బుల్లెట్ రైలు: ముంబై-సూరత్ స్టేషన్ల ఫస్ట్‌ లుక్‌! | Mumbai-Ahmedabad Bullet Train Project Nears Milestone As Surat, BKC Stations Take Shape For 2027 Launch, More Details Inside | Sakshi
Sakshi News home page

బుల్లెట్ రైలు: ముంబై-సూరత్ స్టేషన్ల ఫస్ట్‌ లుక్‌!

Aug 16 2026 8:31 AM | Updated on Aug 16 2026 12:27 PM

Mumbai-Surat Bullet Train Stations Take Shape Ahead of 2027 Launch

ముంబై: ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైలు కారిడార్ నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ), సూరత్ స్టేషన్ల తాజా దృశ్యాలు ప్రాజెక్ట్ పురోగతిని స్పష్టం చేస్తున్నాయి. సూరత్ స్టేషన్‌లో ఇంటీరియర్ ఫినిషింగ్ పనులు తుది దశకు చేరుకోగా, ముంబైలోని భూగర్భ బీకేసీ స్టేషన్ నిర్మాణం శరవేగంగా సాగుతోంది. భారతదేశపు తొలి ప్రత్యేక హై-స్పీడ్ రైలు ప్రాజెక్టైన 508 కిలోమీటర్ల ఈ కారిడార్ ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు 12 స్టేషన్లతో అనుసంధానమై ఉంది. ఈ రైళ్లు గంటకు 320 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించేలా ఈ ప్రాజెక్ట్‌ను రూపకల్పన చేశారు.
 

సూరత్ డైమండ్ ఇండస్ట్రీ స్ఫూర్తితో స్టేషన్ డిజైన్
ఈ కారిడార్‌లో అత్యంత ఆధునిక స్టేషన్లలో సూరత్ ఒకటి. దీని నిర్మాణం, రూఫింగ్ పూర్తికాగా ప్రస్తుతం ఇంటీరియర్ ఫినిషింగ్ కొనసాగుతోంది. సూరత్ నగరానికి గుర్తింపు అయిన వజ్రాల కటింగ్ పరిశ్రమ స్ఫూర్తితో ఈ స్టేషన్‌ను తీర్చిదిద్దారు. మెట్లు, ప్లాట్‌ఫారమ్‌లు, సీలింగ్ పనులతో పాటు ట్రాక్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. అలాగే గుజరాత్‌లో సూరత్-వాపి సెక్షన్ మధ్య సివిల్ పనులు పూర్తయ్యాయి.

భూగర్భంలో ముంబై బీకేసీ స్టేషన్
ముంబై వైపు ఈ కారిడార్‌కు ప్రారంభ స్టేషన్‌గా ఉన్న బీకేసీ స్టేషన్‌ను భూగర్భంలో సుమారు 30 మీటర్ల లోతులో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో ఇదే అత్యంత క్లిష్టమైన ఇంజనీరింగ్ పనులలో ఇది ఒకటి. ముంబై-అహ్మదాబాద్ మార్గంలో ముంబై బీకేసీ, థానే, విరార్, బోయిసర్, వాపి, బిలిమోరా, సూరత్, భరూచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్, సబర్మతి సహా మొత్తం 12 స్టేషన్లు ఉంటాయి.

మొదటి సర్వీస్‌ ఎప్పుడంటే?
ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి తొలి సెక్షన్ సేవలు 2027 ఆగస్టులో ప్రారంభం కానున్నాయి. సూరత్ నుంచి వాపి మధ్య సుమారు 100 కిలోమీటర్ల మేర తొలి సర్వీస్ నడుపనున్నారు. ఈ తొలి సర్వీస్ కోసం బీఈఎంఎల్‌లో తయారవుతున్న మేడ్ ఇన్ ఇండియా ‘భారత్’ బుల్లెట్ రైలును ఉపయోగించనున్నారు. ఈ పూర్తి కారిడార్ అందుబాటులోకి వస్తే ముంబై-అహ్మదాబాద్ ప్రయాణ సమయం కేవలం ఒక గంట 58 నిమిషాలకు తగ్గనుంది.

ఇది  కూడా చదవండి: ఒకే నంబరుతో రెండు విమానాలు.. తప్పిన పెను ప్రమాదం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement