రాయచూరు రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జారీ చేసిన నాలుగు కార్మిక చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. మంగళవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు శరణ బసవ మాట్లాడారు. ప్రభుత్వ, రైతు, వ్యవసాయ, ఏపీఎంసీ, విద్యుత్, కార్మిక చట్టాలను జారీ చేయడం వల్ల రైతు, కార్మిక, వ్యవసాయ కూలీలు అన్ని విధాలుగా నష్టపోతారన్నారు. ప్రైవేట్ పెట్టుబడిదారులకు మద్దతు పలుకుతూ ఎర్ర తివాచీ పరచడాన్ని తప్పుబట్టారు. నరేగను తొలగించి వికసిత్ భారత్ మిషన్ రోజ్‌గార్ పేరును నమోదు చేయడం తగదని పేర్కొన్నారు. నరేగ పథకం తొలగింపుతో నేడు వలస వెళుతున్న కూలీలు, కార్మికుల భవిష్యత్ అంధకారమైందన్నారు. దేశంలో 12 కోట్ల మంది వ్యవసాయ కూలీ కార్మికుల పొట్ట కొట్టిందన్నారు. ఆందోళనలో వీరనగౌడ, వరలక్ష్మి, సంతోష్, శరణ, వీరేష్, దివాకర్, నిర్మల, నిసార్, జిలాని పాషా, చంద్రకళ, కస్తూరి, సురేష్, పద్మావతి, రహమత్‌లున్నారు.


