
బరువు తగ్గాలని స్ట్రాంగ్ డిసైడ్ ఉన్నావారు ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలంటోంది ఫిట్‌నెస్ కోచ్ అమకా. జస్ట్ ఐదు నెలల్లోనే మంచి ఫలితాలు అందుకోవాలని ప్రగాఢంగా కోరుకుంటే ఇలాంటి చిట్కాలు అనుసరించడం మంచిదని సూచిస్తుంది. తాను ఆ రెమిడీస్‌తోనే ఐదు నెలల్లోనే అనూహ్యంగా కిలోలు కొద్దీ బరువు తగ్గినట్టు చెప్పుకొచ్చింది. త్వరితగతిన ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గాలనుకుంటే.. బెస్ట్ టిప్స్ ఇవే అని చెబుతోంది ఫిట్‌నెస్ కోచ్ అమకా.
బరువు తగ్గాలనుకుంటున్నవారు ముందుగా తాను ఎందుకు బరువు తగ్గలనుకుంటున్నా, ఎంత వెయిట్ లాస్ అవ్వాలన్నది లక్ష్యం అనేవి స్ట్రాంగ్‌గా నిర్దేశించుకోవాలంటున్నారు అమకా. అది మీకు లక్ష్యంపై ఫోకస్ పెట్టేలా చేస్తుందట. బరువు తగ్గాలనుకునేవారు ఎవ్వరైనా సింపుల్ దినచర్యను ప్రారంభించాలని చెప్పారు. ముందుగా రోజుకు మూడు లేదా రెండు సార్లు సమతుల్య భోజనం, పది నుంచి 20 నిమిషాల నడక, రెండు లీటర్ల నీరు, మంచి నిద్ర, సరైన క్వాంటిటీలో తీసుకోవడం వంటివి చాలని చెప్పారు.
ఇక్కడ ఆహారం శరీరానికి సరిపడ పోషకాలు అందేలా సంతృప్తిని కలిగించేలా ఉండాలని చెప్పారు. అతిగా తినడాన్ని నివారించాలన్నారు. ముఖ్యంగా ప్రతి భోజనంలో ప్రోటీన్, అధిక ఫైబర్ తప్పనిసరిగా భాగం చేసుకోవాలని చెప్పారు. కార్బోహైడ్రేట్లు కూడా తగు మోతాదులో తీసుకోవాలని సూచించారు. ప్రధానంగా సమతుల్యతను పాటిస్తే చాలు ఎలాంటి ఆహారమైనా ధైర్యంగా తినొచ్చని చెబుతున్నారామె.
ప్రతి రోజు వాకింగ్, చక్కెర పానీయాలు దూరంగా ఉండటం అనేది అత్యంత ముఖ్యం. ఈ చిన్నపాటి రెమిడీలు భారీ ఫలితాలను అందించి..శరీరంలో సత్వర మార్పులకు నాంది పలుకుతుందట. ఇలా స్ట్రిక్ట్‌గా డైట్‌ని అనుసరిస్తే..జస్ట్ ఐదు నెలల్లోనే 25 కిలోలు మేర బరువు తగ్గుతారట. తాను కూడా అలాంటి సింపుల్ చిట్కాలను అనుసరించే ఐదునెలల్లోనే 25 కిలోలు పైనే తగ్గానని చెప్పుకొచ్చింది. ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గాలనుకుంటే ఈ విధానం చాలా హెల్ప్ అవుతుందని సూచిస్తోంది ఫిట్‌నెస్ కోచ్ అమకా.
(చదవండి: Mona Singhs weight loss journey: యోగా, డైట్‌తో ఆరు నెలల్లో 15కిలోలు..! స్లిమ్‌గా మోనాసింగ్)