దాదాపు 50 రోజుల ఉద్రిక్తతల తర్వాత.. ఇరాన్‌ కీలక నిర్ణయం | Iran Resumes Flights From Tehran Airport | Sakshi
Sakshi News home page

దాదాపు 50 రోజుల ఉద్రిక్తతల తర్వాత.. ఇరాన్‌ కీలక నిర్ణయం

Apr 25 2026 3:21 PM | Updated on Apr 25 2026 3:45 PM

Iran Resumes Flights From Tehran Airport

టెహ్రాన్‌: యాభై రోజుల ఉద్రిక్తతల తర్వాత టెహ్రాన్‌ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమానా సేవలను పునరుద్ధరించారు. వాణిజ్య విమానాల రాకపోకలను శనివారం నుంచి ప్రారంభించినట్లు ఇరాన్‌ వెల్లడించింది. తాత్కాలిక కాల్పుల విరమణ నేపథ్యంలో మళ్లీ విమాన సర్వీసులు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. ఇరాన్ ప్రభుత్వ మీడియా సమాచారం ప్రకారం.. ఇరాన్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ పర్యవేక్షణలో విమానా సేవలను పునరుద్ధరించారు  భౌగోళిక, రాజకీయ అనిశ్చితిని దృష్టిలో ఉంచుకుని విమానయాన కార్యకలాపాలను పూర్తిగా పునరుద్ధరించడానికి అధికారులు నాలుగు దశల ప్రణాళికను అమలు చేస్తున్నారు.

'ఫ్లైట్ రాడార్ 24' డేటా ప్రకారం.. శనివారం ఉదయం టెహ్రాన్ నుండి ఇస్తాంబుల్‌కు మూడు విమానాలు బయలుదేరాయి. వీటితో పాటు మస్కట్‌, మదీనాకు కూడా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. కీలకమైన మార్గాల్లో సేవలను పునరుద్ధరించారు. యుద్ధం కారణంగా  ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రయాణికుల డిమాండ్‌ను కూడా అధికారులు నిశితంగా గమనిస్తున్నారు.

అమెరికాతో కుదిరిన కాల్పుల విరమణ అవగాహన ఒప్పందం తర్వాత తన వైమానిక మార్గాలను పాక్షికంగా తెరవాలని ఇరాన్ నిర్ణయించింది. ఈ నిర్ణయం మేరకే విమాన సర్వీసులు మళ్ళీ మొదలయ్యాయి. ప్రస్తుతం నేరుగా సైనిక దాడులు నిలిచిపోయినప్పటికీ, పరిస్థితి ఇంకా సాధారణ స్థితికి రాలేదని అధికారులు చెబుతున్నారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. ఒక్కో దశలో విమాన రాకపోకల సామర్థ్యాన్ని పెంచుతూ సేవలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని అధికారులు భావిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement