వారణాసి ఎయిర్‌పోర్టులో గన్‌ మిస్‌ఫైర్‌.. ఇద్దరికి గాయాలు | Air India passenger Suffer Gun Misfire at Varanasi airport | Sakshi
Sakshi News home page

వారణాసి ఎయిర్‌పోర్టులో గన్‌ మిస్‌ఫైర్‌.. ఇద్దరికి గాయాలు

Aug 16 2026 12:13 PM | Updated on Aug 16 2026 12:13 PM

Air India passenger Suffer Gun Misfire at Varanasi airport

లక్నో: వారణాసి విమానాశ్రయంలో ఆదివారం భారీ ప్రమాదం తప్పింది. ఆయుధాల తనిఖీ సమయంలో ఓ ప్రయాణికుడి వద్ద ఉన్న పిస్టల్‌ అనుకోకుండా పేలడంతో ఇద్దరు విమానాశ్రయ సిబ్బంది గాయపడ్డారు. దీంతో, విమానాశ్రయంలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.

వివరాల మేరకు.. అజాంగఢ్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్యతో కలిసి ఎయిర్ ఇండియా విమానం IX-1810లో ముంబై వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చాడు. అతని వద్ద పిస్టల్‌, మ్యాగజైన్ ఉండగా.. ప్రయాణానికి ముందే ఆయుధాల వివరాలను అధికారులకు వెల్లడించాడు. ఆదివాయం ఉదయం సుమారు 9.30 గంటల సమయంలో ఆయుధం, సంబంధిత పత్రాలను తనిఖీ చేస్తున్న సమయంలోనే పిస్టల్‌ నుంచి ఓ రౌండ్‌ పేలింది. ఈ ఘటనలో సమీపంలో ఉన్న ఇద్దరు సిబ్బంది తగలి గాయపడ్డారు.

తుపాకీ నుంచి వెలువడిన బుల్లెట్‌ తొలుత నేలను తాకి అనంతరం సిబ్బందిని తాకినట్లు అధికారులు తెలిపారు. ఓ మహిళా సిబ్బందికి తొడ భాగంలో బుల్లెట్‌ గాయం కాగా, మరో పురుష సిబ్బంది చేతికి గాయమైంది. ఈ క్రమంలో గాయపడిన ఇద్దరినీ చికిత్స నిమిత్తం న్యూ లక్ష్మీ ట్రామా సెంటర్‌కు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని వారణాసి విమానాశ్రయ డైరెక్టర్ పునీత్ గుప్తా తెలిపారు. ఆయుధం, దాని పత్రాల తనిఖీ సమయంలో ఆయుధ యజమాని, విమానాశ్రయ సిబ్బంది అక్కడే ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఘటనపై స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో దర్యాప్తు కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement