ఇండిగో విమానం రద్దు : ఆగ్రహంతో రగిలిపోయిన మహిళ వీడియో వైరల్‌ | IndiGo flight cancellation passenger climbs luggage belt, lashes out at staff | Sakshi
Sakshi News home page

ఇండిగో విమానం రద్దు : ఆగ్రహంతో రగిలిపోయిన మహిళ వీడియో వైరల్‌

Aug 14 2026 6:01 PM | Updated on Aug 14 2026 6:09 PM

IndiGo flight cancellation passenger climbs luggage belt, lashes out at staff

ముందస్తు సమాచారం ఇవ్వకుడానే విమానం రద్దు కావడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మహిళా ప్రయాణికురాలు  గ్రౌండ్‌స్టాప్‌తో గొడవకు దిగిన ఘటన నెట్టింట వైరల్‌గా మారింది. బిడ్డ అనారోగ్యం కారణంగా ఆమె  అత్యవసరంగా విమానంలో వెళ్లాలని ప్లాన్‌ చేసుకున్నారు. తీరా ఫ్లైట్ క్యాన్సిల్‌ కావడంతో ఆమె ఆవేదన గురైంది.  ఒడిశాలోని భువనేశ్వర్‌ ఎయిర్‌పోర్టులో ఈ ఘటన  చోటు చేసుకుంది.

ఆగస్టు 13న భువనేశ్వర్ నుండి కోల్‌కతా వెళ్లాల్సిన ఇండిగో విమానం (6E 7352) సాంకేతిక లోపం వల్ల రద్దయింది. ఫ్లైట్ క్యాన్సిలేషన్‌తో తీవ్ర నిరాశకు గురైన ఒక మహిళా ప్రయాణికురాలు విమానాశ్రయంలోని లగేజీ బెల్ట్‌పైకి ఎక్కి  మరీ గొడవ చేయడం వివాదానికి దారి తీసింది.  ఇండిగో సిబ్బంది డెస్క్‌పై ఉన్న పేపర్లు, డాక్యుమెంట్లను విసిరికొడుతూ సిబ్బందిపై విరుచుకుపడింది. విమానంలో ప్రయాణించాల్సిన ఆ మహిళ బిడ్డ అనారోగ్యంతో ఉన్నాడని, ("ఇన్ కా బచ్చా బిమార్ హై") అందుకే ఆమె అంత ఆందోళన చెందిందని అక్కడ ఉన్న తోటి ప్రయాణికులు చెప్పారు. తోటి ప్రయాణికులు నీళ్లు ఇచ్చి ఆమెను శాంతపరిచేందుకు ప్రయత్నించినప్పటికీ  ఫలితం దక్కలేదు.  చివరికి సీఐఎస్‌ఎఫ్ (CISF) సిబ్బంది జోక్యం చేసుకుని, మీరు ఎయిర్‌పోర్ట్ ఆస్తికి నష్టం కలిగిస్తున్నారంటూ హెచ్చరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

 ఈ ఘటనకు సంబంధించిన  వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. గంటల తరబడి వేచి చూసిన తర్వాత సమాచారం సరిగ్గా ఇవ్వకుండా ఫ్లైట్ క్యాన్సిల్ చేయడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మరికొందరు ఇండిగోను తప్పుపట్టారు. ఆమె  ప్రవర్తన తప్పే అయినప్పటికీ   ఆమె కోపానికి కారణాన్ని, మానసిక స్థితిని కూడా అర్థం చేసుకోవాలని కొందరు కోరారు.

మరోవైపు విమానాలు రద్దయితే గ్రౌండ్ స్టాఫ్‌పై ప్రతాపం చూపడం సరికాదని, వారు కేవలం విధి నిర్వహణలో ఉంటారని నెటిజన్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ గౌరవంగా వ్యవహరించాలని హితవు పలికారు.ఎయిర్‌పోర్ట్ ఆస్తిని పాడుచేసినందుకు మరియు భద్రతా నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆమెను 'నో-ఫ్లై లిస్ట్' (విమాన ప్రయాణాల నుంచి నిషేధం)లో పెట్టాలని కొందరు డిమాండ్ చేశారు.


ఇండిగో స్పందన
ఈ ఘటనపై ఇండిగో సంస్థ స్పందిస్తూ ప్రకటన విడుదల చేసింది."ప్రీ-డిపార్చర్ తనిఖీలలో సాంకేతిక లోపం గుర్తించడం వల్ల సురక్షిత చర్యల్లో భాగంగా విమానాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. ప్రయాణికులకు ఆహారం, బస (అకామడేషన్), ప్రత్యామ్నాయ ప్రయాణ సౌకర్యాలు లేదా పూర్తి రీఫండ్ వంటి సౌకర్యాలు కల్పించాం. విమానాశ్రయం ఆస్తికి నష్టం కలిగించి నియమాలు ఉల్లంఘించిన సదరు మహిళను 'అన్‌రూలీ ప్యాసింజర్' (Unruly Passenger) గా గుర్తించి నిబంధనల ప్రకారం భద్రతా సంస్థలకు అప్పగించామని తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement