Karnataka
-
చిక్క బస్టాండులో మొబైల్ దొంగలు
చిక్కబళ్లాపురం: చిక్కబళ్లాపురంలోని కేఎస్ ఆర్టీసీ బస్టాండు ఏపీ– కర్ణాటక రాష్ట్రాల మధ్య వారధిలా ఉంటూ నిరంతరం కిటకిటలాడుతూ ఉంటుంది. దీనినే దొంగలు అనువుగా మార్చుకున్నారు. విలువైన మొబైల్ పోన్లు, బంగారు ఆభరణాలను దొంగిలిస్తున్న ఘటనలు జరుగుతున్నాయి. పేరేసంద్రకు చెందిన కేశవ అనే ప్రయాణికుడు బెంగళూరుకు వెళ్లడానికి బస్సు ఎక్కాడు, బస్సు జనంతో కిటకిటలాడుతోంది. జేబులో ఉన్న ఫోన్ పోతుందేమో అనే భయంతో తీసుకుని, పక్కనున్న వ్యక్తికి పట్టుకోమని ఇచ్చాడు. క్షణాల్లోనే ఆ అపరిచితుడు మాయం కావడంతో బాధితుడు కంగుతిన్నాడు. అలాగే.. చిక్కవాసి అభిలాష్ గౌరిబిదనూరుకు వెళ్లడానికి బస్సు ఎక్కాడు, ముదుగానకుంటె గ్రామంలోని గంగమ్మ ఆలయానికి వెళ్లే భక్తులు పెద్దసంఖ్యలో ఉన్నారు. ఈ రద్దీలో అభిలాష్ ఐఫోన్‌ను దొంగలు కొట్టేశారు. కొంతసేపటికి గమనించి, ఆర్టీసీ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరాలను పరిశీలించి ఓ దొంగను పట్టుకొన్నారు, మరొకరు పరారయ్యాడు. వీరు ఇతర రాష్ట్రాలకు చెందినవారు, అందులోనూ బాలలని తేలింది. మైనర్లను ఉపయోగించి మొబైల్ దొంగల ముఠాలు ఈ దందాను నడిపిస్తున్నట్లు అనుమానాలున్నాయి. మరికొందరి మొబైళ్లు కూడా చిక్క బస్టాండులోనే చోరీ అయ్యాయి. ప్రయాణికులకు భయం భయం -
పెట్రోలు, డీజిల్ ధరల పెంపు దుర్మార్గం
సాక్షి, బళ్లారి: కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలు పెంచి సామాన్య, మధ్య తరగతి ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని ఎస్‌యూసీఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఎస్‌యూసీఐ ఆధ్వర్యంలో కురుగోడు పట్టణంలో నిరసన వ్యక్తం చేశారు. ఉన్నఫళంగా పెట్రోలు,డీజల్ ధరలను పెంచడం దుర్మార్గమని మండిపడ్డారు. రష్యా నుంచి రాయితీ ధరలకు చమురు కొనుగోలు చేసే అవకాశాన్ని అమెరికా ఒత్తిడికి లోబడి వదులుకున్న విషయం అందరికి తెలిసిందే అని విమర్శించారు. అదే విధంగా పెట్రోలు, డీజిల్ ధరల్లో సగానికి పైగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులే ఉన్నాయని తెలిపారు. చమురు కంపెనీల లాభాల కోసం దేశంలోనే శుద్ధి చేసి తయారు చేసే పెట్రోలు, డీజిల్‌కు అంతర్జాతీయ ధరలను నిర్ణయించే విధానాన్ని రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌యూసీఐ కమ్యూనిష్టు పార్టీ నాయకులు గురళ్లి రాజ్,కమిటి సభ్యులు మణికంఠ,అంబరీష్,తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు. -
ఫ్రీడం పార్క్‌లో యోగా శిబిరం
హొసపేటె: రోజూ ధాన్యం, యోగా చేయడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చని పతంజలి యోగా సమితి గదగ్, విజయనగర్ జిల్లా ఇన్చార్జ్ డాక్టర్.ఎస్బి.హండ్రాల్ తెలిపారు. ఆదివారం ఉదయం ఫ్రీడం పార్క్‌లో పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక యోగా శిబిరం నిర్వహించారు. కపాలభాతి, అపాన ముద్ర, సూర్య ముద్ర అనే మూడు ముద్రలతో సాధన చేయడం మన జీర్ణాశయ సమస్యలకు కూడా ఒక దివ్యౌషధంలా పని చేస్తుందన్నారు. కార్యక్రమంలో పతంజలి యోగా సమితి జిల్లా ఇన్చార్జ్ డాక్టర్ ఎఫ్‌టి.హళ్లికేరి, బళ్లారి జిల్లా ఇన్చార్జి రాజేష్ కర్వ, సత్యప్ప, విఠోబా బళ్లూరు. ద్రాక్షాయిణి శివకుమార్, కవితా ఆనంద్, శ్రీధర్, ప్రకాష్ కులకర్ణి, శివమూర్తి, శ్రీధర్, ప్రకాష్ కులకర్ణి, శివమూర్తి, శ్రీధర్ వెంకటేష్ వాసి, అశోక చిత్ర, శ్రీరామ్, చంద్రిక, శైలజ కలకప్ప, రామచంద్ర పాల్గొన్నారు. -
కిక్కులో.. కుటుంబాలు తుక్కు
సాక్షి, బెంగళూరు: మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరమని సీసాసై రాసి ఉంటుంది. కానీ అనేక రకాలుగా కూడా అది అపాయకారే. ముఖ్యంగా మద్యం మహమ్మారి పచ్చని సంపారాలను కూల్చేస్తోంది. కైపులో తన మన తేడా లేకుండా దౌర్జన్యాలకు పాల్పడుతూ అశాంతిని రేకెత్తిస్తున్నారు. మద్యం వల్ల కుటుంబాల్లో దాడులు జరుగుతున్న కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. కట్టుకున్న భార్య, తల్లిదండ్రులు, తోబుట్టువులు అనే తేడా లేకుండా మందుబాబులు విరుచుకుపడుతున్నారు. రాష్ట్రంలో అబ్కారీ శాఖ గణాంకాల ప్రకారం 11 శాతం మంది మద్యపాన వ్యసనులుగా ఉన్నట్లు తెలిసింది. ఇందులో 71 శాతం మంది భార్యలపై దాడులకు పాల్పడుతున్నట్లు కూడా గణాంకాలు చెబుతున్నాయి. బెంగళూరు నిమ్హాన్స్ సంస్థ కూడా గతంలో అధ్యయనంలో తెలిపింది. అన్నింటికీ చుక్కే కారణం మద్యపానం వల్ల సామాజికంగా ఏర్పడుతున్న పరిణామాలపై అవగాహన కోసం ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా అధ్యయనం చేసి ఒక నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఇందులోని చేదు నిజాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. మద్యం తాగి వెళ్లి భార్యలపై దాడులకు ఒడిగడుతున్నట్లు తెలిసింది. దేశంలో అత్యధికంగా మద్యం అమ్ముడయ్యే రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. ప్రభుత్వ ఖజానాకు పెద్ద ఆర్థిక వనరుగా ఈ మద్యం విక్రయాలు మారినప్పటికీ సామాజికంగా సమస్యగా తయారైంది. కుటుంబాల్లో శారీరక హింస, గొడవలు, ఆర్థిక ఇబ్బందులకు మద్యమే ప్రధాన కారణమని నివేదికలో పేర్కొన్నారు.మైనర్లకూ అలవాటు రాష్ట్రంలో 15 ఏళ్లు, అంతకుమించి వయసు కలిగిన వారిలో మద్యం సేవించే వారు 8.62 శాతం మంది ఉన్నారు. రాష్ట్రంలో తలసరి మద్య సేవనం ఏటా 9.1 లీటర్లుగా ఉంది. అలాగే 15–49 ఏళ్ల మధ్య వయసున్న పురుషుల్లో సుమారు 16.5 శాతం మంది మద్యాన్ని సేవిస్తుండగా, 0.9 శాతం మంది మహిళలు సైతం అలవాటు చేసుకున్నారు. మద్యపానం వల్ల సంసారాల్లో తీవ్ర గొడవలు అబ్కారీ శాఖ సర్వేలో చేదు నిజాలు రాష్ట్రంలో 11 శాతం మంది మద్యానికి బానిసలు -
రిజర్వేషన్ల కోత వెనుక కాంగ్రెస్ సర్కార్ కుట్ర
సాక్షి, బళ్లారి: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల తగ్గింపు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోంది. కర్ణాటకలో ఎస్సీ, ఎస్టీ జాబితాలోకి కొన్ని కులాలను చేర్చడంతో జనాభా పెరిగినా దానికి అనుగుణంగా లభించాల్సిన రిజర్వేషన్లు పెంచలేదని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర రెడ్డి, సఫాయి కర్మచారి మాజీ అధ్యక్షుడు హనుమంతప్ప ధ్వజమెత్తారు. ఆదివారం వారు నగరంలోని మోకా రోడ్డులోని బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, ఎస్సీ రిజర్వేషన్లను 15 నుంచి 17 శాతానికి, అలాగే ఎస్టీ రిజర్వేషన్లను 3 నుంచి 7 శాతానికి పెంచాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. 2022 నుంచి 2025 వరకు వేలాది మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు పెంచిన రిజర్వేషన్లతో ఇంజనీరింగ్, మెడికల్ ప్రైవేశాలల్లో లబ్ధి పొందారని తెలిపారు. కాంగ్రెస్ సర్కారు ఎస్సీ, ఎస్టీ నిధులను కూడా గ్యారెంటీ పథకాలకు మళ్లించి అన్యాయం చేస్తోందన్నారు. ఇప్పటికైనా స్పందించి ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వై.ఎం.సతీష్, బీజేపీ నాయకులు దరప్ప నాయక్, అడవి స్వామి తదితరులు పాల్గొన్నారు. -
పిల్లలకు ఈత.. గుండెకోత
మాలూరు: పిల్లలకు ఈత నేర్పాలనే ఓ తండ్రి తపన విధి విలాసం ముందు ఓడిపోయింది. పిల్లలు, తండ్రీ నీట మునిగి మృత్యువాత పడ్డారు. ఈ హృదయ విదారక సంఘటన కోలారు జిల్లా మాలూరు తాలూకాలోని నక్కనళ్లి గ్రామంలో ఆదివారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన కూలీ కార్మికుడు శ్రీనివాస్ (40), కుమారులు చేతన్ (13), రాజేష్ (8)ను తీసుకుని ఈత నేర్పించడం కోసం ఓ రైతుకు చెందిన పొలంలోని నీటి కుంటకు వెళ్లాడు. పిల్లలు పట్టుతప్పి నీటిలో మునిగిపోతుండగా, వారిని కాపాడేందుకు వెళ్లిన శ్రీనివాస్ కూడా నీటిలో మునిగిపోయాడు. దగ్గర్లో ఎవరూ లేకపోవడంతో కాపాడేవారు కరువయ్యారు. ఎంతసేపటికీ ఇంటికి రాలేదని అతని భార్య, స్థానికులతో కలిసి గాలించగా నీటికుంటలో శవాలై కనిపించడంతో ఆమె కన్నీరుమున్నీరైంది. మాస్తి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన చేశారు. కేసు నమోదు చేసుకున్నారు.తండ్రి శ్రీనివాస్ పిల్లలు చేతన్ మృత్యు కొలను మింగేసింది తండ్రీ, ఇద్దరు పిల్లల మృతి -
డెంగ్యూ, మలేరియా రహిత జిల్లాగా మార్చేందుకు కృషి
హొసపేటె: డెంగ్యూ, మలేరియా, కలరా తదితర ప్రాణాంతక వ్యాధుల నుంచి జిల్లాను వంద శాతం విముక్తి చేసేందుకు అధికారులు అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కవితా ఎస్ మన్నికేరి ఆదేశించారు. నగర జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ అధికారి కార్యాలయంలో నిర్వహించిన అంతర్ శాఖ సమస్వయ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. స్థానిక యంత్రాంగం ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని తెలిపారు. పైప్‌లైన్ మరమ్మతులు లేదా ఇతర కారణాల వల్ల కలుషిత నీటి సరఫరా కారణంగా ప్రజల ఆరోగ్యం దెబ్బతింటే, సంబంధిత అధికారులను నేరుగా బాధ్యులుగా చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాఠశాలలు, కళాశాలల్లో రోజూ ఉదయం ప్రార్థనల తర్వాత ఈ వ్యాధుల దుష్ప్రభావాలను వివరించాలని పేర్కొన్నారు. అంటువ్యాధుల నియంత్రణలో శాఖల ప్రాతతో పాటు ప్రజల సహకారం కూడా అవసరం అని తెలిపారు. ప్రజలు తమ ఇళ్ల చుట్టూ నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త వహించాలన్నారు. నీటిని మరిగించి, వడకట్టి తాగాలని సూచించారు. ఏదైనా ఆరోగ్య సమస్య కనిపిస్తే వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి శంకర్ నాయక్, వైద్యులు జంబయ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
సాలీడు గూడు
డిపాజిట్ల స్కాంలో సీఐడీ దర్యాప్తు బనశంకరి: బెళగావిలో అక్యూమెన్ పేరిట రూ.4,500 కోట్ల డిపాజిట్ల వంచన కేసులో సీఐడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బెళగావి పోలీసులు కేసు నివేదికను సీఐడీ పోలీసులకు అప్పగించారు. సీఐడీ డీఐజీ భీమాశంకర్ గుళేద్ నేతృత్వంలో బెళగావి పోలీస్ కమిషనర్ భూషణ్ బోర్సేతో భేటీ అయ్యారు. జప్తుచేసిన రికార్డులు, డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 35 వేలమంది నుంచి శివానంద నీలణ్ణవర్ పెట్టుబడుల పేరిట భారీ మొత్తాల్లో డిపాజిట్లను సేకరించాడు. వారికి నెలకు రూ.75 కోట్లకు పైగా వడ్డీ జమ చేస్తున్నట్లు తెలిసింది. కొన్నినెలలుగా చెల్లింపులు నిలిచిపోయాయి. ఇతని వ్యాపారాలకు ఆర్బీఐ అనుమతులు ఏవీ లేవు. ఇతను వాడే నాలుగు బ్యాంకు అకౌంట్లను సీజ్ చేశారు. ఒక్కో అకౌంట్లో వందలాది కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారం. -
బెంగళూరు టు ముంబై ఎక్స్‌ప్రెస్ రైలు షురూ
బనశంకరి: బెంగళూరు–ముంబై మధ్య నూతన ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభమైంది. ఆదివారం బెంగళూరు బైయప్పనహళ్లి విశ్వేశ్వరయ్య రైల్వేస్టేషన్లో కేంద్ర రైల్వే సహాయ మంత్రి వీ.సోమణ్ణ, ఎంపీలు పీసీ.మోహన్, తేజస్విసూర్య ప్రారంభించారు. బెంగళూరు–ముంబై మధ్య ఈ స్టేషన్ నుంచి వారానికి రెండు సార్లు సంచరిస్తుంది. శనివారం, మంగళవారం బెంగళూరు నుంచి ముంబైకి వెళ్తుంది, ఆదివారం, బుధవారం ముంబై నుంచి బెంగళూరుకు వస్తుంది. హుబ్లీ, ధార్వాడ, బెళగావి, పూణె మీదుగా ప్రయాణిస్తుంది. ఇందులో 17 బోగీలు ఉండగా, ఒక ఏసీ 2 టైర్ , 4 ఏసీ–టైర్, 6 స్లీపర్, 4 జనరల్ బోగీలుంటాయి. ఈ సందర్భంగా కేంద్రమంత్రి, ఎంపీలు ఎంజీ రోడ్డు మెట్రో స్టేషన్ నుంచి స్వామి వివేకానంద మెట్రోస్టేషన్ వరకు మెట్రో రైలులో ప్రయాణించారు. ముంబైకి హైస్పీడ్ కారిడార్ కావాలి దావణగెరె, హుబ్లీ మీదుగా బెంగళూరు– ముంబై మధ్య హై స్పీడ్ రైలు కారిడార్‌ను మంజూరు చేయాలని ఎంపీ తేజస్విసూర్య కేంద్ర సర్కారును డిమాండ్ చేశారు. ఇది ఆర్థిక వికాసానికి దోహదపడుతుందని తెలిపారు. ఈ రెండు నగరాల మధ్య ఏటా లక్షలాది మంది ప్రయాణిస్తారని, మధ్యలో దావణగెరె, హుబ్లీలను అనుసంధానంంతో ఉత్తర కర్ణాటక ఆర్థిక ప్రగతికి ప్రోత్సాహం అందించినట్లు అవుతుందన్నారు. వారంలో రెండు సర్వీసులు -
విద్యా రంగంలో ముందుండాలి
రాయచూరు రూరల్: నగరంలో మైనార్టీలు విద్యా రంగంలో ముందుండాలని రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజ్ పేర్కొన్నారు. నగరంలోని ప్రిన్స్ ఫాతిమా కళాశాలలో రూ.50 లక్షలతో నూతన తరగతి గదుల నిర్మాణాలకు ఆదివారం ఆయన భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రిన్స్ ఫాతిమా జీవిత చరిత్ర అందరూ తెలుసుకోవాలన్నారు. మానవతా ధర్మం ఆధారంగా ఆమె చేసిన సేవలు అనన్యమన్నారు. కార్యక్రమంలో శాలం, రుద్రప్ప అంగడి, దరూరు బసవరాజ్, శాంతప్ప, జయణ్ణ, నాసిర్ అహ్మద్, శంశుద్దీన్, నరిసింహులు, ఫిరోజ్, అమరే గౌడ, రమేష్, తిమ్మప్ప, యూనస్, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. పది, ఇంటర్ విద్యార్థులకు సన్మానం రాయచూరు రూరల్: సమాజంలో విద్యార్థులు మానవీయ మౌల్యాలను పెంచుకోవాలని రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజ్ పేర్కొన్నారు. ఆదివారం వీరశైవ కళ్యాణ మంటపంలో గాణిగ సమాజం ఆధ్వర్యంలో 2025–26 విద్యా సంవత్సరంలో ఉత్తమ శ్రేణిలో పాసైన పది, ఇంటర్ విద్యార్థులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు పచ్చని నగరం, ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రచారం చేయాలని సూచించారు. కార్యక్రమంలో కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య, సోమవారిపేట మఠాధిపతి అభినవ రాచోటి శివాచార్య, గాణిగ సమాజం అధ్యక్షుడు చెన్నప్ప సజ్జన్, సిద్రామప్ప, శకుంతల, లక్ష్మీబాయి, బసప్ప గోరేబాళ్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. క్రీడలతో మానసికోల్లాసం రాయచూరు రూరల్: క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయని జిల్లా ఎస్పీ అరుణాంగ్శు గిరి పేర్కొన్నారు. ఆదివారం ఎస్పీ క్రీడా మైదానంలో పాత్రికేయుల సంఘం, పోలీస్ అధికారుల సంఘం మధ్య క్రికెట్ పోటీలు నిర్వహించారు. క్రీడల్లో గెలుపు, ఓటమిని అందరూ సమానంగా స్వీకరించాలని సూచించారు. పోలీస్ జట్టుపై పాత్రికేయుల జట్టు విజయం సాధింరచింది. కార్యక్రమంలో పాత్రికేయుల సంఘం అధ్యక్షుడు గురునాథ్, కార్యదర్శి సిద్ధయ్య, విజయ్ జాగటకల్, అదనపు ఎస్పీలు కుమార స్వామి, హరీష్, డీఎస్పీ శాంతవీర, తదితరులు పాల్గొన్నారు. ఘనంగా ‘గురువందన’హొసపేటె: హొసపేటె తాలూకా, కమలాపురలో ఆదివారం గురువందన, మహాస్నేహ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కమలాపుర ప్రభుత్వ ఉన్నత పాఠశాల, తోప్పల్ చన్నప్ప పాఠశాల, సిద్దేశ్వర్ పాఠశాల, హంపీ ప్రాథమిక పాఠశాలలకు చెందిన పూర్వ విద్యార్థులు తరలివచ్చారు. గురు బ్రహ్మ, గురువిష్ణు, గురు మహేశ్వర్ అని గంట మోగిస్తూ 9 మంది గురువులను వేదికపైకి తీసుకొచ్చి సన్మానించారు. బాల్యంలో జరిగిన సంఘటలు, మధుర జ్ఞాపకాలను పూర్వ విద్యార్థులు గుర్తు చేసుకున్నారు. విచారణ జరపాలిరాయచూరు రూరల్: రాయచూరు జిల్లా కేంద్ర సహకార (ఆర్డీసీసీ)లో గతంలో జరిగిన నియామకాల్లో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయి. వాటిపై విచారణ జరపాలని దళిత సంఘర్ష సమితి సంచాలకుడు రవీంద్ర నాథ్ పట్టి డిమాండ్ చేశారు. ఆదివారం పాత్రికేయుల భనవంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో చేపట్టిన నియామకాలను రద్దు చేసి మళ్లీ పోస్టులు భర్తీ చేయాలని సూచించారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సర్కార్ ముందుకు రావాలన్నారు. బ్యాంక్ నియామకాలకు కోర్టు నుంచి మధ్యంతర ఆదేశాలు రావడం జరిగిందన్నారు. -
ఓ తండ్రి కిరాతకం.. కూతురి పరువు హత్య
తుమకూరు: పరువు హత్యలకు అడ్డుకట్ట వేయడానికి రాష్ట్ర సర్కారు ఏకంగా చట్టాన్ని తెచ్చినా దుండగులు వెనకడుగు వేయడం లేదు. కుమార్తెను కంటికి రెప్పలా చూసుకుంటూ ఆమె భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన కన్నతండ్రే కాలయముడై ప్రాణాలు బలిగొన్నాడు. ఈ ఘటన తుమకూరు శిర తాలూకా నింబెమరదహళ్లిలో జరిగింది. మేఘన (17) అనే అమ్మాయిని ఆమె తండ్రి తిమ్మరాయప్ప (48) దారుణంగా హత్య చేశాడు. తనకు ఇష్టం లేకుండా భార్య తరఫు బంధువుతో పెళ్లికి కూతురు సిద్ధమైందని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పెళ్లికి ఒప్పుకుందని గొడవ వివరాలు.. తిమ్మరాయప్ప, నిర్మల దంపతులు కూలీ పనులు చేస్తుంటారు. వీరి కూతురు మేఘన. తల్లి మేఘనకు తమ బంధువుల అబ్బాయితో పెళ్లి కుదిర్చింది. వరుని కుటుంబ సభ్యులు పెళ్లి కోసం చీరలు, తాళి తదితర వస్తువులు కొనుగోలు చేశారు. ఈ పెళ్లి తండ్రికి ఇష్టం లేదు, దీంతో తరచూ కుటుంబంలో గొడవలు జరుగుతూ ఉండేవి. కూతురును చంపేయాలని నిర్ణయించుకున్నాడు. గత నెల రోజులుగా మేఘన కనిపించడం లేదు. దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కూతురి కోసం ఘరానా తండ్రి విలపిస్తూ రక్తి కట్టించాడు. బావిలోకి తోసి.. రాయి వేసి.. తిమ్మరాయప్ప మీద అనుమానం బలపడిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా నోరు విప్పాడు. ఏప్రిల్ 16న కుమార్తెను తానే చంపినట్లు కిరాతకుడు అంగీకరించాడు. నిర్మల కూలీ పనులకు వెళ్లగా, ఇంట్లో ఒక్కతే ఉన్న కూతురికి మాయమాటలు చెప్పి ఊరిబటయ బావి వద్దకు తీసుకెళ్లాడు. ఆమెను బావిలోకి తోశాడు. మళ్లీ బయటకు వస్తుందేమోనని బండరాయి తీసి ఆమె మీదకు వేశాడు. ఇలా హత్య చేశాక, మృతదేహాన్ని బయటకు తీసి దగ్గర్లో పాతిపెట్టినట్లు చెప్పాడు. ఆ రోజు సాయంత్రం తల్లి ఇంటికి వచ్చాక కూతురు కనబడలేదు. ఫోన్ చేయగా స్విచాఫ్ వచ్చింది. దీంతో పోలీసు స్టేషన్‌కు వెళ్లి కనబడడం లేదని ఫిర్యాదు చేసింది. తిమ్మరాయప్ప కూడా ఠాణాకు వచ్చాడు. కిరాతకున్ని అరెస్టు చేశారు. ఇష్టం లేని పెళ్లికి సిద్ధమైందని దారుణం తుమకూరు జిల్లాలో ఘటన నెల రోజుల తరువాత నేరం గుట్టురట్టు -
మూతపడిన ఇందిరా క్యాంటీన్లు
సాక్షి, బళ్లారి: పట్టణ పేదలు, శ్రామికులకు సరసమైన ధరలకు రాయితీపై పౌష్టికాహారాన్ని (టిఫిన్, భోజనం) ఇవ్వాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఇందిరా క్యాంటీన్లు బళ్లారి నగరంలో మూతపడిపోతున్నాయి. వినియోగదారుడు కేవలం రూ.5 అల్పాహారానికి, రూ.10 భోజనానికి చెల్లిస్తే.. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం సబ్సిడీగా భరిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలు, తాలూకా కేంద్రాలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఇవి పని చేస్తున్నాయి. పేదలు, కూలీలు, కార్మికులు ఆకలి తీర్చేందుకు ప్రారంభించిన ఇందిరా క్యాంటీన్ల నిర్వహణ ప్రస్తుతం అధ్వానంగా తయారైంది. బళ్లారి నగరం మోతీ సర్కిల్ సమీపంలోని బుడా ఆవరణ, ఏపీఎంసీ కూరగాయల మార్కెట్, బాపూజీ నగర్, బెళగల్ క్రాస్, టీబీ శ్యానిటోరియం, జిల్లా ఆస్పత్రి తదితర జన సంచారం ఎక్కువగా ఉన్న ఏడు ప్రాంతాల్లో ఇందిరా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారు. ప్రారంభంలో ఇందిరా క్యాంటీన్లు బాగా పని చేసినా.. కాలక్రమేణ నిర్వహణను గాలికొదిలేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ క్యాంటీన్లను పునరుద్ధరించాలని, పేదలకు ఇబ్బంది లేకుండా నాణ్యమైన ఆహారాన్ని అందించాలని నిర్ణయించింది. బడ్జెట్లో నిధులు కేటాయించి, అవసరమైన ప్రాంతాల్లో కొత్త క్యాంటీన్లు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించింది. అయితే నిధులు విడుదల చేయకపోవడంతో మూడపడిపోతున్నాయి. కొన్ని చోట్ల కాంట్రాక్టర్లు అప్పులు చేసి క్యాంటీన్లు నడిపారు. అయితే బకాయిలు పేరుకుపోవడంతో చేతులెత్తేశారు. ఒక్క బళ్లారి నగరంలోనే 7 ఇందిరా క్యాంటీన్లు ఉండగా.. 8 నెలలకు సంబంధించిన బకాయిలు చెల్లించాల్సి ఉంది. నెలకు ఒక్కో ఇందిరా క్యాంటీన్‌కు సుమారు రూ.20 లక్షల వ్యయం అవుతుంది. ఆ లెక్కన బళ్లారిలో 7 ఇందిరా క్యాంటీన్లు ఉండగా 8 నెలలకు సంబంధించి రూ.కోటిన్నర వరకూ బకాయిలు చెల్లించాల్సి ఉంది. అక్కడ పని చేసిన సిబ్బంది జీతభత్యాలు కూడా చెల్లించ లేదు. అప్పులు చేసిన క్యాంటీన్లు నడిపిన కాంట్రాక్టర్లు బకాయిలు విడుదల చేయాలని కోరుతున్నారు. బకాయిలు చెల్లించకపోవడంతో చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు బళ్లారిలో ఏడు బంద్ అధికారులు, పాలకుల అలసత్వంతో 8 నెలలుగా ఇదే పరిస్థితి పేదలపై తీరని భారం అధ్వానంగా మారిన నిర్వాహణ బకాయిల గుదిబండబళ్లారి నగరంలో రోజూ సుమారు 500 నుంచి 1000 మంది వరకూ ఇందిరా క్యాంటీన్లను ఆశ్రయించే వారు. సరసమైన ధరలకు టిఫిన్, భోజనం అందడంతో క్యాంటీన్లకు పరుగులు పెట్టేవారు. ప్రస్తుతం బళ్లారిలో మొత్తం 7 ఇందిరా క్యాంటీన్లు మూతపడి పోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. క్యాంటీన్లు తెరవాలని నిర్వాహకులను అడిగితే నిధుల కొరత కారణంగా మూసేస్తున్నట్లు చెబుతున్నారు. బయట హోటళ్లలో ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో ఇందిరా క్యాంటీన్లు మూతపడటం పేదలకు శాపంగా మారిందని చెప్పుకోవచ్చు. ఓ వైపు పశ్చిమాసియాలో యుద్దం కారణంగా ఇప్పటికే గ్యాస్ ధరలు పెంచడంతో పాటు, పలు హోటళ్లు మూతపడగా.. ధరలు కూడా పెంచారు. హోటల్లో టిఫిన్ చేయాలంటే కనీసం రూ.50కి పైగా చెల్లించాల్సిందే. ఇక భోజనం అంటే కనీసం రూ.100లు వరకు ఉంటుంది. క్యాంటీన్ల సమస్యలపై స్థానిక పాలకులు, అధికారలు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు గ్యారెంటీలు అమలు చేయడానికి పలు పథకాలకు కోతలు విధిస్తున్న సంగతి తెలిసిందే. ఇకనైనా సంబంధిత అధికారులు, పాలకులు మూతపడిన ఇందిరా క్యాంటీన్లు తెరిపించి పేదలకు భోజనం అందేలా చూడాల్సిన అవసరం ఉంది. -
‘మద్యం తాగొద్దన్నందుకు అన్ననే హతమార్చాడు’
రాయచూరు రూరల్: మద్యం తాగొద్దని బుద్ధి మాటలు చెప్పిన అన్నను.. తమ్ముడు హతమార్చాడు. ఈ ఘటన శనివారం రాత్రి రాయచూరు జిల్లాలో చోటు చేసుకుంది. లింగసూగురులోని బసవ సాగర్ క్రాస్ వద్ద అన్నాతమ్ముళ్లు బసవరాజ్ వాసుదేవ్, శ్రీధర్ నివసిస్తున్నారు. శ్రీధర్ రాత్రి వేళల్లో మద్యం సేవించి వచ్చేవాడు. ఇంట్లో తల్లిని ఇష్టం వచ్చినట్లు తిడుతూ వేధించసాగాడు. మద్యం తాగడం మంచిది కాదు.. మద్యం మానేయాలని శ్రీధర్‌కు అన్న బసవరాజ్ వాసుదేవ్ సూచించాడు. అప్పటి నుంచి కోపం పెంచుకున్న శ్రీధర్.. శనివారం రాత్రి బసవరాజ్ వాసుదేవ్ నిద్రించినప్పుడు గొంతు నులిమి హత్య చేశాడు. తండ్రి ఫిర్యాదు మేరకు శ్రీధర్‌ను అదపులోకి తీసుకున్నట్లు ఎస్పీ దత్తాత్రేయ కర్నాడ్ తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ హుసికేరప్ప వివరించారు. -
గుర్తు తెలియని వాహనం ఢీ: ముగ్గురు మృతి
హుబ్లీ: గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో బైక్‌లో వెళుతున్న ముగ్గురు యువకులు మృతి చెందిన ఘటన సవదత్తి తాలూకా హులికట్టి గ్రామం వద్ద చోటు చేసుకుంది. నరగుంద దండాపుర వీధి నివాసులైన ప్రశాంత (25), నింగప్ప (28), లోకేష్ (28) మృతులు. మునవళ్లి నరగుంద రోడ్డు హెక్కేరి కరియమ్మ దర్శనం చేసుకుని తిరిగి నరగుందకు ముగ్గురు ఒకే బైక్‌లో బయలుదేరారు. నరగుంద నుంచి మునవళ్లి వైపు వస్తున్న భారీ వాహనం హులికట్టి వద్ద బైక్‌ను ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రశాంత, నింగప్ప స్థలంలోనే మృతి చెందారు. లోకేష్ ఆస్పత్రిలో చికిత్స ఫలించక మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై సవదత్తి పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారీ అయిన లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. ‘జై శ్రీరామ్ అని చెప్పండి’ హుబ్లీ: ‘జూన్‌లో పాఠశాలలు ప్రారంభం అయ్యాక ప్రతి ఒక్కరికీ కేసరి శాలువాలు పంపిణీ చేస్తాను. ఇక ముందు పాఠశాలలో హాజరు పలికే వేళ ఎస్ సార్ అనే దానికి బదులుగా జై శ్రీరామ్ అని చెప్పాలి. ఉపాధ్యాయులకు నమస్కరించేటప్పుడు జై శ్రీరామ్ అని చెప్పండి’ అని ఎమ్మెల్యే బసవన గౌడ పాటిల్ యత్నాళ్ సూచించారు. ఆదివారం విజయపూర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యా సంస్థల్లో పునర్ హిజాబ్ ధరించడానికి అవకాశం కల్పించడంపై మండిపడ్డారు. కేసరి శాలువా ధరించడంపై నిషేధం విధించేందుకు కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చింది ఎవరు? కేసరి శాలువా ధరించే హక్కు మాకు ఉందని తెలిపారు. హిందూ పోషకులందరూ తమ పిల్లలకు తిలకం దీద్ది కేసరి శాలువా కప్పి స్కూల్‌కు పంపాలని సూచించారు. బడుగుల ఆశాజ్యోతి అంబేడ్కర్రాయచూరు రూరల్: సమాజంలో బడుగు, దళిత వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని అంజుమన్ సంస్థ అధ్యక్షుడు అన్సరుద్దీన్ అభిప్రాయపడ్డారు. శనివారం రాత్రి లింగసూగురులో అంజుమన్ సంస్థ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేడ్కర్ బాటలో అందరూ పయనించాలని సూచించారు. అంబేడ్కర్ ఆశయ సాధనకు అందరం కృషి చేయాలన్నారు. అనంతరం ఉత్తమ మార్కులు సాధించిన పది, ఇంటర్ విద్యార్థులను సన్మానించారు. కార్యక్రమంలో హుసేన్ పాషా, రహీం, రసూల్, అస్లాం, అరిఫ్, యాసిన్, మజీబాబు, రాజ్ మహ్మద్ పాల్గొన్నారు. రాయచూరు వాసి మృతి చిలమత్తూరు: మండల పరిధిలోని 44 వ నంబర్ జాతీయ రహదారి కొడికొండ చెక్‌పోస్ట్ గంగోత్రి డాబా వద్ద 7 హిల్స్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొని మైసూరుకు చెందిన ప్రకాష్ (60) అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్ఐ శ్రీధర్ తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో రాయచూరు నుంచి ప్రకాష్ బెంగళూరుకు బయలుదేరాడు. టీ తాగేందుకు బస్సు గంగోత్రి డాబా వద్ద ఆపారు. ప్రకాష్ రోడ్డు అవతలి వైపు మూత్ర విసర్జన కోసం వెళ్లే క్రమంలో బెంగళూరు నుంచి హైదరాబాదు వెళుతున్న బస్సు ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ మేరకు బస్సును సీజ్ చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. ఆవుల పంపిణీ శ్రీనివాసపురం: శ్యాగత్తూరు పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఆధ్వర్యంలో రోటరీ సంస్థ నుంచి 150 ఆవులను మహిళలకు ఉచితంగా అందించారు. రోటరీ జిల్లా గవర్నర్ శ్రీధర్, ఎస్.వి సుధాకర్, కె.మంజునాథ్ రెడ్డి, రవీంద్రనాథ్, అశ్విని మస్తి పాల్గొన్నారు. -
వల వేసి.. బెదిరించి వసూళ్లు
దొడ్డబళ్లాపురం: వేధింపులు, అత్యాచారం కేసులు పెడతానని బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న కిలాడీ లేడీని బెళగావి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. బెళగావిలోని లక్ష్మినగర్‌లో నివసిస్తున్న రేష్మ శంకర్ ముతగా.. అధికారులు, ప్రముఖులు, పోలీసులను వలలో వేసుకుని దండుకునేదని తెలిపారు. మ్యాట్రిమోనిలలో అందమైన అమ్మాయిల ఫోటోలు అప్లోడ్ చేసి వల వేసేది. సంప్రదిస్తే.. ఫలానా చోటుకు రావాలని పిలిపించి అత్యాచారానికి పాల్పడ్డారంటూ బెదిరిస్తానని భయపెట్టి డబ్బులు వసూలు చేసేది. ఓ బాధితుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రేష్మని అరెస్టు చేశారు. విచారణలో విస్తుపోయే నిజాలు తెలిశాయి. 2012లో పక్కింటి వ్యక్తి పెళ్లి పేరిట మోసం చేశాడని కుడచి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2022లో ఘటప్రభలో నాగరాజు అనే కానిస్టేబుల్‌పై, 2023లో గజేంద్రఘడలో ఆకాశ్ అనే వ్యక్తిపై అత్యాచారం కేసు పెట్టింది. 2025లో సురేశ్ అనే వ్యక్తిపై, ధార్వాడలో ఓ సీఐ మీద రేప్ కేసు పెట్టింది. ఇంకా పలువురిపై ఇలాంటి నకిలీ ఫిర్యాదులు చేసిందని బెళగావి జిల్లా ఎస్పీ కే.రామరాజన్ తెలిపారు.రేష్మ శంకర్ బెళగావిలో కిలేడీ అరెస్టు -
శ్రీరాజరాజేశ్వరీ నమోస్తుతే
కోలారు: తాలూకాలోని వక్కలేరి గ్రామంలో ఆదివారం శ్రీరాజ రాజేశ్వరి దేవాలయ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉదయం చండికా హోమం, సర్పదోష నివారణ, అశ్లేష పూజ, అమ్మవారికి విశేష అలంకారం తదితరాలను నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణోత్సవం నిర్వహించారు. వేలమంది భక్తులు దర్శనాలు చేసుకున్నారు. ఎయిర్‌పోర్టులో రూ.7 కోట్ల గంజాయి సీజ్ దొడ్డబళ్లాపురం: బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీ మొత్తంలో హైడ్రోఫోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులు అనుమానాస్పదంగా కనిపించడంతో అధికారులు వారిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. లగేజ్ బ్యాగుల్లో రహస్యంగా దాచి ఉంచిన 20 కేజీల హైడ్రోఫోనిక్ గంజాయి పట్టుబడింది. దీని విలువ రూ.7.12 కోట్లుగా తెలిపారు. వారిని అరెస్టు చేశారు. బాలికపై అత్యాచారం, హత్య? ● కోలారు జిల్లాలో ఘటన కోలారు: కనిపించకుండా పోయిన బాలిక నీటికుంటలో శవంగా తేలింది. ఈ ఘటన తాలూకాలోని హరటి గ్రామంలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన బాలిక (15) 3 రోజుల క్రితం అదృశ్యమైంది. ఆమె తల్లిదండ్రులు కోలారు మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పొరుగింటి ఆనంద్ అనే యువకునిపై అనుమానం వ్యక్తం చేశారు, బాలిక అత్తమామల ఇంట్లో ఉండి 9వ తరగతి చదువుకుంటోంది. ఇప్పుడు పదో తరగతికి వెళ్లాల్సి ఉంది. శనివారం సాయంత్రం గ్రామ సమీపంలోని ఓ పొలంలో ఫారంపాండ్‌లో శవం ఉన్నట్లు పోలీసులకు తెలిసి వెళ్లారు. బాలికపై అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేశారు. ఫైర్ సిబ్బంది శవాన్ని వెలికి తీసి పోస్టు మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రియల్టర్‌కు బెదిరింపులు యశవంతపుర: బెంగళూరు విద్యారణ్యపురకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారికి అండర్‌వల్డ్ డాన్ విక్కి శెట్టి పేరున బెదిరింపు వచ్చింది. అడిగినంత ఇవ్వకుంటే నీ కొడుకును పెళ్లి రోజునే లేపేస్తామని బెదిరించారని బాధిత రియల్టర్ శంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏప్రిల్ 21న మొదట ఓ కాల్ చేసి బెదిరించారు, తాను పట్టించుకోలేదని, మళ్లీ మరో నంబర్ నుంచి కాల్ చేసి డబ్బులను డిమాండ్ చేశారు. పదేపదే కాల్స్ రావడంతో స్విచాఫ్ చేశానని తెలిపాడు. నిజంగా విక్కీశెట్టి వర్గీయులు కాల్చేశారా, లేక వ్యాపారంలో పోటీదారులు ఈ పనిచేశారా? అనేది విద్యారణ్యపుర పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, మంగళూరుకు చెందిన విక్కి శెట్టి మోస్ట్ వాంటెండ్ అండర్‌వరల్డ్ నేరగాళ్లలో ఒకరు, 20 ఏళ్ల నుంచి విదేశాలలో తలదాచుకున్నాడు. అతని అరెస్ట్‌కు సీబీఐ రెడ్‌కార్నర్ నోటీసులు కూడా జారీ చేసింది. దుబాయ్, దక్షిణ ఆఫ్రికాలో నివాసం ఉంటాడని సమాచారం. వంతెన పైనుంచి కారు పల్టీ ● నలుగురికి తీవ్ర గాయాలు కోలారు: నిర్మాణ దశలో ఉన్న అండర్‌పాస్ సర్వీస్ రోడ్డుపై నుంచి కారు కింద పడి బాలునితో పాటు నలుగురికి తీవ్ర గాయాలైన ఘటన ముళబాగిలు తాలూకా నరసింహ తీర్థ అండర్‌పాస్ వద్ద జరిగింది. బెంగళూరు నుంచి తిరుపతికి కారులో వెళుతున్న కుటుంబం ఆదివారం తెల్లవారున 3 గంటలప్పుడు ఘటనాస్థలికి రాగానే అదుపు తప్పి కింద పడింది. నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ముళబాగిలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
బెంగళూరువాసులకు ఈ–ఖాతా అభియాన
శివాజీనగర: బెంగళూరు నగరంలో భూములు, స్థలాల యజమానులకు సహాయకారిగా ‘నా ఈ–ఖాతా, నా హక్కు’ అనే అభియానను శనివారం డిప్యూటీ సీఎం డీ.కే.శివకుమార్ ప్రారంభించారు. తూర్పు నగర పాలికె పరిధిలో హొరమావులో నేషనల్ పబ్లిక్ పాఠశాలలో ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ 6వ గ్యారంటీగా ఈ పథకాన్ని జారీచేసింది, ఖాతా లేని ఇళ్లు, భవనాల యజమానులు ఇప్పుడు ఈ–ఖాతా పొందవచ్చు. 100 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పారు. దరఖాస్తుల పరిశీలన తరువాత ఈ–ఖాతా పంపిణీ చేస్తారు అని తెలిపారు. ఇందుకు ఆస్తి విలువలో 2 శాతం ఫీజుగా చెల్లించాలని చెప్పారు. అలాగే మిగతా నగర పాలికెల్లోనూ డీసీఎం ఈ అభియానకు నాంది పలికారు. జీబీఏ చీఫ్ కమిషనర్ మహేశ్వరరావు, కమిషనర్లు పాల్గొన్నారు. సర్వజ్ఞనగరలో ఖాతా అభియాన్‌ను కమిషనర్ పరిశీలించారు. తొలిరోజే వందలాదిమంది దరఖాస్తులు చేసుకొన్నారు. ఈ అభియాన 100 రోజులు మాత్రం అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఈ–ఖాతా పంపిణీ, కొత్తగా ఈ–ఖాతా దరఖాస్తులు చేయడం, బీ–ఖాతా నుంచి ఎ–ఖాతాకు మార్చేందుకు దరఖాస్తులు, విన్నపాల పరిష్కారం తదితరాలు అభియాన కేంద్రాలలో లభిస్తాయని తెలిపారు. ప్రారంభించిన డీసీఎం శివ -
మైసూరు జిల్లాలో వర్ష బీభత్సం
మైసూరు జిల్లాలో గాలీవానకు దెబ్బతిన్న అరటి తోటచిక్కమగళూరులో వర్షంలో గొడుగు పట్టుకుని వెళ్తున్న యువతులుమైసూరు: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం అర్ధరాత్రి, శనివారం వరకు భారీ వర్షాలు కురిశాయి. ఉరుములు, పిడుగులు, ఈదురు గాలులతో కొంత ఆస్తినష్టం జరిగింది. శనివారం మధ్యాహ్నం 4.15 గంటలకు పిడుగుపడి మహిళతో పాటు రెండు మూగజీవాలు చనిపోయాయి. మైసూరు జిల్లా పిరియాపట్టణ తాలూకా సత్యగాల గ్రామానికి చెందిన చంద్రప్పచార్ పొలంలో పిడుగుపడడంతో రెండు పశువులు చనిపోయాయి. అలాగే పొలంలో పశువులు కాస్తున్న చంద్రప్పచార్ కోడలు వినోద కూడా ప్రాణాలు విడిచింది. మైసూరు సిటీలో ఈదురు గాలులు, భీకర ఉరుములతో వర్షం బీభత్సాన్ని కలిగించింది. పెద్దసంఖ్యలో చెట్లు, హోర్డింగులు నేలకొరిగాయి. జేపీ నగరలో కారుపై చెట్టు పడింది. అలాగే పోలీసు లేఔట్లో కూడా కారుపై కూలింది. సిద్ధార్థనగర, లలితాద్రిపురలో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. శుక్రవారం రాత్రి 12 గంటల నుంచి శనివారం మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. మరోవైపు చిక్కమగళూరులో వర్షాలు కొనసాగుతున్నాయి. శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు జోరువాన కురిసింది. పలు జిల్లాలకు వర్షసూచన దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ, ఉత్తర జిల్లాల్లో 16 నుంచి 19 వరకూ భారీ వర్షాలు కురుస్తాయి. ప్రజలు జాగ్రత్త వహించాలని ఎల్లో అలర్ట్ ప్రకటించింది. భారీర్షాలతో పాటు వడగళ్లు, పిడుగులు, ఈదురు గాలులు ఉండవచ్చు. పిడుగులు, గాలులతో వర్షం మహిళ దుర్మరణం కూలిన చెట్లు, కరెంటు స్తంభాలు -
కదం తొక్కిన రైతన్నలు
సాక్షి,బళ్లారి: తాము పదేళ్ల క్రితం లక్ష్మీ మిత్తల్ కంపెనీకి ఇచ్చిన భూములను మరో కంపెనీ జిందాల్‌కు ఎలా బదిలీ చేస్తారని ప్రశ్నిస్తూ రైతులు కదం తొక్కారు. శనివారం కుడితిని భూ పోరాట సమితి ఆధ్వర్యంలో వందలాది మంది రైతులు ఆందోళన చేశారు. అప్పట్లో ఽతక్కువ ధరకే భూములు ఇచ్చామని, తాము భూములు ఇవ్వడంతో తమ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికి భూములు లాక్కొన్నారని, అయితే ఎలాంటి కంపెనీని స్థాపించకపోవడంతో తాము ఎక్కువ పరిహారం ఇవ్వాలని పోరాటం చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం కేఏఐడీబీ ద్వారా లోలోపల జిందాల్ కంపెనీకి ఒక ఎకరాను రూ.28 లక్షలకు పైగా కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిత్తల్‌కు ఇచ్చిన భూమినెలా కేటాయిస్తారు? తాము మిత్తల్ కంపెనీకి భూములు ఇస్తే జిందాల్ కంపెనీకి ఎలా బదిలీ చేస్తారు? అని ప్రశ్నించారు. ఒక కంపెనీ పేరు చెప్పి మరో కంపెనీకి భూములు ఇవ్వడంలో అంతర్యమేంటని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లోను జిందాల్ కంపెనీకి తాము భూములు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తామన్నారు. రైతులకు అన్యాయం చేసి, తక్కువ ధరకే లాక్కొన్న భూములను తిరిగి రైతులకు ఇవ్వాలని, లేకపోతే ఎక్కువ పరిహారం ఇవ్వాలని, ముందుగా రైతుల వద్ద ప్రభుత్వ పెద్దలు సంప్రదింపులు, చర్చలు చేపట్టిన తర్వాత ఏ నిర్ణయమైనా తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు పెద్ద సంఖ్యలో ఎద్దులబండ్లలో నిరసన వ్యక్తం చేస్తూ కుడితిని నుంచి రైతులు ఇచ్చిన భూముల వరకు ఎద్దులబండ్లతో నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీ చేపట్టారు. సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. రైతులు భూముల్లోకి ప్రవేశిస్తారని తెలియగానే వందలాది మంది పోలీసులు చేరుకుని రైతులను అడ్డుకున్నారు. కుడితిని బైపాస్‌లో పెద్ద సంఖ్యలో జనం చేరి బంద్ చేశారు. ఎద్దులబండ్లను ఎక్కడికక్కడే కట్టడి చేశారు. రైతులు, పోలీసులతో ఆ ప్రాంతం అంతా కిటకిటలాడింది. రైతులను, భూ పోరాట సమితి నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత విడుదల చేశారు. రైతులు వందలాది మంది చేరడంతో పాటు భూపోరాట సమితి నాయకులు బసవరాజు, సత్యబాబు, జంగ్లీసాబ్, తిప్పేస్వామి, గోవర్దన్‌రెడ్డి, శేఖర్ తదితరులు నాయకత్వం వహించి అలుపెరగని పోరాటం చేశారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులుమోహరించిన రైతులు, పోరాట సమితి నాయకులు భూముల్లోకి ప్రవేశించేందుకు యత్నం ఎద్దులబండ్లతో అన్నదాతల నిరసన 800 ఎకరాల స్వాధీనానికి ప్రయత్నం ఆందోళనకారుల అరెస్ట్, తర్వాత విడుదల వందలాదిగా మోహరించిన రైతులు, పోలీసులు -
బెళగావిలో రూ.4,500 కోట్ల డిపాజిట్ల స్కాం
బనశంకరి: డిపాజిట్లకు అధిక వడ్డీలంటూ బెళగావి, చుట్టుపక్కల జిల్లాల్లో మాజీ సైనికులు, అమాయక ప్రజల నుంచి వేల కోట్ల రూపాయల వసూలుకు పాల్పడిన కేసులో బెళగావిలో శివం అసోసియేట్స్ సంస్థ యజమాని శివానంద నీలణ్ణవర్‌ను శనివారం స్థానిక మాళమారుతి ఠాణా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో కొన్నిరోజులుగా శివం అసోసియేట్స్ రెండు ఆఫీసులు, శివానంద, ఇతర ముఖ్యుల కార్యాలయాలు, ఇళ్లు, ఫ్లాట్లలో పోలీసులు గాలింపు జరిపారు. పెద్దసంఖ్యలో బ్యాంకు అకౌంట్లు, బాండ్లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్స్, కంప్యూటర్లు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. ఏమిటీ బాగోతం? శివానంద వివిధ పథకాల ద్వారా అధిక వడ్డీ ఇస్తానని వేల మంది ప్రజల నుంచి డబ్బు వసూలు చేశారు. ఈ ప్రాంతంలో సైనికులు, మాజీ సైనికుల నుంచి కూడా డబ్బులు సేకరించాడు. సుమారు రూ.4500 కోట్ల డిపాజిట్లు సేకరించినట్లు విచారణలో వెలుగు చూసింది. కొన్ని నెలలుగా ఎవరికీ వడ్డీ, అసలు ఇవ్వకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయసాగారు. అతని ఇళ్లు, కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ మహమ్మద్ రోషన్ సీజ్ చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టి శివానంద వైరల్ అయ్యాడు. అతడు డిపాజిట్ల వసూలుకు ఆర్బీఐ నిబంధనలను ఏవీ పాటించలేదు. డిపాజిట్‌దారుల గురించి రికార్డులు కూడా లేవు. వేలాది మంది రూ.30 వేల నుంచి రూ.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టారని తేలింది. ఆటోలో ఐస్‌క్రీంలు అమ్మిన శివానంద శివానంద కథ చాలా ఆసక్తిగా ఉంటుంది. హుబ్లీ ఉణకల్ కు చెందిన శివానంద తండ్రి ఆర్మీలో పనిచేశారు. పదవీ విరమణ తరువాత కేఈబీలో పనిచేస్తూ మృతిచెందారు. ఈ ఉద్యోగం శివానంద సోదరునికి లభించింది. బెళగావికి బదిలీ కావడంతో కుటుంబం బెళగావికి చేరుకుంది. ఇంటర్ చదివిన శివానంద నీలణ్ణవర్ ఓ కాలేజీలో సెక్యూరిటీగా పనిచేశాడు. తరువాత ఆటోరిక్షాలో ఐస్‌క్రీంలు విక్రయిస్తూ ఐస్‌క్రీం ఫ్యాక్టరీ పెట్టాడు. 2012లో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి నష్టపోయి, మోసాల బాట పట్టాడు. ఆక్యుమెన్ అనే పేరుతో ఆఫీసు తెరిచి ప్రజల నుంచి డబ్బులు డిపాజిట్లు స్వీకరించడం ప్రారంభించారు. ఇదంతా కూడా అక్రమమే. వేలాది మంది ఇతన్ని నమ్మి పెద్దమొత్తంలో డిపాజిట్లు చేయగా, అతని పంథా మారింది. జిల్లాలో ప్రముఖునిగా చలామణి అవుతూ రియల్ ఎస్టేట్ సహా అనేక వ్యాపారాలు నడిపేవాడు. జనాకర్షక కార్యక్రమాలు, సామూహిక విందులు, ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తూ ప్రజల్లో నమ్మకం చూరగొన్నాడు.ఆస్తులను జప్తు చేస్తాం: కలెక్టరు ఆర్బీఐ అనుమతి లేకుండా ప్రజల నుంచి ఎడాపెడా వసూళ్లు శివం అసోసియేట్స్ యజమాని శివానంద్ నీలణ్ణవర్ అరెస్ట్ బనశంకరి: శివం అసోసియేట్స్ యజమాని శివానంద నీలణ్ణవర్ మోసాలు ఒక్క జిల్లా కాదు, అనేక జిల్లాలకు వ్యాపించాయి. తనిఖీలలో పెద్ద సంఖ్యలో బాండ్లు, చెక్‌లు లభించాయని వీటి విలువ రూ.50 కోట్లపైనే ఉంటుంది, ఇది తీవ్రమైన అంశం.. అని బెళగావి కలెక్టర్ మహమ్మద్ రోషన్ తెలిపారు. ఈ స్కాంపై శనివారం బెళగావి కలెక్టరేట్లో విలేకరులతో మాట్లాడారు. నిందితునిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. సెబీ, ఆర్బీఐ, సహకార శాఖల నుంచి అనుమతులు, మార్గదర్శకాలు పాటించకుండా అధిక వడ్డీ ఆశచూపి అనధికారికంగా డిపాజిట్లు సేకరించాడని తెలిపారు. ప్రభుత్వానికి శుక్రవారం రాత్రి నివేదికను అందించామని, నోడల్ అధికారి ద్వారా ఆ సంస్థ స్థిర, చరాస్తులను జప్తు చేస్తారని, బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ సహా పలు చర్యలను చేపడతారని వివరించారు. ఈ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. సెబీ ద్వారా సమాచారం: కమిషనర్ నగర పోలీస్ కమిషనర్ భూషణ్ బోర్సే మాట్లాడుతూ గుర్తుతెలియని వ్యక్తి సెబీకి లేఖ రాయడంతో, వారు సీఐడీకి లేఖ రాశారు,, వారి సూచన ప్రకారం శివం సంస్థలో సోదాలు చేపట్టామని తెలిపారు. ఆర్బీఐలో ఈ సంస్థ నమోదు కాలేదన్నారు. లక్ష డిపాజిట్ చేస్తే నెలకు రూ.3 వేలు అందించేవాడు. దీంతో చాలామంది డబ్బులు కట్టారని తెలిపారు. సుమారు రూ.400 కోట్ల బ్యాలెన్స్ షీట్ లభించిందని చెప్పారు. స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్, చేపల వ్యాపారం తదితరాల్లో పెట్టుబడులు ఉన్నాయన్నారు. శివానంద విచారణకు సహకరించలేదని, దీంతో కస్టడీకి తీసుకున్నామని తెలిపారు. మరోవైపు కేసును రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి ఇచ్చింది. -
బెంగళూరులో అక్రమ కట్టడాల బాగోతం
బనశంకరి: బెంగళూరు మహా నగరంలో గత 16 ఏళ్లలో నిర్మించిన బృహత్ వసతి, వాణిజ్య కట్టడాల్లో 95 శాతానికి పైగా కట్టడాలకు నకిలీ సీసీ, ఓసీ అందించారని, ఇందులో రూ.40 వేల కోట్లకు పైగా అవినీతి జరిగిందని బీజేపీ నేత ఎన్ఆర్.రమేశ్ లోకాయుక్త, ఈడీకి ఫిర్యాదు చేశారు. ఆధారాల సమేతంగా శనివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. పాలికే నగర ప్లానింగ్ శాఖ అదికారిక సమాచారం ప్రకారం గత 16 ఏళ్లలో 4,381 సీసీ, 4,587 కట్టడాలకు ఓసీ మాత్రమే ఇచ్చారు. కానీ ఇదే అవధిలో 71, 169 కట్టడాలకు ప్లాన్ మంజూరుచేశారని తెలిపారు. 437 నిర్మాణ సంస్థలే సుమారు 25 వేలకు పైగా అపార్టుమెంట్లు నిర్మించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ అపార్టుమెంట్లలో 22 లక్షలు ఫ్లాట్లు ఉండగా చాలావరకు కస్టమర్లు నకిలీ రికార్డులు ఆధారంగా కొనుగోలు చేసి మోసపోయారని ఆరోపించారు. బెంగళూరు లో 98 టెక్ పార్కులు, 3,876 ఐటీ కంపెనీలు, 103 బీటీ కంపెనీలు, 4,500 కుపైగా వాణిజ్య కాంప్లెక్స్‌లు, 217 మాల్స్, మల్టీప్లెక్స్‌లు, 1.10 లక్షల పారిశ్రామిక కట్టడాలు, 540 స్టార్ హోటల్స్, 2,850 సూపర్ స్పెషాలిట ఆసుపత్రులు, 1,350 కళ్యాణ మండపాలు పనిచేస్తున్నాయి. వీటిలో చాలావరకు కట్టడాలకు నకిలీ సీసీ, ఓసీ అందించారని, నగర ప్లానింగ్‌శాఖ అధికారులు, బిల్డర్ మాఫియా కుమ్మకై ్కయ్యారని ఆరోపించారు. చట్టబద్ధమైన ఫీజులకు బదులు పనిలో 25 శాతం డబ్బు లంచంగా తీసుకుని నకిలీ సర్టిఫికెట్లు అందించారని ఆయన ఆరోపించారు.ఈ కారణంతో బీబీఎంపీ, జీబీఏలకు రూ.40 వేలకోట్లకు పైగా ఆదాయం నష్టమైందని తెలిపారు. దీనిపై ఈడీ, సీబీఐ, సీఐడీ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. -
హైవేలో ప్రైవేటు స్లీపర్ బస్సు దగ్ధం
శివాజీనగర: అందరూ నిద్రమత్తులో ఉన్నారు, ఇంతలో ఏదో శబ్ధం, మంటలు.. ఇలా ప్రైవేట్ బస్సు టైర్ పేలడంతో నిప్పంటుకొని బస్సు కాలి బూడిదైంది. అదృష్టవశాత్తు డ్రైవరు, 36 మంది ప్రయాణికులు ప్రాణాపాయం నుంచి తప్పించుకొన్న ఘటన హాసన్ జిల్లా శాంతిగ్రామ వద్ద హైవే–75లో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. ఎలా జరిగిందీ? వివరాలు.. ఓ ప్రైవేటు స్లీపరు బస్సు మంగళూరు నుంచి బెంగళూరుకు వస్తోంది. ఘటనాస్థలికి రాగానే బస్సు వెనుక టైర్ పేలిపోయి ఆ తాకిడికి మంటలు లేచాయి, క్షణాల్లోనే బస్సుకు విస్తరించాయి. ఇది గమనించిన డ్రైవరు బస్సును రోడ్డు పక్కన నిలిపేసి కిందికి దిగిపోవాలని ప్రయాణికులను హెచ్చరించాడు. భయాందోళనకు గురైన ప్రయాణికులు లగేజీని కూడా తీసుకోకుండా దిగిపోగా, కొన్ని నిమిషాల్లోనే మంటలు బస్సంతటికీ వ్యాపించి కాలిపోయింది. విలువైన సామగ్రి దగ్ధం ప్రయాణికుల లగేజ్, అందులోని నగదు, మొబైల్ ఫోన్లు విలువైన సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. కొందరు ప్రయాణికులు చేతికి చిక్కిన బ్యాగ్‌లను తీసుకోగా, మిగతాకి బూడిద కావడంతో ఆవేదనకు గురయ్యారు. అతివేగం, వేడిమి వల్ల టైర్ పేలి ఉండవచ్చని అనుమానాలున్నాయి. హాసన్ నుంచి ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. బస్సు లోహపు పంజరంలా మారింది. రెండు గంటల పాటు హైవేలో ట్రాఫిక్ నిలిచిపోయింది. మరో బస్సులో ప్రయాణికులు బెంగళూరుకు వెళ్లారు. శాంతిగ్రామ పోలీసులు కేసు నమోదు చేశారు. టైరు పేలి అంటుకున్న మంటలు డ్రైవరు జాగ్రత్తతో తప్పిన ప్రాణహాని హాసన్ జిల్లాలో ఘటన -
పెట్రో మంటపై వినూత్న నిరసన
హుబ్లీ: ెపట్రోల్, సీఎన్జీ, ఎల్పీజీ ధరల పెరుగుదలను నిరసిస్తూ హుబ్లీ ధార్వాడ నగర, గ్రామీణ కాంగ్రెస్ కమిటీల ఆధ్వర్యంలో శనివారం నగరంలో వినూత్నంగా ఎద్దులబండి ప్రదర్శన చేపట్టారు. స్థానిక లామింగ్టన్ రోడ్డులో కాంగ్రెస్ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు జాతా నిర్వహించిన కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వ తీరుపై నినాదాలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజల జీవితాన్ని దుర్భరం చేసిందని ఆందోళనకారులు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేత అనిల్‌కుమార్ మాట్లాడుతూ యుద్ధం పేరుతో ఇంధనం ధరలు పెంచి ప్రజలను ఇక్కట్ల పాలు చేస్తున్నారని మండిపడ్డారు. 5 రాష్ట్రాల ఎన్నికల వరకు మౌనంగా ఉన్న బీజేపీ ఎన్నికల తర్వాత ధరలు పెంచి ప్రజలను మోసం చేసిందని, తక్షణమే ఈ పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేశారు. డెంగీపై ప్రచారానికి శ్రీకారంరాయచూరు రూరల్: డెంగీ వ్యాధి నియంత్రణపై ముమ్మర ప్రచారం చేపట్టాలని జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ సురేంద్ర బాబు సూచించారు. శనివారం జిల్లా ఆరోగ్య అధికారి కార్యాలయంలో జిల్లాధికార యంత్రాంగం, జిల్లా పంచాయతీ, ఆరోగ్య శాఖ, నగరసభల ఆధ్వర్యంలో డెంగీ దినోత్సవం పోస్టర్లను విడుదల చేసి మాట్లాడారు. సమాజంలో ప్రతి ఒక్కరు గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. అందరిని ఏకతాటి పైకి తెచ్చి సమాజంలో నలుగురితో సమానంగా జీవించాలన్నారు. ఇంటి వద్ద దోమలు పెరగకుండా, ఇంటి పరిసరాల్లో నీరు నిలవకుండా ముందు జాగ్రత్తలు వహించాలన్నారు. సమావేశంలో నోడల్ అధికారులు గణేష్ చంద్ర శేఖరయ్య, యశోద, ఆర్సీహెచ్ అధికారిణి నందిత, మనోహర్ పత్తార్, శాకీర్లున్నారు. జోరుగా వడగళ్ల వాన హొసపేటె: విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి తాలూకా రామఘట్ట, ఉచ్చంగిదుర్గ, నేరబొమ్మనహళ్లి చుట్టు పక్కల గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండగా ఉండగా సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా వర్షం మొదలై రెండు గంటల పాటు కురిసింది. పిల్లలు, యువకులు ఇళ్ల ముందు పడుతున్న వడగళ్లను చేతుల్లోకి ఏరుకుంటూ సంబరపడ్డారు. ఈ ప్రాంతంలో కురిసిన తొలకరి వర్షం భూమిని చల్లబరచడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. మండుతున్న ఎండలతో అల్లాడుతున్న ఇక్కడి ప్రజలు వర్షంతో ఊపిరి పీల్చుకున్నారు. పిడుగుపాటుకు వ్యక్తి మృతిబళ్లారి అర్బన్: తాలూకాలోని మోకా సమీపంలోని డీ.నాగేనహళ్లిలో శనివారం మధ్యాహ్నం పిడుగుపాటుకు గురై ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని గ్రామానికి చెందిన కోరి గాదిలింగప్ప(32)గా గుర్తించారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో గ్రామంలో అకస్మాత్తుగా వర్షం మొదలైంది. ఆ సమయంలో గాదిలింగప్ప తన పొలంలో సపోటా పండ్లను కోస్తున్నాడు. వర్షం మధ్యలో పిడుగుపాటుకు గురై అతను తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించాడు. కురుబ గాదిలింగప్ప మృతి అతని కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. మృతుడు గాదిలింగప్పకు తండ్రి మల్లేష్, భార్య మంజమ్మ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఈ ఘటన గురించి తెలియగానే గ్రామస్తులు పొలం వద్దకు చేరుకుని పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. కాగా ఈ ఘటనపై మోకా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నలుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్ హుబ్లీ: అక్రమంగా దేశంలోకి చొరబడిన నలుగురు బంగ్లా పౌరులను హుబ్లీ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. హుబ్లీ రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ సిబ్బంది చేపట్టిన కార్యాచరణలో పట్టుబడిన నలుగురు బంగ్లా ప్రజల వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేవు. అయినా కూడా వారు రైల్లో ప్రయాణించి హుబ్లీ వరకు వచ్చారు. ప్రస్తుతం నలుగురిని అదుపులోకి తీసుకున్న ఆర్పీఎఫ్ సిబ్బంది హుబ్లీ– గదగ్ రోడ్డులోని ఆర్పీఎఫ్ పోలీస్ స్టేషన్లో వీరిని తీవ్రంగా విచారిస్తున్నారు. -
హంపీలో బయల్పడిన పురాతన ఆలయ పైకప్పు
హొసపేటె: చారిత్రాత్మక జైన ఆలయ సముదాయం సమీపంలో జరిపిన తవ్వకాల్లో, భారతీయ పురావస్తు శాఖ (ఏఎస్ఐ) హంపీ జోన్ అధికారులు విజయనగర రాజుల కాలం నాటి ఒక పురాతన ఆలయ పైకప్పును కనుగొన్నారు. విజయనగర సామ్రాజ్య చారిత్రక వైభవాన్ని మరోసారి వెల్లడిస్తున్న ఒక ముఖ్యమైన పురావస్తు ఆవిష్కరణ హంపీలో వెలుగు చూసింది. విజయనగర సామ్రాజ్యానికి చెందిన అనేక నిర్మాణాలు భూమిలో పూడిపోయి ఉండవచ్చనే అనుమానంతో, ఏఎస్ఐ బృందం జైన ఆలయ సముదాయం చుట్టుప్రక్కల ప్రాంతంలో తవ్వకాలను ప్రారంభించింది. ఈ క్రమంలో మట్టి పొరల కింద రాతితో నిర్మించిన ఒక ఆలయ పైకప్పు బయటపడింది. ఇది శతాబ్దాల నాటి ఆలయం అయి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ విషయంపై ఏఎస్ఐ హంపీ జోన్ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ కే.రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రాథమిక పరిశీలన ప్రకారం ఇటుకలతో నిర్మించిన ఆలయ గర్భగుడి కాలక్రమేణా తీవ్రంగా దెబ్బతినగా, ప్రస్తుతం గర్భగుడి పైకప్పు మాత్రమే బయటపడిందన్నారు. -
మరో వారం రోజులు వేడి గాలులే
● ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలి రాయచూరు రూరల్: రాయచూరు జిల్లాలో మరో వారం రోజులు వేడి గాలులు వీస్తాయని, ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని జిల్లాధికారి పూవిత పేర్కొన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. మరో వారం రోజుల పాటు అధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారన్నారు. అందువల్ల ప్రజలు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు అత్యవసరైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదన్నారు. వంట గదుల్లో కిటికీలను తెరిచి ఉంచాలన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖాధికారిణిగా శరణమ్మ రాయచూరు రూరల్: రాయచూరు జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖలో మార్పు తెస్తానని రాయచూరు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖాధికారిణి శరణమ్మ పేర్కొన్నారు. శనివారం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖాధికారి కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడారు. గతంలో అధికారిగా ఉన్న నవీన్ కుమార్‌ను మైసూరుకు బదిలీ చేయడంతో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖాధికారి కార్యాలయంలో సీనియర్ అధికారిణిగా ఉన్న తనకు జిల్లా స్థాయి బాధ్యతలు అప్పగించారన్నారు. లోకాయుక్త వలలో గుమాస్తా ● ఖాతా మార్పునకు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం హుబ్లీ: ఖాతా మార్పునకు ఓ వ్యక్తి నుంచి రూ.2 వేల లంచం తీసుకుంటున్న గుమాస్తా లోకాయుక్త వలలో చిక్కాడు. జిల్లాలోని కుందగోళ తహసీల్దార్ కార్యాలయంలో క్లర్క్‌గా పని చేస్తున్న సురేష్ అరకేరి హావేరి జిల్లా శిగ్గాంవి తాలూకా దుండసి గ్రామ నివాసి హజరత్ అలీ ఇమామ్ సాబ్ అరళికట్టి వద్ద నుంచి ఖాతా మార్పు చేసి ఇవ్వడానికి లంచం తీసుకుంటుండగా లోకాయుక్త ఎస్పీ ఎస్టీ సిద్దలింగప్ప నేతృత్వంలో డీఎస్పీ వెంకనగౌడ పాటిల్, సీఐ ప్రభులింగయ్య హిరేమఠ, ప్రసాద్ పనేకర్లతో కూడిన బృందం ఆ క్లర్క్‌ను అదుపులోకి తీసుకున్నారు. దాడి తర్వాత రెవెన్యూ శాఖ కొన్ని కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకున్న అధికారుల బృందం అర్ధరాత్రి వరకు వాటి పరిశీలన చేసి విచారణ కొనసాగించారు. లంచం ఆరోపణలు ఎదుర్కొన్న క్లర్క్‌పై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆగస్టు 2న స్టీల్ సిటీ రన్ బళ్లారిటౌన్: బళ్లారి సైక్లిస్ట్ రన్నర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 2న బళ్లారి నగర శివార్లలో స్టీల్ సిటీ రన్– 2026 పరుగును చేపట్టినట్లు ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ తిప్పారెడ్డి తెలిపారు. శనివారం ఓ ప్రైవేట్ హోటల్లో విలేకరుల సమావేశంలో ఫౌండేషన్ నేత బీకే.సుందర్‌తో కలిసి ఆయన మాట్లాడారు. ఈ పరుగును 16 కి.మీ, 10 కి.మీ, 5 కి.మీ, 3 కి.మీ.లుగా విభజించామన్నారు. 12 నుంచి 18 ఏళ్ల పైబడిన వారికి వారి వయస్సుకు తగ్గట్టుగా పరుగును ఏర్పరిచామన్నారు. సంగనకల్లు రోడ్డులోని విజ్డం ల్యాండ్ స్కూల్ వద్ద నుంచి చాగనూరు టోల్గేట్ వరకు పరుగు ఉంటుందన్నారు. నడి రోడ్డులో రొమాన్స్ వీడియో వైరల్హుబ్లీ: ఓ జంట పట్టపగలు నడి రోడ్డులో అసభ్యంగా ప్రవర్తించిన సదరు వీడియో వైరల్ అయింది. ఈ ఘటన కేశ్వాపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని గదగ్ రోడ్డు రైల్వే లోబ్రిడ్జి వద్ద నడి వీధిలో జరిగింది. ఆ జంట బహిరంగంగా ముద్దుల వర్షం కురిపించుకోవడం ప్రజాగ్రహానికి గురైంది. స్థానికులను గమనించగానే అక్కడ నుంచి ఆటోలో ఆ జంట వెళ్లి పోయారు. ఇలాంటి దృశ్యాలకు అవకాశం ఇవ్వకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. యువకుడు ఆత్మహత్య మరో ఘటనలో యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. ఉణకల్ వద్ద బళిగార వీధిలో చంద్రశేఖర్‌గౌడ(26) అనే ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏదో విషయమై మనోవేదనకు గురై జీవితంపై విరక్తితో పశువుల రేకుల షెడ్‌కు వైరుతో ఉరి వేసుకొన్నాడు. ఈ ఘటనపై విద్యానగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. యువత వారధిలా పని చేయాలిరాయచూరు రూరల్: ప్రజా సమస్యల పరిష్కారానికి యువత నడుం బిగించాలని సదర్ బజార్ పోలీస్ స్టేషన్ సీఐ దాదావలి పేర్కొన్నారు. గురువారం మానవ హక్కుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీసులకు, ప్రజలకు మధ్య వారధిలా యువత పని చేయాలన్నారు. పోలీస్ స్టేషన్లో అందరికీ సమ న్యాయం చేస్తామన్నారు. మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు మోహిద్, సభ్యులు మారుతి, విజయ్, రశీధ్, నరేష్లున్నారు. తాగునీటి ఎద్దడి తలెత్తనీయొద్దురాయచూరు రూరల్: జిల్లాలో తాగునీటి ఎద్దడి నెలకొనకుండా చూడాలని జిల్లాధికారిణి పూవిత పేర్కొన్నారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రజల సమస్యలను ఆలకించడం అధికారుల విధి అని అన్నారు. సమస్యల పరిష్కారానికి నగరసభ, పట్టణ పంచాయతీ, పురపాలక సంస్థల్లో అధికారులందరి సహకారం అవసరమన్నారు. వీధి దీపాల అమరిక, మురుగు కాలువల స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. -
లారీ యజమానుల సంఘానికి ఎంపిక
బళ్లారిఅర్బన్: జిల్లా లారీ యజమానుల సంఘం నూతన అధ్యక్షుడిగా చల్లా మహేష్‌ను ఎంపిక చేసినట్లు మాజీ అధ్యక్షుడు, కార్పొరేటర్ మించు శ్రీనివాస్ తెలిపారు. శనివారం స్థానిక లారీ టర్మినల్లోని లారీ యజమానుల సంఘం కార్యాలయంలో సభ్యుల సమక్షంలో సంఘం పదాధికారులను ఎంపిక చేశామన్నారు. లారీ యజమానుల సంఘం అభివృద్ధికి గత రెండేళ్లుగా కృషి చేశానన్నారు. నూతన అధ్యక్షుడు చల్లా మహేష్ మాట్లాడుతూ లారీ యజమానుల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి పని చేస్తానన్నారు. సభ్యులందరూ ఐక్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జిల్లా లారీ యజమానుల సంఘం గౌరవ అధ్యక్షుడుగా మున్నాబాయి, జిల్లా అధ్యక్షులుగా చల్లా మహేష్, ఉపాధ్యక్షులుగా వై.శ్రీనివాసులు, హెచ్.నారాయణ స్వామి, ప్రధాన కార్యదర్శిగా వీ.శ్రీనివాసులు, కార్యదర్శిగా చల్లా రమేష్, కోశాధికారిగా జి.లక్ష్మీనారాయణ, సలహాదారుడుగా బి.పాండురంగ తదితర పదాధికారులను ఎంపిక చేశారు. కాంగ్రెస్ నాయకులు బోయపాటి విష్ణు, వెంకటేష్ హెగ్డే, ఎస్ఆర్పీ కాలనీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
19 రాత్రి నుంచి ఆర్టీసీ సిబ్బంది సమ్మె పిలుపు
బనశంకరి: కేఎస్ ఆర్టీసీ ఉద్యోగులు మరింత వేతన పెంపు డిమాండుతో ఈ నెల 19వ తేదీ రాత్రి నుంచి నిరవధిక సమ్మెకు సిద్ధమయ్యారు. 19వ తేదీన తుమకూరులో రాష్ట్ర ప్రభుత్వ మూడేళ్ల పాలన సాధనా సమావేశంలో నల్లదుస్తులు ధరించి నిరసన తెలుపుతామని తెలిపారు. ఉద్యోగుల డిమాండు మేరకు గత ఏడాది మార్చి నుంచి వర్తించేలా 12.5 శాతం వేతనాలను సర్కారు పెంచింది. కానీ 25 శాతం కావాలని, అది కూడా 2024 జనవరి నుంచి వర్తించాలని ఉద్యోగ సంఘాలు భీష్మించాయి. 19 తేదీ రాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్‌లు నిలిపేస్తామని చెబుతున్నారు. -
పుష్ప వాహనంలో దుర్గాదేవి
మాలూరు: అమావాస్య సందర్భంగా తాలూకాలోని లక్కూరు గ్రామ చెరువు కట్టపై దుర్గాదేవి దేవాలయంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. మల్లెలతో హంస వాహనం రూపంలో అలంకరించి వివిధ పూజలు జరిపించారు. మహిళా భక్తులు దీపాలు దీపారాధన చేశారు. భజన మండలి భజన, సంకీర్తనలు ఆకట్టుకున్నాయి. రాష్ట్ర సర్కారు పెట్రో పన్నుల్ని తగ్గించాలి: బీజేపీ శివాజీనగర: ఇంధన ధర పెంచిన కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే ముందు మీరు పెట్రోలుపై రూ.3, డీజిల్‌పై రూ.5.5 మేర పెంచిన పన్నులను తగ్గించాలని, ఆ తరువాత మాట్లాడాలని బీజేపీ పక్ష నేత అశోక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత 3 సంవత్సరాల్లో పాలు నుంచి నీటి వరకు, పెట్రోల్ నుంచి మెట్రో రైలు ధర వరకు అన్ని చార్జీలను రాష్ట్ర సర్కారు పెంచేసిందని ఎక్స్‌లో ఆరోపించారు. ఇప్పుడు మోదీ ప్రభుత్వం మీద విమర్శలు చేసే నైతిక హక్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని అన్నారు. అనేక దేశాల్లో 50 శాతం వరకూ పెట్రో ధరలు పెరిగితే, మనదేశంలో పెరిగింది 3.2 శాతం మాత్రమే అన్నారు. ఇది మోదీ సామర్థ్యంతోనే సాధ్యమైందని అన్నారు. నీట్ వద్దు.. సీఈటీనే ఉత్తమం● వైద్య విద్యామంత్రి శరణు ప్రకాష్ ● ఎంబీబీఎస్, పీజీ సీట్లు పెంచుతాం శివాజీనగర: మెడికల్ విద్యకు జాతీయ స్థాయిలో నీట్ పరీక్షను రద్దుచేసి, రాష్ట్రాలు సొంతంగా ప్రవేశ పరీక్షను నిర్వహించుకునేలా అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర వైద్యవిద్యా శాఖ మంత్రి శరణ ప్రకాశ్ పాటిల్ డిమాండ్ చేశారు. శనివారం నగరంలో విలేకరులతో మాట్లాడారు. కర్ణాటకలో పలు దశాబ్దాల నుంచి సీఈటీ పరీక్ష విజయవంతంగా జరిగేదన్నారు. పేద, గ్రామీణ, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు సమాన అవకాశాలు లభించాయన్నారు. అయితే కొన్నేళ్ల జరుపుతున్న నీట్ పరీక్షల వల్ల తీవ్ర అక్రమాలు సాగుతూ విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతున్నాయని ఆరోపించారు. దీనిపై ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసినట్లు తెలిపారు. రాష్ట్రంలో వైద్య సీట్ల పెంపు ఇలా 11 ప్రభుత్వ వైద్య కాలేజీల్లో 550 ఎంబీబీఎస్ సీట్లను, 23 విద్యా సంస్థల్లో 572 మెడికల్ పీజీ కోర్సుల సీట్లను పెంచుతున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ వైద్య విద్యా కాలేజీల్లో ఇంతకు ముందు 1,700 సీట్లు అందుబాటులో ఉండేవి. ఇప్పుడు పెంచడంతో 2,250 కు పెరిగాయన్నారు. రాష్ట్రంలో మొత్తం 72 వైద్య విద్యాలయాల్లో 13,945 ఎంబీబీఎస్, 7,727 పీజీ సీట్లు ఉన్నాయని తెలిపారు. పాము కాటుకు గోవా కాంగ్రెస్ నేత బలి యశవంతపుర: ఉత్తర కన్నడ జిల్లాలో పాముకాటుకు గోవా కాంగ్రెస్ నాయకుడు మరణించారు. వివరాలు.. గోవాలో పోండా శాసనసభా ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కేతన్ బాటికర్ (48) పాము కాటుకు గురయ్యారు. గోవాలోని పోండా నుంచి ఉత్తరకన్నడ జిల్లా జోయిడా తాలూకా రామనగర వద్ద అనమోడ్కు స్నేహితునితో కలిసి వెళ్లారు. అనమోడ్ ఘట్ట అడవిలో కారు నిలిపి మూత్రవిసర్జన చేస్తుండగా నాగుపాము కరిచింది. వెంటనే మిత్రుడు కారులో గోవా జీఎంసీ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ కేతన్ మృతి చెందారు. శివలింగేశ్వర స్వామి రథోత్సవం కోలారు: ముళబాగిలులోని శివకేశవ నగరలో పురాణ ప్రసిద్ధ శ్రీ ఉద్భవ శివలింగేశ్వరస్వామి బ్రహ్మ రథోత్సవం శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం ఉద్భవ శివలింగేశ్వర మూల విగ్రహానికి పంచామృత అభిషేకం, అలంకారం, పూజలు జరిగాయి. వేద మంత్ర ఘోష మధ్య స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని రథంలో ప్రతిష్టించి రథోత్సవం జరిపారు. వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. -
రైల్వే సమస్యలు పరిష్కరించండి
బళ్లారిఅర్బన్: బళ్లారి ప్రాంత రైల్వే సమస్యలను పరిష్కరించాలని కర్ణాటక రాష్ట్ర రైల్వే యాక్షన్ కమిటీ ప్రతినిధులు శనివారం బళ్లారి ఎంపీ.ఈ తుకారాం సమక్షంలో సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్ జనరల్ మేనేజర్ పి.అనంత్‌కు విజ్ఞప్తి చేశారు. వారు బళ్లారి రైల్వే స్టేషన్లో ఆయనకు వినతిపత్రం సమర్పించారు. బళ్లారి నుంచి సిరుగుప్ప మీదుగా సింధనూరు నుంచి లింగసూగూరు వరకు కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బళ్లారి మీదుగా బెంగళూరుకు ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ లేదా వందే భారత్ రైలును ప్రారంభించాలని కోరారు. శివమొగ్గ–బళ్లారి– చైన్నె రైలును తిరిగి ప్రారంభించాలని, హంపీ ఎక్స్‌ప్రెస్‌లో స్లీపర్ కోచ్‌లను మళ్లీ 12కు పెంచాలని విజ్ఞప్తి చేశారు. హంపీ ఎక్స్‌ప్రెస్ వేళల మార్పు, ఏసీ కోచ్‌ల అమరికలో ఉన్న గందరగోళాన్ని సరి చేయాలని కోరారు. అమృత్ భారత్ పథకం కింద బళ్లారి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని, గేట్ నెంబర్ 111 వద్ద అనుసంధాన రోడ్డు పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కాగా వినతులను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని జీఎం హామీ ఇచ్చినట్లు తెలిసింది. నైరుతి రైల్వే జనరల్ మేనేజర్‌కు వినతి బళ్లారి– లింగసూగూరు లైన్‌కు ఒత్తిడి -
ఉదయనిధి వ్యాఖ్యలపై నిరసన
హొసపేటె: సనాతన ధర్మంపై తమిళనాడు డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ హిందూ సనాతన సంరక్షణ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలో భారీ నిరసన ప్రదర్శన, కాగడాల ఊరేగింపు చేపట్టారు. నగరంలోని వడకరాయ స్వామి ఆలయం నుంచి ప్రారంభమైన నిరసన, కాగడాల ఊరేగింపు మెయిన్‌బజార్, పాదగట్టి ఆంజనేయస్వామి ఆలయం, మెయిన్ మసీదు, గాంధీ చౌక్, మూరంగడి సర్కిల్, పుణ్యమూర్తి సర్కిల్, సెంట్రల్ బస్టాండ్, మోడరన్ సర్కిల్ మీదుగా సాగి చివరకు డాక్టర్ పునీత్ రాజ్‌కుమార్ సర్కిల్ వద్ద బహిరంగ సభగా మారింది. సభలో డాక్టర్ రాహుల్ దేవరాజ్ మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని నాశనం చేస్తామని దురుద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ఆయనను ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో చింతామణి మఠం స్వామీజీ, పూర్ణానంద భారతీ స్వామీజీ, సమితి గౌరవాధ్యక్షుడు అశోక్ జీ, కో–ఆర్డినేటర్ ఎన్.రేవణ సిద్దప్ప, కో–కన్వీనర్ అప్పారావు, మున్సిపల్ అధ్యక్షుడు రూపేష్ కుమార్, సభ్యుడు ఆనంద్, వివిధ సంఘాల నాయకులు దేవరమనె శ్రీనివాస్, సందీప్‌సింగ్, సిద్ధార్థ సింగ్, ఎం.సీ.వీరాస్వామి, భూపాల్ ప్రహ్లాద్ తదితరులు పాల్గొన్నారు. -
బెంగళూరు పాలికేలకు ఎన్నికలు జరపాలి
● రాష్ట్ర సర్కారుకు గవర్నర్ ఆఫీసు లేఖ శివాజీనగర: సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గ్రేటర్ బెంగళూరు పరిధిలోని 5 కార్పొరేషన్లకు కాల పరిమితిలోగా ఎన్నికలు జరిపేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ కార్యాలయం లోక్‌భవన్ సూచించడంతో ఎన్నికల వ్యవహారం బిగుసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జూన్ 30లోగా ఎన్నికలు జరగాలి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశంచాలని జేడీఎస్ నేతలు ఇటీవల గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించారు. సకాలంలో ఎన్నికలు జరిపి సుప్రీంకోర్టు సూచనలను పాటించాలి, లేదంటే కోర్టు ధిక్కారం అవుతుందని నేతలు తెలిపారు. ప్రజాప్రతినిధుల ప్రజా హక్కులను కాపాడేందుకు, రాజ్యాంగ బద్ధంగా ఎన్నికలు జరపాలన్నారు. లేనిపక్షంలో ప్రజలకు తప్పుడు సందేశం వెళుతుందన్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావని తెలిపారు. లేఖలో ఏముంది? పరిశీలించిన గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ఆర్.ప్రభుశంకర్ ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాలిని రజనీశ్కు లేఖ రాశారు. ఎలాంటి సమస్యలు కాకుండగా ఎన్నికలను ప్రశాంతంగా జరిపేందుకు ఈసీకి, ప్రభుత్వం నిధులు, సిబ్బందిని మంజూరు చేయాలని లేఖలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి, ఎన్నికలను ఆలస్యం చేయకుండా సకాలంలో జరిపేలా చూడాలన్నారు. లేఖపై సర్కారు స్పందనపై కుతూహలం నెలకొంది. నగల షాపులో భారీ చోరీ దొడ్డబళ్లాపురం: దొంగల ముఠా బంగారు నగలు చోరీ చేసిన సంఘటన హావేరి జిల్లా హానగల్ తాలూకా చిక్కాంశి హొసూరు గ్రామంలో జరిగింది. గ్రామంలో అణ్నప్ప భజంత్రి అనే వ్యాపారికి నగల షాపు ఉంది. అందులోకి జొరబడ్డ దుండగులు సుమారు రూ. 80 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దోచుకుని, షాపులోని 7 క్వింటాళ్ల బరువు గల ఉక్కు లాకర్ కూడా ఎత్తుకెళ్లారు. లాకర్లో విలువైన వస్తువులు ఉన్నట్లు యజమాని తెలిపాడు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. హానగల్ పోలీసులు విచారణ చేపట్టారు. -
డిమాండ్లు తీర్చకుంటే ఆందోళన తప్పదు
సాక్షి,బళ్లారి: తమ న్యాయసమ్మతమైన డిమాండ్లు పరిష్కరించకుంటే ఈనెల 19వ తేదీ రాత్రి నుంచి ఆర్టీసీ బస్సుల బంద్ నిర్వహిస్తామని కేకేఆర్టీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు హెచ్ఏ ఆదిమూర్తి హెచ్చరించారు. ఆయన సంఘం నాయకులతో కలిసి శనివారం నగరంలో విలేకరులతో మాట్లాడారు. గత కొన్ని నెలలుగా తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోకుంటే కచ్చితంగా మూల్యం చెల్లించాల్సి వస్తుందన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు బాకీ ఉన్న 38 నెలల వేతనాన్ని చెల్లించాలన్నారు. దీంతో పాటు కనీసం 25 శాతం జీతాన్ని పెంచాలన్నారు. అయితే ప్రభుత్వం కేవలం 12.5 శాతం మేరకే జీతం పెంచేందుకు నిర్ణయం తీసుకుందన్నారు. దీంతో ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ప్రభుత్వం తీరును తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కేకేఆర్టీసీ సంస్థ ఉద్యోగులు నిరంతరం ప్రజా సేవలో ఉంటారని, రాత్రింబగళ్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పని చేస్తుంటారన్నారు. తక్కువ జీతాలతో ఎక్కువ పని తక్కువ జీతాలతో ఎక్కువ పని చేయించుకుంటున్నారని సంస్థ తీరుపై మండిపడ్డారు. ఆర్టీసీ సేవలు బంద్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. తమపై ఎస్మా ప్రయోగిస్తే ప్రభుత్వానికే నష్టం అన్నారు. అలాంటి బెదిరింపులకు తాము బెదిరేది లేదన్నారు. తమ పోరాటం కేవలం జీతాల కోసం కాదని, ఉద్యోగ భద్రత, కుటుంబాలకు రక్షణ కోసమని అన్నారు. కష్టపడి పని చేసే వారికి జీతాలు, గుర్తింపు ఎందుకు లభించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు, బెదిరింపులు వచ్చినా వెనక్కి తగ్గేది లేదన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో కాలయాపన ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. బస్సులు బంద్ చేస్తే ప్రజలకు ఇబ్బందులు తప్పవని, అయితే అందుకు కారణం మాత్రం ప్రభుత్వమేనని గుర్తుంచుకోవాలని అన్నారు. ఈనెల 19వ తేదీ రాత్రి నుంచి ఆర్టీసీ బస్సుల బంద్‌కు పిలుపు ఆర్టీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆదిమూర్తి -
సాధువు వేషంలో వచ్చి టోకరా
రాయచూరు రూరల్: సాధువులు, సంతుల వేషంలో వచ్చి బంగారు, నగదును మా యం చేసిన ఉదంతం రాయచూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటన వారం రోజుల క్రితం సింధనూరులో జరిగింది. సింధనూరు– కుష్టిగి రహదారిలో మందుల దుకాణాన్ని నడుపుకుంటున్న టింకు, భర్త విష్ణుదత్తలకు సాధువు వచ్చి బూడిద అంటించి వారి వద్ద నుంచి బంగారు, డబ్బులు తీసుకొని పరారయ్యాడు. తాగునీటి కోసం వచ్చిన సాధువు ఆ నీటిని ఎందుకు తాగుతారు అని ఫ్రిజ్‌లో నుంచి చల్లని నీరు తీసి ఇచ్చారు. సాధువు వెంటనే దుకాణం ముందుకొచ్చి వారికి పువ్వులు ఇచ్చాడు, వారిద్దరూ పూల వాసన చూసి మూర్ఛపోయారు. అంతలో అరతులం బంగారు, రూ.10 వేల నగదును తీసుకొని పరారయ్యాడు. ఈ విషయంపై టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వీరారెడ్డి తెలిపారు. నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు డీఎస్పీ చంద్రశేఖర్ నాయక్ తెలిపారు. బంగారు, నగదు అపహరించుకుని పరారీ సింధనూరులో వ్యాపారిని మోసగించిన వైనం -
మందుబాబులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన ధరలు..!
బెంగళూరు: రాష్ట్రంలో మందుబాబుకు ఎక్సైజ్ శాఖ తీపి కబురు చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం మే 11 నుంచి కొత్త ఆల్కహాల్ ఇన్ బేవరేజస్(ఏఐబీ) విధానాన్ని అమలు చేసింది. దీంతో ప్రీమియం బీర్, విదేశీ స్కాచ్ విస్కీ ధరలు గణనీయంగా తగ్గాయి. కొత్త ఎక్సైజ్ విధానం ప్రకారం 5 శాతం ఆల్కహాల్ కలిగిన సాధారణ, లాగర్ బీర్ల ధరలను 20 నుంచి 25 శాతం తగ్గించింది. కింగ్‌ఫిషర్ ప్రీమియం, ఆల్ట్రా 650 మిలీబాటిల్స్ వంటి పేరొందిన బ్రాండ్ల ధరను రూ.75 మేర తగ్గించారు. హైనెకెన్ బీర్ ధర రూ.70, యూబీ ఎక్స్‌పోర్ట్స్ ధర రూ.25, బడ్‌వైసర్ ప్రీమియం ధర రూ.20 మేర తగ్గించారు. బీర్ మాత్రమే కాకుండా విదేశీ ప్రీమియం స్కాచ్ విస్కీ ధరను సైతం 20 శాతం తగ్గించారు. బ్లాక్ లేబల్, చివాస్ రీగల్ లాంటి ప్రజాదరణ పొందిన బ్రాండ్ల 750 మిల్లీబాటిల్ ధర రూ.5,190 నుంచి రూ.4,100కు తగ్గింది. ఇది ప్రీమియం మద్యంప్రియులకు వరంగా మారింది. సాధారణ ప్రజలు తాగే తక్కువ ధర మద్యం ధరలు పెరిగాయి. ప్రభుత్వం కొత్త పన్ను విధాన పద్ధతితో తక్కువ ధర కలిగిన మద్యంపై భారీ భారం మోపింది. దీంతో సాధారణ ప్రజల్లో అసంతృప్తి ఏర్పడింది. కర్ణాటక ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఏఐబీ విధానం దేశంలో మొదటి ప్రయోగం. మద్యంలో ఆల్కహాల్ శాతం ఆధారంగా పన్ను విధించే వ్యవస్థను రూపొందించారు. గతంలో ఉన్న 16 స్లాబ్‌ల విధానాన్ని ప్రస్తుతం 8కి తగ్గించారు. సుమారు 6 దశాబ్దాల పాత పన్ను వ్యవస్థను రద్దు చేసి కొత్త విధానంలో పన్ను వ్యవస్థను అమల్లోకి తెచ్చారు. -
బతికి ఉన్న భర్తకు రిప్ (RIP)..!
కర్ణాటక: నేటి డిజిటల్ యుగంలో కుటుంబ సంబంధాలు, దంపతుల మధ్య అనుబంధాలు మృగ్యమవుతున్నాయి. చిన్న కారణాలకే విడిపోతూ కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. ఇదే మాదిరిగా ఓ భార్య.. భర్తను వదిలేసి అతని ఫోటో మీద రెస్ట్ ఇన్ పీస్ (ఆర్ఐపీ) అని రాసింది. వివరాలు.. 9 ఏళ్ల కిందట ఇక్కడి సాగానహళ్ళిలోని అనూజకు శిడ్లఘట్ట తాలూకా దొడ్డతేకనహళ్ళి కుమార్‌తో వివాహమయ్యింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జల్సాలకు అలవాటు పడిన అనూజా పల్లెలో అత్తమామలను వదిలి బెంగళూరు దేవనహళ్ళిలో భర్తతో బాడుగ ఇంట్లో కాపురం ఉంటున్నారు. పుట్టింటికి వచ్చేసి పోస్టింగులు భర్త కారు డ్రైవర్ కాగా, భార్య విలాసవంత జీవనం కోసం పెద్ద మొత్తంలో అప్పులు చేశాడు. కొన్నిరోజుల కిందట అనూజ భర్తను వదిలేసి పుట్టిల్లయిన సాగానహళ్ళికు వచ్చింది. భర్త ఫోను చేసి కాపురానికి రావాలన్నా అనూజ తిరస్కరించింది. పైగా సోషల్ మీడియాలో.. భర్త ఫోటో పెట్టి రిప్ అని రాసింది. దీంతో కోద్రిక్తుడైన కుమార్ బంధుమిత్రులతో వచ్చి భార్యను నిలదీశాడు. అనూజ, ఆమె అన్న కలిసి కారంపొడి చల్లి చితకబాదడంతో కుమార్, అతని బంధువుల గాయపడ్డారు. బాధితులు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులు పరారయ్యారు. -
నాసిరకం భోజనంపై భగ్గుమన్న విద్యార్థులు
బళ్లారి అర్బన్: విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని ఎస్సీ, ఎస్టీ విద్యార్థి వసతి గృహాల్లో నాసిరకమైన భోజనం పెట్టడంతో విద్యార్థులు భగ్గుమన్నారు. హాస్టల్లో పారిశుధ్యం, తాగునీరు తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఏఐడీఎస్ఓ బళ్లారి జిల్లా సమితి ఆధ్వర్యంలో సమాజ సంక్షేమ శాఖ కార్యాలయం ఎదుట భారీ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐడీఎస్ఓ రాష్ట్ర కార్యదర్శి అజయ్ కామంత్ మాట్లాడుతూ.. బళ్లారి, విజయనగర తదితర జిల్లాల నుంచి ఉన్నత విద్య కోసం వీఎస్కే విశ్వవిద్యాలయానికి చేరుతున్న పేద ప్రతిభావంతులైన విద్యార్థులకు కనీస సౌకర్యాలు కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ హాస్టల్లో 450 మందికి పైగా విద్యార్థులు ఉన్నప్పటికి వారికి అందిస్తున్న ఆహారం, నాసిరకంగా ఉందని తెలిపారు. ఆహారం సరిగా లేకపోవడంతో విద్యార్థులు తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు. హాస్టల్లో పారిశుధ్యం పూర్తిగా దెబ్బతినగా.. మరుగుదొడ్లు, వంట గదులు శుభ్రంగా లేవన్నారు. తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. కూరగాయలు, పప్పు లేకుండా, సాంబార్‌ను నాసిరకం నూనెతో తయారు చేసి భోజనం అందిస్తున్నారని ఆరోపించారు. వారానికి ఒక్కసారి కూడా చికెన్ ఇవ్వడం లేదన్నారు. సంక్షేమ శాఖ అధికారులు ఒకరిపై ఒకరు నెట్టుకుంటూ కాలయాపన చేస్తున్నారన్నారు. అనంతరం సమాజ సంక్షేమ శాఖ ఉపనిర్దేశకులు చిదానంద, జిల్లా అధికారి, సంక్షేమ శాఖ కమిషనర్, సంబంధించిన మంత్రులకు వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఏఐడీఎస్ఓ జిల్లా అధ్యక్షుడు ఈరణ్ణ, కార్యదర్శి కే.మంజునాథ్, ఎం.శాంతి, నిహారిక, సమీర్, వీఎస్కే హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు. -
విమర్శించకపోతే కుమారకు మనుగడ ఏదీ?
● డీసీఎం డీకే శివకుమార్ మండిపాటుశివాజీనగర: కేంద్ర మంత్రి కుమారస్వామికి తమను విమర్శించకపోతే రాజకీయ మనుగడ అసాధ్యం అని, మేం మంచి పనులు చేసినా కుమారస్వామి వ్యతిరేకిస్తారని డీసీఎం డీ.కే.శివకుమార్ మండిపడ్డారు. శుక్రవారం సదాశివనగరలోని తన నివాసం వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. కుమారస్వామి బిడది టౌన్షిప్ ప్రాజెక్ట్‌ను విమర్శించిన విషయంపై స్పందిస్తూ, కుమారస్వామి జారీ చేసిన ప్రాజెక్టునే మేము ముందుకు కొనసాగిస్తున్నాం. తాను రైతుల వద్ద మాట్లాడేందుకు సమయం, తేదీ నిర్ధారించుకొని వెళతానని అన్నారు. నేడు కాదు, భవిష్యత్తులో 20 సంవత్సరాల తరువాత బిడది, బెంగళూరు దక్షిణ ప్రజలు తనను జ్ఞాపకం చేసుకొంటారన్నారు. కుమారస్వామి ఈ ప్రాజెక్ట్ భూమిని డీనోటిఫై చేయవచ్చు కదా? ఎందుకు చేయలేదు? తాను డీనోటిఫై చేసేందుకు సిద్ధంగా లేను. ఆయన డీనోటిఫై చేసి ఎంత అనుభవిస్తున్నారో ఆయనకు, యడియూరప్పకు, తనకు తెలుసునని ఎదురుదాడికి దిగారు. ధరల పెరుగుదల మోదీ కానుక మోదీ ఇతర దేశాలతో ఉత్తమ సంబంధాలు కాపాడుకోలేదు. అంతర్జాతీయ వివాదాలను పరిష్కరించటంలో విఫలమయ్యారు. అందుకు విద్యుత్ పొదుపు చేయాలని, పెట్రోల్ వినియోగించరాదని చెబుతున్నారు. ఇంధనాలను వినియోగించకుండా జీవితం సాగించటమెలా? చాలా మంది కాన్వాయ్ వాహనాలను తగ్గిస్తున్నారు. అయితే సామాన్య ప్రజలు తిరగకుండా ఉండేందుకు ఎలా సాధ్యం? బంగారు కొనుగోలు చేయవద్దంటే ఎలా? అన్నారు. వివాహం చేసుకునే యువతులకు మంగళసూత్రం కావాలి. అలాంటప్పుడు బంగారం కొలుగోలు చేయరాదంటే కుదురుతుందా అని ప్రశ్నించారు. ఎన్నో బ్యానర్లను తీయించాను తానే బ్యానర్ వేయవద్దని, కేసులు పెడతామని చెప్పాను. అయినా అభిమానంతో వేశారు. పలువురికి చెప్పి బ్యానర్లను తీయించాను. 50 శాతం బ్యానర్లు తొలగించారన్నారు. మందుబాబులకు గుడ్ న్యూస్● బీర్, విస్కీ ధరల తగ్గింపు బనశంకరి: రాష్ట్రంలో మందుబాబుకు ఎకై ్సజ్ శాఖ తీపి కబురు చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం మే 11 నుంచి కొత్త ఆల్కహాల్ ఇన్ బేవరేజస్(ఏఐబీ) విధానాన్ని అమలు చేసింది. దీంతో ప్రీమియం బీర్, విదేశీ స్కాచ్ విస్కీ ధరలు గణనీయంగా తగ్గాయి. కొత్త ఎకై ్సజ్ విధానం ప్రకారం 5 శాతం ఆల్కహాల్ కలిగిన సాధారణ, లాగర్ బీర్ల ధరలను 20 నుంచి 25 శాతం తగ్గించింది. కింగ్‌ఫిషర్ ప్రీమియం, ఆల్ట్రా 650 మిలీబాటిల్స్ వంటి పేరొందిన బ్రాండ్ల ధరను రూ.75 మేర తగ్గించారు. హైనెకెన్ బీర్ ధర రూ.70, యూబీ ఎక్స్‌పోర్ట్స్ ధర రూ.25, బడ్‌వైసర్ ప్రీమియం ధర రూ.20 మేర తగ్గించారు. బీర్ మాత్రమే కాకుండా విదేశీ ప్రీమియం స్కాచ్ విస్కీ ధరను సైతం 20 శాతం తగ్గించారు. బ్లాక్ లేబల్, చివాస్ రీగల్ లాంటి ప్రజాదరణ పొందిన బ్రాండ్ల 750 మిల్లీబాటిల్ ధర రూ.5,190 నుంచి రూ.4,100కు తగ్గింది. ఇది ప్రీమియం మద్యంప్రియులకు వరంగా మారింది. సాధారణ ప్రజలు తాగే తక్కువ ధర మద్యం ధరలు పెరిగాయి. ప్రభుత్వం కొత్త పన్ను విధాన పద్ధతితో తక్కువ ధర కలిగిన మద్యంపై భారీ భారం మోపింది. దీంతో సాధారణ ప్రజల్లో అసంతృప్తి ఏర్పడింది. కర్ణాటక ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఏఐబీ విధానం దేశంలో మొదటి ప్రయోగం. మద్యంలో ఆల్కహాల్ శాతం ఆధారంగా పన్ను విధించే వ్యవస్థను రూపొందించారు. గతంలో ఉన్న 16 స్లాబ్‌ల విధానాన్ని ప్రస్తుతం 8కి తగ్గించారు. సుమారు 6 దశాబ్దాల పాత పన్ను వ్యవస్థను రద్దు చేసి కొత్త విధానంలో పన్ను వ్యవస్థను అమల్లోకి తెచ్చారు. -
అంతర్జాతీయ కరాటే పోటీల్లో ప్రతిభ
బళ్లారి టౌన్: ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్‌లో ఈ నెల 9, 10 తేదీల్లో జరిగిన అంతర్జాతీయ కరాటే చాంపియన్‌షిప్ పోటీల్లో షోటోఖాన్ అకాడమీ విద్యార్థులు సత్తా చాటినట్లు ఆ అకాడమీ అధ్యక్షుడు కట్టెస్వామి వెల్లడించారు. శుక్రవారం పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పతకాలు సాధించిన విద్యార్థులను శిక్షకులు ఉలిగన్న, ప్రసాద్, జడేషా, సుభాష్ మోత్కార్ అభినందించారు. యువకుడు దారుణ హత్య రాయచూరు రూరల్: కలబుర్గి జిల్లా చిత్తాపూర్ తాలుకా బి.అల్లూరిలో ఓ యువకుడు గురువారం సాయంత్రం దారుణ హత్యకు గురయ్యాడు. సిద్దప్ప మళ్లప్ప హుళగోళర్ (25)ను గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో కొట్టి చంపారు. పాత కక్షలే ఈ హత్యకు కారణమని ఎస్పీ అడ్డూరు శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. అక్రమ కట్టడాలు తొలగించండి రాయచూరు రూరల్: నగరంలోని బసవేశ్వర సర్కిల్ వద్ద ఉన్న విగ్రహం కనబడకుండా నిర్మిస్తున్న కట్టడాలను తొలగించాలని అఖిల భారత వీరశైవ మహసభ, వీరశైవ సమాజ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం నగర సభ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సంచాలకులు శరణ భూపాల్, నాడగౌడ మాట్లాడుతూ.. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం నగర సభ అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో చంద్రశేఖర్, పరమేశ్వర్, కల్లయ్య, దానమ్మ, విజయరాజ్, రామన గౌడ తదితరులు పాల్గొన్నారు. నూతన బీఈఓ బాధ్యతల స్వీకరణహొసపేటె: తాలూకా విద్యాశాఖ అధికారిగా (బీఈఓ) బి.ఉమాపతి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. హగరిబొమ్మనహళ్లి తాలూకా వల్లభాపూర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నాలుగేళ్లుగా ప్రధానోపాధ్యాయుడిగా సేవలు అందించినట్లు తెలిపారు. విద్యార్థుల్లో పరీక్ష భయాన్ని తొలగించి రాష్ట్రంలో మంచి స్థానం సాధించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. విద్యా పురోగతికి సహకరించాలని ఉపాధ్యాయులందరికీ విజ్ఞప్తి చేశారు. అంతకుమందు ఇన్చార్జ్గా ఉన్న శేఖర్ హొరపేటను కొప్పళ బీఈఓగా బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కార్యాలయ అధికారులు, సిబ్బంది, తాలూకా ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు కొత్త బీఈఓ బి.ఉమాపతిని అభినందించి సన్మానించారు. క్రమశిక్షణతో చదివితే ఉజ్వల భవిష్యత్తు రాయచూరు రూరల్: క్రమశిక్షణతో చదివితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఎస్పీ అరుణాంగ్శు గిరి తెలిపారు. ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పిల్లలకు శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో ప్రతిభా పురస్కారాలు అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రపంచ మానవాళి అభ్యున్నతికి పాటు పడాలన్నారు. సమాజంలో బడుగు వర్గాల అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించాలని సూచించారు. విద్యకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ హరీష్, డీఎస్పీ శాంతవీర తదితరులు పాల్గొన్నారు. -
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ఆగ్రహం
సాక్షి, బళ్లారి: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం లోక్‌సభ సభ్యుడు తుకారాం, బుడా అధ్యక్షుడు జే.ఎస్.ఆంజనేయులు తదితరులు విలేకరులతో మాట్లాడారు. గతంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచినప్పుడు వీధుల్లోకి వచ్చి పోరాటం చేసిన కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు ఇప్పుడు ఏమి చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ఒక నీతి, బీజేపీకి ఒక నీతి ఉంటుందా అని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఒక లీటర్‌పై ఏకంగా ఒకేసారి మూడు రూపాయలు పెంచడం దుర్మార్గమని మండిపడ్డారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కూలీలు కూడా పనులు చేసేందుకు ద్విచక్ర వాహనాల్లో వెళ్తుంటారని.. ఇలాంటి సందర్భంలో పెట్రోలు ధరలు పెంచడం సరికాదని మండిపడ్డారు. కూలీల పొట్ట కొడుతున్నారని దుయ్యబట్టారు. దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని గొప్పలు చెప్పుకునే బీజేపీ నాయకులు.. ఇష్టానుసారంగా పెట్రోలు, డీజిల్ ధరలు పెంచడంలో అర్థం లేదన్నారు. పెంచిన ధరలు తగ్గించకపోతే పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
పెట్రో ధరాభారంతో ప్రజా జీవితం అస్తవ్యస్తం
బనశంకరి: పెట్రోల్, డీజిల్ ధర పెంపుతో ప్రజా జీవితం అస్తవ్యస్తంగా మారుతోందని సీఎం సిద్దరామయ్య అభిప్రాయపడ్డారు. శుక్రవారం నగరంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. కేంద్రప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడాన్ని ఖండిస్తూ ధరల పెంపును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కాగానే కేంద్రప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతుందని భావించినట్లే పెంచారని మండిపడ్డారు. కానీ కర్ణాటకలో ఇతర రాష్ట్రాల కంటే గణనీయంగా తక్కువగా ఉండే పెట్రోల్ ధరను పెంచడంపై బీజేపీ నేతలు విమర్శిస్తున్నారని అన్నారు. నరేంద్ర మోదీ దేశ ప్రధానమంత్రి కాగానే అనేక సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారన్నారు. ధరల పెంపుతో ప్రజలపై వ్యక్తిగతంగా తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. ప్రత్యేకంగా కార్మికులు, రైతులు, పేదలపై తీవ్ర ప్రభావం ఉంటుందన్నారు. కేంద్రప్రభుత్వం ధరల పెంపును రాష్ట్రప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నానన్నారు. మోదీ పాలన ప్రారంభం కాక ముందు రూ.413గా ఉన్న గృహవినియోగ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం రూ.1000కు చేరుకుందన్నారు. పెట్రో ధరల పెంపుతో నిత్యావసరాల ధరలు పెరగడానికి కారణం అవుతుందన్నారు. ఎల్పీజీ సరఫరాలో వ్యత్యాసం మధ్య ధరల పెంపుతో జనజీవనం అస్తవ్యస్తమైందన్నారు. నీట్ పరీక్షను సమర్థవంతంగా నిర్వహించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. లక్షలాది మంది విద్యార్ధుల భవిష్యత్‌కు ఇబ్బందికరంగా మారిందన్నారు. కర్ణాటకలో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభించడంపై స్పందించిన సిద్దరామయ్య రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. దీనికి అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వం కల్పించిందన్నారు. కేంద్రం తీరుపై సీఎం సిద్దరామయ్య ఆగ్రహం -
ప్రైవేటు బస్సు చార్జీల మోత
శివాజీనగర: ఇంధన తదితర సామగ్రిల ధరల పెరుగుదలతో ఇప్పటికే కంగారు పడుతున్న సామాన్య ప్రజలకు ప్రైవేట్ బస్సు యజమానులు మరో షాక్ ఇచ్చారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో శుక్రవారం అర్థరాత్రి నుంచే ప్రైవేట్ బస్సు టికెట్ల ధరలు 20–30 శాతం మేర పెంచాలని తీర్మానించారు. ధరల పెరుగుదలతో ఇప్పటికే ఆర్థిక భారంతో ఉన్న ప్రజలకులిక మరింత భారం కానుంది. ప్రైవేట్ బస్సు యజమానుల వైఖరేంటి? ఓ బస్సుకు ప్రతి రోజు కనీసం 150 లీటర్ల డీజిల్ వేస్తాం. ఇంధనం ధరలో రూ.3 అధికమైన కారణంగా రూ.450 తమకు అదనంగా భారం కానుంది. అందువల్ల టికెట్ల ధర పెంచటం తమకు అనివార్యమైంది. దీంతో ప్రయాణికులపై భారం మోపక తప్పదని కర్ణాటక రాష్ట్ర ప్రైవేట్ బస్సుల యజమానుల సంఘం అధ్యక్షుడు నటరాజ్ శర్మ తెలిపారు. ఉదయాన్నే వాత శుక్రవారం ఉదయాన్నే చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధర పెరుగుదలను ప్రకటించాయి. పెట్రోల్, డీజిల్ రెండూ లీటర్‌కు రూ.3 అదనంగా పెంచారు. అదే ప్రకారం బెంగళూరులో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.3.27, డీజిల్ ధర లీటర్‌కు రూ.3.12 పెరిగింది. ఆ నేపథ్యంలో దేశవ్యాప్తంగా సీఎన్జీ ధరను కూడా ప్రతి కేజీకి రూ.2 చొప్పున పెంచనున్నట్లు ప్రకటించారు. హార్ముజ్ జలసంధి దిగ్బంధంతో ఇంధనం సరఫరాలో తారతమ్యం నెలకొన్న పరిణామమే ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని తెలిసింది. ధరల పెరుగుదలతో అవస్థలు పడుతున్న ప్రజలకు మరొక షాక్ శుక్రవారం అర్ధరాత్రి నుంచే ప్రైవేట్ బస్సు టికెట్ల ధర కూడా పెంపు 20–30 శాతం మేర ధరలు పెరుగుతాయన్న బస్సు యజమానులు -
జాగృతి సమితిని రద్దు చేయాలి
కోలారు: సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాసన్ నిబంధనలకు విరుద్ధంగా జిల్లా జాగృతి సమితి ఏర్పాటుకు సిఫార్సు చేశారని, సాంఘిక సంక్షేమ శాఖ జేడీగా ఆయన నియామకాన్ని రద్దు చేయాలని దళిత సంఘటనల సంయుక్త రంగ పదాధికారులు డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం ఎమ్మెల్సీ అనిల్‌కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. సంఘటన అధ్యక్షుడు డీపీఎస్ మునిరాజు మాట్లాడుతూ జాగృతి సమితి ఎంపికకు తొలుత అర్జీలు ఆహ్వానించి అన్ని దళిత సంఘటనలు, సముదాయ సేవకులకు అవకాశం కల్పించాల్సి ఉండగా సదరు అధికారి ఆ నిబంధనలను విస్మరించి ఏకపక్షంగా వ్యవహరించారన్నారు. వెంటనే ఈ సమితిని రద్దు చేసి కొత్తగా సమితిని రచించాలని కోరారు. నారాయణస్వామి, గాంధీనగర చేతన్ బాబు, మోజిపాళ్య నాగేష్ తదితరులు ఉన్నారు. -
జిల్లా అభివృద్ధికి చర్యలు చేపట్టాలి
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లా అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని రాయచూరు వాణిజోద్యమ సంఘం నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా అధికారి పూవితను కలసి సమస్యలు విన్నవించారు. ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్షుడు కమల్ కుమార్ మాట్లాడుతూ.. రాయచూరులో విమానాశ్రయం, రహదారి, మోగా పార్కు, కృష్ణా వంతెన నిర్మాణం తదితర పనులు త్వరతిగతిన పూర్తి చేయాలని కోరారు. రైల్వే గూడ్స్‌షెడ్ స్థలాంతరం, పరిశ్రమల స్థాపనకు భూముల సేకరణ, మెగా జౌళి పార్కు, పక్షిదామ కేంద్రం, సింధనూర్–రాయచూరు రైల్వే పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో జంబన్న, ఎంఎన్ మూర్తి, పురుషోత్తమ్, వెంకటరాజ్ గుప్తా, వసంత్ రావు, మురారిలాల్, నారాయణ రావ్ తదితరులు పాల్గొన్నారు. ఇన్సూరెన్స్ కంపెనీకి జరిమానాహుబ్లీ: కుమారుడి బీమా సొమ్ము చెల్లించని హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి జిల్లా వినియోగదారుల ఫోరం జరిమానాతో పాటు పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. వివరాలు.. హుబ్లీ గంగాధర నగర పద్మవ్వ గురాల కుమారుడు సునీల్ సదరు బీమా కంపెనీలో రూ.1.96 లక్షలు చెల్లించి బీమా చేయించాడు. పాలసీ రన్నింగ్‌లో ఉండగానే సునీల్ గుండెపోటుతో మరణించాడు. పాలసీ డెత్ రిస్క్ కలిగి ఉంది. పాలసీ నియమాల ప్రకారం తన కుమారుడు మరణాంతరం బీమా సొమ్ము రూ.27.44 లక్షలు చెల్లించాలని తల్లి పద్మవ్వ కంపెనీని కోరింది. అయితే ఆ కంపెనీ నియమాలు ఉల్లంఘించి, బీమా సొమ్ము చెల్లించడంలో జాప్యం చేసింది. బాధితులు వెంటనే జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. ఈ మేరకు ఫోరం అధ్యక్షుడు, సభ్యులు కేసు విచారణ చేపట్టారు. బీమా రూ.27.44 లక్షలను ఆదేశం ఇచ్చిన రోజు నుంచి ఒక నెలలోపు చెల్లించాలన్నారు. అలాగే ఇబ్బంది, మనోవేదనకు రూ.50 వేలు పరిహారం కూడా ఇవ్వాలని ఆదేశించారు. నీటి పొదుపు పాటించండికేజీఎఫ్: తాలూకాలోని కమ్మసంద్ర గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో శుక్రవారం తాగునీటి అదాలత్‌ను శుక్రవారం నిర్వహించారు. పాలనాధికారి తిరుమూర్తి నాయక్ మాట్లాడుతూ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలన్నారు. తాగునీటి సమస్య ఏర్పడితే వెంటనే గ్రామ పంచాయతీ సహాయవాణికి సమాచారం అందించాలని తెలిపారు. పంచాయతీ అభివృద్ధి అధికారి వసంతకుమార్ మాట్లాడుతూ బోరు బావి చుట్టూ స్వచ్ఛతను కాపాడుకోవాలన్నారు. నీరు కలుషితం కాకుండా చూసుకోవాలన్నారు. పట్టపగలే దోపిడీకి యత్నంకోలారు: నగదు సంచిని దోపిడీ చేసేందుకు యత్నించిన దొంగను స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. ఈఘటన బేతమంగల గ్రామంలో చోటు చేసుకుంది. కోర్టులో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి రమేష్.. కెనెరా బ్యాంకు నుంచి రూ. లక్ష డ్రా చేసుకుని డబ్బును స్కూటర్లో ఉంచుకుని బయల్దేరాడు. వెంబడించిన నలుగురు దొంగలు బస్టాండు సమీపంలో అడ్డగించి బెదిరించి నగదును దోచుకునేందుకు యత్నించారు. ఆ సమయంలో స్థానికులు అడ్డుకున్నారు ముగ్గురు పరారు కాగా మరో వ్యక్తికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ఘనంగా డీకేశి జన్మదిన వేడుకలు
సాక్షి, బళ్లారి: కేపీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. శుక్రవారం నగరంలోని కనక దుర్గమ్మ ఆలయంలో కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక పూజలు, అర్చనలు చేయించారు. 65 కేజీల కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అలాగే జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి డీకేశీ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాబోయే రోజుల్లో డీకేశీ మరింత ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు డీకేశీ సీఎం కావాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో లోక్‌సభ సభ్యుడు తుకారాం, సండూరు ఎమ్మెల్యే అన్నపూర్ణ, బుడా అధ్యక్షుడు జే.ఎస్ ఆంజనేయులు, మేయర్ గాదెప్ప, డీసీసీ అధ్యక్షుడు అల్లం ప్రశాంత్, ఎమ్మెల్యే నాగేంద్ర సోదరుడు, బీ.వెంకటేశ్ ప్రసాద్, కార్పొరేటర్లు కుబేరా, మించు శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు తిమ్మనగౌడ, బోయపాటి విష్ణువర్దన్, జగన్నాథ్ (జగన్) తదితరులు పాల్గొన్నారు. -
‘నీట్’ నిర్వహణలో ప్రభుత్వం విఫలం
హొసపేటె: నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై ఎస్ఎఫ్ఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం తాలూకా కార్యాలయం ఎదుట విద్యార్థులతో కలసి నిరసన వ్యక్తం చేశారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రవికిరణ్ జేపీ మాట్లాడుతూ.. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ కేవలం ఒక పరీక్ష సంస్థ వైఫల్యం మాత్రమే కాదు.. ఇది లక్షలాది నిజాయతీగల విద్యార్థుల చెమట, కలలపై జరిగిన ఘోరమైన అమానుష చర్య అని తెలిపారు. కేవలం మూడేళ్లలో ఇది రెండో సారి ప్రశ్నపత్రం లీక్ చేశారన్నారు. నీట్ కోచింగ్ కోసం సంవత్సరానికి రూ.80 వేల నుంచి రూ.3 లక్షల వరకు విద్యార్థులు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. ఇంత ఖర్చు చేసి 3–4 ఏళ్లుగా పగలు, రాత్రి నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. కొద్దిమంది ప్రయోజనం కోసం ప్రభుత్వ విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. -
చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
రాయచూరు రూరల్: నగరంలో ఎవరూ లేని ఇళ్లను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి రూ.1.26 లక్షల విలువైన నగలు స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాత్రి నేతాజి నగర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శాంతవీర మాట్లాడారు. ఇంట్లో దొంగతనం జరిగిందని కొత్తపేట షేక్ రహీం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలించారు. రహీం (19)ను అరెస్ట్ చేసి బంగారు, వెండి నగలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఎస్ఐ బసవరాజ్, శారద, పోలీసులు పాల్గొన్నారు. ఇద్దరు దొంగలు అరెస్ట్ హుబ్లీ: చైన్ దొంగతనాలతో పాటు ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను ధార్వాడ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. హుబ్లీకి చెందిన అసిఫ్, అలాగే అమ్మినబావి నివాసి శివానంద హుళ్లగేరి అరెస్ట్ అయిన నిందితులు. వీరు ఇద్దరు కలసి టౌన్, సబర్బన్ స్టేషన్ పరిధిలోని వివిధ ఇళ్లలో చోరీలు చేశారు. బంగారు ఆభరణాలు దొంగిలించారు. పోలీసులు నిఘా వేసి ఇద్దరిని పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.4.50 లక్షలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రూ.1.26 లక్షల విలువైన నగలు స్వాధీనం -
కర్ణాటకలోనూ సర్
శివాజీనగర: రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–సర్) ఎన్నికల కమిషన్ ఇప్పటికే ప్రకటించిన తేదీ జూన్ 20 నుంచి శిక్షణ, ముద్రణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. జూన్ 30 నుంచి జూలై 29 వరకు ఇంటింటికీ వెళ్లి సమాచారం సేకరిస్తారు. ఓటరు జాబితాలో చేరేందుకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అక్టోబర్ 7న తుది ఓటరు జాబితా ప్రకటించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి అనూప్ కుమార్ వెల్లడించారు. ఆయన శుక్రవారం రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నేపథ్యంలో నగరంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఓటర్ల మ్యాపింగ్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 86 శాతం ప్రగతి సాధించారన్నారు. కొడగు జిల్లాలో 96 శాతం పూర్తయిందన్నారు. చిత్తాపుర అసెంబ్లీ నియోజకవర్గంలో మ్యాపింగ్ ప్రగతి పరిశీలనకు ముందు శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో అతి ముఖ్యమైన వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించినట్లు తెలిపారు. ఓటరు గణన, క్యూఆర్ కోడ్ ఎన్నికల ప్రక్రియ ముందు దశల గురించి ఆయన మాట్లాడుతూ ఎస్ఐఆర్ ఫారంలో గణన నమూనానే అత్యంత ముఖ్యం అన్నారు. బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి 2 సెట్ల గణన నమూనాలను చేస్తారన్నారు. ప్రత్యేకత అంటే గణతి నమూనాలో ఉన్న ప్రతి ఓటరుకు కూడా ప్రత్యేక క్యూఆర్ కోడ్ ఉంటుందన్నారు. ఒక సెట్ తిరిగివ్వాలి బూత్ స్థాయి అధికారులు గణన నమూనాను ఇంటికి తెచ్చినపుడు ప్రజలు అందులో 1 సెట్‌ను పూర్తిగా భర్తీ చేసి అధికారులకు తిరిగి ఇవ్వాలి. మరో సెట్ గణన నమూనాను భవిష్యత్‌కు సాక్షిగా ఓటర్లు తమ వద్ద భద్రంగా ఉంచుకోవాలి. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు సమాచారం అందించే సమావేశం నిర్వహించామన్నారు. రాజకీయ పార్టీలు బీఎల్ఏలను నియమించవచ్చు. మాధ్యమాలకు సైతం శిక్షణ శిబిరాన్ని జరుపుతామన్నారు. జీపీ స్థాయిలో ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లను తెరుస్తారన్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ అమలు రాష్ట ఎన్నికల అధికారి అనూప్‌కుమార్ -
చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
బళ్లారి అర్బన్: విద్యార్థుల జీవితంలో ఆరోగ్యం, క్రీడాస్ఫూర్తి కీలక పాత్ర పోషిస్తాయి. శారీరకంగా ధృడంగా ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చని నగరంలోని శ్రీమతి సరళాదేవి సతీష్‌చంద్ర అగర్వాల్ ప్రభుత్వ ఫస్ట్‌గ్రేడ్ కళాశాల ప్రిన్సిపాల్ డా.ప్రహ్లాద చౌదరి తెలిపారు. కళాశాల వార్షికోత్సవంలో భాగంగా షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా చురుకుగా పాల్గొనాలని సూచించారు. పురుషులు, మహిళలకు వేర్వేరుగా నిర్వహించిన సింగిల్స్, డబుల్స్ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ కనబరిచారు. కార్యక్రమంలో కన్నడ శాఖ సహాయక ఆచార్యుడు రామస్వామి, అధ్యాపకుడు చంద్రశేఖర్, జర్నలిజం శాఖ అధ్యాపకుడు డాక్టర్ గిరీష్ కుమార్, అధ్యాపకులు సంతోష్ కుమార్ చౌహాన్, శంభులింగయ్య స్వామి, సిబ్బంది, హనుమంతు తదితరులు పాల్గొన్నారు. -
వర్ష బీభత్సం.. నలుగురు దుర్మరణం
● విజయపురలో పిడుగుపాటుకు ఒకరు మృతి ● వర్ష బాధితులకు మంత్రి పాటిల్ పరామర్శరాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలోని పలు జిల్లాల్లో గురువారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన జడివాన 8 గంటల వరకు ఏకధాటిగా కురిసింది. విజయపుర జిల్లాలో రెండు గంటల పాటు కురిసిన వానకు ఎక్కడ చూసినా రోడ్లు బురదమయంగా మారాయి. విజయపుర జిల్లాలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఆ జిల్లాలోని ఆలమేల తాలూకా మెరటిగిలో మట్టి మిద్దె కూలి గురునాథ్ బడిగేర(35), జ్యోతి(28), కాళమ్మ(13), కీర్తి(9) మట్టిలో కూరుకు పోవడంతో ఊపిరాడక మరణించారు. ఘటన స్థలానికి శుక్రవారం జిల్లా ఇన్చార్జి, భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్, శాసన సభ్యులు అశోక్ మనగోళి, మాజీ శాసన సభ్యుడు రమేష్, జిల్లాధికారి ఆనంద్, ఎస్పీ లక్ష్మణ్ నింబరిగి, జెడ్పీ సీఈఓ రిషి ఆనంద్ చేరుకుని పరిశీలించారు. ఇక యాదగిరి జిల్లా శహాపుర, బీదర్ జిల్లా భాల్కి, తదితర ప్రాంతాల్లో కూడా భారీ వానలు పడ్డాయి. శహాపురలో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వాన నీరు చేరాయి. సురపుర, నారాయణపుర, గురుమఠకల్, వడగేర, సైదాపుర ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. సేడం తాలూకాలో లక్ష్మణ్(40) అనే వ్యక్తి పిడుగుపాటుకు మృతి చెందారు. ముధోళలో గాలివానకు లక్ష్మీ వేంకటేశ్వర కల్యాణ మంటపం పైకప్పునకు వేసిన టిన్ షెడ్లు లేచిపోయాయి. -
పల్లెల్లో దాహం కేకలు
రాయచూరు రూరల్: వేసవి తీవ్రత, వర్షాభావంతో కర్ణాటకలో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. ఎండల తీవ్రతకు ఉత్తర, కళ్యాణ కర్ణాటకలో తాగునీటి ఎద్దడి నెలకొంది. చెరువులు, తాగునీటి కుంటలు ఎండిపోతున్నాయి. తాగునీటి కోసం ప్రజలు బోర్లను ఆశ్రయిస్తున్నారు. విజయపుర, బాగల్కోటె జిల్లాల సరిహద్దులో ఉన్న ఆల్మట్టి డ్యాంలో అనుకున్నంత మేర నీరు లభ్యత లేదు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది జలాశయంలో నీటి లభ్యత గణనీయంగా పడిపోయింది. ఆల్మట్టి డ్యాం 519.60 మీటర్ల సముద్ర మట్టం వద్ద 123.08 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగి ఉంది. ప్రస్తుతం 52.42 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మే, జూన్ వరకు ఆల్మట్టి జలాశయం నుంచి విజయపుర, బాగల్కోటె, యాదగిరి, కలబుర్గి, రాయచూరు జిల్లాలో తాగునీటి పథకాలకు ఇబ్బందులు తప్పవు. సిరవార తాలూకా ప్రజలు అత్తనూరు చెరువు నీటిని తెచ్చుకుంటున్నారు. మాన్వి తాలూకా కల్లూరులో కిలోమీటర్ దూరం వెళ్లి తోపుడు బండ్లపై తాగునీరు తెచ్చుకునే పరిస్థితి నెలకొంది. తాగునీటి సమస్యలు పరిష్కరించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. నీటి సమస్యలను పరిష్కరించే వారు కరువయ్యారు. జిల్లాలో కృష్ణా, తుంగభద్ర నదులు ఉన్నప్పటికీ వర్షాభావంతో నీటి సమస్య అధికమైంది. ఆల్మట్టి జలాశయానికి కోయ్నా జలాశయం నుంచి తాగునీటి కోసం రెండు టీఎంసీల నీరు విడుదల చేయాలని అధికారులు లేఖ రాశారు. అయితే నేటికీ స్పందన లేదు. కోయ్నా డ్యాంలో 42 టీఎంసీలు, వారణాసి డ్యాంలో 14 టీఎంసీల నీటి లభ్యత ఉండగా.. రెండు టీఎంసీల నీరు వదిలేందుకు మహారాష్ట్ర సర్కార్ విముఖత చూపుతోంది. ఉత్తర, కళ్యాణ కర్ణాటకలో గ్రామాలకు తాగునీటి గండం కృష్ణా తీరంలో తీవ్రమైన సమస్య -
మొక్కు తీరకనే పరలోకాలకు..
ఆస్పత్రులకు క్షతగాత్రుల తరలింపు సాక్షి, బళ్లారి: ఆధ్యాత్మిక యాత్ర విషాదాంతమైంది. ఇష్టదైవాన్ని దర్శించుకుని మొక్కు తీర్చుకుందామని శుక్రవారం ట్రాక్టర్లో ఒకే కుటుంబానికి చెందిన వారు తమ బంధువులతో కలిసి బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ మార్గమధ్యంలో తుంగభద్ర నది వంతెనపై వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన ట్యాంకర్ లారీ ఢీకొంది. దీంతో ట్రాక్టర్ అదుపు తప్పి వంతెన పైనుంచి కిందకు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆస్పత్రిలో మృతి చెందారు. ఈ విషాద ఘటన గ్రామస్తులను కలిచి వేసింది. కొప్పళ జిల్లా మునిరాబాద్ సమీపంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. వివరాలు.. విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా మర్లాయనహళ్లికి చెందిన ఒకే కుటుంబానికి చెందినవారు, సండూరు తాలూకా యశ్వంతనగర గ్రామానికి చెందిన బంధువులతో కలిసి మొత్తం 19 మంది ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం, కొప్పళ జిల్లా హులిగిలో వెలసిన హులిగమ్మ దేవి ఆలయానికి ట్రాక్టర్లో బయలుదేరారు. అయితే వారు వెళుతున్న ట్రాక్టర్ మార్గమధ్యంలో వంతెనపై వెళుతుండగా కొప్పళ వైపునకు వేగంగా వెళుతున్న ట్యాంకర్ లారీ అదుపు తప్పి ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొంది. లారీ క్యాబిన్ ధ్వంసం కాగా ట్రాక్టర్ కిందకు పడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో డ్రైవర్‌తో సహా ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు వీరే సండూరు, కూడ్లిగి తాలూకాలకు చెందిన గౌరమ్మ (25), గీత (20), మహంతేష్ (18), మంజమ్మ (30), ట్రాక్టర్ డ్రైవర్ కెంచప్ప (35), భరత్ (1) మాయ(16). క్షతగాత్రులు వీరే.. మల్లారహళ్లికి చెందిన అజయ్, హనుమక్క, రేణుక , అంజలి, సవిత, మళ్లహళ్లికి చెందిన సండూరుకు చెందిన చేతన్, నాగరాజ, అరుణమ్మ కొప్పళ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక కూడ్లిగి పట్టణంలోని 14వ వార్డుకు చెందిన రేఖ , అర్జున్, రక్షిత, మహాలక్ష్మి హొసపేటె ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.వంతెన పైనుంచి తుంగభద్ర నదిలోకి పడిన ట్రాక్టర్ఘటనా స్థలంలో గుమికూడి ట్రాక్టర్‌ను పరిశీలిస్తున్న స్థానికులువివరాలు నమోదు చేస్తున్న పోలీసులుఘటనా స్థలిలో మృతుడుగాయపడిన బాలుడు ట్రాక్టర్ బోల్తా పడి ఏడుగురు దుర్మరణం వంతెన పైనుంచి తుంగభద్ర నదిలోకి పడిన ట్రాక్టర్ కొప్పళ జిల్లాలో ఘటన మృతులంతా ఒకే కుటుంబం వారే ఘటనలో పది మందికి పైగా తీవ్ర గాయాలుగాయపడిన వారిని హొసపేటె, కొప్పళలోని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులకు సూచించారు. ఈ ఘోర దుర్ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది. 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన వారు ఆరుగురు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ట్రాక్టర్ కూడా నుజ్జునుజ్జయింది. ఘటన అనంతరం హొసపేటె ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ వద్ద మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ప్రమాదంలో భార్య, కుమారుడిని కోల్పోయిన మల్లేష్ తన మరో కుమారుడితో కలిసి రోదించిన తీరు చూపరులను కలిచి వేసింది. సమాచారం తెలియగానే బళ్లారి ఎంపీ తుకారాం హొసపేటెలోని ప్రభుత్వ ఆస్పత్రి వద్దకు చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల పరిహారం అందిస్తామని ప్రకటించారు. ఘటనపై మునిరాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కనకపుర వైద్య కళాశాలకు భూమిపూజ
బొమ్మనహళ్లి: కనకపుర పట్టణంలోని బెంగళూరు రోడ్డులో 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.450 కోట్లతో నిర్మించనున్న ప్రభుత్వ వైద్య కళాశాలకు శుక్రవారం బాముల్ అధ్యక్షుడు డి.కె. సురేష్ శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ ఈ ఆస్పత్రి నిర్మాణంతో కనకపుర తాలూకా ప్రజల చిరకాల స్వప్నం నెరవేరుతుందన్నారు. రెండేళ్లలో భవన నిర్మాణాలు పూర్తవుతాయని, అయితే వచ్చే ఏడాది నుంచే వైద్య కళాశాల కార్యకలాపాలు ప్రారంభమై తాలూకా ప్రజలకు వైద్య సేవలు అందుతాయన్నారు. ఎమ్మెల్సీ ఎస్. రవి, బీడీసీసీ బ్యాంక్ మాజీ అధ్యక్షుడు నారాయణ గౌడ, గ్యారంటీ ప్రాజెక్ట్ అమలు కమిటీ ఛైర్మన్ కె.ఎన్. దిలీప్ పాల్గొన్నారు. 17న మెట్రో సేవల్లో అంతరాయంయశవంతపుర: ఈనెల 17న ఆదివారం నమ్మ మెట్రో మెజిస్టిక్, విశ్వశ్వరయ్య స్టేషన్, సెంట్రల్ కాలేజీస్టేషన్లో మరమ్మతుల దృష్ట్యా రెండు గంటల పాటు మెట్రో సేవల్లో అంతరాయం ఉంటుందని బీఎంఆర్సీఎల్ అధికారులు తెలిపారు. ఉదయం 7 నుంచి 9 గంటల రాకపోకలను రద్దు చేశారు. చల్లఘట్ట–విజయనగర, ఎంజిరోడ్డు–వైట్‌ఫీల్డ్, మాదావర–సీల్కబోర్డు, ఆర్వీ రోడ్డు–బోమ్మనహళ్లిలో యథాస్థితిలో నడవనున్నాయి. 9 గంటల తరువాత రోజులాగానే మెట్రో సంచారం ఉంటుందని అధికారులు తెలిపారు.ఎలక్ట్రిక్ బైక్‌పై ప్రయాణించిన ఎమ్మెల్యే శ్రీవత్స మైసూరు: మైసూరు నగరంలోని కేఆర్ నియోజకవర్గ ఎమ్మెల్యే టి.ఎస్. శ్రీవత్స తన విలాసవంతమైన పెట్రోల్ కారులో ప్రయాణించడం మానేశారు. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్యే శ్రీవత్స తన రోజువారీ రవాణా వ్యవస్థలో ఇంధన వినియోగాన్ని 90 శాతం తగ్గించాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఎలక్ట్రిక్ బైక్‌పై ప్రయాణించారు. ప్రజలు కూడా ప్రజా రవాణా బస్సులను ఎక్కువగా ఉపయోగించాలని పిలుపునిచ్చారు. ఆన్లైన్ గేమ్స్ కంపెనీకి ఈడీ షాక్ బనశంకరి: ఆన్లైన్ గేమింగ్ సంస్ద గేమ్స్క్రాఫ్ట్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఈడీ బిగ్‌షాక్ ఇచ్చింది. ఇటీవల కంపెనీ కార్యాలయాలు, ప్రముఖ డైరెక్టర్ల నివాసాలపై నిర్వహించిన ఈడీ అధికారులు ఈ కేసులో సంస్థకు చెందిన ముగ్గురు డైరెక్టర్లను అధికారికంగా అరెస్ట్ చేసింది. సుమారు రూ.526 కోట్ల విలువ చేసే చరాస్తులను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. అక్రమ నగదు బదిలీ కేసులో గేమ్స్క్రాఫ్ట్ టెక్నాలజీ సంస్థ డైరెక్టర్ పృథ్వీరాజ్‌సింగ్, వికాస్ తనేజా, దీపక్‌సింగ్ అహ్లావత్ అనే ముగ్గురు డైరెక్టర్లను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన ముగ్గురు డైరెక్టర్లు ఆర్థిక వ్యవహారాల్లో నేరుగా భాగస్వాములుగా ఉన్నారు. ప్రస్తుతం వీరిని తీవ్రంగా విచారణ చేపడుతున్నారు. ఈనెల 7 నుంచి 13వ తేదీ వరకు ఈడీ అధికారుల బృందం బెంగళూరుతో పాటు వివిధ చోట్ల ఉన్న గేమ్స్క్రాఫ్ట్ టెక్నాలజీస్ ప్రముఖ కార్యాలయాలు, డైరెక్టర్లు, కంపెనీ ఉన్నతాధికారుల నివాసాలపై సుదీర్ఘంగా సోదాలు నిర్వహించారు. వారం రోజుల వ్యవధిలో కీలక ఫైళ్లు స్వాధీనం వారం రోజుల వ్యవధిలో కంపెనీ వ్యవహారాలకు సంబంధించి కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. దాడుల సమయంలో ఈడీ అధికారులు భారీ ఎత్తున నగదు, ఆభరణాల ఆచూకీ కనిపెట్టారు. సుమారు రూ.3.5 కోట్ల విలువ చేసే 2.5 కిలోల బంగారం, వజ్రాభరణాలు, రూ.11 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు డిజిటల్ సాక్ష్యాలైన అనేక ఎలక్ట్రానిక్ పరికరాలను జప్తు చేశారు. కేవలం నగదు, బంగారు ఆభరణాలు మాత్రమే కాకుండా కంపెనీలకు కోట్లాది రూపాయల ఆర్థిక పెట్టుబడులకు ఈడీ బ్రేక్ వేసింది. దర్యాప్తులో భాగంగా కంపెనీకి చెందిన వివిధ బ్యాంకు బ్యాలెన్స్ పేమెంట్ గేట్‌వే బ్యాలెన్స్, మ్యూచువల్ ఫండ్స్, బాండ్లు, స్థిర డిపాజిట్లు(ఎఫ్డీ)తో పాటు మొత్తం రూ.526.49 కోట్ల విలువైన చరాస్దులను ఈడీ ఫ్రీజ్ చేసింది. -
భారతీయ సంస్కృతిపై అవగాహన అవసరం
రాయచూరు రూరల్: భారతదేశంలో హిందు వైదిక ధర్మ సందేశాలను పిల్లలకు బోధిచడం మనందరి కర్తవ్యం అని కిల్లే బ్రహన్మ మఠాధిపతి శాంతమల్ల శివాచార్య పేర్కొన్నారు. శుక్రవారం ఈశ్వర దేవాలయలంలో రాయచూరు జిల్లా వీరశైవ జంగమ పురోహితుల సంఘం ఆధ్వర్యంలో వేద అధ్యయనం, సంస్కార శిబిరాల ముగింపు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ.. పిల్లలకు సనాతన సంప్రదాయాలు ఆచార, వ్యవహారాలు, భారతీయ సంస్కృతిపై అవగాహన కల్పించి ఆిసక్తి కల్పించేలా చూడాలని సూచించారు. అనంతరం పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన జంగమ సమాజం విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో శరణ భూపాల్ నాడగౌడ, మాలి పాటిల్, చంద్రశేఖర్, బసవరాజ్, శరణయ్య స్వామి, పంపాపతి శాస్త్రి, రామన గౌడ తదితరులు పాల్గొన్నారు. -
మార్కెట్లో శుభ్రత కాపాడండి
రాయచూరు రూరల్: నగరంలోని మార్కెట్లో శుభ్రతకు ప్రాధాన్యత కల్పించి పరిసరాలను సంరక్షించాలని స్వచ్ఛత నోడల్ అధికారి కృష్ణ శావంతగేర పేర్కొన్నారు. గురువారం నగరంలోని ఉస్మానియా కాయగూరల మార్కెట్‌ను సందర్శించి విక్రయదారులకు సలహా సూచనలు అందించారు. కుళ్లిన కాయగూరలను ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల పశువులు, కుక్కలు వాటిని చిందర వందర చేస్తాయని, అలా జరగకుండా చూసుకోవాలన్నారు. నగరసభ అధికారులు, సిబ్బంది నిఘా ఉంచి స్వచ్ఛత కాపాడని వారిపై జరిమానా విధించాలని సూచించారు. గ్యాస్ సిలిండర్ల ధరాభారం తగదు హొసపేటె: విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి తాలూకాలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను అక్రమంగా అదనపు ధరలకు అమ్మడాన్ని అరికట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తలు గురువారం తహసీల్దార్ కవితకు వినతిపత్రాన్ని సమర్పించారు. ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా మధ్య యుద్ధం సాకుతో కొంత మంది గ్యాస్ సిలిండర్ల డీలర్లు వినియోగదారుల నుంచి అదనపు డబ్బు వసూలు చేస్తున్నారని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఆర్ఎస్ బసవరాజ్ అన్నారు. గ్యాస్ ఏజెన్సీ యజమానులు, కొందరు అధికారుల కుమ్మక్కుతో నడుస్తోన్న ఈ దందాను అరికట్టాలన్నారు. ప్రజలకు సిలిండర్లు సులభంగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) తాలూకా అధ్యక్షుడు ఎస్.జగన్నాథ్, దురుగమ్మ, నాగమ్మ, కే.రమేష్, ఎం.ఆనంద్, పి.చాంద్‌బీ తదితరులు పాల్గొన్నారు. చెరువుల సంరక్షణకు చర్యలు రాయచూరు రూరల్: నగరంలో పురాతన చెరువుల సంరక్షణకు చర్యలు చేపట్టాలని జిల్లాధికారిణి పూవిత సూచించారు. గురువారం నగరంలోని మావినకెరె చెరువును పరిశీలించి ఆమె మాట్లాడారు. నిర్ణీత గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. వేసవిలో పట్టణాలు, నగరాల్లో ప్రజలకు తాగునీటి ఎద్దడి నెలకొనకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆమె వెంట కమిషనర్ జుబిన్ మహాపాత్రో, ఆనంద రెడ్డి, బసవరాజ్‌లున్నారు. నలుగురు పోలీసు అధికారుల బదిలీ రాయచూరు రూరల్: రాయచూరు జిల్లాలో నలుగురు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు బదిలీ అయ్యారు. సదర్ బజార్ పోలీస్ స్టేషన్ సీఐగా దాదావలిని నియమిస్తు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పదేళ్ల క్రితం ఎ్స్ఐగా విధులు నిర్వహించిన పోలీస్ స్టేషన్లోనే సీఐగా గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. సదర్ బజార్ సీఐగా ఉన్న ఉమేష్ నారాయణ కాంబ్లేను పశ్చిమ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. పశ్చిమ పోలీస్ స్టేషన్ సీఐగా ఉన్న మేకా నాగరాజ్‌ను లోకాయుక్తకు బదిలీ చేశారు. దేవదుర్గ గ్రామీణ సీఐగా ఉన్న గుండూరావ్ను రాయచూరు సైబర్ క్రైంకు బదిలీ చేశారు. లోకాయుక్తలో ఉన్న పుండలీక పత్తార్‌ను దేవదుర్గ గ్రామీణ సీఐగా నియమితులయ్యారు. 15 రోజులైనా తాగునీరు వదలరా?రాయచూరు రూరల్: నగరంలోని మడ్డిపేటెలో 15 రోజుల క్రితం తాగునీటిని వదిలిన తర్వాత నేటికీ వదలక పోవడంతో అధికారుల తీరును నిలదీస్తూ అఖిల భారత జనవాది మహిళా సంఘం కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. గురువారం నగరసభ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో మహిళా సంఘం సంచాలకురాలు సులోచన మాట్లాడారు. వేసవిలో తాగునీటి ఎద్దడి నెలకొనకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజా ప్రతినిధులు, మంత్రులు, ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేసినా స్పందించక పోవడాన్ని ఖండించారు. కాలనీవాసులకు తాగునీటిని వదలాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. వరలక్ష్మి, శకుంతల, నాగరత్నలున్నారు. -
ఉప సమన్వయాధికారిగా సుఖ్‌దేవ్
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఉప సమన్వయాధికారిగా సుఖ్‌దేవ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేశారు. రాయచూరు డయట్ సీనియర్ అధ్యాపకుడిగా, దేవదుర్గ తాలూకా విద్యా శాఖాధికారిగా పని చేసిన సుఖ్‌దేవ్ గురువారం నూతన అధికార బాధ్యతలు చేపట్టారు. అజ్ఞాన అంధకారాన్ని వీడాలి రాయచూరు రూరల్: నేటి ఆధునిక యుగంలో విద్యార్థులు అజ్ఞానమనే అంధకారం నుంచి బయటికి రావాలని విశాఖపట్నం వేదాంత సంస్థ సంచాలకుడు సత్యనారాయణ పిలుపు ఇచ్చారు. నగరంలోని నవోదయ వైద్య కళాశాలలో జరిగిన గురుశిష్యుల పరంపర, విద్యార్థుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు గురువులను ప్రశ్నించే హక్కు, సేవా మనోభావాలను పెంపొందించుకోవాలన్నారు. నవోదయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ దొడ్డయ్య, రాజేష్, రశ్మి అద్రి, ప్రవీణ్ కుమార్, కాంచనలున్నారు. -
వెట్టి నుంచి 37 మందికి విముక్తి
హొసపేటె: జిల్లాలోని మరియమ్మనహళ్లి ఫిర్కా నందిబండిలో వెట్టిచాకిరీ వ్యవస్థలో చిక్కుకున్న ఒడిశాకు చెందిన 37 మంది కార్మికులను రక్షించారు. బెళగావి జిల్లాకు చెందిన స్పందన అనే స్వచ్ఛంద సంస్థ అందించిన విశ్వసనీయ సమాచారం మేరకు జిల్లాధికారిణి కవిత మార్గదర్శకత్వంలో సహాయ కమిషనర్ వివేకానంద నందిబండి గ్రామంపై దాడి చేశారు. ఆ సమయంలో కనీస సౌకర్యాలు లేని, కేవలం నాలుగు అడుగుల వెడల్పున్న చిన్న ఇళ్లలో దుస్థితిలో నివసిస్తున్న ఒడిశాలోని బోలాంగిర్, నవరంగ్‌పూర్ జిల్లాలకు చెందిన 10 మంది పిల్లలు, 11 మంది మహిళలు, 16 మంది పురుషులతో సహా మొత్తం 37 మంది కార్మికులకు రక్షణ కల్పించారు. ఒక్కొక్కరికీ రూ.40 వేల అడ్వాన్స్ ఈ కార్మికులను ఒక్కొక్కరికి రూ.40 వేల అడ్వాన్స్ చెల్లించి ఆరు నెలల క్రితం వారిని ఒడిశా నుంచి ఇక్కడికి తీసుకువచ్చారు. మొదట వారు ఆరు నెలల పాటు పని చేయాలన్న షరతుతో ఇక్కడికి తీసుకువచ్చి చేసిన పనిని బట్టి వారికి జీతం చెల్లిస్తామని కూడా హామీ ఇచ్చారు. ఈ ప్రకారం డబ్బుకోసం వారం మొత్తం కష్టపడి పని చేసినా మొత్తం కుటుంబానికి వారానికి కేవలం రూ.500 మాత్రమే చెల్లిస్తున్నారు. తాము ఆరు నెలల క్రితం వచ్చాం. తమ గడువు ముగిసింది, తాము వెళ్లి పోతామని చెప్పినప్పుడు తమకు బయటి ప్రపంచంతో సంబంధాలు లేకుండా చూసేందుకు భద్రతా సిబ్బందిని నియమించారని బాధితులు ఆవేదనను వ్యక్తం చేశారు. దోషులను కఠినంగా శిక్షిస్తాం దీనిపై జిల్లాధికారిణి స్పందిస్తూ ఈ ఘటనపై మరియమ్మనహళ్లి పోలీస్ స్టేషన్లో ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైంది. దోషులకు కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా యంత్రాంగం కేవలం రక్షించడంతోనే సరిపెట్టుకోకుండా కార్మికులను వారి స్వగ్రామాలకు సురక్షితంగా పంపించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. జిల్లాధికారిణి కవిత, జిల్లా ఎస్పీ ఎస్.జాహ్నవి స్వయంగా హాజరై వారిని రైలులో స్వగ్రామాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా రక్షణ కోసం కార్మికులతో పాటు ఇద్దరు పోలీసులను, రెవెన్యూ శాఖకు చెందిన ఇద్దరు అధికారులను కూడా పంపించారు. డీఎస్పీ పీ.మురళీధర్, వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు హాజరయ్యారు. అధికారుల దాడితో ఎట్టకేలకు స్వేచ్ఛ ఒడిశాకు తిరిగి బయల్దేరిన కార్మికులు -
నీట్ పరీక్ష రద్దుపై నిరసన
హొసపేటె: వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్ష నిర్వహణ సంస్థ ఎన్టీఏ( నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ)ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం నగరంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కార్యకర్తలు నిరసన తెలిపారు. ఈ మేరకు వారు తహసీల్దార్ ద్వారా రాష్ట్రపతికి వినతిపత్రాన్ని సమర్పించారు. కాంగ్రెస్ నేత భరత్‌కుమార్ మాట్లాడుతూ వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎన్ఏటీ నిర్వహించిన నీట్ యూజీ– 2026 పరీక్షను రద్దు చేసి, తిరిగి నిర్వహిస్తామని ప్రకటించిందన్నారు. పరీక్షల నిర్వహణలో ఎన్టీఏ తన అసమర్థతను మరోసారి నిరూపించుకుందని విమర్శించారు. యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాయచూరులో.. రాయచూరు రూరల్: కేంద్రంలోని బీజేపీ సర్కార్ హయాంలో జరిగిన నీట్ పరీక్షల్లో అక్రమాలపై విచారణ జరిపి, ఎన్టీఏను రద్దు చేయాలని ఏఐడీఎస్ఓ డిమాండ్ చేసింది. గురువారం టిప్పు సుల్తాన్ ఉద్యానవనం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు బసవరాజ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మే 3వ తేదీన జరిపిన నీట్ పరీక్షల్లో అవినీతి అక్రమాలు జరిగాయన్నారు. పరీక్షను రద్దు చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటం తగదన్నారు. మూడేళ్లలో ఇలా రెండోసారి జరిగిందని, కేంద్ర విద్యా శాఖ మంత్రి ఈ విషయంలో జోక్యం చేసుకుని ఎన్టీఏను రద్దు చేసి విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. -
హెల్మెట్ ధరించండి.. ప్రాణం కాపాడుకోండి
సాక్షిబళ్లారి: ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ ధరించి తమ ప్రాణాలను కాపాడుకోవాలని జిల్లాధికారి నాగేంద్ర ప్రసాద్ సూచించారు. గురువారం జిల్లాలో రోడ్డు భద్రత, ప్రజల ప్రాణ రక్షణ కోసం పోలీస్ శాఖ, ట్రాఫిక్ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఆవగాహన కార్యక్రమం, హెల్మెట్ల పంపిణీ, బైక్ ర్యాలీని ప్రారంభించి ఆయన మాట్లాడారు. చట్టాలు ప్రజల రక్షణ కోసమే రూపొందిస్తారని, ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని అన్నారు. హెల్మెట్ తప్పనిసరి నిబంధన ఎవరికీ మినహాయింపు కాదని వ్యాఖ్యానించారు. రోడ్డు భద్రత నియమాలు పాటించి జిల్లాకు మంచి పేరు తేవాలన్నారు. జిల్లా ఎస్పీ సుమన్ పన్నేకర్ మాట్లాడుతూ గత మూడేళ్లుగా జిల్లాలో జరిగిన బైక్ ప్రమాద గణాంకాలు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు. మూడేళ్లలో 462 మంది మృతి మూడేళ్లలో బైక్ ప్రమాదాల్లో 462 మంది మరణించారని ఎస్పీ అన్నారు. జూన్ 1వ తేదీ నుంచి హెల్మెట్ ధారణను తప్పనిసరిగా అమలు చేస్తామన్నారు. ప్రజలు తమ కుటుంబ సభ్యుల కోసమైనా హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలన్నారు. హెల్మెట్‌పై బైక్ ర్యాలీ, అవగాహన సదస్సు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తెచ్చారు. సీనియర్ సివిల్ జడ్జి హొసమనె మాట్లాడుతూ ఖరీదైన మొబైల్ ఫోన్లకు ఇచ్చే రక్షణను ప్రజలు తమ ప్రాణాలకు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొబైల్ స్క్రీన్ పగలకుండా స్క్రీన్ గార్డ్ వేసుకొనే మనం మెదడు, ప్రాణ రక్షణ కోసం హెల్మెట్ ధరించడంలో నిర్లక్ష్యం చేస్తున్నామన్నారు. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతే కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయని గుర్తు చేశారు. జెడ్పీ సీఈఓ మహమ్మద్ హ్యారీస్, ఏఎస్పీ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాధికారి నాగేంద్ర ప్రసాద్ సూచన హెల్మెట్‌పై జాగృతి ర్యాలీకి శ్రీకారం -
జల్లు వర్షాలతో చల్లదనం
శివమొగ్గ: తీవ్రమైన ఎండ, ఉక్కబోతల మధ్య ఓ మోస్తరు వర్షాలతో పలు జిల్లాల్లో ప్రజలు ఉపశమనం చెందారు. బుధవారం సాయంత్రం నుంచి శివమొగ్గ జిల్లాలో సొరబ పట్టణంతో సహా తాలూకాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది, గాలీవానకు చెట్లు, కరెంటు స్తంభాలు కూలి నష్టం వాటిల్లింది. సొరబలోని మురుగ మఠం వద్ద నిర్మాణంలో ఉన్న సభా మందిరం పైకప్పు పలకలు గాలి తీవ్రతకు ఎగిరిపోవడంతో భవనం దెబ్బతింది. చంద్రగుత్తి రోడ్డులోని కరడిగేరిలో చెట్టు పడి విద్యుత్ స్తంభం కూలిపోయింది. ఉద్రి–సిగెహళ్లి రహదారిపై చెట్టు కూలి వాహన సంచారం నిలిచిపోయింది. విద్యుత్, అటవీ శాఖ సిబ్బంది చెట్లను తొలగించే పనిలో ఉన్నారు. కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినడంతో అనేక ప్రాంతాల్లో బుధవారం రాత్రి నుంచి కరెంటు పోయి ప్రజలు అవస్థలు పడ్డారు. గురువారం సాయంత్రం మైసూరు నగరంలో ఆకస్మికంగా వర్షం కురవడంతో చల్లదనం నెలకొంది. ప్యాలెస్, జేసీ సర్కిల్ తదితర ప్రాంతాల్లో వాననీరు నిలిచిపోయింది. శివమొగ్గ జిల్లా, మైసూరులో వానలు -
బ్రిడ్జి కింద బుల్లెట్ల గుట్టలు
● బంగారుపేట తాలూకాలో కలకలం కోలారు: జిల్లాలోని బంగారుపేట తాలూకా తమిళనాడు సరిహద్దుల్లో పెద్దసంఖ్యలో తుపాకీ తూటాలు దొరికాయి. ఎస్ఎల్ఆర్ లేదా మిషన్ గన్లకు ఉపయోగించే 214 బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాసరమల్ల బ్రిడ్జి వద్ద అపరిచిత వ్యక్తులు ఈ బుల్లెట్లను పడేసి పోయినట్లు తెలుస్తోంది. కామసముద్రం పోలీసులు వాటిని పరిశీలించగా పలు వివరాలు తెలిశాయి. 1969లో మహారాష్ట్రలో తయారు చేసినట్లు గుర్తించారు. ఇందులో 7.6 ఎంఎం మోడల్ గుండ్లు ఉన్నాయి. 135 లైవ్ తూటాలు, 85 ఖాళీ తూటాలు లభించాయి. ఇవి ఆర్మీలో వాడే తూటాలని అనుమానం. కొద్దినెలల క్రితమే ఇక్కడ వీటిని పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. సరిహద్దు ప్రాంతంలో ఇంత భారీమొత్తంలో బుల్లెట్లు లభ్యం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ముమ్మరంగా విచారణ చేపట్టారు. -
కన్నడనాడుకు వస్తోన్న సర్
శివాజీనగర: దేశవ్యాప్తంగా ఈసీ చేపట్టిన సర్ ప్రకంపనలు సృష్టించడం తెలిసిందే. ప్రతి ఓటరును జాబితాలో నమోదు చేయడం, అలాగే నకిలీ ఓటర్లను, అక్రమాలను తొలగించడమే లక్ష్యమని ఈసీ చెబుతోంది. ఇంటింటికీ వెళ్లి తనిఖీలు కర్ణాటకతో పాటుగా 16 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక పరిష్కరణ (సర్) నిర్వహణకు ఎన్నికల కమిషన్ సంసిద్ధమైంది. ఇది జూన్ 20 నుంచి ఆరంభం కానుండగా రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రాష్ట్రంలో సుమారు 5.5 కోట్ల ఓటర్లు ఉన్నారు. వేలాది బూత్ స్థాయి అధికారులు, రాజకీయ పార్టీలు నియమించిన ఏజెంట్ల సహకారంతో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను తనిఖీ చేస్తారు. అవకతవకలు ఉన్నట్లు తేలితే ఓటర్లను తక్షణం తొలగించే అవకాశముంది. మరణించిన ఓటర్లు, రెండు మూడు సార్లు నమోదైన పేర్లు తదితరాలను పరిశీలిస్తారు. అయితే ఓటర్లను విచక్షణా రహితంగా తొలగించే ప్రమాదముందని కాంగ్రెస్ నేతలు ముందు నుంచీ ఆరోపిస్తున్నారు. కర్ణాటకలో ఎప్పుడు? కర్ణాటకలో ప్రక్రియ ఇలా సాగుతుంది... జూన్ 20 నుంచి 29 వరకు ఏర్పాట్లు, సిబ్బందికి శిక్షణ, కాగితాల ముద్రణ జరుగుతుంది. జూన్ 30 నుంచి జూలై 29 వరకు బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి పరిశీలిస్తారు. ఆగస్టు 5న సవరించిన ఓటర్ల జాబితా ప్రకటిస్తారు. ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 3 వరకు ఓటర్లు, పార్టీలు అభ్యంతరాలను సమర్పించవచ్చు. అక్టోబరు 3 వరకు వీటిని పరిష్కారం నిర్వహించి, తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ 7న ప్రకటిస్తామని ఈసీ వర్గాలు తెలిపాయి. ముమ్మరంగా ఏరివేతలుంటాయా? జూన్ 20 నుంచి ఓటర్ల ప్రత్యేక పరిష్కార ప్రక్రియ పలు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించిన సర్ -
విచ్చలవిడి మద్యం విక్రయాలు వద్దు
రాయచూరు రూరల్: జిల్లాలో విచ్చలవిడిగా తెరుచుకుంటున్న మద్యం దుకాణాల లైసెన్సులను రద్దు చేయాలని నమ్మ కర్ణాటక సేన డిమాండ్ చేసింది. గురువారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు కొండప్ప మాట్లాడారు. జిల్లాలోని గ్రామాలు, నగరాల్లో కళాశాల, ఆలయాలు, మసీదుల సమీపంలో మద్యం విక్రయాల దుకాణాలకు ఇచ్చిన లైసెన్సులను రద్దు చేయాలని వినతిపత్రం సమర్పించారు. సేంద్రియ చెత్త కుప్పలు దగ్ధంహొసపేటె: విజయనగర జిల్లా కొట్టూరు తాలూకాలోని హరలు గ్రామంలోని హగరిహళ్ల సమీపంలో ఐదుకు పైగా చెత్త కుప్పలు బూడిదయ్యాయి. వ్యవసాయ క్షేత్రాలకు ఉపయోగపడే సేంద్రియ ఎరువు ఇప్పుడు బూడిదగా మారింది. వెంటనే స్పందించిన స్టేషన్ హౌస్ ఆఫీసర్, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. లేకుంటే పెను విపత్తు సంభవించి ఉండేది. సమీపంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్కు నిప్పంటుకున్న పరిస్థితి తలెత్తగా విద్యుత్ శాఖ అధికారులు వెంటనే మేల్కొని సమస్యను పరిష్కరించారు. బీఈఓగా నియామకంహొసపేటె: విజయనగర జిల్లా హొసపేటె తాలూకా విద్యా శాఖాధికారి(బీఈఓ)గా బ్యాటి ఉమాపతి నియమితులయ్యారు. మరో రెండు రోజుల్లో ఆయన నూతన బీఈఓగా అధికార బాధ్యతలు చేపట్టనున్నారు. -
బెళగావి టు హైదరాబాద్.. కొత్త రైలు బండ్లు
గుంతకల్లు/ శివాజీనగర: కర్ణాటకలోని బెళగావి నుంచి గుంతకల్లు మీదుగా తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్, చర్లపల్లి జంక్షన్లకు కొత్తగా వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపనున్నారు. ఈ మేరకు రైల్వే అధికారులు గురువారం తెలిపారు. దీని వల్ల వేలాది మంది ప్రయాణికులకు ఉపయుక్తం అవుతుంది. హైదరాబాద్– బెళగావి మధ్య.. ● గతంలో రద్దయిన హైదరాబాద్–బెళగావి ఎక్స్‌ప్రెస్ రైలు (17071) ను పునురుద్ధరించారు. ఈ నెల 15 నుంచి మొదలవుతుంది. ప్రతి గురువారం సాయంత్రం 4.30 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి శుక్రవారం ఉదయం 10.30 గంటలకు బెళగావికి చేరుకుంటుంది. ●బెళగావి–హైదరాబాద్ (17072) రైలు మే 21 నుంచి ప్రారంభమవుతుంది. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు బెళగావి నుంచి బయలుదేరి, శనివారం ఉదయం 7 గంటలకు హైదరాబాద్‌కు చేరుతుంది. సికింద్రాబాద్ టు బెళగావి ● అలాగే సికింద్రాబాద్ నుంచి బెళగావి మధ్య మరో వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రవేశపెట్టారు. సికింద్రాబాద్ జంక్షన్ నుంచి ఈ నెల 18 నుంచి ప్రతి సోమవారం సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి (17073) మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు బెళగావికి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో బెళగావి నుంచి ప్రతి మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరే రైలు (17074) మరుసటి రోజు ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుతుంది. చర్లపల్లి– బెళగావి సర్వీసులు ● చర్లపల్లి–బెళగావి–చర్లపల్లి మధ్య మరో వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు ఈ నెల 16 నుంచి సంచరిస్తుంది. చర్లపల్లి జంక్షన్ నుంచి శనివారం సాయంత్రం 4 గంటలకు బయలుదేరే రైలు (17075) మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు బెళగావికి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో బెళగావి నుంచి ప్రతి ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరే రైలు (17076) మరుసటి రోజు ఉదయం 8.45 గంటలకు చర్లపల్లికి చేరుతుంది. ● బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, తాండారు, యాదగిరి, కృష్ణ, రాయచూర్, మంత్రాలయం రోడ్డు, ఆదోని, గుంతకల్లు, బళ్లారి, దరోజి, తోర్నగల్లు, హోస్పేట్, కొప్పల్, గదగ్, హుబ్లీ, ధార్వాడ్, లోండా, ఖానాపుర స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయి. నేటి నుంచి వరుసగా సర్వీసులు షురూ ప్రయాణికులకు సౌలభ్యం -
ఆర్టీసీ బస్సు కండక్టర్, డ్రైవర్ నిజాయితీ
హొసపేటె: సాధారణంగా రోడ్డు మీద లేదా బస్సులో డబ్బు లేదా బంగారు ఆభరణాలు దొరికితే చాలా మంది వాటిని ఎవరికీ తెలియకుండా దాచిపెట్టుకుని అదృశ్యమవుతారు. అయితే విజయనగర జిల్లా కొట్టూరు నుంచి దావణగెరె జిల్లా జగళూరు మధ్య తిరిగే ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్ నిజాయితీని ప్రదర్శించారు. బస్సులో ఓ మహిళా ప్రయాణికురాలు తాను మర్చిపోయిన బంగారం, డబ్బును గురువారం ఆమెకు తిరిగి ఇచ్చి వేసిన బస్సు కండక్టర్, డ్రైవర్ ప్రశంసలు అందుకున్నారు. కొట్టూరు నుంచి జగళూరు వెళ్తున్న బస్సులో ఒక ప్రయాణికురాలు తన పర్సును మర్చిపోయి దిగిపోయారు. బస్సు కండక్టర్ బసవరాజ్ ఆ పర్సును గుర్తించి తెరిచి చూడగా అందులో 10 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.1000 నగదు లభించాయి. ఇంతలో ఆ బస్సు జగళూరు నుంచి ఉజ్జయినికి చేరుకుంది. ఇంతలో తన పర్సు బస్సులో మర్చిపోయానని గ్రహించిన ఆ మహిళ ఉజ్జయినికి వెళ్లే మరో బస్సు ఎక్కి వెళ్లి కండక్టర్ బసవరాజ్‌ను సంప్రదించింది. అప్పుడు బసవరాజ్ ఏ మాత్రం సంకోచించకుండా ఆ మహిళ పోగొట్టుకున్న డబ్బు, బంగారు ఆభరణాలతో సహా పర్సును తిరిగి ఇచ్చేశాడు. -
చిన్నారి శ్రమ.. ఉడుతకు పునర్జన్మ
సాక్షి,బళ్లారి: ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఒక ఉడుతను మనకెందులే అని వదిలివెళ్లకుండా దానిని పట్టుకుని, ఇంటికి తీసుకెళ్లి రాత్రింబగళ్లు కంటికి రెప్పలా చూసుకుని ప్రాణాలు రక్షించి ఉడుతకే సేవ చేస్తున్న ఓ చిన్నారిని అందరూ పొగడ్తలతో ముంచెత్తుతున్న ఉదంతం జిల్లాలోని సండూరు తాలూకా నరసాపురలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చిన్నారి సాన్వి ఒక ఉడుతకు ఆప్త రక్షకురాలు, స్నేహితురాలు, ప్రాణదాతగా మారింది. నరసాపుర ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న చిన్నారి సాన్వి గత నెల మొదటి వారంలో పరీక్షలు ముగిసి, వేసవి సెలవులు ప్రకటించిన నేపథ్యంలో ఆనందంతో ఇంటికి వెళుతుండగా పాఠశాల ఆవరణలో ఒక చిన్న ఉడుత ఏదో ప్రమాదంలో పడి కొట్టుమిట్టాడుతోంది. తోటి విద్యార్థులు చూసీచూడనట్లు వెళ్లిపోయారు. కొన ఊపిరితో అల్లాడిపోతున్న ఆ ఉడుతను సాన్వి చూసింది. అందరి మాదిరిగా వదిలి వెళ్లిపోకుండా దాని తల్లి వస్తుందేమోనని చాలా సేపు అక్కడే వేచి చూసింది. అయితే దాని తల్లి రాలేదు. ఉడుతలో కూడా కదలిక లేదు. అలాగే వదిలివెళితే ఉడుత ప్రాణం పోతుందని భావించిన సాన్వి తన చేతుల్లోకి తీసుకుని ఇంటికి తీసుకెళ్లింది. అష్టకష్టాలతో ఉడుతకు సేవలు ఆరోజు నుంచి ఉడుతను కాపాడే పనిలో సాన్వి అష్టకష్టాలు పడింది. ఉడుతను ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు భయపడ్డారు. అడవిలో చెట్లు, గుట్టల మధ్య పెరిగే ఈ పిల్ల ప్రాణి ఇంట్లో పెరగడం కష్టంగా ఉంటుందని మందలించారు. అయినా వెనక్కి తగ్గకుండా దాని సంరక్షణలో పడింది. ఉడుతపై ఏర్పడిన ప్రేమతో దానిని పట్టుదలగా సాకడంపై దృష్టి సారించింది. చివరకు కుటుంబంలో అందరూ ఒప్పుకోవడంతో సాన్వి సోదరుడు గురు కూడా తోడ్పాటునందించాడు. ఎట్టకేలకు ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఉడుతను ప్రాణాలతో రక్షించారు. ఇంట్లో వారందరూ దానిని ప్రేమతో చూస్తూ దానికి రాము అని పేరు పెట్టారు. సాన్వికి బాగా అలవాటు కావడంతో పాటు రాము అని పిలిస్తే చెవులు నిక్కపెట్టి చూస్తూ స్పందిస్తుంది. ముద్దు ముద్దుగా కనిపిస్తుండటంతో ఇంట్లో అల్లారుముద్దుగా పెరుగుతోంది. సాన్వి భుజాల మీదకు ఎగిరి అల్లరి చేస్తుండటంతో పాటు ఆ ఇంట్లో ఒక అందమైన ప్రాణిగా ఎదుగుతోంది. రోజు రోజుకు చలాకీగా మారుతుండటంతో నరసాపుర గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారు కూడా ఉడుతను చూసి సాన్వి సేవలకు శభాష్ అంటున్నారు. అడవిలో పెరిగే ప్రాణికి ఇంట్లో ఆశ్రయం ఈ సందర్భంగా సాన్వితో పాటు కుటుంబసభ్యులు మాట్లాడుతూ ఉడుతను ఇంట్లోకి తీసుకొచ్చిన తర్వాత ఉడుత ఏం తింటుందో అర్థం కాలేదన్నారు. ఆవుపాలను చిన్న మూతలో పోసి తాగించగా, అది తాగడంతో ఆవు పాలను పోసి ప్రాణాలను కాపాడామన్నారు. అనంతరం బిస్కెట్లు, కొబ్బరి, టమాటాలు, మామిడి పండ్లు, పుచ్చకాయలు తదితర శాకాహారాన్ని అందిస్తున్నామన్నారు. ఆరోగ్యంగా ఉందని, ఎగిరి గంతులు వేస్తూ తమ మధ్య బాగా తిరుగుతోందన్నారు. రెండురోజులకొకసారి బాగా స్నానం చేయిస్తామన్నారు. ప్రస్తుతం ఇంట్లో అల్లారుముద్దుగా తిరుగుతూ తమ కుటుంబ సభ్యుడుగా మారిపోయిందని ఆనందం వ్యక్తం చేశారు. తాము ఏ ఊరికై నా వెళ్లినా దానిని వెంట తీసుకెళతామన్నారు. కొద్దిసేపు ఇంట్లో కనిపించకపోతే వెదుకుతామని, కాసేపటికి అదే తిరిగి వస్తుందన్నారు. ఉడుతను ఎక్కడా బంధించలేదు అడవిలో పెరిగే ప్రాణి కాబట్టి తమ వద్ద ఉంటుందో లేదో అని భావించామన్నారు. అయితే తమను వదిలివెళ్లడం లేదన్నారు. తమ వద్దనే ఉంటోందని, దానిని బోనులో లేదా ఎక్కడైనా ఇంట్లో బంధించలేదన్నారు. సహజంగా ఎక్కడబడితే అక్కడ తిరిగేందుకు వదిలివేశామని, అయితే ఇంట్లో తిరుగుతూ, బయటకు వెళ్లి మళ్లీ ఇంట్లోకి వచ్చి తమ భుజాల మీదకు ఎక్కి ఎగురుతుంటుందన్నారు. ఉడుతకు తమకు ఏదో జన్మలో బంధం ఉండటం వల్లనే తాము సేవ చేసేందుకు అవకాశం లభించిందన్నారు. జంతువులు, పక్షులను మనం ప్రేమతో చూసుకుంటే అవి కూడా మనల్మి ప్రేమగా తమ భాషలో పలకరిస్తుంటాయని సంతోషం వ్యక్తం చేశారు. ఉడుతకు ప్రాణం పోసిన పసి చేతులు బాలిక సాన్వి సేవతో బతికిన చిరు ప్రాణం పాఠశాల ఆవరణలో దొరికిన ఉడుతకు ఆసరా ఉడుతతో అనుబంధంతో ఇంట్లో కొత్త ఆనందం -
హిజాబ్ మినహాయింపుపై హీట్
యశవంతపుర: రాష్ట్రవ్యాప్తంగా ముస్లిం విద్యార్థుల సంక్షేమం కోసమే విద్యాలయాల్లో హిజాబ్ ధారణకు అనుమతులిచ్చినట్లు విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప తెలిపారు. అయన గురువారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడారు. విద్య, మతంపై రాజకీయాలు చేయటం సరికాదన్నారు. హిజాబ్ మీదే మాట్లాడుతున్నారు, ఇటీవల నీట్ పరీక్షల్లో జంధ్యాన్ని తొలగించారు.. దానిపై బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదని మంత్రి ప్రశ్నించారు. నీట్ పరీక్షల్లో కేంద్ర ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసినా మీకు కనిపించటం లేదా అని మండిపడ్డారు. రాజస్థాన్, గుజరాత్లో నీట్ లీకేజీలో దొరికిన వారందరూ బీజేపీ నాయకులని ఆరోపించారు. బుజ్జగించడానికే: బీజేపీ శివాజీనగర: పార్టీ సీనియర్ నాయకులు ఆర్.అశోక్, వీ.సునీల్‌కుమార్, బహిష్కృత బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్ తదితరులు సోషల్ మీడియాలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. మైనారిటీల మెప్పు కోసం విద్యాసంస్థల్లో హిజాబ్ధారణకు అవకాశం ఇచ్చారన్నారు. కేసరి శాలువాను ధరించరాదని చెప్పడం ఒక వర్గాన్ని సంతృప్తి పరచడానికే అని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి కన్నడిగులు తగిన గుణపాఠం చెప్పటం తథ్యమన్నారు. ఓటు బ్యాంకును కాపాడుకోవటానికి హిజాబ్ అంశాన్ని తీసుకొచ్చిందని ఆరోపించారు. నిరసనలు మరోవైపు పలు హిందూ సంస్థలు గురువారం నిరసలను నిర్వహించాయి. హుబ్లీలో శ్రీరామసేన కార్యకర్తలు సీఎం తదితరుల చిత్రాలను తగులబెట్టారు. హిజాబ్‌పై బీజేపీ నాయకులు నిరసనలను చేపట్టాలని నిర్ణయించారు. బీజేపీ నిరసనలపై విద్యా మంత్రి ఆగ్రహం కొత్తగా అయితే వద్దు: సీఎంమైసూరు: విద్యార్థులు హిజాబ్, జంధ్యం, మొలతాడు, రుద్రాక్ష ధరించవచ్చని, ఇప్పటికే ఉన్న మతపర వస్త్రధారణను అనుసరించవచ్చని, కొత్తగా చేయకూడదని సీఎం సిద్దరామయ్య పేర్కొన్నారు. గురువారం మైసూరులో తమ నివాసం వద్ద విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. డీజిల్, పెట్రోల్ వాడకాన్ని తగ్గించే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సూచనలు సరికాదని సిద్దరామయ్య అన్నారు. మోదీ కాన్వాయ్‌లోని వాహనాలను తగ్గించడం కేవలం తాత్కాలిక చర్యేనని అన్నారు. అలా కాకుండా పెట్రోల్, డీజిల్‌ను ఉత్పత్తి చేసే దేశాలతో చర్చించి ఏకాభిప్రాయానికి రావడం మేలని చెప్పారు. త్వరలో రాష్ట్ర కేబినెట్‌ను పునర్వ్యవస్థీకరణ చేసే ఉద్దేశం ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నీట్ పరీక్షను సక్రమంగా జరపలేదని, దీంతో విద్యార్థులకు అన్యాయం జరిగిందని విమర్శించారు. -
కార్మిక వ్యతిరేక చట్టాలను విరమించాలి
రాయచూరు రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జారీ చేసిన నాలుగు కార్మిక చట్టాలను ఉపసంహరించాలని ఏఐసీఐటీయూ రాష్ట సంచాలకులు అజీజ్ డిమాండ్ చేశారు. గురువారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో మాట్లాడారు. ప్రభుత్వం రైతు, వ్యవసాయ, ఏపీఎంసీ, విద్యుత్ వ్యతిరేక కార్మిక చట్టాలను జారీ చేయడం వల్ల రైతు, కార్మిక, వ్యవసాయ కూలీలు అన్ని విధాలుగా నష్టపోతారని ఆరోపించారు. ప్రైవేట్ పెట్టుబడిదారులకు మద్దతు పలుకుతూ ఎర్ర తివాచీ పరచడాన్ని తప్పుబట్టారు. నరేగలో తొలగించి వికసిత భారత్ మిషన్ రోజ్‌గార్ పేరును నమోదు చేయడం తగదన్నారు. నరేగ పథకం రద్దుతో నేడు వలసలు వెళుతున్న కూలీలు, కార్మికుల భవిష్యత్ అంధకారమైందన్నారు. ఆందోళనలో లక్ష్మణ్, ఈరణ్ణ, వీరన గౌడ, భీమణ్ణ, జగదీష్, ఆంజనేయ, తిమ్మప్పలున్నారు. -
ఘనంగా ముత్తప్ప కోల
బొమ్మనహళ్లి: కొడగు జిల్లాలోని సోమవారపేట వద్ద ఐగూరులో ముత్తప్ప దేవుని కోల సేవలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గురువారం ఉదయం గణపతి హోమంతో వేడుక ప్రారంభమైంది. సాయంత్రం గుళిగప్ప ఆలయం నుంచి ఒక భారీ ఊరేగింపు ప్రారంభమైంది. ముత్తప్పన్, తిరువప్పన్, కుట్టిచాతన్, గుళిగన్ వెల్లటం సేవలు స్థానిక సంప్రదాయ రీతిలో జరిగాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాది భక్తులు వేడుకలను వీక్షించారు. కాలువలో ఇద్దరు బీటెక్ విద్యార్థుల గల్లంతు యశవంతపుర: ఈతకెళ్లి ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు జల సమాధి అయిన విషాద ఘటన దావణగెరె జిల్లా చన్నగిరి తాలూకాలో జరిగింది. వివరాలు.. దావణగెరెలోని బిఐఇటీ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్న కొందరు విద్యార్థులు గురువారం మధ్యాహ్నం విహారయాత్రకు సమీపంలోని భద్రా కుడికాలువకు వచ్చారు. కాలువలో ఈత కొడుతుండగా, వివేక్, మానస అనే ఇద్దరు లోతైన చోట గల్లంతయ్యారు. మిగిలిన విద్యార్థులు సాయం కోసం కేకలు వేసిన ఫలితం లేకపోయింది. స్థానికులు, ఫైర్ సిబ్బంది వెతగ్గా వివేక్ మృతదేహం లభించింది. మానస కోసం గాలిస్తున్నారు. బసవపట్టణ పోలీసులు ఘటన స్థలంను పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. కాలేజీ విద్యార్థులు, కుటుంబసభ్యులు తీవ్రంగా దుఃఖించారు. బైక్‌ను ఢీకొని లాక్కెళ్లిన కారు ● తల్లి మృతి, కుమారునికి గాయాలు తుమకూరు: తిపటూరు నుంచి సూగూరుకు వెళ్తున్న కారు హేమావతి కాలువ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని వెనుక నుండి ఢీకొట్టింది. బైక్ వెనుక కూర్చున్న వృద్ధురాలు తల పగిలి మరణించింది. మృతురాలు రామక్క (60). ఆమె కుమారుడు సతీష్‌తో కలిసి తిపటూరు నుంచి సుగూర్కు బైక్‌పై వెళ్తుండగా, వెనుక వేగంగా వచ్చిన కారు ఢీకొంది. అలాగే బైక్‌ను, రామక్కను సుమారు 300 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో మహిళ తల ఛిద్రమై చనిపోగా, కుమారుని తలకు గాయాలై రోడ్డు పక్కన పడిపోయాడు. కానీ కారు ఆపకుండా వెళ్లిపోయింది. ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకుని, కారును అక్కడికి తీసుకురావాలని డిమాండ్ చేశారు. నోనవినకెరె పోలీసులు, ప్రజలను శాంతింపజేసి, మహిళ మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని నోనవినకెరె పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలిసింది. పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారా, లేక కారు నడిపినవారిపై నామమాత్రంగా కేసులు పెట్టి వదిలేస్తారా? అని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. గవర్నర్ కాన్వాయ్ కుదింపు శివాజీనగర: దేశంలో ఇంధన పొదుపును పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకు బెంగళూరులో గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ తన కాన్వాయ్‌లో వాహనాలను తగ్గించారు. గవర్నర్‌కు బెదిరింపులు ఉన్నాయని ఆయనకు భారీ భద్రత ఉంటోంది. సీఐఎస్ఎఫ్ భద్రతా వాహనాలను గణనీయంగా తగ్గించారు. -
మొక్కల పెంపకంతో పచ్చదనం వృద్ధి
రాయచూరు రూరల్: నగరంలో పచ్చదనం పెంపొందించి పరిసరాలను సంరక్షించాలని గ్రీన్ రాయచూరు సంచాలకురాలు సరస్వతి పేర్కొన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గురూజీ 70వ జన్మదినోత్సవం సందర్భంగా గురువారం ఆమె నూతన జిల్లాధికారి కార్యాలయం ఆవరణ వద్ద ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటిన అనంతరం ఆమె మాట్లాడారు. భవిష్యత్తులో వేడి నుంచి రక్షణ పొందాలంటే ప్రతి ఇంటి ముందు మొక్కలు పెంచి పరిసరాలను సంరక్షించాలన్నారు. కార్యక్రమంలో రమేష్ జైన్, అన్నపూర్ణ, సంగీత, గురురాజ్, మల్లికార్జున, చంద్రశేఖర్, విశాల్, పూర్విత, సంపూర్ణలున్నారు. -
నీట్ పాపం కేంద్ర సర్కారుదే
చిక్కబళ్లాపురం: ఇటీవల వైద్య కోర్సుల ప్రవేశానికి దేశమంతటా జరిగిన నీట్–యూజీ పరీక్ష ప్రశ్నాపత్రం రాజస్థాన్‌లో లీక్ కావడంతో పరీక్షను రద్దు చేయడం తెలిసిందే. ఈ వ్యవహారంపై కాంగ్రెస్, వామపక్ష విద్యార్థి సంఘాలు రాష్ట్రంలో నిరసనలను కొనసాగిస్తున్నాయి. ఈ లీకేజీకి కేంద్ర ప్రభుత్వానిదే జవాబుదారీ అని జిల్లా యువజన కాంగ్రెస్ కార్యకర్తలు చిక్కబళ్లాపురం నగరంలోని బీజేపీ ఆఫీసును ముట్టడించడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకొన్నారు. ఆఫీసు ముందు కార్యకర్తలు బైఠాయించి నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఎంతోమంది ప్రతిభావంత విద్యార్థులు రాత్రి పగలూ తేడా లేకుండా చదువుకుని పరీక్షరాస్తే, దానిని రద్దు చేశారని దుయ్యబట్టారు. ఇందుకు ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా కారణమని ఆరోపించారు. నగరంలో మరోచోట స్థానిక బీజేపీ ఎంపీ కె.సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు హయాంలో పేపర్లు లీక్ కాలేదా?, పరీక్షలపై రాజకీయాలు చేయడం బాధాకరమన్నారు. పార్లమెంటులో ప్రశ్నించాలి తుమకూరు: నీట్ పరీక్ష నిర్వహణలో వైఫల్యానికి కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అని యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. బీజీఎస్ సర్కిల్లో ఆందోళన చేపట్టి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎంపీలు పార్లమెంట్లో ప్రశ్నించాలన్నారు. బీజేపీ ఆఫీసుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అలాగే కలబుర్గిలో కలెక్టరేట్ ముందు కమ్యూనిస్టు విద్యార్థి సంఘాలు భారీ ప్రదర్శన నిర్వహించాయి. రాష్ట్రంలో పలుచోట్ల కాంగ్రెస్, వామపక్ష విద్యార్థి సంఘాల ధర్నాలు -
నా భర్త సరైనోడు కాదు..!
బనశంకరి: బెంగళూరులో ఇన్‌స్టా ఇన్ఫ్లుయెన్సర్ సాధనాశెట్టి.. బ్లాక్మెయిల్ కేసులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రేమ పేరుతో సాధనాశెట్టిని కార్తీక్‌పుతా లైంగికంగా వేధించాడని అతని భార్య హర్షిత జయనగర పోలీసులకు వాంగ్మూలం ఇవ్వడం విశేషం. అసలు దోషి తన భర్తే అని.. అక్రమ సంబంధాలు దాచి పెట్టేందుకు సాధనాశెట్టిపై ఫిర్యాదు చేశాడని ఆరోపించింది. వివరాలు.. ఇన్‌స్టా ఇన్ఫ్లుయెన్సర్ సాధనాశెట్టిని వ్యాపార ప్రచారం కోసం మేకప్ క్లినిక్ యజమాని కార్తీక్‌పుతా కలిశాడు.తొలుత వీరి మధ్య ప్రారంభమైన స్నేహం.. ప్రేమకు దారి తీసింది. అనేకచోట్ల ఇద్దరూ తిరిగారు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో లైంగికంగా వాడుకున్నాడంటూ సాధనాశెట్టి ఇంటి వద్దకు వచ్చి గొడవ చేసింది. గత ఏడాది హైదరాబాద్‌లో ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో కార్తీక్‌పుతా.. సాధనాశెట్టి మొబైల్ చోరీకి పాల్పడ్డాడు. అంతేకాక లైంగిక సంబంధం దాచిపెట్టడానికి ప్రైవేటు ఫొటోలు, వీడియోలు పెట్టుకుని హనీట్రాప్‌కు పాల్పడుతోందని ఆరోపిస్తూ జయనగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తాజాగా తన తప్పు కప్పిపుచ్చుకోవడానికి సాధనాశెట్టిపై కార్తీక్‌పుతా ఫిర్యాదు చేశాడని భార్య హర్షిత చెబుతోంది. కార్తీక్‌పుతా బిజినెస్మెన్ కాదు. కాస్మోటిక్ మార్కెటింగ్ చేసేవాడు. యువతి ఫిర్యాదు చేస్తే ఇబ్బందులు తప్పవని హనీట్రాప్ అంటూ ముందే పోలీసులకు ఫిర్యాదు చేశాడని భార్య చెబుతోంది. -
వివాహేతర సంబంధం.. భర్త, మామను హత్య చేసిన కోడలు..!
కర్ణాటక: దేశ రక్షణ కోసం పోరాడే జవాన్, మాజీ జవాన్‌కు సొంత ఇంట్లోనే భద్రత లేకుండా పోయింది. మూడు రోజుల క్రితం క్రిష్ణగిరి సమీపంలో కాలిన స్థితిలో బయటపడిన మృతదేహాల కేసును పోలీసులు ఛేదించారు. తండ్రీకుమారుడు హత్యకు గురికాగా, కోడలి అక్రమ సంబంధమే ఇంత ఘోరానికి కారణమని తేల్చారు. ఉలిక్కిపడిన బెల్లారంపల్లి వెప్పాలంపట్టి సమీపంలో కాలిన స్థితిలో ఇద్దరి మృతదేహాలున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. సేలం డీఐజీ సంతోష్, క్రిష్ణగిరి ఎస్పీ తంగదురైలు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదుచేసుకొని, దర్యాప్తు చేపట్టారు. హత్యకు గురైన వ్యక్తులు క్రిష్ణగిరి సమీపంలోని బెల్లారంపల్లి గ్రామానికి చెందిన సైనికుడు మాదేశ్ (43), అతని తండ్రి, మాజీ జవాన్ సెల్లప్ప (63)గా గుర్తించారు. భర్త జమ్మూకశ్మీర్‌లో ఉంటే..మాదేష్ జమ్మూకశ్మీర్‌లో విధుల్లో ఉండేవాడు. ఈ క్రమంలో అతని భార్య భానుప్రియ (30)పై పోలీసులకు అనుమానం ఏర్పడింది. ఆమెను ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలివ్వడంతో.. పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి తమదైన శైలిలో ప్రశ్నించారు. దాంతో అసలు గుట్టును భానుప్రియ విప్పింది. బెల్లారంపల్లివాసి, జవాన్ మాదేశ్ (43) జమ్మూకశ్మీర్‌లో పని చేసేవాడు. ఈ క్రమంలో భానుప్రియకు స్థానికంగా ఉండే వ్యాన్ డ్రైవర్ పూవరసన్ (24) అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరి తతంగమంతా గ్రామస్థులకు తెలిసింది. భర్త మాదేశ్‌కు కూడా విషయం తెలియడంతో.. ఆయన ఆగ్రహంతో ఈ నెల 10వ తేదీన హఠాత్తుగా ఊరికి వచ్చి భార్యను నిలదీసి దండించాడు. భానుప్రియ ఈ సంగతిని ప్రియునికి చెప్పింది. పథకం ప్రకారం ప్రియుడు పూవరసన్ ఆ రోజు రాత్రి కత్తితో భానుప్రియ ఇంటికెళ్లి మాదేశ్‌పై దాడి చేశాడు. మాదేశ్ కేకలు వేయడంతో తండ్రి, మాజీ జవాన్ సెల్లప్ప బయటకొచ్చాడు. వారిద్దరిపై భానుప్రియ, ప్రియుడు కత్తులతో విరుచుకుపడి హత్య చేశారు. శవాలను వ్యాన్‌లో తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు నిందితులు వివరించారు. ఈ కేసు చుట్టుపక్కల గ్రామాల్లో తీవ్ర సంచలనం కలిగిస్తోంది. -
నకిలీ నోట్ల చెలామణి.. ఇద్దరు అరెస్ట్
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లాలో నకిలీ రూ.500 నోట్ల చెలామణి అధికమైంది. గత వారం రోజుల నుంచి వివిధ దుకాణాలు, అంగళ్లు, హోటళ్లలో చాలా హాట్ టాపిక్‌గా మారింది. ఏడాది క్రితం సిరవారలో నకిలీ నోట్ల చెలామణి జోరుగా కొనసాగింది. మార్కెట్లోకి నకిలీ రూ.500 నోట్లు రావడంతో ప్రజలు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. నోట్లపై నంబర్, స్టిక్కర్, మహాత్మ గాంధీ చిత్రం, న్యూ ఢిల్లీ కోట చిత్రం మాదిరిగానే ఉంటుందనే భావనలో ప్రజలున్నారు. ఈ సందర్భగా గత రాత్రి సిరవార తాలూకా కల్లూరు పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పోయించడానికి వచ్చిన ఇద్దరు యువకులు రూ.120 పెట్రోల్ వేయించుకొని రూ.100 నకిలీ కరెన్సీ నోట్లను ఇచ్చారు. అనుమానంతో యజమానికి విషయాన్ని చేరవేశారు. 112కు ఫోన్ చేసి నగరంలోని ఎల్‌బీఎస్‌నగర్‌కు చెందిన యూసఫ్ మహ్మద్, బందేనవాజ్ నివాసి ముర్తుజాలను పోలీసులకు అప్పగించారు. సిరవార ఎస్ఐ చంద్రశేఖర్ హిరేమఠ్ వారిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఎస్సీ అంతర్గత రిజర్వేషన్లలో సవరణ
శివాజీనగర: రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల అంతర్గత రిజర్వేషన్‌ను తాత్కాలికంగా 17 శాతం నుంచి 15 శాతానికి పరిమితం చేసి అమలుకు ఆదేశాలిచ్చింది. ఈ రిజర్వేషన్లను మూడు కేటగిరీలుగా విభజించింది. ఏ కేటగిరికి 5.25 శాతం, బీ కేటగిరికి 5.25 శాతం, సీ కేటగిరికి 4.5 శాతం రిజర్వేషన్లు కల్పించింది. ఒకవేళ ఆయా వర్గాల నుంచి అభ్యర్థులు లేని పక్షంలో మిగతా వర్గం అభ్యర్థులతో ఉద్యోగాలను భర్తీ చేసుకోవచ్చని తెలిపింది. కొత్తగా ఉద్యోగాల భర్తీ ఈ నేపథ్యంలో జారీ అయిన ఉద్యోగ నోటిఫికేషన్లను రద్దు చేసి, కొత్త అంతర్గత రిజర్వేషన్ నియమాల ప్రకారం నోటిఫికేషన్లు ఇవ్వాలని ఆదేశించింది. 56,432 ఉద్యోగాల నియామకాలకు ఇటీవల ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం భర్తీకి త్వరలో ప్రకటన ఇవ్వనున్నారు. -
భారీగా రేషన్ బియ్యం పట్టివేత
హొసపేటె: అన్నభాగ్య పథకం బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఒక లారీని గదగ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో పోలీసులు నిర్వహించిన కార్యాచరణలో ఈ అక్రమం వెలుగు చూసింది. ఈ కేసులో ఎంపీ–09 డీఎన్–7251 నెంబరు గల లారీని సుమారు రూ.29 లక్షల విలువైన 34,720 కిలోల అన్నభాగ్య బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ లారీ విజయనగర జిల్లాలోని హరపనహళ్లి నుంచి ఇలకల్ మీదుగా గుజరాత్‌కు వెళ్తున్నట్లు తెలిసింది. లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెటగేరి బారంగే పోలీస్ స్టేషన్లో ఈ ఘటనపై కేసు నమోదైంది. జప్తు చేసుకున్న బియ్యం బస్తాలను కేఎఫ్సీఎస్సీ గోదాముకు తరలించారు. గదగ్ ఎస్పీ రోహన్ జగదీష్, ఆహార తనిఖీ అధికారి జగదీష్ ఆహార, పౌర సరఫరాల గోదామును తనిఖీ చేశారు. నీట్ రద్దుపై యూత్ కాంగ్రెస్ ఆందోళనహుబ్లీ: నీట్ పరీక్ష రద్దును ఖండిస్తూ, విద్యార్థులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హుబ్లీ ధార్వాడ నగర యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో హుబ్లీలో భారీ ఆందోళన చేపట్టారు. ఇక్కడి రమేష్ భవన్ నుంచి కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషి నివాసం వరకు ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ జోషి నివాసాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. పోలీసులు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ నేత అర్జున్ పాటిల్ మాట్లాడుతూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన మంత్రి అయ్యాక రెండో సారి ప్రశ్నపత్రిక లీక్ అయిందన్నారు. తగిన పరిహారం చెల్లించాలని, పరీక్షల వ్యవస్థపై విద్యార్థులు నమ్మకం కోల్పోతారన్నారు. తక్షణమే మరోసారి నీట్ పరీక్షలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. పాఠశాలల విలీనం తగదు రాయచూరు రూరల్: రాయచూరు తాలూకాలోని మల్లాపుర ప్రభుత్వ పాఠశాలను విలీనం చేయడం తగదని ఏఐడీఎస్ఓ డిమాండ్ చేసింది. బుధవారం మల్లాపురలో చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు నంద గోపాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక పబ్లిక్ పాఠశాల(కేపీఎస్)లను ప్రారంభించిన జేగర్కల్లో మల్లాపుర పాఠశాలను చేర్చడాన్ని విరమించుకోవాలని కోరుతూ గ్రామస్తులతో కలిసి ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం కేపీఎస్లను ప్రారంభించిన ఆదేశాలను విరమించుకోవాలన్నారు. ఆందోళనలో నాగనగౌడ, సురేష్‌గౌడ, శంకరప్ప, సిద్దప్ప, సుశాంత్, గంగప్ప, చంద్రేగౌడ, వెంకటేష్, చెన్నబసవలున్నారు. ఆక్రమిత భూమి స్వాధీనంబళ్లారిటౌన్: జిల్లా యంత్రాంగం బుధవారం నగరంలోని భువనగిరి కాలనీ, అశోక్ నగర్లో ఆక్రమణకు గురైన భూమిని స్వాధీనపరచుకునే ప్రక్రియను కొనసాగించింది. సర్వే నెంబర్–348లో 11.59 ఎకరాల భూమిని ప్రభుత్వ భూమిగా గుర్తించింది. ఈ భూమిలో పలు భవనాలను జేసీబీ ద్వారా ధ్వంసం చేసి స్వాధీనం చేసుకున్నట్లు బోర్డును ఏర్పాటు చేశారు. ఏడీసీ మహమ్మద్ ఝుబేర, ఏసీ రాకేష్, తహసీల్దార్ టీ.రేఖ పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ భూములను ఎవరూ అక్రమంగా స్వాధీన పరుచుకోరాదన్నారు. ఒక వేళ అక్రమంగా స్వాధీనం చేసుకున్న వారిపై కఠినంగా, న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎయిమ్స్‌ను ప్రారంభించాలని వినతి రాయచూరు రూరల్: రాయచూరులో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్) ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఎయిమ్స్ సాధన పోరాట సమితి నేతలు ఆందోళన జరిపారు. బుధవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సమితి అధ్యక్షుడు బసవరాజ కళస మాట్లాడారు. గత నాలుగేళ్ల నుంచి రాయచూరుకు ఎయిమ్స్‌ను కేటాయించాలని కోరుతూ ఆందోళన కొనసాగిస్తున్నామన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ విషయంలో మౌనం వహించకుండా గళం విప్పి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లాధికారిణి పూవితకు వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో అశోక్ కుమార్ జైన్, బసవరాజ్, మారెప్ప, జాన్ వెిస్లి, అమరేగౌడ, గురురాజ్, వీరభద్రయ్యలున్నారు. -
గంజాయి కేసులో విద్యార్థిని అరెస్టు
యశవంతపుర: రేవు నగరి మంగళూరులో గంజాయి భూతం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోంది. దీనికి బానిస కావడంతోపాటు అమ్ముకుని డబ్బు సంపాదించవచ్చని కటకటాల పాలవుతున్నారు. బీసీఏ విద్యార్థినిని మంగళూరు నగర పోలీసులు అరెస్ట్ చేసి రూ.35 లక్షలు విలువగల 1.42 కేజీల హైడ్రో గంజాయిని పట్టుకున్నారు. శివమొగ్గ జిల్లా సాగరకు చెందిన విద్యార్థిని సుహన (21) కుందాపురలో కాలేజీలో చివరి ఏడాది బీసీఏ చదువుతోంది. ఈ నెల 12న హైడ్రో గంజాయిని అమ్ముతున్నట్లు తెలిసి పణంబూరు పోలీసులు అరెస్టు చేశారు. గుండెపోటుతో కానిస్టేబుల్ మృతియశవంతపుర: విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ సతీశ్ (53) గుండెపోటుతో మృతి చెందిన ఘటన చిక్కమగళూరు జిల్లా శృంగేరి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. మంగళవారం అర్ధరాత్రి 112 అత్యవసర సేవల వాహనంలో విధుల్లో ఉండగా హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. తక్షణం పోలీసులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స ఫలించక చనిపోయారు. శృంగేరి తాలూకా కిగ్గా గ్రామానికి చెందిన సతీశ్ 17 ఏళ్ల పాటు ఆర్మీలో పని చేశారు. తరువాత కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరారు. -
అభివృద్ధి పనుల ఆకస్మిక తనిఖీ
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలో జరుగుతున్న అభివృద్ధి పనులను జెడ్పీ సీఈఓ నోంగ్‌జోయ్ మహమ్మద్ అక్రమ్ అలీ బుధవారం తాలూకాలోని శివపుర గొల్లరహట్టి, బీబీ తండా, కానాహొసహళ్లిలలో వివిధ పనులను తనిఖీ చేశారు. ఆయన తాలూకాలోని శివపుర గొల్లరహట్టిలో తాగునీటి సరఫరా పనులను, ఆ తర్వాత బండె బసాపుర తాండాలోని పాఠశాల గదుల పనులను తనిఖీ చేశారు. కర్ణాటక మైనింగ్ ఎన్విరాన్మెంటల్ రిస్టోరేషన్ కార్పొరేషన్ గ్రాంటుతో చేపడుతున్న పట్టణ సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ మరమ్మతులను ఆయన పరిశీలించారు. పనుల అనంతరం జెడ్పీ కానాహొసహళ్లిలోని వెనుకబడిన తరగతుల ప్రీ–మెట్రిక్ బాలుర హాస్టల్‌ను సందర్శించారు. సీఈఓ కేఎంఈఆర్సీలో అదనపు గదుల నిర్మాణ స్థలాన్ని, పోస్ట్–మెట్రిక్ బాలికల హాస్టల్ భవన నిర్మాణ పనులను, కేఎంఈఆర్సీ పరిధిలోని బీసీఎం ప్రీ–మెట్రిక్ బాలికల హాస్టల్ నిర్మాణ స్థలాన్ని కూడా తనిఖీ చేశారు. కర్ణాటక గనుల పర్యావరణ పునరుద్ధరణ కార్పొరేషన్ గ్రాంటు కింద నివాస గృహాల నిర్మాణం, మరమ్మతులతో సహా జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను సీఈఓ అక్రమ్ అలీ షా పరిశీలించారు. ఈ విషయమై సమగ్ర సమీక్ష నిర్వహించి తాలూకాలో అద్దె భవనాల్లో ఉన్న అన్ని అంగన్వాడీ కేంద్రాలకు కొత్త భవనాల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చారు. టీపీ ఈఓ నరసప్ప, జెడ్పీ ఇంజినీరింగ్ సబ్–డివిజన్ ఏఈఈ మల్లికార్జున, తాగునీటి సరఫరా శాఖ ఏఈఈ ప్రసన్న, గ్రామ పీడీఓ వినయ్‌కుమార్, బీసీఎం హాస్టల్ వార్డెన్లు ఎస్వీ.రాచప్ప, సహనా వీరేంద్ర, ఫస్ట్ క్లాస్ అసిస్టెంట్ మారుతి, టీఏపీ సిబ్బంది రాఘవేంద్ర, మాజీ గ్రామ సభ్యుడు నాగరాజ్, గ్రామ బిల్ కలెక్టర్ టీఎస్.సుకుమార్, నీరుగంటి తిప్పేస్వామి హాజరయ్యారు. -
జూన్ 1 నుంచి హెల్మెట్ తప్పనిసరి
సాక్షి,బళ్లారి: ద్విచక్ర వాహనంలో వెళ్లేటప్పుడు పలు కారణాల వల్ల ప్రమాదానికి గురైనప్పుడు హెల్మెట్ లేకపోతే ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారని ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రుద్రప్ప పేర్కొన్నారు. ఆయన రెండు రోజుల నుంచి నగరంలో వివిధ ప్రాంతాల్లో హెల్మెట్‌పై విస్తృతంగా ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుల ద్వారా ప్రజల్లో చైతన్యం తెస్తున్నారు. జూన్ 1వ తేదీ నుంచి నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనంలో వెళ్లేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని జిల్లా ఎస్పీ సుమన పన్నేకర్ ఆదేశాలు జారీ చేశారని గుర్తు చేశారు. పోలీసుల ఆదేశాలే కాకుండా తమ ప్రాణాల రక్షణ కోసం హెల్మెట్లు వాడాలని సూచించారు. ఈమేరకు నగరంలో వాహన షోరూంలు, బార్ అసోసియేషన్ల వద్ద, కళాశాలల వద్ద అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వారిలో చైతన్యం నింపేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. హెల్మెట్ వాడకంతో ప్రాణాలకు రక్ష హెల్మెట్ వాడకపోవడం వల్ల నగరంతో పాటు జిల్లాలో ఎక్కడో ఒక చోట ప్రమాదానికి గురైనప్పుడు ప్రాణాలు కోల్పోతుండటం ఆవేదన కలిగిస్తుందన్నారు. ద్విచక్ర వాహనాల్లో వెళ్లేటప్పుడు కింద పడినప్పుడు ఒక్కోసారి క్షణాల్లో ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఎందరో ఉన్నారన్నారు. హెల్మెట్ పెట్టుకోకపోతే కుటుంబాలకు ద్రోహం చేసిన వారు అవుతారన్నారు. సాధారణంగా ద్విచక్ర వాహనాలు నడిపేది సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారేనని, అలాంటి సందర్భంలో ఇంట్లో ఎవరైనా ప్రమాదాలకు గురైనప్పుడు ఎంతో ఇబ్బందులు పడుతుంటారన్నారు. 18 ఏళ్ల లోపు వయస్సు ఉన్న విద్యార్థులు కూడా ద్విచక్ర వాహనాలు నడపకూడదని, కళాశాలకు వెళ్లేటప్పుడు ఇంట్లో తల్లిదండ్రుల వెంట వెళ్లాలన్నారు. కళాశాల బస్సులు, ఆటోల్లో వెళితే ఇంకా మంచిదన్నారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి నగరంలో మంగళవారం సాయంత్రం హెల్మెట్ ధరించక, ద్విచక్ర వాహనం నడుపుతున్న సమయంలో సత్యవాణినగర నివాసి శివకుమార్(41) కిందకు పడిపోవడంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడని గుర్తు చేశారు. మరొక వ్యక్తి కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లాలో ద్విచక్ర వాహనాల్లో వెళ్లే వారు ఏదో విధంగా ప్రమాదాల బారిన పడి మృతి చెందుతున్నారని, తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు. హెల్మెట్ వాడకంపై జోరుగా అవగాహన సదస్సులు కళాశాలలు, షోరూంలలో జాగృతి సమావేశాలు హెల్మెట్ వాడి ప్రాణాలు రక్షించుకోవాలని సూచన -
రాలిన నట కుసుమం
శివాజీనగర: కరోనా వైరస్ వ్యాప్తి తరువాత ఆకస్మిక గుండెపోటు మరణాలు తీవ్ర ఆందోళనకరంగా మారాయి. అప్పటివరకు ఆరోగ్యంగా ఉన్నవారు, చిన్న వయస్కలు సైతం క్షణాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదే మాదిరిగా కన్నడ టీవీ, సినిమా నటుడు, నిర్మాతగా రాణిస్తున్న దిలీప్‌రాజ్ కన్నుమూశారు. అభిమానులు, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన వయసు 47 సంవత్సరాలు కాగా, భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. మంగళవారం రాత్రి నుంచి.. బెంగళూరులోనే జన్మించిన దిలీప్ రాజ్ చిన్ననాటి నుంచే నటనా రంగంతో ఆసక్తితో టీవీ సీరియళ్లతో పాటు పలు చిత్రాలలో నటించారు. ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యమిస్తూ యువతను ఆకర్షించేవారు. మంగళవారం రాత్రి ఒంట్లో బాగా లేదని కుటుంబ సభ్యులకు చెప్పాడు. ఫ్యామిలీ డాక్టర్‌కు ఫోన్ చేయగా, బుధవారం పొద్దున్నే రావాలని సూచించారు. కానీ బుధవారం ఉదయం ఇంట్లో ఉండగానే తీవ్రమైన గుండెనొప్పి వచ్చి పడిపోయారు. కుటుంబసభ్యులు సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, చికిత్స ప్రారంభించిన కొంతసేపటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కాలేజీ రోజుల్లోనే నటన.. దిలీప్ రాజ్ కాలేజీ రోజుల్లోనే నాటక బృందంలో చేరి నటించేవారు. ముందుగా ‘కంబద మనె’ అనే కన్నడ సీరియల్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యారు. హిట్లర్ కల్యాణ సీరియల్లో ప్రధాన పాత్రలో నటించి ప్రజాభిమానాన్ని గడించారు. ఆయన నటన, గెటప్, డైలాగ్ చెప్పే శైలి మెప్పు పొందింది. పలు సినిమాలలోనూ ప్రతిభ చాటుకున్నారు. 2005లో విడుదలైన బాయ్‌ఫ్రెండ్ సినిమా ద్వారా వెండితెరపై మెరిశారు. 2007లో పునీత్ రాజ్‌కుమార్ హిట్ మూవీ మిలనలో దిలీప్ రాజ్ నటించి ప్రశంసలందుకున్నారు. మరోవైపు డీఆర్ క్రియేషన్స్ బ్యానర్ ద్వారా పలు కన్నడ సీరియల్స్లను నిర్మించారు. సంతాపాల వెల్లువ దిలీప్‌రాజ్ మృతిపై అనేకమంది టీవీ నటులు, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. కొందరు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. సినిమా రంగం ఒక ప్రతిభావంత నటున్ని మాత్రమే కాకుండా, స్నేహితున్ని కోల్పోయిందని పేర్కొన్నారు. సాయంత్రం రామనగర వద్ద ఉన్న గన్నూరులోని సొంత ఫాంహౌస్‌లో రేవణ సిద్ధేశ్వరబెట్ట దాసోహ మఠాధిపతి రాజశేఖర స్వామీజీ ఆధ్వర్యంలో అంతిమ సంస్కారాలు జరిగాయి. నటుడు, నిర్మాత దిలీప్ రాజ్ మృతి ఆకస్మిక గుండెపోటే కారణం! సినీ రంగం, అభిమానుల దిగ్భ్రాంతి -
అలంకారప్రాయంగా ఏపీఎంసీ
రాయచూరు రూరల్: రాష్ట్రానికే తలమానికంగా రాయచూరులో ఉన్న రాజేంద్ర గంజ్ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ అధ్వానంగా మారింది. పేరుకు మాత్రమే పాలక మండలి ఉన్నా సౌకర్యాలను సమకూర్చడంలో విఫలమైందని రైతులు, వ్యాపారులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో అతి పెద్ద మార్కెట్ ఉన్నా అన్నదాతలను ఆదుకోని పరిస్థితి నెలకొంది. వరి ధాన్యం అనుకున్న దాని కంటే అధిక స్థాయిలో మార్కెట్‌కు దిగుమతి అయింది. రాయచూరు ఏపీఎంసీ అసౌకర్యాలకు నిలయంగా మారింది. వర్షాకాలంలో వర్షాలు కురిస్తే ధాన్యం నీటిలో కొట్టుకు పోతాయి. అధికారులు వరిధాన్యానికి టెండర్లు పిలవడం, వాటిని కొనుగోలు చేయడం వరకే ఉన్నారు. అక్కడి పరిస్థితిని అవలోకిస్తే మార్కెట్ అగమ్యగోచరంగా మారింది. అసౌకర్యాలకు నిలయంగా.. మార్కెట్లో వాహనాల రాకపోకలకు అధ్వానంగా తయారైంది. మురుగు కాలువలో పేరుకు పోయిన చెత్తా చెదారం, ప్లాిస్టిక్ సంచులు, పూడికతో నిండిన కాలువలు, మరోవైపు మురుగు నీరు ముందుకు ప్రవహించకుండా అక్కడే నిలబడడంతో దుర్వాసన వెదజల్లుతోంది. ఇన్ని అసౌకర్యాల నడుమ ఏపీఎంసీ పని చేస్తుంది. వర్షాకాలంలో నీరు ముందుకు ప్రవహించకుండా మార్కెట్లో విక్రయాలకు వచ్చిన ధాన్యం తడిసి పోవడానికి ప్రధాన కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. కాగా గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్ ఆప్తుడు ఏపీఎంసీ అధ్యక్షుడు మల్లికార్జున గౌడ ఏనాడూ మార్కెట్‌ను సందర్శించిన దాఖలాలు లేవు. జిల్లాలో అన్నదాతలకు అక్కరకు రాని వైనం ఆందోళన చెందుతున్న రైతులు, వ్యాపారులు -
మండ్య మిమ్స్‌లో తల్లి పాల బ్యాంకు
మండ్య: తల్లి పాలకు ప్రత్యామ్నాయం లేదు. అంతకంటే పౌష్టికాహారమైన పాలు మరొకటి లేదని, తల్లి పాల ప్రాధాన్యతపై, తల్లి పాల దానంపై తల్లుల్లో జాగృతి కల్పించాలని వ్యవసాయ శాఖ మంత్రి ఎన్.చలువరాయస్వామి అన్నారు. ఆయన బుధవారం నగరంలోని మిమ్స్ ఆస్పత్రిలో తల్లి పాల బ్యాంక్, సహజ కాన్పు పోషణ విభాగాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఎంతో మంది తల్లుల్లో పాల కొరత ఉంటుందన్నారు. పిల్లలకు అవసరమైనన్ని పాలు ఉండవన్నారు. తల్లులకు నచ్చజెప్పి అదనపు పాలను సేకరించి నిల్వచేసి లేనివారికి అందించాలని తెలిపారు. పాలను దానం చేయడం వల్ల కొరత ఉన్న శిశువులకు అమృతపానం కల్పించినట్లవుతుందని తల్లులకు నచ్చజెప్పాలన్నారు. ఎమ్మెల్యే పీ.రవికుమార్, జిల్లాధికారి కుమార్, జెడ్పీ సీఈఓ కేఆర్ నందిని పాల్గొన్నారు. లేఔట్ పేరుతో రూ.7.92 కోట్ల చీటింగ్ మైసూరు: లేఔట్ నిర్మాణంలో భాగస్వామిగా చేసుకుంటానని నమ్మించి ఓ డెవలపర్ రూ.7,92,75,000 లను వసూలు చేసి మోసగించాడని ఫిర్యాదు నమోదైంది. మైసూరుకు చెందిన బీపీ శ్రీనివాసరాజు, ధర్మప్ప అనే ఇద్దరిపై ఏ.రాధాకృష్ణ అనే వ్యక్తి మైసూరు దక్షిణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వివరాలు.. రాధాకృష్ణకు శ్రీనివాసరాజు తాను ల్యాండ్ డెవలపర్నని పరిచయం చేసుకున్నాడు. ధర్మప్ప కూడా డెవలపర్ అని చెప్పాడు. తామిద్దరూ హౌసింగ్ స్కీం కింద కాలనీ నిర్మిస్తామని తెలిపారు. అందుకోసం ఉత్తనహళ్లి వద్ద స్థలం కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టులో రాధాకృష్ణను పార్ట్నర్గా చేసుకుని అడ్వాన్సుగా రూ.25 లక్షలను తీసుకున్నారు. తర్వాత దశల వారీగా కాలనీని అభివృద్ధి పేరుతో రాధాకృష్ణ నుంచి చెక్, నగదు, డీడీల ద్వారా మొత్తం రూ.7.92 కోట్లను వసూలు చేశారు. ఇప్పుడు డబ్బు వెనక్కి ఇవ్వడం లేదని, మోసగించారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విద్యార్థులపై నీట్ లీకేజీ కాటు ● విద్యామంత్రి మధు శివమొగ్గ: లీకేజీ కారణంతో నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం తీవ్ర ఆందోళనకరమని రాష్ట్ర ప్రాథమిక విద్యా శాఖ మంత్రి మధు బంగారప్ప అన్నారు. ఆయన బుధవారం శివమొగ్గలో విలేకరులతో మాట్లాడారు. పరీక్షల వ్యవస్థ తరచు ఇలా అభాసుపాలవడం వల్ల విద్యార్థులు ఆందోళనకు గురవుతారన్నారు. ఏడాది పొడవున కష్టపడి చదివి పరీక్ష రాసిన లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు కేంద్రం బాధ్యతారాహిత్య నిర్ణయాలతో నిస్సహాయ స్థితిలోకి పడిపోయారన్నారు. దీనిపై బీజేపీ నాయకులు నోరు మెదపడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి విషయాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించి చేతులు దులుపుకొంటే చాలదన్నారు. మరింత సమర్థవంతమైన పరీక్షల వ్యవస్థను రూపొందించాలని, లేకుంటే యావత్ పరీక్షల వ్యవస్థపైనే ప్రజలకు నమ్మకం పూర్తిగా పోతుందని హెచ్చరించారు. బెంగళూరు– బీదర్ మధ్య కొత్త రైలు గుంతకల్లు: ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో బెంగళూరు– బీదర్ మధ్య బై వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభిస్తున్నట్లు డివిజన్ అధికారులు తెలిపారు. ప్రతి శుక్ర, ఆదివారాల్లో బెంగళూరు జంక్షన్ ( నంబరు 16559) నుంచి రాత్రి 9:15 గంటలకు బయలుదేరే ఈ రైలు ఈ నెల 15 నుంచి ప్రారంభమవుతుంది. అదేవిధంగా బీదర్ జంక్షన్ నుంచి (నంబరు 16560) ప్రతి శని, సోమవారాల్లో మధ్యాహ్నం 2 గంటలకు బయల్దేరుతుంది. బెంగళూరు, యలహంక, హిందూపురం, ధర్మవరం, అనంతపురం, గుత్తి, ఆదోని, మంత్రాలయం రోడ్డు, రాయచూర్, యాదగిరి, వాడి, షహబాద్, కలబురిగి, తాజ్ సుల్తాన్పూర్, హుమ్నాబాద్ మీదుగా రాకపోకలు సాగిస్తుందని తెలిపారు. గృహలక్ష్మి స్కీంలో రూ.22 కోట్ల స్కాంయశవంతపుర: రాష్ట్ర ప్రభుత్వ ఐదు గ్యారంటీ పథకాలలో ఒకటైన గృహ లక్ష్మీ డబ్బులు నెల నెలా సక్రమంగా పడటం లేదనే ఆరోపణలున్నాయి. లబ్ధిదార మహిళలు తరచూ ఆక్రోశం వ్యక్తంచేస్తున్నారు. కానీ దక్షిణ కన్నడ జిల్లాలో మరణించిన మహిళల ఖాతాల్లోకి ఈ పథకం పేరుతో సుమారు రూ.22 కోట్లు జమైన కుంభకోణం బయటపడింది. జిల్లాలో నిర్వహణలో లేని వేలాది ఖాతాలకు ఈ డబ్బులు పడుతున్నాయి. ఈ ఖాతాదారుల్లో అనేకమంది చనిపోయినవారే. అధికారులు కుమ్మకై ్క నిధులు స్వాహా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. జిల్లాలో 4.25 లక్షలు రేషన్ కార్డులుండగా, 3.82 లక్షల మంది గృహలక్ష్మీ లబ్ధిని పొందుతున్నారు. అనర్హులు పొందిన డబ్బులను వాపస్ కట్టించాలని జిల్లా గ్యారంటీల కమిటీ అధ్యక్షుడు భరత్ మండోడి జిల్లా అధికారుల సమావేశంలో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో చర్యలు చేపట్టాలని కలెక్టరు ఆదేశించారు. -
ఈదురుగాలుల బీభత్సం
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా యంబలి, వడ్డరహట్టి గ్రామాల్లో మంగళవారం సాయంత్రం అకస్మాతుగా ప్రారంభమైన ఈదురుగాలులకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనంలో రెండు గదులపై ఏర్పాటు చేసిన రేకుల షీట్ల ట్రస్ రూఫింగ్ పైకప్పు దెబ్బ తింది. ఇప్పుడు పాఠశాలకు సెలవు కావడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. రైతు చెన్నబసప్పకు చెందిన కోళ్లఫారం షెడ్ మొత్తం పూర్తిగా ధ్వంసమైంది. ఆ సందర్భంలో రేకులన్నీ గాలికి కొట్టుకుపోయాయి. జరిగిన నష్టంపై జీపీ అధికారులు పరిశీలించి నివేదిక రూపొందిస్తున్నారు. -
కార్మిక చట్టాల అమలుపై నిరసన
హొసపేటె: కార్మిక, రాజ్యాంగ వ్యతిరేకమైన 4 కార్మిక చట్టాలను అమలు చేసేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను వ్యతిరేకిస్తూ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ హాస్టల్, రెసిడెన్షియల్ పాఠశాలల ఔట్‌సోర్స్ ఉద్యోగుల విజయనగర జిల్లా కమిటీ కార్యవర్గ సభ్యులు నగరంలోని ఏకలవ్య సర్కిల్ సమీపంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. నోటిఫికేషన్ల ప్రతులను దహనం చేశారు. గత కొన్నేళ్లుగా తాము కనీస వేతనం, మెరుగైన జీవన వ్యవస్థను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఔట్ సోర్స్, తాత్కాలిక ఔట్‌సోర్స్ కార్మికుల పోరాటానికి అన్యాయం చేయడమే ఈ కార్మిక చట్టాల అమలు ఉద్దేశ్యం అని నిరసనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కమిటీ అధ్యక్షుడు జంబయ్య నాయక్, జిల్లా నాయకులు సూర్యనారాయణ, కరిబసవయ్య, దివాకర్, దురుగేష్, లక్ష్మీదేవి, శారద, శివప్ప, కే.బసవరాజ్, మంజుల, కాళమ్మ, ప్రేమావతి, బి.గీత, పంపాపతి తదితరులు పాల్గొన్నారు. -
నాసిరకం అరటి మొక్కల సరఫరా
హొసపేటె: తాలూకాలో నాణ్యత లేని అరటి మొక్కలను సరఫరా చేసిన కంపెనీపై చర్యలు తీసుకోవాలని కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేసింది. తాలూకాలోని రాజాపుర గ్రామానికి చెందిన రైతులు, రైతు సంఘం నాయకత్వంలో ఉద్యానవన శాఖ జాయింట్ డైరెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. రైతు నేత ఆనంద్ మాట్లాడుతూ తమ భూముల్లో అరటి మొక్కలు నాటడం కోసం రైతులు బెంగళూరు, దేవనహళ్లి, విజయపురలోని ఆదిత్య బయోటెక్ నుంచి ఒక్కొక్కటి రూ.22 చొప్పున సుమారు 6000 మొక్కలను కొనుగోలు చేసి నాటారు. కానీ నాటిన ఆ అరటి మొక్కలు పెరిగి నిలబడక ముందే కుళ్లిపోయాయి. ఈ నేపథ్యంలో అరటి మొక్కలను సరఫరా చేసిన కంపెనీపై చర్య తీసుకోవాలి, వ్యాధి సోకిన ఆ మొక్కలను రాయచూరు వ్యవసాయ శాఖకు పంపించాలని డిమాండ్ చేశారు. నాయకులు ఎన్.యల్లాలింగ, చంద్రు, కారె హనుమంత కరియన్న, నబీసాబ్, కనిమప్ప, ఏ.స్వామి, దురుగప్ప, గణేష్ పాల్గొన్నారు. కంపెనీపై చర్యలకు కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ -
పది ఫలితాల్లో మార్పు తెస్తా
రాయచూరు రూరల్: ఈసారి పదవ తరగతి ఫలితాల్లో గణనీయమైన మార్పులు తెస్తామని రాయచూరు జిల్లా విద్యా శాఖాధికారి మల్లికార్జున పేర్కొన్నారు. బుధవారం తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈసారి పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లా 21వ స్థానం పొందిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఏడాది 15వ స్థానంలోకి తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయుల సంఘం పదాధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సహకారంతో విధులు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 26 నుంచి మూడు రోజుల పాటు పాఠశాలల్లో విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలనే అభియాన్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. పాఠశాల గదులు, మరుగుదొడ్ల నిర్మాణాలకు ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. ఉపాధ్యాయుల కొరత నివారణకు అతిథి ఉపాధ్యాయులను నియమిస్తామన్నారు. -
జపాన్ మామిడికి కొప్పళలో భలే గిరాకీ
రాయచూరు రూరల్: జపాన్ మామిడి పండ్లకు కొప్పళ జిల్లాలో డిమాండ్ పెరిగింది. కొప్పళ జిల్లాలోని కల్లతావర గెరెలో రైతు నాగరాజ్ రెండు ఎకరాల్లో మియా జాకీ అనే రకం మామిడి పండ్లను పండించారు. జపాన్ నుంచి మియా జాకీ రకం మామిడిని కొనుగోలు చేసి పంట పండించారు. జపాన్ నుంచి తెచ్చిన కొత్త రకం మామిడి పండ్లకు భలే డిమాండ్ ఏర్పడింది. ఐదు రోజుల పాటు మామిడి పండ్ల శిబిరాన్ని ప్రజలు తిలకించడానికి వీలు కల్పించినట్లు నాగరాజ్ తెలిపారు. జపాన్ మామిడి పండ్లు యాపిల్ పండ్ల మాదిరిగా ఉంటాయి. 10వ వార్షికోత్సవంలో భాగంగా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఆరోగ్యంపై కనీస జాగ్రత్తలు అవసరం రాయచూరు రూరల్: నగరంలో విధులు నిర్వహించే పౌర కార్మికులు ఆరోగ్యంపై కనీస జాగ్రత్తలు వహించాలని సఫాయి కర్మచారి మండలి అధ్యక్షుడు మురళి అశోక్ సాలప్ప పిలుపునిచ్చారు. బుధవారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో పౌర కార్మికులకు రూ.5 లక్షలు నగదు రూపేణ బీమా పాలసీలను అందించిన అనంతరం పౌర కార్మికులనుద్దేశించి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నుంచి 5,744 మంది కార్మికులకు ఆరోగ్య కార్డులను పంపిణీ చేశామన్నారు. ఆరోగ్యం విషయంలో కార్మికులు నిర్లక్ష్యం వహించరాదన్నారు. ఐపీడీ సాలప్ప నివేదిక ఆధారంగా 36 అంశాలతో కూడిన ఆరోగ్య కార్డుల ద్వారా లబ్ధి పొందాలన్నారు. మూడు నెలలకు ఒకసారి ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు. పౌర కార్మికుల పిల్లలకు విద్యార్థి వేతనాలను చెల్లించాలని కోరారు. జిల్లాధికారిణి పూవిత, కమిషనర్ జుబిన్ మహాపాత్రో, శరణప్ప, కృష్ణ, రవి, మల్లికార్జున, జయపాల్ రెడ్డిలున్నారు. జూలై 27న దక్షిణాది రాష్ట్రాల సమావేశంరాయచూరు రూరల్: నగరంలో జూలై 27న దక్షిణాది రాష్ట్రాల సమావేశం నిర్వహిస్తున్నట్లు మున్నూరు కాపు సమాజం అధ్యక్షుడు పాపారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని వీరాంజనేయ కళ్యాణ మంటపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, కేరళ రాష్ట్రాల నుంచి కాపు, బలిజ కులాలకు చెందిన సభ్యులు సమావేశంలో పాల్గొంటారన్నారు. శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేక మహోత్సవంతో పాటు పంచ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు హాజరవుతారన్నారు. -
మారెమ్మా.. కాపాడమ్మా
మండ్య: నగరంలో మారెమ్మ దేవర పండుగ వైభవంగా జరిగింది. హోసహళ్లి–రామనహళ్లి లేఔట్‌లోని శ్రీ బిసిలు మారెమ్మ దేవస్థానానికి వచ్చిన అశేష భక్తజనం ఊరేగింపులో పాల్గొన్నారు. కొబ్బరికాయలు, పూలు పండ్లు తదితరాలను అమ్మవారికి సమర్పించి పూజలు చేశారు. గతంలో మండు వేసవిలో ప్రజలు, పశువుల ఆరోగ్యం దెబ్బతినడంతో ప్రజలు కాపాడాలని అమ్మవారికి జాతర చేయడంతో అంతా మంచే జరిగిందని నమ్ముతారు. అలా వేసవిలో జాతరకు శ్రీకారం చుట్టారు. ప్రతి ఐదేళ్లకొకసారి ప్రతి ఇంట్లోని అక్కా చెల్లెళ్లు, వదినా–మరదళ్లు కలసికట్టుగా ఈ పండుగను ఆచరిస్తారని చెప్పారు. సీఎం సిద్దు.. మరిచారా: నిఖిల్ మైసూరు: అసెంబ్లీలో జేడీఎస్ బలం 17 స్థానాల నుంచి ఒక్క అంకెకు పడిపోతుందని సీఎం సిద్ధరామయ్య అపహాస్యం చేశారని, వరుణ నియోజకవర్గంలోనే తాను ఈ సవాలును స్వీకరిస్తున్నట్లు జేడీఎస్ పార్టీ యువ నాయకుడు నిఖిల్ కుమారస్వామి చెప్పారు. వరుణ వద్ద మెల్లహళ్లిలో బుధవారం ప్రజలతో మాట్లాడారు. 2004లో జేడీఎస్ పార్టీ 58 స్థానాలు గెలుపొందిందని, 2028 ఎన్నికల్లో అంతకంటే ఒక్క స్థానం ఎక్కువే గెలిచి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. మిమ్మల్ని చాంపియన్ చేసింది ఎవరో మరిచిపోయారా అని సిద్దరామయ్యను విమర్శించారు. తమ జేడీఎస్ పార్టీ ద్వారా ఎదిగి, ఆ తర్వాత తిన్నింటికే ద్రోహం చేశారని మండిపడ్డారు.కంట్లో కారంపొడి చల్లి దోపిడీ ● స్నేహితుడే సూత్రధారి గౌరిబిదనూరు: నగరంలో సోమవారం మధ్యాహ్నం వినాయకనగర నివాసి శివశంకర్ ఆరాధ్యకు కారు కొనిస్తామని చెప్పి నమ్మించిన యశ్వంత్, అతని స్నేహితులు కంట్లో కారంపొడి చల్లి రూ 7.5 లక్షలున్న బ్యాగుతో పరారయ్యారు. బాధితుడు మాట్లాడుతూ నాకు యశ్వంత్ మూడు నెలల క్రితం పరిచయమయ్యాడు. కారును బాడుగకు తిప్పితే మంచి లాభముందని, తక్కువ ధరకు కారును కొనిస్తానని నమ్మించాడని తెలిపాడు. డబ్బు తీసుకుని ఇంట్లో ఉండగా యశ్వంత్ పిలుచుకెళ్లాడని, ఇంతలో బైక్‌లో వచ్చిన దుండగులు తన కంట్లో కారంపొడి చల్లి, కత్తితో దాడి చేసి రూ.7.5 లక్షల నగదుతో పరారైనట్లు తెలిపాడు. ఫిర్యాదు మేరకు క్రైం బ్రాంచ్ ఎస్ఐలు లలిత, వరలక్ష్మి సిబ్బంది మంగళవారం ఉదయానికల్లా దొంగలను అరెస్టు చేసి సొమ్మును స్వాధీన పరచుకొన్నారు. బెంగళూరు బిడదికి చెందిన భరత్, దర్శన్, విషకంఠ, యశ్వంత్‌లను అరెస్టు చేసినట్లు తెలిపారు. నేడు పలు జిల్లాలకు వర్షసూచన బనశంకరి: ఉత్తర ఒళనాడు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముంది, అలాగే పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. గురువారం బెంగళూరుతో సహా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. కరావళిలో ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, ఉడుపిలో సాధారణ వర్షం కురవనుంది. ఉత్తర ఒళనాడులో బెళగావి, ధార్వాడ, గదగ్, హావేరి, కొప్పళ, రాయచూరులో సాధారణ వానలు పడవచ్చు. దక్షిణ ఒళనాడు జిల్లాలైన బళ్లారి, బెంగళూరు గ్రామాంతర, చామరాజనగర, చిక్కబళ్లాపుర, చిక్కమగళూరు, చిత్రదుర్గ, దావణగెరె, హాసన్ తదితర జిల్లాలకూ ఓ మోస్తరు వర్షసూచన ఉంది. రాబోయే 5 రోజులపాటు ఉత్తర ఒళనాడు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 2–3 డిగ్రీల మేర అధికం కావచ్చు. -
ఆరోగ్య శాఖలో నిధుల దుర్వినియోగం
రాయచూరు రూరల్: కాంట్రాక్ట్ పద్ధతిపై ఆరోగ్య శాఖలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాల్లో ఏజెన్సీలు కోతలు విధిస్తున్నా అధికారులు మౌనం వహించడం తగదని టీయూసీఐ సంచాలకుడు మానసయ్య డిమాండ్ చేశారు. బుధవారం పాత్రికేయుల భనవంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిపై విధులు నిర్వహిస్తున్న సీ, డీ గ్రూప్ ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధించడాన్ని తప్పుబట్టారు. జిల్లాలో 228 మంది ఉద్యోగులకు 9 నెలలుగా వేతనాలు చెల్లించలేదని ఆరోపించారు. కాంట్రాక్ట్ పొందిన ఏజెన్సీలు 2025 సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు వీరిని విధుల నుంచి తొలగించినట్లు నాటకమాడి ఆ 4 నెలల గౌరవ వేతనాలను రూ.1.33 కోట్లను స్వాహా చేశారన్నారు. 2025 డిసెంబర్ నుంచి 2026 మార్చి వరకు ఐదు నెలల గౌరవ వేతనం చెల్లించక పోవడం తగదన్నారు. రూ.25 వేలకు బదులుగా కేవలం రూ.15 వేలు చెల్లించి చేతులు దులుపుకుంటారని ఆరోపించారు. ఈ విషయంలో జడ్పీ సీఈఓ చర్యలు చేపట్టి ఉద్యోగులకు న్యాయం చేయాలన్నారు. -
ఎక్కడి నుంచి ఎంత దూరం?
బొమ్మనహళ్లి: క్రీడా ప్రియులకు శుభవార్త. బెంగళూరు నగర జిల్లా పరిధిలోని ఆనేకల్ తాలూకాలోని సూర్యనగర్ దగ్గర ఇండ్లవాడి వద్ద 80 వేల సీట్ల సామర్థ్యం గల అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం నిర్మాణానికి సీఎం సిద్దరామయ్య ఈ నెల 23వ తేదీన శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. స్టేడియం నిర్మాణం కోసం కర్ణాటక హౌసింగ్ బోర్డు ఇప్పటికే టెండర్లను ఆహ్వానించింది, త్వరలో టెండర్ల ప్రక్రియను ఖరారు చేస్తారని బోర్డు వర్గాలు తెలిపాయి. ఇక్కడ సుమారు 75 ఎకరాల స్థలంలో ఆధునిక హంగులతో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పనులు మొదలైన మూడేళ్ల లోపు స్టేడియం పూర్తవుతుందని భావిస్తున్నారు. ఆ దుర్ఘటన నుంచి పాఠం.. గతేడాది జూన్‌లో బెంగళూరు నడిబొడ్డున చిన్నస్వామి స్టేడియం ముందు తొక్కిసలాట జరిగి అనేకమంది చనిపోవడం తెలిసిందే. దీంతో నగరం బయట విశాలమైన ఆట మైదానం అవసరమని ప్రభుత్వం నిశ్చయించింది. బెంగళూరువాసులు క్రికెట్ ప్రియులు. మ్యాచ్‌లను చూడటానికి పెద్ద సంఖ్యలో ప్రజలు, క్రీడాభిమానులు వస్తారనే విషయాన్ని పరిగణించి, నూతన స్టేడియాన్ని విశాలమైన ప్రదేశంలో నిర్మించనున్నారు. దీనిని అనుసంధానించేలా రోడ్లు, విద్యుత్ సౌకర్యాలను రూ 950 కోట్లతో ఏర్పాటు చేస్తారు. రెండవ దశలో, ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తారు. ఇందులో ఇండోర్, అవుట్డోర్ క్రీడల మైదానాలు ఉంటాయి. కన్వెన్షన్ సెంటర్, అన్ని సౌకర్యాలు గల హోటల్ మొదలైన సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. వీటన్నింటికీ సుమారు రూ1,000 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. ఆనేకల్ తాలూకాలో వివిధ క్రీడా సదుపాయాలతో నిర్మానం! ఈ నెల 23న శంకుస్థాపన ఈ స్టేడియం బెంగళూరులో మెజెస్టిక్ బస్టాండు నుంచి 48 కి.మీ., కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 72 కి.మీ, ఆనేకల్ రైల్వేస్టేషన్ నుంచి 11 కి.మీ., బొమ్మసంద్ర మెట్రో స్టేషన్ నుంచి 18.4 కి.మీ. దూరం ఉంటుంది. -
వైభవం.. హులిగమ్మ దేవి రథోత్సవం
హొసపేటె/రాయచూరు రూరల్: కొప్పళ జిల్లాలో చారిత్రాత్మక ప్రసిద్ధ శక్తి పీఠంగా నిలిచిన హులిగిలో వెలిసిన హులిగమ్మ దేవి రథోత్సవం మంగళవారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగింది. కొప్పళ తాలూకాలోని సుక్షేత్ర హులిగి గ్రామంలో సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమైన ఈ రథోత్సవంలో కొప్పళతో పాటు విజయనగర, బళ్లారి, గదగ్, రాయచూరు వంటి సరిహద్దు జిల్లాలతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి, పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. అక్కడికి చేరుకున్న లక్షలాది మంది భక్తులు రథోత్సవాన్ని వీక్షించి ఆనంద నినాదాలు చేశారు. హులిగమ్మ దేవి విగ్రహాన్ని ప్రతిష్టించిన రథాన్ని లాగారు. రథం తిరిగి యథాస్థానానికి చేరుతుండగా, భక్తుల నుంచి చప్పట్లు మారుమోగాయి. ఉదో ఉదో.. హులిగమ్మ అని భక్తులు పదే పదే నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఎంపీ రాజశేఖర్ హిట్నాళ్, ఎమ్మెల్సీ హేమలత నాయక్, మాజీ ఎంపీ సంగణ్ణ కరడి తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ డాక్టర్ రామ్ ఎల్. అరసిద్ది మార్గదర్శకత్వంలో తగిన పోలీసు భద్రత కల్పించారు. హులిగమ్మ అభివృద్ధి ప్రాధికార సంస్థ సభ్యులు, కార్యదర్శి ప్రకాష్ రావు, ప్రపంచ పశు వైద్య సంక్షేమ బోర్డు అధ్యక్షుడు దయానంద స్వామీజీ, హులిగి గ్రామ పంచాయతీ అధ్యక్షుడు, సభ్యులతో సహా చుట్టు పక్కల అనేక గ్రామాల నుంచి భక్తులు హాజరయ్యారు. -
సకాలంలో ఎరువులను అందించండి
హొసపేటె: పంటల సాగు అవసరాలకు అనుగుణంగా రైతులు మార్కెట్లో యూరియా, ఎరువులను పొందేలా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రైతులు కొనుగోలు చేసే ఎరువులతో పాటు అదనంగా లింక్ ఉత్పత్తులుగా ఇతర వస్తువులను కూడా కొనాలని ఒత్తిడి చేసే పంపిణీదారులపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కర్ణాటక రాష్ట్ర రైతుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి వినతిపత్రాన్ని అందజేశారు. రైతు సంఘం నేతలు జగన్‌రాజ్ బసవరాజ్ మాట్లాడుతూ ఎఫ్ఐడీ ద్వారా ఎకరాకు ఒక బస్తా యూరియా మాత్రమే ఇవ్వాలనే నిబంధనను రద్దు చేయాలన్నారు. రైతులకు అవసరం లేని ఇతర ఎరువులను, వారికి కావాల్సిన ఎరువులతో పాటు తప్పనిసరిగా కొనాలనే నిబంధనను తొలగించాలన్నారు. రైతులపై లింక్ ఎరువుల పేరుతో అదనపు ఎరువులను కొనాలని ఒత్తిడి చేసే పంపిణీదారులపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఎరువులు కొనుగోలు చేసే రైతులపై నిబంధనలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు హనుమంతప్ప, నల్లప్ప తదితరులు పాల్గొన్నారు. -
బర్త్‌డే రోజే విద్యార్థిని ఆత్మహత్య
● పెళ్లి చేస్తున్నారని ఆవేదన రాయచూరు రూరల్: తాను చదువుకుంటానంటే, తల్లిదండ్రులు పెళ్లి ఖాయం చేశారు, తనకిక చదువుకునే యోగమే లేదా అనే ఆవేదనతో పుట్టినరోజే ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన బెళగావి నగరం అజాంనగరలోని ఎస్సీ సాంఘిక సంక్షేమ హాస్టల్లో జరిగింది. జిల్లాలో హుక్కేరి తాలూకా కటాబళికి చెందిన కావేరి నాయక్ (21) బీఎస్సీ చివరి ఏడాది చదువుతూ ఈ హాస్టల్లో ఉంటోంది. ఆమెకు మూడు నెలల క్రితం పోలీస్ కానిస్టేబుల్‌తో నిశ్చితార్థం జరిగింది. ఇరు కుటుంబాలు పెళ్లి పనులకు సిద్ధమవుతున్నాయి. కానీ చదువుకోవాలనే ఆకాంక్షకు పెళ్లి అడ్డుగా ఉందని కావేరి మథన పడుతూ ఉండేది. ఈ కారణంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలున్నాయి. సోమవారం ఆమె బర్త్ డే కాగా అదేరోజు ప్రాణాలు తీసుకోవడం గమనార్హం. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. కేపీఎస్సీ భ్రష్టు: కుమార యశవంతపుర: కర్ణాటకలో ఎన్నిసార్లు పరీక్షలను వాయిదా వేయలేదు? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యార్థులకు అనేక సార్లు ఇబ్బంది కలిగింది అని కేంద్రమంత్రి హెచ్డి కుమారస్వామి అన్నారు. నీట్ పరీక్షల రద్దుపై ప్రతిపక్షాలు చేస్తున్న అరోపణలపై మండళవారం నగరంలో స్పందించారు. రాష్ట్రంలో కేపీఎస్సీ సంస్థను సరి చేయలేదు, ఆ సంస్థను నాశనం చేశారని కాంగ్రెస్ సర్కారుపై మండిపడ్డారు. పోస్ట్‌కు డబ్బులు ఇవ్వాలని అడుగుతున్నారు, ప్రజలు వీధుల్లో చర్చించుకొంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు నీట్‌పై అరోపణలు చేయడం సబబు కాదన్నారు. పేలిన ఈవీ స్కూటర్, వ్యక్తి మృతి దొడ్డబళ్లాపురం: ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలిన దుర్ఘటనలో వ్యక్తి మృతిచెందిన సంఘటన బెంగళూరులోని హలసూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని మర్ఫి టౌన్లో జరిగింది. వివరాలు.. లూర్థనాథన్ (62) ఇంట్లో తన స్కూటర్‌కు చార్జింగ్ పెట్టి అక్కడే పడుకున్నాడు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో స్కూటర్ బ్యాటరీ పేలింది. పేలుడు ధాటికి లూర్థనాథన్ తీవ్రంగా గాయపడి అక్కడే మరణించాడు. ఇంట్లో మంటలు అంటుకుని వస్తువులు కాలిబూడిదయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. హస్తం ఎమ్మెల్సీల ఢిల్లీ యాత్ర బనశంకరి: మంత్రి పదవులు కావాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఢిలో ప్రయత్నాలు ప్రారంభించారు. ఎమ్మెల్సీలు పుట్టణ్ణ, మధు మాదేగౌడ, బసణ్ణగౌడ బాదర్లి, చంద్రశేఖర్‌పాటిల్, డీటీ శ్రీనివాస్ తదితరులు మంగళవారం రాష్ట్ర ఇన్చార్జ్ రణదీప్‌సింగ్ సూర్జేవాలాను కలిశారు. త్వరగా మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని, కనీసం ఐదుమంది ఎమ్మెల్సీలకు క్యాబినెట్లో చోటివ్వాలని కోరారు. ముఖ్యమంత్రి మార్పు గందరగోళాన్ని త్వరగా పరిష్కరించాలని మనవిచేశారు. వివిద కార్పోరేషన్లు, బోర్డు పదవుల్లో కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. నిర్లక్ష్య ఫలితమే బౌరింగ్ విషాదం శివాజీనగర: ఇటీవల నగరంలో వర్షాలకు బౌరింగ్ ఆస్పత్రి గోడ కూలి ఏడుమంది ప్రజలు బలైన కేసులో జిల్లాధికారి జగదీశ్ ప్రభుత్వానికి దర్యాప్తు నివేదికను అందజేశారు. ఈ దుర్ఘటనలకు ఆరోగ్య శాఖ ఇంజనీర్, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే కారణం. ఆస్పత్రి పాలక మండలి నిర్లక్ష్యం కూడా ఉందని పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ లోతుగా తనిఖీ చేపట్టి సీల్డ్ కవర్లో నివేదిక సమర్పించాం, అన్నింటినీ చెప్పలేము, ప్రభుత్వం ఏం చర్యలు తీసుకొంటుందో వేచి చూడాలన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల సవరణ యశవంతపుర: రాష్ట్ర ప్రభుత్వం రావాణాశాఖ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. ఉద్యోగులు, అధికారుల వేతనాలను పరిష్కరిస్తూ అదేశాలను జారీ చేసింది. పూర్వ కింకో ఉద్యోగులు/కేఎస్ఆర్టీసీ/బీఎంటీసీ/వాయువ్య కర్ణాటక/కల్యాణ కర్ణాటక రవాణా శాఖ ఉద్యోగులకు వేతన పరిష్కరణ చేసినట్లు అధికారులు తెలిపారు. మార్చి 31, 2025న అందుకున్న మూల వేతనంపైకి 12.50 శాతం పెంచింది. ఈ పెంపు 2025 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుంది. ఈ జూలై 1 నుంచి పెంచిన వేతనం అందిస్తారు. -
ఇంటి గోడ కూలి బాలిక మృతి
● మరో ఇద్దరికి గాయాలు ●యాదగిరి జిల్లాలో విషాదం సాక్షి బళ్లారి: భారీ వర్షాల కారణంగా పాతమిద్దె గోడ కూలి బాలిక మృతి చెందింది. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన యాదగిరి జిల్లా వడగేరి తాలూకా తుమకూరు గ్రామంలో జరిగింది. భారీ వర్షం కురవడంతో పాతమిద్దె గోడ కూలడంతో అక్షిత(8) అనే బాలిక అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆడుకుంటున్న సమయంలో ఉన్నఫళంగా గోడ కూలడంతో అక్షిత మృత చెందగా, సంగీత, భూమిక అనే ఇద్దరు బాలికలకు తీవ్ర గాయాలయ్యాయి. వర్షాలు భారీగా కురవడంతో ఇంటి పైకప్పుపై నీరు నిలబడంతో గోడ కూలినట్లు స్థానికులు పేర్కొన్నారు. అధికారుల పరామర్శ ఈ విషయం తెలుసుకొన్న వెంటనే జిల్లాధికారి, జెడ్పీ సీఈఓ తదితరులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. చిన్నారి మృతితో కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. శిథిలాల కింద చిక్కుకొన్న చిన్నారులను ఆస్పత్రిలో చేర్పించారు. రెండు రోజుల క్రితం కురిసిన వర్షానికి ఇంటి పైకప్పు పూర్తిగా బలహీన పడటంతో పాతమిద్దె కావడం వల్ల ఈ ఘటన చోటు చేసుకుందని అధికారులు పేర్కొన్నారు. వారు బాలిక కుటుంబాన్ని పరామర్శించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య రాయచూరు రూరల్: అప్పుల బాధ భరించలేక బంగారు అభరణాలు విక్రయించే దుకాణపు యజమాని ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. సోమవారం రాత్రి వేళ సింధనూరులో ప్రాణేష్ వర్ణికర్(45) తమ అద్దె ఇంటిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నారు. రూ.2.5 కోట్ల మేర అప్పులుండడం, మరో వైపు కుటుంబ కలహాలతో భార్య దూరంగా ఉండడం అతడిని కలిచి వేయడంతో ఆ బాధలను దిగమింగ లేక ఆత్మహత్య చేసుకున్నట్లు డీఎస్పీ చంద్రశేఖర్ నాయక్ తెలిపారు. చాలా ఏళ్ల నుంచి నగరంలో జువెలరీ దుకాణం నడుపుతూ పార్ట్ టైమ్ అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తుండే వాడని, ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. సమాజ సేవ ఎన్ఎస్ఎస్ లక్ష్యంరాయచూరు రూరల్: నేటి ఆధునిక సమాజంలో సేవ చేయడం ఎన్ఎస్ఎస్ ప్రధాన లక్ష్యమని మటమారి పంచాయతీ అభివృద్ధి అధికారి శేఖరప్ప అభిప్రాయపడ్డారు. సోమవారం రాయచూరు తాలూకా మటమారిలో సర్కారీ మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో జరిగిన ఎన్ఎస్ఎస్ శిబిరాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. విద్యార్థులకు గ్రామీణ ప్రాంత సమస్యల గురించి వివరించాలన్నారు. పాఠ్యాంశాలపై చర్చ జరగాలన్నారు. ఎన్ఎస్ఎస్ సంస్థ నలుగురికి సహాయం చేయడం నిస్వార్థంతో కూడినది అని వివరించారు. గ్రామాల్లో సేవలు, స్వచ్ఛత, రక్తదానం, ఆరోగ్యం, పరిసరాల సంరక్షణపై దృిష్టి పెట్టాలన్నారు. బసనగౌడ, ప్రిన్సిపాల్ సుగుణ, సంతోష్, వీరాంజనేయ, ఈరణ్ణ, శరణేగౌడ, రేఖ, మహేశ్వరి, తేజేశ్వరిలున్నారు. సర్వే పనుల్లో జాప్యం తగదురాయచూరు రూరల్: భూ మాపన శాఖలో సర్వేయర్లు గత 72 రోజుల నుంచి ఆందోళన చేస్తున్న నేపథ్యంలో రైతుల భూములను సర్వే చేయడంలో జాప్యం తగదని రైతు సంఘం సంచాలకుడు గురురాజ్ డిమాండ్ చేశారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల భూములను కొలత వేసుకోవడానికి పలు ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 6.50 లక్షలు, రాయచూరు జిల్లాలో 19,496 సర్వే రికార్డులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. త్వరితగతిన రైతుల సమస్యల పరిష్కారానికి సర్కార్ ముందుకు రావాలన్నారు. గొలుసుల దొంగకు జైలు శిక్షహుబ్లీ: బంగారు గొలుసు దొంగతనం ఆరోపణలు రుజువు కావడంతో ఓ దొంగకు మొత్తం 9 కేసుల్లో రెండేళ్ల చొప్పున శిక్ష విధిస్తూ మూడో ఏసీజేఎం కోర్టు తీర్పునిచ్చింది. విశ్వనాథ్ సోమప్ప కోళివాడ శిక్షకు గురైన వ్యక్తి. ఇక్కడి విద్యాగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా మహిళల మంగళ సూత్రాల చోరీలు చేశాడు. ఆరోపణలు రుజువైన క్రమంలో న్యాయమూర్తి అళ్లప్ప ఎం.బడిగేర ఆ 9 కేసుల్లో రెండేళ్ల చొప్పున జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారని ప్రభుత్వం తరపున కేసు వాదించిన సీనియర్ సహాయక న్యాయవాది అనిల్‌కుమార్ తెలిపారు. కులదూషణ కేసు నమోదు అదే విధంగా మరో ఘటనలో కులం పేరుతో దూషణపై కేసు నమోదైంది. గత నెల 13న రాత్రి అమరగోళ ఏపీఎంసీ బసవ కాలనీలో డాక్టర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా బ్యానర్ కట్టే విషయంలో అసభ్యంగా తిట్టడమే కాకుండా కుల దూషణకు పాల్పడి ప్రాణాలు తీస్తామని కూడా బెదిరించిన ఆరోపణలపై బాధితురాలు విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు ఓ వ్యక్తిపై నవనగర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
మహిళల భద్రతపై ప్రత్యేక అవగాహన
హొసపేటె: మహిళా, శిశు అభివృద్ధి శాఖ, మహిళా సాధికారత విభాగం, అక్క పడె, విజయ మహిళా సురక్షా పడె బృందాల సంయుక్త ఆధ్వర్యంలో హంపీలోని ముఖ్య ప్రదేశాల్లో సోమవారం మహిళల భద్రత, రక్షణపై ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచ వారసత్వ ప్రదేశం హంపీలోని విరుపాక్ష ఆలయం, రథ వీధి, బస్టాండ్ పరిసరాల్లోని భద్రతా చర్యల గురించి ప్రజలకు, మహిళా పర్యాటకులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా మిషన్ కో–ఆర్డినేటర్ విద్యా, జెండర్ స్పెషలిస్ట్ అన్నపూర్ణ మాట్లాడుతూ మిషన్ శక్తి బేటీ బచావో.. బేటీ పడావో, సఖి వన్ స్టాప్ సెంటర్ వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వివిధ పథకాల సౌకర్యాలను మహిళలు ఎలా పొందవచ్చో వివరించారు. కష్టాల్లో ఉన్న మహిళలకు కేంద్రం అందిస్తున్న సహాయం గురించి సఖి కేంద్ర నిర్వాహకురాలు బషీరా బీ సమాచారం అందించారు. ఏదైనా అవాంఛనీయ సంఘటన లేదా అత్యవసర పరిస్థితిలో మహిళల హెల్ప్‌లైన్–181, పోలీస్ అత్యవసర సేవ–112, పిల్లల హెల్ప్‌లైన్–1098, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్–1930లకు సమాచారం అందించాలన్నారు. బృందం సభ్యులు పిల్లలపై లైంగిక నేరాల నివారణ చట్టం గురించి వివరించారు. అక్క పడె, విజయ మహిళా సురక్షా పడె సిబ్బంది అక్కడికి వచ్చిన మహిళా పర్యాటకులతో మాట్లాడి వారికి భరోసా ఇచ్చారు. అక్కపడె సిబ్బంది, విజయ మహిళా సురక్షా పడె సభ్యులు పాల్గొన్నారు. -
1243వ రోజుకు రైతుల పోరాటం
బళ్లారిటౌన్: కుడితిని వద్ద పరిశ్రమల స్థాపనకు భూమి కోల్పోయిన రైతులు చేపట్టిన పోరాటం 1243వ రోజుకు చేరుకుంది. అయితే ఇటీవల పోరాటాలు తీవ్రం చేస్తున్నందున జిల్లా ఏసీ కోర్టు 144 సెక్షన్, 163 సెక్షన్లను అమలు చేసి ఎలాంటి పోరాటాలు చేయరాదని ఆదేశాలు జారీ చేసింది. దీంతో రైతు పోరాట నాయకులు కోర్టుకు వెళ్లి స్టే తీసుకువచ్చారు. ఈ క్రమంలో మంగళవారం తొలి రోజున నిరంతర ఉపవాస సత్యాగ్రహాన్ని చేపట్టారు. రైతు సంఘం నేత యూ.బసవరాజ్ మాట్లాడుతూ ఈ ప్రాంత రైతులు 13 వేల ఎకరాల భూములను పరిశ్రమల కోసం కోల్పోయారన్నారు. అయితే సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం భూమి ధరను కేటాయించలేదన్నారు. కేటాయించిన ధరనైనా ఇవ్వాలి లేదా భూములను వాపసు ఇవ్వాలనే డిమాండ్‌తో ననిరంతర ఉపవాస సత్యాగ్రహాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. కమిటీ నేతలు జంగ్లి సాబ్, తిమ్మప్ప, నాగలింగ, శివకుమార్, నరసింహ మూర్తి, రాజప్ప, సిద్దప్ప, శ్రీధర్, మహిళా నాయకురాళ్లు మహంతమ్మ, మల్లమ్మ, పద్మావతి, సరోజ, కాళమ్మ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులకు శ్రీకారం
భక్తిశ్రద్ధలతో హనుమ జయంతిసాక్షి,బళ్లారి: కోరిన కోర్కెలు తీర్చే, శ్రీరాముని పరమభక్తుడు హనుమ జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఆచరించారు. మంగళవారం హనుమ జయంతిని పురస్కరించుకుని నగరంలోని బాలాంజనేయ స్వామి ఆలయం, మోకా రోడ్డులోని ఆంజనేయ స్వామి ఆలయం, సిరుగుప్ప రోడ్డులోని ఆంజనేయ స్వామి ఆలయం తదితర ఆంజనేయ స్వామి ఆలయాలు ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులతో కిక్కిరిశాయి. ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. ఆంజనేయ స్వామి జన్మస్థలం గంగావతి సమీపంలోని అంజనాద్రిలో వెలసిన అంజనేయ స్వామి ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు జరిపారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వీధి కుక్కలకు విషాహారం● రెండు శునకాల మృత్యువాత ● విజయపుర జిల్లాలో కలకలం సాక్షి బళ్లారి: విజయపుర జిల్లాలో వీధి కుక్కల దాడిలో ఓ బాలుడు తీవ్రంగా గాయపడటంతో ఆక్రోశం వ్యక్తం చేసిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వీధి కుక్కలకు విషాహారం ఇచ్చారు. వీధి కుక్కల బెడద నివారణపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ అధికారుల తీరుపై మండిపడ్డారు. మహానగర పాలికె నిర్లక్ష్యంగా పని చేస్తోందని, వీధి కుక్కలను నియంత్రించడాన్ని పట్టించుకోవడం లేదని, ప్రతి రోజు నగరంలో ఏదో ఒక చోట కుక్కలు ప్రజలను గాయపరుస్తున్నాయని ఆరోపించారు. దీంతో వీధి కుక్కలను తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకొన్నారు. అయితే ఇదే సందర్భంలో విజయపుర నగరంలోని పలు కాలనీల్లో విచ్చలవిడిగా ఉన్న వీధి కుక్కలకు విషాహారం ఇవ్వడంతో రెండు కుక్కలు మృతి చెందాయి. ఈ ఘటనతో జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూగ జంతువులను కాపాడాల్సిందిపోయి విషాహారం పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. బ్యాంక్ ఉద్యోగుల ధర్నా రాయచూరు రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బ్యాంక్ అధికారులు, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించిందని ఎస్బీఐ ఉద్యోగుల సంఘం ఆరోపించింది. మంగళవారం ఎస్బీఐ వద్ద చేపట్టిన ఆందోళనలో ఉద్యోగుల సంఘం కార్యాధ్యక్షుడు సోమశేఖర్ మాట్లాడారు. ప్రభుత్వం అధికంగా పని భారం పెంచిందన్నారు. సిబ్బంది కొరతను నివారించాలని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని, 2019 నుంచి ఉద్యోగంలో చేరిన వారికి ఐసిటీ మార్పులు చేయాలన్నారు. వేతనాల్లో తారతమ్యాలను నివారించాలని తదితర డిమాండ్లు తీర్చాలని ఒత్తిడి చేశారు. -
అమ్మా.. లే అమ్మా.. తల్లి లేక గున్న విలవిల
దొడ్డబళ్లాపురం: కనకపుర తాలూకా సంగమం వద్ద ఆడ ఏనుగు కన్నుమూసింది. తల్లి ఏనుగు కళేబరం వద్ద గున్న విలపిస్తున్న దృశ్యం అందరికీ బాధను పంచింది. సుమారు 38 సంవత్సరాల వయసు గల ఆడ ఏనుగు తీవ్ర అనారోగ్యంతో చనిపోయిందని అటవీ సిబ్బంది తెలిపారు. సిబ్బంది సోమవారం రాత్రి గస్తీ తిరుగుతుండగా ఏనుగు కళేబరం కనిపించింది. దాని పిల్లతో పాటు మరికొన్ని ఏనుగులు అక్కడే చాలాసేపు ఉండి వెళ్లిపోయాయి. ఆ తరువాత పశు వైద్యాధికారి డా.గిరీష్ అక్కడే పోస్టుమార్టం నిర్వహించి పూడ్చిపెట్టారు. గున్న ఏనుగును గజ సంరక్షణాలయానికి తరలిస్తారని తెలిసింది. -
మైసూరు మహిళకు రూ.12 లక్షల టోపీ
మైసూరు: ఫేస్బుక్ ద్వారా పరిచయమైన ముక్కు మొహం తెలియని వ్యక్తిని నమ్మి మైసూరులోని ఓ గృహిణి రూ.12.65 లక్షలను కోల్పోయింది. సోషల్ మీడియాలో కనిపించే మోసగాళ్ల మాయలో పడిపోయి పచ్చని కాపురాలకే ప్రమాదం తెచ్చుకుంటున్నారు. వివరాలు.. మైసూరులోని శక్తినగర నివాసి, ప్రభుత్వ ఉద్యోగి భార్య వేద (40) బాధితురాలు. 2025లో ఫేస్బుక్ ద్వారా డాక్టర్ జోసెఫ్ అలీ అనే వ్యక్తి తాను లండన్ నివాసినని వేదాకు పరిచయమయ్యాడు. తన తొమ్మిదేళ్ల కుమారుడిని కూడా పరిచయం చేశాడు. క్రమంగా అలీ, వేద ఫోన్ నంబర్లు మార్చుకుని తరచూ మాట్లాడుకునేవారు. తాను ఇండోనేషియాకు వెళుతున్నానని, తన ఏటీఎం కార్డు బ్లాక్ అయిందని, టికెట్ కొనుగోలు కోసం డబ్బు సాయం చేయాలని అడిగాడు. దీంతో వేద పలుమార్లు రూ.1.85 లక్షలను బదిలీ చేసింది. తర్వాత కొన్ని రోజులకు తాను ఇండియాకు వచ్చానని, రూ.25 లక్షలను మీ ఖాతాకు బదిలీ చేస్తానని వేదాను నమ్మించాడు. ఇండియన్ కరెన్సీలోకి మార్చేందుకు చార్జీలు కట్టాలని రూ.10.80 లక్షలను బదిలీ చేయించుకున్నాడు. మళ్లీ రూ.1.55 లక్షలను పంపాలని మోసగాడు ఒత్తిడి చేయగా వేదాకు అనుమానం వచ్చింది. ఆమె ప్రశ్నించడంతో ఫోన్‌ను స్విచాఫ్ చేసుకున్నాడు. మొత్తం రూ.12.65 లక్షలను కోల్పోయిన వేద సైబర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. -
బంగారం కొందామా.. వద్దా?
హుబ్లీ: దేశ ప్రజలను బంగారం కొనుగోలు చేయవద్దని, బంగారం మీద పెట్టుబడులు పెట్టవద్దని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరులో ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో జంట నగరాలతో పాటు ధార్వాడ జిల్లా వ్యాప్తంగా సంబంధిత వ్యాపారులు కొందరు అసంతృప్తి వ్యక్తం చేయగా, మరికొందరేమో వివిధ రకాలుగా అభిప్రాయాలను వెల్లడించారు. 25 శాతం ప్రజలు కొనుగోలు చేసినా ఫర్వాలేదని హుబ్లీ నగర బంగారు వ్యాపారులు తెలిపారు. సంబంధిత హుబ్లీ సరాఫ్ వ్యాపారుల సంఘం అధ్యక్షుడు పరశురామ బిలాల్ మాట్లాడుతూ భారతీయులకు బంగారం అంటే మోజు ఎక్కువని అన్నారు. అయితే దేశంలో బంగారం ఉత్పత్తి కావడం లేదన్నారు. దీంతో విదేశాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం. వ్యాపారులకు ఎలాంటి సమస్యా కాదు డాలర్ ముందు రూపాయి విలువ పడిపోయింది. దీంతో ప్రధాని మోదీ బంగారు కొనుగోలు చేయరాదని సూచించడం సమంజసమేనన్నారు. దీని వల్ల బంగారు వ్యాపారులకు ఎటువంటి సమస్య కాదన్నారు. తులం బంగారు ధర రూ.లక్షకు పెరిగినప్పటి నుంచి కొనుగోలుదారుల సంఖ్య తగ్గిపోయింది. దీపావళి, ఉగాది, అక్షయ తృతీయ రోజుల్లో కూడా ప్రజలు అంతగా బంగారు కొనుగోలు చేయడం లేదన్నారు. ప్రధాని చెప్పారన్న కారణంతో ప్రజలు కొనుగోలు చేయడం మానరు. 25 శాతం ప్రజలు కొనుగోలు చేసినా చాలని, వ్యాపారాలు నిర్వహించుకోవచ్చని అన్నారు. అయితే ఈ పరిణామం సంబంధిత వృత్తిపర కార్మికులపై పడుతుందన్నారు. అయితే ఆ కార్మికులందరూ బెంగాల్‌కు చెందిన వారని, హుబ్లీలో వారే ఎక్కువగా ఉన్నారన్నారు. ధర తక్కువ ఉన్నప్పుడే డిమాండ్ ఎక్కువ హుబ్లీలో 450 బంగారు అంగళ్లు ఉన్నాయి. షరాఫ్ బజార్లో 190 మంది సభ్యులు ఉన్నారు. రూ.లక్ష కన్నా తక్కువగా ధర ఉన్నప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉండేది. అధిక విక్రయాలు జరిగేవి. ప్రస్తుతం చాలా తగ్గిపోయిందన్నారు. మొత్తానికి దేశాభివృద్ధి కోసం ప్రజలందరూ కొన్ని కొన్ని నిర్ణయాలను తీసుకొని అమలు చేయాల్సి ఉందని కూడా ఆయన అభిప్రాయ పడ్డారు. ఓ వినియోగదారుడు మాట్లాడుతూ మోదీ ఏ ఉద్దేశంతో ఆ ప్రకటన చేశారో తెలియదు. అయితే మా ఇళ్లల్లో పిల్లల పెళ్లిళ్లు నిశ్చయం అయ్యాయి. పెళ్లిలో బంగారం పెట్టకపోతే కుదరదు. మా డబ్బులు ఇచ్చి బంగారు కొంటాం. ఇతరులు ఎవరూ మాకు డబ్బులు ఇవ్వరు. మేము వరకట్నం విషయంలో మాట ఇచ్చినట్లుగా బంగారం కట్టపెట్టాల్సి ఉంటుందన్నారు. బంగారం కొనుగోళ్లపై జనంలో జోరందుకున్న చర్చలు ప్రధానమంత్రి వ్యాఖ్యలతో ప్రజల్లో తీవ్ర సందిగ్ధత నెలకొన్న వైనం -
కార్మిక చట్టాల్ని విరమించుకోవాలి
రాయచూరు రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జారీ చేసిన నాలుగు కార్మిక చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. మంగళవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు శరణ బసవ మాట్లాడారు. ప్రభుత్వ, రైతు, వ్యవసాయ, ఏపీఎంసీ, విద్యుత్, కార్మిక చట్టాలను జారీ చేయడం వల్ల రైతు, కార్మిక, వ్యవసాయ కూలీలు అన్ని విధాలుగా నష్టపోతారన్నారు. ప్రైవేట్ పెట్టుబడిదారులకు మద్దతు పలుకుతూ ఎర్ర తివాచీ పరచడాన్ని తప్పుబట్టారు. నరేగను తొలగించి వికసిత్ భారత్ మిషన్ రోజ్‌గార్ పేరును నమోదు చేయడం తగదని పేర్కొన్నారు. నరేగ పథకం తొలగింపుతో నేడు వలస వెళుతున్న కూలీలు, కార్మికుల భవిష్యత్ అంధకారమైందన్నారు. దేశంలో 12 కోట్ల మంది వ్యవసాయ కూలీ కార్మికుల పొట్ట కొట్టిందన్నారు. ఆందోళనలో వీరనగౌడ, వరలక్ష్మి, సంతోష్, శరణ, వీరేష్, దివాకర్, నిర్మల, నిసార్, జిలాని పాషా, చంద్రకళ, కస్తూరి, సురేష్, పద్మావతి, రహమత్లున్నారు. -
మంచినీరివ్వండి సార్
తుమకూరు: రాష్ట్రంలో పలుచోట్ల తాగునీరు కావాలని ప్రజలు రోడ్డెక్కుతున్నారు. ఇదే మాదిరిగా జిల్లాలోని శిరా తాలూకా గౌడగెరె ఫిర్కా తావరకెరె గ్రామ పంచాయతీ పరిధిలోని మారనగెరె గ్రామంలో రక్షిత మంచినీటి యూనిట్‌కు మరమ్మతులు చేసి నీటిని అందించాలని గ్రామస్తులు మంగళవారం ధర్నా చేశారు. గ్రామస్తుడు నటరాజ్గౌడ మాట్లాడుతూ రూ.లక్షలాది వెచ్చించి రక్షిత మంచినీటి యూనిట్లను నెలకొల్పినా సరైన పర్యవేక్షణ లేక చెడిపోతున్నట్లు చెప్పారు. ఈ యూనిట్ పనిచేయక 8 నెలలైందన్నారు. రిపేరీ చేయించాలని పీడీఓకు తెలిపినా పట్టించుకోలేదన్నారు. అధికారులు వెంటనే బాగు చేయించి నీటి వసతి కల్పించాలని ప్రజలు ఖాళీ బిందెలు పట్టుకుని కోరారు. -
పసిడి నగలా.. పూత పూసినవా!
అంజనాద్రి శ్రీఆంజనేయస్వామికి దాత సమర్పించిన బంగారు ఆభరణాలు సాక్షి బళ్లారి: హంపీ సమీపంలో తుంగభద్ర నది ఒడ్డున అంజనాద్రిపై ఉన్న ఆంజనేయస్వామి దేవస్థానానికి సమర్పించిన బంగారు నగల వ్యవహారం చర్చనీయాంశమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ఏఎంఆర్ గ్రూప్స్ అధినేత మహేశ్వరెడ్డి ఈనెల 8న రూ.కోట్ల విలువైన ప్రభావళి, గద, చక్రం, తదితర ఆభరణాలను విరాళంగా సమర్పించారు. ఇవన్నీ 1,400 గ్రాముల బంగారంతో చేసినవని, రూ.2.50 కోట్ల విలువని దాత తెలిపారు. దేవాదాయ అధికారులు ఆ నగల నాణ్యతను పరిశీలించగా 250 గ్రాములు మాత్రమే బంగారం ఉందని నిర్ధారించడం చర్చనీయాంశమైంది. అన్నింటినీ రాగితో తయారు చేసి బంగారు పూత పూశారని ఆలయ పెద్దలు చెప్పడంతో వివాదం మొదలైంది. ఇంత వ్యత్యాసం ఎలా సాధ్యమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరీక్షలకు సమయం పడుతుంది: కలెక్టర్ ఈ నేపథ్యంలో కొప్పళ జిల్లా కలెక్టరు సురేశ్ హిట్నాల్ ఈ వివాదంపై మంగళవారం సాయంత్రం తమ కార్యాలయంలో మాట్లాడారు. ‘మహేశ్వరరెడ్డి 1,400 గ్రాముల బంగారం సమర్పించినట్లు రికార్డుల్లో ఉంది. అది పూర్తిగా నిర్ధారణ జరిగే వరకు నకిలీనా, అసలా అనేది తేల్చలేం. లేజర్ టెక్నాలజీతో పరిశీలన చేయిస్తాం. ఆయన అన్ని రకాల రికార్డులు సమర్పించారు, 50 ఏళ్ల వారంటీ కూడా ఇచ్చారన్నారు. ఏదైనా పొరపాటు జరిగి ఉంటే బంగారు ఆభరణాలు తయారు చేసిన వారే బాధ్యులని వారి దృష్టికి తీసుకెళతామన్నారు. బెంగళూరు లేదా హరియాణా నుంచి నిపుణులైన బంగారు పనివాళ్లను పిలిపించి తనిఖీలు చేయిస్తాం. హొసపేటెకు చెందిన నాగరాజు ఆచారి అనే నిపుణుడు పరిశీలించి ఒక కేజీ బంగారం ఉండవచ్చన్నారు. హట్టి గోల్డ్‌మైన్స్ అధికారులను కూడా సంప్రదించాం. కానీ నిర్ధారణకు తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవన్నారు. బీఎస్ఐ హాల్‌మార్క్ సంస్థను సంప్రదించగా, బంగారాన్ని ఇప్పటికే రాగితో కలిపి ఆభరణాలు తయారు చేసినందున అందులో కచితమైన బంగారం ఎంతుందో చెప్పడం కష్టమన్నారు. పూర్తిగా తేల్చేందుకు మరింత సమయం పడుతుంది’ అని తెలిపారు. అంజనాద్రి హనుమంతునికి.. విరాళమిచ్చిన ఆభరణాలపై వివాదం పరిశీలన చేస్తున్నాం: కలెక్టరు -
అమ్మ జ్ఞాపకాలను మరువలేక..
తుమకూరు, పావగడ: ఆయనకు తల్లి అంటే ఎంతో ప్రేమ. ఆమె మృతిని తట్టుకోలేక మానసిక క్షోభకు గురై అతడు కూడా ఆత్మహత్య కు పాల్పడిన విషాద ఘటన తుమకూరులో జరిగింది. వివరాలు.. పావగడ పీడబ్ల్యూడీ కార్యాలయంలో ఏఈ గా విధులు నిర్వహిస్తున్న మంజు ప్రసాద్ (32) తల్లి ఏడాది క్రితం చనిపోయింది. అప్పట్నుంచి తల్లి మరణాన్ని తట్టుకోలేక లోలోపలే కుంగిపోయేవాడు. దీంతో మానసిక రుగ్మతకు గురై ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఉండేవాడు. సోమవారం ఉదయం ఆఫీసుకు వెళ్తానని ఇంటి నుంచి వెళ్ళిన మంజుప్రసాద్ కొరటగెరెలోని తన బంధువులకు మొబైల్ ఫోన్, ఇంటి తాళాలు అప్పగించాడు. నేరుగా తుమకూరు లోని ప్రఖ్యాత పర్యాటక కేంద్రం దేవరాయన దుర్గ కొండ పైకి వెళ్ళాడు. కొండపై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు రాత్రికి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. సుమారు 200 అడుగుల కిందన ఆయన మృతదేహం లభ్యమైంది. క్యాత్సంద్ర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. మంజు ప్రసాద్ ఆత్మహత్య పట్ల సహ ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. కొండపై నుంచి దూకి ప్రభుత్వ ఇంజనీరు ఆత్మహత్య తుమకూరు జిల్లాలో విషాద సంఘటన -
ప్రతిభా పాటవాలతో జ్ఞాన సముపార్జన
రాయచూరు రూరల్: విద్యార్థుల జ్ఞాన సముపార్జనకు ప్రతిభా పాటవాలు అవసరమని సింధనూరు శాసన సభ్యుడు హంపనగౌడ బాదర్లి అభిప్రాయ పడ్డారు. సోమవారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో అంజుమన్ ఈ సంస్థలో ప్రతిభాన్విత విద్యార్థులను సత్కరించి విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. నేటి పోటీ తత్వ యుగంలో చదువుకు ఇస్తున్న ప్రాధాన్యతను అర్థం చేసుకుని జ్ఞానంతో విద్యాభ్యాసం సాధించాలని పోతే జీవితాలకు అపాయం కలుగుతుందన్నారు. పిల్లల సర్వతోముఖాభివృద్ధికి ప్రాధాన్యత ఉందన్నారు. పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభలను వెలికి తీయడానికి ఇలాంటి వేదికలు అవసరమన్నారు. కార్యక్రమంలో ఏపీఎంసీ అధ్యక్షుడు మల్లికార్జున గౌడ, సంస్థ సంచాలకులు హ్యారిస్ సిద్దికి, రజాక్ ఉస్తాద్, అబ్దుల్ ఖరీం, అస్లాం పాషా, లతీఫ్, తారీఖ్ హుసేన్, అమినుల్ హసన్, మహిబూబ్, బందే నవాజ్, జుబేర తదితరులు పాల్గొన్నారు. -
అవాంఛిత పిల్లలను అనాథల్ని చేయొద్దు
హొసపేటె: పిల్లలు ఈ దేశపు ఆస్తి. అనాథ లేదా అవాంఛిత పిల్లలను ఎక్కడపడితే అక్కడ వదిలి వేయకుండా వారిని ఒక ప్రత్యేక ప్రభుత్వ దత్తత సంస్థకు అప్పగించి, వారి భవిష్యత్తును సురక్షితం చేయడంలో సహాయపడాలని జిల్లాధికారిణి కవిత ఎస్.మన్నికేరి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం నగరంలోని ప్రత్యేక దత్తత సంస్థను సందర్శించి, తనిఖీ చేసి, ఇద్దరు పిల్లల దత్తత ఉత్తర్వు జారీ చేసిన అనంతరం మాట్లాడారు. 2024 అక్టోబర్‌లో జిల్లాలో ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పటి వరకు 7 మంది పిల్లలను చట్టబద్ధంగా దత్తత తీసుకుని వారి జీవితాలను ప్రకాశవంతం చేసిందన్నారు. జైలు మార్గదర్శకాల ప్రకారం మండ్య, హొన్నావరలకు చెందిన దంపతులకు ఇద్దరు పిల్లలను దత్తతకు అప్పగించి, ఆ సంస్థలోనే పిల్లల సంరక్షణ, పెంపకాన్ని సక్రమంగా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. వదిలి వేసిన లేదా అనాథ పిల్లలు కనపడితే మహిళా శిశు అభివృద్ధి శాఖ పరిధిలోని జిల్లా బాలల సంరక్షణ విభాగాన్ని వెంటనే సంప్రదించి తెలియజేయాలన్నారు. ఆ పిల్లలను చట్టబద్ధంగా దత్తత తీసుకుని వారికి ఒక అందమైన జీవితాన్ని ఇవ్వండి అని ఆమె సూచించారు. జిల్లా బాలల సంరక్షణ అధికారి సుదీప్ కుమార్ ఉంకి, జిల్లా బాలల సంరక్షణ విభాగం, దత్తత కేంద్రం సిబ్బంది, తల్లిదండ్రులు హాజరయ్యారు. వారిని ఏదైనా దత్తత సంస్థకు అప్పగించండి విజయనగర జిల్లా మేజిస్ట్రేట్ కవిత ఎస్ మన్నికేరి విజ్ఞప్తి -
కన్ను పడితే.. బైక్ గల్లంతే
హొసపేటె: కొప్పళ, దావణగెరె తదితర జిల్లాల్లో పదికి పైగా బైక్‌లను దొంగలించిన దొంగ ఎట్టకేలకు పోలీసు వలలో చిక్కాడు. తాను దొంగలించిన బైక్‌పై ప్రయాణిస్తుండగా అతడు ఒక రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదం ద్వారా ఆ దొంగ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన సంఘటన కొప్పళ జిల్లా గంగావతి నగరంలో వెలుగులోకి వచ్చింది. పూర్వాపరాలు.. నగరంలోని ఆనెగుంది రోడ్డులోని శ్రీరాములు కళాశాల సమీపంలో ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం అతడిని వెంటనే ఆస్పత్రిలో చేర్చారు. ప్రమాదానికి గురైన ఆ బైక్‌ను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత బసాపట్టణ గ్రామానికి చెందిన మల్లప్ప బసప్ప అనే వ్యక్తి పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఆ బైక్ తనదేనని, అది చోరీకి గురైందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బైక్‌కు సంబంధించిన పత్రాలన్నింటిని అతడు పోలీసులకు సమర్పించాడు. బైక్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గంగావతిలోని సాయినగర్‌కు చెందిన, వృత్తి రీత్యా డ్రైవర్ అయిన ప్రకాష్ తళవారను పోలీసులు క్షుణ్ణంగా విచారించగా దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. గంగావతి, దావణగెరె, హొసపేటెలతో సహా వివిధ ప్రాంతాల నుంచి తాను మొత్తం పది బైక్‌లను దొంగిలించినట్లు ప్రకాష్ విచారణలో అంగీకరించాడు. గత ఏడాదిన్నర కాలంలో పది బైక్‌ల చోరీ దొంగతనాలకు పాల్పడిన ఘరానా దొంగ చివరకు రోడ్డు ప్రమాదంతో పోలీసులకు పట్టుబడిన వైనం -
ఆర్టీసీ బస్సు బోల్తా.. ఐదుగురి మృతి
బీదర్: తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీదర్‌లో కర్ణాటక ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. బైక్‌ను ఢీకొట్టిన బస్సు.. పల్టీలు కొట్టింది. ఈ ఘటనలోఐదుగురు ప్రయాణికులు మృతిచెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.. వారిని బీదర్ ఆసుపత్రికి తరలించారు. -
సుప్రీం ఆదేశంతో ఎన్నికల ఫలితం రివర్స్!
నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలపై పశ్చిమ బెంగాల్లో రభస కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలో మే 11 అంటే సోమవారం సుప్రీంకోర్టులోనూ ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. కర్ణాటకలోని శృంగేరి అసెంబ్లీ స్థానాన్ని అధికార కాంగ్రెస్ పార్టీ మళ్లీ దక్కించుకుంది. తీర్పు ఇస్తున్న సందర్భంగా ‘‘ప్రజాస్వామ్యం హైజాక్ అయ్యేందుకు అనుమతించం’’ అంటూ సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అలాగే ఈ వ్యవహారంలో కర్ణాటక హైకోర్టు తీరును దేశ అత్యున్నత న్యాయస్థానం తప్పు పట్టింది కూడా.. వివరాలు ఇలా ఉన్నాయి..2023లో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అప్పట్లో శృంగేరి అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున టీటీ రాజేగౌడ, బీజేపీ తరఫున జీవరాజ్‌లు పోటీ చేశారు. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల కౌంటింగ్ తరువాత 201 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి టీటీ రాజేగౌడ గెలుపొందినట్టుగా ఎన్నికల అధికారి ప్రకటించారు. అయితే.. జీవరాజ్ ఈ ఫలితాన్ని సవాలు చేశారు. విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు రీకౌంటింగ్‌కు ఆదేశించింది.రిటర్నింగ్ అధికారి 562 ఓట్లను పునః పరిశీలించి బీజేపీ అభ్యర్థి జీవరాజ్ గెలుపొందినట్టుగా ప్రకటించారు. స్టోరీ ఇక్కడితో అయిపోలేదు. విషయం కాస్తా సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. కేసు పూర్వాపరాలను పరిశీలించిన జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌లతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ హైకోర్టు తీరును తప్పుపట్టింది. ఫలితాలను మార్చేసి కాంగ్రెస్ అభ్యర్థే శృంగేరి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించే ఎమ్మెల్యే అని స్పష్టం చేసింది.క్రిమినల్ కేసును విస్మరించారు...హైకోర్టు తీర్పు ఒకలా.. సుప్రీంకోర్టు తీర్పు ఇంకోలా ఉండేందుకు కారణాలు లేకపోలేదు. ఎందుకంటే.. రీకౌంటింగ్ సందర్భంలో జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి హైకోర్టు ఆదేశాలను మించి 562 ఓట్లను రీకౌంట్ చేయడం సమస్యకు కారణంగా మారింది. ఈ నెల రెండు మూడు తేదీల్లో రీకౌంటింగ్ జరగ్గా 279 ఓట్లకు బదులు 562 ఓట్లు రీకౌంట్ చేశారు. ఫలితంగా టీటీ రాజేగౌడకు పడ్డ ఓట్లు 248- 255 వరకూ తగ్గిపోయి జీవరాజ్ ఓట్లు స్వల్పంగా పెరిగాయి. సుమారు 52 - 66 ఓట్ల తేడాతో జీవరాజ్ గెలిచినట్టుగా రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.అంతకు ముందు అంటే 2023 ఎన్నికల కౌంటింగ్ సందర్భంలోనూ తమకు పడ్డ బ్యాలెట్లను ఉద్దేశపూర్వకంగా చెల్లనివిగా చేశారని టీటీ రాజేగౌడ ఆరోపిస్తున్నారు. బ్యాలెట్ కాగితాలపై గీతలు పెట్టి, ఇంకు గుర్తులు పెట్టి చెల్లకుండా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. స్ట్రాంగ్ రూమ్ తలుపుల తాళాలు, సీళ్లు చెదిరిపోయి ఉన్నాయని కూడా గుర్తించారు. కౌంటింగ్‌కు ముందే బ్యాలెట్ బాక్సులు తెరిచి ఉన్న విషయాన్ని కాంగ్రెస్ నేతలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారాలపై అప్పట్లోనే కలెక్టర్ కె.ఎన్.రమేశ్, రిటర్నింగ్ అధికారి వేదమూర్తి, బీజేపీ అభ్యర్థి జీవరాజ్లపై కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ఈ కేసులన్నింటిపై హైకోర్టు స్టే విధించడం గమనార్హం. చివరకు సుప్రీంకోర్టు చొరవతో శృంగేరి అసెంబ్లీ స్థానం కాంగ్రెస్ వశమైంది.పెద్ద ఎత్తున జరిగి ఉంటే...శృంగేరి అసెంబ్లీ స్థానంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రముఖ జర్నలిస్ట్ రవీశ్ కుమార్ స్పందించారు. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారి అక్రమాలకు పాల్పడుతూ కెమెరాకు చిక్కడం, హర్యానా పంచాయితీ ఎన్నికల్లోనూ సుప్రీంకోర్టు ఆదేశాలతో జరిగిన ఈవీఎం రీకౌంటింగ్తో ఫలితాలు తారుమారైన విషయాన్ని, బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియపే ప్రస్తావిస్తూ.... కర్ణాటక మాదిరిగానే దేశంలోని ఇతర నియోజకవర్గాల్లోనూ రిటర్నింగ్ అధికారులు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడి ఉంటే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో 2024 సాధారణ ఎన్నికల విషయంలోనూ సుప్రీంకోర్టు సమీక్ష జరపాలని కోరారు. రిటర్నింగ్ అధికారులు తప్పు చేసి ఉంటే న్యాయస్థానం ఎలాంటి శిక్ష విధిస్తుందని ప్రశ్నించారు. ఎన్నికల అక్రమాల విషయంలో హెచ్చరించడం, లేదా ఖండించడం శిక్ష కిందకు రాదని వ్యాఖ్యానించారు.:::గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
ఇంటి అద్దె రూ.56 వేలు.. ఖర్చు రూ.1.3 లక్షలు
బనశంకరి: బెంగళూరు జీవన వ్యయం పెరిగింది. ఇక్కడ ఇంటి అద్దె, ఖర్చులు ఆకాశానికి అంటుతున్నాయి. ప్రతి నెలా ఇంటి అద్దె రూ.56 వేలు, రూ.1.3 లక్షలకు పైగా ఇతర ఖర్చులకు వ్యయం చేయాల్సి వస్తోందని ఇన్‌స్ట్రాగాంలో దంపతులు తమగోడు వెల్లబోసుకున్న వీడియో వైరల్‌గా మారింది. దంపతులు ఇద్దరికి మంచి ఉద్యోగం ఉంది. కానీ నెలవారీ ఖర్చులు గురించి ఆందోళన వ్యక్తం చేశారు. విలాసవంతంగా జీవించడం సాధ్యం కాదని.. సాధారణ ఖర్చులు బెంగళూరులో భారీగా పెరిగాయని చెబుతున్నారు. నిత్యావసరాలు, ఇంటి సామాగ్రి, ఇంటర్నెట్, విద్యుత్, షాపింగ్, బయట ఆహారం తినడం, ప్రయాణం, ఆన్లైన్ చందాలతో పాటు ఖర్చు ఇంకా పెరిగిందన్నారు. కంపెనీ పని ఒత్తిడితో ఇంట్లో పని మనుషులను పెట్టుకుంటే ఈ ఖర్చులన్నీ కలిపి నెలకు రూ.1.3 లక్షలు అవుతున్నాయని తెలిపారు. బెంగళూరులో కొన్ని ప్రాంతాల్లో ఇంటి అద్దెలు అధికంగా ఉండగా.. కొన్ని చోట్ల పరిమితంగా ఉన్నాయి. అయితే ఇటీవల సంవత్సరాల్లో బెంగళూరులో జీవించడం కష్టంగా ఉందని నెటిజన్ ఒకరు కామెంట్ పెట్టారు. View this post on Instagram A post shared by Radhika and Ekansh (@radhi.and.ekansh) -
రమణీయంగా కరగ
కోలారు: నగర సమీపంలోని టమకలో రేణుకా యల్లమ్మ దేవి పూల కరగ ఉత్సవం ఆదివారం రాత్రి కన్నుల పండుగగా జరిగింది. పూజారి కరగనెత్తుకుని రేణుకా యల్లమ్మ దేవాలయం ముందు మంగళ వాయిద్యాలకు నృత్యమాడారు. గ్రామంలోని అన్ని వీధుల గుండా కరగ సాగింది. కేంద్ర మంత్రులకూ మోదీ ఆ మాట చెప్పాలి ● డీసీఎం శివకుమార్ విసుర్లు దొడ్డబళ్లాపురం: పెట్రోల్, డీజిల్‌ను తక్కువ వాడాలని, బంగారం కొనవద్దని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు చెప్పే ముందు కేంద్రమంత్రులకు, అధికారులకు అదే మాట చెప్పాలని డీసీఎం డీకే శివకుమార్ విమర్శించారు. సోమవారం బెంగళూరులో మీడియాతో మాట్లాడిన ఆయన మంత్రులు, ప్రభుత్వఽ అధికారులు కూడా కార్లలో కాకుండా బస్సుల్లో, మెట్రో రైళ్లలో తిరగాలని ఆదేశాలివ్వాలన్నారు. మోదీ బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయని ప్రజలకు చెప్పడం లేదని, కేవలం పెట్రోల్,డీజిల్ తక్కువ వాడాలని చెబుతున్నారని అన్నారు. ప్రధాని సలహాలు ఇచ్చే ముందు కేంద్రంలో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులతో ఈ పని చేయించి నాంది పలకాలన్నారు. దేశంలో శుభ కార్యాలకు బంగారం కొనడం అనాదిగా వస్తున్న ఆచారమని, ప్రజలను కొనవద్దని చెప్పడం సమంజసమా? అని ప్రశ్నించారు. 13న బెంగళూరువాసులకు బహుమతి బెంగళూరు వాసులకు మే 13న పెద్ద గిఫ్ట్ ఇస్తున్నట్టు డీసీఎం తెలిపారు. దానిపై సుర్జేవాలాతో రాజకీయ అంశాలపై చర్చించామని, ఇప్పుడు అధికారులను పిలిచి సూచనలు ఇచ్చానన్నారు. పెద్ద బహుమతిని గ్యారంటీగా ఇస్తానని, అదేమిటనేది ఆ రోజే చెబుతానన్నారు.యువకున్ని బలిగొన్న గంజాయి కేసు మైసూరు: మైసూరులోని రామకృష్ణ నగరలో ఓ యువకుడు తనపై గంజాయి సేవనం కేసు పెట్టారని ఆత్మహత్య చేసుకున్నాడు. 4వ మెయిన్ నివాసి అయిన ఎం. మధు (22), వృత్తి రీత్యా వడ్రంగి, 6వ తేదీ రాత్రి 9 గంటలకు ఓ చెట్టు వద్ద గంజాయి సిగరెట్‌ను సేవిస్తూ ఉండగా కువెంపునగర పోలీసులు పట్టుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసు భయంతో సతమతమైన అతడు ఆదివారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకున్నాడు, కుటుంబ సభ్యులు చూసి వెంటనే ఆసుపత్రికి తరలించగా మరణించాడని వైద్యులు ప్రకటించారు. పోలీసులు స్పందిస్తూ, గంజాయి వాడినందుకు అతనిపై కేసు నమోదు చేశాం, అతను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం తెలియరాలేదు. అతని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో అసహజ మరణంగా కేసు నమోదు చేశామని తెలిపారు. చిరుత బాధిత కుటుంబానికి పరిహారం మైసూరు: చామరాజనగర జిల్లా, హనూరు తాలూకాలోని నాగమలేలో చిరుతపులి దాడిలో మరణించిన బాలుడు హర్షిత్ (10) కుటుంబానికి ప్రభుత్వం రూ. 20 లక్షల పరిహారం ప్రకటించింది. ఆదివారం మలే మహదేశ్వర కొండ నుంచి నాగమలేకు భక్తులు వెళ్తుండగా చిరుత దాడి చేసి బాలున్ని లాక్కెళ్లి చంపివేసింది. అటవీ శాఖ బాలుని కుటుంబానికి రూ. 20 లక్షల పరిహారం ప్రకటించి, ఇప్పటికే రూ. 5 లక్షల చెక్కును అందజేసింది. మిగిలిన సొమ్మును కుటుంబ బ్యాంకు ఖాతాకు జమచేస్తారు. -
అగ్నిప్రమాదంలో ప్లాస్టిక్ ఫ్యాక్టరీ బుగ్గి
హుబ్లీ: బెళగావి తాలూకా వనగ గ్రామంలోని పారిశ్రామికవాడలో ఆదివారం అర్ధరాత్రి దాటాక ఘోర అగ్నిప్రమాదం వాటిల్లింది. ఇక్కడి డాంగే ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో ఆకస్మికంగా మంటలు చెలరేగగా ఘటనలో రూ.లక్షలాది విలువ చేసే ప్లాస్టిక్ వస్తువులు, యంత్ర పరికరాలు దగ్ధమయ్యాయి. అర్ధరాత్రి ఉన్నఫళంగా మంటలు చెలరేగగా, ప్లాస్టిక్ వస్తువులు భారీగా ఉండటంతో కొద్ది సేపటిలోనే ఫ్యాక్టరీ అంతా మంటలు వ్యాపించాయి. ఘటన సమాచారం అందుకున్న వెంటనే స్థలానికి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది ఎంతో శ్రమించి మంటలను అర్పారు. సమయ స్పూర్తితో నడుచుకున్నందు వల్ల అగ్నిజ్వాలలు పక్కన ఉన్న ఫ్యాక్టరీలకు తగలక పోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రాథమిక అంచనా ప్రకారం షార్ట్‌సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఫ్యాక్టరీలోని విలువైన ప్లాస్టిక్ ముడివస్తువులు, అలాగే తయారు చేసిన ప్లాస్టిక్ ఉత్పత్తులు అగ్నికి ఆహుతయ్యాయి. అదృష్టం కొద్ది ఘటనలో ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. కాకతి పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్నిప్రమాదం జరగడంతో ఘటన స్థలాన్ని సంబంధిత పోలీసులు పరిశీలించి నివేదిక సిద్ధ చేస్తున్నట్లు తెలిసింది. -
ఇద్దర్ని బలిగొన్న చెరువు
● మండ్య జిల్లాలో విషాదం మండ్య: మండ్య జిల్లాలోని నాగమంగళ తాలూకాలోని హెరగనహళ్లి గ్రామంలో కోడి చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు బాలురు మునిగిపోయారు. సత్యప్రకాష్ (17), యశస్ (17), స్నేహితులు కాగా, ఇటీవలే టెన్త్ పాసై, ఇంటర్లో చేరబోతున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు చెరువులో ఈతకు వెళ్లి మునిగిపోయారు. రాత్రయినా ఇళ్లకు రాకపోవడంతో తల్లిదండ్రులు భయపడి స్నేహితులు, బంధువుల ఇళ్లలో విచారించగా రాలేదని తెలిపారు. ఈతకు చెరువుకు వెళ్లినట్లు తెలిసి అక్కడకు చేరగా, బైక్, బట్టలు, చెప్పులు కనిపించాయి. సోమవారం తెల్లవారుజాము నుంచి పోలీసులు, ఫైర్‌సిబ్బంది, గ్రామస్తులు గాలించగా, బాలలు విగతజీవులుగా బయటపడ్డారు. మంత్రి ఎన్. చలువరాయస్వామి ఆసుపత్రిలో బాలల మృతదేహాలపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రధాని రక్షణపై సర్కారు నిర్లక్ష్యం: శోభ బనశంకరి: కర్ణాటక ప్రభుత్వానికి ప్రధాని రక్షణ పట్ల ప్రేమ ఉందా? అని కేంద్రమంత్రి శోభా కరంద్లాజే ప్రశ్నించారు. సోమవారం బెంగళూరులో ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రధాని ఆదివారం వస్తున్నారని తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం 100 మందికి పైగా ఇన్స్పెక్టర్లు, పోలీస్ అధికారులను ఎందుకు బదిలీ చేసింది, దీని వల్ల పోలీసుల్లో గందరగోళం ఏర్పడి ఉంటుందన్నారు. ఇలాంటి అత్యవసర సమయంలో బదిలీలు ఎందుకో తెలియదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనికి సమాధానం ఇవ్వాలని, ప్రధాని ప్రయాణించే దారిలో భద్రతను ఎందుకు పెంచలేదని అన్నారు. షెడ్డులో మంటలు.. చిన్నారుల సజీవ దహనం బనశంకరి: బెంగళూరులో కొత్తనూరు సమీపంలోని నారాయపురలో షెడ్లో నిప్పు అంటుకుని ఇద్దరు చిన్నారులు సజీవ దహనమయ్యారు. వివరాలు.. రాయచూరుకు చెందిన వలస కూలీ కుటుంబం షెడ్డులో జీవిస్తోంది. వారి పిల్లలు అర్జున్ (5), ఆశా (3). సోమవారం ఉదయం తల్లిదండ్రులు పనులకు వెళ్లగా ఇంటి వద్ద అవ్వతో కలిసి బాలలు ఉన్నారు. మధ్యాహ్నం 1:30 సమయంలో అవ్వ షెడ్లో నుంచి బయటకు వెళ్లిన సమయంలో మంటలు లేచాయి. పిల్లలిద్దరూ బయటకు వెళ్లకుండా షెడ్లోనే దాక్కున్నారు. చివరకు మంటల్లో చిక్కి మృత్యువాత పడ్డారు. కొత్తనూరు పోలీసులు పరిశీలించి కేసు విచారణ చేపట్టారు. పిల్లలు లేరని తెలిసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. శృంగేరి రీకౌంటింగ్‌పై సుప్రీం స్టే ● రాజేగౌడ కొనసాగింపు యశవంతపుర: చిక్కమగళూరు జిల్లా శృంగేరి అసెంబ్లీ క్షేత్రం పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో గెలిచిన బీజేపీ అభ్యర్థి జీవరాజ్ వ్యవహారం మలుపులు తిరుగుతూనే ఉంది. ఈ ఓటింగ్‌లో ఓడిపోయిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే రాజేగౌడ సుప్రీంకోర్టులో అర్జీ వేయగా, విచారించిన ధర్మాసనం అక్కడ యథాస్థితిని కాపాడాలంటూ ఆదేశించింది. ఫలితాలపై స్టే ఇవ్వలేమన్న హైకోర్టు అదేశాలను రాజేగౌడ సుప్రీంలో సవాల్ చేశారు. గత ఎన్నికల ఓట్లు, తాజాగా బ్యాలెట్ ఓట్ల లెక్కింపు సమాచారం, జిల్లాధికారి గౌరవ్‌శెట్టి నిర్ణయాలు తదితరాలను ధర్మాసనం ముందు సమర్పించారు. పరిశీలించిన ఇద్దరు న్యాయమూర్తులు.. రీకౌంటింగ్ తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. పోస్టల్ ఓట్ల లెక్కింపు సమాచారాన్ని సీల్డ్ కవర్లో అందించాలని ఎన్నికల కమిషన్‌కు నోటీసులిచ్చారు. రీకౌంటింగ్ ఫలితాన్ని నిలుపుదల చేయాలని ఆదేశించడంతో రాజేగౌడకు ఊరట దక్కినట్లయింది. ఆయనే ఎమ్మెల్యేగా కొనసాగుతారు. మోదీ బాగా చెప్పారు: దేవేగౌడ బనశంకరి: బంగారం కొనొద్దు, ఇంధనాలను పొదుపుగా వాడుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సూచనలను మనందరం స్వాగతించాలని జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవేగౌడ తెలిపారు. సోమవారం బెంగళూరులో మాట్లాడిన ఆయన అంతర్జాతీయ సంఘర్షణతో దుష్పరిణామాలు ఏర్పడ్డాయి, ఈ సందర్భంలో నరేంద్ర మోదీ చెప్పిన మంచి సలహాలను స్వాగతించాలన్నారు. -
పర్మినెంట్ చేయాలని ఆశాల ధర్నా
రాయచూరు రూరల్: జాతీయ ఆరోగ్య మిషన్ పథకం కింద విధులు నిర్వహిస్తున్న ఆశా కార్యకర్తలను పర్మినెంట్ చేయాలని రాష్ట్ర ఆశా కార్యకర్తల సంఘం డిమాండ్ చేసింది. సోమవారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు మహేష్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవ వేతన బకాయిలను చెల్లించాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 60:40 శాతం పద్ధతిలో వేతనాలు పెంచి ఆదుకోవాలన్నారు. గత నాలుగు నెలల నుంచి గౌరవ వేతనాల్లో ఇచ్చే పారితోషికంలో కోత విధించడాన్ని తప్పుబట్టారు. న్యాయసమ్మతంగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఈఓకు వినతిపత్రం సమర్పించారు. -
హంపీలో అక్రమ హోం స్టేలకు తాళం
హొసపేటె: ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక కేంద్రం హంపీ చుట్టు పక్కల ఉన్న కమలాపుర ప్రాంతంలో అక్రమంగా వెలిసిన హోంస్టేలు, రెస్టారెంట్లపై పోలీస్ శాఖ, జిల్లా యంత్రాంగం సోమవారం ఉక్కుపాదం మోపాయి. అధికారులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. గత కొద్ది రోజులుగా హంపీ ప్రాంతంలో వందలాది హోంస్టేలు, రెస్టారెంట్లు ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా నడుస్తున్నాయని వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ దాడులు నిర్వహించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం హంపీ, కమలాపుర ప్రాంతాల్లోని రెస్టారెంట్లు, హోంస్టేలు పర్యాటకులకు సేవలు అందించడానికి అవసరమైన అధికారిక అనుమతులు లేకుండానే నడుస్తున్నట్లు తెలిసింది. సంయుక్త ఆపరేషన్‌లో జిల్లా ఎస్పీ జాహ్నవి, తహసీల్దార్ శృతి, పర్యాటక శాఖ సీనియర్ అధికారుల బృందం పాల్గొన్నారు. -
గజరాజు వచ్చె.. ఘాట్ రోడ్డు బంద్
యశవంతపుర: రాష్ట్రంలో తరచూ ఎక్కడో ఓ చోట ఏనుగులు వీరంగం సృష్టిస్తున్నాయి. రైతులు, కూలీలపై ప్రతాపం చూపిస్తూ ఉంటాయి. చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా చార్మాడీఘాట్ రోడ్డులో ఆదివారం ఒంటరి ఏనుగు హల్చల్ చేయడంతో వాహనదారులు అందోళనకు గురయ్యారు. ఈ ఘాట్‌లో దక్షిణ కన్నడ, చిక్కమగళూరుల మధ్య వేల సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. వీకెండ్ కావడంతో వాహన రద్దీ ఎక్కువగా ఉంది. ఘాట్ మార్గం 10 మలుపు వద్ద భారీ అడవి ఏనుగు నిలబడింది. దీంతో గంటలకొద్దీ కారు, బస్సు, బైకిస్టులు ఎక్కడివారక్కడే నిలిచిపోయారు. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మలెనాడు భాగంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఏనుగులు కనిపించటం సహజం, అయితే ఇప్పుడు ఘాట్‌రోడ్డులోకి కూడా రావడంతో ప్రయాణికులు హడలిపోయారు. కొందరు ఏనుగును మొబైల్ ఫోన్లో వీడియోలు తీయసాగారు. రెండు వైపులా వాహనాలు కిలోమీటర్ కొద్దీ నిలిచి పోయ్యాయి. ఏనుగుకు దగ్గరగా వెళ్లరాదని అటవీ సిబ్బంది ప్రయాణికులకు సూచించారు. రెండు గంటల తరువాత ఏనుగు నెమ్మదిగా అడవిలోకి వెళ్లడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చార్మాడి రూట్లో గందరగోళం -
నైతిక విలువలు అలవర్చుకోండి
కోలారు: విద్యార్థులు విద్యతో పాటు తమ జీవితంలో నైతిక విలువలు అలవర్చుకోవాలని డీఐజీ డి.దేవరాజ్ పిలుపునిచ్చారు. సోమవారం బంగారుపేట పట్టణంలోని ఎస్డీసీ విద్యా సంస్థలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ద్వితీయ ఇంటర్లో అత్యుత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులు అయిన 465 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిగ్రీ పట్టాతో ఉన్నత ఉద్యోగం సాధించవచ్చన్నారు. అయితే దానితో పాటు విద్యార్థులు ఉత్తమ విలువలు అలవర్చుకోవాలన్నారు. దుర అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. పోలీస్ శాఖ విద్యా సంస్థల వ్యాప్తిలో మాదక ద్రవ్యాల విక్రయించడాన్ని అరికట్టడానికి ప్రయత్నిస్తోందన్నారు. సమాజాన్ని మాదక ద్రవ్య రహితంగా చేయడానికి అందరు చేతులు జోడించాలన్నారుు. బంగారు పేట కన్నడ సంఘం అధ్యక్షుడు పల్లవి మణి, ఎస్డీసీ సమూహ విద్యా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
విద్యా శాఖలో మార్పులు తెస్తా
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లాలో విద్యా శాఖలో మార్పులు తెస్తామని డీడీపీఐ మల్లికార్జున పేర్కొన్నారు. సోమవారం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం పాత్రికేయులతో మాట్లాడారు. బడిగేర్ను గదగ్‌కు బదిలీ చేయడంతో రాయచూరు డయట్ సీనియర్ అధ్యాపకుడిగా, దేవదుర్గ తాలూకా విద్యా శాఖాధికారి(బీఈఓ)గా పని చేస్తున్న తనకు జిల్లా స్థాయి బాధ్యతలు అప్పగించారన్నారు. పదో తరగతి ఫలితాల్లో జిల్లాను ఈ ఏడాది 15వ స్థానంలో నిలపడానికి ప్రయత్నిస్తామన్నారు. ఉపాధ్యాయులు, సంఘం కార్యవర్గ సభ్యులు, ఉద్యోగులు, సిబ్బంది సహకారంతో విధులు నిర్వహిస్తామన్నారు. చెరువు స్నానం.. తీసింది ప్రాణం●స్నానానికి వెళ్లి యువకుడు మృత్యువాత హొసపేటె: కొప్పళ జిల్లా కుష్టిగి తాలూకాలోని వనగేరి వద్ద చెరువులో స్నానానికి వెళ్లిన ఓ యువకుడు మృత్యువాత పడిన ఘటన జరిగింది. ఆ తాలూకాలోని బోదూరు గ్రామానికి చెందిన హనుమంత(17) అనే యువకుడు తోటి యువకులతో కలిసి స్నానానికి వెళ్లాడు. అయితే నీటిలోకి దూకిన హనుమంత తిరిగి పైకి రాలేదు. ఈ విషయాన్ని గ్రామస్తులు పోలీసులకు తెలియజేశారు. ఘటన స్థలానికి చేరుకున్న గ్రామస్తులు, అగ్నిమాపక సిబ్బంది గాలించి, మృతదేహాన్ని వెలికి తీశారు. విద్యార్థిని మృతిపై విచారణకు వినతిరాయచూరు రూరల్: జిల్లాలోని సింధనూరులో ఇటీవల ప్రైవేట్ కళాశాల నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో జీపును వెనుకకు మళ్లిస్తుండగా అదుపు తప్పి ఢీకొనడంతో భూమిక(17) అనే విద్యార్థిని దుర్మరణం చెందడంపై విచారణ జరపాలని సీపీఐ(ఎంఎల్) డిమాండ్ చేసింది. సోమవారం సింధనూరులోని తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు పూజార్ మాట్లాడారు. విద్యార్థిని కుటుంబానికి రూ.25 లక్షలు పరిహారం అందించాలని ఒత్తిడి చేస్తూ తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రియుడితో పెళ్లికి నిరాకరణ.. యువతి ఆత్మహత్యహుబ్లీ: ప్రియుడితో పెళ్లికి నిరాకరించిన కుటుంబ సభ్యుల తీరుతో మనోవేదనకు గురై ఓ యువతి విషం తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ధార్వాడ జిల్లాలోని కుందగోళ తాలూకా యరగుప్పి గ్రామంలో జరిగింది. శ్వేత(18) ఆత్మహత్య చేసుకున్న యువతి. మృతురాలు శ్వేత కొన్నేళ నుంచి హుబ్లీ తాలూకా కిరేసూర గ్రామానికి చెందిన నాగరాజ్‌ను ప్రేమిస్తుండేది. ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలిపి నాగరాజ్‌ను పెళ్లి చేసుకుంటానని చెప్పింది. దీనికి కుటుంబ సభ్యులు ఒప్పుకోక పోవడంతో జీవితం విరక్తి చెందిన ఆమె విషం తాగింది. ఘటనపై కుందగోళ పోలీసులు కేసు నమోదు చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాలికలకు టీకా అభియాన్ బళ్లారిటౌన్: జిల్లాలో 14 ఏళ్ల వయస్సులోపు బాలికలకు క్యాన్సర్ నియంత్రణ కోసం టీకా అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు డీహెచ్ఓ యల్లా రమేష్ బాబు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ అభియాన్‌ను ప్రవేశ పెట్టామని, దీన్ని సద్వినియోగ పరుచుకోవాలని ఆయన ఓ ప్రకటనలో కోరారు. జిల్లాలో 16,495 మంది బాలికలకు ఈ టీకాలను వేసే లక్ష్యం ఉందన్నారు. ఇంత వరకు 5,658 మంది బాలికలకు టీకాలను వేసినట్లు తెలిపారు. దీనిపై ఎలాంటి దుష్ప్రచారాన్ని నమ్మరాదని కోరారు. -
అంజన్నకు విరాళంలో వివాదం
సాక్షి బళ్లారి: కర్ణాటకలోని కొప్పళ జిల్లా గంగావతి సమీపంలోని అంజనాద్రిలో వెలసిన ఆంజనేయస్వామి ఆలయానికి హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఏఎంఆర్ గ్రూప్ అధినేత మహేశ్వర్‌రెడ్డి సమర్పించిన రూ.2.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు వివాదానికి దారి తీశాయి. రెండు రోజుల క్రితం మహేశ్వర్‌రెడ్డి స్వామివారికి గద, కిరీటం తదితర ఆభరణాలను సమర్పించిన సంగతి విదితమే. అయితే వాటిని జిల్లా యంత్రాంగం పరిశీలించిన తర్వాత వాటిలో కేవలం 28 గ్రాముల బంగారం మాత్రమే ఉందని, తామ్రం, రాగితో తయారు చేసి బంగారు పూతతో ఆభరణాలను సమర్పించారని తేలింది. దీంతో ఈ అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తామ్రంపై బంగారు పూత పూసి ఆభరణాలను తయారు చేసినట్లు తేలడంతో సదరు వ్యక్తికి నోటీసు జారీ చేశారు. ఆభరణాలకు సంబంధించి కచ్చితమైన బిల్లులను ఇవ్వాలని సూచించారు. అయితే ఈ బంగారు ఆభరణాలకు సంబంధించిన బిల్లులు ఇవ్వకపోవడంతో చర్చ నడుస్తోంది. ఏదేమైనా ఈ ఆభరణాలు తయారు చేసిన వారు ఇలా తామ్రంతో చేసి పైన బంగారు పూత పూశారా? అన్నది సమగ్ర దర్యాప్తులో తేలాల్సి ఉంది. అది నకిలీ బంగారమని తేల్చిన జిల్లా యంత్రాంగం చర్చనీయాంశంగా గోల్డ్ ప్లేటెడ్ ఆభరణాల సమర్పణ -
మంత్రి సుధాకర్‌కు కన్నీటి వీడ్కోలు
సాక్షి, బళ్లారి: రాష్ట్ర ప్రణాళిక, గణాంక మంత్రి డి.సుధాకర్‌కు కుటుంబీకులు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. అనారోగ్యంతో బాధపడుతూ బెంగళూరులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో ఆదివారం తెల్లవారుజామున మరణించడం తెలిసిందే. భౌతికకాయాన్ని చిత్రదుర్గం జిల్లా హిరియూరుకు తీసుకొచ్చి ప్రజల సందర్శనార్థం ఉంచారు. తరువాత చెళ్లకెరెకు తీసుకువచ్చి స్టేడియంలో కొంత సేపు ఉంచి, నివాసానికి తరలించారు. తమ నేతను కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, ప్రజలు తరలివచ్చారు. అక్కడి నుంచి పార్థివ దేహాన్ని ప్రత్యేక వాహనంలో ఊరేగింపుగా తీసుకెళ్లి పావగడ రోడ్డులోని ఆర్యవైశ్య ముక్తిధామలో జైన సంప్రదాయం ప్రకారం, ప్రభుత్వ లాంఛనాలతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. కుమారుడు సుహాస్ చేతుల మీదుగా అంతిమ సంస్కారాలను పూర్తి చేశారు. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, స్పీకర్ ఖాదర్, పలువురు కాంగ్రెస్ ప్రముఖులు, మంత్రులు పాల్గొని తుది నివాళులు అర్పించారు. పార్థివ దేహంపై కప్పిన జాతీయ జెండాను సీఎం, డీసీఎంలు ఆయన సతీమణి హర్షిణి కి అందజేశారు. సుధాకర్‌ను డీకే శివకుమార్ గుర్తు చేసుకొని ఆవేదనకు గురయ్యారు. ఆయనను బతికించుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేశామని చెప్పారు.మంత్రి డి.సుధాకర్ (ఫైల్) చెళ్లకెరెలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు హాజరైన సీఎం, డీసీఎం, మంత్రులు -
ఇళ్లలో చోరీలు.. ఇద్దరి అరెస్టు
హొసపేటె: తాళాలు వేసి ఉన్న ఇళ్లలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను సోమవారం విజయనగర జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా పోలీస్ కేంద్రం సభాంగణంలో ఎస్పీ జాహ్నవి విలేకరుల సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు. కొన్ని నెలలుగా హగరిబొమ్మనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి రాత్రిపూట తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలు కుమారనహళ్లి, జహంగీర్ బాషాలను అరెస్ట్ చేశామన్నారు. పలు ఇళ్లలో చోరీలకు పాల్పడి బంగారు, వెండి ఆభరణాలు దోచుకెళ్లారన్నారు. దొంగలించిన సొత్తును అమ్ముకుని వచ్చిన డబ్బులను పంచుకుని జల్సాలు చేసేవారన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దొంగలను పట్టుకున్నారన్నారు. నిందితులు హగరిబొమ్మనహళ్లి, తంబ్రళ్లి, మరియమ్మనహళ్లి ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడ్డారని తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ.12.56 లక్షల విలువైన 96.54 గ్రాముల బంగారు, రూ.1.50 లక్షల విలువైన 750 గ్రాముల వెండి ఆభరణాలను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దొంగలను పట్టుకున్న కూడ్లిగి డీఎస్పీ మల్లేష్ దొడ్డమని, హగరిబొమ్మనహళ్లి ఎస్ఐ వికాస్ పి.లమాణి, మరియమ్మనహళ్లి ఎస్ఐ తారాబాయి, తంబ్రళ్లి ఎస్ఐ నాగరాజ్, సిబ్బందిని ఎస్పీ జాహ్నవి అభినందించి రివార్డులు అందజేశారు. రూ.14 లక్షల ఆభరణాలు స్వాధీనం -
సర్కారు బడికి హైటెక్ హంగులు
మరఖల్లోని ప్రభుత్వ పాఠశాల ప్రవేశద్వారంలో విద్యార్థులు తరగతి గదిలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన అత్యాధునిక బెంచీలు ప్రాజెక్టర్తో తరగతి గదిలో పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయుడు రాయచూరు రూరల్: ప్రైవేట్ స్కూల్ కంటే తామేం తక్కువ కాదంటూ బీదర్ జిల్లాలో ఓ సర్కారు పాఠశాల మౌలిక సౌకర్యాలతో ఆదర్శంగా నిలుస్తోంది. కళ్యాణ కర్ణాటకలోని బీదర్ జిల్లా హుమ్నాబాద్ తాలూకా మరఖల్ ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ స్కూళ్లలో లేని సౌకర్యాలను కూడా విద్యార్థులకు కల్పించారు. చిన్న కుగ్రామంలో ఉన్న ఈ పాఠశాల పెద్ద కాన్వెంట్లకు దీటుగా నిలిచింది. 2026–27వ విద్యా సంవత్సరంలో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడానికి ఉపాధ్యాయులు, ఎస్డీఎంసీ, ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించారు. తొమ్మిది గదులు, గ్రంథాలయం, వంట గది, భోజన గదులు, రక్షిత మంచి నీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. 8వ తరగతి వరకు బోధన ఈ పాఠశాలలో ఎల్కేజీ నుంచి మొదలుకొని యూకేజీ తర్వాత 8వ తరగతి వరకు విద్యాబోధన ఉంది. 185 మంది విద్యార్థులుండగా, 8 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. ఆరుగురు పర్మినెంట్ అతిథి ఉపాధ్యాయులు, ముగ్గురు వంట మనుషులున్నారు. గ్రంథాలయంలో విద్యార్థులకు అన్ని విధాలైన పుస్తకాలు, 5 కంప్యూటర్లు, ఎల్ఈడీ టీవీ, ప్రతి తరగతి గదిలో సీసీ కెమెరాలు, డిజిటల్ తరగతులు, రెండు ప్రాజెక్టులు, రైట్ సంస్థ రూ.6.50 లక్షల నిధులను విరాళంగా అందించడంతో పాటు 25 హైటెక్ బెంచీలను సమకూర్చింది. ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందితే రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల బెడదను తప్పించవచ్చని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామనగౌడ అన్నారు. ప్రైవేట్‌కు దీటుగా మరఖల్ ప్రభుత్వ పాఠశాల మౌలిక సౌకర్యాలతో ఆదర్శంగా నిలిచిన వైనం బీదర్ జిల్లా హుమ్నాబాద్ తాలూకాలో ప్రత్యేకం -
యువకుడిని హతమార్చిన నిందితుల అరెస్ట్
మాలూరు: తాలూకాలోని కేజీ హళ్లి గ్రామంలో యవకుడి హత్య కేసులో నిందితులను మాస్తి పోలీసులు 24 గంటల్లోనే అరెస్టు చేశారు. టీకల్ గ్రామానికి చందిన దర్శన్, సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కేజీ హళ్లి సంత మైదానంలో శనివారం రాత్రి జంగానహళ్లి గ్రామానికి చెందిన పురుషోత్తం (26) అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ఎస్పీ ఆదేశాలతో కార్యాచరణ జరిపిన పోలీసులు నిందితులను అరెస్టు చేయడంలో సఫలం అయ్యారు. కోర్టులో ఓ కేసు వ్యవహారానికి సంబంధించి ఈ హత్య జరిగిందని పోలీసుల విచారణలో తెలిసింది. -
భారీ మొత్తం అమ్మొద్దు, సీసాల్లో వద్దు
శివాజీనగర: ఇరాన్– ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం, పశ్చిమాసియాలో సంక్షోభం కారణంగా ఇప్పటికే గ్యాస్ కొరత ఏర్పడడం తెలిసిందే. పెట్రోలు, డీజిల్ ఇంధనాలు బొటాబొటిగా సరఫరా అవుతున్నాయి. పలు రకాల ప్రచారాలు జరిగినప్పుడల్లా బెంగళూరుతో సహా అనేక జిల్లాల్లో బంకుల వద్ద జనం పోటెత్తి రద్దీ ఏర్పడుతోంది. కొన్ని వారాలుగా ఇలాంటి తంతు నిత్యకృత్యమైంది. కొందరు భయంతో భారీ మొత్తంలో పెట్రోలు, డీజిలు కొని నిల్వ చేసుకోవడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడుతోందనే ఆరోపణలున్నాయి. కట్టుదిట్టంగా అమలు చేయాలి ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇంధన కొరత తీవ్రతరం కాకుండా ముందు జాగ్రత్తలు వహించేందుకు ఆహార పౌరసరఫరాల శాఖ సిద్ధమైంది. పెట్రోల్, డీజిల్ పంపిణీపై కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు ఆయిల్ కంపెనీలు, బంకుల యజమానులకు సూచనలు చేసింది. అలాగే మార్గదర్శకాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని వివిధ శాఖల అధికారులను ఆదేశించింది. ఉల్లంఘించే పెట్రోల్ బంక్‌ల మీద కఠిన చర్యలు తీసు కుంటామని తెలిపింది. పెట్రోలు, డీజిల్ విక్రయాలపై కొత్త నియామాలు ఉల్లంఘించే బంకులపై చర్యలు ప్రభుత్వం కార్యాచరణ మార్గదర్శకాలు ఇవే నియమాల ప్రకారం.. వాహనాలకు మాత్రమే పెట్రోలు, డీజిల్ పోయాలి. గరిష్టంగా 200 లీటర్ల వరకూ అనుమతి ఉంది. ఎవరైనా గానీ బాటిల్లు, క్యాన్లు వంటి వాటిలో ఇంధనాన్ని తీసుకెళ్లరాదు, అలా వచ్చిన వారికి బంకుల సిబ్బంది ఇంధనం ఇవ్వరాదు. సాధారణ పెట్రోలు బంకులు భారీస్థాయిలో ఒకరికే ఇంధనం సరఫరా చేయడానికి వీలు లేదు. అతిక్రమించి బల్క్ అమ్మకం చేసినచో లైసెన్స్ రద్దు లాంటి తీవ్ర చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యవసాయ కార్యకలాపాలకు, ఆక్వా రంగానికి డీజిల్ సరఫరాలో ఎలాంటి తారతమ్యం జరగకుండా అధికారులు దృష్టిసారించాలి. ఇలా పలు నిబంధనలను రూపొందించారు. -
కుటుంబాన్ని చిదిమిన కారు
దొడ్డబళ్లాపురం: కారు, బైక్ ముఖాముఖి ఢీకొన్న ప్రమాదంలో తండ్రి, కుమారుడు చనిపోగా, తల్లి, చిన్న కొడుకు తీవ్రంగా గాయపడిన సంఘటన హాసన్ తాలూకా శివారులోని బిట్టగౌడనహళ్లి వద్ద దేవేగౌడ సర్కిల్లో జరిగింది. గోరూరుకు చెందిన జయణ్ణ (38), మిథున్ (8) మృతులు, రజిని (29), మిలన్ (4) క్షతగాత్రులు. అందరూ ఒకే బైక్‌లో హాసన్‌లో 10 ఏళ్లకోసారి జరిగే దేవీరమ్మ జాతరకు వచ్చారు. జాతర చూసుకుని బైక్‌లో తిరిగి వెళ్తుండగా దారి మధ్యలో వేగంగా వచ్చిన కారు వీరిని ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ నలుగురినీ ఆస్పత్రికి తరలిస్తుండగా జయణ్ణ, మిథున్ దారిలో మృతిచెందారు. తల్లీ, కొడుకు చికిత్స పొందుతున్నారు. కారు అతివేగంతో దూసుకువచ్చి ఇంత ఘోరానికి కారణమైందని స్థానికులు ఆరోపించారు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. బైక్‌ను ఢీ, తండ్రీ కొడుకు మృతి -
భర్తను చంపిన కేసులో భార్య, ప్రియునికి ఉరిశిక్ష..14 లక్షల జరిమానా..!
బెంగళూరు: అనైతిక బంధానికి ఒడిగట్టిన భార్య చివరకు హత్యకూ వెనుకాడలేదు, ఫలితంగా కఠిన శిక్షకు గురైంది. అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే కోపంతో హత్య చేసిన కేసులో భార్య, ఆమె ప్రియునికి శివమొగ్గ జిల్లా భద్రావతి కోర్టు మరణశిక్షతో పాటు రూ. 14 లక్షల జరిమానా విధించింది. మత్తు మందు ఇచ్చి.. వివరాలు... 2020 జనవరి 15న, భద్రావతిలోని పేపర్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సురగీ టాప్కు చెందిన ఫ్లోరా నాన్సీ అనే మహిళ, తన ప్రియుడు రాజశేఖరయ్యతో కలిసి భర్త ప్రకాష బాబుకు మత్తుమందు ఇచ్చి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అప్పటి కేసు దర్యాప్తు అధికారి, సీఐ మంజునాథ్.. దర్యాప్తును పూర్తి చేసి కోర్టుకు ఛార్జిషిట్ సమర్పించారు. భద్రావతిలోని 4వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో విచారణ సాగింది. ప్రభుత్వ ప్రాసిక్యూటర్ రత్నమ్మ వాదనలు వినిపించారు. ఫ్లోరా నాన్సీ, ప్రియునికి ఉరే సరైన శిక్ష అని వాదిస్తూ ఆధారాలను సమర్పించారు. నేరం రుజువు కావడంతో జడ్జి ఇందిరా మైలస్వామి చెట్టియార్.. ఇద్దరు దోషులకు ఉరిశిక్ష విధించాలని తీర్పు చెప్పడంతో పాటు రూ.14 లక్షల జరిమానా విధించారు. మృతుని తల్లిదండ్రులకు రూ. 5 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించారు. -
ఆంటీతో యువకుడి వివాహేతర సంబంధం..!
బనశంకరి(బెంగళూరు): సహజీవన బంధాలు ఎక్కువగా విషాదంతోనే ముగుస్తున్నాయి. అలాంటి ఉదంతమే ఇది. మహిళతో కలిసి జీవిస్తున్న యువకుడు ఉరివేసుకున్న రీతిలో శవమయ్యాడు, బెంగళూరు రాజగోపాలనగర పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. వివరాలు.. చిత్రదుర్గకు చెందిన తిప్పేస్వామి(28), దావణగెరె (35) మహిళ ఒకే గార్మెంట్స్‌లో పనిచేస్తూ ఇన్‌స్టా ద్వారా పరిచయమై ప్రేమలో పడ్డారు. మహిళకు వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. భర్త , పిల్లలను వదిలిపెట్టి తిప్పేస్వామితో వచ్చేసింది. రెండునెలల క్రితం బెంగళూరు శ్రీగంధనగరలో బాడుగ ఇల్లు తీసుకుని భార్యాభర్తలం అని చెప్పి జీవిస్తున్నారు. కొంతకాలంగా మహిళ గొంతెమ్మ కోర్కెలతో తిప్పేస్వామిని ఇబ్బంది పెడుతోంది. దీంతో విరక్తి చెందిన అతడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మహిళ పరారైంది. యువకుని సంబంధీకుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు ఆ మహిళపై కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. -
ప్రభుత్వ కార్యాలయంలో జల్సాలు
రాయచూరు రూరల్: సర్కారు కార్యాలయాలను ప్రజలకు సేవలు చేసే దేవాలయాలుగా భావిస్తాం. అయితే కొంతమంది అధికారులు వాటిని అసాంఘిక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారు. రాయచూరు జిల్లా లింగసూగురులో పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం కార్యాలయం మందు పార్టీలకు వేదికగా మారింది. రాత్రి వేళ్లలో అధికారులు పార్టీలు చేసుకుంటూ క్లబ్‌గా మార్చేస్తున్నారు. శనివారం రాత్రి కార్యాలయంలో అధికారులు రెచ్చిపోయారు. విచ్చల విడిగా మందు తాగుతూ జల్సాలు చేశారు. పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ ఏఈఈ హనుమప్ప అదవాని ఇతర అధికారులతో కలసి పాటలు పాడుతూ డ్యాన్స్ చేశారు. ప్రభుత్వ కార్యాలయంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ఉన్నత స్థాయి అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతున్నారు. జల్సాలు చేస్తున్న అధికారులపై వేటు వేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. కనీసం ఇప్పటికై నా స్పందించి చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి మరి. -
హొసపేటెలో కాంగ్రెస్ సంబరాలు
హొసపేటె: తమిళనాడులో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఆదివారం హొసపేటెలోని డాక్టర్ పునీత్ రాజ్‌కుమార్ సర్కిల్ వద్ద కాంగ్రెస్ పార్టీ షెడ్యూల్డ్ కులాల విభాగం నాయకులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ప్రజలు, పార్టీ అభిమానులకు స్వీట్లు పంచిపెట్టారు. దేశంలో ప్రజాస్వామ్యం, సంకీర్ణ రాజకీయాల విజయానికి మద్దతుగా కార్యకర్తలు నినాదాలు చేశారు. విజయనగర జిల్లా షెడ్యూల్డ్ కులాల విభాగం జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్ బంతమనే మాట్లాడుతూ.. మనువాద భావజాలం కలిగిన బీజేపీ పార్టీ ఏ కారణం చేతనైనా సరే దక్షిణ భారతదేశంలో ఎప్పటికీ అధికారంలోకి రాలేదని తెలిపారు. తమిళనాడులో అమలువుతున్న పాలన, సంకీర్ణ ప్రభుత్వ విజయం యావత్ దేశానికే ఆదర్శమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ షెడ్యూల్డ్ కులాల విభాగం ప్రముఖ కార్యనిర్వాహకులు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, తలూరు వీరభద్ర, సజ్జద్ఖాన్, రఘు, నాగరాజు, గిరీష్, ప్రకాష్, బి.మౌలాలి, శశికుమార్, కిషోర్ కుమార్, కార్తీక్, గణేష్, యోహాన్, అమీద్ హుస్సేన్, బాబా ఫకృద్దీన్, ఆశాబేగం తదితరులు పాల్గొన్నారు. డ్రగ్ పెడ్లర్ అరెస్ట్ హుబ్లీ: మత్తు పదార్థాల సేకరణ, విక్రయం కేసులో దాండేలి సుభాష్ నగర్ నివాసి అయాన్ సాన్వాజ్ను అరెస్ట్ చేసి బళ్లారి జైలుకు పంపారు. మత్తు పదార్థాల సేకరణ నిల్వ, రవాణా విక్రయాల్లో వృత్తి పరమైన డ్రగ్స్ పెడ్లర్ అయిన నిందితుడిపై దాండేలి పోలీసులు 5 కేసులు, హుబ్లీ గోకుల్ రోడ్డు పోలీసులు కేసు నమోదు చేశారు. పలుసార్లు జైలుకు పంపిన కూడా బెయిల్ షరతులను ఉల్లంఘించాడు. పదే పదే ఇవే నేరాలకు పాల్పడటంతో ఐజీపీ, ఎస్పీ ఆదేశాల మేరకు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణ చట్టం ద్వారా డ్రగ్స్ పెడ్లర్ అయాన్ సాన్వాజ్ను అరెస్ట్ చేసి జైలు పంపించడం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రాణం తీసిన ఈత సరదారాయచూరు రూరల్: ఈత సరదా ప్రాణం తీసింది. మిత్రులతో కలసి ఈత కోసం వెళ్లి యువకుడు దుర్మరణం పాలైన ఘటన ఆదివారం బీదర్ జిల్లాలో చోటు చేసుకుంది. బీదర్ జిల్లా కమల నగర తాలూకా బళత వద్ద ఉన్న మంజ్రా నదిలోకి అనిల్ చిద్రి (28) స్నేహితులతో కలసి ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈత కొడుతూ లోతైనా ప్రదేశానికి వెళ్లిన అనిల్ చిద్రి నీట మునిగిపోయాడు. తోటి స్నేహితులు వెంటనే కుటుంబ సభ్యులు, అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్ని మాపక సిబ్బంది, రెవెన్యూ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. బోట్ ద్వారా మంజ్రా నదిలో గాలించారు. చాలా సేపు అనంతరం యువకుడి మృతదేహం లభ్యం కావడంతో వెలికితీశారు. కుశనూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కేఎంసీ ఆస్పత్రిలో మహిళకు ప్రాణదానంహుబ్లీ: రక్తహీనత, తలసీమియా, హెమోగ్లోబిన్ కొరత తదితర అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్న మహిళకు కేఎంసీ ఆస్పత్రి వైద్యులు పునర్ జన్మ ప్రసాదించారు. నెల రోజుల క్రితం విజయవంతంగా ఆపరేషన్ చేసి ఆమె ప్రాణాలు కాపాడారు. వివరాలు.. విజయనగర జిల్లా కంప్లి సమీపంలో ఓ గ్రామానికి చెందిన రేణుక (47) తొలి కాన్పులో మగ్గ బిడ్డకు జన్మినిచ్చింది. ఆ తర్వాత మూడు అబార్షన్లు జరిగాయి. 5వ సారి మళ్లీ రేణుక గర్భం దాల్చింది. అనారోగ్యానికి గురికావడం, నిసత్తువతో ఎప్పుడు నిద్రించేది. గంగావతి, కూష్టగి ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందింది. ఆ తర్వాత బెంగళూరులోని ఓ ఆస్పత్రికి వెళ్లి తిరిగి కొప్పళ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. తల్లీబిడ్డ బతకడం కష్టమని సదరు ఆస్పత్రుల్లోని వైద్యులందరూ తేల్చి చెప్పారు. అంతేగాక ఆస్పత్రిలో చేర్చుకునేందుకు నిరాకరించారు. కొప్పళ వైద్యుల సూచన మేరకు కేఎంసీ ఆస్పత్రికి వచ్చిన రేణుక.. ఏప్రిల్ నెలలో అడ్మిట్ అయ్యింది. కిమ్స్ వైద్యులు ఆమెకు తొలుత వివిధ వైద్య పరీక్షలు చేశారు. రక్తహీనతతో పాటు కొన్ని సమస్యలు ఉండటంతో కడుపులో ఉన్న బిడ్డ చనిపోయినట్లుగా గుర్తించారు. తక్షణమే మాతృ శిశు ఆస్పత్రి విభాగంలో డాక్టర్ రామలింగప్ప అంతర్సాని నేతృత్వంలోని వైద్య బృందం సహజ ప్రసవం చేశారు. ప్రస్తుతం రేణుక ఆరోగ్యం కుదుటపడింది. -
గంగమ్మ ఆలయ వార్షికోత్సవం
మాలూరు: తాలూకాలోని పుర గ్రామంలో గంగమ్మ దేవి దేవాలయ వార్షికోత్సవ వేడుకలను ఆదివారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఇటీవల దేవాలయాన్ని జీర్ణోద్దారణ చేయగా.. జీర్ణోద్దారణ అనంతరం మొదటి వార్షికోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. గోపూజ, స్వస్తివచనం, అంకురార్పణ, మహాగణపతి పూజ, అగ్నిప్రతిష్ట, గణహోమం, పంచామృతాభిషేకం చేశారు. అంచెముస్కూరు, లక్కూరు. చిక్కతిరుపతి, జయమంగల, తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాద వినియోగం జరిగింది. వైభవంగా చౌడేశ్వరి దేవి దీపారాధన కోలారు: బంగారుపేట తాలూకా బేతమంగల ఫిర్కా కంగాండ్లహళ్లి గ్రామంలో చౌడేశ్వరి దేవి జాతరలో భాగంగా దీపారాధన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. మహిళలు తంబిట్టు దీపాలను తలపై మోసుకుని వచ్చి అమ్మవారికి సమర్పించారు. పూజా కార్యక్రమాలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అంతకుముందు దేవాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఉదయం దేవాలయంలో అమ్మవారికి క్షీరాభిషేకం, దీపారాధన, తదితర పూజలు చేపట్టారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ప్రసాద వితరణ జరిగింది. -
పనసమాకనహళ్లిలో నీటి ఎద్దడి
శ్రీనివాసపురం: తాలూకాలోని పనస మాకనహళ్లి గ్రామంలో నీటి ఎద్దడి అధికమైంది. గ్రామంలో చాలా వరకు బోర్వెల్లు ఎండి పోయాయి. ప్రజలు తాగునీరు లేక నానా ఇబ్బంది పడాల్సి వస్తోంది. వంకలు, వాగులు ఎండిపోవడంతో పశువులకు కూడా నీరు లభించడం లేదు. సుదూరంలో ఉన్న కొళాయిల నుంచి సైకిళ్లపై నీరు తెచ్చుకుంటున్నారు. మరి కొంతమంది గ్రామానికి తరచుగా వచ్చే నీటి ట్యాంకర్‌పై ఆధారపడుతున్నారు. కొత్తగా బోర్వెల్ వేసి నీటి సమస్యను పరిష్కరించాలని పీడీఓకు విన్నవించినా స్పందన లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి సమస్యను త్వరగా పరిష్కరించకుంటే తీవ్ర ఆందోళన చేపట్టాల్సి ఉంటుందని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. -
ఘనంగా హేమరెడ్డి మల్లమ్మ జయంతి
రాయచూరు రూరల్: నగరంలోని పండిత సిద్దరామ జంబలదిన్న రంగ మందిరంలో ఆదివారం జిల్లా దళిత, జెడ్పీ, నగర సభ, కన్నడ సంస్కృతి, సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హేమరెడ్డి మల్లమ్మ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామీణ శాసన సభ్యుడు బసన గౌడ దద్దల్ మాట్లాడుతూ.. హేమారెడ్డి మల్లమ్మ శరణుల చింతనలను అలవర్చుకున్న విషయాలను ప్రప్తావించారు. అలనాటి మహా మానవతా వాది బసవన్న సమకాలికురాలు అయిన హేమరెడ్డి మల్లమ్మ ఆదర్శాలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. సమాజంలో బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించారని గుర్తు చేశారు. హేమరెడ్డి మల్లమ్మ జీవత చరిత్రను భవిష్యత్తు తరాల వారికి తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. అంతకు ముందు రాష్ట్ర మంత్రి సుధాకర్ మృతికి రెండు నిమిషాల పాటు మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అభినవ రాచోటి శివాచార్య, వీర సంగన బసవ స్వామీజీ, ఏపీఎంసీ అధ్యక్షుడు మల్లికార్జున గౌడ, ఏసీ హంపణ్ణ, తహసీల్దార్ సురేష్ వర్మ, శరణప్ప, ఉమేష్, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణ, బసన గౌడ, రామన గౌడ కేశవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మల్లమ్మ జీవితం ఆదర్శంసాక్షి, బళ్లారి: మహాసాథ్వి మల్లమ్మ జీవితం మానవాళికి ఆదర్శం అని కర్ణాటక రాష్ట్ర రెడ్డి జన సంఘం డైరెక్టర్ గణపాల ఐనాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నగర శివారులోని వేమనపీఠం ఆధ్వర్యంలో హేమరెడ్డి మల్లమ్మ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లమ్మ విగ్రహానికి పూజలు చేసి, నివాళులర్పించారు. గణపాల ఐనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. మల్లమ్మ రెడ్డి సమాజంలో జన్మించడంతో మన అందరికి గర్వకారణంగా ఉందన్నారు. కార్యక్రమంలో రెడ్డి సమాజ ప్రముఖులు బసవరాజ్ రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, నాగరాజ్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే నగరంలోని బసవ భవనంలో వీరశైవ లింగాయ్ రెడ్డి సమాజంలో హేమరెడ్డి మల్లమ్మకు ఘనంగా నివాళులర్పించారు. హేమరెడ్డి మల్లమ్మ విగ్రహానికి పూజలు చేస్తున్న రెడ్డి సమాజ ప్రముఖులు బసవ భవనంలో వీరశైవ లింగాయత్ రెడ్డి సమాజం ఆధ్వర్యంలో మల్లమ్మ జయంతి -
తల్లికి సేవ చేయాలి
రాయచూరు రూరల్: ప్రపంచంలో తల్లికి మించిన దైవం లేదు. కుమారులు తల్లిని పూజించి, సేవ చేయాలని ప్రజాపిత బ్రహ్మ కుమారి ఈశ్వరీయ విశ్వ విద్యాలయం సంచాలకురాలు స్మిత పేర్కొన్నారు. ఆదివారం ఈశ్వరీయ విశ్వ విద్యాలయంలో ప్రపంచ మాతృ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తల్లి కుటుంబ కోసం నిత్యం శ్రమిస్తుందన్నారు. తల్లి చూపే త్యాగం, ప్రేమ, కరుణను గుర్తు చేసుకోవాలన్నారు. పిల్లలకు మానవతా విలువలు, సంస్కృతి, ఆచార వ్యవహారాలు బోధిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో రవీంద్ర జాలదార్, శారద తదితరులు పాల్గొన్నారు. ముగిసిన ఉద్బవ లింగ ఉత్సవాలు రాయచూరు రూరల్: రాయచూరు తాలూకా గాణదాళలో ఆదిశేష ఉద్బవ లింగ ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. శనివారం సాయంత్రం కిల్లే బ్రహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య, అభినవ రాచోటి శివాచార్యులు, హోసళ్లి ముత్యా మహంత శివయోగి మహాస్వామి, మాజీ శాసన సభ్యుడు తిప్పరాజ్ ప్రత్యేక పూజలు చేశారు. భారీగా తరలివచ్చిన భక్తులతో కలసి రథాన్ని లాగారు. వీడియోతో మహిళకు బ్లాక్మెయిల్ హుబ్లీ: యువతిపై లైంగిక దాడి చేసిన వీడియోలను ఇతరులకు మొబైల్స్‌కు పంపిన యువకుడిపై ఉపనగర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్న 21 ఏళ్ల యువతి నవనగర అబ్దుల్ మాలిక్‌పై ఫిర్యాదు చేసింది. గతంలో ఈమె ఇన్సూరెన్స్ కంపెనీ ఇంటర్యూకు వెళ్లిన సమయంలో అబ్దుల్ మాలిక్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. యువతికి మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. లైంగిక దాడి చేస్తున్న దృశ్యాలను రికార్డు చేసుకుని ఇతరుల మొబైల్స్‌కు పంపించాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. వాల్మీకి విగ్రహావిష్కరణ రాయచూరు రూరల్: నాయక్ సమాజం విద్యలో రాణించాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజ్ పిలుపునిచ్చారు. శనివారం రాత్రి మాన్వి తాలూకాలోని బల్లటిగిలో మహర్శి వాల్మీకి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహర్శి వాల్మీకి జీవత చరిత్రను అందరూ తెలుసుకోవాలని సూచించారు. మానవతా ధర్మం ఆధారంగా మహర్శి చేసిన సేవలు అనన్యమన్నారు. నాయక్ సమాజం చేస్తున్న సేవలు ఆదర్శమని కొనియాడారు. భవిష్యత్తు తరాల వారికి గుర్తుండేలా ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో లోకసభ సభ్యుడు కుమార నాయక్, మాన్వి శాసన సభ సభ్యుడు హంపయ్య నాయక్, ప్రసన్నానంద స్వామి, వరదానేంద్ర, గంగాధర నాయక్, రవి, అమరేష్, రుద్రప్ప అంగడి, కేశవ మూర్తి, సూగుప్ప, గంగారెడ్డి, గపూర్ పాల్గొన్నారు. ఫ్లాట్లపై ఫిర్యాదు సాక్షి, బళ్లారి: నగరంలో ఓ రోడ్డులో నూతనంగా నిర్మించిన ఓ అపార్టుమెంటులో తాను కొనుగోలు చేసిన ఫ్లాట్లు నాసిరకంగా ఉన్నాయంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమకు కేటాయించిన 10 ఫ్లాట్లలో నాణ్యత ఏమాత్రం లేదని వాపోయింది. నిర్మాణదారులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదన్నారు. రెండు రోజుల క్రితం బాడుగులకు ఇచ్చిన షాపులో పై పెచ్చులు ఉడిపోయాయని తెలిపారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కోలారు: ఉత్తమ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరు ఆరోగ్య పరీక్షలను తరచుగా చేయించుకుంటూ ఉండాలని తాలూకా ఆరోగ్య అధికారి డా నారాయణస్వామి తెలిపారు. ఆదివారం నగరంలోని సబ్ జైలులో ఖైదీలకు ఆరోగ్య పరీక్షా శిబిరం నిర్వహించారు. 100 రోజుల క్షయ ముక్త అభియాన్ గురించి ఖైదీలకు వివరించారు. అతి వేడి వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి, ఎక్కువగా నీరు తాగాలని తెలిపారు. జైలు అధికారి జి రాములు, జైలర్ యాస్మిన్, ఎస్.బాబు పాల్గొన్నారు. -
కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలు
కేజీఎఫ్: విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకొని తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చాలని ఎమ్మెల్యే రూపా శశిధర్ పిలుపునిచ్చారు. తాలూకా వ్యాప్తిలో పదవ తరగతిలో 90 శాతం పైగా మార్కులు సాధించిన 206 మంది విద్యార్థులకు ఆదివారం నగరంలోని మున్సిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రతిభా పురస్కారాలను అందించి మాట్లాడారు. టెన్త్ ఫలితాల్లో జిల్లాలో తాలూకా చివరి స్థానంలో నిలిచిందని, వచ్చే ఏడాది ఉత్తమ ఫలితాలను తీసుకు రావడానికి ఉపాధ్యాయులు శ్రమించాలన్నారు. కార్యక్రమంలో బీఈఓ నారాయణస్వామి, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరసింహమూర్తి, నగర బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాణిక్యం పాల్గొన్నారు. యువకుడు దారుణ హత్య మాలూరు: యువకుడిని కొడవలితో నరికి ఆపై తలపై బండరాయితో మోది దారుణంగా హత్య చేసిన ఘటన టీకల్ ఫిర్కా కెజి హళ్లి సంత మైదానంలో చోటు చేసుకుంది. తాలూకాలోని జంగానహళ్లి గ్రామానికి చెందిన పురుషోత్తం (26) హత్యకు గురైన యువకుడు. పాత గొడవలే హత్యకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. లేదా ఎవరైనా కిరాయి హంతకులు హత్య చేయించి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విషయం తెలుసుకున్న మాస్తి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చేపట్టారు. వేసవి శిబిరాలతో ప్రతిభ వెలికితీత బొమ్మనహళ్లి: ఆనేకల్ పట్టణం పాత ప్రభుత్వ సెకండరీ పాఠశాల ఆవరణలో సంక్రమణ బలగం, వివిధ సంస్థల సహకారంతో చిన్నారుల కోసం వేసవి శిబిరం ఏర్పాటు చేశారు. వ్యక్తిత్వ వికాసం, చిత్రలేఖనం, సినిమా, నాటక ప్రదర్శన, కథ, పాట, సాంఘిక చైతన్యం, గ్రామ క్రీడలపై అనేక కార్యక్రమాలను నిర్వహించారు. విద్యార్థులు ఆటపాటల్లో ఉత్సాహంగా పాల్గొంటూ ప్రతిభను ప్రదర్శించారు. జాతీయ యువ పురస్కార గ్రహీత డాక్టర్ చిన్నప్ప చిక్కహగడే, న్యాయవాది పురుషోత్తం, శ్యామ్ రాజ్ ఉర్సు తదితరులు పాల్గొన్నారు. -
కారు, టాటా ఏస్ ఢీ: నలుగురికి గాయాలు
హొసపేటె: అతివేగంగా వచ్చిన టాటా ఏస్ గూడ్స్ వాహనం ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం తాలూకాలోని ధర్మసాగర్ గ్రామం సమీపంలో జరిగింది. ఉదయం బళ్లారి నుంచి హొసపేటె వైపునకు వస్తున్న కారును ఎదురుగా వచ్చిన టాటా ఏస్ గూడ్స్ వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం హొసపేటె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. టాటా ఏస్ గూడ్స్ డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపడం ప్రమాదానికి కారణమని తెలిసింది. గాదిగనూరు పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. జాతీయ రహదారి–63పై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదాలు తరచుగా చోటుచేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఆటోను ఢీకొన్న కారు.. హుబ్లీ: కారు డ్రైవర్ మద్యం మత్తులో ఆటో రిక్షాను ఢీకొట్టాడు. ఈ ఘటన ధార్వాడ జిల్లా ఆస్పత్రి ఆవరణలో చోటు చేసుకోగా... అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రమాదం జరగలేదు. ప్రతి నిత్యం వేల సంఖ్యలో ప్రజలు నడిచి వెళ్లే జిల్లా ఆస్పత్రి ఎమర్జెనీ యూనిట్ దగ్గర తాగిన మత్తులో కారు నడుపుకుంటూ వచ్చి ఆటో రిక్షాను ఢీకొట్టాడు. అనంతరం ఆ కారు స్టిరింగ్పై ఆ మందు బాబు నిద్రలోకి జారుకున్నాడు. ఘటన స్థలానికి వచ్చిన ధార్వాడ ట్రాఫిక్ పోలీసులు ఆ కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఘటన నేపథ్యంలో జిల్లా ఆస్పత్రిలో కొద్ది సేపు గందరగోళం నెలకొంది. ట్రాఫిక్ పోలీసులు సకాలంలో వచ్చి తగిన చర్యలు తీసుకున్నారు. -
పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తున్న బీజేపీ
హొసపేటె: పెట్టుబడిదారులకు బీజేపీ కొమ్ముకాస్తోందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నగరంలోని ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన వర్క్‌షాప్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈనెల 9న కేంద్రం ప్రభుత్వం నాలుగు కార్మిక కోడ్లను ప్రవేశ పెట్టిందని తెలిపారు. పెట్టుబడిదారులు మాత్రమే పాలించాలన్నట్లుగా బీజేపీ వ్యవహరిస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో 20 మంది కార్మికులను ఒక యూనిట్‌గా పరిగణించేవారు. ఇప్పుడు ఈ సంఖ్యను 50 మందికి పెంచడంతో 49 మంది కార్మికులు ఉన్నా సరే వారికి ఎటువంటి లైసెన్స్ పొందే అర్హత లేకుండా పోయిందని మండిపడ్డారు. గతంలో 8 గంటల పని వేళలను ఇప్పుడు 12 గంటలకు పెంచారని తెలిపారు. అదనంగా మహిళలు కూడా రాత్రి షిఫ్టులలో పని చేయాలనే నిబంధన తీసుకొచ్చారన్నారు. యజమానులు తమకు నచ్చినంత సమయం కార్మికులతో పని చేయించుకోవచ్చనే చట్టాన్ని అమలులోకి తెచ్చారు. తాము దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. అంగన్వాడీ కార్యకర్తలను కూడా ఈ కార్మిక చట్టాల పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్మిక సంఘాల విజ్ఞప్తులను ఆమోదించడానికి బదులుగా, ప్రభుత్వం కేవలం పెట్టుబడిదారుల సంఘాల విజ్ఞప్తులకు మాత్రమే ఆమోదం తెలుపుతోందన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ప్రధాని వెళ్లే మార్గంలో విస్ఫోటకాలు
● పోలీసు అధికారుల తనిఖీ శివాజీనగర: ప్రధాని నరేంద్ర మోదీ సంచరించే మార్గంలో బెంగళూరు దక్షిణ తాలూకా వడేరహళ్ళి గేట్ వద్ద విస్ఫోటక పదార్థాలైన జిలెటిన్ కడ్డీలు లభించడం పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. వారంరోజుల నుంచి ప్రధాని టూర్‌కు ఎస్పీజీ, పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. తీరా మోదీ వచ్చిన సమయంలో పేలుడు పదార్థాలు బయటపడడం చర్చనీయాంశమైంది. వడేరహళ్ళి గేట్ సమీపంలోని రోడ్డు పక్కన రెండు జిలెటిన్ కడ్డీలు లభ్యమయ్యాయి. పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో లభించాయి. పేలుడు వస్తువులు అక్కడికి ఎలా వచ్చాయి? దీని వెనుక ఏమైనా కుట్ర వంటిది ఉందా అనేది కనుగొనేందుకు ఇన్స్పెక్టర్తో పాటుగా 50 మంది పోలీసులతో తనిఖీ బృందాన్ని రామనగర ఎస్పీ నియమించారు. పోలీస్ ఉన్నతాధికారులు స్థలాన్ని పరిశీలించారు. బాంబు స్క్వాడ్, జాగిలాలతో చుట్టుపక్కల ప్రాంతాల్లో శోధించారు. పరిసరాల్లోని సీసీ కెమెరాల దృశ్యాలను పోలీసులు సేకరిస్తున్నారు. బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత గవర్నర్, సీఎం, డీసీఎంల నివాళులు నేడు చెళ్లకెరెలో అంత్యక్రియలు -
ప్రాచీన కట్టడాలకు జీవం పోయండి
మైసూరు: ప్యాలెస్ సిటీలో రెండు చారిత్రక కట్టడాలను కాపాడుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మైసూరు వారసత్వ కట్టడాలైన దేవరాజ మార్కెట్, లాన్స్‌డౌన్ భవనాల పరిరక్షణ, పునరుద్ధరణకు నిధులు విడుదల చేయాలని స్థానిక ఎంపీ యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడెయార్.. సీఎం సిద్దరామయ్యకు విజ్ఞప్తి చేశారు. మైసూరు వారసత్వ కట్టడాలను పరిరక్షించడమే మా ప్రధాన లక్ష్యమని, ఈ మేరకు సీఎం లేఖ రాసినట్లు తెలిపారు. ఈ భవనాల పరిరక్షణకు ఈ ఏడాది మే 4న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చాలా ముఖ్యమైనదని ఎంపీ చెప్పారు. ఈ కట్టడాలను కూల్చివేసి, కొత్త భవనాలను నిర్మించాలన్న ప్రతిపాదనను సుప్రీంకోర్టు తిరస్కరించిందని చెప్పారు. 19వ శతాబ్దానికి చెందిన భవనాలను పరిరక్షించి, పునరుద్ధరించడానికే ఈ తీర్పు వచ్చిందని అన్నారు. మరమ్మతులు చాలు రూర్కీ ఐఐటీ నిపుణుల కమిటీ సిఫార్సుల ప్రకారం 70 శాతం మరమ్మతులతో భవనాలు సుస్థిరంగా ఉంటాయన్నారు. ప్రస్తుతం ఉన్న పునాదులను పరిరక్షించి, పునరుద్ధరిస్తామని ఆయన అన్నారు. పునరుద్ధరణ ప్రాజెక్టును వెంటనే ప్రారంభించేలా మైసూరు నగరపాలక సంస్థ (ఎంసీసీ), మైసూరు అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఎండీఏ)లకు ఆదేశించాలని సీఎంను కోరినట్లు ఆయన తెలిపారు. 2024–25 బడ్జెట్లో దేవరాజ మార్కెట్ పునరుద్ధరణకు రూ.95 కోట్లు, లాన్స్‌డౌన్ భవనానికి రూ.35 కోట్లు గ్రాంటుగా ప్రకటించారని చెప్పారు. అవి కట్టడాలు మాత్రమే కాదని, అవి మైసూరు సజీవ సాంస్కృతిక, వాణిజ్య వారసత్వానికి ప్రతీకలని పేర్కొన్నారు. మైసూరు దేవరాజ మార్కెట్, లాన్స్‌డౌన్ భవనాల పునరుద్ధరణకు ఎంపీ డిమాండ్ -
రథోత్సవాల నేత్రపర్వం
బొమ్మనహళ్లి: బెంగళూరు బొమ్మనహళ్ళి నియోజకవర్గం సింగంద్రలోని చన్నకేశవ నగరలో చెన్నకేశవ జాతర వేడుకలు నిర్వహించారు. ఆదివారం మండుటెండలో అన్నమ్మ దేవి రథం, కబ్బాలమ్మ దేవి రథం, రేణుకా యల్లమ్మ దేవి రథం, వీరభద్రస్వామి రథాలను భక్తజనం లాగారు. మంగళవాయిద్యాలు, కళాకారుల ప్రదర్శనల మధ్య తేర్లు ముందుకు కదలగానే భక్తులు అరటిపండ్లు విసిరారు. కనువిందుగా కరగ కోలారు: తాలూకాలోని చిట్నహళ్లి గ్రామంలో శనివారం రాత్రి ధర్మరాయస్వామి కరగ ఉత్సవ వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పూజారి కాకినత్త బాలరాజ్ దేవాలయం ముందు వేదికపై మేళతాళాలకు అనుగుణంగా కరగను మోస్తూ చేసిన నృత్యం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకూ కరగ సంబరం సాగింది. అగ్నిగుండ ప్రవేశంతో ఉత్సవం ముగిసింది. వేలాది భక్తులు వీక్షించారు. దేవీరమ్మ తేరు సంబరంబొమ్మనహళ్లి: హాసన్ దగ్గర భువనహళ్లిలో ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జరిగే చారిత్రక దేవీరమ్మ జాతర మహోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శంభునాథ్ స్వామీజీ, కలెక్టర్ కె. లతాకుమారి, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. దేవీరమ్మకు పూజలు రథోత్సవానికి నాంది పలికారు. భక్తులు దారి పొడవునా హారతి ఇస్తూ అమ్మవారిని స్వాగతించారు. పరిసర గ్రామాల నుంచి వేలాదిగా భక్తులు రావడంతో జాతర కిటకిటలాడింది. బ్యాంకు ఖాతాలో రూ.18 లక్షలు మాయంయశవంతపుర: చిక్కమగళూరు జిల్లా వ్యాప్తంగా సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. జనవరి నుంచి ఇప్పటివరకు 29 కేసులు నమోదయ్యాయి. మహిళల బ్యాంక్ ఖాతా నుంచి రూ.18.24 లక్షలు మాయమయ్యాయి. సైబర్ నేరగాళ్ల మోసాలకు ప్రజలు బెంబేలెత్తుతున్నారు. చిక్కమగళూరు నగరానికి చెందిన ఓ మహిళ ప్రైవేటు బ్యాంకు ఖాతా నుంచి పలు విడతలలో ఈ డబ్బులు పోయాయి. ఏపీకే, ఓటీపీ, లింక్‌లు ఏవీ ఆమె మొబైల్‌కు రాలేదు. అయినా బ్యాంక్ ఖాతాలోని డబ్బు మాయం కావడం చూస్తే ఇంటిదొంగల పాత్ర కూడా ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు. మార్చి 4 నుంచి ఏప్రిల్ 21 వరకు వివిధ దినాలలో డబ్బులు డ్రా అయ్యాయి. బ్యాంక్ సిబ్బంది మీద అనుమానం వ్యక్తమవుతోంది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.లక్కుండిలో ప్రాచీన శిల లభ్యందొడ్డబళ్లాపురం: గదగ్ జిల్లా చారిత్రక లక్కుండి గ్రామంలో శనివారంనాడు కుంబార బావిని శుభ్రం చేస్తుండగా 9 లేదా 10వ శతాబ్దం నాటి రాతి శిల లభించింది. అందులో మొదట యుద్ధం జరగడం, తరువాత యుద్ధంలో మరణించిన వీరున్ని అప్సరసలు స్వర్గానికి తీసికెళ్లే దృశ్యాలు, వీరుడు స్వర్గంలో సేదతీరుతున్న వైనం చెక్కి ఉన్నాయి. శిలపై సూర్య చంద్రులు, శివలింగం, శివలింగాన్ని యువతి పూజిస్తున్న బొమ్మలు ఆకట్టుకునేలా ఉన్నాయి. కొన్నినెలల కిందట లక్కుండిలో ఓ ఇంటిలో బంగారు నిధి లభించడం, తవ్వకాలలో ప్రాచీన విగ్రహాలు దొరకడం తెలిసిందే. -
జస్టినాదే సింగిల్స్ ట్రోఫీ
● తుమకూరు టెన్నిస్ టోర్నీ... తుమకూరు: తుమకూరు వర్సిటీలో జిల్లా టెన్నిస్ అసోసియేషన్ కోర్టులో జరిగిన సింగిల్స్ ఫైనల్లో, రెండవ సీడ్ జుజానా పావ్లికోవ్స్కా గాయం కారణంగా వైదొలిగింది. దీంతో, జస్టినా మికుల్స్కిటే సులభంగా సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. భుజం గాయం కారణంగా శనివారం జరిగిన డబుల్స్ ఫైనల్ నుంచి పోలెండ్ ఆటగత్తె జుజానా తప్పుకుంది. అగ్రశ్రేణి క్రీడాకారిణుల మధ్య పోటీ మిస్ కావడంతో ప్రేక్షకులు నిరాశ చెందారు. దీంతో జస్టినా సులభంగా టైటిల్ పొందింది. ఇరువురికీ హోంమంత్రి పరమేశ్వర్ ట్రోఫీలు, బహుమతి నగదును అందజేశారు. కన్నికా పరమేశ్వర్, కలెక్టరు శుభ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. అలరించే హస్తకళా మేళాబనశంకరి: బెంగళూరు బనశంకరి రెండోస్టేజ్లోని శ్రీహరి కళ్యాణ మండపంలో జరుగుతున్న చేనేత హస్తకళా మేళా వినూత్న ఉత్పత్తులకు వేదికై ంది. దేశంలోని వివిధ ప్రాంతాల గ్రామీణ కళాకారులు తీర్చిదిద్దిన కాటన్, పట్టు, నూలు చేనేత వస్త్రాలు, చీరలు, మహిళలను అలరిస్తున్నాయి. డ్రెస్ మెటీరియల్స్, టాప్స్, కుర్తాలు, ఆభరణాలు, గృహాలంకరణ సామగ్రి ఇక్కడ లభిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో పేరుపొందిన వస్త్రాలు, చీరలు, కళాకృతుల స్టాల్స్ ఇందులో వెలిశాయి. ఈ ప్రదర్శన ఈ నెల 17వ తేదీ వరకు జరుగుతుంది. -
మృత్యువుతో పోరాడి.. ఓడిన మంత్రి సుధాకర్
శివాజీనగర: రాష్ట్ర రాజకీయాలలో తీవ్ర విషాదం సంభవించింది. ప్రణాళికా, గణాంక మంత్రి, చిత్రదుర్గ ఇన్చార్జి.. డి.సుధాకర్ (62) ఆదివారం తెల్లవారుజామున మరణించారు. సుమారు నెల రోజుల నుంచి ఆయన శ్వాసకోశ జబ్బుతో బాధపడుతూ బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉండడం తెలిసిందే. మొదట మోకాలి శస్త్ర చికిత్స కోసం యశవంతపురలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా, శ్వాసకోస సమస్య మొదలైంది. దీంతో మెరుగైన చికిత్స కోసం ఈ ఆస్పత్రిలో చేర్పించారు. ఐసీయూలో ఉంచి దేశ విదేశాల వైద్యనిపుణులు వైద్యం అందించినప్పటికీ పరిస్థితి మెరుగుపడలేదు. చివరికి ఆయన ప్రాణాలు విడిచారు. కుటుంబంతో పాటు కాంగ్రెస్ నాయకులు, అభిమానులు విచారంలో మునిగిపోయారు. సుధాకర్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. చెళ్లకెరె నుంచి ఎమ్మెల్యేగా చిత్రదుర్గ జిల్లా చెళ్లెకెరెకు చెందిన సుధాకర్ పారిశ్రామికవేత్తగా ఉండేవారు. ఈయన చిన్నాన్న ఎస్.జయణ్ణ చెళ్లెకెర నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జయణ్ణ తరువాత సుధాకర్ రాజకీయ ప్రవేశం చేసి చెళ్లకెరె నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నియోజకవర్గ పునర్విభజన తరువాత ఆయన హిరియూరు నుంచి 2008లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి సత్తా చాటుకున్నారు. బీజేపీ యడియూరప్ప ప్రభుత్వానికి మద్దతునిచ్చి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 2013 ఎన్నికల్లో హిరియూరు నుంచి కాంగ్రెస్ టికెట్‌తో గెలిచారు. తరువాత ఓటమి పాలైనా, 2023 ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ మంత్రి పదవిని చేపట్టారు. జైన సముదాయానికి చెందిన సుధాకర్, అన్నివర్గాల ఓటర్ల అభిమానాన్ని చూరగొన్నారు. సోమవారం మధ్యాహ్నం తరువాత చెళ్లకెరెలో ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరుగుతాయి. పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఆదివారమే హిరియూరుకు, ఆపై చెళ్లకెరెలోని స్వగృహానికి తీసుకెళ్లారు. ప్రముఖుల నివాళులు గవర్నర్ గెహ్లాట్, సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, బీజేపీ నేతలు యడియూరప్ప, ఆర్.అశోక్, చలవాది నారాయణస్వామి తదితరులు ఆస్పత్రికి వెళ్లి నివాళులర్పించారు. 3 రోజులు సంతాప దినాలు మంత్రి సుధాకర్ గౌరవార్థం ప్రభుత్వం ఆదివారం నుంచి 12వ తేదీ వరకు మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. ఈ రోజుల్లో ఎలాంటి ప్రభుత్వ వేడుకలు జరగవు. చిత్రదుర్గ జిల్లాలో సోమవారం ప్రభుత్వ సెలవును ప్రకటించారు. పార్థివ దేహానికి సీఎం సిద్దరామయ్య నివాళులు ప్రమాణ స్వీకార వేడుకలో కుటుంబంతో మంత్రి సుధాకర్ (ఫైల్) నాకు సన్నిహితుడు డిప్యూటీ సీఎం తీవ్ర విచారం మంత్రి డి.సుధాకర్ అప్పర్ భద్రా ప్రాజెక్ట్ కోసం పోరాడారు, ఆయన జ్ఞాపకార్థం ఆ పథకానికి సుధాకర్ పేరు పెట్టడం గురించి ఆలోచిస్తామని డీసీఎం శివకుమార్ తెలిపారు. ఇది చాలా దుఃఖకరమైన రోజు. నా సన్నిహిత మిత్రుడు, మంత్రి సుధాకర్ దూరమయ్యారు. గత ఒక నెల క్రితం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. శస్త్రచికిత్స తరువాత శ్వాసకోశ వ్యాఽధికి గురయ్యారు. కోమాలోకి వెళ్లారు. ఈ మధ్య మళ్లీ కోలుకొన్నారు. ఆయన కోలుకుని వస్తారని విశ్వాసముండేది. విదేశాల నుంచి కూడా వైద్యులను పిలిపించి చికిత్స చేయించాం, కానీ ఆదివారం తెల్లవారజామున 3:15 గంటలకు తుదిశ్వాస విడిచారు అని డీసీఎం తెలిపారు. భారత జోడో యాత్రలో ఐదు రోజులు ఆయనే పర్యవేక్షించారు, మరణవార్తను రాహుల్‌గాంధీకి తెలిపాను అని చెప్పారు. -
Bengaluru : ప్రధాని మోదీ కాన్వాయ్ మార్గంలో పేలుడు పదార్ధాల కలకలం
సాక్షి,బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సాయంత్రం బెంగళూరు శివార్లలో జరగనున్న బీజేపీ సభకు హాజరుకానున్నారు. ఈ సభకు మోదీ కాన్వాయ్ వచ్చే మార్గంలో జెలటిన్ స్టిక్స్ లభ్యమవ్వడం కలకలం రేపింది. అప్రమత్తమైన పోలీసులు అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. సమాచారం అందుకున్న బాంబు స్క్వాడ్ అక్కడికి చేరుకుని జెలటిన్ స్టిక్‌ను నిర్వీర్యం చేసింది.ఈ ఘటనతో సభ ప్రాంగణం చుట్టూ భద్రతా ఏర్పాట్లు మరింత కఠినతరం చేశారు పోలీసులు. అదనపు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, ప్రతి వాహనం, వ్యక్తిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తిని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతని నేపథ్యంతో పాటు ఈ ఘటనకు సంబంధం ఉన్న ఇతర వ్యక్తులపై కూడా విచారణ కొనసాగుతోంది. అధికారులు ఈ ఘటనను భద్రతా లోపంగా కాకుండా, ముందస్తు జాగ్రత్తలతో గుర్తించిన ప్రయత్నంగా పేర్కొన్నారు.ప్రధాని సభకు భారీ జనసందోహం హాజరయ్యే అవకాశం ఉండటంతో, పోలీసులు, ఇంటెలిజెన్స్ సంస్థలు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టాయి. భద్రతా సంస్థలు ఇప్పటికే సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నాయి. ఈ ఘటన కుట్రలో భాగమా లేదా స్థానిక స్థాయిలో జరిగినదా అన్నది తెలుసుకోవడానికి అధికారులు పరిశీలిస్తున్నారు. -
కాంగ్రెస్‌ది నమ్మక ద్రోహం
సాక్షి బెంగళూరు: కాంగ్రెస్ ఒక విశ్వాస ఘాతుక పార్టీ అని ప్రధాని మోదీ మండిపడ్డారు. అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్‌ను అధికారం నుంచి దూరం చేయాలని పేర్కొన్నారు. వెన్నుపోటు పొడిచే బుద్ధి ఆ పార్టీకి పుట్టుకతోనే వచ్చిందని, అధికారం కోసం ఏమైనా చేసేందుకు సిద్ధపడుతోందని నిప్పులు చెరిగారు. 2014 కంటే ముందు కేంద్రంలో పదేళ్లు డీఎంకే మద్దతుతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే అధికారం కోల్పోవడంతో వెంటనే వెన్నుపోటు పొడిచి కొత్త పార్టీని ఆశ్రయించిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కేవలం మిత్రపక్షాలను మాత్రమే వెన్నుపోటు పొడవలేదని, మహిళా రిజర్వేషన్ బిల్లును ఓడించడం ద్వారా దేశ మహిళలకు ద్రోహం చేసిందని విమర్శించారు. నమ్మక ద్రోహి కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం తర్వాత తొలిసారిగా ఆదివారం కర్ణాటక రాజధాని బెంగళూరుకు వచ్చిన మోదీని బీజేపీ నాయకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎన్ని రోజులు అధికారంలో ఉంటారో తెలియదని ఎద్దేవా చేశారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం ఖజానాను లూటీ చేసే పనిలో పడ్డారని ఆరోపించారు. హిమాచల్ ప్రదేశ్‌లో సఫాయి కారి్మకులకు వేతనాలు ఇవ్వడం లేదని, తెలంగాణలో రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయని, కేరళ ఎన్నికల్లో మెజారిటీ సాధించినప్పటికీ ఇంకా ముఖ్యమంత్రి ఎంపిక చేయడం సాధ్యపడడం లేదని వ్యాఖ్యానించారు. కేరళలో అధికారం తథ్యం బీజేపీ ఒక్కసారి అధికారంలోకి వస్తే రెండు, మూడుసార్లు ప్రజలు అధికారం అప్పగించేలా తమ పార్టీ పాలన ఉంటుందని ప్రధానమంత్రి తెలిపారు. అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలే ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో పదేళ్ల క్రితం కేవలం ముగ్గురు ఎమ్మెల్యేల బలం ఉన్న బీజేపీ ఇప్పుడు ఏకంగా 203 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిందని వెల్లడించారు. కేరళలో ప్రస్తుతం ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారని, అక్కడ పూర్తి మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే రోజు ఎంతో దూరంలో లేదని ధీమా వ్యక్తంచేశారు. సమాజం క్రియాశీలం అయినప్పుడే.. దేశ నిర్మాణంలో సమాజం క్రియాశీలకంగా పాలుపంచుకుంటే అప్పుడే ప్రభుత్వం విజయం సాధించినట్లు అని ప్రధానమంత్రి మోదీ తెలిపారు. దేశ ప్రజలు, సమాజం క్రియాశీలం అయినప్పుడే అతిపెద్ద సవాళ్లకు సామూహికంగా పరిష్కారం లభిస్తుందని చెప్పారు. బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ 45వ వార్షికోత్సవంతోపాటు శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ 70వ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భవ్య ధ్యాన మందిరాన్ని ప్రధాని ప్రారంభించారు. బెంగళూరు కేవలం సాంకేతిక నగరం కాదని, ఇదొక అధ్యాత్మిక నగరమని పేర్కొన్నారు. యోగా, ధ్యానం, ప్రాణాయామం దేశ సంస్కృతిలో అంతర్భాగాలని చెప్పారు. వీటిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు. #WATCH | Bengaluru | Prime Minister Narendra Modi says, "I have arrived in Bengaluru today at a time when discussions regarding election results are underway across the country. The formation of an NDA government in Puducherry for the second consecutive time, the formation of an… pic.twitter.com/lFNbQ429aS— ANI (@ANI) May 10, 2026 -
ఆమెకు ఉరిశిక్షే సరి
శివమొగ్గ: అనైతిక బంధానికి ఒడిగట్టిన భార్య చివరకు హత్యకూ వెనుకాడలేదు, ఫలితంగా కఠిన శిక్షకు గురైంది. అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే కోపంతో హత్య చేసిన కేసులో భార్య, ఆమె ప్రియునికి శివమొగ్గ జిల్లా భద్రావతి కోర్టు మరణశిక్షతో పాటు రూ. 14 లక్షల జరిమానా విధించింది. మత్తు మందు ఇచ్చి.. వివరాలు... 2020 జనవరి 15న, భద్రావతిలోని పేపర్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సురగీ టాప్కు చెందిన ఫ్లోరా నాన్సీ అనే మహిళ, తన ప్రియుడు రాజశేఖరయ్యతో కలిసి భర్త ప్రకాష్‌బాబుకు మత్తుమందు ఇచ్చి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అప్పటి కేసు దర్యాప్తు అధికారి, సీఐ మంజునాథ్.. దర్యాప్తును పూర్తి చేసి కోర్టుకు ఛార్జిషీట్ సమర్పించారు. భద్రావతిలోని 4వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో విచారణ సాగింది. ప్రభుత్వ ప్రాసిక్యూటర్ రత్నమ్మ వాదనలు వినిపించారు. ఫ్లోరా నాన్సీ, ప్రియునికి ఉరే సరైన శిక్ష అని వాదిస్తూ ఆధారాలను సమర్పించారు. నేరం రుజువు కావడంతో జడ్జి ఇందిరా మైలస్వామి చెట్టియార్.. ఇద్దరు దోషులకు ఉరిశిక్ష విధించాలని తీర్పు చెప్పడంతో పాటు రూ.14 లక్షల జరిమానా విధించారు. మృతుని తల్లిదండ్రులకు రూ. 5 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించారు. ప్రియునికి సైతం అదే శిక్ష భర్త హత్య కేసులో భద్రావతి కోర్టు తీర్పు -
నమో తిరుమలేశా
● చిక్క తిరుపతిలో విశేష పూజలు మాలూరు: ప్రసిద్ద యాత్రాస్థలం అయిన చిక్కతిరుపతి గ్రామంలోని శ్రీ ప్రసన్న వెంకట రమణస్వామి దేవాలయానికి రెండవ శనివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామి దర్శనం చేసుకున్నారు. వేసవి సెలవులు కావడంతో బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి భక్తజనం వచ్చారు. ప్రధాన అర్చకులు గోపాలకృష్ణ భరద్వాజ్, ఎన్ శ్రీధర్, కార్తీక్‌ల నేతృత్వంలో మూల విగ్రహానికి అభిషేకం, పంచామృత అభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూలతో స్వామి వారిని అలంకరించారు. గిగ్ కార్మికులకు సర్కారు వెబ్సైట్ బనశంకరి: డెలివరీ బాయ్స్ తదితర గిగ్ కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ వేదికను ప్రారంభించింది. ఆ వెబ్సైట్లో కార్మికుల తమ ఇబ్బందుల గురించి ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే, సదరు కంపెనీలకు ప్రభుత్వం బదిలీచేసి పరిష్కారం కనుగొంటారు. ఈ పోర్టల్ కార్మికులు– కంపెనీల మధ్య వారధిగా ఉంటుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి అనేక కంపెనీలతో చర్చలు జరుపుతున్నామని కార్మిక శాఖ అధికారులు తెలిపారు. ప్రతి కంపెనీ కూడా అంతర్గత వివాదాల పరిష్కార కమిటీలను కచ్చితంగా ఏర్పాటు చేయాలి. ఇప్పటివరకు 12 లక్షల గిగ్ కార్మికుల వివరాలను పోర్టల్‌లో నమోదు చేశారని తెలిపారు. ప్రతి కార్మికునికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యను అందించడం ద్వారా నకిలీల నమోదును తొలగిస్తున్నామని తెలిపారు. గుడికి వెళ్లివచ్చేలోగా ఇల్లు లూటీ మైసూరు: ఇంటి యజమాని లేని సమయంలో చొరబడిన దొంగలు బీరువాలోని సుమారు రూ.2.25 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను దోచుకున్నారు. ఈ ఘటన మైసూరు తాలూకా ఇలవాల సమీపంలో జరిగింది. ఓ కంపెనీలో మేనేజర్‌గా పనిచేసే ప్రవీణ్‌కుమార్ వినాయక ఎన్‌క్లేవ్‌లో నివసిస్తుంటారు. ఇంటికి తాళం వేసుకుని ఒంటికొప్పలు సమీపంలోని గుడికి వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చి చూడగా తలుపు తెరిచి ఉండటం కనిపించింది. కిటికీ అద్దాలు పగిలిపోయి ఉన్నాయి, ఇంట్లోకి వెళ్లి చూడగా చోరీ జరిగిన విషయం తెలిసింది. ఇలవాల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నదిలో అక్కా చెల్లి జలసమాధియశవంతపుర: ఈతకెళ్లిన బాలిక, యువతి నీటిపాలైన ఘటన దక్షిణకన్నడ జిల్లా కడబ తాలూకాలో జరిగింది. గుండ్యకు చెందిన నలుగురు అమ్మాయిలు స్థానిక నదిలో ఈత కొట్టాలని వెళ్లారు. లోతైన చోటుకు వెళ్లడంతో నీటిలో మునిగిపోయారు. వారిలో సునీత (21). అర్పిత (15)లు మునిగిపోగా, మిగతా ఇద్దరూ కేకలు వేశారు. దగ్గరలో ఉన్నవారు వచ్చి రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. ఇద్దరి మృతదేహాలను నదిలో నుంచి బయటకు తీశారు. వీరిద్దరూ అక్కా చెల్లెలని తెలిసింది. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కడబ పోలీసులు కేసు నమోదు చేశారు. పసికందును చంపిన వీధి కుక్క దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో వీధి కుక్కల దురాగతాలు అధికయ్యాయి. నిత్యం ఎక్కడో ఓ చోట జనంపై దాడులు చేస్తున్నాయి. బీదర్ జిల్లాలో ఘోరం జరిగింది. 5 నెలల పసికందుని వీధికుక్క బలితీసుకుంది. హుమ్నాబాద్ తాలూకా దుబలగుండి గ్రామంలో సిద్ధప్ప, సుధ దంపతుల కుమార్తె శివాని (5 నెలలు). శిశువు వారికి 4వ సంతానం. ఇంటి ఆవరణలో కుమార్తెను పడుకోబెట్టి తల్లి పని చేసుకుంటుండగా ఓ వీధి కుక్క చొరబడి చిన్నారిని తీవ్రంగా గాయపరిచింది. తల్లి కేకలు వేసి కుక్కను తరిమేసింది. చిన్నారిని బ్రిమ్స్ జిల్లా ఆస్పత్రికి తరలించగా, కొంతసేపటికి పసికందు మరణించడంతో తల్లి బోరున విలపించింది. అటవీ మంత్రి ఈశ్వర్ ఖండ్రే ఆ కుటుంబానికి సంతాపం తెలిపారు. -
ఈడీ అదుపులో హ్యాకర్ శ్రీకృష్ణ
బనశంకరి: రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన బిట్‌కాయిన్ కుంభకోణంలో బెంగళూరులో ఈడీ అధికారులు సూత్రధారి శ్రీకృష్ణతో పాటు ముగ్గురిని శనివారం అరెస్ట్ చేశారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వ ఈ–ప్రొక్యూర్మెంట్ వెబ్‌సైట్‌ను హ్యాక్‌చేసి కోట్లాది రూపాయలను దోచుకున్నారని వీరిపై కేసు నడుస్తోంది. గతంలో సిట్ దర్యాప్తులో హ్యాకర్ శ్రీకృష్ణ చే అనేక డిజిటల్ వ్యాలెట్లు చోరీ అయినట్లు వెల్లడైంది. ఈ కేసుల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే హ్యారిస్ కుమారుడు మహమ్మద్ నలపాడ్‌ను రెండుసార్లు సిట్ విచారించింది. ఇప్పుడు శ్రీకృష్ణను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు మరికొందరి పాత్రపై కూపీలాగుతున్నారు. భారీగా నగదు మార్పిడి ఏప్రిల్‌లో ఎమ్మెల్యే హ్యారిస్, నలపాడ్ నివాసాలలో ఈడీ అధికారులు రోజంతా సోదాలు చేపట్టడం తెలిసిందే. శ్రీకృష్ణ హ్యాక్ చేసిన బిట్కాయిన్లను క్రిప్టో ద్వారా నగదుగా మార్చుకుని పలువురికి బదిలీ చేసినట్లు అనుమానాలున్నాయి. శ్రీకృష్ణ ముంబైకి చెందిన వ్యక్తి ద్వారా నలపాడ్ అకౌంట్ కు రూ.10 లక్షలు జమ చేసినట్లు ఆరోపణలున్నాయి. మొత్తం రూ.4.5 కోట్ల అక్రమ కార్యకలాపాలు జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. గతంలో సిట్, ఇటీవల సోదాల్లో సేకరించిన సమాచారం ఆధారంగా ఇప్పుడు శ్రీకృష్ణను అరెస్ట్ చేశారు. దీంతో కొందరు చిక్కుల్లో పడే అవకాశం ఉంది. శ్రీకృష్ణ అరెస్ట్ బెంగళూరు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. బిట్కాయిన్ల దోపిడీ కేసుల్లో అరెస్టు మరికొందరి పాత్రపై కూపీ బెంగళూరులో కలకలం -
వివాహ వార్షికోత్సవం వేళ.. విషాద హేల
తుమకూరు: వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆనందంగా పుణ్యక్షేత్రానికి వెళ్లివస్తున్న దంపతులతో పాటు బంధువులు తిరిగిరాని లోకాలకు వెళ్లారు. తుమకూరు జిల్లాలోని కుణిగల్ తాలూకాలో హైవే – 33లో హొన్నెనహళ్లి సమీపంలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. మండ్య జిల్లాలోని స్వర్ణనగరకు చెందిన శుభ (60), కె.ఆర్. గాయత్రి (60), ఈమె భర్త కుమార్ నరసింహమూర్తి (65), కారు డ్రైవర్ రఘు కుమార్ (56) మృతులు. వీరందరూ ఒకే కుటుంబానికి చెందినవారని తెలిసింది. గాయత్రీ, కుమార్ల 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా తుమకూరులోని దేవరాయనదుర్గలో ఉన్న యోగనరసింహ స్వామి ఆలయంలో పూజలు చేసుకుని కారులో సొంతూరికి వెళ్తున్నారు. ఘటనాస్థలంలో ఓవర్టేక్ చేసే క్రమంలో ఒక లారీ వేగంగా వచ్చి వీరి కారును ఢీకొట్టింది. ఎగిరిపడిన కారు ఆ ధాటికి కారు దూరంగా ఎగిరిపడగా, నలుగురూ దుర్మరణం చెందారు. కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. స్థానికులు, కుణిగల్ పోలీసులు కారులోనుంచి మృతదేహాలను వెలికితీసి ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. ఇదే ప్రాంతంలో మూడు రోజుల వ్యవధిలో రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మరణించారు. ప్రమాద స్థలంలో హైవే, స్థానిక అధికారులు ఎలాంటి పరిష్కార చర్యలు చేపట్టకపోవడంతో ప్రాణనష్టం జరుగుతోంది. ఆలయానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం దంపతులు, బంధువుల మృతి తుమకూరు జిల్లాలో ఘటన -
త్వరలోనే సీఎం కుర్చీ సమస్యకు తెర: మంత్రి ్చ
దొడ్డబళ్లాపురం: ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన సీఎం కుర్చీ మార్పు, మంత్రివర్గ విస్తరణ రెండు సమస్యలు త్వరలో కొలిక్కి వస్తాయని మంత్రి కేహెచ్ మునియప్ప తెలిపారు. శనివారంనాడు బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ హైకమాండ్ అన్ని సమస్యలనూ త్వరలో పరిష్కరిస్తుందన్నారు. ముఖ్యమంత్రి మార్పు ఉంటుందా, లేదా అనేది త్వరలో తెలుస్తుందన్నారు. ఎన్నికల సంఘం సర్ ప్రక్రియ గురించి ముఖ్యమంత్రి అధ్యక్షతన భేటీ జరిగిందని, సర్‌పై దేశవ్యాప్తంగా గందరగోళం ఉందన్నారు. సర్ దుర్వినియోగాన్ని అరికట్టడం గురించి చర్చలు జరిగాయన్నారు. పెద్ద సంఖ్యలో ఓట్లను తొలగించడం అనుమానాలను కలిగిస్తోందన్నారు. బెంగాల్లో మమత బెనర్జీ ఈ విషయం చర్చకు వచ్చిందన్నారు. తమిళనాడులో టీవీకే విజయ్‌కి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇచ్చి తరువాత బలపరీక్షకు సమయం ఇవ్వాలన్నారు. -
ఈజీపుర ఫ్లై ఓవర్ పనులకు మోక్షం
బనశంకరి: బెంగళూరు దక్షిణ పాలికె పరిధిలో కొన్నేళ్లుగా సాగుతున్న ఈజీపుర కేంద్రీయ సదన ఫ్లై ఓవర్ పనులు వేగవంతమయ్యాయి. ఈ వంతెన పొడవు 2.38 కిలోమీటర్లు కాగా, ఎన్నో ఏళ్లుగా నిర్మాణం నత్తనడకన సాగుతోంది. సెయింట్‌జాన్స్ ఆస్పత్రి వద్ద సంక్లిష్టమైన పోర్టల్ ఫ్రేమ్ పనులు నిలబడి పోగా, ఫిబ్రవరిలో వాటిని పరిష్కరించారు. ఇక్కడ భూస్వాధీనం పెండింగ్‌లో ఉండింది. ర్యాంప్స్ చివరి పనులను పూర్తిచేసి ఈ ఏడాదిలోగా ప్రజల సంచారానికి పచ్చజెండా ఊపే చాన్సుంది. కాంట్రాక్టర్లు మారుతూ.. 2017 మే 4వ తేదీన రూ.203 కోట్ల వ్యయంతో ఈజీపుర పై వంతెన పనులకు నాంది పలికారు. కానీ కాంట్రాక్టు సంస్థ అలసత్వం, వివిధ సమస్యల వల్ల పనులు ఒకడుగు ముందుకు, రెండడుగులు వెనక్కు చందంగా జరగడంతో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. హైకోర్టు ఆదేశాలతో 2022 మార్చిలో మరో సంస్థకు నిర్మాణ కాంట్రాక్టును అప్పగించారు. అక్టోబరులోగా పూర్తిచేసి సంచారానికి అందుబాటులోకి తీసుకువస్తామని ఈజీపుర పథకం చీఫ్ ఇంజనీర్ రాఘవేంద్ర ప్రసాద్ తెలిపారు. అక్టోబరులో ప్రారంభానికి సన్నాహాలు -
సీహెచ్ పౌడర్ విక్రేత అరెస్ట్
రాయచూరు రూరల్: సీహెచ్ పౌడర్ విక్రయించిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు నేతాజీ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ బసవరాజ్ వెల్లడించారు. నగరంలోని బోళమానుదొడ్డి శ్రీకృష్ణ దేవరాయ కాలనీలో మారెప్ప(52) అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 84 లీటర్ల సీహెచ్ పౌడర్ ప్యాకెట్లను స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రైతు మహిళలకు బ్యాంక్ రుణాలురాయచూరు రూరల్: మహిళలకు, రైతులకు బ్యాంక్ నుంచి రుణాలిస్తామని ఢిల్లీకి చెందిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏజీఎం దీప్ కుమార్ పేర్కొన్నారు. నగరంలోని ప్రైవేట్ భవనంలో వ్యవసాయ మేళాను ప్రారంభించి ఆయన మాట్లాడారు. రాయచూరు జిల్లాలో స్వసహాయ మహిళా గుంపులకు ఈ ఏడాది రూ.6 కోట్ల మేర రుణాలిచ్చామన్నారు. రాష్ట్రంలో 240 ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు రైతులు, మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలనే ఉద్దేశ్యంతో రుణాలిచ్చి వారిని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హుబ్లీ ఆర్ఎంఓ సూర్యమని సాహూ, అశోక్, షేక్ అస్రార్, రవీంద్ర నాథ్ సింగ్, విశాల్, శంకర్, ఆనంద్, బాలకృష్ణ, పద్మలున్నారు. కసాయిల బారి నుంచి రక్షించండి రాయచూరు రూరల్ : నగరంలోని పశువుల సంతలో విక్రయానికి తెచ్చిన పశువులను ఇతర చోటికి తరలించడానికి కసాయిలు ఇబ్బందులు కలిగిస్తున్నారని, వారి నుంచి రైతులను రక్షించాలని హిందూ మంచ్ ఏక్తా మైనార్టీ సంఘం డిమాండ్ చేసింది. శనివారం ఎస్పీ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు ఫైజల్ ఖాన్ మాట్లాడారు. జిల్లాలో ఖురేషి సమాజం వారు జంతువులను కొనుగోలు చేయడం, ఇతర సంతల్లో వాటిని విక్రయించడం పరిపాటి అని, దానిని ఆసరాగా చేసుకొని కసాయిలు వారిపై దాడి చేసి, పశువులను లాక్కొని తక్కువ ధరకు ఇవ్వాలని వేధించడం వంటి సంఘటనలు పునరావృతం కావడం వల్ల అలాంటి వారి బారి నుంచి రక్షించాలని కోరుతూ ఎస్పీ అరుణాంగ్శు గిరికి వినతిపత్రం సమర్పించారు. అభిమానోత్సవానికి బస్సుల మళ్లింపు● బస్టాండ్‌లో ప్రయాణికుల లబోదిబో హొసపేటె: నగరంలో శనివారం సరిగా ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు తమ ఊర్లకు వెళ్లేందుకు బస్సులు లేక బస్టాండ్‌లో గంటల తరబడి వేచి ఉండి నానా ఇబ్బంది పడ్డారు. మాజీ ముఖ్యమంత్రి బీఎస్.యడియూరప్ప 50 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో పొరుగు జిల్లా చిత్రదుర్గలో ఏర్పాటు చేసిన అభిమానోత్సవానికి ఒప్పంద ప్రాతిపదికన బస్సులన్నీ మళ్లించగా, బస్సులు లేక గమ్యస్థానాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు నరకయాతన పడ్డారు. బస్టాండ్‌లో ప్రయాణికులు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ బస్టాండ్‌కు బస్సులు రాకపోవడం వల్ల సండూరు, కొప్పళ, కంప్లి, బళ్లారి, గంగావతి, కూడ్లిగి, కొట్టూరు, హగరిబొమ్మనహళ్లి, హగడలి వంటి పట్టణాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు బస్సుల కోసం పడిగాపులు పడ్డారు. నియామకంరాయచూరు రూరల్: రాయచూరు జిల్లా విద్యా శాఖాధికారిగా మల్లికార్జునను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇక్కడ విధులు నిర్వహిస్తున్న బడిగేరను గదగ్‌కు బదిలీ చేశారు. ఆయన స్థానంలో రాయచూరు డయట్ సీనియర్ అధ్యాపకుడిగా, దేవదుర్గ తాలూకా విద్యాశాఖాధికారిగా పని చేస్తున్న మల్లికార్జునను నియమించారు. -
సహజీవనంలో దారుణం
బనశంకరి: సహజీవన బంధాలు ఎక్కువగా విషాదంతోనే ముగుస్తున్నాయి. అలాంటి ఉదంతమే ఇది. మహిళతో కలిసి జీవిస్తున్న యువకుడు ఉరివేసుకున్న రీతిలో శవమయ్యాడు, బెంగళూరు రాజగోపాలనగర పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. వివరాలు.. చిత్రదుర్గకు చెందిన తిప్పేస్వామి(28), దావణగెరె (35) మహిళ ఒకే గార్మెంట్స్‌లో పనిచేస్తూ ఇన్‌స్టా ద్వారా పరిచయమై ప్రేమలో పడ్డారు. మహిళకు వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. భర్త , పిల్లలను వదిలిపెట్టి తిప్పేస్వామితో వచ్చేసింది. రెండునెలల క్రితం బెంగళూరు శ్రీగంధనగరలో బాడుగ ఇల్లు తీసుకుని భార్యాభర్తలం అని చెప్పి జీవిస్తున్నారు. కొంతకాలంగా మహిళ గొంతెమ్మ కోర్కెలతో తిప్పేస్వామిని ఇబ్బంది పెడుతోంది. దీంతో విరక్తి చెందిన అతడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మహిళ పరారైంది. యువకుని సంబంధీకుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు ఆ మహిళపై కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. మహిళ వేధింపులకు యువకుడు బలి


