లైఫ్
కడుపులో ఉన్న కష్టాన్ని ఎవరితో పంచుకోవాలో తెలియక ఇటీవలి కాలంలో చాలామంది తమ వ్యక్తిగత బాధలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. దానివల్ల వారికి తాత్కాలిక ఉపశమనం లభించవచ్చేమో కానీ ముందు ముందు అనేక రకాల కొత్త సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది.
చాణక్యుడి ప్రకారం, ఐదు రకాల వ్యక్తులకు మన సమస్యలకు చెప్పుకోవడం వల్ల లేనిపోని తలనొప్పులను కొని తెచ్చుకున్నట్టే! ఇంతకీ ఆ అయిదు రకాల వ్యక్తులెవరో తెలుసా? ఓర్వలేనివారు... నెగటివ్ ఆలోచనలు ఉన్నవారు, కుత్సిత, కుట్ర స్వభావులు, తెలివి హీనులు, దేనినీ దాటడం చేతకాని వాళ్లు.. వీరు అయిదుగురితో ఏ విషయాన్నీ పంచుకోకూడదు.
మరి ఎవరితో పంచుకోవచ్చునంటారా... అక్కడికే వస్తున్నాం... సమస్యలు వచ్చినప్పుడు వాటిని గుండెల్లోనే దాచుకోవడం కూడా కష్టమే. అందుకే చాణక్యుడు ఒక పరిష్కారం చెప్పారు. మీకు అత్యంత నమ్మకమైన స్నేహితుడు, మీ గురువు లేదా మీ కుటుంబ సభ్యులతో మాత్రమే మీ మనసు విప్పి మాట్లాడండి. వీరు మాత్రమే మీకు సరైన దిశానిర్దేశం చేసి, సమస్య నుంచి గట్టెక్కించగలరు.


