తగ్గిన ట్రంప్‌..మార్కెట్‌ జంప్‌  | US stocks rallied after President Trump announced a Greenland deal framework | Sakshi
Sakshi News home page

తగ్గిన ట్రంప్‌..మార్కెట్‌ జంప్‌ 

Jan 23 2026 5:17 AM | Updated on Jan 23 2026 5:25 AM

US stocks rallied after President Trump announced a Greenland deal framework

మూడురోజుల తర్వాత లాభాలు 

అమెరికా–భారత్‌ల మధ్య ట్రేడ్‌ డీల్‌పై ఆశలు 

అరశాతం పెరిగిన స్టాక్‌ సూచీలు  

ముంబై: మూడు రోజుల వరుస నష్టాల తర్వాత ఎట్టకేలకు దేశీయ స్టాక్‌ మార్కెట్‌ గురువారం అరశాతం మేర లాభపడింది. గ్రీన్‌ల్యాండ్‌ స్వా«దీనం విషయంలో ట్రంప్‌ కాస్త వెనక్కి తగ్గడం, అమెరికా–భారత్‌ ట్రేడ్‌ డీల్‌ ఖరారవుతుందనే అంచనాలు, ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి స్వల్ప రికవరీ, క్రూడాయిల్‌ ధరలు దిగిరావడం తదితర అంశాలు కలిసొచ్చాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 398 పాయింట్లు లాభపడి 82,307 వద్ద స్థిరపడింది. 

నిఫ్టీ 132 పాయింట్లు పెరిగి 25,290 వద్ద నిలిచింది. ఉదయమే లాభాలతో మొదలైన సూచీలు... రోజంతా అదే ధోరణిలో కొనసాగాయి. ముఖ్యంగా ఇటీవల 3రోజుల మార్కెట్‌ పతనంలో భాగంగా కనిష్టాలకు దిగివచి్చన నాణ్యమైన షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. ఒక దశలో సెన్సెక్స్‌ 874 పాయింట్లు ఎగసి 82,783 వద్ద, నిఫ్టీ 278 పాయింట్లు ర్యాలీ చేసి 25,434 వద్ద ఇంట్రాడే గరిష్టాలు అందుకున్నాయి. 

గ్రీన్‌ల్యాండ్‌ విషయంలో ఈయూ దేశాలపై విధించిన టారిఫ్‌లను ఎత్తివేస్తున్నట్లుగా ట్రంప్‌ ప్రకటించడంతో అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొంతమేర తగ్గుముఖం పట్టాయి. ఆసియాలో జపాన్, చైనా, కొరియా, హాంగ్‌కాంగ్‌ సూచీలు 1% వరకు లాభపడ్డాయి. యూరప్‌ మార్కెట్లు 1.50% పెరిగాయి. అమెరికా స్టాక్‌ సూచీలు అరశాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. 

→ కన్జూమర్, రియల్టీ షేర్లు మినహా అన్ని రంగాల షేర్లకూ కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్‌ఈలో రంగాల వారీ ఇండెక్సుల్లో పీఎస్‌యూ బ్యాంక్‌ 2.43%, క్యాపిటల్‌ గూడ్స్‌ 2.03%, ఇండ్రస్టియల్స్‌ 1.78%, యుటిలిటి 1.45%, విద్యుత్‌ 1.43%, మెటల్స్‌ 1.34%, ఎఫ్‌ఎంసీజీ 1.22%, కమోడిటిస్‌ 1.15%, ఫార్మా 1.11 శాతం లాభపడ్డాయి. మిడ్, స్మాల్‌ క్యాప్‌లు వరుసగా 1.28%, 1.13 శాతం పెరిగాయి. 

→ డిసెంబర్‌ క్వార్టర్‌ ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేరు 8% క్షీణించి రూ.859 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఏకంగా 10% పతనమై రూ.838 వద్ద లోయర్‌ సర్క్యూట్‌ తాకింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement