బాలీవుడ్ నటి కరీనా కపుర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కరీన తన అందం, అభినయంతో వేలాది అభిమానులను సొంతం చేసుకున్నారామె. ఇప్పటికీ ఐదు పదుల ఏజ్‌లోనూ యువ హీరోయిన్‌లకు తీసిపోని ఫిట్‌నెస్‌తో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటారు. తాజాగా ఆమె ఫ్యాషన్‌పరంగా కరీనా రేంజ్ వేరేలెవెల్ అన్నట్లు ఉంటుంది ఆమె స్టైల్. అబుదాబిలో ఓ ప్రముఖ్య జ్యువెలరీ షాప్ ప్రారంభోత్సవంలో కరీనా లుక్ అందర్నీ ఆశ్చర్యపోయేలా చేసింది.ముఖ్యంగా ఆమె ధరించిన జాకెట్ హాట్‌టాపిక్‌గా మారింది.
ఓజీ స్టైల్ ఐకాన్ కరీనా కపూర్ ఖాన్ అబుదాబిలో విలాసవంతమైన లగ్జరీ ఫ్యాషన్‌కి కేరాఫ్‌గా నిలుచారు. ఆమె స్టన్నింగ్ లుక్ కళ్లుతిప్పుకోనివ్వనంతగా హైలెట్‌గా నిలిచింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధానిలో కరీనా తన స్టైల్ స్టేట్‌మెంట్ ఇది అన్నట్లుగా అత్యంత అందంగా కనిపించారామె. ఈ మేరకు ఆమె శ్వేతా కపూర్ నేతృత్వంలోని ఫ్యాషన్ బ్రాండ్ బృందంతోపాటు మెరిశారామె. బ్రాండ్ బైడల్ కలెక్షన్ నుంచి బెబో తెల్లటి దుస్తులు విత్ చేతితో ఎంబ్రాయిడరీ చేసిన పొడవాటి జాకెట్‌ని ధరించింది కరీనా.
నిజానికి డ్రెస్‌ని ఒపాల్ సెట్ అని పిలుస్తారట. దీని ధర వచ్చేసి సుమారు రూ. 5 లక్షలు పైనే పలుకుతుందట. తెల్టి శాటిన్‌పై ఆ జాకెట్ లుక్ అదిరిపోగా..ఈ జాకెట్‌ని వెండి దారలతో ఎంబ్రెయిడ్ చేసి, మేలుజాతి స్టోన్‌లతో తీర్చిదిద్దారు. ఇక ఆమె చెవిపోగులు, ఉంగరంగ డైమండ్‌ని ఎంచుకుని తన లుక్ మరింత ప్రకాశంతంగా కనిపించేలా జాగ్రత్త పడ్డారామె.
ఇక జడను బన్ స్టైల్ వేసుకుని..ఆ డ్రెస్‌కి పూర్తి న్యాయం చేశారామె. అలాగే ఆ ప్రకాశవంతమైన డ్రెస్‌కి అనుగుణంగా పెదవులకు,బుగ్గలకు లేతరంగు గులాబీ, కనురెప్పలకు మస్కారా, స్మోకీ ఐషాడోను ఎంచుకుని స్టైల్‌కి సరికొత్త అర్థం ఇచ్చేలా కరీనా ఆహార్యం అదుర్స్.
(చదవండి: 90 నిమిషాల ఎమర్జెన్సీ రూమ్‌కి..హడలెత్తించేలా బిల్లు..!)


