సేవలో అతడికి సాటిలేరెవ్వరూ..! చేసేది డెలివరీ బాయ్‌​ జాబ్‌ కానీ.. | 24 Year Old Swiggy Agent In Delhi Delivers Food And Shares Half His Earnings To Help The Needy | Sakshi
Sakshi News home page

సేవలో అతడికి సాటిలేరెవ్వరూ..! చేసేది డెలివరీ బాయ్‌​ జాబ్‌ కానీ..

Feb 4 2026 9:36 AM | Updated on Feb 4 2026 11:30 AM

This 24 Year Old Swiggy Agent Delivers Food And Helps The Needy

డబ్బుంటేనే సాయం కాదు..మంచి మనసు ఉంటే ఎలాగైనా సాయం అందించొచ్చు అని నిరూపిస్తున్నాడు ఈ 24 ఏళ్ల స్విగ్గీ డెలివరీ బాయ్‌. అతడి చేసేది చాలాకష్టమైన పని. పైగా అది సేవ రంగానికి చెందింది. అందులో వచ్చే సంపాదన అతడి కుటుంబ బాధ్యతలకు అక్కరకు రావు. అయినా..అందులో సగం పేదల కోసం ఖర్చు చేస్తూ పెద్ద మనసు చాటుకుంటున్నాడు. సాధారణ ఆదాయమే అయినా..ఇంత సేవాతత్పరత..! అని అందరూ విస్తుపోతున్నారు. ఇంతకీ ఎవరా యువకుడు అంటే.. 

అతడే ఢిల్లీకి చెందిన యువకుడు ఆకాశ్‌ సరోజ్‌. అతడి ఉదారతకు హద్దులు లేవు. స్విగ్గీ డెలివరి బాయ్‌గా పనిచేస్తూ..వచ్చే ఆదాయంలో సగం జీతం పేదల కోసం ఖర్చుపెడుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. అలాగని మనోడుకి ఏమి బాధ్యతలు లేవా అంటే..కుటుంబాన్ని పోషించుకోవాలి, వారి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత ఆకాశ్‌దే. అయినప్పటకీ..సంపాదనలో 50% పేద ప్రజల కోసం ఉపయోగిస్తూ అందర్నీ ఆలోచింపచేస్తున్నాడు. 

డెలివరీ బాయ్‌గా ఎంతలా కష్టపడితే డబ్బులు వస్తాయో తెలిసిందే. కానీ ఈ యువకుడు..రిక్షా కార్మికుడు నుంచి వీధిల్లో బిచ్చమెత్తుకునే అభాగ్యులు వరకు.. తనకెదురైనా ప్రతి వ్యక్తికి తన ఆదాయంలో ఎంతో కొంత ఖర్చు చేసి మరి సాయం చేస్తాడు. ఎందుకింత ప్రయాస అని ఆకాశ్‌ని ఎవరైనా ప్రశ్నిస్తే..ఇది తన తండ్రి కల అని,  తాను ఒక కొడుకుగా..మంచి వ్యక్తిగా ఉండాలన్నదే అతడి కోరిక అని చెబుతుంటాడు. 

మరో వీడియోలో కుక్కలకు, పిల్లులకు ఆహారం పెడుతూ కనిపిస్తుంటాడు. పైగా ఇది తన బాధ్యత అని పోస్టులో పేర్కొంటూ..వీడియోకి "ఎక్కవ ఆశీర్వాదాలు సంపాదించు..నీకు మించిన ధనవంతుడు లేడు". అనే క్యాప్షన్‌ పెట్టడం విశేషం. ఇక్కడ ఆకాశ్‌ పేదలకు సాయం చేస్తున్న వీడియోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ వాటికి ఇచ్చే క్యాప్షన్‌లు కూడా నెజన్లను అత్యంత ఆకట్టుకుంటాయి, ఆలోచింపచేసేలా ఉంటాయి కూడా.  

 

(చదవండి: వెయిట్‌లాస్‌ డ్రగ్‌ ఉపయోగించకుండానే..90 కిలోలు తగ్గిన గ్రామీ విజేత)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement