వైఎస్ జగన్ ఇవాళ (మే 12, మంగళవారం) అనంతపురం జిల్లా పామిడిలో పర్యటించారు.
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ డాక్టర్ ఎ.మధుసూధన్ కుమారుడు, అనంతపురం ఏడీసీసీ బ్యాంక్ మాజీ ఛైర్మన్ ఎం.వీరాంజనేయులు (వీరా) కుమార్తెల వివాహ రిసెప్షన్‌కు ఆయన హాజరయ్యారు.
వైఎస్ జగన్‌ను చూసేందుకు అభిమానులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిచ్చారు.
జగన్ అభిమానులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో రావడంతో సందడి వాతావరణం నెలకొంది.
తన కోసం వచ్చిన అభిమానులు, కార్యకర్తలకు రెండు చేతులు జోడించి జగన్ అభివాదం చేశారు.
వధూవరులకు వివాహ శుభాకాంక్షలు తెలిపి, ఆశీర్వదించారు వైఎస్ జగన్.


