నేను తప్పు చేశా.. ఆ రూట్‌లో వెళ్లొద్దు | Punjab Man Warns Against Donkey Route In Tearful Video From Mexico | Sakshi
Sakshi News home page

నేను తప్పు చేశా.. ఆ రూట్‌లో వెళ్లొద్దు

Aug 14 2026 4:11 PM | Updated on Aug 14 2026 4:29 PM

Punjab Man Warns Against Donkey Route In Tearful Video From Mexico

డంకీ రూట్‌లో వెళ్లి మెక్సికోలో చిక్కుకుపోయిన ఓ పంజాబీ యువకుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  నేను తప్పు చేశాను.. ఎవరూ ఆ రూట్‌లో అమెరికాకు వెళ్లొద్దంటూ అభ్యర్థించాడు. ఆ వీడియోలో ఆ యువకుడు ఒక గదిలోని మంచంపై పడుకుని.. చేతులు జోడించి వేడుకుంటూ.. 'డంకీ' మార్గం ద్వారా ఎవరూ మెక్సికోకు రావద్దని విజ్ఞప్తి  చేశాడు.

ఆ వీడియోలో తాను తప్పించుకోవడానికి ప్రయత్నించిన తర్వాత తనపై దాడి చేశారని ఆ యువకుడు ఆరోపిస్తున్నాడు. తనను ఎంత తీవ్రంగా కొట్టారంటే.. తాను సరిగ్గా నడవలేకపోతున్నానని..  ఇదే పొరపాటును ఎవరూ చేయవద్దంటూ ఆ యుకుకులు పదే పదే విజ్ఞప్తి చేశాడు. సురక్షితంగా తీసుకువెళ్తామని నమ్మించిన ఏజెంట్లు తనపై తీవ్రంగా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేసిన ఆ యువకుడు.. అలాంటి ఏజెంట్ల మాటలు నమ్మొద్దంటూ హచ్చరించాడు.

అయితే, ఆ వీడియోలో అతని  పేరు, చిరునామా వెల్లడి కాలేదు. 33 సెకన్ల పాటు ఉన్న ఈ క్లిప్‌ను ఆగస్టు 13న అప్‌లోడ్ చేసినట్లు సమాచారం. 'డంకీ' మార్గం ద్వారా ప్రయాణించిన పలువురు యువకులు మెక్సికోలో చిక్కుకుపోయారని.. వారి భద్రత కోసం ప్రార్థనలు చేస్తున్నారని పలు సోషల్ మీడియా పోస్టులు కూడా పేర్కొంటున్నాయి.

విదేశాలకు అక్రమంగా వెళ్లేందుకు ఉపయోగించే మార్గాన్నే ‘డంకీ’ రూట్‌గా అంటారు. ఈ పదం.. పంజాబీ వాడుక భాషలో నుంచి  వచ్చింది. ప్లానింగ్‌ లేకుండా ఒకచోట నుంచి మరో ప్రాంతానికి వెళ్లడం.. నకిలీ పత్రాలతో షిప్‌ కంటైనర్లు, వాహనాల సీక్రెట్‌ కంపార్టుమెంట్లలో దేశ సరిహద్దులు దాటడం అన్నమాట. మంచి అవకాశాల కోసం విదేశాలకు వెళ్లాలనే కోరిక.. కానీ చదువు, సరైన అర్హతలు లేకపోవడంతో చాలామంది అక్రమ మార్గాలను ఎంచుకుంటున్నారు.

ముందుగా భారత్ నుండి కెనడాకు టూరిస్ట్ వీసాపై వెళ్తారు. టొరంటో చేరుకున్నాక ఏజెంట్ పిలుపు కోసం హోటళ్లలో వేచి ఉంటారు. అక్కడి నుండి 2,100 కి.మీ దూరంలోని మనిటోబా ప్రావిన్స్‌కు, ఆపై ఎమర్సన్ గ్రామానికి చేరుకుంటారు. ఇది సరిహద్దు ప్రాంతం. ఇక్కడ 40 డిగ్రీల చలిలో, మోకాళ్ల లోతు మంచులో నడుస్తూ అమెరికాలోకి ప్రవేశిస్తారు. దక్షిణ అమెరికా ద్వారా వెళ్లే ఈ మార్గం అత్యంత భయంకంగా ఉంటుంది. పనామా అడవులు, నదులు, కొండలను దాటాల్సి ఉంటుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement