ఇరాన్‌ తదుపరి సుప్రీం లీడర్‌ ఎంపిక పూర్తి..! | Iran israel And US war live update On 8th March 2026 | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

ఇరాన్‌ తదుపరి సుప్రీం లీడర్‌ ఎంపిక పూర్తి..!

ఐఆర్‌జిసి స్పేస్ కమాండ్‌పై ఐడీఎఫ్‌ దాడులు

  • ఐఆర్‌జిసి స్పేస్ కమాండ్‌పై ఐడీఎఫ్‌ దాడులు
  • అధిక జనాభా కలిగిన పౌర ప్రాంతాలపై ఇరాన్‌ దాడులు చేస్తుంది: అమెరికా
  • ఇది మానుకోకపోతే మేము దాడులు తీవ్రతరం చేస్తాం: అమెరికా
2026-03-08 21:42:35

ఇద్దరు ఇజ్రాయెల్‌ సైనికుల మృతి

  • దక్షిణ లెబనాన్‌లో పోస్ట్ వద్ద జరిగిన కాల్పుల్లో ఇద్దరు  ఇజ్రాయెల్‌(ఐడిఎఫ్) సైనికులు మృతి
  • లెబనీస్ సరిహద్దులో కొత్తగా స్థాపించబడిన ఐడిఎఫ్ పోస్ట్ వద్ద చిక్కుకున్న సాయుధ వాహనాన్ని రక్షించడానికి పంపిన డి 9 బుల్డోజర్ కాల్పులకు గురై ఇద్దరు ఇంజనీరింగ్ సైనికులు మరణించారు; 
2026-03-08 19:49:19

ఇరాన్‌పై యూఏఈ దాడి

  • ఇరాన్‌పై యూఏఈ తొలి దాడి
  • డీశాలినేషన్ ప్లాంట్‌ను లక్ష్యంగా దాడులు
  • యూఏఈపై  ఇరాన్‌ వరుస దాడులు
  •  అందుకు బదులుగా ఇరాన్‌పై యూఏఈ దాడులు
  • మాపై దాడులు ఆపకపోతే యుద్ధంలో మేము కూడా జాయిన్‌ కావాల్సి ఉంటుంది
  •  ఇరాన్‌కు యూఏఈ వార్నింగ్‌
2026-03-08 18:09:01

ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల్లో 18 మంది మృతి

దక్షిణ గాజా: 

  • ఖాన్‌ యూనిస్‌ నగరంపై ఇజ్రాయెల్‌ దాడులు
  • ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల్లో 18 మంది మృతి
  • మృతుల్లో ఎక్కువ మంది ఒకే కుటుంబానికి చెందిన వారు
     
2026-03-08 16:19:16

ఇరాన్‌ తదుపరి సుప్రీం లీడర్‌ ఎంపిక పూర్తి..!

  • కొత్త నాయకుడిని ఇరాన్‌ ఎన్నుకున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు
  • నాయకుడిని ప్రకటించనున్న అసెంబ్లీ సెక్రటేరిట్‌ అధిపతి
  • అధికారికంగా పేరు బయటపెట్టకపోయినప్పటికీ ఖమేనీ కుమారుడు ముజ్తబానే కొత్త నాయకుడిగా ఎన్నిక
  • వారసత్వ నాయకత్వంపై అసెంబ్లీలో కొంతమంది సభ్యుల అసంతృప్తి
  • అసంతృప్తి నేపథ్యంలో కొత్త నాయకుడి ప్రకటన జాప్యం
  • కొత్త నాయకుడిని  ఇజ్రాయెల్‌ లక్ష్యంగా చేసుకునే అవకాశం
  • కొత్త నాయకుడి పేరు ప్రకటించే లోపు భారీ భద్రతా ఏర్పాట్లు
     
2026-03-08 16:16:37

ఇరాన్‌ యురేనియం నిల్వలపై యూఎస్‌ నిఘా వర్గాల కన్ను

  • ఇరాన్‌ యురేనియం నిల్వలపై యూఎస్‌ నిఘా వర్గాల కన్ను
  • ఇస్ఫహాన్ అణు కేంద్రంలో 440 కిలోల 60% సుసంపన్నమైన యురేనియంను ఇరాన్ పునరుద్ధరించే పనిలో ఉంది: అమెరికా నిఘా వర్గాలు
  • ఈ   యురేనియంను తరలించే ఏ ప్రయత్నమైనా  మేం పసిగట్టగలం
  • దీన్ని నిశితంగా మా టీమ్‌ పరిశీలిస్తోంది
2026-03-08 15:17:25

ఆరు నెలలపాటు భీకర యుద్ధం చేసే సత్తా ఉంది: ఇరాన్‌

  • దక్షిణ మరియు మధ్య ఇజ్రాయెల్ వైపు  ఇరాన్‌ దాడులు
  • మేం దాడులు కొనసాగిస్తాం
  • ప్రతీకారం  తీర్చుకుంటాం
  • ఆరు నెలల పాటు తీవ్రమైన యుద్ధం చేసే సత్తా మాలో ఉంది: ఇరాన్‌
2026-03-08 15:09:19

ట్రంప్‌కు ఇరాన్‌ సెక్యూరిటీ చీఫ్ వార్నింగ్

  • ఖమేనీ హత్యకు ట్రంప్ మూల్యం చెల్లిస్తారు
  • ఇరాన్  సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజనీ  వార్నింగ్
  • 1000 మందికి పైగా ప్రజలను పొట్టనబెట్టుకున్నారు
  • వెనిజువెలా మాదిరి ఇరాన్‌లో చేద్దామని ప్రయత్నించారు
  • ఇరాన్‌ పరిస్థితులను అంచనా వేయడంలో అమెరికా విఫలమైంది
  • నాయకుడి హత్యకు ప్రతీకారం తీర్చుకుంటాం
     
2026-03-08 13:49:27

అమెరికా సైనికులను బంధించిన ఇరాన్‌

  • ఇజ్రాయెల్‌,గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ క్షిపుణులతో దాడి

  • బహ్రెయిన్‌,ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్‌ దాడి

  • ఇరాక్‌లోని ఇర్బిల్‌ ఎయిర్‌పోర్టు లక్క్ష్యంగా ఇరాన్‌ దాడి

  • ఇరాన్‌ దాడుల్లో దుబాయ్‌లోని 23 మెరీనా టవర్‌ ధ్వంసం

  • బహ్రెయిన్‌లోని సల్మాన్‌ పోర్టుపై ఇరాన్‌ డ్రోన్‌ దాడి

  • కువైట్‌లోని అమెరికా స్థావరంపై భారీ డ్రోన్‌ దాడి

  • కువైట్‌ ఎయిర్‌పోర్టు వద్ద ఆయిల్‌ ట్యాంకర్లపై ఇరాన్‌ దాడి

  • ఇద్దరు భద్రతా సిబ్బంది మృతి చెందారన్న కువైట్‌

  • పలువురు అమెరికా సైనికులను బంధించిన ఇరాన్‌

2026-03-08 11:44:48

యూకే ప్రధాని స్మార్టర్‌పై ట్రంప్‌ సీరియస్‌

  • వార్‌ విషయంలో యూకే వర్సెస్‌ యూఎస్‌

  • యూకే ప్రధాని కీర్ స్టార్మర్ పై ట్రంప్‌ సీరియస్‌

  • యుద్ధం కోసం ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ వార్‌షిప్‌ రెడీ 

  • పశ్చిమాసియాకు తరలించే అంశంపై నిర్ణయం తీసుకోలేదన్న స్టార్మర్

  • మేం యుద్ధం గెలిచాం.. మీ అవసరం మాకు లేదని ట్రంప్‌ స్పష్టం 

2026-03-08 11:20:08

మాట తప్పిన ఇరాన్.. పక్క దేశాలపై దాడులు

  • పొరుగు దేశాలపై కొనసాగుతున్న ఇరాన్ దాడులు

  •  బహ్రెయిన్‌పై మిస్సైళ్ల దాడి చేస్తున్న ఇరాన్ 

  •  కువైట్‌లోని నివాస సముదాయాలపై డ్రోన్ల దాడి

  • పొరుగు దేశాలపై దాడి చేయమని చెప్పిన ఇరాన్ ప్రెసిడెంట్

  • దాడి చేయమని చెప్పి మాట  తప్పిన ఇరాన్ 
     

2026-03-08 11:05:33

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ కీలక ప్రకటన

  • ఇరాన్‌తో యుద్ధం కొనసాగిస్తాం 

  • దాడికి మా సైన్యం సిద్ధంగా ఉంది

  • ఆరు నెలలైనా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం 

  • ఇరాన్‌లో పాలన అంతం చేయడానికి మా వద్ద స్పష్టమైన ప్రణాళిక ఉంది

2026-03-08 10:26:05

ట్రంప్ కీలక ప్రకటన

  • ఇరాన్‌ ప్రభుత్వంపై దాడికి కుర్దిష్ మిలీషీయాను ప్రోత్సహించం 

  • దాడికి ప్రోత్సహించమని స్పష్టం చేసిన అమెరికా అధ్యక్షుడు

 

2026-03-08 10:11:32

టెహ్రాన్‌లో భారీ పేలుళ్లు

  • టెహ్రాన్ గగన తలంలో భారీ పేలుళ్లు

  • IRGC సైన్యం, ఇంధన నిల్వకేంద్రాలే లక్షంగా దాడులు
     

2026-03-08 10:11:32

ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌,కరాజ్‌ నగరాల్లో భారీ పేలుళ్లు

  • లెబనాన్‌ రాజధాని బిరూట్‌లోని రౌషేపై ఇజ్రాయెల్‌ దాడి

  • 2024 హెజ్‌బొల్లా,ఇజ్రాయెల్‌ యుద్ధం ప్రారంభమైన తర్వాత  రౌషేపై ప్రాంతంపై తొలిసారి ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు

  • ఇజ్రాయెల్‌ దాడిలో నలుగురు మృతి,పది మందికి గాయాలు

  • ఇరాన్‌ ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్స్ప్‌కి చెందిన కీలక కమాండర్లే లక్క్ష్యంగా ఇజ్రాయెల్‌ సైన్యం దాడి

  • ఇరాన్‌ ఇంధన కేంద్రాలపై ఇజ్రాయెల్‌ మెరుపు దాడులు

  • ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌,కరాజ్‌ నగరాల్లో భారీ పేలుళ్లు

2026-03-08 08:59:24

ఇరాన్‌పై నిప్పులు చెరుగుతున్న ఇజ్రాయెల్,అమెరికా‌‌

  • యుద్ధం తొమ్మిదవ రోజైన ఆదివారం 

  • రాజధాని టెహ్రాన్ సహా పలు నగరాలపై నిప్పులు చెరుగుతున్న ఇజ్రాయెల్,అమెరికా‌‌

  • హెజ్‌బొల్లా,ఇతర తీవ్రవాద సంస్థలకు డబ్బులు,ఆయుధాలను సరఫరా చేసేందుకు టెహహ్రాన్‌లోని మెహ్రాబాద్‌ ఎయిర్‌పోర్టును వినియోగిస్తున్న ఇరాన్‌

  • ఈ ఎయిర్‌పోర్టుపై 80కిపైగా యుద్ధ విమానాలపై విరుచుకుపడ్డ అమెరికా,ఇజ్రాయెల్‌

  • ఎయిర్‌పోర్టుతో పాటు 16 ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ కోర్‌ (ఐఆర్‌జీసీ) యుద్ధ విమానాలు ధ్వంసం

2026-03-08 08:03:39

ఇంధన మౌలిక సదుపాయాలపై ఇదే అతిపెద్ద దాడి

  • ఇరాన్‌పై కొనసాగుతున్న అమెరికా-ఇజ్రాయెల్‌ దాడులు

  • అమెరికా-ఇజ్రాయెల్‌ సంయుక్త దాడులతో అట్టుడుకుతున్న టెహ్రాన్‌

  • ఇరాన్‌లోని ఆయిల్‌ స్టోరేజీ ట్యాంకులను టార్గెట్‌ చేసిన ఇజ్రాయెల్‌

  • టెహ్రాన్‌ సమీపంలో 30కి పైగా ఆయిల్‌ రిఫైనరీ కేంద్రాలు

  • స్టోరేజ్‌ సైట్లే లక్ష్యంగా విరుచుకు పడిన ఇజ్రాయెల్‌

  • ఇరాన్‌ కూడా మిడిల్‌ ఈస్ట్‌లో ప్రతిదాడులు చేయొచ్చని అంచనా

  • యుద్ధం మొదలైన తర్వాత ఇంధన మౌలిక సదుపాయాలపై ఇదే అతిపెద్ద దాడి  

  • నగరానికి మూడువైపుల ఉన్న ఆయిల్‌ రిఫైనరీలపై దాడులు

  • ఆయిల్‌ డిపోలపై దాడులు  

  • ప్రపంచ వ్యాప్తంగా ఇంధన ధరలు మరింత పెరిగే అవకాశం

2026-03-08 07:22:18

పశ్చిమాసియాలో కురుస్తున్న నిప్పుల వాన

  • పశ్చిమాసియాలో కురుస్తున్న నిప్పుల వాన

  • ఇరాన్‌పై భీకరంగా విరుచుకుపడుతున్న అమెరికా,ఇజ్రాయెల్‌

  • వెనక్కి తగ్గని ఇరాన్‌

2026-03-08 07:22:18
Advertisement
 
Advertisement
Advertisement