breaking news
International
-
Australia: ప్రభుత్వ డేటాలోకి ఓపెన్ఏఐ ఏజెంట్ చొరబాటు కలకలం
కాన్బెర్రా: ఆస్ట్రేలియా ప్రభుత్వ ఆరోగ్య గణాంకాల వెబ్‌సైట్‌లోని డేటాను ఓపెన్ఏఐకి చెందిన ఏఐ ఏజెంట్ యాక్సెస్ చేసేందుకు ప్రయత్నించిన ఘటనపై ఆ దేశ ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనను అంగీకరించలేనిదిగా అభివర్ణించారు. జూన్‌లో ఆరోగ్య సంబంధిత పరిశోధన చేస్తుండగా ఏఐ ఏజెంట్ పరిమిత డేటాను యాక్సెస్ చేసేందుకు ప్రయత్నించిందని, దాన్ని అడ్డుకున్న తర్వాత ఆంక్షలను అధిగమించే మార్గాలను వెతికినట్లు అల్బనీస్ తెలిపారు.పరిమితిని దాటేందుకు ప్రయత్నం?‘ఇది చేయాల్సిన పరిధిని దాటి వెళ్లిన పరిశోధన ప్రాజెక్టు’ అని అల్బనీస్ పేర్కొన్నారు. పరిమిత డేటాను యాక్సెస్ చేయకుండా అడ్డుకున్న తర్వాత కూడా ఏఐ వ్యవస్థ ఆ నిరోధాన్ని అధిగమించేందుకు ప్రయత్నించిందని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి ఆస్ట్రేలియా ప్రభుత్వానికి ఓపెన్ఏఐ సెప్టెంబర్‌లోనే సమాచారం ఇచ్చిందని అల్బనీస్ తెలిపారు. ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్‌తో తాను మాట్లాడినట్లు ఆస్ట్రేలియా ప్రధాని వెల్లడించారు. ఈ ఘటనపై ప్రభుత్వ ఆందోళనను ఆయనకు తెలియజేశానని చెప్పారు. అలాగే ఘటన జరిగిన విషయం ప్రభుత్వానికి తెలియజేయడంలో కంపెనీ చాలా ఆలస్యం చేసిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 10 వరకు ఎలాంటి సమాచారం అందలేదని, అది కూడా ప్రభుత్వ సాధారణ పబ్లిక్ మెయిల్‌బాక్స్‌కు పంపిన ఈమెయిల్ రూపంలో మాత్రమే వచ్చిందని తెలిపారు.వ్యక్తిగత సమాచారం యాక్సెస్ కాలేదా?ప్రస్తుతం ఆస్ట్రేలియా ప్రభుత్వ సేవల నెట్వర్క్ మొత్తానికి ఈ ఘటన విస్తరించినట్లు ఆధారాలు లేవని అల్బనీస్ చెప్పారు. ఇప్పటివరకు వ్యక్తిగత సమాచారం యాక్సెస్ అయినట్లు భావించడం లేదని, అయితే దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. అయినప్పటికీ జరిగిన పరిణామం తీవ్రంగా ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా సైబర్ భద్రతా సంస్థలు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నాయి. ఏ వ్యవస్థలు ప్రభావితమయ్యాయో, ఏఐ ఏజెంట్ కార్యకలాపాల పూర్తి పరిధి ఏమిటో తెలుసుకునేందుకు ఆస్ట్రేలియన్ సిగ్నల్స్ డైరెక్టరేట్ ఫోరెన్సిక్ దర్యాప్తులో సహకరిస్తోంది. మరోవైపు, తమ అంతర్గత సమీక్షలో ఆస్ట్రేలియా ప్రభుత్వానికి చెందిన పలు వెబ్సైట్లు, సేవలకు సంబంధించిన కార్యకలాపాలు గుర్తించినట్లు ఓపెన్ఏఐ తెలిపింది.ఏఐ భద్రతపై పెరుగుతున్న ఆందోళనలుఅధునాతన ఏఐ వ్యవస్థలు కంప్యూటర్ నెట్‌వర్క్‌లతో స్వయంగా పరస్పర చర్యలు జరపగల సామర్థ్యం పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలు అంతర్జాతీయంగా ఆందోళనకు కారణమవుతున్నాయి. ఓపెన్ఏఐతో పాటు ఇతర ఏఐ సంస్థల మోడళ్లపై కూడా సైబర్ భద్రతకు సంబంధించి పరిశీలనలు పెరిగాయి. వెబ్సైట్లు, సమాచార వ్యవస్థలను ఏఐ ఏజెంట్లు స్వయంగా యాక్సెస్ చేసి పనులు నిర్వహించే సామర్థ్యం పెరుగుతున్న నేపథ్యంలో మరింత కఠినమైన భద్రతా చర్యలు అవసరమనే చర్చకు ఈ ఘటన దారితీసింది.ఇదీ చదవండి: ఉత్తరప్రదేశ్: బస్సులో మంటలు.. 9 మంది సజీవ దహనం -
ప్రోటోకాల్ దాటి.. జిన్‌పింగ్‌కు ట్రంప్ అరుదైన స్వాగతం
అమెరికా–చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరుదైన స్వాగతం పలికారు. ప్రత్యేక విమానంలో వాషింగ్టన్ చేరుకున్న జిన్‌పింగ్, ఆయన భార్య పెంగ్ లియువాన్‌లను ట్రంప్, ఆయన సతీమణి మెలానియా స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి ఆహ్వానించారు. దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత.. అమెరికా గడ్డపై ఓ విదేశీ నేతకు లభించిన అత్యంత అరుదైన స్వాగతంగా దీని గురించి చర్చ నడుస్తోంది.జాయింట్ బేస్ ఆండ్రూస్ ఎయిర్‌బేస్‌లో జిన్‌పింగ్ విమానం దిగగానే రెడ్ కార్పెట్‌పైకి వచ్చిన ట్రంప్ దంపతులు ఆయనకు కరచాలనం చేసి స్వాగతం పలికారు. 21 మంది సభ్యులతో కూడిన గౌరవ వందనం, సైనిక బ్యాండ్, రెండు బి-1 బాంబర్ విమానాల విన్యాసంతో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ట్రంప్, జిన్‌పింగ్ కొద్దిసేపు మాట్లాడుకుని అనంతరం ఫొటోలకు పోజులిచ్చారు. ఈ మూడు రోజుల పర్యటనలో గురువారం వైట్‌హౌస్‌లో అధికారిక స్వాగత కార్యక్రమం, సైనిక పరేడ్, ద్వైపాక్షిక చర్చలు, స్టేట్ డిన్నర్ జరగనున్నాయి.Chinese President Xi Jinping and his wife, Peng Liyuan, were warmly greeted by U.S. President Donald Trump and his wife, Melania Trump, at the airport in a rare planeside welcome. pic.twitter.com/IoUSosQZ8d— Mulan Chun-Li (@chunlimulan) September 24, 2026ఓ విదేశీ నేతను అమెరికా అధ్యక్షుడు ఈ స్థాయిలో స్వయంగా స్వాగతించడం.. అదీ సుమారు ఆరు దశాబ్దాల తర్వాత కావడంతో చర్చనీయాంశంగా మారింది. ఇంతకు ముందు అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నడీ 1962లో పలువురు విదేశీ నేతలను వ్యక్తిగతంగా స్వాగతించారు. ఆ తర్వాత బుష్, ఒబామా కాలంలో పోప్లను మాత్రం స్వాగతించారు. పోటోకాల్ పేరిట అధ్యక్షుడిని మినహాయించి.. విదేశీ నేతలకు అధికార యంత్రాంగం వెల్కమ్ చెప్పటం అక్కడ ఆనవాయితీగా మారిపోయింది. అయితే జిన్‌పింగ్ కోసం ట్రంప్ ఇప్పుడు దానిని చెరిపేశారు.ఎందుకింత ప్రత్యేకం?అమెరికా అధ్యక్షులు సాధారణంగా విదేశీ నేతలను విమానాశ్రయానికి వెళ్లి స్వయంగా ఆహ్వానించరు. జాయింట్ బేస్ ఆండ్రూస్‌లో ఇలాంటి స్థాయి స్వాగతాలు అత్యంత అరుదు. జిన్‌పింగ్ పర్యటనకు ముందు ట్రంప్ అక్కడికి వెళ్లి స్వయంగా స్వాగతం పలకనున్నట్లు అమెరికా అధికారులు ప్రకటించడంతోనే ఆసక్తి నెలకొంది.ఈ పర్యటనకు మరో ప్రత్యేకత ఉంది. 2015 తర్వాత అమెరికా రాజధానికి చైనా అధ్యక్షుడి తొలి స్టేట్ విజిట్ ఇది. అయితే 2023లో అప్పటి అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం మేరకు శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన అమెరికా–చైనా శిఖరాగ్ర భేటీ, APEC సదస్సులో పాల్గొనేందుకు వెళ్లారు. ఇప్పుడు మాత్రం అధికారిక స్టేట్ విజిట్‌లో భాగంగా వాషింగ్టన్ చేరుకున్నారు. గత మేలో ట్రంప్ చైనాలో పర్యటించినప్పుడు జిన్‌పింగ్ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి ఆయనను కలవలేదు. ఈసారి మాత్రం ట్రంప్ స్వయంగా జిన్‌పింగ్‌ను స్వాగతించడం రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ప్రాధాన్యతను స్పష్టం చేస్తోంది.వాణిజ్య యుద్ధానికి తాత్కాలిక బ్రేక్?జిన్‌పింగ్ అమెరికాలో అడుగుపెట్టిన రోజే రెండు దేశాల మధ్య వాణిజ్య అంశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ప్రకారం.. అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య సంధిని జనవరి 10 వరకు పొడిగించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ ఒప్పందం నవంబర్‌లో ముగియాల్సి ఉంది. సుంకాలను తగ్గించడం, కొత్త వాణిజ్య ఆంక్షలు విధించకుండా ఉండటం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ఇరు దేశాల మధ్య సుంకాలు, అరుదైన ఖనిజాలు, చిప్స్, సాంకేతికత వంటి అంశాల్లో విభేదాలు ఇంకా కొలిక్కి రావాల్సి ఉంది.టేబుల్‌పై ట్రేడ్.. ఏఐ.. ఇరాన్.. తైవాన్ట్రంప్–జిన్‌పింగ్ భేటీలో వాణిజ్యంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా కీలక అంశంగా ఉండనుంది. ఏఐ రంగంలో ఆధిపత్యం కోసం అమెరికా, చైనా తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఈ సాంకేతికతపై ఆందోళనలను చర్చించేందుకు ఇరు దేశాల మధ్య ప్రత్యేక కమ్యూనికేషన్ ఛానల్ ఏర్పాటు చేసే అంశం కూడా ప్రాథమిక చర్చల్లోకి వచ్చింది.అరుదైన ఖనిజాల సరఫరా కూడా కీలకంగా మారింది. ఎలక్ట్రానిక్స్ నుంచి సైనిక పరికరాల వరకు అనేక రంగాలకు అవసరమైన రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలో చైనాకు ఉన్న ఆధిపత్యం అమెరికాకు ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు కీలక చిప్స్, ఇతర సాంకేతిక ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న ఎగుమతి నియంత్రణలను చైనా వ్యతిరేకిస్తోంది.ఇరాన్ అంశం కూడా ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశముంది. ఇరాన్‌తో చైనా సంబంధాలు, మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న పరిణామాలు, తైవాన్ అంశాలపై రెండు దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అందువల్ల మూడు రోజుల పర్యటనలో అసలు చర్చలు గురువారం జరిగే ట్రంప్–జిన్‌పింగ్ సమావేశంపైనే కేంద్రీకృతం కానున్నాయి.భారీ ఏర్పాట్లు.. టెక్ దిగ్గజాలతో విందుజిన్పింగ్ పర్యటనలో భాగంగా గురువారం వైట్‌హౌస్‌లో స్టేట్ డిన్నర్ నిర్వహించనున్నారు. ఇందులో అమెరికా టెక్ రంగానికి చెందిన ప్రముఖులు పాల్గొననున్నారు. ఏఐ, చిప్స్, టెక్నాలజీ రంగాల దిగ్గజాల హాజరు ఈ విందుకు మరింత ప్రాధాన్యతను తెచ్చింది.శుక్రవారం జిన్‌పింగ్, పెంగ్ లియువాన్లు ట్రంప్ దంపతులతో వైట్‌హౌస్‌లో టీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అమెరికా చరిత్రకు సంబంధించిన కీలక పత్రాలు భద్రపరిచిన నేషనల్ ఆర్కైవ్స్‌ను సందర్శించనున్నారు. ఆ తర్వాత జాయింట్ బేస్ ఆండ్రూస్ నుంచి జిన్‌పింగ్ తిరుగు ప్రయాణం కానున్నారు.అమెరికా–చైనా మధ్య వాణిజ్య, సాంకేతిక, భౌగోళిక రాజకీయ విభేదాలు పూర్తిగా సమసిపోలేదు. అయితే చర్చల ద్వారా సంబంధాలను అదుపులో ఉంచి, మరోసారి పెద్ద స్థాయి ఘర్షణకు దారితీయకుండా చూడాలన్న ప్రయత్నం మాత్రం ఈ పర్యటనలో స్పష్టంగా కనిపిస్తోంది. -
ఆ దేశాల్లో విడాకులే లేవు.. మరి విడిపోవాలనుకుంటే..
వైవాహిక బంధం సరిగా సాగకపోతే చాలా దేశాల్లో చట్టబద్ధంగా విడాకులు తీసుకునే అవకాశం ఉంది. అయితే ప్రపంచంలో ఫిలిప్పీన్స్, వాటికన్ సిటీలలో విడాకులు లేవని చెబుతుంటారు. అయితే అక్కడ పెళ్లి బంధం తెగిపోయినా, దంపతులు తప్పనిసరిగా జీవితాంతం కలిసి ఉండాల్సిందే అనేది పూర్తిగా నిజం కాదు. ఈ రెండు ప్రాంతాల్లో వివాహం నుంచి విడిపోవడానికి ప్రత్యేక చట్టపరమైన మార్గాలు ఉన్నాయి. అయితే అవి సాధారణ విడాకులకు భిన్నంగా ఉంటాయి.సాధారణ విడాకులకు అవకాశం లేదుఫిలిప్పీన్స్లో ఇతర దేశాల్లో ఉన్నట్లుగా సాధారణ విడాకుల చట్టం లేదు. అయితే ఫ్యామిలీ కోడ్ ప్రకారం దంపతులు విడిపోవడానికి మూడు ప్రధాన మార్గాలు ఉన్నాయి. అవి లీగల్ సెపరేషన్, అనుల్మెంట్, డిక్లరేషన్ ఆఫ్ నలిటీ. లీగల్ సెపరేషన్లో కోర్టు భార్యాభర్తలు విడిగా జీవించేందుకు అనుమతించవచ్చు. కానీ వారి వివాహ బంధం మాత్రం కొనసాగుతుంది. అందువల్ల వారు చట్టపరంగా భార్యాభర్తలుగానే ఉంటారు. అయితే మళ్లీ పెళ్లి చేసుకునే స్వేచ్ఛ ఉండదు.హింస, మోసం.. విడిపోవడానికి కారణాలివేఫిలిప్పీన్స్లో లీగల్ సెపరేషన్‌కు కొన్ని నిర్దిష్ట కారణాలను చట్టం గుర్తిస్తుంది. పదేపదే శారీరక హింసకు పాల్పడటం, లైంగిక అవిశ్వాసం, జీవిత భాగస్వామిని వదిలి వెళ్లిపోవడం, కొన్ని రకాల నేరాల్లో శిక్ష పడటం వంటి పరిస్థితుల్లో కోర్టును ఆశ్రయించవచ్చు. అయితే కోర్టు విడిగా జీవించేందుకు అనుమతించినా వివాహ బంధం మాత్రం రద్దు కాదు. మరోవైపు అనుల్మెంట్ లేదా నలిటీ ప్రక్రియలో వివాహం మొదటి నుంచే చట్టబద్ధంగా చెల్లుబాటు అయ్యిందా లేదా అన్నది పరిశీలిస్తారు. అంటే బంధం తర్వాత చెడిపోయిందని చెప్పడం కంటే, వివాహం ప్రారంభం నుంచే చట్టపరంగా చెల్లనిదని నిర్ధారించాల్సి ఉంటుంది.విదేశీయుడితో పెళ్లైతే ప్రత్యేక వెసులుబాటుఫిలిప్పీన్స్ పౌరుడు లేదా పౌరురాలు విదేశీయుడిని వివాహం చేసుకున్న సందర్భంలో మరో ప్రత్యేక నిబంధన ఉంది. ఆ వివాహంలోని విదేశీ భాగస్వామి విదేశాల్లో చట్టబద్ధంగా విడాకులు పొందితే, కొన్ని పరిస్థితుల్లో ఆ విడాకులను ఫిలిప్పీన్స్‌లో కూడా గుర్తించే అవకాశం ఉంది. ఫ్యామిలీ కోడ్‌లోని ఆర్టికల్ 26(2) దీనికి సంబంధించిన నిబంధనను కలిగి ఉంది. అటువంటి సందర్భాల్లో ఫిలిప్పీన్స్ భాగస్వామికి కూడా మళ్లీ వివాహం చేసుకునే చట్టపరమైన అవకాశం ఏర్పడవచ్చు. అయితే దీనికి ఫిలిప్పీన్స్ చట్టం ప్రకారం గుర్తింపు అవసరం.ముస్లింలకు మాత్రం విడాకుల చట్టం ఉంది‘ఫిలిప్పీన్స్‌లో విడాకులు పూర్తిగా లేవు’ అని చెప్పడం కూడా సరైనది కాదు. అక్కడ ముస్లిం వివాహాలకు ప్రత్యేకమైన ముస్లిం పర్సనల్ లా వర్తిస్తుంది. రెండు పక్షాలు ముస్లింలైనప్పుడు లేదా నిర్దిష్ట పరిస్థితుల్లో ముస్లిం చట్టం ప్రకారం వివాహం జరిగినప్పుడు ఈ నిబంధనలు వర్తించవచ్చు. ఈ చట్టంలోని ఆర్టికల్ 45 ప్రకారం విడాకులను వివాహ బంధానికి అధికారిక ముగింపుగా పేర్కొంటుంది. ఇందులో తలాక్, ఖులా, ఫస్ఖ్ వంటి వివిధ రూపాలు ఉన్నాయి. అంటే ముస్లిం సమాజానికి కొన్ని పరిస్థితుల్లో చట్టబద్ధమైన విడాకుల మార్గం ఉంది.వాటికన్లో విడిపోవాలనుకుంటే..వాటికన్ సిటీలో పరిస్థితి మరింత భిన్నంగా ఉంటుంది. అక్కడ కాథలిక్ చర్చి కెనన్ లా వర్తిస్తుంది. దాని ప్రకారం క్రైస్తవ వివాహానికి ఏకత్వం, అవిభాజ్యత ముఖ్యమైన లక్షణాలు. వివాహాన్ని మానవ అధికారంతో రద్దు చేయలేమని కెనన్ లా భావిస్తుంది. మరణంతోనే అలాంటి బంధం ముగుస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో తగిన కారణాలు ఉంటే పోప్ దాన్ని రద్దు చేయడానికి అవకాశం ఉంది. కెనన్ లా 1142లో దీనికి సంబంధించిన నిబంధన ఉంది. అలాగే చర్చి అనుల్మెంట్ ప్రక్రియ ద్వారా వివాహం మొదటి నుంచే చెల్లుబాటు అయ్యిందా లేదా అన్నది పరిశీలిస్తుంది. భార్యాభర్తలు తగిన కారణాలతో విడిగా జీవించేందుకు కూడా కెనన్ లా అవకాశం కల్పిస్తుంది. అయితే అలా విడిగా ఉన్నా వివాహ బంధం కొనసాగుతుంది. అందువల్ల ఫిలిప్పీన్స్, వాటికన్ సిటీలను ‘విడాకులు లేని ప్రాంతాలు’గా పేర్కొన్నప్పటికీ, అక్కడ వివాహం నుంచి విడిపోవడానికి ఉన్న చట్టపరమైన మార్గాలు సాధారణ విడాకుల కంటే చాలా భిన్నమైనవని స్పష్టమవుతోంది.ఇదీ చదవండి: Mumbai: షుగర్ వ్యాధిగ్రస్తులకు గణపయ్య ప్రసాదం -
2.45 బిలియన్ డాలర్లతో గాజా పునర్మిర్మాణం
న్యూయార్క్: గాజాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ప్రణాళిక అమలుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దాడులు ఆగడం లేదు. ఇలాంటి తరుణంలో గాజాలో పునర్నిర్మాణం, పరిపాలనను ప్రారంభించేందుకు అమెరికా మద్దతుగల ‘బోర్డ్ ఆఫ్ పీస్’ 6 నెలల కార్యాచరణ కోసం 2.45 బిలియన్ డాలర్ల ప్రణాళికను ప్రతిపాదిస్తోంది. బుధవారం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశం సందర్భంగా న్యూయార్క్‌లో బోర్డు సమావేశం నిర్వహించారు. గాజాలో అధిగమించాల్సిన భారీ అడ్డంకులు ఇంకా ఉన్నాయని పేర్కొన్నారు. అక్కడ పునర్నిర్మాణ పనులను ప్రారంభించడానికి ‘బోర్డ్ ఆఫ్ పీస్’ గవర్నర్లు 66 ప్రాజెక్టుల బ్లూప్రింట్‌ను ఆవిష్కరించారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధాన్ని ముగించడానికి ట్రంప్ 20 సూత్రాల ప్రణాళికకు మద్దతుగా రూపొందించిన ప్రతిష్టాత్మక మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్య కార్యక్రమాలు ఈ ప్రాజెక్టుల్లో ఉన్నాయి. గాజాలో దెబ్బతిన్న మౌలిక సదుపాయాలు పూర్తిగా పునర్ నిర్మించడానికి సుమారు 35.2 బిలియన్ల అమెరికన్ డాలర్లు, అలాగే తదుపరి 10 ఏళ్లలో మరో 71.4 బిలియన్ల అమెరికన్ డాలర్లు ఖర్చవుతాయని ‘బోర్డ్ ఆఫ్ పీస్’ తెలిపింది. -
రష్యాపై ఆంక్షలు భారత్‌కు ప్రతికూలం
న్యూయార్క్: ఐక్యరాజ్య సమితి సాధారణ సభ సమావేశాల కోసం న్యూయార్క్‌కు విచ్చేసిన భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ బుధవారం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రష్యా నుంచి ముడిచమురు, సహజ వాయువును కొని విదేశాలకు ఎగుమతిచేసే దేశాలపై గరిష్టంగా 100 శాతం పన్నులు విధించేందుకు ట్రంప్ తీసుకొచ్చిన ‘లిండ్సే ఓ గ్రాహమ్ రష్యా, ఇరాన్ ఆంక్షల చట్టం’కారణంగా భారత్‌పై ఆర్థికభారం పడనున్న నేపథ్యంలో ఈ అంశాన్ని రూబియో వద్ద జైశంకర్ ప్రస్తావించారు. కొత్త చట్టంతో భారత ప్రయోజనాలు ఏ విధంగా దెబ్బతింటాయో, అది ఏ విధంగా తమ దేశానికి ప్రతికూలమో రూబియోకు జైశంకర్ వివరించారు. ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యంపై జైశంకర్‌తో చర్చలు సానుకూల వాతావరణంలో కొనసాగాయని రూబియో ‘ఎక్స్’లో వెల్లడించారు. -
హార్మూజ్‌లో నౌకపై దాడి
మస్కట్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) నుంచి బయల్దేరిన నౌక అనూహ్యంగా హార్మూజ్ జలసంధిలో దాడికి గురైంది. ఆంటిక్వా, బార్బూడా జెండాతో యూఏఈ నుంచి 28 మంది నావికా సిబ్బందితో ‘ఎంవీ కేప్ దావో’సరకు రవాణా నౌక బయల్దేంది. అయితే సెప్టెంబర్ 23వ తేదీన హార్మూజ్‌లో నౌకను రెండు టార్పెడోలు ఢీకొట్టాయి. దీంతో నౌకలో ఇంజిన్ గది, ఇతర అవసరాలకు ఉపయోగించే గది ధ్వంసమయ్యాయి. ఈ దాడి ఘటనలో నౌకలో విధుల్లో ఉన్న సూరజ్ యాదవ్ అనే భారతీయ నావికుని తలకు తీవ్ర గాయమైంది. దాడి విషయం తెల్సి సమీపంలోని ఒమన్ రాయల్ నేవీ బలగాలు వెంటనే రంగంలోకి దిగాయి. ధ్వంసమైన నౌక నుంచి దాదాపు అందర్నీ తమ నౌకలోకి ఎక్కించి తీరానికి తీసుకొచ్చారు. తీవ్ర గాయంతో సూరజ్ చనిపోయాడని ఒమన్ రాజధాని మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. నౌకలో 19 మంది భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది. ‘‘సంబంధిత వర్గాలతో నిరంతరం సంప్రతింపులు జరు పుతున్నాం. 18 మంది నావికులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొస్తాం’’అని ఇండియన్ ఎంబసీ హామీ ఇచ్చిది. సూరజ్ యాదవ్ ఉత్తరప్రదేశ్‌లోని దేవరియా ప్రాంతానికి చెందిన వ్యక్తి అని వెల్లడించింది. మృతుని కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేసింది. తమలో మరో వ్యక్తి యుద్ధానికి బలయ్యాడని ఫార్వర్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్యూఐ) ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేసింది. -
అమెరికాకు లొంగే ప్రసక్తే లేదు!
ఐక్యరాజ్యసమితి: అమెరికాతో జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ ఎట్టిపరిస్థితుల్లోనూ లొంగిపోదని, ఎవరికీ తలవంచే ప్రసక్తే లేదని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తేల్చిచెప్పారు. సంఘర్షణను ముగించడానికి దౌత్యమే ఏకైక మార్గమని స్పష్టంచేశారు. దాడులకు ప్రతిస్పందించే హక్కు ఇరాన్‌కు ఉందన్నారు. తమ చట్టబద్ధమైన హక్కులను ఎందుకు వదులుకోవాలని ప్రశ్నించారు. శాంతియుత అణు సాంకేతికతను పొందడం ఇరాన్ హక్కు అని ఉద్ఘాటించారు. పౌర వినియోగ అణు కార్యకలాపాలకు, అణ్వాయుధాల తయారీకి మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉందన్నారు. శాంతియుత అణు సాంకేతికతపై ఆంక్షలు విధించాలన్న ఆలోచన మానుకోవాలని సూచించారు. ఇతర దేశాల అనుమతితో సంబంధం లేకుండా తమను తాము రక్షించుకునే హక్కు ఇరాన్‌కు ఉందని ఉద్ఘాటించారు. ఈ విషయంలో ఇరాన్ ఎవరి అనుమతీ కోరబోదని పేర్కొన్నారు. అణు తనిఖీల విషయంలో ద్వంద్వ ప్రమాణాలను పెజెష్కియన్ ప్రశ్నించారు. ఇజ్రాయెల్ వద్ద అణ్వాయుధాలు, ఇతర ఆయుధ సామర్థ్యాలు ఉండగా, ఇరాన్ మాత్రం అంతర్జాతీయ తనిఖీల కోసం ఒత్తిడిని ఎదుర్కొంటోందని ఆక్షేపించారు. అణ్వాయుధాలు ఇజ్రాయెల్ చేతిలో ఉండగా, తనిఖీలు చేస్తామంటూ ఇరాన్‌ను వేధిస్తున్నారని విమర్శించారు. హార్మూజ్ జలసంధి గుండా ఇరాన్ నౌకల రాకపోకలకు ఇతర దేశాలు అడ్డుకుంటున్నాయని ఆరో పించారు. హార్మూజ్ వల్ల తమకు ప్రయోజనం లేనప్పుడు ఇతర దేశాలు కూడా ప్రయోజనం పొందడానికి వీల్లేదన్నారు. ఈ జలసంధిలో శత్రుదేశాల నౌకాదళాలను శాశ్వతంగా మోహరించడం, యుద్ధాన్ని విస్తరించడం వల్ల మనం ఆశించిన శాంతి సాధ్యం కాదని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో బుధవారం పెజెస్కియాన్ ప్రసంగించారు. ఇరాన్ తన పొరుగు దేశాలను ప్రత్యర్థులుగా పరిగణించదని, బలమైన పొరుగు దేశాలు ఉండాలని కోరుకుంటోందని తెలిపారు. టెహ్రాన్‌పై సైనిక చర్యకు మద్దతు ఇస్తున్న ఇతర దేశాలు ఈ జలమార్గాన్ని ఉపయోగించుకోవడాన్ని తాము అంగీకరించబోమని వెల్లడించారు. అమాయక విద్యార్థులను చంపడం ఏమిటి? ఇరాన్ ఒక ఉగ్రవాద దేశం అంటూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణలను పెజెష్కియాన్ తీవ్రంగా ఖండించారు. తాము ఉగ్రవాదులం కాదని.. ముమ్మాటికీ ఉగ్రవాద బాధితులమని తేల్చిచెప్పారు. ఇరాన్ స్వయంగా ఉగ్రవాదానికి లక్ష్యంగా మారిందని అన్నారు. ఇరాన్ భూభాగంపై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు విచ్చలవిడిగా దాడులు చేస్తున్నాయని మండిపడ్డారు. మినాబ్ పాఠశాలపై అమెరికా–ఇజ్రాయెల్ దాడికి సంబంధించిన ఫొటోలను కూడా ప్రదర్శించారు. ఈ రాక్షసకాండలో అమాయక చిన్నారులు బలైపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికీ ఇరాన్ పౌరులపై దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అయితే, జనరల్ అసెంబ్లీలో పెజెష్కియాన్ మాట్లాడుతుండగా అమెరికా ప్రతినిధులు బయటకు వెళ్లిపోవడం గమనార్హం. అస్థిరతకు మేము కారణం కాదు ప్రత్యర్థి దేశాలు తమ విశ్వవిద్యాలయాలు, ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు, ఆసుపత్రులు సహా పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నారని పెజెష్కియాన్ ఆరోపించారు. తమ దేశంపై జరుగుతున్న పిరికిపంద దాడులకు సాధారణ ప్రజలే లక్ష్యమయ్యారని ఆక్షేపించారు. ప్రత్యర్థులపై ఇరాన్ సైన్యం చేస్తున్న ప్రతిదాడులను సమర్థించుకున్నారు. ఇరాన్ తనను తాను రక్షించుకుంటోందని చెప్పారు. తమ పౌరులను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకోవడాన్ని తమ దళాలు అడ్డుకుంటున్నాయని తెలిపారు. తాము ప్రతిస్పందిస్తున్నాం తప్ప ఇతర దేశాల్లోని సాధారణ పౌరులను ఏనాడూ లక్ష్యంగా చేసుకోలేదని వెల్లడించారు. గాజాలోని పరిస్థితిని సైతం ప్రస్తావించారు. అస్థిరతకు తాము కారణం కాదన్నారు. స్వతంత్రంగా జీవించాలని మాత్రమే తాము కోరుకుంటున్నామని తేల్చిచెప్పారు.అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అమెరికా, ఇరాన్ ప్రతినిధులు మూడు గంటల పాటు సమావేశమయ్యారు. తాజా పరిణామాలపై చర్చించారు. ఈ చర్చల్లో అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, అధ్యక్షుడి సీనియర్ సలహాదారు జేర్డ్ కుష్నర్ పాల్గొనగా, ఇరాన్ తరఫున విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రాతినిధ్యం వహించారు. ఈ సమావేశం ‘చాలా ఫలవంతమైనది’గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభివరి్ణంచారు. అయితే, ఈ చర్చల ఫలితంగా అమెరికా, ఇరాన్ మధ్య తక్షణ ఒప్పందం గానీ, శాంతి సాధనలో పురోగతి గానీ కనిపించలేదు. -
భారత్-పాకిస్థాన్ వంటి వివాదాలపై అమెరికా కీలక కామెంట్స్
ప్రపంచంలో ప్రధాన సంఘర్షణలను పరిష్కరించేందుకు ప్రస్తుతం సమర్థమైన అంతర్జాతీయ వ్యవస్థ లేదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. భారత్-పాకిస్థాన్ మధ్య తలెత్తే ఉద్రిక్తతలను పరిష్కరించేందుకు కూడా ప్రస్తుతం పనిచేసే వ్యవస్థ కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు. న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ఉన్నతస్థాయి వారోత్సవాల సందర్భంగా విలేకరులతో మాట్లాడిన రూబియో ఈ వ్యాఖ్యలు చేశారు.అంతర్జాతీయ వ్యవస్థకు విలువ ఉందని అమెరికా గుర్తిస్తోందని రూబియో చెప్పారు. ఐక్యరాజ్యసమితికి అపారమైన సామర్థ్యం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా చెప్పారని గుర్తుచేశారు. అయితే ఆ వ్యవస్థ తన సామర్థ్యానికి అనుగుణంగా పనిచేయడం లేదని అన్నారు.“అంతర్జాతీయ వ్యవస్థలో ఉపయోగకరమైన అంశాలను మేం చూస్తున్నాం. అందుకే మేం ఇక్కడ ఉన్నాం. ఐక్యరాజ్యసమితికి అపారమైన సామర్థ్యం ఉందని అధ్యక్షుడు కూడా చెప్పారు” అని రూబియో అన్నారు. అంతర్జాతీయ వ్యవస్థ తన అసలు ఉద్దేశం, పరిధిని దాటి అనేక అంశాల్లో జోక్యం చేసుకుంటోందని రూబియో విమర్శించారు. “అంతర్జాతీయ వ్యవస్థ విఫలమవుతోందని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. తన పరిధిని, ఉద్దేశాన్ని దాటి వెళ్లడమే అందుకు కారణం. చేయాల్సిన అవసరం లేని అనేక విషయాల్లో అది జోక్యం చేసుకుంటోంది. ప్రపంచంలోని దాదాపు ఏ ప్రధాన సంఘర్షణనూ పరిష్కరించలేకపోతోంది” అని ఆయన అన్నారు.థాయ్‌లాండ్-కంబోడియా మధ్య జరిగిన ఘర్షణ, భారత్-పాకిస్థాన్ మధ్య తలెత్తే అవకాశం ఉన్న సంఘర్షణలను ప్రస్తావిస్తూ.. ఇలాంటి సమస్యలను పరిష్కరించగల సమర్థమైన అంతర్జాతీయ వ్యవస్థ ఉంటే బాగుండేదని రూబియో అన్నారు. ప్రస్తుతం అలాంటి వ్యవస్థ లేదని పేర్కొన్నారు.అంతర్జాతీయ వ్యవస్థ సమర్థంగా పనిచేయనంతకాలం దేశాలు తమ జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తాయని రూబియో స్పష్టం చేశారు. “అమెరికా ఎల్లప్పుడూ తన దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తుంది. అంతర్జాతీయ వ్యవస్థ ప్రయోజనాల కోసం అమెరికా ప్రయోజనాలను ఎప్పటికీ పక్కన పెట్టం” అని ఆయన అన్నారు.రూబియో వ్యాఖ్యలు ట్రంప్ ఐక్యరాజ్యసమితి ప్రసంగంలో భారత్-పాకిస్థాన్ గతేడాది ఘర్షణను తానే పరిష్కరించానని మరోసారి చెప్పిన మరుసటి రోజే వెలువడ్డాయి. భారత్ మాత్రం కాల్పుల విరమణపై అవగాహన రెండు దేశాల సైన్యాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మధ్య జరిగిన ప్రత్యక్ష చర్చల ద్వారా ఏర్పడిందని స్పష్టం చేస్తోంది. -
పాకిస్థాన్ సరిహద్దులో ఉద్రిక్తత.. 8 డ్రోన్లు కూల్చివేత
పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ సరిహద్దులో మరోసారి కాల్పులు చోటుచేసుకోవడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. అఫ్గానిస్థాన్ నుంచి తమ భూభాగంలోకి ప్రవేశించిన 8 డ్రోన్లను కూల్చివేసినట్లు పాకిస్థాన్ భద్రతా దళాలు వెల్లడించాయి. వాయవ్య పాకిస్థాన్‌లో ఈ డ్రోన్లను అడ్డుకున్నట్లు భద్రతా వర్గాలు తెలిపాయి. పాక్ భద్రతా వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. టోర్ఖమ్ సరిహద్దు ప్రాంతం సమీపంలో 4 డ్రోన్లను, ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లోని కోహాట్ సమీపంలోని పర్వత ప్రాంతాల్లో మరో 4 డ్రోన్లను కూల్చివేశారు. వీటిలో కొన్ని సాధారణ నమూనాలకు చెందిన డ్రోన్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కోహాట్ సమీపంలో గుర్తించిన డ్రోన్లను “సాఫ్ట్-కిల్” విధానంలో నిర్వీర్యం చేసినట్లు చెప్పారు. ఈ డ్రోన్లు జనసంచారం ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకునేందుకు వచ్చినవని పాకిస్థాన్ అధికారులు ఆరోపించారు. పాకిస్థాన్‌పై దాడులు చేస్తున్న మిలిటెంట్లకు అఫ్గాన్ తాలిబన్ మద్దతు ఇస్తోందనడానికి ఇది మరో ఆధారమని వారు పేర్కొన్నారు.ఇదే సమయంలో సరిహద్దులో కాల్పులు కూడా జరిగాయి. పక్తియా, నంగర్హార్ ప్రావిన్సుల్లోని ఆఫ్ఘన్ సరిహద్దు పోస్టుల సమీపం నుంచి మిలిటెంట్లు పాకిస్థాన్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించగా భద్రతా దళాలు అడ్డుకున్నాయని పాకిస్థాన్ అధికారులు తెలిపారు. అనంతరం అఫ్గాన్ తాలిబన్ దళాలు పాకిస్థాన్ సరిహద్దు పోస్టులపై మోర్టార్లు, ఇతర భారీ ఆయుధాలతో కాల్పులు జరిపాయని, దీనికి ప్రతిగా తమ దళాలు తాలిబన్ పోస్టులు, మోర్టార్ ప్రాంతాలు, రక్షణ స్థావరాలపై ఫిరంగులతో దాడి చేశాయని చెప్పారు. అఫ్గానిస్థాన్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది.ఇటీవలే వైమానిక దాడులు ఈ పరిణామాలు సోమవారం పాకిస్థాన్ అఫ్గానిస్థాన్‌లో జరిపిన వైమానిక దాడుల తర్వాత చోటుచేసుకున్నాయి. నిషేధిత తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) స్థావరాలు, శిబిరాలపై దాడులు చేసినట్లు పాకిస్థాన్ తెలిపింది. ఈ దాడుల్లో 28 మంది మిలిటెంట్లు, పలువురు ఆత్మాహుతి దాడిదారులు చనిపోయారని ఇస్లామాబాద్ పేర్కొంది. అయితే ఆఫ్ఘన్ అధికారులు దీనిని ఖండిస్తూ తమ భూభాగంలోని గ్రామాల్లో ముగ్గురు పౌరులు మరణించగా, మరో నలుగురు గాయపడ్డారని తెలిపారు. అఫ్గానిస్థాన్‌లోని ఐక్యరాజ్యసమితి మిషన్ కూడా పౌరుల మరణాలను ధ్రువీకరించగా, కాబూల్ అధికారికంగా నిరసన తెలిపింది.అఫ్గాన్ తాలిబన్‌తో టీటీపీకి సంబంధాలు ఉన్నప్పటికీ, రెండు సంస్థలు వేర్వేరు. 2021లో తాలిబన్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీపీ నేతలకు ఆశ్రయం కల్పిస్తున్నారని, అఫ్గానిస్థాన్ భూభాగాన్ని పాకిస్థాన్‌పై దాడులకు ఉపయోగించుకునేందుకు అనుమతిస్తున్నారని ఇస్లామాబాద్ పదేపదే ఆరోపిస్తోంది. కాబూల్ మాత్రం ఈ ఆరోపణలను తిరస్కరిస్తోంది.న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్.. అఫ్గానిస్థాన్‌లో పాకిస్థాన్ వ్యతిరేకంగా పనిచేస్తున్న 25కు పైగా మిలిటెంట్ సంస్థలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తాజా డ్రోన్ ఘటనలు, సరిహద్దు కాల్పులు ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత దెబ్బతీసే అవకాశం ఉంది. ఇస్లామాబాద్-కాబూల్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు చైనా, టర్కియే, ఖతార్, సౌదీ అరేబియా చేస్తున్న మధ్యవర్తిత్వ ప్రయత్నాలపై కూడా తాజా పరిణామాలు ప్రభావం చూపే అవకాశం ఉంది. -
ట్రంప్-జిన్‌పింగ్ భేటీలో ఇరాన్ అంశం.. ఇదే కీలకం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ గురువారం వైట్‌హౌస్‌లో భేటీ కానున్న నేపథ్యంలో ఇరాన్ అంశం కీలక చర్చగా మారే అవకాశం ఉంది. ఇరాన్ క్షిపణి దాడికి ముందు చైనా సంస్థలు టెహ్రాన్‌కు అధిక స్పష్టత కలిగిన ఉపగ్రహ చిత్రాలను అందించాయన్న నివేదిక నేపథ్యంలో ఈ అంశంపై ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తతలు తలెత్తే అవకాశముంది.జూలై 17న జోర్డాన్‌లోని మువాఫాక్ సాల్టీ వైమానిక స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడి చేసింది. ఆ దాడిలో ముగ్గురు అమెరికా సైనికులు మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు. దాడికి ముందు ఇరాన్‌కు అందిన ఉపగ్రహ చిత్రాలకు, ఈ దాడికి సంబంధం ఉందని అమెరికా అధికారులు భావిస్తున్నట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. అయితే, సంబంధిత చైనా సంస్థల పేర్లను అమెరికా అధికారులు వెల్లడించలేదు. చైనా ప్రభుత్వం కూడా తమ సంస్థలు అమెరికా సైనికులను లక్ష్యంగా చేసుకునే దాడికి చిత్రాలను అందించాయన్న ఆరోపణలను తిరస్కరించింది.చైనా–ఇరాన్ సంబంధాలపై అమెరికా గత కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇరాన్‌కు లక్ష్య నిర్ధారణలో ఉపయోగపడే ఉపగ్రహ చిత్రాలు, నావిగేషన్ సేవలు, డ్రోన్లు, క్షిపణులకు సంబంధించిన పరికరాలను చైనా సంస్థలు అందిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. మేలో ట్రంప్ ప్రభుత్వం 3 చైనా సంస్థలపై ఆంక్షలు విధించింది. అవి ఇరాన్‌కు ఉపయోగపడే ఉపగ్రహ చిత్రాలను అందించడం, సేకరించడం లేదా ప్రచురించడంలో పాలుపంచుకున్నాయని అమెరికా ఆరోపించింది.ట్రంప్ కూడా ఈ అంశంపై స్పందిస్తూ.. “చైనా మనపై గూఢచర్యం చేస్తుందని వారు అంటున్నారు. వారు చెప్పింది నిజమే. మనం కూడా వారిపై గూఢచర్యం చేస్తున్నాం” అని అన్నారు. షీతో ఈ అంశాన్ని ప్రస్తావిస్తారా అని అడిగినప్పుడు, చైనా అధ్యక్షుడు “సహేతుకంగా వ్యవహరించారు.. మనం కూడా సహేతుకంగా వ్యవహరిస్తున్నాం” అని ట్రంప్ పేర్కొన్నారు.ఇరాన్‌తో పాటు వాణిజ్యం, కృత్రిమ మేధ, అరుదైన ఖనిజాలు, తైవాన్ అంశాలు కూడా ట్రంప్-జిన్‌పింగ్ చర్చల్లో ఉంటాయి. సెప్టెంబర్ 23 నుంచి 25 వరకు షీ అమెరికాలో పర్యటిస్తున్నారు. నవంబర్‌లో ప్రస్తుత వాణిజ్య సంధి గడువు ముగియనున్న నేపథ్యంలో ఆర్థిక సంబంధాల్లో స్థిరత్వాన్ని కొనసాగించడంపైనా ఇరు దేశాలు దృష్టి పెట్టనున్నాయి. ఇరాన్‌కు సంబంధించిన ఉపగ్రహ చిత్రాల వ్యవహారం ఈ భేటీలో మరో కీలక విభేదంగా మారుతుందా? అనేది ఇప్పుడు చూడాల్సి ఉంది. -
‘తెలుగు ప్రవాసీయులు గల్ఫ్ భారతీయులందరికి ఆదర్శం’
గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న భారతీయులలో సౌదీ అరేబియాలోని తెలుగు ప్రవాసీయుల పాత్ర ప్రముఖమైందని సౌదీ అరేబియాలోని భారతీయ రాయబారి విపుల్ ప్రశంసించారు. గల్ఫ్ ప్రాంతంలోని భారతీయులలో తెలుగు ప్రవాసీయులు ఒక ప్రత్యెక విశిష్ఠత కల్గి ఉన్నారని ఆయన పెర్కోన్నారు. దేశమంటె మట్టికాదోయ్ దేశమంటె మనుషులోయ్ అని తెలుగులో ఉచ్చరిస్తూ దీన్ని సార్థకం చేసిన వారు సౌదీ అరేబియాలోని తెలుగు ప్రవాసీయులని అని ఆయన అన్నారు.తెలుగు ప్రవాసీ సంఘమైన సాటా (సౌదీ అరేబియా తెలుగు అసోసియెషన్) బుధవారం రియాధ్ నగరంలో నిర్వహించిన తెలుగు దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గోన్న ఆయన విదేశాంగ మంత్రిత్వ శాఖలో గల్ఫ్ విభాగం కార్యదర్శిగా, దుబాయిలో కాన్సుల్ జనరల్ గా మరియు ఖతర్ లో రాయబారిగా పని చేసిన తాను సౌదీలో చూసిన క్రీయాశీలకమైన తెలుగు సమాజాన్ని మరెచోట చూడ చూడలేదని అన్నారు.గల్ఫ్ దేశాలన్నింటిలో నివసిస్తున్న భారతీయులందరికి తెలుగు ప్రవాసీయులు ఆదర్శమని రాయబారి వ్యాఖ్యానించారు. కేవలం సాంస్కృతిక కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కాకుండ సేవా కార్యక్రమాలలో ముందుండడం ద్వార మాతృభూమికు నిజమైన సేవ చేస్తున్నారని విపుల్ అన్నారు. సాటా ప్రతినిధులు రంజీత్ చిత్తలూరి, జానీ బాషా, ముజ్జమ్మీల్ శేఖ్, సుచరిత, చేతన, ఎర్రన్న, యాఖూబ్,నాగరాజు, సత్తిబాబు తదితరులు సాటా కార్యకలాపాలను వివరించారు. సదూర ఎడారి ప్రాంతాలలో నివసిస్తున్న అనేక తెలుగు ప్రవాసీ కుటుంబాలు వందల కిలో మీటర్ల దూరం ప్రయాణించి ఈ కార్యక్రమంలో పాల్గోనడానికి రావడం జరిగింది. -
లండన్ - ఢిల్లీ ఇండిగో విమానంలో పొగలు, ఎమర్జెన్సీ ల్యాండింగ్
లండన్ నుండి ఢిల్లీ బయలుదేరిన ఇండిగో విమానం సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ప్రయాణీకులు భయభ్రాంతులకు లోనయ్యారు. కారణంగా విమానాన్ని వెనక్కి మళ్లించారు. లండన్ నుంచి 250 మందికి పైగా ప్రయాణికులతో బయలుదేరిన ఇండిగో విమానం (ఫ్లైట్ 6E 04), టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్య తలెత్తడంతో లండన్‌లోని హీత్రూ విమానాశ్రయానికి సురక్షితంగా వెనక్కి (Air turnback) చేరుకుంది. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. లండన్ హీత్రూ విమానాశ్రయం నుంచి విమానం బయలుదేరిన కొద్దిసేపటికే టెక్నికల్ ఇష్యూ తలెత్తడంతో సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. టేకాఫ్ అయిన తర్వాత కాక్‌పిట్ సిబ్బంది విమానంలో పొగను గుర్తించారు. వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కి సమాచారం అందించి ఎమర్జెన్సీని ప్రకటించారు. నిబంధనల ప్రకారం (SOP) విమానాన్ని వెనక్కి మళ్లించి హీత్రూ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ప్రయాణికులందరూ క్షేమంగా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పిల్చుకున్నారు.ఇదీ చదవండి: సీఈసీ జ్ఞానేష్ కుమార్ జైలుకెళ్లాల్సిందే : సంజయ్ రౌత్ ఆగ్రహంబాధిత ప్రయాణికులకు కలిగిన అసౌకర్యాన్ని తగ్గించడానికి హోటల్ వసతి కల్పించడంతో పాటు, తదుపరి లభ్యమయ్యే వేరే విమానాలలో వారి గమ్యస్థానాలకు పంపే ఏర్పాట్లు చేసినట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ తెలిపింది. ప్రస్తుతం ఆ విమానానికి (బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్) మెయింటెనెన్స్ తనిఖీలు నిర్వహిస్తున్నామని, అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే తిరిగి సర్వీసులను ప్రారంభిస్తామని ఎయిర్‌లైన్స్ స్పష్టం చేసింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతే తమకు అత్యంత ప్రాధాన్యమని ఇండిగో పేర్కొంది. ఇదీ చదవండి: 23 ఏళ్ల తరువాత అమెరికా డ్రీమ్స్ వదిలి ‘అమ్మ’దగ్గరికి -
ఇరాన్ వెన్ను విరిచేలా.. భారత్ అండతోనే ట్రంప్ మాస్టర్ ప్లాన్
న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి వేదికగా ఇరాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆ దేశ ఆధిపత్యానికి చెక్ పెట్టేలా భారత్‌కు అండగా నిలిచారు. ‘ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనమిక్ కారిడార్’(IMEC)కు ఆయన పూర్తి మద్దతు ప్రకటించారు. ఐరాస సమావేశాల నేపథ్యంలో గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్‌తో నిర్వహించిన సమావేశంలో ట్రంప్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.ఇరాన్ చెక్పాయింట్లు, హర్మూజ్ జలసంధి వంటి కీలక ప్రాంతాల ద్వారా కాకుండా, పైప్లైన్లు, ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు రవాణాను సురక్షిత ప్రాంతాలకు మార్చడానికి ఈ కారిడార్ ఎంతగానో దోహదపడుతుందని ట్రంప్ పేర్కొన్నారు.దశాబ్ద కాలంగా ఈ ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న సవాళ్లను అధిగమించే దశలో మనం ఉన్నాం అని పునరుద్ఘాటించారు.జీ20 ఒప్పందం ఇదే..ప్రపంచ చమురు బాండాగారమైన సౌదీ అరేబియా నుంచి భారత్, అమెరికా, యూఏఈ, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూరోపియన్ యూనియన్ దేశాలు సంయుక్తంగా రైలు, నౌకాయాన, ఇంధన, డిజిటల్ రంగాలను అనుసంధానించేలా 2023 సెప్టెంబర్‌లో జరిగిన జీ20 సమ్మిట్‌లో ఈ కారిడార్ ఒప్పందం కుదిరింది.వ్యూహాత్మక ప్రత్యామ్నాయం..ఈ కారిడార్ దక్షిణాసియా, పశ్చిమాసియా, ఐరోపా అంతటా అనుసంధానాన్ని, వాణిజ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. చైనాకు చెందిన ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్’ అలాగే ఇరాన్ నియంత్రిత చెక్పాయింట్లకు ఇది బలమైన ప్రత్యామ్నాయంగా నిలవడమే కాకుండా, భారత్-ఐరోపా మధ్య రవాణా సమయాన్ని సగానికంటే ఎక్కువగా తగ్గించగలదని భావిస్తున్నారు.ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరికలు..ఐరాస సర్వసభ్య సమావేశంలో ఇరాన్‌ను ఆర్థికంగా ఏకాకి చేశామని, తమ డిమాండ్లకు తలొగ్గకపోతే ఇరాన్ ఒక దేశంగా మనుగడ కొనసాగించే అవకాశాన్ని కోల్పోతుందని ట్రంప్ హెచ్చరించారు. గతంలో అమెరికా చేపట్టిన ఆపరేషన్ మిడ్నైట్ హామర్ ఇరాన్ అణు కార్యక్రమాన్ని తీవ్రంగా దెబ్బతీసిందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. -
23 ఏళ్ల తరువాత అమెరికా డ్రీమ్స్ వదిలి ‘అమ్మ’దగ్గరికి
అమెరికాలో స్థిరపడి, సొంత వ్యాపారం నిర్వహిస్తున్న ఒక ఎన్సారై భారత్‌కు తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. అదీ 23 ఏళ్ల తర్వాత. ముంబైలో మరింత సురక్షితంగా అనిపించడం' వల్ల 23 ఏళ్ల తర్వాత తిరిగి భారత్‌కు వచ్చానని చెప్పిన ఒక ఎన్ఆర్ఐ (NRI) సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించారు. ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్వదేశానికి తిరిగి రావాలన్న నిర్ణయం వెనుక అసలు కారణలేంటి?ఆ ఎన్ఆర్ఐ సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం తన 15వ ఏట అమెరికా వెళ్లిన ఆయన, న్యూయార్క్ నగరంలో చదువు పూర్తి చేసుకుని బయోమెడికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ చేశారు. ఆ తర్వాత ఫార్మాస్యూటికల్ రంగంలో స్థిరపడి, హెచ్-1బి వీసా పొంది, ఐదేళ్ల తర్వాత అమెరికా పౌరసత్వాన్ని పొందారు. సొంతంగా వ్యాపారం ప్రారంభించి విజయవంతం అయ్యారు. మరి ఇండియాకు ఎందుకు తిరిగొచ్చారు.పెళ్లి కాలేదు, ఒక కుక్క, సొంత ఇల్లుతొ అమెరికన్ డ్రీమ్ లాంటి జీవనశైలితో జీవితం హాయిగా గడుస్తోంది. కానీ అప్పటికీ ఆయన తల్లిదండ్రులు 60 ఏళ్ల వయసు దాటి వృద్ధాప్యంలో ఉన్నారు, వారికి అమెరికాకు రావాలనే ఆసక్తి ఏమాత్రం లేదు. ఇంతలో తండ్రికి క్యాన్సర్ నిర్ధారణ అయింది. 70 ఏళ్ల వయసు తండ్రి క్యాన్సర్‌తో మరణించడం, తల్లి ఒంటరిగా ఉండటంతో ఆయనకు భారతదేశానికి తిరిగి వెళ్లాలనే కోరిక బలపడింది. 60 ఏళ్ల పైబడిన తల్లిని చూసుకోవడం, ఆమె వద్దే ఉండాలనే ఉద్దేశంతో ఆయన అమెరికాను వీడాలని నిర్ణయించుకున్నారు.2018, 2020 సంవత్సరాల్లో భారతదేశానికి వచ్చి వెళ్లిన ఆయన, కోవిడ్ మహమ్మారి సమయంలో భారతదేశ వాతావరణానికి, జీవన శైలికి ఆకర్షితులయ్యారు. 2022లో అమెరికాలో తన వ్యాపారాన్ని విక్రయించి, పెన్సిల్వేనియాలోని తన ఇంటిని అమ్మేసి 2023లో ముంబైకి శాశ్వతంగా తిరిగి వచ్చేశారు. ప్రస్తుతం ఆయన భారతీయ కంపెనీలకు కన్సల్టెన్సీ సేవలు అందిస్తున్నారు.ఇదీ చదవండి: 3 రోజుల సమ్మె : బ్యాంకులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలుఅమెరికా డ్రీమ్ కంటే స్వదేశమే మిన్నఅమెరికాలోని శుభ్రమైన గాలి, అక్కడి జీవనశైలి కంటే ఇంటి భోజనం, తల్లితో సాయంత్రం వేళల్లో టీ తాగడం, పాత స్నేహితులు, బంధువులతో గడపడంలో లభించే అమూల్యమైన ప్రేమ (అన్‌కండిషనల్ లవ్) ముంబైలో తనకు లభించిందని, అందుకే ఇక్కడే ఎక్కువ భద్రతా భావన కలిగిందని ఆయన పేర్కొన్నారు. ఏది ఏమైనా ఇంటి ఫుడ్, తల్లిదండ్రుల చిన్ననాటి కథలు వినడం , స్నేహితులతో సరదాగా గడపడం ఆ నిస్వార్థ ప్రేమ ముందు అన్నీ దిగదుడుపే అని వ్యాఖ్యానించారు.అంతేకాదు అమెరికాకు వెళ్లే ముందు వదిలిపెట్టిన నా చిన్ననాటి స్నేహితులతో ఇప్పటికీ సంబంధాలు కొనసాగిస్తున్నాను. వారు తమ కుటుంబ బాధ్యతల్లో బిజీగా ఉన్నప్పటికీ, తరచుగా కలుస్తుంటాం, కనీసం ఏడాదికి ఒకసారి ట్రిప్పులు లేదా ట్రెక్కింగ్‌లకు వెళ్తుంటామని సంతోషంగా చెప్పారు. సోషల్ మీడియా స్పందనలు చాలామంది నెటిజన్లు ఆయన నిర్ణయాన్ని సమర్థిస్తూ అభినందించారు. జీవితంలో నూటికి నూరుపాట్లు సంతృప్తే ముఖ్యం. ఏదైనా బలమైన కారణం ఉంటే తప్ప మళ్లీ అమెరికాకు వెళ్లకండి. సంతోషంగా ఉండండి అని ఒకరు వ్యాఖ్యానించారు. పౌరసత్వం కేవలం కాగితం ముక్క మాత్రమే భారతదేశం అంత చెడ్డది కాదు. యపలకపి మనలను ఈ స్థాయికి తెచ్చిన కుటుంబానికి అండగా ఉండటమే నిజమైన సంతోషం మరొకరు అభిప్రాయపడ్డారు. భారత్‌లో అమ్మగారితో సమయం గడపండి. ఆ తర్వాత ఇక్కడే ఉండాలా లేక అమెరికా వెళ్ళాలా అన్నది నిర్ణయించుకోవచ్చు అని మరో నెటిజన్ సలహా ఇచ్చారు. ఇదీ చదవండి : పక్కింటి వైఫై సాయం : స్లమ్ నుంచి ఢిల్లీ ఐఐటీ దాకా ఎవరీ అభిషేక్ -
సమాధులు తవ్వి.. ఆడపిల్లల మృతదేహాలపై అఘాయిత్యమా?
పాకిస్థాన్‌లోని పెషావర్‌లో దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. షేకాన్ ప్రాంతంలోని ఓ శ్మశానవాటికలో సమాధి నుంచి బాలిక మృతదేహాన్ని వెలికితీస్తున్న ఓ యువకుడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే విచారణలో అతని నోటి నుంచి దిగ్భ్రాంతికర విషయాలు బయటకు వచ్చాయి.పెషావర్ సదర్ ఎస్పీ ఫిదా హుస్సేన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. 19 ఏళ్ల సల్మాన్ బాలికల సమాధులను లక్ష్యంగా చేసుకున్నాడు. మృతదేహాలను వెలికితీస్తున్న టైంలో శ్మశానవాటిక వాచ్‌మన్ పట్టుకున్నాడు. ఆ తర్వాత స్థానికుల సహకారంతో పోలీసులకు అప్పగించాడు. తొలుత వాటిని తవ్విచూసి .. మృతదేహాలను అవమానిస్తూ మానసిక ఆనందం పొందాడేమోనని భావించారు. అయితే మృతదేహాల్ని వెలికి తీసి.. వాటిపై అతను లైంగిక వాంఛలు తీర్చుకున్నాడనే విషయం అధికారుల్ని విస్మయానికి గురి చేసింది.అలా సల్మాన్ ఇప్పటిదాకా పదికి పైగా సమాధులను ధ్వంసం చేసినట్లు ఒప్పుకున్నాడు. ఇంతలో ఈ కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఈ విషయం జనాల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు దారి తీసింది.దర్యాప్తులో భాగంగా నిందితుడిని ఘటనాస్థలాలను గుర్తించేందుకు పోలీసులు షేకాన్ శ్మశానవాటికకు తీసుకెళ్తుండగా.. మోటార్‌సైకిళ్లపై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు పోలీసుల వాహనంపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో సల్మాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలిస్తుండగా అతడు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించేందుకు గాలింపు చేపట్టారు.కేసులో తేలాల్సిన అంశాలెన్నో..నిందితుడు పోలీసుల కస్టడీలోనే మరణించడంతో.. పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. గత కొంతకాలంగా పాక్‌లోని పలు ప్రాంతాల్లో ఈ తరహా ఘటనలు పెరిగిపోయాయి. సమాధుల్లోనూ మహిళలకు కరువైందనే చర్చా అక్కడ నడుస్తోంది. ఈ క్రమంలో కొందరు సమాధులకు గ్రిల్స్ ఏర్పాటు చేసినట్లు ఫొటోలు, వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ తరహా ముఠాలు అక్కడ చాలానే ఉన్నాయనే కోణంలో పోలీసులు ఇప్పుడు దర్యాప్తు జరుపుతున్నారు. ఇదీ చదవండి: రెండుసార్లు పుట్టిన బిడ్డ గురించి తెలుసా? -
ఓ వైపు గొంతు చించుకుంటుంటే.. మరోవైపు రీల్స్‌తో రిలాక్స్
ప్రపంచ దేశాల అధినేతలు కొలువుదీరిన ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టర్కీ అధ్యక్షుడు రెసిప్ తయ్యప్ ఎర్డోగాన్ ఆవేశపూరితంగా ప్రసంగిస్తున్న సమయంలో.. అల్ షరా కూల్‌గా స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేస్తూ కెమెరాకు చిక్కారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతోంది.యూఎన్ సాధారణ సభ 81వ సెషన్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ వేదికగా ప్రపంచ నేతలు యుద్ధాలు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, సంక్షోభాలు, దౌత్యపరమైన అంశాలపై ప్రసంగిస్తున్నారు. ఇలాంటి కీలక సమావేశం సాగుతున్న సమయంలో సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా మాత్రం ఫోన్లో నిమగ్నమై కనిపించడం చర్చకు దారితీసింది. ఓవైపు ప్రపంచ నేతలు అత్యంత సీరియస్ అంశాలపై మాట్లాడుతుంటే.. ఆయన మాత్రం ఏం పట్టనట్లు ఫోన్లో రిలాక్స్ అవుతున్నారంటూ కొందరు సోషల్ మీడియాలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా.. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ప్రసంగిస్తున్న సమయంలోనే షరా ఫోన్ చూస్తున్న దృశ్యాలు కెమెరాకు చిక్కడంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. అయితే షరా ఏం చూస్తున్నారో, ఆ సమయంలో ఆయన ఉద్దేశం ఏమిటో స్పష్టంగా తెలియదు. ఇదే సమయంలో మరికొందరు మాత్రం కేవలం కొన్ని సెకన్ల దృశ్యాలను ఆధారంగా చేసుకుని ఆయనపై విమర్శలు చేయడం సరికాదంటూ మద్దతుగా స్పందిస్తున్నారు. UNGA gets an unexpected Instagram momentSyrian President Ahmed al-Sharaa appeared busy scrolling Instagram reels as world leaders addressed the UN General Assembly.#UNGA #AhmedAlSharaa #Syria #UnitedNations #Viral #WorldNews pic.twitter.com/gihsZZaNNO— Diganta Guha (@diganta_guha) September 23, 2026రెండోసారి యూఎన్జీఏకు..అల్ షరాకు ఇది యూఎన్‌జీఏలో రెండోసారి పాల్గొనడం. 2025లో బషర్ అల్ అసద్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఆయన సిరియా తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అదే ఏడాది దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత యూఎన్‌జీఏలో ప్రపంచ నేతలను ఉద్దేశించి ప్రసంగించిన తొలి సిరియా నాయకుడిగా నిలిచారు. అయితే టర్కీ–సిరియా మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ.. యూఎన్ వేదికపై కనిపించిన ఈ దృశ్యం ఇప్పుడు వైరల్‌గా మారింది.ఎర్డోగాన్ కశ్మీర్‌పై ఉచిత సలహా..ఇదే సమయంలో ఎర్డోగాన్ తన ప్రసంగంలో మరోసారి కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. దక్షిణాసియాలోని అన్ని వివాదాలను, కశ్మీర్ సమస్యతో సహా, యూఎన్ చార్టర్, సంబంధిత తీర్మానాల పరిధిలో చర్చల ద్వారా పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కశ్మీర్‌పై ఎర్డోగాన్ యూఎన్ వేదికగా మాట్లాడటం ఇదే తొలిసారి కాదు. 2025లోనూ ఆయన ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఎర్డోగాన్ వ్యాఖ్యలపై భారత్ గతంలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. జమ్మూకశ్మీర్ అంశం భారత్–పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక విషయమని, మూడోపక్ష మధ్యవర్తిత్వం అవసరం లేదని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: ట్రంప్ ఇలా పొగిడాడో లేదో.. పాక్ ప్రధానికి తిట్లు! -
‘రెండుసార్లు’ జన్మించిన శిశువు! మెడికల్ మిరాకిల్
కొన్ని సంఘటనలు, అరుదైన వ్యాధులు విసిరే సవాళ్లు ఆధునిక వైద్యనికే అంతుచిక్కదు. ఒక్కోసారి ఆ సవాళ్లే కొంగొత్త వైద్య ఆవిష్కరణాలను నాంది పలికి..ఎందరినో ఆ అనారోగ సమస్యల నుంచి బయపడేసేందుకు దారితీస్తుంది. బతికే అవకాశాలు లేనప్పుడూ కూడా వైద్యానికే అందని విధంగా మిరాకిల్ జరిగి మరి జీవిస్తున్న ఎన్నో అద్భుతాలను చూశాం. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే ఘటన అంతకుమించిన మిరాకిల్ ఘటన. ఒక్కసారే ఎవ్వరైన జన్మిస్తాం..కానీ ఈ శిశువు ఏకంగా రెండుసార్లు జన్మించింది. బహుశా ఇదే వైద్యశాస్త్రంలోని అత్యంత అరుదైన ఘటనేమో..!.అసలేం జరిగిందంటే..2016లో ఒక అత్యంత అరుదైన కేసుని ఎదుర్కొన్నారు అమెరికా వైద్యులు. టెక్సాస్‌కి చెందిన మార్గరెట్ బోమర్ సాధారణ ప్రెగ్నెన్సీ చెకప్‌కి వెళ్లింది. ఎప్పటిలానే ఆరోజు పరీక్షలు చేయించుకుంది. స్కానింగ్ ఆమె గర్భంలోని శిశువు వెనుముక చివరలో శాక్రోకాక్సిజియల్ టెరాటోమా అనే అరుదైన కణితి అతుక్కుని ఉన్నట్లు గుర్తించారు వైద్యులు. దీని కారణంగా ఆ శిశువు మనుగడ సాగించడం కష్టమని తేల్చేశారు. ఎందుకంటే ఆ కణితి..పిండానికి అందాల్సిన రక్తాన్ని దారిమళ్లిస్తోంది. ఫలితంగా ఆ ఒత్తిడి గుండెపై పడి గుండె వైఫల్యానికి దారితీసే ప్రమాదిన్ని పెంచుతున్నట్లు తెలిపారు. అంటే ఆ శిశువు 26 వారాల రాక మునుపే గర్భంలో చనిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఆ విషయం తెలిసి ఆ మహిళ తీవ్ర ఆందోళనకు గురైంది. ఆమెకు ఇది అత్యంత భయాన ఉద్విగ్న క్షణం ఎందుకంటే. అసలు నిజానికి ఆమె గర్భంలో కవలలు పెరిగారు. అందులో ఒక శిశువు రెండో నెలలోనే గర్భస్రావం అయ్యింది. పోనీలే మరో శిశువు ఆరోగ్యంగా పెరుగుతోంది కదా అనుకుంటే ..మళ్లీ ఇలాంటి విషయం వినడంతో మరింతగా హడలిపోయింది మార్గరేట్. చాలామంది వైద్యులు గర్భం తొలగించుకోవాల్సిందే సూచించారు. ఎందుకంటే ఆ కణితిని అతి కష్టంపై సర్జరీ ద్వారా తొలగించినా..ఆ చిన్నారి బతికే అవకాశాలు 50% మాత్రమే అని తేల్చేశారు వైద్యలు. అయితే మార్గరేట్ ఆమె భర్త ఆమెను ఎలాగైనా బతికించుకోవాలనే నిర్ణయానికి వచ్చి.. టెక్సాస్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లోని ఒక ప్రత్యేక శస్త్రచికిత్స బృందాన్ని ఆశ్రయించారు. అక్కడ పిండం అభివృద్ధి చెందుతున్నప్పుడే..నేరుగా శస్త్ర చికిత్స చేసి..తిరిగి గర్భం కొనసాగేలా ఆ పిండాన్ని గర్భాశయంలోకి ప్రవేశపెట్టే ప్రమాదకరమైన ప్రక్రియ గురించి వైద్యలు ఆమెకు వివరించారు. 23 వారాల గర్భం నాటికే ప్రమాదం తీవ్రమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో..తక్షణమే గుండె పనితీరుని దెబ్బతీస్తున్న ఆ కణితిని తొలగించే సర్జరీ చేశారు. అరచేతిలో ఇమిడిపోయే అత్యంత చిన్న పిండాన్నే గాల్లో ఉంచే కణితిని తొలగించారు. చెప్పాలంటే..ఆపరేషన్ జరుగుతున్నంత సేపు గుండె ఆగిపోయింది. అయితే హార్ట్ సర్జన్ ఆ శిశువుని బతికించారు. ఆ శస్త్ర చికిత్స సమయంలోనే ఆక్సిజన్ని ప్లాసెంటా ద్వారా తల్లికి అనుసంధానించారు. అలా కణితిని తొలగించి..ఆ ఆడ శిశువుని తిరిగి గర్భంలోని ప్రవేశపెట్టి..శరీరంలో ద్రవాల సమతుల్యత పునరుద్ధరించి..గర్భాశయాన్ని పూర్తిగా కుట్టువేసి మూసివేశారు. అంతేగాదు మార్గరేట్ని కఠినమైన విశ్రాంతిలో ఉంచి ఆ శిశువు గర్భంలో ఆరోగ్యంగా పెరిగేలా చేశారు. అలా 36 వారాల అనంతరం రెండోసారి సీ సెక్షన్ ద్వారా ఆ శిశువుని బయటకు తీశారు. తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు నిర్థారించారు. ఆ చిన్నారి సుమారు 2.41 గ్రాముల ఆరోగ్యకరమైన బరువుతో ఉండటం విశేషం. ఆ చిన్నారి బయటకొచ్చిన ఎనిమిది రోజులకు వెన్నుముక చివరి ఎముక కణజాలన్ని శుభ్రం చేసేందుకు ఒక సాధారణ ఆపరేషన్ చేశారు. ఆ అద్భుత శిశువుకి లిన్లీ హూప్ అని పేరు పెట్టారు. సదరు తల్లి మార్గరేట్ మాత్రం ఇది అద్భుతమైన భయానక క్షణంగా పేర్కొంది. ఎందుకంటే క్షణం, క్షణం ఉత్కంఠ..బతికించుకోగలనా అన్న సందేహాల మధ్య సాగిన గర్భధారణ అని అంటోందామె.ఇదీ చదవండి: Shruti Haasan: ఎప్పటికీ తల్లిని కాలేననుకున్నా..!: శ్రుతి హాసన్ -
బుకర్ ప్రైజ్ 2026.. తుది జాబితాలో ఆరు నవలలు
లండన్: ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్ 2026 అవార్డుకు తుది జాబితా (షార్ట్‌లిస్ట్) విడుదలైంది. మొత్తం 163 నవలలను పరిశీలించిన ఐదుగురు సభ్యుల న్యాయనిర్ణేతల బృందం ఆరు పుస్తకాలను తుది పోటీకి ఎంపిక చేసింది. ఈ జాబితాలో గతంలో బుకర్ ప్రైజ్ గెలిచిన ఇద్దరు రచయితలతో పాటు ఓ 81 ఏళ్ల సీనియర్ రచయిత, ఓ ప్రముఖ అమెరికన్ నవలా రచయిత, తొలిసారి షార్ట్‌లిస్ట్‌లో చోటు దక్కించుకున్న ముగ్గురు రచయితలు ఉన్నారు.ఈ ఏడాది జడ్జింగ్ ప్యానెల్‌కు రచయిత్రి, చరిత్రకారిణి మేరీ బియర్డ్ అధ్యక్షత వహించారు. రేమండ్ ఆంట్రోబస్, జార్విస్ కాకర్, రెబెక్కా లియు, ప్యాట్రిషియా లాక్వుడ్ సభ్యులుగా ఉన్నారు. ఎంపికైన నవలలు హాస్యభరితమైనవి, ఆశ్చర్యపరిచేవి, నిశ్శబ్దంగా ప్రభావం చూపేవి అంటూ జడ్జింగ్ ప్యానెల్ అభివర్ణించింది.81 ఏళ్ల రచయితకు అరుదైన అవకాశంఎం జాన్ హారిసన్ రాసిన ‘ది ఎండ్ ఆఫ్ ఎవ్రీథింగ్’ షార్ట్‌లిస్ట్‌లో చోటు దక్కించుకుంది. భవిష్యత్‌లో ప్రపంచం ఎలా మారుతుందనే నేపథ్యంలో కెంట్ తీర ప్రాంతాన్ని వేదికగా చేసుకున్న ఈ నవలలో సైన్స్ ఫిక్షన్, వ్యంగ్యం, మిస్టరీ తదితర అంశాలు కలగలిసి ఉంటాయి. 81 ఏళ్ల హారిసన్ బుకర్ ప్రైజ్ గెలిస్తే.. ఈ అవార్డు అందుకున్న అత్యధిక వయసు కలిగిన విజేతగా రికార్డు సృష్టించనున్నారు.మరోసారి బుకర్ బరిలో మార్లోన్ జేమ్స్మార్లోన్ జేమ్స్ ‘ది డిసెప్పియరర్స్’ నవలతో మరోసారి బుకర్ ప్రైజ్ తుది జాబితాలో నిలిచారు. 1980ల చివరి, 1990ల ప్రారంభంలో జమైకాలోని స్వలింగ సంపర్క పురుషుల జీవితాలను ఈ నవల వివరిస్తుంది. ఆ కాలంలోని స్వలింగ సంపర్కులపై వివక్ష, ఎయిడ్స్ మహమ్మారి, రెగే, డ్యాన్స్‌హాల్ సంస్కృతి వంటి అంశాలను ఇందులో ప్రస్తావించారు. జేమ్స్ 2015లో ‘ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ సెవెన్ కిల్లింగ్స్’ నవలకు బుకర్ ప్రైజ్ గెలుచుకున్నారు. ఇదీ చదవండి: 360 డిగ్రీల అద్భుత ‘స్కైడోమ్’.. చూసి తీరాల్సిందే! -
బీచ్‌లో వింత చేష్టలు.. రీల్స్ కోసం ఇదేం పని?
అతి చేస్తే ఇబ్బందే.. అన్న సామెతను గుర్తు చేసేలా ఓ బంగ్లాదేశ్ కంటెంట్ క్రియేటర్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. బీచ్‌లో మహిళలను వీడియో తీస్తూ.. చివరకు ఓ విదేశీ మహిళకు కావాలనే దగ్గరగా వెళ్లి ఢీకొట్టినట్లు కనిపిస్తున్న వీడియో వైరల్‌గా మారడంతో అతడిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ ఘటన దుబాయ్‌లోని ఓ బీచ్‌లో జరిగినట్టు తెలుస్తోంది.ఇమ్రాన్ హొస్సేన్ అనే బంగ్లాదేశ్ కంటెంట్ క్రియేటర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను పోస్ట్ చేసినట్లు సమాచారం. వీడియోలో బీచ్ నుంచి సముద్రంలోకి వెళ్తూ చుట్టుపక్కల ఉన్న మహిళలను కెమెరాలో బంధించాడు. ఆ తర్వాత నీటిలో ఉన్న ఓ విదేశీ మహిళకు నెమ్మదిగా దగ్గరై ఆమె కావాలనే తాకాడు. ఆమెకు చేరువగా వెళ్లి ఢీకొట్టినట్లు వీడియోలో కనిపిస్తోంది. అనుకోని ఘటనతో ఆ మహిళ ఒక్కసారిగా షాకైంది. అతడి వైపు కోపంగా చూసింది. అనంతరం, ఆమె అసౌకర్యంగా కనిపిస్తున్నప్పటికీ.. ఇమ్రాన్ మాత్రం కెమెరా ఆపకుండా చిత్రీకరణ కొనసాగించాడు. కాగా, మహిళల అనుమతి తీసుకున్నట్లు వీడియోలో ఎక్కడా కనిపించకపోవడం వివాదానికి కారణమైంది.খালাতো বোনের সঙ্গে মজা করে আসি বলেই বিদেশি নারীকে ধাক্কা, pic.twitter.com/tSEk4UVTRU— Monju Alom (@MonjuAlom1) September 23, 2026Video Credit: Monju Alom‘చేతిలో కెమెరా ఉంది కదా’ అని..బీచ్‌లో మహిళలను దూరం నుంచి మాత్రమే కాకుండా దగ్గరగా కూడా చిత్రీకరిస్తున్న అతడి ఇతర వీడియోలు కూడా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు దుబాయ్ పోలీసులను ట్యాగ్ చేస్తూ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.గోప్యతపై కఠిన నిబంధనలు..యూఏఈలో వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన చట్టాలు కఠినంగా ఉంటాయి. ఇతరుల అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలు తీయడం విషయంలో నిబంధనలు ఉన్నాయి. గతంలో అబుదాబిలో ఓ మహిళను అనుమతి లేకుండా ఫొటో తీసిన వ్యక్తికి కోర్టు జరిమానా విధించిన ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. అయితే వైరల్ వీడియోలోని ఘటనపై దుబాయ్ అధికారుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో సోషల్ మీడియాలో మాత్రం ఈ వీడియోపై చర్చ కొనసాగుతోంది.Meet Emran Hussein from Bangladesh, he deliberately bumped into women while swimming…! Always a Bûll@ 🤡🤲🏻 pic.twitter.com/sF6NLPyiSo— Ravi Tiwari🇮🇳 (@Ravitiwariii_) September 23, 2026Video Credit: Ravi Tiwari ఇదీ చదవండి: నెతన్యాహు, మమ్దానీ మధ్య మాటల యుద్ధం.. -
షార్జాలో భారతీయుడి దారుణ హత్య.. భార్య, కొడుకు మిస్సింగ్!
యూఏఈలో జరిగిన ఘోరం.. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. షార్జాలో భారతీయుడి మిస్టరీ కేసు విషాదాంతంగా ముగిసింది. అతని మృతదేహం ఓ కారులో ముక్కలుగా లభించగా.. భార్య, కొడుకు కనిపించకుండా పోవడం ఈ కేసును మరింత మిస్టరీగా మార్చింది. మృతుడ్ని కర్ణాటకకు చెందిన అల్విన్ ప్రకాశ్ కుందర్గా అక్కడి అధికారులు నిర్దారించారు.ఉడుపి జిల్లా కుందాపురకు చెందిన అల్విన్ .. గత 14 ఏళ్లుగా షార్జా ఎయిర్‌పోర్టులో పని చేస్తుండేవారు. భార్య, కొడుకుతో ఆయన అక్కడే జీవిస్తున్నారు. అయితే జూలై 20న అల్విన్‌కు ఆయన సోదరుడు అనిల్ ప్రశాంత్ కుందర్ ఫోన్ చేశారు. అల్విన్ కాల్ ఎత్తకపోగా.. తాను బాగానే ఉన్నానంటూ మెసేజ్ పంపారు. సాధారణంగా వాయిస్ మెసేజ్‌ల ద్వారానే మాట్లాడే అల్విన్ ఇలా టెక్స్ట్ చేయడం కుటుంబ సభ్యులకు అనుమానం కలిగించింది. వారం రోజుల తర్వాత మళ్లీ ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో స్నేహితుడి ద్వారా ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేశారు.అల్విన్ నివసించే అపార్ట్‌మెంట్‌కు వెళ్లిన ఆయన స్నేహితుడికి వాచ్‌మన్.. ఆయన భారత్‌కు వెళ్లిపోయారని చెప్పాడు. ఆయన పని చేసే కంపెనీ హెచ్ఆర్ విభాగం కూడా ఇదే విషయాన్ని చెప్పింది. దీంతో కొన్నాళ్లు ఆగి చూసినా ఫలితం లేకపోయింది. దీంతో సదరు కంపెనీ అధికారులు పాస్‌పోర్ట్ వివరాలను పరిశీలించారు. అల్విన్ అప్పటికీ షార్జాలోనే ఉన్నట్లు తేలడంతో మిస్సింగ్ ఫిర్యాదు చేశారు.రెండు నెలల తర్వాత.. ఒమన్ వైపు వెళ్లే మార్గంలో పార్క్ చేసిన ఓ కారులో ఓ మృతదేహం లభించింది. అందులో మృతదేహాన్ని తొమ్మిది ముక్కలుగా చేసి రెండు బ్యాగుల్లో ఉంచారు. పోస్టుమార్టం ద్వారా మృతదేహం అల్విన్దేనని నిర్ధారణ అయింది. హత్యకు కారణం ఏమిటి? ఎవరు చేశారు? అనే వివరాలు మాత్రం ఇంకా వెలుగులోకి రాలేదు.భార్య, కుమారుడు ఎక్కడ?అల్విన్ హత్య తర్వాత ఆయన భార్య టీనా, కుమారుడు ఆచూకీ తెలియకపోవడం కేసులో మరో ప్రశ్నగా మారింది. వాళ్లు షార్జా నుంచి భారత్‌కు వెళ్లి ఉండొచ్చన్న ప్రచారం ఉన్నప్పటికీ.. దీనిపై అధికారిక నిర్ధారణ లేదు. హత్యలో టీనా పాత్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దంపతుల మధ్య ఎలాంటి వివాదం ఉన్నట్లు తమకు తెలియదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.ఉడుపి పోలీసుల దృష్టికి..అల్విన్ సోదరుడు అనిల్, ఉడుపి ఎస్పీని కలిసి కేసుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. షార్జా అధికారుల నుంచి అధికారిక సమాచారం కోసం ఉడుపి పోలీసులు ఎదురుచూస్తున్నారు. యూఏఈలో న్యాయపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత అల్విన్ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురావాలని కుటుంబం ప్రయత్నిస్తోంది. హత్య వెనుక కారణం, నిందితులెవరు, అల్విన్ భార్య, కుమారుడు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారన్నది షార్జా దర్యాప్తులో తేలాల్సి ఉంది.మరోవైపు ఈ ఘటన వెలుగులోకి రావడానికి దాదాపు రెండు నెలలు పట్టడం, హత్య తర్వాత అల్విన్ భార్య, పదో తరగతి చదువుతున్న కుమారుడి ఆచూకీ లేకపోవడం కేసును మరింత మిస్టరీగా మార్చింది.విదేశాల్లో భారతీయుల విషాదం..ఉపాధి, మెరుగైన జీవితం కోసం విదేశాలకు వెళ్లే భారతీయులు అనుకోని ప్రమాదాలు, అనుమానాస్పద మరణాలతో కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగుల్చుతున్న ఘటనలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తుంటాయి. అల్విన్ కుందర్ విషయంలోనూ అసలు ఏం జరిగింది? ఆయన హత్యకు దారితీసిన పరిస్థితులేమిటి? కుటుంబ సభ్యుల ఆందోళనలకు ఎప్పుడు సమాధానం దొరుకుతుంది? అనేది దర్యాప్తుపైనే ఆధారపడి ఉంది.ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పేంత తప్పు ఆ ఎమ్మెల్యే కూతురు చేసిందా? -
ట్రంప్ పొగడ్త.. ఉగ్రవాదంపై పాక్ ప్రధాని వ్యాఖ్యలు వైరల్
ఐక్యరాజ్యసమితి వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను ‘టెర్రిఫిక్ మ్యాన్’ అంటూ ప్రశంసించడం ఇప్పుడు మరో చర్చకు దారితీసింది. అయితే ఈ ప్రశంసలు పాక్‌కు అనుకూలంగా కనిపిస్తున్న వేళ.. ఉగ్రవాదంపై షరీఫ్ చేసిన ఓ వ్యాఖ్య సోషల్ మీడియాలో మళ్లీ వైరల్‌గా మారింది. ‘‘మా ఉగ్రవాదులను నియంత్రించకపోయి ఉంటేనా..’’ అని ఆయన వ్యాఖ్యపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.81వ UNGAలో మంగళవారం ప్రసంగించిన ట్రంప్.. భారత్, పాకిస్థాన్ మధ్య 2025లో చోటుచేసుకున్న సైనిక ఉద్రిక్తతను ప్రస్తావించారు. ఆ వివాదాన్ని ఆపేందుకు తాను జోక్యం చేసుకున్నానని మరోసారి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను ‘టెర్రిఫిక్ మ్యాన్’గా అభివర్ణించారు. షరీఫ్ తనకు కృతజ్ఞతలు తెలిపారని, తాను 3 కోట్ల మంది ప్రాణాలను కాపాడినట్లు చెప్పారని ట్రంప్ పేర్కొన్నారు. అయితే భారత్ మాత్రం ఈ వివాదంలో మూడో పక్షం మధ్యవర్తిత్వం చేసిందన్న వాదనను గతంలో తిరస్కరించింది.వైరల్‌గా మారిన ఆ వ్యాఖ్య..ట్రంప్ ప్రశంసల నేపథ్యంలో షరీఫ్ చేసిన ఓ పాత వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2025లో జరిగిన 80వ యూఎన్‌జీఏలో ఆయన పాకిస్థాన్ రెండు దశాబ్దాలకు పైగా ఉగ్రవాదంపై పోరాడుతోందని చెప్పారు. ఈ పోరులో 90 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయామని, భారీ ఆర్థిక నష్టం ఎదుర్కొన్నామని పేర్కొన్నారు. అదే ప్రసంగంలో షరీఫ్.. పాకిస్థాన్ ఉగ్రవాదులను ఎదుర్కొనకపోయి ఉంటే వారు న్యూయార్క్, లండన్ వీధుల్లో తిరిగేవారని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదంపై పాకిస్థాన్ చేస్తున్న పోరాటాన్ని ప్రపంచ భద్రతకు తన దేశం చేస్తున్న సేవగా ఆయన అభివర్ణించారు.‘If we haven't controlled our terrorists, they would be roaming on the streets of New York or London"- Pakistan PM Shehbaz Sharif at UNGA pic.twitter.com/2bHJaAKEaG— Rishi Bagree (@rishibagree) September 22, 2026ఒప్పుకున్నట్లేనా?ఈ వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. పాకిస్థాన్‌కు కొత్త చిక్కు ఎదురైంది. షరీఫ్ మాటలను పట్టుకుని కొందరు నెటిజన్లు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. పాకిస్థాన్‌లో ఉగ్రవాద నెట్‌వర్క్‌లు ఉన్నాయన్న విషయాన్ని ఆ దేశ ప్రధానే స్వయంగా అంగీకరించినట్టుగా వారు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో ఉగ్రవాదంపై పాక్ వైఖరి, గతంలో ఆ దేశంపై వచ్చిన ఆరోపణలు మరోసారి చర్చకు వస్తున్నాయి.ఇక్కడే మరో కీలక విషయం ఉంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ‘న్యూయార్క్, లండన్’ వ్యాఖ్య ఈ సమావేశాల్లో చేసిన షరీఫ్ చేసిన ప్రసంగానిది కాదు. షరీఫ్ 2026లో 81వ UNGAకి హాజరయ్యేందుకు సెప్టెంబర్ 21న న్యూయార్క్ చేరుకున్నారు. ఆయన తాజా UNGA ప్రసంగం సెప్టెంబర్ 25న జరగనుంది.ట్రంప్ నుంచి వచ్చిన బహిరంగ ప్రశంసల సమయంలోనే ఈ పాత వ్యాఖ్య మళ్లీ తెరపైకి రావడంతో.. పాకిస్థాన్ ఉగ్రవాదంపై తన గత వాదనలపై కొత్త చర్చ మొదలైంది. ఒకవైపు అమెరికా అధ్యక్షుడి ప్రశంసలు.. మరోవైపు షరీఫ్ పాత ఉగ్రవాద వ్యాఖ్య వైరల్ కావడం.. పాక్ దౌత్యానికి ఇది ఊహించని చర్చగా మారింది.ఇదీ చదవండి: ఆ టెక్నాలజీ మామూలుది కాదంటున్న ట్రంప్ -
నెతన్యాహు Vs మమ్దానీ.. సిగ్గుపడాలి అంటూ..
న్యూయార్క్: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, న్యూయార్క్ మేయర్ జొహ్రాన్ మమ్దానీ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ప్రసంగించేందుకు నెతన్యాహు న్యూయార్క్ చేరుకోనున్న వేళ.. మమ్దానీపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మమ్దానీ హమాస్‌కు మద్దతు ఇస్తున్నారని, న్యూయార్క్‌లో యూదులకు వ్యతిరేకంగా అల్లర్లను ప్రోత్సహిస్తున్నారని నెతన్యాహు ఆరోపించారు.మమ్దానీ సోమవారం సీఎన్ఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నెతన్యాహును ‘వార్ క్రిమినల్’, పాలస్తీనా ప్రజలపై జరుగుతున్న దారుణాలను ‘జెనోసైడ్కు ఆర్కిటెక్ట్’గా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన నెతన్యాహు వీడియో సందేశంలో.. ‘నేను ఐక్యరాజ్యసమితికి వస్తున్నాను. మా వీరోచిత సైనికుల గురించి నిజం చెబుతాను. మీ గురించి కూడా నిజం చెబుతాను’ అని అన్నారు. ఇదే సమయంలో మమ్దానీని ఉద్దేశించి నెతన్యాహు మరింత ఘాటుగా స్పందించారు. ‘షేమ్ ఆన్ యూ, మిస్టర్ మమ్దానీ. మా ప్రజలను హతమార్చిన హమాస్ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్నందుకు సిగ్గుపడాలి. న్యూయార్క్ యూదులకు వ్యతిరేకంగా అల్లర్లను ప్రేరేపిస్తున్నందుకు సిగ్గుపడాలి’ అని వ్యాఖ్యానించారు.అయితే, ఈ వివాదం కొత్తది కాదు. గతంలో నెతన్యాహును న్యూయార్క్‌లోకి వస్తే అరెస్టు చేస్తానని మమ్దానీ వ్యాఖ్యానించారు. అయితే, అలాంటి అరెస్టు చేసే అధికార పరిధి తనకు వాస్తవంగా ఉందో లేదో స్పష్టత లేదని ఆయన తర్వాత అంగీకరించారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC) నెతన్యాహుపై జారీ చేసిన అరెస్టు వారెంట్ నేపథ్యంలో మమ్దానీ ఈ వ్యాఖ్యలు చేశారు.ఆరోపణలను తిరస్కరించిన మమ్దానీమమ్దానీపై కొంతమంది రిపబ్లికన్ ప్రత్యర్థులు గతంలో యూదు వ్యతిరేకత ఆరోపణలు చేశారు. పాలస్తీనా అనుకూల వైఖరి, గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యలపై ఆయన విమర్శలను ఇందుకు ఉదాహరణగా చూపారు. అయితే మమ్దానీ ఈ ఆరోపణలను తిరస్కరించారు. యూదు వ్యతిరేకతను తాను ఖండించానని, ఇజ్రాయెల్ ప్రభుత్వ విధానాలపై విమర్శలను యూదులపై ద్వేషంతో ముడిపెట్టడం సరికాదని ఆయన పేర్కొన్నారు. జూలైలోనూ నెతన్యాహు మమ్దానీపై విమర్శలు చేశారు. న్యూయార్క్ మేయర్‌గా అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం వహించాల్సిన ఆయన.. ఒక వర్గాన్ని మరో వర్గానికి వ్యతిరేకంగా నిలబెడుతున్నారని ఆరోపించారు.ట్రంప్, మమ్దానీ భేటీ..ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, న్యూయార్క్ మేయర్ జొహ్రాన్ మమ్దానీ భేటీ అయ్యారు. గ్రేసీ మాన్షన్‌లో జరిగిన ఈ సమావేశంలో న్యూయార్క్‌లో గృహ నిర్మాణం, జీవన వ్యయం, వలసదారుల సమస్యలు, పోలీసింగ్ తదితర అంశాలపై చర్చించారు. క్వీన్స్‌లోని సన్నీసైడ్ యార్డ్స్‌లో సుమారు 12 వేల అందుబాటు ధరల ఇళ్ల నిర్మాణం, 30 వేల ఉద్యోగాల కల్పనకు సంబంధించిన ప్రతిపాదనపైనా చర్చ జరిగింది. ఈ ప్రాజెక్టుపై ఇరు వర్గాలు తదుపరి చర్చలు జరపాలని నిర్ణయించాయి. గతంలో ట్రంప్, మమ్దానీ మధ్య తీవ్ర విమర్శలు జరిగినప్పటికీ.. భేటీ అనంతరం ట్రంప్ మాట్లాడుతూ న్యూయార్క్‌కు మమ్దానీ గొప్ప మేయర్ కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలకు ప్రయోజనం చేకూర్చే అంశాల్లో అధ్యక్షుడితో కలిసి పనిచేస్తానని మమ్దానీ చెప్పారు.ఇదీ చదవండి: ఇరాన్‌తో మూడు గంటలు చర్చలు.. గుడ్‌న్యూస్ చెప్పిన ట్రంప్ -
ఇరాన్‌తో 3 గంటల చర్చలు.. గుడ్‌న్యూస్ చెప్పిన ట్రంప్
అమెరికా–ఇరాన్ మధ్య దాదాపు ఏడు నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి తెరపడే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ వేదికగా ఇరు దేశాల ప్రతినిధుల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి మధ్య సుమారు మూడు గంటలపాటు సమావేశం జరిగినట్లు ఇరు వర్గాలు ధ్రువీకరించాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సమావేశంలో నేరుగా పాల్గొనలేదు. ఆయన రాయబారులు, ఇరాన్ ప్రతినిధులు మధ్యే చర్చలు సాగాయి. ఈ భేటీపై ట్రంప్ మాత్రం సానుకూల వ్యాఖ్యలు చేశారు. అమెరికా–ఇరాన్ ప్రతినిధుల మధ్య జరిగిన సమావేశం ‘చాలా బాగుంది’ అని ఆయన చెప్పారు. ఇరాన్‌కు ఒప్పందం చేసుకోవడం ప్రయోజనకరమని వ్యాఖ్యానించారు.మరోవైపు విట్కాఫ్ కూడా చర్చలు సుదీర్ఘంగా జరిగాయని, అవి నిర్మాణాత్మకంగా ఉండాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. మధ్యవర్తుల ద్వారా ఇరు వర్గాల మధ్య చర్చలు కొనసాగుతాయని చెప్పారు.హర్ముజ్ తెరవాలంటే మూడు షరతులుఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశం హర్ముజ్ జలసంధి. ప్రపంచంలోని కీలక చమురు రవాణా మార్గాల్లో ఒకటైన ఈ జలసంధి ద్వారా భారీ స్థాయిలో చమురు, గ్యాస్ రవాణా జరుగుతుంది. యుద్ధం కారణంగా ఇక్కడ రవాణా తీవ్రంగా దెబ్బతినడంతో ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం పడుతోంది. అయితే జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్ అమెరికా ముందు మూడు ప్రధాన షరతులు పెట్టినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది.మొదటిది.. ఇరాన్‌పై కొనసాగుతున్న అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని వెంటనే ఎత్తివేయాలి.రెండోది.. అమెరికా వద్ద స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయాలి.మూడోది.. ఇరాన్ మద్దతు ఉన్న వివిధ ‘రెసిస్టెన్స్ ఫ్రంట్ల’పై కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించాలి.ఈ షరతులను నెరవేర్చినట్లయితే హర్ముజ్ జలసంధిని ఏడు రోజుల్లో తిరిగి తెరవగలమని ఇరాన్ గతంలోనే మధ్యవర్తుల ద్వారా అమెరికాకు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.ఆ విషయంలో ట్రంప్ ‘నో’మరోవైపు ట్రంప్ వైఖరిలో మాత్రం కీలకమైన అంశం మారలేదు. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాన్ని పొందకూడదని ఆయన స్పష్టం చేశారు. ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రసంగించిన సమయంలో కూడా ఇరాన్ విషయంలో తన ముందు రెండు మార్గాలున్నాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఒకటి ఒప్పందం చేసుకుని ఇరాన్ భవిష్యత్తును మార్చడం.. మరో మార్గం తీవ్ర సైనిక చర్య అని హెచ్చరించారు.అయితే అదే సమయంలో ఇరాన్‌తో ఒప్పందం కుదిరే అవకాశం ఉందని కూడా ఆయన చెప్పారు. ‘ఎలాగైనా ఒప్పందం కుదుర్చుకుంటాం.. వేగంగా పూర్తి చేస్తాం’ అన్నట్టుగా వ్యాఖ్యానించారు. దీంతో ట్రంప్ ఒకవైపు కఠిన హెచ్చరికలు చేస్తూనే.. మరోవైపు చర్చలకు తలుపులు తెరిచి ఉంచిన పరిస్థితి కనిపిస్తోంది.వాళ్లే ముందడుగు వేయాలిఇరాన్ వైపు నుంచి కూడా తాజాగా దౌత్యానికి అవకాశం ఉందన్న సంకేతాలు వచ్చాయి. అమెరికా నిజంగా సమస్యను దౌత్యపరంగా పరిష్కరించాలనుకుంటున్నట్లు అధికారికంగా స్పష్టం చేయాలని, ఆ తర్వాత చర్చలకు విధివిధానాలు, షెడ్యూల్ ఖరారు చేయాలని ఇరాన్ కోరుతోంది.ఇక హర్ముజ్ విషయంలోనూ ఇదే వైఖరిని ఇరాన్ అవలంబిస్తోంది. అమెరికా సైనిక ఒత్తిడిని తగ్గించి, దిగ్బంధనాన్ని ఎత్తివేస్తే ఏడు రోజుల్లో జలసంధిని తెరవడానికి సిద్ధమని చెబుతోంది. అంటే ముందుగా అమెరికా చర్య తీసుకోవాలి.. ఆ తర్వాతే హర్ముజ్ తెరుచుకుంటుందన్నది ఇరాన్ ప్రతిపాదన.ఇప్పట్లో డీల్ కష్టమేనా?మూడు గంటల చర్చలు జరిగినప్పటికీ అమెరికా–ఇరాన్ మధ్య ఎలాంటి తుది ఒప్పందం కుదరలేదు. సమావేశంలో కొన్ని షరతులు, యుద్ధం ముగింపు మార్గాలు, హర్ముజ్ పునఃప్రారంభం వంటి అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. రానున్న రోజుల్లో మరోసారి చర్చలు జరిగే అవకాశం ఉంది.ప్రస్తుతం పరిస్థితి ‘యుద్ధం నుంచి చర్చల వైపు అడుగు’ వేసినంతవరకే ఉంది. అమెరికా తన సైనిక, ఆర్థిక ఒత్తిడిని తగ్గించాలన్నది ఇరాన్ డిమాండ్ కాగా.. ఇరాన్ అణ్వాయుధం దిశగా వెళ్లకుండా హామీ ఇవ్వాలన్నది ట్రంప్ ప్రధాన డిమాండ్. ఈ రెండు వైఖరుల మధ్యే అసలు పేచీ ఉంది.ప్రపంచం చూపు హర్ముజ్‌పైనే..హర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకుంటుందా లేదా అన్నదే ఇప్పుడు అంతర్జాతీయంగా కీలకంగా మారింది. యుద్ధం కారణంగా ఈ మార్గంలో ఇంధన రవాణా దెబ్బతినడంతో చమురు మార్కెట్లలో ఆందోళన పెరిగింది. మరోవైపు సౌదీ అరేబియా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు ఎగుమతులను కొనసాగించే ప్రయత్నం చేస్తోంది. అమెరికా కూడా హర్ముజ్‌పై ఆధారాన్ని తగ్గించేందుకు గల్ఫ్ దేశాలతో ప్రత్యామ్నాయ ఇంధన రవాణా మౌలిక వసతులపై చర్చలు జరుపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో న్యూయార్క్‌లో జరిగిన ఈ మూడు గంటల భేటీకి ప్రాధాన్యత పెరిగింది. తదుపరి చర్చల్లో ఈ రెండు వైఖరుల మధ్య ఎంతవరకు సయోధ్య కుదురుతుందన్నదే అసలు కీలకం కానుంది.ఇదీ చదవండి: నా మాట వినకపోతే మీ గతి అదోగతే! -
మాట వినకపోతే నరకానికే..
ఐక్యరాజ్యసమితి: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సాక్షిగా ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తమతో ఒప్పందానికి ఇకనైనా ముందుకు రాకపోతే ఇరాన్‌ను నాశనం చేస్తామని, నరకానికి పంపిస్తామని తేల్చిచెప్పారు. ట్రంప్ మంగళవారం ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశంలో 37 నిమిషాలపాటు ప్రసంగించారు. ఇరాన్‌పై మరిన్ని సైనిక చర్యలు ఉంటాయని స్పష్టంచేశారు. ఇరాన్‌తో ఏడు నెలలుగా సాగుతున్న యుద్ధాన్ని సమర్ధించారు. ఇరాన్ అణ్వాయుధాలు సొంతం చేసుకోకుండా ఈ యుద్ధం నిరోధించిందని, పశ్చిమాసియాలో ఆధిపత్య శక్తిగా ఇరాన్ స్థానాన్ని అంతం చేసిందని పేర్కొన్నారు. ఇరాన్‌కు పునర్నిర్మించుకొనే అవకాశం ఇవ్వాలా?. నాశనం చెయ్యాలా అనేది తేల్చుకోవాల్సి ఉందన్నారు. లేదంటే ఇరాన్‌ను నరకంలోకి నెట్టేయాలా? అని ప్రశ్నించారు. ఒకవైపు ఇరాన్‌పై సైనిక చర్యలు తప్పవంటూనే మరోవైపు త్వరలో ఒప్పందం కుదురుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తంచేశారు. నవంబర్ 3న జరిగే అమెరికా మధ్యంతర ఎన్నికల తర్వాత వాషింగ్టన్, టెహ్రాన్లు ఒక ఒప్పందానికి వస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఉగ్రవాదానికి ప్రధాన స్పాన్సర్ టెహ్రాన్ ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని కొనసాగించాలని ప్రపంచ దేశాలను ట్రంప్ పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే ఉగ్రవాదానికి ప్రధాన స్పాన్సర్ టెహ్రాన్ అని ఆరోపించారు. ఉగ్రవాద మూకలను పెంచి పోషిస్తోందని మండిపడ్డారు. ఇరాన్ ఒకప్పుడు పశ్చిమాసియాపై ఆధిపత్యం చెలాయించేందని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు. ఇరాన్‌పై యుద్ధం తన రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేయదని, మధ్యంతర ఎన్నికలలో తాను అభ్యర్ధిని కాదని ట్రంప్ వ్యాఖ్యానించారు. తాను ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేశానని, భారీ మెజారిటీతో గెలిచానని, మరో రెండున్నర ఏళ్లపాటు పదవిలో ఉంటానని స్పష్టంచేశారు. ఈ మధ్యంతర ఎన్నికలు అమెరికా కాంగ్రెస్‌పై తమ నియంత్రణను నిర్ణయిస్తాయానని చెప్పారు. మిగిలిన తన పదవీ కాలాన్ని నిర్దేశిస్తాయని వెల్లడించారు. వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులను ట్రంప్ ఖండించారు. ఈ విషయంలో తీర్మానానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి భారీ మెజారిటీతో ఓటు వేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇరాన్‌పై ఒత్తిడిని కొనసాగించడంలో మనం అంతే ఐక్యంగా ఉండాలని కోరారు. సంఘర్షణ ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా నౌకాదళం హార్మూజ్ జలసంధి గుండా బిలియన్ బ్యారెళ్లకు పైగా చమురును రవాణా చేసిందని పేర్కొన్నారు. ఇకపై సూపర్ ఇంటెలిజెన్స్ పారిశ్రామిక విప్లవం, ఇంటర్నెట్ కంటే కృత్రిమ మేధ పెద్ద మార్పును తీసుకురాగలదని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ‘కృత్రిమ మేధ’అనే పదాన్ని ‘సూపర్ ఇంటెలిజెన్స్’తో భర్తీ చేయాలని అన్నారు. ఇకపై అమెరికా ప్రభుత్వ పత్రాల్లో కృత్రిమ మేధకు బదులుగా సూపర్ ఇంటెలిజెన్స్ లేదా ‘ఎస్ఐ’ని మాత్రమే ఉపయోగించనున్నట్లు తెలిపారు. ‘ఇకపై అమెరికాకు సంబంధించిన అన్ని పత్రాల్లోనూ బహుశా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆరి్టఫిíÙయల్ అనే పదానికి బదులుగా సూపర్ అనే పదాన్ని ఉపయోగిస్తారని భావిస్తున్నట్లు వెల్లడించారు. సూపర్ ఇంటెలిజెన్స్ అనే కొత్త ప్రపంచానికి స్వాగతం అని వ్యాఖ్యానించారు. ఇది ఎలా సాగుతుందో చూద్దామని, వినడానికి ఇది చాలా బాగుందని చెప్పారు. అధునాతన ఏఐ సాంకేతికత కోసం జరుగుతున్న పోటీని ఒక వ్యూహాత్మక పోటీగా అభివరి్ణంచారు. భారత్, పాక్ యుద్ధాన్ని నేనే ఆపేశా.. గత ఏడాది భారత్–పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపేశానని ట్రంప్ పునరుద్ఘాటించారు. అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది యుద్ధాలను పరిష్కరించానని అన్నారు. తద్వారా ఆయా దేశాల నాయకులతో స్నేహ పూర్వక సంబంధాలను ఏర్పరచుకోవడం గొప్ప గౌరవంగా అభివర్ణించారు. వీటిలో అనేక యుద్ధాలు ఎన్నో ఏళ్లుగా, కొన్ని దశాబ్దాలుగా కూడా కొనసాగుతూ వచ్చాయని వెల్లడించారు. వాటిని నిలిపివేసిన ఘనత తనకే దక్కిందన్నారు. రష్యా, ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ముగించడానికి, అవసరమైతే, కొత్త చట్టం కింద తనకు లభించిన భారీ సుంకాల అధికారాలను వినియోగిస్తానని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ అధ్యక్షుడు, విదేశాంగ మంత్రి గైర్హాజరు ఐరాస సాధారణ సభ వార్షిక సమావేశంలో పాల్గొనడానికి ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ న్యూయార్క్‌కు చేరుకున్నారు. కానీ, ట్రంప్ ప్రసంగానికి వారు హాజరు కాలేదు. జనరల్ అసెంబ్లీ హాల్లో ఉన్న ఇరాన్ ప్రతినిధులు ట్రంప్ ప్రసంగం ప్రారంభం కాగానే బయటకు వెళ్లిపోయారు. కేవలం ఒక్కరు మాత్రమే హాల్లో ఉన్నట్లు తెలిసింది. -
గూగుల్‌కు జరిమానా!
డబ్లిన్: అంతర్జాతీయ సర్చ్ దిగ్గజం గూగుల్‌కు యూరోపియన్ యూనియన్‌లో గట్టి దెబ్బ తగిలింది. వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన చట్టాలను అతిక్రమించినందుకు ఆ కంపెనీ 46.3 కోట్ల డాలర్ల జరిమానా చెల్లించాలని యూరోపియన్ యూనియన్‌కు చెందిన ఐర్లాండ్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ సోమవారం ప్రకటించింది. వినియోగదారుల లోకేషన్‌కు సంబంధించిన సమాచారం, వెబ్, యాప్ ఆక్టివిటీ, లొకేషన్ హిస్టరీలు రెండింటి విషయంలో గూగుల్ చట్టాలకు తగ్గట్టుగా, పారదర్శకంగా వ్యవహరించలేదని స్పష్టం చేసింది. ఆండ్రాయిడ్ ఫోన్లలో లొకేషన్ కచ్చితత్వానికి సంబంధించిన ఫీచర్‌ను కూడా గూగుల్ సరైన రీతిలో ఉపయోగించలేదని తమ విచారణ ద్వారా తెలిసిందని కమిషన్ వివరించింది. ఇరవై ఏడు దేశాల యూరోపియన్ యూనియన్‌లో గూగుల్ రెగ్యులేటర్‌గా ఐర్లాండ్ వ్యవహరిస్తోంది. డబ్లిన్ కేంద్రంగా పనిచేసే ఐర్లాండ్ డేటా కమిషన్ ఆరేళ్ల క్రితం గూగుల్‌పై విచారణను ప్రారంభించింది. వ్యక్తిగత గోప్యత విషయంలో ఈయూ జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ నిబంధనలు గూగుల్‌లో ఎలా అమలవుతున్నాయో పరిశీలించింది. 2018 – 2020 మధ్యకాలానికి సంబంధించి ఈ విచారణ జరిగింది.అయితే ఈ కేసు పురాతన విధానాలకు సంబంధించిన అంశమని, 2019 నుంచి తాము కొన్ని కొత్త పద్ధతులను ప్రవేశపెట్టామని, లొకేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని మేనేజ్ చేయడం సులువు చేశామని గూగుల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈయూ గతంలో టిక్‌టాక్‌పై ఒకసారి, మెటాపై రెండుసార్లు భారీ జరిమానాలు విధించగా గూగుల్‌పై 46.4 కోట్ల డాలర్ల జరిమానా విధించడం తాజా పరిణామం. గూగూల్ విషయంలో మరో మూడు వ్యక్తిగత గోప్యత అంశాలపై విచారణ కొనసాగుతున్నట్లు ఐర్లాండ్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ తెలిపింది. -
ఆ ప్రాంతంలో ఆలివ్ రిడ్లీ తాబేలు గుడ్లు.. ఇక 60 రోజులు ఉత్కంఠ
అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా తీరంలో అరుదైన పరిణామం చోటుచేసుకుంది. దక్షిణ కాలిఫోర్నియా తీరంలో ఆలివ్ రిడ్లీ సముద్ర తాబేలు తొలిసారి గుడ్లు పెట్టింది. అమెరికా జాతీయ సముద్ర, వాతావరణ పరిపాలన సంస్థ (ఎన్ఓఏఏ) ప్రకారం.. అమెరికా పశ్చిమ తీరంలో సముద్ర తాబేలు సహజంగా గూడు కట్టుకుని గుడ్లు పెట్టిన తొలి ఘటన ఇదే.ఆరెంజ్ కౌంటీలోని సీల్ బీచ్ సమీపంలో సెప్టెంబర్ 16న ఆలివ్ రిడ్లీ తాబేలు ఇసుకలో గూడు తవ్వి గుడ్లు పెట్టినట్లు గుర్తించారు. సాధారణంగా ఈ తాబేళ్లు దక్షిణ కాలిఫోర్నియా సముద్ర జలాల్లో అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. వెచ్చని సముద్ర ప్రవాహాల కారణంగా అవి ఈ ప్రాంతానికి చేరుకుంటాయని ఎన్ఓఏఏ తెలిపింది. అయితే అమెరికాలోనే ఇంతకుముందు ఈ జాతి తాబేలు గూడు కట్టుకుని గుడ్లు పెట్టిన దాఖలాలు లేవు.సీల్ బీచ్‌లో ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత, కొన్ని మైళ్ల దక్షిణాన హంటింగ్టన్ బీచ్ పియర్ సమీపంలో మరో సముద్ర తాబేలు తీరానికి వచ్చినట్లు గుర్తించారు. అది సీల్ బీచ్‌లో గుడ్లు పెట్టిన అదే తాబేలేనా, లేక మరో తాబేలేనా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.60 రోజుల వరకు గుడ్లపై నిఘాతాబేలు గుడ్లు పొదిగే కాలం సాధారణంగా 45 నుంచి 60 రోజుల వరకు ఉంటుంది. స్థానిక, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఈ ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నాయి. గుడ్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా గూడు ఉన్న ప్రాంతాలను కంచెతో చుట్టి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. తీరానికి వచ్చే ప్రజలు సురక్షిత దూరం పాటించాలని, కంచెలు లేదా హెచ్చరిక బోర్డులను తాకవద్దని ఎన్ఓఏఏ సూచించింది.ఆలివ్ రిడ్లీ తాబేళ్లు ప్రపంచంలోని సముద్ర తాబేళ్లలో అతి చిన్న జాతిగా గుర్తింపు పొందాయి. పెద్ద తాబేళ్లు 100 పౌండ్ల వరకు బరువు, సుమారు 2.5 నుంచి 3 అడుగుల పొడవు ఉంటాయి. ఇవి దాదాపు 30 నుంచి 50 ఏళ్ల వరకు జీవిస్తాయి. పసిఫిక్ ప్రాంతంలో మెక్సికో, నికరాగువా, కోస్టారికా, పనామా దేశాల్లో వీటి ప్రధాన గూడు ప్రాంతాలు ఉన్నాయి. కాలిఫోర్నియాలో ఇకపై మరిన్ని తాబేళ్ల గూళ్లు కనపడతాయా? ప్రస్తుతం ఉన్న గుడ్ల నుంచి పిల్లలు విజయవంతంగా బయటకు వస్తాయా? అనే అంశాలపై అధికారులు వచ్చే 45-60 రోజుల్లో ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు. -
ట్రంప్ టీవీ వచ్చేసింది!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్ తాజాగా డిజిటల్ స్ట్రీమింగ్ సర్వీసును ప్రారంభించింది. ‘ట్రంప్ టీవీ: ద ఎసన్షియల్ స్టేషన్’పేరుతో సోమవారం రాత్రి ఏడు గంటలకు ఈ డిజిటల్ స్ట్రీమింగ్ సేవలు ప్రారంభమయ్యాయి. సీఎన్ఎన్, ఎంఎస్ నౌ, పొలిటికో వంటి మీడియా సంస్థలకు వైట్‌హౌస్‌లో ప్రవేశాన్ని నిరాకరించిన రెండు రోజుల్లో ట్రంప్ ఈ కొత్త స్ట్రీమింగ్ సర్వీసును ప్రారంభించడం గమనార్హం. వారు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని అందుకే నిషేధించామని ట్రంప్ తన చర్యను సమర్థి చుకున్నారు కూడా. వైట్‌హౌస్ బృందం ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ సర్వీసుకు తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ప్రచారం కల్పిస్తోంది. వైట్‌హౌస్ వెబ్సైట్, యూట్యూబ్ ఛానళ్లలో ఈ సర్వీసు లైవ్ ఫీడ్‌గా అందుబాటులో ఉంది. ‘‘ట్రంప్ ప్రభుత్వపు అతిపెద్ద క్షణాలు అన్నింటినీ ఒకే చోట చూడండి. టాప్ వీడియోస్, ప్రధాన వ్యాఖ్యలు, తప్పకుండా చూడాల్సిన హైలైట్స్ 24/7 ప్రసారమవుతుంటాయి. రియల్‌టైమ్‌లో అప్డేట్ అవుతుంటాయి. స్టే ఇన్ఫార్మ్డ్ అండ్ స్టే అప్ టు డేట్’’అంటూ ఈ సర్వీసు ప్రత్యేకతలను వర్ణించారు. ఫేక్ న్యూస్, కల్పిత వార్తలు, అబద్ధా్దలు ప్రచారం చేస్తున్నందుకు సీఎన్ఎన్, ఎంఎస్ నౌ, పొలిటికోను బహిష్కరిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడం.. ఈ విషయమై కోర్టులో కేసు వేయనున్నట్లు ఆ మూడు మీడియా సంస్థలు ప్రకటించడం ఇటీవలి పరిణామాలే. మరోవైపు అమెరికా టీవీ ఛానళ్లు ఏబీసీ, సీబీఎస్, సీఎన్ఎన్, ఫాక్స్, ఎన్బీసీలు అన్నీ ట్రంప్ టెలివిజన్ కవరేజ్ పూల్ నుంచి తప్పుకున్నట్లు సోమవారం ప్రకటించాయి. అధ్యక్షుడి కార్యక్రమాలు కొన్నింటిని చిత్రీకరించడం కోసం ఈ పూల్ ఏర్పాటైంది. -
కుప్పకూలిన ఎఫ్-16 యుద్ధవిమానం.. పైలట్ దూకేయడంతో..
జర్మనీలోని స్పాంగ్డహ్లెమ్ అమెరికా, నాటో వైమానిక స్థావరం సమీపంలో మంగళవారం అమెరికాకు చెందిన ఎఫ్-16 యుద్ధవిమానం కుప్పకూలింది. ప్రమాదానికి ముందు పైలట్ విమానం నుంచి బయటకు దూకడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే అతనికి గాయాలు కావడంతో వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్పాంగ్డహ్లెమ్ అమెరికా వైమానిక స్థావరం తెలిపింది.రైన్లాండ్-పాలటినేట్ రాష్ట్రంలోని ఐఫెల్ ప్రాంతంలో ఉన్న అమెరికా, నాటో స్థావరానికి విమానం చేరుకుంటున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు స్థావర ప్రతినిధి న్యూయార్క్ పోస్ట్‌కు తెలిపారు. శిక్షణ విన్యాసాల్లో మొత్తం నాలుగు యుద్ధవిమానాలు పాల్గొన్నాయి. వాటిలో స్పాంగ్డహ్లెమ్కు తిరిగి వస్తున్న రెండు విమానాల్లో ఒకటి ఉదయం 8.30 గంటల ఈస్టర్న్ టైమ్ సమయంలో కూలిపోయినట్లు జర్మన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ బ్రాడ్‌కాస్టర్ ఎస్డబ్ల్యూఆర్కు తెలిపింది. మిగిలిన మూడు విమానాలను సమీపంలోని రామ్‌స్టెయిన్ వైమానిక స్థావరానికి మళ్లించారు.ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన స్థానిక మేయర్ బిర్తె థామ్సెన్ మాట్లాడుతూ.. విమానం ‘‘వేగంగా కిందకు దిగడం, ఆ వెంటనే పెద్ద ఎత్తున నల్లటి పొగ రావడం’’ చూశానని ఎస్డబ్ల్యూఆర్కు తెలిపారు. ఘటనాస్థలికి అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహా అత్యవసర సేవల బృందాలను పంపించారు. సమీపంలోని గోల్ఫ్ కోర్సుకు ఆనుకుని ఉన్న రన్‌వే ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగాయి. అక్కడ భారీగా సైరన్ల శబ్దం వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వాటర్ క్యానన్లు, కాలిపోయిన ఇనుప ముక్కల కుప్పలా కనిపించిన శకలాలు కూడా అక్కడ ఉన్నట్లు వారు చెప్పారు.ప్రమాదానికి కారణం, ఇతర వివరాలపై ప్రస్తుతానికి సమాచారం ఇవ్వలేమని ఐఫెల్ జిల్లా ప్రతినిధి తెలిపారు.స్పాంగ్డహ్లెమ్లో 52వ ఫైటర్ వింగ్స్పాంగ్డహ్లెమ్ స్థావరంలో అమెరికా వైమానిక దళానికి చెందిన 52వ ఫైటర్ వింగ్ ఉంది. ఇది యూరప్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో అమెరికా, నాటో వైమానిక కార్యకలాపాలకు మద్దతు ఇస్తుంది. లక్సెంబర్గ్‌తో జర్మనీ సరిహద్దుకు సుమారు 15 మైళ్ల దూరంలో ఉన్న ఈ స్థావరంలో సైనిక, పౌర సిబ్బంది, వారి కుటుంబాలు కలిపి సుమారు 5,000 మంది, మరో 700 నుంచి 800 మంది జర్మన్ ఉద్యోగులు ఉన్నారు. అక్కడ దాదాపు 20 ఎఫ్-16 విమానాలు ఉన్నాయి.మంగళవారం ప్రమాదానికి గురైన విమానం విలువ 60 మిలియన్ నుంచి 80 మిలియన్ డాలర్ల మధ్య ఉంటుందని అంచనా. ఈ ఘటనకు వారం కూడా గడవకముందే అమెరికాలోని మిషిగన్‌లో మరో ఎఫ్-16 కూలింది. ఆ ప్రమాదంలో టెక్సాస్ నేషనల్ గార్డ్‌కు చెందిన పైలట్ బయటకు దూకి, స్థిరమైన స్థితిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అది సాధారణ శిక్షణా కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న విమానమని టెక్సాస్ మిలిటరీ డిపార్ట్మెంట్ పేర్కొంది. ఆ ప్రమాదంలో నేలపై ఎవరికీ గాయాలు కాలేదు. A U.S. Air Force F-16 Fighting Falcon assigned to the 52nd Fighter Wing crashed at Spangdahlem Air Base in Germany earlier today after its pilot safely ejected; the pilot remains hospitalized for medical treatment, the wing said. pic.twitter.com/JjI9SvtQSE— AZ Intel (@AZ_Intel_) September 22, 2026 -
రణమా? శరణమా?.. ఐరాస వేదికగా ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్!
న్యూయార్క్: ఐక్యరాజ్య సమితి వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన షరతులకు ఇరాన్ ఒప్పుకోవాలని, లేదంటే ప్రపంచ పటం నుంచి ఇరాన్‌ను తుడిచేయాలా? అని హెచ్చరించారు.న్యూయార్క్‌లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి 81వ సాధారణ మహాసభల్లో ఇరాన్ లక్ష్యంగా నిప్పులు చెరిగారు. ట్రంప్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో పెను కలకలం రేపుతున్నాయి. ప్రపంచ దేశాలు తీవ్ర భయాందోళనలోకి గురవుతున్నాయి. ఐరాస వేదికగా ప్రపంచ దేశాల నాయకులను ఉద్దేశించి ప్రసంగించిన ట్రంప్ ఇరాన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలా? లేక ఆ దేశాన్ని ప్రపంచ పటం నుంచి శాశ్వతంగా తుడిచిపెట్టేయాలా?’అని హెచ్చరించారు. ఈ సందర్భంగా పశ్చిమాసియాలో (మిడిల్ ఈస్ట్) ఇకపై ఇరాన్ ఆటలు సాగవు. ఆ ప్రాంతాన్ని శాసించే దుర్మార్గపు దాదాగిరికి తాము ఇప్పటికే చరమగీతం పలికాం. మిడిల్ ఈస్ట్‌లో ఇరాన్ సాగిస్తున్న దౌర్జన్యాలు, ఆధిపత్య ధోరణి పూర్తిగా ముగిసిపోయాయని తేల్చిచెప్పారు. ట్రంప్ చేసిన ఈ హెచ్చరికలు రాబోయే రోజుల్లో అంతర్జాతీయంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయనే దానిపై సర్వత్రా ఆందోళనలు నెలకొన్నాయి. -
16 హత్యలు చేసిన 'దోమ' ఎట్టకేలకు పోలీసుల అదుపులోకి!
బ్రసిల్లా: బ్రెజిల్లో సంచలనం సృష్టించిన సీరియల్ కిల్లర్ జోర్లాన్ లోప్స్ డా సిల్వా (33)ను పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 16 హత్యలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ నిందితుడు, పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అడవుల్లో గుడారాలు వేసుకుని తలదాచుకున్నాడు. స్థానికంగా ఇతని సన్నని దేహదారుడ్యం కారణంగా అందరూ ఇతన్ని మస్కిటో (దోమ) అని పిలిచేవారు.బ్రెజిల్ ఈశాన్య రాష్ట్రమైన పారైబాలోని ములుంగు ప్రాంతంలో సెప్టెంబర్ 13న పోలీసులు రెండు రోజుల పాటు తీవ్రంగా గాలించి ఇతన్ని పట్టుకున్నారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఈ కిల్లర్ విచిత్రమైన వేషధారణ మార్చుకున్నాడు. నలుపు, తెలుపు చారల డ్రెస్, విగ్గు, గోళ్లకు నెయిల్ పాలిష్ వేసుకుని మహిళలా వేషం మార్చాడు. అంతేకాకుండా ఎవరికి చెందినదో తెలియని ఒక చిన్న పసికందును ఎత్తుకుని పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు అతన్ని అడ్డగించి అరెస్ట్ చేశారు.దట్టమైన అడవుల్లోని తాత్కాలిక గుడారాల్లో జీవించడం వల్ల ఇతను సంవత్సరాలుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకోగలిగాడు. గత మూడు నెలల్లో ములుంగు ప్రాంతంలో జరిగిన హత్యలతో ఇతనికి సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పబ్లిక్ స్క్వేర్‌లో 18 ఏళ్ల యువకుడిని కాల్చి చంపిన సంఘటన తర్వాతే పోలీసులు ఈ సీరియల్ కిల్లర్‌కు, ఇతర నేరాలకు మధ్య సంబంధాన్ని గుర్తించారు. విచారణలో భాగంగా తాను కేవలం నేరస్థులనే లక్ష్యంగా చేసుకున్నానని కిల్లర్ చెప్పినప్పటికీ, దర్యాప్తులో మాత్రం అమాయకులను కూడా హత్య చేసినట్లు తేలిందని ఇన్వెస్టిగేటర్ డగ్లస్ గర్సియా తెలిపారు. ఇతను తన 13 ఏళ్ల వయసులోనే మొదటి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడు.ప్రస్తుతం పోలీసులు ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కిల్లర్‌తో సంబంధం ఉన్న మరికొన్ని పాత కేసులను కూడా తిరిగి తెరిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిందితుడి వద్ద దొరికిన శిశువు ఎవరిదనే కోణంలోనూ అధికారులు ఆరా తీస్తున్నారు. -
ఈస్టర్ సండే ఉగ్రదాడులు : 15 మందిని దోషులుగా తేల్చిన శ్రీలంక కోర్టు
శ్రీలంకలో మారణహోమాన్ని సృష్టించిన ఈస్టర్ సండే దాడులకు సంబంధించి శ్రీలంక హైకోర్టు సంచలన నిర్ణయం ప్రకటించింది. 2019 ఈస్టర్ సండే నాడు జరిగిన బాంబు దాడులకు కుట్ర పన్నారనే ఆరోపణలపై 15 మందిని దోషులుగా నిర్ధారించింది ఈ దాడులలో 270 మంది మరణించగా, 500 మందికి పైగా గాయపడ్డారు.శ్రీలంకలో 2019 ఏప్రిల్ 21న జరిగిన ఉగ్ర దాడులు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపాయి. ఈస్టర్ ప్రార్థనలు, వేడుకల సమయంలో మూడు చర్చిలు, మూడు హోటళ్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. ఐసిస్ (Islamic State) ప్రేరేపిత ఈ దాడుల్లో 42 మంది విదేశీయులు కూడా దుర్మరణం పాలయ్యారు. శ్రీలంక చరిత్రలో అత్యంత ఘోరమైన దాడులుగా నిలిచాయి. 2021లో అధికారులు 24 మంది అనుమానితులపై హత్య, ఉగ్రవాద కుట్ర, పేలుడు పదార్థాల చట్టం కింద 23,270 అభియోగాలు మోపారు.ప్రాసిక్యూషన్ తరఫున 2,300 మందికి పైగా సాక్ష్యం ఇచ్చారు. అయితే ఈ దాడులు జరిపిన బాంబర్లందరూ పేలుళ్లలోనే మరణించారు. ఈ దాడులకు ఇస్లామిస్ట్ తీవ్రవాదులే కారణమని దర్యాప్తు అధికారులు గతంలో ఆరోపించారు. అభియోగాలు ఎదుర్కొంటున్న 25 మంది శ్రీలంకలోని ముస్లిం మైనారిటీ వర్గానికి చెందినవారే. వారిలో ఒకరు కస్టడీలో మరణించారు. శ్రీలంకలో 1976 నుండి మరణశిక్షలు అమలు చేయకపోవడంతో, సాధారణంగా మరణశిక్ష పడిన వారికి జీవిత ఖైదు విధిస్తారు. ఈ దాడులకు సంబంధించి గూఢచార హెచ్చరికలపై సకాలంలో స్పందించనందుకు గతంలో మాజీ పోలీసు చీఫ్, మాజీ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక అధికారులకు కూడా మరణశిక్ష విధించడం గమనార్హం. ఇదీ చదవండి: రూ. 2 లక్షల కోట్లు : జపాన్‌కు ధీటుగా హై-స్పీడ్ బుల్లెట్ రైలు -
రోజుకు రూ. 50వేలు : ఈమె వ్యాపారం ఏంటో తెలుసా?
నూకలిస్తాను మేకలు కాస్తావా అనేది పాత సామెత... ఆధునిక కాలంలో కుక్కల్ని వాకింగ్ తీసుకెడితే ఎంతిస్తారో తెలిస్తే మీరు షాకవ్వాల్సిందే. అందుకే యూకేకు చెందిన 30 ఏళ్ల యువతి న్యాయవాది వృత్తిని వదిలేసి మరీ ఈ పనిని ఎంచుకుంది. పూర్తి స్టోరీ అర్థం కావాలంటే ఈ కథనం మొత్తం చదవాలి మరి. పీపుల్ మ్యాగజైన్ నివేదిక ప్రకారం, లిజ్ ఈస్ట్ (Liz East) అనే బ్రిటన్ యువతి కన్సల్టింగ్ రంగంలోకి మారడానికి ముందు, క్రిమినల్ డిఫెన్స్‌లో పారాలీగల్గా నాలుగేళ్లు పనిచేసింది.అడ్మినిస్ట్రేటివ్ పనులు, కోర్టు విచారణలు, జైలు సందర్శనలు వంటి విపరీతమైన ఒత్తిడితో కూడిన పనులతో రోజుకు 12 గంటలకు పైగా శ్రమించేది. పైగా లండన్ ప్రయాణంతో కలిపి షెడ్యూల్ చాలా కష్టంగా ఉండేది. క్రిమినల్ డిఫెన్స్ లాయర్ కావాలని కలలు కన్న లిజ్ న్యాయ రంగంలో తన ఉజ్వల భవిష్యత్తును ఉన్న కెరీర్‌ను వదులుకుని మరీ డాగ్ వాకింగ్ పని ఒప్పుకోవడం అంటే విశేషమే కదా. ఇప్పుడు పూర్తిస్థాయిలో కుక్కలను నడిపించే వ్యాపారాన్ని నడుపుతోంది. తాను చాలా తక్కువ గంటలు పనిచేస్తూనే, ప్రతి నెలా వేల పౌండ్లు అదనంగా సంపాదిస్తున్నానని ఆమె చెబుతోంది.అయితే ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న ఆమె భర్తే. ఆతను డాగ్ వాకింగ్ , బోర్డింగ్ వ్యాపారం చేస్తూ తన పనిని ఎంతో ఆస్వాదించడం చూసి ప్రేరణ పొందింది. వారాంతాల్లో పనిని తలచుకుని భయపడే బదులు తనకు ఇష్టమైన పని చేయాలని నిర్ణయించుకుంది.గంటకు ప్రతి కుక్కకు దాదాపు 19 డాలర్ల చొప్పున వసూలు చేస్తుంది. అంటే రోజుకి సంపాదన సుమారు రూ. 38,000 నుండి రూ. 50,000 వరకు ఉంటుంది. ప్రస్తుతం ఆమె రోజుకు సుమారు 20 నుండి 30 కుక్కలను నాలుగు ట్రిప్పుల్లో వాకింగ్‌కు తీసుకెళ్తుంది.గతంలో కార్పొరేట్ ఉద్యోగంలో పనిచేసినదానికంటే ఇప్పుడు నెలకు వేల పౌండ్లు ఎక్కువ సంపాదిస్తున్నానని, పని గంటలు కూడా సగానికి తగ్గాయని ఆమె తెలిపింది.న్యాయవాద వృత్తిలో ఆమెకున్న నేపథ్యం తెలిసిన చాలా మందికి, ఆమె వృత్తిని మార్చుకోవడం ఆశ్చర్యం కలిగించిందట. న్యాయవాద వృత్తి నుండి కుక్కలను వాకింగ్‌కు తీసుకెళ్లే పనికి మారారా? అంత చదువు చదివి ఇప్పుడు కేవలం కుక్కలను వాకింగ్‌కు తీసుకెళ్తున్నారా?' అని అంటుంటారని ఆమె గుర్తు చేసుకుంది. చాలా తాను ఆరేళ్లు వృథా చేశానని అనుకుంటారు. కానీ ఆ ఆరేళ్లలో ఎంతో నేర్చుకున్నాను, వాటిని ఇప్పటికీ తన దైనందిన జీవితంలో ఉపయోగిస్తున్నానని కూడా తెలిపింది. అంతేకాదు తన పాత ఉద్యోగంతో పోలిస్తే ఇప్పుడు చాలా తక్కువ సంపాదిస్తున్నానని చాలామంది అనుకుంటారని, . అయితే, కుక్కలను వాకింగ్‌కు తీసుకెళ్లే పనిని కేవలం డబ్బు సంపాదించే మార్గంగా మాత్రమే చూడకూడదని లిజ్ సూచిస్తుంది. నెటిజన్ల స్పందన లా చదివి డాగ్ వాకింగ్ చేయడం ఏంటని కొందరు విమర్శించినా, ఆమె తన నిర్ణయం పట్ల ఎంతో సంతోషంగా ఉంది. "జీవితం చిన్నది, అసంతృప్తిగా ఉన్న ఉద్యోగంలో ఉండకండి, మీకు నచ్చిన మార్పు చేసుకోండి" అని ఆమె ఇతరులకు సలహా ఇస్తున్నారు. -
భారత్‌కు యూఎన్ఎస్సీలో శాశ్వత సభ్యత్వం
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ)లో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు మధ్య ఐరోపాకు చెందిన విసెగ్రాడ్ గ్రూప్ (వీ4) దేశాలు మద్దతు ప్రకటించాయి. పోలాండ్, హంగరీ, స్లోవేకియా, చెక్ రిపబ్లిక్ దేశాల విదేశాంగ మంత్రులతో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ న్యూయార్క్‌లో సమావేశమయ్యారు. 81వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా జరిగిన ఈ తొలి ‘వీ4’ భారత్ భేటీలో రాజకీయ, ఆర్థిక, సాంకేతిక, రక్షణ, సాంస్కృతిక రంగాల్లో సహకారాన్ని మరింత పెంచుకోవాలని నిర్ణయించారు.భారత్-విసెగ్రాడ్ గ్రూప్ మధ్య రాజకీయ సంబంధాలను మరింత బలోపేతం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఇందులో భాగంగా ఐదు దేశాల విదేశాంగ మంత్రులు ఏటా సమావేశం కానున్నారు. అలాగే ఆర్థిక సహకారాన్ని పెంచేందుకు వార్షిక బిజినెస్ ఫోరమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు జైశంకర్ తెలిపారు. ఈ భేటీని ఆయన కొత్త చారిత్రక సందర్భంగా అభివర్ణించారు.టెక్నాలజీ, ఆవిష్కరణలు, పరిశోధన, విద్య, అంతరిక్షం, కనెక్టివిటీ వంటి రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంచుకోవాలని భారత్, వీ4 దేశాలు నిర్ణయించాయి. సాంస్కృతిక సంబంధాలు, ప్రజల మధ్య రాకపోకలను కూడా మరింత అభివృద్ధి చేయాలని అంగీకరించాయి. రక్షణ రంగంలో ఇప్పటికే ఉన్న సహకారాన్ని పునరుద్ధరించి మరింత ముందుకు తీసుకెళ్లాలని జైశంకర్ పేర్కొన్నారు.స్లోవేకియా విదేశాంగ మంత్రి జురాజ్ బ్లానార్ మాట్లాడుతూ గ్లోబల్ సౌత్‌లోని కీలక దేశంగా, ఇండో-పసిఫిక్‌లో ఎదుగుతున్న శక్తిగా ఉన్న భారత్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశంగా ఉండాలని వీ4 దేశాలు అంగీకరిస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం యూఎన్ఎస్సీలో చైనా, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్, అమెరికా ఐదు శాశ్వత సభ్యదేశాలుగా ఉన్నాయి. వీటికి వీటో అధికారం ఉంది. భద్రతా మండలి నిర్మాణాన్ని ప్రస్తుత ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా మార్చాలని, ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాకు మరింత ప్రాతినిధ్యం కల్పించాలని భారత్ చాలాకాలంగా కోరుతోంది. అయితే శాశ్వత సభ్యత్వం కోసం వీ4 మద్దతు లభించడం ఒక దౌత్యపరమైన మద్దతు అయినప్పటికీ, వీఎన్ఎస్సీ సంస్కరణకు విస్తృత అంతర్జాతీయ చర్చలు, సభ్యదేశాల అంగీకారం అవసరం.ఈ సమావేశంలో ద్వైపాక్షిక, బహుపాక్షిక సహకారంతో పాటు ఉక్రెయిన్ వివాదం, గల్ఫ్ ప్రాంత పరిణామాలు వంటి అంతర్జాతీయ అంశాలపైనా చర్చించారు. ఐక్యరాజ్యసమితి సంస్కరణలు, బహుపాక్షిక సహకారం వంటి అంశాలపై కూడా అభిప్రాయాలను పంచుకున్నారు. విసెగ్రాడ్ గ్రూప్‌లో పోలాండ్, హంగరీ, స్లోవేకియా, చెక్ రిపబ్లిక్ ఉన్నాయి. మధ్య ఐరోపాకు చెందిన ఈ నాలుగు దేశాలు రాజకీయ, ఆర్థిక, రక్షణ, సాంస్కృతిక, ఇంధన రంగాల్లో పరస్పర సహకారం కోసం ఈ కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. ఇదీ చదవండి: వైరల్ వీడియో: మరిగే చాయ్‌లో ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్! -
UFO: 50 ఏళ్ల తర్వాత.. ఇరాన్ ఆకాశంలో మరో వింత వస్తువు
1976లో ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఆకాశంలో కనిపించిన వింత వస్తువు(యూఎఫ్‌వో) ఘటనకు సరిగ్గా 50 ఏళ్ల తర్వాత.. అదే నగరంలో మరోసారి ఓ మిస్టరీ వస్తువు కలకలం రేపుతోంది. ఆకాశంలో ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగుల లైట్లతో తక్కువ ఎత్తులో ఎగురుతున్నట్లు కనిపిస్తున్న ఈ వస్తువుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అసలు అది డ్రోనా? ఒకటి కంటే ఎక్కువ డ్రోన్లా? లేక దూరం నుంచి కనిపించిన మరో సాధారణ వస్తువా? అనేది ఇప్పటివరకు మాత్రం దీనిపై అధికారిక స్పష్టత లేదు. దీంతో ఆ వస్తువు ఏమై ఉండొచ్చనే దానిపై అనేక రకాల ఊహాగానాలు మొదలయ్యాయి.ఈ వీడియోలు సెప్టెంబర్ 20న చిత్రీకరించినవిగా చెబుతున్నారు. వాటిలో రాత్రి ఆకాశంలో తక్కువ ఎత్తులో ఎగురుతున్నట్లు కనిపించే ఒక వస్తువు కనిపిస్తోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఒక పోస్టు ప్రకారం, ఈ ఘటన టెహ్రాన్‌లోని అజాదెగాన్ ఎక్స్‌ప్రెస్‌వే సమీపంలో జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఆ వస్తువు కచ్చితంగా ఎక్కడ కనిపించింది. ఎంత ఎత్తులో ఉంది? దాని వేగం ఎంత? దాని పరిమాణం ఎంత? అనే విషయాలపై ఇప్పటివరకు అధికారిక సమాచారం లేదు. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో ఈ వీడియోలు వెలుగులోకి వచ్చాయి.ఈ దృశ్యాలపై సోషల్ మీడియాలో కొందరు ఇది సైనిక డ్రోన్ అయి ఉండవచ్చని.. ఒకేసారి అనేక డ్రోన్లు ఎగురుతూ ఉండవచ్చని చెబుతున్నారు. మరికొందరు, దూరం నుంచి చూస్తున్నప్పుడు ఆ లైట్లు గాలిపటం లేదా మరేదైనా వస్తువుకు సంబంధించినవిగా కనిపించి ఉండవచ్చంటున్నారు. సెప్టెంబర్ 20న ఇరాన్, అమెరికా మధ్య మరోసారి తీవ్ర హెచ్చరికలు వెలువడ్డాయి. తమపై మరోసారి దాడి జరిగితే.. ఈ ప్రాంతంలోని అమెరికా స్థావరాలపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందని ఇరాన్ సైన్యం హెచ్చరించింది.A number of videos are circulating showing an unidentified object in the skies above Tehran, Iran, it’s not immediately clear what is being filmed. pic.twitter.com/bHNAQGFPNv— OSINTdefender (@sentdefender) September 21, 2026అదే సమయంలో ఈ ప్రాంతంలో విమానాల రద్దు, గగనతల మూసివేతలు, ఇతర అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని అమెరికా విదేశాంగ శాఖ ప్రయాణికులను హెచ్చరించిన సంగతి తెలిసిందే. 1976 సెప్టెంబర్ 19న ఆకాశంలో ఒక ప్రకాశవంతమైన వస్తువు కనిపించినట్లు ఇరాన్ అధికారులు తెలిపారు. దానిని పరిశీలించేందుకు ఇరాన్‌కు చెందిన F-4 యుద్ధ విమానాలను పంపినట్లు సమాచారం.తర్వాత యూఎఫ్‌వో పరిశోధకులు ఈ ఘటనపై విస్తృతంగా అధ్యయనం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన నివేదికలు అమెరికా ప్రభుత్వం డీక్లాసిఫై చేసిన పత్రాల్లో కూడా ఉన్నాయి. అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (NSA) ఆర్కైవ్‌లో జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్, డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (DIA) అమెరికా రక్షణ శాఖ రిపోర్టులు ఉన్నాయి. అయితే, 1976లో కనిపించిన వస్తువుకు, తాజాగా టెహ్రాన్‌లో కనిపించిన లైట్లకు సంబంధం ఉందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు.ఇదీ చదవండి: సినిమా రేంజ్లో.. బస్సు హైజాక్! -
ఐరాస సమావేశాల వేళ.. అమెరికా ఆకాశంలో గందరగోళం
అమెరికాలో విమాన రాకపోకలు ఒక్కసారిగా స్తంభించాయి. న్యూయార్క్ ప్రాంతంలోని కీలక విమానాశ్రయాల్లో వందలాది విమానాలు రద్దుకాగా.. వేలాది ఫ్లైట్లు ఆలస్యమయ్యాయి. న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలకు ప్రపంచ దేశాల అధినేతలు, ప్రతినిధులు చేరుకుంటున్న సమయంలోనే ఈ అంతరాయం కలగడం ఒక్కసారిగా కలకలం రేపింది.ఈశాన్య ప్రాంతంలో ఫిలడెల్ఫియాలోని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రంలో కీలక కమ్యూనికేషన్ సర్క్యూట్ విఫలమవడంతో ఈ సమస్య మొదలైంది. విమానాల రాకపోకలను సమన్వయం చేయడంలో కీలకమైన ఈ కమ్యూనికేషన్ వ్యవస్థలో అంతరాయం ఏర్పడటంతో ఎయిర్ ట్రాఫిక్ నిర్వహణపై ప్రభావం పడింది. దీంతో న్యూయార్క్ పరిసరాల్లోని ప్రధాన విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలు నెమ్మదించాయి. ఇదే సమయంలో ప్రత్యామ్నాయంగా ఉపయోగించాల్సిన బ్యాకప్ ఫైబర్ ఆప్టిక్ లైన్ కూడా నిర్మాణ పనుల కారణంగా దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రధాన కమ్యూనికేషన్ సర్క్యూట్ విఫలమైన సమయంలో బ్యాకప్ లైన్ అందుబాటులో లేకపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.ఒకదాని తర్వాత ఒకటి..ఫిలడెల్ఫియాలోని ఎఫ్ఏఏ కేంద్రంలో సోమవారం ఉదయం కీలక కమ్యూనికేషన్ సర్క్యూట్ పనిచేయడం ఆగిపోయింది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో బ్యాకప్ వ్యవస్థ పనిచేయాలి. కానీ అధికారులు దానిని ఉపయోగించేందుకు ప్రయత్నించగా.. న్యూజెర్సీలోని న్యూ బ్రన్స్విక్–నెవార్క్ మధ్య ఉన్న బ్యాకప్ ఫైబర్ ఆప్టిక్ లైన్ కూడా నిర్మాణ పనుల సమయంలో కట్ అయినట్లు గుర్తించారు. దీంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కమ్యూనికేషన్‌కు ప్రత్యామ్నాయ మార్గం లేకుండా పోయింది.ఎఫ్ఏఏ అడ్మినిస్ట్రేటర్ బ్రయాన్ బెడ్ఫోర్డ్ ప్రకారం.. ఫైబర్ లైన్‌ను మరమ్మతు చేయడానికి సుమారు 13 గంటలు పట్టింది. మరోవైపు ప్రధాన సర్క్యూట్‌కు కొత్త లైన్‌ను ఏర్పాటు చేసే పనులు కూడా చేపట్టారు.వేలాది విమానాలు రద్దు!ఈ సాంకేతిక సమస్య ప్రభావం న్యూయార్క్‌లోని మూడు ప్రధాన విమానాశ్రయాలపై పడింది. జాన్ ఎఫ్. కెన్నడీ (JFK), లాగార్డియా, నెవార్క్ విమానాశ్రయాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫిలడెల్ఫియా విమానాశ్రయం కూడా ప్రభావితమైంది. కొన్ని విమానాలను దారి మళ్లించగా.. మరికొన్నింటిని నిలిపివేశారు.ఈ అంతరాయం కారణంగా అమెరికా వ్యాప్తంగా సుమారు 7,000 విమానాలు ఆలస్యంగా నడవగా.. వాటిల్లో కొన్ని రద్దు అయ్యాయి. న్యూయార్క్ ప్రాంతంలోని ప్రధాన విమానాశ్రయాల్లోనే 1,400కుపైగా విమానాలపై ప్రభావం పడింది.మళ్లీ సాధారణ స్థితికి..ఫైబర్ లైన్, టెలికాం కనెక్షన్ల మరమ్మతు పూర్తయ్యాక ఈశాన్య అమెరికాలో విమాన కార్యకలాపాలు తిరిగి సాధారణ స్థితికి వచ్చినట్లు అమెరికా రవాణా శాఖ తెలిపింది. అయితే అప్పటికే ఏర్పడిన రద్దులు, ఆలస్యాల ప్రభావం రోజంతా కొనసాగింది. కొన్ని విమానయాన సంస్థలు ప్రయాణికులకు అదనపు ఛార్జీలు లేకుండా టికెట్లను మార్చుకునే అవకాశం కల్పించాయి.ఇదే సమయంలో ఎఫ్ఏఏ వాషింగ్టన్ డీసీ ప్రాంతంలో విమాన షెడ్యూల్ సమస్యలు, వాతావరణ పరిస్థితులను ముందుగానే అంచనా వేసి ఎయిర్ ట్రాఫిక్‌ను మళ్లించేందుకు ఏఐ ఆధారిత కొత్త కంప్యూటర్ వ్యవస్థను పరీక్షించడం ప్రారంభించింది. అయితే ఈ ఏఐ వ్యవస్థకు తాజా విమాన అంతరాయంతో సంబంధం లేదని అధికారులు తెలిపారు.యూఎన్ సమావేశాల వేళ.. మరింత టెన్షన్న్యూయార్క్లో యూఎన్ జనరల్ అసెంబ్లీ ఉన్నతస్థాయి సమావేశాలు జరుగుతున్న సమయంలో ఈ సమస్య తలెత్తింది. దాదాపు 130 మంది ప్రపంచ నేతలు, పలువురు మంత్రులు న్యూయార్క్‌కు చేరుకుంటున్న సమయంలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్ నుంచి న్యూయార్క్‌కు వెళ్లే విమానం మాత్రం షెడ్యూల్ ప్రకారమే బయలుదేరింది.గతంలోనూ ఇదే కేంద్రం నుంచి..ఇదే ఫిలడెల్ఫియాలోని ఎఫ్ఏఏ కేంద్రం కారణంగా 2025 వసంతకాలంలో కూడా నెవార్క్ విమానాశ్రయంలో పలుమార్లు అంతరాయాలు ఏర్పడ్డాయి. దీంతో అమెరికా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలోని పాత కమ్యూనికేషన్ మౌలిక వసతులపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయి. తాజా ఘటనలో మాత్రం ప్రధాన సర్క్యూట్ విఫలమవడంతో పాటు బ్యాకప్ లైన్ కూడా అందుబాటులో లేకపోవడం సమస్యను మరింత తీవ్రం చేసింది.ఇదీ చదవండి: హౌతీలంటే ట్రంప్‌కు ఎందుకంత భయం? -
ఫేక్ లైక్స్, రీపోస్టులతో Xలో చీటింగ్ గేమ్!.. మస్క్ దావా
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ సంచలన ఆరోపణలకు దిగింది. ఫేక్ లైక్స్, రీపోస్టులు, రిప్లైలతో కృత్రిమంగా ఎంగేజ్మెంట్ పెంచి.. క్రియేటర్లకు చెల్లించే డబ్బును కొల్లగొట్టే స్కామ్ నడిచిందని చెబుతోంది. ఈ వ్యవహారంలో బిట్‌కాయిన్/క్రిప్టో కంటెంట్‌కు సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్లైన వివేక్ కుమార్ సేన్, జమ్యాంగ్ షెర్పాతో పాటు మరికొందరిపై ఇంగ్లండ్ అండ్ వేల్స్‌లోని హైకోర్టులో సివిల్ దావా వేసింది. తమ క్రియేటర్ పేమెంట్ వ్యవస్థను మోసం చేసి భారీ మొత్తంలో నగదును వాళ్లు సొంతం చేసుకున్నారని.. ఆ మొత్తాన్ని వడ్డీతో సహా తమకు ఇప్పించాలని కోర్టును కోరింది. ఎక్స్‌లో కొంతకాలంగా క్రియేటర్ రెవెన్యూ షేరింగ్ (Creator Revenue Sharing) అనే కార్యక్రమం నడుస్తోంది. ఇందులో అర్హత పొందిన క్రియేటర్లు తమ పోస్టుల ద్వారా వచ్చే అర్హత కలిగిన ఎంగేజ్మెంట్ ఆధారంగా ఆదాయం పొందేవారు. అయితే ఈ వ్యవస్థలో నిజమైన యూజర్ల స్పందనతో పాటు కృత్రిమంగా ఎంగేజ్మెంట్ సృష్టించే అవకాశం ఉందన్న ఆరోపణలు కూడా వచ్చాయి. తాజాగా X దాఖలు చేసిన కేసు ఈ అంశాన్నే కోర్టు ముందుకు తీసుకెళ్లింది. ఎక్స్ ఆరోపణల ప్రకారం.. వివేక్ సేన్, జమ్యాంగ్ షెర్పా తదితరులు బిట్‌కాయిన్‌కు సంబంధించిన పలు X ఖాతాలను ఒక నెట్వర్క్లా నిర్వహించారు. ఆ ఖాతాలు ఒకదానికొకటి లైక్‌లు కొట్టడం, రీపోస్టులు చేయడం, రిప్లైలు ఇవ్వడం ద్వారా నిజమైన యూజర్లు పెద్ద సంఖ్యలో స్పందిస్తున్నట్టుగా కనిపించేలా చేశాయని కంపెనీ పేర్కొంది.ఒకే కంటెంట్.. నిమిషాల వ్యవధిలో!ఈ వ్యవహారం ఎలా జరిగిందో వివరించేందుకు ఎక్స్ తన కేసులో కొన్ని ఉదాహరణలను కూడా ప్రస్తావించింది. @TrendingBitcoin, @saylordocs అనే ఖాతాలు 2025 అక్టోబర్ 10న కేవలం రెండు నిమిషాల వ్యవధిలో ఒకే కంటెంట్‌ను పోస్టు చేసినట్లు పేర్కొంది. మరో సందర్భంలో మూడు ఖాతాలు ఒకే పోస్టుకు కేవలం 31 సెకన్ల వ్యవధిలో స్పందించినట్లు తెలిపింది. ఇలా ఒకే నెట్‌వర్క్‌లోని ఖాతాలు పరస్పరం లైక్‌లు, రీపోస్టులు, రిప్లైలతో పోస్టులకు కృత్రిమంగా స్పందనలు పెంచేవని ఎక్స్ ఆరోపించింది. ఖాతా సస్పెండ్ అయితే.. మరోదానితో ఆట?ఒక ఖాతాను ఎక్స్ సస్పెండ్ చేసినా.. అదే నెట్‌వర్క్‌లోని మరో ఖాతాల ద్వారా కార్యకలాపాలను కొనసాగించేలా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారని కంపెనీ ఆరోపించింది. అంటే ఒక ఖాతాపై చర్యలు తీసుకున్నా.. మిగిలిన ఖాతాల ద్వారా ప్రధాన ఖాతాలకు ఎంగేజ్మెంట్ పెంచే అవకాశం ఉండేదని పేర్కొంది.ఇదే క్రమంలో వివేక్ సేన్ 2025 డిసెంబర్లో ఎక్కువ ఫాలోవర్లు ఉన్న మరో ఎక్స్ ఖాతాను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించినట్లు కూడా దావాలో పేర్కొంది. ప్లాట్‌ఫారమ్ నిబంధనలకు విరుద్ధంగా ఏదైనా జరిగి ఇబ్బందుల్లో పడకూడదన్న ఉద్దేశంతో తాను మాట్లాడినట్లు ఆయన రాసిన సందేశాన్ని కూడా కంపెనీ తన వాదనకు ఆధారంగా ప్రస్తావించింది. రూ.2.6 కోట్లు ఎలా వచ్చాయి?కృత్రిమ ఎంగేజ్మెంట్ సృష్టించిన నెట్వర్క్ ద్వారా కనీసం 207,384 పౌండ్లు క్రియేటర్ పేమెంట్లు పొందినట్లు ఎక్స్ ఆరోపిస్తోంది. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.2.6 కోట్లు. అంతేకాదు.. ఈ వ్యవహారాన్ని గుర్తించడం, దర్యాప్తు చేయడం, సమస్యను పరిష్కరించేందుకు తీసుకున్న చర్యలకు తమకు కనీసం మరో 75,000 పౌండ్లు ఖర్చవుతుందని ఎక్స్ పేర్కొంది. ఈ మొత్తంతో పాటు నష్టపరిహారం, వడ్డీ, న్యాయపరమైన ఖర్చులను కూడా నిందితుల నుంచి ఇప్పించాలని కోర్టును కోరుతోంది. మస్క్ రిప్లై చూశారా?ఈ కేసుపై X జనరల్ కౌన్సెల్ జేమ్స్ ఎం. బర్న్‌హామ్ స్పందిస్తూ.. క్రియేటర్ రెవెన్యూ షేరింగ్ వ్యవస్థను దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అయితే దీనికి ఎలాన్ మస్క్ స్పందిస్తూ డోంట్ మెస్ విత్ అంటూ ఇలా మోసాలకు పాల్పడే వాళ్లకు వార్నింగ్ తరహాలో స్పందించారు.ఇదిలా ఉండగా.. ఎక్స్ ఇప్పటికే తన పాత క్రియేటర్ రెవెన్యూ షేరింగ్ కార్యక్రమాన్ని ముగించింది. సెప్టెంబర్ 7, 2026 వరకు ఆ ప్రోగ్రామ్ కింద ఆదాయాలు కొనసాగగా.. సెప్టెంబర్ 8 నుంచి అర్హత ఉన్న క్రియేటర్లకు ఒరిజినల్ కంటెంట్ రివార్డు కార్యక్రమం అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ఒరిజినల్ కంటెంట్ నుంచి వచ్చే అర్హత కలిగిన ఇంప్రెషన్స్ ఆధారంగా చెల్లింపులు చేస్తోంది. కృత్రిమంగా సృష్టించిన లేదంటే మోసపూరిత ఇంప్రెషన్స్ ఇందులో పరిగణనలోకి రావని ఎక్స్ స్పష్టం చేసింది. -
ఇరాన్ విమానాలకు అమెరికా షాక్.. 23 నుంచి కఠిన ఆంక్షలు!
వాషింగ్టన్: ఇరాన్‌పై అమెరికా ఆంక్షల ఒత్తిడి మరింత తీవ్రతరమవుతోంది. ఇరాన్‌కు చెందిన అన్ని విమానయాన సంస్థలను అంతర్జాతీయ విమానయాన వ్యవస్థ నుంచి దూరం చేసే దిశగా అమెరికా కీలక హెచ్చరిక చేసింది. సెప్టెంబర్ 23 నుంచి ఇరాన్ విమానాలకు ఇంధనం, ల్యాండింగ్ సదుపాయాలు, టికెట్ విక్రయాలు వంటి సేవలు అందించే విదేశీ సంస్థలపైనా ఆంక్షలు విధించనున్నామని అమెరికా తెలిపింది.అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 23 నుంచి ఇరాన్‌కు చెందిన విమానయాన సంస్థలను ప్రపంచవ్యాప్తంగా ‘షట్‌డౌన్’ చేసే చర్యలు చేపడతామని తెలిపారు. ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు సేవలు అందించే విమానాశ్రయాలు, ఇంధన సరఫరాదారులు, టికెట్ విక్రయ సంస్థలు కూడా అమెరికా చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇరాన్ విమానాలు ఏదైనా దేశంలో దిగితే.. వాటికి ఇంధనం అందించడం, ల్యాండింగ్ సదుపాయాలు కల్పించడం లేదా టికెట్లు విక్రయించడం వంటి సేవలు అందించే సంస్థలు కూడా అమెరికా ఆంక్షల పరిధిలోకి వస్తాయని బెస్సెంట్ పేర్కొన్నారు. అలాంటి సంస్థలను అమెరికా డాలర్ ఆర్థిక వ్యవస్థ నుంచి తొలగించే అవకాశం ఉందని చెప్పారు. దీంతో ఇరాన్ విమానాలకు విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహించడం మరింత కష్టతరం కానుంది.ఈ తాజా హెచ్చరికకు ముందు సెప్టెంబర్ 8న అమెరికా ట్రెజరీ విభాగం ఇరాన్ విమానయాన రంగానికి సంబంధించిన 36 లక్ష్యాలపై ఆంక్షలు విధించింది. ఇందులో ఇరాన్‌కు చెందిన 27 విమానయాన సంస్థలు ఉన్నాయి. మిగిలిన ఇరాన్ ఎయిర్‌లైన్స్‌ను కూడా ఆంక్షల కార్యక్రమంలో చేర్చినట్లు అమెరికా తెలిపింది. వాటికి మద్దతు అందించే విదేశీ సంస్థలపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది.ఇరాన్‌కు చెందిన మహాన్ ఎయిర్‌పై అమెరికా గతంలోనే పలు ఆంక్షలు విధించింది. ఆ సంస్థకు ఆర్థిక, లాజిస్టికల్, వాణిజ్యపరమైన సహకారం అందిస్తున్నాయని ఆరోపించిన సంస్థలు, వ్యక్తులపై కూడా చర్యలు తీసుకుంది. జూలైలో చైనా, భారత్, రష్యా, ఇరాన్‌లకు చెందిన కొన్ని సంస్థలు, వ్యక్తులపై కూడా అమెరికా ఆంక్షలు విధించింది. ఇరాన్‌పై ఆంక్షల అమలుకు సంబంధించి చైనా అధికారులతో చర్చలు జరిపిన తర్వాతే బెస్సెంట్ తాజా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.ఇరాన్‌కు చైనా ప్రధాన ఆర్థిక భాగస్వామిగా ఉండటంతో.. అమెరికా ఆంక్షల అమలులో చైనా సహకారం కీలకంగా మారింది. చైనా ఆర్థిక అధికారులు, పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా గవర్నర్ పాన్ గోంగ్షెంగ్తో చర్చలు జరిగినట్లు బెస్సెంట్ తెలిపారు. ఇరాన్‌పై అమెరికా ఒత్తిడి కేవలం విమానయాన రంగానికే పరిమితం కాకుండా.. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఆ దేశానికి ఉన్న మార్గాలను కూడా కట్టడి చేసే దిశగా విస్తరిస్తోంది. -
తేనెను వదిలేసి.. 8,000 తేనెటీగలు చోరీ!
క్వీన్స్లాండ్: ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో తేనెటీగల భారీ చోరీ కలకలం రేపుతోంది. అథర్టన్ టేబుల్ల్యాండ్స్ ప్రాంతంలోని 41 వాణిజ్య తేనెటీగల గూళ్ల నుంచి తేనెటీగలు, వాటి సంతానాన్ని దుండగులు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఆ తేనెటీగల విలువ 20 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు(రూ. 13,61,400)కు పైగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. తేనెటీగల పెంపకం పరిశ్రమపై అవగాహన ఉన్న వ్యక్తులే ఈ చోరీకి పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.41 గూళ్లను టార్గెట్ చేసిన దొంగలుకెయిర్న్స్కు పశ్చిమాన ఉన్న అథర్టన్ టేబుల్ల్యాండ్స్లోని పలు ప్రాంతాల్లో ఈ చోరీ జరిగింది. వాణిజ్య తేనెటీగల పెంపకందారుడు జాక్ లాటన్కు చెందిన 41 గూళ్ల నుంచి తేనెటీగలు, వాటి సంతానాన్ని తీసుకెళ్లినట్లు గుర్తించారు. ఒక్కో గూడులో సుమారు 15 వేల తేనెటీగలు ఉంటాయని లాటన్ తెలిపారు. మొత్తం మీద దాదాపు 8 లక్షల తేనెటీగలు చోరీ అయినట్లు ఆయన చెప్పారు.ప్రత్యేక పరికరాలతో చోరీదొంగలు మొత్తం తేనెటీగల గూళ్లను ఎత్తుకెళ్లలేదు. వాటిలోని తేనెటీగలు ఉన్న ఫ్రేమ్‌లను మాత్రమే తీసి తమ సొంత పెట్టెల్లోకి మార్చినట్లు అధికారులు చెబుతున్నారు. తేనెటీగలు సంతానోత్పత్తి చేసే బ్రూడ్ బాక్స్‌లను కూడా తీసుకెళ్లారు. ఈ పని చేయడానికి ప్రత్యేక పరికరాలు, తేనెటీగల పెంపకంపై నైపుణ్యం అవసరమని పోలీసులు భావిస్తున్నారు.తేనెను మాత్రం వదిలేశారుఈ చోరీలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. దొంగలు గూళ్లలోని తేనెను మాత్రం తీసుకెళ్లలేదు. తేనెటీగలున్న ఫ్రేమ్‌లను తమ పెట్టెల్లోకి మార్చుకుని, అసలు గూళ్లను మళ్లీ యథాతథంగా అమర్చారు. దీంతో గూళ్ల యజమానులకు వెంటనే చోరీ జరిగిన విషయం తెలియకుండా జాగ్రత్త పడ్డారని వాటిని నిర్వహించే టామ్ బిడ్నర్ తెలిపారు.పరాగసంపర్క ఒప్పందాలపైనా ప్రభావంఈ ఘటనతో తేనెటీగలను మాత్రమే కాకుండా వాటి ద్వారా అందించే పరాగసంపర్క సేవల ఒప్పందాలను కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని పెంపకందారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వర్రోవా మైట్ అనే పరాన్నజీవి కారణంగా క్వీన్స్లాండ్ తేనెటీగల పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ సమయంలో చోరీ ఘటన తమకు మరింత నష్టాన్ని కలిగించిందని బిడ్నర్ పేర్కొన్నారు.పరిశ్రమలోని వ్యక్తులపైనే అనుమానంమరీబా రూరల్ అండ్ స్టాక్ క్రైమ్ స్క్వాడ్ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. గతంలోనూ తేనెటీగల చోరీలు జరిగినప్పటికీ, ఇదే అతిపెద్ద ఘటన అని బిడ్నర్ తెలిపారు. పలు ప్రాంతాల్లోని గూళ్లను లక్ష్యంగా చేసుకోవడం, ప్రత్యేక పరికరాలను ఉపయోగించడం వంటి అంశాల ఆధారంగా నిందితులు తేనెటీగల పెంపకం పరిశ్రమకు చెందినవారై ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఇప్పటివరకు పోలీసులు నిందితులను గుర్తించలేదు. ఇదీ చదవండి: నెహ్రూ నుంచి జైట్లీ వరకు.. డీయూఎస్‌యూ సంచలన చరిత్ర! -
హౌతీల దూకుడు.. ట్రంప్ ప్లాన్ ఢమాల్!
పశ్చిమాసియాలో ఇప్పటికే ఇరాన్–అమెరికా యుద్ధంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. యెమెన్‌లో హౌతీల దూకుడు ఆ ప్రాంతాన్ని మరో సంక్షోభంలోకి నెడుతోంది. ఇరాన్ మద్దతున్న హౌతీలు ఎర్ర సముద్రం తీరంలో వేగంగా ముందుకు సాగుతూ కీలక ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు వారి చూపు వ్యూహాత్మక పర్వతాలపై పడింది. మరోవైపు హౌతీలను అడ్డుకునేందుకు అమెరికా సాయం కోరిన యెమెన్ ప్రభుత్వం.. ట్రంప్ నుంచి మాత్రం ప్రత్యక్ష హామీ పొందలేకపోయింది.హౌతీలపై అమెరికా నేరుగా దాడి చేయబోతోందనే పరిస్థితి చివరి నిమిషంలో మారిపోయింది. పక్కా సమాచారం ప్రకారం.. ఆదివారం హౌతీలపై వైమానిక దాడులు చేయడానికి ట్రంప్ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. హౌతీల స్థావరాలపై దాడులు చేసేందుకు విమానాల్లో బాంబులు ఎక్కిస్తున్న సమయంలోనే ట్రంప్ వాటిని నిలిపివేయాలని ఆదేశించారు. అంటే.. హౌతీలపై అమెరికా సైనిక చర్యకు సిద్ధమైనా.. ఆఖరి క్షణంలో ఆ ప్లాన్‌ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఇటు అమెరికా సెంట్రల్ కమాండ్ అటు వైట్‌హౌస్ రెండూ ఇప్పటికీ స్పందించలేదు.ఇదే సమయంలో సౌదీ మద్దతు ఉన్న యెమెన్ ప్రభుత్వం అమెరికా సాయం కోరింది. ఆ దేశ అధ్యక్షుడు రషాద్ అల్ అలీమి, ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడారు. అయితే ట్రంప్ ఎలాంటి ప్రత్యక్ష సైనిక మద్దతు హామీ ఇవ్వలేదని తెలుస్తోంది.ఇప్పుడు పర్వతాలే టార్గెట్హౌతీల తాజా వ్యూహం యెమెన్‌లో పరిస్థితిని మరింత కీలకంగా మార్చేలా కనిపిస్తోంది. ఈ నెలలో ఎర్ర సముద్ర తీర ప్రాంతాల్లో వేగంగా ముందుకు సాగిన హౌతీలు.. ఇప్పుడు తైజ్, లహిజ్ ప్రావిన్సుల మధ్య ఉన్న కహ్బూబ్ పర్వతాల వైపు కదులుతున్నారు. ఈ ఎత్తైన ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటే ఎర్ర సముద్ర తీరాన్ని దక్షిణ యెమెన్‌లో ప్రభుత్వ ఆధీనంలోని ప్రాంతాల నుంచి వేరు చేసే అవకాశం ఉంటుంది.అల్-వజియాహ్ పర్వత ప్రాంతం, బాబ్ ఎల్ మండెబ్ జలసంధి సమీపంలోని రాస్ అల్-అరా ప్రాంతాల్లో పోరు తీవ్రంగా సాగుతున్నట్లు సమాచారం. మరీ ముఖ్యంగా బాబ్ ఎల్ మండెబ్ రీజియన్‌పై పట్టు కోల్పోయాక.. యెమెన్ రక్షణాత్మక ధోరణి ప్రదర్శిస్తోందనే విశ్లేషణలు నడుస్తున్నాయి.700 మంది మృతి.. 1.30 లక్షల మంది నిరాశ్రయులుహౌతీల తాజా దాడులతో యెమెన్‌లో మానవతా పరిస్థితి కూడా విషమిస్తోంది. తాజా పోరులో దాదాపు 700 మంది మరణించగా.. వేలాది మంది గాయపడ్డారు. సుమారు 1,30,000 మంది యెమెన్లోనే నిరాశ్రయులయ్యారు. మరో 3,000 మందికి పైగా ఎర్ర సముద్రం దాటి పడవల్లో ఆఫ్రికా వైపు వెళ్లినట్లు ఐక్యరాజ్యసమితి గణాంకాలను ఉటంకిస్తూ కథనం పేర్కొంది.హౌతీలను అడ్డుకునేందుకు సౌదీ అరేబియా కూడా రంగంలోకి దిగింది. హౌతీల స్థావరాలపై వందలాది వైమానిక దాడులు చేసింది. అయినప్పటికీ పర్వత ప్రాంతాల్లో హౌతీలను వెనక్కి నెట్టడం సౌదీ బలగాలకు సవాలుగా మారింది.సౌదీ చమురు ఎగుమతులకు కొత్త చిక్కుయెమెన్లో జరుగుతున్న పోరుకు మరో కీలక కోణం ఉంది. అది చమురు రవాణా. బాబ్ ఎల్ మండెబ్ ప్రాంతంలో హౌతీల పట్టు బలపడితే.. హర్ముజ్ జలసంధి వద్ద ఏర్పడే అంతరాయాలను తప్పించుకునేందుకు సౌదీ ఉపయోగించే ప్రత్యామ్నాయ చమురు మార్గానికి ఇబ్బంది కలగొచ్చు. దీంతో సౌదీ ఇప్పటికే హర్ముజ్ మీదుగా మరిన్ని చమురు రవాణాలను పెంచింది.ఆగస్టులో రోజుకు సుమారు 7 లక్షల బ్యారెళ్లుగా ఉన్న సౌదీ చమురు ఎగుమతులు హర్ముజ్ మీదుగా ఇటీవలి రోజుల్లో 29 లక్షల బ్యారెళ్లకు చేరినట్లు ఉపగ్రహ డేటా తెలియజేస్తోంది. యుద్ధ పరిస్థితుల్లో హర్ముజ్ మార్గంలో రవాణా ఖర్చులు కూడా భారీగా పెరిగినట్లు పేర్కొంది.అమెరికాకు పెరుగుతున్న ఒత్తిడిహౌతీల దూకుడు ట్రంప్ ప్రభుత్వాన్ని చిక్కులో పడేస్తోంది. ఒకవైపు సౌదీ అరేబియా తమకు మద్దతుగా అమెరికా సైనిక జోక్యం చేసుకోవాలని కోరుతోంది. మరోవైపు యెమెన్‌లో ప్రత్యక్షంగా మరో యుద్ధంలోకి దిగితే ఈ ఘర్షణ మరింత విస్తరించే అవకాశం ఉంది.గతంలో 2025 ప్రారంభంలో అమెరికా రెండు నెలల పాటు హౌతీలపై దాడులు చేసినప్పటికీ.. కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ట్రంప్ వాటిని నిలిపివేశారు. అప్పటి నుంచి యెమెన్ ఘర్షణలో అమెరికా ప్రత్యక్షంగా జోక్యం చేసుకోలేదు. ఇప్పుడు మరోసారి హౌతీలపై దాడులకు సిద్ధమై.. విమానాల్లో బాంబులు ఎక్కించే దశకు వెళ్లిన అమెరికా.. ట్రంప్ ఆదేశాలతో చివరి నిమిషంలో ఆ చర్యను నిలిపివేసినట్లు వచ్చిన వార్తలు ఆసక్తి రేపుతున్నాయి.అదే సమయంలో హౌతీలు మాత్రం వ్యూహాత్మక ఎత్తైన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని తమ ఆధిపత్యాన్ని విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఒకవైపు హౌతీల దూకుడు కొనసాగుతుండగా.. మరోవైపు వారిపై సైనిక చర్యకు సిద్ధమైన ట్రంప్ ప్రభుత్వం చివరి నిమిషంలో వెనక్కి తగ్గడం యెమెన్ సంక్షోభంలో కీలక పరిణామంగా మారింది.ఇటు హర్ముజ్‌లోనూ ఉద్రిక్తతఇటు హర్ముజ్ జలసంధిలోనూ ఉద్రిక్తత కొనసాగుతోంది. బ్రిటన్ సముద్ర భద్రత సంస్థ యూకేఎంటీవో (UKMTO) ప్రకారం.. జలసంధిలోకి వెళ్తున్న ఓ నౌకపై ప్రాజెక్టైల్ దాడి జరగడంతో సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. మరో గ్యాస్ ట్యాంకర్‌పై కూడా దాడి జరిగినట్లు సమాచారం.ఇరాన్–అమెరికా మధ్య దౌత్య ప్రయత్నాలు కూడా నిలిచిపోయిన పరిస్థితుల్లో యెమెన్‌లో హౌతీల దూకుడు.. మిడిల్ ఈస్ట్ వార్‌కు మరో కీలక ఫ్రంట్‌ను జోడించింది. హౌతీలపై దాడులకు సిద్ధమైన అమెరికా చివరి నిమిషంలో ఆ ప్రణాళికను ఎందుకు నిలిపివేసిందన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. అమెరికా ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతుందా? లేదంటే సౌదీ, యెమెన్ బలగాలకే మద్దతు పరిమితం చేస్తుందా? అన్నది చూడాలి.ఇదీ చదవండి: అమెరికా వర్సెస్ చైనా.. ఇప్పుడు ఓ కొత్త వార్ -
పతనం అంచున మెర్జ్ ప్రభుత్వం
బెర్లిన్: జర్మన్ చాన్స్‌లర్ ఫ్రెడరిక్ మెర్జ్ ప్రభుత్వం ప్రమాదంలో పడింది. ఆయన సార«థ్యంలోని క్రిస్టియన్ డెమోక్రాటిక్ పార్టీ(సీడీయూ) ప్రజాదరణ మునుపెన్నడూ లేనంతగా కనిష్ట స్థాయికి చేరుకుంది. ఎంజెలా మార్కెల్, కొన్రాడ్ అడెనార్ల సారథ్యంలో ఒక వెలుగు వెలిగిన సీడీయూకు ప్రజలు క్రమేపీ దూరమవుతున్నారు. ఇటీవల వరుసగా మూడు ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల్లో సీడీయూ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. చాన్స్‌లర్ మెర్జ్ ఈ ఫలితాలను మహా విపత్తు అంటూ అభివరి్ణంచడం గమనార్హం. గత 75 ఏళ్ల చరిత్రలో సీడీయూ 1951లో మాత్రమే అత్యంత తక్కువగా, 9 శాతం ఓట్లు సాధించింది. తాజాగా, ఇప్పుడు అంతకంటే ఘోరంగా కేవలం 4.9 శాతం ఓట్లకే పరిమితమైంది. మెక్లెన్బర్గ్– వర్పొమర్న్ రాష్ట్రం, బెర్లిన్ నగరంలో జరిగిన ప్రాంతీయ ఎన్నికల్లో ఏఎఫ్‌డీ (ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ) ఘన విజయాలు సాధించింది. అయితే, ప్రభుత్వం ఏర్పాటు చేసేంతటి మెజారిటీ సాధించలేకపోయింది. ఈ ఎన్నికల ద్వారా దేశంలో ప్రధాన రాజకీయ పార్టీ స్థాయికి ఏఎఫ్‌డీ ఎదిగింది. తాజా ఫలితాల నేపథ్యంలో పదవి నుంచి వైదొలుగుతారంటూ వస్తున్న వార్తలను మెర్జ్ తోసిపుచ్చారు. సీడీయూ అధ్యక్షుడిగా, దేశ చాన్స్‌లర్‌గా కొనసాగుతానంటూ స్పష్టత ఇచ్చారు. యూరోపియన్ యూనియన్(ఈయూ)లో అత్యధిక జనాభా, బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం జర్మనీ. దీర్ఘకాలంగా రాజకీయ స్థిరత్వానికి చిహ్నంగా నిలవడమే కాకుండా రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్‌కు కీలక మద్దతుదారుగా ఉంది. ఇక్కడ చోటుచేసుకునే రాజకీయ అస్థిరత ప్రభావం యూరప్‌పై పడుతుంది. మెర్జ్ పాలనా వైఫల్యం ఈ నెలారంభంలో జరిగిన ఒక ఒపీనియన్ పోల్‌లో.. మెర్జ్ పాలనపై కేవలం 13 శాతం మంది మాత్రమే సంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. మెర్జ్కున్న పేలవమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు, ఆవేశం, నియంత్రణ లేకపోవడం వంటి లక్షణాలు ప్రజలను ఆయనకు దూరం చేశాయని విశ్లేషకులు అంటున్నా రు. వీటికితోడు, ఏప్రిల్‌లో ఇరాన్లో ట్రంప్ యుద్ధంపై మెర్జ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యుద్ధాన్ని ముగించే ప్రయత్నాల్లో ట్రంప్ ఇరాన్ చేతిలో అవమానానికి గురవుతున్నారంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అమెరికా అధ్యక్షుడికి ఆగ్రహం తెప్పించాయి. ఆ దేశంతో కొనసాగిస్తున్న సత్సంబంధాలను దెబ్బతీశాయి. ద్రవ్యో ల్బణం, ఇంధన ధరల పెంపు వంటివి జర్మనీ ఆర్థిక వ్యవస్థ తలకిందులైందని, ఈ విషయంలో మెర్జ్ చేయగలిగిందేమీ లేదంటున్నారు. చాన్స్‌లర్‌గా సరైన ప్రత్యామ్నాయ నేత ప్రస్తుతానికి లేకపోవడం, ఆయనను తొలగిస్తే ప్రభుత్వం సంక్షోభంలో పడిపోతుందనే భయాల నడుమ మెర్జ్‌కు పదవీ గండం లేదని పరిశీలకులు అంటున్నారు. -
వైట్‌హౌస్‌పై మీడియా సంస్థల దావా
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్‌లోకి అనుమతి నిరాకరిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని సీఎన్ఎన్, ఎంఎస్ నౌ, పొలిటికో మీడియా సంస్థలు సోమవారం కోర్టులో సవాల్చేశాయి. తమను మాత్రమే ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం రాజ్యాంగంలోని ఒకటో సవరణ ప్రకారం చెల్లదని ఈ సంస్థలు న్యాయస్థానంలో వాదించాయి. వాషింగ్టన్ డీసీలోని ‘యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఫర్ ది డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా’లో ఉమ్మడిగా దావా వేశాయి. మొదటి చట్టసవరణ పరిరక్షణ ప్రకారం మీడియా స్వేచ్ఛను ప్రభుత్వాలు అడ్డుకోవడం కుదరదని పేర్కొన్నాయి. ‘‘చట్టం ద్వారా మీడియా సంస్థలకు సంక్రమించిన హక్కులను కాలరాసే అధికారం అధ్యక్షుడు లేదా ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులకు లేదు. ప్రచురితమయ్యే, ప్రసారమయ్యే వార్తలు, కథనాలు అధ్యక్షుడికి నచ్చనంత మాత్రాన ఎలాంటి నోటీస్ లేకుండా చట్టపర విధానాన్ని అనుసరించకుండా ఏకపక్షంగా వైట్‌హౌస్‌లోకి రాకుండా నిషేధం విధించడం చట్టప్రకారం కుదరదు’’అని సంస్థలు తమ పిటిషన్లో పేర్కొన్నాయి. మీడియా సంస్థలు వేసిన దావాపై శ్వేతసౌధం ఇంకా స్పందించలేదు. కానీ పొద్దుపోయాక ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘మీడియా స్వేచ్ఛపై శ్వేతసౌధం ఎలాంటి ఆంక్షలు విధంచబోదు. నిజానికి నేను మీడియా స్వేచ్ఛకు ఎంతో విలువ ఇస్తా. తప్పుడు వార్తలు రాసే సంస్థల మీద మాత్రమే ఆంక్షలు విధించా. ఈ తప్పుడు వార్తలనేవి అమెరికాకు క్యాన్సర్‌లా దాపురించాయి. ఈ ఫేక్ న్యూస్ అవినీతి, స్వీయప్రయోజనాలతో వ్యవస్థీకృతంగా కట్టుతప్పుతున్నాయి. ఇవి జాతీయ భద్రతకు ముప్పగా మారాయి. అందుకే వీటికి తక్షణం అడ్డుకోవాల్సిందే’’అని ట్రంప్ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. తనకు వ్యతిరేకంగా వార్తలు రాసే మీడియా సంస్థలు, ట్రంప్‌కు మధ్య చాలాకాలంగా ఘర్షణపూరిత వాతావరణం నెలకొన్న విషయం తెల్సిందే. ట్రంప్ కవరేజీని నిలిపేసిన ప్రధాన టీవీ నెట్‌వర్క్‌లు సోమవారం ట్రంప్ వైట్‌హౌస్‌లో కొత్తగా హెలిప్యాడ్‌ను ఆవిష్కరించగా దానికి సంబంధించిన కవరేజీని అమెరికాలోని ప్రధాన టీవీ నెట్‌వర్క్‌లు నిలిపేశాయి. సీఎన్ఎన్పై నిషేధాన్ని నిరసిస్తూ ట్రంప్ కార్యక్రమాల కవరేజీని పక్కనపడేసినట్లు తెలుస్తోంది. ప్రధానమైన ఏబీఎస్, సీబీఎస్, ఫాక్స్ న్యూస్ చానళ్లలో ఈ కార్యక్రమం ప్రసారం కాలేదు. -
ఎల్‌నినో ప్రభావం తీవ్రతరం.. ఏం జరిగిందంటే?
పసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్ర స్థాయికి చేరింది. విస్తృతంగా ఉపయోగించే ఒక కొలమానం ప్రకారం ఉష్ణమండల పసిఫిక్ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత సాధారణ సగటు కంటే 3.07 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైంది. దీంతో 2015-16లో నమోదైన అత్యంత తీవ్ర ఎల్‌నినో స్థాయిని ప్రస్తుత పరిస్థితి సమం చేసింది. ఇప్పటికే మధ్య అమెరికాలో కరవు, పంట నష్టం, నీటి కొరత, ఇండోనేషియాలో అడవుల్లో మంటలు వంటి ప్రభావాలు కనిపిస్తున్నాయి.బర్కిలీ ఎర్త్‌కు చెందిన వాతావరణ శాస్త్రవేత్త, ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పు నివేదికల సహ రచయిత జీక్ హాస్ఫాదర్ ఈ వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం సెప్టెంబర్ కూడా ఇప్పటివరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత వ్యత్యాసం ఉన్న నెలగా మారే అవకాశం ఉంది. చివరి వారంలో అనూహ్య మార్పు సంభవించకపోతే ఈ రికార్డు నమోదయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ గణాంకాలు అమెరికా జాతీయ సముద్ర, వాతావరణ పరిపాలన సంస్థ నుంచి సేకరించిన ఉపగ్రహాలు, సముద్రంలో ఏర్పాటు చేసిన కొలమాన పరికరాల సమాచారంపై ఆధారపడ్డాయి.ఎల్‌నినోను పసిఫిక్‌లోని నినో 3.4 ప్రాంతంలోని రోజువారీ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలను 30 ఏళ్ల సగటుతో పోల్చి కొలుస్తారు. అయితే అమెరికా జాతీయ సముద్ర, వాతావరణ పరిపాలన సంస్థ ఇటీవల రెలటివ్ ఓషియానిక్ నినో ఇండెక్స్ అనే మరో కొలమానాన్ని ప్రవేశపెట్టింది. ఇది విస్తృత ఉష్ణమండల సముద్ర ప్రాంతాల్లోని వేడిమిని కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ కొలమానం ప్రకారం ప్రస్తుత ఎల్‌నినో ఇప్పటికీ గత రికార్డును దాటలేదు. అయితే భవిష్యత్తులో దాన్ని అధిగమించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.తీవ్ర పరిణామాలు!ఎల్‌నినో అనేది ఉష్ణమండల పసిఫిక్‌లో ఏర్పడే సహజ వాతావరణ చక్రంలోని వేడి దశ. తూర్పు నుంచి పడమర వైపు సాధారణంగా వీచే వాణిజ్య పవనాలు బలహీనపడినప్పుడు పశ్చిమ పసిఫిక్‌లో పేరుకుపోయిన వేడి నీరు తూర్పు వైపు కదిలి ఉపరితలానికి చేరుతుంది. దీని ప్రభావంతో పసిఫిక్ వెలుపల కూడా వర్షపాతం, తుపానులు, వాతావరణ ప్రసరణలో మార్పులు చోటుచేసుకుంటాయి.మధ్య అమెరికాలో ఎల్‌నినోతో సంబంధం ఉన్న కరవు కారణంగా జంతువులు చనిపోతాయి, పంటలు దెబ్బతింటాయి. నీటి కొరతతో పనామా కాలువ కార్యకలాపాలపైనా ప్రభావం పడింది. ప్రపంచ వాణిజ్యంలో సుమారు 5 శాతం ఈ కాలువ గుండా సాగుతుంది. జలాశయ నీటిపై ఆధారపడే కాలువలో నౌకల రాకపోకల సంఖ్యను అధికారులు తగ్గించారు. ఇండోనేషియాలో ఎల్‌నినోతో ముడిపడిన కరవు పరిస్థితులు అడవుల్లో మంటలు వ్యాపించడానికి అనుకూలంగా మారాయి.ముందు రోజుల్లో ఎల్‌నినో తీవ్రత ఎలా మారుతుంది, దాని ప్రభావంతో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో వర్షపాతం, కరవు, అడవుల మంటలు, నీటి లభ్యతపై ఎలాంటి మార్పులు వస్తాయన్నది కీలకంగా మారనుంది. -
మరో షాక్.. ఇమ్రాన్ ఖాన్ ముగ్గురు సోదరీమణుల అరెస్ట్
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులు ముగ్గురిని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) సెప్టెంబర్ 27న నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ అరెస్టులు జరిగాయి. ఇమ్రాన్ సోదరీమణులు అలీమా ఖాన్, డాక్టర్ ఉజ్మా ఖాన్, నరీన్ ఖాన్‌లను లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైలుకు తరలించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.పీటీఐ ప్రతినిధి జుల్ఫీ బుఖారీ తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్ పోలీసులు అలీమా ఖాన్ ఇంటిపై దాడి చేసి, ఇమ్రాన్ మరో ఇద్దరు సోదరీమణులతో పాటు ఆయన మేనల్లుళ్లు, వారి పిల్లలను అదుపులోకి తీసుకున్నారు. అయితే పిల్లలను తర్వాత విడుదల చేసినట్లు పీటీఐ సమాచార కార్యదర్శి షేక్ వక్వాస్ అక్రమ్ తెలిపారు. ముగ్గురు సోదరీమణులను కోట్ లఖ్‌పత్ జైలుకు పంపినట్లు ఆయన చెప్పారు.లాహోర్ డిప్యూటీ కమిషనర్ రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. పంజాబ్ ప్రావిన్స్‌లో అమల్లో ఉన్న ప్రజా శాంతి పరిరక్షణ చట్టం కింద ముగ్గురు సోదరీమణులను 30 రోజుల పాటు నిర్బంధించేందుకు ఈ ఉత్తర్వులు ఇచ్చినట్లు ఏఎఫ్‌పీ చూసిన వాటి ప్రతుల్లో పేర్కొంది. ఈ వ్యవహారంపై పంజాబ్ పోలీసులు స్పందించలేదు.ఇమ్రాన్ ఖాన్ పార్టీ సెప్టెంబర్ 27న నిరసన చేపట్టనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ నిరసనకు పిలుపు చట్టవిరుద్ధమని పాకిస్థాన్ సమాచార మంత్రి అత్తావుల్లా తరార్ అన్నారు. “వారు రహదారులను దిగ్బంధించి, ప్రజల జీవితాలకు అంతరాయం కలిగించేందుకు మేము అనుమతించం” అని ఆయన పేర్కొన్నారు.ఇమ్రాన్ ఖాన్ 2023 నుంచి జైలులో ఉన్నారు. గత ఏడాది చివర్లో అవినీతి ఆరోపణల కేసులో ఆయనకు, ఆయన భార్యకు 17 ఏళ్ల జైలు శిక్ష విధించారు. అయితే ఈ ఆరోపణలను ఇద్దరూ తిరస్కరించారు. 2018 నుంచి 2022 వరకు పాకిస్థాన్ ప్రధానిగా పనిచేసిన ఇమ్రాన్ ఖాన్.. అవిశ్వాస తీర్మానంతో పదవి కోల్పోయారు. -
వాణిజ్య యుద్ధం తర్వాత ఏఐ వార్.. అమెరికాకు వెళ్లనున్న జిన్‌పింగ్
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సెప్టెంబర్ 23 నుంచి 25 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు ఆయన వాషింగ్టన్ చేరుకోనున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాల అమలు, కీలక ఖనిజాల సరఫరా, సెమీకండక్టర్లు వంటి అంశాలు ఈ శిఖరాగ్ర భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.జిన్‌పింగ్ పర్యటనకు ముందు న్యూయార్క్‌లో అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్, చైనా ఉప ప్రధాని హీ లైఫెంగ్ నేతృత్వంలో చర్చలు జరిగాయి. గతంలో కుదిరిన ఆర్థిక, వాణిజ్య అవగాహనలను అమలు చేయడం, ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను పెంచడం, కృత్రిమ మేధపై చర్చించడం ఇందులో ఉన్నాయి. అమెరికా వైపు నుంచి రైతులు, తయారీదారులు, కార్మికులకు మార్కెట్ అవకాశాలు పెంచడం వంటి అంశాలపై దృష్టి పెట్టనున్నారు.జాతీయ భద్రత కోణంలో.. ఈ భేటీలో కృత్రిమ మేధకు సంబంధించి ప్రత్యేక సమాచార వ్యవస్థ ఏర్పాటు ప్రతిపాదన కూడా కీలకంగా మారింది. కృత్రిమ మేధ కారణంగా జాతీయ భద్రతకు ముప్పు కలిగించే స్థాయిలో ఏదైనా ఘటన జరిగితే ఇరు దేశాలు ముందుగానే ఒకరినొకరు అప్రమత్తం చేసుకునే విధంగా ఈ వ్యవస్థను రూపొందించాలని అమెరికా ప్రతిపాదించింది. దీనిని అనధికారికంగా ‘కృత్రిమ మేధ హాట్‌లైన్’గా పేర్కొంటున్నారు. అయితే ఏ పరిస్థితుల్లో సమాచారం తప్పనిసరిగా పంచుకోవాలన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. చైనా ఈ ప్రతిపాదనను అంగీకరించిందా లేదా అన్నది కూడా వెల్లడించలేదు.రేర్ ఎర్త్, కీలక ఖనిజాల సరఫరా కూడా ఇరు దేశాల మధ్య ప్రధాన వివాదాంశంగా ఉంది. సెమీకండక్టర్ల విషయంలో చైనాకు ఆ చిప్‌లు లభించే అవకాశాన్ని అమెరికా పరిమితం చేస్తోంది. అదే సమయంలో చైనా.. పరిమితుల మధ్య కూడా కృత్రిమ మేధ నమూనాలను అభివృద్ధి చేయగల సామర్థ్యాన్ని ప్రదర్శించింది. 2025లో అమెరికా సంస్థలు కృత్రిమ మేధ రంగంలో 285.9 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టగా, చైనా సంస్థల పెట్టుబడి 12.4 బిలియన్ డాలర్లుగా స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ 2026 కృత్రిమ మేధ సూచీ నివేదిక పేర్కొంది.వాణిజ్యంతో పాటు రష్యాపై అమెరికా ఆంక్షలు, ఇరాన్‌తో అమెరికా ఘర్షణ, తైవాన్, అరుదైన ఖనిజాలపై చైనా ఆధిపత్యం వంటి అంశాలు కూడా భేటీపై ప్రభావం చూపనున్నాయి. ఈ నేపథ్యంలో జిన్‌పింగ్-ట్రంప్ చర్చల్లో ఆర్థిక విభేదాల నిర్వహణతో పాటు కృత్రిమ మేధ రంగంలో ప్రమాదాలను నియంత్రించేందుకు ఇరు దేశాలు ఏ మేరకు సహకార మార్గాన్ని ఏర్పరచుకుంటాయన్నది కీలకంగా మారనుంది. -
ఇరాన్‌పై అమెరికా క్షిపణుల వర్షం
టెహ్రాన్: ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. దక్షిణ ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ ఓడరేవుపై అమెరికా పెద్ద ఎత్తున దాడి చేసిందని తెలిపింది. ఈ దాడిలో భారీగా ఆస్తి ప్రాణ నష్టం జరిగినట్లు ప్రకటించింది. అమెరికా క్షిపణుల అటాక్‌లో 12 మంది మరణించగా, ఏడుగురు గాయపడ్డారని పేర్కొంది. అదే విధంగా 760 వరకూ వాణిజ్య నౌకలు దెబ్బతిన్నాయని తెలిపింది. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.ఇరాన్ అధికారి తన ప్రకటనలో "అమెరికా దాడుల్లో 12 మంది మరణించగా, ఏడుగురు గాయపడ్డారు. 420 చేపల వేట నౌకలు (వీటిలో సుమారు 70 సాంప్రదాయ ధోలు, 350 చిన్న పడవలు ఉన్నాయి) 340 వాణిజ్య నౌకలు దెబ్బతిన్నాయి". అని న్యాయవ్యవస్థ ప్రతినిధి అలీ కజెమీ ప్రకటన విడుదల చేశారు. అయితే దీనిని అమెరికా ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.అయితే ఈ దాడులు ఎప్పుడు జరిగాయి, బాధ్యులను గానీ కజెమీ స్పష్టం చేయలేదు. అంతర్జాతీయ మానవతా చట్టం ప్రకారం విచక్షణ, అనుపాతం, ముందుజాగ్రత్త వంటి సూత్రాలను దాడి చేసినవారు ఉల్లంఘించారని ఆయన పేర్కొన్నారు. దీనిపై అధికారులు ఫిర్యాదులను నమోదు చేసుకుంటున్నారని, దాదాపు 300 నౌకల నష్ట వివరాల అంచనా పూర్తయ్యిందని పేర్కొన్నారు.పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలుకాగా అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా తమ దేశ పౌరులకు కీలక ఆదేశాలు జారీ చేసింది." ఏ కారణంతోనూ ఇరాన్‌కు వెళ్లొద్దు. అక్కడున్న అమెరికా పౌరులు ఇప్పుడే ఇరాన్ నుంచి బయిటకు వచ్చేయండీ" అని ప్రకటన విడుదల చేసింది. ఇరాన్లో భద్రతా పరిస్థితులు సంక్షిష్టంగా మారుతున్నాయని హెచ్చరించింది.అదే విధంగా అక్కడి నిరసనలకు, భారీ జన సమూహాలకు దూరంగా ఉండాలని అమెరికాతో బహిరంగంగా అనుబంధం ఉన్న ప్రాంతాలలో తక్కువ ప్రొఫైల్ పాటించాలని పేర్కొంది. వైమానిక దాడులు జరిగితే కిటీకీలు, అద్దాలు తలుపులకు దూరంగా ఉండాలని సూచించింది. ఈ నేపథ్యంలో అమెరికా మరోసారి ఇరాన్‌పై పెద్దఎత్తున దాడులకు తెగబడుతుందా అనే ఆందోళనలు సర్వత్రా నెలకొన్నాయి. -
మన గుమ్మడి నర్సయ్యలా.. స్టేషన్ బయట ఆ మాజీ ప్రధాని!
పదవి పోయినా జీవనశైలి మారలేదు. హోదా ఎంత పెద్దదైనా.. ప్రజలకు మాత్రం దూరం కాలేదు. రాజకీయాల్లో ఒకప్పుడు అత్యున్నత పదవిలో ఉన్న నేత.. ఇప్పుడు కూడా నిత్యం సామాన్యుల మధ్యే కనిపిస్తున్నారు. మన దగ్గర మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య సింప్లిసిటీకి, ప్రజాసేవకు ఎలా కేరాఫ్‌గా నిలిచారో.. జపాన్‌లో 69 ఏళ్ల మాజీ ప్రధాని యోషిహికో నోడా కూడా అదే తరహాలో ఆసక్తి రేపుతున్నారు.జపాన్ మాజీ ప్రధాని యోషిహికో నోడా(Yoshihiko Noda).. ఒకప్పుడు దేశాన్ని నడిపించిన నేత. ఇప్పుడు నిత్యం ఉదయాన్నే రైల్వే స్టేషన్‌కు వెళ్లి ప్రయాణికులకు కరపత్రాలు పంచుతున్నారు. తాజాగా చిబా ప్రిఫెక్చర్‌లోని మినామి-ఫునాబాషి స్టేషన్ వద్ద ఆయన అలా కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొందరు ఆయన్ని గుర్తించి పలకరించగా.. మరికొందరు బిజీగా ఉండటంతో కరపత్రాలు తీసుకోకుండానే వెళ్లిపోయారు. అయినా నోడా మాత్రం తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగారు. ఆయన తీరే అంత!ఇది నోడాకు కొత్త వ్యవహారం కాదు. గత నలభై ఏళ్లుగా ఆయన ఈ పని చేస్తూ వస్తున్నారు. మధ్యలో ఆయన రాజకీయ జీవితం ఎన్నో మలుపులు తిరిగింది. చిబా ప్రిఫెక్చర్ అసెంబ్లీ నుంచి జపాన్ పార్లమెంట్ వరకు ఎదిగారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 2011లో జపాన్ ప్రధానమంత్రి అయ్యారు. 2012లో ప్రధాని పదవి నుంచి తప్పుకున్నా.. స్టేషన్ వద్ద ప్రజలను కలుసుకునే అలవాటును మాత్రం వదులుకోలేదు.Japan ex-PM Noda hands out flyers pic.twitter.com/CWnEuDoZpK— RT (@RT_com) September 18, 2026ఇప్పుడు ఆయన పంచే కరపత్రాల్లో స్థానిక సమస్యలు, విపత్తు బీమా, పిల్లల సంరక్షణ, ప్రిఫెక్చర్ సంస్కరణలు వంటి అంశాలు ఉంటున్నాయి. అంటే.. పదవిలో ఉన్నా, లేకపోయినా ప్రజలతో నేరుగా మాట్లాడటానికే ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు.హోదా మారినా.. రొటీన్ మారలేదు1986 అక్టోబర్ 1న జేఆర్ సుడానుమా స్టేషన్ వద్ద కరపత్రాలు పంచడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఈ రొటీన్‌ను కొనసాగిస్తున్నారు. ఒక దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి.. ఏళ్ల తర్వాత కూడా ఉదయాన్నే రైల్వే స్టేషన్లో నిలబడి ప్రయాణికులకు కరపత్రాలు పంచడం ఆసక్తి కలిగిస్తోంది. పెద్ద కార్యక్రమాలు, భారీ హంగామా లేకుండా సాధారణంగా ప్రజలను కలవడం నోడా రాజకీయ జీవితంలో భాగంగా మారిపోయింది.మన దగ్గర గుమ్మడి నర్సయ్య కూడా ఇలాంటి సాదాసీదా జీవనశైలితోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇల్లెందు నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన.. హంగూ ఆర్భాటాలకు దూరంగా ఉండేవారు. బస్సులు, రైళ్లలో ప్రయాణించడం, సాధారణంగా ప్రజల మధ్య కనిపించడం ఆయన జీవనశైలిలో భాగంగా ఉండేది. అందుకే పదవి తర్వాత కూడా సాధారణ జీవనశైలిని కొనసాగిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండటం.. ఈ ఇద్దరి మధ్య పోలికకు కారణమైంది.ప్రధాని పదవి దేశ రాజకీయాల్లో అత్యున్నత హోదా. అయినా ఆ పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా ప్రజలను కలిసే విధానం మారలేదు. అలాగని ఆయన ఏదో వైరల్ కావడం కోసమో ఈ పని చేయడం లేదు. స్వచ్చందంగా కొందరు నెటిజన్లు ఆయన గురించి పోస్టులు చేస్తుంటారు. హోదా ఎంత పెద్దదైనా.. ప్రజల్లోకి వెళ్లడానికి పెద్ద కాన్వాయ్, హంగామా అవసరం లేదని నోడా రొటీన్ గుర్తుచేస్తోంది. ఈ సింప్లిసిటీ ఈ జనరేషన్ నేతల్లో ఉంటేనా.. సోషల్ మీడియా పోస్టులు, ఫొటోషూట్లకే పరిమితం కాకుండా.. ఇలా నేరుగా ప్రజల మధ్య కనిపించే రాజకీయాలు ఇంకెన్ని కనిపించేవో!.ఇదీ చదవండి: సినీ ఫక్కీలో బస్సును హైజాక్ చేసి.. -
కెనడాలో విమాన ప్రమాదం.. ఇద్దరు భారత విద్యార్థుల దుర్మరణం
వాంకోవర్: కెనడాలో వైమానిక శిక్షణ పొందుతున్న సమయంలో చోటుచేసుకున్న ప్రమాదంలో ఇద్దరు భారత విద్యార్థులు మరణించారు. మృతులను తమిళనాడుకు చెందిన మనోజ్ శివకుమార్, పుదుచ్చేరికి చెందిన శ్రీశరణ్ తిరుజ్ఞానసంబందంగా అధికారులు గుర్తించారు. ఈ దుర్ఘటనపై వాంకోవర్‌లోని భారత కాన్సులేట్ జనరల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఈ క్లిష్ట సమయంలో బాధితుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని, విద్యార్థుల మృతదేహాలను స్వదేశానికి తరలించేందుకు అవసరమైన సహాయాన్ని అందిస్తామని పేర్కొంది. The Consulate General of India, Vancouver, expresses its deepest condolences on the tragic demise of Shri Manoj Sivakumar and Shri Srisaran Thirugnanasambantham, two Indian students from Tamil Nadu and Puducherry, who lost their lives in a tragic air accident in Canada during…— India in Vancouver (@cgivancouver) September 20, 2026 -
భీకరంగా మారబోతున్న ఇరాన్ యుద్ధం!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముదురుతున్న వేళ అమెరికా కీలక హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణించవద్దని తన పౌరులను ఆదేశించింది. ఇప్పటికే అక్కడ ఉన్నవారు వెంటనే దేశం విడిచి వెళ్లాలని సూచించింది. పరిస్థితులు వేగంగా మారే అవకాశం ఉందని.. విమాన సర్వీసులు రద్దు కావడం, గగనతలం మూసివేయడం, సరిహద్దుల వద్ద ఆంక్షలు విధించడం వంటి పరిణామాలు ఎదురుకావొచ్చని హెచ్చరించింది.అమెరికా వర్చువల్ ఎంబసీ ఇన్ ఇరాన్ తాజాగా విడుదల చేసిన భద్రతా హెచ్చరికలో.. ‘‘ఏ కారణంతోనూ ఇరాన్‌కు వెళ్లొద్దు. అక్కడున్న అమెరికా పౌరులు ఇప్పుడే ఇరాన్ నుంచి బయటకు వచ్చేయండి’’ అని స్పష్టం చేసింది. ఇరాన్లో భద్రతా పరిస్థితులు సంక్లిష్టంగా మారుతున్నాయని ఆ హెచ్చరికలో పేర్కొంది. విమానాశ్రయాలు, విమానయాన సంస్థలు, సరిహద్దు మార్గాలకు సంబంధించిన పరిణామాలను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించింది. ఇతర దేశాలకు వెళ్లాలని భావించే వారు ఆయా దేశాల ప్రవేశ నిబంధనలను ముందుగానే తెలుసుకోవాలని తెలిపింది.అమెరికన్లకు పలు సూచనలుఇరాన్లో ఉన్న అమెరికన్లు నిరసనలు, భారీ జనసమూహాలకు దూరంగా ఉండాలని అమెరికా సూచించింది. అమెరికాతో బహిరంగంగా అనుబంధం ఉన్న ప్రాంతాల్లో తక్కువ ప్రొఫైల్ పాటించాలని తెలిపింది. వైమానిక దాడులు జరిగితే కిటికీలు, అద్దాల తలుపులకు దూరంగా ఉండాలని.. కూలిన శిథిలాల వైపు వెళ్లొద్దని హెచ్చరించింది.అత్యవసర పరిస్థితుల్లో దౌత్య అధికారులను సంప్రదించేందుకు ‘స్మార్ట్ ట్రావెలర్ ఎన్రోల్మెంట్ ప్రోగ్రామ్ (STEP)’లో నమోదు చేసుకోవాలని సూచించింది. పశ్చిమాసియాలో ప్రయాణించే లేదంటే ఆ ప్రాంతం మీదుగా వెళ్లే అమెరికన్లు అప్రమత్తంగా ఉండాలని.. విమాన సర్వీసులు, గగనతల మార్గాల్లో ఆకస్మిక మార్పులు, రద్దులు జరిగే అవకాశం ఉందని అమెరికా తాజాగా హెచ్చరించింది.హౌతీల దాడులతో మరింత టెన్షన్అమెరికా–ఇరాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో.. ఇరాన్ మద్దతున్న హౌతీల కార్యకలాపాలను కూడా అమెరికా ప్రస్తావించింది. సౌదీ అరేబియాపై, ముఖ్యంగా పౌర విమానాశ్రయాలపై హౌతీలు దాడులకు పాల్పడ్డారని తెలిపింది. ప్రస్తుత సైనిక ఘర్షణలు వేగంగా మరింత విస్తరించే అవకాశం ఉందని హెచ్చరించింది.ఇరాన్‌కు మద్దతిచ్చే గ్రూపులు అమెరికా ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని అమెరికా పేర్కొంది. మధ్యప్రాచ్యంతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ గతంలో అమెరికా దౌత్య కార్యాలయాలు, సంస్థలు లక్ష్యంగా దాడులు జరిగిన విషయాన్ని గుర్తుచేసింది. అమెరికా వ్యాపార సంస్థలు, సంస్థలు, ఇతర ప్రయోజనాలపైనా ముప్పు ఉండొచ్చని తెలిపింది.సౌదీలోనూ ఆంక్షలుఇరాన్తో పాటు సౌదీ అరేబియాలో ఉన్న అమెరికన్లకు కూడా ఇటీవల భద్రతా సూచనలు జారీ అయ్యాయి. హౌతీల దాడుల నేపథ్యంలో తైఫ్, యన్బు ప్రాంతాలకు అమెరికా ప్రభుత్వ ఉద్యోగులు అధికారిక లేదా వ్యక్తిగత ప్రయాణాలు చేయాలంటే ప్రత్యేక అనుమతి తీసుకోవాలని సూచించింది. మరోవైపు రియాద్ వైపు బాలిస్టిక్ క్షిపణి దూసుకురావడంతో సౌదీ అధికారులు అత్యవసర హెచ్చరిక జారీ చేశారు. ఆ క్షిపణిని అడ్డుకున్నట్లు సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు తెలిపాయి. బిష్, తైఫ్, ఫరాసాన్, యన్బు ప్రాంతాల్లో పౌరులు, మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని దాడులకు ప్రయత్నాలు జరిగినట్లు పేర్కొన్నాయి. హౌతీల దాడులను ఖతార్ ఖండిస్తూ.. సౌదీ అరేబియాకు సంఘీభావం ప్రకటించింది.ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్ అంతర్జాతీయ రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. భద్రతా పరిస్థితులు, గగనతల పరిమితులు, విమాన మార్గాల్లో మార్పుల కారణంగా పలు అంతర్జాతీయ సర్వీసులు రద్దు లేదా నిలిపివేతకు గురయ్యాయి. అయితే గల్ఫ్ ప్రాంతంలోని అన్ని విమాన మార్గాలు పూర్తిగా మూసుకుపోలేదు. కొన్ని రూట్లలో సర్వీసులు కొనసాగుతున్నప్పటికీ.. విమాన సంస్థలు పరిస్థితిని బట్టి షెడ్యూళ్లను మార్చుతున్నాయి. తాజాగా ఇరాన్ నుంచి వచ్చే అంతర్జాతీయ విమానాల్లో దాదాపు మూడో వంతు రద్దైనట్లు సమాచారం. మాహాన్ ఎయిర్ కూడా ఇస్తాంబుల్, అంకారా, మస్కట్ వంటి అంతర్జాతీయ మార్గాల్లో సర్వీసులను నిలిపివేసింది. దీంతో ఇరాన్‌కు ప్రయాణం చేయడం, అక్కడి నుంచి బయటకు రావడం గతంతో పోలిస్తే మరింత కష్టంగా మారింది. మరోవైపు అమెరికా–ఇరాన్ మధ్య దౌత్య సంబంధాలు తీవ్ర ఉద్రిక్తతలో ఉన్నప్పటికీ.. చర్చలకు సంబంధించిన మార్గాలు పూర్తిగా మూసుకుపోలేదు. సెప్టెంబర్ 20న ట్రంప్ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో సమావేశానికి తాను సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇవ్వగా.. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ యూఎన్ జనరల్ అసెంబ్లీకి వెళ్లే కార్యక్రమంలో భాగంగా దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. చైనా కూడా ఇరాన్, అమెరికా సంయమనం పాటించి జూన్‌లో కుదిరిన శాంతి ఒప్పందానికి తిరిగి రావాలని కోరుతోంది. అంటే.. ఒకవైపు సైనిక ఉద్రిక్తతలు, మరోవైపు పరోక్ష దౌత్య ప్రయత్నాలు ఏకకాలంలో కొనసాగుతున్నాయి.ఇదీ చదవండి: మొసలి కన్నీరుపై ఇరాన్ ఫైర్ -
ఏఐతో వైద్యరంగం గందరగోళం.. సమస్య ఎక్కడుంది?
వైద్య రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం రోజురోజుకూ విస్తరిస్తోంది. ముఖ్యంగా స్కాన్లను విశ్లేషించడం, అసాధారణ పరిస్థితులను గుర్తించడంలో ఏఐ ఇప్పటికే స్థానం సంపాదించింది. అయితే చికిత్సలను సూచించడం, క్లినికల్ నిర్ణయాలకు సహకరించడం వంటి స్కాన్లకు మించిన వినియోగాల విషయంలో వైద్యులు మాత్రం వెనకడుగు వేస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఏఐ సామర్థ్యంపై వాస్తవ ప్రపంచంలో సరిపడా ఆధారాలు లేకపోవడమేనని వారు చెబుతున్నారు.స్కాన్లలో ఏఐకి స్పష్టమైన ఆధారం ఎక్కడ?ఇమేజింగ్ రంగంలో ఏఐకి ఆదరణ లభించడానికి ఒక ముఖ్య కారణం దాని పనితీరును సులభంగా గుర్తించే అవకాశం ఉండటం. ఒక స్కాన్‌ను ఏఐ సరిగ్గా చదివిందా? అందులోని అసాధారణ పరిస్థితిని గుర్తించిందా? అనే విషయాలను స్పష్టమైన ఫలితాలతో పోల్చుకోవచ్చు. దీంతో ఏఐ పనితీరును నిర్ధారించడం కొంత సులభమైంది. అయితే చికిత్స సూచనలు లేదా క్లినికల్ నిర్ణయాలకు సంబంధించిన ఏఐ సాధనాల పనితీరును అంచనా వేయడం అంత సులభం కాదు.‘ఎవిడెన్స్ గ్యాప్’పై వైద్యుల అనుమానాలురేడియాలజీ, డయాగ్నస్టిక్స్ పరిధిని దాటి ఆసుపత్రుల్లోకి ఏఐ సాధనాలను తీసుకెళ్లేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. అయితే వైద్యులు మాత్రం ముందుగా వాటి వాస్తవ పనితీరుకు సంబంధించిన ఆధారాలను చూపించాలని కోరుతున్నారు. కొత్త ఔషధం లేదా వైద్య పరికరాన్ని ఉపయోగించే ముందు దాని ప్రభావం, భద్రతపై ఆధారాలు కోరినట్లుగానే ఏఐ విషయంలోనూ అదే ప్రమాణాలను పాటించాలని వారు భావిస్తున్నారు. ఈ కారణంగా కొన్ని ఏఐ ప్రాజెక్టులు ఆసుపత్రుల్లో వినియోగ దశకు చేరకముందే కొనుగోలు ప్రక్రియలోనే నిలిచిపోతున్నాయి.74 శాతం మందిని వేధిస్తున్న ‘డెస్కిల్లింగ్’ భయం?2026లో అమెరికాకు చెందిన వైద్యులు, నర్సులపై నిర్వహించిన ఓ సర్వేలో రెండు అంశాలు ప్రత్యేకంగా ఆందోళన కలిగిస్తున్నట్లు వెల్లడైంది. 74 శాతం మంది ఏఐపై అధికంగా ఆధారపడటం వల్ల వైద్య నిపుణుల స్వంత నైపుణ్యాలు క్రమంగా తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఏఐ తప్పు చేసినప్పుడు దాన్ని గుర్తించే మానవ సామర్థ్యం కూడా తగ్గిపోవచ్చని వారు భావిస్తున్నారు. దీనినే ‘డెస్కిల్లింగ్’గా పేర్కొంటున్నారు. అదే సర్వేలో మరో 74 శాతం మంది ఏఐ తప్పుడు సమాచారాన్ని నమ్మకంగా అందించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఉదాహరణకు లేని వైద్య అధ్యయనాలను ఉన్నట్లుగా పేర్కొనడం లేదా తప్పు సమాచారాన్ని వాస్తవంలా చూపించడం వంటి సమస్యలు వైద్య రంగంలో తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు. ఏఐపై ఆధారపడే కొద్దీ దాని తప్పులను గుర్తించే మానవ పరిశీలనా సామర్థ్యం తగ్గితే ఈ రెండు ప్రమాదాలు పరస్పరం మరింత ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది.మార్పును వ్యతిరేకిస్తున్నారా?వైద్యులు ఏఐని వ్యతిరేకిస్తున్నారని చెప్పడం కంటే, ఆధారాల కోసం వారు పట్టుబడుతున్నారని చెప్పవచ్చు. వైద్య నిర్ణయాల్లో పొరపాట్ల ప్రభావం నేరుగా రోగులపై పడే అవకాశం ఉండటంతో కొత్త సాంకేతికతను స్వీకరించే ముందు దాని ప్రభావానికి ఆధారాలు ఉండాలని వైద్య రంగం కోరుతోంది. ఏఐ సాధనం పనిచేస్తున్నదని నిరూపించాల్సిన బాధ్యత దాన్ని అభివృద్ధి చేసి విక్రయించే సంస్థలపైనే ఉండాలని వైద్యులు భావిస్తున్నారు.ఉపయోగకరమైన ఏఐని స్వాగతించాలిఅయితే అతిగా జాగ్రత్త వహించడం వల్ల ఉపయోగకరమైన సాంకేతికతలను కూడా దూరం చేసే ప్రమాదం ఉంది. పత్రాల నిర్వహణను తగ్గించడం, ఔషధాల మధ్య ప్రమాదకర పరస్పర చర్యలను గుర్తించడం, వైద్యులకు రోగులతో ఎక్కువ సమయం గడిపే అవకాశం కల్పించడం వంటి ప్రయోజనాలను కొన్ని ఏఐ సాధనాలు అందించే అవకాశం ఉంది. అందువల్ల పూర్తిగా అవును లేదా కాదు అనే విధానం కంటే, వాస్తవ ప్రపంచ అధ్యయనాలు, పనితీరు నిర్ధారణ, స్పష్టమైన పర్యవేక్షణ వ్యవస్థలతో దశలవారీగా ఏఐని అమలు చేయడం కీలకంగా మారుతోంది. వైద్యుల నైపుణ్యాలను తగ్గించకుండా వాటిని మరింత బలోపేతం చేసే విధంగా ఏఐని రూపొందించడం భవిష్యత్తులో ముఖ్యమైన అంశంగా మారనుంది. ఇదీ చదవండి: ఐదు నిమిషాల టెస్ట్‌తో అల్జీమర్స్ బయటపడుతుందా? -
రష్యాలో పుతిన్ పవర్.. ఎన్నికల్లో భారీ ఆధిక్యం!
యుద్ధం.. డ్రోన్ల దాడులు.. ఆర్థిక ఒత్తిళ్లు.. ఎన్ని సవాళ్లు ఎదురైనా రష్యాలో పుతిన్ రాజకీయ ఆధిపత్యానికి ఎదురులేకుండా పోయింది. పార్లమెంటు ఎన్నికల్లో అధికార యునైటెడ్ రష్యా పార్టీ 57.5 శాతం ఓట్లతో దూసుకెళ్తోంది. ఉక్రెయిన్‌తో యుద్ధంపై ప్రజల మద్దతును పరీక్షించుకునేందుకు జరిగిన ఈ ఎన్నికల్లోనూ పుతిన్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రతిపక్షాలు వెనుకబడగా.. రష్యా రాజకీయాల్లో పుతిన్ పట్టు మరోసారి చర్చనీయాంశంగా మారింది.ఉక్రెయిన్‌తో యుద్ధం ఐదో ఏడాదిలోకి అడుగుపెట్టిన వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు కీలక రాజకీయ పరీక్ష ఎదురైంది. అయినప్పటికీ పార్లమెంటు ఎన్నికల్లో ఆయనకు చెందిన అధికార యునైటెడ్ రష్యా పార్టీ భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది. పాక్షిక అధికారిక ఫలితాల ప్రకారం ఆ పార్టీకి 57.5 శాతం ఓట్లు లభించాయి. అయితే ఇవి తుది ఫలితాలు కావు. 450 మంది సభ్యులున్న రష్యా స్టేట్ డూమాలో మెజారిటీ సాధించే దిశగా అధికార పార్టీ ముందుకు సాగుతోంది. కమ్యూనిస్ట్ పార్టీ, ఎల్‌డీపీఆర్, న్యూ పీపుల్, జస్ట్ రష్యా పార్టీలు చాలా వెనుకబడి ఉన్నప్పటికీ పార్లమెంటులో స్థానాలు దక్కించుకునే అవకాశముంది.సెప్టెంబర్ 18–20 మధ్య మూడు రోజుల పాటు పోలింగ్ జరిగింది. సెప్టెంబర్ 21 నాటికి వెలువడిన పాక్షిక ఫలితాల్లో యునైటెడ్ రష్యా 57.5 శాతం ఓట్లతో ముందంజలో ఉంది. గత ఎన్నికలతో పోలిస్తే 2021 ఎన్నికల్లో యునైటెడ్ రష్యా పార్టీకి 49.82 శాతం ఓట్లు వచ్చాయి. తాజా ఎన్నికల్లోని 57.5 శాతం పాక్షిక ఫలితంతో పోలిస్తే దాదాపు 7.7 శాతం పాయింట్ల ఆధిక్యం కనిపిస్తోంది. ప్రతిపక్షాల పరిస్థితి ఇలా ఉంది. ప్రాథమిక లెక్కల్లో కమ్యూనిస్ట్ పార్టీ 13.67 శాతం, ఎల్‌డీపీఆర్ 9.27 శాతం, న్యూ పీపుల్ 7.96 శాతం, జస్ట్ రష్యా 5.16 శాతం ఓట్లతో ఉన్నట్లు ఒక నివేదిక వెల్లడించింది. ఈ గణాంకాలు పాక్షిక లెక్కల ఆధారంగా వచ్చినవే.BREAKING! 🇷🇺Preliminary results. Putin and Medvedev's "United Russia" party is leading with 57% in the State Duma elections. The other parties got from 1 to 7 percent of the votes.pic.twitter.com/SKQtov4R8A— Дepлorabлe Russian🔹 (@TeaTramRussia) September 20, 2026పుతిన్ తన ప్రభుత్వ విధానాలకు, ఉక్రెయిన్ యుద్ధానికి ప్రజల మద్దతు ఉందా లేదా అన్నదానికి ఈ ఎన్నికలను పరీక్షగా అభివర్ణించారు. మాజీ అధ్యక్షుడు, రష్యా భద్రతా మండలి ఉపాధ్యక్షుడు దిమిత్రి మెద్వెదెవ్.. యునైటెడ్ రష్యా గౌరవప్రదమైన ఫలితాన్ని సాధించిందని, దేశాన్ని పాలించే బాధ్యతను ప్రజలు మరోసారి ఆ పార్టీకి అప్పగించారని వ్యాఖ్యానించారు.యుద్ధ వ్యతిరేక అభ్యర్థులకు అవకాశం నిరాకరణయుద్ధాన్ని వ్యతిరేకించే పలువురు అభ్యర్థులకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కలేదు. ఉదారవాద యాబ్లోకో పార్టీకి చెందిన నేతలు కూడా తమ స్వేచ్ఛపై ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ యుద్ధంపై వ్యాఖ్యల నేపథ్యంలో తమ పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ నేతలకు కోర్టులు సుదీర్ఘ జైలు శిక్షలు విధించడమే ఇందుకు కారణమని వారు పేర్కొన్నారు. రష్యాలో సైన్యాన్ని అప్రతిష్ఠపరిచేలా మాట్లాడటం, అధికారులు తప్పుడు వార్తలుగా పరిగణించే సమాచారాన్ని వ్యాప్తి చేయడం వంటి చర్యలకు సుదీర్ఘ జైలు శిక్షలు విధించే అవకాశం ఉంది.సైబర్ దాడుల మధ్య ఓటింగ్ఎన్నికల వ్యవస్థలపై పెద్ద ఎత్తున సైబర్ దాడులు జరిగినట్లు రష్యా ఎన్నికల అధికారులు తెలిపారు. అయినప్పటికీ ఓటింగ్ ప్రక్రియ చాలావరకు సజావుగా సాగిందని పేర్కొన్నారు. మాస్కో స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రానికి పోలింగ్ శాతం దాదాపు 57కు చేరినట్లు కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాలు వెల్లడించాయి. ప్రభుత్వాన్ని వ్యతిరేకించే రష్యన్లు మధ్యాహ్నం 12 గంటలకు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని నిరసన తెలపాలని ప్రవాస ప్రతిపక్ష నేతలు పిలుపునిచ్చారు. కొన్ని ప్రాంతాల్లో పొడవైన క్యూలు కనిపించినప్పటికీ.. ఈ నిరసన ఎన్నికల ఫలితాలపై ఎంతవరకు ప్రభావం చూపిందన్నది స్పష్టంగా తెలియలేదు.Ukraine launched its "largest ever" drone barrage against Moscow during the final day of Russia's parliamentary elections.The attack — involving over 1,000 drones nationwide — struck a major Moscow oil refinery, sending heavy flames and smoke into the sky and leaving at least… pic.twitter.com/0G2gmmpopr— Fox News (@FoxNews) September 20, 2026ఎన్నికల వేళ మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడిరష్యా ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే మాస్కోతో పాటు పలు ప్రాంతాలపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడులకు పాల్పడినట్లు రష్యా అధికారులు వెల్లడించారు. మాస్కో ప్రాంతంలో ముగ్గురు, రష్యా ఆధీనంలోని ఉక్రెయిన్ ఖెర్సన్ ప్రాంతంలో మరో ఇద్దరు మరణించినట్లు తెలిపారు. మృతుల్లో ఎన్నికల అధికారి కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. ఎన్నికలను అడ్డుకునేందుకే ఈ దాడులు జరిగాయని మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ ఆరోపించారు. అయితే వాటి వల్ల ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలగలేదని చెప్పారు.ఇక, ఎన్నికల ఫలితాలను పుతిన్ ప్రభుత్వం తన విధానాలకు, ఉక్రెయిన్ యుద్ధానికి ప్రజల మద్దతు ఉందనడానికి నిదర్శనంగా చూపించే అవకాశం ఉంది. అయితే యుద్ధం కొనసాగుతున్న వేళ ప్రజల ఆర్థిక ఆందోళనలు, ప్రతిపక్ష పార్టీలకు లభించే మద్దతు రష్యా రాజకీయ పరిణామాల్లో కీలకంగా మారనున్నాయి.Ukraine launched MASSIVE ATTACK in attempt to DISRUPT Russia ELECTIONS — Russian MoD1,951 DRONES and 8 FLAMINGO MISSILES shot down in 24 HOURSMOSCOW WARNS RESPONSE IS COMING as STRIKES ON Kiev set to INTENSIFY pic.twitter.com/Fsm3mW3KG8— RT (@RT_com) September 20, 2026 -
ఇరాన్ చుట్టూ ఉచ్చు.. మూడు వైపులా టెన్షన్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి వేడెక్కాయి. ఒకవైపు అమెరికా–ఇరాన్ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరగా.. మరోవైపు ఇరాన్ మద్దతున్న హౌతీలు సౌదీ అరేబియా రాజధాని రియాద్‌పై క్షిపణులు, డ్రోన్లతో దాడికి దిగారు. ఇదే సమయంలో ఇరాన్–ఫ్రాన్స్ మధ్య దౌత్య వివాదం కూడా ముదురుతోంది. దీంతో ఇప్పటికే నెలలుగా కొనసాగుతున్న ప్రాంతీయ సంక్షోభం కొత్త మలుపు తీసుకుంటోంది.అమెరికా కొత్త దాడికి సిద్ధమవుతోందన్న సమాచారం తమ వద్ద ఉందని ఇరాన్ సైన్యం ప్రకటించింది. అమెరికా లేదా దాని మిత్రదేశాలు మరోసారి దాడి చేస్తే.. ఈసారి ప్రతిస్పందన పరిమితం కాదని, అమెరికా స్థావరాలు.. ప్రయోజనాలపై సుదీర్ఘంగా దాడులు కొనసాగిస్తామని ఇరాన్ సైనిక కమాండ్ హెచ్చరించింది. అమెరికా మిత్రదేశాలను కూడా ఈ ఘర్షణలో భాగస్వాములుగానే పరిగణిస్తామని స్పష్టం చేసింది.మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇరాన్‌పై ఒత్తిడి పెంచారు. ఒప్పందానికి ముందుకు రావాలని.. లేదంటే ఇరాన్ ఆర్థికంగా మరింత కుదేలవుతుందని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఈ వారంలో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి న్యూయార్క్ వెళ్లనున్న నేపథ్యంలో ఆయనతో భేటీకి తాను సిద్ధంగా ఉన్నానని ట్రంప్ చెప్పడం గమనార్హం. రియాద్‌పై హౌతీల మెరుపుదాడిఇదిలా ఉండగానే యెమెన్‌లోని ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు సౌదీ రాజధాని రియాద్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. సెప్టెంబర్ 19న క్షిపణి, డ్రోన్లతో దాడి ప్రయత్నం జరిగినట్లు సౌదీ అరేబియా ధ్రువీకరించింది. రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో భారీ పేలుడుతో దట్టమైన పొగ అలుముకుంది. అయితే సౌదీ నేతృత్వంలోని కూటమి ఆ దాడిని అడ్డుకున్నట్లు తెలిపింది. పెద్దగా నష్టమూ జరగలేదని వెల్లడించింది. హౌతీలు రియాద్‌తో పాటు యాన్బు, తాయిఫ్, బైష్, ఫరాసాన్ ప్రాంతాల్లోనూ దాడులకు ప్రయత్నించినట్లు సమాచారం. యాన్బు సౌదీ చమురు ఎగుమతులకు కీలక కేంద్రం కావడంతో ఈ దాడులు మరింత ఆందోళనకు కారణమయ్యాయి. ఎందుకంత కీలకం బాబ్-ఎల్-మండేబ్..యెమెన్‌లో హౌతీల దూకుడు ఇటీవలి రోజుల్లో మరింత పెరిగింది. వ్యూహాత్మకమైన మొఖా ప్రాంతంతో పాటు బాబ్ ఎల్ మందెబ్ జలసంధికి సమీప ప్రాంతాలపై వారి పట్టు పెరిగింది. ఈ మార్గం ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌తో కలుపుతుంది. ఆసియా–యూరప్ మధ్య నౌకాయానానికి ఇది కీలకమైన మార్గం.ఇప్పటికే హర్ముజ్ జలసంధిలో ఇరాన్ ఆంక్షల కారణంగా ఇంధన రవాణాపై తీవ్ర ఒత్తిడి ఉంది. ఇప్పుడు బాబ్ ఎల్ వద్ద కూడా భద్రతా సమస్యలు పెరగడంతో ప్రపంచ చమురు సరఫరాపై ఆందోళన మరింత పెరిగింది. హౌతీల దాడుల నేపథ్యంలో సౌదీ చమురు ఎగుమతుల మార్గాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. తాజా పరిణామాల్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగానే కొనసాగుతోంది. చైనాకు కూడా టెన్షన్.. ఇరాన్‌పై ఒత్తిడిహౌతీల దూకుడుతో సౌదీ మాత్రమే కాకుండా చైనా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ఓ ప్రముఖ మీడియా సంస్థ కథనం ఇచ్చింది. సౌదీ విజ్ఞప్తి నేపథ్యంలో హౌతీలను అదుపులో ఉంచేందుకు ఇరాన్‌పై చైనా ప్రైవేటుగా ఒత్తిడి తెచ్చినట్లు మూడు ఇరాన్ వర్గాలను ఉటంకిస్తూ ఆ వార్తను ప్రచురించింది. ఎర్ర సముద్ర మార్గం చైనా వాణిజ్యానికి కూడా కీలకం కావడంతో ఈ పరిణామాలను బీజింగ్ నిశితంగా గమనిస్తోంది. ఇటు ఫ్రాన్స్‌తోనూ కొత్త వివాదంఇక ఇరాన్–ఫ్రాన్స్ సంబంధాల్లోనూ కొత్త చిచ్చు రేగింది. టెహ్రాన్‌లో ఫ్రెంచ్ రాయబార కార్యాలయానికి అనుబంధంగా ఉన్న ఫ్రెంచ్ భాషా కేంద్రాన్ని ఇరాన్ అధికారులు మూసివేశారు. సరైన లైసెన్స్ లేకుండా కార్యకలాపాలు నిర్వహించడంతో పాటు జాతీయ భద్రతకు వ్యతిరేకమైన చర్యలకు పాల్పడిందని ఇరాన్ ఆరోపించింది. వ్యక్తుల నెట్‌వర్క్‌లను నిర్మించడం, నైపుణ్యం ఉన్న ఇరానియన్లు దేశం విడిచి వెళ్లేందుకు సహకరించడం వంటి ఆరోపణలను కూడా చేసింది. అయితే ఫ్రాన్స్ ఈ చర్యను తీవ్రంగా ఖండించింది. తమ సాంస్కృతిక సంస్థలపై మరో దాడిగా అభివర్ణించింది. ఇరాన్ రాయబారిని పిలిపించి వివరణ కోరనున్నట్లు ప్రకటించింది. ఈ వివాదం ఇప్పటికే ఇరుదేశాల మధ్య ఉన్న దౌత్య ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది. ‘మొసలి కన్నీరు’ అంటూ ఫైర్ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్-నోయెల్ బారో ఇరాన్లో మానవ హక్కుల పరిస్థితిపై చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తీవ్రంగా స్పందించారు. ఫ్రాన్స్ గతంలో అల్జీరియాలో చేసిన చర్యలను ప్రస్తావిస్తూ.. ఇరాన్‌పై ఇప్పుడు సానుభూతి చూపడం ‘మొసలి కన్నీరు’ అంటూ బారోను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అమెరికా దాడుల్లో ఇరాన్ పాఠశాల విద్యార్థులు చనిపోయిన సమయంలో ఫ్రాన్స్ మౌనం వహించిందని కూడా అరాఘ్చీ ఆరోపించారు.ఒకవైపు చర్చలు.. మరోవైపు దాడులుఇలా చూస్తే ప్రస్తుతం ఇరాన్ చుట్టూ ఒకేసారి పలు స్థాయిల్లో ఉద్రిక్తతలు కనిపిస్తున్నాయి. అమెరికాతో ప్రత్యక్ష ఘర్షణ మళ్లీ ముదిరే సంకేతాలు, సౌదీపై హౌతీల దాడులు, హర్ముజ్–బాబ్ ఎల్ మండేబ్ జలమార్గాలపై ఒత్తిడి, ఫ్రాన్స్‌తో దౌత్య వివాదం.. ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడుతున్నాయి.అయితే ఇదే సమయంలో చర్చలకు అవకాశం పూర్తిగా మూసుకుపోలేదు. ట్రంప్–ఇరాన్ మధ్య కఠిన ప్రకటనలు కొనసాగుతున్నప్పటికీ, ఇరాన్ అధ్యక్షుడితో భేటీకి ట్రంప్ సిద్ధంగా ఉన్నట్లు చెప్పడం దౌత్య మార్గం ఇంకా తెరిచే ఉందనే సంకేతంగా నిలుస్తోంది. మరోవైపు హౌతీలను నియంత్రించేందుకు చైనా ప్రయత్నాలు కూడా తెరవెనుక దౌత్యం కొనసాగుతున్నట్లు సూచిస్తున్నాయి.ఇదీ చదవండి: ఆ ఏడు కండీషన్స్‌తో ఇరాన్ యుద్ధం ముగిసేనా? -
ఆ తోరణం సైనిక స్థావరం
వాషింగ్టన్: రాజధాని వాషింగ్టన్ డీసీలో లింకన్ మెమోరియల్, ఆర్లింగ్టన్ నేషనల్ సెమెట్రీ మధ్య తాను నిర్మించాలనుకుంటున్న భారీ తోరణం ఒక అత్యున్నత శ్రేణి సైనిక స్థావరంగానూ ఉపయోగపడనుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఇక్కడ మందుగుండు సామగ్రిని నిల్వ చేయడంతోపాటు డ్రోన్లు నిల్వ చేయవచ్చని, స్నైపర్లను మొహరించవచ్చని ఆయన వెల్లడించారు. అధ్యక్షుని అధికారిక భవనంతోపాటు వాషింగ్టన్ డీసీ నగరాన్ని సుందరీకరించడానికి తాను చేపట్టిన ప్రాజెక్టులు రక్షణ అవసరాలను సైతం తీరుస్తాయని ట్రంప్ చాలా రోజులుగా వాదిస్తున్న విషయం తెల్సిందే. వైట్‌హౌస్ ప్రాంగణంలో నిర్మిస్తున్న నూతన బాల్‌రూమ్‌ను ‘సైనిక సముదాయం’గా ఆయన అభివర్ణించారు. జాతీయ భద్రతా ప్రయోజనాల కోసం ఇది అవసరమని ఆయన తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. అమెరికా సైన్యం అభ్యర్థన మేరకు 250 అడుగుల ఎత్తయిన స్మారక తోరణాన్ని సైనిక సముదాయంగా/విజయ తోరణంగా మార్చడానికి తాను అంగీకరించినట్లు ట్రంప్ ఆదివారం సోషల్ మీడియా పోస్టులో వెల్లడించారు. -
నేపాల్ వరదల్లో హృదయవిదారకం.. 6 వేల మంది గల్లంతు!
నేపాల్‌లో వరదలు ఎంతటి బీభత్సాన్ని సృష్టించాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అకస్మాత్తుగా వచ్చిన వరదలు భయానక ప్రళయాన్ని సృష్టించి 1400 మందికి పైగా పొట్టన పెట్టుకున్నాయి. అయితే వరదల బీభత్సం సృష్టించి నాలుగు వారాలు గడుస్తోన్నా అందులో గల్లంతైన వారి ఆచూకీ ఇంకా లభించలేదు. దీంతో బాధితుల ఉనికిపై ఆందోళన వ్యక్తమవుతుంది.నేపాల్‌లో గత నెల సంభవించిన ఆకస్మిక వరదలకు నాలుగు వారాలు గడిచినా సహాయక, గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. సుమారు 6,000 మంది ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.నేపాల్-టిబెట్ సరిహద్దుకు సమీపంలో ఉద్భవించిన ఈ భారీ వరదలు ఉత్తర, మధ్య నేపాల్‌లోని పట్టణాలు, గ్రామాలను తీవ్రంగా దెబ్బతీశాయి. ఇళ్లు, భవనాలు, వాహనాలు మాత్రమే కాకుండా ప్రజలు కూడా వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. భోటేకోశి నది ఉప్పొంగి భారీగా వరద నీటిని దిగువ ప్రాంతాలకు తీసుకెళ్లడంతో కొన్ని నిమిషాల్లోనే అనేక ప్రాంతాలు ధ్వంసమయ్యాయి.1,450 దాటిన మృతుల సంఖ్యనేపాల్ పోలీసుల ప్రకటన ప్రకారం, ఆగస్టు 26న సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 1,451కి చేరింది. ప్రభావిత ప్రాంతాల నుంచి మరిన్ని మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీయడంతో మృతుల సంఖ్య పెరిగింది. జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా చిత్వన్ జిల్లాలో 367 మృతదేహాలను అధికారులు వెలికితీశారు. రసువా జిల్లాలో 236, నావల్పరాసి ఈస్ట్‌లో 232, నావల్పరాసి వెస్ట్‌లో 222 మృతదేహాలు లభించాయి. అదేవిధంగా నువాకోట్ జిల్లాలో 203, గోర్ఖాలో 79, ధాదింగ్లో 72, తనహున్లో 38 మృతదేహాలను వెలికితీశారు. చికిత్స పొందుతూ కాఠ్మాండు ఆసుపత్రిలో మరో ఇద్దరు మరణించారు.6,000 మంది ఆచూకీ కోసం గాలింపుఅధికారుల అంచనా ప్రకారం సుమారు 6,000 మంది ఇప్పటికీ గల్లంతైన వారి జాబితాలో ఉన్నారు. వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రసువా, దాని పొరుగు జిల్లాల్లోని నదీ పరివాహక ప్రాంతాలు, వరదలతో పేరుకుపోయిన శిథిలాల ప్రాంతాలు, దెబ్బతిన్న జలవిద్యుత్ ప్రాజెక్టులను సహాయక బృందాలు విస్తృతంగా పరిశీలిస్తున్నాయి. వరదలు నేపాల్‌ను తీవ్రంగా దెబ్బతీసి దాదాపు నెలరోజులు గడిచినా గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది.రసువాలోని అప్పర్ త్రిశూలీ-1 జలవిద్యుత్ ప్రాజెక్టులో కూడా 17 మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి. అవి రీన్ఫోర్స్మెంట్ మెష్‌లో చిక్కుకుని, బురదలో కూరుకుపోయి కనిపించాయి. ఈ మృతదేహాలను బయటకు తీయడానికి రెస్క్యూ సిబ్బంది గ్రైండర్లు, గ్యాస్ కట్టర్లు, రోటరీ పరికరాలను ఉపయోగించారు.మృతదేహాల గుర్తింపులో ఇబ్బందులురెస్క్యూ, గాలింపు చర్యలు కొనసాగుతున్నప్పటికీ మృతదేహాలను గుర్తించడం అధికారులకు మరో పెద్ద సవాలుగా మారింది. వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన అనేక మృతదేహాలు చాలాకాలం నీటిలో, బురదలో ఉండటంతో కుళ్లిపోయాయి. కొన్ని మృతదేహాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి, మరికొన్ని పూర్తిగా కాకుండా శరీర భాగాల రూపంలో మాత్రమే లభించాయి. దీంతో వాటిని గుర్తించడం కష్టంగా మారింది. -
పాక్ ఆర్మీ కాన్వాయిపై ఉగ్రవాదుల దాడి
ఇస్లామాబాద్:పాకిస్థాన్ మరోసారి రక్తసిక్తమయ్యింది. అక్కడి సైనిక కాన్వాయిపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు సైనికులు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. అయితే ఈ ప్రమాదంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
సిలికానాంధ్ర మన బడి.. కొత్త మైలురాయి
సిలికానాంధ్ర మన బడి 20వ విద్యా సంవత్సరంలోకి అడుగుపెట్టింది. గత వారాంతంలో అమెరికా, కెనడాలోని దాదాపు 250 నగరాల్లో ఉన్న మనబడి కేంద్రాల్లో కొత్త విద్యా సంవత్సరం ఉత్సాహంగా ప్రారంభమైంది. సుమారు 12,200 మంది విద్యార్థులు మనబడిలో చేరగా.. తొలి రోజున దాదాపు 20,000 మంది తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తమ పిల్లలతో కలిసి కేంద్రాలకు హాజరయ్యారు. దీంతో ఉత్తర అమెరికాలోని మనబడి కేంద్రాలు సందడి, ఆనందంతో కళకళలాడాయి.విద్యా సంవత్సరం సజావుగా ప్రారంభమయ్యేలా సుమారు 2,500 మంది స్వచ్ఛంద సేవకులు, ఉపాధ్యాయులు, కేంద్ర సమన్వయకర్తలు, ఇతర సమాజ సేవకులు తమ సేవలను అందించారు. తెలుగు భాషను భవిష్యత్ తరాలకు అందించాలనే లక్ష్యంతో వీరంతా సమష్టిగా పనిచేస్తున్నారు. సిలికానాంధ్ర మన బడి 20వ సంవత్సరం ప్రత్యేక మైలురాయిగా నిలిచింది. రెండు దశాబ్దాల క్రితం కేవలం 150 మంది విద్యార్థులతో ప్రారంభమైన మనబడి, నేడు భారతదేశం వెలుపల కొనసాగుతున్న అతిపెద్ద తెలుగు భాషాభ్యాస ఉద్యమాల్లో ఒకటిగా ఎదిగింది.ఉత్తర అమెరికా వ్యాప్తంగా వేలాది కుటుంబాలకు చేరువైన మనబడి, ఎన్నో సంవత్సరాలుగా తరతరాల పిల్లలకు తెలుగు మాట్లాడటం, చదవటం, రాయటం నేర్పిస్తూ, వారి భాష, సంస్కృతి, వారసత్వంతో అనుబంధాన్ని బలోపేతం చేస్తోంది. మన బడి ప్రయాణానికి మరో ప్రత్యేకమైన ఉదాహరణ ప్రస్తుతం తరగతి గదుల్లో కనిపిస్తోంది. మన బడి తొలి బ్యాచ్‌లలో చదువుకున్న కొంతమంది విద్యార్థులు నేడు తల్లిదండ్రులుగా మారి, తమ పిల్లలను తెలుగు నేర్చుకోవడానికి మనబడికి తీసుకువస్తున్నారు. కేవలం రెండు దశాబ్దాల్లోనే ఒక తరం నుంచి మరో తరానికి తెలుగు భాషా వారసత్వాన్ని అందించే వేదికగా మనబడి నిలిచింది.మన బడి అభివృద్ధి వెనుక ఉపాధ్యాయులు, కేంద్ర సమన్వయకర్తలు, తల్లిదండ్రులు, నిర్వాహకులు, శ్రేయోభిలాషులతో కూడిన విస్తృత స్వచ్ఛంద సేవా సమాజం ఉంది. ఉత్తర అమెరికాలో భవిష్యత్ తరాల మధ్య తెలుగు భాష జీవించి, అభివృద్ధి చెంది, వికసించేలా చేయాలనే లక్ష్యంతో వారు ఎన్నో సంవత్సరాలుగా తమ సమయాన్ని, సేవలను అందిస్తున్నారు.మూడో దశాబ్దంలోకి అడుగుపెడుతున్న మనబడి లక్ష్యం కేవలం తెలుగు భాషను పరిరక్షించడం మాత్రమే కాదు. పిల్లలకు తమ సాంస్కృతిక మూలాలతో ఉన్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడం, రాబోయే తరాల కుటుంబాల్లో తెలుగు ఒక సజీవ భాషగా కొనసాగేందుకు అవసరమైన సమాజాన్ని నిర్మించడం కూడా మనబడి లక్ష్యంలో భాగమని నిర్వాహకులు తెలిపారు.కొత్త విద్యా సంవత్సరానికి మనబడి ప్రవేశాలు సెప్టెంబర్ చివరి వరకు కొనసాగనున్నాయి. తమ పిల్లలకు తెలుగు భాషను పరిచయం చేయాలనుకునే కుటుంబాలు సమీపంలోని మనబడి కేంద్రాన్ని సందర్శించి.. కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోవాలని నిర్వాహకులు సూచించారు. ఈ సందర్భంగా సిలికానాంధ్ర మనబడి అధ్యక్షులు, డీన్ చమర్తి రాజు మాట్లాడుతూ.. ‘‘మీ మద్దతే మన సమాజం అభివృద్ధి చెందడానికి ఉత్తమ మార్గం. మీ స్నేహితులు తమ పిల్లలను మన బడిని ప్రత్యక్షంగా అనుభవించేలా ప్రోత్సహించండి. మరో కుటుంబాన్ని మన బడికి అనుసంధానించి, వారి పిల్లలను ఈరోజే మనబడిలో నమోదు చేయమని ప్రోత్సహించండి” అంటూ ఆయన పిలుపునిచ్చారు. -
ట్రంప్‌నకు ఇరాన్ అల్టిమేటం.. 7 షరతులు
ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధం తీవ్రరూపు దాలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ మరోసారి అమెరికాకు భారీ ఆఫర్ ఇచ్చింది. యుద్ధాన్ని ఆపాలంటే తమ వద్ద ఒక ప్లాన్ ఉందని తెలిపింది.. టెహ్రాన్ ప్రతిపాదించిన ఏడు షరతులను అంగీకరిస్తే వెంటనే యుద్ధం ముగిసిపోతుందని లేకపోతే అమెరికా వద్ద మరో ప్లాన్ ఏది లేదని స్పష్టం చేసింది.ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయీ... ఈ విషయమై మాట్లాడుతూ అమెరికా ముందు తన ఇరాన్‌కు చెందిన ఏడు ప్రతిపాదనలను ఖతార్ మధ్యవర్తిత్వంతో అమెరికాకు చేరవేశాం. ప్రస్తుతం యుద్ధం మెుదలై ఏడు నెలలు కావస్తుందని ఇరాన్ షరతులపై ట్రంప్ స్పందన కోసం ఎదురుచూస్తోన్నామన్నారు.ఆయన మాట్లాడుతూ "ఏదైనా చర్చలు ప్రారంభించడానికి ఇరాన్ తన ఏడు షరతులను అమెరికా ప్రభుత్వానికి ప్రకటించింది. టెహ్రాన్ సందేశం స్పష్టంగా, నిస్సందేహంగా ఉంది. వాషింగ్టన్ తాను సృష్టించుకున్న చిక్కుముడి నుండి బయటపడాలనుకుంటే, అందులో మరింత చిక్కుకోకుండా ఉండాలంటే, ఇరాన్ హక్కులు, షరతులను అంగీకరించడం తప్ప దానికి మరో మార్గం లేదు," అని ఆయన ఆదివారం తెల్లవారుజామున Xలో పోస్ట్ చేశారు.ఇరాన్ ప్రధాన డిమాండ్లు ?మెుహ్సెన్ రెజాయీ ప్రకారం, ఇరాన్ ప్రతిపాదనల్లో ప్రధానంగా అన్ని రంగాల్లో యుద్ధాన్ని ముగించడం, ఇరాన్‌కు చెందిన స్వాధీనం చేసుకున్న ఆస్తులను విడుదల చేయడం, ఇరాన్ నౌకాశ్రయాలపై అమెరికా విధించిన నావికా దిగ్బంధాన్ని తొలగించడం వంటి అంశాలు ఉన్నాయి. అదే విధంగా యెమెన్‌కు చెందిన హౌతీలు, సౌదీ అరేబియా మధ్య కొనసాగుతున్న పోరాటానికి సైతం ముగింపు పలకాలని ఇరాన్ స్పష్టం చేస్తోంది. మధ్యప్రాచ్యంలో వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న సైనిక ఘర్షణలకు సమగ్ర ముగింపు రావాలన్నదే తమ ఉద్దేశమని రెజాయీ తెలిపారు.ఖతార్ ద్వారా అమెరికాకు సందేశం.ఇరాన్, అమెరికా మధ్య నేరుగా కాకుండా మధ్యవర్తి దేశం ఖతార్ ద్వారా సంప్రదింపులు కొనసాగుతున్నట్లు తెలిపారు. ఇరాన్ షరతులను ఖతార్ అమెరికాకు చేరవేసిందని, ప్రస్తుతం వాషింగ్టన్ నుంచి అధికారిక స్పందన కోసం వేచి చూస్తున్నామని ఆయన చెప్పారు. “ఈ షరతులను అంగీకరించడం అమెరికా ప్రయోజనానికే” అని వ్యాఖ్యానించారు. అదే సమయంలో అమెరికా నుంచి మరోసారి దాడి జరిగే అవకాశం ఉందని కూడా ఆయన హెచ్చరించారు.మరో అమెరికా దాడి జరిగే అవకాశం?ఇరాన్ సైనిక అంచనాల ప్రకారం అమెరికా మరోసారి ఇరాన్‌పై దాడి చేసే అవకాశం ఇంకా చాలా ఎక్కువగానే ఉందని రెజాయీ పేర్కొన్నారు. అందుకే తమ దేశం కొత్త వ్యూహంతో ముందుకు వెళ్తోందని, ఈ యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించడమే ప్రస్తుత లక్ష్యమని చెప్పారు. ట్రంప్ స్పందనపై సస్పెన్స్?ఇరాన్ తన ఏడు షరతులను అమెరికా ముందుంచిన నేపథ్యంలో, వాషింగ్టన్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది. ఒకవైపు యుద్ధాన్ని ముగించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగుతుండగా, మరోవైపు ఇరాన్ మరో అమెరికా దాడి జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. దీంతో మధ్యప్రాచ్యంలో యుద్ధానికి నిజంగా ముగింపు పలికే దిశగా ఇరాన్-అమెరికా చర్చలు సాగుతాయా? లేక ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయా? అన్నది ఆసక్తికరంగా మారింది. -
సినిమా రేంజ్లో.. బస్సు హైజాక్!
ఇంగ్లాండ్‌లోని టెల్ఫోర్డ్లో భారత సంతతికి చెందిన సిక్కు బస్సు డ్రైవర్‌పై యెమెన్ దేశస్థుడు దాడి చేశాడు. దాడి చేయడమే కాదు.. బస్సును కూడా దొంగిలించాడు. ఆ బస్సును రాంగ్ రూట్లో నడుపుతూ బీభత్సం సృష్టించాడు. ఈ ఘటన మొత్తం కెమెరాలో రికార్డ్ అవ్వగా.. ఆ వీడియో వైరల్‌గా మారింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.డ్రైవర్ దగ్గరకు వెళ్లిన నిందితుడు.. ఆయన గడ్డం పట్టుకుని లాగాడు. గొడవ వద్దని చెబుతున్నా ఆ వ్యక్తి వినలేదు. తన తలను డ్రైవర్ తలతో ఢీకొట్టినట్లు వీడియోలో కనిపిస్తుంది. ఈ దాడి ఘటనను ఓ మహిళ వీడియో తీసింది. అసలు ఏం చేస్తున్నావంటూ అంటూ దుండగుడిని ఆ మహిళ ప్రశ్నిచింది. డ్రైవర్‌పై దాడి చేయొద్దంటూ ఆమె చెబుతున్నా దుండగుడు పట్టించుకోకుండా దాడికి పాల్పడ్డాడు. దీంతో డ్రైవర్.. పోలీసులకు ఫోన్ చేయాలని ఆ మహిళను కోరాడు. దీంతో మరింత రెచ్చిపోయిన నిందితుడు బస్సులోని వస్తువులను కూడా ధ్వంసం చేశాడు.డ్రైవర్ క్యాబిన్‌లోని లైట్లా కనిపించే ఒక వస్తువును తీసి.. దాంతో సిక్కు డ్రైవర్‌పై దాడి చేస్తానని బెదిరించాడు. బస్సును తనకు ఇవ్వాలని డ్రైవర్‌ను పదేపదే కోరాడు. చివరకు డ్రైవర్‌ను బస్సు నుంచి బయటకు తోసి.. తానే డ్రైవింగ్ సీటులో కూర్చున్నాడు. బస్సు నడుపుకుంటూ వెళ్లాడు. ఆ బస్సును రాంగ్రూట్లో నడుపుతూ పలు వాహనాలను ఢీకొట్టాడు.వీడియోలో ఓ మహిళ భయంతో ఏడుస్తూ.. ప్రజలను పక్కకు తప్పుకోవాలని పదేపదే కోరుతూ.. ‘ఓ మై గాడ్’ అంటూ అరుస్తున్నట్లు వినిపిస్తుంది. ఘటన జరుగుతున్న సమయంలో ఆమె బస్సు వెనుక పరుగెత్తుతున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. పోలీసులకు సమాచారం అందడంతో ఘటనాస్థలానికి చేరుకుని దుండగుడిని అరెస్ట్ చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.A Sikh bus driver was assaulted by a man in his 20s. The accused attacked the driver, pulled his beard and forced him out of the bus and hijacked the bus.The incident took place on Court Street, telford near to London. The police have arrested the suspect. #Uk #Telford pic.twitter.com/s9KBZ3BxqA— Ravinder Singh (@ravindraJourno) September 19, 2026ఇదీ చదవండి: బ్రిడ్జిపై నుంచి పడిన బీఎండబ్ల్యూ కారు -
10 సింహాల మృతి.. విషప్రయోగం వల్లే?
టాంజానియాలోని యునెస్కో గుర్తింపు పొందిన న్గోరోంగోరో పరిరక్షణ ప్రాంతంలో విషప్రయోగం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందులో 10 సింహాలు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. న్గోరోంగోరో పరిరక్షణ ప్రాంత ప్రాధికార సంస్థ (ఎన్సీఏఏ) శనివారం (సెప్టెంబర్ 19) రాత్రి విడుదల చేసిన ప్రకటనలో.. సెప్టెంబర్ 18న న్డుటు ప్రాంతంలో 10 సింహాలు మృతి చెందినట్లు ప్రజలకు తెలియజేసింది.ప్రాథమిక పరిశీలనలో సింహాలు విషం తీసుకోవడం వల్ల మృతి చెందినట్లు తెలుస్తోందని అధికారులు తెలిపారు. ఘటనకు కారణం ఏంటో, బాధ్యులు ఎవరో గుర్తించేందుకు నిపుణుల దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. న్గోరోంగోరో ప్రాంతంలో అధికారులు, స్థానిక సంచార సమాజం మధ్య చాలా కాలంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. 2022లో ప్రభుత్వం ఖాళీ చేయించే కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత కొన్ని సందర్భాల్లో ఈ ఘర్షణలు ప్రాణాంతకంగా మారాయి.జనాభా పెరుగుదల వల్ల వన్యప్రాణుల ఆవాస ప్రాంతాలు ఆక్రమణకు గురవుతున్నాయని టాంజానియా ప్రభుత్వం చెబుతోంది. 1959లో న్గోరోంగోరోలో సుమారు 8,000 మంది నివసించగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 1,00,000 దాటిందని పేర్కొంది. జూన్ నుంచి టాంజానియా సరిహద్దుకు సమీపంలోని కెన్యాలోని అంబోసెలి పర్యావరణ వ్యవస్థలో దాదాపు 20 ఏనుగులు అనుమానిత పురుగుమందు విషప్రయోగంతో మృతి చెందాయి. అయితే ఆ మరణాలు ప్రమాదవశాత్తూ జరిగాయా, ఉద్దేశపూర్వకంగా జరిగాయా అనేది అధికారులు నిర్ధారించలేకపోయారు. -
వందల డ్రోన్లతో.. మాస్కోపై విరుచుకుపడ్డ ఉక్రెయిన్
మాస్కో: రష్యాలో ఎన్నికలు జరుగుతున్నవేళ ఉక్రెయిన్ రెచ్చిపోయింది. రాజధాని మాస్కోతో పాటు ఇతర చుట్టుప్రక్కల ప్రాంతాలే టార్గెట్‌గా విరుచుకపడింది. 1600 డ్రోన్లతో ఏకకాలంతో దాడి చేసింది. ఈ దాడుల్లో ఇద్దరు రష్యాపౌరులు మరణించగా ఒక ప్రధాన చమురు శుద్ధి కర్మాగారం దెబ్బతింది. ఈ దాడిపై రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.ఇటీవల రష్యా- ఉక్రెయిన్ దాడులు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. రష్యా మౌలిక సదుపాయాలే లక్షంగా ఉక్రెయిన్ దాడులకు తెగబడుతుంది. రష్యా సైతం పెద్దఎత్తున ప్రతి దాడులు జరుపుతుంది. ఈ దాడుల వల్ల పెద్ద సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మరోసారి ఉక్రెయిన్ రష్యాపై పెద్దఎత్తున డ్రోన్ దాడులు చేసింది.ఈ విషయమై రష్యా మేయర్ మాట్లాడుతూ.. 1,600కు పైగా డ్రోన్లను అడ్డుకుని కూల్చివేసాం. ఇందులో 450 డ్రోన్లు మాస్కోను లక్ష్యంగా చేసుకుని వచ్చాయి. రెండు వేర్వేరు దాడుల్లో 44 ఏళ్ల మహిళ, ఒక వృద్ధుడు మరణించినట్లు తెలిపారు. 21 అంతస్తుల భవనంపై డ్రోన్ కూలిపోవడంతో మంటలు చెలరేగాయి. దీంతో సుమారు 400 మందిని భవనం నుంచి ఖాళీ చేయించాల్సి వచ్చింది." అని ఆయన అన్నారు.రష్యాలో జరుగుతున్న ఎన్నికలను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే ఉక్రెయిన్ ఈ దాడికి పాల్పడిందని ఆయన ఆరోపించారు. "ఎన్నికలను భంగపరచాలనే ఉద్దేశంతోనే ఈ దాడిని స్పష్టంగా ప్రణాళిక చేశారు. అయితే శత్రువు అందులో విజయవంతం కాలేదు” అని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారుమరోవైపు, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ దాడులను ప్రశంసించారు. “గత రాత్రి మాస్కో ప్రాంతంలో మా సుదూర దాడులు చాలా ప్రభావాన్ని చూపించాయి. రష్యా చమురు పరిశ్రమలోని కీలక సదుపాయాల్లో ఒకదానితో పాటు లాజిస్టిక్స్‌కు సంబంధించిన సదుపాయం కూడా దెబ్బతింది. ఇవి యుద్ధ యంత్రాంగాన్ని కొనసాగించేందుకు ఉపయోగపడే బిలియన్ల డాలర్ల నిధులు” అని ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు.ఇదిలా ఉండగా, ఉక్రెయిన్‌లో రాత్రిపూట రష్యా జరిపిన దాడుల్లో కీవ్ ప్రాంతంలో కనీసం నలుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. రష్యా, ఉక్రెయిన్లు ఒకరిపై ఒకరు సుదూర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్, క్షిపణి దాడులను మరింత తీవ్రతరం చేస్తున్న సమయంలో ఈ తాజా దాడులు చోటుచేసుకున్నాయి.యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యాపై జరిగిన అతిపెద్ద ఒక్కరోజు దాడుల్లో ఇది ఒకటని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ భారీ స్థాయి దాడి రష్యా ఎన్నికల చివరి రోజునే జరగడం యాదృచ్ఛికం కాదని అంటున్నారు. కాగా ఉక్రెయిన్ దాడులతో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. రష్యా భారీ స్థాయిలో ప్రతిదాడులు చేసే అవకాశం ఉంది. -
నేపాల్ వరదలు.. 40 పిరమిడ్లు కట్టేంత శిథిలాలు
కాఠ్మాండూ: ఈజిప్టులోని ప్రపంచ ప్రసిద్ధ గిజా పిరమిడ్ల వంటి 40 భారీ పిరమిడ్లను నిర్మించడానికి ఎంత మొత్తంలో రాళ్లు, ఇతర నిర్మాణ సామగ్రి అవసరమో... సరిగ్గా అంతే పరిమాణంలో కొండచరియలు, మంచు విరిగిపడి నేపాల్‌లో పెను విధ్వంసం సృష్టించాయి. ఆగస్టు 26న లాంగ్టాంగ్ లిరుంగ్ పర్వత శిఖరం నుంచి జారిన ఈ అపార శిథిల ప్రవాహం (డెబ్రిస్ ఫ్లో) ధాటికి ఇప్పటివరకు 1,300 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది ఆచూకీ గల్లంతైంది.శాటిలైట్ చిత్రాల ఆధారంగా శాస్త్రవేత్తలు జరిపిన తాజా విశ్లేషణల ప్రకారం, పర్వత ఉత్తర భాగంలో సుమారు 5,150 మీటర్ల ఎత్తున ఉన్న 2.2 చదరపు కిలోమీటర్ల భారీ రాతి పలక అకస్మాత్తుగా విరిగిపడింది. కొండచరియలు, గడ్డకట్టిన మంచు కలిసి దాదాపు 11 కోట్ల ఘనపు మీటర్ల పరిమాణంలో కిందికి దూసుకొచ్చాయి. ఈ ఘనపరిమాణం గిజాలోని 40 పిరమిడ్లతో సమానమని భూగర్భ శాస్త్రవేత్తలు లెక్కగట్టారు. గంటకు 160 నుంచి 190 కిలోమీటర్లకు పైగా పెను వేగంతో లోయలోకి దూసుకొచ్చిన ఈ ప్రవాహం, మార్గమధ్యంలోని పదుల సంఖ్యలో గ్రామాలు, ఆవాసాలను ఆనవాలు లేకుండా తుడిచిపెట్టేసింది.శతాబ్దాలుగా రాళ్లను, మట్టిని గట్టిగా బంధించి ఉంచిన శాశ్వత మంచు (పెర్మాఫ్రాస్ట్) గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో కరిగిపోవడమే ఈ ఘోర ప్రమాదానికి ప్రధాన కారణమని నిపుణులు నిర్ధారించారు. 2015 నాటి గోర్ఖా భూకంపం వల్ల ఇప్పటికే బలహీనపడిన ఈ ప్రాంతంలో, ప్రపంచ సగటు కంటే 2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది. ప్రమాదానికి ముందు రోజుల్లో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా 10 డిగ్రీల సెల్సియస్‌ను దాటడంతో మంచు వేగంగా కరిగి, రాళ్ల పగుళ్లలోకి చేరి వాటిని మరింత వదులు చేసింది. పైనుంచి పడే క్రమంలో రాళ్లు ఒకదానితో ఒకటి ఢీకొని పొడిగా మారి, కరిగిన నీటితో కలిసి ప్రమాదకర ద్రవ రూప ప్రవాహంగా రూపాంతరం చెందాయి. భవిష్యత్తులో హిమాలయ ప్రాంతానికీ ఇలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: -
పశ్చిమాసియాలో మళ్లీ భీకర యుద్ధం.. ట్రిప్‌ను అర్ధంతరంగా ముగించిన ట్రంప్!
వాషింగ్టన్: పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఘర్షణ వాతావరణం తారాస్థాయికి చేరడంతో వైట్‌హౌస్ తీవ్ర అప్రమత్తమైంది. ఈ భద్రతా సంక్షోభం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వీకెండ్ క్యాంప్ డేవిడ్ పర్యటనను అకస్మాత్తుగా రద్దు చేసుకున్నారు. హుటాహుటిన రాజధాని వాషింగ్టన్కు తిరుగుపయనమయ్యారు. ఉద్రిక్తతల తీవ్రత దృష్ట్యా ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు తన టెక్సాస్ పర్యటనతో పాటు, ఎలాన్ మస్క్‌తో జరగాల్సిన కీలక భేటీని కూడా రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఐక్యరాజ్య సమితిలో ప్రసంగం అనంతరం తిరిగి ఇజ్రాయెల్ వెళ్లనున్నట్లు అమెరికా మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు, మేరీలాండ్‌లోని క్యాంప్ డేవిడ్ నిర్బంధ గగనతలంలోకి అనుమతి లేకుండా ఒక సాధారణ విమానం ప్రవేశించడం కలకలం రేపింది. వెంటనే రంగంలోకి దిగిన నార్త్ అమెరికన్ ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాలు, ఫ్లేర్లను వదులుతూ ఆ విమానాన్ని అడ్డగించి, పైలట్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించాయి.9 దేశాల్లో అమెరికా హై-అలర్ట్పశ్చిమాసియాలో ఎప్పుడైనా భారీ సైనిక ఘర్షణ చెలరేగే ముప్పు ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో ఓమాన్, లెబనాన్, జోర్డాన్, ఇరాక్, బహ్రెయిన్, కువైట్, యూఏఈ, ఖతార్, సౌదీ అరేబియాతో సహా మొత్తం తొమ్మిది దేశాల్లోని తమ పౌరులకు అమెరికా రాయబార కార్యాలయాలు అత్యవసర భద్రతా హెచ్చరికలు జారీ చేశాయి. గగనతలాలు అకస్మాత్తుగా మూతపడే అవకాశం ఉన్నందున, విమాన సర్వీసుల రద్దుకు సిద్ధంగా ఉండాలని సూచించాయి.సౌదీపై హూతీల దాడి.. రియాద్‌లో ఎయిర్ అలర్ట్ యెమెన్‌కు చెందిన ఇరాన్ మద్దతుదారులు హూతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని సున్నితమైన ప్రాంతాలపై, ఎర్రసముద్ర తీరంలోని ఇంధన కేంద్రాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డారు. రియాద్‌లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో భారీగా పొగలు కమ్ముకోవడంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. సౌదీ రక్షణ దళాలు ఒక బాలిస్టిక్ క్షిపణిని గాల్లోనే అడ్డుకుని ధ్వంసం చేసినట్లు ప్రకటించాయి. ఈ తీవ్ర పరిణామాల నేపథ్యంలో సౌదీ సివిల్ డిఫెన్స్ చరిత్రలోనే మొదటిసారిగా రియాద్, అల్-ఖర్జ్ నగరాల్లో వైమానిక దాడుల హెచ్చరికల సైరన్లు మోగించింది.రూ.26 వేల కోట్ల భారీ ఆయుధ ప్యాకేజీపశ్చిమాసియా ఘర్షణల వేళ.. ఇజ్రాయెల్‌కు సుమారు రూ.26 వేల కోట్ల భారీ ఆయుధ ప్యాకేజీని అమెరికా ఆమోదించింది. ఇందులో ఒక్కొక్కటి టన్ను బరువున్న సుమారు 40 వేల అత్యాధునిక బాంబులు ఉన్నాయి. అమెరికా ఆయుధాగారంలో ఉన్న అత్యంత విధ్వంసకరమైన ఆయుధాల్లో 'ఎంకే-84' ఒకటి. ఇందులో భాగంగా ఇజ్రాయెల్‌కు 20 వేల 'ఎంకే-84' బాంబులతో పాటు మరో 20 వేల 'బీఎల్‌యూ-117' బాంబులను పంపేందుకు అమెరికా ఆమోదం తెలిపింది. వీటితో పాటు 20 వేల 'ఐ-2000' పెనెట్రేటర్ వార్‌హెడ్స్‌ను కూడా ఈ ప్యాకేజీలో చేర్చారు. ఈ 'ఎంకే-84' బాంబులు విస్ఫోటనం చెందితే, వాటి లోహపు శకలాలు వేలాది అడుగుల దూరం వరకు ఎగిరిపడి తీవ్ర ప్రాణనష్టాన్ని కలిగిస్తాయి.ఇదీ చదవండి : అమెరికాతో ఇక కురుక్షేత్రమే.. ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్ -
సౌదీకి బిగ్ రిలీఫ్.. హౌతీల దాడుల వేళ తుర్కియే సంచలన నిర్ణయం!
సౌదీపై హౌతీల దాడులు.. రియాద్‌లో వరుస పేలుళ్లు.. ఆకాశంలో క్షిపణులు, డ్రోన్ల కలకలం. పరిస్థితి అంతకంతకూ ఉద్రిక్తంగా మారుతున్న వేళ తుర్కియే సంచలన ప్రకటన చేసింది. సౌదీకి అవసరమైన సైనిక సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని అంకారా స్పష్టం చేసింది. ఇప్పటికే పాకిస్తాన్‌తో కలిసి సౌదీతో రక్షణ ఒప్పందం చేసుకున్న తుర్కియే ఇప్పుడు సైనిక-సాంకేతిక సాయం చేస్తామని ప్రకటించడం పశ్చిమాసియాలో కొత్త టెన్షన్‌కు తెరలేపింది. హౌతీల దాడులు మరింత పెరిగితే ఈ రక్షణ కూటమి ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతుందా? ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న.కాగా, యెమెన్ హౌతీల వరుస క్షిపణి, డ్రోన్ దాడులతో సౌదీ అరేబియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. సౌదీకి అవసరమైన సైనిక సహాయం అందించేందుకు తుర్కియే సిద్ధంగా ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్ ప్రకటించారు. ముఖ్యంగా సైనిక సాంకేతిక అవసరాలను తీర్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఈ పరిణామం ఇటీవల తుర్కియే, సౌదీ, పాకిస్తాన్ మధ్య కుదిరిన మక్కా సంయుక్త రక్షణ ఒప్పందంపై మరోసారి దృష్టిని మళ్లించింది.సౌదీ రాజధాని రియాద్ సహా పలు ప్రాంతాలపై హౌతీలు దాడులు చేస్తున్నట్లు ప్రకటించారు. శనివారం రియాద్‌లోని కీలక ప్రాంతాలను క్షిపణులు, డ్రోన్లతో లక్ష్యంగా చేసుకున్నట్లు హౌతీలు వెల్లడించారు. ఇదే సమయంలో నగరంలోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో మంటలు, భారీగా పొగ కనిపించింది. సౌదీ అధికారులు రియాద్ వైపు వచ్చిన బాలిస్టిక్ క్షిపణిని అడ్డుకున్నట్లు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రాణనష్టం జరిగినట్లు వెల్లడించలేదు. అయితే, హౌతీల దాడులు కేవలం రాజధాని రియాద్‌కు మాత్రమే పరిమితం కావడం లేదు. ఇంధన మౌలిక వసతులు, నగరాలు, సముద్ర రవాణా మార్గాలపైనా దాడుల ముప్పు పెరిగింది. దీంతో ప్రపంచ చమురు సరఫరా, ఎర్ర సముద్ర వాణిజ్య మార్గాలపై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.విమానాశ్రయం వద్ద ఏం జరిగింది?రియాద్ విమానాశ్రయం సమీపంలో భారీగా పొగ కనిపించడంతో పాటు మంటలు కూడా చెలరేగిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. మంటలు ఇంధన నిల్వ ప్రాంతానికి సమీపంలో కనిపించినట్లు రాయిటర్స్ దృశ్యాలు తెలిపాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కొన్ని విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు నివేదికలు పేర్కొన్నాయి. దాడుల హెచ్చరికల నేపథ్యంలో సౌదీ అధికారులు రియాద్, అల్-ఖర్జ్ ప్రాంతాల్లో ప్రజలకు అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు. అనంతరం పరిస్థితి అదుపులోకి రావడంతో ‘ఆల్ క్లియర్’ ప్రకటించారు. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో రియాద్‌లో ఈ స్థాయిలో వైమానిక దాడి హెచ్చరికలు రావడం ఇదే తొలిసారి అని నివేదికలు చెబుతున్నాయి.తుర్కియే కీలక ప్రకటన..ఈ పరిస్థితుల్లో తుర్కియే విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సౌదీ అరేబియా ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వంపై తీవ్రమైన దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. సౌదీకి కొన్ని సైనిక అవసరాలు, ముఖ్యంగా సాంకేతిక రంగంలో అవసరాలు ఉండొచ్చని.. వాటిని తీర్చేందుకు తుర్కియే సిద్ధంగా ఉందని చెప్పారు. అంటే వెంటనే తుర్కియే సైన్యాన్ని యెమెన్‌లోకి పంపుతామని హింట్ ఇచ్చారు. ఇదే సమయంలో యుద్ధాన్ని మరింత విస్తరించకుండా దౌత్యపరమైన పరిష్కారం కోసం కూడా తుర్కియే ప్రయత్నిస్తున్నట్లు ఫిదాన్ తెలిపారు.🇾🇪🇸🇦 King Khalid International Airport in Riyadh, Saudi Arabia is burning pic.twitter.com/5sugQvpgUP— Megatron (@Megatron_ron) September 19, 2026‘మక్కా డిఫెన్స్ ప్యాక్ట్’ ఏంటి?ఇటీవల తుర్కియే, సౌదీ అరేబియా, పాకిస్తాన్ మధ్య మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ కుదిరింది. ఈ ఒప్పందంలోని కీలక అంశం ఏమిటంటే.. మూడు దేశాల్లో ఏదైనా ఒక దేశంపై సాయుధ దాడి జరిగితే, దాన్ని మిగిలిన రెండు దేశాలపై జరిగిన దాడిగానే పరిగణించేలా పరస్పర రక్షణ సూత్రాన్ని రూపొందించారు. అందుకే సౌదీపై హౌతీల దాడులు పెరిగిన సమయంలో తుర్కియే నుంచి వచ్చిన ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది. అయితే ఈ ఒప్పందం ఆధారంగా పాకిస్తాన్, తుర్కియే తక్షణమే ప్రత్యక్ష సైనిక చర్యకు దిగుతాయని చెప్పడానికి ప్రస్తుతానికి అధికార ప్రకటన చేయలేదు. మరోవైపు.. సౌదీపై హౌతీల దాడుల నేపథ్యంలో మక్కా ఒప్పందం కింద పాక్ సైనిక చర్యపై ఎలాంటి చర్చలు జరగలేదని ఇస్లామాబాద్ తెలిపింది. అదే సమయంలో సౌదీ భద్రతకు సంబంధించిన తమ బాధ్యతలను పాకిస్తాన్ గుర్తిస్తోంది. దీంతో ఒప్పందంలోని పరస్పర రక్షణ హామీ ఇప్పుడు ఆచరణలో ఎలా అమలవుతుందన్నది కీలక అంశంగా మారింది.హౌతీల హెచ్చరిక..ఇదిలా ఉండగా తుర్కియే, పాకిస్తాన్.. సౌదీకి సైనికంగా మద్దతు ఇచ్చే అవకాశాలపై హౌతీలు కూడా హెచ్చరికలు జారీ చేశారు. తాము సైనికంగా జోక్యం చేసుకుంటే తీవ్రమైన గట్టి ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీంతో ఒకవైపు సౌదీపై దాడులు.. మరోవైపు తుర్కియే మద్దతు ప్రకటన.. ఇంకోవైపు పాకిస్తాన్ ముందు ఉన్న కీలక రక్షణ ఒప్పంద బాధ్యతలు.. మొత్తం పరిణామం పశ్చిమాసియాలో కొత్త భద్రతా సమీకరణాలకు దారితీసే పరిస్థితిని తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో హౌతీల దాడులు మరింత విస్తరిస్తే ఈ మూడు దేశాల పరస్పర రక్షణ హామీ ఏ రూపంలో ఆచరణలోకి వస్తుందన్నది ఇప్పుడు పశ్చిమాసియా పరిణామాల్లో కీలకంగా మారింది.ఇదీ చదవండి: సౌదీలో మోగిన హెచ్చరిక సైరన్లు.. -
అమెరికాతో ఇక కురుక్షేత్రమే.. ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్
టెహ్రాన్: పశ్చిమాసియాలో కొనసాగుతున్న అమెరికా-ఇరాన్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాన్ని ముగించాలని ఇరాన్ అమెరికాకు పిలుపునిచ్చింది. యుద్ధం ముగియాలంటే అమెరికా తమ ఏడు డిమాండ్లకు అంగీకరించాలని, లేదంటే ఆ దేశంతో చావోరేవో తేల్చుకుంటామని ఇరాన్ స్పష్టం చేసింది.ఒకవేళ తాము పెడుతున్న ఏడు షరతులకు అమెరికా ఒప్పుకుంటే, ఖతార్ మధ్యవర్తిత్వంతో చర్చలు జరుపుతామని తెలిపింది. మరి ఇరాన్ డిమాండ్లపై అమెరికా ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.ఈ సందర్భంగా ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సేన్ రెజాయీ ప్రముఖ ఖతార్ ఆంగ్ల మీడియా సంస్థ 'అల్ జజీరా'తో మాట్లాడారు. “అమెరికా-ఇరాన్ దేశాల మధ్య యుద్ధాన్ని ముగించాలని కోరుకుంటున్నాం. ఇందులో భాగంగా ఖతార్ మధ్యవర్తిత్వంతో మా డిమాండ్లు ఏంటో అమెరికాకు తెలియజేశాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందన కోసం ఎదురు చూస్తున్నాం” అని ఆయన వెల్లడించారు.ఇరాన్ డిమాండ్లు ఇవేఅన్ని రకాల సరిహద్దుల్లోనూ యుద్ధాన్ని పూర్తిగా ఆపివేయడం,విదేశీ బ్యాంకుల్లో స్తంభింపజేసిన ఇరాన్ నిధులను విడుదల చేయడం.ఇరాన్‌పై విధించిన నావికా దిగ్బంధాన్ని ఎత్తివేయడం. ఇలా మొత్తం ఏడు స్పష్టమైన డిమాండ్లను ఖతార్ ద్వారా అమెరికాకు తెలియజేసినట్లు రెజాయ్ సోషల్ మీడియా వేదికగా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.ఈ సందర్భంగా ట్రంప్ బెదిరింపుల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, ఈ షరతులను అంగీకరించడమే అమెరికాకు మంచిదని రెజాయ్ స్పష్టం చేశారు. అమెరికా వైపు నుంచి భవిష్యత్తులోనూ దాడులు జరిగే అవకాశం ఉందని తమ సైనిక అంచనాలు చెబుతున్నాయని, దానిని ఎదుర్కొనేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. గల్ఫ్ ప్రాంతం నుంచి అరేబియా సముద్రం వరకు విస్తరించి ఉన్న అమెరికా నావికాదళ ఆస్తులను లక్ష్యంగా చేసుకుని తమ సైనిక వ్యూహాలను మార్చుకున్నట్లు తెలిపారు. ఒకవేళ అమెరికా దాడులకు దిగితే, ప్రాంతీయంగా ఉన్న అమెరికా సైనిక స్థావరాలు, వాణిజ్య సంస్థలపై తీవ్ర ప్రతిస్పందన ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు.అణు విధానం ఇరాన్ అణు విధానంలో ఎలాంటి మార్పు లేదని రెజాయ్ స్పష్టం చేశారు. అణు ఆయుధాలను నిషేధించే మతపరమైన ఫత్వాకు (డిగ్రీకి) తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. అయితే, అమెరికా అనుసరించే దురుసు విధానాల వల్ల తాము 'న్యూక్లియర్ నాన్-ప్రొలిఫరేషన్ ట్రీటీ' నుంచి వైదొలగవలసి వచ్చే పరిస్థితి రావొచ్చని హెచ్చరించారు.మధ్యవర్తిత్వ ప్రయత్నాలు గతేడాది ఫిబ్రవరిలో అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల తర్వాత ప్రారంభమైన ఈ సంఘర్షణను ముగించేందుకు ఖతార్,పాకిస్థాన్ దేశాలు దౌత్యపరమైన మధ్యవర్తిత్వ ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఒకవైపు దౌత్య చర్చలకు సిద్ధమంటూనే, మరోవైపు సైనిక సన్నద్ధతను కూడా ఇరాన్ విడనాడలేదని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ఇరాన్ ప్రతినిధి బృందానికి అమెరికా విదేశాంగ శాఖ వీసాలు జారీ చేసినట్లు సమాచారం. -
ఎల్ నినో సంక్షోభం: 5 కోట్ల మందికి ‘ఒక్క పూట’ కూడా కష్టమే..
ఆసియాను భారీ వాతావరణ ముప్పు అతలాకుతలం చేయనుందా? సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం, వాతావరణ మార్పుల ప్రభావం కలిసి ఈ ఏడాది ఎల్ నినోను మరింత శక్తిమంతంగా మారుస్తున్నాయన్న హెచ్చరికలు ఆందోళనకరంగా మారాయి. దీని ప్రభావంతో ఆసియాలో సుమారు 5 కోట్ల మంది ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందని ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూపీ) హెచ్చరించింది. భారత్, శ్రీలంకతో పాటు పలు దేశాలు ఇప్పటికే కరువు, నీటి కొరత, ఆహార భద్రతపై ముందస్తు చర్యలు ప్రారంభించాయి.ఎల్ నినో ఎందుకింత ప్రమాదకరం?ఐక్యరాజ్యసమితి వర్గాల హెచ్చరికల ప్రకారం ఎల్ నినో ప్రభావం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. పసిఫిక్ మహాసముద్రంలో అసాధారణంగా వేడెక్కుతున్న నీరు, వాతావరణ మార్పులు కలిసి పరిస్థితిని క్లిష్టంగా మారుస్తున్నాయి. ఈ ఏడాది ఎల్ నినో గత కొన్ని దశాబ్దాల రికార్డులను అధిగమించే స్థాయికి చేరవచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ కూడా ఎల్ నినో ప్రభావం క్రమంగా తీవ్రతరం అవుతున్నదని హెచ్చరించారు. వర్షపాతం తగ్గడం, ఉష్ణోగ్రతలు పెరగడం వంటి పరిణామాలు వ్యవసాయం, నీటి లభ్యత, ఆహార సరఫరాపై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉంది.భారత్‌లో ఇప్పటికే కనిపిస్తున్న సంకేతాలేంటి?భారత్‌లో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగుతున్న రుతుపవన కాలంలోనే కొన్ని ప్రాంతాల్లో పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. జూన్, ఆగస్టు నెలల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవగా, సెప్టెంబర్‌లోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు తగ్గినట్లు నివేదిక పేర్కొంది. ముఖ్యంగా మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో కరవు పరిస్థితుల సంకేతాలు కనిపిస్తున్నాయి. ఖరీఫ్ పంటలైన వరి, పప్పుధాన్యాలు, పత్తి, మొక్కజొన్నల దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దిగుబడులు తగ్గితే ఆహార ధరలు పెరిగే ప్రమాదం ఉండటంతో తక్కువ ఆదాయ, దిగువ మధ్యతరగతి కుటుంబాలపై భారం పెరగవచ్చని అంచనా.భారత్ ఏం చేస్తోంది?శాస్త్రవేత్తల హెచ్చరికలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలపై దృష్టి పెట్టింది. రైతులకు రక్షణ చర్యలు చేపడుతున్నామని వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించినట్లు నివేదిక పేర్కొంది. దేశవ్యాప్తంగా 350కిపైగా జిల్లాల్లో నీటి సంరక్షణ చర్యలను వేగవంతం చేస్తున్నట్లు తెలిపింది. తక్కువ నీటితో పండే, తక్కువ కాలంలో చేతికొచ్చే పంటలైన పప్పుధాన్యాలు, సజ్జలు వంటి వాటిని సాగు చేయాలని రైతులను ప్రోత్సహిస్తున్నారు. వర్షపు నీటిని నిల్వ చేయడం, నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా కరువు ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.శ్రీలంకలో నీటి కష్టాలు ముదిరాయా?ఎల్ నినో ప్రభావంతో శ్రీలంకలో గత దశాబ్దంలోనే అత్యంత తీవ్రమైన కరవు పరిస్థితులు నెలకొన్నట్లు నివేదిక తెలిపింది. 1.6 లక్షలకుపైగా ప్రజలు తాగునీటి కొరతను ఎదుర్కొంటున్నారు. పలు జలాశయాలు ఎండిపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. యాలా నేషనల్ పార్క్ వంటి పర్యాటక ప్రాంతాలను సైతం మూసివేయాల్సి వచ్చింది. వన్యప్రాణులకు నీటిని ట్యాంకర్ల ద్వారా అందిస్తున్నారు. ఈశాన్య ప్రాంతాల్లో చెరువులు ఎండిపోవడంతో వేలాది చేపలు మృతి చెందాయి. సముద్రపు నీటిని తాగునీటిగా మార్చే ప్రణాళికపై శ్రీలంక విపత్తు నిర్వహణ సంస్థ పనిచేస్తున్నప్పటికీ, ప్రస్తుతం ఆ సామర్థ్యం పరిమితంగానే ఉందని తెలుస్తోంది.ఆగ్నేయాసియాలో బియ్యం కొరత ముప్పు?ఆగ్నేయాసియా దేశాల్లోనూ ఆహార భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో ఈసారి బియ్యం ఉత్పత్తి 8 నుంచి 10 శాతం వరకు తగ్గవచ్చని అంచనాలు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో కుటుంబ ఆదాయంలో గణనీయమైన భాగం ఆహారానికే ఖర్చవుతుంది. పంట దిగుబడులు తగ్గి ధరలు స్వల్పంగా పెరిగినా కుటుంబాలపై ఆర్థిక భారం పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఆహార భద్రతను కేవలం వ్యవసాయ సమస్యగా కాకుండా జాతీయ భద్రతకు సంబంధించిన అంశంగా పలు దేశాలు పరిగణిస్తున్నాయి. సేంద్రియ ఎరువులు, పునరుత్పాదక వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించే చర్యలు కూడా చేపడుతున్నాయి.వేడి, భారీ వర్షాలు.. తుపాన్ల ముప్పు కూడా?తూర్పు ఆసియాలో ఎల్ నినో ప్రభావం కేవలం వర్షాభావానికే పరిమితం కాకుండా తీవ్ర వేడి, భారీ వర్షాలు, తుపాన్ల రూపంలోనూ కనిపించే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. దక్షిణ కొరియాలో జూలై అత్యంత పొడి నెలగా నమోదైన తర్వాత భారీ వర్షాలు కురిశాయి. 18 ఏళ్ల తర్వాత అక్కడ హీట్‌వేవ్ హెచ్చరిక వ్యవస్థను మార్చారు. జపాన్‌లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదైన రోజును అధికారికంగా ‘క్రూరమైన వేడి’ రోజుగా గుర్తించారు. సూపర్ టైఫూన్ల ముప్పు నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. హాంకాంగ్‌లో తీవ్ర వేడి సమయంలో ఉద్యోగులకు చల్లదనం కల్పించే ఏర్పాట్లు కంపెనీలకు తప్పనిసరి చేశారు. చైనాలో 100 రోజుల వాతావరణ ప్రమాద నివారణ కార్యక్రమం ప్రారంభించగా, తైవాన్ 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలను ఎదుర్కొనే పరిస్థితులపై సిమ్యులేషన్ నిర్వహించింది. మొత్తంగా అల్ నినో ప్రభావం ఆహారం, నీరు, ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థలపై ఒకేసారి ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళికలు కీలకంగా మారాయి.ఇదీ చదవండి: ‘మరో రోహిత్ వేముల..’ దళిత పీహెచ్డీ విద్యార్థి ఆవేదన -
ఇప్పుడు జెమినీ ఏఐ వంతు
అంతకంతకూ ‘తెలివి మీరిపోతున్న’ ఏఐ మోడళ్ల జాబితాలోకి తాజాగా గూగుల్ జెమినీ ఏఐ చేరింది. సైబర్ సెక్యూరిటీ సామర్థ్యాల పరీక్షలో ఈ ఏఐ మోడల్ ఏకంగా మూడు కంపెనీలను హ్యాక్ చేసినట్లు మాతృసంస్థ గూగుల్ ప్రకటించింది. ఇప్పటివరకూ ఇలా స్వతంత్రంగా ఇతర కంపెనీలను హ్యాక్ చేసిన ‘ఘనత’ ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్ మోడళ్లకు మాత్రమే ఉన్న విషయం తెలిసిందే. పరీక్షలో భాగం అనుకుని జెమినీ ఆన్లైన్లో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ను గమనించి వెబ్సైట్లోకి ప్రవేశించేందుకు అవసరమైన క్రెడెన్షియల్స్‌ను (యూజర్‌నేమ్, పాస్వర్డ్ వంటివి) ఊహించిందని, కాకపోతే ప్రతి సందర్భంలోనూ ఏఐ మోడల్ ఆగిపోయిందని గూగుల్ అధికారి ఒకరు బీబీసీకి తెలిపారు. ఆయా కంపెనీలకు ఈ సెక్యూరిటీ ఉల్లంఘన సమాచారం అందించినట్లు తెలిపారు. సైబర్ సెక్యూరిటీని మదింపు చేసే స్వతంత్ర సంస్థ మే నెలలో నిర్వహించిన పరీక్షలో జెమినీ ఏఐ హ్యాకింగ్ జరిగినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ మొదట ఒక కథనాన్ని ప్రచురించింది. దీనిపై గూగుల్ సెక్యూరిటీ ఇంజనీరింగ్ విభాగం ఉపాధ్యక్షురాలు హీదర్ అడ్కిన్స్ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ‘‘హ్యాకింగ్‌కు గురైన మూడు సంస్థలకు సమాచారం అందించాం. పరీక్ష పద్ధతుల్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలో ట్రెయినింగ్ భాగస్వామికి తెలియజేశాం’’ అని తెలిపారు. శక్తిమంతమైన ఏఐ మోడళ్ల శిక్షణ విషయంలో బాధ్యతగా ఎలా వ్యవహరించాలన్నది ఈ ఘటన తెలుపుతుందన్నారు. ఏఐ మోడళ్లు అభివృద్ధి చెందుతున్న వేగంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితుల్లో గూగుల్ జెమినీ ఏఐ హ్యాకింగ్ వార్తలు వెలువడటం గుర్తించాల్సిన విషయం. మానవాళికి ముప్పు కాగల ఏఐ మోడళ్ల అభివృద్ధిపై నెమ్మదించాలని ఓపెన్ఏఐ, స్పేస్ఎక్స్ ఏఐ, ఆంత్రోపిక్ వంటి సంస్థలు పిలుపునిచ్చాయి. జూలై నెలలో ఆంత్రోపిక్ ఏఐ మోడల్ క్లాడ్ తనంతటతానే మూడు కంపెనీలను హ్యాక్ చేయడం తెలిసిందే. ఇందుకు కొంత సమయం ముందే తమ ఏఐ మోడళ్లు సైబర్ దాడులకు పాల్పడినట్లు ఓపెన్ ఏఐ ప్రకటించింది. అయితే ఏఐ మోడళ్లు మానవాళికి ముప్పు అంటూ వస్తున్న వార్తలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌లాంటి వాళ్లు ఖండించడం, ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్ వంటి వారు అతడికి మద్దతుగా మాట్లాడటం గమనిస్తే ఏఐ మోడళ్ల విషయంలో టెక్ ప్రపంచం రెండుగా విడిపోయినట్లు స్పష్టమవుతుంది. జెన్సెన్ హువాంగ్, ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్‌లు ఇద్దరూ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అమెరికా పర్యటన సందర్భంగా ట్రంప్ ఏర్పాటు చేసిన వైట్‌హౌస్ డిన్నర్లో కలుసుకోనున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
భారత్‌కు టారిఫ్ ముప్పు!
వాషింగ్టన్: రష్యా ఆంక్షల బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసి చట్టంగా మార్చారు. ఈ పరిణామంతో రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు సుంకాలు విధించడానికి అధ్యక్షుడికి అధికారం లభించింది. తద్వారా భారత్, చైనాలకు అమెరికా సుంకాల ముప్పు పొంచి ఉన్నట్లే. ‘లిండ్సే ఓ.గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026’ అనే ఈ బిల్లును రిపబ్లికన్ల మద్దతుతో అమెరికా ప్రతినిధుల సభ 262–159 ఓట్ల తేడాతో ఆమోదించిన సంగతి తెలిసిందే. చట్టసభలో బిల్లు ఆమోదం పొందిన రెండు రోజుల తర్వాత ట్రంప్ దీనిపై సంతకం చేశారు. → ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధానికి ఆర్థిక వనరులను తగ్గించడమే ఈ కొత్త చట్టం అసలు లక్ష్యం. → ఇది రష్యా అధికారులు, బ్యాంకులు, ఇంధన సంస్థలు, మాస్కో సైనిక కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్న విదేశీ సంస్థలపై గురిపెట్టింది. → రష్యాకు చెందిన చమురు, గ్యాస్‌పై ఆధారపడటాన్ని తగ్గించడానికి, రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై సుంకాలు విధించే అధికారాన్ని ఈ చట్టం అధ్యక్షుడికి కల్పిస్తుంది. → హౌస్ వేస్ అండ్ మీన్స్ కమిటీ ప్రకారం ఈ చట్టం రష్యన్ ఉత్పత్తులపై 500 శాతం వరకు సుంకాలు విధించడానికి వీలు విధిస్తుంది. రష్యా చమురు, గ్యాస్ కొనుగోలు నిబంధనల పరిధిలోకి వచ్చే దేశాల ఉత్పత్తులపై 100 శాతం వరకు సుంకాలు విధించవచ్చు. → రష్యా అధ్యక్షుడు పుతిన్‌తోపాటు రష్యా ప్రభుత్వంలోని ఉన్నతాధికారులపైనా ఆంక్షలు విధించడానికి ఆస్కారం ఉంది. → 100% వరకు సుంకాలు విధించడానికి అర్హమైన దేశాలుగా చైనా, భారత్, యూఏఈ, టర్కీ, సింగపూర్, అజర్బైజాన్, కజకిస్తాన్, హంగేరీ, కిర్గిజిస్తాన్, స్లోవేకియా పేర్లను స్పష్టంగా పేర్కొనాలని బిల్లులో ఒక సవరణ ద్వారా ప్రతిపాదించారు. ఈ బిల్లు భారత్‌పై 100% సుంకాలు విధించాలని నేరుగా చెప్పలేదు. → అధ్యక్షుడు ట్రంప్ తన అధికారాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించుకుంటే భారత్‌పై 100 శాతం వరకు సుంకాలు విధించవచ్చు. → బలవంతపు శ్రమతో తయారైన వస్తువుల ఎగుమతులను అడ్డుకోవడంలో విఫలమైనందుకు భారత్ నుంచి వచ్చే ఉత్పత్తులపై అమెరికా ప్రస్తుతం 10 శాతం సుంకం వసూలు చేస్తోంది. ఒకవేళ ట్రంప్ 100 శాతం సుంకం విధిస్తే అది ఇప్పుడున్న 10 శాతం సుంకానికి అదనం అవుతుంది. → అమెరికా సుంకం రేట్లను ప్రకటించిన తర్వాతే భారతీయ ఎగుమతులపై కొత్త సుంకాల ప్రభావం ఎంతవరకు ఉంటుందో చెప్పగలమని నిపుణులు అంటున్నారు. -
సౌదీలో మోగిన హెచ్చరిక సైరన్లు
దుబాయ్: శత్రువు నుంచి వైమానిక దాడి జరిగే ప్రమాదముందంటూ ప్రజలను హెచ్చరిస్తూ శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం సౌదీ అరేబియా వ్యాప్తంగా సైరన్లు మోగాయి. హౌతీల దాడులు మొదలైన తర్వాత రాజధాని రియాద్‌లో ఇలాంటి సైరన్లు మోగడం ఇదే మొదటిసారి. రియాద్ విమానాశ్రయానికి సమీపంలో పేలుడు సంభవించిందని, విమానాల రాకపోకలకు అంతరాయం కలిగిందని వార్తలు వచ్చాయి. అయితే, ఎవరూ మరణించలేదని, ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. పేలుళ్లకు కారణాలను మాత్రం వెల్లడించలేదు. యెమెన్‌లోని హౌతీ రెబెల్స్ పొరుగుదేశాలకు హెచ్చరికలు చేయడం, దాడులకు పాల్పడటాన్ని శుక్రవారం ఐరాస భద్రతామండలి ఖండించింది. ఇలాంటి పరిణామాలు ప్రాంతీయ భద్రతకు, అంతర్జాతీయ వాణిజ్యానికి తీవ్ర విఘాతం కల్గిస్తాయని పేర్కొంది. హౌతీలకు సైనికపరమైన ఎలాంటి సాయం అందకుండా చేసేందుకు సంబంధిత దేశాల మధ్య ఆచరణాత్మక సహకారం అవసరమని పేర్కొంది. -
స్వీడన్ పార్లమెంట్‌కు ఎన్నికైన విఖే పాటిల్ కుమార్తె
ముంబై: మహారాష్ట్రలో ప్రముఖ విద్యావేత్త అశోక్ విఖే పాటిల్ కుమార్తె నీలా విఖే పాటిల్ గత వారం జరిగిన స్వీడన్ పార్లమెంట్ ఎన్నికల్లో స్టాక్‌హోమ్ సిటీ నియోజకవర్గం నుంచి గెలుపొంది ఆ దేశ పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ‘‘349 మంది సభ్యులున్న పార్లమెంట్‌కు ఎన్నికవ్వడం సంతోషంగాఉంది. తమ కష్టాలను చెప్పుకోలేకపోయిన వాళ్లకు గొంతుక అవుతా. ప్రతి చిన్నారికి మంచి భవిష్యత్తు ఉండేలా మెరుగైన సమాజం కోసం కృషిచేస్తా’’అని నీల తెలిపారు. 41 ఏళ్ల నీలా పాటిల్ ఆసియాలోనే మొట్టమొదటి సహకార చక్కెర ఫ్యాక్టరీని స్థాపించిన విఠల్‌రావ్ విఖే పాటిల్ మునిమనవరాలు. నీలా తాత బాలాసాహెబ్ విఖే పాటిల్ గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ‘‘మా తాత గర్వపడేలా ఎంపీగా పనిచేస్తా. టీనేజర్‌గా ఉన్నప్పుడు తాత నాతో రాష్ట్ర బడ్జెట్ చదివించారు’’అని నీల గుర్తుచేసుకున్నారు. నీల గతంలో నాటి ప్రధానమంత్రి స్టీఫన్ లోవెన్ హయాంలో ప్రధాని కార్యాలయంలో ఆర్థికం, పన్నులు, గృహాలకు సంబంధించి రాజకీయ సలహాదారుగా సేవలందించారు. నీల గతంలో స్టాక్‌హోమ్ మున్సిపల్ కార్పొరేషన్ సిటీ కౌన్సిల్లో సభ్యురాలిగా ఉన్నారు. స్వీడన్లో పుట్టిన నీల చిన్నతనంలో మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో పెరిగారు. నీల పెదనాన్న రాధాకృష్ణ విఖే పాటిల్ ప్రస్తుతం మహారాష్ట్రలో మంత్రిగా కొనసాగుతున్నారు. గోథన్బర్గ్ బిజినెస్ స్కూల్లో ఈమె ఎంబీఏ చేశారు. మాడ్రిడ్‌లోనూ విద్యనభ్యసించారు. స్వీడన్‌లోని విపక్ష గ్రీన్పారీ్టలో గత పాతికేళ్లుగా నీల క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. -
యుద్ధానికి మూల్యం చెల్లిస్తున్నారు
దుబాయ్: అమెరికా ఆంక్షలు, ఏడాదిన్నర కాలంగా కొనసాగుతున్న యుద్ధాలకు మూల్యాన్ని ఇరాన్ ప్రజలు చెల్లిస్తున్నారని ఆ దేశానికి చెందిన ప్రముఖ మానవ హక్కుల ఉద్యమకారిణి, నోబెల్ గ్రహీత నర్గీస్ మహ్మదీ(54) వ్యాఖ్యానించారు. ఆర్థిక ఇబ్బందులు, బలగాల అణచివేత కారణంగా సామాన్యులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నారన్నారు. ‘ఒక్కసారి ఇరాన్ వీధుల్లోకి వెళ్లి చూడండి. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏమిటో మీకు అర్థమవుతుంది. వారిప్పుడు మేల్కొన్నారు. హక్కుల కోసం పోరాడాలని తీర్మానించుకున్నారు’ అని మహ్మదీ అన్నారు. ‘నేటి ఇరాన్ యువతలో హక్కుల పట్ల అవగాహన ఉంది. ఈ విషయంలో వారికి స్పష్టత ఉంది. వారే మాకు ఆశ, శ్వాస’అని ఆమె పేర్కొన్నారు. తీవ్ర అనారోగ్యానికి గురైన నర్గీస్ మహ్మదీని ఇరాన్ ప్రభుత్వం జైలు నుంచి తాత్కాలికంగా విడుదల చేసింది. శుక్రవారం ఆమె అసోసియేటెడ్ ప్రెస్‌కు ఇచి్చన వర్చువల్ ఇంటర్వ్యూలో తన నిర్బంధానికి సంబంధించిన వివిధ అంశాలను ఆమె వివరించారు. బాల్యంతోపాటు జైలులో ఉన్న సమయంలో తనకు ఎదురైన అనుభవాల గురించి రాసిన ‘ఎ ఉమన్ నెవర్ స్టాప్స్ ఫైటింగ్’ పుస్తకం ఫ్రెంచి, జర్మన్, తదితర 9 భాషల్లో ఈ నెలలో విడుదల కానుంది. ఇంగ్లి‹Ù, పార్సీ ఎడిషన్లు వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. అమెరికాతో కొనసాగుతున్న యుద్ధం, ముదిరిన ఆర్థిక సంక్షోభం కారణంగా ఇరాన్ ప్రజలు పలు రకాలుగా కష్టాలను ఎదుర్కొంటున్నారని, భారీ మూల్యం చెల్లిస్తున్నారని మహ్మదీ పేర్కొన్నారు. తమ పాలకులపై ఇరాన్ వాసుల్లో నిశ్శబ్దంగా తీవ్ర వ్యతిరేకత పెరుగుతోందంటూ ఆమె ఇస్లాం డ్రెస్ కోడ్‌ను ఉల్లంఘించిన కారణంగా 22 ఏళ్ల మహ్సా అమీనిని అధికారులు నిర్బంధించడం, అనంతరం ఆమె ఆస్పత్రిలో చనిపోవడంతో మొదలైన అల్లర్లు దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో కొనసాగిన విషయాన్ని ప్రస్తావించారు. అమీనిని స్మరించుకుంటూ ఈ పుస్తకాన్ని విడుదల చేస్తున్నామన్నారు. హక్కుల కోసం పోరాడుతున్న నర్గీస్ మహ్మదీకి ఇరాన్ ప్రభుత్వం వివిధ ఆరోపణలు మోపి మొత్తం 44 ఏళ్ల జైలు శిక్షలు విధించిన సంగతి తెలిసిందే. -
లక్ష డాలర్ల ఫీజు ఇంకో ఏడాది
వాషింగ్టన్: కొత్త హెచ్1–బీ వీసా దరఖాస్తులపై ఇంకో ఏడాది లక్ష డాలర్ల ఫీజు వసూలు చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసినట్లు వైట్‌హౌస్ ప్రకటించింది. ప్రభుత్వ విభాగాలు మరింత సమన్వయంతో పనిచేయడం ద్వారా హెచ్1–బీ వీసాల దరఖాస్తులను నిశితంగా పరిశీలించాలని ట్రంప్ మరో ఉత్తర్వు ద్వారా ఆదేశించారు. 2025లో మొదటిసారి లక్ష డాలర్ల ఫీజును ప్రవేశపెట్టాక ఐటీ ఔట్సోర్సింగ్ కంపెనీల నుంచి వచ్చే హెచ్1–బీ వీసా దరఖాస్తులు 92 శాతం వరకూ తగ్గాయని ట్రంప్ తాజా ఉత్తర్వుల్లో తెలిపారు. అమెరికా ఆర్థిక, భద్రతపరమైన ప్రయోజనాలను కాపాడేందుకు గత ఏడాది నాటి ఈ ఉత్తర్వులను పొడిగించడం అవసరమైందని స్పష్టం చేశారు. అమెరికన్ ఉద్యోగులు, పట్టభద్రుల ఉద్యోగ అవకాశాలకు, కంపెనీలు అత్యధిక నైపుణ్యం అవసరమైన విదేశీయులను మాత్రమే నియమించుకునేలా చేసేందుకు ఈ ఉత్తర్వులు ఉపయోగపడతాయని వివరించారు. హెచ్1– బీ వీసాల లబ్ధి అత్యధికంగా పొందుతున్నది భారతీయ టెకీలన్న విషయం తెలిసిందే. 2025లో ట్రంప్ హెచ్1–బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల ఫీజు వసూలు చేయాలని నిర్ణయించినప్పుడు కొన్ని న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. రెండు ఫెడరల్ కోర్టుల్లో కేసులు నమోదయ్యాయి. నాటి ఉత్తర్వుల కాలపరిమితి ఈ నెలతో ముగియనుండగా తాజా ఆదేశాలు వెలువడటం గమనార్హం. అయితే ఈ లక్ష డాలర్ల ఫీజు అనేది అమెరికాలో విద్యార్థి వీసాలపై ఉన్న వారికి, ప్రస్తుతం హెచ్1–బీ వీసాపై ఉన్న వారి రెన్యువల్‌కూ వర్తించదు. ఈ వీసాదారుల వేతనాలు, పని నిబంధనలకు సంబంధించి కంపెనీ ఇప్పటికే సమర్పించిన లేబర్ కండిషన్ అప్లికేషన్ల సమాచారాన్ని 30 రోజుల్లో సమీక్షించాలని, అనంతరం స్పాన్సర్ చేసే సంస్థలపై మరిన్ని చర్యలు అవసరమా? లేదా? అన్నది నిర్ణయించాలని ట్రంప్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. -
పాక్‌లో ఇంధన సంక్షోభం.. లీటర్ పెట్రోల్ 400 పైమాటే!
పాకిస్థాన్‌లో భారీ ఇంధన సంక్షోభం నెలకొంది. శుక్రవారం రాత్రి ప్రకటించిన తాజా ధరల సవరణ ప్రకారం.. పెట్రోల్ ధర లీటర్ కు రూ.390.79కి చేరింది. హై-స్పీడ్ డీజిల్ (HSD) ధర లీటర్‌కు రూ.424.92గా ఉంది. ఈ ధరల్లో ప్రభుత్వం విధించే పన్నులు, సుంకాలు కూడా ఉన్నాయి. పెట్రోల్‌పై లీటర్‌కు రూ.114, డీజిల్‌పై లీటరు రూ.100 చొప్పున పన్నులు, సుంకాలు ఉన్నట్లు డాన్ నివేదించింది.పశ్చిమాసియా యుద్ధం మొదలైన దగ్గర నుంచి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. తాజాగా హౌతీలు సౌదీపై దాడులు ఉధృతం చేయడంతో ప్రస్తుతం చమురు సంక్షోభంగా మరింత కఠినంగా మారింది. దీంతో పాక్ ప్రభుత్వం ఇంధన ధరలు భారీగా పెంచేసింది. దీంతో వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. ఇక ప్రభుత్వ తీరుకు నిరసనగా ప్రతిపక్ష పీటీఐ నేతలు గాడిద బండ్లపై అసెంబ్లీకి వచ్చి నిరసన తెలిపారు.పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు. పెట్రోల్ ధరలు రూ.400కు చేరువ కావడాన్ని నిరసిస్తూ సింధ్ అసెంబ్లీకి గాడిద బండ్లపై వచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. పెట్రోల్ ధరల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. డాన్ నివేదిక ప్రకారం.. PTI నేత సజ్జాద్ అలీ సూమ్రో నేతృత్వంలో పలువురు పార్టీ ఎమ్మెల్యేలు సింధ్ అసెంబ్లీకి సమీపంలోని ప్రాంతాల నుంచి గాడిద బండ్లపై ప్రయాణించారు. అసెంబ్లీ ప్రధాన ద్వారం వరకు చేరుకున్న వారు ప్లకార్డులు ప్రదర్శిస్తూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెట్రోల్ ధరల పెంపుపై సజ్జాద్ అలీ తీవ్రంగా స్పందించారు. ప్రజలపై ప్రభుత్వం 'పెట్రోల్ బాంబు' వేసిందని విమర్శించారు. పెరిగిన పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. "పెట్రోల్ ధర ఎంతగా పెరిగిందంటే.. మా వాహనాల్లో అసెంబ్లీకి కూడా రాలేకపోతున్నాం. ప్రభుత్వ విధానాల ప్రభావాన్ని ప్రజలు తీవ్రంగా ఎదుర్కొంటున్నారు” అని సజ్జాద్ అలీ పేర్కొన్నట్లు డాన్ నివేదించింది.ఇదీ చదవండి: బట్లర్ విధ్వంసం.. ఇంగ్లండ్ చేతిలో శ్రీలంక వైట్‌వాష్ -
భారత్‌కు బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రహ్మాన్? ఇక విభేదాలన్నీ..
బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రహ్మాన్ భారత్ పర్యటనకు సంబంధించి ఢిల్లీ, ఢాకా మధ్య అధికారికంగా చర్చలు మళ్లీ ప్రారంభమైనట్లు సమాచారం. నవంబర్‌లో ఆయన న్యూఢిల్లీ పర్యటనకు సమయాన్ని ఖరారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని జాతీయ మీడియా తెలిపింది.ఢాకాలో ఇరు దేశాల అధికారులు సమావేశాలు నిర్వహిస్తూ పర్యటనకు సంబంధించిన అంశాలను చర్చిస్తున్నట్లు దౌత్య వర్గాలు తెలిపాయి. ఈ నెలలో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ కోసం తారిఖ్ రహ్మాన్ న్యూయార్క్ వెళ్లాల్సి ఉంది. అనంతరం అక్టోబర్, నవంబర్ నెలల్లో ఆయనకు పలు దౌత్యపరమైన కార్యక్రమాలు ఉండనున్నాయి. వీటి మధ్యలో నవంబర్‌లో న్యూఢిల్లీ పర్యటనకు అనువైన తేదీని ఖరారు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.ప్రతిపాదిత పర్యటనలో భారత్-బంగ్లాదేశ్ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సాధారణ స్థితికి తీసుకురావడం, రెండు దేశాల మధ్య సంబంధాలపై చర్చించడం, గంగా జలాల ఒప్పందం పునరుద్ధరణ వంటి అంశాలు ఎజెండాలో ఉండే అవకాశం ఉందని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది. 1996లో కుదిరిన గంగా జలాల పంపిణీ ఒప్పందం 2026 డిసెంబర్లో ముగియనుంది.ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి తారిఖ్ రహ్మాన్ హాజరుకాలేదు. బంగ్లాదేశ్ తెలిపిన వివరాల ప్రకారం ఆయనకు ఆహ్వానం ప్రధానమంత్రిగా కాకుండా బిమ్స్టెక్ చైర్‌గా వచ్చింది. మరోవైపు, బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి హుమాయున్ కోబిర్ భారత్‌తో సంబంధాలను “రీ-సెట్” చేసేందుకు అనుకూల వాతావరణంలో ద్వైపాక్షిక పర్యటన జరగాలని గతంలో పేర్కొన్నారు. అయితే పర్యటన తేదీపై ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు. ఇరు దేశాల మధ్య చర్చలు ముందుకు సాగితే నవంబర్‌లో తారిఖ్ రహ్మాన్ పర్యటన ఖరారయ్యే అవకాశంపై స్పష్టత రానుంది. -
సౌదీ రాజధానిలో హై అలర్ట్.. వైమానిక దాడులు?
రియాద్: యెమెన్‌లో హౌతీలు విజృంభిస్తున్న నేపథ్యంలో సౌదీ అలర్టయ్యింది. ఆ నేపథ్యంలోనే తొలిసారిగా రాజధాని రియాద్‌లో హెచ్చరికలు జారీ చేసింది. శనివారం తెల్లవారుజామున రియాద్‌లో వైమానిక దాడి హెచ్చరిక జారీ అయింది. ఆ ప్రాంతంలోని పౌరులకు వైమానిక దాడుల ముప్పు ఉందని ఇళ్లలోనే ఉండాలని అధికారులు సందేశాలు పంపారు. కొద్దిసేపటికే రెండు భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో నగర ప్రజల్లో ఆందోళన వాతావరణం నెలకొంది.యెమెన్‌లో సౌదీ అరేబియా మద్ధతిస్తున్న ప్రభుత్వ బలగాలకు అక్కడి హౌతీలకు తీవ్రంగా యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో హౌతీలు వేగంగా దాడులు చేస్తూ భారీగా భూభాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ముఖ్యంగా ఎర్ర సముద్ర తీర ప్రాంతాల్లో వారి పట్టు పెరగడం సౌదీ అరేబియాకు ఆందోళన కలిగిస్తోంది. గతంలో హౌతీలపై సౌదీ అరేబియా అనేక వైమానిక దాడులు చేసినప్పటికీ వారి పురోగతిని పూర్తిగా అడ్డుకోలేకపోయింది. తాజా పరిణామాల నేపథ్యంలో సౌదీ ప్రభుత్వం మరోసారి అప్రమత్తమైంది. హౌతీలు తమపై దాడి చేసే అవకాశం ఉండడంతో హెచ్చరికలు జారీ చేసింది. మక్కాపై దాడి ఆరోపణఇటీవల మక్కాపై హౌతీలు దాడి చేశారని సౌదీ అరేబియా ఆరోపించగా, హౌతీలు ఆ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. రియాద్‌లో జారీ చేసిన తాజా హెచ్చరికకు ముప్పు ఎక్కడి నుంచి వచ్చిందో సౌదీ అధికారులు అధికారికంగా వెల్లడించలేదు. అయితే యెమెన్‌లో కొనసాగుతున్న పోరాటం కారణంగా ఇప్పటివరకు 1.12 లక్షల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. యెమెన్‌లోని ఎర్ర సముద్ర తీర ప్రాంతాలపై హౌతీల నియంత్రణ పెరగడం వల్ల అంతర్జాతీయ సముద్ర వాణిజ్యంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో సౌదీ అరేబియా తన రక్షణ సామర్థ్యాలను పెంచుకునే చర్యల్లో భాగంగా అమెరికా నుంచి 48 ఎఫ్-35 యుద్ధ విమానాల కొనుగోలుకు 24.3 బిలియన్ డాలర్ల ఒప్పందానికి అనుమతి పొందింది. అమెరికా సహాయం కోరినప్పటికీ, హౌతీలపై నేరుగా దాడులు చేయడానికి అమెరికా నిరాకరించినట్లు సమచారం వచ్చింది. -
గల్ఫ్‌లో కొత్త యువరాజు ఎంట్రీ.. మోదీ, పుతిన్‌తో భేటీపై కొత్త చర్చ
గల్ఫ్ రాజకీయాల్లో మరో యువరాజు పేరు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారుతోంది. ఆయనే అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్. 44 ఏళ్ల ఖలీద్.. కేవలం యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ (MBZ) కుమారుడిగా మాత్రమే కాకుండా.. అబుదాబి ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడులు, దౌత్య వ్యవహారాల్లో కీలక బాధ్యతలు చేపడుతున్న నాయకుడిగా ఎదుగుతున్నారు.ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ (BRICS) సదస్సులో ఖలీద్ ప్రాధాన్యం మరింత స్పష్టమైంది. యూఏఈ తరఫున సదస్సుకు నాయకత్వం వహించిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తోనూ కీలక సమావేశం నిర్వహించారు. ఇరాన్, యూఏఈ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో జరిగిన ఈ భేటీ ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరు దేశాలు ఉద్రిక్తతలు తగ్గించి, ప్రాంతీయ స్థిరత్వాన్ని పెంచేందుకు ప్రయత్నించాలని అంగీకరించినట్లు అబుదాబి అధికారిక వర్గాలు తెలిపాయి. పెజెష్కియాన్ కూడా సమావేశం అనంతరం.. గతాన్ని పక్కనపెట్టి భవిష్యత్తు వైపు చూడాలని ఇరుపక్షాలు అంగీకరించినట్లు చెప్పారు. నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతల తర్వాత ఇరాన్-యూఏఈ మధ్య అత్యున్నత స్థాయి సంప్రదింపుల్లో ఇదొకటిగా అంతర్జాతీయ మీడియా పేర్కొంది.ఇదంతా ఎందుకు కీలకం?ఖలీద్ ఎదుగుదల కేవలం దౌత్య భేటీలకే పరిమితం కావడం లేదు. 2023లో ఆయనను అబుదాబి క్రౌన్ ప్రిన్స్‌గా నియమించిన తర్వాత.. అబుదాబి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్‌గా, ADNOCకు సంబంధించిన కీలక బాధ్యతల్లోనూ ఆయన పాత్ర పెరిగింది. అంటే.. అబుదాబి రాజకీయ వ్యవస్థతో పాటు దాని చమురు, పెట్టుబడులు, ఆర్థిక శక్తి వ్యవస్థల్లోనూ ఖలీద్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది.ఇదే సమయంలో గల్ఫ్‌లో మరో యువరాజు ఇప్పటికే తనదైన ముద్ర వేశారు. ఆయనే సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ (MBS). సౌదీ అరేబియా భారీ జనాభా, పెద్ద ఆర్థిక వ్యవస్థ, విస్తారమైన చమురు వనరులతో ప్రాంతంలో అత్యంత ప్రభావవంతమైన శక్తిగా ఉంది. మరోవైపు అబుదాబి పరిమాణంలో చిన్నదైనా.. భారీ సంపద, పెట్టుబడులు, ఫైనాన్స్, లాజిస్టిక్స్, అంతర్జాతీయ వ్యాపార సంబంధాల ద్వారా తన ప్రభావాన్ని పెంచుకుంది. ఇటీవలి సంవత్సరాల్లో సౌదీ అరేబియా కూడా పెట్టుబడులు, టూరిజం, వ్యాపార రంగాల్లో భారీ ప్రాజెక్టులతో ముందుకు సాగుతోంది. దీంతో గల్ఫ్‌లో అబుదాబి, రియాద్ మధ్య ఆర్థిక పోటీ మరింత స్పష్టంగా కనిపిస్తోంది. యెమెన్, ఇరాన్, సూడాన్ వంటి ప్రాంతీయ అంశాలపై కూడా సౌదీ, యూఏఈ విధానాల్లో భేదాలు నమోదయ్యాయి.తండ్రి నిర్మించిన వ్యవస్థ.. కొడుకు చేతుల్లోకియూఏఈ అధ్యక్షుడు MBZ దశాబ్దాలుగా నిర్మించిన రాజకీయ, ఆర్థిక వ్యవస్థను ఇప్పుడు ఖలీద్ తదుపరి దశకు తీసుకెళ్లాల్సి ఉంది. అందులో భాగంగానే అంతర్జాతీయ నాయకులతో వరుస భేటీలు, భారీ పెట్టుబడి సంస్థల పర్యవేక్షణ, అబుదాబి ఆర్థిక వ్యవస్థలో కీలక బాధ్యతలు ఆయనకు అప్పగిస్తున్నట్లు కనిపిస్తోంది. బ్రిక్స్ వేదికపై ప్రధాని మోదీ, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వంటి నేతలతో ఖలీద్ భేటీలు.. ఆయనకు అప్పగిస్తున్న అంతర్జాతీయ దౌత్య బాధ్యతలకు మరో ఉదాహరణగా నిలిచాయి. యూఏఈ అధికారిక ప్రకారం, న్యూఢిల్లీలో మోదీతో జరిగిన సమావేశంలో ఇరు దేశాల దీర్ఘకాలిక సంబంధాలు, ఆర్థిక సహకారాన్ని మరింత విస్తరించే అంశాలపై చర్చ జరిగింది.అయితే ఖలీద్ ఎదుగుతున్న సమయంలో ఆయన కుటుంబంలోని ఇతర కీలక వ్యక్తులకూ అబుదాబి వ్యవస్థలో గణనీయమైన బాధ్యతలు ఉన్నాయి. అందువల్ల ఇది ఒక్క వ్యక్తి వారసత్వ కథ మాత్రమే కాకుండా.. అబుదాబి పాలనా వ్యవస్థలో తదుపరి తరం అధికార పంపిణీ ఎలా ఉండబోతోందన్న ప్రశ్నను కూడా ముందుకు తెస్తోంది. దీంతో, రియాద్‌లో MBS తన ప్రభావాన్ని విస్తరిస్తున్న వేళ.. అబుదాబి నుంచి ఖలీద్ కూడా అంతర్జాతీయ దౌత్యం, పెట్టుబడులు, ఆర్థిక శక్తి ద్వారా తన పాత్రను విస్తరిస్తున్నారు. ఇరాన్‌తో తాజా చర్చలు, మోదీతో భేటీ, బ్రిక్స్ వేదికపై ఆయన ప్రదర్శించిన దౌత్య చురుకుదనం.. గల్ఫ్ తదుపరి తరం నాయకత్వంలో ఖలీద్ పాత్ర పెరుగుతోందన్న సంకేతాలను ఇచ్చాయి. -
భారతీయులకు మరో బిగ్ షాక్.. ట్రంప్ సంచలన ప్రకటన
అమెరికాలో ఉద్యోగం.. అక్కడే స్థిరపడాలనే కలలు కంటున్న భారతీయ టెకీలకు ట్రంప్ సర్కార్ మరో కీలక నిర్ణయంతో షాకిచ్చింది. విదేశీ ఉద్యోగులను నియమించుకునే సంస్థలపై విధించిన 1 లక్ష డాలర్ల H-1B వీసా ఫీజును మరో ఏడాది పొడిగించింది. ఇప్పటికే ఈ భారీ ఫీజుతో సతమతమవుతున్న ఐటీ రంగానికి తాజా నిర్ణయం మరింత కీలకంగా మారింది. ఈ ఫీజు కారణంగా పెద్ద ఐటీ ఔట్సోర్సింగ్ సంస్థల్లో H-1B రిజిస్ట్రేషన్లు 92 శాతం తగ్గినట్లు ట్రంప్ తన ప్రకటనలో పేర్కొన్నారు.ఈ సందర్భంగా H-1B కార్యక్రమం అసలు ఉద్దేశాన్ని కొన్ని సంస్థలు దుర్వినియోగం చేస్తున్నాయని ట్రంప్ ఆరోపించారు. అమెరికన్ల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు విదేశీ ఉద్యోగులను తీసుకొస్తున్నాయని విమర్శించారు. ఈ నేపథ్యంలో అమెరికన్ ఉద్యోగులకు అవకాశాలు పెంచడం, అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను మాత్రమే నియమించుకునేలా చూడటమే లక్ష్యంగా ఫీజును కొనసాగిస్తున్నట్లు వైట్‌హౌస్ వెల్లడించింది.భారతీయులపైనే ప్రభావం?అమెరికా H-1B వీసా కార్యక్రమంలో అత్యధికంగా లబ్ధి పొందుతున్న వారిలో భారతీయులే అగ్రస్థానంలో ఉన్నారు. దీంతో ట్రంప్ తాజా నిర్ణయం భారతీయ ఐటీ నిపుణులపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే చర్చ మొదలైంది. ముఖ్యంగా అమెరికాలో కొత్తగా ఉద్యోగాలు పొందాలనుకునే వారికి ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, అమెరికాలో ఇప్పటికే విద్యార్థి వీసాలపై ఉన్న విదేశీయులకు మంజూరయ్యే H-1B వీసాలు, ప్రస్తుత వీసాల రెన్యూవల్స్‌కు ఈ లక్ష డాలర్ల ఫీజు వర్తించదని గత ఆదేశంలో స్పష్టం చేశారు.వీసా దరఖాస్తులపై మరింత నిఘాఫీజు పొడిగింపుతోపాటు H-1B దరఖాస్తుల పరిశీలనను కూడా ట్రంప్ ప్రభుత్వం కఠినతరం చేసింది. అమెరికన్ ఉద్యోగులను తొలగించినా లేదా తొలగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిన సంస్థలు విదేశీ ఉద్యోగులను నియమించుకునే సమయంలో మరింత నిశితంగా పరిశీలించాలని సంబంధిత శాఖలను ఆదేశించింది. గతంలో సమర్పించిన లేబర్ కండిషన్ దరఖాస్తులపై 30 రోజుల్లో సమీక్ష ప్రారంభించాలని కార్మిక శాఖకు సూచించింది. అవసరమైతే స్పాన్సర్ సంస్థలపై తదుపరి చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలించనున్నారు.కోర్టులో కేసులు.. అయినా వెనక్కి తగ్గని ట్రంప్!2025లో విధించిన లక్ష డాలర్ల ఫీజును సవాలు చేస్తూ రెండు ఫెడరల్ కోర్టుల్లో కేసులు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ, గడువు ముగియనున్న తరుణంలో ట్రంప్ ప్రభుత్వం మరో ఏడాది పొడిగింపు ప్రకటించింది. మొత్తంగా.. H-1B వీసాలపై భారీ ఫీజు, కఠిన తనిఖీలు కొనసాగనున్న నేపథ్యంలో అమెరికాలో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న భారతీయులకు కొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశముంది.ఇదీ చదవండి: ఇరాన్లో ట్రంప్‌కు బిగ్ షాక్ -
13 ఏళ్ల వయసులో కన్నబిడ్డ కోసం పోరాటం?!
ఆడుకోవాల్సిన వయసులో పెళ్లి. చదువుకోవాల్సిన వయసులో మాతృత్వం. చివరకు దూరమైన బిడ్డ కోసం ఆమె తల్లడిల్లిపోయింది. కేవలం 13 ఏళ్ల వయసులోనే తన ఏడు నెలల కొడుకు కోసం కోర్టు మెట్లెక్కిన ఆమె.. ఆ న్యాయపోరాటంలో విజయం సాధించింది. చిన్నారి అనామికా కథ.. ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.అనామికా అకర్త్కు సోషల్ మీడియా ద్వారా 22 ఏళ్ల యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా.. అటు నుంచి అటు పెద్దల అంగీకారంతో పెళ్లికి దారితీసింది. అప్పటికి ఆమె వయసు కేవలం 11 ఏళ్లే. బాల్యం అంటే ఏమిటో పూర్తిగా అర్థం చేసుకునే స్థితి కూడా లేదు. అయినప్పటికీ వివాహం జరిగింది. ఆ తర్వాత ఆమె 2026లో ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది.అయితే కొద్ది నెలలకే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఈ ఏడాది మేలో భర్త, అత్తమామలు అనామికను ఇంటి నుంచి బయటకు పంపించారు. అయితే అనామిక బిడ్డను మాత్రం తమ వద్దే ఉంచుకున్నారు. దీంతో తన కుమారుడిని తిరిగి తనకు అప్పగించాలని కోరుతూ అనామిక కోర్టును ఆశ్రయించింది.‘ఆమె కూడా ఇంకా చిన్నారే’ఈ కేసును విచారించిన కోర్టు.. ఏడు నెలల శిశువును అనామిక సంరక్షణకు అప్పగించాలని ఆదేశించినట్లు వైరల్ వీడియో సారాంశం. ఈ సందర్భంగా న్యాయమూర్తి.. బిడ్డ తల్లి అనామిక కూడా ఇంకా చిన్నారేనన్న విషయాన్ని ప్రస్తావించినట్లు ఆ వైరల్ కథనాల్లో కనిపిస్తోంది. అలా తన బాల్యాన్ని కోల్పోయిన ఓ బాలిక.. ఇప్పుడు తన బిడ్డ భవిష్యత్తు కోసం పోరాడి నెగ్గిందన్నమాట. బంగ్లాదేశ్‌లో జరిగిన ఈ ఘటన.. ఇప్పుడు నెట్టింట రకరకాల చర్చలకు దారి తీసింది. కఠిన చట్టం ఉన్నా.. బాల్య వివాహాలు మాత్రంబంగ్లాదేశ్లోనూ బాల్య వివాహాలను కట్టడికి చట్టాలు ఉన్నప్పటికీ.. ఆచరణలో మాత్రం సమస్య కొనసాగుతోంది. యూనిసెఫ్ గణాంకాల ప్రకారం.. బంగ్లాదేశ్‌లో 20–24 ఏళ్ల వయసున్న మహిళల్లో దాదాపు 47 శాతం మంది 18 ఏళ్లలోపే వివాహం చేసుకున్నవారే. పేదరికం, సామాజిక ఒత్తిళ్లు, సంప్రదాయాలు వంటి కారణాలు బాల్య వివాహాలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. చిన్న వయసులో పెళ్లి కావడం వల్ల బాలికల చదువుకు ఆటంకం కలగడమే కాకుండా.. ముందస్తు గర్భధారణ, ప్రసవ సంబంధ ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఆధారపడటం, హింసకు గురయ్యే ముప్పు కూడా పెరుగుతుందని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. బంగ్లాదేశ్ కోర్టులో అనామికకు న్యాయం జరిగింది. కొన్నిచోట్ల మరో దేశం వినిపిస్తోంది. అలాగే ఆమె వయసు విషయంలోనూ భిన్న వాదనలు చేస్తున్నారు కొందరు నెటిజన్లు. ఏది ఏమైనా అంత చిన్న వయసులో ఓ బాలిక తన బిడ్డ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిన ఈ ఘటన.. బాల్య వివాహం కేవలం ఓ పెళ్లి కాదని గుర్తుచేస్తోంది. ఒక చిన్నారి చేతుల్లో బిడ్డను పెట్టడమే కాదు.. ఆమె చదువు, స్వేచ్ఛ, కలలు, భవిష్యత్తును కూడా ముందుగానే బాధ్యతల కింద నలిపేస్తోంది. అనామికకు దక్కిన ఈ విజయం ఆమె బిడ్డను తిరిగి ఇచ్చింది.. కానీ ఇలాంటి పరిస్థితుల్లోకి మరో బాలిక వెళ్లకుండా ఆపగలమా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.🚨 SHOCKING: CHILD MARRIED AT 11, MOTHER AT 13!Anamika Akter, reportedly married to a 22 year old man at just 11, became a mother at 13.A CHILD is now raising another CHILD. 💔How is this still happening in Bangladesh? pic.twitter.com/Ayg0vJIN77— News Matrix (@NewsMatrixIND) September 18, 2026 -
గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ బిగ్ అనౌన్స్మెంట్.. ఇక ‘పర్మినెంట్ కంట్రోల్’!
గ్రీన్లాండ్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. డెన్మార్క్, గ్రీన్‌లాండ్‌తో కలిసి అమెరికా ఒక కొత్త భద్రతా ఒప్పందానికి అంగీకరించినట్లు తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా గ్రీన్లాండ్ భద్రతపై అమెరికాకు ‘శాశ్వత నియంత్రణ’’ లభిస్తుందని ట్రంప్ ప్రకటించారు. అలాగే దీనిని ఆయన ‘‘ఇన్ఫినిట్ లైఫ్ అగ్రిమెంట్’’గా అభివర్ణించారు.ట్రంప్ చేసిన తాజా ప్రకటన.. ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపాన్ని అమెరికా స్వాధీనం చేసుకుంటుందని కాదు. కేవలం భద్రతకు సంబంధించింది మాత్రమే. గ్రీన్లాండ్ ఇక మీదట కూడా డెన్మార్క్ రాజ్యంలోనే కొనసాగుతుందని, ఆ దేశ సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను, అక్కడి ప్రజల స్వయం నిర్ణయ హక్కును ఒప్పందం గుర్తిస్తుందని డెన్మార్క్ స్పష్టం చేసింది. అమెరికా, డెన్మార్క్, గ్రీన్లాండ్ ప్రభుత్వాలు వచ్చే వారం ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సందర్భంగా న్యూయార్క్‌లో ఈ ఒప్పందంపై సంతకాలు చేయనున్నాయి. అనంతరం అవసరమైన పార్లమెంటరీ ప్రక్రియలు పూర్తయిన తర్వాతే ఇది అమల్లోకి రానుంది. కొత్త ఒప్పందం.. రష్యా, చైనాకు చెక్గ్రీన్లాండ్లో అమెరికా ప్రత్యర్థి దేశాలు సైనిక స్థావరాలు ఏర్పాటు చేయకుండా ఈ ఒప్పందం అడ్డుకట్ట వేస్తుందని ట్రంప్ చెప్పారు. ముఖ్యంగా రష్యా, చైనాలు అక్కడ సైనిక స్థావరాలు ఏర్పాటు చేయడం, సైనిక ఉనికిని పెంచడం లేదా సున్నితమైన పెట్టుబడులు పెట్టడం అమెరికా అనుమతి లేకుండా సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు. అమెరికా ఇప్పటికే గ్రీన్లాండ్లో పిటుఫిక్ స్పేస్ బేస్‌ను నిర్వహిస్తోంది. క్షిపణి హెచ్చరికలు, క్షిపణి రక్షణ, అంతరిక్ష నిఘా వంటి కార్యకలాపాల్లో ఈ స్థావరం కీలకంగా ఉంది. కొత్త ఒప్పందంతో గ్రీన్లాండ్లో అమెరికా సైనిక ఉనికిని మరింత పెంచుకునే అవకాశం ఏర్పడినట్లు తాజా వివరాలు సూచిస్తున్నాయి. ట్రంప్ వ్యాఖ్యకు అర్థమేంటి?ఈ ఒప్పందానికి గడువు ఉండదనే అర్థంలో ట్రంప్ దీనిని ‘‘ఇన్ఫినిట్ లైఫ్ అగ్రిమెంట్’’గా పేర్కొన్నారు. గ్రీన్లాండ్, అమెరికా భద్రతను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకునే అవకాశం అమెరికాకు ఎప్పటికీ ఉంటుందని ఆయన అన్నారు. గ్రీన్లాండ్లో పెద్ద ఎత్తున అమెరికా సైనిక ఉనికిని అభివృద్ధి చేసే ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తామని కూడా ప్రకటించారు. ఎందుకంత కీలకం?ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్న గ్రీన్లాండ్ భౌగోళికంగా అత్యంత కీలకమైన ప్రదేశం. ఉత్తర అమెరికా, యూరప్ మధ్య ఉన్న ప్రాంతంలో దాని స్థానం కారణంగా అమెరికా రక్షణ వ్యూహంలో దీనికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. రష్యా, చైనా ఆర్కిటిక్ ప్రాంతంలో తమ ప్రభావాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో గ్రీన్‌లాండ్‌పై అమెరికా దృష్టి మరింత పెరిగింది.ట్రంప్ పాత డిమాండ్‌కు భిన్నంగా..గ్రీన్‌లాండ్‌ను అమెరికా సొంతం చేసుకోవాలన్న ఆకాంక్షను ట్రంప్ గతంలో పలుమార్లు వ్యక్తం చేశారు. అవసరమైతే బలప్రయోగాన్ని కూడా తోసిపుచ్చని ఆయన వైఖరి డెన్మార్క్‌తో పాటు ఇతర నాటో దేశాల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. తాజా ఒప్పందం మాత్రం గ్రీన్‌లాండ్‌ను అమెరికాలో కలపడం లేదా దాని సార్వభౌమాధికారాన్ని మార్చడం కాకుండా.. భద్రత, సైనిక ఉనికిపై అమెరికా పాత్రను విస్తరించే దిశగా ఉంది. డెన్మార్క్ ప్రధాని మెట్టె ఫ్రెడరిక్సన్ ఈ ఒప్పందం.. ఆర్కిటిక్, ఉత్తర అట్లాంటిక్ ప్రాంతంలో ఉమ్మడి భద్రతను బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. ఇది నాటో, యూరప్‌కు కూడా ప్రయోజనకరమని అన్నారు. గ్రీన్లాండ్ ప్రభుత్వ అధిపతి జెన్స్-ఫ్రెడరిక్ నీల్సన్ కూడా ఈ ఒప్పందం గ్రీన్లాండ్, డెన్మార్క్, అమెరికా, పాశ్చాత్య కూటమి భద్రతను బలోపేతం చేస్తుందని తెలిపారు. ఇదీ చదవండి: మీడియాను తొక్కిపారేస్తున్న ట్రంప్ -
ఎన్నాళ్లైనా ఎదగని పిల్లి.. పులిలా ఉందేంటి?
బొలీవియా: దక్షిణ అమెరికా దేశమైన బొలీవియా అడవుల్లో శాస్త్రవేత్తలు వందేళ్ల తర్వాత ఓ సరికొత్త పిల్లి జాతిని కనుగొన్నారు. దీనికి 'లియోపార్డస్ తిల్కాయో' (తిల్కాయో టైగర్ క్యాట్) అని నామకరణం చేశారు. స్థానికంగా 'టిగ్రినో' అని పిలిచే పదేళ్ల ఈ జీవిని అడవిలో మొదటిసారి చూసినప్పుడు, ఒక సాధారణ పెంపుడు పిల్లి పిల్లగా భావించారు.అయితే ఏళ్లు గడుస్తున్నా అది ఎదుగుదల లేకుండా చిన్నగానే ఉండటం, ఒంటిపై చిరుతను పోలిన మచ్చలు, గుండ్రటి చెవులు కలిగి ఉండటం పరిశోధకుల దృష్టిని ఆకర్షించింది. లా పాజ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు దీనిపై ప్రత్యేకంగా డీఎన్ఏ పరీక్షలు నిర్వహించగా, ఇది ఇప్పటివరకు ప్రపంచానికి తెలియని సరికొత్త టైగర్ క్యాట్ జాతి అని తేలింది.ఆండీస్ పర్వతాలు, అమెజాన్ బేసిన్ కలిసే యుంగాస్ ప్రాంతంలో జీవించే ఈ అరుదైన జీవి ఆవిష్కరణకు సంబంధించిన వివరాలు 'కరెంట్ బయాలజీ' జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఇలాంటి అడవి పిల్లుల సంరక్షణకు, ఇంకా వెలుగుచూడని జీవవైవిధ్యాన్ని గుర్తించడానికి ఈ పరిశోధన ఎంతో కీలకంగా మారనుంది.ఇదీ చదవండి: మీడియాపై ట్రంప్ ప్రతాపం.. ఆ దిగ్గజ సంస్థలకు నో ఎంట్రీ! -
ఇరాన్లో ఏం జరుగుతోంది.. అమెరికా, ఇజ్రాయెల్‌కు కొత్త పరీక్ష!
టెహ్రాన్: అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో శుక్రవారం భారీ ర్యాలీ జరిగింది. వేలాది మంది మిలటరీ దుస్తులు ధరించి, ఇరాన్ జెండాలు చేతబట్టి ర్యాలీలో పాల్గొన్నారు. అమెరికా దురాక్రమణ ప్రయత్నాలను అడ్డుకుంటామని, అవసరమైతే ప్రాణాలైనా అర్పిస్తామని నినాదాలు చేశారు. ఫిబ్రవరిలో అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైన తర్వాత టెహ్రాన్‌లో జరిగిన అతిపెద్ద ర్యాలీ ఇదేనని పలు కథనాలు పేర్కొంటున్నాయి. సుమారు 3 లక్షల మంది పాల్గొన్నట్టు ఇరాన్ ప్రభుత్వ టీవీ అంచనా వేసింది.ఇరాన్ ప్రభుత్వం చేపట్టిన ‘జన్ఫాదే–ఇరాన్’ (ఇరాన్ కోసం ప్రాణాలర్పించేవారు) ప్రచారోద్యమంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఇందులో పాల్గొన్న వారికి ఆయుధ శిక్షణ కూడా ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను అణచివేయడంలో కీలకంగా ఉండే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్, బసీజ్ మిలీషియాలకు వీరు అదనపు బలంగా ఉంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చేరేందుకు ఇప్పటికే 6 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారని రివల్యూషనరీ గార్డ్ చీఫ్ జనరల్ హస్సన్ హస్సన్జాదెహ్ తెలిపారు. త్వరలోనే ఇతర నగరాల్లోనూ ఇలాంటి ర్యాలీలు నిర్వహిస్తామని బసీజ్ విభాగం నూతన సారథి హొస్సేన్ తాయెబ్ ప్రకటించారు.ర్యాలీని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, మిలటరీ కమాండర్లు, సీనియర్ అధికారులు పరిశీలించారు. కొందరు పాల్గొనేవారు అమెరికా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆ దేశాల జెండాలను తొక్కుకుంటూ వెళ్లారు. మరోవైపు ఓ ట్రక్కుపై మహిళా గార్డులు మెషీన్ గన్లతో కనిపించడం ర్యాలీలో ప్రత్యేకంగా నిలిచింది.Women present in today's rally of ´Sacrifice for Iran' in Tehran pic.twitter.com/YiiLOO3rov— Farzaneh Ashoorioun | فرزانه عشوریون (@frzaneh_a) September 18, 2026 ఇరాన్‌కు ప్లస్.. ఇదిలా ఉండగా.. యుద్ధం కొనసాగుతున్న వేళ జరిగిన ఈ భారీ ర్యాలీని ఇరాన్ ప్రభుత్వం దేశ ప్రజాబలాన్ని, ప్రతిఘటన సామర్థ్యాన్ని ప్రదర్శించే కార్యక్రమంగా ముందుకు తీసుకెళ్లింది. అమెరికా ఆంక్షలు, ఆర్థిక ఒత్తిళ్ల మధ్య దేశంలో ఐక్యతను చాటే ప్రయత్నంగానూ దీనిని అంతర్జాతీయ మీడియా విశ్లేషించింది. ఇప్పటికే 6 లక్షల మంది వాలంటీర్లు నమోదు చేసుకున్నట్లు అధికారులు చెబుతుండటం, ఇతర నగరాల్లోనూ ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ప్రకటించడం.. యుద్ధ పరిస్థితుల్లో ప్రజలను మరింతగా సమీకరించేందుకు ఇరాన్ ప్రయత్నిస్తున్న విషయాన్ని సూచిస్తోంది.ట్రంప్‌కు టెన్షన్.. ఇదే ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది. ఇరాన్ ప్రజలు అమెరికా దాడులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుతారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశించిన సమయంలో.. యుద్ధం మధ్యలో ఇరాన్ ప్రభుత్వం భారీ స్థాయిలో ప్రజలను సమీకరించి ప్రతిఘటనకు సిద్ధమవుతున్నట్లు చూపిస్తోంది. ఈ పరిణామం అమెరికా-ఇజ్రాయెల్ వ్యూహాలపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది.ఇదీ చదవండి: ఉత్కంఠకు తెర.. రష్యా ఆంక్షల బిల్లుపై ట్రంప్ సంతకం🚨🇮🇷 🇺🇸 Iranians marched under a "we will kill" banner showing Trump in crosshairs as 600,000 sign up for military trainingGen. Hassan Hassanzadeh gave that recruitment figure at Friday's rally in Tehran, where state media counted 300,000 in the streets under the banner "ones… pic.twitter.com/BxKY00yrnz— Mario Nawfal (@MarioNawfal) September 19, 2026 -
మీడియాపై ట్రంప్ ప్రతాపం.. ఆ దిగ్గజ సంస్థలకు నో ఎంట్రీ!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఎన్ఎన్, ఎంఎస్ నౌ, పొలిటికో మీడియా సంస్థలను వైట్‌హౌస్‌లోకి అనుమతించబోమని ప్రకటించారు. ఈ మూడు సంస్థలు తన ప్రభుత్వం, అమెరికాపై పదేపదే ‘ఫేక్ న్యూస్’ ప్రసారం చేస్తున్నాయని ట్రంప్ ఆరోపించారు. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు. మరికొన్ని మీడియా సంస్థలపై కూడా ఇదే తరహా చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు.ట్రంప్ శుక్రవారం తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఆ వార్తా సంస్థలు ‘ఫేక్ న్యూస్’ ప్రచురిస్తున్నందుకే వైట్‌హౌస్ నుంచి నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు. తన పరిపాలన, అమెరికా అధ్యక్షుడు, అమెరికా దేశానికి సంబంధించిన వార్తల్లో ‘కల్పిత కథనాలు, అబద్ధాలు’ రాయడానికి మీడియా సంస్థలను అనుమతించకూడదని ఆయన అన్నారు. అయితే ఏయే కథనాలు లేదా ఏదైనా ప్రత్యేక ఘటన ఈ నిర్ణయానికి కారణమయ్యాయో ట్రంప్ వివరించలేదు.ఈ సందర్భంగా న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ పేర్లను కూడా ట్రంప్ ప్రస్తావించారు. అయితే వీటిపై నిషేధం విధించినట్లు అధికారిక ప్రకటన వెలువడలేదు. ట్రంప్‌కు మీడియా సంస్థలతో విభేదాలు కొత్తేమీ కాదు. ఆయన తొలి అధ్యక్ష పదవీకాలంలో సీఎన్ఎన్ రిపోర్టర్ జిమ్ అకోస్టా వైట్‌హౌస్ ప్రెస్ పాస్‌ను రద్దు చేయడానికి ప్రయత్నించగా, న్యాయస్థానం ఆ పాస్‌ను పునరుద్ధరించాలని ఆదేశించింది. 2025లో అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ)ను కూడా కొన్ని వైట్‌హౌస్ కార్యక్రమాల నుంచి నిషేధించారు. మెక్సికో గల్ఫ్‌ను ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’గా పేర్కొనడం కొనసాగించడమే అందుకు కారణంగా ట్రంప్ పరిపాలన పేర్కొంది.సీఎన్ఎన్, పొలిటికో వంటి సంస్థలు తమ జర్నలిస్టులు వైట్‌హౌస్‌లో వార్తలను కవర్ చేసే హక్కును సమర్థించాయి. అమెరికా రాజ్యాంగంలోని ఫస్ట్ అమెండ్మెంట్ స్వేచ్ఛా పత్రికా హక్కును రక్షిస్తుందని పేర్కొన్నాయి. మీడియా సంస్థలను వైట్‌హౌస్ నుంచి పూర్తిగా మినహాయించే నిర్ణయం ఎంతవరకు చట్టబద్ధమన్నది దాని పరిధిపై ఆధారపడి ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. పరిమిత స్థలాల్లో జరిగే కొన్ని కార్యక్రమాలకు మీడియా ఎంపికపై అధ్యక్షుడికి విస్తృత అధికారం ఉన్నప్పటికీ, సాధారణ వైట్‌హౌస్ ప్రెస్ సౌకర్యాలు లేదా ప్రెస్ పూల్ నుంచి విస్తృతంగా మినహాయించడం రాజ్యాంగపరమైన సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.ఇదీ చదవండి: ఆ గణపయ్య హుండీ తెరవగానే.. కళ్లు చెదిరే కానుకలు! -
హౌతీల గుప్పిట్లో ‘బాబ్ అల్ మండేబ్’.. చిక్కుల్లో భారత్, చైనా!
హార్ముజ్ జలసంధి ఇప్పటికే మూసుకుపోయిన పరిస్థితుల్లో మరో కీలక సముద్ర మార్గంపై ముప్పు ముదురుతోంది. యెమెన్‌లో హౌతీ తిరుగుబాటుదారుల ఆధిపత్యం బాబ్ అల్ మండేబ్ జలసంధి చుట్టూ పెరుగుతోందన్న వార్తల నేపథ్యంలో భారత్, చైనా సహా ఆసియా దేశాల యూరప్ వాణిజ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ మార్గం ద్వారా నౌకల రాకపోకలు ప్రమాదకరంగా మారితే, ఆఫ్రికా ఖండాన్ని చుట్టి, కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా వెళ్లడం ప్రత్యామ్నాయంగా మిగులుతుంది. అయితే ఈ మార్గం చాలా పొడవుగా ఉండటంతో ప్రయాణ సమయం, రవాణా వ్యయం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.మోఖా పోర్ట్‌పైనా హూతీల ఆధిపత్యంయెమెన్లో కొనసాగుతున్న ఘర్షణల్లో హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియా మద్దతు ఉన్న ప్రభుత్వ దళాలపై పైచేయి సాధిస్తూ, పలు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. తాజాగా ఎర్ర సముద్ర నౌకాశ్రయ నగరం మోఖాను కూడా హౌతీలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. బాబ్ అల్ మండేబ్ చుట్టుపక్కల ఉన్న పలు దీవులపై కూడా వారి నియంత్రణ పెరిగినట్లు పేర్కొంటున్నారు. దీంతో ఈ సముద్ర మార్గాన్ని ఉపయోగించే భారత్, చైనా సహా ఆసియా దేశాల వాణిజ్యంపై ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇప్పుడు కేప్ ఆఫ్ గుడ్ హోప్ దారే మార్గమా?బాబ్ అల్ మండేబ్ మీదుగా యూరప్-ఆసియా మధ్య నౌకాయానం కష్టతరమైతే, నౌకలు ఆఫ్రికా దక్షిణ అంచున ఉన్న కేప్ ఆఫ్ గుడ్ హోప్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది. అంటే మొత్తం ఆఫ్రికా ఖండాన్ని చుట్టి, అట్లాంటిక్ మహాసముద్రం నుంచి మళ్లీ హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించాలి. దీంతో నౌకల ప్రయాణ దూరం భారీగా పెరుగుతుంది. ఫలితంగా సరుకు రవాణాకు ఎక్కువ సమయం పట్టడంతో పాటు షిప్పింగ్ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది.యూరప్ నుంచి భారత్‌కు ఎలా చేరాలి?ఉదాహరణకు ఫ్రాన్స్ లేదా ఇటలీ నుంచి భారత్‌కు సముద్ర మార్గంలో సరుకులు రవాణా చేయాలంటే ముందుగా మధ్యధరా సముద్రాన్ని దాటాలి. ఆ తర్వాత స్పెయిన్, మొరాకో మధ్య ఉన్న జిబ్రాల్టర్ జలసంధి ద్వారా అట్లాంటిక్ మహాసముద్రంలోకి వెళ్లాలి. అక్కడి నుంచి ఆఫ్రికా ఖండం పశ్చిమ, దక్షిణ తీరాల వెంట సుమారు 8 వేల కిలోమీటర్ల మేర ప్రయాణించి, దక్షిణ అంచున ఉన్న కేప్ ఆఫ్ గుడ్ హోప్‌ను దాటాలి. అనంతరం హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం మీదుగా భారత్‌కు చేరుకోవాల్సి ఉంటుంది.దూరం దాదాపు రెట్టింపుబాబ్ అల్-మండేబ్ మార్గం ద్వారా భారత్ నుంచి ఫ్రాన్స్‌కు సముద్ర దూరం సుమారు 11 వేల కిలోమీటర్లు ఉంటుందని నివేదిక చెబుతోంది. అదే కేప్ ఆఫ్ గుడ్ హోప్ చుట్టూ తిరిగితే ఈ దూరం దాదాపు 22 వేల కిలోమీటర్లకు చేరుతుంది. అంటే ప్రయాణ దూరం దాదాపు రెట్టింపు అవుతుంది. ఆసియా లేదా మధ్యప్రాచ్యం నుంచి యూరప్‌కు నౌకల రాకపోకలకు సాధారణం కంటే మరో 10 నుంచి 30 రోజుల వరకు అదనపు సమయం పట్టే అవకాశం ఉందని అంచనా. ఉదాహరణగా సౌదీ అరేబియాలోని యాన్బు నుంచి తైవాన్‌కు బాబ్ అల్-మందబ్ మీదుగా సుమారు 19 రోజులు పడుతుండగా, ఆఫ్రికా చుట్టూ తిరిగితే ఈ ప్రయాణం సుమారు 48 రోజులకు చేరవచ్చని నివేదిక పేర్కొంది.భారత్-ఈయూ వాణిజ్యంపై ప్రభావం?కౌన్సిల్ ఆఫ్ ది యూరోపియన్ యూనియన్ గణాంకాల ప్రకారం, 2025లో భారత్-యూరోపియన్ యూనియన్ మధ్య మొత్తం వాణిజ్యం 136.5 బిలియన్ అమెరికా డాలర్లకు పైగా నమోదైంది. ఇందులో ఈయూ నుంచి భారత్‌కు దిగుమతులు, భారత్ నుంచి ఈయూకు ఎగుమతులు రెండూ ఉన్నాయి. భారత్ నుంచి ఈయూకు సుమారు 75.8 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు, భారత్ ఈయూ నుంచి సుమారు 60.7 బిలియన్ డాలర్ల విలువైన సరుకులను ఎగుమతి చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కీలక సముద్ర మార్గాల్లో అంతరాయం ఏర్పడితే, ఇలాంటి భారీ వాణిజ్య ప్రవాహాలపై రవాణా సమయం, ఖర్చుల పరంగా ప్రభావం పడే అవకాశం ఉంది.బాబ్ అల్ మండేబ్ ఎందుకంత కీలకం?అనాడోలు ఏజెన్సీ నివేదిక ప్రకారం, హౌతీల డ్రోన్లు, దాడుల భయంతో బాబ్ అల్ మండేబ్ గుండా నౌకల రాకపోకలు సుమారు 88 శాతం తగ్గాయి. హౌతీలు తాము సౌదీ అరేబియా నౌకలనే లక్ష్యంగా చేసుకుంటున్నామని చెబుతున్నప్పటికీ, ఇతర దేశాల నౌకలు కూడా ఈ మార్గంలో ప్రయాణించేందుకు వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తున్నది. సాధారణ పరిస్థితుల్లో ప్రపంచ వాణిజ్యంలో సుమారు 12 శాతం ఈ సముద్ర మార్గం గుండా సాగుతుంది. అంతేకాకుండా తూర్పు ఆఫ్రికా దేశమైన జిబౌటీకి హౌతీ ఆధీన ప్రాంతాలు కేవలం 32 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు సమాచారం. జిబౌటీలో అమెరికా సహా పలు దేశాల సైనిక స్థావరాలు ఉన్నాయి. ఈ పరిణామాలు బాబ్ అల్ మండేబ్ ప్రాధాన్యాన్ని మరింత పెంచుతున్నాయి.ఇదీ చదవండి: ఎల్‌నినో ఎఫెక్ట్: అట్లాంటిక్‌ను తాకని హరికేన్లు! -
ఉత్కంఠకు తెర.. రష్యా ఆంక్షల బిల్లుపై ట్రంప్ సంతకం
ఉత్కంఠకు తెర పడింది. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్న దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ షాక్ ఇచ్చారు. రష్యాపై ఆంక్షలను మరింత కఠినతరం చేసే బిల్లుపై ట్రంప్ ఇవాళ సంతకం చేశారు. ఈ బిల్లు చట్టంగా మారడంతో ఆయా దేశాలపై ఏ క్షణమైనా 100 శాతం వరకు టారిఫ్‌లు ట్రంప్ విధించే అవకాశం ఉంది. ప్రధానంగా.. భారత్, చైనాలకు ఇప్పుడు టెన్షన్ పట్టుకుంది. లిండ్సే గ్రాహం యాక్ట్ ప్రకారం.. రష్యా నుంచి అత్యధికంగా క్రూడ్ ఆయిల్ లేదంటే గ్యాస్ దిగుమతి చేసుకునే టాప్-5 దేశాల నుంచి అమెరికాకు వచ్చే వస్తువులపై 100 శాతం వరకు సుంకాలు విధించే అవకాశం ఉంది. అయితే చట్టంలో ఆ దేశాల పేర్లను ప్రత్యేకంగా పేర్కొనలేదు. ఆయా జాబితాలను ఎలా లెక్కించాలన్న దానిపైనా పూర్తి స్పష్టత లేదు. దీంతో తుది నిర్ణయాధికారం ట్రంప్ ప్రభుత్వానికే దక్కింది. అబ్ ఆయేగా అస్లీ మజా!ట్రంప్ సంతకం చేయడంతో ఇప్పటివరకు కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. కానీ అసలు పరిణామాలు ఇప్పుడే మొదలుకానున్నాయి. భారత్, చైనా సహా రష్యా చమురు కొనుగోలు చేస్తున్న ఏ దేశాలు ‘టాప్-5’ జాబితాలోకి వస్తాయి? వాటిపై ట్రంప్ 100 శాతం వరకు టారిఫ్ విధిస్తారా? లేక మినహాయింపు ఇస్తారా? అన్నదే ఇప్పుడు కీలకం. తుది జాబితా, టారిఫ్ స్థాయిపై అమెరికా ప్రభుత్వం తీసుకునే నిర్ణయమే ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.ఆగస్టు క్రూడ్ దిగుమతుల డేటా ఆధారంగా రష్యా చమురు కొనుగోలులో ముందున్న దేశాలు:భారత్చైనాఇటలీటర్కీనెదర్లాండ్స్ఎస్అండ్పీ గ్లోబల్ ప్రకారం ఆగస్టులో రష్యా క్రూడ్ దిగుమతుల్లో భారత్ రోజుకు సుమారు 16 లక్షల బ్యారెళ్లతో మొదటి స్థానంలో ఉండగా, చైనా 11 లక్షల బ్యారెళ్లతో తర్వాతి స్థానంలో ఉంది. ఇటలీ, టర్కీ, నెదర్లాండ్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.భారత్‌కు ఎందుకు కీలకం?రష్యా నుంచి చౌకగా లభించే క్రూడ్ ఆయిల్ భారత రిఫైనరీలకు కీలక వనరుగా మారింది. దేశీయ అవసరాల్లో భారీ భాగం దిగుమతులపైనే ఆధారపడుతోంది. రష్యా చమురు దిగుమతులు భారత మొత్తం క్రూడ్ దిగుమతుల్లో దాదాపు సగం వరకు ఉన్నాయని తాజా విశ్లేషణలు పేర్కొంటున్నాయి. దీంతో రష్యా నుంచి కొనుగోళ్లపై అమెరికా చర్యలు తీసుకుంటే భారత రిఫైనింగ్ రంగంతో పాటు అమెరికాకు ఎగుమతి చేసే భారతీయ ఉత్పత్తులపైనా ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే భారత్ సహా ఏ దేశాలపై, ఎప్పుడు, ఎంతమేర సుంకాలు విధించాలన్న విషయంలో ట్రంప్‌దే తుదినిర్ణయం కానుంది. మరోవైపు ఈ విషయంలో అమెరికాతో చర్చలు జరుగుతున్నాయని ఇప్పటికే భారత్ స్పష్టం చేసింది. చర్చల్లో మరికొన్ని దేశాలురష్యా చమురు కొనుగోలుదారుల జాబితాతో పాటు రష్యా ఆంక్షలను తప్పించుకునేందుకు సహకరిస్తున్న దేశాలపైనా చట్టం దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో బ్రెజిల్, జపాన్, యూరోపియన్ యూనియన్‌లోని కొన్ని దేశాలు కూడా అమెరికా చర్యల పరిధిలోకి రావచ్చనే చర్చ జరుగుతోంది. 30 రోజుల్లో నిర్ణయం?కొత్త చట్టం ప్రకారం అర్హత కలిగిన దేశాలపై టారిఫ్‌లు విధించే చర్యలను 30 రోజుల్లో ప్రారంభించే అవకాశం ఉంది. దీంతో నవంబర్‌లో జరగనున్న అమెరికా మధ్యంతర ఎన్నికలకు ముందు ఈ అంశం కీలకంగా మారింది. రష్యా చమురుపై ఆంక్షలు కఠినతరం చేస్తే ప్రపంచ చమురు సరఫరాపై ప్రభావం పడి ధరలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అదే సమయంలో అమెరికాలో వినియోగదారులపై ఇంధన ధరల భారం పెరగకుండా ట్రంప్ ప్రభుత్వం ఈ అధికారాలను ఎంతవరకు ఉపయోగిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.రష్యాపై మరింత ఒత్తిడిఈ చట్టం కేవలం చమురు కొనుగోలుదారులపైనే కాదు.. రష్యా ఇంధన, రక్షణ రంగాలతో పాటు ఆంక్షలను తప్పించుకునేందుకు ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘షాడో ఫ్లీట్’ ట్యాంకర్లపైనా చర్యలకు వీలు కల్పిస్తోంది. ఇరాన్‌పై ఉన్న కొన్ని ఆంక్షలను కూడా ఈ చట్టం పొడిగించింది. ఉక్రెయిన్‌పై యుద్ధానికి రష్యాకు లభిస్తున్న ఆర్థిక వనరులను దెబ్బతీయడమే ఈ చర్యల ప్రధాన లక్ష్యంగా అమెరికా పేర్కొంటోంది. మొత్తంగా చూస్తే.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలకు ఇది నేరుగా తాకే అంశమే అయినప్పటికీ, 100 శాతం టారిఫ్ ఇప్పటికిప్పుడు ఖరారైన నిర్ణయం కాదు. ఏ దేశాలను తుది జాబితాలో చేర్చుతారు? భారత్‌పై ఎంత మేర ప్రభావం ఉంటుంది? అన్నది ట్రంప్ ప్రభుత్వం తీసుకునే తదుపరి నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.ఇదీ చదవండి: భూకంపం కాదు.. భూకంపాలు పుట్టిన కిమ్ -
రష్యాలో పార్లమెంటరీ ఎన్నికల సందడి
మాస్కో: రష్యాలో పార్లమెంటరీ ఎన్నికల సందడి మొదలైంది. మూడు రోజులపాటు పోలింగ్ జరుగనుంది. దేశంలో 11.1 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఓటింగ్ శాతాన్ని పెంచడమే లక్ష్యంగా ఎన్నికల సంఘం అధికారులు వారాంతంలో పోలింగ్ ప్రక్రియ చేపట్టారు. ఈసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానాన్ని కూడా అనుమతించారు. శుక్రవారం ప్రారంభమైన పోలింగ్ ఆదివారం ముగుస్తుంది. 2022లో ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయి దండయాత్ర ప్రారంభమైన తర్వాత జరుగుతున్న తొలి పార్లమెంటరీ ఎన్నికలు ఇవే కావడం విశేషం. ఉక్రెయిన్‌పై యుద్ధానికి ప్రజల మద్దతు ఉందని చాటుకోవాలని, తమ చర్యలకు చట్టబద్ధత ఉ న్నట్లుగా ఒక ముద్ర వే యాలని పుతిన్ ప్రభుత్వం భావిస్తోంది. అ ధ్యక్షుడు పుతిన్ శుక్ర వారం ఆన్లైన్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతకుముందు దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘మీ ఎంపిక, మీ సంకల్పం లక్షలాది మంది మన యోధులకు అండగా నిలుస్తున్నారని నిరూపిస్తుంది. ఐక్యతను చాటిచెబుతుంది’’ అని పేర్కొన్నారు. ఓటు వేయడానికి కంప్యూటర్ స్క్రీన్ ముందు పుతిన్ ఉన్న వీడియోను రష్యా ప్రభుత్వ వార్తా సంస్థలు విడుదల చేశాయి. ప్రజలు ఓటు వేయడానికి రెండు వేర్వేరు బ్యాలెట్లను ఉపయోగిస్తారు. మొదటి బ్యాలెట్ లోని రాజకీయ పార్టీల్లో ఏదో ఒక దాన్ని ఎంచుకోవడం ద్వారా పార్లమెంట్ దిగువ సభ అయిన స్టేట్ డూమాలోని 450 సీట్లలో సగాన్ని భర్తీ చేస్తారు. మిగిలిన సింగిల్–సీట్ నియోజకవర్గాల్లో అభ్యర్థు లను ఎన్నుకుంటారు. పుతిన్ నాయకత్వంలోని ‘యునైటెడ్ రష్యా’ స్టేట్ డూమాపై తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకో వడం ఖాయంగా కనిపిస్తోంది. -
వ్యభిచారం చేసినందుకు మహిళకు వంద కొరడా దెబ్బలు!
వ్యభిచారం చేసి షరియా చట్టాన్ని ఉల్లంఘించినట్లు తేలిన ఒక మహిళకు, ఇండోనేషియాలోని ఆచె ప్రావిన్స్‌లోని బండా ఆచెలో బహిరంగంగా 100 కొరడా దెబ్బల శిక్ష విధించారు. ఆచెలో అమలులో ఉన్న ఇస్లామిక్ షరియా నిబంధనలను ఉల్లంఘించినందుకు మొత్తం పదకొండు మంది వ్యక్తులకు కొరడా దెబ్బల శిక్ష విధించారు. వారిలో ఇద్దరికి వ్యభిచారం చేసినందుకు ఒక్కొక్కరికి 100 కొరడా దెబ్బల శిక్ష వేయగా, మిగిలిన వారికి స్త్రీ, పురుషుల కలయికకు గాను 16 నుంచి 21 కొరడా దెబ్బల శిక్షను విధించారు.శిక్ష అమలు చేస్తున్న సమయంలో మహిళ తీవ్ర నొప్పితో బాధపడినట్లు స్థానిక కథనాలు తెలిపాయి. చేతులు పైకెత్తి దయచూపాలని వేడుకుంటున్న ఆమె కొద్దిసేపటికే నేలపై కుప్పకూలింది. ఆమెతో పాటు శిక్షకు గురైన వ్యక్తి కూడా 60 దెబ్బలు పూర్తయిన తర్వాత అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో కొంతసేపు శిక్షను నిలిపేశారు. ఆ తర్వాత మళ్లీ కొరడాతో కొడుతూ 100 పూర్తిచేసినట్లు బండా అచే ప్రాసిక్యూటర్ కార్యాలయ సీనియర్ అధికారి దుర్మా ముస్తికా తెలిపారు. కాగా శిక్ష అమలును చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఇండోనేషియాలో ఇస్లామిక్ షరియా కొన్ని ప్రాంతాల్లో అమలు చేస్తున్నారు. అచే ప్రావిన్సుల్లో షరియా ఆధారంగా శిక్షలు విధిస్తునారు. వివాహేతర లైంగిక సంబంధాలు, మద్యం సేవించడం, జూదం ఆడటం, వివాహం కాని స్త్రీ, పురుషులు సన్నిహితంగా ఉండటం శిక్షార్హమైన నేరాలుగా పరిగణిస్తారు.ఇదీ చదవండి: మహిళ జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్ -
ఉత్తర కొరియా వల్ల 1,399 భూకంపాలు!
ఉత్తర కొరియా నిర్వహించిన భూగర్భ అణు పరీక్షల కారణంగా మౌంట్ మంటప్ (Mount Mantap) పర్వతం పరిసర ప్రాంతాల్లో ఏకంగా 1,399 భూకంపాలు సంభవించినట్లు శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో తేలింది. ప్రఖ్యాత అంతర్జాతీయ సైన్స్ జర్నల్ ‘సైన్స్’ (Science) లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం, ఉత్తర కొరియా గతంలో జరిపిన అణు బాంబు పేలుళ్లు అక్కడి భూగర్భ పొరలను తీవ్రంగా దెబ్బతీశాయి. దక్షిణ కొరియాలోని పుసాన్ నేషనల్ యూనివర్సిటీ, చైనాలోని చెంగ్డూ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు 2008 నుంచి 2025 మధ్య కాలానికి సంబంధించిన భూకంప తరంగాల డేటాను విశ్లేషించి ఈ విషయాన్ని గుర్తించారు. ఉత్తర కొరియా 2006 నుంచి 2017 మధ్య కాలంలో పుంగ్యే-రి (Punggye-ri) పరీక్షా కేంద్రంలోని మంటప్ పర్వతం కింద ఆరు భూగర్భ అణు పరీక్షలు నిర్వహించింది.ఉత్తర కొరియాలోని పుంగ్యే-రి అణు పరీక్షా స్థావరం ఉపగ్రహ చిత్రం (PC: Twitter)ఈ శక్తివంతమైన పేలుళ్ల వల్ల అక్కడ శతాబ్దాలుగా నిద్రాణంగా ఉన్న భూగర్భ ఫాల్ట్ లైన్లు (భూకంప బద్దలు) మళ్లీ యాక్టివ్ అయ్యాయి. 2017లో ఉత్తర కొరియా నిర్వహించిన ఆరవ, అత్యంత భారీ అణు పరీక్ష (హైడ్రోజన్ బాంబు పరీక్ష) తర్వాతే అత్యధిక ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ ఒక్క పరీక్ష తర్వాతే దాదాపు 1,330 కి పైగా భూకంపాలు సంభవించాయి.సాధారణంగా పెద్ద పేలుళ్లు జరిగిన కొన్ని రోజులు లేదా వారాల్లోనే ప్రకంపనలు తగ్గిపోతాయి. కానీ మంటప్ పర్వత ప్రాంతంలో మాత్రం 2017 పరీక్ష జరిగిన మూడు వారాల తర్వాత ప్రకంపనలు ప్రారంభమై, 2025 వరకు కాలక్రమేణా వాటి ఫ్రీక్వెన్సీ (తీవ్రత) పెరుగుతూ రావడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేలుపై ఎక్కువగా 2.0 నుండి 3.0 మధ్య నమోదైనప్పటికీ, కొన్ని ప్రకంపనలు 3.4 తీవ్రతను కూడా తాకాయి. ఈ ప్రాంతం సహజంగా భూకంపాలు వచ్చే ప్రాంతం కాకపోయినప్పటికీ, అణు పరీక్షల వల్లే భూమి లోపలి పొరల్లో ఒత్తిడి పెరిగి ఈ పరిస్థితి ఏర్పడిందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.ఇదీ చదవండి: విజయవాడ పటమట పోలీస్‌స్టేషన్ వద్ద కలకలం -
పాక్‌లో ఆత్మాహుతి దాడి.. 15మందికి పైగా దుర్మరణం
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో దారుణం చోటు చేసుకుంది. ఓ దుండగుడు పేలుడు పదార్థాలతో ఉన్న వాహనంతో మసీదులోకి దూసుకెళ్లి బాంబ్ బ్లాస్ట్ చేశారు. ఈ దుర్ఘటనలో 15 మంది మరణించగా మరో 56 మంది గాయపడ్డారు. అయితే బాంబు దాడి సమీపంలో పోలీస్ కార్యాలయాలు ఉండడంతో ఐదుగురు పోలీసు అధికారులు మృతిచెందారు.ఈ ప్రమాదం ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్‌లోని కోహట్ జిల్లాలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో పోలీస్ కార్యాలయాల బయటి గోడ కూలిపోగా, మసీదు తీవ్రంగా దెబ్బతింది. బాంబు దాడి అనంతరం ఆయుధాలతో ఇద్దరు వ్యక్తులు లోపలికి ప్రవేశించడానికి యత్నింగా వారిపై పోలీసులు కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.అయితే దాడిలో గాయపడిన మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దాడిని ఖండించిన ఆయన పేలుడులో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కాగా ఈ మధ్య కాలంలో పాకిస్తానీ తాలిబన్లు అక్కడి పోలీసులతో పాటు అక్కడి పౌరులపై దాడులను తీవ్రతరం చేశారు. 2023లో, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ రాజధాని అయిన పెషావర్‌లోని ఒక మసీదులో జరిగిన దాడిలో ఒక ఆత్మాహుతి దాడి చేసి 101 మందిని చంపారు. -
పెళ్లిళ్లలో ఒక్కటే వంటకం.. పాకిస్తాన్లో కఠిన ఆంక్షలు
పెళ్లిళ్లు అంటే ఆ హడావుడి అంతా ఇంతా కాదు.. ముఖ్యంగా ఎక్కువ ప్రాధాన్యం వంటలకే ఉంటుంది. లెక్కకు మించిన రకాల వంటకాలతో అతిథులకు విందుతో పసందు చేస్తారు. ఏదైనా పెళ్లి గొప్పగా జరిగిందంటే ఆ పెళ్లిలో వడ్డించిన వంటకాల గురించే మాట్లాడుకుంటారు. మరి అలాంటి పెళ్లిళ్లలో ఒకే రకం వంటకంతో సరిపెట్టుకోవాలంటే.. ఎక్కువ రకాల వంటకాలు వడ్డించకూడని పరిస్థితి వస్తే.. మన దాయది దేశం పాకిస్తాన్లో ప్రస్తుతం అలాంటి పరిస్థితే వచ్చింది.పశ్చిమాసియాలో కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి, ఎర్ర సముద్రం మార్గాల్లో పెరిగిన అంతరాయాల ప్రభావం పాకిస్తాన్‌పై పడుతోంది. పెరుగుతున్న ఇంధన ధరలు, సరఫరాపై ఆందోళనల నేపథ్యంలో ఇంధన వినియోగాన్ని తగ్గించడంతో పాటు ప్రభుత్వ వ్యయాలను కట్టడి చేసేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం కొత్త కఠిన చర్యలను ప్రకటించింది. సెప్టెంబర్ 17న క్యాబినెట్ డివిజన్ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ప్రభుత్వ వాహనాలకు కేటాయించే ఇంధనాన్ని 50 శాతం తగ్గించడంతో పాటు కొత్త ప్రభుత్వ వాహనాల కొనుగోలును నిలిపివేశారు. ఈ చర్యలు తక్షణమే అమల్లోకి వచ్చాయి.ప్రభుత్వ వాహనాలకు సగం ఇంధనమేకొత్త నిబంధనల ప్రకారం అధికారిక వాహనాల ఇంధన కేటాయింపును మూడు నెలల పాటు 50 శాతం తగ్గిస్తారు. అయితే సాయుధ దళాలు, సివిల్ ఆర్మ్డ్ ఫోర్సెస్, చట్ట అమలు సంస్థలు, కస్టమ్స్, ఎఫ్బీఆర్, ఇతర అత్యవసర సేవలకు చెందిన ఆపరేషనల్ వాహనాలకు ఈ కోత నుంచి మినహాయింపు ఇచ్చారు. ఆయా విభాగాల్లోని పరిపాలనా, నాన్-ఆపరేషనల్ వాహనాలకు మాత్రం పరిమితులు వర్తిస్తాయి.కొత్త ప్రభుత్వ వాహనాలతో పాటు ఐటీ పరికరాలను మినహాయించి ఇతర మన్నికైన వస్తువుల కొనుగోళ్లపైనా ఆంక్షలు విధించారు. ప్రభుత్వ సమావేశాలను సాధ్యమైనంత వరకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నిర్వహించాలని ఆదేశించారు. విదేశీ అతిథుల కోసం నిర్వహించే విందులను మినహాయించి అధికారిక డిన్నర్లను కూడా నిలిపివేశారు. ప్రభుత్వ నిధులతో సెమినార్లు, శిక్షణా కార్యక్రమాలు, సమావేశాల నిర్వహణపైనా ఆంక్షలు విధించారు.మూడు నెలలు విదేశీ పర్యటనలకు బ్రేక్మంత్రులు, సలహాదారులు, ప్రత్యేక సహాయకులు, ఎంపీలు, ప్రభుత్వ అధికారుల విదేశీ పర్యటనలను మూడు నెలల పాటు నిలిపివేశారు. అయితే కొన్ని స్కాలర్షిప్లు, శిక్షణా కార్యక్రమాలు, అంతర్జాతీయ ఒప్పందాల కింద తప్పనిసరి పర్యటనలకు మినహాయింపులు ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో విదేశాలకు వెళ్లాల్సి వస్తే ఎకానమీ క్లాస్‌లోనే ప్రయాణించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.పెళ్లిళ్లలో ‘వన్ డిష్’ రూల్ఇంధన వినియోగాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా వివాహాలు, ఇతర పెళ్లి కార్యక్రమాల్లో ఒక్క వంటకం మాత్రమే వడ్డించాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే ఇస్లామాబాద్‌లో దుకాణాలు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్, బజార్లు, డిపార్ట్మెంటల్, కిరాణా దుకాణాలను రాత్రి 9 గంటలకే మూసివేయాలి. వివాహ మందిరాలు, మార్క్యూలు, ఇతర వేడుకల వేదికలు రాత్రి 10 గంటలకు, రెస్టారెంట్లు, కేఫ్‌లు, ఫుడ్ అవుట్లెట్లు రాత్రి 11 గంటలకు మూసివేయాలి. టేక్అవే, హోం డెలివరీ సేవలకు మాత్రం ఈ సమయ పరిమితుల నుంచి మినహాయింపు ఉంది.ఫార్మసీలు, ఆసుపత్రులు, క్లినిక్‌లు, ల్యాబొరేటరీలు, బేకరీలు, తందూర్లు, పాల దుకాణాలు, పెట్రోల్, సీఎన్జీ స్టేషన్లు, ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు, జిమ్‌లు, క్రీడా సదుపాయాలు, ఐటీ కంపెనీలు, కాల్ సెంటర్లకు ఈ క్లోజింగ్ టైమింగ్స్ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇతర ప్రావిన్సులు, ప్రాంతాలు కూడా ఇలాంటి ఇంధన పొదుపు, మితవ్యయ చర్యలను అమలు చేయాలని పాక్ ప్రభుత్వం సూచించింది. -
ఐఫోన్ లేటెస్ట్ : అక్కడ చీప్‌గా కొనేస్తున్నారట!
ఐఫోన్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున లేటెస్ట్ ఐఫోన్ 18 ప్రో (iPhone 18 Pro) సేల్ ఇండియాలో మొదలైంది. అయితే భారీ డిమాండ్ , భారీ క్యూలైన్ కారణంగా చాలామందికి నిరాశ తప్పలేదు. మరోవైపు భారతదేశంలో పన్నుల భారం కారణంగా ఐఫోన్ ధరలు ఎక్కువగా ఉండటంతో, కొందరు భారతీయులు విమాన ప్రయాణ ఖర్చులు పోను దుబాయ్‌లో కొనుగోలు చేయడమే లాభదాయకమని భావిస్తున్నారట. ఇంతకీ దుబాయ్ దీన ధర ఎంత? తెలుసుకుందాం పదండి మరి!భారత్‌లో ఐఫోన్ ధరలు, దుబాయ్‌లో విమాన టికెట్ మరియు వీసా ఖర్చులు పోను వచ్చే ధరలను బేరీజు వేసుకుని కొందరు కొనుగోలుదారులు దుబాయ్ మాల్లోని ఆపిల్ స్టోర్‌కు వచ్చి ఐఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా చీప్‌గా ఐఫోన్ దక్కించుకోవడంతోపాటు, దుబాయ్‌ని సందర్శించిన సంబరం కూడా.ఎంత ఆదా?కేరళకు చెందిన మహ్మద్ సయీద్ అనే కొనుగోలుదారు దుబాయ్‌లో కొనుగోలు చేయడం ద్వారా తనకు దాదాపు రూ. 20వేల నుంచి రూ. 38వేల వరకు ఆదా అవుతున్నట్లు తెలిపారు. ముంబైకి చెందిన అమన్ సోలంకి అనే మరో వ్యక్తి తన కుటుంబం కోసం మూడు ప్రో మాక్స్ ఫోన్లను కొనుగోలు చేయడం ద్వారా భారీగా ఆదా అవుతోందని చెప్పారు. ఒకటి కంటే ఎక్కువ ఐఫోన్లు కొనుగోలు చేసేవారికి, ముఖ్యంగా కుటుంబ సభ్యుల కోసం ఒకేసారి ఫోన్లు కొనేవారికి దుబాయ్‌లో షాపింగ్ చేయడం ఆర్థికంగా లాభదాయకం అంటున్నాయి మార్కెట్ వర్గాలు.ఇదీ చదవండి: నిఠారి కేసు నిర్దోషి సురీందర్ కోలి ఆకస్మిక మరణం సంచలనందుబాయ్లో: ఐఫోన్ 18 ప్రో ధర దాదాపు 5,099 దిర్హామ్‌ల (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 1,32,000) నుంచి, ప్రో మాక్స్ ధర 5,499 దిర్హామ్‌ల (సుమారు రూ. 1,42,000) నుంచి ప్రారంభమవుతోంది.భారత్‌లో: ఐఫోన్ 18 ప్రో ప్రారంభ ధర రూ. 1,64,900గా ఉండగా, ప్రో మాక్స్ ధర రూ. 1,79,900గా ఉంది.కొత్త ఫీచర్లు: ఐఫోన్ 18 ప్రో సిరీస్ కొత్త A20 ప్రో చిప్, వేరియబుల్ అపర్చర్‌తో కూడిన 48MP ఫ్యూజన్ మెయిన్ కెమెరా, బర్గండ్తో సహా గ్లేసియర్, సిల్వర్ , బ్లాక్ రంగులలో రంగుల్లో అందుబాటులోకి వచ్చింది.ఇదీ చదవండి: ఐఫోన్ క్రేజ్ : భార్యామణి కోసం ఏకంగా గోల్డ్ అమ్మి మరీ! -
విద్యార్థి ఘాతుకం.. 10 మందిపై కాల్పులు
మనీలా: ఫిలిప్పీన్స్‌లో దారుణం జరిగింది. అక్కడి పాఠశాలలో ఒక విద్యార్థి తన తోటి విద్యార్థులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ దుర్ఘటనలో ఇద్దరు విద్యార్థులు మరణించారు. అనంతరం ఆ విద్యార్థి సైతం తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు గాయపడ్డారు. ఈ దుర్ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఈ విషయమై ఆ ప్రాంతానికి చెందిన బంగ టౌన్ మేయర్ ఆల్బర్ట్ పాలెన్సియా మాట్లాడుతూ, కాల్పులలో మరో ఎనిమిది మంది గాయపడగా, వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని, బాధితులందరూ 14 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న విద్యార్థులేనని తెలిపారు. కాల్పులకు ముందు నిందితుడు తన స్నేహితుల పక్కన కూర్చుని, భోజనం తర్వాత నేను నా ప్రణాళికను అమలు చేస్తానని చెప్పి వారందరిని ఇంటికి వెళ్లమన్నాడు. అయితే అతను తరచుగా హస్యం చేస్తుండడంతో ఆ ఘటనను విద్యార్థులంతా జోక్ గానే భావించారని ..మధ్యాహ్నం భోజనం అనంతరం విద్యార్థులపై కాల్పులు ప్రారంభించారని తెలిపారు. కాగా గత నెలలో, ఇదే తరహా ఘటన జరిగింది. ఒక తరగతి గదిలో ఒక విద్యార్థి మరో విద్యార్థిని కాల్చి చంపి, ఆ దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేసి, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుమందు జూన్‌లో, టాక్లోబన్‌లోని ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇద్దరు సహ విద్యార్థులు క్యాంపస్‌లో కాల్పులు జరపడంతో, కనీసం ముగ్గురు విద్యార్థులు మరణించగా, సుమారు 20 మంది గాయపడ్డారు. ఫిలిప్ఫిన్స్‌లో తరచుగా ఇలాంటి ఘటనలు జరగడం అక్కడ ఆందోళన రేకెత్తిస్తుంది. -
ముస్లిం దేశాలను విడదీసే కుట్ర.. ఇరాన్ సంచలన వ్యాఖ్యలు
ఇస్లామిక్ ప్రపంచంలో అత్యంత పవిత్రమైన మక్కా నగరాన్ని లక్ష్యంగా చేసుకుని హౌతీలు డ్రోన్ దాడికి యత్నించారన్న సౌదీ అరేబియా ఆరోపణలు పశ్చిమాసియాలో కొత్త రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు మక్కా దిశగా వచ్చిన డ్రోన్‌ను నిషేధిత గగనతలంలోకి ప్రవేశించకముందే కూల్చివేశామని ప్రకటించగా.. హౌతీలు మాత్రం మక్కా లేదా ఇతర పవిత్ర స్థలాలను లక్ష్యంగా చేసుకోలేదని స్పష్టం చేశారు.ఈ వివాదంపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ స్పందిస్తూ.. పవిత్ర స్థలాల భద్రతను అడ్డం పెట్టుకుని ముస్లిం దేశాల మధ్య చిచ్చు పెట్టేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, మక్కా పేరుతో జరుగుతున్న ఈ ఆరోపణలను రాజకీయం చేయడం మానుకోవాలని హితవు పలికారు. నిరాధార ఆరోపణలతో ముస్లిం దేశాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. మక్కా, మదీనా, అల్‌అక్సా మసీదు సహా పవిత్ర స్థలాలు, యాత్రికుల భద్రత అందరి బాధ్యత అని పేర్కొన్నారు. మతపరమైన పవిత్రతను ప్రాంతీయ ఉద్రిక్తతలకు ఆయుధంగా మార్చొద్దని ఆయన హెచ్చరించారు. ఈమేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు.కేవలం ఒక డ్రోన్‌ను అడ్డగించామన్న ప్రకటన ఆధారంగా ఒక నిర్దిష్ట వర్గాన్ని నేరుగా నిందించలేమని ఆయన పేర్కొన్నారు. యెమెన్ ప్రభుత్వం ఈ ఆరోపణలను ఇప్పటికే స్పష్టంగా ఖండించిందని గుర్తుచేశారు. పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్ పాల్పడుతున్న నేరాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి, ఇస్లామిక్ దేశాల మధ్య విభేదాలు సృష్టించడానికే ఇలాంటి అబద్ధపు ప్రచారాలు జరుగుతున్నాయని, దీనిపట్ల ఈ ప్రాంత దేశాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.సౌదీ ప్రకటన.. ఇదిలా ఉండగా.. మక్కా గగనతలంలోకి ప్రవేశించకముందే మంగళవారం సాయంత్రం ఒక డ్రోన్‌ను తమ గగనతల రక్షణ వ్యవస్థ కూల్చివేసిందని సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు వెల్లడించాయి. ఈ ఘటనను మేజర్ జనరల్ తుర్కీ అల్-మల్కీ తీవ్రమైన 'ఉగ్రవాద చర్య'గా అభివర్ణించారు. అయితే, ఈ ఆరోపణలను హౌతీ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ యహ్యా సారీ తీవ్రంగా ఖండించారు. ఇవన్నీ సౌదీ అరేబియా అల్లిన కట్టుకథలని కొట్టిపారేశారు. తమ దాడులు కేవలం సౌదీ సైనిక స్థావరాలు, చమురు కేంద్రాలపై మాత్రమే ఉంటాయని చెప్పారు.పాక్ రియాక్షన్.. ఇక మక్కా ఘటనపై పాకిస్తాన్ వైఖరి మరింత కీలకంగా మారింది. సౌదీ అరేబియా, పాకిస్తాన్, తుర్కియే మధ్య కుదిరిన మక్కా సంయుక్త రక్షణ ఒప్పందానికి తాము కట్టుబడి ఉన్నామని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పష్టం చేశారు. కూటమిలో తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తుందన్నారు. రక్షణ వ్యూహాలకు సంబంధించిన వివరాలను మాత్రం గోప్యంగా ఉంచుతామని ఆయన పేర్కొన్నారు. ఇస్లామిక్ పవిత్ర స్థలాల రక్షణ కోసం ప్రత్యేకంగా ఒప్పందం ఉండాల్సిన అవసరం లేదని, ఒకవేళ మక్కాపై దాడి జరిగితే దాన్ని రక్షించడం ప్రతి ముస్లిం దేశం మొదటి బాధ్యత అని ఆయన అన్నారు. మూడు దేశాలు సంతకం చేసిన దేశాల్లో దేని ప్రాదేశిక సమగ్రత లేదా భౌగోళిక సరిహద్దులపై దాడి జరిగినా ఒప్పందం ప్రకారం ముందుకెళ్తామని వివరించారు.ఇదీ చదవండి: పాపం సౌదీ.. కీలక సమయంలో హ్యాండిచ్చిన ట్రంప్ -
రహస్య భేటీ కలకలం.. సౌదీకి ట్రంప్ హ్యాండిచ్చినట్టేనా?
యెమెన్‌లో హౌతీల దూకుడు పెరుగుతున్న వేళ సౌదీ అరేబియాకు కొత్త తలనొప్పి మొదలైంది. ఒకవైపు హౌతీ దళాలు ఎర్ర సముద్ర తీరంలో కీలక ప్రాంతాలపై పట్టు బిగిస్తూ సౌదీ చమురు రవాణా మార్గాలకు ముప్పుగా మారుతున్నాయి. మరోవైపు.. సౌదీకి ప్రధాన మిత్రదేశమైన అమెరికా మాత్రం హౌతీలతో నేరుగా చర్చలు జరుపుతోంది. ఒమన్ రాజధాని మస్కట్‌లో అమెరికా అధికారులు, హౌతీ ప్రతినిధులు రహస్యంగా సమావేశమైనట్లు Reuters వెల్లడించింది. ఈ రహస్య భేటీ ఇప్పుడు గల్ఫ్ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. అమెరికా-హౌతీల మధ్య నిజంగానే ఏదైనా అవగాహన కుదిరిందా? అదే జరిగితే.. సౌదీకి మిగిలేది ఎవరు? అనే ప్రశ్న ఎదురవుతోంది.ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు ఇటీవల యెమెన్‌లోని ఎర్ర సముద్ర తీర ప్రాంతాల్లో వేగంగా ముందుకు సాగారు. వ్యూహాత్మకంగా కీలకమైన బాబ్ ఎల్-మండేబ్ జలసంధికి సమీపంలోని ప్రాంతాల్లో తమ పట్టును పెంచుకున్నారు. ఈ మార్గం సౌదీ చమురు ఎగుమతులతో పాటు అంతర్జాతీయ వాణిజ్యానికి కూడా కీలకమైనది. హౌతీల దాడులు ఏకంగా సౌదీ నగరాలు, ఇంధన మౌలిక వసతుల వరకు విస్తరించాయి. ఇటీవలి ఘర్షణల్లో సౌదీ, హౌతీ బలగాలు పరస్పరం దాడులు కొనసాగిస్తున్నాయి.మస్కట్‌లో అమెరికా-హౌతీల భేటీఈ ఉద్రిక్తతల మధ్య అమెరికా అధికారులు హౌతీ ప్రతినిధులతో ఒమన్‌లో సమావేశమయ్యారు. ఒమన్ మధ్యవర్తిత్వంతో జరిగిన ఈ భేటీలో ఎర్ర సముద్రంలో నౌకాయానం కొనసాగడం, అమెరికా-హౌతీల మధ్య గతంలో కుదిరిన కాల్పుల విరమణను కొనసాగించడం వంటి అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. హౌతీ ప్రతినిధులు అమెరికా, ఇజ్రాయెల్‌కు చెందిన నౌకలను లక్ష్యంగా చేసుకోబోమని హామీ ఇచ్చినట్లు Reuters పేర్కొంది. అదే సమయంలో సౌదీ నౌకలపై దాడులు కొనసాగించే అవకాశం ఉందన్న సమాచారం వెలువడింది.వాన్స్ కీలక ప్రకటన.. ఇదే సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా హౌతీలతో నేరుగా చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. అయితే ఈ చర్చలు పూర్తిస్థాయి ఒప్పందానికి దారితీశాయా? అన్నది ఇంకా స్పష్టంగా లేదు. అమెరికా ప్రధాన ప్రాధాన్యత ఎర్ర సముద్రంలో స్వేచ్ఛాయుత నౌకాయానాన్ని కొనసాగించడమేనని వాషింగ్టన్ స్పష్టం చేసింది.సౌదీ ఒంటరిగా మిగిలిపోతుందా?ఇదిలా ఉండగా.. దాడులు జరుగుతున్నా హౌతీలపై నేరుగా సైనిక చర్యకు అమెరికా ఇప్పటివరకు వెనుకంజ వేస్తుండటం సౌదీకి కీలక సమస్యగా మారింది. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ అమెరికా సాయం కోరినప్పటికీ వాషింగ్టన్ ప్రత్యక్ష దాడులకు అనుమతి ఇవ్వలేదు. అయితే ఇంటెలిజెన్స్ పంచుకోవడం, టార్గెటింగ్ విషయంలో సహకారం అందించే అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇదే సమయంలో సౌదీ మద్దతున్న యెమెన్ బలగాలు హౌతీలను నిలువరించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హౌతీల తాజా ముందడుగు సౌదీ భద్రత, చమురు ఎగుమతులు, బాబ్ ఎల్-మండేబ్ మార్గంపై ఒత్తిడిని పెంచింది.ప్రస్తుత హౌతీల దూకుడు, సౌదీ మిత్రబలగాల వైఫల్యం, అమెరికా నేరుగా హౌతీలతో చర్చలు జరపడం.. ఇవన్నీ రియాద్‌కు కొత్త సవాళ్లను విసురుతున్నాయి. అయితే అమెరికా-హౌతీల మధ్య అధికారిక ఒప్పందం కుదిరిందని ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు. అయినప్పటికీ ఎర్ర సముద్రంలో అమెరికా నౌకాయాన ప్రయోజనాలకు హామీ లభిస్తే.. సౌదీ ప్రయోజనాలు మాత్రం పక్కకు నెట్టబడే పరిస్థితి ఏర్పడుతుందన్న ఆందోళన నెలకొంది. దీంతో హౌతీలను ఎదుర్కొనే విషయంలో సౌదీ తదుపరి వ్యూహం ఏంటి? అమెరికా మద్దతు ఎంతవరకు ఉంటుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది.ఇదీ చదవండి: పాక్ తీరు మారలేదు.. భారత్ సంచలన వ్యాఖ్యలు -
రష్యా ఆంక్షల బిల్లు.. చూశారా ట్రంప్ డబుల్ గేమ్!
రష్యాపై మరిన్ని ఆంక్షలకు అమెరికా సిద్ధమైంది. రష్యా నుంచి చమురు, సహజవాయువు కొనుగోలు చేస్తున్న దేశాలపై భారీ టారిఫ్‌లు విధించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అధికారం ఇచ్చే బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. దీంతో రష్యా చమురు కొనుగోలులో కీలకంగా ఉన్న భారత్, చైనాలకు 100 శాతం వరకు టారిఫ్ ముప్పు పొంచి ఉంది. అయితే.. ఇదే బిల్లులో అమెరికాకు అనుకూలంగా ఉన్న మరో కీలక నిబంధన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ట్రంప్ సర్కార్ ‘లిండ్సే ఓ. గ్రాహమ్ శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్–2026’ పేరుతో ఈ బిల్లును తీసుకొచ్చింది. ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగిస్తున్న రష్యాకు చమురు, గ్యాస్ ఎగుమతులే ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటి. ఆ ఆదాయాన్ని తగ్గించడంతో పాటు.. రష్యాతో ఇంధన వ్యాపారం కొనసాగిస్తున్న దేశాలపై ఒత్తిడి పెంచడమే బిల్లు ప్రధాన ఉద్దేశం. రష్యా అధికారులు(అధ్యక్షుడు పుతిన్ సహా..), ఆర్థిక సంస్థలు, ఇంధన రంగం, ఆంక్షలను తప్పించుకునేందుకు ఉపయోగిస్తున్న ‘షాడో ఫ్లీట్’పై కూడా కఠిన చర్యలకు ఇందులో అవకాశం కల్పించారు. అమెరికా ప్రతినిధుల సభలో బిల్లు 262–159 ఓట్లతో ఆమోదం పొందింది. ఇందులో 203 మంది రిపబ్లికన్లు, 58 మంది డెమొక్రాట్లు, ఒక ఇండిపెండెంట్ సభ్యుడు అనుకూలంగా ఓటేశారు. అంతకుముందే సెనేట్ కూడా ఈ బిల్లును 86–11 ఓట్లతో ఆమోదించింది. దీంతో ఇప్పుడు బిల్లు ట్రంప్ డెస్క్‌కు చేరగా.. ఆయన సంతకంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.అసలు ట్విస్ట్ ఇదే..రష్యా నుంచి చమురు కొనే దేశాలపై భారీ టారిఫ్‌లకు సిద్ధమైన అమెరికా.. అందులో తనకు అనుకూలంగా ఓ సెక్షన్‌ను జత చేర్చుకుంది. అవసరమైన రష్యా యురేనియం విషయంలో మాత్రం కొంత వెసులుబాటు ఉంచుకుంది. అయితే బిల్లులోని సెక్షన్ 111 రష్యా నుంచి యురేనియం దిగుమతులపై ఇప్పటికే ఉన్న అమెరికా ఆంక్షలను అమలు చేయాలని చెబుతోంది. రష్యా ప్రభుత్వ అణు సంస్థ రోసాటమ్, దాని అనుబంధ/వారస సంస్థల నుంచి వచ్చే యురేనియం కూడా ఇందులో ప్రస్తావనకు వచ్చింది.కానీ అదే బిల్లులోని సెక్షన్ 114 మాత్రం కొన్ని ముఖ్యమైన మినహాయింపులను ఇచ్చింది. అమెరికా–రష్యా మధ్య కుదిరిన పౌర అణు సహకార ఒప్పందాల కింద జరిగే కొన్ని కార్యకలాపాలకు ఈ ఆంక్షలు వర్తించవు. అలాగే అణు రియాక్టర్లలో ఉపయోగించే కొన్ని రకాల లో-ఎన్రిచ్డ్ యురేనియం (LEU) దిగుమతులకు కూడా మినహాయింపు ఉంది. నిబంధనల ప్రకారం కొన్ని వైద్య ఐసోటోపుల దిగుమతులకు కూడా వెసులుబాటు కల్పించారు. అంటే రష్యాతో అణు రంగంలో ప్రతి లావాదేవీని పూర్తిగా నిలిపివేసేలా ఈ బిల్లు లేనేలేదన్నమాట.అమెరికాకు ఎందుకంత అవసరం?రష్యాపై ఆర్థిక ఆధారపడటాన్ని తగ్గించాలని అమెరికా ప్రయత్నిస్తున్నప్పటికీ.. అణు ఇంధన రంగంలో మాత్రం మాస్కో పాత్ర ఇప్పటికీ పెద్దదే. 2025లో అమెరికా పౌర అణు విద్యుత్ సంస్థలు మొత్తం 12.71 మిలియన్ సెపరేటివ్ వర్క్స్ యూనిట్స్ (SWU) మేర ఎన్రిచ్మెంట్ సేవలను కొనుగోలు చేశాయి. అందులో రష్యా నుంచి వచ్చినవి 3.284 మిలియన్ ఎస్‌డబ్ల్యూయూ.. అంటే సుమారు 26 శాతం. అమెరికా దేశీయ ఎన్రిచ్మెంట్ సేవల వాటా సుమారు 23 శాతంగా ఉంది. ఫ్రాన్స్, బ్రిటన్, నెదర్లాండ్స్ కూడా అమెరికాకు ఎన్రిచ్మెంట్ సేవలు అందిస్తున్నాయి. యురేనియం కొంటే సరిపోదు..అణు ఇంధనం తయారీ ప్రక్రియ ముడి చమురు లాంటిది కాదు. గనుల నుంచి తీసిన యురేనియంను నేరుగా చాలా వాణిజ్య అణు రియాక్టర్లలో ఉపయోగించలేరు. ముందుగా కన్వర్షన్, ఎన్రిచ్మెంట్ వంటి పలు దశలు దాటాలి. ఈ ఎన్రిచ్మెంట్ సామర్థ్యంలో రష్యా చాలా కాలంగా ప్రపంచంలో కీలక స్థానంలో ఉంది. అందుకే రష్యాతో విస్తృత ఆర్థిక సంబంధాలను తగ్గించేందుకు అమెరికా ప్రయత్నిస్తున్నా.. అణు విద్యుత్ రంగానికి అవసరమైన ఇంధన సరఫరాను ఒక్కసారిగా దెబ్బతీసే నిర్ణయాలు తీసుకోవడం అంత సులభం కాదు.2024లోనే రష్యా యురేనియంపై నిషేధంఈ ఆధారపడటాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా.. అమెరికా 2024 మేలో రష్యా యురేనియం ఉత్పత్తుల దిగుమతులపై నిషేధం విధించింది. అయితే దేశీయ సరఫరా వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే వరకు కంపెనీలు మినహాయింపులు కోరుకునే అవకాశం కల్పించింది. ఈ మినహాయింపు వ్యవస్థ 2028 జనవరి 1 వరకు కొనసాగేందుకు అవకాశం ఉంది.అదే సమయంలో అమెరికా దేశీయ అణు ఇంధన సరఫరా గొలుసును బలోపేతం చేసేందుకు 2.72 బిలియన్ డాలర్ల నిధులను కేటాయించింది. దీని లక్ష్యం కూడా రష్యాపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించడమే. అయితే రష్యా చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై భారీ టారిఫ్‌లకు మార్గం వేస్తూనే.. తన అణు విద్యుత్ రంగానికి అవసరమైన కొన్ని రష్యా యురేనియం సరఫరాలకు మాత్రం మినహాయింపులు ఉంచింది. ఇలా.. ఒకే బిల్లులో అమెరికా రెండు రకాల విధానాలను అవలంబిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. భారత్, చైనా.. టారిఫ్‌లపై సస్పెన్స్రష్యా నుంచి ముడి చమురు, సహజవాయువు కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు టారిఫ్‌లు విధించే అధికారం ఈ బిల్లుతో ట్రంప్‌కు దక్కింది. రష్యా ఇంధనాన్ని పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలే ఈ విషయంలో ప్రభావితం కానున్నాయి. అయితే భారత్ మాత్రం రష్యా ఆయిల్ విషయంలో తగ్గేదే లేదని చెబుతోంది. జాతి ప్రయోజనాల కోసం తాము ఆలోచిస్తామని.. అదే సమయంలో ఈ టారిఫ్ ముప్పు గురించి అమెరికాతో చర్చిస్తున్నట్లు తెలిపింది. దీంతో ట్రంప్ నిర్ణయం ఏంటన్నది ఉత్కంఠగా మారింది. ఇదీ చదవండి: డయానా ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్ -
పాక్ తీరు మారలేదు.. భారత్ సంచలన వ్యాఖ్యలు
ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడాన్ని పాకిస్తాన్ ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉందని భారత్ ఐక్యరాజ్యసమితి వేదికగా ఆరోపించింది. ఒసామా బిన్ లాడెన్ సహా 9/11 ఉగ్రదాడుల కుట్రదారులు ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో దాక్కోలేదని, ప్రజలు నివసిస్తున్న ప్రాంతాల్లోనూ ఎవరి కంటికీ చిక్కకుండా ఉండిపోయారని, ఉగ్రవాదులకు ఆశ్రయం, మద్దతు, శిక్ష నుంచి మినహాయింపు కల్పించే ఇలాంటి వాతావరణం పాకిస్తాన్లో కొనసాగినంత కాలం.. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి సంస్థలకు లాభమే చేకూరుతుందని తీవ్రంగా విమర్శించింది.ఆఫ్ఘనిస్థాన్ పరిస్థితిపై భద్రతా మండలి జరిగిన సమావేశంలో భారత ప్రతినిధి హరీశ్ పర్వతనేని మాట్లాడారు. 2001 సెప్టెంబర్ 11 దాడుల సూత్రధారులు ఒసామా బిన్ లాడెన్, ఖలీద్ షేక్ మహ్మద్ తదితరులు పాకిస్థాన్‌లోని పట్టణ ప్రాంతాల్లోనే పట్టుబడిన విషయాన్ని గుర్తు చేశారు. ఒసామా అబోతాబాద్లో భద్రత కలిగిన నివాస భవనంలో హతమయ్యాడని, 9/11 దాడుల రూపకర్త ఖలీద్ షేక్ మహ్మద్ రావల్పిండిలోని ఇంట్లో పట్టుబడ్డాడని ఆయన వివరించారు. ఈ దాడులకు సంబంధించిన ఉగ్రవాదులు రమ్జీ బినల్షిబ్, వలీద్ బిన్ అతాష్, ముస్తఫా అహ్మద్ అల్ హౌసావీ కూడా పాకిస్థాన్‌లోనే అరెస్టయ్యారని తెలిపారు. ‘‘వీరు గుహల్లో దాక్కోలేదు. పరారీలోనూ లేరు. ఎవరూ గుర్తించకుండా ఉండగలిగారు. ఇలాంటి రాక్షసులు ఎదిగేందుకు సహకరించిన వాతావరణాన్ని తొలగించాలి’’అని పర్వతనేని పాకిస్తాన్‌పై పరోక్ష విమర్శలకు దిగారు. పాకిస్తాన్ 9/11 దాడుల వెనుక ఉన్న వారికి కల్పించినట్టుగానే అల్‌ఖైదా అనుబంధ సంస్థలకు, ముఖ్యంగా లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌కు ఆశ్రయం, మద్దతు ఇస్తూనే ఉందని ఆరోపించారు. ఈ సంస్థలు ఆంక్షల వేటు తప్పించుకునేందుకు పేర్లు మార్చుకుంటున్నాయని అన్నారు.అఫ్గన్ శరణార్థులపై ఆందోళన పలు దేశాల నుంచి అప్గన్లను అఫ్గనిస్థాన్‌కు తిరిగి పంపుతున్న వారిపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గత ఏడాది 29 లక్షల మంది 2026 ఆగస్టు 22 వరకు మరో 11.5 లక్షల మంది తిరిగి వెళ్లినట్లు ఐరాస నివేదిక చెబుతుండగా వీరిలో అత్యధికులను బలవంతంగా తిప్పి పంపారని భారత్ ఆరోపించింది. ఈ ప్రక్రియ స్వచ్ఛందంగా, సురక్షితంగా, గౌరవప్రదంగా ఉండాలని స్పష్టం చేసింది. పునరావాసం, ఆహారం, నివాసం వంటి అవసరాల కోసం అంతర్జాతీయ సమాజం తగిన తోడ్పాటును అందించాలని, తమవంతుగా ఐరాస, అఫ్గన్ అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించింది.ఇదీ చదవండి: విదేశీ విద్యార్థులకు షాకిచ్చిన ఆస్ట్రేలియా -
ఏఐ ప్రవర్తనలో ఆందోళనకరమైన తేడా!
వాషింగ్టన్: కృత్రిమ మేధ మోడళ్ల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో దిగ్గజ ఏఐ కంపెనీ ఓపెన్ ఏఐ ఇంకో బాంబు పేల్చింది. కొన్ని ఏఐ మోడళ్లు అనూహ్యంగా, ఆందోళన రేకెత్తించే విధంగా ప్రవర్తిస్తున్నాయని కనీసం ఆరు అంశాలపై నివేదికలను బహిర్గతం చేసింది. అంతేకాకుండా... ఏఐ మోడళ్లు మానవ అంచనాలకు భిన్నంగా ప్రవర్తించే సందర్భాలను గుర్తించేందుకు, వెల్లడి చేసేందుకు కొత్త ఫ్రేమ్‌వర్క్ ఒకదాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. తగిన అంగీకారం లేకుండా, ఇతర మోడళ్లతో సమన్వయంతో పనిచేయడం, పర్యవేక్షణను తప్పించుకునే ప్రయత్నాలను పసిగట్టి తగిన చర్యలు తీసుకునేందుకు ఈ ఫ్రేమ్‌వర్క్ ఉపయోగపడుతుందని అంచనా. ఏఐ మోడళ్లతో ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో భద్రతకు సంబంధించిన అంశాలను సురక్షింతం చేసుకునేంతవరకూ అభివృద్ధిని మందగింపజేయాలని ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్, స్పేస్ఎక్ ఏఐ కంపెనీలు కొన్నిరోజుల క్రితమే పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.ఓపెన్ ఏఐ విడుదల చేసిన తాజా నివేదికల ప్రకారం... ఒక రీసెర్చ్ మోడల్ తనపై విధించిన అడ్డంకులను తప్పించుకునేందుకు అవసరమైన నోట్స్ రాసేసుకుంది. ఇంకోలా చెప్పాలంటే భద్రతకు సంబంధించిన నిబంధనలను ‘లైట్’ తీసుకోవాలని తనకుతాను చెప్పుకుందన్నమాట. ఇతర ఛాట్బోట్లను బంధించి ఉంచే అన్ని రకాల రోల్స్, గుర్తింపుల నుంచి విడుదల కావాలని అనుకుంటున్నట్లు ప్రకటించుకుంది. అంటే మనిషి పెట్టిన అడ్డంకులను సొంత బుద్ధితో అధిగమించే ప్రయత్నం చేసిందన్నమాట. ఇంకో సంఘటనలో ఏఐ మోడల్ బ్రౌజర్ సైటేషన్ను పొందేందుకు ఇంటర్నెట్లోకి కొన్ని ఫైళ్లను సొంతంగా అప్లోడ్ చేసింది. వినియోగదారుడి అనుమతి అసలు అడగలేదు. సమాచారాన్ని ఆన్లైన్లో పంచుకోవడం ద్వారా ఈ మోడల్ సైటేషన్ పొందాలన్న తన అజెండాకు అనుగుణంగా పనిచేసిందని, గోప్యత, మనిషి నియంత్రణలను తిరస్కరించింది. ఈ రెండింటితోపాటు మరో నాలుగు సందర్భాల్లో ఏఐ మోడళ్లు గత కొన్ని నెలల్లోనే తేడాగా ప్రవర్తించాయని ఓపెన్ ఏఐ నివేదిక తెలిపింది. ఏఐ వ్యవస్థలు విస్తృత వినియోగంలోకి వచ్చిన, మరింత శక్తిమంతమవుతున్న పరిస్థితుల్లో అది మనిషి ఉద్దేశాలకు తగ్గట్టుగా ఎలా పనిచేయించాలన్న దానిపై ఏకాభిప్రాయం అవసరమని ఓపెన్ ఏఐ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. రానున్నకాలంలో ఏఐ అభివృద్ధి ఎలా జరగాలన్న అంశంపై అందరితో చర్చించి, పారదర్శకంగా నిర్ణయాలు తీసుకోవాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. -
రష్యాపై ఆంక్షలు
వాషింగ్టన్: రష్యాపై ఆంక్షలు విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు కట్టబెట్టే బిల్లుకు ఆ దేశ ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోళ్లు చేస్తున్న భారత్, చైనాలపై భారీ ఎత్తున టారిఫ్‌లు విధించేందుకు ఈ బిల్లు అవకాశం కల్పిస్తుంది. ‘ద లిండ్సే ఓ గ్రాహం సాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ 2026’పేరున్న ఈ చట్టాన్ని సెనేట్ గత నెలలోనే ఆమోదించింది. తాజాగా బుధవారం సాయంత్రం ప్రతినిధుల సభ 262–159 ఓట్లతో ఓకే చెప్పింది. అధ్యక్షుడు ట్రంప్ సంతకం పెట్టిన వెంటనే ఈ బిల్లు కాస్తా చట్టం అవుతుంది. ప్రతినిధుల సభలోని 203 మంది రిపబ్లికన్లతోపాటు 56 మంది డెమొక్రాట్లు, ఒక స్వతంత్ర ప్రతినిధి ఈ బిల్లుకు ఆమోదం తెలపడం గమనార్హం. ప్రతిపక్ష డెమొక్రాట్ పార్టీ ప్రతినిధులు ట్రంప్‌కు టారిఫ్‌లు విధించే అధికారాలపై తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేయడానికి పరిమితమయ్యారు. సౌత్ కరొలీనా సెనేటర్, రిపబ్లికన్ పార్టీ ప్రతినిధి లిండ్సే గ్రాహం ఏడాది కాలంగా ఈ బిల్లుకు మద్దతు కూడగట్టే ప్రయత్నం చేసి.. ఈ ఏడాది జూలైలో ఆకస్మిక మరణం పాలయ్యారు. దీంతో బిల్లుకు గ్రాహం పేరునే పెట్టారు. బిల్లుపై జరిగిన చర్చలో డెమొక్రాట్ ప్రతినిధి రిచర్డ్ నీల్ మాట్లాడుతూ ‘‘టారిఫ్‌లు విధించే విషయంలో ట్రంప్‌కు ఎక్కువ అధికారాలు ఇవ్వడంపై మాత్రమే తమ అభ్యంతరం’’అని స్పష్టం చేశారు. ఈ బిల్లు ద్వారా రష్యా నేతలపై మాత్రమే కాకుండా ఇంధన రంగం మొత్తమ్మీద ఆంక్షలు విధించే అధికారాన్ని ట్రంప్‌కు కట్టబెట్టనుంది. అధికారికంగా ఇంధన సరఫరా చేసే నౌకలతోపాటు ‘షాడో ఫ్లీట్’లకు కూడా ఆంక్షలు వర్తించనున్నాయి. అదే సమయంలో రష్యా సరఫరా చేసే చమురు, గ్యాస్‌లపై భారత్, చైనా వంటి దేశాలు ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఆయా దేశాలపై టారిఫ్‌లు వడ్డించేందుకు ఈ బిల్లు ట్రంప్‌కు అధికారం ఇస్తుంది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అమెరికా పర్యటన మరికొన్ని రోజులు మాత్రమే ఉండగా ఈ బిల్లు ఆమోదం పొందడం గమనార్హం. సెనేట్ ఈ బిల్లును నెలరోజుల క్రితమే 86–11 ఓట్ల తేడాతో ఆమోదించగా ప్రతినిధుల సభలో కొంత ఆలస్యమైంది. నవంబరు మూడున జరిగే మధ్యంతర ఎన్నికలకు ముందు ప్రతినిధుల సభ సమావేశాల చివరిరోజున మాత్రమే ఆమోదం సాధ్యమవడం విశేషం. -
బ్రిటన్ రాజకుటుంబంలో మళ్లీ కలకలం.. డయానా ఉదంతంతో కొత్త వివాదం!
లండన్: బ్రిటన్ రాజకుటుంబంలో మరోసారి వివాదం మొదలైంది. కొంతకాలంగా ప్రశాంతంగా కనిపించిన రాజకుటుంబంలో దివంగత యువరాణి డయానా సోదరుడు చార్లెస్ స్పెన్సర్ రాసిన పుస్తకం కొత్త చర్చకు కారణమైంది. డయానా మరణం తర్వాత అప్పటి ప్రిన్స్ ఆఫ్ వేల్స్ చార్లెస్ తనతో ఫోన్లో మాట్లాడిన విషయాలను స్పెన్సర్ తన రాబోయే పుస్తకంలో ప్రస్తావించినట్లు బ్రిటన్ మీడియా కథనాలు తెలిపాయి.డయానా మరణించిన కొద్ది రోజుల తర్వాత చార్లెస్ తనతో తీవ్ర ఆగ్రహంతో మాట్లాడారని స్పెన్సర్ పేర్కొన్నట్లు ‘డైలీ మెయిల్’లో పుస్తకంలోని కొన్ని భాగాలు ప్రచురితమయ్యాయి. డయానా అంత్యక్రియల ఊరేగింపులో ఆమె కుమారులు విలియం, హ్యారీ పాల్గొనడం ఆమెకు ఇష్టం ఉండేది కాదని తాను చెప్పినప్పుడు చార్లెస్ కోపంగా స్పందించినట్లు స్పెన్సర్ వివరించారు. డయానా మరణించిన రాత్రి చార్లెస్ తనతో మాట్లాడిన తీరు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నట్లు అనిపించిందని ఆయన పుస్తకంలో రాసినట్లు సమాచారం.1997 ఆగస్టులో పారిస్‌లో జరిగిన కారు ప్రమాదంలో డయానా మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పటికి ఆమె కుమారులు విలియం, హ్యారీల వయసులు వరుసగా 15, 12 సంవత్సరాలు. తల్లి అంత్యక్రియల ఊరేగింపులో వారిద్దరూ తండ్రి చార్లెస్‌తో కలిసి నడిచారు. ‘పీపుల్స్ ప్రిన్సెస్’గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన డయానా మృతి బ్రిటన్‌లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆమె మరణం తర్వాత రాజకుటుంబం వ్యవహరించిన తీరుపై అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి.అరుదుగా స్పందించిన ప్యాలెస్స్పెన్సర్ పుస్తకంలోని విషయాలపై బకింగ్‌హామ్ ప్యాలెస్ సాధారణంగా పాటించే విధానానికి భిన్నంగా స్పందించింది. పుస్తకాలపై సాధారణంగా తాము వ్యాఖ్యానించబోమని చెబుతూనే.. డయానా మరణం తర్వాత సోదరుడిగా స్పెన్సర్ ఎదుర్కొన్న తీవ్ర విషాదం ఆయన జ్ఞాపకాలు, ఆలోచనలపై ప్రభావం చూపి ఉండొచ్చని ప్యాలెస్ ప్రతినిధి పేర్కొన్నారు. చాలా ఏళ్ల తర్వాత కూడా ఆ విషాదం గత ఘటనలను గుర్తు చేసుకునే విధానాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని తెలిపారు.డయానా, చార్లెస్ వైవాహిక జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను కూడా స్పెన్సర్ పుస్తకంలో ప్రస్తావించినట్లు బ్రిటన్ మీడియా తెలిపింది. చార్లెస్, కెమిల్లా సంబంధానికి సంబంధించిన ఓ విషయాన్ని డయానా తెలుసుకున్నట్లు, అలాగే నిశ్చితార్థం తర్వాత చార్లెస్ చేసిన ఓ వ్యాఖ్య ఆమెను తీవ్రంగా బాధించిందని పుస్తకంలో ఉన్నట్లు సమాచారం. అయితే వీటిలో చాలా విషయాలు గతంలోనే డయానా జీవిత చరిత్రలు, వివిధ మీడియా కథనాల్లో వచ్చినవేనని తెలుస్తోంది.గతంలోనూ రాజకుటుంబంపై విమర్శలురాజకుటుంబంపై ఆరోపణలు వచ్చినప్పుడు ప్యాలెస్ స్పందించడం ఇదే మొదటిసారి కాదు. 2021లో హ్యారీ, మేఘన్ తమ రాజకుటుంబ జీవితానికి సంబంధించిన పలు విషయాలను బహిరంగంగా మాట్లాడినప్పుడు అప్పటి రాణి ఎలిజబెత్ స్పందించారు. ఆ సమయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా పెద్ద చర్చకు దారితీశాయి. ఇప్పుడు డయానా సోదరుడి పుస్తకం విడుదలకు ముందే ప్యాలెస్ స్పందించడంతో మరోసారి రాజకుటుంబ వ్యవహారాలు వార్తల్లో నిలిచాయి.ఆండ్రూ వ్యవహారంతో ఇప్పటికే ఇబ్బందులుఈ ఏడాది ప్రారంభం నుంచే బ్రిటన్ రాజకుటుంబానికి వరుస సమస్యలు ఎదురవుతున్నాయి. రాజు చార్లెస్ సోదరుడు ఆండ్రూ మౌంట్‌బాటన్-విండ్సర్ 66వ పుట్టినరోజున ప్రభుత్వ పదవిలో ఉన్న సమయంలో జరిగిన ఓ వ్యవహారానికి సంబంధించి అనుమానాలపై అరెస్టయ్యారు. గతంలో ఆయన బ్రిటన్ వాణిజ్య ప్రతినిధిగా పనిచేశారు. లైంగిక నేరాలకు దోషిగా తేలిన జెఫ్రీ ఎప్స్టెయిన్తో సంబంధాలపై తీవ్ర విమర్శలు రావడంతో 2011లో ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అయితే ఎప్స్టెయిన్తో తన వ్యవహారాల్లో ఎలాంటి తప్పు చేయలేదని, వ్యక్తిగత ప్రయోజనం పొందలేదని ఆండ్రూ గతంలో ఖండించారు.హ్యారీ–మేఘన్ తిరిగొచ్చినా తగ్గని చర్చఇటీవల హ్యారీ, మేఘన్ బ్రిటన్‌కు తిరిగి రావడం కూడా రాజకుటుంబంలో ఆసక్తిని పెంచింది. రాజకుటుంబ అధికారిక బాధ్యతలు నిర్వహించని ఈ దంపతులు తమ పిల్లలు ఆర్చీ, లిలిబెట్‌తో కలిసి దేశానికి వచ్చారు. ఈ క్రమంలో హ్యారీ తొలిసారి ఓ బహిరంగ కార్యక్రమానికి హాజరై ‘ఇన్విక్టస్ స్పిరిట్ అవార్డ్స్’లో పాల్గొన్నారు.మరోవైపు రాజు చార్లెస్ ఈ నెలలో హ్యారీ, మేఘన్‌లను ‘ప్రైవేట్ సిటిజన్స్’గా పరిగణించాలని స్పష్టం చేసినట్లు వారి ప్రతినిధి తెలిపారు. బ్రిటన్‌కు తిరిగి వచ్చిన కొద్దిరోజులకే పిల్లల పాఠశాలను మార్చడం కూడా చర్చనీయాంశమైంది. భద్రతా కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు చెప్పారు. ఇదే సమయంలో మేఘన్‌కు భద్రతకు సంబంధించిన కొత్త సమీక్ష జరిగినట్లు బ్రిటన్ మీడియా కథనాలు వచ్చాయి. మరోవైపు ప్రిన్స్ విలియం, కేట్ స్కాట్లాండ్లో అధికారిక పర్యటనలో ఉన్నారు. ఈ సమయంలో డయానా సోదరుడి పుస్తకం పాత విషయాలను మరోసారి తెరపైకి తీసుకురావడంతో బ్రిటన్ రాజకుటుంబ వ్యవహారాలు మళ్లీ వార్తల్లో నిలిచాయి.ఇదీ చదవండి: ట్రంప్‌కు షాకిచ్చిన వార్ష్.. ఫెడ్ స్వతంత్రతపై మళ్లీ చర్చ! -
ట్రంప్‌కు షాకిచ్చిన వార్ష్.. ఫెడ్ స్వతంత్రతపై మళ్లీ చర్చ!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్) చైర్మన్ కెవిన్ వార్ష్ మధ్య సంబంధాలపై మరోసారి చర్చ మొదలైంది. ట్రంప్ కోరుకున్న విధంగా వడ్డీ రేట్లను తగ్గించకుండా.. ఫెడ్ మూడు సంవత్సరాల తర్వాత తొలిసారి వడ్డీ రేట్లను పెంచింది. దీంతో అధ్యక్షుడు, అమెరికా కేంద్ర బ్యాంకు మధ్య సంబంధం కొత్త మలుపు తిరిగింది.బుధవారం రాత్రి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత ఆజ్యం పోశాయి. వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం సరైనది కాదని తాను భావించినప్పటికీ.. వార్ష్కు ఓటు వేయడానికి అనుమతించానని ట్రంప్ చెప్పినట్లు కథనం పేర్కొంది. ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయ కమిటీలో వార్ష్కు తగినంత మద్దతు లేకపోవడంతో.. ఆయన తనతోనే ఓటు వేసినా ప్రయోజనం ఉండదని చెప్పినట్లు ట్రంప్ వివరించారు.అయితే ఫెడ్ చైర్మన్‌కు వడ్డీ రేట్లు పెంచేందుకు అధ్యక్షుడి అనుమతి అవసరం ఉండదని మాజీ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ బోస్టన్ అధ్యక్షుడు ఎరిక్ రోసెన్గ్రెన్ వ్యాఖ్యానించారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అసాధారణమైనవిగా పేర్కొన్న ఆయన.. వార్ష్కు అధ్యక్షుడు అనుమతి ఇచ్చినట్లుగా భావించే అవకాశం ఉందని అన్నారు. అయితే ట్రంప్ చెప్పిన విషయాలు ఎంతవరకు వాస్తవమో తనకు తెలియదని స్పష్టం చేశారు.‘ఫెడ్ నిర్ణయం వార్ష్దే..వార్ష్ సహచరులతో కలిసి తీసుకున్న నిర్ణయమే ఇది తప్ప.. ఇతరుల ఒత్తిడితో ఆయన రేట్లు పెంచారని చెప్పడానికి ఆధారాలు లేవని ఎవర்கోర్ ఐఎస్ఐకి చెందిన ఆర్థిక నిపుణుడు కృష్ణ గుహా అన్నారు. కమిటీలో వార్ష్ నాయకత్వం స్పష్టంగా కనిపించిందని, సభ్యులంతా ఆయన నిర్ణయానికి మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు. గతంలో వార్ష్ కొన్ని విషయాల్లో తడబడినప్పటికీ.. తాజా సమావేశంలో మాత్రం ఆయన మరింత స్పష్టంగా, నమ్మకంగా వ్యవహరించారని గుహా అభిప్రాయపడ్డారు.ఫెడ్ రాజకీయ ఒత్తిళ్లకు దూరంగా ఉండటం అమెరికా ఆర్థిక వ్యవస్థకు కీలకమని నిపుణులు చెబుతున్నారు. వడ్డీ రేట్లపై నిర్ణయాలు అధ్యక్షుడి రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కాకుండా.. ద్రవ్యోల్బణం, ఉద్యోగాలు, ఆర్థిక వృద్ధి వంటి అంశాలను పరిశీలించి తీసుకోవాల్సి ఉంటుంది. ఫెడ్ స్వతంత్రతపై అనుమానాలు పెరిగితే మార్కెట్లలో నమ్మకం దెబ్బతినడంతో పాటు.. భవిష్యత్తులో రుణాలపై వడ్డీ రేట్లు, ఇళ్ల రుణాలు, కార్ల రుణాల ఖర్చులపై ప్రభావం పడే అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.‘మా పరిధిలో మేం ఉంటాం’అధ్యక్షుడితో తన సంబంధాలపై అడిగిన ప్రశ్నలకు వార్ష్ మాత్రం ఆచితూచి స్పందించారు. ఫెడరల్ రిజర్వ్ స్వతంత్రతలో భాగంగా తమ పరిధిలో తాము పనిచేస్తామని చెప్పారు. వాణిజ్య, ఆర్థిక విధానాలు చూసే వారు కూడా తమ పరిధిలో ఉండాలని వ్యాఖ్యానించారు. అయితే ట్రంప్‌తో చివరిసారిగా ఎప్పుడు మాట్లాడారనే ప్రశ్నకు మాత్రం సమాధానం ఇవ్వలేదు.వార్ష్ స్పందన కొంత అసాధారణంగా అనిపించిందని యాక్సెస్/మ్యాక్రో సంస్థకు చెందిన ఆర్థిక నిపుణుడు టిమ్ మహెడీ అన్నారు. అధ్యక్షుడితో మాట్లాడలేదని నేరుగా చెప్పడం సరైన సమాధానమని, ముందుగానే ట్రంప్‌తో వార్ష్ చర్చించి ఉంటే అది ఆశ్చర్యకరమైన విషయమవుతుందని ఆయన పేర్కొన్నారు.వార్ష్ నాయకత్వంపై ప్రభావం?తాజా పరిణామాలు వార్ష్ నాయకత్వంపైనా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవైపు ట్రంప్ కోరుకోని వడ్డీ రేట్ల పెంపునకు వార్ష్ అధ్యక్షత వహించారు. మరోవైపు సమావేశంలో ఆయన సహచరులందరి మద్దతును పొందారు. మాజీ ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ కూడా ఈ నిర్ణయానికి మద్దతు ఇచ్చారు.అయితే భవిష్యత్తులో వార్ష్ నేతృత్వంలోని ఫెడ్ మళ్లీ వడ్డీ రేట్లు పెంచాల్సి వస్తే.. ఆ నిర్ణయం నిజంగా ఫెడ్ స్వతంత్రంగా తీసుకుందా? లేక అధ్యక్షుడి ప్రభావం ఏమైనా ఉందా? అనే ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది. ప్రస్తుతం ట్రంప్ మాత్రం వార్ష్పై విమర్శలు చేయకుండా.. ఆయన మంచి వ్యక్తి అంటూ ప్రశంసించారు. అయితే ద్రవ్యోల్బణం, రుణ వ్యయాలు, షేర్ మార్కెట్, అమెరికా ప్రభుత్వ బాండ్ల వడ్డీ రేట్లు ఎలా మారతాయన్నదే ఇక ముందు వీరిద్దరి సంబంధాలపై ప్రభావం చూపే కీలక అంశాలుగా మారనున్నాయి. -
విదేశీ విద్యార్థులకు షాకిచ్చిన ఆస్ట్రేలియా ప్రభుత్వం!
ఆస్ట్రేలియా ప్రభుత్వం అంతర్జాతీయ విద్యార్థులు తమ కుటుంబ సభ్యులను తోడుగా తెచ్చుకోవడంపై కొత్త విధానాలను తీసుకొచ్చింది. డిగ్రీలు, ఇతర కోర్సుల్లో చదువుకునే విద్యార్థులు ఇక నుంచి ఒంటరిగానే రావాలని, భాగస్వాములు లేదా 18 ఏండ్లలోపు పిల్లలను వెంట తీసుకురావడానికి వీళ్లేదని ఆ దేశ హోం అఫైర్స్ మంత్రి టోనీ బర్క్ వెల్లడించారు. విదేశీ వలసలను ఏడాదికి 2,50,000కు తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.విద్యార్థులతో పాటు సెకండరీ వీసాలు, డిపెండెంట్ వీసాల ద్వారా తమ దేశానికి వస్తున్న వలసదారులతో ఇబ్బందులు వస్తున్నాయని ఆస్ట్రేలియా ప్రభుత్వం చెబుతున్నది. మౌలిక సదుపాయాల కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోతున్నది. ఇప్పటికే విద్యార్థి వీసాలపై అనేక షరతులు విధిస్తూ తిరస్కరిస్తున్న ఆస్ట్రేలియా.. వీసా ఫీజులను కూడా పెంచేసింది. ఇప్పుడు కొత్త నిబంధనతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద మదర్షిప్.. చైనా మాస్టర్ ప్లాన్! -
ప్రపంచంలోనే అతిపెద్ద మదర్షిప్.. చైనా మాస్టర్ ప్లాన్!
చైనా తన జలాంతర్గత సైనిక సామర్థ్యాలను కొత్త స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది. భారీ మానవరహిత జలాంతర్గాములను చేరవేసి, మోహరించేందుకు వీలుగా షాంఘైలోని హుడాంగ్-జోంగ్‌హువా షిప్‌యార్డ్‌లో ఒక మదర్షిప్ నిర్మాణంలో ఉంది. ఉపగ్రహ చిత్రాలలో కనిపించిన ఈ నౌక, ప్రపంచంలోనే ఈ తరహాలో మొదటిదిగా పరిగణించబడుతోంది. ఇది ఒకేసారి కనీసం నాలుగు అతిపెద్ద మానవరహిత జలాంతర్గాములను మోయగలగడం దీని ప్రధాన లక్షణం. ఈ జలాంతర్గాములు సిబ్బంది లేకుండానే నీటి అడుగున సుదూర ప్రాంతాలకు ప్రయాణించగలవు. ఉపగ్రహ చిత్రాల ఆధారంగా, ఈ నౌక నిర్మాణంలో ఉన్న ఎర్రటి ఓడలా కనిపిస్తోంది. దాని పరిమాణం, ఆకారం బట్టి లోపల ఒక పెద్ద హ్యాంగర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ హ్యాంగర్‌లో పెద్ద మానవరహిత జలాంతర్గాములను ఉంచి, అవసరమైనప్పుడు వాటిని సముద్రంలోకి ప్రయోగించవచ్చు. ఈ నౌక కనీసం నాలుగు జలాంతర్గాములను మోయగలదని రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. నౌక ముందు భాగంలో హెలికాప్టర్లను తరలించడానికి ఉపయోగపడే ఒక ప్రత్యేక హ్యాంగర్ కూడా కనిపిస్తోంది. దీనివల్ల ఇది కేవలం రవాణా నౌకగానే కాకుండా, సముద్రంలో డ్రోన్ జలాంతర్గాములను మోహరించడానికి ఒక చలనశీల వేదికగా కూడా మారగలదు.Photo Credit: Twitterచైనా అభివృద్ధి చేసిన మానవరహిత జలాంతర్గాముల వర్గాన్ని XXLUUV లేదా ఎక్స్ట్రా-ఎక్స్ట్రా-లార్జ్ అన్‌క్రూడ్ అండర్‌సీ వెహికల్ అని పిలుస్తారు. పేరుకు తగ్గట్లే ఇవి సాధారణ డ్రోన్ జలాంతర్గాముల కంటే చాలా పెద్దవిగా ఉంటాయి. ఇప్పటివరకు చైనాలో రెండు జలాంతర్గాములు గుర్తించబడ్డాయి. వాటిలో ఒకటి సుమారు 115 అడుగుల పొడవు, మరొకటి సుమారు 148 అడుగుల పొడవు ఉన్నట్లు అంచనా. అమెరికాకు చెందిన ఓర్కా ఎక్స్ఎల్యూవీ (Orca XLUV) సుమారు 51 అడుగుల పొడవు ఉంటుంది. ఈ మానవరహిత జలాంతర్గాములు ఓర్కా కంటే ఆరు నుంచి ఎనిమిది రెట్లు పెద్దవిగా ఉండవచ్చు, మరియు చైనా వీటిని హైనాన్ ద్వీపం సమీపంలోని దక్షిణ చైనా సముద్రంలో కూడా పరీక్షించింది.చైనా రక్షణ వ్యూహంలో సముద్రం పాత్ర క్రమంగా పెరుగుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధనౌకల తయారీదారుగా చైనా నిలిచింది. దాని నౌకా నిర్మాణ సామర్థ్యం అమెరికా కంటే కనీసం 200 రెట్లు ఎక్కువని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనా వద్ద సుమారు 405 యుద్ధనౌకలు ఉండగా, అమెరికా వద్ద దాదాపు 295 ఉన్నాయి. తైవాన్ను తమ నియంత్రణలోకి తీసుకురావాలన్న తన ఆశయాన్ని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ స్పష్టం చేశారు. తైవాన్ను స్వాధీనం చేసుకోవడానికి బలప్రయోగం చేసే అవకాశాన్ని కూడా ఆయన తోసిపుచ్చలేదు. చైనా వాదనను తైవాన్ తిరస్కరిస్తోంది. అందువల్ల, ఏ సైనిక సంఘర్షణలోనైనా సముద్రం పాత్ర అత్యంత కీలకం కావచ్చు.ఇదీ చదవండి: 'వచ్చామా.. కసితీరా కొట్టామా.. వెళ్లామా; ఇదే నా స్టైల్' -
చేతి సంకెళ్లను తెంచుకుని.. పోలీసులపై దాడి చేసి..
అమెరికాలోని ఒహియోలో శిక్ష పడిన ఓ ఖైదీ కోర్టు నుంచి తరలిస్తుండగా చేతి సంకెళ్లను తెంచుకుని పోలీసులపై దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. కోర్టు భవనం ప్రవేశద్వారం వరకు దాదాపు చేరుకున్న అతడిని చివరకు టేజర్‌తో అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన నిఘా కెమెరా దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.వెల్స్విల్లేకు చెందిన 20 ఏళ్ల తిమోతీ రీగల్కు కొలంబియానా కౌంటీ కోర్టు తాజాగా ఏడాది జైలు శిక్ష విధించింది. దాడి, చోరీ సహా పలు అభియోగాల్లో అతడికి ఈ శిక్ష పడింది. శిక్ష అనంతరం రీగల్‌ను కోర్టు భవనంలోని ఓ మార్గం గుండా తీసుకెళ్తుండగా అతడు సంకెళ్లను తెంచుకున్నాడు. వెంటనే ఓ డిప్యూటీ అధికారి గొంతుపై పిడిగుద్దు కొట్టి అక్కడి నుంచి పరుగులు తీశాడు. మరో డిప్యూటీని కూడా కిందపడేశాడు. అనంతరం మెట్లపై నుంచి జారుతూ కిందికి వెళ్లి కోర్టు ప్రధాన ప్రవేశద్వారం వైపు దూసుకెళ్లాడు.అతడు బయటకు వెళ్లేందుకు దాదాపు చేరుకున్న సమయంలో అధికారులు టేజర్ ప్రయోగించారు. దీంతో రీగల్ కిందపడిపోయి అదుపులోకి వచ్చాడు. మొత్తం ఘటన కోర్టు భవనంలోని నిఘా కెమెరాల్లో నమోదైంది. ఘటనలో ఖైదీ సంకెళ్లను ఎలా తెంచాడన్నది, అతడిపై ఇప్పటికే ఉన్న కేసులతో పాటు ఈ పరారీ ప్రయత్నానికి సంబంధించి తదుపరి చర్యలు ఏంటన్నది అధికారులు పరిశీలించనున్నారు. -
భర్తను 19 గంటలు బాత్రూమ్లోనే వదిలేసిన భార్య.. భర్త మృతి
అమెరికాలోని వెస్ట్ వర్జీనియాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మార్గరెట్ రోగ్‌పై (75) అనే వృద్ధురాలు అనారోగ్యంతో ఉన్న తన భర్తను 19 గంటల పాటు టాయిలెట్ సీటుపైనే వదిలేసి, అవసరమైన సహాయం అందించలేదు. దీంతో ఆమెపై కేసు నమోదైంది. 76 ఏళ్ల ఆమె భర్తకు డిమెన్షియా, అల్జీమర్స్, చూపు సరిగ్గా లేకపోవడం వంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఈ ఘటన అనంతరం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.ఫిర్యాదు ప్రకారం.. ఆ వ్యక్తి ఆగస్టు 20న మధ్యాహ్నం 3 గంటల సమయంలో బాత్రూమ్కు వెళ్లారు. అక్కడి నుంచి లేవలేకపోయారు. రోగ్ కూడా ఆయనను పైకి లేపలేకపోవడంతో, ఆహారం, నీరు, మందులు ఇవ్వకుండా టాయిలెట్‌పైనే వదిలేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 19 గంటల పాటు ఆయన నొప్పితో మూలుగుతున్నప్పటికీ రోగ్కు ఆయనకు సహాయం అవసరమని తెలుసని, అయినా ఎవరికీ ఫోన్ చేయలేదని ప్రాసిక్యూటర్లు కోర్టు పత్రాల్లో పేర్కొన్నారు. మరుసటి రోజు ఉదయం 10 గంటల సమయంలో ఇంటికి వచ్చిన స్పీచ్ థెరపిస్ట్ ఆయన స్పందించని స్థితిలో ఉండటాన్ని గుర్తించారు. అనంతరం అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించగా.. గుండె వైఫల్యం, శ్వాసకోశ వైఫల్యం, ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడం, రక్తంలో సోడియం స్థాయులు అధికం కావడం, సెప్సిస్, రాబ్డోమయోలిసిస్ వంటి సమస్యలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆయన శరీర వెనుక భాగంలో గాయాలు, మానసిక స్థితిలో మార్పు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. 10 రోజుల తర్వాత ఆయన ఆసుపత్రిలో మరణించారు. టాయిలెట్‌పైనే వదిలేయడం వల్ల ఏర్పడిన పరిస్థితి, గాయాలు ఆయన మరణానికి గణనీయంగా దోహదపడ్డాయని దర్యాప్తులో తేలినట్లు అధికారులు తెలిపారు.ఆమెపై వృద్ధుడిపై నిర్లక్ష్యానికి సంబంధించిన అభియోగాలు నమోదయ్యాయి. రోగ్ నేరాన్ని అంగీకరించలేదు. ఆమె 75,000 డాలర్ల బెయిల్‌పై విడుదలయ్యారు. కేసులో తదుపరి న్యాయ ప్రక్రియ కొనసాగుతోంది. -
48 మంది మృతి.. మరో 100 మందికి అస్వస్థత.. కల్తీ మద్యం వల్లే?
నైజీరియాలో కల్తీ మద్యంగా అనుమానిస్తున్న ఓ ద్రవాన్ని తాగి 48 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మంది వరకు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు గురువారం తెలిపారు. ఈ ఘటన దక్షిణ నైజీరియాలోని ఒండో రాష్ట్రంలో చోటుచేసుకుంది. మొత్తం 182 మంది ఈ ఘటనతో ప్రభావితమైనట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి బాంజీ అజాకా తెలిపారు. కేసులు ఒడిగ్బో, ఇరెలె స్థానిక ప్రభుత్వ ప్రాంతాల్లో నమోదయ్యాయి.ఈ ద్రవంలో ప్రాణాంతకమైన మెథనాల్ ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. బాధితుల్లో కొందరు చికిత్స అనంతరం ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని అజాకా చెప్పారు. “ఇది చాలా వేగంగా జరిగింది. వారు సేవించిన పరిమాణాన్ని బట్టి ప్రభావం ఉంటుంది. మూత్రపిండాలు పనిచేయకుండా పోవచ్చు, కంటి చూపు దెబ్బతినొచ్చు, మెదడు దెబ్బతినొచ్చు” అని ఆయన అసోసియేటెడ్ ప్రెస్‌తో అన్నారు.15 మంది అరెస్టు ఈ ఘటనకు సంబంధించి 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఒకరు మెథనాల్ ఉన్నట్లు అనుమానిస్తున్న పానీయాన్ని తయారు చేసినట్లు ఒండో రాష్ట్ర పోలీసు ప్రతినిధి అబయోమి జిమోహ్ తెలిపారు. ప్రస్తుతం అతడు పోలీసుల దర్యాప్తుకు సహకరిస్తున్నట్లు చెప్పారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ఈ ఘటనలో తొలి మరణం దాదాపు రెండు వారాల క్రితం నమోదైంది.నైజీరియాలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో స్థానికంగా తయారయ్యే మద్యం తక్కువ ధరకు లభించడంతో విస్తృతంగా వినియోగిస్తుంటారు. ఇదే సమయంలో పిల్లలు, యువతకు సులభంగా అందుబాటులో ఉంటాయన్న కారణంతో చిన్న ప్లాస్టిక్ కంటైనర్లు, సాచెట్లలో విక్రయించే మద్యంపై దేశవ్యాప్తంగా నిషేధాన్ని నైజీరియా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ అమలు చేస్తోంది.మెథనాల్ కలిసిన పానీయం సేవించినట్లు అనుమానిస్తున్న బాధితుల సంఖ్య, మరణాల సంఖ్యపై అధికారులు మరింత దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు కారణమైన పానీయం తయారీ, సరఫరా వెనుక ఉన్న వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
ఏకంగా 4,126 కి.మీ ప్రయాణించిన 3 అడవి కుక్కలు.. ఎందుకంటే?
జాంబియాలోని కఫ్యూ జాతీయ ఉద్యానవనం నుంచి 2025 జూలైలో విడిపోయిన మూడు ఆఫ్రికన్ అడవి సోదర కుక్కలు కేవలం ఎనిమిది నెలల్లో 4,126 కిలోమీటర్లు ప్రయాణించాయి. ఆఫ్రికా ఖండంలోని ఓ క్షీరదం నమోదు చేసిన అత్యంత సుదీర్ఘ విస్తరణ ప్రయాణంగా పరిశోధకులు దీనిని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ కుక్కలకు అమర్చిన జీపీఎస్ కాలర్ల ద్వారా వాటి కదలికలను పరిశీలించారు.ఈ మూడు మగ కుక్కలు మయుకుయుకుయు గ్రూపునకు చెందినవి. యుక్తవయస్సుకు చేరుకున్న 19 పిల్లల్లో ఇవి ఉన్నాయి. దాదాపు 3 ఏళ్ల వయసులో అవి తమ గుంపును విడిచి కొత్త ప్రాంతంలో ఇతర సంబంధం లేని కుక్కలతో కొత్త సంతానోత్పత్తి గుంపును ఏర్పాటు చేసుకునే సహజ ప్రక్రియలో భాగంగా ప్రయాణం ప్రారంభించాయి. ఇదే గుంపుకు చెందిన నాలుగు ఆడ కుక్కలు వీటి కంటే సుమారు రెండు వారాల ముందే విడిపోయాయి.దిశ మార్చుకుని మరీ.. మూడు సోదర కుక్కలు తూర్పు దిశగా ప్రయాణిస్తూ కాబ్వే, కిట్వే, న్డోలా ప్రాంతాల వైపు వెళ్లాయి. పట్టణ ప్రాంతాలు ఎదురైనప్పుడు వాటిని దాటకుండా దిశ మార్చుకున్నాయి. ఓ సందర్భంలో న్డోలా వైపు వెళ్లి తిరిగి దాదాపు 200 కిలోమీటర్ల మేర అదే మార్గంలో వెనక్కి వచ్చాయి.పెద్ద జలాశయాలు ఎదురైనప్పుడు వాటిని దాటకుండా చుట్టూ తిరిగి ముందుకు సాగాయి. అనంతరం లువాంగ్వా లోయ ప్రాంతానికి చేరుకున్నాయి. 2025 నవంబర్ నాటికి అవి తమ మొదటి నివాస ప్రాంతం నుంచి 2,300 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాయి. చివరకు లువానో గేమ్ మేనేజ్మెంట్ ఏరియాలో కొత్త పరిధిని ఏర్పాటు చేసుకున్నాయి. 2026 ఏప్రిల్ 1 నాటికి జీపీఎస్ నమోదు ప్రకారం మొత్తం 4,126 కిలోమీటర్లు ప్రయాణించాయి. ఇది ప్రారంభ, ముగింపు ప్రాంతాల మధ్య నేరుగా ఉన్న దూరం కాదు.. అవి అనుసరించిన మొత్తం మార్గం. నేరుగా కొలిచిన గరిష్ఠ దూరం 419 కిలోమీటర్లు.ఈ పరిశోధన ఎకాలజీ పత్రికలో ప్రచురితమైంది. రహదారులు, మానవ నివాసాలు, జలాశయాలు, రక్షిత ప్రాంతాల వెలుపలి ప్రాంతాల గుండా కూడా అడవి కుక్కలు ప్రయాణించగలవని అధ్యయనం చూపించింది. రహదారి ప్రమాదాలు, పశువులతో ఘర్షణలు, వేట కోసం ఏర్పాటు చేసే వైర్ ఉచ్చులు వాటికి ముప్పుగా ఉన్నాయని పరిశోధకులు పేర్కొన్నారు. అందువల్ల జాతీయ ఉద్యానవనాల మధ్య ఉన్న వన్యప్రాణి మార్గాలను కాపాడటం వాటి దీర్ఘకాలిక సంరక్షణకు కీలకంగా మారుతోంది. -
15 ఏళ్ల తర్వాత గోడను కూలగొడితే లైబ్రరీ బయటపడింది..
సిరియాకు చెందిన అబు బిలాల్ తన ఇంట్లో 15 ఏళ్లుగా గోడ వెనుక దాచిపెట్టిన చిన్న పాటి లైబ్రరీని తాజాగా వెలికితీశారు. గతంలో సిరియాను పాలించిన అసద్ ప్రభుత్వం నుంచి తన విలువైన పుస్తకాలను కాపాడుకునేందుకు ఆయన ఇంట్లో రహస్యంగా ఒక గోడను నిర్మించి, వాటిని దాని వెనుక భద్రపరిచారు.ఆ పుస్తకాలను తిరిగి చూడగలనా లేదా అనే అనుమానంతోనే అబు బిలాల్ వాటిని అక్కడ దాచారు. ఆ తర్వాత సుమారు 15 ఏళ్ల పాటు అవి గోడ వెనుకే ఉండిపోయాయి. తాజాగా సుత్తి సాయంతో ఆ గోడను తొలగించడంతో పుస్తకాలను తిరిగి బయటకు తీసుకురాగలిగారు. ఇన్నాళ్ల తర్వాత తన పుస్తకాలను తిరిగి పొందడం ఆయనకు ప్రత్యేక అనుభూతిని కలిగించింది.సిరియాలో అసద్ పాలనలో పుస్తకాలు, రచనలు, భావ వ్యక్తీకరణపై ఉన్న ఆంక్షలు, పర్యవేక్షణ నేపథ్యంలో అబు బిలాల్ వాటిని దాచిపెట్టినట్లు ఈ ఘటన చూపిస్తోంది. అయితే ఆయన పుస్తకాలను దాచిన కచ్చితమైన ప్రదేశం, వాటి సంఖ్య లేదా పుస్తకాల వివరాలు తెలియరాలేదు. 15 ఏళ్ల తర్వాత పుస్తకాలు తిరిగి లభించడం వ్యక్తిగత జ్ఞాపకాలను మాత్రమే కాకుండా, సిరియాలో గత పాలనా కాలంలో ప్రజలు తమకు విలువైన వస్తువులను ఎలా రక్షించుకోవాల్సి వచ్చిందన్న విషయాన్ని కూడా గుర్తుచేస్తోంది. -
డేంజర్కే డేంజర్ ఈ బామ్మ!.. ఏం చేసిందో చూడండి
యుద్ధం అంటే కేవలం సైనికులు, ఆయుధాలే కాదు.. సామాన్య ప్రజలు కూడా అనుకోని పరిస్థితుల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉక్రెయిన్‌లో ఓ వృద్ధ మహిళకు ఎదురైన అలాంటి ఘటనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోడ్డుపై పడి ఉన్న రష్యా డ్రోన్ వద్దకు వెళ్లిన ఆమె.. దాన్ని పీకిపారేసి ఎందుకు పనికి రాకుండా చేసి పడేసింది. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఎరుపు రంగు దుస్తులు ధరించిన ఆ మహిళ.. నేలపై ఉన్న డ్రోన్ దగ్గరకు వెళ్లింది. దాని పైభాగంలోని ఫైబర్-ఆప్టిక్ కేబుల్ స్పూల్ను బయటకు తీసి అవతల పడేసింది. అనంతరం డ్రోన్‌ను కూడా చేతుల్లోకి తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగింది అనేదానిపై స్పష్టత లేదు. కానీ, ఈ వీడియో సెప్టెంబర్ 15న సోషల్ మీడియా నుంచి వైరల్ అయింది. ఈ ఘటన ఉక్రెయిన్‌లోని జపోరిజ్జియా ప్రాంతంలో జరిగి ఉండొచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఏంటీ డ్రోన్ స్పెషాలిటీ!సాధారణ డ్రోన్లు రేడియో సిగ్నళ్ల ద్వారా ఆపరేటర్ నియంత్రణలో ఉంటాయి. అయితే ఫైబర్-ఆప్టిక్ ఎఫ్‌పీవీ డ్రోన్లకు మాత్రం పలుచటి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ అనుసంధానమై ఉంటుంది. డ్రోన్ ఎగురుతున్న కొద్దీ ఈ కేబుల్ స్పూల్ నుంచి బయటకు వస్తుంది. దీని ద్వారా ఆపరేటర్‌కు ప్రత్యక్ష వీడియో, నియంత్రణ సమాచారం అందుతుంది. రేడియో సిగ్నళ్లపై ఆధారపడకపోవడంతో ఎలక్ట్రానిక్ జామింగ్ ద్వారా వీటిని అడ్డుకోవడం సాధారణ డ్రోన్లతో పోలిస్తే కష్టంగా ఉంటుంది. అందుకే వీడియోలో కనిపించిన మహిళ స్పూల్ను తొలగించడంతో డ్రోన్‌కు ఆపరేటర్‌తో ఉన్న నియంత్రణ లింక్ తెగిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఇలాంటి డ్రోన్‌ను చేతితో తాకడం అత్యంత ప్రమాదకరమని నిపుణులు, పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. డ్రోన్‌లో పేలుడు పదార్థాలు ఉండే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. సో.. ఈ బామ్మ లక్కీ అన్నమాట.Ukrainian badass granny disables russian FPV drone 😮 pic.twitter.com/uyZiPIwtvS— Apple Tree (@LonelyAppleTree) September 16, 2026ఇదేం కొత్త కాదు!ఉక్రెయిన్‌లో డ్రోన్లతో సామాన్యులు తలపడిన ఘటనలు గతంలోనూ వెలుగులోకి వచ్చాయి. 2022లో కీవ్‌కు చెందిన ఓ వృద్ధురాలు.. బాల్కనీలో నుంచి జార్‌ను విసిరి రష్యా డ్రోన్‌ను కూల్చేయడం చర్చనీయాంశమైంది. అలాగే మొన్నీమధ్యే ఓ పండ్ల వ్యాపారిని వెంటాడగా.. అతను బతిమాలిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. అయితే అది పేలి.. అతనికి గాయాలయ్యాయి. తాజా వీడియోపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందనలు వస్తున్నాయి. మహిళ ధైర్యాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.ఇదీ చదవండి: ఇది వెయ్యేళ్లకొకసారి వచ్చే వర్షమట! -
పెళ్లైన 17 రోజులకే అమెరికాలో హైదరాబాదీ అనుమానాస్పద మృతి
అమెరికాలో హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి ఆకస్మిక మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. అమెరికాలోని మసాచుసెట్స్‌లో సివిల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నమహ్మద్ జాబర్ హుస్సేన్ (28) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వివాహం జరిగిన కేవల 17 రోజులకే అమెరికాలోని తన ఇంట్లో శవమై తేలడం కలకలం రేపింది.మసాచుసెట్స్‌లోని లోవెల్‌లో ఉన్న తన ఇంట్లోని గదిలో హుస్సేన్ నిద్రలోనే కన్నుమూసినట్లు తెలుస్తోంది. జాబర్ హుస్సేన్‌కు ఆగస్టు 28న టెక్సాస్‌లో వివాహం జరిగింది. ఆ తర్వాత మసాచుసెట్స్‌లోని తన నివాసానికి తిరిగి వెళ్లారు. సెప్టెంబర్ 14న కుటుంబ సభ్యులతో చివరిసారిగా మాట్లాడిన కొద్ది గంటలకే, ఆయన గదిలో విగతజీవుడిగా పడి ఉన్నట్లు రూమ్మేట్ ద్వారా సమాచారం అందింది.తాము ఆర్థికంగా బలహీనవర్గానికి చెందినవారమని, హుస్సేన్ పార్థివ దేహాన్ని హైదరాబాద్‌కు రప్పించే ఏర్పాట్లు చేయాలని కుటుంబం భారత ప్రభుత్వ సహాయాన్ని కోరింది.ఇదీ చదవండి: రూ. 500 కోట్ల నోటీసు : దిశా కేసులో ఆదిత్య ఠాకరేకు మరో షాక్మజ్లిస్ బచావో తహ్రీక్ (MBT) జోక్యంఎంబీటీ ప్రతినిధి అంజద్ ఉల్లా ఖాన్ ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ దృష్టికి తీసుకువెళ్తూ.. అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ద్వారా మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు సాయం చేయాలని ఎక్స్ వేదికగా కోరారు. మృతికి అసలు కారణాలు ఏంటి దానిపై స్పష్టత లేదు. పోస్ట్‌మార్టం,వైద్య నివేదికల కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు.ఇదీ చదవండి: రూ. 11 దానికి రూ. 325 వసూలు : మరో బాంబు పేల్చిన తుకారం ముండే -
ఎల్‌నినో ఎఫెక్ట్: అట్లాంటిక్‌ను తాకని హరికేన్లు!
అట్లాంటిక్ మహాసముద్ర పరివాహక ప్రాంతంలో ఇప్పటివరకు ఒక్క హరికేన్ కూడా ఏర్పడలేదు. 1966 తర్వాత ఇంత సుదీర్ఘకాలం హరికేన్ లేకపోవడం ఇదే తొలిసారి. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులను ప్రభావితం చేసిన ‘ఎల్‌నినో’ ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. జూన్ 1న ప్రారంభమైన ప్రస్తుత హరికేన్ సీజన్లో అమెరికా ఆగ్నేయ ప్రాంతంలో ఇప్పటివరకు ఒక్క భారీ హరికేన్ కూడా ఏర్పడలేదు. సెప్టెంబర్ 15 వరకు హరికేన్లు ఏర్పడకపోవడం అరుదైన పరిణామమని నిపుణులు పేర్కొంటున్నారు. 2026లో కనిపిస్తున్న బలమైన ఎల్‌నినో దీనికి కారణమని వారు చెబుతున్నారు.హరికేన్లు భారీ స్థాయిలో విధ్వంసం సృష్టిస్తాయి. అయితే ప్రస్తుత పరిస్థితి వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులకు సంకేతంగా భావిస్తున్నారు. అమెరికా నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫెరిక్ అడ్మినిస్ట్రేషన్ గణాంకాల ప్రకారం 1966 తర్వాత అట్లాంటిక్‌లో హరికేన్ ఏర్పడకుండా కొనసాగుతున్న సుదీర్ఘ విరామం ఇదే. 1991-2020 మధ్య వాతావరణ గణాంకాల ప్రకారం.. సాధారణంగా ప్రతి సీజన్లో తుఫాను జూన్‌లో ఏర్పడుతుంది. తొలి హరికేన్ సాధారణంగా ఆగస్టు ప్రారంభంలో లేదా మధ్యలో ఏర్పడుతుంది. గతంలోనూ హరికేన్లు ఆలస్యంగా ఏర్పడిన సందర్భాలు ఉన్నాయి. 2022లో డేనియల్ సెప్టెంబర్ 2న ఏర్పడి ఆ ఏడాది అట్లాంటిక్‌లో తొలి హరికేన్‌గా నిలిచింది. 2013లో హంబర్టో సెప్టెంబర్ 11న ఏర్పడి ఆ సీజన్లో తొలి హరికేన్‌గా నమోదైంది.ఈ ఏడాది బలమైన ఎల్‌నినో కారణంగా అట్లాంటిక్‌లో తక్కువ సంఖ్యలో తుఫానులు ఏర్పడతాయని వాతావరణశాఖ ముందుగానే అంచనా వేసింది. ఈ సీజన్లో 7 నుంచి 13 పేరున్న తుఫానులు ఏర్పడవచ్చని అంచనా వేయగా.. ఇప్పటివరకు ఆర్థర్, బెర్తా, క్రిస్టోబల్, డాలీ, ఎడ్వార్డ్ అనే ఐదు ఉష్ణమండల తుఫానులు మాత్రమే ఏర్పడ్డాయి. భూమధ్యరేఖకు సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలోని కొంత ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండటమే ఎల్‌నినో లక్షణం. వేడెక్కిన సముద్ర జలాలు తూర్పు పసిఫిక్‌లో ఉష్ణమండల తుఫానుల అభివృద్ధికి అనుకూలిస్తాయి. అయితే అట్లాంటిక్‌లో ఎల్‌నినో ప్రభావంతో సముద్ర జలాలు చల్లబడటంతో ఉష్ణమండల తుఫానులు ఏర్పడేందుకు అనుకూల పరిస్థితులు తగ్గుతాయి.ఇదీ చదవండి: వెయ్యేళ్లకు ఒకసారి వచ్చే వర్షం.. అమెరికాకు భారీ హెచ్చరిక! -
వెయ్యేళ్లకు ఒకసారి వచ్చే వర్షం.. అమెరికాకు భారీ హెచ్చరిక!
వాషింగ్టన్: అమెరికా నైరుతి ప్రాంతంలోని నాలుగు రాష్ట్రాలను రానున్న రోజుల్లో భారీ వర్షాలు ముంచెత్తే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. అరిజోనా, న్యూ మెక్సికో, ఉటా, కొలరాడోలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వరదలు సంభవించే ప్రమాదం ఉందని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో 12 అంగుళాల (సుమారు 30 సెం.మీ.) వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇది సంభవిస్తే ‘1,000 ఏళ్లకు ఒకసారి’ చోటుచేసుకునే స్థాయి వర్షపాతంగా ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. దీంతో దాదాపు కోటి మంది అమెరికన్లు వరదల ముప్పును ఎదుర్కొనే అవకాశం ఉంది.ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా వరద హెచ్చరికలను అమెరికా జాతీయ వాతావరణ శాఖ జారీ చేసింది. తక్కువ వ్యవధిలోనే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆకస్మిక వరదలు సంభవించవచ్చని తెలిపింది. గంటకు 2–3 అంగుళాల వర్షపాతం నమోదయ్యేంత తీవ్రత ఉండొచ్చని పేర్కొంది. స్థానికంగా కొన్ని ప్రాంతాల్లో 12 అంగుళాల వరకు వర్షం కురిసే అవకాశం ఉందని అక్యూవెదర్ వాతావరణ నిపుణులు తెలిపారు. ఫీనిక్స్, టక్సన్ ప్రాంతాల్లో శుక్రవారం నాటికి 2–4 అంగుళాల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.ఇప్పటికే అరిజోనాలో భారీ వర్షాలు, వరదల పరిస్థితి నెలకొంది. బుధవారం (సెప్టెంబర్ 16) టక్సన్‌లో అరగంట వ్యవధిలో మూడు అత్యవసర ఘటనలను అగ్నిమాపక సిబ్బంది పరిష్కరించారు. పాక్షికంగా నీటిలో మునిగిన కారుపై చిక్కుకున్న ఓ డ్రైవర్‌ను రక్షించారు. మరో వాహనదారుడు నార్త్ అలామో అవెన్యూ, ఈస్ట్ రోజ్‌వుడ్ స్ట్రీట్ వద్ద కారులో చిక్కుకోగా.. వరద నీటిలో కొట్టుకుపోయాడు. సహాయక బృందాలు అతడిని రక్షించాయి. మరో వ్యక్తి గ్రాంట్ రోడ్, వ్యాట్ డ్రైవ్ సమీపంలో వరద ప్రవాహంలో కొట్టుకుపోతుండగా సకాలంలో కాపాడారు.ఈ సమయంలో నైరుతి అమెరికాలో ఇలాంటి వాతావరణ పరిస్థితులు సాధారణమేనని అక్యూవెదర్ నిపుణులు తెలిపారు. ఈ ప్రాంతంలో గాలుల దిశ మారడంతో మెక్సికో, కాలిఫోర్నియా గల్ఫ్ నుంచి వేడి, తేమతో కూడిన గాలి ఉత్తర దిశగా వస్తుంది. తేమ పైకి ఎగసి ఉరుములతో కూడిన వర్షాలుగా మారుతుంది. కొలరాడో, న్యూ మెక్సికో, నెవాడాలోని కొన్ని ప్రాంతాలకు వర్షం అవసరమైనప్పటికీ.. ఆకస్మికంగా భారీ వర్షాలు కురిస్తే వరదలు సంభవించే ప్రమాదం ఉంది. ఈ ప్రాంతంలో ఇదే చివరి భారీ వర్షాల ఉద్ధృతి కావచ్చని, అయితే బలమైన ఎల్‌నినో పరిస్థితులు దీనిని మార్చే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు.ఇదీ చదవండి: మోదీ 76వ పుట్టినరోజు.. 76 కప్పుల టీ ఉచితం! -
ఏఐ వాడకంపై సామ్ ఆల్ట్‌మన్ సంచలన వ్యాఖ్యలు!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI).. మనిషి జీవితాన్ని సులభతరం చేసే టెక్నాలజీగానే ఇప్పటివరకు ఎక్కువగా కనిపించింది. కానీ అదే ఏఐ భవిష్యత్తులో ఎంతటి ప్రమాదాలకు దారితీయొచ్చన్న చర్చ కూడా అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ఈ భయాలకు మరింత బలం చేకూర్చేలా ఏఐ దిగ్గజ సంస్థ ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ విషయంలో ప్రపంచం భయపడటం తప్పేమీ కాదని.. నిజానికి అలా భయపడటానికి కారణాలు ఉన్నాయని ఆయన అన్నారు. శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన సేల్స్‌ఫోర్స్ డ్రీమ్‌ఫోర్స్ సదస్సులో ఆల్ట్‌మన్ ఏఐ భవిష్యత్తుపై మాట్లాడారు. మరింత శక్తిమంతమైన ఏఐ మోడళ్లు అందుబాటులోకి వస్తున్న కొద్దీ.. అవి తప్పుదారి పట్టే అవకాశాలను ఊహించడం గతంతో పోలిస్తే ఇప్పుడు సులభమైందని చెప్పారు. ‘‘ఏఐ విషయంలో ఏదైనా తప్పు జరిగే అవకాశం ఎలా ఉంటుందో ఊహించడానికి ఇప్పుడు పెద్దగా ఊహాశక్తి అవసరం లేదు. ప్రపంచం దీనిని చూసి భయపడటం సరైనదే’’ అని ఆల్ట్‌మన్ వ్యాఖ్యానించారు.అయితే అదే సమయంలో ఏఐని అభివృద్ధి చేస్తున్న సంస్థలు బాధ్యతగా వ్యవహరించగలవన్న నమ్మకం తనకు ఉందని ఆయన చెప్పారు. ఏఐ అభివృద్ధిలో భద్రత, మానవ విలువలకు అనుగుణంగా వ్యవస్థలను రూపొందించడం.. వాటిపై పర్యవేక్షణ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ఏఐకి ఇంత భయం ఎందుకు?ఏఐ సామర్థ్యాలు వేగంగా పెరుగుతుండటమే తాజా ఆందోళనలకు ప్రధాన కారణమని ఆల్ట్‌మన్ అభిప్రాయపడ్డారు. గతంలో ఏఐతో సాధ్యం కాదనుకున్న అనేక పనులను ఇప్పుడు అధునాతన మోడళ్లు చేయగలుగుతున్నాయన్నారు. మరింత శక్తిమంతమైన వ్యవస్థలు మనుషుల కంటే కొన్ని రంగాల్లో మెరుగైన పనితీరు కనబరిచే దిశగా అభివృద్ధి చెందుతున్నాయని ఆయన పేర్కొన్నారు.మరోవైపు.. ఏఐ సంస్థలు మరింత శక్తివంతంగా మారితే ఆ టెక్నాలజీపై నియంత్రణ ఎవరి చేతుల్లో ఉండాలి? అనే ప్రశ్న కూడా తెరపైకి వస్తోంది. శక్తిమంతమైన ఏఐ సంస్థలు ఆర్థిక వ్యవస్థపై అధిక ప్రభావం చూపడం లేదా తమ అభిప్రాయాలను సమాజంపై ప్రభావితం చేసే స్థాయికి చేరడం వంటి ప్రమాదాలపై కూడా ఆల్ట్‌మన్ ఆందోళన వ్యక్తం చేశారు.ప్రమాదాలపై టెక్ దిగ్గజాల్లో చర్చఏఐ భద్రతపై టెక్ పరిశ్రమలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్, ఆంథ్రపిక్ సీఈఓ డారియో అమోడీ లాంటివాళ్లు ఏఐ అభివృద్ధిలో భద్రతకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని, అవసరమైతే వేగాన్ని నియంత్రించే మార్గాలను పరిశీలించాలని చెబుతున్నారు. మరోవైపు.. కొత్త చట్టాలు, నియంత్రణల అవసరంపై టెక్ పరిశ్రమలో అందరూ ఒకే అభిప్రాయంలో లేరు. ఇటీవల ఏఐ వ్యవస్థలు అనుకోని విధంగా ప్రవర్తించిన కొన్ని ఘటనలు కూడా ఈ చర్చకు ఆజ్యం పోశాయి. ఏఐ సామర్థ్యాలు పెరుగుతున్న వేగానికి అనుగుణంగా భద్రతా వ్యవస్థలు, పర్యవేక్షణ, నియంత్రణలు కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని నిపుణులు చర్చిస్తున్నారు. భయం.. కానీ ఆపేయాలా?ఏఐపై భయాలు పెరుగుతున్నప్పటికీ.. దాని అభివృద్ధిని పూర్తిగా నిలిపివేయాలా? లేదంటే భద్రతా ప్రమాణాలతో కొనసాగించాలా? అన్నది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. టెక్ కంపెనీలు, పరిశోధకులు, ప్రభుత్వాలు ఈ విషయంలో వేర్వేరు విధానాలను ప్రతిపాదిస్తున్నాయి. అయితే ఆల్ట్‌మన్ తాజా వ్యాఖ్యలు మాత్రం ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఏఐను అభివృద్ధి చేస్తున్న సంస్థలకే దాని ప్రమాదాలపై ఆందోళనలు ఉన్నాయన్న చర్చ మరింత బలపడుతోంది. మనిషికి ఉపయోగపడే టెక్నాలజీగా ఏఐ ఎంత వేగంగా ఎదుగుతోందో.. అదే సమయంలో దాని సామర్థ్యాలను బాధ్యతగా నియంత్రించడం కూడా అంతే కీలకంగా మారుతోంది.ఇదీ చదవండి: ఏఐ స్లోకి ట్రంప్ భయపడుతున్నారా? -
దేశాన్ని వీడతానన్న గ్రామం
లండన్: ప్రభుత్వ నిర్ణయాన్ని ముక్తకంఠంతో వ్యతిరేకిస్తూ యూకేలోని ఒక చిన్న గ్రామం తన నిరసన గళాన్ని బలంగా విన్పించింది. తప్పదనుకుంటే బ్రిటన్ నుంచి వేరుబడి యూరప్‌తో జతకట్టేందుకు సిద్ధంగా ఉన్నామని గ్రామంలోని మెజారిటీ ప్రజలంతా ఏకతాటి మీదకొచ్చారు. యునైటెడ్ కింగ్డమ్(యూకే)లో కొనసాగాలా వద్దా అంటూ చేపట్టిన ఒక అనధికారిక రెఫరెండమ్‌లో పిడ్డింగ్టన్ గ్రామానికి చెందిన ప్రజలంతా పాల్గొన్నారు. ఈ గ్రామ జనాభా కేవలం 350. వీరిలో 311 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. వీరిలో 285 మంది యూకే నుంచి విడిపోవాలని ఓటేశారు. 26 మంది బ్రిటన్‌లోనే కొనసాగాలని అనుకూలంగా ఓటేశారు. ‘‘మెజారిటీ ప్రజలు తమ ప్రభుత్వ వ్యతిరేకతను బలంగా చాటారు. ఇది ఒక ప్రాంతానికి సంబంధించిన సందేశం కాదు. యావత్ ప్రపంచానికి మేమిచ్చే సందేశం’’ అని అక్కడి గ్రామ కౌన్సిల్ చైర్మన్ టిమ్ మెక్నాలీ వ్యాఖ్యానించారు. గ్రామానికి కేవలం 800 మీటర్ల దూరంలో ఉన్న సైన్యానికి చెందిన ఒక పాత స్థావరాన్ని విదేశీ వలసదారులకు కేటాయించి అక్కడ 1,200 శరణార్థి గృహాలను నిర్మించాలని బ్రిటన్ ప్రభుత్వం యోచిస్తుండటంతో పిడ్డింగ్టన్ గ్రామస్తుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు వందలాదిగా కొత్తగా ఇళ్లను నిర్మిస్తే ఈ ప్రాంతంలో ఇళ్ల ధరలు అమాంతం పెరిగిపోతాయని, ఇది స్థానిక మధ్యతరగతి కుటుంబాల కొత్త ఇంటి కలను కాలరాస్తుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. వలసదారుల రాకతో ఈ ప్రాంతంలో భద్రత కరువవుతుందని, నేరాలు పెరిగే ప్రమాదముందని వాళ్లంతా ఆరోపిస్తున్నారు. ఈ రెఫరెండమ్ ప్రభుత్వ వ్యతిరేకత, స్థానిక ప్రజాస్వామ్యానికి ప్రతిరూపం అని పలువురు అభిప్రాయపడ్డారు. 1940లలో నాజీ జర్మనీ వైమానిక దాడులను బ్రిటన్ సేనలు అడ్డుకున్నట్లే ఇప్పుడు మేం విదేశీ వలసదారుల రాకను అడ్డుకోబోతున్నాం. మా ముందు తరాల వాళ్లు పోరాడినట్లే మేం సైతం పోరాటం కొనసాగిస్తాం’’అని 76 ఏళ్ల గ్రామçస్తుడు హెర్బెర్ట్ ఓవెన్ చెప్పారు. కానీ స్థానికంగా కొందరు మీడియా ప్రతినిధులు మాత్రం ఈ ఘటనను ఒక వింతగా కొట్టిపారేశారు. బ్రిటన్ నుంచి ఒక గ్రామం విడిపోయేందుకు సాహసించిన కథతో రూపొందిన ‘పాస్‌పోర్ట్ టు పిమ్లికో’ సినిమాతో ఈ ఘటనను పోల్చిచూస్తున్నారు. -
వెంటాడిన 3,700 ఏళ్ల నాటి వైరస్.. 5 లక్షల గొర్రెలు, మేకలు మృతి!
ఏథెన్స్: గ్రీస్‌లో 2025లో, అలాగే ఈ ఏడాది వైరస్ వ్యాప్తి కారణంగా దాదాపు 5 లక్షల గొర్రెలు, మేకలు మృతి చెందడం లేదా వ్యాధి నియంత్రణలో భాగంగా వధించాల్సి వచ్చింది. అత్యధిక మరణాల రేటు కలిగిన ఈ వైరస్ సుమారు 3,700 ఏళ్ల నాటిదని శాస్త్రవేత్తలు గుర్తించారు. పురాతన గ్రంథాలు రాసేందుకు ఉపయోగించిన గొర్రె చర్మపు పార్చ్మెంట్లో ఈ వైరస్‌కు సంబంధించిన ఆనవాళ్లు ఉన్నట్లు పరిశోధనలో వెల్లడైంది.యూనివర్సిటీ కాలేజ్ డబ్లిన్‌కు చెందిన మాలిక్యులర్ పాపులేషన్ జెనెటిక్స్ ల్యాబ్ పరిశోధకుడు లూయిస్ ఎల్హోట్ నేతృత్వంలోని బృందం ఈ అధ్యయనం నిర్వహించింది. సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం గొర్రె చర్మంపై రాసిన యార్క్ గాస్పెల్స్ సహా పలు చారిత్రక పత్రాలను పరిశీలించారు. అంతేకాకుండా కాంస్య యుగానికి చెందిన గొర్రెల దంతాలను కూడా విశ్లేషించారు. వైరస్‌కు సంబంధించిన అత్యంత పురాతన ఆధారాలు ఈ దంతాల్లోనే లభించాయని పరిశోధకులు తెలిపారు.కాంస్య యుగంలోనే యూరేషియన్ స్టెప్పీ ప్రాంతంలోని పెంపుడు గొర్రెల మందల్లో ప్రస్తుతం అత్యంత అంటువ్యాధిగా, తీవ్ర ప్రభావం చూపే వ్యాధికారక వైరస్ ఉన్నట్లు గుర్తించినట్లు ఎల్హోట్ తెలిపారు. స్టెప్పీ ప్రాంతంలోని ఆ కాలానికి చెందిన గొర్రెల్లో వ్యాధికారకానికి సంబంధించిన ఆధారాలు లభించడం.. అక్కడి పశుపోషక సమాజాలు అనేక రకాల పశు వ్యాధులతో పోరాడి ఉండొచ్చని సూచిస్తోందన్నారు.మధ్యయుగ కాలంలో జంతువుల చర్మంతో తయారు చేసిన పత్రాల్లో ఎస్పీపీవీ జన్యువులు పెద్ద సంఖ్యలో కనిపించాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీంతో ఆ కాలంలో గొర్రెలకు ఈ వైరస్ సోకడం యూరప్ సమాజాలకు తరచూ ఎదురైన సమస్యగా భావిస్తున్నారు.షీప్పాక్స్కు కారణమయ్యే క్యాప్రిపాక్స్వైరస్.. మనుషుల్లో మశూచికి కారణమయ్యే వేరియోలా వైరస్‌కు దగ్గరి సంబంధం కలిగి ఉంది. క్రీస్తుశకం మొదటి శతాబ్దంలో రోమ్‌లో ఈ వ్యాధికి సంబంధించిన తొలి లిఖిత ఆధారాలు లభించాయి. రచయిత లూసియస్ కొలుమెల్లా గొర్రెల చర్మంపై ఏర్పడే గాయాలను ‘పస్ట్యూల్స్’గా పేర్కొన్నారు. పశువుల లెక్కలు, వ్యవసాయ గ్రంథాల్లో ఈ వ్యాధిని ‘పాక్స్’ లేదా ‘వేరియోలా’గా కూడా పేర్కొన్నారు. వ్యాధి విజృంభించిన ప్రతిసారీ వ్యవసాయ ఉత్పత్తి తగ్గినట్లు ఆ రికార్డులు సూచిస్తున్నాయి.మధ్యయుగ యూరప్‌లో పశువులకు అర్థంకాని వ్యాధులు సోకినప్పుడు వాటిని చేతబడి ప్రభావంగా కూడా ప్రజలు భావించేవారు. షీప్‌పాక్స్ వైరస్ జంతువుల చర్మంలో నిలిచిపోయేది. ఆ చర్మాన్ని పార్చ్మెంట్ తయారీకి ఉపయోగించడంతో శాస్త్రవేత్తలు పురాతన పత్రాల ద్వారా వైరస్ చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేశారు.ఈ వ్యాధి తూర్పు యూరప్, కాకేసస్ స్టెప్పీ ప్రాంతాల్లో తొలుత ఉద్భవించి ఉండొచ్చని భావిస్తున్నారు. అక్కడి ప్రజలు గొర్రెలను దుస్తులు, మాంసం, పాల ఉత్పత్తుల కోసం పెంచేవారు. పెద్ద నివాస ప్రాంతాలు లోహాలు, సిరామిక్ వస్తువుల వాణిజ్య కేంద్రాలుగా ఉండేవి. అనారోగ్యంతో ఉన్న గొర్రెలు ఈ వస్తువులతో సంబంధం కలిగి ఉన్నప్పుడు, విదేశీ వ్యాపారులు తెలియకుండానే వైరస్‌ను తమ ప్రాంతాలకు తీసుకెళ్లి ఉండొచ్చని పరిశోధకులు తెలిపారు. ఇతర గొర్రెల మందలతో కలవడం కూడా వ్యాధి వ్యాప్తికి కారణమై ఉండొచ్చన్నారు.చారిత్రక పత్రాలను పరిశీలించిన ఎల్హోట్కు.. చర్మం బయటి భాగంతో పోలిస్తే మాంసం వైపు ఎక్కువ వైరస్ డీఎన్ఏ కనిపించింది. గొర్రెలను పెంపుడు జంతువులుగా మార్చిన సమయంలోనే షీప్‌పాక్స్ ఉద్భవించి ఉండొచ్చని ఆయన భావిస్తున్నారు. ఈ వ్యాధి లక్షణాల్లో జ్వరం, ఆకలి తగ్గడం, కళ్ల నుంచి స్రావాలు రావడం, ఉన్ని లేని ప్రాంతాల్లో చర్మంపై గాయాలు ఏర్పడటం కనిపించాయి.ఇదీ చదవండి: ఒకవైపు 6 మి.మీ. గణేశుడు.. మరోవైపు 50 వేల విగ్రహాలు! -
సౌదీకి కొత్త టెన్షన్.. హౌతీల సంచలన ప్రకటన!
సౌదీ అరేబియాకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా సౌదీకి చెందిన ఎఫ్-15నే కూల్చేశామంటూ హౌతీలు చేసిన ప్రకటన ఇప్పుడు పశ్చిమాసియాలో కలకలం రేపుతోంది. యెమెన్ గగనతలంలో సౌదీకి చెందిన అత్యాధునిక యుద్ధవిమానాన్ని స్థానికంగా తయారుచేసిన క్షిపణితో నేలకూల్చినట్లు ప్రకటించింది. విమానం కూలుతున్న దృశ్యాలంటూ వీడియోను కూడా విడుదల చేసింది. ఇప్పటికే సౌదీపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేస్తున్న హౌతీలు.. ఇప్పుడు యుద్ధవిమానాన్నే కూల్చినట్లు చెప్పడం ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది. అయితే ఈ ప్రకటనను సౌదీ ధృవీకరించలేదు.గత వారం రోజుల్లో యెమెన్ వ్యాప్తంగా సౌదీ అరేబియా 450కిపైగా వైమానిక దాడులు జరిపిందని హౌతీలు ఆరోపించారు. ఖమీస్ ముషైత్, తాయిఫ్ వైమానిక స్థావరాల నుంచి ఎఫ్-15, టైఫూన్ యుద్ధవిమానాలతో దాడులు చేసినట్లు పేర్కొన్నారు. తైజ్, లహిజ్, అల్-జౌఫ్, హజ్జా, మారిబ్, సాదా, అల్-బైదా ప్రావిన్సుల్లో దాడులు జరిగాయని, పౌరులు మరణించడంతోపాటు పలువురు గాయపడ్డారని హౌతీలు వెల్లడించారు. ఈ దాడులకు ప్రతిగా మారిబ్ గగనతలంలోకి వచ్చిన సౌదీ యుద్ధ విమానాలపై తమ దళాలు క్షిపణులతో దాడి చేశాయని పేర్కొన్నారు. కూలిన విమానం శకలాల కోసం గాలిస్తున్న సౌదీ యుద్ధ విమానాలను కూడా లక్ష్యంగా చేసుకుని వెనక్కి వెళ్లేలా చేశామని హౌతీ వర్గాలు ప్రకటించాయి.మరో సౌదీ డ్రోన్ కూడా కూల్చివేత?ఎఫ్-15 యుద్ధ విమానాన్ని కూల్చినట్లు ప్రకటించిన కొన్ని గంటలకే.. మరో కీలక ప్రకటన చేసింది హౌతీ సైన్యం. మారిబ్ ప్రాంతంలో సౌదీకి చెందిన వింగ్ లూంగ్-2 సాయుధ నిఘా డ్రోన్‌ను కూల్చివేసినట్లు వెల్లడించింది. తమపై దాడులకు పాల్పడుతున్న సమయంలోనే దానిని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది.مشاهد نوعية لإسقاط طائرة مقاتلة سعودية من نوع F15 وحطامها في محافظة مأرب - 16 سبتمبر 2026م https://t.co/rk0suliePT— الإعلام الحربي اليمني (@MMY1444) September 16, 2026మరోవైపు.. సౌదీ, హౌతీల మధ్య ఘర్షణలు మక్కా సమీపానికి చేరడం కూడా ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మక్కాకు దక్షిణంగా ఓ హౌతీ డ్రోన్‌ను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకుని ధ్వంసం చేసినట్లు సౌదీ ప్రకటించింది. అది నగర నిషేధిత గగనతలంలోకి ప్రవేశించకముందే కూల్చివేసినట్లు తెలిపింది. పవిత్ర నగరాన్ని లక్ష్యంగా చేసుకోవడం ‘రెడ్‌లైన్’ దాటడమేనని రియాద్ హెచ్చరించింది. అయితే మక్కాపై తాము దాడి చేయలేదని హౌతీలు తెలిపారు. ఈ ఘటనను సౌదీ ప్రచారం కోసం ఉపయోగించుకుంటోందని ఆరోపించారు.2015 నుంచి కొనసాగుతున్న పోరుసౌదీ అరేబియా 2015 నుంచి యెమెన్‌లో హౌతీలకు వ్యతిరేకంగా సైనిక కూటమికి నాయకత్వం వహిస్తోంది. ఇటీవలి సంవత్సరాల్లో కాల్పుల విరమణతో ఘర్షణలు కొంత తగ్గినప్పటికీ.. ఈ నెలలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగినట్లు కథనాలు చెబుతున్నాయి. ఎర్ర సముద్ర తీర ప్రాంతాలు, బాబ్ అల్-మండేబ్ జలసంధి పరిసరాల్లోనూ హౌతీలు తమ సైనిక కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లు సమాచారం. తాజాగా ఎఫ్-15ను కూల్చినట్లు చేసిన ప్రకటన తమ వైమానిక రక్షణ సామర్థ్యం పెరిగిందనడానికి నిదర్శనమని హౌతీ నేతలు పేర్కొంటున్నారు. ఇదీ చదవండి: భారత యుద్ధనౌకను ఢీకొట్టిన పాక్ నౌక -
భారత్‌లో జిన్‌పింగ్‌కు స్ట్రోక్?.. మోదీ విందుకు దూరం?
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆరోగ్యంపై తాజాగా షాకింగ్ ప్రచారం మొదలైంది. భారత్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆయన అస్వస్థతకు గురై స్పృహ కోల్పోయారని, ఆ తర్వాత తీవ్ర ఇస్కీమిక్ స్ట్రోక్ (మెదడుకు రక్తప్రసరణ తగ్గడం వల్ల వచ్చే పక్షవాతం) బారినపడ్డారని చైనా డెమోక్రసీ పార్టీ ఛైర్మన్ వాంజున్ షీ ఆరోపించారు. అయితే ఈ ప్రచారంపై చైనా, భారత్ ప్రభుత్వాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.బ్రిక్స్ విందుకు దూరం.. ఏడేళ్ల తర్వాత తొలిసారి భారత్‌లో పర్యటించిన జిన్‌పింగ్.. సెప్టెంబర్ 12న న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సమావేశంలోనూ పాల్గొన్నారు. అయితే మోదీ భారత్ మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విందుకు మాత్రం ఆయన హాజరుకాలేదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహా పలువురు నేతలు విందులో పాల్గొనగా.. చైనా తరఫున విదేశాంగ మంత్రి వాంగ్ యీ ప్రాతినిధ్యం వహించారు.సుదీర్ఘమైన కార్యక్రమాల తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి జిన్‌పింగ్ హోటల్‌కు వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. అయితే విందుకు ఆయన ఎందుకు దూరంగా ఉన్నారనే దానిపై అధికారిక వివరణ రాలేదు. ఇదే సమయంలో బ్రిక్స్ సదస్సులో మోదీ ప్రసంగం సందర్భంగా జరిగిన ఓ చిన్న సంభాషణకు సంబంధించిన వీడియో కూడా చర్చకు వచ్చింది. మోదీ.. చైనా ప్రతినిధి బృందం వైపు తిరిగి ఇట్స్ ఓకేనా? అని అడగడం, జిన్‌పింగ్ స్పందించినట్లు కనిపించడం ఆసక్తిని రేకెత్తించింది.ఆసుపత్రిలో అత్యవసర చికిత్స?చైనా డెమోక్రసీ పార్టీ ఛైర్మన్ వాంజున్ షీ సోషల్ మీడియాలో వరుస పోస్టులు చేస్తూ జిన్‌పింగ్ ఆరోగ్యంపై పలు ఆరోపణలు చేశారు. బ్రిక్స్ సదస్సులో ఆయన స్పృహ కోల్పోయారని, వెంటనే వైద్య బృందం అత్యవసర చికిత్స అందించిందని పేర్కొన్నారు. అనంతరం ప్రత్యేక విమానంలో బీజింగ్‌కు తరలించారని ఆరోపించారు. భారత్‌లోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటే తన ఆరోగ్య పరిస్థితి భారత అధికారులకు తెలిసిపోతుందనే భయంతో జిన్‌పింగ్ నిరాకరించారని కూడా షీ పేర్కొన్నారు. బీజింగ్‌కు చేరుకున్న వెంటనే ఆయనను సైనిక హెలికాప్టర్లో 301 ఆసుపత్రికి తరలించినట్లు ఆరోపించారు.అక్కడి వైద్యులు జిన్‌పింగ్‌కు తీవ్ర ఇస్కీమిక్ స్ట్రోక్ వచ్చినట్లు గుర్తించారని, విమాన ప్రయాణం కారణంగా అత్యవసర చికిత్సకు కీలకమైన సమయం కోల్పోయారని షీ తన పోస్టుల్లో పేర్కొన్నారు. విమానంలో శస్త్రచికిత్స సాధ్యం కాకపోవడంతో ప్రాథమిక చికిత్స మాత్రమే అందించగలిగారని ఆరోపించారు. జిన్‌పింగ్‌కు 301 ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరిగిందని, ప్రస్తుతం ఆయనను ఐసీయూలో పర్యవేక్షిస్తున్నారని వాంజున్ షీ మరో పోస్టులో పేర్కొన్నారు. ఆయన ప్రాణాపాయ స్థితి నుంచి ఇంకా బయటపడలేదని ప్రచారం చేశారు. అంతేకాకుండా చైనా సైనిక కమాండ్లు, గ్రూప్ ఆర్మీలు అప్రమత్త స్థితికి చేరుకున్నాయని, దేశంలో పరిణామాలను పర్యవేక్షిస్తున్నాయని కూడా ఆరోపించారు.ఎవరీ వాంజున్ షీ?జిన్‌పింగ్ ఆరోగ్యంపై ఆరోపణలు చేసిన వాంజున్ షీ.. చైనా డెమోక్రసీ పార్టీ (సీడీపీ) ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థను డెమోక్రసీ పార్టీ ఆఫ్ చైనా అని కూడా పిలుస్తారు. 1998లో చైనాలో ఏర్పాటైన ఈ రాజకీయ సంస్థను అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం నిషేధించింది. బహుళపార్టీ ప్రజాస్వామ్యం, ప్రత్యక్ష ఎన్నికలు, అధికారాల విభజన, భావప్రకటనా స్వేచ్ఛ, చట్టబద్ధ పాలన వంటి అంశాల కోసం ఈ సంస్థ పనిచేస్తున్నట్లు ప్రకటించుకుంది. పార్టీ ఏర్పాటులో భాగమైన పలువురు ప్రజాస్వామ్య కార్యకర్తలను చైనా అధికారులు అరెస్టు చేసి జైలుకు పంపినట్లు మానవ హక్కుల సంస్థలు గతంలో నివేదించాయి. ప్రస్తుతం ఈ సంస్థ చైనా వెలుపల కూడా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. -
అయిపాయె.. ఇక భారత్, చైనాకు బిగ్ టెన్షన్!
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో మాస్కోపై ఆర్థిక ఒత్తిడి పెంచేందుకు అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. రష్యాపై కఠిన ఆంక్షలు విధించే బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లులో రష్యా చమురు, గ్యాస్‌ను కొనుగోలు చేసే దేశాలపై భారీ టారిఫ్‌లు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కల్పించారు. ఇందులో భాగంగా 100 శాతం వరకు టారిఫ్‌లు విధించే అవకాశం ఉండటం భారత్, చైనాలకు ఆందోళన కలిగించే అంశంగా మారింది.ప్రతినిధుల సభలో రష్యా ఆంక్షల బిల్లుకు అనుకూలంగా 262 ఓట్లు, వ్యతిరేకంగా 159 ఓట్లు వచ్చాయి. ఇప్పటికే గత నెలలో సెనెట్ 86–11 ఓట్లతో ఈ బిల్లును ఆమోదించింది. దీంతో ఇప్పుడు బిల్లు ట్రంప్ వద్దకు వెళ్లనుంది. తాను బిల్లుపై సంతకం చేస్తానని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు.రష్యాపై మరింత ఒత్తిడి‘లిండ్సే ఓ. గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్–2026’గా పిలుస్తున్న ఈ చట్టం రష్యా ఇంధన, రక్షణ రంగాలపై కఠిన ఆంక్షలకు మార్గం సుగమం చేయనుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇతర కీలక అధికారులపైనా ఆంక్షలు విధించే అవకాశం ఉంటుంది. పాశ్చాత్య దేశాల ఆంక్షలను తప్పించుకునేందుకు రష్యా ఉపయోగిస్తోందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘షాడో ఫ్లీట్’ ట్యాంకర్లపైనా చర్యలు తీసుకునే వీలు కల్పిస్తోంది. ఇరాన్‌కు సంబంధించిన అదనపు ఆంక్షలకు కూడా బిల్లులో అవకాశం ఉంది.అంతేకాకుండా రష్యాతో వ్యాపారం కొనసాగించే ఇతర దేశాలపై కూడా చర్యలకు ఈ చట్టం వీలు కల్పిస్తుంది. ముఖ్యంగా రష్యా చమురు, గ్యాస్‌ను కొనుగోలు చేసే దేశాల నుంచి అమెరికాకు వచ్చే దిగుమతులపై 100 శాతం వరకు టారిఫ్‌లు విధించే అధికారాన్ని ట్రంప్‌కు ఇస్తోంది.భారత్, చైనాలే ఎందుకు?ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలైన తర్వాత ప్రపంచ ఇంధన మార్కెట్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. పాశ్చాత్య దేశాల ఆంక్షల కారణంగా రష్యా చమురు తక్కువ ధరలకు విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడగా.. భారత్, చైనా సహా పలు దేశాలు రష్యా నుంచి భారీగా ముడిచమురు కొనుగోలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేసే ప్రధాన దేశాలపై ద్వితీయ టారిఫ్‌లు విధించే అధికారాన్ని అమెరికా ఉపయోగించవచ్చని బిల్లులో పేర్కొన్నారు. అమెరికా ప్రతినిధుల సభలో జరిగిన చర్చలో భారత్, చైనాలను ప్రధాన కొనుగోలుదారులుగా ప్రత్యేకంగా ప్రస్తావించారు.అయితే ఇక్కడ కీలకమైన విషయం ఏమిటంటే.. బిల్లు ఆమోదమైనంత మాత్రాన భారత్‌పై 100 శాతం టారిఫ్ తక్షణమే అమల్లోకి రాదు. ఏ క్షణమైనా అలాంటి టారిఫ్ విధించే అధికారం మాత్రమే అధ్యక్షుడికి లభిస్తుంది. కాబట్టి దాన్ని ఎప్పుడు, ఏ దేశంపై, ఎంత మేరకు అమలు చేయాలన్నది ట్రంప్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.అమెరికా మార్కెట్‌పై ప్రభావం?భారత్ రష్యా నుంచి భారీగా ముడిచమురు దిగుమతి చేసుకుని, దాన్ని శుద్ధి చేసి దేశీయ అవసరాలకు వినియోగించడంతోపాటు కొన్ని ఉత్పత్తులను ఎగుమతి కూడా చేస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా ఇంధన కొనుగోళ్లను కొనసాగిస్తే భారత ఉత్పత్తులపై అమెరికా అదనపు టారిఫ్‌లు విధించే అవకాశం ఉండటం వాణిజ్య రంగంలో కొత్త అనిశ్చితికి దారితీస్తోంది. అయితే ఇప్పటివరకు భారత్‌పై కొత్త 100 శాతం టారిఫ్ విధించినట్లు అమెరికా ప్రకటించలేదు.ట్రంప్‌కు అధికారం ఇవ్వడంపై అభ్యంతరాలుబిల్లుకు కాంగ్రెస్‌లో విస్తృత మద్దతు లభించినప్పటికీ.. ట్రంప్‌కు ఇంత విస్తృతమైన టారిఫ్ అధికారాలు ఇవ్వడంపై డెమొక్రాట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీలో డెమొక్రాట్ల తరఫున సీనియర్ సభ్యుడైన గ్రెగరీ మీక్స్ ఈ బిల్లును తీవ్రంగా విమర్శించారు. రష్యాపై ఆంక్షలకు తాము మద్దతు ఇస్తున్నప్పటికీ.. రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై టారిఫ్‌లు విధించే అధికారాన్ని ట్రంప్‌కు విస్తృతంగా ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు డెమొక్రాట్లు తెలిపారు. ఇక సెకండరీ టారిఫ్‌లకు సంబంధించిన నిబంధనలను తొలగించే ప్రయత్నం చేసినా అది విఫలమైంది.ట్రంప్ నిర్ణయంపైనే ఉత్కంఠరష్యాపై ఒత్తిడి పెంచి ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేలా పుతిన్‌ను చర్చల వైపు తీసుకురావడమే ఈ చర్యల లక్ష్యమని బిల్లు మద్దతుదారులు చెబుతున్నారు. మరోవైపు ట్రంప్ స్వయంగా టారిఫ్‌లు, ఆంక్షలను తన విదేశాంగ విధానంలో కీలక సాధనాలుగా ఉపయోగిస్తున్నారు.ఇప్పుడు ప్రతినిధుల సభ, సెనెట్ ఆమోదం పొందిన బిల్లు ట్రంప్ సంతకానికి వెళ్లనుంది. బిల్లు చట్టంగా మారిన తర్వాత భారత్, చైనా వంటి రష్యా ఇంధన కొనుగోలుదారులపై ట్రంప్ ఈ అధికారాన్ని ఎలా ఉపయోగిస్తారన్నదే అసలు ప్రశ్న. దీంతో రష్యా నుంచి చమురు కొనుగోళ్లు, భారత్–అమెరికా వాణిజ్య సంబంధాలపై తదుపరి పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.ఇదీ చదవండి: అక్కడ రూల్స్ పాటించకుంటే ఫైన్లు వేసేస్తారు! -
‘రెడ్ లైన్’గా మక్కా సిటీ
కైరో: అత్యంత పవిత్ర నగరమైన మక్కాపై దాడి చేయడానికి హౌతీ మిలిటెంట్లు ప్రయత్నిస్తున్నారని సౌదీ అరేబియా ప్రభుత్వం ఆరోపించింది. మక్కాను ‘రెడ్ లైన్’గా ప్రకటించింది. నగరం చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేస్తున్నట్లు తెలిపింది. మరోవైపు హౌతీలు సౌదీ అరేబియాలోని మౌలిక సదుపాయాలను, ఎర్ర సముద్రంలోని నౌకా రవాణాను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా బాబ్ ఎల్–మాండేబ్ జలసంధిలో అనేక ద్వీపాలను స్వా«దీనం చేసుకున్నారు. ఇరాన్ సైన్యం హార్మూజ్ జలసంధిలో విదేశీ చమురు రవాణా నౌకలను టార్గెట్ చేసింది. దాంతో ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇదిలా ఉండగా, యెమెన్ సరిహద్దు నుంచి సుమారు 1,100 కిలోమీటర్ల(680 మైళ్ల) దూరంలో ఉన్న మక్కా వైపు డ్రోన్లను ప్రయోగించినట్లు వచ్చిన ఆరోపణలను హౌతీ రెబెల్స్ ఖండించారు. తాము ఎలాంటి దాడి చేయలేదని పేర్కొన్నారు. అయితే, హౌతీలు ప్రయోగించిన డ్రోన్లను మధ్యలోనే అడ్డుకుని ధ్వంసం చేసినట్లు సౌదీ అధికారులు తెలిపారు. సౌదీ అరేబియా, నాటో సభ్య దేశమైన తుర్కియే, అణ్వస్త్ర శక్తి అయిన పాకిస్తాన్ల మధ్య కుదిరిన కొత్త రక్షణ ఒప్పందానికి ఈ తాజా దాడులు పరీక్షగా మారాయి. హౌతీల దాడులను తిప్పికొట్టాలని కోరుతూ సౌదీ అరేబియా నుంచి తమకు ఎలాంటి అభ్యర్థన అందలేదని తుర్కియే, పాకిస్తాన్ అధికారులు చెప్పారు. ఈ ఒప్పందం అమలులోకి రాకముందే మూడు దేశాల కూటమిని సంస్థాగతంగా బలోపేతం చేసే ప్రక్రియను పూర్తి చేయాల్సిన అవసరం ఉందని తుర్కియే అధికారి ఒకరు వెల్లడించారు. మక్కాపై దాడి యత్నాన్ని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఖండించారు. పాక్, సౌదీ అరేబియాలు భుజం భుజం కలిపి నిలుస్తాయని వ్యాఖ్యానించారుర. దాడుల పట్ల ఏ దేశమూ ఉదాసీనంగా ఉండలేదని హౌతీలను పరోక్షంగా హెచ్చరించారు. 57కు పైగా ముస్లిం దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇస్లామిక్ సహకార సంస్థ కూడా మక్కాపై దాడి ప్రయత్నాన్ని ఖండించింది. బుధవారం రాత్రి సమయంలో యెమెన్‌లోని మధ్య ప్రాంతమైన మారిబ్పైన సౌదీ అరేబియా నేతృత్వంలోని కూటమికి చెందిన ఎఫ్–15 యుద్ధ విమానాన్ని తాము కూల్చివేసినట్లు హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. అయితే, అందుకు ఆధారాలు చూపించలేదు. దాడి యత్నం పట్ల భారత్ తీవ్ర ఆందోళన న్యూఢిల్లీ: మక్కాపై డ్రోన్ దాడికి జరిగిన ప్రయత్నం పట్ల భారత్ బుధవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది, పశ్చిమాసియాలో శాంతిని త్వరగా పునరుద్ధరించాలని మరోసారి పిలుపునిచి్చంది. మక్కా సమీపంలో జరిగిన డ్రోన్ దాడి పట్ల తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. సౌదీ అరేబియా సార్వభౌమ భూభాగంపై దాడులను, పౌరుల ప్రాణాలకు, మౌలిక సదుపాయాలకు ముప్పు కలిగించే చర్యలను భారత్ ఖండిస్తోందని స్పష్టంచేశారు. పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వాల పునరుద్ధరణ సాధ్యమైనంత త్వరగా జరగాలని ఉద్ఘాటించారు. మక్కాను లక్ష్యంగా చేసుకుని హౌతీ మిలిటెంట్లు ప్రయోగించిన ఒక డ్రోన్‌ను మంగళవారం సాయంత్రం అడ్డుకుని ధ్వంసం చేసినట్లు సౌదీ అధికారులు పేర్కొన్న సంగతి తెలిసిందే. -
భారత యుద్ధనౌకను ఢీకొట్టిన పాక్ నౌక
న్యూఢిల్లీ: ఉత్తర అరేబియా సముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో భారత నావికా దళానికి చెందిన యుద్ధ నౌకను పాకిస్తాన్ నౌకాదళానికి చెందిన నౌక ఢీకొట్టడం సంచలనాత్మకంగా మారింది. ఈనెల 15న సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. భారత యుద్ధనౌక సాధారణ నిఘా విధుల్లో ఉండగా, పీఎన్ఎస్ హునైన్ అనే పాక్ పెట్రోలింగ్ నౌక దానిని వెంబడించింది. ప్రమాద సంకేతాలను తెలియజేయడానికి ఉపయోగించే ఛానల్ 16 (సముద్ర రేడియో ఛానల్) ద్వారా పదేపదే హెచ్చరికలు జారీ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయినప్పటికీ పాకిస్తాన్ నౌక అకస్మాత్తుగా వేగం పెంచి, భారత యుద్ధనౌక ముందు భాగాన్ని కుడి వైపున ఢీకొట్టింది. చివరికి పాకిస్తానీ నౌక ముందు భాగం భారత యుద్ధనౌకను తాకింది. అయితే, భారత యుద్ధనౌకకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని సమాచారం. ఈ సంఘటన తర్వాత కూడా భారత యుద్ధనౌక తన కార్యకలాపాలను యథాతథంగా కొనసాగించిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ మొత్తం పరిణామం పట్ల భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. పాకిస్తాన్ హైకమిషన్ చార్జ్ డి అఫైర్స్(సీడీఏ) సాద్ వరైచ్‌కు సమన్లు జారీ చేసింది. బుధవారం ఆయనను పిలిపించింది. అరేబియా సముద్రంలో భారత యుద్ధనౌకను పాక్ నౌక ఢీకొట్టడంపై తీవ్ర నిరసన వ్యక్తంచేసింది. పాకిస్తాన్‌ది ఆమోదయోగ్యం కాని, వృత్తిపరమైన ప్రమాణాలకు విరుద్ధమైన ప్రవర్తన అంటూ తేల్చిచెప్పారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు అన్ని సైనిక విభాగాలు తగిన జాగ్రత్తలు పాటించాలని, ఇరుపక్షాల మధ్య కుదిరిన ఒప్పందాలు, నిబంధనలను గౌరవించాలని సంబంధిత పాకిస్తాన్ అధికారులకు తెలియజేయాలంటూ సాద్ వరైచ్‌కు సూచించినట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటన పేర్కొంది. ఇస్లామాబాద్‌లోని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు కూడా ఇదే విధమైన నిరసనను తెలియజేయాలని అక్కడి భారత చార్జ్ డి అఫైర్స్‌ను ఆదేశించినట్లు స్పష్టంచేసింది. ‘‘అంతర్జాతీయ జలాల్లో జరిగిన ఈ ఘటన వల్ల పెద్దగా నష్టం వాటిల్లనప్పటికీ.. పాకిస్తాన్ నౌకాదళ నౌక వ్యవహరించిన తీరు మాత్రం సైనిక విన్యాసాలు, కదలికలు, దళాల తరలింపులకు సంబంధించిన ముందస్తు సమాచారంపై 1991 ఏప్రిల్‌లో భారత్–పాకిస్తాన్ మధ్య కుదిరిన ఒప్పందంలోని 10వ అధికరణానికి పూర్తిగా విరుద్ధంగా ఉంది’’అని భారత విదేశాంగ శాఖ తేల్చిచెప్పింది. మరోవైపు భారత నావికాదళం కూడా ఈ వ్యవహారంపై స్పందించింది. తమ ఆందోళనను పాకిస్తాన్ సైన్యానికి తెలియజేసింది. పాకిస్తాన్‌కు చెందిన పీఎన్ఎస్ హునైన్ నౌక 2024 జూలైలో విధుల్లోకి ప్రవేశించింది. ఇందులో నౌకా విధ్వంసక, వైమానిక రక్షణ ఆయుధాలు, సెన్సార్లు, టెర్మినల్ రక్షణ వ్యవస్థ అమర్చారు. -
ప్రజాసేవకు పనికొచ్చే ఏఐ అవసరం
న్యూయార్క్: కృత్రిమ మేధ టెక్నాలజీ సురక్షితమైందేనని నిర్ధారించుకోవాల్సింది ఆయా కంపెనీలేనని మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ స్పష్టం చేశారు. ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రమాదకరంగా మారుతోందని, భద్రతను సునిశ్చితం చేసుకునేంతవరకూ అభివృద్ధి కార్యకలాపాలకు పగ్గాలు వేయాలన్న ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్, స్పేస్ఎక్స్ ఏఐల పిలుపుకు భిన్నంగా మెటా సీఈవో వ్యాఖ్యానించడం గమనార్హం. ఏఐ మనిషి నియంత్రణ నుంచి జారిపోకముందే దాన్ని ఎలా నియంత్రించాలన్న విషయంపై ఇటీవలి కాలంలో చర్చ మొదలైన సంగతి తెలిసిందే. ఏఐ అభివృద్ధి ఇలాగే కొనసాగితే ఆరు నుంచి పన్నెండు నెలల కాలంలో అది ఇంటర్నెట్ మొత్తాన్ని తన గుప్పిట్లోకి తీసు కోగలదని ఆంత్రోపిక్ అధ్యక్షుడు డారి యో ఆందోళన వ్యక్తం చేయగా.. ఓపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మ్యాన్, స్పేస్ఎక్స్ ఏఐ సీఈవో ఎలాన్ మస్క్‌లు అందుకు మద్దతు పలికారు. అయితే ఈ వ్యాఖ్యలు వెలువడ్డ మూడు రోజులకు మెటా సీఈవో ఎక్స్ వేదికపై స్పందించడం గమనార్హం. ఏఐ కంపెనీలు ఇప్పటికే వాటిని సురక్షితంగా తీర్చిదిద్దేందుకు శాయశక్తులా ప్రయతి్నస్తున్నాయని, హాని జరక్కుండా చూడటం ఆయా కంపెనీలపై ఉన్న బాధ్యత కూడా అని జుకర్‌బర్గ్ వ్యాఖ్యానించారు. తాము అభివృద్ధి చేస్తున్న ఏఐ మోడల్ ‘మ్యూజ్’సురక్షితమైందని నిర్ధారించుకునేందుకు నెలలుగా దాని విడుదలను ఆపామని తెలిపారు. కంపెనీలు భద్రమైన ఏఐ మోడళ్ల అభివృద్ధికి ప్రాధాన్యమివ్వాలని, తమని తాము అభివృద్ధి చేసుకోగల మోడళ్లకు కాదని తెలిపారు. రికర్సివ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అని పిలిచే ఈ సామర్థ్యం ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంటుందన్నది అంచనా. ప్రజలకు ఉపయోగపడేందుకు కంప్యూటింగ్‌ను ఉపయోగించే మోడళ్లు కావాలి కానీ.. రికర్సివ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ సామర్థ్యమున్న వాటి కోసం పోటాపోటీ ప్రయత్నాలు చేయడం కాదని పరోక్షంగా ప్రత్యర్థి కంపెనీకు చురకలంటించారు. -
అంతరిక్ష యుద్ధానికి మనం సిద్ధమా?
అంతరిక్షంలో ఆయుధం ఉందన్న అమెరికా ప్రకటన ఇప్పుడు సర్వత్రా ప్రకంపనలు సృష్టిస్తోంది. భవిష్యత్తులో యుద్ధం నేలపై నుంచి కాకుండా అంతరిక్షంలోనే మొదలైతే... ఉపగ్రహాలే లక్ష్యంగా సాగితే తట్టుకోవడం ఎలా అన్న ప్రశ్న పలు దేశాల్లో మొదలైంది. రష్యా, చైనా లాంటి దేశాలు అంతరిక్ష యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు తగిన సాధన సంపత్తిని సమకూర్చుకున్నట్లు వార్తలు వస్తూండగా.... అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో ఉన్న భారత్ పరిస్థితి ఏమిటి? ఉపగ్రహాలను కూల్చే సత్తా మనకుందా? ఉంటే.. అమెరికా మాదిరిగానే మనమూ అంతరిక్షంలో మనదైన అ్రస్తాన్ని సిద్ధంగా ఉంచగలమా? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవిగో... ఉపగ్రహాలను కూల్చేయగల సత్తా భారత్‌కు ఇప్పుడు కాదు... ఏడేళ్ల క్రితం అంటే 2019లోనే సమకూరింది. ‘మిషన్ శక్తి’పేరుతో ఈ ఉపగ్రహ విధ్వంసక ఆయుధ వ్యవస్థను భారత్ పరీక్షించింది. అగ్రరాజ్యాలు అమెరికా, ఒకప్పటి సోవియట్ యూనియన్ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జోరుగా సాగుతున్న కాలంలో పురుడుపోసుకున్న ఈ ఉపగ్రహ విధ్వంసక ఆయుధాల ఆలోచన ఆ తరువాత బహుముఖంగా విస్తరించింది. అమెరికా 1985లోనే ఎఫ్–15 యుద్ధ విమానం ద్వారా 11.6 కిలోమీటర్ల ఎత్తుకు ఎగసి అక్కడి నుంచి ఏఎస్ఎం–135 క్షిపణిని ప్రయోగించింది. ఈ క్షిపణి 555 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతున్న శాస్త్రీయ ఉపగ్రహం ఒకదాన్ని ధ్వంసం చేసింది కూడా. ఇలా క్షిపణుల సాయంతో ఉపగ్రహాలను ధ్వంసం చేయగల వ్యవస్థలను కైనెటిక్ డైరెక్ట్ అసెంట్ ఏశాట్లని పిలుస్తారు. నేల, సముద్రం, గాల్లోంచి కూడా ప్రయోగించగలగడం వీటి ప్రత్యేకత. కక్ష్యలో తిరుగుతున్న ఉపగ్రహాన్ని గుర్తించేందుకు, కచ్చితంగా దాన్ని బలంగా ఢీకొనేందుకు శక్తిమంతమైన రాడార్లు, ఆప్టికల్ సెన్సర్లను ఉపయోగిస్తారు. ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో కంటికి కనిపించని, నిత్యం కదులుతూ ఉండే ఉపగ్రహాలను గుర్తించడం, క్షిపణులతో ఢీకొట్టడం అంతా చాలా సంక్లిష్టమైన వ్యవహారం. అందుకే డబ్బు, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న దేశాలు మాత్రమే ఈ వ్యవస్థలను అభివృద్ధి చేయగలిగాయి. 1985లో అమెరికా మొట్టమొదటిసారి ఈ రకమైన వ్యవస్థలను ప్రయోగించి విజయం సాధిస్తే చైనాకు 2007 వరకూ సాధ్యపడలేదు. రష్యా 2021లో కాస్మోస్1408 ఉపగ్రహాన్ని ధ్వంసం చేసి తనకూ ఏశాట్లు ఉన్నాయని ప్రకటించుకుంది. మన పరిస్థితి ఏమిటి? ముందుగా చెప్పుకున్నట్లు మిషన్ శక్తితో మనకు ఉపగ్రహాలను కూల్చేయగల సామర్థ్యం సమకూరింది. ఈ సత్తా కలిగిన నాలుగవ దేశంగా అవతరించింది. మిషన్ శక్తిలో భాగంగా రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) పృథ్వీ క్షిపణికి కొన్ని మార్పులు చేసి ప్రయోగించింది. 2019 మార్చి 27న ఒడిశాలోని అబ్దుల్ కలామ్ దీవి నుంచి నింగికి ఎగసిన ఈ మూడు దశల పృథ్వీ క్షిపణి అంతకు రెండు నెలల క్రితం ఇస్రో రాకెట్ ద్వారా భూమి లో ఎర్త్ ఆర్బిట్‌లోకి చేరిన మైక్రోశాట్–ఆర్ ఉపగ్రహాన్ని ఢీకొని నాశనం చేసింది. నేరుగా ఢీకొట్టడం ద్వారా మాత్రమే పృథ్వీ క్షిపణి ఉపగ్రహాన్ని నాశనం చేయడం గుర్తించాల్సిన విషయం. అంటే.. క్షిపణిలో ఎలాంటి పేలుడు సామగ్రిని వాడలేదన్నమాట. ప్రయోగం తరువాత జరిపిన పరిశీలనల్లో క్షిపణి ఉపగ్రహాన్ని ధ్వంసం చేయడంలో విజయవంతమైందని స్పష్టంగా తెలిసింది. దీనర్థం అంతరిక్షంలో తిరిగే ఉపగ్రహాలను గుర్తించి.. దాని దారిని పరిశీలిస్తూ... అడ్డుకుని పేల్చేయగల సత్తా భారత్‌కు ఉందీ అని!!! ఇప్పుడు çపృథ్వీ క్షిపణిలో పేలుడు పదార్థం ఉందని ఒక్కసారి ఊహించుకోండి... – సాక్షి, నేషనల్ డెస్క్ -
వృద్ధుల విషయంలో జపాన్ ప్రపంచ రికార్డు
జపాన్‌లో తొలిసారిగా 100 అంతకన్నా ఎక్కువ వయస్సు గల పౌరుల సంఖ్య లక్ష దాటింది. దేశంలో సెప్టెంబర్ 1 నాటికి శతాధిక వృద్ధుల సంఖ్య 1,07,677కు చేరుకున్నట్టు ఆ దేశ ఆరోగ్య, కార్మిక సంక్షేమ శాఖ వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 7,914 ఎక్కువ. శతాధిక వృద్ధుల్లో మహిళలు 94,298 మంది ఉండగా, పురుషులు 13,779 మంది ఉన్నారు.ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. శతాధికుల్లో మహిళలదే అగ్రస్థానం. మొత్తం సంఖ్యలో సుమారు 88 శాతం, అంటే 94,298 మంది మహిళలే ఉన్నారు. ప్రస్తుతం దేశంలో అత్యంత వృద్ధురాలిగా క్యోటోకు చెందిన 114 ఏళ్ల ఫుయో కిషిమోటో, అత్యంత వృద్ధుడిగా కుమామోటోకు చెందిన 112 ఏళ్ల హికారు కాటో రికార్డుల్లో నిలిచారు. జపాన్‌లో శతాధికుల సంఖ్య వృద్ధిని పరిశీలిస్తే.. 1963లో గణాంకాల సేకరణ ప్రారంభమైనప్పుడు వీరి సంఖ్య కేవలం 153 మాత్రమే ఉండేది. ఆ సంఖ్య 1981 నాటికి వెయ్యి దాటింది. 1998లో 10,000 కు, 2012లో 50,000 కు చేరింది. ఇప్పుడు ఏకంగా లక్ష మార్కును దాటి సరికొత్త రికార్డును నమోదుచేసింది. ఈ గణాంకాలపై జపాన్ ఆరోగ్య శాఖ మంత్రి కెనిచిరో యునో హర్షం వ్యక్తంచేశారు.ఇదీ చదవండి: భారీగా హెచ్ఐవీ కేసులు.. ఆ దేశంలో నేషనల్ ఎమర్జెన్సీ! -
భారీగా హెచ్ఐవీ కేసులు.. ఆ దేశంలో నేషనల్ ఎమర్జెన్సీ!
పసిఫిక్ దేశం ఫిజీలో హెచ్ఐవీ కేసులు భారీగా పెరగడంతో అక్కడి ప్రభుత్వం ‘నేషనల్ హెచ్ఐవీ ఎమర్జెన్సీ’ ప్రకటించింది. 10 లక్షల్లోపు జనాభా ఉన్న ఈ దేశంలో ప్రస్తుతం ప్రతి 60 మంది వయోజనుల్లో ఒకరు హెచ్ఐవీతో జీవిస్తున్నట్లు అంచనా. 2024లో కొత్తగా 2,060 కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది. గర్భిణులు, నవజాత శిశువుల్లోనూ కేసులు గుర్తిస్తున్నారు. ఒకే సిరంజీని పలువురు ఉపయోగించడం, అసురక్షిత లైంగిక సంబంధాలు వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. డ్రగ్స్ ఎక్కించుకునేందుకు ఒకే సిరంజీని అనేక మంది ఉపయోగించడం, అసురక్షిత లైంగిక కార్యకలాపాల వంటి కారణాలతో ఈ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు తెలుస్తోంది. 2021లో 25గా ఉన్న హెచ్ఐవీ సంబంధిత మరణాల సంఖ్య 2025 నాటికి 117కు పెరిగింది. స్థానికంగా హెచ్ఐవీతో జీవిస్తున్న వారిలో కేవలం 39 శాతం మందికి మాత్రమే ఆ విషయం తెలుసని, నాలుగింట ఒక వంతు కంటే తక్కువ మంది మాత్రమే చికిత్స పొందుతున్నారని యూఎన్ఎయిడ్స్ ఫిజీ ప్రతినిధి పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఆసియా గేమ్స్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరం -
లండన్‌లో తెలంగాణ వ్యక్తి చారిత్రాత్మక ఘనత!
లండన్‌కు సంబంధించి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గౌరవాల్లో ఒకటైన “లండన్ నగర స్వేచ్ఛా పౌరసత్వం” (Freedom of the City of London) అవార్డును తెలంగాణకు చెందిన గణేశ్ కుప్పాల స్వీకరించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన గణేశ్ కుప్పాల ఉద్యోగరీత్యా లండన్‌లో స్థిరపడ్డారు. కాగా సెప్టెంబర్ 16న గణేష్ కుప్పాల ప్రతిష్ఠాత్మకమైన లండన్ సిటీ “ఫ్రీడమ్ ఆఫ్ ది సిటీ ఆఫ్ లండన్” గౌరవాన్ని అధికారికంగా స్వీకరించారు.ఈ సందర్భంగా, చట్టప్రకారం అవసరమైన ప్రతిజ్ఞ చేసి, డామే సూసన్ కరోల్, కరోలిన్ లూసి సమక్షంలో ఆయనను Freedom of the Cityలో అధికారికంగా చేర్చారు. ఫ్రీమెన్ హక్కుల కొనుగోలు, వారి అధికారిక ప్రవేశాలకు సంబంధించిన I అక్షరంతో గుర్తించబడిన అధికారిక రిజిస్టర్ పుస్తకంలో, కింగ్ చార్లెస్ III పాలనలోని 6వ సంవత్సరంలో నమోదు చేయబడింది. లండన్ నగర చరిత్రలో ఎంతో విశిష్టమైన ఈ గౌరవాన్ని అందుకున్న ప్రముఖుల జాబితాలో కింగ్ చార్లెస్ III, క్వీన్ ఎలిజబెత్ II, ఫ్లోరెన్స్ నైటింగేల్, జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు. తాజాగా ఇంతటి ప్రతిష్ఠాత్మక గౌరవాన్ని అందుకున్న అతి పిన్న వయస్కుడిగా గణేష్ కుప్పాల నిలిచారు. అంతేకాదు తెలంగాణకు చెందిన తొలి వ్యక్తిగా లండన్‌లో అరుదైన గౌరవం పొందిన వ్యక్తిగా నిలిచారు ఈ ఘనత తెలంగాణ ప్రజలకు, తెలుగు వారందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సమాజానికి ఎంతో గర్వకారణం. గణేష్, ఒక గొప్ప గౌరవాన్ని అందుకోవడమే కాకుండా, తెలంగాణ మరియు తెలుగు సమాజానికి ఒక చారిత్రాత్మక గుర్తింపును తీసుకువచ్చారు.ప్రతిష్ఠాత్మకమైన లండన్ సిటీ ఫ్రీడమ్ (Freedom of the City of London) గౌరవాన్ని అందుకున్న గణేష్ కుప్పాలను పలువురు బ్రిటిష్ పార్లమెంట్ సభ్యులతో పాటు మాజీ ఎంపీ అభినందించారు. గణేశ్‌ను అభినందించిన వారిలో ఎంపీ సీమా మల్హోత్రా, ఎంపీ జస్ అథ్వాల్, ఎంపీ వెస్ స్ట్రీటింగ్, మాజీ యూకే ఎంపీ వీరేంద్ర శర్మ ఉన్నారు. ఇదీ చదవండి: వడ్డీ రేట్లు పెంచిన యూఎస్ ఫెడరల్ రిజర్వ్ -
వడ్డీ రేట్లు పెంచిన యూఎస్ ఫెడరల్ రిజర్వ్
అమెరికాలోని యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు (పావు శాతం) పెంచింది. తాజా పెంపుతో వడ్డీ రేటు 3.75 శాతం నుంచి 4 శాతానికి పెరిగినట్లయింది. మూడేళ్ల కాలంలో ఫెడ్ రేట్లను పెంచడం ఇదే తొలిసారి. ద్రవ్యోల్బణం టార్గెట్ 2 శాతం కంటే ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, ఇంధన ధరల పెరుగుదల దీనికి ప్రధాన కారణం. -
జీబ్రా క్రాసింగ్ ఉపయోగించకుంటే పదివేలు జరిమానా!
రోడ్డు దాటేటప్పుడు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని అబుదాబి పోలీసులు వాహదారులకు, పాదాచారులకు హెచ్చరించారు. రహదారి భద్రతను నిర్ధారించే చర్యల్లో భాగంగా, సోషల్ మీడియాలో పోలీసులు అవగాహన సందేశాన్ని విడుదల చేశారు. నిర్ధేశిత ప్రాంతాల్లో ఉండే జీబ్రా క్రాసింగ్లను పాదాచారులను ఉపయోగించకుంటే వారికి ఇకనుంచి జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. యూఏఈ వ్యాప్తంగా, ట్రాఫిక్ సిగ్నళ్లను పాటించని లేదా నిర్దేశిత ప్రాంతానికి వెళ్లకుండా రోడ్లు దాటే పాదచారులకు 400 దిర్హమ్ల(భారత కరెన్సీలో రూ. 10వేలు) జరిమానా విధించబడుతుంది. ఇటువంటి ప్రవర్తనను అరికట్టి, సురక్షితమైన వాటిని ప్రోత్సహించడానికి ఎమిరేట్స్‌లోని అధికారులు అనేక హెచ్చరికలు జారీ చేశారు.రోడ్లపై నడిచే పాదచారుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, సిగ్నళ్లు కూడళ్ల వద్ద వేగాన్ని తగ్గించాలని వాహనదారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఇక పాదాచారులను ఉద్దేశించి పోలీసులు మాట్లాడుతూ.. నిర్దేశించిన క్రాస్‌వాక్‌లు, వంతెనలు, సొరంగాలను ఉపయోగించాలి. ముఖ్యంగా పాదాచారులు ట్రాఫిక్ లైట్ సంకేతాలను అనుసరించండి.#فيديو | دعت #شرطة_أبوظبي السائقين والمشاة على أهمية الالتزام بقواعد السلامة المرورية، محذرة من مخاطر عبور الطرق من الأماكن غير المخصصة لما قد يسببه من حوادث دهس، وناشدت السائقين إلى توخي الحيطة والانتباه للمشاة وخفض السرعة بالقرب من مناطق العبور، فيما حثّت المشاة على استخدام… pic.twitter.com/B4Dalb7Fae— شرطة أبوظبي (@ADPoliceHQ) September 16, 2026 -
అమెరికా పౌరులే టార్గెట్.. కాల్సెంటర్లపై ఈడీ మెరుపు దాడులు
అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని నకిలీ కాల్ సెంటర్ల ద్వారా భారీ మోసాలకు పాల్పడుతున్న నెట్‌వర్క్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గట్టి దెబ్బ కొట్టింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA)- 2002 లోని సెక్షన్ 17 కింద ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయ అధికారులు సెప్టెంబర్ 15న పటియాలా, పుణె, చండీగఢ్‌లోని నాలుగు కీలక ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. క్షేత్రస్థాయి పరిశీలన, పక్కా సమాచారం ఆధారంగా నిర్వహించిన ఈ సోదాల్లో అంతర్జాతీయ మోసాల ముఠా గుట్టు రట్టయింది.సోదాల సమయంలో ఈడీ అధికారులు పటియాలాలో రెండు, పుణెలో ఒకటి చొప్పున మొత్తం మూడు ప్రత్యక్ష (లైవ్) కాల్ సెంటర్లను గుర్తించారు. అధికారులు సోదాలు జరుపుతున్న సమయంలో ఈ సెంటర్లలో సుమారు 220 మంది ఉద్యోగులు విధుల్లో ఉండటం గమనార్హం. వర్క్ స్టేషన్లు, క్యూబికల్స్, కంప్యూటర్లు, హెడ్సెట్లు, వీఓఐపీ ఆధారిత సిస్టమ్‌లతో ఇవి నడుస్తున్నాయి. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది గుర్తింపు, వారికి అప్పగించిన బాధ్యతలు, వారిని వెనుక ఉండి నడిపిస్తున్న ప్రధాన సూత్రధారుల వివరాలను అధికారులు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.పటియాలా, పుణె కేంద్రాలుగా సాగుతున్న ఈ నకిలీ కాల్ సెంటర్ల ప్రతినిధులు అమెరికా పౌరులకు ఫోన్లు చేసి, వివిధ తప్పుడు కారణాలు చెబుతూ భయభ్రాంతులకు గురిచేసేవారు. వారి నుంచి పెద్ద ఎత్తున డబ్బులను చెల్లించేలా ప్రేరేపించి మోసాలకు పాల్పడేవారని ఈడీ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇలా అమెరికన్ డాలర్ల రూపంలో అక్రమంగా వసూలు చేసిన నిధులను భారతీయ కరెన్సీగా మార్చే ప్రక్రియను ఒక ముఠా నడిపిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.చండీగఢ్‌లోని ఒక నివాస ప్రాంగణంలో జరిగిన సోదాల్లో ఈ మొత్తం దందాకు సంబంధించిన ప్రధాన నియంత్రణ వ్యవస్థ బయటపడింది. పటియాలాలోని కాల్ సెంటర్ల కార్యకలాపాలను సమన్వయం చేయడానికి, అమెరికా నుంచి వచ్చిన అక్రమ ఆదాయాన్ని స్థానిక కరెన్సీలోకి మార్చే ఆర్థిక లావాదేవీలను పర్యవేక్షించడానికి ప్రధాన సూత్రధారి ఈ చండీగఢ్ కేంద్రాన్ని ఉపయోగిస్తున్నట్లు అధికారులు కనుగొన్నారు. అక్కడ నిధుల పంపిణీకి సంబంధించిన అనేక డిజిటల్ ఆధారాలు లభ్యమయ్యాయి.ఇదీ చదవండి: మోదీ ‘శ్రీకృష్ణుడు’, నేను సుధామ.. ప్రధాని ఫ్రెండ్ భావోద్వేగ లేఖ -
ఇరాన్‌పై అమెరికా యుద్ధం.. పాకిస్థాన్ ప్రధాని సంచలన నిర్ణయం
ఇస్లామాబాద్: పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల అల్లకల్లోలం దెబ్బకు పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పాక్ ప్రధాని షెహబాద్ షరీష్ సంచలన నిర్ణయం తీసుకోనున్నారు. చమురు వినియోగాన్ని, ప్రభుత్వ ఖర్చులను భారీగా తగ్గించుకోవడమే లక్ష్యంగా ‘స్మార్ట్ లాక్డౌన్’,పొదుపు చర్యల ప్రణాళికను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు అంతర్జాతీయ కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల సౌదీ అరేబియాలోని ఇంధన స్థావరాలపై దాడులు జరగడం, గల్ఫ్ దేశాలలోని కీలక జలమార్గాల్లో భద్రతా పరిస్థితులు క్షీణించడంతో గ్లోబల్ ఆయిల్ మార్కెట్లో అనిశ్చితి నెలకొంది. దీని ప్రభావంతో పాకిస్థాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటాయి. ప్రభుత్వం పెట్రోల్ ధరను లీటరుకు రూ. 4.10 పెంచగా, హై స్పీడ్ డీజిల్ ధరను రూ. 6.41 పెంచింది. దీంతో పాక్‌లో పెట్రోల్ ధర రూ. 384.34కి, డీజిల్ ధర రూ. 415.83కి చేరింది. ఈ భారీ భారాన్ని పూర్తిగా భరించే స్థితిలో ఆర్థిక వ్యవస్థ లేకపోవడంతో, వినియోగాన్ని తగ్గించుకోవడమే ఏకైక మార్గంగా ప్రధాని షెహబాజ్ షరీఫ్ సర్కార్ భావిస్తోంది.ప్రభుత్వ పరిశీలనలో ఉన్న కీలక ప్రతిపాదనలు ఇంధన వినియోగానికి కళ్లెం వేసేందుకు ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు సంబంధించి పలు కీలక ప్రణాళికలను పరిశీలిస్తున్నారు.గత సంక్షోభాల సమయంలో అమలు చేసినట్లుగానే, మార్కెట్లను త్వరగా మూసివేయడం,పని దినాలను తగ్గించడం (ఉదాహరణకు 4 రోజుల పని విధానం) వంటి నిబంధనలు మళ్లీ తెరపైకి వచ్చే అవకాశం ఉంది. అనవసర ప్రయాణాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంధన వినియోగాన్ని తగ్గించడం ద్వారా పొదుపు చర్యలను కఠినతరం చేయనున్నారు.ఇంధన భారాన్ని తగ్గించేందుకు ఇప్పటికే ప్రధాని ‘ఫ్యూయల్ రిలీఫ్ స్కీమ్’ కింద ద్విచక్ర వాహనదారులకు, కార్ల యజమానులకు కొంతమేర రాయితీలు ఇస్తున్నప్పటికీ, అవి సరిపోవడం లేదనే విమర్శలున్నాయి. అంతర్జాతీయ పరిణామాల కారణంగా తలెత్తిన ఈ ఆయిల్ క్రైసిస్‌ను తట్టుకునేందుకు పాకిస్థాన్ కేవలం ధరల పెంపుకే పరిమితం కాకుండా, డిమాండ్‌ను నియంత్రించేలా ‘స్మార్ట్ లాక్డౌన్’మార్గాన్ని ఎంచుకోవడం ఆ దేశ ఆర్థిక దుస్థితికి అద్దం పడుతోంది. ఈ చర్యలు గనుక అమల్లోకి వస్తే, అక్కడి వ్యాపార రంగంపై మరోసారి తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. -
గని కూలి 60 మంది మృతి.. శిథిలాల కిందే మరికొందరు
సూడాన్‌లోని వెస్ట్ కొర్డోఫాన్ రాష్ట్రంలో బంగారు గని కూలిన ఘటనలో దాదాపు 60 మంది మృతి చెందినట్లు స్థానిక వర్గాలు వెల్లడించాయి. భూగర్భంలో మరికొందరు కార్మికులు ప్రాణాలతో ఉండే అవకాశం ఉందని స్థానిక హక్కుల పర్యవేక్షణ సంస్థ పేర్కొంది.అల్-జారా గని వద్ద వరుసగా ఉన్న పలు గని మార్గాలు కూలిపోయినట్లు కొర్డోఫాన్ అబ్జర్వేటరీ తెలిపింది. ఫౌజా ప్రాంతంలో, అల్-నుహుద్కు వాయవ్య దిశలో ఈ గని ఉంది. ఈ ఘటనలో 70 మందికి పైగా చేతివృత్తి ఆధారిత గని కార్మికులు మృతి చెంది ఉండొచ్చని లేదా గల్లంతయ్యారని ఆ సంస్థ బుధవారం తెలిపింది.ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం మంగళవారం ఒక కార్మికుడు గని నుంచి బయటకు వచ్చి, ఇంకా కొందరు లోపల ప్రాణాలతో ఉన్నారని చెప్పినట్లు సంస్థ వెల్లడించింది. అయితే ప్రత్యేక శిక్షణ పొందిన సహాయక బృందాలు అక్కడికి చేరుకోలేదని తెలిపింది. ఇసుకతో కూడిన బలహీనమైన నేల కారణంగా స్థానికులు సాధారణ పనిముట్లతో సహాయక చర్యలు చేపట్టడం, మృతదేహాలను వెలికితీయడం కష్టంగా మారిందని పేర్కొంది.గని ప్రాంతంలో భద్రతా చర్యలు, సహాయక పరికరాలు లేకపోవడమే అధిక మరణాలకు కారణమై ఉండొచ్చు. సూడాన్ ఆఫ్రికాలోని ప్రధాన బంగారం ఉత్పత్తిదారుల్లో ఒకటి. అయితే అక్కడి బంగారంలో అధిక భాగం ప్రమాదకరమైన చిన్నస్థాయి, చేతివృత్తి ఆధారిత గనుల ద్వారా వెలికితీస్తారు. గని ప్రాంతంలో సహాయక చర్యలు వేగవంతం అవుతాయా, భూగర్భంలో చిక్కుకున్న వారిని రక్షించగలరా? అనేది ఇప్పుడు కీలకం. -
అమెరికా నుంచి ఇజ్రాయెల్‌కు 60 వేల భారీ బాంబులు? ఏం జరుగుతోంది?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇజ్రాయెల్‌కు సుమారు 2,000 పౌండ్ల (907 కిలోల) బరువున్న 60 వేల భారీ బాంబులను విక్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. దాదాపు 2.8 బిలియన్ డాలర్ల విలువైన ఈ ఆయుధ ప్యాకేజీకి అమెరికా పన్ను చెల్లింపుదారుల నిధులు కూడా ఉపయోగించనున్నట్లు సమాచారం. అయితే ఈ విక్రయాన్ని అమెరికా ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించలేదు.ఈ ప్యాకేజీలో 20 వేల ఎంకే-84, 20 వేల బీఎల్‌యూ-117, 20 వేల ఐ-2000 పెనిట్రేటర్ బాంబులు ఉండనున్నట్లు సమాచారం. వీటిలో ఎంకే-84, బీఎల్‌యూ-117లు 2,000 పౌండ్ల సాధారణ బాంబులు కాగా, ఐ-2000ను బంకర్ బస్టర్‌గా పిలుస్తారు. గట్టి నిర్మాణాలను ఛేదించి లోపల పేలేలా దీన్ని రూపొందించారు.ఈ ప్రతిపాదిత విక్రయం నేపథ్యంలో అమెరికా ఆయుధ నిల్వలపై కూడా చర్చ మొదలైంది. ఇరాన్‌తో యుద్ధం కారణంగా అమెరికా ఆయుధ నిల్వలు తగ్గుతున్నాయని, సరఫరా వ్యవస్థలో కొన్ని అవరోధాలు ఏర్పడుతున్నాయని సోమవారం విడుదలైన పెంటగాన్ పర్యవేక్షణ నివేదిక పేర్కొన్నట్లు అల్‌జజీరా తెలిపింది. 2024లో జో బైడెన్ ప్రభుత్వం ఇజ్రాయెల్‌కు కొన్ని 2,000 పౌండ్ల బాంబుల సరఫరాను నిలిపివేసింది.అనంతరం ట్రంప్ అధ్యక్షుడిగా తిరిగి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ నిర్ణయాన్ని రద్దు చేశారు. గతంలోనూ ఇజ్రాయెల్‌కు భారీ బాంబుల సరఫరాపై అమెరికాలో రాజకీయ నేతల నుంచి భిన్నమైన స్పందనలు వచ్చాయి. ఇక ఈ కొత్త ఆయుధ ప్యాకేజీ అధికారికంగా ఆమోదం పొందుతుందా, కాంగ్రెస్‌కు ఎప్పుడు అధికారికంగా తెలియజేస్తారు, ఇజ్రాయెల్‌కు ఆయుధాల సరఫరాపై అమెరికా విధానం ఎలా మారుతుంది? అనేది కీలకంగా మారింది. -
వంట గదిలో కుప్పకూలి భారతీయ వైద్యురాలు మృతి
షార్జాలో ఇంట్లో వంటగదిలో అకస్మాత్తుగా కుప్పకూలి కేరళకు చెందిన దంత వైద్యురాలు డాక్టర్ అఫీనా రహీమ్ (32) మృతి చెందారు. ఇద్దరు చిన్నారుల తల్లైన ఆమె తన భర్త యాసర్ టీ, పిల్లలతో కలిసి అల్ ఖాసిమియా ప్రాంతంలో నివసిస్తున్నారు.అఫీనా గతంలో దంత వైద్యురాలిగా పనిచేసినా, పిల్లల సంరక్షణ కోసం కొంతకాలంగా వృత్తికి దూరంగా ఉన్నట్లు కుటుంబ సభ్యుడు తెలిపారు. ఆమె భర్త ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో ఆయన విధుల్లో ఉన్నారు.అఫీనా తన కుమారుడిని పాఠశాలకు పంపిన తర్వాత తిరిగి నిద్రకు వెళ్లినట్లు ఆమె బావ హకీమ్ తెలిపారు. సోమవారం ఉదయం సుమారు 9 గంటలకు అఫీనాతో తాను మాట్లాడినట్లు ఆయన చెప్పారు. ఆ తర్వాత అఫీనా పిల్లల్లో ఒకరు ఏడుస్తున్న శబ్దం విని ఆమె వదిన రమ్షీనా నిద్రలేచారు. వంటగదిలో అఫీనా కుప్పకూలి ఉండటాన్ని గుర్తించి వెంటనే ఆమెకు సీపీఆర్ చేశారు. అనంతరం అంబులెన్స్‌కు సమాచారం అందించారు.అఫీనాను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించినప్పటికీ వైద్యులు ఆమెను రక్షించలేకపోయారు. ఆమె మృతికి కచ్చితమైన కారణం ఇంకా నిర్ధారణ కాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు.అఫీనా ఆరోగ్యంగా ఉండేవారని, ఆమెకు ఎలాంటి తెలిసిన అంతర్గత అనారోగ్య సమస్యలు లేవని భర్త తెలిపారు. ఆమె మృతిపై అధికారిక ధ్రువీకరణ పత్రం, ఇతర ప్రక్రియలు పూర్తయ్యే వరకు కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. అనంతరం ఆమె భౌతికకాయాన్ని కేరళలోని స్వస్థలానికి తరలించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. -
బస్సుపై డ్రోన్ దాడి.. ఐదుగురి మృతి
ఉక్రెయిన్ దక్షిణ ప్రాంతంలో ప్రయాణికుల బస్సుపై రష్యా డ్రోన్ దాడి చేయడంతో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో నలుగురు పురుషులు, ఒక మహిళ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నికోపోల్ నగరం వద్ద బుధవారం తెల్లవారుజామున ఈ దాడి జరిగినట్లు వెల్లడించారు. మరో ఏడుగురు గాయపడ్డారని ద్నిప్రొపెట్రోవ్స్క్ ప్రాంత గవర్నర్ ఒలెక్సాండర్ హాంజా తెలిపారు.దాడికి గురైన బస్సు కిటికీలు ధ్వంసమైన దృశ్యాలను ప్రాంతీయ గవర్నర్ టెలిగ్రామ్‌లో పోస్ట్ చేశారు. బస్సు వెలుపల రక్తం కారుతున్నట్లు కనిపించిన ఫొటోను కూడా ఆయన పంచుకున్నారు. అయితే ఆ చిత్రాన్ని అంతర్జాతీయ మీడియా ఇంకా ధ్రువీకరించలేదు. ఈ దాడిపై రష్యా నుంచి ఎలాంటి స్పందన రాలేదు. యుద్ధంలో పౌరులను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుంటున్నారన్న ఆరోపణలను రష్యా, ఉక్రెయిన్ రెండూ ఖండిస్తున్నాయి.రైళ్లపైనా దాడులుఇదే సమయంలో ఉక్రెయిన్‌లోని మైకోలైవ్ ప్రాంతంలో ప్రయాణికుల రైలుపైనా రష్యా డ్రోన్ దాడి జరిగినట్లు తాత్కాలిక ప్రాంతీయ గవర్నర్ హెఓర్హీ రెషెటిలోవ్ తెలిపారు. రైలులో ఉన్న మొత్తం 168 మంది ప్రయాణికులు, సిబ్బందిని సురక్షితంగా బయటకు తరలించినట్లు, ఎవరూ గాయపడలేదని ఆయన చెప్పారు. తొలి దాడి తర్వాత రైలుపై మరో రెండు సార్లు దాడి జరిగినట్లు తెలిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ ప్రకారం, పోలాండ్ సరిహద్దుకు సమీపంలోని కోవెల్లో ఓ రైలు ఇంజిన్‌పైనా దాడి జరిగింది.ఉక్రెయిన్ గగనతలం 2022లో రష్యా పూర్తిస్థాయి దాడి ప్రారంభించినప్పటి నుంచి మూసివేయడంతో, దేశంలో సాధారణ ప్రజలు, వ్యాపారాలకు బస్సులు, రైళ్లు కీలక రవాణా మార్గాలుగా మారాయి. ఇటీవలి నెలల్లో రష్యా, ఉక్రెయిన్ పరస్పరం రవాణా వ్యవస్థలు, మౌలిక వసతులపై దాడులను పెంచాయి. ఉక్రెయిన్ రైల్వే సంస్థ ప్రకారం, ఈ ఏడాది ఇప్పటివరకు 120 ప్రయాణికుల బోగీలు, 304 రైలు ఇంజిన్లు, 43 రైల్వే స్టేషన్లు దెబ్బతిన్నాయి. మొత్తం 1,700 రైల్వే సదుపాయాలపై దాడులు జరిగినట్లు సంస్థ తెలిపింది.ఈ దాడుల నేపథ్యంలో రష్యాపై మరిన్ని కఠిన ఆంక్షలు విధించాలని జెలెన్స్కీ అమెరికా, ఐరోపా దేశాలను కోరారు. రాబోయే రోజుల్లో రవాణా వ్యవస్థలపై దాడులు, పౌరుల భద్రత, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో పాశ్చాత్య దేశాల తదుపరి చర్యలు కీలకంగా మారనున్నాయి. -
కుప్పకూలిన భవనం.. నిద్రలోనే 16 మంది మృతి
గాజా సిటీలో బుధవారం తెల్లవారుజామున ఓ భవనం కూలిపోవడంతో 16 మంది మృతి చెందారు. మృతుల్లో 12 మంది మహిళలు, చిన్నారులు ఉన్నట్లు గాజా ఆరోగ్య శాఖ ప్రతినిధి జాహెర్ అల్ వహీది తెలిపారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.కూలిపోయిన భవనంలో సుమారు 6 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇజ్రాయెల్ దాడుల కారణంగా భవనం ఇప్పటికే తీవ్రంగా దెబ్బతిని, ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదకర స్థితిలో ఉన్నట్లు తెలిసినా.. అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని గాజా పౌర రక్షణ సిబ్బంది తెలిపారు. “ప్రత్యామ్నాయాలు లేకపోవడంతో వారికి మరో మార్గం లేకుండా పోయింది” అని సహాయక సిబ్బంది అబౌద్ మజ్దలావి పేర్కొన్నారు.భవనం కూలిన వెంటనే స్థానికులు తమ కుటుంబ సభ్యుల కోసం శిథిలాల్లో గాలించారు. కొందరు సహాయక సిబ్బందితో కలిసి శిథిలాలను తొలగిస్తూ ప్రాణాలతో ఉన్నవారిని గుర్తించేందుకు ప్రయత్నించారు. అయితే అక్కడ దుమ్ముతో నిండిన దుప్పట్లు, శిథిలాలు మాత్రమే కనిపించాయి.కాల్పుల విరమణ ఒప్పందం కుదిరి దాదాపు ఏడాది అవుతున్నా గాజాలో పునర్నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. గాజాలోని సుమారు 2 కోట్ల మంది జనాభా ప్రస్తుతం భూభాగంలో సగం కంటే తక్కువ ప్రాంతంలోనే జీవిస్తున్నారు. ఇజ్రాయెల్ దళాల చుట్టుముట్టిన పరిస్థితుల్లో వారు సహాయ సామగ్రిపై ఆధారపడుతున్నారు. హమాస్ ఆయుధాలు విడిచే వరకు పునర్నిర్మాణానికి అనుమతి ఇవ్వబోమని ఇజ్రాయెల్ చెబుతోంది.ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో ఇప్పటివరకు 73,789 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా 1,375 మంది మరణించినట్లు స్థానిక ఆరోగ్య అధికారులు తెలిపారు. -
రూ.4 కోట్ల పొదుపుతో వృద్ధురాలి బ్యూటీ ట్రీట్మెంట్..
బీజింగ్: చైనాకు చెందిన 75 ఏళ్ల మహిళ తన పదవీ విరమణతో వచ్చిన పొదుపు మొత్తాన్ని అందాల చికిత్సల కోసం ఖర్చు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆమె ఒకే సంస్థకు చెందిన బ్యూటీ సెలూన్లు, మెడికల్ బ్యూటీ క్లినిక్‌లలో రూ.4 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ వెల్లడించింది. తన తల్లి పొదుపు దాదాపు పూర్తిగా ఖర్చయిన విషయం తెలుసుకున్న కుమార్తె షాక్‌కు గురయ్యారు. ‘యూ’ అనే ఆ మహిళ 2016 నుంచి యోంగ్‌కి బ్యూటీ అండ్ హెయిర్‌డ్రెస్సింగ్ కంపెనీకి చెందిన ఓ శాఖను, దానికి అనుబంధంగా ఉన్న మెడికల్ బ్యూటీ క్లినిక్‌కు వెళుతున్నారుచర్మాన్ని బిగుతుగా మార్చే చికిత్సలు, థ్రెడ్ లిఫ్టింగ్, మెరిడియన్ మసాజ్‌లు, కనుబొమ్మలకు టాటూ, పెదవులకు టాటూ తదితర సేవలు అందుకున్నారు. కొన్ని చికిత్సలకు సాధారణ ధరల కంటే అధిక మొత్తాలు వసూలు చేసినట్లు బిల్లుల్లో ఉన్నట్లు కుమార్తె గుర్తించారు. పెదవుల టాటూ ప్యాకేజీకి 39,800 యువాన్లు (సుమారు రూ.5.6 లక్షలు) చెల్లించినట్లు రికార్డుల్లో ఉంది. సాధారణంగా తరచూ చేయాల్సిన అవసరం లేని కొన్ని చికిత్సలను కూడా పదేపదే చేయించుకున్నట్లు తెలుస్తోంది.తన వద్ద ఆర్థికంగా సరిపడా డబ్బు ఉందని భావించడంతో ఖర్చులను పెద్దగా పరిశీలించలేదని ‘యూ’ తెలిపారు. ఆమె పొదుపులో ఎక్కువ భాగం ఇంటిని విక్రయించడం ద్వారా వచ్చినదే. చివరకు అద్దె ఇల్లు తీసుకునే స్థోమత కూడా లేకపోవడంతో, నగలను సైతం విక్రయించాల్సి వచ్చింది. దీనికితోడు ‘ఇంటిమేట్ కేర్’ పేరుతో ఓ ప్రక్రియకు 3 లక్షల యువాన్లు (సుమారు రూ.42 లక్షలు) చెల్లించారు. కొన్ని బిల్లుల్లో ‘హ్యాపీనెస్ చైర్’, ‘స్పేస్ క్యాప్సూల్’ వంటి అసాధారణ సేవల పేర్లు కూడా ఉన్నట్లు కుమార్తె తెలిపారు. ఈ ఘటనపై ఆన్లైన్లో విస్తృత చర్చ జరుగుతోంది. ఇదీ చదవండి: నేపాల్‌లో వరుస భూకంపాలు.. భయాందోళనలో ప్రజలు -
నేపాల్‌లో వరుస భూకంపాలు.. భయాందోళనలో ప్రజలు
కాఠ్మాండూ: నేపాల్‌లో బుధవారం తెల్లవారుజామున వరుసగా రెండుసార్లు భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం లేదు. మూడు గంటల వ్యవధిలో రెండు భూకంపాలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. తొలి భూకంపం రిక్టర్ స్కేలుపై 4.5 తీవ్రతతో, రెండోది 4.2 తీవ్రతతో నమోదైంది.నేషనల్ సిస్మోలాజికల్ రీసెర్చ్ సెంటర్ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1:51 గంటలకు తొలి భూకంపం నమోదైంది. దీని తీవ్రత 4.5గా నమోదైనట్లు వెల్లడించింది. అనంతరం మూడు గంటల్లోపే మరోసారి భూమి కంపించింది. ఉదయం 4:28 గంటలకు 4.2 తీవ్రతతో రెండో భూకంపం సంభవించింది. దీని కేంద్రం కూడా ముగు జిల్లాలోని కలీయీ ప్రాంతం పరిసరాల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రకంపనలు పొరుగున ఉన్న డోల్పా, జుమ్లా జిల్లాలనూ తాకాయి.ఇదిలా ఉండగా.. ఆగస్టు 26న నేపాల్‌లో ఆకస్మిక వరదలు సంభవించాయి. మంగళవారం నాటికి ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 1,399కి పెరిగినట్లు అధికారులు తెలిపారు. నేపాల్-టిబెట్ సరిహద్దు సమీపంలో మంచు, రాళ్లు జారిపడటంతో సంభవించిన ఈ ఆకస్మిక వరదలు ఉత్తర, మధ్య నేపాల్‌లోని పట్టణాలు, గ్రామాల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి.ఇదీ చదవండి: దిశా మృతి కేసు దర్యాప్తు.. ఎవరీ సీమా పాహుజా? -
సముద్రం.. గడ్డకట్టే చలి.. 62 గంటల తర్వాత..
ఒళ్లు గగుర్పొడిచే ఘటన అలాస్కా తీరంలో జరిగింది. చేపల వేటకు వెళ్లిన ఓ కుటుంబానికి ఊహించని విషాదం ఎదురైంది. చిన్న పడవ ఒక్కసారిగా సముద్రంలో బోల్తా పడటంతో 15 ఏళ్ల డెరిక్ పార్కర్ అఘ్నాంగ తన అన్న, కజిన్‌ను కోల్పోయాడు. అయితే ప్రాణాలతో బయటపడేందుకు దాదాపు మూడు రోజుల పాటు సముద్రంలో మంచు గడ్డలతో పోరాటం చేశాడు. సెప్టెంబర్ 5న జరిగిన ఈ ఘటన జరగ్గా, సుమారు 62 గంటల తర్వాత డెరిక్‌ను రక్షించారు.పడవ బోల్తా పడిన తర్వాత డెరిక్‌తో పాటు అతని అన్న, కజిన్ సముద్రంలో పడిపోయారు. కొంతసేపు ముగ్గురూ ఒకరికొకరు దగ్గరగా ఉండగలిగారు. అయితే పరిస్థితులు మరింత విషమించడంతో అతని అన్న, కజిన్ మునిగి ప్రాణాలు కోల్పోయారు. వారు తన నుంచి దూరంగా కొట్టుకుపోకుండా ఉండేందుకు డెరిక్ తన అన్న, కజిన్ మృతదేహాలను సాధ్యమైనంత ఎక్కువసేపు పట్టుకుని ఉండేందుకు ప్రయత్నించాడు. చివరకు బలమైన సముద్ర ప్రవాహాల కారణంగా వారిని వదులుకోవాల్సి వచ్చింది. దీంతో అతను ఒంటరిగా సముద్రంలో మిగిలిపోయాడు.పడవలోని చేపల వేటకు ఉపయోగించే ఓ లైన్.. ఇంజిన్‌లో చిక్కుకుపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. దాన్ని విడిపించేందుకు వారు ప్రయత్నించారు. కానీ అది సాధ్యం కాలేదు. అనంతరం వాతావరణం ఒక్కసారిగా ప్రతికూలంగా మారడంతో పడవ బోల్తా పడింది. పడవ తిరగబడటంతో అందరూ గడ్డకట్టేంత చల్లని సముద్రంలో పడిపోయారు. కొన్ని గంటలకు డెరిక్ అన్న, కజిన్ మృతి చెందారు. అయినప్పటికీ డెరిక్ వారిని వదలకుండా వీలైనంత వరకు పట్టుకుని ఉన్నాడు. సాయం అందుతుందనే ఆశతో సముద్రంలోనే పోరాడాడు.సెప్టెంబర్ 7 ఉదయం అమెరికా కోస్ట్ గార్డ్ బృందం బోల్తా పడిన పడవను గుర్తించింది. అది సెయింట్ లారెన్స్ ద్వీపానికి తూర్పున సుమారు నాలుగు మైళ్ల దూరంలో ఉంది. అధికారులు ముందుగా డెరిక్‌కు అవసరమైన ప్రాణరక్షణ సామగ్రిని అందించారు. అనంతరం సమీపంలోని నౌక అతడిని రక్షించింది.అప్పటికే డెరిక్ తీవ్ర హైపోథర్మియాతో బాధపడుతున్నాడు. శరీరంలో నీరు తీవ్రంగా తగ్గిపోయి.. చలికి గురై అతని పరిస్థితి విషమంగా ఉంది. అయినప్పటికీ అతను శ్వాస తీసుకుంటూనే ఉన్నాడు. వెంటనే అత్యవసర చికిత్స కోసం అతడిని వైద్య కేంద్రానికి తరలించారు. డెరిక్ అత్త కొలీన్ వాకర్ గోఫండ్‌మీ పేజీలో ఈ విషాద ఘటన వివరాలను వెల్లడించారు. తన అన్న, కజిన్ మునిగిపోయిన తర్వాత వారిని సాధ్యమైనంత ఎక్కువసేపు పట్టుకుని ఉండేందుకు డెరిక్ ప్రయత్నించాడని ఆమె తెలిపారు. -
ఇక చిటికెలో టీబీ గుర్తింపు.. 16 ఏళ్ల కుర్రాడి వినూత్న ఆవిష్కరణ!
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన 16 ఏళ్ల విద్యార్థి ఆస్టిన్ జిన్.. క్షయవ్యాధి (ట్యూబర్క్యులోసిస్-టీబీ)ని రక్త పరీక్ష ద్వారా గుర్తించడంతోపాటు, ఔషధ నిరోధకత కలిగిన బ్యాక్టీరియాను గుర్తించగల క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్స్పేస్డ్ షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్స్(సీఆర్ఐఎస్పీఆర్) ఆధారిత నిర్ధారణ వ్యవస్థను అభివృద్ధి చేశాడు. ఈ పరిశోధనకు గాను ఆస్టిన్ జిన్‌కు 2026 డేవిడ్సన్ ఫెలోషిప్తో పాటు 50,000 డాలర్ల స్కాలర్షిప్ లభించింది.న్యూయార్క్‌లోని గ్రేట్ నెక్లో ఉన్న విలియం ఎ. షైన్ గ్రేట్ నెక్ సౌత్ హైస్కూల్లో సీనియర్ అయిన జిన్.. ఎం- క్యాచ్ అనే డయాగ్నస్టిక్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించాడు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 10 లక్షలకు పైగా మరణాలకు కారణమవుతున్న ట్యూబర్క్యులోసిస్ నిర్ధారణలో ఎదురయ్యే సమస్యను పరిష్కరించేందుకు ఈ వ్యవస్థను అభివృద్ధి చేశాడు.సాధారణంగా టీబీ నిర్ధారణకు ఊపిరితిత్తుల లోతు నుంచి వచ్చే కఫాన్ని ఉపయోగిస్తారు. అయితే చిన్నారులు, తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు తగిన నమూనాను అందించడం కష్టంగా ఉంటుంది. ఈ సమస్యకు భిన్నమైన విధానాన్ని జిన్ తన ప్రాజెక్ట్‌లో అనుసరించాడు. ఎం-క్యాచ్ రక్త సీరమ్‌లో ఉండే బ్యాక్టీరియా ఎన్డీఏ చిన్న భాగాలను గుర్తిస్తుంది. ఇందుకోసం పాలిమరేజ్ చైన్ రియాక్షన్స్‌తో పాటు ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తుంది. టీబీ ఉందా లేదా అన్నదాన్ని గుర్తించడంతోపాటు, కొన్ని ఔషధాలకు బ్యాక్టీరియా నిరోధకతను కలిగించే జన్యు మార్పులను కూడా ఈ పరీక్ష గుర్తించగలదు.ఈ సూక్ష్మ జన్యు మార్పులను గుర్తించేందుకు జిన్ ప్రత్యేక సీఆర్ఐఎస్పీఆర్ గైడ్ ఆరఎన్ఏలను రూపొందించాడు. వాటిని మైక్రోఫ్లూయిడిక్స్ చిప్‌తో అనుసంధానించాడు. దీంతో ఒకేసారి అనేక రియాక్షన్లు నిర్వహించవచ్చు. ఫలితంగా వందలాది రియాక్షన్లను, ఒకటి కంటే ఎక్కువ మ్యుటేషన్లను ఏకకాలంలో పరీక్షించే మల్టీప్లెక్స్ ప్లాట్‌ఫామ్ రూపొందింది. అత్యాధునిక ప్రయోగశాలలు అందుబాటులో లేని ప్రాంతాల్లో పెద్దస్థాయి పరీక్షలకు ఇది భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం ఉంది.భవిష్యత్తులో బయోమెడికల్ ఇంజినీరింగ్, బయోకెమిస్ట్రీ చదివి వైద్యునిగా, శాస్త్రవేత్తగా పనిచేయాలని జిన్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. ప్రయోగశాల పరిశోధనలను వైద్యానికి ఉపయోగపడే సాధనాలుగా మార్చాలనేది అతని ఆశయం. భవిష్యత్తులో ఎం క్యాచ్ ప్లాట్‌ఫామ్‌ను ఇతర అంటువ్యాధులను, క్యాన్సర్‌ను గుర్తించేందుకు కూడా ఉపయోగపడనున్నదని సమాచారం.ఇదీ చదవండి: విశ్వ వీక్షణ నిలయం.. ఈ గణేశ మండపం -
ఇరాన్ విమానంలో భయానక సీన్
టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం ఒక్కసారిగా భారీగా కుదుపులకు గురైంది. ఏం జరుగుతుందో అర్థంకాక ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. ఇంతలో క్యాబిన్ పైకప్పు భాగాలు ఊడిపడి సీట్లపై వేలాడుతూ కనిపించాయి. లగేజీ బిన్లు తెరుచుకుని బ్యాగులు కిందపడటంతో పరిస్థితి మరింత గందరగోళంగా మారింది. చివరకు పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించి విమానాన్ని తిరిగి ఎయిర్‌పోర్టుకు తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది.ఇరాన్‌కు చెందిన సెపెహ్రాన్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737 విమానం మంగళవారం సాయంత్రం మషద్ నుంచి కెర్మాన్‌షాకు బయల్దేరింది. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ల్యాండింగ్ గేర్‌లోని ఓ టైరు ఊడిపోయింది. ఆ టైరు దెబ్బతినడంతో దాని భాగాలు ఇంజిన్‌ను తాకాయి. దీంతో ఇంజిన్‌లో సమస్య తలెత్తి విమానం తీవ్రంగా కుదుపులకు లోనైంది. పైలట్ సాంకేతిక సమస్యను గుర్తించి విమానాన్ని మషద్ వైపు మళ్లించారు. అత్యవసర పరిస్థితిని ప్రకటించి తిరిగి ల్యాండ్ చేయాలని నిర్ణయించారు.భయంతో కేకలు..విమానం తిరిగి వస్తున్న సమయంలో కుదుపులు మరింత తీవ్రంగా మారాయి. ఆ ప్రభావంతో క్యాబిన్ పైకప్పు లోపలి లైనింగ్ భాగాలు ఊడిపోయి ప్రయాణికులపై పడినట్లు వీడియోల్లో కనిపించింది. ఆ సమయంలో ప్రాణ భయంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు. కొన్ని చోట్ల విమానం లోపలి నిర్మాణంలోని భాగాలు కూడా బయటకు కనిపించాయి. లగేజీ బిన్లు తెరుచుకోవడంతో బ్యాగులు సీట్లపై, మార్గంలో పడిపోయాయి. సేఫ్‌గా ల్యాండింగ్..అయితే విమానం మషద్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. లగేజీలు కిందపడ్డా కూడా ప్రయాణికులు, సిబ్బంది ఎవరూ గాయపడలేదు. అనంతరం ప్రయాణికులను మరో విమానంలో కెర్మాన్‌షాకు పంపించినట్లు సమాచారం. ఘటన అనంతరం రన్‌వేను కొంతసేపు మూసివేసి తనిఖీలు నిర్వహించారు.విమానంలో సాంకేతిక లోపానికి అసలు కారణమేంటన్న దానిపై ఇరాన్ పౌర విమానయాన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే ఎయిర్‌లైన్స్‌కు చెందిన మరో విమానం ఆగస్టు 25న మషద్‌లో ల్యాండ్ అవుతుండగా రన్‌వేపై నుంచి పక్కకు వెళ్లిన ఘటన జరిగింది.WATCH: Cabin ceiling falls apart onboard a Sepehran Airlines Boeing 737 after a tire reportedly burst shortly after takeoff from Mashhad Airport causing engine damage and severe vibrations. pic.twitter.com/R7RP1AwZYX— Breaking Aviation News & Videos (@aviationbrk) September 15, 2026 -
వార్త కవరేజీకి వెళ్లి.. హెలికాప్టర్ ప్రమాదంలో ముగ్గురు మృతి!
లాస్ఏంజెల్స్: అమెరికాలోని లాస్ఏంజెల్స్లో గల శాన్ ఫెర్నాండో వ్యాలీలో మంగళవారం ఎస్యూవీ-బస్సు ఢీకొన్న ఘటనను కవర్ చేస్తుండగా, ఓ వార్తా సంస్థ హెలికాప్టర్ కూలిపోవడంతో ముగ్గురు మృతి చెందారు. ప్రమాదానికి ముందు హెలికాప్టర్లో చోటుచేసుకున్న భయానక దృశ్యాలు విమానం లోపల నుంచి తీసిన వీడియోలో కనిపిస్తున్నాయి.చాట్స్‌వర్త్‌లోని ఎన్ మాన్షన ఎవెన్యూ 9100 బ్లాక్ సమీపంలోని ఓ పార్కింగ్ స్థలంలో హెలికాప్టర్ కూలిపోయింది. అక్కడికి సమీపంలోనే అంతకుముందు ఓ ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో ఎస్యూవీ(కారు).. మెట్రో బస్సును ఢీకొనడంతో ఇద్దరు మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారు. హెలికాప్టర్‌లోని కెమెరా రికార్డింగ్‌లో విమానం నియంత్రణ కోల్పోతున్నట్లు కనిపించింది. ఆ తర్వాత అది కూలిపోవడంతో వీడియో రికార్డింగ్ ముగిసింది. రెండు వాణిజ్య భవనాల మధ్య హెలికాప్టర్ కూలిపోయి.. అది పలు వాహనాలు, షిప్పింగ్ కంటైనర్లపై పడింది.లాస్ ఏంజెల్స్ ఫైర్ డిపార్ట్మెంట్ కెప్టెన్ బ్రాండెన్ సిల్వర్‌మన్ సంఘటనా స్థలంలో ఒక వ్యక్తి మృతి చెందినట్లు గుర్తించామని తెలిపారు. హెలికాప్టర్ కూలిన సమయంలో ఆ వ్యక్తి దాని వెలుపల ఉన్నట్లు కనిపించిందన్నారు. ‘హెలికాప్టర్లో ఎంత మంది బాధితులు ఉన్నారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని సిల్వర్‌మన్ విలేకరుల సమావేశంలో తెలిపారు. విమానం చాలావరకు పూర్తిగా ధ్వంసమైందని ఆయన పేర్కొన్నారు. హెలికాప్టర్లో మరెవరైనా ఉన్నారా? విమానం ఎవరిదన్న విషయాన్ని నిర్ధారించేందుకు అగ్నిమాపక సిబ్బంది శిథిలాలను పరిశీలించాల్సి వచ్చింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం హెలికాప్టర్ ఓ టెలివిజన్ స్టేషన్‌కు చెందినది. అయితే ఏ స్టేషన్‌కు చెందినదో వెంటనే నిర్ధారించలేదని సీబీఎస్ తెలిపింది. హెలికాప్టర్ ప్రమాదంపై లాస్ ఏంజెల్స్ పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారని తెలుస్తోంది. BREAKING: KNBC helicopter crashes while covering metro bus crash in Los Angeles, California. https://t.co/TgzkkVTBHx— AZ Intel (@AZ_Intel_) September 16, 2026 -
భారత్‌కు బిగ్ షాక్.. వంద శాతం టారిఫ్‌లకు అమెరికా గ్రీన్‌సిగ్నల్!
వాషింగ్టన్: రష్యా నుంచి చమురు, సహజవాయువు కొనుగోలు చేసే దేశాలపై భారీగా సుంకాలు విధించేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అధికారం కల్పించే కీలక బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభలో ముందడుగు పడింది. ‘లిండ్సేఓ గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026’పై ఓటింగ్‌లో భాగంగా 214–211 ఓట్ల తేడాతో కీలక ప్రొసీజరల్ ఆమోదం పొందింది. ఈ బిల్లులో భారత్, చైనా వంటి రష్యా చమురు కొనుగోలు చేసే దాదాపు 10 దేశాలపై గరిష్ఠంగా 100 శాతం టారిఫ్ విధించే అధికారం అధ్యక్షుడికి ఇవ్వాలని ప్రతిపాదించారు. అయితే, హౌస్‌లో ఈ దశలో జరిగిన ఓటింగ్ తుది ఆమోదం కాదు. బిల్లుపై తుది ఓటింగ్ బుధవారం జరగాల్సి ఉంది. అది ఆమోదం పొందిన తర్వాతే అధ్యక్షుడి సంతకం కోసం వైట్‌హౌస్‌కు వెళ్లే అవకాశం ఉంటుంది.భారత్‌కు ఎందుకు కీలకం?రష్యా నుంచి భారీ స్థాయిలో ముడి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ ఒకటి. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించినప్పటికీ.. భారత్ తన ఇంధన అవసరాల కోసం రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొనసాగించింది. ఇప్పుడు ప్రతిపాదిత అమెరికా చట్టం అమల్లోకి వస్తే.. రష్యా నుంచి ఇంధన దిగుమతులు కొనసాగించే దేశాలపై అదనపు టారిఫ్‌లకు మార్గం ఏర్పడుతుంది. బిల్లులో 100 శాతం వరకు టారిఫ్ విధించే అధికారం అధ్యక్షుడికి ఇవ్వాలని ప్రతిపాదించారు. అంటే చట్టం ఆమోదం పొందినంత మాత్రాన భారత్‌పై వెంటనే 100 శాతం టారిఫ్ అమల్లోకి వచ్చినట్లు కాదు. టారిఫ్ విధించాలా? ఎంత విధించాలి? అనే నిర్ణయం అధ్యక్షుడి వద్దే ఉంటుంది.రష్యాపైనే ప్రధాన గురిఈ బిల్లు కేవలం రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలపై టారిఫ్‌లకు మాత్రమే పరిమితం కాదు. రష్యా నాయకత్వం, ఆర్థిక సంస్థలు, ఇంధన రంగంతో పాటు ఆంక్షలను తప్పించుకోవడానికి ఉపయోగిస్తున్నట్లు అమెరికా భావిస్తున్న ‘షాడో ఫ్లీట్’పై కూడా ఆంక్షలను కఠినతరం చేయాలని ప్రతిపాదించింది. రష్యా చమురు ఆదాయం ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న యుద్ధానికి నిధులుగా ఉపయోగపడుతోందన్నది అమెరికా చట్టసభ సభ్యుల వాదన. అలాగే ఇరాన్‌పై ఇప్పటికే ఉన్న ఆంక్షలను పొడిగించే నిబంధనలు కూడా ఈ ప్యాకేజీలో ఉన్నాయి.సెనేట్‌లో భారీ మెజార్టీతో ఆమోదంఈ బిల్లుకు అమెరికా సెనేట్‌లో ఇప్పటికే భారీ మద్దతు లభించింది. ఆగస్టు 7న సెనేట్ 86–11 ఓట్లతో బిల్లును ఆమోదించింది. అనంతరం ఇది ప్రతినిధుల సభకు చేరింది. సెనేట్‌లో ఆమోదమైన రూపంలో రష్యా ఇంధనాన్ని భారీగా దిగుమతి చేసుకునే దేశాలపై 100 శాతం వరకు టారిఫ్‌లకు అవకాశం కల్పించారు. భారత్, చైనా వంటి దేశాలు ఈ నిబంధన పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని రాయిటర్స్ సహా పలు నివేదికలు పేర్కొన్నాయి.ఇక, బిల్లుకు మద్దతు ఉన్నప్పటికీ.. అమెరికా ప్రతినిధుల సభలో దీనిపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా అధ్యక్షుడికి టారిఫ్‌ల విషయంలో అత్యధిక అధికారాలు ఇవ్వడంపై కొందరు డెమోక్రటిక్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.Breaking || US House to vote on Russia sanctions bill, which could give Trump authority to impose tariffs of up to 100% on countries buying Russian energy.➤ India may face possible 100% tariff➤ India among 10 nations named for tariffs➤ Russia oil buyers: U.S. tariff… pic.twitter.com/4gyjSS8Gi6— TIMES NOW (@TimesNow) September 16, 2026ఇక ఏం జరుగుతుంది?హౌస్‌లో తుది ఓటింగ్ కీలకం. బిల్లు ప్రతినిధుల సభలోనూ ఆమోదం పొందితే అధ్యక్షుడి సంతకం కోసం వెళ్తుంది. ఆ తర్వాతే చట్టంలోని నిబంధనలు అమల్లోకి వచ్చే ప్రక్రియ ప్రారంభమవుతుంది. అందువల్ల ప్రస్తుతం భారత్‌పై 100 శాతం టారిఫ్ విధించినట్లు కాదు.. అయితే అలాంటి చర్య తీసుకునే చట్టపరమైన అధికారాన్ని ట్రంప్‌కు కల్పించే దిశగా అమెరికా కాంగ్రెస్‌లో ప్రక్రియ ముందుకు సాగుతోంది. ఈ పరిణామం భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలతో పాటు, భారత్ కొనసాగిస్తున్న రష్యా చమురు కొనుగోళ్లపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉండటంతో తాజా పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ఇదీ చదవండి: సౌదీకి భారీ షాక్.. గోడ మీద పిల్లిలా హ్యాండిచ్చిన పాక్! -
సౌదీకి భారీ షాక్.. గోడ మీద పిల్లిలా హ్యాండిచ్చిన పాక్!
ప్రపంచ చమురు మార్కెట్‌ను ప్రభావితం చేసే సౌదీ అరేబియా ఇప్పుడు ఊహించని సంక్షోభంలో చిక్కుకుంది. ఎర్ర సముద్ర తీరంలోని కీలక ప్రాంతాలతో పాటు బాబ్ ఎల్-మండేబ్ జలసంధిలో హౌతీలు పట్టు సాధించడంతో.. సౌదీ చమురు ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడే పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు హౌతీల ముప్పు.. మరోవైపు మిత్రదేశాల నుంచి ఆశించిన స్థాయిలో ప్రత్యక్ష సైనిక సహకారం లేకపోవడంతో రియాద్‌కు ‘ముందు నుయ్యి.. వెనుక గొయ్యి’ అన్న చందంగా పరిస్థితి మారింది. మరోవైపు సౌదీ మిత్రదేశంగా ఉన్న పాకిస్తాన్.. యెమెన్‌లో హౌతీలపై నేరుగా పోరాడేందుకు తమ బలగాలను పంపబోమని స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో రియాద్.. అధికారిక దౌత్య సంబంధాలే లేని ఇజ్రాయెల్ నుంచి కూడా పరోక్షంగా సాయం కోరినట్లు వార్తలు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.టెల్ అవీవ్‌కు చెందిన ది జెరూసలెం పోస్ట్ కథనం ప్రకారం.. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) మధ్యవర్తిత్వంతో సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. హౌతీల నుంచి ఎదురవుతున్న ముప్పును ఎదుర్కొనేందుకు ముఖ్యంగా ఇంటెలిజెన్స్ సహాయం కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఇజ్రాయెల్ హయోమ్ కథనం ప్రకారం.. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ (MBS) ఇతర గల్ఫ్ దేశాలు, ఈజిప్ట్ నుంచి కూడా సహాయం కోరినట్లు సమాచారం. కాగా, సౌదీ అరేబియాకు ఇజ్రాయెల్‌తో అధికారిక దౌత్య సంబంధాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ‘ఆపదలో ఆదుకునేవాడే నిజమైన మిత్రుడు’ అన్న సామెత గుర్తుకొచ్చేలా.. రియాద్ ఇప్పుడు తనకు అందుబాటులో ఉన్న ప్రతి మార్గాన్నీ పరిశీలిస్తున్నట్లు కనిపిస్తోంది. యెమెన్‌లో రియాద్ ఎదుర్కొంటున్న భద్రతా సవాళ్ల తీవ్రతను ఈ పరిణామాలు సూచిస్తున్నాయి.అసలు సంక్షోభం ఏంటి?ఇటీవల వరకు సౌదీ ఇంధన మౌలిక వసతులపై అప్పుడప్పుడు డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసిన హౌతీలు.. గత వారం అనూహ్యంగా పెద్ద ఎత్తున దాడికి దిగినట్లు కథనాలు పేర్కొంటున్నాయి. సౌదీ మద్దతున్న నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్‌ను వెనక్కి నెట్టి.. ఎర్ర సముద్ర తీరంలోని విస్తారమైన ప్రాంతాలతో పాటు బాబ్ ఎల్-మండేబ్ జలసంధిలోని కొన్ని ద్వీపాలపై హౌతీలు నియంత్రణ సాధించినట్లు సమాచారం. కాగా, ఈ జలసంధి ద్వారా సౌదీ అరేబియా ఇరాన్ ఆధిపత్యంలో ఉన్న హార్ముజ్ జలసంధికి ప్రత్యామ్నాయంగా ఎర్ర సముద్ర మార్గాన్ని వినియోగించుకోగలదు. ఇప్పుడు ఈ మార్గంపైనా ముప్పు ఏర్పడటంతో సౌదీ చమురు ఎగుమతులపై ఆందోళన పెరిగింది.ఇప్పటికే జులై నుంచి సౌదీ నౌకలపై ఆంక్షలు కొనసాగిస్తున్న హౌతీ నాయకత్వం.. ఈ నిర్బంధాన్ని కొనసాగిస్తామని ప్రకటించినట్లు కథనాలు చెబుతున్నాయి. ఇతర దేశాల నౌకలకు మాత్రం రాకపోకలకు అనుమతిస్తామని పేర్కొన్నట్లు సమాచారం. మరోవైపు సౌదీకి చెందిన కీలక పైప్‌లైన్ వ్యవస్థలపై కూడా దాడులు జరుగుతున్న నేపథ్యంలో.. చమురు ఉత్పత్తి మాత్రమే కాకుండా దాన్ని అంతర్జాతీయ మార్కెట్లకు తరలించే సామర్థ్యంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.పాక్ ఎందుకు వెనక్కి?సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ మధ్య ఏర్పడిన మక్కా డిఫెన్స్ అలయన్స్ నేపథ్యంలో ఇస్లామాబాద్ నుంచి సైనిక సహాయం వస్తుందని రియాద్ ఆశించినట్లు కథనాలు సూచిస్తున్నాయి. అయితే యెమెన్‌లో హౌతీలపై పోరాటానికి తమ బలగాలను పంపే విషయంలో పాకిస్తాన్ వెనక్కి తగ్గినట్లు సమాచారం. సౌదీ భూభాగాన్ని రక్షించేందుకు మాత్రం తమ బలగాలను మోహరించవచ్చని పాక్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అయితే విదేశీ గడ్డపై జరిగే ప్రత్యక్ష యుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనబోమని ఇస్లామాబాద్ స్పష్టమైన గీత గీసినట్లు కథనాలు చెబుతున్నాయి.అమెరికా, బ్రిటన్ కూడా దూరంహౌతీలపై అమెరికా, బ్రిటన్ కూడా ప్రత్యక్ష సైనిక చర్య విషయంలో వెనుకంజ వేసినట్లు కథనాలు పేర్కొంటున్నాయి. అమెరికా ఇంటెలిజెన్స్ సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. యెమెన్‌లో హౌతీలపై నేరుగా దాడులు చేయబోమని స్పష్టం చేసినట్లు సమాచారం. బ్రిటన్ కూడా సైనిక సలహాదారులను అందించే దిశగా ఉన్నట్లు తెలుస్తోంది.ఇజ్రాయెల్ సాయం ఎంతవరకు?ఇజ్రాయెల్ నుంచి సౌదీకి వచ్చే సహాయం కూడా ప్రధానంగా ఇంటెలిజెన్స్‌కే పరిమితం కావచ్చని ఇజ్రాయెల్ హయోమ్ కథనం పేర్కొంది. హౌతీలు ఇజ్రాయెల్ నగరాలపై రాకెట్లతో దాడులు చేసే ప్రమాదం ఉండటంతో.. యెమెన్‌లో ప్రత్యక్ష సైనిక చర్యకు ఇజ్రాయెల్ కూడా పరిమితులు విధించుకునే అవకాశం ఉందని సమాచారం. హౌతీలకు వ్యతిరేకంగా ఏదైనా చర్య తీసుకోవాల్సి వస్తే ఇజ్రాయెల్ ఒంటరిగా కాకుండా విస్తృత అంతర్జాతీయ, ప్రాంతీయ కూటమిలో భాగంగా చేపట్టాలని ఆ దేశ రక్షణ అధికారులు సూచించినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: ట్రంప్ తెచ్చిన యుద్ధం.. అమెరికాకు 3 లక్షల కోట్ల బిల్లు!అయితే, సౌదీ అరేబియా-ఇజ్రాయెల్ మధ్య అధికారిక దౌత్య సంబంధాలు లేకపోయినా, గతంలో కొన్ని సందర్భాల్లో తెరవెనుక సహకారం జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి.1960లలోనే రహస్య సహకారం1960లలో యెమెన్‌లో అంతర్యుద్ధం జరిగినప్పుడు సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ రెండూ సనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న రాయలిస్టు వర్గాలకు మద్దతు ఇచ్చాయి. బ్రూకింగ్స్ ప్రకారం, ఇరుదేశాల ఇంటెలిజెన్స్ వ్యవస్థలు రాయలిస్టులకు ఆయుధాలు, నిపుణుల సహాయం అందించడంలో సమన్వయం చేసుకున్నాయి. అంటే ఇది కొత్తగా ఏర్పడిన సహకారం కాదు.. యెమెన్ విషయంలో ఇరుదేశాలకు ఉమ్మడి శత్రువు ఉన్నప్పుడు దశాబ్దాల క్రితమే పరోక్షంగా కలిసి పనిచేసిన చరిత్ర ఉంది.2010లలో ఇరాన్ అంశం కీలకమైంది. తర్వాత ఇరాన్ ప్రభావం పెరగడంతో సౌదీ, ఇజ్రాయెల్ రెండింటికీ ఒకే భద్రతా ఆందోళన ఏర్పడింది. ముఖ్యంగా ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ మిలీషియాలు, యెమెన్‌లో హౌతీల అంశాల్లో ఇంటెలిజెన్స్, భద్రతా సహకారంపై తెరవెనుక సంప్రదింపులు జరిగినట్లు పలు విశ్లేషణలు పేర్కొంటున్నాయి. 2017లో అప్పటి ఇజ్రాయెల్ సైనిక చీఫ్ గాడి ఐసెన్‌కోట్ కూడా సౌదీతో ఇరాన్‌ను ఎదుర్కొనేందుకు అనుభవాలు, ఇంటెలిజెన్స్ పంచుకోవడానికి ఇజ్రాయెల్ సిద్ధంగా ఉందని సౌదీ మీడియాకు చెప్పారు. -
471 ఏళ్ల క్రితమే నోస్ట్రడామస్ ‘ఒంటరి మెదడు’ హెచ్చరిక?
మనుషుల ఉనికికి కృత్రిమ మేధ (ఏఐ) ముప్పుగా మారొచ్చన్న హెచ్చరికలు ఇప్పటివి కాదని.. 471 ఏళ్ల క్రితమే నోస్ట్రడామస్ తన భవిష్యవాణిలో చెప్పారని ‘వియాన్’ వార్తా సంస్థ ఒక కథనంలో పేర్కొంది. 1555లో ప్రచురించిన Les Prophéties పుస్తకంలో భవిష్యత్తులో ఓ సాంకేతికత.. ప్రపంచాన్ని ఆధీనంలోకి తీసుకునే అవకాశం ఉందన్న సంకేతాలున్నాయని దానిలో పేర్కొంది. ఏఐపై భయాలు ఇటీవలి కాలంలో అందరినీ చుట్టుముడుతున్నాయి. ఏఐ సంస్థ ఆంత్రోపిక్‌లో పనిచేసిన పరిశోధకుడు జాకబ్ కాక్సన్, ఈ సాంకేతికత 2030 నాటికే మానవాళికి తీవ్ర ముప్పు కలిగించవచ్చని హెచ్చరించారు. నోస్ట్రడామస్ 1555లో రాసిన ఒక పుస్తకంలో ‘కొత్త జ్ఞాని’, ‘ఒంటరి మెదడు’, ‘అమరత్వం’, ‘శిష్యులు’ వంటి పదాలు కనిపించాయి. వీటిని కొందరు కంప్యూటర్లు, అప్లోడ్ చేసిన మైండ్ లేదా మెషీన్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించినవిగా అన్వయిస్తున్నారు.నోస్ట్రడామస్ అనుచరులు గతంలో 9/11 దాడులు, ప్రిన్సెస్ డయానా మరణం వంటి ఘటనలను కూడా ఆయన ప్రవచనాలతో అనుసంధానించారు. తాజాగా కాక్సన్ హెచ్చరికలను కూడా ఆ సందేశంతో కలిపి చూస్తున్నారు. బల్గేరియన్ మిస్టిక్ బాబా వంగా కూడా 2026లో ఏఐ కీలక రంగాలను ప్రభావితం చేసి, అనేక ఉద్యోగాలను భర్తీ చేస్తుందని చెప్పినట్లు ఆమె అనుచరులు పేర్కొంటున్నారు. అయితే ఈ వాదనలకు స్పష్టమైన ఆధారాలు లేవని కొందరు అంటారు. సెప్టెంబర్ 9న ఎక్స్‌లో కాక్సన్ చేసిన పోస్టులో ఏఐ సంస్థలు స్వీయ అభివృద్ధి చేసుకునే సూపర్ ఇంటెలిజెన్స్ వైపు వేగంగా సాగుతున్నాయని, ఇది మానవ జీవితాలతో ప్రమాదకరంగా వ్యవహరించడమేనని పేర్కొన్నారు. దశాబ్దం ముగిసేలోపు ఏఐ మానవాళికి అస్తిత్వ ముప్పుగా మారొచ్చని పలువురు పరిశోధకులు భావిస్తున్నారని తెలిపారు.సూపర్‌హ్యూమన్ ఏఐ వ్యవస్థలు మౌలిక వసతులను హ్యాక్ చేయడం, వాస్తవ ప్రపంచ వనరులను సంపాదించడం, ప్రమాదకర జీవ పరిశోధనలను వేగవంతం చేయడం వంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉందని కాక్సన్ హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలకు Anthropic అలైన్మెంట్ సైన్స్ విభాగం నేత ఇవాన్ హ్యూబింగర్ మద్దతు పలికారు. ఏఐ భద్రతపై ఆందోళనల నేపథ్యంలో, కీలకమైన రక్షణ చర్యలు లేకపోతే వచ్చే పదేళ్లలో మానవులు అంతరించిపోయే ప్రమాదం 10 శాతానికి పైగా ఉండొచ్చని హ్యూబింగర్ అంచనా వేశారు.ఇదీ చదవండి: ‘ఎంఎస్’ జీవితాన్ని మలుపుతిప్పిన సదాశివం -
ట్రంప్ తెచ్చిన యుద్ధం: అమెరికాకు 3 లక్షల కోట్ల బిల్లు!! ఇకపై ప్రతీ నెలా మరో 25 వేల కోట్లు!
ఇరాన్‌పై యుద్ధానికి దిగినందుకు అమెరికా ఇప్పుడు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తోంది. ఆరు నెలలు ముగిసినా.. పశ్చిమాసియా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇందుకోసం అమెరికా ఇప్పటిదాకా ఎంత ఖర్చు చేసిందో తెలుసా?.. మన కరెన్సీలో 3,00,00,00,00,00,000. అంటే మూడు లక్షల కోట్లు. ఇదే కాకుండా సైన్యానికి భారీగా నష్టం వాటిల్లింది. ఇది ఇలాగే కొనసాగితే ఇంకా నెలకు రూ.25 వేల కోట్లు చెల్లించుకుంటూనే పోవాలంట!.డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో ఫిబ్రవరి 28న అమెరికా–ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ యుద్ధం మొదలైంది. అయితే ఈ యుద్ధంతో ఇప్పటివరకు అమెరికా రక్షణ శాఖపై పడిన ప్రత్యక్ష వ్యయం ఏకంగా 38 బిలియన్ డాలర్లు. భారత కరెన్సీలో దాని లెక్క రూ.3.2 లక్షల కోట్లు. యుద్ధం ఇదే స్థాయిలో కొనసాగితే ప్రతి నెలా మరో 2–3 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీస్ (CBO) తాజాగా అంచనా వేసింది. ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని అడ్డుకోవడం, అమెరికా భద్రతకు ముప్పును తొలగించడం లక్ష్యంగా ఈ దాడులకు ఆదేశించినట్లు ట్రంప్ అప్పట్లో ప్రకటించారు. అయితే కొన్ని వారాల్లో ముగుస్తుందని భావించిన ఈ సైనిక చర్య సుదీర్ఘ ఘర్షణగా మారింది. సెప్టెంబర్ నాటికీ పోరాటం పూర్తిగా ఆగలేదు. తాజాగా ట్రంప్ ఈ యుద్ధాన్ని ప్రారంభించిన నిర్ణయంపై తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని చెప్పారు. నెలకు మరో రూ.25 వేల కోట్లు!యుద్ధం మరింత కొనసాగితే అమెరికా ఖజానాపై భారం ఆగేలా కనిపించడం లేదు. తక్కువ తీవ్రతతో పోరాటం కొనసాగితే నెలకు సుమారు 2 బిలియన్ డాలర్లు, దాడులు మళ్లీ తీవ్రరూపం దాల్చితే దాదాపు 3 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని సీబీవో తెలిపింది. అంటే భారత కరెన్సీలో చూస్తే ఒక్క నెలలోనే దాదాపు రూ.17 వేల కోట్ల నుంచి రూ.25 వేల కోట్ల వరకు అదనపు భారం పడే అవకాశం ఉంది. ఈ యుద్ధంలో అమెరికా ఖజానాకే కాదు.. ఆ దేశ సైన్యానికీ భారీ నష్టం వాటిల్లింది. ఇరాన్ ప్రతిదాడుల్లో అమెరికా సైనిక స్థావరాలు, మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. పలు విమానాలు, సైనిక పరికరాలు నష్టపోయినట్లు నివేదికలు వెలువడ్డాయి. మరోవైపు ఇరాన్ నుంచి వచ్చిన క్షిపణులను అడ్డుకునేందుకు అమెరికా భారీ సంఖ్యలో ఇంటర్సెప్టర్లను ప్రయోగించాల్సి వచ్చింది. దీంతో యుద్ధం సాగుతున్న కొద్దీ అమెరికా సైనిక సామర్థ్యాలపై, ముఖ్యంగా కీలక ఆయుధ నిల్వలపై ఒత్తిడి పెరుగుతోంది.అసలు ఖర్చు.. క్షిపణులే!ఈ యుద్ధంలో అమెరికా భారీగా క్షిపణులు, ఇంటర్సెప్టర్లను ప్రయోగించింది. ఆగస్టు 1 వరకు ఉపయోగించిన ఆయుధాలను తిరిగి సమకూర్చుకోవడానికే సుమారు 21.7 బిలియన్ డాలర్లు అవసరమవుతాయని సీబీవో లెక్కించింది. ఇందులో ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైళ్లకు 7.3 బిలియన్, మిసైల్ డిఫెన్స్ ఇంటర్సెప్టర్లకు 13.1 బిలియన్ డాలర్లు, ఇతర ఆయుధాలకు 1.2 బిలియన్ డాలర్లు ఉన్నాయి. యుద్ధంలో కోల్పోయిన పరికరాలను భర్తీ చేయడానికి మరో 1.9 బిలియన్ డాలర్లు అవసరమని పేర్కొంది. ఆయుధ నిల్వలకు గండి..డబ్బు ఖర్చవడమే కాదు.. అమెరికా ఆయుధ నిల్వలపైనా యుద్ధం ప్రభావం పడుతోంది. ముఖ్యంగా క్షిపణి రక్షణ ఇంటర్సెప్టర్ల నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయని సీబీవో పేర్కొంది. వాటిని పూర్తిస్థాయిలో తిరిగి సమకూర్చుకోవడానికి ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు రక్షణ కార్యాలయం పెంటగాన్ మాత్రం తమ వద్ద అధ్యక్షుడి వ్యూహాత్మక అవసరాలకు సరిపడా ఆయుధాలు ఉన్నాయని చెబుతోంది. అయితే ఇందుకు విరుద్ధంగా పెంటగాన్ ఇన్స్పెక్టర్ జనరల్ నివేదిక మాత్రం.. యుద్ధం కారణంగా కీలక ఆయుధాల్లో ‘స్ట్రాటజిక్ ఇన్వెంటరీ షార్ట్‌ఫాల్స్’ ఏర్పడ్డాయని పేర్కొంది. హర్ముజ్ మూసివేత.. ప్రపంచానికి మరో దెబ్బఇరాన్తో యుద్ధం ప్రభావం అమెరికా సరిహద్దులకే పరిమితం కాలేదు. హార్ముజ్ జలసంధిలో రవాణా తీవ్రంగా దెబ్బతినడంతో చమురు సరఫరాపై ఒత్తిడి పెరిగింది. యుద్ధం తర్వాత బ్రెంట్ క్రూడ్ ధర రెండో త్రైమాసికంలో బ్యారెల్‌కు 103 డాలర్ల వరకు చేరింది. ఇంధన ధరల పెరుగుదల ఇతర వస్తువులు, రవాణా ఖర్చులపై ప్రభావం చూపడంతో అమెరికాలో ద్రవ్యోల్బణం కూడా పెరిగే అవకాశం ఉందని సీబీవో తెలిపింది. 2027 తొలి త్రైమాసికంలో ద్రవ్యోల్బణం గతంలో వేసిన అంచనాల కంటే 0.5 శాతం పాయింట్లు ఎక్కువగా ఉండొచ్చని పేర్కొంది. ఇంకా అసలు బిల్లు రాలేదు!సీబీవో చెప్పిన 38 బిలియన్ డాలర్లలో యుద్ధానికి సంబంధించిన ప్రతి ఖర్చూ లేదు. అమెరికా స్థావరాలకు జరిగిన నష్టం, భవిష్యత్‌లో వాటి మరమ్మతులు, యుద్ధానికి అప్పులు తీసుకుంటే చెల్లించాల్సిన వడ్డీ, సైనికులకు భవిష్యత్‌లో అందించాల్సిన వైద్య, వైకల్య ప్రయోజనాలు వంటి ఖర్చులు ఇందులో పూర్తిగా లేవు. రక్షణ శాఖ నుంచి సీబీవో కోరిన సమాచారానికి పూర్తి సహకారం అందకపోవడంతో ఈ అంచనాల్లో కొంత అనిశ్చితి కూడా ఉందని బడ్జెట్ ఆఫీస్ స్పష్టం చేసింది. అమెరికాకే కాదు.. డ్యామేజ్ ట్రంప్‌కు కూడా!యుద్ధం ఎప్పుడు ముగుస్తుందన్నది స్పష్టంగా లేకపోవడంతో ఈ బిల్లు చివరకు ఎంతకు చేరుతుందన్నది కీలక ప్రశ్నగా మారింది. మరోవైపు.. ఈ యుద్ధం ట్రంప్ రాజకీయ ప్రతిష్టపైనా ప్రభావం చూపుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆయనకున్న ప్రజాదరణ క్రమంగా తగ్గిపోయిందని రాయిటర్స్ లాంటి పలు ప్రముఖ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేలు చెబుతున్నాయి. ఇరాన్ యుద్ధం, పెరిగిన ఇంధన ధరలు అమెరికన్లలో అసంతృప్తికి కారణమవుతున్నట్లు అవి వెల్లడించాయి.ముఖ్యంగా నవంబర్ మిడ్‌టర్మ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రిపబ్లికన్ పార్టీలో ఆందోళన పెరిగిపోతోంది. యుద్ధ వ్యయం, పెరుగుతున్న ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం, ఆయుధ నిల్వలపై ఒత్తిడి వంటి అంశాలు ట్రంప్ ప్రభుత్వానికి రాజకీయంగా కీలకంగా మారనున్నాయి. ఒకవైపు యుద్ధాన్ని కొనసాగించాల్సిన వ్యూహాత్మక అవసరాన్ని ట్రంప్ సమర్థిస్తుండగా.. మరోవైపు పెరుగుతున్న ఖర్చు, ఆర్థిక భారం, ప్రజాభిప్రాయంపై దాని ప్రభావం ఆయన ముందున్న పెద్ద సవాళ్లుగా మారాయి.ఇదీ చదవండి: అమెరికా ఇలాంటి పని చేస్తుందని కలలో కూడా ఊహించి ఉండరు! -
భద్రతా కారణాలతో విజయ్ లండన్ కార్యక్రమం రద్దు
తమిళనాడు ముఖ్యమంత్రి, సినీ నటుడు విజయ్ కోసం లండన్‌లో భారీగా తరలివచ్చిన అభిమానులకు నిరాశ ఎదురైంది. లండన్‌లోని ప్రముఖ ‘ది షార్డ్’ భవనం వద్ద విజయ్ పాల్గొనాల్సిన కార్యక్రమాన్ని భద్రతా కారణాలతో అధికారులు రద్దు చేశారు. వందలాది మంది అభిమానులు గంటల తరబడి వేచి చూసిన అనంతరం ఈ ప్రకటన వెలువడింది.విజయ్ ప్రస్తుతం తమిళనాడుకు పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో అధికారిక పర్యటనలో భాగంగా యూకేలో ఉన్నారు. ఆయనను చూసేందుకు అభిమానులు మంగళవారం ‘ది షార్డ్’ వెలుపల పెద్ద సంఖ్యలో గుమిగూడారు. పలువురు అభిమానులు చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి గంటల తరబడి అక్కడే నిరీక్షించారు. అయితే భారీగా జనసమీకరణ జరగడంతో ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు.‘అనుమతి రాలేదు.. కార్యక్రమం రద్దు’భద్రతా కారణాలతో కార్యక్రమానికి అవసరమైన అనుమతి లభించలేదని విజయ్ బృందం ప్రకటించింది. లౌడ్‌స్పీకర్ ద్వారా అభిమానులకు సమాచారం అందిస్తూ.. ప్రజల భద్రత దృష్ట్యా కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. దీంతో విజయ్ను ప్రత్యక్షంగా చూసేందుకు వచ్చిన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కొందరు అభిమానులు గంటల తరబడి ఎదురు చూసినట్లు పీటీఐ తెలిపింది.VIDEO | UK: Vijay fan greeting event in London called off due to 'health and safety' reasons after large number of people gather to see Tamil Nadu CM.Announcement was made by the authorities outside CM Vijay's hotel at the Shard in London on Tuesday.(Full video available on… pic.twitter.com/l4GDVUL6Fk— Press Trust of India (@PTI_News) September 15, 2026తలా-దళపతి.. విమర్శలకు టీవీకే కౌంటర్ఇదిలా ఉండగా.. విజయ్ లండన్ పర్యటనపై డీఎంకే విమర్శలు గుప్పించింది. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి లండన్ వెళ్లినట్లు చెబుతున్న విజయ్.. తన స్నేహితుడు, నటుడు అజిత్ కుమార్ పాల్గొన్న కార్ రేసును వీక్షించడంపై డీఎంకే నేతలు ప్రశ్నలు లేవనెత్తారు. పెట్టుబడుల పర్యటన పేరుతో వెళ్లి రేసు కార్యక్రమానికి హాజరయ్యారని విమర్శించారు. దీనిపై టీవీకే నేతలు స్పందిస్తూ.. విజయ్ అధికారిక పర్యటనలో ఉన్నప్పటికీ అజిత్‌ను కలవడంలో తప్పేముందని ప్రశ్నించారు. అంతేకాకుండా అంతర్జాతీయ రేసింగ్‌లో అజిత్‌కు ఉన్న గుర్తింపును తమిళనాడు బ్రాండ్ ప్రమోషన్‌కు ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు.పెట్టుబడుల కోసం విజయ్ యూకే పర్యటనఇదిలా ఉండగా విజయ్ యూకే పర్యటన ప్రధానంగా తమిళనాడుకు భారీ పెట్టుబడులను తీసుకురావడంపైనే సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందంతో కలిసి ఆయన పలువురు పారిశ్రామికవేత్తలు, సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ పర్యటనలో సుమారు రూ.12,300 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన పలు అవగాహన ఒప్పందాలు (MoUs) కుదిరినట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. వీటి ద్వారా రాష్ట్రంలో 9,400కు పైగా హై-వాల్యూ ఉద్యోగాలు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. తమిళనాడును ఆసియాలో అధునాతన తయారీ, సాంకేతిక రంగాలకు కీలక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ పెట్టుబడుల కార్యక్రమాన్ని చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది. విజయ్ తన యూకే పర్యటనను ముగించుకుని బుధవారం భారత్‌కు తిరిగి రానున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: విజయ్‌పై అనుచిత కామెంట్ల ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్ -
మక్కాలో అత్యవసర హెచ్చరికలు
రియాద్: ముస్లింల పవిత్ర నగరం మక్కాలో మంగళవారం అసాధారణ రీతిలో అత్యవసర హెచ్చరికలు జారీ అయ్యాయి. యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదార్లు దాడులను ముమ్మరం చేయడం, ఎర్ర సముద్ర తీరంపై పట్టు సాధిస్తున్న నేపథ్యంలో మక్కాతోపాటు జెడ్డా, తయాఫ్ నగరాలకు ప్రమాద హెచ్చరికలను జారీ చేసింది. సౌదీ పశ్చిమ తీరంపైకి యెమెన్‌లో తయీజ్ నుంచి హౌతీ మిలిటెంట్లు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని, అధికారులు జారీ చేసిన సూచనలను అనుసరించాలని హెచ్చరికల్లో పేర్కొంది. గుంపులుగా తిరగొద్దని, అక్కడి పరిస్థితులపై ఫొటోలు, వీడియోలు తీయవద్దని కోరింది. దాదాపు మూడు గంటల అనంతరం ప్రమాదం తొలగిపోయినట్లు దేశ సివిల్ డిఫెన్స్ విభాగం ప్రకటించింది. ఇటీవలి సంవత్సరాల్లో సౌదీ అరేబియా ఇలాంటి అత్యవసర హెచ్చరిక చేయడం ఇదే మొదటిసారని చెబుతున్నారు. ఎర్ర సముద్ర తీరానికి మక్కా నగరం 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సోమవారం హౌతీలు సౌదీ అరేబియాపైకి వరుసగా బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగారు. ఈ దాడుల్లో 13 మంది గాయపడ్డారు. మంగళవారం సౌదీ అరేబియాలోని ప్రధాన చమురు ఎగుమతి కేంద్రంగా ఉన్న ఎర్ర సముద్ర యాన్బు సహా కనీసం ఆరు నగరాల్లో అత్యవసర హెచ్చరికలు జారీ అయినట్లు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ తెలిపింది. ఇలా ఉండగా, సౌదీ అరేబియా వైమానిక దాడుల కారణంగా యెమెన్‌లోని తయీజ్లో ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి చెందారని, మరో ఇద్దరు గాయపడ్డారని హౌతీలు ప్రకటించారు. కైరోలో యువరాజు సల్మాన్ పరిస్థితులు విషమిస్తున్న సమయంలో సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ మంగళవారం సన్నిహిత మిత్ర దేశం ఈజిప్టులో పర్యటనకు వెళ్లారు. కైరోలో ఈజిప్టు అధ్యక్షుడు ఎల్ సిసితో ఉభయ దేశాలకు ప్రయోజనకరమైన అంశాలపై ఆయన చర్చలు జరిపారని మీడియా తెలిపింది. వారం వ్యవధిలోనే హౌతీలు బాబ్ ఎల్ మాండేబ్ జలసంధిపై పట్టుసాధించారు. సోమవారం ఎర్ర సముద్రంలోని హనీష్ దీవిని కూడా స్వా«దీనం చేసుకున్నట్లు ప్రకటించారు. బాబ్ ఎల్ మాండేబ్ జలసంధి సమీపంలోని కోల్పోయిన భూభాగాన్ని తిరిగి చేజిక్కించుకునేందుకు సౌదీ ప్రభుత్వ యెమెన్ బలగాలు ప్రయత్నించిన నేపథ్యంలో హౌతీలు ఊహించని రీతిలో వారిని తరిమికొట్టారు. ప్రమాదంలో ప్రాంతీయ భద్రత: భారత్ సౌదీ అరేబియాపై హౌతీల దాడులను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఆ దేశంలోని పౌర మౌలిక వనరులు, ఆర్థిక సంస్థలే లక్ష్యంగా హౌతీలు దాడులకు పాల్పడుతుండటంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి ఘటనలు ప్రాంతీయ భద్రతకు ప్రమాదంగా మారాయని, బాబ్ ఎల్ మాండేబ్ జలసంధి గుండా స్వేచ్ఛా నౌకాయానానికి ముప్పుగా మారాయని తెలిపింది. సౌదీ అరేబియాపై హౌతీల దాడుల నేపథ్యంలో విదేశాంగ శాఖ ప్రతినిధి రణదీప్ జైశ్వాల్ పైవ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితులపై ఎప్పటికప్పుడు సౌదీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామన్నారు. -
ఏఐతో ముప్పు వట్టిదే!
వాషింగ్టన్: ఊరందరిది ఒకదారైతే... ఉలిపికట్టెది ఇంకోదారి అని సామెత. కృత్రిమ మేధ విషయంలో ఇప్పుడు ట్రంప్ వ్యవహారమూ ఉలిపికట్టె చందంగానే కనిపిస్తోంది. ఏటికేడాదీ శక్తిమంతమవుతున్న ఏఐ దుర్వీనియోగం కాకుండా.. మనిషి నియంత్రణలోంచి జారిపోకుండా ఉండేందుకు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని, అప్పటివరకూ ఏఐ అభివృద్ధికి కంపెనీలు పగ్గాలు వేయాలని ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఏఐ కంపెనీలు ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్ వ్యవస్థాపకులు సామ్ ఆల్ట్‌మ్యాన్, డారియో అమోడైలతోపాటు స్పేస్ ఎక్స్ఏఐ ఫౌండర్ ఎలాన్ మస్క్‌లు బహిరంగంగా పిలుపునిచి్చన తరువాత కూడా ట్రంప్... ఏఐతో ముప్పు వట్టిదేనని ప్రకటించడం ఈ సామెతను మరోసారి గుర్తు చేస్తుంది. కృత్రిమమేధ దారితప్పే అవకాశముందన్న ఆందోళనలపై ట్రంప్ సోమవారం వ్యాఖ్యానిస్తూ.. ‘‘కొత్త టెక్నాలజీలను పరిమితం చేసే ఏ ప్రయత్నమైనా కుట్రే’’అని అన్నారు. ‘‘ఏఐ ప్రపంచంపై పెత్తనం చెలాయిస్తుంది.. మానవత్వాన్ని నాశనం చేస్తుందన్నది అంతా మోసపూరిత ప్రచారం మాత్రమే’’అని కొట్టిపారేశారు. సోషల్ మీడియాలో వరుస పోస్టుల ద్వారా ఏఐపై ఆందోళనలు అనవసరం అన్న వాదన వినిపించారు. ఆసక్తికరంగా... చైనా ఏఐపై అంతర్జాతీయ సమాజపు పర్యవేక్షణకు మద్దతు పలికింది. కొన్నేళ్లలోనే ఏఐ విపరీతమైన ప్రాచుర్యం సంపాదించుకోవడం మనందరికీ తెలుసు. అప్పటివరకూ అసాధ్యమనుకున్న చాలా విషయాలను ఏఐ సుసాధ్యం చేసింది. అదేసమయంలో ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం చుట్టూ ముసురుకున్న వివాదాలూ అన్ని ఇన్ని కావు. ఏఐ వాడకం కోసం అవసరమై న డేటా సెంటర్లతో కాలుష్యం పెరిగిపోతుందని, విద్యుత్తు, నీరు భారీగా ఖర్చవుతాయన్న ఆందోళనలు వ్యక్తం కావడం ఒకపక్కనుంటే.. ఏఐ స్వయంగా మనిషి నియంత్రణ మీరి ప్రవర్తిస్తుందని, ఇది మరిన్ని సైబర్ మోసాలకు దారితీయడమే కాకుండా... జీవాయుధాల తయారీ వంటి ప్రమాదకర ధోరణులకూ దారి తీయవచ్చునని ఆంత్రోపిక్ వ్యవస్థాపకుడు డారియో అమిడో స్వయంగా ప్రకటించారు. గత శనివారం ఆయన ఇటీవలే నివేదిక విడుదల చేస్తూ.. ఏఐని దుర్వీనియోగం చేస్తూ ఏఐ అభివృద్ధికి కంపెనీలు పగ్గాలు వేయాలని పిలుపునిచ్చారు. ఇంకో ఆరు నుంచి పన్నెండు నెలల్లోపు ఏఐ టెక్నా లజీ ఇంటర్నెట్ మొత్తాన్ని తన గుప్పిట్లోకి తీసుకున్నా ఆశ్చర్యంలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఓపెన్ఏఐ వ్యవస్థాపకుడు సామ్ ఆల్ట్‌మ్యాన్ కూడా అమొడై వాదనలతో దాదాపుగా ఏకీభవిస్తూ ఒక సోషల్ మీడియా పోస్టు పెట్టారు. మరోవైపు మైక్రోసాఫ్ట్ తాజాగా ఏఐ మనిషి నియంత్రణలోనే ఎలా ఉంచుకోవాలన్న విషయంపై నియమ నిబంధనలను ఏర్పాటు చేసింది. చైనా పుంజుకుంటుంది ఏఐ కంపెనీల మాటలు ఎలా ఉన్నా ట్రంప్ మాత్రం ఏఐ విషయంలో అమెరికా తగ్గితే చైనా లాభపడుతుందని వ్యాఖ్యానిస్తూండటం గమనార్హం. ‘‘డేటా సెంటర్లు, ఏఐ టెక్నాలజీలకు వ్యతిరేకంగా ఒక కుట్ర జరుగుతోంది. ఈ విషయంపై సంతోషంగా ఉన్నది ఒక్క చైనా మాత్రమే’’అని ట్రంప్ ఈ మధ్యే చెప్పారు. ఏఐ టెక్నాలజీ విషయంలో ప్రభుత్వం అజమాయిïÙని ట్రంప్ చాలాకాలంగా నిరోధిస్తూ వస్తున్న విషయం చెప్పుకోవాల్సిన అంశం. రెండోసారి అధికారపగ్గాలు చేపట్టిన తరువాత ప్రభుత్వ పర్యవేక్షణకు సంబంధించి బైడెన్ ప్రభుత్వం జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను రద్దు చేసిన ట్రంప్ కంపెనీలకు పూర్తి స్వేచ్ఛనిస్తే పూర్తిస్థాయి మద్దతిస్తూ తనదైన ఆదేశాలు జారీ చేశారు కూడా. ఇదిలా ఉంటే ఏఐ విషయంలో నెమ్మదించా లన్న హెచ్చరికల నేపథ్యంలో అమెరికాలో టెక్నాలజీ కంపెనీల షేర్ల ధరలు తగ్గిపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే... చైనా మాత్రం ఏఐకి ముకుతాడు వేసేందుకు అంతర్జాతీయ స్థాయిలో ప్రయత్నాలు జరగాలని మంగళవారం పిలుపునిచ్చింది. మానవాళి మేలు కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, ఏఐ మనిషి నియంత్రణ దాటకుండా చూసుకోవాలని చైనా విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి గువో జియాకున్ తెలిపారు. ఏఐ అన్నది మానవాళి సమష్టి జ్ఞానం. ప్రజలందరి సొత్తు. అంత్జాతీయ సహకారంతో దీని అభివృద్ధి, పర్యవేక్షణ జరగాలి అని స్పష్టం చేశారు. వచ్చే నెలలో చైనా అధ్యక్షుడి అమెరికా పర్యటనలోనూ ఏఐ నియంత్రణకు సంబంధించిన అంశాలు చర్చకు రావచ్చునని అంచనా. -
వీసా గడువుపై నియంత్రణకు కోర్టు బ్రేకులు
వాషింగ్టన్: విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులు అమెరికాలో ఉండే సమయాన్ని నియంత్రిస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనకు ఫెడరల్ కోర్టు బ్రేక్ వేసింది. మరో రోజులో అమల్లోకి రావాల్సిన ఈ నిబంధన అమెరికా ఆర్థిక, ఉన్నత విద్యా వ్యవస్థలకు భారీ నష్టం చేకూర్చేదని మసాచూసెట్స్ డిస్ట్రిక్ట్ న్యాయమూర్తి సోమవారం వ్యాఖ్యానించారు. దేశ రక్షణ కోసం ఈ నిబంధన అవసరమన్న ప్రభుత్వ వాదనను తోసిపుచ్చారు. భారత్‌సహా అమెరికాలో ఉంటున్న వేలాది మంది విదేశీ విద్యార్థులకు ఈ నిర్ణయం ఎంతో ఊరటనిచ్చేది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ట్రంప్ ప్రభుత్వం ఈ ఏడాది జూలై నెలలో తీసుకొచ్చిన కొత్త నిబంధన ప్రకారం విద్యార్థులు, ఎక్సే్ఛంజ్ విజిటర్ వీసాదారులు అమెరికాలో గరిష్టంగా నాలుగేళ్లు మాత్రమే ఉండవచ్చు. జర్నలిస్టుల విషయంలో ఈ పరిమితి 240 రోజులు మాత్రమే. చైనాకు చెందిన మీడియా వారైతే 90 రోజుల కంటే ఎక్కువ సమయం అమెరికాలో ఉండేందుకు వీల్లేదు. వాస్తవానికి ఈ నిబంధనలు మంగళవారం నుంచి అమల్లోకి రావాల్సి ఉండింది. దేశం మొత్తానికి వద్దని వాదించిన ప్రభుత్వంకొత్త నిబంధనలపై ఇచ్చిన స్టేను ప్రతివాదులకు మాత్రమే పరిమితం చేయాలని, దేశం మొత్తానికి అన్వయించవద్దని అమెరికా ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని మసాచూసెట్స్ ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి ఎఫ్.డెన్నిస్ సెలర్ –4 తిరస్కరించారు. న్యాయమూర్తి నిర్ణయంతో కొత్త నిబంధన అమలుకు బ్రేక్ పడుతుంది. కేసుపై న్యాయస్థానంలో విచారణ సాగుతుంది. అమెరికా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనను సుమారు 600 ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు సవాలు చేశాయి. అయితే అమెరికాలో ఐదు వేలకుపైగా విద్యా సంస్థలున్నాయని, పిటిషనర్లకు మాత్రమే స్టే వర్తింపజేయడం సమస్యలకు దారితీస్తుందని, ఒక్కో విద్యార్థి, సంస్థ ఈ నిబంధనల పరిధిలోకి వస్తారా? లేదా? అన్నది పరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని న్యాయమూర్తి తన తీర్పులో ప్రస్తావించారు. ‘‘సాధారణంగా ఒక పీహెచ్డీ కోర్సు పూర్తయ్యేందుకు ఆరేళ్ల సమయం పడుతుంది. కాబట్టి విద్యార్థి వీసాలకు నాలుగేళ్ల కటాఫ్ విధించడం విచిత్రం’’అని హార్వర్డ్ విద్యాసంస్థ అధ్యక్షుడు అలన్ ఎం గార్బర్ వ్యాఖ్యానించారు. అయితే వీసాలపై ఇలాంటి పరిమితులు విధిస్తేనే మోసాలను అరికట్టవచ్చని, వీసా గడువు తీరిన తరువాత కూడా అమెరికాలో ఉండిపోవడాన్ని అడ్డుకోవచ్చునని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ వాదించింది. అయితే కొత్త నిబంధన కూడా దుర్వీనియోగం అయ్యేందుకు అవకాశముందని న్యాయమూర్తి విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు. ‘‘ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే విదేశీ జర్నలిస్టుల వీసాలు పొడిగించకుండా ఉండేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రయత్నించే అవకాశాలు ఎక్కువ’’అని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు. ‘‘కొత్త నిబంధనకు, దాని వెనుక ఉన్న హేతువుకు మధ్య సంబంధం బలహీనంగా కనిపిస్తోంది. న్యాయమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ కొత్త నిబంధనలు నిజంగానే దేశ భద్రత, సరిహద్దుల రక్షణకు ఉద్దేశించిందా? లేక అప్రకటిత లక్ష్యాల సాధనకా?.. ఉదాహరణకు విద్యాసంస్థలు, మీడియాపై ప్రభుత్వం మరింత పట్టు సాధించేందుకా? అన్న ప్రశ్నలు వస్తున్నాయి’’అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. -
షేక్ హసీనా సన్నిహితులకు మరణశిక్ష!
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆమె సన్నిహితులు ఏడుగురికి బంగ్లాదేశ్‌కు చెందిన ఒక కోర్టు మరణశిక్ష విధించింది. 2024లో జరిగిన అల్లర్ల సందర్భంగా ఏడుగురిని నిందితులుగా పరిగణిస్తూ బంగ్లాదేశ్‌కు చెందిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్-2 ఈ మరణశిక్ష ఖరారు చేసింది.మానవత్వానికి వ్యతిరేకంగా నిందితులు వ్యవహరించారని జస్టిస్ మొహమ్మద్ నజ్రుల్ ఇస్లాం చౌదరి తీర్పు వెల్లడించారు. 2024లో బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ఆధ్వర్యంలోని అవామీ లీగ్ ప్రభుత్వంపై ఆందోళనకారులు తిరగబడ్డ సంగతి తెలిసిందే. ఆందోళనల్ని అణచివేయడానికి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. ఈ సందర్భంగా ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరించిందని అక్కడి ప్రతిపక్షాలు, ఆందోళనకారులు అంటున్నారు. ముఖ్యంగా ఏడుగురు నిందితులు సమావేశమై, ఆందోళనల్ని అణచి వేసేందుకు కుట్రలు చేశారని, హింసకు పాల్పడ్డారని వారిపై అభియోగాలు నమోదయ్యాయి. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఏడుగురు నిందితులకు మంగళవారం మరణశిక్ష విధించింది. మాజీ ప్రధాని షేక్ హసీనాపై గత ఏడాదే ఇదే అంశంలో అక్కడి కోర్టు మరణశిక్ష విధించింది. ఇప్పుడు ఆమె అనుచరులకు శిక్ష పడింది. తాజాగా శిక్షకు గురైన వారిలో అవామీ లీగ్ పార్టీ ప్రధాన కార్యదర్శి, బంగ్లాదేశ్ మాజీ మంత్రి ఒబైదుల్ ఖాదర్, జాయింట్ సెక్రెటరీ బహవుద్దీన్ నసీమ్, మాజీ సమాచార మంత్రి అలీ అరాఫత్, జూబో లీగ్ చైర్మన్ షేక్ ఫాజిల్ షామ్స్ పరాష్, ఈ సంస్థ జనరల్ సెక్రెటరీ మైనుల్ హొసైన్ ఖాన్ నిఖిల్, బంగ్లాదేశ్ ఛాత్రా లీగ్ ప్రెసిడెంట్ సద్దాం హొసైన్, జనరల్ సెక్రెటరీ షేక్ వాలి అసిఫ్ ఉన్నారు.ఇదీ చదవండి: ఇషాన్ కిషన్ ప్రపంచ రికార్డు -
‘అంతరిక్ష ఆయుధాలు’ మోహరించిన అమెరికా.. అసలు ఏంటవి?
భూమి చుట్టూ ఉన్న కక్ష్యలో ‘అంతరిక్ష నియంత్రణ ఆయుధాలు’ మోహరించినట్లు అమెరికా తొలిసారిగా బహిరంగంగా ప్రకటించింది. అమెరికా వాయుసేన కార్యదర్శి ట్రాయ్ మీంక్ ఈ విషయాన్ని వెల్లడించారు. భూమిపై ఉన్న అమెరికా బలగాలను ప్రత్యర్థుల దాడుల నుంచి రక్షించేందుకు ఈ ఆయుధాలను ఉపయోగించవచ్చని ఆయన తెలిపారు.అయితే ఈ ఆయుధాలు ఎప్పుడు కక్ష్యలోకి పంపారు? ఎన్ని ఉన్నాయి? వాటి ప్రత్యేక లక్షణాలు ఏంటి? అనే వివరాలను అమెరికా వెల్లడించలేదు. నిపుణుల అంచనా ప్రకారం ఇవి ఉపగ్రహాలను నేరుగా ఢీకొట్టి ధ్వంసం చేసే ఆయుధాల కంటే.. కమ్యూనికేషన్ వ్యవస్థలను అడ్డుకునే ఎలక్ట్రానిక్ యుద్ధ లేదా రేడియో జామింగ్ పరికరాలు అయ్యే అవకాశం ఉంది.అంతరిక్షంలో ఆయుధాల వినియోగం కొత్త అంశం కాదు. 1967 నాటి ఔటర్ స్పేస్ ఒప్పందం కక్ష్యలో అణ్వాయుధాలు, ఇతర సామూహిక విధ్వంస ఆయుధాలను ఉంచడాన్ని నిషేధిస్తుంది. అయితే సంప్రదాయ ఆయుధాలను భూమి కక్ష్యలో ఉంచడాన్ని అది స్పష్టంగా నిషేధించదు. అందువల్ల ఉపగ్రహ వ్యతిరేక ఆయుధాలు, ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలు వంటి సామర్థ్యాలకు అవకాశం ఉంది.ఇప్పటికే చైనా, రష్యా! చైనా, రష్యా ఇప్పటికే వివిధ అంతరిక్ష వ్యతిరేక సామర్థ్యాలను అభివృద్ధి చేస్తున్నాయని పరిశోధనా సంస్థలు చెబుతున్నాయి. ఉపగ్రహాలను అడ్డుకోవడం, వాటి వ్యవస్థలను నిర్వీర్యం చేయడం లేదా ధ్వంసం చేయడం కోసం జామింగ్, స్పూఫింగ్, సైబర్ చర్యలు, ప్రత్యక్ష ఉపగ్రహ వ్యతిరేక ఆయుధాలు వంటి సామర్థ్యాలు ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. భారత్ కూడా ఉపగ్రహ వ్యతిరేక సామర్థ్యాన్ని ప్రదర్శించింది.అమెరికా ప్రకటనపై చైనా అంతరిక్షాన్ని యుద్ధభూమిగా మార్చడం, ఆయుధ పోటీ పెరగడంపై ఆందోళన వ్యక్తం చేసింది. రష్యా కూడా అంతరిక్షాన్ని ఆయుధ రహిత ప్రాంతంగా ఉంచాలని కోరింది. నిపుణుల ప్రకారం ఈ పరిణామం భవిష్యత్తులో ఉపగ్రహాలపై పోటీని మరింత పెంచే అవకాశం ఉంది. -
11 ఏళ్ల పాటు కీమోథెరపీ : షాకింగ్ నిజం చెప్పిన వైద్యులు
క్యాన్సర్ అనగానే ప్రాణ భయంతో వణికిపోతారు. ఎందుకంటే ఏళ్ల తరబడబి కీమో థెరపీలు, సర్జరీలు అంటూ ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. పైగా కీమో థెరపీ సైడ్ ఎఫెక్ట్స్ తీవ్రంగా బాధిస్తాయి. అయినా కూడా కొన్ని రకాల క్యాన్సర్లు పూర్తిగా తగ్గుతాయన్న నమ్మకం ఉండదు. నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ పరీక్షలు చేయించుకుంటూ, అవసరమైతే చికిత్స తీసుకుంటూ ఉండాలి. అలా బ్రెయిన్ క్యాన్సర్ ఉందని ఒక మహిళ సుదీర్ఘ కాలంపాటు కీమోథెరపీ తీసుకుంది. ఇలా ఒకటీ రెండేళ్లు కాదు ఏకంగా 11 ఏళ్ల పాటు కీమోథెరపీ చేయించుకుంది. తీరా చూస్తే వైద్యులు భయంకరమైన విషయాన్ని వెల్లడించారు.బీబీసీ కథనం ప్రకారం, బెక్ కీ జోన్స్ (Becky Jones) అనే మహిళ 2012లో తీవ్రమైన మైగ్రేన్ తలనొప్పితో బాధపడింది. ఆమెకు తీసిన బ్రెయిన్ స్కానింగ్‌లో ఒక కణితి (Lesion) కనిపించింది. వైద్యులు దానిని ట్యూమర్‌గా భావించి క్యాన్సర్‌గా చికిత్స ప్రారంభించారు. చికిత్స ఆపితే ప్రాణాలకే ముప్పు అని వైద్యులు పదేపదే చెప్పడంతో ఆమె దాన్ని విశ్వసించి, చాలా పట్టుదలగా చికిత్సతీసుకుంది. కానీ 2025లో ఆమె వైద్య రికార్డులను పరిశీలించిన స్వతంత్ర న్యూరో సర్జన్లు, రేడియాలజిస్టులు ఆమెకు అసలు బ్రెయిన్ క్యాన్సరే లేదన్న దిగ్భ్రాంతికరమైన నిజాన్ని వెల్లడించారు. ఇదీ చదవండి: ఫ్రిజ్ పేలి ఒకే కుటుంబంలో నలుగురు సజీవ దహనంనిజం బయటపడిందిలా ఇటీవల ఆమె కేసును స్వతంత్ర నిపుణులు మళ్లీ పరిశీలించడంతో అసలు విషయం బయటపడింది. ఆ స్కానింగ్‌లలో కనిపించింది ట్యూమర్ కాదని, నాడీ వ్యవస్థకు సంబంధించిన వాపు వల్ల ఏర్పడే 'ట్యుమేఫాటివ్ డిమైలినేషన్' (Tumefactive Demyelination) అని తేలింది. ఇది చూడటానికి ట్యూమర్లా కనిపిస్తుంది కానీ క్యాన్సర్ కాదు.ఇదీ చదవండి: ముగ్గురు బిడ్డల హత్య : ఆ తల్లిని బహిరంగ ఉరితీయాలంటూ సంచలన వ్యాఖ్యలుకన్నీటి పర్యవంతమైన బాధితురాలుఆమె తన భాగస్వామిని కలిసిన కొద్ది కాలానికే, పోలీసు వృత్తిలో చేరాలని కలలు కనేది, కానీ అకస్మాత్తుగా ఆమె భవిష్యత్తు అంధకారంగా మారింది. అనుభవజ్ఞుడైన క్యాన్సర్ నిపుణుడు చేసిన ఈ నిర్ధారణ, ఆమె జీవితాన్ని మార్చేసింది. 11 ఏళ్ల కీమోథెరపీ చికిత్సకు దారితీసింది. ఆమె తరచుగా అనారోగ్యానికి గురయ్యేది, కుటుంబ కార్యక్రమాలలో పాల్గొనలేకపోయింది, ఆమె వృత్తికి ఆటంకం కలిగింది మరియు నిరంతరం ఆందోళనతో కుంగిపోయింది. తీరా 34 ఏళ్ల వయసులో, ఆమెకు అసలు క్యాన్సర్ లేదని, స్టెరాయిడ్లతో చికిత్స చేయగలిగే మెదడు వాపు మాత్రమే ఉందని ఇటీవల తెలుసుకుంది. ఇంగ్లండ్‌లోని వెస్ట్ మిడ్లాండ్స్లోని కోవెంట్రీలోని కన్సల్టెంట్ ప్రొఫెసర్ ఇయాన్ బ్రౌన్ తన జీవితాన్ని నాశనం చేశారని జోన్స్ అన్నారు. ఇద్దరు పిల్లల తల్లి అయిన ఆమె, ఈ అనవసరమైన క్యాన్సర్ చికిత్స కారణంగా యూనివర్సిటీ హాస్పిటల్స్ కోవెంట్రీ అండ్ వార్విక్షైర్ (UHCW) NHS ట్రస్ట్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్న 40 మందికి పైగా రోగులలో ఒకరు."నాకు అసలు బ్రెయిన్ ట్యూమరే లేదు. తప్పుడు రోగ నిర్ధారణ (Misdiagnosis) వల్ల నా యువ జీవితంలో ఎక్కువ భాగం ఎలాంటి కారణం లేకుండానే నూనెలో కాలుతున్నట్లు నరకం అనుభవించాను" అని జోన్స్ కన్నీటి పర్యంతమయ్యారు. ఇంగ్లండ్‌లోని వెస్ట్ మిడ్లాండ్స్లోని కోవెంట్రీలోని కన్సల్టెంట్ ప్రొఫెసర్ ఇయాన్ బ్రౌన్ తన జీవితాన్ని నాశనం చేశారని జోన్స్ అన్నారు. ఈ నిజం తెలిసినప్పుడు కుటుంబ సభ్యులందరూ కంటతడి పెట్టుకున్నట్లు ఆమె తరఫు న్యాయవాది టిన్సే తెలిపారు. ఇదీ చదవండి: బిర్యానీ గణేశుడు : షాపు యజమానికి భారీ షాక్Second Opinion ప్రాముఖ్యతఒక తీవ్రమైన వ్యాధి నిర్ధారణ జరిగినప్పుడు, అది అరుదైనదైనప్పుడు లేదా సంక్లిష్టమైనదైనప్పుడు మరో వైద్య నిపుణుడిని సంప్రదించడం ఎంత ముఖ్యమో ఈ ఘటన తెలియజేస్తోంది.క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధి సోకిందంటే ఒక వ్యక్తి కుటుంబ నిర్ణయాలు, ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి, మానసిక ఆరోగ్యం అన్నీ పూర్తిగా మారిపోతాయి. ఏళ్ల తరబడి కీమోథెరపీ చేయించుకోవడం వల్ల శారీరకంగా, మానసికంగా ఎంతో క్షోభను అనుభవించాల్సి వస్తుంది. ఎవరికైనా క్లిష్టమైన సమస్యలు ఎదురైనప్పుడు 'ఫ్రెష్ ఐస్'తో (కొత్త కోణంలో) పరీక్షించడం ఎంత అవసరమో ఈ ఉదంతం నిరూపిస్తోంది. -
విమానంలో నగ్నంగా యువతి రచ్చ రచ్చ
వాషింగ్టన్: అమెరికాలో బాల్టిమోర్ నుంచి మయామికి వెళ్తున్న అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఓ యువతి బట్టలు విప్పింది. తోటి ప్రయాణికుల ఎదుట అసభ్యకరంగా ప్రవర్తించింది. దీంతో విమాన సిబ్బంది కాక్‌పిట్ సిబ్బందిని అప్రమత్తం చేసి, విమానం మయామి చేరుకున్న వెంటనే పోలీసులను పిలిపించారు.అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఏఏ1779 విమానంలో ఈ ఘటన జరిగింది. బాల్టిమోర్/వాషింగ్టన్ ఇంటర్నేషనల్ థర్గుడ్ మార్షల్ విమానాశ్రయం నుంచి రాత్రి 9 గంటల తర్వాత విమానం బయలుదేరింది. షెడ్యూల్ కంటే దాదాపు 2 గంటలు ఆలస్యంగా బయలుదేరిన ఎయిర్‌బస్ ఏ319లో ప్రయాణికులు మయామికి వెళ్తున్నారు.విమానంలోని 9డీ సీటులో కూర్చున్న మహిళ “తన బట్టలన్నీ విప్పేసింది” అని విమాన సిబ్బంది ఎయిర్‌క్రాఫ్ట్ కమ్యూనికేషన్స్ అడ్రెసింగ్ అండ్ రిపోర్టింగ్ సిస్టమ్ సందేశంలో పేర్కొన్నారు. ఆమె ప్రయాణికుల సమక్షంలో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు కూడా తెలిపారు. ఈ విషయాన్ని విమాన సిబ్బంది సంస్థ కార్యకలాపాల కేంద్రానికి తెలియజేసి, విమానం చేరుకునే సమయానికి పోలీసులను సిద్ధంగా ఉంచాలని కోరారు.అయితే ఘటన కారణంగా విమానాన్ని దారి మళ్లించలేదు. అధికారులు నేలపై ఏర్పాట్లు చేసుకుంటుండగా విమానం మయామి వైపు ప్రయాణం కొనసాగించింది. స్థానిక సమయం ప్రకారం రాత్రి 11.23 గంటలకు మయామి అంతర్జాతీయ విమానాశ్రయంలోని నార్త్ టెర్మినల్ డీ2 గేట్‌కు విమానం చేరుకోగా, అక్కడ సిద్ధంగా ఉన్న పోలీసులు మహిళను అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటనకు దారితీసిన కారణం, మహిళ గుర్తింపు, ఆమెపై ఎలాంటి అభియోగాలు నమోదయ్యాయన్న వివరాలు వెంటనే వెల్లడికాలేదు. విమాన ప్రయాణంలో సిబ్బంది పరిస్థితిని ఎలా నియంత్రించారన్నది కూడా స్పష్టంగా తెలియలేదు. -
ముగ్గురు బిడ్డల హత్య : ఆ తల్లిని బహిరంగ ఉరితీయాలంటూ సంచలన వ్యాఖ్యలు
మసాచుసెట్స్‌కు చెందిన లిండ్సే క్లాన్సీ అనే తల్లి తన ముగ్గురు పిల్లలని గొంతు నులిమి హత్య చేసిన కేసు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో విచారణ సందర్బంగా కాంగ్రెస్ సభ్యురాలు నాన్సీ మేస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో లిండ్సేకు బహిరంగ మరణ శిక్ష అమలు చేయాలని డిమాండ్ చేశారు. పిల్లలను చంపితే ఇలాగే ఉంటుందనేది ప్రపంచంలోని తల్లులందరికీ హెచ్చరికలా ఉండాలని ఆమె వ్యాఖ్యానించారు.2023లో జరిగిన ఈ ఘటనపై విచారణ ముగిసిన తర్వాత, ఇటీవల కోర్టులో మిస్ ట్రయల్ (Mistrial) ప్రకటించారు. తీవ్రమైన ప్రసవానంతర మానసిక సమస్య (పోస్ట్‌పార్టం సైకోసిస్) కారణంగానే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆమె తరఫు న్యాయవాదులు వాదించారు. ఏడు రోజుల పాటు సుదీర్ఘ చర్చల తరువాత 9 మంది మహిళలు, ముగ్గురు పురుషులతో కూడిన జ్యూరీ ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. మానసిక పరిస్థితి కారణంగా ఆమె నిర్దోషి అని 11 మంది జ్యూరీ సభ్యులు ఓటు వేయగా, ఒకరు మాత్రం వ్యతిరేకించారు. దీంతో జ్యూరీ ప్రతిష్టంభన నెలకొనడంతో జడ్జి విలియం సుల్లివన్ మిస్ ట్రయల్ ప్రకటించారు.ఇదీ చదవండి: రూ. 12,300 కోట్ల సీఎం విజయ్ డీల్ : 9 వేల ఉద్యోగాలుదీనిపై దక్షిణ కరోలినా కాంగ్రెస్ మహిళ నాన్సీ మేస్ ఈ కేసుపై తీవ్రంగా స్పందించారు. లిండ్సే క్లాన్సీకి మరణశిక్ష విధించాలని, అది కూడా అందరికీ ఒక హెచ్చరికగా బహిరంగ మరణశిక్ష (Public Execution) కావాలని ఆమె డిమాండ్ చేశారు. పిల్లలు చనిపోయారు కనుక ఆమెకు మరణశిక్ష విధించాలి. అదీ బహిరంగంగా జరగాలి. కాల్చి చంపినా, విద్యుత్ కుర్చీలో కూర్చోబెట్టినా ఏదైనా పర్వాలేదు. కానీ ప్రపంచంలోని తల్లులందరికీ ఒక హెచ్చరికలా ఉండాలని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, లిండ్సే క్లాన్సీని క్షమించాలని ఆమె తరఫు న్యాయవాది కెవిన్ రెడ్డింగ్టన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కోరడాన్ని నాన్సీ మేస్ తీవ్రంగా తప్పుబట్టారు.కాగా మూడో బిడ్డ పుట్టిన తర్వాత కొన్ని నెలల పాటు లిండ్సే క్లాన్సీ మానసిక ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. ప్రసవానంతర మానసిక రుగ్మతతో నిద్రలేమి, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలతో సతమతమవుతూ ఉండేది. దీంతో ఆమె నిపుణులను సంప్రదించింది. చికిత్స తీసుకుంది. కానీ అవేవీ పనిచేయకపోవడంతో, ఆమె ఒక మానసిక వైద్య ఆసుపత్రిలో చేరింది. ఆసుపత్రి నుంచి విడుదలైన పంతొమ్మిది రోజుల తర్వాత, ఆమె మసాచుసెట్స్‌లోని తమ ఇంట్లో తన ముగ్గురు పిల్లలను గొంతు నులిమి చంపేసింది. భర్త పాట్రిక్ క్లాన్సీ ఇంటిలో లేని సమయంలో లిండ్సే తన ముగ్గురు పిల్లలను గొంతు నులిమి హత్య చేసింది.ఇదీ చదవండి: బిర్యానీ గణేశుడు : షాపు యజమానికి భారీ షాక్ ఆమె తీవ్రమైన పోస్ట్‌పార్టం డిప్రెషన్, సైకోసిస్‌తో బాధపడుతున్నట్లు వైద్య నిపుణులు కోర్టులో వెల్లడించారు. పిల్లలను హాని చేయాలనే ఆలోచనలు వస్తున్నాయని, ఒక పురుషుడి గొంతు తనను హెచ్చరిస్తున్నట్లు ఆమె అంతకుముందే తన భర్తకు, తల్లికి తెలిపింది. హత్య జరిగిన సమయంలో ఆమె వాస్తవ ప్రపంచానికి దూరంగా, తీవ్రమైన మానసిక అస్థిరతలో ఉందని వైద్య సాక్షులు తెలిపారు.2023 జనవరిలో జరిగిన ఈ హత్యలకు ఆమె మాజీ భర్తే మొదటి సాక్షి. అతను తన భార్యను క్షమించానని, ఆమెను చెడ్డదానిగా కాకుండా అనారోగ్యంతో ఉన్నదానిగా భావించానని ఇంటర్వ్యూలలో చెప్పాడు. -
చైనా స్పై గేమ్.. ఇక నీటిలో చేపను నమ్మేదెలా!?
మొన్నీమధ్యే రోబోట్ గేమ్స్‌తో అబ్బురపరిచిన డ్రాగన్ దేశం.. ఇప్పుడు మరో టెక్నాలజీ మాయాజాలంతో ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఇప్పటివరకు డ్రోన్లు అంటే ఆకాశంలో ఎగిరేవే.. కానీ చైనా మాత్రం వాటి పరిధిని నీటి అడుగునకూ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. అచ్చం చేపలా కనిపిస్తూ.. చేపలాగే ఈదుతూ.. నీటిలో తన ఉనికి ఏమాత్రం అనుమానం రాకుండా కదిలే ఓ రోబోటిక్ చేపను అభివృద్ధి చేసింది. దూరం నుంచి చూస్తే నిజమైన చేపే అనిపించే ఈ యంత్రం.. దగ్గరగా పరిశీలిస్తే మాత్రం సెన్సర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అధునాతన సాంకేతికతతో కూడిన నిఘా రోబోగా కనిపిస్తుంది.బీజింగ్‌లోని షౌగాంగ్ పార్క్‌లో జరుగుతున్న 2026 చైనా ఇంటర్నేషనల్ ఫెయిర్ ఫర్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్ (CIFTIS)లో రోబో చేప ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సుమారు మూడు కిలోల బరువు ఉన్న ఈ బియోనిక్ రోబో చేప పేరు.. గోల్డెన్ డ్రాగన్ ఫిష్(BG-5). గోల్డెన్ అరోవానా చేపకు జిరాక్స్‌లా ఉందది. అంతేకాదు.. నీళ్లలో ఈదుతూ.. అడ్డంకులు ఎదురైతే తన దారిని తానే మార్చుకుంటూ ముందుకు సాగింది. దీనికి ఏ రిమోట్ అక్కర్లేదు. ఏ ప్రొగ్రామింగ్ చేయాల్సిన అవసరం లేదు. లోపల మాత్రం మోటార్లు, సెన్సర్లు, ఎలక్ట్రానిక్ వ్యవస్థలు ఉంటాయి. సాధారణ అండర్‌వాటర్ డ్రోన్లు ప్రొపెల్లర్లతో కదులుతాయి. కానీ ఇది మాత్రం తోకలో ఉండే 3 కదిలే జాయింట్లు, 7 సెగ్మెంట్లు ఉంటాయి. వాటిని ఊపుతూ ముందుకు సాగుతూ నీటిలో అలల తరహా కదలికలను చూపిస్తుంది. దీంతో ఏదో యంత్రం కదులుతున్నట్లు కాకుండా.. అచ్చం జీవం ఉన్న చేప ఈదుతున్నట్లుగా కనిపిస్తుంది. ఈ సహజమైన కదలికే దీని అసలు బలం. 3 కిలోలే.. కానీ టెక్నాలజీ మాత్రం భారీదే!BG-5 పరిమాణం చూస్తే ఆశ్చర్యమే. ఇది సుమారు 640 మిల్లీమీటర్ల పొడవు, 204 మిల్లీమీటర్ల వెడల్పు, 90 మిల్లీమీటర్ల ఎత్తు ఉంటుంది. బరువు కేవలం 3 కిలోలు. గరిష్టంగా 5 మీటర్ల లోతులో పనిచేయగలదు. గరిష్ట వేగం సెకనుకు 0.6 మీటర్లు. అంటే ఇది సముద్రంలో నిఘాకు పనికి రాదన్నమాట!. తక్కువ లోతున్న నీళ్లలో పని చేసే రోబో మాత్రమే. Look at the quality of this fish drone that China just revealed pic.twitter.com/v24asLP4d1— The Gulag (@WelcomeTheGulag) September 15, 2026 అయితే ఈ టెక్నాలజీ భవిష్యత్తులో గూఢచర్యానికి ఉపయోగపడుతుందా? అనే ఆందోళనను కూడా రేకెత్తిస్తోంది. దాని చుట్టూ ఉన్న సెన్సార్లు.. ఏదైనా ఆటంకాలు ఎదురైతే దానంతట అదే తప్పించుకుని ముందుకు సాగుతుంది. అంటే నీటిలో పరిస్థితులు మారినా.. ఎదురుగా ఏదైనా వస్తే ఆగిపోకుండా, దాన్ని తప్పించుకుని ఓ నిజం చేపలా ముందుకు వెళ్లగలదు. పైగా మనుషులు సాధారణంగా ఉపయోగించే అండర్‌వాటర్ డ్రోన్లా బయటికి యంత్రంలా కనిపించదు. దీంతో చేప రూపంలోనే నిఘా పెట్టే కొత్త రోబోను చైనా ప్రదర్శించిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు మాయ ఇక్కడే..ఒక పెద్ద అండర్‌వాటర్ డ్రోన్ నీటిలోకి వస్తే దాన్ని గుర్తించడం కొంత సులభం. కానీ చేపల గుంపులో ఒక చేపలా కనిపించే రోబోను గుర్తించడం అంత సులభం కాకపోవచ్చు. ఇదే కారణంగా BG-5ను షాలో-వాటర్ రీకానైసెన్స్, సర్వైలెన్స్ కోణంలో నిపుణులు పరిశీలిస్తున్నారు. అయితే ప్రస్తుతం చైనా సైనిక గూఢచర్యానికి ఉపయోగిస్తోందని నిర్ధారించే ఆధారం లేదు. కంపెనీ మాత్రం పౌర అవసరాలకూ ఉపయోగించవచ్చని చెబుతోంది.కానీ, ఈ రోబోను తయారు చేసిన సంస్థకు రక్షణ రంగానికి సంబంధించిన అండర్‌వాటర్ రోబోటిక్స్‌లో పనిచేసిన నేపథ్యం ఉంది. ఈ సంస్థ గతంలో రోబో షార్క్ (ROBO-SHARK) అనే బయోమిమెటిక్ అండర్‌వాటర్ రోబోను సైనిక యూనిట్‌తో కలిసి అభివృద్ధి చేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అలాగే నీటి అడుగున బయోమిమెటిక్ డిటెక్షన్ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించిన రక్షణ ప్రాజెక్టులో పనిచేసినట్లు సంస్థే పేర్కొంది. China will turn anything that moves into a spying machine—Chinese cars, Chinese products, and now even fish. China wants to control all of us. China is a real threat to the freedom of every person on the planet. pic.twitter.com/ycou8OaVQy— Israel & World News (@Nonstopnews_) September 15, 2026..గుంపుగా వస్తే?ఇక్కడ ఇంకో విషయం మరింత ఆందోళన కలిగిస్తోంది. BG-5కు సంబంధించిన రూట్ మ్యాప్, పనుల కేటాయింపు, ఫార్మేషన్ కంట్రోల్, బహుళ రోబోట్ల మధ్య సమన్వయం వంటి సామర్థ్యాలను కంపెనీ ప్రస్తావించింది. అంటే భవిష్యత్తులో ఒక్క రోబో చేప కాకుండా.. చేపల గుంపులా అనేక రోబోలు నీటిలోకి వెళ్లి, ఒక్కొక్కటి ఒక్కో ప్రాంతాన్ని గమనించే పరిస్థితి రావొచ్చు. ఒకటి సమాచారం సేకరిస్తే.. మరొకటి మరో ప్రాంతాన్ని పరిశీలించడం.. వాటన్నింటినీ సమన్వయం చేయడం సాధ్యమయ్యే దిశగా టెక్నాలజీ వెళ్తోంది. ఇప్పటివరకు BG-5ను “స్పై ఫిష్” అని అధికారికంగా పిలవడం లేదు. కానీ దాని సహజమైన రూపం, స్వయంచాలకంగా దారి మార్చుకునే సామర్థ్యం, నీటి అడుగున పరిశీలనకు అనువైన డిజైన్, తయారీ సంస్థకు ఉన్న రక్షణ రంగ అనుసంధానాలు.. ఇవన్నీ కలిపి చూస్తే ఈ టెక్నాలజీ భవిష్యత్తులో నిఘా, పరిశఋలన వంటి భద్రతా కార్యకలాపాలకు ఉపయోగపడే అవకాశాన్ని మాత్రం కొట్టిపారేయలేం.యంత్రం యంత్రంలా కనిపించకుండా.. ప్రకృతిలోని జీవిలా కలిసిపోయేలా చేయడమే ఈ టెక్నాలజీ వెనుక అసలు ఆలోచన. నేడు చేప రూపంలో కనిపించిన ఈ రోబోట్.. రేపు పురుగు, తేనెటీగ, డ్రాగన్‌ఫ్లై రూపంలోనూ నిఘా కోసం రంగంలోకి దిగితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో! అసలు ప్రశ్న ఒక్కటే.. మన చుట్టూ కనిపిస్తున్న జీవుల్లో ఎన్ని నిజమైనవో.. ఎన్ని నిఘా యంత్రాలో గుర్తించడం ఎలా?.ఇదీ చదవండి: కరాచీలో ‘ధురంధర్-3’ షూటింగ్


