హైదరాబాద్ నగరం మరోసారి తన ట్రెండ్ సెట్టర్ హోదాను నిరూపిస్తోంది. ఒకప్పుడు చార్మినార్, హుస్సేన్ సాగర్ ప్రాంతాలకే పరిమితమైన ఈ గుర్తింపు, ఇప్పుడు రీల్స్, రిహార్సల్స్ కల్చర్, సోషల్ మీడియా లైఫ్‌స్టైల్ ద్వారా కొత్త మలుపు తిరుగుతోంది. 2026 ప్రారంభంలోనే కొన్ని ప్రాంతాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ, లక్షల్లో వ్యూయర్స్, లైకులతో హైదరాబాద్‌ను డిజిటల్ హబ్‌గా మార్చుతున్నాయి. ఇటీవల వైరల్ అవుతున్న ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది..!
నేటి యువత జీవనశైలిలో భారీ మార్పు కనిపిస్తోంది. రీల్స్ ట్రెండ్ (Reels Trend) అనే కల్చర్ కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా.. విస్తృత స్థాయిలో వేదికలను ఏర్పాటు చేసుకునే స్థాయికి చేరుతోంది. వీళ్లందరికీ నగరం అంటే ఓ లొకేషన్ కాదు, ఒక అనుభూతి, ఒక స్టోరీ, ఒక షేర్ చేయదగిన క్షణం..నగరం దీనికి అనుగుణంగా మారుతూ.. వారికి కొత్త ఉత్సాహాన్ని అందిస్తోంది. జూబ్లీహిల్స్ నుంచి హైటెక్ సిటీ వరకు టీ హబ్ నుంచి నీలోఫర్, దుర్గం చెరువు వరకు నగరంలోని ప్రతి ప్రాంతమూ ఒక రీల్ స్పాట్ నుంచి రియల్ హబ్‌గా మారుస్తోంది. ఇక్కడికి వచ్చే యువత ప్రతి రీల్‌నీ ఒక లైఫ్‌స్టైల్ స్టేట్‌మెంట్‌గా భావిస్తున్నారు.
రీల్స్‌కు కొత్త అడ్రస్..
జూబ్లీహిల్స్ అంటే ఒకప్పుడు కేఫ్‌లు, లగ్జరీ రెస్టారెంట్లు, సెలబ్రిటీ నివాసాలు అనే గుర్తింపు. కానీ ఇప్పుడు అది పూర్తిగా మారింది. స్ట్రీట్ లైఫ్, నేచురల్ లైటింగ్, మోడర్న్ ఆర్కిటెక్చర్, మినిమల్ వైబ్స్.. ఇవన్నీ కలగలిసిన స్పాట్స్ యువతను ఓ సరికొత్త ప్రపంచం వైపు లాగుతున్నాయి. రోడ్డు పక్కన చిన్న టీ స్టాల్స్ దగ్గర నుంచి, డిజైన్ ఉన్న భవనాల వరకు ప్రతి మూల ఒక రీల్ ఫ్రేమ్‌లా మారుతోంది. ప్రత్యేకంగా సాయంత్రం, రాత్రి వేళ, సాఫ్ట్ సన్‌లైట్‌తో జూబ్లీహిల్స్ రోడ్లు ఆర్గానిక్ రీల్స్‌కి పర్ఫెక్ట్ బ్యాక్‌డ్రాప్‌గా మారుతున్నాయి.
కార్పొరేట్ నుంచి క్రియేటివ్ వైపు..
ఐటీ ఉద్యోగాలతోనే గుర్తింపు పొందిన హైటెక్ సిటీ, ఇప్పుడు మరో అవతారం ఎత్తుతోంది. గ్లాస్ బిల్డింగ్స్, స్కై వాక్స్, మెట్రో పిల్లర్స్, అర్బన్ మోషన్.. ఇవన్నీ కలిపి ఫ్యూచరిస్టిక్ రీల్స్‌కు సరైన స్పేస్‌గా మారాయి. ఉద్యోగ సమయం తర్వాత, బ్యాగ్ పక్కన పెట్టి, ఫోన్ చేతిలో పట్టుకుని యువత రీల్స్ చేయడం ఇక్కడ సాధారణ విషయం. ‘ఆఫీస్ అయిపోయాక రీల్స్ తప్పనిసరి’ అన్నట్టుగా మారింది ఈ తరం లైఫ్ స్టైల్.
టీ హబ్ టు ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్స్..
టీ హబ్ అంటే కేవలం స్టార్టప్‌లకే పరిమితం కాదు. ఇది ఒక సోషల్ స్టేట్‌మెంట్ స్పాట్‌గా మారుతోంది. ఇక్కడ రీల్స్ అంటే డ్యాన్స్ కాదు వాక్ అండ్ టాక్ రీల్స్, మోటివేషనల్ వాయిస్ ఓవర్స్, డే ఇన్ మై లైఫ్, హైదరాబాద్ గ్రోత్ స్టోరీస్ వంటి వైవిధ్యమైన కంటెంట్‌కు కేంద్రంగా మారుతోంది. నగర యువత కేవలం వ్యూస్ కోసం కాదు, తమ ఆలోచనల్ని కూడా రీల్స్‌లో చూపిస్తోంది.
రుచికి రీచ్.. నీలోఫర్ కేఫ్..
2026లో నీలోఫర్ కేఫ్ మరోసారి వైరల్ అవుతోంది.. అయితే ఈసారి లైఫ్ స్టైల్ రీల్స్ వల్ల అనే విషయాన్ని తప్పక గ్రహించాలి. చాయ్ గ్లాస్, ఇరానీ చాయ్ ఆవిరి, రాత్రి పూట జిగేల్‌మనే లైట్స్, జనాల హడావుడి.. ఇవన్నీ కలిసి ఒక ఎమోషనల్ హైదరాబాద్ వైబ్ సృష్టిస్తున్నాయి. ఇక్కడ తీసిన రీల్ అంటే, అది కేవలం వీడియో కాదు.. నగరంతో కనెక్ట్ అయ్యే అనుభూతి.
అర్బన్ నేచర్ హాట్‌స్పాట్..
దుర్గం చెరువు ఫ్లైఓవర్, లేక్ వ్యూ, నైట్ లైట్స్.. ఇవి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఫ్రేమ్స్. నేచర్ ప్లస్ సిటీ ఈక్వల్స్ టు రీల్ అండ్ రియల్ మ్యాజిక్.. ఇక్కడ సన్‌సెట్ టైమ్‌లో తీసిన రీల్స్ లక్షల్లో వ్యూస్, లైక్స్ అందుకుంటున్నాయి. హైదరాబాద్ (Hyderabad) అందాలను, పర్యాటకాన్ని మరో కోణంలో ప్రపంచానికి చాటిచెప్పే మాధ్యమాలుగా ఇన్‌స్టా, ఫేస్‌బుక్ వంటివి నిలుస్తున్నాయన్నది వాస్తవం.
నగరంలో బెంగళూరియన్స్ రీల్స్?
ఇది ఆశ్చర్యంగా అనిపించినా నమ్మదగిన వాస్తవం. సోషల్ మీడియా ట్రెండ్స్ ప్రకారం, బెంగళూరు నుంచి వచ్చిన కొంతమంది కంటెంట్ క్రియేటర్స్ నగరంలోని ప్రముఖ స్పాట్స్‌లో రీల్స్ (Reels) షూట్ చేస్తున్నారు. తక్కువ ట్రాఫిక్, విశాలమైన రోడ్లు, క్లీనర్ బ్యాక్‌డ్రాప్స్, నాచురల్ లైటింగ్, కల్చర్ ప్లస్ మోడర్నిటీ మిక్స్.. వంటివి దీనికి కారణమని స్పష్టమవుతోంది. ఈ కారణంగా హైదరాబాద్ సౌత్ ఇండియాలో కొత్త రీల్ క్యాపిటల్‌గా మారుతోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
చదవండి: అలాంటి డైట్‌లతో ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి: నటి ఊర్మిళ


