న్యూఢిల్లీ: అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా కీలక సూత్రధారి వీరేందర్ సింగ్ బసోయాను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అధికారులు. గత రెండేళ్లుగా పరారీలో ఉంటూ తప్పించుకుని తిరుగుతున్న వీరేందర్ సింగ్‌ను.. ఎన్సీబీ అధికారులు ఇంటర్‌పోల్ సాయంతో అదుపులోకి తీసుకుని భారత్‌కు రప్పించారు. సుమారు రూ. 13 వేల కోట్ల డ్రగ్స్ సంబంధిత కేసులో కింగ్ పిన్‌గా ఉన్న వీరేందర్ సింగ్‌ను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.
కోట్లాది రూపాయల విలువైన కొకైన్, సింథటిక్ డ్రగ్స్ అక్రమ రవాణా కేసుల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు వీరేందర్ సింగ్ బసోయా. దుబాయ్ కేంద్రంగా అంతర్జాతీయ డ్రగ్ సిండికేట్‌ను నడిపిస్తున్న వీరేందర్ సింగ్ బసోయాను యూఏఈలో అరెస్ట్ చేశారు. భారతీయ, అరేబియా అధికారుల సమన్వయంతో భారత్‌కు రప్పించిన ఎన్సీబీ.. అదుపులోకి తీసుకుంది.
బసోయాను యూఏఈ నుంచి భారత్‌కు తీసుకు వచ్చిన విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. విదేశాలలో దాక్కున్న మాదకద్రవ్యాల స్మగ్లర్లను నిర్దాక్షిణ్యంగా వేటాడి, వారి మొత్తం వ్యవస్థను ప్రభుత్వం అత్యంత కఠినమైన పద్ధతితో నాశనం చేస్తుందనడానికి ఇదొక ఉదాహరణ అని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలపై జీరో టోలరెన్స్ పద్ధతితో ఒక కొత్త మైలురాయిని సృష్టిస్తూ పరారీలో ఉన్న డ్రగ్స్ మాఫియా కింగ్ పిన్ వీరేందర్ సింగ్ బసోయాను యూఏఈ నుంచి భారత్‌కు రప్పించడంలో ఎన్సీబీ విజయం సాధించింది. డ్రగ్స్ సరఫరా దారులు ఎక్కడ ఉన్నా పట్టుకుంటామని మన ఏజెన్సీలు మరోసారి నిరూపించుకున్నాయి. భారత చట్టాలను వారు ఎట్టిపరిస్థితుల్లోనూ తప్పించుకోలేరని విషయం మరోసారి రుజువైంది’ అని పేర్కొన్నారు.
Modi govt is relentlessly tracking down drug traffickers hiding abroad and destroying their entire ecosystem with a ruthless approach.
Creating a new milestone in the policy of zero tolerance against narcotics, the NCB secured the return of fugitive drug kingpin Virender Singh…— Amit Shah (@AmitShah) August 14, 2026
రూ. 13 వేల కోట్ల డ్రగ్స్ సిండికేట్
వేల కోట్ల డ్రగ్స్ రాకెట్‌లో కీలక సూత్రధారిగా ఉన్న బసోయా.. 2023లో తన కుమారుడి వివాహం తర్వాత దేశం విడిచి పారిపోయాడు. ఆ తర్వాత 2024 అక్టోబర్‌లో ఢిల్లీ డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చిన క్రమంలో బసోయా పేరు తెరపైకి వచ్చింది.
2024, అక్టోబర్ 1వ తేదీన ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ జాతీయ రాజధానిలోని మహిపాల్‌పూర్ ఎక్స్‌టెన్షన్‌లో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో వారికి సుమారు 16 కిలోల కొకైన్ లాంటి పదార్థం, 547 కిలోల కొకైన్ మరియు 39.706 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి లభించాయి. అధికారులు తుషార్ గోయల్, హిమాన్షు కుమార్, మరియు ఔరంగజేబ్ సిద్ధిఖీ అనే ముగ్గురిని అరెస్టు చేశారు.
రెండు రోజుల తర్వాత, జతిందర్ సింగ్ గిల్ అలియాస్ జస్సీగా గుర్తించిన మరో వ్యక్తిని అమృత్‌సర్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. అక్టోబర్ 5న, పంజాబ్‌లో అతను ఉపయోగించిన ఫార్చ్యూనర్ వాహనాన్ని సోదా చేయగా, సుమారు 1.096 కిలోల డ్రగ్స్ బయటపడ్డాయి. కోర్టు రికార్డుల ప్రకారం, ఆ వాహనం బసోయా సోదరుడు రవీందర్‌కు చెందినది గుర్తించారు.
అక్టోబర్ 10వ తేదీన, ఢిల్లీలోని రమేష్ నగర్‌లో 208 కిలోల అనుమానిత డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్‌ను స్పైసీ స్నాక్స్ ప్యాకెట్లలో దాచి ఉంచారు. తదనంతరం, అక్టోబర్ 13న గుజరాత్‌లోని అంక్లేశ్వర్‌లో ఉన్న ఆవ్‌కర్ డ్రగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాంగణం నుండి 518.18 కిలోల మెఫెడ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
2026 జనవరిలో అదే సిండికేట్‌లో ప్రమేయం ఉన్నారనే ఆరోపణలపై సిక్కింలో తిలక్ ప్రసాద్ శర్మ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ కేసులో మొత్తం 14 మంది నిందితులను అరెస్టు చేసి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు ఢిల్లీ పోలీసులు
ఈ మొత్తం నెట్‌వర్క్‌కు విదేశాలతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. వీరేందర్ సింగ్ బసోయాతోపాటు సంసార్ ధునేలు దీనికి ప్రధాన సూత్రధారులుగా గుర్తించారు. వీరు అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా సామ్రాజ్యం మలేషియా, పాకిస్తాన్, థాయ్‌లాండ్, దుబాయ్‌ల వరకు విస్తరించి ఉన్నాయి. వీరు డ్రగ్స్‌ను ప్రధానంగా దక్షిణ అమెరికా నుండి దుబాయ్ మీదుగా భారతదేశానికి తీసుకువచ్చేవారు. బసోయా విదేశాల నుంచి తన నెట్‌వర్క్‌ను కొససాగిస్తూ తప్పించుకుని తిరుగుతూ తన డ్రగ్స్ మాఫియాలో కింగ్‌పిన్‌గా మారిపోయాడు. సుమారు రూ. 13,000 కోట్ల విలువైన డ్రగ్స్ సరఫరా కేసులో వీరేందర్ బసోయా ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు..
అక్టోబర్ 10న, ఢిల్లీలోని రమేష్ నగర్‌లో 208 కిలోల అనుమానిత డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్‌ను స్పైసీ స్నాక్స్ ప్యాకెట్లలో దాచి ఉంచారు. తదనంతరం, అక్టోబర్ 13న గుజరాత్‌లోని అంక్లేశ్వర్‌లో ఉన్న ఆవ్‌కర్ డ్రగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాంగణం నుండి 518.18 కిలోల మెఫెడ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.


