breaking news
USA President
-
ట్రంప్, మోదీ మధ్య క్షీణిస్తున్న సంబంధాలు
-
టారిఫ్‌లు అక్రమం
వాషింగ్టన్: శత్రుదేశాలు, మిత్ర దేశాలు అనే తేడా లేకుండా ఎడాపెడా టారిఫ్‌ల వాతలు పెట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అక్కడి అప్పీళ్ల కోర్టు షాక్ ఇచ్చింది. అధికారాలను మితిమీరి వాడేశారని, ఇలా టారిఫ్‌లు పెంచడం పూర్తిగా అక్రమమని వాషింగ్టన్‌లోని ‘యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ఫర్ ది ఫెడరల్ సర్క్యూట్’శుక్రవారం తీర్పు చెప్పింది. ‘‘ప్రపంచంలోని ప్రతి దేశంపై ఇష్టారీతిన అంతర్జాతీయ టారిఫ్‌లు పెంచేసే అధికారం, అర్హత అధ్యక్షుడికి లేవు’’అని జడ్జీలు 7–4 మెజారీ్టతో తీర్పు చెప్పారు. అధిక టారిఫ్‌లను తప్పుబడుతూ మేలో న్యూయార్క్‌లోని ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెడరల్ కోర్టు ఇచ్చిన తీర్పును మేం సమర్థిస్తున్నామని మెజారిటీ జడ్జీలు తమ తీర్పులో అభిప్రాయపడ్డారు. అమెరికా అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం(ఐఈఈపీఏ) ప్రకారమే ఈ టారిఫ్‌లు పెంచామన్న ట్రంప్ ప్రభుత్వం చేసిన వాదనలను జడ్జీలు తోసిపుచ్చారు. ఐఈఈపీఏ చట్టానికి విరుద్దంగా అధ్యక్షుడు నిర్ణయాలు తీసుకున్నారు. అధికారాలను మితిమీరి ఉపయోగించారు. ఇలా భూగోళం మీది ప్రతి ఒక్క దేశంపై టారిఫ్ మోపకూడదు. పెంచిన టారిఫ్‌లను తొలగిస్తే ఇప్పటికిప్పుడే అమెరికా ఆర్థికవ్యవస్థ చిక్కుల్లో పడుతుంది. అందుకే అక్టోబర్ 14వ తేదీదాకా యథాతథ స్థితిని కొనసాగిస్తాం. ఆలోపు ఈ కేసును యూఎస్ సుప్రీంకోర్టు పరిశీలించాలని కోరుతున్నాం’’అని 127 పేజీల తీర్పులో అప్పీళ్ల కోర్టు తెలిపింది. తీర్పుపై దుమ్మెత్తిపోసిన ట్రంప్ తన నిర్ణయాలకు వ్యతిరేకంగా వెలువడిన కోర్టు తీర్పుపై వెంటనే ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఆరోపణలు గుప్పించారు. ‘‘తీర్పు తర్వాత సైతం నేను విధించిన టారిఫ్‌లు ఇంకొన్ని రోజులు అమల్లోనే ఉండబోతున్నాయి. పక్షపాతధోరణితోనే అప్పీళ్ల కోర్టు టారిఫ్‌లను తప్పుబట్టింది. అప్పీళ్ల కోర్టులో తీర్పు వ్యతిరేకంగా వచ్చిన సుప్రీంకోర్టులో గెలిచి తీరతాం. చివరకు గెలిచేది మేమే. ఒకవేళ టారిఫ్‌లను తొలగిస్తే దేశంలో వినాశనం తప్పదు. అది మన ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తుంది. వాస్తవానికి మన వ్యవస్థ బలీయంగా ఉండాలి. శత్రువు, మిత్రుడు అనే తేడా లేకుండా మనపై విదేశాలు మోపిన టారి ఫ్ల భారాన్ని, వాణిజ్య లోటును అమెరికా సహించబోదు. విదేశాల విధానాలతో మన తయారీసంస్థలు, రైతులుసహా ప్రతి ఒక్కరూ ఇబ్బందిపడుతున్నారు. మన కార్మికులతోపాటు కర్మాగారాలను పరిరక్షించాలంటే విదేశాలపై టారిఫ్‌లను పెంచడమే అత్యుత్తమ మార్గం’’అని ట్రంప్ అన్నారు.ఇప్పుడేం జరగొచ్చు? అప్పీళ్ల కోర్టులో కేసును ఓడిపోవడంతో ట్రంప్ వెంటనే యూఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. అక్కడే ట్రంప్ సర్కార్‌కు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. యూఎస్ సుప్రీంకోర్టులోని 9 మంది జడ్జీల్లో ఆరుగురిని రిపబ్లికన్ పార్టీ ప్రభుత్వాలే నియమించాయి. ఈ ఆరుగురిలో ముగ్గురిని స్వయంగా ట్రంప్ నియమించారు. వీరంతా ట్రంప్‌కు అనుకూలంగా తీర్పు చెప్పే అవకాశముంది. అయితే ఇతర ప్రభుత్వానికి సంబంధించిన కేసులతో పోలిస్తే స్వయంగా అధ్యక్షుడు కలుగజేసుకున్న కేసులను యూఎస్ సుప్రీంకోర్టు మరింత నిశితంగా పరిశీలించే వీలుంది. అమెరికా కాంగ్రెస్(పార్లమెంట్)ను కాదని సొంతంగా తీసుకున్న నిర్ణయాలతో వెలువర్చిన కార్యనిర్వాహక ఉత్తర్వుల విషయంలో సుప్రీంకోర్టు పారదర్శకంగా వ్యవహరిస్తే ఈ కేసు ఫలితం ఎటువైపు రానుందో ఇప్పుడే చెప్పడం కష్టమే. ఒకవేళ సుప్రీంకోర్టు సైతం ట్రంప్ టారిఫ్‌లు చట్టవ్యతిరేకమని తేలిస్తే అమెరికా ఆర్థికవ్యవస్థలో ఆటుపోట్లు తప్పకపోవచ్చు. అదనపు టారిఫ్‌ల కింద వసూలుచేసిన వందల బిలియన్ డాలర్లను ఆయా దేశాలకు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. -
ట్రంప్కేమైంది?
న్యూఢిల్లీ: ట్రంప్కేమైంది? ఆయన బాగున్నారా?అసలు బతికే ఉన్నారా? అమెరికా అధ్యక్షుడు మరణించారంటూ శనివారం ఉన్నట్టుండి పుకార్లు పుట్టా యి. చూస్తుండగానే ప్రపంచమంతటా కార్చిచ్చు వేగంతో వ్యాపించాయి. ఈ వైనమంతా ‘ట్రంప్ మరణించారు’ పేరిట ఇంటర్నెట్లో రోజంతా యమా ట్రెండింగ్‌గా మారింది. సోషల్ మీడియాలో నిమిషాల వ్యవధిలోనే ఏకంగా 60 వేలకు పైగా పోస్టులు పుట్టుకొచ్చాయి. గ్రోక్ తదితరాల్లోనైతే ఏకంగా 13 లక్షల మందికి పైగా ఈ విషయమై ఆరాలు తీశారు. నిజానికి 79 ఏళ్ల ట్రంప్ ఆరోగ్యం కొన్ని నెలలుగా అమెరికాలోనే గాక ప్రపంచమంతటా పెద్ద చర్చనీయాంశంగా మారింది. గత జూలైలో ఆయన చేతికి గాయం, కాళ్ల మడిమల వాపుతో కన్పించడంతో లెక్కలేనన్ని పుకార్లకు తెర లేచింది. ఆయన ఆరోగ్యం నిక్షేపంగా ఉందంటూ వైట్‌హౌస్ వర్గాలు వెంటనే వివరణ ఇచ్చినా అనుమానాలు మాత్రం నేటికీ ఆగలేదు. అందుకు తగ్గట్టే, ట్రంప్ తన గాయాలు, వాపులు తదితరాలను మేకప్‌తో మేనేజ్ చేస్తున్నారంటూ కొద్ది రోజుల క్రితం కూడా విపరీతంగా వార్తలు వెలువడ్డాయి. పైగా తాజా పుకార్లపై వైట్‌హౌస్ కూడా మౌనం పాటిస్తుండటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. దీనికి తోడు ఇటీవల స్వయానా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (41) చేసిన వ్యాఖ్యలు వీటికి మరింత ఆజ్యం పోశాయి. ‘‘200 రోజులుగా (ఉపా ధ్యక్షునిగా) మంచి శిక్షణ పొందుతూ వస్తున్నా. పెను విషాదమేదైనా జరిగి తప్పనిసరైతే, ‘పెద్ద బాధ్యతలు’ స్వీకరించేందుకు కూడా సిద్ధంగా ఉన్నా ’’ అని బుధవారం ఒక ఇంటర్వ్యూలో అన్నారాయ న! ఆ వెంటనే సర్దుకుని, ‘‘ట్రంప్ ఆరోగ్యం భేషుగ్గా ఉంది. ఈ వయసులో కూడా అర్ధరాత్రి దాటేదాకా పని చస్తున్నారు. మళ్లీ తెల్లవారుజామునే మేల్కొంటున్నారు’’ అంటూ కవర్ చేసే ప్రయత్నం చేశారు. అయితే నాలుగు రోజులుగా బయటి ప్రపంచానికి కన్పించని ట్రంప్, శనివారం ఉదయమే తన మనవ రాలు కై తదితరులతో కలిసి వర్జీనియాలో గోల్ఫ్ క్లబ్‌కు వెళుతున్న ఫొటోలు బయటికొచ్చాయి.జనానికి దూరంగా... కొంతకాలంగా ట్రంప్ బయట కన్పించడం బాగా తగ్గింది. అలాగని బయటి ప్రపంచానికి ఆయన పూర్తిగా దూరంగా ఉన్నారని చెప్పడానికి కూడా లేదు. సొంత సోషల్ మీడియా హ్యాండిల్ ‘ట్రూత్ సోషల్’లో శనివారం తెల్లవారుజామున కూడా ఆయన ఖాతాలో ఒక మెసేజ్ దర్శనమిచ్చింది. ప్రపంచ దేశాలపై తాను విధించిన టారిఫ్‌లు ఇంకా అమల్లోనే ఉన్నాయని ట్రంప్ అందులో రాసుకొచ్చారు.ఆ గాయం వెనక... అప్పట్లో ఓవల్ ఆఫీసులో భేటీ సందర్భంగా గాయాలైన కుడి అరచేయిని ట్రంప్ వీలైనంతగా కప్పుకుంటూ మీడియా కంటబడ్డారు. దక్షిణ కొరియా అధ్యక్షునితో భేటీ సందర్భంగా కుడిచేయి వెనకవైపు గాయంతో కనిపిస్తున్న ట్రంప్ ఫొటోలు తాజాగా విపరీతంగా ట్రెండయ్యాయి. ఆయన దీర్ఘకాలంగా నరాల బలహీనతతో బాధపడుతున్నట్టు తాజాగా జరిపిన వార్షిక ఆరోగ్య పరీక్షల్లో తేలింది. 70 ఏళ్ల పైబడ్డ వారిలో ఇది సాధారణమేనని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలినా లెవిట్ అప్పట్లో అన్నారు. ట్రంప్ నరాల సమస్య పెద్ద విషయమేమీ కాదంటూ ఆయన వ్యక్తిగత వైద్యుని పేరిట ఒక లేఖ నోట్‌ను కూడా ప్రభుత్వం హడావుడిగా విడుదల చేసింది. అంతకుముందు గత ఫిబ్రవరిలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ సందర్భంగా కూడా ట్రంప్ కుడి చేయి ఇలాగే వార్తల్లో నిలిచింది. దానికి కొట్టొచి్చనట్టుగా కన్పించే స్థాయిలో మేకప్ వేసుకున్న వైనాన్ని అంతా గమనించారు. -
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారీ ఎదురుదెబ్బ
-
ఏనుగును ఎలుక ఢీకొడుతున్నట్టుగా ఉంది
వాషింగ్టన్: రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసినందుకు భారత్‌ను శిక్షించాలనే ప్రయత్నంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు ఆ దేశానికే ఎసరు తెస్తున్నాయి. భారత్ పట్ల అమెరికా వైఖరిపై ట్రంప్ ప్రభుత్వం సొంత ఆర్థిక వేత్తలనుంచే విమర్శలను ఎదుర్కొంటోంది. భారత్‌పై అమెరికా సుంకాల చర్యలు ఏనుగును ఎలుక పిడికిలితో ఢీకొట్టినట్టుగా ఉందని అమెరికన్ ఆర్థికవేత్త రిచర్డ్ వోల్ఫ్ విమర్శించారు. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వ్యక్తిలా అమెరికా వ్యవహరిస్తోందని, కానీ తనను తానే దహించుకుంటోందని విచారం వ్యక్తం చేశారు. ట్రంప్ సుంకాలు బ్రిక్స్ కూటమిని పోషిస్తున్నాయని ఆయన హెచ్చరించారు. బ్రిక్స్‌ను విజయవంతమైన ఆర్థిక ప్రత్యామ్నాయంగా అమెరికా అభివృద్ధి చేస్తోందని గుర్తు చేశారు. కాగా, భారతీయ ఉత్పత్తులపై ట్రంప్ విధించిన 50 శాతం సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై రష్యా టుడేకు ఇచి్చన ఇంటర్వ్యూలో వోల్ఫ్ మాట్లాడారు. బ్రిక్స్ దేశాలను బలోపేతం చేస్తోంది.. ‘భూమిపై అతిపెద్ద దేశం భారత్. సోవియట్ యూనియన్ కాలం నుంచే అమెరికాతో భారత్‌కు బలమైన సంబంధాలున్నాయి. ఈ విషయాన్ని ట్రంప్ మర్చిపోతున్నారు. భారత్‌కు అమెరికా మార్కెట్ గేట్లు మూసేస్తే.. ఆ దేశం తన ఎగుమతులను విక్రయించడానికి ఇతర దేశాలను వెదుక్కుంటుంది. చమురును అమ్ముకునేందుకు రష్యా ఇతరత్రా మార్కెట్లను సిద్ధం చేసుకున్నట్లే.. భారత్ కూడా ఇతరత్రా మార్కెట్లను తయారు చేసుకోగలదు. ప్రపంచ జీడీపీలో బ్రిక్స్ కూటమిలోని చైనా, భారత్, రష్యా, బ్రెజిల్, ఇండోనేషియా వంటి దేశాల వాటా 35 శాతం దాకా ఉంది. జీ7 దేశాల జీడీపీ వాటా 28 శాతమే. ఈ నేపథ్యంలో అమెరికా చర్యలు బ్రిక్స్ దేశాలను బలోపేతం చేస్తాయి. పశ్చిమ దేశాలకు ఆర్థిక ప్రత్యామ్నాయంగా మారుస్తాయి’అని వోల్ఫ్ వ్యాఖ్యానించారు. అమెరికా దిగుమతిదారులకూ ప్రమాదం.. ‘ప్రస్తుతం భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాల్లో వస్తువులు, సేవలను చౌకగా పొందుతున్న కంపెనీలు అమెరికాకు తరలే అవకాశమే లేదు. అందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించవు. ఇప్పటికే అమెరికాలో కొత్త ఉద్యోగాలు లేవు. సుంకాల వల్ల అమెరికన్ ఎగుమతిదారులూ రిస్‌్కను ఎదుర్కొంటున్నారు. వాళ్లు విదేశీ మార్కెట్లను కోల్పోయే అవకాశం ఉంది. ఇప్పటికే అమెరికాకు ట్రిలియన్ డాలర్ల అప్పులున్నాయి. విదేశీ అప్పులపై అమెరికా ఇంకా ఎంతకాలం నిలువగలదనేది పెద్ద ప్రశ్న. ఇదే పరిస్థితి కొనసాగితే అమెరికా అప్పులపై వడ్డీల భారం పెరిగిపోతుంది. తద్వారా అమెరికా బలహీనపడుతుంది’అని వోల్ఫ్ విశ్లేషించారు. బ్రిక్స్ దేశాలకు బెదిరింపులు.. బ్రిక్స్ పది దేశాలతో కూడిన సమూహం. ఇందులో బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సభ్యుదేశాలుగా ఉన్నాయి. ఈ కూటమి పాశ్చాత్య ఆర్థిక ఆధిపత్యాన్ని ఎదుర్కోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. డాలర్ ఆధిపత్యాన్ని సవాలు చేయడానికి ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తోంది. అయితే.. ట్రంప్ అనేక సందర్భాల్లో బ్రిక్స్‌ను వేగంగా అంతరించిపోతున్న ఒక చిన్న సమూహంగా తోసిపుచ్చారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక ఫిబ్రవరిలో ఏకంగా బ్రిక్స్ చచి్చపోయిందన్నారు. డాలర్‌ను కాదని ఉమ్మడి కరెన్సీని సృష్టించడానికి ప్రయతి్నస్తే.. సభ్య దేశాలపై 100 శాతం సుంకాలు విధిస్తామని బెదిరించారు. -
అధ్యక్ష బాధ్యతలకు సిద్ధం: వాన్స్
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైనా భయంకరమైన విషాదం జరిగితే అమెరికా కమాండర్–ఇన్–చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అయితే.. ట్రంప్ తన నాలుగు సంవత్సరాల పదవీకాలాన్ని పూర్తి చేసేంత ఆరోగ్యంగా ఉన్నారని ఆయన స్పష్టంచేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై ఇటీవల వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాన్స్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇంటర్వ్యూలో వాన్స్ మాట్లాడుతూ.. జనవరిలో మొదటిసారి ఓవల్ ఆఫీసులో అడుగు పెట్టిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. ‘ఆ గొప్పతనం, అద్భుతమైన చరిత్ర చూసి ముగ్ధుడినయ్యాను. అది నిజంగా అద్భుతమైన అనుభవం. అది శీతాకాలం. కర్టెన్లు మూసి ఉండటంతో చాలా చీకటిగా కనిపించింది. ప్రపంచ నాయకుడు పనిచేసే ప్రదేశం ఇలాగే ఉండకూడదు. అది కొంచెం వెలుగుతో, ఉత్సాహంగా ఉండాలనుకున్నా. ఆ తరువాత అధ్యక్షుడు చేసిన మార్పులు నాకు చాలా నచ్చాయి. JUST IN—VP JD Vance said he is prepared to step in if “a terrible tragedy” were to befall Trump, while emphasizing that Trump is “in incredibly good health” and brimming with “incredible energy.” Trump is sicker than we thought. pic.twitter.com/fX9uiauvtp— ADAM (@AdameMedia) August 28, 2025 వైట్‌హౌస్‌ను పునరుద్ధరించడంలో ట్రంప్ విలక్షణమైన శైలి నాకు బాగా నచ్చింది’ అని ప్రశంసించారు. అనంతరం 79 ఏళ్ల ట్రంప్ ఆరోగ్యం గురించి ఆందోళనలను ప్రస్తావించగా.. ‘ఆయన మంచి ఆరోగ్యంతో ఉన్నారు. ఆయనకు అద్భుతమైన శక్తి ఉంది. ఆయనతో పనిచేస్తున్నవారు చాలామంది ఆయనకంటే చిన్న వయసువాళ్లే. అయినా వారందరికంటే చివరిగా నిద్రపోయేది, మొదటగా నిద్ర లేచేది ట్రంపే. ఆయన మిగిలిన పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారన్న నమ్మకం నాకుంది. అమెరికన్ ప్రజలకోసం ఆయన ఇంకా ఎన్నో గొప్ప పనులు చేస్తారు’ అని వాన్స్ వ్యాఖ్యానించారు. పెద్ద విషాదం ఏదైనా జరిగి, అనుకోని పరిస్థితులు ఎదురైతే, అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని వాన్స్ స్పష్టం చేశారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్‌తో జరిగిన సమావేశంలో ట్రంప్ చేతికి పెద్ద గాయం కనిపించడంతో ఆయన ఆరోగ్యంపై ఆందోళనలు తలెత్తాయి. 78 సంవత్సరాల ఏడు నెలల వయసులో ఈ ఏడాది జనవరిలో ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా చరిత్రలో ట్రంప్ అత్యంత పెద్ద వయస్కుడైన అధ్యక్షుడాయన. అంతకుముందు అధ్యక్షుడు జో బైడెన్ 2021లో పదవీ బాధ్యతలు స్వీకరించినప్పుడు ఆయన వయసు 78 సంవత్సరాల రెండు నెలలు. ఇక, ఈ నెల ప్రారంభంలో ట్రంప్ మాట్లాడుతూ వాన్స్‌ను తన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఉద్యమానికి వారసుడిగా చెప్పుకొచ్చారు. కానీ వాన్స్ మాత్రం 2028 అధ్యక్ష ఎన్నికల ప్రణాళికల గురించి ఊహాగానాలను తోసిపుచ్చుతూనే ఉన్నారు. -
ఫెడరల్ రిజర్వు గవర్నర్‌కు ట్రంప్ ఉద్వాసన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫెడరల్ రిజర్వు గవర్నర్ లిసా కుక్‌ను తొలగించారు. ఈ విషయాన్ని సోమవారం రాత్రి సొంత ట్రూత్ మీడియాలో ట్రంప్ ప్రకటించారు. ఆమె మోసానికి పాల్పడినట్లు వచి్చన ఆరోపణలకు తగు ఆధారాలున్నాయని తెలిపారు. మిషిగన్, జార్జియాలోని భవనా లను ప్రాథమిక నివాసాలుగా ప్రకటిస్తూ ఆమె సంతకాలు చేసిన పత్రాలను ట్రంప్ అటాచ్ చేశారు. రెండు వారాల వ్యవధిల్లోనే రెండిళ్లను ఆమె కోరారని, బహుశా మొదటి నివాసం విషయం మ ర్చిపోయి ఉంటారంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. మార్టిగేజ్(తనఖా) విభాగానికి ట్రంప్ నియమించిన బిల్ పాల్ట్ గత వారం స్వయంగా లిసాపై ఆరోపణలు చేయడం గమనార్హం. స్వల్పకాలిక వడ్డీ రేట్లలో కోత విధించాలంటూ ఫెడరల్ రిజర్వు చైర్మన్ జెరోమ్ పావెల్‌పై తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు. చెప్పింది చేయకుంటే పదవి నుంచి తొలగిస్తానని హెచ్చరిక సైతం చేయడం గమనార్హం. అదేవిధంగా, సెంట్రల్ బ్యాంకు బోర్డులోని ఏడుగురు సభ్యుల్లో లిసా ఒకరు. మొత్తం 12 మంది సభ్యుల్లో లిసా సహా ఏడుగురికి మాత్రం వడ్డీ రేట్లు తగ్గించే అధికారముంది. వడ్డీ రేటు తగ్గించేందుకు లిసా అంగీకరించడం లేదు. జూలైలో జరిగిన బోర్డు సమావేశంలో వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచేందుకు పావెల్‌తోపాటు ఓటేసిన వారిలో లిసా కుక్ ఉన్నారు. దీంతో, ఇటీవల రాజీనామా చేయాలంటూ ట్రంప్ కోరినా ఆమె కొనసాగుతూనే ఉన్నారు. ఇది నచ్చని ట్రంప్ రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అధికారంతోనే లిసా కుక్‌ను తొలగించినట్లు తాజాగా సమర్థించుకున్నారు. ఆ అధికారం అధ్యక్షుడికి లేదు ఫెడరల్ రిజర్వు గవర్నర్ లిసా కుక్ వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. వేధింపులకు భయపడి రాజీనామా చేయబోనని తెగేసి చెప్పారు. తనను తొలగించే అధికారం అధ్యక్షుడికి లేదని స్పష్టం చేశారు. అమెరికా ప్రజలకు సేవలందించేందుకు 2022 నుంచి కొనసాగుతున్నానన్నారు. ట్రంప్ చర్యకు తగు కారణం లేదన్నారు. ట్రంప్ చూపుతున్న పత్రాలు నాలుగేళ్ల క్రితం తాను సెంట్రల్ బ్యాంకులో చేరకముందునాటివని తెలిపారు. -
ట్రంప్ ఫోన్ కాల్స్‌కు మోదీ నో
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడేందుకు పదేపదే ప్రయత్నించారా? అందుకు మోదీ తిరస్కరించారా? ట్రంప్‌తో సంభాషణకు మోదీ ఇష్టపడలేదా? అంటే.. అవుననే చెబుతోంది జర్మనీ వార్తాపత్రిక ఫ్రాంక్‌ఫర్టర్ అల్‌జెమేని(ఎఫ్ఏజెడ్). భారత ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వం ఏకంగా 50 శాతం టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. దీనిపట్ల భారత నాయకత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో మోదీతో ఫోన్లో మాట్లాడడానికి ట్రంప్ కనీసం నాలుగుసార్లు ప్రయత్నించారని జర్మనీ పత్రిక పేర్కొంది. అమెరికా నుంచి నాలుగుసార్లు ఫోన్ చేసినా మోదీ స్పందించలేదని వెల్లడించింది. అమెరికా విజ్ఞప్తులను ఆయన గట్టిగా తిరస్కరించారని, ట్రంప్ విధించిన టారిఫ్‌ల పట్ల తన ఆగ్రహాన్ని పరోక్షంగా వ్యక్తీకరించారని స్పష్టంచేసింది. ఈ మేరకు జర్మనీ పత్రికలో ప్రచురితమైన కథనాన్ని బెర్లిన్‌కు చెందిన గ్లోబల్ పబ్లిక్ పాలసీ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ థార్‌స్టెన్ బెన్నర్ తాజాగా ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ట్రంప్ శాపనార్థాలు భారత్–అమెరికా మధ్య గత 25 ఏళ్లుగా సంబంధాలు క్రమంగా మెరుగుపడుతున్నాయి. కానీ, ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచి్చన తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు చేస్తుండడాన్ని ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు. భారత్ ఇస్తున్న సొమ్మును ఉక్రెయిన్‌లో యుద్ధానికి రష్యా ఖర్చు చేస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. అందుకే రష్యా నుంచి చమురు కొనుగోళ్లు వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. ట్రంప్ హెచ్చరికలను భారత ప్రభుత్వం లెక్కచేయకపోవడంతో ప్రతీకార చర్యల కింద 50 శాతం టారిఫ్‌లు విధించారు. భారత్–రష్యా సంబంధాల గురించి తాను పట్టించుకోనని, ఆ రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు మృతప్రాయంగా మారుతాయంటూ ట్రంప్ శాపనార్థాలు సైతం పెట్టారు. అయితే, ట్రంప్‌కు ప్రధాని మోదీ గట్టిగా బదులిచ్చారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ త్వరలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం తథ్యమని తేలి్చచెప్పారు. టారిఫ్‌లకు బెదిరిపోయే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. రెచ్చగొట్టేలా ట్రంప్ చర్యలు! మరోవైపు భారత్–పాకిస్తాన్ ఘర్షణను తానే ఆపేశానని ట్రంప్ తరచుగా చెప్పుకుంటున్నారు. తాను చొరవ తీసుకోకపోతే రెండు దేశాల మధ్య అణుయుద్ధం జరిగేదని ఆయన బహిరంగంగా పేర్కొన్నారు. భారత్‌పై ఒత్తిడి తెచ్చి పాకిస్తాన్‌పై దాడులకు తెరదించేలా చేశానని ట్రంప్ తెలిపారు. ఆపరేషన్ సిందూర్ హఠాత్తుగా ఆగిపోవడం తన ఘనతేనని స్పష్టంచేశారు. అయితే, ట్రంప్ వ్యాఖ్యలను భారత్ పలుమార్లు ఖండించింది. అయినప్పటికీ ఆయన వెనక్కి తగ్గడం లేదు. భారత్–పాక్ యుద్ధాన్ని ఆపేసినందుకు నోబెల్ శాంతి బహుమతికి అర్హుడినని అంటున్నారు. ఇదిలా ఉండగా, పాకిస్తాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్‌ను ట్రంప్ ముద్దు చేస్తున్నారు. వైట్‌హౌస్‌కు అధికారికంగా ఆహా్వనించి, ఘనంగా విందు ఇచ్చారు. పాకిస్తాన్‌కు ఆర్థికంగా మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ భారత ప్రభుత్వానికి రుచించడం లేదు. ట్రంప్ చర్యలు తమను రెచ్చగొట్టేలా ఉన్నాయని భావిస్తోంది. అందుకు ట్రంప్‌తో మాటాడ్డానికి ప్రధాని మోదీ ఇష్టపడలేదని తెలుస్తోంది. మరోవైపు ఇటీవలి కాలంలో చైనాతో సంబంధాలకు మోదీ ప్రాధాన్యం ఇస్తుండడం గమనార్హం. ఆయన ఈ నెలాఖరులో చైనాలో పర్యటించబోతున్నారు -
పాత ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ కేసులతో ట్రంప్ పంపేస్తారా?
వాషింగ్టన్: అమెరికాలోని ప్రతి ఒక్క ఉద్యోగం అమెరికన్లకే దక్కాలనే దురాశతో దొరికిన ప్రతి ఒక్క అవకాశాన్ని, లొసుగును వాడుకునేందుకు ప్రయత్నిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈసారి గ్రీన్‌కార్డ్, వీసాదారులను దేశం నుంచి బహిష్కరించేందుకు కొత్త ఎత్తుగడతో ముందుకొచ్చారు. మద్యం తాగి వాహనం నడపడంతో నమోదైన పాత కేసులను సైతం తిరిగి తోడి ఆయా వ్యక్తులపై మళ్లీ నేరాభియోగాలు మోపి దేశం నుంచి బహిష్కరించాలని ట్రంప్ సర్కార్ కంకణం కట్టుకుంది. ఇందులోభాగంగా ఇప్పటికే ‘ప్రొటెక్షన్ అవర్ కమ్యూనిటీస్ ఫ్రమ్ డ్రంక్ అండర్ ఇన్ప్లూయన్స్’చట్టాన్ని అక్కడి కాంగ్రెస్ ప్రతినిధుల(దిగువ)సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ బిల్లుకు జూలై చివరివారంలో ఆమోద ముద్రపడింది. వెంటనే దీనిని ఎగువ సభ అయిన సెనేట్‌లో ప్రవేశపెట్టారు. జూన్‌లో ఈ బిల్లును సెనేట్ జుడీíÙయరీ, రూల్స్ కమిటీ పరిశీలనకు పంపించారు. అక్కడ బిల్లుకు ఆమోదముద్రపడితే సెనేట్‌లో తర్వాత ఆమోదం పొందే అవకాశాలు మెరుగవుతాయి. ఈ లెక్కన బిల్లు చివరకు చట్టంగా మారితే ఇప్పటికే పాత ‘డ్రంక్ అండ్ డ్రైవ్’కేసులున్న గ్రీన్‌కార్డ్ పొందిన భారతీయులకూ కష్టాలు మొదలుకానున్నాయి. ఇక విద్యార్థి, హెచ్–1బీ వంటి వీసాలు పొందిన భారతీయులకూ బహిష్కరణ వేటు పడే అవకాశముంది. ఇమిగ్రేషన్ అండ్ నేషనల్ చట్టానికి సవరణలు తెస్తూ ఈ హెచ్.ఆర్.875 బిల్లును తీసుకొచ్చారు. అమెరికా పౌరసత్వంలేని విదేశీయులు అమెరికాలో మద్యం తాగి, లేదంటే మద్యం మత్తులో వాహనం నడిపి రోడ్డు ప్రమాదం చేసినా, అమెరికన్ల ప్రాణాలు హరించినా అలాంటి వ్యక్తలను దేశబహిష్కరణ చేయాలనే ప్రధానోద్దేశ్యంతో ఈ బిల్లును తీసుకొచ్చారు. ఈ బిల్లుపై గ్రీన్‌కార్డ్, వీసాదారుల నుంచి సర్వత్రా విమర్శలు, అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. అత్యంత నిర్దయగా నిబంధనలు కొత్త బిల్లులో పేర్కొన్న నిబంధనలు, షరతులు చూస్తుంటే ఎలాగైనా సరే పాత, చిన్నపాటి నేరాలకు పాల్పడిన విదేశీయులను ఖచ్చితంగా దేశబహిష్కరణచేయాలనే ఉద్దేశం్య స్పష్టంగా కనిపిస్తుంది. ‘‘ఒక పదేళ్ల క్రితంనాటి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు అయినాసరే, అది ఇప్పటికే మూసేసిన కేసు అయినాసరే దానిని మళ్లీ తెరచి నేరం మోపుతారు. ఆ కేసులో నిందితుడు క్షమాపణ చెప్పడం, సంబంధిత ట్రయల్ కోర్టు అందుకు సమ్మతి తెలపడం వంటి సందర్భాల్లోనూ పాత కేసులను తిరగతోడి దేశ బహిష్కరణచేస్తారు’’అని వలసదారుల కేసులను వాదించే లాయర్ జోసెఫ్ ట్సాంగ్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘ఇది అత్యంత దారుణమైన బిల్లు. ఉదాహరణకు గ్రీన్కార్డ్దారుడు లేదంటే స్టూడెంట్ వీసా, హెచ్–1బీ వంటి అంతర్జాతీయ వీసా పొందిన వ్యక్తి పదేళ్ల క్రితం మద్యం మత్తులో చిన్నపాటి యాక్సిడెంట్ చేసి తర్వాత కేసు నుంచి బయటపడ్డాను అనుకుందాం. ఈరోజు ఆ వ్యక్తి స్వదేశానికి లేదంటే వేరే పని నిమిత్తం న్యూజిలాండ్ వంటి దేశానికి వెళ్లాడనుకుందాం. ఈలోపు హెచ్.ఆర్.875 బిల్లు చట్టంగామారితే ఇకపై ఆ వ్యక్తిని అమెరికాలోకి అనుమతించబోరు. కనీసం ఆ పాత కేసుపై వాదించుకునే అవకాశం అతనికి ఇవ్వబోరు. నిన్ను అమెరికాలోకి అనుమతించబోమనే ముంద్తు హెచ్చరిక కూడా ప్రభుత్వం పంపబోదు. అసలు అమెరికాలోకి వచ్చే అధికారిక మార్గాలన్నీ మూసుకుపోతాయి. ఇంతటి నిర్దయ నిబంధనలు ఈ బిల్లులో ఉన్నాయి’’అని జోసెఫ్ చెప్పారు. ‘‘ఎలాంటి అధికారిక పత్రాలు లేని వలసదారులు, వీసా, శాశ్వత స్థిరనివాస హోదా సవరణ కోసం దరఖాస్తు చేసుకుని వేచిచూస్తున్న వ్యక్తులకు సైతం ఈ బిల్లు వర్తిస్తుంది’’అని వలసదారుల న్యాయసేవల సంస్థ ‘ల్యాండర్హోమ్ ఇమిగ్రేషన్’పేర్కొంది. ఈ బిల్లు చట్టంగా మారేలోపే పాత కేసులున్న వ్యక్తులు తక్షణం కోర్టులను ఆశ్రయించి తమ వాదనలను వినిపించడం ఉత్తమమని ఈ సంస్థ అభిప్రాయపడింది. -
ఉక్రెయిన్‌కు 3,350 క్షిపణులు పంపనున్న అమెరికా
వాషింగ్టన్: ఉక్రెయిన్ గగనతల రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంపొందించేందుకు అగ్రరాజ్యం సిద్ధమైంది. 850 మిలియన్ డాలర్ల విలువైన 3,350కి పైగా ఎక్స్టెండెడ్ రేంజ్ అటాక్ మ్యూనిషన్ (ఈఆర్ఏఎమ్) క్షిపణులను ఉక్రెయిన్‌కు అందించేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఈ ఆయుధ ప్యాకేజీకి యురోపియన్దేశాలు నిధులు సమకూరుస్తున్నాయి. ఆరు వారాల్లో ఈ క్షిపణులు కీవ్‌కు చేరుకుంటాయి. ఇవి ఎప్పుడో ఉక్రెయిన్‌కు చేరాల్సి ఉండగా.. రష్యా అద్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చల నేపథ్యంలో కొంత ఆలస్యం అయ్యాయి. వీటిలో 240 నుంచి 450 కి.మీ. పరిధి కలిగిన ఈ ఈ ఆర్ఏఎమ్ క్షిపణులు ఉన్నాయి. -
రష్యాకు రెండు వారాల గడువిస్తున్నా: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాకు రెండు వారాల అల్టిమేటం ఇచ్చారు. అప్పటి వరకు తగు రీతిలో స్పందించకుంటే రష్యాపై ఆంక్షలు విధించాలా లేదా సుంకాలతో బాదాలా అనేది నిర్ణయిస్తామని తెలిపారు. ఉక్రెయిన్‌లోని అమెరికాకు చెందిన ఎల్రక్టానిక్ ఫ్యాక్టరీపై రష్యా క్షిపణి దాడి నేపథ్యంలో ట్రంప్ తాజా హెచ్చరిక జారీ చేయడం గమనార్హం. ఇటీవల అమెరికాలోని అలాస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగిన చర్చలు ఫలప్రదంగా ముగిశాయంటూ ప్రకటించిన ట్రంప్ తాజాగా ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రష్యా దాడితో తాను సంతోషంగా లేనని, పరిస్థితిని మరోసారి సమీక్షిస్తానని ట్రంప్ అన్నారు. తదుపరి చర్యలను రెండు వారాల్లో ప్రకటిస్తానని పేర్కొన్నారు. రష్యా– ఉక్రెయిన్ మధ్య సంక్షోభం తెలివితక్కువైంది. వారానికి 7 వేల మంది, అంతకంటే ఎక్కువ మంది సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ పోరాటాన్ని ఆపాలనుకుంటున్నా, అయితే, ఇప్పుడది కష్టతరంగా మారింది’అని ట్రంప్ అన్నారు. -
రేపే ట్రంప్, జెలెన్స్కీ భేటీ
కీవ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సోమవారం వాషింగ్టన్లో భేటీ కాబోతున్నానని ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ వెల్లడించారు. శనివారం ఉదయమే ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడానని తెలిపారు. చాలాసేపు సంభాషణ జరిగిందని పేర్కొన్నారు. వ్యక్తిగత భేటీ కోసం సోమవారం వాషింగ్టన్కు రావాలంటూ ఆహా్వనించినందుకు ట్రంప్‌కు జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని, సాధారణ ప్రజల మరణాలకు ముగింపు పలికే దిశగా ట్రంప్‌తో సమగ్రంగా చర్చించబోతున్నానని జెలెన్స్కీ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఉక్రెయిన్–రష్యా సంఘర్షణకు తెరతించడానికి యూరప్ దేశాలు చురుకైన పాత్ర పోషించాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. అమెరికాతోపాటు యూరప్ దేశాల అధినేతల నుంచి ఉక్రెయిన్ భద్రతకు హామీ కోరుతున్నామని ఉద్ఘాటించారు. తమకు విశ్వసనీయమైన సెక్యూరిటీ గ్యారంటీ కావాలన్నారు. -
పుతిన్ పైచేయి!
ఉక్రెయిన్‌పై దురాక్రమణ దండయాత్ర మొదలెట్టాక రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అంతర్జాతీయంగా ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. అమెరికాసహా పలు దేశాల నుంచి అంతర్జాతీయ ఆంక్షలు, యుద్ధ నేరాలకు పాల్పడ్డారంటూ అరెస్ట్ వారెంట్లు, సైబర్ దాడులతో శత్రుదేశాలు చుట్టుముట్టినా ఏమాత్రం బెదరక పుతిన్ తన తిరుగులేని ఆధిపత్యాన్ని ట్రంప్ సమక్షంలోనే ప్రదర్శించి రష్యాకు ఎదురులేదని నిరూపించారు. సంయుక్త ప్రకటన సమయంలోనూ ట్రంప్ కంటే ముందే మాట్లాడి తన వాదనను మొదటే గట్టిగా వినిపించారు. దాదాపు 13 నిమిషాలపాటు సంయుక్త ప్రకటన చేస్తే అందులో అగ్రభాగం 8 నిమిషాలు పుతినే మాట్లాడాడు. దాంతో ట్రంప్ చివర్లో మమ అనిపించి ప్రసంగాన్ని ముగించారు. ట్రంప్‌తో భేటీ పర్వంలో అడుగడుగునా పుతిన్ తన పైచేయిని ప్రదర్శించడం విశేషం.ఎర్రతివాచీ స్వాగతంలో తొలి గెలుపు ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందం కుదుర్చు కోకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరికలను స్వీకరించిన ట్రంప్ నుంచే స్వయంగా రెడ్‌కార్పెట్ సాదర స్వాగతాన్ని పొంది పుతిన్ తన రష్యాకు అంతర్జాతీయంగా ప్రభ ఏమాత్రం తగ్గలేదని నిరూపించారు. ఉక్రెయిన్ యుద్ధంలో లక్షలాది మంది అమాయక ఉక్రెయిన్ పౌరుల ప్రాణాలను బలితీసుకున్నారన్న అపవాదు ఉన్న దేశాధ్యక్షునికి అలస్కా ఎయిర్‌పోర్ట్‌లో సాధారణ స్వాగతంతో ట్రంప్ ముగిస్తే సరిపోయేది. కానీ అత్యంత ఆప్తుడైన మిత్రుడు తరలివస్తే ఎంతగా ప్రేమతో ఆహా్వనం పలుకుతామో అదేతరహాలో పుతిన్‌కు ట్రంప్ ఎర్రతివాచీ పరిచి మరీ సాదరంగా ఆహా్వనించారు. ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించినప్పుడు కూడా సమహోదా ఉన్న ట్రంప్ స్వయంగా వెళ్లి ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలకలేదు. కానీ యుద్ధనేరారోపణలు ఎదుర్కొ ంటున్నాసరే స్వయంగా ట్రంప్ వెళ్లి పుతిన్‌కు స్వాగతం పలకడం ద్వారా అగ్రరాజ్యాధినేతకు తాను ఏమాత్రం తీసిపోనని పుతిన్ బహిరంగంగా నిరూపించారు. ఉక్రెయిన్ మొదలయ్యాక దౌత్యపరంగా, ఆర్థికంగా, ఆంక్షల పరంగా రష్యా ఏకాకిగా తయారైందని పశి్చమదేశాల మీడియా చెబుతున్నదంతా ఒట్టిమాటలేనని, అమెరికా దృష్టిలో పుతిన్ ఇప్పటికీ అత్యంత ప్రభావవంతమైన, శక్తివంతమైన ప్రపంచనేత అని రుజువైంది. ట్రంప్‌తో సోదరభావంతో మెలగడం, కరచాలనం, ఒకే కారులో ప్రయాణించడం ద్వారా తానూ ట్రంప్ ఒకేస్థాయి అని పుతిన్ అందరికీ స్పష్టంగా అర్థమయ్యేలా చేశారు.కాల్పుల విరమణ.. గప్‌చుప్ ఉక్రెయిన్‌తో దాడులు ఆపి కాల్పుల విరమణను అమల్లోకి తేవడమే ఈ భేటీ ప్రధాన లక్ష్యం. అలాంటి కీలక ‘కాల్పుల విరమణ’పదాన్ని మాటవరసకైనా ట్రంప్ ప్రస్తావించకుండా పుతిన్ విజయవంతంగా కట్టడిచేశారు. మేమే ‘ఆ మార్గం’లో ఇంకా పయనించలేదు. అక్కడి దాకా వెళ్లేందుకు ఇంకొన్ని అవరోధాలను అధిగమించాల్సి ఉంది అని మాత్రమే ట్రంప్ వ్యాఖ్యానించారుగానీ ‘కాల్పుల విరమణ’అనే పదం పలకడానికి కూడా ఆయన సాహసించలేదు. తద్వారా పుతిన్ తన కనుసన్నల్లో, తాను అనుకున్నదే భేటీలో జరిగేలా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. పాక్షిక విజయం కూడా సాధించని ట్రంప్ ఈ భేటీలో మా ప్రతిపాదనలకు పుతిన్ ఒప్పుకోకపోతే రష్యాపై మరోదఫా ఆంక్షలు విధిస్తానని రెండ్రోజుల ముందు ట్రంప్ చేసిన భీష్మప్రతిజ్ఞ ఉత్తిదేనని తేలిపోయింది. ఎలాంటి తుది నిర్ణయాలు తీసుకోకుండానే భేటీ ముగిసినా సరే ట్రంప్‌లో ఎలాంటి నిరసన, ఆందోళన కనిపించలేదు. పైగా పుతిన్ చేసిన మాస్కో పర్యటన ప్రతిపాదనకు ట్రంప్ సంతోషం వ్యక్తంచేయడం విచిత్రం. పైగా తాము అనుకున్న ఫలితాలు రాకపోయినా ట్రంప్.. పుతిన్‌తో చర్చలు సానుకూలంగా సాగాయని విరుద్ధమైన ప్రకటన చేయడం గమనార్హం. దీంతో భేటీపై ట్రంప్‌కు ఎలాంటి పట్టు సాధించలేకపోయారని అర్థమవుతోంది. భేటీ జరుగుతున్నాసరే రష్యా దాడులుచేసేలా పుతిన్ ఆదేశాలిచ్చి తన మొండి వైఖరిని మరోసారి చూపించారు. శాంతి చర్చలను వాణిజ్య చర్చలుగా మార్చిన పుతిన్ యుద్ధం ఆపాలన్న డిమాండ్‌తో ముందుకొచి్చన అమెరికాను వాణిజ్యచర్చలకు బలవంతంగా పుతిన్ కూర్చోబెట్టినట్లు ఈ భేటీ తర్వాత ప్రసంగాన్ని చూస్తే అర్థమవుతోంది. ‘‘వాణిజ్యం, డిజిటల్, హై–టెక్, స్పేస్ వంటి రంగాల్లో అమెరికా–రష్యా పెట్టుబడులు, వాణిజ్య సహకారం మరింతగా బలపడనుంది. ఆర్కిటిక్లోనూ సహకారం బాగుంది’’అని సంబంధంలేని విషయాలనూ పుతిన్ చెప్పుకొస్తున్నా ఆయనను అడ్డుకోవాల్సిందిపోయి ట్రంప్ ఆయనకు వంతపాడటం విచిత్రం. పుతిన్‌తోపాటు ట్రంప్ ఆ తర్వాత గొంతు కలుపుతూ.. ‘‘రష్యా వ్యాపార భాగస్వాములు మాతో వాణిజ్యానికి ఉవి్వళ్లూరుతున్నారు’’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. తద్వారా శాంతి చర్చలను పుతిన్ విజయవంతంగా వాణిజ్యచర్చలుగా మార్చేశారు. పదికి పది.. కానీ సున్నా సమావేశం ముగిశాక ఈ భేటీలో పూర్తి సత్ఫలితాలను సాధించామని, 10/10 మార్కులు కొట్టేశానని ట్రంప్ చేసిన వ్యాఖ్యానాల్లో పిసరంతైనా నిజం లేదని తేలిపోయింది. వాస్తవానికి ఆ పది మార్కులు పుతిన్ దోచేశారు. శాంతి ఒప్పందం దిశగా కనీసం ఒక్క షరతు విషయంలో పుతిన్‌ను ట్రంప్ ఒప్పించలేకపోయారు. ఎయిర్‌పోర్ట్‌లో ట్రంప్‌తో కరచాలనం, రెడ్‌కార్పెట్ స్వాగతం, ట్రంప్ కలిసి మీడియాకు ఫొటోలకు పోజులు, కలిసి కారులో ప్రయాణం, దారి పొడవునా కారులో నవ్వులు, భేటీ సందర్భంగా తమ వాదనను గట్టిగా వినిపించడం, సంయుక్త ప్రకటన వేళ తొలుత మాట్లాడం సహా ప్రతి సందర్భంలోనూ పుతిన్ పైచేయి సాధించారు. సాధారణంగా ఇతర దేశాల నేతలు మాట్లాడేటప్పుడు హఠాత్తుగా కల్గజేసుకుని, వెటకారంగా మాట్లాడి వారిని అవమానించే ట్రంప్.. ఈసారి మాత్రం పుతిన్ మాట్లాడేటప్పుడు మౌనంగా ఉండటం గమనార్హం. యుద్ధం, శాంతి, ఉక్రెయిన్ ప్రాంతాల దురాక్రమణ, కాల్పుల విరమణ వంటి కీలక పదాలను కనీసం ట్రంప్ ప్రస్తావించేందుకు సైతం సాహసించకపోవడం పుతిన్ దౌత్యవిజయంగా చెప్పొచ్చు. సొంత గడ్డపై జరిగిన భేటీలోనే నోరుమెదపని ట్రంప్ ఇక రష్యాలో జరగబోయే రెండో రౌండ్ భేటీలో ఏపాటి మాట్లాడతారనే అనుమానాలు బలపడుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉత్కంఠతో మొదలై ఉసూరుమనిపించి..
జాయింట్ బేస్ ఎల్మెండార్ఫ్–రిచర్డ్స్‌న్(అలాస్కా): ఎడాపెడా టారిఫ్‌ల పిడిగుద్దులు కురిపించి ప్రపంచదేశాలకు సుంకాల ముచ్చెమటలు పట్టించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శక్తిసామర్థ్యాలు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎదుట నిర్విర్యమయ్యాయి. అలాస్కాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా, ప్రపంచ దేశా లు అత్యంత ఉత్కంఠతతో ఎదురుచూసిన ట్రంప్, పుతిన్ శిఖరాగ్ర చర్చలు దాదాపు మూడు గంటలపాటు జరిగినా చివరకు ఎలాంటి సత్ఫలితాలనివ్వకుండానే ముగిశాయి. దీంతో దురాక్రమణ జెండా ఎగరేసి ఉక్రెయిన్‌పై బాంబుల మోత మోగిస్తున్న రష్యాను నిలువరించి ఉక్రెయిన్‌లో శాంతికపోతాలు ఎగిరేలా చేస్తానన్న ట్రంప్ భీష్మ ప్రతిజ్ఞ నెరవేరలేదు. అలాస్కాకు చేరుకున్నది మొదలు చర్చలు, సంయుక్త ప్రకటనదాకా ఆద్యంతం పుతిన్‌దే పైచేయి కనిపించింది. అయితే శాంతి ఒప్పందం దిశగా అడుగులు వేశామని ట్రంప్ ప్రకటించగా ఒప్పందం కంటే ‘పరస్పర అవగాహన’దిశగా సఖ్యత కుదిరిందని పుతిన్ చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్‌లో శాంతిస్థావనకు ఇరునేతలు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనే నిర్దిష్ట ప్రణాళికలను ఇరువురూ బయటపెట్టలేదు. కానీ ఈ చర్చలకు కొనసాగింపుగా రష్యా రాజధాని మాస్కోలో మరోదఫా చర్చలు జరిగే అవకాశముంది. పుతిన్‌పై ప్రశ్నల శరాలు తన ఏలుబడిలో రష్యా మీడియా పుతిన్‌ను ముక్కుసూటి ప్రశ్నలడిగే దుస్సాహసం చేయదు. కానీ అమెరికాలో అడుగుపెట్టిన పుతిన్‌కు అమెరికా అంతర్జాతీయ మీడియా ప్రశ్నలతో మూకుమ్మడి దాడి చేసింది. పుతిన్ దాదాపు ఏ ప్రశ్నకూ సమాధానం ఇవ్వనప్పటికీ ప్రశ్నల బాణాలు సంధిస్తూ మీడియా పుతిన్‌కు నోటమాట రానివ్వకుండా చేసింది. ‘‘ఉక్రెయిన్‌లో అమాయక పౌరుల ప్రాణాలను తీయడం ఎప్పుడు ఆపేస్తారు? శాంతిస్థాపనకు కంకణం కట్టుకున్నానని మీరు చెప్పే మాటలను ట్రంప్ ఎందుకు నమ్మాలి? ఇలా పలు ప్రశ్నలను మీడియా గట్టిగా అడిగినా పుతిన్ మౌనంగా ఉండిపోయారు. తాను ఆ ప్రశ్నలను వినదల్చుకోలేదు అన్నట్లు చెవులు మూసుకున్నారు. సాదర స్వాగతం పలికిన ట్రంప్ పుతిన్ కంటే ముందే యాంకరేజ్ సిటీలోని ఎయిర్‌పోర్ట్‌కు ట్రంప్ చేరుకున్నారు. తర్వాత ఎయిర్‌పోర్ట్‌లో దిగిన పుతిన్‌కు ట్రంప్ ఎర్ర తివాచీ పరచి మరీ సాదర స్వాగతం పలికారు. ఇద్దరూ కలిసి ఫొటోలకు పోజిచ్చారు. రెడ్‌కార్పెట్‌పై నడిచి వెళ్లేటప్పుడు అమెరికా అత్యంత భారీ బాంబులను జారవిడిచే బీ–2 బాంబర్ యుద్ధవిమానాలతోపాటు ఎఫ్–22 ఫైటర్జెట్లు గగనతలంలో దూసుకుపోయాయి. ట్రంప్ తన బీస్ట్ కారులో పుతిన్‌ను ఎక్కించుకున్నారు. మార్గమధ్యంలో ఇద్దరూ వెనకసీట్లో కూర్చుని నవ్వుతూ మాట్లాడుకున్నారు. తర్వాత జాయింట్ ఎల్మెండార్ఫ్–రిచర్డ్స్‌న్ వైమానిక స్థావరంలో ఏర్పాటుచేసిన సమావేశమందిరానికి చేరుకున్నారు. అమెరికా విదేశాంగ మంత్రి, జాతీయ భద్రతా సలçహాదారు మార్కో రూబియో, ట్రంప్ ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, జాతీయ భద్రతా సలహాదారు యూరీ ఉషకోవ్ల సమక్షంలో ట్రంప్, పుతిన్‌లు సుదీర్ఘంగా చర్చించారు. ఉక్రెయిన్‌పై దాడులు మొదలెట్టాక పుతిన్ అమెరికా గడ్డపై కాలుమోపడం ఇదే తొలిసారి.అమెరికా మా పొరుగు దేశం భేటీ తర్వాత సంయుక్త సమావేశంలో పుతిన్ తొలుత మాట్లాడారు. ‘‘అమెరికా, రష్యాలు పొరుగుదేశాలే. మమ్మల్ని కేవలం మహాసముద్రాలే వేరుచేస్తున్నాయి. అది కూడా కేవలం నాలుగు కిలోమీటర్లే. మిగతా అంశాల్లో మేం మిత్రదేశాలమే. అందుకే రెడ్‌కార్పెట్‌పై నాకు స్వాగతం పలకేటప్పుడు ట్రంప్ నన్ను హలో పొరుగుమిత్రుడా(నెయిబర్) అని సంబోధించారు. అమెరికాలో ఇప్పటికీ ఆర్థోడాక్స్ చర్చిలు ఉన్నాయి. మా మధ్య సాంస్కృతిక బంధం బలోపేతానికి కృషి చేస్తాం. పరస్పర ప్రయోజనకర, సమస్థాయి ఒప్పందాలకు ఈ సాంస్కృతికబంధాలు వారధిగా నిలుస్తాయి. ప్రచ్ఛన్నయుద్ధంకాలంనుంచి ఇరు దేశాల సంబంధాలు అత్యంత దారుణంగా దెబ్బతిన్నాయి. ఇకమీదట విభేదాలు విడనాడి చర్చల మార్గంలో పయనిద్దాం. వాస్తవానికి ఇలాంటి భేటీ ఎప్పుడో జరగాల్సింది’’అని పుతిన్ అన్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధం అంశాన్ని పుతిన్ పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘‘సంక్షోభమే ఈ సమావేశాలకు ప్రధాన పునాది. ఉక్రెయిన్ను చుట్టుముట్టిన సమస్యలకు పరిష్కారం వెతకాల్సి ఉంది. ఉక్రేనియన్ల ఆందోళనను అప్పుడూ పట్టించుకున్నా. ఇప్పుడూ పట్టించుకుంటున్నా. మా మూలాలు ఒక్కటే. పరస్పర సంఘర్షణ కారణంగా ఇరువైపులా శాంతి ప్రక్రియలో ఉక్రేనియన్లు, యురోపియన్లు అవరోధాలు కల్పించొద్దు. అంతా శుభమే జరగాలని కోరుకుంటున్న ట్రంప్‌కు నా ధన్యవాదాలు. మా ఇరు పక్షాలు చక్కటి ఫలితాల కోసమే పాటుపడుతున్నాయి. అమెరికా శ్రేయస్సు కోసం ట్రంప్ పరితపిస్తున్నారు. అలాగే రష్యా స్వప్రయోజనాలు మాకు ముఖ్యం. ట్రంప్‌తో ఎలాంటి ఒప్పందం కుదరలేదు. కానీ ఉక్రెయిన్ అంశంలో అమెరికాతో ఒక అవగాహనకు వచ్చాం’’అని పుతిన్ స్పష్టంచేశారు.నేరుగా శాంతి ఒప్పందమే అత్యుత్తమం తర్వాత ట్రంప్ మాట్లాడారు. ‘‘అధ్యక్షుడు వ్లాదిమిర్‌తో సమావేశం అత్యంత సత్ఫలితాలనిచి్చంది. అయితే తదుపరి దశ(శాంతిచర్చల)కు చేరే క్రమంలో ఎంతో పురోగతి సాధించాం. ఈ చర్చలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మాకు సువర్ణావకాశం దక్కింది. కానీ ఇంకా కొన్ని అవరోధాలను అధిగమించాల్సి ఉంది. (శాంతి)ఒప్పందం కుదరాలంటే అంతకుముందు మరో ఒప్పందం కుదరాలి. సంక్షోభం సమసిపోవాలంటే నాటో కూటమి దేశాలు, ఉక్రెయిన్ వల్లే సాధ్యం. ఒప్పందం పూర్తిగా వాళ్ల చేతుల్లోనే ఉంది. వారానికి వేల మంది చనిపోకుండా నిలువరించాల్సి ఉంది. చర్చల కొనసాగింపుగా మరోదఫా వ్లాదిమిర్‌తో భేటీ కావాల్సి ఉంది’’అని ట్రంప్ అన్నారు. దీంతో వెంటనే పుతిన్ కల్పించుకుని ‘‘ఈసారి మాస్కోలో కలుద్దాం’’అని అన్నారు. తర్వాత ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో పలు పోస్ట్‌లు పెట్టారు. ‘‘ఉక్రెయిన్, రష్యాలు నేరుగా శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడమే ఈ యుద్ధాన్ని ముగించేందుకు అత్యుత్తమ మార్గం. కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నా అది సమగ్ర స్థాయిలో అమలుకావడం కష్టమే. కాల్పుల విరమణ తరచూ ఉల్లంఘనలకు గురయ్యే అవకాశం ఉంది. అందుకే ఉక్రెయిన్, రష్యా నేరుగా శాంతి ఒప్పందం చేసుకోవాలి. సోమవారం వైట్‌హౌస్‌లో జెలెన్స్కీతో సమావేశమవుతా. మా చర్చలు ఫలవంతమయ్యాక పుతిన్‌తో మాట్లాడతా. ఆ తర్వాత పుతిన్, జెలెన్స్కీలు ఒక్కచోటకు చేర్చి యుద్ధవిరమణకు కృషిచేస్తా’’అని ట్రంప్ అన్నారు. -
ఎవరి పంతం నెగ్గుతుందో!
ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి ముగింపు పలికి, శాంతి దూతగా పేరు సంపాదించాలన్నదే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పంతం. యుద్ధంలో ఆక్రమించిన ఉక్రెయిన్ భూభాగాలను తమదేశంలో సంపూర్ణంగా విలీనం చేసుకొని, చట్టబద్ధత కల్పించుకోవాలన్నదే రష్యా అధినేత పుతిన్ ఆశయం. రెండు భిన్నమైన లక్ష్యాల సాధన కోసం ట్రంప్, పుతిన్ శుక్రవారం అలస్కాలో సమావేశం కాబోతున్నారు. ఇరువురు నేతల భేటీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధానంగా ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని ముగించడంపైనే చర్చలు జరుగుతాయని పైకి చెబుతున్నా.. తెరవెనుక ఇతర అంశాలూ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు తమ అధీనంలో ఉన్న ఉక్రెయిన్ భూభాగాల విషయంలో పుతిన్ పట్టుదలతో వ్యవహరిస్తున్నారు. అలస్కా భేటీతో ఇరువురు నేతలు ఆశిస్తున్నదేమిటో చూద్దాం.. అందుకే అలస్కా వేదిక ఉక్రెయిన్‌పై దండయాత్ర కొనసాగిస్తున్న పుతిన్‌ను ప్రపంచంలో ఏకాకిగా మార్చేందుకు పశ్చిమ దేశాలు చేసిన ప్రయత్నాలు చాలావరకు విఫలమయ్యాయి. అమెరికా నుంచి రష్యాను దూరం చేసేందుకు కూడా ప్రయత్నాలు జరిగాయి. అమెరికా వద్ద తన ప్రతిష్ట స్థిరంగా చెక్కుచెదరకుండా ఉందని నిరూపించుకోవాలని పుతిన్ భావిస్తున్నారు. ఇందుకోసం అలస్కా సమావేశాన్ని అవకాశంగా వాడుకోవాలని నిర్ణయించారు. అంతర్జాతీయ రాజకీయాల్లో తన పట్టు ఏమాత్రం సడలలేదని ట్రంప్‌తో భేటీ ద్వారా పుతిన్ సంకేతం ఇవ్వబోతున్నారు. సమావేశానికి వేదికగా అలస్కాను ఎంచుకోవడం వెనుక ఒక వ్యూహం ఉంది. అలస్కాకు చేరుకోవాలంటే ఇతర దేశాల గగనతలం గుండా ప్రయాణించాల్సిన అసవరం లేదు. ఎవరినో అనుమతి కోరాల్సిన పనిలేదు. రష్యా నుంచి నేరుగా అలస్కాకు చేరుకోగలరు. అలస్కాను 19వ శతాబ్దంలో రష్యా పాలకులు అమెరికాకు విక్రయించారు. 21వ శతాబ్దంలో కొన్ని సరిహద్దుల్లో బలవంతంగా చేసిన మార్పులను సమర్థించుకోవడానికి అలస్కాను వేదికగా పుతిన్ ఎంచుకున్నారు. దేశాల సరిహద్దులు మార్చడం, భూభాగాల యజమానులు మారడం సాధారణ విషయమేనని ఆయన చెప్పదలిచారు. అలాగైతేనే కాల్పుల విరమణ ఉక్రెయిన్తోపాటు యూరోపియన్ దేశాల అధినేతలను పుతిన్ పక్కనపెట్టారు. ప్రత్యక్షంగా అమెరికాతోనే చర్చలకు సిద్ధమయ్యారు. ఇతర దేశాల పరిగణనలోకి తీసుకోవడం లేదు. చర్చలైనా, ఒప్పందమైనా అమెరికాతోనే అంటున్నారు. ఈ విషయంలో ఉక్రెయిన్ అభ్యంతరాలు వ్యక్తం చేసినా పుతిన్ పట్టించుకోలేదు. తాము ఆక్రమించిన ఉక్రెయిన్ భూభాగాలను రష్యాలో అంతర్భాగంగా అంతర్జాతీయ సమాజం గుర్తించాలని పుతిన్ డిమాండ్ చేస్తున్నారు. అలాగైతేనే ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణకు సిద్ధమని చెబుతున్నారు. అయితే, పుతిన్ డిమాండ్‌ను ఉక్రెయిన్ వ్యతిరేకిస్తోంది. కబ్జాదారులకు తమ భూమి ఇవ్వబోమని ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ తెగేసి చెప్పారు. ఆక్రమిత ప్రాంతాలను రష్యాలో భాగంగా అధికారికంగా గుర్తించేలా ట్రంప్‌పై ఒత్తిడి పెంచాలన్నదే పుతిన్ వ్యూహంగా కనిపిస్తోంది. మొదట అమెరికా గుర్తిస్తే తర్వాత ఇతర దేశాలపైనా ఒత్తిడి పెంచే అవకాశం ఉంటుంది. ఆక్రమిత ప్రాంతాలను వదులుకోకుంటే ఆర్థిక సాయం నిలిపివేస్తామంటూ అమెరికా బెదిరిస్తే ఉక్రెయిన్ దారికి రావడం ఖాయమని పుతిన్ వాదిస్తున్నారు. ఆర్థిక బంధం బలపడుతుందా? అమెరికా–రష్యా మధ్య ఆర్థిక, ద్వైపాక్షిక సంబంధాలపైనా ట్రంప్, పుతిన్ చర్చించబోతున్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించిన రష్యాపై అమెరికా కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ ఆంక్షలను సడలించి, ఆర్థిక బంధాన్ని బలోపేతం చేసుకొనే దిశగా ఇరువురు నేతలు ఏదైనా ఒప్పందానికి వచ్చే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం రష్యా ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటోంది. అమెరికా సాయంతో గట్టెక్కాలన్న ఆలోచనలో పుతిన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపడానికి పుతిన్ అంగీకరిస్తే రష్యాకు ఆర్థికంగా అండగా ఉండడానికి ట్రంప్ ముందుకు రావొచ్చు. యుద్ధానికి ఫుల్స్టాప్ పెట్టకపోతే తీవ్ర పరిణామాల ఉంటాయని ట్రంప్ తాజాగా రష్యాను హెచ్చరించడం గమనార్హం. అంటే ఈ విషయంలో ట్రంప్ గట్టి పట్టుదలతో ఉన్నట్లు స్పష్టమవుతోంది. శుక్రవారం జరిగే భేటీలో పుతిన్‌ను ఆయన ఒప్పించడం ఖాయమని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. యుద్ధాన్ని ఆపేసి శాంతి దూతగా నోబెల్ శాంతి బహుమతి స్వీకరించాలని ట్రంప్ ఆరాపడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ట్రంప్ మరణంపై జోస్యం నిజమవుతుందా?
-
యుద్ధం ఆపనంటే తీవ్ర పరిణామాలు
వాషింగ్టన్/బెర్లిన్: ఉక్రెయిన్‌పై పుతిన్ దండయాత్రను ఆపకపోతే రష్యా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. శుక్రవారం అమెరికా పరిధిలోని అలస్కాలో పుతిన్‌తో భేటీకి మరికొద్ది గంటలే ముగిలి ఉండగా ఆలోపే పుతిన్‌ను హెచ్చరిస్తూ ట్రంప్ వ్యాఖ్యానాలు చేయడం గమనార్హం. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో జర్మనీ చాన్స్‌లర్ ఫ్రెడరిక్ మెర్జ్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంయుక్తంగా యురోపియన్ యూనియన్ సభ్యదేశాల అగ్రనేతలతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారితో ట్రంప్ సైతం వర్చువల్‌గా భేటీ అయి రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రస్తావించారు. ‘‘ శుక్రవారం అలస్కాలో పుతిన్‌తో భేటీ సవ్యంగా సాగుతుందని భావిస్తున్నా. యుద్ధాన్ని ఆపబోనని పుతిన్ గనక చెబితే రష్యా తీవ్ర పర్యావసానాలను ఎదుర్కోక తప్పదు. రెండో దఫా ఆంక్షలను విధంచాల్సి ఉంటుంది. ఒకవేళ భేటీ సత్ఫలితాలనిస్తే వెంటనే పుతిన్, జెలెన్స్కీల మధ్య భేటీని నిర్వహించేందుకు సిద్ధపడతా. ఇరువురి భేటీలో నన్ను అనుమతిస్తే నేనూ భాగస్వామినవుతా’’ అని ట్రంప్ అన్నారు. వర్చువల్ భేటీలో జెలెన్‌స్కీసహా యురోపియన్ యూనియన్ సభ్యుదేశాల అగ్రనేతలతోనూ ట్రంప్ మాట్లాడారు. జెలెన్స్కీతో వర్చువల్ భేటీ అద్భుతంగా సాగిందని ట్రంప్ అన్నారు. -
ట్రంప్, పుతిన్ ఏకాంత చర్చలే!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత పుతిన్ ఈ నెల 15న అలస్కాలో భేటీ కాబోతున్నారు. ఈ భేటీ అత్యంత గోప్యంగా జరుగబోతోందని వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. సమావేశం జరిగే గదిలో ట్రంప్, పుతిన్‌తోపాటు ఇద్దరు అనువాదకులు మాత్రమే ఉంటారని తెలిపాయి. ఇంకెవరికీ ప్రవేశం ఉండదని పేర్కొన్నాయి. ఇరువురు నేతలు దాదాపు నాలుగేళ్ల తర్వాత ముఖాముఖి చర్చలు జరుపబోతున్నారు. ఈ చర్చలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. 2018 జూలై 16న ఫిన్లాండ్ రాజధాని హెల్సింకీలో ట్రంప్, పుతిన్ మధ్య రెండు గంటలపాటు గోప్యమైన భేటీ జరిగింది. అప్పటి చర్చల్లో పెద్దగా ఏదీ సాధించలేకపోయారు. ఫల వంతం కాలేదు. పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. భేటీ తర్వాత ఇరువురు నేతలు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పుడు కూడా అదే తరహాలో గోప్యంగా మాట్లాడుకోవాలని నిర్ణయించుకోవడం పట్ల భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అప్పటిలాగే విఫలమయ్యే అవకాశం లేకపోలేదని విమర్శకులు అంటున్నారు. ట్రంప్, పుతిన్ తోపాటు ఇరుపక్షాల నుంచి ప్రతినిధులు కూడా సమావేశంలో పాల్గొంటే ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందని సూచిస్తున్నారు. కాల్పుల విరమణ, శాంతి ఒప్పందం పుతిన్‌తో ఏకాంత చర్చలకే ట్రంప్ మొగ్గు చూపడం వెనుక స్పష్టమైన కారణం ఉన్న ట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించేలా పుతిన్‌తో గట్టిగా వాదించి, ఒప్పించడానికి ఏకాంత భేటీ దోహదపడు తుందని ఆయన భావిస్తున్నట్లు సమా చారం. ఎందుకంటే చర్చల గదిలో ఇతరు లు కూడా ఉంటే వారు అప్పటికప్పుడు పుతిన్ మనసు మార్చేసి, వెనక్కి లాగే ప్రమాదం లేకపోలేదు. అలాంటి పరిస్థితి లేకుండా చేయాలన్న ఉద్దేశంతోనే ట్రంప్ ఈ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. మధ్యవర్తులతో పని కాదన్న అంచనాతో స్వయంగా తానే రంగంలోకి దిగాలని ట్రంప్ నిర్ణయించుకున్నారు. ఉక్రెయిన్‌తో మొదట కాల్పుల విరమణకు, ఆ తర్వాత శాంతి ఒప్పందానికి రష్యా అధినేతను ఎలాగైనా ఒప్పించాలన్నదే ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. పుతిన్ విజయమే: బోల్టన్ అలస్కాలో జరిగే భేటీని పుతిన్ విజయంగా డొనాల్డ్ ట్రంప్ మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ అభివర్ణించారు. సమావేశానికి ట్రంప్‌ను స్వయంగా రప్పిస్తుండడం ద్వారా పుతిన్ ఇప్పటికే పైచేయి సాధించారని అన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఆపేస్తుందన్న నమ్మకం తనకు లేదని తేల్చిచెప్పారు. అయితే, జాన్ బోల్టన్ వ్యాఖ్యలను ట్రంప్ కొట్టిపారేశారు. అమెరికాకు అపజయం ఉండదని పేర్కొన్నారు. -
ఫెడరల్ నియంత్రణలోకి వాషింగ్టన్ డీసీ
వాషింగ్టన్: దేశ రాజధాని వాషింగ్టన్ డీసీ హింసాత్మక గ్యాంగ్‌లు, రక్తపిపాసులైన నేరగాళ్లతో నిండిపోయిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు రాజధానిలోని పోలీసు విభాగాన్ని ఫెడరల్ నియంత్రణలోకి తీసుకుంటున్నామని చెప్పారు. పోలీసులకుతోడుగా 800 మంది నేషనల్ గార్డ్స్‌ను కూడా మోహరిస్తామని ప్రకటించారు. నేషనల్ గార్డులు శాంతిభద్రతలను, పౌరులకు రక్షణను కల్పిస్తారన్నారు. అవసరమైతే మరింతమంది నేషనల్ గార్డులను తీసుకొస్తామని పేర్కొన్నారు. సోమవారం ఆయన వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. నగరంలో నేరాల రేటు 2024లో 30 ఏళ్ల కనిష్టానికి పడిపోయిందంటూ గణాంకాలు చెబుతుండగా నేరాలమయంగా మారిందని వ్యాఖ్యానించడం గమనార్హం. ట్రంప్ ఈ వారంలోనే ఫెడరల్ బలగాలు రాజధానికి చేరుకుంటాయని రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ తెలిపారు. నిరాశ్రయులు నగరం విడిచి వెళ్లిపోవాలి ‘నివాసం లేని వారు వెంటనే నగరం వదిలి వెళ్లిపోవాలి. వారి కోసం నగరానికి దూరంగా స్థలాలిచ్చాం. నేరగాళ్లూ, మీరు మాత్రం ఎక్కడికీ వెళ్లొద్దు, మీరుండాల్సింది జైలులోనే. మేమే మిమ్మల్ని అందులో ఉంచుతాం’అని ట్రంప్ అంతకుముందు సొంత ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు. వీధుల్లో, పార్కుల్లో నివాసం ఏర్పాటు చేసుకున్న వారిని తక్షణమే అరెస్ట్ చేయాలంటూ ఫెడరల్ పోలీసులకు ఆదేశాలిచ్చామన్నారు. -
అలస్కా చర్చల్లో జెలెన్స్కీకీ చోటు?
వాషింగ్టన్: ఈ నెల 15వ తేదీన అలస్కాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన దౌత్యపరమైన విభేదాలకు తెరతీసింది. ఈ సమావేశంలో కుదరబోయే ఒప్పందంపై ఉప్పందుకున్న యూరప్ దేశాల నేతలు ఉక్రెయిన్ భవిష్యత్తును నిర్ణయించే భేటీలో అధ్యక్షుడు జెలెన్స్కీకి చోటు కల్పించకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో సమావేశమైన యూరప్ దేశాల ఉన్నతాధికారులు..ట్రంప్ దౌత్య ప్రయత్నాలకు మద్దతు పలికారు. అదే సమయంలో, ట్రంప్–పుతిన్ చర్చల తర్వాత ముందుగా కాల్పుల విరమణ అమల్లోకి రావాలని, ఉక్రెయిన్‌కు సైతం ఒప్పందంలో భాగస్వామి అయ్యే అవకాశమివ్వాలని జేడీ వాన్స్‌ను కోరారు. అలస్కాలో శుక్రవారం పుతిన్–ట్రంప్ మధ్య జరిగే శిఖరాగ్రంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేరు లేదు. అయితే, జెలెన్స్కీ పాల్గొనే అవకాశాలను పూర్తిగా కొట్టిపారేయలేమని వైట్ హౌస్ వర్గాలు అంటున్నాయి. ట్రంప్–పుతిన్‌ల సమావేశం తర్వాత మాత్రమే జెలెన్స్కీకి చాన్సుంటుందని చెబుతున్నారు. వేగంగా చోటుచేసుకున్న పరిణామాల నడుమ అలస్కా శిఖరాగ్రంపై నిర్ణయం వెలువడింది. శిఖరాగ్రం వేదికను ఇంకా ఖరారు చేయలేదు. అంతేకాదు, ఇద్దరు నేతల మధ్య చర్చకు రావాల్సిన అంశాలపైనా స్పష్టత రాలేదని చెబుతున్నారు. అధ్యక్షుడు ట్రంప్ ఇద్దరు నేతలతో కలిసి త్రైపాక్షిక చర్చలకు సైతం సిద్దంగా ఉన్నా, పుతిన్ వినతి మేరకు ద్వైపాక్షిక చర్చలకు అవసరమైన ఏర్పాట్లు మాత్రమే చేస్తున్నామని వైట్ హౌస్ అధికారి ఒకరు తెలిపారు. యూరప్ నేతల డిమాండ్లివీ..అలస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అవనున్నట్లు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్..ఇందులో జెలెన్స్కీ పాల్గొనేదీ లేనిదీ మాత్రం స్పష్టం చేయలేదు. యుద్ధానికి ముగింపు పలికే విషయంలో ఉక్రెయిన్ను కూడా భాగస్వామిగా చేర్చుకోవాలని జెలెన్‌స్కీతోపాటు యూరప్ దేశాల నేతలు కోరుతున్నారు. ట్రంప్ ప్రకటనను స్వాగతించిన జెలెన్స్కీ, తమ భూభాగాన్ని రష్యాకు ధారాదత్తం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను తోసిపుచ్చారు. పుతిన్–ట్రంప్ చర్చల్లో ప్రస్తావనకు వచ్చే అంశాలేమిటి, కుదరనున్న ఒప్పందం వివరాలేమిటి? అంటూ జేడీ వాన్స్‌తో సమావేశమైన యూరప్ దేశాల ఉన్నతాధికారులు కూపీ లాగారు. అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్కు పుతిన్ బుధవారం అందించిన పత్రాల్లో ఏముందంటూ ఆరా తీశారు. ‘ఈ చర్చల్లో ఉక్రెయిన్‌కు భాగస్వామ్యం ఉండాలి. చర్చల అనంతరం ముందుగా కాల్పుల విరమణ అమల్లోకి రావాలి. ఆ తర్వాతే మిగతా అంశాల అమలు విషయం తేల్చాలి. ఉక్రెయిన్ కొంత భూభాగాన్ని కోల్పోవాల్సి వస్తే..ప్రస్తుతం రష్యా ఆక్రమించుకున్న భూభాగాలను వెనక్కి ఇచ్చేయాలి...’వంటి షరతులను వారు జేడీ వాన్స్‌కు వినిపించారు. ఇందుకు సంబంధించిన ప్రకటనపై ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, పోలండ్, యూకే, ఈయూ, ఫిన్లాండ్ దేశాల నేతలు సంతకాలు చేశారు. ఉక్రెయిన్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతలకూ గ్యారెంటీ ఇవ్వాలని కోరారు. తమ ప్రతినిధి విట్కాఫ్ మాస్కోలో పుతిన్‌తో జరిపిన సమావేశంలో కుదిరిన ఒప్పందంపై మీడియా అడిగిన ప్రశ్నకు ట్రంప్.. కొన్ని భూభాగాలను వదులుకోవడం వంటి అంశాలున్నాయని చెప్పడం యూరప్ దేశాలతోపాటు జెలెన్స్కీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పుతిన్ అందజేసిన పత్రంలో తాము పాక్షికంగా ఆక్రమించుకున్న ప్రాంతాలతోపాటు డోన్బాస్ ప్రాంతం పూర్తిగా స్వాధీనం చేయాలనే అంశం ఉన్నట్లు యూరప్ దేశాలంటున్నాయి. ఖెర్సన్, జపొరిజియాల్లోనూ రష్యా ఆర్మీ తిష్టవేసింది. వీటి విషయం తేల్చలేదు. అమెరికా ఇచ్చే భద్రతాపరమైన గ్యారంటీల విషయం సైతం అస్పష్టంగా ఉంది. దీనిపై వైట్ హౌస్ అధికారులను ఈయూ నేతలు పదేపదే ప్రశ్నిస్తున్నా స్పందనలేదు. -
మా అభ్యంతరాలు వినాల్సిందే
కీవ్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధినేత పుతిన్ మధ్య ఈ నెల 15న జరుగబోతున్న భేటీ పట్ల ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ అసహనం వ్యక్తంచేశారు. తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా వారిద్దరూ ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ ఒప్పందం కుదుర్చుకున్నా అది తమకు సమ్మతం కాబోదని తేల్చిచెప్పారు. ఈ మేరకు శనివారం ‘టెలిగ్రామ్’లో పోస్టు చేశారు. రష్యా ఆక్రమణలో ఉన్న తమ భూభాగాలను వదులుకొనే ప్రసక్తే లేదన్నారు. అవి ఏనాటికైనా ఉక్రెయిన్‌లో కలవాల్సిందేనని తేల్చిచెప్పారు. ఒకవేళ వాటిని రష్యాలో అంతర్భాగంగా అమెరికా ప్రభుత్వం అధికారికంగా గుర్తిస్తే సంఘర్షణ మరింత ముదురుతుంది తప్ప తగ్గబోదని స్పష్టంచేశారు. ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతపై రాజీపడే ప్రసక్తే లేదన్నారు. ట్రంప్–పుతిన్ చర్చల్లో ఈ అంశంపై చర్చ జరగదనే భావిస్తున్నామని తెలిపారు. ఉక్రెయిన్–రష్యా మధ్య శాంతి కోసమే ఆ ఇరువురు నేతల చర్చలు పరిమితమైతే బాగుంటుందని వెల్లడించారు. రెండు దేశాల నడుమ శాశ్వత శాంతి సాధ్యం కావాలంటే తమ అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఆక్రమణదారులకు తమ భూమి అప్పగించేందుకు సిద్ధంగా లేమన్నారు. ఉక్రెయిన్ ప్రమేయం లేకుండా ఇతర పక్షాలు తీసుకొనే ఏ నిర్ణయమైనా అది శాంతికి వ్యతిరేకమే అవుతుందన్నారు. పరిష్కారమార్గాలను చంపేసేలా ఎవరూ వ్యవహరించవద్దని జెలెన్స్కీ విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా, ఉక్రెయిన్‌లోని ఖేర్సన్ సిటీపై రష్యా సైన్యం శనివారం డ్రోన్లతో దాడికి దిగింది. ఈ ఘటనలో ఇద్దరు ఉక్రెయిన్ పౌరులు మరణించారు. మరో 16 మంది గాయపడ్డారు. జపొరిజియాలో జరిగిన మరో దాడిలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. రష్యా సైన్యం 47 డ్రోన్లు ప్రయోగించగా, వాటిలో 16 డ్రోన్లను మధ్యలోనే కూల్చివేశామని ఉక్రెయిన్ వైమానిక దళం ప్రకటించింది. రెండు క్షిపణులు సైతం ప్రయోగించగా, ఒక క్షిపణిని ధ్వంసం చేశామని తెలియజేసింది. -
టారిఫ్‌ల వ్యవహారం తేలేదాకా.. భారత్‌తో వాణిజ్య చర్చల ప్రశ్నే లేదు: ట్రంప్
వాషింగ్టన్: టారిఫ్‌ల వ్యవహారం తేలేదాకా, భారత్‌తో వాణిజ్య చర్చలు జరిపే ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. భారత్ వస్తువులపై టారిఫ్‌లను 50 శాతానికి పెంచిన నేపథ్యంలో వాణిజ్య చర్చలను ముమ్మరం చేస్తారా అన్న ప్రశ్నకు ట్రంప్..భారత్‌తో ముందు టారిఫ్‌ల వ్యవహారం కొలిక్కిరావాలని, అప్పటి వరకు వాణిజ్య చర్చలు జరిగే అవకాశం లేదని పేర్కొన్నారు. ట్రంప్ రెండో విడత పెంచిన 25 శాతం టారిఫ్‌లు 21 రోజుల తర్వాత ఈ నెల 27వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ పరిణామంపై ప్రముఖ భారతీయ అమెరికన్ అటార్నీ రవి బాత్రా స్పందించారు. ట్రంప్ కోరిన విధంగా ఉక్రెయిన్‌తో రష్యా కాల్పుల విరమణకు రాకపోవడం విచారకరమని ఆయన పేర్కొన్నారు. భారత్‌ను బాధపెడితే రష్యాను బాధపెట్టినట్లే. అదే సమయంలో అది మమ్మల్నీ మరింతగా బాధపెడుతుంది’అని ఆయన వ్యాఖ్యానించారు. -
అమెరికాతో రక్షణ ఒప్పందాలు యథాతథం
న్యూఢిల్లీ: భారత్ వస్తువులపై టారిఫ్‌లను 50 శాతానికి పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసిన వేళ రక్షణ ఒప్పందాలను నిలిపి వేసినట్లు వస్తున్న వార్తలను కేంద్రం కొట్టివేసింది. రక్షణ ఒప్పందాలను రద్దు చేసుకునే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. రక్షణ సామాగ్రి కొనుగోలు ఒప్పందాలు యథాతథంగా అమలవుతాయని పేర్కొంది. అమెరికా నుంచి అందాల్సినవి ఒప్పందం ప్రకారం అందుతూనే ఉంటాయని, తదుపరి ఆర్డర్లపై చర్చలు కూడా కొనసాగుతాయని వివరించింది. అమెరికా నుంచి రక్షణ కొనుగోళ్లను భారత ప్రభుత్వం ఆపేసిందంటూ వస్తున్న వార్తలు అసత్యాలు, అభూత కల్పనలు అని రక్షణ శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. టారిఫ్‌ల పెంపు నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ అమెరికా వెళ్లి, కొత్తగా ఒప్పందాలు కుదుర్చుకుంటారంటూ వస్తున్న వార్తలను కూడా ఆయన తోసిపుచ్చారు. అయితే, ఆ పర్యటనను ప్రభుత్వం రద్దు చేసిందని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. టారిఫ్‌ల పెంపు వేళ..రెండు వ్యూహాత్మక భాగస్వామ్య దేశాల మధ్య విశ్వాసం సడలిన మాట వాస్తవమేనని, అయితే దీని ప్రభావం రక్షణ సంబంధాలపై ప్రత్యక్షంగా పడబోదని ఐజీ డ్రోన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రిటైర్డ్ మేజర్ జనరల్ పధి విశ్లేషించారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య 20 వరకు రక్షణ ఒప్పందాలున్నాయన్నారు. అమెరికాకు చెందిన అపాచీ, చినూక్, పీ–81 విమానాలు, ఎంక్యూ–9 డ్రోన్లను భారత్ ఎక్కువగా కొనుగోలు చేస్తోందని, వీటిపై ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం పడదని ఆయన పేర్కొన్నారు. -
వచ్చే వారంలో ట్రంప్‌తో భేటీ
మాస్కో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వచ్చే వారం సమావేశమవ్వాలని భావిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. బహుశా యూఏఈలో శిఖరాగ్రం జరిగే అవకాశముందన్నారు. మూడేళ్లుగా కొనసాగిస్తున్న యుద్ధానికి ముగింపు పలకాలంటూ అమెరికా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా ఒత్తిళ్లు తెస్తున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. యూఏఈ అధ్యక్షుడు జాయెద్ అల్ నహ్యాన్తో క్రెమ్లిన్‌లో జరిగిన భేటీ అనంతరం పుతిన్ ఈ ప్రకటన చేశారు. ప్రతిపాదన తమదే అయినా, ఇరు దేశాలు ఈ భేటీపై ఆసక్తితో ఉన్నాయన్నారు. చర్చల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పాల్గొంటారా అన్న ప్రశ్నకు పుతిన్..ఇందుకు తాను వ్యతిరేకం కాదని గతంలోనూ అనేక పర్యాయాలు చెప్పానన్నారు. అయితే, ఇందుకు కొన్ని పరిస్థితులు అనుకూలించాల్సి ఉందన్నారు. అంతకుముందు, రష్యా విదేశాంగ శాఖ సలహాదారు యూరి ఉషకోవ్ మాట్లాడుతూ.. శిఖరాగ్రం వచ్చే వారం జరిగే అవకాశాలున్నాయని తెలిపారు. ఇందుకు వేదికపై సూత్రప్రాయ అంగీకారం కుదిరినట్లు వెల్లడించారు. తేదీలింకా ఖరారు కాలేదన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా ఈ భేటీలో పాల్గొనే ఛాన్సుందన్న వార్తలను ఉషకోవ్ కొట్టిపారేశారు. పుతిన్, ట్రంప్ భేటీ విజయవంతం, ఫలవంతం కావాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. యుద్ధానికి ముగింపు పలికేందుకు గతంలో జెలెన్స్కీ భేటీ ప్రతిపాదన తెచ్చినా పుతిన్ పట్టించుకోలేదు. తాజాగా, పుతిన్ వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్ష భవనం స్పందించలేదు. యుద్ధం ఆపకుంటే ఆర్థికపరమైన కఠిన ఆంక్షలను విధిస్తామని ట్రంప్ చేసిన హెచ్చరికల గడువు శుక్రవారంతో ముగియనుంది. ట్రంప్–పుతిన్ శిఖరాగ్రం తమ వైఖరిని స్పష్టంగా తెలియజేసేందుకు ఒక అవకాశమని రష్యా బుధవారం వ్యాఖ్యానించింది. అరుదైన ఖనిజాల వెలికితీత వంటి అంశాల్లో ఉమ్మడి పెట్టుబడులకు ఆర్థిక అవకాశాలపైనా చర్చలు జరపవచ్చని తెలిపింది.యుద్ధానికి వ్యతిరేకంగా ఉక్రేనియన్లు2022తో పోలిస్తే రష్యాతో జరిగే యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా ముగించాలని ఎక్కువమంది ఉక్రెయిన్ ప్రజలు కోరుకుంటున్నారు. యుద్ధం మొదలైన కొత్తలో చేపట్టిన ఓ సర్వేలో విజయం సాధించేదాకా పోరాడాల్సిందేనంటూ మూడొంతుల మంది గట్టిగా కోరుకున్నారు. తాజాగా ఇటీవల చేపట్టిన సర్వేలో మాత్రం ఇందుకు విరుద్ధమైన ఫలితాలు వచ్చాయి. యుద్ధానికి కొనసాగించాలనుకునే వారి సంఖ్యలో గణనీయంగా తగ్గుదల కనిపించింది. త్వరగా యుద్ధానికి ముగింపు పలికి, రష్యాతో ఒప్పందానికి రావాలని మూడొంతుల మంది కోరుకుంటున్నారని వెల్లడైంది. రష్యా ఆధీనంలోని భాగాలు మినహా మిగతా ప్రాంతాల్లోని 15 ఏళ్లు పైబడిన వెయ్యి మంది నుంచి అభిప్రాయాలను తెలుసుకున్నామని సర్వే నిర్వాహకులు తెలిపారు. -
రష్యా–అమెరికా నిర్మాణాత్మక చర్చలు
మాస్కో: ఉక్రెయిన్‌పై యుద్ధం ముగించే దిశగా రష్యాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి పెంచుతున్నారు. ఇందులో భాగంగా రష్యా అధినేత పుతిన్‌తో చర్చల కోసం తన ప్రత్యేక ప్రతినిధిగా స్టీవ్ విట్కాఫ్ను పంపించారు. విట్కాఫ్ బుధవారం ఉదయం మాస్కోలో పుతిన్‌తో దాదాపు మూడు గంటలపాటు సమావేశమయ్యారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధంతోపాటు తాజా పరిణామాలపై చర్చించారు. ట్రంప్ సందేశాన్ని విట్కాఫ్ ఈ సందర్భంగా పుతిన్‌కు చేరవేశారు. ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు సన్నద్ధం కావాలని, కాల్పుల విరమణ పాటించాలని చెప్పారు. పుతిన్, విట్కాఫ్ మధ్య సుహృద్భావ వాతావరణంలో నిర్మాణాత్మక చర్చలు జరిగాయని రష్యా విదేశాంగ ప్రతినిధి యూరి ఉషకోవ్ తెలిపారు. ఇరుపక్షాలు సానుకూల సంకేతాలు పంపించుకున్నాయని వివరించారు. వ్యూహాత్మక సహకారంపై చర్చించుకున్నాయని స్పష్టంచేశారు. ఇదిలా ఉండగా, పుతిన్‌తో చర్చల అనంతరం విట్కాఫ్ బుధవారం మధ్యాహ్నం స్వదేశానికి తిరిగి వెళ్లిపోయారని రష్యన్ మీడియా తెలియజేసింది. అయితే, పుతిన్, విట్కాఫ్ తాజా చర్చలపై అమెరికా, ఉక్రెయిన్ ప్రభుత్వాలు ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఉక్రెయిన్‌పై యుద్ధానికి ఇకనైనా ఫుల్స్టాప్ పెట్టకపోతే కఠినమైన ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని రష్యాను ట్రంప్ తీవ్రంగ హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
మోదీ చేతుల్ని ట్రంప్ కట్టిపడేశారు
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతీయ వస్తువులపై దిగుమతి సుంకాల సుత్తితో మోదుతానని మొత్తుకుంటున్నా మోదీ మౌనం వహించడం వెనుక అక్రమ వ్యాపార సంబంధాలు దాగున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రమైన విమర్శలు గుప్పించారు. మరో 24 గంటల్లో మరోమారు భారత్‌పై దిగుమతి టారిఫ్‌లను పెంచుతానని మంగళవారం ట్రంప్ ప్రకటించిన మరుసటి రోజే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ మోదీపై విమర్శలతో విరుచుకుపడ్డారు. ఈ మేరకు రాహుల్ తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో పలు పోస్ట్‌లు పెట్టారు. ‘‘ భారత్‌పై అదనపు టారిఫ్‌లు మోపుతానని ట్రంప్ పదేపదే ప్రకటిస్తూ ఇప్పటికే ఒకసారి 25 శాతం పెంచినా ప్రధాని మోదీ ఏమాత్రం ట్రంప్‌ను నిలువరించలేకపోయారు. దీని వెనుక అసలు కారణం ఇప్పటికైనా భారతీయు లకు తెలియాల్సి ఉంది. అదేంటంటే అమెరికాలో గౌతమ్ అదానీపై అక్కడి విచారణ సంస్థలు దర్యాప్తు కొన సాగిస్తున్నాయి. మోదీ, ఏఏ(అంబానీ, అదానీ), రష్యా ముడి చమురు కొను గోళ్ల వ్యవహారంలో అక్రమ ఆర్థిక సంబంధాలు బట్టబయలు చేస్తానని ట్రంప్ బెదిరిస్తున్నారు. అందుకే భారత్‌పై ఎంతటి టారిఫ్‌ల భారం పడుతున్నా ప్రధాని మోదీ చీమకుట్టినట్లయినా లేకుండా మౌనంగా ఉండిపోయారు. అదానీ దర్యాప్తు పేరు చెప్పి మోదీ చేతుల్ని ట్రంప్ కట్టిపడేశారు’’ అని రాహుల్ గాంధీ ఆరోపించారు. రాహుల్ ఆరోపణలపై అదానీ గ్రూప్ సంస్థనుంచిగానీ కేంద్రప్రభుత్వం నుంచిగానీ ఇంతవరకు ఎలాంటి స్పందన, వివరణ రాలేదు. రష్యాతో ముడి చమురు వాణిజ్యాన్ని భారత్ మరింతగా పెంచుకోవడంపై ట్రంప్ మొదట్నుంచీ తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తుండటం తెల్సిందే. ఈ అక్కసుతోనే ఆయన భారత్‌పై అదనపు దిగుమతి టారిఫ్‌లను విధిస్తు న్నారు. ఇప్పటికే ఒక దఫా పెంచగా మరోదఫా మరికొన్ని గంటల్లో పెంచుతానని ప్రకటించడం, భారత్ ఘాటుగా బదులివ్వడం తెల్సిందే. -
ట్రంప్ చెప్పింది అబద్ధం
వాషింగ్టన్: రష్యా నుంచి ఆయుధాలు, చమురును కొనుగోలు చేయొద్దని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గుడ్లురిమి చూసినా భారత్ ఏమాత్రం బెదరలేదని తాజాగా వెల్లడైంది. భారత్ చమురు, ఆయుధాలను కొనుగోలు చేయడం ద్వారా ఆర్జించిన లాభాలను రష్యా.. ఉక్రెయిన్‌పై యుద్ధం కోసం వెచ్చిస్తోందని ట్రంప్ ఇప్పటికే ఆరోపించారు. ఈ కొనుగోల్లు ఆపకపోతే భారీ దిగుమతి సుంకాలు విధిస్తానని భారత్‌ను ట్రంప్ బెదిరించినా రష్యా ముడిచమురును భారత రిఫైనరీ కంపెనీలు నిరాటంకంగా కొనుగోలుచేస్తూనే ఉన్నాయని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. భవిష్యత్తులో రష్యా నుంచి భారత్ చమురును కొనుగోలుచేయబోదనే వార్తలను విన్నానని ట్రంప్ శనివారం వ్యాఖ్యానించిన కొద్దిసేపటికే జాతీయమీడియాలో భిన్నమైన వార్తలు రావడం విశేషం. ‘‘రష్యా నుంచి చమురు కొనే సంస్కృతికి భారత్ మంగళం పాడుతుందని విన్నా. ఇది నిజంగా మంచి విషయం. అయితే ఇందులో నిజమెంతో నాక్కూడా తెలీదు. తర్వాత ఏం జరుగుతుందో వేచిచూద్దాం’’ అని ట్రంప్ న్యూజెర్సీలోని బెడ్మిన్స్టర్ గల్ఫ్ క్లబ్లో మీడియాతో ట్రంప్ అన్నారు. అయితే అగ్రరాజ్యం అమెరికా ఎంతగా బెదిరించినా సరే భారత్ తన స్వప్రయోజనాలకు, సార్వ¿ౌమతానికే అత్యంత ప్రాధాన్యతనిస్తుందని మరోసారి రుజువైందని జాతీయమీడియాలో శనివారం పలు కథనాలు వచ్చాయి. ‘‘ రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేయాలా? వద్దా? కొంటే ఎంత పరిమాణంలో కొనాలి? అనేవి కేవలం మార్కెట్ ధర ప్రకారంమే నిర్ణయం తీసుకుంటాంగానీ ట్రంప్ వంటి బయటివ్యక్తి బెదిరింపులకు భయపడికాదు’’ అని రిఫైనరీల సంబంధిత వర్గాలు వ్యాఖ్యానించాయి. ‘‘ ముడి చమురు నాణ్యత, సరఫరా వ్యయాలు, ఇతరత్రా ఖర్చుల గురించే మేం ఆలోచిస్తాంగానీ అమెరికా ఆదేశించిందనో మరెవరో వద్దన్నారో మేం చమురు కొనుగోళ్లను ఆపబోం’’ అని భారతీయ రిఫైనరీలు స్పష్టంచేసినట్లు తెలుస్తోంది. -
25 శాతం సుంకాలు ఇక అధికారికం
వాషింగ్టన్/న్యూఢిల్లీ: తంపులమారి ట్రంప్ అన్నంత పనీ చేశారు. భారత్‌పై తాజాగా ప్రకటించిన 25 శాతం సుంకాలపై అమెరికా అధ్యక్షుడు అధికారిక ముద్ర వేశారు. ఈ మేరకు ఉత్తర్వులపై గురువారం సంతకం చేశారు. అంతేగాక పదుల కొద్దీ దేశాలపై కూడా సుంకాల కొరడా ఝళిపించారు. తద్వారా అంతర్జాతీయంగా మరోసారి వాణిజ్య కల్లోలానికి తెర తీశారు. తాజా జాబితాలో లేని దేశాలకు 10 శాతం టారిఫ్ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అత్యధికంగా సిరియాపై 41 శాతం, పలు దేశాలపై అత్యల్పంగా 10 శాతం టారిఫ్‌లు వడ్డించారు. ఇవి ఆగస్టు 7 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే పాకిస్తాన్‌పై మాత్రం టారిఫ్‌లను 29 నుంచి 19 శాతానికి తగ్గించడం విశేషం. తాజాగా టారిఫ్‌లు విధించిన జాబితాలో 69 దేశాలున్నాయి. మరిన్ని దేశాలు తమతో చర్చలు జరుపుతున్నా, వాటి ప్రతిపాదనలు పరస్పర వర్తక లోటును పూడ్చేలా లేవంటూ ట్రంప్ పెదవి విరిచారు. ఈ నేపథ్యంలో త్వరలో మరిన్ని టారిఫ్ పెంపుదలలు ఉంటాయని వైట్‌హౌస్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. దీనిపై అధ్యక్షుడే ప్రకటన చేస్తారన్నారు. ఉత్తర అమెరికా వర్తక ఒప్పందం కింద అమెరికాలోకి ప్రవేశించే కెనడా, మెక్సికో ఉత్పత్తులకు సుంకాల బాదుడు నుంచి మినహాయింపు ఇచ్చారు. అయితే అమెరికాలోకి ఫెంటానిల్ భారీ అక్రమ రవాణాను అడ్డుకోవడంలో కెనడా విఫలమవుతోందని వైట్‌హౌస్ ఆక్షేపించింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన ఉత్పత్తులపై టారిఫ్‌లను 25 నుంచి 35 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించింది. మెక్సికోకు మాత్రం పలు ఉత్పత్తులపై విధించిన 30 శాతం టారిఫ్‌లను సంప్రదింపులకు వీలుగా 90 రోజుల గడువిచ్చారు. అయితే ఆటోయేతర, లోహేతర వస్తువులకు మాత్రం గడువు ఇవ్వలేదు. మెక్సికో నుంచి ఉక్కు, అల్యుమినియం, రాగిపై 50 శాతం టారిఫ్‌లు, ఆటో ఉత్పత్తులపై 25 శాతం తప్పవని వైట్‌హౌస్ స్పష్టం చేసింది. ట్రంప్ కొద్ది నెలల క్రితం ప్రపంచ దేశాలపై ప్రకటించిన టారిఫ్‌లు ఆగస్టు 1 నుంచే అమల్లోకి రావడం తెలిసిందే. భారత ఆర్థిక వ్యవస్థ మృతప్రాయమైనది అంటూ బుధవారం ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. మన ఎగుమతులపై 25 శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్టు తాజా ఉత్తర్వుల్లో ఆయన పునరుద్ఘాటించారు. రష్యా నుంచి భారీగా చమురు, ఆయుధాలు కొనుగోలు చేస్తున్నందుకు ప్రకటించిన పెనాల్టీ శాతాన్ని మాత్రం తాజా ఉత్తర్వుల్లో వెల్లడించలేదు. వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు అంశాల్లో అమెరికా ప్రమేయాన్ని అంగీకరించేందుకు భారత్ ఇప్పటికే ససేమిరా అనడం తెలిసిందే. అమెరికాపై భారత్ సుంకాలు దారుణంగా ఉన్నాయంటూ ట్రంప్ ఇటీవలే విమర్శించడం, దేశ ప్రయోజనాలను అన్ని రకాలుగా కాపాడతామని కేంద్రం ప్రకటించడం తెలిసిందే. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాల నడుమ చర్చలు కొనసాగుతుండగానే బుధవారం ట్రంప్ 25 శాతం సుంకాలు బాదారు. ఇక అమెరికాకు ఎగుమతులపై 15 శాతం టారిఫ్‌లకు దక్షిణ కొరియా ఇప్పటికే అంగీకరించింది. వాటిపై 25 శాతం బాదుడు తప్పదంటూ ట్రంప్ తొలుత హెచ్చరించారు. దాంతో ఆయన నిర్ణయించే అమెరికా ప్రాజెక్టుల్లో 350 బిలియన్ల మేరకు పెట్టుబడికి ఒప్పుకుంది. ఇక అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన చైనాపై టారిఫ్‌లను ట్రంప్ ఏ మేరకు నిర్ణయిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఆగస్టు 12 నాటికి ఒప్పందం కుదుర్చుకోవాల్సిందిగా ఆ దేశానికి ఆయన ఇప్పటికే అలి్టమేటమివ్వడం తెలిసిందే. ఇరు దేశాల నడుమ పలు అంశాలపై వర్తక విభేదాలు కొనసాగుతున్నాయి. దేశ ప్రయోజనాలు కాపాడతాం: కేంద్రం ట్రంప్ వ్యాఖ్యలు, తాజా ఉత్తర్వులపై కేంద్రం ఆచితూచి స్పందించింది. ‘‘ద్వైపాక్షిక వాణిజ్య భాగస్వామ్యం అనేక ఆటుపోట్లను ఎదుర్కొని నిలిచింది. ఇరు దేశాలు విశ్వసించే ఎజెండాకు కట్టుబడి ఉన్నాం. ఈ బంధం సజావుగా సాగుతుందని విశ్వసిస్తున్నాం’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు ప్రతీకారంగా జరిమానా విధిస్తామన్న ట్రంప్ ప్రకటనను మీడియా ప్రస్తావించగా ఈ విషయంలో జాతి ప్రయోజనాలకు అనుగుణంగా మాత్రమే నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
ట్రంప్ ‘డెడ్ ఎకానమీ’ వ్యాఖ్యలు తప్పుగా దొర్లినవే...
న్యూఢిల్లీ: భారత్ ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అంటూ ఒకవైపు ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ తదితర పేరున్న సంస్థలు కీర్తిస్తుంటే.. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రం భారత ఆర్థిక వ్యవస్థను ‘డెడ్ ఎకానమీ’ (నిర్వీర్యమైనది)గా అభివర్ణిస్తూ నోరు పారేసుకున్నారు. కాకపోతే ఈ వ్యాఖ్యలు తప్పుగా ఉచ్చరించడమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విదేశీ పెట్టుబడులకు భారత్ ఎంతో ఆకర్షణీయ కేంద్రంగా ఉండడమే కాకుండా.. అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు భారత్‌లో గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల (జీసీసీలు) ఏర్పాటుకు క్యూ కడుతుండడాన్ని గుర్తు చేశారు. భారత్ ఉత్పత్తులపై ఆగస్ట్ 1 నుంచి 25 శాతం టారిఫ్‌లకు అదనంగా పెనాల్టిలను విధిస్తామంటూ ప్రకటించిన మర్నాడే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ‘‘రష్యాతో భారత్ ఏం చేసినా నాకు అవసరం లేదు. నిర్వీర్యమైన తమ ఆర్థిక వ్యవస్థలను (డెడ్ ఎకానమీస్) అవి పరస్పరం మరింత దిగజార్చుకుంటుండడంపైనే నా దృష్టి అంతా’’అని పోస్ట్‌లో పేర్కొన్నారు. దీనిపై కన్సల్టెన్సీ సంస్థ ఈవై ఇండియా స్పందిస్తూ.. భారత్‌పై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తప్పుగా దొర్లినట్టుగా పేర్కొంది.ఇండియానే ఆధారం.. ‘‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గ్లోబల్ సౌత్ ప్రధానంగా మారుతోంది. ఇందులో భారత్ కీలకమైన పాత్ర పోషిస్తోంది. మరోవైపు అభివృద్ధి చెందిన ఒకప్పటి ఆర్థిక వ్యవస్థలు వేగంగా ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. భారత సంతతి వారి కృషి మూలంగానే ఆయా ఆర్థిక వ్యవస్థలు ఎంతో కొంత సానుకూల వృద్ధిని చూపించగలుగుతున్నాయి’’అని ఈవై ఇండియా ముఖ్య విధాన సలహాదారుడు డీకే శ్రీవాస్తవ తెలిపారు. అధిక యువ జనాభా కలిగిన భారత ఆర్థిక వ్యవస్థ ఎంతో చురుకైన, చైతన్యవంతమైనదిగా పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి 2024 గణాంకాల ప్రకారం భారత్‌లో సగటు వయసు 28.8 సంవత్సరాలు కాగా, అమెరికాలో ఇది 38.5, యూరప్‌లో 42.8 సంవత్సరాలుగా ఉంది. సగటు వయసు, వృద్ధి అవకాశాల పరంగా అభివృద్ది చెందిన దేశాలు మరింత వృద్ధాప్యంలోకి చేరుతున్నట్టు శ్రీవాస్తవ అన్నారు. ఐఎంఎఫ్ ఒక రోజు ముందే భారత ఆర్థిక వృద్ధి అంచనాలను పెంచుతూ ప్రకటించడం గమనార్హం. 2025, 2026 సంవత్సరాల్లో జీడీపీ 6.4 శాతం చొప్పున వృద్ధిని నమోదు చేస్తుందని తెలిపింది. ఈ ఏడాదికి గాను భారత్ 6.3 శాతం వృద్ధి చెందుతుందని ప్రపంచ బ్యాంక్ ప్రకటించగా, ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) 6.5 శాతంగా అంచనా వేసింది. పారిస్ కేంద్రంగా పనిచేసే ఆర్థిక సహకార, అభివృద్ధి సమాఖ్య (ఓఈసీడీ) సైతం భారత్‌కు సంబంధించి మెరుగైన అంచనాలను ప్రకటించడం తెలిసిందే. -
బఫూన్లకు బాస్ ట్రంప్
న్యూఢిల్లీ: రష్యాతో వాణిజ్యం చేస్తున్నదనేసాకు చూపుతూ భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌లు విధించడంపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా మండిపడ్డారు. భారత ప్రభుత్వాన్ని వేధిస్తున్న ట్రంప్‌ను ఆయన ‘బఫూన్ ఇన్ చీఫ్’గా అభివర్ణించారు. ‘వైట్ హౌస్‌లోని బఫూర్ ఇన్ చీఫ్ నా దేశ ప్రభుత్వాన్ని వేధిస్తుండటం విచారం కలిగిస్తోంది. ఇలాంటి బెదిరింపులకు లొంగటానికి సామంత రాజ్యం కాదు.. భారత్ సార్వభౌమత్వం కలిగిన దేశం అని స్పష్టం చేశారు. అత్యధిక టారిఫ్‌లతో మన ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టం వాటిల్లుతుందని ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ టారిఫ్‌ల పెంపుపై ప్రధాని మోదీ మౌనంగా ఉండటాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. మోదీ వైఖరి దారుణమన్నారు. -
అవి డెడ్ ఎకానమీలు
వాషింగ్టన్/న్యూఢిల్లీ/మాస్కో: ఆంక్షలు విధిస్తామ ని భయపెట్టినా గత కొంతకాలంగా రష్యా నుంచి భారీ ఎత్తున చమురు కొనుగోళ్లను తగ్గించుకోని భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోమారు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. భారత్‌కు చమురును సరఫరాచేస్తున్న శత్రు దేశం రష్యాను సైతం ట్రంప్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. భారత్, రష్యా రెండూ కలిసి సాధించేది ఏమీ ఉండదని ఎద్దేవాచేశారు. జట్టుకట్టి అనవసరంగా రెండు దేశాల ఆర్థికవ్యవస్థలను మరింత నిర్వీర్యంచేస్తున్నా యని ఇరు దేశాల ప్రభుత్వాలపై విమర్శల బురద చల్లారు. భారత్‌పై పాతికశాతం టారిఫ్ ఆర్థిక భారం మోపిన ట్రంప్ గురువారం భారత్, రష్యాల వాణిజ్యబంధంపై తన అక్కసును వెళ్లగక్కుతూ సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో పలు పోస్ట్‌లు పెట్టారు. ఐ డోంట్ కేర్..‘‘ రష్యాతో భారత్ ఎలాంటి వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటోందీ, రష్యాతో భారత్‌కు ఉన్న సత్సంబంధాలు ఏంటి అనేవి నాకు అస్సలు అవసరం లేదు. అత్యంత కీలకమైన అమెరికాతో వాణిజ్యం అత్యల్ప స్థాయిలో చేసుకుంటూ భారత్ సొంత ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యంచేసుకుంటోంది. ఇక రష్యా సంగతి చెప్పనక్కర్లేదు. రష్యాతో అమెరికాకు ఎలాంటి వాణిజ్య సంబంధాలు లేవు. ఇలాంటి రష్యా, భారత్‌లో కూడబలుక్కుని సాధించింది ఏమీ లేదు. అవి రెండూ డెడ్ ఎకానమీలు (నిర్వీర్యమైన ఆర్థిక వ్యవస్థలు). ఉమ్మడిగా పతనమవుతున్నాయి. ఈ దేశాలను నేనసలు పట్టించుకోను. భారత్‌తో మేం చాలా తక్కువ స్థాయిలో వాణిజ్యం చేస్తున్నాం. భారత్ మాపై విధించే అధిక టారిఫ్‌లే ఇందుకు ప్రధాన కారణం. భారత్ విధించే దిగుమతి సుంకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రపంచంలో అత్యధిక దిగుమతి సుంకాలు వసూలుచేస్తున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. భారత్‌తో వ్యవహారాలు ఒక్కోసారి సవ్యంగా ఉండవు. దాని పర్యవసానమే ఈ 25 శాతం దిగుమతి సుంకాలు. వీటికి పెనాల్టీ(జరిమానా) అదనం. ఇవన్నీ ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి అమలుచేసి వసూలు మొదలెడతా’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘‘భారత వాణిజ్య విధానాలు అసంపూర్ణంగా, అస్పష్టంగా ఉంటాయి. దానికితోడు భారత్‌తో పరస్పర సరుకుల విలువను మాత్రమే జమకట్టే నగదుయేతర వాణిజ్య అవరోధాలు చాలా ఉన్నాయి. మేం వద్దు అని వారిస్తున్నా, హెచ్చరిస్తున్నాసరే రష్యా నుంచి ఆయుధ, ఇంధన ఉత్పత్తులను భారీ ఎత్తున భారత్ కొనుగోలుచేస్తోంది. ఇలా వచ్చిన ఆదాయాన్ని పరోక్షంగా ఉక్రెయిన్ యుద్ధం కోసం రష్యా వినియోగిస్తోంది’’ అని ట్రంప్ ఆరోపించారు.మెద్వెదేవ్, ట్రంప్ మాటల యుద్ధంభారత్ను విమర్శించిన ట్రంప్ పనిలోపనిగా రష్యాపైనా, రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వదేవ్పైనా విమర్శలు గుప్పించారు. దీంతో మెద్వదేవ్ సైతం ప్రతివిమర్శలు చేశారు. తొలు త మెద్వదేవ్నుద్దేశిస్తూ ట్రంప్ వ్యంగ్య పోస్ట్ చేశారు. ‘‘రష్యా అధ్యక్షుడిగా పేలవంగా పాలించిన మాజీ అధ్యక్షుడు మెద్వదేవ్ ఇంకా రష్యాకు అధ్యక్షుడినే అని అనుకుంటున్నారేమో. ఏదైనా మాట్లాడేముందు చూసి మాట్లాడండి. అమె రికాపై మాట్లాడే దుస్సాహసం చేయొద్దు’’ అని హెచ్చరించారు. దీనిపై రష్యా భద్రతా మండలి ఉపాధ్యక్షుడి హోదాలో మెద్వదేవ్ ఘాటుగా జవాబిచ్చారు. ‘‘ట్రంప్ ఎలా స్పందించినాసరే రష్యా తన పంథాను వీడబోదు. డెడ్ ఎకానమీ అని నోటికొచ్చినట్లు మాట్లాడటంకాదు. సోవి యట్ కాలంలోనే రష్యా అణుబాంబును తయా రుచేసిందన్న విషయం మర్చి పోవద్దు. అయినా ‘డెడ్’ అనే పదానికి ‘ది వాకింగ్ డెడ్’ అనే సినిమాకు, ‘డెడ్ హ్యాండ్ అనే ‘వ్యవ స్థ’కు ఉన్న శక్తి ట్రంప్‌కు తెలీదనుకుంటా’’ అని మెద్వదేవ్ వ్యాఖ్యానించారు. శత్రుదేశం దాడిచేసి రష్యా నా యక త్వాన్ని అంతమొందించినాసరే తిరిగి అణు బాంబులు ప్రయోగించేలా రష్యా రూపొందించిన ఆటో మేటిక్ దాడి వ్యవస్థ పేరే డెడ్ హ్యాండ్. -
టారిఫ్‌లతో జీడీపీపై ఎఫెక్ట్
న్యూఢిల్లీ: ఊహించిన దానికన్నా అధిక స్థాయిలో టారిఫ్‌లు విధించడంతో పాటు పెనాల్టిలు కూడా వేయాలన్న అమెరికా నిర్ణయంతో భారత స్థూల దేశీయోత్పత్తిపై (జీడీపీ) ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు తెలిపారు. పరస్పరం ప్రయోజనకరంగా ఉండే డీల్‌ను కుదుర్చుకోవడం ద్వారా భారత్ దీన్ని అధిగమించగలదని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. భారీ టారిఫ్‌ల వల్ల ఇరు దేశాల మధ్య అత్యధిక వాణిజ్యం జరిగే ఫార్మా, టెక్స్టైల్స్, లెదర్, ఆటోమొబైల్స్, మెరైన్ ఉత్పత్తుల్లాంటి కీలక రంగాలపై నేరుగా ప్రభావం పడుతుందని ఇక్రా చీఫ్ ఎకానమిస్ట్ అదితి నాయర్ తెలిపారు. ప్రాథమికంగా టారిఫ్‌లను ప్రకటించినప్పుడే 2025–26 జీడీపీ వృద్ధి అంచనాలను 6.2 శాతానికి కుదించగా, తాజాగా పెనాల్టిల పరిమాణాన్ని బట్టి మరింతగా తగ్గించే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు, 25% టారిఫ్‌ల విధింపు దురదృష్టకరమని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానించాయి. దీని వల్ల ఎగుమతులపై ప్రభావం పడుతుందని ఫిక్కీ ప్రెసిడెంట్ హర్ష వర్ధన్ అగర్వాల్ తెలిపారు. టెక్స్టైల్స్ రంగానికి టారిఫ్‌లు పెను సవాలుగా మారతాయని టెక్స్టైల్ పరిశ్రమ సమాఖ్య సీఐటీఐ ఆందోళన వ్యక్తం చేసింది. -
రూపాయి మూడేళ్లలో అతిపెద్ద పతనం
ముంబై: భారత్‌పై ఆగస్టు 1 నుంచి జరిమానాతో సహా 25% సుంకాలను విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనతో దేశీయ కరెన్సీ రూపాయి మూడేళ్లలో అతిపెద్ద పతనాన్ని చవిచూసింది. డాలర్ మారకంలో ఏకంగా 89 పైసలు బలహీనపడి 87.80 వద్ద ముగిసింది.2022, డిసెంబర్ 24 (99 పైసలు క్షీణత) తర్వాత రూపాయి ఒకే రోజు ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. నెలాఖరున దిగుమతిదార్ల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడం, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సైతం దేశీయ కరెన్సీ కోతకు కారణమయ్యాయి. -
గాజాలో కరువు వాస్తవమే: ట్రంప్
స్కాట్లాండ్: గాజాలో కరువు పరిస్థితులున్న విష యం వాస్తవమేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. కరువు లేదంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవించడం లేదన్నారు. ‘టీవీల్లో చూస్తే తెలుస్తుంది. అక్కడున్న చిన్నారులు ఎంత ఆకలితో ఉన్నారో... అక్కడ నిజంగానే కరువుంది. దీనిని దాచిపెట్టలేం’అని స్కాట్లాండ్లో పర్యటిస్తున్న ట్రంప్ సోమ వారం పేర్కొన్నారు. గాజా ప్రాంతంలో అమెరికా ఆహార కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని, చిన్నారుల పొట్ట నింపుతుందని చెప్పారు. ప్రజలు స్వేచ్ఛగా సంచరించే చోట, సరిహద్దులు లేని చోట తాము అవాంతరాలు కల్పించబోమన్నారు. గాజా లో హమాస్ చేయలేనిది ఎంతో చేయగలమన్నారు. ‘బందీలందరినీ హమాస్ ఎక్కడ దాచిందో తెలిసిన ఇజ్రాయెల్ హమాస్‌తో ఒప్పందం కష్టమంటోంది. అదే సమ యంలో, చిట్టచివరి 20 మంది బందీలను హమాస్ రక్షణ కవచాలుగా భావిస్తోంది. అందుకే, వారిని వి డుదల చేయడం లేదు’అని ట్రంప్ వ్యాఖ్యానించారు.గాజాలో 17 టన్నుల ఆహారం జారవేతయూఏఈ వైమానిక దళం విమానాలు రెండో రోజు సోమవారం గాజాలోని పాలస్తీనియన్లకు 17 టన్నుల ఆహార పదార్థాలను జారవిడిచాయని జోర్డాన్ తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 19 టన్నుల ఆహార పదార్థాలను ఒక ట్రక్కు కింద లెక్క. అంటే ట్రక్కు కంటే తక్కువ ఆహారాన్ని విడిచినట్లేనని ఐరాస పాలస్తీనా శరణార్థి విభాగం చీఫ్ ఫిలిప్ తెలిపారు. ఆదివారం 25 టన్నుల ఆహార ప్యాకెట్లను జారవిడవడం తెల్సిందే. ఇజ్రాయెల్ ఆర్మీ నెలలుగా అమలు చేస్తున్న దిగ్బంధంతో గాజాలో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడటం, జనం, ముఖ్యంగా చిన్నారులు ఆకలి చావులకు గురవుతుండటంపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది.పుతిన్‌కు గడువు 10, 12 రోజులేఉక్రెయిన్తో ఒప్పందానికి రాకుంటే ఆంక్షలేట్రంప్ తాజా హెచ్చరికఉక్రెయన్తో యుద్ధం చేస్తున్న రష్యాకు విధించిన 50 రోజుల గడువును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుదించారు. అధ్యక్షుడు పుతిన్ 10, 12 రోజుల్లో ఉక్రెయిన్‌తో ఒప్పందం చేసుకోకుంటే ఆంక్షలు చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. సోమవారం ఆయన స్కాట్లాండ్లో మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని కావాలనే పొడిగిస్తూ పోతున్న పుతిన్ వైఖరితో అసహనంతో ఉన్నానన్నారు. ఇంత సుదీర్ఘకాలం వేచి ఉండటంలో అర్థం లేదంటూ, మున్ముందు ఏం జరగనుందో తనకు తెలుసునని వ్యాఖ్యానించారు. అందుకే పుతిన్‌కు తక్కువ సమయం ఇస్తున్నట్లు తెలిపారు. భారీ టారిఫ్‌ల ను రష్యాపై విధిస్తారా అన్న ప్రశ్నకు ఆయన.. ఇందుకు సంబంధించిన చర్యలపై ఇవ్వాళోరేపో ఒక అధికారిక ప్రకటన వెలువడుతుందని ప్రకటించారు. ప్రస్తుత పరిణామాలపై పుతిన్‌తో మాట్లా డాలనే ఆసక్తి తనకు అంతగా లేదని చెప్పారు. -
ట్రంప్ రూల్.. ఇండియన్స్ కు షాక్
-
ట్రంప్ వ్యాఖ్యలపై మౌనమెందుకు?
న్యూఢిల్లీ: భారత్–పాక్‌ల మధ్య కాల్పుల విరమణకు తానే మధ్యవర్తిత్వం వహించానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పదేపదే చెప్పుకుంటున్నా, ప్రధాని నరేంద్ర మోదీ దానిపై ఎందుకు నోరు విప్పడం లేదని లోక్‌సభ ప్రతిపక్షనాయకుడు రాహుల్‌గాంధీ ప్రశ్నించారు.‘‘కాల్పుల విరమణ ఒప్పందం తానే కుదిర్చానని ట్రంప్ ఇప్పటికో 25 సార్లు చెప్పారు. అసలు మనదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చడానికి ట్రంప్ ఎవరు? అది ఆయన పని కాదు. అయినా.. ప్రధాని ఒక్కసారి కూడా సమాధానం ఇవ్వలేదు’’అని ఆయన మండిపడ్డారు. ఆపరేషన్ సిందూర్ పట్ల పరస్పర వైరుధ్య వ్యాఖ్యలు చేయడాన్ని రాహుల్ ఎత్తి చూపారు. ‘ఒకవైపు ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది అంటున్నారు, మరోవైపు, విజయం సాధించామంటున్నారు. అది కొనసాగుతోందా? లేదా ముగిసిందా? మరోవైపు ఆపరేషన్ సిందూర్‌ను తానే ఆపానని ట్రంప్ చెబుతున్నారు. కాబట్టి ‘కుచ్ తో దాల్ మే కాలా హై నా’(ఏదో తేడాగా ఉంది)’అని రాహుల్ అనుమానం వ్యక్తం చేశారు. బుధవారం న్యూయార్క్‌లో జరిగిన ఓ సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ, భారత్–పాక్‌ల మధ్య పెద్ద యుద్ధాన్ని తానే నిరోధించానని పునరుద్ఘాటించడాన్ని రాహుల్ ప్రస్తావించారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత విదేశాంగ విధానం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం ప్రపంచ వేదికపై భారత్‌ను ఒంటరి చేస్తోందని ఆరోపించారు. ట్రంప్ వాదన కారణంగానే ప్రధాని మోదీ పార్లమెంటుకు దూరంగా ఉంటున్నారన్నారు. ఓటర్ల జాబితా సవరణ ఎన్నికల మోసం.. బీహార్‌లో పెద్ద ఎత్తున ఓటర్ల జాబితా సవరణను కూడా రాహుల్ తీవ్రంగా విమర్శించారు. ప్రక్రియను బీజేపీ ఎన్నికల మోసంగా ఆయన అభివరి్ణంచారు. 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికి బీజేపీ ఓటర్ల జాబితాను తారుమారు చేసిందని గుర్తు చేశారు. ‘బిహార్‌లో 52 లక్షల మంది మాత్రమే కాదు. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లోనూ మోసం చేశారు. ఓటర్ల జాబితాను చూపించమని ఈసీని అడిగితే నిరాకరించింది. వీడియోగ్రఫీ గురించి అడిగితే నియమాలను మార్చేసింది. మహారాష్ట్రలో 1 కోటి మంది కొత్త ఓటర్లను చేర్చారు. కర్ణాటకలో భారీ మోసాన్ని బయటపెట్టి.. ఎన్నికల కమిషన్ ముందుంచాం. తమ ఆటలు ఇక చెల్లవని తెలిసి ఓటర్లను తొలగించారు’అని ఆరోపించారు. రాహుల్ వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ సమరి్థంచారు. కీలకమైన విషయాలపై చర్చించేందుకు మోదీ నిరాకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ‘ట్రంప్ తన కాల్పుల విరమణ ప్రకటనతో రజతోత్సవం జరుపుకుంటున్న సమయంలో, ప్రధానమంత్రి పూర్తిగా మౌనంగా ఉన్నారు. విదేశాలకు వెళ్లడానికి, స్వదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను అస్థిరపరచడానికి మాత్రమే సమయం వెతుక్కుంటున్నారు’అని ఆయన ఎక్స్‌లో ఎద్దేవా చేశారు. -
జెఫ్రీ ఎప్స్టీన్ స్కామ్‌కు ఫుల్స్టాప్ పెట్టాలి
వాషింగ్టన్: రాజకీయ నాయకులకు వ్యభిచారిణులను ఎరగా వేసి, సొంత పనులు చక్కబెట్టుకోవడంలో సిద్ధహస్తుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త జెఫ్రీ ఎప్స్టీన్ వ్యవహారంలో పూర్తి నిజాలు బయటకు రావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక తాజాగా ఓ రిపోర్ట్ ప్రచురించింది. 2003లో జెఫ్రీ ఎప్స్టీన్కు పంపించిన బర్త్‌డే లేఖలో ట్రంప్ పేరు, సంతకం ఉన్నట్లు ఆ పత్రిక బయటపెట్టింది. అభ్యంతకర రీతిలో ఉన్న ఓ మహిళ శరీర భాగాలు, దానిపై ట్రంప్ సంతకం ఇందులో కనిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ట్రంప్‌పై ప్రతిపక్ష డెమొక్రటిక్ నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఆయన అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. దీనిపై ట్రంప్ తాజాగా స్పందించారు. అది నకిలీ లేఖ అని తేల్చిచెప్పారు. వాల్‌స్ట్రీట్ జర్నల్ను, పాత్రికేయుడు రూపర్డ్ మర్దోక్ను కోర్టుకు లాగుతానని హెచ్చరించారు. డెమొక్రటిక్ పార్టీ సృష్టిస్తున్న ఈ కుంభకోణానికి ఫుల్స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే ఎప్స్టీన్ అంశంలో పూర్తి వివరాలు సేకరించాలని, నిజాలు నిగ్గుతేల్చాలని తమ అటార్నీ జనరల్ పామ్ బాండీని ఆదేశించారు. కోర్టు ఆమోదం మేరకు సమాచారం బహిర్గతం చేయాలన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ట్రంప్ ఆదేశాలపై దీనిపై పామ్ బాండీ ప్రతిస్పందించారు. కోర్టుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని, ఎప్స్టీన్పై ఇప్పటిదాకా రహస్యంగా సాగిన దర్యాప్తునకు సంబంధించిన వివరాలు సేకరించేందుకు ప్రయతి్నస్తానని స్పష్టంచేశారు. -
కాళ్ల వద్ద వాపు.. చేతి వద్ద గాయం..!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(80) ఆరోగ్యంపై మరోసారి వదంతులు చెలరే గాయి. ఆదివారం న్యూజెర్సీలో జరిగిన ఫిపా క్లబ్ వరల్డ్ కప్ తిలకించేందుకు వచ్చిన ట్రంప్‌నకు కాళ్ల వద్ద నరాలు ఉబ్బిపోయినట్లుగా కనిపించడం, కుడి చేతిపై పలు చోట్ల వాపు కనిపించడంపై పలు దృశ్యాలు ఆన్లైన్లో హల్చల్ చేశాయి. ట్రంప్ వాస్తవ ఆరోగ్య స్థితిని కప్పిపుచ్చేందుకు అధ్యక్ష యంత్రాంగం ప్రయత్నిస్తోందా? అంటూ ఎక్స్‌లో ఓ యూజర్ అనుమానం వ్యక్తం చేశాడు. అధ్యక్షుడు ట్రంప్ శ్వాస సంబంధ సమస్యతో బాధపడు తున్నట్లుగా మరికొందరు నెటిజన్లు పేర్కొన్నారు. ఇలా వస్తున్న రకరకాల వదంతులపై అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ స్పందించారు. వీన్స్ ఇన్సఫియెన్సీ అనే సిరల వ్యాధితో ట్రంప్ బాధపడుతున్నారన్నారు. 70 ఏళ్లు దాటిన వారిలో సాధారణంగా కనిపించేదేనని చెప్పారు. ‘ట్రంప్ కాళ్ల దిగువ భాగంలో, చీలమండ వద్ద వాపును వైద్యులు పరీక్షించారు. దీన్ని సాధారణ లోపంగా నిర్ధారించారు. భయపడాల్సిన అవసరం లేదన్నారు’అని ఆమె తెలిపారు. ఇతర వైద్య పరీక్షల్లో గుండె వైఫల్యం, కిడ్నీ వైఫల్యం వంటివి లేనట్లు వైద్యులు చెప్పారని తెలిపారు. -
ఈయూ, మెక్సికోపై 30% టారిఫ్‌లు
వాషింగ్టన్: యూరోపియన్ యూనియన్ (ఈయూ), మెక్సికో దేశాల ఉత్పత్తులపై 30 శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆగస్టు 1వ తేదీ నుంచే ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని వెల్లడించారు. సుంకాలపై ఆయా దేశాలకు రాసిన లేఖలను సోషల్ మీడియాలో శనివారం పోస్టుచేశారు. అక్రమ వలసదారులు, మత్తు పదార్థాలు అమెరికాలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి మెక్సికో ప్రభుత్వం తమకు చక్కగా సహకరిస్తోందని మెక్సికోకు రాసిన లేఖలో ట్రంప్ ప్రశంసించారు. మత్తు పదార్థాల నియంత్రణకు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని మెక్సికో ప్రభుత్వానికి సూచించారు. అలాగే ఈయూతో అమెరికాకు వాణిజ్య లోటు ఉందని, ఇది తమ జాతీయ భద్రతకు ముప్పేనని తేల్చిచెప్పారు. ఈ లోటును పూడ్చడానికి కలిసికట్టుగా పనిచేద్దామని ఈయూకు రాసిన లేఖలో పిలుపునిచ్చారు. అమెరికా ఉత్పత్తులపై ఈయూ దేశాలు అధికంగా టారిఫ్‌లు విధిస్తున్నాయని ట్రంప్ అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆయన ఇప్పటిదాకా 24 దేశాలతోపాటు 27 దేశాలతో కూడిన ఈయూపై టారిఫ్‌లను ప్రకటించారు. మరికొన్ని దేశాలపై సుంకాలను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఏ రెండు దేశాల మధ్యనైనా సరే టారిఫ్‌లు ఒకేరకంగా ఉండాలని ట్రంప్ వాదిస్తున్నారు. ఒక దేశం నుంచి వచ్చే ఉత్పత్తులపై అధికంగా సుంకాలు వసూలు చేస్తూ.. అదే దేశానికి ఎగుమతయ్యే మన ఉత్పత్తులపై సుంకాలు తక్కువగా ఉండాలని కోరుకోవడం న్యాయం కాదని అంటున్నారు. -
భలే ఇంగ్లిష్ మీది!
వాషింగ్టన్: ఏదో ఒక వివాదం లేనిదే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పొద్దుపోవడం లేదు. తాజాగా లైబీరియా అధ్యక్షుడు జోసెఫ్ బొవాకై ఇంగ్లిష్ చాలా బాగుందంటూ ఆయన ఇచి్చన కితాబు కూడా వివాదానికే దారితీసింది. బుధవారం వైట్‌హౌస్‌లో ఐదుగురు ఆఫ్రికా దేశాధినేతలతో భేటీ సందర్భంగా జోసెఫ్ ఇంగ్లిష్ కు ట్రంప్ ముగ్ధుడయ్యారు. ‘‘చాలా బాగా మాట్లాడుతున్నారు. ఇంత చక్కని ఇంగ్లిష్ ఎక్కడ నేర్చుకున్నారు?’’అంటూ ఆరా తీశారు. ఆయన ధోరణి తమను అవమానించేలా ఉందంటూ లైబీరియాలోనే గాక ఆఫ్రికావ్యాప్తంగా విమర్శలు, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామీణ ఆఫ్రికా ప్రాంతాలవాళ్లు నిరక్షర కుక్షులనే ఉద్దేశంలోనే ట్రంప్ వ్యాఖ్యలున్నాయని మండిపడుతున్నారు. దీనిపై లైబీరియా దౌత్యవేత్తలు కూడా అభ్యంతరం వెలిబుచ్చారు. ట్రంప్ తీరుకు నిరసనగా తమ అధ్యక్షుడు వాకౌట్ చేయాల్సిందని లైబీరియన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే వైట్‌హౌస్ ప్రెస్ కరోలినా లెవిట్ ట్రంప్ వ్యాఖ్యలను సమరి్థంచారు. వాటిలో తప్పేమీ లేదని, తమ అధ్యక్షుడు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారని లైబీరియా విదేశాంగ మంత్రి కూడా అన్నారు. ఆంగ్లమే అధికార భాష లైబీరియా అధికారిక భాష ఇంగ్లిష్. ఆఫ్రికాలో బానిసత్వం నుంచి విముక్తి పొందిన వారి పునరావాసం నిమిత్తం అమెరికా వలస సమాజం 1822లో ఆ దేశాన్ని ఏర్పాటు చేసింది. 1847లోనే అమెరికా నుంచి స్వతంత్రం ప్రకటించుకుంది. ఆంగ్లంతో పాటు అక్కడ పలు భాషలు మాట్లాడతారు. గతంలో జర్మనీ చాన్సలర్ ఫ్రెడెరిక్ మెర్జ్ ఇంగ్లిష్ నుకూడా ట్రంప్ ఇలాగే మెచ్చుకున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ‘అమెరికా ఫస్ట్’నినాదంతో భాగంగా ఆంగ్లానికి ఆయన అధిక ప్రాధాన్యమిస్తున్నారు. దాన్ని అమెరికా అధికార భాషగా గుర్తిస్తూ గత మార్చిలో ఉత్తర్వులు కూడా ఇచ్చారు! -
నా ప్రాణాలకు ముప్పు నిజమే: ట్రంప్
వాషింగ్టన్: తన ప్రాణాలకు ముప్పు ఉన్న మాట నిజమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. డ్రోన్ దాడి చేసి ట్రంప్‌ను అంతం చేస్తామంటూ ఇరాన్ అధినేత అయతొల్లా అలీ ఖమేనీ సన్నిహితుడొకరు ఇటీవల హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న మర్–ఎ–లాగో రిసార్ట్‌లో ట్రంప్ సన్ బాత్ చేస్తున్న సమయంలో డ్రోన్ ప్రయోగిస్తామని, అదే అనువైన ప్రదేశమని చెప్పారు. దీనిపై ట్రంప్ తాజాగా స్పందించారు. ఇది తనకు వచి్చన బెదిరింపుగానే భావిస్తున్నానని తెలిపారు. తన ప్రాణాలకు ముప్పు ఉందన్న విషయంలో సందేహం లేదన్నారు. వాస్తవానికి ఏడేళ్ల వయసు నుంచి తాను సన్ బాత్ చేయడం లేదని వివరించారు. ఖమేనీ అనుచరుడి హెచ్చరికలను పరోక్షంగా ట్రంప్ తేలిగ్గా తీసుకున్నారు. -
జపాన్, దక్షిణకొరియాపై 25 శాతం సుంకాలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్ రగడకు తెర తీశారు. జపాన్, దక్షిణ కొరియా ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు విధించనున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయం ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుందని ట్రూత్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. అంతేగాక జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్‌కు ఈ మేరకు స్వయంగా లేఖలు కూడా రాశారు. ప్రతీకార సుంకాలకు దిగితే ఆ దేశాలపై టారిఫ్‌లు ఆ మేరకు పెరుగుతాయని అందులో ట్రంప్ హెచ్చరించారు! ఆ లేఖల స్క్రీన్షాట్లను ట్రూత్ సోషల్‌లో షేర్ చేశారు. జపాన్, దక్షిణకొరియాపై 25 శాతం టారిఫ్ నిజానికి చాలా తక్కువేనంటూ వాపోయారు. ‘‘ఇవి తుది టారిఫ్‌లు కావు. మీ దేశంతో మా సంబంధాలను బట్టి అంతిమంగా పెరగవచ్చు, తగ్గనూ వచ్చు’’ అన్నారు. టారిఫ్ పెంపుపై భారత్‌తో పాటు పలు ఇతర దేశాలకు కూడా ట్రంప్ లేఖాస్త్రాలు సంధిస్తున్నట్టు సమాచారం. మస్క్ కొత్త పార్టీ ప్రకటనపై ట్రంప్ ఎద్దేవా న్యూయార్క్: ‘అమెరికన్ పార్టీ’ పేరిట కొత్త పార్టీ పెడతానన్న ఎలాన్ మస్క్ ప్రకటనను హాస్యాస్పదంగా ట్రంప్ సోమవారం అభివర్ణించారు. ‘‘అమెరికాలో ఎన్నో ఏళ్లుగా రెండు పారీ్టలతోనే రాజకీయ వ్యవస్థ నడుస్తోంది. ఇప్పుడు మూడో పార్టీని తీసుకురావడమంటే గందరగోళాన్ని సృష్టించడమే’’ అని అన్నారు. తర్వాత తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లోనూ మస్‌్కను విమర్శిస్తూ ట్రంప్ పోస్ట్‌లు పెట్టారు. ‘‘కొన్ని వారాల క్రితం మా స్నేహ రైలుబండ్లు ఢీకొన్నాయి. ఇప్పుడు మస్క్ పూర్తిగా పట్టాలు తప్పారు. అమెరికాలో మూడో పార్టీ ఏదీ అద్భుతాలు చేయలేదన్న చేదు నిజం తెల్సికూడా మస్క్ కొత్త పార్టీ పెడతానంటున్నాడు. సక్రమంగా ఉన్న రాజకీయ వ్యవస్థను చిన్నాభిన్నం చేయడానికి తప్ప మూడోపార్టీ ఎందుకూ పనికిరాదు’’ అని వ్యాఖ్యానించారు. -
ఒంటి చేత్తో యుద్ధం ఆపేశా
వాషింగ్టన్: భారత్, పాకిస్తాన్ మధ్య అణు యుద్ధం జరిగే పరిస్థితి ఏర్పడగా, తానే చొరవ తీసుకొని ఒంటిచేత్తో ఆపేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టంచేశారు. అన్ని రకాల వాణిజ్య సంబంధాలు తెంచేసుకుంటామని హెచ్చరించడంతో ఈ రెండు దేశాలు తన మాట విని దారికొచ్చాయని, యుద్ధం ఆపేశాయని చెప్పారు. ట్రంప్ తాజాగా శ్వేతసౌధంలో మీడియాతో మాట్లాడారు. భారత్, పాక్ మధ్య ఘర్షణ మొదలైన తర్వాత తన సీనియర్ అధికారులను రంగంలోకి దించానని, ఇరుదేశాలను ఒత్తిడి పెంచానని తెలిపారు. తన చాతుర్యం ఫలించి యుద్ధం ఆగిపోయిందని వెల్లడించారు. తానే కనుక చొరవ తీసుకోకపోత రెండు దేశాల మధ్య కచ్చితంగా అణు యుద్ధం జరిగేదని స్పష్టంచేశారు. తనలాగా గొప్ప పని చేసిన అమెరికా అధ్యక్షుడు గతంలో మరొకరు ఉన్నారో లేదో తనకు తెలియదని వ్యాఖ్యానించారు. మధ్య కాల్పుల విరమణకు భారత్, పాక్‌లను ఒప్పించడం ద్వారా గొప్ప పని చేశానని అన్నారు. సెర్బియా, కొసావో దేశాలను సైతం ఇలాంటి దారికి తీసుకొచ్చానని, అక్కడ పెద్ద యుద్ధం ఆపేశానని ట్రంప్ ఉద్ఘాటించారు. వాణిజ్య సంబంధాలు తెంచేసుకుంటానని బెదిరించడంతో అవి ఘర్షణకు స్వస్తి చెప్పి, శాంతిని ఆశ్రయించాయని పేర్కొన్నారు. ఈ రెండు దేశాల్లో మంచి నాయకులు ఉన్నారని, వారు తెలివైన నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. అమెరికాతో వాణిజ్యం కావాలా? లేక ఒకరిపై ఒకరు అణు బాంబులతో దాడులు చేసుకుంటారా? అని ప్రశ్నించగా, వాణిజ్యమే కావాలని బదులిచ్చారని వివరించారు. -
NATO Summit 2025: డాడీ ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కొత్తగా ఒక నిక్‌నేమ్ వచ్చి చేరింది. అదేమిటో తెలుసా?.. డాడీ. అంటే నాన్న అని తెలిసిందేగా. నాటో సదస్సు సందర్భంగా ట్రంప్‌ను డాడీ అని పిలుస్తున్న వీడియోను వైట్‌హౌస్ తాజాగా విడుదల చేసింది. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై మీడియాతో మాట్లాడుతున్న ట్రంప్‌ను పక్కనే ఉన్న నాటో చీఫ్ మార్క్ రుట్టే సరదాగా డాడీ అని సంబోధించారు. ఒక నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోను ‘డాడీస్ హోమ్. హే, హే, హే, డాడీ’ అని శీర్షికతో శ్వేతసౌధం షేర్ చేసింది. ఇది జనాన్ని బాగా ఆకట్టుకుంటోంది. వారు తమకు తోచిన రీతిలో ప్రతిస్పందిస్తున్నారు. నెదర్లాండ్స్‌లోని హేగ్ నగరంలో నాటో సదస్సుకు ట్రంప్ హాజరయ్యారు. ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం ముగిసిపోయేలా తానే చొరవ తీసుకున్నానని ఆయన చెప్పారు. ఇంతలో నాటో చీఫ్ మార్క్ రుట్టే మాట్లాడుతూ.. డాడీ (ట్రంప్) ఇరు దేశాలకు బలమైన భాషలో చెప్పారని వ్యాఖ్యానించారు. తర్వాత డాడీ అన్ని సంబోధనపై ట్రంప్ స్పందించారు. అది చాలా ఆప్యాయత, అనురాగంతో కూడిన సంబోధన అని ఆనందం వ్యక్తం చేశారు. -
శాంతి నోబెల్‌కు ట్రంప్
వాషింగ్టన్: నోబెల్ శాంతి బహుమతిపై గంపెడాశలు పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ ఆశలు మళ్లీ చిగురించాయి. ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటూ పాకిస్తాన్ ప్రభుత్వం నార్వేకు సిఫార్సుచేసింది. ఈ మేరకు నామినేట్ చేస్తున్నట్లు పాక్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. తమ నాయకుడు నోబెల్ అవార్డ్‌కు తగిన వ్యక్తి అని అమెరికా కాంగ్రెస్‌లో ప్రతినిధుల సభ సభ్యుడు, జార్జియా నుంచి రిపబ్లికన్ పార్టీ నేత బడ్డీ కార్టర్ వ్యాఖ్యానించారు. ఈయన సైతం ట్రంప్ పేరును నామినేట్ చేస్తూ నార్వేలోని శాంతి బహుమతి కమిటీకి లేఖ రాశారు. ‘‘ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధాన్ని ట్రంప్ ఒంటిచేత్తో ఆపారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ఇరాన్ అణుబాంబును సాధించకుండా ట్రంప్ సమర్థవంతంగా అడ్డుకున్నారు. ఈ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అసాధ్యమని అంతా భావించిన వేళ ట్రంప్ దానిని సాధించి చూపించారు. సమర సంక్షోభం సమసిపోయేలా ఎంతో సమర్థవంతంగా వ్యవహరించిన ట్రంప్ ఈసారి నోబెల్ శాంతి బహుమతికి అర్హుడు. శాంతిస్థాపన, యుద్ధ విరమణ, అంతర్జాతీయ సామరస్యాల సాధనకు కృషిచేసినందుకు ట్రంప్ నోబెల్ ఇవ్వాల్సిందే’’అని బడ్డీ కార్టర్ తన లేఖలో రాశారు. ‘‘భారత్, పాకిస్తాన్ మధ్య పరస్పర సైనిక చర్యలు ఆపడంలో ట్రంప్ సఫలీకృతులయ్యారు. దౌత్య జోక్యం ద్వారా ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించారు. ఈ విషయంలో ట్రంప్ నిజంగా శాంతికాముకుడు’’అని పాకిస్తాన్ ప్రభుత్వం వ్యాఖ్యానించింది. అయితే గతంలో ట్రంప్‌ను నామినేట్ చేస్తూ లేఖ రాసిన ఉక్రెయిన్ విదేశీవ్యవహారాల పార్లమెంటరీ కమిటీ చైర్మన్ ఒలెగ్జాండర్ మరెజ్కో తన ట్రంప్ నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. -
ట్రంప్‌కు ‘నోబెల్ శాంతి’ ఇవ్వాలి
ఇస్లామాబాద్/న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వచ్చే ఏడాది నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని కోరుతూ ఆయన పేరును అధికారికంగా ప్రతిపాదించాలని నిర్ణయించినట్లు పాకిస్తాన్ ప్రభుత్వం శనివారం వెల్లడించింది. ఇటీవల నిర్ణయాత్మక దౌత్యపరమైన జోక్యంతో భారత్–పాకిస్తాన్ ఘర్షణ ఆగేలా ట్రంప్ కృషి చేశారని, అందుకు నోబెల్ శాంతి బహుమతికి ఆయన అర్హుడేనని తేల్చిచెప్పింది. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేసింది. మూడు రోజుల క్రితం ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు వైట్‌హౌస్‌లో విందు ఇచ్చిన సంగతి తెలిసిందే. ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ఆ సమయంలో అసిమ్ మునీర్ విజ్ఞప్తి చేశారు. తాజాగా పాక్ ప్రభుత్వం అధికారికంగా దీనిపై ప్రకటన చేసింది. భారత్–పాక్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సమయంలో డొనాల్డ్ ట్రంప్ వ్యూహాత్మకంగా వ్యవహరించారని, ఇరు దేశాలతో మాట్లాడి శాంతికోసం కృషి చేశారని పేర్కొంది. అణ్వ్రస్తాలు కలిగిన రెండు దేశాల మధ్య యుద్ధం జరగకుండా నివారించారని కొనియాడింది. భారత్–పాక్ మధ్య అమల్లోకి వచి్చన కాల్పుల విరమణకు ట్రంప్ చొరవే కారణమని స్పష్టంచేసింది. రక్త పిపాసులకా! నోబెల్ శాంతి బహుమతికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు ప్రతిపాదించాలని పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఇంటా బయ టా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పాక్ సర్కారు తీరును పలువురు తప్పుపట్టారు. పాక్ పౌరులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, రచయితలతోపాటు అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ నిపుణులు కూడా వీరిలో ఉన్నారు. ఒకవైపు గాజాలో మారణహోమం సృష్టిస్తూ, మరోవైపు ఇరాన్లో రక్తం పారిస్తున్న ఇజ్రాయెల్‌కు మద్దతిస్తున్నందుకు ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలా? అని మండిపడ్డారు. హింసాకాండను సమరి్థస్తున్న వ్యక్తి ఈ బహుమతికి ఎలా అర్హుడో చెప్పాలని నిలదీశారు. పాక్ ప్రభుత్వం ఆత్మగౌరవం అనేది లేకుండా ట్రంప్ చేతిలో కీలు»ొమ్మగా మారిందని సామాజిక కార్యకర్తలు ధ్వజమెత్తారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. శాంతి, న్యాయం కోసం నిజాయతీగా కృషి చేసినవారికే నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని, అమాయక ప్రజల రక్తంతాగే వారికి కాదని తేల్చిచెప్పారు. పాక్ సర్కారు నిర్ణయానికి ప్రజల ఆమోదం లేదని స్పష్టంచేశారు. నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాకు నోబెల్ శాంతి బహుమతి దక్కదేమో డొనాల్డ్ ట్రంప్ నిర్వేదం భారత్–పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపేసినందుకు లేదా రష్యా–ఉక్రెయిన్, ఇజ్రాయెల్–ఇరాన్ ఘర్షణలు నివారించేందుకు కృషి చేస్తున్నందుకు తనకు నోబెల్ శాంతి బహుమతి దక్కదేమోనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఈ ప్రతిష్టాత్మక బహుమతి తనకు రాసిపెట్టి లేదేమోనని నిర్వేదం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తాను ఎన్ని మంచి పనులు చేసినా నోబెల్ శాంతి బహుమతి రాదన్నారు. దశాబ్దాలుగా యుద్ధ రంగంలో తలపడుతున్న కాంగో, రువాండా మధ్య శాంతికి చొరవ తీసుకుంటున్నానని, అందుకు చాలా సంతోషిస్తున్నానని పేర్కొన్నారు. సోమవారం ఇరు దేశాల మధ్య ఒప్పందం జరగబోతోందని, ఆఫ్రికాతోపాటు ప్రపంచానికి అదొక గొప్ప రోజు కాబోతోందని వివరించారు. సెర్బియా, కొసావో మధ్య ఘర్షణలకు చరమగీతం పాడేశానని, ఈజిప్టు, ఇథియోపియా మధ్య శాంతిని కొనసాగిస్తున్నానని తెలిపారు. అయినప్పటికీ తనకు నోబెల్ శాంతి బహుమతి లభించే అవకాశం లేదని ట్రంప్ నిరాశకు లోనయ్యారు. -
టెలికాం రంగంలోకి డొనాల్డ్ ట్రంప్!
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆయన మద్దతుదారులు రెడ్ టోపీలను మాత్రమే కాదు.. ఇక నుంచి పసిడి వర్ణపు ఫోన్లను కూడా క్యారీ చేయనున్నారు. ఎందుకంటే ట్రంప్ ఇప్పుడు టెలికాం రంగంపై దృష్టి సారించారు. కొత్త ఫోన్ బ్రాండ్‌తోపాటు ఒక నెట్‌వర్క్‌నే ఏర్పాటు చేయాలనే ప్రణాళికలో ఉన్నారు. ఆయన ట్రేడ్‌మార్క్‌లను నిర్వహించే కంపెనీ డీటీటీఎమ్ ఆపరేషన్స్ ఎల్ఎల్సీ రెండు ట్రేడ్ మార్క్లకోసం యునైటెడ్ స్టేట్స్ పేటెంట్ అండ్ ట్రేడ్‌మార్క్ ఆఫీస్‌లో దరఖాస్తు చేసుకుంది. అందులో ట్రంప్ బ్రాండ్ మొబైల్‌ఫోన్, టెలికాం నెట్వర్క్ ఉన్నట్లు తెలుస్తోంది. జూన్ 12న ట్రంప్, టీ1 పేర్లపై పేటెంట్ కోరినట్లు తెలుస్తోంది. దరఖాస్తు పత్రాల ప్రకారం.. మొబైల్ ఫోన్లు, ఫోన్కేసులు, బ్యాటరీ ఛార్జర్లు, వైర్లెస్ టెలికాం సేవలు, ట్రంప్ బ్రాండ్‌తో రీటైల్ దుకాణాలు ప్రారంభించే ప్రణాళికలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి ఊతమిస్తూ ట్రంప్ వ్యాపారాలను నిర్వహించే ఆయన కుమారుడు ఎరిక్ ట్రంప్ ఓ ప్రకటన చేశారు. ట్రంప్ మొబైల్ అనే కొత్త వెంచర్ అమెరికాలో తయారయ్యే ఫోన్లను విక్రయిస్తుందని, కాల్ సెంటర్‌కూడా నిర్వహిస్తుందని వెల్లడించారు. ఆగస్టులో అందుబాటులోకి వచ్చే టీ1 ఫోన్ బంగారు రంగులో ఉంటుందని, అయితే దీనిని మరో కంపెనీ తయారు చేస్తుందని ట్రంప్ కుటుంబ సంస్థ తెలిపింది. మరిన్ని వివరాలను వెల్లడించలేదు. -
యుద్ధం తక్షణమే ఆపండి
కాల్గరీ: ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం ఎంతమాత్రం వాంఛనీయం కాదని జీ7 దేశాల అధినేతలు తేల్చిచెప్పారు. రెండు దేశాలు వెంటనే వెనక్కి తగ్గాలని, యుద్ధానికి స్వస్తి చెప్పాలని కోరారు. ఇజ్రాయెల్–ఇరాన్ వెంటనే చర్చలు ప్రారంభించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. పరస్పరం కలిసి చర్చించుకొని, ఘర్షణకు తెరతించాలని అన్నారు. జీ7 కూటమి వార్షిక సదస్సు సోమవారం కెనడాలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలువురు నేతలు మీడియాతో మాట్లా డారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నివారించడమే లక్ష్యగా ఒక పరిష్కార మార్గం కనిపెట్టాలని తామంతా అంగీకారానికి వచ్చినట్లు బ్రిటిష్ ప్రధానమంత్రి కియర్ స్టార్మర్ చెప్పారు. ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతినే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గాజాలోనూ పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉందన్నారు. అణ్వాయుధాలు సొంతం చేసుకొనేందుకు ఇరాన్‌ను అనుమతించకూడదని జర్మనీ చాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ చెప్పారు. మరోవైపు జీ7 కూటమిపై డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2014లో రష్యాను ఈ కూటమి నుంచి తొలగించడం పొరపాటేనని చెప్పారు. రష్యాను పక్కనపెట్టడం ప్రపంచాన్ని ఇప్పుడు అస్థిరపరుస్తోందని అభిప్రాయపడ్డారు. జీ7 ఇక జీ8 కావాలని.. జీ9 అయితే ఇంకా బాగుంటుందని పేర్కొన్నారు. కూటమిలో రష్యా, చైనా సైతం సభ్యదేశాలుగా చేరాలన్న తన ఆకాంక్షను ట్రంప్ వ్యక్తంశారు. జీ7 ప్రస్తుతం ఫ్రాన్స్, అమెరికా, యూకే, జర్మనీ, జపాన్, ఇటలీ, కెనడా,చే యూరోపియన్ యూనియన్(ఈయూ) సభ్యదేశాలుగా ఉన్నాయి. ఇందులో భారత్‌కు సభ్యత్వం లేదు. అయినప్పటికీ ఈ ఏడాది జీ7 సదస్సుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ ప్రత్యేకంగా ఆహ్వానించారు. మంగళవారం జీ7 సదస్సులో మోదీ పాల్గొంటారు. -
సోదాలు, అరెస్టులకు తాత్కాలిక విరామం
వాషింగ్టన్: అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైఖరి మార్చుకున్నారు. వలసదారులందరినీ ఇప్పటికిప్పుడు ఉన్నపళంగా బయటకు తరిమేస్తే తలెత్తే ఇబ్బందుమిటో అనుభవంలోకి వస్తున్నాయి. కార్మిక శక్తి ఒక్కసారిగా తగ్గిపోతే పరిశ్రమలు నష్టాల్లోకి జారుకొనే ప్రమాదం పొంచి ఉంది. అందుకే సోదాలు, అరెస్టులు తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు సమాచారం. వ్యవసాయ క్షేత్రాలు, వ్యవసాయ సంబంధిత పరిశ్రమలు, హోటళ్లు, రెస్టారెంట్లలో సోదాలు నిలిపివేయాలని ట్రంప్ ప్రభుత్వం తాజాగా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ఐసీఈ)కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మాంసం ప్యాకింగ్ ప్లాంట్లతోపాటు చేపల పెంపకం కేంద్రాల్లోనూ సోదాలు నిలిపివేయాలని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు గురువారం రాత్రి ఐసీఈ అధికారులకు అధికారికంగా ఈ–మెయిల్ పంపించినట్లు సమాచారం. ముగ్గురు ప్రభుత్వ అధికారులు ఈ విషయం ధ్రువీకరించారు. వ్యవసాయ సంబంధిత పరిశ్రమలు, హోటళ్లు, రెస్టారెంట్లలో మానవ అక్రమ రవాణా, మనీ లాండరింగ్, మాదక ద్రవ్యాల వ్యాపారం జరుగుతున్నట్లు సమాచారం వస్తే సోదాలు కొనసాగించవచ్చని, అరెస్టులు చేయొచ్చని ప్రభుత్వం తేల్చిచెప్పింది. -
ట్రంప్ గద్దె దిగడమా, నాన్సెన్స్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వివాదంపై ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందించారు. అధ్యక్షునితో తలపడటం ద్వారా ఆయన పెద్ద తప్పిదం చేస్తున్నారన్నారు. ఎప్స్టీన్ లైంగిక కుంభకోణంతో ట్రంప్‌కు సంబంధముందని, ఆయన గద్దె దిగి వాన్స్ అధ్యక్షుడు కావడం ఖాయమని మస్క్ పేర్కొనడం తెలిసిందే. ఆ వ్యాఖ్యలను ‘నాన్సెన్స్’అంటూ వాన్స్ శుక్రవారం కొట్టిపారేశారు. అధ్యక్షునిగా ట్రంప్ అద్భుతంగా పని చేస్తున్నారన్నారు. ఆయనపై మస్క్ ఆరోపణలను ఖండించారు. ‘‘ఇలాంటి గొడవలు అందరి విషయంలోనూ జరుగుతుంటాయి. అందులోనూ మస్క్ చాలా ఎమోషనల్. కాస్త నెమ్మదించారంటే అంతా సర్దుకుంటుంది. కొంతకాలానికి ఆయనే మా వద్దకు తిరిగొస్తారు’’అని అభిప్రాయపడ్డారు. ఎప్స్టీన్ ఫైల్స్‌లో ట్రంప్ పేరుందంటూ చేసిన ఎక్స్ పోస్టులను మస్క్ తాజాగా తొలగించారు. అయితే, ‘ఆ పోస్టులను ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం దాచిపెట్టుకోండి’అంటూ భావగర్భితంగా పోస్ట్ చేశారు. మరోవైపు, మస్్కతో తాను మాట్లాడబోతున్నానంటూ వచి్చన వార్తలను ట్రంప్ ఖండించారు. ‘‘ఆ మతి చెడిన మనిíÙతోనా? అలాంటి ఉద్దేశమేదీ నాకు లేదు. నిజానికి మస్కే నాతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. నేనే పట్టించుకోలేదు’’అని స్పష్టం చేశారు. అంతేగాక ఆయన కంపెనీలకు ప్రభుత్వం కట్టబెట్టిన కాంట్రాక్టులన్నింటినీ పూర్తిగా సమీక్షిస్తానని ప్రకటించారు. ‘‘అంతా నిబంధనల మేరకే ఉంటే ఓకే. లేదంటే ఏం చేయాలో ఆలోచిస్తాం’’అని స్పష్టం చేశారు. మస్క్ కంపెనీలపై గతంలో జరిగిన విచారణలను తిరగదోడతారా అని ప్రశ్నించగా, ‘‘అలాంటివి జరిగాయా? నాకు తెలియదు. అదే నిజమైతే ఏం జరగాలో అదే జరుగుతుంది’’అంటూ స్పందించారు. ‘‘చైనా, రష్యా, ఇరాన్ వంటి అంతర్జాతీయ అంశాలతో నేనిప్పుడు యమా బిజీగా ఉన్నా. మస్క్ గురించి ఆలోచేంచే తీరిక కూడా లేదు. మస్కే కాదు, ఒక్క నేను తప్ప ఎవరున్నా లేకున్నా అమెరికాకు వచి్చన లోటేమీ లేదు’’అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. మిడ్ టర్మ్ ఎన్నికల్లో ట్రంప్ డెమొక్రాట్లకు మద్దతిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మస్క్ కొత్త పార్టీ! ట్రంప్‌తో రగడ నేపథ్యంలో మస్క్ కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నట్టు కని్పస్తోంది. 80 శాతం మంది అమెరికన్లకు ప్రాతినిధ్యం వహించేలా కొత్త పార్టీ పెడితే ఎలా ఉంటుందంటూ ఎక్స్‌లో ఆయన ఒపీనియన్ పోల్ పెట్టడం తెలిసిందే. దాన్ని 80 శాతం మంది సమరి్థంచినట్టు శుక్రవారం మస్క్ ప్రకటించారు. ‘‘80 శాతం మందికి ప్రాతినిధ్యం వహించే పారీ్టకి 80 శాతం మద్దతు. విధి అంటే ఇదేనేమో!’’అని ఒక పోస్టులో ఆయన హర్షం వెలిబుచ్చారు. ఆ వెంటనే ‘ద అమెరికా పారీ్ట’అంటూ మరో పోస్ట్ పెట్టారు. అది ఆయన పెట్టబోయే కొత్త పార్టీ పేరు కావచ్చని భావిస్తున్నారు. మస్క్ రష్యాలో స్థిరపడాలనుకుంటే రెడ్‌కార్పెట్ పరుస్తామని ఆ దేశ చట్టసభ డ్యూమా సభ్యుడు ద్మిత్రీ నొవికోవ్ ప్రకటించారు. ఆయన కోరితే రాజకీయ ఆశ్రయం కల్పిస్తామన్నారు. అయితే ట్రంప్–మస్క్ రగడపై స్పందించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్ నిరాకరించారు. -
పెద్దన్నల పోట్లాట
వాషింగ్టన్: ఒకరు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. మరొకరు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశానికి అధినేత. బెదిరించి పనులు చక్కబెట్టుకోవడంలో, అవసరం తీరిందనుకుంటే ఎంతటి వారినైనా సరే దూరం పెట్టడంలో, భావోద్వేగాలకు తావన్నదే లేకుండా స్వీయ ప్రయోజనాలే పరమావధిగా వ్యవహరించడంలో ఒకరికొకరు ఏ మాత్రమూ తీసిపోరు. అలాంటి వాళ్లు పరస్పరం తలపడితే ఎలా ఉంటుంది? అచ్చం ఎలాన్ మస్క్ , డొనాల్డ్ ట్రంప్ తాజా రగడ మాదిరిగానే ఉంటుంది. నిజానికి అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు మొదలైన వారి బ్రొమాన్స్ ట్రంప్ గద్దెనెక్కాక కూడా బ్రహా్మండంగా కొనసాగింది. అవకాశం దొరికినప్పుడల్లా మస్క్ ను ఇంద్రుడు చంద్రుడంటూ ట్రంప్ ఆకాశానికెత్తేశారు. ప్రభుత్వ వ్యయానికి కత్తెర వేసేందుకు సృష్టించిన డోజ్ విభాగపు సారథ్యం అప్పగించారు. దాని ముసుగులో కీలకమైన ప్రభుత్వ డేటాను మస్క్ చేజిక్కించుకున్నారంటూ ఆరోపణలు వచ్చినా పట్టించుకోలేదు. అధ్యక్ష కార్యాలయమైన ఓవల్ ఆఫీసులో, అధికారిక విమానం ఎయిర్‌ఫోర్స్‌వన్‌లో, కేబినెట్ సమావేశాల్లో... ఇలా ఎక్కడ చూసినా మస్కే. వైట్‌హౌస్‌ను చివరికి మస్క్‌కు అత్తారిల్లుగా మార్చేశారంటూ ట్రంప్‌పై విపక్షాలు దుమ్మెత్తిపోసేదాకా వెళ్లింది. అంతలా కొనసాగిన ట్రంప్, మస్క్ సాన్నిహిత్యానికి మూడు రోజుల క్రితం అనూహ్యంగా, అర్ధాంతరంగా తెరపడింది. అంతే! ఒక్కసారిగా అంతా తల్లకిందులైంది. అసలే మొండితనంలోనూ, నోటి దురుసులోనూ ఒకరికొకరు ఏ మాత్రమూ తీసిపోని బాపతు కావడంతో పరస్పర నిందలు, విమర్శలు, ఆరోపణలతో ‘తగ్గేదే లే’అంటూ ఇద్దరూ చెలరేగిపోతున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అనే రీతిలో సోషల్ మీడియాలో సవాళ్లు విసురుకుంటున్నారు. మస్క్ కు మతి చలించిందంటూ ట్రంప్ దుయ్యబట్టడమే గాక ఆయన స్పేస్ ఎక్స్, స్టార్‌లింక్ తదితర సంస్థలకు బిలియన్ల కొద్దీ డాలర్ల విలువైన ప్రభుత్వ కాంట్రాక్టులు రద్దు చేసి పారేస్తానని హెచ్చరించారు. దాంతో చిర్రెత్తుకొచ్చిన మస్క్ , దమ్ముంటే ఆ పని చేసి చూపించాలంటూ సవాలు విసిరారు. నాసాకు అతి కీలకమైన స్పేస్ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌక సేవలను తక్షణం నిలిపేస్తానంటూ బెదిరించారు. అంతేగాక, ‘‘అసలు నావల్లే ట్రంప్ అధ్యక్షునిగా గెలిచారు. కనీసం ఆ కృతజ్ఞత కూడా లేకుండా వ్యవహరిస్తున్నారు’’అంటూ మండిపడ్డారు. అంతటితో ఆగకుండా మైనర్లతో సెక్స్ కార్యకలాపాల ‘ఎప్స్టీన్ కుంభకోణం’లో ట్రంప్ పేరూ ఉందంటూ పెద్ద బాంబు పేల్చారు. ఈ ఉదంతంలో ఆయన గద్దె దిగడం, ఉపాధ్యక్షుడు వాన్స్ అధ్యక్ష పీఠమెక్కడం తప్పదని జోస్యం చెప్పారు. వారి వాగ్యుద్ధం ఇప్పుడు టాక్ ఆఫ్ ద వరల్డ్‌గా మారిపోయింది. ఇది చివరికి ఎటు దారి తీస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. అలా మొదలైంది... నిజానికి ట్రంప్, మస్క్ సంబంధాలు కొంతకాలంగా ఒడిదొడుకులమయంగానే సాగుతున్నాయి. ప్రభుత్వ పనితీరుపై మస్క్ పెత్తనం మరీ మితిమీరుతోందని ట్రంప్ బృందం ఆక్షేపిస్తూ వస్తోంది. ఆ క్రమంలో ట్రంప్ గద్దెనెక్కిన ఒకట్రెండు రోజుల నుంచే ఆయన సన్నిహితులతో మస్క్ తరచూ గొడవ పడుతూ వస్తున్నారు. వ్యవహారం శ్రుతి మించుతోందని భావించిన ట్రంప్ కూడా క్రమంగా ఆయనను దూరం పెడుతూ వచ్చారు. డోజ్ సారథిగా కేవలం 130 రోజుల కోసం జరిగిన తన నియామకాన్ని పొడిగిస్తారని మస్క్ ఆశించారని కూడా అంటారు. అలాంటి సూచనలు కన్పించకపోవడంతో ఇటీవల ఆయనే తప్పుకున్నారు. ట్రంప్ ఇటీవల తెరపైకి తెచ్చిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ను తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వ వ్యయానికి కత్తెర వేస్తానని గొప్పలు చెప్పుకున్న పెద్దమనిషి చివరికిలా భారీ దుబారాకు వీలు కలి్పంచే బిల్లుకు రూపమిచ్చారంటూ నిప్పులు చెరిగారు. దాంతో అప్పటిదాకా సంయమనం పాటిస్తూ వచ్చిన ట్రంప్ కూడా శషభిషలన్నీ పక్కనపెట్టి మస్క్ పై విరుచుకుపడ్డారు.ఏమిటీ ఎప్స్టీన్ కుంభకోణం? మైనర్ బాలికలతో పాటు మహిళలను లైంగికంగా వేధించినట్టు ఎప్స్టీన్పై ఆరోపణలు వెల్లువెత్తాయి. తన ఎదుగుదల కోసం వారిని సన్నిహితులైన రాజకీయ తదితర రంగాల ప్రముఖులకు ఎరగా వేశాడని అభియోగాలు నమోదయ్యాయి. జాబితాలో ట్రంప్, బిల్ క్లింటన్, ప్రిన్స్ ఆండ్రూ, పలు దేశాల ప్రధానులు, రాజకీయ దిగ్గజాలు, హాలీవుడ్ తారలు తదితరులున్నారు. 2019లో అతను జైల్లో అనుమానాస్పదంగా మరణించాడు. సంబంధిత ఫైళ్లను బయట పెడతానని గత అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ హామీ ఇచ్చారు.మస్క్ కు ఎదురుదెబ్బలు విద్యుత్ కార్లపై ట్యాక్స్ క్రెడిట్‌కు ‘బ్యూటిఫుల్’ బిల్లులో భారీ కోతలు ప్రతిపాదించారు. అందులోని పలు అంశాలు తన వ్యాపార ప్రయోజనాలను దెబ్బతీసేవి కావడం మస్క్ కు మంటెక్కించింది. అంతకుముందు అమెరికా వైమానిక వ్యవస్థ తన స్టార్‌లింక్ శాటిలైట్ సిస్టం సేవలను వాడుకునేలా ఒప్పించేందుకు ప్రయతి్నంచినా కుదరలేదు. మస్క్ సన్నిహితున్ని నాసా చీఫ్ పదవికి పరిగణించొద్దని ట్రంప్ నిర్ణయించారు. ట్రంప్‌తో రగడ నేపథ్యంలో మస్క్ కార్ల కంపెనీ టెస్లా షేర్లు ఏకంగా 14 శాతం పడిపోయాయి.ట్రంప్ గద్దె దిగుతారు: మస్క్అమెరికాను కుదిపేసిన సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎప్స్టీన్తో ట్రంప్‌కు సంబంధాలున్నట్టు మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. ‘‘అతి పెద్ద బాంబు పేల్చాల్సిన సమయం ఆసన్నమైంది. ఎప్స్టీన్ దర్యాప్తు ఫైళ్లలో ట్రంప్ పేరు కూడా ఉంది. అందుకే వాటిని ఆయన బయట పెట్టడం లేదు’’అంటూ ఆరోపించారు. ట్రంప్‌ను అభిశంసించాలంటూ ఓ నెటిజన్ పెట్టిన పోస్ట్‌ను సమరి్థంచారు. వాన్స్‌ను అధ్యక్షున్ని చేయాలన్న పోస్ట్‌ను రీ పోస్ట్ చేస్తూ ‘అవు’నని కామెంట్ చేశారు. ‘‘ట్రంప్ అధ్యక్షునిగా ఉండేది మహా అయితే మూడున్నరేళ్లు. నేను మాత్రం కనీసం ఇంకో 40 ఏళ్ల దాకా ఉంటాను’’ అన్నారు. అమెరికన్లలో కనీసం 80 శాతం మందికి ప్రాతినిధ్యం వహించేలా కొత్త పార్టీ స్థాపనపై ఒపీనియన్ పోల్ పెట్టారు. నాసాకు డ్రాగన్ సేవలు ఆపేయబోనంటూ కాస్త వెనక్కు తగ్గారు.మస్క్ తో మాట్లాడను: ట్రంప్ మస్క్ వంటి వ్యక్తి డోజ్ పదవిని నెలల క్రితమే వదిలేసి ఉంటే బాగుండేదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ‘బ్యూటిఫుల్ బిల్లు’లో టెస్లాకు మస్క్ ఆశించిన లబ్ధి కని్పంచకపోవడంతో తనపై నిందారోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘ట్రంప్ గురించి కనీసం ఆలోచించడం కూడా లేదు. కొంతకాలం ఆయనతో మాట్లాడబోను’’అని సీఎన్ఎన్ వార్తా సంస్థతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. ‘‘పాపం మస్క్ . అతనికేదో సమస్య ఉన్నట్టుంది! బహుశా మతి చలించినట్టుంది’’ అంటూ ఎద్దేవా చేశారు. ‘‘బిలియన్ల కొద్దీ డాలర్లు ఆదా చేసేందుకు సులువైన మార్గం ఒకటుంది. మస్క్ సంస్థలకు అందుతున్న ప్రభుత్వ కాంట్రాక్టులు, రాయితీలను తెగ్గోస్తే చాలు!’’అంటూ గురువారం ట్రూత్ సోషల్‌లో వరుస పోస్టులు పెట్టారు. -
కొన్నాళ్లు కొట్టుకోనీ!
వాషింగ్టన్/కీవ్: రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేతులెత్తేశారు. రెండు దేశాలనూ ఇంకొన్నాళ్లు కొట్టుకోనివ్వడమే మేలని వ్యాఖ్యానించారు. గురువారం వైట్‌హౌస్‌లో జర్మనీ చాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్‌తో భేటీ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అవి మరీ చిన్నపిల్లల మాదిరిగా కీచులాడుకుంటున్నాయంటూ ఆక్షేపించారు. ‘‘కొన్నిసార్లు ఓపికున్నంత సేపు కొట్టొకోనివ్వడమే మేలు. తర్వాత ఇద్దరినీ చెరోవైపు లాగేయాలి. నిన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా ఇదే మాట చెప్పా’’ అని ట్రంప్ అన్నారు. అయితే, ‘‘నా మాట వినకపోతే చాలా కఠినంగా వ్యవహరిస్తా. యుద్ధానికి తెర దించకపోతే రెండు దేశాలపైనా ఆంక్షలు విధిస్తా’’ అంటూ మరోసారి కుండబద్దలు కొట్టారు.రష్యా డ్రోన్ దాడుల్లో ఐదుగురు మృతిబుధవారం రాత్రి ఉత్తర ఉక్రెయిన్‌లోని ప్రిలుకీ నగరంపై రష్యా డ్రోన్ దాడిలో ఐదుగురు మరణించారు. ‘‘స్థానిక ఫైర్ చీఫ్ ఒలెక్జాండర్ లెబిడ్ ఇంటిపై డ్రోన్ దాడులు జరిగాయి. ఆయన భార్య, కుమార్తె, ఏడాది వయసున్న మనవడు చనిపోయారు’’ అని అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. చిన్నారి తల్లి కీవ్‌లో పోలీసు అధికారి. అక్కడ రష్యా దాడులు పెరగడంతో బాబును తల్లిదండ్రుల దగ్గర వదిలేందుకు వచ్చి తనతో పాటుగా బలైంది. పుతిన్‌తో ట్రంప్ ఫోన్ సంభాషణ జరిగిన కొద్ది గంటల్లోపే ప్రిలుకీపై దాడి జరగడం గమనార్హం. ఆదివారం తమ వైమానిక స్థావరాలపై జరిపిన దాడులకు గట్టి ప్రతీకారం తీర్చుకుంటామని పుతిన్ తనతో అన్నట్లు అనంతరం ట్రంప్ చెప్పారు. ఈ యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ ప్రయత్నాలు సాగిస్తుండటం తెల్సిందే. -
ట్రంప్ మాటలు ఉత్త డొల్ల
న్యూఢిల్లీ: భారత్–పాకిస్తాన్ల మధ్య యుద్ధాన్ని ఆపేశానని, తాను చొరవ తీసుకోకపోయి ఉంటే రెండు దేశాల మధ్య కచి్చతంగా అణుయుద్ధం జరిగేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణదీర్ జైస్వాల్ తిప్పికొట్టారు. మాట వినకపోతే టారిఫ్‌లు విధిస్తామని, వాణిజ్య సంబంధాలు తెంచేసుకుంటామని బెదిరించడంతో భారత్, పాక్‌లు దారికొచ్చాయని, బుద్ధిగా కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్ చెప్పడాన్ని ఖండించారు. పహల్గాం ఉగ్రవాద దాడి అనంతరం ఆపరేషన్ సిందూర్ సమయంలో అమెరికాలో జరిగిన చర్చల్లో టారిఫ్‌ల అంశమే ప్రస్తావనకు రాలేదని గురువారం తేలి్చచెప్పారు. గత నెల 7 నుంచి 10వ తేదీ దాకా అమెరికాలో పలుమార్లు సంప్రదింపులు జరిగాయని అన్నారు. పాకిస్తాన్‌తో నెలకొన్న ఘర్షణలు, ఉద్రిక్త పరిస్థితుల గురించి మాత్రమేని మాట్లాడామని తెలిపారు. టారిఫ్‌లు, వాణిజ్య సంబంధాల అంశాన్ని అమెరికా లేవనెత్తలేదని స్పష్టంచేశారు. ట్రంప్ ప్రకటనల్లో ఏమాత్రం వాస్తవం లేదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, పాకిస్తాన్ అభ్యర్థన మేరకే కాల్పుల విరమణకు అంగీకరించినట్లు భారత ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది కేవలం రెండు దేశాలకు సంబంధించిన అంశమని, ఇందులో మూడో పక్షం జోక్యాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని వెల్లడించింది. అయినప్పటికీ అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికీ నోరుపారేసుకుంటూనే ఉంది. ట్రంప్ హెచ్చరికల కారణంగానే భారత్, పాక్‌ల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచి్చనట్లు ఈ నెల 23న కోర్టు ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్‌కు అమెరికా ప్రభుత్వం తెలియజేసింది. విదేశీ ఉత్పత్తులపై ట్రంప్ ప్రతిపాదించిన అధిక టారిఫ్‌లకు చట్టపరమైన ఇబ్బందులు రాకుండా కోర్టు ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్‌కు తప్పుడు వివరణలు ఇస్తున్నట్లు అమెరికాపై సర్కారుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
ట్రంప్‌పై మస్క్ అసమ్మతి గళం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై ఆయన సన్నిహిత మిత్రుడు, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ(డోజ్) చీఫ్, టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రంప్ తాజాగా తీసుకొచ్చిన పన్నులు, వ్యయాల బిల్లును తీవ్రంగా తప్పుపట్టారు. ట్రిలియన్ డాలర్ల మేర పన్నులు చేయకుండా నిలిపివేయడం, రక్షణ రంగంపై వ్యయాన్ని భారీగా పెంచాలని ట్రంప్ నిర్ణయించడం సరైంది కాదని కుండబద్ధలు కొట్టారు. మంగళవారం రాత్రి ఓ ఇంటర్వ్యూలో ఎలాన్ మస్క్మాట్లాడారు. ‘బిగ్, బ్యూటిఫుల్’అంటూ ట్రంప్ చెబుతున్న బిల్లు గొప్ప బిల్లుగా తాను భావించడం లేదన్నారు. అది చాలా పెద్దది లేదా అందమైనది అని తాను ఎంతమాత్రం అనుకోవడం లేదని తేల్చిచెప్పారు. గత ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు ఎలాన్ మస్క్ బహిరంగంగా మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా భారీగా ఆర్థిక సాయం సైతం అందజేశారు. ఇద్దరూ కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఎలాన్ మస్‌్కకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ప్రభుత్వ ఖర్చులను, ఉద్యోగుల సంఖ్యను తగ్గించడానికి ఉద్దేశించిన డో జ్ చీఫ్ పదవిని కట్టబెట్టారు. అలాంటి తన మిత్రు డు ట్రంప్‌పై ఎలాన్ మస్క్ అసమ్మతి గళం విప్పడం చర్చనీయాంశంగా మారింది. పన్నుల్లో కోతలకు, రక్షణ వ్యయం పెంపునకు తాను వ్యతిరేకం అని పరోక్షంగా ఎలాన్ మస్క్ స్పష్టంచేశారు. -
ట్రంప్ పేరుతో నకిలీ యాప్
బెంగళూరు: సైబర్ నేగరాళ్లు చివరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కూడా వదల్లేదు. ఆయన పేరుతో యాప్‌ను రూపొందించి.. 150 మందిని మోసం రూ.కోటి వసూలు చేశారు. ‘ట్రంప్ హోటల్ రెంటల్’పేరుతో యాప్ క్రియెట్ చేసిన స్కామర్లు.. ఇందులో పెట్టుబడులు పెడితే డబ్బు రెట్టింపవుతుందని నమ్మబలికారు. యాప్ చట్టబద్ధమైనదిగా చూపించడానికి ఏఐ జనరేటెడ్ ట్రంప్ వీడియోను ప్రసారం చేశారు. పెట్టుబడి పెట్టిన వారికి బహుమతులు కూడా ఆశ చూపారు. అంతేకాదు.. ఇంటి నుంచి పనిచేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు. దీంతో నమ్మిన బెంగళూరు, తమకూరు, మంగళూరు, హవేరి వరకు ప్రజలు యాప్‌లో ఉన్న నంబర్‌కు కాల్ చేసి డబ్బు ఇచ్చారు. 150 మంది కోటికి పైగా పెట్టుబడి పెట్టారు. వీరికి నమ్మకం కలిగించేందుకు స్కామర్లు ధ్రువీకరణ పత్రాలు కూడా అందజేవారు. కొన్ని రోజులపాటు చిన్నచిన్న బహుమతులు కూడా అందజేశారు. ఆ తరువాత షేర్లు రోజురోజుకూ పెరుగుతున్నట్టుగా డిజిట్స్ మారుస్తూ వారిని మాయ చేశారు. ఆ తరువాత కొంతకాలానికి యాప్‌లో ఉన్న నంబర్‌కు కాల్ చేస్తే స్పందన లేదు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీస్ స్టేషన్లను ఆశ్రయించారు. ఒక్క హవేరీలోనే 15 మందికి పైగా మోసపోయారని పోలీసు అధికారులు వెల్లడించారు. -
హార్వర్డ్‌లో విదేశీ విద్యార్థులే ఎక్కువ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంపై దాడిని కొనసాగించారు. వర్సిటీ ఎస్ఈవీపీ హోదా రద్దును నిలిపేస్తూ తన ప్రభుత్వం తీసుకున్న చర్యను ఆయన సమరి్థంచారు. అక్కడ చదువుతున్నవారిలో 31శాతం విదేశీ విద్యార్థులే ఉన్నారని, వారి పూర్తి వివరాలను వెల్లడించాలని ట్రూత్‌సోషల్ వేదికగా ట్రంప్ పునరుద్ఘాటించారు. అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకునే హోదాను రద్దు చేస్తూ ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు నిలిపేసిన విషయం తెలిసిందే. దీనిపై ట్రంప్ స్పందించారు. ‘హార్వర్డ్‌లో చదువుతున్నవారిలో 31 శాతం మంది విదేశీ విద్యార్థులే. పదేపదే ప్రభుత్వం అభ్యరి్థంచినప్పటికీ విశ్వవిద్యాలయ ఆయా విద్యార్థుల గురించి వివరాలను అందించడం లేదు. ఎందుకు చెప్పడం లేదు? వారిలో ఎక్కువ మంది అమెరికా వ్యతిరేక దేశాలకు చెందిన విద్యార్థులున్నారు. ఆయా విద్యార్థుల విద్యకోసం వారేమీ చెల్లించడం లేదు. ఆ విదేశీ విద్యార్థులు ఎవరో మేం తెలుసుకోవాలనుకుంటున్నాం’అని ట్రంప్ పేర్కొన్నారు. 443 కోట్లు ఖర్చు చేయండి.. ‘హార్వర్డ్ యూనివర్సిటీకి బిలియన్ డాలర్ల నిధులు ఇచ్చిన ప్రభుత్వంగా వివరాలు అభ్యర్థించడం సహేతుకమైనది. మాకు ఆ విద్యార్థుల పేర్లు, వారి దేశా ల వివరాలు కావాలి. లేదంటే హార్వర్డ్ దగ్గర దాదా పు రూ.443 కోట్ల రూపాయలు ఉన్నాయి. వాటినే ఉపయోగించుకోవాలి. ఫెడరల్ ప్రభుత్వాన్ని నిధు లు అడగకూడదు’అని ట్రంప్ హెచ్చరించారు. -
సామ్‌సంగ్‌కు ట్రంప్ హెచ్చరికలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ ప్రఖ్యాత తయారీ సంస్థలను టారిఫ్‌ల పేరిట బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఆయా కంపెనీలు అమెరికాలోనే వస్తువులు, సరుకులు ఉత్పత్తి చేయాలని, లేకపోతే సుంకాల బాదుడుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఆయన యాపిల్ కంపెనీకి ఇప్పటికే హెచ్చరికలుజారీ చేశారు. దక్షిణ కొరియాకు చెందిన సామ్సంగ్ సంస్థకు సైతం ఇప్పుడు అదే పరిస్థితి ఎదురయ్యింది. అమెరికాలో ఉత్పత్తి చేయకపోతే 25 శాతం టారిఫ్ విధిస్తామని సామ్‌సంగ్‌కు ట్రంప్ తేల్చిచెప్పారు. ఆయన తాజాగా వైట్‌హúస్లో మీడియాతో మాట్లాడారు. అణు విద్యుత్ ఉత్పత్తిని మరింత పెంచడానికి ఉద్దేశించిన ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై సంతకాలు చేశారు. అమెరికాలో ఎల్రక్టానిక్ ఉత్పత్తులు విక్రయించుకొనే ఏ సంస్థ అయినా సరే వాటిని ఇక్కడే తయారు చేయాలని, లేనిపక్షంలో సుంకాలు చెల్లించడానికి సిద్ధంగా ఉండాలని స్పష్టంచేశారు. తయారీ ప్లాంట్లను అమెరికాలో నెలకొల్పితే ఎలాంటి టారిఫ్‌లు ఉండవని చెప్పారు. మరెక్కడో తయారు చేసి, ఇక్కడ విక్రయించుకొని, సొమ్ము చేసుకుంటామంటే అది సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. ఐఫోన్లను అమెరికాలో ఉత్పత్తి చేయకపోతే యాపిల్ కంపెనీపై 25 శాతం టారిఫ్‌లు విధించడం తథ్యమని ట్రంప్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. యాపిల్ కంపెనీకి సంబంధించి 90 శాతం ఫోన్లు చైనాలోనే తయారవుతున్నాయి. అక్కడి ప్లాంట్లను భారత్‌కు తరలించేందుకు యాపిల్ సిద్ధమవుతోంది. ఇంతలోనే ట్రంప్ కన్నెర్ర చేశారు. మరోవైపు సామ్‌సంగ్‌కు చైనాలో తయారీ ప్లాంట్లు లేవు. చివరి ప్లాంట్ 2019లో మూతపడింది. సామ్సంగ్ ఫోన్లు, ఎల్రక్టానిక్ ఉత్పత్తులు ఎక్కువగా భారత్, దక్షిణ కొరియా, వియత్నాం, బ్రెజిల్‌లోనే తయారవుతున్నాయి. భారత్‌లోనే తయారు చేస్తారా? మీ ఇష్టం.. యాపిల్ కంపెనీకి ట్రంప్ మరోసారి అల్టిమేటం జారీ చేశారు. ‘‘ఐఫోన్ల తయారీ ప్లాంట్లను చైనా నుంచి భారత్‌కు తరలించుకోవాలంటే తరలించుకోండి. మేము వద్దనడం లేదు. కానీ, ఐఫోన్లను అమెరికాలో విక్రయించుకోవాలంటే మాత్రం సుంకాలు చెల్లించాల్సిందే. సుంకాలు లేకుండా మీరు ఐఫోన్లు ఇక్కడ అమ్ముకోలేరు’’అని పేర్కొన్నారు. -
ట్రంప్ గారి మనవరాలు... మస్తు హుషార్!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మనవరాలు కై ట్రంప్ తన 18వ పుట్టిన రోజు సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో నెటిజనులను ఆకట్టుకుంటోంది. తన గోల్ఫ్ ఆటకు సంబంధించిన ఫోటోలు, వైట్‌హౌజ్‌లో తాతతో గడిపిన ఫోటోలు ఇందులో ఉన్నాయి. ‘17... నువ్వు నాకు జీవితం గురించి ఎంతో చె΄్పావు. 18... నువ్వు కూడా అలాగే చేస్తావని ఆశిస్తున్నాను’ అని తన పోస్ట్‌లో రాసింది కై ట్రంప్.‘లాస్ట్ డే బీయింగ్ 17’ కాప్షన్‌తో పోస్ట్ చేసిన వీడియోలో స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపిస్తుంది కై. తాత కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఆకట్టుకునే ఉపన్యాసాలు ఇచ్చింది. రాజకీయ ఉపన్యాసాల సంగతి ఎలా ఉన్నా గోల్ఫ్ ఆటలో చక్కని ప్రతిభ చూపుతోంది. యూట్యూబ్ చానల్ స్టార్ట్ చేసి తక్కువ కాలంలోనే ‘సోషల్ మీడియా సెన్సేషన్’ అయింది. -
ట్రంప్.. మళ్లీ అదే తీరు!
వాషింగ్టన్: కొన్ని వారాల క్రితం శ్వేతసౌధంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మీడియా సాక్షిగా తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిని ఏమాత్రం మార్చుకోలేదు. సాదరంగా ఆహా్వనించి నిందారోపణల బురద కుమ్మరించడం అగ్రరాజ్యానికి ఏమాత్రం తగదని ఆనాడే ప్రపంచమీడియా తీవ్రంగా మందలించినా ట్రంప్ తన తెంపరితనాన్ని ఏమాత్రం తగ్గించుకోలేదని బుధవారం మరోసారి రుజువైంది. వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటారనే ఆశతో వైట్‌హౌస్‌కు విచ్చేసిన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫొసాకు ట్రంప్ ఆరోపణలతో స్వాగతం పలికారు. దక్షిణాఫ్రికాలో వేలాది మంది శ్వేతజాతి రైతులను వధించారని ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో హతాశుడైన రమఫొసా వెంటనే తేరుకుని ట్రంప్‌కు దీటుగా బదులిచ్చారు. అసలేం జరిగిందంటే? శ్వేతసౌధంలో మీడియా సమక్షంలో సంయుక్తంగా మాట్లాడేందుకు రమఫొసా సిద్ధంకాగా ట్రంప్ మీడియాతో మాట్లాడటం వదిలేసి అక్కడే ఉన్న పెద్ద టెలివిజన్‌లో ఒక వీడియో చూపిస్తాం చూడండని అక్కడి వారందరినీ ఆదేశించారు. ‘‘శ్వేతజాతీయులను చంపేయండి. శ్వేతజాతి రైతులను కాల్చిచంపండి’’ అంటూ దక్షిణాఫ్రికాలో చిన్నపాటి కమ్యూనిస్ట్‌పార్టీ అయిన ఎకనమిక్ ఫ్రీడమ్ ఫైటర్స్ నేత జూలియస్ మలేమా పాడుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. వీడియో ప్లే అవడం పూర్తయ్యాక ట్రంప్ రమఫొసాను ఉద్దేశించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. ‘‘ దక్షిణాఫ్రికాలో నల్లజాతీయులు జాత్యహంకారానికి గురయ్యారనేది ఒట్టిమాట. వాస్తవానికి వేలాది మంది శ్వేతజాతి రైతులను ఊచకోత కోశారు. ఆ దేశంలో ఎన్నో ప్రాంతాలు శ్వేతజాతీయుల సమాధి దిబ్బలుగా మారాయి. శ్వేతజాతీయులు పీడనకు, వేదనకు గురయ్యారు. మీ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో చాలా మంది శ్వేతజాతీయులు బతుకుజీవుడా అంటూ అమెరికాకు శరణార్థులుగా వలసవచ్చారు. వాళ్లకు మేం ఆశ్రయం కల్పించాం’’ అంటూ ట్రంప్ చెప్పుకుంటూ పోయారు. శ్వేతజాతీయుల అవస్థలు ఇవి అంటూ విదేశీ వార్తాసంస్థల్లో ప్రచురితమైన కథనాల జిరాక్స్ కాపీలను మీడియా ప్రతినిధులకు చూపించి రమఫొసాకు అందజేశారు. వీటికి సంజాయిషీ చెప్పాలని డిమాండ్‌చేశారు. ‘‘ అన్ని హత్యలే. దక్షిణాఫ్రికాలో ఎక్కడ చూసినా మరణాలే’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ వైఖరితో ఒక్కసారిగా విసిగిపోయిన రమఫొసా పట్టరాని ఆగ్రహంతో ఉన్నాసరే సంయమనం పాటించారు. హుందాగా వ్యవహరిస్తూ సూటిగా మాట్లాడారు. ‘‘ అసలేంటీ వీడియో?. నేనెప్పుడూ ఈ వీడియో చూడలేదు. ఎక్కడిదీ వీడియో?. ఈ వీడియో ఎంత వరకు వాస్తవం?’’ అంటూ ట్రంప్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘ దశాబ్దాలుగా జాత్యహంకారానికి, పీడనకు కోట్లాదిమంది నల్లజాతీయులు బాధితులయ్యారు. లెక్కలేనంత మంది బలయ్యారు. మా దేశంలో శ్వేతజాతీయుల ఊచకోత అనేది పూర్తిగా అబద్ధం. నిజానికి ఆఫ్రికనర్స్గా పిలిచే మైనారిటీ శ్వేతజాతీయులే చాన్నాళ్లు మా దేశాన్ని చెండుకు తిన్నారు. ఆఫ్రికన్ల దీనగా«థను వినే ఓపిక మీకు ఉంటే మా బాధ సరిగ్గా అర్థమవుతుంది.’’ అని రమఫొస సూటిగా సమాధానం ఇచ్చారు. ట్రంప్ చూపిన వీడియోలో ఒక రోడ్డు పక్కన చోట పెద్ద సంఖ్యలో సమాధులు ఉన్నాయి. అయితే ఇవి నిజమైన సమాధులు కావని, 2020లో ఖ్వజూలు–నటాల్ ప్రావిన్సులో ఒక రైతు జంట పొలంలో హత్యకు నిరసనగా ఏర్పాటుచేసిన నకిలీ సమాధులు అని కొందరు వాదించారు. ఉంటే ఇచ్చేవాడినే శ్వేతజాతి, నల్లజాతీయుల్లో ఎవరు పీడనకు గురయ్యారని ఓవైపు ట్రంప్, రమఫొసా వాదించుకుంటుంటే ఒక విలేకరి మధ్యలో కల్గజేసుకుని వందల కోట్ల రూపాయల విలువైన విమానాన్ని బహుమతిగా స్వీకరించడం ఎంత వరకు నైతికతగా అనిపించుకుంటుంది? అని ట్రంప్‌ను సూటి ప్రశ్న వేశారు. దీంతో చిర్రెత్తికొచ్చిన ట్రంప్.. ‘‘ నువ్వో చెత్త రిపోర్టర్‌వు. ఇంత కీలకమైన విషయంపై చర్చిస్తుంటే మధ్యలో నీ విమానం గోల ఏంటి?. నువ్వు అసలు ప్రశ్నలు అడగొద్దు’’ అని అతనిపై ట్రంప్ అరిచాడు. ఆగ్రహంతో ఊగిపోతున్న ట్రంప్‌ను కూల్ చేసేందుకు రమఫొసా మధ్యలో కలుగజేసుకున్నారు. ‘‘ ఖతార్ మాత్రమే కాదు. కావాలంటే మేం కూడా మీకు విమానాన్ని బహుమానంగా ఇస్తాం’’ అని అన్నారు. దీనికి ట్రంప్ వెటకారంగా బదులిచ్చారు. ‘‘ అగ్రరాజ్యమైన అమెరికాకే ఎయిర్‌ఫోర్స్‌వన్‌గా కొత్త విమానాన్ని ఇచ్చే దమ్ముంటే మీరూ ఇవ్వొచ్చు. నేను తీసుకునేందుకు రెడీ’’ అని అన్నారు. వెంటనే రమఫొసా ‘‘ అగ్రరాజ్యంగా ఉండి కూడా మీరు ఇంకొకరి నుంచి తీసుకునే స్థితిలో ఉన్నా.. ఇచ్చే స్థితిలో మేం లేము. మా వద్ద అసలు విమానమే లేదు’’ అని అనేసరికి అక్కడ ఉన్న వాళ్లంతా ఘొల్లున నవ్వేశారు. -
ట్రంప్ సలహా సంఘంలో మాజీ ఉగ్రవాదులు
వాషింగ్టన్: కరడుగట్టిన అల్‌కాయిదా, లష్కరే తోయిబా ఉగ్రసంస్థలకు చెందిన మాజీ ఉగ్రవాదులకు ఏకంగా అమెరికా అధ్యక్షుని సలహా సంఘంలో చోటు దక్కింది! వారిలో ఒకరు ఉగ్రవాదం, సంబంధిత కేసుల్లో దోషిగా జైలుశిక్ష అనుభవించి విడుదలైన ఇస్మాయిల్ రాయర్ కాగా మరొకరు హమాస్, ముస్లిం బ్రదర్హుడ్లతో సంబంధాలున్న మాజీ ఉగ్రవాది షేక్ హమ్జా యూసుఫ్. వారిని రిలీజియస్ లిబర్టీ కమిషన్ ఆధ్వర్యంలో పనిచేసే అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ లే లీడర్స్‌లో సభ్యులుగా ట్రంప్ సర్కారు ఎంపిక చేసింది. వారిద్దరూ అమెరికాలో ఇస్లామిక్ బోధనల్లో ప్రముఖులుగా మంచిపేరు తెచ్చుకున్నారని చెప్పుకొచి్చంది. కరడుగట్టిన ఉగ్ర చరిత్ర ఉన్న మాజీలను సలహా సంఘంలోకి కూర్చోబెడతారా అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ రెండో హయాంలో అమెరికాలో నెలకొన్న అవ్యవస్థకు ఇది మరో నిదర్శనమంటూ పలువురు మండిపడుతున్నారు. ఈ సలహా సంఘం మతస్వేచ్ఛ, మత విశ్వాసాలకు అనుగుణంగా విధాన నిర్ణయాల్లో అధ్యక్షుడికి సలహాలిస్తుంది.ఎవరీ ఇస్మాయిల్? ఇతను అమెరికా జాతీయుడు. అసలు పేరు ర్యాండల్ టోడ్ రాయర్. 1992లో ఇస్లాం స్వీకరించి ఇస్మాయిల్‌గా పేరు మార్చుకున్నాడు. లష్కరే తోయిబా, ఈజిప్‌్టలోని ముస్లిం బ్రదర్హుడ్, ‘వర్జీనియా జిహాద్ నెట్వర్క్’, పాలస్తీనాలోని హమాస్ ఉగ్ర సంస్థతో సత్సంబంధాలున్నాయి. ప్రత్యేక ఉగ్రశిక్షణ కోసం 2000లో పాక్ వెళ్లాడు. అమెరికాపై యుద్ధం కోసం పలువురికి ఉగ్ర తర్ఫీదు ఇచ్చేలా ప్రణాళికలు వేశాడు. జమ్మూ కశీ్మర్లో సైనిక స్థావరాలపై రాకెట్ ప్రొపెల్డ్ గ్రనేడ్ దాడికి సహచర ఉగ్రవాదికి శిక్షణ ఇచ్చాడు. అల్ఆయిదా, లష్కరేలకు సాయపడ్డ నేరానికి 2003లో ఇస్మాయిల్‌పై కేసు నమోదైంది. దోషిగా తేలడంతో 20 ఏళ్ల జైలుశిక్ష పడ్డా స్రత్పవర్తన కారణంగా 2017లో విడుదలయ్యాడు. అమెరికాలోని రిలీజియస్ ఫ్రీడం ఇన్స్టిట్యూట్లో డైరెక్టర్‌గా ఉన్నాడు.ఎవరీ షేక్హమ్జా యూసుఫ్? అమెరికాలో తొలి ముస్లిం లిబరల్ ఆర్ట్స్ కాలేజీ అయిన జేతునా కాలేజ్ సహవ్యవస్థాపకుడు. ఈ కాలేజీలో షరియా చట్టాలను బోధిస్తారు. యూసుఫ్‌కు ముస్లిం బ్రదర్హుడ్, హమాస్‌లతో లింకులున్నట్టు తేలింది. వాటితో ఇప్పటికీ సంబంధాలు కొనసాగిన్తున్నట్టు చెబుతారు. ఇతని బోధనలకు పలువురు ఉగ్రవాదులు ఆకర్షితులైనట్టు స్పష్టమైంది. అమెరికా జాత్యహంకార దేశమంటూ వ్యాఖ్యలు చేశాడు. 1990ల నాటి శకంలో న్యూయార్క్ బాంబు దాడుల కేసు నిందితుడు షేక్ ఒమర్ అబ్దుల్ రహా్మన్పై దర్యాప్తులో అమెరికా ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడం లేదని విమర్శలు గుప్పించాడు. అమెరికా పోలీస్ ఉన్నతాధికారిని హత్య చేసిన జమీల్ అల్ అమీన్ అనే వ్యక్తికి మద్దతుగా యూసుఫ్ ప్రసంగించాడు. తర్వాత రెండు రోజులకే అమెరికాపై 9/11 దాడి జరిగింది. దాంతో అతన్ని ఎఫ్‌బీఐ విచారించింది. ముస్లిం దేశాల్లో అత్యంత ప్రముఖ ఇస్లామిక్ విద్యావేత్తగా పేరొందాడు. -
భారత్–పాక్ మధ్య అణు యుద్ధం ఆపేశా..
వాషింగ్టన్: భారత్–పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ కోసం తానే చొరవ తీసుకున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చెప్పుకొచ్చారు. ఆ క్రెడిట్ తనకే దక్కాలని పేర్కొన్నారు. ఆ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చి, ఉద్రిక్తతలు ఆగిపోవడం ఇప్పటిదాకా తాను సాధించిన అతిపెద్ద విజయాల్లో ఒకటి అని వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారం ఫాక్స్ న్యూస్ సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. తన జోక్యం వల్లే పాకిస్తాన్‌పై ఇండియా సైనిక చర్య నిలిచిపోయిందని వెల్లడించారు. ఇరు దేశాల మధ్య అణుయుద్ధాన్ని నివారించానని తెలిపారు. రెండు బలమైన దేశాలైన భారత్–పాక్ మధ్య మొదలైన ఘర్షణలు అతి తక్కువ సమయంలోనే అణుయుద్ధానికి దారితీసే పరిస్థితి ఏర్పడిందని, తాను కల్పించుకోవడంతో అది ఆగిపోయిందని వివరించారు. అయితే, పాకిస్తాన్‌తో కాల్పుల విరమణ వెనుక ట్రంప్ ప్రమేయం ఎంతమాత్రం లేదని భారత్ ఇప్పటికే తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. మూడో పక్షం జోక్యాన్ని తాము అంగీకరించే ప్రసక్తే లేదని భారత్ వెల్లడించింది. అయినప్పటికీ ట్రంప్ తన నోటి దురుసు తగ్గించుకోకపోవడం గమనార్హం. భారత్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పినప్పటికీ ఈ అంశాన్ని పదేపదే ప్రస్తావించడం ద్వారా ఆయన ఏం సాధించదల్చుకున్నారో అర్థం కావడం లేదని నిపుణులు అంటున్నారు. టారిఫ్‌ల రద్దుకు ఇండియా సంసిద్ధత భారత్, పాక్ నడుమ ఉద్రిక్తతలు నివారించి, శాంతిని నెలకొల్పడానికి వాణిజ్యాన్ని ఆయుధంగా వాడుకున్నానని డొనాల్డ్ ట్రంప్ తెలియజేశారు. అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌లను 100 శాతం రద్దు చేయడానికి ఇండియా సంసిద్ధత వ్యక్తం చేసిందని పునరుద్ఘాటించారు. అమెరికా–ఇండియా మధ్య వాణిజ్య ఒప్పందం త్వరలోనే కుదరడం ఖాయమని తెలిపారు. అయితే, ఈ ఒప్పందం కోసం తాను తొందరపడడంలేదన్నారు. తమతో వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని ఇప్పుడు ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని చెప్పారు. ఇప్పటిదాకా 150 దేశాలు ఇలాంటి ఒప్పందం కోసం ముందుకొచ్చాయన్నారు. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధిస్తున్న దేశం ఇండియా అంటూ ట్రంప్ మరోసారి విమర్శించారు. వ్యాపారాలు చేయడం అసాధ్యం అనే పరిస్థితులు ఇండియాలో సృష్టించారని తప్పుపట్టారు. కానీ, అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌లు పూర్తిగా రద్దు చేయడానికి ఇండియా సుముఖంగా ఉందని వివరించారు. కేవలం అమెరికా కోసం ఇండియా ఈ మేలు చేయడానికి సిద్ధపడిందని అన్నారు. -
అమెరికాలో రెమిటెన్సులపై పన్ను.. ఎన్నారైలకు సెగ..!
న్యూఢిల్లీ: అమెరికాలో ఉంటున్న విదేశీయులు స్వదేశాలకు పంపే రెమిటెన్సులపై 5 శాతం ట్యాక్స్ విధించాలన్న ట్రంప్ ప్రభుత్వ ప్రతిపాదన అక్కడి ప్రవాస భారతీయులకు సమస్యగా పరిణమించనుంది. దీని వల్ల వారు భారత్‌కి నిధులు పంపించడానికి సంబంధించిన వ్యయాలు పెరగనున్నాయి. ఇటీవలి రిజర్వ్ బ్యాంక్ ఆర్టికల్‌లో ప్రస్తావించిన 2023–24 డేటా ప్రకారం ఏకంగా 1.6 బిలియన్ డాలర్ల మేర భారం పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సదరు కథనం ప్రకారం వివిధ దేశాల నుంచి 2010–11లో రెమిటెన్సులు 55.6 బిలియన్ డాలర్ల నుంచి 2023–24లో రెట్టింపై 118.7 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఇందులో అమెరికా వాటా 27.7 శాతంగా ఉంది. దీన్ని బట్టి చూస్తే అమెరికా నుంచి 32.9 బిలియన్ డాలర్లు రెమిటెన్సుల రూపంలో వచ్చాయి. దీనిపై 5 శాతం ఎక్సైజ్ ట్యాక్స్ విధిస్తే 1.64 బిలియన్ డాలర్ల పన్ను భారం పడుతుందని అంచనా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధానంగా దృష్టి పెడుతున్న ప్రతిపాదన ప్రకారం గ్రీన్ కార్డులు, హెచ్1బీ వీసాలపై ఉన్న వారు సహా మొత్తం 4 కోట్ల మందిపై 5 శాతం ఎక్సైజ్ ట్యాక్స్ భారం పడనుంది. ఇది అమెరికన్ పౌరులకు వర్తించదు. టాప్‌లో భారత్.. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం అత్యధిక స్థాయిలో రెమిటెన్సులను అందుకోవడంలో 2008 నుంచి భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్రపంచ దేశాల మధ్య 2001లో 11 శాతంగా ఉన్న భారత్ వాటా 2024లో 14 శాతానికి పెరిగింది. 2024లో 129 బిలియన్ డాలర్లతో భారత్ అగ్రస్థానంలో ఉండగా, మెక్సికో (68 బిలియన్ డాలర్లు), చైనా (48 బిలియన్ డాలర్లు), ఫిలిప్పీన్స్ (40 బిలియన్ డాలర్లు), పాకిస్తాన్ (33 బిలియన్ డాలర్లు) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. -
అమెరికా ఉత్పత్తులకు భారత్‌లో జీరో టారిఫ్!
దోహా: భారత్, పాక్ పరస్పర సైనిక చర్యలతో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా ఉన్న వేళ కాల్పుల విరమణకు ఇరుదేశాలు సమ్మతించాయని అందరికంటే ముందే ప్రకటించి అభాసుపాలైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోమారు తొందరపాటు ప్రకటన చేశారు. టారిఫ్‌లు విధించకుండానే అమెరికా నుంచి వస్తూత్పత్తుల దిగుమతికి భారత్ అత్యుత్సాహం చూపిస్తోందని ట్రంప్ గురువారం అనూహ్య ప్రకటన చేశారు. దీంతో వెంటనే భారత్ స్పందించింది. అలాంటిదేమీ లేదని, టారిఫ్‌ల ఖరారుపై విస్తృతస్థాయిలో చర్చలు జరుగుతు న్నాయని, చర్చలు ఇప్పట్లో ముగిసిపోవని భారత్ స్పష్టంచేసింది. జీరో టారిఫ్ ప్రతిపాదన లేదని కుండబద్దలు కొట్టింది.మోదీ మౌనమేల?: కాంగ్రెస్ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఎందుకు స్పందించట్లేరని విపక్ష కాంగ్రెస్ ప్రశ్నించింది. ‘‘ అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఖరారు చర్చల కోసం మన వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వాషింగ్టన్ డీసీలో పర్యటిస్తున్నారు. ఇదే సమయంలో ట్రంప్ జీరో టారిఫ్ అంటూ ప్రకటన చేశారు. ఈ సున్నా టారిఫ్‌కు, ఆపరేషన్ సిందూర్ ఆగిపోవడానికి మధ్య సంబంధమేంటి?. ఈ అంశంలో మోదీ ఎందుకు మౌనం వహించారు?. అమెరికాతో డీల్ కుదుర్చుకునేందుకు మోదీ ఏమేం అంశాల్లో తలూపారు?’’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాంరమేశ్ ‘ఎక్స్’లో ప్రశ్నించారు.ట్రంప్ ఏం మాట్లాడారు?గురువారం ఖతార్ రాజధాని దోహాలో వ్యాపారదిగ్గజాలు, సంస్థలతో ట్రంప్ సమావేశమయ్యారు. చైనా, అమెరికా టారిఫ్‌ల యుద్ధం నేపథ్యంలో భారత్‌లో అత్యధికంగా ఐఫోన్లను తయారుచేసి అమెరికాకు ఎగుమతి చేయబోతున్నట్లు యాపిల్ సంస్థ ఇటీవల ప్రకటించడం తెల్సిందే. ఈ విషయం నచ్చని ట్రంప్ ఇదే అంశాన్ని దోహా భేటీలో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ వద్ద ప్రస్తావించారు. ‘‘అమెరికాలో యాపిల్ సంస్థను ఇంతబాగా చూసుకుంటున్నా మీరేమో భారత్‌లో ఐఫోన్లను మరింత ఎక్కువగా తయారుచేస్తామంటున్నారు. అక్కడే కర్మాగారాలను విస్తరిస్తున్నారు. ఇది నాకు అస్సలు నచ్చలేదు. అమెరికా ఉత్పత్తులపై భారత్ చాలా ఎక్కువ టారిఫ్‌లు విధిస్తోంది. ప్రపంచంలో అధిక టారిఫ్‌లు విధించే దేశాల్లో భారత్ కూడా ఉంది. టారిఫ్‌లు పెంచాక అత్యధిక ధరలకు మీరు భారత్‌లో వస్తువులను విక్రయించడం చాలా కష్టమవుతుంది. మీకో విషయం చెప్పనా. అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి భారత్ ఒక చక్కని ప్రతిపాదన తెచ్చింది. అసలు టారిఫ్‌లే లేకుండా వస్తువులను భారత్‌లోకి దిగుమతి చేసుకోవడానికి వాళ్లు దాదాపు అంగీకారం తెలిపారు. మీరు భారత్‌లో ఐఫోన్ల తయారీ కర్మాగారాలను నిర్మించినా అక్కడి సర్కార్ మిమ్మల్ని అస్సలు పట్టించుకోలేదు. వాళ్లకు స్వప్రయోజనాలే ముఖ్యం’’ అని టిమ్‌కుక్‌తో ట్రంప్ మాట్లాడారు. ఈ విషయాలను మీడియాకు ట్రంప్ స్వయంగా వెల్లడించారు. తనతో మాట్లాడిన తర్వాత అమెరికాలో ఉత్పత్తి పెంచేందుకు టిమ్‌కుక్ అంగీకారం తెలిపారని ట్రంప్ ప్రకటించారు. భారతీయ ఉత్పత్తులపై 26 శాతం టారిఫ్ విధిస్తామని ట్రంప్ ఏప్రిల్ 9వ తేదీన ప్రకటించారు. అయితే 90 రోజులపాటు ఈ పెంపును తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు తర్వాత ట్రంప్ వెల్లడించడం తెల్సిందే.ఖండించిన భారత్ట్రంప్ మాటల్లో వాస్తవం లేదని భారత్ గురువారం ప్రకటించింది. ఈ విషయమై భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ స్పందించారు. ‘‘ టారిఫ్లుసహా సమగ్ర వాణిజ్య ఒప్పందంపై భారత్, అమెరికా మధ్య విస్తృతస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఇవి సంక్లిష్టమైనవి. చర్చలు ముగిసిపోలేదు. ప్రతి అంశంపైనా కూలంకషంగా చర్చ జరుగుతోంది. ఇప్పటిదాకా ఏ అంశంపైనా తుది నిర్ణయాలు వెలువడలేదు. ఒప్పందం కుదుర్చుకుంటే అది ఇరుపక్షాలకు ప్రయోజనకారిగా ఉండాలి. రెండు దేశాలకూ లబ్ధిచేకూరాలి. మేం ఇదే కోరుకుంటున్నాం. చర్చలు పూర్తికాకుండానే దీనిపై మాట్లాడటం తొందరపాటు చర్యే అవుతుంది’’ అని జైశంకర్ వ్యాఖ్యానించారు. 2024లో ఇరుదేశాల మధ్య 129 బిలియన్ డాలర్ల విలువైన వాణిజ్యం జరిగింది. -
విరమణ.. ఉల్లంఘన
న్యూఢిల్లీ/వాషింగ్టన్/ఇస్లామాబాద్ కయ్యానికి కాలుదువ్విన దాయాదికి నాలుగు రోజుల్లోనే తత్వం బోధపడింది. సాయుధ ఘర్షణకు తెర దించుదామంటూ భారత్‌తో కాళ్లబేరానికి వచ్చింది. దాంతో ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. రెండు ప్రభుత్వాలూ దాన్ని ధ్రువీకరించాయి. తమ మధ్యవర్తిత్వమే ఇందుకు కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగా భారత్ దాన్ని తోసిపుచ్చింది. పాక్ విజ్ఞప్తి మేరకే ద్వైపాక్షిక చర్చల ద్వారా ఒప్పందం కుదుర్చుకున్నట్టు ప్రకటించింది. ‘‘శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. భూ, గగన, సముద్ర తలాల్లో పూర్తిస్థాయిలో కొనసాగుతుంది’’ అని విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ మీడియాకు వెల్లడించారు. కానీ కాసేపటికే పాక్ వంకర బుద్ధి ప్రదర్శించింది. శనివారం రాత్రి ఏడింటి నుంచీ మరోసారి దాడులకు దిగింది. సరిహద్దుల గుండా మళ్లీ డ్రోన్ ప్రయోగాలకు, కాల్పులకు తెగబడింది. కోరి కుదుర్చుకున్న విరమణ ఒప్పందానికి గంటల వ్యవధిలోనే తూట్లు పొడిచి తాను ధూర్తదేశాన్నేనని మరోసారి నిరూపించుకుంది. ఈ పరిణామంపై భారత్ మండిపడింది. రాత్రి 11 గంటలకు మిస్రీ మరోసారి మీడియా ముందుకొచ్చారు. ఓవైపు విరమణ అంటూనే మరోవైపు సరిహద్దుల వెంబడి పాక్ తిరిగి దాడులు, కాల్పులకు దిగిందంటూ ధ్వజమెత్తారు. ఒప్పందం కుదిరిందన్న ట్రంప్పాక్ దొంగ నాటకాల నడుమ శనివారం రోజంతా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి దాటేదాకా పాక్ సైన్యం క్షిపణి, డ్రోన్ దాడులు, సరిహద్దుల వెంబడి కాల్పులు కొనసాగించింది. వాటికి దీటుగా బదులిచ్చిన భారత్ శనివారం తెల్లవారుజాము నుంచీ తీవ్రస్థాయిలో ప్రతి దాడులకు దిగింది. ఆరు పాక్ వైమానిక, రెండు రాడార్ కేంద్రాలను నేలమట్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల నడుమ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనూహ్య ప్రకటన చేశారు. సొంత సోషల్ మీడియా హ్యాండిల్ ట్రూత్ సోషల్‌లో సాయంత్రం ఐదింటి ప్రాంతంలో ఈ మేరకు పోస్ట్ చేశారు. ‘‘అమెరికా మధ్యవర్తిత్వంలో రాత్రంతా జరిగిన చర్చోపచర్చల అనంతరం ఎట్టకేలకు ఇరు దేశాలూ తక్షణం పూర్తిస్థాయి కాల్పుల విరమణకు అంగీకరించాయి’’ అని పేర్కొన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా అవే వ్యాఖ్యలు చేశారు. ప్రధానులు నరేంద్ర మోదీ, షహబాజ్ షరీఫ్‌లకు అభినందనలు తెలిపారు. ట్రంప్ బృందం ఈ దిశగా అద్భుతంగా పని చేసిందని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చెప్పుకొచ్చారు. సాయంత్రం ఆరింటికి విదేశాంగ కార్యదర్శి మిస్రీ మీడియా ముందుకొచ్చారు. ‘‘పాక్ విజ్ఞప్తి మేరకే విరమణకు ఒప్పుకున్నాం. శనివారం మధ్యాహ్నం 3.35 గంటలకు పాక్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ భారత డీజీఎంఓకు ఫోన్ చేశారు. వారి నడుమ చర్చల ఫలితంగా ఈ మేరకు ఒప్పందం కుదిరింది’’ అని స్పష్టం చేశారు. దీనిపై డీజీఎంఓల నడుమ సోమవారం పూర్తిస్థాయి చర్చలు జరుగుతాయని వెల్లడించారు. ‘‘శాంతి సాధనకు ఇది నూతన ప్రారంభం. కాల్పుల విరమణకు చొరవ చూపినందుకు ట్రంప్, వాన్స్, రూబియోలకు కృతజ్ఞతలు’’ అంటూ పాక్ ప్రధాని షహబాజ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్, పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టి(పీపీపీ) అధినేత బిలావల్ భుట్టో, ప్రజాప్రతినిధులు తదితరులు ఒప్పందాన్ని స్వాగతించారు. అనంతరం తన గగనతలాన్ని తెరుస్తున్నట్టు పాక్ ప్రకటించింది. బయటపడ్డ పాక్ నైజం కొద్ది గంటలైనా గడవకుండానే పాక్ తన బుద్ధి బయటపెట్టుకుంది. విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ శనివారం రాత్రి ఏడింటి నుంచే మరోసారి సరిహద్దుల వెంబడి దాడులకు దిగింది. జమ్మూ కశ్మీర్ మొదలుకుని గుజరాత్ దాకా పలుచోట్ల డ్రోన్ దాడులు జరిగాయి. శ్రీనగర్‌లో భారీ పేలుడు శబ్దాలు విని్పంచాయి. బారాముల్లా తదితర చోట్ల సైనిక స్థావరాల సమీపంలో డ్రోన్లు ఎగురుతూ కని్పంచాయి. దీనిపై జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. ‘‘శ్రీనగర్ అంతటా పేలుళ్ల శబ్దాలే. ఏమిటిది? విరమణకు అప్పుడే తూట్లా?’’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మరోవైపు నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు మొదలయ్యాయి. పాక్ దాడులకు మన సైన్యం దీటుగా బదులిచ్చింది. జమ్మూ, శ్రీనగర్, గుజరాత్‌లోని భుజ్ తదితర చోట్ల పాక్ డ్రోన్లను బలగాలు కూల్చేశాయి. కచ్ తదితర చోట్ల కూడా డ్రోన్లు కని్పంచినట్టు రాష్ట్ర మంత్రి హర్‡్ష సంఘవి ధ్రువీకరించారు. ముందుజాగ్రత్తగా సరిహద్దు రాష్ట్రాల్లో పలుచోట్ల కరెంటు సరఫరా నిలిపేసి బ్లాకౌట్ పాటించారు. అయితే శనివారం అర్ధరాత్రికల్లా పాక్ వెనక్కు తగ్గిందని, నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు దాదాపుగా ఆగిపోయాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.కాల్పుల విరమణ ఒప్పందాన్ని గంటల్లోనే పాక్ ఉల్లంఘించింది. ఇది అత్యంత దుర్మార్గం. ఇందుకు పూర్తి బాధ్యత ఆ దేశానిదే. దీన్ని అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నాం. మతిలేని చర్యలను ఇకనైనా కట్టిపెట్టి కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ పూర్తిస్థాయిలో కట్టుబడాలి. లేదంటే తీవ్రస్థాయిలో ప్రతిక్రియ తప్పదు. దాడులను దీటుగా తిప్పికొట్టాల్సిందిగా సైన్యానికి పూర్తిస్థాయి ఆదేశాలిచ్చాం. – విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ -
దయచేసి ఘర్షణలు ఆపండి
న్యూయార్క్/వాషింగ్టన్: భారత్–పాకిస్తాన్ మధ్య ఘర్షణలు పూర్తిగా ఆగిపోవాలని కోరుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరారు. కుక్కకాటుకు చెప్పుదెబ్బ అన్నట్టుగా భారత్–పాక్ మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయని వెల్లడించారు. మొదట ఉగ్రవాదులు దాడి చేశారు కాబట్టి తర్వాత భారత సైన్యం ప్రతిదాడి చేసిందని పరోక్షంగా అంగీకరించారు. ఇప్పటిదాకా జరిగింది చాలు, ఇకనైనా ఘర్షణలకు తెరదించాలని భారత్, పాక్‌లకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో తన వంతు సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నానని సూచించారు. భారత్, పాక్ మధ్య శాంతి కోసం తాను చేయగలిగినదంతా చేస్తానని ప్రకటించారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం వైట్‌హౌస్ ఓవల్ ఆఫీసులో ట్రంప్ ఓ కార్యక్రమంలో మాట్లాడారు. తన విజ్ఞప్తిని మన్నించి దాడులకు తెరదించాలని భారత్, పాక్‌లకు సూచించారు. -
ఈసారి ‘జెడి’ ట్రంప్!
వాషింగ్టన్: ‘స్టార్‌వార్స్ డే’ సందర్భంగా కృత్రిమ మేధతో రూపొందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో ఫొటోను అధ్యక్ష భవనం ఆదివారం విడుదల చేసింది. ఈసారి, హాలీవుడ్ సినిమా ‘స్టార్ వార్స్ యూనివర్స్’లోని కండలు తిరిగిన ‘జెడి’ అవతారంలో ట్రంప్ దర్శనమిచ్చారు. రెండు రోజుల క్రితమే దివంగత పోప్ ఫ్రాన్సిస్ ఫొటోతో కనిపించిన ట్రంప్‌పై ఆన్లైన్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవడం తెల్సిందే. తాజాగా, జెడి ఫొటోను సైతం జనం వదల్లేదు. చౌకబారు రాజకీయ ప్రచారంగా ఎత్తిపొడిచారు. ఆ సినిమాలో శత్రువుల దగ్గర మాత్రమే ఉండే ఎర్ర లైట్ సాబెర్‌ను ట్రంప్ పట్టుకోవడాన్ని తప్పుబట్టారు. గద్దలు, అమెరికా జెండాలు వెనుక కనిపిస్తుండగా జెడి వేషధారణతో కండలు తిరిగిన దేహంతో ట్రంప్ కనిస్తున్న ఫొటోను వైట్‌హౌస్ సోషల్ మీడియా వేదికపై షేర్ చేసింది. -
మితవాదానికి మరో ఓటమి
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గమనించుకుంటున్నారో లేదో గానీ ప్రపంచంలో ఎక్కడ ఎన్ని కలు జరిగినా ఆయన చర్చనీయాంశం అవుతున్నారు. గెలుపోటముల్ని ప్రభావితం చేస్తున్నారు. ఇటీవల కెనడా ఎన్నికల్లో ట్రంప్ పట్ల మెతకగా వ్యవహరించిన కన్సర్వేటివ్‌లు ఓటమిపాలై, ఊహించని రీతిలో అధికార లిబరల్ పార్టీ గెలుపొందింది. ఇప్పుడు ఆస్ట్రేలియాలోనూ అదే జరిగింది. అచ్చం ట్రంప్ విధానాలనే అనుకరిస్తూ ఆస్ట్రేలియా ఎన్నికల్లో తిరుగులేని గెలుపు సాధించాలనుకున్న విపక్ష కన్సర్వేటివ్ పార్టీ అపజయాన్ని మూటకట్టుకోవటమే కాదు... ఆ పార్టీ గెలిస్తే ప్రధాని అవుతారనుకున్న నాయకుడు పీటర్ డటన్ సైతం ఓటమి పాలయ్యారు. 2004 తర్వాత వరసగా రెండోసారి కూడా అధికారం నిలబెట్టుకున్న పార్టీగా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ నేతృత్వంలోని లేబర్ పార్టీ చరిత్ర సృష్టించింది. ఇక సింగపూర్‌లో ఎప్పటిలా పద్నాలుగోసారి సైతం అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీ (పీఏపీ) తిరిగి అధికారంలోకి రావటం వింతేమీ కాదుగానీ... ఆ పార్టీ నేత, ప్రధాని లారెన్స్ వాంగ్ ప్రచారసభల్లో ట్రంప్‌పై రణభేరి మోగించారు. అమెరికా విధించిన సుంకా లకు ప్రతీకార సుంకాలుంటాయని ప్రకటించారు. అసలు అమెరికాకు సింగపూర్ నుంచి ఎగుమతులు చేసేదే లేదని స్పష్టం చేశారు. 97 స్థానాలున్న సభలో ఆ పార్టీ 87 స్థానాలు గెల్చుకోవటం గతంలో కూడా జరిగినా ఈసారి వోటు శాతాన్ని సైతం 66.57కి పెంచుకుని చరిత్ర సృష్టించింది. ఇక రుమేనియాలో మాత్రం ట్రంప్‌ను తలకెత్తుకున్న తీవ్ర మితవాదపక్షం అలయెన్స్ ఫర్ ది యూనిటీ ఆఫ్ రుమేనియన్స్ (ఏయూఆర్) నాయకుడు జార్జి సైమన్ తొలి రౌండ్లో గెలుపొందారు. ఈ నెల 18న జరగబోయే రెండో రౌండ్ ఎన్నికల్లో సైతం ఆయనదే విజయమన్న అంచనాలున్నాయి. వచ్చే సెప్టెంబర్‌లో ఎన్నికలు జరగబోయే నార్వేలో కూడా ట్రంప్ ప్రభావం కనబడుతోంది. అక్కడి అధి కార లేబర్ పార్టీకి ఓటమి తప్పదని జనవరిలో వివిధ సర్వేలు ప్రకటించగా, ఆ మరుసటి నెలకల్లా అంతా మారిపోయింది. ఇప్పుడు లేబర్ పార్టీయే గెలుపుగుర్రంగా కనబడుతోంది.కరోనా దాపురించినప్పటి నుంచీ ఆస్ట్రేలియా ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ ఇన్నీ కాదు. ముఖ్యంగా మూడేళ్లుగా ఆ దేశంలో ఉత్పాదకత తీవ్రంగా దెబ్బతింది. ద్రవ్యోల్బణం పెరిగింది. దాన్ని తగ్గించటానికి ఆస్ట్రేలియా రిజర్వ్‌బ్యాంక్ 13 సార్లు వడ్డీరేట్లు పెంచింది. ఫలితం లేకపోగా అధిక ధరల కారణంగా కొనుగోళ్లు ఆగిపోయి గృహనిర్మాణ రంగం పడకేసింది. వీటన్నిటి వల్ల జీవన ప్రమాణాలు పడిపోయాయి. ఇవన్నీ చూసి తదుపరి ఎన్నికల్లో తమదే విజయమని కన్సర్వే టివ్ పార్టీ కలలుగంది. అమెరికాలో ట్రంప్‌కు పెరుగుతున్న మద్దతు చూసి అదే తరహా ప్రకటనలు చేసి ఆ పార్టీ నాయకుడు డటన్ మొదట్లో వోటర్ల మెప్పు పొందినమాట వాస్తవం. ప్రభుత్వ రంగంలో 40,000 ఉద్యోగాలు రద్దుచేస్తామని, వలసల విషయంలో కఠినంగా వుంటామని, ఉదార వాద విధానాలైన భిన్నత్వం, అందరినీ కలుపుకొనిపోవటం వగైరాలకు కాలం చెల్లిందని ఆయన పదే పదే ప్రకటించారు. ఆస్ట్రేలియా మొదటి నుంచీ అమెరికా మిత్ర దేశమే. అయినా ట్రంప్ ఏమాత్రం కనికరించలేదు. అందరితోపాటు ఆస్ట్రేలియాపైనా భారీయెత్తున సుంకాలు పెంచుతా మని ప్రకటించారు. ఇవింకా అమల్లోకి రాకపోయినా అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం కారణంగా అసలే అంతంతమాత్రంగా వున్న ఆర్థిక వ్యవస్థ మరింత అనిశ్చితిలోకి పోయింది. ఈ దశలో డటన్ తనకు ట్రంప్‌తో వున్న వ్యక్తిగత సాన్నిహిత్యం వల్ల ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థను సునాయాసంగా గట్టెక్కిస్తానని హామీ ఇచ్చారు. కానీ ట్రంప్ దూకుడు కారణంగా స్టాక్ మార్కెట్లన్నీ బోల్తా కొట్టడంతో డటన్‌కు దిక్కుతోచలేదు. దాంతో ట్రంప్ ప్రస్తావన మానుకున్నారు. కానీ అప్పటికే జరగా ల్సిన నష్టం జరిగిపోయింది. జనం లేబర్ పార్టీకే వోటేయాలన్న నిర్ణయానికొచ్చారు. సింగపూర్ సైతం ఆర్థిక అస్థిరతలో కొట్టుమిట్టాడుతోంది. అసలే వాణిజ్యం దెబ్బతిని వుండగా ట్రంప్ అధిక సుంకాల ప్రకటన మరింత దెబ్బ తీసింది. ఆస్ట్రేలియా మాదిరే ఆ దేశంలోనూ పౌరులకు సొంతిళ్లు సమకూర్చుకోవటం సమస్యగా మారింది. పెరిగిన ద్రవ్యోల్బణం, ఆర్థికమాంద్యం, ఉద్యో గాలు కోల్పోతామన్న భయాందోళనలు ప్రజల్ని వణికిస్తున్నాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో అంచనాల కన్నా జీడీపీ చాలా తగ్గి 3.8 శాతానికొచ్చింది. వచ్చే త్రైమాసికంలో అది 2 శాతం మించక పోవచ్చు. ట్రంప్ సుంకాల బెదిరింపు సరేసరి. అందుకే ఈ అనిశ్చితిలో పాలకపక్షాన్నే మరోసారి గెలిపించటం ఉత్తమమన్న నిర్ణయానికొచ్చారు. కనుకనే పీఏపీ వోట్ల శాతం 61.2 నుంచి 65.67కి పెరి గింది. సింగపూర్ ఎన్నికల్ని విదేశీ మదుపుదార్లు, అంతర్జాతీయ మీడియా, వివిధ దేశాల ప్రభుత్వాలు శ్రద్ధగా గమనించాయి. ఈ అయిదేళ్లూ సింగపూర్ ఎదుర్కొన్న సమస్యలు అలాంటివి మరి.ఏతావతా ఇప్పటికి ఒక్క రుమేనియా మినహాయించి ట్రంప్‌ను చూసి వాతలు పెట్టుకుంటున్న నాయకులంతా ఊహించని ఓటమితో ఖంగుతింటున్నారు. నిరుడంతా మితవాద పక్షాలు ఎక్కడి కక్కడ విజయం సాధించగా, ప్రస్తుతం ఆ పక్షాలకు ఎదురుగాలి వీస్తోంది. అయితే గెలిచిన పక్షాలు చుట్టుముడుతున్న ఆర్థిక సంక్షోభాలకు ఎదురీదటం, జనం మెప్పు పొందటం అంత సులభమేమీ కాదు. ప్రపంచంతోపాటే మనమూ అని ఈ సంక్షోభాల్ని సరిపెట్టుకునే పరిస్థితుల్లో వారు లేరు. కనుక సమస్యలకు దీటైన పరిష్కారాలు కనుగొనటానికి గద్దెనెక్కిన నాయకులు ప్రయత్నించాల్సి వుంది. వారి మాటెలావున్నా ప్రపంచమంతటా తన కారణంగా మితవాద పక్షాలు బోల్తా కొట్టడాన్ని చూసైనా ట్రంప్ తన విధానాలను మార్చుకుంటారా, లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. -
100 రోజుల ట్రంపరితనం
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టి మంగళవారానికి 100 రోజులు. అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా మారుస్తున్నాననే మిషతో రోజుకోటి అన్నట్టుగా ఈ మూడు నెలల్లో ఆయన లెక్కలేనన్ని అనాలోచిత చర్యలకు దిగారు. ‘పూటకో మాట, రోజుకో వైఖరి’ అన్నట్టుగా పదేపదే నిర్ణయాలను, విధానాలను మార్చుకుంటూ నవ్వులపాలవుతున్నారు. అంతర్జాతీయ సమాజం దృష్టిలో అమెరికాను పలుచన చేయడమే గాక వ్యక్తిగతంగా జీవితకాలానికి సరిపడా అప్రతిష్ట మూటగట్టుకున్నారు. అక్రమ వలసదారులకు అడ్డుకట్ట సాకుతో తలా తోకా లేని నిబంధనలతో అంతర్జాతీయ విద్యార్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. పొదుపు పేరిట ఉద్యోగులను భారీగా తొలగించడం వంటి చర్యలతో అమెరికన్లను కూడా ఎన్నడూ లేనంత అభద్రతా భావంలోకి నెట్టేశారు. దాదాపుగా ఈ మూడు నెలల్లో ట్రంప్ తీసుకున్న అన్ని నిర్ణయాలూ న్యాయ వివాదాలకు దారితీయడం విశేషం. అమెరికా ద్రవ్యోల్బణానికి ముకుతాడు వేస్తానన్న వాగ్దానం నిలుపుకోవడంలోనూ ట్రంప్ ఘోరంగా విఫలమయ్యారు. నిత్యావసరాల ధరలు చుక్కలు తాకుతున్నాయి. చివరికి గుడ్ల ధరలు చూసి సగటు అమెరికన్ గుడ్లు తేలేసే పరిస్థితి నెలకొంది! ఇష్టారాజ్యపు నిర్ణయాలతో అటు ప్రపంచాన్ని, ఇటు అమెరికాను కూడా ఆర్థికంగా ప్రమాదపుటంచుల్లోకి నెట్టిన ట్రంప్, ఆ మంటల్లో తీరిగ్గా చలి కాచుకుంటున్నారు...మతిలేని టారిఫ్‌ల యుద్ధం ఈ 100 రోజుల్లో ట్రంప్ చేపట్టిన చర్యలన్నింట్లోనూ అత్యంత వివాదాస్పదమైనది, ఆనాలోచితమైనది టారిఫ్‌ల యుద్ధమే. అమెరికాపై భారీ టారిఫ్‌లు విధిస్తున్నాయంటూ చాలా దేశాలపై అంతర్జాతీయ వాణిజ్య సూత్రాలకు విరుద్ధంగా ప్రతీకార చర్యలకు దిగారు. అగ్ర రాజ్యాలు మొదలుకుని చివరికి అసలు జనమే ఉండని అంటార్కిటికా వంటి ప్రాంతాలపై కూడా ఎడాపెడా టారిఫ్‌లు పెంచి నవ్వులపాలయ్యారు. పైగా వాటిని రోజుకోలా మారుస్తూ అత్యంత చంచల ధోరణి కనబరిచారు. ఇక చైనా విషయంలోనైతే టారిఫ్‌లను రోజురోజుకూ అంతకంతకూ పెంచుతూ వేలంపాటను తలపించారు. చివరికి 145 శాతం దాకా తీసుకెళ్లి దాన్నో కామెడీ వ్యవహారంగా మార్చేశారు. టారిఫ్‌ల భయంతో ప్రపంచ మార్కెట్లన్నీ కుప్పకూలి కోలుకోలేని రీతిలో లక్షలాది కోట్ల రూపాయల మేర నష్టాలను చవిచూశాక తీరిగ్గా వాటి అమలును మూడు నెలల పాటు వాయిదా వేశారు. టారిఫ్‌లకు ప్రతీకారంగా అరుదైన ఖనిజాల ఎగుమతిని చైనా పూర్తిగా నిలిపేయడంతో అమెరికా దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది.వలసలపై మొట్టి కాయలు అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపే పేరిట వలసదారుల గుండెల్లో ట్రంప్ రైళ్లు పరుగెత్తిస్తున్నారు. పగ్గాలు చేపట్టిన కొద్ది రోజులకే అక్రమ వలసదారులను భారీ ఖర్చుతో ఏకంగా సైనిక విమానాల్లో స్వదేశాలకు పంపారు. సుదీర్ఘ ప్రయాణం పొడవునా ఒళ్లంతా సంకెళ్లు వేసి విమర్శలు మూటగట్టుకున్నారు. తర్వాత వారిని గ్యాటెమాలా తదితర సమీప దేశాలకు తరలించి నిర్బంధంలో ఉంచడం మొదలుపెట్టారు. దీనిపై కోర్టుల మందలింపులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక విదేశీ విద్యార్థుల విషయంలోనైతే ట్రంప్ అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తున్నారు. ఐదారేళ్ల చరిత్రను తవ్వుతూ ఎక్కడ ఏ చిన్న తప్పిదం కనిపించినా దేశం వీడాలని ఆదేశిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన చిన్నాచితకా కారణాలకు కూడా వీసాలు రద్దు చేసి వెనక్కు పంపిస్తున్నారు. ఈ విషయంలో కోర్టులతో పదేపదే మొట్టికాయలు తింటూ వస్తున్నారు.డోజ్.. ఓవర్ డోస్ దుబారా వ్యయానికి కళ్లెం వేసేందుకంటూ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సారథ్యంలో తీసుకొచ్చిన డోజ్ పనితీరు అమెరికన్లలో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. లెక్కలేనన్ని ఉద్యోగాలను డోజ్ ఒక్క దెబ్బతో పీకిపారేసింది. కనీసం రెండు లక్షల కోట్ల డాలర్లు ఆదా చేస్తానని గొప్పగా చెప్పుకున్న మస్‌్క, ఓ రెండొందల కోట్ల డాలర్ల కంటే ఆదా కష్టమంటూ చివరికి చేతులెత్తేశారు. పైగా డోజ్ ముసుగులో అమెరికా ప్రభుత్వానికి సంబంధించిన కీలక, రహస్య డేటానంతా మస్క్ చేజిక్కించుకున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.జెలెన్స్కీకి అవమానం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని చర్చలకంటూ పిలిచి వైట్‌హౌస్‌లో మీడియా సాక్షిగా ట్రంప్, ఆయన డిప్యూటీ జేడీ వాన్స్ ఘోరంగా అవమానించిన తీరు చరిత్రలో నిలిచిపోయింది. దేశాధ్యక్షుడనే కనీస గౌరవం కూడా లేకుండా సూటిపోటి మాటలతో ఇద్దరూ రెచ్చిపోయారు. జెలెన్స్కీ ఎక్కడా తగ్గకుండా వాళ్లకు మాటకు మాట బదులిచ్చి శెభాష్ అనిపించుకున్నారు. చిర్రెత్తుకొచి్చన ట్రంప్ చివరికి ఆయన్ను వైట్‌హౌస్ నుంచి అవమానకర రీతిలో వెళ్లగొట్టిన తీరు చూసి ప్రపంచ దేశాలన్నీ షాక్‌కు గురయ్యాయి. ట్రంప్, వాన్స్ ప్రవర్తన వైట్‌హౌస్‌కే తీవ్ర కళంకమంటూ ఈసడించుకున్నాయి. ఆదరణ అట్టడుగుకు ట్రంప్ పట్ల అమెరికన్లలో వ్యతిరేకత నానాటికీ పెరిగిపోతోందని పోల్స్ అన్నీ ముక్త కంఠంతో చెబుతున్నాయి. అధ్యక్షుల తొలి 100 రోజుల పాలనకు జనామోదం విషయంలో ట్రంప్ గత 70 ఏళ్లలోనే అట్టడుగున నిలిచారు! ఆయన పాలనను గట్టిగా సమరి్థస్తున్న వారి సంఖ్య ఏకంగా 22 శాతానికి పడిపోయినట్టు సీఎన్ఎన్ పోల్ తేలి్చంది. గట్టిగా వ్యతిరేకించేవారి సంఖ్య 45 శాతానికి పెరిగింది. ముఖ్యంగా మార్చి నుంచి ట్రంప్ ఆదరణ శరవేగంగా అడుగంటుతూ వస్తోంది. టారిఫ్‌లపై ట్రంప్ తీరును 35 శాతం అమెరికన్లు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఆర్థికంగా దేశాన్ని ఆయన గట్టెక్కిస్తారని నమ్ముతున్న వారి సంఖ్య కూడా డిసెంబర్‌తో పోలిస్తే ఏకంగా 12 శాతం తగ్గింది. మతిలేని చర్యలతో దేశాన్ని ట్రంప్ ప్రమాదంలోకి నెడుతున్నారని 57 శాతం మంది భావిస్తున్నారు. ఆయన విదేశీ విధానాన్ని 60 శాతం మందికి పైగా తీవ్రంగా తప్పుబడుతున్నారు. వలసల విధానాన్ని కూడా 47 శాతం మంది ఆక్షేపిస్తున్నారు. ఉద్యోగ కల్పనలో ట్రంప్ తీరుతో 58 శాతం మంది పెదవి విరుస్తున్నారు. అధ్యక్షునిగా అధికారాన్ని బాధ్యతాయుతంగా వాడతారన్న నమ్మకం లేదని 54 శాతం మంది అమెరికన్లు అంటుండటం విశేషం. సరైన నాయకత్వం అందిస్తారని నమ్ముతున్నది 50 శాతమే. ఆయనకు ఓటేసి తప్పు చేశామని 20 శాతం మంది వాపోతుండటం పరిస్థితికి అద్దం పడుతోంది!దేశాలపై నోటి దురుసు కెనడా మొదలుకుని పలు దేశాలపై నోటి దురుసు వ్యాఖ్యలతో ట్రంప్ పరువు పోగొట్టుకున్నారు. అమెరికాలో 51వ రాష్ట్రంగా విలీనమైతే మేలంటూ అనవసర వ్యాఖ్యలు చేసి కెనడాతో శత్రుత్వాన్ని కొనితెచ్చుకున్నారు. పైగా ఆ దేశంపై విధించిన అడ్డగోలు టారిఫ్‌లతో అంతిమంగా అమెరికాకే నష్టం జరిగింది. అంతేగాక అమెరికాను ఇక జీవితంలో నమ్మేది లేదని కెనడా నాయకత్వంతో అనిపించుకున్నారు. గ్రీన్‌లాండ్‌ను ఆక్రమించేసుకుంటామని ప్రకటించి మరో వివాదాల తేనెతుట్టెను కదిపారు. గాజా నుంచి పాలస్తీనియన్లను పూర్తిగా తొలగించేసి దాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామంటూ తలాతోకా లేని ప్రకటన చేసి మొత్తం ముస్లిం ప్రపంచం ఆగ్రహానికి గురయ్యారు. ఉక్రెయిన్‌కు చేసిన యుద్ధ సాయానికి బదులుగా ఆ దేశ ఖనిజ నిల్వలను అమెరికాకు కట్టబెట్టాల్సిందేనంటూ భీష్మించుకున్నారు. రష్యాను ఒప్పించి ఒక్క రోజులో యుద్ధాన్ని ఆపిస్తానన్న ట్రంప్ ప్రకటన కూడా ఉత్తదేనని తేలిపోయింది. ‘పుతిన్‌కు యుద్ధం ఆపే ఉద్దేశమే లేనట్టుంది’ అంటూ ఇప్పుడాయన తీరిగ్గా నిట్టూరుస్తున్నారు.విద్యాసంస్థలపై ఉక్కుపాదం తన మాట వినడం లేదంటూ యూనివర్సిటీలపై ట్రంప్ కన్నెర్రజేశారు. ప్రపంచానికే తలమానికం వంటి అమెరికా విద్యా సంస్థల పునాదులనే పెకిలించే పనిలో పడ్డారు. వాటికి బిలియన్ల కొద్దీ ప్రభుత్వ నిధులను నిలిపేశారు. దారికొస్తే తప్ప వాటిని విడుదల చేసేది లేదంటున్నారు. అలా కొలంబియా వంటి వర్సిటీలను లొంగదీసుకున్నారు. కానీ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ మాత్రం ట్రంప్ తీరును తూర్పారబట్టింది. అణచివేత చర్యలకు తలొంచేది లేదని ప్రకటించింది. 300 కోట్ల డాలర్లకు పైగా నిధులను నిలిపేసినా ‘డోంట్ కేర్’ అనేసింది. -
ట్రంప్, జెలెన్స్కీ ఏకాంత చర్చలు
కీవ్: పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వాటికన్ సిటీకి వెళ్లిన అమెరికా అధ్యక్షుడు, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అక్కడే భేటీ అయ్యారు. అంత్యక్రియల కార్యక్రమానికి హాజరయ్యేందుకు ముందుగా వీరిద్దరూ సెయింట్ పీటర్స్ బసిలికాలో 15 నిమిషాలు మాట్లాడుకున్నారు. ప్రైవేట్‌గా సమావేశమైన ఇద్దరు నేతల మధ్య ఫలవంతమైన చర్చలు జరిగాయని వైట్‌హౌస్ కూడా తెలిపింది. ఇతర వివరాలను తర్వాత వెల్లడిస్తామని పేర్కొంది. మూడేళ్లుగా జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికేలా అత్యున్నత స్థాయి సమావేశం త్వరలోనే జరగనుందని అంతకుముందు రోమ్ చేరుకున్న ట్రంప్ తన సొంత ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ‘పుతిన్, జెలెన్స్కీ ఒప్పందానికి అతి సమీపంలో ఉన్నారు. యుద్ధం ముగింపునకు రావాలంటే వీరి సమావేశం జరగాలి. చాలా ముఖ్యమైన అంశాలపై ఏకాభిప్రాయం కుదిరింది. ఇప్పుడే ఈ రక్తపాతాన్ని ఆపాలి. క్రూరమైన, అర్థరహితమైన ఈ యుద్ధానికి ముగింపు పలుకుతాం’అని శుక్రవారం ఒక ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యానించారు. క్రిమియా రష్యాతోనే ఉంటుందని ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ దూత స్టీవ్ విట్కాఫ్ శుక్రవారం మాస్కోలో పుతిన్‌తో సమావేశమవడం తెల్సిందే. వాటికన్లో ట్రంప్‌తో భేటీ అనంతరం జెలెన్స్కీ సైతం సోషల్ మీడియాలో స్పందించారు. ‘ఒక్కో అంశాన్ని సవివరంగా చర్చించాం. వీటిపై సానుకూల ఫలితాలను ఆశిస్తున్నాం. ప్రజల ప్రాణాలను కాపాడుకోవడం, సంపూర్ణ, బేషరతు కాల్పుల విరమణ, మళ్లీ యుద్ధం రాకుండా నివారించే విశ్వసనీయమైన, శాశ్వత శాంతి మాకు కావాలి’అని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో అత్యంత కీలకమైన సమావేశాలు జరగనున్నాయని రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జరుగనున్న భేటీపై ఆయన సూచనప్రాయంగా తెలిపారు. ఇది చారిత్రాత్మకంగా మారే అవకాశం ఉందన్నారు. అయితే, భేషరతుగా కాల్పుల విరమణ ప్రకటించేలా రష్యాపై తక్షణమే ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. శనివారం మరోసారి చర్చలు కొనసాగించాలని ట్రంప్, జెలెన్స్కీ నిర్ణయించుకున్నారని ఉక్రెయిన్ అధ్యక్షభవనం ప్రతినిధి సెర్హి నికిఫొరోవ్ అంతకుముందు వెల్లడించారు. కానీ, పోప్ అంత్యక్రియలు ముగిసిన వెంటనే ట్రంప్ నేరుగా రోమ్ విమానాశ్రయం చేరుకుని, ఎయిర్ ఫోర్స్ విమానంలో అమెరికాకు బయలుదేరారు. దీంతో, రెండో సమావేశానికి అవకాశం లేకుండా పోయింది. -
భారత్, పాక్‌లది వెయ్యేళ్ల పోరు!
న్యూయార్క్: భారత్, పాక్ తమ ఉద్రిక్తతలను అంతర్గతంగానే పరిష్కరించుకుంటాయమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశాభావం వెలిబుచ్చారు. పోప్ అంత్యక్రియల నిమిత్తం వాటికన్ వెళ్తూ శుక్రవారం ఎయిర్‌ఫోర్స్‌వన్ విమానంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ క్రమంలో హాస్యాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత్, పాక్‌కు ఇది కొత్తేమీ కాదు. కశ్మీర్ కోసం ఇరుదేశాల మధ్య వెయ్యేళ్లకు పైగా పోరు నడుస్తోంది. బహుశా 1,500 ఏళ్లుగా అనుకుంటా’’అని చెప్పుకొచ్చారు. అంతేగాక పహల్గాం ఉగ్ర దాడిలో 30 మందికి పైగా పర్యాటకులు మరణించారంటూ సంఖ్యను కూడా తప్పుగానే చెప్పారు. ట్రంప్ వ్యాఖ్యలను నెటిజన్లు ఒక రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. కశీ్మర్ ఘర్షణల గురించి ట్రంప్‌కు తెలిసినంతగా బహుశా ఇంకెవరికీ తెలియదేమో అంటూ ఒకరు వ్యంగ్యంగా కామెంట్ చేశారు. ‘‘అవునా! నేనింకా పాకిస్తాన్ 1947లో పురుడు పోసుకుందనే అపోహలో ఉన్నా’’అని మరొకరు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. -
డొనాల్డ్ ట్రంప్‌పై ప్రజాగ్రహం
వాషింగ్టన్: అమెరికాను మరోసారి గొప్ప దేశంగా మారుస్తానంటూ రెండోసారి అధికారంలోకి వచ్చిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా నిరసనలు ఊపందుకుంటున్నాయి. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న విధానాలు అమెరికన్లకు ఎంతమాత్రం నచ్చడం లేదు. ట్రంప్ తీరును మెజార్టీ జనం తప్పుపడుతున్నారు. అమెరికాను నాశనం చేయొద్దని కోరుతున్నారు. అమెరికాలో రాచరికం లేదు, ట్రంప్ రాజు కాదు అంటూ జనం గొంతెత్తి నినదిస్తుండడం గమనార్హం. ట్రంప్‌కు వ్యతిరేకంగా శనివారం దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. జనం వీధుల్లోకి వచ్చి అధ్యక్షుడికి వ్యతిరేకంగా గొంతు విప్పారు. ప్లకార్డులు ప్రదర్శించారు. వైట్‌హౌస్ ఎదుట, టెస్లా కార్యాలయాల వద్ద, నగరాల్లోని ప్రధాన సెంటర్లలో జనం పెద్ద ఎత్తున గుమికూడారు. ట్రంప్ వ్యవహార శైలిపై ఆగ్రహం వెళ్లగక్కారు. చాలాచోట్ల ర్యాలీలు జరిగా యి. ఈ నిరసన ఉద్యమం ‘50501’గా పేరు పొందింది. ‘50 నిరసనలు, 50 రాష్ట్రాలు, ఒక ఉద్యమం’ అనేదే దీని అర్థం. సరిగ్గా 250 ఏళ్ల క్రితం అమె రికాలో ఇదే రోజు విప్లవ యుద్ధం ఆరంభమైంది. బ్రెగో గార్సియాను వెనక్కి రప్పించాలి ప్రభుత్వ ఉద్యోగాల్లో కోతలు విధించడానికి, ప్రభుత్వ ఖర్చులు తగ్గించడానికి డిపార్ట్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ(డోజ్) పేరిట ట్రంప్ ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థ పట్ల అమెరికన్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. శనివారం నాటి ప్రజాందోళనల్లో ఇది స్పష్టంగా కనిపించింది. ఎల్‌సాల్వెడార్ దేశానికి చెందిన బ్రెగో గార్సియా అనే వ్యక్తిని ప్రభుత్వం ఇటీవల బలవంతంగా స్వదేశానికి పంపించింది. ఈ ఉదంతాన్ని అమెరికన్లు తప్పుపట్టారు. గార్సియాను తిరిగి అమెరికాకు రప్పించాలని డిమాండ్ చేశారు. ట్రంప్‌ను ఎల్‌సాల్వెడార్‌కు తరిమేయాలంటూ కొందరు తేల్చిచెప్పారు. ప్రజల నిరసనలు చాలావరకు శాంతియుతంగానే జరిగాయి. ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు జరిగినట్లు తెలియరాలేదు. ‘నో కింగ్స్’ అని రాసి ఉన్న ప్లకార్డులు జనం ప్రదర్శించారు. ట్రంప్ రాచరిక పోకడలు ప్రదర్శిస్తున్నారంటూ పరోక్షంగా మండిపడ్డారు. ట్రంప్ పనితీరుకు 45 శాతం సానుకూలత మొదటి త్రైమాసికంలో ట్రంప్ పనితీరు పట్ల ఇటీవల నిర్వహించిన గ్యాలప్ సర్వేలో 45 శాతం మంది సానుకూలత వ్యక్తం చేశారు. తొలిసారిగా ఆయన అధ్యక్షుడైనప్పుడు తొలి త్రైమాసికంలో ఆయన పనితీరుకు 41 శాతం మంది అనుకూలంగా ఓటేశారు. అంటే ఈసారి ప్రజాదరణ కొంత పెరిగినట్లు స్పష్టమవుతోంది. కానీ, 1952 నుంచి 2020 దాకా అధ్యక్షులుగా పనిచేసిన నేతల తొలి త్రైమాసికం పనితీరుకు సగటున 60 శాతం జనామోదం లభించింది. అంటే వారితో పోలిస్తే ట్రంప్ వెనుకబడే ఉన్నారు. ఆయన జనవరిలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పుడు అప్రూవల్ రేటింగ్ 47 శాతంగా ఉన్నట్లు ఒక సర్వేలో తేలింది. అది ఇప్పుడు 43 శాతానికి పడిపోయింది. -
చైనా స్మార్ట్ఫోన్లపై సుంకాలు
వాషింగ్టన్: ప్రతీకార సుంకాలు విధించినా, నేరుగా బెదిరించినా చైనా దారికి రాకపోవడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడుతున్నారు. ఆ దేశంపై మరింతగా కత్తులు నూరుతున్నారు. చైనా స్మార్ట్ ఫోన్లతో పాటు ఆ దేశ ఎలక్ట్రానిక్ వస్తువులపై సుంకాలు విధించనున్నట్టు ఆయన తాజాగా ప్రకటించారు. అవి ఎంత శాతమన్నది సోమవారం వెల్లడిస్తానని తెలిపారు. ‘‘ఎలక్ట్రానిక్ వస్తువులకు నేను ప్రకటించిన సుంకాల మినహాయింపు చైనాకు వర్తించబోదు. వాటిపై కేవలం సుంకాల శాతం మార్పుచేర్పులు చేయబోతున్నామంతే’’ అని ఆదివారం ట్రంప్ వెల్లడించారు. ‘‘చైనా ఎలక్ట్రానిక్ వస్తువులకు సెమీ కండక్టర్ టారిఫ్‌లు వర్తించవచ్చని వాణిజ్య మంత్రి హొవార్డ్ లెట్నిక్ చెప్పుకొచ్చారు. అమెరికాకు అవసరమైన ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, ఔషధాలు.. ఇలా అన్ని వస్తువులూ దేశీయంగానే తయారు కావాలన్నది అధ్యక్షుని ఆలోచన అన్నారు. స్మార్ట్ఫోన్లతో పాటు చైనా నుంచి దిగుమతయ్యే అన్నిరకాల ఎలక్ట్రానిక్స్ వస్తువులనూ ఆ దేశంపై విధించిన 145 శాతం టారిఫ్ నుంచి మినహాయిస్తున్నట్టు అమెరికా కస్టమ్స్ విభాగం శనివారం నోటీసులో వెల్లడించడం తెలిసిందే. ఈ అంశంపై రెండు రోజుల్లోనే ట్రంప్ పిల్లమొగ్గ వేశారు. ఆ నోటీసు వాస్తవం కాదంటూ సొంత సోషల్ మీడియా హాండిల్ ట్రూత్‌సోషల్‌లో పోస్టు పెట్టారు. అమెరికాకు ఎలక్ట్రానిక్స్ వస్తువుల సరఫరాపై త్వరలో నేషనల్ సెక్యూరిటీ టారిఫ్స్ ఇన్వెస్టిగేషన్స్ భేటీలో కూలంకషంగా చర్చిస్తామని చెప్పుకొచ్చారు. -
చిందేసిన ట్రంప్..!
మియామి: వలసదారుల బహిష్కరణలు, సుంకాలతో హడలెత్తిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం కాస్త రిలాక్సయ్యారు. తన బృందంలో కీలక సభ్యులైన ఎలాన్ మస్క్, తులసీ గబార్డ్ తదితరులతో కలిసి ఫ్లోరిడాలోని మియామిలో అలి్టమేట్ ఫైటింగ్ చాంపియన్ షిప్ కార్యక్రమాన్ని తిలకించారు. అభిమానులతో కలిసి కాసేపు డ్యాన్స్ చేసి, పిడికిలి బిగించి ఉత్సాహపరిచారు. పూర్తిగా ఫిట్ 78 ఏళ్ల ట్రంప్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు ధ్రువీకరించారు. అమెరికా సర్వసైన్యాధ్యక్షుడిగా పనిచేసే సామర్ధ్యం ఆయనకుందని పేర్కొన్నారు. శుక్రవారం ట్రంప్‌కు జరిపిన సాధారణ వైద్య పరీక్షల ఫలితాలను వైట్‌హౌస్ విడుదల చేసింది. ‘2020లో అధ్యక్షుడిగా ఉండగా చివరిసారిగా జరిపిన పరీక్షల్లో ట్రంప్ 110.677 కిలోలుండగా ఇప్పుడు 9 కిలోలు తగ్గారు. రక్తంలో కొలెస్టరాల్ స్థాయిలు తగ్గాయి. అధ్యక్షుడిగా రోజూ సమావేశాలు, సభల్లో భేటీల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇటీవల ఓ గోల్ఫ్ పోటీలో విజేతగా నిలిచారు కూడా. ఆరోగ్యవంతుల్లో కొలెస్టరాల్ స్థాయి 200కు మించరాదు. బీపీ మాత్రం కాస్త ఎక్కువ (128/74)గా ఉంది. హృదయ స్పందన రేటు గతంలో మాదిరిగా 62గానే ఉంది. గుండెపోటు రిస్‌్కను నివారించేందుకు ట్రంప్ నిత్యం ఆస్పిరిన్ టాబ్లెట్ తీసుకుంటున్నారు’’ అని పేర్కొంది. Trump Dance at UFC 314 🇺🇸 pic.twitter.com/Ud01BkHp8M— Margo Martin (@MargoMartin47) April 13, 2025 -
భారతీయులే లక్ష్యంగా ట్రంప్ మరో బాంబు
అమెరికాలోని మనోళ్లపై తెంపరి ట్రంప్ మరో బాంబు పేల్చారు. గ్రీన్‌కార్డు, హెచ్1బీ వీసాలపై అక్కడ చట్టబద్ధంగా నివసిస్తున్న భారతీయులే లక్ష్యంగా మరో వేధింపుల పర్వానికి తెరతీశారు. వాళ్లు నిరంతరం తమ ఐడీ కార్డును విధిగా వెంట ఉంచుకోవాల్సిందేనని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు కఠిన నిబంధనను శుక్రవారం (ఏప్రిల్ 11) నుంచే అమల్లోకి తెచ్చింది. లేదంటే జరిమానాలతో పాటు కఠినచర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఇంకా ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోని అక్రమ వలసదారులను గుర్తించడంలో ప్రభుత్వానికి దోహదపడుతుందంటూ అక్కడి న్యాయస్థానం కూడా ఈ కఠిన నిబంధనకు పచ్చజెండా ఊపింది. అమెరికా పౌరసత్వంలేని 18 ఏళ్లు నిండిన వారంతా తమ చట్టబద్ధ నివాసానికి సంబంధించిన ఐడీ కార్డును 24 గంటలూ వెంట ఉంచుకోవాల్సిందేనని కొత్త నిబంధన సూచిస్తోంది. విదేశీయుల నమోదు చట్టం (1940)లోని ఈ విదేశీయుల నమోదు ఆవశ్యకత (ఏఆర్ఆర్) నిబంధనలు గతంలో ఉన్నవే. కానీ వాటిని ఏనాడూ అమలుచేయలేదు. కోర్టు అనుమతితో కోట్ల మంది అక్రమవలసదారులే లక్ష్యంగా ఈ నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని ట్రంప్ సర్కారు నిర్ణయించింది. హోంల్యాండ్ సెక్యూరిటీ మంత్రి క్రిస్టీ నోయెమ్ శుక్రవారం ఒక ప్రకటనలో ఈ మేరకు వెల్లడించారు. అమెరికాలో ప్రస్తుతం దాదాపు 54 లక్షల మంది భారతీయులున్నారు. 2022 గణాంకాల ప్రకారం 2.,2 లక్షల మంది భారతీయులు అక్కడ అక్రమంగా నివసిస్తున్నారు. అయితే మొత్తం అక్రమ వలసదారుల్లో వీరు కేవలం 2 శాతమేనని సమాచారం. ఏమిటీ నిబంధనలు ? అక్రమంగా వలస వచ్చిన విదేశీయులు, చాన్నాళ్లుగా అమెరికాలో అక్రమంగా ఉంటూ ఇప్పటిదాకా వివరాలు నమోదు చేసుకోని వలసదారులను గుర్తించి దేశం నుంచి బహిష్కరించడమే లక్ష్యంగా ఈ కఠిన నిబంధనలను తెచ్చారు. వాటి ప్రకారం అమెరికాకు వచ్చి 30 రోజులకు మించి ఉండాలనుకునే వాళ్లు తమ వీసా, ఐడీ కార్డులను కచి్చతంగా అనుక్షణం వెంట ఉంచుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో అధికారులు సోదాలు, తనిఖీల వేళ ప్రశ్నిస్తే వెంటనే వాటిని చూపించాలి. లేదంటే జరిమానాలు, ఇతర కఠిన చర్యలను ఎదుర్కోక తప్పదు. దీని ప్రకారం అమెరికా పౌరసత్వం లేని 18 ఏళ్లు నిండిన వాళ్లంతా ఐడీ కార్డును వెంటే ఉంచుకోవాలి. అమెరికా పౌరులు కాని 14 ఏళ్లు నిండిన టీనేజర్ వివరాలను విధిగా నమోదు చేయించుకోవాలి. 14వ పుట్టినరోజుకు ముందు నమోదు చేసినా మళ్లీ కొత్తగా నమోదు చేసుకుని మరోసారి వేలిముద్రల వంటివి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు టీనేజర్ 325ఆర్ దరఖాస్తు సమరి్పంచాలి. వారి తల్లిదండ్రులు సైతం 30 రోజుల్లోపు కచి్చతంగా నమోదు చేయించుకోవాలి. ..అయినా ఉండనివ్వరు మరోసారి నమోదు చేసుకున్నా వారిని అమెరికాలో ఉండనిచ్చే ప్రసక్తే లేదని ట్రంప్ సర్కారు స్పష్టం చేసింది. అక్రమవలసదారుల వాస్తవిక సంఖ్యను తేల్చడం, వారిని కనిపెట్టి వెళ్లగొట్టడమే రీ రిజి్రస్టేషన్ లక్ష్యమని హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు చెప్పారు. తాజాగా నమోదు సమయంలో కొత్త అడ్రస్, వ్యక్తిగత, కుటుంబ వివరాలు తెలపాల్సి ఉంటుంది. వాటిని కావాలని మార్చి రాస్తే స్వదేశానికి బదులు జైలుకు పంపవచ్చని కూడా తెలుస్తోంది. కఠిన నిబంధనలు అమల్లోకి వచ్చాక కూడా పేర్లను నమోదు చేయనివారు సోదాలు, తనిఖీల్లో దొరికితే భారీ జరిమానా, ఆర్నెల్ల దాకా జైలుశిక్ష వేస్తారు. అడ్రస్ అప్డేట్ చేయకుంటే 5 వేల డాలర్ల జరిమానా గ్రీన్‌కార్డు, వీసాదారులు మరో చోటుకు మారితే కొత్త చిరునామాను ప్రభుత్వానికి కచ్చితంగా తెలియజేయాలి. 10 రోజుల్లోపు తెలపని పక్షంలో 5,000 డాలర్ల జరిమానా విధిస్తారు. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాక గ్రీన్‌కార్డు, హెచ్–1బీ వీసాదారులు తమ సమాచారాన్ని మరోసారి నమోదు చేయించుకోవాల్సిన పనిలేదు. కాకపోతే గ్రీన్‌కార్డ్, హెచ్1బీ ఐడీ కార్డును మాత్రం ఎప్పుడూ విధిగా వెంట ఉంచుకోవాల్సిందే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
టార్గెట్ చైనా ఎందుకంటే..!
కాళ్లబేరానికి వచ్చిన కారణంగా డజన్ల కొద్దీ ప్రపంచదేశాలపై ఆంక్షల కత్తిని దింపకుండా 90 రోజులు ఆగుతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ప్రకటించారు. వాస్తవానికి బుధవారం నుంచే అన్ని దేశాలపై పెరిగిన టారిఫ్‌లు అమల్లోకి రావాల్సి ఉండగా ఆఖరి నిమిషంలో ట్రంప్ తన నిర్ణయాన్ని అనూహ్యంగా వాయిదా వేశారు. అయితే ఇందులో అనూహ్యమేమీ లేదని, ట్రంప్ అసలు లక్ష్యం ఈ దేశాలు కాదని, చైనాయే అసలు లక్ష్యమని కొందరు అంతర్జాతీయ వాణిజ్యరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వాళ్లు చెప్పినట్లు నిజంగానే ట్రంప్ కేవలం చైనా ఉత్పత్తులు, ఎగుమతి మార్కెట్‌పై కత్తిగట్టారా? అనే చర్చ ఇప్పుడు వాణిజ్యవర్గాల్లో మొదలైంది. దీనికి కొన్నేళ్ల క్రితమే బీజాలు పడ్డాయని తెలుస్తోంది. తొలి దఫా పగ్గాలు చేపట్టినప్పుడేదాదాపు 13 ఏళ్ల క్రితంనాటి సంగతి. చైనా వాణిజ్య రాజధాని షాంఘైలో హఠాత్తుగా అంతర్జాతీయ వాణిజ్య సంబంధాల బలోపేతంపై విస్తృతస్థాయి సమావేశాలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వస్తూత్పత్తుల వినిమయ అవకాశం ఉన్న దేశాలతో చైనా వాణిజ్య సంబంధాలను బలపర్చుకుంది. అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, కంపెనీలు, దేశాల ప్రభుత్వాలతో చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం చర్చలు జరిపింది. చవగ్గా సరుకుల సరఫరాపై ఒప్పందాలు కుదిరాయి. విదేశీ సంస్థల ప్రతినిధులు, చైనా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉన్నతాధికారులు, ప్రముఖ ఆర్థికవేత్తల మధ్య సఖ్యత కుదిరింది. దీంతో చైనా నుంచి అన్ని రకాల ఉత్పత్తుల ఎగుమతి అనూహ్యంగా ఊపందుకుంది. చైనాకు నిరాయుధ సైన్యంగా పేరొందిన కార్మికుల కష్టంతో పురుడుపోసుకున్న లక్షల కోట్ల రూపాయల వస్తువులు ప్రపంచదేశాలకు ఎగుమతి అయ్యాయి. ఆ పరంపర అప్రతిహతంగా కొనసాగి అమెరికాను తోసిరాజని చైనా ప్రపంచ ఎగుమతి కేంద్రంగా మారింది. మారిన ఈ పరిణామాలను ట్రంప్ అస్సలు జీర్ణించుకోలేకపోయారు. తక్కువ ధరకే వస్తువులు లభిస్తుండటంతో ప్రపంచదేశాల కీలక వ్యాపారసంస్థలన్నీ చైనాకే క్యూకట్టాయి. అక్కడ ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పాయి. రోల్స్ రాయిస్, జనరల్ మోటార్స్, ఫోక్స్‌వ్యాగన్ సంస్థల ఉత్పత్తులూ చైనాలో తయారవడం మొదలైంది. దీంతో దశాబ్దాల చరిత్ర కల్గిన అమెరికాలోని కొన్ని కంపెనీల నుంచి ఉత్పత్తి తగ్గింది. దీంతో అమెరికా పరిశ్రమల్లో కార్మికుల జీవితాల్లో వెలుగులు తగ్గిపోయాయి. అమెరికాకు పరిశ్రమల నుంచి రెవెన్యూ పడిపోయింది. అమెరికా పారిశ్రామికరంగానికి పూర్వవైభవం తెస్తానని తొలిసారి ఎన్నికల్లో పోటీచేసినప్పుడే ట్రంప్ ఓటర్లకు మాటిచ్చారు. గెలిచి అధికారం చేపట్టారు. కానీ ఆ నాలుగేళ్లలో అనుకున్న వ్యూహాలను అమలుచేయలేకపోయారు. దీనికి ఇతరత్రా కారణాలున్నాయి. ఇప్పుడు రెండోదఫా అధికారంలోకి రాగానే పాత ప్రణాళికలకు పదునుపెట్టి ప్రయోగిస్తున్నారు. దాని ఫలితమే ఈ టారిఫ్‌ల పరంపర. ఎగుమతులు పెరిగాక చైనాలో ఏం జరిగింది? ఎగుమతులతో చైనా ఆర్థికాభివృద్ది సాధించాక అక్కడ పౌరులు పాలనలో సంస్కరణలు కోరుకున్నారు. కానీ ఏక పార్టీ, నియంతృత్వపాలనలో ఆ కల నెరవేరలేదు. కొనుగోలు శక్తి పెరిగాక వినిమయ సమాజంగా అభివృద్ధి చెందాలని జనం భావించినా అదీ నెరవేరలేదు. ప్రభుత్వం కేవలం ఎగుమతులపైనా దృష్టిసారించింది. 2015లో బహిర్గతమైన ‘‘మేడిన్ చైనా 2025’ బ్లూప్రింట్ సైతం ఇదే విషయాన్ని ఉద్ఘాటించింది. గుండుసూది నుంచి గగనతల రక్షణ వ్యవస్థలదాకా, విద్యుత్వాహనాలు మొదలు అధునాతన యుద్ధవిహంగాల దాకా ప్రతిరంగంలో అగ్రగామిగా వెలుగొందడమే లక్ష్యంగా ముందుకుసాగి ఆ పనిలో సఫలీకృతమైంది. ఇదే సమయంలో అమెరికాలో ట్రంప్ రాజకీయ రంగప్రవేశంచేసి చైనా ఎగుమతి మార్కెట్ ఎదుగుదలకు అడ్డుకట్టవేయాలని కంకణం కట్టుకున్నారు. ఎన్నికల హామీల్లోనే అదే చెప్పారు. చైనా ఇప్పటికే ప్రపంచంలోని మొత్తం విద్యుత్ వాహనాల తయారీలో 60 శాతం వాటాను ఒడిసిపట్టింది. ఈ 60 శాతంలోకూడా అధిక బ్రాండ్లు స్వదేశానివే కావడం విశేషం. ఇక బ్యాటరీల్లోనూ 80 శాతం అక్కడే తయారవుతున్నాయి. వీటిని దెబ్బకొట్టేందుకే ట్రంప్ టారిఫ్‌ల కొరడాను ఝుళిపిస్తున్నారు. చైనా పరిశ్రమలను దెబ్బకొడితే అమెరికా పరిశ్రమలకు పునరుజ్జీవం సాధ్యమని ట్రంప్ బలంగా నమ్ముతున్నారు. ట్రంప్ నిర్ణయం యావత్ ప్రపంచ వాణిజ్యవ్యవస్థనే కుదుపునకు గురయ్యేలా చేస్తోంది. ఇప్పుడేం జరగొచ్చు? అతి టారిఫ్‌ల భారాన్ని అమెరికా తమపై మోపిన నేపథ్యంలో చైనా ముంగిట ఇప్పుడు రెండు మార్గాలున్నాయి. సంప్రదింపుల ప్రక్రియ ద్వారా టారిఫ్‌లను చైనా తగ్గించుకోవచ్చు. ఇందుకోసం చైనా తన ఎగుమతి ఆధారిత ఆర్థికవ్యవస్థ విధానాలను అమెరికాకు అనుగుణంగా మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే చైనా గత చరిత్రను చూస్తే ఇది జరగకపోవచ్చని అర్థమవుతుంది. అగ్రగామి ప్రపంచ ఆర్థిక శక్తిగా మారేందుకు ఎన్నాళ్లనుంచో చైనా కలలుకంటోంది. అందుకోసమే ప్రభుత్వ వ్యతిరేకతను ఉక్కుపాదంతో అణిచివేస్తూ దాదాపు ప్రజలందర్నీ ఓ మోస్తరు వృత్తినిపుణులుగా మార్చేసింది. ఆట»ొమ్మలు మొదలు ఫోన్లదాకా అన్ని వస్తువులు కుటీరపరిశ్రమల్లా ఇళ్లలోనే తయారవుతాయి. చైనాలో ఏం జరుగుతోందనే వివరాలు బయటకు పొక్కకుండా మీడియాపైనా కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. సొంత టెక్నాలజీనే నమ్ముకున్న ప్రభుత్వం దేశీయ సంస్థలు మినహా చైనా గడ్డపై ఎవరినీ ఎదగనీయదు. ఈ నేపథ్యంలో అమెరికా టెక్నాలజీ కంపెనీలకు చైనా గడ్డపై ఎదిగేందుకు ఒప్పుకోకపోవచ్చు. టారిఫ్‌ల భయాలతో విదేశీ కంపెనీలు చైనాలో పెట్టుబడులను తగ్గించుకుని అమెరికాలో పెట్టుబడులను పెంచుకుంటాయని ట్రంప్ భావిస్తున్నారు. చైనాకు ఆర్డర్లు ఇవ్వడం మానేసి అమెరికన్ కంపెనీలు మళ్లీ దేశీయంగా కర్మాగారాలను తెరుస్తాయని ట్రంప్ ఆశిస్తున్నారు. అదే నిజమైతే మళ్లీ అమెరికాలో కొత్త పారిశ్రామిక విప్లవం రావొచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
టారిఫ్ ‘రిలీఫ్’ ర్యాలీ..!
న్యూఢిల్లీ: చైనా మినహా మిగతా దేశాలపై ప్రతీకార సుంకాలు 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు బలంగా పుంజుకున్నాయి. బుధవారం రాత్రి అమెరికా నాస్డాక్ ఇండెక్స్ 12.16%, ఎస్అండ్పీ సూచీ 9.52%, డోజోన్స్ ఇండెక్స్ 8% లాభపడ్డాయి. యూఎస్ నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న ఆసియా, యూరప్ మార్కెట్లు గురువారం రాణించాయి. జపాన్ నికాయ్ 9%, దక్షిణ కొరియా కోస్పీ 7%, సింగపూర్ స్ట్రెయిట్ టైమ్స్ 5%, హాంగ్‌కాంగ్ హాంగ్ సెంగ్ 2%, చైనా షాంఘై ఒకశాతం పెరిగాయి. యూరప్‌లో జర్మనీ డాక్స్ 5%, ఫ్రాన్స్ సీఏసీ 5%, బ్రిటన్ ఎఫ్టీఎస్ఈ నాలుగు శాతం పెరిగాయి. కాగా బుధవారం భారీగా ర్యాలీ చేసిన అమెరికా మార్కెట్లో గురువారం లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. దీంతో అమెరికా మార్కెట్లు మళ్లీ భారీ గా పడ్డాయి. నాస్డాక్ 5% క్షీణించి 16,292 వద్ద, డోజోన్స్ 3% పడి 39,184 వద్ద, ఎస్అండ్పీ 4% నష్టంతో 5,243 వద్ద ట్రేడవుతోంది. భారత మార్కెట్ భారీ గ్యాప్‌అప్..? అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూలతల కారణంగా శుక్రవారం దేశీయ మార్కెట్ భారీ గ్యాప్‌అప్‌తో ప్రారంభం కావచ్చని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నాయి. ఇందుకు సంకేతంగా దలాల్ స్ట్రీట్‌ను ప్రతిబింబించే గిఫ్ట్ నిఫ్టీ 3% (680 పాయింట్లు) పెరిగింది. శ్రీ మహావీర్ జయంతి సందర్భంగా భారత మార్కెట్ గురువారం పనిచేయలేదు. భారత్‌తో సహా 60 దేశాల నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులపై ఏప్రిల్ 2 నుంచి ట్రంప్ భారీగా పన్నులు వడ్డించారు. దీంతో అంతర్జాతీయంగా ప్రపంచ వాణిజ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. నాటి (ఏప్రిల్ 2)నుంచి సెన్సెక్స్ 2,770 పాయింట్లు(3.61%), నిఫ్టీ 933 పాయింట్లు(4%) క్షీణించాయి. ఇన్వెస్టర్ల సంపద రూ.19.15 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయి రూ.393.82 లక్షల కోట్లకు దిగివచి్చంది.మన మార్కెట్లోనూ దూకుడు...! నిఫ్టీ సుమారు 700 పాయింట్లు లాభంతో ట్రేడింగ్ ప్రారంభించవచ్చు. షార్ట్ కవరింగ్‌తో మార్కెట్ భారీగా పెరిగే అవకాశం ఉంది. విస్తృత స్థాయిలో కొనుగోళ్ల పర్వం కొనసాగొచ్చు. ఐటీ షేర్లు బౌన్స్‌బ్యాక్ అయ్యే వీలుంది. ఫార్మా షేర్లు డిమాండ్ లభించవచ్చు. లార్జ్ క్యాప్ బ్యాంకులు, ఫైనాన్షియల్స్ షేర్లు ర్యాలీ చేయొచ్చు. అమెరికా–చైనా ట్రేడ్ వార్ ముదరడంతో విదేశీ ఇన్వెస్టర్లు త్వరలో భారత ఈక్విటీల కొనుగోళ్లకు ఆసక్తి చూపొచ్చు. – వీకే విజయ్‌కుమార్, జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ చీఫ్ స్ట్రాటజిస్ట్ -
టారిఫ్‌లకు ట్రంప్ బ్రేక్
ప్రపంచవ్యాప్త ఆర్థిక ప్రకంపనల నేపథ్యంలో ట్రంప్ వెనక్కు తగ్గారు. భారత్‌తో పాటు 75 పై చిలుకు దేశాలపై విధించిన ప్రతీకార సుంకాలను తాత్కాలికంగా పక్కన పెట్టారు. వాటి అమలును 90 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. దాంతో అదనపు సుంకాలు అమల్లోకి వచ్చిన ఒక్క రోజులోనే అటకెక్కాయి. కానీ చైనాతో మాత్రం అమెరికా టారిఫ్‌ల పోరు బుధవారం మరింత తీవ్రరూపు దాల్చింది. ఈ దిశగా రోజంతా శరవేగంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. 50 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే అమెరికాపైనా చైనా అంతే మొత్తం బాదింది. అమెరికా ఉత్పత్తులపై 84 శాతం సుంకాలు గురువారం నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. దీనిపై ట్రంప్ తీవ్రంగా కన్నెర్రజేశారు. చైనా ఉత్పత్తులపై ఇప్పటికే 104 శాతానికి చేరిన సుంకాలను ఏకంగా 125 శాతానికి పెంచేశారు. అవి తక్షణం అమల్లోకి వస్తాయని కుండబద్దలు కొట్టారు. మరోవైపు యూరోపియన్ యూనియన్ కూడా అమెరికాపై మళ్లీ సుంకాల కత్తి ఝుళిపించింది. 23 బిలియన్ల విలువైన యూఎస్ ఉత్పత్తులపై దశలవారీగా అదనపు టారిఫ్‌లు విధిస్తున్నట్టు ప్రకటించింది. కెనడా కూడా అమెరికా ఆటో ఉత్పత్తులపై 25 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్టు పేర్కొంది. బీజింగ్/వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నట్టుండి వెనక్కు తగ్గారు. తన ఎడాపెడా టారిఫ్‌ల దెబ్బకు ప్రపంచ మార్కెట్లు కుదేలవడమే గాక ఆర్థిక మాంద్య పరిస్థితులు తలెత్తడంతో పునరాలోచనలో పడ్డారు. చైనా మినహా 75 పై చిలుకు దేశాలపై విధించిన ప్రతీకార సుంకాల అమలును 90 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు బుధవారం ప్రకటించారు. ‘‘ఆ దేశాలు చైనా మాదిరిగా మాపై తిరిగి ప్రతీకార చర్యలకు పాల్పడలేదు. పైగా టారిఫ్‌లపై మాతో చర్చలకు ముందుకొస్తున్నాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా’’ అని సొంత సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. దాంతో భారత్ సహా ఆయా దేశాలకు తాత్కాలికంగా ఊరట లభించింది. భారత్‌పై ట్రంప్ 26 శాతం అదనపు సుంకాలు విధించడం తెలిసిందే. లెసొతో (50 శాతం), మడగాస్కర్ (47), వియత్నాం (46), తైవాన్ (32), దక్షిణ కొరియా (25), జపాన్, ఈయూ (20) తదితర దేశాలపైనా భారీగా వడ్డించారు. బుధవారం అమల్లోకి వచ్చిన ఈ సుంకాలు 24 గంటలు కూడా గడవకముందే వాయిదా పడ్డాయి. అయితే ఆ దేశాలన్నింటిపైనా 10 శాతం బేస్‌లైన్ టారిఫ్ మాత్రం కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. చైనాపై మాత్రం ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘మాపట్ల, ప్రపంచ మార్కెట్ల పట్ల చైనా ఏమాత్రమూ గౌరవం చూపలేదు. పట్టు వీడి దిగి రావాల్సింది పోయి అర్థం లేని దూకుడుకు పోయింది’’ అంటూ తీవ్రంగా ఆక్షేపించారు. చైనాపై ఇప్పటికే విధించిన 104 శాతం సుంకాలను ఏకంగా 125 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించారు. అవి తక్షణం అమల్లోకి వచ్చాయని ట్రంప్ స్పష్టం చేశారు. ఒక దేశంపై అమెరికా విధించిన అత్యధిక సుంకాలు ఇవే కావడం విశేషం! ట్రంప్ దూకుడుపై తామేమీ చేతులు ముడుచుకు కూచోబోమన్న డ్రాగన్ దేశం అన్నంత పనీ చేసింది. అమెరికాపై మరో 50 శాతం ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించింది. ‘‘ఇప్పటికే ప్రకటించిన 34 శాతంతో కలిపి గురువారం నుంచి అమెరికా ఉత్పత్తులన్నింటి మీదా 84 శాతం సుంకాలు వసూలు చేస్తాం. అవి గురువారం నుంచే అమల్లోకి వస్తాయి’’ అని పేర్కొంది. దాంతో పెద్దన్నల పోట్లాట కాస్తా ముదురు పాకాన పడింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దాదాపు సగం మేరకు వాటా ఉండే అమెరికా, చైనా టారిఫ్‌ల యుద్ధం తారస్థాయికి చేరింది. మరోవైపు అమెరికా దిగుమతి చేసుకునే అన్నిరకాల ఆటో ఉత్పత్తులపైనా గత గురువారం నుంచే 25 శాతం టారిఫ్ అమల్లోకి వచి్చంది. ఇది ప్రస్తుతానికి కార్లపై మాత్రమే వసూలవుతున్నా మే 3 నుంచి ఆటో విడిభాగాలకూ వర్తించనుంది. దీనికి ప్రతీకారంగా అమెరికా ఆటో ఉత్పత్తులపై బుధవారం నుంచే 25 శాతం సుంకాలు విధిస్తున్నట్టు కెనడా కూడా ప్రకటించింది. తగ్గే ప్రసక్తే లేదు: చైనా అమెరికా దుందుడుకు చర్యలను దీటుగా ఎదుర్కొంటామని, ఈ విషయంలో తగ్గే ప్రసక్తే లేదని చైనా కుండబద్దలు కొట్టింది. ఆ దేశంపై సుంకాలను 84 శాతానికి పెంచుతున్నట్టు చైనా కస్టమ్స్ టారిఫ్ కమిషన్‌ను ఉటంకిస్తూ అధికార వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది. అంతేకాదు, ‘‘ఇప్పటికే ప్రకటించినట్టు మరో 12 యూఎస్ కంపెనీలను ఎగుమతి నియంత్రణ జాబితాలో చేరుస్తున్నాం. వీటితో పాటు మా అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ తైవాన్‌కు ఆయుధాల విక్రయం వంటి చర్యలకు దిగిన ఆరు అమెరికా సంస్థలను అనుమానాస్పద జాబితాలో చేరుస్తున్నాం’’ అని కమిషన్ ప్రకటించింది. అమెరికాది ఫక్తు ఏకపక్ష పోకడ అని దుయ్యబడుతూ చైనా శ్వేతపత్రం కూడా విడుదల చేసింది. ఇరుదేశాల కీలక ప్రయోజనాలను పరస్పరం గౌరవించుకుంటూ సాగాల్సింది పోయి మతిలేని నిర్ణయాలు తీసుకుంటోందంటూ తూర్పారబట్టింది. అమెరికా టారిఫ్‌లను తీవ్ర తప్పిదంగా అభివరి్ణంచింది. అవి చైనా హక్కులను, ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బ తీస్తున్నాయంటూ దుయ్యబట్టింది. దీనిపై ప్రపంచ వాణిజ్య సంస్థలో బుధవారం అదనపు దావా కూడా వేసింది.హాలీవుడ్ సినిమాలపై నిషేధం అమెరికాపై మరిన్ని ప్రతీకార చర్యలకు చైనా సన్నద్ధమవుతోంది. అందులో భాగంగా హాలీవుడ్ సినిమాలపై కూడా నిషేధం విధించాలని యోచిస్తున్నట్టు సమాచారం. అదే జరిగితే వందలాది కోట్ల డాలర్ల విలువైన చైనా మార్కెట్ హాలీవుడ్‌కు దూరమవుతుంది. ఆ పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బే’’ అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అమెరికా తర్వాత ప్రపంచంలో రెండో అతి పెద్ద సినీ మార్కెట్ చైనాయే. దీనితోపాటు అమెరికాపై చైనా పరిశీలనలో ఉన్న ఇతర ప్రతీకార చర్యలు... → చైనాతో వ్యాపారం చేస్తున్న అమెరికా సేవా రంగ సంస్థలపై ఆంక్షలు, నిషేధాలు → సోయాబీన్ తదితర అమెరికా వ్యవసాయోత్పత్తులపై భారీ సుంకాలు → చైనాలో ఉన్న అమెరికా కంపెనీలపై అనుచిత మేధో సంపత్తి లబ్ధి అభియోగాలపై విచారణ ఈయూ అదనపు టారిఫ్‌లు బ్రసెల్స్: అమెరికాకు యూరోపియన్ యూనియన్ కూడా మరో సుంకాల షాకిచ్చింది. ఈయూ స్టీల్, అల్యుమినియం దిగుమతులపై ట్రంప్ విధించిన 25 సుంకాలకు ప్రతీకార చర్యలు ప్రకటించింది. ఏకంగా 2,300 కోట్ల డాలర్ల విలువైన అమెరికా ఉత్పత్తులపై అదనపు సుంకాలు విధిస్తున్నట్టు బుధవారం పేర్కొంది. ఇవి దశలవారీగా అమల్లోకి వస్తాయి. ఉత్పత్తుల పేర్లు చెప్పకపోయినా, కొన్నింటిపై ఏప్రిల్ 15 నుంచి, మరికొన్నింటిపై మే 15, ఇంకొన్నింటిపై డిసెంబర్ 1న సుంకాల వసూలు మొదలవుతుందని వివరించింది. ‘‘ఈయూపై అమెరికా సుంకాలు అన్యాయం ఇరుపక్షాలకే గాక ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే హానికరం కూడా’’ అంటూ ఈయూ ఎగ్జిక్యూటివ్ కమిషన్ దుయ్యబట్టింది. అమెరికా, ఈయూ వార్షిక వర్తక విలువ ఏకంగా 1.8 లక్షల కోట్ల డాలర్లు కావడం విశేషం! ఈ నేపథ్యంలో ట్రంప్‌కు హెచ్చరికగా మాత్రమే తాజా సుంకాలను ప్రకటించినట్టు భావిస్తున్నారు. ఈయూ ఉత్పత్తులన్నింటిపైనా ట్రంప్ 20 శాతం సుంకాలు విధించడం తెలిసిందే.దేశాలన్నీ కాళ్ల బేరానికి: ట్రంప్ తన టారిఫ్‌ల దెబ్బకు ప్రపంచ దేశాలు విలవిల్లాడుతున్నాయని ట్రంప్ చెప్పుకున్నారు. ‘‘టారిఫ్‌లను తప్పించుకునేందుకు ఏం చేయడానికైనా సిద్ధమంటున్నాయి. దయచేసి ఒప్పందం చేసుకుందామంటూ కాళ్లబేరానికి వస్తున్నాయి’’ అంటూ గొప్పలు పోయారు. ఆ క్రమంలో ఓ బూతు పదాన్నీ అధ్యక్షుడు ఉపయోగించారు! -
మరో 50 శాతం వేస్తాం
వాషింగ్టన్: చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. అమెరికాపై 34 శాతం ప్రతీకార సుంకాలు విధించడంపై తీవ్రంగా మండిపడ్డారు. ఆ నిర్ణయాన్ని మంగళవారంలోగా వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే బుధవారం నుంచి చైనాపై ఏకంగా మరో 50 శాతం అదనపు సుంకాలు విధిస్తానని సోమవారం హెచ్చరించారు. అంతేకాదు, ‘‘చైనా విజ్ఞప్తి మేరకు పలు అంశాలపై ఆ దేశంతో పురోగతిలో ఉన్న అన్నిరకాల చర్చలనూ ఉన్నపళాన నిలిపేస్తాం. బదులుగా ఇతర దేశాలపై దృష్టి సారిస్తాం. ఆయా రంగాల్లో వాటితో బంధాలను పటిష్టం చేసుకుంటాం’’ అని కుండబద్దలు కొట్టారు. చైనాపై ట్రంప్ ఇటీవలే 34 శాతం సుంకాలు విధించడం, బదులుగా అమెరికాపైనా అంతే శాతం సుంకాలు విధిస్తున్నట్టు చైనా ప్రకటించడం తెలిసిందే. అంతేగాక తమనుంచి అమెరికా దిగుమతి చేసుకుంటున్న పలు కీలక ఖనిజాలపై ఆంక్షలు కూడా విధించింది. దీనిపై ట్రంప్ తీవ్రంగా మండిపడుతూ తన సోషల్ మీడియా హాండిల్ ట్రూత్‌లో పలు పోస్టులు పెట్టారు. ‘‘అమెరికా ఉత్పత్తులపై చైనా ఏళ్లుగా రికార్డు స్థాయిలో భారీ టారిఫ్‌లు వసూలు చేస్తోంది. అవి చాలవన్నట్టు నిన్న మరో 34 శాతం ప్రతీకార సుంకాలు విధించింది. ఇవిగాక చైనా కంపెనీలు అనైతిక సబ్సిడీలు, భారీ ద్రవ్య అవకతవకల వంటివాటికి పాల్పడుతూ వస్తున్నాయి! నేను విధించిన సుంకాలపై ఏ దేశమైనా ప్రతీకార చర్యలకు దిగితే సహించబోమని స్పష్టంగా హెచ్చరించా. వాటిపై అదనపు బాదుడు తప్పదని అప్పుడే స్పష్టం చేశా. చైనా ఇప్పుడు వాటిని రుచిచూడబోతోంది’’ అని ప్రకటించారు. అమెరికాలో ద్రవ్యోల్బణం లేదు తన సుంకాల దెబ్బకు ప్రపంచ మార్కెట్లన్నీ పతనమవుతున్నా ట్రంప్ మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. అమెరికా ద్రవ్యోల్బణం కోరల్లో చిక్కుతోందని ఆర్థిక నిపుణులంతా గగ్గోలు పెడుతున్నా అదేమీ లేదని చెప్పుకొచ్చారు. ఎవరేమన్నా సుంకాలపై తగ్గే ప్రసక్తే లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలంటికీ అమెరికా గత పాలకులు, తమను ఇంతకాలంగా దోచేసిన చైనా వంటి దేశాలే కారణమని నిందించారు. ‘‘ఒక్కోసారి చేదుగా ఉన్నా చికిత్స తప్పదు. నా చర్యల ఫలితాలు ఇప్పటికే కని్పస్తున్నాయి. చమురు ధరలు దిగొచ్చాయి. వడ్డీ రేట్లూ తగ్గుముఖం పడుతున్నాయి. ఆహార పదార్థాల ధరలూ తగ్గుతున్నాయి. ఇక ద్రవ్యోల్బణం ఎక్కడున్నట్టు? పలు దేశాలు అమెరికాను ఇంతకాలం పీల్చి పిప్పి చేశాయి. ముఖ్యంగా చైనా! ఇప్పుడు చూడండి, నా టారిఫ్‌ల దెబ్బకు చైనా మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఇకపై అమెరికాకు ప్రతి వారం ఏకంగా బిలియన్ల కొద్దీ డాలర్లు వచి్చపడతాయి. చూసుకోండి’’ అంటూ స్పష్టం చేశారు.ఇక భారత్‌లోనే ఉత్పత్తి! యాపిల్, సామ్సంగ్ యోచన మొబైళ్ల తయారీ దిగ్గజాలు యాపిల్, సామ్సంగ్ ట్రంప్ టారిఫ్‌ల ప్రభావాన్ని తప్పించుకునే మార్గాల అన్వేషణలో పడ్డాయి. తమ అంతర్జాతీయ ఉత్పత్తి కేంద్రాలను లాభదాయక ప్రాంతాలకు తరలించాలని యోచిస్తున్నాయి. వియత్నాంపై 46 శాతం చైనాపై 34 శాతం చొప్పున సుంకాలు విధించిన ట్రంప్ భారత్‌పై 26 శాతంతో సరిపెట్టడం తెలిసిందే. దాంతో భారత్‌లో ఉత్పత్తిని వీలైనంతగా పెంచడంతో పాటు అంతర్జాతీయ ఉత్పత్తి వ్యవస్థలను వీలైనంత వరకూ ఇక్కడికి తరలించాలని యాపిల్, సామ్సంగ్ యోచిస్తున్నట్టు సమాచారం. యాపిల్ చాలాకాలంగా భారత్‌లో ఐఫోన్లు తయారు చేస్తోంది. ‘‘చైనాలో ఉత్పత్తిని వీలైనంతగా తగ్గించుకోవాలని కంపెనీ నిర్ణయానికి వచి్చంది. ఇకమీదట అమెరికాకు కేవలం భారత్‌లో తయారైన ఐఫోన్లనే పంపనుంది. ప్రస్తుతానికి చైనాలో తయారు చేసిన ఫోన్లను యూరప్, లాటిన్ అమెరికా, ఆసియా దేశాలకు పంపిస్తుంది’’ అని కంపెనీ వర్గాలను ఉటంకిస్తూ వార్తలొస్తున్నాయి. అంతేగాక ట్రంప్ టారిఫ్‌ల దెబ్బకు అమెరికాలో ఐఫోన్ల ధరలు 40 శాతం దాకా పెరగవచ్చంటున్నారు. -
టారిఫ్ టెర్రర్... ఇన్వెస్టర్లకు ఫీవర్!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేల్చిన ‘లిబరేషన్ డే’ టారిఫ్ బాంబ్‌తో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అల్లకల్లోలం మొదలైంది. ప్రధానంగా భారత్, చైనా వంటి కీలక దేశాల ఆర్థిక వ్యవస్థలు మరింత మందగమనంలోకి జారిపోవచ్చని, దీంతో ప్రపంచ ఎకానమీ గాడి తప్పుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. మరోపక్క, చైనా కూడా 34% ప్రతీకార సుంకాలతో విరుచుకుపడింది. ఇతర దేశాలూ ఇదే బాట పట్టి వాణిజ్య యుద్ధం ముదిరితే, అమెరికాతో పాటు యూరప్ కూడా మాంద్యంలోకి జారే ప్రమాదం ఉంది. దీంతో అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లతో పాటు కమోడిటీలు (బంగారం, వెండి, కాపర్, క్రూడ్ ఇతరత్రా) కూడా కుప్పకూలుతున్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించడం మేలని విశ్లేషకులు సూచిస్తున్నారు. భారత్‌ను పదే పదే టారిఫ్ కింగ్‌గా పేర్కొంటూ వస్తున్న ట్రంప్.. కాస్త కనికరించి 27 శాతం ప్రతీకార సుంకాలతో సరిపెడుతున్నట్లు ప్రకటించారు. కనీసం 10 శాతం నుంచి గరిష్టంగా 50 శాతం దాకా టారిఫ్‌లను వడ్డించడంతో ప్రపంచ దేశాలన్నీ గగ్గోలు పెడుతున్నాయి. అమెరికాకు కీలక వాణిజ్య భాగస్వామిగా ఉన్న భారత్ ఎగుమతులపై సుంకాల పోటు కచ్చితంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అసలే వృద్ధి మందగమనంలో ఉన్న మన జీడీపీకి ఇది మరింత ప్రతికూలాంశంగా చెబుతున్నారు. వృద్ధి రేటుపై కనీసం అర శాతం ప్రభావం ఉండొచ్చనేది (ఈ ఆర్థిక సంవత్సరం 6 శాతానికి పరిమితం కావచ్చు) ఆర్థిక నిపుణుల అభిప్రాయం. మరోపక్క, వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమైతే రూపాయి బలహీనపడొచ్చని.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా పడిపోయే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. అయితే, ఇతర వర్ధమాన దేశాలు, ముఖ్యంగా ఆసియాలో మనకు ప్రధాన పోటీదారులైన చైనా, వియత్నాం, బంగ్లాదేశ్ వంటి దేశాలపై మన కంటే అధిక సుంకాలు విధించడం అనేది మనకు కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. ‘ట్రంప్ లిబరేషన్ డే టారిఫ్‌లపై సంబంధిత దేశాలన్నీ ప్రతీకార సుంకాలతో విరుచుకుపడితే, 2008 ఆర్థిక సంక్షోభం, కోవిడ్ తర్వాత అతిపెద్ద ఆర్థిక కుదుపు తప్పదు. టారిఫ్ ప్రభావిత తీవ్ర ఆటుపోట్లు కొన్నాళ్ల పాటు స్టాక్ మార్కెట్లలో కొనసాగవచ్చు’ అని వెస్టెడ్ ఫైనాన్స్ ఫౌండర్, సీఈఓ విరమ్ షా పేర్కొన్నారు. మార్కెట్లో మరింత కరెక్షన్ తప్పదు... టారిఫ్ వార్ దెబ్బకు అమెరికా, యూరప్, ఆసియా వ్యాప్తంగా సూచీలు లిబరేషన్ డే రోజున 3–6% కుప్పకూలగా.. వారాంతంలో మరో 5–6% క్రాష్ అయ్యాయి. వాల్‌స్ట్రీట్‌లో ఇన్వెస్టర్ల సంపద రెండు రోజుల్లో 4 ట్రిలియన్ డాలర్లకు పైగా తుడిచిపెట్టుకుపోవడం సుంకాల సునామీకి నిదర్శనం! ట్రేడ్ వార్తో ఎగుమతులు మందగిస్తే, వృద్ధి రేటుకు మరింత సెగ తగులుతుందని, స్వల్పకాలికంగా మార్కెట్లో కరెక్షన్ కొనసాగే అవకాశం ఉందని యాక్సిస్ సెక్యూరిటీస్ పేర్కొంది. ‘టారిఫ్‌ల దెబ్బతో ద్రవ్యోల్బణం ఎగబాకే ముప్పు పొంచి ఉంది. దీంతో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు ఇకపై సాధ్యపడకపోవచ్చు. అంతేకాకుండా వాణిజ్యపరమైన అడ్డంకులతో అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారే రిస్క్ పెరుగుతుంది. అంతిమంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా కకావికలం అవుతుంది’ అని అభిప్రాయపడింది. ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే భారత్ పోటీపరంగా కాస్త మెరుగైన స్థితిలోనే ఉన్నప్పటికీ, అమెరికాలో మాంద్యం ముప్పు మన మార్కెట్లకు ప్రతికూలాంశమని ఎడెలీ్వజ్ ఎంఎఫ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (ఈక్విటీస్) త్రిదీప్ భట్టాచార్య పేర్కొన్నారు.ఇన్వెస్టర్లు ఏం చేయాలి? ‘ట్రంప్ టారిఫ్‌లపై ఇతర దేశాల ప్రతీకార సుంకాలను ఇన్వెస్టర్లు నిశితంగా గమనించాలి. ముఖ్యంగా రక్షణాత్మక రంగాలైన ఎఫ్ఎంసీజీ, యుటిలిటీస్ షేర్లు కాస్త మెరుగైన పనితీరు ప్రదర్శించవచ్చు. సైక్లికల్ రంగాల (ఆటో, మెటల్స్) షేర్లకు ప్రతికూలం. టారిఫ్‌లపై కుదిరే వాణిజ్య ఒప్పందాల ఫలితాలే దీర్ఘకాలింగా మార్కెట్లకు దిశానిర్దేశం చేస్తాయి. స్వల్పకాలానికి మాత్రం మన మార్కెట్లలో తీవ్ర ఆటుపోట్లు తప్పవు. పెట్టుబడుల విషయాలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలి’ అని స్టాక్సా్కర్ట్ సీఈఓ ప్రణయ్ అగర్వాల్ సూచించారు. మార్కెట్లో స్వల్పకాలిక సెంటిమెంట్ చాలా బలహీనంగా ఉన్నప్పటికీ.. దీర్ఘకాలికంగా మన ఆర్థిక మూలాలు పటిష్టంగానే ఉన్నాయని ఆనంద్ రాఠీ గ్రూప్ చీఫ్ ఎకనమిస్ట్ సుజన్ హజ్రా చెప్పారు. టారిఫ్‌ల దెబ్బతో తక్షణం మార్కెట్లో తీవ్ర కుదుపులు ఉన్నప్పటికీ.. మధ్య, దీర్ఘకాల దృక్పథంతో భారీగా కరెక్షన్కు గురైనప్పుడల్లా పటిష్ట ఫండమెంటల్స్ ఉన్న నాణ్యమైన స్టాక్స్‌లో క్రమానుగతంగా పొజిషన్లను పెంచుకోవాలని ఆయన సూచిస్తున్నారు. నిఫ్టీ గతేడాది సెప్టెంబర్‌లో 26,277 పాయిట్ల గరిష్టాన్ని తాకగా.. 2025 మార్చిలో 21,964 పాయిట్లకు (దాదాపు 16.6 శాతం) క్షీణించింది. ఎఫ్‌పీఐల దన్నుతో ఆ తర్వాత 7 శాతం బౌన్స్ అయ్యింది. అయితే, ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రకటన తర్వాత ప్రపంచ మార్కెట్ల క్రాష్‌తో పాటు మన సూచీలు కూడా మళ్లీ రివర్స్ గేర్ వేశాయి. ఈ వారంలో 2.5 శాతం పడ్డాయి.డెట్ ఫండ్స్‌కు దన్ను... జీడీపీ వృద్ధి మందగమనానికి తోడు ఇప్పుడు టారిఫ్‌ల పిడుగుతో ఎకానమీకి దన్నుగా ఆర్బీఐ సరళతర పాలసీని కొనసాగించే అవకాశం ఉంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత తొలిసారిగా గత పాలసీ సమీక్షలో రెపో రేటును పావు శాతం తగ్గించడం (6.25 శాతానికి) సంగతి తెలిసిందే. దీంతో పాటు బ్యాంకింగ్ వ్యవస్థలో ద్రవ్య సరఫరా (లిక్విడిటీ) పెంచేందుకు కూడా పలు చర్యలు ప్రకటించింది. ‘వాణిజ్య యుద్ధాలతో పాటు ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల నుంచి దేశీ ఫైనాన్షియల్ మార్కెట్లకు రక్షణ కల్పించేందుకు ఆర్బీఐ రానున్న రోజుల్లో వడ్డీరేట్లను మరింత తగ్గించడంతో పాటు సానుకూల లిక్విడిటీ చర్యలను చేపట్టవచ్చు. దీనివల్ల వడ్డీ రేట్లు దిగిరావడం వల్ల ఇప్పటికే ట్రేడవుతున్న అధిక కూపన్ (వడ్డీ) రేటు బాండ్ ధరలు పెరుగుతాయి. ఫలితంగా డెట్ మ్యూచువల్ ఫండ్స్ నికర అసెట్ విలువ (ఎన్ఏవీ) ఎగబాకేందుకు దోహదం చేస్తుంది. డెట్ ఫండ్సో్ల పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్లకు ఇది సానుకూలాంశమని నిపుణులు చెబుతున్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
టారిఫ్‌లు సబబే: ట్రంప్
వాషింగ్టన్: ప్రపంచ దేశాలపై విధించిన టారిఫ్‌లను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు. వాటి ఫలితాలు చరిత్రాత్మకంగా ఉంటాయని చెప్పుకున్నారు. అమెరికాపై చైనా ప్రతీకార సుంకాల నేపథ్యంలో శనివారం ఆయన ఈ ప్రకటన చేశారు. అమెరికా ఇక ఎంతమాత్రమూ మౌనంగా, నిస్సహాయంగా ఉండబోదని కుండబద్దలు కొట్టారు. ‘‘అమెరికాను చైనా సుంకాలతో గట్టిగా దెబ్బ కొట్టింది. నిజానికి మాపై చైనా సుంకాలతో పోలిస్తే ఆ దేశంపై నేను విధించిన టారిఫ్ ఏ మూలకూ కాదు. చాలా దేశాలు అమెరికా పట్ల ఇంతకాలం ఇలాగే వ్యవహరించాయి. ఇది ఇకపై సాగదు. మునుపెన్నడూ లేని విధంగా ఉద్యోగాలు, వ్యాపారాలను అమెరికాకు తిరిగి తీసుకొస్తున్నాం. ఇప్పటికే ఐదు లక్షల డాలర్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. అవి మరింత వేగంగా పెరుగుతున్నాయి. ఈ ఆర్థిక విప్లవంలో మనం గెలుస్తాం. అయితే ఈ ప్రక్రియ అంత సులువు కాదు. ఈ పునరుద్ధరణకు అమెరికన్లు సహకరించాలి. సమస్యలను తట్టుకొని నిలబడగలగాలి. అమెరికాను మళ్లీ గొప్పగా తీర్చిదిద్దుతాం’’అని తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ తాజా వ్యాఖ్యలపై చైనా ఘాటుగా స్పందించింది. తమ సార్వభౌమాధికారం, భద్రత, అభివృద్ధి, ప్రయోజనాల పరిరక్షణకు చర్యలు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. -
చర్చనీయాంశంగా సుంకాల హేతుబద్ధత
న్యూఢిల్లీ: వివిధ దేశాలపై అమెరికా వడ్డించిన భారీ టారిఫ్‌ల వెనుక హేతుబద్ధత ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అసలు ఏ ప్రాతిపదికన ఈ టారిఫ్‌లను నిర్ణయించారనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. మిగతా దేశాలు తమపై ఎంత టారిఫ్‌లు విధిస్తున్నాయో అదే స్థాయిలో తామూ సుంకాలు విధించామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నప్పటికీ వాస్తవానికి లెక్కలు వేరేగా ఉన్నాయి. మిగతా దేశాలతో వాణిజ్య లోటును భర్తీ చేసుకునే విధంగా టారిఫ్‌లను నిర్ణయించినట్లుగా పరిశీలకులు చెబుతున్నారు. సాధారణంగా పైకి కనిపించే టారిఫ్‌లే కాకుండా తమ ఉత్పత్తులకు నియంత్రణ సంస్థలపరమైన అడ్డంకులు, సాంకేతిక అవరోధాలు, కరెన్సీ హెచ్చుతగ్గులు తదితర టారిఫ్యేతర అంశాలు కూడా వాణిజ్య లోటుకు కారణమవుతున్నాయని అగ్రరాజ్యం భావిస్తోంది. కాబట్టి వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ప్రస్తుత రేటును నిర్ణయించింది. ఉదాహరణకు భారత్‌తో అమెరికాకు 46 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఉందంటే.. దాన్ని సున్నా స్థాయికి తీసుకొచ్చేలా సుంకాలను నిర్ణయించినట్లు పరిశీలకులు పేర్కొన్నారు. అంటే ప్రస్తుతం భారత్‌పై విధించిన 26% రేటు ద్వారా మన దేశంతో ఉన్న వాణిజ్య లోటును పూర్తిగా భర్తీ చేసుకోవచ్చని అమెరికా భావిస్తోంది. ఈ సుంకాల వల్ల భారతీయ ఉత్పత్తుల ధరలు పెరిగి, అమెరికన్లు మన దగ్గర నుంచి దిగుమతులు తగ్గించుకుంటారని, తద్వారా వాణిజ్య లోటు తగ్గుతుందని అమెరికా అభిప్రాయం. లోపభూయిష్టమైన విధానం.. అయితే, ఇది తప్పుల తడక విధానమని విమర్శలు వస్తున్నాయి. వాణిజ్య లోటుకు లేదా మిగులుకు టారిఫ్‌లు, టారిఫ్యేతర అడ్డంకులు, కరెన్సీ హెచ్చుతగ్గుల్లాంటివి కారణమే అయినప్పటికీ.. కేవలం సుంకాల విధింపు ద్వారా దీన్ని పరిష్కరించుకోవడం సాధ్యపడదని విశ్లేషకులు చెబుతున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్య లోటుకు కారణాలు అనేకం ఉంటాయని తెలిపారు. ఉదాహరణకు బియ్యం ప్రధాన ఆహారంగా ఉండే దేశానికి .. గోధుమలను భారీగా పండించి, ఎగుమతి చేసే మరో దేశం నుంచి ఎక్కువగా దిగుమతులు ఉండకపోవచ్చు. కానీ తాము దేశీయంగా ఉత్పత్తి చేసుకోలేని పరికరాలు, కంప్యూటర్లను ఎగుమతి చేసే ఇంకో దేశంతో వాణిజ్య లోటు ఉండొచ్చు. అలాగని ఈ వాణిజ్య లోటేమీ అవాంఛనీయమైన లేదా అనుచితమైనదేమీ కాదు. ప్రస్తుతం అమెరికా పాటిస్తున్న విధానాన్ని బట్టి చూస్తే ఏప్రిల్ 2 నాటి టారిఫ్‌లే అంతిమం కాదని భావించాలి. రేప్పొద్దున్న డాలరు మారకం విలువ పెరిగి, అమెరికాలో మన ఉత్పత్తుల ధరలు పెరగకపోయి, అక్కడి వారు దిగుమతులు చేసుకోవడం కొనసాగిస్తే.. వాణిజ్య లోటు యథాప్రకారం కొనసాగుతుంది. అప్పుడు మళ్లీ వాణిజ్య లోటును భర్తీ చేసుకోవడానికి మళ్లీ టారిఫ్‌లు పెంచాల్సి వస్తుంది. ఆ విధంగా సుంకాల వడ్డింపు నిరంతర ప్రక్రియగా కొనసాగే అవకాశం ఉంది. -
టారిఫ్‌లతో ద్రవ్యోల్బణం ముప్పు..
ఆర్లింగ్టన్ (అమెరికా): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎడాపెడా టారిఫ్‌లను విధించడం దేశీయంగా ద్రవ్యోల్బణాన్ని ఎగదోస్తుందని ఫెడరల్ రిజర్వ్ చీఫ్ జెరోమ్ పావెల్ హెచ్చరించారు. దీనితో ఆర్థిక వృద్ధి కూడా నెమ్మదించే ముప్పు ఉందన్నారు. ఎకానమీ, ద్రవ్యోల్బణంపై టారిఫ్‌ల ప్రభావాలు ఊహించిన దానికంటే గణనీయంగా ఎక్కువగానే ఉండబోతున్నాయని ఆయన స్పష్టం చేశారు. భారీ దిగుమతి సుంకాలు తాత్కాలికంగా ధరల పెరుగుదలకు దారి తీయొచ్చని, దాని ప్రభావాలు దీర్ఘకాలికంగా కొనసాగే అవకాశం ఉందని పావెల్ చెప్పారు. ఒక దఫా ధరల పెరుగుదల అనేది దీర్ఘకాలికంగా ద్రవ్యోల్బణ సమస్యగా మారకుండా చూడటం తన బాధ్యతని వ్యాఖ్యానించారు. ద్రవ్యోల్బణంపై ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే.. రాబోయే రోజుల్లో కీలక వడ్డీ రేట్లు యథాతథంగా 4.3 శాతం స్థాయిలోనే కొనసాగించవచ్చని భావిస్తున్నారు. ఫెడ్ రిజర్వ్ ఈ ఏడాది వడ్డీ రేట్లను అయిదు విడతల్లో తగ్గిస్తుందని ఆశిస్తున్న ఇన్వెస్టర్లను ఇది నిరాశపర్చే అవకాశం ఉంది. పావెల్ వ్యాఖ్యలు బట్టి చూస్తే ఆయన ద్రవ్యోల్బణంపైనే దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. -
టారిఫ్‌లతో పడిపోయిన ట్రంప్ గ్రాఫ్
వాషింగ్టన్: ప్రపంచ దేశాలపై ఎడాపెడా టారిఫ్‌లు వడ్డించిన అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రాఫ్ బాగా పడిపోయింది. ఆయనను అధ్యక్షుడిగా అంగీకరించే అమెరికన్ల సంఖ్య 43 శాతానికి పడిపోయింది. బుధవారంతో ముగిసిన మూడు రోజుల సర్వేలో ఈ మేరకు వెల్లడైంది. మూడు నెలల కింద అధికారం చేపట్టిన నాటి నుంచి ఆయనకు మద్దతు ఇంత తగ్గడం ఇదే తొలిసారి. జనవరిలో పదవీ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకు ట్రంప్‌కు 47 శాతం మద్దతు లభించింది. ట్రంప్ సుంకాలు, నిర్వహణపై అమెరికన్లు బాగా అసంతృప్తితో ఉన్నారు. ఆయన విదేశాంగ విధానాన్ని సైతం వ్యతిరేకిస్తున్నారు. వలసదారులను తిప్పి పంపుతున్న అంశంపై మాత్రమే ట్రంప్ విధానాలకు ఆమోదం తెలిపారు. ట్రంప్ పాపులారిటీ తగ్గడానికి ప్రధాన కారణం ఆర్థిక వ్యవస్థను నిర్వహిస్తున్న తీరే. ఈ విషయంలో ఆయన పనితీరును కేవలం 37 శాతం మంది మాత్రమే ఆమోదించారు. ఆటోమొబైల్స్, ఆటోమోటివ్ విడిభాగాల వంటి వస్తువులపై ట్రంప్ విధించిన భారీ సుంకాలతో చాలామంది అమెరికన్లు ఆందోళన చెందుతున్నారు. కొత్త టారిఫ్‌లు తమకు, తమ కుటుంబాలకు చేటు చేస్తాయని భావిస్తున్నట్లు సర్వేలో దాదాపు సగం మంది పేర్కొన్నారు. ట్రంప్ సుంకాల పెంపు స్టాక్ మార్కెట్లో కూడా అనిశ్చితికి దారితీయడం తెలిసిందే. ఆయన దుందుడుకు విధానాలు దీర్ఘకాలిక దౌత్య నిబంధనలకు విఘాతం కలిగించడమే గాక ప్రపంచంతో అమెరికా వ్యవహరించే విధానంలో మార్పుకు కారణమయ్యాయి. ట్రంప్ సైనిక నిర్వహణ పట్ల కూడా అమెరికన్లు బాగా ఆందోళన చెందుతున్నట్టు సర్వే తేల్చింది. యెమెన్‌లో హౌతీ ఉగ్రవాదులపై సైనిక దాడి ప్రణాళిక సిగ్నల్ యాప్ ద్వారా లీకవడంపై వారు ఆగ్రహంగా ఉన్నారు. ఇది తవ్ర బాధ్యతారాహిత్యమని ఏకంగా 74 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇక ట్రంప్ విదేశాంగ విధానానికి జనామోదం కూడా జనవరిలో 34 శాతానికి పడిపోయింది. జనవరిలో ఇది 37 శాతంగా ఉంది. ట్రంప్ వలస విధానాలకు 48 శాతం ఆమోదం లభించింది. -
ఇదిగో ‘ట్రంప్’కార్డు
వాషింగ్టన్: అమెరికా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గోల్డ్ కార్డు తాలూకు కొత్త లుక్కును అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విడుదల చేశారు. గురువారం ఎయిర్‌ఫోర్స్‌వన్ విమానంలో ప్రయాణిస్తూ దాన్ని మీడియాతో పంచుకున్నారు. ‘‘ఇదేమిటో తెలుసా? గోల్డ్ కార్డు. ట్రంప్ కార్డు. ఐదు మిలియన్ డాలర్లకే దీన్ని సొంతం చేసుకోవచ్చు’’ అని చెప్పుకొచ్చారు. ట్రంప్‌కార్డు తొలి కొనుగోలుదారు ఎవరని మీడియా ప్రశ్నించగా, ‘నేనే’నంటూ అధ్యక్షుడు బదులిచ్చారు. కొత్త కార్డును రెండు వారాల్లో విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. ట్రంప్కార్డును పేరుకు తగ్గట్టే బంగారు రంగులో రూపొందించారు. కార్డులో ఎడమవైపు దాదాపుగా సగం మేరకు ట్రంప్ ఫొటో ఆక్రమించింది. ఆ పక్కనే చుట్టూ చుక్కల నడుమ ‘ద ట్రంప్ కార్డ్’ అని రాసుంది. కింద ట్రంప్ సంతకం, 5,000,000 సంఖ్య ఉన్నాయి. కార్డు విలువ 50 లక్షల డాలర్లని చెప్పేలా ఎడమవైపున పైన, కింద 5ఎం అని రాసుంది. విదేశీ సంపన్నులకు అమెరికాలో శాశ్వత నివాసానికి, అంతిమంగా పౌరసత్వానికి వీలు కల్పించేలా ఈ గోల్డ్‌కార్డును రూపొందించడం తెలిసిందే. ఈబీ–5 వీసా స్థానంలో కొద్దివారాల క్రితమే దాన్ని తీసుకొచ్చారు. ఇటీవల ఒక్క రోజులోనే ఏకంగా వెయ్యి గోల్డ్ కార్డులు అమ్ముడైనట్టు అమెరికా ప్రకటించింది కూడా. తర్వాత దాని పేరును ట్రంప్ కార్డుగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అమెరికన్ల కోరిక మేరకే ఈ మార్పు చేసినట్టు ట్రంప్ చెప్పుకున్నారు. -
టారిఫ్‌పై మళ్లీ తూచ్
న్యూఢిల్లీ: 26 శాతం. కాదు 27. కాదు, కాదు... 26 శాతమే! భారత్‌పై విధించిన ప్రతీకార సుంకాల టారిఫ్ విషయంలో అమెరికా వరుస పిల్లిమొగ్గలివి. జనమే ఉండని అంటార్కిటికాతో పాటు ప్రపంచ దేశాలన్నింటినీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ఎడాపెడా టారిఫ్‌లతో బాదేయడం తెలిసిందే. వైట్‌హౌస్ రూపొందించిన టారిఫ్‌ల చార్టును చేతిలో పట్టుకుని మరీ ఒక్కో దేశంపై టారిఫ్‌లను ప్రకటించారాయన. అమెరికాలోకి ప్రవేశించే ప్రతి ఉత్పత్తిపైనా 10 శాతం సుంకాలు విధిస్తున్నట్టు పేర్కొన్నారు. భారత్‌పై 26 శాతం సుంకాలు విధిస్తున్నట్టు ఆ సందర్భంగా ట్రంప్ వెల్లడించారు. ‘‘భారత్ మాపై ఏకంగా 52 శాతం సుంకాలు విధిస్తోంది. అందులో సగం మాత్రమే మేం వసూలు చేయబోతున్నాం. ఆ లెక్కన చూస్తే మేమిప్పటికీ ఉదారంగానే వ్యవహరిస్తున్నట్టే’’ అని చెప్పుకున్నారు. కానీ మ ర్నాటికల్లా వాటిని 27 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. భారత్‌తో పా టు మొత్తం 14 దేశాలపై ట్రంప్ ప్రకటించిన టారిఫ్‌లను వైట్‌హౌస్ గురువారం సవరించింది. ఆ మేరకు అనుబంధ ప్రకటన విడుదల చేసింది. అయితే శుక్రవారానికల్లా మళ్లీ కథ మొదటికి వచ్చింది. భారత్‌పై టారిఫ్‌ను అమెరికా తిరిగి 26 శాతానికి తగ్గించేసింది. తాజాగా విడుదల చేసిన ప్రకటనలో వైట్‌హౌస్ ఈ మేరకు పేర్కొంది. ఈ సుంకాలు ఏప్రిల్ 9 నుంచి అమల్లోకి రానున్నాయి. భారత్ విషయంలో ఈ ‘ఒక్క శాతం’ తడబాటుపై ఆర్థిక నిపుణులు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. టారిఫ్‌ల విధింపు విషయంలో బహుశా ట్రంప్, ఆయన యంత్రాంగంలో నెలకొన్న తీవ్ర అయోమయానికి ఇది నిదర్శనమని వారంటున్నారు. ఈ దుందుడుకు టారిఫ్‌లు అంతిమంగా అమెరికా పుట్టినే ముంచుతాయని ఇంటా బయటా జోరుగా విశ్లేషణలు వెల్లువెత్తుతుండటం తెలిసిందే. బయటికి బెదిరింపు స్వరం వినిపిస్తున్నా, ఆ విశ్లేషణల ప్రభావం ట్రంప్ టీమ్‌పై బాగానే పడుతున్నట్టు కనిపిస్తోంది. -
ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో సుంకాల సునామీ
ఈ ఊరికి ఆ ఊరెంతో... ఆ ఊరికి ఈ ఊరూ అంతే!. వస్తూనే దీన్ని ఆలాపించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్... ఇప్పుడు ఆచరించేశారు. అమెరికా వస్తువులపై ప్రపంచ దేశాలన్నీ భారీ సుంకాలు విధిస్తున్నాయి కనక... తామెందుకు తగ్గాలంటూ... ఇండియా సహా ఏ దేశాన్నీ వదలకుండా సుంకాల సమ్మెటతో చితక్కొట్టేశారు. అన్ని దేశాలకూ అమెరికా అతి పెద్ద మార్కెట్ కావటంతో... కంపెనీల లాభాలపై ప్రభావం పడి, వ్యాపారం తగ్గుతుందనే భయాలు మొదలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లన్నీ కుదేలయ్యాయి. ఒకరకంగా భార త మార్కెట్లు తక్కువే నష్టపోయాయి. మొదట మిగతా మార్కెట్లలాగే భారీ పతనంతో మొదలైనా... చివరకు కాస్త కోలుకున్నాయి. అమెరికాకు భారత్ నుంచి ఎక్కువ ఎగుమతయ్యేవి సాఫ్ట్వేర్ సేవలు, మందులే. సుంకాల దెబ్బ నుంచి ఫార్మాను మినహాయించారు. ఇక సాఫ్ట్వేర్ సేవలపై టారిఫ్‌లు లేకున్నా... ట్రంప్ చర్యలతో అమెరికా మాంద్యంలోకి జారే అవకాశాలున్నాయని, కంపెనీలు టెక్నాలజీపై వ్యయాలూ తగ్గించుకుంటాయనే అంచనాలు వస్తున్నాయి. అందుకే భారత ఐటీ షేర్లు భారీగా పతనం కాగా.. అమెరికాలో టెక్నాలజీ కంపెనీల సూచీ అయిన నాస్డాక్ అనూహ్యంగా 5 శాతానికిపైగా పతనమయింది. ఆటో, టెక్స్టైల్, రత్నాలు– ఆభరణాల రంగాలపై ఈ సుంకాలు తీవ్ర ప్రభావాన్నే చూపించవచ్చు. ఎందుకంటే దేశం నుంచి అమెరికాకు వీటి ఎగుమతులు గణనీయంగా ఉన్నాయి. కాకపోతే టెక్స్టైల్, దుస్తులపై భారత్ కన్నా చైనాపై ట్రంప్ ఎక్కువ సుంకాలు విధించారు. దీంతో చైనాతో పోలిస్తే మన దుస్తులు తక్కువ ధరకు విక్రయించే అవకాశం ఉంటుంది కనక మన కంపెనీలు లాభపడతాయనే అంచనాలున్నాయి.ముంబై: అమెరికాతో వాణిజ్య భాగస్వాములుగా ఉన్న 60 దేశాలపై డొనాల్డ్ ట్రంప్ భారీ సుంకాల విధింపుతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు వణికిపోయాయి. ఏ దేశంపై ఎంత టారిఫ్‌ల విధింపు ఉంటుందో అని లెక్కలతో సహా ట్రంప్ వివరణతో ఆసియా నుంచి అమెరికా వరకు ఈక్విటీ మార్కెట్లు ‘బేర్’మన్నాయి. ప్రతీకార సుంకాలతో వాణిజ్య యుద్ధం తీవ్రతరమై అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంటాయనే భయాలు అధికమయ్యాయి. ప్రపంచ దేశాలపై ట్రంప్ వాణిజ్య యుద్ధ ప్రభావం ఈక్విటీ మార్కెట్‌ను కుదిపేసింది.→ ఆసియాలో జపాన్ నికాయ్ 3% క్షీణించింది. హాంగ్‌కాంగ్ సూచీ 1.50%, థాయ్‌లాండ్, దక్షిణ కొరియా ఇండెక్స్‌లు 1%, సింగపూర్ సూచీ అరశాతం చొప్పున నష్టపోయాయి. → యూరోపియన్ యూనియన్‌పై 20% సుంకాల విధింపుతో యూరప్ మార్కెట్లు సైతం కుప్పుకూలాయి. ఫ్రాన్స్ ఇండెక్స్ సీఏసీ 3.50%, జర్మనీ సూచీ డాక్స్ 3%, బ్రిటన్ ఇండెక్స్ ఎఫ్టీఎస్ఈ 1.50% నష్టపోయాయి. దలాల్ స్ట్రీట్ అరశాతం డౌన్... భారత ఈక్విటీ మార్కెట్ అరశాతం నష్టపోయింది. ఐటీ, ఆటో షేర్లలో అమ్మకాలు ఒత్తిడికి లోనయ్యాయి. సెన్సెక్స్ 322 పాయింట్లు నష్టపోయి 76,295 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 82 పాయింట్లు పతనమై 23,250 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ ప్రారంభమైన క్షణాల్లో సెన్సెక్స్ 809 పాయింట్లు క్షీణించి 75,808 వద్ద, నిఫ్టీ 187 పతనమై 23,145 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. ఫార్మాతో పాటు కొన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఆరంభ నష్టాల నుంచి కోలుకోగలిగాయి. → ప్రతీకార సుంకాల నుంచి ఫార్మా ఉత్పత్తులను మినహాయించడంతో ఫార్మా షేర్లకు డిమాండ్ నెలకొంది. జుబిలెంట్ ఫార్మోవా 7%, ఇప్కా ల్యాబ్స్ 5%, లుపిన్ 4%, సన్‌ఫార్మా 3% లాభపడ్డాయి. సిప్లా 2.50%, దివీస్ ల్యాబ్స్, గ్లెన్‌మార్క్ ఫార్మా 2%, అరబిందో ఫార్మా 1.50% పెరిగాయి.→ అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్లిపోవచ్చనే భయాలతో ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. పెర్సిస్టెంట్ 10%, కోఫోర్జ్, కేపీఐటీ 8%, టీసీఎస్, టెక్ మహీంద్రా 4% పతనమయ్యాయి. హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్ 3.50%, విప్రో 3% నష్టపోయాయి. → ఆరంభ నష్టాలు భర్తీ చేసుకున్న రూపాయి డాలర్ మారకంలో 22 పైసలు పెరిగి 85.30 వద్ద స్థిరపడింది.వాల్‌స్ట్రీట్ విలవిల ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రకటన ప్రభావం అమెరికా ఈక్విటీ మార్కెట్లనూ వెంటాడింది. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో వినిమయం తగ్గిన నేపథ్యంలో తాజా టారిఫ్‌లతో పరిస్థితులు మరింత దిగజారి ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్తున్న భయాలు నెలకొన్నాయి. డోజోన్స్ సూచీ 1,118 పాయింట్లు క్షీణించి 41,047 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో 1500 పాయింట్ల పతమైంది. నాస్డాక్ 4% ఎస్అండ్పీ 3.50 శాతం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. యూఎస్ మార్కెట్లో చిన్న కంపెనీల షేర్లకు ప్రాతినిధ్యం వహించే రస్సెల్స్ 2000 ఇండెక్స్ 5% క్షీణించింది. అమెరికా మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.65 ట్రిలియన్ డాలర్లు హరించుకుపోయింది. → ఐఫోన్లకు ప్రధాన సప్లయర్‌గా ఉన్న చైనాపై అమెరికా భారీ సుంకాలు విధించడంతో సప్లయ్ చైన్‌కు అవరోధం ఏర్పడుతుందన్న ఆందోళనలతో యాపిల్ షేర్లు 9 శాతం మేర నష్టాల్లో ట్రేడవుతున్నాయి. షేరు భారీ పతనంతో కంపెనీ విలువ 250 బిలియన్ డాలర్లు పడిపోయింది. 2020 తర్వాత యాపిల్ స్టాక్ ఈ స్థాయిలోపతనం కావడం ఇదే తొలిసారి. వీటితో పాటు అమెజాన్ 6%, ఎన్విడియా 5%, టెస్లా 4.50% గూగుల్ 3%, మెటా 6%, మైక్రోసాఫ్ట్ 2% నష్టపోయాయి. కమోడిటీలకూ సెగపసిడి, వెండి ధరల పతనం చల్లబడిన చమురు ధరలు పలు దేశాలపై ట్రంప్ తెరతీసిన టారిఫ్‌లతో కమోడిటీలకు సైతం సెగ తగులుతోంది. దీంతో ఇటీవల తళతళ మెరుస్తున్న పసిడి, వెండి ధరలు ఒక్కసారిగా కరగడం మొదలైంది. ముడిచమురు ధరలు సైతం భారీగా చల్లబడ్డాయి. న్యూయార్క్ కామెక్స్‌లో పసిడి ఔన్స్(31.1 గ్రాములు) 40 డాలర్లు(1.3 శాతం) క్షీణించి 3,126 డాలర్లకు చేరింది. ఒకదశలో 3,198 డాలర్ల ఆల్‌టైమ్ గరిష్టాన్ని తాకి, తర్వాత 3,074 డాలర్ల వరకూ పతనమైంది. ఈ బాటలో వెండి మరింత అధికంగా ఔన్స్ 2.66 డాలర్లు(7.7 శాతం) కుప్పకూలింది. 31.9 డాలర్ల వద్ద కదులుతోంది. బ్రెంట్ చమురు బ్యారల్ 6.8% పతనమై 69.8 డాలర్లను తాకింది. న్యూయార్క్‌లో నైమెక్స్ చమురు బ్యారల్ 7%పైగా పడిపోయి 66.65 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ట్రంప్ టారిఫ్‌లతో యూఎస్ జీడీపీపై 2025 రెండో క్వార్టర్(ఏప్రిల్–జూన్)లో 10 శాతం ప్రతికూల ప్రభావం పడే వీలున్నట్లు ఆర్థికవేత్తలు అంచనా వేయడం స్టాక్స్, కమోడిటీలలో భారీ అమ్మకాలకు కారణమైనట్లు విశ్లేషకులు తెలియజేశారు. -
ప్రపంచానికి ట్రంప్ టారిఫ్ షాక్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై ప్రకటించిన టారిఫ్‌ల యుద్ధం .. అంతర్జాతీయంగా వాణిజ్యం, సరఫరా వ్యవస్థల ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేయనుంది. ఇకపై అమెరికా భవిష్యత్ వాణిజ్య విధానాలన్నీ, చైనా ఆర్థిక ప్రాబల్యానికి అడ్డుకట్ట వేయడం, దేశీయంగా పరిశ్రమలను పటిష్టపర్చుకోవడం, సరఫరా వ్యవస్థలను మెరుగుపర్చుకోవడం లాంటి అంశాలపైనే ఆధారపడి ఉంటాయని అంచనాలు నెలకొన్నాయి. రాబోయే రోజుల్లో ఒకవేళ కొన్ని రంగాల విషయంలో టారిఫ్‌లను సడలించినప్పటికీ కీలక పరిశ్రమలపై మాత్రం సుంకాల మోత యథాప్రకారం కొనసాగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ టారిఫ్‌లతో ఇప్పటికే ప్రపంచ ఎకానమీలో పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాబోయే రోజుల్లోనూ దేశాలు, పరిశ్రమలు, అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులను బట్టి ప్రపంచంపై టారిఫ్‌ల ప్రభావాలు రకరకాలుగా ఉండబోతున్నాయి. ట్రంప్ హయాంలో చైనాపై విధించిన టారిఫ్‌లు వాణిజ్య యుద్ధానికి దారి తీశాయి. అంతర్జాతీయంగా వాణిజ్యానికి భారీగా అవరోధాలు ఏర్పడ్డాయి. సుంకాల భారాన్ని తప్పించుకునేందుకు చాలా మటుకు కంపెనీలు చైనా నుంచి తయారీ కార్యకలాపాలను వేరే దేశాలకు మళ్లించాయి. దీంతో భారత్, వియత్నాం, మెక్సికోలాంటివి ప్రత్యామ్నాయ తయారీ హబ్‌లుగా మారాయి. సరఫరా వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ .. టారిఫ్‌ల ధాటితో ప్రపంచ దేశాలు .. అమెరికా, చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకుని, ఉత్పత్తులు, సేవల సరఫరా కోసం ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టే ధోరణి మరింత వేగవంతమైంది. ఫలితంగా ఆగ్నేయాసియా, ఉత్తర అమెరికా లాంటి ప్రాంతాల్లో పెట్టుబడులు మరింత పెరుగుతున్నాయి. ఈ మార్పులకు అలవాటుపడే వరకు కంపెనీలు కాస్త వ్యయాల భారాన్ని మోయక తప్పని పరిస్థితి ఉంటోంది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు.. సుంకాల వల్ల సాధారణంగా దిగుమతి చేసుకున్న ఉత్పత్తుల రేటు పెరుగుతుంది. దీనితో ద్రవ్యోల్బణమూ పెరుగుతుంది. కంపెనీలు సుంకాల భారాన్ని కొంత తాము భరించి, కొంత బదలాయించినా ఆ ప్రభావం వ్యాపారాల మీద, వినియోగదారుల మీద పడుతుంది. ప్రతీకార టారిఫ్‌లు .. అమెరికా టారిఫ్‌ల బారిన పడ్డ యూరోపియన్ యూనియన్, చైనా వంటి దేశాలు.. ప్రతీకార సుంకాలకు శ్రీకారం చుట్టాయి. అమెరికా ఎగుమతులపై ఇప్పటికే దీని ప్రభావం కనిపించడం మొదలైంది. ముఖ్యంగా వ్యవసాయం, తయారీ, టెక్నాలజీలాంటి రంగాలపై ఇది ఎక్కువగా ఉంటోంది. పెట్టుబడి ధోరణుల్లో మార్పులు.. సుంకాల భారం ఉండని ప్రాంతాలకు వ్యాపార సంస్థలు తమ పెట్టుబడులు మళ్లిస్తున్నాయి. చైనాలాంటి దేశాలు ఎగుమతులకు కొత్త మార్కెట్లను అన్వేíÙస్తున్నాయి. ప్రాంతీయంగా వాణిజ్య బంధాలను బలపర్చుకుంటున్నాయి. గ్లోబల్ వృద్ధిపై ప్రభావం.. టారిఫ్లపరమైన అనిశ్చితి అనేది ప్రపంచ ఆర్థిక వృద్ధి నెమ్మదించడానికి కారణమవుతోంది. వాణిజ్య ఉద్రిక్తతలు సుదీర్ఘకాలం కొనసాగడం వల్ల పెట్టుబడులతో పాటు వ్యాపార విశ్వాసం తగ్గిపోయి, ప్రపంచ జీడీపీ వృద్ధి మరింత మందగించవచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి, (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంక్ అంచనా వేస్తున్నాయి.భవిష్యత్తులో అమెరికా పాలసీ ఎలా మారొచ్చంటే..చైనాపై కఠిన వైఖరి కొనసాగొచ్చు.. భవిష్యత్తులో అమెరికాలో ప్రభుత్వం మారినా కూడా చైనాపై టారిఫ్‌లను పూర్తిగా వెనక్కి తీసుకోకపోవచ్చు. మేధోహక్కులు, జాతీ య భద్రత, వాణిజ్య అసమానతల్లాంటి అంశాలపై ఆందోళన వల్ల ఇరు దేశాల సంబంధాల్లో టారిఫ్‌లు ఇకపైనా కీలకాస్త్రంగా కొనసాగే అవకాశం ఉంది. మిత్రదేశాలకు మరింత చేరువ .. ముఖ్యమైన ఉత్పత్తుల కోసం ప్రత్యర్థి దేశాలపై ఆధారపడటం కాకుండా అమెరికా తన మిత్ర దేశాలతో ఆర్థిక సంబంధాలను మరింతగా పటిష్టపర్చుకోవడంపై దృష్టి పెట్టొచ్చు. యూరప్, భారత్, దక్షిణ కొరియాలాంటి దేశాలపై టారిఫ్‌లు తగ్గించడం, కొత్త వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటి పరిణామాలకు అవకాశం ఉంది. హరిత పరిశ్రమలపై సుంకాలు.. దేశీయంగా పరిశ్రమలకు మద్దతునిచ్చేందుకు, చైనా ప్రభుత్వ దన్ను ఉన్న కంపెనీలతో పోటీపడేందుకు స్వచ్ఛ ఇంధనం, సెమీకండక్టర్లు, ఇతరత్రా పర్యావరణహిత రంగాలపై అమెరికా కొత్తగా టారిఫ్‌లు విధించవచ్చు. ద్వైపాక్షిక, ప్రాంతీయ ఒప్పందాలు అన్ని దేశాలతో విస్తృతస్థాయి వాణిజ్య ఒప్పందాలకు బదులుగా అమెరికా.. ఏవో కొన్ని దేశాలతోను, ప్రాంతీయంగాను వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడంపై మొగ్గుచూపొచ్చు. ఆగ్నేయాసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాలు ఈ జాబితాలో ఉండొచ్చు. ఈయూపై మరిన్ని టారిఫ్‌లు.. ఎలక్ట్రిక్ వాహనాల్లాంటి వాటి మీద సబ్సిడీలపై వివాదాల కారణంగా యూరోపియన్ యూనియన్‌లోని మిత్రదేశాలపైనా కొత్త టారిఫ్‌లు పడొచ్చు. దీంతో అంతర్జాతీయంగా వాణిజ్య సంబంధాలు మరింత సంక్లిష్టంగా మారొచ్చు.భారత్‌పై ప్రభావం స్వల్పమే...కనీసం 10 శాతం సుంకాలకు అదనంగా 27 శాతం విధించడంతో.. టారిఫ్‌ల పరంగా భారత్ మధ్యస్థ స్థితిలో ఉంది. నికరంగా చూస్తే అమెరికా మార్కెట్‌కు సంబంధించి భారత ఎగుమతుల పోటీతత్వంపై తక్కువ ప్రభావమే పడనున్నట్టు తెలుస్తోంది. ఎగుమతుల సామర్థ్యాన్ని, విలువ జోడింపును పెంచేందుకు, టారిఫ్‌ల ప్రభావాన్ని అధిగమించేందుకు పరిశ్రమ సమిష్టి కృషి చేయాల్సి ఉంటుంది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ద్వారా అమెరికాతో సహకారాన్ని ఇతోధికం చేసుకోవచ్చు. – సంజయ్ నాయర్, అసోచామ్ ప్రెసిడెంట్ జీడీపీపై 0.1 శాతం ఎఫెక్ట్ భారత పరిశ్రమలకు ఉన్న బలమైన పోటీతత్వం అమెరికా టారిఫ్‌ల ప్రభావాన్ని సమతుల్యం చేస్తుంది. స్వల్పకాలంలో జీడీపీపై 0.1 శాతం ప్రభావం పడొచ్చు. మధ్యకాలంలో విధానాలు పూర్తిగా అమల్లోకి వచ్చే నాటికి ఈ లోటును అధిగమించగలం’’ – హేమంత్ జైన్, పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ ఎగుమతులకు సవాళ్లు... టారిఫ్‌ల పెరుగుదలతో భారత ఎగుమతుల రంగం సవాళ్లను ఎదుర్కోవాల్సి రావొచ్చు. అమెరికాకు ఎగుమతుల ఎక్స్పోజర్ ఎక్కువగా ఉన్న టెక్స్టైల్స్, ఫార్మాస్యూటికల్స్, ఆటోమోటివ్ విడిభాగాలు స్వల్పకాలంలో డిమాండ్ క్షీణతను ఎదుర్కోవచ్చు. ఇది ఉత్పత్తి, ఉపాధిపై ప్రభావం చూపిస్తుంది’’ – బజాజ్ బ్రోకింగ్ రీసెర్చ్ పోటీతత్వం బలపడుతుంది... అమెరికా విధించిన 27% టారి ఫ్లు భారత ఎగుమతులకు అవరోధాలే అయినప్పటికీ తయారీ లో బలంగా ఉన్న ఇతర ఆసియా దేశాలతో పోలి్చతే మనపై టారిఫ్‌లు తక్కువగా ఉండడం వల్ల భారత్ ఎగుమతుల పోటీతత్వం నిలబడుతుంది.– పరితోష్ ప్రజాపతి, జీఎక్స్ గ్రూప్ సీఈవో ద్వైపాక్షిక ఒప్పందమే మేలు.. స్వల్పకాలంలో అమెరికాకు భారత్ నుంచి 10 బిలియన్ డాలర్ల రత్నాభరణాల ఎగుమతులకు సవాళ్లు ఎదురుకానున్నాయి. భారత్–అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం దిశగా పురోగతికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. – రత్నాభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి -
ప్రతీకారం తప్పదు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తాజా టారిఫ్‌లపై ప్రపంచ దేశాలన్నీ మండిపడుతున్నాయి. ప్రపంచ వాణిజ్య యుద్ధానికి తెర తీశారంటూ దుయ్యబడుతున్నాయి. ప్రతీకారం తప్పదని ఆయా దేశాల అధినేతలు స్పష్టం చేశారు. వాణిజ్య యుద్ధాలు ఇరు పక్షాలను దెబ్బతీస్తాయని జర్మనీ హెచ్చరించింది. తమపై ట్రంప్ విధించిన 10 శాతం సుంకాన్ని ఎదుర్కోవడానికి లాటిన్ అమెరికాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన బ్రెజిల్ బుధవారం ఒక చట్టాన్ని ఆమోదించింది. దెబ్బకు దెబ్బ: ఈయూ యూరోపియన్ యూనియన్‌పై 20 శాతం సుంకాలను యూరప్ దేశాలన్నీ తీవ్రంగా ఖండించాయి. ఇది పూర్తిగా అన్యాయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ‘‘అమెరికా వస్తువులకు ఈయూ అతి పెద్ద మార్కెటని ట్రంప్ మర్చిపోయినట్టున్నారు. యూఎస్‌పై ప్రతీకార సుంకాలు విధిస్తాం’’అని హెచ్చరించాయి. ‘‘ఈయూ ఉక్కుపై అమెరికా సుంకాలకు ప్రతిస్పందనగా ప్రతీకార ప్యాకేజీని ఖరారు చేస్తున్నట్టు ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా వాండడెర్ లెయన్ ప్రకటించారు. చర్చలు విఫలమైతే తమ ప్రయోజనాలను, వ్యాపారాలను రక్షించుకోవడానికి మరిన్ని ప్రతీకార సుంకాలు తప్పవని స్పష్టం చేశారు. అయితే ఈ సుంకాల యుద్ధంతో అంతిమంగా నష్టపోయేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థేనంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ...సమరమే: కెనడా ప్రపంచ వాణిజ్య వ్యవస్థనే అతలాకుతలం చేసే ట్రంప్ సుంకాలపై పోరాడతామని కెనడా ప్రధాని మార్క్ కార్నీ ప్రతిజ్ఞ చేశారు. ఇతర దేశాలతో పోలిస్తే కెనడాపై తాజా టారిఫ్‌ల ప్రభావం పరిమితమే. అయినా ఉక్కు, అల్యూమినియం, ఆటోమొబైల్స్‌పై అమెరికా సుంకాలు లక్షలాది కెనడియన్లను నేరుగా ప్రభావితం చేస్తాయని కార్నీ ఆక్షేపించారు. ఈ సుంకాలను ప్రతిదాడులతో ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. మంచిది కాదు: బ్రిటన్ వాణిజ్య యుద్ధం ఎవరికీ మంచిది కాదని బ్రిటన్ ప్రధాని కియిర్ స్టార్మర్ వ్యాఖ్యానించారు. ‘‘అన్ని పరిస్థితులకూ మేం సిద్ధంగా ఉన్నాం. ప్రతిస్పందనగా మావైపు నుంచి ఏ చర్యలనూ తోసిపుచ్చలేం’’అని పార్లమెంటుకు చెప్పారు. విచారకరం: జపాన్ ఈ దిగుమతి సుంకాలు చాలా విచారకరమని జపాన్ వ్యాఖ్యానించింది. అవి ప్రపంచ వాణిజ్య సంస్థ, యూఎస్–జపాన్ ఒప్పందాలను ఉల్లంఘించడమేనని పేర్కొంది. అమెరికా తమపై విధించిన 36 శాతం సుంకంపై చర్చలు జరుపుతామని అయితే థాయిలాండ్ తెలిపింది. సుంకాల ప్రకటనకు ఒక రోజు ముందే.. అమెరికా దిగుమతులపై ఇజ్రాయెల్ అన్ని సుంకాలను రద్దు చేసినా.. ఫలితం లేకపోయింది. ఇజ్రాయెల్ వస్తువులపై ట్రంప్ 17 శాతం సుంకాలను విధించడంపై ఆ దేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. భారీ మూల్యం తప్పదు: ఆ్రస్టేలియా ఆ్రస్టేలియా గొడ్డు మాంసంపై ట్రంప్ కఠిన ఆంక్షలు దారుణమని ప్రధాని ఆంటోనీ అల్బనీస్ విమర్శించారు. ఇందుకు అమెరికా ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. అయితే, ‘‘మేం పరస్పర సుంకాలకు దిగబోం. అధిక ధరలకు, ఆర్థిక మందగమనానికి దారితీసే రేసులో చేరబోం’’అని స్పష్టం చేశారు. కంపెనీలను కాపాడుకుంటాం: స్పెయిన్ దేశీయ కంపెనీలను, పరిశ్రమలను, మొత్తంగా ఆర్థిక రంగాన్ని ఈ సుంకాల ప్రభావం బారినుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకుని తీరతామని స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ ప్రకటించారు. స్వేచ్ఛా వాణిజ్య ప్రపంచమే తమ లక్ష్యమన్నారు. గొడవలొద్దు: స్వీడన్ వాణిజ్య అడ్డంకులను కోరుకోవడం లేదని స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టెర్సన్ అన్నారు. ‘‘మాకు వాణిజ్య యుద్ధం వద్దు. అమెరికాతో కలిసి వాణిజ్యం, సహకార మార్గంలో పయనించాలని, తద్వారా ఇరు దేశాల ప్రజలు మెరుగైన జీవితాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నాం’’అని చెప్పారు. హానికరమైన సుంకాలు: ఇటలీ ట్రంప్ సుంకాలను ఆయన మిత్రురాలు, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఘాటుగా విమర్శించారు. ఈ సుంకాలు హానికరమని హెచ్చరించారు, ‘‘వాణిజ్య యుద్ధాన్ని నివారించాలి. అది తీవ్రతరం కాకముందే పరిష్కారం కోసం అమెరికా ప్రయతి్నంచాలి’’అని సూచించారు. ఆర్థిక సంక్షోభం: ఫ్రాన్స్ ట్రంప్ సుంకాలు అతి పెద్ద ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తాయని ఫ్రాన్స్ ఆందోళన వెలిబుచి్చంది. ఫ్రెంచ్ వైన్, స్పిరిట్స్ ఎగుమతులపై ఇవి గణనీయ ప్రభావం చూపుతాయని ప్రభుత్వ ప్రతినిధి సోఫీ ప్రైమాస్ వ్యాఖ్యానించారు. తక్షణం రద్దు చేయాలి: చైనా ఏకపక్ష టారిఫ్‌లను అమెరికా తక్షణం రద్దు చేయాలని చైనా డిమాండ్ చేసింది. ప్రపంచ ఆర్థికాభివృద్ధికి ఇవి గొడ్డలి పెట్టని అభిప్రాయపడింది. అమెరికా ప్రయోజనాలతో పాటు అంతర్జాతీయ సరఫరా గొలు సులను కూడా దెబ్బతీస్తాయని హెచ్చరించింది. విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అమెరికాకు సూచించింది.చర్చలే మార్గం: దక్షణ కొరియా ఈ సమస్యకు చర్చలే మార్గమని ద క్షణ కొరియా అభిప్రాయపడింది. ప్రపంచ వాణిజ్య యుద్ధం వాస్తవ రూపం దాల్చిందని తాత్కాలిక అధ్యక్షుడు హాన్ డక్ సూ అన్నారు. ఆర్థిక మంత్రి, ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష జరిపారు. ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి శక్తి సామ ర్థ్యాలన్నింటినీ ధారపోద్దామని చెప్పారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికాపై సుంకాలు ఎత్తేసిన ఇజ్రాయెల్
జెరూసలేం: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల హెచ్చరికలు పని చేస్తున్నాయి. అమెరికా దిగుమతులపై అన్ని సుంకాలను ఇజ్రాయెల్ ఎత్తేసింది. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బుధవారం ఈ మేరకు ప్రకటించారు. ‘‘అమెరికా వస్తువులపై కస్టమ్స్ సుంకాలను రద్దు చేయడమంటే మార్కెట్‌ను ఒక దశాబ్దం పాటు పోటీకి తెరవడం. ఆర్థిక వ్యవస్థకు వైవిధ్యాన్ని పరిచయం చేయడం. జీవన వ్యయాన్ని తగ్గించడానికి మా ప్రభుత్వం ఎంచుకున్న విధానాల్లో ఇది అదనపు దశ. మార్కెట్‌కు, ఇజ్రాయెల్ పౌరులకు ప్రయోజనం చేకూర్చేది. ఇజ్రాయెల్, అమెరికాల సంబంధాలను ఈ చర్య మరింత బలోపేతం చేస్తుంది’’ అని ‘ఎక్స్’లో నెతన్యాహు ప్రకటించారు.40 ఏళ్ల స్వేచ్ఛా వాణిజ్యంఇజ్రాయెల్, అమెరికా మధ్య 40 ఏళ్లుగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లో ఉంది. 99 శాతం అమెరికా దిగుమతులను ఇజ్రాయెల్ ఇప్పటికే సుంకాల నుంచి మినహాయించింది. ఈ నేపథ్యంలో తాజా చర్యను ఆర్థిక చర్యగా కంటే దౌత్య, రాజకీయ చర్యగా భావిస్తున్నారు. ప్రస్తుతం అమెరికా వ్యవసాయోత్పత్తులపై ఇజ్రాయెల్ ఏటా 42 మిలియన్ షెకెల్స్ (సుమారు 1.15 కోట్ల డాలర్ల) సుంకాలు వసూలు చేస్తోంది. ఇజ్రాయెల్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ డేటా ప్రకారం 2024లో ఆ దేశం మొత్తం ఎగుమతుల విలువ 172 కోట్ల డాలర్లు. అమెరికా నుంచి దిగుమతుల విలువ 92 కోట్ల డాలర్లు. -
పుతిన్, జెలెన్స్కీ మధ్య అంతులేని విద్వేషం
వాషింగ్టన్: రష్యా, ఉక్రెయిన్ అధినేతలు పుతిన్, జెలెన్స్కీలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి రుసరుసలాడారు. రష్యా–ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని నివారించి, శాంతిని నెలకొల్పడానికి తాను చేస్తున్న ప్రయత్నాలను వారు ముందుకు సాగనివ్వడం లేదని మండిపడ్డారు. ఆ ఇద్దరు నాయకుల మధ్య అంతులేని విద్వేషం కనిపిస్తోందని చెప్పారు. అయినప్పటికీ యుద్ధాన్ని ముగించే విషయంలో ఇప్పటికే ఎంతో పురోగతి సాధించానని అన్నారు. ఆదివారం ఫ్లోరిడాలోని తన ప్రైవేట్ క్లబ్ ‘మర్–అ–లాగో’లో ‘ఎన్బీసీ న్యూస్’వార్తా సంస్థకు ట్రంప్ ఇంటర్వ్యూ ఇచ్చారు. జెలెన్స్కీ విశ్వసనీయతను పుతిన్ ప్రశ్నించడం తనకు నచ్చలేదని చెప్పారు. శాంతి ఒప్పందంపై సంతకం చేసే హక్కు జెలెన్స్కీకి లేదని, ఉక్రెయిన్‌కు బాహ్య పరిపాలన అవసరమని పుతిన్ చేసిన వ్యాఖ్యల పట్ల ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇకనైనా పద్ధతి మార్చుకోకపోతే రష్యాపై మరిన్ని ఆంక్షలు విధిస్తామని పరోక్షంగా సంకేతాలిచ్చారు. రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత పుతిన్ పట్ల సానుకూల ధోరణితో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు హఠాత్తుగా స్వరం మార్చేయడం చర్చనీయాంశంగా మారింది. ఉక్రెయిన్–రష్యా యుద్ధం విషయంలో తాను అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోవడం పట్ల ఆయన ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. క్రిటికల్ మినరల్స్ మైనింగ్‌పై మాట తప్పితే.. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని నిలిపివేస్తానంటూ పుతిన్ తనకు హామీ ఇచ్చారని, ఈ విషయంలో ఆయన వెనక్కి తగ్గబోరని భావిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. పుతిన్ తనకు ఎన్నో ఏళ్లుగా తెలుసని, తాము కలిసి పనిచేస్తామని అన్నారు. కాల్పుల విరమణకు పుతిన్ ఎప్పుడు అంగీకరిస్తారో చెప్పలేనని, దానిపై సైకలాజికల్ డెడ్‌లైన్ ఉందని వెల్లడించారు. ఉక్రెయిన్‌కు ఇన్నాళ్లూ అందించిన ఆర్థిక, సైనిక సాయానికి బదులుగా అరుదైన ఖనిజాల తవ్వకానికి అమెరికాకు అనుమతి ఇవ్వడానికి జెలెన్స్కీ అంగీకరించిన సంగతి తెలిసిందే. అయితే, విషయంలో జెలెన్స్కీ మోసం చేసే అవకాశం ఉన్నట్లు తమకు సమాచారం అందని ట్రంప్ చెప్పారు. క్రిటికల్ మినరల్స్ మైనింగ్ విషయంలో మాట తప్పితే చాలాచాలా పెద్ద సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని జెలెన్స్కీని ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. ఉక్రెయిన్ భద్రతకు స్పష్టమై హామీని ఇవ్వాలంటూ మిత్రదేశాలతో ఒప్పందం కుదుర్చుకోవాలన్న ఆలోచనలో జెలెన్స్కీ ఉన్నట్లు తెలిపారు. ఉక్రెయిన్‌కు ‘నాటో’సభ్యత్వం లభించే అవకాశమే లేదని, ఆ విషయం జెలెన్స్కీకి కూడా తెలుసని తే ల్చిచెప్పారు. సాధ్యమైనంత త్వరగా కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్ ప్రభుత్వం చెబుతుండగా పుతిన్ ప్రభుత్వం అంగీకరించడంలేదు. కనీసం 30 రోజులపాటు దాడులు ఆపేయాలని కోరినా లెక్కచేయడం లేదు. పైగా ఉక్రెయిన్‌పై వైమానిక, క్షిపణి దాడులను మరింత ఉధృతం చేస్తుండడం గమనార్హం. -
అమెరికా పర్యటనా?... వద్దు బ్రో!
లీడ్స్ (యూకే): ప్రపంచంలో అత్యుత్తమ పర్యాటక దేశాల జాబితాలో అమెరికా టాప్–3లో ఉండడం పరిపాటి. శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, షికాగో వంటి నగరాలు, అక్కడున్న జాతీయ పార్కులు, వినోద కేంద్రాలు అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్శిస్తుంటాయి. 2023లో 66.5 మిలియన్ల మంది అమెరికాను సందర్శించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. 2024లో ఈ సంఖ్య మరింత ఎక్కువేనని అంచనా వేస్తున్నారు. అయితే, ఈ ఏడాది పరిస్థితి మారిపోయింది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇతర దేశాలతో సంబంధాలు దెబ్బతింటున్నాయి. విదేశీ ఉత్పత్తులపై ట్రంప్ సుంకాల మోత మోగిస్తున్నారు. అక్రమ వలసదార్ల పేరిట వేలాది మందిని బలవంతంగా బయటకు తరిమేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ కలిసి పర్యాటక రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. అమెరికాలో పర్యటించాలని నిర్ణయించుకున్నవారు సైతం పునరాలోచన చేస్తున్నారు. అమెరికా పట్ల ప్రపంచ దేశాల దృక్పథంలో మార్పు కనిపిస్తోంది. → అమెరికా పర్యాటక రంగం ఈ ఏడాది కనీసం 5.5 శాతం పతనమయ్యే అవకాశం ఉన్నట్లు పరిశోధక సంస్థ ‘టూరిజం ఎకనామిక్స్’ అంచనా వేసింది. ఈ మేరకు ఇటీవల ఒక నివేదిక విడుదల చేసింది. పర్యాటక రంగం ఈ ఏడాది 9 శాతం వృద్ధి చెందనున్నట్లు ఇదే సంస్థ గతంలో అంచనా వేయడం గమనార్హం. → ప్రధానంగా డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన టారిఫ్‌లు, వాణిజ్య యుద్ధంతో పర్యాటకానికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం కనిపిస్తోంది. ఈ ఏడాది టూరిజంపై జనం చేసే ఖర్చు 18 బిలియన్ డాలర్లు తగ్గనున్నట్లు అంచనా. → అమెరికా పర్యాటకానికి కెనడా ప్రజలే అతిపెద్ద వనరు. కెనడా ఉత్పత్తులపై 25 శాతం సుంకాలను ట్రంప్ విధించడం కెనడా పర్యాటకులకు నచ్చడం లేదు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కెనడా నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్యలో భారీగా తగ్గుదల నమోదవుతోంది. కొన్నిసార్లు ఇది 45 శాతంగా ఉంటోంది. → అమెరికా ప్రయాణాలకు డిమాండ్ తగ్గడంతో విమానాల సంఖ్యను తగ్గించాల్సి వచ్చిందని ఎయిర్ కెనడా ప్రకటించింది. అమెరికాకు వెళ్లడానికి జనం ఆసక్తి చూపడం లేదని వెల్లడించింది. → అమెరికాకు ఇప్పటికే ట్రిప్పులు ప్లాన్ చేసుకున్నవారిలో 36 శాతం మంది వాటిని రద్దు చేసుకున్నారని కెనడియన్ మార్కెట్ రీసెర్చర్ ‘లెగర్’ తెలియజేసింది. → గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కెనడా నుంచి అమెరికాకు ప్యాసింజర్ బుకింగ్‌లు 70 శాతం పడిపోయాయని ఏవియేషన్ అనలిటిక్స్ కంపెనీ ‘ఓఏజీ’ ప్రకటించింది. → పర్యాటకుల రాక తగ్గుతుండడం పట్ల యూఎస్ ట్రావెల్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తంచేసింది. కెనడా నుంచి పర్యాటకుల సంఖ్య 10 శాతం తగ్గినా 2.1 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుందని స్పష్టంచేసింది. 1.40 లక్షలు ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం ఉందని పేర్కొంది. → అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ వాతావరణం మారిపోయిందని, పర్యాటకులకు అది అనువుగా లేదని విదేశీయులు అభిప్రాయపడుతున్నారు. విదేశీయులు, వలసదార్లతోపాటు స్వలింగ వివాహాల పట్ల ట్రంప్ ప్రభుత్వం కఠినంగానే వ్యవహరిస్తోంది. అందుకే ఇప్పుడు అక్కడికి వెళ్లడం క్షేమకరం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. → పశ్చిమ యూరప్ ప్రజల్లో ట్రంప్ ప్రభుత్వంపై స్పష్టమైన వ్యతిరేకత కనిపిస్తోంది. ఇటీవల ఒక సర్వేలో బ్రిటన్‌లో 53 శాతం, జర్మనీలో 56 శాతం, స్వీడన్లో 63 శాతం, డెన్మార్క్‌లో 74 శాతం మంది ట్రంప్ సర్కారుపై ప్రతికూల అభిప్రాయం వ్యక్తం చేశారు. అమెరికాపై ఈ స్థాయిలో వ్యతిరేకత కనిపించడం 2016 తర్వాత ఇదే మొదటిసారి. → అమెరికాకు పొరుగు దేశం మెక్సికో నుంచి కూడా అధికంగా టూరిస్టులు వస్తుంటారు. ట్రంప్ తొలి హయాంలో మెక్సికో టూరిస్టుల సంఖ్య బాగా తగ్గడం గమనార్హం. అప్పుడు మెక్సికో నుంచి విమాన ప్రయాణాలు 3 శాతం తగ్గాయి. 2025లో కూడా 2024తో పోలిస్తే ఇప్పటికే 6 శాతం తగ్గాయి. → అమెరికాకు వెళ్తే అరెస్టయ్యే, నిర్బంధానికి గురయ్యే ప్రమాదముందని చాలా దేశాలు తమ పౌరులను అప్రమత్తం చేస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాయి. → అమెరికాలో పర్యటన కష్టంగా మారుతోందనే ఉద్దేశంతో అంతర్జాతీయ టూరిస్టులు ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారిస్తున్నారు. బెర్ముడా హోటళ్లలో బుకింగ్‌ల కోసం ఆరా తీస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. అమెరికా పర్యటనలు రద్దు చేసుకుంటున్నవారు యూరప్ దేశాలను డెస్టినేషన్‌గా ఎంచుకున్నారు. → 2026లో ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్ అమెరికా, కెనడా, మెక్సికోల్లో జరుగనుంది. 2028 ఒలింపిక్స్ అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో విదేశీ పర్యాటకుల్లో భయాందోళనను తొలగించడానికి అమెరికా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. -
ట్రంప్ మూడో ముచ్చట తీరేనా?
‘మూడోసారి కూడా అధ్యక్షుడు కావాలనుకుంటున్నా. నేనేమీ జోక్ చేయడం లేదు. సీరియస్‌గానే చెప్తున్నా. నన్ను మూడోసారి కూడా అధ్యక్షునిగా చూడాలని అమెరికన్లలో చాలామంది కోరుకుంటున్నారు’ – రెండోసారి అధ్యక్షుడై మూడు నెలలైనా నిండకముందే డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. మూడో టర్ము గురించిన ఆకాంక్షలను వెలిబుచ్చడం ఆయనకు ఇది తొలిసారేమీ కాదు. అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. అనంతరం గత జనవరిలో కూడా, ‘ఒకట్రెండు సార్లు మాత్రమే కాదు, మూడు, ఇంకా చెప్పాలంటే నాలుగుసార్లు కూడా దేశానికి సేవ చేయడం నాకు అత్యంత గౌరవప్రదమైన విషయం’అని చెప్పుకొచ్చారు. రెండుసార్లకు మించి అధ్యక్ష పదవి చేపట్టేందుకు అమెరికా రాజ్యాంగం అనుమతించదని తెలిసీ ట్రంప్ ఎందుకిలాంటి ప్రకటన చేశారన్నది ఆసక్తికరం. మనసుంటే మార్గముంటుందన్నట్టు, ‘మూడో’ముచ్చట తీర్చుకునేందుకు ట్రంప్‌కు అవకాశముందని అభిమానులు చెబుతున్నారు. అందుకే అంత బాహాటంగా ఆ ప్రకటన చేశారంటున్నారు. అదెంతవరకు సాధ్యమన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. అంతేగాక ట్రంప్ యోచనకు అనుకూలంగా, వ్యతిరేకంగా కూడా పలు వాదనలు తెరపైకి వస్తున్నాయి. అవేమిటంటే...రాజ్యాంగాన్ని సవరించాలి అమెరికా రాజ్యాంగానికి చేసిన 22వ సవరణ ప్రకారం ఒక వ్యక్తి రెండుసార్లకు మించి అధ్యక్ష పదవి చేపట్టడానికి వీల్లేదు. అంతేకాదు. ఏ కారణాలతోనైనా రెండేళ్లు, అంతకంటే ఎక్కువకాలం అధ్యక్షునిగా చేసినా సరే, ఈ సవరణ ప్రకారం వారు మరొక్కసారి మాత్రమే తిరిగి ఎన్నిక కావచ్చు. ఈ లెక్కన ట్రంప్ కోరిక నెరవేరాలంటే రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది. కానీ అది అత్యంత కష్టసాధ్యం. ఎందుకంటే ఆ సవరణను కాంగ్రెస్ ఉభయ సభలూ మూడింట రెండొంతుల మెజారిటీతో ఆమోదించాలి. ఆ మీదట మూడొంతుల రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆమోదముద్ర వేయాలి. కానీ అధికార రిపబ్లికన్లకు కాంగ్రెస్‌లో అంతæ మెజారిటీ లేదు. పైగా 50 రాష్ట్రాల్లో 18 విపక్ష డెమొక్రాట్ల చేతుల్లోనే ఉన్నాయి.‘ఉపాధ్యక్ష’దారిలో... అధ్యక్ష పదవికి రెండుకంటే ఎక్కువసార్లు ‘ఎన్నిక’కావడాన్ని మాత్రమే 22వ సవరణ నిషేధిస్తోంది. వారసత్వంగా ఆ పదవిని పొందే విషయంపై మాత్రం అందులో ఎలాంటి ప్రస్తావనా లేదు. దీన్ని ట్రంప్ తనకు అనుకూలంగా వాడుకోనున్నట్టు ఆయన మద్దతుదారులు చెబుతున్నారు! ‘‘ఏ కారణంతోనైనా అధ్యక్షుడు రాజీనామా చేస్తే నిబంధనల ప్రకారం ఆ పదవి ఉపాధ్యక్షునికే దక్కుతుంది. కనుక 2028లో ట్రంప్ ఉపాధ్యక్ష బరిలో దిగుతారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తారు. గెలిస్తే వెంటనే రాజీనామా చేస్తారు. తద్వారా ట్రంప్ ఆటోమేటిగ్గా మూడోసారి అధ్యక్షుడైపోతారు’’అంటున్నారు. ఈ ఆలోచన తన మనసులో ఉందని ట్రంప్ అంగీకరించారు కూడా. కానీ దీనిపై భిన్న వాదనలున్నాయి. ఇది అసాధ్యమని యూనివర్సిటీ ఆఫ్ నోర్టెడామ్లో ఎన్నికల నిబంధనల నిపుణుడైన ప్రొఫెసర్ డెరెక్ ముల్లర్ చెబుతున్నారు. ‘‘అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు అర్హత లేని వ్యక్తి ఉపాధ్యక్ష పదవికి కూడా పోటీ పడేందుకు కూడా అనర్హుడేనని 12వ రాజ్యాంగ సవరణ స్పష్టం చేస్తోంది. 2028లో అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు ట్రంప్ అనర్హుడు గనుక ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు కూడా అనర్హుడే అవుతారు’’అని ఆయన స్పష్టం చేశారు. ఇవన్నీ కాకుండా ఒకవ్యక్తి మూడుసార్లు అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు అనుమతిస్తూ రాజ్యాంగాన్ని సవరించాలని రిపబ్లికన్ నేత ఆండీ ఓగ్లెస్ గత జనవరిలో ప్రతిపాదించారు. అంతగా అయితే ఆ మూడుసార్లు వరుసగా కాకుంటే చాలంటూ ఓ నిబంధన విధిస్తే సరిపోతుందని సూచించారు.9 మంది గెలవకుండానే అధ్యక్ష పీఠమెక్కారుఅమెరికా చరిత్రలో ఏకంగా 9 మంది ఉపాధ్యక్షులు ఎన్నికల పోరులో గెలవకుండానే అత్యున్నత పీఠమెక్కారు. అధ్యక్షుని మరణం, లేదా రాజీనామా వల్ల తాము అధ్యక్షులయ్యారు. వయసు అనుమతించేనా? మూడోసారి అధ్యక్ష పదవి చేపట్టేందుకు వయసు కూడా ట్రంప్‌కు అడ్డంకిగానే మారేలా కన్పి స్తోంది. ఆయనకిప్పటికే 78 ఏళ్లు. ఆ లెక్కన ఈ పదవీ కాలం ముగిసేసరికి 82 ఏళ్లకు చేరుకుంటారు. ఆ వయసులో తిరిగి ఎన్నికల బరిలో దిగాల్సి ఉంటుంది. అదెంత వరకు సాధ్యమన్నది కాలం గడిస్తే గానీ తేలదు.వద్దే వద్దు: డెమొక్రాట్లు ట్రంప్ మూడో టర్ము వ్యాఖ్యలను విపక్ష డెమొక్రాటిక్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ‘‘ఇటువంటి ఆలోచనలతో ప్రజాస్వామ్యానికి ఆయన మరింతగా తూట్లు పొడుస్తున్నారు. రెండోసారి అధ్యక్షుడైతేనే ప్రపంచమంతటినీ ఇంతటి గందరగోళంలోకి నెట్టేస్తున్న ఆయన మూడోసారి గద్దెనెక్కేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదు. కాంగ్రెస్‌లోని రిపబ్లికన్ ప్రతినిధులకు రాజ్యాంగంపై ఏమాత్రం విశ్వాసమున్నా ట్రంప్ మతిలేని మూడో టర్ము ఆకాంక్షలను తక్షణం బాహాటంగా ఖండించాలి’’అని డిమాండ్ చేసింది. రిపబ్లికన్లలో కూడా కొందరు మూడో టర్ము సరైన యోచన కాదంటున్నారు. ఈ ఆలోచనకు తానసలే మద్దతివ్వబోనని ఓక్లహామీ సెనేటర్ మార్కవైన్ ములిన్ ఇటీవలే చెప్పారు.రూజ్వెల్ట్ నాలుగుసార్లు! రెండు కంటే ఎక్కువసార్లు అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన ఏకైక నేతగా ఫ్రాంక్లిన్ డి.రూజ్వెల్ట్ నిలిచిపోయారు. 32వ అధ్యక్షునిగా 1933లో తొలిసారి గద్దెనెక్కిన ఆయన 1945లో మరణించేదాకా పదవిలోనే కొనసాగారు! అత్యధిక కాలం పాటు అధ్యక్షునిగా కొనసాగిన రికార్డు కూడా ఆయనదే. అధ్యక్ష పదవిని రెండుసార్లకు మించి చేపట్టరాదన్న సంప్రదాయాన్ని అమెరికా మొదటినుంచీ పాటిస్తోంది. దీనికి బాటలు వేసింది తొలి అధ్యక్షుడు జార్జి వాషింగ్టనే. ఆయన వరుసగా రెండుసార్లు గెలిచారు. మూడోసారీ అధ్యక్షుడు కావాలని దేశమంతా కోరినా సున్నితంగా నిరాకరించి తప్పుకున్నారు. అప్పటినుంచి అందరు అధ్యక్షులూ అనుసరిస్తూ వస్తున్న ఆ సంప్రదాయాన్ని రూజ్వెల్ట్ మాత్రం అతిక్రమించారు. రెండో ప్రపంచ యుద్ధాన్ని, హిట్లర్ సారథ్యంలో నాజీల దూకుడును బూచిగా చూపిస్తూ 1940, 1944 అధ్యక్ష ఎన్నికల్లో వరుసగా మరో రెండుసార్లు పోటీ చేసి గెలిచారు. అయితే 1944లో నాలుగోసారి బరిలో దిగేనాటికే రూజ్వెల్ట్ ఆరోగ్యం క్షీణించింది. 1945లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మూడు నెలలకే మరణించారు. అనంతరం రెండుసార్లకు మించి అధ్యక్ష పదవి చేపట్టకుండా 1951లో 22వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచి్చంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
రాజకీయ ప్రకంపనలు.. మూడోసారి అధికారంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాను మూడోసారి అధికారంలోకి రావడానికి మార్గాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నిక కావడంపై తాను జోక్ చేయడం లేదంటూ మాట్లాడారు. అయితే, అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నిక కావడాన్ని రాజ్యాంగంలోని 22వ సవరణ అనుమతించదు. దీంతో, ఆయన వ్యాఖ్యలు అమెరికాలో కొత్త చర్చకు దారి తీశాయి.అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నిక కావడానికి అవకాశం, మార్గాలు ఉన్నాయని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అయితే దీనిపై ఇప్పుడే ఆలోచించడం సరికాదన్నారు. దానికి ఇంకా సమయం ఉందని చెప్పుకొచ్చారు. అధ్యక్షుడు ట్రంప్ ఆదివారం ఓ న్యూస్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమెరికాలో చాలా మంది ప్రజలు.. నన్ను మూడోసారి ఎన్నిక కావాలని కోరుతున్నారు. నాకు పనిచేయడం అంటే ఇష్టం. అమెరికా ప్రజలు కోసం ఎంత కష్టమైనా కొన్ని నిర్ణయాలు తీసుకోడానికి వెనుకాడను. మూడోసారి అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఇప్పుడే దానిపై ఆలోచించడం తొందరపాటు అవుతుంది. ఇప్పుడు నేను ప్రస్తుత పరిస్థితులపై దృష్టి సారించాను. ఇప్పుడు చేయాల్సింది చాలా మిగిలి ఉంది’ అంటూ కామెంట్స్ చేశారు.రెండు మార్గాలు.. ఇదిలా ఉండగా.. అమెరికా రాజ్యాంగంలో విధించిన రెండు దఫాల నిబంధనను మార్చాలంటే సవరణ చేయాలి. అది కష్టతరమైనది. రాజ్యాంగ సవరణ చేయాలంటే కాంగ్రెస్‌లో మూడింట రెండు వంతుల మెజారిటీ ఉండాలి. లేదంటే మూడింట రెండు వంతుల రాష్ట్రాలు అంగీకరించాలి. ఈ రెండు మార్గాలనూ నాలుగింట మూడు వంతుల రాష్ట్రాలు ఆమోదించాలి. ఇది వ్యాఖ్యలు చేసినంత సులభం కాదని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక, అమెరికాలో 2028లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. -
వైట్ హౌస్‌లో ట్రంప్ ఇఫ్తార్ విందు
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంజాన్ సందర్బంగా గురువారం వైట్ హౌస్‌లో ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముస్లిం వర్గం నేతలు, దౌత్య సిబ్బంది, ప్రభుత్వాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ ముస్లిం సోదరులకు రంజాన్ ముబారక్ తెలిపారు. 2024 ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచిన లక్షలాది మంది అమెరికన్ ముస్లింలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ముస్లింలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. చారిత్రక అబ్రహాం ఒడంబడికల ప్రాతిపదికగా పశ్చిమాసియాలో శాశ్వత శాంతిని నెలకొల్పేందుకు అవిశ్రాంతంగా పనిచేస్తున్నామని చెప్పారు. గత బైడెన్ ప్రభుత్వం ఈ విషయంలో ఏమీ చేయలేకపోయిందని విమర్శించారు. ఇజ్రాయెల్, ఏడు అరబ్ దేశాల మధ్య సంబంధాలను సాధారణ స్థితికి తీసుకువచ్చే లక్ష్యంతో గతంలో ట్రంప్ ప్రభుత్వం హయాంలో కుదిరిన అబ్రహాం ఒప్పందాలను ఆయనీ సందర్భంగా గుర్తు చేశారు. కాగా, అమెరికా, ఖతార్, ఈజిప్టు మధ్యవర్తిత్వంతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ప్రశ్నార్థకంగా మారడం, గాజాపై మళ్లీ ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడుతున్న వేళ ట్రంప్ ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇవ్వడం గమనార్హం. -
Donald Trump: మరో టారిఫ్ బాంబు
వాషింగ్టన్/టొరంటో/ఫ్రాంక్ఫర్ట్/టోక్యో: ప్రపంచ దేశాలతో టారిఫ్‌ల యుద్ధాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తారస్థాయికి తీసుకెళ్తున్నారు. తమ దేశంలోకి దిగుమతయ్యే అన్నిరకాల కార్లపైనా సుంకాలను ఎకాయెకి 25 శాతానికి పెంచేస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఇది కార్ల విడిభాగాలతో పాటు తేలికపాటి ట్రక్కులకు కూడా వర్తించనుంది. ‘‘కొత్త టారిఫ్‌లు ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి వస్తాయి. ఇది శాశ్వత నిర్ణయం. దీనిపై వెనక్కు తగ్గేదే లేదు’’ అని ట్రంప్ బుధవారం ప్రకటించారు. ‘‘సుంకాలు వద్దనుకునే తయారీ కంపెనీలు అమెరికాలోనే కార్లను తయారు చేసుకుంటే సరి! పైసా కూడా పన్ను కట్టాల్సిన పనుండదు!’’ అంటూ హితవు పలికారు! భారత్‌తో పాటు పలు దేశాలపై ప్రకటించిన పరస్పర సుంకాలు కూడా ఏప్రిల్ 2 నుంచే అమల్లోకి వస్తాయని ట్రంప్ ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. దాన్ని ‘విముక్తి దినం’గా అభివరి్ణంచారు. ఒకట్రెండు రోజుల్లో మరిన్ని కఠిన వాణిజ్య నిర్ణయాలు కూడా ప్రకటించనున్నారు. కార్లపై సుంకాల పెంపుపై ప్రపంచ దేశాలు భగ్గుమన్నాయి. కెనడా, మెక్సికో, చైనా, బ్రెజిల్, జపాన్‌తో పాటు పలు యూరప్ దేశాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించాయి. దీన్ని తక్షణం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. లేదంటే తగిన ప్రతి చర్య తప్పదని హెచ్చరించాయి. ట్రంప్ నిర్ణయం ప్రభావం భారత్‌పైనా పడనుంది. టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్ వంటి ఆటో దిగ్గజాలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. త్వరలో ప్రతీకార చర్యలు: కెనడా ట్రంప్ ప్రకటించిన కార్ల సుంకాలను కెనడాపై ప్రత్యక్ష దాడిగా ప్రధాని మార్క్ కార్నీ అభివరి్ణంచారు. దీనిబారి నుంచి తమ దేశాన్ని, కార్ల పరిశ్రమను, కంపెనీలను, కార్మికులను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకుని తీరతామని ప్రకటించారు. దీనికి తప్పకుండా ప్రతీకార చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. వాటిపై నిర్ణయం తీసుకునేందుకు ‘అమెరికాతో సంబంధాలపై కేబినెట్ కమిటీ’తో కార్నీ గురువారం అవ్యతసరంగా సమావేశం కానున్నారు. ఇందుకోసం ఎన్నికల ప్రచారం నుంచి ఆయన ఉన్నపళాన ఒట్టావా చేరుకున్నారు. ట్రంప్ టారిఫ్‌ల బారినుంచి దేశీయ ఆటో పరిశ్రమను కాపాడేందుకు కెనడా ఇప్పటికే 140 కోట్ల డాలర్ల నిధిని ఏర్పాటు చేసింది. అమెరికాకు కెనడా ఎగుమతుల్లో ఆటో ఉత్పత్తులది రెండో స్థానం. యూరప్ ఆందోళన ఆర్థిక మందగమనంతో ఇప్పటికే సతమతమవుతున్న యూరప్ కార్ల పరిశ్రమపై ట్రంప్ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనుంది. బీఎండబ్ల్యూ, ఫోక్స్‌వాగన్, మెర్సిడెజ్–బెంజ్, వోల్వో, స్టెలాంటిస్ వంటి యూరప్ తయారీ కార్ల ధరలు అమెరికాలో భారీగా పెరగనున్నాయి. ట్రంప్ చర్యను అక్కడి కార్ల దిగ్గజాలన్నీ తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇది అమెరికాపైనా ప్రతికూల ప్రభావం చూపుతుందని యూరప్ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం హెచ్చరించింది. అందుకు తగ్గట్టుగానే ట్రంప్ ప్రకటన తర్వాత ఫోర్డ్, జనరల్ మోటార్స్ వంటి అమెరికా కార్ల తయారీ దిగ్గజాల షేర్ల ధరలు పతనమయ్యాయి. యూరప్ ఆటో పరిశ్రమకు అమెరికాయే అతి పెద్ద దిగుమతిదారు. 2023లో అక్కడినుంచి అమెరికాకు 560 కోట్ల యూరోల విలువైన వాహనాలు, విడిభాగాలు ఎగుమతయ్యాయి. ఇటలీ, జర్మనీ కార్ల ఎగుమతుల్లో 30 శాతం వాటా అమెరికాదే. అమెరికా కార్ల ఎగుమతుల్లో యూరప్ వాటా కేవలం 2 శాతమే. జపాన్ కార్లకు అమెరికాయే అతి పెద్ద దిగుమతిదారు. దాంతో ట్రంప్ నిర్ణయం గురువారం జపాన్ పార్లమెంటును కుదిపేసింది. ప్రధాని షిగెరు ఇషిబా దీనిపై సభలో ప్రకటన చేశారు. తాజా నిర్ణయం నుంచి తమను మినహాయించాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రతీకార చర్యలు తప్పవని హెచ్చరించారు. బ్రెజిల్ అధ్యక్షుడు లులా డసిల్వా కూడా ట్రంప్ నిర్ణయంపై మండిపడ్డారు. స్వేచ్ఛా వాణిజ్య విలువలకు ఇష్టానికి తూట్లు పొడవడం ద్వరా ట్రంప్ సర్కారు దారుణంగా ప్రవర్తిస్తోందంటూ తూర్పారబట్టారు. ‘‘ట్రంప్ తాను ప్రపంచానికే అధ్యక్షుడినని భావిస్తున్నారు. ఈ మతిలేని నిర్ణయాలు అంతిమంగా అమెరికాతో పాటు ఎవరికీ మంచి చేయవు’’ అని హెచ్చరించారు. అమెరికా టారిఫ్‌లపై ప్రపంచ వాణిజ్య సంస్థకు ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు.అమెరికాపైనా ప్రభావం ట్రంప్ కార్ల టారిఫ్ నిర్ణయం ప్రభావం అమెరికాపైనా గట్టిగానే పడనుంది. ముఖ్యంగా డెట్రాయిట్ వంటి కార్ల పరిశ్రమ కేంద్రాలకు ఇది కోలుకోలేని దెబ్బే కానుంది. అక్కడి నుంచి ఒక్క కెనడాకే 40 శాతం కార్లు ఎగుమతి అవుతాయి. ఇతర దేశాలన్నీ అమెరికాపై విధించబోయే ప్రతీకార సుంకాలు దేశీయ కార్ల పరిశ్రమ నడ్డి విరవడం ఖాయమని ఆ రంగ నిపుణులు చెబుతున్నారు. ‘‘కార్ల కంపెనీలు తయారీ యూనిట్లు అమెరికా బయటికి తరలి వేలాది మంది ఉపాధి కోల్పోవచ్చు. సరిహద్దులకు రెండు వైపులా చాలా కార్ల కంపెనీలు మూతబడటం ఖాయం. ఏప్రిల్ 2 అమెరికాకు విముక్తి దినమని ట్రంప్ అనుకుంటున్నారు. కానీ నిజానికి అది ఆ దేశం పాలిట వినాశ దినం కాబోతోంది’’ అని కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్ గవర్నర్ డౌగ్ ఫోర్డ్ చెప్పారు.2024లో అమెరికా దిగుమతి చేసుకున్న కార్లు, ట్రక్కులు దాదాపు 80 లక్షలు వాటి విలువ24,000 కోట్ల డాలర్లు -
‘ఆటో’ టారిఫ్‌ల ప్రభావం అంతంతే..
న్యూఢిల్లీ: వచ్చే నెల నుంచి వాహనాలు, ఆటో విడిభాగాలపై అమెరికా విధించబోయే 25 శాతం దిగుమతి సుంకాల ప్రభావం భారతీయ సంస్థలపై అంతంత మాత్రంగానే ఉండొచ్చని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. మరోవైపు దేశీ ఎగుమతిదారులకు దీనివల్ల వ్యాపార అవకాశాలు మరింతగా పెరగడానికి కూడా ఆస్కారం ఉందని పేర్కొన్నారు. 2024 సంవత్సరంలో భారతీయ ఆటో, ఆటో విడిభాగాల ఎగుమతులను విశ్లేషించిన మీదట ఈ మేరకు అంచనా వేస్తున్నట్లు వివరించారు. ఏప్రిల్ 3 నుంచి కంప్లీట్లీ బిల్ట్ వెహికల్స్ (సీబీయూలు), ఆటో విడిభాగాలపై 25 శాతం టారిఫ్‌లు విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో జీటీఆర్ఐ అంచనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2024 గణాంకాల ప్రకారం భారత్ సుమారు 8.9 మిలియన్ డాలర్ల విలువ చేసే వాహనాలను అమెరికాకు ఎగుమతి చేసింది. ఇది మొత్తం 6.98 బిలియన్ డాలర్ల వాహన ఎగుమతుల్లో 0.13 శాతమే. అలాగే, మొత్తం ట్రక్కుల ఎగుమతుల్లో అమెరికా మార్కెట్ వాటా 0.89 శాతమే. ఇలా అమెరికాకు వాహనాల ఎగుమతులు నామమాత్రమే కాబట్టి, మనపై టారిఫ్‌ల ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని శ్రీవాస్తవ వివరించారు.ఆటో షేర్లకు టారిఫ్ బ్రేక్స్ఆటో దిగుమతులపై 25 శాతం ప్రతీకార సుంకాలను విధింపుతో దేశీ ఆటో విడిభాగాల పరిశ్రమలో అనిశ్చితి తలెత్తింది. బ్రిటిష్ లగ్జరీ కార్ల దిగ్గజం జేఎల్ఆర్ విలాసవంత మోడల్ కార్లు అమెరికా మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కారణంగా దేశీ మాతృ సంస్థ టాటా మోటార్స్‌కు సైతం సెగ తగులుతోంది. దీంతో టాటా మోటార్స్ షేరు తాజాగా 5.5 శాతం పతనమైంది. రూ. 669 వద్ద ముగిసింది. కార్లతో పోలిస్తే యూఎస్‌కు భారత్ నుంచి ఆటో విడిభాగాలు అధికంగా ఎగుమతి అవుతున్నాయి. దీంతో ఎన్ఎస్ఈలో సోనా కామ్స్టార్ షేరు 6.2 శాతం క్షీణించి రూ. 466 వద్ద నిలవగా.. సంవర్ధన మదర్సన్ 2.6 శాతం నీరసించి రూ. 131 వద్ద, అశోక్ లేలాండ్ 2.7 శాతం నష్టంతో రూ. 209 వద్ద, భారత్ ఫోర్జ్ 2.3 శాతం క్షీణించి రూ. 1,155 వద్ద ముగిశాయి.ఆందోళనలో విడిభాగాల సంస్థలుటారిఫ్ల ప్రభావం వాహన తయారీ సంస్థల కన్నా విడిభాగాల తయారీ సంస్థలపైనే ఎక్కువగా ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. అమెరికాకు భారత్ నుంచి విడిభాగాల ఎగుమతులు గణనీయంగా ఉండటమే ఇందుకు కారణమని పేర్కొన్నాయి. ప్రస్తుతం ఎక్కువగా ఇంజిన్ విడిభాగాలు, పవర్ ట్రెయిన్లు మొదలైన వాటిని అమెరికాకు భారత్ ఎగుమతి చేస్తోంది. పరిశ్రమ వర్గాల ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో ఆ దేశానికి ఆటో విడిభాగాల ఎగుమతులు 6.79 బిలియన్ డాలర్లుగా ఉండగా, దిగుమతులు 1.4 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. మన దిగుమతులపై అమెరికాలో సుంకాలేమీ లేకపోయినప్పటికీ అక్కడి నుంచి వచ్చే ఉత్పత్తులపై భారత్‌లో 15 శాతం సుంకాలు అమలవుతున్నాయి. -
భారత్‌లో ట్రంప్ కంపెనీ.. తొలి ఆఫీస్ ఎక్కడంటే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు చెందిన వ్యాపార సమ్మేళనం ట్రంప్ ఆర్గనైజేషన్ భారతదేశ వాణిజ్య రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి అడుగుపెడుతోంది. ట్రంప్ సంస్థ ఆర్గనైజేషన్‌కు భారత్‌లో ప్రాపర్టీ డెవలప్మెంట్ భాగస్వామి అయిన ట్రిబెకా డెవలపర్స్ 289 మిలియన్ డాలర్లకుపైగా అమ్మకాల లక్ష్యంతో దేశంలో మొదటి ట్రంప్-బ్రాండెడ్ వాణిజ్య రియల్ ఎస్టేట్ ప్రాజెక్టును బుధవారం ప్రారంభించింది.దశాబ్ద కాలంలో భారతదేశం అమెరికా వెలుపల ట్రంప్ బ్రాండ్ అతిపెద్ద రియల్ ఎస్టేట్ మార్కెట్‌గా మారింది. ఇక్కడ ట్రిబెకా ఇతర స్థానిక డెవలపర్లతో లైసెన్సింగ్ ఒప్పందాల కింద నాలుగు భారతీయ నగరాల్లో నివాస ప్రాజెక్టుల అభివృద్ధిలో పాలుపంచుకుంది.గత దశాబ్ద కాలంలో అనేక పెద్ద అంతర్జాతీయ, స్థానిక ఐటీ సంస్థలు కార్యాలయాలను ఏర్పాటు చేసిన పశ్చిమ భారత నగరం పుణెలోనే రియల్ ఎస్టేట్ కంపెనీ కుందన్ స్పేసెస్ సహకారంతో "ట్రంప్ వరల్డ్ సెంటర్" పేరుతో ఆఫీస్ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు నాలుగేళ్లలో పూర్తవుతుందని ట్రిబెకా డెవలపర్స్ వ్యవస్థాపకుడు కల్పేష్ మెహతా ముంబైలో రాయిటర్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. -
యుద్ధానికి పాక్షిక విరామం
వాషింగ్టన్/మాస్కో: రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి తెర దించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. రష్యా, అమెరికా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్, డొనాల్డ్ ట్రంప్ మంగళవారం జరిపిన ఫోన్ చర్చలు ఇందుకు వేదికయ్యాయి. ఉక్రెయిన్‌పై దాడులకు పాక్షికంగా విరామమిచ్చేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సుముఖత వ్యక్తం చేశారు. అందులో భాగంగా మౌలిక వనరులు, విద్యుదుత్పత్తి, ఇంధన వ్యవస్థలు తదితరాలపై దాడులు జరపబోమని ప్రతిపాదించారు.అయితే అందుకు ప్రతిగా అమెరికా, దాని మిత్ర దేశాలు ఉక్రెయిన్‌కు సైనిక, నిఘా సాయాలను పూర్తిగా నిలిపేయాలని షరతు విధించారు! వాటితో పాటు పలు ఇతర డిమాండ్లతో కూడిన భారీ జాబితాను ట్రంప్ ముందుంచారు. వాటన్నింటికీ ఉక్రెయిన్ అంగీకరించాల్సిందేనని కుండబద్దలు కొట్టారు. గంటకు పైగా జరిగిన సంభాషణలో యుద్ధంతో పాటు అమెరికా, రష్యా ద్వైపాక్షిక సంబంధాలు కూడా ప్రధానంగా చర్చకు వచ్చాయి. పాక్షిక యుద్ధ విరమణకు పుతిన్‌ను ఒప్పించడంలో ట్రంప్ సఫలమైనట్టు చర్చల అనంతరం వైట్‌హౌస్ ఒక ప్రకటనలో పేర్కొంది.యుద్ధం ఆగి శాశ్వత శాంతి నెలకొనాలని అధ్యక్షులిద్దరూ ఏకాభిప్రాయం వెలిబుచ్చనట్టు తెలిపింది. ‘‘తర్వాతి దశలో నల్లసముద్రంలో కాల్పుల విరమణ, చివరగా పూర్తిస్థాయి కాల్పుల విరమణపై సాంకేతిక చర్చలు జరిపేలా అంగీకారం కుదిరింది. అవి పశ్చిమాసియా వేదికగా తక్షణం మొదలవుతాయి’’ అని వివరించింది. అమెరికా, రష్యా మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని కూడా నేతలిద్దరూ నిర్ణయించినట్టు పేర్కొంది. ఈ దిశగా త్వరలో కీలక ఆర్థిక ఒప్పందాలు తదితరాలు కుదరనున్నట్టు వెల్లడించింది.అమెరికా ఇటీవల ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణకు ఉక్రెయిన్ వెంటనే అంగీకరించడం, దానిపై సంతకం కూడా చేయడం తెలిసిందే. ఈ ప్రతిపాదనకు పుతిన్ కూడా సూత్రప్రాయంగా అంగీకరించారు. పలు అంశాలపై స్పష్టత కోసం ట్రంప్‌తో మాట్లాడతానని చెప్పారు. ఉక్రెయిన్‌లో రష్యా ఆక్రమించిన భూములు, జపోరిజియా అణు విద్యుత్కేంద్రం తదితరాలు కూడా తమ మధ్య చర్చకు వస్తాయని సంభాషణకు ముందు ట్రంప్ మీడియాకు తెలిపారు.ఇరు దేశాల మధ్య పంపకాలకు సంబంధించి రష్యాతో ఇప్పటికే చర్చలు మొదలు పెట్టినట్టు కూడా చెప్పారు! ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగినందుకు మూడేళ్లుగా రష్యాపై అమెరికా కఠిన ఆంక్షలను అమలు చేస్తుండటం తెలిసిందే. పుతిన్, ట్రంప్ తాజా చర్చలను చరిత్రాత్మకంగా రష్యా అభివర్ణించింది. వాటి ఫలితంగా ప్రపంచం మరింత సురక్షితంగా మారిందని అభిప్రాయపడింది. యుద్ధానికి ముగింపుపై ఇటీవల సౌదీ అరేబియాలో అమెరికా పలుమార్లు చర్చలు జరపడం తెలిసిందే. పాక్షిక, దశలవారీ కాల్పుల విరమణ ప్రతిపాదనలు, పుతిన్ తాజా షరతులపై ఉక్రెయిన్ స్పందన ఏమిటన్నది తెలియాల్సి ఉంది. -
ట్రూత్ సోషల్‌లో చేరిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సొంత సోషల్ మీడియా ‘ట్రూత్ సోషల్’ప్లాట్ఫామ్లో ప్రధాని నరేంద్ర మోదీ చేరారు. పాడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రిడ్మన్తో మోదీ ఆదివారం సంభాషించారు. ఈ పాడ్‌కాస్ట్‌ను ట్రంప్ తన సోషల్ మీడియా హ్యాండిల్లో వెంటనే షేర్ చేశారు. దీంతో సోమవారం మోదీ ట్రూత్ సోషల్‌లో అరంగేట్రం చేశారు. ‘ట్రూత్‌సోషల్‌లో చేరడం సంతోషంగా ఉంది. ఇక్కడ ఉద్వేగ భరిత గొంతులతో సంభాషించడానికి, రాబోయే కాలంలో మరింత అర్థవంతమైన సంభాషణల్లో పాల్గొడానికి ఎదురు చూస్తుంటాను’ అని ప్రధాని మొదటి పోస్ట్‌లో పేర్కొన్నారు. మరో పోస్ట్‌లో.. ఫ్రిడ్మన్తో జరిగిన తన సంభాషణను పంచుకున్నందుకు ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ‘నా మిత్రుడు, అధ్యక్షుడు ట్రంప్‌కు ధన్యవాదాలు. నా జీవిత ప్రయాణం, భారతదేశ నాగరిక దృక్పథం, ప్రపంచ సమస్యలు, మరెన్నో అంశాలను నేను కవర్ చేశాను’ అని పేర్కొన్నారు. -
నేడు పుతిన్, ట్రంప్ చర్చలు
వాషింగ్టన్: ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ఆపేలా రష్యాను ఒప్పించడమే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మంగళవారం మంతనాలు జరపనున్నారు. నెలల తరబడి కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు అగ్రరాజ్యం చేస్తున్న ప్రయత్నాల్లో ఇది కీలక పరిణామమని ప్రపంచదేశాలు భావిస్తున్నాయి. దీంతోబాటే సమకాలీన పరిస్థితులకు తగ్గట్లు అమెరికా విదేశాంగ విధానాలకు మార్చే సదవకాశం ట్రంప్‌కు దక్కనుంది. ‘‘ గత వారం రోజులుగా ఇందుకోసం ఎంతో కసరత్తు చేశాం. యుద్ధాన్ని ఎంత త్వరగా ముగింపు పలకగలమో ఈ చర్చల ద్వారా తెలుస్తుంది’’ అని ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్కు ఎయిర్‌ఫోర్స్‌వన్ విమానంలో వస్తూ మీడియాతో ట్రంప్ చెప్పారు. ట్రంప్‌తో పుతిన్ చర్చించబోతున్నట్లు రష్యా అధ్యక్ష కార్యాలయం అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ సోమవారం ధ్రువీకరించారు. అయితే ఇరుదేశాల అగ్రనేతల మధ్య ఎలాంటి అంశాలు చర్చకు రాబోతున్నాయనే వివరాలను పెస్కోవ్ పేర్కొనలేదు. -
ఉక్రెయిన్ సైనికులను దయతలచి వదిలేయండి
వాషింగ్టన్/మాస్కో: ‘‘పాపం ఉక్రెయిన్ సైనికులు! అత్యంత నిస్సహాయ స్థితిలో ఉన్నారు. వాళ్లను రష్యా సైన్యం అన్నివైపుల నుంచీ దిగ్బంధించింది. వారినింకా వేటాడితే సామూహిక హననానికి, రెండో ప్రపంచయుద్ధం తర్వాత అతి దారుణమైన రక్తపాతానికి దారితీస్తుంది. కనుక వాళ్లను చంపకండి. దయచేసి వదిలేయండి’’ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా విజ్ఞప్తులివి! ఈ విషయమై పుతిన్‌తో ఫోన్ చర్చలు జరిపినట్టు శుక్రవారం ఆయన ప్రకటించారు. ‘‘చర్చలు ఫలప్రదంగా సాగాయి. ఉక్రెయిన్ యుద్ధానికి, భయానక రక్తపాతానికి అతి త్వరలో తెర పడుతుందని ఆశిస్తున్నా’’ అని తన సొంత సోషల్ మీడియా హాండిల్ ట్రూత్‌లో చెప్పుకొచ్చారు. అమెరికా ప్రతిపాదించిన 30 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణకు ఉక్రెయిన్ ఇప్పటికే అంగీకరించడం, పుతిన్ కూడా సూత్రప్రాయంగా సరేననడం తెలిసిందే. అయితే తాజాగా ఆయన స్వరం మార్చారు. కాల్పుల విరమణకు ముందు చర్చించుకుని తేల్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ‘‘వాటిపై బహుశా అమెరికా, ఇతర భాగస్వామ్య పక్షాలతో చర్చిస్తాం. ట్రంప్‌కు కూడా కాల్చేసి మాట్లాడతా’’ అని ప్రకటించారు. దీనిపై ఉక్రెయిన్ మండిపడింది. కావాలనే శాంతిప్రక్రియకు మోకాలడ్డుతున్నారని ఆక్షేపించింది. -
‘చిప్’ల కోసం ట్రంప్ స్కెచ్
వాషింగ్టన్/తైపీ: సెమీ కండక్టర్ల తయారీలో ద్వీపదేశమైన తైవాన్‌దే అగ్రస్థానం. ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్న సెమీ కండక్టర్లలో 90 శాతానికిపైగా తైవాన్‌లో తయారైనవే. సెల్ఫోన్ల నుంచి అత్యాధునిక డ్రోన్ల దాకా ప్రతి ఎల్రక్టానిక్ పరికరంలో ఈ చిప్‌లు ఉండాల్సిందే. చిప్‌ల రారాజుగా తైవాన్ తలపై ఉన్న కిరీటాన్ని తన్నుకుపోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద స్కెచ్ వేశారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సంస్థగా పేరున్న తైవాన్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ(టీఎస్ఎంసీ)తో అమెరికాలో 100 బిలియన్ డాలర్ల (రూ.8.69 లక్షల కోట్లు) పెట్టుబడులు పెట్టిస్తున్నారు. ఈ మేరకు ఆ కంపెనీని ఒప్పించారు. గతవారం ఒప్పందం కూడా చేసుకున్నారు. ఈ నిధులతో టీఎస్ఎంసీ అమెరికాలో సెమీకండక్టర్ల తయారీ యూనిట్లు ఏర్పాటు చేయనుంది. అంటే సెమీకండక్టర్లు అమెరికాలోనే ఉత్పత్తి అవుతాయి. అక్కడి నుంచే విదేశాలకు చిప్‌ల ఎగుమతి జరుగుతుంది. ఆదాయం చాలావరకు అమెరికా ఖాతాలోకి వెళ్లిపోతుంది. చిప్‌ల ఉత్పత్తిలో తైవాన్ ప్రాధాన్యం తగ్గిపోతుంది. ఇదే ఇప్పుడు తైవాన్‌లో మంటలు రాజేస్తోంది. జాతీయ భద్రతా సంక్షోభం తైవాన్ అధికార డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టి(డీపీపీ)పై మాజీ అధ్యక్షుడు మా యింగ్–జియూ నిప్పులు చెరిగారు. చైనా బారి నుంచి తైవాన్ను కాపాడుతున్నందుకు ట్రంప్‌కు ‘ప్రొటెక్షన్ ఫీజు’ చెల్లిస్తున్నారని డీపీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. టీఎస్ఎంఎస్ను అమెరికాకు అమ్మేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామం జాతీయ భద్రతా సంక్షోభమేనని తేల్చిచెప్పారు. అమెరికాలో 8.69 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడాన్ని తప్పుపట్టారు. చిప్‌ల తయారీలో తైవాన్ స్థానాన్ని దిగజార్చడం తగదని అన్నారు. ట్రంప్‌తో కుదుర్చుకున్న ఒప్పందం తైవాన్ ప్రజల విశ్వాసాన్ని, ఇతర సంబంధాలను దెబ్బతీస్తుందని మా యీంగ్–జియూ ఆందోళన వ్యక్తంచేశారు. భవిష్యత్తులో భౌగోళిక రాజకీయాల్లో తైవాన్ హోదాను దిగజారుస్తుందని అన్నారు. అయితే, అమెరికాలో పెట్టుబడులపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని తైవాన్ అధ్యక్షుడు లా చింగ్–తే స్పష్టంచేశారు. టీఎస్ఎంసీ విస్తరణ కోసమే ఈ పెట్టుబడులు పెడుతున్నట్లు వెల్లడించారు. దేశ ప్రతిష్టకు వచ్చే ముప్పేమీ లేదని ప్రజలకు హామీ ఇచ్చారు. తైవాన్ను గాలికొదిలేస్తారా? తైవాన్‌పై పొరుగు దేశం చైనా ఎప్పటి నుంచో కన్నేసింది. తైవాన్ తమ దేశంలో అంతర్భాగమేనని, ఏనాటికైనా విలీనం కాక తప్పదని చైనా చెబుతోంది. మరోవైపు అమెరికా మద్దతుతోనే తైవాన్ స్వతంత్ర దేశంగా మనుగడ సాగిస్తోంది. గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం తైవాన్ రక్షణ బాధ్యతను అమెరికా స్వీకరించింది. ఇందుకోసం తైవాన్ రిలేషన్స్ యాక్ట్ తీసుకొచ్చారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తైవాన్ విషయంలో అమెరికా స్వరం మారింది. ప్రధానంగా తైవాన్‌కు జీవనాడిగా ఉన్న చిప్‌ల తయారీ రంగంపై ట్రంప్ దృష్టి పెట్టారు. అక్కడి పరిశ్రమను క్రమంగా అమెరికా తరలించాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. తమ దేశాన్ని పీల్చిపిప్పి చేసి, ఆఖరికి గాలికి వదిలేయాలన్నదే ట్రంప్ ప్లాన్ అని తైవాన్ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. తైవాన్ మరో ఉక్రెయిన్‌లా మారినా ఆశ్చర్యం లేదని అంటున్నాయి. అమెరికా–తైవాన్ సంబంధాల భవితవ్యంపై అనిశ్చితి నెలకొన్నట్లు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. ‘ఈ రోజు ఉక్రెయిన్, రేపు తైవాన్’ అనే మాట తైవాన్‌లో తరచుగా వినిపిస్తోంది. -
గాజా అమ్మకానికి లేదు
ఎడిన్బర్గ్: గాజా స్ట్రిప్‌ను ఖాళీ చేయించి అందమైన పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతానన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై పాలస్తీనియన్లు ప్రతీకార చర్యలకు దిగారు. స్కాట్లాండ్లో ట్రంప్‌కు చెందిన టర్న్బెర్రీ గోల్ఫ్ రిసార్ట్‌ను ధ్వంసం చేశారు. శనివారం తెల్లవారుజామున నిరసనకారులు రిసార్ట్‌లోకి చొరబడ్డారు. గోల్ఫ్ హోల్స్‌ను నాశనం చేశారు. ఓపెన్ చాంపియ్íÙప్స్‌లో ఉపయోగించే వస్తువులు, ప్రదేశాలను పాడు చేశారు. అక్కడి పచ్చికబయళ్లపై ‘గాజా అమ్మకానికి లేదు’ అని తెల్లని పెయింట్‌తో రాశారు. రిసార్ట్ క్లబ్‌హౌస్ భవన గోడలపై ఎరుపు రంగు చల్లారు. ఇది తమ పనేనని ‘పాలస్తీనా యాక్షన్’ అనే సంస్థ ప్రకటించుకుంది. ‘‘గాజాపై ట్రంప్ వ్యాఖ్యలకు ప్రతీకారంగానే ఈ పని చేశాం. గాజాను తన సొంత ఆస్తిలా పరిగణిస్తామంటే ఒప్పుకోం. ఇది తెలియజేప్పేందుకు, ట్రంప్ ఆస్తికి భద్రత లేదని నిరూపించేందుకు రిసార్ట్‌పై దాడి చేశాం. గాజా స్ట్రిప్‌ను ఇజ్రాయెల్‌కు, అమెరికాకు వలసరాజ్యంగా మార్చే యత్నాలను అడ్డుకుంటాం’’ అని ప్రకటించింది. దాడిని పిల్లచేష్టగా రిసార్ట్ వర్గాలు కొట్టిపారేశాయి. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక గోల్ఫ్‌కోర్సుల్లో టర్న్బెర్రీ ఒకటి. ఇక్కడ నాలుగుసార్లు ఓపెన్ ఛాంపియన్íÙప్ జరిగింది. 2014లో ట్రంప్ కొనుగోలు చేసినప్పటి నుంచీ ఇక్కడ ఓపెన్ రొటేషన్‌ను అమలు చేయడం లేదు. -
రష్యాకు ట్రంప్ షాక్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాకు ఊహించని షాక్ ఇచ్చారు. ఉక్రెయిన్–రష్యా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం, శాంతి ఒప్పందం కుదిరేదాకా రష్యాపై భారీ స్థాయిలో ఆంక్షలు, టారిఫ్‌లు విధించాలని తీవ్రంగా యోచిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సోషల్ మీడియాలో పోస్టు చేశారు. రష్యా, ఉక్రెయిన్ వెంటనే శాంతి చర్చలకు శ్రీకారం చుట్టాలని స్పష్టంచేశారు. ఆలస్యం కాకముందే ఆ పని ప్రారంభిస్తే బాగుంటుందని హితవు పలికారు. నిన్నటిదాకా రష్యా పట్ల సానుకూలంగా మాట్లాడిన ట్రంప్ హఠాత్తుగా స్వరం మార్చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే, రష్యాకు ట్రంప్ హెచ్చరికలు జారీ చేయడం కొత్తేమీ కాదు. ఈ ఏడాది జనవరిలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రష్యాను ఉద్దేశించి కఠిన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని నిలిపివేయకపోతే మరిన్ని ఆంక్షలు విధిస్తామని, రష్యా ఉత్పత్తులపై అధికంగా టారిఫ్‌లు వసూలు చేస్తామని తేల్చిచెప్పారు. ఆయన తన వైఖరికి కట్టుబడి ఉన్నట్లు తెలుస్తోంది. యుద్ధాన్ని ముగించే దిశగా రష్యాపై ఒత్తిడి పెంచడానికి ఆంక్షలు, టారిఫ్‌లను మరోసారి తెరపైకి తెచి్చనట్లు సమాచారం. ఉక్రెయిన్‌కు సైనిక సాయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ ట్రంప్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. యూరప్ దేశాలు వ్యతిరేకిస్తున్నా ఆయన వెనక్కి తగ్గడం లేదు. ఒకవైపు ఉక్రెయిన్ను, మరోవైపు రష్యాను ఏకకాలంలో దారికి తీసుకురావాలన్నదే ట్రంప్ వ్యూహంగా కనిపిస్తోంది. రష్యాపై కొత్తగా ఎలాంటి ఆంక్షలు విధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పుతిన్ ప్రభుత్వం వాటికి తలొగ్గుతుందా? అనేది చూడాలి. -
టారిఫ్ వార్.. ఎవరికి లాభం?
అన్నట్టుగానే భారత్‌పైనా సుంకాల మోతకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెర తీశారు. ఏప్రిల్ 2 నుంచి పరస్పర సుంకాలు తప్పవని పునరుద్ఘాటించారు. దీని ప్రభావం మనపై ఏ మేరకు ఉండనుందంటూ జోరుగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే అమెరికా మనకు అతి పెద్ద వాణిజ్య భాగస్వామి. అందుకే అగ్ర రాజ్యంతో టారిఫ్‌ల రగడకు తెర దించేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఇప్పటికే అమెరికాలో పర్యటిస్తున్నారు. ఇరు దేశాలకు ఆమోదయోగ్యమైన ద్వైపాక్షిక వర్తక ఒప్పందం (బీటీఏ)పై చర్చలు జరుపుతున్నారు. ఈలోగా పలు అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌లను వీలైనంతగా తగ్గిస్తూ భారత్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ తదితర ఉత్పత్తులపైనా టారిఫ్ కోతలు ప్రకటించే అవకాశం కన్పిస్తోంది. ఏ మేరకు సుంకాలు? సుంకమంటే ఒక దేశం మరో దేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై విధించే పన్ను. భారత ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న సుంకాలు సగటున 4 నుంచి 5 శాతం మించడం లేదు. భారత్ మాత్రం అమెరికా ఉత్పత్తులపై సగటున 18 శాతం పై చిలుకు దిగుమతి సుంకాలు విధిస్తోంది. లగ్జరీ కార్లు, కెమికల్స్, ఎల్రక్టానిక్స్‌పై 125 శాతం, మద్యం మీదైతే ఏకంగా 150 శాతం దాకా వసూలు చేస్తోంది! ఈ తేడాలను సరిచేయకుంటే ఏప్రిల్ 2 నుంచి తామూ అంతే మొత్తం బాదుతామని ట్రంప్ బెదిరిస్తున్నారు. అమెరికాపై ప్రధానంగా ఆధారపడ్డ భారత ఎగుమతిదారులపై ఇది గట్టి ప్రభావమే చూపనుంది. ముఖ్యంగా మన ఇనుము, ఉక్కు, జౌళి ఎగుమతులపై ప్రభావం తీవ్రంగా ఉండనుంది. దిద్దుబాటు చర్యలేవీ తీసుకోని పక్షంలో 25 బిలియన్ డాలర్ల విలువైన భారత ఎగుమతులపై ప్రభావం పడవచ్చని అంచనా. అయితే మన జీడీపీలో అమెరికా ఎగుమతుల వాటా కేవలం 2.2 శాతమే. కనుక భారత్ మరీ అంతగా బెంబేలెత్తిపోవాల్సిన పని లేదన్నది ఆర్థికవేత్తల మాట. ‘‘భారత్ వంటి అతిపెద్ద మార్కెట్‌ను అమెరికా విస్మరించలేదు. అక్కడి ఈ కామర్స్ కంపెనీలు, బ్యాంకులు, ఆర్థిక సేవలు, టెక్నాలజీ సంస్థలకు భారత మార్కెట్ అంటే భారీ ఆసక్తి. సోషల్ నెట్వర్కింగ్ కంపెనీలకూ భారత్ ప్రధానమే’’ అని వారంటున్నారు. అమెరికాతో భారత్ వాణిజ్యమెంత? అమెరికాకు అతి పెద్ద ఎగుమతిదారుల్లో భారత్ ఒకటి. 2024లో ఆ దేశానికి 87.4 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేసింది. అమెరికా నుంచి 41.8 బిలియన్ డాలర్ల దిగుమతులు మాత్రమే చేసుకుంది. ఈ వాణిజ్య లోటునూ ట్రంప్ ప్రశి్నస్తున్నారు. దీన్ని పూడ్చాల్సిందేనని పట్టుబడుతున్నారు. మనకు మేలే! ట్రంప్ తెర తీసిన టారిఫ్ వార్ అంతిమంగా భారత్‌కే లబ్ధి చేకూరుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. చైనా, కెనడా, మెక్సికో తదితర దేశాలపై అమెరికా ఇప్పటికే సుంకాలను పెంచడం తెలిసిందే. బదులుగా అమెరికాపై ప్రతీకార సుంకాలు తప్పవని ఆ దేశాలు కూడా స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో ఆయా దేశాల నుంచి అమెరికాకు ఎగుమతులు బాగా తగ్గేలా కని్పస్తున్నాయి. ఇది భారత్‌కు సానుకూలంగా మారుతుందని, మనం మరిన్ని ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేసేందుకు వీలు కలుగుతుందని ఆర్థికవేత్తలు అంటున్నారు. ట్రంప్ తొలి హయాంలో కూడా చైనాపై సుంకాలు పెంచడంతో భారత్ బాగా లాభపడింది. ఈసారి కూడా అమెరికాకు మన మిర్చి, జౌళి తదితర ఉత్పత్తుల ఎగుమతులు బాగా పెరిగే అవకాశముంది. ఇప్పటికే చర్యలు అమెరికాపై విధిస్తున్న సుంకాల తగ్గింపుకు భారత్ ఇప్పటికే చర్యలు తీసుకుంటోంది... → ఇటీవలి బడ్జెట్లో స్మార్ట్ ఫోన్ దిగుమతులపై ప్రకటించిన 15–16 శాతం సుంకాల నుంచి అమెరికాను మినహాయించాలని కేంద్రం భావిస్తోంది.→ వైద్య పరికరాలు, లగ్జరీ మోటార్ సైకిళ్ల వంటి పలు అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌లను తగ్గించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.→ వాణిజ్య లోటును తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా అమెరికా నుంచి రక్షణ, చమురు తదితర ఉత్పత్తుల దిగుమతులను ఇతోధికంగా పెంచేందుకు ట్రంప్–మోదీ భేటీలో అంగీకారం కూడా కుదిరింది. → ఏఐజీ వంటి అమెరికా బీమా దిగ్గజాలకు లబ్ధి చేకూర్చేలా ఆ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 100 శాతానికి పెంచుతూ తాజా బడ్జెట్లో కేంద్రం నిర్ణయం తీసుకుంది.→ భారత ఔషధాలపై అమెరికా ఎలాంటి సుంకాలూ వసూలు చేయడం లేదు. కనుక అమెరికా ఔషధ దిగుమతులపై భారత్ విధిస్తున్న 10 శాతం సుంకాన్ని కూడా ఎత్తేయాలని ఫార్మా సంస్థలు సూచిస్తున్నాయి. → అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న పలు వ్యవసాయోత్పత్తులపై ఏకంగా 42 నుంచి 120 శాతం దాకా సుంకాలున్నాయి. వీటిని కూడా బాగా తగ్గించే అవకాశముంది. త్వరలో ఒప్పందం: భారత్ న్యూఢిల్లీ/వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుని తాజా ప్రకటనపై భారత్ ఆచితూచి స్పందించింది. అగ్ర రాజ్యంతో వాణిజ్య బంధాన్ని మరింత పటిష్టం చేసుకోవడమే తమ లక్ష్యమని పేర్కొంది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) ద్వారా టారిఫ్, టారిఫేతర అడ్డంకులను తగ్గించుకునేందుకు కృషి చేస్తున్నట్టు వివరించింది. దీన్ని ఇరు దేశాలకూ ఆమోదనీయ రీతిలో పరిష్కరించుకుంటామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్«దీర్ జైస్వాల్ శుక్రవారం ఒక ప్రకటనలో విశ్వాసం వెలిబుచ్చారు.సుంకాల తగ్గింపుకు భారత్ ఒప్పుకుంది: ట్రంప్ అమెరికాపై సుంకాలను భారీగా తగ్గించేందుకు భారత్ అంగీకరించినట్టు ట్రంప్ వెల్లడించారు. శుక్రవారం ఉదయం వైట్‌హౌస్ ఓవల్ కార్యాలయంలో ఈ మేరకు ప్రకటించారు. అమెరికాపై ఇన్నాళ్లుగా భారత్ విధిస్తున్న హెచ్చు సుంకాలను తాను బయట పెట్టడమే ఇందుకు కారణమని చెప్పుకొచ్చారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌గా 13 ఏళ్ల బాలుడు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టెక్సాస్‌కు చెందిన 13 ఏళ్ల బాలుడు, క్యాన్సర్ విజేత డీజే డేనియల్ను సీక్రెట్ సర్వీస్ గౌరవ ఏజెంట్‌గా నియమించారు. కాంగ్రెస్ తొలి సంయుక్త సమావేశంలో డీజే విజయగాథను ట్రంప్ పంచుకున్నారు. ‘2018లో డీజేకు అరుదైన కేన్సర్ నిర్ధారణ అయ్యింది. ఐదు నెలలే బతు కుతాడని డాక్టర్లు చెప్పారు. కానీ.. పోలీసు ఆఫీసర్ కావాలన్న లక్ష్యం ఆయనకు పోరాడే స్థైర్యాన్నిచ్చింది. కేన్స ర్ను ఓడించిన డీజే తన కలను నిజం చేసుకోబోతున్నాడు. అతనికి పెద్ద గౌరవాన్ని ఇస్తున్నా. డీజేను యూఎస్ సీక్రెట్ సర్వీస్ గౌరవ ఏజెంట్‌గా చేయాలని డైరెక్టర్ సీన్ కరన్‌ను అడుగుతున్నా’ అని ప్రకటించారు. దీంతో సభంతా చప్పట్లతో హోరెత్తింది. సభ మొత్తం ‘డీజే... డీజే’ అని హోరెత్తగా గ్యాలరీలో అతని తండ్రి డీజేను గాల్లోకి ఎత్తాడు. సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ కరన్ ఆ బాలుడి దగ్గరకు వెళ్లి అధికారిక బ్యాడ్జీని అందజేశారు. -
ట్రంప్‌పై అదే వ్యతిరేకత
వాషింగ్టన్: అధ్యక్షుడిగా డొనాల్ట్ ట్రంప్ దేశాన్ని ముందుకు నడిపించే విధానంపై ప్రజల్లో ఇప్పటికీ అనుకూల వైఖరి కంటే వ్యతిరేక వైఖరే ఎక్కువగా కనిపి స్తోంది. ట్రంప్‌పై ప్రజామోదం, పని తీరు, నిర్ణయాలు, దేశాన్ని ఆయన సరైన దిశగా నడిపిస్తున్నారా అంటే లేదనే ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తమ్మీద ట్రంప్ పని తీరుపై 52 శాతం మంది పెదవి విరిచారు. 48 శాతం మంది మాత్రమే ట్రంప్ పాలన బాగుందన్నారు. ఫిబ్రవరి మధ్యలో సర్వే చేపట్టినప్పుడు సైతం దాదాపు ఇదే ఫలితం రావడం గమనార్హం. ఉద్యో గులపై వేటు సహా ఆయన విధానాలకు సొంత రిపబ్లికన్లు 90 శాతం మంది సానుకూలత చూపగా, ప్రతిపక్ష డెమో క్రాట్లు 90 శాతం మంది వ్యతిరేకత తెలిపారు. స్వతంత్రుల్లో 59 మంది కూడా ట్రంప్ తీరు నచ్చలేదన్నారు. ట్రంప్ విధానాలు దేశాన్ని తప్పుడు మార్గంలో నడిపిస్తు న్నాయని 45 శాతం మంది చెప్పగా సరైన దిశగానే దేశం సాగుతోందని 39 శాతం మంది బదులిచ్చారు. 15 శాతం మంది ఏ సమాధానమూ చెప్పలేదు. దేశం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్ర సమస్యల పై ట్రంప్ దృష్టి పెట్టడం లేదని 52 శాతం మంది, ప్రాధాన్యతలు బాగానే ఉన్నాయని 40 శాతం మంది అభిప్రాయం వెలిబుచ్చారు. మొత్త మ్మీద 18–34 ఏళ్ల గ్రూపులో 51 శాతం మంది ట్రంప్ పాలన సరిగా లేదని కుండబద్దలు కొట్టారు. అదే సమయంలో మహిళలు కూడా 57 శాతం మంది ట్రంప్ ప్రభుత్వంపై అసంతృప్తి వెలిబుచ్చారు. ఎస్ఎస్ఆర్ సంస్థ ఫిబ్రవరి 24–28వ తేదీల మధ్య దేశవ్యాప్తంగా ర్యాండమ్‌గా ఎంపిక చేసిన 2,212 మందితో సర్వే చేపట్టింది. ఆన్లైన్లో, టెలిఫోన్ ద్వారా లేదా లైవ్ ఇంటర్వ్యూ ద్వారా చేపట్టిన ఈ సర్వే కచ్చితత్వం మైనస్ 2.4 శాతం పాయింట్లు అటూఇటుగా ఉండొచ్చని సీఎన్ఎన్ పేర్కొంది. కాగా, శుక్రవారం వైట్‌హౌస్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో తీవ్ర వాదోపవాదం జరిగిన ముందు రోజే ఈ పోల్ ముగియడంతో, ఆ ప్రభావం దీనిపై కనిపించదు.అక్రమ వలసలు రికార్డు స్థాయిలో తగ్గాయి: ట్రంప్అమెరికాపై అక్రమ వలసల ఆక్రమణ ముగిసిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ‘‘మెక్సికో సరిహద్దులో అక్రమ వలసలు ఫిబ్రవరిలో చరిత్రాత్మక స్థాయిలో తగ్గాయి. నా కఠిన నిర్ణయాల వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. ‘‘నా పాలనలో మొదటి పూర్తి నెల అయిన ఫిబ్రవరిలో అతి తక్కువ సంఖ్యలో అక్రమ వలసదారులు అమెరికాలో ప్రవేశించడానికి ప్రయత్నించారు. మెక్సికో సరిహద్దులో కేవలం 8,326 మంది అరెస్టయ్యారు. వారందరినీ వెంటనే బహిష్కరించాం’’ అని తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు. బైడెన్ హయాంలో నెలకు 3ల క్షల మంది పై చిలుకు చొప్పున అక్రమంగా ప్రవేశించారని ఆరోపించారు. వలసలు గణనీయంగా తగ్గాయన్న ప్రకటనను వార్తా నివేదికలు తిప్పికొట్టాయి. ‘‘బైడెన్ అధికారంలో ఉన్న చివరి వారంలో రోజుకు సగటున 2,869 సరిహ ద్దు అరెస్టులు జరిగాయి. ట్రంప్ అధికారం చేపట్టాక తొలి వారంలో 7,287 అరెస్టులు నమోదయ్యాయి. అంటే రోజుకు సగటున 1,041. అంటే తగ్గుదల కేవలం 60 శాతమే. వైట్‌హౌస్ చెబుతున్నట్టు 95 శాతం కాదు’’ అని ఫాక్స్ న్యూస్ తెలిపింది. -
అమెరికా.. ఉక్రెయిన్ మధ్య సయోధ్య ఎలా?
లండన్: అధినేతలు డొనాల్డ్ ట్రంప్, జెలెన్స్కీ వాగ్యుద్ధంతో అమెరికా, ఉక్రెయిన్ సంబంధాలు అకస్మాత్తుగా దెబ్బతిన్న వైనం యూరప్‌ను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. వాటిని తిరిగి చక్కదిద్దే మార్గాల కోసం అవి మల్లగుల్లాలు పడుతున్నాయి. ఈ అంశంపై చర్చించేందుకు యూరప్ దేశాధినేతలు ఆదివారం లండన్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇందుకు బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ చొరవ తీసుకున్నారు. ‘సురక్షిత యూరప్ కోసం’ పేరిట జరిగిన ఈ శిఖరాగ్ర సమావేశంలో చర్చంతా అమెరికా, ఉక్రెయిన్ సంబంధాల చుట్టే తిరిగినట్టు సమాచారం. ఉక్రెయిన్‌కు మరిన్ని నిధులు అందించాలని నేతలు నిర్ణయానికి వచ్చారు. అవసరమైతే యూరప్ దేశాలన్నీ తమ సైన్యాన్ని కూడా ఉక్రెయిన్‌కు పంపేందుకు సిద్ధంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. ఈ కీలక భేటీలో జెలెన్స్కీతో పాటు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా పాల్గొన్నారు. తరానికోసారే! యూరప్ భద్రత కోసం ఖండంలోని దేశాలన్నీ ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరముందని స్టార్మర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇలాంటి అవసరం, అవకాశం తరానికి ఒక్కసారి మాత్రమే వస్తాయని అన్నారు. ‘‘రష్యా బారి నుంచి ఉక్రెయిన్‌కు శాశ్వత రక్షణ కల్పించాలి. యూరప్‌లోని ప్రతి దేశం భద్రతకూ ఇది చాలా కీలకం’’ అని చెప్పారు. ‘‘ఇందుకు మూడంచెల మార్గముంది. ఉక్రెయిన్ను సాయుధంగా పటిష్టపరచాలి. దాని భద్రతకు యూరప్ మొత్తం పూచీగా ఉండాలి. ఇక ఉక్రెయిన్‌తో కుదిరే ఒప్పందాలను రష్యా అధ్యక్షుడు పుతిన్ మళ్లీ తుంగలో తొక్కకుండా చూసే బాధ్యతను అమెరికా తీసుకోవాలి’’ అని ప్రతిపాదించారు. అంతకుముందు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో స్టార్మర్ విడిగా భేటీ అయ్యారు. అందులో జెలెన్స్కీ కూడా పాల్గొన్నారు. రష్యా, ఉక్రెయిన్ కాల్పుల విరమణకు నిర్దిష్ట కార్యారణ ప్రణాళిక రూపొందించి అమెరికా ముందుంచాలని వారు నిర్ణయానికి వచ్చారు. ఈ ప్రయత్నంలో మిగతా యూరప్ దేశాలన్నింటినీ కలుపుకుని వెళ్తామని చెప్పారు. అంతకుముందు ఉక్రెయిన్‌కు 3.1 బిలియన్ డాలర్ల రుణం అందించేందుకు బ్రిటన్ అంగీకరించింది.ట్రంప్‌తోనూ మాట్లాడా: స్టార్మర్ శిఖరాగ్రం అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు. వీలైనంత త్వర లో మరోసారి సమావేశమై అన్ని అంశాలపైనా లోతుగా చర్చించుకోవాలని నిర్ణయించినట్టు స్టార్మర్ వెల్లడించారు. అమెరికా నమ్మదగ్గ భాగస్వామి కాదన్న విమర్శలను తోసిపుచ్చారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం యూరప్ భద్రతకు చాలా కీలకమని పునరుద్ఘాటించారు. ఈ విషయమై ట్రంప్‌తో శనివారం రాత్రి ఫోన్లో సుదీర్ఘంగా మాట్లాడినట్టు వివరించారు. ‘‘యూరప్ ఒకరకంగా నాలుగు రోడ్ల కూడలిలో నిలిచింది. కనుక ప్రతి అడుగూ ఆచితూచి వేయాల్సిన సమయమిది. పరిస్థితులన్నీ పూర్తిగా అదుపు తప్పేందుకు ఒకే ఒక్క తప్పుడు నిర్ణయం చాలు’’ అని హెచ్చరించారు. -
అమెరికా టారిఫ్‌లు..ప్రపంచ పరిణామాలే దిక్సూచి!
న్యూఢిల్లీ: భారీ పతన బాటలో కొనసాగుతున్న దేశీ మార్కెట్లలో ఒడిదుడుకులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్‌ల మోతకు తోడు కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) అమ్మకాల పరంపర... ఇన్వెస్టర్లలో బలహీన సెంటి‘మంట’కు ఆజ్యం పోస్తోంది. ఈ వారంలో కూడా యూఎస్ టారిఫ్ సంబంధిత పరిణామాలు, ప్రపంచ మార్కెట్ల ట్రెండ్, ఎఫ్‌పీఐల ట్రేడింగ్ కార్యకలాపాలే మార్కెట్ల గమనాన్ని నిర్దేశిస్తాయని విశ్లేషకులు పేర్కొన్నారు. బలహీనంగానే... ‘ట్రంప్ టారిఫ్ పాలసీతో పాటు గత వారంలో విడుదలైన నిరుద్యోగ గణాంకాలు (అయిదు నెలల గరిష్టం) మార్కెట్ గమనంపై ప్రభావం చూపుతాయి. సమీప కాలంలో మార్కెట్లో బలహీన ధోరణి కొనసాగవచ్చు. ప్రపంచ వాణిజ్య విధానాల్లో అస్థిరతలు సద్దుమణిగి, వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీల లాభాల్లో రికవరీ కనిపిస్తేనే మార్కెట్ మళ్లీ గాడిలో పడతాయి’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా బలహీన సెంటిమెంట్‌కు తోడు దేశీయంగా కీలక అంశాలు (ట్రిగ్గర్లు) ఏవీ లేనందున మన మార్కెట్లలో నష్టాలు కొనసాగే అవకాశం ఉందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ (వెల్త్ మేనేజ్మెంట్) సిద్ధార్థ ఖేమ్కా పేర్కొన్నారు. వాణిజ్య యుద్ధ భయాలతో మార్కెట్లు వణుకుతున్నాయని, ఎఫ్‌పీల అమ్మకాల జోరు దీనికి మరింత ఆజ్యం పోస్తోందని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా అభిప్రాయపడ్డారు. గణాంకాల ఎఫెక్ట్... గత వారాంతంలో విడుదలైన జీడీపీ గణాంకాల ప్రభావం సోమవారం మార్కెట్‌పై కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (క్యూ3)లో జీడీపీ వృద్ధి రేటు 6.2 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. గతేడాది క్యూ3తో పోలిస్తే భారీగా తగ్గినప్పటికీ.. క్యూ2తో పోలిస్తే (5.6 శాతం) సీక్వెన్షియల్‌గా కాస్త పుంజుకోవడం విశేషం. అమెరికా టారిఫ్ వార్ ఆందోళనల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ రానున్న రోజుల్లో మరింత గడ్డు పరిస్థితులను ఎదుర్కోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఫిబ్రవరి జీఎస్టీ వసూళ్లు 9.1 శాతం ఎగబాకి రూ.1.84 లక్షల కోట్లకు చేరడం ఆర్థిక వ్యవస్థ రికవరీపై ఆశలు రేకెత్తిస్తోంది. ఈ వారంలో విడుదల కానున్న హెచ్ఎస్బీసీ తయారీ, సేవల రంగ పీఎంఐ డేటాపై కూడా ఇన్వెస్టర్లు నిశితంగా గమనించనున్నారు.ఫిబ్ర‘వర్రీ’...గత కొన్ని నెలలుగా నేల చూపులు చూస్తున్న మన మార్కెట్లకు ఫిబ్రవరిలో మరింత షాక్ తగిలింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 1,384 పాయింట్లు (5.88 శాతం) పతనం కాగా, బీఎస్ఈ సెన్సెక్స్ 4,302 (5.55%) పాయింట్లు కోల్పోయింది. సెపె్టంబర్ 27న సెన్సెక్స్ రికార్డ్ గరిష్టాన్ని (85,978) తాకి, అక్కడి నుంచి రివర్స్ గేర్‌లోనే వెళ్తోంది. ఇప్పటిదాకా 12,780 పాయింట్లు (14.86 శాతం) కుప్పకూలింది. ఇక నిఫ్టీ కూడా అప్పటి గరిష్టం (26,277) నుంచి 4,153 పాయింట్లు (15.8 శాతం) దిగజారింది. కాగా, ఒక్క గత వారంలోనే సెన్సెక్స్ 2.8 శాతం, నిఫ్టీ 2.94 శాతం క్షీణించడం గమనార్హం.రూ. 34,574 కోట్లు వెనక్కి...విదేశీ ఇన్వెస్టర్ల తిరోగమనం మరింత జోరందుకుంది. ఫిబ్రవరి నెలలో దేశీ ఈక్విటీ మార్కెట్ల నుంచి ఎఫ్‌పీఐలు రూ.34,574 కోట్లు వెనక్కి తీసుకున్నారు. దీంతో ఈ ఏడాది తొలి రెండు నెలల్లో మొత్తం అమ్మకాలు రూ.1.12 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ప్రధానంగా ట్రేడ్ వార్ ఆందోళనలతో పాటు కంపెనీల లాభాలపై ఆందోళనలు దీనికి కారణంగా నిలుస్తున్నాయి. ‘భారత్ మార్కెట్లో ఈక్విటీ వేల్యుయేషన్లు చాలా అధికంగా ఉండటం, కార్పొరేట్ల ఆర్థిక ఫలితాలపై ఆందోళనల ప్రభావంతో ఎఫ్‌పీఐల తిరోగమనం కొనసాగుతోంది’ అని వాటర్‌ఫీల్డ్ అడ్వయిజర్స్ సీనియర్ డైరెక్టర్ విపుల్ భోవర్ పేర్కొన్నారు.టాప్–10 కంపెనీల్లో రూ.3 లక్షల కోట్లు హుష్గత వారంలో ప్రధాన సూచీలు దాదాపు 3 శాతం కుప్పకూలడంతో దేశీ స్టాక్ మార్కెట్లో టాప్–10 కంపెనీల మార్కెట్ విలువ రూ.3,09,245 కోట్లు ఆవిరైంది. టీసీఎస్ మార్కెట్ క్యాప్ అత్యధికంగా రూ.1,09,211 కోట్లు క్షీణించి రూ.12,60,505 కోట్లకు పడిపోయింది. దీంతో టాప్–10లో 2వ స్థానం నుంచి మూడో స్థానానికి దిగజారింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రెండో ర్యాంకును అందుకుంది. దీని మార్కెట్ క్యాప్ రూ.30,258 కోట్లు జంప్ చేసి, 13,24,411 కోట్లకు ఎగబాకింది. ఇక ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ రూ.52,697 కోట్లు తగ్గి, రూ.7,01,002 కోట్లకు చేరింది. భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాప్ కూడా 39,230 కోట్లు నష్టపోయి రూ.8,94,993 కోట్లకు దిగొచ్చింది. -
ట్రంప్ వర్సెస్ జెలెన్స్కీ.. అధ్యక్షుల వాగ్వాదం జరిగిందిలా!
వాషింగ్టన్ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా అధ్యక్షుల వాగ్వాదానికి, పరస్పర ఆక్షేపణలకు, వాగ్బాణాలకు వైట్‌హౌస్ శుక్రవారం వేదికగా నిలిచింది. మీడియా సాక్షిగా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్షంగా ప్రసారమైన భేటీలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధినేత వొలొదిమిర్ జెలెన్స్కీ మధ్య సాగిన విమర్శలపర్వం సర్వత్రా చర్చనీయంగా మారింది. నిజానికి ఈ రగడకు అగ్గి రాజేసింది వారితో పాటు చర్చల్లో పాల్గొన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్. అలా ఒక్కసారిగా వేడెక్కిన పరిస్థితి కాస్తా చూస్తుండగానే అదుపు తప్పిపోయింది. చివరికి జెలెన్స్కీని ట్రంప్ వైట్‌హౌస్ వదిలి పొమ్మనడం, చర్చలకు అర్ధాంతరంగా ఫుల్స్టాప్ పెట్టి ఆయన వెనుదిరగడం దాకా వెళ్లింది! జెలెన్స్కీ వైట్‌హౌస్ సందర్శన రద్దవడమే గాక రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌కు అమెరికా దన్ను కొనసాగడం కూడా అనుమానంలో పడింది. వారి మధ్య వాగ్యుద్ధం ఎలా జరిగిందంటే... వాన్స్: (బైడెన్‌ను ఉద్దేశించి) నాలుగేళ్లుగా అమెరికా (తాజా మాజీ) అధ్యక్షుడు (బైడెన్) రష్యా అధినేత పుతిన్‌ను ఉద్దేశించి గట్టి మాటలు మాట్లాడుతూ వచ్చారు. అయినా పట్టించుకోకుండా ఉక్రెయిన్ౖపె దండెత్తిన పుతిన్ ఆ దేశాన్ని చాలావరకు నేలమట్టం చేశారు. ఇప్పుడిక దౌత్యమే శాంతికి మార్గం. నామమాత్రపు బెదిరింపులకు దిగుతూ, ఛాతీ చరుచుకుంటూ బైడెన్ చూపిన దారి పనికొచ్చేది కాదని తేలిపోయింది. దౌత్యానికి బాటలు వేసినప్పుడే అమెరికా మంచి దేశమని అనిపించుకోగలదు. ట్రంప్ సరిగ్గా అదే చేస్తున్నారు. జెలెన్స్కీ: నేనొకటి అడగొచ్చా? వాన్స్: తప్పకుండా. జెలెన్స్కీ: పుతిన్ మా దేశాన్ని ఆక్రమించాడు. నిజమే. 2014లోనూ అతనదే చేశాడు. క్రిమియాను ఆక్రమించాడు. మా ప్రజలను భారీగా పొట్టన పెట్టుకున్నాడు. అప్పుడెవరూ అతన్ని ఆపలేదు. ఇన్నేళ్లుగా కూడా ఆపడం లేదు. 2014లో ఒబామా, తర్వాత ట్రంప్, ఆ తర్వాత బైడెన్... ఏ అధ్యక్షుడూ పట్టించుకోలేదు. దేవుని దయవల్ల పుతిన్‌ను ఇప్పుడు బహుశా ట్రంప్ ఆపుతారేమో. ట్రంప్: 2015లోనా? జెలెన్స్కీ: 2014లో ట్రంప్: అవునా? అప్పుడు అధ్యక్షున్ని నేను కాదుగా. వాన్స్: అదే కదా! జెలెన్స్కీ: కావచ్చు. కానీ 2014 నుంచి 2022 దాకా కూడా మా దుస్థితి అలాగే కొనసాగుతూ వచ్చింది. సరిహద్దుల వెంబడి మా ప్రజలు నిస్సహాయంగా చనిపోతూనే వచ్చారు. ఈ దారుణాన్ని ఆపేవారే లేకపోయారు. పుతిన్‌తో చర్చలు జరిపాం. ఒక్కసారి కాదు. ఎన్నోసార్లు. అతనితో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాం. (ట్రంప్‌నుద్దేశించి) మీరు కూడా 2019లో పుతిన్‌తో ఒప్పందం చేసుకున్నారు. (ఫ్రాన్స్ అధ్యక్షుడు) మాక్రాన్, (నాటి జర్మనీ చాన్సలర్) మెర్కెల్ కూడా. కాల్పుల విరమణ ఒప్పందాలూ కుదిరాయి. పుతిన్ వాటిని ఉల్లంఘించబోడనే మీరంతా మాకు హామీ ఇచ్చారు. కానీ ఏం జరిగింది? దానికతను తూట్లు పొడిచాడు. మావాళ్లను మరింతగా పొట్టన పెట్టుకున్నాడు. ఖైదీల మార్పిడి ఒప్పందాన్నీ తుంగలో తొక్కాడు. ఇదెక్కడి దౌత్యం? జేడీ! మీరేం మాట్లాడుతున్నారో, వాటికి అర్థమేమిటో మీకైనా తెలుస్తోందా?వాన్స్: మీ దేశంలో సాగుతున్న వినాశనానికి తెర దించగలిగే దౌత్యం గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నా. కానీ ఒక్కటి మాత్రం మీకు స్పష్టంగా చెప్పదలచుకున్నా. ఇలా ఓవల్ ఆఫీసులో కూర్చుని అమెరికా మీడియా సమక్షంలో మీరిలా వాదనకు దిగడం చాలా అమర్యాదకరం. మీకిప్పుడు రష్యాతో పోరాడేందుకు సరిపడా సైన్యమే లేదు. మరో దారిలేక పౌరులకు ఆయుధాలిచ్చి బలవంతంగా యుద్ధక్షేత్రంలోకి నెడుతున్నారు. అలాంటి ఘర్షణకు తెర దించేందుకు కృషి చేస్తున్నందుకు అధ్యక్షుడు ట్రంప్‌కు మీరు నిజానికి కృతజ్ఞతలు తెలపాలి. జెలెన్స్కీ: మాకెలాంటి సమస్యలున్నాయో కళ్లతో చూసినట్టే చెబుతున్నారు! మీరెప్పుడైనా ఉక్రెయిన్‌లో పర్యటించారా? వాన్స్: అవును. జెలెన్స్కీ: ఓసారి ఇప్పుడొచ్చి చూడండి. వాన్స్: ఉక్రెయిన్‌లో ఏం జరుగుతోందో చూశాను. కథలు కథలుగా విన్నాను. నిజానికి మీరు తరచూ దేశాధినేతలు తదితరులను మీ దేశానికి రప్పించుకుంటూ ఉంటారు. అవన్నీ ఫక్తు ప్రచార టూర్లు. మీకు సమస్యలున్నది నిజం కాదంటారా? సైన్యంలో చేరేందుకు జనమే లేకపోవడం నిజం కదా? జెలెన్స్కీ: అవును. మాకు సమస్యలున్నాయి. వాన్స్: అలాంటప్పుడు అమెరికాలో పర్యటిస్తూ, వైట్‌హౌస్‌లో ఓవల్ ఆఫీసులో కూర్చుని మరీ, అదీ అధ్యక్షుని సమక్షంలోనే మా యంత్రాంగంపై దాడికి దిగడం మర్యాదా? మీ దేశ వినాశనానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయతి్నస్తున్న మా ప్రభుత్వంపై నోరు పారేసుకోవడం సబబా?జెలెన్స్కీ: వరుసబెట్టి చాలా ప్రశ్నలే అడిగేశారు. అన్నింటినీ ఒక్కొక్కటిగా చర్చిద్దాం. వాన్స్: అలాగే కానిద్దాం. జెలెన్స్కీ: ముందుగా మీరొకటి అర్థం చేసుకోవాలి. యుద్ధ సమయంలో ఎవరికైనా సమస్యలే ఉంటాయి. రేపు మీకైనా అంతే. కాకపోతే ఇప్పుడు మీకది తెలియకపోవచ్చు. భవిష్యత్తులో అలాంటి పరిస్థితి వస్తే మీకూ తెలిసొస్తుంది. ట్రంప్: మున్ముందు మాకెలా అనిపిస్తుందో మీరేమీ మాకు చెప్పాల్సిన అవసరం. మేం కేవలం మీ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం. మీ పరిస్థితే మాకొస్తే ఎలా ఉంటుందో మాకు చెప్పే సాహసం చేయకండి. జెలెన్స్కీ: నేను మీకేమీ చెప్పడం లేదు. నాకు సంధించిన ప్రశ్నలకు బదులిస్తున్నానంతే. ట్రంప్: అలా కాదు. ఏం జరగాలో, ఎలా జరగాలో నిర్దేశించే పరిస్థితిలో మీరు ఎంతమాత్రమూ లేరు. వాన్స్: కానీ మీరు ఎంతసేపూ కేవలం మీకేం కావాలో మాకు నిర్దేశించే ప్రయత్నమే చేస్తూ వస్తున్నారు. ట్రంప్: మాకూ మీలాంటి పరిస్థితే వస్తే మాకెలా ఉంటుందో చెప్పే పరిస్థితిలో మీరు లేరు. ముందు అది తెలుసుకోండి. మేం బాగుంటాం. జెలెన్స్కీ: (మాలాంటి పరిస్థితే గనక వస్తే) ఎంతోమంది ప్రభావితం చేసేందుకు ప్రయతి్నంచడం మీకూ అనుభవంలోకి వస్తుంది. ట్రంప్: మేమెప్పుడూ శక్తిమంతంగా ఉంటాం.జెలెన్స్కీ: మళ్లీ చెబుతున్నా. అలాంటి పరిస్థితే వస్తే ఎలా ఉంటుందో అప్పుడు మీకూ అనుభవంలోకి వస్తుంది. ట్రంప్: ప్రస్తుతం మీ పరిస్థితి అస్సలు బాగా లేదు. ఇదంతా స్వయంకృతం. మీరు స్వయంగా కొనితెచ్చుకున్నదే. జెలెన్స్కీ: యుద్ధం మొదలైనప్పటి నుంచీ... ట్రంప్: (మధ్యలోనే అడ్డుకుంటూ) చెప్తున్నాగా. మీరు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. మీ దగ్గర ప్రస్తుతం వాడేందుకు ఎలాంటి కార్డులూ లేవు. మేం దన్నుగా ఉన్నప్పుడే మీరు ఏమైనా చేయగలిగేది! జెలెన్స్కీ: నేనేమీ కార్డులు ప్లే చేయడం లేదు. సమస్య పరిష్కారానికి చాలా చిత్తశుద్ధితో ఉన్నా. మిస్టర్ ప్రెసిడెంట్! మీరది అర్థం చేసుకోవాలి. ట్రంప్: లేదు లేదు. ఎంతసేపూ మీరు కార్డులే ప్లే చేస్తున్నారు. లక్షలాది జీవితాలతో చెలగాటమాడుతున్నారు. అందరినీ మూడో ప్రపంచ యుద్ధ భయంలోకి నెడుతున్నారు. జెలెన్స్కీ: మీరేం మాట్లాడుతున్నారు! ట్రంప్: అవును. మీరు అందరినీ మూడో ప్రపంచయుద్ధం దిశగా నెట్టే జూదానికి దిగారు. అంతేకాదు! మీ ప్రవర్తన అమెరికా పట్ల అత్యంత అమర్యాదకరంగా ఉంది. కేవలం మాటలు చెప్పే ఎన్నో దేశాల కంటే మీకు అన్నివిధాలా దన్నుగా నిలిచింది మేమే. వాన్స్: అందుకు మీరు కనీసం ఒక్కసారన్నా కృతజ్ఞతలు తెలిపారా? జెలెన్స్కీ: ఒక్కసారి కాదు. ఎన్నోసార్లు చెప్పా! ఇప్పుడూ చెబుతున్నా. వాన్స్: నేననేది ఈ భేటీలో. ఇప్పటిదాకా మాపై, మా దేశంపై విమర్శలే తప్ప కృతజ్ఞతాపూర్వకమైన మాటలు ఒక్కటైనా మాట్లాడారా? గత అక్టోబర్‌లో పెన్సిల్వేనియాలో మా ప్రత్యర్థి పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసిన చరిత్ర మీది! జెలెన్స్కీ: నేనలా చేయలేదు.వాన్స్: ఇప్పటికైనా అమెరికాకు, మీ దేశాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్న మా అధ్యక్షునికి కృతజ్ఞతగా కనీసం మంచి మాటలైనా చెప్పండి. జెలెన్స్కీ: మీరేమనుకుంటున్నారు? గొంతు చించుకు అరిస్తే సరిపోతుందా... ట్రంప్: (ఆగ్రహంగా మధ్యలోనే కలగజేసుకుంటూ) ఆయన (వాన్స్) గొంతు చించుకోవడం లేదు. అంత గట్టిగా మాట్లాడటం లేదు. వాస్తవమేమిటంటే, మీ దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.జెలెన్స్కీ: ఆయన అన్నదానికి నన్ను కనీసం సమాధానమైనా చెప్పనిస్తారా? ట్రంప్: చెప్పనిచ్చే సమస్యే లేదు. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేశారు. ఓవైపు మీ దేశమే చాలా సమస్యల్లో ఉంది. జెలెన్స్కీ: అవును. నాకు తెలుసు. ట్రంప్: మీరు (యుద్ధం) గెలవబోవడం లేదు. ఈ ఆపద నుంచి బయట పడేందుకు మీకున్న ఏకైక అవకాశం మా దన్ను మాత్రమే. జెలెన్స్కీ: మిస్టర్ ప్రెసిడెంట్! మేమెవరినీ ఆక్రమించలేదు. మా దేశంలో మేం బతుకుతున్నాం. ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచీ మేం ఒంటరిగానే పోరాడుతున్నాం. అయినా సరే, మీ దేశం పట్ల మొదటినుంచీ కృతజ్ఞతగానే ఉన్నాం. ఇప్పుడు కూడా చెబుతున్నా. కృతజ్ఞతలు. ట్రంప్: కాల్పుల విమరణకు మీరు అంగీకరించి తీరాల్సిందే. మా సాయుధ సాయం లేకపోతే ఈ యుద్ధం రెండే రెండు వారాల్లో ముగిసిపోయేది. జెలెన్స్కీ: కాదు. మూడే రోజుల్లో. అలాగని పుతిన్ కూడా అన్నారు. ట్రంప్: ఏమో! అంతకంటే కూడా ముందే ముగిసేదేమో! ఇలాగైతే మీతో ఒప్పందం కుదుర్చుకోవడం చాలా చాలా కష్టం. వాన్స్: ఇప్పటికైనా కనీసం కృతజ్ఞతలు తెలపండి. జెలెన్స్కీ: ఒక్కసారి కాదు. ఎన్నోసార్లు చెప్పా. అమెరికా పౌరులకు కృతజ్ఞతలు. వాన్స్: మన మధ్య అభిప్రాయ భేదాలున్నాయని అంగీకరించండి. మీరు చేస్తున్నదే తప్పు. అలాంటప్పుడు వాటిని చర్చించుకుని పరిష్కరించుకోవాలి. అంతే తప్ప ఇలా అమెరికా మీడియా సాక్షిగా మాతో గొడవకు దిగడం చాలా తప్పు. ట్రంప్: కానీ నా ఉద్దేశంలో ఇదీ మంచిదే. ఏం జరుగుతోందో ఇప్పుడు అమెరికా ప్రజలంతా చూస్తున్నారు. వారికీ తెలియనీయండి. ఇది చాలా ముఖ్యం. అందుకే ఈ సంవాదాన్ని ఇంతసేపు కొనసాగించా. జెలెన్స్కీ అమెరికాకు కృతజు్ఞడై ఉండాల్సిందే. జెలెన్స్కీ: అవును. నేను కృతజు్ఞన్ని. ట్రంప్: మీ దగ్గర వాడటానికి ఇంకే కార్డులూ లేవు. మీరు నిండా మునిగారు. మీ జనం చనిపోతున్నారు. పోరాడేందుకు మీకు సైనికుల్లేరు. ఎలా చూసుకున్నా యుద్ధానికి తెర దించడమే మీకు మంచిది. కానీ మీరు చూస్తే కాల్పు విరమణే వద్దంటున్నారు! అది కావాలి, ఇది కావాలని పేచీకి దిగుతున్నారు! మీకొక్కటే చెప్పదలచుకున్నా. కాల్పుల విరమణకు ఇప్పుడే, ఇక్కడే ఒప్పుకుంటారా సరేసరి. మీ దేశంపై తూటాల వర్షం ఆగుతుంది. జన నష్టానికి తెర పడుతుంది. జెలెన్స్కీ: యుద్ధం ఆగాలనే మేమూ కోరుతున్నాం. కానీ అందుకోసం మేం కోరుతున్న హామీలు కావాలి. ఆ విషయం మీకిప్పటికే స్పష్టంగా చెప్పా. ట్రంప్: అంటే ఏమిటి మీరనేది? కాల్పుల విరమణ వద్దా? నాకైతే అదే కావాలి. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో మీరు కోరుతున్న ఒప్పందాల కంటే మీకు త్వరగా దక్కేది కాల్పుల విరమణే! జెలెన్స్కీ: కాల్పుల విరమణపై మీవాళ్లనే అడిగి చూడండి. మీకే తెలుస్తుంది!ట్రంప్: దానితో నాకు సంబంధం లేదు. అదంతా బైడెన్ అనే వ్యక్తి ఉండగా జరిగిన వ్యవహారం. కానీ అతనంత సమర్థుడు కాదు. జెలెన్స్కీ: అప్పుడాయన మీ దేశాధ్యక్షుడు. ట్రంప్: ఏం మాట్లాడుతున్నారు? బైడెన్ అనే కాదు. అంతకుముందు ఒబామా మాత్రం మీకేం సాయం చేశాడు? కేవలం కాగితాలిచ్చి సరిపెట్టాడు. నేనేమో మీకు శత్రువులపైకి ప్రయోగించేందుకు ఆయుధాలు సమకూర్చా. అందుకే చెప్తున్నా. మీరు నిజానికి మరింతగా కృతజు్ఞలై ఉండాలి. మీరిప్పుడు నిస్సహాయులు. మా దన్నే మీకు బలం. మేమే లేకపోతే మీకేమీ లేదు. పుతిన్ నన్ను గౌరవిస్తున్నాడంటే కారణం అధ్యక్షునిగా తొలి టర్ములో నా శైలిని దగ్గర్నుంచి గమనించాడు గనుకే.(రష్యా గనుక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ఏమిటన్న ఒక రిపోర్టర్ ప్రశ్నను ట్రంప్‌కు వాన్స్ వినిపించారు)ట్రంప్: ఎందుకీ ఊహాజనిత ప్రశ్నలు? ఇప్పటికిప్పుడు మీ నెత్తిపై బాంబు పడితే? రష్యా ఒకవేళ ఉల్లంఘిస్తే ఏం జరుగుతుందో నాకైతే తెలియదు. బైడెన్‌తో చేసుకున్న ఒప్పందాన్ని రష్యా నిజంగానే ఉల్లంఘించింది. ఎందుకంటే అతనంటే వారికి గౌరవం లేదు. ఒబామా అన్నా అంతే. కానీ నా విషయం అలా కాదు. నేనంటే రష్యాకు, పుతిన్‌కు ఎంతో గౌరవం. ఒక్కటి చెప్తా వినండి. పుతిన్‌కు నేను చుక్కలు చూపించా! నేను చెప్పేదల్లా ఒక్కటే. ఒబామాతోనో, బుష్తోనో, చివరికి బైడెన్‌తో కూడా ఒప్పందాలను పుతిన్ ఉల్లంఘించి ఉండొచ్చు. నాకు తెలియదు. కానీ నాతో మాత్రం ఆయన అలా చేయలేదు. ఇప్పుడు కూడా ఒప్పందం చేసుకోవాలనే పుతిన్ అనుకుంటున్నాడు. (జెలెన్స్కీని ఉద్దేశించి) కానీ కాల్పుల విమరణకు ఒప్పుకునే ఉద్దేశం మీకేమాత్రం ఉందో లేదో నాకైతే తెలియదు. మిమ్మల్ని నేను బలశాలిగా, శక్తిమంతునిగా తీర్చిదిద్దా. అమెరికా దన్నే లేకపోతే మీకెన్నటికీ అంతటి శక్తి ఉండేదే కాదు. మీ ప్రజలు చాలా ధైర్యశాలులు. చివరిగా ఒక్కటే మాట. మాతో (ఖనిజ వనరుల) ఒప్పందం చేసుకుంటారా, సరేసరి! లేదంటే రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి యత్నాల నుంచి అమెరికా వైదొలగుతుంది. అప్పుడిక మీ పోరాటం మీదే. అదంత సులువని నేనైతే అనుకోను. ఎందుకంటే పోరాడేందుకు మీ దగ్గర ఏమీ లేదు. మాతో ఒప్పందం కుదుర్చుకుంటే మీరు చాలా మెరుగైన స్థితిలో ఉంటారు. కానీ ఏ దశలోనూ మీరు కాస్త కూడా కృతజ్ఞతపూర్వకంగా వ్యవహరించడం లేదు. ఇది ఎంతమాత్రమూ సరైన పద్ధతి కాదు. నిజంగా చెప్తున్నా. మీ తీరు అస్సలు సరికాదు. చూడాల్సిందంతా చూసేశాం. కదా! టీవీలకైతే ఇదంతా నిజంగా పండుగే! -
జెలెన్స్కీకి యూరప్ బాసట
న్యూయార్క్: అధ్యక్షుల రగడలో యూరప్‌తో సహా పలు ప్రపంచ దేశాలు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి బాసటగా నిలిచాయి. దేశాధినేతలంతా శనివారం ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టారు. వారందరికీ జెలెన్స్కీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు అమెరికా, యూరప్ దేశాల మధ్య పెరుగుతున్న అంతరానికి కూడా ఈ ఉదంతం అద్దం పట్టింది. రష్యా మాత్రం జెలెన్స్కీకి తగిన శాస్తే జరిగిందంటూ ఎద్దేవా చేసింది. ‘‘అంతటి వాగ్యుద్ధంలోనూ ట్రంప్, ఉపాధ్యక్షుడు వాన్స్ చూపిన సంయమనం అభినందనీయం. జెలెన్స్కీని వాళ్లు కొట్టకపోవడం నిజంగా అద్భుతమే’’ అని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జకరోవా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ట్రంప్, వాన్స్ వైఖరిని అమెరికా మంత్రులు పూర్తిగా సమర్థించుకున్నారు. ఈ మేరకు వారంతా పోటాపోటీగా ప్రకటనలు విడుదల చేశారు. అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి, సెనేటర్ జాక్ రీడ్ తదితరులు మాత్రం ట్రంప్, వాన్స్ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. జెలెన్స్కీని కించపరిచేలా వారు వ్యవహరించిన తీరు అమెరికాకే అవమానకరమని కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు. ట్రంప్ ఎంతగా రష్యా వైపు, పుతిన్ వైపు మొగ్గినా అమెరికా ప్రజలు మాత్రం ఎప్పటికీ ఉక్రెయిన్‌కే దన్నుగా నిలుస్తారన్నారు. జెలెన్స్కీతో ట్రంప్, వాన్స్ వ్యవహరించిన తీరు నిజంగా సిగ్గుచేటని రీడ్ మండిపడ్డారు. తమ ప్రవర్తనతో అంతర్జాతీయంగా అమెరికా విశ్వసనీయతనే దెబ్బతీశారని ఆవేదన వెలిబుచ్చారు. దీన్ని ప్రపంచమంతా గమనిస్తోందన్నారు. ఆత్మగౌరవం ప్రదర్శించారు: ఉర్సులా ఉక్రెయిన్ ప్రజల ధైర్యాన్ని నిలబెట్టేలా జెలెన్స్కీ ఆత్మగౌరవం ప్రదర్శించారంటూ యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండర్ లియన్ కొనియాడారు. ‘‘నిర్భయంగా, ధైర్యంగా, బలంగా ఉండండి. మీరు ఒంటరి కారు. శాశ్వత శాంతి కోసం మేమంతా మీతో కలిసి పని చేస్తాం’’ అని పేర్కొన్నారు. ‘‘రష్యా ఒక దురాక్రమణదారు. ఉక్రెయిన్ బాధితురాలు. మేం ఆ దేశానికి సాయం చేయడం, రష్యాపై ఆంక్షలు విధించడం అస్సలు తప్పు కాదు. అమెరికా, యూరప్ దేశాలు, కెనడా, జపాన్ తదితరాలన్నీ ఇకముందూ ఇదే వైఖరి కొనసాగిస్తాయి’’ అని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అన్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి తెరదించే దౌత్య యత్నాలను తిరిగి పట్టాలెక్కించేందుకు తక్షణం ఈయూ–అమెరికా శిఖరాగ్ర భేటీ జరగాలని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ పిలుపునిచ్చారు. ఉక్రెయిన్‌కు, జెలెన్స్కీకి మీకు తామంతా అన్నివేళలా వెన్నుదన్నుగా నిలుస్తామని జర్మనీ కాబోయే చాన్స్‌లర్ ఫ్రెడరిక్ మెర్జ్ ప్రకటించారు. ఉక్రెయిన్‌పై రష్యా అక్రమంగా దండెత్తిందన్నది కాదనలేని వాస్తవమని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అన్నారు. లాతి్వయా, ఎస్తోనియా, ఫిన్లండ్, లగ్జెంబర్గ్, పోలండ్, హాలండ్ తదితర దేశాధినేతలు కూడా జెలెన్స్కీకి మద్దతుగా పోస్టులు చేశారు.మూడో ప్రపంచయుద్ధానికి బాటలు... ‘‘అమెరికా, ఉక్రెయిన్ మధ్య ఖనిజాల ఒప్పందం ముందుకు సాగలేదు. అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నిరంతరం అమెరికా ప్రజల ప్రయోజనాల పరిరక్షణకే పాటుపడతారు. ప్రపంచంలో అమెరికా స్థానాన్ని గౌరవించని వాళ్లు మానుంచి అనుచిత లబ్ధి పొందేందుకు వారెన్నటికీ అనుమతించబోరు. జెలెన్స్కీతో భేటీలో ట్రంప్ మాటతీరే ఇందుకు తాజా నిదర్శనం. యుద్ధానికి తక్షణం ముగింపు పలకాలని ఉక్రేనియన్లలో ఏకంగా 52 శాతం మంది కోరుతున్నట్టు గత నవంబర్‌లో జరిగిన సర్వే తేల్చింది. రష్యాకు భూభాగాన్ని కోల్పోవడానికి ఉక్రెయిన్ సిద్ధంగా ఉండాలి. లేదంటే ట్రంప్ హెచ్చరించినట్టు మూడో ప్రపంచ యుద్ధం తప్పదు. అది ఉక్రెయిన్‌లో మొదలవుతుంది. ఇజ్రాయెల్ మీదుగా ఆసియా దాకా పాకుతుంది. తర్వాత అంతటా విస్తరిస్తుంది’’ – వైట్‌హౌస్ ప్రకటన -
శరణమా.. రణమేనా?
వాషింగ్టన్: ఇటు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ. అటు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. దేశాధినేతలం అన్న విషయం కూడా మర్చిపోయి మీడియా సాక్షిగా వాగ్వాదానికి దిగారు. నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు. ఒకరినొకరు దుయ్యబట్టుకున్నారు. అచ్చం వీధి బాగోతాన్ని తలపించేలా పాత విషయాలన్నీ తిరగదోడుతూ, పరస్పరం దెప్పిపొడుచుకుంటూ రెచ్చిపోయారు. అంతర్జాతీయ స్థాయిలో ఎన్నడూ కనీవినీ ఎరగని ఈ దృశ్యాలకు వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీసు వేదికైంది. ఉక్రెయిన్‌లోని అపార ఖనిజ నిక్షేపాల్లో అమెరికాకు 50 శాతం వాటా ఇవ్వాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేయడం, బదులుగా రష్యా నుంచి తమ దేశానికి కచి్చతమైన రక్షణ హామీలు కావాలని జెలెన్స్కీ కోరడం తెలిసిందే. వాటిపై స్పష్టమైన ఒప్పందాల నిమిత్తం అగ్ర రాజ్యం చేరిన ఆయన శుక్రవారం వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో 45 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో తదితరులు పాల్గొన్న ఈ భేటీకి మీడియాను అనుమతించడమే గాక ప్రత్యక్ష ప్రసారం కూడా చేయడం విశేషం. భేటీ చాలాసేపటిదాకా ప్రశాంతంగానే సాగినా చివర్లో పూర్తిగా అదుపు తప్పింది. నేతలిద్దరి మాటల యుద్ధంతో రచ్చ రచ్చగా మారింది. చివరికి ఎటూ తేలకుండానే ముగిసింది. భేటీ అనంతరం జరగాల్సిన ట్రంప్, జెలెన్స్కీ సంయుక్త మీడియా భేటీ కూడా రద్దయింది! అంతేగాక, ‘జెలెన్స్కీ వైట్‌హౌస్ వీడి వెళ్లిపోవచ్చు’ అంటూ మీడియా సమక్షంలో ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. శాంతి ఒప్పందానికి సిద్ధపడితేనే తిరిగి తమతో చర్చలకు రావాలని సూచించారు. దాంతో ఎన్నో ఆశల నడుమ జెలెన్స్కీ చేపట్టిన అమెరికా యాత్ర ఆశించిన ఫలితం రాబట్టకపోగా వికటించిన్నట్టు కనిపిస్తోంది. అలా మొదలైంది... రష్యా–ఉక్రెయిన్ వివాదం విషయమై దశాబ్ద కాలంగా అమెరికా వ్యవహరిస్తున్న తీరును ఆక్షేపిస్తున్నట్టుగా జెలెన్స్కీ మాట్లాడటంతో పరిస్థితి వేడెక్కింది. అమెరికా మీడియా అంతా చూస్తుండగా అంత అమర్యాదకరంగా మాట్లాడటం సరికాదంటూ వాన్స్ జోక్యం చేసుకున్నా ఆయన వెనక్కు తగ్గలేదు. తమతో కుదుర్చుకున్న ఒప్పందాలన్నింటినీ రష్యా 2014 నుంచీ తుంగలో తొక్కుతూ వస్తున్నా అమెరికా సరైన రీతిలో జోక్యం చేసుకోలేదంటూ ఆక్షేపించారు. అధ్యక్షులు బరాక్ ఒబామా, ట్రంప్, బైడెన్ ఎవరూ తమకు చేయాల్సినంతగా సాయం చేయలేదని ఆరోపించారు. ఇప్పటికైనా ఖనిజ ఒప్పందానికి ప్రతిగా ఉక్రెయిన్ రక్షణకు అమెరికా స్పష్టమైన హామీ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఆ క్రమంలో, ‘‘యుద్ధంలో అంతులేని నష్టాన్ని చవిచూడాల్సి వస్తే ఎలా ఉంటుందో అమెరికాకు తెలియదు. బహుశా మున్ముందు తెలిసొస్తుందేమో!’’ అన్న జెలెన్స్కీ వ్యాఖ్యలతో పరిస్థితి మరింత అదుపు తప్పింది. ట్రంప్ ఒక్కసారిగా తీవ్ర అసహనానికి లోనయ్యారు. జెలెన్స్కీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘అలాంటి పరిస్థితి మాకెప్పుడూ రాదు. ఎప్పటికీ తిరుగులేని శక్తిగానే ఉంటాం’’ అంటూ ఆగ్రహంగా బదులిచ్చారు. ‘‘ఉక్రెయిన్‌కు ఇన్నేళ్లుగా అన్నివిధాలా ఆదుకుంటూ వస్తున్నాం. ఈ యుద్ధంలో ఇప్పటికే 350 బిలియన్ డాలర్ల మేర సాయుధ, ఆర్థిక సాయం అందించాం. లేదంటే రష్యాతో యుద్ధం కొనసాగించడం మీ తరమయ్యేదే కాదు. పోరు రెండే వారాల్లో ముగిసిపోయేది’’ అంటూ దుయ్యబట్టారు. అయినా జెలెన్స్కీకి మాత్రం కనీస కృతజ్ఞత కూడా లేదంటూ విరుచుకుపడ్డారు. మీడియా ముందే తనతో గొడవకు దిగుతూ అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్నారంటూ విమర్శించారు. ‘‘అమెరికా దన్ను లేనిదే మీరెందుకూ కొరగారు! మాకు షరతులు విధించే, మమ్మల్ని డిమాండ్ చేసే పరిస్థితిలో అసలే లేరు. అది గుర్తుంచుకోండి’’ అంటూ వేలు చూపిస్తూ మరీ జెలెన్స్కీని కటువుగా హెచ్చరించారు. ‘‘మీరు లక్షలాది ప్రాణాలను పణంగా పెడుతున్నారు. మూడో ప్రపంచ యుద్ధాన్ని తెచ్చిపెట్టేలా ప్రమాదకర జూదం ఆడుతున్నారు’’ అంటూ జెలెన్స్కీని ఆక్షేపించారు. మధ్యలో పదేపదే ఆయన భుజంపై కొట్టి మరీ ఆగ్రహం వెలిగక్కారు. రష్యాతో ఏ విషయంలోనూ రాజీ పడేదే లేదన్న జెలెన్స్కీ వ్యాఖ్యలను కూడా ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ‘‘పుతిన్ ఒక ఉగ్రవాది. యుద్ధాల్లోనూ నిబంధనలుంటాయి. వాటన్నింటినీ కాలరాసిన పుతిన్ వంటి హంతకునితో ఎలాంటి రాజీ ఉండబోదు’’ అని జెలెన్స్కీ అన్నారు. అలా కుదరదని, యుద్ధానికి తెర దించాలంటే రష్యాతో చాలా విషయాల్లో రాజీ పడాల్సిందేనని ట్రంప్ కుండబద్దలు కొట్టారు. ‘‘ఇలాగైతే మాతో వ్యాపారం కష్టమే. అమెరికాతో ఖనిజ వనరుల ఒప్పందానికి అంగీకరిస్తారా, సరేసరి. లేదంటే మీకూ మాకూ రాంరాం’’ అంటూ తేల్చిపడేశారు. వాగ్వాదం పొడవునా నేతలిరువురూ పదేపదే వాగ్బాణాలు విసురుకున్నారు. కనీసం ఇప్పటికైనా అమెరికా చేస్తున్న దానికి కృతజ్ఞతలు చెప్పండంటూ వాన్స్ కల్పించుకోగా ట్రంప్ వారించారు. ‘‘పర్లేదు. ఈ డ్రామా నాకూ సరదాగానే ఉంది. జరుగుతున్నదేమిటో అమెరికా ప్రజలందరూ చూడాలి’’ అన్నారు.సాయానికి హామీ ఇవ్వలేం: ట్రంప్ జెలెన్స్కీతో భేటీకి ముందు ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్‌తో సహజ వనరుల ఒప్పందంపై ఆయన, తాను కాసేపట్లో సంతకాలు చేస్తామని ప్రకటించారు. యుద్ధం వీలైనంత త్వరగా ముగియాలన్నదే తన ఉద్దేశమన్నారు. అయితే, ‘‘ఉక్రెయిన్‌కు అమెరికా సైనిక సాయం కొనసాగుతుంది. కాకపోతే ఈ విషయంలో మానుంచి మరీ ఎక్కువగా ఆశించకూడదు’’ అని స్పష్టం చేశారు. యుద్ధాన్ని ముగించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కృతనిశ్చయంతో ఉన్నారంటూ మరోసారి ప్రశంసించారు. -
ట్రేడ్ వార్ టెర్రర్
ముంబై: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా దిగుమతులపై అదనంగా 10%, యూరోపియన్ యూనియన్ ఉత్పత్తులపై 25% తాజా సుంకాల ప్రకటనతో ఈక్విటీ మార్కెట్లలో మరోసారి అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా సెన్సెక్స్ 1,414 పాయింట్లు నష్టపోయి 74వేల స్థాయి దిగువన 73,198 వద్ద నిలిచింది. నిఫ్టీ 420 పాయింట్లు కోల్పోయి 22,125 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం నష్టాలతో మొదలయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,471 పాయింట్లు క్షీణించి 73,141 వద్ద, నిఫ్టీ 440 పాయింట్లు కుప్పకూలి 22,105 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. → అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ఇండెక్సుల వారీగా.. ఐటీ సూచీ 4.20% పతనమైంది. టెలి కమ్యూనికేషన్, ఆటో ఇండెక్సు 4%, కన్జూమర్ డి్రస్కేషనరీ 3%, ఆయిల్‌అండ్‌గ్యాస్ 2.50%, విద్యుత్ ఇండెక్స్ 2% నష్టపోయాయి. చిన్న, మధ్య తరహా షేర్లలోనూ అమ్మకాలు కొనసాగాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ 2.33%, మిడ్ క్యాప్ ఇండెక్సు 2.16 క్షీణించాయి. → స్టాక్ మార్కెట్ 2% పతనంతో శుక్రవారం ఒక్కరోజే రూ.9.08 లక్షల కోట్లు హరించుకుపోయింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.384.01 లక్షల కోట్లకు దిగివచ్చింది. → సెన్సెక్స్ సూచీలో ఒక్క హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2%) తప్ప మిగిలిన అన్ని షేర్లూ పతనమయ్యాయి. అత్యధికంగా టెక్ మహీంద్రా 6%, ఇండస్ఇండ్ బ్యాంక్ 5.5%, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎయిర్టెల్ 5%, టైటాన్ 4.5% పడ్డాయి.→ గతేడాది సెపె్టంబర్ 27 నాటి సెన్సెక్స్ రికార్డు గరిష్టం(85,978) నుంచి 12,780 పాయింట్లు(15%), నిఫ్టీ జీవితకాల గరిష్టం(26,277) నుంచి 4,153 పాయింట్లు(16%) క్షీణించాయి. ఆర్థిక వృద్ధి మందగమనం ఆందోళనలు, ట్రంప్ వాణిజ్య విధానాలు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు దీనికి కారణయ్యాయి. పతనానికి కారణాలుతారస్థాయికి వాణిజ్య యుద్ధ భయాలు: చైనా ఉత్పత్తులపై ఇప్పటికే 10% సుంకాలు విధించిన ట్రంప్.. అదనంగా మరో 10% విధిస్తున్నట్లు ప్రకటించారు. యూరోపియన్ యూనియన్ దిగుమతులపై 25% సుంకాల విధింపు ఉంటుందన్నారు. వీటికి తోడు భారత్‌తో సహా అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలు ఏప్రిల్‌లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే మెక్సికో, కెనడాల దిగుమతులపై ప్రతిపాదించిన 25% సుంకాలు మార్చి 4 నుంచి అమల్లోకి రానున్నాయి.టెక్ షేర్లు క్రాష్: టెక్ దిగ్గజం ఎన్విడియా త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చనే అంచనాలతో వాల్ స్ట్రీట్‌లో అధిక మార్కెట్ విలువ కలిగిన టెక్ కంపెనీల షేర్లు కుప్పకూలాయి. ఈ ప్రభావం దేశీయ ఐటీ రంగ షేర్లపైనా పడింది. నెలరోజుల కనిష్టానికి ప్రపంచ మార్కెట్లు: వాణిజ్య యుద్ధ భయాలకు తోడు టెక్ రంగ షేర్ల పతనంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు నెలరోజుల కనిష్టానికి దిగివచ్చాయి. ఆసియాలో దక్షిణ కొరియా, ఇండోనేషియా, హాంగ్‌కాంగ్, జపాన్ సూచీలు 3.50% నుంచి 3% కుప్పకూలాయి. చైనా, సింగపూర్ తైవాన్ ఇండెక్సులు 2–1% నష్టపోయాయి. యూరప్‌లో ఫ్రాన్స్, జర్మనీ దేశాల సూచీలు అరశాతం నష్టపోయాయి.బలపడుతున్న డాలర్ ఇండెక్స్: వాణిజ్య యుద్ధ భయాలతో అమెరికా కరెన్సీ డాలర్ ఇండెక్స్ 10 వారాల గరిష్టానికి (108) చేరుకుంది. దీంతో భారత్‌తో సహా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు ప్రతికూలాంశంగా మారింది. ఆగని ఎఫ్ఐఐల అమ్మకాలు: దేశీయ మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోతుండడం దలాల్ స్ట్రీట్ పతనానికి మరో ప్రధాన కారణం. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రూ.1.13 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వెనక్కి వెళ్లాయి. ఈ ఫిబ్రవరిలోనే రూ.58,988 కోట్ల ఈక్విటీలు అమ్మేశారు.రూపాయి 19 పైసలు పతనం డాలర్ మారకంలో రూపాయి విలువ 19 పైసలు క్షీణించి 87.37 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ రెండు నెలల గరిష్టానికి చేరుకోవడం, వాణిజ్య యుద్ధ భయాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూలతలు దేశీయ కరెన్సీపై ఒత్తిడి పెంచాయి. ఇంట్రాడేలో 35 పైసలు బలహీనపడి 87.53 వద్ద కనిష్టాన్ని తాకింది. కాగా, ఫిబ్రవరి 10న రూపాయి 87.94 వద్ద జీవితకాల కనిష్ట స్థాయిని తాకింది. -
మోదీ తన మిత్రుడు ట్రంప్ వ్యాఖ్యలను పట్టించుకోవాలి
న్యూఢిల్లీ: ఓటింగ్ కోసం ఎల్రక్టానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం)లకు బదులుగా బ్యాలెట్ పేపర్లను వాడాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారులకు చేసిన సూచనపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ప్రధాని మోదీ తన మిత్రుడు ట్రంప్ వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. మనదేశ ఎలక్టోరల్ విధానం సమగ్రతపై వ్యక్తమవుతున్న ఆందోళనలకు బ్యాలెట్ విధానమే సరైన సమాధానమని పేర్కొంది. అమెరికాలో ఇటీవల జరిగిన రాష్ట్రాల గవర్నర్ల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ..‘ఈవీఎంల విధానం చాలా ఖరీదైన వ్యవహారం. దీనికి బదులుగా బ్యాలెట్ విధానాన్ని, ఒకే రోజు ఓటింగ్ చేపట్టడం వంటివి తీసుకురావడం మంచిది’అని తెలిపారు. దీనిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం ‘ఎక్స్’లో పలు పోస్టులు చేశారు. ‘ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా లక్షల సంఖ్యలో ఓటర్లు పెరిగారు. అదేసమయంలో, ప్రతిపక్షాలకు చెందిన వారి ఓట్లను పెద్ద సంఖ్యలో తొలగించారు. ఇవన్నీ తెలిస్తే మోదీ మిత్రుడు ట్రంప్ సైతం షాకవుతారు’అని పేర్కొన్నారు. ‘ఈవీఎంలతో ఎన్నికల విధానాన్ని తారుమారు చేయవచ్చని ప్రపంచానికంతటికీ తెలిసినా బీజేపీ మాత్రం అమాయకత్వం ప్రదర్శించటం విషాదకరం. పారదర్శకతకు దూరంగా పారిపోయే బీజేపీ వైఖరి చూస్తే వాళ్లు అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలకు బలం చేకూరుతోంది’అని తెలిపారు. -
అమెరికాలో ముగ్గురు సైనికాధికారులపై వేటు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముగ్గురు కీలక సైనాధికారులకు ఉద్వాసన పలికారు. జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ చార్లెస్ సీక్యూ బ్రౌన్(ఛార్లెస్ క్వింటన్ బ్రౌన్) జూనియర్‌పై హఠాత్తుగా వేటువేశారు. ఎయిర్‌ఫోర్స్ జనరల్ అయిన బ్రౌన్ గత 16 నెలలుగా ఈ పదవిలో కొనసాగుతున్నారు. అత్యంత కీలకమైన జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ పదవిని అధిరోహించిన రెండో నల్లజాతి అధికారిని ఉన్నట్టుండి పదవి నుంచి తొలగించడం అమెరికా సైనిక వర్గాల్లో సంచలనాత్మకంగా మారింది. ‘‘అమెరికాకు 40 ఏళ్లకుపైగా సేవలందిస్తున్న జనరల్ చార్లెస్ సీక్యూ బ్రౌన్ జూనియర్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఆయన ఒక గొప్ప అధికారి. సైన్యాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపించిన నాయకుడు. బ్రౌన్‌తోపాటు ఆయన కుటుంబం భవిష్యత్తు ఉజ్వలంగా వెలిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’అని సోషల్ మీడియాలో డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం పోస్టు చేశారు. జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ నూతన చైర్మన్‌గా రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ లెఫ్టినెంట్ జనరల్ డాన్ రజిన్ కెయిన్‌ను నామినేట్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అమెరికాలో జార్జి ఫ్లాయిడ్ అనే నల్లజాతి వ్యక్తిని పోలీసులు హత్య చేసినప్పుడు ప్రజలు వీధుల్లోకి వచ్చి ఉద్యమించారు. వర్ణవివక్ష పూర్తిగా అంతం కావాలని డిమాండ్ చేశారు. ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’పేరిట జరిగిన ఉద్యమానికి చార్లెస్ సీక్యూ బ్రౌన్ జూనియర్ బహిరంగంగా మద్దతు ప్రకటించారు. నల్లజాతి ప్రజల పట్ల ఆయన సానుభూతి చూపుతుంటారు. అమెరికా సైన్యంలో బ్రౌన్ వ్యతిరేకులు చాలామందే తయారయ్యారు. సైనిక వ్యయాన్ని గణనీయంగా తగ్గించాలని, అవసరం లేదని సిబ్బందిని ఇంటికి సాగనంపాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే బ్రౌన్కు ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, మరో ఇద్దరు సీనియర్ సైనిధికారులను పదవి నుంచి తొలగిస్తున్నట్లు అమెరికా రక్షణ శాఖ మంత్రి హెగ్సెత్ వెల్లడించారు. నావల్ ఆపరేషన్స్ చీఫ్ అడ్మిరల్ లీసా ఫ్రాంచెట్టీ, స్టాఫ్ ఆఫ్ ద ఎయిర్‌ఫోర్స్ వైస్ చీఫ్ జనరల్ జిమ్ స్లైఫ్ను పదవుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు.5,400 మంది ప్రొబేషనరీ సిబ్బందికి ఉద్వాసనే సైన్యంలో పనిచేస్తున్న 5,400 మంది ప్రొబేషనరీ వర్కర్స్కు ఉద్వాసన పలకబోతున్నట్లు అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది. వచ్చేవారం నుంచే వారిని తొలగించే ప్రక్రియ ప్రారంభమవుతుందని స్పష్టంచేసింది. నూతన నియామకాలను నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. ఏడాది కంటే తక్కువ కాలం పని చేసినవారిని తొలగించాలని ట్రంప్ సర్కారు నిర్ణయించింది. ఇలాంటి వారికి సివిల్ సర్వీసు ప్రొటెక్షన్ ఉండదు. సైన్యంలో యూనిఫామ్ సర్వీసు మినహా ఇతర విభాగాల్లో 5 నుంచి 8 శాతం సిబ్బందిని తగ్గించుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు యూఎస్ ఫారెస్టు సర్వీసు నుంచి దాదాపు 2 వేల మంది ఉద్యోగులను ఇప్పటికే తొలగించింది. ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసులో పనిచేస్తున్న 7 వేల మందిపై త్వరలో వేటు వేయబోతున్నట్లు తెలిసింది. ఉద్యోగుల తొలగింపుపై రక్షణ మంత్రి హెగ్సెత్ గతవారం సోషల్ మీడియాలో నర్మగర్భమైన పోస్టు చేశారు. ‘‘శరీరం నుంచి అనవసరమైన కొవ్వును తొలగించుకుంటే కండరాలు బలపతాయి’’అని పేర్కొన్నారు. సైన్యంలో కొన్ని కార్యక్రమాలకు కత్తెర వేసి 50 బిలియన్ డాలర్లు ఆదా చేయాలని ఆదేశించారు. ఈ సొమ్మును అధ్యక్షుడు ట్రంప్ ప్రాధాన్యతల జాబితాలో ఉన్న కార్యక్రమాలకు మళ్లించాలని పేర్కొన్నారు. 50 బిలియన్ డాలర్లు అంటే అమెరికా సైనిక బడ్జెట్లో 8 శాతం. -
Russia-Ukraine war: యుద్ధం @ మూడేళ్లు
ఉక్రెయిన్. రష్యా దురాక్రమణ జెండా ఎగరేసి దూసుకురావడంతో అస్థిత్వమే లక్ష్యంగా సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతున్న పొరుగుదేశం. అణ్వస్త్ర సామర్థ్యం, అమేయ సైన్యంతో కొద్దికొద్దిగా ఆక్రమించుకుంటూ వస్తున్న రష్యాను నిలువరించేందుకు ఉక్రెయిన్ యుద్ధంచేస్తూ శతథా ప్రయత్నాలు చేయబట్టి రేపటికి సరిగ్గా మూడేళ్లు. ఈ మూడేళ్లలో రష్యా కన్నెర్రజేసి వేలాది సైన్యంతో చేస్తున్న భీకర గగనతల, భూతల దాడుల్లో ఉక్రెయిన్‌లో సాధారణ ప్రజల వేలాది కలల సౌధాలు పేకమేడల్లా కూలి నేలమట్టమయ్యాయి. వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. శివారు గ్రామాలు, పట్టణాలన్నీ మరుభూములుగా మారిపోయాయి. ఎక్కడ చూసినా మరణమృదంగం నిరాటంకంగా వినిపిస్తోంది. సైనికులు పిట్టల్లా రాలిపోయారు. మార్షల్ లా ప్రయోగించి జెలెన్స్కీ ప్రభుత్వం యువత మొదలు నడివయసు వారిదాకా దమ్మున్న వారందరినీ రణక్షేత్రంలోకి దింపి పోరాటం చేయిస్తోంది. దశాబ్దాల నాటి దౌత్య ఒప్పందాలను ఉల్లంఘించిందని, నాటోలో చేరాలనుకుంటోందని పలు సాకులు చూపి రష్యా సమరశంఖం పూరించింది. దీంతో హఠాత్తుగా యుద్ధంలో కూరుకుపోయినా ఉక్రెయిన్ తన మిత్రబృందం నుంచి అందుతున్న అధునాతన ఆయుధాలతో రష్యాను సైతం సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తూ లక్షలాది మంది రష్యన్ సైనికులను నేలకూల్చింది. దీంతో అణ్వస్త్ర బూచి చూపించి భయపెడుతున్న పుతిన్‌కు యుద్ధాన్ని ఆపడమే ఉత్తమమని అగ్రరాజ్య నయా నాయకుడు డొనాల్డ్ ట్రంప్ టెలీఫోన్ మంతనాలు చేయడంతో యుద్ధం మొదలైన మూడేళ్ల తర్వాత తొలిసారిగా కీలక మలుపు తీసుకుంది. వాస్తవానికి ఈ మలుపు తుది మలుపు అని, ట్రంప్ పట్టుదలతో యుద్ధాన్ని ఆపబోతున్నారని అంతర్జాతీయ విశ్లేషణలు వెలువడుతున్నాయి. 36 నెలల తర్వాత అయినా ఉక్రెయిన్ ఊపిరి పీల్చుకుంటుందో లేదోనని, యుద్ధప్రభావిత విపరిణామాలతో తిప్పలుపడుతున్న ఎన్నో ప్రపంచదేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.అత్యంత భీకర ఘర్షణరెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌లో వెలుగుచూసిన అతిపెద్ద వైరం ఇదే. వాస్తవానికి తాజా యుద్ధానికి పునాదులు పదేళ్ల క్రితమే పడ్డాయి. 2014లో ఉక్రెయిన్‌లోని క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా ఉన్నపళంగా ఆక్రమించుకుంది. ఆనాటి నుంచి ఇరుదేశాల మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. ఆ తర్వాత 2022 ఫిబ్రవరి 24వ తేదీన ఉక్రెయిన్ పైకి రష్యా దండయాత్ర మొదలెట్టింది. వందల కొద్దీ చిన్నపాటి క్షిపణులు ప్రయోగిస్తూ వేలాది సైనికులను కదనరంగంలోకి దింపింది. తొలిరోజుల్లో రాజధాని కీవ్‌దాకా దూసుకొచ్చి భీకర దాడులు చేసిన రష్యా ఆ తర్వాత ఆక్రమణ వేగాన్ని అనూహ్యంగా తగ్గించింది. ఉక్రెయిన్ వైపు నుంచి ప్రతిఘటన కూడా దీనికి ఒక కారణం. ఉక్రెయిన్ తొలినాళ్లలో యుద్ధంలో తడబడినా ఆ తర్వాత అగ్రరాజ్యం, యూరప్ దేశాల ఆర్థిక, ఆయుధ, నిఘా బలంతో చెలరేగిపోయింది. ధాటిగా దాడులు చేస్తూ పుతిన్ పటాలానికి ముచ్చెమటలు పట్టించింది. దీంతో మరింత శక్తివంతమైన ఆయుధాలను రష్యా బయటకుతీయక తప్పలేదు. దీంతో డ్రోన్లకు ఉక్రెయిన్ పనిచెప్పింది. దృఢత్వానికి చిరునామా అయిన అత్యంత ఖరీదైన వేలాది రష్యన్ యుద్ధట్యాంక్‌లను సైతం సులువుగా చవకైన డ్రోన్లతో పేల్చేసి జెలెన్స్కీ సేన పలు యుద్ధక్షేత్రాల్లో పైచేయి సాధించింది. 18 శాతం ఆక్రమణఅంతర్జాతీయ మీడియా కథనాలు, రష్యా, ఉక్రెయిన్ ఉన్నతాధికారులు పలు సందర్భాల్లో వెల్లడించిన గణాంకాలను బట్టి చూస్తే ఇప్పటిదాకా రష్యా ఉక్రెయిన్‌లోని కేవలం 18 శాతం భూభాగాన్ని మాత్రమే ఆక్రమించుకోగలిగింది. కీవ్, లివివ్, డినిప్రో, ఒడెసా వంటి ప్రధాన నగరాలపై దాడి ప్రభావం లేదు. అమెరికా, ఇతర మిత్ర దేశాల నుంచి ఉక్రెయిన్‌కు అందుతున్న భారీ ఆయుధాలే ఇందుకు ప్రధాన కారణం. ఎప్పటికప్పుడు ఆయుధాలు, మందుగుండు, సైనిక ఉపకరణాలు, ఆర్థిక సాయం అందడంతోపాటు అంతర్జాతీయంగా లభిస్తున్న నైతిక మద్దతుతో రెట్టించిన ఉత్సాహంతో ఉక్రెయిన్ సైనికులు కదనరంగంలో ధైర్యంగా ముందడుగు వేయగల్గుతున్నారు. యుద్ధంలో రష్యా దాదాపు ఏకాకిగా మారింది. రహస్యంగా ఉత్తరకొరియా, చైనా, ఇరాన్ వంటి దేశాల నుంచి ఆయుధాలు, డ్రోన్లు తదితర ఆయుధాలు, కిరాయి సైనికులు తప్పితే రష్యాకు బయటి దేశాల నుంచి ఎలాంటి సాయం అందట్లేదు. అమెరికా తదితర దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షల కత్తి గుచ్చాయి. సొంత దేశంలోనూ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న రష్యన్లు కోట్లలో ఉన్నారు. యుద్ధం కారణంగా విదేశీ వస్తువుల లభ్యత తగ్గి, డిమాండ్ పెరిగింది. దీంతో ద్రవ్యోల్బణం పెరిగి రష్యన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆయుధం చేతికిచ్చి యుద్ధానికి పుతిన్ పంపిస్తాడన్న ముందస్తు అంచనాతో తొలినాళ్లలోనే వేలాది మంది యువ రష్యన్లు దేశం నుంచి పారిపోయారు. చివరకు ఖైదీలు, నిందితులను సైతం పుతిన్ సైన్యంలో చేరి్పంచుకుని ఉక్రెయిన్‌తో పోరాటం చేయిస్తున్నారు.అన్ని రంగాలు తిరోగమనం నష్టాలు చెప్పకపోయినా అంతర్జాతీయంగా తగ్గిన వాణిజ్యంతో ఉక్రెయిన్ నష్టాలు చరిత్రలో ఎన్నడూ చూడని స్థాయికి చేరుకున్నాయని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. బాంబు దాడుల్లో ఆనకట్టలు, రహదారులు, భవనాలు, వ్యవసాయ క్షేత్రాలు, పాఠశాలలు, కర్మాగారాలు ఇలా మౌలికవసతుల వ్యవస్థ బాగా దెబ్బతింది. వ్యవసాయం తగ్గిపోయింది. నిరుద్యోగం పెరిగింది. ఇలా ఎన్నో రంగాలు తిరోగమన పథంలో పయనిస్తున్నాయి. దేశ జీడీపీకి వందల బిలియన్ డాలర్ల నష్టం చేకూరింది. వాణిజ్య, పరిశ్రమ రంగానికి సంబంధించి దాదాపు రూ.15 లక్షల కోట్లు, వ్యవసాయ రంగానికి రూ.5.8 లక్షల కోట్ల నష్టాలు వాటిల్లాయి. రవాణా, వాణిజ్యం, ఎగుమతులు, వ్యవసాయం, విద్యుత్, పరిశ్రమల రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి వందల బిలియన్ డాలర్ల నిధులు అవసరమవుతాయని ఓ అంచనా. ఉక్రెయిన్‌కు మిత్ర దేశాల నుంచి భారీ స్థాయిలో సాయం అందుతున్నా అది ఎక్కువగా సైనిక, రక్షణపర సాయమే తప్పితే సాధారణ ప్రజల జీవితాలను బాగుచేసేది కాదు. దీంతో యుద్ధంలో ఉక్రెయిన్ తన భూభాగాలను మాత్రమే కాదు భవిష్యత్తును కొంత కోల్పోతోందనేది వాస్తవం. ఉక్రెయిన్‌కు అపార ఆస్తినష్టం రష్యా వైపు సైనికులు, ఆయుధాల రూపంలో నష్టం కనిపిస్తుంటే ఉక్రెయిన్ వైపు అంతకుమించి ఆస్తినష్టం సంభవించింది. లక్షల కోట్ల రూపాయల విలువైన భవనాలు నేలమట్టమయ్యాయి. పెద్ద సంఖ్యలో జనావాసాలపై దాడులతో పెద్దసంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇక దాదాపు లక్షకుపైగా ఉక్రెయిన్ సైనికులు చనిపోయినట్లు తెలుస్తోంది. దాదాపు 4 లక్షల మంది సైనికులు గాయాలపాలయ్యారు. ఇక స్వస్థలాలు సమరక్షేత్రాలుగా మారడంతో లక్షలాది మంది స్వదేశంలోనే యుద్ధంజాడలేని సుదూర ప్రాంతాలకు తరలిపోయారు. పక్కనే ఉన్న పోలండ్, రొమేనియా దేశాలుసహా అరడజనుకుపైగా దేశాలకు దాదాపు 60 లక్షల మంది శరణార్థులుగా వలసవెళ్లారు. దాదాపు ఉక్రెయిన్ వైపు యుద్ధంలో ఎంత నష్టం జరిగిందనేది స్పష్టంగా తెలీడం లేదు. అమెరికా సహా యూరప్ దేశాల ప్రభుత్వాలు, ఆయా దేశాల్లోని ప్రధాన మీడియా సంస్థలు సైతం ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తున్నాయి. దీంతో ఉక్రెయిన్ సైన్యం, పౌరుల్లో నైతిక స్థైర్యం సడలకూడదనే ఉద్దేశంతో యుద్ధ నష్టాలను తక్కువ చేసి చూపిస్తున్నాయని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.యుద్ధంలో రక్తమోడుతున్న రష్యాఅణ్వ్రస్తాలు లేకున్నా ఉక్రెయిన్‌తో యుద్ధం అంత తేలిక కాదని పుతిన్‌కు రానురాను అర్థమైంది. రష్యాకు తగ్గట్లు ఉక్రెయిన్ సైతం అధునాతన యుద్ధవ్యూహాలను అమలుచేస్తుండటంతో రష్యా వైపు నష్టం భారీగానే ఉంది. అంతర్జాతీయ యుద్ధ పరిశీలనా బృందాలు, సంస్థలు, వార్తాసంస్థల నివేదికలు, అంచనాల ప్రకారం యుద్ధంలో ఏకంగా 8,66,000 మంది రష్యా సైనికులు చనిపోయారు. ఉక్రెయిన్ విషయంలో చూస్తే కేవలం లక్షకుపైగా సైనికులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఏకంగా 10,161 రష్యన్ యుద్ధ ట్యాంకులను ఉక్రెయిన్ ధ్వంసంచేసింది. ఉక్రెయిన్‌లో ఎన్నికలొచ్చేనా?రష్యా దాడులు మొదలెట్టగానే జెలెన్స్కీ తమ దేశంలో మార్షల్ లా ప్రయోగించారు. సైనికపాలన వంటి అత్యయిక స్థితి అమల్లో ఉన్న కారణంగా ఉక్రెయిన్‌లో ఇప్పట్లో ఎన్నికలు సాధ్యంకాదు. ఒకవేళ ఎన్నికలు నిర్వహించాలంటే పార్లమెంట్లో ఏకాభిప్రాయ నిర్ణయం ద్వారా మార్షల్ లాను తొలగించాలి. యుద్ధం జరుగుతుండగా మార్షల్ లాను చట్టప్రకారం తొలగించడం అసాధ్యం. దీంతో ఇప్పట్లో ఎన్నికలు కష్టమని భావిస్తున్నారు. ఒకవేళ ఎన్నికలు నిర్వహించినా జెలెన్స్కీ జాతీయభావం, యుద్ధంలో రష్యాను దీటుగా ఎదుర్కొంటున్నానని చెప్పి మళ్లీ అధికారం కైవసం చేసుకుంటారని విపక్ష పారీ్టలు విమర్శిస్తున్నాయి. యుద్ధంలో ట్రంప్‌కార్డ్ జెలెన్స్కీ మొండిపట్టుదలతో యుద్ధాన్ని ఇక్కడిదాకా తెచ్చారని సంచలన ఆరోపణలు చేసిన అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ వడివడిగా తీసుకుంటున్న నిర్ణయాలు యుద్ధమేఘాలను శాశ్వతంగా తరిమేస్తాయన్న ఆశలు ఒక్కసారిగా చిగురించాయి. తొలిసారిగా రష్యా విదేశాంగ మంత్రి స్థాయి కీలక నేతలతో ఇటీవల మొదలైన చర్చల ప్రక్రియను ఇప్పుడు యుద్ధంలో కీలకదశగా చెప్పొచ్చు. మంతనాలు మరింత విస్తృతస్థాయిలో జరిగితే మూడేళ్ల యుద్ధానికి ముగింపు ఖాయమనే విశ్లేషణలు పెరిగాయి. ఇప్పటిదాకా ఆక్రమించిన ప్రాంతం రష్యాకే చెందుతుందని, ఇప్పటి ‘వాస్తవాదీన రేఖ’నే అంగీకరిస్తూ జెలెన్స్కీని ఒప్పించాలని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్‌కు ఒప్పకోకపోతే మిత్రదేశాల నుంచి ఎలాంటి సాయం అందకుండా అడ్డుకుంటానని ట్రంప్ హెచ్చరించి జెలెన్స్కీని దారికి తెస్తారని భావిస్తున్నారు. అధునాతన ఆయుధాలతో దూసుకొస్తున్న రష్యా సేనలను అడ్డుకోవాలంటే ఉక్రెయిన్‌కు విదేశీ ఆయుధసాయం తప్పనిసరి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో జెలెన్స్కీ అమెరికా పెట్టే షరతులకు ఒప్పకోక తప్పదని, యుద్ధం ఒక రకంగా ముగింపు దిశలో పయనిస్తోందని వార్తలొచ్చాయి. యుద్ధం అంకెల్లో.. చనిపోయిన రష్యా సైనికులు 8,66,000కుపైగా చనిపోయిన ఉక్రెయిన్ సైనికులు 1,00,000కుపైగా ఇప్పటిదాకా రష్యా ఆక్రమించుకున్న ఉక్రెయిన్ ప్రాంతం 18 శాతం సగటున రోజుకు రష్యా ఆక్రమణ రేటు 16.1 చదరపు కిలోమీటర్లు ఉక్రెయిన్‌కు యూరప్ దేశాల నుంచి అందిన ఆర్థిక సాయం రూ. 14 లక్షల కోట్లు యూరోపియన్ యూనియన్ ఉక్రెయిన్‌కు ఇచ్చిన రుణాలు రూ. 2 లక్షల కోట్లు– సాక్షి, నేషనల్ డెస్క్ -
మస్క్ ప్రతిపాదన నచ్చింది: ట్రంప్
వాషింగ్టన్: ఫెడరల్ వ్యవస్థ తగ్గింపుతో పొదుపు చేసిన డబ్బు ఖర్చుపై డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సమర్థించారు. వ్యయ తగ్గింపుతో మిగిల్చిన మొత్తంలోని కొంత డబ్బును అమెరికా పౌరులకు డివిడెండ్ రూపంలో తిరిగి ఇచ్చే ఆలోచన తనకు నచ్చిందన్నారు. మయామీలో జరిగిన ఇన్వెస్టర్స్ మీట్లో ఆయన మాట్లాడారు. అనంతరం విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. మస్క్ ప్రతిపాదనకు మద్దతిచ్చారు. వ్యయ తగ్గింపులతో మిగిలే మొత్తంలో 20 శాతాన్ని అమెరికా పౌరులకు డివిడెండ్‌గా ఇవ్వాలని, మరో 20 శాతాన్ని జాతీయ రుణాలను చెల్లించడానికి ఉపయోగించాలని డోజ్ ప్రతిపాదించింది. ఈ సొమ్ము ప్రజల ఖాతాల్లోకి వెళ్లడం ద్వారా.. వృధాను అరికట్టేందుకు వారే ముందుకొస్తారన్నారు. -
ఎయిర్ ఫోర్స్ వన్ కోసం పాత విమానాలకు మార్పులు చేయిస్తాం
వాషింగ్టన్: కాంట్రాక్టు ఒప్పందం ప్రకారం బోయింగ్ కంపెనీ ఎయిర్ ఫోర్స్ వన్ విమానాలను అందజేయడంలో ఆలస్యం చేస్తుండటంపై అమెరికా అధ్య క్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయంగా బోయింగ్ పాత విమానాలను కొనుగోలు చేసి, వాటిని అవసరాలకు అనుగుణంగా మార్చనున్నామని చెప్పారు. అమెరికా అధ్యక్షుడి పర్యటనల కోసం ప్రత్యేకంగా వాడే ‘ఎయిర్ ఫోర్స్ వన్’విమానాలను బోయింగ్ కంపెనీ రూపొందిస్తుంది. రెండు విమానాలను కొనుగోలు చేసేందుకు అమెరికా ప్రభుత్వం గతంలో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఖరీదు చాలా ఎక్కువైందంటూ ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైన సమయంలో కాంట్రాక్టును మార్చారు. మారిన నిబంధనల ప్రకారం 2024లోనే బోయింగ్ మొదటి విమానాన్ని అందజేయాల్సి ఉంది. కానీ, ఉద్యోగుల సమ్మె, కరోనా మహమ్మారి వంటి కారణాలతో ఆ కంపెనీ నష్టాల్లో కూరుకుపోయి పనులు నిలిచిపోయాయి. తాజా అంచనాల ప్రకారం, మొదటిది 2027లో, 2028లో ట్రంప్ పదవి నుంచి దిగిపోయే సమయానికి రెండో విమానం అందుతుంది. 35 ఏళ్లనాటి బోయింగ్ ‘ఎయిర్ ఫోర్స్ వన్’విమానంలో బుధవారం ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ..బోయింగ్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ కాంట్రాక్టుకు ప్రత్యామ్నాయం చూస్తున్నామన్నారు. యూరప్ కంపెనీ ఎయిర్ బస్ నుంచి కొంటారా అన్న ప్రశ్నకు ఆయన.. అలాంటిదేమీ లేదన్నారు. విదేశీ కంపెనీ కంటే స్వదేశీ కంపెనీకి ప్రాధాన్యం ఇస్తామన్నారు. బోయింగ్ కంపెనీకే చెందిన వాడిన విమానాన్ని కొని, దానిలో మార్పులు చేయిస్తామని చెప్పారు. ఖరీదు ఎక్కువనే కారణంతో ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో డిజైన్ చేసిన కొత్తతరం వీసీ–25బీ రకం విమానాలను సైతం ట్రంప్ తిరస్కరించారు. గాలిలో ఉండగానే ఇంధనం నింపుకునే సౌకర్యంతోపాటు అధ్యక్షుడికి అవసరమైన మరెన్నో ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. ఇలా ఉండగా, అధ్యక్షుడు ట్రంప్ శనివారం బోయింగ్ 747–800 రకం కొత్త విమానాన్ని పరిశీలించారని వైట్ హౌస్ తెలిపింది. ఇందులో అత్యాధునిక హార్డ్‌వేర్, ఇతర సాంకేతిక ప్రత్యేకతలను ఆయన తెలుసుకున్నారు. అదేవిధంగా, పామ్‌బీచ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పార్కు చేసిన ఉన్న ఖతార్ రాజకుటుంబానికి చెందిన 15 ఏళ్లనాటి ప్రైవేట్ విమానం లోపల కూడా ఆయన తిరిగి చూశారని తెలిపింది. -
భారత్‌కు సాయం అనవసరం
వాషింగ్టన్: భారత్‌లో ఓటింగ్‌ను పెంచడానికంటూ అందిస్తూ వస్తున్న 2.1 కోట్ల డాలర్ల నిధిని రద్దు చేస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్) తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు. భారత్‌కు అసలు ఇంతకాలంగా ఆ మొత్తం ఎందుకు ఇస్తూ వచ్చినట్టని ప్రశ్నించారు. విదేశాలకు సహాయ నిధులకు కోత పెడుతూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేసిన అనంతరం మంగళవారం తన నివాసం మార్–ఎ–లాగోలో అధ్యక్షుడు మీడియాతో మాట్లాడారు. ‘‘భారత్ దగ్గర చాలా డబ్బుంది. అమెరికా నుంచి ప్రపంచంలోనే అత్యధికంగా పన్నులు విధిస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. మాపై వాళ్ల టారిఫ్‌లు చాలా ఎక్కువ. అలాంటి దేశానికి 2.1 కోట్ల డాలర్లు ఎందుకిస్తున్నామో అర్థం కావడం లేదు!’’ అన్నారు. అయితే భారత్ పట్ల, ఆ దేశ ప్రధానిపై నాకెంతో గౌరవముందని చెప్పుకొచ్చారు. భారత్‌తో పాటు పలు దేశాలకు అందిస్తున్న మొత్తం 72.3 కోట్ల డాలర్ల సహాయ నిధులకు డోజ్ ఆదివారం మంగళం పాడటం తెలిసిందే. ఈ వ్యవహారంపై ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యుడు, ఆర్థికవేత్త సంజీవ్ సన్యాల్ స్పందించారు. భారత్‌లో ఓటింగ్ శాతం మెరుగు పరిచేందుకు అమెరికా నుంచి 2.1 కోట్ల డాలర్లను ఇన్నేళ్లుగా ఎవరు అందుకుంటూ వచ్చారో తెలుసుకోవాలనుకుంటున్నానంటూ ట్వీట్ చేశారు. భారత్‌లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అమెరికా నిధులు సమకూరుస్తోందన్న వార్తలను కేంద్ర మాజీ ఎన్నికల ప్రధానాధికారి ఎస్‌వై ఖురేషీ ఇప్పటికే ఖండించడం తెలిసిందే. 2012లో తాను సీఈసీగా ఉండగా ఈ మేరకు అమెరికా ఏజెన్సీ నుంచి ఎన్నికల సంఘం ఒప్పందం కుదుర్చుకున్నట్లు వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు.‘స్పేస్’లో మస్క్ జోక్యముండదుఅంతరిక్ష సంబంధిత ప్రభుత్వ నిర్ణయాల్లో టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ జోక్యం ఉండబోదని ట్రంప్ స్పష్టం చేశారు. మస్క్ ప్రధానంగా డోజ్ ద్వారా ప్రభుత్వానికి ఖర్చులను తగ్గించే పనిమీద ఉంటారన్నారు. ‘‘ఆయనను మీరు ఉద్యోగి అని పిలవవచ్చు. కన్సల్టెంట్ అనొచ్చు. మీకు నచ్చినట్లుగా పిలవవచ్చు, కానీ ఆయన దేశభక్తుడు’’ అని చెప్పుకొచ్చారు. మస్క్ ప్రభుత్వోద్యోగి కాదని, ఆయనకు ఎలాంటి నిర్ణయాధికారాలూ లేవని వైట్‌హౌస్ సోమవారం పేర్కొనడం తెలిసిందే.టారిఫ్‌లపై తగ్గేదే లేదుపరస్పర టారిఫ్‌ల విషయంలో తగ్గేదే లేదని ట్రంప్ కుండబద్దలు కొట్టారు. ఈ విషయంలో తనతో ఎవరూ వాదించలేరని స్పష్టం చేశారు. ‘భారత్‌కు మినహాయింపు లేదు. మీరెంత విధిస్తే మేమూ అంతే విధిస్తా’మని ప్రధాని మోదీకి స్పష్టం చేశానని చెప్పారు. ప్రతి దేశానికీ ఇదే వర్తిస్తుందన్నారు. ఎలాన్ మస్క్‌తో కలిసి ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఆటోమొబైల్ వంటి రంగాల్లో అమెరికాపై భారత్ ఏకంగా 100 శాతం సుంకాలు విధిస్తోందని ట్రంప్ చెప్పగా అవునంటూ మస్క్ శ్రుతి కలిపారు.‘బైడెన్ అటార్నీ’లకు ఉద్వాసనమాజీ అధ్యక్షుడు జో బైడెన్ నియమించిన అటార్నీలందరినీ తొలగించాలని ట్రంప్ ఆదేశించారు. న్యాయశాఖను గత నాలుగేళ్లలో మునుపెన్నడూ లేనంతగా రాజకీయమయం చేశారంటూ ఆక్షేపించారు. అందుకే ఆ శాఖలో ‘బైడెన్ శకం’ ఆనవాళ్లను తొలగించాలని ఆదేశించినట్టు తన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ‘‘నమ్మకాన్ని పునరుద్ధరించాలంటే ఇంటిని ప్రక్షాళన చేయాల్సిందే. స్వర్ణయుగపు అమెరికాలో నిష్పాక్షిక న్యాయ వ్యవస్థ ఉండాలి. ఈ రోజు నుంచే అది మొదలవుతుంది’’ అన్నారు. యూఎస్ అటార్నీలుగా పిలిచే ఫెడరల్ ప్రాసిక్యూటర్లను నామినేట్ చేయడం అధ్యక్షుడి బాధ్యత. అమెరికాలో ప్రస్తుతం 93 మంది అటార్నీలున్నారు. ప్రభుత్వ చట్టాల అమలు వీరి బాధ్యత. రిపబ్లికన్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి న్యాయ శాఖ తీవ్ర ప్రకంపనలకు గురవుతోంది. పలువురు ఉన్నతాధికారులను తొలగిస్తున్నారు.ఉక్రెయిన్‌లో సైనిక పాలనజెలెన్స్కీకి స్వదేశంలో ఆదరణ పూర్తిగా అడుగంటిందని ట్రంప్ అన్నారు. ‘‘జెలెన్స్కీ రేటింగ్స్ 4 శాతానికి పడిపోయాయి. ఆయ నకు ధైర్యముంటే తక్షణం ఎన్నికలకు వెళ్లాలి’’ అని సవాలు కూడా చేశారు. రష్యా కోరిక మేరకే ఇలా ఉక్రెయిన్‌లో ఎన్నికలకు డిమాండ్ చేస్తున్నానన్న ఆరోపణలను తోసిపుచ్చారు. ‘‘నాతో పాటు చాలా దేశాలు ఈ మేరకు డిమాండ్ చేస్తున్నాయి. ఎందుకంటే ఉక్రెయిన్ లో ఏళ్లుగా సైనిక పాలన నడుస్తోంది’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నెలాఖర్లోగా పుతిన్‌తో తాను భేటీ అయ్యే అవకాశముందని ఈ సందర్భంగా ట్రంప్ వెల్లడించారు. ఉక్రెయిన్‌పై ట్రంప్ తాజా వ్యాఖ్యలను డోజ్ అధిపతి ఎలాన్ మస్క్ పూర్తిగా సమర్థించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో స్పందించారు. ‘‘జెలెన్స్కీకి శాంతి ఇష్టం లేదు. ఆయనకు కావాల్సిందల్లా మరింత డబ్బు, అధికారం మాత్రమే’’ అంటూ ఆక్షేపించారు. -
నేడు యూరప్ అధినేతల అత్యవసర భేటీ!
వాషింగ్టన్: ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా ముగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదలతో ఉన్నారు. ఈ మేరకు ఇప్పటికే సంకేతాలిచ్చారు. చెప్పిన మాట వినకపోతే ఉక్రెయిన్‌కు ఆయుధ, ఆర్థిక సాయం నిలిపివేస్తామని హెచ్చరించారు. గతవారం రష్యా అధినేత పుతిన్‌తో ఫోన్లో మాట్లాడారు. గంటకుపైగా సుదీర్ఘంగా చర్చించారు. ఉక్రెయిన్–రష్యా మధ్య శాంతిని నెలకొనాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్రంప్ స్పష్టంచేశారు. ట్రంప్ పోద్బలంతో ఉక్రెయిన్–రష్యా మధ్య జరిగే శాంతి చర్చల్లో యూరప్ భాగస్వామ్యం ఉండబోదని అమెరికా ప్రతినిధి కీథ్ కెల్లాగ్ తేలి్చచెప్పారు. ఈ పరిణామాలన్నీ యూరప్ దేశాలకు మింగుడుపడడం లేదు. విజేత ఎవరో తేలకుండానే యుద్ధం ముగించాలన్న ప్రతిపాదనను కొన్ని ఐరోపా దేశాలు పరోక్షంగా వ్యతిరేకిస్తున్నాయి. ట్రంప్ తమను లెక్కచేయకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అంశంలో చేపట్టాల్సిన తదుపరి కార్యాచరణపై చర్చించడానికి అత్యవసరంగా భేటీ కావాలని నిర్ణయించుకున్నాయి. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో సోమవారం ఈ సమావేశం జరగబోతున్నట్లు తెలుస్తోంది. యూరప్ జాతీయ భద్రతకు ఈ భేటీ చాలా ముఖ్యమని యునైటెడ్ కింగ్డమ్(యూకే) ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ చెప్పారు. అమెరికా, యూరప్ మధ్య సంబంధాలు ఎప్పటిలాగే బలంగా ఉండాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆ దిశగా తమవంతు కృషి చేస్తున్నామని వెల్లడించారు. తమ కూటమిలో విభజనలను అంగీకరించబోమని పేర్కొన్నారు. ఉక్రెయిన్–రష్యా వ్యవహారంలో ఐరోపా దేశాలు ఒంటరవుతున్నాయని, అమెరికాకు దూరంగా జరుగుతున్నాయన్న వాదనను ఆయన ఖండించారు. మరోవైపు ఉక్రెయిన్‌కు మద్దతుగా నూతన చర్యలతో ముందుకు రాబోతున్నట్లు యూరోపియన్ యూనియన్(ఈయూ) ఫారిన్ పాలసీ చీఫ్ కాజా కెల్లాస్ ఆదివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. యూరప్ భద్రతకు తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించారు. అయితే, యూరప్ ఆదేశాల అధినేతల అత్యవసర భేటీని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ ఇంకా ధ్రువీకరించారు. ఆయన ప్రతినిధుల సైతం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ, భేటీ కచ్చితంగా జరుగుతుందని యూరోపియన్ అధికారులు అంటున్నారు. -
కట్టుబడినందుకు కట్టడి చేశారు
అమెరికాలో దాదాపు వందకు పైగా సంచలనాత్మక కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీచేసిన డొనాల్డ్ ట్రంప్ అక్కడి అసోసియేటెడ్ ప్రెస్ వార్తాసంస్థపై కత్తిగట్టారు. అమెరికా తీరప్రాంతమైన ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’పేరును ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’గా మారుస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. అయినాసరే పాత పేరునే తమ రోజువారీ వార్తల్లో, కథనాల్లో వినియోగిస్తామని అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ) కరాఖండీగా చెప్పింది. దీంతో అధ్యక్షుడి నిర్ణయాన్నే బేఖాతరు చేస్తారా అన్న ఆగ్రహంతో ట్రంప్ పాలనాయంత్రాంగం శుక్రవారం నుంచి ఏపీ పాత్రికేయులకు అధ్యక్షభవనం, ఎయిర్‌ఫోర్స్ వన్ అధ్యక్ష విమానంలో రిపోర్టింగ్ కోసం అనుమతి నిరాకరించింది. అన్ని దేశాల్లో దినపత్రికలు, మేగజైన్లు, ఇతర వార్తాసంస్థలకు రోజువారీ వార్తలు, కథనాలు అందించే ప్రపంచంలో అతిపెద్ద న్యూస్‌ఏజెన్సీల్లో ఏపీ కూడా ఒకటి. ఇంతటి కీలకమైన బాధ్యతలు నిర్వర్తించే తమ ప్రతినిధులను అధ్యక్షభవనం వంటి ముఖ్యమైన చోటుకు రానివ్వకపోవడంపై ‘ఏపీ’తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఇది వార్తాస్వేచ్ఛను అడ్డుకోవడమేనని వ్యాఖ్యానించింది. దీనిపై ట్రంప్ ప్రభుత్వం స్పందించింది. ‘‘అధ్యక్షుని నిర్ణయాన్ని బేఖాతరు చేయడమంటే వార్తల్లో విభజన తెచ్చే సాహసం చేయడమే. పైగా తప్పుడు విషయాన్ని అందరికీ చేరవేయడమే. అధ్యక్షుని నిర్ణయానికి గౌరవం ఇవ్వని వ్యక్తులకు వైట్‌హౌస్‌లో, ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో తగు స్థానం లేదు. ఆ స్థానాన్ని ఇన్నాళ్లూ వైట్‌హౌస్‌లోకి రాలేక రిపోర్టింగ్ చేయలేకపోయినా ఇతర మీడియా ప్రతినిధులకు కల్పిస్తాం’’అని వైట్‌హౌస్ డెప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ టేలర్ బుడోవిచ్ వాదించారు. దీనిపై ఏపీ మళ్లీ స్పందించింది. ‘‘అమెరికన్ వినియోగదారులను మినహాయిస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా వినియోగదారులకు ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’అనే పేరు వాస్తవం. ఆ దృక్కోణంలో పాత పేరుకే కట్టుబడి ఉన్నాం. ఈ విషయంలో అధ్యక్షుడు కార్యనిర్వాహక ఉత్తర్వును ధిక్కరించినట్లుగా భావించకూడదు’’అని ఏపీ స్పష్టంచేసింది. దశాబ్దాలుగా పూల్ రిపోర్టర్‌గా.. ప్రముఖ మీడియా సంస్థల కొద్దిపాటి మీడియా ప్రతినిధులు, కెమెరామెన్లకు మాత్రమే వైట్‌హౌస్, ఎయిర్‌ఫోర్స్ వన్ వంటి కీలక ప్రదేశాల్లోకి అనుమతిస్తారు. ఇది దశాబ్దాలుగా కొనసాగుతోంది. నాటి అమెరికా అధ్యక్షుడు జేమ్స్ ఏ గార్ఫీల్డ్ హత్యోదంతం తర్వాత కొద్దిమంది మీడియా వాళ్లనే అనుమతించడం మొదలెట్టారు. ఇది 1881 ఏడాదినుంచి మొదలైంది. ఈ మీడియా బృంద సభ్యులను పూల్ రిపోర్టర్ అంటారు. ‘ఏపీ’ప్రతినిధి చాన్నాళ్లుగా ఇలా పూల్ రిపోర్టర్‌గా కొనసాగుతున్నారు. తమను లోపలికి అనుమతించకపోవడం పూర్తి వివక్షాపూరిత నిర్ణయం అని ఏపీ ప్రతినిధి ఒకరు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేయాలని ‘ఏపీ’భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్క ఏపీనే బయటకు గెంటేయడంపై వైట్‌హౌస్‌లోని ‘ది వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్(డబ్ల్యూహెచ్‌సీఏ)’తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ‘‘ప్రస్తుతానికైతే ఏపీకి బదులు రొటేషన్‌లో భాగంగా వేరే ప్రతినిధికి అవకాశం కల్పిస్తాం. సాధారణంగా ప్రతి రోజూ రొటేషన్‌లో ఏపీకి అవకాశం ఉంటుంది. కానీ ఇలా ఏకపక్షంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అమెరికా రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే. భావప్రకటనా స్వేచ్ఛకు భంగం వాటిల్లజేస్తూ ప్రభుత్వం సెన్సార్‌షిప్‌కు తెరలేపుతోంది’’అని డబ్ల్యూహెచ్‌సీఏ ఒక ప్రకటనలో తెలిపింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
డాలర్‌తో గేమ్స్ ఆడితే 100% సుంకాలు!
వాషింగ్టన్: భారత్‌తో పాటు బ్రిక్స్ కూటమిలోని ఇతర సభ్య దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఘాటు హెచ్చరికలు చేశారు. డాలర్‌తో ఆటలాడాలని చూస్తే వాటిపై వంద శాతం టారిఫ్ విధిస్తామని పునరుద్ఘాటించారు. డాలర్‌ను వేరే కరెన్సీతో భర్తీ చేయాలని చూస్తే బ్రిక్స్ దేశాలతో అమెరికా ఇకపై ఎలాంటి వర్తక లావాదేవీలూ జరపబోదని స్పష్టం చేశారు. గురువారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీకి రెండు గంటల ముందే ట్రంప్ ఈ మేరకు సంచలన ప్రకటన చేశారు. తాను తొలిసారి 100 శాతం టారిఫ్‌ల హెచ్చరికలు చేసినప్పుడే బ్రిక్స్ మృతప్రాయ కూటమిగా మిగిలిపోయిందని చెప్పుకొచ్చారు! దాని ఏర్పాటులోనే దురుద్దేశం దాగుందని ట్రంప్ ఆరోపించారు. ‘‘బ్రిక్స్ కూటమి కొనసాగాలని దాని సభ్య దేశాలే కోరుకోవడం లేదు. బ్రిక్స్ గురించి మాట్లాడేందుకు కూడా భయపడుతున్నాయి’’అని చెప్పుకొచ్చారు. ఎందుకంటే, ‘‘డాలర్‌తో గేమ్స్ ఆడొద్దు. అలా చేస్తే మీపై 100 శాతం టారిఫ్‌లు తప్పవు. అప్పుడు మీరే అలా చేయొద్దంటూ వేడుకుంటారు’’అని హెచ్చరించానన్నారు. బ్రిక్స్ కూటమిని రూపుమాపాలనుకుంటున్నారా, లేక అందులో భాగం కావాలని భావిస్తున్నారా అన్న విలేకరుల ప్రశ్నకు బదులుగా ట్రంప్ ఈ మేరకు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాని విషయంలో గత అధ్యక్షులు జో బైడెన్, బరాక్ ఒబామా ఇలా కఠినంగా వ్యవహరించలేకపోయారని ఆక్షేపించారు. బ్రిక్స్ కూటమిలో భారత్‌తో పాటు రష్యా, చైనా, బ్రెజిల్, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండొనేసియా, ఇరాన్ సభ్య దేశాలు. బ్రిక్స్‌పై 100 శాతం టారిఫ్‌లు తప్పవని ట్రంప్ రెండోసారి అధికారంలోకి రాకముందు నుంచీ హెచ్చరిస్తూ వస్తున్నారు. బ్రిక్స్ దేశాలు డాలర్‌కు బదులుగా తమ సొంత కరెన్సీల్లోనే లావాదేవీలు నెరపాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2023లో బ్రిక్స్ శిఖరాగ్రంలో ప్రతిపాదించారు. మరుసటేడాది బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రుల భేటీ కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చింది. -
మోదీకి స్పెషల్ గిఫ్ట్
ప్రధాని మోదీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అపూర్వ కానుకతో ఆశ్చర్యపరిచారు. ‘అవర్ జర్నీ టుగెదర్’ పేరుతో సంతకం చేసిన కాఫీ టేబుల్ పుస్తకాన్ని గురువారం వైట్‌హౌస్‌లో భేటీ సందర్భంగా ఆయనకు అందజేశారు. దాని కవర్ ఫొటోలో ట్రంప్ ఎయిర్‌ఫోర్స్ వన్ నుంచి దిగుతూ అభివాదం చేస్తూ కన్పిస్తున్నారు. కానుకను మోదీకి అందిస్తూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్! మీరు గ్రేట్’ అంటూ పొగడ్తల్లో ముంచెత్తారు. 320 పేజీల ఈ పుస్తకంలో ట్రంప్ తొలి పదవీకాలంలో 2016–2020 మధ్య ఇరు నేతలు పాల్గొన్న కీలక ఘట్టాలకు సంబంధించిన ఫొటోలున్నాయి. 2020లో ట్రంప్ భారత పర్యటన ‘హలో ట్రంప్’తో పాటు అంతకుముందు అమెరికాలో జరిగిన ‘హౌడీ మోదీ’ తదితర కార్యక్రమాల ఫొటోలను పొందుపరిచారు. భార్య మెలానియాతో కలిసి తాజ్‌మహల్ దగ్గర తీసుకున్న ట్రంప్ ఫొటో కూడా ఉంది. ఆయన పదవీకాలపు మధుర ఘట్టాలన్నింటినీ పొందుపరిచారు. సరిహద్దు గోడ నిర్మాణంలో ట్రంప్ చొరవ, స్పేస్ ఫోర్స్ ఏర్పాటు, జిన్‌పింగ్, పుతిన్, కిమ్ జోంగ్ ఉన్ వంటి దేశాధినేతలతో ఉన్నత స్థాయి భేటీల వంటి ఘటనలకు సంబంధించి ఎంపిక చేసిన ఫొటోలను పుస్తకాన్ని తయారు చేశారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటన తనకు గొప్ప గౌరవ మని ట్రంప్ మీడియాతో అన్నారు. ‘‘చిరకాలంగా ఆయన నాకు మంచి మిత్రుడు. మా మధ్య అద్భుతమైన బంధముంది. నా నాలుగేళ్ల తొలి పదవీకాలంలో ఆ బంధాన్ని చక్కగా కొనసాగించాం’’ అన్నారు. మోదీ కూడా ట్రంప్ నాయ కత్వాన్ని ప్రశంసించారు. ‘‘నేనెంతో ఇష్టపడే నాయకుడు ట్రంప్. జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్య మివ్వడం ఆయన నుంచి నేర్చుకున్న ప్రధాన విషయం’’ అని చెప్పారు. -
ఆ విషయంలో మోదీనే గ్రేట్.. నేను పోటీ పడలేను: ట్రంప్
వాషింగ్టన్: అమెరికాలో భారత ప్రధాని నరేంద్ర మోదీకి దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చారు. అనంతరం, దేశాధినేతలిద్దరూ సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. మోదీ తన కంటే కఠినమైన సంధానకర్త అని ట్రంప్ చెప్పుకొచ్చారు.భారత ప్రధాని మోదీతో ట్రంప్ భేటీ అనంతరం విలేకరులు పలు ప్రశ్నలు సంధించారు. ఈ క్రమంలో మీ ఇద్దరిలో ఎవరు మంచి సంధానకర్త అని ఓ విలేకరి ప్రశ్నించగా.. దీనికి ట్రంప్ సమాధానం ఇచ్చారు. ట్రంప్ స్పందిస్తూ.. మోదీ నా కంటే కఠినమైన సంధానకర్త. చర్చల్లో కఠినంగా వ్యవహరిస్తారు. ఆ విషయంలో మోదీతో నేను పోటీ పడలేను. మోదీనే గ్రేట్ అంటూ బదిలిచ్చారు. ట్రంప్ సమాధానంతో మోదీ సైతం ఆనందం వ్యక్తం చేశారు.మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఇద్దరి మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు సాగాయి. ఇరు దేశాల పరస్పర వాణిజ్య, రక్షణబంధం బలోపేతానికి కట్టుబడి ఉన్నట్లు దేశాధినేతలు తెలిపారు. అమెరికా పర్యటనను ముగించుకొని ప్రధాని మోదీ కొన్ని గంటల క్రితమే భారత్‌కు తిరుగు పయనం అయ్యారు.#WATCH | Washington, DC: US President Donald Trump says, "He (PM Narendra Modi) is a much tougher negotiator than me and he is a much better negotiator than me. There is not even a contest."(Video: ANI/DD) pic.twitter.com/V8EzU0FfE9— ANI (@ANI) February 13, 2025మోదీకి ట్రంప్ బహుమతి..మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఆయనకు ట్రంప్ ఓ బహుమతి అందజేశారు. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చోటుచేసుకున్న కీలక సందర్భాలు, ప్రధాన ఈవెంట్లతో కూడిన ఫొటోబుక్‌ను ఇచ్చారు. ఇందులో ప్రధాని మోదీ 2019 నాటి అమెరికా పర్యటనలో నిర్వహించిన ‘హౌడీ మోదీ’, ఆ తర్వాత 2020లో ట్రంప్ భారత్‌కు విచ్చేసినప్పుడు ఏర్పాటుచేసిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు కూడా ఉన్నాయి. ఈ పుస్తకంపై ‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, యూ ఆర్ గ్రేట్’ అని రాసి ట్రంప్ సంతకం చేశారు. అనంతరం పుస్తకంలోని పేజీలను తిప్పుతూ వీరిద్దరూ ఉన్న ఫొటోలను మోదీకి ఆయన చూపించారు. BIG NEWS 🚨 World's most powerful leader Donald Trump pulls chair for Indian PM Narendra Modi. Extraordinary Moment.US President Donald Trump gifts a signed copy of his book 'Our Journey Together' to PM Narendra Modi.The book features pictures from 'Howdy Modi', 'Namaste… pic.twitter.com/tMA3fHWFZ5— Times Algebra (@TimesAlgebraIND) February 14, 2025 President Trump gifts Prime Minister Modi his book, Our Journey Together, and shows the photo of his 2020 visit to the Taj Mahal 🇺🇸🇮🇳 pic.twitter.com/MYhPyX0LZD— Margo Martin (@MargoMartin47) February 13, 2025 US President Donald Trump gifted PM Narendra Modi the book ‘Our Journey Together’ when they met at the White House in Washington DC, on 13th February. Showed him several photos from 'Howdy Modi' and 'Namaste Trump' events, which are a part of the book pic.twitter.com/GgRy6C85NH— ANI (@ANI) February 14, 2025 Trump pulled a chair for PM Modi; it's a not an ordinary thing!!That's the Power of Bharat 🔥 pic.twitter.com/u4cG0SUdD7— BALA (@erbmjha) February 14, 2025 -
ట్రంప్ బృందంలో పాల్ కపూర్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికార బృందంలో మరో భారత సంతతి వ్యక్తికి చోటు లభించింది. అమెరికా దక్షిణాసియా వ్యవహారాల సహాయ కార్యదర్శిగా ఎస్.పాల్ కపూర్‌ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికా సెనేట్ పరిశీలించి ధ్రువీకరిస్తే ప్రస్తుత సహాయ కార్యదర్శి అయిన డొనాల్డ్ లూ స్థానంలో పాల్కపూర్ బాధ్యతలు చేపడతారు. ఆ తర్వాత భారత్ సహా దక్షిణాసియా ప్రాంతంలో అమెరికా దౌత్య సంబంధాల్లో కపూర్ కీలక పాత్ర పోషించనున్నారు. కపూర్ ప్రస్తుతం నేవల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కూల్లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. 2020 నుంచి 2021 వరకు స్టేట్ డిపార్ట్మెంట్ పాలసీ ప్లానింగ్ సిబ్బందిగా పనిచేశారు. దక్షిణ, మధ్య ఆసియా, ఇండో–పసిఫిక్ , అమెరికా–ఇండియా సంబంధాలకు సంబంధించిన సమస్యలపై పనిచేశారు. అంతకుముందు కపూర్ క్లేర్మోంట్ మెకెనా కళాశాలలో బోధించారు. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా సేవలందించారు. ఆయన ‘జిహాద్ యాజ్ గ్రాండ్ స్ట్రాటజీ: ఇస్లామిక్ మిలిటెన్సీ’, ‘నేషనల్ సెక్యూరిటీ అండ్ ది పాకిస్తానీ స్టేట్’, ‘దక్షిణాసియాలో సంఘర్షణ’తదితర పుస్తకాలు రచించారు. ‘ఇండియా, పాకిస్తాన్ అండ్ ది బాంబ్: డిబేటింగ్ న్యూక్లియర్ స్టెబిలిటీ ఇన్ సౌత్ ఏషియా’అనే పుస్తకానికి సహ రచయితగా వ్యవహరించారు. ‘ది ఛాలెంజెస్ ఆఫ్ న్యూక్లియర్ సెక్యూరిటీ: యూఎస్ అండ్ ఇండియన్ పర్సె్పక్టివ్స్’కు సహ సంపాదకత్వం వహించారు. -
సమానంగా వడ్డిస్తాం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం కీలక నిర్ణయం తీసుకొన్నారు. దిగుమతి సుంకాలకు సంబంధించి.. ఆయా దేశాలపై వారితో సమానంగా టారిఫ్‌లు విధించే ఉత్తర్వులపై సంతకం చేశారు. అమెరికా ఉత్పత్తులపై వివిధ దేశాలు ఎంతమొత్తంలో దిగుమతి సుంకాలు విధిస్తున్నాయో.. అంతే మొత్తంలో ఆయా దేశాల ఎగుమతులపై తాము దిగుమతి సుంకాలు విధిస్తామని స్పష్టం చేశారు. ట్రంప్ నిర్ణయం.. అమెరికాతో అంతర్జాతీయ వాణిజ్యంపై తీవ్ర ప్రభావాన్నే చూపనుంది. భారత్‌పైనా దీని ప్రభావం తీవ్రంగానే ఉండే అవకాశాలున్నాయి. ‘ఈ రోజు ఎంతో ముఖ్యమైనది. వారితో సమానంగా వడ్డించే సమయం వచ్చింది’ అని ట్రంప్ అంతకుముందు తన సొంత సోషల్‌మీడియా సంస్థ ‘ట్రూత్ సోషల్’లో గురువారం పేర్కొన్నారు. అమెరికాకు ఎగుమతులు చేసే దేశాలకు ట్రంప్ తాజా నిర్ణయం మింగుడుపడనిదే. భారీగా సుంకాలు విధిస్తే.. మార్కెట్లో ధరలు పెంచాల్సి ఉంటుంది. అప్పుడు ఇతర దేశాల ఉత్పత్తులతో పోటీపడే విషయంలో కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొంటాయి. -
మస్క్... ట్రంప్‌కు కోటి డాలర్లు ఎందుకు ఇస్తానన్నాడు?
వాషింగ్టన్: అమెరికాలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. గతంలో ఎక్స్(ట్విట్టర్)పై ట్రంప్ దావా వేసిన కారణంగా తాజాగా ఎలాన్ మస్క్ ఆయనకు దాదాపు 10 మిలియన్ డాలర్లు చెల్లించడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. 2021లో యూఎస్ క్యాపిటల్ భవనంపై దాడి అనంతరం ట్రంప్ ఈ దావా వేశారు.వివరాల ప్రకారం.. 2020లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ (Donald Trump) పరాజయం పాలయ్యారు. తర్వాత 2021 జనవరి 6న అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ (Joe Biden) విజయాన్ని ధ్రువీకరించేందుకు వాషింగ్టన్ క్యాపిటల్ భవనంలో కాంగ్రెస్ సమావేశమైంది. అయితే ఆ సమావేశం జరగడానికి కొన్ని గంటల ముందు ట్రంప్ తన మద్దతుదారులను ఉద్దేశిస్తూ ప్రసంగించారు. అనంతరం ట్రంప్ మద్దతుదారులు వేలాదిగా క్యాపిటల్ భవనంలోకి చొచ్చుకెళ్లి విధ్వంసం సృష్టించారు. ఈ క్రమంలో అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని, బైడెన్ విజయాన్ని ధ్రువీకరించకుండా కాంగ్రెస్‌ను ఆపేందుకే క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు దాడికి పాల్పడ్డారని వాషింగ్టన్ ఫెడరల్ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి. ఆ ఛార్జ్‌షీట్‌లో ట్రంప్ పేరు కూడా ఉంది.ఈ నేపథ్యంలో ట్రంప్ సోషల్ మీడియా అకౌంట్స్‌ను ఎక్స్(ట్విట్టర్), ఫేస్బుక్.. ట్రంప్ అకౌంట్స్‌ను సస్పెండ్ చేసింది. దీంతో, వారి చర్యలను ఆయా సంస్థలపై ట్రంప్ దావా వేశారు. ఈ దావాను పరిష్కరించుకునేందుకు 25 మిలియన్ డాలర్లు చెల్లిస్తామని గత నెలలో మెటా ప్రకటించింది. ఇక, తాజాగా మస్క్(Elon Musk) కూడా ట్రంప్‌కు 10 మిలియన్ డాలర్లు చెల్లించడానికి సిద్ధమైనట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ చెప్పుకొచ్చింది.*Elon Musk’s company X settles Trump lawsuit over account suspension*• Social media company X has agreed to pay about $10 million to settle a lawsuit by President Donald Trump, The Wall Street Journal reported.• Elon Musk, X’s billionaire owner, is overseeing DOGE, pic.twitter.com/nw7n2HbUwF— AS ♠️🍌✡︎🪬חי🎗️🤟🫶🧡👑❰̶̶͟͞🍓꙰꙰❱̶𖠧̙̞͢▹͍►͍👑 (@AdelBadel7) February 13, 2025ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. యూఎస్ క్యాపిటల్‌పై దాడి చేసిన తన మద్దతుదారులకు ఉపశమనం కల్పించారు. ఈమేరకు ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. ఈ ఘటనలో దాదాపు 1500 మందికి ట్రంప్ క్షమాభిక్ష కల్పించారు. వారిపై పెండింగ్‌లో ఉన్న కేసులు కొట్టివేయాలని అటార్నీ జర్నల్‌కు ఆదేశాలు జారీ చేశారు. -
పాలస్తీనియన్లకు ఆశ్రయం కోసం జోర్డాన్‌పై ట్రంప్ ఒత్తిడి
వాషింగ్టన్: గాజా స్ట్రిప్ స్వాదీనం ప్రణాళికలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరింత వేగవంతం చేశారు. గాజా స్ట్రిప్ నుంచి పంపేయడంతో శాశ్వతంగా నిర్వాసితులయ్యే పాలస్తీనియన్లకు మీ దేశంలో ఆశ్రయం కల్పించాలని జోర్డాన్ రాజు అబ్దుల్లాపై ట్రంప్ ఒత్తిడి పెంచారు. మంగళవారం శ్వేతసౌధంలో అబ్దుల్లాతో ట్రంప్ సమావేశమై ఈ అంశంపై చర్చించారు. నివాసితు లను తరలించడంతోపాటు యుద్ధంతో దెబ్బతిన్న గాజాను పశ్చిమాసియాలో అత్యద్భుతమైన పర్యాటక ప్రదేశంగా మార్చాలన్న తన ఆలోచనను వదలుకోబోనని ట్రంప్ సంకేతం ఇచ్చారు. గాజాను కొనడం లేదని, ఏకంగా స్వా«దీనం చేసుకుంటున్నామని ట్రంప్ స్పష్టం చేశారు. ‘‘గాజా స్ట్రిప్‌ను తీసుకుంటాం. పశి్చమాసియాలో ప్రజలకు చాలా ఉద్యోగాలు కల్పించబోతున్నాం’’అని ట్రంప్ పేర్కొన్నారు. గాజా నిర్వాసితులకు ఆశ్రయం కల్పించడానికి జోర్డాన్, ఈజిప్ట్ లు అంగీకరిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. ‘‘జోర్డాన్‌లో మాకు కొంత భూమి ఉంటుందని నేను నమ్ముతున్నాను. చర్చలు పూర్తయిన అనంతరం పాలస్తీనియన్లు సంతోషంగా, సురక్షితంగా జీవించడానికి చోటు లభిస్తుందని అనుకుంటున్నా’’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆర్థిక, సైనిక సహాయం కోసం అమెరికాపై జోర్డాన్, ఈజిప్ట్ ఆధారపడటమే ట్రంప్ అంత బలంగా చెప్పడానికి కారణం. అయితే... జోర్డాన్‌కు సహాయాన్ని నిలిపివేసే అంశాన్ని పరిశీలిస్తామన్న ట్రంప్ అన్నారు. మద్దతు ఇస్తున్నామన్న వంకతో ఈ దేశాలను బెదిరించాలని భావించట్లేమని చెప్పారు. ‘‘మేము జోర్డాన్‌కు, ఈజిప్టుకు సహాయాన్ని అందిస్తాం. ఆ సాకుతో బెదిరించాల్సిన అవసరం లేదు. మేం అలాంటి భావజాలానికి అతీతులం అనే అనుకుంటున్నాం’’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే పాలస్తీనియన్లను తమ భూభాగంలోకి తరలించే ప్రక్రియకు రాజు అబ్దుల్లా సుముఖంగా ఉన్నట్లు కనిపించలేదు. ట్రంప్ ప్రణాళికను సమరి్థంచకుండా, వ్యతిరేకించకుండా అసౌకర్యంగా కనిపించారు. తన దేశానికి ఏది మంచిదో అది చేస్తానని అబ్దుల్లా అన్నారు. గాజాలో అనారోగ్యంతో బాధపడుతున్న 2,000 మంది చిన్నారులను మాత్రం చికిత్సచేయించేందుకు జోర్డాన్‌కు తీసుకెళ్తామని రాజు చెప్పారు. రాజు నిర్ణయంపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. పాలస్తీనియన్లను నిర్వాసితులను చేసే ప్రయత్నాలను తాను వ్యతిరేకినని రాజు అబ్దుల్లా గతంలోనూ వ్యాఖ్యానించారు. ‘‘ఇది ఏకీకృత అరబ్ వైఖరి’’అని తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. ‘‘పాలస్తీనియన్లను ఇంకెక్కడికీ పంపేయకుండానే గాజా స్ట్రిప్‌ను పునర్ నిర్మించాలి. అందరికీ ప్రాధాన్యత ఇవ్వాలి’’అని ఆయన అన్నారు. గాజా అంశంలో అమెరికా కొత్త అధ్యక్షుడు తన ప్రణాళికలను వెల్లడించాక అగ్రరాజ్య అధ్యక్షుడితో భేటీ అయిన తొలి అరబ్ నేత అబ్దుల్లా కావడం గమనార్హం. ఇరువురు నాయకులు ఇతరత్రా అంశాల్లో ఒకరికొకరు స్నేహపూర్వకంగా మెలిగారు. అయితే గాజా గురించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు రాజు అబ్దుల్లాను ఇబ్బందికర స్థితిలోకి నెట్టాయి. డోలాయమానంలో కాల్పుల విరమణ ట్రంప్ గాజా ప్రతిపాదన ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపులో కొత్త సమస్యను తీసుకొచ్చింది. గాజాపై దాడులను నిలిపివేసే ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తోందని, తదుపరి నోటీసు వచ్చే వరకు బందీలను విడుదల చేయడం నిలిపివేస్తున్నట్లు హమాస్ సోమవారం తెలిపింది. బందీలందరినీ శనివారం మధ్యాహ్నంలోగా విడుదల చేయకపోతే మీ అంతు చూస్తానని ఇప్పటికే ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో హమాస్ ఏ విధంగా స్పందిస్తుంది, దానికి ఇజ్రాయెల్ ప్రతిస్పందన ఎలా ఉంటుంది?. అప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం భవిష్యత్తు ఏమిటనే అంశాలు ప్రశ్నార్థకంగా మారాయి. సర్వత్రా వ్యతిరేకత గాజా స్వా«దీనం, పాలస్తీనియన్లను తిరిగి గాజాకు అనుమతించబోమంటూ ట్రంప్ చేసిన ప్రకటనపై అరబ్ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గాజాను స్వా«దీనం చేసుకుంటామన్న ట్రంప్ వ్యాఖ్యలపై స్పందన కోరుతూ ఫిబ్రవరి 7 నుంచి 9 తేదీలలో రాయిటర్స్/ఇప్సోస్ అమెరికాలో ఒక సర్వే నిర్వహించింది. గాజాను అమెరికా స్వా«దీనం చేసుకుని అక్కడ నివసిస్తున్న పాలస్తీనియన్లను తరలించే ఆలోచనను తాము వ్యతిరేకిస్తున్నామని ప్రతి నలుగురు అమెరికన్లలో ముగ్గురు చెప్పారు. అంటే.. 74 శాతం మంది అమెరికన్ల అభిప్రాయం ఇదే. ఈ అంశంపై రిపబ్లికన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. గాజా స్వా«దీన ప్రకటనను 55 శాతం మంది రిపబ్లికన్లు వ్యతిరేకించారు. 43 శాతం మంది మాత్రమే మద్దతు తెలిపారు. -
ట్రంప్ ‘ఉక్కు’ పాదం..!
న్యూఢిల్లీ: అన్ని రకాల ఉక్కు, అల్యుమినియం దిగుమతులపై పాతిక శాతం టారిఫ్‌లు వడ్డించాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యోచన భారత పరిశ్రమలను కలవరపరుస్తోంది. దీనితో బిలియన్ డాలర్ల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం భారత్ ఉక్కు ఎగుమతుల్లో అమెరికా వాటా సుమారు అయిదు శాతం లోపు ఉంటోంది. అయినప్పటికీ భారతీయ ఉక్కు ఎగుమతిదార్లు తమ ఉత్పత్తులను ఎగుమతి చేయడంలో కొంత సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉందని మూడీస్ రేటింగ్స్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ హుయ్ తింగ్ సిమ్ తెలిపారు. అమెరికా టారిఫ్‌ల దెబ్బతో మిగతా దేశాల్లో సరఫరా పెరిగిపోయి, భారత్ ఎగుమతులకు ప్రతికూలం కావచ్చని పేర్కొన్నారు. గత పన్నెండు నెలలుగా భారీ స్థాయిలో ఉక్కు దిగుమతులతో ధరలు, ఆదాయాలు పడిపోయి దేశీ ఉత్పత్తి సంస్థలు ఇప్పటికే సతమతమవుతున్నట్లు వివరించారు. ఇదే సమయంలో టారిఫ్‌ల వల్ల అమెరికాలోని ఉక్కు ఉత్పత్తి సంస్థలకు ప్రయోజనం చేకూరుతుందని సిమ్ చెప్పారు. అక్కడ దేశీయంగా ఉక్కుకు డిమాండ్ పెరిగి, ధరలూ పెంచుకునే అవకాశం లభిస్తుందన్నారు. సుంకాల విధింపుతో అమెరికాకు ఉక్కు ఎగుమతులు 85 శాతం మేర తగ్గిపోవచ్చని ఇండియన్ స్టీల్ అసోసియేషన్ (ఐఎస్ఏ) ప్రెసిడెంట్ నవీన్ జిందాల్ తెలిపారు. ఇలా మిగిలిపోయేదంతా, ప్రస్తుతం వాణిజ్యపరమైన ఆంక్షలు లేని అతి పెద్ద మార్కెట్లలో ఒకటైన భారత మార్కెట్లోకి వెల్లువెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, అల్యూమినియం పరిశ్రమపై ప్రభావం గట్టిగా పడొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే భారత అల్యుమినియం ఎగుమతుల్లో అమెరికా వాటా దాదాపు 12 శాతం ఉంటుంది. గతేడాది నవంబర్ నాటికి 777 మిలియన్ డాలర్ల అల్యూమినియం ఎగుమతులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఉక్కు పరిశ్రమతో పోలిస్తే అల్యుమినియం రంగంపై టారిఫ్‌ల ఎఫెక్ట్ ఎక్కువగా ఉండనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ట్రంప్‌తో నిర్వహించబోయే సమావేశంలో టారిఫ్‌ల అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2018 వ్యూహం.. ట్రంప్ 2018 వ్యూహాన్నే మళ్లీ అమలు చేస్తే వాణిజ్యానికి సంబంధించి బేరసారాలు ఆడేందుకు దీన్ని ఉపయోగించుకునే అవకాశం ఉందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ చెప్పారు. 2018లోనూ ట్రంప్ ఇలాంటి నిర్ణయమే తీసుకున్నా, అప్పట్లో మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌పై పెద్దగా ప్రభావం పడలేదు. ప్రతిగా 2019లో 28 అమెరికన్ ఉత్పత్తుల దిగుమతులపై భారత్ కూడా అదనపు సుంకాలు విధించింది. 2023లో భారత్ నుంచి ఉక్కు, అల్యుమినియం దిగుమతులపై అమెరికా టారిఫ్‌లు తొలగించింది. తాజాగా టారిఫ్‌ల పెంపు అనేది అమెరికాకు అత్యధికంగా ఎగుమతి చేసే జపాన్, యూరప్ దేశాలు, కెనడా, మెక్సికోపై ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉన్నప్పటికీ సరఫరా పెరిగిపోయి, ధరలు పడిపోవడం వల్ల భారత్‌కి కూడా కాస్త ప్రతికూలంగానే ఉండొచ్చని విశ్లేషకులు తెలిపారు. ఆందోళన చెందనక్కర్లేదు: ఉక్కు శాఖఅమెరికాకు భారత్ ఉక్కు ఎగుమతులు అంతగా లేవు కాబట్టి టారిఫ్‌ల గురించి దేశీ పరిశ్రమ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి సందీప్ పౌండ్రిక్ తెలిపారు. ‘గతేడాది మనం 14.5 కోట్ల టన్నుల ఉక్కును ఉత్పత్తి చేస్తే అందులో అమెరికాకు ఎగుమతి చేసింది చాలా తక్కువే. కాబట్టి, టారిఫ్‌ల పెంపు పెద్ద సమస్య కాబోదు‘ అని ఆయన చెప్పారు. దేశీయంగా ఉక్కు వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో, రాబోయే రోజుల్లో డిమాండ్‌కి తగ్గట్లుగా పరిశ్రమ సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడవచ్చని వివరించారు. -
వేధిస్తాడు.. మొరటోడు
వాషింగ్టన్: అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా విధానాలను ప్రముఖ హాలీవుడ్ నటుడు రిచర్డ్ గెరె తీవ్రంగా తప్పుబట్టారు. ఇటీవల స్పెయిన్‌లో ‘గోయా’అవార్డ్‌ల ప్రదానోత్సవంలో రిచర్డ్‌కు జీవితకాల సాఫల్యత పురస్కారం దక్కింది. ఈ సందర్భంగా రిచర్డ్ మాట్లాడుతూ ట్రంప్ విధాన నిర్ణయాలు, ట్రంప్ చుట్టూ ఉన్న నేతాగణాన్ని ప్రస్తావించారు. గిరిజనులు అడవుల్లో గిరిజనేతరుల ఆధిపత్యాన్ని కోరుకోరు అనే అర్థంలో మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడో అనాలోచిత ట్రైబలిజం అమెరికాలో మొదలవుతోంది. ఇతరులతో పోలిస్తే మేం ప్రత్యేకం అన్న ధోరణి పెరుగుతోంది. అలాంటి ఆలోచనలను తుంచేయాల్సిన ప్రజాప్రతినిధులే ఈ ఆలోచనలకు అంటుకట్టడం విషాదకరం. ఇప్పుడు అమెరికాలో చీకటిరోజులు మొదలయ్యాయి. అందర్నీ అవహేళన చేస్తూ వేధించే మొరటు మనిషి ట్రంప్ ఏలుబడిలో ఉన్నాం. ఈయన విషయంలో ఒక్క అమెరికాలో మాత్రమే కాదు యావత్ ప్రపంచదేశాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన తరుణమిది. అధికారం, పెట్టుబడిదారుల సంకర వివాహమిది. బాధ్యతారాహిత్యంతో ప్రభుత్వ ఖజానానే దోచేసే బడా పారిశ్రామికవేత్తలు, సంపన్నులు కొలువైన ప్రభుత్వమిది. ఇది మానవళికే ప్రమాదకరం. ఇతరుల పట్ల దయ లేని పరిణతి సాధించని సంపన్న మూకలు ట్రంప్ చుట్టూ చేరారు. ఇలాంటి వ్యక్తుల కలయిక ఎంతో వినాశకరం’’అని రిచర్డ్ ఆందోళన వ్యక్తంచేశారు. అమెరికాలో ఉండే రిచర్డ్ ఇటీవలే తన భార్య అలెజాండ్రా సిల్వాతో కలిసి స్పెయిన్‌కు మకాం మార్చారు. -
ప్రెసిడెంట్ ఎలాన్ మస్క్!
వాషింగ్టన్: చరిత్రాత్మక కవర్ పేజీలకు పెట్టింది పేరైన టైమ్ మేగజైన్ ‘ప్రెసిడెంట్ ఎలాన్ మస్క్’ అంటూ తాజాగా వ్యంగాత్మక కవర్ పేజీ కథనం ప్రచురించింది. అందులో టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ వైట్‌హౌస్‌లోని ఓవల్ కార్యాలయంలోని ప్రెసిడెంట్ స్థానంలో కూర్చుని కని్పస్తున్నారు. ఎరుపు బ్యాక్‌గ్రౌండ్ ముఖచిత్రంలో చేతిలో కాఫీ కప్పు పట్టుకొని ఉన్నారు. జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఫెడరల్ ప్రభుత్వాన్ని సమూలంగా మార్చేందుకు మస్క్ ప్రయతి్నస్తుండటం తెలిసిందే. ఆ క్రమంలో ఆయనే అధ్యక్షుడిలా వ్యవహరిస్తున్నానే అర్థంలో టైమ్ ఇలా కవర్ పేజీని డిజైన్ చేసింది. అధ్యక్ష సింహాసనం వెనుక ఉన్న అసలైన శక్తి మస్కేనని పరోక్షంగా చెప్పుకొచ్చింది. కవర్ స్టోరీలోనూ ఈ అంశాన్ని గట్టిగానే ఎండగట్టింది. లక్షలాది మంది ప్రభుత్వోద్యోగులు మస్క్ దయపై ఆధారపడి బతకాల్సి వస్తోందని పేర్కొంది. ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్న స్పృహ ఆయనలో కన్పించడం లేదని ఆక్షేపించింది. ‘డోజ్ పనితీరుపై మా పత్రిక వైట్‌హౌస్‌కు కొన్ని ప్రశ్నలు పంపింది. కానీ వాటికి బదులివ్వడానికి వైట్‌హౌస్ నిరాకరిచింది’’ అని కథనంలోనే పేర్కొంది. మస్క్ టైమ్ మేగజైన్‌పై కనిపించడం ఇది రెండోసారి. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆయనను ‘కింగ్ మేకర్’గా అభిర్ణిణస్తూ ఇటీవలే మేగజైన్ ఓ ఫీచర్ రాసింది. టైమ్ తాజా కవర్ పేజీ ఉదంతంపై ట్రంప్‌ను ప్రశ్నించగా, ‘ఆ మేగజైన్ ఇంకా నడుస్తోందా? నాకు తెలియదు’ అంటూ అంతే వ్యంగ్యంగా స్పందించారు. -
మరో ట్రంప్ ఉత్తర్వుకు చుక్కెదురు
వాషింగ్టన్: అధికారంలోకి వచ్చినప్పట్నుంచీ డజన్లకొద్దీ కార్యనిర్వాహక ఉత్తర్వులిస్తూ అన్ని దేశాలను కలవరపరుస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరో న్యాయస్థానం మొట్టికాయ వేసింది. వలస వచ్చిన వాళ్లకు పిల్లలు పుడితే వారికి దక్కే జన్మతః పౌరసత్వ హోదాను రద్దుచేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులు ఇచ్చిన ట్రంప్‌ను ఇప్పుడు అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ(యూఎస్ఎయిడ్) ఉద్యోగుల విషయంలోనూ మరో కోర్టు కట్టడిచేసింది. వేలాది మంది యూఎస్ఎయిడ్ ఉద్యోగులను ఉద్యోగాలు మానేసి 30 రోజుల్లోపు స్వదేశానికి తిరిగొచ్చేయాలని ట్రంప్ ఇచ్చిన ఆదేశాలను వారం రోజులపాటు నిలుపుదల చేస్తున్నట్లు యూఎస్ డిస్ట్రిక్ కోర్ట్ జడ్జి కార్ల్ నిఖోల్స్ శుక్రవారం రాత్రి మధ్యంతర తీర్పు వెలువరిచారు. యూఎస్‌ఎయిడ్‌ను శాశ్వతంగా మూసేస్తానంటూ ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో పోస్ట్ పెట్టిన కొన్ని గంటలకే ఆయన నిర్ణయానికి వ్యతిరేకంగా తాత్కాలిక తీర్పు వెలువడటం విశేషం. విదేశాల్లో యూఎస్ఎయిడ్ ఉద్యోగులు, వారి జీవితభాగస్వాములు, చదువుకుంటున్న వారి పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైన వేళ కోర్టు ఉత్తర్వులతో తాజాగా వారికి భారీ ఊరట లభించింది. అయితే ఈ విభాగానికి నిధులు ఆపేయాలంటూ ట్రంప్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దుచేయాలంటూ ది అమెరికన్ ఫారెన్ సర్విస్ అసోసియేషన్, ది అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంస్థలు చేసిన విజ్ఞప్తిని జడ్జి తిరస్కరించారు. ట్రంప్ ప్రభుత్వం ఆదేశించడంతో యూఎస్ఎయిడ్లో ఇప్పటికే 500 మంది ఉద్యోగులు సెలవులపై వెళ్లగా మరో 2,200 మంది శనివారమే సెలవుపై వెళ్లాల్సి ఉంది. యూఎస్ఎయిడ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో సహాయక, అభివృద్ధి, దాతృత్వకార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రతి ఏటా వందల కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తున్నారు. 2016 గణాంకాల ప్రకారం యూఎస్ఎయిడ్ ప్రభుత్వ విభాగంలో 10,235 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో మూడింట రెండొంతుల మంది విదేశాల్లో పనిచేస్తున్నారు. విదేశాలకు అపరిమిత సాయం అమెరికాకు గుదిబండగా మారిందని, ఉద్యోగుల్లో 90 శాతం మంది తీసేయాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగానే దశలవారీగా చాలా మంది సెలవుల మీదకు స్వదేశానికి తిరిగొచ్చేయాలని ట్రంప్ ప్రభుత్వం హెచ్చరించింది. శాశ్వతంగా తిరిగొస్తున్నందున ప్రయాణఖర్చులు కూడా చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే విధులు నిర్వర్తిస్తున్న దేశంలోనే ఈ సిబ్బంది పిల్లలు చదువుకుంటున్నారు. -
గాజాపై ట్రంప్ కన్ను
వాషింగ్టన్: సంచలనాల ట్రంప్ మరో అంతర్జాతీయ సమాజంపై మరో బాంబు విసిరారు. గాజాను అమెరికా పూర్తిగా స్వా«దీనం చేసుకుంటుందని ప్రకటించారు. ‘‘ఇజ్రాయెల్‌తో యుద్ధంలో శ్మశానసదృశంగా మారిన గాజాను అత్యంత సుందర పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం. ఆర్థికాభివృద్ధి కార్యకలాపాలు చేపడతాం. భారీగా ఆవాస, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం’’ అని అమెరికా అధ్యక్షుడు చెప్పుకొచ్చారు. గాజాలో ఉంటున్న దాదాపు 20 లక్షల మంది పాలస్తీనావాసులు ఆ ప్రాంతాన్ని వీడాల్సిందేనని స్పష్టం చేశారు. వారిని గాజా నుంచి శాశ్వతంగా తరలించి పునరావాసం కల్పిస్తామన్నారు. అయితే, పశ్చిమాసియాలోని పొరుగు దేశాలే వారిని అక్కున చేర్చుకోవాలని తేల్చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ సమక్షంలోనే ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రకటన చేయడం విశేషం. పాలస్తీనావాసులను గాజా నుంచి తరలించేందుకు, ఆ ప్రాంతాన్ని స్వా«దీనం చేసుకునేందుకు అమెరికాకు ఏం అధికారముందని ప్రశ్నించగా తన చర్య గాజా, ఇజ్రాయెల్‌తో పాటు పశ్చిమాసియా అంతటికీ గొప్ప స్థిరత్వాన్ని తెస్తుందని ఆయన బదులిచ్చారు. గాజా స్వా«దీనానికి సైన్యాన్ని రంగంలోకి దించుతారా అని ప్రశ్నించగా, అన్ని అవకాశాలనూ పరిశీలిస్తామని బదులిచ్చారు. ఈ సందర్భంగా నెతన్యాహూ పదేపదే చిరునవ్వులు చిందిస్తూ కన్పించారు. ట్రంప్ ప్రకటనకు పూర్తి మద్దతు తెలిపారు. ‘‘ఈ నిర్ణయం చరిత్రను మార్చేస్తుంది. గాజాకు అద్భుతమైన భవిష్యత్తు అందిస్తుంది. ఇజ్రాయెల్‌కు ముప్పును శాశ్వతంగా తొలగిస్తుంది’’ అని ప్రకటించారు. ట్రంప్ ప్రకటన అంతర్జాతీయంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. పశ్చిమాసియా భౌగోళిక, రాజకీయ పరిస్థితులను అల్లకల్లోలం చేసేలా కనిపిస్తున్న ఈ ప్రతిపాదనను అక్కడి దేశాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. పాలస్తీనా, సౌదీ అరేబియా, ఈజిప్‌్ట, తుర్కియేతో పాటు చైనా, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ కూడా దీన్ని ఖండించాయి. అమెరికాలో విపక్ష నేతలు కూడా ట్రంప్ ప్రకటనను దుయ్యబడుతున్నారు. గాజావాసులకు తమ దేశంలో ఆశ్రయం కల్పించాలన్న ట్రంప్ ప్రతిపాదనను ఈజిప్‌్ట, జోర్డాన్, తుర్కియే తదితర అమెరికా మిత్ర దేశాలన్నీ ఇప్పటికే ముక్త కంఠంతో తిరస్కరించడం తెలిసిందే. గ్రీన్‌లాండ్‌ను, పనామా కాల్వను స్వా«దీనం చేసుకుంటానని, కెనడాను అమెరికాలో కలిపేస్తానని ట్రంప్ ఇప్పటికే పలు వివాదాస్పద ప్రకటనలు చేశారు. అంతర్జాతీయ ప్రాంతంగా గాజా అమెరికా పర్యటనలో ఉన్న నెతన్యాహూతో ట్రంప్ మంగళవారం భేటీ అయ్యారు. అనంతరం సంయుక్త మీడియా సమావేశంలో ఆకస్మికంగా గాజా స్వా«దీన ప్రకటన చేశారు. దీన్ని పశ్చిమాసియా గర్వించదగ్గ విషయంగా అభివరి్ణంచారు. ‘‘పశ్చిమాసియా నమ్మశక్యం కానంత గొప్ప ప్రదేశం. అద్భుతమైన తీర ప్రాంతం. గొప్ప వ్యక్తులతో నిండిన అందమైన ప్రదేశాల్లో ఒకటి. గాజాలో త్వరలో పర్యటిస్తా. ఇజ్రాయెల్ అంటే నాకిష్టం. అక్కడ, సౌదీ అరేబియాలో, పశ్చిమాసియా అంతటా పర్యటిస్తా. గాజాలో ఇప్పుడేమీ మిగల్లేదు. ఆ ప్రాంతమంతా మృత్యువుకు, విధ్వంసానికి చిరునామాగా, నరకకూపంగా మారింది. ప్రతి భవనమూ నేలమట్టమైంది. చిరకాలంగా శప్తభూమిగా ఉన్న గాజాను పూర్తిగా పునరి్నరి్మస్తాం. పేలని బాంబులు, ఆయుధాలను తొలగిస్తాం. ధ్వంసమైన భవనాలను తొలగించి ఆ ప్రాంతాన్నంతా చదును చేస్తాం. అక్కడ అపరిమితమైన ఉద్యోగాలందించేలా అద్భుతమైన ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తాం. గాజావాసుల జీవన స్థితిగతులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తాం. ఏ ఒక్క సమూహానికో కాకుండా అందరికీ అద్భుతమైన ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. పాలస్తీనావాసులతో పాటు ప్రపంచం నలుమూలలకు చెందిన ప్రజలు అక్కడ నివసిస్తారు. లేదంటే ఆ ప్రాంతం వందల ఏళ్లుగా ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఏదైనా డిఫరెంట్‌గా చేయాలి. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలి. అది పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఏదైనా అద్భుతం చేయడానికి మాకు అవకాశముంది’’ అని చెప్పుకొచ్చారు. ‘‘ఇదేమీ అల్లాటప్పగా తీసుకున్న నిర్ణయం కాదు. దీనిపై చాలా ప్రముఖులు, ముఖ్యులతో లోతుగా చర్చించా. వారంతా నా ప్రతిపాదనను అమితంగా ఇష్టపడ్డారు. గాజాను సొంతం చేసుకుని అభివృద్ధి చేసి అపారమైన ఉపాధి అవకాశాలు సృష్టించాలన్న అమెరికా ఆలోచనలను ఇష్టపడుతున్నారు’’ అని చెప్పారు. ‘‘గాజాలో దశాబ్దాలుగా మరణమృదంగం కొనసాగుతోంది. చంపుకోవడాలు లేకుండా ఆనందంగా ఉండగలిగే అందమైన ప్రదేశంలో వారికి శాశ్వతంగా పునరావాసం కల్పించగలిగితే చాలు. మరో దారి లేకే వారు గాజాకు తిరిగి వెళ్తున్నారు. ఎప్పుడు కూలతాయో తెలియని పై కప్పుల కింద బతుకీడుస్తున్నారు. దానికి బదులుగా అందమైన ఇళ్లలో సురక్షితంగా, స్వేచ్ఛగా, శాంతియుతంగా జీవించే అవకాశం వారి ముందుంది. ఆ మేరకు చక్కని పునరావాసం పొందగలరని, ఇప్పుడు వద్దంటున్న దేశాల్లోనే వారికి ఆ సదుపాయం ఏర్పాటు చేయగలనని నమ్ముతున్నా’’ అని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో అనుసరించదగ్గ మార్గం ఇదేనని నెతన్యాహూ అభిప్రాయపడ్డారు. ‘‘హమాస్‌ను నిర్మూలించాలన్న మా లక్ష్యాలను సాధించడానికి ట్రంప్ కొత్త ఆలోచనలతో ముందుకొచ్చారు. ఇది యూదు జాతికి సాయపడుతుంది’’ అని చెప్పారు. ‘‘ఉగ్రవాదానికి కేంద్రబిందువుగా ఉన్న గాజాకు భిన్నమైన భవిష్యత్తును ట్రంప్ కాంక్షిస్తున్నారు. హంతక సంస్థ (హమాస్)ను నిర్మూలిస్తే అక్కడ శాంతి సాధ్యమే’’ అన్నారు. హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుందో లేదో చెప్పలేనన్నారు. బైడెన్ ప్రభుత్వం తమకు పెద్దగా సాయం చేయలేదని నెతన్యాహూ ఆక్షేపించారు. గాజాను వీడబోం: స్థానికులు ట్రంప్ ప్రతిపాదనపై గాజా పౌరులు మండిపడుతున్నారు. ‘‘ఇన్నాళ్లకు కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత సొంత గూటికి తిరిగి వెళ్తున్నాం. మా ఇళ్లను విడిచిపెట్టబోం. గౌరవప్రదమైన జీవితం కోరుకుంటున్నాం. మా నేతలను వీడాలనుకోవడం లేదు’’ అని చెబుతున్నారు. ట్రంప్ ప్రతిపాదన గాజాతో పాటు పరిసర దేశాల్లో మరింత విధ్వంసానికి, ఘర్షణకు కారణమవుతుందని వారంటున్నారు. ట్రంప్ వ్యాఖ్యలను సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. పాలస్తీనా దేశాన్ని ఏర్పాటు చేయకుండా ఇజ్రాయెల్‌తో ఎలాంటి సంబంధాలను కొనసాగించబోమని స్పష్టం చేసింది. గాజన్లు తమ ఇళ్లకు తిరిగి వచ్చి పునరి్నరి్మంచాలని కోరుకుంటున్నారని ఐరాసలో పాలస్తీనా రాయబారి రియాద్ మన్సూర్ అన్నారు. వారి ఆకాంక్షలను గౌరవించాలన్నారు. ట్రంప్‌ది హాస్యాస్పద, అసంబద్ధ ప్రకటన అని హమాస్ దుయ్యబట్టింది. ‘‘ఈ తరహా ఆలోచనలు పశ్చిమాసియాలో మరిన్ని ఘర్షణలకు దారితీస్తాయి. గాజావాసులకు సమీప దేశాల్లో పునరావాసం కల్పించాలన్న ట్రంప్ ప్రతిపాదన మరింత గందరగోళం, ఉద్రిక్తతలకు కారణమవుతుంది. గాజావాసులు దీనికి ఒప్పుకోరు’’ అని హమాస్ అధికారి సమీ అబు స్పష్టం చేశారు.అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగాట్రంప్ గాజా ప్రణాళిక గాజాను పునరి్నర్మించాలంటూ పది రోజుల క్రితమే పిలుపునిచ్చిన ట్రంప్ ఆ విషయమై ఎంత సీరియస్‌గా ఉన్నారో తాజా ప్రకటనతో ప్రపంచానికి తెలిసొచి్చంది. కానీ అంతర్జాతీయ చట్టాలకు పూర్తిగా విరుద్ధమైన ఆయన గాజా ప్రణాళిక పశ్చిమాసియాను అతలాకుతలం చేయడమే గాక ప్రపంచ శాంతికి గొడ్డలిపెట్టుగా మారేలా కనిపిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందం, ఇజ్రాయెల్–హమాస్ పరస్పర బందీల విడుదల ప్రక్రియపైనా ప్రభావం చూపేలా ఉంది. ఒక దేశ జనాభాను బలవంతంగా నిరాశ్రయులను చేయడం అంతర్జాతీయ చట్టం ప్రకారం నిషేధం. ఇజ్రాయెల్ మాత్రం పాలస్తీనియన్లను తరిమేసి గాజాను యూదు స్థావరంగా మార్చుకోవాలని ఆశపడుతోంది. ట్రంప్ ప్రకటన కార్యరూపం దాలిస్తే 20 లక్షల మంది పాలస్తీనావాసులు శాశ్వత శరణార్థులుగా మారిపోతారు. -
మార్కెట్‌కు ట్రంప్ సుంకాల పోటు
ముంబై: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడా, మెక్సికో, చైనాలపై దిగుమతి సుంకాలు పెంచుతూ ఆదేశాలు జారీ చేయడంతో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ అరశాతం నష్టపోయింది. దేశీయ కరెన్సీ రూపాయి భారీ కోత, అధిక వెయిటేజీ రిలయన్స్ (–1.50%), ఎల్అండ్టీ (–4.50%) క్షీణతలూ ప్రతికూల ప్రభావం చూపాయి. సెన్సెక్స్ 319 పాయింట్లు నష్టపోయి 77,186 వద్ద నిలిచింది. దీంతో ఈ సూచీ 5 రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడినట్లైంది. నిఫ్టీ 121 పాయింట్లు క్షీణించి 23,361 వద్ద నిలిచింది. వాణిజ్య యుద్ధ భయాలతో ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే నష్టాల్లో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 750 పాయింట్లు క్షీణించి 76,756 వద్ద, నిఫ్టీ 260 పాయింట్లు కుప్పకూలి 23,222 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. అయితే మిడ్ సెషన్ నుంచి కన్జూమర్ డ్యూరబుల్, ఐటీ, ఫార్మా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో సూచీలు కొంతమేర నష్టాలు భర్తీ చేసుకోగలిగాయి. → క్యాపిటల్ గూడ్స్, ఇండ్రస్టియల్స్, విద్యుత్, యుటిలిటీస్, ఆయిల్‌అండ్‌గ్యాస్, మెటల్ షేర్లు భారీ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈ స్మాల్‌క్యాప్ సూచీ 2%, మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఒకశాతం చొప్పున నష్టపోయాయి. → మార్కెట్ పతనంతో రూ.4.29 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. బీఎస్ఈలో మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.419 లక్షల కోట్లకు తగ్గింది. ప్రపంచ మార్కెట్లూ డీలా ట్రంప్ టారిఫ్ దాడికి ప్రతిగా తాము కూడా టారిఫ్‌లు పెంచుతామని కెనడా, మెక్సికో ప్రకటించడంతో వాణిజ్య యుద్ధ భయాలు మరింత తీవ్రమయ్యాయి. ఆసియాలో జపాన్, తైవాన్, కొరియా సూచీలు 3.50% క్షీణించాయి. ఇండోనేషియా, సింగపూర్, హాంగ్‌కాంగ్ దేశాలు 2–0.5% పతనమయ్యాయి. యూరప్ మార్కెట్లు 1% నష్టపోయాయి. అమెరికా సూచీలు నాస్డాక్ 1%, ఎస్అండ్పీ అరశాతం, డోజోన్ పావుశాతం నష్టాలతో ట్రేడవుతున్నాయి. -
యూఎస్ఎయిడ్ మూసివేత
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ చర్యలు ప్రభుత్వాలతోపాటు సొంత దేశస్తులను సైతం కలవర పెట్టిస్తున్నాయి. యూఎస్ ఎయిడ్(యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్) ఇక మూతబడక తప్పదని బిలియనీర్ ఎలన్ మస్క్ వ్యాఖ్యానించారు. రహస్య పత్రాలను పరిశీలించేందుకు నిరాకరించారన్న ఆగ్రహంతో యూఎస్ఎయిడ్కు చెందిన ఇద్దరు ఉన్నత భద్రతాధికారులను సెలవుపై పంపారన్న వార్తల నేపథ్యంలో ఈ ప్రకటన చేయడం గమనార్హం. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ(డోజ్)కు సారథిగా మస్క్‌ను ట్రంప్ నియమించడం తెలిసిందే. ప్రభుత్వ వ్యయంపై కోతలు విధించే విధుల్లో భాగంగా వాషింగ్టన్‌లోని యూఎస్ఎయిడ్ ప్రధాన కార్యాలయంలోని రహస్య సమాచారం చూపేందుకు సోమవారం డోజ్ బృందానికి అధికారులు అనుమతించకపోవడంపై మస్క్ తీవ్రంగా స్పందించారు. యూఎస్‌ఎయిడ్‌ను నేరగాళ్ల సంస్థగా అభివరి్ణస్తూ..దాని మూసివేసే సమయం వచ్చిందంటూ ‘ఎక్స్’లో వ్యాఖ్యానించారు. డోజ్‌కు అనుమతివ్వని యూఎస్ఎయిడ్ సెక్యూరిటీ డైరెక్టర్ జాన్ వూర్హీస్, ఆయన సహాయక డైరెక్టర్ బ్రియాన్ మెక్గిల్లను ట్రంప్ ప్రభుత్వం సెలవుపై పంపించిందని మీడియా అంటోంది. సుమారు 600 మందికి తమ హెడాఫీసులోని కంప్యూటర్లకు యాక్సెస్ లేకుండా చేశారని ఉద్యోగులు అంటున్నారు. కంప్యూటర్లతో యాక్సెస్ ఉన్న వారికి కూడా ‘సంస్థ నాయకత్వం సలహా మేరకు ప్రధాన కార్యాలయాన్ని 3న మూసివేస్తున్నాం’అంటూ సమాచారం వచ్చిందన్నారు. అయితే, ఇవన్నీ అసత్యాలని వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చ్యుంగ్ కొట్టిపారేశారు. మీడియాను సైతం ఆయన తిట్టిపోశారు. దక్షిణాఫ్రికాకు సాయం నిలిపేస్తాం: ట్రంప్ఇలా ఉండగా, దక్షిణాఫ్రికాకు ఇకపై అన్ని రకాల సాయం నిలిపివేస్తామని ట్రంప్ చెప్పారు. ఒక వర్గానికి చెందిన ప్రజల భూములను దక్షిణాఫ్రికా ప్రభుత్వం బలవంతంగా ఆక్రమించుకుంటోందని ఆరోపించారు. శ్వేత జాతికి చెందిన కొందరు రైతుల భూములను ఎలాంటి పరిహారం లేకుండా ఆక్రమించుకునేందుకు ఉద్దేశించిన వివాదాస్పద బిల్లుపై గతం వారం దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమఫోసా సంతకం చేశారు. 2023లో దక్షిణాఫ్రికాకు అమెరికా సుమారు 440 మిలియన్ డాలర్ల సాయాన్ని అందజేసింది. 2023లో 180 దేశాలకు 72 బిలియన్ డాలర్ల మేర అమెరికా సాయం అందించింది. ఇందులో సగం వరకు యూఎస్ఎయిడ్ ద్వారానే పంపింది. -
ట్రంప్ చర్యలపై నిరసనలు
వాషింగ్టన్: అక్రమ వలసదారులను తిప్పి పంపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేపడుతున్న చర్యలను వేలాది మంది వ్యతిరేకించారు. అక్రమ వలసదారులను నిర్బంధించి మూకుమ్మడిగా సామూహిక బహిష్కరణలు చేపడతానన్న ట్రంప్ నిర్ణయాన్ని నిరసిస్తూ వేలాది మంది ప్రజలు ఆదివారం దక్షిణ కాలిఫోర్నియాలో ర్యాలీ చేపట్టారు. లాస్ ఏంజెలెస్‌లోని డౌన్‌టౌన్‌తో సహా నిరసనకారులు ప్రధాన జాతీయ రహదారిని కొన్ని గంటల పాటు దిగ్బంధించారు. ఇమ్మిగ్రేషన్ సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ‘ఎవ్వరూ చట్టవిరుద్ధం కాదు’, ‘ఇమ్మిగ్రెంట్స్ అమెరికాను గొప్పగా మార్చారు’వంటి నినాదాలతో కూడిన బ్యానర్లను ప్రదర్శించారు. మధ్యాహ్నానికల్లా యూఎస్ 101లోని అన్ని మార్గాలను దిగ్బంధించడంతో ట్రాఫిక్ స్తంభించింది. కాలిఫోర్నియా హైవే పెట్రోలింగ్ అధికారుల బందోబస్తు నిలవగా నిరసనకారులు వీధుల్లో బైఠాయించారు. ఫ్రీవే పూర్తిగా తెరవడానికి ఐదు గంటలకు పైగా సమయం పట్టింది. తూర్పున రివర్సైడ్ నగరంలో వందలాది మంది నిరసన తెలిపారు. ఓ కూడలి వద్ద జెండాలు ఎగురవేస్తున్న నిరసనకారులకు మద్దతుగా వాహనదారులు ఆపకుండా అంతా ఒకేసారి హారన్ మోగించి తమ మద్దతు తెలిపారు. శాన్‌డియాగో నగరంలోని కన్వెన్షన్ సెంటర్ వద్ద వందలాది మంది ఆదివారం ర్యాలీ నిర్వహించారు. అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అరెస్టులకు నిరసనగా డల్లాస్‌లో నిరసనకారులు ఆదివారం ఆందోళనకు దిగారు. ఐసీఈ దాడులను నిరసిస్తూ ఆర్లింగ్టన్ నగరంలో వందలాది మంది ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిటీ హాల్ వెలుపల జెండాలతో నిరసన తెలిపారు. ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాలకు వ్యతిరేకంగా టారెంట్ కౌంటీలో నిరసనకారులు ఆందోళనకు దిగారు. -
ఐరోపా సమాఖ్యపైనా టారిఫ్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ వాణిజ్య యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కెనడా, మెక్సికో, చైనాలపై అదనపు టారిఫ్‌లు విధించిన ట్రంప్ ఇప్పుడు యూరోపియన్ యూనియన్ (ఈయూ)పై సుంకాలు విధిస్తానని సంకేతాలు ఇస్తున్నారు. ట్రంప్ సుంకాలు విధిస్తే తాము దీటుగా బదులిస్తామని ఐరోపా సమాఖ్య సైతం కుండబద్దలు కొట్టింది. చర్చల ద్వారా వాణిజ్య సంఘర్షణను నివారించవచ్చని వ్యాఖ్యానించింది. 27 దేశాల కూటమిపై సుంకాల విధింపు అంశాన్ని పరిశీలిస్తున్నారా? అని వైట్‌హౌజ్‌లో ట్రంప్‌ను మీడియా ప్రశ్నించింది.‘‘ దీనికి నిజమైన సమాధానం కావాలా లేక రాజకీయ సమాధానం కావాలా?. ఖచ్చితంగా విధిస్తా’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. యూరోపియన్ యూనియన్ అమెరికా పట్ల వివక్షాపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈయూకు వ్యతిరేకంగా ట్రంప్ గళమెత్తడం ఇది మొదటిసారి కాదు. వాణిజ్యం విషయంలో అమెరికా పట్ల చాలా అన్యాయంగా వ్యవహరిస్తోందని గతంలోనూ ఆయన ఆరోపించారు. ట్రంప్ తొలిసారిగా అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చున్నప్పుడూ స్టీల్, అల్యూమినియం ఎగుమతులకు సంబంధించి ఈయూపై సుంకాలు విధించారు. దీంతో ఆగ్రహం వ్యక్తంచేసిన ఈయూ కూటమి వెంటనే తగిన రీతిలో స్పందించింది. విస్కీ, మోటార్ సైకిళ్లతో సహా పలు అమెరికా వస్తువులపై టారిఫ్‌లు విధించి ప్రతీకారం తీర్చుకుంది.ప్రతీకారం తప్పదన్న ఈయూకెనడా, మెక్సికో, చైనాలపై అమెరికా టారిఫ్‌లు విధించడాన్ని ఈయూ వ్యతిరేకించింది. ‘‘సుంకాలు అనవసరమైన ఆర్థిక అంతరాయాలను సృష్టిస్తాయి. ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయి. అవి రెండు వైపులా ఇబ్బందులను కలగచేస్తాయి. అలాంటిది ఈయూ వస్తువులపైనే అన్యాయంగా లేదా ఏకపక్షంగా సుంకాలు విధించే ఏ వాణిజ్య భాగస్వామికైనా మేం గట్టిగా బదులిస్తాం’’ అని ఈయూ వ్యాఖ్యానించింది.మెక్సికోపై టారిఫ్ అమలుకు బ్రేక్మెక్సికో నుంచి దిగుమతి అయ్యే వస్తూత్ప త్తులపై 25 శాతం టారిఫ్ విధిస్తానని ప్రకటించిన అమెరికా అధ్యక్షడు ట్రంప్ ఆఖరి నిమిషంలో తన ఆదేశాల అమలును నిలుపుదల చేశారు. నేటి నుంచి కొత్త టారిఫ్ అమల్లోకి రావాల్సి ఉండగా తన ఉత్తర్వుల అమలును నెల రోజులపాటు వాయిదా వేస్తున్నట్లు సోమ వారం ట్రంప్ ప్రక టించారు. టారిఫ్‌ల అమలు నిలుపుదలపై అమె రికా సర్కార్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్ వెల్ల డించారు. సోమవారం ఆమె ట్రంప్‌తో దాదాపు 45 నిమిషాలు ఫోన్లో మంతనాలు జరిపారు. -
కెనడా, మెక్సికోలపై టారిఫ్‌లు నేటి నుంచే
వాషింగ్టన్: పొరుగుదేశాలైన కెనడా, మెక్సికోలపై ప్రకటించిన 25 శాతం టారిఫ్ పెంపు శనివారం నుంచే అమలవుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ప్రకటించారు. వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. టారిఫ్‌లు విధించే కెనడా, మెక్సికో వస్తువుల జాబితాలో చమురును చేర్చాలా వద్దా అనేది కూడా త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఈ రెండు దేశాల నుంచి దిగుమతయ్యే ఆయిల్ ధర సరిగ్గా ఉందని భావిస్తే టారిఫ్ ఉండదని చెప్పారు. కెనడా, మెక్సికోలపై టారిఫ్ విధింపునకు ఎన్నో కారణాలు ఉన్నాయన్నారు. ఈ రెండు దేశాల నుంచి అక్రమ వలసలు, డ్రగ్స్ స్మగ్లింగ్ ఎక్కువన్నారు. ఈ రెండు దేశాలతో అమెరికా వాణిజ్యం భారీ లోటు ఉందని చెప్పారు. వాణిజ్యం విషయంలో ఈ రెండూ అమెరికాతో చాలా అన్యాయంగా వ్యవహరించాయన్నారు. ఇవి ఎగుమతి చేసే వస్తువులు ఆయిల్, కలప వంటి వాటి అవసరం తమకు లేదన్నారు. ప్రస్తుతం ఏడాదికి కెనడాకు 175 బిలియన్ డాలర్లు, మెక్సికోకు 300 బిలియన్ డాలర్ల వరకు అమెరికా సబ్సిడీల రూపంలో అందిస్తోందని ట్రంప్ వివరించారు. చైనా పైనా టారిఫ్ఫెంటానిల్ వంటి ప్రమాదకరమైన డ్రగ్‌ను తమ దేశంలోకి దొంగచాటుగా పంపుతున్న చైనా వస్తువులపైనా టారిఫ్‌లు విధించే విషయాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. ‘ఫెంటానిల్ కారణంగా వేలాదిగా అమెరికన్లు చనిపోతున్నారు. ఇందుకు బదులుగా చైనా టారిఫ్‌తో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంది. ఈ విషయంలో స్పష్టతతో ఉన్నాం’అని ఆయన అన్నారు.బ్రిక్స్‌కు ట్రంప్ మళ్లీ వార్నింగ్అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్‌కు బదులుగా ప్రత్యామ్నాయం తీసుకురావాలనుకుంటే తీవ్ర చర్యలు తప్పవని బ్రిక్స్ దేశాలకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అలాంటి పరిస్థితే వస్తే సభ్యదేశాలపై వంద శాతం టారిఫ్ తప్పదన్నారు. అమెరికాకు బదులు మరో దేశాన్ని చూసుకోవాలని సలహా ఇచ్చారు. ‘ఇప్పటి వరకు చూస్తూ ఊరుకున్నాం, ఇకపై సహించేది లేద’అంటూ సొంత సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు. ‘కొత్తగా బ్రిక్స్ కరెన్సీని తేవడం లేదా డాలర్‌కు ప్రత్యామ్నాయంగా మరో కరెన్సీకి మద్దతివ్వడం వంటివి మానుకోవాలి. అలా చేస్తే 100 శాతం టారిఫ్‌లు తప్పవు. అమెరికాలో ఉత్పత్తుల విక్రయానికి గుడ్ బై చెప్పుకోవాల్సిందే’అన్నారు. గత డిసెంబర్‌లోనూ బ్రిక్స్‌కు ట్రంప్ ఇటువంటి హెచ్చరికే చేశారు. అయితే, డాలర్ రహిత బ్రిక్స్ దేశాల వాణిజ్యానికి సంబంధించి ఎలాంటి ప్రతిపాదనా లేదని విదేశాంగ మంత్రి జై శంకర్ స్పష్టం చేశారు. బ్రిక్స్‌లో రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్టు, ఇథియోపియా, ఇండోనేసియా, ఇరాన్ దేశాలకు సభ్యత్వముంది. -
సునీతా విలియమ్స్‌ను తీసుకురండి: ట్రంప్
వాషింగ్టన్: నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి తీసుకురావాలంటూ టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ఆ యన తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో పంచుకున్నారు. ‘బైడెన్ ప్రభుత్వం అంతరిక్ష కేంద్రంలో వదిలేసిన ఇద్దరు ధైర్యవంతులైన వ్యోమగాములను తీసుకురావాలని మస్క్ ను కోరుతున్నా. సునీత, విల్మోర్ కొన్ని నెలలుగా అంతరిక్ష కేంద్రంలో ఎదురు చూస్తున్నారు. వీలైనంత త్వరగా వ్యోమగాములను తీసుకురావాలి. గుడ్ల క్ ఎలాన్’అని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు. దీనికి మస్క్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘మేం తీసుకొస్తాం. బైడెన్ ప్రభుత్వం ఇంతకాలం వారిన లా వదిలేయడం దారుణం’’అని మస్క్ వ్యాఖ్యానించారు. పది రోజుల మిషన్ కోసం సునీత, విల్మోర్ 2024 జూన్ 5న బోయింగ్ సంస్థకు చెందిన స్టార్‌లైనర్ వ్యోమనౌకలో అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. అయితే అక్కడికి వెళ్లాక వ్యోమనౌకలోని థ్రస్టర్ పనిచేయకపోవడం, హీలియం లీక్ కావడంతో వ్యోమగాములను అక్కడే వదిలేసి స్టార్‌లైనర్ క్యాప్సుల్ మాత్రం సెపె్టంబర్ 7న తిరిగి భూ మి మీదకొచి్చంది. అంతరిక్షంలో ఎక్కువకాలం ఉండటంతో ఆమె చాలా బరువు తగ్గినట్లు ఇటీవల బహిర్గతమైన ఫొటోల ద్వారా వెల్లడైంది. తన ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలను గతేడాది నవంబర్‌లో సునీత తోసిపుచ్చారు. తన శరీరం కొద్దిగా మారిందని, అదే బరువుతో ఉన్నానని చెప్పారు. ఒకవేళ మార్చి నెలాఖరులో వీళ్లిద్దరూ భూమికి తిరిగొస్తే అనుకోకుండా అక్కడే ఉండిపోయి 300 రోజులపాటు అంతరిక్షంలో గడిపిన వ్యోమగాములుగా మరో రికార్డ్ నెలకొల్పుతారు. ఎలా నడవాలో గుర్తుంచుకునేందుకు ప్రయత్నిస్తున్నా: సునీత ఇప్పటికే 7 నెలలుగా అంతరిక్ష కేంద్రంలో ఉండిపోయిన సునీత తాను చదివిన పాఠశాల విద్యార్థులతో సోమవారం మాట్లాడారు. వర్చువల్‌గా జరిగిన ప్రశ్నోత్తరాల సెషన్లో సునీతను విద్యార్థులు అత్యల్ప గురుత్వాకర్షణ స్థితిపై ప్రశ్నలు సంధించారు. ‘‘ఈత కొట్టడం, ఎగరడం వంటి అనుభూతిని మాత్రమే ఆస్వాదిస్తున్నా. ఎక్కువకాలం అంతరిక్షంలో ఉండటం వల్ల తన శరీరం అనేక సర్దుబాట్లకు లోనైంది. చాలాకాలంగా నేను నడవలేదు. కూర్చోలేదు. పడుకోలేదు. నడవడం ఎలా ఉంటుందో గుర్తుంచుకోవడానికి ప్రయత్నిస్తున్నా’’అని తెలిపారు. ‘‘ఎలాగోలా తిరిగి రావడానికి మరో నెలరోజుల సమయం పడుతుందనుకున్నా. కానీ ఇన్ని రోజులైనా ఇంకా ఉండాల్సి రావడం కాస్త ఇబ్బందిపెడుతోంది. వృద్ధాప్యంలో ఉన్న నా తల్లితో వీలైనంతసేపు మాట్లాడుతున్నా. అంతరిక్ష కేంద్రంలో బిజీ షెడ్యూల్, కుటుంబంతో క్రమం తప్పకుండా మాట్లాడటం వల్ల తాను ఒంటరిగా ఉన్నట్లు భావించట్లేను’’అని సునీత చెప్పారు. -
ట్రంప్ పనామా జపం వెనక..
పనామా కాలువ. వందేళ్ల క్రితం నిర్మించిన ఇంజనీరింగ్ అద్బుతం. చిన్నపాటి భూభాగం కారణంగా కలవకుండా ఉండిపోయిన అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలను వందల కోట్లు వెచ్చించి అక్కడి వారి కలను సాకారం చేసింది అగ్రరాజ్యం. పాతికేళ్ల తర్వాత దానిపై అజమాయిషీ కోసం పట్టుబడుతుండటం విచిత్రం. ఆ కాల్వపై అజమాయిషిని నాటి అమెరికా అధ్యక్షుడు స్థానిక దేశానికి ధారాదత్తం చేస్తే కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం అదేమీ చెల్లవంటూ కొత్త రాగం ఆలపిస్తున్నారు. ట్రంప్ బెదిరింపులకు బెదిరేదిలేదని పనామా ప్రభుత్వం చెబుతుండటంతో ఏమౌతుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. అవసరమైతే సైనిక శక్తితో బెదిరించో, బలవంతపు దౌత్యంతోనో మాట నెగ్గించుకోవడం దశాబ్దాలుగా అమెరికాకు అలవాటు. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టి వారమైనా తిరక్కుండానే ఏకంగా వందకు పైగా కార్యనిర్వాహక ఉత్తర్వులిచ్చిన తెంపరి ట్రంప్ పనామాపై ఎలాంటి దూకుడు నిర్ణయాలు తీసుకుంటారోనని ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠగా వేచిచూస్తున్నాయి... భారీ రాకపోకలు, అనూహ్య రాబడి అమెరికా నౌకలు ఆసియా ఖండానికి వెళ్లాలంటే గతంలో దక్షిణ అమెరికా ఖండం చుట్టూతా వేల మైళ్లు సముద్రయానం చేయాల్సి వచ్చేది. ప్రయాణఖర్చలు విపరీతంగా ఉండేవి. వీటిని చాలా వరకు తగ్గించేందుకు, ప్రత్నామ్నాయ సముద్రమార్గంగా పనామా కాలువను తెరమీదకు తెచ్చారు. అనుకున్నదే తడవుగా వందల కోట్లు ఖర్చుపెట్టి కాలువను తవ్వి 1914 ఆగస్ట్ 15న కాలువను వినియోగంలోకి తెచ్చారు. కొత్తలో ఈ మార్గం గుండా రోజుకు మూడు నాలుగు నౌకలే రాకపోకలు సాగించేవి. అయితే అత్యంత దగ్గరి దారికావడంతో రానురాను దీని గుండా అంతర్జాతీయ సరకు రవాణా నౌకల రాకపోకలు విపరీతంగా పెరిగాయి. ఇప్పుడు ఏటా లక్షలాది నౌకలు వెళ్తున్నాయి. దీంతో కాల్వపై యాజమాన్య హక్కులున్న పనామా దేశానికి ఏటా నికర లాభం ఏకంగా రూ.43,000 కోట్లకు పెరిగిందని ఒక అంచనా. ఏటా ఇంతటి లాభాల పంట పండించే బంగారు కోడిని నాటి అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అప్పనంగా పనామాకు అప్పజెప్పారని నేటి అధ్యక్షుడు ట్రంప్ తెగ బాధపడిపోతున్నారు. పనామా దేశ వార్షిక ఆదాయంలో 23.6 శాతం ఒక్క ఈ కాలువ నుంచే వస్తుండటం గమనార్హం. పనామా వాదనేంటి? నాటి కాలువకు నేటి కాలువకు ఎంతో తేడా ఉంది. బాధ్యతలు తమ చేతుల్లోకి వచ్చాక పనామా దేశం ఈ కాలువను మరింతగా తవ్వి పెద్దగా విస్తరించింది. ఏకంగా 5 బిలియన్ డాలర్లు ఖర్చుపెట్టింది. సామర్థ్యాన్ని రెట్టింపు చేసింది. దీంతో 2016 ఏడాది తర్వాత భారీ నౌకలు సైతం సులభంగా వెళ్లడం మొదలవడంతో యాజమాన్యం అధిక లాభాలను కళ్లజూస్తోంది. ‘‘ మేం సొంతంగా ఎంతో ఖర్చుపెట్టాం. గతంలో పోలిస్తే ఆదాయం 55 శాతం పెరగడానికి గతంలో మేం పెట్టిన పెట్టుబడులే కారణం’’ అని కాలువ మాజీ అడ్మిని్రస్టేటర్ జార్జ్ లూయిస్ క్విజానో తేల్చి చెప్పారు. ‘‘ కాలువ మా దేశంలో, దేశభక్తిలో అంతర్భాగం. దీనిపై యాజమాన్య హక్కులు మాకే దక్కుతాయి’’ అని పనామా దేశస్తులు తెగేసి చెబుతున్నారు. అధ్యక్ష ఎన్నికలప్పుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో ఆగ్రహించిన స్థానికులు పనామా సిటీలోని అమెరికా రాయబార కార్యాలయం వద్ద పెద్ద ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో అమెరికా ఈ కాలువను దక్కించుకోవాలంటే పెద్ద ఘర్షణ చెలరేగి అది అంతర్జాతీయ నౌకాయానంపైనా పెను ప్రభావం పడే ప్రమా దముంది. అమెరికా నౌకలపై అధిక చార్జీలు ఈ కాలువను వాణిజ్య అవసరాలకు అత్యధికంగా వాడుతున్న దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. తర్వాత చైనా, చిలీ, జపాన్, దక్షిణకొరియాలు అతిగా వాడుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా సరకు రవాణా నౌకలతోపాటు చాలా ప్రపంచదేశాలపై నిఘా కోసం, తమ మిత్రదేశాల్లో తమ స్థావరాలకు సైన్యాన్ని తరలించేందుకు యుద్ధనౌకలనూ ఇదే మార్గం గుండా పంపుతోంది. వినియోగం ఎక్కువగా ఉండటంతో అమెరికాకు రాకపోకలు చార్జీలు ఎక్కువ అవుతున్నాయి. అయితే మాపైనే అధిక చార్జీలు మోపుతున్నారని ట్రంప్ వాదిస్తున్నారు. అయితే తన వాదనలకు బలం చేకూర్చే ఆధారాలను ఆయన బయటపెట్టలేదు. పైగా చైనా రహస్యంగా ఈ కాలువ నిర్వాహణ యాజమాన్య హక్కులు పొందిందని ట్రంప్ ప్రధాన ఆరోపణ. కాలువను పనామా దేశం శాశ్వతంగా సొంతంగా మాత్రమే నిర్వహించుకోవాలన్న ‘ టోరిజోస్–కార్టర్’ ఒడంబడికను పనామా కాలదన్నిందని, తటస్థ వైఖరికి తిలోదకాలు ఇచ్చిందని అమెరికా ఆరోపిస్తోంది. కష్టపడి తవ్విన తమకే అధిక చార్జీల వాత పెడుతూ, శత్రుదేశం చైనాకు నిర్వహణ హక్కులు కట్టబెట్టారని ట్రంప్ ఆగ్రహంగా ఉన్నారు. అందుకే ఎలాగైనా సరే పనామా కాలువపై యాజమాన్య హక్కులను తిరిగి సంపాదిస్తామని ప్రమాణస్వీకారం రోజే ట్రంప్ ప్రకటించారు. 13 ఏళ్ల పాటు సుదీర్ఘ చర్చల తర్వాత 1977లో నాటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్, పనామా పాలకుడు ఒమర్ టోరిజోస్కు పనామాకాలువ బాధ్యతలు అప్పగించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ట్రంప్ సంచలన నిర్ణయాలు.. ఖుషీలో ఇజ్రాయెల్, ఉక్రెయిన్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఇజ్రాయెల్-గాజా అంశంపై ఫోకస్ పెట్టిన ట్రంప్.. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇజ్రాయెల్‌కు 2,000 పౌండ్ల బరువున్న బాంబులను అమెరికా సరఫరా చేసేందుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో, ఇజ్రాయెల్‌కు మరింత బలం పెరగనుంది.కాగా, గాజాలో విధ్వంస తీవ్రతను తగ్గించేందుకు గత బైడెన్ సర్కారు తీసుకొన్న నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పక్కనపెట్టారు. ఇజ్రాయెల్‌కు 2,000 పౌండ్ల బరువున్న బాంబులను అమెరికా సరఫరా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయాన్ని వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో రానున్న రోజుల్లో దాదాపు 1,800 ఎంకే-84 బాంబులను ఇజ్రాయెల్‌కు సరఫరా చేయనున్నారు. వీటిని బంకర్ బస్టర్లు అని కూడా అంటారు. ఇక, ట్రంప్ నిర్ణయాన్ని ఇప్పటికే పెంటగాన్ ప్రతినిధులు టెల్‌అవీవ్‌కు వెల్లడించారు.అయితే, ఇజ్రాయెల్-గాజా యుద్ధం ప్రారంభమైన కొద్దిరోజులకు ఈ బాంబులను బైడెన్ నిలిపివేశారు. గతంలో ఈ బాంబులను జనావాసాలపై వాడుతున్నారని ఆందోళనలు వ్యక్తం కావడంతో బైడెన్ వీటిని నిలిపేశారు. దీంతో అవి గోదాముల్లోనే ఉండిపోయాయి. నాడు బైడెన్ నిర్ణయంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇజ్రాయెలే స్వయంగా దేశంలో ఈ బాంబులను తయారు చేసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు కొన్ని రక్షణ సంస్థలకు కాంట్రాక్టులు కూడా ఇచ్చింది. వాస్తవానికి గతంలో అమెరికానే దాదాపు 10,000 ఎంకే-84లను ఇజ్రాయెల్‌కు సరఫరా చేసింది. ఇక, తాజాగా ట్రంప్ నిర్ణయంతో అమెరికా నుంచి ఇజ్రాయెల్‌కు బాంబు చేరనున్నాయి.ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ విషయంలో కూడా ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. విదేశాలకు అమెరికా అందించే అన్ని రకాల సాయాలను 90 రోజులపాటు నిలిపేస్తూ కార్యనిర్వాహక ఆదేశాలపై ట్రంప్ సంతకం చేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం తమ దేశానికి అమెరికా సైనిక సహాయాన్ని ఆపలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు. కష్ట సమయంలో సానుకూల నిర్ణయం తీసుకున్నందుకు ట్రంప్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాగా, రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ తన సైనిక అవసరాల్లో 40 శాతం అమెరికాపైనే ఆధారపడింది. ఇప్పటికే 725 మిలియన్ డాలర్ల ప్యాకేజీ, 988 మిలియన్ డాలర్ల సామగ్రిని అందజేస్తామని మాజీ అధ్యక్షుడు బైడెన్ గతంలో ఉక్రెయిన్‌కు హామీ ఇచ్చారు. వాషింగ్టన్ నుంచి కీవ్‌కు 2022 నుంచి ఇప్పటి వరకు 62 బిలియన్ డాలర్లు ఆయుధాలు, ఇతర సాయం అందించారు. -
ట్రంప్ దూకుడు.. మన విద్యార్థుల్లో ఆందోళన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు అక్కడి భారతీయ విద్యార్థుల్లో ఆందోళనలు పెంచుతోంది. ఆయన రెండోసారి బాధ్యతలు చేపట్టడానికి వారిలో చాలామంది పార్ట్‌టైమ్ ఉద్యోగాలకు గుడ్‌బై చెప్పారు. కొత్త ఇమ్మిగ్రేషన్ చట్టాల భయమే ఇందుకు కారణం. వారిలో చాలామంది ఉన్నత చదువుల కోసం అప్పులు చేసి అమెరికా వచ్చినవాళ్లే. దాంతో తల్లిదండ్రులకు భారంగా కావద్దని పార్ట్‌టైమ్‌గా చిన్నాచితకా ఉద్యోగాలు చేస్తుంటారు. ఎఫ్–1 వీసాపై ఉన్న విద్యార్థులకు వారానికి 20 గంటల వరకు పని చేయడానికి అనుమతిస్తారు. కానీ చట్టం, వీసా నిబంధనలు అనుమతించని ఉద్యోగాలు కూడా చేస్తుంటారు. కానీ ఇకపై అలాంటివి చేస్తూ పట్టుబడితే నేరుగా డీపోర్టేషనేనని ట్రంప్ హెచ్చరించడంతో మన విద్యార్థులు రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడటం లేదు. కొన్ని నెలలపాటు పరిస్థితి చూశాకే పార్ట్‌టైం కొలువులపై నిర్ణయానికి వస్తామంటున్నారు. ధీమా పోయింది.. ఇప్పటిదాకా ఏదో ఒక ఉద్యోగం చేస్తూ చదువుకోవచ్చనే ధీమా ఉండేదని, ఇప్పుడది కాస్తా పోయిందని మన విద్యార్థులు ఆవేదన చెందుతుందున్నారు. ‘‘రూ.42 లక్షలు అప్పు చేసి మరీ వచ్చా. కాలేజీ కాగానే చిన్న కఫేలో రోజుకు ఆరు గంటలు పని చేసేవాన్ని. గంటకు ఏడు డాలర్ల చొప్పున ఇచ్చేవారు. నెలవారీ ఖర్చులు హాయిగా వెళ్లిపోయేవి. కానీ ఇలా అనధికారికంగా పని చేస్తున్న వారిపై ఇమ్మిగ్రేషన్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలియడంతో గత వారం రాజీనామా చేశా’’ఇల్లినాయీ వర్సిటీకి చెందిన ఓ భారతీయ విద్యార్థి చెప్పారు. ‘‘ఇప్పటికే నా పొదుపులో చాలావరకు వాడేశా. రూమ్మేట్స్ నుంచి అప్పు తీసుకుంటున్నా. ఇంకెంతకాలం నెట్టుకురాగలనో తెలియడం లేదు’’అని టెక్సాస్‌లో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న మరో విద్యార్థి వాపోయాడు. ఈ అనిశ్చితి విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై బాగా ప్రభావం చూపుతోంది. అతి పెద్ద విద్యార్థి సమూహం... అమెరికాలో చదివే విదేశీ విద్యార్థుల్లో మనవాళ్లు అతి పెద్ద సమూహం. ఈ విషయంలో చైనాను కూడా దాటేశారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ (ఐఐఈ) నివేదిక ప్రకారం 2022–23లో 2.69 లక్షల భారత విద్యార్థులు అమెరికాలో చదువుతున్నారు. అంతకుముందు ఏడాది కంటే అది ఏకంగా 35% అధికం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘ఏ తప్పు చేయనప్పుడు క్షమాభిక్షలు దేనికి?’
క్యాపిటల్ ఘటనలో నిందితులకు క్షమాభిక్ష, టిక్‌టాక్ అంశంతోపాటు పలు ఆసక్తికర అంశాలపై అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత బుధవారం తొలిసారి వ్యక్తిగత ఇంటర్వ్యూలో ఆయన పాల్గొన్నారు. ఫాక్స్ న్యూస్ ఛానెల్ ప్రతినిధి సీన్ హన్నిటీ అధ్యక్షుడు ట్రంప్‌ను పలు ఆసక్తికర అంశాలపై ప్రశ్నలు సంధించగా.. తనదైన శైలిలో ఆయన స్పందించారు.టిక్ టాక్ బ్యాన్పై.. చైనాలో ఆ యాప్ తయారైందని మీరు అంటున్నారు. కానీ, ఆ దేశంలో ఇంకా చాలా తయారవుతున్నాయి. మరి ఇక్కడ వాటి ప్రస్తావన ఎందుకు రావడం లేదు. కేవలం అమెరికా యువతపై నిఘా పెట్టడమే చైనా పనా?. యువత కేవలం సరదా కాలక్షేపం కోసం మాత్రమే ఆ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. టిక్‌టాక్‌పై తాజాగా అమెరికా నిషేధం విధించగా.. దానిని ఎత్తివేసే ప్రయత్నాలను ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే మొదలుపెట్టింది👉కాపిటల్ భవనంపై దాడి కేసులో.. చాలా మంది అమాయకులు. అర్థమైందా?. 2021 జనవరి 6న అమెరికా క్యాపిటల్ హిల్(Capitol Hill) భవనంపై జరిగిన దాడి ఘటనలో పాల్గొన్న 1,600 మందికి ట్రంప్ క్షమాభిక్ష ప్రసాదించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై ఆయన సంతకం కూడా చేశారు. ఆ అల్లర్లలో పాల్గొన్న తన మద్దతుదారులను విడుదల చేస్తానని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.👉జో బైడెన్(Joe Biden) పోతూపోతూ..విశిష్ట అధికారాలను ఉపయోగించి స్వీయ క్షమాభిక్ష పెట్టుకున్నారు. తన కుటుంబ సభ్యులతో సహా తనకు కావాల్సిన వాళ్లకు క్షమాభిక్షలు ప్రసాదించుకున్నారు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. గతంలో నేను అధ్యక్షుడిగా దిగిపోయే సమయంలో.. నన్ను అలా చేయమని నా చుట్టూ ఉన్న అధికారులు సూచించారు. చివరకు.. నాకు నేనుగా క్షమాభిక్ష విధించుకునే ఆప్షన్‌ను కూడా నా ముందు ఉంచారు. కానీ, నేనెవరికీ క్షమాభిక్ష ప్రసాదించే ఉద్దేశం లేదని చెప్పా. మేం ఎలాంటి తప్పు చేయలేదు. అలాంటప్పుడు క్షమాభిక్ష ఎందుకు?. మా వాళ్లంతా దేశభక్తులే అని అన్నారాయన.👉ఓవల్ ఆఫీస్(అమెరికా అధ్యక్ష కార్యాలయం)కు తిరిగి రావడంపై.. స్పందిస్తూ.. ఇక్కడ బోలెడంత పని ఉంది. ద్రవ్యోల్బణం, యుద్ధాలు.. ఇలా ఎన్నో సంక్షోభాలు నడుస్తున్నాయి. అసలు ఈ టైంలో మనం ఇక్కడ ఉండాల్సింది కాదు(నవ్వుతూ..). 👉లాస్ ఏంజెల్స్ కార్చిచ్చుపై.. ఇది ముమ్మాటికీ ఆ రాష్ట్ర గవర్నర్ గావిన్ న్యూసోమ్ చేతకానితనమే. ఉత్తరాది నుంచి వచ్చే నీటిని అతను విడుదల చేయాల్సి ఉంది. తద్వారా మంటలను కట్టడి చేసే అవకాశం ఉండేది.👉అక్రమ వలసదారుల్లో(Illegal Immigrants) నేరస్తుల సంఖ్య అధికంగానే ఉంది. ప్రపంచం నలుమూలల నుంచి 2 కోట్లకు పైగా నేరస్తులు అమెరికాకు అక్రమంగా వలసలు వచ్చారు!. బైడెన్ పాలనతో ప్రపంచంలోని జైళ్లన్నీ ఖాళీగా మగ్గుతున్నాయి(సెటైరిక్‌గా). వలసదారుల చట్టం అమలు కోసం శాంక్చురీ సిటీలకు కేటాయించే ఫెడరల్ ఫండ్స్‌కు కోత విధించాల్సిన అవసరం ఉంది. నేను చేయగలిగిన పని అదొక్కటే అనిపిస్తోంది. 👉దేశంలో ఉగ్రవాదుల సంఖ్య పెరిగిపోయింది. వాళ్ల లెక్కలు తేల్చాల్సి ఉంది. -
చైనా విస్తరణ కాంక్షకు ‘పనామా’తో ట్రంప్ ఆజ్యం పోస్తున్నారా?
అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన డొనాల్డ్ ట్రంప్ ప్రారంభోపన్యాసంలో పనామా కాలువ గురించి చేసిన వ్యాఖ్యలపై విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పనామా కాలువను బల ప్రయోగంతోనైనా స్వాదీనం చేసుకుంటామంటూ ట్రంప్ చేసిన ప్రకటన మున్ముందు ప్రమాదకర పరిస్థితులకు దారి తీస్తుందంటున్నారు. ప్రారంభ ప్రసంగంలో ట్రంప్ పనామా కాలువ చైనా నియంత్రణలోకి వెళ్లిపోయిందని, 1977 నాటి ఒప్పందాన్ని పనామా ఉల్లంఘించిందని ఆరోపించారు. అప్పట్లో కాలువను అమెరికా మూర్ఖంగా పనామాకు ఇచ్చివేసిందని వ్యాఖ్యానించారు. అమెరికా నౌకల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తోందని, అందుకే స్వాధీనం చేసుకుంటామని పేర్కొన్నారు. చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకే ట్రంప్ ఈ ప్రకటన చేసినట్లుగా భావించినప్పటికీ డ్రాగన్ దేశ విస్తరణ కాంక్షకు బలమిస్తున్నట్లు అవుతుందని అంటున్నారు. తైవాన్ను, ఇతర ప్రాంతాలను కలిపేసుకునేందుకు ఇదో సాకుగా చూపే ప్రమాదముందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో, తైవాన్ పట్ల చైనాను సంయమనంగా వ్యవహరించేలా చేయడమన్న దశాబ్దాల అమెరికా విధానానికి వీడ్కోలు పలుకుతూ ట్రంప్ చేసిన అనూహ్య ప్రకటన తన విస్తరణ కాంక్షకు చట్టబద్ధతగా ఆ దేశం భావించే ప్రమాదముందని చెబుతున్నారు. రష్యా, చైనాల సరసన అమెరికా? అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టకమునుపే ట్రంప్ పనామా కాలువ అమెరికాకే చెందుతుందంటూ చేసిన వ్యాఖ్యలపై నిపుణులు పెదవి విరిచారు. అలాంటప్పుడు, చైనా, రష్యాల చర్యల కంటే అమెరికా ఏవిధంగా మెరుగనే ప్రశ్న ఉత్పన్నమవుతుందని వారన్నారు. ఉక్రెయిన్ తమకే చెందుతుందంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారు. తైవాన్ను బలప్రయోగంతోనైనా స్వాదీనం చేసుకుంటామని చైనా బెదిరింపులకు దిగుతోంది. ట్రంప్ కూడా పనామా, గ్రీన్‌ల్యాండ్‌లను సైనిక చర్యతో అయినా స్వాధీనం చేసుకుంటామంటున్నారు. ఆ రెండు దేశాలకు, అమెరికాకు తేడా ఏముంటుంది?’అని న్యూయార్క్‌కు చెందిన జర్నలిస్ట్ గెరాల్డో రివెరా ‘ఎక్స్’లో పేర్కొన్నారు. సార్వభౌమ దేశాన్ని స్వాదీనం చేసుకుంటామనడం ట్రంప్ విస్తరణవాదానికి ఉదాహరణ అని వాషింగ్టన్కు చెందిన మరో జర్నలిస్ట్ పేర్కొన్నారు. చైనాకు ఓ అవకాశం కానుందా? పనామా కాలువతోపాటు సరిహద్దులను ఆనుకుని ఉన్న కెనడాను, ఉత్తర అట్లాంటిక్ సముద్రంలోని డెన్మార్క్ పాలనలోని గ్రీన్‌ల్యాండ్‌ను కలిపేసుకుంటామంటూ ట్రంప్ చేసిన ప్రకటనలు.. రష్యా, చైనాలు కూడా తమ ఆక్రమణలను అమెరికా గుర్తిస్తుందనే సంకేతాలిచ్చినట్లవుతుందని సీఎన్ఎన్ యాంకర్ జిమ్ సియుట్టో ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఇటువంటి ప్రకటనలు అమెరికా విశ్వసనీయతను దెబ్బతీస్తాయని, చైనాకు విస్తరణకు గేట్లు తెరిచినట్లవుతుందని ఆ దేశ విశ్లేషకులు అంటున్నారు. ఒక వేళ అమెరికా గ్రీన్‌ల్యాండ్‌ను ఆక్రమిస్తే చైనా తైవాన్ను తప్పక స్వా«దీనం చేసుకుంటుందని వాంగ్ జియాంగ్యు అనే హాంకాంగ్ ప్రొఫెసర్ స్పష్టం చేస్తున్నారు. అత్యంత క్లిష్టమైన తైవాన్ అంశం సహా అన్ని విషయాలపైనా ట్రంప్‌తో బేరసారాలకు అవకాశముంటుందని చైనా అధికార వర్గాలు భావిస్తున్నాయని షాంఘైలోని ఫుడాన్ వర్సిటీ ఇంటర్నేషనల్ స్టడీస్ ప్రొఫెసర్ ఝావో మింగ్హావో అంటున్నారు. కాలువపై చైనా పెత్తనం నిజమేనా? పసిఫిక్–అట్లాంటిక్ సముద్రాలను కలుపుతూ అమెరికా ప్రభుత్వం 1904–1914 సంవత్సరాల మధ్య పనామా కాలువను తవ్వించింది. దీనివల్ల ఈ రెండు సముద్రాల మధ్య ప్రయాణ దూరం చాలా తగ్గింది. 1977లో కుదిరిన ఒప్పందం ప్రకారం 1999 నుంచి పనామా నియంత్రణ కొనసాగుతోంది. పనామా కాలువ గుండా వెళ్లే ఓడల్లో 70 శాతం అమెరికావే కావడం గమనార్హం. భద్రతకు ముప్పు కలిగితే కాపాడేందుకు అమెరికా జోక్యం చేసుకోవచ్చు. ప్రస్తుతం, కాలువను చైనా నియంత్రించడం లేదు, నిర్వహించడం లేదు. కానీ, హాంకాంగ్‌కు చెందిన సీకే హచిసన్ అనుబంధ కంపెనీ పనామా కాలువలోని కరీబియన్, పసిఫిక్ ఎంట్రన్స్ వద్ద నిర్వహణ బాధ్యతలను నిర్వహిస్తోంది. ఇదికాకుండా, చైనా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌లో 2017లో చేరిన మొట్టమొదటి లాటిన్ అమెరికా దేశం పనామాయే. 2016లో చైనా ప్రభుత్వ సీవోఎస్సీవోకు చెందిన ఓట మొదటిసారిగా పనామా కాలువలోకి ప్రవేశించింది. అదే ఏడాది, చైనా కంపెనీ లాండ్బ్రిడ్జి గ్రూపు మార్గరిటా దీవిలోని అతిపెద్ద నౌకాశ్రయాన్ని కొనుగోలు చేసింది. పనామా కాలువపై మరో వంతెన నిర్మాణ కాంట్రాక్టును చైనా కంపెనీలే దక్కించుకున్నాయి. ఈ ప్రాంతంలో చైనా ప్రాబల్యం విస్తరిస్తుండటం అమెరికాకు కంటగింపుగా మారింది. ‘సాంకేతికంగా కాలువపై హక్కులు మావే. మరో దేశం చేతుల్లోకి కాలువ వెళుతోంది. వాస్తవానికి పరాయి దేశం తన కంపెనీల ద్వారా కాలువపై పెత్తనం సాగిస్తోంది’అని విదేశాంగ మంత్రి మార్కో రుబియో సైతం పేర్కొన్నారు. కాలువను అమెరికా కొంటుందనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మోదీ, ట్రంప్ భేటీ ఫిబ్రవరిలో?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ ఫిబ్రవరిలోనే జరగనుందా? ఈ దిశగా ఇరు దేశాల దౌత్యవేత్తల స్థాయిలో ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయా? అవుననే అంటోంది రాయిటర్స్ వార్తా సంస్థ. వారు వాషింగ్టన్లో భేటీ కానున్నారని భారత దౌత్యవర్గాలను ఉటంకిస్తూ కథనం వెలువరించింది. ‘‘ఇరు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంలో మోదీ, ట్రంప్ మధ్య ఉన్న స్నేహబంధం కీలకపాత్ర పోషించనుంది. చైనా దూకుడును అడ్డుకోవడంపై ఈ భేటీలో నేతలిద్దరూ దృష్టి సారించే అవకాశముంది. ఇక భారతీయులను ఆందోళన పరుస్తున్న వలసలపై కఠిన వైఖరి, జన్మతః పౌరసత్వం రద్దు తదితర అంశాలను మోదీ ప్రముఖంగా లేవనెత్తవచ్చు. హెచ్–1బీ వీసాల్లో సింహభాగం భారతీయులే దక్కించుకుంటారన్నది తెలిసిందే. అమెరికా వస్తువులపై భారత్ విధిస్తున్న సుంకాలు మరీ ఎక్కువని పదేపదే ఆక్షేపిస్తున్న ట్రంప్ ఈ అంశాన్ని మోదీతో లేవనెత్తవచ్చు. సుంకాలను తగ్గించడంతో పాటు అమెరికా పెట్టుబడులను మరింతగా ఆకర్షించే దిశగా పలు నిర్ణయాలను ఈ భేటీలో ట్రంప్ ముందుంచాలని మోదీ భావిస్తున్నారు’’ అని రాయిటర్స్ పేర్కొంది. భారత్‌కు అతి పెద్ద వర్తక భాగస్వామిగా అమెరికా కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2023–24లో 118 బిలియన్ డాలర్ల మేరకు ద్వైపాక్షిక వర్తకం జరిగింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చర్చలకు రాకపోతే ఆంక్షలే : పుతిన్‌కు ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్: రష్యా అధినేత పుతిన్‌ను కలుసుకోవడానికి ఆసక్తితో ఉన్నానని, ఎప్పుడైనా సరే ఆయనతో చర్చలకు తాను సిద్ధమని అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టంచేశారు. చర్చలకు ముందుకు రాకపోతే రష్యాపై అదనపు ఆంక్షలు విధించే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. చర్చల బల్ల వద్ద కలుసుకుందామని పుతిన్‌కు సూచించారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో ఇప్పటికే లక్షలాది మంది మరణించారని ఆవేదన వ్యక్తంచేశారు. సైనికులతోపాటు సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతుండడం, నగరాలు, పట్టణాలు శిథిలాలుగా మారుతుండడం బాధాకరమని అన్నారు. మీడియాలో వస్తున్న వార్తల కంటే ఉక్రెయిన్‌లో మృతుల సంఖ్య అధికంగా ఉందన్నారు. వాస్తవాలు చెప్పడం లేదని మీడియాపై మండిపడ్డారు. ట్రంప్ స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. నాలుగేళ్ల క్రితం తాను అధ్యక్షుడిగా ఎన్నికై ఉంటే ఉక్రెయిన్–రష్యా యుద్ధం జరిగేది కాదని స్పష్టంచేశారు. సమర్థుడైన పాలకుడు అధికారంలో ఉంటే యుద్ధాలకు ఆస్కారం ఉండదని అన్నారు. పుతిన్ చాలా తెలివైన వ్యక్తి అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తమ గత అధ్యక్షుడు జో బైడెన్‌ను, రష్యా ప్రజలను పుతిన్ అగౌరవపర్చారని ఆక్షేపించారు. పుతిన్ గురించి తనకు బాగా తెలుసని చెప్పారు. తాను పదవిలో ఉంటే మధ్యప్రాచ్యంలో సంక్షోభం తలెత్తేది కాదని పునరుద్ఘాటించారు. 200 మిలియన్ డాలర్లు అధికంగా ఖర్చు చేశాం ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరా, ఆర్థిక సాయం నిలిపివేసే అంశాన్ని పరిశీలిస్తామని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మాట్లాడుతున్నామని, త్వరలో పుతిన్‌తోనూ మాట్లాడుతామని చెప్పారు. ‘‘ఉక్రెయిన్– రష్యా యుద్ధానికి యూరోపియన్ యూనియన్ కంటే అమెరికా 200 మిలియన్ డాలర్లు అధికంగా ఖర్చు చేసింది. మాతో సమానంగా యూరోపియన్ యూనియన్ భారం భరించాల్సిందే. మేము ఎక్కువ ఖర్చు పెట్టాం అంటే నిజంగా మూర్ఖులమే. అందులో సందేహం లేదు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. శాంతిని కోరుకుంటున్నట్లు జెలెన్స్కీ తనతో చెప్పారని వివరించారు. ఏం జరుగుతుందో చూద్దామని చెప్పారు. పుతిన్ ఎప్పుడు కోరుకుంటే అప్పుడు చర్చలకు సిద్ధమని ట్రంప్ తేలి్చచెప్పారు. యుద్ధంలో మరణాలు ఇక ఆగిపోవాలని అన్నారు. కృత్రిమ మేధలో 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు చైనా నుంచి వచ్చే దిగుమతులపై 10 శాతం టారిఫ్ విధించాలని భావిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఫిబ్రవరి 1 నుంచి ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. చైనా నుంచి ఫెంటానైల్ అనే ప్రమాదకరమైన మాదకద్రవ్యం రాకుండా అడ్డుకోనున్నట్లు చెప్పారు. చైనా నుంచి మెక్సికో, కెనడా వంటి దేశాలకు, అక్కడి నుంచి అమెరికాకు ఫెంటానైల్ చేరుకుంటోందని ఆందోళన వ్యక్తంచేశారు. డ్రగ్స్‌తోపాటు అక్రమ వలసదార్లను అమెరికాలోకి పంపిస్తున్న దేశాల ఉత్పత్తులపై భారీగా పన్నులు విధిస్తామని ఆయన గతంలోనే హెచ్చరించిన సంగతి తెలిసిందే. కృత్రిమ మేధ(ఏఐ) మౌలిక సదుపాయాల కల్పనకు 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఒక కొత్త కంపెనీ ద్వారా నిధులు ఖర్చు చేస్తామన్నారు. ఒరాకిల్, సాఫ్ట్‌బ్యాంక్, ఓపెన్ ఏఐ భాగస్వామ్యంతో ఈ కంపెనీని స్థాపిస్తామన్నారు. స్టార్గేట్గా పిలిచే ఈ ప్రాజెక్టు ద్వారా లక్ష ఉద్యోగాలు లభిస్తాయని వివరించారు. -
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం
-
భవిష్యత్తు బంగారమేనా?
అనుకున్నదే అయింది. అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తూనే డొనాల్డ్ ట్రంప్ తన మాటలు, చేతలు, చేష్టల ద్వారా సంచలనాలు సృష్టించారు. గతంలో దేశానికి 45వ అధ్యక్షుడిగా పనిచేసి, తాజాగా 47వ అధ్యక్షుడిగా సోమవారం పదవీ ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్ తన తొలి ప్రసంగంలోనే ‘ఇక నుంచి అమెరికాకు స్వర్ణయుగం’ అంటూ అమెరికన్లలో ఆశలు, ఆకాంక్షలు పెంచారు. అయితే, ‘అమెరికాను మళ్ళీ ఘనమైన దేశంగా తీర్చిదిద్దాల’ని (మాగా) నినదిస్తూ ఆయన ప్రకటించిన కొన్ని చర్యలు ఆధిపత్య, విస్తరణవాదానికి ప్రతీకగానూ ప్రతిధ్వనించాయి. వర్తమాన ప్రపంచ అధికార క్రమాన్ని మార్చివేసే పలు చర్యలకు నడుం బిగి స్తున్న తీరు, అలాగే కోవిడ్, చైనాలను సాకుగా చూపుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి, అలాగే పర్యావరణ రక్షణపై ప్యారిస్ ఒప్పందం నుంచి పక్కకు తప్పుకుంటున్నట్లు ప్రకటించడం ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. ట్రంప్ పదవీ ప్రమాణ స్వీకారం పైకి సాదాసీదా అధికార మార్పిడిగా అనిపించవచ్చు. రాజకీయ ప్రత్యర్థులు సైతం చిరునవ్వులు చిందిస్తూ సౌహార్దం చూపుకుంటున్నట్టు కనిపించవచ్చు. అంతమాత్రాన అంతా మామూలే అనుకొంటే పొరపాటు. పదవీ ప్రమాణ స్వీకారోత్సవంలో దర్శనమిచ్చిన ఐక్యతకు భిన్నంగా ప్రత్యర్థులపై తుపాకులు ఎక్కుపెట్టిన తీరు ఆయన ప్రసంగంలో స్పష్టంగా వినిపించింది. కునారిల్లిన దేశాన్ని తాను మాత్రమే మళ్ళీ పునరుత్తేజితం చేయగలనన్న భావన కలిగించడంతో పాటు ఆయన ఒకటికి రెండు జాతీయ ఎమర్జెన్సీలు ప్రకటించడం పెను పర్యవసానమే. అలాగే, చైనా నుంచి పనామా కాలువను వెనక్కి తీసుకోవాలని పిలుపునివ్వడమూ వివాదాస్పదమే. బలప్రయోగం ద్వారా మాత్రమే సాధ్యమయ్యే అలాంటి పనుల ప్రస్తావన నిప్పుతో చెలగాటానికి సిద్ధమని స్పష్టం చేయడమే. ఇక, గద్దెనెక్కిన తొలిరోజునే ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’ను ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’గా ట్రంప్ ప్రకటించడంతో రానున్న రోజుల్లో అంతర్జాతీయంగా మరెన్ని ఆశ్చర్యకర పరిణామాలు చోటుచేసుకుంటాయనే ఉద్విగ్నత నెలకొంది. పదవి చేపడుతూనే ట్రంప్ చకచకా సంతకాలు చేసిన పదుల సంఖ్యలోని కార్యనిర్వాహక ఆదేశాలు ఆసక్తికరం. పర్యావరణ పరిరక్షణను గాలికొదిలేయడం, జన్మహక్కుగా సంక్రమించే పౌర సత్వంపై అమెరికా రాజ్యాంగాన్ని సైతం తోసిపుచ్చడం లాంటివి ఇట్టే మింగుడుపడే అంశాలు కావు. జాతీయతతో సంబంధం లేకుండా దేశంలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నవారికి పుట్టినబిడ్డలకు సైతం 150 ఏళ్ళ పైచిలుకుగా అమెరికా పౌరసత్వం దక్కుతూ వచ్చింది. కానీ, నెల రోజుల్లో అమలులోకి రానున్న తాజా ఆదేశం ఫలితంగా ఇప్పుడిక అలాంటి పిల్లలకు పౌరసత్వ పత్రాలివ్వరు. అదేమంటే, 1868లో చేసిన 14వ సవరణ కింద అమెరికా గడ్డపై పుడితేచాలు ఆ పిల్లలకు మారుమాట లేకుండా పౌరసత్వమివ్వాలనేమీ లేదనీ, సవరణను తప్పుగా వ్యాఖ్యానించారనీ ట్రంప్ వాదన. తాత్కాలిక వీసాలతో అమెరికాలో నివసిస్తూ, ఉద్యోగాధారిత గ్రీన్కార్డ్కై దీర్ఘ కాలంగా నిరీక్షిస్తున్న 10 లక్షల పైచిలుకు మంది భారతీయులకు ఈ కొత్త నిర్ణయం అశనిపాతమే. ఇప్పటికే కొన్నిచోట్ల ఇమ్మిగ్రేషన్ లాయర్లు కోర్టుకెక్కిన ఈ ఆదేశం గనక అమలైతే, తాత్కాలిక వర్క్ వీసాలు, టూరిస్ట్ వీసాలపై అగ్రరాజ్యంలో ఉంటున్నవారి సంతానానికి అక్కడి పౌరసత్వ ఆశలు అడుగంటినట్లే. 2022 నాటి అమెరికా జనాభా లెక్కలపై ప్యూ రిసెర్చ్ విశ్లేషణ ప్రకారం అమెరికాలో 48 లక్షల మంది భారతీయ అమెరికన్లుంటే, వారిలో మూడింట రెండొంతుల మంది వలసజీవులే. కేవలం 34 శాతం, మరో మాటలో 16 లక్షల మంది మాత్రం అగ్రరాజ్యంలోనే పుట్టారు. ఇక, చట్టవిరుద్ధమైన వలసల్ని అడ్డుకుంటాననీ, సరైన పత్రాలు లేని లక్షలాది వలస జీవుల్ని దేశం నుంచి పంపివేస్తాననీ ట్రంప్ చేసిన గర్జన కూడా లక్షలమందికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఆ జాబితాలో మెక్సికో (40 లక్షలు), ఎల్ సాల్వడార్ (7.5 లక్షలు) తర్వాత 7.25 లక్షల మంది భారతీయులదే మూడో స్థానం. ఫలితంగా, ట్రంప్ ప్రతి మాట, ప్రతి అడుగు మనవాళ్ళలో ఆదుర్దా పెంచుతోంది. ఈ పరిస్థితుల్లో ట్రంప్ కొత్త ఏలుబడిలో భారత్‌తో బంధం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం. మరోపక్క డెమోక్రాట్లను జనం బాధలు పట్టని కులీనులుగా చిత్రించి, సామాన్య పౌరుల సంరక్ష కుడిగా ఎన్నికల్లో తనను తాను చూపుకొన్న ట్రంప్‌ను అతిగా నమ్మి మోసపోయామనే భావన రేకెత్తడం సహజమే. చేతిలోని నియంత్రణ నిర్ణయాలే అండగా ఇటీవలే ఓ బ్రాండెడ్ క్రిప్టో టోకెన్ ద్వారా ఆయన వందల కోట్ల డాలర్ల లబ్ధి పొందాడనే విమర్శలూ గుప్పుమంటున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన 80 ఏళ్ళ తర్వాత కీలక సమయంలో పగ్గాలు చేపట్టిన ట్రంప్ తన మద్దతుదారులకై ఏమైనా చేసేలా ఉన్నారు. 2021లో అమెరికా అధ్యక్ష భవనంపై దాడి చేసిన దాదాపు 1500 మంది దుండగులకూ ఆయన తక్షణం సామూహిక క్షమాభిక్ష ప్రసాదించడమే అందుకు తార్కాణం. నాలుగేళ్ళు విచారించి, శిక్షలు వేసిన న్యాయవ్యవస్థను అలా నూతన అధ్యక్షుడు పరిహసించినట్టయింది. ఆశ్రితులు, ఆర్థిక దాతలు, బంధు మిత్రులకై క్షమాభిక్ష వ్యవస్థను దుర్వినియోగం చేయడంలో నిన్నటి బైడెన్ నుంచి నేటి ట్రంప్ దాకా అందరూ ఒకే తాను గుడ్డలన్న మాట. కాలు మోపిననాడే కాపురం చేసే లక్షణం తెలిసిందన్నట్టు ట్రంప్ 2.0 హయాం ఆరంభమవు తూనే రోజులు ఎలా ఉండనున్నాయో తేటతెల్లమైంది. బహుళ ధ్రువ ప్రపంచం వైపు అంతర్జాతీయ అధికార క్రమం అడుగులేస్తున్న కాలంలో ‘అమెరికా ఫస్ట్’ నినాదంతో సామాజిక, ఆర్థిక రంగాల్లో ట్రంప్ ఆధిపత్యభావ నిర్ణయాలు రానున్న నాలుగేళ్ళలో ప్రపంచాన్ని కుదిపేయడం ఖాయం. -
జన్మతః పౌరసత్వం రద్దు
వాషింగ్టన్: తాత్కాలిక వీసాలపైనైనా అమెరికాలో ఉద్యోగాలు చేయాలని, సంతానానికి జన్మనివ్వాలని, తద్వారా వారికి అమెరికా పౌరసత్వం దక్కాలని కోరుకొనే భారతీయులతోపాటు ప్రపంచ దేశాల పౌరులకు, అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులకు నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పెద్ద షాక్ ఇచ్చారు. జన్మతః పౌరసత్వం దక్కే విధానానికి మంగళం పాడేశారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ట్రంప్ సంచలన నిర్ణయాలకు తెరతీశారు. అంతా ఊహించినట్లుగానే తనకున్న అసాధారణ అధికారాలు ఉపయోగించుకొని పదుల సంఖ్యలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేశారు.స్థానిక కాలమానం ప్రకారం సోమవారం 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన తన కార్యాచరణ ప్రారంభించడం గమనార్హం. గంటల వ్యవధిలోనే పలు కీలక నిర్ణయాలు వెలువడ్డాయి. తొలుత క్యాపిటల్ వన్ ఎరీనాలో మద్దతుదారుల సమక్షంలో, అనంతరం శ్వేతసౌధం ఓవల్ ఆఫీసులో ఆయన సంతకాలు చేయడం, మరోవైపు ఉత్తర్వులు వెలువడడం వెనువెంటనే జరిగిపోయాయి. వలసలు, వాతావరణ మార్పులు, క్షమాభిక్షలు, జన్మతః పౌరసత్వం రద్దు వంటి కీలక అంశాలపై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ అయ్యాయి. పత్రాలపై తన సంతకాన్ని ట్రంప్ బహిరంగంగా ప్రజలకు చూపించారు. ఆ పెన్నులను ఉత్సాహంగా జనంపైకి విసిరేశారు. చరిత్రలోనే అత్యంత అధ్వాన పరిపాలన గత ప్రభుత్వ హయాంలో జరిగిందని ట్రంప్ ఆరోపించారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన 78 విధ్వంసకర విధానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.అమెరికాకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తూ ట్రంప్ విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నారు. భారతీయులతోపాటు ప్రపంచదేశాల ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేయగల నిర్ణయాలు సైతం ఉన్నాయి. కానీ, ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లకు చట్టపరమైన రక్షణ కొంతవరకే ఉంటుందని, ఆయన తర్వాత పగ్గాలు చేపట్టబోయే అధ్యక్షులు గానీ, కోర్టులు గానీ వాటిని తిరగదోడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ నిర్ణయాలకు కోర్టుల్లో సవాళ్లు ఎదురుకావడం ఖాయమని అంటున్నారు. నూతన అధ్యక్షుడు జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు ఏమిటంటే... జన్మతః పౌరసత్వం లేనట్లే అమెరికాలో నివసిస్తున్న అక్రమవలసదార్లకు, వలస వచ్చినవారికి, తాత్కాలిక వీసాలపై ఉంటున్నవారికి అమెరికా గడ్డపై సంతానం జన్మిస్తే.. ఇకపై జన్మతః అమెరికా పౌరసత్వం లభించదు. తల్లిదండ్రులు అమెరికా పౌరులు కాకపోయినా ఇక్కడ పుట్టిన వారి బిడ్డలకు జన్మతః పౌరసత్వం లభించే వెసులుబాటు గత శతాబ్ద కాలంగా అమలవుతోంది. ఈ మేరకు వందేళ్ల క్రితమే 14వ రాజ్యాంగ సవరణ చేశారు. 1868లో చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టాన్ని రద్దు చేయాలని ట్రంప్ ఆదేశించారు. జన్మతః పౌరసత్వం లభించే అవకాశం ఉండొద్దని తేల్చిచెప్పారు. దీనివల్ల లక్షలాది మందికి ఇబ్బందులు ఎదురుకానున్నాయి.ప్రధానంగా అమెరికాలో ఉంటున్న విదేశీయులకు జన్మించే సంతానానికి ఇక్కడి పౌరసత్వం దక్కడం కష్టమే. అయితే, ఈ విషయంలో ట్రంప్ నిర్ణయాన్ని కొందరు ఫెడరల్ కోర్టులో సవాలు చేసినట్లు తెలిసింది. చట్టపరంగా ఇది చెల్లదని అంటున్నారు. ట్రంప్ జారీ చేసిన ఆర్డర్ ప్రకారం.. అమెరికా గడ్డపై పుట్టినవారికి పౌరసత్వం రావాలంటే తల్లిదండ్రుల్లో కనీసం ఒక్కరైనా అమెరికా పౌరులై ఉండాలి. లేదా చట్టపరమైన శాశ్వత నివాసిత హోదా(గ్రీన్‌కార్డు హోల్డర్) ఉండాలి. ఒకవేళ వలసదార్లు అమెరికా సైన్యంలో పని చేస్తూ ఉంటే వారికి జన్మించే పిల్లలకు కూడా పౌరసత్వం లభిస్తోంది. అక్రమ వలసదారులంతా వెనక్కే మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన ‘రిమెయిన్ ఇన్ మెక్సికో విధానాన్ని ట్రంప్ పునరుద్ధరించారు. ప్రస్తుతం సరిహద్దుల్లో వేచిచూస్తున్న 70 వేల మంది నాన్–మెక్సికన్ శరణార్థులను వెనక్కి పంపించబోతున్నారు. ‘క్యాచ్ అండ్ రిలీజ్’కు శుభంకార్డు వేశారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని గుర్తించి వెనక్కి పంపబోతున్నారు. శరణార్థులుగా గుర్తించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నవారికి కూడా వదిలిపెట్టరు. అక్రమ వలసదార్లంతా అమెరికాను విడచిపెట్టి వెళ్లిపోవాల్సిందే. లేకపోతే బలవంతంగానైనా వెళ్లగొడతారు. ఈ విషయంలో ట్రంప్ నిర్ణయానికి చట్టపరమైన సవాళ్లు ఎదురుకాబోతున్నాయి. జాతీయ అత్యవసర పరిస్థితి అమెరికా సార్వభౌమత్వం ప్రమాదంలో పడిందని ట్రంప్ ఎప్పటినుంచో చెబుతున్నారు. అందుకే మెక్సికో సరిహద్దుల్లో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తూ ఉత్తర్వుపై సంతకం చేశారు. దీంతో మెక్సికో సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయడానికి, గోడ నిర్మాణానికి స్వేచ్ఛగా నిధులు వాడుకొనే అవకాశం ట్రంప్‌కు లభించింది. డ్రగ్స్ గ్యాంగ్‌లపై ఉగ్రవాద ముద్ర అమెరికాలో చెలరేగిపోతున్న మాదక ద్రవ్య ముఠాలు, అంతర్జాతీయ డ్రగ్స్ గ్యాంగ్‌లను విదేశీ ఉగ్రవాద సంస్థలుగా పరిగణిస్తూ ట్రంప్ ఉత్తర్వు జారీ చేశారు. ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలున్న జాబితాలో ఇవి చేరబోతున్నాయి. అంటే డ్రగ్స్ గ్యాంగ్‌లపై ఇక కఠిన చర్యలు తీసుకోబోతున్నారు. ఇంధన అత్యవసర పరిస్థితి ట్రంప్ జాతీయ ఇంధన అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. చమురు నిల్వలు పెంచాలని ఆదేశించారు. శిలాజ ఇంధనాల ఉత్పత్తిని భారీ పెంచే దిశగా అడుగులు వేస్తున్నారు. అలాస్కా నుంచి చమురు, గ్యాస్, ఇతర సహజ వనరులను భారీగా సమీకరించాలని పేర్కొంటూ ఉత్తర్వుపై సంతకం చేశారు. హరిత ఉద్యోగాల(గ్రీన్ జాబ్స్) కల్పనకు జో బైడెన్ తీసుకొచ్చిన గ్రీన్ న్యూ డీల్‌ను నిలిపివేశారు. టిక్‌టాక్ మరో 75 రోజులు అమెరికాలో టిక్‌టాక్‌పై నిషేధం విధిస్తూ తీసుకొచ్చిన చట్టం అమలును ట్రంప్ 75 రోజులపాటు వాయిదా వేశారు. చైనాకు చెందిన టిక్‌టాక్‌కు ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బందేమీ లేదు. టిక్‌టాక్‌ను తొలుత వ్యతిరేకించిన ట్రంప్ తర్వాత సానుకూలంగా మారిపోయారు. ఎన్నికల ప్రచారంలో ఈ మాధ్యమాన్ని చక్కగా వాడుకున్నారు. కొత్త నియామకాలకు చెల్లు! అమెరికా సైన్యంతోపాటు కొన్ని ఇతర విభాగాల్లో తప్ప ప్రభుత్వంలో కొత్త నియామకాలు చేపట్టవద్దని ట్రంప్ తేలి్చచెప్పారు. ప్రభుత్వంపై ట్రంప్ పూర్తి పట్టుసాధించేదాకా నియామకాలు ఉండవు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులంతా ఆఫీసులకు కచ్చితంగా హాజరై విధులు నిర్వర్తించాల్సిందేనని, ఇంటి నుంచి పనిచేసే వెలుసుబాటు ఎవరికీ ఉండదని ట్రంప్ స్పష్టంచేశారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పునరుద్ధరణ దేశంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పునరుద్ధరిస్తూ, ప్రభుత్వ సెన్సార్íÙప్ను నియంత్రిస్తూ ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేశారు. జో బైడెన్ హయాంలో డిపార్టుమెంట్ ఆఫ్ జస్టిస్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్, ఫెడరల్ ట్రేడ్ కమిషన్ వంటి సంస్థల సాగించిన కార్యకలాపాలపై విచారణ జరపాలని అటార్నీ జనరల్‌ను ఆదేశించారు. విదేశాలకు సాయం నిలిపివేత విదేశాలకు ఆర్థిక సాయం తాత్కాలికంగా నిలిపివేస్తూ మరో నిర్ణయం తీసుకున్నారు. విదేశాలకు సహాయం అందించే కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో సమీక్షిస్తామని తెలిపారు. ‘అమెరికా ఫస్ట్’ విదేశాంగ విధానంలో భాగంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. వెనెజ్వెలాపై ఆంక్షలు పునరుద్ధరించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాల జాబితాలో క్యూబాను మళ్లీ చేర్చారు. పౌరుల జీవన వ్యయం తగ్గింపు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు పౌరుల జీవన వ్యయాన్ని గణనీయంగా తగ్గించాలని ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఇళ్లు, ఆరోగ్య సంరక్షణ, గృహోపకరణాలు, నిత్యావసరాలు, ఇంధనం ధరలు తగ్గించాలన్నారు. దీనిపై వెంటనే కార్యాచరణ ప్రారంభించాలని చెప్పారు. జీవన వ్యయం ఏ మేరకు తగ్గిందో 30 రోజుల్లోగా తనకు నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు. ఇకపై గల్ఫ్ ఆఫ్ అమెరికా గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చాలని ట్రంప్ స్పష్టంచేశారు. అలాస్కాలోని మౌంట్ డెనాలీ పేరును మౌంట్ మెక్కిన్లీగా మార్చాలన్నారు. వాస్తవానికి మౌంట్ మెక్‌కిన్లీ పేరును బరాక్ ఒబామా హయాంలో మౌంట్ డెనాలీగా మార్చారు. కెనడా, మెక్సికో ఉత్పత్తులపై పన్నుల మోత కెనడా, మెక్సికో నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులు, వస్తువులపై ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పన్ను లు పెంచాలని ట్రంప్ ఆదేశించారు. చైనా, కెనడా, మెక్సికో తదితర దేశాలతో వాణిజ్య సంబంధాల్లో అనైతిక పద్ధతులపై సమీక్ష నిర్వహించాలన్నారు. ట్రాన్స్జెండర్లకు చేదు వార్త లింగ మార్పిడి చేయించుకున్నవారికి ట్రంప్ చేదువార్త చెప్పారు. అమెరికాలో ఇకపై పురుష, మహిళ అనే రెండు లింగాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని, మూడో లింగాన్ని గుర్తించడం లేదని స్పష్టంచేశారు. మహిళలు గానీ, పురుషులు గానీ లింగ మార్పిడి చేయించుకోవడానికి వీల్లేదని పేర్కొన్నారు. అయితే, ఈ నిర్ణయాన్ని అమలు చేయడంలో ఇక్కట్లు ఎదురయ్యే అవకాశాలున్నాయి. మద్దతుదారులకు క్షమాభిక్ష 2021 జనవరి 6వ తేదీన క్యాపిటల్ భవనంపై దాడి కేసులో నిందితులైన తన మద్దతుదారులకు ట్రంప్ క్షమాభిక్ష ప్రసాదించేశారు. దోషులుగా తేలినవారికి విముక్తి కల్పించారు. జైలుశిక్షలు సైతం రద్దు చేశారు. మొత్తానికి ట్రంప్ దాతృత్వం వల్ల 1,500 మందికిపైగా నిందితులు/దోషులు కేసుల నుంచి బయటపడ్డారు. పోలీసులతో ఘర్షణకు దిగి బీభత్సం సృష్టించినవారందరిపై ట్రంప్ కరుణ చూపారు. వారిపై నమోదైన కేసులన్నీ ఒక్క కలంపోటుతో రద్ద య్యాయి. ఇప్పటికే జైలుపాలైన వారంతా ఇక బయటకు రాబోతున్నారు.వలస నేరగాళ్లకు మరణ శిక్ష ఉద్యోగం, ఉపాధి కోసం అమెరికాకు వలస వచ్చి నేరాలకు పాల్పడివారికి మరణశిక్ష విధించబోతున్నారు. అమెరికాలో ఇటీవల మరణశిక్షలు విధించలేదు. ట్రంప్ వాటిని పునరుద్ధరిస్తున్నా రు. హత్యలు చేసినవారికి మరణశిక్ష విధి స్తారు. అలాగే యూఎస్ శరణార్థి సెటిల్మెంట్ ప్రోగ్రామ్‌ను ట్రంప్ రద్దు చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు గుడ్బైప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)కు ట్రంప్ గుడ్‌బై చెప్పేశారు. డబ్ల్యూహెచ్ఓ నుంచి అమెరికా తప్పుకొనే ప్రక్రియ ప్రారంభమైనట్లే. ఇది చాలా పెద్ద నిర్ణయమని ఆయన అభివర్ణించారు. 2020లో కోవిడ్–19 మహమ్మారి ఉధృతి సమయంలో డబ్ల్యూహెచ్ఓ వ్యవహార శైలి పట్ల ట్రంప్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అమెరికా పట్ల ఆ సంస్థ స్పందన సక్రమంగా లేదని విమర్శించారు. చైనా పట్ల పక్షపాతం చూపుతోందని మండిపడ్డారు. ట్రంప్ తాజా నిర్ణయంపై డబ్ల్యూహెచ్ఓ విచారం వ్యక్తంచేసింది.పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వెనక్కిచరిత్రాత్మక పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకుంటోంది. తద్వారా వాతావరణ మార్పులను నియంత్రించడంతోపాటు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కృషికి భారీ విఘాతం కలగబోతోంది. పారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ నుంచి అమెరికా వైదొలగుతున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ తేల్చిచెప్పారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. 2017లో ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. కానీ, మళ్లీ ఆ ఒప్పందంలో భాగస్వామిగా చేరారు. ఏమిటీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్? అమెరికా ప్రభుత్వాన్ని శీఘ్రగతిన సంస్కరించడానికి, పరిపాలనను పరుగులు పెట్టించడానికి డొనాల్డ్ ట్రంప్ ఎంచుకున్న మార్గం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. కాంగ్రెస్ అనుమతి లేకుండానే అధ్యక్షుడు కొన్ని నిర్ణయాలు తీసుకొనే అధికారం ఇలాంటి ఉత్తర్వుల ద్వారా లభిస్తుంది. అయితే, కొన్ని పరిమితులు ఉంటాయి. ప్రభుత్వం ఎలా వ్యవహరించాలని అధ్యక్షుడు కోరుకుంటాడో ఆ మేరకు కొన్ని స్టేట్మెంట్లపై సంతకాలు చేస్తాడు. ఆ స్టేట్మెంట్లను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు ఉంటారు. ఇలాంటి ఆర్డర్లు ఒక రకంగా సలహాలు, విజ్ఞప్తుల్లాంటివే. కొన్ని ఆర్డర్లను సవాలు చేయడానికి వీల్లేదు. కొన్నింటిని కోర్టుల్లో సవాలు చేయొచ్చు. కాంగ్రెస్ లేదా కోర్టులు ఇలాంటి ఉత్తర్వులను నిలిపివేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. -
జైశంకర్‌కు ముందు సీటు.. మెలానియా తళుకులు.. సందడిగా సాగిన ట్రంప్ ఈవెంట్లో చిత్రాలెన్నో!