
చెన్నై: ఓ మహిళా సైనికురాలు కన్నీరుమున్నీరలయ్యేలా విలపిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘తాను దేశ రక్షణ కోసం విధులు నిర్వహిస్తుండగా.. తన ఇంట్లో దొంగతనం జరిగిందని వాపోయారు. అగంతకులు తన పెళ్లికోసం కొనుగోలు చేసిన బంగారంతో పాటు ఇతర ఖరీదైన వస్తువులు దోచుకెళ్లారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
తమిళనాడులోని నారాయణపురం గ్రామానికి చెందిన కళావతి జమ్మూ కశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ జవానుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె జమ్మూకశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తుండగా.. జూన్ 24న నారాయణపురం తన గ్రామంలోని ఇంట్లో దొంగతనం జరిగింది.
ఇదే విషయాన్ని కన్నీటి పర్యంతం అవుతూ ఓ వీడియో తీశారు. ఆ వీడియోలో వ్యవసాయం నిమిత్తం నాతల్లిదండ్రులు పొలానికి వెళ్లారు. ఆ సమయంలో అగంతకులు నా ఇంటి తాళం పగలగొట్టి, నా పెళ్లి కోసం దాచుకున్న ఆభరణాలన్నీ దొంగిలించారు. దొంగతనం జరిగిన రోజైన జూన్ 24న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ జూన్ 25న ముఖ్యమంత్రి భద్రతా విధుల్లో ఉన్నారని ఎవరూ దర్యాప్తుకు రాలేదు. తర్వాత వేలిముద్రలు సేకరించి జూన్ 28న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు’అని కళావతి వీడియోలో పేర్కొన్నారు.
ఆ వీడియో వైరల్‌గా మారింది. సైనికురాలి వీడియోను తమిళనాడు బీజేపీ నేత అన్నామలై షేర్ చేస్తూ డీఎంకే ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. దేశాన్ని కాపాడే సైనికురాలి పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. అయితే,ఆ వీడియోపై వెల్లూరు జిల్లా పోలీసులు స్పందించారు.
జూన్ 24న కళావతి తండ్రి కుమారసామి తన ఇంట్లో జరిగిన దొంగతనం గురించి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు ప్రకారం, కళావతి పెళ్లి కోసం పక్కన ఉంచిన 15 తులాల బంగారు ఆభరణాలు, రూ.50,000 నగదు, ఒక పట్టు చీర దొంగతనం జరిగింది. జూన్ 25న భారతీయ న్యాయ సంహిత (BNS) చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, వేలిముద్రల నమూనాలు సీసీటీవీ ఫుటేజ్‌లను సేకరించామని పోలీసులు తెలిపారు.
అనుమానితుల సెల్‌ఫోన్ కాల్ డేటా రికార్డులను (CDRలు) తిరిగి పొందడానికి వారు టవర్ డంప్ టెక్నాలజీని కూడా ఉపయోగించారు. జూన్ 29న, ఫిర్యాదుదారుడు తన ప్రకటనను సవరించి దొంగిలించబడిన ఆభరణాల బరువు 22.5 తులాలని చెప్పినట్లు తెలిసింది. ఈ వివాదంలో నిజమెవరిదో తేలాలంటే, విచారణ పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందే.
A CRPF jawan from Tamil Nadu, serving with honour at our nation’s borders in J&K, is forced to take to social media on police inaction on the case of jewellery theft from her residence near Katpadi in June this year.
What kind of governance forces a woman in uniform to beg for… pic.twitter.com/BnU6WtT99l— K.Annamalai (@annamalai_k) August 4, 2025