US Iran War ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా దాడులు, ఇరాన్ ప్రతీకార దాడుల మధ్య మధ్యప్రాచ్యంలోని కొన్ని ప్రాంతాలలో వైమానిక సర్వీసులు తీవ్రంగా ప్రభావితమైనాయి. దీంతో ఎక్కడి ప్రయాణీకులు అక్కడే నిలిచి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో దుబాయ్, అబుదాబి అధికారులు మానవత్వాన్ని చాటు కున్నారు. ప్రస్తుత అసాధారణ పరిస్థితుల కారణంగా బయలుదేరలేని టూరిస్టుల బసలను పొడిగించాలని హోటళ్లను ఆదేశించారు.
ఇరాన్ ప్రతీకార దాడులు గల్ఫ్ దేశాలు, మిడిల్ ఈస్ట్‌లో మరింత టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరాన్ జరిపిన మిస్సైల్ దాడులలో దుబాయ్ ఎయిర్‌పోర్టు, ప్రముఖ బుర్జ్ అల్ అరబ్ హోటళ్లు దెబ్బతిన్నాయి. అనేక విమానాలు నిలిపివేయడంతో, GCC దేశాలలో వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. దీంతో దుబాయ్ ఆర్థిక మరియు పర్యాటక శాఖ హోటల్ నిర్వాహకులకు అధికారిక ఆదేశాన్ని జారీ చేసింది, అతిథుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వండి, వసతి కొనసాగించడం, ప్రయాణికులు బయలుదేరలేకపోతే , వారిని ఖాళీ చేయించకుండా ఉండాలని, ఒక వేళ వెంటనే చెల్లించలేకపోతే వారి గదులను ఖాళీ చేయమని కోరవద్దని ఆదేశించింది. ప్రభావిత అతిథులు బసలను పొడిగించడానికి అనుమతించమని వారికి సూచించింది. హోటల్ జనరల్ మేనేజర్లను ఉద్దేశించి ఒక సర్క్యులర్ జారీ చేసింది.
ఇదీ చదవండి: 82 ఏళ్ల మహిళకు అప్పర్ బెర్తా? IRCTC క్లారిటీ ఇది!
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కొంతమంది అతిథుల చెక్-అవుట్ సమయం ముగిసినా, వారు బయలుదేరే వరకు వారి బసను పొడిగించాలని దీనికి సంబంధించిన అదనపు బస ఖర్చులను DCT అబుదాబి భరిస్తుందని వారికి తెలిపింది. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
Wow. pic.twitter.com/fo7DSPfaXB
— Samir Arora (@Iamsamirarora) March 1, 2026
చూసి నేర్చుకోండి!
పెట్టుబడిదారుడు సమీర్ అరోరా ఈ నిర్ణయాన్ని ప్రశంసించారు. అంతరిక్ష పరిశ్రమ శాస్త్రవేత్త హితేష్ మోదీ ఇలా రాశారు: "ఇది వేరే ప్రదేశం అయితే, అటువంటి అత్యవసర పరిస్థితుల్లో వారు ధరలను మూడు రెట్లు పెంచేవారు." అని వ్యాఖ్యానించారు. ‘‘ఇతర ప్రపంచ నాయకులు UAE నుండి నేర్చుకోవాలి. నేనుప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నాను, ఈ దేశ పాలన మానవాళి భద్రత కోసం అత్యున్నత స్థాయి శ్రద్దతీసుకుంటున్నారు. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న మీ గురించి దయచేసి ఈ సందేశాన్ని మీ హోటల్ మేనేజర్‌కు చూపించండి" అని కతార్జినా కొమోరోవిచ్ ట్వీట్ చేశారు.
I am currently in Dubai, the governance of this country is the highest level of deep care for safety of Humanity. May all other leaders watch and learn. Of you currently in #Dubai please show this message to your hotel Manager. https://t.co/L6CLQLCiLL
— Katarzyna Komorowicz (@KasiaKomorowicz) March 2, 2026


