‘ఏమీ కనిపించడంలేదు’.. ఢిల్లీ ప్రజల గగ్గోలు! | Dense fog engulfs Delhi visibility drops below 50 metres | Sakshi
Sakshi News home page

‘ఏమీ కనిపించడంలేదు’.. ఢిల్లీ ప్రజల గగ్గోలు!

Feb 2 2026 9:23 AM | Updated on Feb 2 2026 9:28 AM

Dense fog engulfs Delhi visibility drops below 50 metres

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఒకవైపు శీతల గాలుల తీవ్రత కొనసాగుతుండగా, మరోవైపు సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు నగరాన్ని కమ్మేసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో విజిబిలిటీ (దృశ్యమానత) 50 మీటర్ల కంటే తక్కువకు పడిపోవడంతో జనజీవనం స్తంభించిపోయింది. ముఖ్యంగా అక్షరధామ్, ధౌలాకువాన్ వంటి కీలక ప్రాంతాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అతి తక్కువ దూరంలో ఉన్న వస్తువులు కూడా కనిపించని పరిస్థితి ఉండటంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి.
 

విపరీతమైన పొగమంచు కారణంగా ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ)హై అలర్ట్ ప్రకటించింది. విమానాల రాకపోకల్లో జాప్యం తప్పదని ఎయిర్‌పోర్ట్ యంత్రాంగం తెలిపింది. ప్రయాణికులు తమ విమాన సమయాల గురించి సంబంధిత ఎయిర్‌లైన్స్‌ను సంప్రదించాలని లేదా అధికారిక వెబ్‌సైట్‌ను తనిఖీ చేయాలని సూచించింది. కాగా భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గణాంకాల ప్రకారం, ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి.

శనివారం కనిష్ట ఉష్ణోగ్రత 6.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది సీజన్ సగటు కంటే 1.7 డిగ్రీలు తక్కువ. పాలం (8.1°C), లోధి రోడ్ (7.1°C), అయానగర్ (6.6°C) వంటి ప్రాంతాల్లో కూడా తీవ్రమైన చలి వాతావరణం నెలకొంది. రానున్న రోజుల్లో పొగమంచు తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఢిల్లీలో వాయు కాలుష్యం కలవరపెడుతోంది. గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ)318గా నమోదై ‘అత్యంత పేలవమైన’ (Very Poor) విభాగంలో కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి: పొద్దున్నే వణికించిన భూకంపం

Advertisement
 
Advertisement
Advertisement