
అమెరికా అధ్యక్షుడి టారిఫ్ వ్యాఖ్యలపై ఒవైసీ ఆగ్రహం
న్యూఢిల్లీ: రష్యాతో వాణిజ్యం చేస్తున్నదనేసాకు చూపుతూ భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌లు విధించడంపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా మండిపడ్డారు. భారత ప్రభుత్వాన్ని వేధిస్తున్న ట్రంప్‌ను ఆయన ‘బఫూన్ ఇన్ చీఫ్’గా అభివర్ణించారు. ‘వైట్ హౌస్‌లోని బఫూర్ ఇన్ చీఫ్ నా దేశ ప్రభుత్వాన్ని వేధిస్తుండటం విచారం కలిగిస్తోంది.
ఇలాంటి బెదిరింపులకు లొంగటానికి సామంత రాజ్యం కాదు.. భారత్ సార్వభౌమత్వం కలిగిన దేశం అని స్పష్టం చేశారు. అత్యధిక టారిఫ్‌లతో మన ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టం వాటిల్లుతుందని ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ టారిఫ్‌ల పెంపుపై ప్రధాని మోదీ మౌనంగా ఉండటాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. మోదీ వైఖరి దారుణమన్నారు.