డియర్‌ విజయ్‌ హ్యాట్సాఫ్‌ : హీరో విశాల్‌ ప్రశంసలు | What A Move Actor Vishal Reacts To CM Vijay Liquor Ban | Sakshi
Sakshi News home page

డియర్‌ విజయ్‌ హ్యాట్సాఫ్‌ : హీరో విశాల్‌ ప్రశంసలు

May 12 2026 4:53 PM | Updated on May 12 2026 5:03 PM

What A Move Actor Vishal Reacts To CM Vijay Liquor Ban

తమిళనాట సంచలన విజయాన్ని నమోదు చేసి,  రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్‌ తీసుకున్న తాజా నిర్ణయంపై  హీరో విశాల్‌ స్పందించారు.  తన తొలి సంతకంతోనే మరో సంచలనం క్రియేట్‌ చేసిన సీఎం విజయ్‌ నిర్ణయంపై  విజయ్‌ చిరకాల మిత్రుడు,  విశాల్ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. విజయ్‌  ప్రభుత్వ ఏర్పాటులో జాప్యంపై కూడా  విశాల్‌ స్పందించారు. 

రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలు, పాఠశాలలు మరియు బస్టాండ్‌లకు 500 మీటర్ల లోపు ఉన్న 717 మద్యం దుకాణాలను (TASMAC) మూసివేస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై  మరోవైపు సినిమా రంగం నుండి రాజకీయాల్లోకి వచ్చి,  అధికారాన్ని చేపట్టడం, తొలి నిర్ణయంతోనే తనదైన ముద్ర వేయడంతో విజయ్ అభిమానులు, తమిళ ప్రజలు సోషల్ మీడియాలో ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

"ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ హ్యాట్సాఫ్. పాఠశాలల సమీపంలోని 717 మద్యం దుకాణాలను మూసివేయడం గొప్ప నిర్ణయం. స్కూళ్ల దగ్గర మద్యం దుకాణాల వల్ల ఎంతోమంది ఆడపిల్లలు వేధింపులకు గురవుతున్నారు. ఈ చర్యతో వారికి ఊరట లభిస్తుంది.  వాటిని మూసివేస్తున్నట్లు ప్రకటించినందుకు ధన్యవాదాలు. ఎంత గొప్ప చర్య," అని విజయ్‌కు పంపిన వీడియో సందేశంలో విశాల్ పేర్కొన్నారు. అంతేకాదు "ప్రియమైన విజయ్, దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈ రోజు మీకు, మీ ప్రభుత్వానికి నేను సెల్యూట్ చేస్తున్నాను," అంటూ మరో పోస్ట్‌లో తన సంతోషాన్ని ప్రకటించారు.

చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజులకే విజయ్ ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. విద్యాసంస్థలు, ప్రార్థనా స్థలాల వద్ద మద్యం షాపుల కారణంగా సామాన్య ప్రజలు, ముఖ్యంగా విద్యార్థినులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

 కాగా విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ మొత్తం 234 స్థానాల్లో 108 స్థానాలను గెలుచుకుంది. అయితే  పూర్తి మెజారిటీకి (118) పది సీట్లు తక్కువ కావడంతో, వారం రోజుల హైడ్రామా తర్వాత కాంగ్రెస్, వామపక్షాలు,వీసీకే మద్దతుతో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.  సీఎంగా ప్రమాణం చేసిన తరవాత మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్‌, ఇతర  కీలక నేతలను  గౌరవప్రదంగా కలుసుకోవడం  కూడా నెట్టింట ఆకర్షణీయంగా మారింది.

 

 

Advertisement
 
Advertisement
Advertisement