60 ఏళ్ల వయసులో బీజేపీ దిలీప్‌ ఘోష్‌ వివాహం.. IPL మ్యాచ్‌తో ప్రేమ! | Bengal BJP Dilip Ghosh Marries Rinku Majumdar | Sakshi
Sakshi News home page

60 ఏళ్ల వయసులో బీజేపీ నేత దిలీప్‌ ఘోష్‌ వివాహం.. IPL మ్యాచ్‌తో ప్రేమ!

Apr 19 2025 7:11 AM | Updated on Apr 19 2025 8:38 AM

Bengal BJP Dilip Ghosh Marries Rinku Majumdar

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బెంగాల్‌ బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ దిలీప్‌ ఘోష్ 60 ఏళ్ల వయసులో బ్రహ్మచర్యాన్ని వీడి పెళ్లి చేసుకున్నారు. బీజేపీకి చెందిన మాహిళా నేతను ఆయన వివాహమాడారు.

వివరాల ప్రకారం.. మాజీ ఎంపీ దిలీప్‌ ఘోష్‌(60) వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. బెంగాల్‌లో పార్టీకి చెందిన బీజేపీ మహిళా మెర్చా నాయకురాలు రింకూ మజుందార్‌ (51)తో శుక్రవారం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య శుక్రవారం వివాహం జరిగింది. ఈ సందర్బంగా దిలీప్‌ ఘోష్‌ మాట్లాడుతూ.. వివాహం తన అమ్మ కోరిక అని చెప్పుకొచ్చారు. అయితే, మజుందార్‌కు ఇది రెండో వివాహం. అంతకుముందు మరో వ్యక్తితో వివాహం జరగ్గా.. విడాకులు తీసుకున్నారు.

 

ఇదిలా ఉండగా.. వీరిద్దరి పెళ్లికి ఐపీఎల్‌ మ్యాచ్‌ కారణం కావడం విశేషం. ఇంతకీ ఏం జరిగిందంటే.. మజుందార్‌తో దిలీప్‌కు నాలుగేళ్లుగా పరిచయం ఉంది. అయితే, ఈ నెల మొదటి వారంలో కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్‌లో జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌ను ఇద్దరూ కలిసి చూసిన సందర్భంగా పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. దీంతో​, కొద్దిరోజుల వ్యవధిలోనే ఇలా వివాహం చేసుకోవడం విశేషం. ఇక, ఇద్దరి వివాహం నేపథ్యంలో బెంగాల్‌కు చెందిన బీజేపీ సీనియర్‌ నేతలు ఇంటికి వచ్చి దిలీప్‌ ఘోష్‌ను అభినందించారు. అలాగే, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం శుభాకాంక్షలు తెలిపారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement