కొబ్బరి పీచుతో సముద్ర కాలుష్యానికి చెక్‌..! టెన్త్‌ స్టూడెంట్‌ ఆవిష్కరణ | hawaii high school senior vera wang who built a coconut based ocean filter | Sakshi
Sakshi News home page

coconut based ocean filter: కొబ్బరి పీచుతో సముద్ర కాలుష్యానికి చెక్‌..! టెన్త్‌ స్టూడెంట్‌ ఆవిష్కరణ

Aug 15 2026 5:12 PM | Updated on Aug 15 2026 5:20 PM

hawaii high school senior vera wang who built a coconut based ocean filter

కాలుష్యంతో నిండిన సముద్రపు నీటిని శుభ్రం చేయడానికి హవాయి హైస్కూల్‌ విద్యార్థి వేరావాంగ్‌(vera wang) అద్భుతమైన ఆవిష్కరణకు నాంది పలికాడు. సముద్రపు నీటి నుంచి మైక్రోప్లాస్టిక్, సన్‌స్క్రీన్‌లు(మనం స్నానం చేసేటప్పుడు లేదా సముద్రంలో ఈత కొట్టేటప్పుడు ఈ రసాయనాలు నీటిలో కలుస్తాయి.) ఫిల్టర్‌ చేయడానికి కొబ్బరి వ్యర్థాలు ప్రభావంతంగా పనిచేస్తాయని గుర్తించింది. 

సాధారణ హైస్కూల్‌ ప్రాజెక్టుగా మొదలైన ఈ పరిశోధన ఓ సరికొత్త శాస్త్రీయ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. కొబ్బరి పీచులో సహజంగా లభించే శిలీంధ్రాలు ప్లాస్టిక్‌, సన్‌స్క్రీన్‌ను విచ్ఛిన్నం చేయగలవని తెలిసింది. ఆ నేపథ్యంలోనే కొబ్బరి ఆధారిత సముద్ర ఫిల్టర్‌లను అభివృద్ధి చేసే ప్రాజెక్ట్‌ని రూపొందించాడు. ఈ ఫిల్టర్‌లలో ఉపరితల నీటి నుంచి మైక్రోప్లాస్టిక్‌లు, సన్‌స్క్రీన్‌ను తొలగించేలా కొబ్బరి ఉప-ఉత్పత్తులను ఉపయోగించినట్లు పేర్కొంది. ఆ విధ్యార్ధి హవాయిలోని మానోవా విశ్వవిద్యాలయంలో ఆంథోనీ అమెండ్ ప్రయోగశాలలో  ఈ పరిశోధన చేసింది. కొబ్బరిపీచుకు గాలి, నీరు ప్రవహించడానికి వీలు కల్పించే రంధ్రాల నిర్మాణం ఉందని, ఇది సూక్ష్మజీవుల పెరుగదలకు ఉపకరిస్తుందని గుర్తించింది. 

అందువల్ల ఈ కొబ్బరి పీచు కేవలం కాలుష్య కారకాలను బంధించడం కంటే ఎక్కువ చేయగలదా అనే దిశగా చేయగా..అది అద్భుతమైన ఫలితాలను అందించిందని తెలిపింది. ఆకొబ్బరిపీచులో సహజంగా లభించే శిలీంధ్ర సముదాయాలు సన్‌స్క్రీన్, ప్లాస్టిక్‌లను విచ్చిన్నం చేయగలదని అధ్యయనంలో నిరూపితమైందని వెల్లడించింది. ఇది పర్యావరణ శుద్ధిలో రెండు దశలను ప్రభావవంతంగా చేయగలదని పేర్కొంది. మాములుగా అయితే సముద్రంలో ప్లాస్టిక్‌ని వడకట్టి..దాన్ని ప్రాసెస్‌ చేసి విచ్ఛిన్నం చేయడం లేదా రీసైకిల్‌ చేయడం జరుగుతుంది. 

కానీ సన్‌స్క్రీన్‌ సమ్మేళనాలను మాత్రం విచ్చిన్నం చేయడం సులభం కాదు. అవి నీటిలో కలసిపోయి ఉంటాయి. కానీ ఈ కొబ్బరి పీచు ప్లాస్టిక్‌ని వడపోసి విచ్చిన్నం చేయడం తోపాటు సన్‌స్క్రీన్‌ వంటి ఇతర సమ్మేళనాలను సైతం విచ్చిన్నం చేసి శుభ్రపర్చగలదని వెల్లడించింది వాంగ్‌. అంతేగాదు ఈ హైస్కూల్‌ విద్యార్థి వాంగ్‌ పరిశోధనకు హవాయి స్టేట్ సైన్స్ అండ్‌ ఇంజనీరింగ్ ఫెయిర్‌లో గుర్తింపు లభించడమే కాకుండా సముద్ర పర్యావరణాలను పీడిస్తున్న కొన్ని అత్యంత మొండి కాలుష్య కారకాలను ఎదుర్కోవడానికి సరికొత్త మార్గాన్ని అందించింది.

(చదవండి: ఎవరీ కెప్టెన్ సోనియా సింగ్ చౌహాన్ ? స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీకి..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement