
60 ఏళ్లు దాటిని సీనియర్ సిటీజన్లంతా జీవిత చరమాంకంలో తమ జీవితాన్ని ఎలా గడుపుతారో తెలిసిందే. రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. అలాంటిది ఈ బామ్మ మాత్రం ఈ జనరేషన్ అవాక్యయ్యేలా జీవిస్తోంది. ఈ ఏజ్‌లో యువత మాదిరిగా చురుగ్గా ఉంటూ అన్ని వ్యాయమాలు చేస్తోంది. జిమ్‌లో ఆమే చేసే వ్యాయామాలకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇటీవలే వందేళ్ల వయసుకుకి చేరుకుంది. అయితే ఆమె అందరిలో కాకుండా విభిన్నంగా తన పుట్టినరోజుని చేసుకుంది. ఆఖరికి తన జీవన విధానం సైతం అందరి వృద్ధుల్లా కాకుండా..యంగ్ ఏజ్‌లో ఉండే వ్యక్తుల్లా అత్యంత యాక్టివ్‌గా ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదిస్తోంది. పైగా 120 ఏళ్లు జీవించాలనుకుంటున్నా అని అత్యంత ధీమాగా చెబుతోంది ఈ బామ్మ. ఇంతకీ ఆమె ఎవరంటే..
యునైటెడ్ స్టేట్స్ కనెక్టికట్‌లోని నార్వాక్‌కు చెందిన మేరీ కరోనియోస్ అనే బామ్మ ఇటీవలే సెంచరీ వయసులోకి చేరుకుంది. అయితే ఆమె తన వందో పుట్టిన రోజుని అందరిలా కేకులు, చాక్లెట్లు, మిఠాయిలతో కాకుండా జిమ్‌లో చేసుకుంది. జిమ్‌లో చేసుకోవడం ఏంటి అనుకోకండి. ఈ బామ్మ స్పెషాలిటీ అందులోనే కాదు ఆమె జీవిన విధానంలోనూ ఉంది.
ఎందుకంటే అందరి వృద్ధుల్లా కాకుండా డైనమిక్‌గా ఉంటుంది ఈ బామ్మ. ఆమె జిమ్‌లో హుషారుగా బరువులు ఎత్తుతు..తన వందో పుట్టిన రోజుని జరుపుకుంది. తానింకా వృద్ధురాలిని కాదు యంగ్ అని చెప్పేందుకే ఇలా విభిన్నంగా తన పుట్టినరోజుని జరుపుకుందామె. అంతా ఆ బామ్మను జిమ్ మేయర్ అని ముద్దుగా పిలుచుకుంటారు. దీర్ఘాయువుతో ఉండాలని, తన వృద్ధాప్యం భారంగా సాగకూడదనే మంచి ఆహారపు అలవాట్లను అనుసరిస్తోందట. వ్యక్తిగత ట్రైనర్లతో కలిసి జిమ్‌లో ఇతరులకు శిక్షణ కూడా ఇస్తుందట కూడా.
అంతేగాదు అక్కడకు వచ్చే వారు ఈ వందేళ్ల బామ్మ ట్రైనింగ్ చూసి స్ఫూర్తి పొందుతారట. జీవతాన్ని ఆస్వాదించడం అంటే ఇదే కదా అని ఆ బామ్మని చూసి అనుకుంటుంటారట. ఆ బామ్మ కూతురు ఎథీనా సైతం ఆమె దినచర్య, ఆహరపు అవాట్లకు ఫిదా అవుతుంటుందట. తనకు దీర్ఘాయువుతో రికార్డులు బ్రేక్ చేయడమ తన లక్ష్యం కాదని, మానసిక పరిమితులను బద్దలు కొట్టేలా జీవించడమే తన ధ్యేయం అని ఆమె కూతురు ఎథీనా చెబుతోంది.
ఈ బామ్మ నేపథ్యం..లైఫ్‌స్టైల్..
మాజీ ఉపాధ్యాయురాలైన కరోనియోస్ వృద్ధుల సంప్రదాయ జీవన విధానాన్ని విడిచిపెట్టి ఆధునిక జీవిన విధానానికి అడాప్ట్ అయ్యింది. సీనియర్ కేంద్రాల కంటే జిమ్‌కు వెళ్లేవారితో కలిసే యత్నం చేసేది. ఆమె ఈ ఏజ్‌లోనూ యువకులతో వేళాకోలం ఆడుతూ..హుషారుగా ఉంటుందట. ఆమె వయసుకి జిమ్ అనేది అతిపెద్ద శారీరక శ్రమ అయినా..ఆ అనితర సాధ్యమైన వర్కౌట్లు, బరువుల ఎత్తడం అంటేనే ఆమెకు ఇష్టమట.
ఆరోగ్యానికి మదద్దుతి ఇచ్చే వ్యాయామాలన్నింటిని అలవోకగా చేసేస్తుందట. అలాగే సమాజంతో మంచి సత్సంబంధాలను నెరుపుతుందట. బంధువులు, కుటుంబ సభ్యుల అందరితోనూ సానూకూల దృక్పథంలో వ్యవహరిస్తుందట. ఇవే తన ధీర్ఘాయువుకి కారణమని నమ్మకంగా చెబుతోంది కరోనియస్ బామ్మ. హార్వర్డ్ స్టడీ ఆఫ్ అడల్ట్ డెవలప్‌మెంట్ సైతం ఇదే విషయాన్ని వెల్లడించింది. దీర్ఘాయువుకి సంబంధించి.. నిపుణులు సైతం..ఆమె ఆహారపు అలవాట్లను ప్రశంసిస్తున్నారు.
ఆమె అత్యంత మితంగా భోజనం, మొక్కల ఆధారిత పోషకాహారం, బాడీకి సరైన కదలికలు ఉండేలా చేసే వ్యాయామాలు తదితరాలన్నీ మంచి అలవాట్లకు దగ్గరగా ఉండే సూత్రాలుగా పేర్కొన్నారు పోషకాహార నిపుణులు. ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా పర్లేదు కానీ 120 ఏళ్ల వరకు ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నానని ఆ బామ్మ చెబుతుండటం విశేషం.
ప్రస్తుతం ఆమె హైపర్ ధైరాయిడిజంకి సంబంధించిన మందులు ఒక్కటే తీసుకుంటున్నారు. ఈ విధమైన మంచి జీవన విధానానికి కీలకం తన గ్రామీణ నేపథ్యమేనని అంటోందామె. పెన్సిల్వేనియా గ్రామంలో పుట్టి పెరిగిన ఆమె తన తోబుట్టువులు ఐదుగురిలో ఈ బామ్మే పెద్దదట. ఈత నుంచి చెట్లు ఎక్కడం, బాస్కెట్‌బాల్, వాలీబాల్ వంటి అన్ని ఆటలను హాయిగా ఆడేదాన్ని అని చెబుతోంది. అంతేగాదు తనలా జీవితానికి పరమార్థం ఉండేలా ఏదో ఒకటి సాధించేలా లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలని సూచిస్తోంది ఈ కరోనియోస్ బామ్మ.
(చదవండి: Weight Loss: బరువు తగ్గాలనుకుంటే.. ఇవిగో ఐదు చిట్కాలు!: ఫిట్‌నెస్ కోచ్)