
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. పాక్‌కు వెన్నులో వణుకు పుట్టించిన ఆపరేషన్ సింధూర్‌తో భారత్ ఆర్మీ తన సత్తాచాటింది. పాక్‌లోకి దూసుకుపోయి మరీ ఉగ్రస్థావరాలను, పలు పాక్ ఎయిర్ బేస్‌లపై దాడులు చేసింది. ఇందులో మన ఆర్మీ పాత్రను ఎంత కొనియాడినా తక్కువే. అత్యంత కట్టుదిట్టమైన ప్రణాళికతో పాక్‌కు దడపుట్టించింది. ఆ దెబ్బతో పాక్ కాల్పుల విరమణ ఒప్పందానికి రావడంతో దానికి భారత్‌కు అంగీకరించింది.
ఇదిలా ఉంచితే, భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌కు సాయం చేసిన ఒక 10 ఏళ్ల లిటిల్ హీరో కూడా ఉన్నాడు. అదేంటి 10 ఏళ్ల పిల్లాడు ఏం చేస్తాడు అనుకుంటున్నారా?, పాక్ ఆర్మీతో యుద్ధం చేస్తున్న సమయంలో భారత్ సైనికులకు భోజనాలు అందించి తన పాత్రను నిలబెట్టుకున్నాడు. ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా పంజాబ్ గ్రామంలో భారత సైనికులు యుద్ధం చేస్తున్న సమయంలో వారికి ఆ ‘బుడ్డోడు’ భోజనాలు తదితర ఆహార పదార్థాలను సప్లై చేశాడు. దాంతో ఆ లిటిల్ హీరోను సత్కరించింది ఆర్మీ.
పంజాబ్‌లోని తారా వాలి గ్రామంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆ చిన్నోడు ధైర్యాన్ని ఇండియన్ ఆర్మీ కీర్తించింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పంజాబ్ గ్రామంలో తుపాకీతో పోరాడుతున్న సైనికులకు మధ్య మధ్యలో భోజనం సరఫరా చేసిన పదేళ్ల బాలుడు ష్వాన్ కథను వెస్ట్రన్ కమాండ్ కమాండింగ్-ఇన్-చీఫ్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ పంచుకున్నారు.
Indian Army decides to sponsor all educational needs of the Youngest Warrior of '#OperationSindoor' from Punjab, Master Shvan Singh.
This 10-years old from Ferozepur kept on providing essential eatables, day and night, to the army men deployed in his fields in the border… pic.twitter.com/8xv7kozth4— All India Radio News (@airnewsalerts) July 20, 2025
ఆ బాలుడి ధైర్యానికి మెచ్చిన ఇండియన్ ఆర్మీ.. ఆ పిల్లాడు చదువుకు అయ్యే ఖర్చును భరిస్తామని హామీ ఇచ్చింది. ష్వాన్ యొక్క కథ దేశంలో ఉన్నవారికి ఆదర్శం కావాలని ఆర్మీ స్పష్టం చేసింది.
ఫిరోజ్‌పూర్ జిల్లాలోని మామ్‌డోట్ ప్రాంతంలోని ఒక చిన్న గ్రామానికి చెందిన 10 ఏళ్ల ష్వాన్... అతను కూడా పెద్దయ్యాక సైన్యంలో చేరాలని కోరుకుంటున్నాడు.‘ నేను పెద్దయ్యాక 'ఫౌజీ' కావాలనుకుంటున్నాను. దేశానికి సేవ చేయాలనుకుంటున్నాను’ అని గతంలోనే చెప్పుకొచ్చాడు.