ఇరాన్‌పై ప్రతీకారం తీర్చుకుంటాం : జీసీసీ | Group of Gulf countries warning To iran attacks on abu dhabi | Sakshi
Sakshi News home page

Group of Gulf countries: ఇరాన్‌పై ప్రతీకారం తీర్చుకుంటాం : జీసీసీ

Mar 4 2026 4:32 AM | Updated on Mar 4 2026 12:30 PM

Group of Gulf countries warning To iran attacks on abu dhabi

ఇరాన్ దాడులపై గల్ఫ్ దేశాల సమూహం అయిన జీసీసీ స్పందించింది. ఈ దాడులకు తగిన ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చింది. అబుదాబి, రస్‌ ఆల్ ఖైమాలపై ఇరాన్‌ మిస్సైల్స్, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో అబుదాబిలో గిడ్డంగులు దెబ్బతిన్నాయి.  ఇరాన్ దాడి తర్వాత జెబెల్ అ లీ ఓడరేవు నుండి పొగలు ఎగసిపడుతున్నాయి.

కాగా.. అబుదాబి, రస్ అల్ ఖైమాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడిలో  యుఎఇ రక్షణ వ్యవస్థ ధ్వంసమైంది. నిన్న మధ్యాహ్నం ముసాఫా పారిశ్రామిక ప్రాంతంపై ఈ దాడి జరిగింది. ముసాఫా, ఐసిఎడిలోని గిడ్డంగులను క్షిపణి శిథిలాలు తాకాయి. అయితే ఈ దాడుల్లో ఎవరూ గాయపడలేదు. సాయంత్రం జరిగిన దాడిలో ఓ క్షిపణి యూఎస్ సైనిక స్థావరంలోని నిల్వ కేంద్రం దగ్గర పడింది. ఆ సమయంలో భారీ పేలుడు జరిగింది.

నిన్న రస్ అల్ ఖైమాలో కూడా డ్రోన్ దాడి జరిగింది.  దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. వెంటనే అగ్నిమాపక దళం అదుపులోకి తీసుకొచ్చింది. చమురు, ఇంధన వనరులపై దాడి చేసిన ఇరాన్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని గల్ఫ్ దేశాల సమూహం అయిన జీసీసీ ప్రకటించింది. అయితే అబుదాబి, రస్ అల్ ఖైమాను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడులను యూఏఈ రక్షణ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకుంది. కొన్ని గిడ్డంగులు శిథిలాల నుండి నష్టపోయినప్పటికీ, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
 

Advertisement
 
Advertisement
Advertisement