చిల్లీ పెప్పర్స్ స్పా..! వెరైటీ థెరపీలు.. | Travel: Will You Bathe In Chilli Soup goes Viral | Sakshi
Sakshi News home page

చిల్లీ పెప్పర్స్ స్పా..! వెరైటీ థెరపీలు..

Feb 4 2026 11:07 AM | Updated on Feb 4 2026 11:44 AM

Travel: Will You Bathe In Chilli Soup goes Viral

పర్యాటన అనగానే..చాలామంది స్కైడైవింగ్‌, జలపాతాలు, ప్రకృతి అందాల కోసం అన్వేషిస్తుంటారు. మరికొందరు మానసిక ప్రశాంతతను అందించే ధ్యానానికి సంబంధిన పర్యాట ప్రదేశాలను వెతుకుతారు. ఇంకొందరు ఆరోగ్యం కోసమే..సేద తీరే థెరపీలందించే స్పాల కోసం సర్చ్‌ చేస్తుంటారు. అలాంటి వారి కోసం ఈ ప్రత్యేక స్పాలు. ఇంతవరకు చూడని, అనుభవం పొందని వెరైటీ స్పాలు. ఇవి బాడీకి విశ్రాంతినిచ్చే థెరపీల్లాంటి స్పాలు. ముఖ్యంగా చలికాలంలో సందర్శనకు బెస్ట్‌ స్పాలుగా పేర్కొనవచ్చు. ఎక్కడున్నాయంటే..

అలాంటి ప్రత్యేక స్పాల కోసం చైనాలోని హార్బిన్ నగరంలోకి వాలిపోవాల్సిందే. ఇక్కడ ఉండే ప్రతి స్పా ఓ అద్భుతం. ఇలాంటి విచిత్రమైనవి ఎక్కడ ఉండవేమో అన్నంతగా ఆకర్షణగా ఉంటాయి ఈ స్పాలు. ఘాటెక్కించే స్పా చిల్లీ పెప్పర్స్‌ స్పా. మొత్తం ఎర్రటి పచ్చిమిర్చితో ఉండే పూల్‌ చూసి నోటమాటరాదు. ఓర్నీ ఇందులో స్నానం చేయడం సాధ్యమవుతుందా అనే సందేహం కలుగుతుంది. కానీ ఇది ఒకరకమైన బాడీ చికిత్స కోసమేనట. 

ముఖ్యంగా చలికాలంలో వేడి మిరపకాయలతో కూడిన నీటిలో స్నానం చేయడం వల్ల శరీరానికి వెచ్చదనం కలగడటమేగాక చురుగ్గా ఉండేలా చేస్తుందని నమ్ముతారట అక్కడి చైనా ప్రజలు. అక్కడ ఆ పూల్‌లోని ఎర్రటి మిరపకాయలు, ఇతర ఘాటైన పదార్థాలతో ఎర్రగా ఉంటుందట నీరు. దీంతోపాటు ప్రత్యేకమైన ఫిష్‌ స్పా కూడా ఉంది. ఇందులోని చిన్న చేపలు పాదాలకు పెడిక్యూర్‌ చేస్తాయి. 

దీంతోపాటు కొన్ని బహిరంగా హాట్‌ టబ్‌లు కూడా ఉన్నాయి. ఇక ఈ ప్రదేశంలో మంచు మద్య సహజంగా ఏర్పడిన ఆర్కిటిక్‌ స్పా ఒకటి ఉంది. ఇది 103 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉంటుందట. అంతేగాదు ఈ ప్రదేశం ఐస్‌ పెస్టివెల్‌కి నిలయం కూడా. ఈ స్పాలన్నీ పర్యాటకులకు మంచి ఆహ్లాదాన్ని, విశ్రాంతి తోపాటు బాడీకి ఒకవిధమైన చికిత్సను అందిస్తాయి.

 

(చదవండి: సేవలో అతడికి సాటిలేరెవ్వరూ..! చేసేది డెలివరీ బాయ్‌​ జాబ్‌ కానీ..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement