breaking news
Greenland
-
గ్రీన్లాండ్కు పాచి పడుతోంది!
ప్రపంచంలోనే అతి పెద్దవైన గ్రీన్లాండ్ దీవులకు పెను ముప్పు పొంచి ఉంది. అయితే అది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొద్ది నెలలుగా బెదిరిస్తూ వస్తున్న ఆక్రమణ ముప్పు కాదు. పాచి ముప్పు! అవును. అపారమైన మంచుకు నిలయమైన గ్రీన్లాండ్ దీవులు నానాటికీ విపరీతంగా పాచిపట్టిపోతున్నాయి! దాంతో అక్కడ మంచు కరుగుదల రేటు చూస్తుండగానే మరింత ప్రమాదకర స్థాయికి పెరిగిపోతోంది. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే గ్రీన్‌లాండ్‌కే కాక ప్రపంచమంతటికీ త్వరలో పెను ముప్పు తప్పదని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా పలు తీర నగరాలు, ప్రాంతాలు అనుకున్న దానికంటే చాలా ముందుగానే సముద్రంలో మునిగిపో తాయని అంచనా వేస్తున్నారు.దుమ్ము తదితరాల వల్ల హిమానీ నదాల్లో పాచి పరిమాణం క్రమంగా పెరిగిపోతోంది. దీనివల్ల మంచు కూడా స్వచ్ఛని తెలుపు రంగు కోల్పోయి మకిలిపడుతుంది. ఫలితంగా మంచు వేడిని ఎక్కువగా పీల్చుకుంటుంది. దాంతో అది కరిగే వేగం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుంది. ఇప్పుడు గ్రీన్లాండ్ దీవుల్లో అదే జరుగుతోంది. తాజా అధ్యయనం ఒకటి ఈ మేరకు తేల్చింది. ఈ దెబ్బకు సముద్రమట్టం కూడా వేగంగా పెరుగుతోందని నిర్ధారించింది. ఈ అధ్యయనం వెల్లడించింది. దుమ్మూధూళి, ఖనిజాల తాలూకు సూక్ష్మకణాలు గాలితో పాటుగా గ్రీన్లాండ్ మంచుపై భారీ పరిమాణంలో వచ్చిపడుతున్నాయట. ‘‘వాటివల్ల మంచుపై నాచు పొర ఏర్పడుతోంది.దాంతో తెల్లని మంచు కాస్తా రంగు మారి వెలిసిపోతోంది. అలా అది సూర్యరశ్మిని మరింత ఎక్కువగా గ్రహిస్తోంది’’ అని అధ్యయన బృంద సారథి ప్రొఫెసర్ జెనిన్ మెక్కచోన్ వివరించారు. ‘‘ఫలితంగా మంచు మరింతగా కరిగిపోతోంది. ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ వెచ్చని ఉపరితలం మరింత నాచు ఏర్పడటానికి, దుమ్ము పేరుకోవడానికి కారణమవుతుంది. తద్వారా గ్రీన్లాండ్ మంచు తెలుపును కోల్పోయి నానాటికీ మరింతగా ముదురు రంగులోకి మారుతుంది. దాంతోపాటే అది సూర్యరశ్మిని మరింతగా గ్రహిస్తుంది. అలా అక్రమంగా ఇదో విషవలయంగా మారుతుంది’’ అని ఆయన హెచ్చరించారు. గ్రీన్లాండ్లోని మంచు పూర్తిగా కరిగితే ప్రపంచవ్యాప్తంగా సముద్రమట్టం ఏకంగా 7 మీటర్లు పెరుగుతుంది! లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న కోట్లాది మంది నిర్వాసితులుగా మారిపోతారు. వారి జీవనోపాధికి గండి పడుతుంది. -
చైనాతో జాగ్రత్త.. కెనడాకు ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కెనడాను టార్గెట్ చేశారు. కెనడాపై విరుచుకుపడ్డారు. గ్రీన్‌లాండ్‌పై గోల్డెన్ డోమ్ నిర్మించడాన్ని కెనడా వ్యతిరేకిస్తోందని ఆరోపించారు. ఇదే సమయంలో చైనాతో కెనడా వ్యాపారం చేయడం వారికే నష్టం కలిగిస్తుందంటూ వ్యాఖ్యలు చేశారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో ట్రుత్ వేదికగా.. గ్రీన్‌లాండ్‌పై విస్తారమైన క్షిపణి రక్షణ వ్యవస్థను నిర్మించాలనే అమెరికా ప్రణాళికను కెనడా వ్యతిరేకిస్తోంది. అయినప్పటికీ గోల్డెన్ డోమ్ కెనడాను రక్షిస్తుంది. అమెరికా నిర్మిస్తున్న గోల్డెన్ డోమ్.. కెనడాను రక్షించబోతోంది. కెనడా మా నుండి చాలా ఉచితాలను పొందుతుంది. అమెరికా కారణంగానే కెనడా మనుగడ సాగిస్తోంది. వారు కూడా కృతజ్ఞతతో ఉండాలి. అలా కాకుండా అమెరికాతో సంబంధాలను తెంచుకుకుంటున్నారు. బదులుగా చైనాతో వ్యాపారం చేసేందుకు కెనడా ఆమోదం తెలిపింది. చైనాకు అనుకూలంగా ఓటు వేశారు. మొదటి సంవత్సరమే కెనడాను చైనా తినేస్తుంది’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ చైనాతో ఆర్థిక సంబంధాలను పునరుద్ధరించడానికి బీజింగ్‌ను సందర్శించిన కొన్ని రోజుల తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.మరోవైపు.. ట్రంప్ వ్యాఖ్యలపై కెనడా ప్రధాని మార్క్ కార్నీ తీవ్రంగా స్పందించారు. అమెరికా మద్దతు కారణంగానే కెనడా మనుగడ సాగిస్తుందనే ట్రంప్ వాదనను తిరస్కరించారు. ఈ క్రమంలో మార్క్ కార్నీ మాట్లాడుతూ..‘కెనడాకు అమెరికాతో సంబంధమే లేదు. మనం కెనడియన్లం కాబట్టి కెనడా అభివృద్ధి చెందుతుంది. కెనడా సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటాం. కెనడాకు మనమే యజమానులం. ఇది మన సొంత దేశం. ఇది మన భవిష్యత్తు అంటూ వ్యాఖ్యలు చేశారు. అలాగే, దావోస్‌లో ట్రంప్ పేరు ప్రస్తావించకుండానే చిన్న దేశాల పట్ల గొప్ప శక్తులు బలవంతం చేయడాన్ని కార్నీ తప్పుబట్టారు. -
మాకు సంబంధం లేదు
మాస్కో: గ్రీన్‌లాండ్‌ను తమ స్వాధీనం చేయా లంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదేపదే చేస్తున్న డిమాండ్‌తో నాటో ఐక్యతకు బీటలు వారుతున్న వేళ ఈ వ్యవహారంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనదైన శైలిలో స్పందించారు. గ్రీన్లాండ్ విషయంలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో తమకు ఎటువంటి సంబంధం లేదని తెగేసి చెప్పారు. బుధవారం రాత్రి మాస్కోలో జరిగిన నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ‘గ్రీన్‌లాండ్‌ను డెన్మార్క్ ఒక కాలనీ మాదిరిగా పరిగణిస్తోంది. అక్కడి ప్రజల విషయంలో క్రూరంగా కాకున్నా, కఠినంగా వ్యవహరించిందన్నది నిజం. అది వేరే విషయం. గ్రీన్‌లాండ్‌పై ఇప్పుడు ఎవరికైనా ఆసక్తి ఉంటుందా అంటే అనుమానమే’అని పేర్కొన్నారు. ‘గ్రీన్లాండ్కు సంబంధించిన పరిణామాలపై మాకెలాంటి ఆందోళన లేదు. ఈ అంశాన్ని వాళ్లే పరిష్కరించుకుంటారని భావిస్తున్నా’అని పుతిన్ తెలిపారు. ‘1917లో డెన్మార్క్ వర్జిన్ దీవులను అమెరికాకు అమ్మేసింది. ఆ మాట కొస్తే రష్యా 1867లో అలా స్కాను అమెరికాకు 72 లక్షల డాలర్లకు విక్రయించింది’అని ఆయన చరిత్రను గుర్తు చేశారు. -
మన తక్షణ కర్తవ్యమేంటి?
బ్రస్సెల్స్: గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ మొండిపట్టు పట్టడంతో తమ తదుపరి కార్యాచరణపై సమాలోచనలు జరిపేందుకు యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు అత్యవసరంగా సమావేశమయ్యాయి. గురువారం బ్రస్సెల్స్‌లో యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా సారథ్యంలో ఐరోపా మండలి సమావేశాలు ఆరంభమయ్యాయి. డెన్మార్క్ విషయంలో తమకు మద్దతివ్వని ఏడు యూరోపియన్ దేశాలపై 10 శాతం అదనపు సుంకాలను విధిస్తానన్న తన నిర్ణయం నుంచి ట్రంప్ అనూహ్యంగా వెనక్కి తగ్గడంతో ఆయా దేశాలు కాస్తంత ఊపిరిపీల్చుకున్న తరుణంలో ఈ సమావేశాలు జరగడం గమనార్హం. ట్రంప్ శాంతి మండలిలో చేరేందుకు కొన్ని యూరప్‌దేశాలు విముఖత వ్యక్తంచేశాయి. గ్రీన్లాండ్ విషయంలోనూ ట్రంప్‌తో విబేధించాయి. ఈ నేపథ్యంలో ఇకమీదట అమెరికాతో ఏదైనా తేల్చుకునేందుకు ఉమ్మడి నిర్ణయాలు తీసుకోవాలని, ఐక్యంగానే ముందడుగు వేయాలని యూరోపియన్ కౌన్సిల్ సమావేశంలో సభ్యదేశాలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. -
తగ్గిన ట్రంప్..మార్కెట్ జంప్
ముంబై: మూడు రోజుల వరుస నష్టాల తర్వాత ఎట్టకేలకు దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం అరశాతం మేర లాభపడింది. గ్రీన్‌ల్యాండ్ స్వా«దీనం విషయంలో ట్రంప్ కాస్త వెనక్కి తగ్గడం, అమెరికా–భారత్ ట్రేడ్ డీల్ ఖరారవుతుందనే అంచనాలు, ఫారెక్స్ మార్కెట్లో రూపాయి స్వల్ప రికవరీ, క్రూడాయిల్ ధరలు దిగిరావడం తదితర అంశాలు కలిసొచ్చాయి. ఫలితంగా సెన్సెక్స్ 398 పాయింట్లు లాభపడి 82,307 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 132 పాయింట్లు పెరిగి 25,290 వద్ద నిలిచింది. ఉదయమే లాభాలతో మొదలైన సూచీలు... రోజంతా అదే ధోరణిలో కొనసాగాయి. ముఖ్యంగా ఇటీవల 3రోజుల మార్కెట్ పతనంలో భాగంగా కనిష్టాలకు దిగివచి్చన నాణ్యమైన షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. ఒక దశలో సెన్సెక్స్ 874 పాయింట్లు ఎగసి 82,783 వద్ద, నిఫ్టీ 278 పాయింట్లు ర్యాలీ చేసి 25,434 వద్ద ఇంట్రాడే గరిష్టాలు అందుకున్నాయి. గ్రీన్‌ల్యాండ్ విషయంలో ఈయూ దేశాలపై విధించిన టారిఫ్‌లను ఎత్తివేస్తున్నట్లుగా ట్రంప్ ప్రకటించడంతో అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొంతమేర తగ్గుముఖం పట్టాయి. ఆసియాలో జపాన్, చైనా, కొరియా, హాంగ్‌కాంగ్ సూచీలు 1% వరకు లాభపడ్డాయి. యూరప్ మార్కెట్లు 1.50% పెరిగాయి. అమెరికా స్టాక్ సూచీలు అరశాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. → కన్జూమర్, రియల్టీ షేర్లు మినహా అన్ని రంగాల షేర్లకూ కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈలో రంగాల వారీ ఇండెక్సుల్లో పీఎస్‌యూ బ్యాంక్ 2.43%, క్యాపిటల్ గూడ్స్ 2.03%, ఇండ్రస్టియల్స్ 1.78%, యుటిలిటి 1.45%, విద్యుత్ 1.43%, మెటల్స్ 1.34%, ఎఫ్ఎంసీజీ 1.22%, కమోడిటిస్ 1.15%, ఫార్మా 1.11 శాతం లాభపడ్డాయి. మిడ్, స్మాల్ క్యాప్‌లు వరుసగా 1.28%, 1.13 శాతం పెరిగాయి. → డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ షేరు 8% క్షీణించి రూ.859 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఏకంగా 10% పతనమై రూ.838 వద్ద లోయర్ సర్క్యూట్ తాకింది. -
సార్వభౌమత్వంపై సంప్రతింపుల్లేవ్
కోపెన్‌హాగెన్: తమ దేశ సార్వభౌమత్వ అంశాన్ని ఇతరులతో చర్చించాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని డెన్మార్క్ మహిళా ప్రధాని మెటె ఫ్రెడరిక్సన్ తెగేసి చెప్పారు. పాక్షికంగా డెన్మార్క్ ఏలుబడిలో ఉన్న గ్రీన్‌లాండ్‌ను ఎలాగైనా చేజిక్కించుకుంటామని, ఆర్కిటిక్ ప్రాంతంలో భద్రతపై నాటో కూటమి ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్టేతో సంప్రతింపులు జరిపామని ట్రంప్ ప్రకటించిన వేళ ఫ్రెడరిక్సన్ ఘాటుగా స్పందించారు. ‘‘ ఆర్కిటిక్ ప్రాంతంలో భద్రత అనేది నాటో సభ్యదేశాలన్నీ కూర్చుని మాట్లాడుకోవాల్సిన అంశం. నాటో చీఫ్ హోదాలో రుట్టేతో ట్రంప్ మాట్లాడినా ఇబ్బందేంలేదు. కానీ గ్రీన్లాండ్ వంటి మాకు సంబంధించిన సార్వ భౌమత్వ అంశాలపై ఎవరు మాట్లాడినా ఊరుకోబోం. మా సార్వభౌమత్వ అంశాన్ని ఇంకెవరితోనో చర్చించాల్సిన అగత్యం మాకు లేదు. దావోస్‌లో ట్రంప్, రుట్టే మాట్లాడుకున్నారు. అంతకుముందు, తర్వాత సైతం రుట్టేతో మాట్లాడా. అది కేవలం మర్యాదపూర్వక భేటీ. అందులో గ్రీన్లాండ్ అంశం చర్చకు రాలేదు’’ అని ఫ్రెడరిక్సన్ స్పష్టంచేశారు. -
గ్రీన్లాండ్: ఇక్కడ ఇల్లు కొనొచ్చు.. కానీ స్థలం కొనలేరు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారణంగా నిత్యం వార్తల్లో నిలుస్తోంది గ్రీన్లాండ్. దశాబ్దాల క్రితం తమ చేజారిన ఈ ద్వీప దేశాన్ని తిరిగి చేజిక్కించుకోవాలని ట్రంప్ ఉవ్విళ్లూరుతున్నారు. డెన్మార్క్ రాజ్యంలో భాగమైన స్వయంప్రతిపత్త ప్రాంతం మొత్తాన్ని కొనుగోలు చేయడానికి అమెరికా ఆసక్తిని వ్యక్తం చేస్తుండగా వాస్తవంగా ఇక్కడ ఎక్కడా లేని భిన్న భూ యాజమాన్య చట్టాలు ఉన్నాయి.ఇంటి కొనుగోలు, భూమి పరిమితులుగ్రీన్లాండ్లో మీరు ఇల్లు కొనుగోలు చేయవచ్చు కానీ భూమి స్వంతం చేసుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే.. గ్రీన్లాండ్ మొత్తం భూమి ప్రభుత్వానికి చెందినది. ప్రైవేట్ భూ యాజమాన్యానికి అనుమతి ఉండదు. స్థానికులు, కంపెనీలు, లేదా సహకార గృహ సంఘాలు మాత్రమే భూమిని ఉపయోగించుకునే హక్కును పొందగలరు. కానీ భూమి అసలు వారికి స్వంతం కాదని గుర్తుంచుకోవాలి.హౌసింగ్ కంపెనీలు.. పబ్లిక్ హౌసింగ్, ఇతర ఆస్తులను నిర్వహిస్తాయి. మీరు ఇల్లు కొనుగోలు చేసినా, భూమి కోసం “సైట్ కేటాయింపు” (use-right allocation) కోసం స్థానిక మునిసిపాలిటీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సైట్ కేటాయింపు పొందిన తర్వాత మాత్రమే ఆ భూమిని ఉపయోగించుకునేందుకు వీలుంటుది. కానీ దాన్ని కొనలేరు.సైట్ కేటాయింపుతో ఏమేం చేయొచ్చు..కొత్త ఇల్లు నిర్మించుకోవచ్చు. ఇప్పటికే ఉన్న ఇంటిని విస్తరించుకోవచ్చు. నిర్మించిన ఇల్లు కొనుక్కోవచ్చు. కారు పార్కింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు. నిర్మాణం ఉపయోగాన్ని మార్చుకోవచ్చు (ఉదాహరణకు, దుకాణం నుంచి ఇల్లుగా మార్పు). పైపు, శాటిలైట్ డిష్, మురుగునీరు సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవచ్చు.గ్రీన్లాండ్లో భూమి చట్టాలు ఒక తాత్విక సిద్ధాంతానికి అనుగుణంగా ఉంటాయి. అదేంటంటే.. భూమి వ్యక్తిగత యాజమాన్యంలో ఉండకూడదు. అది సమష్టిగా ప్రజలందరికీ చెందాలి.ఆస్తి ఎవరు కొనొచ్చు..గ్రీన్లాండ్, డెన్మార్క్ లేదా ఫారో దీవుల పౌరులు ఇక్కడ ఆస్తి కొనవచ్చు. ఈ ద్వీపంలో కనీసం రెండు సంవత్సరాలు నివసించి, పన్నులు చెల్లించిన వారు కూడా సైట్ కేటాయింపు కోసం దరఖాస్తు చేయవచ్చు.ఇంటివలన పొందే స్థల పరిమాణం కూడా కుటుంబానికి అనుగుణంగా ఉంటుంది. ఉదాహరణకు, నలుగురు సభ్యులున్న కుటుంబానికి నాలుగు పడకగదుల అపార్ట్మెంట్ కేటాయిస్తారు. కానీ నుక్ వంటి పెద్ద పట్టణాలలో వెయిటింగ్ లిస్ట్ చాలా పొడవుగా ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఇంటికి సైట్ కేటాయింపు రావడానికి ఎక్కువ సమయం పడుతుంది.గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్ మార్కెట్గ్రీన్లాండ్లో పెద్ద పట్టణాలు గృహాల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఉద్యోగుల కోసం ముఖ్యంగా స్వయంప్రతిపత్త ప్రాంతాలకు వలస వచ్చిన వారికి ప్రత్యేక వసతులు ఉంటాయి. ఇంటికి సైట్ కేటాయింపు కోసం వేచి ఉండే సమయం నుక్లో సుమారుగా 10–12 సంవత్సరాలు ఉంటుంది. ప్రైవేట్ కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు వసతిని అందిస్తాయి. -
అప్పుడు మేం అలస్కాను యూఎస్‌కు అమ్మేశాం: పుతిన్
గ్రీన్‌లాండ్‌ను ఎలాగైనా చేజిక్కించుకోవాలని చూస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఊహించని మద్దతు లభించింది. ఇప్పటివరకూ అమెరికా- గ్రీన్లాండ్ అంశంపై రష్యా వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఉందని అంతా భావించినా ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ మాత్రం.. యూఎస్‌కే దాదాపు మద్దతు తెలిపాడు. జాతీయ భద్రతా మండలిలో పుతిన్ మాట్లాడుతూ.. ‘ గ్రీన్లాండ్ అంశం మాకు సంబంధం లేదు. అది యూఎస్-నాటోలు చూసుకుంటాయి. గ్రీన్లాండ్ మా జోక్యం ఉండదు. అది అసలు రష్యాకు సంబంధం లేని అంశం. ఆ విషయాన్ని నాటో ఆర్గనైజేషన్-అమెరికాలు చూసుకుంటాయి. గ్రీన్‌లాండ్‌పై మధ్యలో మేము దూరాల్సిన అవసరం లేదు. గ్రీన్‌లాండ్‌ను డెన్మార్క్ ఎప్పుడూ కాలనీగా చూస్తుంది. గ్రీన్‌లాండ్‌పై క్రూరత్వం ప్రదర్శించకపోయినా.. దానిపై డెన్మార్క్ కఠినంగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఏది ఏమైనా.. ఏం జరిగినా గ్రీన్లాండ్ ఎపిసోడ్ అనేది మాకు అనవసరం. వాళ్ల వాళ్లు చూసుకుంటారు. మాకైతే సంబంధమే లేదు. 1917లో వర్జిన్ దీవుల్ని అమెరికాకు డెన్మార్క్ అమ్మేసింది. మేం కూడా అలస్కా(ప్రస్తుతం యూఎస్‌లో ఉన్న 49వ రాష్ట్రం) ను యూఎస్‌కు అమ్మేసాం. 1867లో సుమారు 7.2 మిలియన్ డాలర్లకు అలస్కాను అమ్మేశాం’ అని పుతిన్ గతాన్ని గుర్తు చేసుకున్నారు. -
గ్రీన్లాండ్ టారిఫ్‌లు.. వెనక్కి తగ్గిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చల్లబడ్డారు. గ్రీన్లాండ్ విషయంలో యూరప్ దేశాలపై విధించబోయే సుంకాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దావోస్ వేదికగా గ్రీన్లాండ్.. యూరోపియన్ దేశాలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కాసేపటికే ఈ ప్రకటన వెలువడడం గమనార్హం. యూరప్‌లో తమ మిత్రదేశాలపై ఫిబ్రవరి 1 నుంచి సుంకాలు విధించబోతున్నట్లు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ నిర్ణయాన్ని రద్దు చేసినట్లు స్వయంగా ఆయనే తన సోషల్ మీడియా అకౌంట్లో ప్రకటించారు. నాటో చీఫ్ మార్క్ రుట్టేతో జరిగిన భేటీలో ఆర్కిటిక్ భద్రతపై భవిష్యత్ ఒప్పందానికి రూపకల్పనపై అంగీకారం కుదిరిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఫిబ్రవరి 1న అమలులోకి రావాల్సిన సుంకాలను విధించబోను. గ్రీన్లాండ్కు సంబంధించిన "గోల్డెన్ డోమ్" అంశంపై అదనపు చర్చలు కొనసాగుతున్నాయని, చర్చలు ముందుకు సాగేకొద్దీ మరిన్ని వివరాలు వెల్లడిస్తాం. ఈ చర్చలు, ఒప్పందాలు అమెరికా మరియు నాటో దేశాలందరికీ ప్రయోజనకరంగా ఉంటాయి. చర్చల బాధ్యతను ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రుబియో, ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ మరియు ఇతరులు నిర్వహిస్తారు. వారు నేరుగా నాకు నివేదిస్తారు.. అని ట్రంప్ తన పోస్టులో తెలియజేశారు. అంతకు ముందు.. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో మాట్లాడుతూ.. గ్రీన్‌లాండ్‌ను ఓ ఐస్ ముక్కగా అభివర్ణించారు. ఎలాగైనా దానిని అమెరికా సొంతం చేసుకోవాల్సిందేనంటూ మాట్లాడారు. అయితే ఇందుకోసం బలప్రయోగం(సైనిక చర్య) చేయబోమని.. అమెరికా విస్తరణను నాటో అడ్డుకునేందుకు ప్రయత్నించకూడదని అంటూనే ఇటు యూరప్ మిత్రదేశాలనూ ఆయన హెచ్చరించారు. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికానే యూరప్‌ను రక్షించింది. ఆ సంగతి మరిచిపోకూడదు. అలాగే.. నాటోకు మేమెంతో సాయం అందించాం. కాబట్టి మా అభ్యర్థన చిన్నదే అని అనుకుంటున్నాం అంటూ గ్రీన్లాండ్ విషయంలో అడ్డుపడకూడదంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో.. మేం బలప్రయోగం జరిపితే పని తేలికగా అవుతుంది. కానీ, అలా చేయం. ఆ అవసరం లేదు అంటూ వ్యాఖ్యానించారు. గ్రీన్లాండ్కు అమెరికా భద్రత కోసం అవసరమని, రష్యా–చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ఇది కీలకమని ఆయన వాదించారు. గ్రీన్లాండ్ విషయంలో తమ విధానాన్ని వ్యతిరేకిస్తున్న 8 ఐరోపా దేశాలపై 10 శాతం అదనపు సుంకం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తొలుత ప్రకటించారు. ఈ దేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే సరకులపై 10 శాతం అదనపు సుంకం ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, నెదర్లాండ్స్, ఫిన్లాండ్ దేశాలకు ఈ సుంకం వర్తిస్తుందన్నారు. ఒకవేళ.. గ్రీన్‌లాండ్‌ను అమెరికా సంపూర్ణంగా కొనుగోలు చేయడంపై జూన్ 1కల్లా అంగీకారం కుదరకపోతే సుంకాన్ని 25శాతానికి పెంచుతానని ట్రంప్ హెచ్చరించారు. ఈ హెచ్చరికలను యూరోపియన్ దేశాలు ఖండించాయి. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్.. అమెరికా సుంకాలు విధిస్తే యూరప్ ఒక్కటిగా.. కఠినంగా ప్రతిస్పందిస్తుందన్నారు. అమెరికా–యూరప్ మధ్య వాణిజ్య ఒప్పందం దెబ్బతింటే.. అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టం కలుగుతుందని హెచ్చరించారు. గ్రీన్లాండ్ భవిష్యత్తుపై సుంకాల బెదిరింపులకు తాము తలొగ్గే ప్రసక్తే లేదని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సైతం అన్నారు. మరోవైపు యూరోపియన్ పార్లమెంట్ సైతం అమెరికా వాణిజ్య ఒప్పందం రద్దు చేసే ఆలోచనను తీవ్రతరం చేసింది. ఈలోపు దావోస్‌లో ట్రంప్ ప్రసంగం, నాటో చీప్తో భేటీ జరిగిన కాసేపటికే యూరప్ దేశాలపై సుంకాలు విధించాలన్న తన నిర్ణయాన్ని ఆయన మార్చుకున్నారు. రియాక్షన్ ఇదే.. దావోస్ వేదికగా ట్రంప్ చేసిన సంచలన వ్యాఖ్యలపై డెన్మార్క్ ప్రభుత్వం స్పందించింది. తమ సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని అమెరికాకు స్పష్టం చేసింది. మరోవైపు.. ఇది తమ దేశాన్ని అవమానించడమేనని గ్రీన్లాండ్ భావిస్తోంది. ట్రంప్ అనిశ్చితి కలిగించే నాయకుడంటూ తిట్టిపోస్తోంది. అయితే సైనిక చర్య ఉండదని ట్రంప్ చెబుతున్నప్పటికీ.. గ్రీన్లాండ్ ప్రభుత్వం మాత్రం అప్రమత్తమైంది. ఐదు రోజుల పాటు సరిపడా ఆహారం, నీరు, ఇంధనం నిల్వ చేసుకోవాలంటూ ఆ దేశ ప్రజలకు సూచనలు చేసింది. నూక్ నగరంలోని ప్రజలు అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. -
అదో ఐసు ముక్క!.. గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ వ్యాఖ్యలు
దావోస్: గ్రీన్‌లాండ్‌ను కేవలం ‘ప్రపంచానికి మారుమూలగా ఉన్న ఒక మంచు ముక్క’గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభివరి్ణంచారు! అయితే, ‘‘వ్యూహాత్మకంగా అత్యంత ప్రాధాన్యమున్న ప్రాంతం గనుకనే ప్రపంచ శాంతిభద్రతల నిమిత్తం దానిపై అమెరికా నియంత్రణ ఉండాలని కోరుతున్నా. అంతే తప్ప అక్కడున్న అరుదైన ఖనిజ నిల్వల కోసం కాదు’’ అని చెప్పారు. గ్రీన్‌లాండ్‌ను అమెరికా మాదిరిగా కాపాడే సత్తా మరే దేశానికీ లేదని చెప్పుకొచ్చారు. దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో బుధవారం ట్రంప్ గంటకు పైగా మాట్లాడారు. ‘ఇక్కడ సమావేశమైన ఎందరో మిత్రులారా, కొందరు శత్రువులారా!’ అంటూ ట్రంప్ తన ప్రసంగాన్ని మొదలుపెట్టడం విశేషం. ‘గ్రీన్‌లాండ్‌పై హక్కులు, యాజమాన్యం, సార్వ¿ౌమాధికారం... అన్నీ అమెరికాకే కావాలి’ అంటూ ఈ సందర్భంగా ఆయన మరోసారి కుండబద్దలు కొట్టారు. గ్రీన్లాండ్కు, యూరప్‌కు, ముఖ్యంగా డెన్మార్క్‌కు దశాబ్దాలుగా అమెరికా చేసిన మేలుకు బదులుగా తాను అడుగుతున్నది చాలా చిన్నదని చెప్పుకొచ్చారు. ‘‘అందుకు ఆ దేశాలు అవుననవచ్చు, కాదనీ అనవచ్చు. అయితే ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పదలచుకున్నా. కాదన్న దేశాలను నేను కచ్చితంగా గుర్తు పెట్టుకుంటా’’ అంటూ హెచ్చరించారు! అంతేకాదు, గ్రీన్లాండ్ స్వా«దీనం కోసం బలప్రయోగం చేయబోనని కూడా ట్రంప్ ప్రకటించారు. ‘‘నేను సైనిక చర్యకు దిగుతానని చాలామంది అనుకుంటున్నారు. కానీ నాకు ఆ ఆలోచనే లేదు. గ్రీన్‌లాండ్‌పై బలప్రయోగానికి దిగను’’ అని స్పష్టం చేశారు. అయితే, ‘‘గ్రీన్లాండ్ ఉన్నది ఉత్తర అమెరికా ఖండంలో. కనుక అది మా భూభాగమే’’ అంటూ వాదించారు. ‘‘రెండో ప్రపంచ యుద్ధం తర్వాత గ్రీన్‌లాండ్‌ను అమెరికాయే డెన్మార్క్‌కు అప్పగించింది. అది నిజంగా తెలివితక్కువ పని. ఆ దీవిని కాపాడే సత్తా డెన్మార్క్‌కు లేదు’’ అన్నారు. ట్రంప్ ప్రసంగం వినేందుకు వచ్చిన పారిశ్రామిక ప్రముఖులు తదితరులతో దావోస్ వేదిక కిటకిటలాడిపోయింది. యూరప్‌ను ప్రేమిస్తా, కానీ... యూరప్ అంటే తనకెంతో ప్రేమ అని ట్రంప్ చెప్పుకున్నారు. రెండో ప్రపంచయుద్ధ సమయంలో ఆ ఖండాన్ని కాపాడింది అమెరికాయేనని చెప్పారు. కానీ కొంతకాలంగా యూరప్ మాటలు, చేతలు సరైన దిశలో సాగడం లేదని ఆక్షేపించారు. యూరప్ దేశాలపైనా, నాటో కూటమిపైనా ఈ సందర్భంగా ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. టారిఫ్‌లు మొదలుకుని పర్యావరణం, వలసల దాకా ప్రతి విషయంలోనూ యూరప్ దేశాలు పొరపాట్లపై పొరపాట్లు చేస్తున్నాయన్నారు. తమ గ్రీన్లాండ్ స్వాధీన యత్నాలకు అవి కలిసిరాకపోవడం ఘోర తప్పిదమని పదేపదే చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా ఈ విషయమై తక్షణం సంప్రదింపుల ప్రక్రియకు యూరప్ దేశాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గ్రీన్‌లాండ్‌ను అమెరికా స్వా«దీనం చేసుకోవడానికి నాటో కూడా మద్దతివ్వాలని అభిప్రాయపడ్డారు. అమెరికా గత అధ్యక్షులపై, ముఖ్యంగా జో బైడెన్‌పై ట్రంప్ విమర్శల వర్షం కురిపించారు. ‘‘అమెరికాను బైడెన్ దివాలా స్థాయికి దిగజార్చారు. నేనొచ్చాక ఏడాదిలోనే దేశ ఆర్థిక పరిస్థితిని అద్భుతంగా తీర్చిదిద్దా’’ అని చెప్పుకున్నారు. యూరప్ మాత్రం తప్పుడు నిర్ణయాలతో ఆర్థికంగా అతలాకుతలం అవుతోందని ఎద్దేవా చేశారు. ‘‘చైనా నుంచి యూరప్ గాలిమరల్ని కొంటోంది. చైనా ఆర్థికంగా బలపడటం, యూరప్‌లో పక్షులు చనిపోవడం తప్ప వాటివల్ల ఒరిగేదేమిటి? చైనాలో ఎక్కడైనా గాలిమరల్ని వాడుతున్నారా?’’ అని ప్రశ్నించారు. ‘‘ప్రపంచమంతటికీ ఆర్థిక ఇంజన్ అమెరికాయే. అమెరికా అభివృద్ధి చెందినప్పుడే ప్రపంచమంతా అభివృద్ధి సాధిస్తుంది’’ అన్నారు. ట్రంప్ తన ప్రసంగంలో గ్రీన్లాండ్కు బదులుగా పదేపదే ఐస్లాండ్ అని పేర్కొనడం విశేషం! భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నిలువరించానని దావోస్ వేదికపై కూడా ట్రంప్ పాత పాటే పాడారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి ఇప్పటికైనా తెర దించకపోతే ఆ దేశాల అధ్యక్షులు పుతిన్, జెలెన్స్కీ మూర్ఖులే అవుతారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు! అయితే, వాళ్లు మూర్ఖులు కాదని తనకు తెలుసంటూ ముక్తాయించారు. ట్రంప్ కాన్వాయ్ దావోస్ వేదిక వద్దకు వస్తుండగా నిరసనకారులు దారి పొడవునా ఆయనకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. మాక్రాన్ కళ్లద్దాలపై చెణుకులు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ ధరించిన కళ్లద్దాలపై దావోస్ వేదికగా ట్రంప్ చెణుకులు విసిరారు. ‘‘నిన్న దావోస్ వేదికపై మాక్రాన్ అందమైన కళ్లద్దాలు ధరించడం చూశా. పాపం, ఆయనకు ఏమైందసలు?’’ అంటూ ప్రశ్నించడంతో సభికులంతా ఘెల్లున నవ్వారు. తాత్కాలిక కళ్ల సమస్య కారణంగా వాటిని ధరించక తప్పడం లేదని మాక్రాన్ చెప్పడం తెలిసిందే.మావల్లే మీ ఉనికి! కెనడాపై ట్రంప్ ఫైర్ మార్క్, నోరు జాగ్రత్త! ప్రధానికి హెచ్చరికలు దావోస్ వేదికగా అమెరికాపై కెనడా ప్రధాని మార్క్ కార్నీ గుప్పించిన విమర్శలపై ట్రంప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను కూడా అదే వేదిక నుంచి ఆయనకు గట్టిగా చురకలు వేశారు. అమెరికా వల్లే కెనడా బతికి బట్టకడుతోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘మార్క్ (కెనడా ప్రధానిని ఉద్దేశించి)! దశాబ్దాలుగా అమెరికా నుంచి కెనడా ఎన్నో తాయిలాలు అందుకుంటూ వచ్చింది. ఇకపై ఏ వ్యాఖ్యలైనా చేసేముందు ఈ విషయాన్ని కచ్చితంగా గుర్తు పెట్టుకో’’ అంటూ హెచ్చరించారు. తమ సాయం పట్ల కెనడాకు కృతజ్ఞతే లేదంటూ ఆక్షేపించారు. అమెరికా ఏకపక్ష పోకడలను కార్నీ మంగళవారం దావోస్ సదస్సులో ఏకిపారేయడం తెలిసిందే. -
చాగోస్లా కావొద్దనే...
లండన్/దావోస్: గ్రీన్లాండ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు తాను చేస్తున్న తీవ్ర ప్రయత్నాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సమర్థించుకున్నారు. ‘‘బ్రిటన్ వంటి దేశమే మారిషస్ నుంచి అప్పుడెప్పుడో కొనుగోలు చేసిన చాగోస్ దీవులపై అధికారాన్ని అకారణంగా తిరిగి ఆ దేశానికి వదిలేసుకుంటోంది. అక్కడి డీగో గార్షియా దీవుల్లో అమెరికాకు వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన నావిక, బాంబర్ స్థావరాలున్నాయి. వాటి భద్రత ప్రశ్నార్థకంగా మారిందిప్పుడు.గ్రీన్లాండ్ విషయంలోనూ అలాంటిది జరగొద్దనే ఆ దీవి అమెరికా చేతిలో ఉండాలని చెబుతున్నాను’’ అని సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్‌సోషల్‌లో రాసుకొచ్చారు! ‘నాటోకు చెందిన అత్యంత తెలివైన సభ్య దేశం’ ఇలాంటి తెలివి తక్కువ పనికి దిగుతోందంటూ బ్రిటన్ను ఎద్దేవా కూడా చేశారాయన. ‘‘బ్రిటన్ కనబరిచిన ఈ బలహీనతను చైనా, రష్యా కచ్చితంగా గమనించే ఉంటాయి. గ్రీన్‌లాండ్‌పై మరింత దూకుడు పెంచే ఆలోచన కూడా చేస్తుండి ఉంటాయి’’ అని చెప్పుకొచ్చారు. ట్రంప్ వ్యాఖ్యలను బ్రిటన్ ఖండించింది.చాగోస్ దీవులను మారిషస్‌కు అప్పగించాలన్న నిర్ణయం పూర్తిగా సబబేనని పేర్కొంది. చాగోస్ దీవుల్ని రెండు శతాబ్దాల క్రితం మారిషస్ నుంచి బ్రిటన్ కారుచౌకగా కొనుగోలు చేసింది. వాటిని మారిషస్‌కు తిరిగిచ్చేలా, డీగో గార్షియా దీవిని మాత్రం 99 ఏళ్ల లీజుకు బ్రిటనే అట్టిపెట్టుకునేలా గతేడాది ఒప్పందం కుదిరింది. అప్పుడు దాన్ని స్వాగతించిన ట్రంప్ ఇప్పుడు మాత్రం తప్పుబడుతున్నారు!ట్రంప్ విశ్వసనీయత కోల్పోయారు: ఉర్సులాగ్రీన్లాండ్ స్వాధీన యత్నాలకు మద్దతివ్వనందుకు పలు యూరప్ దేశాలపై 10 శాతం టారిఫ్ విధిస్తున్నట్టు ట్రంప్ చేసిన ప్రకటనను యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ లెయన్ తూర్పారబట్టారు. ఈ నిర్ణయాన్ని ఘోర తప్పిదంగా అభివర్ణించారు. ‘‘ఈయూపై ఇక టారిఫ్‌లు విధించబోనని గతేడాది ఇచ్చిన హామీని ట్రంప్ సునాయాసంగా తుంగలో తొక్కారు. ఆయనకు అసలు విశ్వసనీయత అన్నది ఏమైనా ఉందా?’’ అంటూ ఆమె మండిపడ్డారు. ‘‘వ్యాపారంలో మాదిరిగానే రాజకీయాల్లో కూడా ఒప్పందమంటే ఒప్పందమే. ఈయూ సమైక్యంగా నిలుస్తుంది. ట్రంప్ టారిఫ్‌లపై దీటుగా స్పందిస్తుంది’’ అని ప్రకటించారు. కాస్త వెన్నెముక చూపండి!టారిఫ్‌ల వ్యవహారంలో యూరప్ దేశాలు పిరికిగా వ్యవహరిస్తున్నాయంటూ కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ ఎద్దేవా చేశారు. ఆ దేశాలకు అసలు వెన్నెముక అనేదే లేదా అంటూ తూర్పారబట్టారు. ట్రంప్ టారిఫ్‌లను కలసికట్టుగా, దీటుగా ఎదుర్కోవాలని వాటికి సూచించారు. అలాగే గ్రీన్లాండ్కు కూడా యూరప్ దేశాలన్నీ సమైక్యంగా మద్దతిచ్చి ట్రంప్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలన్నారు.అమెరికాపై ట్రేడ్ బజూకా?ట్రంప్ టారిఫ్‌లకు అదే విరుగుడుఈయూ దేశాలకు మాక్రాన్ పిలుపుదావోస్: గ్రీన్లాండ్ స్వాధీ నానికి అంగీకరించడం లే దంటూ పలు యూరప్ దేశా లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 10 శాతం టారిఫ్‌పై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యు యేల్ మాక్రాన్ మరోసారి ధ్వజమెత్తారు. అంతూ పొంతూ లేకుండా సాగుతున్న ట్రంప్ టారిఫ్‌ల బెదిరింపులను దీటుగా ఎదుర్కోవాలని యూరోపియన్ యూనియన్ దేశాలకు ఆయన పిలుపునిచ్చారు. అందుకోసం అవసరమైతే ‘ట్రేడ్ బజూకా’గా పిలిచే యాంటీ కొయెర్షన్ ఇన్స్ట్రుమెంట్ (ఏసీఐ) ఆయుధాన్ని వాడేందుకు కూడా ఈయూ కూటమి వెనకాడొద్దన్నారు. మంగళవారం దావోస్‌లో ప్రపంచ ఆర్థిక ఫోరంలో మాట్లాడుతూ మాక్రాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈయూ కూటమి చేతిలో ఉన్న అతి పదునైన ఆయుధం ఏసీఐ.ప్రస్తుత కఠిన పరిస్థితుల దృష్ట్యా దాన్ని అమెరికాపై వాడేందుకు ఈయూ దేశాలు ఏమాత్రం వెనకాడొద్దు’’ అని అభిప్రా యపడ్డారు. ఈయూ దేశాలపై ఆర్థిక, ఇతరత్రా ఒత్తిళ్లు, బెదిరింపులను తిప్పికొట్టేందుకు ఆ సమాఖ్య రూపొందించుకున్న వాణిజ్య అస్త్రం ట్రేడ్ బజూకా. దీనిద్వారా కూటమేతర దేశాలపై ప్రతీకార సుంకాల విధింపుతో పాటు పలు ఇతరత్రా ఆంక్షలు విధించే అధికారం ఈయూకు దఖలు పడింది. అలాగే ఈయూకు చెందిన ఎలాంటి బిడ్డింగుల్లోనూ సదరు దేశాలు పాల్గొనేందుకు వీలుండదు. కూటమేతర దేశాలను, ముఖ్యంగా చైనా, రష్యాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ట్రేడ్ బజూకాను మిత్రదేశమైన అమెరికాపైనే ఈయూ ప్రయోగించే పరిస్థితులు కన్పిస్తుండటం విశేషం! -
కెనడాపైనా ట్రంప్ కన్ను!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు నానాటికీ శ్రుతి మించి రాగాన పడుతోంది. అర్ధరాత్రి అధ్యక్ష దంపతులను కిడ్నాప్ చేసి చెరబట్టిన వెనెజువెలాతో పాటు గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలని కలలుగంటున్న ట్రంప్ దృష్టి పొరుగుదేశం కెనడా పైనా పడింది. ఆ మూడు దేశాలనూ అమెరికా మ్యాప్‌లో చేర్చేసి మురిసిపోయారాయన! కెనడా, వెనెజువెలా, గ్రీన్‌లాండ్‌తో కలిపిన అమెరికా మ్యాప్‌ను సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్ సోషల్‌లో ట్రంప్ మంగళవారం పోస్టు చేశారు. తద్వారా అవి ఎప్పటికైనా అమెరికా భూభాగాలేనన్న సంకేతాలిచ్చారు! ఈ మేరకు ట్రంప్ పోస్టు చేసిన ఏఐ ఫొటో వైరల్‌గా మారింది. అందులో వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీసులో పలువురు దేశాధినేతలతో ఆయన ఏదో సీరియస్‌గా చర్చిస్తూ కన్పిస్తున్నారు.నేపథ్యంలో మూడు దేశాలను అమెరికా భూభాగంతో కలిపి చూపుతున్న ఆ దేశ సరికొత్త మ్యాప్ ప్రముఖంగా కన్పిస్తోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్, యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాండెర్ లెయన్, నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్టె తదితరులు ఫొటోలో ఉన్నారు. తద్వారా... కెనడా, వెనెజువెలా, గ్రీన్లాండ్ స్వాధీనానికి ఆయా దేశాల ఆమోదముందని చెప్పడం ట్రంప్ ఉద్దేశమని విశ్లేషిస్తున్నారు.ట్రంప్ అక్కడితో ఆగలేదు! గ్రీన్లాండ్ గడ్డపై తాను సగర్వంగా అమెరికా జెండా పాతుతున్నట్టుగా మరో ఏఐ ఆధారిత ఫొటోను కూడా పోస్ట్ చేశారు. ఆయనతో పాటు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఫొటోలో కన్పిస్తున్నారు. ‘‘గ్రీన్లాండ్, అమెరికా భూభాగం, స్థాపితం: 2026’ అని రాసిన బోర్డు కూడా ఫొటోలో దర్శనమిస్తోంది. కెనడా స్వచ్ఛందంగా అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరాలని గతంలో ట్రంప్ వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఇక డెన్మార్క్ అధీనంలోని స్వయంపాలిత ప్రాంతమైన గ్రీన్లాండ్ స్వాధీ నానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు, ఆ క్రమంలో చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు కొంతకాలంగా అంతర్జాతీయ రగడకు దారితీస్తు న్నాయి. డెన్మార్క్ తో పాటు గ్రీన్లాండ్ కూడా ట్రంప్ యత్నాలను ముక్త కంఠంతో వ్యతిరేకించాయి. అమెరికాలో కలిసేది లేదని గ్రీన్లాండ్ స్పష్టం చేసింది.గ్రీన్లాండ్కు యూఎస్ విమానం!డెన్మార్క్‌తో నానాటికీ తీవ్రతరమవుతున్న ఉద్రిక్తతల నడుమ, గ్రీన్లాండ్లోని అమెరికా సైనిక స్థావరంలో యుద్ధ విమానాన్ని మోహరించాలని ట్రంప్ తాజాగా మరో వివాదాస్పద నిర్ణ యం తీసుకున్నారు. అక్కడి పిటుఫిక్ స్థావరంలో దీర్ఘకాలిక అవసరాల నిమిత్తం ఈ చర్య చేపడుతున్నట్టు వైట్‌హౌస్ చెప్పుకొచ్చింది. -
'ట్రంప్ ఓ ఇంటర్నేషనల్ గ్యాంగ్‌స్టర్'
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై బ్రిటన్ ప్రతిపక్ష నేత, లిబరల్ డెమొక్రాట్ పార్టీ అధ్యక్షుడు ఎడ్వర్డ్ జోనాథన్ డేవీ తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. బ్రిటీష్ పార్లమెంట్లో ప్రసంగించిన సర్ ఎడ్ డేవీ.. ట్రంప్‌ను అత్యంత ఘాటైన పదజాలంతో విమర్శించాడు. ఆయన ట్రంప్‌ను ఓ ఇంటర్నేషనల్ గ్యాంగ్‌స్టర్‌గా అభివర్ణించారు. అమెరికా చరిత్రలోనే అత్యంత అవినీతిపరుడైన అధ్యక్షుడు అని సర్ డేవీ మండిపడ్డారు.ఈ విమర్శలకు కారణమేంటంటే..?డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్లాండ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నాడు. గ్రీన్‌లాండ్‌ను అమెరికాకు విక్రయించాలని లేదా తమ దేశంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. ట్రంప్ ప్రతిపాదనను డెన్మార్క్ తిరస్కరించింది.డెన్మార్క్ నిర్ణయానికి బ్రిటన్‌తో పాటు పలు ఐరోపా దేశాలు మద్దతు ఇచ్చాయి. దీంతో ఆగ్రహించిన ట్రంప్.. గ్రీన్లాండ్ విషయంలో తమకు సపోర్ట్ చేయని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సహా ఎనిమిది యూరప్ దేశాలపై ఫిబ్రవరి నుంచి 10 నుంచి 25 శాతం వరకు దిగుమతి సుంకాలు విధిస్తానని ప్రకటించారు. ఈ క్రమంలోనే మంగళవారం బ్రిటన్ పార్లమెంట్లో చర్చ జరిగింది.ఈ సందర్భంగా సర్ డేవీ మాట్లాడుతూ.. ట్రంప్ అంతర్జాతీయ గ్యాంగ్‌స్టర్‌లా ప్రవర్తిస్తున్నారు. మిత్రదేశాల సార్వభౌమాధికారాన్ని కాలరాస్తూ, ఆర్థిక ఒత్తిడితో అందరినీ భయపెట్టాలని చూస్తున్నారు" అని విమర్శలు గుప్పించారు. కేవలం పుతిన్, షీ జిన్‌పింగ్ వంటి వారే ట్రంప్‌కు మద్దతు ఇస్తున్నారని, ఇది నాటో కూటమిని బలహీనపరుస్తుందని ఆయన పేర్కొన్నాడు.ఫ్రాన్స్‌తో కూడా విభేదాలుట్రంప్ కేవలం బ్రిటన్ మాత్రమే కాకుండా ఫ్రాన్స్‌ను కూడా హెచ్చరించాడు. ట్రంప్ ప్రతిపాదించిన 'బోర్డ్ ఆఫ్ పీస్' లో చేరనందుకు, ఫ్రెంచ్ వైన్, షేంపేన్లపై 200 శాతం సుంకం విధిస్తామని బెదిరించాడు. దీనిని ఫ్రాన్స్ తీవ్రంగా ఖండించింది. -
ట్రంప్ సంచలనం.. అమెరికా కొత్త మ్యాప్ రిలీజ్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనానికి తెర తీశారు. వెనెజువెలా, కెనడా, గ్రీన్లాండ్ ద్వీపంతో కూడిన అమెరికా మ్యాప్‌ను ట్రంప్ తాజాగా విడుదల చేశారు. దీంతో, ట్రంప్ తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంతటితో ఆగకుండా ట్రంప్.. మ్యాప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.అధ్యక్షుడు ట్రంప్ మంగళవారం ట్రూత్ సోషల్ వేదికగా పోస్ట్ చేసిన రెండు ఫొటోలు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఒక పోస్టులో గ్రీన్లాండ్ సరిహద్దులో అమెరికా జెండాను పాతుతున్నట్లు చూపించే చిత్రాన్ని షేర్ చేశారు. ఆ చిత్రంలో ఆయనతో పాటు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా ఉన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన మైలురాయి బోర్డుపై ‘గ్రీన్లాండ్ అమెరికా భూభాగం-2026లో ఏర్పాటైంది’ అని రాసి ఉన్న సూచిక బోర్డు కనిపిస్తుంది. మరో పోస్టులో ఏకంగా అమెరికా మ్యాప్‌ను మార్చేశారు. ఓవల్ ఆఫీస్‌లో ట్రంప్‌తో పాటుగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ సహా ఇతర నాటో నేతలు కనిపించారు. అయితే, ఆ ఫొటోలో ఓ బోర్డుపై అమెరికా మ్యాప్ ఉంది. ఆ మ్యాప్‌లో కెనడా, గ్రీన్లాండ్, వెనిజువేలా దేశాలు అమెరికా భాగాలుగా చూపించారు. దీంతో, అమెరికా మ్యాప్ ఇప్పుడు సంచలనంగా మారింది.గ్రీన్‌లాండ్‌లోకి యుద్ధ విమానం..మరోవైపు.. ట్రంప్ తొలి పోస్ట్ పెట్టిన కాసేపటి తర్వాత నార్త్ అమెరికన్ ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ (ఎన్ఓఆర్ఏడీ) ఎక్స్ వేదికగా కీలకమైన ట్వీట్ చేసింది. ఒక యుద్ధ విమానాన్ని గ్రీన్లాండ్లోని పిటుఫిక్ వైమానిక స్థావరానికి పంపుతున్నామని ఎన్ఓఆర్ఏడీ కమాండ్ ప్రకటించింది. గ్రీన్లాండ్ భద్రత కోసం రూపొందించిన పలు దీర్ఘకాలిక ప్రణాళికల అమలు కోసమే ఆ విమానాన్ని పంపుతున్నామని వెల్లడించింది. డెన్మార్క్, గ్రీన్లాండ్ల సమన్వయంతోనే ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపింది.అమెరికాలో కెనడా 51వ రాష్ట్రం..2025 సంవత్సరం మే నెల చివరి వారంలో ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్య చేసిన విషయం తెలిసిందే. కెనడా అనేది అమెరికాలో 51వ రాష్ట్రం అవుతుందన్నారు. నాటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కెనడా గవర్నర్ అవుతారని కామెంట్ చేశారు. కానీ కెనడా కొత్త ప్రధానమంత్రి మార్క్ కార్నీ ఈ వ్యాఖ్యలను ఖండించారు. కెనడా ఎన్నటికీ అమెరికాలో కలవదని తేల్చి చెప్పారు. అయినా ట్రంప్ తన వాదనను కొనసాగించారు. -
ట్రంప్ నోబెల్ బహుమతి చెల్లదంతే!
నాకు నోబెల్ బహుమతి ఇవ్వలేదు. ఇక శాంతి గురించి ఆలోచించను. అమెరికా ప్రయోజనాల కోసం గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకుని తీరతా అంటూ డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ట్రంప్ చేసిన ఆరోపణలపై నార్వే ప్రభుత్వం స్పందించింది. ట్రంప్ వ్యాఖ్యలపై నార్వే ప్రధాని జోనాస్ గహర్ స్టోర్ స్పందించారు. నోబెల్ శాంతి బహుమతికి, నార్వే ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదన్నారు. "నోబెల్ బహుమతులను ఒక స్వతంత్ర కమిటీ నిర్ణయిస్తుంది తప్ప మా ప్రభుత్వం కాదు. ఈ విషయాన్ని నేను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు తెలియజేస్తూ స్పష్టంగా ఓ లేఖ రాశాను" అని స్టోర్ తెలిపారు.ఇక తనకు దక్కిన నోబెల్ శాంతి బహుమతి గౌరవాన్ని.. వెనెజువెలా విపక్ష నేత మారియా కొరీనా మచాడో ట్రంప్‌నకు అందజేసిన సంగతి తెలిసిందే. మచాడో నుంచి అవార్డును స్వీకరించిన అనంతరం ట్రంప్ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. ధన్యావాదాలు కూడా తెలిపారు. అయితే.. దీనిపై నోబెల్ కమిటీ తాజాగా మరోసారి స్పందించింది.‘‘ఒకసారి నోబెల్ ప్రకటించిన తర్వాత.. దానిని రద్దు, బదిలీ చేయడం లేదంటే ఇతరులతో పంచుకోవడం కుదరదని స్పష్టం చేసింది. ఒకవేళ గ్రహీతలు దానిని అమ్మేసుకున్నా.. వేలం వేసుకున్నా.. అది వాళ్ల ఇష్టం. కానీ, ఆ గౌరవం మాత్రం మచాడో పేరు మీదనే ఉంటుంది. కాబట్టి ఆయన బహుమతి చెల్లదు’’ అని కమిటీ తాజాగా మరో ప్రకటనలో తెలిపింది. గ్రీన్‌ల్యాండ్ విషయంలో తనకు అభ్యంతరాలు చెబుతున్న యూరప్ దేశాలపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే భారీ సుంకాల పెంపును ప్రతిపాదించారు కూడా. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నార్వే ప్రధాని స్టోర్, ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ సంయుక్తంగా ట్రంప్‌నకు ఒక సందేశం పంపారు. అయితే దానికి బదులుగా ట్రంప్.. ‘‘సుమారు ఎనిమిది యుద్ధాలను ఆపిన నాకు మీ దేశం (నార్వే) నోబెల్ శాంతి బహుమతి ఇవ్వలేదు. అందుకే ఇకపై కేవలం శాంతి గురించి మాత్రమే ఆలోచించాల్సిన బాధ్యత నాకు లేదు’’ అంటూ రిప్లై ఇచ్చారు. -
గ్రీన్ల్యాండ్పైకి అమెరికా యుద్ధ విమానాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనీ చేయబోతున్నారా?.. గ్రీన్‌ల్యాండ్‌ను చేజిక్కించుకోవాలనే ప్రయత్నాల్లో దూకుడు ప్రదర్శిస్తున్నారా?.ఈ క్రమంలోనే సైన్యాన్ని గ్రీన్ల్యాండ్లోకి దింపబోతున్నారా?. ఈ తరుణంలో డెన్మార్మ్ ఆందోళనలో అర్థం ఉందా?.. అసలు దీనంతటికి కారణమైన నోరాడ్ అంటే ఏంటసలు?..గ్రీన్‌ల్యాండ్‌లోని పిటుఫిక్ స్పేస్ బేస్‌కి అమెరికా తన యుద్ధ విమానాలు పంపడం ఆర్కిటిక్ ప్రాంతంలో రాజకీయ, సైనిక ఉద్రిక్తతలకు దారి తీసింది. అగ్రరాజ్యం చర్యపై డెన్మార్క్, గ్రీన్లాండ్ ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిగా డెన్మార్క్ తన సైన్యాన్ని ఇప్పటికే గ్రీన్‌ల్యాండ్‌లో మోహరింపజేసింది. అయితే.. నోరాడ్ (ఉత్తర అమెరికా వైమానిక రక్షణ కమాండ్) మాత్రం ఇది రొటీన్ ఆపరేషన్స్ అంటూ చెబుతోంది.అమెరికా సైనిక విమానాలు త్వరలో గ్రీన్లాండ్లోని పిటుఫిక్ స్పేస్ బేస్ (మునుపటి తులే ఎయిర్‌ఫోర్స్ బేస్) వద్దకు చేరనున్నాయి. దీనిని దీర్ఘకాలిక రక్షణ కార్యకలాపాల భాగంగా పేర్కొంటూ.. అమెరికా, కెనడా, డెన్మార్క్ మధ్య ఉన్న రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడమే లక్ష్యమని నోరాడ్ చెబుతోంది. అయితే.. అమెరికా చర్యలను డెన్మార్క్ మాత్రం ఖండిస్తోంది.ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక, వ్యూహాత్మక ఆధిపత్యాన్ని పెంచుకోవడం అమెరికా ఉద్దేశం అయ్యి ఉండొచ్చు. అయితే.. తమ ఆధీనంలో ఉన్న స్వయం పాలక గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా సైనిక చర్యలకు దిగితే అది తమ సార్వభౌమాధికారాన్ని సవాలు చేయడమేనని డెన్మార్క్ భావిస్తోంది. అదే జరిగితే నాటోలో విబేధాలు తప్పవని డెన్మార్క్ ప్రధాని ఇప్పటికే ట్రంప్‌కు స్పష్టం చేశారు. ఈ క్రమంలో.. తాజా పరిణామంతో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.ఏమిటీ నోరాడ్NORAD అంటే "North American Aerospace Defense Command". ఇది అమెరికా-కెనడా కలిసి ఏర్పాటు చేసిన ద్వైపాక్షిక రక్షణ సంస్థ. దీని ప్రధాన పని ఉత్తర అమెరికా మీదకు వచ్చే విమానాలు, క్షిపణులు, అంతరిక్ష వాహనాలపై హెచ్చరికలు ఇవ్వడం.. గగనతల నియంత్రణ చేయడం, అలాగే సముద్ర మార్గాలపై పర్యవేక్షణ చేయడం. నోరాడ్ గ్రీన్‌ల్యాండ్‌లో ప్రధానంగా.. పిటుఫిక్ స్పేస్ బేస్ నుంచే తన కార్యకలాపాలు నిర్వహించుకుంటోంది. ఇది ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్న అత్యంత కీలకమైన సైనిక స్థావరం కూడా. పిటుఫిక్ బేస్‌లోని రాడార్ వ్యవస్థలు రష్యా, చైనా వంటి దేశాల నుండి వచ్చే బాలిస్టిక్ మిసైల్ దాడులను ముందుగానే గుర్తించడానికి ఉపయోగపడతాయి.గ్రీన్‌ల్యాండ్ స్వయం పాలనలో ఉన్నప్పటికీ.. విదేశాంగం, రక్షణ వ్యవహారాలు ఇంకా డెన్మార్క్ ఆధీనంలో ఉన్నాయన్నది తెలిసిందే. కాబట్టి NORAD కార్యకలాపాలకు డెన్మార్క్ అనుమతి కచ్చితంగా అవసరం. నాటో సభ్యదేశమైన డెన్మార్క్.. నోరాడ్లో కార్యకలాపాల్లో భాగస్వామి కూడా. ఈ మేరకు అమెరికాతో 1951లో ప్రత్యేక రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది. అందుకే ఒప్పందం ప్రకారం ఇప్పుడు అమెరికా చర్యలను అడ్డుకోవడానికి లేదు. కానీ, గ్రీన్‌ల్యాండ్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నాలను మాత్రం అడ్డుకునే అవకాశం ఉంది. అదే జరిగితే.. యుద్ధం తప్పదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. -
వాణిజ్య యుద్ధం ఎవ్వరికీ మంచిది కాదు
లండన్: గ్రీన్‌లాండ్‌ను సొంతం చేసుకునే క్ర మంలో యూరప్ దేశాలపై అమెరికా అధ్యక్షు డు ట్రంప్ చేస్తున్న తీవ్ర ఒత్తిడులపై యూకే ప్రధాని కీర్ స్టార్మర్ తనదైన శైలిలో స్పందించారు. అమెరికా, యూకే ఎప్పటిలా గానే సన్నిహిత మిత్ర దేశాలుగా కొనసాగు తాయన్న ఆయన..వాణిజ్య యుద్ధం వల్ల ఎవ్వరికీ లాభం కలగదన్నారు. సోమవారం ఆయన అత్యవసర మీడియా సమావేశంలో మాట్లాడారు. గ్రీన్‌లాండ్‌ను సైనిక చర్య ద్వారా స్వాధీనం చేసుకునేందుకు ట్రంప్ ప్రయత్ని స్తున్నారంటూ వస్తున్న వార్తలను ఖండించారు. మిత్ర దేశాలపై టారిఫ్‌లను అస్త్రంగా ప్రయో గించడం పూర్తిగా తప్పన్నారు. అదే సమయంలో, యూకే జాతీయ ప్రయోజనాల పరిరక్షణే తన బాధ్యతన్నారు. ‘అందుకే, భాగస్వామ్యం, వాస్తవాలు, పరస్పర గౌరవం ప్రాతిపదికగా ఈ సమస్యపై పరిష్కారం కనుగొనే క్రమంలో ఆదివారం ట్రంప్‌తోపాటు యూరప్ దేశాల నేతలు, నాటో సెక్రటరీ జనరల్‌తో ఫోన్లో మాట్లాడా. ఎందుకంటే, బలమైన కూట ములు తమ ఉమ్మడి ప్రయోజనాలను ఆ విధంగానే కాపాడుకుంటాయి’అని వ్యాఖ్యా నించారు. ట్రంప్‌తో క్రమం తప్పక మాట్లాడు తూనే ఉంటానన్న స్టార్మర్..విభేదాలున్నా లేనట్టుగా నటించడం కాదు, వాటిని ముఖా ముఖి చర్చించి పరిష్కరించుకోవడమే పరిణతి చెందిన కూటముల లక్షణమని చెప్పారు. -
నాకు నోబెల్ ఇవ్వలేదు కాబట్టి.. శాంతి గురించి ఆలోచించను..!
ఓస్లో: గ్రీన్లాండ్ అంశంపై ఉద్రిక్త తలు కొనసాగుతున్న వేళ నార్వే ప్రధానమంత్రి జొనాస్ గహ్ర్ స్టోర్ ఒక ఆసక్తికర విషయాన్ని బయట పెట్టారు. నోబెల్ శాంతి బహుమ తిని, గ్రీన్‌లాండ్‌తో ముడిపెడుతూ అమెరికా అధ్యక్షుడు తనకో సందేశం పంపారని చెప్పారు. ‘నోబెల్ శాంతి బహుమతి నాకు లభించలేదు. కాబట్టి, శాంతి గురించి మాత్రమే మాట్లాడాల్సిన బాధ్యత ఎంతమాత్రం నాకు లేదు’అని అందులో ట్రంప్ పేర్కొన్నట్లు తెలిపారు. ‘ఎనిమి దికి పైగా యుద్ధాలను ఆపినందుకుగాను నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వకూడదని మీ దేశం నిర్ణయించింది. అందుకే ఇకపై కేవలం శాంతి గురించి మాత్రమే ఆలోచించాల్సిన బాధ్య త నాకు ఉందని అనుకో వడం లేదు. శాంతికి ఎప్పు డూ ప్రాధాన్యత ఉంటుంది, కానీ, ఇప్పుడు అమెరికాకు ఏది మంచిది, ఏది సరైనది అనే దానిపైనే నేనిప్పుడు ఆలోచిస్తా. గ్రీన్‌లాండ్‌పై మాకు పూర్తి, సమగ్ర నియంత్రణ ఉంటే తప్ప ఈ ప్రపంచం సురక్షి తంగా ఉండదు’అని ఆయన అందులో పేర్కొ న్నట్లు జొనాస్ వివరించారు. ట్రంప్ నోబెల్ వాదనపై జొనాస్.. ‘నోబెల్ శాంతి బహుమతి ఎంపిక బాధ్యత నార్వేజి యన్ నోబెల్ కమిటీయే తప్ప నార్వే ప్రభు త్వం కాదు. కమిటీ ఒక స్వతంత్ర విభాగం. అందులోని ఐదుగురు సభ్యులను నార్వే పార్లమెంట్ నియమిస్తుంది’అని వివరించారు. -
ట్రంప్ ప్రమాదకర పోకడ
వారానికో, పదిరోజులకో తన విధ్వంసక ప్రకటనలతో ప్రపంచాన్ని హడలెత్తించటం అలవాటు చేసుకున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్... ఇప్పుడు దాన్ని నిత్యకృత్యంగా మార్చుకున్నట్టు కనబడుతోంది. డెన్మార్క్‌లో భాగమైన కీలకదీవి గ్రీన్‌ల్యాండ్ దురాక్రమణకు సమాయత్తమవుతూ, అందుకు అభ్యంతరం చెప్పిన యూరోపియన్ యూనియన్(ఈయూ) దేశాలపై వచ్చే నెల 1 నుంచి పదిశాతం సుంకాలు విధిస్తానని బెదిరించి కయ్యానికి కాలుదువ్వారు. మరోపక్క గాజా పునర్నిర్మాణం కోసమంటూ తన ఆధ్వర్యంలో ‘శాంతిమండలి’ని ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. ఆ మండలిలో ‘ఖరీదైన’ సభ్యత్వాన్ని ఇస్తానని భారత్‌తో సహా 60 ప్రపంచ దేశాలకు వర్తమానం పంపారు. ఎనిమిది దశాబ్దాల క్రితం హిట్లర్ రూపంలో తలెత్తి ప్రపంచాన్ని చాప చుట్టేయాలని చూసిన నియంతను వదుల్చుకోవటానికి ఎంత మారణహోమం చవి చూడాల్సి వచ్చిందో, ఎన్ని కోట్లమంది బలిదానాలు చేయాల్సి వచ్చిందో తెలిసి కూడా ఏడాదిగా బుజ్జగింపు ధోరణితో పొద్దుపుచ్చిన దేశాలకూ, ఐక్యరాజ్యసమితికీ తాజా పరిణామాలు ఒక పెద్ద షాక్. తాను ఆశించినట్టు నోబెల్ శాంతి బహుమతి దక్కలేదు గనుక ఇక శాంతి గురించి ఆలోచించాల్సిన అవసరం ట్రంప్‌కు లేదట. అమెరికాకు ఏది ప్రయోజనకరమో అదే చేస్తారట!గాజాపై ఏర్పాటు చేయదల్చుకున్న శాంతి బోర్డుకు తలాతోకా లేదు. అది గాజాకే పరిమితమై ఉండదట. భవిష్యత్తులో వేరే దేశాల వివాదాల్లో తలదూరుస్తుందట! బోర్డుకు ట్రంప్ జీవితకాల అధ్యక్షుడు. అందులో ‘రా రమ్మ’ని పిలిచిన దేశానికి మూడేళ్లపాటు సభ్యత్వం ఇస్తారు. శాశ్వత సభ్యత్వానికైతే వందకోట్ల డాలర్లు చెల్లించాలి. గాజాలో అంతంతమాత్రంగా అందుతున్న సాయాన్ని కూడా ఆపటానికీ, అక్కడ ఉంటున్నవారి కడుపుమాడ్చి వెళ్లగొట్టడానికీ, నరమేధం ఆనవాళ్లు చెరిపేయటానికీ తోడ్పడటమే ఈ బోర్డు ఏర్పాటు ఆంతర్యం. నిజానికి ఈ బోర్డు ఆలోచన భద్రతామండలిది. 2027 చివరి వరకూ ఈ బోర్డు గాజా ఘర్షణలపై దృష్టి సారిస్తుందని ద్రతామండలి మొన్న నవంబర్‌లో ప్రకటించింది. గాజాలో రెండేళ్లపాటు మారణహోమం సాగించిన ఇజ్రాయెల్‌నూ, దానికి ప్రత్యక్షంగా సహకరించిన అమెరికానూ పల్లెత్తు మాట అనని మండలి... దొంగ చేతికి తాళం చెవులు అప్పగించినట్టు గాజాను ఉద్ధరించటానికి పూనుకోవాలని అగ్ర రాజ్యాలను కోరుతూ తీర్మానించింది. ఇంతకూ ట్రంప్ బోర్డూ, ఐక్యరాజ్యసమితి బోర్డూ వేర్వేరా... ఒకటేనా అనేది ఎవరికీ తెలియదు. దిగ్భ్రాంతి నుంచి తేరుకోలేకపోవటం వల్ల కావొచ్చు... సమితి కూడా అస్పష్టంగా మాట్లాడుతోంది. ‘సభ్యదేశాలు ఎవరికి నచ్చిన గ్రూప్‌లో వారు చేరొచ్చ’ని సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ చేతులు దులుపుకొన్నారు. అమెరికా అధ్యక్ష పదవే ఇంకో మూడేళ్ల ముచ్చట కాగా,శాంతి బోర్డుకు యావజ్జీవ అధ్యక్షుడెలా కాగలరో అనూహ్యం. ఒక దేశంగా ఇందులో అమెరికా ప్రమేయం కూడా ఉండదా? ఇది ట్రంప్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయా? ఏమైనా కావొచ్చు. అమెరికా సుంకాలతో బెదిరించినా... ఏ సార్వభౌమాధికార దేశమైనా ఇందులో భాగస్వామ్యానికి అంగీకరించగలదా? బలహీనంగా కనబడే దేశాలను కించపరచటం, పాదాక్రాంతం చేసుకునేందుకు ప్రయత్నించడం ట్రంప్ నైజం. అమెరికా స్వప్రయోజనాల కోసం నాటో తీసుకొస్తే, భద్రతకు పూచీపడుతుందని నమ్మి అందులో చేరిన ఈ దేశాలు ఇప్పుడు అమెరికాయే దండ యాత్రకు పూనుకోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. డెన్మార్క్‌లో స్వయంప్రతిపత్తి గల గ్రీన్‌ల్యాండ్ పేరుకు ప్రపంచంలోనే పెద్ద దీవి. జనాభా 60,000 మించదు. వివాదం ఎందుకని అప్పగిస్తే అమెరికా హిరణ్యాక్షుడు శాంతిస్తాడన్న నమ్మకం లేదు. అలాంటి హిరణ్యాక్షులు ఇంకా ఇద్దరున్నారు. చైనా తైవాన్‌నూ, రష్యా ఉక్రెయిన్‌నూ కబళించే యత్నం చేస్తాయి. ఇలా కండబలంతో ఎవరికి వారు చెలరేగితే ఈ ప్రపంచం మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. కనుక ఇన్నాళ్ల బుజ్జగింపులకూ స్వస్తిచెప్పి యూరప్ దేశాలు ఇకనైనా దృఢంగా నిలబడాలి. 75 ఏళ్ల చరిత్రలో ఎందుకూ కొరగాని ‘నాటో’ ఉన్నా ఊడినా ఒకటేనన్న తెలివి తెచ్చుకుని, ప్రతీకార సుంకాలతో జవాబీయాలి. గాజా శాంతిబోర్డు పైనా ఛీత్కారాలు వెల్లువెత్తాలి. అప్పుడు మాత్రమే ట్రంప్ దారికొస్తారు. -
నార్వే ప్రధాని లేఖలో తేల్చిచెప్పిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ టంప్‌కు నోబెల్ బహుమతిపై ఉన్న ప్రేమ గురించి అందరికీ తెలిసిందే. ఎలాగైనా ప్రపంచశాంతి బహుమతి సాధించాలని ట్రంప్ ఎక్కని గడపా లేదు.. చేయని రచ్చా లేదు. ఎలాగైనా ఈ అవార్డు తనకు ప్రకటించాలంటూ పలుసార్లు బహిరంగ ప్రకటన సైతం చేశారు. కానీ నోబెల్ మాత్రం ట్రంప్‌కు దక్కలేదు. తాజాగా ట్రంప్ మరోసారి నోబెల్‌పై తనకు ప్రకటించకపోవడంపై తనకున్న అక్కసును వెల్లగక్కారు. తాజాగా నార్వే ప్రధాని జోనస్ గహర్కు ట్రంప్ లేఖ రాశారు. అందులో ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న విధ్వంసానికి కారణం ఆదేశం తనకు నోబెల్ ప్రకటించకపోవడమేనన్నారు. అందువల్లే తన రూట్ మార్చానని తెలిపారు. శాంతిని వదిలి యుద్ధ బాట పట్టినట్లు పేర్కొన్నారు.ఆలేఖలో ట్రంప్ ... "నేను ఎనిమిది యుద్ధాలు ఆపాను. అయినా మీ దేశం నన్ను శాంతిదూతగా గుర్తించలేదు. అందుకే ఇక నేను శాంతి గురించి ఆలోచించాలనుకోవడం లేదు. ఇప్పుడు నేను కేవలం అమెరికాకు ఏది లాభం చేకురుస్తోంది అదే చేస్తాను" అని ట్రంప్ లేఖలో అన్నారు. గ్రీన్లాండ్కు ఎప్పటికైనా చైనా, రష్యాల నుంచి ముప్పు పొంచి ఉంది ఈ నేపథ్యంలో ఆ భూమిపై వారికి యాజమాన్య హక్కులు ఎలా ఉంటాయి అని ట్రంప్ ప్రశ్నించారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం అక్కడ పడవలు దిగాయి. మా భూభాగంలో కూడా పడవలు దిగాయి. అంతే .. ఆ భూమిపై యాజమాన్య పత్రాలు ఆదేశానికి లేవు అని అన్నారు.అయితే గ్రీన్లాండ్ ద్వీపాన్ని ఎట్టిపరిస్థితుల్లో ఆక్రమించుకుంటానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ట్రంప్ నిర్ణయాన్ని డెన్మార్క్‌తో సహా ఇతర నాటో దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ఆ నాటో దేశాలపై 10 శాతం సుంకం విధిస్తూ ఆదేశాలు జారీచేశారు. నోబెల్ బహుమతి ప్రకటన అనేది పూర్తిగా నోబెల్ కమిటీ ఎంపిక మాత్రమే అక్కడి ప్రభుత్వానికి అందులో ఎటువంటి జోక్యం ఉండదు. -
అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి బ్రేక్
స్ట్రాస్‌బర్గ్/అసన్షియన్: గ్రీన్లాండ్ విషయంలో తన వెంట నిలబడని 8 ఐరోపా దేశాలపై ట్రంప్ 10 శాతం అదనపు సుంకాలు విధించడాన్ని యురోపియన్ యూనియన్ సమాఖ్య తీవ్రంగా తప్పుబట్టింది. ట్రంప్‌కు బుద్ధిచెప్పేలా అమెరికాతో గత ఏడాది జూలైలో కుదుర్చుకున్న చరిత్రాత్మక యురోపియన్ యూనియన్–అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని తాత్కాలికంగా పక్కనబెడుతున్నట్లు ఈయూ పార్లమెంట్ ఆదివారం ప్రకటించింది. దీంతో ట్రంప్ సారథ్యంలోని అమెరికా ప్రభుత్వానికి నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. పారదర్శకత, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందమే లక్ష్యంగా జరిగిన ఈయూ–యూఎస్ డీల్‌ను తక్షణం స్తంభింపజేస్తున్నామని యురోపియన్ యూనియన్ పార్లమెంట్ స్పష్టంచేసింది. ‘‘ఐరోపా దేశాల వాణిజ్య ప్రయోజనాలకు భంగం కల్గించే ఎలాంటి చర్యలకైనా మేం దీటుగా ప్రతిచర్యలు, నిర్ణయాలు తీసుకుంటాం. ఇందులో అమెరికాకు ఎలాంటి మినహాయింపులు లేవు’’అని ఐరోపా మండలి అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా వ్యాఖ్యానించారు. గ్రీన్లాండ్ విషయంలో తమ విధానాన్ని వ్యతిరేకిస్తున్న దేశాలపై 10 శాతం అదనపు సుంకాన్ని విధిస్తున్నామని, జూలై ఒకటోతేదీలోపు గ్రీన్లాండ్ కొనుగోలు ఒప్పందం పూర్తికాకపోతే మరో 25 శాతం సుంకాలు విధిస్తానని ట్రంప్ ప్రకటించడం తెల్సిందే. దీనిపై యురోపియన్ పార్లమెంట్‌లోని పలు రాజకీయ పారీ్టలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. ‘‘గ్రీన్లాండ్ విషయంల మనల్ని బెదిరిస్తున్న ట్రంప్ అనుకూలంగా ఈయూ–యూఎస్ డీల్‌ను ముందుకు తీసుకెళ్లకూడదు. అమెరికా ఉత్పత్తులపై సున్నా టారిఫ్‌ల బుజ్జగింపులకు మనం చరమగీతం పాడదాం’’అని యురోపియన్ పీపుల్స్ పార్టీ చీఫ్ మ్యాన్‌ఫ్రెడ్ వెబర్ అన్నారు. ‘‘ఈయూ–యూఎస్ డీల్‌కు ఈయూ పార్లమెంట్ ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదముద్ర వేయొద్దు. ట్రంప్ ఏకపక్ష నిర్ణయాలను స్వీడన్‌లాంటి దేశాలు తమ ప్రతీకార చర్యలతో అడ్డుకోవాల్సిందే’’అని ఈయూ పార్లమెంట్ సభ్యురాలు, స్వీడన్ రాజకీయ నాయకురాలు కరీన్ కార్ల్స్బ్రో అన్నారు. దక్షిణ అమెరికా దేశాలతో డీల్.. ఉత్తర అమెరికా ఖండంలోని అమెరికాతో డీల్‌ను స్తంభింపజేసిన ఐరోపా సమాఖ్య వెనువెంటనే దక్షిణ అమెరికాలోని మెర్కొసర్ కూటమి దేశాలతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. పశి్చమాసియాలో యుద్ధాలతో అంతర్జాతీయ వాణిజ్యంలో రక్షణాత్మకధోరణి పెరుగుతున్న వేళ దక్షిణఅమెరికా దేశాలతో ఈయూ వాణిజ్య ఒప్పందం చేసుకోవడం గమనార్హం. దాదాపు పాతికేళ్లుగా హింసాత్మక ఘటనల నడుమే చర్చలు కొనసాగిన ఎట్టకేలకు స్వేచ్ఛా వాణిజ్యం కుదిరింది. పరాగ్వే దేశ రాజధాని అసన్షియన్ ఇందుకు వేదికైంది. అమెరికా నుంచి అధిక టారిఫ్‌ల బెడద, చైనా నుంచి చౌక ఉత్పత్తుల వరదల నడుమ మెర్కొసర్ కూటమితో ఈయూ ఒప్పందం చేసుకుంది. మెర్కొసర్ కూటమిలో అర్జెంటీనా, బ్రెజిల్, పరాగ్వే, ఉరుగ్వేలు సభ్యదేశాలుగా ఉన్నాయి. బొలివియా కొత్తగా చేరినప్పటికీ వాణిజ్య ఒప్పందంలో పాలుపంచుకోవట్లేదు. వెనెజువెలాను గతంలో కూటమి నుంచి బహిష్కరించారు. వాణిజ్య ఒప్పందంలో భాగంగా అర్జెంటీనా గొడ్డు మాంసం మొదలు జర్మనీ కార్ల దాకా పలు రకాల వస్తూత్పత్తులపై 90 శాతం టారిఫ్‌లను దశలవారీగా తొలగించనున్నారు. దీంతో ఈ వాణిజ్య ఒప్పందం ప్రపంచంలోనే అతిపెద్ద స్వేచ్ఛావాణిజ్య జోన్లలో ఒకటిగా మారనుంది. 70 కోట్ల మంది వినియోగదారులు ఈ డీల్‌తో లాభపడనున్నారు. ఈ ఒప్పందం చరిత్రాత్మకమైనదని యురోపియన్ కమిషన్ మహిళా అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డీర్ లెయిన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇన్సియో లూలా డసిల్వా అన్నారు. -
ట్రంప్ బెదిరింపులు.. మాక్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. గ్రీన్లాండ్ విషయంలో మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారు. గ్రీన్లాండ్ అంశంలో అమెరికా విధానాన్ని వ్యతిరేకిస్తున్న 8 ఐరోపా దేశాలను ట్రంప్ టార్గెట్ చేశారు. తాజాగా ఆయా దేశాలపై 10 శాతం అదనపు సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు పలు దేశాల అధినేతలు..కాగా, ట్రంప్ గ్రీన్లాండ్ అంశంపై చేసిన టారిఫ్ బెదిరింపులపై తాజాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తీవ్రంగా స్పందించారు. మాక్రాన్ ట్విట్టర్ వేదికగా..‘ట్రంప్ టారిఫ్‌లు అంటూ ఎలాంటి బెదిరింపులు, ఒత్తిళ్లు మమ్మల్ని ప్రభావితం చేయలేవు. అది ఉక్రెయిన్ అయినా, గ్రీన్లాండ్ అయినా, ప్రపంచంలోని మరెక్కడైనా సరే. ఈ తరహా పరిస్థితుల్లో మేం వెనక్కి తగ్గం. టారిఫ్‌ల పేరుతో ఒత్తిడి తేవడం సరికాదు. ఈ సందర్భంలో వాటికి ఎలాంటి స్థానం లేదు. అలాంటి బెదిరింపులు పూర్తిగా అంగీకరించే ప్రసక్తే లేదు’ అని కుండబద్దలు కొట్టారు. ఇదే సమయంలో టారిఫ్‌లు అమలయ్యే పరిస్థితి వస్తే యూరప్ దేశాలన్నీ కలిసికట్టుగా, సమన్వయంతో దీనికి తగిన సమాధానం ఇస్తాయని హెచ్చరించారు. గ్రీన్‌లాండ్‌తో పాటు ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని కాపాడటానికి ఫ్రాన్స్ కట్టుబడి ఉందని మరోసారి ఆయన స్పష్టం చేశారు.France is committed to the sovereignty and independence of nations, in Europe and elsewhere. This guides our choices. It underpins our commitment to the United Nations and to its Charter.It is on this basis that we support, and will continue to support Ukraine…— Emmanuel Macron (@EmmanuelMacron) January 17, 2026ఫ్రాన్స్ ప్రాధాన్యం అదే.. మరోవైపు.. దేశాల సార్వభౌమత్వం, స్వతంత్రతకు ఫ్రాన్స్ ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇస్తుందని మాక్రాన్ గుర్తు చేశారు. అదే సూత్రాల ఆధారంగానే ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచామని, భవిష్యత్తులో కూడా ఆ మద్దతు కొనసాగుతుందని తెలిపారు. ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను గౌరవించడం ఫ్రాన్స్ విదేశాంగ విధానానికి మూలస్తంభమని ఆయన చెప్పారు. ‘యూరప్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా దేశాల సార్వభౌమత్వం, స్వాతంత్ర్యం మా నిర్ణయాలకు మార్గదర్శకం. అదే కారణంగా ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచాం. శాంతి కోసం, భద్రత కోసం ఎంత దూరమైనా వెళ్తాం’ అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. గ్రీన్లాండ్ విషయంలో వ్యతిరేకంగా ఉన్న డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, నెదర్లాండ్స్, ఫిన్లాండ్ దేశాలపై 10 శాతం సుంకం వర్తిస్తుందని ట్రంప్ తెలిపారు. ఈ దేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే సరకులపై 10 శాతం అదనపు సుంకం ఫిబ్రవరి నుంచి అమల్లోకి వస్తుందని శనివారం ఆయన తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. గ్రీన్‌లాండ్‌ను అమెరికా సంపూర్ణంగా కొనుగోలు చేయడంపై జూన్ ఒకటో తేదీకల్లా అంగీకారం కుదరకపోతే సుంకాన్ని 25శాతానికి పెంచుతానని ట్రంప్ హెచ్చరించారు. -
నయా వలసవాద కేంద్రం అమెరికా
అమెరికా ఇటీవల కాలంలో తాను వేసుకున్న ముసుగును పూర్తిగా తొల గించి బాహాటంగానే దురాక్రమణ కాంక్షను వ్యక్తం చేస్తోంది. వరుసగా ఒక దేశం తరువాత మరొక దేశాన్ని ఆక్రమించడానికి వేగంగా పావులు కదుపుతోంది. వెనిజులా అధ్యక్షుణ్ణి కిడ్నాప్ చేసి పట్టుకుపోవడం, గ్రీన్‌ల్యాండ్ తమదేనని ప్రకటించడం, తాజాగా ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలకు అండగా ఉంటామని ప్రకటించడం... ఇవన్నీ అమెరికా దూకుడును సూచించే అంశాలే. ముఖ్యంగా అణు పాటవం సంతరించుకోకుండా ఇరాన్‌ను అడ్డుకోవడం, దాని చమురు సంపదను చేజిక్కించుకోవడంపై అమెరికా ఎప్పటి నుంచో కన్నేసింది. దాని కొనసాగింపే ప్రస్తుత ఇరాన్ సంక్షోభం.2015 అణు ఒప్పందం నుండి అమెరికా ఏకపక్షంగా బయటకు రావడంతో ఇరాన్‌తో అమెరికా ఘర్షణ ముదిరింది. ఇరాన్‌కు చెందిన సుమారు 100 బిలియన్ డాలర్ల నిధులను అంతర్జాతీయ బ్యాంకుల్లో అమెరికా స్తంభింపజేయడమే కాకుండా, కఠినమైన ఆర్థిక ఆంక్షలను విధించింది. గడిచిన కొద్ది నెలలుగా ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా అమెరికా దాడులకు దిగుతోంది. ఈ దాడుల్లో ఏడు బి–2 స్టెల్త్ బాంబర్లు, అత్యంత శక్తిమంతమైన 14 బంకర్ బస్టర్ బాంబర్లు, 30,000 పౌండ్ల మందుగుండు సామగ్రిని ఉపయోగించి ఫోర్డో, నటాంజ్, ఇస్ప హాన్ వంటి కీలక ప్రాంతాలపై విరుచుకుపడింది. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 400 మందికి పైగా ఇరా నీయులు ప్రాణాలు కోల్పోగా, 3,000 మందికి పైగా గాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూల మధ్య ఇటీవల జరిగిన భేటీ పశ్చిమ ఆసియాలో యుద్ధ తీవ్రతను పెంచేలా ఉంది. గాజాలో ప్రతిఘటనను తుడిచిపెట్టడమే కాకుండా, ఇరాన్ పుంజుకుంటే తీవ్రంగా దెబ్బతీస్తామని వారు హెచ్చరించారు. ఈ హెచ్చరికల నేపథ్యంలోనే ఇరాన్ లోపల వ్యూహాత్మక అల్లర్లు ప్రారంభమయ్యాయి. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పడిపోతున్న కరెన్సీ విలు వపై ప్రజల్లో అసహనం పెంచుతూ నిరసనలను, సమ్మెలను అమెరికా ప్రోత్సహిస్తోంది. శాంతియుత నిరసనల ముసుగులో జరుగుతున్న ఈ ఘర్షణల్లో ఇప్పటికే వందలాదిమంది మర ణించారు. నిరసనకారులకు అమెరికా బాసటగా నిలుస్తామని ప్రకటించడం వెనుక ఇరాన్ ప్రభుత్వాన్ని పడగొట్టే పక్కా ప్లాన్ ఉంది. ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురి పించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.ఆర్థిక విధ్వంసం – చమురు రాజకీయం 2025 జూన్ నాటి యుద్ధ పరిస్థితులు, చమురు ధరల పతనం ఇరాన్ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశాయి. నిత్యా వసరాల ధరలు పెరగడంతో సామాన్య ప్రజల జీవన ప్రమా ణాలు పడిపోయాయి. విద్యుత్ కోతలు పారిశ్రామిక రంగాన్ని దెబ్బతీయగా, వాతావరణ మార్పుల వల్ల వర్షాలు లేక వ్యవసా యోత్పత్తి తగ్గి ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది. అమెరికా చర్యలను ఇరాన్ నేత ఖమేనీ తీవ్రంగా ఖండిస్తున్నారు. పాత కాలపు షా రాజరికం లాంటి బానిసత్వాన్ని ‘నయా వలస వాదం’ రూపంలో అమెరికా మళ్లీ రుద్దాలని చూస్తోందని ఆయన మండిపడ్డారు. దేశంలోని కార్పొరేట్ శక్తులు తమ స్వార్థం కోసం అమెరికా, ఐరోపా దేశాలతో చేతులు కలుపు తున్నాయనీ, దీనివల్ల కార్మికులు, గ్రామీణ ప్రజలపై భారం పెరుగుతోందనీ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ప్రపంచ ముడిచమురు నిల్వల్లో ఇరాన్ వాటా 13 శాతం ఉండగా, అమెరికా అడుగులకు మడుగులొత్తే సౌదీ అరేబియా వద్ద 16 శాతం నిల్వలు ఉన్నాయి. వెనిజులా నిల్వలను కూడా కలిపితే, ప్రపంచ చమురులో 50 శాతాన్ని తన గుప్పిట్లో ఉంచుకోవాలని అమెరికా ఆశిస్తోంది. రష్యా, చైనాలు అమెరికా చర్యలను ఖండించే ప్రకటనలకే పరిమితం అవుతూ ప్రత్యక్ష కార్యాచరణకు దిగకపోవడం గమనార్హం.రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా తన గూఢ చారి సంస్థ ‘సీఐఏ’ ద్వారా అనేక దేశాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూల్చివేసింది. 1954లో గ్వాటెమాల, 1963లో ఈక్వె డార్, 1964లో బ్రెజిల్, 1973లో చిలీ... ఇలా సుమారు 20కి పైగా దేశాల్లో అమెరికా తన తోలుబొమ్మ ప్రభుత్వాలను ఏర్పాటు చేసేందుకు కుట్రలు చేసింది. క్యూబా నేత ఫిడెల్ క్యాస్ట్రోను హతమార్చేందుకు 621 సార్లు విఫలయత్నం చేయడం అమెరికా దురహంకారానికి పరాకాష్ఠ. డ్రగ్స్‌పై పోరాటం పేరుతో మెక్సికో, కొలంబియా వంటి దేశాల్లో అరాచ కాలు సృష్టించింది. ఇప్పుడు మళ్లీ ప్రపంచవ్యాప్తంగా ట్యారిఫ్ యుద్ధాలు, సైనిక బెదిరింపులతో నూతన సామ్రాజ్యవాదాన్ని విస్తరించేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. బుడ్డిగ జమిందార్వ్యాసకర్త ‘ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం’జాతీయ కార్యవర్గ సభ్యులు -
8 దేశాలకు షాక్.. కొత్త టారిఫ్‌లు ప్రకటించిన ట్రంప్
వాషింగ్టన్: గ్రీన్‌లాండ్‌పై అమెరికా నియంత్రణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఎనిమిది యూరోపియన్ దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాక్ ఇచ్చారు. ఆయా దేశాల నుంచి దిగుమతయ్యే వస్తువులపై ఫిబ్రవరి నుంచి 10 శాతం దిగుమతి సుంకం విధించనున్నట్లు ప్రకటించారు.డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్, నెదర్లాండ్స్, ఫిన్లాండ్ దేశాలు ఈ సుంకానికి లోబడి ఉంటాయని ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. అంతేకాకుండా 2026 జూన్ 1 నుంచి ఈ దిగుమతి సుంకాన్ని 25 శాతానికి పెంచనున్నట్లు కూడా తెలిపారు. గ్రీన్‌లాండ్‌ను పూర్తిగా కొనుగోలు ఒప్పందం కుదిరే వరకు ఈ సుంకాలు అమల్లో కొనసాగుతాయని ట్రంప్ స్పష్టం చేశారు. -
ట్రంప్ టారిఫ్ బెదిరింపు..
-
గ్రీన్లాండ్ సొంతం కావాల్సిందే!
నూక్ (గ్రీన్లాండ్): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ నామజపం నానాటికీ శ్రుతి మించుతోంది. ఆ ద్వీపం పూర్తిగా అమెరికా వశం అయి తీరాల్సిందేనని, అది తప్ప ఇంక దేనికీ అంగీకరించే ప్రసక్తే లేదని ఆయన బుధవారం పునరుద్ఘాటించారు. అంతేకాదు, అందుకు నాటో కూటమి ఇతోధికంగా సాయపడాలని చెప్పుకొచ్చారు. వెనెజువెలాపై సైనిక చర్యతో అధ్యక్షుడు మదురో దంపతులను నిర్బంధించిన అనంతరం ట్రంప్ తన దృష్టినంతా గ్రీన్‌లాండ్‌పై కేంద్రీకరించడం తెలిసిందే. ఇది గ్రీన్‌లాండ్‌తో పాటు ఆ ద్వీపాన్ని నియంత్రిస్తున్న డెన్మార్క్‌తో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అవసరమైతే సైనిక చర్య తప్పదని ట్రంప్, అలాగైతే తొలి తూటా పేల్చేది తామేనని డెన్మార్క్ పోటాపోటీ ప్రకట నలతో వాతావరణం బాగా వేడెక్కింది. ఈ పరిస్థితుల్లో ఉద్రిక్తతలను చల్లార్చేందుకు ఒకవైపు డెన్మార్క్, గ్రీన్లాండ్ విదేశాంగ మంత్రులు, ఉన్నతాధికారులతో కూడిన బృందంతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో వాషింగ్టన్లో భేటీ అవుతుండగా, అంతకు కేవలం కొద్ది గంటల ముందు ట్రంప్ మళ్లీ ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దిగారు. ‘అమెరికా జాతీయ భద్రత నిమిత్తం గ్రీన్లాండ్ మాకు కావాల్సిందే. ఆ ప్రయత్నాలకు నాటో కూటమే సారథ్యం వహించాలి. లేదంటే గ్రీన్‌లాండ్‌పై రష్యా, చైనా పట్టు సాధిస్తాయి. అలా జరగనివ్వబోం’ అని సొంత సోషల్ మీడియా ‘ట్రూత్ సోషల్’లో ఆయన వరుస పోస్టులు పెట్టారు. ‘మేం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన గోల్డెన్ డోమ్ రక్షణ వ్యవస్థలో గ్రీన్లాండ్ అతి కీలకం’ అని పేర్కొన్నారు. అంతేకాదు, గ్రీన్లాండ్ అమెరికా గుప్పెట్లోకి వస్తే నాటో మరింత బలోపేతమైన శక్తిగా మారుతుందని చెప్పుకొచ్చారు. డెన్మార్క్, గ్రీన్లాండ్ ప్రతినిధుల బృందం ఇప్పటికే వైట్‌హౌస్‌లో ఒక దఫా అమెరికా బృందంతో చర్చలు జరిపింది. వాన్స్‌తో భేటీ అనంతరం సెనేటర్లు, ఇతర ఉన్నతాధికారులతో వారు మరోసారి సమావేశం కానున్నారు. మరోవైపు, గ్రీన్లాండ్ స్వాధీన ప్రయత్నాలకు రక్షణ, లేదా ఇతర శాఖల నుంచి నిధులు వెచ్చించేందుకు వీల్లేదంటూ ఇద్దరు సెనేటర్లు తాజాగా బిల్లు ప్రవేశపెట్టారు. వీరిలో ఒకరు అధికార రిపబ్లికన్ పార్టీకి చెందినవారు కావడం విశేషం. శుక్ర, శనివారాల్లో వారి బృందం డెన్మార్క్‌లో పర్యటించనుంది. డెన్మార్క్ ప్రధాని తదితరులతో భేటీ కావాలని వారు నిశ్చయించారు. తమ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలపై గ్రీన్లాండ్వాసులు మండిపడుతున్నారు. తాము అమ్మకానికి సిద్ధంగా లేమంటూ నినదిస్తున్నారు. ‘‘మేం డెన్మార్క్‌ను ఎంచుకున్నాం. ఆ దేశంలో భాగంగా, యూరోపియన్ యూనియన్ భాగస్వామిగా మాత్రమే కొనసాగుతాం. అంతే తప్ప అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరడం కల్ల’’ అని అంతర్జాతీయ మీడియా ప్రతినిధులతో వారు కుండబద్దలు కొడుతున్నారు. చైనా, రష్యాలతో తమ ద్వీపానికి ముప్పుందన్న ట్రంప్ వాదనను గ్రీన్లాండ్వాసులు ఎద్దేవా చేస్తున్నారు. ఆయన నోట వస్తున్నవన్నీ కాల్పనిక గాథలని వారు చెప్పు కొచ్చారు. ‘‘ట్రంప్‌కు కావాల్సింది కేవలం మా ద్వీపంలోని అపార సహజ వనరులే. వాటికోసమే ఇలా ఇతర దేశాలను బూచిగా చూపుతూ ప్రయాస పడుతు న్నారు’’ అని మండిపడ్డారు. మరోవైపు, ఫిబ్రవరి 6న గ్రీన్లాండ్లో దౌత్య కార్యాలయం తెరుస్తున్నట్టు నాటో సభ్య దేశమైన ఫ్రాన్స్ కీలక ప్రకటన చేసింది. గ్రీన్‌లాండ్‌పై దాడి తప్పదన్న బ్లాక్‌మెయిలింగ్‌కు అమెరికా స్వస్తి పలకాలని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ నోయల్ బారొట్ హితవు పలికారు.డెన్మార్క్, గ్రీన్లాండ్ నేతల యునైటెడ్ ఫ్రంట్!ట్రంప్‌కు వ్యతిరేకంగా డెన్మార్క్, గ్రీన్లాండ్ సంఘటితమవుతున్నాయి. ఈ దిశగా సమైక్య పోరు కోసం యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని వారు నిర్ణయానికి వచ్చారు. ‘‘గ్రీన్లాండ్ పూర్తిగా డెన్మార్క్‌కు చెందిన భాగమే. కనుక దానికి నాటో సైనిక రక్షణ పూర్తిస్థాయిలో కొనసాగుతుంది’’ అని ఇరు దేశాల ప్రధానులు మెట్టె ఫ్రెడరిక్సన్, జీన్స్ నీల్సన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ‘‘ప్రియ మైన గ్రీన్లాండ్వాసు లారా.. ఈ రోజు మనమంతా సంయుక్తంగా ఒక్కతాటిపై నిలబడి ఉన్నాం. మున్ముందూ అలాగే ఉండబోతున్నాం’’అని ఫ్రెడరిక్సన్ కోపెన్ హాగెన్‌లో మీడియా భేటీలో ప్రకటించారు. ‘‘అమెరికా, డెన్మార్క్‌లలో ఏదో ఒకదా న్నే ఎంచుకోవాల్సి వస్తే మా చాయిస్ ఎప్పటికీ డెన్మార్కే. నాటోనే. యూరోపియన్ యూని యనే’’ అని నీల్సన్ కుండబద్దలు కొట్టారు. -
ఇక గ్రీన్లాండ్ విలీనమే!
వాషింగ్టన్: డెన్మార్క్‌లో భాగంగా కొనసాగుతూ పాక్షికంగా స్వయం ప్రతిపత్తి హోదా కలిగిన గ్రీన్‌లాండ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పటి నుంచో కన్నేశారు. సహజ వనరులు, ముడి చమురుతో కూడిన ఆ ప్రాంతాన్ని అమెరికాలో విలీనం చేసుకొనే దిశగా అడుగులేస్తున్నారు. అందులో భాగంగా రిపబ్లికన్ సభ్యుడు ర్యాండీ ఫైన్ అమెరికా కాంగ్రెస్‌లో సోమవారం ‘గ్రీన్లాండ్ అనెక్సేషన్ అండ్ స్టేట్హుడ్’ పేరిట బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు చట్టసభలో ఆమోదం పొందితే గ్రీన్‌లాండ్‌ను అమెరికాలో విలీనం చేసి 51వ రాష్ట్రంగా మార్చేసే అధికారం అధ్యక్షుడు ట్రంప్‌కు లభిస్తుంది.అమెరికా జాతీయ భద్రత కోసం గ్రీన్‌లాండ్‌ను ఎలాగైనా స్వా«దీనం చేసుకోక తప్పదని ట్రంప్ ఇప్పటికే స్పష్టంచేశారు. వీలైతే సులభ మార్గంలో, లేకపోతే కఠిన మార్గంలో గ్రీన్‌లాండ్‌ను అమెరికాలో కలిపేస్తామని ఆయన ప్రకటించారు. బల ప్రయోగానికైనా సిద్ధమని పరోక్షంగా సంకేతాలిచ్చారు. డబ్బులిచ్చి గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేస్తామని అమెరికా చెప్పగా అందుకు డెన్మార్క్ నేతలు అంగీకరించలేదు. ఆ ప్రాంతం అమ్మకానికి లేదని తెలియజేశారు.గ్రీన్లాండ్ విలీనం అనేది విస్మరించదగిన అంశం కాదని ర్యాంటీ ఫైన్ పేర్కొన్నారు. అమెరికా భద్రతకు అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. గ్రీన్లాండ్ విలీనం లేదా బలవంతపు ఆక్రమణ కోసం చర్యలు చేపట్టడానికి వీలుగా ట్రంప్‌కు అధికారాలు ఇవ్వడానికే బిల్లును తీసుకొచి్చనట్లు తెలిపారు. ఈ ఆర్కిటిక్ ద్వీపం అమెరికాలో ఒక రాష్ట్రంగా మారాలంటే ఫెడరల్ చట్టంలో మార్పులు చేయాల్సి ఉంటుంది. ఆ ఫొటోల్లో ట్రంప్ అంతరంగం గ్రీన్‌లాండ్‌ను ఎప్పుడెప్పుడు సొంతం చేసుకోవాలా? అని డొనాల్డ్ ట్రంప్ తెగ ఆలోచిస్తున్నారు. ఆయన మనసంతా అక్కడే ఉంది. అమెరికా అధ్యక్ష భవనమైన వైట్‌హౌస్ మంగళవారం నాలుగు ఆసక్తికరమైన ఫొటోలను ‘ఎక్స్’లో షేర్ చేసింది. వీటిని ఒక క్రమపద్ధతిలో అమర్చి చూస్తే ట్రంప్ అంతరంగం బయటపడుతోంది. ఇందులో ట్రంప్ వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీసు కిటికీ నుంచి అటువైపున్న గ్రీన్‌లాండ్‌ను నిశితంగా గమనిస్తున్నారు. తాజా పరిస్థితిని ఆయన పర్యవేక్షిస్తున్నట్లుగా దీనికి శీర్షికను జోడించారు. -
గ్రీన్ లాండ్ విలీనం కోసం బిల్లు తెచ్చిన అమెరికా
-
మేము దాడి చేయకుంటే వాళ్లు చేస్తారు: ట్రంప్
గత కొంతకాలంగా గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటానంటూ డెన్మార్క్‌ను రెచ్చగొడుతున్న ట్రంప్ తాజాగా ఆ అంశంపై మరోసారి మాట్లాడారు. ఎట్టిపరిస్థితుల్లోనూ గ్రీన్‌లాండ్‌ను చేజిక్కించుకోవాల్సిందేనన్నారు లేకుంటే చైనా, రష్యాలు ఆ పని చేస్తాయని హెచ్చరికలు జారీ చేశారు.వెనిజువెలా అధ్యక్షున్ని బంధించి ఆ దేశ పాలనను హస్తగతం చేసుకున్న ట్రంప్ తన తదుపరి టార్గెట్ గ్రీన్లాండ్ అని ప్రకటించారు. అరుదైన ఖనిజాలు, చమురు, సహజవాయువులు పుష్కలంగా ఉండడంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఆ ద్వీపంపై అమెరికా అధ్యక్షుడి కన్ను పడింది. దీంతో ఎలాగైనా ఆ ద్వీపాన్ని అమెరికాలో విలీనం చేస్తామని దాని రక్షణ బాధ్యత తమపై ఉందని ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. అయితే దీనిపై గ్రీన్లాండ్ ప్రజలు నిరాసక్తి చూపిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో అమెరికాలో కలిసేది లేదని తాము స్వతంత్రంగా ఉండదలుచుకుంటున్నామని తమ దేశ పార్లమెంటులో తీర్మానం సైతం చేశారు.అయినప్పటికీ ట్రంప్ తన తీరును మార్చుకోవడం లేదు తాజాగా గ్రీన్లాండ్ వ్యవహారంపై మరోసారి స్పందించారు. "గ్రీన్‌లాండ్‌ను అమెరికా స్వాధీనం చేసుకుంటుంది. లేకపోతే చైనా, రష్యా దాన్ని స్వాధీన పరచుకుంటాయి. ఎట్టిపరిస్థితుల్లో అది నేను జరగనివ్వను". అని ట్రంప్ అన్నారు. గ్రీన్లాండ్ కోసం డెన్మార్క్‌తో ఒప్పందం చేసుకుంటాం. లేదా ఎలాగైనా స్వాధీనం చేసుకుంటాం అని పేర్కొన్నారు.రష్యా, చైనా దేశాల సైనిక బలం ఏమిటో మీకు తెలుసు వారికి ప్రతిచోట సబ్మెరైన్లు, డిస్ట్రాయర్లు ఉన్నాయి. వారి సైనిక శక్తిని మీరు తట్టుకోలేరు అని డెన్మార్క్నుద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ వ్యాఖ్యలనను డెన్మార్క్ ప్రధాని ఖండించారు. ఒకవేళ గ్రీన్‌లాండ్‌పై అమెరికా దాడి చేస్తే అది 80 సంవత్సరాల ట్రాన్స్ అట్లాంటిక్ ఒప్పందానికి భంగం కలిగించడమేనన్నారు. -
గ్రీన్‌లాండ్‌ను సొంతం చేసుకోవాల్సిందే
వాషింగ్టన్: అరుదైన ఖనిజాలు, చమురు, సహజ వాయువు నిల్వలతో కూడిన గ్రీన్‌లాండ్‌ను సాధ్యమైనంత త్వరగా అమెరికాలో విలీనం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తహతహలాడుతున్నారు. గ్రీన్‌లాండ్‌ను రష్యా, చైనాలు ఆక్రమించుకోక ముందే సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉందని అమెరికన్లకు ఆయన తేల్చిచెప్పారు. ట్రంప్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. గ్రీన్లాండ్ విషయంలో తన మనసులోని మాటను మరోసారి బయటపెట్టారు. వీలైతే సులభమైన మార్గంలో.. లేకపోతే కఠినమైన మార్గంలో ఆ ప్రాంతాన్ని అమెరికాలో కలిపేయక తప్పదని ఉద్ఘాటించారు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా తాము అనుకున్నది చేసి తీరుతామన్నారు. త్వరలో ఏదో ఒకటి చేయక తప్పదని వెల్లడించారు. గ్రీన్లాండ్ రక్షణ బాధ్యత తమపై ఉందన్నారు. లీజుకు తీసుకున్న ప్రాంతంపై యాజమాన్య హక్కుందని ఎలా అంటారని డెన్మార్క్‌పై అసహనం వ్యక్తంచేశారు. లీజు ఒప్పందాలతో ఎలాంటి ఉపయోగం ఉండదని, చట్టబద్ధంగా యాజమాన్య హక్కులు ఉండాలని వ్యాఖ్యానించారు. విలీనాన్ని ఎవరూ ఆపలేరు చైనా ప్రజలను, రష్యా ప్రజలను తాను చాలా అభిమానిస్తానని.. కానీ, వారు గ్రీన్లాండ్లో అమెరికాకు పొరుగువారిగా ఉండిపోవడం తమకు ఇష్టం లేదని ట్రంప్ అన్నారు. అలా జరగనివ్వబోనని పేర్కొన్నారు. ఈ విషయం అర్థం చేసుకోవాలని నాటోకు సూచించారు. మొత్తానికి గ్రీన్లాండ్ అనేది అమెరికాలో అంతర్భాగం కావడం తథ్యమని, అలా జరగడం ఎవరూ ఆపలేరని ట్రంప్ పరోక్షంగా స్పష్టంచేశారు. అమెరికా జాతీయ భద్రతకు గ్రీన్లాండ్ అత్యంత కీలకమని ట్రంప్ పదేపదే చెబుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్కడ రష్యా, చైనా నౌకలు పాగా వేస్తున్నాయని, అది తమ భద్రతకు విఘాతం కలిగిస్తోందని అంటున్నారు. గ్రీన్లాండ్ వాయవ్య భాగంలో అమెరికాకు ఇప్పటికే సైనిక స్థావరం ఉంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇది ఏర్పాటయ్యింది. ప్రస్తుతం అక్కడ 100 మందికిపైగా అమెరికా జవాన్లు విధులు నిర్వర్తిస్తున్నారు. అమ్మకానికి లేదు గ్రీన్లాండ్ ప్రస్తుతం డెన్మార్క్‌లో భాగంగా కొనసాగుతోంది. పాక్షికంగా స్వయం ప్రతిపత్తి హోదాను అనుభవిస్తోంది. ఇక్కడి ప్రజలకు డెన్మార్క్ పౌరసత్వం ఉంది. డెన్మార్క్ నుంచి ప్రభుత్వ పథకాలు అందుకుంటున్నారు. గ్రీన్‌లాండ్‌ను డబ్బుతో కొనాలన్న ఆలోచన ఉన్నట్లు అమెరికా శ్వేతసౌధం అధికారులు ఇటీవలే ప్రకటించారు. ఆ ప్రయత్నం విఫలమైతే బలప్రయోగం తప్పదన్న సంకేతాలు ఇచ్చారు. సైన్యాన్ని రంగంలోకి దించాల్సి ఉంటుందని వెల్లడించారు. అమెరికా దురాక్రమణ ప్రయత్నాల పట్ల డెన్మార్క్, గ్రీన్లాండ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గ్రీన్లాండ్ అమ్మకానికి లేదని, డబ్బుతో కొనేయాలన్న ఆలోచన ఉంటే మానుకోవాలని డెన్మార్క్ నేతలు తేల్చిచెప్పారు. ఒకవేళ అమెరికా గనుక సైనిక చర్యకు దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ‘నాటో’అంతమవుతుందని అన్నారు. పార్లమెంట్లో తీర్మానం అమెరికాలో తాము అంతర్భాగంగా మారే ప్రసక్తే లేదంటూ గ్రీన్లాండ్ పార్లమెంట్లో శుక్రవారం తీర్మానం చేశారు. పార్లమెంట్‌లోని అన్ని పారీ్టలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. అమెరికా నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నాయి. గ్రీన్లాండ్ ఎప్పటికీ గ్రీన్లాండర్స్దే గ్రీన్లాండ్ ప్రధానమంత్రి జెన్స్ ఫ్రెడరిక్ నీల్సన్తోపాటు అధికార, ప్రతిపక్ష నాయకులు శుక్రవారం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. అమెరికా పౌరులుగా లేదా డెన్మార్క్ పౌరులుగా మారాలన్న కోరిక తమకు లేదని తేల్చిచెప్పారు. తమ దేశాన్ని స్వాహా చేయాలన్న ప్రయత్నాన్ని పక్కనపెట్టాలని అమెరికాను కోరారు. ఎప్పటికీ గ్రీన్లాండ్ పౌరులుగానే ఉంటామని, అందులో మరో మాటకు తావులేదని వెల్లడించారు. విలీనం వెనుక ఎన్నో సవాళ్లు బల ప్రయోగంతో గ్రీన్‌లాండ్‌ను విలీనం చేసుకోవాలన్న ఆరాటం ట్రంప్‌లో ఉన్నప్పటికీ అది అనుకున్నంత సులభం కాదని నిపుణులు అంటున్నారు. ఎన్నో సవాళ్లు ఎదురవుతాయని చెబుతున్నారు. సైనిక చర్యకు దిగితే అంతర్జాతీయ సమాజం వ్యతిరేకించే అవకాశం ఉంది. అమెరికాతో సంబంధాల విషయంలో విదేశాలు పునరాలోచించుకోవచ్చు. మొదట ‘నాటో’కూటమిలో సంక్షోభం తలెత్తుతుంది. కూటమి విచి్ఛన్నమైనా ఆశ్చర్యం లేదు. కొన్ని దేశాలు గ్రీన్లాండ్ రక్షణ కోసం ముందుకు రావొచ్చు. గ్రీన్లాండ్ సమీపంలో ఇప్పటికే రష్యా, చైనాల జలాంతర్గాములు, నౌకలు ఉన్నాయి. ఉమ్మడిగా సైనిక విన్యాసాలు కూడా నిర్వహిస్తున్నాయి. గ్రీన్లాండ్కు మద్దతుగా ఆ రెండు దేశాలు అమెరికాతో తలపడే అవకాశాలు లేకపోలేదు. అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధం వినాశనానికి దారితీయవచ్చు. మొదట కాల్పులు, తర్వాతే మాటలు గ్రీన్‌లాండ్‌పై ఎవరైనా దండయాత్ర చేస్తే కచి్చతంగా తిప్పికొడతామని డెన్మార్క్ హెచ్చరించారు. దురాక్రమణదారులపై తొలుత కాల్పులు జరుపుతామని, ఆ తర్వాతే చర్చిస్తామని పేర్కొంది. ఈ మేరకు డెన్మార్క్ ప్రభుత్వం తమ సైన్యానికి ఆదేశాలు జారీ చేసింది. గ్రీన్లాండ్ విషయంలో అమెరికా దూకుడుగా ముందుకెళ్తుండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే, అమెరికాను ఢీకొట్టగల శక్తి డెన్మార్క్‌కు లేదు. వెనెజువెలా తరహా సైనిక ఆపరేషన్‌ను తట్టుకొనే బలం కూడా లేదు. అమెరికా భూభాగంలో డెన్మార్క్ పరిమాణం 0.44 శాతమే. సైనిక శక్తి అంతంతమాత్రమే. సైనిక సిబ్బంది వేల సంఖ్యలోనే ఉన్నారు. కానీ, నాటో సభ్యదేశాలపై ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. -
ట్రంప్ కు బిగ్ షాక్ ఇకపై అనుమతి తీసుకోవాల్సిందే!
-
ఎలాగైనా గ్రీన్లాండ్ నాకు కావాలంతే..!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. గ్రీన్‌లాండ్‌ను ఏదో రకంగా తమ సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. తంత్రమో వేశో.. కుతంత్రం చేశో గ్రీన్‌లాండ్‌ను తమ భూభాగంలోకి కలిపేసుకోవాలని అనుకుంటున్నారు. ఒకవైపు గ్రీన్‌లాండ్‌పై కన్నేస్తే యుద్ధం తప్పదంటూ డెన్మార్క్ ఇప్పటికే హెచ్చరికల నేపథ్యంలో ట్రంప్ దీనిపై శరవేగంగా పావులు కదుపుతున్నారు. ట్రంప్ తాజా ఆదేశాల్ని బట్టి గ్రీన్‌లాండ్‌తో పోరు కోసం యూఎస్ సైన్యాన్ని సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది. గ్రీన్‌లాండ్‌ను దక్కించుకునే క్రమంలో ఎవరైనా తమ మాట వింటే ఓకే.. లేకపోతే అమెరికా అంటే ఏమిటో చూపించాలని ఆ దేశ బలగాలకు దిశా నిర్దేశం చేశారు. గ్రీన్‌లాండ్‌ను సీజ్ చేయడానికి ఎంత సైనిక సాయం కావాలో అంతా వాడుకోవాలంటూ ఆర్మీకి సూచించారు ట్రంప్.గ్రీన్లాండ్ భూభామనేది చైనా, రష్యా ఆక్రమించుకోలేదని, డెన్మార్క్‌కు పరిధిలో ఉందనే విషయాన్ని గుర్తించుకోవాన్నారు. ‘ గ్రీన్లాండ్ కచ్చితంగా మన వశం కావాలి. ముందు గ్రీన్లాండ్న దక్కించకోవడానికి ఎన్ని సునాయాస ప్రయత్నాలు ఉన్నాయో అన్ని ట్రై చేద్దాం. ఒకవేళ అలా కాని పక్షంలో మన శక్తి ఏమిటో చూపించి దాన్ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది’ అంటూ సంకేతాలు పంపారు. ఖనిజ సంపదతో నిండిన ఆ ద్వీపాన్ని నియంత్రించడం అమెరికా జాతీయ భద్రతకు అత్యంత కీలకమని, ఎందుకంటే ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా, చైనా సైనిక కార్యకలాపాలు పెరుగుతున్నాయన్నారు. దాంతో గ్రీన్లాండ్ అనేది అమెరికా అత్యంత అవసరమని స్పష్టం చేశారు ట్రంప్.ఇది యుద్ధానికి సంకేతమా?2019లో ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంలోనే గ్రీన్‌లాండ్‌పై బేరసారాలు జరిపారు. అప్పుడు ప్రభుత్వానికి డబ్బు ఆఫర్‌ను ప్రతిపాదించారు ట్రంప్.. అయితే దాన్ని డెన్మార్క్ తిరస్కరించింది. కానీ రెండోసారి అధ్యక్షుడైన ట్రంప్ మరోసారి కూడా డబ్బును వెదజల్లడానికి సిద్ధమయ్యారు. ఈసారి డెన్మార్క్ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి.. గ్రీన్లాండ్ ప్రజలకు భారీ ఆఫర్‌ను తెరపైకి తీసుకొచ్చారు. అక్కడ ఉండే వారికి ప్రతీ వ్యక్తికి 10 వేల డాలర్ల నుంచి లక్ష డాలర్ల వరకూ ఇచ్చి ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించాలని చూస్తున్నారు. ఇప్పుడు సైనిక చర్య ద్వారానైనా గ్రీన్లాండ్ తమది కావాలని అంటున్నారు ట్రంప్. తాజా ట్రంప్ వ్యాఖ్యలతో అమెరికా-డెన్మార్క్‌ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయని, ఏ క్షణమైనా ఇరు దేశాల మధ్య యుద్ధం తప్పకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
గ్రీన్లాండ్ నేలపై కరెన్సీ నీడలు!
వీలైతే యుద్ధం.. లేకపోతే శాంతి మంత్రం.. ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లో గత కొంతకాలంగా చూస్తూ వస్తున్న యాంగిల్స్. అయితే ఆయనలో ‘బిజినెస్‌మ్యాన్’ కూడా ఉన్నాడండి. తాను అనుకున్న దానిని ఏదో రకంగా దక్కించుకోవడమే ఈ బిజినెస్ సూత్రం. వీలేతై దేన్నైనా కొనేయడం. మనం షేర్లు కొన్నట్లు డెన్మార్క్‌లో భాగమైన గ్రీన్‌లాండ్‌ను కొనేయడానికి సిద్ధమవుతున్నారు ట్రంప్. అక్కడ 6 వందల బిలియన్ డాలర్లు వెచ్చించి ఆ ప్రాంతాన్ని సొంతం చేసుకోవడానికి సన్నద్ధమయ్యారు. ఎలాగైనా గ్రీన్‌లాండ్‌ను తమది అనిపించుకోవాలనే పట్టుదలతో ఉన్న ట్రంప్.. ఇక డానిష్ దేశానికి డబ్బు ఆశ చూపుతున్నారు. గ్రీన్లాండ్ నేలపై కరెన్సీ నీడను పరచడానికి ట్రంప్ శరవేగంగా పావులు కదుపుతున్నారు. నేటి ప్రపంచంలో డబ్బుతో అసాధ్యం కానిది ఏదీ లేదని నమ్మేవాళ్లలో ఒకరైన ట్రంప్.. డబ్బు అనే వలతో స్వేచ్ఛను బందించే యత్నం చేస్తున్నారు. ఈ మేరకు గ్రీన్లాండ్ (Greenland) ప్రజలకు డొనాల్డ్ ట్రంప్ భారీ ఆఫర్ చేశారు. స్వచ్ఛందంగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేస్తే ఆరు వందల బిలియన్ డాలర్లు చెల్లిస్తానని ప్రకటించారు ట్రంప్. ఇలా అక్కడ ప్రజల్ని ముందుగా ఖాళీ చేయించే యత్నం చేస్తున్నారు. ఈసారి గ్రీన్లాండ్ ప్రజలే టార్గెట్..గ్రీన్లాండ్ అంటే అమెరికాకు అమితమైన ఆసక్తి. అందులోనూ ఈ దీవిపై ట్రంప్‌నకు ఆసక్తి మరీ ఎక్కువ. 2019లో ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంలోనే గ్రీన్‌లాండ్‌పై బేరసారాలు జరిపారు. అప్పుడు ప్రభుత్వానికి డబ్బు ఆఫర్‌ను ప్రతిపాదించారు ట్రంప్.. అయితే దాన్ని డెన్మార్క్ తిరస్కరించింది. కానీ రెండోసారి అధ్యక్షుడైన ట్రంప్ మరోసారి కూడా డబ్బును వెదజల్లడానికి సిద్ధమయ్యారు. ఈసారి డెన్మార్క్ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి.. గ్రీన్లాండ్ ప్రజలకు భారీ ఆఫర్‌ను తెరపైకి తీసుకొచ్చారు. అక్కడ ఉండే వారికి ప్రతీ వ్యక్తికి 10 వేల డాలర్ల నుంచి లక్ష డాలర్ల వరకూ ఇచ్చి ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించాలని చూస్తున్నారు. ఒకవేళ ట్రంప్ చూపే ఆశకు గ్రీన్లాండ్లో ఉండే వాళ్లు సిద్ధమైతే మాత్రం.. ఆ ప్రాంతాన్ని సునాయాసంగానే ట్రంప్ దక్కించుకునే అవకాశం ఉంటుంది. డబ్బు వలలో స్వేచ్ఛ బందీ కానుందా?గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ వ్యూహం మార్చడంతో డెన్మార్క్‌కు అంతా గందరగోళంగా ఉంది. డెన్మార్క్ నుంచి గ్రీన్‌లాండ్‌ను వేరు చేయడానికి చూస్తున్న ట్రంప్‌ను ఎదుర్కోవడానికి ఏం చేయాలనే యోచనలో ఉంది డెన్మార్క్ ప్రభుత్వం. ట్రంప్ ప్రకటించిన ఆఫర్‌కు గ్రీన్లాండ్ ప్రజలు లొంగితే ఇక తాము ప్రత్యక్ష యుద్ధంలోకి దిగకతప్పదనే భయం పట్టుకుంది. అగ్రరాజ్యం అమెరికా ఎదిరించి నిలబడటం అంత ఈజీ కాదని డెన్మార్క్‌కు తెలుసు. పోని వేరే దేశాలేమైనా సాయం చేస్తాయంటే అది ఎంతవరకూ జరుగతుందో అనేది చూడాలి. రష్యా, చైనా (China) వంటి దేశాలు డెన్మార్క్‌కు సాయం చేస్తే తప్పితే, గ్రీన్‌లాండ్‌ను కాపాడుకోవడం డెన్మార్క్‌కు అత్యంత కష్టమేనని విశ్లేషకులు అంటున్నారు. ప్రత్యేకమైన దీవి ఇది.. ఉత్తర అమెరికా, యూరప్ ఖండాలక ఇది సరిగ్గా మధ్యలో ఉంటుంది. ప్రధానంగా ఖండాంతర క్షిపణులు మందస్తు హెచ్చరికల వ్యవస్థ ఏర్పాటుకు ఇది అనువైనది. అమెరికా సైన్యానికి వ్యూహాత్మకమైన ప్రాంతంగా కూడా ఉపయోగపడుతుంది. రష్యా నావికా దళంపై అమెరికా ఎప్పుడూ కన్నేసి ఉంచడానికి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. యూరప్, ఉత్తర అమెరికా ఖండాలకు అది సరిగ్గా మధ్యలో ఉంటుంది. దాంతో అమెరికా సైన్యానికి వ్యూహాత్మకంగా ఈ ప్రాంతం చాలా కీలకం. అంతేగాక ఖండాంతర క్షిపణుల ముందస్తు హెచ్చరికల వ్యవస్థ ఏర్పాటుకు కూడా ఇది అత్యంత అనువైనది. వాయవ్య గ్రీన్లాండ్లోని పిటుఫిక్‌లో అమెరికాకు ఇప్పటికే సైనిక స్థావరముంది. ఇక్కడి నుంచి రష్యా నావికా దళ కదలికలపై అమెరికా అనునిత్యం స్పష్టంగా కన్నేసి ఉంచవచ్చు కూడా.ఖనిజాల సంపదకు పెట్టింది పేరు.. అత్యంత అరుదైనవిగా ప్రకటించిన 34 ఖనిజాల్లో గ్రాఫైట్, లిథియం వంటి ఏకంగా 25 ఖనిజాలు గ్రీన్లాండ్లో అపారంగా ఉన్నట్టు తేలింది. అమెరికా ఈ ఖనిజాల కోసం చాలాకాలంగా చైనాపై ఆధారపడాల్సి వస్తోంది. చైనాపై విధించిన భారీ టారిఫ్‌లను కూడా అంతే వేగంగా ట్రంప్ వెనక్కు తీసుకోవడానికి ఈ ఖనిజాల ఎగుమతిపై డ్రాగన్ నిషేధం విధించడమే ప్రధాన కారణం. గ్రీన్లాండ్ తమకు చిక్కితే ఇకపై ఆ ఖనిజాల కోసం చైనాను బెదిరించే దురవస్థ ఉండదన్నది ట్రంప్ యోచనగా ఉంది. ఈ దీవి 7 దశాబ్దాల క్రితమే డెన్మార్క్‌లో భాగంగా మారింది. కాకపోతే 2019లో గ్రీన్లాండ్కు విస్తృత స్వయం పాలిత ప్రాంతంగా గుర్తింపు లభించింది. ప్రపంచంలోనే అతిపెద్ద దీవిగా ఉన్న గ్రీన్లాండ్.. డెన్మార్క్ నియంత్రణలోనే ఉంది. ప్రస్తుత గ్రీన్లాండ్ జనాభా కూడా లక్ష లోపే ఉంది. వారి జనాభా సుమారు 57 వేలు ఉండొచ్చని అంచనా.. -
డొనాల్డ్ ట్రంప్ మాస్టర్ ప్లాన్.. అమెరికా చేతికి గ్రీన్లాండ్!
వాషింగ్టన్ డీసీ: ‘గ్రీన్లాండ్ మాక్కావాల్సిందే. అమెరికా భద్రత దృష్ట్యా ఇది అత్యంత కీలకం. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదంటూ’నర్మగర్భ వ్యాఖ్యలు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందుకోసం సామ, దాన, భేద, దండోపాయాలు ఉపయోగిస్తున్నారు.ఇందులో భాగంగా.. ట్రంప్ ప్రభుత్వం గ్రీన్లాండ్లో నివసిస్తున్న మొత్తం 57వేల మంది జనాభాలో ఒక్కొక్కరికి పదివేల డాలర్ల నుంచి లక్ష డాలర్ల వరకు వెచ్చించేందుకు సిద్ధమైంది. మొత్తంగా 53 వేల కోట్లు ఖర్చు పెట్టనున్నారు.వారికి డబ్బులు ఇవ్వడమే కాదు గ్రీన్లాండ్ నుంచి అమెరికాకు తరలి వెళ్లేలా ఏర్పాట్లు చేయనున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల, ట్రంప్ గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేస్తామని ప్రకటించారు. ఆ ప్రకటనకు అనుగుణంగానే గ్రీన్లాండ్ వాసులకు ఈ మొత్తాన్ని ముట్టజెప్పనున్నారు. నగదు చెల్లింపులతో పాటు దౌత్య ఒప్పందాలు, సైనిక శక్తి వినియోగం వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. ఎందుకంత ఆసక్తి? గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ ఆసక్తి వెనక బోలెడన్ని కారణాలున్నాయి. యూరప్, ఉత్తర అమెరికా ఖండాలకు అది సరిగ్గా మధ్యలో ఉంటుంది. దాంతో అమెరికా సైన్యానికి వ్యూహాత్మకంగా ఈ ప్రాంతం చాలా కీలకం. అంతేగాక ఖండాంతర క్షిపణుల ముందస్తు హెచ్చరికల వ్యవస్థ ఏర్పాటుకు కూడా ఇది అత్యంత అనువైనది. వాయవ్య గ్రీన్లాండ్లోని పిటుఫిక్‌లో అమెరికాకు ఇప్పటికే సైనిక స్థావరముంది. ఇక్కడి నుంచి రష్యా నావికా దళ కదలికలపై అమెరికా అనునిత్యం స్పష్టంగా కన్నేసి ఉంచవచ్చు కూడా.అపార ఖనిజ నిల్వలు గ్రీన్లాండ్ అపారమైన ఖనిజ, చమురు, సహజవాయు నిల్వలకు ఆలవాలం. అత్యంత అరుదైనవిగా ప్రకటించిన 34 ఖనిజాల్లో గ్రాఫైట్, లిథియం వంటి ఏకంగా 25 ఖనిజాలు గ్రీన్లాండ్లో అపారంగా ఉన్నట్టు తేలింది. విద్యుత్ వాహనాల తయారీలో ఇవి చాలా కీలకమన్నది తెలిసిందే. అమెరికా ఈ ఖనిజాల కోసం చాలాకాలంగా చైనాపై ఆధారపడాల్సి వస్తోంది. చైనాపై విధించిన భారీ టారిఫ్‌లను కూడా అంతే వేగంగా ట్రంప్ వెనక్కు తీసుకోవడానికి ఈ ఖనిజాల ఎగుమతిపై డ్రాగన్ నిషే«ధం విధించడమే ప్రధాన కారణం. గ్రీన్లాండ్ తమకు చిక్కితే ఇకపై ఆ ఖనిజాల కోసం చైనాను బెదిరించే దురవస్థ ఉండదన్నది ట్రంప్ యోచన. ఇక గ్రీన్లాండ్లో చమురు, సహజవాయు నిల్వలు కూడా అపారంగా ఉన్నా, పర్యావరణ కారణాల రీత్యా వాటి వెలికితీతపై నిషేధం కొనసాగుతోంది. ఆ ప్రాంతాన్ని ఆక్రమించి వాటిని కూడా సొంతం చేసుకోవాలన్నది ట్రంప్ వ్యూహం.అతి పెద్ద ద్వీపం గ్రీన్లాండ్ (Greenland) ప్రపంచంలోనే అతి పెద్ద దీవి. 1953లో డెన్మార్క్‌లో భాగంగా మారింది. అయితే 2009లో దానికి విస్తృత స్వయంపాలిత ప్రతిపత్తి దక్కింది. దాని ప్రకారం గ్రీన్లాండ్వాసులు రిఫరెండం ద్వారా పూర్తి స్వాతంత్య్రం పొందవచ్చు కూడా. కాకపోతే అదిప్పటికీ డెన్మార్క్ నియంత్రణలోనే ఉంది. ఇంతా చేస్తే గ్రీన్లాండ్ జనాభా కేవలం 57 వేలు! -
అగ్రరాజ్యానికి వార్నింగ్.. ఆ రూల్ ప్రకారమే దాడి చేస్తాం..!
అగ్రరాజ్యం అమెరికాను డైన్మార్క్ హెచ్చరించింది. గ్రీన్‌ల్యాండ్‌ను ఆక్రమించినట్లయితే దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. మా ఆదేశాలు లేకుండానే సైనికులు కాల్పులు జరుపుతారని డెన్మార్క్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. తమ సైనికులు ముందుగా కాల్పులు జరిపిన తర్వాతే ప్రశ్నలు అడుగుతారని డానిష్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. 1952 నాటి ఆర్మీ ఎంగేజ్మెంట్ రూల్స్ ప్రకారం ఇదే జరుగుతుందని వెల్లడించింది. ఈ రూల్ ప్రకారం సైనికులు ఉన్నతాధికారుల ఆదేశాల కోసం వేచి ఉండకుండా దురాక్రమణదారులపై దాడి చేస్తారని తెలిపింది.నాటో భూభాగమైన గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రయత్నాలు ప్రారంభించడంతోనే డెన్మార్క్ ఈ ప్రకటన చేసింది. ఈ ఆర్కిటిక్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు అమెరికా పరిశీలిస్తున్న ఎంపికల్లో సైనిక శక్తి ఒకటిగా పేర్కొంది. కాగా.. ఇటీవల వెనిజువెలా అధ్యక్షుడు మదురోను అమెరికా నిర్భంధించాక పలు దేశాలు అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.దీనిపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ మాట్లాడుతూ.. "గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకోవడం అమెరికాకు జాతీయ భద్రతా ప్రాధాన్యత. ఆర్కిటిక్ ప్రాంతంలో మన ప్రత్యర్థులను అరికట్టడానికి అవసరమని అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. ఈ కీలకమైన విదేశాంగ విధాన లక్ష్యాన్ని సాధించడానికి సరైన ఎంపికలను పరిశీలిస్తున్నాం. యుఎస్ మిలిటరీని ఉపయోగించడం ఎల్లప్పుడూ ఒక ఎంపిక." అని అన్నారు.వచ్చే వారం డెన్మార్క్, గ్రీన్‌ల్యాండ్ అధికారులతో సమావేశం కావాలని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అన్నారు. ఓ నివేదిక ప్రకారం ట్రంప్ సైనిక బలప్రయోగం కాకుండా ఆ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు. ఇంతలోనే అమెరికా అధికారులతో సమావేశాన్ని డెన్మార్క్ స్వాగతించింది. దీనిని ఒక ముఖ్యమైన చర్చగా పేర్కొంది. -
గ్రీన్ ల్యాండ్ పై ట్రంప్ కన్ను
-
ట్రంప్ మలి గురి... గ్రీన్లాండ్?
నయా సామ్రాజ్యవాది అవతారమెత్తిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తదుపరి లక్ష్యం గ్రీన్లాండేనా? ఆయన వ్యాఖ్యలు, దూకుడు, సహచర గణం ప్రకటనలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురోను అర్ధరాత్రి వేళ సొంత నివాసం నుంచి నిర్బంధించి తీసుకొచ్చిన ట్రంప్ తెంపరితనం ప్రపంచాన్ని విస్మయానికి లోనుచేయడం తెలిసిందే. తానక్కడితో ఆగేది లేదని, దారికి తేవాల్సిన దేశాలు ఇంకొన్ని ఉన్నాయని ఓ జాబితానే చదివారు ట్రంప్. వాటిలో కొలంబియా, క్యూబాతో పాటు మెక్సికో వంటివాటిని చేర్చడమే గాక, ‘అవసరమైతే వాటిపై ఏ క్షణమైనా విరుచుకుపడతాం’అంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు.అయితే వీటన్నింటి కంటే ముందు ట్రంప్ తదుపరి లక్ష్యం డెన్మార్క్ అధీనంలోని గ్రీన్లాండ్ కానుందన్నది విశ్లేషకుల అంచనా. ఆదివారం మీడియాతో ట్రంప్ మాటతీరు కూడా దాన్ని బలపరిచేవిగానే ఉంది. ‘‘ఒక 20 రోజులాగండి, గ్రీన్లాండ్ గురించి మనమంతా మాట్లాడుకుందాం’’అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారాయన. అంతేకాదు, ‘‘గ్రీన్లాండ్ మాక్కావాల్సిందే. అమెరికా భద్రత దృష్ట్యా ఇది అత్యంత కీలకం. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు.ఒకట్రెండు నెలల్లో దీనిపై గట్టిగానే దృష్టి సారిస్తాం’’అంటూ కుండబద్దలు కొట్టారు కూడా. నిజానికి ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉండగానే 2019లోనే గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేస్తామంటూ డెన్మార్క్‌కు ప్రతిపాదించారు. కానీ అక్కడి ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఇక రెండోసారి అధ్యక్షుడు అయినప్పటినుంచీ గ్రీన్లాండ్ ఆక్రమణ కాంక్షను ఆయన ఎప్పుడూ దాచుకోలేదు. ఇటీవల పలుమార్లు మీడియాముఖంగానే తన మనోగతాన్ని స్పష్టం చేస్తూ వచ్చారు. గ్రీన్లాండ్ స్వా«దీనానికి అవసరమైతే సైనిక చర్యకు కూడా వెనకాడబోమని కూడా ప్రకటించారు! అంతేకాదు, గ్రీన్‌లాండ్‌ను అమెరికాలో కలిపేసుకోవాలని తీవ్రంగా వాదించే లూసియానా గవర్నర్ జెఫ్ లాండ్రీని ఏరికోరి ఆ ప్రాంతానికి ప్రత్యేక రాయబారిగా పంపారు కూడా! ఎందుకంత ఆసక్తి? గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ ఆసక్తి వెనక బోలెడన్ని కారణాలున్నాయి. యూరప్, ఉత్తర అమెరికా ఖండాలకు అది సరిగ్గా మధ్యలో ఉంటుంది. దాంతో అమెరికా సైన్యానికి వ్యూహాత్మకంగా ఈ ప్రాంతం చాలా కీలకం. అంతేగాక ఖండాంతర క్షిపణుల ముందస్తు హెచ్చరికల వ్యవస్థ ఏర్పాటుకు కూడా ఇది అత్యంత అనువైనది. వాయవ్య గ్రీన్లాండ్లోని పిటుఫిక్‌లో అమెరికాకు ఇప్పటికే సైనిక స్థావరముంది. ఇక్కడి నుంచి రష్యా నావికా దళ కదలికలపై అమెరికా అనునిత్యం స్పష్టంగా కన్నేసి ఉంచవచ్చు కూడా. అపార ఖనిజ నిల్వలు గ్రీన్లాండ్ అపారమైన ఖనిజ, చమురు, సహజవాయు నిల్వలకు ఆలవాలం. అత్యంత అరుదైనవిగా ప్రకటించిన 34 ఖనిజాల్లో గ్రాఫైట్, లిథియం వంటి ఏకంగా 25 ఖనిజాలు గ్రీన్లాండ్లో అపారంగా ఉన్నట్టు తేలింది. విద్యుత్ వాహనాల తయారీలో ఇవి చాలా కీలకమన్నది తెలిసిందే. అమెరికా ఈ ఖనిజాల కోసం చాలాకాలంగా చైనాపై ఆధారపడాల్సి వస్తోంది. చైనాపై విధించిన భారీ టారిఫ్‌లను కూడా అంతే వేగంగా ట్రంప్ వెనక్కు తీసుకోవడానికి ఈ ఖనిజాల ఎగుమతిపై డ్రాగన్ నిషే«ధం విధించడమే ప్రధాన కారణం. గ్రీన్లాండ్ తమకు చిక్కితే ఇకపై ఆ ఖనిజాల కోసం చైనాను బెదిరించే దురవస్థ ఉండదన్నది ట్రంప్ యోచన. ఇక గ్రీన్లాండ్లో చమురు, సహజవాయు నిల్వలు కూడా అపారంగా ఉన్నా, పర్యావరణ కారణాల రీత్యా వాటి వెలికితీతపై నిషేధం కొనసాగుతోంది. ఆ ప్రాంతాన్ని ఆక్రమించి వాటిని కూడా సొంతం చేసుకోవాలన్నది ట్రంప్ వ్యూహం. అతి పెద్ద ద్వీపం గ్రీన్లాండ్. ప్రపంచంలోనే అతి పెద్ద దీవి. 1953లో డెన్మార్క్‌లో భాగంగా మారింది. అయితే 2009లో దానికి విస్తృత స్వయంపాలిత ప్రతిపత్తి దక్కింది. దాని ప్రకారం గ్రీన్లాండ్వాసులు రిఫరెండం ద్వారా పూర్తి స్వాతంత్య్రం పొందవచ్చు కూడా. కాకపోతే అదిప్పటికీ డెన్మార్క్ నియంత్రణలోనే ఉంది. ఇంతా చేస్తే గ్రీన్లాండ్ జనాభా కేవలం 57 వేలు! – సాక్షి, నేషనల్ డెస్క్ నాటో భవితవ్యమేమిటో?! గ్రీన్లాండ్ విషయమై అమెరికా, డెన్మార్క్ మధ్య మొదలైన రగడ నాటో కూటమి అస్తిత్వంపైనే ప్రశ్నలు లేవనెత్తుతోంది. అత్యంత శక్తిమంతమైన నాటో కూటమిలో అవి రెండూ సభ్య దేశాలేనన్నది తెలిసిందే. కూటమిలోని ఏ దేశంపై దాడి జరిగినా అది అందులోని దేశాలన్నిటిపైనా దాడిగానే పరిగణించి అంతా కలసికట్టుగా ఎదుర్కోవాలన్నది నాటో ఒప్పందం. అలాంటప్పుడు అమెరికా ఏకంగా తోటి సభ్య దేశంపైనే దాడికి దిగితే అది కూటమి మూల, వ్యవస్థాపక సూత్రాలకే విరుద్ధమవుతుంది.అందుకే, అమెరికా దాడి నాటోకు అంతమేనన్న డెన్మార్క్ ప్రధాని హెచ్చరికల నేపథ్యంలో నాటోలోని యూరప్ దేశాలు వెంటనే స్పందించాయి. ‘‘ఆర్కిటిక్ ప్రాంతమంతా యూరప్ ప్రయోజనాలకు అతి కీలకం. అందుకే అక్కడ మా దేశాల ఉనికి, కార్యకలాపాలతో పాటు పెట్టుబడులను కూడా నానాటికీ విస్తరిస్తూ వస్తున్నాం. దాన్ని సురక్షితంగా ఉంచడానికే మా ప్రాధాన్యం. డెన్మార్క్‌తో పాటు గ్రీన్లాండ్ కూడా నాటోలో భాగమే’’అంటూ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. అమెరికాయే కీలకం నాటో కూటమిలో అమెరికాయే కీలకంగా వ్యవహరిస్తూ వస్తోంది. కూటమి రక్షణ బడ్జెట్లో 17 శాతం వాటా ఆ దేశానిదే. కనుకనే గ్రీన్లాండ్ రక్షణ, సంరక్షణ కూడా తమ బాధ్యతే కావాలన్నది ట్రంప్ సలహాదారు స్టీఫెన్ వాదన. -
ఆర్కిటిక్‌పై నియంత్రణకు పోటీ
భూమి ఎగువ భాగమైన ఉత్తర ధ్రువంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అర్కిటిక్‌పై నియంత్రణ కోసం గ్రీన్‌లాండ్‌ను స్వా«దీనం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయతి్నస్తున్నారు. మరోవైపు రష్యా ఆర్కిటిక్‌లోని తన సైనిక స్థావరాలను ఆధునీకరిస్తోంది. ఇంకోవైపు చైనా ఐస్ బ్రేకర్లు అక్కడ సరికొత్త మార్గాలు తెరుస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత శీతల ప్రాంతమైన అర్కిటిక్ కోసం పెద్ద దేశాల మధ్య ముదురుతున్న ఈపోటీ ప్రపంచ భద్రతకే పెను ముప్పుగా మారుతోంది. ఆర్కిటిక్‌పై పట్టు కోసం అగ్రరాజ్యాల మధ్య ఈ పోటీ ఎందుకో అర్థం కావాలంటే ఆ ప్రాంతాన్ని భూగోళం పై నుంచి చూసి అర్థం చేసుకోవాలి. ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభంలో గ్రీన్‌ల్యాండ్æకు ఉత్తరాన ఉన్న మారుమూల ప్రాంతంలో థూలే అనే ప్రదేశంలో అమెరికా ఒక ముఖ్యమైన స్థావరాన్ని ఏర్పాటు చేసింది. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసినా ఆ ప్రదేశ ప్రాముఖ్యత తగ్గలేదు. గ్రీన్లాండ్ ఇప్పటికీ డెన్మార్క్‌లో భాగంగా అ«దీనంలోనే ఉంది. దాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకోవాలని అమెరికా ఎప్పటినుంచో యోచిస్తోంది. ట్రంప్ రెండోసారి గద్దెనెక్కాక ఈ ప్రయత్నాలు మరింత వేగవంతం చేశారు. అమెరికా రక్షణకోసం గోల్డెన్ డోమ్ వ్యవస్థను ఇటీవలే అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించారు. ఇలాంటి వ్యవస్థకు ముందస్తు హెచ్చరిక సైట్లు చాలా ముఖ్యమైనవి. అలా రక్షణ, దాడి రెండింటికీ పనిచేసే స్థావరంగా గ్రీన్‌లాండ్‌ను అమెరికా చూస్తోంది. ఇది చాలాకాలంగా రష్యాకు ఆందోళన కలిగిస్తోంది. అమెరికా ఏదైనా ముందడుగు వేస్తే అత్యంత ప్రభావితమయ్యేది రష్యానే. రష్యా భూభాగంలో ఐదో వంతు ఆర్కిటిక్‌లో ఉంది. ఇక ఆ దేశ తీరప్రాంతంలో సగానికి పైగా ఆర్కిటిక్ వెంబడే ఉంది. అందుకే అర్కిటిక్‌లో రష్యా కొన్నేళ్లుగా ఇబ్బడిముబ్బడిగా పెట్టుబడులు పెడుతోంది. నాగూర్స్కోయ్ వంటి ౖతన వైమానిక స్థావరాలను యుద్ధ ప్రాతిపదికన ఆధునీకరిస్తోంది. ప్రచ్ఛన్న యుద్ధకాలం నుంచే నిర్వహిస్తున్న ఆ స్థావరాలను భారీ విమానాలను కూడా ఆపరేట్ చేయగలిగేలా తీర్చిదిద్దుతోంది. రష్యా అణు జలాంతర్గామి దళంలో ఎక్కువ భాగం కోలా ద్వీపకల్పంలో ఉంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యరి్థపై దాడికి వీలుగా వాటిని ఆర్కిటిక్‌లో మంచు కింద నిలిపి ఉంచుతుంది. ఇటు అమెరికా, అటు రష్యా చేస్తున్న ఈ ప్రయత్నాలు నాటో కూటమిలోని యూరప్ దేశాలను భయపెడుతున్నాయి. దాంతో ఈ ఉద్రిక్తతలను తగ్గించడంపై నార్వే దృష్టి పెటింది. ఆర్కిటిక్‌లో మరో కీలక ప్రాంతం స్వాల్బార్డ్ దీవులు. వాటిని నార్వే నియంత్రిస్తుంది. అయినా రష్యాతో సహా అనేక దేశాలు అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. గ్రీన్లాండ్, ఐస్లాండ్ మధ్య ఖాళీ ప్రదేశం కూడా కీలకమే. అట్లాంటిక్‌ను చేరుకోవడానికి రష్యన్ ఉత్తరాది నౌకాదళం ఈ జలాలను దాటాల్సి ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ యు–బోట్లను ఎదుర్కోవడానికి గ్రీన్లాండ్లో అమెరికా సైనిక స్థావరాన్ని స్థాపించడానికి ఈ జల సంధే కారణం. రేసులోకి బ్రిటన్ ఇటీవలి కాలంలో బ్రిటన్ కూడా ఆర్కిటిక్‌పై దృష్టి పెట్టింది. విదేశాంగ మంత్రి డేవిడ్ లామీ మే చివరలో ఆర్కిటిక్‌ను సందర్శించారు. అక్కడ శత్రు కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడానికి ఐస్‌లాండ్‌తో కలిసి ఉమ్మడి పథకాన్ని ప్రకటించారు. రష్యన్ జలాంతర్గాములు, పడవలను ఆచూకీ కనిపెట్టడమే లక్ష్యంగా దీన్ని రూపొందించారు. కానీ జలాంతర్గాములు, సముద్ర గస్తీ, వైమానిక ముందస్తు హెచ్చరిక విమానాలు బ్రిటన్ లేని నేపథ్యంలో ఈ యత్నాలేవీ ఫలించేలా లేవు. ఇక ఆర్కిటిక్‌కు చాలా దూరంలో ఉన్న చైనా, తనను తాను ఆ ప్రాంతానికి అతి సమీప దేశంగా చెప్పుకుంటోంది. ఇటీవలి కాలంలో అక్కడ దూకుడు పెంచింది. అక్కడ మంచు విపరీతంగా కరగడం వల్ల ఉత్తరాది అంతటా కొత్త వాణిజ్య మార్గం ఏర్పడుతుండటం చైనాకు బాగా కలిసొస్తోంది. సూయజ్ కాల్వతో పోలిస్తే ఈ మార్గం దానికి బాగా అనుకూలం. అక్కడ విద్యుత్తు ప్రొజెక్ట్ ఏర్పాటుకూ చైనా ప్రయతి్నస్తోంది. అక్కడ ఐస్బ్రేకర్ల సముదాయాన్ని వేగంగా విస్తరిస్తోంది. మైనింగ్ సంస్థలు, విద్యా పరిశోధనల మాటున ఆర్కిటిక్‌లో చైనా గూఢచారులు బిజీగా గడుపుతున్నారు. ఇవన్నీ అమెరికా, రష్యాల్లో ఆందోళన పెంచుతున్నాయి. డేంజర్ బెల్స్ ఇలా ఆర్కిటిక్‌పై పట్టు కోసం ఏ దేశానికి ఆ దేశం చేస్తున్న ప్రయత్నాలు ఆక్కడ విపరీతమైన వాతావరణ మార్పులకు కారణమవుతున్నాయి. 2040 నాటికి వేసవిలో ఈ ప్రాంతంలో మంచు ఆనవాలే ఉండకపోవచ్చని ఒక అధ్యయనం ఇప్పటికే హెచ్చరించింది. ఇలా మంచు కరగడం వల్ల్ల ఖనిజాలు, చేపలు, ఇతర సముద్ర సంపద కోసం పోటీ పెరుగుతుంది. మరోవైపు షిప్పింగ్‌కు దారులు పెరుగుతాయి. ఈ ఆర్థిక పోటీ పెద్ద దేశాల మధ్య మరిన్ని తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీయవచ్చు. రష్యా ఆర్థిక ఉత్పత్తిలో దాదాపు పదోవంతు ఆర్కిటిక్ సహజ వనరుల నుంచే వస్తుంది. అక్కడ మంచు విపరీతంగా కరుగుతుండటం రష్యా భద్రతను డోలాయమానంలో పడేస్తోంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
5 లక్షల కోట్ల టన్నుల మంచు కరిగింది
అపారమైన మంచు నిల్వలకు గ్రీన్లాండ్ ఆలవాలం. ప్రపంచంలోని మొత్తం మంచినీటిలో 8 శాతం అక్కడే ఉందని అంచనా. అలాంటి గ్రీన్లాండ్లో మంచు శరవేగంగా కరిగిపోతోంది. ఎంతగా అంటే ఏటా సగటున 5,500 కోట్ల టన్నుల మేరకు! 1992లో మొదలైన ఈ ధోరణి ఏటా అంతకంతకూ పెరుగుతూనే వస్తోందట. ఆ లెక్కన గత 28 ఏళ్లలో అక్కడ ఏకంగా 5 లక్షల టన్నుల మంచు మాయమైపోయిందట! గ్రీన్‌లాండ్‌పై గ్లోబల్ వార్మింగ్ ప్రభావంపై చేపట్టిన అధ్యయనంలో సైంటిస్టులు ఈ మేరకు తేల్చారు. ఇది ఒక్క గ్రీన్‌లాండ్‌కే పరిమితం కాదని నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్ఓఏఏ) తెలిపింది. ‘‘మొత్తమ్మీద ధ్రువాల వద్ద మంచు కరుగుదల ప్రమాదకర స్థాయిలో ఉంది. ఇది చాలా ఆందోళనకర పరిణామం’’అని ఆందోళన వెలిబుచి్చంది. అక్కడ మంచు ఈ స్థాయిలో కరిగిపోవడానికి నిర్దిష్ట కారణాలేమిటో తేల్చే పనిలో పడింది. అక్కడినుంచి ఆవిరవుతున్న నీరు ఎటు వెళ్తోందో తెలియడం లేదని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ మిస్టరీని ఛేదించేందుకు అక్కడి నీటి ఆవిరిని డ్రోన్ల సాయంతో సేకరించి పరిశోధిస్తున్నారు. ఇందుకోసం భూ ఉపరితలం నుంచి 5,000 అడుగుల ఎత్తు దాకా వివిధ స్థాయిల్లో నీటి ఆవిరిని పలు దఫాలుగా సేకరించారు. ‘‘ఆవిరయ్యే నీటిలో ఎంతోకొంత తిరిగి మంచుగా మారి అక్కడే పడుతుంది. కానీ చాలావరకు మాత్రం గ్రీన్లాండ్ జలవ్యవస్థకు శాశ్వతంగా దూరంగా వెళ్లిపోతోంది. ఇదే ఆందోళన కలిగించే విషయం’’అని అధ్యయనానికి సారథ్యం వహించిన కెవిన్ రోజి్మయారెక్ వివరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
డెన్మార్క్‌ను వదిలేయండి.. అమెరికాతో ఒప్పందం చేసుకోండి
గ్రీన్లాండ్: ఆర్కిటిక్ ద్వీప దేశమైన గ్రీన్‌లాండ్‌పై అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రీన్‌లాండ్‌ను డెన్మార్క్ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. చైనా, రష్యాలకు గ్రీన్‌లాండ్‌ను అప్పగించాలన్నదే డెన్మార్క్ ఆలోచనగా కనిపిస్తోందని మండిపడ్డారు. అందుకే అమెరికాతో ఒక ఒప్పందానికి వస్తే బాగుంటుందని గ్రీన్లాండ్ ప్రజలకు సూచించారు. జె.డి.వాన్స్ శుక్రవారం తన భార్య ఉషా వాన్స్‌తో కలిసి గ్రీన్లాండ్లో పర్యటించారు. డెన్మార్క్‌తో సంబంధాలు తెంచుకోవాలని గ్రీన్లాండ్ పౌరులకు పిలుపునిచ్చారు. మిమ్మల్ని రక్షించే పరిస్థితిలో డెన్మార్క్ లేదని అన్నారు. ఇతర దేశాల ఆక్రమణల నుంచి గ్రీన్‌లాండ్‌ను కాపాడే సత్తా అమెరికాకు మాత్రమే ఉందని తేల్చిచెప్పారు. గ్రీన్లాండ్ సార్వభౌమత్వాన్ని గౌరవిస్తున్నామని చెప్పారు. గ్రీన్లాండ్ భద్రతతోనే అమెరికా భద్రత ముడిపడి ఉందన్నారు. గ్రీన్‌లాండ్‌ను అమెరికాలో విలీనం చేసుకుంటామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రతిపాదనను గ్రీన్లాండ్ ప్రజలకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గ్రీన్లాండ్లో 57 వేల మంది నివసిస్తున్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున విలువైన ఖనిజ నిక్షేపాలున్నాయి. వీటిపై డొనాల్డ్ ట్రంప్ కన్నేశారని ఆయన ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. -
గ్రీన్‌ల్యాండ్‌కు జేడీ వాన్స్ పర్యటన.. పొలిటికల్ టెన్షన్
వాషింగ్టన్: డెన్మార్క్‌లో స్వయంప్రతిపత్తి గల ‘గ్రీన్‌ల్యాండ్’ను కొనేందుకు సిద్ధమంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న వేళ డెన్మార్క్ ప్రభుత్వానికి మరింత కోపం తెప్పించేలా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రవర్తించారు. అనధికార పర్యటనలో భాగంగా గ్రీన్‌ల్యాండ్‌కు వాన్స్ భార్య ఉషా గురువారం వెళ్లి శనివారం తిరిగిరానున్నారు. అయితే భార్యతో వెళ్లాలని తాను నిర్ణయించుకున్నానని వాన్స్ మంగళవారం వెల్లడించారు. ఈ సందర్భంగా గ్రీన్‌ల్యాండ్ అంశాన్ని ప్రస్తావించారు.ఈ క్రమంలో వాన్స్ మాట్లాడుతూ..‘భార్య ఒక్కతే ఆనందంగా ఉంటే సరిపోతుందా. నేను కూడా ఆమెతోపాటు గ్రీన్‌ల్యాండ్‌కు వెళ్తా. గ్రీన్‌ల్యాండ్ పర్యటనలో భాగంగా అక్కడి వాయవ్య పిటిఫిక్ భూభాగంలోని అమెరికా వైమానిక స్థావరాన్ని సందర్శిస్తా. అధ్యక్షుడు ట్రంప్ తరఫున మాట్లాడుతున్నా. గ్రీన్‌ల్యాండ్ ప్రజల భద్రతను మరింత పటిష్టం చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే గ్రీన్‌ల్యాండ్ భద్రత అనేది పరోక్షంగా యావత్ ప్రపంచ భద్రతకు సంబంధించింది’ అని అన్నారు.దీంతో డెన్మార్క్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ‘ప్రైవేట్‌గా లేదంటే ప్రభుత్వం తరఫున ఎవరినీ మా దేశంలోకి అనుమతిస్తూ ఆహ్వానాలు పంపలేదు’ అని గ్రీన్‌ల్యాండ్ సర్కార్ ఫేస్బుక్లో ఒక పోస్ట్పెట్టింది. ‘పిలవకుండా వచ్చి మమ్మల్ని అనవసర ఒత్తిడికి గురిచేయాలని అనుకుంటున్నారు’ అని డెన్మార్క్ ప్రధాన మంత్రి మెట్టే ఫ్రెడెరిక్సన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సిసిమియట్ పట్టణంలోని అవన్నాటా క్విమిసెర్సూ శునకాల స్లెడ్జ్ బండ్ల పరుగుపోటీని, గ్రీన్‌ల్యాండ్ సంస్కృతి, సంప్రదాయాలను స్వయంగా వీక్షించేందుకు అక్కడ పర్యటిస్తానని ఉషా గతంలో చెప్పడం తెలిసిందే. గ్రీన్‌ల్యాండ్‌లో లిథియం వంటి ఖనిజ నిల్వలు అపారం. వీటిని దక్కించుకునేందుకు ట్రంప్ కుయుక్తులు పన్నారని డెన్మార్క్ ప్రభుత్వం గతంలోనే తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఈ విషయంలో డెన్మార్క్‌కు నాటో సభ్య దేశాలు సైతం మద్దతు పలికాయి. JD Vance announces he’s going to Greenland with his wife Usha.Nobody wants her or you there, bro.pic.twitter.com/IowQstwafx— Art Candee 🍿🥤 (@ArtCandee) March 25, 2025 -
‘ఉషా వాన్స్ రాక.. మమ్మల్ని రెచ్చగొట్టడమే!’
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీమణి ఉషా వాన్స్ ‘గ్రీన్లాండ్ పర్యటన’ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. రెండ్రోజులు ఆమె పర్యటించాల్సి ఉండగా.. ప్రకటన వెలువడి 24 గంటలు గడవక ముందే గ్రీన్లాండ్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఉష పర్యటనను బహిష్కరించాలని అక్కడి తాత్కాలిక ప్రభుత్వం నిర్ణయించింది. విలువైన ఖనిజాలు ఉన్న ఈ అతిపెద్ద ద్వీపదేశాన్ని హస్తగతం చేసుకుంటానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వరుస ప్రకటనలే ఇందుకు కారణం. అమెరికా సెకండ్ లేడీ ఉషా వాన్స్(Usha Vance) ఈ నెల 27 నుంచి 29వ తేదీదాకా గ్రీన్లాండ్లో పర్యటించాల్సి ఉంది. అవన్నాట కిముస్సర్సులో జరగబోయే డాగ్స్లెడ్ రేసుకు హాజరు కావడంతో పాటు పలు ప్రాంతాల్లో ఆమె పర్యటించనున్నారు. అయితే ఈ పర్యటనను ఆ దేశ ప్రధాని మ్యూట్ ఎగేడే తీవ్రంగా విమర్శిస్తున్నారు. అమెరికా-గగ్రీన్లాండ్ మధ్య ఒకప్పటిలా మంచి సంబంధాలు లేవని.. అది ఈమధ్యే ముగిసిపోయిందని అన్నారాయన. అలాగే ఉషా వాన్స్ పర్యటన.. ముమ్మాటికీ గ్రీన్‌లాండ్‌ను రెచ్చగొట్టడం కిందకే వస్తుందని అంటున్నారాయన. అంతేకాదు.. ఆమె వెంట జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్ట్జ్, ఎనర్జీ సెక్రటరీ క్రిస్ రైట్లతో కూడిన బృందాలు వస్తుండడంపైనా ఎగేడే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక తన పర్యటనకు ముందు ఉషా వాన్స్ ఓ వీడియోను పోస్ట్ చేశారు. SLOTUS VISITING GREENLAND 🇬🇱 Hands up If USA should purchase Greenland. pic.twitter.com/fkduBBVOPB— Usha Vance News (@UshaVanceNews) March 23, 2025 గ్రీన్లాండ్(GreenLand).. అతిపెద్ద ద్వీపం. అర్కిటిక్-అట్లాంటిక్ మహాసముద్రాల మధ్యలో ఉంటుంది. భౌగోళికంగా ఉత్తర అమెరికాలో భాగమైనప్పటికీ.. యూరప్ దేశాలతోనే రాజకీయ, సంప్రదాయపరంగా కలిసి ఉంది. అయితే ఇది స్వతంత్ర దేశం కాదు. కింగ్డమ్ ఆఫ్ డెన్మార్క్ సరిహద్దులో అటానమస్‌గా ఉండిపోయింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచే గ్రీన్‌లాండ్‌ను చేజిక్కించుకోవడంపై ట్రంప్ వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. అయితే.. ఈ ప్రతిపాదనను ఇటు గ్రీన్లాండ్, అటు డెన్మార్క్ రెండూ వ్యతిరేకిస్తున్నాయి. రెండు నెలల కిందట ట్రంప్ పెద్ద కొడుకు గ్రీన్‌లాండ్‌ను సందర్శించారు.మార్చి 11వ తేదీన జరిగిన గ్రీన్లాండ్ పార్లమెంట్ ఎన్నికల్లో డెమోక్రట్స్ ఘన విజయం సాధించారు. డెమోక్రట్స్ నేత జెన్స్ ఫ్రెడ్రిక్ నీల్సన్ సైతం ఉషా వాన్స్ పర్యటనను తీవ్రంగా తప్పుబట్టారు. అయితే విమర్శలతో సంబంధం లేకుండా.. ఉషా వాన్స్ పర్యటన భద్రత కోసం అమెరికా నుంచి ప్రత్యేక బలగాలు గ్రీన్లాండ్కు చేరుకున్నాయి. మరోవైపు ఈ పర్యటనను వ్యతిరేకిస్తూనే.. అమెరికాతో దౌత్యపరమైన సంబంధాల దృష్ట్యా గ్రీన్లాండ్కు తమ పోలీసు బలగాలను డెన్మార్క్ పంపించింది. -
అమెరికా ‘గ్రీన్‌ల్యాండ్’ కలలకు చెక్ పెట్టిన డెన్మార్క్!
గ్రీన్‌ల్యాండ్ స్వాదీనం కోసం డెన్మార్క్‌కు అగ్రరాజ్యం బెదిరింపులు.. కొన్ని లక్షల మంది ఊబకాయులున్న అమెరికాపైనే ప్రభావం చూపించనున్నాయి. బెదిరింపులకు, ఊబకాయులకు సంబంధమేంటనే సందేహం వస్తోంది కదూ.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే! గ్రీన్‌ల్యాండ్‌పై ఆధిపత్యం కోసం అగ్రరాజ్యం అమెరికా, యూరప్ దేశం డెన్మార్క్ ప్రచ్ఛన్న పోరు కొనసాగుతోంది. గ్రీన్‌ల్యాండ్ ఖనిజ సంపదపై కన్నేసిన డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షునిగా ఎన్నికైన నాటినుంచే కొనుగోలు ఆలోచనను తెరపైకి తెచ్చారు. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన చర్యలను వేగవంతం చేశారు. గ్రీన్‌ల్యాండ్‌పై అధికారాలున్న డెన్మార్క్‌పై బెదిరింపులకు పాల్పడుతున్నారు. తమ ప్రతిపాదనకు అంగీకరించకపోతే అధిక సుంకాలు విధిస్తామంటూ డెన్మార్క్‌ను హెచ్చరించారు. అవసరమైతే సైనిక చర్యకు కూడా వెనుకాడబోమనే సంకేతాలూ ఇచ్చారు. అయినా గ్రీన్‌ల్యాండ్ అమ్మకానికి లేదంటూ డెన్మార్క్ స్పష్టం చేసింది. అమెరికా టారిఫ్ బెదిరింపులు డెన్మార్క్‌ను ప్రభావితం చేయడం ప్రశ్నార్థకమే. ఎందుకంటే అమెరికాను ఎదుర్కోవడానికి డెన్మార్క్ దగ్గర కీలక ఆయుధాలున్నాయి. వీటిలో మొదటిది ఊబకాయాన్ని తగ్గించే ఔషదం ఓజెంపిక్, రెండోది పిల్లలకు ఇష్టమైన లెగో బొమ్మల ఎగుమతులు. ప్రపంచంలోనే అత్యధిక ఊబకాయులు అమెరికాలోనే.. ప్రపంచంలోనే అత్యధిక ఊబకాయం రేటు అమెరికాలో ఉంది. ఓ నివేదిక ప్రకారం.. 23 అమెరికన్ రాష్ట్రాల్లో, ముగ్గురు పెద్దల్లో ఒకరి కంటే ఎక్కువ మంది (35%) ఊబకాయంతో బాధపడుతున్నారు. డానిష్ ఫార్మా దిగ్గజం నోవో నోర్డిస్క్ తయారు చేసిన ఓజెంపిక్, వెగోవి మందులు.. అమెరికాలో ఊబకాయం, డయాబెటిస్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయి. జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం.. 2021 నుంచి 2023 వరకు అమెరికాలో ఓజెంపిక్ ఉపయోగిస్తున్నవారి సంఖ్య 400 శాతం పెరిగింది. ఇప్పటికే అమెరికన్లు ఒక ఓజెంపిక్ ప్యాకెట్ కోసం దాదాపు వెయ్యి డాలర్లు చెల్లిస్తున్నారు. బీమా, డిస్కౌంట్లు లేకుండా అది కాస్తా 1300 డాలర్లు అవుతుంది. ఒకవేళ అమెరికా ఈ మందులు తయారు చేయాలనుకున్నా.. ఓజెంపిక్, వెగోవిలకు అవసరమైన సెమాగ్లుటైడ్ డెన్మార్క్‌లోనే తయారవుతుంది. ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలో ఇప్పటికే ఈ మందుల ధర ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ట్రంప్ డెన్మార్క్‌పై భారీ సుంకాలు విధిస్తే ఓజెంపిక్, వెగోవి ధరలు పెంచే అవకాశం ఉంది. ఆ ఒక్కటే కాదు.. ట్రేడింగ్ ఎకనామిక్స్ డేటా ప్రకారం 2023లో డెన్మార్క్ నుంచి 5.7 బిలియన్ డాలర్ల విలువైన మందులు, వ్యాక్సిన్లు మరియు యాంటీబయాటిక్స్‌ను అమెరికా దిగుమతి చేసుకుంది. డెన్మార్క్ కేంద్రంగా లెగో గ్రూప్... ప్రపంచంలోనే అతిపెద్ద బొమ్మల తయారీ సంస్థ లెగో గ్రూప్ కూడా డెన్మార్క్ కేంద్రంగానే పనిచేస్తోంది. ఈ బొమ్మలకు అమెరికాలో ప్రజాదరణ ఎక్కువ. అంతేకాదు.. అమెరికాకు వినికిడి పరికరాల సరఫరాలో కూడా డెన్మార్క్‌దే అగ్రస్థానం. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ టారిఫ్ బెదిరింపులు.. తిరిగి అమెరికాకు తలనొప్పులు తెచ్చే అవకాశం ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మహిళా ప్రధానికి ట్రంప్ బెదిరింపులు?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేసేలా కనిపిస్తున్నారు. డెన్మార్క్ ప్రధాని మెటె ఫ్రెడరికన్సన్కు ఫోన్లో వాగ్వాదానికి దిగారు. గ్రీన్‌ల్యాండ్ అంశం విషయంలోనే ఈ హాట్ హాట్ పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సంబంధిత అధికారులను ఉటంకిస్తూ ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ ప్రముఖంగా కథనం ప్రచురించింది. ఉత్తర అమెరికా, రష్యా మధ్య ఆర్కిటిక్ ప్రాంతంలో, యూరప్‌కి వాయువ్యంగా వ్యూహాత్మక ప్రాంతంగా ఉంది గ్రీన్‌ల్యాండ్(Greenland). స్వయం ప్రతిపత్తి కలిగిన దేశం అయినప్పటికీ.. డెన్మార్క్ సామ్రాజ్యపు నియంత్రణలో ఉంటోంది. దీంతో ఎలాంటి సంప్రదింపులకైనా డెన్మార్క్‌తో చర్చించాల్సిందే. గ్రీన్‌ల్యాండ్‌ను కొనుగోలు చేయాలని డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఎప్పటి నుంచో భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో డెన్మార్క్‌తో ఆయన సంప్రదింపులు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ట్రంప్, డెన్మార్క్ ప్రధాని ఫ్రెడెరిక్సన్ మధ్య ఫోన్లో వాగ్వాదం జరిగిందని తెలుస్తోంది. తన ప్రతిపాదనకు ఒప్పుకోకపోతే డెన్మార్క్‌ను ఆర్థికంగా శిక్షిస్తానని ట్రంప్ ఈ ఫోన్‌కాల్‌లో హెచ్చరించారట. ఫోన్‌కాల్‌లో ట్రంప్ సంభాషించిన తీరుకు తాము దిగ్భ్రాంతికి గురయ్యామని ఆ అధికారులు వెల్లడించినట్లు సదరు కథనం పేర్కొంది. ఫోన్ కాల్లో సంభాషణ ఇలా.. గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకునే విషయంలో తాము సీరియస్ ఆలోచన చేస్తున్నామని ట్రంప్ పేర్కొన్నారు. దానికి ఫ్రెడెరిక్సన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే గ్రీన్‌ల్యాండ్ అమ్మడంపై ఎలాంటి ఆసక్తి లేదని ఆమె తేల్చిచెప్పారు. తన ప్రతిపాదనను తిరస్కరించడంతో ట్రంప్ కోపంతో ఆమెతో దూకుడుగా మాట్లాడారట. ఒక దశలో బెదిరింపులకు దిగారని సదరు కథనం పేర్కొంది. వీరిద్దరి మధ్య సుమారు 45 నిమిషాల పాటు ఫోన్ కాల్ సాగినట్లు సమాచారం. డొనాల్డ్ ట్రంప్ 2016లో అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ ఈ ప్రతిపాదనను తెర పైకి తెచ్చారు. కానీ, ట్రంప్ కంటే చాలాఏళ్ల ముందే అమెరికా నుంచి ఈ ప్రతిపాదన వెళ్లింది. గతంలో అమెరికా అధ్యక్షుడిగా పని చేసిన హ్యారీ ట్రూమాన్ ఈ ద్వీపం కొనుగోలుపై ఆసక్తి చూపించారు. గ్రీన్‌ల్యాండ్ భౌతిక స్వరూపం, అక్కడ నిక్షిప్తమైన సహజ సంపద వనరులే అందుకు కారణం. అయితే.. సుమారు 100 మిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని ఇచ్చేందుకు సిద్ధమైనప్పటికీ దానిని డెన్మార్క్ తిరస్కరించింది.మళ్లీ ఇన్నాళ్లకు.. పనామా కాలువు, కెనడా, గ్రీన్‌ల్యాండ్ ప్రకటనలతో ట్రంప్ సంచలన చర్చకు దారి తీశారు. తమ ప్రతిపాదనకు ఒప్పుకోకుంటే.. ఆర్థిక ఆంక్షలు విధిస్తానని, అవసరమైతే సైన్యపరమైన చర్యలకు తాను వెనకాడబోనంటూ ప్రకటించారాయన. అయితే ట్రంప్ బహిరంగ ప్రకటన ప్రపంచ దేశాలను.. ప్రత్యేకించి ఈయూ దేశాలను ఆందోళనకు గురి చేసింది. గ్రీన్లాండ్ అమ్మకానికి లేదని, భవిష్యత్తులో అమ్మే ప్రసక్తే లేదని, అది తమ దేశ ప్రజల గౌరవానికి సంబంధించిన విషయమని ఆ దేశ ప్రధాని మ్యూట్ బౌరప్ ఎగిడే ఇటీవల స్పష్టంచేసిన విషయం తెలిసిందే.గ్రీన్లాండ్లో ఏముందంటే..గ్రీన్‌ల్యాండ్ చాలా వనరులు అధికంగా ఉన్న ద్వీపం. ఇది చమురు, గ్యాస్ నిల్వలతో సమృద్ధిగా ఉంది. రేర్ ఎర్త మెటీరియల్ లభ్యం అవుతుంది. రాగి, లిథియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. బ్యాటరీలు, ఎలక్ట్రిక్ వాహనాల్లో వీటి వినియోగం ఎక్కువగా ఉండటంతో అమెరికా వాటిపై దృష్టిపెట్టింది. గ్రీన్లాండ్ ఖనిజ సంపద విలువ సుమారు 1.1 ట్రిలియన్ డాలర్లు (సుమారు రూ.94 లక్షల కోట్లు)గా ఉండొచ్చని ఓ అంచనా. చైనాకు కూడా గ్రీన్ ల్యాండ్‌పై కన్నుంది. -
ట్రంప్ ప్రకటన: గ్రీన్‌ల్యాండ్ రేటెంతో తెలుసా?
అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న 'డొనాల్డ్ ట్రంప్' (Donald Trump) డెన్మార్క్‌లోని గ్రీన్‌ల్యాండ్‌ను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించారు. ఇదే నిజమైతే.. గ్రీన్‌ల్యాండ్‌ను కొనుగోలు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందనే విషయాన్ని న్యూయార్క్ ఫెడ్లో రియల్ ఎస్టేట్ డెవలపర్ & మాజీ ఆర్థికవేత్త 'డేవిడ్ బార్కర్' (David Barker) ఓ అంచనా వేశారు.గ్రీన్‌ల్యాండ్‌ను కొనుగోలు చేయాలంటే 12.5 బిలియన్ డాలర్ల నుంచి 77 బిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని బార్కర్ వెల్లడించారు. అంటే ఈ విలువ భారతీయ కరెన్సీ ప్రకారం.. రూ.1 లక్ష కోట్ల నుంచి రూ. 6.5 లక్షల కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.గ్రీన్‌ల్యాండ్‌ను కొనుగోలు చేయాలనే ఆసక్తి ట్రంప్‌కు కొత్తేమీ కాదు. 2016లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఈ ప్రతిపాదన వెలుగులోకి వచ్చింది. అంతకు ముందు కూడా 1946లో ప్రెసిడెంట్ హ్యారీ ట్రూమాన్ ఈ భూభాగాన్ని 100 మిలియన్ డాలర్ల విలువైన బంగారానికి కొనుగోలు చేయాలని అనుకున్నారు. కానీ దీన్ని డెన్మార్క్ తిరస్కరించింది.ఇదీ చదవండి: పాకిస్తాన్లో భారీగా బంగారు నిక్షేపాలు: ఏకంగా అన్ని టన్నులా..అమెరికా విదేశీ భూభాగాలను కొనుగోలు చేయడం కొత్తేమీ కాదు. గతంలో కూడా ఫ్రాన్స్ నుంచి లూసియానా, డెన్మార్క్ నుంచి వర్జిన్ ఐలాండ్స్, రష్యా నుంచి అలస్కా వంటి భూభాగాలను యూఎస్ఏ కొనుగోలు చేసింది. కాగా ఇప్పుడు గ్రీన్‌ల్యాండ్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతోంది. గ్రీన్‌ల్యాండ్‌ను కొనుగోలు చేయడం అనేది అంత సులభమైన పనేమీ కాదు. అంతే కాకుండా అక్కడి ప్రధాన మంత్రి 'మ్యూట్ బౌరప్ ఎగెడే' (Mute Bourup Egede).. ఈ ద్వీపం అమ్మకం కోసం కాదు.. ఎప్పటికీ అమ్మకానికి ఉండదని పేర్కొన్నారు.గ్రీన్ల్యాండ్గ్రీన్ల్యాండ్ అనేది అత్యంత సుందరమైన ఐలాండ్. ఇక్కడ అపారమైన ఖనిజ (రాగి, లిథియం) సంపద ఉంది. లిథియం అనేది ఎలక్ట్రిక్ వాహనాలలో, ఎలక్ట్రానిక్స్ వంటి వాటిలో విరివిగా ఉపయోగిస్తారు. ఇక్కడి ఖనిజ సంపద విలువ సుమారు రూ. 94 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. ఇలాంటి ద్వీపాన్ని అమెరికా సొంతం కొనుగోలు చేయడం బహుశా అసాధ్యమే. -
వింత శబ్దాల మిస్టరీ వీడింది
సరిగ్గా ఏడాది క్రితం ఆర్కిటిక్ నుంచి అంటార్కిటికా దాకా ప్రపంచమంతటా 9 రోజులపాటు తరచుగా వినిపించిన వింత శబ్దాల రహస్యం వీడిపోయింది. ఈ శబ్దాలకు భూప్రకంపనలు కారణం కాదని పరిశోధకులు తేల్చారు. గ్రీన్లాండ్లోని మారుమూల ప్రాంతం డిక్సన్ ఫోర్డ్లో భారీగా మంచు చరియలు విరిగిపడడం వల్ల భూమి స్వల్పంగా కంపించడంతో ఉత్పత్తి అయిన శబ్దాలుగా గుర్తించారు. ఈ అధ్యయనం వివరాలను సైన్స్ జర్నల్‌లో ప్రచురించారు. భూకంపాలను అధ్యయనం చేసే పరిశోధకులు 2023 సెపె్టంబర్లో రహస్య శబ్ద సంకేతాలను గుర్తించారు. గతంలో ఇలాంటి సంకేతాలు ఎన్నడూ కనిపెట్టలేదు. ఇవి సాధారణ భూప్రకంపనల్లాంటివి కాకపోవడంతో వారిలో ఆసక్తి పెరిగింది. ఒకే వైబ్రేషన్ ప్రీక్వెన్సీతో శబ్దాలు వినిపించాయి. దీనిపై అధ్యయనం కొనసాగించి, గుట్టు విప్పారు. డిక్సన్ ఫోర్డ్లో మంచు కొండల నుంచి విరిగిపడిన మంచు, రాళ్లతో 10 వేల ఒలింపిక్ ఈత కొలనులు నింపవచ్చని తెలిపారు. మంచు చరియల వల్ల మెగా సునామీ సంభవించి, సముద్రంలో 200 మీటర్ల ఎత్తుకు అలలు ఎగిసిపడ్డాయని చెప్పారు. లండన్‌లోని బిగ్ బెన్ గడియారం కంటే రెండు రెట్ల ఎత్తుకు అలలు ఎగిశాయని వెల్లడించారు. భారీ అలల ప్రభావం ఏకంగా 9 రోజులపాటు కొనసాగిందని అన్నారు. దీనికారణంగానే వింత శబ్దాలు వినిపించినట్లు స్పష్టంచేశారు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయి గ్రీన్లాండ్లో మంచు కరుగుతోంది. సముద్రంలో దశాబ్దాలపాటు స్థిరంగా నిలిచి ఉన్న భారీ మంచు పర్వతాలు సైతం చిక్కిపోతున్నాయి. అవి బలహీనపడి, మంచు ముక్కలు జారిపడుతున్నాయి. వాతావరణ మార్పులు, భూతాపం వల్ల హిమానీనదాలు గత కొన్ని దశాబ్దాల్లో పదుల మీటర్ల పరిమాణంలో చిక్కిపోయాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భూ ధ్రువ ప్రాంతాల్లో మంచు చరియలు విరిగిపడడం, సునామీలు ఇక సాధారణ అంశంగా మారిపోతాయని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. భూగోళం వేడెక్కడం ఇంకా కొనసాగితే అవాంఛనీయ పరిణామాలు సంభవించడం తథ్యమని పేర్కొన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆ చల్లని సముద్ర గర్భంలో... అగ్నిపర్వతమే బద్దలైతే?
సముద్ర గర్భంలో ఓ అతి పెద్ద అగ్నిపర్వతం బద్దలైతే? అది పెను వాతావరణ మార్పులకు దారి తీస్తే? ఫలితంగా మానవాళి చాలావరకు తుడిచిపెట్టుకుపోతే? ఏదో హాలీవుడ్ సినిమా సన్నివేశంలా అన్పిస్తోందా? కానీ ఇలాంటి ప్రమాదమొకటి కచ్చితంగా పొంచి ఉందట. అదీ ఈ శతాబ్దాంతంలోపు! ఇలాంటి ఉత్పాతాల వల్లే గతంలో మహా మహా నాగరికతలే తుడిచిపెట్టుకుపోయాయట. ఇప్పుడు అలాంటి ప్రమాదం జరిగితే దాని ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనే ప్రయత్నాలేవీ జరగడం లేదంటూ వోల్కెనాలజిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ శతాబ్దాంతం లోపు సముద్ర గర్భంలో కనీవినీ ఎరగనంత భారీ స్థాయిలో అగ్నిపర్వత పేలుడు సంభవించవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే ప్రపంచ జనాభాలో సగానికి పైగా నశించిపోవచ్చని అంచనా వేస్తున్నారు. గత జనవరి 14న దక్షిణ పసిఫిక్ మహాసముద్ర అంతర్భాగంలో హంగా టోంగా హంగా అగ్నిపర్వతం బద్దలైనప్పుడు జపాన్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా తీర ప్రాంతాలను భారీ సునామీ ముంచెత్తింది. ఇది ఆయా ప్రాంతాల్లో అపార ఆర్థిక నష్టం కలిగించింది. అంతకు 10 నుంచి ఏకంగా 100 రెట్ల తీవ్రతతో అలాంటి ప్రమాదమే మరికొన్నేళ్లలోనే మనపైకి విరుచుకుపడవచ్చని డెన్మార్క్‌లోని కోపెన్హెగన్లో ఉన్న నీల్స్ బోర్ ఇన్స్టిట్యూట్ బృందం హెచ్చరిస్తోంది. గ్రీన్లాండ్, అంటార్కిటికాల్లోని మంచు నిల్వలపై వారు చేసిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైందట. ‘మాగ్నిట్యూడ్ 7’ తీవ్రతతో విరుచుకుపడే ఆ ఉత్పాతాన్ని తప్పించుకోవడం మన చేతుల్లో లేదని బర్మింగ్హం యూనివర్సిటీలో వోల్కెనాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ జిస్టు మైకేల్ కసిడీ అంటుండటం ఆందోళన కలిగించే విషయం. హంగా టోంగా హంగా అగ్నిపర్వత పేలుడును పలు అంతరిక్ష ఉపగ్రహాలు స్పష్టంగా చిత్రించాయి. ‘‘దాని తాలూకు బూడిద వాతావరణంలో వేలాది అడుగుల ఎత్తుకు ఎగజిమ్మింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి కూడా ఇది స్పష్టంగా కన్పించింది’’ అని నాసా పేర్కొంది. ‘‘ఆస్టిరాయిడ్లు ఢీకొనడం వంటి అంతరిక్ష ప్రమాదాల బారినుంచి భూమిని తప్పించే కార్యక్రమాలపై నాసా వంటి అంతరిక్ష సంస్థలు వందలాది కోట్ల డాలర్లు వెచ్చిస్తున్నాయి. కానీ తోకచుక్కలు, ఆస్టిరాయిడ్లు ఢీకొనే ముప్పుతో పోలిస్తే భారీ అగ్నిపర్వత పేలుడు ప్రమాదానికే వందలాది రెట్లు ఎక్కువగా ఆస్కారముందన్నది చేదు నిజం. అయినా ఇలాంటి వినాశనం తాలూకు ప్రభావం నుంచి ప్రపంచాన్ని కాపాడేందుకు అంతర్జాతీయంగా ఎలాంటి కార్యక్రమమూ లేకపోవడం విచారకరం’’ అంటూ కసిడీ వాపోయారు. అప్పట్లో అపార నష్టం ‘7 మాగ్నిట్యూడ్’తో చివరిసారిగా 1815లో ఇండొనేసియాలోని తంబోరాలో ఓ అగ్నిపర్వతం బద్దలైంది. దాని దెబ్బకు లక్ష మందికి పైగా మరణించారు. పేలుడు ఫలితంగా అప్పట్లో వాతావరణంలోకి ఎగసిన బూడిద పరిమాణం ఎంత భారీగా ఉందంటే 1815ను ఇప్పటికీ వేసవి లేని ఏడాదిగా చెప్పుకుంటారు. దాని దెబ్బకు భూమి సగటు ఉష్ణోగ్రత ఒక డిగ్రీ తగ్గింది. ఆ ఫలితంగా సంభవించిన వాతావరణ మార్పుల దెబ్బకు ఆ ఏడాది చైనా, యూరప్, ఉత్తర అమెరికాల్లో ఒకవైపు భారీగా పంట నష్టం జరిగింది. మరోవైపు భారత్, రష్యా తదితర ఆసియా దేశాలను భారీ వరదలు ముంచెత్తాయి. 1815తో పోలిస్తే నేటి ప్రపంచం జనాభాతో కిటకిటలాడిపోతోందని గుర్తుంచుకోవాలని కసిడీ అంటున్నారు. ‘‘ఇప్పుడు గనక అలాంటి ఉత్పాతం జరిగితే లెక్కలేనంత మంది చనిపోవడమే గాక అంతర్జాతీయ వర్తక మార్గాలన్నీ చాలాకాలం పాటు మూతబడవచ్చు. దాంతో నిత్యావసరాల ధరలకు రెక్కలొస్తాయి. కొన్నిచోట్ల కరువు కాటకాలు, మరికొన్నిచోట్ల వరదల వంటివి తలెత్తుతాయి’’ అని హెచ్చరించారు. ‘‘సముద్ర గర్భంలో ఎన్ని వందలు, వేల అగ్నిపర్వతాలు నిద్రాణంగా ఉన్నదీ మనకు తెలియదు. ధ్రువాల్లో మంచు విపరీతంగా కరుగుతోంది. సముద్ర మట్టాలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. తద్వారా ఉత్పన్నమయ్యే ఒత్తిడికి సముద్ర గర్భంలో ఏదో ఓ నిద్రాణ అగ్నిపర్వతం అతి త్వరలో ఒళ్లు విరుచుకోవచ్చు. కనీవినీ ఎరగని రీతిలో బద్దలు కావచ్చు. అది జనవరి 14 నాటి పేలుడును తలదన్నేలా ఉంటుంది’’ అని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు ఇప్పటినుంచే సన్నద్ధమైతే మంచిదని సూచిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గ్రీన్‌ల్యాండ్ కరుగుతోంది!
గ్రీన్‌ల్యాండ్‌లో మంచు అనుకున్న దానికంటే వేగంగా కరిగిపోతోంది. దీంతో సముద్రమట్టాలు పెరిగిపోతూ భయాందోళనలు రేపుతున్నాయి. గత రెండు దశాబ్దాల్లో 4,700 గిగాటన్నుల (4,70 లక్షల కోట్ల టన్నులు) హిమం కరిగిపోయిందంటే ఏ స్థాయిలో కరిగిందో అంచనావేయొచ్చు. కరిగిన నీళ్లన్నీ అమెరికాలో చేరితే ఆ దేశం 1.5 అడుగుల మేర మునిగిపోతుందని ఇటీవలి ఓ అధ్యయనంలో పరిశోధకులు చెప్పారు. ఆ అధ్యయనం విశేషాలు తెలుసుకుందామా..! 2002 నుంచి గ్రీన్లాండ్లో కరిగిన మంచు వల్ల సముద్ర మట్టాలు 1.2 సెంటీమీటర్ల మేర పెరిగినట్లు గుర్తించారు. ఏప్రిల్ 2002–ఆగస్టు 2021 మధ్య కాలంలో గ్రేవిటీ రికవరీ క్లైమెట్ ఎక్స్పరిమెంట్ (గ్రేస్) ఉపగ్రహాల నుంచి సేకరించిన వివరాలతో డెన్మార్స్ పరిశోధకులు తాజాగా అధ్యయనం చేశారు. మంచు ఫలకాల అంచుల్లో ఎక్కువ కరిగినట్లు వీరి పరిశోధనలో వెల్లడైంది. అయితే ఫలకల మధ్యప్రాంతంలో మంచు పరిమాణం ఒకింత పెరిగిందని, ఇది పెరగడానికి కారణం హిమపాతమని పరిశోధకులు చెప్పారు. ముఖ్యంగా ఉపరితల జలాలు పెద్దమొత్తంలో వేడెక్కుతున్న పశ్చిమ గ్రీన్లాండ్ తీరంలో ఎక్కువ మంచు కరిగింది. ముఖ్యంగా వాతావరణ మార్పుల వల్ల గ్రీన్లాండ్, అంటార్కిటికాలో పెద్దమొత్తంలో మంచు కరిగిపోవడం వల్ల సముద్రమట్టాలు పెరుగుతున్నాయని నాసా చెప్పింది. అంటార్కిటికాలో కరిగితే.. అంటార్కిటికాలోని మంచు ఫలకాలన్నీ కరిగితే ప్రపంచవ్యాప్తంగా సముద్రమట్టాలు 60 మీటర్లు పెరుగుతాయని అమెరికాకు చెందిన జాతీయ మంచు సమాచార కేంద్రం వెల్లడించింది. అదే గ్రీన్లాండ్లోని ఫలకాలన్నీ కరిగితే సముద్రమట్టాలు 7.4 మీటర్ల మేర పెరుగుతాయని పేర్కొంది. 2019లో నేచర్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం భూతాపస్థాయి ఇప్పుడున్న ప్రకారమే ఉంటే గ్రీన్లాండ్ వల్ల ఈ శతాబ్దం చివరినాటికి సముద్రమట్టాలు 7–13 సెం.మీ. పెరుగుతాయని అంచనా. సముద్రమట్టం ఒక్క సెం.మీ పెరిగితే దానివల్ల 60లక్షల మంది వరదముంపు బారిన పడతారని నాసాకు చెందిన ఆండ్రూ షెఫర్డ్ పేర్కొన్నారు. 2300 నాటికి 4 అడుగులు... ♦2015 ప్యారిస్ వాతావరణ ఒప్పందం ప్రకారం అన్ని దేశాలు నడుచుకున్నా 2300 సంవత్సరం నాటికి సముద్రమట్టాలు 4 అడుగులు పెరుగుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ♦సముద్రమట్టాల పెంపుతో షాంఘై నుంచి లండన్ దాకా ఉన్న నగరాలతోపాటు సముద్రమట్టానికి దిగువన లేదా సమీపంలో ఉన్న ఫ్లోరిడా లేదా బంగ్లాదేశ్‌లకు ముప్పు ఎక్కువగా ఉంటుంది. ♦ఈ ముప్పు తప్పించాలంటే మనం కర్భన ఉద్గారాలను వీలైనంత త్వరగా నియంత్రించాల్సిన అవసరం ఉందని జర్మనీ శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. ♦ఈ శతాబ్దం రెండో సగానికి వచ్చే నాటికల్లా కర్భన ఉద్గారాలను జీరోస్థాయికి తీసుకురావాలని పర్యావరణ ఒప్పందాలు ఇప్పటికే లక్ష్యం విధించాయి. ♦పరిశ్రమల నుంచి పెద్దమొత్తంలో విడుదలయ్యే వాయు కాలుష్యం వల్ల మహాసముద్రాల మట్టాలు విపరీతంగా పెరిగిపోతాయి. ♦పర్యావరణ ఒప్పందాల అమలు జాప్యం పెరిగేకొద్దీ కర్భన ఉద్గారాలు మరింతగా పెరిగి 2300 నాటికి సుమద్రమట్టాలు అదనంగా 20 సెం.మీ. మేర పెరుగుతాయి. –సాక్షి, సెంట్రల్ డెస్క్ -
28 ట్రిలియన్ టన్నుల మంచు మాయం
లండన్: భూమిపై ఉన్న మంచు కరిగే వేగం నానాటికీ పెరిగిపోతోంది. 1994-2017 మధ్య 28 లక్షల కోట్ల టన్నుల మంచు కరిగిపోయిందని తాజా అధ్యయనం వెల్లడించింది. గత మూడు దశాబ్ఞాలలో పోలిస్తే భూమిపై ఉన్న మంచు కరగే వేగం పెరిగిందని లండన్ కి చెందిన లీడ్స్ విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనంలో తేలింది.1990లలో సంవత్సరానికి 0.8 ట్రిలియన్ టన్నుల మేర మంచు కరిగేదని, 2017నాటికి ఏటా కరిగే మంచు 1.3 ట్రిలియన్ టన్నులకు చేరిందని ఈ అధ్యయనం తెలిపింది. శాటిలైట్ డేటా ఉపయోగించి ఈ అధ్యయనం నిర్వహించారు.(చదవండి: ఎలోన్ మస్క్ 'స్పేస్ఎక్స్' సరికొత్త రికార్డ్!) గత 23 సంవత్సరాల్లో పరిశీలిస్తే మంచు కరిగే వేగం 65 శాతం పేరిగిందని తేలింది. అంటార్కిటికా, గ్రీన్లాండ్లో ఐస్ షీట్లు కరిగిపోవడంతో మంచు కరిగే వేగం పెరిగినట్లు వివరించింది. ఈ సర్వేలో 2.15 లక్షల గ్లేసియర్లను అధ్యయనం చేశారు. ప్రపంచవ్యాప్తంగా మంచు వేగంగా కరగడం కారణంగా సముద్ర మట్టం పెరిగి తీరప్రాంతలు ముంపు ప్రమాదాన్ని ఎదుర్కొంటాయని పరిశోధకులు గుర్తించారు. అలాగే వన్యప్రాణులకు నివాసంగా ఉండే సహజ ఆవాసాలను తుడిచిపెట్టే ప్రమాదం ఉంది అని పర్యావరణ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. పర్యావరణ పతనానికి సంబంధించి శాస్త్రవేత్తలు ఊహించిన దానికంటే వేగంగా దారుణ పరిణామాలన్నీ క్రమంగా ప్రత్యక్షమవుతున్నాయి. అధ్యయనంలో వాతావరణంలో, మహాసముద్రాలలో ఉష్ణోగ్రత పెరుగుదల కారణంగా మంచు వేగంగా కరిగిపోతుందని తెలుస్తుంది. -
క్లీన్లాండ్గా మారిన గ్రీన్లాండ్
-
గ్రీన్‌లాండ్‌ను కొనేద్దామా!
వాషింగ్టన్/స్టాక్‌హోమ్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచంలోనే అదిపెద్ద ద్వీపమైన గ్రీన్‌లాండ్‌పై కన్నేశారు. ‘డెన్మార్క్‌లో భాగంగా ఉన్న గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేయడం వీలవుతుందా?’ అని ట్రంప్ తన సలహాదారుల అభిప్రాయాన్ని కోరినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అపారమైన సహజవనరులతో పాటు వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతం కావడంతో గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ దృష్టి సారించారు. డెన్మార్క్‌లో ప్రావిన్స్ అయిన గ్రీన్లాండ్కు స్వయంప్రతిపత్తి ఉంది. 20 లక్షల చదరపు కి.మీ విస్తీర్ణం గల గ్రీన్లాండ్ జనాభా 57వేలు. ఈ ద్వీపంలోని 85 శాతం భూభాగంపై 3 కి.మీ మందంతో మంచుదుప్పటి కప్పుకుంది. ట్రంప్ ప్రతిపాదనపై కొందరు సన్నిహితులు స్పందిస్తూ..‘గ్రీన్లాండ్లోని తూలేలో అమెరికాకు ఇప్పటికే వైమానిక స్థావరం ఉంది. కాబట్టి ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయం వ్యూహాత్మకమే’ అని తెలిపారు. అయితే అధికారం నుంచి తప్పుకునేలోపు తనపేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసేందుకే ట్రంప్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని మరికొందరు వ్యాఖ్యానించారు. 1946లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రూమన్ గ్రీన్‌లాండ్‌ను తమకు అమ్మితే రూ.712.47 కోట్లు ఇస్తామని చెప్పగా, ఈ ప్రతిపాదనను డెన్మార్క్ తిరస్కరించింది. గ్రీన్లాండ్లో విస్తారమైన హైడ్రోకార్బన్ నిక్షేపాలు, అరుదైన ఖనిజాలు, తీర ప్రాంతంపై అమెరికా అమితాసక్తితో ఉన్నట్లు కొన్నేళ్ల క్రితం వికీలీక్స్ బయటపెట్టింది. మేం అమ్మకానికి లేం: గ్రీన్లాండ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదనను గ్రీన్లాండ్ ఖండించింది. ఈ విషయమై గ్రీన్లాండ్ విదేశాంగ శాఖ స్పందిస్తూ..‘అమెరికాతో వ్యాపారానికి మా తలుపులు తెరిచిఉంటాయి. కానీ గ్రీన్లాండ్ అమ్మకానికి మేం సిద్ధంగా లేం. సహజవనరులు, చేపలు, పునరుత్పాదక విద్యుత్, సాహస క్రీడలకు గ్రీన్లాండ్ నెలవు’ అని స్పష్టం చేసింది. గ్రీన్లాండ్ మాజీ ప్రధాని లార్స్ రాముస్సేన్ మాట్లాడుతూ..‘ట్రంప్ ఏప్రిల్ ఫూల్ జోక్ చేస్తున్నారనుకుంటా. కానీ ఇది సీజన్ కాదుగా’ అని వ్యాఖ్యానించారు. మూడుదేశాల వలస పాలనలో.. గ్రీన్‌లాండ్‌ను 13వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దంవరకూ నార్వే పాలించింది. 1499లో పోర్చుగీసు వారు ఈ ద్వీపం తమదని ప్రకటించుకున్నారు. 18వ శతాబ్దం ఆరంభంలో గ్రీన్‌లాండ్‌ను ఉమ్మడిగా పరిపాలించాలని డెన్మార్క్–నార్వే నిర్ణయించాయి. 1814లో నార్వే–స్వీడన్ విడిపోవడంతో గ్రీన్‌లాండ్‌పై అధికారాలు డెన్మార్క్‌కు దక్కాయి. గ్రీన్లాండ్లో మెజారిటీ ఇన్యుట్ జాతిప్రజలే. వీరంతా గ్రీన్లాండిక్ భాష మాట్లాడుతారు. దీంతో ఈ ప్రాంతంపై పట్టు పెంచుకోవడంలో భాగంగా కాలనీగా ఉన్న గ్రీన్‌లాండ్‌ను డెన్మార్క్ 1953లో విలీనం చేసుకుంది. డానిష్ భాషను తప్పనిసరి చేసింది. దీంతో ఉన్నతవిద్య కోసం పలువురు గ్రీన్లాండ్ ప్రజలు డెన్మార్క్‌కు వెళ్లడం ప్రారంభించారు. ఈ ప్రయోగం విజయవంతమైనా గ్రీన్లాండ్ ప్రజల్లో స్వాతంత్య్ర కాంక్ష బయలుదేరింది. దీంతో డెన్మార్క్ 1972లో హోంరూల్ చట్టం తీసుకొచ్చింది. విదేశాంగ వ్యవహారాలు, రక్షణ, సహజవనరులు మినహా అన్ని అధికారాలను స్థానిక ప్రభుత్వానికి అప్పగించింది. 2008లో జరిగిన రెఫరెండంలో మరిన్ని అధికారాలు కావాలని గ్రీన్లాండర్లు తీర్పునిచ్చారు. దీంతో పోలీస్, న్యాయ వ్యవస్థలు, సహజవనరులు, విమానయానం, సరిహద్దు చట్టాలు చేసే అధికారం గ్రీన్లాండ్కు దక్కాయి. -
గ్రీన్‌ల్యాండ్‌లో మంచు కనుమరుగు కానుందా?
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా ఉత్పన్నమ వుతున్న కర్బనవాయువులు ఇదే వేగంతో పెరుగుతుంటే ఈ శతాబ్దం ముగిసేలోపే గ్రీన్‌ల్యాండ్‌లోని 4.5 శాతం మంచుకొండలు కరిగిపోయే ప్రమాదం ఉందని తాజా పరిశోధన వెల్లడించింది. దానితోపాటు సముద్ర మట్టాలు 13 అంగుళాల మేర పెరిగే అవకాశం ఉందని ఆ నివేదిక హెచ్చరించింది. ఉద్గారాలను తగ్గించకపోతే 3000 సంవత్సరం కల్లా గ్రీన్‌ల్యాండ్‌లోని మంచు పూర్తిగా కరిగే అవకాశం ఉందని అమెరికాలోని అలస్కా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ఆండీ ఆష్వాండెన్ తెలిపారు. గ్రీన్‌ల్యాండ్‌లో 6,60,000 చదరపు కిలోమీటర్ల మేర మంచు పరచుకొని ఉంది. ఈ మంచుకొండల కింద ఉన్న ప్రాంతాల పరిస్థితులపై ఆయన అధ్యయనం చేశారు. దాదాపు 500 రకాల విభిన్న పరిస్థితులను అంచనా వేశారు. వీటిని అంచనా వేసే క్రమంలో పెద్ద మంచు పర్వతాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. వాటి నుంచి కరుగుతున్న హిమ శాతాన్ని కలిపి ఈ మేరకు అంచనాలు వేశారు. 1991, 2015 మధ్య సంవత్సరానికి 0.02 శాతం చొప్పున సముద్రమట్టం పెరిగిందని అన్నారు. గ్రీన్‌ల్యాండ్‌లోని మంచు పర్వతాలను కూడా పరిగణలోకి తీసుకొని పరిశోధన చేసిన మొదటి నివేదిక ఇదే కావడం గమనార్హం. నగరాలకు ముంపు తప్పదు... ఇప్పుడు ఉన్న కర్బన ఉద్గార శాతం ఇలాగే కొనసాగితే 3000 సంవత్సరం కల్లా సముద్రమట్టం 24 అడుగులు పెరుగుతుందని హెచ్చరించారు. దీనివల్ల సముద్రపు ఒడ్డున ఉన్న శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజెలస్, న్యూ ఓర్లాన్స్ వంటి నగరాలు సముద్రంలో మునగడం ఖాయమన్నారు. కర్బన వాయువులు పెరగకుండా జగ్రత్తలు తీసుకుంటే సముద్ర మట్టం కేవలం 6.5 అడుగులు మాత్రమే పెరిగే అవకాశం ఉందన్నారు. -
ఇనార్సూట్ గ్రామ సమీపంలో భారీ మంచుకొండ
-
భారీ మంచుకొండ.. భయం గుప్పిట్లో గ్రామం..
ఇనార్సూట్, గ్రీన్లాండ్ : కేవలం 170 మంది జనాభా కలిగిన గ్రీన్లాండ్లోని ఇనార్సూట్ గ్రామం సునామీ భయంతో వణికిపోతోంది. ఇందుకు కారణం దాదాపు 100 మీటర్లు(330 అడుగులు) ఎత్తైన భారీ మంచుకొండ సదరు గ్రామాన్ని సమీపిస్తుండటం. దాని నుంచి మంచు చరియ గనుక విరిగితే భారీ ఎత్తున అలలు గ్రామంపై విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయి. దీంతో అధికారులు అక్కడి ప్రజలను ఎగువ ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. అయితే, కొందరు స్థానికులు మాత్రం ఈ తరహా భారీ మంచు తునకలు గ్రామానికి సమీపంలో కనిపించడం కొత్తేమీ కాదని అంటున్నారు. గతంలో దీని కంటే అతి పెద్ద మంచు చరియలు అటువైపుగా పయనించాయని వెల్లడించారు. మంచు చరియకు భారీ స్థాయిలో పగుళ్లు ఉండటమే మాత్రం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించే స్టేషన్, ఇంధన వనరు ప్రదేశం తీరానికి అతి చేరువలో ఉన్నాయి. మంచు చరియ దాదాపు కోటి 10 లక్షల టన్నుల బరువు ఉంటుందని భావిస్తున్నారు. నీటిపై భాగంలో దాదాపు 100 అడుగుల ఎత్తు వరకూ మంచుకొండ ఉంది. అప్పుడప్పుడూ చిన్నచిన్న మంచు ముక్కలు విరిగి నీళ్లలో పడిన శబ్దాలు సైతం స్థానికులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. -
దిల్కుషా... మేయర్ క్యాంపు ఆఫీస్?
బంజారాహిల్స్: గ్రేటర్ హైదరాబాద్ మేయర్ క్యాంపు ఆఫీస్ కోసం జీహెచ్ఎంసీ అధికారులు స్థలాన్వేషణ చేపట్టారు. రాజ్‌భవన్ పక్కన ఉన్న దిల్ కుషా గెస్ట్‌హౌస్, గ్రీన్‌ల్యాండ్స్‌లో ఉన్న గ్రీన్‌ల్యాండ్స్ గెస్ట్‌హౌస్‌ను శనివారం మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, సెంట్రల్ జోనల్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ పరిశీలించారు. దిల్కుషా గెస్ట్‌హౌస్ వైపు మేయర్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఈ రెండింటిలో ఒకదాన్ని రెండు రోజుల్లో ఎంపిక చేసి మౌలిక సదుపాయాలు కల్పించాలని తలపెట్టారు. మేయర్ కోసం క్యాంపు ఆఫీస్ అందుబాటులోకి తీసుకురావడం ఇదే మొదటిసారి. మేయర్‌ను కలవడానికి వచ్చేవారు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలుసుకున్నఅధికారులు ప్రత్యేకంగా క్యాంపు ఆఫీస్ అందుబాటులోకి తేవాలని యోచించి... గెస్ట్‌హౌస్‌లను పరిశీలించారు. గ్రీన్‌ల్యాండ్స్ గెస్ట్‌హౌస్ ముందు జరుగుతున్న మెట్రో పనుల వల్ల కొంతవరకు ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులతో పాటు మేయర్ కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం గెస్ట్‌హౌస్‌ను క్యాంపు ఆఫీస్ కోసం తీసుకోవాలా? కొన్ని గదులు మాత్రమే సరిపోతాయా అన్న దానిపై కూడా ఓ నిర్ణయానికి రాలేదు. రెండు మూడు రోజుల్లో నిర్ణయం వెలువడుతుంది. -
‘సూ’ సంస్థపై ఐటీ దాడులు
సాక్షి, హైదరాబాద్: ఆదాయపన్ను లెక్కలు చూపకుండా పన్ను ఎగ్గొడుతున్న ఎస్ఈడబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (సూ) సంస్థపై శుక్రవారం ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారు. గ్రీన్‌ల్యాండ్స్‌లోని సంస్థ కార్యాలయంతో పాటు సంస్థ ఎండీ, డెరైక్టర్ నివాసాలపై తనిఖీలు చేసి కోట్లాది రూపాయలను గుర్తించారు. ముందుగా ఎస్ఈడబ్ల్యూ కంపెనీపై దాడి చేసిన అధికారులు రూ. 155 కోట్ల పైచిలుకు పన్ను ఎగవేత పత్రాలను, పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. శ్రీనగర్‌కాలనీలోని సంస్థ ఎండీ వల్లూరిపల్లి రాజశేఖర్ నివాసంలో జరిపిన సోదాల్లో కోట్లాది రూపాయల నగదుతో పాటు బంగారు ఆభరణాలను గుర్తించారు. అలాగే సంస్థ డెరైక్టర్లు వై.సూర్యపక్రాశ్రావు, వై.గంగాధర్ నివాసాల్లో కూడా దాడులు నిర్వహించారు. కావూరి హిల్స్‌లో నివసించే సూర్యప్రకాశ్‌రావు నివాసంలో, జూబ్లీహిల్స్ రోడ్ నం. 15లో నివసించే గంగాధర్ నివాసంలో కూడా దాడులు చేసి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరి నివాసాల్లోనూ రూ. 5 కోట్ల పైచిలుకు నగదును, బంగారాన్ని గుర్తించారు. -
సీఎం క్యాంపు ఆఫీసుగా ఎస్ఐబీ భవనం
హైదరాబాద్: తెలంగాణ సీఎం క్యాంపు కార్యాలయం ఎట్టకేలకు ఖరారైంది. గ్రీన్ల్యాం డ్స్లోని తన అధికార నివాసానికి పక్కనే ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) పాత భవనాన్ని ఎంపిక చేసుకున్నారు. బేగంపేటలోని క్యాంపు కార్యాలయంలో వాస్తులోపాలున్నాయ న్న ఉద్దేశంతో సీఎం దాన్ని విని యోగించడం లేదు. అదే ప్రాంగణంలోని నివాస భవనానికే ఆయన పరిమితమయ్యారు. అయితే సీఎంను కలిసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుండడంతో నివాసభవనంలో స్థలాభావం కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అతిథులతో భేటీ, ప్రభుత్వ విభాగాలతో సమీక్షలకు కూడా అది అనుకూలంగా లేదు. కుందన్‌బాగ్‌లోని ఐఏఎస్ అధికారుల నివాస ప్రాంగణంలోని భవనాలను, ముషీరాబాద్, బంజారాహిల్స్‌లోని మరికొన్ని భవనాలను అధికారులు పరిశీలిం చారు. ఈ క్రమంలో ఆయన అధికారిక నివాసం సమీపంలో నిజాం కాలంలో నిర్మితమైన ఎస్ఐబీ భవనం చూడముచ్చటగా ఉండడంతోపాటు, ఇటు నివాసానికి, సచివాలయాని కి చేరువగా ఉండడంతో సీఎం దానికి ఓకే చెప్పేశారు. -
నేడు నగరానికి 14వ ఆర్థిక సంఘం
రాజ్‌భవన్‌లో సంఘం సభ్యులకు గవర్నర్ విందు రేపు సీఎం, మంత్రులు, అధికారులతో సభ్యుల సమావేశం హైదరాబాద్: వైవీ రెడ్డి నేతృత్వంలోని 14వ ఆర్థిక సంఘం గురువారం హైదరాబాద్‌కు వస్తోంది. తెలంగాణ ప్రభుత్వంతో ఆర్థిక సంఘం ప్రతినిధులు శుక్రవారం సమావేశమై వారితో చర్చించిన తరువాత నివేదిక తీసుకోనున్నారు. 14వ ఆర్థిక సంఘం సభ్యులకు గురువారం గవర్నర్ నరసింహన్ రాజ్‌భవన్‌లో విందు ఇస్తున్నారు. 19వ తేదీ ఉదయం 10 గంటలకు గ్రీన్‌ల్యాండ్స్‌లోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో ఆర్థిక సంఘం ప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, అధికారులు మధ్యాహ్నం వరకు సమావేశమై ప్రభుత్వ కోర్కెల చిట్టా వివరించనున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. మధ్యాహ్నం నుంచి రాజకీయ పార్టీల నేతలు, స్థానిక సంస్థల ప్రతినిధులు, వ్యాపార, పారిశ్రామికవేత్తలు కమిషన్‌ను కలువనున్నారు. శుక్రవారం రాత్రికి సీఎం కేసీఆర్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో విందు ఇస్తారు. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినందున.. చేపట్టనున్న కొత్త పథకాలకు విరివిగా నిధులిచ్చేలా కేంద్రానికి సిఫారసు చేయాలని ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. శనివారంనాడు కమిషన్ సభ్యులు తిరిగి ఢిల్లీ వెళ్లిపోనున్నారు. సీఎం సమీక్ష.. 14వ ఆర్థిక సంఘాన్ని కోరే అంశాలపై సీఎం కేసీఆర్ బుధవారం సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. వాటర్‌గ్రిడ్, పోలీసు వ్యవస్థ బలోపేతం, రహదారుల నిర్మాణంపై స్పష్టత ఇవ్వాలన్నారు. సమావేశంలో ఆర్థికమంత్రి ఈటెల, సలహాదారులు పాపారావు, జీఆర్‌రెడ్డి, సీఎస్ రాజీవ్‌శర్మ, అధికారులు పాల్గొన్నారు. -
సీమాంధ్ర సీఎం అధికార నివాసం గ్రీన్‌ల్యాండ్ కాదు.. లేక్‌వ్యూ
రెండు రాష్ట్రాల అతిధి గృహాలుగా పర్యాటక భవన్ విభజన సంబంధిత ఆదేశాలన్నీ ఎన్నికలయ్యాకే: సీఎస్ హైదరాబాద్: సీమాంధ్ర ముఖ్యమంత్రి అధికార నివాసంగా లేక్‌వ్యూ అతిధి గృహాన్ని కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత గ్రీన్‌ల్యాండ్ అతిధి గృహాన్ని సీమాంధ్ర సీఎం అధికార నివాసంగా కేటాయించాలని భావించారు. అయితే గ్రీన్‌ల్యాండ్ పూర్తిగా రోడ్డు మీదకు ఉండటం, ట్రాఫిక్ సమస్యలు వస్తాయనే భావనతో లేక్వ్యూను కేటాయించాలనే నిర్ణయం తీసుకున్నారు. అలాగే బేగంపేటలోని పర్యాటక భవన్ ను ఇరు రాష్ట్రాల అతిధి గృహాలకు వీలుగా మార్పులు చేయాలని నిర్ణయించారు. విభజన సంబంధిత ఆదేశాలను ఎన్నికలు పూర్తయ్యేవరకు జారీ చేయకూడదని నిర్ణరుుంచారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి విభజనకు సిద్ధంగా ఉండాలని, సంబంధిత ఆదేశాలను మాత్రం ఎన్నికలు పూర్తయ్యూక జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి సూచించారు. విభజనకు సంబంధించిన 21 కమిటీల ఉన్నతాధికారులతో సీఎస్ శుక్రవారం సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. మే 15వ తేదీకల్లా కమిటీలన్నీ తుది సిఫారసులతో సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు. ఎన్నికల ఫలితాలు మే 16వ తేదీన వెలువడి కొత్త ప్రభుత్వాలు ఏర్పడనున్నందున వారితో సంప్రదింపులు జరిపి తుది నిర్ణయాలు తీసుకోనున్నట్లు సీఎస్ తెలిపారు. ప్రస్తుతం శాఖలకు ప్రత్యేక ప్రధాన, ముఖ్య కార్యదర్శులుగా ఉన్న అధికారులే జూన్ 2వ తేదీన రెండు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులకు ఫైళ్లతో పాటు ఆయా శాఖలకు చెందిన అంశాలను అప్పగించే బాధ్యతలు స్వీకరించాలని సూచించారు. ప్రస్తుతానికి ఎక్కడున్న ఫర్నిచర్‌ను అక్కడే కొనసాగించాలని, ఎలాంటి మార్పులు చేయరాదని పేర్కొన్నారు. అఖిల భారత సర్వీసు అధికారుల కేటాయింపు జూన్ 2వ తేదీన జరుగుతుందని అదే రోజు ఇరు రాష్ట్రాల అధికారులకు ఇప్పుడున్న శాఖాధికారులు అప్పగింతలు చేయాలని సూచించారు.


