breaking news
punjab
-
రణరంగంగా సెంట్రల్ జైలు : సూపరింటెండెంట్ పరిస్థితి విషమం
పంజాబ్‌లోని లూథియానా సెంట్రల్ జైలులో మరోసారి హింస చెలరేగింది. ఖైదీల మధ్య చెలరేగిన ఘర్షణ తీవ్ర రూపం దాల్చింది. వీరిని అదుపు చేయడానికి ప్రయత్నించిన జైలు సూపరింటెండెంట్ తీవ్ర గాయాల పాలు కావడం మరింత ఆందోళన రేపింది.మంగళవారం సాయంత్రం లూథియానాలోని తాజ్పూర్ రోడ్‌లోని సెంట్రల్ జైలులో రెండు గ్రూపుల ఖైదీల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగింది. జైలు అధికారులు, పోలీసు సిబ్బంది వారిని శాంతింప చేసేందుకు ప్రయత్నించినప్పుడు, ఖైదీలు పోలీసు అధికారులపై దాడి చేశారు. ఈక్రమంలో జైలు సూపరింటెండెంట్ కుల్వంత్ సిద్ధూ తలపై ఇటుకతో బలంగా కొట్టడంతో ఆయన స్పృహ కోల్పోయారు. వెంటనే అతన్ని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే జైలు డిఎస్పీ జగ్జీత్ సింగ్ , కొంతమంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) సిబ్బందితో సహా ఇతర సిబ్బంది కూడా ఇటుకల దాడిలో గాయపడ్డారు. ఖైదీలకు అసలు ఇటుకలు ఎలా వచ్చాయనేది ఆరాతీస్తే, జైలులోని గార్డెన్ బెడ్స్ నుంచి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సంఘటన తరువాత పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. అంబులెన్స్‌లు, అదనపు పోలీసు బలగాలను భారీగా తరలించారు. ప్రస్తుతం జైలును మూసివేసి పోలీస్ కమిషనర్ స్వపన్ శర్మ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.200 మందికి పైగా ఖైదీలు దాడిరెండు గ్రూపుల మధ్య గొడవ ఒకవైపు ఇద్దరు, మరోవైపు ముగ్గురుగా ఐదుగురు వ్యక్తుల మధ్య గొడవ మొదలైంది. మత కారణంగా తనను అవమానించారని ఆరోపణలతో ఇరు వర్గాలు ఘర్షణకు దిగారు. ఇరు పక్షాలు ఇటుకల విసురుకోవడంతో కొద్దిసేపటికే పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సుమారు 200 నుండి 250 మంది ఖైదీలు పోలీసులపై దాడి చేశారని అధికారులు తెలిపారు. ఈ సంఘటన తర్వాత, సెంట్రల్ జైలు వెలుపల పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జైలు ఆవరణలో దాదాపు 20 నిమిషాల పాటు సైరన్లు మోతతో దద్దరిల్లినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ ఘటనపై జైళ్ల మంత్రి లాల్జిత్ సింగ్ భుల్లార్ జైలు అధికారుల నుండి నివేదిక కోరారు. కాగా 2019, జూన్‌లో ఇదే జైలులో తీవ్ర ఘర్షణ చెలరేగింది. బ్యారక్ల లోపల హింసాత్మక తిరుగు బాటును అణిచి వేసేందుకు పోలీసులు 150 రౌండ్లకు పైగా కాల్పులు జరపవలసి వచ్చింది*A disturbance has broken out at the central jail in Ludhiana. Police have arrived at the scene, and according to sources, there are reports of clashes between inmates and the police.*+*Ludhiana a mini riot as prisoners clash at Ludhiana Central Jail (Tajpur Road) on Tuesday… pic.twitter.com/fEtZUwL4I3— Amit Bhardwaj (@AmmyBhardwaj) December 16, 2025 -
పిల్లల కోసం కాపురం.. రెండోసారీ భార్య మోసం!
అమృత్సర్: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జరిగిన ఓ ఉదంతం ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది. అమృత్‌సర్‌కు చెందిన రవి గులాటి 15 ఏళ్లుగా తన భార్య హిమానీతో సంసారం సాగిస్తున్నాడు. అయితే తాజాగా అతను తన భార్యను ఒక హోటల్లో మరొక వ్యక్తితో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఈ విధంగా ఆమె భర్తను మోసం చేయడం ఇది మొదటిసారి కాదు.భర్త తెలిపిన వివరాల ప్రకారం 2018లో కూడా ఆమె ఒక హోటల్లో వేరే వ్యక్తితో పట్టుబడింది. అప్పుడు పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రవి సంసారం కొనసాగించాడు. అలాగే ఆ సమయంలో భార్య తన తల్లిదండ్రుల సమక్షంలో క్షమాపణ చెప్పడంతో, పరిస్థితి చక్కబడుతుందని రవి ఆశించాడు. కానీ భార్య తీరుతెన్నులో ఏమాత్రం మార్పు రాలేదు. గతంలో జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకుని రవితన భార్యకు చెందిన యాక్టివా వాహనానికి రహస్యంగా జీపీఎస్ ట్రాకర్‌ను అమర్చాడు. ఒకరోజు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లింది.ఇంతలో రవి పదేపదే ఫోన్ చేసినా ఆమె సమాధానం ఇవ్వకపోవడంతో అతనిలో అనుమానం పెరిగింది. జీపీఎస్ లొకేషన్‌ను అనుసరించి రవి ఒక హోటల్‌కు చేరుకున్నాడు. అక్కడ రవి తన భార్య మరో వ్యక్తితో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఈ ఘటన దరిమిలా రవి తండ్రి పర్వేజ్ గులాటి ఆమె ఇక తన కుమారునితో ఉండనక్కరలేదని, వారి పుట్టింటికి వెళ్లిపోవాలని తెగేసి చెప్పాడు. కాగా ఆమెతో పాటు పట్టిబడిన వ్యక్తిని ఆమె గతంలో తన సోదరునిగా భర్తకు పరిచయం చేసిందని పర్వేజ్ గులాటి తెలిపారు. రవి తండ్రి పర్వేజ్ తెలిపిన వివరాల ప్రకారం ఆ వ్యక్తితో హిమానీ ఏడేళ్లుగా రహస్యంగా సంబంధం కొనసాగిస్తోంది. గతంలో క్షమాపణతో ఈ సమస్య శాంతియుతంగా ముగిసిందని భావించామని, అయితే అదే తప్పు మళ్లీ జరగడంతో ఆమెపై గౌరవం పూర్తిగా పోయిదని పర్వేజ్ తెలిపారు. ఈ కథనం ‘న్యూస్ 18’లోని వివరాల ఆధారంగా రాయడం జరగింది. -
ఐసిస్‌తో సంబంధాలు.. ఉగ్రవాదుల అరెస్ట్
ముంబైలో ఇద్దరు ఉగ్రవాదులను పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాజన్, మనీష్ బేడీ అనే ఇద్దరు టెర్రరిస్టులు పాకిస్థాన్‌లోని ఐసిస్ ఉగ్రసంస్థ ఆదేశాల మేరకు భారత్‌లో ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు వీరిని అరెస్టు చేశారు. వీరంతా ఆర్మేనియా నుంచి ఆపరేట్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.గత నెలలో ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలో (నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ) NIA అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా పలు చోట్ల భారీగా సోదాలు నిర్వహిస్తుంది. అధికారులు ఇదివరకే పలువురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఎర్రకోట వద్ద జరిగిన బాంబుపేలుళ్లలో 15 మంది మృతిచెందగా అనేక మంది గాయపడ్డారు. కాగా ఈ ఘటనతో సంబంధమున్న నిందితులను దర్యాప్తు బృందాలు ఇది వరకే అరెస్టు చేశాయి. -
కెనడా: ఇద్దరు భారతీయులపై కాల్పులు
మాన్సా (పంజాబ్): కెనడాలోని ఎడ్మంటన్‌లో జరిగిన కాల్పుల ఘటన పంజాబ్‌లోని మాన్సా జిల్లా పరిధిలో గల రెండు గ్రామాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో బార్రే గ్రామానికి చెందిన గురుదీప్ సింగ్ (27), ఉద్దత్ సైదేవాలాకు చెందిన రణ్వీర్ సింగ్ (19) గుర్తు తెలియని దుండగుల కాల్పులకు బలయ్యారు. ఉన్నత కెరీర్ ఆశయాలతో విదేశాలకు వెళ్లిన తమ పిల్లలు హత్యకు గురికావడంతో మృతుల కుటుంబాలు తల్లడిల్లిపోతున్నాయి.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఈ హత్యలు తప్పుడు గుర్తింపు కారణంగా జరిగి ఉండవచ్చు. మరో పంజాబీ యువకుని కారులోకి ఎక్కిన గురుదీప్, రణ్‌వీర్‌లపై దుండగులు కాల్పులు జరిపారు. 19 ఏళ్ల రణ్వీర్ గత మార్చిలో కెనడాకు వెళ్లాడు. అమెరికాలో అకౌంటెన్సీ వృత్తిలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఉద్యోగ కౌన్సెలింగ్ సెషన్‌కు హాజరైన తర్వాత ఎడ్మంటన్‌లో తన స్నేహితుడి పుట్టిన రోజు పార్టీలో పాల్గొనేందుకు వెళ్లాడు. ఆ సమయంలో స్నేహితుడి మరో ఫ్రెండ్‌కు చెందిన కారులో డ్రైవర్ సీటులో కూర్చున్న సమయంలో అతనిపై కాల్పులు జరిగాయి. రణ్వీర్ మామ మన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ ఈ ఘటనతో కుటుంబం షాక్‌లో ఉందని, కెనడియన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మరో యువకుడు గురుదీప్ 2023లో కెనడాకు వెళ్లాడు. ట్రక్ మెకానిక్స్‌లో కోర్సు పూర్తి చేసి, ఉద్యోగ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. త్వరలో తన భార్య అమన్‌దీప్ కౌర్‌ను ఇక్కడికి తీసుకురావాలని ప్లాన్ చేసుకున్నాడు. గురుదీప్ మామ దర్శన్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం కారు యజమాని వెనుక సీట్లలో కూర్చోగా, రణ్వీర్, గురుదీప్ ముందు సీట్లలో కూర్చున్నారు. దీంతో దుండగులు తమ టార్గెట్‌కు భిన్నంగా గురుదీప్, రణ్‌వీర్‌లపై కాల్పులు జరిపివుంటారని దర్శన్ సింగ్ అన్నారు. కాగా బాధిత కుటుంబ సభ్యులు తమ వారి మృతికి గల నిజమైన కారణం కోసం, నేరానికి సంబంధించిన వివరాల కోసం ఎదురుచూస్తున్నాయి. ఇది కూడా చదవండి: లిబియాలో భారత జంట కిడ్నాప్: రూ. రెండు కోట్లు డిమాండ్ -
నితీశ్ రెడ్డి అట్టర్ ప్లాప్.. అయినా ఆంధ్ర ఘన విజయం
పుణే వేదికగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఆంధ్ర ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ సాధించింది. పంజాబ్ బ్యాటర్లలో అన్మోల్ప్రీత్ సింగ్(47) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సైల్ ఆరోరా(42), రమణ్‌దీప్ సింగ్(43), హర్నార్ సింగ్(42) రాణించారు. ఆంధ్ర బౌలర్లలో నితీశ్ కుమార్ రెడ్డి, సత్యనారాయణ రాజు, సౌరభ్ కుమార్, పృథ్వీరాజ్ తలా వికెట్ సాధించారు. మధ్యప్రదేశ్‌పై హ్యాట్రిక్‌తో సత్తాచాటిన నితీశ్ రెడ్డి.. ఈ మ్యాచ్‌లో ఒక్క వికెట్‌కే పరిమితమయ్యాడు.హేమంత్ రెడ్డి సూపర్ సెంచరీ..206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆంధ్ర జట్టు కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 19.5 ఓవర్లలో చేధించింది. నితీశ్ కుమార్ బ్యాటింగ్‌లో కూడా విఫలమయ్యాడు. రెండు బంతులు ఆడి ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. అతడితో పాటు శ్రీకర్ భరత్(1), అశ్విన్ హెబ్బర్(4), రికీ భుయ్(15) నిరాశపరిచారు. కానీ మర్మరెడ్డి హేమంత్ రెడ్డి సూపర్ సెంచరీతో సత్తాచాటాడు. 53 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్‌లతో 109 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. హేమంత్‌తో పాటు ఎస్డీఎన్వీ ప్రసాద్(35 బంతుల్లో 53 నాటౌట్) మెరుపు హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. ఆంధ్ర తమ తదుపరి సూపర్ లీగ్ మ్యాచ్‌లో డిసెంబర్ 16న జార్ఖండ్‌తో తలపడనుంది. చదవండి: శతక్కొట్టిన జైస్వాల్.. సర్ఫరాజ్ ధనాధన్.. భారీ లక్ష్యాన్ని ఊదేసిన ముంబై -
సలీల్ అరోరా సూపర్ సెంచరీ
అంబి (మహారాష్ట్ర): పంజాబ్ యువ బ్యాటర్ సలీల్ అరోరా (45 బంతుల్లో 125 నాటౌట్; 9 ఫోర్లు, 11 సిక్స్‌లు) సూపర్ సెంచరీతో చెలరేగినా... పంజాబ్ జట్టుకు పరాజయం తప్పలేదు. దేశవాళీ టి20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ‘సూపర్ లీగ్’ గ్రూప్ ‘ఎ’లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో జార్ఖండ్ జట్టు 6 వికెట్ల తేడాతో పంజాబ్‌ను ఓడించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ... జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుండగా... అతడు లేని లోటును అరోరా భర్తీ చేశాడు. బంతి ఎక్కడపడ్డా దాని గమ్యస్థానం బౌండరీనే అన్న చందంగా చెలరేగిపోయాడు. మిగిలిన వారి నుంచి చెప్పుకోదగ్గ తోడ్పాటు లభించకపోయినా... అరోరా ఏ దశలోనూ వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలో అతడు 39 బంతుల్లోనే సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. కెపె్టన్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (10), హర్నూర్ సింగ్ (13), సాన్వీర్ సింగ్ (10), రమణ్‌దీప్ సింగ్ (8) విఫలం కాగా... అన్మోల్ ప్రీత్ సింగ్ (23), నమన్ ధిర్ (27) ఫర్వాలేదనిపించారు. జార్ఖండ్ బౌలర్లలో సుశాంత్ మిశ్రా, బాలకృష్ణ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో జార్ఖండ్ జట్టు 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. కెపె్టన్ ఇషాన్ కిషన్ (23 బంతుల్లో 47; 8 ఫోర్లు, 1 సిక్స్), విరాట్ సింగ్ (18; 1 ఫోర్, 2 సిక్స్‌లు) జట్టుకు మెరుపు ఆరంభాన్నిచ్చారు. సాధించాల్సిన రన్‌రేట్ కొండంత ఉన్న జార్ఖండ్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ కుమార్ కుశాగ్ర (42 బంతుల్లో 86 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకోగా... చివర్లో అనుకూల్ రాయ్ (17 బంతుల్లో 37; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), పంకజ్ కుమార్ (18 బంతుల్లో 39 నాటౌట్, 1 ఫోర్, 4 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. జార్ఖండ్ బ్యాటర్లలో రాబిన్ మింజ్ (2) మినహా తక్కిన వాళ్లంతా రెండొందల పైచిలుకు స్ట్రయిక్ రేట్‌తో పరుగులు రాబట్టడం విశేషం. ఐపీఎల్ మినీ వేలానికి ముందు యువ ఆటగాళ్లు తమ పవర్‌హిట్టింగ్‌తో ఫ్రాంచైజీల దృష్టిలో పడే ప్రయత్నంలో ఉన్నారు. అంకిత్ కుమార్ అర్ధసెంచరీ ‘సూపర్ లీగ్’ గ్రూప్ ‘బి’లో భాగంగా జరిగిన మరో మ్యాచ్‌లో హరియాణా జట్టు 7 వికెట్ల తేడాతో రాజస్తాన్‌పై గెలిచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. మహిపాల్ లోమ్రర్ (39 బంతుల్లో 37 నాటౌట్; 1 ఫోర్), శుభమ్ గర్వాల్ (27 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. దీపక్ హుడా (0), కునాల్ సింగ్ రాథోడ్ (4), కరణ్ లాంబా (1), కెపె్టన్ మానవ్ సుతార్ (15) విఫలమయ్యారు. హరియాణా బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఇషాంత్ భరద్వాజ్, అన్షుల్ కంబోజ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనలో హరియాణా 16.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. కెప్టెన్ అంకిత్ కుమార్ (41 బంతుల్లో 60; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకంతో మెరవగా... అర్ష్ రంగా (12 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), పార్థ్ వత్స్ (29 బంతుల్లో 27; 1 ఫోర్ 1 సిక్స్) రాణించారు. ఆదివారం జరగనున్న తదుపరి మ్యాచ్‌ల్లో ముంబైతో హరియాణా, ఆంధ్రతో పంజాబ్, హైదరాబాద్‌తో రాజస్తాన్, మధ్యప్రదేశ్‌తో జార్ఖండ్ తలపడతాయి. -
సీఎం కుర్చీపై వ్యాఖ్యలు.. కాంగ్రెస్ నుంచి కౌర్ సస్పెండ్
చండీగఢ్: పంజాబ్‌లో రూ.500 కోట్లు ఇచ్చిన వారికి ముఖ్యమంత్రి కుర్చీ దక్కుతుందంటూ సంచలన వ్యాఖ్యలతో కలకలం రేపిన రాష్ట కాంగ్రెస్ నేత నవ్ జోత్ కౌర్‌ను సస్పెండ్ చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆమెను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్టు పీసీసీ చీఫ్ అమరీందర్ సింగ్ రజా వారియర్ సోమవారం ప్రకటించారు. అయితే, ఆలోపే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీపై కౌర్ మరో బాంబు పేల్చారు. తారన్ తరన్ అసెంబ్లీ స్థానానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో టికెట్ కోసం కాంగ్రెస్ అభ్యర్థి కర్ణబీర్ సింగ్ బుర్జ్ ఇద్దరు పార్టీ నేతలకు రూ.10 కోట్లు ఇచ్చారని సస్పెన్షన్‌కు ముందు ఆమె ఆరోపించారు. ఈ ఆరోపణలను బుర్జ్ వెంటనే ఖండించారు. సస్పెన్షన్ అనంతరం కౌర్ మాట్లాడుతూ.. పీసీసీ చీఫ్ వారియర్ పై నిప్పులు చెరిగారు. ఆయనకు కోర్టు పట్ల, ప్రజల పట్ల నిబద్ధత, నైతికత, బాధ్యత వంటివి ఏ కోశానా లేవంటూ దుయ్యబట్టారు. సీఎం కుర్చీకి సంబంధించి తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పుకొచ్చారు.ఈ సందర్బంగా కౌర్.. ‘‘నా భర్త (పీసీసీ మాజీ చీఫ్, రాష్ట్ర మాజీ మంత్రి నవ్ జోత్ సింగ్ సిద్ధూ) ఏ ఇతర పార్టీ నుంచైనా సీఎం అభ్యర్థి అవుతారా అన్న మీడియా ప్రశ్నకు, అందుకు ఆఫర్ చేసేందుకు కావాల్సిన డబ్బులు మా దగ్గర లేవని మాత్రమే నేనన్నా’’ అని ఆమె ఎక్స్ పోస్టులో చెప్పుకొచ్చారు. నిజం చెప్పినందుకు కౌర్ పై కాంగ్రెస్ పార్టీ ఫత్వా జారీ చేసిందని బీజేపీ నేత షెహజాద్ పూనావాలా ఎద్దేవా చేశారు. -
కాంగ్రెస్ నుంచి కౌర్ సస్పెన్షన్
చండీగఢ్: పంజాబ్‌లో రూ.500 కోట్లు ఇచ్చిన వారికి ముఖ్యమంత్రి కుర్చీ దక్కుతుందంటూ సంచలన వ్యాఖ్యలతో కలకలం రేపిన రాష్ట కాంగ్రెస్ నేత నవ్ జోత్ కౌర్‌ను సస్పెండ్ చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆమెను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్టు పీసీసీ చీఫ్ అమరీందర్ సింగ్ రజా వారియర్ సోమవారం ప్రకటించారు. అయితే, ఆలోపే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీపై కౌర్ మరో బాంబు పేల్చారు. తారన్ తరన్ అసెంబ్లీ స్థానానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో టికెట్ కోసం కాంగ్రెస్ అభ్యర్థి కర్ణబీర్ సింగ్ బుర్జ్ ఇద్దరు పార్టీ నేతలకు రూ.10 కోట్లు ఇచ్చారని సస్పెన్షన్‌కు ముందు ఆమె ఆరోపించారు. ఈ ఆరోపణలను బుర్జ్ వెంటనే ఖండించారు. సస్పెన్షన్ అనంతరం కౌర్ మాట్లాడుతూ పీసీసీ చీఫ్ వారియర్ పై నిప్పులు చెరిగారు. ఆయనకు కోర్టు పట్ల, ప్రజల పట్ల నిబద్ధత, నైతికత, బాధ్యత వంటివి ఏ కోశానా లేవంటూ దుయ్యబట్టారు. సీఎం కుర్చీకి సంబంధించి తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పుకొచ్చారు. ‘‘నా భర్త (పీసీసీ మాజీ చీఫ్, రాష్ట్ర మాజీ మంత్రి నవ్ జోత్ సింగ్ సిద్ధూ) ఏ ఇతర పార్టీ నుంచైనా సీఎం అభ్యర్థి అవుతారా అన్న మీడియా ప్రశ్నకు, అందుకు ఆఫర్ చేసేందుకు కావాల్సిన డబ్బులు మా దగ్గర లేవని మాత్రమే నేనన్నా’’ అని ఆమె ఎక్స్ పోస్టులో చెప్పుకొచ్చారు. నిజం చెప్పినందుకు కౌర్ పై కాంగ్రెస్ పార్టీ ఫత్వా జారీ చేసిందని బీజేపీ నేత షెహజాద్ పూనావాలా ఎద్దేవా చేశారు. -
‘మా ఆయన సీఎం కావాలి’: సిద్ధూ భార్య
న్యూఢిల్లీ: పంజాబ్ కాంగ్రెస్ మహిళా నేత నవజ్యోత్ కౌర్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2027లో పంజాబ్ ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఆమె వ్యాఖ్యల దరిమిలా రాజకీయ సమీకరణల్లో మార్పులు చోటుచేసుకోబోతున్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంతకీ భారత మాజీ క్రికెటర్, రాజకీయ నేత నవజ్యోత్ సింగ్ భార్య నవజ్యోత్ కౌర్ ఏమన్నారు?తన భర్త నవజ్యోత్ సిద్ధూను పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తే, ఆయన క్రియాశీల రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని నవజ్యోత్ కౌర్ వ్యాఖ్యానించారు. సిద్ధూకు తగిన అవకాశం లభిస్తే రాష్ట్రానికి సేవ చేసేందుకు తిరిగి రాజకీయాల్లోకి అడుగుపెడతారని ఆమె స్పష్టం చేశారు. అయితే పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు తీవ్రంగా ఉన్నాయని, ఐదుగురు నేతలు ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నారని, వారు సిద్ధూ పురోగతిని అడ్డుకోవడానికి ప్రయత్నించే అవకాశం ఉందని నవజ్యోత్ కౌర్ ఆరోపించారు. హైకమాండ్ దీనిని అర్థం చేసుకోవాలని ఆమె కోరారు.సిద్ధూ దృష్టి పంజాబ్ అభివృద్ధిపైనే ఉందని, ఏ పార్టీకి ఇవ్వడానికి మా దగ్గర డబ్బు లేదని, అయితే తాము మంచి ఫలితాలు ఇస్తామని, పంజాబ్‌ను బంగారు రాష్ట్రంగా మారుస్తామన్నారు. రూ. 500 కోట్ల సూట్‌కేస్ ఇచ్చేవాడు ముఖ్యమంత్రి అవుతాడనేది మా విధానం కాదని అన్నారు. పంజాబ్ రాజకీయాల్లో డబ్బు పాత్రపై ఆమె పరోక్షంగా విమర్శలు చేశారు. అభివృద్ధి ఆధారిత రాజకీయాలకు సిద్ధూ కట్టుబడి ఉంటారని ఆమె అన్నారు.క్రియాశీల రాజకీయాల నుండి వైదొలిగినప్పటికీ, నవజ్యోత్ సిద్ధూ కాంగ్రెస్ పార్టీతోనూ, పార్టీ కీలక నేత ప్రియాంక గాంధీ వాద్రాతో ఇప్పటికీ సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నారని నవజ్యోత్ కౌర్ తెలిపారు. కాగా గత కొంతకాలంగా సిద్ధూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా ప్రచారం చేయలేదు. రాజకీయాల నుండి దూరమైన తర్వాత, సిద్ధూ ఐపీఎల్ క్రికెట్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అలాగే తన అనుభవాలు ప్రేరణాత్మక చర్చలు, జీవనశైలి తదితర విషయాలను తెలియజేస్తూ ఆయన ‘నవ్‌జోత్ సిద్ధూ అఫీషియల్’ అనే యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించారు. నవజ్యోత్ కౌర్ చేసిన తాజా ప్రకటన దరిమిలా నవజ్యోత్ సిద్ధూ క్రియాశీల రాజకీయాలకు తిరిగి రావచ్చనే ఊహాగానాలకు బలం చేకూర్చాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయనను ప్రకటించడం ద్వారా పంజాబ్‌లో పార్టీ పరిస్థితిని మెరుగుపర్చాలని ఆమె కాంగ్రెస్ హైకమాండ్‌కు సంకేతాలు పంపారు. పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ తీసుకునే తదుపరి నిర్ణయంపై సిద్ధూ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.సిద్ధూ రాజకీయ ప్రయాణం ఇలా..నవజ్యోత్ సింగ్ సిద్ధూ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షడిగా సేవలందించారు. 2004లో బీజేపీ తరఫున అమృత్సర్ నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2016లో బీజేపీకి రాజీనామా చేసి, 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2021, జూలై నెలలో పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (PPCC) అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2022 మార్చి వరకూ ఆయన ఈ పదవిలో కొనసాగారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించడం లేదు.ఇది కూడా చదవండి: నెలాఖరుకు ‘వందేభారత్ స్లీపర్’.. విశేషాలివే! -
అభిషేక్ శర్మ రేర్ రికార్డు.. రోహిత్, కోహ్లికి కూడా సాధ్యం కాలేదు
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో టీమిండియా యువ ఓపెనర్, పంజాబ్ కెప్టెన్ అభిషేక్ శర్మ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ దేశవాళీ టీ20 టోర్నీలో భాగంగా శనివారం ఉప్పల్ వేదికగా సర్వీసెస్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ విధ్వంసం సృష్టించాడు.ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 34 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 62 పరుగులు చేశాడు. అదేవిధంగా అభిషేక్ 2025 ఏడాదిలో టీ20ల్లో వంద సిక్స్‌లను పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఒకే క్యాలెండర్ ఈయర్‌లో టీ20ల్లో 100 సిక్స్‌ల మైలురాయిని అందుకున్న మొదటి భారత ఆటగాడిగా అభిషేక్ చరిత్రకెక్కాడు. ఇప్పటివరకు ఈ ఫీట్ ఎవరూ సాధించలేకపోయారు.అభిషేక్ ఈ ఏడాది ఆరంభం నుంచే టీ20ల్లో దుమ్ములేపుతున్నాడు. ఇంగ్లండ్ టీ20 సిరీస్‌తో పాటు ఐపీఎల్, ఆసియాకప్, ఆసీస్ టూర్, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అదరగొట్టాడు. ఈ సంవత్సరం టీ20ల్లో అభిషేక్ శర్మ ఇప్పటివరకు 42.82 సగటుతో 1,499 పరుగులు చేశాడు. అందులో మూడు సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 149గా ఉంది.పంజాబ్ ఘన విజయంఇక ఈ మ్యాచ్‌లో సర్వీసెస్ టీమ్‌ను 73 పరుగుల తేడాతో పంజాబ్ చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 233 పరుగుల భారీ స్కోర్ సాధించింది. పంజాబ్ బ్యాటర్లలో అభిషేక్‌తో పాటు ఫ్రబ్‌సిమ్రాన్ సింగ్(50), నమన్ ధీర్(54) హాఫ్ సెంచరీలతో మెరిశారు.అనంతరం సర్వీసెస్ 19.4 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటైంది. పంజాబ్ బౌలర్లలో అభిషేక్ శర్మ, సన్వీర్ సింగ్, హర్‌ప్రీత్ తలా రెండు వికెట్లు సాధించారు. -
పంజాబ్ రైతుల రైల్ రోకో
హోషియార్పూర్/ఫిరోజ్‌పూర్: పంజాబ్‌లో రైతులు తమ డిమాండ్ల సాధనకు శుక్రవారం రెండు గంటలపాటు రైల్ రోకో చేపట్టారు. రైళ్ల రాకపోకలను అడ్డగించిన పలువురు రైతులను పోలీసులను అదుపులోకి తీసుకుని, అనంతరం విడుదల చేశారు. నిరసనల కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. రైళ్ల రద్దు, దారి మళ్లింపు వంటివి మాత్రం లేవని అధికారులు తెలిపారు. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ బిల్లు–2025 రైతు వ్యతిరేకమని, విద్యుత్ వ్యవస్థలను ప్రైవేటీకరణ, కేంద్రీకరణ చేయడమే బిల్లు ఉద్దేశమని రైలు సంఘాలు విమర్శిస్తున్నాయి.పంటల కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కి చట్టబద్ధత కలి్పంచాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి. వీటిపై శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల మధ్యలో 19 జిల్లాల పరిధిలో 26 చోట్ల రైల్ రోకోలు చేపట్టాలని కిసాన్ మజ్దూర్ మోర్చా(కేఎంఎం) రైతులకు పిలుపునిచి్చంది. దీంతో, కేఎంఎంతోపాటు అనుబంధ సంఘాలకు చెందిన నేతలు, కార్యర్తలు పలు ప్రాంతాల్లో రైలు పట్టాలపై బైఠాయించారు. ప్రతిపాదిత విద్యుత్ బిల్లును ఉపసంహరించుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. ఇతర సమస్యలపైనా వారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఫిరోజ్‌పూర్ జిల్లాలో రైలు పట్టాలపై ఆందోళనకు దిగిన రైతులు పోలీసులతో తలపడ్డారు.ఫిరోజ్పూర్లో కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ(కేఎంఎస్సీ) శ్రేణులు బస్త టాంకా వాలీ రైల్వే క్రాసింగ్ వద్ద రైలు పట్టాలను దిగ్బంధించారు. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. కొన్ని చెట్ల కొందరు రైతులను అదుపులోకి తీసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత వారిని విడిచిపెట్టారు. రైలు పట్టాలపై బైఠాయించేందుకు జలంధర్ రైల్వే స్టేషన్ వైపు వెళ్తున్న రైతులను పోలీసులు బారికేడ్లతో నిలువరించారు. రైతుల ఆందోళనల కారణంగా పలు ప్రాంతాల్లో రైళ్లు కొద్దిసేపు నిలిచిపోయాయి. -
అభిషేక్ ఆల్‌రౌండ్ షో
సాక్షి, హైదరాబాద్: టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ (9 బంతుల్లో 34; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు; 3/23) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. దేశవాళీ టి20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘సి’లో భాగంగా గురువారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ జట్టు 54 పరుగుల తేడాతో పుదుచ్చేరిపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అభిషేక్ క్రీజులో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించగా... సలీల్ అరోరా (44 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), సాన్వీర్ సింగ్ (38; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), నమన్ ధీర్ (37; 3 ఫోర్లు, 1 సిక్స్), రమణ్‌దీప్ సింగ్ (34 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) తలాకొన్ని పరుగులు చేశారు. పుదుచ్చేరి బౌలర్లలో విజయ్ రాజా రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో పుదుచ్చేరి 18.4 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. సిదాక్ సింగ్ (61; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేయగా... మిగిలిన వాళ్లు విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లో పంజాబ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అభిషేక్ 4 ఓవర్లలో 23 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఆయుశ్ గోయల్ 3 వికెట్లు తీశాడు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లాడిన పంజాబ్ 3 విజయాలు, 2 పరాజయాలతో 12 పాయింట్లు ఖాతాలో వేసుకొని గ్రూప్ ‘సి’లో రెండో స్థానంలో ఉంది. ఇదే గ్రూప్‌లో భాగంగా జరిగిన మరో మ్యాచ్‌లో హర్యానా 7 వికెట్ల తేడాతో హిమాచల్ ప్రదేశ్‌పై గెలిచింది. ముంబైకి కేరళ షాక్ ముస్తాక్ అలీ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్ ముంబై జట్టుకు షాక్ తగిలింది. ఎలైట్ గ్రూప్ ‘ఎ’లో భాగంగా లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు 15 పరుగుల తేడాతో కేరళ చేతిలో పరాజయం పాలైంది. మొదట కేరళ 20 ఓవర్లలో 5 వికెట్లకు 178 పరుగులు చేసింది. కెప్టెన్ సంజూ సామ్సన్ (28 బంతుల్లో 46; 8 ఫోర్లు, 1 సిక్స్), విష్ణు వినోద్ (43 నాటౌట్; 3 ఫోర్లు), మొహమ్మద్ అజహరుద్దీన్ (32; 3 ఫోర్లు), ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ షర్ఫుద్దీన్ (15 బంతుల్లో 35 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ముంబై బౌలర్లలో శివమ్ దూబే, శార్దుల్ ఠాకూర్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం ముంబై జట్టు అనూహ్యంగా ఓడింది. లక్ష్యం పెద్దది కాకపోయినా... ముంబై జట్టు 19.4 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. గత మ్యాచ్ సెంచరీ హీరో సర్ఫరాజ్ ఖాన్ (40 బంతుల్లో 52; 8 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో రాణించగా... టీమిండియా టి20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (32; 4 ఫోర్లు), అజింక్యా రహానే (32; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. అయితే ఇన్నింగ్స్ 18వ ఓవర్లో కేరళ బౌలర్ కేఎమ్ ఆసిఫ్ మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. తొలి బంతికి సాయిరాజ్ పాటిల్ (13)ను అవుట్ చేసిన అతడు... మూడో బంతికి సూర్యకుమార్ యాదవ్‌ను, నాలుగో బంతికి శార్దుల్ ఠాకూర్ (0)ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఒక్కసారిగా ఒత్తిడిలో పడ్డ ముంబై విజయానికి దూరమైంది. ఆసిఫ్ 24 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇతర మ్యాచ్‌ల్లో రాజస్తాన్ 2 వికెట్ల తేడాతో సౌరాష్ట్రపై, అస్సాం 58 పరుగుల తేడాతో విదర్భపై, ఉత్తరప్రదేశ్ 40 పరుగుల తేడాతో చండీగఢ్‌పై, జార్ఖండ్ 7 వికెట్ల తేడాతో ఉత్తరాఖండ్‌పై, గోవా 5 వికెట్ల తేడాతో బిహార్‌పై, ఢిల్లీ 5 వికెట్ల తేడాతో కర్ణాటకపై, ఒడిశా ఒక పరుగు తేడాతో రైల్వేస్‌పై, మధ్యప్రదేశ్ 21 పరుగుల తేడాతో మహారాష్ట్రపై, తమిళనాడు 61 పరుగుల తేడాతో త్రిపురపై విజయాలు సాధించాయి. -
అభిషేక్ శర్మ విధ్వంసం.. కేవలం 9 బంతుల్లోనే!
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ దుమ్ములేపుతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అభిషేక్.. గురువారం పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతి నుంచే ప్రత్యర్ధి బౌలర్లను శర్మ ఉతికారేశాడు. ఉప్పల్ మైదానంలో అభిషేక్ క్రీజులో ఉన్నంత సేపు బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 9 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34 పరుగులు చేశాడు. అతడితో పాటు సలీల్ అరోరా(44), రమణ్‌దీప్ సింగ్(34), శన్వీర్ సింగ్(38) కీలక నాక్స్ ఆడారు. ఫలితంగా పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. పుదుచ్చేరి బౌలర్లలో రాజా రెండు, అయూబ్ తండా, జయంత్ యాదవ్ ఒక్క వికెట్ సాధించారు. అనంతరం లక్ష్య చేధనలో పుదుచ్చేరి 18.4 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. సైదక్ సింగ్(61) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. మిగితా బ్యాటర్లందరూ విఫలమయ్యారు. అభిషేక్ శర్మ బౌలింగ్‌లో కూడా మూడు వికెట్లతో సత్తాచాటాడు. అతడితో పాటు అయూష్ గోయల్ మూడు, హర్‌ప్రీత్ బ్రార్ రెండు వికెట్లు సాధించారు.కాగా ఈ టోర్నీలో బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ కేవలం 52 బంతుల్లోనే 148 పరుగులు చేసి వరల్డ్ రికార్డు సృష్టించాడు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ నేపథ్యంలో పంజాబ్ జట్టు నుంచి అభిషేక్ వైదొలిగే అవకాశముంది. టీ20 సిరీస్ డిసెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: దుమ్ములేపిన మహ్మద్ షమీ.. ఇప్పటికైనా కళ్లు తెరవండి! -
రూ.41 లక్షలు : లాయర్ ముసుగులో ఐఎస్ఐ గూఢచారి!
అమృత్సర్: పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ కోసం గూఢచర్యం చేసి, సమాచారాన్ని చేరవేసిన ఆరోపణలపై అరెస్టయిన గుర్గామ్ న్యాయవాది రిజ్వాన్ కేసులో దర్యాప్తు సంస్థలకు పలు కీలక విషయాలు తెలిశాయి. అరెస్టయిన రిజ్వాన్‌కు రెండు బ్యాంక్ ఖాతాలు ఉన్నాయని, డబ్బు సేకరించేందుకు అతను ఏకంగా ఏడుసార్లు అమృత్సర్ వెళ్లాడని, అతని స్నేహితుడు, న్యాయవాది ముషారఫ్ అలియాస్ పర్వేజ్ పోలీసులకు తెలిపాడు. 2022లో సోహ్నా కోర్టులో ఇంటర్న్‌షిప్ చేస్తున్నప్పుడు రిజ్వాన్‌తో స్నేహం ఏర్పడిందని ముషారఫ్ చెప్పాడు. జూలైలో, ఇద్దరూ కలిసి ముషారఫ్ కారులో అమృత్సర్ వాఘా సరిహద్దుకు వెళ్లారు. అక్కడ స్వర్ణ దేవాలయం వద్ద, ద్విచక్ర వాహనంపై వచ్చిన కొందరి నుండి రిజ్వాన్ ఒక సంచి నిండా డబ్బు తీసుకున్నాడు. అయితే, వారిని గుర్తించలేక పోయానని ముషారఫ్ తెలిపాడు. తిరిగి వస్తుండగా ప్రమాదం జరగడంతో.. కారును అక్కడే వదిలి రైలులో ప్రయాణించారు. ఆగస్టు 1న కారు తీసుకురావడానికి మళ్లీ అమృత్సర్ వెళ్లారని ముషారఫ్ చెప్పాడు.ఇదీ చదవండి: ఇల్లు కట్టాలంటే రూ. 20 లక్షలు లంచం, టెకీ ఆత్మహత్యరూ.41 లక్షలు సేకరించి..రిజ్వాన్ మొత్తం రూ.41 లక్షల నగదును సేకరించినట్లు విచారణలో అంగీకరించాడు. ఈ డబ్బును అతను అజయ్ అరోరా అనే వ్యక్తికి ఇచ్చినట్లు తెలిపాడు. స్కార్పియో, స్కోడా కార్లలో వచ్చిన వ్యక్తుల నుండి డబ్బు సేకరించడానికి.. రిజ్వాన్ ఏడుసార్లు అమృత్సర్ వెళ్లాడు. రిజ్వాన్‌కు తౌరులో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతా, సోహ్నాలో ఇండస్ఇండ్ బ్యాంక్ ఖాతా ఉన్నాయి. రిజ్వాన్ ల్యాప్‌టాప్, ఫోన్లో అనుమానాస్పద లావాదేవీలను దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ కేసులో నుహ్ పోలీసు బృందాలు పంజాబ్ అంతటా దాడులు నిర్వహిస్తున్నాయి. -
వ్యవసాయం ‘విలువ’ పెరిగింది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ రంగం నిరంతర వృద్ధి దిశగా సాగుతోందని ప్రభుత్వం రూపొందించిన ‘రైజింగ్ తెలంగాణ డాక్యుమెంట్’స్పష్టం చేస్తోంది. సుస్థిర వ్యవసాయ విధానాలు, రైతు సంక్షేమ పథకాల అమలు, క్షేత్రస్థాయి విస్తరణ ఫలితంగా తెలంగాణలో వ్యవసాయం కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం...గత రెండేళ్లలో వ్యవసాయ రంగం రాష్ట్ర స్థూల ఉత్పత్తి విలువలో (జీఎస్వీఏ:గ్రాస్ స్టేట్ వ్యాల్యూ యాడెడ్) 6.7 శాతం పెరుగుదలను నమోదు చేయడం అందుకు నిదర్శనం. 2023–24లో వ్యవసాయ రంగం విలువ రూ.1,00,004 కోట్లు ఉండగా, 2024–25 అంచనాల్లో ఇది రూ. 1,06,708 కోట్లకు పెరిగింది. రైతులకు ఇచ్చిన ప్రోత్సాహం, ఉచిత విద్యుత్, పంట రుణాల మాఫీ, పెట్టుబడి సాయం వంటి చర్యలు వ్యవసాయ రంగాన్ని నిలకడగా ఎదిగేలా చేశాయని ప్రభుత్వం పేర్కొంది. పంటల సాగు..ఉత్పత్తిలో ముందంజ పంటల సాగు విస్తీర్ణం, ఉత్పత్తిలోనూ రాష్ట్రం ముందంజలో ఉంది. వరి పంటలో మాత్రం తెలంగాణ దేశంలోనే చరిత్ర సృష్టించింది. సాగు విస్తీర్ణం, దిగుబడిలో పంజాబ్‌ను దాటి నంబర్‌వన్ స్థానంలో నిలిచింది. 2024–25 సీజన్లో వరి సాగు 127.03 లక్షల ఎకరాలకు చేరగా, ధాన్యం ఉత్పత్తి 284 లక్షల టన్నులను దాటి రికార్డు నమోదైంది. పత్తి, మక్కలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు అన్నీ కలిసి మొత్తం సాగు విస్తీర్ణం గతేడాది 209.62 లక్షల ఎకరాల నుంచి ఈ ఏడాది 220.77 లక్షల ఎకరాలకు పెరిగింది. మొత్తం పంట ఉత్పత్తి 296 లక్షల టన్నుల నుంచి 320.62 లక్షల టన్నులకు చేరింది. ఉచిత విద్యుత్‌కు సబ్సిడీ రూ. 10,444 కోట్లు ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అమల్లోకి తెచ్చిన వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది. రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్‌కు ఏటా దాదాపు రూ.10,444 కోట్లు సబ్సిడీగా చెల్లిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి సాయంగా అందించే మొత్తానికి ఎకరాకు రెండు పంటలకు కలిపి రూ.12 వేలుగా చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. మొత్తం 1,57,51,000 ఎకరాలకు 69,86,548 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ నిధులు జమ చేసింది. ఈ ఏడాది వానాకాలం పంటలకు రికార్డు వేగంతో రైతు భరోసా నిధులు పంపిణీ చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం 9 రోజుల్లోనే రూ.8,744 కోట్లు జమ చేసింది.రైతులకు అండగా ఉంటూ...» బీమా ఉన్న రైతులు ఏ కారణంతో మరణించినా రూ. 5 లక్షల పరిహారం ఆ బాధిత కుటుంబానికి ప్రభుత్వం అందిస్తోంది. 42.16 లక్షల మంది రైతుల కుటుంబాల పేరిట ప్రభుత్వం జీవిత బీమా కంపెనీకి రైతు బీమా ప్రీమియం చెల్లించింది. గతంలో ఒక్కో రైతుకు రూ.3,400 చొప్పున చెల్లించిన ప్రీమియంను ప్రభుత్వం ఎల్ఐసీతో సంప్రదింపులు చేసి ఈసారి రూ.3,225కు తగ్గించింది. » సన్న ధాన్యం పండించిన రైతులకు క్వింటాల్‌కు రూ. 500 అదనంగా చెల్లిస్తున్న ప్రభుత్వం ఈసారి సన్నాలు విక్రయించిన రైతులకు రూ.314 కోట్ల బోనస్ చెల్లించింది. » గత ఏడాది మార్చి, సెప్టెంబర్‌లో వడగండ్లు, వర్షాలతో నష్టపోయిన 94,462 మంది రైతులకు రూ.95.39 కోట్ల పరిహారం అందించింది. ఇటీవల మార్చి, ఏప్రిల్‌లో వచ్చిన భారీ వర్షాలకు నష్టపోయిన 36,449 మంది రైతులకు రూ.44.19 కోట్ల పరిహారంగా అందించింది. -
మరోసారి దడదడలాడించిన అభిషేక్ శర్మ
ఐసీసీ వరల్డ్ నంబర్ వన్ టీ20 బ్యాటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) తన అరివీర భయంకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. అంతర్జాతీయ టీ20లకు విరామం రావడంతో దేశవాలీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ఆడుతున్న అభిషేక్.. ఇక్కడ కూడా ప్రత్యర్దులను చీల్చిచెండాతున్నాడు.ఈ టోర్నీలో పంజాబ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అతడు.. రెండు రోజుల కిందట బెంగాల్‌పై సుడిగాలి శతకం (52 బంతుల్లో 148) బాదాడు. ఇవాళ (డిసెంబర్ 2) బరోడాపై మెరుపు అర్ద శతకంతో విరుచుకుపడ్డాడు. కేవలం 18 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేశాడు. అనంతరం రాజ్ లింబాని బౌలింగ్‌లో ఔటయ్యాడు. అభిషేక్‌తో పాటు అన్మోల్ప్రీత్ సింగ్ (32 బంతుల్లో 69; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్ చేసింది. నమన్ ధిర్ (28 బంతుల్లో 39) ఓ మోస్తరు ఇన్నింగ్స్ ఆడాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన బరోడా ఆటగాళ్లు కూడా చెలరేగి ఆడుతున్నారు. 4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేశారు. ఓపెనర్లు శాశ్వత్ రావత్ 30, విష్ణు సోలంకి 14 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. కాగా, దీనికి ముందు బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ కేవలం 12 బంతుల్లోనే అర్ద సెంచరీ చేశాడు. పొట్టి క్రికెట్లో అది మూడో వేగవంతమైన అర్ద సెంచరీ. -
నేడు ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్.. హార్దిక్ పాండ్యా X అభిషేక్ శర్మ
సాక్షి, హైదరాబాద్: భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఎట్టకేలకు మ్యాచ్ బరిలోకి దిగుతున్నాడు. దేశవాళీ టి20 క్రికెట్ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా నేడు పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లో బరోడా తరఫున హార్దిక్ ఆడనున్నాడు. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో ఉదయం 11 గంటల నుంచి ఈ మ్యాచ్ జరుగుతుంది. దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ టి20 టోర్నీలో గాయపడిన హార్దిక్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. సెప్టెంబర్ 26న అతను చివరిసారిగా మ్యాచ్ (శ్రీలంకతో) ఆడాడు. ఈ మ్యాచ్‌లో కండరాల గాయంతో తప్పుకున్న పాండ్యా కొంత విశ్రాంతి తర్వాత బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)కు చేరుకున్నాడు. అక్టోబర్ 15 నుంచి మధ్యలో మూడు రోజుల దీపావళి సెలవు మినహా నవంబర్ 29 వరకు అక్కడే ఉండి పూర్తిగా కోలుకునే వరకు రీహాబిలిటేషన్ కొనసాగించాడు. మ్యాచ్ ఆడేందుకు పాండ్యా సోమవారం హైదరాబాద్‌కు చేరుకున్నాడు. హార్దిక్ ఇప్పుడు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ చేసేందుకు మ్యాచ్ ఫిట్‌గా మారాడని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) సర్టిఫికెట్ ఇచ్చింది. ‘దాదాపు నలభై రోజుల పాటు సీఓఈ బయటకు కూడా పోకుండా పాండ్యా పూర్తి స్థాయి రీహాబిలిటేషన్‌లో పాల్గొన్నాడు. ఈ క్రమంలో అతను రిటర్న్ టు ప్లే ప్రోటోకాల్స్‌ను అన్ని విధాలా పాటించాడు. ఇప్పుడు మ్యాచ్ ఆడటమే మిగిలింది’ అని సీఓఈ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ప్రజ్ఞాన్ ఓజా సమక్షంలో... నిజానికి ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం పాండ్యా డిసెంబర్ 4న గుజరాత్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడాల్సి ఉంది. అయితే బీసీసీఐ సెలక్టర్, హైదరాబాద్‌కే చెందిన ప్రజ్ఞాన్ ఓజా ముస్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా తిలకిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కనీసం రెండు మ్యాచ్‌లలో హార్దిక్ ఆట, ఫిట్నెస్ను పరీక్షించాలని సెలక్టర్లు భావించారు. దాంతో నేడు, గురువారం జరిగే రెండు మ్యాచ్‌లు హార్దిక్ ఆడతాడు. దక్షిణాఫ్రికాతో జరిగే ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ కోసం జట్టును ఎంపిక చేయనున్న నేపథ్యంలో అతని ప్రదర్శన కీలకం కానుంది. అభిషేక్ మళ్లీ చెలరేగేనా! భారత ఆటగాడు, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ సభ్యుడు అభిషేక్ శర్మ మరోసారి తన టి20 మెరుపులను ప్రదర్శించేందుకు సిద్ధమయ్యాడు. ఆదివారం జింఖానా మైదానంలో బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 42 బంతుల్లోనే 8 ఫోర్లు, 16 సిక్స్‌లతో 148 పరుగులు బాదిన అభిషేక్ ఇప్పుడు తనకు అచ్చొచ్చిన ఉప్పల్ మైదానంలో ఎలా ఆడతాడనేది ఆసక్తికరం. గత పోరులో 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్న అతను 32 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. హార్దిక్, కెపె్టన్ కృనాల్ పాండ్యా మినహా పెద్ద అనుభవం లేని బరోడా బౌలింగ్ అతడిని ఏమాత్రం నిలువరించగలదో చూడాలి. -
పెళ్లి వేడుకలో కాల్పుల మోత
లుధియానా: పంజాబ్‌లోని లుధియానాలో శనివారం రాత్రి పెళ్లి వేడుకకు వచ్చిన వైరి వర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఘటనలో అతిథులిద్దరు చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పఖోవల్ రోడ్డులో జరిగే పెళ్లికి వరుడు ప్రత్యర్థి వర్గాల వారికి ఆహ్వానం పంపించాడు. పెళ్లి జరుగుతున్న సమయంలో వేదిక వద్ద రెండు గ్రూపులు ఎదురుపడ్డాయి. ఏదో విషయమై వారి మధ్య గొడవ ముదిరింది. పరస్పరం కాల్పులకు దిగారు. కనీసం 20 రౌండ్ల వరకు కాల్చారు. పెళ్లికి హాజరైన ఇద్దరు వ్యక్తులు బుల్లెట్లు తగిలి చనిపోయారు. పోలీసుల రాకతో రెండు గ్రూపులు అక్కడి నుంచి పరారయ్యాయి. వీరిని పెళ్లికి ఆహా్వనించిన వరుడితోపాటు భద్రతా నిబంధనలను పాటించని ఫంక్షన్ హాల్ నిర్వాహకుడిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
శతక్కొట్టిన అభిషేక్ శర్మ.. సిక్సర్ల వర్షం.. సరికొత్త చరిత్ర
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025 మ్యాచ్‌లో టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ అదరగొట్టాడు. బెంగాల్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ పంజాబ్ కెప్టెన్.. భారీ శతకం బాదాడు. కేవలం 32 బంతుల్లోనే వంద పరుగులు మార్కు అందుకున్నాడు.ఆది నుంచే బౌలర్లపై అటాక్దేశవాళీ టీ20 క్రికెట్ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025 (SMAT)లో భాగంగా ఎలైట్ గ్రూప్-‘సి’లో పంజాబ్- బెంగాల్ (Punjab Vs Bengal) తలపడ్డాయి. హైదరాబాద్‌లోని జింఖానా గ్రౌండ్లో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్లు కెప్టెన్ అభిషేక్ శర్మ (Abhishek Sharma), వికెట్ కీపర్ బ్యాటర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (Prabhsimran Singh) ఆది నుంచే బెంగాల్ బౌలర్లపై దాడికి దిగారు.148 పరుగులుఆకాశమే హద్దుగా బౌండరీల వర్షం కురిపిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో అభిషేక్ శర్మ 32 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 52 బంతులు ఎదుర్కొని ఎనిమిది ఫోర్లు, 16 సిక్సర్ల సాయంతో 148 పరుగులు సాధించాడు. అయితే, ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో వ్రితిక్ ఛటర్జీకి క్యాచ్ ఇవ్వడంతో అభిషేక్ సునామీ ఇన్నింగ్స్‌కు తెరపడింది.మరోవైపు.. ప్రభ్‌సిమ్రన్ సింగ్ 35 బంతుల్లోనే 70 పరుగుల సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లతో పాటు 4 సిక్స్‌లు ఉన్నాయి. మిగతా వారిలో రమణ్‌దీప్ సింగ్ (15 బంతుల్లో 39), సన్వీర్ సింగ్ (8 బంతుల్లో 22) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. అన్మోల్ప్రీత్ సింగ్ (6 బంతుల్లో 11) కాస్త నిరాశపరిచాడు.ఇక నమన్ ధిర్ (2 బంతుల్లో 7), నేహాల్ వధేరా (2 బంతుల్లో 2) ఆఖరి వరకు అజేయంగా నిలిచారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు నష్టపోయిన పంజాబ్ ఏకంగా 301 పరుగులు సాధించింది. బెంగాల్ బౌలర్లలో ఆకాశ్ దీప్ రెండు వికెట్లు తీయగా.. మొహమ్మద్ షమీ, షక్షైమ్ చౌదరి, ప్రదీప్త ప్రామాణిక్ తలా ఒక వికెట్ పడగొట్టారు.అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్ ఇన్నింగ్స్ఈ క్రమంలో భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగాల్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి కేవలం 198 పరుగులే చేసింది. పంజాబ్ బౌలర్ల ధాటికి బెంగాల్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టగా.. అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఒంటరి పోరాటం చేశాడు. కేవలం 66 బంతుల్లోనే 12 ఫోర్లు, 8 సిక్స్‌లు బాది 130 పరుగులతో అజేయంగా నిలిచాడు.అభిమన్యుకు తోడుగా.. పేసర్ ఆకాశ్ దీప్ (7 బంతుల్లో 31) ఒక్కడే మెరుపు వేగంతో పరుగులు రాబట్టాడు. అయితే, మిగతా వాళ్లంతా చేతులెత్తేయడంతో పంజాబ్ చేతిలో బెంగాల్ ఏకంగా 112 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. నేహాల్ వధేరా, గుర్నూర్ బ్రార్ చెరో రెండు.. అభిషేక్ శర్మ ఒక వికెట్ దక్కించుకున్నారు. భారీ సెంచరీతో కదం తొక్కి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మబెంగాల్తో మ్యాచ్‌లో 148 పరుగులు సాధించిన అభిషేక్ శర్మ (16 సిక్సర్లు) అరుదైన రికార్డు సాధించాడు. టీ20 మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రెండో భారత బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ జాబితాలో 17 సిక్స్‌లు (146 నాటౌట్)తో మేఘాలయ బ్యాటర్ పునిత్ బిస్త్ అగ్రస్థానంలో ఉన్నాడు.కాగా టీ20లలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత బ్యాటర్‌గా తిలక్ వర్మ కొనసాగుతున్నాడు. గతేడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టోర్నీలో ఈ హైదరాబాదీ 67 బంతుల్లో 151 పరుగులు సాధించాడు. ఇందులో 14 ఫోర్లు, 10 సిక్స్‌లు ఉన్నాయి.చదవండి: IND vs SA: టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. రుతురాజ్‌కు చోటు.. పంత్‌కు నో ఛాన్స్ -
అభిషేక్ శర్మ అట్టర్‌ఫ్లాప్.. సంజూ శాంసన్ ఫెయిల్
టీమిండియా స్టార్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్.. అభిమానులను తీవ్రంగా నిరాశపరిచారు. దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025 ఎలైట్ రెండో రౌండ్లో ఇద్దరూ విఫలమయ్యారు. దీంతో అభిషేక్ శర్మ సారథ్యం వహిస్తున్న పంజాబ్ జట్టుకు.. సంజూ కెప్టెన్‌గా ఉన్న కేరళ జట్టుకు ఓటములు ఎదురయ్యాయి.ఎలైట్ గ్రూప్-‘సి’లో భాగంగా హైదరాబాద్ వేదికగా పంజాబ్- హర్యానా (Punjab Vs Haryana ) శుక్రవారం తలపడ్డాయి. జింఖానా మైదానంలో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన హర్యానా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి ఏకంగా 207 పరుగులు సాధించింది.సరిగ్గా 207 పరుగులే చేసి..హర్యానా కెప్టెన్ అంకిత్ కుమార్ (26 బంతుల్లో 51), వన్‌డౌన్ బ్యాటర్ నిషాంత్ సింధు (32 బంతుల్లో 61) మెరుపు అర్ధ శతకాలతో అదరగొట్టగా.. ఆఖర్లో సుమిత్ కుమార్ (14 బంతుల్లో 28) వేగంగా ఆడాడు. ఫలితంగా హర్యానా ఈ మేర స్కోరు సాధించింది.భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కూడా 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి సరిగ్గా 207 పరుగులే చేసింది. కెప్టెన్, విధ్వంసకర ఓపెనర్‌గా పేరొందిన అభిషేక్ శర్మ (Abhishek Sharma- 5 బంతుల్లో 6) దారుణంగా విఫలమైనా.. అన్మోల్ప్రీత్ సింగ్ (37 బంతుల్లో 81), సన్వీర్ సింగ్ (16 బంతుల్లో 36 నాటౌట్) అదరగొట్టారు.ఇక స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్ నిర్వహించగా హర్యానా గెలుపొందింది. సన్వీర్ సింగ్ (0), రమణ్‌దీప్ సింగ్ (1) విఫలం కావడంతో పంజాబ్‌కు ఓటమి తప్పలేదు.కేరళకు పరాభవంమరోవైపు.. తొలి మ్యాచ్‌లో ఒడిశాను పది వికెట్ల తేడాతో చిత్తు చేసిన కేరళ.. శుక్రవారం నాటి రెండో మ్యాచ్‌లో మాత్రం విఫలమైంది. లక్నోలో రైల్వేస్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేరళ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన రైల్వేస్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 149 పరుగులు చేసింది.నామమాత్రపు లక్ష్యంతో ఛేదనకు దిగిన కేరళకు ఆదిలోనే షాకులు తగిలాయి. గత మ్యాచ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడిన ఓపెనర్లు సంజూ శాంసన్, రోహన్ కణ్ణుమ్మల్ ఈసారి చేతులెత్తేశారు. సంజూ 25 బంతుల్లో కేవలం 19 పరుగులు చేయగా.. రోహన్ 14 బంతుల్లో 8 పరుగులే చేసి అవుటయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన అహ్మద్ ఇమ్రాన్ (12) సహా అబ్దుల్ బాసిత్ (7), సల్మాన్ నిజార్ (18), అఖిల్ స్కారియా (16), షరాఫుద్దీన్ (6) విఫలమయ్యారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యేసరికి ఎనిమిది వికెట్లు కోల్పోయిన కేరళ కేవలం 117 పరుగులే చేసింది. దీంతో రైల్వేస్ చేతిలో 32 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.ఇద్దరూ విఫలం కావడంతో..ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ముందు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఇలా విఫలం కావడం ఆందోళనకరంగా పరిణమించింది. తదుపరి మ్యాచ్‌లలో ఇద్దరూ సత్తా చాటి ఫామ్‌లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా డిసెంబరు 9- 19 వరకు భారత్- సౌతాఫ్రికా మధ్య ఐదు టీ20లు జరుగనున్న విషయం తెలిసిందే. -
హరియాణా ‘సూపర్’ విక్టరీ
సాక్షి, హైదరాబాద్: దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హరియాణా జట్టు ‘సూపర్ ఓవర్’లో పంజాబ్‌పై విజయం సాధించింది. టీమిండియా బ్యాటర్ అభిషేక్ శర్మను విజయవంతంగా అడ్డుకున్న హరియాణా జట్టు ఈ టోర్నీలో తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఎలైట్ గ్రూప్ ‘సి’లో భాగంగా సికింద్రాబాద్ జింఖానా మైదానంలో శుక్రవారం జరిగిన ‘సూపర్ ఓవర్’లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ జట్టును హరియాణా పేస్ బౌలర్ అన్షుల్ కంబోజ్ హడలెత్తించాడు. మూడు బంతుల్లో ఒక పరుగు మాత్రమే ఇచ్చి అభిషేక్ శర్మ (0), సాన్వీర్ సింగ్ (0)లను అవుట్ చేశాడు. దీంతో రెండు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హరియాణా తొలి బంతికే నిషాంత్ (4 నాటౌట్) ఫోర్ కొట్టడంతో విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన హరియాణా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. కెప్టెన్ అంకిత్ కుమార్ (26 బంతుల్లో 51; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), నిశాంత్ (32 బంతుల్లో 61; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. ఆఖర్లో సుమిత్ కుమార్ (14 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడాడు. పంజాబ్ బౌలర్లలో అశ్వని కుమార్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఛేదనలో పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి సరిగ్గా 207 పరుగులు చేసింది. విధ్వంసక ఓపెనర్ అభిషేక్ శర్మ (6) విఫలం కాగా... అన్మోల్ప్రీత్ సింగ్ (37 బంతుల్లో 81; 8 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సాన్వీర్ సింగ్ (16 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (10 బంతుల్లో 20; 1 ఫోర్, 2 సిక్స్‌లు), సలీల్ అరోరా (22; 2 ఫోర్లు, 1 సిక్స్) తలా కొన్ని పరుగులు చేశారు. హరియాణా బౌలర్లలో అన్షుల్ కంబోజ్, యుజువేంద్ర చహల్, సామంత్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. రెండుసార్లు అభిషేక్‌ను అవుట్ చేయడంతో పాటు పరుగులు కట్టడి చేసిన హరియాణా పేసర్ అన్షుల్ కంబోజ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇదే గ్రూప్‌లో జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో పుదుచ్చేరి జట్టు 17 పరుగుల తేడాతో బరోడాపై, హిమాచల్ ప్రదేశ్ జట్టు 83 పరుగుల తేడాతో సరీ్వసెస్‌పై, బెంగాల్ జట్టు మూడు వికెట్ల తేడాతో గుజరాత్‌పై విజయాలు సాధించాయి. -
‘చండీగఢ్’పై కేంద్రం పీఛేముడ్!
న్యూఢిల్లీ: పంజాబ్, హరియాణా రాష్ట్రాల ఉమ్మడి రాజధాని, కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్‌ను పూర్తిస్థాయిలో తన అదీనంలోకి తీసుకునే అంశంపై మోదీ సర్కారు వెనక్కు తగ్గింది. విపక్షాల విమర్శల జడివాన, ఇంటాబయటా వెల్లువెత్తుతున్న వ్యతిరేకతకు తలొగ్గింది. చండీగఢ్‌ను ఆర్టికల్ 240 పరిధిలోకి తీసుకొచ్చే ఉద్దేశమేదీ లేదంటూ వివాదానికి తెరదించే ప్రయత్నం చేసింది. ‘‘అది కేవలం ప్రతిపాదన మాత్రమే. పంజాబ్‌లో చట్టాలు చేసే ప్రక్రియను మరింత సులభతరం చేయడం మాత్రమే దీని వెనక ఉన్న ఏకైక ఉద్దేశం. అప్పుడు కూడా పంజాబ్, హరియాణా రాష్ట్రాలకు, వాటి రాజధాని హోదాలో చండీగఢ్‌కు ప్రస్తుతమున్న సాంప్రదాయిక ఒప్పందాలు, స్థితిగతుల్లో ఏ విధంగానూ మార్పుచేర్పులు చేసే ఆలోచన కేంద్రానికి ఎంతమాత్రమూ లేదు. చండీగఢ్ పాలన, దాని తాలూకు ప్రస్తుత పాలనాపరమైన నిర్మాణం తదితరాల్లో వేలు పెట్టే ఉద్దేశం కూడా లేదు. అంతేగాక ఈ ప్రతిపాదన ఇంకా కేంద్రం పరిశీలనలో మాత్రమే ఉంది. అంతే తప్ప దీనిపై ఎలాంటి తుది నిర్ణయమూ తీసుకోలేదు’’ అని కేంద్ర హోం శాఖ ఆదివారం హడావుడిగా ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘రాజకీయ పారీ్టలతో పాటు అందరితోనూ అన్నివిధాలా విస్తృతంగా చర్చోపచర్చలు జరిపిన అనంతరమే ఈ విషయమై ఏ నిర్ణయమూ తీసుకోవడం జరుగుతుంది. అది కూడా అందరికీ అంగీకారయోగ్యంగా, చండీగఢ్ ప్రయోజనాలను పూర్తిస్థాయిలో పరిరక్షించేదిగానే ఉంటుంది. ఈ విషయమై ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’అని చెప్పుకొచి్చంది. ఈ విషయమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లుపెట్టే ఆలోచన కూడా లేదని హోం శాఖ ప్రకటన స్పష్టం చేసింది. చండీగఢ్‌ను ఆర్టికల్ 240 పరిధిలోకి తేవాలని కేంద్రం యోచిస్తున్నట్టు లోక్‌సభ, రాజ్యసభ తమ బులెటిన్లలో పేర్కొనడం, దానిపై పంజాబ్‌లోని పాలక పక్షమైన ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు కాంగ్రెస్ తదితర విపక్షాలన్నీ భగ్గుమనడం తెలిసిందే.గవర్నరే పాలకుడు 1984 నుంచి పంజాబ్ గవర్నరే చండీగఢ్ పాలకునిగా వ్యవహరిస్తున్నారు. గతంలో ప్రధాన కార్యదర్శే చండీగఢ్ పాలకునిగా ఉండేవారు. తిరిగి ఆ పద్ధతినే పునరుద్ధరించేందుకు 2016లో మోదీ సర్కారు ప్రయతి్నంచింది. ఉన్నతా« దికారిని పంజాబ్ పాలకునిగా నియమించింది. కానీ ఇప్పట్లాగే దానిపై రాజకీయంగా తీవ్ర విమర్శలు రేగడంతో వెనక్కి తగ్గింది. బీజేపీకి అలవాటే: విపక్షాల ఎద్దేవా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, వ్యతిరేకత రాగానే వెనక్కు తగ్గడం బీజేపీకి అలవాటేనని విపక్షాలు ఎద్దేవా చేశాయి. చండీగఢ్ విషయంలో కేంద్రం ప్రమాదకరమైన ఎత్తుగడ వేసిందని ఆప్ చీఫ్ కేజ్రీవాల్ దుయ్యబట్టారు. చండీగఢ్‌ను ఆర్టికల్ 240 పరిధిలో చేరిస్తే దానిపై పంజాబ్ సర్వహక్కులూ కోల్పోతుందని కేంద్ర మాజీ మంత్రి హర్సిమ్రత్ అన్నారు. -
చండీగఢ్‌పై సవరణ బిల్లు.. కేంద్రానికి సీఎం హెచ్చరిక
చండీగఢ్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పంజాబ్ రాజధాని చండీగఢ్‌ను లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సంచలన ఆరోపణలు చేశారు. పంజాబ్, హర్యానా ఉమ్మడి రాజధాని చండీగఢ్ (Chandigarh)లో చట్టాలు చేసే అధికారాన్ని రాష్ట్రపతి పరిధిలోకి తీసుకొచ్చేలా రాజ్యాంగ అధికరణం 131 సవరణ బిల్లును కేంద్రం తేవడం చర్చకు దారి తీసింది. ఇక, ఈ బిల్లును పంజాబ్‌లోని అన్ని పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంపై ఆప్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పంజాబ్, హర్యానా ఉమ్మడి రాజధాని చండీగఢ్‌పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తించే ఆదేశాలు, చట్టాలను నేరుగా చేసే అధికారాలను రాష్ట్రపతికి కల్పించిన రాజ్యాంగ అధికరణం 240 పరిధిలోకి చండీగఢ్‌ను కూడా తీసుకురావాలని కేంద్రం ప్రతిపాదించింది. ఇందుకు గానూ రాజ్యాంగంలోని అధికరణం 131ను సవరిస్తూ బిల్లు తీసుకురానుంది. త్వరలో ప్రారంభమయ్యే శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లు పార్లమెంటు ముందుకు రానుంది. ఈ బిల్లు ఆమోదం పొందితే చండీగఢ్ ఆర్టికల్ 240 పరిధిలోకి వస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్రం నిర్ణయంపై పంజాబ్‌లోని పార్టీలు మండిపడుతున్నాయి. ఈ బిల్లును ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), కాంగ్రెస్ (Congress), అకాలీదళ్ (Akali Dal) తీవ్రంగా వ్యతిరేకించాయి.భగవంత్ మాన్ ఆగ్రహం.. ఈ బిల్లుపై తాజాగా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ..‘చండీగఢ్‌తో పంజాబ్‌కు విడదీయరాని బంధం ఉంది. పంజాబ్‌కు దానిపై హక్కు కూడా ఉంది. చండీగఢ్ నగరాన్ని నిర్మించేందుకు పంజాబ్‌లోని పలు గ్రామాలను నాశనం చేశారు. అభివృద్ధి కోసం ఎంతో చేశారు. చండీగఢ్ నగరాన్ని ఏ మాత్రం వదులుకునే ప్రసక్తే లేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పంజాబ్ రాజధానిని లాక్కోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకొంటాం’ అని హెచ్చరించారు.240 పరిధిలోనే మిగతా ప్రాంతాలు.. మరోవైపు.. ఆప్ అగ్రనేత అరవింద్ కేజ్రీవాల్ కూడా పంజాబ్ గుర్తింపుపై కేంద్రం దాడి చేస్తోందని అభివర్ణించారు. నియంతృత్వం ఎదుట పంజాబ్ ఏనాడు తలవంచలేదని చరిత్ర చెబుతోందని పేర్కొన్నారు. మరోవైపు పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా స్పందిస్తూ.. చండీగఢ్ పంజాబ్‌కు చెందినదేనని.. దానిని లాక్కోవడానికి చేసే ప్రయత్నాలకు తీవ్ర ప్రతికూల పరిణామాలు ఉంటాయని పేర్కొన్నారు. ఇక, చట్టసభల్లేని కేంద్ర పాలిత ప్రాంతాలైన అండమాన్-నికోబార్ దీవులు, దాద్రా-నగర్ హవేలీ, లక్షద్వీప్, డామున్-డయ్యూ ప్రస్తుతం అధికరణం 240 పరిధిలోనే ఉన్నాయి. -
రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించలేం
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీలు ఆమోదించి పంపే బిల్లులకు రాష్ట్రపతి, గవర్నర్లు ఆమోదం తెలిపే అంశంపై న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల నడుమ తలెత్తిన పెను సంక్షోభానికి అత్యున్నత న్యాయస్థానం ఎట్టకేలకు సామరస్యపూర్వకంగా తెరదించింది. ‘‘ఈ విషయంలో సుప్రీంకోర్టుతో సహా ఏ న్యాయస్థానమూ వారికి ఎలాంటి గడువూ విధించజాలదు. అలా చేయడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. ఎందుకంటే ఇది కార్యనిర్వాహక వ్యవస్థ అధికారాలను న్యాయవ్యవస్థ తన గుప్పెట పట్టడమే అవుతుంది. దీన్ని రాజ్యాంగం ఏ రూపంలోనూ అనుమతించలేదు’’ అని తేల్చిచెప్పింది. అంతేగాక సదరు బిల్లులకు ఆమోదం తెలపడం, రిజర్వులో ఉంచడంపై న్యాయ సమీక్ష కూడా కుదరదని స్పష్టం చేసింది. బిల్లుల ఆమోదానికి రాష్ట్రపతి, గవర్నర్లకు మూడు నెలల గడువు విధిస్తూ ఇద్దరు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం గతంలో సంచలన తీర్పు వెలువరించడం, అది రెండు కీలక వ్యవస్థల నడుమ సంక్షోభానికి దారితీయడం తెలిసిందే. మూడు నెలల్లోపు నిర్ణయం వెలువరించని పక్షంలో సదరు బిల్లులకు ఆమోదం లభించినట్టే భావించాలని కూడా ఆ తీర్పు పేర్కొంది. ఈ రెండు అంశాలూ చెల్లుబాటు కాబోవని సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. సుదీర్ఘ విచారణ అనంతరం ఈ అంశంపై గురువారం ఈ మేరకు ఏకగ్రీవంగా 111 పేజీల తుది తీర్పు వెలువరించింది. ‘‘రాష్ట్రపతి, గవర్నర్లకు ఇది కార్యనిర్వాహక వ్యవస్థ విధుల్లో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవడమే అవుతుంది. అది రాజ్యాంగ విరుద్ధం’’అని వ్యాఖ్యానించింది. 142వ అధికరణంలోని ప్రత్యేక అధికారాలను వినియోగించుకుంటూ ద్విసభ్య ధర్మాసనం వెలువరించిన ఆ తీర్పును కొట్టేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే బిల్లులకు ఆమోదాన్ని గవర్నర్లు నిరవధికంగా పెండింగ్‌లో పెట్టడం మాత్రం ఎంతమాత్రమూ సబబు కాదని సీజేఐ ధర్మాసనం ఈ సందర్భంగా విస్పష్టంగా పేర్కొంది. ‘‘రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు బిల్లులపై నిర్ణయం తీసుకోకుండా అంతులేని జాప్యం చేస్తే కోర్టులు చూస్తూ ఊరుకోబోవు. వాటిపై పరిమిత న్యాయసమీక్ష జరపవచ్చు’’అని పేర్కొంది. అయితే, ‘‘అప్పుడు కూడా వీలైనంత త్వరగా బిల్లులపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా సూచించాలే తప్ప రాష్ట్రపతికి, గవర్నర్లకు కోర్టులు గడువు విధించడానికి వీల్లేదు’’అని స్పష్టం చేసింది. అంతేకాదు, ‘‘బిల్లుల ఆమోదం విషయంలో రాష్ట్ర మంత్రిమండలి సలహాకు గవర్నర్ కట్టుబడాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో విచక్షణ మేరకు వ్యవహరించే అధికారం రాజ్యాంగమే కల్పించింది’’అని కూడా గుర్తు చేసింది. రాజ్యాంగ ధర్మాసనంలో సీజేఐతో పాటు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ పి.ఎస్.నరసింహ, జస్టిస్ ఎ.ఎస్.చందూర్కర్ ఉన్నారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హర్షం ఈ తీర్పుపై వెలిబుచ్చారు. చరిత్రాత్మక తీర్పు వెలువరించినందుకు రాష్ట్రపతి తరఫున సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. దీనిపై డీఎంకే సర్కారు స్పందించలేదు. ఆపితే తిప్పి పంపాల్సిందే.. ఏ నిర్ణయమూ తీసుకోకుండా గవర్నర్లు సుదీర్ఘకాలం పాటు బిల్లులను పెండింగ్‌లో పెట్టడం కుదరదని ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. అది సబబు కూడా కాదని పేర్కొంది. ‘‘ఏ బిల్లునైనా ఆపితే దాన్ని కచ్చితంగా అసెంబ్లీకి వెనక్కి పంపాల్సిందే. రాజ్యాంగంలోని 200 అధికరణ ప్రకారం బిల్లుల విషయంలో గవర్నర్ల ముందున్నది మూడు దారులు. వాటిని ఆమోదించడం, రాష్ట్రపతికి నివేదించడం, లేదా పునఃసమీక్ష నిమిత్తం అసెంబ్లీకి తిప్పి పంపడం’’అని సీజేఐ పేర్కొన్నారు. వాటిని ఆమోదించకుండా గవర్నర్ తన వద్దే అట్టిపెట్టుకోవచ్చన్న కేంద్రం వాదనను తోసిపుచ్చారు. ‘‘అలా చేయడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. ఆపేయాలనుకున్న బిల్లులను అసెంబ్లీకి పంపడం ఆప్షన్కాదు, నిబంధన’అని చెప్పారు. న్యాయమూర్తి పేరు లేదు! రాజ్యాంగ ధర్మాసనం తరఫున తీర్పు రాసిన న్యాయమూర్తి పేరును అందులో పేర్కొనకపోవడం విశేషం. ఇలా అరుదుగా మాత్రమే జరుగుతుంటుంది. 2019లో రామజన్మభూమి–బాబ్రీ మసీదు వివాదం కేసుపై కూడా ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఆ తీర్పు రాసిన న్యాయమూర్తి పేరును కూడా అందులో పేర్కొనలేదు. ఇదీ నేపథ్యం...! అసెంబ్లీ పంపే బిల్లుల ఆమోదంలో గవర్నర్ల మితిమీరిన జాప్యం కొన్నేళ్లుగా వివాదాలకు దారితీస్తూ వస్తోంది. ముఖ్యంగా విపక్షాల పాలనలో ఉన్న తమిళనాడు, కేరళ, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో ఈ సమస్య తరచూ తలెత్తుతోంది. సుప్రీంకోర్టు తాజా తీర్పుకు కారణంగా నిలిచిన కేసు కూడా బిల్లుల ఆమోదం విషయమై తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్ ఎన్.రవి మధ్య తలెత్తిన వివాదానికి సంబంధించినదే. అసెంబ్లీ ఆమోదించి పంపిన 10 బిల్లులను ఆమోదించకుండా ఆయన సుదీర్ఘంగా జాప్యం చేయడాన్ని సవాలు చేస్తూ ఎంకే స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దాంతో, చట్టసభలు ఆమోదించి పంపే బిల్లులపై గవర్నర్లతో పాటు రాష్ట్రపతి కూడా మూడు నెలల్లోగా ఏ నిర్ణయమూ తీసుకోవాలంటూ జస్టిస్ జేబీ పార్డీవాలా ద్విసభ్య ధర్మాసనం గత ఏప్రిల్ 8న సంచలన తీర్పు వెలువరించింది. అది తీవ్ర కలకలానికి దారితీసింది. ఆ తీర్పు ఆధారంగా గవర్నర్ ఆమోదించకుండా పక్కన పెట్టిన 10 బిల్లులను చట్టాలుగా నోటిఫై చేస్తూ తమిళనాడు ప్రభుత్వం గెజిట్ కూడా జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ దాఖలైన అపీళ్లను విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరిచడంతో కేంద్ర ప్రభుత్వానికి, సుప్రీంకోర్టుకు మధ్య విభేదాలు మరింత తీవ్రతరమయ్యాయి. దాంతో నేరుగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ అంశంలో జోక్యం చేసుకున్నారు. బిల్లుల ఆమోదం విషయంలో రాష్ట్రపతికి, గవర్నర్లకు రాజ్యాంగం కల్పించిన అధికారాలను కాదని కోర్టులు ఇలా గడువులు పెట్టవచ్చా అంటూ నేరుగా సుప్రీంకోర్టునే నిలదీశారు. ఈ విషయమై పలు సందేహాలు లేవనెత్తుతూ 14 ప్రశ్నలు సంధించి వాటికి బదులు కోరారు. 143(1)వ అధికరణం రాష్ట్రపతికి కట్టబెట్టిన విశేషాధికారాలను ఉపయోగించుకుంటూ ఈ మేరకు సుప్రీంకోర్టుకు ఆమె లేఖ రాశారు. దాంతో దీనిపై విచారణకు సీజేఐ సారథ్యంలో ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది. గడువును వ్యతిరేకిస్తూ కేంద్రం, సమరి్థస్తూ తమిళనాడు సహా కేరళ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాలు వాదనలు విని్పంచాయి. అనంతరం గత సెపె్టంబర్ 11న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. రాష్ట్రపతి వేసిన 14 ప్రశ్నల్లో పదకొండింటిపై తాజా తీర్పులో తమ అభిప్రాయం వెలిబుచి్చంది. మిగతా మూడింటినీ ఈ అంశంతో సంబంధం లేనివిగా పేర్కొంది. ‘‘గవర్నర్లు బిల్లుపై తమ నిర్ణయాన్ని రిజర్వు చేసిన ప్రతిసారీ రాష్ట్రపతి ఇలా 143వ అధికరణ కింద సుప్రీంకోర్టు అభిప్రాయం కోరాల్సిన అవసరం లేదు’’ అని పేర్కొంది. -
పాక్‌లో పంజాబ్ మహిళ అదృశ్యం
న్యూఢిల్లీ: గురునానక్ దేవ్ 556వ జయంతి సందర్భంగా ‘ప్రకాశ్ పుర్బ్’ వేడుకల్లో పాల్గొనేందుకు పాకిస్తాన్‌కు వెళ్లిన భారత్‌లోని పంజాబ్‌కు చెందిన ఒక మహిళా యాత్రికురాలు తిరిగి రాలేదు. సర్బ్జిత్ కౌర్‌గా గుర్తించిన ఈ మహిళ పంజాబ్‌లోని కపుర్తలా జిల్లాలోని అమానిపూర్ గ్రామానికి చెందినది. ఆమె ఆచూకీ తెలియకపోవడంతో పంజాబ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.సర్బ్జిత్ కౌర్ 2025, నవంబర్ 4న అట్టారి-వాఘా సరిహద్దు మీదుగా పాకిస్తాన్‌కు చేరుకున్నారు. ఆమె 1,900 మందికి పైగా సిక్కు సభ్యులతో కూడిన ‘జాతా’ (తీర్థయాత్ర సమూహం)లో భాగంగా వెళ్లారు. ఈ బృందం గురుద్వారా నంకనా సాహిబ్‌లో ప్రార్థనలు నిర్వహించేందుకు, ఇతర చారిత్రక సిక్కు మందిరాలను సందర్శించేందుకు 10 రోజుల యాత్రకు వెళ్లింది. అయితే గురువారం రాత్రి ఈ బృందం భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు, సర్బ్జిత్ కౌర్ వారిలో లేరు. ఆమె తిరిగి రాకపోవడాన్ని గుర్తించిన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. #WATCH | Kapurthala, Punjab | Station House Officer (SHO) of Talwandi Chaudhrian, Nirmal Singh says, "Sarbjit Kaur, a resident of Amanipur village in Kapurthala, was part of the jatha which went to Nankana Sahib, Pakistan. She did not return. The police are conducting an… pic.twitter.com/fPpMWzjcuK— ANI (@ANI) November 14, 2025ఈ ఘటనపై పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. తల్వాండి చౌదరియన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ)నిర్మల్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ కపుర్తలాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే దీనిపై కేసు నమోదయ్యిదన్నారు. భారత ఇమ్మిగ్రేషన్ అధికారులు కౌర్ కుటుంబ సభ్యుల నుంచి, ఆమె గ్రామం నుంచి మరింత సమాచారాన్ని సేకరించే ప్రయత్నంలో ఉన్నారు. ఆమె అదృశ్యం వెనుక కారణాలు, ఆమె పాకిస్తాన్లో ఉండిపోయారా? లేదా మరేదైనా జరిగిందా? అనే కోణాల్లో పోలీసు దర్యాప్తు జరుగుతోంది.గురువారం తిరిగి వచ్చిన ఈ యాత్రికుల బృందం ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత పాకిస్తాన్‌కు వెళ్లిన మొదటి ‘జాతా’ కావడం గమనార్హం. గతంలో పలు భద్రతా కారణాల దృష్ట్యా భారత్ పాకిస్తాన్‌కు ప్రయాణ ఆంక్షలు విధించింది. గత జూన్‌లో మహారాజా రంజిత్ సింగ్ వర్ధంతికి సిక్కులు పాకిస్తాన్‌ను సందర్శించకుండా నిషేధించారు. సుమారు రెండు వారాల నిరాకరణ తర్వాత, అక్టోబర్ రెండున కేంద్ర ప్రభుత్వం ఈ తీర్థయాత్రకు అనుమతి ఇచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రయాణ ఆంక్షలను మరింత కఠినతరం చేయడంతో, ప్రస్తుతం భారత పౌరులు మాత్రమే అట్టారి సరిహద్దు ద్వారా ప్రయాణించగలుగుతున్నారు. ఈ కఠిన నిబంధనల మధ్య యాత్రికురాలు అదృశ్యం కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇది కూడా చదవండి: Bihar Election: ఈ ఐదుగురు.. ‘ఉత్కంఠ విజయులు’ -
షాకిచ్చిన ఉప ఫలితాలు
న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాల్లోని 8 నియోజకవర్గాలకు ఈనెల 11వ తేదీన జరిగిన ఉప ఎన్నికల్లో నాలుగింటిని అధికార పక్షాలు దక్కించుకున్నాయి. బీజేపీ పాలిత రాజస్తాన్‌లో కాంగ్రెస్ ఒక సీటును గెలుచుకోగా, జమ్మూకశ్మీర్‌లోని బుద్గాం స్థానం అధికార నేషనల్ కాన్ఫరెన్స్ మొట్టమొదటిసారిగా ఓటమి పాలైంది. ఇక్కడ పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ(పీడీపీ)అభ్యర్థి విజయం సాధించారు. జమ్మూకశ్మీర్‌లోని నగ్రోటా సీటును బీజేపీ నిలబెట్టుకుంది. మిజోరంలో ప్రధాన ప్రతిపక్షం మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్) డంపా సీటును, పంజాబ్‌లోని తరన్‌తరన్ స్థానాన్ని ఆప్, జార్ఖండ్‌లోని ఘట్శిలా స్థానాన్ని జేఎంఎం నిలబెట్టుకున్నాయి. అదేవిధంగా, తెలంగాణలోని జుబ్లీహిల్స్ స్థానాన్ని బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ దక్కించుకుంది. ఒడిశాలోని నౌపడ స్థానాన్ని బీజేపీ భారీ మెజార్టీతో తిరిగి గెలుచుకుంది. ఉప ఎన్నిక ఫలితాలపై ప్రధాని మోదీ స్పందించారు. బీజేపీ అభ్యర్థులకు విజయం అందించిన జమ్మూకశ్మీర్‌లోని నగ్రటా, ఒడిశాలోని నౌపడ నియోజకవర్గాల ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కొత్తగా ఎమ్మెల్యేలైన దేవయాని రాణా, ధొలాకియాలను ఆయన అభినందించారు. వీరి గెలుపునకు అహరి్నశలు కృషి చేసిన కార్యకర్తలకు ఎక్స్‌లో ధన్యవాదాలు తెలిపారు. కంచుకోటలో ఎన్సీ ఓటమి బుద్గాం నియోజకవర్గం అబ్దుల్లాల కుటుంబానికి కంచుకోటగా ఉంది. గతేడాది జరిగిన ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అగ్రనేత ఒమర్ అబ్దుల్లా బుద్గాంతోపాటు గండేర్బల్ స్థానాల నుంచి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం, సీఎం అయ్యాక బుద్గాంకు రాజీనామా చేశారు. దీంతో, 11న ఉప ఎన్నిక జరిగింది. తాజాగా వెలువడిన ఫలితాల్లో ఇక్కడ ప్రతిపక్ష పీడీపీ అభ్యర్థి ఆగా సయ్యద్ ముంతజీర్ విజయం సాధించారు. ఎన్సీ అభ్యర్థి ఆగా సయ్యద్ మెహ్మూద్పై ముంతజీర్ 4,478 ఓట్ల తేడాతో గెలుపొంది రికార్డు నెలకొల్పారు. 1957లో మొదటిసారిగా ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఓటమి ఎరుగని ఎన్సీకి మొట్టమొదటి పరాజయమిది. డిపాజిట్ కోల్పోయిన ఎన్సీ జమ్మూకశ్మీర్‌లోని నగ్రోటా స్థానాన్ని బీజేపీ అభ్యర్థి దేవయాని రాణా గెలుచుకున్నారు. జమ్మూకశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ(జేకేఎన్‌పీపీ)కి చెందిన హర్‡్ష దేవ్ సింగ్‌పై 24,647 ఓట్ల తేడాతో దేవయాని గెలిచారు. ఇక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యరి్థని షమీమ్ బేగం డిపాజిట్ కోల్పోయారు. ఆమెకు కేవలం 10,872 ఓట్లు మాత్రమే దక్కాయి. దివంగత ఎమ్మెల్యే దేవేందర్ సింగ్ రాణా కుమార్తె దేవయాని. దేవేందర్ మరణంతో ఉప ఎన్నిక జరిగింది. నౌపడలో బీజేపీ భారీ మెజార్టీ ఒడిశాలోని నౌపడ స్థానాన్ని బీజేపీ అభ్యర్థి జే ధొలాకియా గెలుచుకున్నారు. సమీప ప్రత్యరి్థ, కాంగ్రెస్‌కు చెందిన ఘాసీ రామ్ మాఝిపై 83,748 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. దివంగత బీజేడీ ఎమ్మెల్యే రాజేంద్ర ధొలాకియా కుమారుడు జె. రాజేంద్ర మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అధికార పార్టీకి ఎదురుదెబ్బ రాజస్తాన్‌లో అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. అంటా స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ చేతిలో పరాజయం పాలైంది. బీజేపీ అభ్యర్థి మోర్పాల్ సుమన్‌పై కాంగ్రెస్ నేత ప్రమోద్ జైన్ భయా 15,612 ఓట్ల తేడాతో గెలిచారు. బీజేపీకి చెందిన ఎమ్మెల్యే కన్వర్ లాల్ మీనా ఓ క్రిమినల్ కేసులో దోషిగా తేలడంతో అనర్హత వేటు పడింది. దీంతో, ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. సీటు నిలుపుకున్న ఆప్ పంజాబ్‌లోని తరన్ తరన్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఆప్ అభ్యర్థి హర్మీత్ సింగ్ సంధు తన సమీప ప్రత్యరి్థ, శిరోమణి అకాలీదళ్‌కు చెందిన సుఖ్వీందర్ కౌర్ రణ్ధవాపై 12,091 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆప్ ఎమ్మెల్యే కశ్మీర్ సింగ్ సొహాల్ జూన్‌లో చనిపోవడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిపారు.జార్ఖండ్‌లో బీజేపీ ఓటమి జార్ఖండ్‌లోని ఘట్శిలా నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం)కు చెందిన సోమేశ్ చంద్ర సోరెన్, సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన బాబూలాల్ సోరెన్‌ను 38,500 ఓట్ల తేడాతో ఓడించారు. జేఎంఎం ఎమ్మెల్యే రాందాస్ సోరెన్ కుమారుడే సోమేశ్. రాందాస్ ఆగస్ట్ 15వ తేదీన హఠాన్మరణం చెందగా ఉప ఎన్నిక చేపట్టారు. స్వల్ప తేడాతో విజయం అధికార జొరాం పీపుల్స్ మూవ్మెంట్(జెడ్పీఎం) అభ్యర్థి వన్లాల్ సైలోవా స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆయనపై ఎంఎన్ఎఫ్ అభ్యర్థి ఆర్.లాల్థంగ్లియా 562 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఎంఎన్ఎఫ్కు చెందిన డంపా శాసనసభ్యుడు లాల్రిన్ట్లువాంగా సైలో జూలైలో చనిపోవడంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించారు. -
Punjab ByPoll: తార్న్ తరణ్‌లో ఆప్ ముందంజ
అమృత్సర్: బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశంలోని మరో ఎనిమిది నియోజక వర్గాలకు జరిగిన ఉప ఎన్నికలకు నేడు(శుక్రవారం) కౌంటింగ్ జరుగుతోంది. ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ సరిహద్దు జిల్లా తార్న్ తరణ్ ఉప ఎన్నికల ఫలితాల్లో ‘ఆప్’ ముందంజలో ఉంది. ఈ ఫలితాల తీర్పు పంజాబ్‌లో 2027లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు కీలక సూచికగా పరిగణిస్తున్నారు. తార్న్ తరణ్ ఉప ఎన్నికల్లో ప్రధాన పోటీదారులుగా ఆప్‌నకు చెందిన హర్మీత్ సింగ్ సంధు, బీజేపీకి చెందిన హర్జిత్ సింగ్ సంధు, ఎస్ఏడీకి చెందిన సుఖ్విందర్ కౌర్ రాంధావా, కాంగ్రెస్‌కు చెందిన కరణ్‌బీర్ సింగ్ బుర్జ్ నిలిచారు. వీరంతా ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఆప్ ఎమ్మెల్యే డాక్టర్ కశ్మీర్ సింగ్ సోహల్ మృతితో ఈ స్థానంలో ఉప ఎన్నిక తప్పనిసరి అయింది. -
కాలుష్య నియంత్రణకు తీసుకుంటున్న చర్యలేంటి?
న్యూఢిల్లీ: ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడానికి పంజాబ్, హరియాణాలో పంట వ్యర్థాల తగలబెట్టడం సైతం ప్రధాన కారణమంటూ ఆ రెండు రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పొలాల్లో వ్యర్థాలను తగలబెట్టకుండా, పరిస్థితిని నియంత్రించడానికి తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆయా రాష్ట్రాలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్, జస్టిస్ ఎన్వీ అంజారియాల ధర్మాసనం ఆదేశించింది. కోర్టు సహాయకురాలు(అమికస్ క్యూరీ)గా వ్యవహరిస్తున్న సీనియర్ మహిళా అపరాజితా సింగ్ కోర్టు ఎదుట పలు అంశాలను ప్రస్తావించారు. ‘‘పంజాబ్, హరియాణాలో పంట వ్యర్థాల దహనాలు ఢిల్లీలో గాలి నాణ్యత స్థాయిలను మరింత దిగజార్చాయి. ఈ రెండు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం కారణంగానే ఈ పరిస్థితి దాపురించిందని స్వయంగా నాసా వారి ఉపగ్రహ చిత్రాలు సైతం రుజువుచేస్తున్నాయి. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను రాష్ట్రాలు పెడచెవిన పెట్టాయి. ఇప్పుడైనా రాష్ట్రాలు ఏపాటి చర్యలు తీసుకుంటాయో చూద్దాం’’ అని ఆమె అన్నారు. ‘పంట వ్యర్థాలను తగలబెట్టకుండా నియంత్రించడానికి తీసుకున్న చర్యలేంటో రాష్ట్రాలు స్పష్టంచేయాలి’ అని జస్టిస్ గవాయ్ ఆదేశించారు. కాలుష్యనియంత్రణ మాత్రమేకాదు నిర్మాణ కార్యకలాపాలకు సంబంధించి ఆదేశాలిస్తామని సీజేఐ అన్నారు. ఈ కేసు తదుపరి విచారణను నవంబర్ 17వ తేదీన చేపట్టనున్నారు. -
‘పంజాబ్ సర్వ నాశనం’: సీఎం సంచలన వ్యాఖలు
న్యూఢిల్లీ: పంజాబ్‌లోని తర్న్ తరన్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి హర్జిత్ సింగ్ సంధు తరపున ప్రచారం చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా.. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)పై విరుచుకుపడ్డారు. ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను లక్ష్యంగా చేసుకుని, పలు విమర్శలు గుప్పించారు. ‘ఆప్’ తమ పాలనలో ఢిల్లీని నాశనం చేసినట్లే, ఇప్పుడు పంజాబ్‌ను కూడా సర్వ నాశనం చేస్తోందని ఆరోపించారు.ప్రచార సభలో రేఖా గుప్తా మాట్లాడుతూ.. ఈ ఉప ఎన్నిక కేవలం ఒక సీటు గురించి కాదని, రాష్ట్ర భవిష్యత్తు, అభివృద్ధిపైనేనని ఆమె అన్నారు. పంజాబ్ ప్రభుత్వం మాదకద్రవ్యాల దుర్వినియోగం, శాంతిభద్రతల సమస్యలు, రుణ సమస్యల్లో మునిగిపోయిందని ఆరోపించారు. నవంబర్ 11న తర్న్ తరన్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి హర్జీత్ సింగ్ సంధుకు ఓటు వేయాలని కోరారు. రాష్ట్రంలో ప్రతిరోజూ హత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు.పంజాబ్ రాష్ట్రమంతా మాదకద్రవ్యాల వ్యసనంలో మునిగిందని ఆరోపించారు. రాష్ట్రంపై పెరుగుతున్న అప్పు భారం ప్రజలపై పడిందని రేఖా గుప్తా అన్నారు. ఈ ప్రచారానికి ముందు ఆమె తర్న్ తరన్‌లోని దర్బార్ సాహిబ్‌లో పూజలు చేసి, రాష్ట్రంలో శాంతి, సామరస్యం శ్రేయస్సు కోసం ప్రార్థించారు. అనంతరం ఆమె ఠాకూర్ద్వారా ఆలయాన్ని సందర్శించి, అక్కడున్న భక్తులతో సంభాషించారు. ఢిల్లీ క్యాబినెట్ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా ఆమె వెంట పర్యటించారు.ఇది కూడా చదవండి: ‘హెచ్చరించినా పట్టించుకోలేదు’.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు -
ఛ!.. నేను అలాంటి వాడిని కాదు: యువరాజ్ సింగ్
టీమిండియా దిగ్గజ ఆల్రౌండర్లలో యువరాజ్ సింగ్ (Yuvraj Singh) ఒకడు. భారత్ టీ20 ప్రపంచకప్-2007, వన్డే వరల్డ్‌కప్-2011 గెలవడంలో ఈ ఎడమచేతి వాటం ఆటగాడు కీలక పాత్ర పోషించాడు. క్యాన్సర్‌తో పోరాడి తిరిగి మైదానంలో అడుగుపెట్టి పరుగులు రాబట్టిన ఘనుడు.ఇక అన్ని ఫార్మాట్ల నుంచి చాలా ఏళ్ల క్రితమే వైదొలిగిన యువీ.. ఆ తర్వాత మెంటార్‌గా కొత్త అవతారం ఎత్తాడు. పంజాబీ స్టార్లు.. టీమిండియా వన్డే, టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill), అభిషేక్ శర్మ (Abhishek Sharma)లకు చాన్నాళ్లుగా యువీ మార్గనిర్దేశకుడిగా ఉన్నాడు. ముఖ్యంగా అతడి గైడెన్స్‌లోనే అభిషేక్ టీ20 విధ్వంసకరవీరుడిగా రాటుదేలాడు.అస్సలు పోలికలు లేవుఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్ తాజాగా PTIతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోచింగ్ విషయంలో తన తండ్రి యోగ్రాజ్ సింగ్‌తో తనకు అస్సలు పోలికలు లేవన్నాడు. మనకు నచ్చినది ఎదుటివాళ్లపై రుద్దడం కోచింగ్ కాదని.. ఆటగాళ్ల మైండ్‌సెట్‌ను బట్టి తీర్చిదిద్దడమే అసలైన కోచింగ్ అంటూ పరోక్షంగా తండ్రికి కౌంటర్ ఇచ్చాడు.యోగ్రాజ్ సింగ్ లాంటివాడిని కానే కాదుఈ మేరకు.. ‘‘నేను కచ్చితంగా యోగ్రాజ్ సింగ్ లాంటివాడిని కానే కాదు. వ్యక్తిగా, వ్యక్తిత్వం పరంగా ఆయనతో నాకు పోలిక లేదు. మేమిద్దరం భిన్న ధృవాలము. నా కోచింగ్ శైలి కూడా వేరుగా ఉంటుంది.ఒక ఆటగాడికి కోచ్‌గా ఉన్నపుడు.. అతడి స్థానంలో ఉండి ఆలోచించాలి. అతడికి ఆలోచనా విధానం, శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా వ్యవహరించాలి. వారి గురించి పూర్తిగా తెలుసుకుని మార్గనిర్దేశనం చేయాలి.అభిషేక్ శర్మకు చాలా ఏళ్లుగా మెంటార్‌గా ఉన్నాను. తద్వారా ఓ వ్యక్తికి ఎలా మార్గదర్శనం చేయాలో నేను పరిపూర్ణంగా నేర్చుకున్నా. ప్రతిభావంతులను ఎలా గుర్తించాలో తెలుసుకున్నా. కఠిన శ్రమకు ఓరుస్తూ.. ఒక్కో మెట్టు ఎక్కి మేము అనుకున్న ఫలితాలు రాబడుతున్నాం.అభిషేక్ శర్మ అదే చేస్తున్నాడుసహజమైన శైలిలో ఆడితేనే ఏ ఆటగాడైనా తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలడు. 2011 వరల్డ్‌కప్ విన్నింగ్ జట్టు కెప్టెన్ గ్యారీ కిర్‌స్టెన్ నాకు ఈ మాట చెప్పాడు. ఇదే నేను ఫాలో అయ్యాను. నా శిష్యులకు కూడా ఇదే చెబుతున్నా. కోచ్, కెప్టెన్ స్వేచ్ఛను ఇస్తే ఆటగాడు అద్భుతాలు చేయగలడు. ఇప్పుడు అభిషేక్ శర్మ అదే చేస్తున్నాడు’’ అని యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు.కాగా అభిషేక్ శర్మ ఐపీఎల్లో సత్తా చాటి టీమిండియాలో అడుగుపెట్టాడు. అనతికాలంలోనే ఐసీసీ నంబర్‌వన్ టీ20 బ్యాటర్‌గా ఎదిగాడు. ఇదిలా ఉంటే.. యువీని చిన్ననాటి నుంచే క్రికెటర్‌గా తీర్చిదిద్దే క్రమంలో యోగ్రాజ్ సింగ్ చాలా కఠినంగా వ్యవహరించాడు.ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు కూడా!.. ఒకానొక సందర్భంగా తన శిక్షణలో యువీ చచ్చిపోతాడంటూ అతడి తన తల్లి గొడవపెట్టినా పట్టించుకోలేదని తెలిపాడు. ఈ నేపథ్యంలో యువీ తన తండ్రి గురించి పైవిధంగా స్పందించడం గమనార్హం.చదవండి: BCCI: భారత జట్టు కెప్టెన్‌గా తిలక్ వర్మ.. రోహిత్- కోహ్లి లేరు -
వినూ మన్కడ్ చాంప్ హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ అండర్–19 బాలుర జట్టు చరిత్ర సృష్టించింది. దేశవాళీ అండర్–19 క్రికెట్ టోర్నమెంట్ వినూ మన్కడ్ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు తొలిసారి విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో పంజాబ్‌పై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 28.2 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ ఆర్యాన్ యాదవ్ (29), విహాన్ (28) కాస్త పోరాడారు. హైదరాబాద్ బౌలర్లలో యశ్వీర్ 3 వికెట్లు పడగొట్టగా... మలిక్, నిపుణ్ రెడ్డి, ఉజైర్ అహ్మద్ తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం హైదరాబాద్ 29.3 ఓవర్లలో 5 వికెట్లకు 112 పరుగులు చేసి గెలిచింది. అలంకృత్ రాపోల్ (70 బంతుల్లో 58 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో రాణించగా... అవేజ్ అహ్మద్ (85 బంతుల్లో 35 నాటౌట్; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. వినూ మన్కడ్ ట్రోఫీ గెలిచిన జట్టు సభ్యులకు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) రూ. 2 లక్షల చొప్పున నజరానా ప్రకటించింది. సహాయక సిబ్బందికి రూ. 1.50 లక్షలు అందించనుంది. -
కేజ్రీవాల్ ‘శీష్ మహల్ 2.0’
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్ ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తన శీష్ మహల్ కోసం పంజాబ్ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. అందుకు ఊతం ఇచ్చేలా ఆప్ అధికారంలో ఉన్న పంజాబ్ రాష్ట్రంలో కేజ్రీవాల్ తన రెండో శీష్ మహల్ నిర్మించుకున్నారని దుయ్యబట్టారు.అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మరో శీష్ మహల్‌పై (అద్దాల భవనం 2.0) ఎంపీ ఎంపీ స్వాతి మలివాల్, బీజేపీ దాడికి దిగింది. బిగ్ బ్రేకింగ్ అంటూ శీష్ మహల్ 2.0ను ఫోటోను షేర్ చేసింది. పంజాబ్ ప్రజల సొమ్ముతో రాజధాని చండీగఢ్‌లో ఈ అద్దాల మేడను నిర్మించుకున్నారని ట్వీట్లో పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీ బీజేపీ యూనిట్ ఎక్స్ వేదికగా ఓ ఫొటోను విడుదల చేసింది. బీజేపీ విడుదల చేసిన ఆ ఫొటోలోని ప్రాంతం చండీగఢ్ సెక్టార్ 2లోని ప్రభుత్వ బంగ్లా కాంప్లెక్స్. అందులోనే కేజ్రీవాల్ శీష్ మహల్ నిర్మించుకున్నారని మండిపడింది. కేజ్రీవాల్‌ను పంజాబ్ "సూపర్ సిఎం"గా అభివర్ణిస్తూ, "ఆమ్ ఆద్మీ (సామాన్యుడు) కావాలని కోరుకుంటున్న ఆప్ చీఫ్ మరో 'శీష్ మహల్'ను నిర్మించారని బీజేపీ విమర్శించింది. కేజ్రీవాల్‌కు ముఖ్యమంత్రి కోటా నుండి 2 ఎకరాల విస్తీర్ణంలో విలాసవంతమైన 7 స్టార్ ప్రభుత్వ బంగ్లాను కేటాయించారంటా విమర్శించింది. ‼️ Big Breaking - आम आदमी का ढोंग करने वाले केजरीवाल ने तैयार करवाया एक और भव्य शीशमहल दिल्ली का शीश महल ख़ाली होने के बाद पंजाब के Super CM अरविंद केजरीवाल जी ने पंजाब में दिल्ली से भी शानदार शीश महल तैयार करवा लिया है 😳 चंडीगढ़ के सेक्टर 2 में CM कोटे की 2 Acre की आलीशान 7… pic.twitter.com/d3V4W23yRw— BJP Delhi (@BJP4Delhi) October 31, 2025మరోవైపు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి పంజాబ్ ప్రభుత్వ వనరులను వ్యక్తిగత విలాసం కోసం దుర్వినియోగం చేస్తున్నారని స్వాతి మలివాల్ ఆరోపించడం మరింత సంచలనం రేపింది. అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్‌లో మరో శీష్ మహల్ అంటూ ఆరోపణలు ఆరోపించారు. మొత్తం పంజాబ్ ప్రభుత్వం ఒక వ్యక్తికి సేవ చేయడంలో నిమగ్నమై ఉందని మలివాల్ ఆరోపించారు. నిన్న, ఆయన (కేజ్రీవాల్) తన ఇంటి ముందు నుండి అంబాలాకు ప్రభుత్వ హెలికాప్టర్లో వెళ్లారని, అక్కడి నుంచి పంజాబ్ ప్రభుత్వ ప్రైవేట్ జెట్ ఆయనను పార్టీ పని కోసం గుజరాత్‌కు వెళ్లారని ఆమె ఆరోపించారు. दिल्ली का शीश महल ख़ाली होने के बाद अरविंद केजरीवाल जी ने पंजाब में दिल्ली से भी शानदार शीश महल तैयार करवा लिया है। चंडीगढ़ के सेक्टर 2 में CM कोटे की 2 Acre की आलीशान 7 स्टार सरकारी कोठी अरविंद केजरीवाल जी को मिल गई है। कल अंबाला के लिए घर के सामने से सरकारी हेलीकॉप्टर में… pic.twitter.com/Vy1MfMGkt1— Swati Maliwal (@SwatiJaiHind) October 31, 2025మరోవైపు బీజేపీ తాజా ఆరోపణలపై ఆప్ ఇంకా స్పందించలేదు. అయితే చండీగఢ్ ఆమ్ ఆద్మీ పార్టీ విభాగం ఆ ఆరోపణలను ఖండించింది. ఢిల్లీలో పార్టీ వివరణాత్మక ప్రకటన జారీ చేస్తుందని తెలిపింది. కాగా అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నంబర్ 6, ఫ్లాగ్ స్టాఫ్ రోడ్డులోని అధికారిక బంగ్లాలో నివసించారు. ఆ సమయంలో దాని మరమ్మతుల కోసం ప్రాథమిక అంచనా వ్యయం రూ.7.91 కోట్లు కాగా.. 2020లో రూ. 8.62 కోట్లకు కాంట్రాక్టు ఇచ్చారు. 2022లో పీడబ్ల్యూడీ శాఖ పనులు పూర్తిచేసే నాటికి ఆ ఖర్చు మూడు రెట్లు పెరిగి మొత్తం బంగ్లా మరమ్మతుల ఖర్చు రూ. 33.36 కోట్లకు చేరుకుందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) అంచనా వేసింది. సెప్టెంబర్ 2024 వరకు అరవింద్ కేజ్రీవాల్ ఆ బంగ్లాలోనే నివాసం ఉన్నారు. బీజేపీ నాయకుడు విజేందర్ గుప్తా ఫిర్యాదుపై కేంద్ర ప్రజా పనుల శాఖ (CPWD) వాస్తవ నివేదికను సమర్పించింది. -
క్యాబ్ డ్రైవర్ నుంచి కోటీశ్వరుడిగా.. ఎన్ఆర్ఐ సక్సెస్ స్టోరీ
చిన్నతనంలో ఎన్నో కష్టాలు. 19 ఏళ్ల వయసులోనే కన్నవారిని ఉన్న ఊరిని విడిచిపెట్టి అమెరికాకు ఒంటరి పయనం. అటు ఆర్థిక ఇబ్బందులు, ఇటు ఒంటరి తనం. డిప్రెషన్. అయినా సరే ఎలాగైనా నిలదొక్కుకోవాలనే తపనతో క్యాబ్ డ్రైవర్‌గా తన జీవితాన్ని ప్రారంభించి ఎవ్వరూ ఊహించని శిఖరాలకు చేరాడు. గంటకు 6 డాలర్లు సంపాదించే స్థాయినుంచి కోట్ల టర్నోవర్ వ్యాపారవేత్తగా, కోటీశ్వరుడిగా ఎదిగాడు.పంజాబ్‌కు చెందిన మనీ సింగ్ పేరుకు తగ్గట్టుగా మనీ కింగ్‌గా తనను తాను నిరూపించుకున్నాడు. కఠోరశ్రమ, పట్టుదల, ఓపిక ఇదే అతని పెట్టుబడి. టీనేజర్‌గా కాలేజీని వదిలిపెట్టి మనీ సింగ్ డాలర్ డ్రీమ్స్ కన్నాడు. అలా అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు వలస వెళ్లాడు. అయిష్టంగానే అక్క ఒక క్యాబ్ డిస్పాచర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు.అదే అతనికి విజయానికి పునాది వేసింది. అమెరికాకు వెళ్లిన తర్వాత చాలా ఇబ్బందులుపడ్డాడు. తిరిగి ఇండియాకు వచ్చేద్దామనుకున్నాడు తల్లి సలహా మేరకు తొలుత ఒక మందుల దుకాణంలో పనిచేశాడు, తరువాత తన మామ క్యాబ్ కంపెనీలో డిస్పాచర్‌గా పనిచేశాడు గంటకు 530 రూపాయల వేతనం. తరువాత మనీ సింగ్ స్వయంగా టాక్సీ నడపడం ప్రారంభించాడు. అలా పదేళ్లకు దశాబ్దానికి పైగా టాక్సీ పరిశ్రమలో ఉన్నాడు. ప్రస్తుతం ఏడాదికి సుమారు రూ. 17.65 కోట్లు (2మిలియన్ డాలర్లు) టర్నోవర్ కలిగిన రెండు విజయవంతమైన వ్యాపారాలను నడుపుతుండటం విశేషం.పదేళ్ల అనుభవంతో ఐదు క్యాబ్‌లతో సొంత డిస్పాచ్ సెటప్‌తో డ్రైవర్స్ నెట్‌వర్క్‌ను ప్రారంభించాడు. ఇది ATCS ప్లాట్‌ఫామ్ సొల్యూషన్స్‌గా మారింది. ఇక్కడితో ఆగిపోలేదు. 2019లో, సింగ్ తన తల్లి సెలూన్ వ్యాపారం నుండి ప్రేరణ పొంది, మౌంటెన్ వ్యూలో డాండీస్ బార్బర్షాప్ & బియర్డ్ స్టైలిస్ట్‌ను (Dandies Barbershop and Beard Stylist ) ప్రారంభించాడు. అక్కడ కూడా సక్సెస్ సాదించాడు. CNBC ప్రకారం, డాండీస్ గత సంవత్సరం రూ. 9.47 కోట్లు సంపాదించాడు. అయితే ATCS ప్లాట్‌ఫారమ్ సుమారు మరో 9 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. వ్యాపారం ఇలా మొదలైంది. 75 వేల డాలర్ల పెట్టుబడి, పర్మిట్లు, పేపర్ వర్క్‌కోసం సంవత్సరం పట్టిందని మనీ సింగ్ తెలిపారు . దుకాణం తెరవడానికి లైసెన్స్ పొందేదాకా ఒక సంవత్సరం అద్దె చెల్లించానని చెప్పుకొచ్చాడు. మరోవైపు అతనికి క్షురకుడిగా అనుభవంలేనందున, స్నేహితుడితో భాగస్వామ్యం కుదుర్చు కున్నాడు సరిగ్గా ఆరునెలలు గడిచిందో లేదో కోవిడ్-19 మహమ్మారి వచ్చి పడింది. ఫలితంగా దాదాపు ఒక సంవత్సరం పాటు దుకాణాన్ని మూసివేయాల్సి వచ్చింది. కానీ అద్దె ఇంకా చెల్లించక తప్పలేదు. మొత్తానికి లోన్లు, స్నేహితుల వద్ద అప్పలు, క్రెడిట్ కార్డ్ లోన్లతో మేనేజ్ చేశాడు. దీనికి తోడు స్టాక్ పోర్ట్‌ఫోలియోను కూడా లిక్విడేట్ చేశాడు. ఒక దశలో తిండికి కూడా చాలా కష్టమైంది.కట్ చేస్తే నేడు, మనీ సింగ్ మూడు డాండీస్ అవుట్లెట్లను నెలకొల్పి 25 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. అప్పులన్నీ తీర్చేశాడు. 2023నాటికి డాండీస్ మరింత లాభదాయకంగా మారింది. క్రమశిక్షణ ,పట్టుదల పంజాబ్‌లోని తన బాల్యం నుంచే వచ్చాయనీ గుర్తుచేసుకున్నాడు. భవిష్యత్తు ప్రాజెక్ట్ - బార్బర్స్ నెట్వర్క్, బార్బర్ల కోసం బుకింగ్ యాప్‌ను నిర్మిస్తున్నానని మనీ సింగ్ చెప్పాడు. "నేను రోజుకు 15–16 గంటలు పనిచేస్తాను. రిటైర్ అవ్వాలనుకోవడం లేదు. పనే ఊపిరి లాంటిది," అని చెబుతాడు సగర్వంగా. -
ఉత్సాహంగా బరాత్, తెల్లారితే పెళ్లి : అంతలోనే విషాదం
ఇటీవలికాలంలో చిన్న వయసులోనే గుండెపోటుతో సంభవిస్తున్నమరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. తాజాగా పెళ్లి ఒక రోజు ముందు నవ వధువు గుండెపోటుతో కన్నుమూసింది. దీంతో పెళ్లి బాజాలతో కళకళ లాడాల్సిన వేదిక ఆత్మీయుల రోదనలతో విషాదంగా మారిపోయింది. పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లో ఈ ఘటన జరిగింది.ఫరీద్కోట్ జిల్లాలోని బర్గారి గ్రామానికి చెందిన పూజకు సమీప గ్రామమైన రౌకేకు చెందిన వ్యక్తితో ఇటీవల నిశ్చితార్థం అయింది. వరుడుదుబాయ్లో ఉండటంతో పెళ్లికి ముందు వధూవరులిద్దరూ ఎప్పుడూ వ్యక్తిగతంగా కలవలేదు. వీడియో కాల్‌లోనే ఎంగేజ్మెంట్ జరిగింది. వివాహానికి కొన్ని రోజుల ముందు వరుడు దుబాయ్ నుండి తిరిగి వచ్చాడు. దీంతో ఇరు కుటుంబాలు పెళ్లికి సర్వం సిద్ధం చేసుకున్నాయి. వివాహానికి ఒక రోజు ముందు, జాగో వేడుక (బారాత్) సందర్భంగా, పూజ తన బంధువులతో సంతోషంగా జరుపుకుంది. అయితే, ఆ రాత్రి 2 గంటల ప్రాంతంలో, ఆమె ముక్కు నుండి అకస్మాత్తుగా రక్తం రావడం ప్రారంభమైంది. వెంటనే స్పందించిన బంధువులు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు ప్రకటించాడు. దీంతో పెళ్లి ఇల్లు కాస్త విషాదంగా మారిపోయింది. పూజా అంత్యక్రియల ఊరేగింపు ఆమె పెళ్లి దుస్తులలో ఉండగానే జరిగింది. దీంతో వధూవరుల కుటుంబాలతోపాటు గ్రామం మొత్తం దుఃఖంలో మునిగిపోయింది. ఎంతో సంతోషంగా పెళ్లి చేసి, అత్తారింటికి పంపాలనుకున్నామని బరాత్ రాత్రి పూజకు గుండెపోటు రావడంతోచనిపోయిందని అమ్మాయి తండ్రి, వరుడి సోదరుడు వాపోయారు. -
మాజీ డీజీపీ కొడుకు కేసులో భయానక ట్విస్ట్
మాజీ డీజీపీ కొడుకు మృతి కేసులో భయంకరమైన ట్విస్ట్ వెలుగు చూసింది. తన భార్యతో తన తండ్రి అనైతిక సంబంధం పెట్టుకున్నాడని.. అప్పటి నుంచి తనను మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెట్టారని, చివరకు చంపేందుకు కూడా వెనకడలేదని చెబుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో ఒక్కసారిగా అలజడి రేగింది.పంజాబ్ మాజీ డీజీపీ(మానవ హక్కుల) ముహ్మద్ ముస్తాఫా తనయుడు అకీల్ అక్తర్(35)లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పంచకుల నివాసంలో అక్టోబర్ 16వ తేదీన అకీల్ విగతజీవిగా కనిపించాడు. అయితే డ్రగ్ ఓవర్‌డోస్ కారణంగానే చనిపోయాడంటూ ఆ కుటుంబం చెబుతూ వచ్చింది. ఈలోపు పొరుగింట్లో షామ్‌షుద్దీన్ చౌద్రీ ఈ మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఈ కేసు దర్యాప్తులో ఉండగానే.. సంచలన వీడియో ఒకటి బయటకు వచ్చింది. అందులో తన తండ్రి తన భార్యతో సంబంధం పెట్టుకున్నాడని, తననూ చంపేందుకు కుట్ర కూడా పన్నాడని అకీల్ వివరించాడు. ఆగస్టు 27వ తేదీన రికార్డు చేసిన ఆ వీడియో 16 నిమిషాల నిడివి ఉంది. ఇంకా అందులో.. తన తండ్రి ముస్తాఫా తన భార్యతో అనైతిక సంబంధం పెట్టుకున్నాడని.. దీంతో 2018లో ఆమెతో విడాకులు తీసుకున్నానని, ఈ విషయం తన తల్లీ, సోదరికి కూడా తెలుసని, వాళ్లు అభ్యంతర వ్యక్తం చేయకపోగా తననే నాశనం చేశారని వాపోయాడు. తనను మానసిక రోగిగా ప్రచారం చేస్తూ రిహాబిలిటేషన్ సెంటర్‌కు పంపారని, తన వ్యాపారాన్ని చేజిక్కించుకున్నారని.. హింసించడంతో పాటు తప్పుడు కేసులు పెడతానని బెదిరించారిని అకీల్ చెప్పుకొచ్చాడు.ఈ వీడియో ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేయాలని ఫిర్యాదుదారి షాముద్దీన్ కోరుతున్నాడు. దీంతో.. ముస్తాపా, ఆయన సతీమణి(మాజీ మంత్రి కూడా) రజియా సుల్తానా, వీళ్ల కూతురు, కోడలి(మాజీ)పైనా బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటన పంజాబ్ రాజకీయ, పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. -
అవినీతి తిమింగళం.. డీఐజీ ఇంట్లో నోట్ల కట్టలు, కిలోన్నర బంగారం..
చండీగఢ్: పంజాబ్‌లో అవినీతి తిమింగలం బయటపడింది. పంజాబ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్(డీఐజీ)(DIG Harcharan Bhullar) ఆఫ్ పోలీస్ హర్చరణ్ భుల్లార్‌ను లంచం ఆరోపణలపై సీబీఐ(CBI) అధికారులు గురువారం అరెస్ట్ చేశారు. ఎనిమిది లక్షల రూపాయల లంచం కేసులో సీబీఐ.. భుల్లార్‌కు సంబంధించిన ఇళ్లలో తనిఖీలు చేయగా విస్తుపోయే దృశ్యాలు బయటకు వచ్చాయి.వివరాల ప్రకారం.. మండి గోబింద్‌గఢ్‌కు చెందిన తుక్కు వ్యాపారి ఆకాశ్ బట్టాపై 2023లో కేసు నమోదైంది. ఈ కేసును మాఫీ చేసేందుకు, నెలవారీ మామూళ్లతోపాటు రూ.8 లక్షల లంచం ఇవ్వాలని డీఐజీ భుల్లార్ డిమాండ్ చేశారు. ఇందుకుగాను కిషన్ అనే మధ్యవర్తితో వ్యవహారం నడిపారు. ఈ మేరకు వ్యాపారి ఆకాశ్ నుంచి సమాచారం అందుకున్న సీబీఐ అధికారులు నిఘా పెట్టారు. గురువారం చండీగఢ్‌లో ఆకాశ్ నుంచి డీఐజీ తరఫున రూ.8 లక్షలు తీసుకుంటుండగా కిషన్‌ను పట్టుకున్నామని సీబీఐ తెలిపింది. Images from DIG Ropar (Punjab) Harcharan Singh Bhullar's residence.CBI raid unearthed ₹5Cr cash, Merc, Audi, 22 Expensive watches, 1.5kg gold..He was part of anti-drug campaign as well.Routine news of highly corrupt clans of India — IAS and IPS officers. pic.twitter.com/P8HEo0o1Jh— The Hawk Eye (@thehawkeyex) October 17, 2025ఈ సందర్భంగా డీఐజీ, మధ్యవర్తి కిషను, వ్యాపారి ఆకాశ్ మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణ ఆధారంగా డీఐజీని అరెస్ట్ చేశామని పేర్కొంది డీఐజీ కార్యాలయం, నివాసంలో జరిపిన సోదాల్లో రూ.5 కోట్ల నగదు, కిలోన్నర బరువున్న ఆభరణాలు, ఆస్తి పత్రాలు, మెర్సిడెజ్, ఆడి కార్లు, 22 ఖరీదైన గడియారాలు, డబుల్ బ్యారెల్ గన్, పిస్టల్, రివాల్వర్, ఎయిర్ గన్, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని వివరించింది. ఇద్దరు నిందితులను ఇవాళ కోర్టులో హాజరుపరుస్తారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రోపర్ రేంజ్ DIGగా భుల్లార్ విధులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.Recovery from DIG Harcharan Bhullar Ropar of #PunjabPolice from his house by @cbic_india today.What a corruption it would be very small amount of items? 😂😂😂😂 pic.twitter.com/jRd3tHUOlI— Thomas 🇮🇳🇷🇺🇮🇱🕊️✌️ (@Thomas11P) October 16, 2025 -
ఏకంగా 200 రకాల వెరైటీ సమోసాలు..! ఎక్కడంటే..
సమోసా అంటే ఎవరికి ఇష్టం ఉండదు. వేడివేడి చాయ్‌తో ఆరగించే స్నాక్ ఐటెం అది. ఈ చిరు తిండిని బంగాళ దుంప మసాల, లేదా బఠానీలతో క్రిస్పీగా అందించడం విన్నాం. బంగారు త్రిభుజాకారంలో నోరూరించే ఈ వంటకం భారతీయుల వంటకాలలో అంతర్భాగం. మహా అయితే ఆ సమోసాలో మూడు, నాలుగు రకాల వెరైటీలు చూసుంటాం. కానీ ఏకంగా వందల రకాల వెరైటీ సమోసాలు అందించే ఫుడ్‌స్టాల్ గురించి విన్నారా?. ఔను మీరు వింటుంది నిజమే. నో ఛాన్స్ అనుకోకండి..అన్ని రకాలు అమ్ముతూ నెట్టింట వైరల్ అయ్యాడు ఈవ్యక్తి. ఎక్కడుందంటే ఆ ఫుడ్ స్టాల్.. పంజాబ్‌లో జలంధర్(Jalandhar)లోని వీధిలో ఈ దుకాణం దర్శనమిస్తుంది. అక్కడ ఇన్ని రకాల సమోసా వెరైటీలను(Samosa Varieties) చూడొచ్చు. పది రకాల సమోసాలు విక్రయిస్తేనే..వామ్మో..! అనేస్తాం. కానీ ఇక్కడ ఏకంగా 200 రకాల సమోసాలను అందిస్తున్నారు ఆహారప్రియులకు. అవేంటో చూద్దామా..ముందుగా లేడిఫింగర్ సమోసాతో మొదలై..బీన్స్ సమోసా, పచ్చి అరటి సమోసా, పనీర్ సమోసా, గోబీ సమోసా, సోయా సమోసా, నూడిల్స్ సమోసా, మాకరోని, పుట్టగొడుగులు ఇలా పలు రకాల సమోసాలు దర్శనమిస్తున్నాయి. వాటిని చూడగానే..ఆ రకరకాల సమోసాలు టేస్ట్ చేయగలమా అనే సందేహం తప్పక కలుగుతుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు సైతం బ్రో నేను ఆలుతో చేసిన సమోసా తప్ప మరేది ట్రై చేయను అని ఒకరు, బాబోయ్ సమోసాపై ఉన్న ఇష్టాన్ని చంపేశావు కదా అని మరొకరు ఇలా కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Foodpandits! (@foodpandits) (చదవండి: చలి పులి వచ్చేస్తోంది..ఆరోగ్యం జాగ్రత్త! హెచ్చరిస్తున్న నిపుణులు) -
భర్త క్షేమం కోరి కర్వా చౌత్ ఉపవాసం ఉంటే..పాపం విధి మరోలా..
"ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు" అన్న పాటలానే జీవితం ఉంటుంది. అప్పటి వరకు మనతో ఆడుతూ పాడుతూ సందడి చేసినవాళ్లు హఠాత్తుగా మనల్ని వదిలేసి వెళ్లిపోతే కచ్చితంగా ఠక్కున మన ఘంటసాలగారు పాడిన పాటల మదిలోకి వచ్చేస్తుంది. మనం ఒకటి అనుకుని సరదాగా గడిపితే విధి మరోలా మన కథ రాసేస్తుంటుంది. అలాంటి విషాద ఘటనే ఇక్కడ చోటు చేసుకుంది. ఈ దురదృష్టకర సంఘటన పంజాబ్‌లో జరిగింది. పంజాబ్‌లోని బర్నాలాలో కర్వాచౌత్ వేడుకల సందర్భంగా తన భర్త దీర్ఘాయువు కోసం ఉపవాసం ఉంది 59 ఏళ్ల ఆశా రాణి. దక్షిణ భారతదేశంలో జరుపుకునే అట్లతద్ది మాదిరిగా జరుపుకునే పండుగే ఈ కర్వా చౌత్. అయితే ఈ కర్వాచౌత్ పండుగలో ఉపవాస విరమణ భర్తచేతుల మీదుగా జరుగుతుంది. ఆ నేపథ్యంలోనే ఈ ఆశారాణి అనే మహిళ కూడా భర్త క్షేమం కోరి ఉపవాసం ఉంది. అయితే ఈ వేడుకను ఆ రోజు(శుక్రవారం) సాయంత్రం స్నేహితుల ఇంటిలో జరుపుకోవాలని భావించి మనవరాలు, భర్తతో కలిసి వాళ్ల ఇంటికి వెళ్లారు. అక్కడ చంద్రుడి రాకకై నిరీక్షిస్తూ..అంతా సందడి సందడిగా గడిపారు. ఈలోపు నీరసం రాకుండా ఉత్సాహంగా ఉండేలా కాస్త ఆటపాటలు, నృత్యాలతో నిరీక్షిస్తున్నారు. ఈ ఆశారాణి కూడా అందులో భాగంగానే ఓ పాటకు వారందరితో కలిసి నృత్యం చేస్తూ..ఒక్కసారిగా కుప్పకూలిపోయింద. సకాలంలో వైద్యుడి వద్దకు తీసుకువెళ్లినా.. ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆమె మరణించినట్లు దృవీకరించారు వైద్యులు. అప్పటిదాక ఆనంద సంతోషాలతో తేలియాడిన ఆ రెండు కుటుంబాలు ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయాయి. భర్త దీర్ఘాయువు కోసం ఉపవాసం ఉండి..ఆమెనే సుమంగళిగా మృత్యుఒడికి వెళ్లిపోయిందంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలిపించారు. ఇలాంటి ఘటనలు చూడగానే.. ఏ క్షణంలో ఏం జరగుతుందో ఎవ్వరికీ తెలియదు..విధి చాలా బలీయమైనది అన్న మాటలు స్పురణకు వస్తాయి కదూ..!. ..ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ..అప్పటి దాక ఆడిపాడి..మనముందే తనువు చాలిస్తే..ఆ బాధ అంత తేలిగ్గా మర్చిపోలేరెవ్వరూ..!. సో బీకేర్‌ఫుల్ ఇలాంటి విషయాల్లో..సదా అప్రమత్తంగా ఉండండి.Karwa Chauth celebration in Barnala turn tr@gic after woman coll@pses while dancing#KarwaChauth #KarwaChauthcelebration pic.twitter.com/dz3G5APp7r— True Scoop (@TrueScoopNews) October 13, 2025 (చదవండి: ఆ దంపతుల అభి‘రుచే’ సపరేటు.. అమెరికాలో వడాపావ్ పిక్నిక్కి అదే రూటు) -
35 ఏళ్లకే కోట్ల సంపాదన, బైక్స్ పిచ్చి...నమ్మలేని నిజాలు
పంజాబీ గాయకుడు(Punjabi Singer) రాజ్వీర్ జవాండా (Rajvir Jawanda) అకాల మరణం యావత్ సంగీత ప్రపంచానికి కుదిపివేసింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి,35 ఏళ్ల వయసులో అనంత లోకాలకు చేరుకోవడం అభిమానులను షాక్‌కు గురిచేసింది. ఒక రత్నాన్ని కోల్పోయామంటూ సంగీతాభిమానులు, పెద్దలు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుని, చిన్న వయసులోనే పేరు ప్రఖ్యాతులను సంపాదించుకొని, ఇంకా మరింత బంగారు భవిష్యత్తును చూడాల్సిన ఆయన మరణం అత్యంత విషాదకరం. రాజ్వీర్ జవాండా ఆస్తుల విలువ(Net worth) ఎంత అనేది నెట్టింట చర్చకు దారి తీసింది.ఆస్తి ఎంత అంటే?రాజ్వీర్ జవాండా సంగీతం, పలు మూవీల్లో నటన, బ్రాండ్ ఎండార్స్మెంట్లు , ఇతర పెట్టుబడుల ద్వారా భారీ సంపదను కూడబెట్టాడు. పంజాబీ సంగీత రంగంలో ప్రముఖ వ్యక్తిగా, రాజ్వీర్ జవాండా తన పాటల బహుళప్రజాదరణ పొందాడు. భారీ ఆదాయాన్ని సంపాదించాడు. సర్దారీ, కంగాని , మేరా దిల్‌తో సహా అనే పాటలు అనేక ప్లాట్‌ఫాంలలో మోత మోగిపోయాయి. మిలియన్ల కొద్దీ స్ట్రీమ్స్ సాధించాయి. దీనికి రాయల్టీ కూడా భారీ మొత్తంలోనే సంపాదించాడు. వీటితోపాటు కెనడా,యూకే, యూఎస్ వంటి దేశాలలో అంతర్జాతీయ పర్యటనలు, లైవ్ షోలు మరో ప్రధాన ఆదాయ వనరు. దీనికి సోషల్ మీడియా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రాజ్వీర్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పాన్సర్డ్ పోస్టులు, బ్రాండ్ డీల్స్ తో సంపాదన కూడా తక్కువేమీ కాదు. అలా అక్టోబర్ 8, 2025 నాటికి, రాజ్వీర్ నికర విలువ రూ. 4–5 కోట్ల మధ్య ఉంటుందని సమాచారం.సంగీతంతో పాటు,సుబేదార్ జోగిందర్ సింగ్, జింద్ జాన్ , మిండో తసీల్దార్ని లాంటి పంజాబీ చిత్రాలలో నటనతో కూడా ఆకట్టుకున్నాడు రాజ్వీర్. అలాగే ముందు చూపుతో ఇతర ఇతర వెంచర్లలో జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది.చదవండి: Mounjaro వెయిట్‌లాస్ మందు దూకుడు, డిమాండ్ మామూలుగా లేదు!పంజాబ్‌లోని లూధియానాలో 1990లో జన్మించిన రాజ్వీర్ జవాండా పాఠశాల విద్య తరువాత జగ్రాన్లోని డీఎవీ కళాశాల నుండి పట్టభద్రు డయ్యాడు. తరువాత పాటియాలాలోని పంజాబీ విశ్వవిద్యాలయం నుండి థియేటర్ అండ్ టెలివిజన్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందాడు. తండ్రి కరం సింగ్ బాటలో నడుస్తూ 2011లో పంజాబ్ పోలీస్‌లో కానిస్టేబుల్‌గా చేరాడు. అయితే, ఆయన సంగీతం పట్ల తనకున్న మక్కువతో ఉద్యోగం చేస్తూనే సైడ్ కెరీర్‌గా పాటలు రికార్డ్ చేయడం , తన షిఫ్ట్‌ల తర్వాత ప్రదర్శన ఇచ్చేవారు. మంచి పాపులారిటీ రావడంతో పూర్తిగా దీనిపైనే దృష్టిపెట్టేందుకు అందువల్ల, 2019 లో పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేశాడు.2020-21లో ఢిల్లీ సరిహద్దులో రైతుల నిరసన జరిగినప్పుడు, రాజ్వీర్ కూడా రైతులకు మద్దతుగా వచ్చాడు. నిరసన తెలుపుతున్న రైతుల కోసం వేదికపై ఉచితంగా పాడేవాడు. ఢిల్లీ సరిహద్దులో రైతుల నిరసన సందర్భంగా, ఒక ప్రదర్శన సమయంలో తన తండ్రియ చనిపోయారు. ఈ వార్త తెలిసినా కూడా వేదికపై పాటను పూర్తి చేసి, అంత్యక్రియల కోసం బయలుదేరాడు.రాజ్‌వీర్‌కు బైక్‌లంటే పిచ్చిరాజ్వీర్ జవాండాకు బైకింగ్ అంటే చాలా ఇష్టం. అతను తరచుగా తోటి బైకర్లతో కలిసి కొండలకు విహారయాత్రలకు వెళ్లేవాడు. ఈ పర్యటనల సమయంలో, అతను హోటళ్లలో బస చేయకుండా రోడ్డు పక్కన క్యాంప్ చేసేవాడు. రాజ్వీర్ కొన్ని నెలల క్రితం రూ. 27 లక్షల విలువైన కొత్త BMW బైక్‌ను కొనుగోలు చేశాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకున్నాడు , దానిని ఒక పాటలో కూడా ఉపయోగించాడు. ప్రమాదం జరిగిన సమయంలో అతను ఈ BMW బైక్‌ను నడుపుతున్నాడు. బైకింగ్‌కు అవసరమైన అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకున్నప్పటికీ అతన్ణి మృత్యువు వీడలేదు.చదవండి: Rajvir Jawanda పోలీసు కాస్త గాయకుడిగా..భార్య వద్దన్నా వినలేదు..శోకసంద్రంలో ఫ్యాన్స్రాజ్వీర్ జవాండా కుటుంబంరాజ్వీర్ తాత సౌదాగర్ సింగ్. అమ్మమ్మ సుర్జిత్ కౌర్ తండ్రి రిటైర్డ్ ఏఎస్ఐ కరం సింగ్ . తల్లి పరమ్‌జిత్ కౌర్ ఈమె మాజీ సర్పంచ్. జవాందా, భార్య అశ్విందర్ కౌర్‌తో పాటు, ఇద్దరు పిల్లలు కుమార్తె హేమంత్ కౌర్ చ కుమారుడు దిలావర్ సింగ్. జవాందాకు కమల్జిత్ కౌర్ అనే సోదరి కూడా ఉంది. -
పోలీసు కాస్త గాయకుడిగా..భార్య వద్దన్నా వినలేదు..శోకసంద్రంలో ఫ్యాన్స్
మొన్న అసోం గాయకుడు జుబీన్ గార్డ్ అకాల మరణం వార్తను ఇంకా మర్చిపోకముందే పంజాబ్‌కు చెందిన మరో ప్రముఖ గాయకుడి మరణం సంగీత ప్రపంచంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పంజాబీ గాయకుడు రాజ్వీర్ జవాండా(Rajvir Jawanda) విషాద మరణం ఎంటర్టైన్మెంట్ పరిశ్రమలో దిగ్భ్రాంతి రేపింది. ఈసెప్టెంబర్ 27న తీవ్రమైన ప్రమాదానికి గురైన గాయకుడు 11 రోజులు వెంటిలేటర్‌పై చికిత్స పొందాడు. చివరికి అవయవాలు ఫెయిల్ కావడంతో తుదిశ్వాస విడిచాడు. దీంతో అతని అభిమానులు, స్నేహితులు కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.రాజ్వీర్ జవాండా ప్రమాదానికి కారణం ఏమిటి?తన కెంతో ఇష్టమైన 1300సీసీ బైక్‌పై విహార యాత్రకు వెళ్లిన రాజ్వార్ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. అడ్డొచ్చిన పశువులను తప్పించబోయి ప్రమాదానికి గురయ్యాడు. రాజ్వీర్ 5-6గురు స్నేహితులతో కలిసి సిమ్లాకు విహారయాత్రకు వెళ్లిన సందర్భంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతని స్నేహితులు స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు. అయితే తీవ్రంగా గాయడపిన రాజ్‌వీర్‌ను మొహాలిలోని ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి చాలా విషమంగా మారిపోయింది. తీవ్ర గాయాలు, ప్రమాదంలో వెన్నెముక రెండచోట్ల విరిపోయిందనీ, ఇంకా పొట్టలో తీవ్ర గాయాలయ్యాయి. మెడ విరిగిపోయింది. దీంతో మెదడుకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది. దీంతో లైఫ్ సపోర్ట్మీద ఉంచినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆర్గాన్ పెయిల్యూర్, గుండెపోటు కారణంగా రాజ్వీర్ చివరకు అక్టోబర్ 8న ప్రపంచానికి వీడ్కోలు పలికారు. ఆయన మరణ వార్తను ప్రముఖ పంజాబీ గాయని జస్బీర్ జస్సీ ధృవీకరించారు.2014లో తన సంగీత జీవితాన్ని ప్రారంభించి అనతిలోకాలంలో పాపులారీటీ సాధించాడు. అయితే రాజ్వీర్ జవాంద మొదట్లో పోలీసు అధికారి కావాలని భావించాడు. కానీ అనుకోకుండా సింగింగ్ కరియర్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించు కున్నాడు. కానీ దాన్ని పూర్తిగా అనుభవించకముందే .. చిన్న వయసులోనే నూరేళ్లు నిండిపోవడం విషాదం. అయితే అతని సక్సెస్ వెనుక అతని భార్య కృషి ఉన్నట్టు తెలుస్తోంది. (జుబీన్ గార్గ్ మృతిలో మరో ట్విస్ట్ : డీఎస్పీ అరెస్ట్)రాజ్వీర్ జవాండా భార్య హెచ్చరికరాజ్వీర్ జవాండా తన వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచిన నేపథ్యంలో, అతని భార్య కూడా ఎవరికీ తెలియదు. కానీ భర్తను ఆమె ఎప్పుడూ తెరవెనుక ఉండి నడిపించేదని సన్నిహితులు చెబుతున్న మాట.. ప్రమాదం జరిగిన రోజు తమ ఇంటి నుండి బయటకు వెళ్లవద్దని హెచ్చరించింది రాజ్వీర్ భార్య. రాబోయే కీడును ఊహించే ఆమె అలా హెచ్చరించిందట. భద్రత గురించి తన ఆందోళనను స్పష్టంగా వ్యక్తం చేసిందట. కానీ రాజ్వీర్ పట్టించు కోలేదని రాజ్వీర్ సన్నిహితులు అంటున్నారు. ఇదీ చదవండి: Happy Divorce విడాకులను సెలబ్రేట్ చేసుకున్న తల్లీ కొడుకులు -
రాజ్యసభకు కేజ్రీవాల్?
సాక్షి, న్యూఢిల్లీ: ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) పంజాబ్ నుంచి రాజ్యసభకు(Rajyasaba) పోటీలో ఉంటారని మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. ఆప్(AAP) నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉండి, ఇటీవలి ఉప ఎన్నికలో లుథియానా వెస్ట్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో గెలుపొందిన అరోరా స్థానంలో కేజ్రీవాల్ పోటీలో ఉంటారన్న చర్చ జరుగుతోంది.అయితే, రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో ఈ అంశం తెరపైకి వచ్చింది. ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు అక్టోబర్ 24న ఓటింగ్ కాగా, నామినేషన్ల దాఖలుకు అక్టోబర్ 13 ఆఖరు తేదీ. రాజ్యసభకు వెళితే జాతీయ అంశాలపై ఎన్డీయేను ఢీకొట్టడంతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేయగలరన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్(AAP)నకు భారీ షాక్ తగిలిన విషయం తెలిసిందే. ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సహా అగ్రనేతలు మనీశ్ సిసోదియా, సత్యేందర్ జైన్ ఓడిపోయారు. ఢిల్లీ అసెంబ్లీ స్థానంలో కేజ్రీవాల్ మూడు వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ విజయం సాధించారు. -
మళ్లీ మొదలైన పంట వ్యర్ధాల దహనం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి పొరుగునున్న పంజాబ్‌లో మళ్లీ పంట వ్యర్థాల దహనాలు మొదలయ్యాయి. ఇలా పంట వ్యర్థాలకు నిప్పు పెడితే ఉపేక్షించరాదని, అవసరమైతే కొందరు రైతులను జైలుకు పంపాలని ఇటీవల సుప్రీకోర్టు సైతం కన్నెర్ర చేసింది. రైతులు మాత్రం పట్టించుకోకుండా గడ్డి దుబ్బలను దహనం చేస్తున్నారు. పంట వ్యర్థాల దహనాలపై ఆదివారం ఒక్క రోజే పంజాబ్‌లో 12 ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. పంజాబ్‌లో ఇప్పుడిప్పుడే వరి కోతలు మొదలవుతున్నందున రానున్న రోజుల్లో వ్యర్ధాల దహనం తీవ్రంగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. వరి కోతల తర్వాత అక్టోబర్–నవంబర్ నెలల్లో ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడానికి పంజాబ్, హరియాణాల్లో పంట వ్యర్థాలను కాల్చడమే ప్రధాన కారణమని అధికారులు అంటున్నారు. వరి కోతకు, రబీలో గోధుమలను విత్తడానికి మధ్య సమయం తక్కువగా ఉండటంత్లో రైతులు తరచుగా వ్యర్థాలకు నిప్పు పెడుతున్నారు. ఇది ప్రత్యక్షంగా, పరోక్షంగా శీతాకాలంలో ఢిల్లీలో కాలుష్యం పెరిగేందుకు కారణమవుతోంది. ఈ దృష్ట్యా పంట దహనాలను నివారించేందుకు కేంద్రం భూ విస్తీర్ణం ఆధారంగా రూ.5వేల నుంచి రూ.30వేల వరకు జరిమానాలు విధిస్తూ కేంద్రం గత ఏడాది ఉత్తర్వులిచి్చంది. ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ 400 మార్కును దాటుతుండటం, ప్రజలకు తీవ్ర శ్వాసకోశ వ్యాధులతో పాటు ఇతర అనారోగ్యాలను ఎదుర్కొంటుండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. గత ఏడాది 1,500 మందికి పైగా రైతులకు జరిమానాలు సైతం విధించారు. దీంతో పాటే పంట వ్యర్థాలను కాల్చే సంఘటనలను నివారించేందుకు 8వేల మంది నోడల్ అధికారులతో ఓ ప్రత్యేక దళాన్ని సైతం ఏర్పాటు చేశారు. దీనికి తోడు సెక్షన్ 223 కింద గత ఏడాది 5,797 కేసులు సైతం నమోదయ్యాయి. ఇందులో ఒక్క సంగ్రూర్ జిల్లాలోనే 1,725 కేసులు నమోదయ్యాయి. -
పెళ్లి చేసుకోవాలని అమెరికానుంచి వస్తే.. ఊపిరే తీసేశారు!
పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలనుకుని ఇండియాకు వచ్చిన భారతసంతతికి చెందిన US పౌరురాలు అనూహ్యంగా కన్నుమూసిన ఘటన కలకలం సృష్టించింది. జూలైలో జరిగిన ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మహిళ మిస్సింగ్ కేసు నమోదైన తరువాత షాకింగ్ విషయాలను పోలీసులు ప్రకటించారు.పోలీసులు బుధవారం తెలిపిన వివరాల ప్రకారం పంజాబ్‌లోని లుధియానా జిల్లాలో అమెరికన్ పౌరురాలు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోఇండియాకు వచ్చింది. లూధియానాకు చెందిన ఇంగ్లాండ్‌కు చెందిన నాన్-రెసిడెన్షియల్ ఇండియన్ (NRI) చరణ్‌జిత్ సింగ్ గ్రెవాల్ (75)ను వివాహం చేసుకోవాలని భావించింది. అతని ఆహ్వానం మేరకు రూపిందర్ కౌర్ పాంధేర్ (71) భారతదేశానికి వచ్చారు. అయితే సియాటిల్ నుండి ఇండియాకు వచ్చిన కొద్దిసేపటికే ఏళ్ల మహిళ హత్యకు గురైంది. అయితే ఫోన్లకు స్పందించకపోవడం, ఫోన్ స్విచ్ఆఫ్ కావడంతో అనుమానం వచ్చిన పాంధేర్ సోదరి కమల్ కౌర్ ఖైరా తన మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో జూలై 28న న్యూఢిల్లీలోని అమెరికిఆ రాయబార కార్యాలయానికి సంప్రదించారు. ఎంబసీ ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు చేరవేసింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు పెళ్లి చేసుకుంటానని నమ్మించిన గ్రెవాల్ ఆమెను కిరాయి హంతకులతో హత్య చేయించాడని తేల్చారు. ఆర్థికపరమైన కారణాల వల్లే ఈ హత్య జరిగిందని అధికారులు తెలిపారు. అంతేకాదు గ్రేవాల్‌తో పెళ్లికి ముందు అతనికి పెద్దమొత్తంలో డబ్బును బదిలీ చేసినట్టు కూడా గుర్తించారు. రూపిందర్ అమెరికా పౌరురాలు. యూకేలో నివసిస్తున్న ఎన్ఆర్ఐ చార్జిత్ సింగ్ గ్రెవాల్‌తో పెళ్లికోసం ఇండియాకు వచ్చింది. అయితే ఆమెను తుదముట్టించాలని పథకం వేసుకున్న గ్రెవాల్ కాంట్రాక్ట్ కిల్లర్ సుఖ్జీత్ సింగ్ సోనూతో రూ. 50 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని ఆమెను కిరాతంగా హత్య చేయించాడు. అయితే ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లే సమయంలోనే ఆమెను ఎవరో కిడ్నాప్ చేశాడని సోనూ దెహ్లోన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కానీ అతని వ్యవహారంపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయాన్ని అంగీకరించాడు. తన నివాసంలోని స్టోర్‌రూమ్‌లో రూపిందర్ శరీరాన్ని కాల్చి, బూడిద చేసి లెహ్రా గ్రామంలోని కాలవలో పారవేసినట్లు పోలీసులకు వెల్లడించాడు. ఈ మేరకు సంఘటనా స్థలంలో మృతరాలి ఎముకలను స్వాధీనం చేసుకొన్నారు. ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) హర్జిందర్ సింగ్ గిల్ , స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) సుఖ్జిందర్ సింగ్ నేతృత్వంలో పోలీసులు ఈ కేసును విచారణ సాగుతోంది. పరారీలో ఉన్నగ్రెవాల్‌తో పాటు, అతడి సోదరుడిపై కేసు నమోదు చేశారు. సోను వెల్లడించిన దాని ఆధారంగా బాధితురాలి అస్థిపంజర అవశేషాలు, ఇతర ఆధారాలను కనుగొనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు పోలీసులు ఈ ఘటన ఇటు భారత్‌తోపాటు, అటు అమెరికా, యూకే ఎన్ఆర్ఐ వర్గాల్లో ఆందోళన రేపుతోంది. -
అదీ భారతదేశమే కదా.. నన్ను రక్షించలేరా?: రాహుల్ గాంధీ
పంజాబ్ వరద ప్రాంతాల్లో పర్యటించిన కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీకి చేదు అనుభవం ఎదురైంది. భద్రతా కారణాలను చూపిస్తూ ఆయన్ని పలు గ్రామాల్లోకి పోలీసులు అనుమతించలేరు. దీంతో అధికారులను ఆయన నిలదీయగా.. మరోవైపు పంజాబ్ పోలీసులు, ఆప్ ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది.పంజాబ్‌లో భారీ వర్షాల కారణంగా వరదలు తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వరద ప్రభావిత ప్రాంతాలను పర్యటించారు. బాధితులను పరామర్శించి వారికి భరోసా ఇచ్చారు. వరదల కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించి, ప్రజలకు అండగా నిలుస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. అయితే..बाढ़ ने पंजाब में भीषण तबाही मचाई है।आज घोनेवाल में गांववासियों से मिला - उजड़े आशियाने, बर्बाद खेत, बिखरी ज़िंदगियां। दर्द आंखों में साफ दिखता है, मगर हौसला अटूट है।राज्य और केंद्र सरकार दोनों हर हाल में ये सुनिश्चित करें कि राहत पैकेज और मुआवज़ा बिना देरी पीड़ितों के हाथों… pic.twitter.com/f1nUxJ945S— Rahul Gandhi (@RahulGandhi) September 15, 2025గురుదాస్‌పూర్ జిల్లాలో రావి నది వరదలతో దెబ్బ తిన్న టూర్ గ్రామంలోకి వెళ్లనీయకుండా పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు. దీంతో అధికారులతో ఆయన సంభాషణ ఇలా సాగింది..రాహుల్ గాంధీ: మీరు చెబుతున్నది ఏమిటంటే, భారత భూభాగంలో మీరు నన్ను రక్షించలేరు. అదేనా?పోలీస్ అధికారి: మేము ఎప్పుడూ మీ రక్షణకు సిద్ధంగా ఉన్నాంరాహుల్ గాంధీ: మీరు చెబుతున్నది ఇది భారతదేశమే (రవి నదికి అటుపక్కనున్న గ్రామాన్ని చూపిస్తూ), కానీ మీరు నన్ను అక్కడ రక్షించలేరు. అది భారతదేశం కాదా?.. ఒక ప్రతిపక్ష నాయకుడు వెళ్లలేరు అంటే, పంజాబ్ పోలీస్ రక్షించలేరు అని అర్థమా?పోలీస్ అధికారి: అది భారత్ భూభాగమే అయినా, ప్రస్తుతం అక్కడ రక్షణ కల్పించడం కష్టంఅయినప్పటికీ రాహుల్ గాంధీ బోటు ద్వారా ఆ గ్రామానికి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే వరద ప్రవాహం ఎక్కువగా ఉందని అధికారులు వారించడంతో ఆయన మరోసారి వాళ్లను నిలదీశారు.నది ప్రశాంతంగానే ఉంది. ఇది నిజమైన కారణం కాదు అంటూ టూర్ గ్రామానికి వెళ్లకుండా ఇతర వరద ప్రభావిత ప్రాంతాలు ఘోనేవాల్ (అమృత్సర్) మరియు గుర్చక్ (గుర్దాస్పూర్) గ్రామాల్లో పర్యటించారు. ఇక ఈ ఘటనపై పంజాబ్ కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. భారతదేశంలోనే మనం సురక్షితంగా లేకపోతే.. మరెక్కడ సురక్షితంగా ఉంటాం? అని ప్రశ్నిస్తోంది.पंजाब: गुरदासपुर में राहुल गांधी पाकिस्तान सीमा के पास प्रभावित गांवों का दौरा करने गए◆ सुरक्षा कारणों से SP जुगराज सिंह ने उन्हें आगे जाने से रोका, दोनों में बहस हुई◆ राहुल गांधी गांवों का दौरा किए बिना लौट आए, सुरक्षा मुद्दों पर विवाद बना@RahulGandhi | Punjab | pic.twitter.com/n8OtBTUjOc— Zuber Chaudhary (@ZuberChaudhar18) September 16, 2025మాజీ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ స్పందిస్తూ.. అక్కడ మన ప్రజలే(భారతీయులే) ఉన్నారు. రాహుల్ గాంధీ వాళ్ల పరిస్థితిని తెలుసుకోవాలనుకున్నారు. మూడు రోజులుగా కాంగ్రెస్ తరఫున అక్కడ వైద్య శిబిరం నిర్వహిస్తున్నాం. అలాంటిది ప్రజల్ని కలవనివ్వకపోవడం దురదృష్టకరం అని అన్నారు. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ స్పందిస్తూ.. భారతదేశంలో రాహుల్ గాంధీకి పాకిస్తాన్ నుంచి ప్రమాదం ఉందని చెబుతున్నారు. రాహుల్ గాంధీని రవి నదికి అటుపక్కనున్న గ్రామానికి వెళ్లనివ్వకుండా భద్రతా కారణాలు చూపడం సరైంది కాదు. ఇది భారతదేశమే, అక్కడ మన ప్రజలే ఉన్నారు. ఆయన వారి సమస్యలు తెలుసుకోవాలనుకున్నారు అని అన్నారు. పంజాబ్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత పార్థాప్ సింగ్ బాజ్వా ఈ పరిణామంపై కాస్త తీవ్రంగానే స్పందించారు. ‘‘అధికారులు చెబుతున్నట్లు అది భద్రతా సమస్య కానేకాదు. ఇది రాజకీయ నిర్ణయం. బాధ్యత తప్పించుకునేందుకు ప్రభుత్వం నిరాధార భద్రతా కారణాలు చూపుతోంది. ఇది సిగ్గుపడాల్సిన విషయం అని ఆయన అన్నారు.పంజాబ్ పోలీసులు ఏం చెబుతున్నారంటే..రాహుల్ గాంధీ పర్యటించాల్సిన టూర్ గ్రామం భారత్‌లోనే ఉంది. పంజాబ్ గుర్దాస్పూర్ జిల్లా రావి నది ఒడ్డున ఉంది. అయితే, ఆ ప్రాంతం ఇండియా-పాకిస్తాన్ సరిహద్దుకు చాలా దగ్గరగా ఉంది. ఇటీవల వరదలతో బార్డర్ ఫెన్సింగ్ దెబ్బతింది. అప్పటి నుంచి నిఘా పటిష్టం చేశారు. అందుకే పంజాబ్ పోలీస్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ రాహుల్ గాంధీకి అక్కడికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు. రాహుల్‌కే కాదు.. మరేయితర పార్టీ నేతలకూ అక్కడికి వెళ్లేందుకు ప్రస్తుతానికి అనుమతి లేదు. -
పంజాబ్ ‘ఆప్’ ఎమ్మెల్యేకు నాలుగేళ్ల జైలుశిక్ష
అమృత్సర్: పంజాబ్‌లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యే మంజీందర్ సింగ్ లాల్పురాకు తార్న్‌తరణ్ కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. 2013లో ఓ దళిత మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆయనపై కేసు నమోదైంది. ఈ ఘటనపై 12 ఏళ్లపాటు సుదీర్ఘంగా విచారణ జరిగింది. రెండు రోజుల క్రితం న్యాయస్థానం ఆయనను దోషిగా నిర్ధారించింది. శుక్రవారం శిక్ష ఖరారు చేసింది. మంజీందర్ సింగ్ పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ అసెంబ్లీ స్థానం నుంచి 2022లో ఎమ్మెల్యేగా గెలిచారు. లైంగిక వేధింపుల కేసులో మంజీందర్ సింగ్‌తోపాటు మరో ఆరుగురు సైతం దోషులుగా తేలారు. వారికి సైతం నాలుగేళ్ల చొప్పున జైలుశిక్ష పడింది. ఈ మేరకు అదనపు సెషన్స్ జడ్జి ప్రేమ్‌కుమార్ తీర్పు వెలువరించారు. 2013లో నేరం జరిగిన సమయంలో మంజీందర్ సింగ్ ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తుండడం గమనార్హం. -
పంజాబ్‌లో వరద బాధితులకు రిలయన్స్ సాయం
పంజాబ్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన ప్రజలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అండగా ఉంటుందని కంపెనీ డైరెక్టర్ అనంత్ అంబానీ భరోసా కల్పించారు. బాధితుల కష్టాలు తీర్చే ఉద్దేశంతో సహాయక చర్యలు ప్రారంభించినట్లు చెప్పారు. అందులో భాగంగా స్థానిక అధికారులు, రాష్ట్ర పరిపాలన విభాగం, పంచాయతీలు, వివిధ కమ్యూనిటీ భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని తీవ్ర ప్రభావిత ప్రాంతాల్లో ఈమేరకు సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా అమృత్సర్, సుల్తాన్పూర్ లోధిలోని 10,000 కుటుంబాలకు సహాయం అందించడానికి చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.‘ఈ క్లిష్ట సమయంలో పంజాబ్ ప్రజలకు మా మద్దతు ఉంటుంది. తీవ్ర వర్షాభావం వల్ల చాలా కుటుంబాలు ఇళ్లు, జీవనోపాధి, భద్రతను కోల్పోయాయి. రిలయన్స్ కుటుంబం వారికి తోడుగా ఉంటుంది. ఆహారం, నీరు, ఆశ్రయం, పారిశుద్ధ్య కిట్లు.. వంటి వాటితో ప్రజలు, జంతువుల సంరక్షణకు అన్ని చర్యలు అందిస్తోంది. పంజాబ్ ప్రజల భద్రతకు కట్టుబడి ఉన్నాం. ఈ క్లిష్ట సమయంలో వారితో కలిసి ఉంటాం’ అని అనంత్ అంబానీ అన్నారు.రిలయన్స్ అందిస్తోన్న సహాయక చర్యలు..న్యూట్రిషన్ సపోర్ట్వరద బాధితుల కోసం అత్యవసర పోషకాహార అవసరాలను తీర్చేందుకు చర్యలు చేపడుతుంది. వారికి అవసరమైన ఆహార సామాగ్రి, డ్రై రేషన్ కిట్లను 10,000 కుటుంబాలకు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒంటరి మహిళలు, వృద్ధుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5,000 వంతున వోచర్ ఆధారిత సహాయం అందించనున్నారు. తక్షణ పోషణను నిర్దారించేందుకు కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేస్తున్నారు. స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉండేలా పోర్టబుల్ వాటర్ ఫిల్టర్లను సిద్ధం చేస్తున్నారు.షెల్టర్ సపోర్ట్వరదల నేపథ్యంలో నిర్వాసిత కుటుంబాలను రక్షించడానికి రిలయన్స్ టార్పాలిన్లు, గ్రౌండ్ షీట్లు, దోమతెరలు, తాళ్లతో కూడిన అత్యవసర షెల్టర్ కిట్లను అందిస్తోంది. వరద నీటి నుంచి అత్యవసరంగా ఆశ్రయం అవసరమైన కుటుంబాలకు ఈ కిట్లను పంపిణీ చేస్తున్నారు. ప్రజారోగ్య ప్రమాద నిర్వహణలో భాగంగా నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల వ్యాప్తిని నివారించడానికి రిలయన్స్ ఆరోగ్య అవగాహన ప్రచారాలను చేపడుతోంది. నీటి వనరుల్లో క్రిమిసంహారక చర్యలకు పూనుకుంది. వ్యాధి వ్యాప్తి ప్రమాదాన్ని అరికట్టడానికి ప్రతి ప్రభావిత కుటుంబానికి అవసరమైన పారిశుద్ధ్య కిట్లను అందజేస్తున్నారు.పశువుల ఆరోగ్యానికి మద్దతుగా..వరదల వల్ల పశుసంవర్ధక రంగం కూడా తీవ్రంగా ప్రభావితమైంది. పశువుల ఆవాసాల్లో నీరు నిలిచిపోవడం వల్ల జంతువుల మనుగడకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తుంది. రిలయన్స్, పశుసంవర్ధక శాఖ సహకారంతో పశువైద్య సర్వేలు నిర్వహిస్తోంది. పశువుల సంరక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తోంది. ప్రభావిత జంతువులకు మందులు, చికిత్సలు అందిస్తున్నారు. దాదాపు 5,000 పశువులకు ఆహారం ఇవ్వడానికి 3,000 కట్టల సైలేజ్ (పశుగ్రాసం) పంపిణీ చేస్తున్నారు.జంతు సంరక్షణజంతు సంరక్షణ కోసం రిలయన్స్‌కు చెందిన వంటారాలోని ప్రత్యేక బృందం సహాయక చర్యలను అందిస్తోంది. 50 మందికి పైగా శిక్షణ పొందిన నిపుణులతో ఈ బృందం జంతువులను రక్షించడం, వైద్య సంరక్షణను అందించడం, వ్యాధి వ్యాప్తిని నివారించడానికి పని చేస్తోంది.కమ్యునికేషన్ పునరుద్ధరణవరద ప్రభావిత ప్రాంతాలకు కనెక్టివిటీని పునరుద్ధరించడంలో జియో బృందం కీలక పాత్ర పోషిస్తోంది. రాష్ట్ర కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలు చెక్కుచెదరకుండా ఉండేలా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్)తో కలిసి పనిచేస్తోంది. విపత్తు సహాయ కార్యకలాపాలను సమన్వయం చేయడానికి ప్రభావిత ప్రాంతాలకు అత్యవసర ప్రతిస్పందన బృందాలకు సర్వీసులు అందించేందుకు చర్యలు చేపడుతోంది.రిలయన్స్ ఫౌండేషన్ స్థానిక వాలంటీర్ల సహకారంతో క్యూరేటెడ్ డ్రై-రేషన్, పారిశుద్ధ్య కిట్లను పంపిణీ చేస్తోంది. పోషణ, పరిశుభ్రత కోసం 21 నిత్యావసర వస్తువులను కలిగి ఉన్న ఈ కిట్లను స్థానిక పంచాయతీల పరిధిలోని ప్రజలకు సరఫరా చేస్తున్నారు. -
ట్రాన్స్జెండర్ల గొప్ప మనసు.. పంజాబ్ వరద బాధితులకు భారీ విరాళం
ఆగ్రా: సామాజిక సేవకు లింగ భేదం అడ్డుకాదని మరోసారి నిరూపించే సంఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా నగరంలో ట్రాన్స్జెండర్లు తమ ఉదారతను చాటుకున్నారు. పంజాబ్ రాష్ట్రంలో ఇటీవల సంభవించిన భారీ వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు రూ.25 లక్షల ఆర్థిక సహాయాన్ని పంపించారు.ఈ సహాయాన్ని సమీకరించేందుకు ఆగ్రాలోని ట్రాన్స్‌జెండర్ సంఘాలు ప్రత్యేకంగా సమావేశమయ్యాయి.మనదేశంలో కష్టాల్లో ఎవరున్నా సరే మానవత్వం చూపించాల నినాదంతో తమ ఆదాయంతో పాటు దాతల నుంచి విరాళాలు సేకరించారు. ఆ మొత్తంగా వచ్చిన మొత్తాన్ని పంజాబ్‌కు పంపించారు. आगरा में किन्नरों ने 25 लाख रुपए इकट्ठा करके बाढ़ पीड़ितों को मदद भिजवाई है pic.twitter.com/rEPuXEw5uQ— Birendra Kumar Yadav (@BirendraYdvSP) September 11, 2025 ఆగ్రాలోని ఫతేహాబాద్ రోడ్డులో 'ఆల్ ఇండియా కిన్నార్ సమాజ్ కాన్ఫరెన్స్' జరుగుతోంది. దేశవ్యాప్తంగా దాదాపు పది వేల మంది ట్రాన్స్జెండర్ల ఇందులో పాల్గొన్నారు. ఈ సమావేశంలో, ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ వరద బాధితుల కోసం విరాళాలు సేకరించింది. ఇతర ట్రాన్స్జెండర్ల నుంచి నుండి వచ్చిన విరాళాలు 25 లక్షల రూపాయలుగా చెబుతున్నారు. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ పంజాబ్ వరద బాధితుల కోసం డబ్బును విరాళంగా ఇచ్చిన తర్వాత బిడ్లు వేసింది. కొందరు రూ.50,000 విరాళంగా ఇవ్వగా ..మరికొందరు రూ.లక్ష వరకు విరాళం ఇచ్చారు. అత్యధిక విరాళం గోరఖ్‌పూర్ నుండి వచ్చింది. -
కదులుతున్న ఆటోలో.. ఆమె సాహసాన్ని చూస్తే షాకే!
పంజాబ్‌లో ఓ మహిళ.. దొంగలతో ధైర్యంగా పోరాడి తప్పించుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పట్టపగలే ఆటోలో మహిళను దోచుకోవడానికి ప్రయత్నించిన షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. జలంధర్-లుథియానా జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ మహిళ ఫిల్లౌర్‌కు వెళ్లేందుకు ఆటోలో ప్రయాణిస్తుండగా, డ్రైవర్‌తో పాటు ఇద్దరు వ్యక్తులు ఆమెను బెదిరించి దోచుకునేందుకు ప్రయత్నించారు.అయితే, ఆమె ధైర్యంగా దుండగులను ప్రతిఘటించింది.. ఆటో నుంచి బయటకు వేలాడుతూ సాయం కోసం అరవడం ప్రారంభించింది. ఆమె దాదాపు అర కిలోమీటర్ వరకు వేలాడుతూ సాయం కోసం ఆమె పిలుస్తూనే ఉంది. ఇంతలో, వెనుక కారులో ప్రయాణిస్తున్న కొంతమంది యువకులు ఆటోను వెంబడించారు. ఆమె సాహసాన్ని వీడియో తీశారు. దొంగలను పట్టుకోవడానికి వారు సాయం చేశారు.ఆటో వేగంగా వెళ్లి ఒక కారును ఢీకొట్టింది. చివరికి ఆటో బోల్తా పడింది. దాంతో ఇద్దరు దొంగలను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుల్లో ఓ వ్యక్తి పరారయ్యాడు. ఈ వీడియోలో ఆ మహిళ ఆటోకు బయట వేలాడుతూ దొంగల్ని ఎదుర్కొంటున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తాయి. ధైర్యంతో ఆమె తన ప్రాణాలను కాపాడుకోవడమే కాకుండా దొంగలను కూడా పట్టించగలిగిందని.. ఈ ఘటన మహిళల ధైర్యానికి నిదర్శనమంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.In an extremely courageous act, a Ludhiana woman saved herself from a robbery in a moving auto by clinging on the vehicle while signalling for help from other commuters. Three robbers who tried to snatch her phone and money inside auto arrested by @Ludhiana_Police @IndianExpress pic.twitter.com/N7KXS62Olp— Divya Goyal (@divya5521) September 10, 2025 -
అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం
ధర్మశాల/చండీగఢ్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. నీట మునిగిన పంట పొలాలు, ధ్వంసమైన ఇళ్లు, రహదారులను స్వయంగా పరిశీలించారు. బాధితులతో మాట్లాడారు. భారీ వర్షాలు, వరదలకు తోడు కొండచరియలు విరిగిపడడంతో తీవ్రంగా నష్టపోయిన హిమాచల్ ప్రదేశ్‌కు తక్షణ సాయం కింద రూ.1,500 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. వరదల్లో మృతిచెందినవారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం ఇస్తామని వెల్లడించారు.హిమాచల్ ప్రదేశ్‌లో ఏరియల్ సర్వే అనంతరం కాంగ్రా పట్టణంలో ప్రధాని మోదీ సమీక్షా సమావేశం నిర్వహించారు. సహాయ పునరావాస చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి సుఖ్వీందర్సింగ్ సుఖూ పాల్గొన్నారు. వరద బాధితులు సైతం హాజరై తమ గోడు వినిపించారు. తమను ఆదుకోవాలని ప్రధాని మోదీని వేడుకున్నారు. కచ్చితంగా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. వరదల్లో దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. ధ్వంసమైన ఇళ్లను ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పునరి్నరి్మంచాలని సూచించారు. రాష్ట్రంలో ఈ ఏడాది జూన్ 20 నుంచి సెపె్టంబర్ 8 దాకా వరదలు, కొండచరియల కారణంగా ఏకంగా 370 మంది మృతిచెందారు. పంజాబ్‌లో సహాయక చర్యలపై ఆరా ప్రధాని మోదీ హిమాచల్ ప్రదేశ్‌లో పర్యటన అనంతరం పంజాబ్‌కు చేరుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. హెలికాప్టర్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. బాధితులను కలిసి మాట్లాడారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని, ధైర్యంగా ఉండాలని వారికి సూచించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతోనూ మాట్లాడారు. సహాయక చర్యలపై ఆరా తీశారు. గురుదాస్‌పూర్‌లో సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. పంజాబ్‌కు తక్షణ సాయం కింద రూ.1,600 కోట్లు అందజేస్తామని ప్రకటించారు. భారీ వర్షాలతోపాటు సట్లెజ్, బియాస్, రావి నదులు ఉప్పొంగి ప్రవహించడంతో పంజాబ్‌లో భారీ నష్టం వాటిల్లింది. 51 మంది మరణించారు. 1.84 లక్షల హెక్టార్లలో పంటలు నీట మునిగాయి. రూ.13,000 కోట్ల నష్టం జరిగినట్లు ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. రూ.20,000 కోట్ల సహాయ ప్యాకేజీ ప్రకటించాలని ప్రధాని మోదీని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది.చిన్నారి నీతికతో మోదీ హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రాలో సమీక్షా సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ 14 నెలల చిన్నారి నీతికను ఎత్తుకొని బుజ్జగించారు. ప్రకృతి విలయం వల్ల అనాథగా మారిన నీతిక దీనగాథ విని ఆయన చలించిపోయారు. హిమాచల్‌ప్రదేశ్‌లో మండీ జిల్లాలోని తల్వార గ్రామంలో జూన్ 30న రాత్రిపూట హఠాత్తుగా భారీ వర్షం కురిసింది. గ్రామంపై కొండ చరియలు విరుచుకుపడ్డాయి. ఓ ఇంట్లో రమేశ్ కుమార్(31), రాధాదేవి(24) దంపతులు తమ కమార్తె నీతికతోపాటు తల్లి పూనమ్దేవితో కలిసి నిద్రిస్తున్నారు. ఇంట్లోకి బురద చొచ్చుకొచ్చింది.నీతికను వంట గదిలో పడుకోబెట్టి బురదను తొలగించేందుకు ముగ్గురూ ప్రయత్నించారు. ఇంతలో భారీ కొండచరియ ఆ ఇంటిపైకి దూసుకొచ్చింది. వంట గది మినహా ఆ ముగ్గురున్న గది నేలమట్టమైంది. రమేశ్ కుమార్, రాధాదేవి, పూనమ్‌దేవి బురదతోపాటు కొట్టుకుపోయి మృత్యువాత పడ్డారు. వంట గదికి నష్టం జరగకపోవడంతో నీతిక ప్రాణాలతో బయటపడింది. ఆ సమయంలో నీతిక వయసు 11 నెలలే. నీతికను హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం ‘చైల్డ్ ఆఫ్ ద స్టేట్’గా ప్రకటించింది. ఆమె చదువుతోపాటు జీవనానికి అయ్యే ఖర్చులు భరిస్తామని ప్రకటించింది. -
నేడు వరద బాధిత ప్రాంతాల్లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేడు(మంగళవారం) హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలలో వరదలు, కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను సందర్శించనున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలలో ప్రధాని తొలుత ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.నేటి మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రదాని హిమాచల్‌లోని కాంగ్రాకు చేరుకుంటారు. అక్కడ రాష్ట్ర అధికారులను కలుసుకుంటారు. పరిస్థితిని అంచనా వేసేందుకు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. అలాగే వరద బాధితులు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్), ఆప్దా మిత్ర బృందంతో సంభాషించనున్నారు. మధ్యాహ్నం ప్రధాని మోదీ పంజాబ్‌లోని వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ఏరియల్ సర్వే నిర్వహించాక, గురుదాస్‌పూర్ చేరుకుని, సాయంత్రం 4:15 గంటలకు సీనియర్ అధికారులతో సమావేశం కానున్నారు.హిమాచల్‌లో వరదల కారణంగా 355 మంది మరణించినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది. కొండచరియలు విరిగిపడటం, నిర్మాణాలు కూలిపోవడం కారణంగా ప్రాణనష్టం జరిగిందని పేర్కొంది. మరోవైపు బియాస్, సత్లుజ్, రావి, ఘగ్గర్ తదితర నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తుండటంతో పంజాబ్ హై అలర్ట్‌లో ఉంది. 23 జిల్లాల్లోని 1,650 కి పైగా గ్రామాలు నీట మునిగాయి, 1.75 లక్షల ఎకరాలకు పైగా వ్యవసాయ భూములు దెబ్బతిన్నాయి. -
9న పంజాబ్‌కు ప్రధాని మోదీ.. వరద ప్రభావిత ప్రాంతాల సందర్శన
చండీగఢ్: పంజాబ్‌ను ఇటీవల వరదలు చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 9న ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ను సందర్శించి, వరద పరిస్థితిని, సహాయక చర్యలను సమీక్షించనున్నారు. ఈ పర్యటనలో ఆయన వరద బాధితులతో, రైతులతో నేరుగా మాట్లాడతారని బీజేపీ పంజాబ్ యూనిట్ ‘ఎక్స్’ (ట్విట్టర్)లో తెలిపింది.ప్రధాని మోదీ గురుదాస్‌పూర్ పర్యటన‘ఎక్స్’ పోస్ట్‌లో బీజేపీ.. ‘ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 9న పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌కు వస్తున్నారు. వరద బాధిత రైతులతో ఆయన నేరుగా సమావేశమై వారి కష్టనష్టాలను తెలుసుకుంటారు. వారికి సహాయం చేయడానికి సాధ్యమైన అన్ని చర్యలు తీసుకుంటారు’ అని పేర్కొంది. ఈ పర్యటన ద్వారా బీజేపీ ప్రభుత్వం పంజాబ్ ప్రజలకు అండగా ఉంటుందని, ఈ క్లిష్ట సమయంలో సహాయాన్ని అందిస్తుందని పోస్ట్‌లో వివరించారు.ਮਾਨਯੋਗ ਪ੍ਰਧਾਨ ਮੰਤਰੀ ਸ਼੍ਰੀ ਨਰਿੰਦਰ ਮੋਦੀ ਜੀ 9 ਸਤੰਬਰ ਨੂੰ ਪੰਜਾਬ ਦੇ ਗੁਰਦਾਸਪੁਰ ਵਿੱਖੇ ਆ ਰਹੇ ਹਨ।ਹੜ੍ਹ ਪੀੜਿਤ ਭਰਾਵਾਂ-ਭੈਣਾਂ ਅਤੇ ਕਿਸਾਨਾਂ ਨਾਲ ਸਿੱਧੀ ਮੁਲਾਕਾਤ ਕਰਕੇ ਦੁੱਖ ਵੰਡਾਉਣਗੇ ਅਤੇ ਪੀੜਿਤਾਂ ਦੀ ਮਦਦ ਲਈ ਹਰ ਸੰਭਵ ਕਦਮ ਚੁੱਕਣਗੇ।ਪ੍ਰਧਾਨ ਮੰਤਰੀ ਜੀ ਦਾ ਇਹ ਦੌਰਾ ਸਾਬਤ ਕਰਦਾ ਹੈ ਕਿ ਕੇਂਦਰ ਦੀ ਭਾਜਪਾ ਸਰਕਾਰ ਹਮੇਸ਼ਾ…— BJP PUNJAB (@BJP4Punjab) September 7, 2025పంజాబ్‌లో వరదలుప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఇటీవల ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 500 మందికి పైగా జనం ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని మోదీ పంజాబ్‌తో పాటు జమ్ముకశ్మీర్, గుజరాత్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్లను సందర్శించనున్నారు. పంజాబ్‌లోని 23 జిల్లాల్లో సుమారు 1,650 గ్రామాలు నీటి మునిగాయి. దాదాపు 1.75 లక్షల ఎకరాల వ్యవసాయ భూములు, ముఖ్యంగా వరి పంట దెబ్బతింది. బియాస్, సట్లజ్, రావి, ఘగ్గర్ నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. భాక్రా, పాంగ్, రంజిత్ సాగర్ వంటి ప్రధాన ఆనకట్టల నుంచి నీటిని నియంత్రించి విడుదల చేయడం వల్ల సంక్షోభం మరింత తీవ్రమైంది. గురుదాస్‌పూర్ జిల్లాలో అత్యధికంగా 1.45 లక్షల మంది ప్రజలు వరదలకు ప్రభావితమయ్యారు. అలాగే అమృత్సర్, ఫిరోజ్‌పూర్, ఫాజిల్కా జిల్లాలు కూడా ప్రభావితమయ్యాయి. పంజాబ్‌లో ఇప్పటివరకు 37 మంది మరణించగా, ముగ్గురు గల్లంతయ్యారు. సైన్యం, వైమానిక దళం, బీఎస్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ దళాలు సహాయక చర్యలను వేగవంతం చేశాయి. పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, సెప్టెంబర్ 7 వరకు అన్ని విద్యా సంస్థలను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.గత కొన్ని రోజులుగా పంజాబ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వేలాది ఇళ్లలోకి నీరు చేరింది. రవాణా వ్యవస్థను స్తంభించిపోయింది. గత నెల రోజులుగా సంభవిస్తున్న వరదల కారణంగా 46 మంది ప్రాణాలు కోల్పోయారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం ఈరోజు (ఆదివారం), రాబోయే రెండు రోజులలో పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. -
Punjab: ముదిరిన ఆప్- బీజేపీల ‘వరద’ రాజకీయం.. ‘2027’ కోసమే?
చండీగఢ్: పంజాబ్‌ను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. వేలాది ఎకరాల్లో పంటనష్టం జరిగింది. నిరాశ్రయులైనవారి సంఖ్య అధికంగానే ఉంది. దీంతో వరద బాధితులు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న బీజేపీ- ఆప్‌లు బాధితులకు సాయం అందిస్తూ.. 2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు నిచ్చెన వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పంజాబ్‌లో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. అమృత్సర్, గురుదాస్‌పూర్, కపుర్తలాలోని పలు గ్రామాలను సందర్శించిన ఆయన ప్రధాని నరేంద్ర మోదీ సూచనల మేరకు, తాను రాష్ట్రానికి వచ్చానన్నారు. ‘పంజాబ్‌లో సంభవించిన వరదలను సమీక్షించేందుకు ప్రధాని నన్ను పంపారు. మేము పంజాబ్‌కు అండగా నిలుస్తున్నాం’ అని ఆయన అన్నారు. వరదలు పలు పంటలను నాశనం చేశాయని, తదుపరి సీజన్ సాగుకు కూడా ముప్పు కలిగించాయని ఆయన అన్నారు. తాను ఒక మంత్రిగా ఇక్కడికి రాలేదని, పంజాబ్ రైతుల సేవకునిగా వచ్చాయని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు.అయితే శివరాజ్ సింగ్ మాటలకు స్పందించిన అధికార అప్ నేతలు2023లో హిమాచల్‌లో కురిసిన భారీ వర్షాలు, వరదలు పంజాబ్‌ను అతలాకుతలం చేసినప్పుడు కేంద్ర మంత్రులెవరూ రాష్ట్రంలో పర్యటించలేదని, ఆ సమయంలో బీజేపీ ముందుకొచ్చి ఎందుకు వరద సహాయక చర్యలు చేపట్టలేదని ప్రశ్నిస్తున్నారు. 2024–25 కేంద్ర బడ్జెట్లో బీహార్‌కు వరద ఉపశమనంగా రూ.11,500 కోట్లు కేటాయించినప్పటికీ, పంజాబ్‌కు కేవలం ప్రకటన మాత్రమే చేశారని ఆప్ నేతలు ఆరోపించారు. అయితే ప్రస్తుత వరదల సమయంలో మేమున్నామంటూ బీజేపీ నేతలు వస్తున్నారని ఆప్ నాయకులు ఆరోపిస్తున్నారు.కాగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సునీల్ జాఖర్ స్వయంగా ట్రాక్టర్‌ను నడిపి, చౌహాన్‌ను వరద ప్రభావిత గ్రామాలకు తీసుకెళ్లారు. జలంధర్‌లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ ట్రక్కుపై సహాయ సామగ్రిని లోడ్ చేస్తూ, తన భుజాలపై రేషన్ సంచులను మోసుకెళ్లారు. అలాగే బీజేపే మహిళా నేత, మాజీ కేంద్ర సహాయ మంత్రి సోమ్ ప్రకాశ్ భార్య అనితా సోమ్ ప్రకాశ్ ఫగ్వారాలో రేషన్ కిట్లను పంపిణీ చేశారు. ప్రస్తుతం పంజాబ్ అసెంబ్లీలో బీజేపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. 2024 ఎన్నికల్లో 18.5శాతం ఓట్ల వాటాను పొందినప్పటికీ పార్టీ రాష్ట్రం నుండి ఒక్క లోక్‌సభ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. 2020-21లో రైతుల ఆందోళనల నేపథ్యంలో ఎదురుదెబ్బ తగిలిన తర్వాత పార్టీకి ఇటువంటి పరిణామాలు ఏర్పడ్డాయి. 2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ ఇప్పటి నుంచే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. -
టీ కెటిల్‌తో నడుం లోతు నీళ్లలో నడుస్తూ..
మానవతావాదులు తాము ఎలాంటి కష్టాల్లో ఉన్నా ఇతరులు కష్టాల్లో ఉన్నప్పుడు తమ వంతు సహాయం చేయడానికి రంగంలోకి దిగుతారు. భారీ వర్షాల వల్ల పంజాబ్‌లో జన జీవితం అస్తవ్యస్తం అయింది. ఒక వృద్ధుడు టీ కెటిల్‌తో నడుం లోతు నీళ్లలో నడుస్తూ, తడుస్తూ ఎక్కడ వరద బాధితులు కనిపించినా వారికి టీ అందజేస్తూ వెళుతున్నాడు. బాధితులకు ధైర్యవచనాలు చెబుతున్నాడు.నిజానికి అతడు కూడా వరద బాధితుడే! వర్షాల దెబ్బకు వంట అనేది లేకుండా ఆకలిదప్పులతో నీరసించిపోయిన బాధితులకు ఆ కాస్త టీ ఎంతో కొంత ఉమశమనం ఇచ్చింది. క్రికెటర్ హర్బజన్‌సింగ్ (Harbhajan Singh) ఈ వీడియోను ‘ఎక్స్’లో పోస్ట్ చేశాడు.చదవండి: ఏఐ చాట్బాట్లకు లింగ వివక్ష ఉంటుందా?‘పంజాబీలను అనుకరిస్తూ కొద్దిమంది జోక్‌లు చేస్తుంటారు. ఈ వీడియో చూసి అయినా వారిలో మార్పు రావాలి. పంజాబీ ప్రజల మానవత్వాన్నికి చిన్న ఉదాహరణ ఈ వీడియో’‘ కష్టాలు... అని బాధపడుతుంటాంగానీ ఆ కష్టాలే మనుషులను దగ్గర చేస్తాయి. మానవత్వాన్ని పరీక్షిస్తాయి’... ఇలా రకరకాలుగా స్పందించారు యూజర్లు.When volunteers went to deliver relief materials, the flood-affected family despite having lost almost everything prepared tea and served it to the volunteers in return. That’s the spirit of Panjab. Rab de bande. #Punjab #PunjabFloods pic.twitter.com/EVdCuHlKuP— Harbhajan Turbanator (@harbhajan_singh) September 3, 2025 -
అక్షయ్ కుమార్ భారీ విరాళం.. ఏకంగా రూ.5 కోట్లు
భారీ వర్షాలతో పంజాబ్ అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఇటీవల కురిసిన వర్షాలకు అక్కడి ప్రజలు బాగా ఇబ్బంది పడ్డారు. వరద బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం, పలు స్వచ్ఛంద సంస్థలు తమవంతు ప్రయత్నం చేశాయి. అయతే, తాజాగా బాధితులను ఆదుకోవడానికి బాలీవుడ్ ప్రముఖ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) తన వంతుగా రూ. 5 కోట్ల విరాళం ప్రకటించారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. అయితే, దానిని తాను విరాళం అనుకోవడంలేదని పేర్కొన్నారు. డొనేషన్ అనే పదం తనకు నచ్చదని తెలిపారు. ఇతరులకు డొనేట్ చేసేందుకు నేనెవరిని..? అంటూనే ఇలా సాయం చేయడానికి అవకాశం వచ్చిన ప్రతిసారి అదృష్టంగా భావిస్తుంటానని తెలిపారు. -
Punjab Floods: ఇది రాష్ట్ర విపత్తు.. పంజాబ్ కీలక ప్రకటన
చండీగఢ్: పంజాబ్‌ను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. రాష్ట్రంలోని 1,400 కి పైగా గ్రామాలు నీట మునిగాయి. 30 మంది మృతి చెందారు. ఈ నేపధ్యంలో పంజాబ్ ప్రభుత్వం దీనిని రాష్ట్ర విపత్తుగా ప్రకటించింది. పంజాబ్ అంతటా నదులు ఉప్పొంగుతున్నాయి. VIDEO | Punjab: Heavy rain floods homes in Hoshiarpur’s Hukumat village; 28 villages affected.(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/7VT5BcaTF2— Press Trust of India (@PTI_News) August 31, 2025రాష్ట్రంలోని 23 జిల్లాల్లోని పలు గ్రామాల రోడ్లను వరదలు ధ్వంసం చేశాయి. 1,400 కి పైగా గ్రామాలు ఇంకా నీటి ముంపులోనే ఉన్నాయి. 3.75 లక్షల ఎకరాల వ్యవసాయ భూములను దెబ్బతిన్నాయి. భారీ వర్షాల దృష్ట్యా సెప్టెంబర్ ఏడు వరకు కళాశాలలకు సెలవులు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఏపీ సిన్హా ఇతర అధికారులు వరద పరిస్థితులను అనుక్షణం గమనిస్తున్నారు.మరోవైపు బాధితులను ఆదుకునేందుకు పలువురు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.పీడబ్ల్యుడీ, జల వనరులు, పీఎస్‌పీసీఎల్ విభాగాలను అత్యవసర విధుల్లో ఉంచారు. పంజాలోని గురుదాస్‌పూర్‌లో 94.7 మి.మీ వర్షం పడగా, మొహాలిలో 55.5 మి.మీ వర్షం కురిసింది. రోపర్‌లో, సట్లెజ్ నది తీరం వెంబడి ఉంటున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. -
తప్పించుకున్న ఆప్ ఎమ్మెల్యే
పటియాలా: పంజాబ్‌లోని అధికార ఆప్‌కు చెందిన ఎమ్మెల్యే నాటకీయ పరిణామాల నడుమ పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకోవడం సంచలనంగా మారింది. అత్యాచారం కేసు కావడంతో అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులపైకి ఆయన అనుచరులు తుపాకులతో కాల్పులు జరుపుతూ, రాళ్లు రువ్వారు. ఇదే అదనుగా ఎమ్మెల్యే పోలీసు కస్టడీ నుంచి తప్పించుకున్నారు. హరియాణాలోని కర్నాల్ జిల్లా దబ్రి గ్రామంలోని నివాసంలో ఉన్న హర్మీత్ సింగ్‌ను అదుపులోకి తీసుకునేందుకు మంగళవారం పటియాలా పోలీసు బృందం అక్కడికి చేరుకుంది.అనంతరం పోలీస్ స్టేషన్‌కు ఎమ్మెల్యేను తరలిస్తుండగా కొందరు గ్రామస్తులు పోలీసుల పైకి రాళ్లు రువ్వడంతోపాటు కాల్పులకు దిగారు. ఇదే అదనుగా ఎమ్మెల్యే తప్పించుకున్నారు. ఘటనలో ఒక పోలీసు గాయపడ్డారు. స్కార్పియో వాహనంలో ఎమ్మెల్యే తప్పించుకునే క్రమంలో ఓ పోలీసుపైకి వాహనాన్ని డ్రైవ్ చేశారని అధికారులు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే అనుచరుడు బల్వీందర్ సింగ్‌ను అదుపులోకి తీసుకుని మూడు తుపాకులు, ఫార్చునర్ కారును స్వాదీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పరారయ్యేందుకు ఎమ్మెల్యే వాడిన వాహనాన్ని అనంతరం అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆయన కోసం పెద్ద ఎత్తున గాలింపు చేపట్టారు.భార్య నుంచి విడాకులు తీసుకున్నట్లు నమ్మించి, తనతో హర్‌ప్రీత్ సింగ్ సంబంధం కొనసాగించాడని జిరాక్ పూర్‌కు చెందిన ఓ మహిళ ఆరోపించింది. అనంతరం 2021లో పెళ్లి చేసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ప్రైవేట్ చిత్రాలు చూపుతూ బెదిరిస్తున్నట్లు ఆరోపించింది. ఈ మేరకు పోలీసులు ఎమ్మెల్యేపై రేప్, మోసం తదితర ఆరోపణలపై కేసు నమోదు చేశారు. వరద సహాయక చర్యల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన ఇటీవల పలు ఆరోపణలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు కల్పించిన వ్యక్తిగత భద్రతను సైతం ఉపసంహరించుకుంది. -
పంజాబ్‌ను ఇలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది: శుబ్‌మన్ గిల్
ఉత్తరాది రాష్ట్రం పంజాబ్‌ను భారీ వరదులు ముంచెత్తున్నాయి. గత కొన్ని రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటి వరకు 29 మంది మరణించారు. సుమారు వెయ్యి గ్రామాలు వాననీటిలో మునిగిపోయాయి. ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల 2.65 లక్షలకు పైగా నివాసితులు ప్రభావితమయ్యారు. అంతేకాకుండా పంటలు కూడా భారీగా దెబ్బతిన్నాయి. ఈ వరదలు వల్ల పంజాబ్‌లోని గురుదాస్‌పూర్, పఠాన్‌కోట్, ఫజిల్కా, కపుర్తలా, తరన్ తరణ్, ఫిరోజ్‌పూర్, హోషియార్పూర్ అమృత్‌సర్‌తో సహా 12 జిల్లాలు అతలకుతలమయ్యాయి. ఆగస్టు నెలలో రాష్ట్రంలో 250 మి.మీ.లకు పైగా వర్షపాతం నమోదైంది. గత 25 సంవత్సరాలలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. సట్లెజ్, బియాస్, రావి వంటి నదులు పొంగిపొర్లుతున్నాయి. ఈ తీవ్రమైన విఫత్తుపై పంజాబ్ లోకల్ బాయ్, టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ స్పందించాడు."వరదలతో అతలాకుతలం నా పంజాబ్ చూస్తుంటే నా హృదయం తరుక్కుపోతుంది. పంజాబ్ ఎన్ని కష్టాల్లు వచ్చినా ఎల్లప్పుడూ బలంగా ఉంటుంది. మేము ఈ స్థితి నుంచి మళ్లీ పైకి వస్తాం. బాధిత కుటుంబాల కోసం నేను ప్రార్థిస్తున్నాను. ప్రజలకు నా పూర్తి మద్దతు ఉంటుంది" అని గిల్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు. కాగా శుబ్‌మన్ ఆసియాకప్ కప్-2025 కోసం సిద్దమవుతున్నాడు. అతడు ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఉన్నాడు. సెప్టెంబర్ 9 నుంచి ఆసియాకప్ టీ20 టోర్నీ ప్రారంభం కానుంది. ఈ ఖండాంతర టోర్నీలో భారత జట్టు వైస్ కెప్టెన్‌గా గిల్ వ్యవహరించనున్నాడు.చదవండి: ‘ది హండ్రెడ్’లో ఇరగదీశారు.. ఆ నలుగరికి ఐపీఎల్లో భారీ ధర! -
అత్యాచారం కేసులో ఆప్ ఎమ్మెల్యే అరెస్ట్
సనౌర్: పంజాబ్‌లోని సనౌర్ ఎమ్మెల్యే హర్మిత్ సింగ్ పఠాన్మజ్రాను అత్యాచారం ఆరోపణలపై పోలీసులు అరెస్ట్ చేశారు. హర్మిత్ సింగ్ మాజీ భార్య ఆయనపై అత్యచార ఆరోపణలు చేస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం రాత్రి ఈ అత్యాచారం ఆరోపణలపై కేసు నమోదుకాగా, మంగళవారం ఉదయం హర్యానాలోని కర్నాల్‌లో పంజాబ్‌లోని కర్నాల్‌లో ఎమ్మెల్యే హర్మిత్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలో వరదల పరిస్థితిపై ముఖ్యమంత్రి భగవంత్ మాన్, జల వనరుల ప్రధాన కార్యదర్శి కృష్ణ కుమార్‌పై సనూర్ ఎమ్మెల్యే విమర్శలు చేసిన దరిమిలా ఈ పరిణామం చోటుచేసుకుంది. సోమవారం రాత్రి 10.17 గంటలకు పఠాన్మజ్రా మాజీ భార్య.. పటియాలాలోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో ఈ ఉదంతంపై ఫిర్యాదు చేశారు. ఆమె పేర్కొన్నా వివరాల ప్రకారం 2014,ఫిబ్రవరి 12 నుంచి 2024 జూన్ 12 వరకు ఈ నేరం జరిగిందని ఆరోపించారు. ఈ నేపధ్యంలో ఎమ్మెల్యేపై భారతీయ శిక్షాస్మృతిలోని 376, 420,506 సెక్షన్ల కింద అత్యాచారం, మోసం, క్రిమినల్ బెదిరింపుల అభియోగాలపై కేసు నమోదు చేశారు.పఠాన్మజ్రాను అతని బంధువుల గ్రామమైన దబ్రీలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఒక టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పఠన్‌మజ్రా.. ఢిల్లీకి చెందిన ఆప్ నేతల లైంగిక కార్యకలాపాల వీడియోలు తన వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. వారు తనపై అత్యాచారం కేసు పెట్టారని, తాను కోర్టులో దానిని ఎదుర్కొంటానని అన్నారు. ఇప్పుడు ఢిల్లీ-పంజాబ్ మధ్య కబడ్డీ ఆట జరుగుతున్నదని ఆయన వ్యాఖ్యానించారు. -
Punjab: భీకర వరదలు.. లక్షల ఎకరాల్లో పంట నష్టం.. 1,018 గ్రామాలు నీట మునక
చండీగఢ్: పంజాబ్‌లో దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత అత్యంత భీకర వరదలు సంభవించాయి. ఫలితంగా మూడు లక్షల ఎకరాల్లోని పంటలు దెబ్బతిన్నాయి. 1,018 గ్రామాలు నీట మునిగాయి. 1988లో సంభవించిన వరదల తర్వాత ఇప్పుడు అదే స్థాయిలో వరదలు పంజాబ్‌ను చుట్టుముట్టాయి. పంజాబ్‌లో తాజాగా సంభవించిన వరదలు వెయ్యికి పైగా గ్రామాలను ప్రభావితం చేశాయి. మూడు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. భారీ వర్షాల కారణంగా సట్లెజ్, బియాస్, రావి నదులు పొంగిపొర్లుతున్నాయి. ముంపు ప్రాంతాల్లోని వేలాది మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద విపత్తులకు ముగ్గురు మరణించినట్లు సమాచారం. హిమాచల్ ప్రదేశ్, జమ్ముక కశ్మీర్లో భారీ వర్షాల కారణంగా సట్లెజ్, బియాస్, రావి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఫలితంగా పంజాబ్‌లోని గురుదాస్‌పూర్, అమృత్సర్, తర్న్ తరణ్, ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, ఫాజిల్కా, కపుర్తలా హోషియార్పూర్ జిల్లాల్లో వరదలు సంభవించాయి. On one hand, Indian Punjab is drowning, people are starving & struggling but the lapdog media is only staging pictures to show that it is “helping.” The truth is, this disaster is the very fire it ignited itself which has now come back to haunt it.#PunjabFloods2025 #FloodAlert pic.twitter.com/llwTgL9LzY— Noor Fatima (@Fatima_Zahra120) August 29, 2025ప్రాథమిక నివేదికల ప్రకారం సరిహద్దు జిల్లా ఫాజిల్కాలో 41,099 ఎకరాల వ్యవసాయ భూములు దెబ్బతిన్నాయి. పంజాబ్ జల వనరుల మంత్రి బరీందర్ కుమార్ గోయల్ మాట్లాడుతూ వరదల వల్ల దెబ్బతిన్న గ్రామాలలో దాదాపు మూడవ వంతు గ్రామాలు గురుదాస్‌పూర్ జిల్లాలో ఉన్నాయన్నారు. గురుదాస్‌పూర్‌లో 2,571 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా, ఫజిల్కాలో 1239 మందిని తరలించినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం 77 సహాయ శిబిరాల్లో 4,729 మంది ఆశ్రయం పొందుతున్నారు. Reality of Punjab Floods Full Report Linkhttps://t.co/xktLuLGoLb pic.twitter.com/zzrD89WfWd— Rattandeep Singh Dhaliwal (@Rattan1990) August 27, 2025 -
Punjab: నడిరోడ్డుపై ఎల్పీజీ ట్యాంకర్ దగ్ధం.. ఇద్దరు మృతి
హోషియార్పూర్: పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో దడపుట్టించే రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన మాండియాలా గ్రామంలోని పారిశ్రామిక ప్రాంతంలో జరిగింది. రోడ్డు ప్రమాదం అనంతరం గ్యాస్ ట్యాంకర్‌కు మంటలు అంటుకోగా, అవి సమీపంలోని 15 దుకాణాలను, ఐదు నివాస గృహాలను దగ్ధం చేశాయని పోలీసులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. #WATCH | A massive fire broke out in Mandiala village of Hoshiarpur in Punjab. According to Deputy Commissioner Aashika Jain, it is suspected that the fire was caused by a road accident in an industrial area involving an LPG tanker, and one casualty has been reported. Fire… pic.twitter.com/JMZYi4VT3J— ANI (@ANI) August 22, 2025శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. డిప్యూటీ కమిషనర్ జైన్, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సందీప్ కుమార్ మాలిక్ సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలను పర్యవేక్షించారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు అంబులెన్స్‌లలో తరలించారు. హోషియార్పూర్ డిప్యూటీ కమిషనర్ ఆషికా జైన్ మీడియాతో మాట్లాడుతూ ‘రోడ్డు ప్రమాదం కారణంగా గ్యాస్ ట్యాంకర్ నుంచి మంటలు చెలరేగాయి. ప్రమద బాధితులను ఆస్పత్రులకు తరలించారు. రోడ్డు ప్రమాదం తర్వాత గ్యాస్ లీక్ అయ్యిందని తెలిపారు. #WATCH | Hoshiarpur, Punjab | At the incident spot where a fire broke out in Mandiala village, Deputy Commissioner Aashika Jain says, "... The fire broke out, probably due to a road accident. Patients with burn injuries have been admitted to the hospital... One casualty has been… https://t.co/1jgGIYZKdD pic.twitter.com/OS3kQZw76X— ANI (@ANI) August 22, 2025ఘటనా స్థలానికి పంజాబ్ మంత్రి రవ్‌జోత్ సింగ్ చేరుకుని, పరిస్థితులను, సహాయక చర్యలను పరిశీలించారు. ‘పరిస్థితి వర్ణించలేని విధంగా ఉంది. చాలా విషాదకరమైన ప్రమాదం జరిగింది. ఎంత మంది గల్లంతయ్యారో ఇంకా తెలియదు. ఒక ట్యాంకర్.. కారును ఢీకొంది. ఆ తర్వాత గ్యాస్ లీక్ కావడం వల్ల పేలుడు సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించాయి’ అని మీడియాకు తెలిపారు. కాగా ప్రమాద బాధితులను హోషియార్పూర్ సివిల్ ఆసుపత్రికి తరలించేలోపే ఇద్దరు మృతిచెందారని, మరో 20 మంది వరకు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సివిల్ సర్జన్ పవన్ కుమార్ తెలిపారు. #WATCH | Hoshiarpur, Punjab | At the incident spot where a fire broke out in Mandiala village, Punjab Minister Ravjot Singh says, "The situation is such that it cannot be described. A very tragic accident has happened... It is not yet known how many people are missing. People are… https://t.co/1jgGIZ0i3b pic.twitter.com/IVWi9ArEis— ANI (@ANI) August 22, 2025 -
భారత్ – బ్రిటన్ మధ్య స్నేహ వారధి.. పాల్
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం స్వరాజ్ పాల్ పంజాబ్‌లోని జలంధర్‌లో 1931 ఫిబ్రవరి 18న జన్మించారు. ఆయన తండ్రి ప్యారేలాల్ స్థానికంగా చిన్నపాటి ఉక్కు ఫౌండ్రీని నడిపేవారు. స్వరాజ్ పాల్ 1949లో పంజాబ్ యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తి చేశాక అమెరికాలోని ప్రతిష్టాత్మక మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆప్ టెక్నాలజీలో (ఎంఐటీ) మెకానికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్స్, మాస్టర్స్ చేశారు. స్వదేశానికి తిరిగొచ్చాక కుటుంబ వ్యాపారమైన ఏపీజే సురేంద్ర గ్రూప్‌లో చేరారు. అయితే, ల్యూకేమియాతో బాధపడుతున్న కుమార్తె అంబికాకు మెరుగైన వైద్యచికిత్స కోసం 1966లో ఆయన బ్రిటన్‌కి వెళ్లారు. కానీ, దురదృష్టవశాత్తూ నాలుగేళ్లకే కుమార్తె కన్ను మూయడంతో విషాదంలో మునిగిపోయిన పాల్.. ఆ తర్వాత ఆమె పేరిట అంబికా పాల్ ఫౌండేషన్ అనే చారిటబుల్ ట్రస్టును ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా బాలల విద్య, ఆరోగ్యానికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాల కోసం మిలియన్ల కొద్దీ పౌండ్లను విరాళంగా ఇచ్చారు. 1968లో లండన్ ప్రధాన కేంద్రంగా కపారో గ్రూప్‌నకు స్వరాజ్ పాల్ శ్రీకారం చుట్టారు. తర్వాత రోజుల్లో అది బ్రిటన్‌లోనే అతి పెద్ద స్టీల్ కన్వర్షన్, డిస్ట్రిబ్యూషన్ వ్యాపార దిగజాల్లో ఒకటిగా ఎదిగింది. ప్రస్తుతం బ్రిటన్, భారత్, అమెరికా, కెనడా తదితర దేశాల్లో ఏటా 1 బిలియన్ డాలర్ల ఆదాయంతో కార్యకలాపాలు సాగిస్తోంది. లెజెండ్.. లార్డ్ స్వరాజ్ పాల్ (Lord Swraj Paul) మృతిపై ఇరు దేశాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. బ్రిటన్–భారత్ మధ్య వారధిగా వ్యవహరించిన పాల్ తనకు స్ఫూర్తిప్రదాత అని కోబ్రా బీర్ వ్యవస్థాపకుడు లార్డ్ కరణ్ బిలిమోరియా తెలిపారు. విద్య, వ్యాపారం, రాజకీయాలు ఇలా అన్ని రంగాల్లోనూ ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పేందుకు కృషి చేశారని పేర్కొన్నారు. వోల్వర్‌హ్యాంప్టన్ యూనివర్సిటీ చాన్సలర్‌గా వర్సిటీ అభివృద్ధిలో ఆయన ఎంతో కీలక పాత్ర పోషించారని విశ్వవిద్యాలయం బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చెయిర్ ఏంజెలా స్పెన్స్ పేర్కొన్నారు. బ్రిటన్‌లోని అనేక మంది భారతీయులకు మార్గదర్శిగా నిల్చిన ‘లెజెండ్’ అని పాల్‌ను సన్ మార్క్ వ్యవస్థాపకుడు లార్డ్ రామీ రేంజర్ అభివర్ణించారు. భారత్–బ్రిటన్ను మరింత చేరువ చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను పటిష్టం చేయడంలో ఆయన చెరగని ముద్ర వేశారని లండన్‌లోని భారత హైకమిషన్ ప్రధాని మోదీ సోషల్ మీడియా వ్యాఖ్యలను రీపోస్ట్ చేసింది. ఆయన విదేశాల్లో భారత్‌కి గొంతుకగా నిల్చారని హై కమిషనర్ విక్రమ్ దొరైస్వామి పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కృషి.. భారత్–బ్రిటన్ మధ్య సంబంధాలను పటిష్టం చేసే దిశగా 1975లో ఇండో–బ్రిటీష్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన లార్డ్ పాల్ దానికి సుదీర్ఘకాలం చైర్మన్‌గా వ్యవహరించారు. పాల్ సేవలకు గుర్తింపుగా 1978లో బ్రిటన్ రాణి ఆయనకు నైట్‌హుడ్ ప్రదానం చేశారు. 1983లో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ భూషణ్ (Padma Bhushan) పురస్కారంతో ఆయన్ను సత్కరించింది. పలు సంవత్సరాలుగా బ్రిటన్‌లో అత్యంత సంపన్నుల జాబితాలో ఆయన పేరు క్రమం తప్పకుండా ఉంటోంది. 2 బిలియన్ పౌండ్ల సంపదతో ఈ ఏడాది సండే టైమ్స్ రిచ్ లిస్ట్‌లో ఆయన 81వ స్థానంలో నిల్చారు. ఆరోగ్యం అంతగా సహకరించకపోతున్నప్పటికీ ఇటీవలి వరకు ఆయన హౌస్ ఆఫ్ లార్డ్స్‌కి తప్పకుండా హాజరయ్యారు. 2008లో హౌస్ ఆఫ్ లార్డ్స్ డిప్యుటీ స్పీకర్‌గా పాల్ వ్యవహరించారు. తద్వారా భారత నేపథ్యంతో, ఆ బాధ్యత చేపట్టిన తొలి వ్యక్తిగా ఘనత సాధించారు. 2000 నుంచి 2005 వరకు ఇండియా–యూకే రౌండ్ టేబుల్‌కి కో–చెయిర్‌గా వ్యవహరించారు. 2009లో బ్రిటన్ మోనార్క్‌కి సలహా మండలి అయిన ప్రీవీ కౌన్సిల్ సభ్యుడిగా కూడా ఆయన నియమితులయ్యారు. మరోవైపు, వ్యక్తిగత జీవితంలో ఆయన్ను విషాదాలు వెన్నాడాయి. 2015లో కపారో గ్రూప్ సీఈవోగా వ్యవహరిస్తున్న కుమారుడు అంగద్ పాల్, 2022లో ఆయన భార్య అరుణ మరణించారు. దీనితో వారి స్మారకార్థం తలపెట్టిన పలు సంక్షేమ కార్యక్రమాలకు ఆయన మరింత సంపద, సమయం వెచ్చించారు. భార్య మరణానంతరం అంబికా పాల్ ఫౌండేషన్ పేరును అరుణ అండ్ అంబికా పాల్ ఫౌండేషన్‌గా మార్చారు. 2023 ఫిబ్రవరిలో లండన్‌లోని చారిత్రక ఇండియన్ జింఖానా క్లబ్లో లేడీ అరుణ స్వరాజ్ పాల్ హాల్ని ప్రారంభించారు. -
ఫోన్ల రిక'వర్రీస్'
వేలు కాదు.. లక్షలు పోసి ఫోన్ కొంటున్నాం. ఎడాపెడా వాడేస్తున్నాం. అంతేనా? అన్ని సెక్యూరిటీ ఫీచర్స్ ఎనేబుల్ చేస్తాం. డేటాని బ్యాకప్ పెట్టేస్తున్నాం. కానీ, అనుకోకుండా ఫోన్ పోతే? ఏముందీ.. రికవర్ చేసేయొచ్చులే అనుకుంటే మీది ఓవర్ కాన్ఫిడెన్సే. ఎందుకంటే.. పోయిన ఫోన్ల రికవరీ రేట్ మీరు అనుకునేంత స్థాయిలో లేదు. దేశ రాజధాని ఢిల్లీనే అందుకు సాక్ష్యం. అక్కడ పోగొట్టుకున్న ఫోన్ల రికవరీ రేటు ఎంతో తెలుసా? 1.87%. అంటే.. వంద ఫోన్లు పోతే.. ఒకటో రెండో రికవర్ చేస్తున్నారట. దేశ రాజధానిలో పరిస్థితి సరే, మరి మన దగ్గర ఎలా ఉంది?– సాక్షి, స్పెషల్ డెస్క్ఫోన్ పోగానే ముందుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇస్తాం. ట్రాక్ చేస్తారులే అని భరోసాతో ఎదురు చూస్తాం. కానీ, పోయిన ఫోన్లు దొరికే అవకాశం చాలా తక్కువ అని గణాంకాలు చెబుతున్నాయి. జాతీయ స్థాయిలో సగటున 100 ఫోన్లు పోతే 25 ఫోన్లనే తిరిగి తీసుకురాగలుగుతున్నారట. టెలికమ్యూనికేషన్ల శాఖకు చెందిన సంచార్ సాథీ పోర్టల్ చెబుతున్న వాస్తవాలివి. ఢిల్లీలో మొత్తంగా 8.22 లక్షలకు పైగా ఫోన్లను బ్లాక్ చేశారు. కానీ, వాటిలో తిరిగి దొరికినవి కేవలం 9,871 మాత్రమే. ఈ తక్కువ రికవరీ జాబితాలో పంజాబ్, బిహార్ ఉన్నాయి. జాతీయ స్థాయిలో 36.35 లక్షలకుపైగా ఫోన్లను బ్లాక్ చేస్తే.. ట్రేస్ చేసినవి 22.14 లక్షలు. రికవరీ చేసినవి 5.45 లక్షలు. రికవరీ రేటు 24.5 శాతం. అంటే 100లో 25 ఫోన్లు మాత్రమే రికవరీ అవుతున్నాయన్నమాట. ఈ గణాంకాల విషయంలో యూజర్లు కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా ఎందుకీ అలసత్వం అంటూ సోషల్ మీడియా వేదికలపై అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.మన పరిస్థితేంటి?తెలంగాణలో 3.76 లక్షల ఫోన్లు బ్లాక్ చేస్తే.. ట్రేస్ చేసినవి 2.13 లక్షలు. వాటిలో 91,306 ఫోన్లు రికవరీ అయ్యాయి. అంటే, రికవరీ రేటు 42.8%. ఆంధ్రప్రదేశ్‌లో 1.26 ఫోన్లు బ్లాక్ చేస్తే.. 79వేలకుపైగా ట్రేస్ చేయగలిగారు. తిరిగి తీసుకొచ్చినవి 31,478. రికవరీ రేటు 39.66% శాతం. మరోవైపు సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్న ప్రకారం.. రికవరీ ఫోన్లను పోలీసులు రాబట్టే క్రమంలో కొందరు అమాయకులు బయటపడుతున్నారు. ఎవరా అమాయకులు అంటే.. దొంగిలించిన ఫోన్ ని కొన్నవాళ్లు. చాలా తక్కువ ధరకే దొరుకుతుందని ఆన్ లైన్, ఆఫ్‌లైన్ మార్కెట్లలో అనధికారికంగా ఇలాంటి ఫోన్లు కొంటున్నారు. పోలీస్ స్టేషన్లకు పార్సిళ్లుపోలీసు స్టేషన్లు అంటే ఫిర్యాదులు, విచారణలు, కేసులు. కానీ, కొన్ని స్టేషన్లకు ఇటీవల విచిత్రమైన పార్సిళ్లు వస్తున్నాయి. అవేంటో తెలుసా..దొంగిలించిన మొబైల్ ఫోన్లు. వాటిని కొనుక్కున్న కొత్త యజమానులు వాటిని తిరిగి పోగొట్టుకున్న వారికి పంపేందుకు పోలీస్ స్టేషన్లకు కొరియర్ చేస్తున్నారట. అంతలా స్వచ్ఛందంగా ఎందుకు పంపుతున్నారనేగా మీ సందేహం? ఎందుకంటే.. ఈ చిత్రమైన ట్రెండ్ వెనుక ఒక కొత్త టెక్నాలజీ ఉంది. దానిపేరే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్). ఫోన్ల దొంగతనాల్ని కట్టడి చేసేందుకు టెలికమ్యూనికేషన్స్ విభాగం సీఈఐఆర్ పోర్టల్‌ను ప్రారంభించింది. ఫోన్ పోగొట్టుకున్నవారు ఐఎంఈఐ నంబర్ సాయంతో.. ఈ పోర్టల్ ద్వారా ఆ ఫోన్‌ని బ్లాక్ చేయొచ్చు. దీంతో ఆ ఫోన్ దేశంలో ఎక్కడున్నా.. ఏ నెట్‌వర్క్‌పైనా పనిచేయకుండా పోతుంది. అంటే అది దొంగల చేతిలో ఉన్నా పనికిరాదన్నమాట. అందుకే అలాంటి ఫోన్లు పోలీస్ స్టేషన్లకు పార్సిళ్లుగా వెళ్తున్నాయి.స్వచ్ఛందంగా డిస్కనెక్ట్ కావాల్సిన ప్రూఫ్‌లతో విచ్చలవిడిగా సిమ్ కార్డులు తీసుకుని వాడేసిన రోజులు దాటుకుని.. నా పేరు మీద ఏదైనా నంబర్లు ఇంకా యాక్టివ్‌గా ఉన్నాయా? అని మనమే వెతుక్కునే రోజులకి వచ్చాం. అందుకు కారణం లేకపోలేదు. ఫేక్ ప్రూఫ్‌లు, దొంగిలించిన సిమ్‌లతో సైబర్ క్రై మ్‌లకు పాల్పడుతున్న సంఘటనలు అనేకం. ఈ నేపథ్యంలో చాలా మంది యూజర్లు స్వచ్ఛందంగానే వారి పేరు, అడ్రస్ ప్రూఫ్‌తో ఉన్న ఫోన్ నంబర్లను వెతికి ‘సంచార్ సాథీ’ పోర్టల్ ద్వారా బ్లాక్ / డిస్కనెక్ట్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి మొబైల్ కనెక్షన్ల సంఖ్య 1.07 కోట్లు. -
శ్వాన్‌సింగ్ కోసం దిగొచ్చిన భారత ఆర్మీ.. పాక్ యుద్ధంలో ఏం చేశాడంటే?
సాయం చేయాలన్న ఆలోచన ఎవరికైనా ఎప్పుడైనా కలగొచ్చు. కానీ, తమ శక్తికి మించిన సాయం చేయడమనేది మామూలు విషయం కాదు. అది అసాధ్యమనే చెప్పాలి. అయితే, అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల సత్తా కొందరికి మాత్రమే ఉంటుంది. సరిగ్గా ఆ మనసు కలిగినవాడే శ్వాన్ సింగ్. ఇంతకీ శ్వాస్ సింగ్ ఏం చేశాడంటే..ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ ఎదురుదాడులకు పాల్పడగా.. భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పదేళ్ల శ్వాస్ సింగ్ మన సైనికులకు బాసటగా నిలిచాడు. వారికి మంచినీరు, పాలు, టీ, లస్సీ.. వంటివి అందిస్తూ తనవంతు సాయం చేశాడు. ఇప్పటికే ఆ బాలుడి సేవలను ప్రశంసించిన సైనికాధికారులు.. తాజాగా అతడి చదువుకయ్యే ఖర్చులను భరించేందుకు ముందుకొచ్చారు. ఇండియన్ ఆర్మీ ఇతనికి ఉద్యోగం వచ్చే వరకు మొత్తం తన చదువు ఖర్చునంతా భరించబోతోంది.పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో మామ్ డోట్ గ్రామానికి చెందిన వ్యక్తి ఈ శ్వాన్ సింగ్. శ్వాన్ సింగ్ ఇంటికి సరిగ్గా పాతిక కిలోమీటర్ల దూరంలోనే పాకిస్తాన్ ఉంది. ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్.. పంజాబ్‌లోని మామ్ డోట్ పరిసర ప్రాంతాల్లోనే జరిగింది. ఆపరేషన్ సింధూర్ తరువాత పాకిస్తాన్ మన దేశంపై చేస్తున్న దాడులను మన సైన్యం విజయవంతంగా ఎదుర్కొంది. ఆ నేపధ్యంలో శ్వాన్ సింగ్ ఇంటి ప్రాంతంలో కొంతమంది ఇండియన్ ఆర్మీ డ్యూటీ చేస్తున్నారు. చుట్టూ తుపాకులు, బాంబుల మోతతో అట్టుడికిపోతున్న ఆ ప్రాంతంలో చీమ కూడా బయటకు రాలేనంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సరిగ్గా అదే సమయంలో తన ఇంటి నుండి చల్లని లస్సీ తయారు చేసుకుని అలసిపోతున్న ఆర్మీ అధికారులకు అందించాడు మన శ్వాన్ సింగ్. అది కూడా ఏమాత్రం బెరుకు, భయం లేకుండా దాదాపు 10 రోజులు అలా ఇస్తూనే ఉన్నాడు. ఇండియన్ ఆర్మీ శ్వాన్‌సింగ్ చేసిన ఈ సాయానికి, తెగువకు ముచ్చటపడి తన చదువును స్పాన్సర్ చేస్తోంది.🇮🇳 The Indian Army will sponsor the education of 10-yr-old Shvan Singh from Ferozepur, Punjab — the youngest warrior of #OperationSindoor, who served soldiers with food day & night during the op.#IndianArmy #ShvanSingh #OperationSindoor #RealHero pic.twitter.com/Bqn1Vot8TD— Aman Dev Barman (@AmanDevBar67676) July 21, 2025ఇక, తాజాగా శ్వాన్సింగ్ను ‘సాక్షి’ ఎక్స్‌క్లూజివ్‌గా పలకరించింది. సాక్షి అడిగిన పలు ప్రశ్నలకు శ్వాన్‌సింగ్ ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు. అతడు జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నాడు.. అతడి పేరెంట్స్ ఏం చేస్తారు.. పది రోజుల పాటు తాను ఇండియన్ ఆర్మీతో గడిపిన క్షణాలను.. యుద్ధం నాటి పరిస్థితులను వివరించాడు.. ఈ వివరాల గురించి కింది వీడియోలో.. -
స్పాన్సర్లు లేరు, ప్రభుత్వ మద్దతు లేదు.. అయినా చరిత్ర సృష్టించిన భారత యువ జట్టు
భారత్‌కు చెందిన ఓ యువ జట్టు ప్రపంచంలోనే అతి పెద్ద ఫుట్‌బాల్ టోర్నీని నెగ్గి చరిత్ర సృష్టించింది. కొద్ది రోజుల కిందట నార్వేలో జరిగిన నార్వే కప్ 2025లో పంజాబ్‌కు చెందిన మినర్వా అకాడమీ అబ్బురపరిచే ప్రదర్శనలతో టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ అండర్-13 జట్టుకు బ్రాండింగ్ లేకపోయనా, స్పాన్సర్లు లేకపోయినా, ప్రభుత్వ మద్దతు లేకపోయనా సంచలనాలు సృష్టించింది. ఈ యువ జట్టు తమ అభిరుచి, పట్టుదలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఫైనల్లో మినర్వా అకాడమీ స్థానిక జట్టు ఎస్ఐఎఫ్పై 14-1 గోల్స్ తేడాతో గెలుపొందింది. మినర్వా అకాడమీ తరఫున దనమోని, రాజ్ హ్యాట్రిక్ గోల్స్ సాధించారు. చింగ్కే, కే చేతన్, పున్షిబా, అమర్సన్, ఆజమ్, రీసన్ గోల్స్ చేశారు.ఈ టోర్నీలో మినర్వా అకాడమీ ఆది నుంచి సంచలన ప్రదర్శనలు నమోదు చేసింది. గ్రూప్ స్టేజీలో అలస్కా ఐఎల్పై 25-0, ఫోర్డ్ ఐఎల్-3పై 15-0, క్కొకెల్వ్డలాన్ ఐఎల్పై 22-0 గోల్స్ తేడాతో గెలుపొందింది.నాకౌట్ మ్యాచ్‌ల్లో రోగ్లాండర్స్పై (Round of 32) 11-0, అమ్డాల్ టొక్కెపై (Round of 16) 17-0, క్వార్టర్ ఫైనల్లో ఫైల్లింగ్స్డలెన్పై 18-1, సెమీస్‌లో రదథెల్ చరిఫ్ క్లబ్‌పై (పాలస్తీన్) 8-2 గోల్స్ తేడాతో నెగ్గి ఫైనల్‌కు చేరింది. ఈ టోర్నీలో మినర్వ అకాడమీ 8 మ్యాచ్‌ల్లో మొత్తం 130 గోల్స్ చేసింది. ఈ యూరప్ సీజన్లో భారత్‌కు చెందిన జట్లు మూడు టైటిళ్లు సాధించాయి. నార్వే కప్‌కు ముందు భారత జట్లు గోథియా కప్, డానా కప్‌లు గెలిచాయి.అనామక కుర్రాళ్లు ప్రతిష్టాత్మక నార్వే కప్ గెలిచిన తర్వాత స్వదేశంలో వారిపై ప్రశంసల జల్లు కురుస్తుంది. ఈ జట్టు యూరప్‌లో ట్రోఫీని మాత్రమే కైవసం చేసుకోలేదు. ప్రతి భారత ఫుట్‌బాల్ ప్రేమికుడి కలను సాకారం చేసింది. ఎక్కడో మారుమూల అకాడమీ నుంచి వచ్చి విశ్వవేదికపై భారత కీర్తిపతాకను రెపరెపలాడించింది. ఆట పట్ల అభిరుచి ఏమి చేయించగలదో నిరూపించింది. మొత్తంగా దేశం గర్వపడేలా చేసింది. -
వరదల్లో చిక్కుకున్న విద్యార్థులు.. ఐదు అడుగుల నీటిలో ఇద్దరు యువకులు..
ఛండీగఢ్: ఉత్తరాదిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా దంచికొడుతున్న వర్షాల కారణంగా పలుచోట్ల చెరువులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. తాజాగా పంజాబ్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో రోడ్డు తెగిపోవడంతో 35 మంది స్కూల్ పిల్లలు వరద నీటిలో చిక్కుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు ఎంతో ధైర్య సాహసాలతో జుగాద్ అనే పిలవబడే ప్రత్యేక పద్దతి ద్వారా పిల్లలను కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. పంజాబ్‌లోని మల్లెయన్ గ్రామపంచాయతీ పరిధిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో పాఠశాలలకు వెళ్లిన పిల్లలకు ఉదయం 10 గంటల తర్వాత స్కూల్స్‌కు సెలవు ప్రకటించారు. దీంతో, వారంతా ఇంటికి వస్తున్న సమయంలో వరదల కారణంగా మల్లెయాన్, రసూల్పూర్ గ్రామాలను కలిపే రోడ్డు కొట్టుకుపోయింది. దాదాపు 35 మంది పిల్లలు, యువతులను వరద నీటిలో చిక్కుకున్నారు. పిల్లలంతా భయాందోళన చెబుతున్న సమయంలో వారిని కాపాడేందుకు ఇద్దరు యువకులు ముందుకు వచ్చారు. జుగాద్ అని పిలవబడే ప్రత్యేక పద్దతి ద్వారా వారి రక్షించారు.సుఖ్బిందర్ సింగ్, గగన్‌దీప్ సింగ్ సహా పలువురు పిల్లలకు సహాయం చేయడానికి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సుఖ్బిందర్ సింగ్, గగన్‌దీప్ సింగ్ కలిసి మానవ వంతెనను ఏర్పాటు చేశారు. ఐదు అడుగుల లోతులో వారిద్దరూ వంతెనగా ఏర్పడితే.. స్థానికుల సాయంతో పిల్లలను రోడ్డు దాటించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పిల్లలను కాపాడిన వారిద్దరినీ పలువురు ప్రశంసిస్తున్నారు.शाबाश पंजाबियों...पंजाबी हर वक्त मदद के लिए तैयार रहते हैमोगा के एक गांव की सड़क बह गई। स्कूल जाने वाले बच्चे फंस गए। लोगों ने अपनी पीठ को पुल बनाकर 30 बच्चों को पार कराया। कई साल बाद ऐसी तस्वीर देखने को मिली।सफेद टीशर्ट और शर्ट वाले युवक की तारीफ होनी चाहिए।#Punjab pic.twitter.com/33e0yu0zJ0— Anwar Ali (@Anwarali_0A) July 24, 2025 -
దూసుకొచ్చిన పాక్ డ్రోన్లు.. పేల్చిసిన భారత భద్రతా బలగాలు
అమృత్సర్: నార్కో-టెర్రర్ నెట్‌వర్క్‌లను పెంచిపోషిస్తున్న పాకిస్తాన్‌కు భారత భద్రతా బలగాలు షాకిచ్చాయి. పంజాబ్ సరిహద్దుల్లో వరుస ఆపరేషన్లు చేపట్టిన బీఎస్ఎఫ్ పాక్ నుంచి భారత్ వైపు వచ్చిన ఆరు డ్రోన్లను కూల్చేసింది. ఈ ఆపరేషన్‌లో మొత్తం ఆరు డ్రోన్లను అదుపులోకి తీసుకున్నారు. వాటిల్లో మూడు డ్రోన్లు ఏరియల్ ఫొటోగ్రఫీ,వీడియోల్ని తీసేందుకు ఉపయోగించే డీజీఐ మావిక్ డ్రోన్లు కాగా.. మరో మూడు డ్రోన్లలో మూడు పిస్టల్స్,వాటిల్లో బుల్లెట్లను నింపేందుకు వినియోగించే మ్యాగిజైన్‌ను,1.1 కేజీ హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్ఎఫ్ విభాగం అధికారికంగా ప్రకటించింది. అమృత్సర్ జిల్లాలోని మోధే గ్రామం వద్ద రాత్రి సమయంలో ఐదు డ్రోన్లను బీఎస్ఎఫ్ జవాన్లు టెక్నాలజీ సాయంతో వాటిని కూల్చేశారు. అక్కడ మూడు తుపాకులు, మూడు మ్యాగజైన్లు,హెరాయిన్ ఉన్న నాలుగు ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. టర్న్ టారన్ జిల్లాలోని డాల్ గ్రామం వద్ద పిస్టల్ భాగాలు, మ్యాగజైన్‌ను గుర్తించారు. అటారి గ్రామం వద్ద మరో డ్రోన్‌ను అడ్డుకుని రెండు మ్యాగజైన్లు స్వాధీనం చేసుకున్నారు. భారత భద్రతా బలగాలు చేపట్టిన ఈ ఆపరేషన్లు పాకిస్తాన్ ప్రేరిత నార్కో-టెర్రర్ నెట్‌వర్క్‌లపై గట్టి దెబ్బగా భావిస్తున్నారు. బీఎస్‌ఫ్, పంజాబ్ పోలీసుల సమన్వయంతో ఈ ఆపరేషన్లు జరిగాయి.కాగా, ఇలాంటి ఘటనలు సరిహద్దు భద్రతను మరింత కఠినంగా చేయాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి. -
ఆపరేషన్ సింధూర్ ‘లిటిల్ హీరో’కు సన్మానం
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. పాక్‌కు వెన్నులో వణుకు పుట్టించిన ఆపరేషన్ సింధూర్‌తో భారత్ ఆర్మీ తన సత్తాచాటింది. పాక్‌లోకి దూసుకుపోయి మరీ ఉగ్రస్థావరాలను, పలు పాక్ ఎయిర్ బేస్‌లపై దాడులు చేసింది. ఇందులో మన ఆర్మీ పాత్రను ఎంత కొనియాడినా తక్కువే. అత్యంత కట్టుదిట్టమైన ప్రణాళికతో పాక్‌కు దడపుట్టించింది. ఆ దెబ్బతో పాక్ కాల్పుల విరమణ ఒప్పందానికి రావడంతో దానికి భారత్‌కు అంగీకరించింది.ఇదిలా ఉంచితే, భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌కు సాయం చేసిన ఒక 10 ఏళ్ల లిటిల్ హీరో కూడా ఉన్నాడు. అదేంటి 10 ఏళ్ల పిల్లాడు ఏం చేస్తాడు అనుకుంటున్నారా?, పాక్ ఆర్మీతో యుద్ధం చేస్తున్న సమయంలో భారత్ సైనికులకు భోజనాలు అందించి తన పాత్రను నిలబెట్టుకున్నాడు. ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా పంజాబ్ గ్రామంలో భారత సైనికులు యుద్ధం చేస్తున్న సమయంలో వారికి ఆ ‘బుడ్డోడు’ భోజనాలు తదితర ఆహార పదార్థాలను సప్లై చేశాడు. దాంతో ఆ లిటిల్ హీరోను సత్కరించింది ఆర్మీ. పంజాబ్‌లోని తారా వాలి గ్రామంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆ చిన్నోడు ధైర్యాన్ని ఇండియన్ ఆర్మీ కీర్తించింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పంజాబ్ గ్రామంలో తుపాకీతో పోరాడుతున్న సైనికులకు మధ్య మధ్యలో భోజనం సరఫరా చేసిన పదేళ్ల బాలుడు ష్వాన్ కథను వెస్ట్రన్ కమాండ్ కమాండింగ్-ఇన్-చీఫ్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ పంచుకున్నారు.Indian Army decides to sponsor all educational needs of the Youngest Warrior of '#OperationSindoor' from Punjab, Master Shvan Singh.This 10-years old from Ferozepur kept on providing essential eatables, day and night, to the army men deployed in his fields in the border… pic.twitter.com/8xv7kozth4— All India Radio News (@airnewsalerts) July 20, 2025ఆ బాలుడి ధైర్యానికి మెచ్చిన ఇండియన్ ఆర్మీ.. ఆ పిల్లాడు చదువుకు అయ్యే ఖర్చును భరిస్తామని హామీ ఇచ్చింది. ష్వాన్ యొక్క కథ దేశంలో ఉన్నవారికి ఆదర్శం కావాలని ఆర్మీ స్పష్టం చేసింది. ఫిరోజ్‌పూర్ జిల్లాలోని మామ్‌డోట్ ప్రాంతంలోని ఒక చిన్న గ్రామానికి చెందిన 10 ఏళ్ల ష్వాన్... అతను కూడా పెద్దయ్యాక సైన్యంలో చేరాలని కోరుకుంటున్నాడు.‘ నేను పెద్దయ్యాక 'ఫౌజీ' కావాలనుకుంటున్నాను. దేశానికి సేవ చేయాలనుకుంటున్నాను’ అని గతంలోనే చెప్పుకొచ్చాడు. -
మారథాన్ రన్నర్ ఫౌజా సింగ్ మృతి కేసు.. ఎన్ఆర్ఐ అరెస్ట్
ఛండీగఢ్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భారత దిగ్గజ మారథాన్ అథ్లెట్ ఫౌజా సింగ్ కేసులో ఎన్ఆర్ఐ అమృత్‌పాల్ సింగ్ ధిల్లాన్(30)ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో ప్రమాదం జరిగిన సమయంలో వాహనం నడిపిన అమృత్‌పాల్ సింగ్‌ను కర్తార్‌పుర్‌లో మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే అతడు కెనడా నుంచి భారత్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అతడు నడిపిన ఫార్చ్యూనర్ ఎస్‌యూవీని కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మరికాసేపట్లో అతన్ని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. అనంతరం రిమాండ్‌కు తరలించనున్నారు.ఇదిలా ఉండగా.. పంజాబ్‌లోని జలంధర్ సమీపంలోని బియాస్ పిండ్ గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 114 ఏళ్ల ఫౌజా సింగ్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో రోడ్డు దాటుతుండగా, గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొట్టడంతో ఫౌజాసింగ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.ప్రపంచంలోనే కురువృద్ధ అథ్లెట్‌గా పేరుగాంచిన ఈ పంజాబ్ పుత్తర్ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. వందేళ్ల వయసును ఏమాత్రం లెక్కచేయకుండా యువకులకు సవాలు విసురుతూ ప్రపంచ వ్యాప్తంగా వివిధ మారథాన్లలో బరిలోకి దిగి సత్తాచాటారు. ఫౌజా సింగ్ మృతి పట్ల పలు ప్రపంచ దేశాలు తమ దిగ్భ్రాంతి ప్రకటించాయి. 1911 ఏప్రిల్ 1న జన్మించిన ఫౌజాసింగ్ 89 ఏళ్ల వయసులో అథ్లెటిక్స్ కెరీర్ మొదలుపెట్టారు. 1993లో ఇంగ్లండ్‌కు వెళ్లిన ఈ దిగ్గజ అథ్లెట్.. ‘టర్బన్ టోర్నడో’ అంటూ అందరి మనన్నలు పొందారు. 2011లో జరిగిన టొరంటో మారథాన్‌లో 100 ఏళ్ల వయసులో 8 గంటల 11 నిమిషాల్లో రేసు పూర్తి చేసి కొత్త రికార్డు నెలకొల్పాడు. ఐదేళ్ల పసిప్రాయం వరకు నడవని ఆయన.. తన 14 ఏళ్ల అథ్లెటిక్స్ కెరీర్లో తొమ్మిది మారథాన్ రేసుల్లో పోటీపడటం విశేషం.The world's oldest marathon runner, Fauja Singh, has died at the age of 114. He was involved in a hit-and-run near Jalandhar, India.Singh began running at 89 and ran nine full marathons - and was one of the 2012 London Olympic torchbearers. pic.twitter.com/kvevQ84FaD— Channel 4 News (@Channel4News) July 15, 2025తన కుటుంబసభ్యుల మరణాల నుంచి తేరుకునేందుకు పరుగును ఎంచుకున్న ఫౌజాసింగ్ను 2015లో బ్రిటిష్ ఎంపైర్ మెడల్ వరించింది. 2012లో జరిగిన హాంకాంగ్ మారథాన్.. ఆయన చివరి అంతర్జాతీయ రేసుగా నిలిచింది. పంజాబ్‌లో డ్రగ్స్ నియంత్రణకు అక్కడి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో ఈ దిగ్గజ అథ్లెట్ కీలకంగా వ్యవహరించారు. కనీసం నడిచే వీలు లేని వయసులో కుర్రాళ్లకు స్ఫూర్తిగా నిలిచిన ఫౌజాసింగ్ అకాల మృతి అందరినీ కలిచివేసింది. -
రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 114 ఏళ్ల దిగ్గజ మారథాన్ రన్నర్
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మారథాన్ రన్నర్‌గా పేరొందిన ఫౌజా సింగ్ 114 ఏళ్ల వయసులో ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సోమవారం మధ్యాహ్నం జలంధర్-పఠాన్‌కోట్ హైవేపై కారు ఢీకొనడంతో ఫౌజా సింగ్ తలకు తీవ్ర గాయమైంది. ఫౌజాను వెంటనే ఆసుపత్రికి తరలించగా.. రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ప్రాణాలు వదిలారు.ఫౌజా సింగ్ మృతదేహాన్ని విదేశాల్లో నివసిస్తున్న అతని పిల్లలు వచ్చే వరకు మార్చురీలో ఉంచనున్నారు. వారు వచ్చిన తర్వాతే అతని అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఫౌజా సింగ్ మరణం పట్ల పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా తీవ్ర విచారం వ్యక్తం చేశారు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫౌజా కుటుంబానికి, అతని అభిమానులకు సానుభూతి తెలియజేశారు. ఫౌజా ఆత్మకు శాశ్వత శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.114 ఏళ్ల వయసులోనూ ఫౌజా తన బలం మరియు నిబద్ధతతో తరతరాలను ప్రేరేపించాడని అన్నారు. గతేడాది 'నాషా ముక్త్ - రంగాలా పంజాబ్' మార్చ్‌లో ఫౌజాతో పాటు నడిచే గౌరవం లభించిందని గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు గులాబ్ చంద్ కటారియా తన అధికారిక ఫేస్బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు.కాగా, ఫౌజా సింగ్ 1911 ఏప్రిల్ 1న పంజాబ్‌లోని జలంధర్‌లో జన్మించారు. భార్య, కొడుకు మరణంతో ఫౌజా సింగ్ మానసిక సమస్యలతో పోరాడుతూ 1992లో మరాథాన్వైపు మళ్ళారు. అప్పటి నుంచి ఫౌజా మారథాన్‌లో సంచలన ప్రదర్శనలు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.ఫౌజా సింగ్ లండన్, టొరంటో, న్యూయార్క్ వంటి ప్రముఖ అంతర్జాతీయ మారథాన్లలో పాల్గొన్నారు. 42 కిలోమీటర్ల మారథాన్‌ను విజయవంతంగా పూర్తి చేయడంతో పాటు టొరంటో మారథాన్‌ను 5 గంటలు 44 నిమిషాలు 4 సెకన్లలో ముగించి రికార్డు నెలకొల్పాడు.ఫౌజా 2004 ఏథెన్స్ మరియు 2012 లండన్ ఒలింపిక్స్ లకు టార్చ్ బేరర్ గా ఉన్నాడు. దిగ్గజ ఫుట్‌బాలర్ డేవిడ్ బెక్‌హమ్, బాక్సింగ్ లెజెండ్ ముహమ్మద్ అలీతో కలిసి ఓ ప్రధాన క్రీడా బ్రాండ్ కోసం ప్రకటనలో కనిపించారు. -
‘మోదీజీ.. అలాంటి దేశాలకు వెళ్లడమెందుకు?.. ఇక అవార్డులా?’
ఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ప్రధాని మోదీ.. ఏయే దేశాలకు వెళ్తున్నారో ఆ దేవుడికే తెలియాలి. కేవలం పది వేల మంది జనాభా ఉన్న దేశాల్లో మోదీ పర్యటించం ఏంటి? అని మాన్ విమర్శించారు. ఈ క్రమంలో సీఎం మాన్ వ్యాఖ్యలపై భారత విదేశాంగశాఖ మండిపడింది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా పూర్తిగా బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం ఏంటని ప్రశ్నించింది.ఇటీవల ప్రధాని మోదీ.. ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాల్లో పర్యటించారు. ఈ నేపథ్యంలో ఆయన ఆయా దేశాల పార్లమెంట్లను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ పర్యటనలపై తాజాగా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పందించారు. ఓ కార్యక్రమంలో సీఎం మాన్ మాట్లాడుతూ.. ‘ప్రధాని మోదీ.. చిన్న చిన్న దేశాలకు సైతం వెళ్తున్నారు. ఘనా అని ఎక్కడికో వెళ్లారు. స్వదేశానికి తిరిగివస్తున్న ఆయనకు స్వాగతం. ప్రధాని ఏయే దేశాలకు వెళ్తున్నారో ఆ దేవుడికే తెలియాలి. 140 కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో మన ప్రధాని ఉండరు. కానీ, పది వేల మంది జనాభా ఉన్న దేశాలను మాత్రం సందర్శిస్తున్నారు. అక్కడ ఆయనకు అత్యున్నత అవార్డులు కూడా అందుతున్నాయి’ అని వ్యాఖ్యలు చేశారు.#Punjab CM Bhagwant Mann makes Fun of PM Modiਭਗਵੰਤ ਮਾਨ ਨੇ ਮੋਦੀ ਫਿਰ ਮਜ਼ਾਕ ਉਡਾਇਆ#Punjab CM Doin'it Again !CM Bhagwant Mann makes Fun of PM Modi foreign trips & also asks the Journos now you will ask the questions of Modi also from me. Mann says he didn't do 1 PC in 11 yrs, I… pic.twitter.com/tqmpoyUzt4— Punjab Spectrum (@PunjabSpectrum) July 10, 2025ఈ నేపథ్యంలో సీఎం మాన్ వ్యాఖ్యలపై భారత విదేశాంగశాఖ మండిపడింది. ప్రధాని విదేశీ పర్యటనలపై రాష్ట్రంలోని ఉన్నతస్థానంలో ఉన్న వ్యక్తి చేసిన వ్యాఖ్యలు తమ దృష్టికి వచ్చాయని మాన్ పేరును ప్రస్తావించకుండా పేర్కొంది. అవి పూర్తిగా బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని తెలిపింది. ఈ వ్యాఖ్యలు వారి స్థాయిని తగ్గించేవని మండిపడింది. భారత్‌తో స్నేహపూర్వకంగా మెలిగే దేశాలను తక్కువ చేసి మాట్లాడటం సబబు కాదని పేర్కొంది.కాంగ్రెస్ కౌంటర్..మరోవైపు.. ప్రధాని మోదీ విదేశీ పర్యటనలపై కాంగ్రెస్ నేతలు సైతం విమర్శిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్.. ప్రధాని మరో విదేశీ పర్యటనకు వెళ్లేలోపు ఓ మూడు వారాలు మన దేశంలో ఉంటారేమో! ఇప్పుడైనా మణిపూర్ వెళ్లడానికి ఆయనకు తీరిక దొరుకుతుందో, లేదో అని ఆయన ఎద్దేవా చేశారు. ఇక, మణిపూర్ విషయమై.. ఇప్పటికే కాంగ్రెస్.. మోదీపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. -
సిక్సర్ బాది.. గుండెపోటుతో కుప్పకూలి.. పిచ్‌పైనే ప్రాణాలొదిలి!
పంజాబ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్థానిక క్రికెటర్ పిచ్‌పైనే ప్రాణాలొదిలాడు. ఉత్సాహంగా మ్యాచ్ ఆడుతున్న అతడు.. సిక్సర్ బాదిన వెంటనే గుండెపోటుతో కుప్పకూలాడు. ఆస్పత్రికి తీసుకువెళ్లేలోపే అతడు మరణించినట్లు సమాచారం.మృతుడిని హర్జీత్ సింగ్‌గా గుర్తించారు. కాగా ఫిరోజ్‌పూర్‌లోని డీఏవీ పాఠశాల మైదానంలో రెండు జట్లు క్రికెట్ మ్యాచ్‌లో తలపడుతున్నాయి. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన హర్జీత్.. సిక్సర్‌తో అలరించాడు. అయితే, ఆ వెంటనే పిచ్ మధ్యలోకి వచ్చిన అతడు ఒక్కసారిగా కుప్పకూలాడు.ఇంతలో సహచర ఆటగాళ్లు వచ్చి హర్జీత్‌ను పైకిలేపే ప్రయత్నం చేశారు. పరిస్థితిని గమనించి సీపీఆర్ (CPR- కార్డియోపల్మనరీ రిససిటేషన్) చేశారు. కానీ అప్పటికే అతడు స్పృహ కోల్పోయిన అతడిలో ఎలాంటి చలనం కనిపించలేదు. గుండెపోటు కారణంగా హర్జీత్ అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.సిక్సర్‌బాది ఆ వెంటనే కాగా సిక్సర్‌బాది ఆ వెంటనే అతడు కుప్పకూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. హర్జీత్ కుటుంబానికి నెటిజన్లు సానుభూతి తెలుపుతున్నారు. కాగా గతేడాది కూడా ఇలాంటి ఘటనే జరిగింది. 35 ఏళ్ల క్రికెటర్ ఒకరు పుణెలోని గర్వారే స్టేడియంలో మ్యాచ్ ఆడుతూనే గుండెపోటుకు గురయ్యాడు.ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు వచ్చిన ఇమ్రాన్ పటేల్ అనే వ్యక్తి కాసేపటికే ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పి.. ఫీల్డ్ అంపైర్ల అనుమతితో మైదానాన్ని వీడాడు. కానీ పెవిలియన్ చేరేలోపే అతడు కుప్పకూలిపోయాడు. పూర్తి ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నప్పటికీ అతడు గుండెపోటు కారణంగా మృతి చెందడం గమనార్హం. ఆల్‌రౌండర్ అయిన ఇమ్రాన్ మైదానంలో ఎంతో చురుగ్గా ఉండేవాడని.. దురదృష్టవశాత్తూ అతడిని కోల్పోయామని తోటి ఆటగాళ్లు, స్నేహితులు విచారం వ్యక్తం చేశారు.A local cricketer in Ferozepur hit a six off a delivery, but just moments later, he suffered a heart attack and tragically collapsed on the ground, losing his life. pic.twitter.com/7j4WXolkFf— Vipin Tiwari (@Vipintiwari952) June 29, 2025 -
కాళ్లు, చేతులు కట్టేసి.. డ్రమ్ములో కుక్కేసి..
మరో ఘోర ఉదంతం ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. బ్లూ కలర్ డ్రమ్ములో కుళ్లిపోయిన స్థితిలో ఓ వ్యక్తి మృతదేహాం బయటపడింది. దీంతో యూపీ మీరట్ ఉదంతాన్ని గుర్తు చేసుకుంటున్నారు చాలామంది. మీరట్‌లో ఓ మహిళ గంజాయి మత్తులో తూలుతూ.. ప్రియుడి సాయంతో తన భర్తను చంపి మృతదేహాన్ని డ్రమ్ములో దాచిపెట్టిన సంగతి తెలిసిందే.ఛండీగఢ్: మీరట్ ఉదంతాన్ని గుర్తు చేస్తూ.. పంజాబ్‌లోని లూధియానాలో ఓ డ్రమ్ములో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మెడ, కాళ్లను తాడుతో కట్టి.. డ్రమ్ములోకి కుక్కిన వైనం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. జూన్ 25వ తేదీన.. ఖాళీ స్థలంలో ఓ వ్యక్తి చెత్త ఏరుకుంటుండగా దుర్వాసన వస్తుండడం చుట్టుపక్కల వాళ్లకు సమాచారం అందించాడు. వాళ్ల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు డ్రమ్ము నుంచి మృతదేహాన్ని స్వాధీనపర్చుకున్నారు. డ్రమ్ములో ఓ బెడ్‌షీట్‌లో మృతదేహం చుట్టి ఉంది. చనిపోయిన వ్యక్తికి 40 ఏళ్ల వయసు ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. ఒంటిపై గాయాలు లేవని.. పోస్ట్‌మార్టం నివేదిక రావాల్సి ఉందని చెబుతున్నారు. లోతైన దర్యాప్తు.. డ్రమ్ము కొత్తగా ఉండడంతో.. లూథియానాలో 42 డ్రమ్ము తయారీ యూనిట్లకు, దుకాణాలకు వెళ్లి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనా స్థలానికి ఐదు కిలోమీటర్ల దూరంలోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. హత్య కేసుగా నమోదు చేసుకుని.. ఈ మధ్యకాలంలో కనిపించకుండా పోయిన వ్యక్తల జాబితాతో మృతుడి వివరాలు సరిపోల్చుకుంటున్నారు. మీరట్ సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసు ఇలా.. ఫిబ్రవరి 24, 2025:మర్చంట్ నేవీ ఉద్యోగి సౌరభ్ రాజ్‌పుత్ లండన్ నుంచి తన కుమార్తె పుట్టినరోజు కోసం భారత్‌కు వచ్చారు. ఫిబ్రవరి 25, 2025:భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లా కలిసి హత్యకు ప్రయత్నించారు. కానీ ఆ రోజు ప్రయత్నం విఫలమైంది. మార్చి 3, 2025:సౌరభ్‌ను కత్తితో పొడిచి హత్య చేశారుశరీరాన్ని ముక్కలు చేసి, తల, చేతులను వేరు చేశారుశరీర భాగాలను మిక్సర్ గ్రైండర్లో వేసి ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు మార్చి 4-5, 2025సిమెంట్, డ్రమ్ములు కొనుగోలు చేసి శరీర భాగాలను డ్రమ్ములో వేసి సిమెంట్ పోసారుడ్రమ్మును ఇంట్లో దాచారుమార్చి 10, 2025 (సుమారు):డ్రమ్ము నుంచి దుర్వాసన రావడంతో ఇంటి ఓనర్ అనుమానం వ్యక్తం చేశాడుసౌరభ్ కూతురు ‘‘నాన్న డ్రమ్ములో ఉన్నాడు’’ అని చెప్పినా, మొదట ఎవ్వరూ పట్టించుకోలేదు మార్చి 20–25, 2025:పోలీసులు డ్రమ్మును స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారుఫోరెన్సిక్ బృందం బెడ్షీట్లు, బాత్రూమ్ టైల్స్‌పై రక్తపు మరకలు గుర్తించిందిసూట్కేస్లో కూడా రక్తపు ఆనవాళ్లు లభించాయి మార్చి 26–27, 2025:ముస్కాన్ రస్తోగి, సాహిల్ శుక్లా అరెస్టయ్యారుఇద్దరూ నేరాన్ని అంగీకరించారుముస్కాన్కు 2019 నుంచి సాహిల్‌తో వివాహేతర సంబంధం ఉన్నట్లు వెల్లడించారు ప్రస్తుతం నిందితులిద్దరూ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా జైలులో ఉన్నారు. ముస్కాన్ ఆరు నెలల గర్భవతి కావడంతో ఆమెను ప్రత్యేక బ్యారక్‌లో ఉంచారు. ఆమె జైలులో లా చదివే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. -
Punjab: కారులో భీతావహ దృశ్యం.. స్థిరాస్థి వ్యాపారి ‘క్షణికావేశం’?
చండీగఢ్: పంజాబ్‌లో దారుణం చోటుచేసుకుంది. పాటియాలా జిల్లాలోని ఒక గ్రామానికి సమీపంలోని పంటపొలాల్లో విషాదకర దృశ్యం కనిపించింది. టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీలో అనుమానాస్పద స్థితిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతదేహాలు కనిపించాయి. ఇది ఆత్మహత్య కేసుగా కనిపిస్తున్నప్పటికీ, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారి మంజిత్ సింగ్ మీడియాకు తెలిపారు.టెప్లా బానూర్‌లోని జాతీయ రహదారిలోని ఒక నిర్జన ప్రదేశంలో నిలిపివుంచిన ఈ కారును పోలీసులు గుర్తించారు. మొహాలీకి చెందిన స్థిరాస్థి వ్యాపారి సందీప్ సింగ్ రాజ్‌పాల్ (45), అతని భార్య మందీప్ కౌర్ (42), వారి కుమారుడు అభయ్ సింగ్ (15)ల మృతదేహాలు ఆ కారులో ఉన్నాయని పోలీసులు తెలిపారు. వారి శరీరాలపై తుపాకీ కాల్పుల గాయాలు ఉన్నాయని, క్యాబిన్ లోపల రక్తం చిమ్మివుందని పోలీసులు పేర్కొన్నారు. స్థిరాస్థి వ్యాపారి మృతదేహం డ్రైవర్ సీటులో ఉందని, అతని భార్య మృతదేహం ముందు సీటులో, వెనుక సీటులో వారి కుమారుని మృతదేహం పోలీసులకు కనిపించాయి.కొందరు కూలీలు ఈ కారును గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే పోలీసు అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. కారులో నుంచి ఒక హ్యాండ్‌గన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ సమాచారాన్ని పోలీసులు మృతుల బంధువులకు తెలియజేశారు. ప్రాథమిక దర్యాప్తులో సందీప్ సింగ్ తన భార్యను, కుమారులను షూట్ చేశాక, తాను ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని తేలింది. వారి కుమారుడు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని పోలీసులు గుర్తించారు. బతిండాలోని సిఖ్వాలా గ్రామానికి చెందిన సందీప్ సింగ్ గత ఎనిమిది ఏళ్లుగా మొహాలిలో నివసిస్తున్నాడు.ఇది కూడా చదవండి: ఇరాన్లో అధికార మార్పు? ట్రంప్ పరోక్ష హెచ్చరిక -
పాక్‌కు సమాచారం చేరవేత.. పంజాబ్‌లో ఇద్దరు గూఢచారులు అరెస్ట్
చంఢీగఢ్: పాకిస్తాన్‌కు కీలక సమాచారాన్ని చేరవేస్తున్నారన్న అభియోగాలపై ఇద్దరు గూఢచారులను పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాక్‌కు కీలక సమాచారం చేరవేసిసట్లు గుర్తించిన పంజాబ్ పోలీసులు.. ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి గుర్ప్రీత్ సింగ్ సాహిల్ మాసిహ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి ఐఎస్ఐ ఏజెంట్ జావెద్‌తో సంబంధాలున్నట్లు గుర్తించారు. ప్రధానంగా జావెద్‌తో గుర్‌ప్రీత్‌కు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక విచారలో వెల్లడైంది. పంజాబ్‌లోని ధరివాల్‌కు చెందిన గుర్ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఇండియన్ ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నాడు. సాహిల్‌కు అదే ప్రాంతానికి చెందినవాడు కావడంతో పాటు ఇండియన్ ఆర్మీలోనే ఉన్నాడు. వీరిద్దరూ కలిసి నేరుగా పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లతో సంబంధాలు ఏర్పరుచుకుని కీలక సమాచారాన్ని చేరవేస్తున్నారనేది ప్రధాన అభియోగం. -
నాలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఉప ఎన్నికల పోలింగ్.. 23న ఫలితాలు..
Four states by polls Voting Updates..ముగిసిన పోలింగ్.. 23న ఫలితాలు.పంజాబ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, కేరళ రాష్ట్రాల్లో ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల జరుగుతున్నాయి. ఉప ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఉప ఎన్నికలకు ఎన్డీయే కూటమి, ఇండియా మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇక, ఐదు స్థానాలకు ఓట్ల లెక్కింపు జూన్ 23న జరుగుతుంది.పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది..ఉదయం 9 గంటల వరకు పోలింగ్ శాతం ఇలా.. Polling percentage till 9 am in Assembly by-polls: Visavadar: 12.10%, Kadi: 9.05%, Nilambur: 13.15%, Ludhiana West: 8.50% and Kaliganj: 10.83%Source: Election Commission of India pic.twitter.com/NyVcI3Kai1— ANI (@ANI) June 19, 2025ఉప ఎన్నికల్లో స్థానికులు, అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. #WATCH | Kerala | LDF candidate M. Swaraj casts vote in Nilambur by-election, at polling booth no. 202 of the Government LP School in Muthiri Mankuth, NilamburSwaraj states that voting is a citizen's right and urges everyone in the constituency to exercise their franchise. pic.twitter.com/3IhGv0BsXv— ANI (@ANI) June 19, 2025 పంజాబ్..లూథియానా (పశ్చిమ)లో, సిట్టింగ్ ఆప్ ఎమ్మెల్యే గురుప్రీత్ సింగ్ గోగి మరణం కారణంగా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ అర్బన్ సీటుపై తన పట్టును నిలుపుకోవడానికి రాజ్యసభ ఎంపీ సంజీవ్ అరోరాను పోటీకి దింపింది. కాంగ్రెస్ నుండి భరత్ భూషణ్ ఆశు, బీజేపీ నుండి జీవన్ గుప్తా, శిరోమణి అకాలీదళ్ నుండి పరూప్కర్ సింగ్ ఘుమ్మాన్ పోటీలో ఉన్నారు.#WATCH | Ludhiana, Punjab | Congress candidate Bharat Bhushan Ashu casts his vote at booth number 72-76, Malwa Sr Secondary School, in Ludhiana West assembly by-pollHe says, "I have fulfilled my constitutional duty and appeal to the voters to do the same." pic.twitter.com/WBxrRVazZ0— ANI (@ANI) June 19, 2025పశ్చిమ బెంగాల్..పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఎమ్మెల్యే నసీరుద్దీన్ అహ్మద్ మరణం తరువాత కలిగంజ్‌లో ఉప ఎన్నిక జరుగుతోంది. మహిళలు, మైనారిటీ ఓటర్లను ఏకీకృతం చేసే లక్ష్యంతో అధికార తృణమూల్ కాంగ్రెస్ ఆయన కుమార్తె అలీఫా అహ్మద్‌ను పోటీకి దింపింది. బీజేపీ నుంచి ఆశిష్ ఘోష్ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్-వామపక్ష కూటమి కబిల్ ఉద్దీన్ షేక్‌ను బరిలోకి దింపింది.#WATCH | West Bengal | Voting is underway at polling booth 171 in Nadia for the Kaliganj by-elections.TMC's Alifa Ahmed, BJP's Ashish Ghosh, and Congress' Kabil Uddin Shaikh are the candidates from the constituency. pic.twitter.com/gxKANa55DI— ANI (@ANI) June 19, 2025గుజరాత్లో త్రిముఖ పోరు..గుజరాత్లో కడి, విసావదర్లలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కడిలో బీజేపీ ఎమ్మెల్యే కర్సన్భాయ్ సోలంకి మరణంతో ఆ స్థానం ఖాళీ అయింది. బీజేపీ నుంచి రాజేంద్ర చావ్డాను, కాంగ్రెస్ రమేష్ చావ్డాను, ఆప్ జగదీష్ చావ్డాను పోటీకి దింపింది. ఇక, విశావదర్ సిట్టింగ్ ఎమ్మెల్యే భయాని భూపేంద్రభాయ్ ఆప్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో, అక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. ఆ స్థానంలో బీజేపీ నుంచి కిరీట్ పటేల్‌ను, కాంగ్రెస్ నితిన్ రాన్‌పారియాను, ఆప్ గోపాల్ ఇటాలియాను పోటీకి దింపింది.Polling begins for the assembly by-elections in Kerala's Nilambur, Punjab's Ludhiana West, Kaliganj in West Bengal, and Visavadar and Kadi in Gujarat.The results will be declared on 23 June. pic.twitter.com/Wp2udg68ta— ANI (@ANI) June 19, 2025కేరళ..కేరళలో నీలంబూరులో ఉప ఎన్నిక జరుగుతోంది. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఆర్యదన్ మొహమ్మద్ కుమారుడు ఆర్యదన్ షౌకత్‌ను పోటీకి దింపగా, అధికార ఎల్డిఎఫ్ ఎం. స్వరాజ్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. #WATCH | Kerala: Voting begins at polling booth number 184, at Govt Lower Primary School, Veettikkuth, in the Nilambur assembly by-electionLDF has fielded M Swaraj, UDF has fielded Aryadan Shoukath, while BJP has fielded Adv. Mohan George as candidates pic.twitter.com/YGQJxyClKJ— ANI (@ANI) June 19, 2025 -
దురహంకారంతో తప్పులు చేశాడు
వాషింగ్టన్: మూడు సంవత్సరాల క్రితం పంజాబ్‌కు చెందిన యువ పాప్‌సింగర్ సిద్ధూ మూసేవాలాపైకి తూటాల వర్షం కురిపించి చంపేసిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ ఆచూకీ ఇంతవరకు తెలీదు. కానీ బీబీసీ వార్తాసంస్థ ఎట్టకేలకు తాజాగా అతడిని ఇంటర్వ్యూ చేసింది. మూసేవాలాను అంతమొందించడానికి గల కారణాలను రాబట్టింది. దీనిపై గోల్డీబ్రార్ సూటిగా, సుదీర్ఘంగ మాట్లాడారు. ‘‘ దురహంకారంతో సిద్ధూ క్షమించలేనంతగా కొన్ని తప్పులు చేశాడు. ఇక అతడిని చంపడం మినహా మాకు మరో మార్గం కనిపించలేదు. చేసిన తప్పులకు శిక్ష అనుభవించాల్సిందే. అది అతడైనాసరే మేమైనాసరే’’ అని గోల్డీ అన్నాడు. కెనడాలో ఉంటూ గోల్డీబ్రార్ ఈ హత్యకు పథకరచన చేసినట్లు తెలుస్తోంది. పంజాబ్‌కు చెందిన కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ కలిసి ఎన్నో నేరాలు చేశారు. ప్రస్తుతం బిష్ణోయ్ జైలులో ఉన్నాడు. ‘‘సిద్ధూ మ్యూజిక్ అంటే బిష్ణోయ్‌కు ఇష్టం. 2018 ఏడాది తొలినాళ్లలో సిద్ధూ కెనడాలో ఇంజనీరింగ్ చదవడానికి వచ్చి మ్యూజిక్‌పై మమకారంతో మంచి పాప్సింగర్గా ఎదిగాడు. అప్పుడే సిద్ధూకు బిష్ణోయ్‌తో పరియం ఏర్పడింది. రోజూ గుడ్ మార్నింగ్, గుడ్‌నైట్ మెసేజ్‌లు బిష్ణోయ్‌కు సిద్ధూ చేసేవాడు. సిద్ధూ భారత్‌కు వచ్చిన తర్వాతే భేదాభిప్రాయాలు మొదలయ్యాయి’’ అని అన్నాడు.కబడ్డీతో మొదలై...‘‘మా సొంత రాష్ట్రంలో ప్రఖ్యాత కబడ్డీ ఆటల పోటీలకు సిద్దూ ఆర్థికసాయం చేశాడు. వాస్తవానికి ఆ పోటీలను బిష్ణోయ్ బద్ధశత్రువులైన బామ్‌బిహా గ్యాంగ్ నిర్వహించింది. మా శత్రువులకు చెందిన గ్రామం నుంచి బామ్‌బిహా గ్యాంగ్‌కు చెందిన ఆటగాళ్లు వచ్చి ఆనాడు పోటీల్లో పాల్గొన్నారు. శత్రువులు నిర్వహించిన పోటీలకు సిద్ధూ స్పాన్సర్‌గా ఉండటం బిష్ణోయ్, అతని గ్యాంగ్‌కు అస్సలు నచ్చలేదు. అయితే బిష్ణోయ్ గ్యాంగ్‌లో సభ్యుడైన విక్కీ మిధుఖేరా అనే వ్యక్తి తర్వాత బిష్ణోయ్, సిద్దూల మధ్య సయోధ్య కుదిర్చాడు. అయితే ఈ విక్కీని 2021 ఆగస్ట్‌లో మొహాలీ సిటీలో కొందరు కాల్చిచంపారు. విక్కీని చంపింది తామేనని బామ్‌బిహా గ్యాంగ్ ప్రకటించుకుంది. సిద్ధూ స్నేహితుడు, అతని ఒకప్పటి మేనేజర్ శగన్‌ప్రీత్ సింగ్ పేరును విక్కీ హత్య కేసు చార్జ్‌షీటులో పోలీసులు ప్రస్తావించారు. దీంతో విక్కీ హత్య వెనుక సిద్ధూ హస్తముందని మేం భావించాం. విక్కీని చంపేందుకు హంతకులకు శగన్‌ప్రీత్ అన్ని రకాలుగా సాయంచేశాడు. తర్వాత శగన్ ఆస్ట్రేలియాకు పారిపోయాడు. ఆ తర్వాత కూడా శగన్తో సిద్దూ స్నేహం కొనసాగింది. వద్దని మేం వారించినా వినలేదు. దాంతో సిద్ధూతో మా శత్రుత్వం అమాంతం పెరిగిపోయింది. రాజకీయనేతలతో, అధికారంలో ఉన్న పార్టీలతో సిద్ధూకు సత్సంబంధాలున్నాయి. మా శత్రువులు బలోపేతం కావడానికి సిద్ధూ తన రాజకీయ పలుకుబడి, డబ్బును ఉపయోగించాడు. సిద్ధూ తప్పులకు శిక్ష పడాలని మేం భావించాం. కేసు నమోదుచేసి జైళ్లో పడేయాలని వాదించినా ఎవ్వరూ పట్టించుకోలేదు. పద్దతిగా చెబితే విననప్పుడు తూటాల శబ్దాలైనా వింటారేమో. అందుకే తుపాకీ మోత మోగించాం’’ అని గోల్డీబ్రార్ చెప్పాడు. భారత్‌లో చట్టాలు ఉన్నప్పుడు చట్టాన్ని మీరెందుకు మీ చేతుల్లోకి తీసుకున్నారు? అని ప్రశ్నించగా.. ‘‘ చట్టం. న్యాయం. ఇలాంటివి భారత్‌లో లేవు. కేవలం శక్తివంతమైన వ్యక్తులకు మాత్రమే అవి దక్కుతాయి. సాధారణ ప్రజలకు అవి అందని ద్రాక్షే’’ అని అన్నాడు. ‘‘ చనిపోయిన విక్కీ సోదరుడు రాజకీయాల్లో ఉండి కూడా తన సోదరుడిని హత్యచేసిన వాళ్లకు శిక్షపడేలా చేయలేకపోయాడు. కావాలంటే అతడితో మాట్లాడి చూడండి అతనెంతగా న్యాయబద్ధంగా పోరాడాడో. చనిపోయిన విక్కీ కోసం నేను ఈ పనిచేశా. సిద్దూను అంతంచేసినందుకు నాకు కాస్తంత పశ్చాత్తాపం కూడా లేదు’’ అని అన్నాడు. రెండు గ్యాంగ్‌ల మధ్య తగాదాలో సిద్ధూ మృతికి కారణమని తెలిసినా స్పష్టమైన కారణాలు ఇంతవరకూ ఎవరూ చెప్పలేదు. తొలిసారిగా గోల్డీబ్రారే ఈ అంశాలు వెల్లడించారని బీబీసీ తన కథనంలో పేర్కొంది. -
RCB vs PBKS: ఈసాలా కప్ నమ్దూ.. నెరవేరిన ఆర్సీబీ కల (ఫోటోలు)
-
ఆర్సీబీ గెలుపు కోసం అభిమానుల పూజలు
మైసూరు: మైసూరు నగరంలోని దివాన్రోడ్డులోని సమృద్ధంశ్వర ఆలయంలో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగనున్న ఆర్సీబీ, పంజాబ్ జట్ల మధ్య బుధవారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టు గెలుపొందాలని అభిమానులు విశేష హోమాలు, పూజలు నెరవేర్చారు. ఆర్సీబీ జట్టు గెలుపు కోసం ప్రారి్థంచి ఆర్సీబీ జర్సీ ధరించి అభిమానుల తరపున విశేష పూజలను చెల్లించారు. దేవస్థానం ప్రధాన అర్చకులు కుమార్ నేతృత్వంలో విజయదుర్గ హోమాన్ని నెరవేర్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీ‹Ùగౌడ ఆర్సీబీ జెర్సీ ధరించి పాల్గొన్నారు. ఈసారి ఆర్సీబీ గెలుస్తుందని మేం ఆశిస్తున్నాం. ఈసారి ప్రతి ఆటగాడు బాగా రాణించాడు. కార్యక్రమంలో దేవరాజ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమే‹Ù, రాయప్ప, కర్ణాటక విజయ రక్షణ వేదిక అధ్యక్షుడు వినయ్‌కుమార్, గురురాజిత్ నవీన్, రవిచంద్ర పాల్గొన్నారు. -
యూట్యూబర్‌పై సుప్రీం ధిక్కార చర్యలు
న్యూఢిల్లీ: అత్యున్నత న్యాయస్థానంలోని జడ్జీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పంజాబ్ యూట్యూబర్ అజయ్ శుక్లాపై సుప్రీంకోర్టు మండిపడింది. సుప్రీం జడ్జీలపై అతడు చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా, ప్రతిష్టకు భంగం కలిగించేలా, ధిక్కార పూరితంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. సుమోటోగా అతడిపై ధిక్కార చర్యలు చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఆగస్టీన్ జార్జి మసీహ్, జస్టిస్ ఏఎస్ చందూర్కర్ల ధర్మాసనం శుక్రవారం..తక్షణమే శుక్లా వ్యాఖ్యలున్న వీడియోను తొలగించాలని, మరోసారి అదే వీడియోను కానీ, అలాంటి వీడియోను కానీ ప్రసారం చేయరాదంటూ అతడి వరప్రద్ మీడియా చానల్‌ను ఆదేశించింది. శుక్లా వ్యాఖ్యలు తీవ్రమైనవని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన వాక్ స్వాతంత్య్రం, పత్రికా స్వేచ్ఛకు కొన్ని పరిమితులున్నాయని ధర్మాసనం తెలిపింది. ఈ స్వేచ్ఛను అడ్డుపెట్టుకుని సుప్రీంకోర్టులోని న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని అనుమతించబోమని స్పష్టం చేసింది. శుక్లాపై ధిక్కారం కేసు నమోదు చేయాలని ఆదేశించింది. రిటైర్డు జస్టిస్ బేలా ఎం త్రివేదిపై వ్యాఖ్యలతో కూడిన వీడియోను శుక్లా తన యూట్యూబ్ చానల్లో ఇటీవల అప్లోడ్ చేశాడు. -
ఇరాన్లో ముగ్గురు భారతీయుల కిడ్నాప్!
న్యూఢిల్లీ: ఇండియా నుంచి ఇరాన్ వెళ్లిన ముగ్గురు భారతీయులు అదృశ్యమయ్యారు. వారు అపహరణకు గురైనట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇరాన్‌లోని ఇండియన్ ఎంబసీకి సమాచారం చేరవేశారు. ఆ ముగ్గురి ఆచూకీ కనిపెట్టాలని కోరారు. దీనిపై ఇండియన్ ఎంబసీ వెంటనే స్పందించింది. ముగ్గురు భారతీయులు జాడ తెలియకుండా పోయారని, వారు ఎక్కడున్నారో గుర్తించాలని, వారి భద్రతకోసం చర్యలు తీసుకోవాలని ఇరాన్ ప్రభుత్వానికి బుధవారం విజ్ఞప్తి చేసింది. అలాగే గాలింపు చర్యలపై బాధితుల కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తోంది. ఇరాన్లో అదృశ్యమైన పంజాబ్ యువకుడి తల్లి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 1వ తేదీన తన కుమారుడిని దుండగులు కిడ్నాప్ చేశారని, అతడిని ప్రాణాలతో వదిలేయాలంటే డబ్బులు ఆవ్వాలని డిమాండ్ చేశారని చెప్పారు. ఇరాన్లో కనిపించకుండా పోయిన ముగ్గురు యువకులు పంజాబ్‌కు చెందినవారే. వర్క్ పర్మిట్‌పై ఢిల్లీ నుంచి విమానంలో బయలుదేరారు. ఆ్రస్టేలియాకు చేరుకోవాల్సి ఉండగా, ఏజెంట్లు వారిని ఇరాన్‌కు చేర్చినట్లు తెలుస్తోంది. అక్కడే వారు కిడ్నాప్ అయినట్లు సమాచారం. ట్రావెల్ ఏజెంట్లు తమవద్ద పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారని, తన కుమారుడిని డంకీ రూట్లో ఇరాన్‌కు తీసుకెళ్లారని యువకుడి తల్లి హసన్‌ప్రీత్ చెప్పారు. కిడ్నాపర్లు ఫొటోలు, వీడియోలు పంపించారని, అందులో ముగ్గురు యువకుల చేతులను తాళ్లలో కట్టేసినట్లు కనిపిస్తోందని అన్నారు. అంతేకాకుండా వారి శరీరాలపై గాయాలు ఉన్నాయని తెలిపారు. కిడ్నాప్ అయిన తర్వాత కొన్నిరోజులపాటు యువకులతో వారి కుటుంబ సభ్యులు మాట్లాడారు. ఈ నెల 11 నుంచి ఫోన్‌కాల్స్ ఆగిపోయాయి. -
అతడి బాటలో నడుస్తా.. ప్రొఫెషనల్‌గా సిమ్రన్‌జీత్ కౌర్
న్యూఢిల్లీ: భారత మహిళా బాక్సర్ సిమ్రన్‌జీత్ కౌర్ ప్రొఫెషనల్‌గా మారనుంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన 29 ఏళ్ల సిమ్రన్‌జీత్ కౌర్ (Simranjeet Kaur)... అమెరికా మాజీ బాక్సర్ రాయ్ జోన్స్, భారత బాక్సర్ మన్దీప్ జాంగ్రాతో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది భారత్ నుంచి నిశాంత్ దేవ్, అమిత్ పంఘాల్ ప్రొఫెషనల్‌గా మారగా... ఇప్పుడు ఆ జాబితాలో సిమ్రన్‌జీత్ కూడా చేరింది.కాగా 2020 టోక్యో ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన సిమ్రన్‌జీత్... ఆసియా చాంపియన్‌షిప్స్‌లో పలు పతకాలు నెగ్గింది. ఈ ఏడాది జాతీయ చాంపియన్‌షిప్ 65 కేజీల విభాగంలో రెండో స్థానంలో నిలిచిన కౌర్... అమెచ్యూర్ బాక్సింగ్ నుంచి ప్రొఫెషనల్‌గా మారాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది.అతడి బాటలోనే నడుస్తూ‘ప్రొఫెషనల్ కెరీర్ ప్రారంభించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. మన్దీప్ జాంగ్రా ఇప్పటికే దేశం గర్వపడే విజయాలు సాధించారు. అతడి బాటలోనే నడుస్తూ మెరుగైన ఫలితాలు సాధించేందుకు నావంతు ప్రయత్నం చేస్తా. ఈ ప్రయాణంలో రాయ్ జోన్స్ సహకారం మరవలేను’ అని సిమ్రన్‌జీత్ పేర్కొంది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన భారత బాక్సర్ విజేందర్ సింగ్... దేశం నుంచి తొలి ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారగా... ఆ తర్వాత వికాస్ కృషన్, సరితా దేవి, నీరజ్ గోయత్ వంటి పలువురు బాక్సర్లు ప్రొఫెషనల్స్‌గా మారారు. కాగా పంజాబ్ నుంచి తొలి మహిళా ప్రొఫెషనల్ బాక్సర్‌గా సిమ్రన్ నిలవనుండటం విశేషం. భారత జట్టు పసిడి బోణీన్యూఢిల్లీ: జూనియర్ ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో భారత జట్టు పసిడి బోణీ కొట్టింది. జర్మనీ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో హరియాణాకు చెందిన యువ షూటర్ కనక్ స్వర్ణ పతకంతో మెరిసింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో బుధవారం 17 ఏళ్ల కనక్ 239 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. 8 మంది షూటర్లు పాల్గొన్న 24 షాట్ల తుదిపోరులో కనక్ తన గురితో అదరగొట్టింది.‘ఆరంభంలో కాస్త ఒత్తిడికి లోనయ్యా. కానీ ఆ తర్వాత మెరుగైన ప్రదర్శన చేయడం ఆనందంగా ఉంది.’ అని కనక్ వెల్లడించింది. మాల్దోవాకు చెందిన అన్నా డుల్స్ 1.7 పాయింట్ల తేడాతో రెండో స్థానంలో నిలిచి రజతం దక్కించుకోగా... చెన్ యెన్ చింగ్ (చైనీస్ తైపీ) కాంస్యం గెలుచుకుంది. అంతకుముందు జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్లో భారత్ నుంచి ఇద్దరు షూటర్లు ఫైనల్‌కు అర్హత సాధించారు. కనక్ 571 పాయింట్లతో, ప్రాచి 572 పాయింట్లతో తుదిపోరుకు చేరారు. -
స్వర్ణదేవాలయంపైనే దాడికి తెగించిన పాక్
అమృత్సర్: ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశీ్మర్(పీఓకే)లోని ఉగ్రస్థావరాలపై భారత దాడులతో వెర్రెక్కిపోయిన పాకిస్తాన్ బలగాలు మే 8వ తేదీన పంజాబ్‌లోని ప్రఖ్యాత స్వర్ణదేవాలయాన్ని కూల్చేందుకు దుస్సాహసం చేశాయని తాజాగా వెల్లడైంది. గోల్డెన్టెంపుల్పై గగనతల దాడుల వివరాలను తాజాగా భారత ఆర్మీ మేజర్ జనరల్ కార్తీక్ సి.శేషాద్రి బహిర్గతంచేశారు. శేషాద్రి ఆర్మీలోని 15వ ఇన్ఫాంట్రీ డివిజన్లో జనరల్ ఆఫీసర్ కమాండింగ్(జీఓసీ)గా సేవలందిస్తున్నారు. మే 8వ తేదీన పాక్ జరిపిన దాడులు, ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను భారత గగనతల రక్షణ వ్యవస్థ ఎలా తుత్తునియలు చేసిందో శేషాద్రి సోమవారం వివరించారు. ముందే అంచనా వేశాం ‘‘ఆపరేషన్ సిందూర్‌తో అనూహ్య దాడులను చవిచూసిన పాకిస్తాన్ వెంటనే భారత ఆర్మీ బేస్‌లతోపాటు జనావాసాలను లక్ష్యంగా చేసుకుంది. ఇవి చాలవన్నట్లు మత సంబంధ ప్రాంతాలపైనా విరుచుకుపడుతుందని మేం ముందే అంచనావేశాం. ఇందులో సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్‌లోని స్వర్ణదేవాలయంపై క్షిపణులు ప్రయోగించే వీలుందని ఊహించాం. వెంటనే గగనతల రక్షణ వ్యవస్థను స్వర్ణదేవాలయం వద్ద మొహరించాం. ఆ ప్రాంత గగనతల రక్షణ వ్యవస్థను శత్రు దుర్బేధ్యంగా మార్చేశాం. ఊహించినట్లే పాకిస్తాన్ మానవరహిత గగనతల ఆయుధాలతో పాక్ స్వర్ణదేవాలయంపైకి దాడులు మొదలెట్టింది. దూసుకొస్తున్న డ్రోన్లు, క్షిపణులు, చిన్నపాటి అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్(యూఏవీ)లను భారత ఎయిర్ డిఫెన్స్ గన్నర్స్ గురిచూసి నేలమట్టంచేశారు. స్వర్ణదేవాలయానికి ఒక్క గీత కూడా పడనివ్వలేదు’’అని శేషాద్రి వివరించారు. మరోవైపు స్వర్ణదేవాలయం సహా పంజాబ్‌లోని పలు ప్రాంతాలను ఆకాశ్ క్షిపణి వ్యవస్థలు, ఎల్–70 డిఫెన్స్ గన్స్లతో తమ జవాన్లు ఎలా కాపాడారో భారత ఆర్మీ సోమవారం వివరించింది. సంబంధిత ఆయుధ వ్యవస్థల పనితీరును చూపే వీడియోను విడుదలచేసింది. -
అదంపూర్ ఎయిర్‌బేస్‌కు ప్రధాని మోదీ.. సైనికులతో ముచ్చట
పంజాబ్: అదంపూర్ ఎయిర్‌బేస్‌కు వెళ్లిన ప్రధాని మోదీ.. ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో ప్రధాని భేటీ అయ్యారు. ఆపరేషన్ సిందూర్‌లో ఎయిర్‌ఫోర్స్ కీలక పాత్రపై మోదీ హర్షం వ్యక్తంచేశారు. ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో ముచ్చటించి వారిని అభినందించారు. పాక్‌కు ఇండియా ఎయిర్‌ఫోర్స్ సత్తా చూపించారంటూ ప్రశంసలు కురిపించారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం ప్రధాని తొలిసారిగా నిన్న (సోమవారం) రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ పంజాబ్‌లో మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.పాక్‌పై మన సైనిక విజయాన్ని దేశంలోని ప్రతి తల్లికి, సోదరికి, కూతురికి అంకితం చేస్తున్నట్టు మోదీ నిన్న(సోమవారం) తన ప్రసంగంలో ప్రకటించారు. ఉగ్ర పోరులో మనతో కలిసి రావాల్సింది పోయి మనపైనే దాడులకు తెగబడింది. విచక్షణ కోల్పోయి మన సైనిక స్థావరాలతో పాటు విద్యా సంస్థలు, ప్రార్థనాలయాలు, ఇళ్లను కూడా లక్ష్యం చేసుకుందన్నారు. కానీ ఆ ప్రయత్నంలో ఘోరంగా విఫలమైంది...పాక్ డ్రోన్లు, క్షిపణులను మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఎక్కడివక్కడ నేలకూల్చింది. మనం అంతటితో ఆగలేదు. వాళ్లు సరిహద్దులపై దాడి చేస్తే నేరుగా పాక్ గుండెకాయకే గురిపెట్టాం. ప్రధాన నగరాల్లోని వాళ్ల కీలక సైనిక, వైమానిక స్థావరాలన్నింటినీ నేలమట్టం చేశాం. పాక్ సైన్యానికి ఊహించలేనంత నష్టం మిగిల్చాం. ఆ క్రమంలో మన బలగాలు అంతులేని సామర్థ్యాన్ని, సంయమనాన్ని ఏకకాలంలో అద్భుత రీతిలో ప్రదర్శించాయి. మన దేశీయ ఆయుధ వ్యవస్థ తాలూకు పాటవాన్ని పూర్తిస్థాయిలో రుచిచూపాయి’’ అని ప్రధాని అన్నారు. -
కల్తీ మద్యం సేవించి 14 మంది మృతి, ఆరుగురు పరిస్థితి విషమం
ఛండీఘడ్: పంజాబ్ రాష్ట్రం అమృత్ సర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కల్తీ మద్యం సేవించి 14 మంది మృతి చెందారు. మరో ఆరుగురు పరిస్థితి విషమంగా మారింది. #WATCH | Punjab: 14 people dead and 6 hospitalised after allegedly consuming spurious liquor in Amritsar's MajithaSSP Amritsar Maninder Singh says, " We received information around 9:30 pm last night that here people have started dying after consuming spurious liquor. We took… pic.twitter.com/C7miySsHo6— ANI (@ANI) May 13, 2025దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ‘సోమవారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో కల్తీ మద్యం సేవించి ప్రజలు చనిపోతున్నారని మాకు సమాచారం అందింది. సమాచారంతో బాధితుల్ని అస్పత్రికి తరలించాం. వారిలో 14 మంది మరణించారు’ అని అమృత్సర్ ఎస్ఎస్పీ మనీందర్ సింగ్ తెలిపారు. #WATCH | Punjab: 14 people dead and 6 hospitalised after allegedly consuming spurious liquor in Amritsar's MajithaAmritsar Deputy Commissioner Sakshi Sawhney says, " An unfortunate tragedy has happened in Majitha. We got to know yesterday night, we received reports from 5… pic.twitter.com/9IauurxVyq— ANI (@ANI) May 13, 2025అమృత్సర్ డిప్యూటీ కమిషనర్ సాక్షి సాహ్ని మాట్లాడుతూ..నిన్న రాత్రి మద్యం సేవించిన ఐదు గ్రామాలకు చెందిన ప్రజల పరిస్థితి విషమంగా ఉందని మాకు సమాచారం అందించింది. వెంటనే సంబంధిత గ్రామాలకు వైద్య బృందాల్ని పంపించాం. ఇప్పటికీ వారికి రక్తపరీక్షలు నిర్వహిస్తున్నాం. నకిలీ మద్యం సేవించి ఇప్పటివరకు 14 మంది మరణించారు. ప్రభుత్వం సాధ్యమైనంత వరకు సహాయం అందిస్తోంది. ఈ మరణాల సంఖ్య పెరగకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాం. నకిలీ మద్యాన్ని పంపిణీ చేసిన వ్యాపారస్థుల్ని అదుపులోకి తీసుకున్నాం. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది’ అని అన్నారు. -
బిక్కుబిక్కుమంటూ గడిపాం..
సాక్షి, న్యూఢిల్లీ/సంగారెడ్డి క్రైం: ‘భీకరమైన శబ్దాలు, మెరుపుల్లా డ్రోన్లు, ఆకాశం వైపు చూస్తే చాలు.. గుండె ఆగేంత భయం. భారత్–పాకిస్తాన్ల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ గడిపాము’అని తెలుగు రాష్ట్రాల విద్యార్థులు తమ ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధ పరిస్థితుల నుంచి తాము సురక్షితంగా బయటపడటం ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. జమ్మూ, కశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో ఉంటూ విద్యను అభ్యసిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 51 మంది, తెలంగాణకు చెందిన 17 మంది విద్యార్థులు సురక్షితంగా ఢిల్లీలోని ఉమ్మడి భవన్‌కు చేరుకున్నారు. ఇక్కడ రెండు రాష్ట్రాల అధికారులు విద్యార్థులకు వేర్వేరుగా బస, భోజన ఏర్పాట్లు చేశారు. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు దఫదఫాలుగా విద్యార్థులను విమానాలు, రైళ్ల ద్వారా వారి స్వస్థలాలకు పంపారు. వీరిలో కొందరు విద్యార్థులను ‘సాక్షి’ పలకరించగా.. ఆయా ప్రాంతాల్లో వారు ఎదుర్కొన్న భయానక పరిస్థితులను వివరించారు. ఓ పక్క భయం..ఇంకో పక్క రైల్వే దోపిడీ రెండు రాత్రులు డ్రోన్లు, కాల్పుల శబ్దాలతో గజగజలాడాము. యుద్ధ ప్రాంతం నుంచి తప్పించుకుని ఢిల్లీ చేరుకోవడానికి పంజాబ్‌లోని పగ్వరా రైల్వే స్టేషన్‌కు వచ్చాం. అక్కడ ముందుగానే రిజర్వేషన్ చేసుకున్న ట్రెయిన్ ఎక్కాము. అయితే ఖాళీ లేకపోవడంతో వాష్‌రూమ్ బయట నిలబడ్డాం. టీసీ మమ్మల్ని తర్వాతి స్టేషన్ లుధియానాలో దించేశారు.రిజర్వేషన్ ఉన్నా ఏసీ కోచ్‌లో ఉన్నాం అనే కారణంతో ఐదుగురు నుంచి టీసీ రూ.4,500 వసూలు చేశారు. తర్వాత వచ్చి న ఇంటర్ సిటీ ఎక్కితే దానిలో రిజర్వేషన్ లేదు.. అని వాళ్లు మరో రూ.200 చొప్పున డబ్బులు వసూలు చేశారు. ఓ పక్క యుద్ధ ప్రాంతం నుంచి బయటపడ్డామనుకుంటే, ఇంకో పక్క రైల్వే దోపిడీతో మోసపోయాం. –ఎస్.మధువర్షిత, బీటెక్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, పంజాబ్ హాస్టల్ చుట్టూ.. డ్రోన్లు పదుల సంఖ్యలో పాకిస్తాన్ డ్రోన్లు మా యూనివర్సిటీలోని హాస్టల్ చుట్టూ తిరిగాయి. ఆ శబ్దాలకు చెవులు గింగురుమనడమే కాదు, ఏం జరుగుతుందోనని భయపడిపోయా. ఉదయం రైల్వేస్టేషన్‌కు వచ్చేందుకు బస్సు దగ్గరకు వెళుతుండగా అప్పుడు కూడా మాపై నుంచి డ్రోన్లు వెళ్లాయి. –సీహెచ్ భానుకిరణ్, బీటెక్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, పంజాబ్డ్రోన్ల శబ్దాలకు భయం వేసింది 8వ తేదీ రాత్రి చదువుకుంటున్నాం. ఒక్కసారిగా పైనుంచి భారీ శబ్దాలు.. అవి ఏమిటో మొదట మాకు అర్థం కాలేదు. హాస్టల్ యాజమాన్యం మా అందరినీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఓ రూమ్‌లో కూర్చోబెట్టింది. అర్ధరాత్రి దాటాక పాకిస్తాన్ డ్రోన్ల శబ్దాలు ఆగిపోవడంతో పడుకోవడానికి రూమ్‌లలోకి వెళ్లాము. పడుకున్న రెండు గంటల్లోనే మళ్లీ భీకరమైన శబ్దాలు వినిపించాయి. ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ రాత్రంతా హాస్టల్ రూమ్‌లలో గడిపాం. దేవుడి దయ వల్ల క్షేమంగా బయటపడ్డాం. –ఎస్.జీవన జ్యోతి, ఐఐటీ జగతి (జమ్మూ)ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి మేము చదువుకునే యూనివర్సిటీ సమీపంలో శుక్రవారం రాత్రంతా బాంబుల శబ్దం రావడంతో ఏమి జరుగుతుందోనని భయం భయంగా గడిపాం. గత రెండు రోజులుగా ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేవు. యుద్ధం గురించి తెలుసుకున్న తర్వాత ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని ఎదురుచూశాం. పంజాబ్ ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో స్వస్థలాలకు బయలుదేరాం. – రంజిత్‌రెడ్డి, (సంగారెడ్డి), బీటెక్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, పంజాబ్ ఒక్కసారిగా భయంకర శబ్దాలు.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే వర్సిటీ సమీపంలో ఒక్కసారిగా భయంకర శబ్దాలు రావడంతో భయం వేసింది. శుక్రవారం రాత్రి భోజనం చేసిన తర్వాత పడుకునే సమయంలో భారీ శబ్దాలు వినిపించడంతో యుద్ధం జరుగుతోందని అర్థమైంది. సోషల్ మీడియా మాకు అందుబాటులో లేదు. –కూచ వెంకట బాలాజీ (సంగారెడ్డి), బీటెక్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, పంజాబ్ -
పాక్ ఫేక్ ప్రచారం నమ్మొద్దు
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్, పంజాబ్‌లో సాధారణ ప్రజలు, జనావాసాలు, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ సైన్యం శనివారం దాడులకు పాల్పడినట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రీ చెప్పారు. భారత్‌లో పలు సైనిక స్థావరాలను, ఎస్–400 క్షిపణి వ్యవస్థలను ధ్వంసం చేశామంటూ పాకిస్తాన్ చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని తేల్చిచెప్పారు. పాక్ తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని కోరారు. మిస్రీ శనివారం సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్‌తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. తప్పుడు ప్రచారంతో ప్రజలను ఏమార్చడం పాక్ ప్రభుత్వానికి అలవాటేనని మండిపడ్డారు. ఇండియా వైమానిక, సైనిక స్థావరాలు సురక్షితంగా ఉన్నాయని, ఎలాంటి నష్టం వాటిల్లలేదని ఉద్ఘాటించారు. దేశంలో కీలక మౌలిక సదుపాయాలు, విద్యుత్, సైబర్ వ్యవస్థలపై దాడి చేశామంటూ పాక్ చేస్తున్న ప్రచారాన్ని విక్రం మిస్రీ తిప్పికొట్టారు. వాటిపై దాడిచేసే సత్తా పాక్ సైన్యానికి లేదని పేర్కొన్నారు. దుష్ప్రచారంతో మతం పేరిట ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి కుట్రలు సాగిస్తోందని దాయాది దేశంపై ధ్వజమెత్తారు. అమృత్సర్ సాహిబ్ వైపు భారత సైన్యం క్షిపణులు ప్రయోగించిందని పాక్ ప్రకటించడం పట్ల మిస్రీ ఆగ్రహం వ్యక్తంచేశారు. భారతదేశాన్ని విభజించే కుట్రలు సాగవని తేల్చిచెప్పారు. భారత సైన్యం అఫ్గానిస్తాన్‌పై ఎలాంటి దాడి చేయలేదని అన్నారు. భారత ప్రభుత్వాన్ని సొంత ప్రజలే విమర్శిస్తున్నారంటూ పాక్ మరో తప్పుడు ప్రచారానికి తెరతీసిందని విమర్శించారు. పాక్ ప్రభుత్వాన్ని అక్కడి ప్రజలే దూషిస్తున్న సంగతి ప్రపంచం మొత్తానికి తెలుసని విక్రం మిస్రీ స్పష్టంచేశారు. జమ్మూకశ్మీర్‌లో పాక్ దాడుల్లో ఆరుగురు మరణించారని చెప్పారు. పాక్ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని వ్యాఖ్యానించారు. వాటిని సైన్యం ఎప్పటికప్పుడు దీటుగా ఎదుర్కొంటోదని వివరించారు. 26 ప్రాంతాలపై దాడులకు పాక్ యత్నం పాక్ సైన్యం శుక్రవారం రాత్రి ఎయిర్‌బేస్‌లు, రవాణా కేంద్రాలు సహా 26 కీలక ప్రాంతాలపై దాడులకు ప్రయత్నించిందని కల్నల్ సోఫియా ఖురేషీ తెలిపారు. పంజాబ్‌లోని ఎయిర్ బేస్‌పై హైస్పీడ్ మిస్సైల్ ప్రయోగించిందని అన్నారు. శ్రీనగర్, అవంతిపుర, ఉదంపూర్ సమీపంలో ఆసుపత్రులు, పాఠశాలల సమీపంలో దాడులు జరిగాయని తెలిపారు. పాక్ సైన్యం డ్రోన్లు, ఫైటర్ జెట్లు, లాంగ్ రేంజ్ మిస్సైళ్లు ప్రయోగించినట్లు వెల్లడించారు. భారత సైన్యం మాత్రం ముందుగా గుర్తించిన టార్గెట్లపైనే దాడికి దిగినట్లు స్పష్టంచేశారు. ప్రధానంగా పాక్ సైన్యానికి సంబంధించిన టెక్నికల్ సదుపాయాలు, కమాండ్, కంట్రోల్ సెంటర్లు, రాడార్ కేంద్రాలు, ఆయుధాగారాలపై దాడి చేసినట్లు వెల్లడించారు. భారత సైనిక దళాలు పూర్తి అప్రమత్తంగా ఉన్నట్లు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వివరించారు. పాక్ దాడులను గట్టిగా తిప్పికొట్టినట్లు స్పష్టంచేశారు. భారత్‌కు భారీ నష్టం కలిగించామంటూ పాక్ దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. పాక్ ప్రచారాన్ని తిప్పికొట్టడానికి, వాస్తవాలు బహిర్గతం చేయడానికి ప్రభుత్వం సిర్సా, సూరత్‌గఢ్, అజంగఢ్ ఎయిర్ బేస్‌ల ఫొటోలు, వీడియోలు విడుదల చేసింది. ఈ ఫొటోలపై తేదీ, సమయం స్పష్టంగా కనిపిస్తున్నాయి.8 పాక్ సైనిక స్థావరాలు ధ్వంసంనాలుగు భారత వైమానిక స్థావరాలపై దాడికి పాక్ విఫలయత్నం చేసినట్టు ఖురేషీ తెలిపారు. ‘‘ఉదంపూర్, పఠాన్‌కోట్, అదంపూర్, భుజ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లపై దాడులకు పాక్ ప్రయత్నించింది. క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లకు స్వల్పనష్టం వాటిల్లింది. ఆ దాడులను మన సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. బదులుగా ఆరు పాక్ వైమానిక స్థావరాలు, రెండు రాడార్ కేంద్రాలపై దాడులు చేసింది. వాటిని చాలావరకు ధ్వంసం చేసి భారీ నష్టం మిగిల్చింది. కేవలం పాక్ ఎయిర్‌బేస్‌లపైనే దాడి చేశాం. సామాన్య జనావాసాలకు ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం’’ అని వివరించారు. హరియాణాలోని సిర్సాలో పాక్ క్షిపణి ఫతే–2ను భారత సైన్యం విజయవంతంగా నేలమట్టం చేసిందన్నారు. -
పంజాబ్, కశ్మీర్లో తెలుగు విద్యార్థులు ఆవేదన
ఢిల్లీ: భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల (Operation Sindoor) నేపథ్యంలో పంజాబ్‌లో, జమ్ము కశ్మీర్‌లోనే చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. తమను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్, ఏపీ భవన్ సదుపాయం కల్పించాలని కోరారు.భారత్, పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో పంజాబ్‌లో యూనివర్సిటీల పరీక్షలు వాయిదా వేశారు. తక్షణమే ఇంటికి వెళ్లి పోవాలని యూనివర్సిటీ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో పంజాబ్‌లోని ఎల్పీయూ యూనివర్సిటీలోని పలువురు తెలుగు విద్యార్థులు ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా తెలుగు విద్యార్థులు తాజాగా సాక్షితో మాట్లాడుతూ..‘రాత్రి సమయంలో పెద్ద ఎత్తున భారీ శబ్దాలు వినిపిస్తున్నాయి. మా యూనివర్సిటీ పైనుంచి డ్రోన్లు వెళ్లాయి. మాకు చాలా టెన్షన్‌గా ఉంది. ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి ఉంది. వెంటనే ఇంటికి వచ్చేయాలని మా పేరెంట్స్ చెప్పారు. ఏపీ, తెలంగాణ భవన్లో మాకు వసతి, భోజన సదుపాయం కావాలి అని కోరారు.మరోవైపు.. శ్రీనగర్‌లోని ఎన్ఐటీలో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఎన్ఐటీలో 300 మందికిపైగా విద్యార్థులు ఉండగా.. వీరిలో 10 మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు. సరిహద్దుల్లో బాంబుల మోతతో ఆందోళన చెందుతున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. తమను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నారు. వారిని అధికారులు స్వస్థలాలకు పంపే ప్రయత్నం చేస్తున్నారు. -
పంజాబ్‌లో క్షిపణి శకలాలు
హోషియార్పూర్/భటిండా/జైపూర్: పాకిస్తాన్‌తో యుద్ధం కొనసాగుతున్న వేళ పంజాబ్‌లోని హోషియార్పూర్, భటిండా జిల్లాల్లో క్షిపణి విడి భాగాలుగా భావిస్తున్న శకలాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. గురువారం రాత్రి హోషియార్పూర్ జిల్లాలోని పొలంలో క్షిపణి భాగాలుగా భావిస్తున్న లోహపు శకలాలను గ్రామస్తులు గమనించారు. సమాచారం అందుకున్న ఎయిర్‌ఫోర్స్ బలగాలు ఆ ప్రాంతాన్ని దిగ్బంధించి, విచారణ చేపట్టాయి. అదేవిధంగా, భటిండా జిల్లాలో గురువారం రాత్రి గుర్తు తెలియని శకలాలు రెండు ప్రాంతాల్లో పడిపోయాయి. అంతకుముందు మెరుపులు మెరవడంతోపాటు, పెద్ద శబ్దం వినిపించిందని రైతులు తెలిపారు. శకలాలు పడిన ప్రాంతంలో ఓ ఇంటి కిటికీలు, తలుపులు, పశువుల షెడ్ ధ్వంసమయ్యాయన్నారు. శకలాలు పడిన ప్రాంతంలో మూడడుగుల లోతు గుంత ఏర్పడిందని రైతులు తెలిపారు. ఇందుకు సంబంధించిన సమాచారం ఆరీ్మకి మాత్రమే తెలుస్తుందని స్థానిక పోలీసులు తెలిపారు. అయితే, ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదన్నారు. ఆ శకలాలను తాకవద్దని స్థానికులను హెచ్చరించారు. భటిండా జిల్లా బుర్జ్ మహిమా గ్రామంలోనూ లోహపు శకలాలు కనిపించాయి. పఠాన్‌కోట్ జిల్లాలో షెల్ వంటి లోహపు శకలం కనిపించిందని అధికారులు తెలిపారు. గురువారం పాకిస్తాన్ ఈ ప్రాంతంపై ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను భారత బలగాలు ధ్వంసం చేయడం తెల్సిందే. రాజస్తాన్‌లో బాంబు స్వా«దీనం రాజస్తాన్‌లోని జైసలీŠమ్ర్ జిల్లా కిషన్‌ఘాట్ ప్రాంతంలో శుక్రవారం బాంబు వంటి వస్తువు కనిపించడం కలకలం రేపింది. నర్సరీ వద్ద ఈ వస్తువు కనిపించడంతో, ముందు జాగ్రత్తగా చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేసి, దగ్గరికి వెళ్లకుండా చర్యలు తీసుకున్నామని కొత్వాలీ పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. ఆర్మీ అధికారులు నిర్విర్యం చేయనున్నారని వివరించారు. గురువారం సాయంత్రం జైసలీ్మర్లో భారీ శబ్దాలతో పేలుళ్లు గంటపాటు కొనసాగడంతో, అధికారులు విద్యుత్ సరఫరాను పూర్తి స్థాయిలో నిలిపేశారు. -
సరిహద్దు జిల్లాల్లో 'హై అలర్ట్'
చండీగఢ్/అహ్మదాబాద్: భారత్–పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్న పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలు హై అలర్ట్ ప్రకటించాయి. పాకిస్తాన్‌తో పంజాబ్ 532 కిలోమీటర్లు, రాజస్థాన్ 1,070 కిలోమీటర్లు సరిహద్దును పంచుకుంటోంది. రెండు రాష్ట్రాల్లో పోలీసుల సెలవులను రద్దు చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు పాఠశాలలను కూడా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం దుకాణాల ముందు క్యూ కట్టారు. పంజాబ్‌లోని సరిహద్దుకు సమీపంలోని అన్ని జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఆరు సరిహద్దు జిల్లాలైన ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, ఫాజిల్కా, అమృత్సర్, గురుదాస్‌పూర్, తార్న్ తరన్ జిల్లాల్లో పాఠశాలలను మూసివేశారు. పోలీసుల సెలవులను రద్దు చేశారు. ఇక అమృత్‌సర్‌లో నిత్యావసర వస్తువుల బ్లాక్ మార్కెటింగ్‌ను నిరోధించడానికి జిల్లా యంత్రాంగం ఒక టాస్‌్కఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. జిల్లాలో నిత్యావసర వస్తువుల కొరత లేదని, బ్లాక్ మార్కెటింగ్‌ను ప్రోత్సహించవద్దని, ప్రజలు అనవసరంగా అదనపు వస్తువులను కొనుగోలు చేయవద్దని అధికారులు కోరారు. మరోవైపు పప్పులు, వంటనూనె, గోధుమ పిండి, పంచదార, ఉప్పు వంటి వస్తువులను పెద్దమొత్తంలో కొనుగోలు చేసేందుకు అమృత్‌సర్‌లోని కిరాణా దుకాణాలు, డిపార్ట్మెంటల్ స్టోర్ల వద్ద ప్రజలు క్యూ కట్టారు. సరిహద్దు జిల్లాల్లో ఒకటైన గురుదాస్‌పూర్‌లో గురువారం రాత్రి 9 గంటల నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు బ్లాకవుట్ విధించారు. ప్రజల భద్రత కోసం పోలీసు స్క్వాడ్లు, క్విక్ రెస్పాన్స్ బృందాలను నియమించింది. అత్యవసర సహాయం కోసం హెల్ప్లైన్లను ఏర్పాటు చేసింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం అన్ని బహిరంగ కార్యక్రమాలను రద్దు చేసింది. రిట్రీట్ నిలిపివేత.. ప్రజల భద్రత దృష్ట్యా పాక్ సరిహద్దుల్లో రిట్రీట్ వేడుకలను బీఎస్ఎఫ్ నిలిపివేసింది. పంజాబ్‌లోని పాకిస్తాన్ వెంబడి ఉన్న మూడు సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద రిట్రీట్ వేడుకలను నిర్వహించబోమని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) తెలిపింది. పాకిస్తాన్ వాఘాకు ఎదురుగా ఉన్న అట్టారీ (అమృత్సర్), ఫిరోజ్‌పూర్ జిల్లాలోని హుస్సేనీవాలా, ఫజిల్కా జిల్లాలోని సద్కీ వద్ద ఉన్న జేసీపీల వద్ద పాకిస్తాన్ రేంజర్లతో కలిసి బీఎస్ఎఫ్ దళాలు ప్రతిరోజూ సాయంత్రం రిట్రీట్ కార్యక్రమాన్ని నిర్వమిస్తాయి. తీరప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత.. ఇక గుజరాత్ తీరం వెంబడి భద్రతను కట్టుదిట్టం చేసింది. పోలీసు సిబ్బంది సెలవులను రద్దు చేసింది. తీరం వెంబడి ఉన్న రాజ్‌కోట్ రేంజ్‌లోని జామ్‌నగర్, మోర్బి, దేవభూమి, ద్వారకాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. పోలీసులు తీరప్రాంత గ్రామాలు, బోట్‌ల్యాండింగ్ పాయింట్లను సందర్శిస్తున్నారు. అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని గ్రామస్తులను పోలీసులు కోరుతున్నారు. -
పంజాబ్‌లో ఉగ్రవాదుల కుట్ర భగ్నం
పంజాబ్‌లో ఉగ్రవాదుల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. అడవిలో దాచిన గ్రనేడ్లు, బాంబులు, మందు పాతరలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు.. పలు ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. కాగా, స్లీపర్ సెల్స్‌పై నిఘా పెట్టిన భారత ఆర్మీ.. పాకిస్థాన్ భారీ కుట్రను భగ్నం చేసింది. పంజాబ్‌లో ఐఎస్ఐ, ఉగ్రవాదుల కుట్రను ముందుగానే ఆర్మీ, ఇంటలీజెన్స్ పసిగట్టింది. పక్కా సమచారంతో టిబ్బా నంగల్-కులార్ రోడ్, ఎస్బీఎస్ నగర్లో సోదాలు నిర్వహించిన పోలీసులు.. భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.మరోవైపు, పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత ప్రతీకార చర్యలపై ఆగ్రహంతో ఉన్న పాకిస్తాన్ తన సైబర్‌మూకలను రంగంలోకి దింపింది. దీంతో భారత రక్షణ రంగానికి సంబంధించిన వెబ్సైట్లపై పాక్ సైబర్ దాడుల ఉధృతి ఎక్కువైంది. అయితే రక్షణరంగంలోని వ్యక్తుల లాగిన్, పాస్వర్డ్ వంటి క్రెడెన్షియల్స్ తస్కరణకు గురయినట్లు భావిస్తున్నట్లు భారత సైన్యం తాజాగా ప్రకటించింది. ఇండియన్ ఆర్మీ సోమవారం తన సామాజిక మాధ్యమ ఖాతా ‘ఎక్స్’లో ‘పాకిస్తాన్ సైబర్ ఫోర్స్’ పేరిట ఈ వివరాలతో ఒక పోస్ట్ పెట్టింది.మిలటరీ ఇంజనీర్ సర్వీసెస్, ది మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలసిస్ సంస్థల సిబ్బందికి చెందిన లాగిన్, పాస్‌వర్డ్‌లను పాక్ సైబర్ నేరగాళ్లు తమ వశంచేసుకున్నారు. రక్షణ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆర్మర్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్‌ను హ్యాకర్లు హ్యాక్‌చేశారు. వెబ్సైట్ హోం పేజీపై పాకిస్తాన్ జెండా, అల్ ఖలీద్ యుద్ధట్యాంక్ ఫొటోలను పెట్టారు.‘‘ఈ వెబ్సైట్ ఇప్పుడు పాకిస్తాన్ వశమైంది. ఇది పాకిస్తాన్ సైబర్‌ఫోర్స్ పని. పహల్గాం కేవలం ఆరంభం మాత్రమే’’ అని సందేశాన్ని హ్యాకర్లు ఆ వెబ్సైట్లో పెట్టారు. దీంతో ముందుజాగ్రత్తగా భారత ఆర్మీ అధికారులు ఈ వెబ్‌సైట్‌ను ఆఫ్‌లైన్‌లో పెట్టేశారు. హ్యాకింగ్ కారణంగా వెబ్‌సైట్‌లోని సమాచారం ఏ స్థాయిలో చోరీకి గురైందన్న అంశాలపై విస్తృతస్థాయిలో ఆడిట్ చేశాకే వెబ్‌సైట్‌ను ఆన్‌లైన్‌లోకి తీసుకురానున్నారు. -
KK Garg: రిటైర్డ్ రైల్వే ఇంజనీర్ ఘనత ట్రాక్టర్ స్కూల్
భారతీయ రైల్వే (Indian Railways) ఎలక్ట్రికల్ ఇంజినీర్‌గా పంజాబ్ అంతటా పర్యటించిన కెకె గార్గ్ (KK Garg) ఎన్నో ప్రాంతాలలో, చదువుకు దూరమైన ఎంతోమంది పిల్లలను చూశాడు. రైల్వే ట్రాక్‌ల పక్కన మురికి వాడల్లో వందలాదిమంది చిన్నారులు పేదరికంలో నిర్లక్ష్యానికి గురవుతున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని రిటైర్మెంట్ తరువాత మొబైల్ పాఠశాలను ప్రారంభించాడు గార్గ్.పంజాబ్ వ్యవసాయాధారిత రాష్ట్రం కావడంతో ట్రాక్టర్లు ఎక్కువగా కనిపిస్తాయి. తన నైపుణ్యాలను ఉపయోగించి ఒక ట్రాక్టర్ ర్యాలీని మొబైల్ స్కూల్‌గా మార్చాడు గార్గ్. పైపింగ్‌తో వాటర్ ప్రూఫ్ ప్ల్యానల్స్ రూపొందించాడు. వేడిని బయటకు పంపడానికి అవసరమైన ఏర్పాటు చేశాడు.లైట్లు, ఫ్యాన్, బ్లాక్‌బోర్డ్ లాంటివి మొబైల్ స్కూల్లో ఉంటాయి.బఠిండాలోని ఎన్జీఒ ‘గుడ్‌విల్ సొసైటీ’ సహకారంతో ‘మొబైల్ స్కూల్’ పట్టాలకెక్కింది.స్కూల్ ట్రాలీలు బఠిండాలోని వివిధ ప్రాంతాల గుండా ప్రయాణిస్తాయి.మురికివాడలు, బడులు అందుబాటులో లేని ప్రాంతాలు, స్కూల్ డ్రాపవుట్ రేటు ఎక్కువగా ఉన్నప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రతి మొబైల్ క్లాస్‌రూమ్‌లో ప్రాథమిక అభ్యాసన సామాగ్రి ఉంటుంది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు.చదవండి: స్విట్జర్లాండ్ వెళ్లి ఉంటే..ప్రాణాలతో..నావీ అధికారి చివరి వీడియో వైరల్క్లాసులో విజువల్ ఎయిడ్స్ ఉపయోగిస్తారు. స్టోరీ టెల్లింగ్, ఇంటరాక్టివ్ గేమ్స్ ఉంటాయి. ప్రతి సంవత్సరం వందలాది వలస కుటుంబాలు బఠిండాకు వచ్చి పోతుంటాయి. చాలామంది పిల్లలకు పాఠశాలల్లో చేరడానికి అవసరమైన డాక్యుమెంట్లు ఉండవు. మొబైల్ స్కూల్ ఈ సమస్యను పరిష్కరించింది. మొబైల్ స్కూల్స్ ద్వారా సుమారు వెయ్యిమంది పిల్లలకు విద్య అందిస్తున్నారు. ఏడాది చదువు తరువాత పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడంలో మొబైల్ స్కూళ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ‘పిల్లల తల్లిదండ్రుల నుంచి స్పందన బాగుంది’ సంతోషంగా అంటున్నాడు గార్గ్.ఇదీ చదవండి: Pahalgam : ఈ దుఃఖాన్ని ఆపడం ఎవ్వరి తరము? గుండెల్నిపిండేసే వీడియోలు -
నన్ను చంపేందుకు కుట్రలు.. కేంద్రమంత్రి సంచలన ఆరోపణలు
ఛండీగఢ్: తన హత్యకు ఖలిస్థానీలు కుట్రలు చేస్తున్నారని కేంద్రమంత్రి రవనీత్ సింగ్ బిట్టూ సంచలన ఆరోపణలు చేశారు. రాడికల్ ప్రచారకుడు, ఎంపీ అమృత్‌పాల్ సింగ్ నడిపిస్తున్న ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థతో సంబంధమున్న ఖలిస్థానీ మద్దతుదారులే తన హత్యకు ప్లాన్ చేశారని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.తాజాగా, రైల్వేశాఖ సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్టు మాట్లాడుతూ.. పంజాబ్‌లోని రాజకీయ నాయకులకు ఖలిస్థానీ మద్దతుదారుల నుంచి ప్రమాదం పొంచి ఉంది. పలువురు నేతల హత్యకు వారు ప్లాన్ చేస్తున్నారు. ఖలిస్తానీల ప్లాన్ గురించి సోషల్ మీడియాలో లీకైన కొన్ని స్క్రీన్ షాట్ల ద్వారా ఈ విషయం నాకు తెలిసింది. ఎంపీ అమృత్‌పాల్ సింగ్ నడిపిస్తున్న ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థతో సంబంధమున్న ఖలిస్థానీ మద్దతుదారులే ఇందులో ఉన్నారు. నాతో పాటుగా మరికొంతమంది రాజకీయ నాయకుల ప్రాణాలకు కూడా ఖలిస్థానీయుల నుంచి ముప్పు పొంచి ఉంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు.ఇదే సమయంలో.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై కూడా వారిస్ పంజాబ్ దే నాయకులు కక్ష పెంచుకున్నారని ఆరోపించారు. జాతీయ భద్రతా చట్టం కింద అమృత్‌పాల్ నిర్బంధం మరో ఏడాది పొడిగించడమే ఇందుకు కారణమని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోందని వెల్లడించారు. అందుకే ఈ గ్రూపుతో సంబంధం ఉన్న ఖలిస్తానీ శక్తులను పంజాబ్ ప్రభుత్వం వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.అయతే, గతంలో దిబ్రుగఢ్ జైలులో ఉన్న అమృత్‌పాల్ సింగ్ సహచరులను పంజాబ్‌కు తరలించినట్లు ఆయన తెలిపారు. ఇది ప్రధాన కుట్రదారుడిగా అమృత్‌పాల్ పాత్రపై అనుమానాలను మరింత బలపరుస్తుందంటూ వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కార్యకర్తలుగా మారువేషంలో ఉన్న నేరస్థుల పట్ల పంజాబ్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరారు. -
బుల్లెట్‌కు బలైన భారతీయ విద్యార్థిని
న్యూయార్క్/తరన్ తారన్(పంజాబ్): ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లి అక్కడ అనూహ్య ఘటనల్లో భారతీయులు ప్రాణాలు కోల్పోతున్న విషాద పర్వానికి ముగింపు కనిపించట్లేదు. తాజాగా కెనడాలో రెండు వాహనాల్లోని వ్యక్తుల మధ్య జరిగిన కాల్పుల ఘటనల్లో అభం శుభం తెలియని ఒక భారతీయ విద్యార్థిని బుల్లెట్ గాయాలకు బలైంది. పంజాబ్‌లోని తరన్ తారన్ జిల్లా ధుండా గ్రామానికి చెందిన 21 ఏళ్ల హర్సిమ్రత్ కౌర్ రంధావా కెనడాలో కాల్పుల ఘటనలో మృతిచెందారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి ఒంటారియో ప్రావిన్సులోని హామిల్టన్ నగరంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మృతి వార్త తెల్సి పంజాబ్‌లోని సొంతూరులో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె మృతదేహాన్ని వెంటనే భారత్‌కు తరలించాలని, నిందితులను కఠినంగా శిక్షించేలా కెనడా సర్కార్‌పై భారత ప్రభుత్వం ఒత్తిడితేవాలని సిమ్రత్ కుటుంబసభ్యులు డిమాండ్‌చేశారు. అసలేం జరిగింది? ఉన్నత విద్య కోసం సిమ్రత్ రెండేళ్ల క్రితం కెనడాకు వెళ్లారు. అక్కడ మొహాక్ కాలేజీలో చదువుకుంటున్నారు. రోజులాగే బుధవారం రాత్రి తాత్కాలిక ఉద్యోగం చేసే చోటుకు వెళ్లేందుకు హ్యామిల్టన్‌లోని అప్పర్ జేమ్స్, సౌత్ బెండ్ రోడ్ వీధిలోకి వచ్చారు. అక్కడే ఉన్న బస్టాప్‌లో నిల్చుని బస్సు కోసం ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో అక్కడే ఉన్న రెండు వాహనాల్లోని వ్యక్తులు పరస్పరం గన్లతో కాల్పులు జరుపుకున్నారు. ఈ సందర్భంలో వేరే దిశలో దూసుకొచ్చిన ఒక బుల్లెట్ సిమ్రత్ ఛాతీలోకి దూసుకెళ్లింది. దీంతో విపరీతంగా రక్తమోడుతూ అక్కడే కుప్పకూలారు. విషయం తెల్సి అక్కడికొచ్చిన పోలీసులు ఈమెను వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. తుపాకీ బుల్లెట్లు సమీపంలోని ఇంట్లోకి సైతం దూసుకెళ్లాయి. వీడియోలు ఉంటే ఇవ్వండి ఘటనపై హ్యామిల్టన్ పోలీసులు వెంటనే దర్యాప్తు మొదలెట్టారు. నిందితుని కోసం వేట మొదలెట్టారు. కాల్పుల తర్వాత ఆ రెండు వాహనాలు వెంటనే ఘటనాస్థలి నుంచి వెళ్లిపోయాయని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. వాస్తవంగా ఏం జరిగిందని తెల్సుకునేందుకు సీసీటీవీ వంటి వీడియో ఫుటేజీలను సంపాదించేందుకు పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్నారు. బుధవారం రాత్రి 7.30 గంటల సమయంలో అదే రోడ్లో వెళ్తున్న వాహనాల్లోని డ్యాష్‌క్యామ్ కెమెరా రికార్డులను ఇవ్వాలని స్థానికులను పోలీసులు కోరారు. భారతీయ విద్యార్థి మృతి పట్ల విదేశాంగ శాఖ తీవ్ర విచారం వ్యక్తంచేసింది. ఈ మేరకు టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘కాల్పుల్లో అమాయక భారతీయురాలు ప్రాణాలు కోల్పోవడం చాలా విచారకరం. సిమ్రత్ కుటుంబసభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నాం. మృతదేహం తరలింపుసహా అన్నిరకాల సహాయసహకారాలు ప్రభుత్వం నుంచి అందుతాయి’’అని పేర్కొంది. -
అకాలీదళ్ చీఫ్‌గా సుఖ్బీర్ మళ్లీ ఎన్నిక
సాక్షి, న్యూఢిల్లీ: మతపరమైన దుష్ప్రవర్తన కారణంగా రాజీనామా చేసిన ఐదు నెలల తర్వాత సుఖ్బీర్ సింగ్ బాదల్ శిరోమణి అకాలీదళ్(ఎస్ఐడీ) చీఫ్‌గా తిరిగి ఎన్నికయ్యారు. శనివారం ఇక్కడ జరిగిన సమావేశానికి పంజాబ్, ఇతర రాష్ట్రాల నుంచి హాజరైన 524 మంది ప్రతినిధులు పార్టీ అధ్యక్షుడిగా సుఖ్బీర్ను ఏకగ్రీవంగా తిరిగి ఎన్నుకున్నారు. తండ్రి ప్రకాశ్ సింగ్ బాదల్ స్థానంలో 2008లో సుఖ్బీర్ తొలిసారిగా శిరోమణి చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి పార్టీ చీఫ్‌గా కొనసాగుతూ వస్తున్న ఆయన, గతేడాది రాజీనామా చేశారు. దాదాపు ఐదు నెలల కాలంలో మతపరమైన శిక్ష లేదా ‘తంఖా’ను అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో అనుభవించారు. కాగా, ఈనెల 13న భటిండాలో జరిగే పార్టీ సమావేశంలో సుఖ్బీర్ ప్రసంగించనున్నారు. బాదల్ ఎన్నికతో పంజాబ్‌లో రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలున్నాయి. పంజాబ్‌లో తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఉన్న శిరోమణి అకాలీదళ్, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పాత మిత్రుడైన బీజేపీకి దగ్గరయ్యే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. -
రైతుల కోసం 131 రోజుల పాటు నిరాహార దీక్ష
ఆయనొక రైతు.. రైతు నేత.. రైతులకు మద్దతు ధర కావాల్సిందేనని పట్టుబట్టుకుని కూర్చున్నారు. తాము పండించే పంటలకు మద్దతు ధర లేకపోతే రైతు నష్టపోతున్నాడు అనేది ఆయన ఆవేదన. దాంతో రైతుల కోసం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయినా ప్రభుత్వాల నుంచి స్పందన కనిపించలేదు. అంతే తాను నిరాహార దీక్షకు దిగాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడువుగా నిరవధిక నిరాహార దీక్షకు పూనుకున్నారు. సుమారు నాలుగు నెలలకు పైగా నిరాహార దీక్ష చేసి కేంద్ర పెద్దల దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. చివరకు కేంద్ర మంత్రులు ఆయనకు హామీ ఇవ్వడంతో తన 131 రోజుల నిరవధిక నిరాహార దీక్షను విరమించారు.జగజ్జీత్ సింగ్ దల్లేవాల్.. పంజాబ్ రాష్ట్రానికి చెందిన రైతు. రైతు నాయకుడు కూడా. రైతులకు మద్దతు ధరతో పాటు అనేక డిమాండ్లను కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన రైతు ప్రేమికుడు. రైతు సమస్యలకు ముగింపు పడటం లేదని, మరీ ముఖ్యంగా మద్దతు ధర ఉండటం లేదని ఆందోళన చేపట్టి రైతులను ఒక్కతాటిపైకి తీసుకొచ్చాడు. రైతులు కలిసి నడిచి ఆయన.. చివరకు గతేడాది నవంబర్ 26వ తేదీన నిరవధిక నిరాహార దీక్షకు దిగారు.అప్పట్నుంచి నేటి వరకూ అదే పంతంతో కూర్చున్నారు. అయితే రైతు సమస్యలను కేంద్ర చర్చిస్తోందని, త్వరలోనే పరిష్కారం లభిస్తుందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రైల్వే సహాయ మంత్రి రవ్ నీత్ సింగ్ బిట్టులు ఆయనకు హామీ ఇచ్చారు. దీక్షను విరమించాలని, ఆరోగ్యం బాగా క్షీణించిందని వారు పదే పదే విజ్క్షప్తులు చేసి, హామీ ఇవ్వడంతో జగజ్జీత్ సింగ్ దల్లేవాల్ తన నిరవధిక నిరాహార దీక్షను విరమించారు. ఈ క్రమంలోనే దల్లేవాల్ మాట్లాడుతూ.. ‘ మీరంతా నన్ను దీక్ష విరమించమని కోరుతున్నారు. మా ఆందోళనను గుర్తించినందకు మీకు ధన్యవాదాలు. మీ సెంటిమెంట్స్ ను నేను గౌరవిస్తున్నారు. మీ ఆదేశాలను నేను పాటిస్తాను’ అని పేర్కొన్నారు.రైతు సమస్యలపై ఇప్పటికే డేట్ ఫిక్స్ చేశాంరైతు సమస్యలపై మాట్లాడటానికి ఇప్పటికే డేట్ ఫిక్స్ చేసిన విషయాన్ని శివరాజ్ సింగ్ చౌహాన్.. ఎక్స్ వేదికగా తెలిపారు. రైతు నాయకుల డిమాండ్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ ప్రతినిధులుగా మేము కూడా అదే పనిలో ఉన్నాం. రైతు సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు సాగుతున్నాం. అందుచేతు ఆస్పత్రి నుంచి తిరిగి వచ్చిన జగజ్జీత్ సింగ్ దల్లేవాల్ దీక్ష విరమించాలని కోరాం. ఆయన త్వరగా పూర్తి ఆరోగ్యవంతుడవ్వాలని ఆశిస్తున్నాను. రైతు ప్రతినిధులతో మేము మాట్లాడటానికి ఒక తేదీ ఇప్పటికే ఫిక్స్ చేశాం. మే 4వ తేదీ ఉదయం 11 గంటలకు రైతుల తరఫున వచ్చే ప్రతినిధులతో మాట్లాడాలని నిర్ణయించాం’ అని చౌహాన్ పేర్కొన్నారు. -
ఇన్‌స్టా క్వీన్.. ఉద్యోగం ఊడింది
సోషల్ మీడియాలో ఇన్‌స్టా క్వీన్(Insta Queen)గా పేరున్న సీనియర్ కానిస్టేబుల్ అమన్‌దీప్ కౌర్‌ను పంజాబ్ పోలీస్ శాఖ ఉద్యోగం నుంచి తొలగించింది. అంతేకాదు.. ఇంతకాలం ఆమె విలాసాలకు కారణం ఏంటన్న గుట్టు కూడా ఎట్టకేలకు వీడింది. పంజాబ్‌లో మాదకద్రవ్యాల కట్టడికి అక్కడి ఆప్ ప్రభుత్వం యుధ్ నాశేయన్ విరుధ్ డ్రైవ్ చేపట్టింది. ఈ క్రమంలో పక్కా సమాచారంతో.. బాదల్ ఫ్లైఓవర్ వైపు వేగంగా వెళ్తున్న ఓ వాహనాన్ని పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. అందులో మరో వ్యక్తితో పాటు అమన్‌దీప్ కౌర్(Amandeep Kaur) కూడా ఉండగా.. వాళ్ల వద్ద 17 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. దీంతో.. ఆమెను అదుపులోకి తీసుకుని ప్రాథమిక చర్యల కింద మాన్సా పీఎస్ నుంచి బథిండా పోలీస్ లైన్స్‌కు ఎటాచ్ చేశారు. View this post on Instagram A post shared by Kaur deep (@police_kaurdeep) అయితే.. దర్యాప్తులో డ్రగ్స్ రవాణాలో ఆమె పాత్ర ఉందని తేలడంతో గురువారం డిస్మిస్ చేస్తూ పంజాబ్ పోలీస్ శాఖ ఉత్తర్వులు వెలువరించింది. police_kaurdeep పేరిట ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఉంది. థార్ కారులో కూర్చుని.. ఖరీదైన వాచీలను ధరించి పాటలు పాడుతూ ఐఫోన్లలో రీల్స్ చేస్తూ వస్తోంది. ఫాలోవర్స్ తక్కువే అయినా ఆమె ఇచ్చే బిల్డప్లకు ఇన్‌స్టా క్వీన్‌గా ఆమెకు ఓ పేరు అయితే ముద్రపడింది. అయితే.. View this post on Instagram A post shared by Kaur deep (@police_kaurdeep) అమన్‌దీప్ కౌర్ ఇంతకు ముందు కూడా వార్తల్లోకి ఎక్కారు. గుర్మీత్ కౌర్ అనే మహిళ ఆమెపై గతంలో సంచలన ఆరోపణలు చేసింది. అమన్‌దీప్ దగ్గర రూ.2 కోట్ల విలువైన బంగ్లా.. లక్షలు విలువ చేసే ఖరీదైన వాచీలు, కార్లు ఉన్నాయని ఆరోపించింది. ఆంబులెన్స్ డ్రైవర్ అయిన తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుని.. ఆ ఆంబులెన్స్‌లోనే మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేస్తోందని ఫేస్బుక్లో ఆరోపిస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. అయితే అప్పట్లో ఆ ఆరోపణలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఆమెకు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరెవరికి రవాణా చేశారు? అనే అంశాలపై పోలీసులు దృష్టి సారించారు. -
భల్లే భల్లే.. పంజాబీ ఫుడ్ ఫెస్టివల్
నగరం విభిన్న సంస్కృతులకు నిలయమే కాకుండా ఆహార వైవిధ్యానికి కూడా కేంద్రంగా నిలుస్తోంది. దీనికి ప్రతిగా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన విభిన్న ప్రాంతాలకు చెందిన వంటకాలు నగరంలో అలరిస్తుంటాయి. ఇందులో భాగంగానే సికింద్రాబాద్‌లోని రాయల్ రెవ్ హోటల్ వేదికగా ప్రతిష్టాత్మక పంజాబీ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. పంజాబ్ సంప్రదాయ పంటల పండుగ ‘పంజాబీ ఫుడ్ ఫెస్టివల్‘ను అమృత్సర్ గ్యాస్ట్రోనమికల్ యాత్రలో భాగంగా ఈ నెల 4 నుంచి 13వ తేదీ వరకు రాయల్ రెవ్ హోటల్, లాజీజ్ మల్టీక్యూసిన్ రెస్టారెంట్ వేదికగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. దీనికి సంబంధించి బుధవారం రాయల్ రేవ్ హోటల్ వేదికగా పంజాబీ పసందైన వంటకాలతో ప్రముఖ పంజాబీ మాస్టర్ చెఫ్ రాజుసింగ్ సోన్వాల్ ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేకంగా రూపొందించిన మెనూలో మటన్ బెలిరామ్, రారా మటన్, సాగ్ మీట్, తందూరీ కుక్కడ్, కుక్కడ్ మఖన్వాలా, మచ్లీ టిక్కా, మచ్లీ అమృత్సరి వంటి మాంసాహార వంటకాలు ఉన్నాయన్నారు. శాఖాహారులు పనీర్ టిక్కా జలంధరి, పెథివాలి టిక్కీని ఆస్వాదించవచ్చు. వీటితో పాటు మరెన్నో అందుబాటులో ఉన్నాయన్నారు. చదవండి:35 ఏళ్ల నాటి డ్రెస్‌తో రాధికా మర్చంట్ న్యూ లుక్...ఇదే తొలిసారి!సోనాలీ చేసిన పనికి : నెటిజన్లు ఫిదా, వైరల్ వీడియో -
గురీందర్వీర్ సింగ్ జాతీయ రికార్డు
బెంగళూరు: భారత యువ అథ్లెట్ గురీందర్వీర్ సింగ్ 100 మీటర్ల పరుగులో జాతీయ రికార్డు నెలకొల్పాడు. పంజాబ్‌కు చెందిన 24 ఏళ్ల గురీందర్వీర్ సింగ్.. ఇండియన్ గ్రాండ్ ప్రిలో ఈ ఘనత సాధించాడు. శుక్రవారం జరిగిన పోటీల్లో అతను10.20 సెకన్ల్లలో లక్ష్యాన్ని చేరాడు. గతంలో ఈ రికార్డు మణికంఠ హోబ్లిధార్ (10.23 సెకన్లు) పేరిట ఉండగా... తాజాగా గురీందర్ ఆ రికార్డును బద్దలు కొట్టాడు.2021లో 10.27 సెకన్లలో వంద మీటర్లు పరిగెత్తిన ఈ పంజాబ్ స్ప్రింటర్... ఇప్పుడు దాన్ని సరిచేశాడు. ఇదే పోటీల్లో మణికంఠ 10.21 సెకన్లలో గమ్యాన్ని చేరి రెండో స్థానంలో నిలిచాడు. అతడికిదే వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన. గత కొంతకాలంగా ఈ ఇద్దరి మధ్య రసవత్తర పోరు సాగుతోంది. అమ్లన్ బొర్గోహై (10.43 సెకన్లు) మూడో స్థానంతో రేసును ముగించాడు. గురీందర్వీర్ సింగ్ 2021, 2024లో ఇంటర్ స్టేట్ చాంపియన్‌షిప్‌లలో పసిడి పతకాలు సాధించాడు.చెన్నై, మధురైలో జూనియర్ హాకీ వరల్డ్‌కప్ చెన్నై: ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న ఎఫ్ఐహెచ్ జూనియర్ పురుషుల హాకీ ప్రపంచకప్‌నకు సంబంధించిన వేదికలు ఖరారయ్యాయి. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 10 వరకు జరగనున్న ఈ టోర్నీని చెన్నై, మధురై నగరాల్లో నిర్వహించనున్నట్లు హాకీ ఇండియా (హెచ్ఐ) శుక్రవారం వెల్లడించింది. 24 జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీకి భారత్ ఆతిథ్యమివ్వనుండటం ఇది మూడోసారి. 2016లో లక్నో వేదికగా, 2021లో భువనేశ్వర్‌లో జూనియర్ పురుషుల హాకీ ప్రపంచకప్ జరిగింది.‘చెన్నై, మధురై నగరాల్లో పోటీలు నిర్వహిస్తాం. వరల్డ్‌కప్‌లో మొత్తం 24 జట్లు పాల్గొంటున్నాయి. మధురైలో అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగడం ఇదే తొలిసారి. భిన్నమైన నగరాలకు ఆటను విస్తరించాలనే ఉద్దేశంతోనే మధురైను వేదికగా ఎంపిక చేశాం’ అని హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ పేర్కొన్నాడు. భారత్‌లో చివరిసారిగా 2021లో జరిగిన ప్రపంచకప్‌లో అర్జెంటీనా జట్టు విజేతగా నిలవగా... 2023లో కౌలాలంపూర్‌లో జరిగిన వరల్డ్‌కప్‌లో జర్మనీ చాంపియన్‌గా నిలిచింది. సెమీఫైనల్లో ఓడిన భారత్ నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. మరి ఈసారి స్వదేశంలో జరగనున్న టోర్నీలో అయినా యువభారత్ విజేతగా నిలుస్తుందా చూడాలి. అనాహత్‌కు టైటిల్ ముంబై: జేఎస్‌డబ్ల్యూ ఇండియన్ ఓపెన్ స్క్వాష్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో యువ క్రీడాకారణి అనాహత్ సింగ్ చాంపియన్‌గా నిలిచింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో భారత నంబర్‌వన్ ర్యాంకర్ అనాహత్ సింగ్ 3–0 (11–9, 11–5, 11–8)తో హలెన్ టాంగ్ (హాంకాంగ్)పై విజయం సాధించింది. ఈ విజయంతో అనాహత్ 300 ర్యాంకింగ్ పాయింట్లు ఖాతాలో వేసుకుంది. 17 ఏళ్ల అనాహత్‌కు ఇది వరుసగా ఆరో టైటిల్ కాగా... ఓవరాల్‌గా 11వది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్ ప్లేయర్ అభయ్ సింగ్ రన్నరప్‌గా నిలిచాడు. శుక్రవారం జరిగిన ఫైనల్లో అభయ్ సింగ్ 1–3 (10–12, 4–11, 11–7, 10–12)తో కరీమ్ (ఈజిప్ట్) చేతిలో ఓటమి పాలయ్యాడు.పుణేలో మహిళల చెస్ గ్రాండ్ ప్రి పుణే: ఫిడే మహిళల గ్రాండ్ ప్రి ఐదో అంచె పోటీలకు పుణే ఆతిథ్యమివ్వనుంది. వచ్చే నెల 13 నుంచి 24 వరకు జరగనున్న ఈ టోర్నీలో ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్ కోనేరు హంపి, ఒలింపియాడ్ స్వర్ణ పతక విజేతలు ద్రోణవల్లి హారిక, వైశాలి, దివ్య దేశ్‌ముఖ్ తదితరులు పాల్గొననున్నారు. మహారాష్ట్ర చెస్ సంఘం నిర్వహించనున్న ఈ టోర్నీలో చైనా గ్రాండ్‌మాస్టర్ జూ జినెర్, పొలినా షువలోవా (రష్యా), అలీనా కష్లిన్స్క్యా (పోలాండ్), సలిమోవా నుర్గుల్ (బల్గేరియా), బక్తుయాగ్ (మంగోలియా), మెలియా సలోమె (జార్జియా) పాల్గొననున్నారు. ఫిడే గ్రాండ్ ప్రి సిరీస్‌లో 14 మంది టాప్ ప్లేయర్లతో పాటు... ఆరుగురు ప్లేయర్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పాల్గొంటారు. గత సిరీస్‌ల ఆధారంగా ప్లేయర్ల ఎంపిక జరుగుతుంది. భారత్ యువ ప్లేయర్ ఇంటర్నేషనల్ మాస్టర్ దివ్య వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఈ టోరీ్నలో పోటీపడనుంది. శరత్ కమల్ జోరు చెన్నై: భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) దిగ్గజం ఆచంట శరత్ కమల్... తన చివరి టోర్నీలో చక్కటి విజయాలతో దూసుకెళ్తున్నాడు. చెన్నై వేదికగా జరుగుతున్న డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నమెంట్లో శరత్ కమల్ ప్రిక్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో శరత్ 3–0 (11–8, 11–8, 11–9)తో పదో సీడ్ నికోలస్ లుమ్ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించాడు. 42 ఏళ్ల శరత్... తనకంటే 23 సంవత్సరాలు చిన్నవాడైన ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం కనబర్చాడు.దేశం తరఫున ఐదుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్న శరత్ కమల్ బ్యాక్‌హ్యాండ్, ఫోర్ హ్యాండ్ షాట్లతో ఆకట్టుకొని వరుస గేమ్‌ల్లో విజయం సాధించాడు. శరత్‌తో పాటు పురుషుల విభాగంలో భారత్ నుంచి తెలంగాణ ప్యాడ్లర్ స్నేహిత్ సురావజ్జుల, మానవ్ ఠక్కర్ ప్రిక్వార్టర్స్‌కు చేరగా... మహిళల విభాగంలో కృతి్వక రాయ్ ముందంజ వేసింది. స్నేహిత్ 3–2 (8–11, 11–13, 11–9, 11–7, 12–10)తో యుకియా ఉడా (జపాన్)పై, మానవ్ 3–1 (11–4, 7–11, 11–5, 11–8)తో పిన్ లూ (ఆస్ట్రేలియా)పై గెలిచారు. మహిళల విభాగంలో పదో సీడ్ తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ 2–3 (6–11, 9–11, 11–6, 11–4, 7–11)తేడాతో కృత్వికరాయ్ చేతిలో ఓడింది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో శరత్–స్నేహిత్ జంట 1–3 (11–9, 8–11, 9–11, 6–11)తో ఆస్ట్రేలియా జోడీ చేతిలో ఓడింది. -
ముల్లాన్‌పూర్‌లో మహిళల వన్డే వరల్డ్‌కప్ ఫైనల్!
న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్ ఆతిథ్యమివ్వనున్న మహిళల వన్డే వరల్డ్‌కప్ క్రికెట్ టోర్నమెంట్ వేదికల వివరాలు బహిర్గతమయ్యాయి. ముల్లాన్‌పూర్ (పంజాబ్)లోని మహారాజా యాదవేంద్ర సింగ్ అంతర్జాతీయ స్టేడియం ఈ మెగా టోర్నీ ఫైనల్ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనుందని సమాచారం. 34 వేల మంది ప్రేక్షకుల సామర్థ్యంగల ఈ స్టేడియం ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ జట్టుకు రెండో హోంగ్రౌండ్‌గా ఉంది.ముల్లాన్పూర్తోపాటు విశాఖపట్నం, తిరువనంతపురం, ఇండోర్, రాయ్‌పూర్‌లలో వరల్డ్‌కప్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ముల్లాన్‌పూర్, తిరువనంతపురం, రాయ్‌పూర్‌లలో ఇప్పటి వరకు మహిళల అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగలేదు. » అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆధ్వర్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్వహించనున్న మహిళల వన్డే వరల్డ్‌కప్ ఈ ఏడాది సెపె్టంబర్ 29 నుంచి అక్టోబర్ 26 వరకు జరగనుంది. అయితే ఈ తేదీలను ఐసీసీ, బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. » ఎనిమిది దేశాల మధ్య వన్డే వరల్డ్‌కప్ జరగనుంది. మొత్తం 31 మ్యాచ్‌లు జరుగుతాయి. ఆతిథ్య దేశం భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు ఇప్పటికే ఈ మెగా టోర్నీకి అర్హత సాధించాయి. » ఏప్రిల్ 9 నుంచి 19 వరకు లాహోర్‌లో జరిగే క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా చివరి రెండు జట్లు ఖరారవుతాయి. క్వాలిఫయింగ్ టోర్నీలో పాకిస్తాన్, వెస్టిండీస్, స్కాట్లాండ్, బంగ్లాదేశ్, ఐర్లాండ్, థాయ్‌లాండ్ జట్లు పోటీపడనున్నాయి. ఒకవేళ పాకిస్తాన్ వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తే మెగా టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహిస్తారు. పాకిస్తాన్ జట్టు ఆడే మ్యాచ్‌లను శ్రీలంక లేదా యూఏఈలలో నిర్వహిస్తారు. » భారత్ నాలుగోసారి మహిళల వన్డే వరల్డ్‌కప్ టోర్నీకి ఆతిథ్యమివ్వనుంది. గతంలో భారత్ 1978, 1997, 2013లలో ఈ మెగా టోర్నీని నిర్వహించింది. ఇప్పటి వరకు వన్డే వరల్డ్‌కప్ 12 సార్లు జరగ్గా... భారత్ రెండుసార్లు (2005, 2017) రన్నరప్‌గా నిలిచింది. -
అందుకే శంభు సరిహద్దు తెరిచాం: పంజాబ్ సర్కారు
న్యూఢిల్లీ: పంజాబ్-హర్యానా సరిహద్దులో గత 13 నెలలుగా మూసివేసిన శంభు సరిహద్దు ఇప్పుడు తెరుచుకుంది (Shambu Border Reopen). ఇక్కడ నిరసన చేస్తున్న రైతులను పోలీసులు తరలించారు. ఈ నేపధ్యంలో రైతు నేతలు జగ్జీత్ సింగ్ దల్లెవాల్, సర్వాన్ సింగ్ పంధేర్ సహా దాదాపు 400 మంది రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.పంజాబ్ పోలీసులు శంభు సరిహద్దును తెరవడంతో ఈ దారిలో రాకపోకలు సాగించేవారు.. ముఖ్యంగా పారిశ్రామికవేత్తలు(Entrepreneurs) ఊపిరిపీల్చుకున్నారు. కాగా రైతు నేత రాకేష్ టికైత్ మాట్లాడుతూ పోలీసుల చర్య సరైనది కాదని, దీనిపై రైతు సంఘాలు పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. మరోవైపు యునైటెడ్ కిసాన్ మోర్చా మార్చి 26న పంజాబ్ అసెంబ్లీకి మార్చ్ నిర్వహించాలని నిర్ణయించింది. శంభు సరిహద్దు మూసివేయడం వల్ల పంజాబ్‌లోని పలు పరిశ్రమ భారీ నష్టాలను చవిచూశాయని ప్రభుత్వం చెబుతోంది. ఫలితంగా ఉపాధి సంక్షోభం ఏర్పడుతున్నదని, అందుకే శంభు సరిహద్దును ఖాళీ చేయించామని పేర్కొంది.శంభు సరిహద్దును మూసివేయడం వలన ఇక్కడి పరిశ్రమలు ఎగుమతులు, దిగుమతులను చేయలేకపోతున్నాయనే వాదన వినిపిస్తోంది. కాగా పంజాబ్ రాష్ట్రం పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రంగా ఉండాలని భగవంత్ మాన్ ప్రభుత్వం కోరుకుంటోంది. తద్వారా పంజాబ్ యువతకు ఉపాధి లభిస్తుందని, దీంతో వారు మాదకద్రవ్యాల జోలికి వెళ్లకుండా ఉంటారని ప్రభుత్వం భావిస్తోంది. రైతులను ఆదుకుంటామని కూడా చెబుతోంది. ఇది కూడా చదవండి: గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడి.. 70 మంది మృతి -
అన్నదాతలపై ఉక్కుపాదం
-
Amritsar: ఆలయంపై గ్రనేడ్ విసిరిన వ్యక్తి ఎన్కౌంటర్
అమృత్సర్: పంజాబ్‌లోని అమృత్సర్(Amritsar) జిల్లాలో ఠాకుర్ద్వారా ఆలయంపై గ్రనేడ్‌తో దాడి చేసిన ఇద్దరు యువకులలో ఒకరిని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. పంజాబ్ పోలీసులకు నిందితుల స్థావరానికి సంబంధించిన సమాచారం అందగానే వారు రంగంలోకి దిగారు. ఘటన జరిగిన 24 గంటల్లో ఒక నిందితుడిని ఎన్కౌంటర్లో హతమార్చారు.Acting on specific intelligence, Commissionerate Police Amritsar decisively tracked down those responsible for the attack on Thakur Dwara Mandir, #Amritsar, on March 15, 2025. An FIR has been registered at PS Chheharta under the Explosive Substances Act, and intelligence-based…— DGP Punjab Police (@DGPPunjabPolice) March 17, 2025ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన వివరాలను డీజీపీ గౌరవ్ యాదవ్ మీడియాకు తెలియజేశారు. నిఘా వర్గాల(Intelligence agencies) నుంచి అందిన సమాచారం మేరకు అమృత్సర్ పోలీసులు ఘటన జరిగిన అనంతరం నిందితులను ట్రాక్ చేస్తూ వచ్చారన్నారు. ఈ నేపధ్యంలోనే వారిని గుర్తించగలిగారని, వారు రాజాసాంసీలో ప్రాంతంలో ఉన్నారని తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారని, వారిని చూడగానే నిందితులు తుపాకీతో కాల్పులు జరిపారన్నారు. ఈ ఘటనలో హెడ్ కానిస్టేబుల్ గురుప్రీత్ సింగ్‌కు గాయాలయ్యారన్నారు. ఆత్మరణక్షణకు పోలీసులు(Police) ఎదురు కాల్పులు జరిపారని ఈ నేపధ్యంలో ఒక నిందితునికి గాయాలయ్యాయని, అతనిని ఆస్పత్రికి తరలించామని, అక్కడ అతను మృతిచెందాడని గౌరవ్ యాదవ్ తెలిపారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడన్నారు. అతనిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారన్నారు.ఇది కూడా చదవండి: రాజధానిలో మహిళల రక్షణకు యాంటీ ఈవ్ టీజింగ్ స్క్వాడ్ -
Punjab: హిందూ నేత ఇంటిపై గ్రనేడ్ దాడి
జలంధర్: పంజాబ్(Punjab)లో ఇటీవలి కాలంలో గ్రనేడ్ దాడులు తరచూ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా జలంధర్‌లో హిందూనేత, యూట్యూబర్ రోజర్ సంఘూ ఇంటిపై గ్రనేడ్ దాడి జరిగింది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ పాకిస్తాన్‌కు చెందిన డాన్ షహజాద్ ప్రకటన చేశారు. ఒక వర్గానికి వ్యతిరేకంగా ప్రచారం సాగిస్తున్నందున రోజర్ సంఘూ ఇంటిపై దాడి చేసినట్లు డాన్ షహజాద్ తెలిపాడు.మీడియాకు అందిన వివరాల ప్రకారం హిందూవాదంపై ప్రచారం సాగించే రోజర్ సంఘూ ఒక వర్గాన్ని కించపరిచేవిధంగా మాట్లాడుతున్నానే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపధ్యంలోనే అతని ఇంటిపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఘటనలో జలంధర్ పోలీసులు ఇంకా ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. ఈ ఘటనకు ముందు పంజాబ్‌లోని అమృత్సర్(Amritsar_ జిల్లాలోని ఖండ్వాలా ప్రాంతంలో శనివారం రాత్రి ఠాకుర్ద్వార్ ఆలయంపై గ్రనేడ్ దాడి జరిగింది. మోటార్ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు యువకులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలయం వెలుపల ఉన్న సీసీటీవీలో రికార్డయ్యింది.సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం రాత్రి 12:35 గంటలకు మోటార్ సైకిల్ ఇద్దరు యువకులు ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో వారి చేతుల్లో జండాలు ఉన్నాయి. కొద్దసేపు వారు ఆలయం ముందు అటుఇటు తిరిగాక, ఆలయంపైకి గ్రనేడ్లు విసిరారు. వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. ఇంతలోనే ఆలయంలో నుంచి పెద్ద శబ్ధం వచ్చింది. ఈ సమయంలో ఆలయంలో పూజారి నిద్రిస్తున్నారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణహాని జరగలేదు. అయితే పేలుడు కారణంగా ఆలయంలోని కొంత భాగం ధ్వంసం అయ్యింది. ఇది కూడా చదవండి: ర్యాపిడ్ రైలు కారిడార్‌పై వర్క్ స్పేస్.. ప్రయోజనమిదే.. -
స్వర్ణ దేవాలయంలో భక్తులపై దాడి.. ఐదుగురికి గాయాలు
అమృత్సర్: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో గల స్వర్ణదేవాలయం(Golden Temple)లో దారుణం చోటుచేసుకుంది. ఆలయానికి వచ్చిన భక్తులపై ఒక వ్యక్తి ఇనుప రాడ్‌తో దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరు ఆలయ సిబ్బందితో పాటు ముగ్గురు భక్తులు గాయపడ్డారు. ఈ ఘటనతో స్థానికులు, భక్తులు ఉలిక్కిపడ్డారు.శిరోమణి గురుద్వారా కమిటీ(Shiromani Gurdwara Committee) ప్రతినిధి ప్రతాప్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం ఆలయంలో అనుమానస్పదంగా తిరుగుతున్న ఒక వ్యక్తిని సిబ్బంది ప్రశ్నించగానే అతను దాడికి పాల్పడ్డాడు. ఆలయ సిబ్బందితో పాటు అక్కడున్న భక్తులపై రాడ్‌తో దాడికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.ఈ కేసు గురించి పోలీసులు మాట్లాడుతూ దాడికి పాల్పడిన వ్యక్తి హర్యానాకు చెందినవాడని, ఈ ఘటన అనంతరం ఆలయ సిబ్బంది అతనిని పట్టుకుని తమకు అప్పగించారన్నారు. గాయపడిన భక్తులు మోహాలీ, బఠిండా, పటియాలా నుంచి వచ్చినవారని తెలిపారు. గాయపడినవారందరినీ గురు రామ్‌దాస్ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తితో పాటు వచ్చిన ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆలయ సిబ్బంది కోరుతున్నారు.పోలీస్ కమిషనర్ గురుప్రీత్ సింగ్ భుల్లార్ మీడియాతో మాట్లాడుతూ దర్బార్ సాహిబ్ కాంప్లెక్స్(Darbar Sahib Complex)లోని రెండవ అంతస్థులో అనుమానస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని ఆలయంలో పనిచేస్తున్న జస్బీర్ సింగ్ గుర్తించి, కిందకు రమ్మని కోరగా, అందుకు అతను నిరాకరించాడన్నారు. దీంతో జస్బీర్ సింగ్ రెండవ అంతస్థుకు వెళ్లి అతనిని కిందకు దిగాలని కోరారు. అయితే అతను వెంటనే ఒక రాడ్‌తో జస్బీర్ సింగ్‌పై దాడి చేశాడు. దీనిని చూసిన ఇతర సిబ్బంది ఆ వ్యక్తిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపధ్యంలో వారు కూడా గాయపడ్డారు. నిందితుడిని జుల్ఫాన్‌గా పోలీసులు గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని గురుప్రీత్ సింగ్ తెలిపారు.ఇది కూడా చదవండి: West Bengal: హోలీ వేళ యువకుని హత్య -
పార్కింగ్ వివాదం.. సైంటిస్టు దారుణ హత్య
మొహాలీ: పంజాబ్‌లోని మొహాలీ(Mohali)లో దారుణం చోటుచేసుకుంది. చిన్నపాటి వివాదం హత్యకు దారితీసింది. మొహాలీ లోని సెక్టార్-66లో బైక్ పార్కింగ్ విషయమై జరిగిన వివాదంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఐసర్)కు చెందిన సైంటిస్టు హత్యకు గురయ్యారు.ఈ ఘటనా క్రమమంతా అక్కడి సీసీ టీవీలో రికార్డయ్యింది. మృతుడిని సైంటిస్టు(Scientist) అభిషేక్ స్వర్ణకార్(30)గా గుర్తించారు. ఇతని స్వస్థలం జార్ఖండ్. పొరుగింట్లో ఉంటున్న మోంటీ అనే వ్యక్తి అభిషేక్‌పై దాడి చేశాడని, ఈ నేపద్యంలో అభిషేక్ మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై అభిషేక్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమారునికి ఇటీవలే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ జరిగిందని, ప్రస్తుతం డయాలసిస్ కొనసాగుతున్నదని వారు తెలిపారు.అభిషేక్ తన తల్లిదండ్రులతో పాటు సెక్టార్-66లోని ఒక అద్దె ఇంటిలో ఉంటున్నాడు. మంగళవారం సాయంత్రం 8 గంటల సమయంలో అతను వాహనాన్ని పార్కింగ్ చేస్తున్నాడు. ఈ నేపధ్యంలో అతని పొరుగింటిలో ఉంటున్న మోంటీతో వివాదం చెలరేగింది. ఈ సమయంలో మోంటీ తన ఎదురుగా ఉన్న అభిషేక్‌పై దాడి చేశాడు. అతని పొట్ట, ఛాతీపై పిడిగుద్దులు కురిపించాడు. దీంతో అభిషేక్ బాధతో విలవిలలాడుతూ కిందపడిపోయాడు. దీనిని గమనించిన అభిషేక్ కుటుంబ సభ్యులు అతనిని ఆస్పత్రి(Hospital)కి తరలించారు. అక్కడి వైద్యులు అప్పటికే అభిషేక్ మృతిచెందాడని నిర్ధారించారు. సీసీటీవీలో లభ్యమైన ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: Holi 2025: ఈ దేశాల్లోనూ అంబరాన్నంటే హోలీ వేడుకలు -
కలియుగానికి ఇదో ఉదాహరణ
చండీగఢ్: వృద్ధురాలైన తల్లికి మనోవర్తిగా(Maintenance) నెలకు రూ.5 వేలు ఇవ్వాలంటూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఓ వ్యక్తి వేసిన పిటిషన్‌పై పంజాబ్ హరియాణా హైకోర్టు(Punjab & Haryana High Court) ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కలియుగంలో జరుగుతున్న విపరీతాలకు ఇదో ఉదాహరణ అంటూ వ్యాఖ్యానించింది. సంగ్రూర్ కుటుంబ న్యాయస్థానంలో మూడు నెలల్లోగా రూ.50 వేలు డిపాజిట్ చేయాలంటూ పిటిషనర్‌ను ఆదేశించింది. పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు.. అది చాలా తక్కువ మొత్తమని తెలిపింది. మనోవర్తి మొత్తం పెంచాలంటూ పిటిషనర్ తల్లి ప్రత్యేకంగా ఎలాంటి విజ్ఞాపన చేయలేదని కూడా పేర్కొంది. 77 ఏళ్ల వృద్ధురాలి భర్త 1992లోనే చనిపోయారు. వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు. ఒక కుమారుడు చనిపోయాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఆమెకున్న సుమారు 30 ఎకరాల భూమిని పిటిషనర్ అయిన మరో కుమారుడు, చనిపోయిన కుమారుడి పిల్లలు పంచుకున్నారు. 1993లో మనోవర్తి కింద వృద్ధురాలికి రూ.లక్ష ఇచ్చారు. అప్పటి నుంచి ఆమె కూతురు వద్దే ఉంటోంది. తన పోషణ భారం కుమార్తె మోయాల్సి రావడంతో వృద్ధురాలు సంగ్రూర్ కుటుంబ కోర్టును ఆశ్రయించారు. తల్లి తన వద్ద ఉండటం లేదు కాబట్టి, మనోవర్తి తాను ఇవ్వాల్సిన పనిలేదని కుమారుడు వాదించాడు. తోసిపుచి్చన న్యాయస్థానం నెలకు రూ.5 వేల చొప్పున అందజేయాలంటూ ఆదేశించింది. ఈ ఆదేశాలను హైకోర్టులో సవాల్ చేశాడు. విచారణ సందర్భంగా న్యాయస్థానం..‘తన తల్లికి వ్యతిరేకంగా సాక్షాత్తూ కుమారుడే ఈ పిటిషన్ వేయడం చూసి మేం షాక్‌కు గురయ్యాం. తండ్రి నుంచి ఆస్తి సంక్రమించినప్పటికీ, ఎలాంటి ఆదాయ వనరుల్లేని వయో వృద్ధురాలైన తల్లిని పెళ్లయి మెట్టినింట్లో ఉంటున్న ఆమె కుమార్తె వద్ద వదిలేయడం దురదృష్టకరం. కలియుగంలో జరిగే వైపరీత్యాలకు ఈ కేసు సిసలైన ఉదాహరణ’అని వ్యాఖ్యానించింది. -
వివాహ వేడుకలో విషాదం.. విచారణలో బయటపడ్డ అసలు విషయం
Shocking Viral Video: పెళ్లి వేడుకలో అంతా హుషారుగా డ్యాన్సులు వేస్తున్నారు. అంతలో ఊహించిన ఘటన.. ఆ ఊరిలో తీవ్ర విషాదం నింపింది. హుషారుగా డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో ఆ ఊరి సర్పంచ్ భర్త ఊపిరి ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. అయితే.. ఈలోపు సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో చక్కర్లు కొట్టగా.. విచారణలో అసలు విషయం బయటపడింది.పంజాబ్ జలంధర్ గోరయా ప్రాంతంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆ ఊరి సర్పంచ్ భర్త పరమ్‌జిత్ సింగ్(49) ఓ వివాహ వేడుకలో హుషారుగా చిందులేస్తూ కుప్పకూలిపోయారు. గుండెపోటుతో ఆయన మరణించారని కుటుంబ సభ్యులు, పోలీసులు వెల్లడించారు. అయితే సోషల్ సోషల్ మీడియాలో ఓ వైరల్ అయ్యింది.వివాహ వేడుకలో ఓ వ్యక్తి చిందులేస్తూ.. తుపాకీ పేల్చాడు. అయితే అది పక్కనే డ్యాన్స్ చేస్తున్న పరమ్జిత్కు తగిలింది. దీంతో ఆయన కిందపడిపోయారు. కిందపడిన పరమ్‌జిత్.. తుపాకీతో కాల్చిన వ్యక్తిని మందలించారు కూడా. అయితే ఆ వెంటనే ఆయన అలాగే స్పృహ కోల్పోయారు. వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. బుల్లెట్ గాయంతోనే పరమ్‌జిత్ మరణించాడని, విషయం బయటకు రాకుండా బాధిత కుటుంబం పెద్దల సమక్షంలో డబ్బు తీసుకుందని తేలింది. పిస్టల్ పేల్చిన వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పంజాబ్ సహా భారతదేశంలో ఇలాంటి వేడుకలలో బహిరంగంగా ఆయుధాల్ని ప్రదర్శించడం నిషిద్ధం. ఒకవేళ అది ఉల్లంఘిస్తే నేరం కిందకే వస్తుంది. जालंधर में एक शादी समारोह में की गई हवाई फायरिंग में एक युवक को गोली लग गई, जिससे उसकी मौत हो गई. जानकारी के मुताबिक मृतक गांव की मौजूदा सरपंच के पति हैं. घटना का वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है. #Jalandhar | #Firing pic.twitter.com/NovyLH21vK— Veer Arjun (@VeerArjunDainik) February 22, 2025 VIDEO Credits: VeerArjunDainik -
స్నేహితురాలి మోజులో భార్యను.. ఆప్ నేత అరెస్ట్
అక్రమ సంబంధాలు ఎంతటి దారుణమైన పరిస్థితులకైనా దారితీస్తాయనడానికి పంజాబ్‌లోని లుథియానాలో జరిగిన ఒక ఉదంతం ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పదిమందికీ ఆదర్శంగా నిలవాల్సిన ఒక నేత స్వయంగా అకృత్యానికి పాల్పడటం మానవత్వానికి మాయని మచ్చగా నిలిచింది.వివరాల్లోకి వెళితే పంజాబ్‌లోని లుథియానాలో భార్యను హత్య చేసిన కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత అనోఖ్ మిట్టల్‌ను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితో పాటు అతని స్నేహితురాలు, మరో నలుగురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో తొలుత అనోఖ్ మిట్టల్ తన భార్య లిప్సీ మిట్టల్‌ను ఒక గ్రామం దగ్గర దుండగులు హత్య చేశారని చెప్పాడు. తాను, తన భార్య లుథియానా-మలెర్‌కోట్లా రోడ్డులో ఒక హోటల్లో భోజనం చేసి, తిరిగివస్తుండగా ఈ ఘటన జరిగిందని అనోఖ్ మిట్టల్ పోలీసులకు తెలిపాడు. ఆ దుండగులు మారణాయుధాలతో దాడి చేసి, తమ కారు తీసుకుని పారిపోయాడని పేర్కొన్నాడు.పోలీస్ కమిషనర్ కుల్దీప్ సింగ్ చాహల్ మీడియాతో మాట్లాడుతూ తమ విచారణలో లిప్సీ మిట్టల్‌ను ఆమె భర్త అనోఖ్ మిట్టల్ హత్య చేశాడని విచారణలో వెల్లడయ్యిందన్నారు. అనోఖ్ మిట్టల్‌తో పాటు ఈ హత్యకు సహకరించిన అతని స్నేహితురాలు, మరో నలుగురిని అరెస్ట్ చేశామన్నారు. తన భర్తకు వివాహేతర సంబంధం ఉన్నదని లిప్సీ మిట్టల్‌కు తెలిసిపోయందని, దీంతో భయపడిన అనోఖ్ మిట్టల్ తన స్నేహితురాలి సాయంతో భార్యను హత్య చేశాడన్నారు. ఈ ఘటనలో అనోఖ్‌కు సహకరించిన అమృత్‌పాల్‌సింగ్, గురుదీప్ సింగ్, సోనూ సింగ్, సాగర్‌దీప్ సింగ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.ఇది కూడా చదవండి: ‘మహాకుంభ్’ ఖర్చెంత? లాభమెంత? -
అక్రమ వలసదార్లలో కన్నీటి వరదే
చండీగఢ్: ఏజెంట్ల మాటలు నమ్మి, రూ.లక్షలు సమర్పించుకొని, అందమైన జీవితాన్ని ఊహించుకుంటూ కోటి కలలతో అమెరికా దారిపట్టిన యువతకు చివరకు కన్నీళ్లే మిగిలాయి. ఉత్త చేతులతో, అవమానకర రీతితో స్వదేశానికి చేరుకోవాల్సి వచ్చింది. చట్టబద్ధంగా అమెరికాకు తీసుకెళ్తామంటూ ఏజెంట్లు, సబ్ ఏజెంట్లు చెప్పిన కల్లబొల్లి కబుర్లు నమ్మినందుకు అష్టకష్టాలు ఎదుర్కోన్నామని, ప్రత్యక్ష నరకం చూశామని అమెరికా నుంచి తిరిగివచ్చిన భారతీయ అక్రమవలసదార్లు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. తొలి విడతలో భాగంగా 104 మంది అమెరికా సైనిక విమానంలో ఈ నెల 5వ తేదీన , రెండో విడతలో భాగంగా 116 మంది శనివారం రాత్రి పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. మూడో విడతలో భాగంగా మరో 112 మంది ఆదివారం రాత్రి అమృత్‌సర్‌లో అడుగుపెట్టారు. ఇప్పటిదాకా మూడు విడతల్లో 332 మంది ఇండియాకు చేరుకున్నారు. పలువురు యువకులు తమ కన్నీటి గాథను మీడియాతో పంచుకున్నారు. సరైన తిండి లేదు, నిద్ర లేదుమన్దీప్ సింగ్(38) కుటుంబం అమృత్‌సర్‌లో నివసిస్తోంది. తన కుటుంబానికి చక్కటి జీవితం అందించడానికి అమెరికా వెళ్లి, ఏదైనా ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇతర యువకుల తరహాలోనే ఏజెంట్ వలలో చిక్కాడు. ఏజెంట్‌కు రెండు విడతల్లో మొత్తం రూ.40 లక్షలు చెల్లించాడు. ఇంకేముంది అమెరికాకు పయనం కావడమే అని ఏజెంట్ ఊరించాడు. అధికారికంగా కాకుండా అడ్డదారిలో(డంకీ రూట్) తీసుకెళ్లాడు. సబ్ ఏజెంట్లకు మణిదీప్‌ను అప్పగించాడు. మన్‌దీప్‌ను మొదట అమృత్సర్ నుంచి విమానంలో ఢిల్లీకి, అక్కడి నుంచి ముంబైకి, తర్వాత ఆఫ్రికాలోని నైరోబీకి, అనంతరం ఆమ్స్టర్డ్యామ్, సురినామ్‌కు చేర్చారు. అక్కడ సబ్ ఏజెంట్లు రూ.20 లక్షలు డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యుల ద్వారా ఆ డబ్బు చెల్లించక తప్పలేదు. సిక్కు మతస్థుడైన మన్దీప్ గడ్డాన్ని తొలగించారు. మన్‌దీప్‌తోపాటు మరికొందరు వలసదార్లను ఒక వాహనంలో గయనాకు తీసుకెళ్లారు. తర్వాత బొలీవియా, ఈక్వెడార్‌కు చేర్చారు. తర్వాత పనామా అడవుల్లో అడుగుపెట్టారు. విష సర్పాలు, మొసళ్లతో సావాసం చేస్తూ రోజుల తరబడి దట్టమైన అడవిలో నడిపించారు. 13 రోజులపాటు అడవిలోనే నడక సాగించారు. కాలువలు దాటుకుంటూ ముందుకెళ్లారు. సరైన తిండి కూడా లేదు. సగం కాల్చిన రొట్టెలు, నూడుల్స్‌తో కడుపు నింపుకున్నారు. కంటి నిండా నిద్రలేదు. రోజుకు 12 గంటలు నడిచారు. పనామా దాటిన తర్వాత కోస్టారికా, తర్వాత హోండూరస్కు చేరుకున్నారు. అక్కడ వారికి వరి అన్నం లభించింది. చివరకు నికరాగ్వా, గ్యాటెమాలా నుంచి మెక్సికో చేరారు. జనవరి 27వ తేదీన మెక్సికోలోని తిజువానా నుంచి అమెరికా భూభాగంలోకి ప్రవేశిస్తుండగా, యూఎస్ సరిహద్దు పెట్రోలింగ్ దళం అదుపులోకి తీసుకుంది. మణిదీప్‌ను అరెస్టు చేసి, డిటెన్షన్ క్యాంప్‌లో నిర్బంధించి, విచారణ ప్రారంభించారు. అక్రమ మార్గంలో అమెరికాలో అడుగుపెట్టేందుకు ప్రయత్నించినట్లు అభియోగాలు మోపారు. అక్రమ వలసదార్లను వారి స్వదేశాలకు బలవంతంగా తిప్పి పంపిస్తూ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో మన్దీప్ స్వదేశానికి చేరుకున్నాడు. ప్రాణాలతో బయటపడతానని అనుకోలేదని మణిదీప్ చెప్పాడు. తలపాగాను చెత్తబుట్టలో పడేశారు అమృత్‌సర్‌కు తిరిగొచ్చిన 23 ఏళ్ల జతీందర్ సింగ్‌ది మరో గాధ. ‘‘స్నేహితులు చెప్పడంతో గత నవంబర్‌లో ఏజెంట్ కలిశా. రూ.50 లక్షలిస్తే అమెరికా పంపిస్తానన్నాడు. మాకున్న 1.3 ఎకరాల భూమి అమ్మి ఏజెంట్‌కు అడ్వాన్స్‌గా రూ.22 లక్షలు కట్టా. పెళ్లయిన నా అక్కచెల్లెళ్లు తమ బంగారు నగలమ్మి మరీ చేతికిచ్చిన డబ్బును ఏజెంట్‌కు ఇచ్చేశా. మూడ్రోజులు పనామా అడువులను దాటాకా మెక్సికోకు విమానంలో తీసుకెళ్తానన్నాడు. మెక్సికో సరిహద్దు నగరం తిజువానా నుంచి అమెరికాలోకి తీసుకెళ్తానన్నాడు. కానీ మధ్యలోనే వదిలేశాడు. పనామా అడవుల్ని దాటడం చాలా కష్టం. మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయిన తోటివారిని చూస్తూనే అతికష్టంమ్మీద అడవుల్ని దాటా. ఎలాగోలా అమెరికా సరిహద్దు దాటితే వెంటనే బోర్డర్ పోలీసులు బంధించి నిర్బంధ కేంద్రంలో పడేశారు. సంప్రదాయ తలపాగాను తీయొద్దని బతిమాలినా వినలేదు. తీసి చెత్తబుట్టలో పడేశారు. సరైన తిండి పెట్టలేదు. ఉదయం, రాత్రి ఒక లేస్ చిప్స్ ప్యాకెట్, ప్రూటీ జ్యూస్ చిన్న బాటిల్ ఇచ్చారు. అదే ఆహారం. గదిలో ఎయిర్ కండీషనర్ ఉష్ణోగ్రత బాగా పెంచి వేడికి చర్మం ఎండిపోయేలాగా చేశారు. భారత్‌కు తిరిగొచ్చేటప్పుడు సైనిక విమానంలో కాళ్లు కట్టేశారు. తినడానికి, బాత్రూమ్కు పోవడానికి కూడా చాలా కష్టమైంది. ఏకధాటిగా 36 గంటలు చేతులకు బేడీలు వేశారు. అమృత్‌సర్‌లో దిగడానికి 10 నిమిషాల ముందు మాత్రమే చేతులకు బేడీలు తీశారు’’అని జతీందర్ సింగ్ చెప్పారు. ఆహారం, నీరు అడిగితే దాడులే పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాకు చెందిన లవ్‌ప్రీత్ సింగ్‌ది మరో దీనగాథ. ఏడాది క్రితం ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అమెరికా కలతో ఏజెంట్ల చేతికి చిక్కాడు. పనామా అడవుల గుండా ప్రయాణించి, మెక్సికో నుంచి అమెరికా సరిహద్దు దాటేందుకు ప్రయతి్నస్తుండగా, అక్కడి అధికారులు అరెస్టు చేశారు. పనామా అడవులు చాలా ప్రమాదకరంగా ఉంటాయని, అడుగడుగునా పాములు, క్రూరమృగాలు, మొసళ్లు తారసపడుతుంటాయని చెప్పాడు. వాటి నుంచి తప్పించుకొని ముందుకెళ్లడం నిజంగా సాహసం చేయడమేనని అన్నాడు. ఆహారం, మంచినీరు అడిగితే ఏజెంట్లు దారుణంగా కొట్టారని, దూషించారని ఆవేదన వ్యక్తం చేశాడు. అయినప్పటికీ అన్నీ భరించామని పేర్కొన్నాడు. ఆస్తులు అమ్మేయాల్సి వచ్చింది అమృత్సర్ జిల్లాకు చెందిన జసూ్నర్ సింగ్‌కు అమెరికాలో ఉద్యోగం సంపాదించుకోవాలన్నది ఒక కల. అందుకోసం ఏజెంట్‌కు రూ.55 లక్షలు చెల్లించాడు. అందుకోసం కొన్ని ఆస్తులు, వాహనాలు, ఇంటి స్థలం అమ్మేయాల్సి వచ్చింది. డంకీ రూట్లో అమెరికాకు చేరుకోగానే అక్కడి అధికారులు అరెస్టు చేసి, వెనక్కి పంపించారు. కపుర్తలా జిల్లాకు చెందిన 20 ఏళ్ల నిశాంత్ సింగ్‌కు సైతం ఇలాంటి అనుభవమే ఎదురైంది. దట్టమైన అడవిలో 16 రోజులు నడిచానని అన్నాడు. కేవలం నీరు తాగుతూ ప్రాణాలు నిలబెట్టుకున్నానని పేర్కొన్నాడు. తనను అమెరికా పంపించడానికి తన కుటుంబం రూ.40 లక్షలు ఖర్చు చేసిందని వెల్లడించాడు. -
భారత్‌కు 116 మంది అక్రమ వలసదారుల రాక.. ఏ రాష్ట్రం వారు ఎక్కువగా ఉన్నారంటే?
అమృత్సర్: అమెరికా నుంచి భారత అక్రమ వలసదారులతో కూడిన రెండో విమానం శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో అమృత్సర్ విమానాశ్రయంలో ల్యాండయింది. రాత్రి 10 గంటలకు రావాల్సిన ఈ విమానం ఆలస్యమైంది. ఈ విమానంలో 119 మంది వలసదారులను పంపుతామని అమెరికా అధికారులు ప్రకటించినా, 116 మంది మాత్రం వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీరిలో అత్యధికంగా పంజాబ్‌కు చెందిన 65 మంది ఉన్నారు. ఆ తర్వాత హర్యానాకు చెందిన 33 మంది, గుజరాత్ నుంచి 8 మంది, యూపీ, గోవా, మహారాష్ట్ర, రాజస్తాన్‌ల నుంచి ఇద్దరు చొప్పున, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. వీరంతా 18–30 ఏళ్ల మధ్య వారేనని అధికార వర్గాలు తెలిపాయి. అమెరికా నుంచి మొదటి విడతలో ఈ నెల 5న 104 మంది అక్రమ వలసదారులు భారత్‌కు రావడం తెలిసిందే. #WATCH | Punjab | The second batch of illegal Indian immigrants who were deported from the US and brought to Amritsar today are now being sent to their respective states. Visuals from outside of the Amritsar airport pic.twitter.com/T3MLtrmAVO— ANI (@ANI) February 15, 2025 -
చెన్నైయిన్ విజయం
చెన్నై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో చెన్నైయిన్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) వరుసగా రెండో విజయం నమోదు చేసుకుంది. శనివారం జరిగిన పోరులో చెన్నైయిన్ ఎఫ్‌సీ 2–1 గోల్స్ తేడాతో పంజాబ్ ఎఫ్‌సీపై విజయం సాధించింది. చెన్నైయిన్ జట్టు తరఫున విల్మార్ జోర్డాన్ గిల్ (19వ నిమిషంలో), డానియల్ చిమ చుకువా (84వ నిమిషంలో) చెరో గోల్ చేశారు. పంజాబ్ జట్టు తరఫున లూకా మాజ్కెన్ (48వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించాడు. మ్యాచ్‌లో ఇరు జట్లు చెరో 12 షాట్లు ఆడాయి. అందులో ఐదేసి సార్లు ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై దాడి చేశాయి. అయితే మ్యాచ్ ఆరంభంలోనే జోర్డాన్ గిల్ గోల్‌తో చెన్నైయిన్ జట్టు ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత పంజాబ్ జట్టు స్కోరు సమం చేసినా... మ్యాచ్ మరికాసేపట్లో ముగుస్తుందనగా... చెన్నైయిన్ మరో గోల్‌తో విజయం సాధించింది. తాజా సీజన్లో 21 మ్యాచ్‌లు ఆడిన చెన్నైయిన్ 6 విజయాలు, 9 పరాజయాలు, 6 ‘డ్రా’లతో 24 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో 10వ స్థానంలో ఉంది. శనివారమే జరిగిన మరో మ్యాచ్‌లో మోహన్ బగాన్ జట్టు 3–0 గోల్స్ తేడాతో కేరళా బ్లాస్టర్స్‌పై గెలుపొందింది. జేమీ మెక్లారెన్ (18వ, 40వ నిమిషాల్లో) డబుల్ గోల్స్‌తో విజృంభించగా... అల్బర్టో రోడ్రిగోజ్ (66వ నిమిషంలో) మరో గోల్ సాధించాడు. తాజా సీజన్లో 21 మ్యాచ్‌లు ఆడిన మోహన్ బగాన్ జట్టు 15 విజయాలు, 2 పరాజయాలు, 4 ‘డ్రా’లతో 49 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక ‘టాప్’లో సాగుతోంది. లీగ్‌లో భాగంగా ఆదివారం జరగనున్న మ్యాచ్‌లో మోహమ్మదన్ స్పోర్ట్స్ క్లబ్‌తో ఈస్ట్ బెంగాల్ జట్టు తలపడుతుంది. -
ట్రంప్ దూకుడు.. మరో 119 మంది భారతీయులు వెనక్కి..
చండీగఢ్: అగ్ర రాజ్యం అమెరికా నుంచి అక్రమ వలసదారులను వెనక్కి పంపించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగానే భారత్‌కు చెందిన మరో 119 మంది అక్రమ వలసదారులు రెండు విమానాల్లో స్వదేశం చేరుకోనున్నారు. తొలి విమానం శనివారం రాత్రి 10 గంటలకు అమృత్సర్ చేరుకునే అవకాశాలు ఉన్నాయి.భారత్‌కు చెందిన అక్రమ వలసదారులను తిరిగి పంపించే కార్యక్రమం కొనసాగుతోంది. ఈ క్రమంలో అమెరికా మరో రెండు విమానాల్లో భారతీయులను స్వదేశానికి పంపనుంది. తొలి విమానం సీ 17 గ్లోబ్ మాస్టర్-3.. 119 మందితో శనివారం రాత్రి 10 గంటలకు అమృత్‌సర్‌లో దిగనుంది. రెండో విమానం ఆదివారం ల్యాండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ విమానంలో ఎంత మందిని పంపించనున్నారన్న విషయం వెల్లడి కాలేదు. ఇక, తొలి విమానంలో రానున్న 119 మంది భారత వలసదారుల్లో 67 మంది పంజాబ్‌కు చెందినవారు. మిగతా వారు హర్యానా (33), గుజరాత్ (8), ఉత్తర్‌ప్రదేశ్ (3), గోవా (2), మహారాష్ట్ర (2), రాజస్థాన్ (2), హిమాచల్ ప్రదేశ్(1), జమ్ము కశ్మీర్ (1)వాసులుగా గుర్తించారు.ఇక, గతవారం.. సైనిక విమానంలో అమెరికా 104 మంది అక్రమ వలసదారులను పంపిన సంగతి తెలిసిందే. అమెరికా నుంచి వస్తున్న విమానాలు అమృత్సర్ విమానాశ్రయంలోనే దిగుతున్న నేపథ్యంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో సీఎం మాన్ మాట్లాడుతూ..‘119 మంది అక్రమ వలసదారుల్లో 67 మంది పంజాబ్‌కు చెందిన వారని.. అందుకే అమృత్‌సర్‌లో విమానం ల్యాండ్ చేస్తున్నామని వాళ్లు చెబుతున్నారు. అలా అయితే.. మొదట వచ్చిన విమానం అహ్మదాబాద్‌లో ఎందుకు దిగలేదు?. ఇప్పుడు రెండో విమానం వస్తోంది. ఇది కూడా అమృత్సర్ విమానాశ్రయంలోనే దిగనుంది. అమృత్‌సర్‌నే ఎందుకు ఎంపిక చేసుకుంటున్నారు. ఢిల్లీలో ఎందుకు దించడం లేదు. కేవలం పంజాబ్ ప్రతిష్ఠను దిగజార్చాలని కేంద్రం ప్రయత్నిస్తోంది’ అంటూ ఆరోపణలు చేశారు. #WATCH | Amritsar | Punjab CM Bhagwant Mann says, "There is a conspiracy to defame Punjab and Punjabis... The first plane landed in Amritsar... Now, a second plane (carrying Indian citizens who allegedly illegally migrated to the US) will land in Amritsar... The MEA should tell… pic.twitter.com/dJfn6Abx0V— ANI (@ANI) February 15, 2025 -
ఢిల్లీలో ఆప్ ఓటమి.. నెక్ట్స్ పంజాబే : స్వాతి మలివాల్
ఢిల్లీ : పంజాబ్‌లో ఇసుక తవ్వకాలు, బదిలీ పోస్టింగ్‌లలో భారీ అవినీతి జరుగుతుందని ఆమ్ ఆద్మీ ఎంపీ స్వాతి మలివాల్ ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై విమర్శలు గుప్పించారు. కొంతమంది పంజాబ్‌ను తమ వ్యక్తిగత ఏటీఎంలా భావిస్తున్నారు. పరిస్థితుల్ని సరిదిద్ధకపోతే ఢిల్లీలాగే పంజాబ్‌ను కూడా కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఢిల్లీలో ఓటమి తర్వాత పంజాబ్‌లో ప్రభుత్వ మార్పు, ఆప్ నేతలతో కేజ్రీవాల్ సమావేశం వంటి పరిణామల నేపథ్యంలో మలివాల్ మీడియాతో మాట్లాడారు. ‘కేజ్రీవాల్ తన గూండా బిభవ్ కుమార్‌ను భగవంత్ మాన్ ముఖ్య సలహాదారుగా నియమించారు. పంజాబ్‌లో దోచుకున్న మొత్తాన్ని ఢిల్లీకి తరలిస్తున్నారు. పంజాబ్ ఇసుక మాఫియా గుప్పిట్లో ఉంది. రాష్ట్ర ప్రభుత్వ విభాగాలలో బదిలీ పోస్టింగ్‌ల విషయానికి వస్తే ప్రతి దశలోనూ అవినీతి జరుగుతుందని దుయ్యబట్టారు. ఢిల్లీ ఓటమి తర్వాత పంజాబ్‌లో ఆప్ సీఎం,ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడాన్ని కూడా మలివాల్ ప్రశ్నించారు. ఈ అత్యవసర సమావేశం కారణంగా పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేలు గందరగోళం, కోపంతో ఉన్నారు. ఢిల్లీలో ఓటమి తర్వాత కేజ్రీవాల్ పంజాబ్‌పై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకి క్రేజీవాల్ పంజాబ్‌కి ఏం చేశారు?అని ప్రశ్నించారు. -
సోనుసూద్‌ను అరెస్ట్ చేయండి.. కోర్టు ఆదేశాలు
పాటియాలా: ప్రముఖ నటుడు సోనుసూద్‌కు బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది పంజాబ్‌లోని లూథియానా కోర్టు. ఈ మేరకు సోనుసూద్‌ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. మోసం కేసులో వాంగ్మూలం ఇవ్వడానికి రాకపోవడంతో కోర్టు ఇలా ఆదేశించింది.వివరాల ప్రకారం.. నటుడు సోనుసూద్ (Sonu Sood)కు లూథియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కాగా, లుథియానాకు చెందిన న్యాయవాది రాజేశ్ ఖన్నా తనకు మోహిత్ శర్మ అనే వ్యక్తి రూ.10 లక్షలు మోసం చేశాడని కోర్టులో కేసు వేశారు. రిజికా కాయిన్ పేరుతో తనతో పెట్టుబడి పెట్టించినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో సదరు న్యాయవాది సోనూసూద్‌ను సాక్షిగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పిటిషన్‌పై విచారణ చేపట్టిన లూథియానా కోర్టు.. సోనుసూద్‌కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.పిటిషన్‌పై విచారణ అనంతరం..‘సోనుసూద్‌కు పలుమార్లు సమన్లు పంపించినప్పటికీ అతను హాజరుకాలేదు. వెంటనే అతడిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టాలి అని ఈ సందర్భంగా మేజిస్ట్రేట్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఈ కేసు ఈ నెల 10న మరోసారి విచారణకు రానుంది. ఇక, సోనుసూద్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. సోనుసూద్ తెలుగు సహా బాలీవుడ్లో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.Ludhiana’s Judicial Magistrate Ramanpreet Kaur has issued an arrest warrant against Bollywood actor Sonu Sood.The warrant was issued after Sonu Sood failed to appear in court to testify in a ₹10 lakh fraud case involving the fake Rijika coin. The case was filed by… pic.twitter.com/yZ5R3gk32p— Gagandeep Singh (@Gagan4344) February 6, 2025 -
కెనడా ప్రధాని రేసులో...రూబీ దల్లా!
కెనడా ప్రధాని పదవి కోసం మరో భారతీయ నేత తలపడనున్నారు. ప్రస్తుత ప్రధాని జస్టిన్ ట్రూడో త్వరలో బాధ్యతల నుంచి తప్పుకుంటుండటం తెలిసిందే. అధికార లిబరల్ పార్టీ సారథ్య బాధ్యతలను కూడా వదులుకోనున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో లిబరల్ పార్టీ నేత పదవికి భారత సంతతికి చెందిన పార్టీ నాయకురాలు రూబీ దల్లా పోటీ పడనున్నారు. రూబీ దల్లా తల్లిదండ్రులు పంజాబ్ నుంచి కెనడా వలస వెళ్లారు. ఆమె కెనడాలో మనిటోబాలోని విన్నిపెగ్‌లో జన్మించారు. బయో కెమిస్ట్రీ, ఆరోగ్య సంరక్షణలో డిగ్రీ చేశారు. కొంతకాలం ఆరోగ్య సంరక్షకురాలు (చిరోప్రాక్టర్)గా పని చేశారు. తర్వాత అందాల పోటీల్లో, సినిమాల్లోనూ రాణించారు. 1993లో మిస్ ఇండియా–కెనడా పోటీల్లో రెండో స్థానంలో నిలిచారు. అనంతరం పారిశ్రామికవేత్తగా రాణించారు. దల్లా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సీఈఓగా ఉన్నారు. కెనడా పార్లమెంటుకు మూడుసార్లు వరుసగా ఎన్నికైన తొలి భారత సంతతి మహిళగా నిలిచారు. అదే ఊపులో ఆ దేశ ప్రధాని పదవి చేపట్టిన తొలి నల్లజాతి మహిళగా కూడా రికార్డు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. 2008లో జరిగిన ఓ సర్వేలో కెనడా పార్లమెంటులో సెక్సీయెస్ట్ ఎంపీల్లో రూబీ మూడో స్థానంలో నిలిచారు. అదే ఏడాది మాక్సిమ్ మేగజైన్ ఆమెకు ప్రపంచంలోని హాటెస్ట్ రాజకీయవేత్తల్లో మూడో ర్యాంకు ఇచ్చింది. తాను ప్రధాని అయితే అక్రమ వలసదారులందరినీ కెనడా నుంచి పంపించేస్తానని ప్రకటించడం ద్వారా రూబీ ఇటీవలే వార్తల్లో నిలిచారు. అందుకు తన వద్ద స్పష్టమైన ప్రణాళికలున్నాయని కూడా చెప్పుకొచ్చారు. పార్టీ సారథ్యం, ప్రధాని పదవి విషయంలో బ్యాంక్ ఆఫ్ కెనడా గవర్నర్ మార్క్ కార్నీ, మాజీ ఆర్థిక మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్ నుంచి ఆమె గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. లిబరల్ పార్టీ తదుపరి నేత ఎవరన్నది మార్చి 9న తేలే అవకాశముంది. పదేళ్ల వయసులోనే ఇందిరకు లేఖ పదేళ్ల వయసులోనే నాటి భారత ప్రధాని ఇందిరాగాం«దీకి లేఖ రాసి రూబీ ఔరా అనిపించారు. పంజాబ్‌లో అస్థిరత, అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయంపై చేపట్టిన బ్లూస్టార్ సైనిక చర్యలపై తన అభిప్రాయాలను లేఖలో సూటిగా వెల్లడించారు. ‘‘పంజాబ్ హింసాకాండను టీవీలో చూసి వికలమైన మనసులో మీకు లేఖ రాస్తున్నా. అమాయక సిక్కుల ఊచకోతను, స్వర్ణ దేవాలయంపై దాడులను దయచేసి అడ్డుకోండి. సమస్యను ఇరు వర్గాలూ చర్చల ద్వారా పరిష్కరించుకుంటే మేలు. ఈ విషయంలో నేను చేయగల సాయమేమైనా ఉంటే దయచేసి చెప్పండి’’ అంటూ రాశారు. ఆ లేఖకు ఇందిర బదులివ్వడమే గాక ఈ విషయాన్ని మీడియాతో కూడా పంచుకున్నారు! చిన్నారి రూబీని భారత్‌కు ఆహ్వానించారు. కానీ ఆలోపే ఇందిర హత్యకు గురయ్యారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
శతకంతో చెలరేగిన శుబ్‌మన్ గిల్.. కానీ..
టీమిండియా స్టార్ క్రికెటర్, పంజాబ్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్(Shubman Gill) ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. రంజీ మ్యాచ్‌లో శతకంతో చెలరేగి తనను తాను నిరూపించుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో గిల్ విఫలమైన సంగతి తెలిసిందే. వరుస వైఫల్యాలుగాయం కారణంగా పెర్త్‌లో జరిగిన తొలి టెస్టుకు దూరమైన ఈ పంజాబీ బ్యాటర్.. రెండో టెస్టు నుంచి అందుబాటులోకి వచ్చినా పెద్దగా రాణించలేకపోయాడు. అడిలైడ్‌లో జరిగిన ఈ పింక్ బాల్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 59(31, 28) పరుగులు చేశాడు. అయితే, గబ్బాలో జరిగిన మూడో టెస్టులో గిల్ తీవ్రంగా నిరాశపరిచాడు. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. అయితే, నాలుగో టెస్టు జట్టులో మాత్రం అతడికి చోటు దక్కలేదు. దీంతో బాక్సింగ్ డే టెస్టుకు దూరమైన గిల్.. ఆ తర్వాత సిడ్నీ టెస్టు ఆడినా అందులోనూ విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 20, 13 పరుగులు సాధించాడు.రంజీ బరిలో పంజాబ్ సారథిగాకాగా కంగారూ గడ్డపై ఐదు టెస్టుల సిరీస్‌లో ఓవరాల్‌గా 93 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ నేపథ్యంలో శుబ్‌మన్ గిల్ ఆట తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో బోర్డు నిబంధనలకు అనుగుణంగా రంజీ ట్రోఫీ బరిలో దిగాడు. తాజా ఎడిషన్ రెండో దశ పోటీల్లో భాగంగా కర్ణాటకతో మ్యాచ్ సందర్భంగా ఈ పంజాబ్ ఓపెనర్ రంగంలోకి దిగాడు.మొదటి ప్రయత్నంలో విఫలంఅయితే, మొదటి ప్రయత్నంలో గిల్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. తొలి ఇన్నింగ్స్‌లో ఎనిమిది బంతులు ఎదుర్కొని కేవలం నాలుగు పరుగులే చేసి.. అవుటయ్యాడు. కర్ణాటక పేసర్ అభిలాష్ శెట్టి బౌలింగ్‌లో క్రిష్ణన్ శ్రీజిత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. గిల్‌తో పాటు పంజాబ్ మిగతా బ్యాటర్లు కూడా దారుణంగా విఫలం కావడంతో తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకే ఆలౌట్ అయింది.స్మరణ్ డబుల్ సెంచరీఈ క్రమంలో కర్ణాటక స్టార్ రవిచంద్రన్ స్మరణ్ (277 బంతుల్లో 203; 25 ఫోర్లు, 3 సిక్స్‌లు) డబుల్ సెంచరీతో విజృంభించగా.. జట్టు భారీ స్కోరు సాధించింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఏకంగా 475 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ (20), దేవదత్ పడిక్కల్ (27) ఎక్కువసేపు నిలవలేకపోయిన చోట స్మరణ్ చక్కటి ఇన్నింగ్స్‌తో జట్టుకు భారీ స్కోరు అందించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకు ఆలౌటైన పంజాబ్... శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 24 పరుగులు చేసింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (1), అన్మోల్ప్రీత్ సింగ్ (14) అవుట్ అయ్యారు.గిల్ సూపర్ ఇన్నింగ్స్.. కానీఈ నేపథ్యంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న శుబ్‌మన్ గిల్ మూడో రోజు ఆటలో భాగంగా సెంచరీతో చెలరేగాడు. చిన్నస్వామి స్టేడియంలో శనివారం 159 బంతుల్లో వంద పరుగుల మార్కు అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో పద్నాలుగు ఫోర్లు, మూడు సిక్స్‌లు ఉన్నాయి. గిల్ ఓవరాల్‌గా 171 బంతుల్లో 102 పరుగులు సాధించగా.. మిగతా వాళ్ల నుంచి మాత్రం సహకారం అందలేదు. ఈ క్రమంలో 213 పరుగులకు ఆలౌట్ అయిన పంజాబ్.. కర్ణాటక చేతిలో ఇన్నింగ్స్ 207 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది.చదవండి: అతడిని తప్పించి మంచి పనిచేశారు.. ఇదొక విన్నింగ్ టీమ్: డివిలియర్స్Shubman Gill gets his century.. a fine & confident innings #RanjiTrophy #KarvsPun pic.twitter.com/iA1gm6I1Ib— Manuja (@manujaveerappa) January 25, 2025Shubman Gill Celebration after One of best Hundred under pressure in Ranji trophy match against Karnataka 💥📹📷 @Sebashiyun pic.twitter.com/7IMnWegWSy— JassPreet (@JassPreet96) January 25, 2025 -
పగబట్టినట్టు గుంపుగా దాడిచేసిన కుక్కలు: వైరల్ వీడియో
కుక్కలు చాలా విశ్వాసంగా ఉంటాయి. కాసిన్ని గంజినీళ్లు పోసినా కూడా చాలా కృతజ్ఞతతో ఉంటాయి. కళ్లలోనే ప్రేమను చూపిస్తూ మనిషితో చాలా స్నేహంగా ఉంటాయి. కానీ ఇటీవలి కాలంలో వీధికుక్కల దాడులు బాగా పెరగడం దడ పుట్టిస్తోంది. తాజాగా పంజాబ్‌లో ఒక వృద్ధురాలిపై దారుణంగా కుక్కలు దాడి చేశాయి. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డైనాయి.పంజాబ్‌లోని ఖన్నాలోని ధనిక నాయి అబాది ప్రాంతంలోఈ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో పనిచేస్తున్న వృద్ధ మహిళపై కుక్కల గుంపు దాడి చేసింది. ఆ మహిళ కుక్కల నుండి తప్పించుకోవడానికి పరుగెత్తుకుంటూ వెళ్లినప్పటికీ, పాపం తప్పించు కోలేకపోయింది. సెకన్లలోనే, ఒక కుక్క ఆమె కాలు పట్టి లాగేసింది. అలా ఒకటీ రెండూ కాదు ఏకంగా ఐదు కుక్కల ఒకేసారి ఆమెమీదకు లంఘించాయి కిందకు తోసి, చేయి , ముఖం మీద ఇష్టమొచ్చినట్టు కరిచాయి. ఈడ్చుకెళ్లిపోయాయి. అయితే ఈ సమయంలో, ఒక వ్యక్తి దూరంగా నుంచే ఒక వస్తువును విసిరాడు. దీంతో అవి కొద్దిగా వెనక్కు తగ్గాయి. మరి కాసేపట్లోనే కొంతమంది మహిళలు గుమిగూడి వాటిని చెదరగొట్టారు. తీవ్రంగా గాయపడిన మహిళను రక్షించారు. కనీసం 15 చోట్ల గాయాలైనట్టు గుర్తించారు. గాయాలకు 40 కుట్టు వేసినట్టు తెలుస్తోంది.మరోవైపు ఈ వారంలో తనపై కుక్కలు దాడి చేయడం ఇది మూడోసారి అని చెప్పింది బాధిత మహిళ కన్నీళ్లతో. అదే ప్రాంతంలో నివసించే జోగిందర్ సింగ్‌ది ఇలాంటి అనుభవమే. ఈ ప్రాంతంలో కుక్కల దాడి పెరుగుతోందని, తనను నాలుగుసార్లు కరిచాయని తెలిపారు. దీనిపై చర్యలు చేపట్టాల్సిందిగా ఆ ప్రాంత వాసులు కోరుతున్నారు.ఉన్నట్టుండి కుక్కలు (ఇతర జంతువులు) దాడి చేస్తే ఏం చేయాలి? కుక్కలు కనిపించిన వెంటనే మనం పరుగులు పెట్టకూడదు.అక్కడే నిలబడి గట్టిగా అదిలించాలి. చేతిలో ఏది ఉంటే దానితో బెదిరించాలి.కుక్కలు భయపెడుతూ, మొరుగుతున్నపుడు నడక ఆపి, అవి మొరగడంఆపాకనెమ్మదిగా అక్కడ నుంచి మెల్లిగా అక్కడినుంచి పక్కకి వెళ్లాలి.కళ్లలోకి సూటిగా చూడకూడదు. లేదంటే వాటిని రెచ్చ గొడుతున్నట్లుగా, వాటికి హాని చేస్తున్నట్టుగా భావిస్తాయి. మనం వేసుకున్న రంగులు వాటికి కొన్నిసార్లు నచ్చకపోవచ్చు. ఇందులో మనం ధరించే విచిత్రమైన కలర్ దుస్తువులు, వస్తువులకు కూడా అవి రియాక్ట్ అవుతాయి. ఉదాహరణకు ఎర్ర చొక్కా, నల్ల టోపీ, కళ్లద్దాలు లాంటివి పెట్టుకున్న క్యాప్ తీసేయడం కళ్లద్దాలు తొలగించడం బెటర్.ఇదీ చదవండి: దివ్యాంగుల్లో కొత్త వెలుగులు, మన ‘సారా’ సేవకే అంకితం -
లడ్డూలిస్తా వదిలేయండి సార్.. చలాన్‌కు లడ్డూ లంచమా?!
ట్రాఫిక్, పోలీసులు అనగానే, ట్రాఫిక్ సిగ్నల్ జంప్, నిబంధనలను ఉల్లంఘన, చలాన్లు ఇవన్నీ గుర్తొస్తాయి కదా.. కానీ పెళ్లి, పెళ్లికూతురు, లడ్డూలు ఇలాంటివేమీ అస్సలు ఊహించం కదా. పంజాబ్‌లో ఇలాంటి అసాధారణ సంఘటన ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.పెళ్లి అంటేనూరేళ్ల పంట. ఆ అందమైనక్షణాలను కలకాలం గుర్తుండిపోయేలా పదిలపర్చుకోవాలని అందరూ భావిస్తారు. ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ దగ్గర్నుంచి హనీమూన్ దాకా ప్రతీదీ స్పెషల్‌గా ప్లాన్ చేసుకుంటారు. ఇందులో చిన్న చిన్న సర్‌ప్రైజ్‌ల వరకూ ఉంటాయి. మరికొన్ని వివాహాలలో మాంసాహారం లేదనో, వండ లేదనీ, మర్యాదలు బాగా జరగలేదు లాంటి ఆవేశకావేశాలు, కోపతాపాలు కామన్‌గా ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఆంచల్ అరోరాకు ఊహించని అనుభవం ఎదురైంది. పెళ్లి, హల్దీ వేడుక హడావిడిలో ట్రాఫిక్ సిగ్నల్‌ను జంప్ చేసేసింది. ఇది కాస్త పోలీసు (పంజాబీ) అధికారుల కంటబడింది. ఊరుకుంటారా మరి.. ట్రాఫిక్ ఉల్లంఘన అంటూ కారు ఆపారు. ఇక్కడే ఆసక్తికరమైన సంఘటన జరిగింది.దీంతో హల్దీ వేడుక ముస్తాబులో ఉన్న ఆంచల్.. చిరునవ్వుతో అధికారులను పలకరిస్తూ, "మేరీ హల్దీ హై, జాన్ దో (ఇది నా హల్దీ వేడుక, దయచేసి నన్ను వెళ్లనివ్వండి.)" అని వేడుకుంది.ఇది విన్న పోలీసుల మనసు కరిగింది. సరే పెళ్లి కదా అనుకొని ఆమెను వెళ్లనివ్వాలని ఎంచుకున్నారు. చలాన్ రద్దు చేయాలని కూడా నిర్ణయించుకున్నారు. అయితే పెళ్లి.. సరే.. కాస్త నోరు తీపి చేసి పోరాదా (ముహ్ మిథా కర్కే జానా”) అని అడిగారు సరదాగా. తప్పకుండా “లడ్డూ కా డబ్బా పక్కా” అని బదులిచ్చింది. దీంతో అక్కడున్న వారంతా నవ్వుల పువ్వులయ్యారు. షాదీ ముబారక్ చెప్పి ఆశీర్వాదాలు అందిస్తూ అక్కడినుంచి వెళ్లిపోయారు అధికారులు. దీనికి సంబంధించిన వీడియోను ప్రస్తుతం నెట్టింట తెగ సందడి చేస్తోంది. అంతేకాదు అదే పెళ్లి కొడుకు అయితే పరిస్థితి వేరేలా ఉండేది అంటూ నెటిజన్లు కామెడీగా స్పందించారు. లడ్డూ లంచం అని ఒకరు వ్యాఖ్యానించారు. ‘‘అదే అబ్బాయైతే.. పొట్టు పొట్టు కొట్టేవాళ్లు..("అభి లడ్కా హోతా తో నంగా కర్కే మార్తా యూజ్") పెళ్లి కొడుకైతే చలానా పక్కా ఇచ్చేవాళ్లు అంటూకే కా బ్యా హోతా తో.. పక్కా చలాన్ థా.") అంటూ కమెంట్ చేయడంతో మరికొంతమంది కూడా హా .. అవును అంటూ స్పందించడం విశేషం. View this post on Instagram A post shared by Jist (@jist.news) -
Shubman Gill: అక్కడే కాదు.. ఇక్కడా ఫెయిల్!.. సింగిల్ డిజిట్ స్కోర్
దేశవాళీ క్రికెట్ పునరాగమనంలో టీమిండియా స్టార్ శుబ్‌మన్ గిల్(Shubman Gill) పూర్తిగా నిరాశపరిచాడు. పంజాబ్(Punjab) తరఫున బరిలోకి దిగిన ఈ ఓపెనింగ్ బ్యాటర్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. కాగా గత కొంతకాలంగా భారత ప్రధాన ఆటగాళ్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శుబ్‌మన్ గిల్ తదితరులు టెస్టుల్లో విఫలమవుతున్న విషయం తెలిసిందే.తారలు దిగి వచ్చారుఈ క్రమంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కీలక ఆదేశాలు జారీ చేసింది. జాతీయ జట్టు తరఫున విధుల్లో లేనపుడు ప్రతి ఒక్కరు దేశవాళీ క్రికెట్ ఆడాలన్న నిబంధనలు కఠినతరం చేసింది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ముంబై తరఫున.. రిషభ్ పంత్ ఢిల్లీ తరఫున.. శుబ్‌మన్ గిల్ పంజాబ్ తరఫున రంజీ ట్రోఫీ(Ranji Trophy) సెకండ్ లెగ్ బరిలో దిగారు. కోహ్లి మాత్రం మెడనొప్పి వల్ల ఢిల్లీ జట్టుకు దూరంగా ఉన్నాడుపంజాబ్ ఓపెనర్‌గా గిల్ విఫలంఇక బెంగళూరు వేదికగా కర్ణాటక- పంజాబ్ మధ్య గురువారం మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన కర్ణాటక.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ప్రభ్‌సిమ్రన్ సింగ్‌తో కలిసి శుబ్‌మన్ గిల్ పంజాబ్ ఇన్నింగ్స్ ఆరంభించాడు. అయితే, కర్ణాటక బౌలర్ అభిలాష్ శెట్టి వరుస ఓవర్లలో ఓపెనింగ్ జోడీని విడగొట్టాడు. ఈ లెఫ్టార్మ్ పేసర్ బౌలింగ్‌లో తొలి వికెట్‌గా గిల్ వెనుదిరిగాడు.కర్ణాటక పేసర్ల జోరుమొత్తంగా ఎనిమిది బంతులు ఎదుర్కొన్న గిల్.. ఒకే ఒక్క ఫోర్ కొట్టి నిష్క్రమించాడు. క్రిష్ణన్ శ్రీజిత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరోవైపు.. ప్రభ్‌సిమ్రన్ సింగ్ 28 బంతుల్లో ఒక ఫోర్ సాయంతో ఆరు పరుగులు చేసి.. అభిలాష్ శెట్టి బౌలింగ్‌లో అనీశ్ కేవీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఇక మరో పేసర్ వాసుకి కౌశిక్ కూడాపంజాబ్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.వన్‌డౌన్ బ్యాటర్ బ్యాటర్ ఫుఖ్రాజ్ మన్(1)తో పాటు.. నాలుగో స్థానంలో వచ్చిన అన్మోల్ప్రీత్ సింగ్(0)ను సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్ చేర్చాడు. ఈ క్రమంలో ఆరంభంలోనే నాలుగు వికెట్లు కోల్పోయిన 10 ఓవర్లలో కేవలం 19 పరుగులు మాత్రమే చేసి.. కష్టాల్లో కూరుకుపోయింది.బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో గిల్ ఫ్లాఫ్ షోకాగా ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో శుబ్‌మన్ గిల్ విఫలమైన విషయం తెలిసిందే. గాయం వల్ల తొలి టెస్టుకు దూరమైన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. రెండో టెస్టు నుంచి అందుబాటులోకి వచ్చాడు. అడిలైడ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో గిల్ రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 31, 28 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.అయితే, గబ్బా మైదానంలో జరిగిన మూడో టెస్టులో మాత్రం ఒక్క పరుగుకే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో మెల్బోర్న్ బాక్సింగ్ డే టెస్టుకు దూరంగా ఉన్న ఈ వన్‌డౌన్ బ్యాటర్.. ఆఖరిదైన సిడ్నీ టెస్టులో 20, 13 పరుగులు చేశాడు. మొత్తంగా ఆస్ట్రేలియాతో ఈ ఐదు టెస్టుల సిరీస్‌లో శుబ్‌మన్ గిల్ కేవలం 93 పరుగులు మాత్రమే చేశాడు. రోహిత్- జైస్వాల్ కూడా ఫెయిల్ఇందులో ఒక్క అర్ధ శతకం కూడా లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో రంజీ బరిలో దిగి ఫామ్‌లోకి రావాలని ఆశించిన గిల్‌కు మొదటి ప్రయత్నంలోనే చుక్కెదురైంది. కర్ణాటకతో మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లోనైనా అతడు రాణిస్తాడేమో చూడాలి! మరోవైపు.. జమ్మూ- కశ్మీర్‌తో మ్యాచ్‌లో ముంబై ఓపెనర్లు యశస్వి జైస్వాల్- రోహిత్ శర్మ కూడా ఫెయిలయ్యారు. జైస్వాల్ నాలుగు, రోహిత్ మూడు పరుగులు మాత్రమే చేసి అవుటయ్యారు. చదవండి: NADA: బుమ్రా, సూర్య, పంత్, సంజూ శాంసన్.. ఇంకా.. -
ఎమ్మెల్యే గురుప్రీత్ గోగిని కాల్చి చంపిన దుండగులు
-
ప్రమాదవశాత్తూ పేలిన తుపాకీ.. పంజాబ్ ఆప్ ఎమ్మెల్యే మృతి
లూధియానా: పంజాబ్‌కు చెందిన ఆప్ నేత, లూధియానా (వెస్ట్) ఎమ్మెల్యే గుర్ప్రీత్ బస్సి గోగి(58) ప్రమాదవశాత్తూ బుల్లెట్ గాయంతో చనిపోయారు. శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో ఆయన తన లైసెన్స్డ్ పిస్టల్‌ను శుభ్రం చేస్తుండగా అనుకోకుండా పేలి కణత నుంచి బుల్లెట్ దూసుకెళ్లడంతో చనిపోయారని కుటుంబసభ్యులు, ఆప్ నేతలు తెలిపారు. తీవ్రంగా గాయపడిన గుర్‌ప్రీత్‌ను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారని జాయింట్ పోలీస్ కమిషనర్ జస్కరణ్ సింగ్ తేజ తెలిపారు. ఇది అనుకోకుండా జరిగిన ఘటన అని కుటుంబసభ్యులు తెలిపారన్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని చెప్పారు. ఎమ్మెల్యే గుర్‌ప్రీత్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఘటనకు కొద్ది గంటలకు ముందు గుర్ప్రీత్ బుద్ధా నల్లాలో వ్యర్థాల తొలగింపుపై స్పీకర్ కుల్తార్ సింగ్, ఎంపీ బల్బీర్ సింగ్‌పై చర్చలు జరిపారని ఆప్ నేత ఒకరు వెల్లడించారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో లూధియానా(వెస్ట్)నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గుర్ప్రీత్ రెండు పర్యాయాలు ఆ సీటును గెలుచుకున్న భరత్ భూషణ్‌పై విజయం సాధించారు. అంతకుముందు, లూధియానా మున్సిపల్ కౌన్సిలర్‌గా రెండు పర్యాయాలు ఎన్నికయ్యారు. గత నెలలో లూధియానా మున్సిపల్ ఎన్నికల్లో ఆయన భార్య సుఖ్‌చెయిన్ కౌర్ గోగి పోటీ చేసి ఓటమి చెందారు. బుద్ధా నల్లా నవీకరణ పనుల్లో జాప్యం అవుతున్నందుకు నిరసనగా గతేడాది శంకుస్థాపన ఫలకాన్ని ధ్వంసం చేసి గుర్ప్రీత్ వార్తల్లో కెక్కారు. ఎమ్మెల్యే గుర్ప్రీత్ ఆకస్మిక మృతిపై సీఎం భగవంత్ సింగ్మాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాజీ సీఎం, బీజేపీ నేత అమరీందర్ సింగ్, పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ వారియర్ తదితరులు సంతాపం తెలిపారు. Breaking: AAP MLA from Ludhiana West, Gurpreet Gogi, has died from a gunshot wound to the head. He was at his home when the incident occurred and was taken to DMC Hospital, where he was declared dead. The cause of death and further details are awaited. pic.twitter.com/7FfIafyksZ— Gagandeep Singh (@Gagan4344) January 10, 2025 -
ఆరేళ్ల బుడతడు.. వెయ్యి కిలోమీటర్లు పరిగెడుతూ అయోధ్యకు..
భక్తిలో గొప్ప శక్తి ఉందని పెద్దలు అంటారు. దీనికి పలు ఉదాహరణలు కూడా చెబుతారు. అటువంటి భక్తిని మదిలో నిలబెట్టుకున్నవారు అద్భుతాలు చేస్తుంటారు. ఈ కోవలోకే వస్తాడు ఆరేళ్ల బుడతడు మొహబ్బత్. ఈ చిన్నారికి రామ్‌లల్లాను చూడాలని అనిపించింది. అంతే తాను ఉంటున్న పంజాబ్ నుంచి అయోధ్యకు పరుగున ప్రయాణమయ్యాడు.నెల రోజులకుపైగా సమయంపంజాబ్ నుంచి యూపీలోని అయోధ్య(Ayodhya)కు వెయ్యి కిలోమీటర్ల దూరం ఉంది. ఇంతదూరం ప్రయాణించేందుకు మొహబ్బత్ ఎటువంటి బస్సు,రైలును ఉపయోగించలేదు. పరిగెడుతూనే గమ్యాన్ని చేరుకున్నాడు. ఇందుకోసం మొహబ్బత్‌కు నెల రోజులకుపైగా సమయం పట్టింది. ఎలాగైతేనేం చివరకు జనవరి 7 నాటికి అయోధ్య చేరుకుని, సరికొత్త రికార్డు సృష్టించాడు. ఫజిల్కా నుంచి ప్రయాణంపంజాబ్లోని ఫజిల్కా నుంచి మొహబ్బత్(mohabat) తన పరుగును ప్రారంభించాడు. తొలుత ఓ సైనికాధికారి ఆ చిన్నారి ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీని తరువాత మొహబ్బత్ ఒక నెలా ఇరవై మూడు రోజులు పరిగడుతూ అయోధ్యకు చేరుకున్నాడు. ఈ ప్రయాణంలో మొహబ్బత్ తల్లిదండ్రులు కూడా అతని వెంట ఉన్నారు. వారు ఈ ప్రయాణ సమయంలో అయోధ్య ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్‌తో టచ్‌లో ఉన్నారు. మొహబ్బత్ను పరుగును చూసి దారిలోని పలు గ్రామాల ప్రజలు ఆశ్చర్యపోయారు. అలాగే ఆ చిన్నారికి స్వాగతం పలుకుతూ, ప్రశంసలు కురిపించారు.పర్యావరణాన్ని కాపాడాలంటూ సందేశంమొహబ్బత్ తాను పరుగుసాగిస్తూ మత్తుపదార్థాలకు వ్యతిరేకంగా ప్రచారాన్ని నిర్వహించాడు. అలాగే పర్యావరణాన్ని కాపాడాలంటూ సందేశమిచ్చాడు. ఈ సందర్భంగా మొహబ్బత్ తండ్రి రింకూ కుమార్ మాట్లాడుతూ తమ కుమారుడు యూకేజీ చదువుతున్నట్లు తెలిపారు. రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాలను చూశాక, మెహబ్బత్ అయోధ్యకు పరిగెత్తుకుంటూ వెళ్లాలని నిర్ణయించుకున్నాడన్నారు. బాలల దినోత్సవం(Children's Day) సందర్భంగా ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం మొహబ్బత్ అయోధ్యకు పరుగు ప్రారంభించాడన్నారు.ప్రతిరోజూ 20 కిలోమీటర్ల దూరం..మొహబ్బత్ రాముని భక్తుడని, ప్రతిరోజూ 15 నుంచి 20 కిలోమీటర్ల దూరం పరిగెడుతూ, అయోధ్యకు చేరుకున్నాడన్నారు. గతంలో మొహబ్బత్ పంజాబ్‌లోని అబోహర్ నుండి లూథియానాకు పరుగుసాగించాడన్నారు. అప్పుడే అయోధ్యకు పరిగెత్తాలని నిర్ణయించుకున్నాడని రింకూ కుమార్ తెలిపారు. కాగా తమ కుమారుడిని అందరూ రన్ మెషిన్ మొహబ్బత్ అని పిలుస్తున్నారన్నారు. తమ కుమారుడు భవిష్యత్తులో అంతర్జాతీయ క్రీడాకారుడు అవుతాడని చాలామంది అంటున్నారని రింకూ కుమార్ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: డెలివరీ బాయ్.. జడ్జిగా మారితే.. యాసిన్ షా సక్సెస్ స్టోరీ -
మరింత క్షీణించిన దల్లేవాల్ ఆరోగ్యం
చండీగఢ్: పంజాబ్–హరియాణా సరిహద్దుల్లోని ఖనౌరీలో రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్ దీక్ష(70) ఆదివారం 41వ రోజుకు చేరుకుంది. ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో ఆయన సారథ్యంలోని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం–రాజకీయేతర) తీవ్ర ఆందోళన చెందింది. శనివారం స్ట్రెచర్ పైనుంచే మహా పంచాయత్‌ను ఉద్దేశించి ఆయన 11 నిమిషాలపాటు మాట్లాడారు. తిరిగి దీక్షా శిబిరంలోకి తీసుకెళ్లినప్పటి నుంచి ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించింది. ఆదివారం దల్లేవాల్ మగతలో ఉన్నారని, వాంతులు చేసుకున్నారని ఎన్జీవోకు చెందిన డాక్టర్ అవతార్ సింగ్ వెల్లడించారు. మూత్ర పిండాలు కూడా క్రమేపీ పనిచేయలేని స్థితికి చేరుకుంటున్నట్లు గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్(జీఎఫ్ఆర్)ను బట్టి తెలుస్తోందని చెప్పారు. దల్లేవాల్ కనీసం మాట్లాడలేని స్థితిలో ఉన్నారని ఎస్కేఎం నేతలు తెలిపారు. ఆయన దీక్షను విరమించినా కీలక అవయవాలు వంద శాతం పూర్తి స్థాయిలో పనిచేస్తాయన్న గ్యారెంటీ లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సరిగా నిలుచోలేని స్థితిలో ఉండటంతో బరువును కూడా కచ్చితంగా చెప్పలేకున్నామన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వైద్య సాయం అందించేందుకు పంజాబ్ ప్రభుత్వం ముందుకు రాగా ఆయన తిరస్కరించారు. దీంతో, పంజాబ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలపై ధిక్కారం కింద చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టు ముందు విచారణకు రానుంది. ఆదివారం దల్లేవాల్‌ను పటియాలా సీనియర్ సూపరింటెండెంట్ నానక్ సింగ్, మాజీ డిప్యూటీ డీఐజీ నరీందర్ భార్గవ్ కలిసి మాట్లాడారు. పంటల కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు చట్టబద్ధత కల్పించడం వంటి డిమాండ్లతో నవంబర్ 26 నుంచి నిరశన దీక్ష సాగిస్తుండటం తెలిసిందే. -
పంజాబ్‌లో రైతుల బంద్
చండీగఢ్: పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంసహా తమ పలు డిమాండ్ల సాధనకు ఉద్యమిస్తున్న పంజాబ్ కర్షకులు సోమవారం చేపట్టిన తొమ్మిది గంటల రాష్ట్రవ్యాప్త బంద్‌తో జనజీవనం స్తంభించింది. పంజాబ్ గుండా సాగే జాతీయ రహదారులపై రాస్తారోకోలు, రైల్వేపట్టాలపై బైఠాయింపులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైల్వే రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పంజాబ్–ఢిల్లీ రూట్లో రాకపోకలు సాగించే 163 రైళ్ల సర్వీసులు రద్దయ్యాయి. రాస్తారోకోలతో వాహనాల్లో జనం ఎక్కడికక్కడ చిక్కుకుపోయి అవస్థలు పడ్డారు. సోమవారం ఉదయం ఏడు గంటలకు మొదలెట్టి సాయంత్రం నాలుగు గంటలకు బంద్‌ను ముగిస్తామని రైతు సంఘాలు ప్రకటించినా బంద్ ప్రభావం రోజంతా కనిపించింది. పటియాలా, జలంధర్, అమృత్సర్, ఫిరోజ్‌పూర్, బఠిందా, పఠాన్కోట్లలో బంద్ ప్రభావం ఎక్కువగా కనిపించింది. పటియాలా–చండీగఢ్ జాతీయ రహదారిపై ధరేరీ జఠాన్ టోల్‌ప్లాజా వద్ద రైతులు రోడ్డుపై బైఠాయించడంతో కిలోమీటర్ల పొడవునా వాహ నాలు నిలిచిపోయి సామాన్యులు ఇబ్బందులపా లయ్యారు. VIDEO | Punjab: Shops remain closed, and buses are off the roads in Moga in the wake of shutdown called by protesting farmers.#PunjabBandh #PunjabNews(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/bxerq4Pm7u— Press Trust of India (@PTI_News) December 30, 2024అమృత్‌సర్‌లోని గోల్డెన్ గేట్‌సహా చాలా పట్టణాల్లో వేల సంఖ్యలో రైతులు బంద్‌లో పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా(రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాలు ఈ బంద్‌కు పిలుపునివ్వడం తెల్సిందే. గత 35 రోజులుగా ఖనౌరీ సరిహద్దు వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న రైతు సంఘం నేత జగ్జీత్సింగ్ ధల్లేవాల్‌కు బంద్ సందర్భంగా రైతులు సంఘీభావం ప్రకటించారు. మరోవైపు దీక్ష మొదలై 35 రోజులు పూర్తవడంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఇప్ప టికైనా తమ డిమాండ్లపై కేంద్రం దృష్టిసారించాలని సోమవారం ఒక వీడియో విన్నపంలో ధల్లేవాల్ కోరారు. -
పంజాబ్ ఓపెనర్ విధ్వంసం.. 14 ఫోర్లు, 10 సిక్స్‌లతో
విజయ్ హజారే ట్రోఫీ-2024లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ముంబై జట్టుకు పంజాబ్ ఊహించని షాకిచ్చింది. ఈ టోర్నీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో పంజాబ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 48.5 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది.పంజాబ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ 5 వికెట్లతో ముంబైను దెబ్బతీశాడు. శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే వంటి కీలక వికెట్లను అర్షదీప్ తన ఖాతాలో వేసుకున్నాడు. ముంబై బ్యాటర్లలో అంకోలేకర్(66) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సూర్యన్ష్ షెగ్దే(44), శార్ధూల్ ఠాకూర్(43) రాణించారు.ప్రభసిమ్రాన్ ఊచకోత..అనంతరం 249 పరుగుల లక్ష్య చేధనలో ప్రభసిమ్రాన్ సింగ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ప్రత్యర్ధి బౌలర్లను ప్రభసిమ్రాన్ ఊచకోత కోశాడు. కేవలం 101 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్స్‌లతో 150 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.అతడితో పాటు అభిషేక్ శర్మ(66) హాఫ్ సెంచరీతో రాణించాడు. ముంబై బౌలర్లలో శార్ధూల్ ఠాకూర్, అయూష్ మాత్రే తలా రెండు వికెట్లు సాధించారు. కాగా ఐపీఎల్-2025కు ముందు ప్రభసిమ్రాన్ సింగ్‌ను పంజాబ్ కింగ్స్ రిటైన్ చేసుకుంది.చదవండి: 'భారత క్రికెట్ చరిత్రలో ఇదే మొదటి సారి'.. రోహిత్‌పై ఎమ్ఎస్కే ఫైర్ -
అలా చేయొద్దు.. రైతు సంఘాల నేతలపై సుప్రీం కోర్టు సీరియస్
ఢిల్లీ: పంజాబ్‌లో రైతు సమస్యల పరిష్కారం కోసం డిమాండ్ చేస్తూ గత నెల 26 నుంచి నిరాహారదీక్ష చేపట్టిన రైతు నేత జగ్జీత్ సింగ్ దలేవాల్ ఆరోగ్య పరిస్థితి రోజురోజుకీ క్షీణిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనకు వైద్య సహాయం అందకుండా అడ్డుకుంటున్న రైతు సంఘాల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజంగా ఆయన క్షేమం కోరుకునేవారైతే అలా అడ్డుకోరంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.దల్లేవాల్‌కు వైద్య సహాయం అందించాలన్న ఆదేశాలను అమలు చేయకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శనివారం విచారణ చేపట్టింది. దలేవాల్‌ను ఆస్పత్రికి తరలించకుండా రైతు నేతలు అడ్డుకుంటున్నారని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.దీంతో కోర్టు ఆ రైతు నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దలేవాల్ క్షేమం కోరేవారు ఆవిధంగా ప్రవర్తించరని వ్యాఖ్యానించింది. రైతు నేతలతో మాట్లాడి దలేవాల్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించాలని ఆదేశించింది. ఈ విషయంలో పంజాబ్ రాష్ట్రానికి ఏదైనా సహాయం అవసరమైతే, కేంద్ర ప్రభుత్వం మద్దతివ్వాలంటూ సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసుపై తదుపరి విచారణను డిసెంబర్ 31కి వాయిదా వేసింది.ఇదీ చదవండి: Year Ender 2024: ఎన్నటికీ మరువలేని ఐదు విషాదాలు -
నిప్పులు చెరిగిన అర్షదీప్.. బెంబేలెత్తిపోయిన శ్రేయస్, సూర్యకుమార్, దూబే
విజయ్ హజారే వన్డే ట్రోఫీలో టీమిండియా టీ20 స్పెషలిస్ట్, పంజాబ్ పేసర్ అర్షదీప్ సింగ్ రెచ్చిపోయాడు. ముంబైతో ఇవాళ (డిసెంబర్ 28) జరుగుతున్న మ్యాచ్‌లో అర్షదీప్ నిప్పులు చెరిగాడు. ఫలితంగా ముంబై టాపార్డర్ కకావికలమైంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అర్షదీప్ ధాటికి ముంబై 61 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అర్షదీప్ ముంబై టాపార్డర్ మొత్తాన్ని నేలకూల్చాడు. టీమిండియా ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే సహా దేశవాలీ సంచలనాలు రఘువంశీ, ఆయుశ్ మాత్రే వికెట్లు పడగొట్టాడు. 23.5 ఓవర్ల అనంతరం ముంబై స్కోర్ 119/7గా ఉంది. అథర్వ అంకోలేకర్ (17), శార్దూల్ ఠాకూర్ (5) క్రీజ్‌లో ఉన్నారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ 5, సన్వీర్ సింగ్, రఘు శర్మ తలో వికెట్ పడగొట్టారు. ముంబై బ్యాటర్లలో రఘువంశీ 1, ఆయుశ్ మాత్రే 7, హార్దిక్ తామోర్ 0, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 17, సూర్యకుమార్ యాదవ్ 0, శివమ్ దూబే 17, సూర్యాంశ్ షేడ్గే 44 పరుగులు చేసి ఔటయ్యారు. -
ఘోర బస్సు ప్రమాదం.. 8 మంది మృతి
పంజాబ్: బఠిండాలో ఘోర ప్రమాదం జరిగింది. వంతెనను రెయిలింగ్‌ను ఢీకొట్టిన బస్సు.. కాల్వలో పడింది. ఈ ఘటనలో 8 మంది మృతిచెందగా, మరో 18 మంది గాయపడ్డారు. జీవన్ సింగ్ వాలా గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా, ముగ్గురు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మరణించారు.క్షతగాత్రులు షహీద్ భాయ్ మణి సింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 50 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న బస్సు సర్దుల్‌గఢ్ నుండి బఠాండాకు వెళ్తుండగా జీవన్ సింగ్ వాలా దగ్గర కాలువలో పడడంతో ఈ ప్రమాదం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, స్థానికుల సహకారంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.2 people have died, while many others have been injured after a bus carrying nearly 50 passengers fell into a drain in Punjab's Bathinda. Rescue operations are underway.#Punjab #Bathinda pic.twitter.com/MwwfJlbhrd— Vani Mehrotra (@vani_mehrotra) December 27, 2024 -
‘చీర కడితే.. బొట్టు పెడితే హేళన చేస్తారా?’
విలన్స్ ఆర్ నాట్ బార్న్.. దే ఆర్ మేడ్ బై సొసైటీ.. వ్యవస్థే విలన్లను తయారు చేస్తుందని అర్థం. అవసరాలకు తగ్గట్లు బతికే మనిషి.. అవతలివాళ్లను అవహేళన చేయడం అంతే పరిపాటిగా మార్చేసుకున్నాడు. అయితే మానసిక రుగ్మతలో కూరుకుపోయిన మనిషి ముందు అది ప్రదర్శిస్తే.. అది ప్రాణాల మీదకే రావొచ్చు. అలాంటి వాస్తవ ఘటనే ఇది. ‘‘తస్మాత్ జాగ్రత్త! ఇలాంటి నేరగాళ్లు మన మధ్యే ఉంటారు’’ అని పాఠకులకు తెలియజేయడమే మా ఉద్దేశం.33 ఏళ్ల రామ్ స్వరూప్. చూడడానికే కాదు.. మీడియా ముందు అతని మాటలు అంతే అమాయకంగా ఉన్నాయి. కానీ, ఓ హత్య కేసు ఇంటరాగేషన్‌లో నోరు విప్పి అతను చెప్పిన విషయాలు ఖాకీలనే విస్తుపోయేలా చేశాయి. ఏడాదిన్నర కాలంలో 11 మందిని అతికిరాకతంగా హతమార్చిన సీరియల్ కిల్లర్ ఇతనేనంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు!.పంజాబ్(Punjab)లో ఈ సీరియల్ కిల్లర్ ఉదంతం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. మగవాళ్లకు మాత్రమే లిఫ్ట్ ఇచ్చి.. ఆపై వాళ్లను దారుణంగా హతమార్చాడతను. ఈ క్రమంలో అతను నేరాలకు పాల్పడ్డ తీరు.. అందుకు అతను చెప్తున్న కారణాలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ‘‘వాళ్లు నన్ను కొజ్జావాడంటూ హేళన చేశారు. నా వేషధారణను అవహేళన చేశారు. పైగా నాతో శారీరక అవసరాలు తీర్చుకుని ఇస్తానన్న డబ్బూ ఇవ్వలేదు. ఈ విషయాలు నన్ను ఎంతో బాధించాయి. అందుకే చేతికి ఏది దొరికితే దాంతో.. అక్కడికక్కడే వాళ్లను చంపాల్సి వచ్చింది’’ ఇది నేరాంగీకారంలో రామ్ స్వరూప్ అలియాస్ సోధీ చెప్పిన అసలు విషయం.👉రామ్ స్వరూప్ స్వస్థలం.. హోషియార్పుర జిల్లా చౌరా గ్రామం. అతని తల్లిదండ్రులు విద్యావంతులు. ఆర్థికంగా ఉన్న కుటుంబమే. కానీ, రామ్ స్వరూప్లోపల ఇంకొకరు ఉన్నారు. అతనికి చిన్నప్పటి నుంచి ఆడవాళ్లలా అలంకరించుకోవడం ఇష్టం. చెబితే.. ఇంట్లోవాళ్లు కోప్పడతారనే భయం. అందుకే తల్లిదండ్రులు లేనప్పుడు రహస్యంగా మేకప్ వేసుకుని మురిసిపోయేవాడు. ఆ రహస్య జీవితం చాలా ఏళ్లపాటు అలాగే కొనసాగింది. అయితే 2005లో దుబాయ్ జీవితం అతనిలో మరో కోణాన్ని బయటకు తీసింది. 👉అక్కడ స్వలింగ సంపర్కానికి అలవాటు పడ్డాడతను. ఆపై తిరిగి స్వదేశానికి వచ్చాడు. కోడుకులోని ఆ కోణం తెలిసి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పించారు. అయినా అతనిలో మార్పు రాలేదు. చివరకు.. రామ్ స్వరూప్‌కు వివాహం చేశారు. ముగ్గురు పిల్లలు కూడా పుట్టారు. అయితే అతనిలోని ఆ కోణం.. భార్యకు ఆలస్యంగా తెలిసింది. రెండేళ్ల కిందట పిల్లలను తీసుకుని పుట్టింటి వెళ్లిపోయింది. ఇటు తల్లిదండ్రులు అతన్ని దూరం పెట్టారు.ఒంటరి అయిన రామ్ స్వరూప్‌కు ‘తేడాగాడు’ అనే ముద్ర వేసి ఎవరూ పని ఇవ్వలేదు. దీంతో తనదైన అవసరాల కోసం రోడ్డెక్కాడతను. అందుకోసం చీర కట్టి.. బొట్టు పెట్టి.. ముస్తాబయ్యేవాడు. చూసేవాళ్లంతా తనను తేడా అనుకున్నా ఫర్వాలేదనే ధీమా అతనికి కలిగింది అప్పుడు. అయితే.. ఎప్పుడైతే తాను అనుకున్నది నెరవేరలేదో.. అతనిలో మృగం బయటికి వచ్చింది.👉 మోద్రా టోల్‌ప్లాజా వద్ద టీ, వాటర్ బాటిళ్లు అమ్ముకునే మహిందర్ సింగ్ అనే వ్యక్తి ఆగష్టు 18వ తేదీన దారుణ హత్యకు గురయ్యాడు. ఘటనా స్థలంలో క్లూస్ టీంకు ఓ చిన్న గుడ్డముక్క దొరికింది. అయితే అప్పటిదాకా దొరక్కుండా జాగ్రత్త పడిన రామ్ స్వరూప్.. ఎప్పుడూ తన మెడలో ఉంచుకునే మఫ్లర్‌తో అడ్డంగా దొరికిపోయాడు. నాలుగు నెలలపాటు జరిగిన దర్యాప్తు.. గాలింపు అనంతరం డిసెంబర్ 25వ తేదీన రామ్ స్వరూప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 👉తనతో శారీరక అవసరం తీర్చుకునే సమయంలో మహిందర్ తన కట్టూబొట్టును అవమానించాడని.. అది తట్టుకోలేకే అతన్ని హతమార్చినట్లు రామ్ స్వరూప్ నేరం ఒప్పుకున్నాడు. అంతేకాదు.. దీనికంటే ముందు 10 హత్యలు చేసినట్లు ఈ సీరియల్ కిల్లర్(Serial Killer) పోలీసుల దిమ్మతిరిగిపోయేలా విషయం ఒకటి చెప్పాడు.👉రామ్ స్వరూప్ చేసిన తొలి హత్య.. హర్‌ప్రీత్ అనే మాజీ ఆర్మీ అధికారిది. 18 నెలల కిందట జరిగిందా ఘోరం. ఆయనతో లైంగికంగా కలిశాక.. డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో హర్‌ప్రీత్‌ను హతమార్చి.. ఆయన వీపులో ధోకేబాజ్(మోసగాడు) అని రెడ్ ఇంక్‌తో రాత రాశాడు. ఈ కేసు పంజాబ్‌లో ఆ మధ్య చర్చనీయాంశం అయ్యింది కూడా. అయితే విచారణలో పోలీసులు ఎలాంటి పురోగతిని సాధించలేకపోయారు.👉ఈ ఘటన తర్వాత.. రామ్ స్వరూప్ అప్రమత్తం అయ్యాడు. రోజూవారీ పని చేసుకునే కూలీలు, మెకానిక్‌లు, సెక్యూరిటీ గార్డును రామ్ స్వరూప్ టార్గెట్ చేసుకునేవాడు. మరికొందరికి లిఫ్ట్ ఆఫర్ చేసేవాడు. వాళ్లతో మాటలు కలిపి తన కోరిక బయటపెట్టేవాడు. అందుకు ఒప్పుకున్నవాళ్లతో నిర్మాణుష్య ప్రాంతాలకు వెళ్లేవాడు. అయితే ఏకాంతంగా ఉన్న టైంలో.. వాళ్లు తనతో ప్రవర్తించిన తీరే.. తనను నేరానికి ఉసిగొల్పిందని చెబుతున్నాడను. వాళ్ల మాటలు, చేతలు అతన్ని మానసికంగా కుంగదీశాయట. ఆ ఆవేశంలో చేతికి దొరికిన వస్తువుతో వాళ్లను దారుణంగా హతమార్చి.. తన సిగ్నేచర్ వీపులో మోసగాడు అని రాసి.. వాళ్ల జేబుల్లో ఉన్నదంతా దోచుకుని వెళ్లిపోయేవాడట. అలా రూపానగర్, సర్హింద్, ఫతేఘడ్ సాహిబ్.. ఇలా చుట్టుపక్కల జిల్లాల్లో ఇప్పటిదాకా 11 మందిని హతమార్చాడు. వీటిలో ఆరు కేసుల్లో ఈ సైకో గే కిల్లర్ పాత్రను పోలీసులు ధృవీకరించుకున్నారు. మరో ఐదు కేసుల్లో.. రామ్ స్వరూప్ పాత్రపై నిర్ధారణకు రావాల్సి ఉంది. రాబోయే.. రోజుల్లో రామ్ స్వరూప్ నేరచరితను ఏ సినిమాగానో, వెబ్ సిరీస్(Web Series)గానో తెర మీద చూడాల్సిన వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో కదా!. -
కుప్పకూలిన బిల్డింగ్.. 12 గంటలుగా కొనసాగుతున్న సహాయక చర్యలు
చంఢీగడ్ : పంజాబ్ రాష్ట్రం మొహాలి జిల్లాలో మూడంతస్తుల భవనం కుప్పుకూలింది. సహాయక చర్యలు 12 గంటలకు నిర్విరామంగా కొనసాగుతున్నట్లు సహాయక బృందాలు వెల్లడించాయి. శనివారం సాయంత్రం మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల యువతి మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. మొహాలీ జిల్లాలో ఓ భవనంలో బేస్మెంట్ కోసం తవ్వకాలు జరుగుతుండగా.. పక్కనే ఉన్న మూడంతస్తుల భవనం కుప్పకూలింది. భవనం శిథిలాల కింద పది మంది వరకు చిక్కుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నారు.భవనం కూలిపోవడంపై సమాచారం అందుకున్న ఇండియన్ ఆర్మీ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ (ఎన్డిఆర్ఎఫ్) బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న బాధితుల్ని సంరక్షించారు. అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాయి. ప్రస్తుతం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.మరోవైపు భవనం కూలిపోవడంపై సమాచారం అందుకున్న పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 105 కింద భవన యజమానులు, పర్వీందర్ సింగ్, గగన్‌దీప్ సింగ్‌లపై కేసు నమోదు చేశారు. భవనం కూలిపోవడంపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ విచారం వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.-Sohana Building Collapse Update- Rescue Operation Continues;District Admin Sets Up Control Room +91 172-2219506,Civil Hospital Mohali, Fortis, Max and Sohana Hospital put on alert pic.twitter.com/UjRsI4G0Zh— DC Mohali (@dcmohali) December 21, 2024 -
ఫాస్టెస్ట్ సెంచరీ.. కసిదీరా కొట్టేశాడు!
పంజాబ్ బ్యాటర్ అన్మోల్ప్రీత్ సింగ్ విధ్వంసకర సెంచరీతో మెరిశాడు. కేవలం 35 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. తద్వారా లిస్ట్- ‘ఎ’ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన మూడో భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. అరుణాచల్ ప్రదేశ్‌తో శనివారం నాటి మ్యాచ్ సందర్భంగా అన్మోల్ప్రీత్ సింగ్ ఈ ఫీట్ నమోదు చేశాడు.దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2024-25 ఎడిషన్‌లో భాగంగా గ్రూప్-‘ఎ’లో ఉన్న తమ తొలి మ్యాచ్‌లో పంజాబ్ జట్టు.. అరుణాచల్‌ప్రదేశ్ తలపడింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ‘ఎ’ గ్రౌండ్లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బౌలింగ్ చేసింది.164 పరుగులకే ఆలౌట్‌ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన అరుణాచల్ ప్రదేశ్ 164 పరుగులకే కుప్పకూలింది. తెచి నెరి 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. హార్దిక్ వర్మ 38, ప్రిన్స్ యాదవ్ 23, దేవాన్ష్ గుప్త 22 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. పంజాబ్ బౌలర్లలో మయాంక్ మార్కండే, అశ్వని కుమార్ మూడేసి వికెట్లు తీయగా.. బల్జీత్ సింగ్ రెండు, సన్వీర్ సింగ్, రఘు శర్మ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.అభిషేక్ శర్మ విఫలంఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు సరైన ఆరంభం లభించలేదు. ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం పది పరుగులే చేసి నిష్క్రమించాడు. అయితే, మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్(25 బంతుల్లో 35 నాటౌట్)కు తోడైన వన్‌డౌన్ బ్యాటర్ అన్మోల్ప్రీత్ సింగ్ అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.45 బంతుల్లో 115 పరుగులుసుడిగాలి ఇన్నింగ్స్‌తో కేవలం 35 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్న అన్మోల్.. మొత్తంగా 45 బంతుల్లో 115 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా పన్నెండు ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు ఉండటం విశేషం. ఈ క్రమంలో 12.5 ఓవర్లలో కేవలం ఒకే ఒక్క వికెట్ కోల్పోయి 167 పరుగులు చేసింది పంజాబ్.కసిదీరా కొట్టేశాడుతద్వారా అరుణాచల్ ప్రదేశ్‌పై ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో జయభేరి మోగించి టోర్నీని విజయంతో ఆరంభించింది. తుఫాన్ ఇన్నింగ్స్‌తో పంజాబ్‌ను గెలిపించిన అన్మోల్ప్రీత్ సింగ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. కాగా ఇటీవల జరిగిన ఐపీఎల్-2025 మెగా వేలంలో ఈ పంజాబీ బ్యాటర్ అమ్ముడుపోకుండా మిగిలిపోయిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో వన్డేల్లో టీ20 తరహాలో ఊచకోత కోసి తన కసినంతా ఇక్కడ ప్రదర్శించాడంటూ అభిమానులు అన్మోల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ముంబై తరఫున క్యాష్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చిన అన్మోల్ప్రీత్ సింగ్.. చివరగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడు. ఇప్పటి వరకు ఐపీఎల్లో మొత్తంగా తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన అన్మోల్.. 139 పరుగులు సాధించాడు.చదవండి: శ్రేయస్ అయ్యర్ విధ్వంసకర శతకం.. శివం దూబే మెరుపు ఇన్నింగ్స్A majestic counter-attacking 58-ball 💯 from Anmolpreet Singh 👏👏#SMAT | @IDFCFIRSTBank | #FinalFollow the match ▶️ https://t.co/1Kfqzc7qTr pic.twitter.com/3sdqD7CJvj— BCCI Domestic (@BCCIdomestic) November 6, 2023 -
పంజాబ్‌లో పేలుడు కలకలం
అమృత్సర్: పంజాబ్‌లో పేలుడు కలకలం రేపింది. అమృత్‌సర్‌లోని ఇస్తామాబాద్ పోలీస్‌స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా పెద్ద శబ్ధం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని తెలిపిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు ఈ పేలుడు తమ పనేనంటూ జర్మనీకి చెందిన గ్యాంగ్‌స్టర్ జీవన్ ఫౌజీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో 10 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.ఈ నెల 4న అమృత్‌సర్‌లోని మజితా పోలీస్స్టేషన్లోనూ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పోలీస్ స్టేషన్ అద్దాలు పగిలిపోయాయి. పోలీస్ స్టేషన్ గేటు సమీపంలోని బహిరంగ ప్రదేశంలో పేలుడు సంభవించింది. పేలుడు జరిగిన వెంటనే పోలీస్ స్టేషన్ గేట్లను మూసివేసిన పోలీసులు.. భద్రతను పెంచారు.Reportedly, a blast was heard in the early hours of Tuesday near the Islamabad police station in Amritsar. However, the police have yet to provide an official statement on the incident. pic.twitter.com/1tzYeyjidG— Ravinder Singh Robin ਰਵਿੰਦਰ ਸਿੰਘ رویندرسنگھ روبن (@rsrobin1) December 17, 2024 -
చలి గుప్పెట ఉత్తరాది
న్యూఢిల్లీ: ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్లతో పాటు ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు చలి తీవ్రతతో గజగజ లాడుతున్నాయి. చాలా చోట్ల ఆదివారం ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 23.2 డిగ్రీలుగా నమోదైంది. సాధారణం కంటే ఇది 0.2 డిగ్రీలు తక్కువ. అయితే, కనిష్ట ఉష్ణోగ్రత ఒక్కసారిగా 4.9 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. సాధారణం కంటే ఇది 3.1 డిగ్రీలు తక్కువ. ప్రస్తుతానికి శీతల గాలులు లేవని వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. పంజాబ్, హరియాణాల్లో మాత్రం చలి తీవ్రత ఎక్కువగానే ఉందని ఐఎండీ పేర్కొంది. అత్యల్పంగా ఫరీద్‌కోట్‌లో 1 డిగ్రీ సెల్సియస్ నమోదైంది. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్, భటిండాల్లో కనీస ఉష్ణోగ్రతలు వరుసగా 2 డిగ్రీలు, 4.6 డిగ్రీలు నమోదయ్యాయి. హరియాణాలోని హిస్సార్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 1.7 డిగ్రీలుగా ఉంది. రాజస్తాన్‌లోని ఫతేపూ ర్లో వరుసగా మూడో రోజు ఆదివారం కూడా మైనస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హిమాచల్‌లోని కొండ ప్రాంతంలో శీతల గాలుల తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు ఐఎండీ వివరించింది. ఉనాలో శీతల గాలుల ప్రభా వంతో 0.2 డిగ్రీలు, సుందర్‌నగర్‌లో 0.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదే సమయంలో, సొలాన్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా 24.7 డిగ్రీలు, సిమ్లాలో 19 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శ్రీనగర్‌లో –3.4 డిగ్రీలు, గుల్మార్గ్లో –4.8 డిగ్రీల ఉష్ణోగ్రతలున్నట్లు వెల్లడించింది. -
రణరంగంగా శంభు సరిహద్దు.. రైతులపైకి టియర్ గ్యాస్ ప్రయోగం
Live Updates..👉పంజాబ్-హర్యానా సరిహద్దులు రణరంగంలా మారాయి. రైతు సంఘాల ఢిల్లీ చలో కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. శంభు సరిహద్దు వద్ద రైతులను హర్యానా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం, రైతులు ముందుకు కదలడంతో పోలీసులు.. టియర్ గ్యాస్ ప్రయోగించారు. అలాగే, వాటర్ కెనాన్లను రైతులపైకి ప్రయోగించారు. టియర్ గ్యాస్ కారణంగా పలువురు రైతు సంఘాల నాయకులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వారిని ఆసుపత్రులకు తరలించారు. #WATCH | Drone visuals from the Haryana-Punjab Shambhu Border where the farmers protesting over various demands have been stopped from heading towards DelhiPolice used water cannon, tear gas to disperse the farmers. pic.twitter.com/W54KhOMqZa— ANI (@ANI) December 14, 2024#WATCH | Police use tear gas and water cannon to disperse protesting farmers at the Haryana-Punjab Shambhu Border. The farmers have announced to march towards the National Capital-Delhi over their various demands. pic.twitter.com/lAX5yKFarF— ANI (@ANI) December 14, 2024 #WATCH | Police use tear gas and water cannon to disperse protesting farmers at the Haryana-Punjab Shambhu Border. The farmers have announced to march towards the National Capital-Delhi over their various demands. pic.twitter.com/tDMTy8iGXU— ANI (@ANI) December 14, 2024#WATCH | Farmers begin their 'Dilli Chalo' march from the Haryana-Punjab Shambhu Border; police personnel present at the spot pic.twitter.com/Uq8zTrbXjo— ANI (@ANI) December 14, 2024 👉పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం వంటి పలు డిమాండ్లతో రైతు సంఘాల ఢిల్లీ చలో కార్యక్రమంలో నేడు మళ్లీ కొనసాగనుంది. ఈ మేరకు రైతులు సన్నద్దమవుతున్నారు. ఢిల్లీ చేరుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. 👉ఇందులో భాగంగా రైతులు, రైతు సంఘాల నేతలతో కూడిన 101 మందితో కూడిన రైతు జాతా ఈరోజు మధ్యాహ్నం మరోసారి ఢిల్లీకి బయలుదేరనుంది. ఇక, రైతుల కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు.#WATCH | Visuals from the Haryana-Punjab Shambhu Border where the farmers are protesting over various demands. According to farmer leader Sarwan Singh Pandher, a 'Jattha' of 101 farmers will march towards Delhi today at 12 noon. pic.twitter.com/Tfb1F8dSqE— ANI (@ANI) December 14, 2024👉 మరోవైపు.. రైతుల మార్చ్ నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం అంబాలా జిల్లాలో తాత్కాలికంగా ఇంటర్నెట్ సేవలు, మొబైల్ ఎస్ఎంఎస్ సేవలను నిలిపివేసింది. నేటి నుంచి ఈనెల 17వ తేదీ వరకు ఈ సేవలను నిలిపి వేస్తున్నట్టు అధికారులు తెలిపారు. అత్యవసర సేవలు కొనసాగుతాయని చెప్పుకొచ్చారు. 👉ఇదిలా ఉండగా.. రైతుల మార్చ్ నేపథ్యంలో రైతు సంఘాల నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ మాట్లాడుతూ.. రైతులు ఆందోళనలు చేపట్టి నేటి 307 రోజులు అవుతోంది. పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని మేమందరం కేంద్రాన్ని కోరుతున్నాం. ఈ క్రమంలోనే మార్చ్ తలపెట్టాం. దేశం మొత్తం రైతులకు అండగా నిలుస్తోంది. కానీ, ప్రధాని మోదీ మాత్రం మౌనం వహిస్తున్నారు’ అని కామెంట్స్ చేశారు.ఇక, ఇప్పటికే రెండు సార్లు రైతులు ఢిల్లీ చలో కార్యక్రమానికి పిలుపునివ్వగా పోలీసులు వారిని అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉద్రిక్తతలు చోటుచేసుకోవడంతో రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ సందర్బంగా పలువురు రైతులు, రైతు సంఘాల నాయకులు గాయపడ్డారు. -
స్నేహితుల మధ్య గొడవ.. కెనడాలో భారత విద్యార్థి దారుణ హత్య
ఇద్దరు స్నేహితుల మధ్య వంట గదిలో జరిగిన గొడవ హత్యకు దారి తీసింది. ఈ ఘటనలో 22ఏళ్ల విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.కెనడా పోలీసుల వివారాల మేరకు.. సుమారు నాలుగు నెలల క్రితం భారత్‌లోని పంజాబ్ రాష్ట్రం లుథియానాకు చెందిన 22 ఏళ్ల గురాసిస్ సింగ్ ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లాడు. అక్కడ సర్నియా నగరంలో లాంబ్టన్ కాలేజీలు చేరాడు. స్థానికంగా ఉన్న ఓ అపార్ట్మెంట్లో తన 34 క్రాస్లీ హంటర్‌తో కలిసి ఉంటున్నాడు.అయితే, ఈ తరుణంలో నవంబర్ 30 రాత్రి తన రూమ్‌లో ఓ విషయంలో గురుసిస్‌కు,హంటర్ల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ హత్యకు దారి తీసింది. కిచెన్‌లో ఉన్న గురుసిస్ను హంటర్ కత్తి దాడి చేశారు. ఈ ఘటనలో గురుసిస్ ప్రాణాలు కోల్పోయాడు.ఈ దుర్ఘటన అనంతరం, గుర్తుతెలియని వ్యక్తుల సమాచారం ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. నిందితుడు హంటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం, ఈ హత్యపై విచారణ నిర్వహిస్తున్నామని సర్నియా పోలీస్ అధికారి డేవిస్ తెలిపారు. హత్యకు గల కారణాల్ని వెలుగులోకి తెస్తామన్నారు. కాగా, గురుసిస్ హత్యపై లాంబ్టన్ కాలేజీ యాజమాన్యం విచారం వ్యక్తం చేసింది. -
రైతుల ఢిల్లీ చలో వాయిదా..
farmers Protest Live Updates...👉ఢిల్లీ చలో కార్యక్రమాన్ని రైతులు వాయిదా వేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చల తర్వాత ఢిల్లీ మార్చ్‌పై రైతులు నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ క్రమంలో చర్చలు విఫలమైతే డిసెంబర్ 8న మార్చ్ చేస్తామని రైతులు తెలిపారు. ఢిల్లీ చలో నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో ఉదద్రిక్తకర పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పలువురు రైతు సంఘాల నాయకులు గాయపడ్డారు. #WATCH | At the Shambhu border, farmer leader Sarwan Singh Pandher says, "Now 'Jattha' of 101 farmers will march towards Delhi on December 8 at 12 noon. Tomorrow's day has been kept for talks with the central government. They have said that they are ready for talks, so we will… pic.twitter.com/3llMjDGvsd— ANI (@ANI) December 6, 2024👉రైతుల సంఘాల నాయకుడు సర్వన్ సింగ్ పందేర్ మాట్లాడుతూ.. మమ్మల్ని ఢిల్లీకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు టియర్ ప్రయోగించడంతో ఆరుగురు రైతు నాయకులు తీవ్రంగా గాయపడ్డారు. పలువురికి గాయాలయ్యాయి. కాసేపు మేమేంతా సమావేశం కాబోతున్నాం. భవిష్యత్ ప్రణాళికపై చర్చిస్తామన్నారు. #WATCH | At the Shambhu border, Farmer leader Sarwan Singh Pandher says, "They (police) will not let us go (to Delhi). Farmer leaders have got injured, we will hold a meeting to decide the future strategy..." https://t.co/jpM65N22Po pic.twitter.com/rOnk0VXgcQ— ANI (@ANI) December 6, 2024 👉హర్యానా-పంజాబ్ సరిహద్దుల్లోని శంభు వద్ద నిరసన తెలుపుతున్న రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో, టియర్ గ్యాస్ కారణంగా పలువురు రైతులు అస్వస్థతకు గురయ్యారు. పలువురు గాయపడ్డారు. దీంతో, వారికి ఆసుపతత్రికి తరలించారు. #WATCH | Police use tear gas to disperse protesting farmers at the Haryana-Punjab Shambhu Border. The farmers have announced to march towards the National Capital-Delhi over their various demands. pic.twitter.com/CMon3JDg3I— ANI (@ANI) December 6, 2024 👉దేశంలో రైతులు మరోసారి పోరుబాట పట్టారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పంజాబ్-హర్యానా సరిహద్దులోని శంభు సరిహద్దు వద్ద ‘ఢిల్లీ చలో’ పేరుతో నిరసన చేపట్టారు. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధతతో పాటు పలు డిమాండ్లను నెరవేర్చాలంటూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు.. అన్నదాతలను అడ్డుకోవడంతో ఉద్రికత్తకర పరిస్థితులు నెలకొన్నాయి. ఓ రైతును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.👉రైతులు తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ శంభు సరిహద్దుకు చేరుకున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లోకి రైతులు వచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బారికేడ్లతో రైతులను భద్రతా బలగాలు అడ్డుకున్నారు. మరోవైపు.. రైతులు నిరసనల నేపథ్యంలో హర్యానాలోని అంబాలా సహా కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. గ్రేటర్ నోయిడాలోని పరి చౌక్ వద్ద ‘ఢిల్లీ చలో’ ఆందోళనలో పాల్గొంటున్న రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.#WATCH | Drone visuals from the Shambhu border where the farmers protesting over various demands have been stopped from entering Delhi. pic.twitter.com/0aBiJTI7sS— ANI (@ANI) December 6, 2024ఇదిలా ఉండగా.. రైతుల మార్చ్ నేపథ్యంలో హర్యానా యంత్రాంగం అప్రమత్తమైంది. సరిహద్దుల్లో కేంద్ర పారా మిలటరీ బలగాలను మోహరించారు. అదనంగా మూడంచెల బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది ఒకచోట గుమిగూడకుండా నిషేధాజ్ఞలు జారీ చేశారు.#WATCH | At the Shambhu border, a police official says, "They (farmers) don't have permission to enter Haryana. The Ambala administration has imposed Section 163 of the BNSS..." https://t.co/zVSRcePdgO pic.twitter.com/NwkVbliejp— ANI (@ANI) December 6, 2024రైతు నాయకుడు, కిసాన్ మజ్దూర్ మోర్చా (కేఎంఎం) సమన్వయకర్త శర్వణ్ సింగ్ పాంథేర్ మాట్లాడుతూ.. రైతులు ట్రాక్టర్లు, ట్రాలీలు తేకుండా కేవలం కాలినడకన పాదయాత్ర చేస్తారని తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు శంభు సరిహద్దు నుంచి 101 మంది రైతులతో తమ పాదయాత్ర ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఇక్కడి నుంచి ఢిల్లీకి మార్చ్ చేయాలని నిర్ణయించామని తెలిపారు.#WATCH | Farmers protesting over various demands have been stopped at the Shambhu border from heading towards Delhi. pic.twitter.com/Pm3HxgR2ie— ANI (@ANI) December 6, 2024 -
అకాల్ తఖ్త్.. ఆదేశిస్తే ఏదైనా చేయాల్సిందే!.. మరి ఉల్లంఘిస్తే?
అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో చేసిన పాపాలకుగానూ(తప్పిదాలు).. ఏకంగా డిప్యూటీ సీఎంగా పని చేసిన ఓ వ్యక్తికి శిక్షలు విధించింది సిక్కు మతానికి చెందిన అకాల్ తఖ్త్. బాత్రూంలు, వంటగదులు, వరండాలు కడగడం.. షూలు, చెప్పులను శుభ్రం చేయడం లాంటి పనులు చేయాలని హుకుం జారీ చేసింది. ఆ ఆదేశాల్ని ఉల్లంఘించకుండా సుఖ్బీర్ సింగ్ బాదల్ శిరసావహించారు. ఈ క్రమంలోనే ఆయనపై జరిగిన హత్యాయత్నం తీవ్ర చర్చనీయాంశమైంది. అదే సమయంలో.. అకాల్ తఖ్త్ విధించిన ఈ శిక్షల గురించి తెలిసి చాలామంది ముక్కున వేలేసుకున్నారు.సిక్కు మత సమగ్రతను కాపాడుకోవడంతో పాటు తప్పు చేసిన వ్యక్తికి తన తప్పును సరిదిద్దుకునేందుకు అవకాశం ఇచ్చి.. తద్వారా మత సిద్ధాంతాలకు అనుగుణంగా ఆ వ్యక్తిని మార్చుకోవడమే అకాల్ తఖ్త్ ఉద్దేశం. అయితే.. ఇక్కడే కొన్ని సందేహాలు కలగకమానవు. అసలు అకాల్ తఖ్త్‌ను నడిపించేదెవరు?. ఒకవేళ ఆ శిక్షకు తలొగ్గకపోతే ఏం చేస్తారు?. నిజంగానే తీవ్ర పరిణామాలు ఉంటాయా?. సాధారణంగా అకాల్ తఖ్త్ విధించే శిక్షలను పరిశీలిస్తే..బహిరంగ క్షమాపణలు.. తప్పు చేసినవాళ్లతో సిక్కు ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పిస్తారుపాప పరిహారం కింద.. సేవా కార్యక్రమాల్లో(బాత్రూంలు, వంటగది, వరండాలు శుభ్రం చేయడం.. వంట చేర్చి వార్చడం, కాపలా పని, వగైరా) ద్వారా పాప పరిహారం చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. బహిష్కరణ.. నేర తీవ్రతను బట్టి సిక్కు సమాజం నుంచి వాళ్లను వెలివేస్తారు. ఇది కొంత కాలపరిమితితో ఉంటుంది. తద్వారా.. మతపరమైన కార్యక్రమాల్లో వాళ్లు భాగం కాలేరు. మరి ఈ శిక్షలను ఉల్లంఘిస్తే..?ఎవరైనా అకాల్ తఖ్త్ శిక్షలను గనుక ఉల్లంఘిస్తే.. పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది.శాశ్వత బహిష్కరణ.. అకాల్ తఖ్త్ శిక్షలకు తలొగ్గనివాళ్లను శాశ్వతంగా సిక్కు సమాజం నుంచి వెలివేస్తారు.సామాజిక బహిష్కరణలో భాగంగా.. సిక్కు కమ్యూనిటీ నుంచి వాళ్లకు ఎలాంటి సంబంధాలు ఉండవు. ఎలాంటి సాయం అందించరు. తద్వారా.. వాళ్లను ఒంటరిని చేసేస్తారు.ఆధ్యాత్మిక సయోధ్య.. దండించడం బదులు ఆధ్యాత్మిక మార్గంలో ప్రయత్నం చేస్తారు. కౌన్సెలింగ్‌లాంటివి ఇప్పించి.. వాళ్లను మళ్లీ దారిలో పెట్టే ప్రయత్నం చేశారు.పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చితం మరొకటి ఉండదంటారు కదా. ఒత్తిడి చేయడం ద్వారా వాళ్లు తమ తప్పులను ఒప్పకుని సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రయత్నిస్తారు.ఇవేవీ పని చేయని క్రమంలో.. సిక్కు సంఘాలే రంగంలోకి దిగుతాయి. సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాయి. అయితే.. ఇన్నేళ్ల కాలంలో పరిస్థితి ఇంతదాకా ఏనాడూ రాలేదు.అకాల్ తఖ్త్ ద్వారా శిక్షించబడిన వాళ్లు ఎందరో.. వాళ్లలో కొందరు ప్రముఖులూ ఉన్నారు.మహారాజా రంజిత్ సింగ్సిక్కుల తొలి చక్రవర్తి. పరమతానికి చెందిన నృత్యకారిణిని వివాహం చేసుకున్నారనే నేరం కింద అకాల్ తఖ్త్ ఆయనకు కొరడాతో దెబ్బలు తినాలని శిక్ష విధించింది. అయితే ఆయన క్షమాపణలు చెప్పడంతో మన్నించి వదిలేసింది తఖ్త్.జ్ఞానీ జైల్సింగ్భారత మాజీ రాష్ట్రపతి. 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్ టైంలో ఆయన రాష్ట్రపతిగా ఉన్నారు. స్వర్ణ దేవాలయంలోకి ఆర్మీని అనుమతించారనే నేరం కింద ఆయన్ని అకాల్ తఖ్త్ శిక్షించింది. అయితే రాత పూర్వకంగా క్షమాపణలు కోరుతూ ఆయన లేఖ రాశారు.బూటా సింగ్కేంద్ర మాజీ మంత్రి. ఈయన్ని కూడా ఆపరేషన్ బ్లూ స్టార్ కిందే శిక్షించింది అకాల్ తఖ్త్. శిక్షను అంగీకరించిన ఆయన.. కమ్యూనిటీ సేవలో పాల్గొన్నారు కూడా.సుర్జిత్ సింగ్ బర్నాలాపంజాబ్ మాజీ ముఖ్యమంత్రి. ఆపరేషన్ బ్లాక్ థండర్(అమృత్సర్ గోల్డెన్ టెంపుల్‌లోకి బ్లాక్ క్యాట్ కమాండోలను అనుమతించడంలో ఈయన పాత్ర ఎంతో ఉంది. అందుకే ఆయన్ని కాస్త కఠినంగానే శిక్షించారు. అకాల్ తఖ్త్కు జరిమానా కట్టడంతో బూట్లు శుభ్రం చేసి.. సిక్కు ప్రార్థనల్లో పాల్గొని తన పాపపరిహారం చేసుకున్నారాయన. సుఖ్వీర్సింగ్ బాదల్పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం. శిరోమణి అకాలీదళ్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో సుఖ్బీర్ సింగ్ బాదల్ మతపరమైన తప్పిదాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. 2007-17 మధ్య కాలంలో పార్టీతోపాటు వారి ప్రభుత్వం రాజకీయంగా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్లు అకాల్ తఖ్త్ నిర్ధారించింది. ఇందులో డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు మద్దతు ఇవ్వడం కూడా ఉంది. ఈ విషయంలో పార్టీ చీఫ్ సుఖ్బీర్ను దోషిగా తేల్చింది. అయితే తాను చేసిన తప్పులను అంగీకరించిన(మూడు నెలల కిందటే) సుఖ్బీర్ బేషరతు క్షమాపణలు చెప్పారు. ఆపై కాలు ఫఫ్రాక్చర్ అయ్యి వీల్ చైర్‌కు పరిమితమైనా సరే.. అభియోగాలు ఎదుర్కొంటున్న తోటి పార్టీ నేతలతో కలిసి ఇప్పుడు అకాల్ తఖ్త్ విధించిన శిక్షలను అనుభవించారు. అకాల్ తఖ్త్.. ఒరిజినల్ పేరు అకాల్ బుంగా. సిక్కులు పవిత్రంగా భావించే ఐదు తఖ్త్‌లలో ఇది ఒకటి. పంజాబ్ అమృత్సర్ దర్బార్ సాహిబ్ కాంప్లెక్స్‌లో ఉంది. సిక్కులు అత్యున్నత ఆధ్యాత్మిక విభాగం. సిక్కు మతగురువు గురు హరగోవింద్ జూన్ 15, 1606లో దీనిని అమృత్ సర్‌లోని గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్‌లో నెలకొల్పారు. ఆ ప్రాంతంలోనే ఆయన బాల్యమంతా గడిచిందన్న వాదన ఒకటి ఉంది. 👉పిరి-మిరి అంటే.. ఆధ్యాత్మికంగానే కాకుండా సిక్కు సమాజానికి ఎదురయ్యే ఆందోళనల మీద చర్చ జరిపే ఉద్దేశంతో ఒక తాత్కాలిక అధికార వేదికను గురు హరగోవింద్ స్థాపించారు. పిరి-మిరికి ప్రతీకగా ఈ వేదికపై రెండు కత్తులను ఉంచారాయన. హర్గోవింద్తో పాటు బాబా బుద్ధా, భాయ్ గురుదాస్లు అకాల్ తఖ్త్ ఏర్పాటులో భాగమయ్యారు. 👉సిక్కుల అత్యున్నత విభాగంగా అకాల్ తఖ్త్కు పేరుంది. సర్బత్ ఖాల్సా యావత్ సిక్కు సంఘాలకు అత్యున్నత అధికారి కాగా.. జతేదార్(లీడర్)ను అకాల్ తఖ్త్ అధికార ప్రతినిధిగా గుర్తిస్తారు. సిక్కులకు మతపరమైన అధికారానికి కేంద్రంగా ఉన్న అకాల్ తఖ్త్‌ను అభివర్ణిస్తారు. 👉 పంజాబ్‌తో పాటు పాట్నా, బీహార్, మహారాష్ట్రలలో ఇలాంటి అధికార కేంద్రాలే ఉన్నాయి. అకాల్ తఖ్త్ నుంచి జారీ అయ్యే హుకామ్నామా(ఆదేశాలను).. ప్రతీ సిక్కు పాటించడం తప్పనిసరి. 👉 అకాల్ తఖ్త్ అనేది.. ఆకాలంలో అణచివేతకు వ్యతిరేకంగా చేసిన సిక్కులు చేసిన పోరాటానికి గుర్తు. అయితే ఈ సిక్కుల సార్వభౌమాధికార ప్రతీకపై దాడులు జరిగాయి. 18వ శతాబ్దంలో అహ్మద్ షా అబ్దాలీ దాడులతో మొదలై.. 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్‌లో అకాల్ తఖ్త్ దెబ్బ తింది. ఆ తర్వాత ప్రభుత్వ ఆధ్వర్యంలో తాత్కాలికంగా అకాల్ తఖ్త్ నిర్మాణం జరిగినప్పటికీ.. దానిని ప్రభుత్వ వ్యతిరేక వర్గం ధ్వంసం చేసి.. పునఃనిర్మించుకున్నారు. ఆపరేషన్ బ్లూస్టార్‌లో.. దామ్‌దామి తక్సల్ 14వ జతేదార్ అయిన జర్నైల్ సింగ్ భింద్రన్వాలేపై.. పంజాబ్‌లో అతివాద సంస్థను నడిపిస్తున్నాడనే అభియోగాలు ఉన్నాయి. 1983 జులైలో.. అకాలీదళ్ అధ్యక్షుడు హర్చరణ్ సింగ్ లాంగోవాల్, అప్పటి అకాల్ తఖ్త్ జతేదర్ల ఆహ్వానం మేరకు బింద్రాన్‌వాలే గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్‌కి చేరుకున్నాడు. అక్కడ అరెస్ట్‌కు భయపడి అకాల్ తఖ్త్‌లో తలదాచుకున్నాడు. అయితే.. అతని జాడ కనిపెట్టిన అప్పటి ఇందిరా గాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. భారత సైన్యానికి అనుమతి ఇచ్చింది. 1984 జూన్ 3 నుంచి జూన్ 5వ తేదీల మధ్యలో.. గోల్డెన్ టెంపుల్లో ఆపరేషన్ బ్లూ స్టార్ నడిచింది. ఈ ఆపరేషన్‌లో అకాల్ తఖ్త్ భారీగా డ్యామేజ్ అయ్యింది. మిలిటెంట్లకు, ఆర్మీకి మధ్య జరిగిన కాల్పుల్లో భింద్రాన్వాలే చనిపోయాడు.ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత.. అకాల్ తఖ్త్‌ను తిరిగి నిర్మించేందుకు అప్పటి జతేదార్ బాబా సంతా సింగ్ తీవ్రంగా ప్రయత్నించాడు. ఇందుకు కేంద్రం నుంచి నిధుల సమీకరణ కూడా చేయాలనుకున్నాడు. అయితే.. అందుకు సిక్కుల సంఘాల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం అయ్యింది. అయినా కూడా సర్బత్ ఖాల్సా సహకారంతో జతేదార్ నెలన్నర వ్యవధిలోనే(1984, ఆగష్టు 11) అకాల్ తఖ్త్ నిర్మాణం పూర్తి చేశారు. అయితే.. అదే సర్బత్ ఖాల్సా కూల్చేయాలని తీర్మానం చేసింది. జనవరి 1986లో కూల్చేసి.. బాబా సంతా సింగ్‌ను సిక్కు మర్యాదను దెబ్బ తీశాడనే కారణం చూపించి వెలివేసింది. 2001లో తిరిగి ఆయన్ని సిక్కు కమ్యూనిటీలో చేర్చుకుంది. అయితే.. సిక్కులకు న్యాయ పీఠంగా అకాల్ తఖ్త్ కొనసాగుతున్నప్పటికీ.. కాలక్రమంలోని పరిణామాలు(నిర్మాణాలపరంగా) మాత్రం ఆ సాంస్కృతిక వారసత్వాన్ని మాత్రం బాగా దెబ్బతీసింది. -
డాలర్ డ్రీమ్స్ వేటలో.. కటకటాల పాలు!
అమెరికా కలను సాకారం చేసుకునేందుకు భారతీయులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అమెరికాలోకి భారతీయుల అక్రమ వలసలు విపరీతంగా పెరిగినట్టు యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (యూఎస్ సీబీపీ) తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఇందుకు వాళ్లు ప్రధానంగా కెనడా సరిహద్దులను ఎంచుకుంటున్నారు. కెనడా గుండా అమెరికాలో ప్రవేశిస్తూ అరెస్టవుతున్న వారిలో భారతీయులే 22 శాతం కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది! యూఎస్ సీబీపీ గణాంకాల ప్రకారం 2023 అక్టోబర్ నుంచి 2024 సెప్టెంబర్ మధ్య కెనడా సరిహద్దు గుండా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న భారతీయుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2022లో కెనడా గుండా అక్రమంగా అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించిన 1,09,535 మందిలో భారతీయులు 16 శాతం కాగా 2023లో వారి సంఖ్య ఇంకా పెరిగింది. ఆ ఏడాది 1,89,402 మందిలో 30,010 మంది భారతీయులున్నారు. 2024లో 1,98,929 మంది సరిహద్దు దాటేందుకు అక్రమంగా ప్రయత్నించగా వారిలో 43,764 మంది భారతీయులే. లాటిన్ అమెరికా, కరేబియన్ వలసదారులతో పోలిస్తే ఈ సంఖ్య కాస్త తక్కువే. అయినా గత నాలుగేళ్లలో కెనడా గుండా అక్రమంగా అమెరికాలో ప్రవేశించేందుకు ప్రయత్నించిన వారిలో అతిపెద్ద సమూహం భారతీయులేనని వాషింగ్టన్కు చెందిన ఇమిగ్రేషన్ విశ్లేషకులు చెబుతున్నారు. భద్రతా దళాలకు చిక్కకుండా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన భారతీయుల సంఖ్య తెలియదు. కెనడా సరిహద్దే ఎందుకు? అమెరికాలోకి అక్రమ చొరబాట్లకు భారతీయులు కెనడా సరిహద్దునే ఎంచుకోవడానికి అనేక కారణాలున్నాయి. కెనడా వీసా ప్రక్రియ సులువుగా ఉండటం వాటిలో ముఖ్యమైనది. కెనడా విజిటింగ్ వీసా ప్రాసెసింగ్ కేవలం 76 రోజుల్లో పూర్తవుతుంది. అదే అమెరికా వీసా ప్రాసెసింగ్ కోసమైతే కనీసం ఏడాది వేచి ఉండాల్సిందే. అమెరికాతో కెనడా సరిహద్దు చాలా పొడవైనది. దాంతో అక్కడ రక్షణ తక్కువ. దాంతో అంత సురక్షితమైన మార్గం కానప్పటికీ దీన్నే ఎంచుకుంటున్నారు. పంజాబ్ నుంచే ఎక్కువ ఇలా కెనడా గుండా అమెరికాలో చొరబడేందుకు ప్రయత్నిస్తున్న భారతీయుల్లో ఎక్కువ భాగం పంజాబ్, హరియాణాల వాళ్లే ఉంటున్నారు. తర్వాతి స్థానం గుజరాత్‌ది. విదేశాల్లో విద్య, ఉపాధి అవకాశాల కోసం పంజాబీ గ్రామీణ యువత బాగా ఆసక్తి చూపుతోంది. కానీ సరైన విద్యార్హతలు, ఆంగ్ల ప్రావీణ్యం లేని కారణంగా అమెరికా పర్యాటక, విద్యార్థి వీసాలు పొందడం వీరికి గగనంగా మారుతోంది. ప్రత్యామ్నాయంగా అక్రమంగా సరిహద్దులు దాటించే ముఠాలను ఆశ్రయిస్తున్నారు. ఈ ప్రయత్నంలో చాలామంది లక్షలకు లక్షలు పోగొట్టుకుంటున్నారు. మరికొందరు సరిహద్దులు దాటేందుకు అతి ప్రమాదకరమైన ప్రయాణాలు చేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అకాలీల ప్రస్థానం ఎటువైపు?
పంజాబ్‌లో అవసానదశలో పడిన అకాలీదళ్‌కు కాయకల్ప చికిత్స చేసి రక్షించటానికి చేసిన ప్రయత్నం కాస్తా ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఉపముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ ప్రాణానికి ముప్పు తెచ్చింది. బుధవారం ఆయనపై కాల్పులు జరపబోయిన ఖలిస్తానీ మిలిటెంట్ నారాయణ్ సింగ్ చౌరాను అక్కడున్నవారు సకాలంలో నిరోధించకపోయివుంటే పంజాబ్‌లో మరో నెత్తుటి అధ్యాయం మొదలయ్యేది. గత తప్పిదాలకు బాదల్‌నూ, ఇతర నేతలనూ సిక్కు అత్యున్నత పీఠం అకల్‌తఖ్త్ మతద్రోహులుగా ప్రకటించి విధించిన శిక్షలు అమలవుతుండగా ఈ ఉదంతం చోటుచేసుకుంది. పంజాబ్ స్థితిగతులు ప్రత్యేకమైనవి. మతమూ, రాజకీయాలూ కలగలిసి పోవటాన్ని వ్యతిరేకించేవారు సైతం ఈ ప్రత్యేకతను గమనించబట్టే అక్కడ అకాలీదళ్ వంటి మధ్యేవాద పక్షం అవసరమని భావిస్తారు. లేనట్టయితే మతాన్ని తలకెక్కించుకున్న అతివాదులది అక్కడ పైచేయి అవుతుందని వారి వాదన. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు అకాలీదళ్‌ను బలహీనపరచటానికి భింద్రన్‌వాలే వంటి మిలిటెంట్లకు మొదట్లో అందించిన పరోక్ష ప్రోత్సాహం పంజాబ్‌కు శాపంగా మారింది. పరిస్థితి చేయిదాటాక అమృత్సర్ స్వర్ణాలయంలో తలదాచుకున్న భింద్రన్‌వాలేను, అతని ముఠాను అదుపు చేయటానికి సైన్యంతో నిర్వహించిన ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ కాస్తా వికటించి చివరకు ఇందిర ప్రాణాలనే బలితీసుకుంది. ఆ హత్యకు ప్రతీకారమన్నట్టు ఢిల్లీతోసహా దేశంలో అనేకచోట్ల కాంగ్రెస్ నేతలు వెనకుండి సిక్కులపై సాగించిన హత్యాకాండ పర్యవసానంగా ఉగ్రవాద గ్రూపులు పుట్టుకొచ్చాయి. దశాబ్దంపాటు పంజాబ్ కనీవినీ ఎరుగని కల్లోలం చవిచూసింది. వేలాదిమంది అమాయక పౌరులు ఆహుతయ్యారు. ఉగ్రవాదాన్ని అదుపుచేయటం కోసమంటూ భద్రతా బలగాలు సాగించిన ఎన్కౌంటర్లు, అపహరణలు, అదృశ్యాలు సరేసరి. మన దేశంలో నామరూపాల్లేకుండా పోయిన ఆ ఉద్యమం ప్రస్తుతం కెనడాలో సాగిస్తున్న కార్యకలాపాల పర్యవసానమేమిటో కనబడుతూనే వుంది. అయిదుగురు సిక్కు మత పూజారుల అత్యున్నత పీఠం అకల్‌తఖ్త్ సుఖ్బీర్ సింగ్ బాదల్‌ను స్వర్ణాలయ ప్రధానద్వారం వద్ద సాధారణ సేవాదార్‌గా పనిచేయాలని తీర్మానించింది. ఆయన తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నానని తెలిపే పలకను మెడలో ధరించారు. ఇతర అకాలీ నేతలకు స్వర్ణాలయంలో అంట్లు తోమటం నుంచి మరుగుదొడ్లు శుభ్రం చేయటం వరకూ వేర్వేరు శిక్షలు విధించింది. ఈ శిక్షలకు 2007–17 మధ్య పంజాబ్‌లో ఆ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగిన కూటమి సర్కారులోని భాగస్వామ్య పక్షమైన బీజేపీ అత్యుత్సాహం కారణం. పంథ్ కోసం ప్రాణత్యాగాలు చేసిన వ్యక్తులను విస్మరించి, సిక్కులను అనేకవిధాల హింసించి చంపిన రిటైర్డ్ పోలీసు అధికారుల కుటుంబ సభ్యులకు పదవులు పంచిపెట్టడం అకాలీదళ్ నేతలు చేసిన ‘ప్రధాన నేరం’. వీరిలో చాలామంది బీజేపీవారు కాగా, అకాలీ తరఫున ఎంపికైనవారు కూడా ఉన్నారు. అలాగే మతాన్ని అపవిత్రం చేసిన దేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రాం రహీంపై ఉన్న కేసుల్ని ఆయన కోరకుండానే రద్దుచేయటం, దాన్ని సమర్థించుకోవటానికి తమకు అనుకూలంగా ప్రకటన ఇవ్వాల్సిందిగా జతేదార్లను పిలిపించి ఒత్తిడి చేయటం వంటివి ఇతర ఆరోపణలు. అధికారంలో ఉండగా చేసిన పనులకు అకాలీదళ్ భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. 1920లో ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న రైతాంగం దూరమైంది. రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగం విచ్చలవిడిగా పెరిగింది. దానికితోడు సాగు సంక్షోభం, ఉపాధి లేమివంటì సమస్యలు మధ్యతరగతిని, ఇతర వర్గాలవారినీ అసంతృప్తిలో ముంచెత్తాయి. అందుకే అకాలీలను వరస ఓటములు వెంటాడాయి. పర్యవసానంగా అంతర్గత కుమ్ములాటలు అధికమయ్యాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ రంగప్రవేశం అకాలీని నిలువునా ముంచింది. ఆ పార్టీ మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో అభ్యర్థుల్ని కూడా నిలబెట్టలేకపోయింది. తన భాగస్వామ్య పక్షాన్ని బలహీనపరిచి ఎదగాలని చూసే బీజేపీ ఎత్తుగడలు ఆ రాష్ట్రంలో ఫలించలేదు. అందుకే అకాలీ నేతల ‘తప్పుల’కు తగిన శిక్ష విధించి, వారికి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశమీయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ జాఖడ్ గత నెలలో అకల్తఖ్త్కు విజ్ఞప్తి చేశారు. అయితే ఉగ్రవాదం విస్తరిస్తుందన్న సాకుతో రాజకీయాల్లో మత సంస్థల ప్రాబల్యం పెంచటం ఎంతవరకూ సబబన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. నిజానికి ఆప్ ఆగమనం, అది అధికార పీఠాన్ని కైవసం చేసుకోవటం విశ్లేషిస్తే మత రాజకీయాల ప్రాబల్యం బలహీన పడిందన్న అభిప్రాయం కలుగుతుంది. అకాలీదళ్ 1977 తర్వాత బాదల్ కుటుంబ ప్రాబల్యంలోకొచ్చాక రాష్ట్రంలో సిక్కు–నిరంకారీ ఘర్షణలు పెరిగాయి. అటూ ఇటూ పదులకొద్దీ మంది మరణించారు. ఇందిర పుణ్యమా అని ఉగ్రవాదం విస్తరించింది. ఈ అయోమయ పరిస్థితుల్లో 1996లో బీజేపీతో కలిసి ప్రయాణించటానికి నిర్ణయించుకుని మోగాలో జరిగిన పార్టీ సమావేశాల్లో సిక్కు మత మూలాలున్న అకాలీదళ్‌ను సెక్యులర్ పార్టీగా మారుస్తూ తీర్మానించటం పంథ్ అనుకూల ఓటర్లను క్రమేపీ పార్టీకి దూరం చేసింది. బీజేపీ ఆ పని చేయకపోవటాన్ని అందరూ వేలెత్తి చూపారు. అకాలీ సీనియర్ నేత, మాజీ మంత్రి అనిల్ జోషి పార్టీ తిరిగి పంథ్ అనుకూల వైఖరి తీసుకుని శిక్షలకు తలొగ్గటాన్ని నిరసిస్తూ అకాలీదళ్‌కు రాజీనామా చేశారు. ఈ అంతర్మథనం బాదల్‌పై జరిగిన తాజా దాడితో ఏయే మలుపులు తీసుకుంటుందో, అకాలీదళ్ ప్రస్థానం ఎలా కొనసాగుతుందో మున్ముందు చూడాలి. -
సుఖ్బీర్ సింగ్‌పై కాల్పులు.. కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ: పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయంలో మాజీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై జరిగిన హత్యాయత్నంపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవిద్ కేజ్రీవాల్ స్పందించారు. శిరోమణి అకాలీదళ్ నేత బాదల్ జరిగిన కాల్పుల ఘటన.. పంజాబ్ ప్రతిష్టను తీసేందుకు జరిగిన కుట్రగా అభివర్ణించారు. సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై దాడిలో అనేక శక్తులు పాల్గొన్నాయని ఆరోపించారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. నేడు పంజాబ్‌లో ఊహించని ఓ సంఘటన జరిగిందన్నారు. పెద్ద ప్రమాదం తప్పిందన్నారు.పంజాబ్ మాజీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై ఓ వ్యక్తి కాల్పులకు ప్రయత్నించాడు. కానీ ఈఘటనలో అతనికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనను నేను ఖండిస్తున్నాను. అయితే పంజాబ్, పంజాబీ ప్రజల పరువు తీసేందుకు పెద్ద కుట్ర జరుగుతోందన్నది ఒక్కటి మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది.. ఇందులో అనేక శక్తులు ఉన్నాయి' అని ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్ అన్నారు.అయితే కాల్పుల సమయంలో పంజాబ్ పోలీసులు వ్యవహరించిన తీరును కేజ్రీవాల్ ప్రశంసించారు. అంతేగాక ప్రతిచోటా పంజాబ్‌లో శాంతిభద్రతలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి కానీ ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితి ఏంటని కేజ్రీవాల్ ప్రశ్నించారు.కాగా సర్వదేవాలయం ఎదుట సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై బుధవారం తెల్లవారుజామున హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఆయన సేవాదార్‌గా శిక్ష అనుభవిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ దుండగుడు బాదల్‌పై కాల్పులకు తెగబడ్డాడు. అయితే అతని వ్యక్తిగత సిబ్బంది వెంటనే అప్రమత్తమవ్వడంతో బుల్లెట్లు గోడను తాకాయి. ఈ ప్రమాదంలో బాదల్‌కు ఎలాంటి గాయాలు అవ్వలేదు.కాల్పులు జరిపిన వ్యక్తిని మాజీ ఉగ్రవాది నరైన్ సింగ్ చౌరాగా గుర్తించారు. గతంలో అతడు ఖలిస్తానీ కార్యకలాపాల్లో అలాగే బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (బీకేఐ) ఉగ్రవాదిగా పనిచేసినట్లు తెలిసింది.కాల్పుల ఘటన అనంతరం సుఖ్బీర్ తన శిక్షను కొనసాగించారు. సతీమణి హర్‌సిమ్రత్‌కౌర్ బాదల్‌తో కలిసి స్వర్ణదేవాలయంలో వంటపాత్రలు శుభ్రం చేశారు. ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పందించారు. ‘సుఖ్బీర్ బాదల్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. దీనిపై తక్షణమే దర్యాప్తు చేపట్టి నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించా’’ అని వెల్లడించారు. -
పాత్రలు కడిగి, షూస్ శుభ్రం చేసిన మాజీ డిప్యూటీ సీఎం.. కారణం ఇదే
అమృత్సర్ : సిక్కులు అత్యున్నత ఆధ్యాత్మిక విభాగంగా పరిగణించే అకాల్ తఖ్త్ విధించిన శిక్షను పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం, శిరోమణి అకాలీదళ్ పార్టీ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్ పాటిస్తున్నారు.అకాల్ తఖ్త్ విధించిన శిక్షలో భాగంగా మంగళవారం అమృత్‌సర్‌లో గోల్డెన్ టెంపుల్లో సుఖ్బీర్ సింగ్ బాదల్ నీలిరంగు ‘సేవాదర్’ దుస్తులు ధరించారు. కాలికి గాయం కావడంతో కాలికి గాయం కావడంతో వీల్ చైర్లో కూర్చొని పాత్రల్ని కడిగారు. షూస్‌ను శుభ్రం చేశారు. అకాల్ తఖ్త్ మాజీ డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్‌తో పాటు శిరోమణి అకాలీదళ్ పార్టీ నేతలకు సైతం ఈ శిక్షను అనుభవిస్తున్నారు. సుఖ్బీర్ సింగ్ బాదల్‌తో పాటు పంజాబ్ మాజీ మంత్రి బిక్రమ్ సింగ్ మజిథియా సైతం పాత్రల్ని కడిగారు. ఈ శిక్షను అనుభవించే సమయంలో అకాలీదళ్ నేతల మెడలో వారు ఏ తప్పులు చేశారు. అందుకు గాను అకాల్ తఖ్త్ ఏ శిక్షలు విధించిందో తెలిపేలా ఓ పలకను కూడా ఉంచింది. అధికారంలో ఉండగా అనేక తప్పిదాలుపంజాబ్లో బీజేపీతో దశాబ్ద కాలంగా పొత్తు పెట్టుకున్న సమయంలో శిరోమణి అకాలీదళ్ అనేక మతపరమైన తప్పిదాలకు కారణమని అకాల్ తఖ్త్ పేర్కొంది. ఆ సమయంలో సుఖ్ బీర్ సింగ్ బాదల్ సహా ఆయన అనుచరులు 2007-2017 మధ్య అధికారంలో ఉన్న సమయంలో తప్పులు, మతపరమైన దుష్ప్రవర్తనలకు పాల్పడ్డారని ఈ ఏడాది ఆగస్ట్‌లో అకాల్ తఖ్త్ తేల్చింది. డేరా బాబాకు మద్దతుగా నిలిచారని సుఖ్ బీర్ సింగ్ బాదల్ పలు నేరాలకు పాల్పడిన డేరా బాబాకు మద్దతుగా నిలిచారని తెలిపింది. చేసిన తప్పులకు సుఖ్ బీర్ సింగ్ బాదల్ శిక్ష విధించింది. శిక్షలో భాగంగా స్వర్ణ మందిర్ సహా పలు గురుద్వారాల్లో సేవాదార్లుగా పని చేయాలంటూ శిక్ష ఖరారు చేసింది. సేవాదార్లుగా మరుగుదొడ్లు, వంటశాలలు శుభ్రం చేయాలని, బూట్లు తుడవాలని ఆదేశించింది. అయితే,వారు చేసిన తప్పులకు క్షమాపణలు చెప్పినా అకాల్ తఖ్త్ అంగీకరించలేదు. దీంతో అకాత్ తఖ్త్ విధించిన శిక్షలో భాగంగా సుఖ్ బీర్ సింగ్ బాదల్ సేవాదార్‌గా పనిచేశారు. VIDEO | Punjab: Shiromani Akali Dal leader Sukhbir Singh Badal serves as a 'sewadar' at Golden Temple in Amritsar.#PunjabNews (Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/c6lRVUbRX6— Press Trust of India (@PTI_News) December 3, 2024 -
మాజీ డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్‌కు అకాల్ తఖ్త్ శిక్ష
ఛండీగఢ్: సిక్కులు అత్యున్నత ఆధ్యాత్మిక విభాగంగా పరిగణించే అకాల్ తఖ్త్ కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబ్ మాజీ ఉపముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ పార్టీ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్‌కు కీలక ఆదేశాలు జారీ చేసింది. తాను గతంలో చేసిన పలు తప్పులకు సుఖ్బీర్ సింగ్ బాదల్ గురుద్వారాల్లో పాత్రలు, బూట్లు, టాయిలెట్లను శుభ్రం చేయాలని ఆదేశించింది. అంతేకాదు.. సుఖ్బీర్ సింగ్ బాదల్ తండ్రి, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్‌కు గతంలో ఇచ్చిన ఫఖర్-ఎ-కౌమ్ (సిక్కు సమాజానికి గర్వకారణం) బిరుదును కూడా ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. దీంతో పాటు శిరోమణి అకాలీదళ్ పార్టీ చీఫ్‌గా ఉన్న ఆయన రాజీనామాను ఆమోదించి.. ఆరు నెలల్లోగా పార్టీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని సూచించింది.2007 నుండి 2017 వరకు పంజాబ్‌లో అధికారంలో ఉన్నప్పుడు తాను చేసిన తప్పులకు సుఖ్బీర్ సింగ్ బాదల్ క్షమాపణలు చెప్పడంతో అకాల్ తఖ్త్ ఈ నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి అకాల్ తఖ్త్ ఆదేశాల్ని సుఖ్బీర్ సింగ్ బాదల్ పాటించనున్నారు. VIDEO | Five high priests headed by Akal Takht Jathedar Giani Raghbir Singh pronounce punishment for former Punjab deputy CM Sukhbir Singh Badal for religious misconduct.On August 30, Sukhbir was declared ‘tankhaiya’ by Akal Takht, which held him guilty of religious misconduct… pic.twitter.com/MwPKXI1OS3— Press Trust of India (@PTI_News) December 2, 2024 -
తిలక్ వర్మ విఫలం.. అన్మోల్ప్రీత్ సింగ్ విధ్వంసం
దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు మూడో పరాజయం నమోదు చేసింది. డిఫెండింగ్ చాంపియన్ పంజాబ్‌తో మ్యాచ్‌లో ఏడు పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. ఆల్‌రౌండర్ చామా మిలింద్ (22 బంతుల్లో 55; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపులు మెరిపించినా హైదరాబాద్‌ను విజయతీరాలకు చేర్చలేకపోయాడు.అన్మోల్ప్రీత్ సింగ్ విధ్వంసంగ్రూప్ ‘ఎ’లో భాగంగా రాజ్‌కోట్ వేదికగా ఆదివారం జరిగిన ఈ పోరులో .. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసింది పంజాబ్. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. అన్మోల్ప్రీత్ సింగ్ (36 బంతుల్లో 60; 8 ఫోర్లు, ఒక సిక్స్) అర్ధశతకం సాధించగా... రమణ్‌దీప్ సింగ్ (11 బంతుల్లో 39 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), నేహల్ వధేరా (31; ఒక ఫోర్, 2 సిక్స్‌లు) రాణించారు.హైదరాబాద్ బౌలర్లలో రవితేజ, అజయ్‌దేవ్ గౌడ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. చామా మిలింద్, రోహిత్ రాయుడు (37 బంతుల్లో 56; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో రాణించగా... మికిల్ జైస్వాల్ (23 బంతుల్లో 39; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించాడు.తిలక్ వర్మ విఫలంకెప్టెన్ తిలక్ వర్మ (9), తన్మయ్ అగర్వాల్ (9), రాహుల్ బుద్ధి (5), అజయ్‌దేవ్ గౌడ్ (6), రవితేజ (0), ప్రతీక్ రెడ్డి (4) విఫలమయ్యారు. ఇన్నింగ్స్ చివరి బంతి వరకు క్రీజులో నిలిచిన మిలింద్ భారీ సిక్స్‌లతో విరుచుకుపడినా... జట్టును విజయతీరానికి చేర్చలేకపోయాడు. పంజాబ్ బౌలర్లలో నమన్ ధీర్ 5 వికెట్లు పడగొట్టాడు. తదుపరి మ్యాచ్‌లో మంగళవారం మధ్యప్రదేశ్‌తో హైదరాబాద్ తలపడనుంది. స్కోరు వివరాలు పంజాబ్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (బి) అజయ్‌దేవ్ గౌడ్ 21; ప్రభ్‌సిమ్రన్ సింగ్ (సి) తిలక్ వర్మ (బి) మిలింద్ 1; అన్మోల్ప్రీత్ సింగ్ (సి) ప్రతీక్ రెడ్డి (బి) అజయ్‌దేవ్ గౌడ్ 60; నేహల్ వధేరా (సి) మిలింద్ (బి) నితిన్‌సాయి యాదవ్ 31; నమన్ ధీర్ (సి) రాహుల్ బుద్ధి (బి) రవితేజ 9; సానీ్వర్ సింగ్ (సి) రోహిత్ రాయుడు (బి) రవితేజ 24; రమణ్‌దీప్ సింగ్ (నాటౌట్) 39; అర్ష్‌దీప్ సింగ్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 5, మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1–13, 2–28, 3–115, 4–115, 5–149, 6–151. బౌలింగ్: రవితేజ 4–0–49–2; మిలింద్ 4–0–28–1; అజయ్‌దేవ్ గౌడ్ 4–0–38–2; రక్షణ్ రెడ్డి 2–0–26–0, నితిన్‌సాయి యాదవ్ 4–0–40–1; రోహిత్ రాయుడు 2–0–13–0. హైదరాబాద్ ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (సి) జసిందర్ సింగ్ (బి) నమన్ 9; రోహిత్ రాయుడు (సి) సాన్వీర్ సింగ్ (బి) నమన్ 56; తిలక్ వర్మ (సి) అర్ష్‌దీప్ (బి) జసిందర్ 9; మికిల్ జైస్వాల్ (సి) అన్మోల్ప్రీత్ (బి) మయాంక్ మార్కండే 39; రాహుల్ బుద్ధి (సి) అభిషేక్ శర్మ (బి) జసిందర్ 5; అజయ్‌దేవ్ గౌడ్ (సి) రమణ్‌దీప్ సింగ్ (బి) నమన్ 6; రవితేజ (ఎల్బీ) (బి) నమన్ 0; ప్రతీక్ రెడ్డి (స్టంప్డ్) ప్రభ్‌సిమ్రన్ (బి) నమన్ 4; మిలింద్ (సి) రమణ్‌దీప్ (బి) అర్ష్‌దీప్ 55; నితిన్‌సాయి యాదవ్ (రనౌట్) 0; రక్షణ్ రెడ్డి (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 189. వికెట్ల పతనం: 1–25, 2–57, 3–118, 4–120, 5–127, 6–127, 7–133, 8–141, 9–142, 10–189. బౌలింగ్: అభిషేక్ 1–0–10–0; అర్‡్షదీప్ 4–0–47–1; బల్తేజ్ సింగ్ 3–0–35–0; నమన్ ధీర్ 4–0–19–5; జసిందర్ సింగ్ 4–0–44–2; మయాంక్ మార్కండే 2–0–22–1; సాన్వీర్ సింగ్ 2–0–14–0. -
By Election Results: యూపీ ఉప ఎన్నికల్లో బీజేపీదే హవా
న్యూఢిల్లీ: దేశంలోని 15 రాష్ట్రాల్లోని 48 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు శనివారం(నవంబర్23) వెలువడ్డాయి. మహారాష్ట్రలో ఒక ఎంపీ సీటు, కేరళలోని వయనాడ్ ఎంపీ సీటుకు ఉప ఎన్నికలు జరగ్గా వయనాడ్‌ను కాంగ్రెస్ గెలుచుకుంది. ఇక్కడ కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఆ పార్టీ అగ్రనేత ప్రియాంకగాంధీ 4లక్షలకుపైగా రికార్డు మెజారిటీ సాధించారు. మహారాష్ట్రలోని నాందేడ్ ఎంపీ సీటును బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. ఉత్తరప్రదేశ్..48 సీట్లలో యూపీలో కీలకమైన 9 సీట్లున్నాయి. యూపీలో ఆరు అసెంబ్లీ స్థానాలను బీజేపీ తన ఖాతాలో వేసుకోగా రెండు చోట్ల సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) గెలిచింది. వెస్ట్‌బెంగాల్..వెస్ట్‌బెంగాల్‌లో ఆరు అసెంబ్లీ సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార టీఎంసీ మళ్లీ సత్తా చాటింది. ఇక్కడ ఆరింటికి ఆరు స్థానాలను మమతా బెనర్జీ పార్టీ కైవసం చేసుకుంది. బీహార్..బీహార్‌లో నాలుగు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో ఎన్డీయే క్లీన్ స్వీప్ చేసింది.ఇక్కడ తరారీ (బీజేపీ ), రామ్‌గఢ్ (బీజేపీ), బేలాగంజ్ (జేడీయూ), ఇమామ్‌గంజ్ (హెచ్ఏఎం(ఎస్))రాజస్థాన్..రాజస్థాన్‌లో ఉప ఎన్నికలు జరిగిన 7 అసెంబ్లీ సీట్లలో బీజేపీ 5 గెలుచుకుంది. ఒక సీటులో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండగా భారత్ ఆదివాసీ పార్టీ(బీఏడీవీపీ) ఒక సీటు గెలుచుకుంది. కర్ణాటక..కర్ణాటకలోని 3 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో మూడింటిని అధికార కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. కర్ణాటకలోకి శిగ్గావ్ ఉప ఎన్నికలో మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై తనయుడు భరత్ బొమ్మై ఓటమి13 వేలకుపైగా ఓట్లతో బొమ్మైపై గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి యాసిర్ అహ్మద్ ఖాన్ పఠాన్పంజాబ్.. పంజాబ్‌లో మొత్తం నాలుగు స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా మూడింటిలో ఆమ్ఆద్మీపార్టీ, ఒక సీటులో కాంగ్రెస్ పార్టీ గెలుపొందాయి. కేరళ..కేరళలో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నకలు జరగగా ఒక చోట అధికార సీపీఎం మరొకచోట కాంగ్రెస్ విజయం సాధించాయి. 4 లక్షల రికార్డు మెజారిటీతో గెలిచిన ప్రియాంక గాంధీ 👉కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ మరోసారి భారీ విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకా గాంధీ సీపీఐ అభ్యర్థి సత్యన్ మొకేరిపై 4లక్షల 10 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గతంలో రాహుల్‌గాంధీ ఇదే స్థానం నుంచి 3,64,422 ఓట్ల ఆధిక్యత సాధించారు. 👉కేరళలోని పాలక్కాడ్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ మమ్కూతిల్ 18,840 ఓట్ల భారీ తేడాతో బీజేపీ అభ్యర్థి సి కృష్ణకుమార్‌పై విజయం సాధించారు.అస్సాం.. అస్సాంలోని నాలుగు అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు జరగగా నాలుగింటిలో రెండింటిని అధికార బీజేపీ ఒకటి కాంగ్రెస్ ఒకటి ఏజీపీ గెలుచుకున్నాయి. సిక్కిం..సిక్కింలోని రెండు అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నిక జరగగా రెండు సీట్లలో ఎస్కేఎం గెలుపొందింది. గుజరాత్..గుజరాత్లో ఒక అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక జరగగా ఒక్క సీటులో బీజేపీ గెలుపొందింది. చత్తీస్‌గఢ్..ఛత్తీస్‌గఢ్‌లో ఒక అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక జరగగా దానిని బీజేపీ గెలుచుకుంది.ఉత్తరాఖండ్..ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగగా ఇక్కడ బీజేపీ గెలుపొందింది. మేఘాలయ..మేఘాలయాలోని ఒక అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక జరగగా ఈ సీటును ఎన్పీపీ పార్టీ తన ఖాతాలో వేసుకుంది.ఇది కూడా చదవండి: Jharkhand Election Result: ఇంటర్నెట్ సేవలు నిలిపివేయాలి: జేఎంఎం -
ఒక్కరోజులో భారీగా పంట వ్యర్థాల కాల్చివేత.. మరింతగా పెరిగిన కాలుష్యం
చండీగఢ్: పంజాబ్‌లో ఆదివారం ఒక్కరోజున 400కి పైగా పంట వ్యర్థాలు తగులబెట్టిన సంఘటనలు నమోదయ్యాయి. ఈ సీజన్లో రాష్ట్రంలో తరహా కేసుల సంఖ్య 8,404కి చేరుకుంది. రిమోట్ సెన్సింగ్ డేటా సాయంతో ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది.పంజాబ్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అధికారులు మీడియాతో మాట్లాడుతూ కొత్తగా 404 వరకూ పంట వ్యర్థాలు తగులబెట్టిన ఘటనలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. వాటిలో ఫిరోజ్పూర్లో 74, భటిండాలో 70, ముక్త్సర్లో 56, మోగాలో 45, ఫరీద్‌కోట్‌లో 30 ఘటనలు ఉన్నాయన్నారు. ఫిరోజ్‌లో అత్యధికంగా పంటవ్యర్థాలను తగులబెట్టిన ఘటనలు చోటుచేసుకున్నాయి. కాగా పంజాబ్‌లో 2022లో ఒకేరోజులో 966, 2023లో 1155 పంట వ్యర్థాలు తగులబెట్టిన కేసులు నమోదయ్యాయి.కాగా గత సెప్టెంబరు 15 నుండి నవంబర్ 17 వరకు పంజాబ్‌లో 8,404 పంటవ్యర్థాలు తగులబెట్టారు. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇటువంటి సంఘటనలలో 75 శాతం తగ్గుదల కనిపించింది. పంజాబ్, హర్యానాలలో అక్టోబర్, నవంబర్లలో వరి పంట కోసిన తర్వాత భారీ ఎత్తున పంట వ్యర్థాలు తగులబెడుతుంటారు. ఇదిలో ఢిల్లీలో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వాయు కాలుష్యం పెరగడానికి కారణంగా నిలుస్తోంది.ఇది కూడా చదవండి: మంచు కురిసే వేళలో.. మూడింతలైన కశ్మీర్ అందాలు -
శిరోమణి అకాలీదళ్ అధ్యక్ష పదవికి సుఖ్బీర్ సింగ్ రాజీనామా
చండీగఢ్: శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని పార్టీ అధికార ప్రతినిధి, పంజాబ్ మాజీ విద్యాశాఖ మంత్రి దల్జిత్ ఎస్ చీమా ఎక్స్ ద్వారా వెల్లడించారు. ‘శిరోమణి అకాలీదళ్ అధక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ నేడు పార్టీ వర్కింగ్ కమిటీకి తన రాజీనామాను సమర్పించారని, పార్టీకి కొత్త అధ్యక్షుడిని అందించేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఇన్నాళ్లు తన నాయకత్వంపై విశ్వాసం ఉంచినందుకు, తనకు మద్దతు, సహాకారాన్ని అందించినందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ సుఖ్బీర్ సింగ్ బాదల్ కృతజ్ఞతలు తెలిపారు.ఇక తదుపరి కార్యాచరణను నిర్ణయించేందుకు అకాలీదళ్ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు బల్వీందర్ సింగ్ భుందార్ సోమవారం అత్యవసర సమావేశం ఏర్పాటుకు పిలుపునిచ్చారు. చండీగఢ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు భేటీ జరగనుం. కాగా అకాలీదళ్ అధ్యక్ష పదవి, ఆఫీస్ బేరర్లు, కార్యవర్గానికి డిసెంబర్ 14న ఎన్నికలు జరగనున్నాయి. -
కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాది అర్ష్‌దీప్ దల్లా అరెస్ట్!
ఢిల్లీ: ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జార్ సహాయకుడు అర్ష్‌దీప్ దల్లాను కెనడాలో అదుపులోకి తీసుకున్నట్లు సంబంధిత పోలీసు వర్గాలు వెల్లడించాయి.అయితే.. అతను విడుదలయ్యాడా లేదా ఇంకా జైలులో ఉన్నాడా? అనే దానిపై ఎటువంటి సమాచారం తెలియజేయలేదు. ప్రస్తుతం కెనడాతో దౌత్యపరమైన సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఎటువంటి సమాచారం పంచుకోకపోవటం గమనార్హం. అతని నిర్బంధంపై అధికారిక ధృవీకరించలేదు. అక్టోబర్ 27-28 తేదీలలో కెనడాలో జరిగిన కాల్పుల తర్వాత డల్లాను అదుపులోకి తీసుకున్నారు. కెనడియన్ ఏజెన్సీల ప్రకారం.. మిల్టన్‌లో జరిగిన కాల్పులపై హాల్టన్ ప్రాంతీయ పోలీసు సర్వీస్ (HRPS) దర్యాప్తు చేస్తోంది. ఈ ఘటనపై హెచ్ఆర్పీఎస్.. గల్ఫ్ పోలీసులను సంప్రదించారు. ఆ రోజు కాల్పుల్లో ఇద్దరు గాయపడి ఆస్పత్రిలో చేరారని, అందులో ఒకరికి డాక్టర్లు చికిత్స అందించి అనంతరం పంపించి వేశారని తెలిపారు.మరోవైపు.. 28 ఏళ్ల డల్లా తన భార్యతో కలిసి కెనడాలోని సర్రేలో నివసిస్తున్నట్లు భారత భద్రతా సంస్థల వర్గాలు తెలిపాయి. అతనికి దోపిడీ, హత్య, తీవ్రవాద సంబంధిత కార్యకలాపాలకు సంబంధించిన అనేక కేసుల్లో ప్రమేయం ఉందని తెలిపారు. అదీకాక.. అతనిపై UAPA కింద కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. అతడిపై ఇప్పటికే పంజాబ్ పోలీసులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. పంజాబ్‌లోని జాగ్రావ్‌కు చెందిన ఎలక్ట్రీషియన్ పరమజీత్ సింగ్ హత్యకు డల్లా బాధ్యత వహించాడు. డేరా సచ్చా సౌదా అనుచరుడు మనోహర్ లాల్‌ను అతని సహచరులు నవంబర్ 2020లో కాల్చి హత్య చేశారు. మరో డేరా సచ్చా సౌదా అనుచరుడైన శక్తి సింగ్‌ను కిడ్నాప్ చేసి చంపడానికి కుట్ర పన్నడంలో డల్లా ప్రమేయం ఉందని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో భారత్ డల్లాను మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్స్ జాబితాలో చేర్చింది.#BreakingNews: Wanted Khalistani terrorist Arsh Dalla arrested in Canada@arvindojha joins us for more on this #ArshDalla #Canada #Khalistani (@ahuja_harshit94) pic.twitter.com/pWset1mtnh— IndiaToday (@IndiaToday) November 10, 2024 క్రెడిట్స్: IndiaTodayచదవండి: వివాదంలో బ్రిటన్ ప్రధాని.. భారతీయులకు క్షమాపణలు చెబుతారా? -
బిల్డింగ్ కట్టిన కాంట్రాక్టర్‌కు కోటి రూపాయల వాచ్ గిఫ్ట్
పంజాబ్‌లో నివాస భవనాన్ని నిర్మించిన కాంట్రాక్టర్‌కు కోటి రూపాయల విలువైన రోలెక్స్ వాచ్‌ను బహుమతిగా ఇచ్చాడో వ్యాపారవేత్త. నాణ్యతగా, వేగవంతంగా నిర్మాణాన్ని పూర్తి చేయడంతలో కాంట్రాక్టర్ రాజిందర్ సింగ్ రూప్రా చూపిన ఖచ్చితమైన శ్రద్ధను గుర్తిస్తూ ఆయనకు ఈ బహుమతి అందించినట్లు భవన యజమాని గుర్దీప్ దేవ్‌బత్ చెప్పారు.కాంట్రాక్టర్ రాజిందర్ సింగ్ రూప్రా అందుకున్న ఈ వాచ్ 18-క్యారెట్ల బంగారంతో రూపొందించిన రోలెక్స్ ఓస్టెర్ పెర్పెచ్యువల్ స్కై-డ్వెల్లర్. చూడగానే బంగారు కాంతులతో ధగాధగా మెరిసిపోతున్న ఈ వాచ్‌కి బలమైన బంగారు లింక్‌లతో తయారైన సిగ్నేచర్ ఓస్టెర్ బ్రాస్లెట్ ఉంది. అలాగే ఇందులో షాంపైన్-రంగు డయల్ కూడా ఉంది.200 మందికిపైగా కార్మికులుపంజాబ్లోని జిరాక్పూర్ సమీపంలో 9 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన భవనం విషయానికి వస్తే ఇది ఆధునిక కోటను పోలి ఉంటుంది. పంజాబ్‌లోని షాకోట్‌కు చెందిన రూప్రా అనే కాంట్రాక్టర్ అనుకున్న ప్రకారం రెండు సంవత్సరాల వ్యవధిలో 200 మందికి పైగా కార్మికులతో నిరంతరం పనులు చేసి నిర్మాణం పూర్తి చేశారు.వాస్తుశిల్పి రంజోద్ సింగ్ భవనం డిజైన్‌ను రూపొందించారు. దృఢమైన సరిహద్దు గోడతో ఒక ప్రైవేట్ కోటలా దీన్ని నిర్మించారు. ఇందులో విశాలమైన హాళ్లు, అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన గార్డెన్లు ఉన్నాయి. అంతేకాకుండా నిర్మాణపరంగా విశిష్టమైన ప్రత్యేకతలెన్నో ఈ భవనంలో ఉన్నాయి. -
చరిత్ర సృష్టించిన అందాల రాణి
మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ (MGI) 2024 టైటిల్‌ను సాధించి రాచెల్ గుప్తా (20) చరిత్ర సృష్టించింది. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరిగిన పోటీలో ఈ కిరీటాన్నిదక్కించుకున్న తొలి భారతీయురాలిగా నిలిచింది. సుమారు 70కిపైగా దేశాలకు చెందిన అందాల రాణులను వెనక్కి నెట్టి భారతదేశానికి టైటిల్‌ను అందించింది. దీంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పంజాబ్‌లోని జలంధర్‌లో ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు సంబరాల్లో మునిగిపోయారు. రేచల్ విజయం యవద్దేశం గర్వించేలా చేసిందని కుటుంబ సభ్యుడు తేజస్వి మిన్హాస్ హర్షం వ్యక్తం చేశారు.బ్యాంకాక్ MGI హాల్లో జరిగిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీలో రాచెల్ గ్ర్యాండ్ ఫినాలెలో ఫిలిప్పీన్స్‌కి చెందిన సిజె ఓపియాజాను ఓడించి బంగారు కిరీటాన్ని గెలుచుకున్నారు. ఆగస్టులో మిస్ గ్రాండ్ ఇండియా టైటిల్ గెలుచుకున్న తర్వాత అంతర్జాతీయ పోటీలో చోటు దక్కించుకుంది. అలాగే 2022లో 'మిస్ సూపర్ టాలెంట్ ఆఫ్ ది వరల్డ్' కిరీటాన్ని కూడా గెలుచుకుంది. ఇకపై రాచెల్ ప్రపంచవ్యాప్తంగా శాంతి, స్థిరత్వాన్ని పెంపొందించే ప్రపంచ రాయబారిగా ఉండనుంది. ఈ టైటిల్ దక్కించుకున్న తొలి భారతీయురాలిగా రికార్డ్ సృష్టించడమే కాదు, 'అత్యధిక ప్రపంచ అందాల పోటీల కిరీటాలు గెల్చుకున్న తొలి ఇండియన్ లారాదత్తా సరసన చేరింది. కాగా రాచెల్ ఆమె మాడెల్, నటి వ్యాపారి. ఇన్‌స్టాగ్రామ్‌లో 10లక్షలకు పైగా ఫాలోవర్లు ఆమె సొంతం. -
70 దేశాలను ఓడించి అందాల రాణిగా రాచెల్ గుప్తా : తొలి ఇండియన్‌గా చరిత్ర


