breaking news
West Bengal
-
శివసేన తరహా కష్టమే ఆ పార్టీకి!
మహారాష్ట్ర రాజకీయాల్లో శివసేన ఎదుర్కొన్న ‘‘పార్టీ ఎవరిది?” అనే సంక్షోభం.. దేశ రాజకీయాల్లోనే పెద్ద మలుపుగా నిలిచింది. నాయకత్వం, గుర్తు, ఎమ్మెల్యేలు.. అన్నీ ఒకేసారి చీలిపోయి చివరికి పార్టీ రెండు వర్గాలుగా విడిపోయిన తీరు అప్పట్లో సంచలనం రేపింది. ఇప్పుడు అదే తరహా రాజకీయ తుపాను తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) చుట్టూ తిరుగుతుండడంతో.. బెంగాల్ రాజకీయాలు హీటెక్కుతున్నాయి.తాజాగా కోల్‌కతాలోని టీఎంసీ ప్రధాన కార్యాలయం కేంద్రంగా చోటుచేసుకున్న పరిణామాలు ఈ సంక్షోభాన్ని మరింత ముదిర్చాయి. రితాబ్రత బెనర్జీ నేతృత్వంలోని ఎమ్మెల్యేల తిరుగుబాటు వర్గం కార్యాలయంలోకి తాళాలు పగలగొట్టి ప్రవేశించడం.. లోపలే సమావేశాలు నిర్వహించడం.. “మాదే అసలు టీఎంసీ” అంటూ ప్రకటించుకోవడం.. మళ్లీ తాళాలు వేసుకుని వెళ్లడం వంటి చర్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. మమతా బెనర్జీ నేతృత్వంలోని వర్గం ఈ చర్యలను తీవ్రంగా ఖండించింది. పార్టీ అంతర్గతంగా ఉన్న విభేదాలు ఇప్పుడు బహిరంగ బల ప్రదర్శన స్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. ఇది అప్పటి ఏక్నాథ్ షిండే నేతృత్వంలో జరిగిన.. మహా పొలిటికల్ డ్రామాను తలపిస్తోంది.మహారాష్ట్రలో శివసేన సంక్షోభం కూడా ఇదే తరహా రాజకీయ ఉత్కంఠకు దారి తీసింది. అప్పట్లో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని వర్గానికి పెద్ద షాక్ తగిలింది. ఏక్నాథ్ షిండే నేతృత్వంలో పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు తిరుగుబాటు బాట పట్టి, అసెంబ్లీ సంఖ్యాబలం ఒక్కసారిగా మారిపోయింది. గోవా, గుజరాత్ క్యాంప్‌లలో జరిగిన రాజకీయ కదలికల తర్వాత చివరికి పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఒకవైపు ఉద్ధవ్ వర్గం, మరోవైపు షిండే వర్గం అంటూ అసలు శివసేన ఎవరిదన్న వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పార్టీ గుర్తు, పేరు, అధికారిక హక్కులపై జరిగిన పోరులో.. షిండే పై చేయి సాధించారు. దీంతో బెంగాల్లోనూ సీన్ రిపీట్ కాక తప్పదా? అనే చర్చ జోరందుకుంది.ఇక బెంగాల్ టీఎంసీ సంక్షోభానికి కేవలం ఎమ్మెల్యేల స్థాయిలోనే కాకుండా ఎంపీల స్థాయిలో కూడా కొనసాగుతుందని తెలిసిందే. టీఎంసీకి చెందిన 28 మంది లోక్‌సభ ఎంపీల్లో 20 మంది సభ్యులు ఎన్సీపీఐ అనే రాజకీయ వేదికలో విలీనం కావడం.. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్‌కు బయటి నుంచి మద్దతు ఇస్తామని ప్రకటిస్తూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ సమర్పించడం.. తెలిసిందే. ఇది జరిగిన కొద్దిరోజులకు..ఇదే తరహా రాజకీయం మహారాష్ట్రలోనూ కనిపించింది. అక్కడ ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గానికి చెందిన ఎంపీల్లో కొందరు ఏక్నాథ్ షిండే వర్గంలో చేరేందుకు సిద్ధపడ్డారు. శివసేన సంక్షోభ సమయంలో ఎలా అయితే ఎమ్మెల్యేల మార్పు జరిగిందో.. ఇప్పుడు బెంగాల్లోనూ అదే తరహా చీలిక ఎపిసోడ్ నడుస్తోంది. అలాగే.. ఇరు చోట్ల “పార్లమెంటరీ షిఫ్టింగ్” ఒకేసారి చోటు చేసుకోవడం కొత్త చర్చకు దారి తీసింది. పార్టీలో అంతర్గత చీలిక.. ఎమ్మెల్యేల వేరు వర్గం.. ఎంపీల షిఫ్టింగ్.. మహారాష్ట్ర, బెంగాల్ రాజకీయాల్లో ఒకే ట్రెండ్ కొనసాగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ వద్ద టీఎంసీ పార్టీ పేరు, గుర్తు, నిర్మాణంపై హక్కుల వివాదం పెండింగ్‌లో ఉంది. ఇవన్నీ కలిపి చూస్తే శివసేన తరహా సంక్షోభమే ఇప్పుడు టీఎంసీకి కూడా ఎదురవుతోందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలపడుతోంది. -
నాడు డెలివరీ బాయ్.. నేడు రెండు AI స్టార్టప్స్‌కు ఫౌండర్!
ఎక్కడో మారు మూలగ్రామంలో పుట్టిన ఒక సాధారణ యువకుడు రెండు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్టార్టప్‌ల అధినేతగా ఎదగడం అంటే మాటలు కాదు. ఈ సక్సెస్ వెనుక ఎంతో కఠోర శ్రమ, అంతకుమించిన పట్టుదల చాలా అవసరమని, జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను దాటుకుంటూ ముందుకు సాగాలే కానీ, అనుకోని విజయాలను అందుకోవచ్చని 28 ఏళ్ల సూరజ్ బిస్వాస్ (Suraj Biswas) స్ఫూర్తిదాయకమైన కథ ద్వారా మనకు అవగతమవుతుంది.భారతదేశంలోని అందరికీ ఒకే విధానం అనే విద్యా వ్యవస్థపై తనకున్న తీవ్ర నిరాశే 2021లో తన స్టార్టప్‌ను నిర్మించడానికి ఎలా ప్రేరణగా నిలిచింది అంటారు. సూరజ్. జీవనోపాధి కోసం జొమాటో రైడర్‌గా షిఫ్టులు చేస్తూ, తన భారీ టెక్ ఆశయాలను సమతుల్యం చేసుకుంటూ, ఒక డెలివరీ బాయ్‌ని సీరియస్‌గా తీసుకోడానికి నిరాకరించిన పెట్టుబడిదారుల ముందు ఈ రోజు టెక్ వ్యవస్థాపకుడిగా సగర్వంగి నిలబడ్డాడు. పశ్చిమ బెంగాల్‌లోని నాదియా జిల్లాకు చెందిన చక్దహా అనే ఒక చిన్న పట్టణంలో సూరజ్ జన్మించారు. సాధారణంగా స్టార్టప్ వ్యవస్థాపకులు పుట్టుకొచ్చే మేజర్ సిటీలు లేదా నేపథ్యం తనది కాదని ఆయన గర్వంగా చెబుతారు. కోల్‌కతాలోని గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఆయన జెనెటిక్స్ (Genetics) లో బీఎస్సీ పూర్తి చేశారు. చిన్నప్పుడు డాక్టర్ కావాలనేది ఆయన కల, కానీ పరిస్థితుల ప్రభావంతో ఆ దారి మారింది. డిగ్రీ పూర్తయ్యాక, తన తదుపరి లక్ష్యం ఏమిటో ఆలోచించుకునే లోపు ఆర్థిక అవసరాల కోసం జొమాటోలో డెలివరీ బాయ్‌గా చేరారు.అదే పునాది నగరమంతా తిరుగుతూ ఆహారాన్ని డెలివరీ చేస్తున్న సమయంలోనే ఆయనలో ఒక ఆలోచన మొదలైంది. ప్రస్తుతం ఉన్న విద్యావ్యవస్థను గమనించినప్పుడు, వేర్వేరు సామర్థ్యాలు ఉన్న విద్యార్థులందరినీ ఒకే పద్ధతిలో చదవమని ఎలా ఒత్తిడి చేస్తారనే ప్రశ్న ఆయనలో తలెత్తింది. "వ్యవస్థ ప్రతి మనిషిని ఒకేలా చూస్తోంది. అందరికీ ఒకే కొలత (One size fits all) అన్నట్టుగా ఉంది. కానీ ఈ ప్రపంచంలో ఇద్దరు మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరు," అంటారు సూరజ్.ఈ ఆలోచన విద్యావ్యవస్థ నుండి టెక్నాలజీ వైపు మళ్లింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన AI టెక్నాలజీ, మనుషుల నమూనాలను గుర్తిస్తుందే తప్ప ప్రతి ఒక్క వ్యక్తి ప్రత్యేకతను, వారి జీవక్రియలను ఎందుకు అర్థం చేసుకోలేకపోతోంది? అనే ప్రశ్న ఆయన మెదడులో రేగింది. దీనికి పరిష్కారంగానే 2021లో ఎలాంటి పెట్టుబడిదారులు ఆఫీస్ లేదా భాగస్వాములు, లేకుండానే 'అసెస్లీ' (Assessli) అనే స్టార్టప్‌ను స్థాపించారు. ఆ తర్వాత 'డాట్స్-ఇన్' (Dots-in) అనే మరో సంస్థను కూడా ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన ఈ రెండు కంపెనీలకు వ్యవస్థాపకుడిగా , సీఈఓగా వ్యవహరిస్తున్నారు.ఎన్నో సవాళ్లుతన ఆలోచనను వ్యాపారంగా మార్చడం అంత సులువు కాలేదంటారు సూరజ్. ఒక చిన్న పట్టణం నుండి వచ్చి, పెద్దగా గుర్తింపు లేని కాలేజీలో చదివి, బైక్‌పై ఫుడ్ డెలివరీ చేసే వ్యక్తి చెప్పే ఐడియాలను మొదట్లో ఎవ్వరూ నమ్మలేదు, సీరియస్‌గా తీసుకోలేదు. దీనికి తోడు ఏఐ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి సంవత్సరాల పరిశోధన, మౌలిక వసతులు అవసరం. తక్షణ లాభాల కోసం ఆశపడకుండా మార్కెట్లో గుర్తింపు వచ్చే వరకు పట్టుదలతో నిలబడటం పెద్ద సవాలుగా మారింది.కోలుకోలేని విషాదంతన స్టార్టప్ కల సాకారమవుతున్న సమయంలోనే సూరజ్ జీవితంలో ఒక పెద్ద విషాదం చోటుచేసుకుంది. ఇళ్లల్లో రంగులు వేసే (House Painter) ఆయన తండ్రి, తన కొడుకు భవిష్యత్తు కోసం జీవితాంతం కష్టపడ్డారు. ఐఎస్ఐ కోల్‌కతా (ISI Kolkata) గ్రాంట్ ఫార్మాలిటీస్ పూర్తయిన రెండు రోజులకే, అంటే 2024,జనవరిలో ఆయన కన్నుమూశారు. ఆయన త్యాగానికి ప్రతిఫలంగా తాను అందుకున్న విజయాన్ని తండ్రికి చూపించ లేకపోయాననే బాధ సూరజ్‌ను తీవ్రంగా కలిచివేసింది. ఇందుకోసం తన తల్లిదండ్రుల విజయాన్ని చూడలేకపోయిన ప్రతీ బిడ్డ కోసం 'ఇన్డాట్స్' (Indots) అనే ఒక సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు.అలా తండ్రి రుణం తీర్చుకున్నట్టుగా భావిస్తున్నారు.ఇదీ చదవండి: ఉద్యోగం Vs సంసారం : సింగిల్ మదర్ సునీత సక్సెస్ స్టోరీలక్ష్యాలను సాధించడానికి సరైన సమయం కోసం వేచి చూడకండి. విజయం అనేది కేవలం ప్రతిభపైనే ఆధారపడి ఉండదు, సవాళ్లను ఎదుర్కొంటూ, భయాన్ని వీడి ముందుకు సాగేతత్వంలో ఉంటుంది. మనం ఎక్కడ పుట్టామనేది దాన్ని బట్టి భవిష్యత్తును నిర్ణయించలేం. చిన్న గ్రామంనుంచి వచఇచనా, బైక్‌పై ఫుడ్ డెలివరీ చేసినా, అవేవీ తన ఎదుగుదలను ఆపలేక పోయాయి. పట్టుదలగా సాగితే ఆకాశమే హద్దు అంటారు సూరజ్ బిశ్వాస్. ‘‘నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను. నేను జీవశాస్త్రం వైపు, శరీరం ఎలా పనిచేస్తుంది, మనసు ఎలా పనిచేస్తుంది అనే విషయాలను అర్థం చేసుకోవడం వైపు ఆకర్షితుడయ్యాను. కానీ విచిత్రంగా, ఎల్‌బిఎం (LBM) అనేది ఆ కల అత్యంత ఉన్నతమైన రూపంగా మారింది. నేను ఎప్పుడూ డాక్టర్ కాలేను, కానీ ఆరోగ్యం, ప్రవర్తన, మానవ సామర్థ్యాన్ని మానవాళి అర్థం చేసుకునే విధానాన్ని పెద్ద ఎత్తున మార్చగల విజ్ఞానాన్ని నిర్మిస్తున్నాను.” అని గర్వంగా చెబుతారు.ఇదీ చదవండి: Citizenship16 పత్రాలిచ్చినా; సిటిజెన్‌షిప్‌పై గౌహతి కోర్టు సంచలన తీర్పు -
భర్త వార్నింగ్.. ఆ భార్యను 'అన్నపూర్ణ'గా మార్చింది..!
ధనవంతులు కాబట్టి దానధర్మాలు చేస్తుంటారు అనుకుంటాం. డబ్బులు, నిధులతో పనిలేకుండా..కనీసం తాము బతకడానికే లేకపోయినా గొప్ప ఔదార్యాన్ని చాటుకున్న మనసున్న మారాజులే కాదు మారాణులు కూడా ఉన్నారు. ఆకలి బాధల మధ్య పెరిగి..అనునిత్యం ఆ సమస్యతో బాధపడిన ఆ మహిళే అన్నమో రామచంద్రా అని అల్లాడుతున్న వారి పాలిట అన్నపూర్ణగా మారి ఎందరికో కనువిప్పు కలిగించే మహోన్నతమైన వ్యక్తిగా నిలిచింది. దానం చేయాలంటే ధనంతో పనిలేదని..సాయం చేసే మంచి మనసు ఉండాలని చాటి చెప్పింది. ఆ మహిళే కాజులి బిస్వాస్. ఎవ్వరిని ఆకలితో అలమటించకుండా చేసే తల్లిగా పేరు ఆమెకు. పశ్చిమబెంగాల్‌కి చెందిన కాజులి ఒక పేద కుటుంబంలో జన్మించింది. ఒక పూట భోజనంతో రోజంతా గడపాలి. అలాంటి దుర్భర పరిస్థితుల మధ్య పెరిగింది కాజులి. పేదరిక జీవితంలో ప్రతినిర్ణయాన్ని ఆకలి ఎలా ప్రభావితం చేస్తుందో ఆమె కళ్లారా చవి చూసింది. అప్పుడే ఆమెకు తెలిసింది ఆకలి అనేది తాత్కాలికి సమస్య కానే కాదు. అది ఒక పెద్ద పోరాటం, పెను సమస్యని అర్థం చేసుకుంది. రోడ్డు పక్కన ఆకలితో నకనకలాడుతున్న వాళ్లను చూస్తే కాజులికి మనసు కకలా వికలం అయిపోయేది. ఆ దృశ్యాలు ఆమెను తీవ్రంగా కలిచివేసేవి. వాళ్లలో తనను తాను చూసుకుని బాధపడేది. ఆ కష్టాల కొలిమిలో కాజులి జీవితం మరో ములుపు తిరిగింది. పెళ్లి చేసేస్తే అక్కడైన మంచి జీవితం లభిస్తుందని అంతా నచ్చచెప్పి మరి .. ఆమెకు 15 ఏళ్లకే పెళ్లి చేసేశారు. అందరి అమ్మాయిల్లానే ఇక నుంచి తన జీవితం హాయిగా సాగిపోతుందనుకుంది. అక్కడ మరింత ఘోరం. ఆకలి కోసం అత్యంత ఘోరమైన పోరాటం కనిపించిందామెకు. ఈలోగా ఆమెకు ఒక కొడుకు కూడా పుట్టేశాడు. చిన్నప్పటి నుంచి బాధలు, పెళ్లాయ్యాక కూడా అవే బాధలతో నలిగిపోయిన ఆమె మనసు ఒక అనుహ్య నిర్ణయం తీసుకునేందుకు దారితీసింది. ఈ ఆకలిని చూసి విసుగుపుట్టింది..అందుకే ఆకలి అని బాధపడుతున్న వాళ్లందరికీ అన్నం పెట్టాలని స్ట్రాంగ్‌గా నిర్ణయించుకుంది. అలాగని ఆమె వద్ద ఎలాంటి నిధులు, డబ్బులు లేవు. సహాయం చేసే వ్యక్తులు కూడా లేరు.. తన వల్ల అయ్యింది చేసైనా ఈ మహత్తర కార్యానికి పూనుకోవాలి, ఆకలి బాధలు అడ్డుకట్టవేయాలి.. అని గట్టిగా నిర్ణయించుకుంది. అయితే ఆమె అసాధ్యమైన నిర్ణయానికి భర్త, అతడి కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. ఈ సేవకార్యక్రమాలు చేయాలనుకుంటే తనతో ఉండటమో లేదా రోడ్లపై ప్రజలకు అన్న పెట్టే సేవనో .. ఏదో ఒకటే ఎంచుకోవాల్సిందిగా తెగేసి చెప్పారు. ఇక్కడ కాజులి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఆకలితో అలమటించే అన్నార్తుల కడుపు నింపడమే తన ఆశయం అంటూ దానివైపుకే మొగ్గు చూపింది. ఏదో తీసుకుంది గానీ..అంత మందికి కాదు కదా..తనకే తింటానికి తిండి లేదు ఎలా పెట్టాలన్నది ఆమె ముందున్న ప్రశ్న. అయినాసరే తన చెవిపోగులను తాకట్టు పెట్టి తొలి రోజు రోడ్లపై అలమటిస్తున్న వాళ్ల ఆకలిని నింపింది. తన కొడుకుతో కలిసి ఒక అద్దె ఇంట్లో ఉంటూ ఈ సేవా పనులు చేస్తుండేది. వనరులు తక్కువగా ఉన్నా, సాయం చేసే వాళ్లు లేకున్నా..తనవల్ల అయ్యింది చేస్తూనే ఉండేది. అందుకోసం డబ్బు సంపాదించడానికి ఆహర్నిశలు కష్టపడేది. సంపాదించిన మొత్తం తన జీవనం కోసం కాకుండా..ఇతరుల పొట్ట నింపడమే ధ్యేయంగా వంటలు చేస్తుండేది. కాజులి ప్రచారం కోసం లేదా గుర్తింపు కోసమో ఇది చేయడం లేదని కొద్దిరోజుల్లోనే స్థానిక ప్రజలు గుర్తించారు. ఇవాళ ఆమెకు చాలామంది మద్దతిచ్చేందుకు ముందుకు రావడమే కాదు..కొందరు ఆహార పదార్థాలను విరాళంగా కూడా ఇస్తున్నారు. మరికొందరు ఆమెకు అండగా నిలబడి ప్రోత్సహిస్తున్నారు కూడా. ఇవాళ ప్రతి రోజు దాదాపు 100 మందికి పైగా ఆహారం అందిస్తోంది. అంతేగాదు వీధుల్లో కాజులి రాక కోస ఎదురు చూడటం మొదలైంది. ఆహారం అంటే ఆకలి మాత్రమే కాదని, శ్రద్ధ చూపడం, ఆకలి భయాన్ని పోగొట్టడం అని అంటుందామె. అంతేగాదు అక్కడితో ఆగాలని అనుకోవడం లేదు కాజులి. ఒక అనాథశ్రమాన్ని నిర్మించి అవసరంలో ఉన్న ప్రజలకు సురక్షితమైన వసతి అందించాలన్నదే తదుపరి ధ్యేయమని చెబుతోంది. ఇక్కడ కాజులి కథ సంపద, హోదా వంటి స్థాయిలతో కొలిచేది కాదు. ఆమె ఎంచుకున్న మార్గంలో సాధించిన విజయాన్ని వడ్డించే ప్రతి భోజనపు పళ్లెంలోనో లేక ఇకపై ఆకలితో నిద్రపోని ప్రజల కృతజ్ఞతలోనో చూడొచ్చు. ఆమె కథ తను ఉన్న స్థితికి మించిన నిర్ణయమే అయినా..ఇతరుల మేలు కోరడంతోనే విజయం తనంతాట తాను వొళ్లోకొచ్చి వాలుతుంది అనే చెప్పే స్టోరి. (చదవండి: అరుదైన ఆరోగ్య సమస్యతో పోరాడుతూ..డాక్టర్ అయ్యింది!) -
పశ్చిమ బెంగాల్: రిఫైనరీలో లీకేజీ.. మంటల్లో చిక్కుకున్న కార్మికులు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని హల్దియా ఆయిల్ రిఫైనరీలో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రిఫైనరీ ప్రాంగణంలోని నాఫ్తా రవాణా చేసే ప్రధాన పైప్‌లైన్‌లో ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఈ దుర్ఘటనలో అక్కడ విధులు నిర్వహిస్తున్న 15 మంది కార్మికులు తీవ్రంగా గాయపడినట్లు స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి. VIDEO | West Bengal: A massive fire broke out suddenly in naphtha-carrying pipeline at the Haldia Refinery between 4.00-4.30 AM on Tuesday. Several workers were reportedly injured in the incident. More details are awaited.#Haldia #Fire(Full video available on PTI Videos -… pic.twitter.com/Nz7uHdlIgS— Press Trust of India (@PTI_News) June 30, 2026తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పైప్‌లైన్ నుంచి మంటలు ఎంత వేగంగా వ్యాపించాయంటే.. ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి తప్పించుకునే అవకాశం కూడా లేకపోయింది. దీంతో పలువురు కార్మికులు అగ్నికీలల్లో చిక్కుకుని తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, ఫ్యాక్టరీ యాజమాన్యం అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.ఈ అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. రిఫైనరీ అధికారులు ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించారు. ఈ ప్రమాదంతో హల్దియా పరిసర ప్రాంతాల్లో తీవ్ర కలకలం రేగింది.ఇది కూడా చదవండి: ‘డ్రాగన్ మార్క్’ప్రతీకారం: జపనీస్ కంపెనీలపై చైనా ఉక్కుపాదం -
కుళ్లిన గుడ్లతో ఆ పార్టీ నేత మీద దాడి.. ‘ఎగ్ థెరపీ’ అంటూ..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి టీఎంసీ నేతలపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఉత్తర 24 పరగణాల ఖర్దాహ్‌లో పనిహాటి మున్సిపాలిటీ 13వ వార్డు కౌన్సిలర్ జయంత దాస్ అలియాస్ గోబింద్ దాస్‌పై కొందరు కుళ్లిన గుడ్లు విసిరారు. ఖర్దాహ్ పోలీస్ స్టేషన్ నుంచి బరాక్‌పూర్ సబ్-డివిజనల్ కోర్టుకు పోలీసులు ఆయనను తరలిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.కోర్టుకు తీసుకెళ్తున్న సమయంలో పోలీస్ స్టేషన్ బయట ఉన్న కొందరు జయంత దాస్‌పై కుళ్లిన గుడ్లతో దాడి చేశారు. దీన్ని ఎగ్ థెరపీ అని నిరసనకారులు అభివర్ణించారు. జయంత దాస్‌ను మాజీ పనిహాటి ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్‌కు అత్యంత సన్నిహితుడిగా భావిస్తారు. కుళ్లిన గుడ్లతో దాడి ఘటన తర్వాత కొద్దిసేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. గుడ్లు ఎవరు విసిరారు? నిరసనకు కారణం ఏమిటి? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన తర్వాత భద్రతను కూడా పెంచారు.అవినీతి, వసూళ్లు, అక్రమ భూ వ్యవహారాలు, రాజకీయ హింస ఆరోపణలతో టీఎంసీ నేతలను పోలీసులు వరుసగా అరెస్టులు చేస్తున్నారు. అదే సమయంలో ప్రజలు నిందితులపై దాడులు చేస్తున్నారు. మరోవైపు, కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్‌కు సన్నిహితుడిగా భావించే మాజీ టీఎంసీ కౌన్సిలర్ షమ్స్ ఇక్బాల్‌ను కూడా గార్డెన్ రీచ్ పోలీసులు రూ.70 లక్షల వసూళ్ల కేసులో అరెస్టు చేశారు.North 24 Parganas- Rotten eggs thrown at Panihati TMC councillor Jayanta Das. pic.twitter.com/1P60SspuQ9— News Arena India (@NewsArenaIndia) June 29, 2026 -
సువేందు దూకుడు.. బెంగాల్లో ‘యోగీ’ స్టయిల్ గుండా బిల్లు!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో వ్యవస్థీకృత నేరాలు, హింసాత్మక అల్లర్లపై ఉక్కుపాదం మోపేందుకు ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని ప్రభుత్వం సిద్ధమైంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రవేశపెట్టిన కఠిన చట్టాల తరహాలోనే, రాష్టంలో ‘పశ్చిమ బెంగాల్ పబ్లిక్ సేఫ్టీ అండ్ కంట్రోల్ ఆఫ్ యాంటీ-సోషల్ యాక్టివిటీస్ బిల్, 2026’ను ప్రవేశపెట్టనున్నారు. శాంతిభద్రతలను పూర్తిగా అదుపులోకి తెచ్చే లక్ష్యంతో రూపొందించిన ఈ బిల్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.యోగీ మార్క్.. ఆస్తుల రికవరీఈ ప్రతిపాదిత చట్టంలో అత్యంత కీలకమైన అంశం ఆస్తుల నష్టం రికవరీ నిబంధన. ఉత్తరప్రదేశ్ తరహాలోనే బెంగాల్లో కూడా ఇకపై నిరసనలు, ఊరేగింపులు లేదా అల్లర్ల పేరుతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తే ఊరుకునేది లేదు. హింసకు కారణమైన వారి నుంచే ఆ నష్టాన్ని పైసలతో సహా వసూలు చేసేందుకు ఈ బిల్లు ప్రభుత్వానికి సర్వాధికారాలు కల్పిస్తుంది. దీంతోపాటు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే రౌడీలు, గుండాలను నిర్దేశిత ప్రాంతాల నుండి బహిష్కరించే కఠిన నిబంధనను కూడా ఇందులో చేర్చారు.ముందస్తు అరెస్టులు.. పెరగనున్న పవర్స్నేరాలు జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం మాత్రమే కాకుండా, ముందస్తుగానే అసాంఘిక శక్తులను అడ్డుకునేందుకు 'ప్రివెంటివ్ డిటెన్షన్' (ముందస్తు నిర్బంధం) నిబంధనను ప్రవేశపెడుతున్నారు. సమాజంలో అలజడులు సృష్టించే అవకాశం ఉన్నట్లు అనుమానం వస్తే చాలు, వారిని ముందస్తుగా అరెస్టు చేయవచ్చు. ఇది గత నేరాలకు శిక్ష కాదని, భవిష్యత్తులో అల్లర్లను ఆపేందుకేనని ప్రభుత్వం చెబుతోంది. దీనికి తోడుగా పోలీసులకు తనిఖీలు (సెర్చ్), ఆస్తుల జప్తు (సీజర్) విషయంలో మరింత విస్తృతమైన అధికారాలను ఈ చట్టం కల్పించనుంది.హక్కుల రక్షణ.. రానున్న సవాళ్లుఅయితే ఈ ముందస్తు నిర్బంధాల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు బిల్లులో కొన్ని రక్షణలు కూడా కల్పించారు. ప్రతి నిర్బంధ ఉత్తర్వును ఒక ఉన్నత స్థాయి ‘అడ్వైజరీ బోర్డు’ సమీక్షిస్తుంది. అరెస్ట్ అయిన వారికి తమ వాదనను వినిపించుకునే హక్కు ఉంటుంది. ప్రజా ప్రయోజనాలకు భంగం కలగనంత వరకు అరెస్టయిన వ్యక్తికి కారణాలను వెల్లడిస్తారు. ఈ బిల్లు పౌర హక్కులకు, చట్టపరమైన ప్రక్రియకు విఘాతం కలిగిస్తుందంటూ విపక్షాలు, విమర్శకులు ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. -
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో నేడు యూసీసీ బిల్లు!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) బిల్లును ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమయ్యింది. సోమవారమే అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. మతంతో సంబంధం లేకుండా వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత వంటి విషయాల్లో ప్రజలందరికీ ఒకే చట్టాన్ని వర్తింపజేయడమే యూసీసీ ఉద్దేశం. పౌరులందరికీ ఒకే రకమైన పౌర చట్టాలు ఉండాలని బీజేపీ చెబుతోంది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే యూసీసీ బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదింపజేయాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి సువేందు వెల్లడించారు. గుజరాత్, ఉత్తరాఖండ్, అస్సాం తరహాలోనే ఈ చట్టాన్ని పశ్చిమ బెంగాల్లోనూ అమలు చేస్తామని ప్రకటించారు. -
గుడ్డు పోయింది!
బడుల్లో పిల్లల ప్లేట్లలో మధ్యాహ్న భోజనంలో (మిడ్డే మీల్) గుడ్డు ఇక కనిపించకపోవచ్చు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం.. ఆ భోజనాల తయారీ బాధ్యతలను ఇస్కాన్ (ISKCON)కు అప్పగించాలని నిర్ణయించడమే ఇందుకు కారణం. అలాగే.. గుడ్ల స్థానంలో సోయాబీన్, రాజ్మా, పనీర్ వంటి శాఖాహార పదార్థాలను అందించాలని ప్రతిపాదించింది. దీంతో పిల్లల పోషకాహారం, మతపరమైన భావజాలం, ప్రభుత్వ విధానాలపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది.విద్యార్థులకు మరింత నాణ్యమైన, పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో మిడ్డే మీల్ బాధ్యతలను ఇస్కాన్‌కు అప్పగిస్తున్నాం. ఇందుకోసం ఒక్కో విద్యార్థిపై ఆహార వ్యయాన్ని రూ.6.50 నుంచి రూ.10కు పెంచుతున్నాం అని స్వయంగా ప్రకటించారు ముఖ్యమంత్రి సువేందు అధికారి. అయితే.. ఇస్కాన్ ప్రతినిధులు గుడ్లు బంద్ చేస్తామని చెబుతున్నారు. బదులుగా ఇచ్చే సోయాబీన్, రాజ్మా, పనీర్‌లలో కూడా తగిన ప్రోటీన్లు ఉంటాయని, పిల్లలకు అవసరమైన పోషకాలు అందుతాయని చెబుతున్నారు. అటు ప్రతిపక్షాలు, ఇటు పోషకాహార నిపుణులు మాత్రం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పిల్లల ఆరోగ్యాన్ని పక్కనపెట్టి, ఆహారపు అలవాట్లను భావజాలం ఆధారంగా మార్చే ప్రయత్నమని విమర్శిస్తున్నాయి.ఇదేం మొదటిసారి కాదు!స్కూల్ మెనూలో నుంచి గుడ్లను తొలగించడం ఇదే మొదటిసారి కాదు. 2015లో మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం మిడ్డే మీల్లో గుడ్లను చేర్చేందుకు నిరాకరించింది. 2025లో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా గుడ్లు, చిరుధాన్యాలతో తయారయ్యే కొన్ని వంటకాలకు ఇచ్చే నిధులను ఉపసంహరించుకుంది.పోషకాహారమే ప్రధాన ఆందోళనభారతదేశంలో పేద కుటుంబాలకు చెందిన లక్షలాది మంది పిల్లలకు స్కూల్ మధ్యాహ్న భోజనమే రోజులో అత్యంత పోషకాహారం కలిగిన భోజనం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, పట్టణ మురికివాడల్లో చదివే పిల్లలకు ఇది మరింత కీలకం. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) ప్రకారం దేశంలో ఐదేళ్లలోపు పిల్లల్లో సుమారు 19 శాతం మంది ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం (Wasting), 29.3 శాతం మంది ఎదుగుదల లోపం (Stunting)తో బాధపడుతున్నారు.పశ్చిమ బెంగాల్లో ఈ పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది. ఇలాంటి సమయంలో గుడ్లను తొలగించడం సరైన నిర్ణయమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.గుడ్డే ఎందుకు కీలకం?గుడ్డు తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు అందించే ఆహారంగా వైద్య నిపుణులు భావిస్తారు. ఇందులో నాణ్యమైన ప్రోటీన్‌తో పాటు విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. సోయాబీన్, రాజ్మా, పనీర్‌లలో కూడా పోషకాలు ఉన్నప్పటికీ, వాటి ధర, వండేందుకు పట్టే సమయం, పిల్లలు ఇష్టంగా తినే అంశాలు గుడ్డుతో పోలిస్తే భిన్నంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.బెంగాలీల ఆహార సంస్కృతిపైనా చర్చబెంగాల్లో అత్యధిక మంది ప్రజలు మాంసాహారులు. చేపలు, మాంసం, గుడ్లు అక్కడి ఆహార సంస్కృతిలో భాగంగా ఉన్నాయి. చేపల విషయంలో బెంగాల్ ఎన్నికల సమయంలో జరిగిన రాజకీయం అందరికీ తెలిసిందే. అలాంటి రాష్ట్రంలో స్కూల్ మెనూలో గుడ్లను తొలగించడం స్థానిక ఆహారపు అలవాట్లకు కూడా విరుద్ధమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.రాజకీయమా?.. పోషకాహారమా?విమర్శకుల అభిప్రాయం ప్రకారం, ప్రభుత్వ సంక్షేమ పథకాలలో అందించే ఆహారం మతపరమైన లేదా రాజకీయ భావజాలం ఆధారంగా కాకుండా, శాస్త్రీయ పోషకాహార ప్రమాణాల ఆధారంగా ఉండాలి. పేద పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు అంటున్నారు. -
బెంగాల్ సీఎం సువేందు కీలక నిర్ణయం.. ఇక వాళ్లందరూ..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని బీజేపీ ప్రభుత్వం ప్రస్తుతం కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) అమలు బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపు యూసీసీ అమలు చేస్తామని బీజేపీ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.“యూసీసీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లోనే అది చట్టంగా మారొచ్చు. ఇది ఒక మైలురాయి అవుతుంది. ఒకే దేశం, ఒకే చట్టం అనే మా పార్టీ విధానానికి ఇది అనుగుణంగా ఉంది” అని బీజేపీకి చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే జాతీయ మీడియాకు తెలిపారు. గురువారం రాత్రి రాష్ట్ర అసెంబ్లీలో వ్యాపార సలహా సమావేశం జరిగింది. యూసీసీ సహా పలు బిల్లులు ప్రవేశపెట్టడంపై చర్చ జరిగిందని జాతీయ మీడియా పేర్కొంది. “సోమవారం ఈ బిల్లును సభలో ఉంచే అవకాశం ఉంది” అని తెలిపింది.ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) అనేది మత ఆధారిత వ్యక్తిగత చట్టాలకు బదులుగా పౌరులందరికీ వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత అంశాల్లో ఒకే విధమైన లౌకిక చట్టాలను అమలు చేసే ప్రతిపాదిత వ్యవస్థ. రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 ఆధారంగా రూపొందిన ఈ ప్రతిపాదన, లింగ న్యాయం, జాతీయ సమైక్యతను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఉంది. చరిత్రాత్మకంగా హిందూ వివాహ చట్టం, ముస్లిం వ్యక్తిగత చట్టం వంటి చట్టాలు వ్యక్తిగత వ్యవహారాలను నియంత్రిస్తున్నాయి.ఉత్తరాఖండ్‌లో బీజేపీ ఇప్పటికే యూసీసీ అమలు చేసింది. గుజరాత్లో కూడా ఈ చట్టాన్ని ఆమోదించింది. అస్సాం యూసీసీ అమలు చేసిన మూడో బీజేపీ పాలిత రాష్ట్రంగా నిలిచింది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలో లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్‌పై కఠిన చట్టాలు తీసుకొస్తామని కూడా హామీ ఇచ్చింది.రాష్ట్ర “సామాజిక సమగ్రత, భౌగోళిక సమగ్రత”ను రక్షించడమే తమ లక్ష్యమని కూడా పేర్కొంది. అఖిల భారత ముస్లిం వ్యక్తిగత చట్ట మండలి సభ్యుడు ఉజ్మా ఆలం మాట్లాడుతూ.. యూసీసీ అమలు మైనారిటీల హక్కులకు భంగం కలిగిస్తుందని అన్నారు. “ఇది మా హక్కుల ఉల్లంఘన. మాపై ఏదీ బలవంతంగా రుద్దకూడదు. పశ్చిమ బెంగాల్‌లోని బీజేపీ ప్రభుత్వం దీనిని అర్థం చేసుకోవాలి” అని ఆయన చెప్పారు. -
వృద్ధ కళాకారుడి బతుకుపోరాటం.. అండగా ఆనంద్ మహీంద్ర
చప్పట్లు కొట్టే ప్రేక్షకులు లేరు. పెద్ద వేదిక లేదు. కానీ చేతిలో వయోలిన్, హృదయంలో సంగీతం మాత్రం ఇప్పటికీ అలాగే ఉన్నాయి. వీధుల్లో దశాబ్దాలుగా వయోలిన్ వాయిస్తూ జీవనం సాగిస్తున్న 80 ఏళ్ల భగవాన్ మల్లిక్ కథ ఇప్పుడు దేశవ్యాప్తంగా హృదయాలను కదిలిస్తోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సైతం ఆయన పరిస్థితికి చలించి సాయం చేయడానికి ముందుకు రావడంతో ఈ కథ మరింత మందికి చేరింది.పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు చెందిన భగవాన్ మాలిక్.. యుక్తవయసులోనే తల్లిదండ్రులను కోల్పోయారు. అయితే తండ్రి నేర్పించిన సంగీతమే ఆయనకు ఆధారం అయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు వీధుల్లో వయోలిన్ వాయిస్తూ వచ్చిన డబ్బుతోనే జీవనం సాగిస్తున్నారు. వయసు 80 దాటినా, కంటి చూపు మందగించినా, చేతిలోని వయోలిన్ పాతబడిపోయి శిథిలావస్థకు చేరినా ఆయన సంగీత ప్రయాణం మాత్రం ఆగలేదు.ప్రతిరోజూ సాయంత్రం నుంచి రాత్రి వరకు కోల్‌కతాలోని న్యూ టౌన్ ప్రాంతంలో వయోలిన్ వాయిస్తూ కనిపించే మల్లిక్ రోజుకు వంద రూపాయల వరకే సంపాదిస్తున్నారని తెలుస్తోంది. ఆయన భార్య కూడా తరచూ పక్కనే కూర్చొని తోడుగా ఉంటోంది. అద్దె ఇంట్లో జీవిస్తున్న ఈ వృద్ధ దంపతుల పరిస్థితిని.. కంటెంట్ క్రియేటర్ ఆరాధనా చటర్జీ సోషల్ మీడియాలో పంచుకోవడంతో కథనం వైరల్‌గా మారింది.ఈ వీడియోను చూసిన ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) స్పందిస్తూ, “ఆయన సంగీతంపై ఉన్న అభిరుచి నన్ను కదిలించింది. నేను కూడా సాయం చేయాలనుకుంటున్నాను. ఆయనకు ఎలా సహాయం చేయాలో వివరాలు కావాలి” అని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆయన స్పందనతో మరింత మంది భగవాన్ మల్లిక్ పరిస్థితి గురించి తెలుసుకుని సహాయం చేసేందుకు ముందుకొచ్చారు.I’d like to contribute, along with many others, who I know will be moved by his passion…The video didn’t seem to provide details of how & where. https://t.co/hAkvZDbWev— anand mahindra (@anandmahindra) June 24, 2026ఇప్పటికే ఆరాధనా చటర్జీ మల్లిక్‌కు కొత్త వయోలిన్‌ను బహుమతిగా అందించడమే కాకుండా, ప్రజల సహకారంతో లక్ష రూపాయల నిధులు కూడా సమీకరించినట్లు వెల్లడించారు. ఒక సాధారణ వీడియోతో మొదలైన ఈ ప్రయత్నం ఇప్పుడు దేశవ్యాప్తంగా మానవత్వానికి నిదర్శనంగా మారింది. దశాబ్దాలుగా జీవన పోరాటంలో సంగీతాన్ని ఆయుధంగా మార్చుకున్న భగవాన్ మల్లిక్ కథ... ప్రతిభకు వయసు అడ్డుకాదని, నిజమైన కళాకారుడు పరిస్థితులు ఎంత కఠినమైనా తన కళను వదలడని మరోసారి గుర్తు చేస్తోంది. -
గోడౌన్ పైకప్పు కూలిన ఘటన.. మమతకు షాకిచ్చేలా సీఎం సువేందు నిర్ణయం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో ఓ గోడౌన్ పైకప్పు కూలి ఐదుగురు మృతి చెందిన నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. గత మమతా బెనర్జీ ప్రభుత్వం నుంచి ఆమోదం పొంది, నిర్మాణంలో ఉన్న అన్ని వాణిజ్య ప్రాజెక్టుల పనులను జులై 31 వరకు నిలిపివేస్తూ, వాటిపై సమగ్ర ఆడిట్ నిర్వహించాలని సువేందు అధికారి ఆదేశించారు.ప్రమాద స్థలాన్ని సందర్శించిన తర్వాత ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు. కూలిపోయిన గిడ్డంగికి సంబంధించిన భవన ప్లానింగ్‌లో లోపాలు ఉన్నట్లు తనకు అందిన ప్రాథమిక నివేదికలు సూచించాయని చెప్పారు.“కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌కు, పట్టణాభివృద్ధి-మున్సిపల్ వ్యవహారాల శాఖకు నేను ఆదేశాలు ఇచ్చాను. గత ప్రభుత్వం ఆమోదించిన నిర్మాణంలో ఉన్న అన్ని వాణిజ్య భవనాల పనులు నిలిపివేయాలి. చెరువులను పూడ్చి అనుమతి పొందిన ప్రాజెక్టులు కూడా ఇందులో ఉంటాయి. వీటన్నింటిపైనా ఆడిట్ జరుగుతుంది” అని ముఖ్యమంత్రి చెప్పారు.“ఇలాంటి ప్రాంతాల్లో నిర్మాణ పనులు జులై 31 వరకు నిలిపివేస్తాం” అని సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అధికారి చెప్పారు. తర్వాత ఈ ఆడిట్ ప్రక్రియను హౌరా, బిధాన్నగర్ మున్సిపల్ ప్రాంతాలకు విస్తరిస్తామని చెప్పారు.ఈ ఆడిట్‌ను ప్రజాపనుల శాఖ, పౌర రక్షణ, అగ్నిమాపక-అత్యవసర సేవలు, కోల్‌కతా పోలీసు, కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో కూడిన బృందం నిర్వహిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు.“ఈ బృందం ప్రధాన కార్యదర్శి మార్గదర్శకత్వంలో పనిచేస్తుంది. స్థల ప్రణాళికలు, భవన ప్రణాళికలు పరిశీలించి, ప్రత్యక్ష తనిఖీలు నిర్వహించి నివేదిక సమర్పిస్తుంది” అని చెప్పారు. కోల్‌కతా మెట్రో, శ్యామ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ అథారిటీ భూములను లీజుకు తీసుకుని నిర్మించిన ప్రాజెక్టులు కూడా ఆడిట్ పరిధిలోకి వస్తాయని అధికారి చెప్పారు.“నిబంధనలు, భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అన్నది తెలుసుకోవడమే లక్ష్యం. ఆడిట్ పరిధిలోకి వచ్చే ప్రతి ప్రాజెక్టును పరిశీలిస్తాం” అని చెప్పారు. ప్రధాన కార్యదర్శి పర్యవేక్షణలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తుందని తెలిపారు.అయితే ఆసుపత్రులు, అగ్నిమాపక మౌలిక వసతుల వంటి అత్యవసర సేవలకు సంబంధించిన నిర్మాణ పనులపై ఈ నిలుపుదల ప్రభావం ఉండదని చెప్పారు. “ఆసుపత్రులు, అత్యవసర సేవలకు సంబంధించిన ప్రాజెక్టులు కొనసాగుతాయి. అవి అత్యవసరాలకు చెందినవి” అని ముఖ్యమంత్రి తెలిపారు. -
కోలుకోలేని షాక్.. మమతా కోటలో మహువా చిచ్చు..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి తర్వాత టీఎంసీ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోగా, తాజాగా ఆ పార్టీ ఫైర్‌బ్రాండ్, లోక్‌సభ ఎంపీ మహువా మొయిత్రా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కార్చిచ్చు రేపాయి.బీజేపీ అగ్రనేత,పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారిపై ఆమె అసాధారణ రీతిలో ప్రశంసలు కురిపించడం పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. జాతీయ మీడియా ఇంటర్వ్యూలో మహువా మొయిత్రా మాట్లాడుతూ.. తమ మధ్య ఉన్న రాజకీయ వైరాన్ని పక్కనబెట్టి, సువేందు అధికారితో తనకున్న వ్యక్తిగత, భావోద్వేగ అనుబంధాన్ని బహిరంగంగా పంచుకున్నారు.2014 పార్లమెంట్ ఎన్నికల్లో నాకు లోక్‌సభ టికెట్ దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాను. ఆ రాత్రంతా ఏడ్చాను. ఆ క్లిష్ట సమయంలో సువేందు అధికారి నన్ను ఓదార్చి, ధైర్యం చెప్పారు. 2016 కరీంపూర్ శాసనసభ ఎన్నికల్లో తన గెలుపు కోసం సువేందు ఎంతో కృషి చేశారని, తన తరఫున మొదటి రాజకీయ ప్రచార ర్యాలీని ఆయనే నిర్వహించారు. ప్రస్తుతం ఇద్దరి రాజకీయ మార్గాలు వేరైనప్పటికీ.. ఆయనతో ఉన్న ఎమోషనల్ బాండింగ్‌ను నేనెప్పటికీ మర్చిపోలేనని ఆమె స్పష్టం చేశారు.పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీకి అత్యంత విధేయురాలిగా, కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిరంతరం విరుచుకుపడే నేతగా మహువా మొయిత్రాకు గుర్తింపు ఉంది. అలాంటి ఫైర్‌బ్రాండ్ లీడర్, ఇప్పుడు తృణమూల్ పార్టీ ప్రధాన శత్రువుగా భావించే సువేందు అధికారిని ప్రశంసించడంపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఆమె కూడా టీఎంసీని వీడి బీజేపీలో చేరే అవకాశం ఉందన్నచర్చ మొదలైంది. ఎన్నికల పరాజయం తర్వాత టీఎంసీ ఇప్పటికే బలహీనపడుతుండగా, మహువా మొయిత్రా కూడా త్వరలోనే పార్టీ మారే యోచనలో ఉన్నారా అనే చర్చకు ఈ ఇంటర్వ్యూ తెరలేపింది. -
రెండేళ్ల నిరీక్షణ.. సీఎం హామీతో తల్లి కన్నీళ్లు
యువ డాక్టర్ హత్యాచార కేసు దేశాన్ని కుదిపేసింది. రెండేళ్లు గడిచినా.. బాధితురాలి కుటుంబం న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తూనే ఉంది. ఈ క్రమంలో న్యాయం జరుగుతుందంటూ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని విన్న బాధితురాలి తల్లి భావోద్వేగానికి గురయ్యారు. కళ్లలో నీళ్లు తిరిగాయి. “అధికారం కోసం కాదు.. నా కూతురికి న్యాయం కోసమే రాజకీయాల్లోకి వచ్చాను” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సభలో హృదయాలను కదిలించాయి.పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై జరిగిన చర్చ సందర్భంగా భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి. ముఖ్యమంత్రి సువేందు అధికారి Suvendu Adhikari మాట్లాడుతూ.. సంచలనం సృష్టించిన ఆర్జీ కర్ (RG Kar) మెడికల్ కాలేజ్ వైద్యురాలి కేసు గురించి మాట్లాడారు..“ఆర్జీ కర్ కేసులో తప్పకుండా న్యాయం జరుగుతుంది. బెంగాల్ ప్రజలు అభయకు(బాధితురాలికి పెట్టిన పేరు) న్యాయం జరగాలని ఓటు వేశారు” అని సీఎం ప్రకటించారు.ఈ మాటలు విన్న వెంటనే బాధితురాలి తల్లి.. పానిహటి ఎమ్మెల్యే రత్నా దేవనాథ్ (Ratna Debnath) భావోద్వేగానికి గురయ్యారు. సభలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ సమయంలో తోటి ఎమ్మెల్యేలు ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు.A deeply emotional scene in the Assembly. As Ratna Debnath broke down, CM @SuvenduWB Da’s message was clear: Bengal will do justice to victims of RG KAR & punish my culprits. pic.twitter.com/7L62uLGYLQ— Pradeep Bhandari(प्रदीप भंडारी)🇮🇳 (@pradip103) June 23, 2026నా కూతురి కోసమే.. ఆర్జీ కర్ కేసులో న్యాయం కోసం వీధుల నుంచి న్యాయస్థానాల వరకు పోరాడిన రత్నా దేవనాథ్.. చివరకు రాజకీయాలనే మరో వేదికగా ఎంచుకున్నారు. 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఉత్తర 24 పరగణాల జిల్లాలోని పానిహటి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. మహిళల భద్రత, తన కుమార్తెకు న్యాయం అనే అంశాలనే ప్రధాన అజెండాగా తీసుకుని ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థి తీర్థంకర్ ఘోష్‌పై 28,836 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. రత్నా దేవనాథ్‌కు 87,977 ఓట్లు రాగా, ప్రత్యర్థి అభ్యర్థికి 59,141 ఓట్లు లభించాయి. రాజకీయాల్లోకి రావడంపై ఆమె అప్పట్లో స్పందిస్తూ.. “వ్యవస్థలో ఉండి పోరాడితేనే నా కూతురికి న్యాయం సాధించగలనని భావించాను” అని చెప్పారు. ఇప్పుడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి న్యాయం జరుగుతుందని ప్రకటించగానే, రెండేళ్లుగా తన గుండెల్లో దాచుకున్న బాధ ఒక్కసారిగా కన్నీటి రూపంలో బయటపడింది.ఆనాడు ఘోరంగా..2024 ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్& హాస్పిటల్లో.. విధుల్లో ఉన్న 31 ఏళ్ల పీజీ ట్రైనీ డాక్టర్ మృతదేహం ఆసుపత్రి ప్రాంగణంలో లభించింది. దర్యాప్తులో ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు తేలింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా వైద్య వర్గాల్లో, మహిళా సంఘాల్లో తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది. జస్టిస్ ఫర్ అభయ పేరిట వైద్య సిబ్బంది అంతా ఉద్యమంలో పాల్గొన్నారు. బాధితురాలి అసలు పేరును వెల్లడించకుండా నిరసనకారులు ఆమెను ‘అభయ’ (నిర్భయ, భయంలేని) అనే ప్రతీకాత్మక పేరుతో సంబోధించారు.కేసులో ఇప్పటివరకు ఏం జరిగింది?ఈ కేసులో కోల్‌కతా పోలీసులకు చెందిన సివిక్ వాలంటీర్ సంజయ్ రాయ్ ప్రధాన నిందితుడిగా దోషిగా తేలాడు. అతడికి జీవిత ఖైదు విధించారు. అయితే ఈ ఘటన వెనుక మరింత పెద్ద కుట్ర ఉందన్న ఆరోపణలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. పవర్ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వ్యక్తులు ఇందులో భాగమయ్యారని, అప్పటి మమతా బెనర్జీ ప్రభుత్వ హయాంలో నిజాలను దాచిపెట్టే ప్రయత్నం జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. బెంగాల్ పోలీసులు విఫలమయ్యారన్న విమర్శల నేపథ్యంలో.. కేసును సీబీఐకి అప్పగించారు. అప్పటి నుంచి దర్యాప్తు కొనసాగుతూనే వస్తోంది.ముగ్గురు ఐపీఎస్‌లపై వేటుతాజాగా ఆర్జీకర్ కేసు స్టేటస్‌ను సీఎం సువేందు అధికారి అసెంబ్లీలో తెలియజేశారు. కేసు దర్యాప్తులో లోపాల కారణంగా ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. అలాగే ఘటన సమయంలో ఆసుపత్రి ప్రిన్సిపాల్‌గా ఉన్న సందీప్ ఘోష్(Sandip Ghosh) ను కూడా తొలగించినట్లు చెప్పారు. “ఈ కేసులో ఏదీ దాచిపెట్టం. పూర్తి నిజం బయటకు తీసుకొస్తాం” అని ఆయన హామీ ఇచ్చారు.ఉపేక్షించేది లేదుఆర్జీ కర్ కేసుతో పాటు హన్స్‌ఖాలి, కామ్దుని, కస్బా లా కాలేజ్, రాంపూర్హాట్ వంటి పలు అత్యాచార, మహిళలపై దాడుల కేసులను ప్రస్తావించిన సీఎం.. తమ ప్రభుత్వం మహిళలపై నేరాల విషయంలో ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అనుసరిస్తోందని ప్రకటించారు. -
పిడుగుల ఊచకోత: ఒకే రోజు 11 మంది దుర్మరణం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో ప్రకృతి కన్నెర్ర జేసింది. మంగళవారం కురిసిన భారీ వర్షాలు, ఈదురు గాలులతో కూడిన వాతావరణం బీభత్సం సృష్టించగా.. వేర్వేరు ప్రాంతాల్లో సంభవించిన పిడుగుపాటు సంఘటనల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా ముర్షిదాబాద్-మాల్దా సరిహద్దులోని ఒక ఫెర్రీ ఘాట్ వద్ద ప్రయాణికులు ఆశ్రయం పొందుతున్న సమయంలో పిడుగు పడటంతో ఒకే చోట నలుగురు మృతి చెందడం పెను విషాదాన్ని నింపింది.ఫెర్రీ ఘాట్ వద్ద ఊహించని ఘోరకలిముర్షిదాబాద్లోని ధులియాన్ నుండి మాల్దాలోని శోవాపూర్ వైపు 25 నుండి 30 మంది ప్రయాణికులతో వెళ్లిన ఒక పడవ భాగీరథి నదిని దాటి ఒడ్డుకు చేరింది. అప్పటికే తుఫాను తీవ్రం కావడంతో, ప్రయాణికులు నది ఒడ్డున ఉన్న ఒక పూరిపాక కింద తలదాచుకున్నారు. సరిగ్గా అదే సమయంలో ఆ ప్రాంతంపై పిడుగు పడటంతో అక్కడికక్కడే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను మాల్దా జిల్లాకు చెందిన అసదుల్లా షేక్ (80), అన్సార్ షేక్ (45), కొచ్చి షేక్ (25) మరియు సోరాపూర్కు చెందిన ఏక్రాముల్ షేక్ (80)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో 15 మంది గాయపడగా, వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో జంగీపూర్ సబ్-డివిజనల్ ఆసుపత్రికి తరలించారు.పొలాల్లో పనిచేస్తుండగా కాటేసిన మృత్యువుమాల్దా జిల్లాలోని బైష్నాబ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జైన్పూర్ గ్రామంలో జనపనార పొలంలో పనిచేస్తున్న సలేక్ మియా (35), జహంగీర్ మియా (29) అనే ఇద్దరు సోదరులు పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మరణించారు. అలాగే, కూచ్ బెహార్ జిల్లాలో పశువులను ఇంటికి తోలుకువస్తున్న మేనకా బర్మన్ (59) అనే మహిళతో పాటు, వ్యవసాయ పొలంలో పనిచేస్తున్న అర్మాన్ హుస్సేన్ (20) అనే యువకుడు పిడుగుపాటుకు బలయ్యారు. పురూలియా జిల్లాలో కూడా వేర్వేరు చోట్ల కేశబ్ మహతో (48), ప్రతిమా మహతో (54) అనే ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు.ఫోన్ మాట్లాడుతుండగా పోయిన ప్రాణంఉత్తర 24 పరగణాల జిల్లా పరిధిలోని కాంచ్రాపారాలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. వివేకానంద సర్కార్ (38) అనే వ్యక్తి తన ఇంటి సమీపంలోని మైదానంలో నిలబడి మొబైల్ ఫోన్లో మాట్లాడుతుండగా ఒక్కసారిగా అతనిపై పిడుగు పడింది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా ప్రతికూల వాతావరణం కొనసాగుతుండటంతో అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. బాధితులకు అందుతున్న వైద్య సహాయాన్ని, ఆస్తి నష్టాన్ని అంచనా వేస్తున్నారు.ఇది కూడా చదవండి: కేరళ లాటరీపై ‘కాగ్’ సంచలన నివేదిక -
టీఎంసీ సంక్షోభం.. అసలు ట్విస్ట్ ఇప్పుడే మొదలు!
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ప్రతిపక్ష తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో తిరుగుబాటు వర్గాలు పార్టీ మమతా బెనర్జీకి షాక్‌ల మీద షాకులు ఇస్తున్నాయి. ఇప్పటికే ఎంపీల వర్గం విలీనం పేరుతో వేరు కుంపటి పెట్టుకున్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యేల వర్గం ఆమెను పార్టీ చైర్పర్సన్ పదవి నుంచి తొలగించినట్లు ప్రకటించడమే కాకుండా.. కొత్త నాయకత్వ నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించుకుంది. అంతేకాదు ఈ విషయమై ఎన్నికల సంఘాన్ని ఆశ్రయిస్తామని కూడా చెబుతోంది. దీంతో టీఎంసీలో అంతర్గత సంక్షోభం మరో మలుపు తిరిగినట్లైంది.ప్రతిపక్ష నేత(తాత్కాలిక) రితబ్రత బెనర్జీ (Ritabrata Banerjee) నేతృత్వంలోని అసంతృప్త వర్గం సోమవారం కోల్‌కతాలోని న్యూ టౌన్లో ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, కౌన్సిలర్లు సహా దాదాపు 500 మంది టీఎంసీ నాయకులు హాజరైనట్లు తిరుగుబాటు వర్గం ప్రకటించింది. ఈ సమావేశంలో 30 మంది సభ్యులతో కూడిన జాతీయ కార్యవర్గాన్ని (National Working Committee) ఏర్పాటు చేస్తూ, తామే అసలైన తృణమూల్ కాంగ్రెస్ అని ప్రకటించారు.కొత్త అధినేత అరూప్ రాయ్సమావేశంలో ఎమ్మెల్యే అనూప్ రాయ్‌ను కొత్త చీఫ్‌గా ఎన్నుకున్నట్లు తిరుగుబాటు వర్గం వెల్లడించింది. అలాగే మాజీ కోల్‌కతా మేయర్ ఫర్హిద్ హకీమ్ , అరోప్ బిశ్వాస్, రతిన్ ఘోష్, సబీనా యాస్మిన్‌లను ఉపాధ్యక్షులుగా నియమించారు. రితబ్రత బెనర్జీ, జావేద్ ఖాన్, సందీపన్ సాహాలను ప్రధాన కార్యదర్శులుగా, అఖ్రుజ్జమాన్ అన్సారిని ఖజానాదారుగా నియమించినట్లు ప్రకటించారు.ఎవరీ అరూప్?అరూప్ రాయ్ పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. హౌరా ప్రాంతానికి చెందిన ఆయన, తృణమూల్ కాంగ్రెస్ ఆవిర్భావం నుంచి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. హౌరా సెంట్రల్ నియోజకవర్గం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన, మమత ప్రభుత్వంలో మంత్రిగానూ పనిచేశారు. ప్రస్తుతం టీఎంసీలో తిరుగుబాటు వర్గం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో అరూప్ రాయ్‌ను పార్టీ చైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నట్లు ప్రకటించడం రాజకీయంగా సంచలనంగా మారింది. ఒకప్పుడు మమతకు నమ్మినబంటుగా ఉన్న నేతే ఇప్పుడు ఆమెకు ప్రత్యామ్నాయ నాయకుడిగా ముందుకు రావడం చర్చనీయాంశంగా మారింది.మమతకి మరో చాన్స్మమత బెనర్జీని పార్టీ నుంచి పూర్తిగా దూరం చేయలేదని, ఆమె కోరుకుంటే ప్రధాన సలహాదారుగా (Chief Advisor) వ్యవహరించవచ్చని తిరుగుబాటు వర్గం వ్యాఖ్యానించడం రాజకీయంగా మరింత చర్చనీయాంశమైంది. పార్టీ రాజ్యాంగం ప్రకారం ప్రతి మూడేళ్లకోసారి జాతీయ కార్యవర్గాన్ని పునర్వ్యవస్థీకరించాల్సి ఉండగా, 2022లో ఏర్పాటైన కమిటీ గడువు ముగిసినా కొత్త కమిటీ ఏర్పాటు చేయలేదని వారు ఆరోపిస్తున్నారు.మమత, అభిషేక్ ఫొటోలకు చోటు లేదు!తిరుగుబాటు వర్గం నిర్వహించిన సమావేశంలో టీఎంసీ పార్టీ గుర్తు కనిపించినప్పటికీ, మమత బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఫొటోలు కనిపించకపోవడం గమనార్హం. ఇది పార్టీపై తమ హక్కును ప్రకటించే ప్రయత్నంగా విశ్లేషకులు భావిస్తున్నారు.టీఎంసీ క్రమశిక్షణా చర్యలుమరోవైపు అధికారిక టీఎంసీ నాయకత్వం కూడా వేగంగా స్పందించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఫిర్హాద్ హకీమ్, అరోప్ బిశ్వాస్, అరూప్ రాయ్, జావేద్ ఖాన్, రతిన్ ఘోష్, బిప్లబ్ మిత్రా, స్నేహాశిష్ చక్రవర్తి, సబీనా యాస్మిన్ తదితరులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.ఎంపీల దారి వేరే..!టీఎంసీలో అసంతృప్తి ఎమ్మెల్యేలకే పరిమితం కాలేదు. ఇప్పటికే 20 మంది తిరుగుబాటు ఎంపీలు పార్టీకి గుడ్‌బై చెబుతూ **నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (NCPI)**లో విలీనమయ్యారు. అంతేకాదు, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ప్రకటించారు. త్రిపురలో వెయ్యి ఓట్లకే పరిమితమైన ఓ అనామక పార్టీ ఒక్కసారిగా జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారడం విశేషం.ఒరిజినల్ టీఎంసీ ఏది?పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే టీఎంసీలో అసంతృప్తి స్వరాలు వినిపించడం మొదలైంది. అయితే పార్టీ ఆవిర్భావం తర్వాత ఇంత పెద్ద స్థాయిలో నాయకత్వానికే సవాల్ విసిరిన ఘటన ఇదేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవైపు తిరుగుబాటు వర్గం తమదే అసలైన టీఎంసీ అని ప్రకటిస్తుండగా, మరోవైపు అధికారిక నాయకత్వం క్రమశిక్షణా చర్యలకు దిగింది. దీంతో పార్టీ గుర్తు, సంస్థాగత హక్కులు, నాయకత్వంపై పోరు మరింత ముదిరే సంకేతాలు కనిపిస్తున్నాయి.అసలు ట్విస్ట్ ఇప్పుడే మొదలు!ఇప్పటివరకు ఇది కేవలం రాజకీయ తిరుగుబాటులా కనిపించినా.. అసలు పోరు ఇకపై ఎన్నికల సంఘం వద్ద జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. "అసలైన తృణమూల్ కాంగ్రెస్" ఎవరిది? పార్టీ గుర్తుపై హక్కు ఎవరికుంది? తిరుగుబాటు వర్గం బలం ఎంత? మమతా బెనర్జీ తదుపరి అడుగు ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానాలు రానున్న రోజుల్లోనే తేలనున్నాయి. అందుకే బెంగాల్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి ఒక్క అంశంపైనే ఉంది... టీఎంసీ సంక్షోభం అసలు ట్విస్ట్ ఇప్పుడే మొదలైందా?. -
డీఏ పెంపు, లక్ష ఉద్యోగాలు : బెంగాల్లో బీజేపీ తొలి బడ్జెట్లో వరాల జల్లు
కోలకతా, సాక్షి: పశ్చిమ బెంగాల్లో బీజేపీ సర్కార్ తొలిసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. బెంగాల్ ప్రజలను ఆకట్టుకునేదిశగా లక్ష ఉద్యోగాలు, ఇందులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్,ఉద్యోగులకు డీఏ పెంపు లాంటి అనేక జనాకర్షక తాయిలాలను ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి స్వపన్ దాస్‌గుప్తా సోమవారం ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వపు మొట్టమొదటి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రాష్ట్ర రుణ భారాన్ని తగ్గించడం, ఆదాయ వసూళ్లను పెంచడం, మౌలిక సదుపాయాల ఆధారిత వృద్ధిని వేగవంతం చేయడంపై దృష్టి సారిస్తూ, ప్రభుత్వ ఆర్థిక ప్రాధాన్యతలను ఆయన వివరించారు."వికసిత్ భారత్" విజన్కుఅనుగుణంగానే "వికసిత్ బంగ్లా"అభివృద్ధి ఎజెండా ఉంటుందని ఆర్థిక మంత్రి వెల్లడించారు. మునుపటి ప్రభుత్వం నుండి తమకు రూ. 8.15 లక్షల కోట్ల అప్పు వారసత్వంగా వచ్చిందని, అయితే ప్రస్తుతమున్న అన్ని సామాజిక సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.బడ్జెట్లోని ముఖ్యాంశాలు:లక్ష ఉద్యోగాలు : ప్రభుత్వ రంగంలో లక్ష ఖాళీలను భర్తీ చేయనున్నామనే ప్రకటన ప్రధానంగా నిలిచింది. ఇందులో 33 శాతం సీట్లను మహిళలకు కేటాయించారు. పోలీస్ శాఖలో 20వేల పోస్టులు, విద్యాశాఖలో 50,000 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిలో ప్రస్తుతం ఉన్న ఐదేళ్ల సడలింపును మరో రెండేళ్లపాటు పొడిగించారు.ప్రభుత్వ ఉద్యోగుల కరవు భత్యాన్ని (DA) అక్టోబర్ నుండి 20శాతం పెంచనున్నారు.ప్రభుత్వ మరియు ప్రభుత్వ సాయం పొందే పాఠశాలల్లో చదువుకునే బాలికలకు రూ. 50,000 స్కాలర్షిప్ అందజేస్తారు.అలాగే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అందిస్తున్న రాష్ట్రాల్లో ఇపుడిక బెంగాల్ కూడా చేరిపోయింది. ఇందు కోసం రూ. 550 కోట్లు కేటాయించారు. దీని కోసం త్వరలోనే 'పింక్ కార్డ్' (Pink Card) పథకాన్ని ప్రారంభించనున్నారు.అన్నపూర్ణ యోజన పథకం కోసం రూ. 36,000 కోట్లు కేటాయించారు.పీఎం ఆవాస్ యోజన కింద బెంగాల్లో మరో 25 లక్షల మందికి పీఎం ఆవాస్ ఇళ్లను నిర్మించి ఇస్తారు.ఉపాధి హామీ పథకం (MGNREGA) పని దినాలను 100 రోజుల నుండి 125 రోజులకు పెంచారు.వలస కార్మికులకు ఆయుష్మాన్ భారత్: వలస కూలీల కోసం ఆయుష్మాన్ భారత్ కార్డులను అందజేస్తారు. గిగ్ కార్మికుల (Gig workers) కోసం సంక్షేమ బోర్డును ప్రతిపాదించారు.కోల్‌కతా సమీపంలో సరికొత్త 'గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం' (Greenfield airport) ఏర్పాటు కానుంది.ఎమ్మెల్యే నిధుల పెంపు: ఎమ్మెల్యే అభివృద్ధి నిధులను రూ. 70 లక్షల నుండి రూ. 1 కోటికి పెంచారు.AI మిషన్ ప్రారంభం, భూమి రికార్డుల డిజిటలైజేషన్, మైనింగ్ కార్యకలాపాల కోసం కేంద్రీకృత వేలం విధానంసివిక్ వాలంటీర్ల సంఖ్యలో 2000 పెంపు, గిరిజన విశ్వవిద్యాలయ ఏర్పాటు, కండక్టర్లకు వేతనం పెంపు రిటైర్డ్ జర్నలిస్టులకు రూ. 5,000 నెలవారీ పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించినట్టు ఆర్థికమంత్రి వెల్లడించారు. దీంతోపాటు రాజకీయ కారణాలతో జైలులో ఉన్న వారికి నెలకు రూ.10,000 అందించనున్నారు. సాంప్రదాయ బెంగాలీ చాపలు , జనపనారతో తయారు చేసిన ఫైల్లో ఈ బడ్జెట్‌ను తీసుకురావడం మరో విశేషం. ఇదీ చదవండి: అమెరికాలో తెలంగాణా విద్యార్థి అరుణ్ సాయి రెడ్డి హఠాన్మరణం -
యోగాతో ప్రపంచ శాంతి
కోల్‌కతా: వ్యక్తిగత ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా, ప్రపంచ శాంతికి బాటలు వేయడంలో యోగా ఒక గొప్ప ఉత్ప్రేరకంగా పని చేయగలదని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. సమాజంలో సామూహిక శాంతి, ప్రజల మధ్య సామరస్యాన్ని పెంపొందించే లక్షణం యోగాలో ఉందని వివరించారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని రెడ్ రోడ్లో ఆదివారం నిర్వహించిన 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సమతుల్య వ్యక్తిగత జీవనశైలికి యోగా అవసరమని అన్నారు. అన్ని వయసుల వారు ఈ సంప్రదాయాన్ని ఆచరించవచ్చని సూచించారు. పని, పోషణ, నిద్రలతో కూడిన సమతుల్య జీవనశైలే దుఃఖాన్ని నిర్మూలించడానికి కీలకమని, ఇందుకు యోగా తోడ్పడుతుందని వెల్లడించారు. చాలామంది తమ ఆధునిక జీవనశైలిలో సమతుల్యతను కాపాడుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. సమతుల్యమైన రీతిలో జీవించే విధానాన్ని యోగా మనకు నేర్పుతుందని, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలను కూడా బోధిస్తుందని పేర్కొన్నారు. మన శరీరాన్ని సరైన స్థితిలో ఉంచుకోవడం నేర్చుకున్నప్పుడు, ఆరోగ్యం ఒక అలవాటుగా మారుతుందని వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక వేడుక యోగా అనేది మానసిక ఆరోగ్యం ద్వారా శారీరక దృఢత్వాన్ని సాధించడానికి మార్గం చూపుతుందని అన్నారు. యోగా అనేది వ్యక్తిగత జీవనశైలికే కాకుండా, ఈ ప్రపంచం మెరుగైన భవిష్యత్తుకు ఎంతో అవసరమని స్పష్టంచేశారు. సమతుల్యత, ఆత్మజ్ఞానం, అంతర్గత స్థిరత్వాన్ని యోగా పెంపొందిస్తుందని.. ఈ విలువలు సమాజంలో విభజనలు, సంఘర్షణను అంతం చేస్తాయని వ్యాఖ్యానించారు. యోగాను కేవలం ఒక నిర్దిష్ట రోజుకు లేదా ఒక కార్యక్రమానికి మాత్రమే పరిమితం చేయకూడదని ప్రతిజ్ఞ చేద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. యోగాను మన జీవితాల్లో, భావి తరాల జీవితాల్లోనూ ఒక భాగంగా చేసుకోవాలని తేల్చిచెప్పారు. వివిధ దేశాలు, సంస్కృతులకు చెందిన ప్రజలను ఏకం చేస్తూ, యోగా నేడు ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక వేడుకగా మారిందని మోదీ హర్షం వ్యక్తంచేశారు. భూమిపై అత్యంత సుదీర్ఘమైన రోజుగా నిలిచే జూన్ 21వ తేదీ ఇప్పుడు యోగా కారణంగా అతిపెద్ద సామూహిక వేడుకల దినంగా మారిందని పేర్కొన్నారు. వేలాది మందితో కలిసి యోగాసనాలు కోల్‌కతాలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ వేలాది మందితో కలిసి యోగాసనాలు వేశారు. తెల్ల రంగు టీ–షర్టు, ప్యాంట్ ధరించిన మోదీ ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే అభ్యాసకుల యోగాసనాలను నిశితంగా గమనించారు. కొన్ని సూచనలు జారీ చేశారు. ఈ వేడుకల్లో వృద్ధులు, చిన్నారులు సహా అన్ని వయసుల వారు పాల్గొన్నారు.టోక్యో నుంచి న్యూయార్క్ దాకా.. వాషింగ్టన్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన కార్యక్రమాల్లో ఔత్సాహికులు పెద్ద సంఖ్యలో పాల్గొని, యోగాసనాలు వేశారు. ఆరోగ్యం, సమతుల్యత, శ్రేయస్సుకు యోగా ఒక చక్కని మార్గమని వీరంతా చాటారు. జపాన్ రాజధాని టోక్యోలోని చారిత్రక ఆలయాల దగ్గర్నుంచి న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ వరకు ఇందుకు వేదికలుగా మారాయి. ఈ ఏడాది ఆరోగ్యకరమైన వృద్ధాప్యం ఇతివృతంతో కార్యక్రమాలు జరుగుతున్నాయి. చైనాలోని షాంఘై నగరంలో భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం చేపట్టిన కార్యక్రమానికి 400 మంది హాజరయ్యారు. ఆ్రస్టేలియాలోని కాన్బెర్రాలోగల ఓల్డ్ పార్లమెంట్ హౌస్ భారత హైకమిషన్ చేపట్టిన కార్యక్రమం యోగా ఆ్రస్టేలియా సీఈవో జోష్ ప్రియోర్ నేతృత్వం వహించారు. అమెరికాలోని న్యూయార్క్లోగల టైమ్స్ స్క్వేర్‌లో పెద్ద ఎత్తున జరిగిన యోగా ఉత్సవాలకు భారత కాన్సులేట్ జనరల్ నాయకత్వం వహించారు. ఇంకా, బంగ్లాదేశ్ రాజధాని ఢాకా, న్యూజిలాండ్ లోని వెల్లింగ్టన్, ఫిన్లాండ్ రాజధాని హెల్సింకి, జర్మనీ రాజధాని బెర్లిన్, యూకే రాజధాని లండన్, మలేసియా రాజధాని కౌలాలంపూర్, తుర్కియేలోని అంకారా, సౌదీ అరేబియాలోని రియద్, స్పెయిన్‌లోని బార్సిలోనా, కెనడాలోని టొరంటోతోపాటు అనేక దేశాల్లోనూ కార్యక్రమాలు జరిగాయి. అమెరికాలోని వాషింగ్టన్లోగల లింకన్ మెమోరియల్‌లో భారత ఎంబసీ నిర్వహించిన జరిగిన కార్యక్రమానికి వందలాదిగా హాజరయ్యారు. -
డబ్బు ఎక్కడిది?.. టీఎంసీకి కొత్త తలనొప్పి!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. పార్టీ నిధులపై పెత్తనం కోసం తృణమూల్ కాంగ్రెస్‌లో అంతర్గత పోరు మరింత ముదిరింది. టీఎంసీకి నిధులెక్కడి నుంచి వచ్చాయన్నది తేల్చాలంటూ రెబల్ ఎమ్మెల్యేలు చేసిన ఫిర్యాదుల మేరకు బ్యాంకు అధికారులు మూడు ఖాతాల్లో ఉన్న రూ.440 కోట్ల నిధుల లావాదేవీలను నిలిపి వేశారు.ఈ క్రమంలో మూడు ప్రైవేట్ బ్యాంకు ఖాతాల్లో ఉన్న ఈ నిధులను విత్ డ్రా చేయడం లేదా వేరే ఖాతాల్లోకి బదిలీ చేయడం ఇక కుదరదని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. టీఎంసీ రెబల్ ఎమ్మెల్యేలు ఇటీవల బిధాననగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మూడు అకౌంట్లలోకి నిధులు చట్ట ప్రకారం వచ్చాయా లేదా కట్–మనీ వసూళ్లు, ప్రభుత్వ నిధులను మళ్లించారా లేదా కుంభకోణాలు వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాల ద్వారా వచ్చాయా అన్నది విచారణ చేపట్టి తేల్చాలని వారు కోరారు. కాగా, పార్టీ బ్యాంకు అకౌంట్లను అధికారులు ఫ్రీజ్ చేయడానికి సంబంధించి పూర్తి వివరాలు అందలేదని మమత వర్గం తెలిపింది.రెబల్స్ ఫిర్యాదును పరిశీలించిన అధికారులు మూడు ప్రైవేట్ బ్యాంకు ఖాతాల్లో ఉన్న మొత్తం రూ.440 కోట్ల నిధుల లావాదేవీలను తాత్కాలికంగా నిలిపివేశారు. మరోవైపు, ఈ వ్యవహారం టీఎంసీలోని అంతర్గత విభేదాలను మరింతగా బయటపెట్టడంతో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. -
టూవీలర్లకు ‘ఎల్‌నినో’ బ్రేక్ ..!
న్యూఢిల్లీ: దేశీయ ద్విచక్ర వాహన రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (ఎఫ్వై 2027) లో 3–5 శాతం పరిమిత హోల్‌సేల్ వృద్ధిని నమోదు చేయవచ్చని రేటింగ్స్ సంస్థ ‘ఇక్రా’ తన తాజా నివేదికలో వెల్లడించింది. ఎల్‌నినో కారణంగా రుతుపవనాలు బలహీనపడే సూచనలు, ద్రవ్యోల్బణంతో వాహనాల ధరలు పెరగడం, గత ఆర్థిక సంవత్సరాల్లో నమోదైన అత్యధిక విక్రయాల ప్రభావం (హై బేస్ ఎఫెక్ట్) వంటి అంశాలు ఈ రంగానికి సవాళ్లుగా మారొచ్చని రేటింగ్ సంస్థ అభిప్రాయపడింది. సానుకూలతలున్నా.. అంతర్జాతీయ సవాళ్లు పెరుగుతున్న దేశీయ డిమాండ్, మెరుగైన రిటైల్ విక్రయాల జోరు, నిలకడైన ఎగుమతుల మద్దతుతో ద్విచక్ర వాహన రంగం తన నిలకడైన ప్రదర్శనను చాటుకుంటోందని ఇక్రా పేర్కొంది. ‘జీఎస్టీ 2.0’ సంస్కరణలతో వాహనాలు అందుబాటు ధరల్లోకి రావడం, పాత వాహనాల స్థానంలో కొత్తవి కొనుగోలు చేసే ధోరణి మార్కెట్ వృద్ధికి సానుకూలంగా మారనున్నాయి. అయితే, పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సప్లై చైన్‌ను దెబ్బతీసే అవకాశం ఉన్నందున, ఆ పరిణామాలను క్షుణ్ణంగా గమనించాల్సి ఉంటుందని తెలిపింది. మేలో విక్రయాల జోరు దేశీయ హోల్‌సేల్ విక్రయాలు 2026 మే నెలలో వార్షిక ప్రాతిపదికన 15.7 శాతం బలమైన వృద్ధితో 19 లక్షల యూనిట్లకు చేరాయని ఇక్రా నివేదిక తెలిపింది. జీఎస్టీ 2.0 సంస్కరణలు, వాహన తయారీ కంపెనీలు ధరలు పెంచుతారనే ముందస్తు అంచనాలతో వినియోగదారులు కొనుగోళ్లకు మొగ్గు చూపడం ఇందుకు కారణమైంది. ఇక రిటైల్ విక్రయాలు కూడా మే నెలలో ఏడాది ప్రాతిపదికన 7.5 శాతం వృద్ధిని నమోదు చేశాయి. పెళ్లిళ్ల సీజన్, ఎంట్రీ–లెవెల్ నుంచి ప్రీమియం శ్రేణి వరకు విభిన్న మోడళ్లు అందుబాటులో ఉండటం మార్కెట్‌కు కలిసొచ్చింది. అయితే, దేశంలో నమోదైన విపరీతమైన ఎండల కారణంగా షోరూమ్‌లకు కస్టమర్ల రాక తగ్గడం, కొన్ని మోడళ్ల సరఫరాలో అంతరాయాలు వృద్ధి వేగాన్ని కొంతమేర నియంత్రించాయి. ఈ–టూ వీలర్స్ దూకుడు ఇక్రా నివేదికలో ఎలక్ట్రిక్ వాహన విభాగ ప్రదర్శన ఆకట్టుకుంది. 2026 మే నెలలో రిటైల్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విక్రయాలు ఏకంగా 71.7 శాతం వార్షిక వృద్ధితో 1,72,148 యూనిట్లకు చేరాయి. మొత్తం ద్విచక్ర వాహన మార్కెట్లో ఈవీల వాటా ప్రస్తుతం 8.9 శాతానికి చేరింది. ఎలక్ట్రిక్ వాహనాలకు వినియోగదారుల నుంచి లభిస్తున్న ఆదరణకు, మారుతున్న పర్యావరణ వ్యవస్థకు ఇది నిదర్శనమని ఇక్రా స్పష్టం చేసింది. -
బెంగాల్‌కు పునర్వైభవం
తారకేశ్వర్: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అరాచక పాలన సంకెళ్లను ఛేదించుకొని బీజేపీ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి దిశగా కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆయన శనివారం బెంగాల్లో పర్యటించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ ఇక్కడ అడుగుపెట్టడం ఇదే మొదటిసారి. హూగ్లీ జిల్లాలోని తారకేశ్వర్‌లో ‘పశ్చిమ్‌బంగ దివస్’వేడుకలకు హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అంతకుముందు పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. బెంగాల్ గాలిలో ఇప్పుడు ఒక తాజాదనం కనిపిస్తోందని అన్నారు. బెంగాల్ వైభవం తిరిగి మొదలైనట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజల ముఖాల్లో ఒక కొత్త కాంతి దర్శనమిస్తోందని, గ్రామాల్లో ఆనందం, నమ్మకం అనే భావన వ్యక్తమవుతోందని చెప్పారు. ప్రజల ఒక్క ఓటు ఎలాంటి మార్పును తీసుకురాగలదో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోందని వెల్లడించారు. ప్రజాస్వామ్యానికి ఉన్న శక్తిని బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తీర్పు నిరూపించిందని ఉద్ఘాటించారు. గత ప్రభుత్వాల వల్ల జరిగిన నష్టాన్ని సరిదిద్దడానికి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం సూపర్‌ఫాస్ట్ స్పీడ్‌తో పని పనిచేస్తోందని మోదీ తేల్చిచెప్పారు. ఇప్పుడు మధ్యవర్తులు లేరు, అడ్డంకులు లేవు ‘‘రైల్వేలు, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, మత్స్య పరిశ్రమ, అనుసంధాన రంగాల్లో పలు ప్రాజెక్టులు ప్రారంభించాం. ఇవి బెంగాల్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి, కొత్త అవకాశాలను సృష్టిస్తాయి. బెంగాల్ తన నూతన భవిష్యత్తును నిర్మించుకుంటోంది. ఈ ప్రాజెక్టులు బెంగాల్ అభివృద్ధికి కొత్త ఊపునిస్తాయి, ఇక్కడి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. రాజకీయ వైరం కారణంగా ఇక్కడ ఏళ్ల తరబడి అనేక సంక్షేమ పథకాలు నిలిచిపోయాయి, కొన్ని ఆలస్యమయ్యాయి. నేడు ఆ అడ్డంకులన్నింటినీ అధిగమించి, ప్రతి ప్రభుత్వ పథకం ప్రయోజనాలను నేరుగా ప్రజలకు చేరవేస్తున్నాం. ఇప్పుడు మధ్యవర్తులు లేరు, అడ్డంకులు లేవు. భారత్–బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కంచె నిర్మాణానికి గత ప్రభుత్వం అడ్డంకులు సృష్టించింది. ఇప్పుడు అవన్నీ తొలగిపోయాయి. కంచె నిర్మాణానికి చర్యలు మొదలయ్యాయి’’ అని మోదీ ఉద్ఘాటించారు. అభివృద్ధికి గేటు వే తూర్పు భారత్ రాయ్‌రంగ్‌పూర్: కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనలో నిర్లక్ష్యానికి గురైన తూర్పు భారతదేశం ఇప్పుడు అభివృద్ధికి ఒక ముఖద్వారంగా ఎదుగుతోందని ప్రధాని మోదీ అన్నారు. ఆయన శనివారం ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో పర్యటించారు. రాయ్రంగ్పూర్లో రూ.47,600 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. అభివృద్ధి పథంలో ఒడిశా వేగంగా ముందుకు సాగుతోందని హర్షం వ్యక్తంచేశారు. తూర్పు భారతదేశ అభివృద్ధి ద్వారా దేశాన్ని అభివృద్ధి చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. ‘పూర్వోదయ’విధానంపై ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఒడిశాలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర వనరులను అవకాశాలుగా మారుస్తోందని చెప్పారు. ఇప్పటివరకు రూ.20 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. ముర్ము అత్తగారి గ్రామానికి మోదీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 68వ జన్మదినాన్ని పురస్కరించుకొని మయూర్భంజ్ జిల్లాలోని ఆమె అత్తగారి గ్రామమైన పహద్పూర్ను మోదీ సందర్శించారు. ఈ గ్రామాన్ని ‘సోలార్ విలేజ్’గా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. పహద్‌పూర్ ఒక ఆదర్శవంతమైన సౌరశక్తి ఆధారిత గ్రామంగా ఎదుగుతుందని చెప్పారు. రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మయూర్భంజ్ నేల నుంచి దేశ అత్యున్నత రాజ్యాంగ పదవికి ఆమె ఎదిగిన తీరు ఒడిశాకు, దేశానికి ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. సంతాలీ భాషకు ‘ఓల్ చికి’లిపిని సృష్టించిన పండిట్ రఘునాథ్ ముర్ముకు మోదీ నివాళులరి్పంచారు.కిసాన్ సమ్మాన్ నిధి విడుదల ప్రధాని మోదీ బెంగాల్ పర్యటనలో పీఎం–కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత సొమ్మును విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 9.44 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ.18,880 కోట్లను నేరుగా బదిలీ చేశారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, అగ్రి స్టాక్, నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫారి్మంగ్, ప్రధానమంత్రి ధన్–ధాన్య కృషి యోజన వంటి పథకాలను మోదీ ప్రారంభించారు. -
రేపు పీఎం–కిసాన్ నిధుల విడుదల
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 20వ తేదీన 26వ విడత పీఎం–కిసాన్ నిధులను విడుదల చేయనున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని హూగ్లీ జిల్లా తారకేశ్వర్‌లో పర్యటన సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న 9.44 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ.18,880 కోట్లను జమ చేయనున్నారు. పీఎం–కిసాన్ ద్వారా పశ్చిమబెంగాల్లోని 45.35 లక్షల మంది రైతులు రూ.907 కోట్ల మేర అందుకోనున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు.2019లో ఈ పథకం మొదలు కాగా ఇప్పటివరకు మొత్తం రూ.4.46 లక్షల కోట్లను రైతులకు సాగు సాయంగా విడుదల చేసినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. పశ్చిమబెంగాల్లో పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ ఫసల్ బీయో యోజన (పీఎంఎఫ్‌బీవై)ని, రాష్ట్రంలో పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని కూడా ప్రారంభిస్తారని మంత్రి వివరించారు. -
టీఎంసీకి ఎదురుదెబ్బ.. ప్రతిపక్ష హోదా వివాదంలో ట్విస్ట్!
పశ్చిమ బెంగాల్ పొలిటికల్ ట్విస్టుల పర్వం కొనసాగుతోంది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి, మాజీ సీఎం మమతా బెనర్జీకి ఇంకో ఎదురుదెబ్బ తగిలింది. తిరుగుబాటు ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీని ప్రస్తుతానికి ప్రతిపక్ష నేతగా కొనసాగేందుకు గురువారం కలకత్తా హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో స్పీకర్ నిర్ణయంపై తాత్కాలిక స్టే ఇవ్వాలన్న టీఎంసీ విజ్ఞప్తికి నిరాకరించింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత.. టీఎంసీ చీలిక దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నాయకత్వంపై అసంతృప్తితో 59 మంది ఎమ్మెల్యేలు(మొత్తం 80 మంది గెలిచారు) రెబల్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. వాళ్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న రితబ్రత బెనర్జీ.. తనను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించాలని అసెంబ్లీ స్పీకర్‌ను ఆశ్రయించారు. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉండడంతో స్పీకర్ కూడా దానిని ఆమోదించారు. అయితే.. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దీదీ టీఎంసీ వర్గం హైకోర్టును ఆశ్రయించింది. ఇవాళ వాదనల సందర్భంగా.. పార్టీ సస్పెండ్ చేసిన ఓ వ్యక్తిని ప్రతిపక్ష నేతగా ఎలా నిర్ణయిస్తారని? ప్రశ్నించింది. అసెంబ్లీ లోపల ప్రతిపక్ష నేత (Leader of Opposition)గా గుర్తించిన స్పీకర్ రతిన్ బసు నిర్ణయం సరికాదని.. ఆయన ఎలాంటి విచారణ జరపకుండానే ఆ పని చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఒక పార్టీ తీసుకున్న నిర్ణయం కాకుండా.. సంఖ్యా బలం ఆధారంగా ప్రతిపక్ష నేతను నిర్ణయించడం రాజ్యాంగానికి విరుద్దమని వాదించింది.టీఎంసీ ప్రతిపాదన పెండింగ్‌లో ఉండగా.. మరో వ్యక్తిని.. అందునా సస్పెండ్ అయిన వ్యక్తిని ఎలా నిర్ణయించారని స్పీకర్‌ను జస్టిస్ కృష్ణారావు వివరణ కోరారు. అయితే.. స్పష్టమైన సంఖ్యా బలం ఉండడంతో స్పీకర్ ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అసెంబ్లీ కార్యదర్శి వివరణ ఇచ్చారు. అయితే.. ఆ సమయంలో టీఎంసీ తరఫున అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ అంశంలో మరింత విచారణ అవసరమని తదుపరి విచారణను జస్టిస్ కృష్ణారావు జులై 28కి వాయిదా వేశారు. స్టే విధించాలన్న పిటిషనర్ అభ్యర్థనను తోసిపుచ్చారు. అలాగే తదుపరి విచారణ లోపు అన్ని పక్షాలు తమ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో స్పీకర్ నిర్ణయం ప్రస్తుతానికి అమల్లోనే కొనసాగనుంది.ఇదిలా ఉండగా.. మమతా బెనర్జీతో సహా టీఎంసీకి చెందిన కీలక నేతలంతా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడారు. దీంతో సీనియర్ నేత శోభనదేవ్ చటర్జీని లెజిస్లేటివ్ పార్టీ నేతగా ఆమె వర్గం ప్రతిపాదించింది. ఈలోపు టీఎంసీలో ముసలం మొదలైంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడంతో జూన్ 1వ తేదీన రితబ్రత బెనర్జీని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే.. 58 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండడంతో ఆయనకే ప్రతిపక్ష నేత గుర్తింపు దక్కింది. మొత్తం మీద, హైకోర్టు తాజా నిర్ణయంతో పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కొత్త ఉత్కంఠ నెలకొంది. -
ఉద్ధవ్ ‘శివసేన’లో మళ్లీ చీలిక!
న్యూఢిల్లీ/ముంబై: సజావుగా సాగుతున్న పార్టీని తిరుగుబాటు ఎంపీలు నిట్టనిలువునా చీల్చే పర్వం పశ్చిమబెంగాల్లో పూర్తయి కొత్తగా మహారాష్ట్రలో మొదలైంది. తృణమూల్ కాంగ్రెస్ సారథి మమతా బెనర్జీకి తిరుగుబాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు తలనొప్పి తీసుకురాగా ఇప్పుడు మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన(యూబీటీ) పార్టీలో రెబల్ ఎంపీలు ప్రకంపనలు సృష్టించారు. పార్టీకి లోక్‌సభలో 9 మంది ఎంపీలుండగా వారిలో కొందరు తిరుగుబాటు లేవదీసినట్లు జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. ఈ ఎంపీలు బుధవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. తమకు ఆరుగురు ఎంపీల మద్దతు ఉందని, అందుకే ప్రత్యేక వర్గంగా గుర్తిస్తూ లోక్‌సభలో విడిగా సీటింగ్ కేటాయించాలని స్పీకర్‌ను వారు కోరినట్లు తెలుస్తోంది.ఆరుగురు ఎంపీలు సంజయ్ దినా పాటిల్, సంజయ్ దేశ్‌ముఖ్, ఓం ప్రకాశ్ రాజే నింబాల్కర్, భావూసాహెబ్ వాక్చౌరే, నగేశ్ పాటిల్ అష్టికర్, సంజయ్ జాధవ్లు తిరుగుబాటు కూటమిలో ఉన్నట్లు జాతీయమీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఢిల్లీలో మకాం వేసిన మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఈ చీలిక ఘట్టానికి తెరవెనుక ఉండి నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీలో చీలిక మొదలైందన్న వార్తలతో పార్టీ అగ్రనాయకత్వం అప్రమత్తమైంది. వెంటనే ఎంపీలంతా గురువారం ఢిల్లీలో సమావేశానికి హాజరుకావాలని విప్ జారీచేసింది.చీలిక వర్గంలో ఆరుగురు ఎంపీలు లేరని పార్టీ నాయకత్వం వాదిస్తోంది. 2006లో రాజ్ ఠాక్రే, 2022లో ఏక్నాథ్ షిండేలు శివసేన పార్టీని చీల్చగా తాజా ఉదంతంతో మూడోసారి పార్టీ ముక్కలుకాబోతోందని వార్తలొచ్చాయి. ఎంపీలు పార్టీ గోడ దూకబోతున్నారనే వార్తలపై ఉద్ధవ్ ఠాక్రేకు అత్యంత సమీప కీలక నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ ఘాటుగా స్పందించారు. ‘‘ఒక్కో ఎంపీకి రూ.50 కోట్లు ఆశచూపించి ప్రత్యర్థి పార్టీ లాగేసేందుకు ప్రయత్నిస్తోంది.పార్టీ మారాలనుకుంటే ముందు రాజీనామా చేయండి. ఉద్ధవ్ ఠాక్రే మద్దతుదారులు, కార్యకర్తలు కాళ్లరిగేలా తిరిగి ప్రచారంచేస్తేనే మీరు గెలిచారు. దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలిచి చూపించండి. పార్టీ మారాలనే వాళ్లంతా నమ్మకద్రోహులు. ఒకరిద్దరు పార్టీ మారేందుకు రెడీ అయ్యారని మంగళవారం రాత్రే నాకు సమాచారం వచి్చంది. కోట్లరూపాయల నగదు చేతిలో పడితేనే ఢిల్లీ విమానం ఎక్కుతామని వాళ్లు మొండికేశారని తెలుస్తోంది’’ అని రౌత్ వెల్లడించారు. -
పోలీసులకు గంగూలీ ఫిర్యాదు
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పోలీసులను ఆశ్రయించాడు. తన గురించి అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. ఇందుకు సంబంధించి కోల్‌కతా పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు.విమర్శలు ఓకే.. కానీ..ఈ మేరకు.. ‘‘పబ్లిక్ ఫిగర్‌గా ఉన్నందువల్ల నా గురించి వచ్చే అభిప్రాయాలు, విమర్శలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాను. అయితే, అసత్య ప్రచారాలు చేయడం, పరువుకు భంగం కలిగించే విధంగా వ్యవహరించడం, ఉద్దేశపూర్వకంగానే నా ప్రతిష్టను దిగజార్చేలా రాతలు రాయడం చేస్తే అస్సలు ఆమోదించను.ఆమోదయోగ్యనీయం కాదుఇలాంటి పనులు ఎంతమాత్రం ఆమోదయోగ్యనీయం కాదు. ఈ విషయంలో చట్టపరంగా ముందుకు వెళ్లాలి అనుకుంటున్నాను. నా ఫిర్యాదు స్వీకరించి సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తున్నాను’’ అని గంగూలీ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.కాగా ‘సౌరవ్ గంగూలీ ఫ్యాన్స్’ పేరిట ఉన్న ఫేస్బుక్ పేజీపై గంగూలీ ఫిర్యాదు చేశాడు. అదే విధంగా.. స్పోర్ట్జ్వికీ అనే ప్లాట్‌ఫామ్ గురించి కూడా తన ఫిర్యాదులో ప్రస్తావించాడు. ఈ రెండు ప్లాట్‌ఫామ్‌లలో తరచుగా తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించాడు.దిగ్గజ బ్యాటర్కోల్కతాలో జన్మించిన గంగూలీ టీమిండియా తరఫున 1992లో అరంగేట్రం చేశాడు. తన కెరీర్లో 113 టెస్టులు, 311 వన్డేలు ఆడాడు. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ టెస్టుల్లో 7212, వన్డేల్లో 11363 పరుగులు సాధించాడు. భారత జట్టు కెప్టెన్‌గానూ పనిచేసిన గంగూలీని అభిమానులు ముద్దుగా ‘దాదా’ అని పిలుచుకుంటారు. కాగా గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగానూ పనిచేశాడు.చదవండి: వైభవ్ సూర్యవంశీ.. నువ్విక ఇంటికి వెళ్లవచ్చు! -
టీఎంసీలో మరో ట్విస్ట్.. అందుకు ఎమ్మెల్యేల నో!
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు టీవీ సీరియల్లా సాగిపోతూ.. వెబ్ సిరీస్‌ల పూటకో ట్విస్టులను పంచుతున్నాయి. ప్రతిపక్ష తృమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అంతర్గత సంక్షోభం.. రోజురోజుకూ మరింత తీవ్రరూపం దాల్చుతోంది. ఆ పార్టీ మెజారిటీ ఎంపీలు సరికొత్త రాజకీయ మార్గాన్ని ఎంచుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో ఇప్పుడు మెజారిటీ సంఖ్యలో ఉన్నామని చెప్పుకుంటున్న రెబల్ ఎమ్మెల్యేల వర్గ వైఖరి ఏమిటన్న ఆసక్తి నెలకొంది.టీఎంసీకి చెందిన 20 మంది రెబల్ ఎంపీలు.. ఓ అనామక పార్టీ అయిన నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ)లో విలీనం అవుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ‘ప్రత్యేక సిట్టింగ్’ కేటాయించమని లేఖ కూడా అందజేసింది. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్‌కు బయటి నుంచి మద్దతు ఇస్తామని ప్రకటించింది కూడా. ఈ పరిణామం మమతా బెనర్జీకి పెద్ద షాక్ అనే చెప్పాలి. ఈ పరిణామాల నేపథ్యంలో టీఎంసీ ఎమ్మెల్యేల తిరుగుబాటు వర్గానికి నాయకత్వం వహిస్తున్న రితబ్రతా బెనర్జీ కీలక ప్రకటన చేశారు. టీఎంసీలో మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు(64 మంది) తనకే ఉందని.. తనకు తానుగా ప్రతిపక్ష నేతగా ప్రకటించుకున్నారు రితబ్రతా బెనర్జీ. రెబల్ ఎంపీల దారిలోనే పయనిస్తారా? అనే ప్రశ్నకు ఆయన నుంచి ఆసక్తికరమైన సమాధానమే వచ్చింది. ఎమ్మెల్యేల వర్గం మాత్రం ఆ నిర్ణయాన్ని అనుసరించబోదని రితబ్రతా బెనర్జీ స్పష్టం చేశారు. తమ వర్గంలో అలాంటి ప్రతిపాదన ఎప్పుడూ చర్చకు రాలేదని, ఎన్సీపీఐలో చేరే ఆలోచన కూడా తమకు లేదని తెలిపారాయన. టీఎంసీకి చెందిన 80 మంది ఎమ్మెల్యేలలో మెజారిటీ ఎమ్మెల్యేలు తనకు మద్దతుగా ఉన్నారని చెబుతున్న రితబ్రతా బెనర్జీ.. ఎంపీల విలీన నిర్ణయం గురించి కూడా మీడియా ద్వారానే తెలుసుకున్నామని అన్నారు. శాసనసభ పక్షంగా తమకు ఆ విషయంపై ఎలాంటి సమాచారం లేదని.. కాబట్టి విలీనంపై చర్చే లేదని పేర్కొన్నారు.మరోవైపు తిరుగుబాటు ఎంపీల వర్గం తామే అసలైన టీఎంసీ అని గుర్తింపు కోరుతూ, పార్టీ ఎన్నికల గుర్తుపై కూడా హక్కు సాధించేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు ప్రకటించింది. అయితే ఎమ్మెల్యేల వర్గం మాత్రం అలాంటి పనులు చేయబోమని అంటోంది. మమతా బెనర్జీనే తమ నాయకురాలని.. ఆమె మార్గదర్శకత్వంలోనే తాము ముందుకు సాగాలని అనుకుంటున్నామని రితబ్రతా చెబుతున్నారు. అయితే అధికారిక టీఎంసీ వర్గం ఈ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పార్టీ మొత్తం విలీనమైతేనే అది చట్టబద్ధమవుతుందని, కేవలం ఎంపీలు లేదంటే ఒక వర్గం విడిపోవడం ద్వారా కొత్త గ్రూప్‌కు గుర్తింపు ఇవ్వలేమని రాజ్యాంగంలోని ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ఉటంకిస్తోంది.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం తర్వాత టీఎంసీలో అసంతృప్తి బహిర్గతమైంది. ముఖ్యంగా పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ నాయకత్వంపై కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ చీలిక మొదలైంది. ఈ పరిణామాలను పరిశీలిస్తున్న రాజకీయ విశ్లేషకులు.. 1998లో పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఆ పార్టీ ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన అంతర్గత సంక్షోభం ఇదేనని చెబుతున్నారు.ప్రస్తుతం తిరుగుబాటు ఎమ్మెల్యేల వర్గం తమకు రెండొంతులకుపైగా సభ్యుల మద్దతు ఉందని చెబుతుండగా.. అధికారిక టీఎంసీ మాత్రం పార్టీ పూర్తిగా ఏకతాటిపై ఉందని.. తిరుగుబాటు నేతల వాదనలు రాజకీయ ప్రయోజనాల కోసమేనని కొట్టిపారేస్తోంది. దీంతో బెంగాల్ రాజకీయాల్లో టీఎంసీ భవిష్యత్తు ఎటువైపు మలుపు తిరుగుతుందన్న ఉత్కంఠ మరింత పెరిగింది. -
సువేందు స్కెచ్‌కు ఆర్ఎస్ఎస్ బ్రేక్!
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో భవానీపూర్‌లో మమతా బెనర్జీని ఓడించి, బెంగాల్ పీఠాన్ని దక్కించుకున్న తొలి బీజేపీ సీఎంగా సువేందు అధికారి చరిత్ర సృష్టించారు. ఆ జోష్‌తోనే టీఎంసీని మరింతగా దెబ్బతీయాలని, ఆ పార్టీకి చెందిన అసంతృప్త ఎంపీలు, ఎమ్మెల్యేలను కమలం గూటికి చేర్చాలని సువేందు స్కెచ్వేశారు. అయితే, సీఎం స్పీడ్‌కు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) గట్టి బ్రేకులు వేసినట్లు తెలుస్తోంది. టీఎంసీ నుంచి పెద్ద ఎత్తున వలసలను ప్రోత్సహించే ప్రతిపాదనను సంఘ్ ససేమిరా అనడంతో బెంగాల్ బీజేపీలో కొత్త చర్చ మొదలైంది. టీఎంసీ తిరుగుబాటు నేతలను పార్టీలో చేర్చుకుంటే భవిష్యత్ ఎన్నికల్లో తిరుగుండదని సువేందు భావించారు. ఇప్పటికే పలువురు టీఎంసీ కీలక నేతలతో సువేందు అధికారి చర్చలు జరిపి, చేరికలకు లైన్ క్లియర్ చేసుకున్నారు. సంఘ్ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ‘తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం ఇతర పార్టీల నేతలను చేర్చుకుంటే, పార్టీ సిద్ధాంతాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం రక్తం చిందించిన సొంత క్యాడర్ నైతిక స్థైర్యం దెబ్బతింటుంది. తొందరపాటు రాజకీయ చేరికల కంటే దీర్థ కాలికంగా పార్టీని బలోపేతం చేసుకోవడమే ముఖ్యం’అని ఆర్ఎస్ఎస్ పెద్దలు సువేందుకు స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో, బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా ఈ చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఈ మేరకు తాజాగా 20మంది టీఎంసీ ఎంపీలు త్రిపురకు చెందిన నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ)లోవిలీనం అవుతున్నట్లు ప్రకటించారు. ఈ పరిణామంపై ముఖ్యమంత్రి సువేందు తీవ్ర దిగ్భ్రాంతికి లోనైనట్లు తెలుస్తోంది. -
మేము టీఎంసీని వీడలేదు: 20 మంది రెబల్ ఎంపీలు
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) రెబల్ ఎంపీలు సోమవారం పార్టీ ఎన్నికల గుర్తుపై హక్కు సాధించేందుకు పోరాడతామని ప్రకటించారు. తాము టీఎంసీని వీడలేదని, దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. 20 మంది అసమ్మతి ఎంపీలు నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ)లో విలీనమవుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. సోమవారం మాత్రం మాట మార్చారు.అరూప్ చక్రవర్తి మీడియాతో మాట్లాడుతూ.. “మేము టీఎంసీని వీడలేదు. టీఎంసీలోనే ఉన్నాం. పార్టీని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. అది ఎందుకు దెబ్బతిన్నదన్న చర్చ జరగడం లేదు. పార్టీ గుర్తు కోసం మేము పోరాడతాం. మా వద్ద 20 మంది సభ్యులు ఉన్నారు. గుర్తు కోసం ఎందుకు పోరాడకూడదు?” అని తెలిపారు.రాజకీయ, న్యాయ పోరాటం దీర్ఘకాలం కొనసాగుతాయన్న సంకేతాలు ఇచ్చారు. ఈ తిరుగుబాటు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కొత్త దశకు నాంది పలికిందని చక్రవర్తి అన్నారు. “కొత్త ఆట మొదలైంది. ఖేలా హోబే” అని ఆయన అన్నారు. ఈ పరిణామం రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. 20 మంది రెబల్ టీఎంసీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి, తాము ఎన్సీపీఐలో విలీనమవుతున్నట్టు ప్రకటించినప్పటికీ అరూప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆ సమావేశంలో ఎంపీలు పార్లమెంట్లో ప్రత్యేక సీటింగ్ ఏర్పాటు కోరారు. దీంతో మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీ నుంచి శాసనసభ్యుల స్థాయిలో తమ విభజనను అధికారికంగా ప్రకటించినట్టైంది.కోర్టును ఆశ్రయిస్తాం ఆరు సార్లు ఎంపీగా ఎన్నికైన సుదీప్ బంద్యోపాధ్యాయ్ తిరుగుబాటు వర్గంలో చేరారు. తమదే నిజమైన టీఎంసీ అని నిరూపించేందుకు, పార్టీ జంట పువ్వుల ఎన్నికల గుర్తుపై హక్కు సాధించేందుకు కోర్టును ఆశ్రయిస్తామని ఆయన చెప్పారు. ఈ తిరుగుబాటుపై టీఎంసీ నాయకత్వం తీవ్రంగా స్పందించింది. పార్టీ వాదన ప్రకారం, పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం ఈ చర్య చెల్లదు. రాజ్యసభ ఎంపీ సాగరికా ఘోష్ మాట్లాడుతూ.. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం రాజకీయ పార్టీ ముందుగా విలీనం కావాలి లేదా విడిపోవాలి. ఆ తర్వాతే శాసనసభ్యులు అనర్హత నిబంధనల నుంచి మినహాయింపు కోరగలరని చెప్పారు.ఎక్స్‌లో చేసిన పోస్టులో ఘోష్ స్పందిస్తూ.. “2/3 వంతుల మెజారిటీ, పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టంపై భారీ స్థాయిలో తప్పుడు సమాచారం ప్రచారంలో ఉంది. పదో షెడ్యూల్, సుప్రీంకోర్టు ఈ విషయంలో స్పష్టత ఇచ్చాయి. పార్లమెంట్ వెలుపల ఉన్న రాజకీయ పార్టీనే ముందుగా విడిపోవాలి లేదా విలీనం కావాలి. పార్లమెంట్లో కూర్చున్న పార్టీ ప్రతినిధులు కాదు. ఈ షరతు నెరవేరిన తర్వాతే 2/3 మంది విడిపోయినా పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం వర్తించదు” అని తెలిపారు.సీనియర్ టీఎంసీ నేత సౌగత రాయ్ కూడా తిరుగుబాటు నేతలపై విమర్శలు చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పునకు వారు ద్రోహం చేశారని ఆరోపించారు. “ఇప్పుడు మమతా బెనర్జీ అధ్యక్షురాలిగా ఉన్న అఖిల భారత తృణమూల్ కాంగ్రెసే అసలైన పార్టీ అని స్పష్టమైంది. ఎన్నికల గుర్తు రెండు పువ్వులు. భారతీయ జనతా పార్టీని ఓడించడమే దాని లక్ష్యం” అని ఆయన చెప్పారు.“టీఎంసీ గుర్తుపై ఎన్నికైన 20 మంది ఎంపీలు తమ ఓటర్లకు ద్రోహం చేస్తూ, నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా అనే పెద్దగా గుర్తింపు లేని పార్టీలో చేరారు. చట్టవిరుద్ధంగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏకు మద్దతు ప్రకటించారు. రాజ్యాంగంలోని షెడ్యూల్ 10(4) నిబంధనల నుంచి తప్పించుకోవడానికే వారు ఇలా చేశారు. ప్రజలు ఈ వార్తను గమనిస్తున్నారు” అని రాయ్ అన్నారు.మమతా బెనర్జీపైన కూడా చక్రవర్తి నేరుగా విమర్శలు చేశారు. విభజన తర్వాత ఆమె ఒత్తిడిలో ఉన్నారని అన్నారు. “మమతా బెనర్జీ భయపడుతున్నారు. పార్టీ సమావేశం కూడా నిర్వహించలేకపోతున్నారు. ఎన్నికలకు ముందు సొంత నియోజకవర్గంలో కూడా సమావేశం నిర్వహించలేకపోయారు” అని ఆయన చెప్పారు. -
టీచర్స్ స్కామ్.. అభిషేక్ బెనర్జీపై ప్రశ్నల వర్షం
సాక్షి, కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఉపాధ్యాయ నియామకాల్లో జరిగిన భారీ అవినీతి స్కామ్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ లోతైన విచారణ జరుపుతుంది. ఈ అంశంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీని ఈ రోజు (సోమవారం) అధికారులు విచారించారు. కోల్‌కతాలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. కాగా నిన్న ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసులో అధికారులు అభిషేక్ బెనర్జీని దాదాపు ఎనిమిదిన్నర గంటల పాటు విచారించారు.మనీ లాండరింగ్, ఆర్థిక లావాదేవీలు ,నియామక ప్రక్రియలో జరిగిన అక్రమాల్లో ఆయన పాత్రపై ఈడీ అభిషేక్ బెనర్జీని సుదీర్ఘంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. డబ్బుకు బదులుగా ఉద్యోగాలు ఇప్పించేందుకు ఒక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారని ఆరోపిస్తోంది. ఈనెట్‌వర్క్ ద్వారా, అర్హులైన అభ్యర్థుల కంటే లంచాలు చెల్లించిన వ్యక్తులకే ప్రాధాన్యత లభించిందని దర్యాప్తు సంస్థ ఆరోపిస్తోంది. స్కామ్ నేపథ్యంపశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్, పశ్చిమ బెంగాల్ ప్రాథమిక విద్యా మండలి ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో గ్రూప్-సి, గ్రూప్-డి సిబ్బందితో పాటు ప్రైమరీ, సెకండరీ, హయ్యర్ సెకండరీ ఉపాధ్యాయుల నియామకాల కోసం పరీక్షలు నిర్వహించారు. అయితే, అర్హత గల అభ్యర్థులను పక్కన పెట్టి, పెద్ద మొత్తంలో లంచాలు తీసుకుని అర్హత లేని వారికి, తక్కువ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగాలు ఇచ్చారనేది ప్రధాన ఆరోపణ. అక్రమాల కోసం OMR షీట్ల తారుమారు చేశారని కొందరు ఖాళీ పేపర్లు వదిలినా వారికి ఉద్యోగాలు వచ్చాయని, అధికారిక అర్హత లేకపోయినా, అక్రమ మార్గాల్లో వందలాది మందికి నకిలీ సిఫార్సు లేఖల ద్వారా నియామక పత్రాలు అందజేశారు. అర్హులైన అభ్యర్థుల పేర్లను వెనుకకు నెట్టి, లంచాలు ఇచ్చిన వారి పేర్లను మెరిట్ లిస్ట్‌లో పైకి చేర్చారని ఆరోపణలున్నాయి. దీంతో ఈ స్కామ్‌పై కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణ ప్రారంభించాయి. పశ్చిమ బెంగాల్ మాజీ విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీని, ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీని ED అరెస్ట్ చేసింది. అర్పితా ముఖర్జీ నివాసాల నుంచి సుమారు రూ. 50 కోట్లకు పైగా నగదు, భారీగా బంగారం, ఆస్తుల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకోవడం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. -
నిక్కరుతో నడిరోడ్డుపై ‘టీఎంసీ పుష్ప’ ఊరేగింపు!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చోటుచేసుకున్న కొన్ని సంచలన దృశ్యాలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)నేత, ‘పుష్ప ఆఫ్ ఫాల్తా’గా పేరొందిన జహంగీర్ ఖాన్‌ను పోలీసులు నడుముకు తాడు కట్టి, కేవలం ఒక నిక్కరుతో వీధుల్లో ఊరేగించారు. అరెస్ట్ అయినప్పటి నుండి ఆయనను ఇలా బహిరంగంగా వీధుల్లో తిప్పడం ఇది మూడోసారి కావడం గమనార్హం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. కట్టుదిట్టమైన భద్రత మధ్య, కాళ్లకు చెప్పులు కూడా లేకుండా నడుస్తూ, ప్రజలకు చేతులు జోడించి ఆయన క్షమాపణలు కోరుతున్న దృశ్యాలు చర్చనీయాంశంగా మారాయి.అరెస్ట్ వెనుక అసలు కథదౌర్జన్యాలు, వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలపై జహంగీర్ ఖాన్‌ను జూన్ 8వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెంగాల్ కోర్టు ఆయనకు ఐదు రోజుల పోలీసు కస్టడీ విధించింది. ఉత్తర బెంగాల్‌లోని భారత్-నేపాల్ సరిహద్దుకు సమీపంలో ఉన్న పానిటంకి ప్రాంతంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఫాల్తా అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసిన ఈ డైమండ్ హార్బర్ నేత, మే 21న జరిగిన ఉప ఎన్నికలకు రెండు రోజుల ముందు నుంచే నియోజకవర్గంలో కనిపించకుండా పోయారు. VIDEO OF SYMBOL OF POLITICAL MUSCLE JAHANGIR KHAN ALIAS "PUSHPA" AND ABHISHEK BANERJEE'S CLOSE ASSOCIATE.Jahangir Khan alias “Pushpa” (for threatening IPS officer Ajay Pal Sharma) and TMC Diamond Harbour leader being led through the streets barefoot, in shorts, with a rope… pic.twitter.com/N0GAv0bwSc— Rahul Shivshankar (@RShivshankar) June 15, 2026కోర్టు రక్షణ ఎత్తివేతజహంగీర్ ఖాన్‌పై ఫాల్తా పోలీస్ స్టేషన్లో ఏడు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఈ క్రమంలో మే 21న జరిగే రీ-పోలింగ్ ప్రక్రియలో పాల్గొనడానికి, ప్రచారం చేసుకోవడానికి వీలుగా కలకత్తా హైకోర్టు మే 18న ఆయనకు అరెస్ట్ నుండి తాత్కాలిక ఉపశమనం కల్పించింది. అయితే ఊరట లభించిన మరుసటి రోజే తాను పోటీ నుండి తప్పుకుంటున్నట్లు ఖాన్ బహిరంగంగా ప్రకటించారు. ఆ తర్వాత మే 24న ఎన్నికల ఫలితాలు వెలువడగా, మే 26న కలకత్తా హైకోర్టు ఆయనకు ఇచ్చిన తాత్కాలిక రక్షణను పూర్తిగా రద్దు చేసింది.పోలీస్ కస్టడీలో పరాభవంకోర్టు రక్షణ ఎత్తివేసిన తర్వాత పారిపోవడానికి ప్రయత్నించిన జహంగీర్ ఖాన్‌ను పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. కస్టడీలోకి తీసుకున్నప్పటి నుండి ఈ నేతను నిక్కరుతో, నడుముకు తాడు కట్టి పోలీసులు రోడ్డుపై నడిపించడం సంచలనంగా మారింది. గతంలో అధికార బలంతో అహంకారంగా వ్యవహరించిన ఈ నేత, ఇప్పుడు దీనస్థితిలో ప్రజలకు క్షమాపణలు చెబుతూ కనిపించడం బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. -
ఆ అనామక పార్టీకి పడ్డవే వెయ్యి ఓట్లు!
తృణమూల్ కాంగ్రెస్‌లో సంక్షోభం మరింత ముదిరింది. పార్టీకి చెందిన 20 మంది ఎంపీలు మమతా బెనర్జీకి షాక్ ఇస్తూ వేరు కుంపటి ప్రకటించారు. నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ)లో విలీనమవుతున్నట్లు ప్రకటించారు. అంతటితో ఆగకుండా.. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇస్తామని వెల్లడించారు. ఈ పరిణామం పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనం సృష్టించగా.. జాతీయ రాజకీయాల్లోనూ తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యంగా, ఇప్పటి వరకు పెద్దగా ఎవరికీ తెలియని ఎన్సీపీఐ ఒక్కసారిగా వార్తల్లోకి రావడంతో.. అసలు ఈ పార్టీ ఎవరిది? ఎక్కడిది? అనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.ఎన్నికల సంఘం రికార్డుల ప్రకారం.. నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ) 2023 జనవరి 20న రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీగా నమోదైంది. అక్కడి గిరిజన ప్రాంతాల అభివృద్ధి, వెనుకబడిన వర్గాల ప్రాతినిధ్యం లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చినట్లు పార్టీ వ్యవస్థాపక నాయకుల్లో ఒకరైన శాంతను డే తెలిపారు. అయితే పార్టీ ప్రధాన కేంద్రం మాత్రం పశ్చిమ బెంగాల్లో ఉండడం గమనార్హం. త్రిపురలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీఐ పోటీ చేసింది. ఏడు స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాలని భావించినప్పటికీ, నాలుగు నియోజకవర్గాల్లో నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. చివరకు రెండు స్థానాల్లో మాత్రమే పార్టీ గుర్తుపై అభ్యర్థులు బరిలో నిలిచారు. చౌమనులో పార్టీ అభ్యర్థి 536 ఓట్లు సాధించగా, కైలాశహర్లో 286 ఓట్లు మాత్రమే వచ్చాయి. మొత్తం కలిపి 822 ఓట్లకే పరిమితమైంది. మరో అభ్యర్థి స్వతంత్రుడిగా పోటీ చేసి 376 ఓట్లు సాధించాడు. మొత్తంగా పార్టీ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థులందరికీ కలిపి 1,198 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంతేకాదు, ఎన్నికల తర్వాత పార్టీ పూర్తిగా కనుమరుగైందని అప్పటి అభ్యర్థులే చెబుతున్నారు.కైలాశహర్ అభ్యర్థి జహంగీర్ అలీ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కోల్‌కతా నుంచి వచ్చిన షెవ్లీ కుండు తమను సంప్రదించారని, ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీ కార్యాచరణ పూర్తిగా ఆగిపోయిందని తెలిపారు. మరో అభ్యర్థి బర్జెడా త్రిపుర కూడా పార్టీ తరఫున పోటీ చేసినప్పటికీ, ఎన్నికల తర్వాత నాయకత్వంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని వెల్లడించారు. త్రిపుర ఎన్నికల తర్వాత పార్టీ అంతర్గతంగా ఆర్థిక వ్యవహారాలపై విభేదాలు తలెత్తాయని శాంతను డే తెలిపారు. 2023 పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నప్పటికీ అది సాధ్యం కాలేదన్నారు. 2026 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయాలని ప్రయత్నించినా, ఆర్థిక వనరుల కొరత కారణంగా ముందుకు సాగలేకపోయినట్లు చెప్పారు.పార్టీ ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే.. ఎన్నికల సంఘం వద్ద నమోదైన విరాళాల మొత్తం కేవలం రూ.1.13 లక్షలు మాత్రమే. పార్టీ ఖజాంచీ(ట్రెజరర్.. కోశాధికారి)గా షెవ్లీ కుండు పేరు నమోదైంది. ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఆమె అదే చిరునామాలో నమోదైన రెండు సంస్థలకు కూడా డైరెక్టర్‌గా ఉన్నారు. వాటిలో ఒకటి బిశ్వబజార్ ప్రైవేట్ లిమిటెడ్ కాగా, మరొకటి పశ్చిమ బంగా అసంఘటిత మహిళా కర్మి అసోసియేషన్. ఈ రెండు సంస్థలు కూడా పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లాలోని బనిపూర్ ప్రాంతంలోనే నమోదయ్యాయి. ఇదే అడ్రస్ ఎన్సీపీఐ పార్టీ అధికారిక కార్యాలయంగా కూడా ఉంది.ఉత్తియా కుండు అనే వ్యక్తి పార్టీ అధ్యక్షుడిగా(ఇప్పటికీ) వ్యవహరిస్తున్నారు. ఆయన షెవ్లీ కుండు భర్త. రాజకీయంగా పెద్దగా గుర్తింపు లేని ఈ అనామక పార్టీ ఇప్పుడు ఒక్కసారిగా జాతీయ మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన దాదాపు రెండొంతుల మంది లోక్‌సభ ఎంపీలు ఈ పార్టీతో చేతులు కలపడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ఆదివారం సాయంత్రం.. తిరుగుబాటు ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి ప్రత్యేక పార్లమెంటరీ గ్రూపుగా గుర్తించాలని కోరారు. అనంతరం ఎంపీ కాకోలీ ఘోష్ దస్తిదార్ తమ వర్గానికి ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని అధికారికంగా లేఖ సమర్పించినట్లు తెలిపారు. మరోవైపు తృణమూల్ సీనియర్ నేత సుదీప్ బందోపాధ్యాయ్ కూడా తిరుగుబాటు ఎంపీలు ఎన్సీపీఐలో విలీనమయ్యారని ధృవీకరించారు. దీంతో ఇప్పటివరకు త్రిపురలో వెయ్యి ఓట్లకే పరిమితమైన ఓ చిన్న పార్టీ ఒక్కసారిగా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే స్థితికి చేరుకుంది.అయితే, ఈ విలీనం అంత సులభంగా చెల్లుబాటు అవుతుందా? అనే ప్రశ్న కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. పదో షెడ్యూల్ (యాంటీ డిఫెక్షన్ చట్టం) ప్రకారం.. పార్లమెంటులోని ఒక పార్టీకి చెందిన ఎంపీలు వేరే పార్టీతో విలీనం కావాలంటే, ఆ పార్టీ పార్లమెంటరీ విభాగంలో కనీసం మూడింట రెండొంతుల మంది సభ్యులు విలీనానికి అంగీకరించాలి. తిరుగుబాటు ఎంపీలు తమ సంఖ్య ఆ పరిమితిని దాటిందని చెబుతున్నప్పటికీ, దీనిపై తుది నిర్ణయం లోక్‌సభ స్పీకర్ తీసుకోవాల్సి ఉంటుంది. తిరుగుబాటు వర్గాన్ని ప్రత్యేక సమూహంగా గుర్తిస్తారా? ఎన్సీపీఐలో విలీనాన్ని అధికారికంగా ఆమోదిస్తారా? అనే అంశాలపై స్పీకర్ నిర్ణయం కీలకంగా మారనుంది. అందువల్ల తృణమూల్‌లో రాజకీయ సంక్షోభం కొత్త మలుపు తిరిగినప్పటికీ, ఈ విలీనం చట్టపరంగా, పార్లమెంటరీ పరంగా ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
మమతకు మరో ఎదురుదెబ్బ.. లీగల్ నోటీసు కలకలం
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లో తీవ్ర అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణముల్ కాంగ్రెస్(టీఎంసీ)కి మరో ఎదురుదెబ్బ తగిలింది. తిరుగుబాటు ఎంపీ కకోలీ ఘోష్ కుమారుడు డాక్టర్ బైద్యనాథ్ ఘోష్ దస్తిదార్.. మమతా బెనర్జీతో పాటు పలువురు సీనియర్ టీఎంసీ నేతలకు లీగల్ నోటీసులు పంపడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈ ఘటన మమతకు ఊహించని షాకిచ్చింది.అయితే, వృత్తిరీత్యా సైకియాట్రిస్ట్ అయిన డాక్టర్ బైద్యనాథ్ ఘోష్ దస్తిదార్.. తాను బరాసత్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి టీఎంసీ టికెట్ కోరినట్లు కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని ఆయన పేర్కొన్నారు. తన ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ న్యాయపరమైన చర్యలకు దిగారు. ఈ లీగల్ నోటీసులు మమతా బెనర్జీతో పాటు టీఎంసీ ఎంపీలు మహువా మొయిత్రా, కళ్యాణ్ బెనర్జీ, సౌగతా రాయ్, అలాగే పార్టీ నాయకురాలు సోనాలీ గుహలకు పంపినట్లు సమాచారం.నాపై తప్పుడు ప్రచారం..ఇటీవల టీఎంసీలో చెలరేగిన అంతర్గత విభేదాల సందర్భంగా కకోలి ఘోష్ దస్తిదార్ తిరుగుబాటుకు కారణం తన కుమారుడికి అసెంబ్లీ టికెట్ ఇవ్వకపోవడమేనని కొందరు పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. ముఖ్యంగా మహువా మొయిత్రా చేసిన వ్యాఖ్యలను బైద్యనాథ్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా..‘నా కోసం నా తల్లి ఎమ్మెల్యే టికెట్ అడిగిందనడం వంద శాతం అబద్ధం. రాజకీయ విభేదాలను రాజకీయంగానే ఎదుర్కోవాలి. కుటుంబ సభ్యులను లాగడం సరైంది కాదు’ అని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. లీగల్ నోటీసులో భాగంగా తనపై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పరువునష్టం కేసులు సహా తదుపరి న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.Dr. Baidyanath Ghosh Dastidar, son of rebel TMC MP Kakoli Ghosh Dastidar, has sent a legal notice to former West Bengal Chief Minister Mamata Banerjee and several Trinamool Congress leaders including Mahua Moitra, Kalyan Banerjee, Sougata Roy, and Sonali Guha. In the notice,… pic.twitter.com/HCYU0lQ0ZT— ANI (@ANI) June 14, 2026ఐ-ప్యాక్ ప్రతినిధులే..తాను ఎప్పుడూ బరాసత్ నుంచి పోటీ చేయాలనే ఆసక్తి చూపలేదని బైద్యనాథ్ స్పష్టం చేశారు. అయితే టీఎంసీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ఐ-ప్యాక్ (I-PAC) ప్రతినిధులే తనను సంప్రదించి బరాసత్ నుంచి పోటీ చేయాలని కోరారని ఆయన పేర్కొన్నారు. అలాగే స్థానిక పార్టీ కార్యకర్తలు ఆరోగ్య శిబిరాల్లో పాల్గొనాలని పలుమార్లు ఆహ్వానించినట్లు కూడా నోటీసులో ప్రస్తావించినట్లు సమాచారం. ఈ పరిణామం ఇప్పటికే తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న టీఎంసీకి మరింత ఇబ్బందికరంగా మారింది. ఇటీవల కకోలి ఘోష్ దస్తిదార్ నేతృత్వంలో టీఎంసీ ఎంపీల్లో ఒక వర్గం పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు జెండా ఎగురవేసింది. తమకు మద్దతుగా గణనీయ సంఖ్యలో ఎంపీలు ఉన్నారని తిరుగుబాటు వర్గం ప్రకటించగా, పార్టీ అధిష్ఠానం వారిని "ద్రోహులు"గా అభివర్ణించింది. ఈ సంక్షోభం నేపథ్యంలో మమతా బెనర్జీ ఇటీవల పార్టీ సంస్థాగత నిర్మాణంలో పలు మార్పులు చేపట్టి తిరుగుబాటు నేతలను కీలక పదవుల నుంచి తప్పించారు. పార్టీపై తిరిగి పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. -
బెంగాల్ రాజకీయాలను కుదిపేస్తున్న ‘నంబర్ 13’ రహస్యం!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరో ఉత్కంఠభరిత సీన్ నడుస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో తిరుగుబాటు చెలరేగుతోన్న విషయం తెలిసిందే. 19 మంది ఎంపీలు సంతకం చేసిన ఓ లేఖ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీలో టెన్షన్ పుట్టిస్తోంది. అయితే ఆ లేఖలోని ఒక చిన్న అంశం అందరి దృష్టిని ఆకర్షించింది. దానికి ఇప్పటివరకు ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు. ఆ రెబల్ ఎంపీల జాబితా ఉన్న లేఖలో 1 నుంచి 20 వరకు సంఖ్యలు ఉన్నాయని, అయితే 13వ సంఖ్య వద్ద ఎలాంటి సంతకం లేదని సోర్సెస్ చెబుతున్నాయి. ఆ ఖాళీ స్థానం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. తెర వెనుక ఏం జరుగుతోందో చూద్దాం..అసలు విషయం ఏంటి?టీఎంసీ నాయకత్వంపై కొందరు ఎంపీలు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌కు లేఖ పంపి, తమను ప్రత్యేక వర్గంగా గుర్తించాలని, పార్టీ ఎన్నికల గుర్తుపై హక్కు కల్పించాలని కోరినట్లు చెప్పుకున్నారు. ఇద్దరు ఎంపీలు ఈ లేఖపై తాము సంతకం చేసినట్లు బహిరంగంగానే అంగీకరించారు. అయితే ఆ లేఖ అందిన విషయాన్ని స్పీకర్ కార్యాలయం ఇప్పటివరకు అధికారికంగా ధ్రువీకరించలేదు.‘నంబర్ 13’ ఎందుకు అంత ఉత్కంఠ రేపుతోంది?జాతీయ మీడియాలో పేర్కొన్న సమాచారం ప్రకారం.. లోక్‌సభ స్పీకర్‌కు పంపిన లేఖలో 1 నుంచి 20 వరకు వరుస సంఖ్యలు ఉన్నాయి. అందులో 19 మంది ఎంపీలు ఇప్పటికే సంతకాలు చేశారు. అయితే 13వ సంఖ్య పక్కనున్న స్థలం పూర్తిగా ఖాళీగా ఉంది. ప్రస్తుతం "నంబర్ 13" ఎవరో అధికారికంగా ఎవరూ వెల్లడించలేదు. టీఎంసీ రెబల్ ఎంపీల 13వ సంఖ్య వద్ద సంతకం లేకుండా ఖాళీగా ఉంచారని జాతీయ మీడియా చెబుతోంది. ఆ 13వ సంఖ్య వద్ద ఎవరైనా మరో ఎంపీ సంతకం చేస్తే రెబల్స్ సంఖ్య 20 అవుతుంది. రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న చర్చ ప్రకారం.. ఆ స్థానం పార్టీలో అత్యంత సీనియర్, పలుసార్లు ఎంపీగా గెలిచిన ఒక ప్రముఖ నేత కోసం ఉద్దేశపూర్వకంగా 13వ సంఖ్య వద్ద ఏ పేరూ రాయకుండా ఖాళీగా ఉంచినట్లు భావిస్తున్నారు. సరైన సమయంలో ఆ నేత రెబల్ వర్గంలో చేరి సంతకం చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పటివరకు రెబల్ వర్గం ఆ నేత పేరును వెల్లడించలేదు. టీఎంసీ కూడా ఎలాంటి అధికారిక వ్యాఖ్య చేయలేదు. జాతీయ మీడియా కథనాలు కూడా ఆ వ్యక్తిని కేవలం "సీనియర్ ఎంపీ" లేదా "పలుసార్లు ఎన్నికైన ఎంపీ"గానే పేర్కొంటున్నారు.అందువల్ల "నంబర్ 13" ఎవరనే విషయంలో ప్రస్తుతం వస్తున్న పేర్లన్నీ ఊహాగానాలే. ఆ ఎంపీ బహిరంగంగా ముందుకు రావడం లేదా లేఖపై సంతకం చేయడం జరిగితేనే అసలు విషయం బయటపడే అవకాశం ఉంది.తిరుగుబాటు ఎంపీల డిమాండ్ ఏంటి?తిరుగుబాటు వర్గం తామే లోక్‌సభలో నిజమైన టీఎంసీ ప్రతినిధులమని చెబుతోంది. తమను ప్రత్యేక పార్లమెంటరీ వర్గంగా గుర్తించాలని కోరుతోంది. ఇప్పుడు తుది నిర్ణయం స్పీకర్ చేతుల్లో ఉంది. నిబంధనల ప్రకారం పత్రాలను పరిశీలించిన తర్వాత, ఎంపీలతో మాట్లాడిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారు.అభిషేక్‌నే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారు?ఈ తిరుగుబాటుకు ప్రధాన కారణం ఎన్నికల్లో ఓటమి. తమ అభిప్రాయాలు, సూచనలను పార్టీ పట్టించుకోలేదని పలువురు సీనియర్ నేతలు ఆరోపిస్తున్నారు. ఎంపీల ఆగ్రహం చాలావరకు మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీపైనే.పశ్చిమ బెంగాల్లో తర్వాత ఏమి జరగవచ్చు?పార్టీ, ఎన్నికల గుర్తుపై ఆధిపత్యం కోసం పోరాటం జరగవచ్చు. ఈ 19 మంది ఎంపీలకు లోక్‌సభ స్పీకర్, ఎన్నికల సంఘం గుర్తింపు ఇస్తే, మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ వర్గాల తరహాలో వీరే “నిజమైన టీఎంసీ”గా గుర్తింపు పొందవచ్చు. అలా జరిగితే రాజీనామా చేయకుండానే పార్టీ ఎన్నికల గుర్తుపై హక్కు సాధించే అవకాశం ఉంటుంది.పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం నుంచి మినహాయింపు పొందాలంటే ఎంపీలలో మూడింట రెండొంతుల మద్దతు అవసరం. 28 మంది ఎంపీలు ఉన్న టీఎంసీలో రెబల్స్ సంఖ్య మనకు తెలిసినంతవరకు 19. ఈ వర్గం కోరుకుంటే నేరుగా ఎన్డీఏకు మద్దతు ఇవ్వవచ్చు. లేదా భారతీయ జనతా పార్టీలో విలీనం కావచ్చు. తిరుగుబాటు నేతలు ఇప్పటికే ఢిల్లీలో కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌ను కలిశారని సమాచారం. -
చుక్కలు చూపిస్తున్న సువేందు.. అభిషేక్ ఇంటి వద్ద అర్ధరాత్రి హైడ్రామా!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీ ఇంటి వద్ద అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. సోదాల పేరుతో పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలు.. అభిషేక్ ఇంటి తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించినట్లు టీఎంసీ వర్గాలు ఆరోపించాయి. ఈ విషయం తెలుసుకున్న మమతా బెనర్జీ.. హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కాళీఘాట్‌లోని అభిషేక్ బెనర్జీ నివాసంలో శనివారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. భూ కుంభకోణానికి సంబంధించిన కేసులో దర్యాప్తు నిమిత్తం ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలు ఇంటి తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించాయి. ఈ సందర్బంగా సల్బోని ప్రాంతంలోని ఓ భూమికి సంబంధించిన కేసులో నిందితుడిగా ఉన్న అభిషేక్ బెనర్జీ వ్యక్తిగత సహాయకుడు సుమిత్ రాయ్ కోసం తాము గాలిస్తున్నట్లు దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. అభిషేక్ నివాసంలో నాలుగు గంటలకు పైగా సోదాలు నిర్వహించారు. అయితే, పోలీసులతో పాటు కేంద్ర భద్రతా బలగాలు కూడా తనిఖీల్లో పాల్గొనడంతో టీఎంసీ కార్యకర్తలు పెద్దఎత్తున నిరసన తెలిపారు.Kolkata, West Bengal: Security is heightened at the residence of TMC MP Abhishek Banerjee, with officers from Kolkata Police's Kalighat Police Station and Shalboni Police Station deployed at the premises alongside central security forces pic.twitter.com/qUQehyrh7E— IANS (@ians_india) June 13, 2026ఈ విషయం తెలుసుకున్న వెంటనే టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ.. అభిషేక్ ఇంటికి చేరుకున్నారు. ఆమె రాకతో అక్కడ రాజకీయ ఉద్రిక్తత మరింత పెరిగింది. టీఎంసీ నేతలు ఈ సోదాలను రాజకీయ కక్షసాధింపు చర్యగా అభివర్ణించారు. సోదాల అనంతరం మీడియాతో మాట్లాడిన అభిషేక్ బెనర్జీ.. పోలీసులు అతిగా వ్యవహరించారని ఆరోపించారు. తన నివాసంలోకి గేటు తాళాలు బద్దలు కొట్టి ప్రవేశించారని అన్నారు. తాను ఏమైనా దాచిపెట్టానా? అంటూ ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై తగిన న్యాయపరమైన చర్యలు పరిశీలిస్తామని చెప్పుకొచ్చారు.మరోవైపు.. బెంగాల్లో మున్సిపాలిటీ నియామకాల కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు టీఎంసీ ఎమ్మెల్యే మదన్మిత్ర నివాసంపై దాడులు చేశారు. సోదాలు నిర్వహిస్తుండగా అతడి మంచం కింద నగదు, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ పరిణామాలన్నీ 2026 బెంగాల్ రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నాయి. ఒకవైపు దర్యాప్తు సంస్థల చర్యలు, మరోవైపు టీఎంసీ చేస్తున్న రాజకీయ కక్షసాధింపు ఆరోపణల మధ్య ఈ వ్యవహారం ఎటువైపు మలుపు తిరుగుతుందో అన్న ఆసక్తి నెలకొంది.ABHISHEK BANERJEE ON THE 2 AM KNOCK"My whole residence has been searched , whether I have kept him or not go and ask investigative agency..." pic.twitter.com/oEgSC11Y9n— Rahul Shivshankar (@RShivshankar) June 13, 2026 -
మమతా బెనర్జీకి బిగ్ షాక్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఎన్నికల్లో ఓటమి తర్వాత మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఎన్నికల ప్రచార సమయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై కేసు నమోదైంది. దీంతో, మమతకు బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది.కాగా, అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా మార్చి 9వ తేదీన కోల్‌కతాలోని ఎస్ప్లనేడ్ ప్రాంతంలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో రెండు మతాల మధ్య శత్రుత్వాన్ని పురిగొల్పేలా ప్రసంగించారంటూ వచ్చిన ఫిర్యాదుపై శుక్రవారం నేతాజీ నగర్ పోలీస్ స్టేషన్లో జీరో–ఎఫ్ఐఆర్ నమోదైంది. అనంతరం ఆ కేసును ఎస్ప్లనేడ్ పరిధిలోని హరే స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. దేశ సార్వభౌమత్వానికి, శాంతి భద్రతలకు భంగం కలిగించేలా మమత వ్యాఖ్యలు చేశారంటూ సిలిగురిలోని సైబర్ పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది.తుషార్ కాంతి దాస్ అనే వ్యక్తి జూన్ 5న నేతాజీ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే, తృణమూల్ కాంగ్రెస్ ఈ కేసును రాజకీయ ప్రతీకార చర్యగా అభివర్ణించింది. మమతా బెనర్జీపై ఇటీవల నమోదైన పలు ఫిర్యాదుల్లో ఇది మరో కేసుగా మారింది. ఈ వ్యవహారం ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశమైంది. -
4,000 ఈవీఎంలు అగ్నికి ఆహుతి
కోల్‌కతా: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 4,000 ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎంలు) మంటల్లో కాలి బూడిదయ్యాయి. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. రాష్ట్రంలో ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలను నగరంలోని అలీపూర్ ప్రాంతంలో ఓ ప్రభుత్వ భవనంలో భద్రపర్చారు. ఇది బహుళ అంతస్తుల భవనం. ఇందులో ఎన్నికల సంబంధిత విభాగాలతోపాటు పలు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. శుక్రవారం ఉన్నట్టుండి భవనంలో మంటలు చెలరేగాయి. భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇటీవల ఎన్నికల్లో 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉపయోగించిన 4,000 ఈవీఎంలు అగ్నికి ఆహుతైనట్లు అధికారులు వెల్లడించారు. అగ్ని మాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పేసినట్లు తెలిపారు. ఈ ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక కుట్ర ఉండొచ్చని ప్రచారం సాగుతోంది. భవనంలో హఠాత్తుగా మంటలు చెలరేగడానికి కారణం ఏమిటన్నది ఇంకా గుర్తించలేదు. ఇది సాధారణ అగ్ని ప్రమాదంలా కనిపించడం లేదని బెంగాల్ ఫైర్ సర్వీసుల శాఖ మంత్రి కౌశిక్ చౌదరి చెప్పారు. మొదట కింది అంతస్తులో మొదలైన మంటలు క్రమంగా 8, 9 అంతస్తులకు వ్యాపించాయి. ఈ రెండు అంతస్తుల్లోనే ఎన్నికల విభాగాలు ఉన్నాయి. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలిపారు. నిజాలు నిగ్గుతేల్చడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు జరిపి, నష్టం తీవ్రతను అంచనా వేసే బాధ్యతను సిట్‌కు అప్పగించారు. అగ్ని ప్రమాదంలో ఈవీఎంలు పూర్తిగా కాలిపోవడం వెనుక అధికార బీజేపీ హస్తం ఉన్నట్లు ప్రతిపక్ష తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టు చేసింది. ‘‘అగ్నిప్రమాదంలో అంతుచిక్కని రీతిలో ఈవీఎంలు ధ్వంసమయ్యాయి. 4,000 కంట్రోల్ యూనిట్లు, 4,000 బ్యాలెట్ యూనిట్లు 4,000 వీవీప్యాట్లు బూడిదగా మారిపోయాయి’’అని పేర్కొంది. -
టీఎంసీలో తిరుగుబాటు తుపాను.. ఇదేం ట్విస్ట్ బాబోయ్
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో భారీ ప్రకంపనలు సృష్టించే పరిణామం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తిన్న తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఇప్పుడు పార్టీ చీలిక అంచుల దాకా వెళ్లిన పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీకి చెందిన రెబల్స్ రాసిన సీక్రెట్ లేఖ ఒకటి బయటకు రావడం కలకలం రేపుతోంది. అంతేకాదు.. అసలైన తృణమూల్ కాంగ్రెస్ తమదేనని, పార్టీ ఎన్నికల గుర్తుపై కూడా హక్కు తమకే ఉందని వారు వాదిస్తున్నట్లు సమాచారం.ఏకంగా 19 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటు జెండా ఎగురవేసి, ప్రత్యేక పార్లమెంటరీ వర్గంగా గుర్తింపు ఇవ్వాలని లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాయడం సంచలనంగా మారింది. మే 18 తేదీతో స్పీకర్‌కు పంపిన ఆ రహస్య లేఖ.. కొన్ని మీడియా సంస్థల స్టింగ్ ఆపరేషన్ తర్వాత వెలుగులోకి వచ్చింది. ఆ లేఖలో మెజారిటీ ఎంపీలు సంతకాలు చేసినట్లు తెలుస్తోంది. వాళ్లలో మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్, నటి-ఎంపీ రచనా బెనర్జీ, సయోనీ ఘోష్, శతాబ్ది రాయ్, కాకోలి ఘోష్ దస్తిదార్ తదితరులు ఉన్నారు. ఈ పరిణామంతో.. తృణమూల్‌లో కేవలం తొమ్మిది మంది మాత్రమే మమతా శిబిరంలో మిగిలినట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.రెబల్ ఎంపీలకు ఏ పార్టీనో, కూటమిలోనే చేరే ఉద్దేశం లేదని వాళ్ల లేఖను బట్టి అర్థమవుతోంది. స్వతంత్ర పార్లమెంటరీ గ్రూప్‌గా పనిచేస్తామని వాళ్లు స్పీకర్‌కు రాసిన లేఖలో స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే వారి తదుపరి వ్యూహం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు వంటి కీలక అంశాలపై కేంద్రం తీసుకునే నిర్ణయాలను కూడా ఈ వర్గం పార్టీ అధినాయకత్వం ఆదేశాలను పాటిస్తుందా? లేదా? అనే కుతూహలం నెలకొంది.ఇప్పటికే మమతా బెనర్జీ మేనల్లుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ వ్యవహార శైలిపై కొంతకాలంగా అసంతృప్తి వ్యక్తమవుతోందన్న వార్తలు వస్తున్నాయి. ఆ అసంతృప్తే ఇప్పుడు బహిరంగ తిరుగుబాటుగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల అసెంబ్లీలోనూ మెజారిటీ ఎమ్మెల్యేలు పార్టీకి దూరం కావడం, ఇప్పుడు ఎంపీలు కూడా వేరు దారి పట్టడం.. తృణమూల్ 28 ఏళ్ల చరిత్రలోనే అతిపెద్ద అంతర్గత సంక్షోభంగా కనిపిస్తోంది.ఈ వ్యవహారంలో మరో కీలక అంశం కూడా ఉంది. తిరుగుబాటు ఎంపీలు స్పీకర్‌కు లేఖ రాసిన తేదీ మే 18. అయితే పార్టీ చీఫ్ విప్‌గా సీనియర్ నేత కల్యాణ్ బెనర్జీ నియామకం మే 19న జరిగింది. దీంతో సాంకేతికంగా ఈ వర్గానికి గుర్తింపు ఇవ్వాలా? వద్దా? అన్నది స్పీకర్ పరిశీలించాల్సి ఉంటుంది. అలాగే.. పార్టీ గుర్తుపై కూడా రెబల్ వర్గం హక్కు కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమ వద్దే ఎక్కువ మంది ఎంపీలు ఉన్నారని వాదిస్తూ వారు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించే అవకాశముంది. మరోవైపు నటుడు.. సీనియర్ ఎంపీ శతృఘ్న సిన్హా మాత్రం తిరుగుబాటు వర్గానికి దూరంగా ఉంటూ మమతా బెనర్జీకే తన మద్దతు ప్రకటించారు. మహువా మెయిత్రా సైతం దీదీ పక్షాన నిలిచి అధికారిక శిబిరంలో కొనసాగుతున్నారు. ఇప్పటికే పార్టీపై పట్టు కోల్పోతున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్న మమతకు.. రెబల్స్ తాజా ఎత్తుగడలు మైండ్ బ్లాక్ చేసేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రత్యేక వర్గం, పార్టీ గుర్తు, ఎన్నికల సంఘం పోరు.. ఇలా ఒక్కో అడుగు ముందుకేస్తున్న తిరుగుబాటు నేతలు దీదీ శిబిరంలో ఆందోళన పెంచుతున్నట్లు తెలుస్తోంది. అలా జరిగితే.. ఈ వివాదం ఎన్నికల సంఘం నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. -
సువేందు దూకుడు.. 2,980 అక్రమ వలసదారుల ఏరివేత!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో అక్రమ వలసల నియంత్రణకు సంబంధించి సరికొత్త గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం అక్రమ వలసదారుల ఏరివేతపై ఉక్కుపాదం మోపుతోంది. గత మార్చి నెల నుంచి ఇప్పటివరకు పశ్చిమ బెంగాల్‌లోని వివిధ సరిహద్దు అవుట్పోస్ట్ల ద్వారా 2,980 మంది అక్రమ బంగ్లాదేశ్ వలసదారులను తిరిగి వారి దేశానికి పంపించివేసినట్లు అధికారిక గణాంకాల ద్వారా వెల్లడవుతోంది.సువేందు సర్కార్ యాక్షన్ ప్లాన్పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ప్రక్రియ వేగాన్ని పుంజుకుంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన కొద్ది రోజుల్లోనే, అంటే మే 19 నుండి ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 1,930 మంది అక్రమ వలసదారులను వెనక్కి పంపారు. మే 19న ముఖ్యమంత్రి సువేందు అధికారి ‘డిటెక్ట్, డిలీట్ అండ్ డిపోర్ట్’ (గుర్తించు, తొలగించు, దేశం దాటించు) అనే కఠినమైన విధానాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పాలసీ అమల్లోకి వచ్చిన నాటి నుండి సరిహద్దుల్లో గస్తీ, తనిఖీలు ముమ్మరమయ్యాయి.ఢిల్లీలో ఉన్నత స్థాయి చర్చలుఒకవైపు సరిహద్దుల్లో ఈ విధమైన భారీ బహిష్కరణల పర్వం కొనసాగుతుండగానే, మరోవైపు దేశ రాజధాని న్యూఢిల్లీలో కీలక చర్చలు జరుగుతున్నాయి. భారత్‌కు చెందిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ , బంగ్లాదేశ్‌కు చెందిన బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ ఉన్నతాధికారులు ప్రస్తుతం ఢిల్లీలో సమావేశమయ్యారు. అక్రమ వలసల నిరోధంతో పాటు ఇరు దేశాల సరిహద్దుల్లో మెరుగైన సమన్వయం, పరస్పర సహకారం పెంపొందించుకోవడమే లక్ష్యంగా ఈ ద్వైపాక్షిక చర్చలు సాగుతున్నాయి.రిపోర్టుతో వెల్లడైన నిజాలు‘ది ప్రింట్’ సేకరించిన సరిహద్దు భద్రతా దళాల (బీఎస్ఎఫ్) అంతర్గత వర్గాల డేటా ప్రకారం ఈ షాకింగ్ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని హకీంపూర్ బోర్డర్ అవుట్‌పోస్ట్‌తో పాటు బెంగాల్‌లోని పలు కీలక సరిహద్దు తనిఖీ కేంద్రాల ద్వారా ఈ వలసదారులను గుర్తించి, చట్టపరమైన ప్రక్రియల అనంతరం బంగ్లాదేశ్ అధికారులకు అప్పగించారు. ఈ సరిహద్దు నియంత్రణ చర్యలు రాబోయే రోజుల్లో మరింత తీవ్రతరం కానున్నట్లు తెలుస్తోంది. -
కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం?.. ఇదిగో క్లారిటీ
మమత-సోనియా ఆలింగనం.. రాహుల్-అభిషేక్ చర్చలు.. ఏదైనా సంచలన ప్రకటన వెలువడబోతోందేమోనని.. గత రెండు రోజులుగా దేశ రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. బెంగాల్ రాజకీయాల్లో సంచలన పరిణామాలు(చీలిక, తిరుగుబాటు.. వగైరా) చోటుచేసుకుంటున్న వేళ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోతోందన్న ప్రచారం తీవ్ర చర్చకు దారితీసింది. ఢిల్లీలో జరిగిన కీలక భేటీలు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. అయితే ఈ ప్రచారంపై ఇప్పుడో క్లారిటీ వచ్చింది.గతంలో..(ఎన్నికల టైంలో) కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేసిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనూహ్య వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇటీవల జరిగిన ఇండియా కూటమి సమావేశంలో కాంగ్రెస్ పార్టీనే ప్రతిపక్ష పోరాటానికి నాయకత్వం వహించాలని ఆమె అన్నారు. ఇది రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ తర్వాత ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీతో మమత భేటీ కావడం, ఇద్దరూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం మరిన్ని సందేహాలకు తావిచ్చింది.ఈ భేటీ జరిగిన మరుసటి రోజే లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సమావేశమయ్యారు. దీంతో టీఎంసీ భవిష్యత్, కాంగ్రెస్‌తో సంబంధాలు, విలీనం అవకాశాలపై ఊహాగానాలు మరింత వేగం పుంజుకున్నాయి.ఇదే సమయంలో టీఎంసీలో అసంతృప్తి నేతల వర్గం పార్టీకి చెందిన 28 మంది లోక్‌సభ సభ్యుల్లో కనీసం 19 మంది మద్దతు తమకు ఉందని, తామే అసలైన పార్లమెంటరీ విభాగమని ప్రకటించబోతున్నారన్న వార్తలు రాజకీయంగా సంచలనం సృష్టించాయి. ఇప్పటికే పార్టీకి చెందిన పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేయడం, వరుసగా రాజీనామాలు జరగడం కూడా మమతపై ఒత్తిడిని పెంచింది.ముఖ్యంగా రాజ్యసభ సభ్యురాలు సుష్మితా దేవ్ టీఎంసీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం మరో షాక్‌గా మారింది. అంతకుముందు సుఖేందు శేఖర్ రాయ్ కూడా పార్టీని వీడారు. సుష్మితా దేవ్ ఢిల్లీలో హిమంత బిశ్వ శర్మను కలవడం ఆమె బీజేపీలో చేరబోతున్నారన్న ఊహాగానాలకు దారితీసింది. అయితే దీనిపై ఆమె స్పష్టత ఇవ్వకుండా, సరైన సమయంలో నిర్ణయం ప్రకటిస్తానని మాత్రమే చెప్పారు.ఇక ఈ పరిణామాల వేళ.. ఢిల్లీలో టీఎంసీ నేతల కదలికల నేపథ్యంలో ‘విలీనం’ వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి. అంతేకాకుండా శివసేన(ఉద్దవ్ వర్గం) కీలక నేత సంజయ్ రౌత్.. ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి విడిపోయిన టీఎంసీ, ఎన్సీపీ (ఎస్పీ) వంటి పార్టీలు తిరిగి కాంగ్రెస్‌లో కలవాలని వ్యాఖ్యానించడం చర్చకు మరింత ఊతమిచ్చింది.అయితే ఈ ప్రచారానికి టీఎంసీ పుల్‌స్టాప్ పెట్టింది. కాంగ్రెస్‌తో విలీనం గురించి ఎలాంటి ప్రతిపాదన లేదని, అలాంటి అంశం ఏ సమావేశంలోనూ చర్చకు రాలేదని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. అసలీ పుకార్లు ఎలా పుట్టాయో తమకు అర్థం కావడం లేదని అంటోంది. ఇటు కాంగ్రెస్ వర్గాలు కూడా ఇదే విషయాన్ని వెల్లడించాయి. మమత-సోనియా, రాహుల్-అభిషేక్ భేటీల్లో ప్రధానంగా పశ్చిమ బెంగాల్లో ప్రతిపక్ష వ్యూహాలు, ఇండియా కూటమి బలోపేతం, 2029 లోక్‌సభ ఎన్నికల సన్నాహకాల గురించే చర్చ జరిగిందని పేర్కొన్నాయి.రెండు రోజులుగా దేశ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారిన విలీనం ప్రచారానికి చివరకు టీఎంసీ స్పందిస్తూ.. "అది పూర్తిగా పుకారు మాత్రమే.. విలీనం అంశంపై అసలు ఎలాంటి చర్చా జరగలేదు" అని తేల్చిచెప్పింది. -
మమత ముందున్న 4 మార్గాలు ఇవే.. ఇలాచేస్తేనా సామిరంగా..
ఒకే ఒక్క ఓటమి.. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓడిపోవడం, ఆ తర్వాతి నుంచి పార్టీకి పెద్ద ఎత్తున నేతలు గుడ్‌బై చెబుతుండడంతో ఆ పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అసలు ఏం చేయాలో కూడా అర్థంకాని పరిస్థితి తలెత్తుతోంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బలమైన సంస్థాగత నిర్మాణం కంటే మమతా బెనర్జీ వ్యక్తిగత నాయకత్వంపైనే ఎక్కువగా ఆధారపడింది. అధికారం కోల్పోయిన తర్వాత పార్టీలో తిరుగుబాట్లు, వలసలు పెరగడంతో ఆ బలహీనత బయటపడింది. అధికారంలో ఉన్నప్పుడు బలంగా కనిపించిన టీఎంసీ.. ఇప్పుడు నిజమైన రాజకీయ పార్టీగా తిరిగి నిలబడుతుందా? లేక క్రమంగా విచ్ఛిన్నమవుతుందా?తృణమూల్ కాంగ్రెస్ సాధారణ రాజకీయ పార్టీలా ఎదగలేదు. అది ముందుగా ఒక భావోద్వేగంగా రూపుదిద్దుకుంది. మమతా బెనర్జీ చుట్టూ ఆవేదన, ప్రతిఘటన, వామపక్ష వ్యతిరేక భావన, వీధి పోరాట స్ఫూర్తి, ప్రాంతీయత వంటి అంశాలు చేరి ఒక రాజకీయ శక్తిగా మారాయి. ఈ విధానం ఎన్నో సంవత్సరాలు విజయవంతమైంది. మమతా ప్రజల అసంతృప్తిని ఉద్యమంగా మార్చి, దాని ద్వారా అధికారంలోకి వచ్చారు. బెంగాల్లో 34 ఏళ్ల వామపక్ష పాలనకు 2011లో ముగింపు పలికారు. వరుసగా మూడు పర్యాయాలు అధికారాన్ని నిలబెట్టుకున్నారు.అయితే 2026 ఎన్నికల్లో పరిస్థితి పూర్తిగా మారింది. భారతీయ జనతా పార్టీ భారీ విజయం సాధించగా, తృణమూల్ సుమారు 80 స్థానాలకు పరిమితమైంది. మమతా బెనర్జీ భవానీపూర్ నియోజకవర్గంలో ఓడిపోవడం పెద్ద దెబ్బగా మారింది. ఓటమి ఒక్కటే సమస్య కాదు. అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ అంతర్గత బలహీనతలు బయటపడ్డాయి.పార్టీలో పెద్ద ఎత్తున తిరుగుబాటు ప్రారంభమైంది. అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు తిరుగుబాటు వర్గానికి మద్దతు ఇస్తున్నారనే వార్తలు వచ్చాయి. తిరుగుబాటు నేతలపై చర్యలు తీసుకున్నా పార్టీ నియంత్రణ బలహీనంగా కనిపించింది. మమతా నిర్వహించిన సమావేశాలకు తక్కువ మంది నేతలు రావడం, పలు కమిటీలను రద్దు చేయడం వంటి పరిణామాలు సంస్థాగత సంక్షోభాన్ని సూచించాయి.పార్లమెంటులో తృణమూల్ స్థితి కూడా అస్థిరంగా మారింది. రాష్ట్ర అధికార యంత్రాంగం, స్థానిక రాజకీయ బలం, ఎన్నికల వ్యవస్థపై ప్రభావం లేకపోవడంతో ఎంపీలు తమ రాజకీయ భవిష్యత్తుపై ఆలోచించడం ప్రారంభించారు. తిరుగుబాటు వర్గం నిజమైన తృణమూల్‌గా నిలిస్తే, చాలామంది తమ రాజకీయ మనుగడ దిశగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.మమతా బెనర్జీ వ్యక్తిగతంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ఎదిగిన నాయకురాలు. కానీ ఆమె చుట్టూ పెరిగిన నాయకత్వంలో చాలామంది అధికార రాజకీయాలకు మాత్రమే అలవాటు పడ్డారు. అధికారం ఉన్నప్పుడు విశ్వాసంగా కనిపించిన నాయకులు, ఓటమి తర్వాత వైఖరి మార్చుకోవడం దీనికి ఉదాహరణ.చేయాల్సినవి ఇవే.. ప్రస్తుతం మమతా ముందు నాలుగు మార్గాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీపై నియంత్రణ కొనసాగించడం, తిరుగుబాటు వర్గంతో రాజీకి రావడం, కింది స్థాయి నుంచి తిరిగి నిర్మాణం చేపట్టడం, లేక కాంగ్రెస్-వామపక్షాలతో పెద్ద కూటమి ఏర్పాటుపై ఆలోచించడం. ఇవి అంత ఈజీ కాదు. అసాధ్యమైన విషయాన్ని సుసాధ్యం చేయగలిగితేనే పార్టీ మళ్లీ పుంజుకుంటుంది.తృణమూల్ కాంగ్రెస్ ఇప్పటికీ నిజమైన రాజకీయ పార్టీగా నిలిచి పునర్నిర్మాణం చేసుకోగలదా? లేక నాయకురాలి వ్యక్తిగత ప్రజాదరణపై ఆధారపడిన వ్యవస్థగా క్రమంగా విచ్ఛిన్నమవుతుందా? అన్నదే ఇప్పుడు ప్రశ్న. -
రాజ్యసభకు సుస్మిత రాంరాం.. అస్సాం సీఎంతో మంతనాలు!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. పార్టీ సీనియర్ నేత సుఖేందు శేఖర్ రాయ్ రాజీనామా చేసిన కొద్ది రోజుల వ్యవధిలోనే, మరో కీలక మహిళా నేత, రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత టీఎంసీలో తిరుగుబాటు తీవ్రరూపం దాల్చింది. ఈ పరిణామాల మధ్యే సుస్మితా దేవ్ ఢిల్లీలో అస్సాం బీజేపీ ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.పతనం దిశగా మమత సామ్రాజ్యం?ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చేతిలో ఘోర పరాజయం పాలైన తర్వాత టీఎంసీని కాపాడుకోవడం మమతా బెనర్జీకి కత్తిమీద సాములా మారింది. మూడు పర్యాయాలు అధికారంలో ఉన్న పార్టీ ఇప్పుడు అంతర్గత కుమ్ములాటలతో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ 58 మంది శాసనసభ్యుల మద్దతుతో అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పదవిని కోరుతుండగా, మరో ఎంపీ కాకోలి ఘోష్ 19 మంది అసమ్మతి ఎంపీలతో కలిసి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమవడం పార్టీ పతనానికి సంకేతంగా మారింది.అవినీతిపై తిరుగుబాటు బావుటాఈ వారంలోనే మరో ప్రముఖ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ పార్టీకి రాజీనామా చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఎంసీలో అడ్డూఅదుపూ లేని అవినీతి, అరాచకం కొనసాగుతోందని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి సమావేశానికి కొన్ని గంటల ముందే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పార్టీ సంస్థాగత నిర్మాణంలో అవినీతి వేళ్లునుకుపోయిందని, ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని రాయ్ మండిపడ్డారు.కాంగ్రెస్ నుండి టీఎంసీ.. ఇప్పుడు బీజేపీ వైపు?గతంలో అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేసిన సుస్మితా దేవ్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజ్‌దీప్ రాయ్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 2021లో కాంగ్రెస్‌ను వీడి టీఎంసీలో చేరారు. పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా కూడా బాధ్యతలు నిర్వహించిన ఆమె, ఇప్పుడు రాజ్యసభ స్థానానికి రాజీనామా చేయడంతో మమతా బెనర్జీ రాజకీయ వ్యూహాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుతం ఆమె బీజేపీ సీఎం హిమంత బిస్వా శర్మతో భేటీ కావడంతో, ఆమె త్వరలోనే కాషాయ తీర్థం పుచ్చుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
టీఎంసీలో తిరుగుబాటు.. దీదీ నెత్తిన పాలు పోస్తున్న రాజ్యాంగ సవరణ!
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో టీఎంసీ తిరుగుబాటు ప్రకంపనలు రేపుతోంది. పార్టీకి చెందిన సుమారు 20 మంది లోక్‌సభ సభ్యులు మమతా బెనర్జీ నాయకత్వానికి వ్యతిరేకంగా ప్రత్యేక వర్గంగా ఏర్పడేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సంఖ్యాబలం చూస్తే ఇది దీదీకి భారీ ఎదురుదెబ్బలా కనిపిస్తున్నా.. చట్టపరంగా మాత్రం రెబల్స్‌కే షాక్ తగిలే పరిస్థితి ఉందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు.లోక్‌సభలో టీఎంసీకి 28 మంది ఎంపీలు ఉన్నారు. వారిలో 20 మంది తమవైపే ఉన్నారని తిరుగుబాటు వర్గం చెబుతోంది. అయితే రెండు మూడొంతుల మంది ఎంపీలు ఉన్నారనే కారణంతోనే అనర్హత నుంచి రక్షణ లభించదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వాస్తవానికి రాజకీయ చీలికలకు అడ్డుకట్ట వేసేందుకు తీసుకొచ్చిన 91వ రాజ్యాంగ సవరణ ఇప్పుడు మమతా బెనర్జీ వర్గానికే అండగా నిలుస్తోందని విశ్లేషిస్తున్నారు.ఒకప్పుడు రాజకీయ పార్టీల్లో చీలికలకు చట్టంలో కొంత వెసులుబాటు ఉండేది. శాసనసభ లేదంటే పార్లమెంట్లో మూడింట ఒక వంతు మంది సభ్యులు విడిపోయినా అనర్హత నుంచి రక్షణ పొందే అవకాశం ఉండేది. అయితే 2003లో జరిగిన 91వ రాజ్యాంగ సవరణతో ఆ నిబంధనను పూర్తిగా తొలగించారు. అప్పటి నుంచి "స్ప్లిట్"(చీలిక) అనే భావనకు చట్టపరమైన గుర్తింపు లేదు. ఇప్పుడు రక్షణ పొందాలంటే "మెర్జర్"(విలీనం) మాత్రమే మార్గంగా మిగిలింది.అక్కడే టీఎంసీ తిరుగుబాటు ఎంపీలకు చిక్కులు మొదలవుతున్నాయి. ఎందుకంటే కేవలం ఎంపీలు విడిపోయి కొత్త బ్లాక్‌గా ఏర్పడితే అది విలీనంగా పరిగణించబడదు. పార్టీ సంస్థ మొత్తం మరో పార్టీలో విలీనం కావడం.. దానికి కనీసం రెండు మూడొంతుల మంది ప్రజాప్రతినిధులు అంగీకరించడం వంటి షరతులు నెరవేరినప్పుడే అనర్హత నుంచి రక్షణ లభిస్తుంది. లేదంటే పార్టీని స్వచ్ఛందంగా వీడినట్టుగా పరిగణించి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.ఇదే కారణంగా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో మరో ప్రశ్న వినిపిస్తోంది. మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే అనుసరించిన వ్యూహాన్ని టీఎంసీ తిరుగుబాటు వర్గం అమలు చేయగలదా? శివసేన సంక్షోభంలో షిండే వర్గం కేవలం ఎమ్మెల్యేలను కూడగట్టుకోవడమే కాదు.. తామే అసలైన శివసేన అని ప్రకటించి పార్టీ సంస్థపై హక్కు కోసం పోరాటం చేసింది. చివరకు ఎన్నికల సంఘం ముందు తమ వాదనను నిలబెట్టి పార్టీ పేరు, గుర్తుపై ఆధిపత్యం సాధించింది.టీఎంసీ తిరుగుబాటు వర్గం కూడా అదే దారిలో నడవాలంటే కేవలం ఎంపీల సంఖ్య సరిపోదు. పార్టీ సంస్థలో, రాష్ట్ర స్థాయి నిర్మాణాల్లో, జిల్లా కమిటీల్లో, ఇతర విభాగాల్లో తమకే మెజారిటీ మద్దతు ఉందని నిరూపించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే "అసలైన టీఎంసీ మాదే" అనే వాదనకు బలం చేకూరే అవకాశం ఉంటుంది. లేదంటే ప్రత్యేక బ్లాక్‌గా ఏర్పడటం మాత్రమే జరిగితే అనర్హత ముప్పు తప్పకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.అంటే ప్రస్తుతం తిరుగుబాటు ఎంపీల ముందు రెండు మార్గాలే కనిపిస్తున్నాయి. ఒకటి.. చట్టబద్ధమైన విలీనం దిశగా అడుగులు వేయడం. రెండోది.. తామే అసలైన టీఎంసీ అని ప్రకటించి పార్టీపై హక్కు కోసం పోరాటం చేయడం. ఈ రెండింటిలో ఏదీ చేయకుండా కేవలం ప్రత్యేక వర్గంగా కొనసాగితే యాంటీ డిఫెక్షన్ చట్టం వారి మెడకు చుట్టుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.అందుకే రాజకీయ విశ్లేషకులు ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేస్తున్నారు. బయటికి చూస్తే ఇది మమతా బెనర్జీకి ఎదురుదెబ్బలా కనిపించినా.. చట్టపరంగా చూస్తే ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలు ఆమెకే అండగా నిలుస్తున్నాయి. ఒకప్పుడు రాజకీయ చీలికలను ప్రోత్సహించకుండా తీసుకొచ్చిన 91వ రాజ్యాంగ సవరణే ఇప్పుడు టీఎంసీ తిరుగుబాటుదారులకు అతిపెద్ద అడ్డంకిగా మారిందని చెబుతున్నారు.మొత్తానికి టీఎంసీలో జరుగుతున్నది కేవలం ఎంపీల తిరుగుబాటు మాత్రమే కాదు. ఇది పార్టీపై హక్కు కోసం సాగబోయే పెద్ద రాజకీయ, న్యాయపోరాటానికి నాంది కావచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. 20 మంది ఎంపీలు ఉన్నంత మాత్రాన చట్టం కళ్లలో రక్షణ లభించదు. "అసలైన టీఎంసీ ఎవరిది?" అనే ప్రశ్నకు సమాధానం దొరికే వరకు ఈ పోరాటం కొనసాగనుంది. -
మమత నివాసంలో సీఐడీ సోదా
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ నివాసంలో రాష్ట్ర సీఐడీ అధికారులు మంగళవారం మధ్యాహ్నం సోదాలు జరిపారు. కోల్‌కతా కాళీఘాట్ ప్రాంతంలోని మమతా బెనర్జీ నివాసంలోనే పార్టీ కేంద్ర కార్యాలయం ఉంది. ఈ భవనంలోనే సీఐడీ అధికారులు సోదాలుచేశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పదవి విషయంలో టీఎంసీ ఎమ్మెల్యేల సంతకాలను ఫోర్జరీ చేసినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆ పార్టీలో చీలిక రావడం తెలిసిందే. ఫోర్జరీ ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు చేసిన సీఐడీ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి నోటీసు పంపింది. పార్టీ కేంద్ర కార్యాలయంలోనే ఎమ్మెల్యేల నుంచి సంతకాలను సేకరించినట్లు అభిషేక్ ఇచ్చిన వివరణ ఆధారంగానే ఈ సోదాలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం సాయంత్రం 5 గంటల్లోగా తమ ఎదుట హాజరుకావాలని సీఐడీ నోటీసు పంపించగా అభిషేక్ ఢిల్లీ వెళ్లారు. సీఐడీ అధికారుల సోదాల విషయం తెలియగానే టీఎంసీ ఎమ్మెల్యేలు కునాల్ ఘోష్, మదన్ మిత్ర అక్కడికి చేరుకున్నారు. అయితే, అధికారులు వారిని లోపలికి రానివ్వలేదు. అనంతరం టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ అక్కడికి వచ్చి సీఐడీ అధికారులతో మాట్లాడారు. సీఐడీ తనిఖీలు చట్టవిరుద్ధం, బీజేపీ కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని కల్యాణ్ బెనర్జీ విమర్శించారు. సీఐడీ అధికారుల మరో బృందం కోల్‌కతాలోని కామాక్ వీధిలో ఉన్న అభిషేక్ ఇంటికీ వెళ్లింది. అసెంబ్లీలో పార్టీ నేతను ప్రకటించే విషయంలో తమ సంతకాలను ఫోర్జరీ చేశారని కొందరు ఎమ్మెల్యేలు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ వివాదం రాజుకుని చివరకు తిరుగుబాటు ఎమ్మెల్యేలు బహిష్కృత ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీని శాసనసభలో తమ విపక్షనేతగా ఎన్నుకునేదాకా వెళ్లడం తెల్సిందే. -
దీదీ అంతలా మారిపోతారనుకోలేదు
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వరుస షాకులు తగులుతున్నాయి. టీఎంసీలో భారీ చీలిక, తన గత ప్రభుత్వ అవినీతి ఆరోపణలపై సువేందు సర్కార్ దర్యాప్తు, మరోవైపు మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై సీబీఐ విచారణతో ఆమె రాజకీయంగా ఒత్తిడిలో ఉన్నారు. దీనికి తోడు ఇన్నాళ్లు వెన్నంటే ఉన్న సీనియర్లు కూడా ఒక్కొక్కరుగా దూరమవుతున్న పరిస్థితి కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలోనే దీదీతో రెండు దశాబ్దాల అనుబంధం ఉన్న శతాబ్ది రాయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీని మరింత కుదిపేస్తున్నాయి. ఎన్నికల తర్వాత బెంగాల్ రాజకీయాల్లో షాకింగ్ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దారుణ ఓటమి తర్వాత.. మమతా బెనర్జీ పార్టీ చీలిక సంకేతాలతో తీవ్ర గందరగోళం నెలకొంది. తృణమూల్ కాంగ్రెస్‌లో అంతర్గత అసంతృప్తి తీవ్ర స్థాయికి చేరిందని.. పార్టీ నుంచి వేరుపడిన ఎంపీలు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. “దీదీ ఇంతకు ముందులా లేనేలేరు’’ అంటూ టీఎంసీ రెబల్ ఎంపీ శతాబ్ది రాయ్ ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాలుగు సార్లు ఎంపీగా గెలిచిన శతాబ్ది రాయ్.. 2009 నుంచి మమతా బెనర్జీతో అనుబంధం ఉంది. అయితే టీఎంసీలో మునుపటి పరిస్థితులు లేవని అంటున్నారామె. “దీదీ మారిపోయారు. ఎంతలా అంటే.. మేమెవరం ఆమె తీరును జీర్ణించుకోలేనంతలా. గత కొన్నేళ్లలో పార్టీ నిర్ణయాల తీరు పూర్తిగా మారిపోయింది. ఎంపీలైనప్పటికీ మా పరిస్థితి దారుణంగా ఉండేది. పార్టీ లోపల మా గొంతుక వినిపించే పరిస్థితి లేదు. ఎప్పటికప్పుడు సమస్యలను చెప్పినా.. నాయకత్వం స్పందించేది కాదు. క్షేత్రస్థాయి పరిస్థితులను వివరించాలని ప్రస్తావించిన వినిపించుకోలేదు. పైగా నిర్ణయాల్లోనూ కొందరికే ప్రాధాన్యం ఉండేది. ఆ విషయంలో మమ్మల్ని పూర్తిగా పక్కన పెట్టేవారు.. .. దీదీతో నాకు భావోద్వేగ అనుబంధం ఉంది. కానీ, ఆమె ఇప్పుడు పాత దీదీ కాదు. కానీ ప్రజల కోసం పని చేయాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం(తిరుగుబాటు) తీసుకున్నాను” అని శతాబ్ధిరాయ్ తెలిపారు. అలాగే.. పార్టీలో కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా అవినీతి పేరుకుపోయింది. అది చూసి నేనెంతో నిరాశకు లోనయ్యా. వ్యక్తిగతంగా నాకు స్వచ్ఛమైన ఇమేజ్ ఉంది. అందుకే బయటకు వచ్చేశా.. అని అన్నారామె.శతాబ్ది రాయ్(56) ప్రముఖ బెంగాలీ సినీ నటి. నటనతో పాటు దర్శక నిర్మాతగానూ ఆమె గుర్తింపు పొందారు. 2009లొ టీఎంసీ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో బీర్బూమ్ నుంచి పోటీ చేసిన నెగ్గారు. అప్పటి నుంచి వరుసగా ఆమెనే ఎన్నికవుతూ వస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు లోక్‌సభలో డిప్యూటీ నేతగా ఆమె ఉన్నారు. మమతా బెనర్జీతో దాదాపు రెండు దశాబ్దాల అనుబంధం ఉన్న నేతగా ఆమెను పరిగణిస్తారు. అందుకే ఆమె చేసిన వ్యాఖ్యలు బెంగాల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.తృణమూల్ కాంగ్రెస్‌లోని అటు చీలిక ఎమ్మెల్యేల వర్గం తిరుగుబాటుకు కారణమైంది. ఆ వెంటనే ఇటు పలువురు సీనియర్ నేతలు, ఎంపీలు ఇటీవల పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ బయటకు రావడం రాజకీయంగా కీలక పరిణామంగా మారింది. ఈ పరిణామాల మధ్య దాదాపు డజను మంది టీఎంసీ ఎంపీలు బీజేపీ నేతలతో సమావేశమై ఎన్డీఏకు మద్దతు ఇవ్వడానికి సిద్ధమయ్యారని ప్రచారం నడుస్తోంది. అయితే ఆ రెబల్ వర్గం సంఖ్య 20కి చేరిందని స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి. -
మమతాకు బిగ్ షాక్.. TMCపై సంచలన వ్యాఖ్యలు
-
తిరగబడ్డ ప్రజలు.. చీరల్లో దాగున్న టీఎంసీ లీడర్
-
మహిళను చంపడానికి 1,400 కి.మీ ప్రయాణించి..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ దంపతులు ఢిల్లీలోని ఓ ప్రొఫెసర్‌ను హత్య చేసేందుకు 1,400 కిలోమీటర్లు ప్రయాణించారు. ఆస్తి వివాదమే ఈ హత్యకు కారణమని ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీ యూనివర్సిటీలోని శివాజీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న దేబోస్మితా పాల్ హత్య కేసును పోలీసులు కేవలం 3 రోజుల్లో ఛేదించారు.తూర్పు ఢిల్లీలోని వసుంధర ఎన్‌క్లేవ్‌లో ఉన్న సత్యం అపార్ట్‌మెంట్స్‌లో బుధవారం దేబోస్మితా పాల్ మృతదేహం కనిపించింది. ప్రాథమిక దర్యాప్తు అనంతరం పోలీసులు పశ్చిమ బెంగాల్‌లోని బర్దమాన్ చేరుకుని రామ్‌ప్రసాద్ దాస్, బంశ్రీ దాస్‌ను అరెస్టు చేశారు.పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. వారి మైనర్ కుమారుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. దంపతులను స్థానిక కోర్టులో హాజరుపరచనున్నారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం వారిని ఢిల్లీకి తీసుకెళ్లేందుకు పోలీసులు ట్రాన్సిట్ రిమాండ్ కోరే అవకాశం ఉందని వారు తెలిపారు.అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం.. నిందితులు బర్దమాన్ లో ఉంటారు. బాధితురాలిని కలవాలనే నెపంతో వారు ఢిల్లీకి వచ్చారు. 2022లో వివాహ జీవితం ప్రారంభమైన ఐదేళ్ల తరువాత దేబోస్మితా పాల్ తన భర్త నుంచి విడిపోయింది. ఆమె ఆ ఫ్లాట్‌లో ఒంటరిగా ఉండగా, ఆమె భర్త బెంగళూరులో ఉన్నాడు.బుధవారం నిందితులు మాస్కులు ధరించి ఆమె ఫ్లాట్‌కు వచ్చిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. వారు కొన్ని సంచులతో ప్రైవేట్ క్యాబ్‌లో వచ్చి, మెట్లు ఎక్కి 6వ అంతస్తుకు చేరుకున్నారు. అనుమానం రాకుండా ఉండేందుకు తమ మైనర్ కుమారుడిని కూడా వెంట తీసుకువచ్చారు. స్నేహపూర్వకంగా ఇంట్లోకి ప్రవేశించి, తమ వెంట తెచ్చుకున్న ఆయుధంతో ప్రొఫెసర్‌ను హత్య చేసినట్లు అధికారులు తెలిపారు.దుస్తులు మార్చుకున్న తరువాత సుమారు 30 నిమిషాలకే వారు తిరిగి వచ్చి, కింద వేచి ఉన్న క్యాబ్‌లో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సోర్సెస్ వెల్లడించాయి. క్యాబ్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, ప్రయాణ వివరాల ఆధారంగా ప్రయాణికుల గుర్తింపును పోలీసులు నిర్ధారించారు.బుధవారం ఆ హౌసింగ్ సముదాయాన్ని సందర్శించిన 200 మందిలో 13 మందిని అనుమానితులుగా గుర్తించి ప్రశ్నించారు. 7 పోలీసు బృందాలు 4 రాష్ట్రాల్లో దాడులు నిర్వహించి, వందల మందిని విచారించాయి. దీంతో కేసు ఛేదించగలిగారు. చివరకు నిందితులను బర్దమాన్‌లో అరెస్టు చేసి విచారిస్తున్నారు.ఎందుకు చంపారు? బాధితురాలికి పశ్చిమ బెంగాల్లో తన మాతామహుడి మరణం అనంతరం వారసత్వంగా వచ్చిన ఓ ఆస్తి ఉంది. దాన్ని విలువ కోట్లాది రూపాయలు. నిందితులు ఆ ఇంటిలో అద్దెదారులుగా ఉండేవారు. ఆ ఆస్తిని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఇల్లు ఖాళీ చేయాలని దేబోస్మితా పాల్ వారిపై ఒత్తిడి తెస్తోంది. ఆస్తిని సొంతం చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఆమెను హత్య చేయాలని దంపతులు పథకం రచించినట్లు అధికారులు తెలిపారు.దేబోస్మితా సోదరి దేవరతి గురువారం పోలీసులకు సమాచారం ఇచ్చింది. తన సోదరి మృతిచెందినట్లు తెలిపింది. ఫ్లాట్‌కు బయట నుంచి తాళం వేసి ఉందని పోలీసులు తెలిపారు. సోదరికి పలుమార్లు ఫోన్ చేసినా స్పందన రాకపోవడంతో దేవరతి తలుపు పగులగొట్టి లోపలికి ప్రవేశించింది.లోపల దేబోస్మితా పాల్ మృతదేహం కనిపించింది. ఆమె తలపై లోతైన గాయం, మణికట్టులో కోసిన రక్తనాళాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇంట్లో నగలు, నగదు యథాతథంగా ఉండటంతో దోపిడీ ఆనవాళ్లు కనిపించలేదని చెప్పారు. -
ఎంపీని ఉరికించి కారును నుజ్జు నుజ్జు చేసిన గ్రామస్తులు
-
మమతా బెనర్జీ అలా చేయలేదు.. గంగూలీ కీలక వ్యాఖ్యలు
కోల్‌కతా: టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక ప్రకటన చేశారు. మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎంపీ యూసుఫ్ పఠాన్ మధ్య ఎంపీ సీటు విషయమై తాను మధ్యవర్తిగా ఉన్నాననే వార్తలు పూర్తిగా అవాస్తవం అని కొట్టిపడేశారు. ఈ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని తానేప్పుడూ రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదని తెలిపారు.పశ్చిమబెంగాల్లో 'దీదీ' పరిస్థితి నానాటికీ దిగజారుతుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోవడం.. అనంతరం ఆపార్టీలో తిరుగుబాటు మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై ఏసీబీ దాడులు ఇలా ఒకదాని తర్వాత మరో సమస్యలు మమతను వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమె ఢిల్లీ వెళ్లి అక్కడి నుంచి పార్టీని చక్కదిద్దే యత్నం చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అందుకుగాను మాజీ క్రికెటర్ యూసప్ పఠాన్ తన సీటును త్యాగం చేయనున్నారని పుకార్లు చెలరేగాయి.అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఈ ఎపిసోడ్‌కి మెుత్తం టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని మధ్యవర్తిగా నియమించారని ప్రచారం జరిగింది. అయితే ఈ వ్యవహారంపై గంగూలీ తాజాగా స్పందించారు "పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తరపున నేను యూసుఫ్ పఠాన్‌ను సంప్రదించి, ఆమె ఆ నియోజకవర్గం నుండి జరగబోయే ఉప ఎన్నికలలో పోటీ చేసేందుకు వీలుగా..ఆయన తన పదవికి రాజీనామా చేయాలని మమతా తరపున సందేశాన్ని అందించానని ఆరోపణలు వచ్చాయి. అవన్నీ పూర్తిగా అవాస్తవాలు " అని గంగూలీ అన్నారు.మమతా ఎప్పుడూ తనను ఇటువంటి రాజకీయ వ్యవహారాల చేరవేయాలని కోరలేదన్నారు. ఈ ఇద్దరు వ్యక్తులతో తాను ఇదివరకూ ఏ సందర్భంలోనూ రాజకీయ విషయాలలో పాలుపంచుకోలేదని తెలిపారు. భారత మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ పశ్చిమ బెంగాల్‌లోని బహరంపూర్ లోక్‌సభ నియోజకవర్గం ఎంపీగా కొనసాగుతున్నారు. ఆయన ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ తరపున ఈ స్థానం నుండి గెలుపొందారు. -
మమతపై మరో తిరుగుబాటు?
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అధికారం కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో అంతర్గత సంక్షోభం ముదురుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యేల తిరుగుబాటుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పార్టీకి, ఇప్పుడు పార్లమెంట్ సభ్యుల నుంచీ షాక్ తగలొచ్చన్న ప్రచారం జరుగుతోంది. కనీసం 23 మంది టీఎంసీ ఎంపీలు బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నారని, వారు ఏక్షణమైనా తిరుగుబావుటా ఎగురవేయవచ్చని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఎమ్మెల్యేల బాటలోనే ఎంపీలు.. ఇప్పటికే టీఎంసీ ఎమ్మెల్యేల్లో తీవ్రస్థాయిలో అసంతృప్తి బయటపడింది. తిరుగుబాటు వర్గంలోని రితబ్రత బెనర్జీకి 58 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండటంతో ఆయన ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఈ వర్గం తమ బలం మరింత పెరుగుతుందని ప్రకటించడం పార్టీ నాయకత్వానికి ఆందోళన కలిగిస్తోంది. ఇదే సమయంలో పార్టీ ఎంపీలు సైతం పార్టీకి, మమత మేనల్లురు అభిõÙక్ బెనర్టీకి వ్యతిరేకంగా గళం విప్పారు. పార్టీ సీనియర్ ఎంపీ కాకోలి ఘోష్ దస్తిదార్, పార్టీ విప్ కల్యాణ్ బెనర్జీల మధ్య ఉన్న విభేదాలు వెలుగులోకి వచ్చాయి. బెనర్జీ మహిళలపై విద్వేష పూరితంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ ఘోష్ లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. మమతా బెనర్జీపై అసంతృప్తితో ఉన్న ఘోష్, పార్టీలో ఉండగానే ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించారు. ఇక పార్టీ రాజ్యసభ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ సైతం వ్యతిరేక గళం వినిపిస్తున్నారు. శాసనసభ పక్షం తర్వాత పార్టీ పార్లమెంటరీ పక్షం కూడా చీలిపోవచ్చని ఆయన పేర్కొన్నారు. లోక్‌సభ, రాజ్యసభ రెండింటిలోనూ ఈ చీలిక ఉంటుందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్లో టీఎంసీ వేరు కుంపటి ఖాయమనే సంకేతాలు అందుతున్నాయి. ప్రస్తుతం టీఎంసీకి లోక్‌సభలో 28 మంది, రాజ్యసభలో 13 మంది సభ్యులు ఉన్నారు. మొత్తం 41 మంది ఎంపీల్లో 23 మంది బయటకు వస్తే పార్లమెంట్లో పార్టీ బలం దాదాపు సగానికి పడిపోతుంది. కాంగ్రెస్ తర్వాత ప్రతిపక్ష కూటమిలో అత్యధిక ఎంపీలు కలిగిన పార్టీగా టీఎంసీకున్న ప్రాధాన్యం పడిపోయే అవకాశం ఉ ంది. ఇప్పటికే పలువురు పార్టీ ఎంపీలు బీజేపీతో టచ్‌లో ఉన్నట్లు ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. అయితే బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య మాత్రం తిరుగుబాటు టీఎంసీ నేతలను పెద్దఎత్తున చేర్చుకునే ఆలోచన లేదని ఇటీవల ప్రకటించారు. దీంతో ఎంపీల పార్టీ మార్పు ఎక్కడికి దారితీస్తుందనేది మున్ముందు స్పష్టం కానుంది. కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీం రాజీనామా కోల్‌కతా: టీఎంసీ సీనియర్ నేత, కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఫిర్హాద్ హకీం తన పదవికి రాజీనామా చేశారు. విధులను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నందునే, పార్టీ చీఫ్ మమతా బెనర్జీ నుంచి అనుమతి తీసుకుని రాజీనామా చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. తలెత్తుకు వెళ్లిపోవాలన్నది తన కోరికంటూ వ్యాఖ్యానించారు. హకీమ్ తన రాజీనామా లేఖను కోల్‌కతా మున్సిపల్ చైర్పర్సన్ మాలా రాయ్ కార్యాలయంలో అందజేశారు. ఎమ్మెల్యే కూడా అయిన ఫిర్హాద్ హకీంకు..టీఎంసీ పట్టణ ప్రాంత నాయకత్వంలో మైనారిటీ వర్గం నేతల్లో అతిముఖ్యుడిగా పేరుంది. కోల్‌కతా 150 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటి ముస్లిం మేయర్ ఫిర్హాద్. 2018 నుంచి ఆయన ఇదే బాధ్యతల్లో కొనసాగుతున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓటమితో పార్టీలో మొదలైన అంతర్గత సంక్షోభం నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. కోల్‌కతాయే కాదు, ఇతర మున్సిపల్ కార్పొరేషన్లలోనూ టీఎంసీ కౌన్సిలర్లు రాజీనామా బాట పట్టారు. -
మమతా బెనర్జీకి బంపర్ ఆఫర్..!
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు రోజురోజుకూ ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి.. పార్టీలో చీలికతో కుంగిపోయిన మమతా బెనర్జీకి ఇప్పుడు అనూహ్యమైన అండ లభించింది. ఒకప్పుడు తనపై కుట్రలు పన్నాడని, బీజేపీతో చేతులు కలిపాడని, మైనారిటీ ఓట్లను చీల్చేందుకు కోట్ల రూపాయలు తీసుకున్నాడని తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసిన నేతే.. ఇప్పుడు మమతా బెనర్జీ కోసం తన ఎమ్మెల్యే సీటును వదులుకోవడానికి సిద్ధమని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కోల్‌కతాలోని భవానీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మమతా బెనర్జీ, ప్రస్తుత ముఖ్యమంత్రి సువేందు అధికారి చేతిలో ఓటమిపాలయ్యారు. దీంతో ఆమె ప్రస్తుతం అసెంబ్లీ సభ్యురాలు కాదు. మళ్లీ సభలో అడుగుపెట్టాలంటే ఏదైనా ఉప ఎన్నికలో గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఆమె నందిగ్రామ్(సువేందు పోటీ చేసిన రెండో స్థానం.. రాజీనామా కూడా చేశారు) నుంచి పోటీ చేయొచ్చనే ప్రచారం ఊపందుకుంది. ఇదే సమయంలో తృణమూల్ కాంగ్రెస్‌లో తిరుగుబాటు స్వరాలు కూడా పెరుగుతుండటంతో ఆమె రాజకీయ భవిష్యత్తుపై చర్చ మొదలైంది.ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురై.. ప్రస్తుతం ‘ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ’ (ఏజేయూపీ)ని నడిపిస్తున్న హుమాయున్ కబీర్ సంచలన ప్రకటన చేశారు. ముర్షిదాబాద్ జిల్లాలోని నవడా, రెజీనగర్ స్థానాల నుంచి గెలిచిన ఆయన.. అవసరమైతే రెజీనగర్ సీటుకు రాజీనామా చేసి మమతా బెనర్జీని అక్కడి నుంచి అసెంబ్లీకి పంపేందుకు సిద్ధమని ప్రకటించారు.“మమతా బెనర్జీ నన్ను సంప్రదిస్తే రెజీనగర్ నుంచి ఆమెను అసెంబ్లీకి పంపగలను. నందిగ్రామ్‌లో పోటీ చేస్తే ఆమె గెలుపు కష్టమే. కానీ నా నియోజకవర్గంలో ఆమె విజయాన్ని నేను ఖాయం చేస్తా” అని కబీర్ వ్యాఖ్యానించారు. అంతేకాదు, “నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి కారణం మమతా బెనర్జీయే. ఆమె ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితి నన్ను బాధిస్తోంది” అంటూ తన విధేయతను కూడా చాటుకున్నారు.హుమాయున్ కబీర్‌పై టీఎంసీ గతంలో చేసిన ఆరోపణలు చిన్నవి కావు. బీజేపీతో రహస్య ఒప్పందాలు చేసుకున్నాడని, మైనారిటీ ఓట్లను చీల్చేందుకు భారీ మొత్తంలో నిధులు స్వీకరించాడని, రాజకీయ కుట్రలో భాగస్వామి అయ్యాడని తృణమూల్ కాంగ్రెస్ స్టింగ్ వీడియోలు విడుదల చేసి తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ వివాదాల కారణంగానే ఎంఐఎం కూడా ఆయనతో పొత్తును తెంచుకుంది. అయితే కబీర్ మాత్రం అవన్నీ కృత్రిమ మేధ (AI) సాయంతో రూపొందించిన వీడియోలేనని కొట్టిపారేశారు.అయినప్పటికీ, తనపై టీఎంసీ చేసిన ఆరోపణలు, బహిష్కరణ, రాజకీయ దాడులను పక్కనబెట్టి అదే పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి సహాయం చేసేందుకు ముందుకు రావడం ఇప్పుడు రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.హుమాయున్ కబీర్ మాజీ ఐపీఎస్ అధికారి. టీఎంసీతో రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. అనంతరం బీజేపీలో చేరి కొంతకాలం కొనసాగిన ఆయన, తిరిగి టీఎంసీలో చేరారు. అయితే తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన కబీర్.. గత ఏడాది ముర్షిదాబాద్‌లో బాబ్రీ మసీదు నమునాతో మసీదు నిర్మిస్తానన్న వ్యాఖ్యలతో తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు.ఇదిలా ఉండగా.. తృణమూల్ కాంగ్రెస్‌లో తిరుగుబాటు ఎమ్మెల్యేల వ్యవహారం కూడా కొత్త మలుపు తిరిగింది. 58 మంది రెబెల్ ఎమ్మెల్యేలు రితబ్రత బెనర్జీకి మద్దతు ప్రకటించినప్పటికీ, మమతా బెనర్జీయే తమ సర్వోన్నత నాయకురాలని పలువురు స్పష్టం చేశారు. తమ వ్యతిరేకత అభిషేక్ బెనర్జీపైనే తప్ప మమతాపై కాదని పేర్కొన్నారు. ఆమెను కేవలం సలహాదారు పాత్రకే పరిమితం చేయాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ.. అవసరమైతే తిరుగుబాటు శిబిరంలో కొనసాగడంపైనా పునరాలోచిస్తామని హెచ్చరించారు.ఒకవైపు సొంత పార్టీ తిరుగుబాటు వర్గం "మమతనే మా సుప్రీం లీడర్" అంటూ గళమెత్తుతుండగా.. మరోవైపు పార్టీ నుంచి బహిష్కరణకు గురైన హుమాయున్ కబీర్ తన ఎమ్మెల్యే సీటునే ఆఫర్ చేయడం బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరనే మాటను ఈ పరిణామం మరోసారి గుర్తు చేస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
మమతా బెనర్జీయే మా సుప్రీం లీడర్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో విపక్ష తృణమూల్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షంగా 58 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల వర్గం గుర్తింపు పొందిన మరుసటి రోజే కీలక పరిణామం చోటుచేసుకుంది. రీటబ్రత బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు శిబిరంలో తొలిసారిగా అసంతృప్తి వ్యక్తమైంది. మమతా బెనర్జీయే తమ సర్వోన్నత నాయకురాలిగా కొనసాగాలని పలువురు ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. ఒకవేళ ఆమెను కేవలం సలహాదారు పదవికే పరిమితం చేస్తే, తిరుగుబాటు వర్గంలో ఉండాలో వద్దో పునరాలోచన చేస్తామని తేల్చిచెప్పారు. కొత్తగా గుర్తింపు పొందిన ప్రతిపక్ష నాయకుడు రితబ్రత బెనర్జీ నేతృత్వంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం వారిలో భిన్న స్వరాలు వ్యక్తమయ్యాయి. తమ వ్యతిరేకత అభిషేక్ బెనర్జీపైనే తప్ప మమతా బెనర్జీపై కాదని పేర్కొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మమతా బెనర్జీ నేతృత్వంలోనే కొనసాగాలని రెబెల్ ఎమ్మెల్యే గుల్షన్ ములిక్ తేల్చిచెప్పారు. సలహాదారుగా వ్యవహరించాలని మమను రితబ్రత కోరారు. ఈ అంశాన్ని కొందరు రెబెల్ ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారు. కేవలం ఒక్కరోజులోనే రితబ్రత వర్గంలో విభేదాలు బయటపడడం చర్చనీయాంశంగా మారింది. మమతా బెనర్జీ పట్ల తమ విధేయతలో ఏ మార్పూ లేదని తిరుగుబాటు ఎమ్మెల్యేలు సంకేతాలిచ్చారు. -
టీఎంసీని కాపాడే పనిలో బీజేపీ!?
రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీ బలహీనపడితే ఆనందపడటం సహజం. ఆ పార్టీ చీలిపోతే ఆ కిక్కే వేరేలా ఉంటుంది. కానీ పశ్చిమ బెంగాల్లో మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తన చరిత్రలోనే అతిపెద్ద అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ, బీజేపీ మాత్రం ఆ పార్టీ పూర్తిగా కూలిపోవాలని కోరుకోవడం లేదన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.1998లో మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గత రెండు దశాబ్దాలుగా పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయిస్తోంది. అయితే తాజా పరిణామాలు ఆ పార్టీ భవిష్యత్తుపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల అనంతరం టీఎంసీలో అంతర్గత అసంతృప్తి బహిర్గతమైంది. పార్టీకి చెందిన 80 మంది ఎమ్మెల్యేలలో దాదాపు 60 మంది తిరుగుబాటు బావుటా ఎగురవేయడం, మమతా ఎంపిక చేసిన నాయకత్వానికి వ్యతిరేకంగా రితబ్రత బెనర్జీని ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.టీఎంసీ ఆవిర్భావం తర్వాత ఇదే అతిపెద్ద అంతర్గత సంక్షోభంగా రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా ప్రత్యర్థి బీజేపీ దాడిని మరింత ఉధృతం చేయాలి. కానీ ఆశ్చర్యకరంగా అలా జరిగిన పరిస్థితి కనిపించడం లేదు. పైగా, టీఎంసీ పూర్తిగా కూలిపోవడం బీజేపీకి అంత మంచిది కాదన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.టీఎంసీ కూలిపోతే బీజేపీకి నష్టమా?ఇక్కడే అసలు రాజకీయ ట్విస్ట్ ఉంది. టీఎంసీ బలహీనపడితే రాజకీయంగా లాభపడాల్సింది బీజేపీ. కానీ బీజేపీలోని ఒక వర్గం మాత్రం టీఎంసీ పూర్తిగా కూలిపోవడం ప్రమాదకరమని భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దానికి ప్రధాన కారణం వామపక్షాల పునరాగమనం.ఒకప్పుడు 34 ఏళ్ల పాటు పశ్చిమ బెంగాల్‌ను ఏలిన సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ గత కొన్నేళ్లుగా రాజకీయంగా దాదాపు కనుమరుగైంది. కానీ ఇప్పుడు మళ్లీ ఆ పార్టీలు పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. డోమ్కల్ అసెంబ్లీ స్థానంలో విజయం, ఫాల్టా రీపోల్‌లో 40 వేలకుపైగా ఓట్లు సాధించడం, మూతపడిన పార్టీ కార్యాలయాలు మళ్లీ తెరుచుకోవడం, కార్మిక సంఘాలు తిరిగి చురుకుగా మారడం వంటి పరిణామాలు వామపక్షాల పునరుజ్జీవనానికి సంకేతాలుగా చెబుతున్నారు.దీంతో ఇప్పుడు బీజేపీకి అసలు భయం మమతా బెనర్జీనా? లేక తిరిగి బలపడుతున్న లెఫ్ట్-కాంగ్రెస్ కూటమినా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.ఓటు బ్యాంక్ మొత్తం..గత రెండు ఎన్నికల్లో టీఎంసీకి ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ ఎదిగింది. అయితే టీఎంసీ ఒక ప్రాంతీయ పార్టీ మాత్రమే. దాని ప్రభావం ప్రధానంగా బెంగాల్‌కే పరిమితం. కానీ కాంగ్రెస్, సీపీఎం వంటి పార్టీలు జాతీయ స్థాయిలో ఉనికిని కలిగి ఉన్నాయి.ఒకవేళ టీఎంసీ పూర్తిగా కూలిపోతే, దాని ఓటు బ్యాంక్‌లో గణనీయమైన భాగం లెఫ్ట్-కాంగ్రెస్ కూటమి వైపు వెళ్లే అవకాశం ఉందని బీజేపీలోని కొందరు నేతలు భావిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. 2019 లోక్‌సభ, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ లెఫ్ట్ ఓటర్లలో గణనీయమైన వర్గాన్ని తనవైపు తిప్పుకుంది. ఇప్పుడు అదే వ్యూహాన్ని లెఫ్ట్ టీఎంసీ ఓటర్లపై ప్రయోగిస్తే రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే ప్రమాదం ఉందన్న అంచనాలు ఉన్నాయి.అందుకే చేరికలకు విముఖత?టీఎంసీలో అసంతృప్తి పెరుగుతున్నా, తిరుగుబాటు నేతలను పెద్దఎత్తున బీజేపీలో చేర్చుకునే ప్రయత్నం కనిపించడం లేదు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, టీఎంసీ ఎమ్మెల్యేలను భారీ సంఖ్యలో చేర్చుకుంటే ఆ పార్టీ పూర్తిగా విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది. కానీ బీజేపీ ఆ దిశగా అడుగులు వేయకుండా జాగ్రత్త పడుతోంది.బీజేపీ ఎంపీ సౌమిత్ర ఖాన్ సైతం ఒక సందర్భంలో "కేంద్ర నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే 50 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు వెంటనే బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు" అని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ఇప్పటివరకు అలాంటి చర్య జరగలేదు. టీఎంసీ నుంచి వచ్చే వారిని విచక్షణారహితంగా చేర్చుకోవద్దని బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా బహిరంగంగానే చెబుతోంది.ఈ పరిస్థితిని కొందరు రాజకీయ పరిశీలకులు "టీఎంసీని పూర్తిగా కూల్చకుండా నియంత్రిత బలహీనతలో ఉంచే వ్యూహం"గా అభివర్ణిస్తున్నారు.ఒడిశా మోడల్ ఇప్పుడు బెంగాల్లోనా?ఈ చర్చల్లో మరో ఉదాహరణ కూడా తరచూ వినిపిస్తోంది. ఒడిశాలో నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తిన్న తర్వాత కూడా పూర్తిగా చీలిపోకుండా నిలబడగలిగింది. కాంగ్రెస్ పునరాగమనాన్ని అడ్డుకునేందుకు బీజేపీ పరోక్షంగా బీజేడీని నిలబెట్టిందన్న విశ్లేషణలు అప్పట్లో వచ్చాయి.ఇప్పుడు అదే తరహా వ్యూహం బెంగాల్లోనూ అమలవుతోందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టీఎంసీ బలహీనపడాలి కానీ పూర్తిగా కూలిపోకూడదు. ఎందుకంటే ఆ ఖాళీని లెఫ్ట్-కాంగ్రెస్ కూటమి భర్తీ చేస్తే అది భవిష్యత్తులో బీజేపీకి మరింత పెద్ద రాజకీయ సవాలుగా మారవచ్చన్నది ఈ వ్యూహం వెనుక ఉన్న ప్రధాన ఆలోచనగా చెబుతున్నారు.అసలు పోరాటం ఇప్పుడే మొదలైందిప్రస్తుతం బెంగాల్ రాజకీయాలను పరిశీలిస్తే, ఇది ఇక టీఎంసీ వర్సెస్ బీజేపీ పోరాటం మాత్రమే కాదు. టీఎంసీ బలహీనతతో ఏర్పడే రాజకీయ ఖాళీని ఎవరు భర్తీ చేస్తారు? అన్నదే అసలు ప్రశ్నగా మారింది. ఒకవైపు మమతా బెనర్జీ పార్టీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుండగా, మరోవైపు లెఫ్ట్-కాంగ్రెస్ కూటమి అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. బీజేపీ మాత్రం టీఎంసీని ఓడించాలని కోరుకుంటూనే, అది పూర్తిగా కనుమరుగవ్వకూడదని భావిస్తోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.అందుకే ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో వినిపిస్తున్న అత్యంత ఆసక్తికరమైన ప్రశ్న ఒక్కటే.. "టీఎంసీని కూల్చేయగల శక్తి బీజేపీకి ఉన్నా... కాపాడే వ్యూహాన్నే ఎంచుకుందా?". రానున్న రోజుల్లో బెంగాల్ రాజకీయాల దిశను నిర్ణయించేది ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే కావొచ్చు. -
బెంగాల్లో మరో సంచలనం.. మమతకు బిగ్ షాక్!
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లో రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మారిపోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తృణముల్ కాంగ్రెస్(టీఎంసీ)లో సంక్షోభం మరింత ముదిరింది. టీఎంసీకి చెందిన మంది ఎంపీలు బీజేపీలోకి వెళ్లేందుకు సిద్దమైనట్టు తెలుస్తోంది. ఇక, ఇప్పటికే టీఎంసీలు ఎమ్మెల్యేలు 60 మంది వేరు కుంపటి పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాలు మాజీ సీఎం మమతా బెనర్జీకి ఊహించని షాక్ ఇస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీలు పెద్ద ఎత్తున బీజేపీలో చేరుతున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై రాజకీయ చర్చలు బలంగా జరుగుతున్నాయి. ఇటీవల బీజేపీ ఎంపీ సౌమిత్రా ఖాన్ మాట్లాడుతూ.. 18–20 మంది టీఎంసీ ఎంపీలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని వ్యాఖ్యానించారు. అదే సమయంలో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీలో అంతర్గత అసంతృప్తి, పునర్వ్యవస్థీకరణ జరుగుతోందని వార్తలు వచ్చాయి. పార్టీ తన కమిటీలు, అనుబంధ విభాగాలను రద్దు చేసి పునర్నిర్మాణ ప్రక్రియ ప్రారంభించింది. కాగా, 2024 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో టీఎంసీ 29 స్థానాలు గెలుచుకుని ప్రధాన ప్రతిపక్ష పార్టీల్లో ఒకటిగా నిలిచింది.ఇదిలా ఉండగా, అంతకుముందు.. బెంగాల్ రాజకీయాల్లో టీఎంసీ చీలికతో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా నెగ్గిన రీతాబ్రత బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో భారీ తిరుగుబాటు చెలరేగింది. మొత్తం 80 మంది ఎమ్మెల్యేల్లో 60 మంది ఆయనకు మద్దతుగా సంతకాలు చేయడం.. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీపై తీవ్ర సవాల్‌ను విసిరినట్లయ్యింది.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓడిన వెంటనే పార్టీలో అసంతృప్తి వేగంగా పెరిగింది. పార్టీ అధినేత్రి నివాసంలో జరిగిన కీలక సమావేశానికి 80 మంది ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది(దాదాపు 60 మంది) గైర్హాజరు కావడం పరిస్థితి తీవ్రతను చూపించింది. అంతేకాకుండా, మమతా నిర్వహించిన బహిరంగ నిరసన కార్యక్రమానికి కూడా చాలా తక్కువ మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరుకావడం పార్టీలో లోతైన విభేదాలను బయటపెట్టింది. విశ్లేషకుల ప్రకారం.. ఇది సిద్ధాంత ఆధారిత తిరుగుబాటు కాదు. ఇది మమతా నాయకత్వంపై అసంతృప్తి, అలాగే ప్రతిపక్ష నేత పదవి సహా అధికార పంపకాలపై ఉన్న ఆగ్రహం కలయికగా కనిపిస్తోంది. -
మమతకు బిగ్ షాక్.. ప్రతిపక్ష నేతగా టీఎంసీ ఎమ్మెల్యే
-
ఆశ్చర్యపరిచిన బెంగాల్ ట్విస్ట్
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో టీఎంసీ చీలికతో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా నెగ్గిన రీతాబ్రత బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో భారీ తిరుగుబాటు చెలరేగింది. మొత్తం 80 మంది ఎమ్మెల్యేల్లో 60 మంది ఆయనకు మద్దతుగా సంతకాలు చేయడం.. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీపై తీవ్ర సవాల్‌ను విసిరినట్లయ్యింది. అసలు ఇంత తక్కువ టైంలో.. ఇంత పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలను ఆయన ఎలా తనవైపు తిప్పుకోగలిగాడని రాజకీయ వర్గాలన్నీ ఆశ్చర్యపోతున్నాయి?.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓడిన వెంటనే పార్టీలో అసంతృప్తి వేగంగా పెరిగింది. పార్టీ అధినేత్రి నివాసంలో జరిగిన కీలక సమావేశానికి 80 మంది ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది(దాదాపు 60 మంది) గైర్హాజరు కావడం పరిస్థితి తీవ్రతను చూపించింది. అంతేకాకుండా, మమతా నిర్వహించిన బహిరంగ నిరసన కార్యక్రమానికి కూడా చాలా తక్కువ మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరుకావడం పార్టీలో లోతైన విభేదాలను బయటపెట్టింది. విశ్లేషకుల ప్రకారం.. ఇది సిద్ధాంత ఆధారిత తిరుగుబాటు కాదు. ఇది మమతా నాయకత్వంపై అసంతృప్తి, అలాగే ప్రతిపక్ష నేత పదవి సహా అధికార పంపకాలపై ఉన్న ఆగ్రహం కలయికగా కనిపిస్తోంది. అలాగే..తాజా రాజకీయ సంక్షోభానికి కేంద్రబిందువుగా నిలిచింది మాత్రం అసెంబ్లీలో లీడర్ ఆఫ్ ద్ ఒపోజిషన్ (LoP) నియామకంపై వచ్చిన వివాదం. తృణమూల్‌లోని కొందరు ఎమ్మెల్యేలు తమ సంతకాలను ఫోర్జరీ చేసి సోభందేబ్ చటోపాధ్యాయ్‌ను ఎల్వోపీగా ప్రకటించారన్న ఆరోపణలు బయటకు వచ్చాయి. ఈ వ్యవహారంపై ఫిర్యాదు రావడంతో రీతాబ్రత బెనర్జీ సహా ఇద్దరు ఎమ్మెల్యేలను పార్టీ “అంతర్గత వ్యతిరేక కార్యకలాపాలు” పేరిట మమతా బెనర్జీ బహిష్కరించారు. దీంతో రీతాబ్రత నేతృత్వంలోని వర్గం ఒక్కసారిగా తెరపైకి వచ్చింది.రీతాబ్రత మాములోడేం కాదు.. రీతాబ్రత బెనర్జీ.. పుట్టింది 15 నవంబర్ 1979. చదువంతా కోల్‌కతాలోనే సాగింది. విద్యార్థి రాజకీయాల ద్వారా ప్రారంభమైన ఆయన ప్రయాణంలో ఎస్ఎఫ్ఐలో కీలక నాయకుడిగా ఎదిగి.. సీపీఎం యువజన విభాగంలో సుమారు ఎనిమిదేళ్లు క్రియాశీలంగా పనిచేశారు. 34 ఏళ్ల వయసులో సీపీఎం తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. అయితే 2017లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలతో సీపీఎం నుంచి సస్పెండ్ అయ్యి, తరువాత బహిష్కరణకు గురయ్యారు. అనంతరం.. తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి రాష్ట్ర రాజకీయాల్లో తిరిగి కీలక పాత్ర పోషించారు. తాజాగా ఉలుబేరియా పూర్వ (Uluberia Purba) నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి రుద్ర ప్రసాద్ బెనర్జీపై సుమారు 11 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆ వెంటనే పార్టీ అంతర్గత వివాదాలు, అసంతృప్తి, ఫోర్జరీ సంతకాల ఆరోపణల వివాదం నేపథ్యంలో టీఎంసీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన పార్టీ లోపల తిరుగుబాటు వర్గానికి నాయకత్వం వహించడమే కాదు.. ప్రతిపక్ష నేతగా తనను తాను ప్రకటించుకుని, ఆ గుర్తింపు ఇవ్వాలంటూ స్పీకర్‌కు దరఖాస్తు కూడా చేసుకున్నారు. అసలు ‘టర్నింగ్ పాయింట్’ ఇదేబెంగాల్ రాజకీయ విశ్లేషకుల ప్రకారం.. టీఎంసీలో చీలిక(తిరుగుబాటు) ఒక్కరోజులో జరిగినది కాదు. దీని వెనుక మూడు కీలక దశల్లో జరిగింది.. 1) ఎన్నికల తర్వాత అసంతృప్తి పెరుగుదల: తాజా ఎన్నికల తర్వాత పార్టీ లోపల నాయకత్వంపై అసంతృప్తి వేగంగా పెరిగింది. నిర్ణయాలు కేంద్రీకృతంగా (centralized) మమతా–అభిషేక్ బెనర్జీ ద్వయం చేతుల్లోనే ఉండటంపై చాలా మంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు.2) ‘సైడ్‌లైనింగ్’ భావన: పార్టీ టికెట్ దక్కినా, ప్రభుత్వ–పార్టీ నిర్ణయాల్లో తమకు ప్రాధాన్యం లేదని అనేక మంది సీనియర్, మిడ్-లెవల్ ఎమ్మెల్యేలు భావించారు. బెంగాల్ రాజకీయ భాషలో దీనిని “অবহেলা” (అవహేళన) భావనగా పేర్కొంటారు.3) రీతాబ్రత ఎంట్రీ.. “అసంతృప్త వేదిక”గా మారడం: ఇక్కడే అసలు ట్విస్ట్. రీతాబ్రత బెనర్జీ కొత్త ఎమ్మెల్యే అయినప్పటికీ, ఆయనకు ముందే రాజకీయ అనుభవం ఉంది. రాజ్యసభలో టీఎంసీ, లెఫ్ట్ రెండింటిలో పని చేసిన నేపథ్యం ఉంది. దీనివల్ల ఆయనను “అనుభవజ్ఞుడైన అవుట్‌సైడర్”గా కొంతమంది నేతలు చూశారు.రీతాబ్రత రెబల్స్ గ్రూప్‌నకు ప్రాతినిధ్యం వహించడంలో రాజకీయ వ్యూహమే కీలకంగా మారింది. ప్రత్యక్షంగా పార్టీకి వ్యతిరేకంగా కాకుండా “నిర్ణయాల పునర్వ్యవస్థీకరణ” అనే నినాదంతో ఆయన అసంతృప్త ఎమ్మెల్యేలను ఒక చోటుకి చేర్చడంలో సక్సెస్ అయ్యారు. ప్రధాన ప్రతిపక్ష నేత ఎంపిక విషయంలో.. ఫోర్జరీ సంతకాల ఆరోపణ తర్వాత ఏర్పడిన గందరగోళాన్ని ఆయన తన వైపు మలుచుకున్నాడు. తన సస్పెన్షన్‌తో “పార్టీ లోపల న్యాయం లేదు” అనే భావనను టీఎంసీ శ్రేణుల్లో బలపరిచగలిగారు. తద్వారా.. రాజకీయంగా హై-ప్రొఫైల్ కాకపోయినా, అతను లోపలే నెట్వర్క్ నిర్మించుకున్నారు. ముఖ్యంగా జిల్లా స్థాయి అసంతృప్త నేతలతో సంబంధాలు పెంచుకున్నారు. మరీ ముఖ్యంగా.. బెంగాల్ రాజకీయాల్లో చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీ నిర్ణయాలు మమత చేతిని ఎప్పుడో దాటేసి పూర్తిగా అభిషేక్ బెనర్జీ ప్రభావంలోకి వెళ్లాయని భావిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ రీతాబ్రతకు అనుకూలంగా మారాయి.పరిశీలకులు గతంలో మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ పార్టీల్లో జరిగిన తిరుగుబాట్లతో పోలుస్తున్నారు. అయితే అక్కడికి, ఇక్కడికి చాలా తేడా ఉంది. శివసేన, ఎన్సీపీ వంటి పార్టీల్లో సిద్ధాంత బలం ఉంది. కానీ, టీఎంసీలో అలాంటిది మచ్చుకైనా కనిపించదని విశ్లేషకుల మాట. అందుకే ఇక్కడ తిరుగుబాటు ఒక ఐడియాలజీపై కాకుండా, నాయకత్వ అసంతృప్తి, అధికార పంపకాలపై ఆధారపడి ఉందని భావిస్తున్నారు.ఇప్పటి పరిస్థితుల్లో మమతా బెనర్జీకి రెండు పెద్ద సవాళ్లు ఎదురవుతున్నాయి. ఒకటి.. పార్టీలో తిరుగుబాటును నియంత్రించడం. రెండోది.. అధికార కేంద్రాన్ని తిరిగి స్థిరపరచడం. పార్టీలో ఉన్న అన్ని వర్గాలు విడిపోకుండా ఒకటిగా ఉండేలా చేయగల నాయకురాలిగా మమతా మళ్లీ తన సామర్థ్యాన్ని చూపించుకోగలగాలి..కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే.. మొదటిసారి ఎమ్మెల్యే నెగ్గిన ఉన్న నాయకుడు 60 మంది ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోవడం తృణమూల్ కాంగ్రెస్‌లో లోపలి బలహీనతలను బయటపెట్టింది. అంతేకాదు.. తాము మమతా బెనర్జీ నాయకత్వంలోనే ముందుకు సాగుతామని రీతాబ్రతా ప్రకటించడం ఈ మొత్తం ఎపిసోడ్లో మరో ట్విస్ట్. దీంతో.. ఇది కేవలం నాయకత్వ సంక్షోభమా? లేదంటే పెద్ద రాజకీయ విభజనకు సంకేతమా? అనేది రాబోయే రోజుల్లో తేలిపోనుంది. -
రెండు ముక్కలైన దీదీ పార్టీ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో 28 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రతిపక్ష తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) రెండు ముక్కలైంది. 58 మంది అసమ్మతి ఎమ్మెల్యేలు మమతా బెనర్జీ పార్టీని చీల్చేశారు. అసెంబ్లీలో అసలైన టీఎంసీ శాసనసభాపక్షంగా అధికారికంగా గుర్తింపు పొందారు. బహిష్కృత ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. తమను టీఎంసీ శాసనసభాపక్షంగా గుర్తిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నట్లు తిరుగుబాటు వర్గం వెల్లడించింది. మరోవైపు ఇప్పటికీ మమతా బెనర్జీయే తమ నాయకురాలు అని రితబ్రత బెనర్జీ స్పష్టంచేశారు. తమ శాసనసభ బృందానికి ప్రధాన సలహాదారుగా వ్యవహరించాలని, తమకు మార్గనిర్దేశం చేయాలని ఆమెను కోరారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘోర పరాజయం తర్వాత దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పెత్తనాన్ని ప్రశ్నిస్తూ ప్రారంభమైన తిరుగుబాటు చివరకు పార్టీని చీల్చడం గమనార్హం. పార్టీ చరిత్రలో ఇలాంటి సంక్షోభం తలెత్తడం ఇదే మొదటిసారి. అంతర్గత పోరు పట్ల వెంటనే అప్రమత్తమైన మమతా బెనర్జీ వర్గం తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన అన్ని సంస్థాగత కమిటీలను, అనుబంధ సంఘాలను తక్షణమే రద్దు చేసింది. ఈ పరిణామాలు టీఎంసీ దుస్థితికి అద్దం పడుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. దీదీ పార్టీ భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మూడింట రెండొంతుల ఎమ్మెల్యేల బలం తృణమూల్ బహిష్కృత ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ బుధవారం తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి స్పీకర్ రతీంద్ర బోసుతో సమావేశమయ్యారు. తమ వర్గాన్ని అసలైన టీఎంసీ శాసనసభాపక్షంగా గుర్తించాలని కోరారు. మొత్తం 58 ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖలను స్పీకర్‌కు సమరి్పంచారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం.. అనర్హత వేటు పడకుండా ఉండాలంటే తిరుగుబాటు వర్గానికి కనీసం మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ లెక్కన 54 మంది ఎమ్మెల్యేల మద్దతు లభిస్తే రితబ్రత వర్గంపై అనర్హత వేటు పడదు. అసెంబ్లీలో టీఎంసీకి మొత్తం 80 మంది ఎమ్మెల్యేలు ఉండగా, రితబ్రతకు 58 మంది మద్దతు ప్రకటించడంతో ఆయన వర్గాన్ని శాసనసభాపక్షంగా స్పీకర్ గుర్తించారు. తగిన సంఖ్యా బలం ఉండడంతో అనర్హత వేటు తప్పినట్లే. తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యేలు సమర్ ముఖోపాధ్యాయ, అరూప్ రాయ్, రతిన్ ఘోస్, జావెద్ ఖాన్, ప్రసూన్ బెనర్జీ సైతం అసమ్మతి వర్గంలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత సొంత పార్టీ ఎమ్మెల్యేలపై మమతా బెనర్జీ పట్టు కోల్పోయినట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం రాష్ట్రం బయట ఉన్న మరో ఇద్దరు శాసనసభ్యులు సైతం తమకే మద్దతు ఇస్తున్నారని, వారు త్వరలోనే తమ శిబిరంలో చేరుతారని రితబ్రత బెనర్జీ చెప్పారు. తామంతా తృణమూల్ కాంగ్రెస్ గుర్తుపైనే ఎన్నికల్లో గెలిచామని, అసెంబ్లీలో అసలైన టీఎంసీ శాసనసభాపక్షంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని అన్నారు. స్పీకర్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తమకు మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని స్పష్టంచేశారు. అఖ్రుజమన్‌ను చీఫ్ విప్‌గా, జావెద్ అహ్మద్ ఖాన్, సాందీపన్ సాహా, సబీనా యాస్మిన్, షియులీ సాహాను శాసనసభాపక్ష ఉపనేతలుగా నియమించినట్లు చెప్పారు. తమ శాసనసభాపక్షం కొత్త కూర్పును స్పీకర్ ఆమోదించారని, ప్రతిపక్ష నాయకుడి కోసం ఉద్దేశించిన కార్యాలయాన్ని తనకు కేటాయించారని తెలిపారు.ఎందుకీ ముసలం? తృణమూల్ కాంగ్రెస్‌లో శాసనసభాపక్ష నేతగా ఎవరిని నియమించాలన్న దానిపై తొలుత వివాదం మొదలైంది. టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో అసెంబ్లీ స్పీకర్‌కు గతవారం లేఖ రాశారు. సీనియర్ ఎమ్మెల్యే శోభన్‌దేవ్ చటోపాధ్యాయను టీఎంసీ శాసనసభాపక్ష నాయకుడిగా, ఫర్హాద్ హకీంను చీఫ్ విప్‌గా నియమించాలని కోరారు. ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను కూడా పంపించారు. దీనిపై రగడ జరిగింది. తమ సంతకాలను ఫోర్జరీ చేశారని రితబ్రత, సాందీపన్‌తోపాటు పలువురు ఎమ్మెల్యేలు ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. సీఐడీ విచారణకు కూడా దారితీసింది. అభిషేక్ బెనర్జీకి సీఐడీ అధికారులు సమన్లు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని సూచించారు. ఈ నేపథ్యంలో అభిషేక్ బెనర్జీ ప్రతిపాదనను స్పీకర్ తిరస్కరించారు. అనంతరం క్రమశిక్షణా చర్యలను ఉల్లంఘించారన్న కారణంతో రితబ్రత బెనర్జీని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు టీఎంసీ నాయకత్వం ప్రకటించింది. ఇదిలా ఉండగా, తమ అధినేత మమతా బెనర్జీ మాత్రమేనని తిరుగుబాటు ఎమ్మెల్యేలు తేల్చిచెప్పారు. ఆమె టీఎంసీ చైర్‌పర్సన్‌గా పనిచేస్తారని వెల్లడించారు. శాసనసభాపక్షానికి సంబంధించిన అంశాల్లో దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పెత్తనాన్ని అంగీకరించబోమని హెచ్చరించారు.వీరవిధేయుడే కానీ...కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీకి విధేయుడిగా పేరుగాంచిన రితబ్రత బెనర్జీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత ఆమెపైనే తిరుగుబాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. బెంగాల్ దీదీని ఆయన కొంతకాలం క్రితం వరకు రష్యా దివంగత నేత వ్లాదిమిర్ లెనిన్తో పోల్చేవారు. ధీరవనితగా కొనియాడేవారు. అసలు సిసలైన ప్రజా నాయకురాలిగా కీర్తించేవారు. కమ్యూనిస్టు పార్టీ మాజీ నాయకుడైన రితబ్రత బెనర్జీ నేడు తృణమూల్ కాంగ్రెస్ చరిత్రలోనే అతిపెద్ద చీలికను సృష్టించడం గమనార్హం. 28 ఏళ్ల పార్టీ ప్రస్థానంలో ఎన్నడూ లేని అంతర్గత తిరుగుబాటుకు నేతృత్వం వహించారు. ఆయన మరో ఏక్నాథ్ షిండే కాబోతున్నారంటూ రాజకీయ విశ్లేషణలు ఇప్పటికే మొదలయ్యాయి. ఏకంగా 58 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 46 ఏళ్ల యువకుడైన రితబ్రత వెనుక జట్టుకట్టడం ఆసక్తికరంగా మారింది. రితబ్రత 1979 నవంబర్ 15న కోల్‌కతాలో జని్మంచారు. కోల్‌కతాలోనే గ్రాడ్యుయేషన్ వరకు చదువుకున్నారు. కాలేజీలో వామపక్ష భావజాలం ఉండేది. ఆంగ్ల భాషలో అనర్గళంగా మాట్లాడుతూ టీవీ చర్చా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో గుర్తింపు సంపాదించారు. 2008లో వామపక్ష విద్యార్థి విభాగమైన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఐ) ప్రధాన కార్యదర్శిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. చురుకైన యువ నేతగా అందరి దృష్టిని ఆకర్శించారు. 2011లో 31 ఏళ్ల వయస్సులో కోల్‌కతా సౌత్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో సీపీఎం అభ్యర్థిగా పోటీ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి సుబ్రతా బక్షి చేతిలో ఓడిపోయారు. రాజకీయాల్లో ఎత్తుపల్లాలు చూశా రు. మూడేళ్ల తర్వాత 2014లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతుతో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అప్పట్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా తట్టుకున్నారు. బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య, సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరి ఆయనకు అండగా నిలిచారు. కమ్యూనిస్టు సిద్ధాంతాలకు వ్యతిరేకంగా.. కమ్యూనిస్టు నాయకుడైన రితబ్రత బెనర్జీ జీవనశైలి అప్పట్లో విలాసవంతంగా ఉండేది. ఖరీదైన వస్తువులు, ఎల్రక్టానిక్ పరికరాలు ఉపయోగించేవారు. దీనిపై పార్టీలో అసంతృప్తి చెలరేగింది. కమ్యూనిస్టు సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారంటూ ఆయనపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. సీనియర్ నాయకులు విమర్శలు గుప్పించారు. క్షమశిక్షణా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వెల్లువెత్తాయి. 2017లో రితబ్రతను సీపీఎం నుంచి బహిష్కరించారు. తర్వాత బీజేపీ నేతలు ముకుల్ రాయ్, కైలాశ్ విజయ్‌వర్గియాతో రితబ్రత సన్నిహితంగా మెలిగారు. ఓ మహిళకు సంబంధించిన వివాదంలో పోలీసు కేసు నమోదు కావడంతోపాటు చట్టపరమైన ఇబ్బందుల వల్ల అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. 2020లో రాజ్యసభ సభ్యత్వం గడువు ముగిసిపోవడంతో అధికారికంగా తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. ఆ పార్టీ కార్మిక విభాగమైన ఐఎన్టీటీయూసీకి సారథ్యం వహించారు. మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి నమ్మినబంటుగా మారారు. ప్రతిఫలంగా 2024లో రాజ్యసభ సభ్యత్వం లభించింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ టిక్కెట్ సైతం దక్కింది. ఎమ్మెల్యేగా గెలిచారు. అభిషేక్ బెనర్జీకి వ్యతిరేకంగా గొంతెత్తారు. పార్టీలో అతడి ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ తిరుగుబాటు ప్రారంభించారు. -
బెంగాల్ రాజకీయాల్లో భూకంపం సృష్టించిన రితబ్రత బెనర్జీ ఎవరు?
అసలే ఓటమి బాధతో ఉన్న పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజకీయ భవిష్యత్తుపై మరో పిడుగుపడేలా చేశారు రితబ్రత బెనర్జీ. తృణమూల్ కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురైన నేత రితబ్రత బెనర్జీ బుధవారం రాష్ట్ర అసెంబ్లీలో తనను ప్రతిపక్ష నేతగా స్పీకర్ రథీంద్ర బోస్ గుర్తించారని ప్రకటించిన విషయం తెలిసిందే. తమ తిరుగుబాటు వర్గాన్ని ప్రత్యేక శాసనసభా పక్షంగా గుర్తింపు ఇవ్వాలన్న డిమాండ్‌ను కూడా స్పీకర్ అంగీకరించారని ఆయన చెప్పారు.తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీకి మద్దతుగా 58 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు నిలిచి, శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నుకున్నట్టు స్పీకర్ రథీంద్ర బోస్‌కు అధికారికంగా తెలియజేసిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.ఈ చర్యతో తృణమూల్ కాంగ్రెస్ శాసన విభాగంపై నియంత్రణ తిరుగుబాటు వర్గానికి వెళ్లినట్టయింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయం తర్వాత పార్టీ నాయకత్వానికి ఇప్పటివరకు ఎదురైన అతిపెద్ద సవాలుగా ఇది నిలిచింది.అసలు రితబ్రత బెనర్జీ ఎవరు?పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉలుబేరియా పూర్బా నియోజకవర్గం నుంచి రితబ్రత బెనర్జీ విజయం సాధించారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రుద్ర ప్రసాద్ బెనర్జీపై 11,838 ఓట్ల తేడాతో గెలిచారు. తృణమూల్ కాంగ్రెస్ భారీ ఎన్నికల పరాజయం ఎదుర్కొన్నప్పటికీ, రితబ్రత విజయం సాధించారు. బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ఘన విజయం సాధించింది.పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలపై సోమవారం బహిష్కరణకు గురైన ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో రితబ్రత ఒకరు. ఒకప్పుడు సీపీఎంలో ఎదుగుతున్న నాయకుడిగా, వామపక్షాల భవిష్యత్ నేతగా భావించేవారు. అయితే ఓ వివాదాస్పద ఘటన, వివాదాస్పద ఇంటర్వ్యూ తర్వాత ఆయన ఎదుగుదల ఆగిపోయింది. 2018లో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు.ముఖ్యమంత్రి సువేందు అధికారి ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల పేర్లు వెల్లడించిన వెంటనే మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ వర్గం రితబ్రతను బహిష్కరించింది. ప్రతిపక్ష నేతగా శోభన్‌దేబ్ చట్టోపాధ్యాయ్కు మద్దతు తెలిపిన పార్టీ లేఖపై తమ సంతకాలు నకిలీవని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు స్పీకర్‌కు తెలిపారని ఆరోపణలు వచ్చాయి.రితబ్రత రాజకీయ ప్రయాణంలో అనేక కీలక మలుపులు ఉన్నాయి. వామపక్ష ఉద్యమంలో ప్రారంభించి, స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వేగంగా ఎదిగి, సీపీఎం తరఫున రాజ్యసభ సభ్యుడయ్యారు. పార్టీ కీలక యువ నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. తర్వాత వామపక్షాల్లో ఆయన ప్రభావం తగ్గి, 2017లో పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు.తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ఆయన రాజకీయ పునరాగమనం ప్రారంభమైంది. అక్కడ కూడా సంస్థాగతంగా ఎదిగారు. తొలుత పార్టీ కార్మిక సంఘ విభాగ బాధ్యతలు అప్పగించారు. తర్వాత రాజ్యసభ నామినేషన్ ఇచ్చి ప్రోత్సహించారు. 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించినప్పటికీ, రితబ్రత ఉలుబేరియా పూర్బా నియోజకవర్గాన్ని నిలబెట్టుకున్నారు.ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్‌లో తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తున్న వ్యక్తిగా ఆయనను చూస్తున్నారు. టీఎంసీలోని మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతును పొందారు. రితబ్రత బెనర్జీ పార్టీ నాయకత్వ అధికారాన్ని సవాలు చేస్తున్న తీరును మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే సృష్టించిన రాజకీయ ప్రకంపనలతో పోలుస్తున్నారు. -
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.. TMCలో తిరుగుబాటు
-
బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనం
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుంది. ప్రతిపక్ష తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో భారీ చీలిక చోటు చేసుకుంది. పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే రీటా బ్రతా బెనర్జీ.. ఇవాళ అసెంబ్లీలోకి వెళ్లి తనకు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ ప్రకటించారు. ఈ పరిణామంతో తర్వాత ఏం జరగనుందా? అనే ఉత్కంఠ నెలకొంది.టీఎంసీ సస్పెండెడ్ ఎమ్మెల్యే రీటా బ్రతా బెనర్జీ.. పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేల మద్దతు ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. సుమారు 50 మంది ఎమ్మెల్యేలు తనకు మద్దతు తెలుపుతున్నారని, దీంతో కొత్త రాజకీయ సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో తిరుగుబాటు వర్గం ఆయనను ప్రతిపక్ష నేత (LoP)గా నిలబెట్టే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. దీంతో అసెంబ్లీలో అధికార టీఎంసీకి వ్యతిరేకంగా కొత్త శక్తి రూపుదిద్దుకుంటుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది.బెంగాల్లో టీఎంసీ దారుణ ఓటమి తర్వాత.. ఆ పార్టీలో మమతా బెనర్జీ నాయకత్వంపై అసంతృప్తి బయటపడుతోంది. ఇక ఇటీవల మమతా బెనర్జీ అధ్యక్షతన జరిగిన టీఎంసీ కీలక సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడంతో అది దాదాపు ఖాయమైంది. అదే సమయంలో అసంతృప్త ఎమ్మెల్యేలంతా విడిగా ఓ హెటల్లో సమావేశం అయ్యారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రీటా బ్రతా బెనర్జీ చేసిన తాజా వ్యాఖ్యలు టీఎంసీ అంతర్గత రాజకీయాలను మరింత ఉద్రిక్తంగా మార్చాయి. పార్టీ చీలిక నిజంగానే జరుగుతోందా? లేదంటే ఇది తాత్కాలిక అసంతృప్తి మాత్రమేనా? అన్నది బెంగాల్ రాజకీయాల్లో ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది.మహా సీన్ రిపీటా?టీఎంసీలో కొనసాగుతున్న అంతర్గత అసంతృప్తి మరింత పెరిగితే పార్టీపై మమతా బెనర్జీ పట్టు బలహీనపడే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేల సంఖ్యాబలం కీలకంగా మారితే.. పార్టీ ఆమె చేజారి పోవచ్చని చెబుతున్నారు. ఈ క్రమంలో గతంలో మహారాష్ట్ర రాజకీయాలు ఉదాహరణగా చెబుతున్నారు.2022లో మహారాష్ట్రలోని రాజకీయ సంక్షోభం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేనలో మొదలైన అసంతృప్తి.. ఏక్నాథ్ షిండే వర్గం భారీగా ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవడంతో అసెంబ్లీలో మెజారిటీ సమీకరణం మారిపోయింది. చివరికి పార్టీ గుర్తు, నాయకత్వం కూడా మారిన పరిణామం రాజకీయంగా పెద్ద మలుపుగా నిలిచింది. రీటా బ్రతా బెనర్జీ చేసిన 50 మంది ఎమ్మెల్యేల మద్దతు వ్యాఖ్యలు ఆ దిశగా సంకేతాలిస్తున్నాయనే చెప్పొచ్చు. మహారాష్ట్ర శివసేన సంక్షోభం తరహాలో టీఎంసీలో కూడా ఎమ్మెల్యేల మద్దతు సమీకరణం మారితే, ప్రస్తుత అసంతృప్తి పెద్ద రాజకీయ సంక్షోభంగా మారే అవకాశం ఉందని మమతను విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఎవరీ రీటా బ్రతా బెనర్జీ..రీటా బ్రతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో వివాదాలతో పాటు వేగంగా ఎదిగిన నాయకుడిగా గుర్తింపు పొందారు. కోల్‌కతా సౌత్ పాయింట్ హైస్కూల్, అసుతోష్ కాలేజీలో చదువుకున్న ఆయన 2000ల ప్రారంభంలో విద్యార్థి రాజకీయాల ద్వారా ముందుకు వచ్చారు. స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI)లో కీలక నాయకుడిగా ఎదిగి, సీపీఎం యువజన విభాగంలో దాదాపు ఎనిమిదేళ్లు క్రియాశీలంగా పనిచేశారు. ఆ సమయంలోనే ఆయనను సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరికు దగ్గరగా ఉన్న యువ నాయకుడిగా భావించేవారు.తరువాత 34 ఏళ్లకే సీపీఎం ఆయనను రాజ్యసభకు పంపడం అప్పట్లో పెద్ద సంచలనం. అయితే 2017లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలతో సీపీఎం ఆయనను తొలుత సస్పెండ్ చేసి, తరువాత పూర్తిగా బహిష్కరించింది. అదే సమయంలో పార్టీ నాయకత్వంపై ఆయన బహిరంగ విమర్శలు చేయడం, అంతర్గత విభేదాలు తీవ్రమవ్వడం ఈ చర్యకు కారణమయ్యాయి. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన ఆయన, పార్టీ ట్రేడ్ యూనియన్ విభాగంలో కీలక బాధ్యతలు చేపట్టి తిరిగి రాజకీయంగా పుంజుకున్నారు.టీఎంసీలో చేరిన తర్వాత కూడా ఆయన ప్రయాణం వివాదాల నుంచి పూర్తిగా బయటపడలేదు. తాజాగా ఎమ్మెల్యే సంతకాల ఫోర్జరీ ఆరోపణల వివాదం ఆయనను మళ్లీ వార్తల్లోకి తెచ్చింది. పార్టీ కమ్యూనికేషన్లో తప్పుదారి పట్టించే సంతకాలు ఉన్నాయని ఆయనతో పాటు మరో ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేయడంతో, పార్టీ చర్యలు తీసుకుని ఇద్దరినీ సస్పెండ్ చేసింది. ఈ పరిణామాల మధ్య.. మమతకు దగ్గరేనా?తాజాగా ఆయన “50 మంది ఎమ్మెల్యేల మద్దతు” ఉందని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. రీటా ఒక్కసారిగా రెబల్ వర్గానికి కేంద్రబిందువుగా మారారు. అయితే ఈ మద్దతు ఎంతవరకు వాస్తవమో ఇంకా అధికారికంగా ధృవీకరణ కాలేదు. రాజకీయ విశ్లేషకుల ప్రకారం, ఇలాంటి క్లెయిమ్స్ సాధారణంగా అంతర్గత అసంతృప్తిని ఒక రాజకీయ శక్తిగా మార్చే ప్రయత్నంగా కూడా ఉండవచ్చు. అలాగే..మాజీ సీఎం మమతా బెనర్జీతో ఆయన సంబంధంపై చూస్తే.. ప్రారంభంలో పార్టీ వేదికలో భాగంగా ఉండటం వల్ల ఒక స్థాయి సాన్నిహిత్యం, రాజకీయ సమన్వయం ఉండే అవకాశం ఉంది. కానీ పార్టీ నిర్ణయాలపై భిన్న అభిప్రాయాలు పెరిగిన తర్వాత ఆ దూరం పెరిగినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయనను మమతకు “దగ్గర నేత”గా కాకుండా, పార్టీ లైన్‌కు వ్యతిరేకంగా నిలిచిన రెబల్ నేతగా మాత్రమే చూస్తున్నారు. -
‘చికెన్స్ నెక్’పై భారత్ పట్టు.. చైనా, ‘బంగ్లా’ కుట్రలకు చెక్!
‘చికెన్స్ నెక్’ (సిలిగురి కారిడార్).. ఇది పశ్చిమ బెంగాల్‌లోని అత్యంత వ్యూహాత్మక, ఇరుకైన భూభాగం. కేవలం 20 నుండి 22 కిలోమీటర్ల వెడల్పుతో ఉండి, ఈశాన్య భారతదేశంలోని ఎనిమిది రాష్ట్రాలను దేశంలోని మిగిలిన భాగంతో కలుపుతుంది. భౌగోళికంగా దీనికి ఒకవైపు నేపాల్, మరోవైపు బంగ్లాదేశ్, పైభాగంలో భూటాన్ సరిహద్దులుగా ఉన్నాయి. ఈ ప్రాంతంపై చైనా ఎప్పటినుంచో కన్నేసి ఉంచడం వల్ల సరిహద్దు భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయి. 2017లో చికెన్స్ నెక్కు సమీపంలో ఉన్న భూటాన్ భూభాగమైన ‘డోక్లాం’లో చైనా రోడ్డు నిర్మాణానికి ప్రయత్నించినప్పుడు భారత్-చైనా సైన్యాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఒకవేళ యుద్ధం లాంటి పరిస్థితుల్లో చైనా ఈ ఇరుకైన కారిడార్‌ను ఆక్రమిస్తే లేదా దిగ్బంధిస్తే, ఈశాన్య రాష్ట్రాలకు భారత ప్రధాన భూభాగంతో రవాణా, సైనిక సరఫరాలు పూర్తిగా తెగిపోయే ప్రమాదం ఉంది. ఈ ముప్పును ఎదుర్కొనేందుకు భారత్ అక్కడ భారీగా సైన్యాన్ని మోహరించడంతో పాటు, సరిహద్దు మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తూ, ప్రత్యామ్నాయంగా బంగ్లాదేశ్, మయన్మార్ దేశాల మీదుగా ఈశాన్య రాష్ట్రాలకు కనెక్టివిటీ మార్గాలను అభివృద్ధి చేస్తోంది.సరిహద్దు భద్రతా దళానికి బాధ్యతలుభారతదేశ రక్షణ వ్యూహాల్లో అత్యంత కీలకమైన, సున్నితమైన ప్రాంతంగా భావించే ‘చికెన్స్ నెక్’ (సిలిగురి కారిడార్) పరిధిలోని 120 ఎకరాల భూమిని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్)నకు అప్పగించేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సువేందు అధికారి కేంద్ర ప్రభుత్వ సుదీర్ఘకాల డిమాండ్‌ను నెరవేరుస్తూ ఈ భూమికి సంబంధించిన పత్రాలను బీఎస్ఎఫ్కు స్వయంగా అందజేశారు. గత మమతా బెనర్జీ ప్రభుత్వం కాలయాపన చేసిన ఈ ప్రక్రియను నూతన ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ నిర్ణయంతో ఈశాన్య రాష్ట్రాలను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించే జాతీయ రహదారులు, రైల్వే మౌలిక సదుపాయాల బలోపేతానికి, రక్షణ దళాల వేగవంతమైన కదలికలకు మార్గం సుగమమైంది.సువేందు అధికారి సంచలన నిర్ణయంపశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సువేందు అధికారి కేంద్రం పెండింగ్‌లో ఉంచిన కీలక డిమాండ్‌ను పరిష్కరించారు. సిలిగురి కారిడార్ పరిధిలోని ముఖ్యమైన భాగాలతో కూడిన ఏడు జాతీయ రహదారుల విభాగాలను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా , నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు బదిలీ చేసేందుకు నూతన రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సరిహద్దు కంచె నిర్మాణానికి గానూ బీఎస్ఎఫ్కు భూమిని బదిలీ చేసేందుకు ముఖ్యమంత్రి సువేందు అధికారి తీసుకున్న ఈ నిర్ణయం దేశ రక్షణలో ఒక మైలురాయిగా నిలవనుంది.120 ఎకరాల భూమి ఎందుకు కీలకం?సిలిగురి కారిడార్‌లో నోటిఫై చేసిన ఈ 120 ఎకరాల భూమి వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత కలిగినది. ఇక్కడి పరిపాలనాపరమైన అడ్డంకుల కారణంగా రహదారుల విస్తరణ, దెబ్బతిన్న మార్గాల మరమ్మతులు, కొత్త మౌలిక సదుపాయాల కల్పన వంటి కీలక ప్రాజెక్టులు ఎన్నో ఏళ్లుగా నిలిచిపోయాయి. భారత సైన్యానికి, భారీ సైనిక సామగ్రి రవాణాకు అత్యుత్తమ రహదారులు అత్యంత అవసరం. సిక్కింతో పాటు ఈశాన్య రాష్ట్రాలకు అనుసంధానాన్ని బలోపేతం చేయడం భారతదేశ వ్యూహాత్మక అవసరం కావడంతో, కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతంపై పట్టు కోసం సుదీర్ఘకాలంగా ప్రయత్నిస్తోంది.భూగర్భ రైల్వే లైన్ ప్రణాళికఅత్యవసర పరిస్థితుల్లో కూడా ఈశాన్య రాష్ట్రాలతో రవాణా వ్యవస్థకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు సిలిగురి మీదుగా భూగర్భ రైల్వే కారిడార్‌ను నిర్మించే పనులు సాగుతున్నాయి. సిలిగురి కారిడార్ (చికెన్స్ నెక్) గుండా వెళ్లే 40 కిలోమీటర్ల పొడవైన భూగర్భ రైల్వే లైన్‌ను నిర్మిస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇదివరకే ప్రకటించారు. ఈ కీలక మార్గాలను కేంద్ర ప్రభుత్వం నేరుగా పర్యవేక్షించడం వల్ల భారత సైన్య కార్యాచరణ సంసిద్ధతకు ఎంతో బలం చేకూరుతుంది. ఇది కేవలం వ్యూహాత్మక అడుగు మాత్రమే కాకుండా, ఈశాన్య రాష్ట్రాల భద్రతపై నెలకొన్న దీర్ఘకాలిక ఆందోళనలను తొలగిస్తుంది.సిలిగురి కారిడార్ భౌగోళిక స్థానంభౌగోళికంగా సిలిగురి కారిడార్ పశ్చిమాన నేపాల్ సరిహద్దులో ఉన్న పానిటాంకి నుండి, తూర్పున బంగ్లాదేశ్ సరిహద్దులోని ఫుల్బరి వరకు విస్తరించి ఉంది. కేవలం 22 కిలోమీటర్ల వెడల్పు, దాదాపు 60 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ ఇరుకైన భూభాగం నేపాల్, బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దులను తాకుతూ ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర వంటి ఏడు ఈశాన్య రాష్ట్రాలను భారతదేశ ప్రధాన భూభాగంతో అనుసంధానించే ఏకైక మార్గం ఇదే. సిక్కిం వెళ్లే మార్గం కూడా దీని గుండానే సాగుతుంది.పొరుగు దేశాల భూభాగాలపై భారత్ వైఖరిభారతదేశం ఎన్నడూ పొరుగు దేశాల భూభాగాలను ఆక్రమించుకోవడానికి ప్రయత్నించలేదు. 1971 యుద్ధ సమయంలో పాకిస్తాన్ సైన్యం బంగ్లాదేశ్‌లో దారుణ నరమేధానికి పాల్పడినప్పుడు, భారత దళాలు ఆ ప్రాంతంలోకి లోతుగా దూసుకెళ్లాయి. ఆ సమయంలో బంగ్లాదేశ్‌లోని కొన్ని ప్రాంతాలను భారత్ తన ఆధీనంలోకి తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ, పరిస్థితిని ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదు. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ మధ్య ఉన్న ఈ 22 కిలోమీటర్ల వెడల్పు గల ఇరుకైన కారిడార్‌ను లక్ష్యంగా చేసుకోవాలని శత్రు దేశాలు తరచూ కుట్రలు పన్నుతూనే ఉన్నాయి.శత్రుదేశాల కుట్రలకు చెక్భారతదేశంతో ఈశాన్య రాష్ట్రాల బంధాన్ని తెంచేందుకు చైనా, బంగ్లాదేశ్ వంటి దేశాలు ఈ ఇరుకైన ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలని చాలా కాలంగా ఆశలు పెట్టుకున్నాయి. గతంలో ఢిల్లీ అల్లర్ల సమయంలో కూడా, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ వ్యూహాత్మక చికెన్స్ నెక్ ప్రాంతాన్ని దిగ్బంధించాలంటూ ముస్లిం విద్యార్థి నేత షర్జీల్ ఇమామ్ తన మద్దతుదారులకు పిలుపునిచ్చాడు. అయితే శత్రువుల కుయుక్తులు ఎన్నడూ విజయవంతం కాలేదు. భవిష్యత్తులోనూ కాబోవు. ఒకప్పుడు భారతదేశ బలహీనమైన ప్రాంతంగా పరిగణించిన ఈ ఇరుకైన భూభాగం.. నూతన మౌలిక సదుపాయాల కల్పనతో ఇప్పుడు స్థిరత్వానికి, అజేయమైన శక్తికి ప్రతీకగా మారుతోంది.ఇది కూడా చదవండి: 30 వేల అగ్గిపెట్టెల్లో దేశ ఘన చరిత్ర -
దీదీ ఉక్కిరి బిక్కిరి.. బీజేపీలోకి 75 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు?!
కోల్‌కతా: 15ఏళ్ల పాటు పశ్చిమ బెంగాల్‌ను పాలించిన మాజీ సీఎం మమతా బెనర్జీ ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్తు, అలాగే తాను స్థాపించిన పార్టీ చేజారిపోతుందేమోనన్న భయంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ 80 స్థానాలు గెలుచుకుంది. అయితే ఆ 80 మంది ఎమ్మెల్యేలలో 70 మందికి పైగా బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. దీనికి ఊతం ఇచ్చేలా సెంట్రల్ కోల్‌కతాలో మమతా చేపట్టిన నిరసన కార్యక్రమం వేదికైంది.అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఎంసీ కార్యకర్తలపై దాడులు, కేసులు, ఇతర అంశాలపై మమతా బెనర్జీ మంగళవారం ఆందోళన చేపట్టారు. కానీ ఆ నిరసనకు 80 మంది ఎమ్మెల్యేలలో 75 మంది గైర్హాజరయ్యారు. కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు మాత్రమే పాల్గొన్నారు.ఎస్ప్లనేడ్లో జరిగిన నిరసనలో పాల్గొన్న ఎమ్మెల్యేలలో శోవన్‌దేబ్ చటోపాధ్యాయ్, నైనా బందోపాధ్యాయ్, మదన్ మిత్రా, అశోక్ దేబ్, అసిమా పాత్రా ఉన్నారు. మమతా పక్కన కనిపించిన ఎంపీలలో డోలా సేన్, కళ్యాణ్ బెనర్జీ, డెరెక్ ఓ'బ్రియన్ ఉన్నారు. దీంతో టీఎంసీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు పావులు కదుపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.మరోవైపు మహారాష్ట్ర శివసేన తరహాలో టీఎంసీ కూడా రెండుగా చీలే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీలో చేరకపోయినా, పార్టీ గుర్తును మమతా బెనర్జీకి దూరం చేయాలన్న ఉద్దేశంతో బహిష్కృత నేతలు రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. రీతబ్రత బెనర్జీ, సందీపన్ సాహా తదితరులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు.శోభన్‌దేబ్ చటోపాధ్యాయ్‌ను ప్రతిపక్ష నాయకుడిగా ఆమోదిస్తూ రాసిన లేఖలో పలువురు ఎమ్మెల్యేల సంతకాలను ఫోర్జరీ చేశారన్న ఆరోపణల మధ్య ఈ పరిణామం చోటుచేసుకుంది. అంతకుముందు మమతా బెనర్జీ నివాసంలో జరిగిన సమావేశానికి 80 మంది ఎమ్మెల్యేలలో 60 మంది గైర్హాజరయ్యారు.అభిషేక్ బెనర్జీపై సోనార్‌పూర్‌లో జరిగిన దాడి తర్వాత కూడా చాలా మంది టీఎంసీ నాయకులు బహిరంగంగా స్పందించలేదు. ఇప్పటికే 100 మందికి పైగా కౌన్సిలర్లు పార్టీని వీడగా, పలువురు నాయకులు ముఖ్యంగా అభిషేక్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. టీఎంసీ ఎంపీ కాకోలీ ఘోష్ దస్తిదార్ అన్ని సంస్థాగత పదవులకు రాజీనామా చేయడం కూడా పెద్ద దెబ్బగా మారింది. ఈ వరుస పరిణామాలతో టీఎంసీ భవిష్యత్తు అంధకారమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
బీజేపీ అంత సాహసం చేస్తుందా?
ఒకప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాలను శాసించిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ).. ఇప్పుడు తన అస్తిత్వానికే పోరాడుతోందా? వరుస రాజీనామాలు, ఎమ్మెల్యేల తిరుగుబాటు సంకేతాలు, వేటులు, పార్టీ అంతర్గత విభేదాలు, బీజేపీ ప్రభావం.. ఈ పరిణామాలన్నీ టీఎంసీ భవిష్యత్తుపై పెద్ద ప్రశ్నార్థకాన్ని మిగిల్చాయి. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పార్టీని కాపాడగలిగేది మమతా బెనర్జీ ఒక్కరేనా? లేదంటే టీఎంసీ ఆమె చేతుల్లో నుంచి కూడా జారిపోతుందా? అనే చర్చ ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 294 స్థానాల్లో 208 సీట్లు గెలుచుకుని అధికారంలోకి రాగా.. టీఎంసీ కేవలం 80 స్థానాలకు పరిమితమైంది. దాదాపు పదిహేనేళ్ల అధికారాన్ని కోల్పోయిన పార్టీ ఒక్కసారిగా ప్రతిపక్ష పాత్రలోకి వెళ్లాల్సి వచ్చింది. ఈ ఫలితాల తర్వాతే టీఎంసీలో అసంతృప్తి బయటపడటం మొదలైంది. ఇటీవల మమతా నిర్వహించిన కీలక సమావేశానికి 80 మంది ఎమ్మెల్యేల్లో దాదాపు 60 మంది హాజరుకాకపోవడం పార్టీ పరిస్థితిని స్పష్టంగా చూపించింది. ఇదే సమయంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ ఇద్దరు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం పరిస్థితి తీవ్రతను వెల్లడించింది.బహిరంగంగానే అంగీకారంపార్టీలో చీలిక తీసుకురావడానికి కుట్ర జరుగుతోందని మమతా బెనర్జీ స్వయంగా ఫేస్బుక్ లైవ్‌లో అంగీకరించారు. కొంతమంది నేతలు తమ రాజకీయ భవిష్యత్తు గురించే ఆలోచిస్తున్నారని, ఎమ్మెల్యేలపై ఒత్తిళ్లు తెచ్చి పార్టీని బలహీనపర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. “నాయకులు భయపడవచ్చు.. కానీ కార్యకర్తలు భయపడరు. కార్యకర్తలు ఉన్నంతకాలం నేను పార్టీని మళ్లీ నిర్మిస్తా” అని ఆమె ప్రకటించారు.అభిషేక్‌పై అసంతృప్తి?పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ వ్యవహారశైలిపై కూడా టీఎంసీ సీనియర్ నేతల్లో అసంతృప్తి పెరిగినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. పాత తరం నాయకులను పక్కనపెట్టి కొత్త బృందానికి ప్రాధాన్యం ఇవ్వడం, ఎన్నికల వ్యూహ సంస్థ ఐ-ప్యాక్‌కు అధిక ప్రాధాన్యం కల్పించడం వల్ల మధ్యస్థాయి నాయకత్వం పార్టీకి దూరమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అనేక మంది నేతలు ఎన్నికల ఓటమికి ఐ-ప్యాక్ వ్యూహాలే కారణమని కూడా ఆరోపిస్తున్నారు.పార్టీ నుంచి నిష్క్రమణల పరంపరఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పారు. టీఎంసీ ఎంపీ కాకోలి ఘోష్ దస్తిదార్ పార్టీ పదవులకు రాజీనామా చేయడం పెద్ద చర్చకు దారితీసింది. మాజీ రాజ్యసభ సభ్యుడు శంతను సేన్, సీనియర్ అధికార ప్రతినిధి అరూప్ చక్రవర్తి కూడా పదవులు వీడారు. మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ, సినీ దర్శకుడు రాజ్ చక్రవర్తి, అసోం యూనిట్ మాజీ అధ్యక్షుడు అభిజిత్ మజుందార్ వంటి ప్రముఖులు పార్టీని పూర్తిగా విడిచిపెట్టారు. మరోవైపు వందకు పైగా కార్పొరేటర్లు కూడా టీఎంసీకి రాజీనామా చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.ఎందుకు దూరమవుతున్నారు?రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. టీఎంసీలో సిద్ధాంతపరమైన బలం ఎప్పటినుంచో బలహీనంగానే ఉంది. సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులను గెలుపు అవకాశాల కోసం పార్టీలోకి తీసుకువచ్చారు. వారు మమతా ఇమేజ్, టీఎంసీ బలంతో గెలిచినా.. పార్టీతో భావోద్వేగ అనుబంధం లేదంటే సిద్ధాంతపరమైన నిబద్ధత మాత్రం ఎక్కువగా లేదని విశ్లేషకులు చెబుతున్నారు. కాబట్టి అధికారం కోల్పోయిన తర్వాత అలాంటి నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం కొత్త మార్గాలు వెతకడం సహజమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.బీజేపీ అంత సాహసం చేస్తుందా?టీఎంసీ నేతల్లో చాలామంది బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం ప్రస్తుతం బెంగాల్ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత టీఎంసీలో భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొనడంతో కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక నేతలు ప్రత్యామ్నాయ రాజకీయ ఆశ్రయాల కోసం ప్రయత్నిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో అధికార పార్టీతో ఉండటం రాజకీయంగా లాభదాయకమని భావిస్తున్న నేతలు పెరుగుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.అయితే టీఎంసీ నుంచి వచ్చే ప్రతి నేతకు బీజేపీ తలుపులు తెరుస్తుందా? అనే ప్రశ్నకు మాత్రం స్పష్టమైన సమాధానం కనిపించడం లేదు. 2021 ఎన్నికల సమయంలో టీఎంసీ నుంచి భారీగా వచ్చిన నేతలకు బీజేపీ ప్రాధాన్యం ఇవ్వడం పార్టీకి మిశ్రమ ఫలితాలనే ఇచ్చిందని రాజకీయ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. పాత బీజేపీ నాయకులు, కార్యకర్తల్లో అసంతృప్తి పెరగడంతో పాటు, టీఎంసీ నుంచి వచ్చిన వారిని ప్రజలు పూర్తిగా నమ్మలేదనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది.అంతేకాకుండా అవినీతి, స్థానిక వివాదాలు, అధికార దుర్వినియోగం వంటి ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు మాజీ టీఎంసీ నేతలను చేర్చుకోవడం వల్ల బీజేపీ ప్రతిష్ఠ దెబ్బతిన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు కేవలం సంఖ్యాబలం కోసం కాకుండా.. పార్టీకి రాజకీయంగా ఉపయోగపడే, ప్రజల్లో బలమైన గుర్తింపు ఉన్న నాయకుల విషయంలో మాత్రమే బీజేపీ ఆసక్తి చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.మరోవైపు టీఎంసీ నుంచి బయటకు రావాలనుకునే నేతలకు కూడా బీజేపీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి బహిరంగ ఆహ్వానం కనిపించడం లేదు. దీంతో పార్టీ మారాలని భావిస్తున్న నేతలు కూడా కొంత గందరగోళంలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ప్రస్తుతం టీఎంసీలో అసంతృప్తి ఉన్నప్పటికీ.. అది వెంటనే బీజేపీలో భారీ చేరికలుగా మారుతుందా? లేదా? అన్నది ఇంకా స్పష్టత లేని అంశంగానే మిగిలింది.టీఎంసీకి మమతే బలం.. అదే బలహీనతటీఎంసీ అంటే మమతా.. మమతా అంటే టీఎంసీ అన్న స్థాయిలో పార్టీ నిర్మాణం జరిగింది. అదే ఇప్పుడు పార్టీకి బలం కూడా, బలహీనత కూడా అయింది. ప్రత్యామ్నాయ నాయకత్వం కనిపించకపోవడం ఒకవైపు సానుకూల అంశమైతే.. మొత్తం పార్టీ ఒకే వ్యక్తిపై ఆధారపడటం మరోవైపు ప్రమాద సంకేతంగా మారింది. ప్రస్తుతం మమతా లేకుండా టీఎంసీని ఊహించడం కష్టమే. కానీ మమతా ఒక్కరే పార్టీని మళ్లీ గాడిలో పెట్టగలరా? అనే ప్రశ్న మాత్రం మరింత బలంగా వినిపిస్తోంది.అసలైన పరీక్ష ఇప్పుడేబెంగాల్ రాజకీయ చరిత్ర చూస్తే ఒకసారి అధికారాన్ని కోల్పోయిన పార్టీ మళ్లీ తిరిగి రావడం చాలా అరుదు. కాంగ్రెస్, సీపీఎం వంటి దిగ్గజాలు కూడా అదే పరిస్థితిని ఎదుర్కొన్నాయి. ఇప్పుడు టీఎంసీ కూడా అలాంటి మలుపు వద్ద నిలిచింది. ప్రస్తుతం మమతా బెనర్జీకి రెండు సవాళ్లు ఒకేసారి ఎదురయ్యాయి. బయట బీజేపీ బలమైన ప్రత్యర్థిగా ఎదుగుతుండగా.. లోపల పార్టీ చీలికల ముప్పు వెంటాడుతోంది. 2029 లోక్‌సభ, 2031 అసెంబ్లీ ఎన్నికల వరకు పార్టీని కాపాడటం, మళ్లీ కార్యకర్తల్లో నమ్మకం నింపడం ఆమె ముందున్న అతిపెద్ద పరీక్షగా మారింది. -
అప్పట్లో పనిమనిషి.. నేటి నుంచి బెంగాల్ మంత్రి
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఔస్‌గ్రామ్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి కలితా మాఝీ అనే మహిళ ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే. గతంలో పలువురి ఇళ్లల్లో పనిమనిషిగా పనిచేసిన ఆమె ఇప్పుడు మంత్రి స్థాయికి ఎదిగారు. సోమవారం ఆమె రాష్ట్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒకప్పుడు నెలకు ఆమె జీతం కేవలం రూ.2,500. ఇప్పుడు రాష్ట్ర బాధ్యతల్లో భాగస్వామి కావడం విశేషం.ప్రమాణ స్వీకారం అనంతరం కలితా మాఝీ మాట్లాడుతూ.. "మోదీజీ నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చారు. నేను ఎమ్మెల్యేని అవుతానని కూడా ఊహించలేదు. మంత్రిని అవుతానని అస్సలు అనుకోలేదు. 2014 నుంచి భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తున్నాను. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా నియోజకవర్గంపైనే దృష్టి ఉండేది. ఇప్పుడు మొత్తం పశ్చిమ బెంగాల్ బాధ్యత నా భుజాలపై ఉంది" అని తెలిపారు.ఆర్థిక ఇబ్బందుల కారణంగా కలితా మాఝీ చదువును మధ్యలోనే నిలిపివేశారు. కుటుంబ పోషణ కోసం అనేక ఇళ్లలో పనిమనిషిగా చేశారు. ఆమె భర్త ప్లంబర్‌గా పనిచేస్తుండగా, కుమారుడు పార్థ్ ప్రస్తుతం పాఠశాలలో చదువుతున్నాడు.బూత్ స్థాయి కార్యకర్తగా రాజకీయ ప్రయాణం ప్రారంభించిన కలితా మాఝీకి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అవకాశం ఇచ్చింది. ఆ ఎన్నికల్లో ఓటమి ఎదురైనా, 2026లో మరోసారి అవకాశం కల్పించగా ఆమె విజయం సాధించారు.సోమవారం కోల్‌కతాలోని లోక్ భవన్లో గవర్నర్ ఆర్ఎన్ రవి కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి సువేందు అధికారి మంత్రివర్గ విస్తరణలో 13 మంది క్యాబినెట్ మంత్రులు, ముగ్గురు స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులు, 19 మంది రాష్ట్ర మంత్రులు చోటు దక్కించుకున్నారు.కాగా, బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీకి చెందిన శ్యామా ప్రసన్న లోహర్‌ను ఆ కలితా మాఝీ దాదాపు 12 వేల ఓట్ల తేడాతో ఓడించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 207 స్థానాలను గెలుచుకుంది. టీఎంసీ 80 స్థానాలకే పరిమితమైంది. -
కష్టకాలంలో దీదీ పార్టీ!
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో దారుణ పరాభవం. ఆ వెంటనే పార్టీ నేతలపై దాడులు. నిరసనలు.. వీధి పోరాటాల పిలుపు నేపథ్యంలో కీలక సమావేశానికి రావాలని స్వయంగా పార్టీ అధినేత్రి నుంచి ఆహ్వానం. కానీ ఊహించని విధంగా భారీ సంఖ్యలో ఎమ్మెల్యేల డుమ్మా! దీంతో ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో ఒకటే చర్చ. అసలు టీఎంసీలో ఏమి జరుగుతోంది?.. ఇది కేవలం రాజకీయ ఉద్రిక్తతల ప్రభావమా? లేక మరేదైనా పెద్ద సంకేతమా?పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రస్తుతం రాజకీయంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై దాడి జరగడం కొత్త వివాదానికి తెరతీసింది. ఆ ఘటన తర్వాత పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ కలీఘాట్ నివాసంలో అత్యవసరంగా ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే 80 మంది ఎమ్మెల్యేల్లో కేవలం 20 మంది మాత్రమే హాజరయ్యారు. ఈ పరిణామంతో మమత సైతం ఆశ్చర్యానికి లోనయ్యారు. దీంతో.. చేసేది లేక సమావేశం వాయిదా వేశారు.సాధారణంగా రాజకీయ సంక్షోభ సమయంలో పార్టీ అధినేత పిలిస్తే శాసనసభ్యులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. అలాంటిది దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు సమావేశానికి దూరంగా ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఎన్నికల తర్వాత టీఎంసీ ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో ఈ గైర్హాజరు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.అయితే టీఎంసీ దీనికి భిన్నమైన వివరణ ఇస్తోంది. అభిషేక్ బెనర్జీపై దాడి జరిగిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయని, పలువురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలతో కలిసి ఆందోళనలను పర్యవేక్షిస్తున్నారని పార్టీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ తెలిపారు. పరిస్థితుల దృష్ట్యా సమావేశాన్ని వాయిదా వేయాలని వారే కోరారని, అందుకే పార్టీ అంగీకరించిందని చెప్పారు.కానీ ఈ వ్యవహారంలో రాజకీయంగా మరింత ఆసక్తికరమైన అంశం ఆరోపణలు-ప్రత్యారోపణలే. అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి వెనుక బీజేపీ అనుకూల వర్గాల హస్తం ఉందని టీఎంసీ ఆరోపిస్తోంది. మరోవైపు బీజేపీ మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తూ, దాడికి పాల్పడింది టీఎంసీకి చెందిన వర్గాలేనని ఎదురుదాడి చేస్తోంది. పార్టీ అంతర్గత విభేదాలను కప్పిపుచ్చుకునేందుకే బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారని కమలనాథులు విమర్శిస్తున్నారు.ఇక్కడే రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఒకవేళ బీజేపీ చెబుతున్నట్లుగా ఈ ఘటన వెనుక నిజంగానే టీఎంసీ అంతర్గత వర్గాల ప్రమేయం ఉన్నట్లు తేలితే.. అది పార్టీకి పెద్ద రాజకీయ, సంస్థాగత సవాలుగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్నికల తర్వాత నాయకత్వం, వారసత్వం, భవిష్యత్ వ్యూహాలపై పార్టీలో అసంతృప్తి ఉందన్న ప్రచారానికి అప్పుడు మరింత బలం చేకూరే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సమావేశానికి భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం కూడా అదే కోణంలో విశ్లేషణకు దారితీయొచ్చు.అయితే ప్రస్తుతం ఈ ఆరోపణలకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు బయటకు రాలేదు. అందుకే టీఎంసీ, బీజేపీ రెండూ తమ తమ రాజకీయ కథనాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. ఒకవైపు అభిషేక్ బెనర్జీపై దాడిని ప్రజా ఉద్యమంగా మలచాలని టీఎంసీ భావిస్తుండగా, మరోవైపు అధికార పార్టీ అంతర్గత సంక్షోభాన్ని ఎత్తిచూపాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.ఈ నేపథ్యంలో టీఎంసీ మరింత దూకుడైన ఆందోళన కార్యక్రమాలను ప్రకటించింది. బ్లాక్ స్థాయి నుంచి వార్డు స్థాయి వరకు నిరసన ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించింది. కోల్‌కతాలో మమతా బెనర్జీ స్వయంగా పాల్గొనే ధర్నా కార్యక్రమాన్ని కూడా ప్రకటించింది. ఎన్నికల అనంతర హింస, కార్యకర్తలపై దాడులు, బుల్డోజర్ చర్యలు వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది.మొత్తంగా చూస్తే.. అభిషేక్ బెనర్జీపై దాడి కంటే, ఆ తర్వాత జరిగిన పరిణామాలే ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో పెద్ద చర్చగా మారాయి. 80 మంది ఎమ్మెల్యేల్లో 60 మంది గైర్హాజరు కావడం, బీజేపీ-టీఎంసీ మధ్య ఆరోపణల యుద్ధం, వీధి పోరాటాలకు పార్టీ సిద్ధమవడం.. ఇవన్నీ కలిసి ఒక పెద్ద రాజకీయ కథకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి. అసలు ఇది కేవలం ఒక దాడి ఘటన ప్రభావమా? లేదంటే టీఎంసీలో జరుగుతున్న లోతైన రాజకీయ మార్పులకు సూచనా? అనేది రాబోయే రోజుల్లో మరింత స్పష్టమయ్యే అవకాశం ఉంది. -
వెస్ట్ బెంగాల్ లో టెన్షన్.. టెన్షన్.. మరో ఎంపీపై దాడి
-
బెంగాల్లో మళ్లీ హింస: టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి
హుగ్లీ: పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. చండితాల పోలీస్ స్టేషన్ వెలుపల తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. తమ పార్టీ నేతలు, కార్యకర్తల అరెస్టుకు నిరసనగా టీఎంసీ ప్రతినిధులు పోలీస్ స్టేషన్లో వినతిపత్రం సమర్పించడానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ నేపధ్యంలో టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీకి తీవ్ర గాయాలయ్యాయి.ఘర్షణకు దారితీసిన పరిస్థితులుటీఎంసీ బృందం పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా, అదే సమయంలో అక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. రెండు వర్గాల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరగడంతో పాటు పరిస్థితి భౌతిక దాడుల వరకు దారితీసింది. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘర్షణలో టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీకి తీవ్ర గాయాలయ్యాయి. బీజేపీ కార్యకర్తలు ‘చోర్-చోర్’ (దొంగ-దొంగ) అంటూ నినాదాలు చేస్తున్న సమయంలో, టీఎంసీ మద్దతుదారులకు, వారికి మధ్య ఘర్షణ తీవ్రస్థాయికి చేరిందని సమాచారం. ఈ క్రమంలో జరిగిన దాడిలో ఎంపీ కల్యాణ్ బెనర్జీ తలకు బలమైన గాయాలైనట్లు తెలుస్తోంది. వెంటనే ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు.అధికార యంత్రాంగం అప్రమత్తంఘటన జరిగిన వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు భద్రతను కట్టుదిట్టం చేశారు. అరెస్టులు, ఆ తర్వాత జరిగిన ఈ ఘర్షణ ఘటన రాజకీయంగా మరింత దుమారం రేపుతోంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పోలీసు బలగాలు భారీగా మోహరించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. -
బెంగాల్లో మరో సంచలనం.. మమత వార్నింగ్ ఆడియో లీక్
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్ రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా ఆందోళనకరంగా మారాయి. తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై దాడి నేపథ్యంలో పశ్చిమబెంగాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు రాళ్లు విసరడం, శారీరకంగా దాడి చేయడం వల్ల అభిషేక్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిపై మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఈ క్రమంలో కోల్‌కతాలోని ఓ ప్రముఖ ప్రైవేటు ఆస్పత్రి సీఈవోకు ఆమె వార్నింగ్ ఇస్తున్న ఆడియో బయటకు వచ్చింది. దీంతో, ఇది కాస్త రాజకీయ దుమారం రేపింది. అభిషేక్ బెనర్జీపై సోనార్‌పుర్‌లో దాడి అనంతరం.. ఆయనను చికిత్స కోసం బెల్ వ్యూ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ బెల్ వ్యూ ఆసుపత్రి సీఈవో ప్రదీప్ టాండన్‌ను హెచ్చరిస్తున్న ఆడియో బయటకు వచ్చింది. ‘టాండన్ మీరు తప్పుచేశారు. మేము మీకు చేసిన సాయాన్ని గుర్తుచేసుకోండి. దేవుడు మిమ్మల్ని క్షమించడు. మీ అహంకారాన్ని గుర్తుంచుకుంటాం. మీరు తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆస్పత్రిని నడుపుతున్నారు. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది. తర్వాత వాళ్లు అధికారం కోల్పోతే.. మేం చేయాల్సింది చేస్తాం’ అని ఆడియోలో ఉంది.అయితే, అభిషేక్ పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పటికీ.. డిశ్చార్జ్ చేయాలంటూ బీజేపీ నాయకులు, ఓ సీనియర్ పోలీసు అధికారి ఆస్పత్రిపై ఒత్తిడి తెచ్చారని మమత ఆరోపించారు. తన మేనల్లుడికి ఏమైనా జరిగితే ఆసుపత్రిదే బాధ్యత అని మండిపడ్డారు. కాగా, ప్రస్తుతం అభిషేక్ బెనర్జీకి ఇంట్లోనే చికిత్స అందిస్తున్నట్లు మమత తెలిపారు. కాగా.. ఈ దాడికి సంబంధించి పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు.Last night Mamata Banerjee was shouting at the Hospital Authorities of Belle Vue & especially against Mr. Pradip Tandon (CEO), her arrogance isn't going away either. pic.twitter.com/CP8djkGYns— Sudhanidhi Bandyopadhyay (@SudhanidhiB) May 31, 2026ఇదిలా ఉండగా.. సోనార్‌పుర్‌లో అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి తర్వాత ఆయన ఛాతీలో రక్తపు గడ్డలు ఏర్పడ్డాయని మమత తెలిపారు. అభిషేక్‌కు హెల్మెట్ పెట్టకపోయి ఉంటే ఆయన చనిపోయి ఉండేవాడని ఆరోపించారు. ప్రజలు రాళ్లు విసరడం, శారీరకంగా దాడి చేయడం వల్ల తన మేనల్లుడి ఛాతీ, పక్కటెముకల ప్రాంతంలో గాయాలయ్యాయని పేర్కొన్నారు. అభిషేక్‌కు సరైన చికిత్స అందించకుండా ఉండేందుకు ఆసుపత్రులకు పైనుంచి ఒత్తిడి ఉందని విమర్శించారు. అలాగే, అభిషేక్ సోనార్‌పుర్ పర్యటన గురించి పోలీసులకు ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ, వారు ఎందుకు తగిన భద్రత ఏర్పాట్లు కల్పించలేకపోయారని ప్రశ్నించారు. హింసను సృష్టించేందుకే బీజేపీ బయటి వ్యక్తులను రప్పించిందని ఆరోపించారు. బీజేపీ చట్ట ప్రకారం పనిచేయాలని కోరారు. ఆస్పత్రికి వచ్చినవారిలో ఎవరికి చికిత్స చేయాలి? ఎవరికి చేయకూడదు? అనే దానికి బీజేపీ నుంచి అనుమతి కావాలని మండిపడ్డారు. అంత అమానవీయంగా బీజేపీ తయారయ్యిందని ఫైర్ అయ్యారు. -
మమతా మేనల్లుడిపై గుడ్లు, రాళ్లు, చెప్పులతో దాడి
-
తృణముల్ కాంగ్రెస్‌కు మరో షాక్.. అభిషేక్ బెనర్జీకి నోటీసులు
కోల్‌కతా: తృణముల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీకీ మరో ఎదురుదెబ్బ తగిలింది. టీఎంసీ కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్లి దాడికి గురైన ఘటన గడిచి 24 గంటలు గడవకముందే ఇప్పుడు మరో కేసులో ఇరుకున్నారు. నకీలీ సంతకాల విచారణలో విచారణకు రావాలని సీఐడీ నోటీసులు జారీ చేసింది.పశ్చిమ బెంగాల్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (CID), తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి (శనివారం) సమన్లు జారీ చేసింది. 'నకిలీ సంతకాల' వివాదానికి సంబంధించిన విచారణలో భాగంగా సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు కోల్‌కతాలోని భవానీ భవన్ సిఐడి ప్రధాన కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని అభిషేక్ బెనర్జీకి ఆదేశాలు జారీ చేసింది. కేసు వివరాలు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా శోభన్‌దేబ్ చటోపాధ్యాయను ఎన్నుకుంటూ సుమారు 70 మంది టీఎంసీ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన మద్దతు లేఖను అభిషేక్ బెనర్జిీ మే 19న అసెంబ్లీ సెక్రటేరియట్‌కు సమర్పించారు. అయితే, ఈ లేఖలోని కొన్ని సంతకాలు అసెంబ్లీ రికార్డులతో సరిపోలలేదు. ముఖ్యంగా టీఎంసీ ఎమ్మెల్యే నైనా బెనర్జీ సంతకం ఫోర్జరీ అయిందనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై అసెంబ్లీ సెక్రటేరియట్ కోల్‌కతాలోని హరే స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.ఈ కేసు విచారణను సిఐడి (CID) స్వీకరించి, ఇప్పటికే పలువురు టీఎంసీ ఎమ్మెల్యేలను విచారించింది. అదే సమయంలో అభిషేక్ బెనర్జీ ఐదుగురు సీఐడీ అధికారుల బృందం ముఖర్జీ రోడ్డులోని అభిషేక్ బెనర్జీ నివాసానికి వెళ్లారు. ఆయన అక్కడ లేకపోవడంతో వెనుతిరిగారు. ఈ నేపథ్యంలోనే తృణముల్ కార్యకర్తలను పరామర్శించడానికి అభిషేక్ వచ్చిన సమయంలో ఆయనను స్వయంగా కలిసి నోటీసులు అందజేశారు.అభిషేక్ స్పందన అయితే నోటీసులు అందుకున్న అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ.. "నేను ఇంకా నోటీసు లోపల ఏముందో పూర్తిగా చూడలేదు. నా న్యాయవాదులతో మాట్లాడి తగిన విధంగా స్పందిస్తాను. విచారణకు ఖచ్చితంగా సహకరిస్తాను, అవసరమైతే అధికారుల ముందుకు హాజరవుతాను. అని అన్నారు. -
MPకి ఘోర అవమానం కోడి గుడ్లతో కొట్టిన గ్రామస్థులు
-
అభిషేక్ బెనర్జీపై గుడ్లు, రాళ్లతో దాడి.. ‘చోర్ చోర్’ అంటూ..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని సోనార్‌పూర్‌లో మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయనపై కొందరు గుడ్లు, రాళ్లు విసిరారు. దీంతో అభిషేక్ బెనర్జీ తనకు రాళ్లు, గుడ్లు తగలకుండా హెల్మెట్ పెట్టుకున్నారు. ఈ ఘటన సమయంలో నిరసనకారులు “చోర్ చోర్” అంటూ నినాదాలు చేశారు. అభిషేక్ బెనర్జీ రాకను వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొనగా, భద్రతా సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎన్నికల అనంతరం హింస జరగడంతో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో ఆయనపై ఈ దాడి జరిగింది. దాడి జరుగుతున్న వేళ భద్రతా సిబ్బంది అభిషేక్ బెనర్జీని చుట్టుముట్టి రక్షణ కల్పించారు ఘటనాస్థలిలో ఉద్రిక్తత పెరగడంతో భద్రతా సిబ్బంది ఆయనను సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు.దాడిపై స్పందించిన అభిషేక్ బెనర్జీ.. ఈ ఘటన వెనుక బీజేపీ హస్తం ఉందని ఆరోపించారు. “ఇది పూర్తిగా బీజేపీ ప్రేరేపిత చర్య. ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? ఎన్నికల ఫలితాలు వచ్చి నెల కూడా కాలేదు. అయినా పోలీసులు ఎక్కడా కనిపించడం లేదు” అని వ్యాఖ్యానించారు. దాడికి పాల్పడిన వారి గుర్తింపు, ఘటనకు దారితీసిన కారణాలపై విచారణ కొనసాగుతోంది.#WATCH | Sonarpur, West Bengal: TMC MP Abhishek Banerjee was beaten up by locals during his visit to Sonarpur to meet the post-poll victims' families pic.twitter.com/zkXxLJydqe— ANI (@ANI) May 30, 2026 -
మమత ‘ఊసరవెల్లి’ కవిత
కోల్‌కతా: ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘోర పరాజయం అనంతరం ఆ పార్టీలోని నేతలు రకరకాలుగా అసంతృప్తిని వ్యక్తం చేస్తుండటంతోపాటు పార్టీ నుంచి వెళ్లిపోతుండటం తెల్సిందే. వీరి వైఖరులను ఎండగడుతూ టీఎంసీ చీఫ్, మాజీ సీఎం మమతా బెనర్జీ గిర్గిటి(ఊసరవెల్లి)పేరుతో రాసిన ఓ కవితను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.ఈ సందర్భంగా కేవలం స్వార్థ ప్రయోజనాల కోసమే కొందరు నేతలు ఊసరవెల్లి మాదిరిగా రంగులు మార్చుతున్నారంటూ ఆ కవితలో ఆమె నర్మగర్భంగా పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసం, ఆర్థిక ప్రయోజనాల కోసం కొన్ని గంటల్లోనే వ్యక్తిత్వాలను, విధేయతలను మార్చుకునే కొందరు వ్యక్తులు ఊసరవెల్లి కంటే ప్రమాదకరంగా మారారని పేర్కొన్నారు.‘మీ ప్రవర్తనను ఇంకెంతగా మార్చుకుంటారు? మీకు ఇంకెంత లంచం రావాలి? మిమ్మల్ని మీరు ఇంకెంతగా మారాలని అనుకుంటున్నారు?’అంటూ ఆ కవితలో మమత ప్రశ్నించారు. ఇందులో ఆమె ప్రత్యేకంగా ఎవరి పేరునూ ప్రస్తావించలేదు. సమాజం, రాజకీయాల్లో కృతజ్ఞత, నైతిక విలువలు, మానవీయ స్పందనలు అంతరించిపోతున్నాయంటూ ఆవేదనతో వ్యక్తం చేశారు. -
లగ్జరీ బైక్‌పై బెంగాల్ బీజేపీ మంత్రి రైడ్, వీడియో వైరల్
సాక్షి, కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ మంత్రి దిలీప్ ఘోష్ బైక్ రైడ్ చేసి ఆకట్టుకున్నారు. కోల్కత్తా వీధుల్లో ఖరీదైన హోండా గోల్డ్ వింగ్‌ను రాయల్‌గా చక్కర్లు కొట్టారు. ఈ రైడ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు విభిన్నంగా కామెంట్ చేశారు. మరికొంతమంది మంత్రి బైక్ నడపడం చూసి ఆశ్చర్య పోయారు. హెల్మెట్ లేకుండా బైక్ ఎలా నడుపుతున్నారని కొంతమంది విమర్శిస్తే.. ఇంత ఆదాయం ఎక్కడిది అంటూ @IncomeTaxIndia ట్యాగ్ చేయడం విశేషం ఈ బైక్ ధర మార్కెట్లో దాదాపు రూ.53 లక్షల వరకు ఉంటుందని అంచనా.దీనికి సంబంధించిన వివరాలను కూడా మంత్రి దిలీప్ ఎక్స్‌లో షేర్ చేశారు, Honda BigWing సూపర్ బైక్ అత్యంత వేగవంతమైన, 1800cc సామర్థ్యం గల 6-సిలిండర్ల మోటార్‌సైకిల్. ఈ బైక్ ఎంతో సౌకర్యవంతంగా ఉండటమే కాదు, అద్భుతమైన వేగాన్ని అందిస్తుంది. దీని వెనుక భాగంలో విశాలమైన స్థలం ఉంది; అక్కడ సోఫాలాంటి ప్రయాణీకుల సీటు ఉండటం వల్ల, వెనుక కూర్చునే వ్యక్తి కూడా అత్యంత సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు అంటూదీని ఫీచర్స్ గురించి రాసుకొచ్చారు.#WATCH | West Bengal Minister Dilip Ghosh seen riding a bike, in Kolkata this morning. pic.twitter.com/OKBr643M33— ANI (@ANI) May 29, 2026 1.1 Today, I rode a Honda BigWing superbike. It is a high-speed 1800cc, 6-cylinder motorcycle.The bike is extremely comfortable & offers incredible speed.There is ample space at the back with a sofa-like passenger seat,ensuring that the pillion rider can also sit very comfortably pic.twitter.com/al8jWEKVkF— Dilip Ghosh (Modi Ka Parivar) (@DilipGhoshBJP) May 29, 2026 -
బెంగాల్లో ట్విస్ట్.. మమతకు మరో ఝలక్
కోల్‌కతా: ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం టీఎంసీలో లుకలుకలు ఒకటొకటి బయటపడుతున్నాయి. ఆ పార్టీకి మరో నేత గుడ్‌బై చెప్పారు. రాజ్యసభ మాజీ ఎంపీ శంతను సేన్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు గురువారం ప్రకటించారు. రాజీనామా పత్రాన్ని టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీకి పంపానన్నారు.ఈ సందర్భంగా మమతా బెనర్జీపై సంచలన ఆరోపణలు చేశారు. ఆర్జీకర్ ఆస్పత్రిలో ట్రెయినీ వైద్యురాలి హత్యాచార ఉదంతంపై తమ పార్టీ వ్యవహరించిన తీరు సరిగా లేదని ఆరోపించారు. అనైతిక చర్యల కారణంగానే ఎన్నికల్లో ప్రజలు పార్టీని తిరస్కరించారని విమర్శించారు. ప్రజల తీర్పును గౌరవిస్తూ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానన్నారు. తాను టీఎంసీ ఆవిర్భావం నుంచి విధేయత కలిగిన సైనికుడిగా ఉన్నానంటూ..పార్టీ వివాదాలను బహిరంగంగా సమర్థించడం తనకు నైతికంగా ఇబ్బందికరంగా మారిందని వ్యాఖ్యానించారు.కాగా, ఆర్జీకర్ ఉదంతంపై నిరసన గళం వినిపించిన అతికొద్ది మంది టీఎంసీ నేతల్లో శంతను సేన్ ఒకరు. దీనిపై అప్పట్లో పార్టీ ఆయన్ను సస్పెండ్ చేసింది. ఆ తర్వాత తిరిగి పార్టీలో చేర్చుకుంది. బుధవారం సీనియర్ ఎంపీ కాకోలి ఘోష్ దస్తిదార్, పార్టీ అధికార ప్రతినిధి, టీఎంసీ కౌన్సిలర్లు అనూప్ చక్రవర్తి, సుశాంత ఘోష్ పార్టీ పదవులకు రాజీనామాలు చేశారు. -
‘లక్ష్మీ భండార్’లో 30 లక్షల మంది అనర్హులు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో గత తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన లక్ష్మీ భండార్ పథకం లబ్ధిదారుల్లో దాదాపు 30 లక్షల మంది అనర్హులు ఉన్నట్లు తేలిందని రాష్ట్ర ముఖ్యమంత్రి సువేందు అధికారి చెప్పారు. వారిలో కొందరు భారతీయులు కాదని, అలాగే మరికొందరి పేర్లు ఓటర్ల జాబితా నుంచి శాశ్వతంగా తొలగింపునకు గురయ్యాయని తెలిపారు. సువేందు అధికారి బుధవారం ‘అన్నపూర్ణ భండార్’ పథకానికి సంబంధించిన పత్రాన్ని ఆవిష్కరించారు. అన్ని రకాలుగా తనిఖీ చేసిన తర్వాతే లబ్ధిదారులను ఎంపిక చేస్తామని స్పష్టంచేశారు. లక్ష్మీ భండార్ స్కీమ్‌లో మొత్తం 2.20 లక్షల మంది లబ్ధిదారులు ఉండగా, వీరిలో 30 లక్షల మంది అనర్హులుగా తేలిందన్నారు. అనర్హులను పూర్తిగా ఏరివేసిన తర్వాత అన్నపూర్ణ భండార్‌లో దాదాపు 2 లక్షల మంది లబ్ధిదారులు ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. బెంగాల్లో తాము అధికారంలోకి వస్తే లక్ష్మీ భండార్ స్థానంలో అన్నపూర్ణ భండార్ పథకం తీసుకొస్తామని ఎన్నికల సమయంలో బీజేపీ హామీ ఇచ్చింది. మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చింది. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు రూ.3,000 చొప్పున అందజేస్తారు. -
బెంగాల్లో బీజేపీ ఎఫెక్ట్.. ఈ దృశ్యాలు చూశారా?
ఓ చేతిలో తట్టా బుట్టలు, భుజాన మూటలు… మరో చేతిలో పిల్లల చెయ్యి పట్టుకుని సరిహద్దుల వైపు నడక. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఆందోళన ముఖంలో.. హకీంపూర్ చెక్‌పోస్ట్ నుంచి మాల్దా వరకు పశ్చిమ బెంగాల్ అంతటా ఇప్పుడు కనిపిస్తున్న దృశ్యాలు ఇవే. ఒకప్పుడు రాజకీయ చర్చలకే పరిమితమైన అక్రమ వలసదారుల అంశం ఇప్పుడు క్షేత్రస్థాయిలో కనిపించే పరిణామాలుగా మారడంతో సరిహద్దులో అసాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి.. అధికారంలోకి రాగానే అక్రమ వలసదారులపై కఠిన వైఖరి అవలంబిస్తామని బెంగాల్లో బీజేపీ మొదటి నుంచి ప్రచారం చేసుకుంటోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న సువేందు అధికారి కూడా గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇదే విషయాన్ని పదేపదే చెబుతూ వచ్చారు. అయితే.. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి రాగానే దానిని కార్యరూపంలోకి తీసుకొచ్చారనే చర్చ జోరందుకుంది. West Bengal CM Suvendu Adhikari is on Fire Mode 🔥Worst days for Illegal Jehadi immigrants are coming."Bhaag Jao, Warna Sarkaar pel degi" pic.twitter.com/HpftDWLjQs— Chota Don (@choga_don) May 26, 2026బెంగాల్లో అక్రమ వలసదారుల ఎరివేతకు “డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్”.. విధానాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి సువేందు అధికారి స్పష్టం చేశారు. తాజాగా సీనియర్ బీఎస్ఎఫ్ అధికారులతో జరిగిన మీటింగ్‌లోనూ ఆయన ఈ విషయాన్ని ధృవీకరించారు. పౌరసత్వ సవరణ చట్టం (CAA) పరిధిలో లేని వారిని అక్రమంగా దేశంలోకి వచ్చినవారిగానే పరిగణిస్తామని.. అలాంటి వాళ్లను స్థానిక పోలీసులు సాయంతో అదుపులోకి తీసుకుని బీఎస్ఎఫ్కు అప్పగిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. అంటే అటు నుంచి అటే వాళ్లను దేశం నుంచి పంపించేస్తారన్నమాట. ఈ వ్యాఖ్యలు బెంగాల్లో అలజడిని రేపాయి. అందుకు తగ్గట్లే.. ప్రవాహం కనిపిస్తోంది. North 24 Parganas, West Bengal: Following BJP govt’s fresh order to identify and act against illegal Bangladeshi immigrants, movement near border areas reportedly increased. 🚨 pic.twitter.com/PLQw3Tfurp— JanHit Voice (@HJP2029_2036) May 26, 2026 హకీంపూర్ చెక్‌పోస్ట్ సహా ఉత్తర 24 పరగణాలు, మాల్దా ప్రాంతాల్లో అనుమానితుల కదలికలు పెరిగినట్లు స్థానిక నివేదికలు పేర్కొంటున్నాయి. ఒక్క హకీంపూర్ వద్దే ఒకే రోజులో వంద మందికి పైగా గుమిగూడిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. వీరిలో కొందరు బంగ్లాదేశ్ వైపు తిరిగి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో మాల్దాలో కూడా ఇదే తరహా కదలికలు కనిపించడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.ఇక కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా హోం & హిల్ అఫైర్స్ శాఖలోని ఫారినర్స్ బ్రాంచ్ తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో మాల్దా జిల్లాలో మొదటిసారిగా “హోల్డింగ్ సెంటర్” ఏర్పాటు చేసి అమలు చేస్తున్నారు. భారత్‌లో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులు, రోహింగ్యాలపై చేపట్టే చర్యల భాగంగా ఈ వ్యవస్థను వినియోగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.బెంగాల్ ప్రభుత్వం ఇప్పటికే సరిహద్దు జిల్లాల్లో గుర్తింపు, నిర్బంధం, బహిష్కరణ ప్రక్రియలను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న హోల్డింగ్ సెంటర్లలో అనుమానితులను తాత్కాలికంగా ఉంచి వారి బయోమెట్రిక్ వివరాలు, పత్రాలు, నేపథ్యాన్ని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మాల్దా కేంద్రంలో పలువురు అనుమానితులు ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. వీరిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. ఈ కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత, సీసీటీవీ పర్యవేక్షణ కొనసాగుతోంది.#WATCH | North 24 Parganas, West Bengal | A large group of allegedly illegal Bangladeshi immigrants gather at the Hakimpur checkpost near the Bangladesh border, after the newly formed, BJP-led, West Bengal government, launched its 'detect, delete and deport' policy. (26.05) pic.twitter.com/RBN79D0cfP— ANI (@ANI) May 27, 2026ఇటీవల అమల్లోకి వచ్చిన ఇమ్మిగ్రేషన్ మరియు ఫారినర్స్ చట్టం బెంగాల్ బీజేపీ ప్రభుత్వం చేపట్టిన డ్రైవ్‌కు మరింత బలం ఇచ్చిందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ చట్టం ద్వారా వలసదారులపై నిఘా, నిర్బంధం, బహిష్కరణ ప్రక్రియలను డిజిటల్ వ్యవస్థ ద్వారా వేగవంతం చేయడంతో పాటు, హెడ్ కానిస్టేబుల్ స్థాయి అధికారులకు కూడా వారెంట్ లేకుండానే చర్యలు తీసుకునే అధికారం ఉంది.బెంగాల్ అధికారుల చెబుతోంది ఏంటంటే.. ఈ హోల్డింగ్ సెంటర్లు తాత్కాలిక నిర్బంధ కేంద్రాలుగా పనిచేస్తాయి. అనుమానితుల జాతీయత నిర్ధారణ పూర్తయ్యే వరకు వారిని గరిష్టంగా 30 రోజుల వరకు అక్కడ ఉంచే అవకాశం ఉంది. జిల్లా మేజిస్ట్రేట్లు మరియు సంబంధిత అధికారులు పత్రాల ధృవీకరణ, డేటా సేకరణ, కేంద్ర డేటాబేస్లకు సమాచారాన్ని అప్లోడ్ చేసే ప్రక్రియను కొనసాగిస్తున్నారు.అయితే ఈ పరిణామాలు కేవలం పశ్చిమ బెంగాల్‌కే పరిమితం కాలేదంటూ సోషల్ మీడియా ప్రచారం ఉవ్వెత్తున నడుస్తోంది. పలు రాష్ట్రాల్లోనూ(తెలుగు రాష్ట్రాల్లోనూ) బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద అక్రమ వలసల కదలికల సంకేతాలు కనిపిస్తున్నాయట. కొందరు ఈ పరిణామాలపై ఆందోళనలు వ్యక్తం చేస్తూ.. తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను కోరుతున్నారు. అదే సమయంలో కుటుంబాలతో కలిసి తాత్కాలికంగా ప్రయాణిస్తున్న వర్గాల సంఖ్య పెరుగుతుండటంతో ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది. -
మమతా బెనర్జీకి బిగ్ షాక్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి దెబ్బమీద దెబ్బ తగులుతుంది. ఇప్పటికే అధికారం కోల్పోయి.. పార్టీనేతల జంపులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మమతాకి ఇప్పుడు మరో షాక్ తగిలింది. తాజాగా సిలిగిరి పోలీసు స్టేషన్లో హిందూ మతాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేశారని ఆమెపై కేసు నమోదైంది. ప్రస్తుతం మమతా బెనర్టీ టైం బ్యాడ్ నడుస్తోంది.. అధికారం కోల్పోయిన రోజుల వ్యవధిలోనే ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, వందలమంది కౌన్సిలర్లు టీఎంసీని వీడి బీజేపీలో చేరుతున్నట్లు సమచారం. ఇది చాలదన్నట్లు కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ కూడా గందరగోళంలో ఉంది. టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీకి సంబంధించిన 17 ఆస్తులకు కూల్చివేత నోటీసులు జారీ కావడం, ఆయన రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరగడం ఇలా ఆమె చుట్టూ గందర గోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే మమతాకు మరో షాక్ తగిలింది.గతేడాది కోల్‌కతాలో జరిగిన ఈద్ వేడుకల్లో మమతా బెనర్జీ సనాతన ధర్మాన్ని ఉద్దేశించి "గందా ధర్మ" (మురికి మతం) అని హిందూ ధర్మాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేశారని అడ్వకేట్ రింకీ ఛటర్జీ సింగ్ నిన్న (మంగళవారం) సిలిగురి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ వ్యాఖ్యలు సనాతన ధర్మాన్ని పాటించే కోట్ల మంది ప్రజల మతపరమైన నమ్మకాలను తీవ్రంగా గాయపరిచాయని, సమాజంలో మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.మమతాపై (భారతీయ న్యాయ సంహిత - BNS) సెక్షన్ 351(1),సెక్షన్ 352: సెక్షన్ 353(2) లకింద కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై ప్రస్తుత బెంగాల్ సీఎం సువేందు అధికారి ఎన్నికల ప్రచారంలో విమర్శలు గుప్పించారు. "మీరు ఏ మతాన్ని 'గందా ధర్మ' అన్నారు? సనాతన హిందూ ధర్మానా?" అని ఆయన ప్రశ్నించారు. -
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.. 28ఏళ్లలో తొలిసారిగా దీదీ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో రాజకీయ సంచలనం చోటు చేసుకుంది. రోజుల వ్యవధిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, వందలమంది కౌన్సిలర్లు టీఎంసీని వీడి బీజేపీలో చేరినట్లు తెలుస్తోంది. మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఒకప్పుడు బెంగాల్ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా నిలిచింది. అయితే, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పార్టీ బలహీనపడుతున్నట్లు కనిపిస్తోంది. సీనియర్ నాయకులు, ముఖ్యంగా లోక్‌సభ ఎంపీ కాకోలీ ఘోష్ దస్తిదార్ వంటి వారు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.టీఎంసీ నియంత్రణలో ఉన్న మున్సిపల్ సంస్థల్లో వరుస రాజీనామాలు చోటు చేసుకున్నాయి. భట్పారా మున్సిపాలిటీలో 35 మందిలో 30 మంది, హాలిసహర్‌లో 23 మందిలో 16 మంది, కంచరపారాలో 14 మంది కౌన్సిలర్లు వైదొలిగారు. ఉద్యోగులకు జీతాలు చెల్లించకపోవడం, పార్టీ నాయకత్వం మార్గదర్శకత్వం ఇవ్వకపోవడం వంటి కారణాలతో కౌన్సిలర్లు రాజీనామా చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.అవినీతి, దోపిడీ ఆరోపణలు పార్టీపై మరింత ఒత్తిడి తెచ్చాయి. ఇటీవల ముగ్గురు కౌన్సిలర్లు అరెస్టు అయ్యారు. సౌత్ డుమ్ డుమ్ కౌన్సిలర్ సంజయ్ దాస్ మర్మమైన మరణం ఆందోళనను పెంచింది. మాజీ టీఎంసీ మంత్రి సుజిత్ బోస్‌ను ఈడీ అరెస్టు చేయడం, మాజీ ఎమ్మెల్యే అదితి మున్షీ భర్త దేబ్రాజ్ చక్రవర్తిపై విచారణ కొనసాగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీసింది.కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ కూడా గందరగోళంలో ఉంది. టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీకి సంబంధించిన 17 ఆస్తులకు కూల్చివేత నోటీసులు జారీ కావడం, బీజేపీ 43 ఆస్తుల జాబితాను విడుదల చేయడం అంతర్గత కలహాలకు దారితీసింది. మేయర్ ఫిర్హాద్ హకీమ్ పాత్రపై ప్రశ్నలు తలెత్తాయి. ఆయన రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.మే 22న మేయర్‌తో సహా కౌన్సిలర్లు ప్రధాన ఛాంబర్ వెలుపల సమావేశం నిర్వహించవలసి రావడం, ఎన్నికైన ప్రతినిధులకు అవమానకరంగా మారింది. వరుస రాజీనామాలు మున్సిపల్ సేవలను తీవ్ర గందరగోళంలోకి నెట్టాయి. రాబోయే వర్షాకాలం ముందు డ్రైనేజీ, పారిశుధ్యం, అత్యవసర సన్నద్ధతపై ఆందోళనలు పెరుగుతున్నాయి.కౌన్సిలర్లు అందుబాటులో లేని చోట బీజేపీ ప్రభుత్వం నిర్వాహకులను నియమించడం ప్రారంభించింది. దీంతో, టీఎంసీ సంక్షోభం కేవలం స్థానిక సంస్థలకే పరిమితం కాకుండా, మొత్తం పార్టీ భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ పరిణామాలు 1998లో కాంగ్రెస్ నుండి విడిపోయి మమతా బెనర్జీ స్థాపించినప్పటి నుండి టీఎంసీ ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సంక్షోభంగా విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఎన్నికల ముందు ‘చేప కూర’ ఫైట్.. ఇప్పుడు రూ.5కే ఫిష్ రైస్ పథకం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజలను చేపలు తిననివ్వకుండా చేస్తుందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఎన్నికల ముందు పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో మమత బెంగాల్ ఆహార సంస్కృతిపై బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. “బెంగాల్ ప్రజలు చేప-అన్నంతో జీవిస్తారు. బీజేపీ వాళ్లు బెంగాల్ ప్రజలను చేపలు తినొద్దు, మాంసం తినొద్దు, గుడ్లు తినొద్దు అంటున్నారు. మరి వాళ్లు ఏమి తింటారు?” అని మమతా బెనర్జీ ప్రశ్నించారు. అయితే, అధికారంలోకి వచ్చినా అలాంటి చర్యలు తీసుకోబోమని బీజేపీ అప్పట్లోనే హామీ ఇచ్చింది. అనురాగ్ ఠాకూర్ సహా పలువురు బీజేపీ నేతలు బహిరంగంగా మాఛ్-భాత్ విందుల్లో పాల్గొన్నారు. బెంగాలీ సంస్కృతిపై తమకు అనుబంధం ఉందని చూపించే ప్రయత్నంలో నామినేషన్ ర్యాలీల్లో చేపలు చేతబట్టి కనిపించారు. ఇప్పుడు బీజేపీ చెప్పింది చెప్పినట్లు చేస్తోంది. ఇప్పుడు సీఎం ఏం చేశారు? పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మంగళవారం కొన్ని కొత్త కార్యక్రమాలను ప్రకటించారు. వాటిల్లో తక్కువ ధరలో చేప కూరతో భోజనం అందించే పథకాన్ని కూడా తీసుకొస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వారానికి రెండు సార్లు సుమారు 400 ప్రత్యేక క్యాంటీన్లలో రూ.5కే ఫిష్ రైస్ మీల్స్ అందిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు.అలాగే, అన్నపూర్ణ యోజన, మద్యం దుకాణాలపై నిబంధనలు, ప్రత్యేక ఆయుష్ శాఖను కూడా ఆయన ప్రకటించారు. సువేందు అధికారి మాట్లాడుతూ.. మే 27 నుంచి అన్నపూర్ణ యోజన దరఖాస్తు పత్రాల పంపిణీ ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ పథకం కింద మహిళలకు నెలకు రూ.3,000 అందిస్తామని తెలిపారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రార్థనా స్థలాలకు కిలోమీటర్ పరిధిలో మద్యం దుకాణాలకు అనుమతి ఇవ్వబోమని చెప్పారు.“అన్నపూర్ణ యోజన దరఖాస్తు పత్రాలు రాష్ట్ర సచివాలయం నుంచి అందిస్తాం. ఈ పథకం ప్రయోజనాలు పొందేందుకు భారతీయులందరికీ అర్హత ఉంటుంది” అని కల్యాణి, నాడియా జిల్లాలో జరిగిన పరిపాలనా సమావేశం అనంతరం సువేందు అధికారి మీడియాతో చెప్పారు. ప్రత్యేక ఆయుష్ శాఖను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇందులో ఆయుర్వేదం, యోగా, యునానీ, సిద్ధ, హోమియోపతి ఉంటుందన్న విషయం తెలిసిందే.మే 9న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సువేందు అధికారి వరుసగా పథకాలు, కార్యక్రమాలు ప్రకటిస్తూ రాష్ట్రానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ విజయం సాధించడంతో, తృణమూల్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీ 15 ఏళ్ల పాలనకు ముగింపు పడింది. -
నడిరోడ్డుపై లోదుస్తులతో ‘డాన్’.. ఇన్నాళ్లు విర్రవీగావ్ కదా?
కోల్‌కతా: ఆకాశ్ సింగ్.. పశ్చిమ బెంగాల్లో అతడో రౌడీ.. హౌరా 'డాన్'గా అతడికి పేరుంది. అదే హౌరా రోడ్లపై అతడిని ఇప్పుడు లోదుస్తులతో ఊరేగించారు పోలీసులు. 2021లో పోలీసులపై కాల్పులు జరపడంతో పాటు, 20కి పైగా బాంబులు విసిరినట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు అతడిని ఈ నెల ఆరంభంలోనే అరెస్టు చేసినప్పటికీ, రౌడీలందరికీ ఒక గట్టి హెచ్చరిక పంపే ఉద్దేశంతో ఈ రోజు ఇలా ఊరేగించారు.పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ఉన్న సమయంలో పోలీసులపై దాడులు జరుగుతున్నాయని బీజేపీ నేతలు అనేవారు. పోలీసులపై దాడులు జరుగుతున్నప్పటికీ మమతా బెనర్జీ ఉద్దేశపూర్వకంగా చర్యలు తీసుకోకపోయేవారని బీజేపీ నేతలు ఆరోపించేవారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారికంలోకి రావడంతో పోలీసుల వైఖరిలో కూడా పూర్తిగా మార్పు కనిపిస్తోంది. ఇప్పుడు రౌడీల భరతం పడుతున్నారు పోలీసులు. ఇక పాతరోజులు పోయాయని, సీఎంగా సువేందు వచ్చారని రౌడీలకు రౌడీలే చెప్పుకోవాలని బీజేపీ కార్యకర్తలు అంటున్నారు.హౌరా జిల్లా పోలీసులు చేపట్టిన క్రైమ్ రీకన్స్ట్రక్షన్ ప్రక్రియ సమయంలో ఆకాశ్ సింగ్‌ను లోదుస్తులతో తీసుకెళ్లారు. మాలిపాంచ్ఘడా, గోలాబాడి పోలీస్ స్టేషన్ల జాయింట్ టీమ్ ఆకాశ్ సింగ్‌ను తీసుకుని నగరంలోని పలు ప్రాంతాల్లో దర్యాప్తు చేపట్టింది. ఆకాశ్‌పై తేలాబాజీ, సిండికేట్ నిర్వహణ, ఒక పోలీస్ అధికారిని నేరుగా లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరపడం లాంటి తీవ్ర కేసులు ఉన్నాయి. పాత కేసుల దర్యాప్తును వేగవంతం చేయడం, నేరానికి ప్లాన్ ఎలా రూపొందిందో తెలుసుకోవడమే లక్ష్యంగా ఈ క్రైమ్ రీకన్స్ట్రక్షన్ ప్రక్రియ చేపట్టారు. ఆకాశ్ కేవలం బనియన్, షార్ట్స్‌లో కనిపించడంతో ఇందుకు సంబంధించిన ఆ ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.అయితే, జనాల ముందు నిందితుడిని ఇలా అర్థనగ్నంగా తీసుకెళ్లడం తీవ్ర విమర్శలకు కూడా దారితీస్తోంది. మానవ హక్కుల కార్యకర్తలు, ప్రతిపక్షాల వాదన ప్రకారం, చట్ట పరిధిలో కేసుల దర్యాప్తు చేయడం, క్రైమ్ సీన్ రీక్రియేషన్ నిర్వహించడం పోలీసుల హక్కే. కానీ నేరస్థుడైనప్పటికీ ఒక వ్యక్తిని ఇలా ప్రజల ముందు అర్ధనగ్నంగా తిప్పడం అభ్యంతరకరమని అంటున్నారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని వారు ఆరోపించారు. అయితే జిల్లా పోలీసులు స్పందిస్తూ.. ఎలాంటి చెడు ఉద్దేశంతోనూ ఈ పని చేయలేదని, పాత కేసుల ముడి విప్పడం, నేరానికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు సేకరించడం లక్ష్యంగానే ఈ చర్య చేపట్టామని తెలిపారు. ఈ నేర ముఠా వెనుక ఉన్న ఇతరుల కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు.హౌరా 'డాన్'గా పిలువబడే ఆకాష్ సింగ్‌ను, హౌరా వీధుల్లో కేవలం లోదుస్తులతో ఊరేగించారు.2021లో పోలీసులపై కాల్పులు జరపడంతో పాటు, 20కి పైగా బాంబులు విసిరినట్లు ఇతనిపై ఆరోపణలు ఉన్నాయి.పోలీసులు ఇతన్ని ఈ నెల ఆరంభంలోనే అరెస్టు చేసినప్పటికీ, రౌడీలందరికీ ఒక గట్టి హెచ్చరిక పంపే ఉద్దేశంతో ఈ… pic.twitter.com/Bn74zszZTb— StuN GuN🚩 (@stun_gun22) May 25, 2026 -
ఇండియా కూటమిపై మమత కీలక ప్రకటన
కోల్‌కతా: ప్రతిపక్ష ఇండియా కూటమిపై టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి భేటీ జూన్ మొదటి వారంలోనే జరిగే అవకాశాలున్నాయని మమతా బెనర్జీ చెప్పారు. ఈ భేటీలో ఉమ్మడి వ్యూహాన్ని చర్చిస్తామని చెప్పారు. అధికార బీజేపీతో సుదీర్ఘ రాజకీయ పోరాటానికి తమ కూటమి సిద్ధంగా ఉందని ఆమె ప్రకటించారు.ఈ సందర్భంగా ఇటీవలి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో భారీ అవకతవకలకు బీజేపీ పాల్పడిందన్నారు. కనీసం 150 నియోజకవర్గాల్లో టీఎంసీకి దక్కాల్సిన ఓట్లను తారుమారు చేశారని ఆరోపించారు. ఓడిపోయే సీట్లను గెల్చుకుని, గెలవాల్సిన చోట్ల ఓడిపోయామన్నారు. లేకుంటే టీఎంసీకి 220 నుంచి 230 సీట్లు దక్కి ఉండేవని చెప్పారు.మమత వాదనను బీజేపీ నాయకురాలు కీయా ఘోష్ ఖండించారు. ప్రజల తీర్పును అంగీకరించేందుకు నిరాకరిస్తున్న మమతా బెనర్జీ, బదులుగా కుట్ర సిద్ధాంతాలతో ఓటమిని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ దుయ్యబట్టారు. 2011, 2016, 2021 ఎన్నికల ఫలితాలను చట్టబద్ధమైనవిగా అంగీకరించి, ఇప్పుడెందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారంటూ మమతను నిలదీశారు. మమత దృష్టిలో గెలుపంటే.. బూత్‌లను ఆక్రమించుకోవడం, రాజకీయ ప్రత్యర్థులపై దాడులకు పాల్పడటం, హింసను ప్రేరేపించడమేనని ఆమె వ్యాఖ్యానించారు. -
ఝాల్‌మురి విక్రమ్‌కు, పాక్, బంగ్లాదేశ్ నుంచి బెదిరింపు కాల్స్
పశ్చిమ బెంగాల్‌లోని ఝార్‌గ్రామ్‌కు చెందిన ఝాల్‌మురి (మరమరాల చాట్) విక్రేత విక్రమ్ సౌ గుర్తున్నాడా? అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయన దుకాణం వద్ద ఆగి ఝూల్మురి తినడంతో విక్రమ్ ఒక్కసారిగా జాతీయ స్థాయిలో వార్తల్లోకి ఎక్కారు. ఆయనకు ఇపుడు పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి ప్రాణాపాయ బెదిరింపులు రావడం సంచలనంగా మారింది.ప్రధాని మోదీకి స్నాక్స్ విక్రయించిన విక్రమ్‌కు పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల నంబర్ల నుండి వరుసగా బాంబు దాడులు, చంపేస్తామని బెదిరింపు కాల్స్ రావడంతో కుటుంబం తీవ్ర భయాందోళనలకు గురవుతోంది. దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు విచారణ ప్రారంభించారు. ఈ ఘటన స్థానికంగా కూడా తీవ్ర కలకలం రేపింది.ఎన్నికల ప్రచార ర్యాలీలో భాగంగా ఏప్రిల్ 19న ఝార్గ్రామ్లో జరిగిన బహిరంగ సభ ముగించుకుని వస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సాధారణ వీధి వ్యాపారి స్టాల్ వద్ద ఆగి ఝాల్‌మురి తిన్నారు. దానికి సంబంధించిన ఫోటోలను ఎక్స్‌లో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దీంతో విక్రమ్ రాత్రికి రాత్రే ఫేమస్ అయ్యాడు. అయితే, ఈ పాపులారిటీ ఇప్పుడు అతడికి, అతడి కుటుంబానికి పెద్ద శాపంగా మారింది.ఒక్క రోజులో వచ్చిన గుర్తింపు ఆ కుటుంబానికి ఇలాంటి ఇబ్బందులు తెచ్చిపెట్టడంపై స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు.Vikram Sao, who once served Jhalmuri to PM .@narendramodi Ji, claims he's receiving threats from Pakistan & Bangladesh.Why's Pakistan & Bangladesh rattled with Mamata Bano's defeat? Has something big planned gone down gutter with BJP's win? Will any (P)AAPiya Cockroach answer… pic.twitter.com/HkjOvxRN6l— BhikuMhatre (@MumbaichaDon) May 22, 2026 ఈ ఘటన కాస్తా బెంగాల్ ఎన్నికల సమయంలో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ (TMC) మధ్య పెద్ద రాజకీయ వివాదానికి దారితీసింది. అప్పటి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దీనిని "ముందుస్తుగా ప్లాన్ చేసిన డ్రామా" అని కొట్టిపారేశారు. దీదీ విమర్శలపై స్పందించిన మోదీ తాను కారంగా ఉండే ఝాల్‌మురి తింటే, టీఎమ్‌సీకి సెగ తగులుతోందని ఎద్దేవా చేశారు.మరోవైపు మోదీ తన ఐదు దేశాల పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తూ మళ్లీ ఈ ఘటనను గుర్తుచేకోవడం విశేషం. -
సరదా తీర్చిన ట్వీట్.. తారల మెడకు ఉచ్చు?
ఒకప్పుడు సరదాగా చేసిన పని.. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో పెద్ద రాజకీయ బాంబులా పేలింది. ఐదేళ్ల కిందటి ఎన్నికల హింస తెర మీదకు రావడంతో ఇద్దరు సినీ తారలు చిక్కుల్లో పడ్డారు. వాళ్ల మీద ఫిర్యాదు నమోదు కావడం, పైగా టీఎంసీతో దగ్గరి సంబంధాలు ఉండడంతో సువేందు అధికారి సర్కార్ చర్యలు తీసుకోవడం దాదాపుగా ఖాయంగానే కనిపిస్తోందనే చర్చ ఊపందుకుంది.2021లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే ఫలితాల తర్వాత చెలరేగిన హింస మాత్రం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఆనాడు కౌంటింగ్ జరుగుతున్న టైంలో నటుడు పరంబ్రతా ఛటర్జీ బెంగాలీలో ఒక పోస్టు చేశారు. ఫలితాల ట్రెండ్ ఆధారంగా ఆయన చేసిన ట్వీట్ ‘ఈరోజు ప్రత్యర్థులను చితక్కొట్టే రోజు’ అనే అర్థం వచ్చేలా ఉంది. దానికి నటి స్వస్తికా ముఖర్జీ ‘హహహ’ అంటూ లాఫింగ్ రియాక్షన్‌తో స్పందించారు.అయితే.. ఆ తర్వాత కొన్నిగంటలకే బెంగాల్ అంతటా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎంత మంది చనిపోయారు, ఎన్ని కేసులు నమోదయ్యాయి అనే లెక్కలపై ఇప్పటికీ స్పష్టత లేదు. కనీసం 11 మంది చనిపోయినట్లు అప్పటి దీదీ సర్కార్ కేంద్ర హోంశాఖకు పంపిన నివేదికల్లో ఉంది. అయితే తర్వాత వెలువడిన వివిధ నివేదికలు, దర్యాప్తుల ప్రకారం మొత్తం మరణాల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంది. “కాల్ ఫర్ జస్టిస్” అనే పౌర సంఘం నివేదిక ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15 వేల హింసాత్మక ఘటనలు జరిగాయని, 25 మంది మరణించారని, సుమారు 7 వేల మంది మహిళలు వేధింపులకు గురయ్యారని పేర్కొంది.హత్యలు, దాడులు, అత్యాచారాలు, అగ్నిప్రమాదాలు, ఆస్తుల ధ్వంసం వంటి కేసులపై తర్వాత సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఒక్క దశలోనే 31 కేసులు నమోదు చేసినట్టు సమాచారం. తాజాగా వెలువడిన నివేదికల ప్రకారం.. పాత కేసులను మళ్లీ తెరపైకి తీసుకొచ్చి వందల సంఖ్యలో కొత్త దర్యాప్తులు కూడా ప్రారంభించారు. అయితే.. ఐదేళ్ల కిందట బెంగాల్ హింసపై దర్యాప్తు చేపట్టాలని సువేందు అధికారి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ అంశం మళ్లీ చర్చకు రావడంతో.. ఇప్పుడు ఇద్దరు ప్రముఖ నటుల పేర్లు కూడా వివాదంలో వినిపిస్తున్నాయి.బెంగాలీ తారలు చేసిన ట్వీట్ హింసను ప్రేరేపించేలా ఉందని ఆరోపిస్తూ కోల్‌కతాలోని గరియాహట్ పీఎస్‌లో ఫిర్యాదు నమోదైంది. ఫిర్యాదు చేసిన జోయ్‌దీప్ సేన్ అనే వ్యక్తి ఆరోపణ ఏమిటంటే.. 2021 మే 2న ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో పరంబ్రతా ఛటర్జీ బెంగాలీలో ఒక పోస్టు చేశారు. దానికి స్వస్తికా ముఖర్జీ నవ్వు గుర్తులతో స్పందించారు. అప్పటికే రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో ప్రముఖులైన వీరి వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా పనిచేశాయి. ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలపై దాడులు, హత్యలు, మహిళలపై దాడులు జరిగిన ఘటనలకు ఇలాంటి పోస్టులు మానసిక ప్రోత్సాహం ఇచ్చాయి. అంతేకాదు.. ఆ ట్వీట్ చేసిన గంటలోపే బీజేపీ కార్యకర్త అభిజిత్ సర్కార్ హత్య జరిగిందని, తర్వాత రాష్ట్రవ్యాప్తంగా హింస మరింత పెరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు.. ఆ ఎన్నికల హింసను విచారణ జరిపేందుకు సువేందు సర్కార్ ఓ కమిటీ కూడా వేశారు. ఈ కమిటీ కూడా వీళ్ల అంశాన్ని పరిశీలించే అవకాశమూ కనిపిస్తోంది. పరంబ్రతా ఛటర్జీ, స్వస్తికా ముఖర్జీ.. ప్రముఖ బెంగాలీ యాక్టర్లు. పరంబత్రాది సినీ నేపథ్యం ఉన్న కుటుంబం. ప్రముఖ దర్శకుడు రుత్విక్ ఘటక్‌కు బంధువు. రచయిత్రి మహాశ్వేతా దేవి కుటుంబానికి చెందినవారు. నటుడిగానే కాకుండా దర్శకుడు, నిర్మాతగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. బెంగాలీతో పాటు హిందీ చిత్రాలు, వెబ్ సిరీస్‌ల్లోనూ నటించారు. అందులో కహానీ, బైషే శ్రాబోన్, పారి, బుల్బుల్, అరణ్యక్‌లో నటనకు మంచి గుర్తింపు దక్కింది. ఇక.. స్వస్తిక ముఖర్జీ ప్రముఖ బెంగాలీ నటుడు సంతూ ముఖర్జీ కుమార్తె. బుల్లితెరతో కెరీర్ ప్రారంభించి బెంగాలీ స్టార్‌గా ఎదిగారు. బెంగాలీతో పాటు హిందీలోనూ నటించారు. పాతాళ్ లోక్, దిల్ బేచారా, ఖాలా, మస్తాన్, శ్రీమతి వాటిల్లో ప్రముఖమైనవి.పరంబత్రా, స్వస్తికా ఇద్దరూ ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. కానీ రాజకీయ, సామాజిక అంశాలపై బహిరంగంగా అభిప్రాయాలు చెప్పడం వల్ల తరచూ వార్తల్లో ఉంటుంటారు. బెంగాల్లో లౌకికవాదం, స్వేచ్ఛ, సామాజిక అంశాలపై తమ అభిప్రాయాలు సోషల్ మీడియాలో వెల్లడిస్తూ ఉంటారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, బీజేపీపై విమర్శలు చేస్తూ పలుమార్లు వార్తల్లో నిలిచారు. అందుకే ఈ ఇద్దరికీ మమతా బెనర్జీ పార్టీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే చెబుతుంటారు. -
‘ఆర్జీ కర్’ పూర్వాపరాలను తేల్చేందుకు సిట్
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఆర్జీ కర్ బోధనాస్పత్రిలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనలో కేసు పూర్వాపరాలు, కీలకాంశాలను బయటితీసే లక్ష్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)లో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటుచేస్తూ గురువారం కలకత్తా హైకోర్టు ఆదేశాలిచ్చింది. 2024 ఆగస్ట్ 9వ తేదీ రాత్రి విధులు ముగించుకుని పీ ట్రైనీ వైద్యురాలు భోజనం చేసింది మొదలు రేప్, హత్య, సాక్ష్యాధారాలను ధ్వంసంచేయడం, మృతదేహానికి పోస్ట్‌మార్టమ్, అంత్యక్రియల దాకా జరిగిన క్రమంలో దర్యాప్తులో ఇప్పటిదాకా వెలుగులోకిరాని అంశాలను తెల్సుకునేందుకు సీబీఐ సిట్ రంగంలోకి దిగుతుందని జస్టిస్ షాంపా సర్కార్, జస్టిస్ తీర్థంకర్ ఘోష్‌ల హైకోర్టు డివిజన్ బెంచ్ తన ఉత్తర్వులో పేర్కొంది. 2025 మార్చి 28వ తేదీన అందిన నివేదికలో తీవ్రమైన లోపాలున్నాయని, వాటిని నిగ్గుతేల్చేందుకే సిట్ ఏర్పాటుచేశామని ధర్మాసనం వెల్లడించింది. సీబీఐ ఈస్ట్ జోన్ జాయింట్ డైరెక్టర్ సారథ్యంలో సిట్ పనిచేస్తుందని, సిట్‌లో ఇతర సభ్యుల పేర్లను 48 గంటల్లోపు ఖరారుచేస్తామని కోర్టు తెలిపింది. దర్యాప్తు పూర్తిచేసి జూన్ 25వ తేదీలోపు సిట్ తన నివేదికను కోర్టుకు సమరి్పంచాల్సి ఉంటుంది. వైద్యురాలిని రేప్‌చేసి చంపేసిన నిందితుడు, పౌర వలంటీర్ సంజయ్‌రాయ్‌కు ఇప్పటికే జీవితఖైదు పడింది. హేయమైన హత్యోదంతంలో సాక్ష్యాధారాలను ఉద్దేశపూర్వకంగా ధ్వంసంచేశారని, హత్య విషయాన్ని తొలుత తమకు తెలియజేయలేదని, హడావుడిగా సృష్టించి కేసు తీవ్రతను పోలీసులు, ఆస్పత్రి అధికారులు తగ్గించే ప్రయత్నంచేశారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించడంతో ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ‘‘హత్యోదంతంలో పోలీసులు, ఆస్పత్రి యాజమాన్యం తప్పిదాలతోపాటు తీవ్ర నిర్లక్ష్యపూరిత వైఖరి ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ ఆరోపణలను నివృత్తిచేసేందుకు సిట్ దర్యాప్తు అక్కరకొస్తుంది’’అని ధర్మాసనం అభిప్రాయపడింది. -
మదరసాల్లో ‘వందేమాతరం’ నిర్బంధం
కోలకతా: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ సహాయం పొందుతున్న, గుర్తింపు పొందిన మదరసాలతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిరోజూ ఉదయం జరిగే అసెంబ్లీ ప్రార్థనల్లో ‘వందేమాతరం’ ఆలపించడాన్ని తప్పనిసరి విధిగా మార్చింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన అధికారిక నోటీసు సరికొత్త చర్చకు తెరలేపింది. తరగతులు ప్రారంభం కావడానికి ముందే విద్యార్థులందరూ తప్పనిసరిగా జాతీయ గేయాన్ని పాడేలా చర్యలు తీసుకోవాలని విద్యా సంస్థలను ప్రభుత్వం ఆదేశించింది.కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలుజాతీయ గేయమైన ‘వందేమాతరం’నకు రూపకల్పన జరిగిన 150 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని, కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ ఏడాది జనవరిలో కొన్ని ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ ఆదేశాల అనుగుణంగానే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తక్షణమే అమల్లోకి వచ్చేలా రాష్ట్రంలోని విద్యార్థులందరూ ఉదయపు ప్రార్థనల సమయంలో వందేమాతరం ఆలపించేలా చూడాలని నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పటికే జాదవ్‌పూర్ విద్యాపీఠ్ వంటి పలు ప్రముఖ విద్యాసంస్థలు ఈ నిబంధనను అమలు చేయడం ప్రారంభించాయి. West Bengal: Directorate of Madrasah Education has made the singing of “Vande Mataram” mandatory during assembly prayers before classes in all government, aided, and recognised madrasahs across the state with immediate effect pic.twitter.com/6MK8h0D3YR— IANS (@ians_india) May 20, 2026రాష్ట్ర గేయంపై సందిగ్ధతగత పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రాష్ట్ర పాఠశాలల్లో ‘బాంగ్లార్ మాటి బాంగ్లార్ జల్’ (రాష్ట్ర గేయం) పాడటాన్ని నిర్బంధం చేసింది. అయితే, తాజా ఉత్తరవుల్లో కేవలం వందేమాతరం గురించి మాత్రమే ప్రస్తావించడంతో, పాత నిబంధన కొనసాగుతుందా లేదా అనే అంశంపై పాఠశాలల ప్రధానోపాధ్యాయుల్లో సందిగ్ధత నెలకొంది. విద్యాశాఖ అధికారులు సైతం కొత్త ఆదేశాలలో రాష్ట్ర గేయం గురించి ఎలాంటి ప్రస్తావన లేదని, కేవలం వందేమాతరం ప్రార్థనను చేర్చాలని మాత్రమే సూచించినట్లు స్పష్టం చేశారు.సమయాభావంపై ఉపాధ్యాయుల ఆందోళనఈ కొత్త నిబంధన వల్ల పాఠశాలల్లో సమయపాలన దెబ్బతినే అవకాశం ఉందని కొందరు పాఠశాలల అధిపతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ జాతీయ గీతమైన ‘జనగణమన’ పాడటం తప్పనిసరి, దానికి తోడు ఇప్పుడు ‘వందేమాతరం’ చేరింది. ఒకవేళ రాష్ట్ర గేయాన్ని కూడా కొనసాగిస్తే, విద్యార్థులు వరుసగా మూడు పాటలు పాడాల్సి వస్తుందని, దీనివల్ల ఉదయపు ప్రార్థనల సమయం ఎక్కువై తరగతులు ఆలస్యమయ్యే ప్రమాదం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. -
టీఎంసీకి ఝలక్.. అభిషేక్ బెనర్జీనే కారణమా?
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లో అధికారం కోల్పోయిన తర్వాత తృణముల్ కాంగ్రెస్‌కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ కౌన్సిలర్ దేబాలినా బిస్వాస్ కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్పర్సన్ పదవికి రాజీనామా చేశారు. సోమవారం ఆమె రాజీనామా లేఖ వెలుగులోకి రావడంతో టీఎంసీకి భారీ షాక్ తగిలింది. అయితే, టీఎంసీ ఎంపీ, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కారణంగానే ఆమె తన పదవికి రాజీనామా చేసినట్టు సమాచారం.టీఎంసీ నియంత్రణలో ఉన్న కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ (కేఎంసీ), అభిషేక్ బెనర్జీకి సంబంధించిన 17 ఆస్తులకు నోటీసులు జారీ చేసిన మరుసటి రోజు ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ సందర్బంగా దేబాలినా బిస్వాస్ మాట్లాడుతూ..‘నేను నా పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాలా రాయ్‌కి లేఖ పంపాను. కౌన్సిలర్‌గా కొనసాగుతూ, నా ప్రాంత ప్రజల కోసం పనిచేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను ఈ పదవిలో చాలా కాలంగా ఉన్నాను, కానీ ఇప్పుడు తప్పుకుంటున్నాను. నేను ఇది పూర్తిగా పార్టీ సంబంధిత కారణాల వల్ల చేస్తున్నాను’ అని చెప్పుకొచ్చారు. అయితే, అభిషేక్ బెనర్జీ నివాసం.. అక్రమ నిర్మాణంగా జరిగిందంటూ కేఎంసీ (KMC) నోటీసులు జారీ చేసిన తర్వాత, తృణమూల్ కాంగ్రెస్ నాయకులు మరియు పార్టీ అగ్ర నాయకత్వం తనపై ఒత్తిడి తెచ్చారని బిస్వాస్ ఆరోపించారు. ఈ క్రమంలో..‘నిన్న నోటీసు ఎప్పుడు వచ్చిందో కూడా నాకు తెలియదు. అకస్మాత్తుగా, అర్ధరాత్రి వేళ ఫోన్ కాల్స్ రావడం మొదలయ్యాయి. ‘లేదు, ఇది సరికాదు’ అని నాకు అనిపించింది. తప్పుడు వాంగ్మూలాలు ఇవ్వమని ఒకరిని బలవంతం చేయడం లేదా వారి ఇష్టానికి వ్యతిరేకంగా పనులు చేయమని ఒత్తిడి చేయడం పార్టీకి తగదని నేను భావిస్తున్నాను. విషయాన్ని కప్పిపుచ్చడం సరైన పద్ధతి కాదు. మనం అడగాలి. ఇది ఎందుకు జరిగింది? ఇది ఎలా జరిగింది? దీనికి ఎవరు బాధ్యులు?. కొన్ని విషయాలు నా పరిధిలోకి రావు’ అని వ్యాఖ్యానించారు.అభిషేక్ బెనర్జీ కంపెనీ, కుటుంబానికి సంబంధించి కేఎంసీ నోటీసులు అందుకున్న 17 చిరునామాలలో, 14 చిరునామాలు బిస్వాస్ అధ్యక్షత వహించిన బరో 9 పరిధిలోకి వస్తాయి. నోటీసులు జారీ చేసిన తర్వాత సోమవారం రాత్రి నుంచే పార్టీ నాయకుల నుంచి ఫోన్లు రావడం ప్రారంభమయ్యాయని ఆమె చెప్పారు. పార్టీ అగ్ర నాయకత్వంలోని ఒక వర్గం ఆదేశాల మేరకు బిస్వాస్ రాజీనామా చేశారని టీఎంసీ నాయకుల్లో ఒక వర్గం ఆరోపిస్తోంది. కాగా, తన రాజీనామా ఇంకా అధికారికంగా ఆమోదించబడలేదని బిస్వాస్ తెలిపారు. మరోవైపు.. నగరంలో అభిషేక్ బెనర్జీకి అనేక అక్రమ ఆస్తులు ఉన్నాయని బీజేపీ ఆరోపించింది. -
అభిషేక్ బెనర్జీ ఆస్తులతో నాకు సంబంధం లేదు.. ఎంపీ వివరణ
కోల్‌కతా: అభిషేక్ బెనర్జీకి తనకు ఉమ్మడి ఆస్తులు కలిగి ఉన్నాయనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని టీఎంసీ ఎంపీ సాయాని ఘోష్ స్పష్టం చేశారు. ఈ రోజు (బుధవారం) ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడిగా ఒక ఆస్తిని కలిగి ఉన్నామంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆమె స్పష్టం చేశారు. తన ఆస్తుల వివరాలన్నింటినీ ఎన్నికల అఫిడవిట్లో పూర్తిగా వెల్లడించానన్నారు. ఈ రకమైన "ఫేక్ న్యూస్" (అసత్య ప్రచారాలు) వ్యాప్తి చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు.ఆమె మాట్లాడుతూ " అభిషేక్ బెనర్జీ & సాయాని ఘోష్ కలిసి కోల్‌కతా 700030 లోని '19 D సెవెన్ ట్యాంక్స్ రోడ్' అనే ఆస్తిని ఉమ్మడిగా కలిగి ఉన్నారు దానికి ఎలాంటి మొబైల్ నంబర్ సంప్రదింపుల కోసం లేదని కొన్ని ఫార్వార్డ్ మెసేజ్‌లను ఇప్పుడే చూశాను. వారు ఎవరో నాకు తెలియదు. కానీ, రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు స్వలాభం కోసం పనిచేయకుండా నిజాయితీగా ఉంటూ ఒక సాధారణ నేపథ్యం నుండి ప్రయాణాన్ని ప్రారంభించిన ఎంపీ సాయాని ఘోష్ మాత్రం అది కాదు" అన్నారు. ప్రజలు నన్ను ఆశీర్వదించారు, అందుకు నేను కృతజ్ఞతురాలిని అని ఎక్స్‌లో పేర్కొన్నారు.తాను ఒక తృణమూల్ కాంగ్రెస్ ఎంపీగా తన ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన వివరాలను ఇది వరకే బహిరంగంగా అందుబాటులో ఉంచానని తెలిపారు. తన ఆస్తుల వివరాలు ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించబడ్డాయి. రికార్డులను తనిఖీ చేయండి. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై అవినీతి ఆరోపణలు మోపుతున్నవారు ఇకనైనా ఈ ప్రయత్నాలను ఆపాలన్నారు. తనపై ఇలాంటి అసత్య ఆరోపణలు చేసిన వారిని ఎట్టిపరిస్థితుల్లో క్షమించేది లేదను ఈ అంశంలో తాను ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటానిని సాయాని ఘోష్ హెచ్చరించారు. వివాదం ఏంటికాగా ప్రస్తుతం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, అతని కుటుంబ సభ్యులకు సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న పలు ఆస్తులను కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ పరిశీలిస్తోంది. అతని బంధువులు వారితో సంబంధం ఉన్న వ్యక్తులకు సంబంధించిన 17నుండి 21 ఆస్తులకు సంబంధించి ఆమోదించబడిన బిల్డింగ్ ప్లాన్లు, ఇతర పత్రాలను సమర్పించాలని ఇదివరకే KMC నోటీసులు జారీ చేసింది.నిబంధనలకు విరుద్ధంగా ఏవైనా నిర్మాణాలు జరిగాయా అనేది పత్రాలను పరిశీలించిన చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ సాయాని ఘోష్ వివరణ ఇచ్చింది. -
కోల్‌కతాకు వచ్చేస్తా... బెంగాల్ సీఎంకు తస్లిమా నస్రీన్ లేఖ
సాక్షి, కోల్‌కతా: ప్రముఖ రచయిత్రి తస్లిమా నస్రీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్లో రాజకీయ ముఖచిత్రం మారిన నేపథ్యంలో ఆమె తిరిగి కోల్కతారావాలని భావిస్తున్నారట. పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వం మారడంతో, దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రవాసంలో ఉంటున్నఆశలను మళ్లీ చిగురింపజేసినట్టు తెలిపారు. బంగ్లాదేశ్‌లో జన్మించి, ప్రవాసంలో ఉండి ప్రస్తుతం ఢిల్లీలో నివసిస్తున్న,తస్లీమా తాజా పరిస్థితుల నేపథ్యంలో మళ్లీ కోల్‌కతాకు తిరిగి రావచ్చనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.2007 నవంబర్‌లో తనను కోల్‌కతా నుండి బలవంతంగా వెళ్లగొట్టారనీ, ఇప్పుడు పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నాయన్నారు. గతంలో లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం గానీ, ఆ తర్వాత వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం గానీ తనను నగరానికి తిరిగి వచ్చేందుకు అనుమతించలేదని విమర్శించారు. గతంలో తాను స్క్రిప్ట్ రాసిన ఒక మెగా సీరియల్‌ను కూడా తృణమూల్ ప్రభుత్వ ఆదేశాల మేరకు నిలిపివేయాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నారు. దశాబ్దాలుగా కోల్‌కతాకు తిరిగి రావాలనే కోరిక కోరిగానే ఉండిపోయిందని వాపోయారు.కోల్‌కతాతో ఉన్న అనుబంధంకల్చరల్ క్యాపిటల్ కోల్‌కతాలో ఉండే అవకాశం వస్తే ఖచ్చితంగా అక్కడే ఉంటాను. 1914 ఆగస్టు లో బంగ్లాదేశ్ నుండి బహిష్కరణకు గురైన తరువాత కోల్‌కతా సొంత ఇల్లా అనిపించింది. యూరప్ వదిలేసి తాను ఇక్కడికి రావడానికి కారణం బెంగాలీ సంస్కృతే అన్నారు. భారతదేశ సాంస్కృతిక రాజధాని కోల్‌కతాలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకు, అలాగే కోల్‌కతా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌కు హాజరుకావాలని ఉందన్నారు. ఇటీవల కేరళతో పాటు భారతదేశంలోని పలు ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు తెలిపిన ఆమె, కోల్‌కతా సందర్శనకు అనుమతిస్తే ఎంతో కృతజ్ఞతురాలినై ఉంటానని తస్లీమా చెప్పారు.ఇదీ చదవండి: ఇది కదా లక్ అంటే : పాత ప్యాంట్లో రూ. 57 కోట్ల జాక్పాట్కొత్త ముఖ్యమంత్రి సువేందు అధికారికి లేఖ రాయనున్న తస్లిమాపశ్చిమ బెంగాల్ కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికైన సువేందు అధికారికి తాను కోల్‌కతా తిరిగి వచ్చేలా అనుమతించాలని కోరుతూ లేఖ రాయడానికి సిద్ధంగా ఉన్నట్లు తస్లిమా తెలిపారు. గత రెండు దశాబ్దాలుగా తాను కోల్‌కతాలో నివసించాలనే కలలు కంటున్నానని, రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేస్తే అక్కడికే మారిపోతానని చెప్పారు. ఇదీ చదవండి: మూల్యం : ప్రధాని మోదీని ప్రశ్నించిన జర్నలిస్టుకు ఎదురుదెబ్బ -
పశ్చిమ బెంగాల్ రీపోలింగ్ లో ట్విస్ట్
-
కేంద్రంలో బీజేపీ రాజ్యం కూలబోతోంది: మమత హెచ్చరిక
కోల్కత్తా: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీని త్వరలోనే కేంద్రంలో అధికారం నుంచి తొలగిస్తామని మమత చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో బెంగాల్లో సువేందు ప్రభుత్వం మైనార్టీ వర్గాలను లక్ష్యంగా చేసుకుందని.. వారి ఇళ్లను, దుకాణాలను అన్యాయంగా కూల్చివేస్తున్నారని ఆరోపించారు.మాజీ సీఎం మమతా బెనర్జీ మంగళవారం తన నివాసంలో టీఎంసీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ..‘పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం మైనారిటీ వర్గాలను, రోడ్డు పక్కన దుకాణాలు నడిపేవారిని లక్ష్యంగా చేసుకుంటోంది. మైనారిటీ వర్గాలను టార్గెట్ చేస్తున్నారు. దుకాణాలను బుల్డోజర్లతో కూల్చివేస్తున్నారు. ఈ ప్రభుత్వం మన రాజ్యాంగ భావనలు, విలువలతో చెలగాటం ఆడుతోంది. దేశాన్ని పాలిస్తున్న జాతీయ ప్రజాస్వామ్య కూటమికి నాయకత్వం వహిస్తున్న బీజేపీ, సమీప భవిష్యత్తులో కేంద్రంలో అధికారాన్ని కోల్పోతుంది. రాబోయే రోజుల్లో ఢిల్లీలో బీజేపీని అధికారం నుంచి తొలగిస్తారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. అలాగే.. తాను, తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఎలాంటి బెదిరింపులకు లొంగబోనని స్పష్టం చేశారు.ఇక, మమతా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కూడా హాజరయ్యారు. దక్షిణ కోల్‌కతాలోని తన ఇంటిలోని అనధికార కట్టడాలను కూల్చివేయాలని కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ (కేఎంసీ) పంపిన నోటీసుపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ..‘వారు ఏం చేయాలనుకున్నా చేయనివ్వండి... నా ఇంటిని కూల్చివేయండి, నాకు నోటీసు పంపండి. నేను ఈ విషయాలకు తలవంచను.మన రాష్ట్రానికి చాలా మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి లాంటి వారు ఎవరూ లేరు. కెమెరా ముందు డబ్బులు తీసుకుంటూ(2014లో వివాదాస్పద నారద స్టింగ్ ఆపరేషన్) కనిపించిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేశారు. ఏది ఏమైనప్పటికీ, బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుంది అంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే, కూల్చివేత నోటీసు పంపిన కేఎంసీ ఇప్పటికీ టీఎంసీ నియంత్రణలోనే ఉందని, మమతకు సన్నిహితుడిగా భావించే ఆ పార్టీ ఎమ్మెల్యే ఫిర్హాద్ హకీం కోల్‌కతా మేయర్‌గా ఉన్నారని ఇక్కడ ప్రస్తావించడం గమనార్హం.Suvendu Adhikari was among the TMC leaders named in the 2014 Narada sting operation, which showed them allegedly accepting cash from a fictitious company. However, after he joined the BJP, he was not arrested. In 2021, while other accused politicians were taken into custody, the… pic.twitter.com/JDosWjPXed— pranav pradhi (@pranavpradhi1) May 8, 2026 -
‘ప్యాకేజీ అందింది’.. రీపోలింగ్ నుంచి తప్పుకున్న ‘పుష్ప’
కోల్‌కతా: సీఎం సువేందు అధికారి, సింగం ఐపీఎస్ అజయల్ పాల్ శర్మకు ‘పుప్ప’ భయపడ్డారా? అంటే అవుననే అంటున్నాయి పశ్చిమ బెంగాల్ రీపోలింగ్ ఎన్నికల్లో తాజా పరిణామాలు. ఈ నెల 21న జరగనున్న రీపోలింగ్ ఎన్నిక నుంచి తప్పుకుంటున్నట్లు పశ్చిమ బెంగాల్‌లోని ఫల్టా నియోజకవర్గ టీఎంసీ అభ్యర్థి పుష్ప అలియాస్ జహంగీర్ ఖాన్ అధికారికంగా ప్రకటించారు.ఈ సందర్భంగా జహంగీర్ ఖాన్ మాట్లాడుతూ.. ఫల్టాలో శాంతి, భద్రతలే నాకు ముఖ్యం. ఆ రెండు ఉంటేనే అభివృద్ధి జరుగుతోంది. సీఎం సువేందు అధికారి ఫల్టా అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. నేను అనుకున్నది జరిగింది. అందుకే త్వరలో జరగనున్న ఫల్టా నియోజకవర్గ రీపోలింగ్ ఎన్నికల్లో నేను పోటీ చేయడం లేదు. నా నామినేషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు.రీపోలింగ్ ఎన్నికల్లో పోటీ నుంచి నిష్క్రమించడం వెనుక పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ హస్తం ఉందా? లేదంటే మీరే సీఎం సువేందుకు బయపడి వెనక్కి తగ్గుతున్నారా? అన్న మీడియా ప్రశ్నలకు స్పందిస్తూ..మీరు అడుగుతున్న ప్రశ్నలకు నేను చెప్పే సమాధానం ఒకటే. ఫల్టా ప్రజల కోసం, ఫల్టాలో అభివృద్ధి కోసం, ఫల్టాలో శాంతిని కాపాడటం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానంటూ మీడియా సమావేశం నుంచి వెళ్లిపోయారు. జహంగీర్‌ఖాన్ నిర్ణయంపై టీఎంసీ అధికార ప్రతినిధి మీడియాతో అరూప్ చక్రవర్తి స్పందించారు. జహంగీర్‌ఖాన్ తన నిర్ణయంపై సమాచారం ఇచ్చారు. అయితే ఆ నిర్ణయానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదని అన్నారు.రీపోలింగ్ ఎన్నిక నుంచి తప్పుకున్నానంటూ జహంగీర్‌ఖాన్ ప్రకటనపై సీఎం సువేందుకు అధికారి విమర్శలు గుప్పించారు. ఫల్టా నియోజకవర్గంలో జరగనున్న రీపోలింగ్‌లో పోలింగ్ ఏజెంట్ దొరకడని అతను పారిపోయాడు’ అని ఎద్దేవా చేశారు. ఆయనో ప్రముఖ క్రిమినల్. ఆయన సంగతిని నాకు వదిలేయండి నేను చూసుకుంటానని అన్నారు.ఇటీవల జరిగిన రెండో విడత పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్నికల పర్యవేక్షణ కోసం ఎన్నికల సంఘం 95మంది అధికారుల్ని నియమించింది. వారిలో ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా ఉన్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఐపీఎస్ అజయ్‌పాల్ ఉన్నారు. ప్రయాగరాజ్‌లో అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్)గా విధులు నిర్వహిస్తున్న అజయ్ శర్మ ఎన్కౌంటర్ స్పెషలిస్టు. 500కి పైగా ఎన్కౌంటర్లు చేసిన చరిత్ర ఉంది. ఈసీ ఆయనను సౌత్ 24 పరగణ జిల్లా పోలీస్ ఆబ్జర్వర్‌గా నియమించింది. తనిఖీలు నిర్వహించే సమయంలో టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ ఇంటి వద్ద అనైతిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించారు. ఆపై జహంగీర్‌ఖాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఈ వరుస పరిణామాలపై జహంగీర్ ఖాన్ మీడియాతో మాట్లాడారు. పుష్ప సినిమాకు జహంగీర్ ఖాన్ బీభత్సమైన ఫ్యాన్. అయినప్పటికీ ఆయన సింగం అయితే, నేను పుష్పని ఫైర్ అనుకుంటున్నారా? వైల్డ్ ఫైర్ అంటూ మాస్ డైలాగులు వదిలారు. ఇప్పుడు ఫల్టా రీపోలింగ్ ఎన్నికల నుంచి తప్పుకోవడంపై సీఎం సువేందుకు, ఐపీఎస్ అజయ్ శర్మకు పుష్ప బయపడ్డారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఎంపీ నియోజకవర్గమైన డైమండ్ హార్బర్ పరిధిలోకి ఫల్టా నియోజకవర్గం కావడం, చరిత్రలో తొలిసారిగా ఈసీ నియోజకవర్గం మొత్తం రీపోలింగ్ నిర్వహించడం చర్చాంశనీయంగా మారింది. రీపోలింగ్ ఉన్నా సరే మే 4నుంచి ఇప్పటి వరకు దీదీ,అభిషేక్‌తో పాటు ఇతర సీనియర్ నేతలెవరూ ప్రచారం జోలికి వెళ్లలేదు. ఫల్టా నియోజకవర్గంపై ఎన్నికల సంఘం అసాధారణ నిర్ణయం తీసుకుంది. రెండో విడుత ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్లు ఈసీకి ఫిర్యాదులు అందాయి. వరుస ఫిర్యాదులతో ఫల్టాలోని మొత్తం 285 కేంద్రాల్లో ఈ నెల 21న రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపింది. అక్కడ 24వ తేదీన కౌంటింగ్ జరగనుంది. -
మమతకు సీఎం సువేందు ఝలక్
పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్ ఇచ్చారు. గత టీఎంసీ పాలనలో జరిగిన అవినీతి, మహిళలపై నేరాలపై దర్యాప్తు కోసం ఆయన రెండు కమిషన్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కమిషన్లలో ఒక దాని కీలక బాధ్యతలు సీనియర్ ఐపీఎస్ అధికారిణి దమయంతి సేన్‌కు ఆయన అప్పగించారు. దమయంతి సేన్ 1996 బ్యాచ్ అధికారిణి. కోల్‌కతాకు క్రైమ్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ కూడా. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పార్క్ స్ట్రీట్ గ్యాంగ్‌రేప్ కేసు(2012) కేసును స్వయంగా చేధించి.. నిందితులను తక్కువ టైంలోనే పట్టుకున్నారామె. ఆ సమయంలో దేశం మొత్తం ఆమెపై ప్రశంసలు గుప్పించింది. అయితే.. (పార్క్ స్ట్రీట్ గ్యాంగ్ రేసు కేసు గురించి.. 2012 ఫిబ్రవరి 6వ తేదీన ఒక మహిళపై కారులో గ్యాంగ్‌రేప్ జరిగింది)ఈ కేసు విషయంలోనే ఆమె అప్పటి దీదీ సర్కార్ ఆగ్రహానికి కూడా గురయ్యారు. ఆ సమయంలో మమతా బెనర్జీ సంచలన ఆరోపణలకు దిగారు. ఈ కేసు ఒక కల్పితం అని, టీఎంసీ ప్రభుత్వాన్ని దెబ్బ తీసే కుట్రగా అభివర్ణించారామె. అంతటితో ఆగకుండా దమయంతిని క్రైమ్ బ్రాంచ్ నుంచి ట్రైనింగ్ కాలేజీకి బదిలీ చేశారు. ఈ నిర్ణయం తీవ్ర వివాదాస్పదంగా మారింది. నిజాయితీకి మమత ప్రభుత్వం ఇచ్చిన కానుక అంటూ బీజేపీ, వామపక్షాలు తిట్టిపోశాయి.అటు ఆ టైంలో ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన మద్దతు లభించింది. అయితే మమతా సర్కార్ తీసుకున్న నిర్ణయంపై దమయంతి సేన్ ఇన్నేళ్లు మౌనంగా పాటించారు. రోటీన్ ట్రాన్స్ఫర్ను అంగీకరించి తన విధుల్ని చేసుకుంటూ పోయారు. ఆపై ప్రమోషన్ల విషయంలోనూ ఆమెకు అన్యాయమే జరిగిందని.. పెద్దగా ప్రాధాన్యం లేని పోస్టింగ్‌లు ఇస్తూ వచ్చారని విమర్శలు ఉన్నాయి. అయితే ఆమె సిన్సియారిటీని గుర్తించిన కలకత్తా హైకోర్టు.. 2022లో నాలుగు అత్యాచార కేసులు, రసికా జైన్ మరణం కేసును అప్పగించి మమతా సర్కార్‌కు ఝలక్ ఇచ్చింది.తాజాగా.. రిటైర్డ్ జస్టిస్ సంపతి చటర్జీ అధ్యక్షతన నేతృత్వంలో సువేందు సర్కార్ కమిషన్ వేయగా.. దమయంతి సేన్‌ను అందులో మెంబర్ సెక్రటరీగా నియమించారు. ఈ కమిషన్ మహిళలు, పిల్లలపై దాడులను పరిశీలించనుంది. ఇందులో సందేశ్‌ఖాలి, కస్బా, బోగ్టుయి వంటి కేసులు కూడా ఉన్నాయి. దమయంతి సేన్ తిరిగి కీలక బాధ్యతల్లోకి రావడం.. బెంగాల్ రాజకీయాల్లో ఒక ముఖ్య పరిణామంగా విశ్లేషకులు భావిస్తున్నారు. -
పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు కీలక నిర్ణయం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలో మతపరమైన ప్రోత్సాహకాల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై ఇమామ్‌లు, ముయజ్జిన్లు, ఆలయ పూజారులకు ఇచ్చే నెలవారీ గౌరవ వేతనం నిలిపివేయాలని కేబినెట్ మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నారు. మతపరమైన గుర్తింపుల ఆధారంగా సంక్షేమ పథకాలు ఉండకూడదని సువేందు అధికారి నేతృత్వంలోని ప్రభుత్వం స్పష్టం చేసింది. జూన్ ఒకటి నుండి మతపరమైన వర్గీకరణ ఆధారంగా ఇచ్చే గౌరవ వేతనాల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.ఇప్పటివరకు సమాచార, సాంస్కృతిక వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాలు, మదర్సా విద్యా శాఖల ద్వారా ఈ పథకాలు అమలులో ఉన్నాయి. అవి వచ్చేలా మొదటి తేదీ నుంచి నిలిచిపోనున్నాయి.2012లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి ఇమామ్‌లకు నెలకు రూ. 2,500 గౌరవ వేతనం ప్రకటించింది. ఆ తర్వాత ముయజ్జిన్లకు కూడా ఆర్థిక సహాయం అందించారు. 2020లో హిందూ పూజారులకు కూడా గౌరవ వేతనం ఇచ్చే పథకం ప్రారంభమైంది. మొదట రూ.1,000గా నిర్ణయించిన ఈ వేతనం 2026 ఎన్నికల ముందు రూ.2,000కి పెంచారు.అయితే, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు మతపరమైన గుర్తింపులపై ఆధారపడకూడదని స్పష్టం చేసింది. అందుకే ఈ పథకాలను నిలిపివేస్తూ, కోటా అర్హతను నిర్ణయించడానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనుంది. కోల్కత్తా హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంది.మమతా బెనర్జీ ప్రభుత్వ కాలంలో నిధుల పంపిణీలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేయడానికి రిటైర్డ్ జస్టిస్ బిశ్వజిత్ దాస్ ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేశారు. అలాగే, మహిళలపై జరిగిన దాడుల కేసులను పరిశీలించడానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ఒక నెలలో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆశిస్తోంది. -
మమతకు బిగ్ షాక్.. సువేందు అధికారి అదిరిపోయే దెబ్బ
పశ్చిమ బెంగాల్‌లోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం, ముఖ్యమంత్రి సువేందు అధికారి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హయాంలో తీసుకున్న పలు నిర్ణయాలను, గుర్తులను సువేందు ప్రభుత్వం తొలగిస్తోంది. ఇందులో భాగంగా మమతా బెనర్జీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘బిస్వా బంగ్లా’ లోగోను రాష్ట్రవ్యాప్తంగా తొలగిస్తూ బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అధికారిక వేదికలు, ప్రజా మౌలిక సదుపాయాల నుండి అధికారికంగా తొలగించడం ప్రారంభించింది. దీనికి బదులుగా భారతదేశ జాతీయ చిహ్నమైన అశోక స్తంభాన్ని ఏర్పాటు చేస్తున్నారు.కాగా, మాజీ సీఎం మమతా బెనర్జీ సెప్టెంబర్ 16, 2013న బిస్వా బంగ్లా బ్రాండ్ లోగోను ప్రారంభించారు. బెంగాల్ సాంస్కృతిక గుర్తింపు, పర్యాటకం, సాంప్రదాయ కళలు మరియు చేతివృత్తులకు ప్రాతినిధ్యం వహించే చిహ్నంగా దీనిని రూపొందించారు. బెంగాలీ అక్షరం “B” చుట్టూ రూపొందించబడిన ఈ లోగో, తృణమూల్ కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ వెబ్సైట్లు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు మరియు సుందరీకరణ కార్యక్రమాలలో క్రమంగా అధికారిక బ్రాండింగ్ చిహ్నంగా మారింది.దశాబ్దానికి పైగా తృణమూల్ కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఇది గుర్తింపుగా పనిచేసింది. కాగా, బెంగాల్ బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు అనంతరం, ఈ లోగో స్థానంలో మరో కొత్త లోగోను తీసుకువచ్చారు. దీనికి బదులుగా భారతదేశ జాతీయ చిహ్నమైన అశోక స్తంభాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా సాల్ట్ లేక్ స్టేడియంలో 'బిస్వా బంగ్లా' గుర్తును తొలగించి, దాని స్థానంలో జాతీయ చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. ఈ రీబ్రాండింగ్ ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లకు కూడా విస్తరించింది. పలు ప్రభుత్వ విభాగాలు, సేవలకు లింక్‌లను అందించే 'ఎగియే బంగ్లా' పోర్టల్‌లో ఇప్పుడు బిస్వా బంగ్లా లోగో స్థానంలో అశోక స్తంభాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోర్టల్ థీమ్‌లో కూడా మార్పు వచ్చింది. గతంలో ఉన్న తెలుపు-నీలం రంగుల స్థానంలో కాషాయ రంగును చేర్చారు.The 'Biswa Bangla' logo has been removed from the Salt Lake stadium in Kolkata. Its been replaced by India's national emblem - the Ashok StambhBiswa Bangla logo was introduced by former CM Mamata Banerjee as the state emblem for Bengal pic.twitter.com/dSGg4ViC9Q— Indrajit Kundu | ইন্দ্রজিৎ (@iindrojit) May 16, 2026అయితే, ఒక వ్యక్తి సృష్టించిన లోగో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక గుర్తింపుగా పనిచేయకూడదని వాదిస్తూ బీజేపీ నాయకులు ఈ నిర్ణయాన్ని సమర్థించారు. అధికారిక ప్రభుత్వ వినియోగానికి అశోక చిహ్నమే అత్యున్నతమైన మరియు అత్యంత సముచితమైన చిహ్నంగా ఉంటుందని పార్టీ నాయకులు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. 2017లో 'బిస్వా బంగ్లా' లోగో ఒక రాజకీయ వివాదానికి కేంద్రంగా నిలిచింది. అప్పుడు మాజీ బీజేపీ ఎమ్మెల్యే ముకుల్ రాయ్, ఆ లోగో ప్రైవేట్ యాజమాన్యంలో ఉందని, అది ప్రభుత్వానిది కాదని ఆరోపించారు. ఈ ఆరోపణలను అభిషేక్ బెనర్జీ ఖండించగా మమతా బెనర్జీ అసెంబ్లీలో ఆ లోగోను తానే స్వయంగా సృష్టించానని, రాయల్టీ వసూలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం దానిని ఉపయోగించుకోవడానికి అనుమతించానని తరువాత స్పష్టం చేశారు.దాదాపు 13 సంవత్సరాలుగా బిస్వా బంగ్లా చిహ్నం తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ గుర్తింపుతో మరియు ప్రజా సంబంధాలతో ముడిపడి ఉంది. అయితే, బీజేపీ ప్రభుత్వం వచ్చాక అధికారిక వ్యవస్థలు మరియు రాష్ట్ర నియంత్రిత వేదికల నుండి ఆ లోగో తొలగించడం ఎంతో కీలకంగా మారింది. ఇది బెంగాల్ రాజకీయ, పరిపాలనా బ్రాండింగ్‌లో ఒక ప్రతీకాత్మక మార్పును సూచిస్తుంది.రాజకీయ ప్రభావంటీఎంసీ గుర్తింపు తొలగింపు: బిశ్వ బంగ్లా లోగో తొలగించడం ద్వారా టీఎంసీ పాలనలో ఏర్పడిన గుర్తింపును తొలగిస్తున్నారు.బీజేపీ సంకేతం: అశోక స్తంభం ప్రవేశపెట్టడం ద్వారా జాతీయ చిహ్నాన్ని రాష్ట్ర గుర్తింపుగా మార్చి, “సాఫ్రన్ బ్రాండింగ్”ను బలపరుస్తోంది.సాంస్కృతిక ప్రభావం: దుర్గాపూజ వంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా బీజేపీ ప్రభావం పెరుగుతుందని అంచనా. -
“పుష్ప” సంగతి నేను చూస్తా: బెంగాల్ సీఎం సువేందు
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ నేత, “పుష్ప” అని చెప్పుకునే జహంగీర్ ఖాన్‌కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి శనివారం హెచ్చరిక చేశారు. “అతడు అత్యంత కిరాతక నేరస్థుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి. అతడి వ్యవహారాన్ని నేను స్వయంగా చూసుకుంటా. పుష్ప అని చెప్పుకునే ఆ వ్యక్తి బాధ్యత ఇప్పుడు నాది” అని హెచ్చరించారు.ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గంలో మే 21న రీపోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో డైమండ్ హార్బర్ లోక్‌సభ స్థానం పరిధిలోని ఫల్తాలో జరిగిన బీజేపీ కార్యకర్తల సభలో సువేందు అధికారి మాట్లాడారు.“మేనల్లుడు (అభిషేక్ బెనర్జీ) రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి పదేళ్లుగా ప్రజలు ఓటు వేయలేని పరిస్థితి ఫల్తాలో ఉంది. ఈ రీపోలింగ్‌తో ఓటర్ల హక్కులు మళ్లీ స్థిరపడతాయి. ఇప్పుడు పరిస్థితి మారింది. ఫల్తా ఓటర్లు బీజేపీ అభ్యర్థిని లక్షకు పైగా మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నా” అని సువేందు అధికారి అన్నారు.అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో తృణమూల్ నేత, ఫల్తా అభ్యర్థి జహంగీర్ ఖాన్ తనను తాను “పుష్ప”గా చెప్పుకున్నారు. “పుష్ప” సినిమాలో అల్లు అర్జున్ పోషించిన స్మగ్లర్, శక్తిమంతమైన పాత్రను ఆయన ప్రస్తావించారు. ఉత్తరప్రదేశ్ కేడర్ ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మను ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్ పోలీసు పరిశీలకుడిగా నియమించింది. ఆయనను “సింగం” సినిమా సిరీస్‌లో అజయ్ దేవగన్ పోషించిన పోలీసు అధికారి పాత్రతో పోల్చి, ఖాన్ ‘‘పుప్ప’’ వ్యాఖ్యలు చేశాడు.కాగా, ఏప్రిల్ 23, 29 తేదీల్లో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌ను బీజేపీ ఓడించింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ పార్టీ 15 ఏళ్ల పాలనకు ముగింపు పడింది. రాష్ట్రంలో బీజేపీ తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రెండు దశల్లోనూ 90 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. కాగా, మొన్న తమిళనాడు అసెంబ్లీలోనూ ‘‘పుష్ప’’ పాత్రను గుర్తు చేస్తూ పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
బెంగాల్లో అర్ధరాత్రి భారీ విధ్వంసం
అసన్సోల్: పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఒక్కసారిగా ఉద్రిక్ల వాతావరణం ఏర్పడింది. లౌడ్ స్పీకర్ల శబ్ద పరిమితులపై పోలీసులు ఇచ్చిన సూచనలు చివరకు అపార్థాలకు దారితీసి, తీవ్ర విధ్వంసానికి కారణమయ్యాయి. జహంగీరి మహల్లా పోలీస్ అవుట్‌పోస్టుపై మూకల దాడి, రాళ్ల రువ్వడం, వాహనాల ధ్వంసంతో ఆ ప్రాంతం రణరంగాన్ని తలపించింది.వదంతులు సృష్టించిన చిచ్చుముఖ్యమంత్రి శుభేందు అధికారి ఆదేశాల మేరకు, మతపరమైన ప్రార్థనా స్థలాల్లో లౌడ్ స్పీకర్ల శబ్దాన్ని తగ్గించాలని పోలీసులు అసన్సోల్లోని రైల్‌పార్ ప్రాంత ప్రజలకు సూచించారు. ఇదే విషయమై మసీదు కమిటీతో పోలీసులు మాట్లాడుతుండగా.. శుక్రవారం రాత్రి ప్రార్థనలను అడ్డుకుంటున్నారనే వదంతులు క్షణాల్లో వ్యాపించాయి. దీంతో ఒక వర్గానికి చెందిన అసాంఘిక శక్తులు ఒక్కసారిగా రెచ్చిపోయి, జహంగీరి మహల్లా (నయా మహల్లా) పోలీస్ స్టేషన్‌పై మూకుమ్మడి దాడికి దిగాయి.వాహనాలు ధ్వంసంవదంతులతో రగిలిపోయిన ఆందోళనకారులు నేరుగా పోలీస్ స్టేషన్లోకి చొరబడి, విధ్వంసం సృష్టించారు. లోపల ఉన్న వస్తువులను ధ్వంసం చేయడమే కాకుండా, పోలీసుల పైనా రాళ్ల వర్షం కురిపించారు. ఈ క్రమంలో స్టేషన్ బయట, పరిసర వీధుల్లో పార్క్ చేసిన అనేక వాహనాలను దుండగులు ధ్వంసం చేశారు. అసన్సోల్ నార్త్ ఎమ్మెల్యే కృష్ణేందు ముఖర్జీ తెలిపిన వివరాల ప్రకారం కేవలం శబ్దాన్ని మసీదు ప్రాంగణానికే పరిమితం చేయాలని పోలీసులు కోరినందుకే ఈ అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నాయి.రంగంలోకి కేంద్ర బలగాలుపరిస్థితి చేయి దాటిపోతుండటంతో అదనపు భద్రతా బలగాలు, కేంద్ర బలగాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అల్లరి మూకలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేసి, పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. ఈ విధ్వంసానికి కారణమైన నిందితులను గుర్తించి, కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ దాడి ఘటనకు సంబంధించి ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నారు.ఇది కూడా చదవండి: అప్పుల ఊబిలో.. చమురు మంటల్లో.. -
బెంగాల్లో ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీకి బిగ్ షాక్
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. బెంగాల్లో అధికారం కోల్పోవడంతో తృణమూల్ కాంగ్రెస్ అగ్రనేతలకు కష్టాలు మొదలయ్యాయి. ముఖ్యంగా మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా అభిషేక్ బెనర్జీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారన్న ఆరోపణలపై అభిషేక్ బెనర్జీపై పోలీసులు కేసు నమోదు చేశారు.వివరాల మేరకు.. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు మే 5న సామాజిక కార్యకర్త రాజీబ్ సర్కార్.. అభిషేక్ బెనర్జీపై ఫిర్యాదు చేశారు. ఏప్రిల్ 27 నుంచి మే 3 మధ్య జరిగిన పలు ప్రచార కార్యక్రమాల్లో అభిషేక్ బెనర్జీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో బగుయాటి పోలీస్ స్టేషన్లో ఈ ఫిర్యాదును నమోదు చేశారు. అభిషేక్ ప్రసంగాలు విద్వేషాన్ని రెచ్చగొట్టాయని, ప్రజాశాంతికి భంగం కలిగించాయని, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులు ఉన్నాయని ఫిర్యాదులో ఆరోపించారు. సర్కార్ తన ఫిర్యాదులో భాగంగా పలు ప్రసంగాల లింకులను కూడా సమర్పించారు.ఈ క్రమంలో మే 15వ తేదీ మధ్యాహ్నం 2.45 గంటలకు బిధాన్నగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సెక్షన్లు 192, 196, 351(2) మరియు 353(1)(సి)లతో పాటు, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్లు 123(2) మరియు 125 కింద ఈ కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. దీంతో, పోలీసులు.. అభిషేక్ ప్రసంగాలు రెచ్చగొట్టే, బెదిరింపులతో కూడిన, అశాంతిని సృష్టించి, మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. అనంతరం.. ఈ కేసు దర్యాప్తు చేపట్టాలని సబ్-ఇన్స్పెక్టర్ సోమనాథ్ సింఘా రాయ్‌ను ఉన్నతాధికారులు ఆదేశించారు.అభిషేక్ సతీమణి వివాదం..ఇదిలా ఉండగా.. అంతకుముందు అభిషేక్ బెనర్జీ భార్య రుజిరా నరులా నకిలీ పత్రాల వివాదం తెరపైకి వచ్చింది. బొగ్గు కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రుజిరా రెండు పాన్‌కార్డులను కలిగివున్నారన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ రెండు పాన్‌కార్డుల్లో తండ్రుల పేర్లు వేర్వేరుగా ఉండడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఆమె ఫోర్జరీకి పాల్పడివుంటారనే అనుమానాలు కలుగుతున్నాయి. రుజిరా బెనర్జీ పేరుతో ఒకటి, రుజిరా నరులా పేరుతో మరో పాన్‌కార్డు ఆమె కలిగివున్నారని అధికారులు వెల్లడించారు. ఈ రెండింటిలో తండ్రులు పేర్లు వేర్వేరుగా ఉన్నట్టు తెలిపారు. మరోవైపు రుజిరా ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయని 'నవ భారత్ టైమ్స్' నివేదించింది.థాయ్‌లాండ్ పౌరసత్వంరుజిరా నరులా బెనర్జీకి థాయ్‌లాండ్ పౌరసత్వం కూడా ఉన్నట్టు వెల్లడైంది. ఆమెకు థాయ్‌లాండ్ పాస్‌పోర్ట్ ఉంది. అభిషేక్ బెనర్జీని పెళ్లిచేసుకుని బెంగాల్లో స్థిరపడినప్పటికీ ఆమె థాయ్ పౌరసత్వం వదులుకోలేదని తెలుస్తోంది. దీంతో భారతదేశంలో ఆమె చట్టపరమైన హోదాపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాగా, 2012లో అభిషేక్ బెనర్జీని వివాహం చేసుకోవడంతో ఆమె గురించి బయట ప్రపంచానికి తెలిసింది. ఆ సమయంలో అభిషేక్ బెనర్జీ కూడా రాజకీయంగా ఎదిగే దశలో ఉన్నారు. అప్పటికే ఆయన ఆల్ ఇండియా తృణమూల్ యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికలలో డైమండ్ హార్బర్ నియోజకవర్గం నుంచి టీఎంసీ ఎంపీగా ఎన్నికయ్యారు. అభిషేక్, రుజిరా దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
ఏంటి మామా ఇదీ.. వదిలేస్తే కేజీఎఫ్ హీరోలా సంపాదిస్తాడేమో..
హౌరా: పశ్చిమ బెంగాల్ శిబ్‌పూర్‌లోని తృణమూల్ కాంగ్రెస్ నేత షమీమ్ అహ్మద్ అలియాస్ బారే ఇంటిపై తాజాగా పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో బంగారు పలకలు అమర్చిన మంచం కూడా బయటపడిందని స్థానికులు చెప్పారు. అయితే పోలీసులు ఆ విషయాన్ని ఇంకా ధ్రువీకరించలేదు. ఎన్నికల ఫలితాల రోజు షిల్ పారా లేన్‌లో బీజేపీ మైనారిటీ సెల్ విజయోత్సవ ర్యాలీపై బారే బాంబులు, కాల్పులు జరిపించాడన్న ఆరోపణల తర్వాత పోలీసులు ఆయన ఇంటిపై ఈ దాడి చేశారు.శిబ్పూర్ కేసులో, హెచ్ఎంసీ వార్డు 36 అధ్యక్షుడు అహ్మద్ అలియాస్ బారే తన కుటుంబంతో పాటు పరారీలో ఉన్నాడు. అతని భార్య షమీమా బానో అదే వార్డు తృణమూల్ కౌన్సిలర్. ఈ ఇల్లు సాధారణంగా కనిపించిందని, అయితే మెట్లదారి, రహస్య తలుపు ద్వారా రెండో అంతస్తులోని ఫ్లాట్‌కు చేరుకున్నామని హౌరా పోలీసులు చెప్పారు.ఇంటి మిగతా భాగంలో సాధారణ ఫర్నిచర్ ఉండగా, రహస్యంగా ఉంచిన రెండో అంతస్తులోని ఫ్లాటులో మాత్రం విలాసవంతమైన ఇంటీరియర్లు, సీసీటీవీ కెమెరాలు, బెడ్రూమ్, లివింగ్ రూమ్, కిచెన్, బాత్రూమ్ ఉన్నాయి.స్వాధీనం చేసుకున్న వస్తువుల విలువను అంచనా వేస్తామని పోలీసులు చెప్పారు. బారే దందాలు చేస్తారని బీజేపీ నేత ఓంప్రకాశ్ సింగ్ ఆరోపణలు చేశారు.కాగా, షమీమ్ అహ్మద్ ఇంట్లో జరిపిన దాడిలో బంగారు మంచంతో పాటు బంగారు సోఫా , తదితర ఖరీదైన వస్తువులు బయటపడ్డాయంటూ వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఆ బంగారు మంచం, ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, సీసీటీవీ కెమెరాలు, అధిక నాణ్యతతో ఉన్న అలంకరణ సామగ్రి భవన బేస్మెంట్లోని రహస్య గదిలో దొరికాయని కొందరు అంటున్నారు. అయితే, వీటిని నిర్ధారిస్తూ పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. #BengalShocker | TMC leader’s house raided, gold bed and secret basement uncovered!The entire police team was stunned during the raid on TMC leader Shamim Ahmed’s residence in Shibpur, Howrah.Police reportedly discovered a hidden luxury flat through a trap door, featuring a… pic.twitter.com/JGDCVrY0Pu— Organiser Weekly (@eOrganiser) May 14, 2026పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లా, శిబ్పూర్లో ఉన్న టీఎంసీ ఎమ్మెల్యే ఇల్లు.👇బెంగాల్ టీఎంసీ ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసినప్పుడు, మొత్తం బృందం దిగ్భ్రాంతికి గురైంది....ఎందుకంటే టీఎంసీ ఎమ్మెల్యే షమీమ్ అహ్మద్ ఇంట్లో ఒక బంగారు మంచం, బంగారు సోఫాతో పాటు, రహస్యంగా ఉన్న నేలమాళిగ నుండి… pic.twitter.com/UrXY3uRpIv— JSP Naresh (@JspBVMNaresh) May 14, 2026 -
లాయర్ మమతా వివరాలు ఇవ్వండి: బీసీఐ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ న్యాయవాది దుస్తులలో కలకత్తా హైకోర్టు ముందు హాజరైన కొన్ని గంటల తర్వాత ఆమె లాయర్ వివరాలను ఇవ్వాలంలూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ).. రాష్ట్ర బార్ కౌన్సిల్‌కు లేఖ రాసింది. న్యాయవాదిగా నమోదు, ప్రాక్టీస్ హోదాకు సంబంధించిన వివరాలను కోరింది. అంతకుముందు మమతా బెనర్జీ న్యాయవాది దుస్తులలో కోల్కత్తా హైకోర్టు ముందు హాజరై, బెంగాల్లో ఎన్నికల అనంతర హింసకు సంబంధించిన ఒక కేసులో వాదనలు వినిపించారు. దాంతో మమతా బెనర్జీ మరోసారి హైలైట్ అయ్యారు. దీనిలో భాగంగా ఆమె న్యాయవాది వృత్తికి సంబంధించిన అన్ని వివరాలను తమకు సమర్పించాలని రాష్ట్ర బార్ కౌన్సిల్‌ను ఆదేశించింది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఈ అంశానికి సంబంధించి మే 16వ తేదీ లోగా అంటే శనివారంలోపు ‘లాయర్ మమతా’ పూర్తి వివరాలను ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మేరకు స్టేట్ బార్ కార్యదర్శికి లేఖ రాసింది బీసీఐ. మమతా లాయర్ దుస్తుల్లో హైకోర్టు ముందు హాజరైన విషయం మీడియా ద్వారా తమ దృష్టికి వచ్చిందని దీనికి సంబంధించిన వివరాలను ఇవ్వాలని కోరింది బీసీఐ. కాగా, ఇటీవలే పశ్చిమ బెంగాల్లో ఎన్నికల్లోమాజీ సీఎం మమతా బెనర్జీ ఘోర ఓటమి చవిచూశారు. అయితే ఓ కీలక కేసుకు సంబంధించి ఆమె హైకోర్టుకు హాజరైన క్రమంలో మాజీ సీఎం కాస్తా.. లాయర్ మమతాగా అవతారమెత్తారని జనం అనుకుంటున్నారు. -
మమతా బెనర్జీ మేనల్లుడికి కొత్త చిక్కులు!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో అధికారం కోల్పోవడంతో తృణమూల్ కాంగ్రెస్ అగ్రనేతలకు కష్టాలు మొదలయ్యాయి. ముఖ్యంగా మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి తలనొప్పులు ఎక్కువయ్యాయి. సువేందు అధికారి.. బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అభిషేక్ బెనర్జీకి జడ్‌ప్లస్ భద్రతను ఉపసంహరించారు. అంతేకాదు బీజేపీ సర్కారు ఆదేశాలతో ఆయన ఇంటి ముందు భద్రత కోసం ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను కూడా తొలగించింది. తాజాగా అభిషేక్ బెనర్జీ భార్య రుజిరా నరులా నకిలీ పత్రాల వివాదం తెరపైకి వచ్చింది.బొగ్గు కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రుజిరా రెండు పాన్‌కార్డులను కలిగివున్నారన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ రెండు పాన్‌కార్డుల్లో తండ్రుల పేర్లు వేర్వేరుగా ఉండడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఆమె ఫోర్జరీకి పాల్పడివుంటారనే అనుమానాలు కలుగుతున్నాయి. రుజిరా బెనర్జీ పేరుతో ఒకటి, రుజిరా నరులా పేరుతో మరో పాన్‌కార్డు ఆమె కలిగివున్నారని అధికారులు వెల్లడించారు. ఈ రెండింటిలో తండ్రులు పేర్లు వేర్వేరుగా ఉన్నట్టు తెలిపారు. మరోవైపు రుజిరా ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయని 'నవ భారత్ టైమ్స్' నివేదించింది.థాయ్‌లాండ్ పౌరసత్వంరుజిరా నరులా బెనర్జీకి థాయ్‌లాండ్ పౌరసత్వం కూడా ఉన్నట్టు వెల్లడైంది. ఆమెకు థాయ్‌లాండ్ పాస్‌పోర్ట్ ఉంది. అభిషేక్ బెనర్జీని పెళ్లిచేసుకుని బెంగాల్లో స్థిరపడినప్పటికీ ఆమె థాయ్ పౌరసత్వం వదులుకోలేదని తెలుస్తోంది. దీంతో భారతదేశంలో ఆమె చట్టపరమైన హోదాపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.2012లో అభిషేక్ బెనర్జీని వివాహం చేసుకోవడంతో ఆమె గురించి బయట ప్రపంచానికి తెలిసింది. ఆ సమయంలో అభిషేక్ బెనర్జీ కూడా రాజకీయంగా ఎదిగే దశలో ఉన్నారు. అప్పటికే ఆయన ఆల్ ఇండియా తృణమూల్ యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికలలో డైమండ్ హార్బర్ నియోజకవర్గం నుంచి టీఎంసీ ఎంపీగా ఎన్నికయ్యారు. అభిషేక్, రుజిరా దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు.వేర్వేరు తండ్రుల పేర్లు.. వివాదంథాయ్లాండ్లో ఉన్నప్పుడు రుజిరా.. భారత సంతతికి చెందిన వ్యక్తిగా పీఐఓ (PIO) కార్డును కలిగి ఉన్నారు. ఇందులో ఆమె తండి పేరు నిపన్ నరులా అని ఉంది. అభిషేక్ బెనర్జీని వివాహం చేసుకున్న తర్వాత ఓసీఐ (ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా) కార్డు కోసం ఆమె దరఖాస్తు చేసుకున్నారు. ఇందు కోసం సమర్పించిన పత్రాలలో తన తండ్రి పేరును గురుచరణ్ అహుజాగా పేర్కొన్నారు. ఇది ఇప్పటికీ వివాదాస్పద అంశంగా కొనసాగుతోంది.రుజిరాపై విచారణకు డిమాండ్ఫోర్జరీ ఆరోపణల నేపథ్యంలో రుజిరా బెనర్జీపై విచారణ జరపాలని సోషల్ మీడియాలో నెటిజనులు డిమాండ్ చేస్తున్నారు. రుజిరాపై వచ్చిన ఆరోపణల గురించి మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ వివరణ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ నేప్యథంలో సువేందు అధికారి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. -
ఉదయం వేళ తప్పనిసరి.. బెంగాల్ సర్కార్ కీలక ఆదేశాలు
కోల్కత్తా: పాఠశాలల్లో ఉదయం వేళ వందేమాతరం తప్పనిసరిగా ఆలపించాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. పాఠశాల ప్రారంభంలో జరిగే ఈ జాతీయ గీతాలాపనలో ప్రతి విద్యార్థి తప్పనిసరిగా పాల్గొనాలని.. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.సోమవారం (మే 18 ) నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో వందేమాతరం ప్రార్థన గీతంగా ప్రవేశపెట్టనుంది. వచ్చే సోమవారం నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో వందేమాతరం ప్రార్థన గీతంగా మారుతుందని.. ముఖ్యమంత్రి సువేందు అధికారి అసెంబ్లీలో మీడియాకు తెలిపారు. గతంలో బెంగాల్‌లోని పాఠశాలల్లో రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన జాతీయ గీతం 'జనగణమన' మాత్రమే పాడేవారు.గత తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రభుత్వం 1905 నాటి బెంగాల్ విభజన ఉద్యమ సమయంలో ఠాగూర్ రాసిన 'బంగ్లార్ మాటి బంగ్లార్ జోల్' పాటను రాష్ట్ర గీతంగా ప్రవేశపెట్టింది. ఇప్పుడు బంకిం చంద్ర ఛటోపాధ్యాయ రాసిన జాతీయ గీతం 'వందేమాతరం' కూడా ఈ జాబితాలో చేర్చింది. ఇప్పుడు బంకించంద్ర ఛటోపాధ్యాయ రాసిన జాతీయ గీతం 'వందేమాతరం' కూడా ఈ జాబితాలో చేర్చడంతో తక్కువ సమయంలో ఈ పాటలన్నింటినీ ఏ క్రమంలో పాడాలనే అంశంపై ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ మొదలైంది. -
కీలక కేసు.. లాయర్ అవతారమెత్తిన మమతా బెనర్జీ
కోల్‌కాతా: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ.. న్యాయవాది దుస్తుల్లో కలకత్తా హైకోర్టుకు చేరుకున్నారు. తన పార్టీ తరపున కీలకమైన కేసులో వాదించేందుకు ఆమె సిద్ధమయ్యారు. ఎన్నికల అనంతర హింస కేసులో ఆమె తన వాదనలు వినిపించనున్నారు.ఆమెతో పాటు తృణమూల్ కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీ కల్యాణ్ బెనర్జీ, ఆయన కుమారుడు శీర్షాన్య బంద్యోపాధ్యాయ కూడా ఉన్నారు. వీరిద్దరూ వృత్తిరీత్యా న్యాయవాదులు. శీర్షాన్య బందోపాధ్యాయ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు సంబంధించిన పలు అంశాలపై మమతా ప్రశ్నలు సంధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.కాగా, ఎన్నికల అనంతరం పశ్చిమ బెంగాల్లో హింస ప్రజ్వరిల్లింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో పలువురు మరణించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పర దాడులకు దిగారు.ఈ హింసలో నలుగురు మృతి చెందగా, వందలాది మంది గాయపడ్డారు. 200కి పైగా ఎఫ్ఐఆర్లు నమోదు కాగా.. 400కి పైగా అరెస్టులు జరిగాయి. బీజేపీ గెలుపు తర్వాత తమ కార్యకర్తలపై దాడులు జరిగాయని.. పలువురు మరణించారని ఆరోపిస్తూ కలకత్తా హైకోర్టులో టీఎంసీ పిటిషన్ వేసింది. మరోవైపు టీఎంసీ కార్యకర్తలు తమపై దాడులు చేస్తున్నారంటూ బీజేపీ ఆరోపిస్తుంది. #WATCH | Kolkata | Former West Bengal Chief Minister and TMC chief Mamata Banerjee, wearing a lawyer's court, arrives at the Calcutta High Court to appear before Chief Justice HC Sujoy Pal, in connection with the post-poll violence PIL case. She is expected to raise questions on… pic.twitter.com/8u9bTwrZfI— ANI (@ANI) May 14, 2026 -
అచ్చం ప్రధానిలాగే చేసిన సీఎం
కోల్‌కతా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అనుసరిస్తూ పశ్చిమ బెంగాల్ కొత్త ముఖ్యమంత్రి సువేందు అధికారి బుధవారం శాసనసభలోకి ప్రవేశించే ముందు సాష్టాంగ నమస్కారం చేశారు. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం వేళ సువేందు అధికారి శాసనసభకు చేరుకున్నారు. సభలోకి ప్రవేశించే ముందు, గౌరవ సూచకంగా శాసనసభ మెట్లపై సాష్టాంగ నమస్కారం చేశారు.కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో మే 9న జరిగిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాష్టాంగ నమస్కారం చేస్తూ వేదికపై ప్రజలకు నమస్కరించిన విషయం తెలిసిందే. ఇటీవల ముగిసిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ఘన విజయాన్ని అందించినందుకుగానూ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన అలా చేశారు. ఆ సమయంలో మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.బాధ్యతలు చేపట్టిన వెంటనే పశ్చిమ బెంగాల్ కొత్త ముఖ్యమంత్రి ఆరు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆరోగ్య పథకం ఆయుష్మాన్ భారత్ అమలు చేయడం, 45 రోజుల్లో బంగ్లాదేశ్ సరిహద్దు వెంట కంచె నిర్మాణం చేపట్టేందుకు సరిహద్దు భద్రతా దళానికి భూమి కేటాయించడం వాటిలో ఉన్నాయి.నందిగ్రామ్ స్థానానికి రాజీనామాపశ్చిమ బెంగాల్ కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికైన సువేందు అధికారి తాను భవానీపూర్ అసెంబ్లీ స్థానంలో ఎమ్మెల్యేగా కొనసాగుతానని, నందిగ్రామ్ స్థానానికి రాజీనామా చేస్తానని బుధవారం ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ పూర్తిగా ఓడించడమే కాకుండా.. మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కూడా ఆమె కంచుకోటలాంటి భవానీపూర్‌లో ఓడించింది. బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో ఆమె 15,000కుపైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇప్పుడు భవానీపూర్ నుంచే సువేందు అధికారి ఎమ్మెల్యేగా కొనసాగాలని నిర్ణయించుకున్నారు. -
మమతను ముంచిన ముస్లింలు.. BJPని గెలిపించిన హిందూ ఓటు బ్యాంకు
-
ఎస్ఐఆర్పై సుప్రీంకోర్టుకు మమత : షాకింగ్ రియాక్షన్
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు , ఓటర్ల జాబితా నుండి భారీగా పేర్ల తొలగింపుపై రేగిన వివాదం సోమవారం సుప్రీంకోర్టుకు చేరింది. ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా 90.8 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించడంపై తృణమూల్ కాంగ్రెస్ (TMC) అభ్యంతరం వ్యక్తం చేస్తూ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ పిటిషన్ల పరిష్కారంపై సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.2021లో తమ పార్టీ గెలుచుకుని, ఇపుడు (2026 అసెంబ్లీ ఎన్నికల్లో) బీజేపీకి ఖాతాలో చేరిన 31 స్థానాల్లో ఈ తొలగింపు వల్ల ఓట్ల లెక్కింపుపై తీవ్ర ప్రభావం పడిందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. ఈ 31 స్థానాల్లో ప్రతి దానిలోనూ తొలగించిన ఓటర్ల సంఖ్య, గత ఎన్నికల్లో తృణమూల్ అభ్యర్థుల గెలుపు మార్జిన్ కంటే ఎక్కువగా ఉందని పార్టీ ఎంపీ, సీనియర్ న్యాయవాది ల్ కళ్యాణ్ బెనర్జీ ఎత్తి చూపారు. చాలా సందర్భాల్లో ఈ సంఖ్యలు దాదాపు ఒకేలా ఉన్నాయని కోర్టుకు వివరించారు. ఉదాహరణకు, ఒకచోట టీఎంసీ అభ్యర్థి 862 ఓట్లతో ఓడిపోగా, అక్కడ 5,000 మంది పేర్లను తొలగించారని పేర్కొన్నారు.ఓటర్ల జాబితా నుండి తొలగింపుపై అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్న సమయంలో, తక్కువ మెజారిటీతో ఫలితాలు ప్రభావితమై ఉంటే.. బాధితులు 'ఎలక్షన్ పిటిషన్' దాఖలు చేయవచ్చని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 207 స్థానాలను గెలుచుకుని బెంగాల్లో తొలిసారి అధికారాన్ని దక్కించుకుంది. ఘుస్పైథియా' లేదా అక్రమ చొరబాటుదారులు అంశాన్ని బీజేపీ ప్రచారాస్త్రంగా మార్చుకోగా, అట్టడుగు వర్గాల ఓట్లను తొలగించడానికి బీజేపీ, ఈసీ కుమ్మక్కయ్యాయని మమతా బెనర్జీ ప్రభుత్వం ఆరోపించింది.ఇదీ చదవండి: ఇప్పటికీ ఇండియన్స్‌ని ‘కూలీ’ అంటారు : నేనేమి సిగ్గుపడనుఈ పిటిషన్ల పరిష్కారంపై ప్రస్తుత రేటు ప్రకారం, పెండింగ్‌లో ఉన్న లక్షలాది దరఖాస్తులను పరిష్కరించడానికి మరో నాలుగేళ్లు పట్టే అవకాశం ఉందని న్యాయవాది మేనకా గురుస్వామి కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. టీఎంసీ , బీజేపీ మధ్య ఓట్ల తేడా సుమారు 32 లక్షలు కాగా, ఓటర్ల జాబితా నుండి తొలగించినందుకు వ్యతిరేకంగా దాఖలైన 35 లక్షల దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయన్నారు.ఇదీ చదవండి: అంబానీ చిన్నకోడలు, వెనిస్ బినాలే లుక్, స్పెషల్ ఏంటంటే?ఎన్నికల సంఘం (EC) వాదనఅయితే ఓటర్ల తొలగింపు వల్ల టీఎంసీ నష్టపోయిందన్న వాదనను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. ఈ ఐదు స్థానాలనూ తృణమూల్ కాంగ్రెస్ గెలుచుకుందని ఈసీ వాదించింది.అత్యధికంగా ఓటర్ల తొలగింపు జరిగిన మాల్దా, ముర్షిదాబాద్ ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో (సుజాపూర్, రఘునాథ్గంజ్ వంటివి) టీఎంసీయే విజయం సాధించిందని ఈసీ గణాంకాలతో వివరించింది. కాగా తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్ రాష్ట్రంలోని 294 స్థానాలకు గాను బీజేపీ 207 స్థానాలను గెలుచుకుంది. దాదాపు 15 ఏళ్ల మమతా బెనర్జీకోటను దెబ్బ కొట్టి, ఘన విజయాన్ని నమోదు చేసింది. బెంగాల్లో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇదీ చదవండి: రూ. లక్ష కోట్ల నష్టం, పెట్రోలు పొదుపు : మోదీ విజ్ఞప్తిలోని మర్మం ఇదేనా? -
భారత బోర్డర్.. బెంగాల్ సీఎం సంచలన నిర్ణయం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కీలక నిర్ణయం తీసుకున్నారు. మన దేశ బోర్డర్లో రక్షణ కోసం బీఎస్ఎఫ్కు ల్యాండ్ బదిలీ చేసే దిశగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో దాదాపు 127 కిలోమీటర్ల మేర బీఎస్ఎఫ్ కోసం కేంద్ర హోంశాఖ ఫెన్సింగ్ వేయనుంది. రానున్న 45 రోజుల్లో బీఎస్ఎఫ్కు తగిన భూమిని అప్పగించనున్నట్టు సీఎం సువేందు తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు.పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బీఎస్ఎఫ్ (BSF) కోసం సరిహద్దు భద్రతను బలోపేతం చేయడానికి భూమి కేటాయింపులు ప్రారంభించింది. తాజాగా సీఎం సువేందు అధికారి బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద ఫెన్సింగ్ కోసం భూమి బదిలీకి ఆమోదం తెలిపారు. అయితే, కలకత్తా హైకోర్టు ఇప్పటివరకు కేటాయింపులు ఆలస్యం కావడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించింది. కాగా, గతంలో మమతా బెనర్జీ ప్రభుత్వం బీఎస్ఎఫ్కు భూమి ఇవ్వడంలో నిర్లక్ష్యం చూపించారని ఆరోపణలు ఉన్నాయి. 127 కిలోమీటర్లకు గాను.. కేవలం 8 కిలోమీటర్లే మమత సర్కార్ కేటాయింపులు చేసింది. ప్రభావం ఇలా.. సరిహద్దు భద్రత: బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద అక్రమ రవాణా, చొరబాటు తగ్గించడానికి ఫెన్సింగ్ కీలకం.బీఎస్ఎఫ్ బలోపేతం: కొత్త అవుట్‌పోస్టులు, ఫెన్సింగ్ వల్ల BSFకు పర్యవేక్షణ సులభం అవుతుంది.రాజకీయ ప్రభావం: సువేందు అధికారి ప్రభుత్వం బీఎస్ఎఫ్కు మద్దతు ఇస్తూ, కేంద్రంతో సంబంధాలను బలోపేతం చేస్తోంది.Suvendu government's first big move!▶️Suvendu transfers land for border fencing to BSF. #SuvenduAdhikari #WestBengal pic.twitter.com/xL3gHjmN83— IndiaToday (@IndiaToday) May 11, 2026 -
సువేందు అలా చేయకుంటే.. మారణహోమం: టీఎంసీ బహిష్కృత నేత
కోల్‌కతా: టీఎంసీ బహిష్కృత నేత రిజుదత్తా బెంగాల్ ముఖ్యమంత్రిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం సువేందు అధికారి సంయమనంతో దాదాపు ఐదువేల మంది తృణముల్ కాంగ్రెస్ కార్యకర్తల ప్రాణాలు కాపాడారన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం సువేందు తన వ్యక్తిగత సహాయకుడు దారుణ హత్యకు గురైనప్పటికీ, ప్రతీకారానికి పిలుపునివ్వకుండా శాంతిని పాటించారని లేదంటే భారీ హింస జరిగేదన్నారు.పశ్చిమబెంగాల్‌కు మమతా బెనర్జీ తర్వాత సువేందు అధికారే సీఎంగా అర్హుడైన వ్యక్తి అని కొనియాడారు. మమతా బెనర్జీని నందిగ్రామ్‌లో ఓడించిన రికార్డు ఆయనకు ఉందని, ఆయన రాజకీయ ప్రస్థానం అద్వితీయమని ప్రశంసల వర్షం కురిపించారు.ప్రైవేట్ సంస్థైన ఐ-ప్యాక్ చేతుల్లోకి టీఎంసీ వెళ్లిపోయిందని దీనికి మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ బాధ్యత వహించాలని దత్తా విమర్శించారు.పార్టీ ఓటమికి అభిషేక్ బెనర్జీ ఒంటెత్తు పోకడలే కారణమని కృష్ణేందు నారాయణ్ చౌదరి, అటిన్ ఘోష్ వంటి సీనియర్ నేతలు సైతం తృణముల్ కాంగ్రెస్ ఓటమికి కారణమన్నారు.అయితే రిజూదత్తా వ్యాఖ్యలపై టీఎంసీ స్పందించింది. ఇవన్నీ సదరు వ్యక్తుల వ్యక్తిగత అభిప్రాయాలని, పార్టీకి వీటికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. పార్టీ అధికారికంగా ప్రకటించే అంశాలనే ప్రామాణికంగా తీసుకోవాలని కోరింది. కాగా రిజుదత్తా టీఎంసీ ప్రతినిధి క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డారనే నెపంతో ఆయనను పార్టీ ఆరేళ్లపాటు సస్పెండ్ చేసింది. కాగా ఎన్నికల ఫలితాల అనంతరం సువేందు అధికారి పీఏ చంద్రనాథ్ రథ్ దారుణ హత్యకు గురయ్యారు. కారులో వెళుతున్న ఆయనను అడ్డగించిన దుండగులు పాయింట్ బ్లాక్ రేంజ్లో కాల్చిచంపారు. దీనిపై కన్నీటీ పర్యంతమైన సువేందు అధికారి నిందితులను ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టాది లేదని తేల్చిచెప్పారు. -
‘2026 తీర్పు’: పీఠం కదిలింది.. చరిత్ర మారింది!
భారతదేశ రాజకీయాల్లో 2026 అసెంబ్లీ ఎన్నికలు ఒక కీలక మలుపుగా నిలిచాయి. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో వెలువడిన ఫలితాలు దేశ రాజకీయ గమనాన్ని మార్చేలా ఉన్నాయి. అస్సాం, పుదుచ్చేరిల్లో యథాతథ స్థితి కొనసాగినప్పటికీ, మిగిలిన మూడు రాష్ట్రాల్లో వచ్చిన మార్పులు సామాన్యులను సైతం విస్మయానికి గురిచేస్తున్నాయి. ఒకవైపు ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం, మరోవైపు జాతీయ పార్టీల వ్యూహాలు, ఇంకోవైపు సరికొత్త రాజకీయ శక్తుల ఉద్భవం వెరసి.. భారతదేశ సమాఖ్య వ్యవస్థ, ప్రజాస్వామ్య భవిష్యత్తుపై కొత్త చర్చకు తెరలేపాయి.కేరళలో కాంగ్రెస్ పునరుజ్జీవంకేరళ రాజకీయ చరిత్రలో ఎల్డిఎఫ్ , యూడిఎఫ్ కూటములు దశాబ్దాలుగా మారుతూ అధికారంలోకి వస్తున్నాయి. అయితే 2021లో పినరయి విజయన్ నాయకత్వంలోని ఎల్డిఎఫ్ వరుసగా రెండోసారి విజయం సాధించి, ఆ సంప్రదాయాన్ని బ్రేక్ చేసింది. అయితే గడిచిన ఐదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ సరికొత్త నాయకత్వంతో, రెట్టింపు ఉత్సాహంతో ప్రజల్లోకి దూసుకు వెళ్ళింది. ఫలితం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. లౌకికవాదాన్ని, ఆర్థిక పురోగతిని, సమాఖ్య స్ఫూర్తిని కాపాడాల్సిన బాధ్యత ఇప్పుడు కేరళలో బలపడిన యూడిఎఫ్ భాగస్వామ్య పక్షాలపై ఉంది.తమిళనాట ‘విజయ్’ మేజిక్తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. కానీ ఈసారి ఫలితాలు అత్యంత సంక్లిష్టంగా ఉన్నాయి. 2021లో ఘనవిజయం సాధించిన ఎంకె స్టాలిన్ ప్రభుత్వం ఆర్థిక వృద్ధి, సంక్షేమ పథకాల్లో అద్భుతంగా రాణించినప్పటికీ, ఇతర అంశాలు ఓటర్లను ప్రభావితం చేశాయి. ముఖ్యంగా సినీ హీరో విజయ్ రాజకీయ అరంగేట్రం ఒక పెను తుఫానులా మారింది. రెండేళ్ల క్రితం పెట్టిన టీవీకే పార్టీ.. ఎన్నికలకు పది రోజుల ముందు పుంజుకుని ఏకంగా 108 నియోజకవర్గాల్లో జయకేతనం ఎగురవేసింది. ఎటువంటి భారీ ప్రచారాలు లేకుండా, కేవలం సోషల్ మీడియా మీమ్స్, పాటలు, విజయ్ ప్రసంగాలతోనే ఈ విజయం సాధించడం విశేషం. మేజిక్ ఫిగర్‌కు 11 సీట్ల దూరంలో నిలిచిన టీవీకేకు కాంగ్రెస్, వామపక్షాలు మద్దతు తెలపడంతో నూతన ప్రభుత్వానికి మార్గం సుగమం అయ్యింది.బెంగాల్లో తృణమూల్ వెనుకంజదేశ రాజకీయ దిశను మార్చగల సత్తా ఉన్న పశ్చిమ బెంగాల్ ఫలితాలు ఈసారి దిగ్భ్రాంతిని కలిగించాయి. పదేళ్లుగా పాగా వేయాలని చూస్తున్న బీజేపీ, అక్కడ బలమైన శక్తిగా ఎదిగింది. గత మూడు పర్యాయాలుగా అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్‌పై వ్యతిరేకత ఒక కారణమైతే, ఓటర్ల జాబితాలో జరిగిన భారీ మార్పులు మరో ప్రధాన కారణం. అనేక కుటుంబాల్లో తలిదండ్రులకు ఓటు హక్కు ఉంటే పిల్లలకు లేకపోవడం, కొన్నిచోట్ల వైరుధ్యాలు తలెత్తడం వంటి అంశాలు ప్రజాస్వామ్యంపై మచ్చగా నిలిచాయి. న్యాయవ్యవస్థ కూడా ఈ విషయంలో ఓటర్లను ఆదుకోలేకపోయింది. వరుస విజయాలతో ఉన్న దీదీకి ఈ ఓటమి గట్టి ఎదురుదెబ్బగా మారింది.ఈశాన్యంలోనూ కమలనాథుల హవా పశ్చిమ బెంగాల్ విజయం తర్వాత బీజేపీ ఆధిపత్యం దేశవ్యాప్తంగా దాదాపు పూర్తయింది. మహారాష్ట్ర, గుజరాత్ వంటి పశ్చిమ రాష్ట్రాల నుండి హిందీ బెల్ట్ వరకు, ఇప్పుడు తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లోనూ కమలనాథుల హవా నడుస్తోంది. అయితే, దక్షిణాది ఐదు రాష్ట్రాలు మాత్రం బీజేపీకి ఇప్పటికీ ఇనుప కోటలుగానే మిగిలాయి. కేరళ, తమిళనాడులో పాగా వేయడానికి ఆ పార్టీ చేసిన ప్రయత్నాలను అక్కడి ఓటర్లు తిప్పికొట్టారు. కేరళలో 3, తమిళనాడులో 1 సీటుకు మాత్రమే బీజేపీ పరిమితమైంది. ఉత్తరాదిని శాసిస్తున్నా, దక్షిణాది మాత్రం బీజేపీని సుదూరంగానే ఉంచింది.సమాఖ్య వ్యవస్థకు పొంచి ఉన్న ముప్పు?బీజేపీ వరుస విజయాలు సాధిస్తే భవిష్యత్తులో ఏకపార్టీ పాలన వైపు, హిందూత్వ భావజాలం వైపు రాజ్యాంగ సవరణలు జరిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇది సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసే అవకాశం ఉందంటున్నారు. దేశాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా, లౌకిక రాజ్యంగా ఉంచాలంటే ప్రతిపక్షాల ఐక్యత అనివార్యం. 2024లో కొంత విజయం సాధించిన ఇండియా కూటమి ఆ తర్వాత నెమ్మదించినట్లు కనిపిస్తోంది. అయితే పశ్చిమ బెంగాల్ ఓటమి తర్వాత మమతా బెనర్జీ కూటమిని బలోపేతం చేస్తానని ప్రకటించారు. అటు స్టాలిన్ కూడా బీజేపీని సైద్ధాంతిక శత్రువుగా పరిగణిస్తున్నారు. కొత్తగా పుంజుకున్న విజయ్ (టీవీకే) కూడా ఈ కూటమిలోకి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రాల స్థాయిలో విభేదాలు ఉన్నప్పటికీ, జాతీయ స్థాయిలో దేశ భవిష్యత్తు కోసం ఈ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావడం ఇప్పుడు చారిత్రక అవసరం అని విశ్లేషకులు అంటున్నారు.ఇది కూడా చదవండి: కేబినెట్లో ఏకైక మగువ.. ఎవరీ అగ్నిమిత్ర పాల్? -
బెంగాల్ సీఎంగా సువేందు ప్రమాణం
కోల్‌కతా: పోరాటాల గడ్డ పశ్చిమబెంగాల్లో కమలనాథుల పరిపాలనా శకానికి నాందిపలుకుతూ ప్రధాని మోదీ సమక్షంలో రాష్ట్ర అగ్రనేత సువేందు అధికారి శనివారం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. తద్వారా రాష్ట్రంలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తొలి బీజేపీ నాయకునిగా సువేందు చరిత్ర సృష్టించారు. ప్రధాని, కేంద్ర మంత్రులు, పలువురు బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ కూటమి పార్టీల అగ్రనేతల సమక్షంలో అత్యంత అట్టహాసంగా ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించారు. గవర్నర్ ఆర్ఎన్ రవి అధికారి చేత ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. తర్వాత ఉప్పొంగిపోయిన ప్రధాని తమకు అపూర్వ విజయాన్ని అందించిన బెంగాల్ ఓటర్లకు మోకాళ్లపై ఒంగి నేలకు తల ఆన్చి నమస్కారంచేశారు. ఈ సందర్భంగా బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లోని ప్రమాణస్వీకార ప్రాంగణం జైశ్రీరాం, భారత్ మాతాకీ జై నినాదాలతో మార్మోగిపోయింది. భవానీపూర్‌లో మమతా బెనర్జీని మట్టికరిపించి, నందిగ్రామ్‌లో విజయాన్ని సాధించిన సువేందుకు ప్రధాని ప్రమాణ స్వీకారం తర్వాత శుభాకాంక్షలు తెలిపారు. సువేందు తర్వాత సీనియర్ బీజేపీ నేత దిలీప్ ఘోష్, అగ్నిమిత్ర పాల్, అశోక్ కీర్తనీయ, క్షుదిరాం టుడు, నితీశ్ ప్రామాణిక్‌లు కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. బ్రాహ్మణ, ఓబీసీ, గిరిజన, కాయస్థ, మథువా, రాజ్‌వంశీ ఇలా ఆరు సామాజిక వర్గాలకు చెందిన నేతలను కేబినెట్లోకి తీసుకుని బీజేపీ తమ సామాజిక సమానత్వాన్ని చాటింది. రాష్ట్రంలో ఉత్తర, దక్షిణ ప్రాంతాల నేతలకు సమప్రాధాన్యతనిచ్చింది. సోమవారం రాజ్‌భవన్‌లో మరికొందరు నేతలు మంత్రులుగా ప్రమాణంచేయనున్నారు. ప్రమాణంచేసిన మంత్రులకు ఇంకా శాఖలను కేటాయించలేదు. సోమవారం శాఖలను కేటాయించి తొలి కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. పెద్దసంఖ్యలో హాజరైన కమలదళ సభ్యులు తొలిసారిగా రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్న క్షణాలను చిరస్మరణీయంగా మార్చాలని బీజేపీ నిర్ణయించింది. ఇందుకోసం భారీసంఖ్యలో అభిమానులు, కార్యకర్తలను తరలించారు. ప్రాంగణమంతా భారీ ఎల్ఈడీ తెరలను ఏర్పాటుచేసి సువేందు, మోదీల పాత ప్రసంగాలను ప్రసారంచేశారు. ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్ష ప్రసారంచేశారు. పార్టీ జెండాల రెపరెపలతో ప్రాంగణం కాషాయమయమైంది. ‘‘ఈరోజు కోసం ఎన్నాళ్ల నుంచో వేచిచూస్తున్నా. ఎట్టకేలకు మా ప్రభుత్వం వచ్చింది. ఇక టీఎంసీ అరాచకాలకు చెట్లుచీటీ పడుతుంది. సరిహద్దు ఆవలినుంచి చొరబాట్లు ఆగిపోతాయి. అరాచకాలను తట్టుకోలేక నా కుమారుడు సొంత రాష్ట్రం నుంచి వలసపోయాడు. ఇప్పుడు తిరిగొస్తాడు’’అని 80 ఏళ్ల భగవతీదేవి చెప్పారు. హిందు ప్రభుత్వపాలన ఆరంభాన్ని కళ్లారా చూసేందుకు వచ్చానని 70ఏళ్ల నవదీ్వప్ మఠ్‌లో ప్రజ్ఞాన్ మహరాజ్అనే సాధువు చెప్పారు. బీజేపీ ప్రభుత్వం కొలువుతీరే క్షణాలను కళ్లారా చూడాలని కెనడానుంచి వచ్చానని 50 ఏళ్ల వ్యక్తి చెప్పారు. ప్రత్యేక ఆకర్షణగా ఝాల్మురీ.. ప్రచారంవేళ ప్రధాని రుచిచూసిన బెంగాలీ చిరుతిండి ఝాల్మురీ శనివారం ప్రమాణస్వీకార ప్రాంగణంలో అందర్నీ నోరూరించింది. బీజేపీ నేతలు ప్రత్యేకంగా ఈ స్టాళ్లను ప్రాంగణంలో ఏర్పాటుచేశారు. మరవరాలు, పచ్చి మిరప, మసాలా దినుసులతో ఝాల్మురీ చేస్తారు. దీనిని తినేందుకు పెద్దసంఖ్యలో జనం ఎగబడ్డారు. 20 స్టాళ్లు సరిపోక సొంతంగా కొందరు వ్యాపారులు సైతం స్టాళ్లు పెట్టుకున్నారు. ‘‘ఝాల్మురీ కాస్తంత ఘాటుగాఉంటుంది. కానీ బీజేపీ విజయానికి గుర్తుగా తీపి జోడించాం. అయినా వేగంగా సరుకు అమ్ముడపోయింది’’అని 24 నార్త్పరగణాల జిల్లా నుంచి స్టాల్ పెట్టిన మనీశ్ యాదవ్ చెప్పారు. బీజేపీ జెండా రంగుల్లో తయారుచేసిన రసగుల్లా అయితే హాట్‌కేకులా అమ్ముడుపోయింది. ‘‘మామూలుగా దొరికే ఝాల్మురీ కంటే ఇక్కడి ఝాల్మురీ నిజంగా బాగుంది’’అని కోల్‌కతాలోని గోలీగంజ్ వాసి మంజరి బసు అన్నారు.కదలివచ్చిన తారాలోకం ప్రమాణ స్వీకారోత్సవంలో బెంగాలీ సినీలోకం తరలివచ్చింది. ఫిల్మ్, ఎంటర్టైన్మెంట్ రంగం నుంచి పలువురు ప్రముఖులు కార్యక్రమానికి విచ్చేశారు. ప్రసేన్జీత్ ఛట్జీ, జీషు సేన్గుప్తాలతోపాటు శాస్త్రీయ కళాకారులు పండిత్ అజయ్ చక్రవర్తి, డ్యాన్సర్ మమతా శంకర్, నటుడు రిషి కౌశిక్, పాయల్ సర్కార్సహా బెంగాలీ టెలివిజన్ రంగ ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు.వాళ్లకు న్యాయం చేయాలి: సీఎం తల్లి సువేందు సీఎంగా ప్రమాణం చేశాక ఆయన తల్లిదండ్రులు గాయత్రి, సిసిర్ అధికారులు అమితానందం వ్యక్తంచేశారు. తూర్పు మేదినీపూర్‌లోని కాంతి పట్టణంలో సొంతింట్లో వాళ్లు మాట్లాడారు. ‘‘మాకొడుకు సీఎం అయ్యాడని మాకంటే ఎక్కువగా బెంగాలీ ప్రజలే సంతోషిస్తున్నారు. సువేందు హయాంలో ఇకనైనా ఆర్జీకర్ వైద్యురాలి హత్యోదంతంలో బాధితులకు న్యాయం జరగాలి. ఇలాంటి అకృత్యాల్లో నిందితులకు కఠినంగా శిక్షలుపడేలా చేయాలని కోరుకుంటున్నా’’అని తల్లి గాయత్రి అన్నారు. సువేందు తండ్రి సిసిర్ గతంలో మూడుసార్లు ఎంపీగా గెలిచారు.బీజేపీ అమరులకు మోదీ నివాళులు గత 15 ఏళ్లలో మమతాబెనర్జీ ప్రభుత్వ హయాంలో టీఎంసీ దాడుల్లో మృతిచెందిన బీజేపీ నేతలు,కార్యకర్తలకు నివాళిగా ఏర్పాటుచేసిన తాత్కాలిక స్మారకం వద్ద ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా అంజలి ఘటించారు. ప్రమాణస్వీకార ప్రాంగణంలో ఈ స్మారకం ఏర్పాటుచేశారు. ‘‘కోల్‌కతాలో ఓవైపు బీజేపీ తొలి సర్కార్ కొలువుతీరుతుంటే మేం మాత్రం తొలుత టీఎంసీ అరాచకపాలనలో అమరులైన బీజేపీ కార్యకర్తలకు నివాళులరి్పంచాం. వీళ్ల త్యాగం సదా మాకు స్ఫూర్తిదాయకం’’అని తర్వాత మోదీ తన ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్‌చేశారు. వృద్ధ నేతకు మోదీ పాదాభివందనం 98 ఏళ్ల బీజేపీ నేత మఖన్‌లాల్ సర్కార్‌ను బీజేపీ ప్రత్యేకంగా వేదిక మీదకు ఆహ్వానించింది. శాలువా కప్పి ఆయన కాళ్లను ప్రధాని మోదీ మొక్కారు. తర్వాత ఆప్యాయంగా హత్తుకున్నారు. యోగక్షేమాలు అడిగి తెల్సుకున్నారు. జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామప్రసాద ముఖర్జీతో కలిసి 1952లో కశ్మీర్లో త్రివర్ణపతాకాన్ని ఎగరేసిన బృందంలో మఖన్‌లాల్ ఉన్నారు. ఈ సందర్భంగా ఈయననూ అరెస్ట్‌చేశారు. ‘‘స్వాతం్రత్యానంతరం జాతీయోద్యమంలో చురుగ్గా పాల్గొని ఇప్పటికీ సజీవ స్ఫూర్తిగా ఉన్న అతికొద్ది మందిలో మఖన్‌లాల్ ఒకరు’’అని బీజేపీ కొనియాడింది. 1980లో బీజేపీ ఏర్పడ్డాక పశ్చిమబెంగాల్లోని వెస్ట్ దినాజ్‌పూర్, జల్పాయ్గురి, డార్జిలింగ్ జిల్లాలకు మఖన్‌లాల్ సమన్వయకర్తగా సేవలందించారు. 1981 నుంచి ఏడేళ్లపాటు జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు. -
మమతా బెనర్జీ కొత్త లాజిక్.. !
పశ్చిమ బెంగాల్లో టీఎంసీ 15 ఏళ్ల పాలన ముగిసిపోయింది.. బీజేపీ నుంచి సువేందు అధికారి ప్రమాణ స్వీకారం కూడా జరిగిపోయింది. అంటే మమతా బెనర్జీ మాజీ సీఎం అయినట్లే కదా. కానీ తాను సీఎం పదవికి రాజీనామా చేయనంటూ పట్టుబట్టుకుని కూర్చున్న మమతకు మాజీ అనిపించుకోవడం ఇష్టం లేనట్లు ఉంది. అందుకే తన సోషల్ మీడియా ప్రొఫైల్స్‌లో ‘మాజీ సీఎం’ అని కాకుండా కొత్త భాష్యం చెప్పారు. 15,16,17 విధాన సభలకు ముఖ్యమంత్రి అంటూ కొత్తగా ట్యాగ్ చేసుకున్నారు మమతా. దీనివల్ల కలిసొచ్చేది ఏమీ లేకపోయినా, ఇలా చేయడం మాత్రం చర్చనీయాంశమైంది. ఆది నుంచి తాము నైతికంగా ఓడిపోలేదని, బీజేపీనే కుట్ర చేసి ఓడించిందని వాదిస్తూ వస్తున్నారు మమతా. దానిలో భాగంగా సీఎం పదవికి రాజీనామా కూడా చేయనని కూడా చెప్పేశారు. ఈ క్రమంలోనే శనివారం(మే 9వ తేదీ) ఉదయం 11 గంటల వరకూ తన రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించలేదు. కాకపోతే ఆపై తన ‘ఎక్స్’ అకౌంట్లో మాత్రం స్వల్ప మార్పులు చేసుకున్నారు. మస్క్ జోక్యం చేసుకోవాలి..దీనిపై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ అంశానికి సంబంధించి ‘ఎక్స్’ ప్రధాన యజమాని ఎలాన్ మస్క్ జోక్యం చేసుకోవాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఆమె ప్రొఫైల్ బయోను మస్క్ మార్చాలని కోరుతున్నారు. ఆమె అకౌంట్‌ను సస్పెండ్ చేయాలని మరికొందరు అంటున్నారు. -
‘మనందరి తొలి శత్రువు బీజేపీనే’
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పగ్గాలు చేపట్టిన బీజేపీని ఎదుర్కోవడానికి అన్ని ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలని టీఎంసీ అధినేత్రి, మాజీ సీఎం మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. 15 ఏళ్ల టీఎంసీ పాలనకు ముగింపు పలుకుతూ బీజేపీకి ప్రజలు అధికారం కట్టబెట్టి, సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేసిన తరుణంలో మమతా ఈ వ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీల శత్రవు బీజేపీనేనని, అందుకోసం అంతా ఏకం కావాలన్నారు మమతా. పశ్చిమ బెంగాల్‌లోని అన్ని ప్రతిపక్ష పార్టీలు ఒక ఉమ్మడి వేదిక కింద ఏకం కావాలని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ‘ వామపక్ష, అతివాద వామపక్షాలతో సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి ఒక ఉమ్మడి వేదికను ఏర్పాటు చేయాలని నేను పిలుపునిస్తున్నా.బీజేపీని వ్యతిరేకిస్తున్న విద్యార్థి సంఘాలు, ఎన్జీవోలు కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఏకం కావాలి’ అని అన్నారు. బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి బీజేపీ నాయకుడిగా సువేందు అధికారి నిలిచిన తరుణంలోనే మమతా ఈ సందేశం ఇచ్చారు. మే 4న జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించడంతో మమతా పార్టీ ఘోర పరాజయం తప్పలేదు. ఆ సమయంలో బీజేపీపై మమత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇది బీజేపీ గెలుపు కాదని, కుట్ర చేసి గెలిచారని ధ్వజమెత్తారు. నైతికంగా గెలుపు మాత్రం తమదేనని మమతా పేర్కొన్నారు. -
బెంగాల్ ప్రజలకు మోకరిల్లి.. నమస్కారం చేసిన మోదీ
-
మమతా, అభిషేక్‌లకు పోలీసుల షాక్!
కోల్‌కతా: కాలం మారుతుంటుంది.. దీనితోపాటు ప్రజలు, అధికార యంత్రాంగాలు కూడా మారుతుంటాయి. పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామ క్రమంలో కోల్‌కతా పోలీసులు కూడా మారిపోయారు. వారు తమ అధికారిక ఎక్స్ ఖాతా నుంచి మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ, పలువురు ఇతర తృణమూల్ కాంగ్రెస్ నాయకులను అన్‌ఫాలో చేశారు. ఇదే సమయంలో పోలీసులు ఇప్పుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పీఎంఓ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల ఖాతాలను ఫాలో కావడం మొదలుపెట్టారు. దీనికితోడు టీఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు పలువురు నేతల నివాసాల వద్ద ఉన్న అదనపు భద్రతను కూడా తొలగించారు.బెంగాల్లో భారీ రాజకీయ మార్పుపశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ నేత సువేందు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా, ఇతర ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. 55 ఏళ్ల సువేందు అధికారి.. ఒకప్పుడు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహిత రాజకీయ అనుచరునిగా మెలిగారు. పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో కీలక నేతగా వ్యవహరించారు. కాగా సువేందు అధికారి స్థిరమైన పరిపాలనను అందిస్తారని, బెంగాల్ ప్రజల అంచనాలను అందుకుంటారని అమిత్ షా నమ్మకం వ్యక్తం చేశారు.ఇది కూడా చదవండి: కేబినెట్లో ఏకైక మగువ.. ఎవరీ అగ్నిమిత్ర పాల్? -
మఖన్‌లాల్ పాదాలకు మొక్కిన మోదీ
పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్రానికి తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి శనివారం ఉదయం ప్రమాణం చేశారు. బీజేపీ అగ్రనేతలు నరేంద్ర మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ సహా ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, కేంద్ర మంత్రులు ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఓ పెద్దాయన్ని శాలువాతో సత్కరించి ఆలింగనం చేసుకున్నారు. అంతటితో ఆగకుండా పాదాభివందనం చేశారు. ‘‘బెంగాల్లో మన ప్రభుత్వం వస్తుందని చెప్పా కదా.. వచ్చింది’’ అంటూ మోదీ ఆ పెద్దాయనతో అన్నారు. ఆయన పేరు మఖన్‌లాల్ సర్కార్. పశ్చిమ బెంగాల్లోనే అత్యంత సీనియర్ బీజేపీ కార్యకర్త. ఆయన నేపథ్యం కూడా ఆసక్తికరంగానే ఉంది.బెంగాల్‌కు చెందిన మఖన్‌లాల్ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. ఆరెస్సెస్ రాజకీయ విభాగంగా.. 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్ (BJS) స్థాపించిన సంగతి తెలిసిందే. దీంతో మఖన్‌లాల్ అందులో చేరారు. "ఒక దేశం, ఒక జెండా" అనే నినాదంతో 1952లో కశ్మీర్లో జాతీయ జెండా ఎగరేయడానికి ముఖర్జీ ప్రయత్నించారు. ఆ సమయంలో మఖన్‌లాల్ కూడా ఉన్నారు. ఈ ఉద్యమంలో ఆయన అరెస్టై జైలుకు కూడా వెళ్లారు.ఆ తర్వాత.. 1977లో బీజేఎస్ జనతా పార్టీలో విలీనమై తర్వాత భారతీయ జనతా పార్టీ (BJP)గా రూపాంతరం చెందింది. టెక్నికల్‌గా మఖన్‌లాల్ బీజేపీలో కొనసాగుతూ వచ్చారు. ప్రస్తుతం ఆయన వయసు 98 ఏళ్లు. బెంగాల్లో తొలిసారి బీజేపీ అధికారం చేపట్టింది. ఈ నేపథ్యంలో గౌరవసూచీకంగా ప్రధాని మోదీ ఆయన్ని సత్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. Kolkata, West Bengal: Prime Minister Narendra Modi took blessings and felicitated Makhanlal Sarkar, one of the most senior BJP workers in West Bengal, as he attended the swearing-in ceremony of the new government pic.twitter.com/Yc1FDdlG09— IANS (@ians_india) May 9, 2026 -
Watch Live: దీదీ కంచుకోటను బద్దలు కొట్టి.. సీఎంగా సువేందు ప్రమాణ స్వీకారం
-
రాష్ట్ర మంత్రిగా కేకేఆర్ మాజీ ఆటగాడు
టీమిండియా మాజీ క్రికెటర్, కేకేఆర్ మాజీ బౌలర్ అశోక్ దిండా పశ్చిమ బెంగాల్ నూతన క్రీడా మంత్రిగా నియమితుడయ్యాడు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో 294కు గానూ 206 స్థానాల్లో విజయఢంకా మోగించిన బీజేపీ, దిండాకు తమ మంత్రివర్గంలో స్థానం కల్పించింది. దిండా మోయ్నా నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. టీఎంసీ అభ్యర్ది చందన్ మొండల్‌పై 14000 పైచిలుకు మెజార్టీతో గెలిచాడు. గత ఎన్నికల్లో (2021) స్వల్ప తేడాతో విజయం సాధించిన దిండా, ఈసారి భారీ ఆధిక్యంతో విజయం సాధించి మంత్రి అయ్యాడు.42 ఏళ్ల దిండా 2021లో క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికి బీజేపీలో చేరాడు. దిండా అంతర్జాతీయ స్థాయిలో ఎక్కువ కాలం నిలవకపోయినా, దేశీయ క్రికెట్లో అద్భుతంగా రాణించాడు. బెంగాల్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 420 వికెట్లు, లిస్ట్-ఏ క్రికెట్లో 151 వికెట్లు పడగొట్టాడు. దిండా బెంగాల్ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు.2009లో టీమిండియా అరంగేట్రం చేసి 13 వన్డేలు, 9 టీ20లు ఆడి 29 వికెట్లు తీశాడు. కుడి చేతి వాటం మీడియం పేసర్ అయిన దిండా ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చి టీమిండియా అవకాశాలు దక్కించుకున్నాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో కేకేఆర్, ఆర్సీబీ, ఢిల్లీ, పూణే వారియర్స్, రైజింగ్ పూణే జెయింట్స్ తరఫున 78 మ్యాచ్‌లు ఆడిన దిండా 69 వికెట్లు తీశాడు. 2010లో టీమిండియా ఆసియా కప్ గెలిచిన జట్టులో దిండా సభ్యుడిగా ఉన్నాడు.కాగా, గత బెంగాల్ ప్రభుత్వంలోనూ మనోజ్ తివారి అనే టీమిండియా, కేకేఆర్ మాజీ క్రికెటర్ క్రీడా మంత్రిగా వ్యవహరించాడు. అతడు తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఎన్నికైన కొంతకాలం పాటు క్రీడా శాఖను పర్యవేక్షించాడు. -
బెంగాల్ తొలి BJP ముఖ్యమంత్రిగా సువేందు అధికారి
-
బెంగాల్ సీఎం ఎవరు..? అభ్యర్థిపై కొనసాగుతున్న సస్పెన్స్
-
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ కొత్త ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఎంపికయ్యారు. బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో ఎమ్మెల్యేలు ఆయనను ఏకగ్రీవంగా సీఎంగా ఎన్నుకున్నారు. దీంతో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం శనివారం (రేపు) అధికారంలోకి రానుంది. రేపు ఉదయం 11 గంటలకు సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ కోల్‌కతాలో పర్యటించి, బీజేపీకి చెందిన కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. పశ్చిమ బెంగాల్ న్యూటౌన్‌లోని బిస్వ బంగ్లా కన్వెన్షన్ సెంటర్లో జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ వర్గాల ప్రకారం, సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనుండగా, ఇద్దరు మహిళలకు డిప్యూటీ సీఎం పదవులు కేటాయించే నిర్ణయం తీసుకున్నారు.బెంగాల్లో బీజేపీకి చెందిన తొలి ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన నందిగ్రామ్, భవానిపూర్ రెండు నియోజకవర్గాల నుంచి గెలుపొందారు. భవానిపూర్‌లో 15 వేల ఓట్ల మెజార్టీతో మమతా బెనర్జీని ఓడించారు.కౌన్సిలర్ టూ సీఎంసువేందు అధికారి పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ‘జెయింట్ కిల్లర్’గా పేరుపొందిన నేత. ఆయన కాంగ్రెస్ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి తృణమూల్ కాంగ్రెస్ ద్వారా ఎదిగి, చివరికి బీజేపీలో చేరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.జననం: 15 డిసెంబర్ 1970, కార్కులి గ్రామం, పూర్బ మెదినిపూర్, పశ్చిమ బెంగాల్తల్లిదండ్రులు: సిసిర్ అధికారి (మాజీ యూనియన్ మంత్రి, ఎంపీ), గాయత్రి అధికారివిద్య: 2011లో రబీంద్ర భారతి యూనివర్సిటీ నుంచి ఎంఏ పూర్తి చేశారువివాహం: అవివాహితుడురాజకీయ ప్రస్థానం1995: కాంగ్రెస్‌లో కాంతి మునిసిపాలిటీ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు1998: తండ్రితో కలిసి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో చేరారు2006: కాంతి దక్షిణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు, అదే సంవత్సరం కాంతి మునిసిపాలిటీ చైర్మన్‌గా కూడా అయ్యారునందిగ్రామ్ ఉద్యమం2007: నందిగ్రామ్‌లో భూసేకరణ వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించారుటీఎంసీకి ప్రజాదరణ తెచ్చారుఈ ఉద్యమం మమతా బెనర్జీని రాష్ట్ర రాజకీయాల్లో ముందుకు తెచ్చిందితృణమూల్ కాంగ్రెస్‌లో ఎదుగుదల2009: తమ్లుక్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు2014: మళ్లీ తమ్లుక్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు2016: నందిగ్రామ్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, మమతా బెనర్జీ మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా ప్రమాణం చేశారు2018–2020: నీటి వనరులు, సాగు శాఖ మంత్రిగా కూడా పనిచేశారుబీజేపీలో చేరిక2020 నవంబర్–డిసెంబర్: టీఎంసీ నుంచి రాజీనామా చేసి, 19 డిసెంబర్ 2020న అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారుకారణం: మమతా బెనర్జీ వారసుడిగా అభిషేక్ బెనర్జీని ముందుకు తేవడంపై విభేదాలుఎన్నికల విజయాలు2021: నందిగ్రామ్‌లో మమతా బెనర్జీని ఓడించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు2026: నందిగ్రామ్, భవానిపూర్ రెండింటిలోనూ గెలిచి, మమతా బెనర్జీని ఆమె స్వస్థల నియోజకవర్గంలో ఓడించారుఇది 1967 తర్వాత మొదటిసారి ఒకే వ్యక్తి రెండు నియోజకవర్గాల్లో గెలిచి, సిట్టింగ్ సీఎంను ఓడించిన ఘట్టంముఖ్య పదవులు2009–2016: లోక్‌సభ సభ్యుడు (తమ్లుక్)2016–2020: పశ్చిమ బెంగాల్ మంత్రివర్గంలో రవాణా, నీటి వనరులు శాఖలు2020–2021: జ్యూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్2021–2026: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత2026 నుంచి: పశ్చిమ బెంగాల్ 9వ ముఖ్యమంత్రిజెయింట్ కిల్లర్ అనే బిరుదు: మమతా బెనర్జీని నందిగ్రామ్ (2021), భవానిపూర్ (2026)లో ఓడించడం వల్ల ఈ పేరు వచ్చింది.నైపుణ్యం: గ్రామీణ స్థాయిలో బలమైన కేడర్ నిర్మాణం, ఉద్యమాల ద్వారా ప్రజల్లో ప్రభావం చూపడం ఆయన ప్రత్యేకత.బీజేపీ తొలి సీఎం: పశ్చిమ బెంగాల్లో బీజేపీకి చెందిన మొదటి ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు. -
భారత్‌కు బిగ్ షాకిచ్చిన బంగ్లాదేశ్
బీజింగ్: తారిఖ్ రహ్మన్ సారథ్యంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్‌తో సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపే నిర్ణయం తీసుకుంది. తీస్తా నది పునరుద్ధరణ ప్రాజెక్టులో చైనా సాయం కోరింది. తీస్తా రివర్ కాంప్రెహెన్సివ్ మేనేజ్మెంట్ అండ్ రిస్టోరేషన్ ప్రాజెక్టు(టీఆర్‌సీఎంఆర్‌పీ)కి సంబంధించిన అంశాలపై బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి కలీలుర్ రహ్మన్ బుధవారం చైనాలో ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భేటీ అయి చర్చించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.ఈ నేపథ్యంలో సాయం అందించేందుకు వాంగ్ యీ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు వెల్లడించాయి. చైనా సంస్థలు తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలని కూడా మంత్రి రహ్మన్ కోరినట్లు తెలిపాయి. తూర్పు హిమాలయాల్లో పుట్టిన తీస్తా నది సిక్కిం, పశ్చిమబెంగాల్ గుండా ప్రవహించి, బంగ్లాదేశ్‌లో సముద్రంలో కలుస్తుంది. ఈ నది బంగ్లాదేశ్‌లో సాగుకు, కోట్లాదిమంది జీవనోపాధికి ఎంతో కీలకంగా ఉంది. కాగా.. భారత, బంగ్లాదేశ్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు ఈ నదీ జలాల పంపకం కీలకంగా మారింది. ఈ పరిణామం భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉన్న దశాబ్దాల నాటి తీస్తా జలాల వివాదానికి మరోసారి తెరలేపింది.చైనా బిగ్ ప్లాన్?మరోవైపు.. భారత్-బంగ్లాదేశ్ మధ్య తీస్తా జలాల పంపిణీపై ఇంకా తుది ఒప్పందం కుదరలేదు. ఇటువంటి సమయంలో చైనా జోక్యం చేసుకోవడం వల్ల ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినే అవకాశం కూడా ఉంది. అంతేకాదు దక్షిణాసియాలో భారత్ ప్రాబల్యాన్ని తగ్గించి, తన పట్టును పెంచుకోవాలని చూస్తున్న చైనాకు ఈ ప్రాజెక్ట్ ఒక మంచి అవకాశంగా మారే అవకాశాలున్నాయి. అయితే, తీస్తా నది సిక్కిం, పశ్చిమ బెంగాల్ మీదుగా ప్రవహించి బంగ్లాదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. కాబట్టి, నది ఎగువ భాగంలో ఉన్న దేశంగా భారత్‌కు ఈ ప్రాజెక్టుపై పూర్తి హక్కులు ఉన్నాయి. బంగ్లాదేశ్ ప్రభుత్వం చైనా సహాయం కోరడం ద్వారా భారత్‌పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోందని తెలుస్తోంది.భారత్ భద్రతకు ముప్పు.. ఇదిలా ఉండగా.. తీస్తా నది బంగ్లాదేశ్‌లోని ఉత్తర ప్రాంతాలకు ప్రధాన నీటి వనరు. వేసవిలో నీటి ఎద్దడి, వర్షాకాలంలో వరదల సమస్యను పరిష్కరించడానికి బంగ్లాదేశ్ ఈ భారీ ప్రాజెక్టును తలపెట్టింది. దీనికోసం చైనా నుండి సాంకేతిక, ఆర్థిక సహాయాన్ని బంగ్లాదేశ్ ఆశిస్తోంది. ఇందులో భాగంగా తీస్తా ప్రాజెక్టులో చైనా పెట్టుబడులు పెట్టడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టులో చైనా భాగస్వామ్యం కావడం భారత్‌కు వ్యూహాత్మకంగా, భద్రతాపరంగా ఆందోళన కలిగించే అంశంగా నిపుణులు భావిస్తున్నారు. తీస్తా నది ప్రవహించే ప్రాంతం భారత్‌లోని అత్యంత సున్నితమైన సిలిగురి కారిడార్‌కు అతి సమీపంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో చైనా ఇంజనీర్లు, అధికారుల కదలికలు పెరిగితే, అది భారత రక్షణ వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో, ఈ పరిణామాన్ని భారత్ నిశితంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం. -
"దీదీ మీరు ఓడిపోలేదు".. అఖిలేష్ యాదవ్
కోల్‌కతా: సమాజ్‌వాద్ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి భావోద్వేగ మద్దతు ప్రకటించారు. ఇటీవల బెంగాల్లో జరిగిన ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ వినూత్న రీతిలో పోరాటం చేసిందన్నారు. ఈ రోజు (గురువారం) కోల్‌కతాలోని ఆమె మమతా బెనర్జీ నివాసంలో ఆమెను పరామర్శించారు.ఇటీవల జరిగిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. సాధారణ ఎన్నికల్లో బీజేపీ 207 సీట్లు గెలుచుకోగా, టీఎంసీ కేవలం 80 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ తాను సీఎం పదవికి రాజీనామా చేయనని అవసరమైతే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని పట్టుబడుతుంది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో మమతా బెనర్జీతో పాటు ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీని అఖిలేష్ యాదవ్ పరామర్శించారు.దీదీ మీరు ఓడిపోలేదు. మీరు, అభిషేక్ బెనర్జీ కలిసి అద్భుతమైన పోరాటం చేశారు అని అఖిలేష్ ఆమెకు ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన మీడియా ఎదుట మాట్లాడుతూ బెంగాల్లో జరిగిన ఎన్నికల్లో ఎన్నికల కమిషన్, బీజేపీ కలిసి కుట్ర పన్నాయని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా ఓటర్ల జాబితాలో మార్పులు చేయడం ద్వారా లక్షలాది మంది ఓటు హక్కును తొలగించి, ఎన్నికల ఫలితాలు తారుమారయ్యాయన్నారు. బెంగాల్లో బీజేపీ హింసను ప్రేరేపిస్తోందని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తోందని మండిపడ్డారు. కేంద్ర బలగాల సమక్షంలోనే ఎన్నో అక్రమాలు జరిగాయని ఆరోపించారు.బెంగాల్ వచ్చిన ఫలితాలు ఎలా ఉన్నా జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి పోరాటం కొనసాగుతుందని, మమతా బెనర్జీ ఆ కూటమిలో కీలక పాత్ర పోషిస్తారని ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. VIDEO | Kolkata: After meeting TMC supremo Mamata Banerjee, SP chief Akhilesh Yadav says, "The effort will be to ensure that everyone (INDIA alliance) works together, because democracy needs to be protected. They (BJP) want to destroy democracy itself and take away people’s… pic.twitter.com/1v9k9jl8Hs— Press Trust of India (@PTI_News) May 7, 2026 -
సీఎం కుర్చీపై సువేందు సంచలన వ్యాఖ్యలు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన బీజేపీ సీనియర్ నేత సువేందు అధికారి త్వరలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీని భవానీపూర్‌లో 15 వేల ఓట్ల తేడాతో ఓడించి, నందిగ్రామ్‌లో ముచ్చటగా మూడోసారి అఖండ విజయం సాధించిన ఆయన.. ఈ రెండు స్థానాల్లో దేనిని వదులుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజాగా నందిగ్రామ్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.పార్టీ నిర్ణయమే శిరోధార్యంఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారి నందిగ్రామ్‌లో అడుగుపెట్టిన సువేందు అధికారికి స్థానికులు బ్రహ్మరథం పట్టారు. ‘మీరు నందిగ్రామ్ ముద్దుబిడ్డ, మీరే మా సీఎం’ అంటూ భారీ ఎత్తున నినాదాలు చేశారు. ఈ నినాదాలపై స్పందించిన సువేందు.. అది తాను తీసుకునే నిర్ణయం కాదని, పార్టీ అధిష్ఠానానిదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. ‘నేను క్రమశిక్షణ గల కార్యకర్తను, అవసరమైతే నా అభిప్రాయం చెబుతాను.. కానీ సొంత నిర్ణయాలు తీసుకోను. మరో పది రోజుల్లో ఒక స్థానాన్ని వదులుకోవాల్సిందే. కానీ భవానీపూర్, నందిగ్రామ్ ప్రజల పట్ల నా బాధ్యతను ఎప్పటికీ విస్మరించను’ అని ఆయన పేర్కొన్నారు.పాత కేసుల రీఓపెన్.. కఠిన చర్యలుగత రెండు దశాబ్దాలుగా భూసేకరణ ఉద్యమాల నుండి నందిగ్రామ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న ఆయన, తన కుటుంబం ఎదుర్కొన్న వేధింపులను సభలో ప్రస్తావించారు. ‘2011 మార్పులో నేను భాగమయ్యాను, ఇప్పుడు నిజమైన మార్పులో ఉన్నాను. మా 90 ఏళ్ల తండ్రిని సీఐడీ విచారణ పేరుతో వేధించారు. నా ఆఫీసుకు 150 మంది పోలీసులను పంపారు. గతంలో జరిగిన అకృత్యాలపై విచారణ కోసం ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసి, నేరస్థులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని సువేందు హెచ్చరించారు.ఆరు నెలల్లో నందిగ్రామ్ రూపురేఖలు మార్చేస్తానందిగ్రామ్ అభివృద్ధికి తాను ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తానని సువేందు హామీ ఇచ్చారు. నందిగ్రామ్-I లో ఏడాదికి రెండు పంటలు పండేలా చూస్తానని, హల్దియా-నందిగ్రామ్ వంతెనను నిర్మిస్తానని తెలిపారు. గోకుల్‌నగర్‌లో పాఠశాల, సోనాచురాలో ఐటీఐ ఏర్పాటుతో పాటు వేరే ఆసుపత్రులకు రిఫర్ చేసే పరిస్థితి లేకుండా నందిగ్రామ్ ఆసుపత్రిని ఆధునికీకరిస్తామన్నారు. ఆరు నెలల్లో ప్రతి ఇంటికి నీటి కనెక్షన్ అందిస్తానని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలు శాంతియుతంగా ఉండాలని, ప్రధాని మోదీ ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తూ, నూతన బెంగాల్‌ను నిర్మిస్తామని సువేందు అధికారి పేర్కొన్నారు. -
కారూ, గోల్డూ లేదు, కేసులు మాత్రం..కాబోయే సీఎం ఆస్తుల చిట్టా!
2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం తరువాత బీజేపీ నాయకుడు సువేందు అధికారి పేరు సీఎం రేసులో ప్రముఖంగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన ఆస్తుల వివరాలు, క్రిమినల్ కేసులపై చర్చ జోరుగా నడుస్తోంది. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. సువేందు అధికారి నికర ఆస్తుల విలువ రూ. 85.87 లక్షలు. సొంత కార్లూ లేవు. ఎటువంటి అప్పులు లేవు. చేతిలో ఉన్న నగదు రూ. 12 వేలు మాత్రమే.చరాస్తులు (Movable Assets) రూ.24.57 లక్షలు.14 బ్యాంకు ఖాతాల్లో మొత్తం రూ.7.34 లక్షలు ఉన్నాయి.ఇక పెట్టుబడుల విషయానికి వస్తే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్లు రూ. 5.45 లక్షలు, కిసాన్ వికాస్ పత్రాలు రూ.2.60 లక్షలు, 6 ఎల్ఐసీ (LIC) పాలసీల విలువ రూ.7.71 లక్షలు. ఆయన పేరు మీద ఎటువంటి కార్లుగానీ, బంగారమూ కానీ లేదు. స్థిరాస్తుల విలువ మొత్తం రూ. 61.30 లక్షలు. ఇందులో పూర్బా మేదినీపూర్‌లో వ్యవసాయ భూమి (9.05 లక్షలు), వ్యవసాయేతర స్థలాలు (రూ. 27.50 లక్షలు), రూ.24.75 లక్షల విలువ చేసే మూడు నివాస గృహాలు/ఫ్లాట్లు ఉన్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.17.38 లక్షలు. ఇది గత నాలుగేళ్లలో ఇది రెట్టింపు కావడం గమనార్హం క్రిమినల్ కేసులు : 29 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి, అయితే దేనిలోనూ నేరం రుజువు కాలేదు. అఫిడవిట్ వివరాల ప్రకారం మమతా బెనర్జీతో పోలిస్తే సువేందు అధికారి ఆస్తులు ఐదు రెట్లు ఎక్కువగా ఉన్నాయి. మమతా బెనర్జీకి ఎటువంటి స్థిరాస్తులు (భూమి లేదా ఇల్లు) లేనప్పటికీ, ఆమె వార్షిక ఆదాయం సువేందు అధికారి కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. దీనికి ప్రధాన కారణం ఆమెకు వచ్చే రాయల్టీ, వడ్డీలు. ఇద్దరూ తమకు సొంత కార్లు లేవని అఫిడవిట్లో పేర్కొనడం విశేషం.కాగా సువేందు అధికారి ఇటీవల పశ్చిమ బెంగాల్లో రెండు (నందిగ్రామ్, భవానీపూర్) అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నారు. భవానీపూర్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై 15,105 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఎన్నికల ఫలితాల తరువాత బెంగాల్లో తీవ్ర హింస చెలరేగింది. తాజాగా సువేందు పీఏను చంద్రనాథ్ రథ్‌ను కొంతమంది దుండగులు అత్యంత దారుణంగా కాల్చి చంపడం ఆందోళన రేపింది. -
బాంబుల మోత.. ముగ్గురు బీజేపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలు
పానిహటి: పశ్చిమ బెంగాల్‌లోని పానిహటి ప్రాంతంలో మరోసారి భయానక వాతావరణం నెలకొంది. రాజకీయ కక్షల నేపథ్యంలో వరుస దాడులతో ఆ ప్రాంతం ఉలిక్కిపడింది. బీజేపీ కీలక నేత సువేందు అధికారికి అత్యంత సన్నిహితుడైన చంద్రనాథ్ రత్ బుధవారం రాత్రి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆ నెత్తుటి మరకలు ఆరకముందే, కొన్ని గంటల వ్యవధిలోనే పానిహటిలో గురువారం ఉదయం నాటు బాంబుల మోత మోగింది. ఈ బాంబు దాడిలో ముగ్గురు బీజేపీ మద్దతుదారులు తీవ్రంగా గాయపడటంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.సెయింట్ జేవియర్స్ స్కూల్ వద్ద కలకలంబుధవారం రాత్రి చంద్రనాథ్ రత్ తుపాకీ తూటాలకు బలైన ఘటన మరువక ముందే, గురువారం పానిహటిలోని సెయింట్ జేవియర్స్ స్కూల్ సమీపంలో ఒక బాంబు భారీ శబ్దంతో పేలింది. స్కూల్ వద్ద ఈ పేలుడు జరగడంతో స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ దుర్ఘటనలో అక్కడే ఉన్న ముగ్గురు బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడటం ఉద్రిక్తతను మరింత పెంచింది.ఆస్పత్రికి క్షతగాత్రులుబాంబు దాడిలో రక్తమోడుతూ పడి ఉన్న ఆ ముగ్గురిని స్థానికులు హుటాహుటిన సమీపంలోని సాగర్ దత్తా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అయితే, పేలుడు జరిగిన ప్రదేశం ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన అభయ తల్లి నివాసానికి అతి సమీపంలో ఉంది. ఈ ఘటన వెనుక ఉన్న కుట్ర కోణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.రంగంలోకి పోలీసు బలగాలుహత్య, ఆ తర్వాత వెంటనే జరిగిన బాంబు పేలుడు ఘటనలతో పానిహటి ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే భారీ సంఖ్యలో పోలీసు బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. పరిస్థితి చేజారకుండా అదుపులోకి తెచ్చిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నేరస్తుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. -
బెంగాల్ లో మళ్లీ హింస.. సువేందు అధికారి పీఏ హత్య
-
బెంగాల్ ట్విస్ట్: దీదీకి సరికొత్త టెన్షన్!
పశ్చిమ బెంగాల్ రాజకీయం మరో మలుపు తిరిగింది. బీజేపీ రిగ్గింగ్‌కు పాల్పడి నెగ్గిందంటూ సీఎం పదవికి రాజీనామా చేసేందుకు మమతా బెనర్జీ నిరాకరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాష్ట్రంలో హింస చెలరేగింది. బీజేపీ-టీఎంసీ కార్యకర్తలు వరుసగా హత్యలకు గురవుతుండడం కలకలం రేపుతోంది. తాజాగా ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సువేందు అధికారి వ్యక్తిగత కార్యదర్శి చంద్రనాథ్ హత్యకు గురి కావడంతో రాజకీయ దుమారం రేగింది. మమతా బెనర్జీ ప్రభుత్వం రద్దుమమతా బెనర్జీ ప్రభుత్వాన్ని రద్దు చేసిన గవర్నర్మమతా బెనర్జీ రాజీనామా చేయకపోవడంతో నిర్ణయం!9న పశ్చిమ బెంగాల్లో కొలువుదీరనున్న బీజేపీ ప్రభుత్వం శుక్రవారం (మే 8న) బీజేపీ శాసనసభా పక్ష సమావేశం దర్యాప్తు ముమ్మరంసువేందు అధికారి పీఏ చంద్రనాథ్ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంఘటనాస్థలి నుంచి సేకరించిన ఆధారాలను పరిశీలిస్తున్న ఫోరెన్సిక్ టీమ్స్ఇప్పటికే బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ సహా ఉన్నతాధికారులు రంగంలోకిమధ్యమ్గ్రామ్లోని ఘటనాస్థలాన్ని సందర్శించిన ఉన్నతాధికారులుకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరపాలని తృణమూల్ డిమాండ్ పక్షపాతం లేకుండా విచారణ జరగాలన్న తృణమూల్అందుకే నా పీఏను చంపారు: సువేందునా పీఏ చంద్రనాథ్ రాథ్ హత్యకు కారణాలు ఉన్నాయిఆయన నా కార్యనిర్వాహక సహాయకుడిగా ఉండటమే హత్యకు కారణంభవానీపూర్లో మమతా బెనర్జీని నేను ఓడించడమూ ఓ కారణంనా బాధ్యతలన్నింటినీ నేను నిర్వర్తిస్తాను: సువేందుమమతకు కొత్త తలనొప్పి!ఓడినా సీఎం పదవికి రాజీనామా చేయనంటున్న మమతా బెనర్జీ దీదీ ప్రకటనతో వేడెక్కిన పశ్చిమ బెంగాల్ రాజకీయాలు నేటితో బెంగాల్ అసెంబ్లీ గడువు పూర్తిఆటోమేటిక్గా రద్దు కానున్న టీఎంసీ సర్కార్ఈలోపు.. మరో ట్విస్ట్!టీఎంసీ భేటీకి డుమ్మా కొట్టిన 10 మంది కొత్త ఎమ్మెల్యేలుపార్టీలో జోష్ నింపేందుకు భేటీ నిర్వహించిన మమతా బెనర్జీ80 మందికిగానూ 70 మందే హాజరుచీలిక ఏర్పడిందా అనుమానాలుపార్టీ ఫిరాయిస్తారని జోరుగా ప్రచారంఆ ఊహాగానాలను తోసిపుచ్చిన టీఎంసీ గైర్హాజరుపై ముందుగానే సమాచారం ఇచ్చారని వెల్లడితాజా పరిణామాలపై బీజేపీ సైలెన్స్ ఆ పిస్టోల్ అక్రమంగా వచ్చిందే!బెంగాల్లో సంచలనంగా సువేందు అధికారి పీఏ హత్య కేసుసువేందు పీఏ చంద్రనాథ్ రథ్ దారుణ హత్యబుధవారం రాత్రి ఇంటికి వెళ్తున్న టైంలో కాల్పులు జరిపిన దుండగులుఅక్కడికక్కడే కారులో కుప్పకూలిన చంద్రనాథ్చంద్రనాథ్ రథ్ హత్యకు ఉపయోగించిన తుపాకీ అక్రమంగా వచ్చిందే!హత్యకు ఆస్ట్రియా మేడ్ తుపాకీ వాడిన దుండగలుతుపాకీని బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా తీసుకొచ్చినట్లు గుర్తింపునిందితులను ట్రేస్ చేసే పనిలో కోల్‌కతా పోలీసులుమమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలుఈ నెల 9న బెంగాల్ కొత్త సీఎం ప్రమాణ స్వీకారంసీఎం ఎంపిక.. ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై దృష్టి పెట్టిన బీజేపీటీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలుమే 4వ తేదీన వెలువడ్డ బెంగాల్ ఫలితాలుఫలితాల్లో బీజేపీ ఘన విజయంసీఎం పదవికి ఇప్పటిదాకా రాజీనామా చేయని మమతా బెనర్జీదేశ రాజకీయాల్లో.. ఇప్పటిదాకా ఎవరూ ఇలా చేయలేదు!సీఎం పదవికి రాజీనామా చేసేది లేదని తేల్చేసిన దీదీఏం చేసుకుంటారో చేస్కోమంటూ తాజాగా మరోసారి సవాల్కావాలంటే రాష్ట్రపతి పాలన విధించుకోండి అంటూ వ్యాఖ్యసీఎంగా ఎవరైనా ప్రమాణం చేస్తే.. ఆ రోజును బ్లాక్‌డేగా పాటిస్తామని ప్రకటనమరోవైపు.. ఇప్పటికే ముగిసిన బెంగాల్ అసెంబ్లీ గడువురాజ్యాంగం ప్రకారం.. రద్దైన మమతా బెనర్జీ సర్కార్అయినా సీఎం కుర్చీలో తానే కూర్చుంటానంటున్న మమతా బెనర్జీఎవరీ చంద్రనాథ్?చంద్రనాథ్ రథ్.. బీజేపీ నేత సువేందు అధికారికి అత్యంత విశ్వసనీయ సహాయకుడుచంద్రనాథ్ వయసు 41 ఏళ్లు.. స్వస్థలం మేదినిపూర్ జిల్లా చందిపూర్ రహారా రామకృష్ణ మిషన్‌లో చదివిన చంద్రనాథ్ దాదాపు రెండు దశాబ్దాలు భారత వాయుసేనలో సేవలుఆధ్యాత్మిక జీవితం వైపు ఆకర్షితుడైన.. ఆర్మీ నుంచి వలంటరీ రిటైర్మెంట్ కొంతకాలం రామకృష్ణ మిషన్‌లో సేవలందించిన చంద్రనాథ్ ఆపై కార్పొరేట్ రంగంలో పనిచేసి.. అక్కడ నుంచి పొలిటికల్ కన్సల్టెన్సీలో విధులు తృణమూల్ కాంగ్రెస్‌తో చంద్రనాథ్ కుటుంబానికి అవినాభావ సంబంధంసువేందు అధికారి బీజేపీలో చేరాక.. ఆయన వెంటే చంద్రనాథ్సువేందు కోసం బీజేపీ తరఫున కీలకంగా పని చేసిన చంద్రనాథ్అధికారి సువేందు ఎన్నికల ప్రచార నిర్వహణ, పార్టీ కార్యకర్తలతో సంబంధాలు, లాజిస్టిక్స్ వంటి సున్నితమైన పనులను హ్యాండిల్ చేసిన చంద్రనాథ్తాజా విజయంతో.. బీజేపీ చంద్రనాథ్‌కు కీలక బాధ్యతలు అప్పజెప్తుందనే ఊహాగానాలు ఈలోపే.. చంద్రనాథ్ దారుణ హత్యబెంగాల్ను కుదిపేస్తున్న హత్యారాజకీయాలు ఉత్తర 24 పరగణాలో దారుణ హత్యకు గురైన బీజేపీ రాష్ట్ర చీఫ్ అధికారి సువేందు పీఏ చంద్రనాథ్తన నివాసానికి వెళ్తున్న టైంలో బైక్ మీద వచ్చి కాల్చి చంపిన దుండగులుఅక్కడికక్కడే మృతి చెందిన చంద్రనాథ్.. డ్రైవర్ పరిస్థితి విషమంటీఎంసీపై బీజేపీ ఆరోపణలు.. ఆరోపణలను ఖండించిన టీఎంసీఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చెలరేగిన హింసహింసాత్మక ఘటనల్లో పలువురు బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మృతిఈసీ సీరియస్బెంగాల్లో హింసాత్మక ఘటనలపై ఎన్నికల సంఘం సీరియస్ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. వరుసగా దాడులు, హత్యలుఇప్పటికే పలువురు టీఎంసీ, బీజేపీ కార్యకర్తలపై దాడులుహత్యకు గురైన పలువురు!బెంగాల్ పోలీస్ శాఖపై ఈసీ ఆగ్రహంశాంతి భద్రతలు అదుపు తప్పకుండా చూడాలని ఆదేశంఘటనలపై నివేదిక ఇవ్వాలని బెంగాల్ డీజీపీకి ఆదేశం #WATCH | North 24 Parganas | On Suvendu Adhikari's PA Chandra shot dead in Madhyamgram, BJP leader Sajal Ghosh says, "He had no enemies and was a cheerful boy. This was destined for him just because he worked for Suvendu... This is Bengal... 5 bullets were shot... I have been… pic.twitter.com/X6rFpnDzyZ— ANI (@ANI) May 6, 2026టీఎంసీ స్పందన ఇదే.. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదుచంద్రనాథ్ హత్యను ఖండిస్తున్నాంఆ హత్యతో మాకు సంబంధం లేదుదోషులెవరైనా కఠినంగా శిక్షించాలికోడ్ అమల్లో ఉండగా హింస దురదృష్టకరంచంద్రనాథ్ హత్యపై సీబీఐ విచారణ జరగాలి పీఏ హత్యపై సువేందు రియాక్షన్మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీపై సంచలన ఆరోపణలుఘటనాస్థలాన్ని పరిశీలించిన అధికారి సువేందుపక్కా ప్లాన్‌తోనే నా పీఏను మత్య చేశారుహత్య వెనుక మమతా మేనల్లుడి ప్రమేయం ఉంది సువేందు పీఏ దారుణ హత్యబీజేపీ అధ్యక్షుడు సువేందు అధికారి పీఏ దారుణ హత్యచంద్రనాథ్ను కాల్చి చంపిన గుర్తుతెలియని వ్యక్తులుమధ్యమ్గ్రామ్లో హత్య చేసిన దుండగులుకారులో వెళ్తుండగా కాల్చివేతనాలుగు రౌండ్ల కాల్పులుఛాతీలో బుల్లెట్లు దూసుకెళ్లి కారులోనే కుప్పకూలిన చంద్రనాథ్కారులో ఉన్న మరో వ్యక్తికి గాయాలూ.. పరిస్థితి విషమంSTORY | Bengal BJP leader Suvendu Adhikari's personal assistant shot deadBJP leader Suvendu Adhikari's personal assistant was shot dead by unidentified assailants in West Bengal's North 24 Parganas district, party sources said. The incident took place at Doharia in Madhyamgram… pic.twitter.com/oMET6SQm8w— Press Trust of India (@PTI_News) May 6, 2026 -
9న బెంగాల్లో బీజేపీ తొలి సర్కారు
పశ్చిమ బెంగాల్: పశ్చిమ బెంగాల్ యవనికపై భారతీయ జనతా పార్టీ తన తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. మే 9న కోల్‌కతాలోని చారిత్రక ‘బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్’వేదికగా, నవ శకానికి నాంది పలుకుతూ కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. మే 9న ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. బెంగాల్ సాంస్కృతిక అస్తిత్వానికి నిదర్శనమైన రవీంద్రనాథ్ టాగోర్ జయంతి (మే 9 – 25వ వైశాఖం) రోజు ప్రమాణ స్వీకారం జరగనుండటం విశేషం. తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే సస్పెన్స్ ఇంకా వీడలేదు. సువేందు అధికారి పేరు ప్రధానంగా వినిపిస్తుండగా, సమిక భట్టాచార్య, సుకాంత మజుందార్, స్వపన్ దాస్‌గుప్తాల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ‘భూమిపుత్రుడి’కే పట్టాభిషేకం చేయాలన్నది బీజేపీ కేంద్ర నాయకత్వం ఆలోచనగా కనిపిస్తోంది. ‘రైటర్స్ బిల్డింగ్స్’కు పూర్వవైభవం సుమారు 250 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన, కోల్‌కతా నడి»ొడ్డున ఉన్న ‘రైటర్స్ బిల్డింగ్స్’తిరిగి రాష్ట్ర సచివాలయంగా రూపుదిద్దుకోనుంది. మమతా బెనర్జీ హయాంలో హూగ్లీ నది అవతలి ఒడ్డున నిర్మించిన ‘నబన్నా’నుంచి పరిపాలన సాగగా, ఇప్పుడు అధికార పగ్గాలు చేపట్టిన బీజేపీ ప్రభుత్వం, తిరిగి పాత సచివాలయం నుంచే పాలన అందించాలని నిర్ణయించింది. రైటర్స్ బిల్డింగ్స్‌లో మరమ్మతులు పూర్తయ్యే వరకు, కొత్త ముఖ్యమంత్రి అసెంబ్లీ ఆవరణలోని ‘అనెక్స్ బిల్డింగ్’నుంచి పాలనను నిర్వహించే అవకాశం ఉంది. -
కోల్‌కతా సమీపంలో కాల్పులు.. సువేందు అధికారి పీఏ హత్య
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో రాజకీయాలు మరోసారి భగ్గుమన్నాయి. ఉత్తర 24 పరగణాల జిల్లా మధ్యంగ్రామ్ ప్రాంతంలో ప్రతిపక్ష నేత, బీజేపీ సీనియర్ నాయకుడు సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) చంద్రనాథ్ రథ్ గుర్తు తెలియని దుండగుల కాల్పుల్లో దారుణ హత్యకు గురయ్యారు. దోహారియా ప్రాంతంలో బుధవారం రాత్రి కారులో చంద్రనాథ్ రథ్ ప్రయాణిస్తుండగా బైక్‌పై వచ్చిన దుండగులు అకస్మాత్తుగా దాడికి పాల్పడ్డారు. అత్యంత దగ్గర నుంచి జరిపిన కాల్పుల్లో రథ్‌తో పాటు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు రథ్‌ను, డ్రైవర్‌ను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రథ్ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. దాడి జరిగిన వెంటనే దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. దుండగులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలిసింది. ఈ సంఘటన బీజేపీకి చారిత్రాత్మక విజయాన్ని సాధించిన రెండు రోజులకే చోటు చేసుకోవడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. మధ్యంగ్రాం నియోజకవర్గంలో తృణమూల్ అభ్యర్థి రథిన్ ఘోష్, ఇతను బీజేపీకి గట్టి పోటీ ఇచ్చాడు. ఆయన 2,399 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు. నూతనంగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యే తరుణ్‌జ్యోతి తివారీ మాట్లాడుతూ, ‘మేము నిరంతరం శాంతిని కోరుకుంటున్నాం, కానీ టీఎంసీ ఈ దారుణానికి ఒడిగట్టి అతిపెద్ద తప్పు చేసింది’.. అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఘటనా స్థలికి చేరుకున్న ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పెరగడంతో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. నిందితులను గుర్తించేందుకు, హత్యకు గల కారణాలను విశ్లేషించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని సమాచారం. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ అనుచరులుగా నటిస్తూ హింసను ప్రేరేపించే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇదే సమయంలో సువేందు అధికారి, భవానీపూర్ నియోజకవర్గంలో మమతా బెనర్జీని 15,000 పైగా ఓట్ల తేడాతో ఓడించి 'జెయింట్ కిల్లర్' అనే పేరును సంపాదించారు. దాంతో సువేందు అధికారిని ముఖ్యమంత్రి పదవికి ప్రధాన పోటీదారుగా భావిస్తున్నారు. -
బెంగాల్ సీఎం ప్రమాణ స్వీకారానికి పీఎం మోదీ
-
ఎమ్మెల్యేగా గెలిచిన పని మనిషి
-
టీఎంసీ కీలక నేతలపై మార్కండే కట్జూ షాకింగ్ వ్యాఖ్యలు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 207 స్థానాలను కైవసం చేసుకొని అఖండ విజయాన్ని సాధించింది. మరోవైపు అధికార TMC మాత్రం కేవలం 80 స్థానాలతో సరిపోట్టుకోవాల్సి వచ్చింది. ఈ విజయం తర్వాత భారత సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండే కట్జూ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.ముఖ్యంగా మమతా బెనర్జీకి స్ట్రాంగ్ సపోర్ట్‌గా ఉన్న మహిళానేతలపై ఆయన అనూహ్య విమర్శలు చేశారు. రాబోయే రోజుల్లో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా, మరో ఎంపీ, ప్రముఖ జర్నలిస్ట్ సాగరిక ఘోష్, సయోని ఘోష్ లాంటి నాయకులు BJPలో చేరినా తాను ఆశ్చర్యపోనని అన్నారు. ఈ జాబితాలో కునాల్ ఘోష్‌ను కూడా చేర్చారు. మరొక పోస్ట్‌లో ఆయన ఇలా అన్నారు. "TMC నాయకులారా, మేము ఎన్నికల్లో గెలిచామని మీరు ప్రకటించుకోండి, హరి ఓం." అంటూ వారిని ఎద్దేవా చేశారు.ఇదీ చదవండి: 'దళపతి' 10th మార్క్స్ వైరల్, విజయ్ విద్యార్హత ఏంటి?కాగా పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలుపు తరువాత మమత తాను సీఎం పదవికిరాజీనామా చేయనని ప్రకటించారు. అలాగే ఎన్నికల అనంతరం బెంగాల్లో హింసాకాండ చెలరేగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని TMC కార్యాలయాల వద్ద విధ్వంసానికి సంబంధించిన అనేక ఘటనలు హింసకు సంబంధించిన పలు కేసులు నమోదయ్యాయి. మరోవైపు రాష్ట్రంలో హింసను ప్రేరేపించే, విధ్వంసానికి పాల్పడే వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ బుధవారం తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. అలాంటి వారిని తక్షణమే అరెస్టు చేస్తామని కూడా ఆయన హెచ్చరించారు. మరోవైపు కోల్‌కతాలోని 'న్యూ మార్కెట్' వద్ద బుల్డోజర్లు అంటూ TMC రాజ్యసభ సభ్యురాలు సుష్మిత దేవ్ ఒక వీడియోను పంచుకున్నారు. మాంసం దుకాణాలను, చివరకు పార్టీ కార్యాలయాలను కూడా అవికూల్చివేస్తున్నాయని ఆమె వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: ముస్లిం ఓట్లన్నీ టీఎంసీకే : కాబోయే సీఎం సంచలన వ్యాఖ్యలు -
ముస్లిం ఓట్లన్నీ టీఎంసీకే : కాబోయే సీఎం సంచలన వ్యాఖ్యలు
పశ్చిమ బెంగాల్లో అఖండ విజయం తరువాత బీజేపీనేత కాబోయే ముఖ్యమంత్రిగా భావిస్తున్న సువేందు అధికారి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నందిగ్రామ్, భవానిపూర్, రెండింటిలోనూ విజయం సాధించిన తరువాత ముస్లిం ఓటర్లనుద్దేశించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం కలవరం రేపుతోంది.నందిగ్రామ్‌లో తన గెలుపునకు హిందూ ఓటర్ల బలమైన మద్దతే కారణమని సువేందు అధికారి పేర్కొంటూ, తృణమూల్ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈసారి తాను దాదాపు పదివేల ఓట్ల తేడాతో ఎన్నికల్లో గెలిచాననీ, ఇవన్నీ హిందువుల ఓట్లేనని వారే తనను మళ్లీ గెలిపించారన్నారు.ఇది హిందుత్వ విజయం..అక్కడ ముస్లిం ఓట్లన్నీ టీఎంసీకే వెళ్లాయి, కనుక తనకు ఓటేసిన నందిగ్రామ్ హిందువుల కోసం పనిచేస్తానంటూ వ్యాఖ్యానించారు. #WATCH | Haldia, West Bengal: BJP leader and winning candidate from Bhabanipur and Nandigram seat, Suvendu Adhikari says, "...This time I won the election with almost ten thousand votes. The Hindu people of Nandigram made me win again. There, the entire Muslim vote went to TMC...… https://t.co/VTjw3JrW93 pic.twitter.com/8uOh5qEtyI— ANI (@ANI) May 4, 2026 "హిందూ EVM అంటే బీజేపీ, ముస్లిం EVM అంటే TMC" అని అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యానించారు. ఇక మమతా రాజకీయ సన్యాసం తీసుకోవాలిన, ఆమెను ప్రజలు తిరస్కరించారని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు ఈ అవినీతి, కుటుంబ ఆధారిత పార్టీకి ఎలాంటి సిద్ధాంతం లేదు. టీఎంసీ 24 గంటల్లో నాశన మవుతుంది, అంతమైపోతుందన్నారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన పనులను పూర్తి చేస్తామని హామీ వచ్చారు. కాగా గతంలో కూడ బీజేపీ నినాదమైన 'సబ్కా సాథ్, సబ్కా వికాస్'ను పక్కనపెట్టి, "మనతో ఉండేవారికే మనం తోడుంటాం"(జో హమారే సాథ్, హమ్ ఉన్కే సాథ్) అనే నినాదాన్ని పాటించాలని పిలుపునిచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుండి వెళ్లగొడతామని, అలాగే "బంగ్లాదేశీ ముస్లిం చొరబాటుదారులను" తొలగించాలని ఆయన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: 'దళపతి' 10th మార్క్స్ వైరల్, విజయ్ విద్యార్హత ఏంటి? -
బెంగాల్లో బీజేపీ.. బంగ్లాదేశ్‌కు భారీ గుడ్‌న్యూస్!
పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. బెంగాల్ అధికారాన్ని కైవసం చేసుకోవాలనే కమల దళం కల ఎట్టకేలకు నిజమైంది. రాష్ట్రంలో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ సర్కారు ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో భారత్ పొరుగు దేశం బంగ్లాదేశ్‌కు కొత్త ఆశలు చిగురించాయి. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తీస్తా నది నీటి పంపిణీ ఒప్పందం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. దీంతో, బంగ్లాదేశ్‌కు నీటి కష్టాలు తీరే అవకాశం ఉంది. ఇంతకీ తీస్తా నీటి విషయంలో కేంద్రం, మమత బెనర్జీ.. బంగ్లాదేశ్ వాదనలు ఎలా ఉన్నాయంటే..ఇరు దేశాల మధ్య తీస్తా నీటి పంపిణీ ఒప్పందాన్ని అడ్డుకుంటున్నందుకు మమతా బెనర్జీపై అధికార బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) విమర్శలు గుప్పించింది. అదే సమయంలో బెంగాల్లో విజయం సాధించిన బీజేపీకి అభినందనలు తెలిపింది. ఈ ఫలితంగా రాష్ట్రానికి, బంగ్లాదేశ్‌కు మధ్య సంబంధాలను కొనసాగించడానికి, బలోపేతం చేయడానికి సహాయపడుతుందని అభివర్ణించింది. ఈ సందర్భంగా బీఎన్పీ సమాచార కార్యదర్శి అజీజుల్ బరీ హెలాల్ మాట్లాడుతూ.. సువేందు అధికారి నాయకత్వంలోని బీజేపీ అద్భుత పనితీరును కనబరిచే అవకాశముందని ప్రశంసించారు. అలాగే, రెండు దేశాల మధ్య సంబంధాలు సానుకూలంగా కొనసాగుతాయని అన్నారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న తీస్తా నీటి పంపిణీ సమస్యపై పురోగతి ఆశలకు కూడా ఈ ఫలితాన్ని హెలాల్ ముడిపెట్టారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని గత తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం తీస్తా బ్యారేజ్ ఒప్పందానికి అడ్డుగా నిలిచిందన్నారు.ప్రస్తుతం బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం.. బంగ్లాదేశ్ చాలాకాలంగా కోరుకుంటున్న తీస్తా ఒప్పందంపై కేంద్రంతో కలిసి పనిచేయగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అధికార మార్పిడి బంగ్లాదేశ్ మరియు పశ్చిమ బెంగాల్ మధ్య సంబంధాలను మెరుగుపరిచే అవకాశాన్ని కల్పించిందని అన్నారు. తీస్తా సమస్యపై హెలాల్ స్పందిస్తూ..‘గత ప్రభుత్వమే అభివృద్ధికి ప్రధాన అడ్డంకిగా ఉంది. తీస్తా బ్యారేజ్ ఒప్పందానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం, నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండూ గట్టిగా మద్దతు తెలిపాయి. అలాగే, ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ స్థానంలో బీజేపీ అధికారంలోకి వచ్చినందున, ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడుతుందని అభిప్రాయపడ్డారు.భారత్, బంగ్లాదేశ్ మధ్య నీటి పంపిణీలో పరిష్కారం కాని సమస్యలలో తీస్తా వివాదం ఒకటిగా మిగిలిపోయింది. 1996 గంగా జల ఒప్పందం, ఫరక్కా బ్యారేజీ వద్ద వేసవి కాలంలో నీటి పంపిణీని నిర్దేశిస్తుంది. అయితే, నీటి కొరత ఉన్న నెలల్లో భారత్ తగినంత నీటిని విడుదల చేయడం లేదని, దీనివల్ల దిగువ ప్రాంతాల్లోని వ్యవసాయం, జీవనోపాధులు ప్రభావితమవుతున్నాయని బంగ్లాదేశ్ పేర్కొంది. వాతావరణ మార్పులపై ఆందోళనలు కూడా తగ్గుతున్న నీటి లభ్యతపై వివాదానికి మరింత ఆజ్యం పోశాయి.ఇప్పుడు, 1996 ఒప్పందం ఈ సంవత్సరం చివరలో ముగియనున్న నేపథ్యంలో, తీస్తా జలాల్లో తమకు న్యాయమైన వాటా కావాలని బంగ్లాదేశ్ కోరుతోంది. అయితే, పశ్చిమ బెంగాల్ తన సొంత నీటి అవసరాల కారణంగా దీనిని వ్యతిరేకించడంతో ఈ ఒప్పందం పెండింగ్‌లోనే ఉంది. 2011లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా, తీస్తా జలాల్లో బంగ్లాదేశ్‌కు 37.5 శాతం, భారతదేశానికి 42.5 శాతం వాటా లభించేలా ఒక ప్రతిపాదన చేయబడింది. అయితే, ఇది రాష్ట్ర వ్యవసాయ ప్రయోజనాలకు హాని కలిగిస్తుందని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వ్యతిరేకించడంతో ఆ ప్రణాళిక కార్యరూపం దాల్చలేదు. తీస్తా జలాలపై అంతకుముందు 1983లో ఒక తాత్కాలిక ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం, బంగ్లాదేశ్‌కు 36 శాతం, భారతదేశానికి 39 శాతం వాటా లభించగా, మిగిలిన 25 శాతాన్ని తర్వాత నిర్ణయించాల్సి ఉంది. అయితే, ఆ ఏర్పాటు ఎన్నడూ పూర్తిగా అమలు కాలేదు. 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢాకా పర్యటన, న్యాయమైన మరియు సమానమైన నీటి పంపిణీ ఒప్పందం ద్వారా గతంలోని విభేదాలను పరిష్కరించవచ్చనే అంచనాలను కూడా పెంచింది.తీస్తా ఒప్పందం ఇలా..2011లో డ్రాఫ్ట్ ఒప్పందంభారత్కి 42.5% నీరు.బంగ్లాదేశ్‌కి 37.5% నీరు.20% పర్యావరణ అవసరాలకు ఉపయోగం.అడ్డంకి: గత సీఎం మమతా బెనర్జీ, ఉత్తర బెంగాల్ రైతులకు నీటి కొరత వస్తుందని అభ్యంతరం చెప్పి ఒప్పందాన్ని అడ్డుకున్నారు.సవాళ్లు..భారత్‌లో: ఉత్తర బెంగాల్ రైతులకు నీటి కొరత.బంగ్లాదేశ్‌లో: రెండు కోట్ల మంది ప్రజలు తీస్తా నీటిపై ఆధారపడుతున్నారు.జియోపాలిటిక్స్: చైనా భాగస్వామ్యం వల్ల భారత్–బంగ్లాదేశ్ సంబంధాలపై ప్రభావం.చైనా మద్దతు: నీటి కేటాయింపులపై ఆలస్యం జరిగితే, చైనా మద్దతుతో Teesta River Comprehensive Management and Restoration Projectను ముందుకు తీసుకెళ్తామని బంగ్లా హెచ్చరికలు. -
బెంగాల్ సీఎం ఎవరు?
-
బెంగాల్లో టెన్షన్.. మమతకు తొలి షాక్
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగిసింది. బెంగాల్లో బీజేపీ ఘన విజయం అందుకుంది. అయితే, ఫలితాల అనంతరం, బెంగాల్లో భారీ ట్విస్ట్ చోటుచేసుకుంది. అర్ధరాత్రి తృణముల్ కాంగ్రెస్ యూనియన్ ఆఫీసుకు బుల్డోజర్లతో కూల్చివేయడం తీవ్ర ఉద్రికత్తలకు దారి తీసింది. దీంతో, బెంగాల్లో బుల్డోజర్ల అంశం చర్చనీయాంశంగా మారింది.వివరాల మేరకు.. బెంగాల్‌లోని చారిత్రక హాగ్ మార్కెట్ (న్యూ మార్కెట్) ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి కీలక పరిణామం చోటుచేసుకుంది. అత్యంత రద్దీగా ఉండే ఈ వ్యాపార కేంద్రంలో బుల్డోజర్ల గర్జన మొదలైంది. బుల్డోజర్లతో వచ్చిన ఓ గుంపు టీఎంసీ యూనియన్ కార్యాలయాన్ని కూల్చివేశారు. టీఎంసీకి చెందిన న్యూ మార్కెట్ యూనియన్ ఆఫీసు ఈ ఘటనలో పూర్తిగా నేలమట్టమైంది. దీంతో భయాందోళనకు గురైన వ్యాపారులు తమ షాపులను మూసేసి పరుగులు తీశారు.అయితే, బుల్డోజర్ కూల్చివేతపై టీఎంసీ నేతలు సంచలన విమర్శలు గుప్పించారు. ఈ ఘటనపై టీఎంసీ నేతలు స్పందిస్తూ.. ఇదే బీజేపీ అసలు రూపం. బీజేపీ ఎన్నికల నినాదమైన ‘పరివర్తన్’ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. కోల్‌కతాలోని చారిత్రక న్యూ మార్కెట్.. బెంగాలీలు ఈ పరివర్తనాన్ని ఆస్వాదిస్తున్నారు. పోలీసుల పర్యవేక్షణలోనే ఈ కూల్చివేతలు జరిగాయని ఆరోపించారు. కేంద్ర బలగాలు (CAPF) అక్కడ చూస్తుండగానే, బీజేపీ విజయోత్సవాల్లో భాగంగా మాంసం దుకాణాలను కూల్చడానికి బుల్డోజర్లను తీసుకొచ్చారు అంటూ ఆరోపించారు. బెంగాల్లో ఈ ‘బుల్డోజర్ రాజకీయాలను’ అడ్డుకుంటామని నేతలు స్పష్టం చేశారు.Bulldozers are rolling across West BengalBJP is clearing West Bengal by demolishing illegal TMC party offices and shops in the New Market area pic.twitter.com/bHqlrjWa4X— Surajit (@surajit_ghosh2) May 5, 2026అనంతరం, పార్టీ ఆఫీసు కూల్చివేతపై టీఎంసీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్బంగా టీఎంసీ..‘ఇది బీజేపీ మద్దతుదారుల గూండాయిజం, వ్యాపార సంస్థలను టార్గెట్ చేసుకుని హింసను ప్రేరేపిస్తున్నారని ఆరోపించింది. బీజేపీ అగ్రనేతల అండదండలతోనే ఇదంతా జరుగుతోందని చెప్పుకొచ్చింది. అయితే, ఈ ఆరోపణలను స్థానిక నివాసితులు, కొందరు వ్యాపారులు తోసిపుచ్చారు. కూల్చివేసిన నిర్మాణం అక్రమంగా నిర్మించినట్టు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. కూల్చివేతల నేపథ్యంలో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. ఏది ఏమైనా.. ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండో రోజే బెంగాల్లో ఇలా బుల్డోజర్లు బయటకు రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
మోదీ ఉండటం భారత ప్రజల అదృష్టం: ట్రంప్
పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలుపునకుగానూ ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందనలు తెలిపారు. ఇది స్పష్టమైన ప్రజాతీర్పు అని, చరిత్రాత్మక విజయంగా ఆయన అభివర్ణించారు. ఈ విషయాన్ని వైట్‌హౌజ్ ప్రతినిధి కుశ్ దేశాయ్ మీడియాకు వెల్లడించారు. ‘‘బెంగాల్ విజయంపై ట్రంప్ మోదీకి అభినందనలు తెలియజేశారు. అంతేకాదు.. గత నెలలో ఈ ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. ఆ టైంలో మోదీపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ఆయన వంటి నేత ఉండటం భారత ప్రజల అదృష్టమని అన్నారు’’ అని కుశ్ దేశాయ్ అన్నారు. మమతా బెనర్జీ 15 ఏళ్ల పాలనకు బ్రేకులు వేస్తూ.. బెంగాల్లో బీజేపీ బంపర్‌హిట్ కొట్టింది. మూడింట రెండొంతులకుపైగా మెజారిటీతో కైవసం చేసుకోవడంతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బెంగాల్లో మెజారిటీ మార్కు 147 కాగా.. బీజేపీ ఏకంగా 206 సీట్లు సాధించింది. తృణమూల్ 81 సీట్లకే పరిమితమైంది. -
సీఎంగా రాజీనామా ప్రసక్తే లేదు. తెగేసి చెప్పిన మమతా బెనర్జీ
-
రాజ్యాంగం ఏం చెబుతోంది?
ప్రజాతీర్పుతో మేం ఓడిపోలేదు. కుట్ర చేసి మమ్మల్ని తక్కువ సీట్లకు పరిమితంచేశారు. అలాంటప్పుడు నేను రాజీనామా చేయాలనే ప్రశ్న ఎలా ఉత్పన్నమవుతుంది? నేను ఓడిపోలేదు. లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు రాజీనామాలేఖ సమర్పించే ప్రసక్తే లేదు.. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ చెబుతున్న మాట ఇది. ఇంతకీ రాజ్యాంగం ఏం చెబుతోంది.. ఎన్నికల్లో ఓడిపోయి అధికారం కోల్పోయిన ముఖ్యమంత్రి తాను రాజీనామా చేయబోనని మొండికేస్తే రాజ్యాంగం ప్రకారం గవర్నర్ తదుపరి కార్యాచరణను అమల్లోకి తీసుకురావచ్చు. ఆ అధికారం రాజ్యాంగం గవర్నర్‌కు ప్రసాదించింది. శాసనసభ అనేది శాశ్వతసభ కాదు. ఐదేళ్ల కాలపరిమితి ముగియగానే శాసనసభ రద్దవుతుంది. తదుపరి ఎన్నికల్లో మెజారిటీ ఎమ్మెల్యేలున్న పార్టీని కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ కోరవచ్చు. పాత సీఎం రాజీనామా చేయాలని ఆదేశించవచ్చు. రాజీనామాచేయకపోతే పాత మంత్రిమండలి, కేబినెట్ మంత్రుల పదవులను గవర్నర్ రద్దుచేస్తారు.ఒకవేళ పాత ముఖ్యమంత్రి తనకు కొత్త ఎమ్మెల్యేల్లో సరిపడా బలం ఉందని విశ్వసిస్తే బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆదేశించవచ్చు. అయితే తాజా ఎన్నికల్లో టీఎంసీ ఎమ్మెల్యేల సంఖ్య సాధారణ మెజారిటీకి సరిపడా లేదు కాబట్టి బలనిరూపణలో మమత ఓడిపోవడం ఖాయం. మెజారిటీ సీట్లు సాధించిన పార్టీనే గవర్నర్ కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారు. నేటితోనే టీఎంసీ ప్రభుత్వ కాలపరిమితి ముగుస్తోంది. దీంతో రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం చూసినా టీఎంసీ పాలన ముగిసినట్లే. మమత ఆటోమేటిక్‌గా సీఎం పదవిని కోల్పోయినట్లే లెక్క. గవర్నర్ కోరనిది ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం కూడా మమతకు లేదు. -
రాజీనామా ప్రసక్తే లేదు: మమతా బెనర్జీ
కోల్‌కతా: పదిహేనేళ్ల తృణమూల్ పరిపాలనా కోటలను ప్రజాతీర్పుతో బద్దలుకొట్టామని బీజేపీ ప్రకటించుకుంటుంటే పూర్తిగా కుట్రతోనే తమను కూలదోశారని టీఎంసీ చీఫ్ మమతాబెనర్జీ నిప్పులుచెరిగారు. పశ్చిమబెంగాల్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం తర్వాత మమత తొలిసారిగా మంగళవారం కోల్‌కతాలో మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడారు. ‘‘ఎన్నికల్లో మేం బీజేపీతో పోరాడలేదు. కాషాయపార్టీ కోసం కష్టపడిన ఎలక్షన్ కమిషన్‌తో మేం పోరాడాం. ప్రజాతీర్పుతో మేం ఓడిపోలేదు. కుట్ర చేసి మమ్మల్ని తక్కువ సీట్లకు పరిమితంచేశారు. అలాంటప్పుడు నేను రాజీనామా చేయాలనే ప్రశ్న ఎలా ఉత్పన్నమవుతుంది? నేను ఓడిపోలేదు. లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు రాజీనామాలేఖ సమర్పించే ప్రసక్తే లేదు.అసలు నేను రాజీనామా ఎందుకు చేయాలి? మా ఓట్లను చోరీచేశారు. ఓట్ల లెక్కింపులో భారీ అవకతవకలు జరిగాయి. దాదాపు 100 స్థానాల్లో మా గెలుపును అడ్డుకున్నారు. మా పార్టీ నైతికతను దెబ్బతీసేలా ఓట్ల లెక్కింపు ప్రక్రియను నత్తనడకన కొనసాగించారు. బెంగాల్లో జరిగిన లోపభూయిష్ట ఎన్నికలను నా రాజకీయజీవితంలో ఎన్నడూ చూడలేదు. గత 22 ఏళ్లలో ఇలాంటి దారుణాలు ఎప్పుడూ చూడలేదు. చరిత్రలో ఇదొక చీకటి అధ్యాయం. ఈ అధ్యాయంలో ఎన్నికలసంఘమే అసలైన విలన్. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ, ఈసీ కలసికట్టుగా ఖూనీ చేశాయి. అక్రమంగా మమ్మల్ని ఓడించే ప్రయత్నంచేశారు. ఎన్నికల సంఘం ద్వారా మమ్మల్ని ఓడించారేమోగానీ వాస్తవానికి నైతిక విజయం మాదే. వీధి పోరాటాలకు మేం ఎప్పుడూ సిద్ధమే. బీజేపీ అరాచకాలను ఎండగడతా’’అని మమత అన్నారు. అంతటా దాడులు, బదిలీలు, పక్షపాతమే ‘‘ఎన్నికల ప్రక్రియ మొదలుకావడానికి ముందు నుంచే బెంగాల్ అంతటా కీలకమైన సమర్థులైన ఉన్నతాధికారులపై ఉద్దేశపూర్వకంగా ఈసీ బదిలీ వేటు వేసింది. వందలమందిని అప్రాధాన్య స్థానాలకు తరమేసింది. మా పార్టీ, మా పార్టీతో సంబంధమున్న సంస్థలపై ఈడీ అధికారులను దాడులతో ఉసిగొల్పింది. పక్షపాతధోరణితో రాజ్యాంగబద్ధ సంస్థల నిబద్ధత ప్రశ్నార్థకంగా మారింది. మాపై దాడులతో నిర్ఘాంతపోయి విపక్షాల ఇండియాకూటమి నేతలు మాకు ఫోన్లు చేసి సంఘీభావం తెలిపారు. సోనియాగాంధీ, రాహుల్‌గాం«దీ, అరవింద్ కేజ్రీవాల్, ఉద్ధవ్ ఠాక్రే, అఖిలేశ్ యాదవ్, హేమంత్ సోరెన్ తదితర అగ్రనేతల నుంచి ఫోన్‌కాల్స్ వచ్చాయి. ఇకపై విపక్షాల ఇండియా కూటమి బలోపేతం కోసం పోరాటాన్ని ఉధృతం చేస్తా’’అని మమత ప్రకటించారు. తదుపరి కార్యాచరణ వెల్లడిస్తా ‘‘నేను ఒంటరిదాన్ని కాదు. నాకు తోడుగా పార్టీ అండగా ఉంది. తదుపరి కార్యాచరణను త్వరలో వెల్లడిస్తాం. సమష్టిగా నిర్ణయించి ముందుకెళ్తాం. ఓట్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) బిల్లు అతిపెద్ద కుట్ర. ఎస్ఐఆర్తో ఏకంగా 90 లక్షల ఓట్లు తొలగించారు. తర్వాత పోరాటంచేసి 32 లక్షల ఓట్లు కలిపేలా చేశాం. తర్వాత కూడా 7 లక్షల ఓట్లను కలిపారు. కానీ ఇది ఎవరికీ తెలీదు. ఫలితాల వెల్లడి తర్వాత టీఎంసీ నేతలపై దాడులు జరిగాయి. 10 మంది సభ్యులతో నిజనిర్ధారణ కమిటీ వేస్తా. హింసాత్మక ప్రాంతాలను పర్యటిస్తా’’అని అన్నారు. నన్నూ గెంటేశారు ‘‘ఓట్ల కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్రబలగాలు గూండాల్లా వ్యవహరించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించేందుకు వచ్చిన నన్ను కూడా నెట్టేశారు. పొట్టపై, వీపుపై నెడుతూ గెంటేశారు. మహిళగా నాతో వాళ్ల అనుచిత ప్రవర్తనతో ఎంతగానో బాధపడ్డా. ఎన్నిసార్లు అభ్యర్థించినా టీఎంసీ ఏజెంట్లను సీఆర్పీఎఫ్ జవాన్లు లోపలికి అనుమతించలేదు. ఫిర్యాదు తీసుకోవాల్సిన వాళ్లే ఇలా ప్రవర్తిస్తే ఎలా? జవాన్లంతా అమ్ముడుపోయారు’’అని మమత ఆరోపించారు. ‘‘పులిలా పోరాడతాం. పోరాటాన్నికొనసాగించి మళ్లీ నూతనోత్తేజంతో పైకిలేస్తాం. అధికార కుర్చిల గురించి మాకు పట్టింపులేదు. మాకు ప్రజలే ముఖ్యం. మా, మాటీ, మనుష్ కు మా వందనాలు. ప్రజాస్వామ్యద్రోహుల కారణంగా మాకు ఓటేయలేకపోయిన వారందరికీ నా క్షమాపణలు’’అని మమత అన్నారు. బెంగాల్‌కు అమిత్ షా.. అస్సాంకు నడ్డా సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో బీజేపీ శాసనసభాపక్ష నేతల ఎంపిక ప్రక్రియను పార్టీ అధిష్టానం వేగవంతం చేసింది. ఈ ఎంపికను పర్యవేక్షించేందుకు కేంద్ర పరిశీలకులను నియమిస్తూ మంగళవారం బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంది. బెంగాల్ బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకునే బాధ్యతను హోం మంత్రి అమిత్ షాకు అప్పగించారు. ఆయనతో పాటు సహ పరిశీలకుడిగా ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీని నియమించారు. అదేవిధంగా, అస్సాం శాసనసభా పక్ష నేత ఎంపిక కోసం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాను పరిశీలకుడిగా అధిష్టానం ఖరారు చేసింది. -
హౌస్ మెయిడ్ నుంచి అసెంబ్లీకి...
సమాజంలో పెద్దగా పలుకుబడి లేదు... హోరెత్తించే ప్రచారాలూ లేవు.. ఆర్భాటాలూ లేవు.. ప్రతిపక్షాన్ని ఆరోపణలతో ఎండగట్టిందీ లేదు.. ఆర్థికంగానూ అంతంత మాత్రమే... నాలుగిండ్లల్లో పనిచేసుకుంటేనే నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లే పరిస్థితి.. అయినా నేడు తాను ఎమ్మెల్యేగా గెలిచి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆమే బెంగాల్‌కు చెందిన ఓ సాధారణ మహిళ కలితా మాఝీ తాను ప్రతి రోజూ ఎదుర్కొంటున్న సమస్యల్నే ప్రజల ముందుంచి.. వాటి వాటి పరిష్కారం కోసం పనిచేయడమే తన ముందున్న కర్తవ్యమంటూ తన విజయానికి బాటలు పరచుకొంది.పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక అద్భుతమైన గెలుపు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇళ్లలో పనిమనిషిగా పనిచేసే కలితా మాఝీ, ఇప్పుడు ఆస్గ్రామ్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యింది. ఆస్గ్రామ్ స్థానంలో కలితా మాఝీకి 1,07,692 ఓట్లు రాగా, తన సమీప ప్రత్యర్థి శ్యామ ప్రసన్న లోహర్‌పై 12,535 ఓట్ల మెజారిటీతో ఆమె విజయం సాధించారు.జీవితమంతా కష్టాలే...తూర్పు బర్దామన్ జిల్లాలోని గుస్కరా మున్సిపాలిటీ నివాసి అయిన కలితా మాఝీ ప్రయాణం కటిక పేదరికం నుంచి మొదలైంది. ఏడుగురు అక్కాచెల్లెళ్లు, ఒక సోదరుడు ఉన్న పెద్ద కుటుంబం ఆమెది. తండ్రి దినసరి కూలీ కావడంతో చదువును మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. వివాహం తరువాత కూడా ఆమె ఆర్థిక పరిస్థితిలో మార్పు రాలేదు. కలితా భర్త ప్లంబర్. అందువల్ల ఆమె గత రెండు దశాబ్దాలుగా పలు ఇళ్లలో పనిమనిషిగా చేస్తూ.. నెలకు రూ. 4,500 సంపాదిస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఆమెకు ఒక కుమారుడు.2021లో ఓటమికలితా మాఝీ రాజకీయ ప్రయాణం రాత్రికి రాత్రి మొదలైంది కాదు. దాదాపు పదేళ్ల పాటు ఆమె ఓ సాధారణ కార్యకర్తగా కష్టపడింది. గతంలో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆమె పోటీ చేశారు. అప్పుడు టీఎంసీ అభ్యర్థి అభేదానంద థండర్ చేతిలో 11,815 ఓట్ల తేడాతో ఓడిపోయినప్పటికీ 41 శాతం ఓట్లు సాధించి అందరి దృష్టినీ ఆకర్షించింది. అదే ఇపుడు మరోసారి ఆమె పార్టీ టికెట్‌ను పొందేలా చేస్తే.. ప్రజలతో ఆమెకున్న అనుబంధం భారీ విజయాన్ని సాధించిపెట్టింది.సమస్యలే ప్రచార అస్త్రాలుభారీ బహిరంగ సభలు, ఆర్భాటాలు లేకుండా కలితా మాఝీ ప్రచారం సాగింది. తాను అనుభవించిన కష్టాలనే ఓటర్ల ముందుంచింది. వైద్యంకోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన దుస్థితి, పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, తాగునీటి ఎద్దడి, మహిళల భద్రత వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లింది. కేవలం ప్రభుత్వ పథకాలపై ఆధారపడటం కాకుండా, ప్రజలకు ఉద్యోగాలు, మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆమె గళం విప్పింది. అవినీతిపై ఆమె చేసిన సూటి విమర్శలు ఓటర్లను ఆకట్టుకున్నాయి.అదే ఉత్సాహంతో...నన్ను అభ్యర్థిగా ప్రకటించినప్పుడు, నేను రెండు ఇళ్లలో పనిమనిషిగా చేస్తూ నెలకు రూ. 4,500 సంపాదిస్తున్నాను. నేను పని చేసుకోవడానికి వీలుగా నా అత్తగారు ఇంట్లో వంట పనుల్లో సహాయం చేసేవారు. నేను ప్రతిరోజూ ఉదయం ఐదు గంటలకు నిద్రలేచి పనులకు వెళ్లేదాన్ని. ఇప్పుడు ప్రజల కోసం కూడా పనిచేయడానికి అదే ఉత్సాహంతో సిద్ధంగా ఉన్నాను.ప్రాథమిక సౌకర్యాల మెరుగుదలే నా లక్ష్యం. – కలితా మాఝీ -
తృణముల్ చాప్టర్ ముగిసింది: మాజీ క్రికెటర్
తృణముల్ కాంగ్రెస్ (టీఎంసీ) మాజీ ఎమ్మెల్యే, టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారి తృణముల్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ తనకు హౌరాలోని షిబ్‌పుర్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి రూ. 5 కోట్లు డిమాండ్ చేసినట్లు ఆరోపించాడు. ఇక రాజకీయంగా తృణముల్ కాంగ్రెస్‌తో తన అధ్యాయం ముగిసిందని మనోజ్ తివారి పేర్కొన్నాడు. సోమవారం వెలువడిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 15 ఏళ్ల మమతా బెనర్జీ పాలనకు చరమగీతం పాడిన బెంగాల్ ప్రజలు బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో బెంగాల్లో బీజేపీ గెలుపుపై మనోజ్ తివారి స్పందించాడు. ఈ సందర్భంగా తృణముల్ అవినీతి, పార్టీ చేసిన అరాచకాలను మనోజ్ తివారి ఎండగట్టాడు. ‘హౌరాలోని శిబ్పూర్ నియోజకవర్గం నుంచి నాకు టికెట్ ఇవ్వడానికి టీఎంసీ నిరాకరించింది. ఎమ్మెల్యే టికెట్ కావాలంటే రూ.5కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసింది. ఈ సారి ఎన్నికల్లో సుమారు 70 నుంచి 72 మంది అభ్యర్థులు భారీగా డబ్బు చెల్లించి టికెట్లు కొనుగోలు చేశారు. అందుకే పార్టీ ఘోర పరాజయం పాలైంది. అవినీతిమయమైన పార్టీకి పతనం తప్పదు. టీఎంసీతో నా అధ్యాయం ముగిసింది. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు. మమతా బెనర్జీ ప్రభుత్వంలో నేను క్రీడల శాఖ సహాయ మంత్రిగా పనిచేశాను. పేరుకే మంత్రి పదవి.. కానీ నాకు ఎటువంటి అధికారాలు ఉండేవి కాదు. కనీసం నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. నా సొంత నియోజకవర్గంలో డ్రైనేజీ, మురుగునీటి సమస్యల కోసం ఎంతో పోరాడాను.ప్రతి ఏడాది ఏదో ఒక మాస్టర్ ప్లాన్ అంటారు. కానీ అది మాటలకే పరిమితం అయ్యేది. క్రీడా మంత్రి బిస్వాస్‌కు క్రీడలపై కనీస అవగాహన లేదు. నా ఎదుగుదలను చూసి అసూయ పడేవారు. క్రీడా కార్యక్రమాలకు నన్ను ఆహ్వానించకుండా అడ్డుకునేవారు. నాపై ఎన్నో అవినీతి ఆరోపణలు చేశారు. నేను ఐపీఎల్లో 10 ఏళ్లు, ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 20 ఏళ్లు ఆడాను. నాకు డబ్బు అవసరం లేదు’ అని తివారీ స్పష్టం చేశారు.ఇక తన రాజకీయ జీవితం ముగిసిందని ప్రకటించిన మనోజ్ తివారి త్వరలో క్రికెట్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు స్పష్టం చేశాడు. అయితే ఈసారి ఆటగాడిగా కాకుండా కోచ్ పాత్రలో వస్తున్నట్లు తెలిపాడు. ఇప్పటికే బీసీసీఐ లెవెల్ 2 కోచ్ పరీక్షను కూడా పాసైనట్లు తెలిపాడు. ఇప్పటికే బెంగాల్ క్రికెట్ హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నాడు. బెంగాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మనోజ్ తివారి దేశవాలీ క్రికెట్లో బెంగాల్ తరఫున అత్యధిక పరుగులు (10,195 పరుగులు) చేసిన క్రికెటర్‌గా నిలిచాడు. ఇక టీమిండియా తరఫున 2008 నుంచి 2015 మధ్య ఆడిన మనోజ్ తివారి 12 వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇక ఐపీఎల్లో మనోజ్ తివారి కేకేఆర్, పంజాబ్, రైజింగ్ పూణే, ఢిల్లీ డేర్‌డెవిల్స్ ప్రాతినిధ్యం వహించాడు. చదవండి: చిచ్చు రగిలింది.. చిక్కుల్లో రాజస్తాన్ రాయల్స్! -
మమత వ్యాఖ్యలపై సువేందు అధికారి స్పందన
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో తాము ఓడిపోలేదని, నైతికంగా తామే గెలిచామని, సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదన్న టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత సువేందు అధికారి స్పందించారు. సీఎం పదవికి మమత రాజీనామా చేయనంటే కుదరదని సువేందు అధికారి పేర్కొన్నారు. రాజ్యాంగంలో ప్రతీది రాసి ఉందని, ఓడిపోయాక రాజీనామా చేయనంటే సాధ్యమయ్యే పనినే అంటూ ప్రశ్నించారు. మమత వ్యాఖ్యలను ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నామని సువేందు అధికారి తెలిపారు. కాగా, బెంగాల్లో నైతిక విజయం తమదేనని అన్నారు మమతా బెనర్జీ. ఓట్లను, సీట్లను చోరీ చేసి బీజేపీ గెలిచిందని విమర్శించారు. అదే సమయంలో తాను సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను లోక్‌భవన్‌కు వెళ్లనని, అక్కడకు వెళ్లి రాజీనామా చే యాల్సిన అవసరం కూడా లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో తాము ఓడిపోలేదని, బీజేపీ సీట్లు దొంగిలించిన కారణంగానే ఓడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని మమతా బెనర్జీ మరోసారి ఆరోపించారు. తన ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న మమతా, కోల్‌కతా నుంచి ప్రెస్మీట్లో మాట్లాడుతూ..‘ మేము ఎన్నికల్లో ఓడిపోలేదు. 100 సీట్లను బిజెపి దొంగిలించింది. ఇది బీజేపీ విక్టరీ కాదు.. లూటీ. బెంగాల్ ఎన్నికల్లో ఈసీ విలన్. ప్రతిపక్ష నేతలు వేధించడం బిజెపికి అలవాటు’ అంటూ ధ్వజమెత్తారు. -
దీదీ సంచలన కామెంట్స్.. బీజేపీ 100 సీట్లు చోరీ.!
-
సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదు: మమతా
కోల్‌కతా: బెంగాల్లో నైతిక విజయం తమదేనని అంటున్నారు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ. ఓట్లను, సీట్లను చోరీ చేసి బీజేపీ గెలిచిందని విమర్శించారు. అదే సమయంలో తాను సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను లోక్‌భవన్‌కు వెళ్లనని, అక్కడకు వెళ్లి రాజీనామా చే యాల్సిన అవసరం కూడా లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో తాము ఓడిపోలేదని, బీజేపీ సీట్లు దొంగిలించిన కారణంగానే ఓడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని మమతా బెనర్జీ మరోసారి ఆరోపించారు. తన ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న మమతా, కోల్‌కతా నుంచి ప్రెస్మీట్లో మాట్లాడుతూ..‘ మేము ఎన్నికల్లో ఓడిపోలేదు. 100 సీట్లను బిజెపి దొంగిలించింది. ఇది బీజేపీ విక్టరీ కాదు.. లూటీ. బెంగాల్ ఎన్నికల్లో ఈసీ విలన్. ప్రతిపక్ష నేతలు వేధించడం బిజెపికి అలవాటు. మా నాయకులపై వేధింపులు మొదలయ్యాయి. ఇండియా బ్లాక్ కోసం మరింత గట్టిగా పని చేస్తా. ఈసీ బీజేపీ ఏజెంట్‌గా పనిచేసింది. ఎన్నికలకు రెండురోజుల ముందే టీఎంసీ నేతల్ని అరెస్ట్ చేశారు. బెంగాల్లో మాది ఓటమి కాదు. బీజేపీ చోరీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం మా పాలిట విలన్. మేం విలన్లపై పోరాటం చేశాం. కౌంటింగ్ సెంటర్లలో మా ఏజెంట్లను అనుమతించలేదు. SIR ప్రక్రియలో మోదీ, అమిత్ షా తలదూర్చారు. బీజేపీ ఓట్ల చోరీపై పోరాడుతాం. సీఆర్పీఎఫ్ బలగాలు మా పాలిట గూండాల్లా మారాయి. బీజేపీకి ప్రతిపక్ష నేతల్ని టార్గెట్ చేయడం అలవాటే. మాకు ఇండియా బ్లాక్ మద్దతు ఉంది’ అని స్పష్టం చేశారు. కాగా, నిన్న(సోమవారం) వెలువడిన బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. 200పైగా సీట్లు గెలుచుకుని చరిత్ర సృష్టించింది. బీజేపీ ప్రభంజనంతో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ 100 సీట్ల మార్కును కూడా దాటలేకపోయింది. -
ఎమ్మెల్యేగా ఎన్నికైన టీమిండియా మాజీ క్రికెటర్
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కీలక మార్పులకు దారితీశాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) ఘన విజయం సాధించి, 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యానికి చరమగీతం పాడింది. బీజేపీ నుంచి ఎన్నికైన 200 మంది పైచిలుకు ఎమ్మెల్యేల్లో ఓ టీమిండియా మాజీ క్రికెటర్ కూడా ఉన్నాడు. అతని పేరు అశోక్ దిండా.దిండా పూర్వ మిడ్నాపూర్ ప్రాంతంలోని మోయ్నా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా మరోసారి ఎన్నికయ్యాడు. దిండా తన సమీప ప్రత్యర్ది, టీఎంసీ అభ్యర్ది చందన్ మొండల్‌పై 14000 పైచిలుకు మెజార్టీతో గెలిచాడు. గత ఎన్నికల్లో (2021) స్వల్ప తేడాతో విజయం సాధించిన దిండా, ఈసారి భారీ ఆధిక్యంతో గెలిచి తన ప్రజాదరణను మరింత పెంచుకున్నాడు.2021లో క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన దిండా, అదే సంవత్సరంలో బీజేపీలో చేరి తొలిసారి ఎమ్మెల్యే అయ్యాడు. ఇప్పుడు వరుసగా రెండోసారి గెలవడంతో, త్వరలో ఏర్పాటయ్యే బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా నియమితుడయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. గత టీఎంసీ ప్రభుత్వంలో ఓ టీమిండియా మాజీ క్రికెటర్ (మనోజ్ తివారి) మంత్రిగా ఉండటంతో దిండాకు కూడా ఈసారి మంత్రివర్గం ఛాన్స్ ఖాయమని అంతా చర్చించుకుంటున్నారు.42 ఏళ్ల దిండా 2009లో టీమిండియా అరంగేట్రం చేసి 13 వన్డేలు, 9 టీ20లు ఆడి 29 వికెట్లు తీశాడు. కుడి చేతి వాటం మీడియం పేసర్ అయిన దిండా ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చి టీమిండియా అవకాశాలు దక్కించుకున్నాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో 78 మ్యాచ్‌లు ఆడిన దిండా 69 వికెట్లు తీశాడు. 2010లో టీమిండియా ఆసియా కప్ గెలిచిన జట్టులో దిండా సభ్యుడిగా ఉన్నాడు.దిండా అంతర్జాతీయ స్థాయిలో ఎక్కువ కాలం నిలవకపోయినా, దేశీయ క్రికెట్లో అద్భుతంగా రాణించాడు. బెంగాల్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 420 వికెట్లు, లిస్ట్-ఏ క్రికెట్లో 151 వికెట్లు పడగొట్టాడు. -
టీఎంసీ ఓటమిపై కాంగ్రెస్ సంబురాలు.. రాహుల్ చురకలు
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో.. కేరళంలో అధికారం తప్పించి మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపెట్టలేదు. అయితే సింగిల్ డిజిట్ సీట్లతో తమిళనాడులో అధికారంలో భాగం అయ్యే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఇటు బెంగాల్లో రెండు సీట్లు గెలవడం కంటే.. టీఎంసీ ఓటమిపైనే హస్తం శ్రేణులు ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి. ఈ పరిణామంపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఓటమితో కొందరు కాంగ్రెస్ నేతలు సంబురాలు చేసుకున్నట్లు రాహుల్ గాంధీకి సమాచారం వెళ్లింది. దీంతో సొంత పార్టీ నేతల తీరుపైనే ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘‘ టీఎంసీ ఓటమిని చూసి కొందరు కాంగ్రెస్ నేతలు మురిసిపోతున్నారు. ఇది ఎంత మాత్రం సరికాదు. బెంగాల్, అసోంలో ప్రజల తీర్పును అపహరించడం అనేది భారత ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే క్రమంలో బీజేపీ వేసిన మరో అడుగు.. .. ఇది ఓ పార్టీకో, మరో పార్టీకో చెందింది కాదు. ఇది దేశం గురించి.. చిల్లర రాజకీయాలు పక్కన పెట్టండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా అన్ని పార్టీలు కలిసికట్టుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది’’ అని రాహుల్ హితవు పలికినట్లు సమాచారం. అంతకు ముందు.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందించారు. కేరళలో కాంగ్రెస్ విజయం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూనే.. మరోవైపు బెంగాల్, అస్సాం విషయంలో బీజేపీపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. దీదీకి మద్దతుగా.. బెంగాల్లో ఓట్ల చోరీ జరిగిందన్న టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యలతో రాహుల్ గాంధీ ఏకీభవించారు. బెంగాల్‌తో పాటు అస్సాంలోనూ ఓట్లను బీజేపీ దోచుకుందని అన్నారాయన. ‘‘బెంగాల్లో వందకు పైగా స్థానాలు అన్యాయంగా బీజేపీ ఖాతాలోకి వెళ్లాయి. ఎన్నికల ప్రక్రియలో సీసీటీవీ కెమెరాలు ఆపివేయడం, కౌంటింగ్ సెంటర్లలో అనుమానాస్పద కదలికలు జరిగాయి. ఇది ఒక పెద్ద “ఎలక్షన్ మేనిప్యులేషన్ ప్లేబుక్”లో భాగమని ఆయన ఆరోపించారు. -
ఇక టీఎంసీ నేతలు ‘గుండు’కు రెడీనా?
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. కోల్‌కతా, దక్షిణ 24 పరగణాల్లో బీజేపీ ఒక్క స్థానం గెలిచినా తమ ఎంపీ ఒకరు గుండు కొట్టించుకుంటారని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సీనియర్ నేత డెరెక్ ఓబ్రియన్ విసిరిన సవాలు ఇప్పుడు ఆ పార్టీకే రివర్స్ అయ్యింది. ఇప్పుడు టీఎంసీ నేతలు తమ సవాల్‌ను నిలబెట్టుకుంటారా లేదా అనే ఉత్కంఠ అందరిలోనూ కలుగుతోంది.గత నెలలో జరిగిన ఒక విలేకరుల సమావేశంలో డెరెక్ ఓబ్రియన్ మాట్లాడుతూ.. ‘మేము గొప్పలు చెప్పదలుచుకోలేదు, మే 4 లెక్కింపు రోజు వరకు వేచి చూస్తాం. కోల్‌కతాలో బీజేపీ ఒక్క సీటు గెలిచినా మా ఎంపీ ఒకరు గుండు కొట్టించుకుంటారు’ అని సవాల్ విసిరారు. దక్షిణ 24 పరగణాల్లోని 31 స్థానాలకు కూడా ఇదే రూల్ వర్తిస్తుందని ఆయన నాడు తెలిపారు. 2021 ఎన్నికల్లో సాధించిన 215 సీట్ల కంటే ఈసారి మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తామని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఎన్నికల సమయంలో ధీమా వ్యక్తం చేశారు. అయితే తుది ఫలితాలలో టీఎంసీ కనీసం 100 మార్కును కూడా దాటలేకపోయింది.ఇది కూడా చదవండి: బిగ్ బ్రేకింగ్: 9న బీజేపీ ప్రమాణ స్వీకారం -
ఆమె ఆత్మకు శాంతి : కడుపు శోకం నుంచి శాసనసభ దాకా
పశ్చిమ బెంగాల్లో సంచలనం రేపిన ఆర్.జి. కర్ మెడికల్ కాలేజీ ఘటన బాధితురాలి తల్లి, బీజేపీ అభ్యర్థి రత్న దేబ్నాథ్ (Ratna Debnath) అద్భుత విజయాన్ని సాధించారు. కన్నబిడ్డను అత్యంత దారుణ పరిస్థితుల్లో కోల్పోయిన ఆమె తన తొలి ప్రయత్నంలోనే అసెంబ్లీలోకి అడుగుపెట్ట బోతున్నారు. న్యాయకోసం సాగిన పోరులో జనం ఆమెకు అండగా నిలబడ్డారు. దీంతో పానిహాటిలో రత్నమ్మ అఖండ విజయాన్ని అందుకున్నారు. కన్నీటి గాథ నుంచి విజయ తీరాలకు చేరిన ఆమె ప్రస్థానం బెంగాల్ గడ్డపై ప్రత్యేకంగా నిలుస్తుంది. 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పానిహాటి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి BJP అభ్యర్థిగా పోటీ చేసిన రత్నా దేబ్నాథ్ 28 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అదీ అయిదుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న TMC అభ్యర్థి తీర్థంకర్ ఘోష్‌పై గెలవడం విశేషం. అయితే ఆమె పొలిటిక్ ఎంట్రీ మాత్రం ఒక విషాదం తరువాత జరిగింది. కానీ తనబిడ్డకు జరిగిన అన్యాయంపై పోరుచేసి విజయాన్ని అందుకున్న అమ్మగా ఆమె చరిత్రలో నిలిచిపోతారు.ఆమె పొలిటికల్ ఎంట్రీ2024 ఆగస్టులో తన కుమార్తెపై జరిగిన అమానుష ఘటన తర్వాత,తన కుమార్తెకున్యాయం జరగాలనే డిమాండ్‌తో ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. మహిళల రక్షణ , జవాబుదారీతనం ప్రధాన ఎజెండాగా ఆమె ప్రచారం నిర్వహించారు. న్యాయం కోసం జరిగిన పోరాటానికి ప్రజలు పట్టం కట్టారని, బాధితురాలి తల్లి విజయం అత్యంత కీలకమైనదని విశ్లేషకులు భావిస్తున్నారు.కాగా ఆగస్టు 9 న నార్త్ కోల్‌కతాలోని ఆర్జీ ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న ఓ ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారం జరిగింది. వైద్యురాలిపై ఆస్పత్రిలోనే అతికిరాతంగా అత్యాచారం చేసి హతమార్చిన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై అప్పటి మమతా సర్కార్ వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. పెద్ద ఎత్తు నిరసనలు చెలరేగాయి. నిరసనల వెనుక బీజేపీ, సీపీఐ(ఎం) కుట్రలు ఉన్నాయని, రాష్ట్రంలో అశాంతి సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించడం, ఉద్యమకారులపై దాడి చేయించడం, సాక్ష్యాలను నాశనం చేయడం, పోలీసులు, ఇతర అధికారులు తీరును సమర్ధించడంపై ఆగ్రహం పెల్లుబుకింది. ఒక విధంగా ఈ ఘటనలో నేరస్తులకు వత్తాసు పలకడమే అటు మమతా బెనర్జీకి, ఇటు టీఎంసీ పతనానికి పునాది వేసిందని విశ్లేషకుల అంచనా.రేఖా పాత్రమరోవైపు 2024 ప్రారంభంలో బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో TMC నేతలు షాజహాన్ షేక్, అతని అనుచరులు, భూములను లాక్కున్నారని , మహిళలపై లైంగిక దాడుల ఆరోపణలతో గ్రామీణ మహిళలు, ముఖ్యంగా ఎస్సీ/ఎస్టీ వర్గాలకు చెందినవారు, నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ వీధుల్లోకి వచ్చారు. వీరిపైనా కూడా దీదీ ఉక్కుపాదం మోపారు. ఈ సందేశ్‌ఖాలీ నిరసనల్లో కీలక ముఖచిత్రంగా నిలిచిన రేఖా పాత్ర కూడా బీజేపీ తరపున హింగల్గంజ్ నుంచి విజయం సాధించారు. ఆమె 5,421 ఓట్ల మెజారిటీతో తృణమూల్ అభ్యర్థి ఆనంద సర్కార్‌ను ఓడించారు. గతంలో లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ, ఈసారి హింగల్గంజ్ అసెంబ్లీ స్థానం నుండి విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు.కాగా బీజేపీ బెంగాల్లో 294 స్థానాలకు గాను 202 స్థానాలను కైవసం చేసుకుంది. భవానీపూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బిజెపి నేత సువేందు అధికారి చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ విజయంతో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 15 ఏళ్ల సుదీర్ఘ పాలన ముగిసింది.ఇదీ చదవండి: బెంగాల్లో బీజేపీ ప్రభంజనంలో ఈమె చాలా స్పెషల్ -
బెంగాల్లో బీజేపీ ప్రభంజనంలో ఈమె చాలా స్పెషల్
పశ్చిమ బెంగాల్లో ఒక సాధారణ మహిళ అనూహ్య విజయం సాధించారు. దీదీ సర్కార్‌కు ఝలక్ ఇచ్చి బీజేపీ సాధించిన ప్రభంజనంలో గుస్కారాకు చెందిన గృహ కార్మికురాలు కలితా మాఝీ(37) విజయం మరింత ప్రత్యేకంగా నిలుస్తోంది. గతంలో గృహ కార్మికురాలిగా పనిచేసిన కలితా మాఝీ, ఆస్గ్రామ్ నియోజకవర్గం నుండి ఘనవిజయం సాధించడం విశేషంగా నిలుస్తోంది.కలితా మాఝీ వంటి సాధారణ నేపథ్యం ఉన్న అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా బీజేపీ ప్రజలకు చేరువయ్యింది. పార్టీ లోతైన సంస్థాగత నిర్మాణం, ఓటర్లను ఆకట్టుకోవడం దీదీ ఇలాకాలో బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఈ నేపథ్యంలో గతంలో ఇంటి పనిమనిషిగా నెలకు రూ.2,500 సంపాదించే కలితా మాఝీ బీజేపీ తరఫున పోటీ చేసి విజయం సాధించి ఎమ్మెల్యేగా అవతరించారు. తన సమీప ప్రత్యర్థి శ్యామ ప్రసన్న లోహర్‌పై 12,535 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆమెకు మొత్తం 1,07,692 ఓట్లు వచ్చాయి. ఇది సిండ్రెల్లా స్టోరీ కాదు ఇది కలితా 'హిస్టరీ. పనిమనిషి నుంచి శాసనసభ వరకు ఎదిగిన ఆమె తనలాంటి ఎంతోమందికి స్ఫూర్తి.ఇదీ చదవండి: బెంగాల్ పోరులో ఒక సెన్సేషన్ కలితా మాఝీకాగా రాష్ట్రంలో 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ పాలనకు స్వస్తి పలికి బీజేపీకి పట్టం కట్టారు. బీజేపీ 294 స్థానాలకు గాను 206 స్థానాలను గెలుచుకుని చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. -
పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఓటమి


