పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాలు చూసి ఆందోళన చెందవద్దని ఆమె టీఎంసీ శ్రేణులను ఆమె కోరారు. నిజమైన ఫలితాలు వచ్చేదాకా అంతా ఎదురు చూడాలని.. ఈ క్రమంలో అప్రమత్తంగా ఉండాలని టీఎంసీ శ్రేణులకు ఆమె పిలుపు ఇచ్చారు.
‘‘మనం ఇంకా ఓడిపోయినట్లు కాదు. కౌంటింగ్ కేంద్రం నుంచి టీఎంసీ నేతలు వెళ్లిపోకూడదు. ఎస్‌ఐఆర్ పేరుతో బీజేపీ ఓట్లు దొంగలించింది. ఇప్పటి వరకు మూడు రౌండ్ల ఫలితాలే వచ్చాయి. పలు చోట్ల కౌంటింగ్ నిలిపివేశారు. 70 నియోజకవర్గాల కౌంటింగ్‌పై ఈసీ నుంచే అప్‌డేట్ లేదు. టీఎంసీ కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండాలి. పార్టీ శ్రేణులు అధైర్యపడొద్దు. మనం ఇంకా ఓడిపోయినట్లు కాదు. చివరి కాదా వేచి చూడండి. తుది ఫలితాలు మనవైపే ఉంటాయి. అసలైన విజయం మనదే’’ అని అన్నారామె.
ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం.. బెంగాల్‌లో 191 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. మెజారిటీ (147) దాటేసి అధికార కైవసం దిశగా అడుగులేస్తోంది. దీంతో బీజేపీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయాయి. మమతా బెనర్జీపై ప్రజలకు ఉన్న కోపం ఈ ఫలితాలతో స్పష్టమైందని బీజేపీ అంటోంది. ఇక ఫలితాల్లో.. టీఎంసీ 97 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తుండగా.. సీపీఎం, కాంగ్రెస్‌లు చెరో 1 స్థానంలో లీడ్‌లో కొనసాగుతున్నాయి.


