హీరోలా తుపాకీ పట్టుకుని పోజులు.. చివరకు.. | Delhi Youth Accidentally Shoots Himself While Filming Gun Video, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

హీరోలా తుపాకీ పట్టుకుని పోజులు.. చివరకు..

Mar 17 2026 8:51 PM | Updated on Mar 18 2026 4:07 PM

  Delhi Man Smiles, Then Shoots Himself In The Chest, Friend Records Video

న్యూఢిల్లీ: ఓ యువకుడు హీరోలా తుపాకీ పట్టుకుని పోజులు ఇస్తూ వీడియో తీసుకుంటున్నాడు. ఆ క్రమంలో తుపాకీని లోడ్‌ చేసి, గుండెకు గురి పెట్టుకున్నాడు. అనుకోకుండా అది పేలడంతో బుల్లెట‍్టు అతడి శరీరంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

ఎలా జరిగింది? 
ఢిల్లీకి చెందిన పవన్‌ అనే ఓ యువకుడు చిరునవ్వులు చిందిస్తూ నిలబడి తుపాకీతో వీడియో తీసుకుంటున్నాడు. అతడి స్నేహితుడు వీడియో చిత్రీకరిస‍్తున్నాడు. తుపాకీ పట్టుకున్న పవన్‌ ట్రిగ్గర్‌ను స్వల్పంగా తాకాడు. “చలానా మత్ భాయ్ (కాల్చవద్దు అన్నా)” అంటూ వీడియో తీస్తున్న వ్యక్తి హెచ్చరించాడు. అయినప్పటికీ తుపాకీని పవన్‌ తన చాతీపై పెట్టాడు. అకస్మాత్తుగా అది పేలింది. ఆ వెంటనే పవన్‌ కుప్పకూలిపోయాడు. పవన్‌ను ఆసుపత్రికి తరలించినా, చికిత్స సమయంలో అతడు మృతి చెందాడని అధికారులు తెలిపారు.

ఈ ఘటన తూర్పు ఢిల్లీలోని దల్లుపురాలో జరిగింది. తుపాకీకి లైసెన్స్ ఉంది. అది వీడియో చిత్రీకరించిన యువకుడిదే అని పోలీసులు తెలిపారు. వీడియో తీస్తున్న వ్యక్తి పవన్‌కు తుపాకీ ఎలా లోడ్ చేయాలో సూచనలు ఇస్తూ, కాల్చవద్దని హెచ్చరించాడని పోలీసులు చెప్పారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. పవన్ తుపాకీతో స్టంట్లు చేస్తూ రీల్ చిత్రీకరిస్తున్నట్టు తెలిసింది. పవన్ తుపాకీ లాక్‌లో ఉందని నమ్మాడని పోలీసులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement