ట్రంప్ టారిఫ్ బెదిరింపులపై యూకే ప్రధాని స్టార్మర్
లండన్: గ్రీన్‌లాండ్‌ను సొంతం చేసుకునే క్ర మంలో యూరప్ దేశాలపై అమెరికా అధ్యక్షు డు ట్రంప్ చేస్తున్న తీవ్ర ఒత్తిడులపై యూకే ప్రధాని కీర్ స్టార్మర్ తనదైన శైలిలో స్పందించారు. అమెరికా, యూకే ఎప్పటిలా గానే సన్నిహిత మిత్ర దేశాలుగా కొనసాగు తాయన్న ఆయన..వాణిజ్య యుద్ధం వల్ల ఎవ్వరికీ లాభం కలగదన్నారు. సోమవారం ఆయన అత్యవసర మీడియా సమావేశంలో మాట్లాడారు.
గ్రీన్‌లాండ్‌ను సైనిక చర్య ద్వారా స్వాధీనం చేసుకునేందుకు ట్రంప్ ప్రయత్ని స్తున్నారంటూ వస్తున్న వార్తలను ఖండించారు. మిత్ర దేశాలపై టారిఫ్‌లను అస్త్రంగా ప్రయో గించడం పూర్తిగా తప్పన్నారు. అదే సమయంలో, యూకే జాతీయ ప్రయోజనాల పరిరక్షణే తన బాధ్యతన్నారు. ‘అందుకే, భాగస్వామ్యం, వాస్తవాలు, పరస్పర గౌరవం ప్రాతిపదికగా ఈ సమస్యపై పరిష్కారం కనుగొనే క్రమంలో ఆదివారం ట్రంప్‌తోపాటు యూరప్ దేశాల నేతలు, నాటో సెక్రటరీ జనరల్‌తో ఫోన్‌లో మాట్లాడా.
ఎందుకంటే, బలమైన కూట ములు తమ ఉమ్మడి ప్రయోజనాలను ఆ విధంగానే కాపాడుకుంటాయి’అని వ్యాఖ్యా నించారు. ట్రంప్‌తో క్రమం తప్పక మాట్లాడు తూనే ఉంటానన్న స్టార్మర్..విభేదాలున్నా లేనట్టుగా నటించడం కాదు, వాటిని ముఖా ముఖి చర్చించి పరిష్కరించుకోవడమే పరిణతి చెందిన కూటముల లక్షణమని చెప్పారు.


