'దళపతి' 10th మార్క్స్‌ వైరల్‌, విజయ్‌ విద్యార్హత ఏంటి? | TVK's Thalapathy Vijay 10th marks goes viral | Sakshi
Sakshi News home page

'దళపతి' 10th మార్క్స్‌ వైరల్‌, విజయ్‌ విద్యార్హత ఏంటి?

May 6 2026 10:55 AM | Updated on May 6 2026 11:38 AM

TVK's Thalapathy Vijay 10th marks goes viral

సాక్షి, చెన్నై: 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కజగం (TVK) చారిత్రాత్మక విజయం, పార్టీ అధినేత తరువాత కాబోయే ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ (దళపతి విజయ్)కి సంబంధించిన ప్రతీ విషయం నెట్టింట వైరల్‌గా మారుతోంది. 

ఎన్నికల్లో గెలిచిన తర్వాత లోయోలా కాలేజ్ కౌంటింగ్ సెంటర్ నుండి అందుకున్న MLAగా గెలిచిన ధృవీకరణ పత్రం వైరల్ అయ్యింది. ఇపుడు విజయ్ పదో తరగతి మార్కుల వివరాలు సోషల్‌ మీడియాలో సందడిగామారాయి. ఒక సగటు విద్యార్థిగా ప్రారంభమైన విజయ్‌ ఎవరూ ఊహించని విధంగా విజయం సాధించడమే కాదు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే స్థాయికి ఎదగడం ఆయన అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.

మరోవైపు గురువారం  ఉదయం 11.30 గంటలకు నెహ్రూ స్టేడియంలో  విజయ్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం ఖరారు చేసినట్టు సమాచారం. కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే ల మద్దతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు.  ఈ మేరకు  గవర్నర్‌ను కలిసేందుకు విజయ్‌ సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన ఏదీ ఇంకా రాలేదు.

మనీ కంట్రోల్‌ నివేదిక, నెట్టింట హల్‌ చల్‌ చేస్తున్న 10వ తరగతి మార్కుల జాబితా (mark sheet)  ప్రకారం చెన్నైలోని విరుగంబాక్కంలోని ఒక ప్రైమ్ మెట్రిక్యులేషన్ స్కూల్‌లో విజయ్ చదువు కున్నారు. పదో తరగతి బోర్డు పరీక్షల్లో ఆయన 1100 మార్కులకు గాను 711 సాధించారు. అంటే  మార్కులు 65 శాతం మార్కులొచ్చాయన్నమాట.  

సబ్జెక్టుల వారీగా మార్కులు
తమిళం: 200 మార్కులకు 155 (అత్యధిక మార్కులు)
గణితం: 200 మార్కులకు 95.
ఇంగ్లీష్: 200/133
సైన్స్: 300 /206
సోషల్ సైన్స్: 200/122

పాఠశాల విద్య అనంతరం చెన్నైలోని ప్రతిష్టాత్మక లయోలా కాలేజీలో విజువల్ కమ్యూనికేషన్ కోర్సులో చేరారు. సినిమాలపై మక్కువతో మధ్యలోనే కాలేజీ మానేసి నటన వైపు అడుగులు వేశారు. ఆ నిర్ణయమే ఆయన్ని కోలీవుడ్‌లో సూపర్ స్టార్‌గా నిలబెట్టింది. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ ప్రభంజనం దశాబ్దాల ద్రవిడ పార్టీల (DMK, AIADMK) ఆధిపత్యానికి విజయ్ చెక్ పెట్టి తమిళనాట ఘన విజయం సాధించారు. అత్యధిక మెజారీటీ సాధించిన ఏకైక పార్టీగా  టీవీకే పార్టీని నిలబెట్టడం విశేషం. తిరుచిరాపల్లి ఈస్ట్ , పెరంబూర్ నియోజకవర్గాల్లో విజయ్‌ విజయం సాధించారు.

Advertisement
 
Advertisement
Advertisement