ఆ అధికారిణి ధైర్యానికి ఫిదా అవ్వాల్సిందే..! భారీ కింగ్‌ కోబ్రానే.. | Kerala Forest Officers Daring Rescue Of 16-Foot King Cobra Goes Viral | Sakshi
Sakshi News home page

ఆ అధికారిణి ధైర్యానికి ఫిదా అవ్వాల్సిందే..! భారీ కింగ్‌ కోబ్రానే..

Jul 8 2025 11:30 AM | Updated on Jul 8 2025 1:22 PM

Kerala Forest Officers Daring Rescue Of 16-Foot King Cobra Goes Viral

మనం సాదాసీదాగా చూసే పాములు వాటి తీరుతెన్నులపై ఓ అవగాహన ఉంటుంది. అదే భారీ కింగ్‌ కోబ్రా.. ఎంత చురుగ్గా కదులుతుందో తెలిసిందే. కనిపిస్తేనే హడలిపోయి గుండె ఆగిపోయినంత పని అవుతుంది. అలాంటిది ఆ కోబ్రానే ఓ అటవీ అధికారిణి ఏ మ్రాతం భయం, బెరుకు లేకుండా పట్టుకున్న విధానం చూస్తే..వామ్మో అనిపిస్తుంది. 

ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వీడియోని రిటైర్డ్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ సుశాంత నందా షేర్‌ చేయడంతో నెట్టింట ఈ ఘటన వైరల్‌గా మారింది. ఆ వీడియోలో పరత్తిపల్లి రేంజ్‌కు చెందిన అధికారి జీఎస్‌ రోష్ని ఒక చిన్న కాలువ ప్రవాహం వద్ద భారీ కింగ్‌ కోబ్రా సంచరించడాన్ని చూశారు. వెంటనే పాములను పట్టే స్టిక్‌ని ఉపయోగించి  ఆ కోబ్రాని పట్టే ప్రయత్నం చేశారు. 

ఆ కోబ్రా దగ్గర దగ్గర 16 అడుగుల భారీ పాము అది. అత్యంత విషపూరితమైన ఈ పాముని పట్టుకోవడం అంత ఈజీ కాదు. కానీ ఆమె చాలా చాకచక్యంగా పట్టుకుని ఒక సంచిలో బంధించి మనుషుల సంచరానికి దూరంగా ఒక అటవీ ప్రదేశంలో వదిలేశారు. కేరళ అటవీ అధికారిణి రోష్ని ఇప్పటి వరకు సుమారు 800పైనే పాములను పట్టుకున్నారట. 

కానీ రోష్నికి ఇలా కింగ్‌ కోబ్రాను పట్టుకోవడం మాత్రం ఇదే తొలిసారి అని ఆ ఘటనకు సంబంధించిన వీడియోని షేర్‌ చేస్తూ పోస్ట్‌లో పేర్కొన్నారు రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ నందా. ఆ వీడియోని చూసిన నెటిజన్లు ఆమె అంకితభావానికి ప్రశంసిస్తూ..ఐఏఎస్‌ ఆఫీసర్‌లకు అటవీ అధికారులు ఏ మాత్రం తీసిపోరని, వారికంటే ఎక్కువ గౌరవాన్ని పొందేందుకు అర్హులని పోస్టుల పెట్టారు.  

 

(చదవండి: ట్రెండ్‌ 'షేరెంటింగ్‌'! పిల్లల ఫోటోలు ఆన్‌లైన్‌లో షేర్‌ చేస్తున్నారా..?)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement