breaking news
Marriage
-
37 ఏళ్లకు బిగ్ బాస్ బ్యూటీ, యాంకర్ పెళ్లి : ఆరెంజ్ శారీ, టెంపుల్ జ్యుయల్లరీ
కన్నడ బుల్లితెర యాంకర్, నటి అనుశ్రీ (37) మొత్తానికి మూడు ముళ్ల బంధం లోకి అడుగుపెట్టింది. ఎన్నో ఊహాగానాల తర్వాత, ఆగస్టు 28న సాంప్రదాయ వేడుకలోవ్యాపారవేత్త రోషన్‌ను వివాహం చేసుకుంది. బెంగళూరు శివార్లలోని ఒకఅందమైన రిసార్ట్‌లో ఈ వివాహం జరిగింది. ఈ జంట సన్నిహితులు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. దీంతో అభిమానులుఫుల్ ఖుషీగాఉన్నారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట సందడిగా మారాయి.అనుశ్రీ సాంప్రదాయ నారింజ రంగు చీరలో చాలా అందంగా కనిపించింది. నెక్లెస్, రాణి హార్, కమర్బంద్, మాంగ్ టీకా, ఝుంకాలు, బ్యాంగిల్స్ , ఇతర టెంపుల్ జ్యుయల్లరీతో అందంగా మెరిసిపోయింది. మరోవైపు, వరుడు రోషన్ బంగారు కుర్తాను , మ్యాచింగ్ ధోతీని ధరించాడు. అనుశ్రీ - రోషన్ వివాహ ప్రీ వెడ్డింగ్ వేడుకలుఅనుశ్రీ - రోషన్ వివాహానికి మెహందీ, హల్ది లాంటి ప్రీవెడ్డింగ్ వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారుఘీ సన్నిహిత వేడుకల ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో త్వరగా వైరల్ అయ్యాయి. అభిమానులు, సన్నిహితులు హృదయపూర్వక శుభాకాంక్షలతో వెల్లువెత్తాయి.అనూశ్రీ భావోద్వేగం: రోషన్ మంగళసూత్రాన్ని కట్టుకుంటుండగా అనుశ్రీ భావోద్వేగంతో కన్నీరుపెట్టుకుంది. కన్నడనాట అనుశ్రీ తన టాలెంట్, యాంకరింగ్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. తన చాతుర్యంతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను, పాపులారిటీని సంపాదించుకుంది. బిగ్ బాస్ కన్నడలో కూడా పాల్గొంది. మంగళూరులో జన్మించిన అనుశ్రీ, చిన్నతనంలోనే తండ్రి విడిచి పెట్టడంతో తల్లితో పాటు పెరుగుతూ అనేక కష్టాలను ఎదుర్కొంది. అలా చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలను స్వీకరించింది. కరియర్లో నిలదొక్కుకుని తన తల్లి కోసం ఒక ఇల్లు కూడా నిర్మించింది, ఆమె సోదరుడు తన సొంత హోటల్ వ్యాపారాన్ని స్థాపించాడు. తన కుటుంబం బాధ్యతలను నెరవేర్చిన ఇన్నాళ్లకు అనుశ్రీ కొత్త జీవితంలోకి అడుగు పెట్టింది. భార్యగా తన కొత్త పాత్రను స్వీకరించింది. -
బాయ్ ఫ్రెండ్‌తో బాక్సింగ్ క్వీన్..మేరీ కోమ్ మేకప్ వీడియో వైరల్
ప్రముఖ అథ్లెట్, పరుగుల రాణి పీటీ ఉష కుమారుడు వివాహ వేడుకలో బాక్సింగ్ సంచలనం మేరీ కోమ్ (Mary Kom స్పెషల్ ఎట్రాక్షన్ నిలిచారు. బాక్సింగ్ రింగ్‌ను శాసించిన లెజెండ్మేరీ కోమ్ గోల్డెన్సిల్క్ చీర, నిండుగా నగలు, తలనిండా పూలతో ట్రెడిషనల్ లుక్‌లో కనిపించి ఫ్యాన్స్‌తో పాటు పలువుర్ని మెస్మరైజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తన లుక్కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో మేరీ కోమ్ షేర్ చేశారు. దీంతో ఇది నెట్టింట చక్కర్లు కొడుతోంది. అంతేకాదు కిర్రాక్ ఫోజులతో బాక్సింగ్ రింగ్‌లోనే కాదు..బ్యూటీలో కూడా క్వీన్ అనిపించుకుంది. అంతేకాదు ఆమె పక్కన నడిచిన వ్యక్తికూడా చర్చల్లో నిలిచాడు.మేరీ కోమ్ ముస్తాబైంది ఇలా View this post on Instagram A post shared by Dr Mangte Mary Kom (@mcmary.kom)ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో పుట్టిన మాంగ్టే చుంగ్నీజాంగ్ మేరీ కోమ్..అద్భుతమైన బాక్సర్ ఒలింపిక్ మెడల్ విజేతగా నిలిచారు. ఒక సాధారణ క్రీడాకారిణి నుండి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గొప్ప గుర్తింపు తెచ్చుకోవడం దేశానికి ఎంతో గర్వకారణంగా నిలిచిన ఒక స్ఫూర్తిదాయకమైన మహిళ.క్రీడలకు ఆమె చేసిన విశేష సేవలకు గుర్తింపుగా, ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్, పద్మభూషణ్ అవార్డులు లభించాయి. రికార్డు స్థాయిలో ఆరుసార్లు ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ గెలిచిన ఏకైక బాక్సర్. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలుచుకుని భారత క్రీడా ప్రపంచంలోనే కాకుండా గుర్తింపును తెచ్చుకున్నారు. 2014 ఆసియా క్రీడల్లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ మహిళా బాక్సర్ .మేరీకోమ్ 2016లో రాజ్యసభ సభ్యురాలిగా నియమితులైనారు. 2005లో ఆంఖోలర్ అకా ఓన్లర్‌ను పెళ్లి చేసుకోగా, వీరికి నలుగురు పిల్లలు. అయితే విభేదాల కారణంతో గత ఏడాది భర్తతో విడిపోయారు. ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నట్టు ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రకటించారు.ఎవరీ హితేష్ చౌదరి కాగాభర్తతో విడాకుల తరువాత తన వ్యాపార భాగస్వామి హితేష్ చౌదరి( Hitesh Choudhary))తో ప్రేమలో ఉన్నారనే ఊహాగానాలు వినిపించాయి.మేరీ కోమ్ లేదా హితేష్ చౌదరి ఇద్దరూ బహిరంగంగా ప్రేమ సంబంధాన్ని ధృవీకరించనప్పటికీ, గతంలో అనేక సార్లు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వీరిద్దరూ తాజాగా పెళ్లి వేడుకలో కూడా సందడి చేశారు. ఉమ్మడి వ్యాపార వెంచర్ స్పోర్టీ ఫిట్ ప్రైవేట్ లిమిటెడ్ హితేష్ చౌదరి సీఎండీగా ఉన్నారు. -
పీటీ ఉష కొడుకు పెళ్లి : స్పెషల్ ఎట్రాక్షన్‌గా మేరీ కోమ్
ప్రముఖ అథ్లెట్ , రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉష, వి. శ్రీనివాసన్ ల కుమారుడు డాక్టర్ విఘ్నేష్ ఉజ్వల్ పెళ్లి పీటలెక్కాడు. సోమవారం లే మెరిడియన్ హోటల్లో జరిగిన విలాసవంతమైన వేడుకలో అశోక్ కుమార్ -షిని కుమార్తె కృష్ణను సాంప్రదాయ బద్ధంగా వివాహం చేసుకున్నారు. కొచ్చిలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి క్రీడా, రాజకీయ, చలనచిత్ర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా బాక్సింగ్ లెజెండ్ మేరీ కోమ్, నటుడు శ్రీనివాసన్, కేంద్ర సహాయ మంత్రి జార్జ్ కురియన్ , ఎంపి జాన్ బ్రిట్టాస్ ఉన్నారు.“ఈ వివాహం తన కొడుకు జీవితంలో తదుపరి దశ. తల్లిగా తన జీవితంలో ఎంతో ఆనందమైన క్షణాలు. ఇది పెద్దలు కుదిర్చిన వివాహమేననీ, నాలుగేళ్ల నిరీక్షణ తర్వాత తనకు నచ్చిన, మెచ్చిన అమ్మాయిని తన భాగస్వామిగా చేసుకున్నాడని పీటీ ఉష వెల్లడించారు. స్విట్జర్లాండ్‌లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) స్పోర్ట్స్ మెడిసిన్‌లో డిప్లొమా సంపాదించారు. ప్రస్తుతం అతను పి.టి. ఉష కేరళలో స్థాపించిన ఉష స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్‌లో స్పోర్ట్స్ మెడిసిన్ డాక్టర్‌గా పనిచేస్తున్నారు. View this post on Instagram A post shared by P.T.Usha (@ptushaofficial) అందంగా మెరిసిన వధూవరులు విశాలమైన బంగారు జరీ అంచు, క్లిష్టమైన మోటిఫ్‌లతో నేసిన కంజివర్మ చీరలో నవ వధువు అందంగా కనిపించింది. మ్యాచింగ్ బ్లౌజ్, సాంప్రదాయ ఆభరణాలతో ఆమె ముగ్ధమనోహరంగా కనిపించింది. ముఖ్యంగా, చక్కటి నక్షి డిజైన్‌తో రూపొందించిన చోకర్‌తో , పొడవాటి లేయర్డ్ నెక్లెస్‌తో జత చేసింది. ఇంకా అందమైన టెంపుల్ మాంగ్-టీకాతో పాటు మ్యాచింగ్ చెవిపోగులు, కమర్బంధ్, వంకీ , ఉంగరాలు ధరించింది. సింపుల్ మేకప్ ,గ జ్రాతో అలంకరించిన జడ ఆమెకు అందంగా అమరాయి. మరోవైపు, వరుడు విఘ్నేష్ లేత గోధుమరంగు టోన్ గల కుర్తా, ధోతీ మరియు కండువాలో అందంగా కనిపించాడు.పి.టి. ఉష కొడుకు పెళ్లిలో మేరీ కోమ్ స్పెషల్బాక్సింగ్ రింగులో పంచులతో విరుచుకుపడి ప్రత్యర్థులను మట్టి కరిపించి, బంగారు పతకాలతో మురిపించిన మేరీ కోమ్ ఈ పెళ్లిలో ట్రెడిషనల్లుక్లో ఆకట్టుకున్నారు. గోల్డెన్ సిల్క్ చీర, ఆభరణాలు, తలలో మల్లెలతో కేరళ స్టైల్లో అందరి దృష్టిని ఆకర్షించారు అంతేకాదు, కల్యాణానికి వచ్చినఅందరి ప్రశ్నలకు సంతోషంతో సమాధానాలిస్తూ కనిపించారు .తాను కేరళ ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడతాననీ వడ, ఇడ్లీ, సాంపార్ అన్నీ బెస్ట్అని మేరీ కోమ్ చెప్పుకొచ్చారు.. కేరళలో అందరూ చోట్ ఇష్టపడతారు, ఐ లైక్ చావల్, ఐ ఆమ్ ఏ రైస్ ఈటర్ అని చెప్పారు. మరి ఫిట్ నెస్ పరిస్థితి ఏంటి అని ప్రశ్నించినపుడు.. మితంగా తింటూ పరవాలేదు అని సమాధానమిచ్చారు. -
అర్థం చేసుకోవాలి... అనర్థాలు నివారించుకోవాలి
పెళ్లి మంత్రాల్లో ఏ అర్థం ఉందో తెలుసుకోరు చాలామంది. పెళ్లిలో ఎలాంటి విధానంతో మెలగాలో తెలుసుకోరు ఎంతకాలమైనా. బడిలో ఒకటో తరగతి నుంచి పాఠాలు చదువుతారుగాని పెళ్లిలో ఏ అవగాహన పాఠాలు చదవకుండానే నెట్టుకొచ్చేయాలనుకుంటారు. వర్తమానంలో దంపతుల మధ్య జరుగుతున్న అనర్థాలు ప్రతి ఒక్కరినీ ఆగి, తమ వైవాహిక జీవనాన్ని తరచి చూసుకోమని కోరుతున్నాయి. సరి చేసుకుని ఆనందమయం చేసుకోమంటున్నాయి.న్యూస్‌పేపర్లు తెరిస్తే భార్యాభర్తల విడాకులు, హత్యోదంతాలు, ఆత్మహత్యలు... సోషల్ మీడియాలో చూస్తే వీధికెక్కి రచ్చ చేసుకోవడం, ఇంటి గుట్టు బయటపడేయడం... వివాహం వార్తగా మారడం... వివాహ గొడవలే ప్రధాన వార్తలుగా చలామణి కావడం చూస్తుంటే మనం ఎటువంటి సమాజం నుంచి ఎటువంటి సమాజానికి చేరుకుంటున్నామనేది పరిశీలించుకోవాలి.గతంలో ఎలా ఉండేది?నలభై, యాభై ఏళ్ల క్రితం వివాహ వ్యవస్థలో ఘోరమైన ఉదంతాలు ఇంత విస్తృతంగా కనిపించేవి కాదు. దంపతులు, పిల్లలు, అవ్వా తాతలు... కుటుంబ వ్యవస్థ కొనసాగుతూ ఉండేది. భార్యాభర్తల కీచులాటలు టీకప్పులో తుఫానులా ఉండేవి. చెప్పాలంటే కొందరు భార్యాభర్తల గొడవలు వీధిలో ఉన్నవారికి నవ్వులాటగా ఉండేవి. అంటే భార్యాభర్తలు చీటికి మాటికి కీచులాడుకోవడం నవ్వదగ్గ విషయంగా, వారి చేతగాని విషయంగా ఉండేది. విడాకులు అనే మాట చాలా అరుదుగా వినవచ్చేది. విడాకుల నిర్ణయానికి ఇటువైపు వర్గం, అటువైపు వర్గం వ్యతిరేకంగా నిలిచేది. యాక్సెప్టెన్స్ ఉండేది కాదు. వివాహాన్ని నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నం విడిపోవడానికి పట్టుపట్టడంలో ఉండేది కాదు.ఇవాళ ఎలా ఉంది?వివాహ వ్యవస్థను గౌరవించకపోవడం, ఒకరి పట్ల ఒకరు చూపాల్సిన నిజాయితీ లోపించడం, పిల్లల మీద కక్ష తీర్చుకోవడం, సమస్యకు బదులుగా భార్యనో భర్తనో నిర్మూలించడమే ఏకైక పరిష్కారం అనుకోవడం, వివాహం జీవితానికి ఒక గుదిబండగా మారిందని దాని నుంచి ఎలాగైనా బయటపడాలని చెడు మార్గాలు వెతకడం, హాయిగా ఉన్న ఇంటి నుంచి దూరంగా వెళ్లి ఆ నునుపైన కొండలపై మరింత హాయిగా గడపాలనుకోవడం... ఇవన్నీ అందమైన జీవితాలను ఆగమాగం చేస్తున్నాయి. పరేషానీలోకి నెట్టేస్తున్నాయి. మానసిక, శారీరక కష్టాలు తెచ్చి భవిష్యత్తును చావు దెబ్బ తీస్తున్నాయి.మీ వివాహం సమస్యల్లో ఉంటే–మీ వివాహం సమస్యల్లో ఉంటే మీ వివాహ బంధంలో ఈ విషయాలను చెక్ చేసుకోండి.1. నిజాయితీ: మీరు మీ జీవిత భాగస్వామి పట్ల నిజాయితీతో ఉన్నారా? నిజమైన ప్రేమతో ఉన్నారా? నిజమైన ప్రేమ పొందేలా మీ చర్యలు ఉన్నాయా? ప్రేమను ప్రదర్శిస్తున్నారా? నువ్వంటే నాకు చాలా ప్రేమ అని ఒకసారైనా చెప్పగలుగుతున్నారా. ప్రేమ వివాహానికి మూలం. ప్రేమను వ్యక్తం చేయనప్పుడు ప్రేమ పొందలేరు.2. కమ్యూనికేషన్: మీ మనసులో ఉన్నది స్పష్టంగా మీ జీవిత భాగస్వామికి చెబుతున్నారా? చెప్పి వారికి అది అర్థం చేసుకోవడానికి సమయం ఇస్తున్నారా? అన్నీ మనసులో పెట్టుకుని మౌనంగా ఉంటే అది హింస కిందకు వస్తుంది. మౌనంతో హింసించే విధానం మానుకుంటే వివాహంలో మాట, మంచి మాట మెల్లగా వస్తాయి.3. వింటున్నారా?: వినడం తెలిస్తే సగం సమస్యలు పోతాయి. మీ జీవితభాగస్వామి ఏదైనా చెప్పబోతే మధ్యలోనే తుంచేస్తే, ఎదురు చెప్తే ఇక ఏమీ ముందుకు వెళ్లదు. ఎదుటి వారు చెప్తున్నది పూర్తిగా విని, సమయం తీసుకొని అందులోని మంచి చెడు పట్ల మీ అభిప్రాయం మెత్తగా, స్పష్టంగా చెప్పగలిగితే, అరవడాలు కరవడాలు లేకుండా మాట్లాడుకోగలిగితే చాలు. వివాహం వర్థిల్లుతుంది.4. గౌరవం ఉండాలి: ఒక మనిషి మరో మనిషిని ఎప్పుడు ఇష్టపడతాడంటే ఆ మనిషి తనను గౌరవిస్తున్నాడని తెలిసినప్పుడే. మనం వెళితే గౌరవించి టీ ఇచ్చే ఇంటికే మనం వెళ్తాం తప్ప ముఖాన తలుపు వేసే వారింటికి వెళతామా? భార్యాభర్తల విషయం కూడా అంతే. చులకన భావం వివాహానికి ప్రథమ విరోధి. భార్య/భర్త ఒకరినొకరు చులకన భావంతో చూస్తే వివాహం చులకనకు లోనవుతుంది. ఆ తర్వాత హేళన, ఆపైన తిట్టు, అటుపై కొట్లాట, తదుపరి నువ్వెంతంటే నువ్వెంత అనే మాటలు వచ్చేస్తాయి. చులకన వద్దు.5. సహానుభూతి: పని చేసి అలసిపోయి ఉంటాడేమో, వంటపని, ఇంటి పనితో డస్సిపోయిందేమో అని ఒక నిమిషం పరస్పరం ఆలోచిస్తే... సానుభూతి అందిస్తే ఎంతో ఓదార్పుగా ఉంటుంది. అలసిపోయి ఉన్న జీవిత భాగస్వామిని ‘ఆ.. పెద్ద చేశావులే’ అనే ఒక్క మాటతో శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు. సహానుభూతి చూపితే అది పెద్ద సహాయం చేస్తుంది. ఎమోషనల్ ఇంటిమసీ చాలా ముఖ్యం.6. హద్దులు: మీరు వివాహం చేసుకున్నారు కాని ΄÷లంలో పని చేసే ఎద్దును తెచ్చుకోలేదు. వివాహంలో హద్దులు ఉంటాయి. భార్య/భర్తల పర్సనల్ స్పేస్‌లో ఎంతవరకు వెళ్లాలో తెలుసుకొని ఉండాలి. ఉమ్మడి ఇష్టాలను కలిసి నిర్వహించుకోవాలి.7. ఆర్థికం: ఆర్థిక విషయాలలో భార్యాభర్తల మధ్య అవగాహన అన్నింటి కంటే ముఖ్యం. అప్పులు, అధిక ఖర్చులు ఇద్దరిలో ఎవరు చేసినా ఆ వివాహం ప్రమాదంలో ఉన్నట్టు. అలాగే ప్రతి పైసా గీచిగీచి లెక్క అడిగినా ప్రమాదమే. ఇంటి ఖర్చు, ΄÷దుపు, బాధ్యతలకు అవసరమైన సహాయం... వీటిని జాగ్రత్తగా చూసుకుంటే అంతటా అనుకూలమే.ఈ ఏడు సలహాలు వివాహం ముందుకెళ్లడానికి ఏడడుగులు.పెళ్లి అర్థం కాకుండా పెళ్లెందుకు చేసుకున్నారు?పెళ్లి బొమ్మలాట కాదు. అది పెద్ద బాధ్యత. జీవితాన్ని ఫలవంతం చేసే దశ. ఒంటరి మనిషికి కుటుంబం అనే అందమైన బాంధవ్యాన్ని ఇచ్చే వరం. సంతానాన్ని ఇచ్చి ఎనలేని తృప్తినిచ్చే మార్గం. వివాహంలో అడుగుపెట్టాలంటే మానసికంగా, శారీరకంగా సిద్ధమయ్యి అన్నీ ఆలోచించుకుని ఉండాలి. కాని గతంతో పోలిస్తే ఇంత ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు లేదు. అమ్మాయి, అబ్బాయిల ఇష్టాయిష్టాలు తమకు తాము పట్టించుకోకపోవడం, కుటుంబాలు నిర్లక్ష్యం చేయడం, పొంతన కుదురుతుందో లేదో చూడకపోవడం, అబ్బాయికి అమ్మాయికి ఉన్న ఉపాధి మార్గాలు వారిని కలిపి ఉంచుతాయా... ఎక్కువ పని గంటల వల్ల గాని, ఇతర ఊర్లకు వెళ్లి పని చేయడం వల్లగాని గ్యాప్ తెస్తాయా చూడకపోవడం... డబ్బు పట్ల ఎవరికి ఎంత ఆశ, అత్యాశ ఉంది... అబ్బాయి/అమ్మాయి గురించి ఆరా తీస్తే వారు పెద్దలకు, సంప్రదాయాలకు ఇచ్చే విలువ ఏ మాత్రం ఉంటుంది... ఇవన్నీ చూడకుండానే చేసేస్తున్నారు. దాని వల్ల సమస్యలు వెంటనే బయల్దేరుతున్నాయి. -
చిరకాల స్నేహితుడిని పెళ్లాడిన బుల్లితెర నటి.. పోస్ట్ వైరల్
ప్రస్తుతం శ్రావణమాసం కావడంతో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇండస్ట్రీలోనూ చాలామంది ఈ నెలలోనే పెళ్లి పీటలెక్కుతున్నారు. తాజాగా ప్రముఖ బుల్లితెర నటి గియా మానెక్ వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. 'సాత్ నిభాన సాథియా', 'జీనీ ఔర్ జుజు' సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ నటుడు వరుణ్ జైన్‌ను పెళ్లాడింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు నూతన జంటకు అభినందనలు చెబుతున్నారు.గియా తన ఇన్‌స్టాలో రాస్తూ.. "ఆ దేవుడు, మా గురువుల దయతో, మీరు కురిపించిన ప్రేమతో మేము ఈ రోజు వివాహాబంధంలోకి అడుగుపెట్టాము. మేము ఇద్దరు స్నేహితులం.. కానీ ఈ రోజు చేయి చేయి కలిపి హృదయపూర్వకంగా మేము భార్యాభర్తలం అయ్యాం. ఈ రోజును ఇంత ప్రత్యేకంగా చేసిన మా ప్రియమైన వారందరి ప్రేమ, ఆశీర్వాదాలకు మా కృతజ్ఞతలు. ఎల్లప్పుడు నవ్వుతూ మిస్టర్ అండ్ మిసెస్‌గా జీవితాంతం కలిసి ఉండటానికి ఇదే మా మొదటి అడుగు." అంటూ పోస్ట్ చేసింది.కాగా.. గియా మానెక్, వరుణ్ జైన్ జంటగా తేరా మేరా సాత్ రహే సీరియల్లో నటించారు. అప్పుడు సహనటులుగా ఉన్న వీరిద్దరు.. ఇప్పుడు భార్యాభర్తలుగా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. మరోపైపు గియా మానెక్ సీరియల్స్కతో పాటు సినిమాల్లోనూ నటించింది. కామ్ చాలు హై, నా గర్ కే.. నా ఘాట్ కే లాంటి చిత్రాల్లో కనిపించింది. View this post on Instagram A post shared by Gia Manek (@gia_manek) -
70 ఏళ్ల వయసులో 30 ఏళ్ల చిన్నదానితో నటుడి పెళ్లి.. ఇపుడిదే చర్చ!
బాలీవుడ్, హాలీవుడ్ రంగం ఏదైనాలబ్రిటీల పెళ్లిళ్లు, వయస్సు-అంతరాయాలు చర్చ సర్వ సాధారణం. తాజాగా స్టార్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ తనకంటే పెద్దదైన అమ్మాయితో నిశ్చితార్థం చేసుకోవడం, 51 ఏళ్ల బాలీవుడ్ నటి మలైకా అరోరా కూడా విడాకులు , మళ్లి పెళ్లి వార్తల నడుమ 70 ఏళ్ల వయసులో కబీర్ బేడి నాలుగో పెళ్లి అదీ తన కూతురువయసున్న అమ్మాయిని చేసుకున్న వార్త చర్చల్లో నిలుస్తోంది. వయసులో తనకంటే చిన్నవాళ్లను వివాహం చేసుకోవడంపై చర్చను మళ్ళీ లేవనెత్తింది: ప్రేమలో వయస్సు నిజంగా ముఖ్యమా, లేదా పరస్పర అవగాహన ముఖ్యమైనదా? అనే హాట్ టాపిక్‌గా మారింది.కబీర్ బేడి ప్రేమకథప్రముఖ నటుడు కబీర్ బేడీ తనదైన నటనతో ప్రేక్షకుల మెప్పు పొందిన గొప్ప నటుడు. వ్యక్తిగత జీవితంలో ఇప్పటి వరకు నాలుగు పెళ్లిళ్లు చేసుకుని విమర్శలనెదుర్కొన్నాడు. 2016లో తన 70 పుట్టి రోజు సందర్భంగా తనకంటే దాదాపు 30 ఏళ్లు చిన్నదైన పర్వీన్ దుసాంజ్‌ను వివాహమాడటం ఆయన కుటుంబంలో కూడా విమర్శలకు తావిచ్చింది. అయితే పదేళ్ల పరిచయం, ప్రేమ తరువాత తామీ నిర్ణయం తీసుకున్నామని పర్వీన్ తన జీవితంలోకి రావడంఎంతో సంతషాన్నిచ్చిందనీ అందుకే పెళ్లి చేసుకున్నామని స్పష్టం చేశాడు. 2005లో వీరు తొలిసారి కలుసుకున్నారు. వారి స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. దాదాపు ఒక దశాబ్దం పాటు కలిసి గడిపిన తర్వాత, కబీర్ బేడి 2011లో రోమ్ పర్యటన సందర్భంగా ప్రపోజ్ చేశారు. సన్నిహితులు, కుటుంబ సభ్యులు సమక్షంలో 2016, జనవరి 15న ముంబై సమీపంలోని అలీబాగ్‌లో ఒక ప్రైవేట్ వేడుకలో వారు వివాహం చేసుకున్నారు. నటి , కబీర్ బేడీ కుమార్తె పూజా బేడి కంటే పర్వీన్ ఐదేళ్లు చిన్నది.ఇదీ చదవండి: ఉద్యోగాన్ని వదిలేసిన ఇంజనీర్ కపుల్.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలుప్రేమకు నిజంగా వయసు అవసరమా?ప్రేమ ఏ వయసులోనైనా వస్తుందనీ, ప్రేమకు హద్దులు లేవు; సామాజిక అంచనాలు లేదా వయస్సు తేడాలు దానిని పరిమితం చేయలేవని నిపుణులు చెబుతున్న మాట. ఇదే విషయాన్ని నటి మలైకా అరోరా ఇటీవల స్పష్టం చేసింది. పెళ్లి విషయంలో తానేమీ తలుపులు మూసుకోలేదని, జీవితం ఏ దశలోనైనా కొత్త అవకాశాం రావచ్చని స్పష్టం చేసింది.నిపుణుల ప్రకారం వయస్సు వ్యత్యాసాలు అంతర్గతంగా సమస్యాత్మకమైనవి కావు. ఒక జంట కావాల్సింది ముఖ్యమైన భావోద్వేగ, మానసిక అనుకూలత. పరస్పర అవగాహన. ఇవి లేనపుడు మాత్రమే సమస్యలు సవాళ్లు వస్తాయనేది వారు చెబుతున్న మాట. ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్ జంట, మిలింద్ సోమన్- అంకితా కోన్వర్ లాంటి సెలబ్రిటీల నిజమైన ప్రేమ బంధానికి ఇదే కారణమని ఉదాహరిస్తున్నారు.పెళ్లి ఈ పునాదులపైఇద్దరి మధ్యా స్పష్టమైన కమ్యూనికేషన్నమ్మకం, పరస్పర గౌరవం భావోద్వేగ మద్దతు (emotional support)ఈ ప్రధానమైన అంశాలు, విలువల ఆధారంగా చాలా జంటలు వారి వయస్సు అంతరంతో సంబంధం లేకుండా బలమైన బంధాన్ని కొనసాగించ గలుగుతారని, ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్.. అవగాహనే ముఖ్యమని రిలేషన్షిప్ కౌన్సెలర్లు, సామాజిక, మానసిక నిపుణులు చెబుతున్నామాట. -
సంసారం సాఫీగా ఉండాలంటే ఈ 3 రూల్స్ ఫాలో అవ్వండి: నటుడు
దాంపత్య జీవితం బాగుంటే..జీవితం సాఫిగా హాయిగా సాగిపోతుందని చెప్పొచ్చు. అంతేగాదు అటు కెరీర్ పరంగానూ, ఫ్యామిలీ పరంగా హెల్దీ రిలేషన్షిప్స్ ఉంటాయి. పైగా జీవితాన్ని మంచిగా లీడ్ చెయ్యొచ్చు. అయితే ఈ విషయంలో అందరు ఎక్కువగా పొరపాటులు చేస్తుంటారు. ఇక్కడ ఇద్దరూ సమానంగా బ్యాలెన్స్ కావాలి. అప్పుడే సంసారం అనే నావా సాపీగా సాగుతుంది. ఇందులో ఎవ్వరో ఒక్కరూ తేడాగా ప్రవర్తించినా.. అంతే పరిస్థితి. అయితే ప్రముఖ బాలీవుడ్ నటుడు, మోడల్ జాన్ అబ్రహం మాత్రం ఈ మూడు నియమాలు పాటిస్తే..దాంపత్య జీవితాన్ని పటిష్టంగా మార్చుకోవచ్చని చెబుతున్నాడు.జాన్ అబ్రహం వైవిధ్యభరితమైన చిత్రాలు, విలక్షణమైన నటనతో ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలందుకున్న నటుడు. ఆయన నటుడిగా, నిర్మాతగా ఎంత మంచి మంచి చిత్రాలు చేసినా..వ్యక్తిగత జీవితం మాత్రం అత్యంగ గోప్యంగా ఉంటుంది. అసలు పబ్లిక్‌గా కనిపించడం కూడా అత్యంత అరుదే. అలాంటి వ్యక్తి ఇన్వెస్ట్మెంట్ ప్రియా రంచల్ అనే అమ్మాయిని 2014 యునైటెడ్ స్టేట్స్లో వివాహం చేసుకున్నాడు. అదికూడా ప్రైవేట్‌గా ఎలాంటి అంగు ఆర్భాటం లేకుండా బంధువుల సమక్షంలో చేసుకున్నారు. ఆ విషయం కూడా బయటకు పొక్కనీయలేదు జాన్. ఒక న్యూఈయర్కి శుభాకాంక్షలు చెబుతూ ప్రియా జాన్ అని సంతకం చేయడంతో ఆ విషయం వెలుగులోకి వచ్చింది. అదీగాక ఈ జంట పబ్లిక్‌గా కనిపించడం కూడా అరుదే కాబట్టి తెలిసే ఛాన్స్ తక్కువ కూడా. 11 ఏళ్ల వైవాహికబంధంలో ఎలాంటి పొరపచ్చాలు రాకుండా ఆనందంగా లైఫ్‌ని లీడ్ చేస్తోంది ఈ జంట. ఆయన ఇటీవల ఒక సంభాషణలో వివాహ జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. వైవాహిక జీవితం స్ట్రాంగ్‌గా ఉండాలంటే మూడు నియమాలు పాటించాలంటూ కొన్ని టిప్స్ షేర్ చేశాడు. నా సినిమాలకు, వ్యక్తిగత జీవితంతో సబంధంలేదు. అందుకే తాను మూవీ షూటింగ్ అయిపోగానే వెళ్లిపోతా..అక్కడ ఎక్కడ తన గురించి, ఫ్యామిలీ గురించి ప్రస్తావించనని అన్నారు. అలాగే నా పేరు గాసిప్స్ హెడ్లైన్కి వెళ్లేలా ఎలాంటి ప్రచారక్తరను నియమించుకోలేదని చెబుతున్నాడు. ఎందుకంటే తన షూటింగ్స్ ముగించుకుని నేరుగా తన ఇంటికి వెళ్లిపోతానని అన్నారు. అలాగే తన భార్య కూడా ఈ గోప్యతను పాటిస్తుందని చెప్పాడు. ఎక్కడ తన గురించి ప్రస్తావన చేయదు. అదే మా దాంపత్యాన్ని బలోపేతం చేస్తుందని అన్నాడు. ఇక్కడ ఒకరంటే ఒకరికి గాఢమైన నమ్మకం..పెట్టుకున్న నియమాన్ని బ్రేక్ చేయకుండా గౌరవించడం అనేవి బంధాన్ని దృఢంగా మారుస్తుందని చెబుతున్నాడు అబ్రహం. మన జీవితంలోకి వచ్చిన వ్యక్తి ప్రైవసీని కూడా మనం కాపాడాలని, మన కెరీర్ వాళ్ల జీవితాన్ని ఇబ్బందులో పెట్టేలా చేయకూడదనేది తన ఉద్దేశ్యమని అంటున్నాడు. ఇక జాన్ భార్య ప్రియా అత్యంత విజయవంతమైన ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, పైగా ఆమె కూడా మీడియాకి దూరంగా ఉండేందుకే ఇష్టపడుతుందట. ఏ జంట అయిన వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచితే..ఎలాంటి చిక్కుల్లో పడరు. రిలేషన్ కూడా స్ట్రాంగ్ ఉంటుందనేది నటుడు జాన్ చాలా చక్కగా వివరించారు.(చదవండి: స్ట్రాబెర్రీలతో దంతాలు తెల్లబడతాయా..? సైన్స్ ఏం చెబుతోందంటే..) -
వివాహ వేడుకలో వైఎస్ జగన్.. అనంతపురం జన సంద్రం
-
కాపురం చేస్తూనే.. రెండో పెళ్లికి సిద్ధం
తూర్పు గోదావరి: ఓ మహిళతో కాపురం చేస్తూనే.. పెళ్లి పేరుతో మరో యువతిని మోసం చేసేందుకు యత్నించి, తప్పించుకుని తిరుగుతున్న వ్యక్తిపై స్థానిక పోలీస్ స్టేషన్లో సోమవారం కేసు నమోదైంది. సీఐ బీఎన్ పట్నాయక్ వివరాల మేరకు, గోపాలపురం మండలం భీమోలుకు చెందిన యువతికి, దేవరపల్లి మండలం యాదవోలుకు చెందిన పాలి వీరవెంకట సత్యనారాయణతో ఇటీవల వివాహం కుదిరింది. సోమవారం తెల్లవారుజామున స్థానిక ఫంక్షన్ హాల్లో పెళ్లి జరగాల్సి ఉంది. ఆదివారం సాయంత్రం వధువు ఇంటి వద్ద పెళ్లి ఏర్పాట్లు చేశారు. మరో గంటలో పెళ్లిపీటలు ఎక్కాల్సిన వరుడు కనిపించడంలేదంటూ వధువు బంధువులకు రాత్రి ఏడు గంటల సమయంలో సమాచారం వచ్చింది. దీంతో కంగారు పడిన ఆమె బంధువులు అసలు వివరాలు సేకరించారు. అంతకు ముందే సత్యనారాయణకు పెళ్లయి, కాపురం చేస్తున్నాడని, అందుకే పెళ్లికి రాకుండా అదృశ్యమైనట్టు సమా చారం అందింది. దీంతో వధువు కుటుంబానికి న్యా యం చేయాలంటూ ఆమె బంధువులు ఆందోళన చేశా రు. సోమవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సీఐ పట్నాయక్ తెలిపారు. -
జగ్గారెడ్డి కూతురి పెళ్లిలో ప్రముఖుల సందడి (చిత్రాలు)
-
గ్రాండ్‌గా మధు ప్రియ సిస్టర్ పెళ్లి వేడుక.. ఫోటోలు పంచుకున్న సింగర్!
టాలీవుడ్ సింగర్ మధు ప్రియ చెల్లి పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. ఇవాళ ఆమె సిస్టర్ శృతి ప్రియ మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. తాజాగా పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది మధుప్రియ. తన చెల్లి పెళ్లిలో ఫుల్ ఎనర్జిటిక్‌గా డ్యాన్స్ చేసింది సింగర్. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.కాగా.. సింగర్ మధు ప్రియ తన సిస్టర్ శృతి ప్రియ ఎంగేజ్మెంట్ నుంచి పెళ్లి వేడుక వరకు తానే దగ్గరుండి అన్ని పనులు చూసుకుంది. నిశ్చితార్థం వేడుక రోజు ఫోటోలను అభిమానులతో పంచుకుంది.కాాగ.. తెలంగాణ పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మధుప్రియ.. పదేళ్ల వయసులోనే ఓ స్టేజీ షోలో 'ఆడపిల్లనమ్మా' పాట పాడి ఓవర్ నైట్ స్టార్ అయింది. తర్వాత అంటే 2011లో 'దగ్గరగా దూరంగా' సినిమాలో 'పెద్దపులి' అనే పాటతో ఇండస్ట్రీలోకి వచ్చింది. అనంతరం ఫిదా, టచ్ చేసి చూడు, నేల టికెట్, సాక్ష్యం, సరిలేరు నీకెవ్వరు, బంగార్రాజు, సంక్రాంతికి వస్తున్నాం, లైలా తదితర చిత్రాల్లో సాంగ్స్ పాడి అభిమానులను అలరించింది. View this post on Instagram A post shared by Madhupriya (@madhupriya_peddinti) View this post on Instagram A post shared by Ramu Rathod (@ramurathod__official) -
చెల్లి పెళ్లి సందడి షురూ.. హల్దీ వేడుకలో సింగర్ మధుప్రియ
సింగర్ మధుప్రియ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఇటీవలే తాను దగ్గరుండి చెల్లికి నిశ్చితార్థం చేసిన మధుప్రియ.. ప్రస్తుతం పెళ్లి పనుల్లోనూ బిజీ అయిపోయారు. తాజాగా తన చెల్లెలు శ్రుతిప్రియ పెళ్లి వేడుక సంబురాల ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇవాళ నిర్వహించిన హల్దీ వేడుక వీడియోలను పోస్ట్ చేశారు. చెల్లి పెళ్లి కూతురైందంటూ ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం హల్దీ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.(ఇది చదవండి: చెల్లి నిశ్చితార్థంలో టాలీవుడ్ స్టార్ సింగర్)కాాగ.. తెలంగాణ పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మధుప్రియ.. పదేళ్ల వయసులోనే ఓ స్టేజీ షోలో 'ఆడపిల్లనమ్మా' పాట పాడి ఓవర్ నైట్ స్టార్ అయింది. తర్వాత అంటే 2011లో 'దగ్గరగా దూరంగా' సినిమాలో 'పెద్దపులి' అనే పాటతో ఇండస్ట్రీలోకి వచ్చింది. అనంతరం ఫిదా, టచ్ చేసి చూడు, నేల టికెట్, సాక్ష్యం, సరిలేరు నీకెవ్వరు, బంగార్రాజు, సంక్రాంతికి వస్తున్నాం, లైలా తదితర చిత్రాల్లో సాంగ్స్ పాడి అభిమానులను అలరించింది. అయితే 18 ఏళ్ల వయసులోనే శ్రీకాంత్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న మధుప్రియ.. కొన్నాళ్లకు అతడి నుంచి విడిపోయింది. ప్రస్తుతం తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. View this post on Instagram A post shared by Madhupriya (@madhupriya_peddinti) View this post on Instagram A post shared by Madhupriya (@madhupriya_peddinti) View this post on Instagram A post shared by Madhupriya (@madhupriya_peddinti) -
కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న మహిళా సైనికురాలు.. కారణం ఏంటంటే?
చెన్నై: ఓ మహిళా సైనికురాలు కన్నీరుమున్నీరలయ్యేలా విలపిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘తాను దేశ రక్షణ కోసం విధులు నిర్వహిస్తుండగా.. తన ఇంట్లో దొంగతనం జరిగిందని వాపోయారు. అగంతకులు తన పెళ్లికోసం కొనుగోలు చేసిన బంగారంతో పాటు ఇతర ఖరీదైన వస్తువులు దోచుకెళ్లారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. తమిళనాడులోని నారాయణపురం గ్రామానికి చెందిన కళావతి జమ్మూ కశ్మీర్లో సీఆర్పీఎఫ్ జవానుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె జమ్మూకశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తుండగా.. జూన్ 24న నారాయణపురం తన గ్రామంలోని ఇంట్లో దొంగతనం జరిగింది.ఇదే విషయాన్ని కన్నీటి పర్యంతం అవుతూ ఓ వీడియో తీశారు. ఆ వీడియోలో వ్యవసాయం నిమిత్తం నాతల్లిదండ్రులు పొలానికి వెళ్లారు. ఆ సమయంలో అగంతకులు నా ఇంటి తాళం పగలగొట్టి, నా పెళ్లి కోసం దాచుకున్న ఆభరణాలన్నీ దొంగిలించారు. దొంగతనం జరిగిన రోజైన జూన్ 24న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ జూన్ 25న ముఖ్యమంత్రి భద్రతా విధుల్లో ఉన్నారని ఎవరూ దర్యాప్తుకు రాలేదు. తర్వాత వేలిముద్రలు సేకరించి జూన్ 28న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు’అని కళావతి వీడియోలో పేర్కొన్నారు.ఆ వీడియో వైరల్‌గా మారింది. సైనికురాలి వీడియోను తమిళనాడు బీజేపీ నేత అన్నామలై షేర్ చేస్తూ డీఎంకే ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. దేశాన్ని కాపాడే సైనికురాలి పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. అయితే,ఆ వీడియోపై వెల్లూరు జిల్లా పోలీసులు స్పందించారు.జూన్ 24న కళావతి తండ్రి కుమారసామి తన ఇంట్లో జరిగిన దొంగతనం గురించి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు ప్రకారం, కళావతి పెళ్లి కోసం పక్కన ఉంచిన 15 తులాల బంగారు ఆభరణాలు, రూ.50,000 నగదు, ఒక పట్టు చీర దొంగతనం జరిగింది. జూన్ 25న భారతీయ న్యాయ సంహిత (BNS) చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, వేలిముద్రల నమూనాలు సీసీటీవీ ఫుటేజ్‌లను సేకరించామని పోలీసులు తెలిపారు.అనుమానితుల సెల్‌ఫోన్ కాల్ డేటా రికార్డులను (CDRలు) తిరిగి పొందడానికి వారు టవర్ డంప్ టెక్నాలజీని కూడా ఉపయోగించారు. జూన్ 29న, ఫిర్యాదుదారుడు తన ప్రకటనను సవరించి దొంగిలించబడిన ఆభరణాల బరువు 22.5 తులాలని చెప్పినట్లు తెలిసింది. ఈ వివాదంలో నిజమెవరిదో తేలాలంటే, విచారణ పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందే. A CRPF jawan from Tamil Nadu, serving with honour at our nation’s borders in J&K, is forced to take to social media on police inaction on the case of jewellery theft from her residence near Katpadi in June this year. What kind of governance forces a woman in uniform to beg for… pic.twitter.com/BnU6WtT99l— K.Annamalai (@annamalai_k) August 4, 2025 -
పాక్ క్రికెటర్‌తో మాత్రమే కాదు.. విరాట్ కోహ్లీతోనూ పెళ్లి: తమన్నా
మిల్కీ బ్యూటీ ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్న హీరోయిన్ తమన్నా. తెలుగులో దాదాపు స్టార్ హీరోల అందరి సరసన నటించింది. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణించిన ముద్దుగుమ్మ.. ప్రస్తుతం పెద్దగా కనిపించట్లేదు. ఈ ఏడాదిలో ఓదెల-2 మూవీతో అభిమానులను పలకరించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేకపోయింది. ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉన్న తమన్నా తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా తనపై వచ్చిన రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చింది.గతంలో పాక్ క్రికెటర్ అబ్దుల్ రజాక్‌తో తమన్నా పెళ్లి అంటూ వచ్చిన కథనాలపై స్పందించింది. ఇలాంటి వార్తలు చాలా ఫన్నీగా అనిపించాయని గుర్తు చేసుకుంది. ఓ ఆభరణాల దుకాణం ప్రారంభోత్సవంలో అబ్దుల్ రజాక్‌తో కలిసి ఫోటో దిగడంతో ఇలాంటి రూమర్స్ వచ్చాయని తెలిపింది. తనకు కేవలం అబ్దుల్ రజాక్‌తో మాత్రమే కాదు.. విరాట్ కోహ్లీతోనూ తనకు ముడిపెట్టారని వివరించింది. నా జీవితంలో విరాట్‌ను కేవలం ఒక్కసారి మాత్రమే కలిశానని తమన్నా వెల్లడించింది. ఇలాంటి కథనాలు వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరంగా, బాధగా అనిపిస్తుందని పేర్కొంది. ఇలాంటి వాటిని మరిచిపోవడానికి కాస్తా సమయం పడుతుందని తెలిపింది. -
కలసి తింటూ.. బరువెక్కుతున్నారు
చుక్క లాంటి అమ్మాయి, చక్కనైన అబ్బాయి! ఒకరితో ఒకరికి పెళ్లయింది. పెళ్లికి ముందు ‘ఎవరికి వారు’గా ఉన్నవారు, పెళ్లి తర్వాత ‘ఒకరి కోసం ఒకరు’ అన్నట్లుగా మారిపోయారు. మంచిదే కదా! మంచిదే కానీ.. వాళ్లలో మెల్లగా మార్పు మొదలైంది! గొడవలా? కాదు. మనస్ఫర్థలా? కాదు. ఉద్యోగాల్లో పడి ఒకరికొకరు టైమ్ ఇవ్వటం లేదా? కాదు.. కాదు! మరేంటి సమస్య? ఏంటంటే – ఇద్దరూ బాగా లావైపోయారు! అవునా!! అవును. దేశమంతటా ఇదే ధోరణి కనిపిస్తోందట! కలిసి తినటమే దంపతులను ఊబకాయులుగా మార్చేస్తోందట.⇒ అయ్యో రామా, భార్యాభర్తలు కలిసి తినటం కూడా తప్పేనా? తప్పు కాదు కానీ, ఇద్దరూ ఒకరి కోసం ఒకరు తమ ఆహారపు అలవాట్లు మార్చుకునే క్రమంలో ‘సయోధ్య’తో ఒకే రకమైన ఆహారం తీసుకోవటం వల్ల ఇద్దరూ కూడా క్రమేణా బరువు పెరిగే అవకాశం ఉందని భారత వైద్య పరిశోధన మండలి (ఐ.సి.ఎం.ఆర్.) అంటోంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే–5 (ఎన్.ఎఫ్.హెచ్.ఎస్.) దగ్గరున్న డేటాలో 50 వేలమందికి పైగా దంపతుల ఆహార అలవాట్ల వివరాలను విశ్లేషించిన ఐ.సి.ఎం.ఆర్., ఆ దంపతులలో 27.4 శాతం మంది అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నట్లు కనుగొంది. ఈ ధోరణి ప్రధానంగా పట్టణ, సంపన్న వర్గాలలోని దంపతులలో కనిపించిందని తాజా అధ్యయనం వెల్లడించింది.⇒ దంపతుల ఆహార స్వేచ్ఛ..: సాధారణంగా భారతీయ కుటుంబాలలో అందరికీ కలిపి ఒకే మెనూ ఉంటుంది. అన్నం, నూనెతో వండే కూరలు, వేపుళ్లు ఉంటాయి. అయితే పెళ్లయిన వారికి కొత్తగా ‘ఆహార స్వేచ్ఛ’ వస్తుంది. దంపతులలో ఎవరికి ఇష్టాలు వారికున్నా, ఒకరికి ఇష్టమైన దానికి మరొకరు ఇష్టపడటంతో ఇద్దరూ కలిపి ఒకే విధమైన ఆహారాన్ని తీసుకుంటారు. ఈ కారణంగా దంపతులు లావయ్యే అవకాశం ఉందని ఐ.సి.ఎం.ఆర్. అధ్యయనం విశ్లేషించింది.దాంపత్య భోజనంబు..అధ్యయనంలోకి తీసుకున్న ప్రతి నాలుగు జంటల్లో ఒక జంట ఊబకాయులేనని ఐ.సి.ఎం.ఆర్. గుర్తించింది. భార్యాభర్తల్లో వివాహం ముందు వరకు ఆహారం, జీవనశైలుల విషయంలో ఎవరికి వారికి విభిన్న అభిరుచులు ఉంటాయి. వివాహం తర్వాత ఇదంతా మారిపోతుంది. ఆఫీస్‌లో పని ఒత్తిడి, ప్రయాణ అసలట వారి వారి ఆహారపు అలవాట్లను కలగాపులగం చేసేస్తాయి. ఇద్దరూ ఆర్డర్ పెట్టి ఫుడ్ తెప్పించుకోవటం ఎక్కువౌతుంది. ఒకరి కోసం ఒకరు మేల్కొని ఉండటం, లేట్ నైట్ ఆఫీస్ ప్రజెంటేషన్లు ఇవ్వటం, వారాంతపు విహారాలు.. ఇలాంటివన్నీ కలిసి దంపతుల జీవన శైలిని మార్చేస్తాయి. దాంతో సరైన నిద్రా, తగిన శారీరక శ్రమా లేకపోవటంతో 30ల వయసుకే దంపతులు లావైపోతున్నట్లు ఐ.సి.ఎం.ఆర్. గుర్తించింది.అతి పెద్ద అధ్యయనం‘ఐ.సి.ఎం.ఆర్–నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ ప్రివెన్షన్ అండ్ రీసెర్చ్’, ‘టెరి స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్’, ఇతర సంస్థల పరిశోధకులు కలిసి ఈ అధ్యయనాన్ని నిర్వహించాయి. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే–5 (2019–21) దగ్గరున్న దేశవ్యాప్త డేటా నుంచి 52,737 జంటల ఆహార తీరుతెన్నులను, వారి ఆరోగ్యాలను విశ్లేషించారు. వారిలో 27.4 శాతం జంటల్లో ఊబకాయ స్థితి ఉండటాన్ని గమనించారు. ‘కరెంట్ డెవలప్మెంట్స్ ఇన్ న్యూట్రిషన్’లో ప్రచురణ అయిన ఈ అధ్యయన ఫలితాలు.. భారతదేశ దంపతులు కలిసి తింటూ, కలిసి బరువు పెరగటాన్ని గుర్తించింది. ఇది దేశంలోనే ఈ తరహా అతిపెద్ద అధ్యయనం.ప్రథమ స్థానంలో కేరళఅధ్యయనానికి ఎంచుకున్న అరలక్షకు పైగా జంటలలో ప్రధానంగా.. కేరళ, మణిపూర్, ఢిల్లీ, గోవా, జమ్మూ కశ్మీర్ వంటి రాష్ట్రాలలోని పట్టణ, సంపన్న కుటుంబాలకు చెందిన భార్యాభర్తలు లావు పెరగటం కనిపించింది. కేరళ దంపతులలో అత్యధికంగా 51.3 శాతం వరకు ఊబకాయులు ఉండగా ఆ శాతం జమ్మూ కశ్మీర్లో 48.5, మణిపూర్‌లో 47.9, ఢిల్లీలో 47.1, గోవాలో 45 శాతం, తమిళనాడులో 42.7, పంజాబ్‌లో 42.5గా ఉంది. అత్యంత ధనికులైన వారిలో దాదాపు సగం (47.6 శాతం) జంటల్లో అధిక బరువు లేదా ఊబకాయం కనిపించింది. పేదలలో అది కేవలం 10.2 శాతం మాత్రమే కావడం గమనార్హం.ఇద్దరూ లావవటం ఎలా సాధ్యం?భార్యాభర్తలు సాధారణంగా జన్యుపరంగా సంబంధం కలిగి ఉండరు. అయినప్పటికీ ఒకే విధమైన ఆరోగ్య పరిస్థితులలోకి – అది ఊబకాయం, రక్తపోటు, ఇతరత్రా – ఏదైనా కావచ్చు, ఇద్దరూ ఒకేలా ఎలా మారి పోతారు? దీనికి సమాధానంగా – ‘ఉమ్మడి జీవనశైలి (టీవీ చూడటం, వార్తా పత్రికలు చదవటం వంటి అలవాట్లను కూడా కలిపి), ఆహారం, సామాజిక–ఆర్థిక స్థితి, పర్యావరణం, భావోద్వేగ అంశాల కారణంగా ఇది జరుగుతుంది’ అని ఐ.సి.ఎం.ఆర్–నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ ప్రివెన్షన్ అండ్ రీసెర్చ్ ప్రధాన అధ్యయన రచయిత డాక్టర్ ప్రశాంత్ కుమార్ సింగ్ చెబుతున్నారు. -
విడాకులు మీ సమస్యకు పరిష్కారం కాదు!
నా పెళ్లయి సంవత్సరం అవుతోంది. నేనూ నా భర్త, బెంగళూరులో ఉంటాం. మాది పెద్దలు కుదిర్చిన సంబంధం. మా అమ్మా నాన్నలకు ఒక్కదాన్నే కూతురిని. నన్ను మా ఇంట్లో ఒక రాకుమారి లాగా పెంచారు. కానీ మా అత్త గారింట్లో నన్నెవరూ పట్టించుకోవడం లేదు! నా భర్త వాళ్ళ అమ్మ మాటకే విలువ ఇస్తాడు. నామాట అసలు వినడు. అత్తగారు అక్కడి నుంచే మా ఆయనకి డైరెక్షన్ ఇస్తుంది. మా ఆయన సంపాదించే డబ్బులు ఖర్చు పెట్టుకునే స్వాతంత్య్రం నాకు లేదు. ఆయన కూడా ఏదైనా కొనమంటే... ఉన్నదానితో సర్దుకోమంటాడు. మా అత్తగారింటికి వెళితే నాకు ఊపిరి ఆడనట్లు అనిపిస్తుంది. ఆమె టార్చర్ తట్టుకోలేక వాళ్ళ ఇంటికి వెళ్ళడం కూడా మానేశాను. ఈ విషయం గురించి కూడా మా మధ్య గొడవలు జరుగుతున్నాయి. మాకు ఇంక వేరే సమస్యలు ఏం లేవు. మా అమ్మ వాళ్ళేమో విడాకులు తీసుకుని వచ్చేయమని అంటున్నారు. నా భర్త మంచివాడు, తనంటే నాకు చాలా ఇష్టం. నా భర్తని నేను పూర్తిగా కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ఏదైనా ఉపాయం చెప్పి నా కాపురాన్ని నిలబెట్టండి! – ప్రత్యూష, బెంగుళూరుఇది మీ ఒక్కరి సమస్యే కాదు! చాలా కుటుంబాల్లో అత్త – కోడలు మధ్య ఈ రకమైన ఒత్తిళ్లు, మనస్పర్థలు సర్వసాధారణం! కొడుక్కి గడ్డాలు, మీసాలు వచ్చినా తన వేలు పట్టుకుని నడిపించాలి అనుకుంటారు చాలా మంది తల్లి తండ్రులు. ఆ ఆలోచనలతోనే వారి జీవితాల్లో అతిగా జోక్యం చేసుకుంటారు. ఇవన్నీ పెళ్లికి ముందు బాగానే ఉన్నా, పెళ్లి తర్వాతే అసలు సమస్య మొదలవుతుంది. పిల్లల జీవితంలో ఒక భాగ స్వామి వచ్చాక వారి నిర్ణయాలను వారే తీసుకునే స్వాతంత్య్రం ఇవ్వాలి తల్లిదండ్రులు! ఒక తల్లి తన కోడలిని బయట నుంచి వచ్చిన అమ్మాయిలా కాకుండా, తన కొడుకుతో జీవితాంతం తోడుండే, ఒక ముఖ్యమైన వ్యక్తిగా గుర్తించాలి, అలాగే భర్త కూడా తన కుటుంబాన్ని వదిలి వచ్చిన భార్యని గౌరవించడం కనీస బాధ్యత అని గుర్తుపెట్టుకోవాలి.. ఇక్కడ మనం గమనించాల్సంది. ‘సంసారం అంటే ఒకరినొకరు నియంత్రించుకోవడం కాదు, ఒకరి నొకరు అర్థం చేసుకోవడం‘. మీ భర్త తన తల్లిని గౌరవించడం తప్పు కాదు. కానీ అదే సమయంలో మిన్ముల్ని చిన్నచూపు చూడడం కూడా తగదు. మీరు మీ భర్తను పూర్తిగా మీ నియంత్రణలోకి తీసుకోవాలనుకోవడం కూడా సరైనది కాదు. మీ తల్లితండ్రులు మీకు విడాకులు తీసుకోమని సలహా ఇస్తున్నా, అది ఈ సమస్యకి పరిష్కారం కానే కాదు! మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీ భర్తని గెలవాలంటే ముందు మీరు మీ అత్తగారిని గెలవాలి. అది ద్వేషంతో కాదు, ప్రేమతో, మీ మృదువైన మాటలతో కాస్త తెలివిగా ఆలోచించి, ఆమెతో మాట్లాడితే ఆమె కూడా కొన్ని విషయాల్లో మారతారు. నిదానంగా ఆమె కూడా మీ సమస్యను అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను కోపంతో, ఆవేశంతో కాకుండా ఓపికతో, చాకచక్యంగా ఎదుర్కొంటే మీ సమస్య పరిష్కారమవుతుంది. మీ భర్తతో మీరు ప్రశాంతంగా ఈ అంశం గురించి మాట్లాడండి. ఏదైనా అవసరం అయితే మీకు సహాయం చేయడం కోసం మానసిక నిపుణులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఆల్ ది బెస్ట్!.(చదవండి: ఐటీ గర్ల్స్ జాన్వీ కపూర్, అనన్య పాండే ధరించే కాలా ధాగా స్టోరీ ఏంటో తెలుసా..) -
ఎవరైనా నన్ను పెళ్లి చేసుకుంటారా?.. చాహల్ ప్రియురాలి పోస్ట్ వైరల్!
గత కొన్ని నెలలుగా వార్తల్లో నిలుస్తోన్న బాలీవుడ్ ముద్దుగుమ్మ, ఆర్జే మహ్వశ్. ఆమె టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌తో కనిపించడంతో ఒక్కసారిగా పేరు మార్మోగిపోయింది. వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ పలు సందర్భాల్లో వార్తలొచ్చాయి. వాటిని నిజం చేస్తూ చాహల్ ప్రాతినిధ్యం వహిస్తోన్న పంజాబ్ ఐపీఎల్ మ్యాచ్‌ల్లోనూ సందడి చేసింది. దీంతో వీరిద్దరు డేటింగ్లో ఉన్నది నిజమేనంటూ మరిన్ని కథనాలు వెలువడ్డాయి.తాజాగా ఇంగ్లాండ్‌లో ఈ జంట సందడి చేశారు. ఓకే లోకేషన్లో దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దీంతో మరోసారి మహ్వశ్-చాహల్ డేటింగ్‌పై వార్తలొచ్చాయి. ఇటీవల కపిల్ శర్మ షోకు హాజరైన చాహల్ సైతం ఇన్‌డైరెక్ట్‌గా హింట్ ఇచ్చేశాడు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న ఈ ప్రేమజంట వేకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే ఆర్జే మహ్వశ్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఈ నెల అంటే జూలై 31 తన పెళ్లి జరగనుందని ఓ ఛానెల్లో వార్తలొచ్చాయి. ఈ ఫోటోలు కూడా నా పెళ్లికి సంబంధించినవే. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పెళ్లి కొడుకు పారిపోయాడు.. మరి ఇప్పుడు నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? అంటూ ఫన్నీగా పోస్ట్ చేసింది. తాజాగా తీసుకున్న ఫోటోషూట్ పిక్స్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చింది. అయితే తన క్యాప్షన్‌లో జూలై 31 బదులు జూన్ 31 అని రాయడం మరింత నవ్వులు తెప్పిస్తోంది. View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash) -
అన్నదమ్ముల్ని పెళ్లాడిన యవతి.. ఇదెక్కడి ఆచారం!
ఒక వధువు.. ఇద్దరు పెండ్లి కొడుకులు.. పైగా అన్నదమ్ములు.. వివాహంతో ఒక్కటయ్యారు. ఈ వేడుకకు వందలమంది హాజరై.. ఆ అరుదైన జంటను ఆశీర్వదించారు కూడా. ఈమధ్యకాలంలో జరిగే పరిణామాలతో పెళ్లంటేనే వణికిపోతున్న క్రమంలో.. ‘హవ్వా ఇదెక్కడి ఆచారం అనుకుంటున్నారా?’ అయితే ఈ కథనంలోకి పదండి.. హిమాచల్ ప్రదేశ్ సిరమూర్ జిల్లా షిల్లై గ్రామంలో జులై 12 నుంచి మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా ఈ వివాహ వేడుక జరిగింది. హట్టి తెగ జానపద పాటలతో, నృత్యాలతో అన్నదమ్ములైన ప్రదీప్, కపిల్‌లను సునీతా చౌహాన్ వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ వేడుకకు హాజరై వాళ్లను ఆశీర్వదించారు కూడా. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రదీప్ స్థానికంగా ప్రభుత్వ ఉద్యోగి కాగా.. అతని సోదరుడు కపిల్ విదేశాల్లో జాబ్ చేస్తున్నాడు. కున్‌హట్ గ్రామానికి చెందిన సునీత పెద్దల మాటకు విలువ ఇచ్చే ఈ వివాహం చేసుకుందట. తమపై ఎవరి ఒత్తిడి లేదని, ఇష్టపూర్వకంగానే చేసుకున్నామని, పైగా ఇలా వివాహం చేసుకోవడం(polyandry) అనాదిగా తమ తెగలో వస్తున్న ఆచారమని చెబుతున్నారు. పైగా ఈ వివాహం తమకెంతో గర్వంగా ఉందని ఫొటో షూట్లో ఉత్సాహంగా పాల్గొంటూ చెప్పారు. Astonishing! Two real brother marry a Same Girl 👇In Shillai area of Sirmaur district, two real brothers have married the same girl. This has become a topic of discussion in the entire region. This tradition is ancient in the Giripar region but in today's modern era, due to the… pic.twitter.com/8fIOaeQtjs— Akashdeep Thind (@thind_akashdeep) July 19, 2025హట్టి తెగ ప్రజలు హిమాచల్ ప్రదేశ్-ఉత్తరాఖండ్ సరిహద్దులో ట్రాన్స్ గిరి రీజియన్‌లో 450 గ్రామాల్లో నివాసం ఉంటున్నారు. మూడేళ్ల కిందటే ఈ తెగకు షెడ్యూల్డ్ ట్రైబ్(గిరిజన తెగ.. ఎస్టీ) గుర్తింపు దక్కింది. అయితే వేల ఏళ్లుగా బహుభర్తృత్వం((polyandry)ను ఈ తెగ పాటిస్తోందట. అందుకు భూవివాదాలే ప్రధాన కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. కుటుంబ ఐక్యత.. తద్వారా భూవివాదాలు లేకుండా ఉండేందుకే హట్టి తెగ ఈ ఆచారం మొదలుపెట్టిందట. సోదరుల మధ్య బంధం బలంగా ఉండి ఉమ్మడి కుటుంబంలో గొడవలు జరగవనేది మరో కారణం. అంతేకాదు.. ఇద్దరు భర్తలు ఉంటే తమ ఆడబిడ్డలకు రక్షణ బలంగా ఉంటుందని ఈ తెగవారు భావిస్తారట. అయితే.. మారుతున్న పరిస్థితులు, మహిళలు చదువుకోవడం, ఆర్థికంగా స్థితిగతులు మెరుగుపడడం.. కారణాలతో ఈ తరహా వివాహాలు అరుదుగా జరుగుతూ వస్తున్నాయి. ఈ తరహా వివాహాలకు అక్కడి రెవెన్యూ చట్టాలు కూడా సమ్మతిని తెలుపుతున్నాయి. జోడిధారా పేరుతో గత ఆరేళ్లలో ఈ తరహా వివాహాలు ఐదు జరిగాయని అధికారులు చెబుతున్నారు. హట్టి తెగలో ‘జాజ్దా’ పేరుతో ఈ వివాహ సంప్రదాయం కొనసాగుతుంది. పెళ్లి కూతురిని ఊరేగింపుగా పెళ్లి కొడుకులు ఉన్న ఊరికి తీసుకొస్తారు. అక్కడ వరుడి ఇంట సీంజ్ అనే పద్దతిలో పూజాకార్యక్రమాలు నిర్వహిస్తారు. వాళ్ల భాషలో పంతులుగారు మంత్రాలు చదువుతూ.. పవిత్ర జలాన్ని వధువు- ఇద్దరు పెళ్లి కొడుకుల మీద జల్లుతాడు. ఆపై ఆ ముగ్గురు ఒకరికొరు బెల్లం తినిపించుకుంటారు. ఆఖర్లో కుల్ దేవతా ఆశీర్వాదంతో ఈ వివాహ తంతు ముగుస్తుంది. హిమాలయ పర్వతాల రీజియన్‌లోని కొన్ని తెగలు ఒకప్పుడు ఈ తరహా వివాహాలకు మక్కువ చూపించేవి. తమిళనాడులో తోడా అనే తెగ ఒకప్పుడు ఈ ఆచారం పాటించేది. అలాగే నేపాల్, కెన్యాలో కొన్ని తెగల్లో ఇప్పటికీ ఈ తరహా వివాహాలు జరుగుతున్నాయి. -
పెళ్లి చేసుకునే ఆలోచన లేదు!
‘‘ఇప్పుడు నా వయసు 24 ఏళ్లే. నా కెరీర్ ఇప్పుడేప్రారంభం అయింది. 30 ఏళ్లు వచ్చే వరకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు’’ అని హీరోయిన్ శ్రీలీల చెప్పారు. ‘పెళ్లి సందడి’(2021) చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైన ఆమె బిజీ హీరోయిన్గా దూసుకెళుతున్నారు. అలాగే తమిళ, హిందీ చిత్రాల్లోనూ నటిస్తున్నారామె. ‘ఆషికి 3’ సినిమాలో కార్తీక్ ఆర్యన్‌కి జోడీగా నటిస్తున్నారు శ్రీలీల. అయితే వీరిద్దరి రిలేషన్ గురించి గత కొన్నాళ్లుగా బాలీవుడ్లో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీలీల ప్రేమ, పెళ్లి, వ్యక్తిగత జీవితం వంటి విషయాలపై మాట్లాడారు. ‘‘ప్రస్తుతం నాకు 24 సంవత్సరాలు. కెరీర్ పరంగా ఇంకా ఎన్నో కలలున్నాయి.ప్రస్తుతం పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టాను. వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించేందుకు సమయం లేదు. నా జీవితంలో పెళ్లి అనేది 30 ఏళ్ల తర్వాతే జరుగుతుంది. అప్పటి వరకు ‘మీ వివాహం ఎప్పుడు?’ అని నన్ను ఎవరూ అడగొద్దు. ప్రస్తుతం నేను ప్రేమలో ఉన్నానని చాలా మంది అనుకుంటున్నారు. కానీ, నిజంగా అలాంటిదేం లేదు. నాపై వచ్చిన పుకార్లన్నీ అసత్యం. నేను ఎక్కడికెళ్లినా మా అమ్మ నా వెంట ఉంటుంది. అమెరికా వెళ్లినప్పుడు కూడా నాతోనే ఉంది. అలాంటి పరిస్థితుల్లో నేను ఎవరితో ప్రేమలో పడగలను? నిజంగా ఎవరితోనైనా రిలేషన్ లో ఉంటే మా అమ్మ మాతో కలిసి ఉండగలదా? ప్రస్తుతానికి నా తొలిప్రాధాన్యం కెరీర్‌కే. పెద్ద సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఆ సినిమాల్లో బాగా నటించి, ప్రేక్షకుల మెప్పు పొందేందుకు కష్టపడుతున్నాను. నా కంటూ కొన్ని లక్ష్యాలు ఉన్నాయి.. వాటిని సాధించిన తర్వాతే వ్యక్తిగత విషయాల గురించి ఆలోచిస్తాను’’ అని తెలిపారు శ్రీలీల. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘మాస్ జాతర, ఉస్తాద్ భగత్‌సింగ్’, తమిళంలో ‘పరాశక్తి’, హిందీలో ‘ఆషికి 3’ వంటి సినిమాలు చేస్తున్నారు. -
కట్నం వేధింపులతో యువతి ఆత్మహత్య... ఒంటిపై సూసైడ్ నోట్
లక్నో: మరింత కట్నం తేవాలంటూ అత్తింటి వారు పెట్టే వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. తన చావుకు కారణమంటూ భర్తతోపాటు అత్తింట్లో వాళ్ల పేర్లను ఒంటిపై రాసుకుని మరీ ఈ అఘాయిత్యానికి పాల్పడింది. మనీషా అనే యువతికి 2023లో నోయిడాకు చెందిన కుందన్‌తో పెళ్లయింది. మొదట్లో అంతా సాఫీగానే వారి కాపురం సాగింది. ఆ తర్వాత పరిస్థితులన్నీ మారిపోయాయి. పెళ్లప్పుడు బుల్లెట్ బైక్‌ను కొనిచ్చారు మనీషా తల్లిదండ్రులు. అయితే, ఎస్యూవీ కావాలంటూ కుందన్ కుటుంబీకులు డిమాండ్ చేయనారంభించారు. తమకు అంత స్థోమత లేదని చెప్పడంతో మనీషా తల్లిదండ్రులు తెలపడంతో శారీరకంగా, మానసికంగా వేధింపులు తీవ్రతరం చేశారు. ‘అన్నం పెట్టకుండా పస్తులుంచుతున్నారు. గదిలో ఉంచి తాళం వేస్తున్నారు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ కుందన్ బెదిరిస్తున్నాడు’అని మనీషా తన చేతిపై రాసుకుంది. వేధింపులు తట్టుకోలేక మనీషా 2024లో పుట్టింటికి చేరుకుంది. అక్కడున్నా వేధింపులకు మాత్రం అంతం లేకుండాపోయింది. ఇటీవల కుందన్, అతడి తల్లిదండ్రులు, ఇద్దరు సోదరులు గ్రామ పెద్దను తీసుకువచ్చి విడాకుల పత్రాలపై సంతకం చేయాలంటూ మనీషాను, ఆమె కుటుంబాన్ని ఒత్తిడి చేశారు. ఒప్పుకోకపోయేసరికి బెదిరింపులు మొదలుపెట్టారు. ‘నా మరణానికి భర్త కుందన్, మరుదులు దీపక్, విశాల్లే కారణం. పంచాయితీ సమయంలో వారు నా కుటుంబానికి హెచ్చరికలు చేశారు’అంటూ మనీషా తన కాలిపై రాసుకుంది. ‘మంగళవారం రాత్రి మేడపైన పడుకునేందుకు వెళ్లిన మనీషా పురుగుమందు తాగింది. ఉదయానికి విగతజీవిగా కనిపించింది’అని కుటుంబీకులు చెప్పారు. అత్తింటి నుంచి ఎదురవుతున్న ఒత్తిళ్లు, వేధింపులను తాళలేక డిప్రెషన్‌తో బలవన్మరణం చెందిందన్నారు. చనిపోయేముందే శరీరంపై ఆమె ఈ మేరకు రాసుకుందన్నారు. మనీషా మరణానికి విష ద్రావకమే కారణమని పోస్టుమార్టంలో తేలిందని ఏఎస్పీ ఎన్పీ సింగ్ చెప్పారు. ఆమె కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టామన్నారు. -
ఇది కదా హ్యూమన్ స్పిరిట్ .. ఓ వైపు పెళ్లి.. మరో వైపు అంత్యక్రియలు
కౌలాలంపూర్: నేటి సమాజంలో మంటగలుస్తున్న మానవత్వానికి మచ్చుతునక ఈ ఉదంతం. జూలై 5న మలేషియాలోని నెగెరి సెంబిలాన్ రాష్ట్రంలోని టంపిన్ పట్టణంలో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఓ వైపు భారతీయ కుటుంబం వివాహ వేడుకను నిర్వహిస్తుండగా, అదే వీధిలో చైనా కుటుంబం 94 ఏళ్ల మహిళకు అంత్యక్రియలు నిర్వహించింది.చైనా కుటుంబానికి చెందిన వాంగ్ అనే రాజకీయ నాయకుడు తన తల్లి మరణాన్ని ‘జాయ్‌ఫుల్ ఫ్యూనరల్’గా పేర్కొన్నారు. అంటే, వృద్ధాప్యంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా మరణించడం చైనా సంస్కృతిలో శుభంగా భావిస్తారు. అయితే, తన తల్లి మరణంతో వాంగ్ భారతీయ కుటుంబాన్ని సంప్రదించారు. ‘రాత్రి ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు ఉండవు. మీరు మీ వేడుకను కొనసాగించవచ్చు అని వారికి భరోసా ఇచ్చారు. దీంతో భారతీయ కుటుంబం పెళ్లి వేడుక ఘనంగా నిర్వహించింది. సంగీతాన్ని తగ్గించి, అతిథులను అంత్యక్రియల ప్రదేశానికి దూరంగా వాహనాలు పార్క్ చేయమని సూచించింది.ప్రస్తుతం ఈ ఘటనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఇది నిజమైన మలేషియన్ స్పిరిట్ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. సాంస్కృతిక భిన్నత్వం ఉన్నా.. పరస్పర గౌరవం, సానుభూతి ఎలా మానవత్వాన్ని ముందుకు తీసుకెళ్తాయో ఇది ఒక అద్భుత ఉదాహరణగా నిలిచిందని కామెంట్లు చేస్తున్నారు. -
పెళ్లి చేసుకోండి.. సెలవులిస్తాం
ఉద్యోగుల సంక్షేమం, కుటుంబ వ్యక్తిగత జీవనాన్ని మెరుగుపరిచేందుకు దుబాయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ ప్రభుత్వంలోని వివిధ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులకు పెళ్లి కోసం 10 పనిదినాల పూర్తి వేతనంతో కూడిన సెలవును మంజూరు చేస్తూ కొత్త విధానాన్ని ప్రకటించింది. తమ పౌరులకు పని-జీవిత సమతుల్యత, సామాజిక ఐక్యతను పెంపొందించడానికి దుబాయ్ ప్రకటించిన ఈ నూతన సెలవు విధానం ఈ ఏడాది జనవరి 1 నుంచే అమల్లోకి వచ్చింది.దీనికి సంబంధించి యూఏఈ ప్రధాని, దుబాయ్ పాలకుడైన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ డిక్రీ జారీ చేశారు. ఈ కొత్త ఆదేశాలు వివిధ ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్న యూఏఈ పౌరులందరికీ వర్తిస్తాయి. ఇందులో దుబాయ్ ప్రభుత్వ విభాగాలు, న్యాయాధికారులు, సైనిక సిబ్బంది, ఫ్రీ జోన్లు, స్పెషల్ డెవలప్మెంట్ జోన్లు, దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ (డీఐఎఫ్సీ) వంటి సంస్థలు ఉన్నాయని ఖలీజ్ టైమ్స్ తెలిపింది. భవిష్యత్తులో అదనపు కేటగిరీల ఉద్యోగులను కవర్ చేయడానికి విస్తరణకు కూడా ఈ డిక్రీ అనుమతిస్తుంది.కొత్త వివాహ సెలవుకు అర్హత పొందడానికి ఉద్యోగులు వారి ప్రొబేషనరీ వ్యవధిని విజయవంతంగా పూర్తి చేసి ఉండాలి. అలాగే తాము పెళ్లి చేసుకోబోయే వారు కూడా యూఏఈ పౌరులే అయి ఉండాలి. 2024 డిసెంబర్ 31 తర్వాత అయిన వివాహాలకే ఇది వర్తిస్తుంది. ఈ వివాహ ఒప్పందాన్ని యూఏఈ అధీకృత సంస్థలు అధికారికంగా ధృవీకరించాలి. వెరిఫికేషన్ కోసం మ్యారేజ్ సర్టిఫికేట్ సర్టిఫైడ్ కాపీ అవసరం. పెళ్లి జరిగిన రోజు నుంచి ఈ సెలవులను ఒకసారి కానీ, విడదలవారీగా కానీ ఉపయోగించుకోవచ్చు. వివాహ సెలవుల కాలంలో ఉద్యోగికి వర్తించే అన్ని అలవెన్సులు, ఆర్థిక ప్రయోజనాలతో సహా పూర్తి వేతనాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. -
మూడు ముళ్లకెందుకులే తొందర!
సాక్షి, అమరావతి: పెళ్లి విషయంలో దేశంలోని యువత ధోరణి మారుతోంది. యుక్త వయస్సు రాగానే పెళ్లి కోసం ఆరాటపడే యువకులు ఇప్పుడు కనిపించడంలేదు. ఒకప్పుడు 23 నుంచి 25 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవడం సహజంగా ఉండేది. ఇప్పుడు 30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకునేందుకు యువత ఆసక్తి చూపడంలేదు. ముఖ్యంగా యువకుల్లో ఈ ధోరణి మరింత ఎక్కువగా ఉంటోంది. ఈ మార్పుకు మూడు ప్రధాన కారణాలు ఉన్నట్లు తాజా సర్వేలు చెబుతున్నాయి. ఉద్యోగ స్థిరత్వం, ఆర్థిక స్వావలంబన, వ్యక్తిగత అభిరుచి మేరకు పెళ్లికి సిద్ధమవుతున్నారు. ‘బెటర్ హాఫ్ ఏఐ’ అనే సంస్థ 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న యువతపై చేసిన సర్వేలో సుమారు 68శాతం మంది యువకులు ఉద్యోగం లేకుండా పెళ్లి చేసుకోకూడదనే అభిప్రాయంతో ఉన్నట్లు తేలింది. ఆ కారణంతోనే పెళ్లిని వాయిదా వేసుకుంటున్నారని స్పష్టమైంది.అమ్మాయిలు దొరకడం లేదుచాలా ప్రాంతాల్లో యువకులకు జోడీగా అమ్మాయిలు దొరకని పరిస్థితి నెలకొంది. చదువుకున్న అమ్మాయిల్లో 65 శాతం మంది తమకు సమానంగా ఉన్న అబ్బాయిలను మాత్రమే పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తున్నారు. చదువు, ఉద్యోగంలో కొంచెం వెనుకబడ్డ యువకులకు పెళ్లి సంబంధాలు రావడం లేదని విజయవాడకు చెందిన ఒక మ్యారేజీ బ్యూరో ప్రతినిధి భవానీ శంకర్ చెప్పారు. ప్రధానంగా కొన్ని సామాజికవర్గాలు, కులవృత్తిపై ఆధారపడివారిలో ఈ సమస్య తీవ్రంగా ఉంటోంది.ఐటీ రంగంలో ఉన్నవాళ్లు అదేరంగంలో ఉన్న వారి కోసమే చూస్తున్నారు. అందులోనూ తమ ఉద్యోగ స్థాయికి తగ్గట్టు ఉన్నారో... లేదో.. చూస్తుండడంతో సంబంధాలు వెంటనే కుదరడంలేదు. ఇలా వివిధ అభిరుచులు, కారణాల వల్ల అన్నిచోట్లా తల్లిదండ్రులు సంబంధాల కోసం పరితపించే పరిస్థితి ఏర్పడింది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే పని చేయని వారికి సంబంధాలే రావడంలేదని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన మ్యారేజీ బ్యూరో నిర్వాహకుడు రామారావు చెప్పారు. తమకు సరిపోయే జోడీ దొరక్కపోవడంతో పెళ్లిని చాలామంది వాయిదా వేసుకుంటున్నారు. ప్రధాన నగరాల్లో అయితే పెళ్లి కంటే సహజీవనం పట్ల ఆకర్షణ కూడా పెరుగుతోంది. తల్లిదండ్రులపై భారం లేకుండా...» ‘బెటర్ హాఫ్ ఏఐ’ సర్వే ప్రకారం 70 శాతం మంది యువకులు పెళ్లి ఖర్చును తామే భరించాలనుకుంటున్నారు. తల్లిదండ్రులపై భారం మోపకుండా జీవితం ప్రారంభించాలని ఆశిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. » జీవితంలో ఇంకా స్థిరపడలేదు... స్థిరపడ్డాకే పెళ్లి చేసుకోవాలనే భావన అబ్బాయిల్లో బలంగా ఉంటోంది.»గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగావకాశాలు తక్కువగా ఉండటంతో యువకులు కాస్త త్వరగా పెళ్లికి ఒప్పుకుంటున్నారు. అయితే, వారికి సరైన జోడీ దొరకడం కష్టంగా మారుతోంది. ూ చదువు, కెరీర్లో ఎదగాలన్న లక్ష్యం కూడా పెళ్లిని రెండవ ప్రాధాన్యతగా మార్చుతోంది.» పట్టణాల్లో అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ఆర్థిక స్వావలంబన, కెరీర్‌పై ఫోకస్, సరైన భాగస్వామిని ఎంచుకోవాలన్న కారణాల వల్ల పెళ్లి ఆలస్యమవుతోంది. -
అత్త పాపిట తిలకం దిద్ది.. !
పాత పరిచయాలు.. వివాహేతర సంబంధాలతో భార్యలను భర్తలు, భర్తలను భార్యలు కడతేర్చడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. ఈ క్రమంలో ఈ తరహా నేరాలపై జనాల్లోనూ ఆసక్తి పెరిగిపోతోంది. తాజాగా.. తన బార్యతో సంబంధం పెట్టుకున్నాడంటూ ఓ యువకుడిని చితకబాది వివాహం జరిపించిన ఘటన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ రాక్షస వివాహం జరిపించింది అతని మామే కావడం మరో విశేషం.బీహార్ సుపౌల్ జిల్లాలో దారుణం జరిగింది. తన అత్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడంటూ ఓ యువకుడ్ని చితకబాది.. అతనితో ఆమెకు బలవంతంగా వివాహం జరిపించారు. పైగా ఆ వివాహం జరిపించింది అతని మామనే కావడం గమనార్హం. ఈ ఘటనలో తీవ్రంగా గాయాలపాలైన యువకుడు.. చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు.. భీంపూర్ పీఎస్ పరిధిలో జీవ్‌ఛాపూర్ వార్డు నంబర్ 8కి చెందిన 24 ఏళ్ల మిథిలేష్ కుమార్‌ను జులై 2వ తేదీన కొందరు వ్యక్తులు బలవంతంగా ఇంట్లో నుంచి లాక్కెళ్లారు. మిథిలేష్‌ను తన ఇంటికి తీసుకెళ్లిన మామ శివ్‌చంద్ర తన ఇంట్లో పంచాయితీ పెట్టాడు. శివచంద్రకు భార్య రీటా దేవి, నాలుగేళ్ల కొడుకు ఉన్నారు. అయితే రీటాదేవితో వివాహేతర సంబంధం ఉందని చెబుతూ మిథిలేష్‌ను చితకబాదాడు. అదే సమయంలో ..అక్కడికొచ్చిన జనాలు రాడ్లు, కర్రలతో మిథిలేష్‌ను కొట్టారు. మరికొందరు గ్రామస్తులు ఇటు రీటాను చితకబాదారు. ఆపై బలవంతంగా మిథిలేష్‌తో రీటా నుదుట సిందూరం దిద్దించి.. వివాహం జరిగినట్లు శివ్‌చంద్ర ప్రకటించాడు. అడ్డొచ్చిన బాధితుడి తండ్రి రామచంద్రను, తల్లిని సైతం ఆ జనాలు కొట్టారు. ఈలోపు గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి రాగా.. శివ్‌చంద్ర అండ్ గ్యాంగ్ అక్కడి నుంచి పారిపోయింది. తీవ్ర గాయాలతో మిథిలేష్ అక్కడికక్కడే కుప్పకూలిపోగా.. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.बिहार के सुपौल जिले में रिश्तों को तार-तार करने वाली घटना सामने आई है. जिले के भीमपुर थाना क्षेत्र में एक भतीजे से जबरदस्ती उसकी चाची की मांग भरवाई गई और शादी कराई गई. दरअसल, परिजनों और ग्रामीणों का आरोप है कि दोनों के बीच अवैध संबंध थे, जिसके चलते गांव वालों ने पहले उनके साथ… pic.twitter.com/p5Md89BvkE— ABP News (@ABPNews) July 8, 2025 -
'ఇప్పటికే మూడో పెళ్లి చేసుకున్నా.. కానీ'.. అమిర్ ఖాన్ కామెంట్స్
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ ఇటీవలే సితారే జమీన్ పర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. గతనెలలో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. లాల్ సింగ్ చద్ధా తర్వాత అమిర్ చేసిన మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 2018లో వచ్చిన మూవీకి సీక్వెల్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు బాలీవుడ్ హీరో.అయితే ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్న అమిర్ ఖాన్ మరోసారి రిలేషన్లో ఉన్నారు. తన చిన్ననాటి స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌తో డేటింగ్ ప్రారంభించారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం గౌరీతో రిలేషన్లో ఉన్న అమిర్ ఖాన్.. మూడో పెళ్లిపై స్పందించారు. గౌరీని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నట్లు అమిర్ ఖాన్ తెలిపారు. మేమిద్దరం చాలా నిజాయితీ, నిబద్ధతతో ఉన్నామని అన్నారు. మీకు తెలుసా? మేము ప్రస్తుతం భాగస్వాములని.. ఇప్పటికే తన హృదయంతో ఆమెను పెళ్లాడానని అమిర్ ఖాన్ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చారు. మేము కలిసి ఉన్నామని.. అయితే అధికారికంగా పెళ్లి చేసుకోవాలా? వద్దా? అనే దానిపై రాబోయే రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని అమిర్ ఖాన్ తెలిపారు.కాగా.. ఈ సంవత్సరం మార్చిలో తన 60వ పుట్టినరోజు సందర్భంగా తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌తో తన రిలేషన్‌ను అఫీషియల్‌గా ప్రకటించారు. అమిర్ వయస్సు 60 ఏళ్లు కాగా.. గౌరీకి(46) అతనికి దాదాపు 14 సంవత్సరాల వయస్సు తేడా ఉంది. ఆమె ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు. ఇప్పటికే అమిర్ ఖాన్ 1986లో మొదట రీనా దత్తాను పెళ్లాడారు. ఆ తర్వాత 2002లో విడిపోయారు. మరో మూడేళ్లకు డైరెక్టర్ కిరణ్ రావును వివాహమాడారు. వీరిద్దరు 2021లో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం మూడో పెళ్లికి సిద్ధమయ్యారు మన బాలీవుడ్ స్టార్ హీరో. -
ఉదయం పెళ్లి.. సాయంత్రం ప్రియుడితో నవ వధువు జంప్
అన్నానగర్: పెళ్లి రోజున బ్యూటీ సెలూన్‌కు వెళుతున్నట్లు చెప్పి ప్రియుడితో నవ వధువు పరారైంది. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పెళ్లింట ఇలా వధువు వెళ్లిపోయిందన్న వార్త స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.వివరాల ప్రకారం..పెరంబూర్‌లోని అంబేడ్కర్ నగర్‌కు చెందిన అర్చనకు మాధవరం బర్మా కాలనీకి చెందిన విజయకుమార్‌తో వివాహం నిశ్చయం అయ్యింది. ఈ మేరకు బుధవారం ఉదయం బెసెంట్నగర్ ఆలయంలో వారి వివాహ వేడుక జరిగింది. తర్వాత వధూవరులు ఇంటికి వెళ్లారు. సాయంత్రం వివాహ విందుకు ఏర్పాట్లలో రెండు కుటుంబాలు బిజీగా ఉన్నాయి. అర్చన తన తల్లిదండ్రులకు రిసెప్షన్ కోసం బ్యూటీ సెలూన్‌కు వెళుతున్నానని చెప్పి, తన కొంతమంది స్నేహితులతో వెళ్లింది.అనంతరం, అర్చన ఇంటికి తిరిగి రాలేదు. రిసెప్షన్ సమయం దగ్గర పడుతుండడంతో ఆందోళన చెందిన ఆమె తల్లిదండ్రులు అర్చన సెల్‌ఫోన్‌కు ఫోన్ చేశారు. కానీ అది స్విచ్ ఆఫ్‌లో ఉంది. ఆమెతోపాటు వచ్చిన ఆమె స్నేహితులు కూడా అదృశ్యమయ్యారు. ఆమె తల్లిదండ్రులు విచారించగా, అర్చన ఇప్పటికే ఎరుకంజేరికి చెందిన ఒక యువకుడిని ప్రేమించిందని, పెళ్లి తర్వాత అతనిని వివాహం చేసుకోవాలని ప్లాన్ చేసిందని వారికి తెలిసింది.ఈ క్రమంలో బ్యూటీ సెలూన్‌కు వెళ్లే నెపంతో ఆమె తన ప్రియుడితో పారిపోయిందని కూడా తేలింది. వధువు అదృశ్యం కావడంతో వరుడు, అతని బంధువులు ఒక్కసారిగా షాకై దిగ్భ్రాంతి చెందారు. దీంతో వివాహ రిసెప్షన్ రద్దు చేసుకున్నారు. ఈ విషయమై అర్చన తల్లి తిరు.వి.కె.నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. పారిపోయిన నవ వధువు, ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. -
ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుందాం.. లేకపోతే చంపేస్తా!
అనంతపురం: పెళ్లి చేసుకోకపోతే చంపేస్తా అంటూ ఓ యువతిపై యువకుడు దాడి చేసిన ఘటన అనంతపురం నగరంలో చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు.. పుట్లూరు మండలం శనగల గూడూరుకు చెందిన యువతి సాయినగర్ ఏడో క్రాస్‌లోని లేడీస్ హాస్టల్లో ఉంటోంది.రెండు సంవ త్సరాల క్రితం అనంతపురం నగరంలోని బస్టాండు వద్ద ఉన్న ప్రియదర్శిని హోటల్లో పార్టం ఉద్యోగం చేస్తున్న ఈమెకు.. శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం అగ్రహారంకు చెందిన ప్రవీణ్ కుమార్ పరిచయం అయ్యాడు. ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుందాం అని చెప్పగా యువతి నిరాకరించింది. ఈ క్రమంలోనే ఇటీవల విద్యుత్ నగర్లో ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంకు హోంలోన్ విభాగంలో సేల్స్ ఆఫీసర్ ఉద్యోగంలో చేరింది.విషయం తెలుసుకున్న ప్రవీణ్ కుమార్ మళ్లీ ఆమె వెంటపడుతూ పెళ్లి చేసుకోవాలని వేధించడం ప్రారంభించాడు. మంగళవారం హాస్టల్ వద్దకు వెళ్లి గొడవపడ్డాడు. బైకులో బలవంతంగా ప్రసన్నాయ పల్లి రైల్వేస్టేషన్‌కు తీసుకెళ్లి దాడి చేశాడు. వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే చంపుతా అని బెదిరించాడు. తిరిగి బైక్‌పై హాస్టల్ వద్ద వదిలి వెళ్లిపోయాడు. దీనిపై తన సోదరితో కలిసి యువతి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. -
వధువు సోదరి, వరుడు సోదరుడు ‘చమ్మక్ చల్లో..’ వైరల్ వీడియో
పెళ్లిళ్లలోఅందమైన అమ్మాయిలు, టీనేజ్ కుర్రాళ్లదే సందడి అంతా.వధూవరులు కుటుంబాలు పెళ్లి పనుల్లో బిజీగా ఉంటే, వీరుమాత్రం ‘కళ్లు కళ్లు కలిసేనే...’ ‘కళ్లు కళ్లు ప్లస్సూ... వాళ్లు వీళ్లు మైనస్ ఒళ్లు ఒళ్లు ఇన్టు చేసేటి ఈక్వేషన్ ఇలా ఇలా ఉంటే ఈక్వల్టు ఇన్‌ఫ్యాట్యుయేషన్’ అంటూ ఆనందం, ఆశ్చర్యంతో ఉత్సాహంగా స్టెప్లు లేస్తారు. అలాంటి డ్యాన్స్ ఒకటి నెట్టింట తెగ వైరలవుతోది.పెళ్లిళ్లలో సంగీత్ వేడుక అనేది పెళ్లికి ముందు జరిగే వేడుకలలో ఒకటి. ఈ సందర్భంగా వధూవరుల కుటుంబాలు కలిసి ఆడిపాడతారు. అయితే ఒక పెళ్లి వరుడి సోదరుడు,వధువు సోదరి ఇద్దరూ కలిసి స్టెప్పులతో ఇరగదీశారు. బాలీవుడ్ హిట్ మూవీ రా.వన్‌లోని సూపర్సాంగ్ ‘ చమ్మక్ చల్లో’’ కి చాలా ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. అబ్బాయి సూట్లో, అమ్మాయి లెహంగాలో అందంగా మెరిసిపోతూ, చక్కటి డ్యాన్స్ వేసి అక్కడున్నవారినందర్నీ మెస్మరైజ్ చేశారు. View this post on Instagram A post shared by WeddingDreamCo | Wedding Content Creator Chennai (@weddingdreamco) ఈ వీడియోను @weddingdreamco ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, 8.6 మిలియన్ల వీక్షణలు , 902వేల లైక్స్‌తో తెగ వైరల్‌గా మారింది. నెటిజన్లు ప్రశంసలు, కామెంట్లతో సందడిచేశారు. ‘‘వార్నీ..వీళ్లిద్దరూ ఇప్పటికే డేటింగ్లో ఉన్నట్టున్నారు. అందుకే పేరెంట్స్‌ను ఒప్పించడానికి వారు వారి అన్నయ్యలను వివాహం కోసం ఏర్పాటు చేసుకున్నారు.” ‘‘అమ్మాయి డ్యాన్స్‌తో చంపేసింది’’, అని ఒకరంటే.. ‘హే.. వాళ్లిద్దరూ చాలా మర్యాదగా ప్రవర్తించారు. అబ్బాయి అయితే ఒక్కసారి కూడా టచ్ చేయకుండా డ్యాన్స్చేశారు అని మరొకరు కామెంట్ చేయడం విశేషం.వధూవరుల తోబుట్టువులు పెళ్లిలలో ఇలాంటి డ్యాన్సులతో అతిథుల మనసు దోచుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి వీడియోలు నెట్టింట సందడి చేశాయి. -
కాపురానికి కమ్యూనికేషన్ : గ్యాప్ పెరిగిపోతోంది
రిలేషన్షిప్ ఎన్ని కొత్తపోకడలు పోయినా పెళ్లితోనే ఆ బంధానికి భద్రత అనుకునేవాళ్లే ఎక్కువ!అందుకే పెళ్లికి జాతకాలు,శాలరీ ప్యాకేజ్‌లు, ఆస్తులు, అంతస్తులు చూసుకున్నా...హక్కులు–బాధ్యతలు, ప్రణాళికలు, శక్తిసామర్థ్యాలు, పరస్పర గౌరవం, నమ్మకాలు, అండర్స్టాండింగ్, కంపాటబులిటీలకూ ప్రాధాన్యం ఇవ్వాలి! కాపురానికి కమ్యూనికేషన్ అత్యంత అవసరమని గ్రహించాలి అంటున్నారు ఫ్యామిలీ కౌన్సెలర్స్, మానసిక, న్యాయ నిపుణులు.. ఈ తరం కూడా! ఆ అభిప్రాయాలతోనే ఈ క్యాంపెయిన్‌ను నేటితో ముగిస్తున్నాం! ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవాన్ని మాత్రం ఒప్పుకోరుపెళ్లికి సంబంధించి మన దగ్గర రెండు విధానాలున్నాయి. ఒకటి రాజ్యాంగపరంగా జీవించడం, రెండు.. ఆచార వ్యవహారాలకనుగుణంగా ఉండటం. ఈ రెండోరకంలో పెద్దల నిర్ణయాలు, సమాజ కట్టుబాట్లను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మొదటిరకంలో రాజ్యాంగం వ్యక్తులకు ఏ హక్కులనైతే ఇచ్చిందో అవన్నీ కూడా జీవితభాగస్వాములకు అమలవుతాయి. రాజ్యాంగ పరంగా భార్యభర్తలు ఇద్దరూ సమానమే! కానీ ఆచార వ్యవహారాలు, సాంస్కృతిక విలువల పరంగా ఆలుమగలిద్దరూ సమానం కాదు. అయినా అమ్మాయి చదుకోవాలి, ఉద్యోగం ఉండాలి, కట్నకానుకలు ఇవ్వాలి అనే అంచనాలూ ఉంటాయి. కానీ అమ్మాయి ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవాన్ని మాత్రం ఒప్పుకోరు. రాజ్యాంగబద్ధమైన వాటిల్లో కూడా భర్త సం΄ాదన మీద హక్కు కోరుకుంటున్న భార్య .. ఆయన తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యతల విషయంలో మాత్రం మిన్నకుంటోంది. ఇక్కడే కాన్ఫ్లిక్ట్ మొదలవుతోంది ఏ పెళ్లిలో అయినా! అందుకే ఏ విధానంలోనైనా జీవితభాగస్వాములిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. హక్కుల విషయంలో పరస్పర గౌరవంతో ఉండాలి. ఏరకమైన బాధ్యతలనైనా సమానంగా పంచుకోవాలి.– బీఎన్ నాగరత్న, ప్రెసిడెంట్ దలీప్ ఇదీ చదవండి: తొలి ఏకాదశికి ఆ పేరెందుకు వచ్చింది?గ్యాప్ పెరిగిపోతోంది పెళ్లికి కమ్యూనికేషన్ అండ్ టైమ్ చాలా ముఖ్యం. భార్య, భర్త ఇద్దరూ ఉద్యోగాలు చేయడం తప్పనిసరైన ప్రస్తుత పరిస్థితుల్లో ఈతరం కాపురాల్లో అవి రెండూ మిస్ అవుతున్నాయి. పిల్లల కోసం ప్లాన్ చేసుకోవడానికి మా దగ్గరకు వచ్చే జంటల్లో మేము నోటీస్ చేస్తున్న ప్రధాన సమస్య అదే. భార్య, భర్తలిద్దరిలో ఒకరికి డే షిఫ్ట్ ఉంటే, ఇంకొకరికి నైట్ షిఫ్ట్ ఉంటోంది. వీకెండ్లో మాత్రమే ఇద్దరూ కలిసి ఉంటున్నారు. అదీ ఎవరి ఫోన్లలో వాళ్లు! దీనివల్ల ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగి΄ోతోంది. అండర్స్టాండింగ్ కొరవడుతోంది. మనం అనే భావన లేకుండా నాది అనే ఈగోనే వాళ్ల మ్యారిటల్ లైఫ్‌ని డామినేట్ చేస్తోంది. దీనివల్ల పిల్లల సంగతి అటుంచి వాళ్లు కలిసి కాపురం చేసే పరిస్థితే కనబడట్లేదు. అందుకే పెళ్లిని నిలుపుకోవాలంటే ఈకాలం జంటలకు కావాల్సింది కమ్యూనికేషన్ అండ్ ఇద్దరూ కలిసి స్పెండ్ చేసే క్వాలిటీ టైమ్. దీని కోసం ఇద్దరూ కొన్ని సర్దుబాట్లు చేసుకోవాలి. – డాక్టర్ ప్రశాంతి ఉప్పునూతలపేరెంట్స్కూ కౌన్సెలింగ్ అవసరంపెళ్లి అనేది ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన విషయం. ఇరు కుటుంబాల మధ్య స్నేహం, బంధం, సాన్నిహిత్యం వంటివి పెళ్లి చేసుకునే ఇద్దరు వ్యక్తుల అంగీకారంపై ఆధారపడి ఉండలే తప్ప కుటుంబాల కలయిక కోసం పెళ్లిళ్లు జరగకూడదు. పెళ్లివ్యవస్థపై పూర్తి అవగాహన కల్పించడంలో మనం విఫలమయ్యామని చెప్పుకోవాలి. పెళ్లి బంధంలో ఉండాల్సిన పరస్పర గౌరవం లాంటి ఎన్నో విషయాలు చాలామందికి అర్థం కావడం లేదు. దాంతో పెళ్లి తర్వాత గృహహింస లాంటి ఎన్నో నేరాలకు పాల్పడుతున్నారు. విడాకుల వరకు వచ్చి కౌన్సిలింగ్ తీసుకోవలసిన పరిస్థితులను తరచుగా చూస్తున్నాం. పెళ్లికి ముందే అందరికీ సరైన రీతిలో లీగల్ – సైకలాజికల్ అవగాహన కల్పించినట్లయితే వివాహ వ్యవస్థ నిలబడడానికి కొంతవరకు హెల్ప్ అవుతుంది. మన దగ్గర సెక్స్ ఎడ్యుకేషన్ కూడా సరిగా లేదు. అందులో భాగంగా ‘అంగీకారం’ అంటే ఛిౌnట్ఛn్ట – వ్యక్తిగత స్వేచ్ఛ, సేఫ్టీ వంటి అంశాలను బోధించాలి. లేకపోతే వైవాహిక జీవితమంతా వైధింపుల మయమవుతుంది. పెళ్లి చేసుకునే వారికే కాదు, వారి తల్లిదండ్రులకూ పెళ్లికి ముందు కౌన్సెలింగ్ అవసరం. చాలామటుకు పెళ్లిళ్లలో తల్లిదండ్రుల జోక్యం వల్ల సులభంగా పరిష్కారమయ్యే సమస్యలు కూడా తెగేదాకా వెళ్తున్నాయి. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది ఈ ఎడ్యుకేషన్ తప్పనిసరి అమ్మాయిలు ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నా.. డొమెస్టిక్ వ్యవహారంలో మాత్రం జెండర్ రోల్స్‌లో పెద్దగా మార్పు లేదు. ఇంటి పనులు, పేరెంటింగ్‌లో అబ్బాయిలకు భాగస్వామ్యం ఇవ్వట్లేదు. భర్తతో సమానంగా సం΄ాదిస్తున్నా ఇల్లు, పిల్లల బాధ్యత ఆమెదే అన్న సంప్రదాయ భావనలోనే ఉన్నాం ఇంకా. దీనివల్ల ఆడపిల్లల మీద అదనపు భారం పడుతోంది. అందుకే చాలామంది అమ్మాయిలు పెళ్లి పట్ల విముఖత చూపిస్తున్నారు. అసలు మనదగ్గర వైవాహిక జీవితానికి సంబంధించి ఎడ్యుకేషనే లేదు. పెళ్లికి కులగోత్రాలు, జీతం, ఆస్తి, అంతస్తే ముఖ్యం అనుకుంటారు. ఇంటి బాధ్యత దగ్గర్నుంచి ఆర్థిక వ్యవహారాల దాకా అమ్మాయి, అబ్బాయి అంచనాలు, ప్రణాళికలు, పరస్పర గౌరవ నమ్మకాలు, ఎమోషనల్, ఫిజికల్ కంపాటబులిటీ లాంటివాటి మీద చర్చే ఉండదు. అసలు అలాంటి వాతావరణం తల్లిదండ్రుల మధ్యే కనబడదు కాబట్టి ఆ సంభాషణలు ఇంట్లో వినపడవు. కానీ ఈ తరం అమ్మాయి, అబ్బాయిలూ మాత్రం ఆ దిశగా ఆలోచించాలి. పెళ్లికి ముందు పెళ్లి తంతు, హనీమూన్‌కి ప్లాన్ చేసుకోవడం కన్నా పెళ్లి తర్వాత గడపబోయే సహజీవనం మీద శ్రద్ధ పెట్టాలి. జీతం, ఆస్తిపాస్తుల గురించి పెద్దలు ఎలాగూ చూస్తారు కాబట్టి.. పెళ్లి మీద ఇద్దరి అవగాహన, ఇంటి పనుల నుంచి ఆర్థిక వ్యవహారాల దాకా ఇద్దరి ప్లాన్స్, సామర్థ్యాలు, కంపాటబులిటీల గురించి ఇద్దరూ కూర్చుని మాట్లాడుకోవాలి. అవసరమైతే ఫ్యామిలీ కౌన్సెలర్స్ సాయం తీసుకోవాలి. పెళ్లికి ముందే అన్నీ తెలుసుకునే వీలు లేక΄ోతే ముఖ్యమైన వాటి గురించైన ప్రాథమిక సమాచారం తీసుకుని పెళ్లి తర్వాత హనీమూన్ కన్నా ముందు కౌన్సెలింగ్‌కు ప్లాన్ చేసుకోవాలి. కాపురం సజావుగా సాగేందుకు ఇద్దరికీ అనుకూలమైన ఓ మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. – వర్ష వేముల, సైకోథెరపిస్ట్ పైపై బంధంగానే ఉంటుంది పెళ్లికి కేవలం జాతకాలు, శాలరీలతోనే చూస్తున్నవాళ్లు వాళ్ల ప్రధాన క్రైటీరియా అయిన కం΄ాటబులిటీని మాత్రం మ్యాచ్ చేయట్లేదు. కంఫర్టబుల్ లైఫ్ అండ్ డీసెంట్ లైఫ్ ఉండాలి.. కాదనట్లేదు. కానీ వైవాహిక జీవితానికి కావల్సిన చిన్న చిన్న విషయాలను కూడా మాట్లాడుకోవట్లేదు. ప్రేమ గురించిన వెంపర్లాట కనపడుతోంది తప్ప గౌరవం గురించి కాదు. రెస్పెక్ట్ ఉంటేనే కదా ప్రేమ ఉండేది! ఇలాంటివి అంటే మ్యాచ్ కాక΄ోతే, పరస్పర గౌరవం, కం΄ాటబులిటీ లేక΄ోతే పెళ్లి సఫకేటింగ్ చాంబర్‌లా మారుతుంది.. ముఖ్యంగా మహిళలకు. ఒక్కమాటలో చె΄్పాలంటే పెళ్లి అనేది రెండు కుటుంబా ప్రాపర్టీని రెట్టింపు చేసేదిగా, కుల అహంకారాన్ని ప్రిజర్వ్ చేసేదిగా, క్లాస్‌ని మెయింటేన్ చేసేదిగానే ఉంది. ఒక ప్రిస్టేజ్ సింబల్. ΄ాతికేళ్లు వచ్చాయా పెళ్లి చేసుకున్నామా .. ముప్పై ఏళ్లొచ్చాయా పిల్లల్ని కన్నామా.. సెటిల్ అయ్యామా అనే చూస్తున్నారు కానీ సంతోషంగా ఉన్నామా అని చూడట్లేదు. హారోస్కోప్ లో పద్దెనిమిదో ముప్పై ఆరో గుణాలు (ఛత్తీస్గుణ్) కలుస్తున్నాయా అని చూస్తున్నారు తప్ప పెళ్లిచేసుకోయే జంట కాబోయే తల్లిదండ్రులు కూడా కదా! వాళ్లు పిల్లల్ని కనాలనుకుంటున్నారా లేదా.. పేరెంటింగ్ బాధ్యతలను ఎలా షేర్ చేసుకోవాలనుకుంటున్నారు లాంటి ముఖ్యమైన విషయాల గురించి చర్చించట్లేదు. ఇవేవీ లేని పెళ్లి పైపై బంధంగానే ఉంటుంది. దానికన్నా అన్మ్యారీడ్గా ఉండటమే బెటర్. – హిమబిందు, సోషల్ యాక్టివిస్ట్పరిణతే ప్రామాణికం పెళ్లిని సమాజమెప్పుడూ వయసుకి సంబంధించిన అంశంగా చూస్తోంది. త్వరగా పెళ్లి చేసుకుని త్వరగా పిల్లలు పుడితే వృద్ధ్యాపంలో తోడుగా ఉంటారనే ఆధారపడే మనస్తత్వం అందులో కనిపిస్తుంది. అంతేకానీ పరిణతి, ΄ోషించే శక్తిసామర్థ్యాలను ్ర΄ామాణికంగా చూడట్లేదు. మారుతున్న కాలంలో పెరుగుతున్న అవసరాల దృష్ట్యా మన అభి రుచులూ వేగంగా మారుతున్నాయి. భాగస్వామి వాటన్నిటినీ తీర్చలేక΄ోయినా కనీసం అర్థం చేసుకొని, గౌరవించే స్థాయిలో అయినా ఉండాలి. ఇటీవల జరిగిన అస్సాం, గద్వాల్ సంఘటనలను బూచిగా చూపించి పెళ్లికి ఆడవారి మనస్తత్వమే అడ్డు అన్నట్టు చిత్రీకరిస్తున్నారు. కానీ ఆ నేరాల్లో నిందితులకు సహకరించింది మగవారే అన్న విషయాన్ని విస్మరిస్తున్నాం. పెళ్లి బంధంలోకి అడుగు పెట్టే ముందు మన మీద మనకు సంపూర్ణ అవగాహన ఉండాలి. ఎదుటివారినీ అర్థం చేసుకునే ఓర్పు కావాలి. – కెన్సారో వీవా, ఆంట్రప్రెన్యూర్ -
పాక్ నటిగా పరిచయమై టోకరా
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో సుదీర్ఘకాలం తర్వాత మాట్రిమోనియల్ ఫ్రాడ్ చోటు చేసుకుంది. సోషల్‌మీడియాలోని మాట్రిమోనియల్ గ్రూప్ ద్వారా పాకిస్థాన్‌కు చెందిన నటి ఫాతిమా ఎఫెండీగా పరిచయమైన సైబర్ నేరగాళ్లు పెళ్లి ప్రస్తావన తెచ్చారు. ఆపై తల్లికి అనారోగ్యం, వైద్య ఖర్చుల పేరు చెప్పి రూ.21.73 లక్షలు కాజేశారు. దీనిపై మంగళవారం కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బహదూర్‌పురా ప్రాంతానికి చెందిన యువకుడు (29) ఓ సోషల్‌మీడియా ప్లాట్ఫామ్లో ఉన్న మాట్రిమోనియల్ గ్రూపులో సభ్యుడిగా ఉన్నాడు. అతడికి 2023 మార్చిలో ఆ గ్రూపు ద్వారానే పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ నటి ఫాతిమా ఎఫెండీ పేరుతో సైబర్ నేరగాడు పరిచయం అయ్యాడు. తన ఖాతాలకు డీపీగా సదరు నటి ఫొటోను పెట్టుకోవడంతో అతను పూర్తిగా నమ్మేశాడు. కొన్నాళ్లు చాటింగ్ చేసిన తర్వాత ప్రేమ, పెళ్లి అంటూ అసలు కథ మొదలుపెట్టాడు. ఓ దశలో నగర యువకుడిని పూర్తిగా నమ్మించడానికి ఫాతిమా సోదరి అనీసా ఎం.హుండేకర్ పేరుతోనూ చాటింగ్ చేశాడు. ఈ సందర్భలోనూ తన సోదరిని మీకు ఇచ్చి వివాహం చేయడానికి అభ్యంతరం లేదంటూ పదేపదే ప్రస్తావించి పూర్తిగా ఉచ్చులోకి దింపారు. ఇలా కొంతకాలం చాటింగ్స్ చేసిన తర్వాత ఫాతిమాగా చెప్పుకున్న సైబర్ నేరగాడు తన తల్లి ఆరోగ్యం దెబ్బతిందని, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని చెప్పాడు. దానికి ఆధారంగా అంటూ కొన్ని నకిలీ పత్రాలనూ వాట్సాప్ ద్వారా షేర్ చేశాడు. వైద్యం కోసం భారీగా ఖర్చు అవుతోందని నమ్మబలికాడు. పాకిస్థాన్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం తన వద్ద నగదు అందుబాటులో లేదని సందేశం ఇచ్చాడు. వైద్య ఖర్చుల కోసం సాయం చేస్తే... కొంత తక్షణం, మరికొంత కొన్నాళ్లకు స్థిరాస్తులు విక్రయించి తిరిగి ఇచ్చేస్తానని చెప్పాడు. అవసరమైతే వడ్డీతో సహా చెల్లిస్తానని నమ్మబలికాడు. అతడిని పూర్తిగా నమ్మించడం కోసం తొలుత చిన్న మొత్తాలు బదిలీ చేయించుకుని, వాటిని కొన్ని రోజులకు తిరిగి చెల్లించేశాడు. తాను సంప్రదింపులు జరుపుతోంది, లావాదేవీలు చేస్తోంది పాకిస్థాన్‌కు చెందిన నటి ఫాతిమా ఎఫెండీతోనే అని నగర యువకుడు పూర్తిగా నమ్మేశాడు. దీంతో సైబర్ నేరగాళ్లు కోరినప్పుడల్లా నగదు బదిలీ చేస్తూ వెళ్లాడు. ఇలా దఫదఫాలుగా రూ.21,73,912 చెల్లించాడు. ఆ తర్వాత ఫాతిమాగా చెప్పుకున్న సైబర్ నేరగాడు యువకుడికి సంబంధించిన అన్ని సోషల్‌మీడియా హ్యాండిల్స్, ఫోన్ నెంబర్‌ను బ్లాక్ చేసేశాడు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నిందితుల ఫోన్ నెంబర్లు, సోషల్‌మీడియా ఖాతాలతో పాటు డబ్బు బదిలీ చేసిన బ్యాంకు అకౌంట్ల ఆ«ధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రీ మ్యారిటల్ కౌన్సెలింగ్: పెళ్లి పరీక్షకు ప్రిపేర్ అవ్వాలి
పెళ్లంటే పందిళ్లు, సందళ్లు, తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలే కాదు.. పరస్పర ప్రేమాభిమానాలు, గౌరవ, నమ్మకాలు కూడా! వీటిల్లో ఏది లోపించినా విడాకుల దారే కనిపిస్తోంది ఈ తరానికి! కారణం... ప్రీమ్యారిటల్ కౌన్సెలింగ్ లేకపోవడమే అంటున్నారు నిపుణులు. దాని అవసరం గురించే ఈ కథనం..పెళ్లి అంటే సినిమాల్లో చూపించినట్లో.. సోషల్ మీడియాలోపోస్ట్ చేసే ఫొటోలు, వీడియోల్లాగానో ఉండదు! రిలేషన్ షిప్స్‌లో ఎన్ని కొత్తట్రెండ్స్ కనిపిస్తున్నా పెళ్లంటే మన దగ్గర రెండు కుటుంబాలకు సంబంధించిన వ్యవహారమే ఇంకా! పెట్టుపోతల దగ్గర్నుంచి అప్పగింతల దాకా పెళ్లిలో ఉన్న తంతే దానికి నిదర్శనం! సంప్రదాయ వివాహ వ్యవస్థలో ఇమడాలనుకుంటున్న యూత్.. తమ నేపథ్యాల నుంచి జీవన శైలులు, విలువల దాకా రెండు కుటుంబాల మధ్య ఉన్న భిన్నత్వాన్ని అర్థం చేసుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి. ఇదివరకైతే ఉమ్మడి కుటుంబాలుండేవి.ఆ వాతావరణం, పెద్దవాళ్ల సుద్దుల ద్వారా అలాంటివన్నీ తెలిసేవి. ఇప్పుడు అన్నీ చిన్న కుటుంబాలే! అబ్బాయితోపాటు అమ్మాయీ ఆర్థికంగా స్వతంత్రురాలైంది. జెండర్ రోల్స్, కుటుంబ విలువలూ మారాయి. దాంతో సాంస్కృతిక సర్దుబాట్ల నుంచి ఆర్థిక వ్యవహారాలు, కంపాటబులిటీ దాకా అన్నీ సవాళ్లుగా పరిణమిస్తున్నాయి. విడాకుల సంఖ్యను పెంచుతున్నాయి. అది మన సంప్రదాయ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ క్రమంలో పెళ్లికి ముందే వాటన్నిటి గురించి ముఖ్యంగా కాపురంలో ఉండాల్సిన సర్దుబాట్లు, సమ్మతి, పరస్పర గౌరవం, బాధ్యత, నమ్మకం .. ఒక్కమాటలో చెప్పాలంటే వైవాహిక జీవితం మీద పూర్తి అవగాహనను కల్పించే ప్రీమ్యారిటల్ కౌన్సెలింగ్ అవసరమని చెపుతున్నారు నిపుణులు.ఇదీ చదవండి: Today tip : ఒళ్లంత తుళ్లింత.. ఈ టిప్స్ తప్పవు మరి! క్రాష్ కోర్స్..ప్రీమ్యారిటల్ కౌన్సెలింగ్ అనేది పెళ్లి బంధానికి క్రాష్ కోర్స్ లాంటిదంటున్నారు ఫ్యామిలీ కౌన్సెలర్స్. అన్నిరకాలుగా చూసి పెళ్లికి సిద్ధపడ్డా.. ఆ ప్రయాణం నల్లేరు మీద నడకేమీకాదు. కానీ సంసారం ఒడిదుడుకులకు లోనైప్పుడు జాగ్రత్తగా ఎలా ప్రయాణించాలో ఈ ప్రీమ్యారిటల్ కౌన్సెలింగ్ నేర్పుతుంది అంటున్నారు మానసిక విశ్లేషకులు. అందుకే ఈడు –జోడు, సంపాదన, ఆస్తి– పాస్తులు ఒక్కటే సరిపోవు. జీవిత భాగస్వామి బలాబలాల నుంచి పర్సనల్ – ప్రోఫెషనల్ లక్ష్యాలు, క్లిష్టపరిస్థితులను, భావోద్వేగపరమైన విభేదాలను హ్యాండిల్ చేసే తీరు దాకా, దైనందిన జీవితంలోని పనులు, ఆర్థిక బాధ్యతలు, జీవితభాగస్వామికున్న అంచనాల దాకా అన్నిటినీ పరిశీలించాలి. దానికి ప్రీమ్యారిటల్ కౌన్సెలింగ్ చోటిస్తుంది.చదవండి: కూతురి కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని తండ్రి సాహసం, వైరల్ వీడియోభేదాబీప్రాయాలుంటే సర్దుబాట్లకున్న మార్గాలను చర్చించేలా చేస్తుంది. బలహీనతలు సహా భాగస్వామిని అంగీకరించగలమా లేదా అనే స్టేబులిటీని పరీక్షించుకునే అవకాశాన్నిస్తుంది. మొత్తమ్మీద పెళ్లిలోనిప్రాక్టికల్ప్రాబ్లమ్స్ మీద అవగాహన కల్పిస్తుంది. దీనివల్ల పెళ్లి తర్వాత వచ్చే సమస్యలను వాగ్వాదాలతో కాకుండా చర్చలతో పరిష్కరించుకునే సహనం అలవడుతుందం టున్నారు ఫ్యామిలీ కౌన్సెలర్స్. ఈ కౌన్సెలింగ్‌లో కంపాటబులిటీ లేదని తేలితే ఆ సంబంధం పెళ్లిదాకా వెళ్లకుండా ఆగిపోతుంది. కాబోయే భాగస్వామిలో ఏమి చూడాలి, ఎలాంటి ఆలోచనా తీరున్న వ్యక్తి అయితే తనకు కుదురుతుంది లాంటివన్నీ తెలిసి భాగస్వామి ఎంపిక ఈజీ అవుతుంది.యువతా మొగ్గుచూపుతోంది..సామాజిక కట్టుబాటు కంటే కూడా మానసిక, భావోద్వేగ సరిజోడీని కోరుకుంటున్న ఈ తరం ప్రీమ్యారిటల్ కౌన్సెలింగ్ వైపు మొగ్గు చూపుతోంది. అవతలి వ్యక్తి గురించి సరైన అవగాహన లేకుండా పెళ్లిలోకి దిగి.. జోడీ కుదరక పరస్పర ఆరోపణలతో విడాకులకు వెళ్లే బదులు ఈ కౌన్సెలింగ్ ద్వారా పెళ్లి బంధాన్ని కాపాడుకునే ఎబిలిటీని పెంచుకోవడం మంచిది కదా అని అబీప్రాయ పడుతోంది. పరస్పర గౌరవం, నమ్మకంతో కూడిన బలమైన బం«ధాన్ని ఏర్పరచుకునే వీలును ప్రీమ్యారిటల్ కౌన్సెలింగ్ కల్పిస్తుందని సామాజిక విశ్లేషకులూ చెబుతున్నారు. – సరస్వతి రమపరస్పర గౌరవం లేకపోవడం, ఇరుకుటుంబ పెద్దల జోక్యం, ఆధిపత్యపోరు, అనుమానాలు, ఆర్థిక ఇబ్బందులు, వరకట్నం, గృహహింస వంటివి సగానికి పైగా విడాకుల కేసుల్లో సాధారణ కారణాలు. శృంగార సమస్యలు, సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవటం కూడా ఈ మధ్య ఎన్నో విడాకులకు కారణాలుగా చూస్తున్నాం. ఇలాంటి ఎన్నో అంశాలను ప్రీమ్యారిటల్ కౌన్సెలింగ్ ద్వారా సమస్యలుగా మారకుండా చూడొచ్చు. అయితే ఈ కౌన్సెలింగ్‌లోనే చట్టాలపైనా అవగాహన కల్పిస్తే హక్కుల గురించి తెలిసి, హక్కులు – వ్యక్తిగత స్వేచ్ఛ మధ్య ఒక బ్యాలెన్స్ క్రియేట్ అయ్యి.. కలహాలు, కలతల్లేకుండా కాపురాలు సజావుగా సాగే అవకాశం ఉంటుంది. – సుధేష్ణ మామిడి, హైకోర్ట్ న్యాయవాది -
కొడుకు స్నేహితుడితో పెళ్లి, త్వరలో బిడ్డ : వ్యాపారవేత్త లవ్ స్టోరీ వైరల్
50 ఏళ్ళ వయసులో ఒక చైనా మహిళ తన కొడుకు స్నేహితుడిని పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది. అంతేకాదు ఇపుడు ఒక బిడ్డకు తల్లి కాబోతోంది. ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ కథేంటో తెలుసుకుందాం పదండిఆగ్నేయ చైనాకు చెందిన ఈ-కామర్స్ వ్యవస్థాపకురాలు "సిస్టర్ జిన్". తన కొడుకు రష్యన్ క్లాస్‌మేట్‌ను పెళ్లాడింది. 30 ఏళ్ళ వయసులో మొదటి భర్తనుంచి విడాకులు తీసుకున్న ఆమె కొడుకు, కుమార్తెను స్వతంత్రంగా పెంచి పెద్ద చేసింది. సబర్బన్ విల్లా, చెఫ్, డ్రైవర్ ఇలా సకల హంగులతో అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడిపే ఆమె చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ డౌయిన్‌లో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది. 13,000 మందికి పైగా ఫాలోయర్లు ఉన్నారు.ఆరేళ్ల ప్రేమ తరువాత పిల్లల ఆమోదంతో కొడుకు కైకై రష్యన్ ఫ్రెండ్ డైఫును పెళ్లి చేసుకుంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం న్యూ ఇయర్ పార్టీ సందర్భంగా కొడుకు తన ఫ్రెండ్స్‌ను ఇంటికి ఆహ్వానించినపుడు డైఫుతో పరిచయం ఏర్పడింది. సిస్టర్ జిన్ వంటలకు ఆతిథ్యానికి ఫిదా అయిన డైఫు తన సెలవులను పొడిగించుకున్నాడు. చైనాలో చాలా సంవత్సరాలు గడిపిన తర్వాత చైనీస్ భాషను కూడా మాట్లాడే డైఫు, జిన్‌తో టచ్‌లో ఉంటూ, అనేక గిఫ్ట్‌లు ఇచ్చి పుచ్చుకున్నాడు. అచ్చమైన ప్రేమికుల్లాగానే వీరిద్దరి మధ్య అనేక సర్ప్రైజ్లు కూడా ఉన్నాయి. 20 ఏళ్ల వయసు తేడా, ఎత్తులో తేడా, గతంలో విఫలమైన వివాహం తదితర కారణాల రీత్యా జిన్ తొలుత వ్యతిరేకించినా, ఆ తరువాత ఇవేవీ వీరి ప్రేమకు అడ్డంకి కాలేదు. కొడుకు ప్రోత్సాహంతో అతడి ప్రేమను స్వీకరించింది. ఈ జంట ఈ ఏడాది ప్రారంభంలో అధికారికంగా తమ వివాహాన్ని నమోదు చేసుకున్నారు. చైనా అంతటా విస్తృతంగా పర్యటించారు. (యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్లతో ముప్పు ; షెఫాలీ ప్రాణం తీసింది అవేనా?)చివరికి జూన్8న తన ప్రెగ్రెన్నీని ప్రకటించింది. లేట్ ఏజ్ ప్రెగ్నెన్సీ ప్రమాదమే కానీ, డైఫుతో జీవితం చాలా బావుంది అంటూ సిస్టర్ జిన్ సోషల్ మీడియాలో ఒక వీడియో ద్వారా తన గర్భధారణను ప్రకటించింది ఆన్లైన్ వినియోగదారులు వీరి వివాహ చట్టబద్ధతను ప్రకశ్నించారు. అయితే కాలమే తమ ప్రేమను రుజువు చేస్తుందని సమాధానమిచ్చింది. పుట్టబోయే బిడ్డను స్వాగతించేందుకు ఉత్సాహంగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదీ చదవండి: Today Tip బరువు తగ్గాలంటే.. జామ ఆకూ ఔషధమే -
పెళ్ళైన ఇన్ని రోజులకి ఫోటోలు షేర్ చేసిన అఖిల్.. మ్యారేజ్ పిక్స్ వైరల్
-
పెళ్లి కోసం ‘రీల్స్’లో ఆస్తి చూపించాడు.. వివాహమైన రెండు గంటలకే..
జబల్పూర్: దేశంలో ఇటీవలి కాలంలో భర్తలపై హత్యలకు తెగబడుతున్న మహిళల ఉదంతాలు కలకలం రేపుతున్నాయి. ఇటువంటి ఘటనలను విన్నవారు విస్తుపోతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఇటువంటి ఉదంతమే చోటుచేసుకుంది. జబల్పూర్కు చెందిన ఇంద్ర కుమార్ తివారీ(45)ని పెళ్లి పేరుతో వంచించి, అతనిని అంతమొందించిన సాహిబా బానో అనే మహిళను ఉత్తరప్రదేశ్‌లో పోలీసులు అరెస్టు చేశారు.జూన్ 6న ఉత్తరప్రదేశ్‌లోని కుషినగర్‌లోని హటా ప్రాంతంలోని ఒక కాలువలో ఒక పురుషుని మృతదేహం బయటపడిన దరిమిలా ఈ దారుణం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ వ్యక్తిని కత్తితో పొడిచి హత్య చేశారు. తొలుత ఈ మృతదేహం ఎవరిదైనదీ తెలియలేదు. దర్యాప్తులో కొన్ని వారాల తర్వాత జబల్పూర్లో అదృశ్య వ్యక్తితో ఈ మృతదేహాన్ని పోల్చి చూడగా, అది ఇంద్ర కుమార్ తివారీ మృతదేహమని తేలింది.ఈ హత్య వెనుక సూత్రధారి సాహిబా బానో అని, ఆమె ఖుషీ తివారీగా పేరు మార్చుకుని ఇంద్రకుమార్‌ను ఆకట్టుకున్నదని పోలీసులు తెలిపారు. పెళ్లికాని ఇంద్రకుమార్ ఇటీవల తనకు గల భూమి వివరాలను చెబుతూ ఒక రీల్ చేసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిని చూసిన సాహిబా బానో ఆ భూమిని దక్కించుకోవాలనే ఆశతో, అతనిని ఆకట్టుకునేందుకు ప్రయత్నించింది.సోషల్ మీడియాలో అతనిని సంప్రదించి, తన పేరు ఖుషీ తివారీ అని పరిచయం చేసుకుని, గోరఖ్‌పూర్‌కు రావాలని ఆహ్వానించింది. తర్వాత తన ఇద్దరు సహచరుల సహాయంతో ఇంద్రకుమార్‌ను వివాహం చేసుకుంది. కొన్ని గంటల తర్వాత తివారీని హత్య చేసి, అతని మృతదేహాన్ని తన సహచారుల సాయంతో కాలువలో పడేసింది. ఈ కేసులో పోలీసులు సాహిబాతో ఆమెకు సహకరించిన ఇద్దరినీ అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆరేళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. తొలి ఫొటో షేర్ చేసిన లారెన్
ఆరేళ్ల డేటింగ్ తర్వాత ఆ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. అమెజాన్ వ్యవస్థాపకుడు.. అపర కుబేరుడు జెఫ్ బెజోస్, ప్రముఖ జర్నలిస్ట్ లారెన్ సాంచెజ్ వివాహం ఇటలీ చారిత్రక నగరం వెనిస్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లివేడుకకు హాలీవుడ్ నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి ప్రముఖ తారాగణమంతా హాజరైంది. పెళ్లి తాలుకా ఫస్ట్ ఫొటోను లారెన్ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ వ్యవస్థపాకుడిగా, ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా జెఫ్ బెజోస్(61) కొనసాగుతున్నారు. 2019 నుంచి జర్నలిస్ట్ అయిన లారెన్(55)తో ఆయన డేటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో 2023లో వీళ్ల ఎంగేజ్మెంట్ జరగ్గా.. శుక్రవారం(జూన్ 27న) వీళ్ల వివాహం జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా, ఆమె భర్త జారెడ్ కుష్నెర్, ప్రముఖ జర్నలిస్ట్ ఓప్రా విన్ఫ్రే, కిమ్ కర్దాషియన్, కోలే కర్దాషియన్, జోర్డాన్ రాణి రనియా తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు.వివాహం తర్వాత ఈ ఇన్‌స్టా పేజీకి తన పేరును లారెన్ శాంచెజ్ బెజోస్‌గా మార్చుకున్న ఆమె.. గతంలో తాను చేసిన పోస్టులన్నింటినీ డిలీట్ చేశారు. కేవలం పెళ్లి వేడుకకు సంబంధించిన రెండు పోస్ట్‌లను షేర్ చేశారు. జెఫ్ బెజోస్ (Jeff Bezos), లారెన్‌లు 2018 నుంచే డేటింగ్లో ఉన్నారు. 2019 వరకు ఆ విషయం బయటకు రాలేదు. అదే ఏడాది బెజోస్ తన భార్య మెకంజీ స్కాట్‌తో ఉన్న 25 ఏళ్ల బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. లారెన్తో ఎంగేజ్మెంట్ టైంలో 2.5 మిలియన్ డాలర్ల విలువైన వజ్రాల ఉంగరాన్ని అమెజాన్ అధిపతి ఆమెకు ఇచ్చినట్లు కథనాలు వెలువడ్డాయి.జెఫ్ బెజోస్ గురించి.. జెఫ్ బెజోస్ జనవరి 12, 1964న అల్బుకర్కీ, న్యూ మెక్సికో(అమెరికా) జన్మించారు. 1994లో బెజోస్ సెకండ్‌హ్యాండ్ పుస్తకాలు అమ్మే ఆన్లైన్ స్టోర్‌గా అమెజాన్‌ను ప్రారంభించారు. అదే ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థగా మారింది. ఆపై 2000లో బ్లూ ఆరిజిన్ అనే అంతరిక్ష సంస్థను స్థాపించారు. 2013లో వాషింగ్టన్ పోస్ట్ అనే ప్రముఖ వార్తాపత్రికను కొనుగోలు చేశారు. 2017 నుంచి 2021 వరకు ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఫోర్బ్స్ జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు.వైవాహిత జీవితానికొస్తే.. మెకెంజీ స్కాట్‌ను బెజోస్ 1993లో వివాహం చేసుకున్నారు, 2019లో ఈ జంట విడాకులు తీసుకుంది. మెకెంజీ స్కాట్ ఒక ప్రముఖ అమెరికన్ రచయిత్రి, దాతృత్వవేత్త. అమెజాన్ స్థాపన ప్రారంభ దశలో ఈమె కీలక పాత్ర పోషించారు. విడాకుల సమయంలో ఆమెకు సుమారు 38 బిలియన్ డాలర్లు విలువైన అమెజాన్ షేర్లు లభించాయి. విడాకుల అనంతరం మెకెంజీ స్కాట్ తన సంపదలో పెద్ద భాగాన్ని దాతృత్వానికి కేటాయిస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆమె ఇప్పటివరకు రూ. లక్ష కోట్లకు పైగా విరాళాలు ఇచ్చారామె. విద్య, ఆరోగ్యం, సామాజిక న్యాయం వంటి రంగాల్లో పనిచేస్తున్న 360 లాభాపేక్షలేని సంస్థలకు ఆమె సహాయం అందించారు. ఈ జంటకు నలుగురు పిల్లలు(ఒకరిని దత్తత తీసుకున్నారు). ఆపై లారెన్ సాంచెజ్‌తో ప్రేమలో మునిగిపోయిన ఆయన.. నిశ్చితార్థం చేసుకుని ఇప్పుడు వివాహం చేసుకున్నారు. లారెన్ వెండీ సాంచెజ్ (Lauren Wendy Sánchez).. వయసు 55. ఆమె ఒక టీవీ ప్రెజెంటర్, జర్నలిస్ట్, హెలికాప్టర్ పైలట్ కూడా. Extra", "Good Day LA వంటి షోలతో ఆమెకు పేరు దక్కింది. 2024లో ఆమె బ్లూ ఆరిజిన్ ద్వారా అంతరిక్షానికి వెళ్లిన తొలి మహిళలలో ఒకరిగా నిలిచారు. "Black Ops Aviation" అనే ఎయిర్ ఫిల్మింగ్ కంపెనీ ఉంది — ఇది మహిళల చేత నడపబడే మొదటి సంస్థలలో ఒకటి. ఫ్యాషన్ ఐకాన్‌గా ఆమె స్టైలిష్ దుస్తులు, డిజైనర్ బ్రాండ్స్ కోసం ప్రసిద్ధి. ఇటీవల కర్దాషియన్ కుటుంబం ఆమెకు విలాసవంతమైన UFO-ప్రేరిత బ్యాగ్ బహుమతిగా ఇచ్చారు.లారెన్ గతంలో ఎన్ఎఫ్ఎల్ మాజీ ఆటగాడు టోనీ గోంజాలెజ్‌తో డేటింగ్ చేసి ఓ కొడుకును కన్నారు. ఆపై హాలీవుడ్ టాలెంట్ ఏజెంట్ పాట్రిక్ వైట్సెల్ను వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ముగ్గురు పిల్లలు. పాట్రిక్ నుంచి విడాకులు తీసుకున్నాక ఆమె జెఫ్ బెజోస్‌తో డేటింగ్ మొదలు పెట్టారు. View this post on Instagram A post shared by Lauren Sánchez Bezos (@laurensanchezbezos) -
'నా జీవితంలో అత్యుత్తమమైన రోజు'.. పెళ్లి తర్వాత అఖిల్ పోస్ట్
అక్కినేని హీరో అఖిల్ ఇటీవలే ఓ ఇంటివాడయ్యారు. తన ప్రియురాలు జైనాబ్ రవ్దీని ఆయన పెళ్లాడారు. ఈ నెల ఆరో తేదీన వీరిద్దరు పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. జూబ్లీహిల్స్‌లో నాగార్జున నివాసంలో శుక్రవారం (జూన్ 6న) ఉదయం మూడు గంటలకు ఈ వివాహం జరిగింది. ఈ గ్రాండ్ వెడ్డింగ్ వేడుకలో టాలీవుడ్ తారలు, సన్నిహితులు సందడి చేశారు.పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా జరిగిన రిసెప్షన్ వేడుకలో సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు. తాజాగా పెళ్లి తర్వాత తొలిసారి తన మ్యారేజ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. నా జీవితంలో అత్యుత్తమ రోజులో కొన్ని క్షణాలను మీతో పంచుకోవాలని నా హృదయానికి అనిపించిందని క్యాప్షన్ రాసుకొచ్చారు. ఈ మధుర జ్ఞాపకాలు అందించిన వారికి ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు.కాగా.. గతేడాది అక్కినేని నాగచైతన్య వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. హీరోయిన్ శోభిత ధూలిపాళ్లను ఆయన పెళ్లాడారు. వీరి పెళ్లి ప్రకటన తర్వాతే అఖిల్ అక్కినేని ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. జైనాబ్ రవ్దీతో నిశ్చితార్థం జరిగినట్లు అక్కినేని నాగార్జున వెల్లడించారు. ఈ ఏడాదిలోనే వివాహబంధంలోకి అడుగుపెట్టారు. View this post on Instagram A post shared by Akhil Akkineni (@akkineniakhil) -
నీలిమ 12 పెళ్లిళ్ల వ్యవహారం.. సీఐ ఏమన్నారంటే?
సాక్షి, కోనసీమ జిల్లా: కోనసీమకు చెందిన నీలిమ 12 పెళ్లిళ్లు చేసుకుందనే ఆరోపణలపై రామచంద్రపురం సీఐ వెంకట నారాయణ స్పందించారు. నీలిమ పన్నెండు పెళ్లిళ్లు వ్యవహారంపై విచారణ చేస్తున్నామని తెలిపారు. తమ విచారణలో 12 పెళ్లిళ్లకు సంబంధించిన ఎటువంటి కచ్చితమైన ఆధారాలు ఇప్పటి వరకు లభ్యం కాలేదన్నారు. గుర్రం రాజేశ్వరి, నీలిమ మధ్య ఉన్న పాత గొడవలు నేపథ్యంలో ఇరువురు ఒకరిపై కేసులు పెట్టుకున్నారు. కోర్టుల్లో ఆ కేసుల్లో ఇప్పటికీ విచారణ కొనసాగుతోంది.వారిరువురి మధ్య ఉన్న ఆర్థిక పరమైన లావాదేవీలు కారణంగానే నీలిమపై అమలాపురం ఎస్పీ కార్యాలయంలో గ్రీవెన్స్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోందని సీఐ అన్నారు. పన్నెండు పెళ్లిళ్లు వ్యవహారంపై నీలిమ కూడా స్పందించింది. తాను పన్నెండు పెళ్లిళ్లు అంటూ తప్పుడు ప్రచారాలు, ఆరోపణలు చేస్తున్నారని.. తాను ఒక పెళ్లి మాత్రమే చేసుకున్నానని పేర్కొంది. మిగిలిన పదకొండు మంది ఎవరో నిగ్గు తేల్చాలని.. లేనిపక్షంలో ఆరోపణలు చేసిన వారిపై న్యాయ పోరాటం చేస్తానని తెలిపింది. -
నటి ఊర్మిళను రెండో పెళ్లి చేసుకున్న 60 ఏళ్ల సురేష్
-
మరో హనీమూన్ మర్డర్?: తెలుగు రాష్ట్రాల్లో కలకలం.. పెళ్లైన నెల రోజులకే భర్త హత్య?
సాక్షి,కర్నూల్: మేఘాలయ హనీమూన్ మర్డర్ (meghalaya honeymoon case) తరహాలో.. తెలుగు రాష్ట్రాల్లో మరో హనీమూన్ మర్డర్ కలకలం రేపుతోంది. పెళ్లైన నెలరోజులకే, కొత్త పెళ్లి కొడుకు దారుణంగా హతమయ్యాడు. ఈ హత్యకు పాల్పడింది బాధితుడి భార్యేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.11 రోజులకే హనీమూన్ పేరుతో ప్రియుడు రాజ్ కుష్వాహతో కలిసి భార్య సోనమ్ రఘువంశీ (Sonam Raghuvanshi)తన భర్త రాజా రఘువంశీని (raja raghuvanshi) మేఘాలయాలో హతమార్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే తరహా ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. అయితే, ఈ హనీమూన్ హత్య ప్రణాళికా హత్యా? లేక పాతకక్షల కారణంగా జరిగిందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.వివరాల్లోకి వెళితే.. జోగులాంబ గద్వాల జిల్లాలో అదృశ్యమైన యువకుడు నంద్యాల జిల్లా పాండ్యంలో హత్యకు గురయ్యాడు. మహబూబ్ నగర్ పట్టణం ఘంటవీధికి చెందిన జి.తేజేశ్వర్ లైసెన్స్ సర్వేయర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 17నుంచి తేజేశ్వర్ కనపకడపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తేజేశ్వర్ నంద్యాల జిల్లా పాణ్యం సమీపంలోని పిన్నాపురంలో దారుణ హత్యకు గురయ్యాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు తేజేశ్వర్‌కు కర్నూల్ చెందిన యువతితో వివాహం జరిగింది. నిందితుల్ని గుర్తించిన కఠినంగా శిక్షించాలని బాధితుని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.మే 18న బీచ్పల్లిలో తేజేశ్వర్‌కు కర్నూలు జిల్లాకు చెందిన యువతితో వివాహం జరిగింది. వివాహం జరిగిన రోజుల వ్యవధిలో భర్త తేజేశ్వర్ హత్యకు గురికావడం కలకలం రేపింది. తేజేశ్వర్ హత్యపై అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు అతని భార్యపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధితుడి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
ఇదెక్కడి ఆచారం రా నాయనా?.. హీరోకు ఏకంగా గిన్నె ఇచ్చారట!
బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా ఇటీవలే జాట్ మూవీలో కనిపించారు. సన్నీ డియోల్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతోంది. అయితే బాలీవుడ్లో పలు సినిమాల్లో మెప్పించిన రణ్‌దీప్ హుడా రెండేళ్ల క్రితం తన ప్రియురాలు లిన్ లైస్రామ్‌ను పెళ్లాడారు. 2023లో మణిపూర్‌కు చెందిన లిన్ లైస్రామ్‌ను సంప్రదాయ వేడుకలో వివాహం చేసుకున్నారు.తాజాగా ఆ పెళ్లి వేడుకలో తనకెదురైన విచిత్రమైన అనుభవాన్ని పంచుకున్నారు. మణిపూరి సంప్రదాయంలో జరిగిన ఈ వేడుకలో తనకు మూత్ర విసర్జన కోసం గిన్నె ఇచ్చారని రణదీప్ హుడా గుర్తు చేసుకున్నారు. ఒకరకంగా ఈ పెళ్లి తంతు తనకు అంతర్యుద్ధం లాంటి పరిస్థితిని తలపించేలా చేసిందని తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నారు.ఆ సంఘటనను రణ్‌దీప్ హుడా వివరిస్తూ..' పెళ్లిలో నాతో పాటు ఒక సహాయకుడు ఉన్నాడు. ఒక ట్యూటర్ లాగా. నేను నా వస్తువులను తలపై పెట్టుకున్న తర్వాత ఇక తలను వంచడం సాధ్యం కాదు. అప్పుడే నాకు ఒక గిన్నె, గొడుగు ఇచ్చారు. అప్పుడు మనల్ని ఓ ప్రదేశంలో ఉంచుతారు. అక్కడికి అందరూ వచ్చి మనల్ని చూడాలి. ఆ సమయంలో మనం చాలా గౌరవంగా కనిపించాలి. అయితే నేను గిన్నె దేనికోసం అని వారిని అడిగాను. మీరు మూత్ర విసర్జన చేయవలసి వస్తే.. మీకిచ్చిన ఆ గొడుగు తెరిచి అక్కనే మూత్ర విసర్జన చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు దేవుడు కాబట్టి అక్కడి నుంచి కదల్లేరన్నాడు. వాళ్ల సంస్కృతి చాలా కఠినమైనది. అలాగే చాలా సిస్టమాటిక్ కూడా " అని తనకెదురైన విచిత్ర అనుభవాన్ని వివరించారు.తన పెళ్లి గురించి మాట్లాడుతూ. 'నా పెళ్లి సమయంలో మణిపూర్‌లో ఒక పెద్ద సమస్య తలెత్తింది. కానీ మేమిద్దరం వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. అంతేకాకుండా ఒక అమ్మాయి ఇంట్లో వివాహం చేసుకోకపోతే అది కూడా వివాహమేనా అని అక్కడే వివాహం చేసుకుంటానని తాను దృఢంగా చెప్పాను. ఈ పెళ్లి విషయంలో తనకు అస్సాం రైఫిల్స్‌లో బ్రిగేడియర్‌గా ఉన్న తన స్నేహితుడు సాయం చేశాడు. మీరు రండి పెళ్లి నేను జరిపిస్తాను అన్నాడు. దీంతో మేము దాదాపు 10 నుంచి 12 మంది అక్కడికి చేరుకున్నాం.' అని తెలిపారు. అయితే మేము లిన్ లైస్రామ్ ఇంటికి చేరుకున్నప్పుడు మంచి శాఖాహారం తిన్నారని.. వివాహం చేసుకునే ముందు వారి దేవుళ్లందరినీ పూజించారని గుర్తు చేసుకున్నాడు. అలాగే నా స్నేహితులు కూడా వివాహానికి తీసుకొచ్చావా? పవిత్ర తీర్థయాత్రకు తీసుకువచ్చావా? అంటూ తనతో జోక్ చేశారని రణ్‌దీప్ హుడా వెల్లడించారు. -
Today tips పండంటి కాపురానికి పక్కా లెక్కలు, చిట్కాలు
ఇటీవలి కాలంలో వివాహ బంధం మూణ్ణాళ్ల ముచ్చటగా మిగిలిపోతున్న సంఘటనలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. రెండు మనసులు కలిసి కలకలం సంతోషంగా జీవించాల్సిన జంటలు పగలు ప్రతీకారాలతో రగిలిపోతున్నాయి. చివరికి ఒకర్నొకరు అంతం చేసుకుంటున్న ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. పెళ్లంటే నూరేళ్ల పంట అన్నట్టు దంపతులు హాయిగా, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుగా ఉండాలంటే ఏం చేయాలి? టిప్ ఆఫ్ ది డే లో భాగంగా అన్యోన్యమైన పండంటి కాపురానికి పాటించాల్సిన లెక్కలు, టిప్స్ తెలుసుకుందాం.ఏ బంధానికైనా విశ్వాసం, నమ్మకం బలమైన పునాదిగా ఉంటాయి. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, అనురాగం ఉన్నపుడు భార్యభర్తల బంధం కూడా నూరేళ్లు కొనసాగుతుంది. భార్యభర్తలంటే కలహాలు ఉండవని కాదు, బేధాభిప్రాయాలు ఉండవనీ కాదు. కానీ ఒకరి అభిప్రాయాల్ని ఒకరు గౌరవించుకోవాలి.ఒకరి పొరబాట్లను, తప్పులను అర్థం చేసుకోవాలి. నాదే పంతం, అన్నట్టుగా కాకుండా, సమయానికి తగు.. అన్నట్టు సర్దుకుపోవాలి. ఒక్కోసారి వెనక్కి తగ్గాలి. అవసరమైత రాజీ పడాలి. అదే అందమైన దాంపత్య జీవితానికున్న అర్థం పరమార్థం.చదవండి: నో డైటింగ్, ఓన్లీ జాదూ డైట్ : నెలలో 7 కిలోలు తగ్గడం పక్కా!మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా ఉండాలంటే కొన్ని చిట్కాలు పెళ్లికి ముందే అన్ని విషయాలు పరస్పరం చర్చించుకోవాలి.ఇద్దరి మధ్య బంధానికి అంగీకారం ఉందా లేదా అనేదాన్ని పరస్పరం గట్టిగా నిర్ధారించుకోవాలి. అందమైన బంధానికి కమిట్మెంట్, కమ్యూనికేషన్ కీలకం.నిజాయితీకి పెద్ద పీట వేయాలి. ఉద్యోగం, ఆస్తులు, సంపాదన ఇలాంటి విషయాలో అబద్ధాలకు తావుండ కూడదు.పెళ్లి తరువాత ఇంటా బయటా పనుల్లో ఒకరికొకరు సహకరించుకోవాలి. బడ్జెట్, ఇంటి ఖర్చులు సహా అన్ని విషయాల్లో పరస్పరం చర్చించుకొని నిర్ణయాలు తీసుకోవాలి. తప్పు ఒప్పులకు సమానంగా బాధ్యత తీసుకోవాలి. ఒకళ్ల గురించి ఒకరు పట్టించుకోవాలి. ఒకరికొకరు అండగా ఉండాలి. ముఖ్యంగా అనారోగ్యం విషయాల్లో ఒకరికొకరు శ్రద్ధపెట్టాలి. ‘నేను ఉన్నాను’ అనే భరోసా ఇచ్చుకోవాలిఎపుడూ సంసార సాగరంలో పడిపోకుండా అడపాదడపా, కనీసం పెళ్లి రోజులు, పుట్టిన రోజుల్లో అయినా ఇద్దరికీ నచ్చేలా కొంత సమయాన్ని గడపండి. ఇది జీవితంలో మరింత రీఛార్జ్ అవ్వడానికి ఉపయోగ పడుతుంది. ఇద్దరి మధ్య బంధం, ప్రేమ బలపడడానికి కూడా దోహదపడుతుంది.చివరికి ఏవైనా చిన్ని చిన్న మనస్పర్థలు వచ్చినా కూర్చుని చర్చించుకుంటే శ్రావణమేఘాల్లా ఇట్టే తొలగిపోతాయి. మనసులో పెట్టుకొంటే మరింత వేధిస్తాయి. నలుగురి ముందూ గొడవపడటం, ముఖ్యంగా పిల్లల ముందు వాగ్వాదానికి దిగడం అస్సలు చేయవద్దు. ఇది మీ జీవితంతోపాటు, పిల్లల జీవితాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. చదవండి: Today Tip : బాల్కనీ మొక్కలు.. అదిరిపోయే చిట్కా! -
‘నన్ను పెళ్లి చేసుకో’ అని కోరిన అభిమాని.. హీరోయిన్ ఫన్నీ రిప్లై
‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని ఓ అమ్మాయిని ఓ అబ్బాయి డైరెక్ట్‌గా అడిగితే తడబడే అమ్మాయిలే ఎక్కువగా ఉంటారు. కానీ మాళవికా మోహనన్లాంటి అమ్మాయిలైతే అదే స్పీడుతో సమాధానం ఇచ్చేస్తారు. సరదాగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో కబుర్లు చెప్పాలనుకున్నారు ఈ బ్యూటీ. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.ఓ అభిమాని ‘నన్ను పెళ్లి చేసుకుంటారా’ అని అడిగాడు... అంతే... ‘నాకు దెయ్యాలంటే భయం’ అని సూటిగా సుత్తి లేకుండా చెప్పేశారు మాళవిక. అలా ఎందుకు చెప్పారంటే, అతని ‘ఎక్స్’ ఖాతా పేరు ‘ఘోస్ట్’ అని ఉంది. ఆ పేరుని వాడుకుని, ఇలా సరదాగా మాళవిక చెప్పారు. రెబల్ స్టార్ ప్రభాస్ "రాజా సాబ్"తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది మాళవిక. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా టీజర్ లో మాళవిక స్టన్నింగ్ లుక్స్, బ్యూటిఫుల్ అప్పీయరెన్స్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. ఈ చిత్రం గురించి కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించింది. టీజర్ కు వస్తున్న రెస్పాన్స్ తో హ్యాపీగా ఫీలవుతున్నట్లు ఆమె తెలిపింది. ప్రభాస్ ను ఫస్ట్ టైమ్ సెట్స్ లో కలిసిన సందర్భాన్ని స్పెషల్ మూవ్ మెంట్ గా తాను ఫీలైనట్లు మాళవిక తెలిపింది. ప్రభాస్ ఎంతో గౌరవంగా, స్నేహంగా ఉంటారని, బాగా మాట్లాడతారని ఆమె పేర్కొంది. -
అమ్మాయిలూ.. బహుపరాక్!
వివాహం అంటే నూరేళ్ల పంట. తమ పిల్లలు నిండు నూరేళ్లు ఆనందదాయకమైన జీవితం గడపాలని ఇరు కుటుంబాలు అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటారు. ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాల గురించి ఆరాలు తీస్తారు. అబ్బాయికి మంచి ఉద్యోగం ఉండి, ఆ కుటుంబానికి సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నట్లయితే ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే ఈ ఇంటర్నెట్ జమానాలో ఇవి మాత్రమే సరిపోదని అంటోంది ఓ అమ్మాయి. ఆ యువతి పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వ్యక్తిది మంచి ఉద్యోగం. మంచి కుటుంబ నేపథ్యం. అందుకే ఇంట్లో వాళ్లు నన్ను బలవంతంగా పెళ్లికి ఒప్పించారు. అయితే అతడి గురించి కుణ్ణంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో.. నా స్నేహితుడి ఐడీతో ఆన్లైన్లో అతనితో చాట్ చేశా. అలా.. సోషల్ మీడియా ఫ్లాట్ఫారమ్ల ద్వారా అతను వ్యవహరించే తీరు బయటపడింది. అతని తీరు నన్ను కంగుతినేలా చేసింది. కాబోయేవాడు మంచి సంపాదనపరుడైతే చాలదు. సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తి అయినా కూడా సరిపోదు. అంతరంగికంగా అతడి తీరు ఎలా ఉంటుందనే చెప్పి డిజిటల్ తనిఖీలు కూడా అత్యంత ముఖ్యమే. నేను ఎదుర్కొన్న అనుభవాన్ని నా కుటుంబ సభ్యులకు వివరించి చెప్పా. అతనితో నా పెళ్లి రద్దు చేయించుకున్నా అని ఆమె ఆ పోస్టులో వివరించింది. అందువల్ల.. అమ్మాయిలూ బహుపరాక్. పెద్దలు కుదిర్చిన సంబంధాలపై గౌరవం ఉంటే సరిపోదు. నిండు నూరేళ్ల సంతోషంగా ఉండాలంటే అతని డబ్బు, స్టేటస్ కంటే అతడి వ్యక్తిత్వాన్ని బయటపెట్టే డిజిటిల్ తనిఖీ అనేది ఈ కాలంలో అత్యంత ముఖ్యం. అంటూ ఆ యువతి పోస్ట్ నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. ఈరోజుల్లో అబ్బాయిలు, అమ్మాయిలకు సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అయినవాళ్లతోనే, బంధువులతోనో అయిపోతోంది. కానీ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతకు అనుగుణంగా ఈ తరహా విచారణలోనూ మార్పులు కూడా తప్పనిసరి అని ఓ వ్యక్తి కామెంట్ చేశారు. సోషల్ మాధ్యమాల పరంగా అబ్బాయి మంచోడు అనుకుంటేనే.. పెళ్లికి సుముఖత చూపాలని, లేదంటే వద్దని సూచిస్తోంది ఆ అమ్మాయి. డిజిటల్ తనిఖీలు కూడా ముఖ్యమే అని మరో యువతి వ్యాఖ్యానించింది. (చదవండి: ' పచ్చందనమే పచ్చదనమే..' ఇంట్లోకి తెచ్చేద్దాం ఇలా..!) -
పెళ్లికి మంచి రోజులు లేవని రూంకు తీసుకెళ్లి..!
ముండ్లమూరు (కురిచేడు): పెళ్లి పేరుతో ఓ మహిళను మోసం చేసిన వ్యక్తిపై ముండ్లమూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి ముండ్లమూరు ఎస్సై కమలాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. ముండ్లమూరు మండలంలోని బట్లపల్లి గ్రామానికి చెందిన మహిళకు చీమకుర్తిలోని గాం«దీనగర్‌కు చెందిన వ్యక్తితో 9 సంవత్సరాల క్రితం వివాహమైంది. కొంతకాలం తర్వాత భార్యాభర్తల మధ్య మనస్పర్థలతో చట్టప్రకారం విడిపోయారు. దీంతో ఆ మహిళ బట్లపల్లి గ్రామంలోని పుట్టింటికి చేరింది. తన పెద్దమామ కుమారుడు యద్దనపూడి సుధాకర్ ఆమెను పెళ్లి చేసుకుంటానని వెంటపడ్డాడు. పెద్దల అంగీకారంతో వివాహం చేసుకునేందుకు ఆ మహిళ అంగీకరించింది. కానీ, ఇరువైపుల పెద్దలు అంగీకరించకపోవటంతో వివాహం నిలిచిపోయింది. కానీ, సుధాకర్ మాత్రం ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి నమ్మించాడు. ఎలాగైనా పెద్దల అంగీకారంతో వివాహం చేసుకుందామని చెప్పాడు. ఇక్కడి పెద్దలు అంగీకరించడం లేదని, హైదరాబాద్ వెళ్లి వివాహం చేసుకుందామని చెప్పడంతో అతనితో కలిసి ఆ మహిళ హైదరాబాదు వెళ్లింది. అక్కడ ఓ గది అద్దెకు తీసుకుని మంగళసూత్రం, మెట్టెలు తెచ్చి చూపించి గుడికి వెళ్లి పెళ్లిచేసుకుందామని చెప్పాడు. కానీ, మంచి రోజు కాదని, మంచి రోజు చూసి చేసుకుందామని చెప్పి తిరిగి రూంకు తీసుకొచ్చాడు. రూంలో మోజు తీర్చుకున్నాడు. ఊరు వెళ్లి పెళ్లి చేసుకుందామంటూ తిరిగి ఒంగోలు తీసుకొచ్చాడు. తన బంధువుల ఇంట్లో ఉంచి తల్లిదండ్రులు, బంధువులకు జరిగిన విషయం చెప్పాడు. వారంతా కలిసి గత ఏప్రిల్ 30న వివాహం చేయాలని నిర్ణయించి ఆ మహిళను ఆమె పుట్టింటికి పంపారు. ఆ తర్వాత ఏమైందోఏమోగానీ వివాహం చేసుకునేది లేదని, నీకు దిక్కున్నచోట చెప్పుకోమని, మళ్లీ ఫోన్ చేస్తే చంపేస్తానంటూ సుధాకర్ బెదిరించాడు. ఆ మేరకు బాధిత మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. సుధాకర్‌ను అతని తల్లిదండ్రులు, అన్న, మేనమామ దాచిపెట్టారని, సుధాకర్‌తో పాటు వారిపై కూడా చర్యలు తీసుకోవాలని బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. -
'చాలా అందంగా ఉన్నారు.. పెళ్లి ఎందుకు చేసుకోలేదు'.. ఛావా నటి ఆన్సర్ ఇదే!
30 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదా? ఇలాంటి ప్రశ్నలు సాధారణంగా వినిపిస్తుంటాయి. కెరీర్, జాబ్ అంటూ వివాహాలు చేసుకోకుండా చాలామంది సింగిల్స్‌గానే బతికేస్తున్నారు. ఇక సినీ ఇండస్ట్రీలో వాళ్లయితే ఏకంగా 40 పదుల వయస్సు దాటినా సింగిల్‌గానే ఉంటున్నారు. అలాంటి సల్మాన్ ఖాన్, సుస్మితా సేన్, త్రిష, ప్రభాస్ లాంటి అగ్రతారలేందరో ఉన్నారు. అలా సినీ ఇండస్ట్రీలో 40 పదుల వయస్సు దాటినా పెళ్లి చేసుకోకుండా ఉన్నవారిలో మరో బాలీవుడ్ భామ దివ్య దత్తా ఒకరు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె పెళ్లి ఎందుకు చేసుకోలేదనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చింది. ఇంతకీ ఆమె ఏమన్నారో తెలుసుకుందాం.దివ్య పెళ్లి బంధం గురించి మాట్లాడుతూ.. “మీరు మంచి భాగస్వామి దొరికితే వివాహం చేసుకోవడం చాలా బాగుంటుంది. అదే పెళ్లి లేకపోతే జీవితం ఇంకా అందంగా సాగుతుంది. అందుకే పెళ్లి చేసుకోవడం కంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మంచిది. నాపై చాలా మంది పురుషులు శ్రద్ధ పెడుతుంటారు. నేను వాటిని ఆస్వాదిస్తా అంతే. కానీ మీరు కనెక్ట్ అయితేనే రిలేషన్లో ఉండాలి. ఆ వ్యక్తి మీ చేయి పట్టుకోగలడని మీరు భావించాలి. ఒకవేళ అది జరగకపోతే నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. నా కోసం నేను ఉన్నా.' అని మాట్లాడింది.దివ్య దత్తా ఇంకా మాట్లాడుతూ.. "నేను పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. కేవలం ఎవరైనా నాతో ప్రయాణించగల సహచరుడిగా ఉండటానికి ఇష్టపడతా. అది లేకపోయినా నేను ఇప్పటికీ సంతోషంగా ఉన్నా. నా ప్రాణ స్నేహితుడు నాకు ఒక కోట్ పంపాడు. 'నువ్వు ఎందుకు ఒంటరిగా ఉన్నావు? నువ్వు అందంగా, ఆకర్షణీయంగా ఉన్నావు' కదా అని అడిగాడు. దానికి నేను ఆ స్టేజ్ ఎప్పుడో దాటిపోయానని చెప్పా. మంచి భాగస్వామి మీ జీవితంలోకి ప్రవేశించినప్పుడు మాత్రమే మీరు పరిపూర్ణం కావాలని అవసరం లేదు. గతంలో నాకు కూడా ఆ అపోహ ఉండేది." అని పెళ్లిపై తన అభిప్రాయం వ్యక్తం చేసింది బాలీవుడ్ భామ.ఇక సినిమాల విషయానికొస్తే దివ్య దత్తా చివరిసారిగా ఛావా చిత్రంలో కనిపించింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్కీ కౌశల్ , అక్షయ్ ఖన్నా, రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం దివ్య అర్జున్ రాంపాల్‌తో కలిసి నాస్టిక్లో కనిపించనుంది. ఈ సినిమాకు శైలేష్ వర్మ దర్శకత్వం వహించారు. -
నువ్వు నాకు వద్దు.. చచ్చిపో!
బోయినపల్లి (కరీంనగర్): భార్య వివాహేతర సంబంధంతో అవమానంగా భావించిన ఓ భర్త మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండలో మంగళవారం జరిగింది. తడగొండకు చెందిన హరీశ్ (36)కు కరీంనగర్ జిల్లా బద్దిపెల్లి గ్రామానికి చెందిన కావేరితో 2014లో వివాహం జరిగింది.వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు. హరీశ్ ఉపాధి కోసం దుబాయి వెళ్లాడు. కాగా అతడి భార్య వివాహేతర సంబంధం పెట్టుకోగా, ఈ విషయంలో ఫోన్లో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.ఈ నెల 8న హరీశ్ దుబాయి నుంచి తడగొండకు వచ్చాడు. ఈ క్రమంలో కావేరి ‘నువ్వు నాకు వద్దు.. చచ్చిపో.. నేను రక్షణ్‌తోనే ఉంటా’అని భర్తతో తేల్చిచెప్పింది.దీంతో మనస్తాపం చెందిన హరీశ్ మంగళవారం ఉదయం బయటకు వెళ్లి వస్తానని చెప్పి ఓ వ్యవసాయ బావిలో దూకాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఎస్సై ఆదేశాలతో బావిలోని నీటిని మోటార్లతో తోడేయగా, హరీశ్ మృతదేహం లభ్యమైంది. హరీశ్ తల్లి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కావేరి, రక్షణ్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజ్‌కుమార్ తెలిపారు. -
అఖిల్ పెళ్లి.. 33 ఏళ్లనాటి సీన్ రిపీట్.. అచ్చం నాన్నలాగే..
టాలీవుడ్ హీరో అఖిల్ అక్కినేని ఓ ఇంటివాడయ్యారు. ఈ నెల 6న తన ప్రియురాలి మెడలో మూడు ముళ్లు వేశారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జైనాబ్ రవ్దీని అఖిల్ పెళ్లాడారు. ఈ పెళ్లి వేడుకలో పలువురు సినీ ప్రముఖులు సందడి చేశారు. గతేడాది నవంబర్‌లో ఎంగేజ్మెంట్ చేసుకున్న వీరిద్దరు పెళ్లిబంధంలో కొత్త జీవితం ప్రారంభించారు.తాజాగా వీరి పెళ్లి వేడుక తర్వాత నాగార్జున పెళ్లి ఫోటోను వైరలవుతోంది. అఖిల్- జైనాబ్ పెళ్లిని నాగార్జున- అమల్ పెళ్లి (వీరి వివాహం 1992లో జరిగింది) ఫోటోతో పోలుస్తూ ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. అచ్చం నాన్న స్టైల్లోనే అఖిల్ పెళ్లి ఫోటో ఉందంటూ ఇద్దరి ఫోటోలను జత చేస్తూ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. చూసేందుకు రెండు ఫోటోలు ఓకేలాగా కనిపించడంతో అక్కినేని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అఖిల్ - జైనాబ్ కూడా నాగార్జున-అమల మాదిరిగానే కుర్తా, చీరను ధరించారు. అఖిల్ పెళ్లి వేళ నాగార్జున-అమల వివాహ వేడుక ఫోటోను చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.పెళ్లి తర్వాత టాలీవుడ్ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో రామ్ చరణ్, మహేష్ బాబు, యశ్‌తో సహా పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా.. 2016లోనే వ్యాపారవేత్త జీవీ కృష్ణారెడ్డి మనవరాలు శ్రియ భూపాల్‌తో అఖిల్‌కు నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత 2017లో ఊహించని విధంగా వివాహం రద్దైన సంగతి తెలిసిందే. #KingNagarjunaAmala #AkhilZainab Same pattern... ❤️ pic.twitter.com/R2z5vyH8uw— NagaKiran Akkineni (@NagaKiran60) June 8, 2025 -
నీకు రెండో పెళ్లి నేను చేస్తా!
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): భర్త రహస్యంగా రెండో వివాహం చేసుకుంటున్నట్లు తెలుసుకున్న భార్య.. నేరుగా కల్యాణమండపం చేరుకొని అతన్ని బయటకు ఈడ్చుకు వచ్చి చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పింది. ఈ ఘటన చిత్రదుర్గ లో ఆదివారం చోటుచేసుకుంది. చిక్కమగళూరు జిల్లా అరసీకెరె తాలూకా తిప్పఘట్టకు చెందిన కార్తీక్ నాయక్‌కు నాలుగేళ్ల క్రితం దావణగెరె జిల్లా న్యామతి తాలూకా ముశేనాళ గ్రామానికి చెందిన తనూజాతో వివాహం జరిగింది. అయితే భార్యకు తెలియకుండా రెండో వివాహానికి సిద్ధపడ్డాడు. చిత్రదుర్గలోని గాయత్రి కల్యాణ మండపంలో పెళ్లి ఏర్పాట్లు చేశారు. ఈ విషయం తనూజాకు తెలియడంతో ముహూర్తం సమయానికి వెళి కార్తీక్‌ను పెళ్లి పీటల మీద నుంచి ఈడ్చుకు వచ్చి చెప్పుతో చితకబాదింది. ఈ హఠాత్ పరిణామంతో పెళ్లికి వచ్చిన వారు కంగుతిన్నారు. సంఘటనకు సంబంధించి చిత్రదుర్గ పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
పెళ్లి పేరుతో మాయలేడీ మోసం
కృష్ణలంక(విజయవాడతూర్పు)/అనంతపురం: తనకు పెళ్లి కాలేదని చెప్పిన ఒక మహిళ, అమాయకపు యువకుడిని పెళ్లి చేసుకుని మోసం చేసి కనిపించకుండా పోయిన ఘటనపై ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసుల కథనం ప్రకారం సత్యసాయి జిల్లా కొత్తచెరువు గ్రామానికి చెందిన మైలవరపు రాజశేఖరరెడ్డి బెంగళూరులోని ఆటోమొబైల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కొన్ని నెలలుగా తన పెళ్లి కోసం మ్యారేజ్ బ్యూరోలను సంప్రదిస్తున్నాడు. ఈ క్రమంలో అతని స్నేహితుడైన కృష్ణారెడ్డి ద్వారా గుంటూరుకు చెందిన మల్లేశ్వరి, మంగళగిరికి చెందిన కొండలమ్మ అనే ఇద్దరు మధ్యవర్తులు పరిచయమయ్యారు. ఒక మంచి యువతిని ఇచ్చి పెళ్లి చేస్తామని మధ్యవర్తులు ఈ సందర్భంగా రాజశేఖరరెడ్డిని నమ్మించారు. కరుణావతి అనే యువతికి తల్లిదండ్రులు లేరని, ఎదురు కట్నంగా నగదు ఇస్తే పెళ్లి చేస్తామని నమ్మబలికారు. వారి మాటలను నమ్మిన రాజశేఖరరెడ్డి ఆ యువతి గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఎదురుకట్నంగా అతను మధ్యవర్తులకు రూ.2 లక్షలు చెల్లించి తన గ్రామంలోనే ఈ నెల ఒకటో తేదీన కరుణావతిని వివాహం చేసుకున్నాడు. ఈనెల 6న తన నాయనమ్మకు ఆరోగ్యం క్షీణించిందని, చనిపోయే పరిస్థితిలో ఉందని కరుణావతి భర్తకు చెప్పడంతో ఇద్దరు కలిసి బయలుదేరి శనివారం ఉదయం విజయవాడ బస్టాండ్‌కు చేరుకున్నారు.బస్టాండ్‌లో టాయిలెట్‌కు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన కరుణావతి ఎంతకూ తిరిగి రాలేదు. ఆమె సెల్‌ఫోన్‌కు ఫోన్ చేస్తే స్విచ్ఆఫ్ వచ్చింది. ఎంతసేపటికీ ‘తన భార్య’ తిరిగి రాకపోవడంతో రాజశేఖరరెడ్డి కృష్ణలంక పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు. వివరాలు తెలుసుకున్న సీఐ నాగరాజు, ప్రత్యేకంగా టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఆ టీమ్‌లతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ దర్యాప్తు కొనసాగించారు. అయితే కొండపల్లి ప్రాంతానికి చెందిన ఈ మాయ‘లేడీ’కి అప్పటికే వివాహం జరిగి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారని పోలీసుల విచారణలో తేలింది. దర్యాప్తు కొనసాగుతోంది. -
వ్యాపారవేత్తతో నటి పెళ్లి, ఐవరీ కలర్ లెహంగాలో బ్రైడల్ లుక్!
బాలీవుడ్ నటి, మోడల్ షాజాన్ పదమ్సీ (Shazahn Padamsee) తన ప్రియుడు, వ్యాపారవేత్త ఆశిష్ కనకియాని (Ashish Kanakia) పెళ్లాడింది. గత కొన్నేళ్లుగా డేటింగ్లో ఉన్న ఈ లవ్ బర్డ్స్ ఇప్పటికే ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ముంబైలోని కోర్ట్ యార్డ్ బి మారియట్‌లో జరిగిన ఒక ప్రైవేట్ వివాహ వేడుకలో వ్యాపారవేత్త ఆశిష్ కనకియాతో షాజాన్ పదమ్సీ వివాహం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో సందడి చేస్తున్నాయి. షాజాన్ - ఆశిష్ పెళ్లి ఫోటోలను షాజన్ స్నేహితులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. కొత్త జీవితానికి శుభాకాంక్షలు అంటూ అభిమానులంతా ఈ కొత్త జంటకు విషెస్ అందిస్తున్నారు.37 ఏళ్ల షాజాన్ పదమ్సీ - ఆశిష్ కనకియా ఎప్పటినుంచో డేటింగ్లో ఉన్నారు. గత ఏడాది నవంబరులో నిశితార్థం చేసుకున్నారు. తాజాగా అత్యంత గోప్యంగా మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. షాజన్ స్నేహితులు పెళ్లి వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అలాగే ఇన్స్టాస్టోరీలో ఒక వీడియోను షాజన్ కూడా పోస్ట్ చేసింది. కనకియా గ్రూప్ యాజమాన్యంలోని ముంబైలోని కోర్ట్ యార్డ్ బై మారియట్‌లో రెండు రోజుల పాటు జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారట. రేపు (జూన్ 7న) గ్రాండ్‌గా పార్టీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.సొగసైన ఐవరీ లెహెంగా, ఆఫ్‌వైట్ షేర్వానీషాజాన్ పాస్టెల్ , బ్లష్ పింక్ కలర్ ఐవరీ లెహంగాలో పెళ్లికూతురి ముస్తాబైంది. దానికి మ్యాచింగ్ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో జత చేసింది, తలపైనుంచి మ్యాచింగ్ దుపట్టాను అందంగా అలంకరించుకుంది. డైమండ్, నెక్లెస్, మాంగ్ టీకా, చెవిపోగులు, హెయిర్ స్టైల్, సింపుల్ మేకప్‌తో తన బ్రైడల్ లుక్‌ను పూర్తి చేసింది. మరోవైపు, ఆశిష్ సాంప్రదాయ ఆఫ్-వైట్ టెక్స్చర్డ్ ఎంబ్రాయిడరీ షేర్వానీ ధరించాడు.హౌస్‌ఫుల్ 2', 'ఆరెంజ్', 'కనిమోలి', 'మసాలా', 'పాగల్పన్ నెక్స్ట్ లెవల్', 'డిస్కో వ్యాలీ' తదితర బాలీవుడ్ మూవీల్లో నటించింది. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్‌తో కలిసి రాకెట్ సింగ్ , హౌస్‌ఫుల్ 2 సినిమాలతో బాగా పాపులర్ అయింది. ఈమె మంచి గాయని కూడా. 2010లో రిలీజైన టాలీవుడ్ మూవీ ఆరెంజ్ సినిమాలో కూడా నటించింది. బాలీవుడ్ ప్రముఖ గాయని షారన్ ప్రభాకర్, గాంధీ సినిమాలో జిన్నా పాత్రలో మెప్పించిన నటుడు దివంగత అలిక్ పదమ్‌సీల కుమార్తె షాజన్. షాజాన్ భర్త ఆశిష్ కనకియా గ్రూప్ డైరెక్టర్ , మూవీ మాక్స్ సినిమా సీఈఓ. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా జరిగిన వీరి పరిచయం ప్రేమ,పెళ్లికి దారి తీసాయి.ఇదీ చదవండి: రూ. 5 కోట్ల ఎఫ్డీలు కొట్టేసింది..మునిగింది : ఐసీఐసీఐ అధికారి నిర్వాకం -
అక్కినేని ఇంట పెళ్లి సందడి
-
Trinamool: ఎంపీ రహస్య వివాహం
-
ఎంపీ మహువా మొయిత్రా రహస్య వివాహం
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) లోక్‌సభ ఎంపీ మహువా మొయిత్రా(Mahua Moitra) మరోమారు వార్తల్లో నిలిచారు. ఆమె మే మూడవ తేదీన రహస్య వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని టీఎంసీగానీ, మహువా మొయిత్రా గానీ వెల్లడించలేదు. ఈ విషయమై మీడియా ప్రముఖ టీఎంసీ ఎంపీని అడుగగా, ఆయన తనకు తెలియదని చెప్పారు. The other Operation Sindoor: Trinamool MP @MahuaMoitra marries in quiet wedding in Germany https://t.co/AALx1OgY5Y pic.twitter.com/Yugc1cWsfV— The Telegraph (@ttindia) June 5, 2025అయితే వార్తా సంస్థ ‘ది టెలిగ్రాఫ్’ ప్రచురించిన ఫోటోలో మహువా మొయిత్రా బంగారు రంగు చీరలో మెరిసిపోతూ, భర్త పక్కన కనిపించారు. వారి వివాహం జర్మనీలో జరిగినట్టు తెలుస్తోంది. మహువా మొయిత్రా భర్త పేరు పినాకి మిశ్రా. ఆయన బిజు జనతాదళ్‌కు చెందిన నేత. పూరీ లోక్‌సభ సభ్యునిగా పనిచేశారు. 50 ఏళ్ల మహువా మొయిత్రా గతంలో డానిష్ ఫైనాన్షియర్ లార్స్ బ్రోర్సన్‌ను వివాహం చేసుకున్నారు. తరువాత విడాకులు తీసుకున్నారు. అనంతరం ఆమె ప్రముఖ న్యాయవాది జై అనంత్ దేహద్రాయ్‌తో దాదాపు మూడేళ్లు రిలేషన్షిప్లో ఉన్నారు. గతంలో బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే.. మహువా డబ్బులు తీసుకొని లోక్‌సభలో ప్రశ్నలు అడిగారని ఆరోపించారు. దీంతో ఈ వ్యవహారంలో నిజానిజాలను నైతిక విలువల కమిటీ తేల్చిచెప్పింది. ఆ దరిమిలా మహువా లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేసి, సభ నుంచి బహిష్కరిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఇది 2023 డిసెంబర్లో జరిగింది. ఇది కూడా చదవండి: అన్నివైపుల నుంచి తోపులాట.. ప్రత్యక్ష సాక్షులు -
ఆలుమగలకు 5 కారణాలే విలన్లు
పెళ్లి భార్యాభర్తలను దగ్గరకు చేయాలి. రోజులు గడిచే కొద్ది అనుబంధం పెరగాలి. ఆకర్షణ నిలవాలి. ‘కాని నేడు చాలా పెళ్లిళ్లలో ఆలుమగల మధ్య నిర్లిప్తత చోటు చేసుకుంటోంది’ అంటున్నారు డాక్టర్ సప్నా శర్మ. పూణెలో చాలా గుర్తింపు పొందిన ఈ మేరేజీ కౌన్సిలర్ ఆలుమగల మధ్య ఆకర్షణ నశించడానికి ఐదు ముఖ్యకారణాలను తెలియచేస్తున్నారు అవి...‘గతంలో మనకున్న ఉమ్మడి కుటుంబాలు పిల్లలకు పాఠశాలలుగా ఉండేవి. పెద్దవాళ్లు కష్టసుఖాల్లో ఎలా సర్దుకుపోయేవారో, ఒకరికి ఒకరు సపోర్ట్ ఎలా ఇచ్చేవారో గమనించి పిల్లలు నేర్చుకునేవారు. కాని ఇవాళ న్యూక్లియర్ ఫ్యామిలీలు ఉన్నాయి. పైగా పిల్లలకు తల్లిదండ్రులు చదువు తప్ప వేరే ఏ విషయం మీద ధ్యాస పెట్టనీకుండా చేస్తున్నారు. చదువు పూర్తయ్యి ఉద్యోగం రాగానే పెళ్లి చేస్తున్నారు. పెళ్లి గురించి, భార్యాభర్తలు ఉండవలసిన తీరు గురించి, పెళ్లి డిమాండ్ చేసే బాధ్యతల గురించి, అత్తమామలు ఇతర అనుబంధాలు తెచ్చే ఒత్తిడి గురించి ఏమాత్రం తెలియచేయకుండా సంసారంలో పడేస్తే వాళ్లు కన్ఫ్యూజ్ కారా?’ అంటున్నారు డాక్టర్ సప్న శర్మ.నాగపూర్‌లో జన్మించి ఐ సర్జన్‌గా పని చేసి తర్వాతి రోజుల్లో పర్సనాలిటీ కోచ్‌గా, మోటివేషనల్ స్పీకర్‌గా, మేరేజ్ కౌన్సిలర్‌గా గుర్తింపు పొందిన సప్న శర్మ భారతీయ ఆలుమగల మధ్య వస్తున్న ఘర్షణలకు కారణాలను అర్థం చేసుకుంటూ వాటిని తిరిగి సమాజానికి చెప్పి హెచ్చరికలు చేస్తున్నారు. ఆలుమగల మధ్య జీవితం నిస్సారం అనిపించడానికి ఐదు కారణాలను ఆమె తెలియ చేస్తున్నారు. అవి ఇవి:1. అనురాగానికి ఆటంకాలు పెళ్లయిన స్త్రీ, పురుషులు ఒకరితో మరొకరు ప్రేమగా బహిరంగంగా కనిపించడంపై మన సమాజంలో కనపడని నిషేధాజ్ఞలు ఉన్నాయి. పెళ్లయి జీవితం మొదలుపెట్టాక ఇంట్లో అత్తామామలో తల్లిదండ్రులో ఉంటే భార్యాభర్తలు సరదా భాషణం చేయడం, ఒకరినొకరు తాకడం తప్పు అనే భావన ఇంజెక్ట్ చేస్తారు. దాంతో ప్రేమగా ఉండటం ఏ అర్దరాత్రో తలుపు చాటున చేయవలసిన పనిగా మారుతుంది. అసలు భార్యభర్తలు తమ ప్రేమను ప్రదర్శించడానికి అవకాశమే లేనప్పుడు ప్రేమ జనించే అవకాశం ఎక్కడ? ఇది ఒక పెద్ద సమస్య.2. దొరకని ఏకాంతంభారతదేశంలో పెళ్లయ్యాక యువ జంట ఎక్కడికి ఆఖరుకు సినిమాకు వెళ్లాలన్నా ఎవరో ఒకరు తోడు ఉంటారు. కలిసి ఊళ్లకు, పుణ్యక్షేత్రాలకు వెళ్లాల్సిందే తప్ప వీరు తమ మానామ తాము వెళ్లడం దోషంగా చెప్పబడుతుంది. ఇక ఒకరిద్దరు పిల్లలు పుట్టాక భార్యాభర్తలు ఆ పిల్లల్ని ఎక్కడైనా వదిలి నాలుగు రోజులు విహారంగా వెళ్లడం దాదాపు చోద్యంగా, పాపంగా పరిగణించబడుతుంది. భార్యాభర్తలు మనసు విప్పి మాట్లాడుకునే, ప్రేమను పెంచుకునే అవకాశాలే లేని కుటుంబ వ్యవస్థ వల్ల వారి మధ్య బంధం తప్ప ప్రేమతో కూడిన బంధం ఉండటం లేదు.3. ఆసక్తి లేకపోవడంవీటన్నింటి దరిమిలా భార్యాభర్తలకు ఒకరిపై మరొకరికి ఆసక్తి పోతోంది. చక్కగా తయారవడం అనేది బయటకు వెళ్లేటప్పటి సంగతిగా భావిస్తారు. మంచి బట్టలు, నగలు అన్నీ బయట వారికి చూపించడానికే. ఇంట్లో ఉన్నప్పుడు దారుణమైన బట్టలతో, సింగారం లేకుండా భార్య భర్తకు కనపడుతుంటుంది. భర్త కూడా ఏ పైజామో వేసుకుని తిరుగుతుంటాడు. ఇలాంటి అవతారాల్లో భార్యాభర్తలు ఒకరి ఎదుట మరొకరు ఉంటే ఎందుకు ఆకర్షణ కలుగుతుంది?4. ఫిట్నెస్ను పట్టించుకోకపోవడంపెళ్లి అయ్యే వరకు అబ్బాయి, అమ్మాయి ఎంతో కొంత ఫిట్నెస్ గురించి దృష్టి పెట్టినా మన దేశంలో పెళ్లయ్యాక ఆకారాలు ఎలా ఉన్నా పర్లేదులే అనే నిర్ణయానికి వస్తారు. ఫిట్నెస్ను పూర్తిగా వదిలేస్తారు. స్త్రీలు పిల్లలు పుట్టాక తిరిగి శరీరాన్ని ఫిట్‌గా మార్చుకుందాం అనుకోరు. పురుషులు బరువు పెరిగి, బొజ్జలు పెంచి వికారంగా ఉన్నామని తెలిసినా వ్యాయామం మాట ఎత్తకుండా ఉంటారు. ఇలా ఉండటం వల్ల భార్యాభర్తలు లోలోపల ఒకరిపై మరొకరు అసంతృప్తిని పెంచుకుంటారు.5. ఒకరి ఆసక్తులు మరొకరివైభార్యాభర్తలు భౌతిక ఆకర్షణను కోల్పోయినా మానసికంగా దగ్గరగా ఉంటే చాలా సమస్యలు పోతాయి. భర్త ఆసక్తులు భార్యకు పట్టకపోవడం భార్య ఇష్టాలు భర్తకు రుచించకపోవడం ఇద్దరూ కలిసి మాట్లాడుకునే ఉమ్మడి అభిరుచులే లేకపోతే వారి మధ్య అనుబంధం పెనవేసుకోవడం కష్టమవుతుంది. భర్తను భార్య మెచ్చుకోకపోగా సూటిపోటి మాటలు అనడం, భార్యను కాంప్లిమెంట్ చేయడం... హగ్ చేసుకోవడం భర్త ‘అహాని’కి అడ్డుగా మారడం... ఇవి మానసిక బంధానికి విఘాతంగా మారుతున్నాయి.భార్యాభర్తలే కాదు ఇంటి పెద్దలు కూడా ఈ కారణాలను కొడుకు కోడలు, కూతురు అల్లుళ్ల మధ్య గమనిస్తూ సరి చేయడానికి చేసుకోవడానికి ప్రయత్నించాలి.అప్పుడే వివాహం నూరేళ్ల బంధం అవుతుంది. -
జనవరిలో నిశ్చితార్థం.. పెళ్లి కూతురు కాబోతున్న ఆరెంజ్ నటి..!
ప్రముఖ బాలీవుడ్ నటి షాజన్ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టనుంది. ప్రముఖ వ్యాపారవేత్తతో ఏడడుగులు వేయనుంది. వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్ ఈనెల 5న జరగనుంది. ఈనెల 3న హల్దీ వేడుకతో షాజన్ పదమ్సీ పెళ్లి సందడి మొదలు కానుంది. ఈ ఏడాది జనవరి 20న ఆశిశ్ కనకియాతో ఎంగేజ్మెంట్ చేసుకున్న ముద్దుగుమ్మ.. తాజాగా పెళ్లి చేసుకోనుంది. ఇవాళ సాయంత్రం హల్దీ వేడుకలో పెళ్లి సందడి షూరూ కానుంది.జూన్ 5న పెళ్లి వేడుక తర్వాత స్నేహితుల, సన్నిహితుల కోసం ముంబయిలో గ్రాండ్‌గా సంగీత్‌తో పాటు రిసెప్షన్ కూడా నిర్వహించనున్నారు. కాగా.. షాజన్ పదమ్సీ, ఆశిశ్ కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్నారు. ఆ తర్వాత జనవరి 2025లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆమెకు కాబోయే భర్త ఆశిశ్ మూవీమాక్స్ సినిమాస్ సీఈవోగా పనిచేస్తున్నారు.(ఇది చదవండి: ఐపీఎల్ ఫైనల్.. వార్-2 టీమ్ స్పెషల్ సర్ప్రైజ్!)ఇక షాజన్ సినీ కెరీర్ విషయానికొస్తే హౌస్‌ఫుల్-2 చిత్రంతో బాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకుంది. అంతకుముందు రాకెట్ సింగ్: సేల్స్‌మ్యాన్ ఆఫ్ ది ఇయర్, దిల్ తో బచ్చా హై జీ లాంటి చిత్రాల్లో నటించింది. అంతే కాకుండా తెలుగులో రామ్ చరణ్ నటించిన ఆరెంజ్, వెంకటేశ్ సినిమా మసాలాలోనూ కీలక పాత్రల్లో మెప్పించింది. ఆ తర్వాత తమిళంలోనూ కనిమొజి అనే సినిమాలో కనిపించింది. ఇటీవల జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించిన వెబ్ సిరీస్ హై జునూన్లో నటించింది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించనుంది. -
కుమార్తెను అమెరికా నుంచి రప్పించాలని తండ్రి వేడుకోలు
పంజగుట్ట(హైదరాబాద్): భర్త పెట్టే చిత్రహింసలు భరించలేక, అమెరికాలో చిక్కుకున్న తన కుమార్తెను కాపాడాలని ఓ తండ్రి వేడుకుంటున్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితుడు గులాం అఫ్జల్, న్యాయవాది విజయ్‌కుమార్ మాట్లాడుతూ... తన కూతురు ఫాతిమా హస్నాకు 2007లో గుల్బర్గాకు చెందిన డబీరుద్దీన్ అనే డాక్టర్‌తో వివాహం జరిగిందన్నారు. వివాహం అయిన తరువాత అమెరికాకు వెళ్లిపోయి అక్కడ 58 రోజులపాటు బాగానే ఉన్నారని తెలిపారు. తరువాత డబీరుద్దీన్ కేవలం అమెరికా వెళ్లేందుకే ఫాతిమాను వివాహం చేసుకున్నట్లు తెలియడంతో ఇద్దరి మధ్య తగాదాలు జరిగాయని తెలిపారు. దీంతో వెంటనే ఆమె భారతదేశానికి వచ్చి అతనిపై కేసులు వేసి చట్టపరంగా విడాకులు తీసుకున్నారని తెలిపారు. ఉద్యోగ నిమిత్తం తిరిగి అమెరికాకు వెల్లిన ఫాతిమాను డబీరుద్దీన్ వేధింపులకు గురిచెయ్యడమే కాకుండా ఆమెపైనే తనను మోసం చేసి అమెరికాకు తీసుకువచ్చిందిని అమెరికాలో తప్పుడు కేసులు పెట్టాడని తెలిపారు. దీంతో అమెరికా చట్టం ప్రకారం ఆమెపై కేసు నమోదు చేసి డబీరుద్దీన్కే భరణం ఇవ్వాలని చెప్పడంతో గత 10 సంవత్సరాల నుంచి ఫాతిమా ఉద్యోగం చేసుకుంటూ భరణం ఇస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెపై కేసులు ఉండటంతో ఇండియాకు రాలేని పరిస్థితి ఉందని అటు భరణం ఇవ్వలేక తన పింఛన్ డబ్బులు కూడా పంపించాల్సి వస్తుందని గులాం అఫ్జల్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తన కుమార్తెను భారత్‌కు రప్పించాలని, అలానే డబీరుద్దీన్పై కూడా ఇక్కడ తన కూతురు పెట్టిన కేసులు ఉన్నందున అతన్ని కూడా ఇండియాకు రప్పించాలని విజ్ఞప్తి చేశారు. -
జోదా- అక్బర్‌ల పెళ్లి పచ్చి అబద్ధం: రాజస్థాన్ గవర్నర్
జైపూర్: అక్బర్‌కు సంబంధించిన చరిత్రలోని ఒక అంశంపై రాజస్థాన్ గవర్నర్ హరిబావ్ బగాడే(Rajasthan Governor Haribav Bagade) సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రిటిష్ చరిత్రకారుల ప్రభావం కారణంగా నాడు జోధా బాయి- మొఘల్ చక్రవర్తి అక్బర్‌ల వివాహంతో సహా పలు ఉదంతాలు భారతదేశ చరిత్రలో తప్పులతో నమోదయ్యాయని గవర్నర్ హరిభావ్ పేర్కొన్నారు.రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో గవర్నర్ బగాడే మాట్లాడుతూ అక్బర్ నామాలో జోధా.. అక్బర్‌ల వివాహానికి సంబంధించిన ప్రస్తావన లేదన్నారు. అయితే జోధా - అక్బర్లు వివాహం చేసుకున్నారని చెబుతారన్నారు. ఈ కథనంపై ఒక సినిమా కూడా రూపొందించారన్నారు. చరిత్ర పుస్తకాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయని, అయితే అది అబద్ధమని గవర్న్‌ర్ పేర్కొన్నారు.భర్మల్ అనే రాజు ఒక పనిమనిషి కుమార్తెను దత్తత తీసుకుని, ఆమెను అక్బర్కిచ్చి వివాహం జరిపించారంటూ గవర్నర్ చేసిన వ్యాఖ్యలు.. 1569లో అమర్ పాలకుడు భర్మల్ కుమార్తె - అక్బర్‌ల వివాహానికి సంబంధించిన చారిత్రక కథనంపై మరోమారు చర్చను లేవనెత్తాయి. బ్రిటిష్ వారు మన దేశానికి చెందిన వీరుల చరిత్రను మార్చివేశారు. కొంతమంది భారతీయ రచయితలు బ్రిటిష్ వారికి ప్రభావితమయ్యారని గవర్నర్ పేర్కొన్నారు.రాజ్‌పుత్ పాలకుడు మహారాణా ప్రతాప్(Maharana Pratap).. అక్బర్‌కు సంధిని కోరుతూ లేఖ రాశాడనే చారిత్రక వాదనను కూడా ఆయన ఖండించారు. మహారాణా ప్రతాప్ తన ఆత్మగౌరవం విషయంలో ఎప్పుడూ రాజీపడలేదన్నారు. చరిత్రలో అక్బర్ గురించి అధిక సమాచారం ఉన్నదని, మహారాణా ప్రతాప్ గురించి తక్కువగా ఉన్నదని ఆయన పేర్కొన్నారు. అయితే పరిస్థితి ఇప్పుడు మెరుగుపడుతోందని అన్నారు. నూతన జాతీయ విద్యా విధానంలో మన సంస్కృతిని, అద్భుతమైన చరిత్రను కాపాడుకుంటూ పాఠ్యపుస్తకాలు సిద్ధం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని గవర్నర్ హరిభావ్ బగాడే పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: పాక్ నష్టాలకు కొలంబియా సంతాపమెందుకు?: శశిథరూర్ -
అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి.. అఖిల్- జైనాబ్ పెళ్లి తేదీ ఫిక్స్!
అక్కినేని వారి ఇంట త్వరలోనే పెళ్లి సందడి మొదలు కానుంది. గతేడాది నిశ్చితార్థం చేసుకున్న అక్కినేని అఖిల్ ఓ ఇంటివాడు కాబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఆయన త్వరలోనే ప్రియురాలి మెడలో మూడు ముళ్లు వేయనున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ వినిపిస్తోన్న టాక్ ప్రకారం వచ్చేనెలలోనే అక్కినేని ఇంట పెళ్లిభాజాలు మోగనున్నాయి. అఖిల్ తన ప్రియురాలు జైనాబ్ రవ్దీని జూన్ 6న పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగానే వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది.కాగా.. గతేడాది అక్కినేని నాగచైతన్య వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. హీరోయిన్ శోభిత ధూలిపాళ్లను ఆయన పెళ్లాడారు. వీరి పెళ్లి ప్రకటన తర్వాతే అఖిల్ అక్కినేని ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. జైనాబ్ రవ్దీతో నిశ్చితార్థం జరిగినట్లు అక్కినేని నాగార్జున వెల్లడించారు. -
అక్కినేని వారి పెళ్లి పిలుపు
-
జూన్-6న అఖిల్ మ్యారేజ్
-
44 ఏళ్ల తర్వాత తల్లి చెంతకు కూతురు..! ట్విస్ట్ ఏంటంటే..
ఇక కనపడదు అనుకున్న కూతురు కళ్ల ముందు ప్రత్యక్షమైతే ఆ తల్లి ఆనందం మాటలకందనిది. ఏ దేవుడి ఇచ్చిన వరం అనే భావన కచ్చితంగా కలుగుతుంది. అచ్చం అలాంటి అనుభవమే ఎదురైంది ఈ తల్లికి.దక్షిణకొరియాకి చెందిన హాన్ టే మే 1975లో ఆరేళ్ల కూతురుని ఇంటి వద్ద వదిలేసి మార్కెట్‌కి వెళ్లింది. పని ముగించుకుని ఇంటికి తిరిగి రాగానే కూతురు క్యుంగ్-హా అదృశ్యమై ఉంది. దాంతో ఆమె కూతురు కోసం గాలించిన ప్రాంతం అంటూ లేకుండా కళ్లు కాయలు కాచేలా వెతికింది. అయితే ప్రయోజనం శూన్యం. ఇక విసిగి వేసిరిపోయినా ఆమె ..ఇక తన కూతురు కనిపించిదనుకుని ఆశలు వదులేసుకుంది. అయితే 2019లో అనూహ్యంగా కమ్రా అనే డీఎన్ఏ మ్యాచ్ ద్వారా తన కూతురుని తిరిగి పొందగలిగింది. ఇది విదేశీ కొరియన్ దత్తత తీసుకున్న వారి డీఎన్ఏతో జన్మనిచ్చిన తల్లిదండ్రులను అనుసంధానం చేసే కమ్యూనిటీ. దీని సాయంతో తన బిడ్డను కలుసుకుంది. కాలిఫోర్నియాలో నర్పుగా పనిచేస్తున్న బెండర్తో హెన్ టే డీఎన్ఏ మ్యాచ్ అయ్యింది. గుర్తింపు నిర్థారించుకోవడానికి బెండర్, హాన్టే ఫోన్ కాల్లో ఇరువురు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత బెండర్ సియోల్‌కి వెళ్లి తన తల్లి హాన్ టేని కలవగానే భావోద్వేగానికి గురయ్యారు. కానీ హాన్ టేకి అదంతా సభ్రమాశ్చర్యంగా ఉంది. నిజమేనా..? కాదా అనే సందిగ్ధంలో ఉండిపోయింది. అయితే బెండర్ జుట్టుని తాకి అది తన కూతురే అని నిర్థారణ చేసుకుని ఆలింగనం చేసుకుంది. 30 ఏళ్లుగా హెయిర్ డ్రస్సర్‌గా పనిచేస్తున్న హాన్ టే ఆ అనుభవంతోనే కూతురు జుట్టుని తాకి తన బిడ్డే అని నిర్థారించుకుంది. ఈ మేరకు హాన్ టే కూతురు క్యుంగ్ మాట్లాడుతూ..ఒక వింత మహిళ తన వద్దకు వచ్చి నీ తల్లికి ఇక నీ అవసరం లేదంటూ..తనను రైల్వేస్టేషన్‌కి తీసుకువెళ్లిపోయిట్లు తెలిపింది. అక్కడ పోలీసు అధికారులు తనను ఎత్తుకుని ఒక అనాథశ్రమంలో ఉంచారని, అక్కడ నుంచి అమెరికాకు తరలించారని తెలిపింది. అయితే అక్కడ వర్జీనియాలో ఒక జంట తనను దత్తత తీసుకుందని చెప్పుకొచ్చారామె. ఇక హాన్ టే ఇన్నాళ్ల తన మనో వేదనకు గానూ..దక్షిణ కొరియాలో కొనసాగుతున్న విదేశీ దత్తత కార్యక్రమాన్ని సవాలు చేస్తూ.. ప్రభుత్వంపై దావా వేసింది. అలాగే తన కుమార్తె కనపడక ఎంత నరకయాతన అనుభవించానో చెప్పలేను, ఓ పిచ్చిపట్టినదానిలో క్షోభను అనుభించానంటూ కన్నీళ్లు పెట్టుకున్నారామె. కాగా, ఈ ఏడాది ప్రారంభంలో వరుసగా వచ్చిన దక్షిణ కొరియా ప్రభుత్వాలు పారిశ్రామిక లబ్ధి కోసం ఇలా పిల్లలను పెద్ద ఎత్తున సామూహికంగా ఎగుమతి చేసినట్లు ఆరోపణలు రావడమేగాక విచారణలో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతునట్లు తేలింది. (చదవండి: ఇదేం పండుగ సామీ..! ఏకంగా ప్రాణాలనే పణంగా పెట్టి..) -
పటిష్ట భద్రత నడుమ పెళ్లికి హాజరైన స్టార్ హీరో
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ పెళ్లి వేడుకలో సందడి చేశారు. ఆయన తన స్నేహితుడైన అయాజ్ ఖాన్ వివాహానికి హాజరయ్యారు. ముంబయిలో జరిగిన ఈ పెళ్లి హాజరైన వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఈ పెళ్లికి అతని సోదరుడు సోహైల్ ఖాన్, మేనల్లుడు నిర్వాన్ కూడా పాల్గొన్నారు.అయితే ఈ పెళ్లికి హాజరైన సల్మాన్ ఖాన్ తన అత్యంత భద్రతా నడుమ కనిపించారు. పెళ్లి జంటను ఆశీర్వదించేందుకు వై ప్లస్ సెక్యూరిటీ సిబ్బందితో వచ్చారు. అయితే మే 20న తన నివాసమైన గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌లో ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే సల్మాన్ పెళ్లిలో ప్రత్యక్షమయ్యారు. ఇషా చాబ్రియా అనే 36 ఏళ్ల మహిళ నటుడి ఇంట్లోకి ప్రవేశించడండో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. బాంద్రా కోర్టులో హాజరుపరిచగా.. ఆమెను 14 రోజుల రిమాండ్‌కు తరలించారు.ఇక సినిమాల విషయానికొస్తే సల్మాన్ చివరిసారిగా రష్మిక మందన్నతో కలిసి సికందర్ మూవీలో కనిపించారు. ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వం వహించి సాజిద్ నదియాద్వాలా నిర్మించారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ చిత్రంలో కాజల్ అగర్వాల్, సత్యరాజ్, శర్మన్ జోషి, ప్రతీక్ బబ్బర్, అంజిని ధావన్,జతిన్ సర్నా కూడా నటించారు. ఈ ఏడాదిలో మార్చి 30న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా నేటి నుంచే ఓటీటీలో స్ట్రీమిగ్ అవుతోంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
పెళ్లిలో గొడవ.. వరుణ్ణి కిడ్నాప్ చేసిన డ్యాన్సర్లు
పట్నా: అక్కడ అంగరంగ వైభవంగా వివాహం జరుగుతోంది. అతిథులంతా ఉత్సాహంగా ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. ఈ ఉత్సాహాన్ని రెండింతలు చేసేందుకు డ్యాన్సర్లను పిలిపించారు. అంతా సవ్యంగా సాగుతుండగా ఊహించని పరిణామం చోటుచేసుకుంది. డ్యాన్సర్లంతా కలిసి వరుణ్ణి కిడ్నాప్ చేశారు. అతిథులంతా అవాక్కయ్యారు. బీహార్(Bihar)లోని గోపాల్‌గంజ్ జిల్లాలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. ఈ ఘటన శనివారం రాత్రి రెండు గంటల సమయంలో జరిగింది. సాధు చౌక్ మొహల్లాలో పెళ్లిలో వినోదం కోసం పిలిచిన డాన్స్ టీమ్ వరుణ్ణి కిడ్నాప్ చేసింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. బైకుంఠపూర్ పరిధిలోని దిఘ్వా దుబౌలీలో సురేంద్ర శర్మ కుమార్తె వివాహం జరుగుతోంది. వేడుకలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఊరేగింపుగా వస్తున్న మగపెళ్లివారిని ఆహ్వానించేందుకు డాన్స్ బృందాన్ని పిలిపించారు. అయితే వీరికి స్థానికులతో ఏదో విషయమై గొడవ జరిగింది. చివరికి అది హింసాత్మకంగా మారింది. సదరు డ్యాన్స్ బృందం ఆగ్రహంతో వధువు ఇంటిలోనికి చొరబడి, అక్కడ ఉన్న వారిపై దాడి చేసింది. ఈ నేపధ్యంలో వధువు, ఆమె తల్లి విద్యావతి దేవితో సహా పలువురు మహిళలు గాయపడ్డారు. అంతటితో ఊరుకోకుండా వారు వధువు ఇంటిలోని ఆభరణాలు, విలువైన వస్తువులు, ఖరీదైన దుస్తులను దోచుకుని ఉడాయించారు. విషయం తెలుసుకున్న వరుడు డ్యాన్స్ బృంద సభ్యులను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అయితే వారు అతన్ని చావబాది, బలవంతంగా వ్యాన్లోనికి ఎక్కించుకుని, తమతో పాటు తీసుకుపోయారు. సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు(Local police) సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరారైన నిందితుల కోసం గాలిస్తున్నారు. విషయం తెలుసుకున్న వధువు షాక్‌లో ఉంది. ప్రస్తుతం ఆమెకు వైద్య చికిత్స అందిస్తున్నారు.ఇది కూడా చదవండి: ప్రభుత్వం కోసం పని చేయను: శశి థరూర్ -
ఏడు నెలల్లో 25పెళ్లిళ్లు!
-
నేడు మానస వివాహం.. పెళ్లి పెద్దగా కలెక్టర్ శ్రీహర్ష
రామగుండం(కరీంనగర్): స్థానిక తబితా ఆశ్రమంలో ఉంటున్న నక్క మానస ఆశ్రమం నుంచి అత్తారింటికి వెళ్లే సమయం సమీపిస్తోంది. పెళ్లి కూతురు ముఖంలో ఓ వైపు చిరునవ్వు, మరోవైపు ఆశ్రమ సంరక్షకులను, తోబుట్టువును విడిచి వెళ్తున్నాననే బాధ.. పెద్దపల్లి కలెక్టరేట్లోని దేవాలయంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష వివాహ వేడుక జరిపిస్తున్నారు. కాగా, 2021 మార్చి 15వ తేదీన ఆశ్రమంలో ఆశ్రయం పొందిన గుంజ విజయలక్ష్మి అనే యువతికి హైదరాబాద్‌లోని ఓ వ్యాపారితో వీరేందర్‌నాయక్ వివాహం జరిపించగా, నక్క మానస వివాహం రెండోది. 16ఏళ్ల క్రితమే ఆశ్రమంలో చేరిన అక్కాచెల్లెలు.. సుమారు 16ఏళ్ల క్రితం తల్లిదండ్రులను కోల్పోయిన అక్కాచెల్లెళ్లు నక్క మానస, నక్క లక్ష్మి సంరక్షణ కోసం ఇంటగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ సరీ్వస్(ఐసీపీఎస్) అధికారులు స్పందించి రామగుండంలోని తబితా ఆశ్రమంలో చేరి్పంచారు. ఆనాటి నుంచి ఆశ్రమ నిర్వాహకుడు వీరేందర్‌నాయక్–విమల దంపతులు వారికి తల్లిదండ్రులుగా మారారు. నక్క మానస డిగ్రీ పూర్తి చేయగా, నక్క లక్ష్మి ఇంటర్మీడియట్ పూర్తిచేసింది. చిన్నప్పటి నుంచే చురుకైన పాత్ర.. ఆశ్రమంలో చేరిన సమయం నుంచి చదువులో, ఇంటిపనిలో చురుగా ఉంటోంది. ఇతరులతో మర్యాదగా వ్యవహరించడం తదితర గుణగణాలు కలిగిన అమ్మాయిగా పేరు తెచ్చుకుంది మానస. ఐదో తరగతి వరకు స్థానిక ప్రైవేట్ పాఠశాలలో విద్యనభ్యసించగా ఆరు నుంచి పదో తరగతి వరకు మేడారం గురుకుల విద్యాలయంలో చదివి టెన్త్9.8 జీపీఏ, ఎల్లంపల్లి కేజీబీవీలో ఇంటర్మీడియట్ చదివి ఎంపీసీ గ్రూపులో 895 మార్కులు, కరీంనగర్‌లోని వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో బీఎస్సీ(మ్యాథ్స్) ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించింది. ఎంత చెప్పినా తక్కువే చిన్నప్పటి నుంచి అమ్మానాన్న విమల, వీరేందర్‌నాయక్ అని తెలుసు. కానీ ఓ ఆశ్రమంలో సంరక్షకులుగా మాత్రం నాకు తెలియదు. చిన్నప్పటికీ నా బాధ్యతలు, కష్ట సుఖాలు అన్నీ వారితోనే పంచుకునే దాన్ని. ఇప్పుడు నాకు ఓ వ్యాపారితో వివాహం చేస్తుండడంతో నేను ఇల్లాలిగా మారుతున్నా. అప్పుడు నా చెల్లి నక్క లక్ష్మి, నాతోటి మిత్రులు, నా అమ్మనాన్నలు (సంరక్షకులు)విడిచి వెళ్లలేక పోతున్నా. నా వివాహం కలెక్టర్ జరిపిస్తుండడం మరీ విశేషం. – నక్క మానస, పెళ్లి కూతురు ఆనందమో.. బాధో తెలియడం లేదు పెళ్లీడుకొచ్చిన యువతికి వివాహం జరిపించడం నా కర్తవ్యం. అందుకు కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకోవడం ఊహకందని విషయం. బాల్యం నుంచే మమ్మల్నే తల్లిదండ్రులుగా భావిస్తూ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నాం. ఇప్పుడు పెళ్లి చేసి కన్యాదానం చేయడం ద్వారా గుండెలు బరువెక్కుతున్నాయి. పెళ్లి కూతురు చెల్లి లక్ష్మి మరింత ఆవేదనకు లోనవుతుంది. ఆశ్రమంలో పెద్ద మనిగా వ్యవహరిస్తూ అన్ని విషయాల్లో ఎంతో చురుకుగా వ్యవహరించే కూతురు నక్క మానస. భవిష్యత్తులో ఆమె కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. – వీరేందర్‌నాయక్, తబితా ఆశ్రమ నిర్వాహకుడుఆకట్టుకున్న మానస హల్దీ వేడుకలు -
ఇద్దరూ దివ్యాంగులైనా.. ‘వివాహ కానుక’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని దివ్యాంగులకు ప్రభుత్వం కానుక ప్రకటించింది. వికలాంగులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నట్లుగా.. ‘వికలాంగుల వివాహ కానుక’పథకం నిబంధనల్లో మార్పులు చేసింది. ఇప్పటివరకు వివాహం చేసుకున్న జంటలో ఒకరు మాత్రమే దివ్యాంగులు ఉంటేనే ఈ పథకం వర్తిస్తుండగా, ఇకపై ఇద్దరూ దివ్యాంగులైనా పథ కం వర్తిస్తుంది. ఈ మేరకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్ ఉత్తర్వులు జారీచేశారు. ఎక్కువ మందికి ప్రయోజనం సాధారణ వ్యక్తులు దివ్యాంగులను వివాహం చేసుకునేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. దీని కింద అర్హులకు ప్రభుత్వం రూ.1 లక్ష అందజేస్తుంది. కానీ, చాలా సందర్భాల్లో వివాహం చేసుకునే అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ దివ్యాంగులు ఉంటున్నారు. వీరికి ఈ పథకం వర్తించటంలేదు. దీంతో నిబంధనలు మార్చి ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకున్నా ఆర్థికసాయం అందించాలని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు పెద్ద ఎత్తున వినతులు అందాయి.దీంతో గతేడాది ఏప్రిల్ 18న ఈ శాఖ అధికారులు పథకం నిబంధనల్లో మార్పులు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా నిబంధనలను సవరించింది. ఇకపై దివ్యాంగులను సాధారణ వ్యక్తులు వివాహం చేసుకున్నా, ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకున్నా రాష్ట్ర ప్రభుత్వం ఆ జంటలోని మహిళ బ్యాంకు ఖాతాలో రూ.లక్ష ఆర్థిక సాయాన్ని జమ చేస్తుంది. ఈ నిబంధనలు తక్షణమే అమలు చేయాలని అనితా రామచంద్రన్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.పదేళ్ల పోరాట ఫలితం: ముత్తినేని వీరయ్య వికలాంగుల వివాహ కానుక పథకం నిబంధనలు సడలించాలని పదేళ్లు పోరాటం చేశామని, ప్రస్తుత ప్రభు త్వం స్పందించి ఉత్తర్వులు జారీ చేయడం శుభపరిణామమని తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య మంగళవారం ఒక ప్రకటనలో హ ర్షం వ్యక్తం చేశారు. దివ్యాంగులందరికీ న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకున్నందుకు సీఎం ఎ.రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. -
'అనుకున్నదే అయింది.. విశాల్‌తో పెళ్లిపై హీరోయిన్ అఫీషియల్ ప్రకటన'
కోలీవుడ్ స్టార్ విశాల్, హీరోయిన్ సాయి ధన్సిక పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు. తాజాగా విశాల్ పెళ్లిపై మరోసారి రూమర్స్ రావడంతో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ సాయి ధన్సిక అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తన మూవీ యోగిదా ఈవెంట్లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. తాను విశాల్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు వేదికపై వెల్లడించింది.అవును.. నేను, విశాల్ మంచి స్నేహితులం.. మేమిద్దరం కలిసి నడవబోతున్నాం.. ఈ ఏడాది ఆగస్టు 29న పెళ్లి బంధంలోకి అడుగుపెడుతున్నాం అంటూ సంతోషం వ్యక్తం చేసింది సాయి ధన్సిక. ఈ ప్రకటనతో అటు విశాల్ ఫ్యాన్స్.. ఇటు సాయి ధన్సిక అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు విశాల్‌కు అభినందనలు తెలుపుతున్నారు. కాగా.. కోలీవుడ్‌కు చెందిన సాయి ధన్సిక తెలుగులో తెరకెక్కిన షికారు, అంతిమ తీర్పు, దక్షిణ వంటి చిత్రాల్లో హీరోయిన్గా నటించారు.ఇటీవలే హింట్ ఇచ్చిన విశాల్..ఇటీవల నడిగర్ సంఘం బిల్డింగ్ నిర్మాణం కూడా పూర్తయింది. ఇటీవల ఓ సమావేశంలో తన పెళ్లి గురించి మాట్లాడారు. త్వరలోనే పెళ్లి చేసుకుంటానని తెలిపారు. నాది ప్రేమ వివాహమేనని.. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేస్తానని విశాల్ వెల్లడించారు. కాగా.. విశాల్‌కు గతంలో అనీషా అనే నటితో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. కానీ ఆ తర్వాత వీరి నిశ్చితార్థం క్యాన్సిల్ అయింది. Official Actor #Vishal is going to marry #SaiDhanshika on August 29, 2025 💍♥️pic.twitter.com/ePWoIljAuA— Sugumar Srinivasan (@Sugumar_Tweetz) May 19, 2025 -
ఆ హీరోయిన్‌తో విశాల్ పెళ్లి.. త్వరలోనే ముహుర్తం ఫిక్స్!
కోలీవుడ్ స్టార్, నిర్మాత విశాల్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. గతంలోనే పలు సార్లు ఆయన పెళ్లిపై వార్లలొచ్చినా ఇప్పటివరకు అలాంటిదేం జరగలేదు. నడిగర్ సంఘం భవనం నిర్మించాకే తన పెళ్లి ఉంటుందని గతంలో విశాల్ ప్రకటించారు. అయినప్పటికీ ఆయన పెళ్లి చర్చ ఆగడం లేదు. తాజాగా ఆయన పెళ్లిపై కోలీవుడ్‌లో మరోసారి చర్చ మొదలైంది.విశాల్ త్వరలోనే హీరోయిన్ సాయి ధన్సికను పెళ్లాడబోతున్నారంటూ టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని కోలీవుడ్‌లో వార్త చక్కర్లు కొడుతోంది. అయితే తమపై వస్తున్న వార్తలపై ఇప్పటి వరకు సాయిధన్సిక కానీ.. విశాల్ కానీ స్పందిచంలేదు. దీనిపై వీరిద్దరిలో ఎవరో ఒకరూ స్పందిస్తేనే క్లారిటీ వస్తుంది. కాగా.. కోలీవుడ్‌కు చెందిన సాయి ధన్సిక తెలుగులో తెరకెక్కిన షికారు, అంతిమ తీర్పు, దక్షిణ వంటి చిత్రాల్లో హీరోయిన్గా నటించారు.ఇటీవల నడిగర్ సంఘం బిల్డింగ్ నిర్మాణం కూడా పూర్తయింది. ఇటీవల ఓ సమావేశంలో తన పెళ్లి గురించి మాట్లాడారు. త్వరలోనే పెళ్లి చేసుకుంటానని తెలిపారు. నాది ప్రేమ వివాహమేనని.. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేస్తానని విశాల్ వెల్లడించారు. కాగా.. విశాల్‌కు గతంలో అనీషా అనే నటితో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. కానీ ఆ తర్వాత వీరి నిశ్చితార్థం క్యాన్సిల్ అయింది. ఇవాళే ప్రకటిస్తాడా?..కోలీవుడ్‌లో రూమర్స్ వినిపిస్తోన్న వేళ విశాల్, సాయి ధన్షికతో వివాహం చేసుకోబోతున్నాడన్న వార్త నిజమేనని ఆయన సన్నిహిత వర్గాలు ధృవీకరించాయి. సోమవారం సాయంత్రం జరగనున్న సాయి ధన్షిక నటించిన యోగి దా సినిమా కార్యక్రమానికి విశాల్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ ఈవెంట్లోనే తనతో సాయి ధన్సిక వివాహ ప్రకటన ఉండొచ్చనే వార్తలొస్తున్నాయి. -
తమ్ముడి మృతితో ఆగిన అక్క పెళ్లి
ఆలూరు రూరల్(కర్నూలు): అందరూ వివాహ వేడుకల్లో ఆనందంగా ఉన్నారు. మరి కొద్ది గంటల్లో కల్యాణ తంతు నిర్వహించాల్సి ఉంది. ఇంతలోనే విషాదం. వధువు తమ్ముడు రోడ్డు ప్రమా దంలో దుర్మరణం చెందడంతో అక్క వివాహం నిలిచిపోయింది. శనివారం రాత్రి హుళేబీడు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆస్పరికి చెందిన ఆనంద్ (19) మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో అతని స్నేహితులు పూర్ణచంద్ర, తిమ్మప్ప తీవ్రంగా గాయపడ్డారు. ఆదోని ఆస్పత్రిలో పూర్ణచంద్ర, కర్నూలు ఆస్పత్రిలో తిమ్మప్ప చికిత్స పొందుతున్నారు. ఆస్పరికి చెందిన తిమ్మన్న, శుకుంతల కుమారుడు ఆనంద్.. కాగా అతని సోదరి వివాహం హొళగుంద మండలం వందవాగిలి గ్రామంలో ఆదివారం ఉదయం జరగాల్సి ఉంది. ఆనంద్, పూర్ణచంద్ర, తిమ్మప్ప గుంటూరులోని ఆర్‌వీఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నారు. పూర్ణచంద్ర స్వగ్రామం ప్రకాశం జిల్లా కంభం గ్రామం కాగా తిమ్మప్పది ఆస్పరి మండలం చిగిళి గ్రామం. శనివారం రాత్రి ఆనంద్ సోదరి వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు బైక్‌పై వెళ్తుండగా కారు ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఆనంద్ మృతితో అతని సోదరి పెళ్లి ఆగిపోయింది. అక్క పెళ్లికి వచ్చి తమ్ముడి అంత్యక్రియలు చేయాల్సి వచ్చిందని బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.ఎమ్మెల్యే పరామర్శ.. ఆనంద్ మృతి బాధాకరమని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అన్నారు. ఆదివారం ఆయన ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆనంద్ మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
గుడి సేవకులు.. దేవుడిచ్చిన బంధాలు
పల్లకీలోని అమ్మాయి పేరు హిమబిందు. తండ్రి ఆవులశెట్టి చంద్రశేఖరప్ప వస్త్ర దుకాణం నిర్వహిస్తుండగా, తల్లి లక్ష్మీదేవి గృహిణి. బీసీఏ పూర్తి చేసిన ఈమె ‘మన ఊరు.. మన గుడి.. మన బాధ్యత’ బృందంలో సభ్యురాలు. మూడేళ్లుగా తన వంతు సేవగా ఆలయాలను శుభ్రం చేస్తున్నారు. ఈ అమ్మాయి ఎదురొచ్చి టెంకాయ కొడితే కానీ ఆ బృందం బయలుదేరుతున్న బస్సు కదలదు. అంతటి సెంటిమెంట్. పల్లకీ మోస్తున్నారంటే వాళ్లు సొంత మేనమామలు అనుకుంటే పొరపాటు. గుడి సేవ బృందంలోని సభ్యులు ఎంచుకున్న తోవ ఇది. తమతో పాటు సేవలో పాల్గొనే అమ్మాయిల పెళ్లి సందర్భంగా ఈ ‘పల్లకీ సేవ’ ఇంటి మనుషులుగా సొంత ఖర్చుతో నిర్వహిస్తుండటం విశేషం. కర్నూలు కల్చరల్: అమ్మాయిని ఓ అయ్య చేతిలో పెట్టాలంటే తల్లిదండ్రులకు కంటి మీద కునుకు ఉండదు. పెళ్లి చూపులు మొదలు.. అప్పగింతల వరకు ఒకటే హడావుడి. కాంక్రీట్ వనాల్లో ఎవరికి వారుగా బతుకున్న రోజుల్లో బంధాలు, బంధుత్వాలు గుర్తుకు తెచ్చుకున్నా కళ్ల ముందు మెదలని పరిస్థితి. సొంతూళ్లకు దూరంగా, సప్త సముద్రాలకు అవతల ఉద్యోగాలు చేస్తున్న వారికి వరుసలు తెలియవు, ఉన్న ఊళ్లో ఎవరిని ఏమని పిలవాలో దిక్కుతోచదు. అలాంటిది పెళ్లి అనగానే.. తల్లిదండ్రుల గుండెలు బరువెక్కుతాయి. అమ్మో.. ఇంత తక్కువ సమయమా? అనే మాట వినపడటం సర్వ సాధారణం. అయితే ముక్కూమొహం తెలియని వాళ్లు, మేమున్నామని భరోసా కల్పిస్తే.. సొంత మేనమామళ్లా హడావుడి చేస్తే.. కుటుంబ సభ్యుల్లో ఒకరిలా మెలుగుతుంటే.. జీవితంలో అంతకంటే సంతోషం ఏముంటుంది. ఈ కోవకు చెందినదే ‘మన ఊరు.. మన గుడి.. మన బాధ్యత’. కార్యక్రమం చేశామా, వెళ్లిపోయామా అన్నట్లు కాకుండా.. ఈ బృందం ఓ కుటుంబంలా మెలుగుతోంది. కష్టాలో ఒకరికొకరు తోడుగా నిలుస్తూ.. సంతోషాలను కలిసి పంచుకుంటున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకం. వాట్సాప్ గ్రూపులో 1,500 పైనే సభ్యులు మొదట అరకొరగా మొదలైన మన ఊరు.. మన గుడి.. మన బాధ్యత వాట్సాప్ గ్రూపు దినదిన ప్రవర్దమానంగా వెలుగొందుతోంది. ప్రస్తుతం ఈ గ్రూపులో 1,500 మందికి పైగానే సభ్యులు. ఎంపిక చేసుకున్న గుడి వివరాలను గ్రూపులో తెలియజేసి కార్యక్రమం నిర్వహణలో పాల్పంచుకునేందుకు ఆసక్తి కలిగిన సభ్యుల వివరాలతో జాబితా తయారు చేస్తున్నారు. ఆ తర్వాత అవసరమైన మేరకు సభ్యులకు అవకాశం కలి్పస్తున్నారు. మరో కార్యక్రమంలో మిగిలిన వారికి ఆ భాగ్యం లభిస్తోంది. ఇప్పటి 123 దేవాలయాల్లో కార్యక్రమం నంద్యాలలోని ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయంలో మొదలైన కార్యక్రమం ఇప్పటి వరకు 123 దేవాలయాల్లో తమ సేవను విస్తరించడం విశేషం. కాశీలోని విశాలక్ష్మి గుడిలో ఏకంగా 9 రోజుల పాటు ఈ బృందం తమ కార్యక్రమాన్ని నిర్వహించారు. పల్లకీలో పెళ్లి కూతురు‘మన ఊరు.. మన గుడి.. మన బాధ్యత’ బృందంలో సభ్యురాలైన హిమబిందు స్వస్థలం నంద్యాల కాగా.. వివాహం ఆదివారం కర్నూలు నగరంలో నిర్వహించారు. వరుడు వీర నవీన్. బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. వివాహం సందర్భంగా బృందం సభ్యులు సు మారు 150 మంది హాజరయ్యారు. వీరు పల్లకీని తీసుకొచ్చి పెళ్లి మంటపానికి తీసుకొస్తున్న తీరుకు వివాహానికి హాజరైన అతిథులు ఆశ్చర్యచకితులయ్యారు. ఎవరికి ఎవరో అన్నట్లుగా బతుకుతున్న రోజుల్లో ఇలాంటి వాళ్లు కూడా ఉన్నారా అని చర్చించుకోవడం విశేషం. -
చెల్లి పెళ్లిని గుర్తు చేసుకున్న బిగ్‌బాస్ బ్యూటీ హరితేజ..!
అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై తనదైన ముద్రని వేసుకున్న నటి, యాంకర్ హరితేజ. గతేడాది బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి అభిమానులను అలరించింది. దాదాపు పదివారాల పాటు హౌస్‌లో ఉండి ఫ్యాన్స్‌ను అలరించింది. సీరియల్స్, సినిమాలతో పాపులర్ అయింది హరితేజ. బిగ్‌బాస్ మొదటి సీజన్లో అడుగుపెట్టి ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. గ్రాండ్ ఫినాలే వరకు చేరుకుని సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. ఫిదా మీ ఫేవరెట్ స్టార్‌తో, పండగ చేస్కో, సూపర్ సింగర్, లక్కీ ఛాన్స్.. ఇలా పలు షోలకు యాంకర్‌గా వ్యవహరించింది. గతేడాది రిలీజైన దేవర సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్‌గా మెప్పించింది.అయితే తాజాగా తన చెల్లి పెళ్లిలో సందడి చేసింది హరితేజ. వివాహా వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. చెల్లి పెళ్లి వైభోగం అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది హరితేజ. అయితే తన సిస్టర్ పెళ్లి ఫిబ్రవరిలో జరగ్గా.. తాజాగా మరోసారి ఫోటోలను పంచుకుంది. కాగా.. హరితేజ కన్నడకు చెందిన దీపక్ అనే వ్యక్తిని 2015లో వివాహం చేసుకుంది. వీరిద్దరికీ 2021లో భూమి అనే కూతురు జన్మించింది. View this post on Instagram A post shared by Hari Teja (@actress_hariteja) -
చెల్లి పెళ్లిలో నటి హరితేజ (ఫోటోలు)
-
పెళ్లి పేరుతో.. టోకరా
సాక్షి, పుట్టపర్తి : గతంలో పెళ్లంటే... పెద్దలు కూర్చుని బంధువర్గాల్లో ఈడు, జోడు చూసి సంబంధం కుదుర్చేవారు. ఎక్కువగా బంధువర్గాల్లోని అమ్మయిలతోనే వివాహం జరిపించేవారు. కానీ ప్రస్తుత కాలంలో అమ్మాయిలు దొరకడం కష్టంగా మారింది. ఫలితంగా 30 ఏళ్లు దాటి.. 40 ఏళ్లకు సమీపిస్తున్నా.. పెళ్లి సంబంధాలు వెతుకుతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. దీంతో ‘పెళ్లి కాని ప్రసాద్’ లను లక్ష్యంగా చేసుకుని కొందరు యువతులు, మ్యారేజీ బ్యూరో నిర్వాహకులు మోసాలకు పాల్పడుతున్నారు. పెళ్లి పేరుతో బంగారు నగలు, నగదు చేజిక్కించుకుని ఉడాయిస్తున్నారు. ఇంకొన్ని చోట్ల ఆస్తి రాయించుకుని అడ్డం తిరుగుతున్నారు. వయసు మీరితే మోసపోయినట్లే.. అప్పట్లో అబ్బాయిలకు 21, అమ్మాయిలకు 18 ఏళ్లు నిండితేనే వివాహం జరిపించే వాళ్లు. అయితే ప్రస్తుతం ఉద్యోగాల వేటలో పడి 30 ఏళ్లు దాటినా పెళ్లి సంబంధాలు చూడటానికి యువకులు మొగ్గు చూపటం లేదు. ఆ తర్వాత ఏదో ఉద్యోగం లభించాక పెళ్లి సంబంధాలకు వెళ్తే...అమ్మాయిల కోర్కెల చిట్టా చూసి ఖిన్నులవుతున్నారు. రూ.లక్షల్లో జీతంతో పాటు అత్తమాత బాదరబందీ ఉండకూడదంటూ షరతులు పెడుతున్నారు. దీంతో యువకులు నచ్చిన భాగస్వామి కోసం మ్యారేజీ బ్యూరోలను సంప్రదిస్తున్నారు. ఇదే అదునుగా మధ్యవర్తులు ఇతర ప్రాంతాల అమ్మాయిలను ఒప్పించి.. ఒకట్రెండు నెలలు కాలయాపన చేసి.. ఆలోపు డబ్బులు, ఆస్తులు లాగేసుకుని పరారవుతున్నారు. కొన్ని సామాజిక వర్గాల్లో మరీ కష్టం.. కొన్ని సామాజిక వర్గాల్లో అమ్మాయిల సంఖ్య మరీ దారుణంగా ఉంది. మండలానికి నాలుగైదు కుటుంబాలు ఉండే కులాల్లోని యువకులకు పెళ్లి పెద్ద సమస్యగా మారింది. మరోవైపు ఆస్తి తక్కువగా ఉండే అగ్రవర్ణ యువకులదీ ఇదే పరిస్థితి. ఫలితంగా యువకులు... ఎవరైతే ఏంటి..పెళ్లయితే చాలు అనే పరిస్థితికి వచ్చారు. దూర ప్రాంతాలకు వెళ్లి సామాజికవర్గం ఏదైనా సరే ఎవరో ఒక అమ్మాయిని పెళ్లిచేసుకుని వస్తున్నారు. అయితే రెండు, మూడు నెలల్లోనే సదరు యువతులు టోకరా వేసి బంగారం, నగదుతో ఉడాయిస్తున్నారు. ⇒ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం రాచుపల్లికి చెందిన 40 ఏళ్ల వ్యక్తి మ్యారేజీ బ్యూరో ద్వారా భీమవరానికి చెందిన మహిళను వివాహం చేసుకున్నారు. సంబంధం కుదిర్చిన ఇద్దరు వ్యక్తులకు రూ.4 లక్షలు చెల్లించాడు. అయితే వివాహం తర్వాత సదరు యువతిని రైలులో భీమవరానికి తీసుకువెళ్లగా.. రైల్వే స్టేషన్ నుంచే ఆమె ఉడాయించింది. ఫోన్ స్విచాఫ్ వచ్చింది. పెళ్లి చేసిన మధ్యవర్తుల నంబర్లూ పనిచేయలేదు. దీంతో బాధితుడు తిరిగివచ్చి.. హిందూపురం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన 2024 అక్టోబరులో వెలుగు చూసింది.⇒ నాలుగు నెలల క్రితం ధర్మవరానికి చెందిన ఓ యువతిని పుట్టపర్తిలో పని చేసే ఓ ఉద్యోగి పెళ్లి చూపులు చూశాడు. ఆ వెంటనే సదరు యువతి బంధువులు పెళ్లిపత్రికలు ప్రింట్ చేయించారు. తాను పెళ్లికి అంగీకారం తెలపకుండానే పత్రికలు ఎలా ప్రింట్ చేయించారని అడగ్గా... తనను మోసం చేశాడని రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని సదరు యువతి నాలుగు నెలల క్రితం నానా రభస చేసింది. దీంతో ఆ ఉద్యోగి అప్పటి నుంచి పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. -
జూమ్ కాల్‌తో భార్య రెండో పెళ్లి గుట్టురట్టు.. నాలుగేళ్ల కోర్టు పోరాటంలో భర్త విజయం
సాక్షి, బెంగళూరు: భార్య నుంచి విడాకులు కావాలని కోరుతూ నాలుగేళ్ల కోర్టు పోరాటంలో ఓ భర్త విజయం సాధించాడు. అంతేకాదు భర్త నుంచి తనకు రూ.3 కోట్ల భరణం కావాలన్న భార్య డిమాండ్‌ను కోర్టు తిరస్కరించింది. కోర్టు ఖర్చుల కింద రూ.30వేలు ఇస్తే సరిపోతుందంటూ భార్య నుంచి భర్తకు విడాకులు మంజూరు చేస్తూ ఫ్యామిలీ కోర్టు తీర్పును వెలువరించింది.కేసు పూర్వాపరాల్ని పరిశీలిస్తే.. బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ దంపతులకు 2018లో వివాహం జరిగింది. అయితే, ఏ చీకు చింతా లేని దాంపత్య జీవితంలో వివాహానికి ముందు భార్య నెరిపిన ప్రేమాయణం చిచ్చుపెట్టింది.వివాహం తర్వాత భార్య.. భర్తతో అన్యోన్యంగా మెలుగుతూ వచ్చింది. కానీ అనూహ్యంగా అదే భార్య ప్రేమ పేరుతో ప్రియుడికి దగ్గరైంది. భర్తకు తెలియకుండా అతన్ని రెండో వివాహం చేసుకుంది. మొదటి భర్తతో కలిసి జీవించేది. డబ్బులు అవసరం అయినప్పుడల్లా రెండో భర్తకు డబ్బులు పంపిస్తుండేది. దీంతో భార్య చేస్తున్న ఖర్చులపై మొదటి భర్తకు అనుమానం మొదలైంది. ఇదే విషయంపై భార్యను నిలదీయాలని అనుకున్నాడు.కానీ అలా చేయలేదు. భార్య గుట్టు రట్టు చేసేందుకు పక్కా ప్లాన్ వేశాడు. తన స్నేహితుడి సాయంతో భార్యకు జూమ్ ఇంటర్వ్యూ నిర్వహించాడు. ఆ జూమ్ ఇంటర్వ్యూలో తనకు అన్వేక కారణాల వల్ల మొదటి వివాహం జరిగిందని, ఇప్పుడు ఆ వివాహ బంధానికి ముగింపు పలికి రెండో వివాహం చేసుకున్నట్లు తెలిపారు.ఈ పరిణామం తరువాత ఆర్టీఐ ద్వారా.. తన భార్యకు రెండో వివాహం ఎప్పుడు జరిగిందో తెలుసుకున్నాడు. మ్యారేజీ సర్టిఫికెట్లు, పాన్ కార్డ్‌లతో పాటు ఇతర ఆధారాల్ని సేకరించాడు. వాటి ఆధారంగా 2023 మార్చి నెలలో భార్య తన ప్రియుడిని రెండో వివాహం చేసుకున్నట్లు గుర్తించాడు. వెంటనే మంగళూరు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. తనకు న్యాయం చేయాలని ప్రాధేయపడ్డాడు. భార్య నుంచి విడాకులు కోరాడు. భార్య మానసిక హింస, వివాహం నిబంధనలను ఉల్లంఘించడం, ప్రతిష్టకు భంగం కలిగించిందని ఆరోపించాడు. ఆర్టీఐ ద్వారా సేకరించిన ఆధారాల్ని కోర్టుకు అందించాడు. విచారణ చేపట్టిన కోర్టు విడాకుల విషయంలో భార్య నిర్ణయం తెలపాలని ఆదేశించింది. దీంతో భార్య.. భర్తపై గృహ హింస, డౌరీ హింస, గర్భం తొలగించమని బలవంతం చేశారని ఆరోపించింది. అంతేకాదు భరణం కింద రూ.3 కోట్లు, నెలకు ఖర్చుల కింద రూ.60వేలు ఇవ్వాలని డిమాండ్ చేసింది.ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. 2025,ఏప్రిల్ 23న భార్య నుంచి భర్తకు విడాకులు మంజూరు చేసింది. భార్య అడిగిన భరణాన్ని తిరస్కరించింది. న్యాయవాద ఖర్చుల నిమిత్తం రూ.30వేలు ఇవ్వాలని ఆదేశించింది. -
పెళ్లి పెద్దగా పెద్దపల్లి కలెక్టర్
సాక్షి,పెద్దపల్లి: బాజాభజంత్రీలు.. మేళతాళాలు.. వేదపండితుల మంత్రోచ్ఛారణలు.. తరలివచ్చే అతిథుల సమక్షంలో ఓ అనాథ యువతి వివాహం జరిపించేందుకు పెద్దపల్లి జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. తల్లిదండ్రులను కోల్పో యి రామగుండంలోని తబిత బాలల సంరక్షణ కేంద్రంలో మానస, తన చెల్లితో కలిసి 16 ఏళ్లుగా ఉంటోంది. ఈ నేపథ్యంలో జనగామ జిల్లా రఘనాథపల్లికి చెందిన రాజేశ్‌తో ఇటీవల ఆమెకు వివాహం నిశ్చయమైంది. ఆ యువతికి పెళ్లిపెద్దగా కలెక్టర్ కోయ శ్రీహర్ష వ్యవహరించేందుకు ముందుకు వచ్చారు. జిల్లా సంక్షేమశాఖ అధికారి వేణుగోపాల్‌రావు, అదనపు కలెక్టర్లు, బాలల పరిరక్షణ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈనెల 21న యువతి వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టరేట్లోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని వేదికగా ఎంచుకున్నారు. ఈమేరకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. -
ఊహించని విధంగా పెళ్లి వాయిదా.. యువతి ఆత్మహత్య
అనంతపురం: ఊహించని విధంగా పెళ్లి వాయిదా పడటంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ గౌస్ మహమ్మద్‌బాషా తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఇల్లూరుకు చెందిన మస్తానయ్య, సుశీలమ్మ దంపతులు బతుకు తెరువు కోసం కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు వలస వెళ్లి అక్కడే జీవనం సాగిస్తున్నారు. కుమార్తె లక్ష్మీనరసమ్మ(23)కు గుంతకల్లు మండలంలోని ఓ యువకుడితో వివాహం నిశ్చయమైంది. ఈ నెల 14, 15 తేదీల్లో వివాహం జరగాల్సి ఉంది. వారం క్రితమే కుటుంబ సభ్యులంతా స్వగ్రామం ఇల్లూరుకు చేరుకున్నారు. పెళ్లి ఏర్పాట్లల్లో తలమునకలయ్యారు. ఈ క్రమంలో బంధువు ఒకరు చనిపోవడంతో పెళ్లి వాయిదా వేశారు. రెండేళ్ల క్రితం కూడా బంధువొకరు చనిపోవడంతో పెళ్లి ఆగింది. వరుస ఘటనలతో మనస్తాపం చెందిన లక్ష్మీనరసమ్మ తనకు కళ్యాణ యోగం లేదేమోనన్న బాధతో శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుంది. పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం పామిడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
సమంత పెళ్లి మళ్లీ జరుగుతుందా?
-
రెండేళ్ల వయసులో అనాథలా ఆశ్రమానికి : కట్ చేస్తే..!
అనాథ అయితేనేం.. ఒక పెద్ద కుటుంబమే ఆమెకు అండగా నిలబడింది. పెద్దలంతా, ముఖ్యంగా మహిళలంతా పెద్దిదిక్కులా మారి ఆమెకు ఘనంగా పెళ్లి చేయాలని నిర్ణయించారు ఇందులోనే భాగంగా హల్దీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రెండేళ్ల వయసులో అనాథలా రైల్వే స్టేషన్లో దొరికిన యువతి పెళ్లివార్త ఇపుడు సోషల్ మీడియాలో విశేషంగా నిలిచింది. పదండి ఆ వివరాలేంటో తెలుసుకుందాం. రాంగోపాల్‌పేట్: రెండేళ్ల వయసులో రైల్వే స్టేషన్లో దొరికి పోలీసుల సహకారంతో ఆశ్రమానికి వచ్చింది. నిర్వాహకులే కుటుంబ సభ్యులై అన్నీ చూసుకున్నారు. పాయల్‌కు రెండేళ్ల వయసున్నపుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉండగా పోలీసులు హిల్‌స్ట్రీట్ పాఠశాల ఆవరణలోని ఆశ్రయ్ రెయిన్బో హోంకు అప్పగించారు. రెండేళ్ల వయసు నుంచి అక్కడే ఉంటూ డిగ్రీ ఆమె ఇక్కడే పూర్తి చేసింది. ఇదీ చదవండి: Operation Sindoor సలాం, హస్నాబాద్!ఆ తరువాత ఆప్థమాలజీ కోర్సు పూర్తి చేసి ఓ ఆప్టికల్ షాపులో ఉద్యోగం చేస్తుంది. చందానగర్‌కు చెందిన యువకుడిని ఇష్టపడింది. దీంతో ఆశ్రమ నిర్వాహకులు పెళ్లిచేయాలని నిర్ణయించారు. ఆశ్రమం నిర్వాహకులు గ్రేస్.. కార్పొరేటర్ కొంతం దీపిక మరికొంత మంది దాతల దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని వెళ్లారు. బుధవారం రాత్రి ఆశ్రమం ఆవరణలో ఉత్సాహంగా మెహిందీ ఫంక్షన్ నిర్వహించారు. వైభవంగా ఆ మూడు ముళ్ల వేడుకను పూర్తిచేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.చదవండి: వెయిటర్ టు కరోడ్‌పతి: కె.ఆర్. భాస్కర్ ఇన్స్పైరింగ్ జర్నీ -
రెండో పెళ్లి.. కాబోయే భర్తను పరిచయం చేసిన జాను లిరి!
ఫోక్ డ్యాన్సర్ జాను లిరి కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతోంది. ఆమె రెండో పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా జాను ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ప్రముఖ ఫోక్ సింగర్ దిలీప్ దేవ్‌గన్‌ని పెళ్లి చేసుకోతున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ మేరకు ఇన్‌స్టాలో వీరిద్దరు కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ..‘ఆశ్విరదించండి’ అని రాసుకొచ్చింది.కాగా ఇదే విషయాన్ని తెలియజేస్తూ సింగర్ దిలీప్ దేవ్గన్ కూడా ఇన్‌స్టాలో ఓ వీడియాని విడుదల చేశారు. ‘అందరికి నమస్కారం. నా పాటలు ఆదరించి, నన్ను ఈ స్థాయికి నిలబెట్టిన ప్రేక్షక దేవుళ్లకు, మీడియా మీత్రులకు నమస్కారం. రీసెంట్గా నేను పోస్ట్ చేసిన ఓ ఫోటోని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. నిజంగానే నేను జాను పెళ్లి చేసుకోబోతున్నాం. ఒకరినొకరు ఇష్టం పడ్డాం. కలిసి బతుకాలనుకుంటున్నాం. అంతేకాని ఎలాంటి తప్పు చేయలేదు. మా ఇంట్లో ఒప్పుకున్నారు. జాను ఇంట్లో కూడా ఒప్పుకున్నారు. సోషల్ మీడియాలో ఎన్ని విమర్శలు చేసిన తట్టుకొని నిలబడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు సపోర్ట్ చేస్తున్నావారికి ధన్యవాదాలు’ అన్నారు.(ఇది చదవండి: రెండో పెళ్లి చేసుకుంటా.. అందరికీ సమాధానమిస్తా: జాను లిరి)నిన్న ఎమోషనల్.. నేడు గుడ్ న్యూస్ఫోక్ సాంగ్స్‌కు అదిరిపోయే స్టెప్పులేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న జాను.. ‘ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2 షో’ విన్నర్‌గా నిలిచి మరింత ఫేమస్ అయింది. నెట్టింట ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అదే సమయంలో జానుపై ట్రోలింగ్ కూడా భారీగానే పెరిగింది. ముఖ్యంగా ఆమె పర్సనల్ లైఫ్‌పై కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.ఈ విమర్శలను భరించలేకపోతున్నానంటూ భోరున విలపిస్తూ నిన్న ఓ వీడియోని షేర్ చేసింది. రెండో పెళ్లి చేసుకుంటే తప్పేంటంటూ..అందులో పేర్కొంది. చాలా మంది నెటిజన్స్ జాను ఎమోషనల్ వీడియోపై స్పందిస్తూ..ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇక నేడు కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాననే విషయాన్ని అధికారికంగా తెలియజేసింది. View this post on Instagram A post shared by Jimmidi Jhansi - Janulyri (@janulyri_official) -
భారత జవాన్‌కు భార్యగా పాకిస్తానీ మహిళా?
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పౌరుల వీసాలను భారత్ రద్దు చేయడం.. ఆసక్తికర కథనాలను కళ్ల ముందు ఉంచుతోంది. పదిహేడేళ్లుగా భారత్‌లో ఉంటూ ఇక్కడి ఎన్నికల్లో ఓటేసిన వ్యక్తి తిరిగి అక్కడికి వెళ్లిపోవడం లాంటివి మీడియాకు ఎక్కాయి. అయితే భారత జవాన్‌ను వివాహం చేసుకుని ఇక్కడే ఉండిపోవాలనుకున్న ఓ పాకిస్థానీ మహిళకు హోంశాఖ ఝలక్ ఇవ్వగా.. బార్డర్ దాటే చివరి నిమిషంలో కోర్టు నుంచి ఊరటతో ఆమె ఆగిపోవాల్సి వచ్చింది.పీటీఐ కథనం ప్రకారం.. పాక్ పంజాబ్‌కు చెందిన మినాల్ ఖాన్‌కు జమ్ము కశ్మీర్లో డ్యూటీ చేసే సీఆర్పీఎఫ్ జవాన్ మునీర్ ఖాన్ కు కిందటి ఏడాది మేలో ఆన్లైన్లో వివాహం(నిఖా) జరిగింది. ఈ ఏడాది మార్చిలో షార్ట్ టర్మ్ వీసా మీద ఆమె భారత్‌కు వచ్చింది. మార్చి 22వ తేదీతో ముగిసినప్పటికీ ఇక్కడే ఉండిపోయింది. అయితే ఆమె ఎలా ఉండగలిగిందో ఇప్పటికీ అర్థం కావట్లేదని అధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఈలోపు పహల్గాం దాడి తర్వాత పాకిస్థానీలు భారత్ ను వీడాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో మినాల్ కు కూడా నోటీసులు జారీ అయ్యాయి. ఏప్రిల్ 29వ తేదీలోపు పాక్ పౌరులు వెనక్కి వెల్లిపోవాలని కేంద్రం డెడ్ లైన్ విధించింది. ఈ క్రమంలో.. అట్టారీ వాఘా సరిహద్దుకు చేరుకుని బస్సులో కూర్చుందామె. అంతలోనే ఊహించని పరిణామం చోటు చేసుకుంది.ఆమె లాయర్ అంకూర్ శర్మ కోర్టు నుంచి స్టే ఆదేశాలతో అక్కడికి చేరుకున్నారు. తన వీసాను పొడిగించాలని ఆమె కేంద్ర హోం శాఖ వద్ద విజ్ఞప్తి చేసుకుందని.. అది ఇంకా పెండింగ్ లోనే ఉందని.. కాబట్టి కోర్టు ఈఅంశాన్ని పరిగణనలోకి తీసుకుని ఆమెను తరలించడంపై నిలిపివేత ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. దీంతో ఆమె బస్సు దిగి వెనక్కి వచ్చేసింది. ఈ ఎపిసోడ్లో ట్విస్ట్ ఏంటంటే.. ఆమె తరఫున వాదించిన అంకూర్ శర్మ బీజేపీ అధికార ప్రతినిధిగా గ్రేటర్ కశ్మీర్ ఓ కథనం ఇచ్చింది. అంతేకాదు ప్రధాని మోదీకి మినాల్ చేసిన విజ్ఞప్తిని కూడా ప్రముఖంగా ప్రచురించింది.‘‘మేం రూల్స్ అన్నీ ఫాలో అయ్యాం. సుదీర్ఘ వీసా కోసం నేను ఎప్పుడో దరఖాస్తు చేసుకున్నా. అది త్వరలోనే వస్తుందని అధికారులు మాకు చెప్పారు కూడా. ఆలోపు దాడి జరిగింది. నా భర్త నుంచి నన్ను విడదీసే ప్రయత్నం జరిగింది. నాలాగే.. ఎంతో మంది తమ తల్లులు, తండ్రుల నుంచి విడిపోవాల్సిన పరిస్థితి. ఇది మానవత్వం అనిపించుకోదు. ప్రధాని మోదీకి మేం చేసే విజ్ఞప్తి ఒక్కటే.. మాలాంటి వాళ్లకు న్యాయం చేయమని అని ఆమె గ్రేటర్ కశ్మీర్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.మినాల్‌పై అనుమానాలు?ఇదిలా ఉంటే.. మినాల్ ఖాన్ ఎపిసోడ్ సోషల్ మీడియాకు ఎక్కడం పెద్ద చర్చనీయాంశమైంది. ఒక జవాన్‌ను పాకిస్థాన్ మహిళను, అదీ ఆన్లైన్లో పరిచయంతో వివాహం చేసుకోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. షార్ట్ వీసా ముగిసిన తర్వాత కూడా నెలపైనే ఆమె ఎక్కడ నివసించగలిగిందని ప్రశ్నిస్తున్నారు. బహుశా ఇది ట్రాప్ అయి ఉండొచ్చని.. ఈ ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు.. మినాల్‌కు మద్దతుగానూ పలువురు కామెంట్లు చేస్తుండడం గమనార్హం. ఇదిలా ఉంటే.. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ పౌరులను వెనక్కి వెళ్లాలని కేంద్రం ఆదేశించింది. ఇందుకు తొలుత ఏప్రిల్ 29వ తేదీని గడువుగా ప్రకటించి.. ఆ తర్వాత మరొక రోజు పొడిగించింది. ఏప్రిల్ 30వ తేదీతో అట్టారీ వాఘా సరిహద్దును మూసేశారు. గత ఆరో రోజులుగా 786 మంది పాకిస్థానీలు దేశం విడిచి వెళ్లిపోగా, అందులో 55 మంది దౌత్యవేత్తలు, సహాయ సిబ్బంది ఉన్నారు. అలాగే.. పాకిస్థాన్ నుంచి 1,465 భారతీయులు తిరిగి వచ్చారని కేంద్రం ప్రకటించింది. -
మనవడితో 50 ఏళ్ల మహిళ పెళ్లి : ఫ్యామిలీని లేపేసేందుకు కుట్ర?
ఇటీవల అల్లుడితో అత్త పారిపోయిన సంఘటన మరిచిపోకముందే మరో విచిత్రకరమైన సంఘటన చోటు చేసుకుంది. తాజాగా ఓ బామ్మ, వరుసకు మనవడయ్యే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం అందర్నీ షాక్‌కు గురి చేసింది. ప్రస్తుతం ఈ స్టోరీ నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది. అతడిని పెళ్లి చేసుకోవడం వెనుక ఉద్దేశం మరేదైనా ఉందా? అసలేం జరిగింది తెలుసుకుందాం.ఉత్తర్‌ప్రదేశ్ అంబేద్కర్ నగర్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన సంచలనంగా మారింది. బందుత్వాలు, మానవ విలువలకు తిలోదకాలిచ్చి మనవడి వరసయ్యే వ్యక్తిని ఓ బామ్మ పెళ్లి చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 50 ఏళ్ల మహిళ ఇంద్రావతి తన 30 ఏళ్ల మనవడు ఆజాద్‌తో పారిపోయి గోవింద్ సాహిబ్ ఆలయంలో వివాహం చేసుకుంది. సింధూరం పూసుకుని , పవిత్ర అగ్ని చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసి, గ్రామం నుండి పారిపోయారు. ఇందుకోసం నలుగురు పిల్లలు, భర్త ( ఇద్దరు కుమారులు ,ఇద్దరు కూతుళ్లు) కుటుంబాన్ని వదిలేసింది. ఇంతవరకూ ఓకే గానీ. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే...?ట్విస్ట్ ఏంటంటే..?వారిద్దరూ అంబేద్కర్‌నగర్‌లో నివసించేవారు. ఈక్రమంలోనే ఇంద్రావతి, ఆజాద్ ప్రేమలో పడ్డారు. ఇరు కుటుంబాల మధ్య సాన్నిహత్యం కారణంగా వీరిని పెద్దగా అనుమానించలేదు. అయితే ఇంద్రావతి భర్త చంద్రశేఖర్, వారు పారిపోవడానికి నాలుగు రోజుల ముందు వీరిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకోవడం చూశాడు. వద్దని వారించాడు. నచ్చజెప్పాలని ప్రయత్నించాడు. వారి వ్యవహారాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. కానీ ఇద్దరూ దానికి సుతరామూ అంగీకరించలేదు. ఇక అంతే తమకు అడ్డురాకుండా ఎలాగైనా భర్తను తప్పించాలని ప్లాన్ వేసింది. ఇందుకోసం ఇద్దరూ కలిసి కుట్రపన్నారు. ఇంద్రావతి ఆజాద్‌తో కలిసి వారికి విషం ఇవ్వడానికి కుట్ర పన్నిందని ఇంద్రావతి భర్త చంద్రశేఖర్ ఆరోపణ.చదవండి: Vaibhav Suryavanshi Success Story: తండ్రి త్యాగం, పట్టుదలతో 13 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఇదీ టాలెంట్!ఇదే చంద్రశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్రమంగా ఆజాద్‌ను పెళ్లి చేసుకోవడంతో పాటు, తనతోపాటు తన నలుగురు పిల్లల్ని హత మార్చేందుకు వారిద్దరూ కుట్ర చేశారని పోలీసులకు చేసిన ఫిర్యాదులో బాధితుడు వాపోయాడు. అయితే వారిద్దరూ మేజర్లు కావడంతో పోలీసులు చంద్రశేఖర్ ఫిర్యాదును తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో తన భార్యకు పెద్ద కర్మ నిర్వహించి "చనిపోయినట్లు" ప్రకటించాలని నిర్ణయించు కున్నాడు. కాగా ఇంద్రావతి చంద్రశేఖర్‌కు రెండో భార్య. ఉద్యోగరీత్యా అతను ఎక్కువ క్యాంప్‌లకు వెళ్లేవాడట. ఈ సమయంలో ఇంద్రావతి, అజాద్ మధ్య సాన్నిహిత్యం పెరిగిందని భావిస్తున్నారు. ఇదీ చదవండి: Akshaya Tritiya 2025 పదేళ్లలో పసిడి పరుగు, కొందామా? వద్దా? -
Attari Border Closure : పెళ్లి ఆగిపోయింది!
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి పాకిస్తాన్, భారత్ దేశాల మధ్య ఉద్రికత్తకి దారి తీసింది. ఈ సంఘటన నేపథ్యంలో భారత ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంది. ముఖ్యంగా ఐదు అంశాల కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది.ఇందులో అట్టారి-వాఘా సరిహద్దును తక్షణమే మూసివేయడం. ఈ ఆంక్షల నేపథ్యంలో రాజస్థాన్‌కు చెందిన సైతాన్‌సింగ్ కలల వివాహం ఇప్పుడు నిరవధికంగా వాయిదా పడింది. సరిహద్దులు మూసివేయడంతో నిశ్చితార్థం దాకా వచ్చిన పెళ్లి నిలిచిపోయిందని ఆయన వాపోయాడు.రాజస్థాన్‌కు చెందిన సైతాన్‌సింగ్‌కు అట్టారీ సరిహద్దు దాటి పాకిస్థాన్‌లో ఉన్న యువతితో వివాహం నిశ్చయమైంది. పెళ్లికి ఇరు కుటుంబాలు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. వరుడి బంధువు చాలామంది ఇప్పటికే పాకిస్థాన్‌కు చేరుకున్నారు. ఇంతలోనే ఉగ్రవాదులు పహల్గాంలో మారణహోమం సృష్టించారు. 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారత్ పాకిస్తాన్‌పై ఆంక్షలు విధించింది. సరిహద్దులను మూసి వేయడంతో వధువు ఇంటికి వెళ్లే అవకాశాలు మూసుకు పోయాయి. దీంతో సైతాన్‌సింగ్ ఏం చేయాలోఅర్థం కావడం లేదంటూANIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వాపోయారు.#WATCH | Shaitan Singh, a Rajasthan citizen, who was scheduled to cross the Amritsar's Attari border to enter Pakistan for his wedding today, says, " What the terrorists have done is wrong...We are not being allowed to go (to Pakistan) as the border is closed...Let us see what… pic.twitter.com/FEEuf1GxZG— ANI (@ANI) April 24, 2025"ఉగ్రవాదులు చేసింది తప్పు... సరిహద్దు మూసివేతో(పాకిస్తాన్‌కు) వెళ్లడానికి అనుమతించడం లేదు... ఇప్పుడు ఏమి జరుగుతుందో చూద్దాం." అన్నారు. అటు సైతాన్ సింగ్ సోదరుడు సురీందర్ సింగ్ కూడా మీడియాతో మాట్లాడుతూ, "పర్యాటకులపై (పహల్గామ్లో) జరిగిన దాడి చాలా తప్పు. దురదృష్టకర దాడి భారతదేశంలోని అనేక మంది అమాయక పౌరుల జీవితాలతో తమ కుటుంబాన్ని ప్రభావితం చేసిందన్నారు.ఇదీ చదవండి: రూ. 40 లక్షల నుంచి 20 కోట్లకు ఒక్కసారిగా జంప్, లగ్జరీ కారు : ఎవరీ నటుడు కాగా ఈ ఉగ్రదాడి తరువాత ప్రభుత్వం ఇప్పటివరకు ప్రకటించిన ఇతర చర్యలలో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, పాకిస్తాన్ జాతీయులకు సార్క్ వీసా మినహాయింపు పథకాన్ని రద్దు చేయడం, పాకిస్తాన్ సైనిక సలహాదారులను బహిష్కరించడం , ఇస్లామాబాద్‌లో దౌత్య సిబ్బందిని తగ్గించడం ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. జమ్మూ-రాజౌరి-పూంచ్ జాతీయ రహదారిపై సైనిక నిఘా పెరిగింది, చెక్‌పోస్టుల వద్ద గట్టి నిఘా కొనసాగుతోంది. -
ఇద్దరు వధువులు.. ఒక వరుడు
ఆదిలాబాద్ జిల్లా: వివాహం చేసుకునేందుకు అమ్మాయిలు దొరక్క చాలా మంది యువకులు ‘పెళ్లి కాని ప్రసాద్‌లు’గా మిగిలిపోతున్నారు. కొందరు ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకుంటున్నారు. ఒక వైపు పరిస్థితులు ఇలా ఉంటే.. మరో వైపు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ గిరిజన యువకుడు ఇద్దరు యువతులతో ప్రేమాయణం నడిపి, ఇద్దరినీ ఒకే మండపంలో వివాహం చేసుకున్నాడు. జైనూర్ మండలం అడ్డెసరాకు చెందిన ఆత్రం రంభబాయి, భాద్రుషావ్ దంపతుల కుమారుడు ఆత్రం చత్రుషావ్.. అదే గ్రామానికి చెందిన సెడ్మకి సోమిత్రబాయి, భీంరావ్‌ల కుమార్తె జంగుబాయి నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం సాంగ్వి గ్రామానికి చెందిన గోడం రంభబాయి, యాదోరావ్ కుమార్తె సోన్‌దేవితో చత్రుషావ్‌కు పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మధ్య ఏడాదిగా ప్రేమాయణం సాగుతోంది. విషయం తెలుసుకున్న జంగుబాయి రాయిసెంటర్‌ను ఆశ్రయించింది. రాయిసెంటర్ పెద్దలు 15 రోజుల క్రితం మూడు కుటుంబాలతో చర్చించారు. యువతులిద్దరూ చత్రుషావ్‌తో కలిసి ఉండేందుకు ఒప్పుకున్నారు. దీంతో గురువారం బంధువుల సమక్షంలో వరుడి స్వగృహంలో వీరికి వివాహం జరిపించారు. కాగా, ఇటీవల ఇదే జిల్లాలో సిర్పూర్(యూ) మండలం గుంనూర్ (కె)కు చెందిన ఓ యువకుడు కూడా ఇద్దరు యువతులను పెళ్లి చేసుకోవడం తెలిసిందే. -
కుటుంబ సమేతంగా పెళ్లి వేడుకలో అల్లు అర్జున్ సందడి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 మూవీతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను తిరగరాసింది. సుకుమార్- బన్నీ కాంబోలో వచ్చిన పుష్పకు సీక్వెల్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం బన్నీ జవాన్ డైరెక్టర్ అట్లీతో జతకట్టనున్నారు. వీరిద్దరి కాంబోలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.తాజాగా ఓ పెళ్లి వేడుకలో అల్లు అర్జున్ సందడి చేశారు. తన కజిన్ పెళ్లికి ఆయన హాజరయ్యారు. ఈ పెళ్లికి అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి తమ ఇద్దరు పిల్లలతో కలిసి వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలను టీమ్ అల్లు అర్జున్ ట్విటర్లో షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. Bunny anna : Yesesaava 😳🤣@alluarjun #AA22 pic.twitter.com/6MWEZ36JjK— Allu Babloo AADHF (@allubabloo) April 24, 2025 Icon Star @alluarjun attended his cousin’s wedding, joining the family in the special celebration. ✨#AlluArjun pic.twitter.com/HFR29rUZp1— Team Allu Arjun (@TeamAAOfficial) April 23, 2025 -
రోజుకు 121 రూపాయలతో రూ.27 లక్షలు చేతికి: ఈ పాలసీ గురించి తెలుసా?
సంపాదించిన మొత్తంలో ఎంతో కొంత పొదుపు చేయాలని అందరూ అనుకుంటారు. అయితే ఎప్పుడు, ఎక్కడ, ఎంత ఇన్వెస్ట్ చేయాలనే విషయాల మీద బహుశా కొందరికి అవగాహన ఉండకపోవచ్చు. మనదేశంలో ముఖ్యంగా.. ఆడపిల్లల గురించి ఆలోచించేవారి సంఖ్య కొంత ఎక్కువే. ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా ఆలోచించేవారు ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీ ఎంచుకోవచ్చు. ఇందులో రోజుకు రూ. 121 పొదుపు చేస్తే.. పెళ్లి చేసే నాటికి రూ. 27 లక్షలు చేతికి వస్తాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ప్రవేశపెట్టిన 'ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీ'.. తల్లిదండ్రులు తమ కుమార్తె భవిష్యత్తును సురక్షితంగా ఉంచడంలో సహాయపడటానికి ప్రత్యేకంగా రూపొందించింది. ఇందులో మీరు రోజుకు 121 రూపాయలు డిపాజిట్ చేస్తే.. నిర్దిష్ట సమయం తరువాత రూ. 27 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ చేతికి అందుతాయి. ఇది మీరు ఎన్ని సంవత్సరాలు డిపాజిట్ చేస్తున్నారు, వచ్చే బోనస్ ఎంత అనేదానిపై ఆధారపడి ఉంటుంది.➤కనీస రోజువారీ పెట్టుబడి: రూ. 121➤మెచ్యూరిటీ మొత్తం: రూ. 27 లక్షల వరకు (ఎన్ని సంవత్సరాలు డిపాజిట్ చేస్తున్నారు & బోనస్ ఆధారంగా)➤పాలసీ కాలపరిమితి: 13 నుంచి 25 సంవత్సరాలుఇదీ చదవండి: ఐదేళ్లలో రూ.20 లక్షలు: ఈ పోస్టాఫీస్ స్కీమ్ గురించి తెలుసా?ఉదాహరణకు.. మీ కుమార్తెకు 5 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు మీరు రోజుకు రూ. 121 పెట్టుబడి పెట్టడం ప్రారంభించారని అనుకుందాం. అలా మీరు 25 సంవత్సరాలు డిపాజిట్ చేస్తే.. వచ్చే ఎల్ఐసీ ద్వారా బోనస్‌లు, లాయల్టీ వంటి వాటితో కలిపి మీ మొత్తం మెచ్యూరిటీ మొత్తం రూ. 27 లక్షలు దాటవచ్చు. ఈ పథకంలో లబ్ధిదారు తండ్రి వయస్సు కనీసం 30 సంవత్సరాలు, కుమార్తె వయస్సు కనీసం ఒక సంవత్సరం ఉండాలి.ఇదీ చదవండి: విడాకులు తీసుకుంటే క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది!.. ఎలా అంటే?ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీ అనేది ఆదాయ పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80సీ కిందికి వస్తుంది. కాబట్టి వినియోగదారులు రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. పాలసీదారు స్కీమ్ మెచ్యూరిటీ కాలానికి ముందే కొన్ని అవాంఛనీయ కారణాల వల్ల మరణిస్తే.. కుటుంబ సభ్యులకు రూ. 10 లక్షల వరకు అందుతాయి. అంతే కాకుండా కుటుంబ సభ్యులు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. ప్రీమియం గడువు ముగిసిన తరువాత మొత్తం రూ. 27 లక్షలు నామినికీ అందిస్తారు.ఎల్ఐసీ కన్యాదాన్ పథకానికి అప్లై చేసుకోవడానికి.. ఐడెంటిటీ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, నివాస ఋజువు, కుమార్తె బర్త్ సర్టిఫికెట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో వంటివి అవసమవుతాయి. ఈ పథకం గురించి తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ లేదా సమీపంలోని ఎల్ఐసీ కార్యాలయాన్ని సందర్శించవచ్చు. -
అక్కడ అబ్బాయి.. ఇక్కడ అమ్మాయి
పెదవడ్లపూడి(మంగళగిరి): ప్రేమించుకున్న జర్మనీ అబ్బాయి ఆంధ్రా అమ్మాయి ఇరు కుటుంబాల అంగీకారంతో ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరికి సమీపంలోని పెదవడ్లపూడిలో ఒక్కటయ్యారు. వీరి వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం వైభవంగా జరిగింది. పెదవడ్లపూడికి చెందిన సుందర్శనం రవికుమార్, లక్ష్మీ దంపతుల కుమార్తె మౌనిక జర్మనీలో పీహెచ్డీ చేస్తూ ఉద్యోగం చేస్తున్నారు. అదే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న జర్మనీకి చెందిన ఫాబియన్ డువెన్ బేక్‌తో పరిచయమై అది ప్రేమగా మారింది. దీంతో ఇరువురూ తమ ఇళ్ళల్లో తల్లిదండ్రులకు తెలియజేసి అందరి అంగీకారంతో పెదవడ్లపూడి సాయిబాబా ఆలయంలో వైభవంగా వివాహం చేసుకున్నారు. -
అయ్యా.. సీఎంసారూ.. మీరు వచ్చిననాడే నా పెళ్లి!
ఖమ్మం: ‘సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) వచ్చిన రోజే నా పెళ్లికి ముహూర్తం ఖరారు చేస్తా’ అంటూ కారేపల్లి మండలం మేకలతండాకు చెందిన ఓ కాంగ్రెస్ కార్యకర్త అంటున్నాడు. మేకలతండాకు చెందిన భూక్యా గణేష్‌కు ఇటీవల పెళ్లి నిశ్చితార్థం అయింది. కాగా, గణేష్‌కు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అన్నా, సీఎం రేవంత్‌రెడ్డి అన్నా చాలా ఇష్టం. అందుకే.. రేవంత్‌రెడ్డి వస్తేనే పెళ్లి చేసుకుంటానంటూ భీష్మించాడు. ఆయనకు కుదిరిన రోజే పెళ్లి తేదీ ఖరారు చేస్తా అంటున్నాడు. ఎలాగైనా సీఎంను రప్పించాలంటూ ఆదివారం వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్‌కు వినతిపత్రం అందించాడు. దీంతో అతడి వినతిపై ‘రెస్పెక్టెడ్ సీఎం సార్, ప్లీజ్ కైండ్లీ అటెండ్ ది మ్యారేజ్.. వెరీ వెరీ ఇంపార్టెంట్ లీడర్ ఇన్ సింగరేణి మండల్, ప్లీజ్ ఎనీ డేట్ డు ఫిక్స్’ అని రాసి సంతకం చేసిన ఎమ్మెల్యే సీఎం ఆఫీస్‌కు పంపించారు. కాగా గణేష్ పెళ్లికి సీఎం వస్తారా? అప్పటిదాకా అతడు పెళ్లి చేసుకుంటాడా లేదా అని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.గణేష్ వినతిపై సీఎంను రావాలని కోరుతూ రాసిన ఎమ్మెల్యే (ఇన్ సెట్) వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్‌కు వినతి పత్రం అందజేస్తున్న గణేష్ -
నాకు నువ్వు వద్దు!
నగరానికి చెందిన ఓ యువజంటకు ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహం జరిగింది. అన్యోన్యంగా సాగాల్సిన వీరి కాపురంలో పెళ్లయిన నెలరోజులకే చిచ్చు మొదలైంది. ఇంట్లో నెలకొన్న చిన్నచిన్న సమస్యలు వీరి గొడవకు ప్రధాన కారణంగా మారాయి. గొడవ పెద్దదై ఈ యువజంట పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో కొద్దిరోజులుగా పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. నూరేళ్ల జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచిస్తున్నారు.నగరానికి చెందిన యువకుడికి పొరుగు జిల్లాకు చెందిన యువతితో గతేడాది వివాహం జరిగింది. ఇద్దరూ ఉద్యోగులు కావడంతో కొన్నాళ్లకు ఆధిపత్య పోరు మొదలైంది. విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎవరికి వారు జీవిస్తూ.. విడాకుల కేసు నమోదు చేసుకున్నారు. ఎందుకని ఆరా తీసిన పోలీసులు, న్యాయవాదులు ఆ జంట చెప్పిన కారణంతో అవాక్కయ్యారు. దీనికి పూర్తి కారణం ఇరువురి తల్లిదండ్రుల అతిజోక్యమేనని కౌన్సెలింగ్‌లో పోలీసులు నిర్ధారణకు వచ్చారు.ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ, నాతిచరావిు..! అని ప్రమాణాలు చేసుకుని ఒకటవుతున్నారు. అగ్నిహోత్రం చుట్టూ.. ఏడడుగులు నడిచి.. మూడుముళ్లతో వివాహ బంధంలో అడుగిడుతున్నారు. జీలకర్ర.. బెల్లం తలపై పెట్టుకుని ఒకరికొకరు నూరేళ్లు కలిసుంటామని బాస చేసుకుని సరికొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకుని, జీవితంలో కష్టాసుఖాలను సమానంగా పంచుకోవల్సిన కొందరు కొత్త జంటలు ‘ఆధిపత్య’ పోరుతో ఆదిలోనే తమ నూరేళ్ల సంసార జీవితాన్ని ముక్కలు చేసుకుంటున్నారు. మూణ్నాళ్లకే ‘నాకు నువ్వు వద్దు’ అంటూ.. పోలీసుస్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు. కోర్టుల్లో విడాకులకు దరఖాస్తు చేసుకుంటున్నారు. జిల్లాలో రోజురోజుకు ఠాణామెట్లు ఎక్కుతున్న జంటల సంఖ్య పెరుగుతుండగా.. జిల్లా కోర్టులోనూ విడాకుల కేసుల సంఖ్య అదేస్థాయిలో కొనసాగుతోంది. – కరీంనగర్క్రైంచిన్న చిన్న కారణాలతో..⇒నిండు నూరేళ్లు అన్యోన్యంగా జీవించాల్సిన కొన్ని జంటలు చిన్నచిన్న కారణాలతో మూడుముళ్ల బంధాన్ని తెంచుకుంటున్నాయి. ⇒బతుకుపోరులో.. ఉద్యోగాల వేటలో పెళ్లయిన వెంటనే దూర ప్రాంతాల్లో జీవిస్తూ.. వేరు కాపురాలు పెడుతున్నారు.⇒ ఉమ్మడి కుటుంబం ఊసే లేకపోతుండగా.. దంపతుల మధ్య అహం, అపార్థం, అనుమానాలు పెరుగుతున్నాయి. ⇒నాలుగు గోడల మధ్య సర్దుకుపోవాల్సిన విషయాలు రోడ్డెక్కుతున్నాయి.⇒ఇద్దరి మధ్య అగాథం పెరిగి, పోలీసుస్టేషన్, కోర్టు మెట్లు ఎక్కేలా చేస్తున్నాయి.⇒పెద్దలు కుదిర్చినా.. ప్రేమించి పెళ్లి చేసుకు న్నా.. చాలా జంటల్లో అదే తీరు కనిపిస్తోంది.అవగాహన అవసరం⇒కొత్తగా పెళ్లయిన దంపతుల మధ్య విబేధాలు వచ్చినప్పుడు ఇరువురి తల్లిదండ్రులు నచ్చజెప్పాలి. సమస్యను ఓపిగ్గా విని, పరిష్కారానికి కృషి చేయాలి.⇒అలా కాకుండా చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల నే రెచ్చగొడుతుండడం బాధ కలిగించే అంశమని మహిళా పోలీసు స్టేషన్‌కు చెందిన ఓ అధికారి వెల్లడించారు.⇒అనుమానం, హింస, దాంపత్య బంధం విలువ తెలియకపోవడం, ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం, హంగుఆర్భాటాలకు పోయి ఆర్థిక పరిస్థితి చితికిపోయి, చిన్న కారణాలతోనే విడాకుల వరకు వెళ్తున్నారని, ఆవేశంతో కోర్టు మెట్లు ఎక్కుతున్నారని వివరించారు.⇒ప్రేమ వివాహం చేసుకున్న వారు సైతం చాలామంది కొన్నాళ్లకే ఠాణామెట్లు ఎక్కుతున్నారని తెలిపారు. ⇒విడాకులు తీసుకుంటున్న, పోలీసుస్టేషన్‌కు వస్తున్న జంటల్లో ఎక్కువగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వారే ఉంటున్నారని ఓ సీనియర్ కౌన్సిలర్ పేర్కొన్నారు.ఆధిపత్య ధోరణి వద్దు దాంపత్య జీవితానికి విలువ తెలియక చాలా మంది విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. వివాహం అనంతరం ఎలా వ్యవహరించాలి..? ఎలా ఉండాలనే విషయాలపై పెద్దలు అవగాహన కల్పించాలి. ఈ రోజుల్లో పెళ్లికి ముందే దాంపత్య జీవితంలో ఎలా ఉండాలనే విషయాలు తెలిపే ప్రి మారిటల్ కౌన్సెలింగ్ తప్పనిసరి అని నా భావన.– అట్ల శ్రీనివాస్‌రెడ్డి, సైకాలజిస్ట్తొందరపాటుతోనే..దంపతుల మధ్య గొడవలు వచ్చినప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ తరం పిల్లలకు దాంపత్య బంధం విలువ సరిగా తెలియడం లేదు. పెళ్లయ్యాక ఇద్దరూ ఉద్యోగాలు చేయడంతో స్వేచ్ఛాయుత వాతావరణానికి అలవాటు పడి ఒకరి మాట ఒకరు వినడం లేదు. చిన్న గొడవకే ఠాణాకు వస్తున్నారు. అనుమానం, తల్లిదండ్రుల మితివీురిన జోక్యం, దురలవాట్లు, గృహహింస, కుటుంబానికి సమయం ఇవ్వకపోవడం మా వద్దకు వచ్చే దంపతుల మధ్య గొడవకు ప్రధాన కారణాలు. – శ్రీలత, మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ, కరీంనగర్ -
నటి అభినయ దంపతులను ఆశీర్వదించిన ఓంకార్, సముద్రఖని (ఫోటోలు)
-
పెళ్లిపీటలపై వధువు తల్లి.. అప్పుడే మొదలైంది అసలు కథ!
లక్నో: ఓ పెళ్లి పందిరిలో ఘరానా మోసం వెలుగు చూసింది. వధువు బదులు ఆమె తల్లి పెళ్లి పీఠలెక్కింది. పెళ్లి తంతులో వధువు తన అసలు పేరు బదులు మరో పేరు పలకడంతో పక్కనే ఉన్న వరుడికి అనుమానం వచ్చింది. ముసుగు తొలగించి చూడగా.. అసలు విషయం బయటపడింది. దీంతో తాను మోసపోయానని వరుడు గ్రహించాడు. వధువు బదులు ఆమె తల్లి ఎందుకు ఉందని ప్రశ్నించారు. వధువు తరుఫు కుటుంబ సభ్యులు బెదిరించడంతో పెళ్లి పంచాయితీ పోలీస్‌స్టేషన్‌కు చేరింది.పోలీసుల వివరాల మేరకు.. ఉత్తరప్రదేశ్ (uttar pradesh) మీరట్‌లో (meerut) బ్రహ్మపురికి చెందిన వరుడు (22)కు శామలీ జిల్లావాసి వధువు (21)తో పెళ్లి కుదిరింది. కుదుర్చుకున్న సమయానికి పెళ్లి చేసేందుకు కుటుంబసభ్యులు సిద్ధమయ్యారు. పెళ్లి తంతు మొదలైంది. అయితే, సరిగ్గా అప్పుడే వధువు తన పేరు చెప్పాల్సి ఉంది. బదులుగా ఆమె తల్లి పేరు చెప్పింది. ఇదేంటని బిత్తరపోయిన పెళ్లి కొడుకు వధువు ధరించిన ముసుగును తొలగించాడు.అంతే, వధువు బదులు ఆమె తల్లి ఉందని చూసి కంగుతిన్నాడు. ఇదే విషయాన్ని పెళ్లి పెద్దల్ని ప్రశ్నించాడు. పెళ్లి పెద్దలు సైతం వధువు తల్లికి మద్దతు పలికారు. వధువు తల్లిని పెళ్లి చేసుకోవాల్సిందేనని వరుడిని హెచ్చరించారు. లేదని అల్లరి చేస్తే రేప్ కేసులో ఇరికిస్తామని బెదిరించారు. తాను పూర్తిగా మోసపోయానని గ్రహించిన వరుడు పోలీసుల్ని ఆశ్రయించాడు.‘నాకు వధువు బదులు ఆమె తల్లిని ఇచ్చి పెళ్లి చేసేందుకు కుట్ర చేశారు. పెళ్లి కోసం రూ.5లక్షలు ఖర్చు చేశా. మీరే న్యాయం చేయండి’ అంటూ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు -
అమ్మాయికి అంకుల్‌తో పెళ్లి.. ఆగింది ఇలా..!
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణస్వామివారి దేవస్థానంలో శనివారం తెల్లవారుజామున ఒక పెళ్లి అర్థాంతరంగా ఆగిపోయింది. రామాలయం వద్ద గల విశ్రాంతి మంటపంలో జరుగుతున్న ఒక వివాహంలో వధువు గట్టిగా విలపించడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డులు ఆమె వద్దకు వెళ్లి ప్రశ్నించారు. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని ఆమె తెలిపింది. తన వయసు 22 ఏళ్లు అని, తన కంటే 20 ఏళ్లు పెద్దయిన వ్యక్తితో తనకు వివాహం జరిపిస్తున్నారని విలపించింది. దీంతో సెక్యూరిటీ గార్డులు వెంటనే ఆ పెళ్లిని నిలిపివేసి, వధూవరులను, ఇరువైపులా పెళ్లి పెద్దలను స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ ఎస్సై శ్రీహరి రాజు వధువును ప్రశ్నించగా తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని, పెళ్లి కొడుకు వయసు 42 ఏళ్లు అని తెలిపింది. అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేయడం చట్టరీత్యా నేరమని చెప్పి వధూవరుల కుటుంబ సభ్యులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించేశారు. పెళ్లి చేయించేందుకు అంగీకరించిన పురోహితుడిని కూడా మందలించారు. కాగా.. వధూవరులిద్దరిదీ నెల్లూరు జిల్లానే. వధువు ఉతుకూరుకు, వరుడు కందుకూరుకు చెందినవారు. బలిజ సామాజికవర్గానికి చెందిన వధువు కుటుంబీకులు పేదవారు. అమ్మాయికి పెళ్లి చేసే స్థోమత లేక బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వరుడికి ఇచ్చి పెళ్లి చేసేందుకు నిశ్చయించినట్టు తెలిసింది. దీనిపై ఎవ్వరూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయనందున కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. -
అయ్యో ఎంత విషాదం : కన్నీటి సుడుల మధ్య ప్రియురాలితో పెళ్ళి
చెట్టంత ఎదిగిన పిల్లలకు వేడుకగా పెళ్లి చేయాలని భావిస్తారు ఏ తల్లిదండ్రులైనా. అలాగే కనిపెంచిన అమ్మానాన్నల కనుల విందుగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాలి ఆశిస్తారు ఏ బిడ్డలైనా. కానీ కన్నకొడుకు మూడు ముళ్ల ముచ్చట చూడాలన్న కోరిక తీరకముందే ఓ తండ్రి అనంతలోకాలకు వెళ్లిపోయాడు. దీంతో పుట్టెడు దుఃఖ్ఖంతో కొడుకు తీసుకున్న నిర్ణయం పలువురి చేత కంట తడి పెట్టిస్తోంది.Cuddalore Marriage | அப்பாவின் உடல் முன்பு நடைபெற்ற மகன் திருமணம்#cuddalore #viralvideo #virudhachalam #marriage #death pic.twitter.com/wUJW3qgvov— Thanthi TV (@ThanthiTV) April 18, 2025తండ్రి నిండు మనసుతో అక్షింతలేసి ఆశీర్వదిస్తుండగా, తన ప్రియురాల్ని పెళ్లి చేసుకోవాలని భావించిన కొడుక్కి తీరని వేదని మిగిల్చిన ఘటన ఇది. దీంతో తండ్రి భౌతిక దేహం సాక్షిగా అమ్మాయి మెడలో తాళి కట్టాడు. వధూవురులతోపాటు, బంధుమిత్రుల అశ్రు నయనాల మధ్య జరిగిన ఈ పెళ్లి తమిళనాడులోని కడలూర్ జిల్లాలో చోటుచేసుకుంది. భౌతికంగా తన తండ్రి పూర్తిగా మాయం కాకముందే, ఆయన ఆశీస్సులు పొందాలనే ఉద్దేశంతో ప్రియురాలిని ఒప్పించి మరీ తండ్రి మృతదేహం ఎదుటే ఆమెకు తాళి కట్టారు. బోరున విలపిస్తూ తండ్రి ఆశీస్సులు తీసుకోవడం అక్కడున్నవారినందరి హృదయాలను బద్దలు చేసింది. ఉబికి వస్తున్న కన్నీటిని అదుముకుంటూ బంధువులు, స్థానికులు కూడా వారిని ఆశీర్వదించారు.ఇదీ చదవండి:అనేక విషాద గాథల మధ్య.. స్ఫూర్తినిచ్చే జ్యోతి, శోభనాద్రి దాంపత్యం!కవణై గ్రామానికి చెందిన సెల్వరాజ్(63) రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. ఆయన రెండో కుమారుడు అప్పు లా కోర్సు చదువుతున్నాడు. గత నాలుగేళ్లుగా విజయశాంతి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. తమ ప్రేమ సంగతిని ఇంట్లోని పెద్దలతో చెప్పారు. ఇరు కుటుంబాల అనుమతితో త్వరలోనే పెళ్లి చేసుకోవాలను కున్నారు. విరుధాచలం కౌంజియప్పర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విజయశాంతి డిగ్రీ చదువుతోంది. చదువు పూర్తైన తరువాత వివాహంచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలేదని ఆగవు కొన్ని..అన్నట్టు విధి మరోలా ఉంది. అప్పు తండ్రి సెల్వరాజ్ అనారోగ్యంతో అనూహ్యంగా కాలం చేశాడు. దీంతో గుండె పగిలిన అప్పు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
ప్రియుడితో మాజీ సీఎం కుమార్తె పెళ్లి : వైభవంగా
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ,ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. అరవింద్ కేజ్రీవాల్, సునీతా దంపతుల కుమార్తె హర్షిత వివాహం ఘనంగా జరిగింది. ఐఐటీలో క్లాస్మేట్, ప్రియుడు సంభవ్ జైన్‌ను వివాహమాడింది హర్షిత. బంధుమిత్రుల సమక్షంలో నిన్న (ఏప్రిల్ 18) ఢిల్లీలోని కపుర్తల హౌస్‌లో వైభవంగా ఈ మూడుముళ్ల వేడుక జరిగింది. ఈ గ్రాండ్ వివాహానికి పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తదితర రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట సందడిగా మారాయి.డిల్లీ మాజీ సీఎం కుమార్తె హర్షిత కేజ్రీవాల్ ప్రీ-వెడ్డింగ్ వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్హంగా అరవింద్ కేజ్రీవాల్ సతీమణితో అల్లు అర్జున్, రష్మిక మందన్న నటించిన హిట్ చిత్రం పుష్ప సినిమాలోని పాటకు స్టెప్పులేశారు. ఏప్రిల్ 20న ఢిల్లీలో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారని సమాచారం. చదవండి: ఇషా అంబానీ డైమండ్ థీమ్డ్ లగ్జరీ ఇల్లు : నెక్ట్స్ లెవల్ అంతే!అందంగా వధూవరులుతన వెడ్డింగ్ డే కోసం, ఎరుపు లెహంగాలో గోల్డెన్ కలర్ వర్క్ బ్లౌజ్‌తో కళకళలాడింది. ఆమె ధరించినవీల్కూడా హైలైట్‌గా నిలిచింది .సంభవ్ తెల్లటి రంగు షేర్వానీ, తలపాగా నల్ల సన్ గ్లాసెస్ క్రిస్పీగా, రాయల్‌గా కనిపించాడు.ఇక అరవింద్ తెల్లటి షేర్వానీలో కనిపించగా, సునీత పింక్ చీర, కమర్బంద్, గులాబీ రంగు చూడీల సెట్, చక్కటి హెయిర్ బన్‌తో అత్తగారి హోదాలో హుందాగా కనిపించారు.ఎవరీ సంభవ్ జైన్హర్షిత, సంభవ్ IIT ఢిల్లీలో కలుసుకున్నారు. కెమికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. 2018లో గ్రాడ్యుయేషన్ తర్వాత, గురుగ్రామ్‌లోని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG)లో పనిచేసింది హర్షిత. ఆ తరువాత సంభవ్తో కలిసి, బాసిల్ హెల్త్ అనే స్టార్టప్‌ను మొదలు పెట్టింది. కస్టమర్లకు ఆరోగ్యకరమైన, అనుకూలీకరించిన భోజనాన్ని అందించడమే దీని లక్ష్యం.. హర్షిత కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నపుడు మద్యం సేవించే అలవాటు ఉన్నప్పుడు ఈ ఆలోచన ఆమె మనసులోకి వచ్చిందట. ఇక హర్షిత సోదరుడు పుల్కిత్ కూడా IIT ఢిల్లీలో చదువుతున్నాడు. -
60 ఏళ్ల వయసులో బీజేపీ దిలీప్ ఘోష్ వివాహం.. IPL మ్యాచ్‌తో ప్రేమ!
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బెంగాల్ బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ దిలీప్ ఘోష్ 60 ఏళ్ల వయసులో బ్రహ్మచర్యాన్ని వీడి పెళ్లి చేసుకున్నారు. బీజేపీకి చెందిన మాహిళా నేతను ఆయన వివాహమాడారు.వివరాల ప్రకారం.. మాజీ ఎంపీ దిలీప్ ఘోష్(60) వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. బెంగాల్లో పార్టీకి చెందిన బీజేపీ మహిళా మెర్చా నాయకురాలు రింకూ మజుందార్ (51)తో శుక్రవారం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య శుక్రవారం వివాహం జరిగింది. ఈ సందర్బంగా దిలీప్ ఘోష్ మాట్లాడుతూ.. వివాహం తన అమ్మ కోరిక అని చెప్పుకొచ్చారు. అయితే, మజుందార్‌కు ఇది రెండో వివాహం. అంతకుముందు మరో వ్యక్తితో వివాహం జరగ్గా.. విడాకులు తీసుకున్నారు.Dilip Ghosh, the ultimate wild card of Bengal politics today, united both TMC-BJP on occasion of his marriage. For all the best wishes, he thanks everyone from the bottom of his heart. pic.twitter.com/UCGOmOg8LT— Sudhanidhi Bandyopadhyay (@SudhanidhiB) April 18, 2025 ఇదిలా ఉండగా.. వీరిద్దరి పెళ్లికి ఐపీఎల్ మ్యాచ్ కారణం కావడం విశేషం. ఇంతకీ ఏం జరిగిందంటే.. మజుందార్‌తో దిలీప్‌కు నాలుగేళ్లుగా పరిచయం ఉంది. అయితే, ఈ నెల మొదటి వారంలో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌ను ఇద్దరూ కలిసి చూసిన సందర్భంగా పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. దీంతో, కొద్దిరోజుల వ్యవధిలోనే ఇలా వివాహం చేసుకోవడం విశేషం. ఇక, ఇద్దరి వివాహం నేపథ్యంలో బెంగాల్‌కు చెందిన బీజేపీ సీనియర్ నేతలు ఇంటికి వచ్చి దిలీప్ ఘోష్‌ను అభినందించారు. అలాగే, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం శుభాకాంక్షలు తెలిపారు. Ex BJP National VP Dilip Ghosh has officially tied the knot with BJP mahila morcha leader Rinku Mazumdar today in Newtown, Kolkata according to Vedic traditions . Congratulations to the power couple. pic.twitter.com/l2z89U26ay— Sourav || সৌরভ (@Sourav_3294) April 18, 2025 -
టాలీవుడ్ నటి అభినయ పెళ్లి.. సంబురాల్లో ఇరు కుటుంబాలు
తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన నటి అభినయ. శంభో శివ శంబో చిత్రంలో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించింది. కర్ణాటకకు చెందిన అభినయ తెలుగు, తమిళంలోనే ఎక్కువగా పాపులర్ అయింది. ఇటీవలే అభినయ తన చిరకాల ప్రియుడు, సన్నీ వర్మ (వేగేశ్న కార్తీక్)తో మార్చి 9, 2025న నిశ్చితార్థం చేసుకుంది. తాజాగా బుధవారం వివాహాబంధంలోకి అడుగుపెట్టనుంది ముద్దుగుమ్మ.అభినయ-సన్నీ వర్మల పెళ్లి వేడుక ఈ నెల 16న అంటే బుధవారం గ్రాండ్‌గా జరగనుంది. ప్రస్తుతం ఇరు కుటుంబాలు పెళ్లి సంబురాల్లో మునిగిపోయారు. ఇటీవలే తన ఫ్రెండ్స్‌కు బ్యాచ్‌లరేట్ పార్టీ ఇచ్చిన అభినయ మరి కొన్నిగంటల్లోనే వివాహాబంధంలోకి అడుగుపెట్టనుంది. హైదరాబాద్‌లోని ప్రముఖ కన్వెన్షన్ హాల్లో వారిద్దరూ ఒక్కటిగా ఏడడుగులు వేయనున్నారు. తాజాగా తన పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలను అభియన ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.కాగా.. 'నేనింతే' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అభినయ.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కింగ్, శంభో శివ శంభో వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్గా 'పని' అనే మలయాళ సినిమాలో ఆమె అద్భుతంగా నటించారని ప్రశంసలు కూడా దక్కాయి. View this post on Instagram A post shared by M.g Abhinaya (@abhinaya_official) -
మొన్న బ్రేకప్.. ఇప్పుడేమో పెళ్లి గురించి అడిగితే?
హీరోయిన్లు ప్రేమ-పెళ్లి విషయంలో ఆచితూచి అడుగులేస్తుంటారు. త్వరగా పెళ్లి చేసుకుంటే కెరీర్ ముగిసిపోతుందేమోనని భయం, కొన్నిసార్లు బ్రేకప్ వల్ల కూడా పెళ్లి చేసుకోవడం చాలా లేటు చేస్తుంటారు. మొన్నీమధ్య బ్రేకప్ అయిన తమన్నాని ఇప్పుడు పెళ్లి గురించి అడిగితే ఏం సమాధానమిచ్చిందో తెలుసా?దాదాపు 20 ఏళ్లుగా నటిగా కొనసాగుతున్న తమన్నా.. దక్షిణాదితో పాటు హిందీలోనూ సినిమాలు-ఐటమ్ సాంగ్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. గత రెండేళ్లుగా నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉందని తెగ రూమర్స్ వినిపించాయి. అందుకు తగ్గట్లు కలిసి చాలాసార్లు కనిపించారు.(ఇదీ చదవండి: తమన్నా ట్రెండీ ఐటమ్ సాంగ్.. రెమ్యునరేషన్ ఎన్ని కోట్లు?)మరి ఏమైందో ఏమో గానీ కొన్నిరోజుల క్రితం వీళ్ల బ్రేకప్ న్యూస్ బయటకొచ్చింది. అది నిజమేనని కొన్ని సంఘటనల ద్వారా క్లారిటీ వచ్చింది. తాజాగా ఓదెల 2 సినిమా ప్రమోషన్లలో భాగంగా తమన్నాని పెళ్లెప్పుడు అని అడిగితే.. ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదని చెప్పింది.తమన్నా ప్రస్తుత వయసు 35 ఏళ్లు. మరి ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదని చెప్పిందా? లేదంటే మొత్తానికి ఒంటరిగా ఉండిపోతుందా అని అభిమానులు అనుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 12 సినిమాలు.. అవేంటంటే?) -
పెళ్లి కావట్లేదని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
జనగామ జిల్లా: పెళ్లి సంబంధం కుదరడం లేదన్న మనస్థాపంతో జనగామ జిల్లా కొడ కండ్ల మండలం నీలి బండ తండాకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ గుగులోత్ నీల (26) ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గుగులోత్ హేమ, చిన్ని దంపతుల రెండో కుమార్తె నీల 2020లో ఏఆర్ కానిస్టే బుల్గా ఎంపికై వరంగల్‌లో పనిచేస్తోంది. శనివారం విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన నీల.. ఎవరూ లేని సమయంలో ప్యాన్‌కు ఊరి వేసుకుంది. పెళ్లి సంబంధం కుదరడం లేదన్న మనస్థాపంతో తన కూతురు ఆత్మహత్య చేసు కుందని మృతురాలి తల్లి చిన్ని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చింత రాజు తెలిపారు. ఒకే కాన్పులో ముగ్గురు శిశువులుముస్తాబాద్(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో ఆదివారం ఓ గర్భిణికి ముగ్గురు శిశువులు జన్మించారు. తల్లితో పాటు ముగ్గురు శిశువులు క్షేమంగా ఉన్నారు. ముస్తాబాద్ మండలం చిప్పలపల్లికి చెందిన కొడెండ్ల సృజనకు ఆదివారం పురిటినొప్పులు రాగా.. మండల కేంద్రంలోని శ్రీతిరుమల నర్సింగ్‌హోమ్‌కు తరలించారు. వైద్యపరీక్షలు చేసిన వైద్యులు స్రవంతి, శ్రీకాంత్‌లు.. సృజన గర్భంలో ముగ్గురు శిశువులు ఉన్నట్లు గుర్తించి.. వెంటనే శస్త్రచికిత్స చేశారు. సృజన ఇద్దరు ఆడ శిశువులు, ఒక మగ శిశువుకు జన్మనిచ్చారు. ఆస్పత్రి వైద్యులు మాట్లాడుతూ 15వేల మంది గర్భిణుల్లో.. ఇలా ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మిస్తారని తెలిపారు. -
కూతురి పెళ్లి రోజే.. నిండు ముత్తైదువుగా తల్లి కాటికి
తమిళనాడు: కుమార్తె పెళ్లికి భర్తతో కలిసి బైక్‌పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. అయితే తల్లి మరణవార్త కుమార్తెకు తెలియనివ్వకుండా బంధువులు పెళ్లి జరిపించారు. వివరాలు.. తంజావూరు జిల్లా అయ్యనార్పురం గ్రామానికి చెందిన రంగస్వామి (55). ఇతని భార్య మాలతి (50). ఇద్దరూ రోజువారీ కూలీలు. వీరి కుమార్తె సుకీర్త, సతీష్ కుమార్ వివాహం గురువారం ఊరణిపురంలోని ఆలయంలో జరిగింది. కుమార్తె వివాహానికి ఏర్పాట్లు చేసిన దంపతులు రంగస్వామి, మాలతి ఇంటి నుంచి మోటారు సైకిల్‌పై వివాహానికి వెళ్లారు. మోటారు సైకిల్‌ను రంగస్వామి నడిపాడు. మాలతి వెనక కూర్చుంది.తిరువోణం సమీపంలోని కాళయరాయన్ రోడ్డులోని నరియట్రు వంతెన వైపు వెళ్తుండగా.. ద్విచక్రవాహనం అనూహ్యంగా రోడ్డు పక్కన ఉన్న బ్రిడ్జి బారికేడ్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మాలతి తలకు గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన రంగస్వామిని చికిత్స నిమిత్తం తంజావూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో అసుపత్రిలో చేర్చారు. కూతురు పెళ్లి చేయబోతున్న సమయంలో ప్రమాదంలో రంగస్వామి తీవ్రంగా గాయపడగా.. మాలతి మృతి చెందడం బంధువులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.కూతురు పెళ్లి చేయబోతున్న సమయంలో ప్రమాదంలో రంగస్వామికి తీవ్రగాయాలు కాగా మాలతి మృతి చెందడం బంధువులను దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే యాక్సిడెంట్లో తల్లి మరణించిన విషయాన్ని వధువుకు తెలియజేయకుండా పెళ్లి జరిపించాలని బంధువులు నిర్ణయించారు. ఆ ప్రకారమే సుకీర్త, సతీష్ పెళ్లి చేశారు. తర్వాత ప్రమాదంలో తల్లి చనిపోయిందని, తండ్రికి తీవ్రగాయాలు అయ్యాయని బంధువులు వధువు సుకీర్తకు తెలిపారు. అది విని బోరున ఏడ్చింది. బంధువులు ఆమెను ఓదార్చారు. కూతురి పెళ్లి రోజునే ప్రమాదంలో తల్లి మృతి చెందడం బంధువులు, గ్రామస్తుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. -
మనువాడిన మామిడి చెట్లు
సారంగాపూర్: సాగు చేస్తున్న మామిడితోటలో కాపుకొచ్చిన చెట్లకు రైతు దంపతులు పెళ్లి చేశారు. వ్యవసాయంతో తమకున్న అనుబంధాన్ని చాటుకున్నారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్ గ్రామానికి చెందిన ఓగుల అనిల, అజయ్ దంపతులు ఎనిమిది ఎకరాల్లో మామిడి తోట సాగు చేస్తున్నారు.నాలుగేళ్ల తరువాత మొదటి కాత (పంట) వచ్చింది, దీంతో కాత కాసిన రెండు చెట్లకు పెళ్లి చేయాలని నిశ్చయించి బంధువులను సైతం ఆహ్వానించారు. బీర్పూర్ శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ అర్చకుడు వొద్దిపర్తి మధుకుమారాచార్యులు ఆధ్వర్యంలో మామిడి చెట్లకు నూతన వస్త్రాలు ధరింపజేసి, జీలకర్ర, బెల్లం ఉంచి మాంగళ్యధారణ గావించారు. కార్యక్రమానికి గ్రామంలోని పలువురు రైతులు హాజరుకాగా.. మామిడితోటలో సహపంక్తి భోజనం ఏర్పాటు చేశారు. ఆడెపు రమ్య, మహేశ్, సత్తెన్న, మమత దంపతులు పెళ్లి పెద్దలుగా హాజరయ్యారు. -
రెండో పెళ్లి ఎందుకు చేసుకోలేదంటే?.. రేణు దేశాయ్ సమాధానం ఇదే!
పవన్ కల్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్.. రెండేళ్ల క్రితమే టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇచ్చింది. రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు మూవీలో కీలక పాత్రలో మెప్పించింది. అయితే ప్రస్తుతం సినిమాలేమీ చేయకపోయినా.. సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటోంది. సమాజంలో జరుగుతున్న విషయాలపై కూడా రియాక్ట్ అవుతూ ఉంటోంది. ఇటీవల హెచ్‌సీయూ భూముల వివాదంపై రేణు దేశాయ్ స్పందించారు. వన్య ప్రాణులను ఇబ్బంది పెట్టొద్దని సోషల్ మీడియా వేదికగా వేడుకున్నారు.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రేణు దేశాయ్ తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. పవన్ కల్యాణ్‌తో విడాకులు తీసుకున్న తర్వాత ఎందుకు పెళ్లి చేసుకోలేదన్న విషయంపై మాట్లాడారు. రెండో పెళ్లిపై చేసుకోవాలని చాలా సార్లు అనిపించింది.. కానీ నాపై ఇద్దరు పిల్లల బాధ్యత ఉందని గుర్తు చేసుకున్నారు. నాకు, పిల్లలకు మధ్య మరో వ్యక్తి వస్తే ఎలా ఉంటుందనేది చాలా సెన్సిటివ్ విషయమని రేణు దేశాయ్ తెలిపింది.రేణు దేశాయ్ మాట్లాడుతూ.. "నాకు కూడా భాగస్వామి కావాలని అనిపిస్తుంది. కానీ నా పిల్లల పట్ల నాకున్న బాధ్యత వల్లే సింగిల్‌గా ఉంటున్నా. వ్యక్తిగతంగా చూస్తే నాకు బాయ్‌ఫ్రెండ్ ఉండాలి.. నాకు పెళ్లి కావాలి.. నాకంటూ ప్రత్యేకమైన జీవితం ఉండాలని ఉంటుంది. కానీ నేను పిల్లల కోణం నుంచి ఆలోచిస్తే ఇది సాధ్యం కాదు. నా పిల్లలకు నేను సింగిల్ పేరేంట్. ఆద్యకు ఇప్పుడు 15 ఏళ్లు. మరో మూడేళ్ల తర్వాత తాను కాలేజీకి వెళ్తుంది. ఆద్య తన జీవితంలో ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటున్నా' అని చెప్పుకొచ్చింది.కాగా.. రేణు దేశాయ్, పవన్ కల్యాణ్ బద్రి, జానీ చిత్రాల్లో జంటగా నటించారు. 2009లో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. ఈ జంటకు అకీరా నందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. అయితే ఇద్దరి మధ్య రిలేషన్లో మనస్పర్థలు రావడంతో 2012లో విడాకులు తీసుకున్నారు. -
పెళ్లి సంబంధాలు : శాలరీ స్లిప్ అడగాలా వద్దా? అడిగితే తప్పేంటి?
‘వేయి అబద్దాలు చెప్పి ఒక పెళ్లి చెయ్యమన్నారు’ అనేది సామెత. ఈ సామెత ఎలా పాపులర్ అయిందనేది పక్కన బెడితే, ఈ మధ్య కాలంల పెళ్లిళ్లలో మోసాలు ఆందోళన కరంగా మారింది. అధిక కట్నం కోసం ఫేక్ సర్టిఫికెట్లతో వధువు, వారి కుటుంబాన్ని మెప్పించేందుకు నానా తంటాలు పండతారు. తీరా అసలు విషయం తెలిశాక గొడవలు, విడాకులు తెలిసిన సంగతే.. ఈనేపథ్యంలోనే ఒక స్టోరీ నెట్టింట్ తెగ సందడి చేస్తోంది.వివాహ సంబంధాల్లో మోసాలు, విడాకులు కేసులు, నేరాలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలు పెళ్లి సంబంధాలు చూడటం, పెళ్ళిళ్లు చేయడం పెద్ద సవాల్‌గా మారింది. తన మనసుకు నచ్చిన భాగస్వామిని తెచ్చుకోవడం అంటే మాటలు కాదు. అందులోనూ మాట్రిమమోనియల్ వెబ్సైట్లు ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తున్న తరుణంలో అప్రమత్తత చాలా అవసరం.కొందరు తమ సంబంధాల గురించి అబద్ధం చెబుతుండగా, మరికొందరు తమ విద్యార్హతలు, వృత్తి, ఆరోగ్యం, ఆర్థిక స్థితి గురించి అబద్ధం చెబుతారు. దీంతో ఆ జంట, వారి కుటుంబాల మధ్య సమస్యలకు దారితీస్తుంది. దీనిమీదే ఎక్స్(ట్విటర్)లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. సాలరీ స్లిప్పులు అడగడం, అవునో కాదో ధృవీకరించు కోవాలా వద్దా? అనే ప్రశ్నపై చర్చ మొదలైంది. ప్రొఫైల్స్ వెరిఫికేషన్ పై నెటిజన్లు వివిధ అభిప్రాయాలను పంచుకున్నారు.ఈ పోస్ట్ పై నెటిజనుల స్పందనప్రపంచంలో పుష్కలంగా మంచితనం ఉందని నమ్మినా, వివాహం లాంటి కీలక అడుగు వేసేటప్పుడు ఖచ్చితంగా అన్ని విషయాలపై స్పస్టత తెచ్చుకోవాలి. "జాతకానికి బదులుగా ITRని చెక్ చేయడం మంచిది. సీరియస్‌గా చెప్పాలంటే, ఇద్దరి మధ్యా ప్రముఖ ఆసుపత్రి నుండి పూర్తి ఆరోగ్య పరీక్ష నివేదిక , ITR తనిఖీ కనీసం జరగాలని ఒకరన్నారు. మరొకరు ఇలా రాశారు, "అవును, కొంతమంది పురుషులు జీతం గురించి అబద్ధం చెబుతారు. డిఫాల్టర్ కాకపోతే, స్థానిక పోలీస్ స్టేషన్ నుండి క్యారెక్టర్ సర్టిఫికేట్ అడగాలి, అతి ముఖ్యమైనది మెడికల్ సర్టిఫికేట్! అన్నాడు. మరొకాయన తన అనుభవాన్ని ఇలా పంచుకున్నారు. తెలుసుకోవాలి. ఎందుకంటే బాగా సంపాదిస్తున్నామని చెప్పి లెక్కలేనన్ని పెళ్లి కొడుకు కుటుంబాలు, అమ్మాయిల కుటుంబాలను మోసం చేశాయి. అదృష్టవశాత్తూ, ఇప్పుడు సాలరీ స్లిప్‌లు ఉన్నాయి. పాత కాలంలో, ఇలాంటివేమీ లేవు కదా. అప్పట్లో లెక్చరర్‌గా ఉన్న నా సొంత మౌసి (ఇప్పుడు మరణించింది), తాను పోలీసు అధికారినని చెప్పి పెళ్లి చేసుకున్నాడు. తీరా అతను మామూలు సేవకుడు, పైగా అతనికి అప్పటికే పెళ్లి అయింది. ఒక బిడ్డకూడా ఉన్నాడు. అంతే ఈ విషయం తెలిసి ఆమె పుట్టింటికి తిరిగి వచ్చేసింది. మళ్లీ అతని గుమ్మం తొక్క లేదు. తన జీవితాన్ని విద్యకు అంకితం చేసింది, 2 పీహెచ్‌డీలు చేసింది, బోధనా వృత్తిలో ఉంది. మనస్తత్వశాస్త్ర పుస్తకాలు రాసింది అని చెప్పాడు.ఒక యూజర్ ఇలా వ్రాశాడు, "నా స్నేహితుల్లో ఒకరు నియామక ప్రొఫైల్ ఉద్యోగంలో పని చేశారు.. ఆమె కొన్నిసార్లు మ్యాట్రిమోనియల్ సైట్లలో పేర్కొన్న ప్యాకేజీలను క్రాస్ చెక్ చేసేది. దాదాపు అన్నీ కల్పిత సమాచారంతో నిండిఉన్నాయనీ, ప్యాకేజీలు చాలావరకు అబద్ధం మని గుర్తించింది. "వెరిఫైడ్ జీతం స్లిప్పులు అడిగితే అబ్బాయి పారిపోవాలి" అని ఒక యూజర్ అన్నారు. ఆ మాత్రం నమ్మకంలేకపోతే ఎలా?మరో కామెంట్ ఏంటంటే.. నన్ను ఒకమ్మాయి ఇలానే అడిగింది. పంపాను కానీ పెద్దలు కుదిర్చిన వివాహానికి నో చెప్పాను. నేను, నా జీతం మీద కూడా వాళ్లకి నమ్మకం లేకపోతే, భవిష్యత్తులో ఇక దేన్ని నమ్ముతారు?"దీనిపై మీరేమనుకుంటున్నారు. కామెంట్ల రూపంలో తెలియజేయండి. -
ఇదేం పెళ్లిరా నాయనా!
వన్ ప్లస్ వన్ ఆఫర్ గురించి మనందరికీ తెలుసు. వినియోగదారులను ఆకర్షించేందుకు ఒకటి కొంటే ఒకటి ఉచితమని వ్యాపార సంస్థలు ఆఫర్లు ఇస్తుంటాయి. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి జిల్లాలో ఇలాంటి వింత ‘ఆఫర్’ను సోషల్ మీడియా వెలుగులోకి తెచ్చింది. అయితే ఇది వస్తువులకు సంబంధించిన ఆఫర్ కాదు. మనుషుల పెళ్లికి సంబంధించిన ఆఫర్! ఇద్దరు మైనర్ బాలికలను ఒకే ముహూర్తానికి ఒకే వేదికపై పెళ్లాడటానికి రెడీ అయ్యాడో ప్రబుద్ధుడు. విషయం అధికారులకు తెలియడంతో పెళ్లిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.వరుడు ఒక్కడే.. వధువులిద్దరు!పెళ్లికి వధువు దొరకక ఎందరో యువకులు నిరాశతో జీవనం సాగిస్తున్న ప్రస్తుత రోజుల్లో ఒక వ్యక్తి ఒకేసారి ఇద్దరు మైనర్ బాలికలను వివాహం (Wedding) చేసుకునేందుకు రెడీ అయిన ఉదంతం శ్రీసత్యసాయి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. గోరంట్ల మండలం గుమ్మయ్యగారిపల్లికి చెందిన యువకుడు, కర్ణాటకలోని బాగేపల్లికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలను ఈనెల 10న పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. 16 ఏళ్ల తన అక్క కూతురిని వివాహం చేసుకోవాలనుకున్నాడు. అయితే చిన్న మేనకోడలు (15) కూడా మేనమామనే పెళ్లి చేసుకుంటానని, అలా చేయని పక్షంలో ఆత్మహత్య చేసుకుంటానని మొండికేసింది. దీంతో ఇద్దరు అమ్మాయిలనూ అతనికే ఇచ్చి పెళ్లి చేయాలని బంధువులు నిర్ణయించారు.అధికారుల వార్నింగ్గోరంట్లలోని రంగమహల్ ఫంక్షన్ హాల్లో ఈనెల 10న పెళ్లి చేసేందుకు ఇరువర్గాల వారు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే పెళ్లి శుభలేఖ (Wedding Card) వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టడంతో విషయం ఐసీడీఎస్ అధికారులకు తెలిసింది. వెంటనే స్పందించిన అధికారులు మంగళవారం ఇరువర్గాల తల్లిదండ్రులు, బంధువులతో పాటు ఫంక్షన్ హాల్ నిర్వహకుడిని గోరంట్ల పోలీస్ స్టేషన్‌కు పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. చట్టాన్ని అతిక్రమించి పెళ్లి చేస్తే చర్యలు తప్పవని ఐసీడీఎస్ సూపర్వైజర్ రజిత, సీఐ శేఖర్ వార్నింగ్ ఇచ్చారు. చిన్న వయసులో పెళ్లిళ్లు చేయడం వల్ల ఎదురయ్యే సమస్యలను వివరించారు.కేసు నమోదుపెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నామని, కనీసం ఒక అమ్మాయితోనైనా పెళ్లి జరిపిస్తామని వధువు, వరుడు (Groom) తరపువారు అధికారులను వేడుకున్నారు. మైనర్ బాలికకు పెళ్లి చేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని అధికారులు గట్టిగా హెచ్చరించడంతో వారు వెనక్కు తగ్గారు. కాగా, చివరిలో ఇరువర్గాలు మాట వినకపోవడంతో ఐసీడీఎస్ (ICDS) సూపర్వైజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ శేఖర్ తెలిపారు. మరి రేపు ఉదయం ముహుర్తం సమయానికి పెళ్లి జరుగుతుందా, లేదా అనేది ఆసక్తికరంగా మారింది.చదవండి: ఆంధ్రా అబ్బాయి.. అమెరికా అమ్మాయి లవ్స్టోరీబాల్య వివాహాలు వద్దుసోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వ్యవహారంపై జనం ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. చిన్నవయసులో పెళ్లి చేయడం కరెక్ట్ కాదని అభిప్రాయపడుతున్నారు. బాల్యవివాహాలను అడ్డుకునే విషయంలో అధికారులు సమర్థవంతంగా వ్యవహరించాలని కోరుకుంటున్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం యంత్రాంగం పెద్ద ఎత్తున చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని సూచిస్తున్నారు. -
ఓ ఇంటివాడైన రవిశాస్త్రి.. ఉదయ్‌పూర్‌లో గ్రాండ్ వెడ్డింగ్!
ప్రముఖ బాలీవుడ్ నటుడు ధైర్య కర్వా ఓ ఇంటివాడయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో జరిగిన వివాహా వేడుకలో మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వివాహ వేడుకలో కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది.కాగా.. ధైర్య కర్వా బాలీవుడ్లో దీపికా పదుకొణె నటించిన గెహరియాన్ చిత్రంలో కీలక పాత్రలో నటించారు. అంతేకాకుండా యురి ది సర్జికల్ స్ట్రైక్ చిత్రంలో కెప్టెన్ సర్తాజ్ సింగ్ చందోక్ పాత్రలో కనిపించారు. ఆ తర్వాత స్పోర్ట్స్ డ్రామా 83 లాంటి సినిమాలతో అభిమానులను మెప్పించారు. 1983 ప్రపంచకప్ నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రంలో రవిశాస్త్రి పాత్రలో ఆకట్టుకున్నారు. గతేడాది గ్యారాహ్ గ్యారాహ్ సినిమాలో నటించారు. పలు సినిమాలతో బాలీవుడ్లో అభిమానులను మెప్పించిన ధైర్య కర్వా పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. అయితే అతను చేసుకున్న ఆమె గురించి వివరాలేమీ తెలియదు. -
షాక్ ఇచ్చిన పోలీసులు.. పెళ్లయిన ఏడాదికి భర్తపై పోక్సో కేసు
బి.కొత్తకోట: పెళ్లయి ఏడాది గడిచి, పాప పుట్టిన తర్వాత మైనర్ బాలికను వివాహం చేశారని గుర్తించి కర్ణాటక రాష్ట్రం బట్లపల్లిలో కేసు నమోదు చేసిన వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. సీఐ జీవన్ గంగనాథ్‌బాబు వివరాల మేరకు.. కర్ణాటకలోని బట్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓబులాపురానికి చెందిన లలితకు తల్లిదండ్రులు లేరు. ఏడాది కిందట 17 ఏళ్ల వయసులో బి.కొత్తకోట మండలం గుడిపల్లికి చెందిన మల్లి కార్జున(35)ను వివాహం చేసుకుంది.లలిత గర్భం దాల్చడంతో కర్ణాటక రాష్ట్రం చింతామణి ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లింది. అక్కడి వైద్యులు వయస్సు ఆరా తీసి బట్లపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి బి.కొత్తకోట మండలంలో వారు ఉండడంతో ఆ స్టేషన్‌కు బదిలీ చేశారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో లలిత భర్త మల్లికార్జునపై ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఈ దంపతులకు ఒక పాప కూడా పుట్టింది. -
కాబోయే భార్యతో అక్కినేని అఖిల్.. పెళ్లి కళ వచ్చేసిందా?
టాలీవుడ్లో అక్కినేని హీరో అఖిల్ ఏజెంట్ మూవీ తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేయలేదు. 2023లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇటీవలే ఓటీటీలోకి వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీకి మిక్స్డ్ టాక్ రావడంతో ఓటీటీ రిలీజ్ కూడా ఆలస్యమైంది. ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించారు. అఖిల్ ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్ ప్రకటించకపోవడంతో ఫ్యాన్స్ కాస్తా నిరాశకు గురవుతున్నారు. అయితే త్వరలోనే అఖిల్ బర్త్ డే సందర్భంగా కొత్త సినిమాను అనౌన్స్ చేయనున్నట్లు నిర్మాత నాగవంశీ ఇప్పటికే ట్విటర్ ద్వారా హింట్ ఇచ్చాడు.ఇక సినిమాల సంగతి పక్కనపెడితే.. అఖిల్ త్వరలోనే వివాహాబంధంలోకి అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తన ప్రియురాలు జైనాబ్ రావ్జీతో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఈ ఏడాది మార్చిలోనే పెళ్లి పీటలెక్కుతారని టాక్ వినిపించింది. కానీ అలా జరగలేదు. దీంతో మరోసారి టాలీవుడ్లో అఖిల్ పెళ్లి ఎప్పుడనే విషయంపై చర్చ మొదలైంది.ోఈ నేపథ్యంలో త్వరలోనే పెళ్లి చేసుకోబోయే అఖిల్, జైనాబ్ జంటగా కనిపించారు. హైదరాబాద్ విమానాశ్రయంలో ఒకరి చేయి ఒకరు పట్టుకుని సందడి చేశారు. ఇది చూసిన నెటిజన్స్.. చూడ ముచ్చటగా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే వీరి పెళ్లి పనులతో బిజీగా ఉన్నారేమో అంటూ పోస్టులు పెడుతున్నారు. వీరిద్దరు జంటగా వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మరోసారి అఖిల్ పెళ్లిపై చర్చ మొదలైంది. అయితే ఈనెల 8న అఖిల్ పుట్టినరోజు కావడంతో సెలబ్రేట్ చేసుకునేందుకు వెళ్లారా? అని మరికొందరు చర్చించుకుంటున్నారు. #TFNExclusive: Hero @AkhilAkkineni8 and #ZainabRavdjee get papped walking hand in hand at the Hyderabad airport!!❤️📸#AkhilAkkineni #Akhil6 #TeluguFilmNagar pic.twitter.com/oDD6SU2sMq— Telugu FilmNagar (@telugufilmnagar) April 6, 2025 -
ప్రముఖ రాజకీయ నాయకురాలితో పెళ్లి.. ప్రదీప్ సమాధానం ఇదే!
బుల్లితెరపై యాంకర్‌గా క్రేజ్ దక్కించుకున్న టాలీవుడ్ నటుడు ప్రదీప్ మాచిరాజు. పలు రియాలిటీ షోలకు యాంకర్‌గా పనిచేశారు. అలా యాంకరింగ్‌తో ఫేమస్ అయిన ప్రదీప్ పలు సినిమాల్లోనూ ప్రత్యేక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఆయనే హీరోగా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి మూవీతో ఆడియన్స్‌ను పలకరించనున్నారు. ఈ సినిమకు నితిన్- భరత్ దర్శకత్వం వహించారు.ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు ప్రదీప్. ఇటీవలే ట్రైలర్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. తన మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ప్రదీప్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. త్వరలోనే ఓ రాజకీయ నాయకురాలితో మీ పెళ్లి జరగనుందని వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. సమయం వచ్చినప్పుడు తప్పుకుండా పెళ్లి అయితే చేసుకుంటానని అన్నారు.తన పెళ్లి గురించి ప్రదీప్ మాట్లాడుతూ.. 'నా పెళ్లికి సంబంధించి ఎలాంటి ప్లాన్ లేదు. ముందు జీవితంలో సెటిల్ కావాలనుకున్నా. నాకు సొంతంగా కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. ముందు వాటిని సాధించడమే నా లక్ష్యం. అవీ ఆలస్యం కావడంతోనే మిగిలిన పనులు కూడా వాయిదా పడుతున్నాయి. అన్నీ కూడా సరైన టైమ్‌కే పూర్తి అవుతాయని నమ్ముతున్నా. రాజకీయ నాయకురాలితో తన పెళ్లి అని వస్తున్న వార్తలు నేనూ విన్నా.. అంతకుముందే రియల్ ఎస్టేట్ కుటుంబానికి చెందిన అమ్మాయితో పెళ్లి అన్నారు.. త్వరలో క్రికెటర్‌తో పెళ్లి అంటారేమో. అన్నీ సరదా కోసమే చేస్తున్న ప్రచారం' అంటూ నవ్వుతూ మాట్లాడారు. కాగా.. ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించిన చిత్రం అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి ఏప్రిల్ 11న విడుదల కానుంది. -
Erotomania ఆ హీరోనే పెళ్లి చేసుకుంటానంటోంది!
మాది తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి. మా అమ్మాయి ఈ మధ్యే బి.టెక్. పూర్తి చేసింది. తనకి సంబంధాలు చూడడం మొదలుపెట్టాం. తను ఈ మధ్య కాస్త విచిత్రంగా మాట్లాడటం మొదలుపెట్టింది. తాను ఒక సినిమా హీరోని ప్రేమిస్తున్నానని, అతణ్ణి మాత్రమే పెళ్ళి చేసుకుంటానని అంటోంది. ఏదో చిన్నపిల్ల సరదాగా మాట్లాడుతుంది అనుకున్నాము. ఆ హీరో కూడా తనను ఇష్టపడుతున్నాడని, అందుకే తాను ఎవర్నీ పెళ్ళి చేసుకోవట్లేదని ఏదేదో మాట్లాడుతుంది. తన గది నిండా ఆ హీరో ఫోటోలతో నింపేసింది. ఫోన్లో ఎప్పుడూ ఆ హీరో సినిమాలే చూస్తుంటుంది. అతను ఇంటర్వ్యూలో ఏదైనా మాట్లాడితే అది తనకి ఇన్‌డైరెక్ట్‌గా మెసేజెస్ పంపిస్తున్నాడని అనుకుంటుంది. సినిమా ఇండస్ట్రీలో కొంతమంది తమను కలుసు కోకుండా అడ్డం పడుతున్నారని, అందుకే నేరుగా వెళ్ళి తనను కలుస్తానని, ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. మేం గట్టిగా చెప్తే ఏదైనా చేసుకుంటా అని బెదిరిస్తోంది. మాకు ఏం చెయ్యాలో పాలుపోవట్లేదు. దయచేసి మాకు ఈ సమస్య నుండి బయటపడే దారి చూపెట్టండి. – విజయలక్ష్మీ, రాజమండ్రిమీరు రాసిన లక్షణాలన్నీ ‘ఎరటో మేనియా ’(Erotomania) లేదా ‘డిక్లేరామ్బాల్ట్ సిండ్రోమ్’ (De Clérambault's syndrome) అనే ఒక రకమైన మానసిక రుగ్మతకు సంబంధించినవి. ఈ సమస్య ఎక్కువగా మహిళల్లోనే చూస్తుంటాం. తమకంటే బాగా ఉన్నత మయిన స్థాయిలో లేదా పదవిలో ఉన్న పురుషులు లేదా సినిమా స్టార్స్, స్పోర్ట్స్ స్టార్స్ లాంటి వారు తమతో రహస్యంగా ప్రేమలో ఉన్నారనే భ్రమలో ఉంటారు. వాళ్ళ ప్రవర్తనని, మాట్లాడే మాటలని తమకోసమే చేస్తున్నారని తప్పుగా భావించుకుంటారు. వాళ్ళకి ఉత్తరాలు, ఇమెయిల్స్, బహుమతులు పంపడం లాంటివి కూడా చేస్తుంటారు. అవతలివైపు నుండి ఎటువంటి స్పందన లేకపోతే తమ మధ్య వేరేవాళ్ళు అడ్డుపడుతున్నారనో లేదా కావాలనే అవతలి వ్యక్తి గోప్యతని పాటిస్తున్నారని కూడా వాదిస్తారు. వాళ్ళు అనుకునేది నిజం కాదు, భ్రమ అని చెప్పడానికి ఎవరైనా ప్రయత్నిస్తే, నమ్మకపోగా గొడవలు చేయడం, ఇంట్లో నుండి వెళ్ళిపోవడం లేదా ఏదైనా చేసుకుంటాం అని బెదిరించడం లాంటివి కూడా చేస్తారు.చదవండి: సోనాలీ చేసిన పనికి : నెటిజన్లు ఫిదా, వైరల్ వీడియోవాళ్ళకి ఉన్నది ఒక మానసిక సమస్యే అని వారికి తెలియకపోవడం వల్ల వారితో మందులు వేయించడం కూడా కష్టమే. ఇది కాస్త క్లిష్టమైన మానసిక సమస్యే అయినప్పటికీ కొంతకాలం వాళ్ళని సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో, ఆసుపత్రిలో ఉంచి, మందులు, కౌన్సెలింగ్ ద్వారా వైద్యం చేస్తే క్రమంగా వాళ్లలో మార్పు తీసుకురావచ్చు. వెంటనే మీ దగ్గర్లోని మానసిక వైద్యుని దగ్గరకు తీసుకువెళ్ళి తగిన వైద్యం చేయించండి. ఆ హీరోనే పెళ్లి చేసుకుంటానంటోంది! చదవండి: 35 ఏళ్ల నాటి డ్రెస్‌తో రాధికా మర్చంట్ న్యూ లుక్...ఇదే తొలిసారి!డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
యంగ్ హీరోయిన్ చెల్లి పెళ్లి.. ఫొటోలు వైరల్!
రియాలిటీ షోలో డ్యాన్సర్ గా కెరీర్ ప్రారంభించిన నటి సానియా అయ్యప్పన్ (Saniya Iyappan).. తర్వాత సినిమా హీరోయిన్ అయింది. లేటెస్ట్ గా రిలీజైన మోహన్ లాల్ మూవీలోనూ యాక్ట్ చేసింది. ఇవన్నీ పక్కనబెడితే చెల్లి పెళ్లిని దగ్గరుండి చేస్తోంది.(ఇదీ చదవండి: దమ్ముంటే నన్ను, నా సినిమాలను బ్యాన్ చేయండి: నాగవంశీ)2014 నుంచి సినిమాలు చేస్తున్న సానియా అయ్యప్పన్.. సొంత భాష మలయాళంలోనే హీరోయిన్, సహాయ పాత్రలతో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం కొచ్చిలో ఈమె సోదరి సాదికా అయ్యప్పన్ పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. ఇప్పుడు సంగీత్ జరగ్గా సానియా మాస్ డ్యాన్స్ చేస్తూ కనిపించింది.చెల్లి సంగీత్ వేడుకకు సంబంధించిన కొన్ని ఫొటోలని సానియా పోస్ట్ చేయడంతో పెళ్లి గురించి తెలిసింది. ప్రస్తుతం ఈమె నటి కాబట్టి లేటుగా మ్యారేజ్ చేసుకునే ఆలోచన ఉందేమో. అందుకే ముందే చెల్లి పెళ్లి చేసేస్తున్నట్లుంది.(ఇదీ చదవండి: టాలెంట్‌తో పనిలేదు.. అలాంటి వాళ్లకే ఛాన్సులు ఇస్తున్నారు: పాయల్ రాజ్‌పుత్) -
ఆ స్టార్ హీరోయిన్‌తో ప్రభాస్ పెళ్లి.. నిజంగానే జరిగితే?
టాలీవుడ్లో రెబల్ స్టార్ పెళ్లి గురించి చర్చ ఇప్పటి నుంచి మొదలైంది కాదు. గత పదేళ్లుగా ఏదో ఒక సందర్భంలో ప్రభాస్ పెళ్లి ముచ్చట వినిపిస్తూనే ఉంటుంది. అలా మరోసారి ఇటీవలే ప్రభాస్ పెళ్లి లొల్లి మొదలైంది. ఓ ప్రముఖ వ్యాపారవేత్త కూతురిని ఆయన పెళ్లాడబోతున్నారని టాక్ వచ్చింది. కానీ ఈ విషయంపై ఆరా తీస్కే అదంతా ఒట్టి పుకారే తేలిపోయింది. ఈ విషయంపై ఆయన టీమ్ సైతం స్పష్టమైన సమాధానం ఇచ్చింది. అవన్నీ ఫేక్ వార్తలేనని కొట్టిపారేసింది.ఇక ప్రభాస్ అన్న పెళ్లి ముచ్చట వచ్చినప్పుడల్లా ఆ స్టార్ హీరోయిన్ పేరు కూడా వినిపిస్తుంది. ఎందుకంటే వీరిద్దరు జంటగా పలు సూపర్ హిట్ మూవీల్లో నటించారు. ఆమె మరెవరో కాదు.. టాలీవుడ్ అభిమానులు స్వీటీ అని పిలుచుకునే అనుష్క శెట్టి. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలని ఎంతోమంది సినీ ప్రియులు ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ ఇదేది అంత ఈజీగా అయ్యే పనిలా మాత్రం కనిపించడం లేదు. అందుకే ఓ నెటిజన్ వినూత్న ఆలోచనతో ఓ వీడియోను రూపొందించాడు. అది చూస్తే ఈ జంట ఇంత చూడముచ్చటగా ఉన్నారా? అంటూ కామెంట్స్ చేయకుండా ఉండలేరు. అంతలా ఎడిట్ చేసిన ఓ నెటిజన్ ఆ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఇంతకీ ఆ వీడియో ఏంటో చూసేద్దాం పదండి.నెటిజన్ ఎడిట్ చేసిన ఫోటోలతో ప్రభాస్- అనుష్క శెట్టికి పెళ్లైనట్లు ఊహించుకుని ఓ వీడియోను రూపొందించాడు. పెళ్లి మాత్రమే కాదు.. ఈ జంటకు పిల్లలు పుడితే ఎలా ఉంటారో కూడా ఊహించి మరీ ఫోటోలు ఎడిట్ చేసిన తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది. అలా ఎడిట్ చేసిన ఫోటోలు చూస్తే ప్రభాస్- అనుష్క జోడీ టాలీవుడ్లో సూపర్ హిట్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోటోలు మీరు కూడా చూసి ఊహల్లో విహరించండి.Entraa idi entha realistic ga undi 🫠 pic.twitter.com/7JG14Sf4kC— x_tweet's 🌅 (@MididoddiSai1) March 31, 2025 -
ప్రేమ.. పరువు.. ఆత్మహత్య.. హత్య!
ప్రేమ.. త్యాగం నేర్పుతుంది అంటారు. కానీ.. యువతీ, యువకుల మధ్య చిగురించిన ప్రేమ బలికోరుతోంది. సామాజిక సమీకరణాలు కుదరక కులాల కుంపటి రాజుకుంటోంది. గ్రామాల్లో ఈ పోకడ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాము కనీ, పెంచిన పిల్లలు తమకు దక్కకుండా పోతారన్న భయం, పరువు పోతుందన్న ఆందోళనలో తల్లిదండ్రులు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. .. ఇవి హత్యల వరకు దారితీస్తున్నాయి. మరోపక్క తమ ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించన్న భయంతో ప్రేమికులు ప్రాణత్యాగాలు చేసుకుంటున్నారు. దురదృష్టవశాత్తూ ఉమ్మడి జిల్లాలో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుండగా.. సామాజిక అంతరాలకు అద్ధం పడుతున్నా యి. వేర్వేరు కులాల యువతీ, యువకులు ప్రేమించుకుంటే వారిపై దాడులు సహజమే అయినా.. అది చంపుకునేదాకా వెళ్తుండడమే ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు ఉత్తరాదికే పరిమితమైన ఈ పోకడ ఉమ్మడిజిల్లాకు పాకడం గమనార్హం.పంతాలతో కుటుంబాలు నాశనంసామాజిక కట్టుబాట్లను ఛేదించలేక, అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లల ప్రేమను అంగీకరించలేక పెద్దలు తీసుకుంటున్న తీవ్ర నిర్ణయాలు ఆయా కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. కుటుంబ పెద్ద జైలుకు వెళ్లడంతో ఆర్థికంగా చితికిపోతున్నా యి. వాస్తవానికి ఏ సమాజంలో ఏ పరువు కోసం హత్యలు చేస్తున్నారో.. తరువాత అదే సమాజం ఆయా కుటుంబాలకు అండగా నిలబడని విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో యుక్తవయసులో ప్రేమే సర్వస్వం అంటూ జీవితంలో స్థిరపడక ముందే ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకొని ప్రాణాలు తీసుకుని, తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగుల్చుతున్నారు.ఉమ్మడి జిల్లాలోని పలు ఘటనలు⇒ మార్చి 27న పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటకు చెందిన సాయికుమార్‌ను అదే గ్రామానికి చెందిన ముత్యం సద య్య తన కుమార్తెను ప్రేమిస్తున్నాడని గొడ్డలితో నరికి చంపడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. కేవలం కులాలు వేరన్న కా రణమే సాయిని చంపేలా చేసింది.⇒ ఇల్లందకుంట యువకుడు, నిర్మల్ జిల్లాకు చెందిన యువతి ప్రేమించుకున్నారు. పెద్దల ఆమోదం ఉండదన్న ఆందోళనతో మార్చి 17న జమ్మికుంట పరిధిలోని రైల్వేస్టేషన్లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.⇒ మార్చి 6న చొప్పదండికి చెందిన ప్రేమికులు ఇంట్లోవారు తమ ప్రేమను అంగీకరించరన్న భయంతో కరీంనగర్లో స్నేహితుడి ఇంట్లో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.⇒ 2024 ఏప్రిల్‌లో తాను అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు కులాంతర వివాహం చేసుకుని వెళ్లిపోయిందన్న బాధతో సిరిసిల్ల జిల్లాలో ఓ తండ్రి తన కుమార్తెకు పిండ ప్రదానం చేశాడు. తమ ఆశలను అడియాశలు చేసిన కూతురు మరణించిందని ఫ్లెక్సీ పెట్టించడం సంచలనంగా మారింది.⇒ 2023 నవంబరులో సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలానికి చెందిన ప్రేమికులు విషం తాగి ప్రాణాలు తీసుకున్నారు.⇒ 2023 ఆగస్టులో కోరుట్ల పట్టణంలో తన ప్రియుడితో పరారయ్యే క్రమంలో ప్రియురాలు తన అక్కనే హత్య చేసి పరారవడం కలకలం రేపింది.⇒ 2021 ఆగస్టులో మంథనికి చెందిన ఓ ప్రేమజంటపై యువతి తండ్రి హేయంగా దాడి చేశాడు. ఈ దాడిలో ప్రేమికులు తృటిలో చావు నుంచి తప్పించుకున్నారు. ⇒ 2017లో మంథనిలో మధుకర్ అనే దళిత యువకుడి అనుమానాస్పద మరణం కూడా పరువుహత్యగా ప్రాచుర్యం పొందింది. అనుమానాస్పద మరణం అని పోలీసులు, ప్రి యురాలి బంధువులే చంపారని మధుకర్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. దళితసంఘాలు ధర్నా చేయడంతో మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించారు. అప్పట్లో ఇది జాతీయస్థాయిలో చర్చానీయాంశంగా మారింది. ఈ కేసు ఇంకా తేలాల్సి ఉంది.⇒ 2016లో తిమ్మాపూర్‌లోని ఓ గుడిలో ప్రేమ వివాహం చేసుకునేందుకు పీటల మీద కూర్చున్న జంటపై యువతి బంధువులు దాడి చేశారు. పెళ్లికూతురు కళ్లముందే పెళ్లి కొడుకును విచక్షణా రహితంగా పొడిచి చంపడం కలకలం రేపింది.ఆలోచన తీరు మారాలి కులం అహంకారంతో జరిగే దారుణాలతో ప్రాణాలుపోతున్నాయి. టెక్నాలజీలో ముందున్న మనం ఆధునికంగా ఆలోచించలేక పోతున్నాం. ఉన్నత చదువులు చదువుకునే..యువత కూడా ప్రేమించుకోవడం.. కాదన్నారని ప్రాణాలు తీసుకోవడం తగదు. ఈ ఘటనలకు కేవలం ఆలోచన తీరే కారణం. తీరుమారితే విపరీత ధోరణులు మారుతాయి. – ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత,సోషియాలజీ విభాగం అధిపతి, శాతవాహన వర్సిటీకుల వివక్షపై అవగాహన కల్పించాలి సమాజంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నా కుల,మత భేదాలు గ్రామాల్లో అలాగే కొనసాగుతున్నాయి. కులాల మధ్య వైరుధ్యాలు పెరిగేలా ప్రభుత్వాలు కులాల ఆధారంగా ప్రవేశపెడుతున్న పథకాలు ప్రజల మధ్య దూరాలను పెంచుతున్నాయి. పిల్లల ప్రేమ కన్నా పరువు, పట్టింపులే ఎక్కువ అనే భావన తొలిగేలా, కులవివక్షపై ప్రజలకు అవగాహన కలిగించేలా ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది.– కల్లెపల్లి ఆశోక్, కేవీపీఎస్ :::సాక్షిప్రతినిధి, కరీంనగర్ -
బిజినెస్మెన్ కూతురితో ప్రభాస్ పెళ్లి.. స్పందించిన టీమ్
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ పెళ్లి గురించి ఎప్పటి నుంచో చర్చ నడుస్తోంది. ఇప్పటికే ప్రభాస్ పెళ్లి గురించి చాలాసార్లు వార్తలొచ్చాయి. కానీ అవన్నీ కేవలం రూమర్స్‌గానే మిగిలిపోయాయి. కొన్ని నెలల గ్యాప్ తర్వాత మళ్లీ ప్రభాస్ పెళ్లి గురించి మొదలైంది. త్వరలోనే ఆయన ఓ ఇంటివాడు కాబోతున్నారని నెట్టింట తెగ వైరలవుతోంది. అంతేకాదు రెబల్ స్టార్ పెద్దమ్మ శ్యామలా దేవి అప్పుడే పెళ్లి పనులతో బిజీగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. దీంతో ప్రభాస్ అన్న పెళ్లి కోసం ఎంతోమంది ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే మరోసారి ప్రభాస్ పెళ్లి వార్తల నేపథ్యంలో తాజాగా ఆయన టీమ్ స్పందించింది. ప్రభాస్ మ్యారేజ్ గురించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలేనని కొట్టి పారేశారు. ఓ బిజినెస్మెన్ కుమార్తెను పెళ్లి చేసుకోబోతున్నారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఈ వార్తలపై ఆయన టీమ్‌ను సంప్రదించగా.. ఎలాంటి ఊహగానాలు నమ్మవద్దని రెబల్ స్టార్ అభిమానులకు సూచించారు.(ఇది చదవండి: వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి.. ఏర్పాట్లలో శ్యామలా దేవి)గతంలో ప్రభాస్ పెళ్లి గురించిన వచ్చిన రూమర్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. అతను తన బాహుబలి నటి అనుష్క శెట్టితో రిలేషన్షిప్లో ఉన్నాడని చాలాసార్లు రూమర్స్ వినిపించాయి. ఆ తర్వాత ఈ వార్తలను నటీనటులిద్దరూ ఖండించారు. తాము మంచి స్నేహితులమని క్లారిటీ ఇచ్చారు.ఇక సినిమాల విషయానికొస్తే ప్రభాస్ ప్రస్తుతం దర్శకుడు మారుతీ దర్శకత్వంలో ది రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల కావాల్సి ఉండగా.. వాయిదా పడింది. ఆ తర్వాత దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్లో ఫౌజీ, సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి -2, ప్రశాంత్ నీల్‌తో సలార్ 2: శౌర్యంగ పర్వం సినిమాలను చేయనున్నారు. -
ఎంబీబీఎస్ డాక్టర్ ప్రాణం తీసిన బట్టతల
సాక్షి,హైదరాబాద్ : సికింద్రాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. బట్టతల కారణంగా నిశ్చితార్ధం వరకు వచ్చి పెళ్లి ఆగిపోవడంతో ఓ ఎంబీబీఎస్ డాక్టర్ బలవన్మరణానికి పాల్పడ్డారు.సికింద్రాబాద్ పోలీసుల వివరాల మేరకు.. గుజరాత్‌కు చెందిన ప్రకాష్ మాల్ కుటుంబం కొన్నేళ్ల క్రితం సికింద్రాబాద్‌లో స్థిరపడింది. ప్రకాష్ మాల్ చిన్న కుమారుడు పురోహిత్ కిషోర్ ఎంబీబీఎస్ డాక్టర్‌గా అల్వాల్ బస్తీ ఆస్పత్రిలో సేవలందిస్తున్నారు. అయితే, ఈ క్రమంలో కిషోర్‌కు కొన్ని రోజుల కిందట నిశ్చితార్ధం జరిగింది. బట్టతలతో పాటు ఇతర కారణాల వల్ల నిశ్చితార్ధం ఆగిపోయింది. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు కిషోర్‌కు పెళ్లి సంబంధాలు చూస్తూనే ఉన్నారు. కానీ సంబంధాలు కుదరడం లేదు.బట్టతల ఉండడం, వయస్సు పెరిగిపోతుండడంతో డాక్టర్ కిషోర్ మనోవేధనకు గురయ్యారు. ఈ క్రమంలో గురువారం జామాబాద్ నుంచి సికింద్రాబాద్‌కు వస్తున్న హుజూర్‌సాహిబ్ నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. డాక్టర్ ఆత్మహత్యపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
అత్తారింటికి దారేది?
ఆదిలాబాద్ రూరల్ మండలం అంకాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని బుర్కి ఆదివాసీ గ్రామానికి సరైన రోడ్డు లేదు. చిన్నపాటి మొరం రోడ్డు గుండానే రాకపోకలు సాగించాల్సి వస్తోంది. వర్షాకాలంలో సమస్య మరీ అధ్వానం. ఆ గ్రామానికి చెందిన యువకుడు ఆనంద్‌రావుతో.. బుధవారం దొండారిగూడెంకు చెందిన అనితతో పెళ్లి జరగాల్సి ఉంది. ఇందుకోసం ఆడపెళ్లివారు పెళ్లికూతురితో కలిసి బయల్దేరారు. కోలాంగూడ సగం దూరం వరకు ఐషర్, ద్విచక్రవాహనంపై వచ్చారు. అక్కడినుంచి బుర్కికి వెళ్లేందుకు రోడ్డు లేకపోవడంతో.. పెళ్లికూతురితో సహా బంధువులంతా కాలినడకన బయల్దేరారు. మండుటెండలో కాళ్లకు చెప్పులు కూడా లేకుండా ఎట్టకేలకు పెళ్లి బృందం బుర్కికి చేరుకుంది. అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. బుర్కిని ఆదివాసీ గ్రామాభివృద్ధికి దత్తత తీసుకున్నారు. ఈ గ్రామ రహదారి దుస్థితిపై ప్రస్తుత గవర్నర్ జిష్ణుదేవ్ కూడా ఇటీవల అధికారులను ఆరా తీశారు. – చింతల అరుణ్ రెడ్డి, సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ రూరల్ -
అద్దెంటి కుర్రాడితో భార్య అలా.. కట్ చేస్తే ఏడడుగుల గోతిలో..
రోహ్తక్: హర్యానాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తితో తేన భార్య వావాహేతర సంబంధం పెట్టుకుందనే కారణంగా సదరు వ్యక్తిని భర్త దారుణంగా హత్య చేశాడు. అతడు బతికి ఉండగానే ఓ పొలంలో గొయ్యి తీసి పాతిపెట్టాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.వివరాల ప్రకారం.. హర్యానాలోని రోహ్తక్లో జగ్దీప్ అనే వ్యక్తి హరిదీప్ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. యోగా గురువైన హరిదీప్.. హర్యానాలోని మస్త్‌నాథ్ యూనివర్సిటీలో యోగా బోధిస్తుంటాడు. అయితే, హరిదీప్.. జగదీప్ ఇంట్లో అద్దెకు ఉంటూ.. అతడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం హరిదీప్‌కు తెలియడంతో ఆగ్రహంతో రగిలిపోయాడు. ఈ క్రమంలో హరిదీప్ తన స్నేహితులతో కలిసి జగ్దీప్ను కిడ్నాప్ చేశాడు. అనంతరం, హరిదీప్ బతికి ఉండగానే ఓ పొలంలో గొయ్యి తీసి పాతిపెట్టాడు. బోర్ వెల్ కోసం అని ముందుగానే కార్మికులకు చెప్పి ఏడు అడుగులు గొయ్యి తవ్వించాడు.ఇదిలా ఉండగా.. హరిదీప్ చనిపోయిన పది రోజుల తర్వాత అతడు కనిపించడం లేదంటూ పోలీసులు ఫిర్యాదు వచ్చింది. దీంతో, దర్యాప్తు చేపట్టిన పోలీసులకు వివాహేతర సంబంధం గురించి తెలిసింది. దీంతో, జగదీఫ్ కాల్ డేటా, రికార్డింగ్‌లను పరిశీలించిన తర్వాత అతని స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టగా హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. ఈ హత్య ఉదంతం గతేడాది డిసెంబర్లో చోటుచేసుకోగా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. హత్య జరిగిన మూడు నెలల తర్వాత మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న వారిని అరెస్ట్ చేస్తామన్నారు. ఇక, తాజాగా ఈ ఘటన బయటకు రావడంతో స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. -
పెళ్లి సంగతి తర్వాత... కౌన్సెలింగ్ ఇప్పించండి..!
మా అక్క తన విడాకుల అనంతరం మాతోనే ఉంటున్నారు. తనకి ఇద్దరు కూతుర్లు. పెద్ద కూతురి వయసు 29 సంవత్సరాలు. గత ఎనిమిది సంవత్సరాలుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నాము. 2023వ సంవత్సరంలో ఒక అబ్బాయి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ‘‘నేను మరొకరిని ప్రేమిస్తున్నాను అని చెప్పింది’’ కానీ ఆ అబ్బాయి వివరాలు ఇవ్వలేదు. మేమే ఎలాగోలా అతని ఫోన్ నెంబర్ తెలుసుకుని అబ్బాయిని సంప్రదించగా తనకు జాబ్ వచ్చిన తరువాత మాత్రమే తమ ప్రేమ విషయం ఇంట్లో చె΄్తాను అన్నాడు. తన కుటుంబ వివరాలు కూడా మాకు ఇవ్వలేదు. వారిది వైజాగ్ అని మాత్రమే తెలుసు. అమ్మాయిని వేరే సంబంధం చేసుకోమంటే మా మాట వినటం లేదు. ఎలా అయినా సరే అతన్నే పెళ్లి చేసుకుంటాను అంటుంది. ఇలా అయితే లాభం లేదు, ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని గట్టిగా చెము. అయినా లాభం లేదు. ఇటీవలే అబ్బాయికి ఉద్యోగం వచ్చిన ట్లు తెలిసింది కానీ, తర్వాత నుంచి మా మేనకోడలితో కూడా మాట్లాడడం మానేశాడు. మా అక్కకి ఆ అబ్బాయితో సంబంధం ఇష్టం లేదు. పరిష్కారం చూపగలరు.– విజయ, హైదరాబాద్మీ మేనకోడలు ఒక మేజర్. చట్టప్రకారం తను ఎవరిని పెళ్లి చేసుకోవాలి – ఎవరితో కలిసి బతకాలి, అసలు పెళ్లి చేసుకోవాలా వద్దా అనేది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుంది. అందులో మూడో వ్యక్తి జోక్యం చేసుకోవటాన్ని చట్టం అంగీకరించదు.అది తల్లిదండ్రులైనా సరే! ఏమి చేసినా ఆ అమ్మాయి అంగీకారంతో మాత్రమే చేయవలసి ఉంటుంది. మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే ఆ అబ్బాయికి ఇంక ఇంట్రెస్ట్ లేనట్టు కనిపిస్తుంది. బహుశా మీ అమ్మాయి ఈ విషయం జీర్ణించుకున్నట్లు లేదు. తనకు కౌన్సిలింగ్ అవసరం అనిపిస్తుంది. మీ అమ్మాయి అతన్ని మాత్రమే పెళ్లి చేసుకుంటాను అనడానికి గల కారణం ఏమిటో ప్రేమగా మాట్లాడి తనకి ధైర్యాన్ని ఇస్తూ కనుక్కోండి. పరస్పర అంగీకారంతో ప్రేమించుకున్నట్లైతే సరేం అలా కాదు ఏదైనా వేరే కోణం ఉందేమో తెలుసుకోండి. శారీరక సుఖం కోసం ప్రేమిస్తున్నాను అంటూ వెంటపడుతూ కోరిక తీరినాక మోసపూరితంగా వదిలేస్తే, అందుకు తగిన శిక్షలు భారతీయ న్యాయ సంహితలో వున్నాయి. కఠిన చర్యలు తీసుకోవచ్చు. ఏది ఏమైనా, ఈ సమయంలో మీరు తనపై మరింత ఒత్తిడి పెట్టడం సరైనది కాదు. మీరు కలిగించే ధైర్యం–నమ్మకం తనకు చాలా అవసరం. కాబట్టి పెళ్ళి సంగతులు కాసేపు పక్కనబెట్టి ముందు తన మానసిక పరిస్థితి, తనకు ఏం కావాలి అనే అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేయండి. వీలైతే కౌన్సెలింగ్ ఇప్పించండి.– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు.)(చదవండి: యాక్సియల్ స్పాండిలో ఆర్థరైటిస్ అంటే ఏంటి..? నటి సమంత, దర్శకుడు విక్రమ్ భట్) -
భార్యకు భర్త యజమాని కాడు!
ప్రయాగ్‌రాజ్: భార్య తనతో ఉన్న ఇంటిమేట్ వీడియోను ఫేస్బుక్లో అప్లోడ్ చేసిన వ్యక్తిపై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పెళ్లి చేసుకోగానే భార్యకు భర్త యజమాని అయిపోడని వ్యాఖ్యానించింది. అతనిపై క్రిమినల్ కేసు కొట్టేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను తోసిపుచ్చింది. ‘ఇంటిమేటెడ్ వీడియోను ఫేస్బుక్లో అప్లోడ్ చేసి దరఖాస్తుదారుడు (భర్త) వివాహ బంధానికున్న పవిత్రతను ఉల్లంఘించారు. భార్య తనపై ఉంచిన నమ్మకాన్ని పోగొట్టారు. భార్య గౌరవాన్ని కాపాడలేకపోయారు. ఇలాంటి కంటెంట్‌ను షేర్ చేయడం భార్యాభర్తల మధ్య బంధాన్ని నిర్వచించే గోప్యతను ఉల్లంఘించడమే అవుతుంది. ఈ నమ్మక ద్రోహం వైవాహిక బంధం పునాదినే దెబ్బతీస్తుంది’అని విచారణ సందర్భంగా జస్టిస్ వినోద్ దివాకర్ వ్యాఖ్యానించారు. భార్య అంటే భర్తకు కొనసాగింపు కాదని, తనకంటూ సొంత హక్కులు, కోరికలు, ఉన్న వ్యక్తని ఆయన పేర్కొన్నారు. తామిద్దరూ సాన్నిహిత్యంతో ఉన్న వీడియోలను తన భర్త మొబైల్లో చిత్రీకరించి, తనకు తెలియకుండా ఫేస్బుక్లో అప్లోడ్ చేశాడని, తరువాత బంధువులు, గ్రామస్తులతో పంచుకున్నాడంటూ మీర్జాపూర్ జిల్లాలో ప్రద్యుమ్న్ యాదవ్ అనే వ్యక్తిపై అతని భార్య కేసు నమోదు చేసింది. తాను ఆమె భర్త కాబట్టి అది నేరం కాదని, తనపై మోపిన క్రిమినల్ కేసులను కొట్టేయాలని ప్రద్యుమ్న్ కోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. భార్యాభర్తల మధ్య రాజీ కుదిరే అవకాశం ఉంది కాబట్టి.. కేసును కొట్టేయాలంటూ ఆయన తరపు న్యాయవాది సైతం వాదించారు. ఫిర్యాదుదారు చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భార్య అయినప్పటికీ, ఆమెను అశ్లీల వీడియో తీసి బంధువులకు, గ్రామస్తులకు పంపే హక్కు భర్తకు లేదని కోర్టు తేల్చి చెప్పింది. -
ఇంకా పచ్చని పందిరి తీయలేదు..ఇంతలోనే విషాదం
సత్తుపల్లిటౌన్/రూరల్: ఇంకా పచ్చని పందిరి తీయలేదు.. భాజాభజంత్రీల శబ్దం చెవులను వీడలేదు.. ఇంతలోనే నూతన వధూవరులతో కలిసి దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా జరిగిన ప్రమాదంలో వధువు తల్లి మృతి చెందగా.. తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. సత్తుపల్లి మండలం బేతుపల్లి వద్ద శుక్రవారం జరిగిన ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. సత్తుపల్లికి చెందిన వ్యాపారి అడపా రాజేంద్రప్రసాద్ – పుష్పావతి ఏకైక కుమార్తె హర్షిణి వివాహం ఈనెల 16న జరిగింది.నూతన వధూవరులతో కలిసి అందరూ అశ్వారావుపేట సమీపాన శ్రీసుబ్రమణ్యేశ్వరస్వామి కల్యాణానికి వెళ్లారు. ఆతర్వాత నూతన దంపతులను జంగారెడ్డిగూడెంలోని అత్తగారి ఇంటికి సాగనంపి.. హర్షిణి తల్లిదండ్రులు పుష్పావతి(55), రాజేంద్రప్రసాద్ కారులో సత్తుపల్లికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈక్రమాన బేతుపల్లి సమీపంలో వీరి కారు – ఎదురుగా వచ్చిన పాలవ్యాన్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో పుష్పావతి, రాజేంద్రప్రసాద్‌కు గాయాలు కాగా 108 వాహనంలో సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చేసరికి పుష్పావతి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.ఈ విషయం తెలియడంతో జంగారెడ్డిగూడెం నుంచి వచ్చిన హర్షిణి తల్లి మృతదేహంపై పడి రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. కాగా, పలువురు వ్యాపారులు, స్థానికులు సైతం పుష్పావతి మృతదేహం వద్ద నివాలులరి్పంచారు. ఈమేరకు సత్తుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
అవును వాళ్లిద్దరికీ పెళ్లైంది : అదిరే స్టెప్పులతో పెళ్లి వీడియో వైరల్
మన దేశంలో పెళ్లి అంటే కేవలం వేడుక, ఆనందం మాత్రమేకాదు ఆడంబరం, ఆర్బాటం కూడా. ఎంత ఖర్చైనా పరవాలేదు విలాసవంతంగా మూడు ముళ్ల వేడుక పూర్తి కావాల్సిందే. ఇదీ నేటి ప్రజ తీరు. దీనికి తోడు ఇలాంటి వివాహ వేడుకలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటం క్రేజీగా మారిపోయింది. సోషల్ మీడియాలో వైరల్ అంటే ముందుగా గుర్తొచ్చే నెటిజన్లు కమెంట్లే గదా. తాజాగా ఒక పెళ్లికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది.అయితే ఈ పెళ్లి వెనుక విశేషం ఇదే అంటూ ఇంటర్నెట్ యూజర్లు కమెంట్లతో హోరెత్తించారు. ఇంతకీ విషయం ఏమిటంటే.ఈ వైరల్ వీడియోలో వధువు గ్రాండ్ జర్జోజీ వర్క్‌తో తయారైన మెరూన్ కలర్ లెహంగాలో అందంగా ముస్తాబైంది. డబుల్ దుపట్టాలతో మరింత అందంగా కనిపించింది.ఆకర్షణీయమైనమేకప్, చోకర్,నెక్లెస్‌లు,చెవిపోగులు ఇలా సర్వహంగులతో పెళ్లికూతురి లుక్‌లో స్టైలిష్‌గా కనిపిస్తోంది. మరోవైపు, వరుడు కూడా ఐవరీ కలర్ షేర్వానీలో బాగానే తయారయ్యాడు. ఇద్దరూ ఆనందంగా డ్యాన్స్ చేస్తారు. మరీ ముఖ్యంగా పెళ్లి కూతురు చాలా ఉత్సాహంగా స్టెప్పులేసింది. అటు 40 ఏళ్ల పెళ్లి కొడుకుగా సిగ్గుపడుతూ ఆమెతో జత కలిశాడు. View this post on Instagram A post shared by mayank Kumar Patel (@mayank_kumar_patel473)అసలు స్టోరీ ఇదట! వరుడు వయసు 46, వధువు వయసు 24.తనకంటే పదహారు సంవత్సరాలు పెద్దవాడిని సంతోషంగా వివాహం చేసుకుంది. వయసులో చాలా తేడా ఉన్నా కూడా ఆమె ఆనందంగా కనిపిస్తోంది. వరుడు గవర్నమెంట్ టీచర , సురక్షితమైన ప్రభుత్వ ఉద్యోగం అందుకే ఇలా అంటూ గత ఏడాది డిసెంబరులో చేసిన పోస్ట్‌లో వెల్లడించింది. వీడియో అప్లోడ్ కాగానే కమెంట్ సెక్షన్‌ను నెటిజన్లు చమత్కారాలు, వ్యంగాలతో నింపేశారు. కొంతమంది పెళ్లి కొడుకు వయస్సును ఎగతాళి చేయగా, మరికొందరు గవర్నమెంట్ ఉద్యోగం బాబూ అని వ్యాఖ్యానించారు. పెళ్లి చేయాలంటే అందం, కులంతోపాటు, వయసు, హోదాకూడా పరిశీలిస్తారు పెద్దలు సాధారణంగా. సమయాన్నిబట్టి, తమ సౌలభ్యాన్ని వీటిల్లో అనేక మినహాంపులతో పెళ్లిళ్లు జరిగిపోతాయి. దాదాపు వీరంతా చాలా హ్యాపీగా జీవితాలను గడుపుతూ ఉంటారు. అయితే సోషల్ మీడియా యూజర్లు మాత్రం, చమత్కారాలతో, మీమ్స్ సందడిచేస్తూనే ఉంటారు. ‘కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు’ అన్న సామెత వీళ్లు అసలు పట్టించుకోరు. -
‘పెళ్లి కార్నర్’లో భారత హాకీ స్టార్లు
షట్లర్లు సైనా నెహ్వాల్–పారుపల్లి కశ్యప్, ఆర్చర్లు దీపిక కుమారి–అతాను దాస్, హాకీ క్రీడాకారులు మౌనిక–ఆకాశ్‌దీప్... ఇలా పెళ్లాడిన ప్లేయర్ల జాబితాలో కొత్తగా మహిళా డిఫెండర్ ఉదిత దుహాన్, పురుషుల ఫార్వర్డ్ మన్దీప్ సింగ్‌లు కూడా చేరనున్నారు. భారత ప్లేయర్ల పెళ్లి బాజా ఇప్పటికే మోగుతోంది. శుక్రవారం (21న) జరిగే వేడుకలో మన్దీప్–ఉదితలు వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. జలంధర్: మైదానంలో గోల్స్ కోసం ప్రత్యర్థులతో పోరాడే భారత హాకీ ప్లేయర్లు మన్దీప్ సింగ్, ఉదిత దుహాన్‌లు కాసేపు పెనాల్టీ కార్నర్లు, పెనాల్టీ స్ట్రోక్‌లు పక్కనబెట్టి, చేతుల్లోని హాకీ స్టిక్‌లకు సెలవిచ్చి కళ్యాణ మాలలు పట్టుకునేందుకు సిద్ధమయ్యారు. జలంధర్ (పంజాబ్)కు చెందిన మన్దీప్... హిస్సార్ (హరియాణా) అమ్మాయి ఉదితతో కలిసి ఏడడుగులు నడువనున్నాడు. భారత హాకీకి రెండు కన్నుల్లాంటి పంజాబ్, హరియాణా రాష్ట్రాలకు చెందిన ప్లేయర్ల మధ్య ఈ నెల 21న అంగరంగ వైభవంగా వివాహ వేడుక జరుగనుంది. ఈ మేరకు ఇద్దరి ఇళ్లు, కళ్యాణశోభను సంతరించుకున్నాయి. వీళ్లిదరి పెళ్లికి సంబంధించిన ప్రి–వెడ్డింగ్ షూట్ ఫొటోల్ని సామాజిక సైట్లలో పోస్ట్ చేశారు. 27 ఏళ్ల ఉదిత 2017లో జాతీయ జట్టుకు ఎంపికైంది. డిఫెండర్‌గా 127 మ్యాచ్‌ల్లో కీలక పాత్ర పోషించింది. ప్రత్యర్థి స్ట్రయికర్లను గోల్స్ చేయకుండా నిరోధించే ఆమె 14 గోల్స్ కూడా చేసింది. 30 ఏళ్ల ఫార్వర్డ్ ప్లేయర్ మన్దీప్ 2013లో భారత్ తరఫున అంతర్జాతీయ హాకీలో ఆరంగేట్రం చేశాడు. 15 ఏళ్లుగా 260 మ్యాచ్‌లాడిన మన్దీప్ 120 గోల్స్‌తో సత్తాచాటుకున్నాడు. పంజాబ్ పోలీస్ శాఖలో అతను డీఎస్పీగా ఉన్నాడు. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన భారత జట్టులో మన్దీప్ సభ్యుడు కాగా... త్రుటిలో కాంస్యం కోల్పోయి నాలుగో స్థానంతో తృప్తి పడిన మహిళల జట్టులో ఉదిత ఉంది. పెళ్లికి ముందరి సంగీత్ కార్యక్రమం నేడు జరుగనుంది. భారత పురుషులు, మహిళా జట్ల ప్లేయర్లు ఈ వేడుకలో గానబజానాతో హడావుడి చేయనున్నారు. 21న ఉదయం 9 గంటలకు సిక్కు మత సంప్రదాయం ప్రకారం పెళ్లి జరుగనుంది. అనంతరం మరుసటి రోజు ఘనంగా రిసెప్షన్ (విందు)కు హాకీ, ఇతర క్రీడా ప్రముఖులు హాజరుకానున్నారు. -
తెనాలికి వైఎస్ జగన్ రాక.. పోటెత్తిన అభిమాన సంద్రం
-
భర్త మూడో పెళ్లి.. పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య
జగిత్యాల క్రైం: భర్త మూడో పెళ్లి చేసుకోవడంతో ఇంట్లో జరుగుతున్న గొడవలతో విసిగిపోయిన మొదటి భార్య, ఆమె సంతానం ఇంటిపెద్దపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటన శనివారం జగిత్యాల జిల్లా, జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామంలో జరిగింది. పొలాస గ్రామానికి చెందిన పడాల కమలాకర్ (58) అదే గ్రామానికి చెందిన జమునను వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అనంతరం కొంతకాలం తర్వాత జమున సొంత చెల్లి లలితను రెండో పెళ్లి చేసుకున్నాడు. లలితకు కూడా కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ నేపథ్యంలో మూడేళ్లుగా ఇద్దరు భార్యలతో కమలాకర్‌కు విభేదాలు రావడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఐదు నెలల క్రితం బీదర్‌కు చెందిన మహిళను మూడో వివాహం చేసుకున్నాడు. దీంతో కొద్దిరోజులుగా ఇంట్లో నిత్యం గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం కమలాకర్ పొలాస గ్రామంలో మొదటి భార్య ఇంటికి వెళ్లి గొడవ చేశాడు. విసిగిపోయిన భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె, అల్లుడు అందరూ కలిసి అతనిపై కత్తితో దాడిచేసి, ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో కమలాకర్ కేకలు వేయడంతో స్థానికులు జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రూరల్ సీఐ కృష్ణారెడ్డి, ఎస్సై సధాకర్ ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కమలాకర్ నుంచి న్యాయమూర్తి మరణ వాంగ్మూలం తీసుకున్నారు. కాగా, కమలాకర్ సాయంత్రం 6.30 గంటలకు మృతిచెందాడు. ఈ ఘటనలో మృతుడి కుటుంబ సభ్యులను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. బీదర్‌కు చెందిన మూడో భార్యను కూడా విచారిస్తున్నారు. కమలాకర్ సోదరుడి ఫిర్యాదు మేరకు మొదటి భార్య, పిల్లలు, అల్లుడిపై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై తెలిపారు. -
జత కలవాలంటే జాతకాలు కలవాల్సిందేనా!
‘ఏనాడు ఏ జంటకో రాసి ఉంటాడు విధి ఎప్పుడో’ అన్నాడు మనసుకవి ఆత్రేయ.‘పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయి’ అని నానుడి. విధి నిర్ణయం ముందే జరిగి ఉంటుందనేది తరతరాల విశ్వాసం. ఆ నిర్ణయమే మనల్ని నడిపిస్తుందనేది నమ్మకం.అంతమాత్రాన పెళ్లిళ్ల వ్యవహారాన్ని ఆషామాషీగా తీసుకోలేం. జీవితంలోని నానా పరిణామాల్లాగానే పెళ్లిళ్లు కూడా బ్రహ్మలిఖితమేనంటారు.విధి విధానాన్ని మార్చడం మానవమాత్రులకు శక్యంకాదని అందరికీ తెలుసు.విధిపై నమ్మకమెలా ఉన్నా, భవిష్యత్తును తెలుసుకోవాలనే కుతూహలం మానవ సహజం. అందుకే పెళ్లిళ్లకు ముందు వధూవరులకు జత కలిసేదీ లేనిదీ తెలుసుకోవాలనుకుంటారు. జత కట్టడానికి... జాతకాలు కలవడానికి సంబంధమేమిటో... తెలుసుకుందాం.సంప్రదాయబద్ధంగా జరిగే చాలా పెళ్లిళ్లలో పెళ్లికి ముందు వధూవరుల తల్లిదండ్రులు కట్న కానుకలు, లాంఛనాలు తదితర ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి లెక్కలు మాట్లాడుకుంటారు. ఇదంతా పెళ్లిచూపుల సమయంలో జరిగే వ్యవహారం. పెద్దల ద్వారానో, తెలిసిన మధ్యవర్తుల ద్వారానో పెళ్లి సంబంధం ప్రస్తావన వస్తే, పెళ్లిచూపులకు ముందే జరిగే తతంగం ఇంకొకటి ఉంది. అదే వధూవరుల జాతక పరిశీలన, నిపుణులైన జ్యోతిష సిద్ధాంతుల ద్వారా వధూవరుల జాతకాలను పరిశీలిస్తారు. వధూవరులకు జత కలవాలంటే, వారిద్దరి జాతకాలూ కలవాల్సిందేనని చాలామంది నమ్ముతారు. అందుకే, వధూవరులు ఇద్దరి జాతకాలూ సరిపోతాయని సిద్ధాంతులు నిర్ధారించిన తర్వాత మాత్రమే పెళ్లిచూపుల వరకు వెళతారు. జాతకాలలో ఏవైనా దోషాలు ఉన్నట్లు చెబితే, పెళ్లికి ముందు పరిహారాలు చేయించుకుంటారు. జాతకాలు ఏమాత్రం సరిపోవని సిద్ధాంతులు తేల్చేస్తే, పెళ్లిచూపుల వరకు వెళ్లకుండానే విరమించుకుంటారు.పెళ్లి సంబంధాలు ప్రస్తావనకు వచ్చినప్పుడు చాలామంది మొదటగా వధూవరుల జాతకాలను పరిశీలన కోసం జ్యోతిష సిద్ధాంతులను సంప్రదిస్తారు. వారి సలహాలు, సూచనల మేరకే తర్వాతి కార్యక్రమాల కోసం సన్నాహాలు చేసుకుంటారు. పెళ్లికి ముందు వధూవరుల జాతకాలను పరిశీలించే సంప్రదాయం మన దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఉంది. అలాగని, ఇది కేవలం మన భారతదేశానికి మాత్రమే పరిమితమైన సంప్రదాయం కాదు, పలు ఇతర దేశాల్లోనూ ఉంది. వేర్వేరు దేశాల్లో వేర్వేరు జ్యోతిష పద్ధతులు ఉన్నాయి. ఆయా దేశాల వారు తమ తమ జ్యోతిష పద్ధతుల ఆధారంగా పెళ్లికి ముందు వధూవరుల జాతకాలను పరిశీలించి, ఆ తర్వాత పెళ్లిళ్లకు సిద్ధపడతారు. పెళ్లిళ్ల కోసం జాతకాల పరిశీలన చరిత్ర, సంప్రదాయాల గురించి తెలుసుకుందాం.జాతకాల్లో ఏమేం పరిశీలిస్తారు?వధూవరుల జాతకాలు పరస్పరం పొంతన సరిపోయేదీ లేనిదీ నిర్ధారించేందుకు మన దేశంలోని జ్యోతిషులు ‘అష్టకూట గుణ మేళనం’ అనే పద్ధతిని అనుసరిస్తారు. ఈ పద్ధతిలో వధూవరుల జాతకాలలోని నాడీ కూటమి, భకూటమి, గణ కూటమి, మైత్రీ కూటమి,యోని కూటమి, తారా కూటమి, వశ్య కూటమి, వర్ణ కూటమి అనే ఎనిమిది అంశాల పొంతనను పరిశీలిస్తారు. ఈ అంశాలకు మొత్తం 36 గుణాలను కేటాయిస్తారు. వధూవరుల జాతకాలు రెండింటినీ పరిశీలించినప్పుడు ఈ ఎనిమిది అంశాల్లో కనీసం 18 గుణాలు వచ్చినట్లయితేనే, వధూవరుల జాతకాల్లో పొంతన కుదిరినట్లు చెబుతారు. వధూవరుల జాతకాల గుణమేళనంలో 18–25 గుణాలు మధ్య వచ్చినట్లయితే సామాన్యమైన పొంతనగా, 25 గుణాల కంటే ఎక్కువగా వచ్చినట్లయితే ఉత్తమమైన పొంతనగా చెబుతారు. ఉత్తర భారతదేశంలో ఈ పద్ధతిని ఎక్కువగా అనుసరిస్తారు.దక్షిణ భారతదేశంలో మరో నాలుగు అంశాలను కూడా పరిశీలిస్తారు. అవి: మహేంద్ర కూటమి, స్త్రీ దీర్ఘకూటమి, రజ్జు కూటమి, వేధ కూటమి. వధూవరుల జాతకాల పరిశీలనలో గుణ మేళనం కీలకమే అయినా, దీనితో పాటు గ్రహమైత్రి తదితర మరికొన్ని అంశాలను కూడా జ్యోతిషులు పరిశీలిస్తారు. కుజ దోషం, కాలసర్పదోషం, పితృదోషం వంటి దోషాలు ఉన్నట్లయితే, తగిన పరిహారాలను సూచిస్తారు. వివాహానికి ముందే దోష పరిహారాలు చేయించుకున్నట్లయితే, ఉపశమనం కలుగుతుందని నమ్ముతారు. అన్నీ కుదిరి, వధూవరుల ఉభయ కుటుంబాలవారు వివాహానికి నిశ్చయించుకుంటే, నిశ్చితార్థం మొదలుకొని వివాహ క్రతువు పూర్తయ్యేంత వరకు వివిధ ఘట్టాలకు తగిన ముహూర్తాలను జ్యోతిషులు నిర్ణయిస్తారు. అందుకే, పెళ్లిళ్ల సీజన్లో జ్యోతిష సిద్ధాంతులకు దేశవ్యాప్తంగా విపరీతమైన గిరాకీ ఉంటుంది.శరవేగంగా జ్యోతిష వ్యాపారంఆ ధునికత పెరిగే కొద్ది జ్యోతిషంపై జనాల్లో నమ్మకం అంతకు మించి పెరుగుతూ వస్తోంది. మన దేశంలోని జ్యోతిషులు కూడా ఎప్పటికప్పుడు సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారు. వెబ్సైట్లు, యాప్‌ల ద్వారా జ్యోతిషానికి సంబంధించిన రకరకాల సేవలను అందిస్తున్నారు. కొందరు జ్యోతిషులు టీవీ చానెళ్లు, పత్రికల్లో విరివిగా ప్రకటనలు కూడా గుప్పిస్తున్నారు. ఇంకొందరు టీవీ చానెళ్లు, పత్రికల్లో రాశిఫలాలను చెప్పడం ద్వారా వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నారు. ‘బిజినెస్ రీసెర్చ్ ఇన్సైట్స్’ నివేదిక ప్రకారం 2023 నాటికి మన దేశంలో జ్యోతిషుల వ్యాపారం 3.22 బిలియన్ డాలర్ల మేరకు (దాదాపు రూ.28 వేల కోట్లు) జరిగింది. ఈ వ్యాపారం 2032 నాటికి 23.87 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.2.07 లక్షల కోట్లు) చేరుకోగలదని అంచనా. మన దేశంలోని జ్యోతిష వ్యాపారం 24.93 శాతం సగటు వార్షిక వృద్ధి రేటుతో దూసుకుపోతున్నట్లు ‘బిజినెస్ రీసెర్చ్ ఇన్సైట్స్’ చెబుతోంది. ఐటీరంగం నమోదు చేసుకుంటున్న వార్షిక వృద్ధి రేటు కంటే ఇది చాలా ఎక్కువగా ఉండటం విశేషం.ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే, జ్యోతిష వ్యాపారం విలువ 2024 నాటికి 14.30 బిలియన్ డాలర్లుగా (రూ.1.24 లక్షల కోట్లు) నమోదైంది. ఇది 2034 నాటికి 25.61 బిలియన్ డాలర్లకు (రూ.2.23 లక్షల కోట్లు) చేరుకోగలదని ‘మార్కెట్ రీసెర్చ్ ఫ్యూచర్’ అంచనా వేస్తోంది. పెళ్లిళ్ల సీజన్లో జ్యోతిషులకు రాబడి ఇబ్బడి ముబ్బడిగా ఉంటుంది. వధూవరుల గుణమేళన కోసం జాతకాల పరిశీలనకు మన దేశంలో జ్యోతిషులు సగటున రెండువేల నుంచి మూడువేల రూపాయల వరకు వసూలు చేస్తుంటారు. చిన్న చిన్న పట్టణాలు, పల్లెల్లోని జ్యోతిషులైతే, ఈ పనికి ఐదువందల రూపాయలతో సరిపెట్టుకుంటుంటే, పెద్ద నగరాల్లోని పేరుమోసిన జ్యోతిషుల్లో కొందరు పదివేల రూపాయలకు పైబడి రుసుము వసూలు చేస్తున్నారు. వివాహ ముహూర్త నిర్ణయం, దోష పరిహార సలహాలు, పూజలు వంటి వాటికి రుసుము అదనంగా ఉంటుంది. కొందరు జ్యోతిషులు ఈ సేవలను ఆన్లైన్ ద్వారా అందిస్తుంటే, చాలామంది ముఖాముఖిగా అందిస్తున్నారు.ఆసియా దేశాల్లో..భారత ఉపఖండ ప్రాంతంలోనే కాకుండా, పలు ఆసియా దేశాల్లోనూ జ్యోతిషంపై ప్రజలకు నమ్మకాలు ఉన్నాయి. సంప్రదాయబద్ధంగా చేసుకునే పెళ్లిళ్లలో జాతకాల పరిశీలనను ఆ దేశాల్లోని ప్రజలు కూడా కీలకంగా భావిస్తారు. మయాన్మార్, చైనా, మంగోలియా, టిబెట్, తైవాన్, కంబోడియా, జపాన్ తదితర దేశాల్లోని ప్రజలు స్థానిక సంప్రదాయాలకు అనుగుణంగా పెళ్లిళ్లు వంటి ముఖ్యమైన కార్యక్రమాలకు ముందు జ్యోతిషులను సంప్రదిస్తుంటారు. దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాల్లో ఎక్కువగా పురాతన చైనీస్ జ్యోతిష పద్ధతిని అనుసరిస్తారు. మన జ్యోతిషంలో పన్నెండు రాశులకు పన్నెండు చిహ్నాలు ఉన్నట్లే, చైనీస్ జ్యోతిషంలోనూ పన్నెండు చిహ్నాలు ఉంటాయి. మన దేశంలో జ్యోతిషులు చాంద్రమానాన్ని, సౌరమానాన్ని అనుసరిస్తుంటారు. సూర్య చంద్రుల గమనాన్ని బట్టి తిథి నక్షత్రాలను లెక్కిస్తారు. చైనీస్ జ్యోతిష విధానంలో ఒక్కో సంవత్సరానికి ఒక్కో చిహ్నం ఉంటుంది. చైనీస్ నూతన సంవత్సరం రోజు నుంచి వారికి సంవత్సరం మొదలవుతుంది. చైనీస్ పద్ధతిలో ఎలుక, ఎద్దు, పులి, కుందేలు, డ్రాగన్, పాము, గుర్రం, మేక, కోతి, కోడిపుంజు, కుక్క, పంది ఒక్కో సంవత్సరానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. ప్రతి పన్నెండేళ్లకు ఇవి పునరావృతమవుతూ ఉంటాయి. ఉదాహరణకు ఈ ఏడాది 2025 చైనాకు ‘పాము’ సంవత్సరం. చైనీస్ జ్యోతిషం ప్రకారం ఈ సంవత్సరం పుట్టిన వారికి ‘ఎద్దు’, ‘కోడిపుంజు’ సంవత్సరాలలో పుట్టినవారితో వివాహం అనుకూలంగా ఉంటుంది. ‘పులి’, ‘గుర్రం’, ‘పంది’ సంవత్సరాలలో పుట్టిన వారితో వివాహం వీరికి అంతగా పొసగదు.జపాన్‌లో ‘అస్జిక్కన్ జునిషి’ అనే సంప్రదాయ జ్యోతిష పద్ధతిని పాటిస్తారు. వీరు కూడా చైనా కేలండర్ మాదిరిగా పన్నెండు చిహ్నాలను ఉపయోగిస్తారు. పన్నెండు చిహ్నాలతో కూడిన రాశి చక్రాన్ని ‘జునిషి’ అని పిలుస్తారు. చైనా పద్ధతిలో మేక ఉంటే, జపాన్ పద్ధతిలో గొర్రెను; చైనా పద్ధతిలో పంది ఉంటే, జపాన్ పద్ధతిలో ముళ్లపందిని ఉపయోగిస్తారు. వివాహ పొంతనకు దాదాపు చైనా పద్ధతినే అనుసరిస్తారు. చైనా సంప్రదాయంలో చాంద్రమానం ఆధారంగా కేలండర్‌ను రూపొందించుకుంటారు. జపాన్‌లో గ్రెగేరియన్ కేలండర్‌ను ఉపయోగిస్తారు. జపాన్ సమాజంలో జ్యోతిషంపై పెద్దగా పట్టింపులు లేకున్నా, పెళ్లిళ్లకు ముందు ప్రేమజంటలు జ్యోతిషులను సంప్రదిస్తుంటారు.మయాన్మార్లో మరోరకమైన జ్యోతిష పద్ధతిని పాటిస్తారు. వారంలోని ఏడు రోజులకు ఏడు జంతువుల పేరుతో గుర్తిస్తారు. వాటి ఆధారంగా ఎవరితో ఎవరికి పెళ్లి జరిగితే అనుకూలమో నిర్ణయిస్తారు. బర్మీస్ ప్రాచీన జ్యోతిష పద్ధతి ప్రకారం ఆదివారం– గరుడపక్షి, సోమవారం– పులి, మంగళవారం– సింహం, బుధవారం– ఏనుగు, గురువారం– ఎలుక, శుక్రవారం– గినీపంది, శనివారం– డ్రాగన్‌గా గుర్తిస్తారు. వీటితో పాటు భారతీయ జ్యోతిషంలో మాదిరిగానే పన్నెండు రాశులను, ఇరవై ఏడు నక్షత్రాలను, నవగ్రహాలను అనుసరించి జాతక చక్రాలు వేస్తారు. అన్ని అంశాలనూ తమ శాస్త్రం ప్రకారం పరిశీలించి, వధూవరులకు జాతక పొంతన బాగున్నదీ లేనిదీ నిర్ణయిస్తారు. పెళ్లిళ్లకు ముందు జ్యోతిషులను సంప్రదించే సంప్రదాయాన్ని మయాన్మార్లో ఇప్పటికీ పాటిస్తారు.పాశ్చాత్య దేశాల్లో.. ఆ సియా దేశాలతో పోల్చుకుంటే పాశ్చాత్య దేశాల్లో జ్యోతిషాన్ని నమ్మేవారి సంఖ్య కొంత తక్కువే అయినా, ఇప్పటికీ జ్యోతిషాన్ని నమ్మేవారు లేకపోలేదు. ప్రస్తుతం లండన్ సహా పలు యూరోపియన్ నగరాల్లో రకరకాల సేవలు అందిస్తున్న జ్యోతిషులు ఉన్నారు. వెబ్సైట్లు, యాప్‌లు వంటి అధునాతన సాధనాల ద్వారా వీరు తమ సేవలను వివిధ రంగాలకు విస్తరిస్తున్నారు. యూరోపియన్ దేశాల్లో పెద్దలు కుదిర్చే సంప్రదాయ వివాహాలు తక్కువే అయినా, పెళ్లికి ముందు చాలామంది ప్రేమికులు తమ అన్యోన్యతను గురించి ముందుగానే తెలుసుకోవడానికి జ్యోతిషులను సంప్రదిస్తుంటారు. మెసపటేమియన్ నాగరికత కాలంలో అభివృద్ధి చెందిన జ్యోతిష విధానం కాలక్రమంలో పాశ్చాత్య దేశాలన్నింటిలోనూ విస్తరించింది. మధ్యయుగాల కాలం వరకు పాశ్చాత్య ప్రపంచంలో జ్యోతిషుల ప్రభావం ఎక్కువగా ఉండేది. క్రైస్తవ మత గురువుల ఆంక్షల వల్ల ఆ దేశాల్లో జ్యోతిషానికి ప్రాభవం సన్నగిల్లింది. ప్రాచీన రోమన్ శాస్త్రవేత్త క్రీస్తుపూర్వం రెండో శతాబ్దిలో రాసిన ‘టెట్రాబిబ్లోస్’ పాశ్చత్య ప్రపంచంలోని తొలి జ్యోతిష గ్రంథం. పాశ్చాత్య జ్యోతిషంలోనూ మన మాదిరిగానే పన్నెండు రాశులు ఉంటాయి. ఈ పద్ధతిలో సౌర గమనం ప్రకారం రాశులను గణిస్తారు.కుజ, శుక్ర గ్రహాల స్థానాలు, జన్మరాశుల ఆధారంగా వధూవరుల జాతకాల పొంతనను నిర్ణయిస్తారు.ఆఫ్రికా దేశాల్లో.. ఆ ఫ్రికా దేశాల్లో స్థానిక తెగల ప్రజలు రకరకాల ఆచారాలను, సంప్రదాయాలను పాటిస్తారు. వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు జ్యోతిష పద్ధతులను పాటిస్తారు. వలస పాలనల ప్రభావంతో ఆఫ్రికాలో పాశ్చాత్య జ్యోతిషానికి, భారతీయ జ్యోతిషానికి ఆదరణ పెరిగింది. అయితే, ‘అయోదెజి ఒగున్నయికె’, ‘ఇఫా’ అనేవి ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా వ్యాప్తిలో ఉన్న స్థానిక సంప్రదాయ జ్యోతిష పద్ధతులు. ‘అయోదెజి ఒగున్నయికె’ అనేది ఒకరకమైన ‘భూ భవిష్యవాణి’. అంతరిక్షంలోని గ్రహాలు, నక్షత్రాల చలనాన్ని కాకుండా, భూమిపై నిత్యం కనిపించే నేల, కొండలు, చెట్లు చేమలు, జీవరాశులు వంటివాటిని శకునాలుగా పరిగణించి, వాటి ఆధారంగా భవిష్యవాణి చెబుతారు. ఈ పద్ధతిలో ప్రధానంగా పదహారు చిహ్నాల పట్టికను ఉపయోగిస్తారు. శిశువు పుట్టినప్పుడు కనిపించే వాటి ఆధారంగా ఈ చిహ్నాలతో జాతక చక్రాన్ని రూపొందిస్తారు. ‘ఇఫా’ జ్యోతిష పద్ధతి పశ్చిమాఫ్రికా దేశాలలో వ్యాప్తిలో ఉంది. ఈ పద్ధతిలో 256 సంప్రదాయ సంకేతాల పట్టిక ఆధారంగా, జ్యోతిషం చెబుతారు. ఇందులో నేల మీద గవ్వలు వేసినట్లుగా, నేల మీద లేదా పళ్లెంలో పరిచిన పిండిలో పోకలను వేసి, వాటి సంఖ్య ఆధారంగా పట్టికలోని సంకేతాలను గుర్తించి, జ్యోతిషం చెబుతారు. సంప్రదాయ వివాహాల్లో వధూవరుల మధ్య పొంతనను తెలుసుకునేందుకు ఆఫ్రికన్ స్థానిక తెగల ప్రజలు ఈ జ్యోతిషులను సంప్రదించి, వారి సలహాలను పాటిస్తారు. -
జాగ్రత్త పడకుంటే విడాకులే..!
అమెరికాలో విడాకుల లాయర్‌గా పేరుబడిన జేమ్స్ శాక్స్ట్టన్. విడాకులు పెరగడానికి కారణం ‘స్లిప్పేజ్ అన్నాడు. పెళ్లయిన కొన్నాళ్ల తర్వాత భార్యాభర్తలు ఒకరినొకరు పట్టించుకోక చూపే లెక్కలేనితనాలే ఒకనాటికి ‘విడాకులు’గా మారుతున్నాయని హెచ్చరించాడు. ‘నా ఉద్యోగం, పిల్లలు, సంపాదన...వీటన్నింటి కన్నా ముందు నువ్వే నాకు ముఖ్యం’ అని భార్య/భర్త ఒకరికొకరు తరచూ చెప్పుకోకపోతే చర్యలతో చూపకపోతే విడాకులకు దగ్గరపడ్డట్టే అంటున్నాడు. స్లిప్పేజ్ లక్షణాలు మీలో ఉన్నాయా..?ఒకరోజు ఉదయాన్నే మీరు బట్టలు ధరిస్తుంటే అవి బిగుతుగా కనబడతాయి. వేసుకోవడానికి పనికి రానట్టుగా ఉంటాయి. ఏమిటి... ఇంత లావై΄ోయానా అనుకుంటారు. ఈ లావు రాత్రికి రాత్రి వచ్చిందా? కాదు. సంవత్సరాలుగా మీరు నిర్లక్ష్యంగా తిన్నది, వ్యాయామాన్ని పట్టించుకోనిది పేరుకుని ఇప్పుడు ఇలా బయటపడింది. మీ జీవన భాగస్వామి ఒక ఉదయాన వచ్చి మనం విడాకులు తీసుకుందాం అనంటే అది అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. ఎన్నో సంవత్సరాల నిర్లక్ష్యాల ఫలితం’ అంటున్నాడు జేమ్స్ శాక్స్టన్. అమెరికాలో విడాకుల లాయర్‌గా పేరుగడించిన ఈయన ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో ‘స్లిప్పేజ్’ అనే మాట వాడాడు. పెళ్లయ్యాక ఏది ముఖ్యమో, ఏది అక్కడ అవసరమో అది వయసు గడిచేకొద్దీ ‘స్లిప్’ చేసుకుంటూ వెళితే ఎదురయ్యేది విడాకులే అంటాడతను. ఇతని మాటల ఆధారంగా వివిధ మ్యారేజ్ కౌన్సిలర్లు తమ వ్యాఖ్యానం వినిపిస్తున్నారు.మీ పెళ్లయ్యాక ఇలా చేస్తున్నారా?అతడు/ఆమె ఇష్టాఇష్టాలను ‘ఏం పర్లేదులే’ అనే ధోరణిలో ఖాతరు చేయకపోవడం.చిన్న చిన్న కోరికలు పట్టించుకోకపోవడంతగిన సమయం ఇవ్వకపోవడంసంభాషించకపోవడంమాటల్లేని రోజులను పొడిగించడంఅసంతృప్తులను బయటకు చెప్పకుండా కప్పెట్టి రోజులు వెళ్లబుచ్చడం..ఇలాంటివి జరుగుతుంటే త్వరలోనే వివాహ బంధం బ్రేక్ కానుందని అర్థం.ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?మీరు కేవలం రోజువారి పైపై మాటలే మాట్లాడుకుంటున్నారా?లోతైన, ఆత్మీయమైన సంభాషణలే చేసుకోవడం లేదా?సన్నిహితమైన సమయాలే ఉండటం లేదా?సమస్యాత్మక విషయాలను చర్చకు పెట్టకుండా తప్పించుకు తిరుగుతున్నారా?ఇలా ఉన్నా మీ వివాహం ప్రమాదంలో ఉన్నట్టే అంటున్నారు నిపుణులు.మంచి తల్లిదండ్రులైతే సరిపోదుచాలామంది దంపతులు తాము మంచి తల్లిదండ్రులుగా ఉండటం ముఖ్యమనే దశకు వెళతారు. పిల్లలతో అనుబంధం గట్టిగా ఉంటే భార్యాభర్తల బంధం కూడా గట్టిగా ఉంటుందని అనుకుంటారు. అయితే ఇలా ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతుంది అంటున్నారు నిపుణులు. ‘నేను, నా ఉద్యోగం, నా పిల్లలు, నా సంపాదన ఆ తర్వాతే జీవిత భాగస్వామి అనుకుంటారు చాలామంది. వాస్తవానికి జీవిత భాగస్వామి ముందు ఉండాలి. మనం చేస్తున్నదంతా భార్య/భర్త కోసమే అనుకుని నిర్లక్ష్యం వహిస్తే భార్య/భర్త దూరమవుతారు. పిల్లలు, కెరీర్ కంటే ముందు భార్యాభర్తలుగా మన బంధం ముఖ్యం అని ఇద్దరూ ఒకరికొకరు చెప్పుకోవాలి... ఆ విధంగా రిలేషన్‌ను కాపాడుకోవాలి’ అంటున్నారు నిపుణులు.ఇలా చేయండి..మీ జీవిత భాగస్వామి పట్ల అక్కరగా ఉండండి.తరచూ ఎక్కువగా మాట్లాడండి. మంచి సమయాన్ని గడపండి.ఆర్థిక విషయాలు దాచకుండా చర్చిస్తూ ఇష్టాఇష్టాలు గమనించండి.మీ భార్య/భర్త ఒక గట్టి పాయింట్ లేవదీసి మిమ్మల్ని నిలదీస్తే తప్పించుకోకుండా దానిపై ఇవ్వాల్సిన వివరణ ఇచ్చి ముగించండి. లేకుంటే అది పెరుగుతూనే ఉంటుంది.మీరు భార్య లేదా భర్త. అంటే వివాహ బంధంలో మీవంటూ కొన్ని బాధ్యతలు తప్పనిసరిగా ఉంటాయి. ఆ బాధ్యతలను మీరు నిర్లక్ష్యం చేస్తే ఆ బంధం గట్టిగా ఉంటుందని భావించండంలో లాజిక్ లేదు.పెళ్లి తనకు తానుగా నిలబడదు. కాని మీరు నిర్లక్ష్యం చేస్తే తనకు తానుగా విఫలమవుతుంది. కాబట్టి చెక్ చేసుకోండి. (చదవండి: ఎగ్ ఫ్రీజింగ్' అంటే..? ఉపాసన, నటి మెహ్రీన్ , తానీషా ముఖర్జీ అంతా..!) -
తమ్ముడి పెళ్లిలో సాయిపల్లవి డ్యాన్స్.. వీడియో వైరల్
ప్రస్తుతం సాయిపల్లవి టైమ్ నడుస్తోంది. గతేడాది 'అమరన్' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టగా.. రీసెంట్ గా 'తండేల్'తో మరో హిట్ కొట్టింది. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ 'రామాయణ' చేస్తోంది. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుని సోదరుడు పెళ్లికి హాజరైంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)సాయిపల్లవికి పూజా కన్నన్ అనే చెల్లి ఉంది. గతేడాది పూజకు పెళ్లి జరిగింది. ఆ వేడుకలో సాయిపల్లవి ఫుల్ సందడి చేసింది. డ్యాన్సులు, ఫొటోలు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. ఇప్పుడు కజిన్ బ్రదన్ జిత్తుకి పెళ్లి జరగ్గా సాయిపల్లవి హాజరైంది. నీలం చీరలో బుట్టబొమ్మలా ఉంది.అలానే సాయిపల్లవి తన బంధువులతో కలిస సాంప్రదాయ పాటలకు స్టెప్పులు కూడా వేసింది. దీనికి తోడు పెళ్లికి హాజరైన పలువురు.. ఈమెతో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి. పెళ్లికి వచ్చింది గానీ సాయిపల్లవి తన ఇన్ స్టాలో ఎక్కడా ఫొటోల్ని, వీడియోలని పోస్ట్ చేయలేదు. ఫ్యాన్ పేజీల్లో వాటిని అందరూ పోస్ట్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: పెళ్లి రిసెప్షన్ లో ఫుల్ హ్యాపీగా సితార-నమ్రత-చరణ్)#Saipallavi #SaiPallavi @Sai_Pallavi92 dancing at her cousin bro wedding ! Performing baduga dance ritual. ♥️🔥💃pic.twitter.com/dbMPwO8TNR— shruthi (@shruthisundar01) March 11, 2025You are my MALAR FOREVER..🥹♥️#SaiPallavi #SaiPallaviBrotherMarriage pic.twitter.com/Hpg9U00BrN— Sai Pallavi FC™ (@SaipallaviFC) March 11, 2025#SaiPallavi ❤️ at #SaiPallaviBrotherMarriageJITHU ♥️ROOPApic.twitter.com/aeRj7OiITe— Saran (@rskcinemabuff) March 11, 2025 -
తండ్రి మృతదేహం సాక్షిగా వివాహం
సాక్షి, చెన్నై: మరికొన్ని గంటల్లో కుమారుడి వివాహం జరగబోనుండగా.. తండ్రి గుండెపోటుతో(Heart attack) కుప్పకూలిపోయాడు. సాధారణంగా అయితే వివాహాన్ని వాయిదా వేస్తుంటారు. అంతటి దుఃఖంలోనూ వరుడి తల్లి స్పందించి.. తన భర్త నిర్ణయాన్ని అమలు చేశారు. ఆయన మృత దేహం సాక్షిగా కుమారుడి వివాహం జరిపించారు. వివరాలు.. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా పేరుగోపనపల్లికి చెందిన వరదరాజ్ (60) దుస్తుల వ్యాపారం చేస్తుండగా.. అతని భార్య మంజుల గృహిణి. వీరి కుమారుడు మనీశ్‌కు బర్గూరు చెందిన గోవిందరాజులు, శివశంకరిల కుమార్తె కావ్య ప్రియకు సోమవారం వివాహం జరగాల్సి ఉంది. ఆదివారం రాత్రి వివాహానికి సంబంధించిన వేడుక నిర్వహించారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న వరుడి తండ్రి వరదరాజ్ హఠాత్తుగా కుప్పకూలాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి.. వరద రాజ్ గుండెపోటుతో మరణించినట్లు తెలిపారు. దీంతో వధూవరుల కుటుంబసభ్యులు, బంధువులు షాక్ గురయ్యారు. వివాహాన్ని వాయిదా వేద్దా మంటూ సలహాలు ఇచ్చారు. కానీ వరుడి తల్లి మంజుల స్పందించి.. పెళ్లి (marriage) కుదరగానే తన భర్త ఎంతో సంతోషించాడని కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన నిర్ణయం ప్రకారం వివాహ తంతు పూర్తి చేస్తే.. తన భర్త ఆత్మకు శాంతి కలుగు తుందన్నారు. దీంతో గ్రామ పెద్దలు, వధూవరుల కుటుంబసభ్యులు, బంధువులు చర్చించుకొని.. వివాహానికి అంగీకారం తెలిపారు. అనంతరం వరదరాజ్ మృతదేహం సాక్షిగా వరుడు మనీశ్ వధువు మెడలో తాళి కట్టాడు. అనంతరం వరదరాజ్ అంత్యక్రియలు నిర్వహించారు.Video Credit To Polimer News -
బీఆర్ఎస్ యువ కార్పొరేటర్ హేమ సామల వివాహ వేడుకలో ప్రముఖుల సందడి (చిత్రాలు)
-
అనాథ యువతి పెళ్లికి అన్నీ తామై..
కరీంనగర్: అనాథ యువతి పెళ్లికి పెద్దగా వ్యవహరించి మంచి మనసు చాటుకున్నారు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి. మహిళాభివృద్ధి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలసదన్‌కు చెందిన అనాథ యువతి మౌనిక వివాహాన్ని ఆదివారం కళాభారతిలో నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, అధికారులు పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. తల్లిదండ్రులు లేని మౌనికను 2017లో కరీంనగర్ బాలసదనంలో చేర్పించారు. అక్కడి అధికారులు ఆమెకు చదువు చెప్పించడంతోపాటు ఆలనాపాలన చూసుకున్నారు. ఎంపీహెచ్‌డబ్ల్యూ ఇంటర్న్‌షిప్ చేస్తున్న సమయంలో.. మౌనికకు పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన సాయితేజతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. విషయాన్ని యువతి అధికారులకు చెప్పడంతో యువకుని కుటుంబసభ్యులతో మాట్లాడారు. వారంతా అంగీకరించడంతో మహిళ, శిశు సంక్షేమశాఖ అధికారులు మౌనికకు పెళ్లి నిశ్చయించారు. దగ్గరుండీ పెళ్లి జరిపించిన కలెక్టర్ పమేలా సత్పతి.. వధూవరులకు నూతన వ్రస్తాలు బహూకరించారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అతిథులకు భోజనాలు ఏర్పాటు చేయించారు. వివాహానికి జిల్లా జడ్జి, మహిళా సంక్షేమ శాఖ అధికారులు, ఎన్జీవో నాయకులు, వివిధ శాఖల అధికారులందరూ ఆర్థిక సహాయం అందించారు. కాగా మౌనికకు ముగ్గురు చెల్లెళ్లు ఉన్నారు. Officials Became Parents: Grand Wedding of an Orphaned Young Woman was performed Karimnagar @Collector_KNR @PamelaSatpathy Satpathy and Manakondur MLA Kavvampalli Satyanarayana Organized a Wedding at KalabharatiA grand wedding ceremony was held at Kalabharati Auditorium in… pic.twitter.com/UMzBkniH0Z— Jacob Ross (@JacobBhoompag) March 9, 2025 -
అమిర్ ఖాన్‌తో పెళ్లి.. మా పేరేంట్స్ షాకయ్యారు: కిరణ్ రావు
దర్శకనిర్మాత కిరణ్‌రావు గురించి బాలీవుడ్లో పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్‌కు మాజీ భార్యగా అందరికీ సుపరిచితమే. 2005లో ఆమిర్.. కిరణ్ రావును రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఐవీఎఫ్- సరోగసి పద్ధతి ద్వారా 2011లో ఆజాద్ అనే కుమారుడు జన్మించాడు. దాదాపు 16 ఏళ్లపాటు అన్యోన్యంగా ఉన్న వీరిద్దరు 2021లో విడాకులు తీసుకున్నారు. భార్యా, భర్తలుగా విడిపోయినా స్నేహితులుగా కలిసిమెలిసి ఉంటున్నారు. కుటుంబానికి సంబంధించిన కార్యక్రమాల్లో కలిసి పాల్గొంటున్నారు. గతేడాది లపతా లేడీస్ మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు కిరణ్ రావు.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కిరణ్ రావు తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అమీర్‌ఖాన్‌తో పెళ్లి విషయం గురించి మా తల్లిదండ్రులతో చెప్పితే వారంతా షాక్‌కు గురయ్యారని తెలిపింది. నా పేరేంట్స్ ఆందోళన చెందారని వివరించింది. అంతేకాదు తన నిర్ణయాన్ని మరోసారి ఆలోచించుకోవాలని చెప్పారని వెల్లడించింది. అమీర్ గొప్ప నటుడని.. అతనికున్న పేరు, ప్రతిష్టలతో నీపై ఒత్తిడి ఉంటుందని సూచించారు. అయినప్పటికీ అమిర్ ఖాన్‌ను పెళ్లాడేందుకు నిర్ణయించుకున్నట్లు కిరణ్ రావు తెలిపారు. అమిర్ గొప్ప వ్యక్తి అని ఆమె కొనియాడారు. కాగా.. గతేడాది అమిర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ పెళ్లికి కిరణ్ రావు హాజరయ్యారు. -
తెల్లారితే పెళ్లి.. అంతలోనే బలవన్మరణం
మెట్‌పల్లిరూరల్(కోరుట్ల): తెల్లారితే వై భవంగా పెళ్లి జరగాల్సిన ఇంట్లో రోద నలు మిన్నంటాయి. మేళతాళాలతో సందడి నెలకొనాల్సిన పందిట్లో చావు డప్పులతో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరి కొన్ని గంటల్లోనే పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు అర్ధంతరంగా తనువు చాలించిన విషాదకరమైన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. మెట్పల్లి మండలం వెల్లుల అనుబంధ గ్రామమైన రాంచంద్రంపేట గ్రామానికి చెందిన లక్కినపల్లి లక్ష్మి–లింబాద్రిలకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతు ళ్లు. వీరిలో ముగ్గురికి వివాహమైంది. చివరివాడై నా కిరణ్(37) మెట్‌పల్లిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్నాడు. ఇతడికి వివా హం చేయాలని నిశ్చయించిన తల్లిదండ్రులు పక్క గ్రామమైన వెల్లులకు చెందిన అమ్మాయితో పెళ్లి ఖరారు చేశారు. ఇటీవల నిశ్చితార్థం జరగ్గా.. పెళ్లి తేదీ ఈనెల 9. శుక్రవారం వధువుతో ఫొటో షూట్‌కు సైతం వెళ్లిన కిరణ్.. మ ధ్యాహ్నం తర్వాత ఇంటికొచ్చాడు. వచి్చ న నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు కుటుంబ సభ్యులు, ఇంటికొచ్చిన బంధువులతో సైతం బాగానే ఉన్నాడు. పడుకునేందుకు గదిలోకి వెళ్లాడు. ఆ తర్వాత ఏం జరిగిందో గానీ.. శనివారం ఉదయం తెల్లవారుజామున కిరణ్ సోదరికి ఫ్యాన్‌కు ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆరా తీశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం మెట్పల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కిరణ్ ఆత్మహత్యకు అతడి అనారోగ్య సమస్యలే కారణమని ఆయన తల్లిదండ్రులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అనారోగ్య సమస్యల కారణంగా పెళ్లి జరిగాక భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తాయేమోననే భయంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని ఫిర్యాదు ఇచ్చారు. కేసు నమోదు చేసినట్లు మెట్పల్లి ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు. -
పెళ్లింట తీవ్ర విషాదం..
సాక్షిప్రతినిధి, వరంగల్: బంధువులు, అతిథుల మధ్య అంగరంగ వైభవంగా కొడుకు పెళ్లి జరిపించాడు. పెళ్లింటి నుంచి సొంతింటికి వచ్చి వ్రతం చేసుకుంటున్నారు. అంతలోనే బంధువులతో కళకళలాడుతున్న ఆ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బ్రెయిన్ స్ట్రోక్‌తో పెళ్లి కొడుకు తండ్రి మృతి చెందాడు. ఈ ఘటనతో బంధువులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కుటుంబ సభ్యులు, బంధువుల కథనం ప్రకారం.. ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని సుందరయ్య కాలనీ గ్రామానికి చెందిన అక్కిసెట్టి ఏసుబాబు(48)కి భార్య కుమారి, ఇద్దరు కుమారులు హరికృష్ణ, శివ కృష్ణ ఉన్నారు. పెద్ద కొడుకు హరికృష్ణకు భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలోని సత్యనారాయణపురం గ్రామానికి చెందిన యువతితో సోమవారం(మార్చి 3) పెళ్లి జరిపించాడు. అనంతరం వధూవరులను తీసుకుని తమ ఇంటికి వచ్చాడు. మంగళవారం సత్యనారాయణ స్వామి వ్రతం జరిపిస్తున్నాడు. అదే సమయంలో తనకు అలసటగా ఉందని, వ్రతంలో కూర్చో లేనని కుటుంబ సభ్యులకు తెలిపాడు. కొత్త జంటతో పాటు వరుడి తల్లి వ్రతంలో కూర్చున్నారు. ఈ క్రమంలో ఏసుబాబు కాళ్లు, చేతులు లాక్కురావడం చూసిన బంధువులు వెంటనే ఆర్ఎంపీతో పరీక్షించగా బీపీ పెరిగినట్లు తెలిపి వెంటనే మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించాలని చెప్పాడు. దీంతో ఏటూరు నాగారం తీసుకు వెళ్లగా పరిస్థితి ప్రమాదకరంగా ఉందని వరంగల్ తీసుకెళ్లాలని అక్కడి ప్రైవేట్ వైద్యుడు తెలుపగా వెంటనే వరంగల్ ఎంజీఎం తరలించారు. వైద్యం చేస్తుండగా బుధవారం మృతి చెందాడు. దీంతో కుటుంబీకులు, బంధువులు బోరున విలపించారు. -
ఒకే కులం పెళ్లిళ్లతోనూ వ్యాధులు
సాక్షి, హైదరాబాద్: ‘బంధువుల అమ్మాయే. అన్నీ కుదిరాయి. అందుకే చేసుకుంటున్నాం.. మా కులపువాళ్లే. అమ్మాయి బాగుంటుంది. సంబంధం ఖాయం చేశాం.. పెళ్లిళ్ల విషయంలో ఈ రకమైన మాటలు తరచూ వింటూనే ఉంటాం. అయితే ఈ రకంగా దగ్గరి చుట్టాలు, ఒకే కులంలో పెళ్లిళ్ల వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అంటున్నారు సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు. కొన్ని కులాల వారికి కొన్ని రకాల వ్యాధులు వారసత్వంగా వస్తాయని గతంలో జరిగిన పరిశోధనల్లో తేలింది. సీసీఎంబీ (CCMB) శాస్త్రవేత్త డాక్టర్ కె.తంగరాజ్ బృందం ఇటీవల నిర్వహించిన అధ్యయనం కూడా ఈ విషయాన్ని నిర్ధారించింది.ఒకే కులం (Same Caste)లో ఎక్కువగా పెళ్లిళ్లు చేసుకోవడం (కులాలతో పాటు చిన్నచిన్న సమూహాలకు కూడా ఇది వర్తిస్తుంది) వల్లనే ఆయా కులాల వారికి కొన్ని రకాల జబ్బులు వారసత్వంగా వస్తున్నాయని ఈ అధ్యయనం చెబుతోంది. నాలుగు వేర్వేరు సమూహాలకు చెందిన 281 మంది జన్యు క్రమాలను పరిశీలించి ఈ నిర్ధారణకు వచ్చినట్టు తంగరాజ్ తెలిపారు. జబ్బులకు వాడే మందులు కొన్ని సమూహాల్లో ఎందుకు భిన్నమైన ప్రభావం చూపుతాయనే అంశాన్ని కూడా పరిశీలించామని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్ ప్రతీసా మచ్చ తెలిపారు.కీళ్లు, వెన్ను, లిగ్మెంట్లలో వాపు/మంటకు కారణమయ్యే స్పాండిలైటిస్‌కు ఒక నిర్దిష్ట జన్యుపరమైన మార్పుతో సంబంధం ఉందని చెప్పారు. HLA& B27:04 అని పిలిచే ఈ జన్యు మార్పు కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఒక ప్రాంతంలో ఒక సామాజికవర్గం వాళ్లలో ఈ స్పాండిలైటిస్ (spondylitis) ఎక్కువగా ఉందని గుర్తించినట్లు కిమ్స్ ఆసుపత్రి (KIMS Hospital) రుమటాలజిస్ట్ డాక్టర్ శరత్ చంద్రమౌళి వీరవల్లి వెల్లడించారు. కొన్ని కులాలు, సమూహాలకే ప్రత్యేకమైన వ్యాధుల జన్యు రూపాంతరాలను కూడా గుర్తించినట్లు వివరించారు. ఆయా సమూహాల్లోని వారు ఈ వ్యాధులకు వాడే ఔషధాలు ఇతరులలో కంటే భిన్నంగా పని చేస్తాయని సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్ దివ్య తేజ్ పేర్కొన్నారు. చదవండి: పాపం శిరీష.. ఆడపడుచు కపట ప్రేమకాటుకు బలైంది -
పెళ్లి ముద్దు,పిల్లలొద్దు ఎందుకంటే..అక్కడి యువత
పిల్లలను కనకూడదని యుక్తవయసులోనే నిర్ణయించుకుంటున్నవారి సంఖ్య రానురానూ పెరుగుతోంది. మన దేశంలో ఇప్పుడిప్పుడే కనిపిస్తోన్న ఈ పంధా... సింగపూర్‌లో ఓ రేంజ్లో విజృంభిస్తోంది. పిల్లలను కనే వయసు దాటిపోతున్నా అనేకమంది వివాహిత స్త్రీలు నిర్లిప్తంగా ఉంటూ చివరకు సంతానం లేకుండా మిగిలిపోతున్నారుగత 2024లో 40 నుంచి 49 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళల్లో 15 శాతం మందికి పిల్లలు లేరని సింగపూర్‌కి చెందిన స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ గత ఫిబ్రవరి 18న, గణాంకాలను విడుదల చేసింది. ఇది 2004లో 7.1 శాతం కంటే రెట్టింపు కాగా, అయితే ఇది 2014లో ఈ సంఖ్య 11.2 శాతంగా ఉంది. సింగపూర్‌లోని ఇన్సి్టట్యూట్ ఆఫ్ పాలసీ స్టడీస్ సీనియర్ రీసెర్చ్ ఫెలో టాన్ పోహ్ లిన్ మాట్లాడుతూ పిల్లలు లేని జంటల నిష్పత్తిలో పెరుగుదలను ‘చాలా వేగంగా‘ సంభవిస్తోందని అంటున్నారు.ఈ పరిస్థితిని పురస్కరించుకుని అక్కడి మీడియా స్థానికులను ఇంటర్వ్యూలు చేస్తూ కారణాలను అన్వేషిస్తోంది. పిల్లలు వద్దనుకునేందుకు సింగపూర్ వాసులను ప్రేరేపిస్తున్నవి ఏమిటి? అని ఆరాతీస్తోంది...జీవనశైలి ప్రాధాన్యతలు, ప్రతికూల బాల్య అనుభవాలు పిల్లలను పెంచే అపారమైన బాధ్యత గురించిన భయం వంటి ఇతర కారణాల వల్ల తాము పిల్లల్ని కనకూడదనే నిర్ణయం తీసుకున్నామని పలువురు ఆ ఇంటర్వ్యూల్లో వెల్లడించారు.‘‘బిడ్డను కనడం చాలా పెద్ద బాధ్యత, పైగా వారు ఎలా మారతారో తెలీదు. నేను మరొక జీవితానికి నేను బాధ్యత వహించాలని అనుకోవడం లేదు’ అని ఓ యువతి చెప్పింది. ‘‘ పిల్లలు కాదు‘నేను నా స్వేచ్ఛను నా జీవితాన్ని నేను కోరుకున్న విధంగా జీవించగల సామర్థ్యాన్ని కూడా చాలా విలువైనదిగా భావిస్తున్నాను’’ అంటూ మరొకరు చెప్పారుు. తాము ప్రయాణాలు చేస్తూ ‘జీవితాన్ని అన్వేషించడం‘ తమ లక్ష్యాలుగా జంటలు వెల్లడిస్తున్నారు. పిల్లలను కలిగి ఉండటం వల్ల తాము చేయాలనుకున్న చాలా పనులను చేయలేమని, ఉద్యోగ సెలవులను కూడా తమ కోసం వినియోగించుకోలేమని చెబుతూన్నారు. సమాన అవకాశాలతో సాధికారత పొందడం, తమ విభిన్న ఆసక్తులను కొనసాగించడం కోసం సమయాన్ని వెచ్చించడానికి తాము ఇష్టపడుతున్నామని మహిళలు చెబుతున్నారు.పిల్లల చదువుల విషయంలో తమ స్నేహితులు ఎదుర్కొనే ఒత్తిళ్లను గమనించిన తర్వాత పిల్లల్ని కనదలచుకోలేదని, నేటి ప్రపంచంలో పిల్లలను పెంచడం మునుపటి కంటే చాలా క్లిష్టంగా ఉందని వీరు అంటున్నారు. ‘‘పిల్లలను కనడానికి కాదు...పెంపకంలో నాకు తెలియనిది చాలా ఎక్కువ. పిల్లవాడు బాగుంటాడా? నేను ఆల్ రైట్ పేరెంట్ అవుతానా?’’, అనే భయాలు తమని వెంటాడుతున్నాయని చెబుతున్నారు.ఇలా పెళ్లి ఓకే కానీ పిల్లల్ని వద్దనుకుంటున్న జంటల సంఖ్య వేగంగా పెరుగుతుండడంతో సింగపూర్ ప్రభుత్వం అనేక రకాల దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న కుటుంబాలకు ప్రోత్సహిస్తూ, సింగపూర్ వాసులు ఎక్కువ మంది పిల్లలను కనేలా చేయాలని, పెద్ద కుటుంబాలకు మద్దతు ఇవ్వడానికి నిర్ణయించుకుంది.గత ఫిబ్రవరి 18న తన బడ్జెట్ ప్రసంగంలో, ప్రధాన మంత్రి లారెన్స్ వాంగ్, కొత్త పెద్ద కుటుంబాల పథకంలో భాగంగా, ఫిబ్రవరి 18న లేదా ఆ తర్వాత జన్మించిన ప్రతి మూడవ తదుపరి సింగపూర్ బిడ్డకు కుటుంబాలు 16,000 డాలర్ల వరకు అదనపు మద్దతును అందిస్తామని ప్రకటించారు. Satyababu -
పెళ్లి, మంచి ఉద్యోగం, 4 సార్లు ఓటమి : ఐఏఎస్ కాజల్ సక్సెస్ స్టోరీ
గొప్ప గొప్ప కలలు అందరూ కంటారు. కానీ సాధించాలన్న ఆశయం ఉన్నవారు, లక్ష్యంతో పని చేసిన వాళ్లు మాత్రమే తమ కలల్ని సాకారం చేసుకుంటారు. క్రమశిక్షణ, కఠోరశ్రమ సవాళ్లను స్వీకరించే లక్షణం, ఫోకస్, డెడికేషన్ ఉన్నవారే లక్ష్య సాధనలో సఫలీ కృతులౌతారు. అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటారు కాజల్ జావ్లా (Kajal Jawla). పెళ్లి, ఉద్యోగ బాధ్యతలను మోస్తూనే సివిల్స్ ర్యాంక్ సాధించి ఐఏఎస్ ఆఫీసర్‌గా నిలిచారు. స్ఫూర్తిదాకమకమైన కాజల్ జావ్లా సక్సెస్ గురించి తెలుసుకుందామా!కాజల్ జావ్లా ఉత్తరప్రదేశ్‌లోని మధురలో 2010లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్(ECE) పట్టా అందుకుంది. ఆ తరువాత ప్రముఖ ఐటీ కంపెనీ విప్రోలో ఉద్యోగం. రూ.23 లక్షల వార్షిక ప్యాకేజీ. ప్రేమించే భర్త. అందమైన కుటుంబం. కానీ ఐఏఎస్ కావాలన్న కల మాత్రం అలాగే ఉండిపోయింది. అందుకే భర్తతో మాట్లాడి, ఆయన మద్దతుతో ఐఏఎస్ కావాలనే తన సంకల్ప సాధనకు నడుం బిగించింది. ఫుల్‌టైమ్ జాబ్ చేస్తూనే ఖాళీ సమయంలో సివిల్స్ కోసం ప్రిపేర్ అయింది. కార్పొరేట్ ఉద్యోగం నుండి బయటపడి తన సహోద్యోగులు అంతా చిల్ అవుతోంటే కాజల్ మాత్రం రాత్రి ఎనిమిది గంటలకు క్యాబ్ ఎక్కి ఇంటికి వెళ్ళేది. అలా తొమ్మిదేళ్ల పాటు రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగింది.దేశంలోని అత్యంత గౌరవనీయమైన సివిల్ సర్వెంట్ల ర్యాంకులకు ఎదగాలనే అచంచలమైన సంకల్పంతో పగలూ రాత్రి కష్టపడింది. కానీ అనుకున్నది సాధించేందుకు నాలుగు సార్లు నిరాశను, ఓటమిని భరించాల్సి వచ్చింది. ప్రిలిమ్స్ క్వాలిఫై అయినప్పటికీ మెయిన్స్ క్లియర్ చేయలేకపోయింది. అయినా పట్టుదల వదలకుండా ఓర్పు, దృఢ సంకల్పంతో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)కు సిద్ధమైంది. ఐదోసారి UPSC 2018 పరీక్షలో 28వ ఆల్ ఇండియా ర్యాంక్ సాధించడంతో ఆమె కలలు నిజమయ్యాయి.భర్త మద్దతు2012లో 24 సంవత్సరాల వయసులో ఆమె UPSC సన్నాహాలు మొదలు పెట్టింది. ఆమె మొదటి ప్రయత్నం సానుకూల ఫలితాన్ని ఇవ్వలేదు, 2014 ,2016లోనూ అదే రిజల్ట్. ఈ కాలంలో, కాజల్ ఉద్యోగాలు మారడం వివాహం జరిగింది. భర్త ఆశిష్మాలిక్తో తన దీర్ఘకాలిక ఆశయాన్ని వెల్లడించింది. ఆయనిచ్చి సపోర్ట్‌తో గత వైఫల్యాల గురించి ఆలోచించ కుండా, చివరి ప్రయత్నం చేయాలని నిర్ణయించుకుంది.ఈ ప్రయాణంలో కాజల్ జావ్లాకు ఢిల్లీలోని అమెరికన్ ఎంబసీలో పనిచేసే భర్త ఆశిష్ మాలిక్ సంపూర్ద మద్దతునిచ్చాడు. ఇంటిపనుల ఉంచి మినహాయింపు నిచ్చి, భర్త తన ప్రిపరేషన్‌కు తగిన సమయం కల్పించారని స్వయంగా కాజల్ ఒక సందర్భంగా తెలిపింది. అంతేకాదు ‘ఢిల్లీలో ఒక చిన్న ఇంట్లో ఉండవాళ్లం కాబట్టి. ఇంటి పనులు తక్కువగా ఉండేవి. ఎక్కువ వంట హడావిడి లేకుండా, ఫ్యాన్సీ భోజనాలకు సాధారణ కిచిడీ లేదా సలాడ్లతో పరిపెట్టు కునే వాళ్లం. తద్వారా ఎక్కువ టైమ్ ప్రిపరేషన్‌కు దొరికేది. ఇంటిని అద్దంలా ఉంచుకోవడం గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఒక విధంగా చెప్పాలంటే.. పెళ్ళయ్యాక కూడా బ్యాచిలర్స్‌గా బతికాం’ అని చెప్పింది. ఎక్కువ సెలవులు కూడాతీసుకోకుండా, వార్షిక సెలవులను వాడుకుంది. ప్రిలిమ్స్‌కు ఒక వారం ముందు సెలవు 'మెయిన్స్' కోసం 45 రోజుల, పెర్సనల్ టెస్ట్‌కి వారం రోజులు మాత్రమే సెలవు తీసుకుంది. ప్రారంభంలో తన వైఫల్యాలకు కారణం సమయం లేకపోవడమేనని కాజల్ చెప్పింది. ‘సమయం చాలా కీలకం. ప్రిపరేషన్‌కు సరిపడా సమయం లేకపోవడం సవాల్ లాంటిది. నా తొలి వైఫల్యానికి కారణం టైమ్ లేక పోవడమే.’ అంటూ తన అనుభవం గురించి చెప్పింది. ఓటమికి తలవంచకుండా, వైఫల్యానికి గల కారణాలను సమీక్షించుంటూ అచంలచమైన పట్టుదలతో తాను అనుకున్నది సాధించిన కాజల్ తనలాంటి వారెందరికో ప్రేరణగా నిలిచింది. -
పెళ్లి అన్నాడు, పాప పుట్టాక కాదన్నాడు...
తిరుమలాయపాలెం(ఖమ్మం): అప్పటికే ఒకరి చేతిలో మోసపోయిన ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన దగ్గరి బంధువు పాప జన్మించాక ముఖం చాటేయడంతో శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమలాయపాలెంకు చెందిన యువతికి నాలుగేళ్ల క్రితం క్రితం వివాహం జరగగా, 16 రోజులకే భర్త మరో మహిళతో వెళ్లిపోయాడు. దీంతో ఆమె తల్లిదండ్రుల వద్దే ఉంటూ జీవనం సాగిస్తోంది. రెండేళ్లుగా ఖమ్మం రూరల్ మండలం ఆరెకోడుకు చెందిన మేనత్త కుమారుడు చిర్రా హరీశ్ వీరి ఇంటికి వచ్చివెళ్లే క్రమాన ఆమె అంటే ఇష్టమని, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి శారీరకంగా దగ్గరయ్యాడు. దీంతో ఆమె గర్భం దాల్చి పాపకు జన్మనిచ్చాక తనతో ఎలాంటి సంబంధం లేదని, పాప తనకు పుట్టలేదంటూ హరీశ్ బుకాయించాడు. ఈక్రమాన ఆమె మూడు నెలల పాపను తీసుకుని హరీశ్ ఇంటికి వెళ్లగా ఆయనతో పాటు తల్లిదండ్రులు, సోదరి ఇంటికి రావొద్దని, వస్తే చంపేస్తామని బెదిరించారు. ఈమేరకు బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కూచిపూడి జగదీష్ తెలిపారు. -
డాకు మహారాజ్ బ్యూటీ గొప్ప మనసు .. ఏకంగా 251 మంది అమ్మాయిలకు!
ఈ ఏడాది డాకు మహారాజ్‌తో అభిమానులను అలరించిన ముద్దుగుమ్మ ఊర్వశి రౌతేలా. బాలకృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. అంతే కాకుండా దబిడి దిబిడి సాంగ్‌తో అభిమానులను ఆకట్టుకుంది. ఇటీవల భారత్- పాక్ క్రికెట్ మ్యాచ్‌లో మెరిసిన ముద్దుగుమ్మ మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాకుండా ఇటీవల తన పుట్టిన రోజును కూడా సెలబ్రేట్ చేసుకుంది.అయితే తన పుట్టిన రోజు సందర్భంగా ఊర్వశి రౌతేలా తన మంచి మనసును చాటుకుంది. ఊర్వశి రౌతేలా ఫౌండేషన్ తరఫున అనాథలైన అమ్మాయిలకు సామూహిక వివాహాలు జరిపించింది. ఈ మహోన్నత కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు ఆశీర్వదించారు. దాదాపు 251 జంటలకు సామూహిక వివాహం జరిపించనట్లు ఊర్వశి రౌతేలా వెల్లడించారు. అంతేకాదు తానే స్వయంగా వారికి భోజనాలు కూడా వడ్డించింది బాలీవుడ్ భామ. దీనికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్స్ ఊర్వశి చేసిన పనికి అభినందనలు తెలియజేస్తున్నారు.During Mahashivratri & her birthday Urvashi Rautela facilitated the marriages of 251 underprivileged orphaned girls along with PM @narendramodi ji & President @rashtrapatibhvn ji 🙏🏻 #NarendraModi #UrvashiRautela #DroupadiMurmu #UrvashiRautelaFoundation #BageshwarDhamSarkar pic.twitter.com/ySjcwnkI9X— URVASHI RAUTELA🇮🇳 (@UrvashiRautela) February 28, 2025 -
పెళ్లిపై రాజేష్ తికమక
-
హెచ్ఐవీ దాచి.. వివాహం చేసుకోబోయిన వరుడు
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని క్రిస్టియన్‌పేటలోని ఓ చర్చిలో తాళికట్టే సమయానికి ఏపీ ఎన్జీవోస్(AP NGOs) ప్రతినిధులు వచ్చి మంగళవారం ఓ వివాహాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా హెచ్ఐవీ డిస్ట్రిక్ ప్రాజెక్ట్ మేనేజర్ శ్యామ్సన్ అందించిన వివరాలు.. 2013లో హెచ్ఐవీ పాజిటివ్(HIV Positive) నిర్ధారణ అయి, ప్రస్తుతం 35 సంవత్సరాల వయసు ఉన్న ఓ యువకుడు ఆరోగ్యంగా ఉన్నాడు. అయితే ఓ యువతిని వివాహం చేసుకుంటున్నాడని తెలియడంతో ఆరోగ్యంగా ఉన్న యువతిని అనారోగ్యం బారిన పడకుండా కాపాడేందుకు ఏపీ ఎన్జీవోస్(AP NGOs) మహిళా ప్రతినిధులు క్రిస్టియన్‌పేట వచ్చి చర్చి పాస్టర్కు వివరించారు. అమ్మాయి బంధువులతో పెళ్లి కొడుకుకు హెచ్ఐవీ(HIV Positive) ఉందని చెప్పడంతో వారు వివాహాన్ని నిలిపివేశారు. వివాహం నిలిపివేయడంతో పెళ్లికొడుకు బంధువులు పెళ్లికూతురు బంధువులతో గొడవకు దిగారు. వివాహం చేసే పాస్టర్, హెచ్ఐవీ పాజిటివ్ ఉంటే ఎలా వివాహం జరిపిస్తామని మాట్లాడడంతో పెళ్లికొడుకు బంధువులు అక్కడ ఉన్నవారిపై దాడికి పాల్పడ్డారు. ఏపీఎన్జీవోస్ అధికారులు మేము బహిరంగం చేయాలను కోవడం లేదని, ఇక్కడ గొడవ చేయవద్దని మా వారు వేడుకుకున్నప్పటికీ వినకుండా వీరిపై దాడి చేశారని హెచ్ఐవీ డిస్ట్రిక్ ప్రాజెక్ట్ మేనేజర్ తెలిపారు. సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసులు, ఘటనా స్థలానికి వచ్చారు. మా సిబ్బందిపై దాడిచేసి ఫోన్లు లాక్కున్నారని, మా ఎన్జీవోస్ ఫోన్లు ఇప్పించాలని ఆయన పోలీసులను కోరారు. -
పెళ్లి పేరుతో మోసం రూ. 10 లక్షలు వసూలు
బంజారా హిల్స్(హైదరాబాద్) : పెళ్లి చేసుకుంటానని ఓ వైద్యురాలిని నమ్మించి మోసం చేసిన వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ ప్రాంతానికి చెందిన వైద్యురాలికి జనవరిలో వివాహ వేదిక ద్వారా హర్ష చెరుకూరి అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఫోన్ నంబర్లు ఇచ్చి పుచ్చుకున్న వారు వాట్సాప్ చాటింగ్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సదరు యువకుడు తన పాన్ కార్డు విషయంలో కొంత గందరగోళం ఉందని ఆదాయపన్ను శాఖ అధికారులు తన బ్యాంకు ఖాతాను సీజ్ చేయడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపాడు. తనకు కొంత నగదు సహాయం చేస్తే తిరిగి ఇస్తానని చెప్పాడు. అతడి మాటలు నమ్మిన వైద్యురాలు పలు దఫాలుగా రూ.10 లక్షలు ఇచ్చింది. ఈ నెల 21న తన తల్లి అమెరికా నుంచి వస్తున్నదని పెళ్లి విషయం మాట్లాడుకుందాం అని చెప్పాడు. తీరా అతడి తల్లి రాకపోవడంతో అనుమానం వచ్చిన బాధితురాలు అతడిని నిలదీసింది. తన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరింది. దీంతో తన నిజ స్వరూపాన్ని బయట పెట్టిన హర్ష డబ్బులు అడిగితే నీ ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా వేదికలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించాడు. ఫొటోలు వైరల్ కాకుండా ఉండాలంటే మరో రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తాళి కట్టమంటే పాడె కట్టిండు
వర్గల్(గజ్వేల్): వారిది ఒకే గ్రామం.. ఇద్దరి మధ్య పెరిగిన సాన్నిహిత్యం.. గుట్టుగా కొనసాగుతున్న వివాహేతర సంబంధం.. పెండ్లి చేసుకోవాలని మహిళ ఒత్తిడి జీర్ణించుకోలేక పథకం ప్రకారం హత్య చేసి ఆమెను కాటికి పంపాడు. దర్యాప్తులో పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. పది రోజుల కిందట జాడ తెలియకుండా పోయిన వర్గల్ మండలం మహిళ మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. మంగళవారం కోమటిబండ అడవిలో మృతదేహాన్ని గుర్తించి హత్యకు గురైనట్లు నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి వివరాలను బుధవారం గజ్వేల్ ఏసీపీ పురుషోత్తంరెడ్డి వెల్లడించారు.వర్గల్ మండలం అనంతగిరిపల్లికి చెందిన దార యాదమ్మ(40) 15వ తేదీన బ్యాంక్‌కు వెళ్తున్నట్లు చెప్పి ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. ఆమె కుమారుడు దార సాయికుమార్ ఫిర్యాదు మేరకు గౌరారం పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదుచేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి పోలీసులు వివిధ కోణాల్లో కేసు దర్యాప్తు కొనసాగించారు. సీసీ ఫుటేజీలు, లోకేషన్లు, కాల్‌డేటాలు విశ్లేషించారు. దర్యాప్తులో భాగంగా అనంతగిరిపల్లి గ్రామానికి చెందిన బండ్ల చిన్న లస్మయ్య(39)ను మంగళవారం విచారించారు. ఏడాదిన్నర నుంచి అతడికి యాదమ్మతో వివాహేతర సంబంధమున్నట్లు విచారణలో వెల్లడైంది. ఆరునెలల నుంచి పెండ్లి చేసుకోవాలని యాదమ్మ ఒత్తిడి చేస్తుండటంతో ఎలాగైనా అడ్డు తొలిగించుకోవాలనుకున్నాడు. 15న మధ్యాహ్నం పథకం ప్రకారం యాదమ్మను బైక్ మీద గజ్వేల్ సమీప కోమటిబండ అడవిలోకి తీసుకెళ్లాడు. తమ వెంట తెచ్చుకున్న కల్లును ఇద్దరు తాగే సమయంలో ఆమెకు తెలియకుండా పురుగుల మందు కలిపాడు. యాదమ్మ తాగిన తర్వాత కింద పడేసి మెడచుట్టూ చీర బిగించి హతమార్చాడు. నిందితుడిపై హత్య నేరంతోపాటు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ పేర్కొన్నారు. గ్రామంలో ఉద్రిక్తత యాదమ్మ హత్యోదంతం నేపథ్యంలో బుధవారం ఆమె కుటుంబీకులు, బంధువులు ఆగ్రహంతో అనంతగిరిపల్లిలోని నిందితుడి ఇంటి ఎదుట బైఠాయించారు. న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొనగా ఏసీపీ పురుషోత్తంరెడ్డి, రూరల్‌సీఐ మహేందర్‌రెడ్డి, గౌరారం ఎస్ఐ కరుణాకర్‌రెడ్డి వెంటనే గ్రామానికి చేరుకున్నారు. న్యాయం చేస్తామని వారికి నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది. -
ప్రియుడితో కలిసి పెళ్లికి హాజరైన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్
సాహో మూవీతో తెలుగు వారికి పరిచయమైన బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ (Shraddha Kapoor). ఆ తర్వాత తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. అయితే గతేడాది విడుదలైన స్త్రీ-2 మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. గతంలో వచ్చిన స్త్రీ చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో రాజ్ కుమార్ రావు కీలక పాత్రలో కనిపించారు.రైటర్‌తో డేటింగ్..అయితే ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మపై కొన్ని రోజులుగా డేటింగ్ రూమర్స్ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ సినీ రచయిత రాహుల్ మోదీతో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు గతంలో వార్తలొచ్చాయి. అంతేకాదు వీరిద్దరు చాలాసార్లు ఈవెంట్లలో జంటగా కనిపించారు. అప్పటి నుంచే ఈ జంట రిలేషన్లో ఉన్నారంటూ బీటౌన్‌లో టాక్ వినిపిస్తూనే ఉంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలోనూ తాను ప్రేమలో ఉన్నట్లు తెలిపింది శ్రద్ధాకపూర్. తమ రిలేషన్ గురించి అధికారికంగా ప్రకటించకపోయినా దీన్ని బట్టి వీరిద్దరు డేటింగ్లో ఉన్నారని అర్థమవుతోంది.పెళ్లిలో జంటగా..తాజాగా తన ప్రియుడిగా భావిస్తోన్న రాహుల్ మోదీతో కలిసి ఓ పెళ్లి వేడుకకు హాజరైంది ముద్దుగుమ్మ. గుజరాత్లో అహ్మదాబాద్‌లో జరిగిన స్నేహితుల పెళ్లిలో బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి సందడి చేసింది. ఇద్దరు కలిసి నూతన వధూవరులతో ఫోటోలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఆ తర్వాత శ్రద్ధా కపూర్ సైతం పెళ్లికి హాజరైన చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు శ్రద్దాకపూర్, రాహుల్ విమానంలో ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించారు. కాగా.. గతేడాది జామ్‌నగర్‌లో జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ-వెడ్డింగ్ బాష్‌లో శ్రద్ధా కపూర్, రాహుల్ జంటగా కనిపించారు. అప్పటి నుంచే వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ మరింత వైరలయ్యాయి. Shraddha Kapoor and Rahul Mody at a friend's wedding in Ahmedabad last night ♥️ pic.twitter.com/PBRanqJeoR— 𝒔𝒉𝒓𝒂𝒅𝒅𝒉𝒂__𝒎𝒚__𝒋𝒂𝒂𝒏🦋 (@shraddhasmehnaz) February 22, 2025 -
'అలాంటి వ్యక్తి దొరకాలి.. కచ్చితంగా పెళ్లి చేసుకుంటా': సుస్మితా సేన్
బాలీవుడ్ నటి, మాజీ మిస్ యూనివర్స్ సుష్మితా సేన్(Sushmita Sen) గురించి పరిచయం అక్కర్లేదు. ఆమె చివరిసారిగా తాలీ వెబ్ సిరీస్‌లో కనిపించింది. గౌరీ సావంత్ జీవితం ఆధారంగా నిర్మించారు. అంతకుముందు ఆర్య వెబ్ సిరీస్‌తో అభిమానులను అలరించింది ఈ 49 ఏళ్లు బాలీవుడ్ భామ. అయితే తాజాగా తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా మాట్లాడింది. ఈ సందర్భంగా ఆమెను పెళ్లి గురించి ప్రశ్నించగా దానిపై స్పందించింది. తాను కూడా పెళ్లి చేసుకునేందుకు ఆసక్తిగా ఉన్నానని తెలిపింది. అయితే సరైన భాగస్వామి దొరకాలి కదా? అని వెల్లడించింది.తన అభిమాని ప్రశ్నకు స్పందిస్తూ.. "నేను కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. నాకు సరైన వ్యక్తి దొరకాలి కదా. మనం అనుకున్న వెంటనే పెళ్లి జరిగదు కదా. ఎందుకంటే ఇది రెండు హృదయాలకు సంబంధించింది. అతనితో ప్రేమ, సంబంధం నా హృదయానికి నచ్చాలి. అప్పుడే నేను కూడా పెళ్లి చేసుకుంటా' అని తెలిపింది సుస్మితా సేన్. కాగా.. గతంలో నటుడు రోహ్మన్ షాల్‌తో ప్రేమాయణం కొనసాగించింది ముద్దుగుమ్మ. (ఇది చదవండి: మూడేళ్లుగా సింగిల్‌గానే.. నా కూతురు పెళ్లి చేసుకోనివ్వట్లేదు)దాదాపు మూడు సంవత్సరాలు డేటింగ్ తర్వాత 2021లో అతనితో బంధానికి గుడ్‌బై చెప్పేసింది. అంతకుముందు ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీతో రిలేషన్లో ఉన్నారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2022లో లలిత్ మోడీ సుష్మితా సేన్‌ను తన "బెటర్ హాఫ్"గా పరిచయం చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత సుస్మితా సేన్ మాట్లాడుతూ అదంతా గతమని కొట్టిపారేసింది. కాగా.. సుష్మితా సేన్.. 2000వ సంవత్సరంలో రెనీ అనే అమ్మాయిని దత్తత తీసుకుంది. 2010లో అలీసాను దత్త తీసుకుని పెంచుకుంటోంది. -
మల్లాది విష్ణు కుమార్తె వివాహానికి హాజరైన వైఎస్ జగన్ (ఫోటోలు)
-
పెళ్లెప్పుడంటే...?
సాయిపల్లవి తన వ్యక్తిగత విషయాలను మీడియాతో చాలా అరుదుగా మాత్రమే పంచుకుంటుంది. పెళ్లెప్పుడని ఆమెను అడిగితే, కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పింది. ఈ నేపథ్యంలోనే సాయిపల్లవి ఇష్టాయిష్టాలు, ఆమె జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం..⇒ తల్లిదండ్రులను, పుట్టిన ఊరిని విడిచి పెట్టడం సాయిపల్లవికి ఇష్టం లేదు. పెళ్లి తర్వాత తనని అన్నీ విడిచి రమ్మని చెప్పే వారిని అసలు పెళ్లే చేసుకోనని ‘అస్ట్రో ఉలగం’ అనే తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది.⇒ సాయిపల్లవిది బడగ గిరిజన కుటుంబం. ఆమె తల్లి రాధామణి సాయిబాబా భక్తురాలు. అందుకే, ఆమె పేరులో ‘సాయి’ అని చేర్చారు.⇒ డ్యాన్స్ అంటే పిచ్చి, కేవలం టీవీలో మాధురీ దీక్షిత్, ఐశ్వర్యా రాయ్ డ్యాన్స్ వీడియోలను చూస్తూ డ్యాన్స్ నేర్చుకుంది. మెడిసిన్ చదువులో చేరడానికి ముందు ‘ధామ్ ధూమ్’, ‘కస్తూరిమాన్’ అనే తమిళ సినిమాల్లో నటించింది.⇒ మొదటిసారి టీ రుచి చూసింది ‘ప్రేమమ్’ సినిమా షూటింగ్ సెట్లోనే.. అప్పటి వరకు ఆమెకు టీ, కాఫీ అలవాటే లేదు. హీరోయిన్గా అదే ఆమె మొదటి సినిమా.⇒ భాష ఏదైనా తన వ్యక్తిత్వానికి దగ్గరగా ఉండే పాత్రలనే ఎంపిక చేసుకుంటారట సాయిపల్లవి.⇒ అసలైన అందం మనిషి మనసులో ఉంటుందని, రూ. 2 కోట్ల విలువైన బ్యూటీ ప్రోడక్ట్ యాడ్‌ను తిరస్కరించింది.⇒ బన్‌తో తయారుచేసే ఆహారం, కొబ్బరి నీళ్లు ఇష్టం. వంట వండటం, తోటపని, తేనెటీగల పెంపకం ఆమెకు ఇష్టమైన పనులు.⇒ దైవ భక్తి ఎక్కువ. తన తాతయ్య ఇచ్చిన రుద్రాక్ష మాలను ఎప్పుడూ చేతికి ధరిస్తుంది.⇒ సినిమాల్లోకి రాకముందు సాయిపల్లవి చేసిన ఓ డ్యాన్స్ వీడియో వైరల్‌గా మారింది. అప్పుడే ఇకపై శరీరం ఎక్కువగా కనిపించేలా దుస్తులు వేసుకోకూడదని నిర్ణయించుకుంది. అందుకే, ఎక్కువ సంప్రదాయ దుస్తుల్లోనే కనిపిస్తుంది.⇒ ప్రస్తుతం బుజ్జితల్లిగా ‘తండేల్’ చిత్రంతో ప్రేక్షకులను అలరిస్తోంది. బాలీవుడ్లో ‘రామాయణ’ అనే పాన్ ఇండియా సినిమాలోనూ నటిస్తోంది. -
పెళ్లి మంటపంలో కుప్పకూలిన వధువు తండ్రి
భిక్కనూరు(హైదరాబాద్): మంగళ వాయిద్యాలు మోగుతుండగా వేదపండితులు పెళ్లి తంతు నిర్వహిస్తున్నారు. బంధువులు, స్నేహితులంతా పెళ్లి మంటపానికి చేరుకున్నారు. అల్లుడు, కూతురు కాళ్లు కడిగిన వధువు తండ్రి ఆనందంగా అందరినీ పలకరిస్తున్నారు. మరోవైపు భోజనాలు కూడా మొదలయ్యాయి. ఇంతలోనే ఆ తండ్రి గుండెపోటుతో కుప్పకూలిపోయారు. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. వివరాలు ఇలా ఉన్నాయి.. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం రామేశ్వర్పల్లికి చెందిన కుడిక్యాల బాల్‌చంద్రం (55) కామారెడ్డి పట్టణంలోని హౌసింగ్‌బోర్డులో నివసిస్తున్నారు. చిన్నచిన్న కాంట్రాక్టు పనులు చేసేవారు. ఆయనకు భార్య రాజమణి, కూతుళ్లు కనకమహాలక్ష్మి, కల్యాణలక్ష్మి ఉన్నారు. పెద్ద కూతురు కనకమహాలక్ష్మి పెళ్లి కుదిరింది. శుక్రవారం భిక్కనూరు మండలం బీటీఎస్ చౌరస్తా వద్ద ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో పెళ్లి జరిగింది. ఈ సందర్భంగా స్నేహితులు, బంధువులను బాల్‌చంద్రం ఆనందంగా పలకరించారు. అందరూ అభినందనలు తెలిపారు. వచ్చే ఏడాది చిన్న కూతురు పెళ్లి కూడా చేస్తానని చాలా మందితో బాల్‌చంద్రం చెబుతూ సంతోషంగా ఉన్నారు. ఇంతలోనే ఒక్కసారిగా ఆయన గుండెపోటుతో కుప్పకూలిపోయారు. బాల్‌చంద్రంను వెంటనే కామారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ ఆయన కన్నుమూశారు. కూతురు పెళ్లిలో తండ్రి కన్నుమూయడం ఆ కుటుంబానికి తీరని విషాదం మిగిలింది. పెళ్లి కోసం వేసిన పందిరిలో విగతజీవిగా పడిపోయిన తండ్రిని చూసి ఆ కూతురు రోదించిన తీరు అందరినీ కలచివేసింది. సాయంత్రం కామారెడ్డి పట్టణంలో బాల్‌చంద్రం అంత్యక్రియలు నిర్వహించారు. -
జాలిరెడ్డి పెళ్లిలో అరుదైన సన్నివేశం.. గడ్డం పట్టుకుని మరి..!
పుష్ప సినిమాలో జాలిరెడ్డిగా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటుడు డాలీ ధనంజయ (Daali Dhananjaya). ఇటీవలే ఆయన వివాహబంధంలో అడుగుపెట్టారు. తన ప్రియురాలు డాక్టర్ ధన్యతను పెళ్లాడారు. మైసూరులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన వేదికపై మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. వీరి పెళ్లికి శాండల్‌వుడ్ సినీతారలతో పాటు టాలీవుడ్ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. పుష్ప డైరెక్టర్ సుకుమార్ సైతం జాలిరెడ్డి పెళ్లికి హాజరైన నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ భారీ వెడ్డింగ్ వేడుకకు దాదాపు 30 వేల మందికి పైగానే హాజరయ్యారు.అయితే తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. ఈ పెళ్లి వేడుకలో డాలీ ధనుంజయకు తన భార్య కాళ్లు మొక్కుతూ కనిపించింది. ఇందులో డాలీ ధనుంజయ వద్దని చెబుతున్నప్పటికీ వినకుండా గడ్డం పట్టుకుని మరీ భర్త పాదాలను నమస్కరించింది. ఆ తర్వాత వెంటనే తను కూడా భార్య పాదాలకు మొక్కారు. దీనికి సంబంధించిన వీడియో ఓ నెటిజన్ వీడియోను షేర్ చేయడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.(ఇది చదవండి: పెళ్లి తర్వాత క్షమాపణలు చెప్పిన జాలిరెడ్డి దంపతులు) కాగా.. కన్నడలో హీరో కమ్ విలన్‌గా చాలా సినిమాల్లో ధనంజయ నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. అక్కడి ఫ్యాన్స్ ఇతడిని ముద్దుగా డాలీ అని పిలుస్తారు. ఇతడి యాక్టింగ్ నచ్చి డైరెక్టర్ సుకుమార్ తన 'పుష్ప'లో జాలీరెడ్డి రోల్ ఇచ్చారు. తనదైన స్లాంగ్‌తో ఫెర్ఫెక్ట్ విలనిజం చూపించాడు. డిసెంబర్లో రిలీజైన పుష్ప-2 ది రూల్ సీక్వెల్లోనూ ఆయన కనిపించారు. అయితే, పుష్ప పార్ట్-1లో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. కాగా.. డాలీ ధనుంజయ్ ప్రస్తుతం కన్నడలో ఉత్తరకాండ చేస్తున్నాడు. ఈయన నటుడు మాత్రమే కాదు పాటల రచయిత కూడా! కన్నడలో పదికి పైగా పాటలు రాశాడు. ఇక డాలీ ధనుంజయ్ సతీమణి ధన్యతా విషయానికొస్తే.. చిత్రదుర్గ ప్రాంతానికి చెందిన ఈమె డాక్టర్. ప్రస్తుతం బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గైనకాలజిస్ట్‌గా పని చేస్తోంది. స్నేహంతో మొదలైన వీరి పరిచయం..ఆ తర్వాత ప్రేమగా మారింది. ఇప్పుడు పెళ్లితో ఒక్కటి అయ్యారు.Men in love 🤌🏻✨!!!#DaaliDhananjay #DaaliDhanyata #DaaliDhanyata #kfi pic.twitter.com/KXc7gqwTIa— MASS (@Thalassophilee6) February 16, 2025 -
32 పేజీల పెళ్లి పత్రిక.. చూస్తేనే మతిపోతోంది..
జమ్మికుంట(కరీంనగర్): పెళ్లి అంటే మామూలుగా పత్రిక అచ్చు వేయించి, బంధు మిత్రులకు పంచుతూ ఆహ్వానిస్తుంటారు. కానీ ఓ కుటుంబం ఏకంగా 32 పేజీలతో కూడిన పెళ్లి పత్రికను ముద్రించి, ఆహ్వానించడం పలువురిని ఆకట్టుకుంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన సుద్దాల శ్రీనివాస్– శ్రీదేవి దంపతుల పెద్ద కూతురు రవళి వివాహం ఈ నెల 23న నిశ్చయించారు. పెళ్లికి బంధు, మిత్రులను ఆహ్వానించేందుకు 32పేజీలతో కూడిన శుభలేఖను ముద్రించారు. ఇందులో వివాహ విశిష్టతకు సంబంధించిన సంస్కృతి, పెళ్లి చూపులు, పాణిగ్రహణం, జీలకర్రబెల్లం, తలంబ్రాలు వంటి పలు అంశాలను పొందుపరిచారు. -
కాబోయే భార్యతో అఖిల్ అక్కినేని.. పెళ్లి పనులు మొదలైనట్టేనా?
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ గతేడాది నిశ్చితార్థం చేసుకుని అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చాడు. జైనాబ్ రవ్జీ అనే అమ్మాయితో కొత్త జీవితం ప్రారంభించేందుకు రెడీ అయిపోయాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అక్కినేని నాగార్జున పంచుకున్నారు. అయితే అఖిల్ ఎంగేజ్మెంట్ తర్వాత నాగచైతన్య వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. హీరోయిన్ శోభిత దూళిపాలను చైతూ పెళ్లాడారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఇక అక్కినేని అభిమానులంతా అఖిల్ పెళ్లి కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే ఈ ఏడాదిలోనే అఖిల్ పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. వచ్చేనెలలోనే అఖిల్- జైనాబ్ ఒక్కటి కాబోతున్నట్లు సమాచారం. అంతా అనుకున్నట్లు జరిగితే మార్చి 24న గ్రాండ్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తలకు మరింత బలం చేకూర్చుతోంది తాజా వీడియో. అఖిల్ అక్కినేని తనకు కాబోయే భార్య జైనాబ్ రవ్జీతో కలిసి ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. దీంతో పెళ్లి పనులు మొదలైనట్లేనని కొందరు అభిమానులు భావిస్తున్నారు. ఇద్దరు కలిసి జంటగా వెళ్తున్న వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. ఇది చూసిన కొందరు నెటిజన్స్ అక్కినేని వారి చిన్న కోడలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. గతేడాది నవంబర్ 26న జైనాబ్ రావ్జీతో అఖిల్ నిశ్చితార్థం జరిగింది. అయితే వీరి పెళ్లికి సంబందించిన అధికారిక ప్రకటనైతే ఇంకా రావాల్సి ఉంది.ఇక సినిమాల విషయాకొనిస్తే.. అఖిల్ అక్కినేని 1994లో సిసింద్రీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత 2 015 అఖిల్ మూవీతో హీరోగా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఏజెంట్ వంటి చిత్రాలతో అభిమానులను మెప్పించారు. ప్రస్తుతం సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌తో బిజీగా ఉన్నారు అఖిల్. ప్రముఖ పారిశ్రామిక వేత్త జుల్ఫీ రవ్జీ కూతురే జైనాబ్.. ఆమెకు స్కిన్ కేర్‌కి సంబంధించిన కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది. భారత్, దుబాయి, లండన్‌లో జైనాబ్ పెరిగింది. ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకున్న అఖిల్-జైనాబ్ త్వరలోనే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టనున్నారు. Dhisti Teeyandra..😍😍Chinnodu ,Chinna Vadhina Merisipothunaru Iddharu ..😍#akhilakkineni & #zainabravdjee 👩❤️👨 pic.twitter.com/c9ovnyfnyc— 𝗖𝗵𝗮𝘆-𝗦𝗮𝗶 ⛓️ (@SaiNavabathula) February 18, 2025 Anna style vere level #Akhil6 #akhilakkineni pic.twitter.com/cfy3ZBOMUQ— SAITEJA VARMA (@Missile_Saiteja) February 18, 2025 -
మా పెళ్లిని సింపుల్‌గా చేసుకోవడానికి కారణం అదే: రకుల్ ప్రీత్ సింగ్
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు, నిర్మాత అయిన జాకీ భగ్నానీని పెళ్లాడింది ముద్దుగుమ్మ. గతేడాది ఫిబ్రవరి 2024లో గోవాలో ఓ ప్రైవేట్ వేడుకలో వీరి పెళ్లి వేడుక జరిగింది. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌లో సన్నిహితులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు పాల్గొన్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రకుల్ ప్రీత్ సింగ్ ఆసక్తికర విషయాలు పంచుకుంది. ముఖ్యంగా తన పెళ్లికి సంబంధించిన మధురమైన జ్ఞాపకాలను షేర్ చేసుకుంది. మీ పెళ్లిని ఎందుకు ప్రైవేట్‌గా ఉంచారన్న ప్రశ్నపై రకుల్ స్పందించింది.రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ..'మేము ఎల్లప్పుడూ చాలా సింపుల్‌గా ఉండాలని కోరుకుంటా. మేము సౌకర్యంగానే ఉండటానికి ఇష్టపడతాం.. కానీ ఎక్కువ లగ్జరీగా ఉండాలని ఎప్పుడూ కోరుకోలేదు. అన్నిటికంటే ఎక్కువగా ఆ మధురమైన క్షణాలు, సంతోషంగా ఉండేందుకే ఎక్కువ విలువ ఇస్తాం. అందుకే మా పెళ్లిని అతిథులతో కలిసి ఆస్వాదించాలనుకున్నాం. ఆ మూడు రోజులు మా జీవితంలో గుర్తుండిపోవాలని ఆశించాం. అందువల్లే నో-ఫోన్ పాలసీ పెట్టాం. అంతే తప్ప ఫోటోలు లీక్ చేస్తారని కాదు. మా పెళ్లి చిత్రాలను మేమే మొదట బయట పెట్టాలకున్నాం. అలాగే పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశాం. నా పెళ్లి దుస్తుల్లో కూడా డ్యాన్స్ చేశాను.' అని తెలిపింది. కాగా.. రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం మేరే హస్బెండ్ కి బివి చిత్రంలో కనిపించనుంది. ఈ చిత్రంలో అర్జున్ కపూర్, భూమి పెడ్నేకర్ నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 22న విడుదల కానుంది. -
పెళ్లి తర్వాత క్షమాపణలు చెప్పిన జాలిరెడ్డి దంపతులు
పుష్ప సినిమాలో జాలిరెడ్డిగా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటుడు ధనంజయ (Daali Dhananjaya) వివాహబంధంలో అడుగుపెట్టాడు. తన ప్రియురాలు డాక్టర్ ధన్యతతో కలిసి ఏడడుగులు వేశాడు. ఈ క్రమంలో తమ ఆత్మీయులకు, అభిమానులకు నూతన దంపతులు క్షమాపణ చెప్పారు. కర్ణాటకలోని మైసూరులో బంధుమిత్రులు సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఆదివారం (ఫిబ్రవరి 16న) వీరి వివాహం జరిగింది. ఈ వేడుకకు దాదాపు 30 వేల మందికి పైగానే హాజరయ్యారు.పెళ్లి తంతు పూర్తి అయిన తర్వాత మీడియా పూర్వకంగా అందరి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ క్రమంలో ఆయన సోషల్‌మీడియా ద్వారా పలు విషయాలు పంచుకున్నారు. పెళ్లికి వచ్చిన వారందరికీ, రాలేకపోయిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెళ్లి వేడుకలు ఘనంగా జరగడానికి కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, అభిమానులు, మీడియా, పోలీసు శాఖ ఇలా ఎంతో మంది కృషి చేశారు. వారందరికీ మా ఇద్దరి తరఫున ధన్యవాదాలు. మా పెళ్లి కోసం చాలామంది హాజరయ్యారు. దీంతో కొంతమంది మాపై అభిమానంతో ఫంక్షన్ హాలు వరకు వచ్చి కూడా లోపలికి రాలేకపోయారు. మీకు ఇబ్బంది కలిగించినందుకు దయచేసి మమ్మల్ని క్షమించండి. మేము తప్పకుండా మరిన్ని మంచి విషయాలతో తిరిగి మిమ్మల్ని కలుస్తాము. పెద్ద మనుసుతో మమ్మల్ని ఆశీర్వదించండి.' అని ఆయన తెలిపారు.కన్నడలో హీరో కమ్ విలన్‌గా చాలా సినిమాల్లో ధనంజయ నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. అక్కడి ఫ్యాన్స్ ఇతడిని ముద్దుగా డాలీ అని పిలుస్తారు. ఇతడి యాక్టింగ్ నచ్చి డైరెక్టర్ సుకుమార్ తన 'పుష్ప'లో జాలీరెడ్డి రోల్ ఇచ్చారు. తనదైన స్లాంగ్‌తో ఫెర్ఫెక్ట్ విలనిజం చూపించాడు. డిసెంబర్లో రిలీజైన పుష్ప-2 ది రూల్ సీక్వెల్లోనూ ఆయన కనిపించారు. అయితే, పుష్ప1లో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంటుంది.ధనంజయ్ సతీమణి ధన్యత విషయానికొస్తే.. చిత్రదుర్గ ప్రాంతానికి చెందిన ఈమె డాక్టర్. ప్రస్తుతం బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గైనకాలజిస్ట్‌గా పని చేస్తోంది. స్నేహంతో మొదలైన వీరి పరిచయం..ఆ తర్వాత ప్రేమగా మారింది. ఇప్పుడు పెళ్లితో ఒక్కటి అయ్యారు. ధనంజయ్ ప్రస్తుతం కన్నడలో ఉత్తరకాండ చేస్తున్నాడు. ఈయన నటుడు మాత్రమే కాదు పాటల రచయిత కూడా! కన్నడలో పదికి పైగా పాటలు రాశాడు. View this post on Instagram A post shared by Daali Dhananjaya (@dhananjaya_ka) -
రెండో పెళ్లితో ‘చిక్కుల్లో’ ఐపీఎస్.. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా..
జైపూర్ : రెండో వివాహం ఓ సీనియర్ ఐపీఎస్ అధికారిని చిక్కుల్లో పడేసింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారి సీనియర్ ఐపీఎస్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఓ ఐపీఎస్ అధికారి హోదా తగ్గించింది. ఈ నిర్ణయంతో సీనియర్ ఐపీఎస్ అధికారిగా హోదాతో పాటు తీసుకునే పేస్కేలు సైతం తగ్గింది. కొత్తగా విధుల్లో చేరిన ఐపీఎస్ ఎంత వేతనం తీసుకుంటారో.. అంతే వేతనం సదరు సీనియర్ ఐపీఎస్ అధికారికి అందుతుంది.పలు నివేదికల ప్రకారం.. రాజస్థాన్ కేడర్ ఐపీఎస్ అధికారి పంకజ్ కుమార్ చౌదరి జైపూర్‌లో కమ్యూనిటీ పోలీసింగ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా పని చేస్తున్నారు. అయితే పంకజ్ కుమార్ మొదటి భార్య నుంచి విడాకులు తీసుకోకుండా రెండో వివాహం చేసుకున్నారు. ఈ వివాదంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ పంకజ్ కుటుంబ సభ్యులు రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టుకు చేరింది. విచారణ చేపట్టిన దేశ అత్యున్నత న్యాయస్థానం తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని పంకజ్ కుమార్ మీడియాకు వెల్లడించారు.ఈ తరుణంలో ఐపీఎస్ అధికారి పంకజ్ కుమార్ వివాహంపై రాజస్థాన్ రాష్ట్ర ఉన్నాతాధికారులు విచారణ చేపట్టారు. విచారణలో పంకజ్ కుమార్ దోషిగా తేల్చారు. విచారణ అనంతరం మూడు సంవత్సరాల పాటు ప్రస్తుతం ఉన్న తన డిజిగ్నేషన్‌ను తగ్గించారు. లెవల్ 11 సీనియర్ పే స్కేల్ నుండి లెవల్ 10 జూనియర్ పే స్కేల్‌కు కుదించారు. ఈ పేస్కేల్ కొత్తగా విధుల్లోకి చేరిన ఐపీఎస్‌లకు కేటాయిస్తారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా, 2009 బ్యాచ్ ఐపీఎస్ అధికారి పంకజ్ చౌదరి. ప్రస్తుతం,జైపూర్‌లో కమ్యూనిటీ పోలీసింగ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా పని చేస్తున్నారు. హోదా తగ్గించడంతో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (లెవల్ 10)గా కొనసాగనున్నారు.