UAE
-
గల్ఫ్‌కు అండగా ఉన్నాం.. జెలెన్స్కీ సంచలన ప్రకటన
గల్ఫ్ దేశాలకు మద్దతుగా ఉక్రెయిన్ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. ఉక్రెయిన్ సాయం కోరే దేశం మాత్రమే కాదని ఇతరులకు సాయం శక్తి తమ దేశానికి ఉందని స్పష్టం చేశారు.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ దుబాయిలో పర్యటనకు వెళ్లారు. ఖతార్‌తో 10 ఏళ్ల పాటు రక్షణ సహాకార ఒప్పందంపై ఆయన సంతకం చేశారు. ఇటీవలే గల్ఫ్ దేశాలకు సహాయంగా వెళ్లిన ఉక్రెయిన్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా త్వరలో యుఏఈ, ఉక్రెయిన్ ఉమ్మడి సహకారంతో ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.కాగా ఈ పర్యటనలో జెలెన్స్కీతో యూఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సమావేశమయ్యారు. ఇరాన్ దాడుల నేపథ్యంలో పలు రక్షణ అంశాలపై ఇరు దేశాధినేతలు కీలక చర్చలు జరిపారు. ఇరాన్ తమ దేశంలోని ప్రజలు, సంపదనే లక్షంగా చేసుకొని దాడులు జరుపుతుందని యుఏఈ అధ్యక్షుడు ఆరోపించారు. అయితే ఇటీవల ఇరాన్ దాడులను ఎదుర్కొవడానికి ఉక్రెయిన్ సాయం చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై టెహ్రాన్ జెలెన్స్కీకి వార్నింగ్ ఇచ్చింది. ఉక్రెయిన్‌పై నేరుగా దాడి చేస్తామని ప్రకటించింది. అయినప్పటికీ గల్ఫ్ దేశాలకు ఉక్రెయిన సాయం అందిస్తోంది. -
దుబాయ్‌లో ఈద్ వేడుకలు.. కార్మికులకు కార్లు, బంగారు కడ్డీలు
దుబాయ్‌లోని కార్మికులకు ఈ ఏడాది ఈద్ అల్ ఫితర్ (రంజాన్) వేడుకలు ప్రత్యేకంగా నిలవనున్నాయి. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) ఆధ్వర్యంలో మార్చి 20, 21 తేదీల్లో రెండు రోజులపాటు వర్చువల్ ఈవెంట్ నిర్వహించబడుతోంది. ‘ఈద్ అల్ ఫితర్… లెట్స్ సెలబ్రేట్ టుగెదర్’ అనే థీమ్‌తో జరుగుతున్న ఈ కార్యక్రమం కార్మికుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ వేడుకల్లో పాల్గొనే వారికి కార్లు, బంగారు బార్లు, విమాన టికెట్లు, మొబైల్ ఫోన్లు వంటి విలువైన బహుమతులు గెలుచుకునే అవకాశం కల్పించబడుతోంది. మొదటి రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు, రెండవ రోజు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమం దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, ఉప ప్రధాని, రక్షణ మంత్రి మరియు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ అయిన షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశాల మేరకు నిర్వహించబడుతోంది. దుబాయ్ అభివృద్ధి ప్రయాణంలో కార్మికులు పోషిస్తున్న కీలక పాత్రకు కృతజ్ఞతగా, సమాజంలో ఐక్యతను బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. కార్మికులు విస్తృతంగా పాల్గొనేలా ‘బ్లూ కనెక్ట్’ అనే ప్రత్యేక డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఈ వేడుకలు ప్రసారం చేయబడతాయి. ఇందులో వీడియోలు, ఇంటరాక్టివ్ గేమ్స్, పోటీలు వంటి విభిన్న వినోదాత్మక కంటెంట్ అందుబాటులో ఉంటుంది. GDRFA దుబాయ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ ఒబైద్ ముహైర్ బిన్ సురూర్ మాట్లాడుతూ.. ఈ వేడుకల ద్వారా కార్మికుల కృషిని గౌరవించడం, వారి దైనందిన సహకారాన్ని గుర్తించడం మా లక్ష్యం. ఈద్ ఆనందాన్ని వారితో పంచుకోవడం ద్వారా దుబాయ్ స్థిరమైన అభివృద్ధి ప్రయాణంలో వారి పాత్రను వెలుగులోకి తీసుకురావాలనుకుంటున్నామని అన్నారు. -
యూఏఈ అధ్యక్షుడికి మోదీ ఫోన్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేల భారత ప్రధాని నరేంద్ర మోదీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో టెలిఫోన్ ద్వారా మాట్లాడారు. ఈ సంభాషణలో హర్ముజ్ జలసంధి ద్వారా సురక్షిత వాణిజ్య నౌకాయానంపై ఇద్దరు నాయకులు చర్చించారు.మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్న ప్రకారం.. నా సోదరుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో మాట్లాడాను. అతనికి ముందస్తుగా ఈద్ శుభాకాంక్షలు. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితులపై ఇద్దరం చర్చించాం. హర్ముజ్ జలసంధి ద్వారా సురక్షితమైన, స్వేచ్ఛాయుతమైన నావిగేషన్ అవసరమని మేము అంగీకరించాము. యూఏఈపై జరిగిన దాడులను భారతదేశం తీవ్రంగా ఖండిస్తుంది. పశ్చిమాసియాలో శాంతి, భద్రత, స్థిరత్వం కోసం కలిసి పని చేస్తాము.కాగా, ఇరాన్‌పై ఇజ్రాయెల్–అమెరికా యుద్ధం ప్రారంభమైన తర్వాత మోదీ, యూఏఈ అధ్యక్షుడి మధ్య ఫోన్ సంభాషణ జరగడం ఇది రెండోసారి. మార్చి 2న కూడా మోదీ యూఏఈ అధ్యక్షుడితో మాట్లాడి దాడులను ఖండించారు. మోదీ ఇటీవల సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, జోర్డాన్ రాజు అబ్దుల్లా II, ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్, కువైట్ క్రౌన్ ప్రిన్స్ షేక్ సబాహ్ అల్-ఖాలెద్ అల్-సబాహ్, ఖతార్ అమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో కూడా మాట్లాడారు. -
అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు రోజులు సెలవులు
ఈద్ ఉల్ ఫితర్ పర్వదినాన్ని పురస్కరించుకుని అజ్మాన్ ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు రోజులు, ప్రైవేటు ఉద్యోగులకు మూడు రోజుల సెలవుగా పేర్కొంది. మానవ వనరుల విభాగం ప్రకటన ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు మార్చి 19 (గురువారం) నుండి మార్చి 22 (ఆదివారం) వరకు కొనసాగుతాయి. వారికి అధికారిక పనులు మార్చి 23 (సోమవారం) తిరిగి ప్రారంభమవుతాయి. ప్రైవేటు ఉద్యోగుల విషయానికొస్తే.. వీరికి సెలవులు మార్చి 19 (గురువారం) నుండి మార్చి 21 (శనివారం) వరకు ఉంటాయి. వీరు మార్చి 22 (ఆదివారం) తిరిగి విధుల్లో చేరాల్సి ఉంటుంది. కొద్ది రోజుల క్రితమే యూఏఈ ఫెడరల్ ప్రభుత్వం కూడా ఇదే తరహాలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు సెలవులు ప్రకటించింది.సాధారణంగా ఈద్ ఉల్ ఫితర్ ఖచ్చితమైన తేదీ చంద్ర దర్శనం ఆధారంగా నిర్ణయించబడుతుంది. ఈ చంద్ర దర్శనాన్ని గుర్తించడానికి యూఏఈ చంద్ర దర్శన కమిటీ మార్చి 18న (29వ రోజు) సమావేశం కానుంది. చంద్రుడు కనిపిస్తే, ఈద్ మార్చి 19న (గురువారం) ప్రారంభమవుతుంది. లేకపోతే, మార్చి 20న (శుక్రవారం) జరుపుకుంటారు. -
యూఏఈపై ఇరాన్ మరోసారి దాడి
యూఏఈపై ఇరాన్ మరోసారి (మార్చి 17) దాడికి దిగింది. 10 బాలిస్టిక్ మిసైళ్లు, 45 డ్రోన్లతో అటాక్ చేసింది. అయితే ఈ దాడిని యూఏఈ వైమానిక రక్షణ వ్యవస్థ విజయవంతంగా నిర్వీర్యం చేసింది. ఈ విషయాన్ని యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. దేశ సార్వభౌమత్వం మరియు భద్రతకు ముప్పు కలిగించే ఈ తరహా దాడులను సైన్యం అత్యంత అప్రమత్తతతో ఎదుర్కొంటున్నట్లు అధికారిక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుత సంఘర్షణ ప్రారంభమైనప్పటి నుండి తమ రక్షణ వ్యవస్థలు 314 బాలిస్టిక్ మిసైళ్లు, 15 క్రూయిజ్ మిసైళ్లు, 1672 డ్రోన్లు నిర్వీర్యం చేసినట్లు తెలిపింది. ప్రపంచంలోనే అత్యాధునిక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు గర్వంగా పేర్కొంది. కాగా, ఇప్పటివరకు జరిగిన రక్షణ చర్యలలో యూఏఈ ఇద్దరు అధికారుల ప్రాణాలు కోల్పోయింది. అదనంగా పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, పాలస్తీనా దేశాలకు చెందిన ఆరుగురు సాధారణ పౌరులు ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. 157 మంది గాయపడ్డారు. అపశృతిఇరాన్ జరిపిన మిసైల్, డ్రోన్ దాడిని తిప్పికొడుతుండగా అబుదాబిలోని బనియాస్ నివాస ప్రాంతంలో అపశృతి చోటు చేసుకుంది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణిని ధ్వంసం చేస్తుండగా శకలాలు కిందపడి, ఓ పాకిస్తానీ జాతీయుడు మృతి చెందినట్లు యూఏఈ వర్గాలు తెలిపాయి. ఘర్షణనలు ప్రారంభమైనప్పటి నుంచి యూఏఈలో నమోదైన ఎనిమిదవ మరణం ఇది. -
కుమారుడు తప్పు చేస్తే తండ్రికి శిక్ష.. గల్ఫ్‌లో అంతే?
గల్ఫ్ దేశాల్లో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న తప్పు చేసినా అక్కడ శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. ఇటీవల ఓ మైనర్ బాలుడు చేసిన తప్పుకు అతని తండ్రికి కోర్టు శిక్ష విధించింది. పిల్లాడి సంరక్షణ బాధ్యత తండ్రిదేనని తెలిపింది.అబుదాబీలో ఇటీవల ఓ మైనర్ బాలుడు ఒకరి ఇంట్లోకి అనుమతి లేకుండా వెళ్లాడు. అంతేకాకుండా అక్కడ ఉన్న మరో మైనర్ బాలుడి చిత్రాలను వీడియో తీసి అతనిని ఆట పట్టించడానికి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో తమ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిందని సదరు కుటుంబం సదరు కుటుంబం ఈ విషయంపై కేసు నమోదు చేసింది. ఈ వివరాలను పరిశీలించిన అక్కడి న్యాయమూర్తి ఇది పిల్లాడి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనని తీర్పు ఇచ్చారు.అందుకు గాను సదరు కుటుంబానికి 50 వేల దిర్హామ్‌లు జరిమానా విధించారు. అయితే ఆ పిల్లాడు మైనర్ అని వాదించినప్పటికీ వారి సంరక్షణ బాధ్యత తల్లిదండ్రులేదనని వారి ఎటు వెళుతున్నది ఏం చేస్తున్నది కనిపెడుతూ ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో చేసేదేం లేక ఆ ఫ్యామిలీ ఆ మెుత్తాన్ని చెల్లించడానికి అంగీకరించింది. -
యూఏఈలో ఉపాధి.. వీసా, విమాన టికెట్ ఉచితం
మోర్తాడ్(బాల్కొండ): యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఉపాధి విస్తరణకు ఏడీఎన్‌హెచ్, జీటీఎం సంస్థలు మరోసారి ఉచిత నియామకాల మేళా నిర్వహించనున్నాయి. కేటరింగ్ విభాగంలో ఇప్పటికే ఎంతో మందికి ఉచితంగానే వీసాలు, విమాన టికెట్లు అందించిన ఈ రెండు సంస్థలు.. మరో మూడు విభాగాల్లో ఉచిత వీసాలను జారీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి.తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు ఈ అవకాశం కల్పిస్తున్నాయి. గతంలో మాదిరిగా నిర్ణీత తేదీల్లో నియామకాల ర్యాలీలు కాకుండా వచ్చే దరఖాస్తులకు అనుగుణంగా ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జీటీఎం సంస్థ చైర్మన్ చీటీ సతీశ్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. హెవీ, లైట్ మోటార్ వెహికల్ డ్రైవర్లు, స్టీవార్డింగ్ సూపర్వైజర్లు, ఆఫీస్ బాయ్స్‌గా పని చేయాలనుకునే వారిని నేరుగా ఇంటర్వ్యూ చేస్తామన్నారు. వేతనం, అర్హతల వివరాలు.. హెవీ మోటార్ వెహికల్ డ్రైవర్లు, స్టీవార్డ్ సూపర్వైజర్లుగా ఎంపికైన వారికి నెలకు రూ.60 వేల చొప్పున, లైట్ డ్రైవర్లకు రూ.45 వేలు, ఆఫీస్ బాయ్స్‌కు రూ.25 వేల వరకు వేతనాలు చెల్లించనున్నారు. వసతి, భోజన సదుపాయాలు కంపెనీలు కల్పిస్తాయి. డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు యూఏఈ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. స్టీవార్డ్ సూపర్వైజర్లుగా పని చేయాలనుకునేవారికి గతంలో గల్ఫ్‌లో పని చేసిన అనుభవం అవసరం. ఆఫీస్ బాయ్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు డిగ్రీ పాసై ఇంగ్లిష్ మాట్లాడగలగాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. మూడు రకాల పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు gulfjobsgtm @gmail.com మెయిల్‌కు వివరాలను పంపించాలని కంపెనీల ప్రతినిధులు సూచించారు. పూర్తి వివరాలకు జీటీఎం సంస్థ కార్యాలయాలు ఉన్న ఆర్మూర్ (83320 62299), నిజామాబాద్ (93916 61522), జగిత్యాల(83320 42299), సిరిసిల్ల(93916 61522)లలో సంప్రదించాలని పేర్కొన్నారు. -
అట్టుడుకుతున్న దుబాయ్ : విమానాశ్రయం వద్ద డ్రోన్ దాడి
మధ్యప్రాచ్య వివాదం ప్రారంభమైనప్పటి నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌పై 1,800కి పైగా క్షిపణులు, డ్రోన్లను ఇరాన్ ప్రయోగిచింది. ఇరానియన్ డ్రోన్ దాడి తర్వాత దుబాయ్ విమానాశ్రయం సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పలు విమానాలు రద్దయ్యాయి. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DXB) సమీపంలో జరిగిన డ్రోన్ ఇంధన ట్యాంక్‌ను ఢీకొట్టిన తర్వాత సోమవారం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో మంటలు చెలరేగాయి అత్యవసర బృందాలు వేగంగా స్పందించి విమానాలను తాత్కాలికంగా నిలిపివేసాయి. యుఎఇ అత్యంత లక్ష్య దేశంగా మారిందని అధికారులు తెలిపారు. దుబాయ్ సివిల్ డిఫెన్స్ సిబ్బందిని వెంటనే మంటలను అదుపు చేశారు. సమీపంలో భద్రతా చర్యలు చేపట్టడంతో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఈమేరకు దుబాయ్ మీడియా ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టింది. దుబాయ్ విమానాశ్రయం దుబాయ్ విమానాశ్రయం నుండి అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొన్ని విమానాలను మళ్లిస్తున్నట్లు కూడా ప్రకటించింది. విమానాశ్రయ రోడ్డు, విమానాశ్రయ సొరంగంను పోలీసులు మూసివేశారు.Large fire reported in the vicinity of Dubai International Airport after an Iranian drone attack tonight. pic.twitter.com/XmIvEq2KTu— OSINTtechnical (@Osinttechnical) March 16, 2026విమానాలు తిరిగి ప్రారంభంమరోవైపు ఇరాన్ డ్రోన్ దాడి తర్వాత కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన తర్వాత దుబాయ్ విమానాలను క్రమంగా తిరిగి ప్రారంభమైనాయి. ఇక్కడి నుండి కొన్ని విమానాలు క్రమంగా ఎంపిక చేసిన గమ్యస్థానాలకు తిరిగి ప్రారంభ మవుతున్నా యని దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఎక్స్ ద్వారా సమాచారం అందించింది. ప్రయాణీకులు తమ విమానాలకు సంబంధించిన వివరాలకోసం సంబంధిత విమానయాన సంస్థలను సంప్రదించాలని పేర్కొంది.విమానాశ్రయం సమీపంలో డ్రోన్ దాడి ఇదే మొదటిసారి కాదు. వరుస దాడుల మధ్య తమ సేనలు ఈ దాడులు తిప్పికొడుతున్న తరుణంగా లేటెస్ట్ అప్డేటట్స్ను ఫాలో కావాలని అధికారులు సూచించారు. ప్రస్తుత దాడులు ఈ ప్రాంతంలో కీలకమైన మౌలిక సదుపాయాల భద్రతపై పెరుగుతున్న ఆందోళనలను మరింత పెంచుతోంది.#WATCH | Dubai authorities brought under control a fire caused by a drone attack near the city's international airport that forced a temporary suspension of flights, though no injuries were reported, they said: Reuters (Video Source: Reuters) pic.twitter.com/tVEDxDqtFN— ANI (@ANI) March 16, 2026 -
UAE:19 మంది భారతీయుల అరెస్ట్.. కారణం ఇదే..
దుబాయ్: పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ముదురుతున్న వేళ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా వేదికగా తప్పుడు సమాచారాన్ని, కల్పిత దృశ్యాలను ప్రచారం చేస్తున్న వారిపై చర్యలకు ఉపక్రమించింది. నిబంధనలు ఉల్లంఘించిన ఆరోపణలపై మొత్తం 35 మందిని అరెస్ట్ చేయగా, అందులో ఏకంగా 19 మంది భారతీయులు ఉండటం గమనార్హం.అసలేం జరిగింది?పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, క్షిపణి దాడులు లేదా రక్షణ వ్యవస్థల ఆపరేషన్లను చిత్రీకరించవద్దని యూఏఈ ప్రభుత్వం గతంలోనే స్థానికులను హెచ్చరించింది. అయితే ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తూ, కొందరు సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేశారు. తాజాగా యూఏఈ అటార్నీ జనరల్ డాక్టర్ హమద్ సైఫ్ అల్ షమ్సీ 25 మందిని అరెస్ట్ చేయాలని ఆదేశించారు (వీరిలో 17 మంది భారతీయులు ఉన్నారు). అంతకుముందు శనివారం పది మందిని (వీరిలో ఇద్దరు భారతీయులు) అరెస్ట్ చేశారు. మొత్తంగా 19 మంది భారతీయులు ఇప్పుడు జైలు పాలయ్యారు.అరెస్ట్ అయిన వారిపై మూడు రకాల ఆరోపణలు..నిందితులు మూడు గ్రూపులుగా విడిపోయి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారుక్షిపణుల వీడియోలు: ఆకాశంలో వెళ్తున్న క్షిపణులను లేదా వాటిని అడ్డుకుంటున్న దృశ్యాలను చిత్రీకరించి, వాటికి భయాందోళనలు కలిగించే శబ్దాలను జోడించి ప్రచారం చేయడం.ఏఐ ఫేక్ దృశ్యాలు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ఉపయోగించి పేలుళ్లు జరిగినట్లు కృత్రిమ వీడియోలను సృష్టించడం. ఇతర దేశాల్లో జరిగిన పాత ఘటనలను యూఏఈలో జరిగినట్లుగా నమ్మించడం.శత్రు దేశాలకు మద్దతు: యూఏఈ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించే దేశాలను, వారి సైనిక చర్యలను పొగుడుతూ పోస్టులు పెట్టడం.శిక్షలు కఠినం: లక్ష దిర్హమ్ల జరిమానాఈ తరహా చర్యలు దేశ భద్రతకు ముప్పు కలిగిస్తాయని అటార్నీ జనరల్ హెచ్చరించారు. నిందితులకు కనీసం ఏడాది జైలు శిక్షతో పాటు, ఒక లక్ష దిర్హమ్లకు (సుమారు రూ. 22 లక్షలకు పైగా) తగ్గకుండా జరిమానా విధించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం వీరందరినీ అదుపులోకి తీసుకున్న పబ్లిక్ ప్రాసిక్యూషన్, త్వరితగతిన విచారణ చేపట్టాలని ఆదేశించింది.ఇది కూడా చదవండి: మెగా ఫైట్ @2026: పేలుతున్న ‘సీనియర్ల’ మాటల తూటాలు -
యూఏఈ పోర్టులపై ఇరాన్ హెచ్చరిక.. భారీ దాడుల ముప్పు
గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో ఇరాన్ సైన్యం కీలక ప్రకటన చేసింది. యూఏఈలో ఉన్న అమెరికా ప్రయోజనాలు, సైనిక స్థావరాలు, పోర్టులు భవిష్యత్ దాడుల్లో లక్ష్యాలుగా మారవచ్చని హెచ్చరించింది.ఇరాన్ సైన్యానికి చెందిన ఇస్లామిక్ రెవెల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) విడుదల చేసిన ప్రకటనలో, అమెరికా సైన్యం వినియోగిస్తున్న ప్రదేశాలు “న్యాయమైన లక్ష్యాలు” కావచ్చని పేర్కొంది. అందువల్ల ఆ ప్రాంతాల్లో నివసించే ప్రజలు, కార్మికులు వెంటనే అక్కడి నుంచి దూరంగా వెళ్లాలని సూచించింది.దాడులకు ముందు హెచ్చరికఇరాన్ ప్రకారం యూఏఈలోని కింది ప్రాంతాలు ప్రమాదంలో ఉండే అవకాశం ఉంది. అవి.. * ప్రధాన పోర్టులు, డాక్‌లు* అమెరికా సైన్యం ఉపయోగించే స్థావరాలు* అమెరికా ప్రయోజనాలు ఉన్న ఆయిల్ టర్మినల్స్* వాణిజ్య, లాజిస్టిక్స్ కేంద్రాలుఈ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇరాన్ సైన్యం సూచించింది.ఫుజైరా పోర్ట్ వద్ద డ్రోన్ దాడిఈ ఉద్రిక్తతల మధ్య ఫుజైరా పోర్ట్ వద్ద డ్రోన్ దాడి జరిగినట్లు నివేదికలు వెలువడ్డాయి. ఈ ఘటనతో అక్కడి ఆయిల్ లోడింగ్ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. కొన్ని ఆయిల్ నిల్వ ట్యాంకుల సమీపంలో అగ్నిప్రమాదం సంభవించగా, భారీగా పొగలు ఎగసిపడుతున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. భద్రతా బలగాలు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టాయి.ప్రపంచానికి కీలకమైన చమురు ఎగుమతి కేంద్రాలలో ఫుజైరా పోర్ట్ ఒకటి. ఇక్కడి నుంచి రోజుకు సుమారు 10 లక్షల బ్యారెల్స్ చమురు ఎగుమతి అవుతుందని అంచనా.ఉద్రిక్తతలకు కారణం ఇదే..ఇటీవల అమెరికా సైన్యం ఇరాన్‌లోని కీలక ఆయిల్ టర్మినల్ అయిన ఖార్గ్ ద్వీఈపంపై దాడులు జరిపిందని వార్తలు వచ్చాయి. ఈ చర్యలకు ప్రతీకారంగానే గల్ఫ్ ప్రాంతంలో అమెరికా ప్రయోజనాలపై చర్యలు తీసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. -
ప్రజలకు యూఏఈ హెచ్చరిక.. ఫొటోలు, వీడియోలు తీయొద్దు..
యూఏఈ నేషనల్ మీడియా అథారిటీ ప్రజలకు కీలక సూచనలు జారీ చేసింది. భద్రతకు సంబంధించిన ఘటనలను చిత్రీకరించడం లేదా ధ్రువీకరించని సమాచారాన్ని ఆన్లైన్లో పంచుకోవద్దని అథారిటీ హెచ్చరించింది. ఇటువంటి చర్యలు ప్రజా భద్రతతో పాటు సమాజ రక్షణకు ముప్పు కలిగించే అవకాశం ఉందని స్పష్టం చేసింది.సోషల్ మీడియాలో విడుదల చేసిన ప్రకటనలో కమ్యూనిటీ భద్రత ప్రతి ఒక్కరి భాగస్వామ్య బాధ్యత అని అథారిటీ పేర్కొంది. పుకార్లు వ్యాప్తి చెందకుండా నివారించేందుకు ప్రజలు అధికారిక వనరుల ద్వారా వచ్చిన సమాచారాన్నే నమ్మాలని నివాసితులకు సూచించింది.భద్రతా ఘటనలు జరిగిన ప్రదేశాల నుంచి ఫోటోలు లేదా వీడియోలు పంచుకోవడం వల్ల సున్నితమైన ప్రాంతాల వివరాలు బయటపడే ప్రమాదం ఉందని అథారిటీ తెలిపింది. అలా చేస్తే రహదారులు, ప్రవేశ ద్వారాలు, నిష్క్రమణ మార్గాలు వంటి ముఖ్యమైన సమాచారం వెల్లడై ప్రజలు ప్రమాదంలో పడే అవకాశముందని హెచ్చరించింది.ఇలాంటి వీడియోలు లేదా చిత్రాల ద్వారా ప్రజల కదలికలు, సమావేశ సమయాలు వంటి వివరాలు కూడా బయటపడే అవకాశం ఉందని, వాటిని శత్రు గుంపులు దుర్వినియోగం చేసే ప్రమాదం ఉన్నదని అథారిటీ తెలిపింది. ప్రజల భద్రతను కాపాడటంలో అవగాహనతో పాటు బాధ్యతాయుతమైన ఆన్లైన్ ప్రవర్తన ఎంతో కీలకమని అథారిటీ పునరుద్ఘాటించింది. -
యూఏఈ గుడ్‌న్యూస్.. వీసా ముగిసినా రావచ్చు..
అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (UAE) రెసిడెన్సీ వీసాల గడువు ముగిసిన ప్రవాసులకు కొత్త ప్రవేశ అనుమతి లేకపోయినా దేశానికి తిరిగి రావడానికి తాత్కాలికంగా వీలు కల్పించారు. ఈ మేరకు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్స్ సెక్యూరిటీ (ఐసీపీ) కీలక నిర్ణయం తీసుకుంది.ఈ ప్రత్యేక వెసులుబాటు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 31 వరకు ఒక నెల పాటు అమల్లో ఉంటుంది. ఇక్కడ రెసిడెన్సీ వీసాలు ఉండి బయటి దేశాలకు వెళ్లి వీసా గడువు ముగిసేలోపు యూఏఈకి తిరిగి రాలేకపోయినవారికి వెసులుబాటు కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది."ఈ చర్య ప్రవాస నివాసితులు తిరిగి రావడానికి సులభతరం చేస్తూ, నిర్దిష్ట వ్యవధిలో వారి ప్రయాణాలను సౌకర్యవంతం చేయడం లక్ష్యంగా ఉంది" అని ఐసీపీ ప్రకటనలో పేర్కొంది. అర్హులైన నివాసితులు తిరిగి యూఏఈలో ప్రవేశించి, తరువాత సంబంధిత అధికారిక విధానాల ద్వారా వారి నివాస స్థితిని క్రమబద్ధీకరించుకోవచ్చు. -
యూఏఈ, ఒమన్‌లో రంజాన్ సెలవులు ప్రకటన
మస్కట్: ఈద్ ఉల్ ఫితర్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఒమన్ ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగులకు మార్చి 19 గురువారం నుంచి మార్చి 23 సోమవారం వరకు సెలవులు అమల్లో ఉంటాయి. అనంతరం మార్చి 24 నుంచి సాధారణ పనిదినాలు తిరిగి ప్రారంభమవుతాయి.ఇదిలా ఉండగా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో కూడా ఈ ఏడాది ఈద్ అల్-ఫితర్ సందర్భంగా సెలవులను ముందుగానే ప్రకటించారు. మానవ వనరులు, వలస మంత్రిత్వ శాఖ ఫెడరల్ ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ రంగ ఉద్యోగులకు సంబంధించిన సెలవుల వివరాలను వెల్లడించింది.ప్రైవేట్ రంగ ఉద్యోగులకు మార్చి 19 నుంచి 21 వరకు మూడు రోజుల సెలవు ప్రకటించారు. అయితే రంజాన్ నెల 30 రోజులు పూర్తయితే, ఈ సెలవు మార్చి 22 వరకు పొడిగించే అవకాశం ఉంది. ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం మార్చి 19 నుంచి 22 వరకు నాలుగు రోజుల పాటు సెలవులు ఉంటాయి. మార్చి 23 నుంచి కార్యాలయాలు తిరిగి ప్రారంభమవుతాయి.ఈ ఏడాది ఈద్ సందర్భంగా యూఏఈ నివాసితులకు గరిష్టంగా నాలుగు రోజుల సెలవులు లభించే అవకాశముంది. అయితే ఈద్ పండుగ తేదీ నెలవంక కనిపించడంపై ఆధారపడి ఉంటుంది. దీనిపై అధికారిక ప్రకటనను ఆయా దేశాల షవ్వాల్ అబ్జర్వేటరీ కమిటీలు జారీ చేయనున్నాయి. -
బుమ్రాపై పాక్ ఆటగాడి సంచలన వ్యాఖ్యలు
టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాపై పాకిస్తాన్లో జన్మించి, యూఏఈ తరఫున ఆడిన జహూర్ ఖాన్ అనే పేస్ బౌలర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బుమ్రాకు తానే కోచింగ్ ఇచ్చానంటూ గొప్పలకు పోయాడు. స్లో డెలివరీ వేరియేషన్‌ను బుమ్రా తన వద్దనే నేర్చుకున్నాడని అన్నాడు.జహూర్ మాటల్లో.. 2019లో నేను ఓ టీ10 లీగ్‌లో లెండిల్ సిమ్మన్స్‌కు ఐదు స్లో డెలివరీలతో మెయిడిన్ ఓవర్ వేసాను. ఆ వీడియో చూసిన బుమ్రా.. ఇవి ఎలా వేసావు.. హ్యాండ్ గ్రిప్ ఎలా ఉంటుందని నన్ను అడిగాడు. ఆతర్వాత ముంబై ఇండియన్స్ కోచింగ్ క్యాంప్‌లో నేను ఆయనకు అలాంటి బంతులే వేసి చూపించాను. జహూర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. జహూర్‌కు అంత సీన్ లేదని భారత క్రికెట్ అభిమానులు అంటున్నారు. బుమ్రా నిరంతర అభ్యాసంతో ప్రపంచంలో అత్యుత్తమ పేసర్‌గా ఎదిగాడని కితాబునిస్తున్నారు.వాస్తవానికి స్లో బాల్ అనేది బుమ్రా అమ్ములపోదిలో ఓ అస్త్రం. స్లో బంతులను అతను అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేస్తాడు. చాలా సందర్భాల్లో ఇలాంటి బంతులతో ప్రత్యర్థులను బోల్తా కొట్టించాడు. ఈ స్లో బాల్స్‌ను కూడా బుమ్రా అందరికీ భిన్నంగా వేస్తాడు. మణికట్టు సాయంతో సంధిస్తాడు. బ్యాటర్లు వీటిని పసిగట్టడం కష్టమవుతుంది. తాజాగా జరిగిన ప్రపంచకప్‌లోనూ బుమ్రా ఇలాంటి బంతులను చాలాసార్లు ప్రయోగించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో జేకబ్ బేతెల్ జోరు మీద ఉన్నప్పుడు వీటితోనే అతని ఆట కట్టించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లోనూ యార్కర్లతో పాటు ఈ స్లో డెలివరీలను ప్రయోగించాడు. ఫైనల్లో బుమ్రా అద్వితీయ ప్రదర్శన (4 వికెట్లు) కారణంగా భారత్ వరుసగా రెండో పొట్టి ప్రపంచకప్ సాధించింది. ఈ ప్రపంచకప్‌లో బుమ్రా 8 మ్యాచ్‌ల్లో 12.43 సగటున, 6.21 ఎకానమీతో 14 వికెట్లు తీసి భారత్ తరఫున లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. -
‘మోదీ ఒక్క ఫోన్ చేస్తే యుద్ధం మొత్తం..’
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఇజ్రాయెల్-ఇరాన్ ఇష్యూ మొత్తం ముగియవచ్చని భారత్‌లోని యూఏఈ తొలి రాయబారి హుస్సేన్ హసన్ మిర్జా అన్నారు. ఇవాళ ఓ ఇంటర్వ్యూలో మిర్జా మాట్లాడారు. యూఏఈకి ప్రధాని నరేంద్ర మోదీతో ఉన్న సంబంధాల గురించి ప్రశ్నించగా.. మోదీ అంటే గల్ఫ్ నాయకులకు మాత్రమే కాదని,. ఆయా దేశాల ప్రజలు, వ్యాపార వర్గాల్లో కూడా ఆయనకు చాలా గౌరవం ఉందని మిర్జా చెప్పారు. “ఇరాన్, ఇజ్రాయెల్ అధినేతలకు మోదీ ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఈ సమస్య ముగుస్తుంది. ఒక ఫోన్ కాల్ చాలు” అని మిర్జా చెప్పారు. ప్రస్తుతం యుద్ధం చేస్తున్న ఇరాన్- ఇజ్రాయెల్ నాయకులతో మోదీకి ఉన్న సత్సంబంధాలపై ఇది ఆధారపడి ఉందని ఆయన చెప్పారు.‘ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణలో చేరాలన్న ఆసక్తి యూఏఈకి లేదు. మా భూభాగాన్ని దాడుల కోసం వాడుకోవడానికి ఇరు పక్షాలకు అనుమతి ఇవ్వము. నిజంగా చెప్పాలంటే ఇందులో మేమెందుకు చేరుతున్నామో నాకు స్పష్టంగా తెలియదు. ఈ ఘర్షణలో యూఏఈ జోక్యం చేసుకోవాల్సిన కారణం ఏమీ లేదు” అని మిర్జా వ్యాఖ్యానించారు. రెండు పక్షాలతో తాము చర్చలు జరపగలమని అన్నారు.యూఏఈ సున్నితమైన భౌగోళిక-రాజకీయ పరిస్థితుల్లో ఉంది. అది ఇరాన్ పక్కన ఉన్న దేశం. అలాగే అబ్రహామ్ ఒప్పందాల కింద ఇజ్రాయెల్‌తో యూఏఈ పార్ట్నర్షిప్ కొనసాగిస్తోంది. అబ్రహామ్ ఒప్పందాలు అంటే కొన్ని అరబ్ దేశాలు ఇజ్రాయెల్‌తో సంబంధాలు సాధారణం చేసుకోవడానికి కుదుర్చుకున్న అంతర్జాతీయ ఒప్పందాలు.“వాళ్లు మా భూభాగంగాపై పరస్పరం యుద్ధం చేస్తున్నారు. దీన్ని మేము అంగీకరించలేం” అని మిర్జా చెప్పారు. ఇప్పటివరకైతే నష్టం తక్కువగానే ఉన్నట్టు తెలుస్తోందని అన్నారు.ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా మోజ్తబా ఖమేనీ బాధ్యతలు చేపట్టారు. సోమవారం ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్‌పై మరోసారి దాడులు చేసింది. బీరూట్‌లో హిజ్బుల్లా మౌలిక సదుపాయాలపై కూడా దాడి చేసింది. ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ రాయబారి చెప్పిన వివరాల ప్రకారం యుద్ధంగా వల్ల ఇప్పటివరకు ఇరాన్లో 1,332 మంది సాధారణ ప్రజలు మృతి చెందారు. వేలాది మంది గాయపడ్డారు. -
ఇరాన్ దాడులు.. మృతుల వివరాలు ప్రకటించిన యుఏఈ
ఓ వైపు తమ పరిసర దేశాలపై దాడులు చేయమని ప్రకటించిన ఇరాన్... మరోవైపు అటాక్స్ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న దుబాయిపై మిస్సైళ్లు, డ్రోన్లతో విరుచుకపడినట్లు యూఏఈ తెలిపింది. ఇప్పటి వరకూ ఇరాన్ జరిపిన దాడుల్లో ముగ్గురు విదేశీ పౌరులు మృతి చెందగా 112 మంది గాయపడ్డట్లు యుఏఈ రక్షణ శాఖ ప్రకటించింది.అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ గల్ఫ్ దేశాలపై అటాక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయా దేశాల్లోని యుఎస్ఏ మిలిటరీ స్థావరాలే లక్షంగా దాడులకు తెగబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ నిన్న (శనివారం) స్పందించారు. గల్ఫ్ దేశాలపై దాడులు జరిపినందుకు క్షమాపణలని ఇకపై దాడులు జరపమన్నారు. అయితే వారి దేశం నుంచి అమెరికా దాడులు చేయకుండా చూసుకోవాలని కోరారు. అయితే వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. యుఏఈపై ఇరాన్ దాడులు జరుపుతున్నట్లు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించిందియుఏఈ డిఫెన్స్ ఫోర్స్ ట్వీట్ చేస్తూ "7 వతేదీ శనివారం రోజు యుఏఈ పై ఇరాన్ 16 బాలిస్టిక్ క్షిపణులు, 121 డ్రోన్లు ప్రయోగించింది. వాటిలో 15 క్షిపణులు, 119 డ్రోన్లు గాలిలోనే కూల్చివేయబడ్డాయి. ఇప్పటివరకూ మెుత్తంగా 221 బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించబడగా 205 క్షిపణులను గాలిలోనే కూల్చివేశాము. 14 సముద్రంలో పడ్డాయి. 2 క్షిపణులు మాత్రం యూఏఈ భూభాగాన్ని తాకాయి. అదేవిధంగా 1,305 డ్రోన్లను ప్రయోగించగా 1,229 కూల్చివేశాము. 76 డ్రోన్లు భూభాగాన్ని తాకాయి." అని తెలిపిందికాగా ఇప్పటి వరకూ ఈ దాడులలో ముగ్గురు విదేశీ పౌరులు మృతి చెందారని వారు పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్ జాతీయులను పేర్కొంది. అయితే ఇరాన్ జరిపిన అటాక్స్ వల్ల 112 మందికి స్వల్ప గాయాలయ్యాయాయని అందులో వివిధ దేశాలకు చెందిన ప్రజలున్నారని యుఏఈ రక్షణ శాఖ వెల్లడించింది. -
UAE: స్కూళ్లు బంద్.. సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా
దుబాయ్: పశ్చిమ ఆసియాలో నెలకొన్న ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని పాఠశాలలు, విశ్వవిద్యాలయాలకు ముందస్తుగా ‘స్ప్రింగ్ బ్రేక్’ (వసంతకాల సెలవులు) ప్రకటించడమే కాకుండా, విద్యా సంవత్సరం రెండో విడత (టర్మ్-2) గ్రేడింగ్ విధానంలోనూ సమూల మార్పులు చేసింది.విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించిన ఆదేశాల ప్రకారం షెడ్యూల్ కంటే ఒక వారం ముందుగానే, అంటే మార్చి 9వ తేదీ నుండి మార్చి 22 వరకు విద్యా సంస్థలన్నీ మూతపడనున్నాయి. సాధారణంగా మార్చి 16 నుండి ప్రారంభం కావాల్సిన ఈ సెలవులను, ప్రస్తుతం నెలకొన్న క్షిపణి, డ్రోన్ దాడుల ముప్పులను దృష్టిలో ఉంచుకుని మార్చి 9వ తేదీకి మార్చారు. ఈ నిర్ణయం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో పాటు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు, బోధన, బోధనేతర సిబ్బందికి కూడా వర్తిస్తుంది.ఈ ఆకస్మిక మార్పుల నేపథ్యంలో విద్యార్థుల విద్యా ఫలితాలపై ప్రభావం పడకుండా ఉండేందుకు టర్మ్-2 మూల్యాంకన విధానాన్ని ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల మార్కులను ప్రస్తుత సెమిస్టర్లో వారు పూర్తి చేసిన ప్రాజెక్టులు, అసైన్మెంట్ల ఆధారంగా నిర్ణయించనున్నారు. ప్రైవేటు పాఠశాలల విషయానికొస్తే, ఆయా విద్యా సంస్థలు తమ సొంత విద్యా విధానాలకు అనుగుణంగా మూల్యాంకన పద్ధతులను ఎంచుకునే వెసులుబాటును కల్పించారు. ఈ ఉద్రిక్తతల నేపధ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఇప్పటికే మార్చి 5, 6 తేదీల్లో మిడిల్ ఈస్ట్‌లో జరగాల్సిన 10, 12 తరగతుల బోర్డు పరీక్షలను వాయిదా వేసింది. యూఏఈతో పాటు సౌదీ అరేబియా, ఖతార్, ఓమన్, కువైట్, బహ్రెయిన్, ఇరాన్ దేశాల్లోని విద్యార్థులకు ఇది వర్తిస్తుంది. ఇది కూడా చదవండి: నార్కో గ్యాంగ్‌లకు ట్రంప్ వార్నింగ్: ఈక్వెడార్‌లో వేట షురూ! -
యూఏఈపై డ్రోన్ల దాడి.. పదుల సంఖ్యలో గాయాలు
UAEపై గడిచిన కొద్ది గంటల్లో 129 డ్రోన్ అటాక్స్ జరిగినట్లు ఆ దేశ అధికారిక వర్గాలు ప్రకటించాయి. వాటితో పాటు నాలుగు బాలిస్టిక్ మిసైల్స్ దాడి జరిగినట్లు ఆ దేశం ప్రకటించింది. ఈ దాడులలో ఎటువంటి ప్రాణాపాయం జరగలేదని 78 మందికి గాయాలైనట్లు తెలిపింది. అమెరికాపై కోపంతో ఇరాన్ రగిలిపోతుంది. ఈ నేపథ్యంలోనే గల్ఫ్ దేశాలపై విరుచుకపడుతుంది. ఆ దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్షంగా దాడులు చేస్తుంది. అయితే దాడులలో రక్షణ స్థావరాలతో పాటు ఇతర ప్రాంతాలపైనా దాడులు జరుపుతుంది. ఈ నేపథ్యంలోనే తమ దేశంపై గడిచిన కొన్ని గంటల్లో 129 డ్రోన్ అటాక్స్ జరిగినట్లు యుఏఈ ప్రకటించింది. అయితే ఆ డ్రోన్లను చాలా మాట్టుకు గాలిలోనే కూల్చివేశామని ఆ దేశ రక్షణ శాఖ ప్రకటించింది. ఈ దాడులలో 78 మంది ప్రజలు గాయపడ్డారని వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ తెలిపింది. క్షతగాత్రులలో వివిధ దేశాలకు చెందిన ప్రజలున్నట్లు సమాచారం. వారిలో భారతీయులు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇరాన్ దాడుల నేపథ్యంలో ఆ దేశ ప్రజలకు యుఎఈ మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రజలెవ్వలరూ ఇండ్లనుంచి బయిటకి రావొద్దని కిటీకిల నుంచి దూరంగా ఉండాలని సూచించింది. -
భీకర దాడుల వేళ, దుబాయ్ సంచలన నిర్ణయం
US Iran War ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా దాడులు, ఇరాన్ ప్రతీకార దాడుల మధ్య మధ్యప్రాచ్యంలోని కొన్ని ప్రాంతాలలో వైమానిక సర్వీసులు తీవ్రంగా ప్రభావితమైనాయి. దీంతో ఎక్కడి ప్రయాణీకులు అక్కడే నిలిచి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో దుబాయ్, అబుదాబి అధికారులు మానవత్వాన్ని చాటు కున్నారు. ప్రస్తుత అసాధారణ పరిస్థితుల కారణంగా బయలుదేరలేని టూరిస్టుల బసలను పొడిగించాలని హోటళ్లను ఆదేశించారు.ఇరాన్ ప్రతీకార దాడులు గల్ఫ్ దేశాలు, మిడిల్ ఈస్ట్‌లో మరింత టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరాన్ జరిపిన మిస్సైల్ దాడులలో దుబాయ్ ఎయిర్‌పోర్టు, ప్రముఖ బుర్జ్ అల్ అరబ్ హోటళ్లు దెబ్బతిన్నాయి. అనేక విమానాలు నిలిపివేయడంతో, GCC దేశాలలో వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. దీంతో దుబాయ్ ఆర్థిక మరియు పర్యాటక శాఖ హోటల్ నిర్వాహకులకు అధికారిక ఆదేశాన్ని జారీ చేసింది, అతిథుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వండి, వసతి కొనసాగించడం, ప్రయాణికులు బయలుదేరలేకపోతే , వారిని ఖాళీ చేయించకుండా ఉండాలని, ఒక వేళ వెంటనే చెల్లించలేకపోతే వారి గదులను ఖాళీ చేయమని కోరవద్దని ఆదేశించింది. ప్రభావిత అతిథులు బసలను పొడిగించడానికి అనుమతించమని వారికి సూచించింది. హోటల్ జనరల్ మేనేజర్లను ఉద్దేశించి ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఇదీ చదవండి: 82 ఏళ్ల మహిళకు అప్పర్ బెర్తా? IRCTC క్లారిటీ ఇది!ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కొంతమంది అతిథుల చెక్-అవుట్ సమయం ముగిసినా, వారు బయలుదేరే వరకు వారి బసను పొడిగించాలని దీనికి సంబంధించిన అదనపు బస ఖర్చులను DCT అబుదాబి భరిస్తుందని వారికి తెలిపింది. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. Wow. pic.twitter.com/fo7DSPfaXB— Samir Arora (@Iamsamirarora) March 1, 2026చూసి నేర్చుకోండి! పెట్టుబడిదారుడు సమీర్ అరోరా ఈ నిర్ణయాన్ని ప్రశంసించారు. అంతరిక్ష పరిశ్రమ శాస్త్రవేత్త హితేష్ మోదీ ఇలా రాశారు: "ఇది వేరే ప్రదేశం అయితే, అటువంటి అత్యవసర పరిస్థితుల్లో వారు ధరలను మూడు రెట్లు పెంచేవారు." అని వ్యాఖ్యానించారు. ‘‘ఇతర ప్రపంచ నాయకులు UAE నుండి నేర్చుకోవాలి. నేనుప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నాను, ఈ దేశ పాలన మానవాళి భద్రత కోసం అత్యున్నత స్థాయి శ్రద్దతీసుకుంటున్నారు. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న మీ గురించి దయచేసి ఈ సందేశాన్ని మీ హోటల్ మేనేజర్‌కు చూపించండి" అని కతార్జినా కొమోరోవిచ్ ట్వీట్ చేశారు. I am currently in Dubai, the governance of this country is the highest level of deep care for safety of Humanity. May all other leaders watch and learn. Of you currently in #Dubai please show this message to your hotel Manager. https://t.co/L6CLQLCiLL— Katarzyna Komorowicz (@KasiaKomorowicz) March 2, 2026 -
సీసీఎస్ అత్యవసర సమావేశం.. నెతన్యాహుకు మోదీ ఫోన్
ఢిల్లీ: ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్న వేళ భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుతో మాట్లాడినట్టు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ప్రస్తుత దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, శాంతి దిశగా చర్యలు తీసుకోవాలని మోదీ.. నెతన్యాహుకు సూచించినట్టు చెప్పుకొచ్చారు.ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా నెతన్యాహు, యూఏఈ అధ్యక్షుడితోనూ మాట్లాడినట్టు ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఈ సందర్బంగా మోదీ.. ఇరాన్‌తో యుద్ధం, తాజా పరిణామాలపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోందన్నారు. పౌరుల భద్రతే ప్రాధాన్యమని స్పష్టం చేశారు. శాంతి దిశగా చర్యలు చేపట్టాని నెతన్యాహుకు సూచించినట్టు తెలిపారు. అలాగే, యూఏఈపై దాడులను మోదీ తీవ్రంగా ఖండించారు. ఇరాన్ దాడుల్లో మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు. యూఏఈకి భారత్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఉద్రిక్తతలను తగ్గించడం, ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వాన్ని సమర్థిస్తామని.. శత్రుత్వాలను త్వరగా నిలిపివేయాల్సిన అవసరాన్ని భారత్ పునరుద్ఘాటిస్తుందని మోదీ చెప్పుకొచ్చారు.Had a telephone call with PM Benjamin Netanyahu to discuss the current regional situation. Conveyed India's concerns over recent developments and emphasised the safety of civilians as a priority. India reiterates the need for an early cessation of hostilities.@netanyahu— Narendra Modi (@narendramodi) March 1, 2026సీసీఎస్ అత్యవసర సమావేశం.. అయితే.. భద్రత, వ్యూహాత్మక వ్యవహారాలపై భారతదేశ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ భద్రతా కేబినెట్ కమిటీ (CCS) సమావేశానికి ప్రధాని మోదీ అధ్యక్షత వహించిన కొన్ని గంటల తర్వాత ఈ సమాచారం వచ్చింది. రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు, పుదుచ్చేరిలలో రెండు రోజుల పర్యటన నుండి ఆయన న్యూఢిల్లీకి తిరిగి వచ్చిన కొద్దిసేపటికే ఈ సమావేశం జరిగింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సమావేశానికి హాజరయ్యారు. భారత చమురు దిగుమతులకు కీలకమైన షిప్పింగ్ మార్గమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం వల్ల కలిగే ప్రభావాన్ని కూడా CCS అంచనా వేసినట్టు తెలుస్తోంది.మధ్యప్రాచ్యంలోని భారతీయ పౌరుల భద్రత, వివాదం మరింత తీవ్రమైతే అత్యవసర ప్రణాళికలపై ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. దాదాపు 10,000 మంది భారతీయులు ఇరాన్లో, 40,000 మందికి పైగా ఇజ్రాయెల్‌లో, పశ్చిమాసియా మరియు గల్ఫ్‌లో సుమారు తొమ్మిది మిలియన్ల మంది భారతీయులు నివసిస్తున్నట్టు సమాచారం. తాజా దాడుల నేపథ్యంలో వారి భద్రతపై ఆందోళన నెలకొంది. -
పొట్టకూటి కోసం వెళ్తే.. కోట్ల రుపాయల లాటరీ జాక్‌పాట్
ఆ వ్యక్తి పొట్టకూటి కోసం యూఏఈ వెళ్లాడు. అక్కడ ఏవో పనులు చేస్తూ తన జీవితాన్ని సాగిస్తూ ఇంటికి డబ్బులు పంపిస్తున్నాడు. అయితే అతని కష్టాలు చూసిన లక్ష్మీ దేవీ అతనిపై కృప చూపింది. సరదా కోసం కొనుగోలు చేసిన లాటరీ టికెట్టు తనకు తాకేలా చేసింది. ఇంకేంటి అప్పటి వరకూ కష్టాలు పడుతూ కాలం వెళ్లదీస్తున్న వ్యక్తి.. రాత్రికి రాత్రి కోటీశ్వరుడయ్యాడు.భారత్‌కు చెందిన మురుగనాథ్ అనే వ్యక్తి మూడేళ్ల క్రితం పొట్టకూటి కోసం యూఏఈ వెళ్లారు. అక్కడ వివిధ పనులు చేస్తూ జీవనాన్ని సాగిస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన ఓఘటన అతని జీవితాన్నే మార్చి వేసింది. అతని స్నేహితునితో కలిసి యూఏఈ లాటరీ వైబ్సైట్లో లాటరీ టికెట్ కొనుగోలు చేశారు. తాజాగా జరిగిన లక్కీ డ్రాలో ఆ టికెట్ రెండవ బహుమతి గెలుచుకుంది. దీంతో అతనికి 50 లక్షల దిర్హామ్‌లు భారత కరెన్సీలో దాదాపు రూ.11.35 కోట్లు ఆయన సొంతమయ్యాయి.ఈ లాటరీ దక్కడంపై మురుగనాథ్ సంతోషం వ్యక్తం చేశారు. తాను కొన్న తొలిటికెట్ కే లాటరీ తాకడం సంతోషంగా ఉందన్నారు. తన ఆర్థిక కష్టాలు పరిష్కారిద్దామని ఇక్కడికి వస్తే దేవుడు తనను ఇంత త్వరగా కరుణించాడని ఆనందం వ్యక్తం చేశారు. తనకు సొంత ఇల్లు కూడా లేదని ఈ డబ్బులతో ఇప్పుడు తన కుటుంబం స్థిరపడుతుందన్నారు. తన స్నేహితునితో కలిసి ఈ టికెట్ కొనుగోలు చేశానని వచ్చే డబ్బులని ఇద్దరం సమానంగా పంచుకుంటామని తెలిపారు. కాగా ఈ లాటరీలో తొలి ఫ్రైజ్ 30 మిలియన్ దిర్హామ్‌లు. -
యూఏఈ సంచలన నిర్ణయం.. అనాథల కోసం రూ.225 కోట్లు
అనాథ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం యూఏఈ ప్రభుత్వం చారిత్రత్మక నిర్ణయం తీసుకుంది. 'మదర్ ఆఫ్ ది నేషన్ ఎండొవ్మెంట్' కార్యక్రమానికి యూఏఈ శ్రీకారం చుట్టింది. అయితే ఈ ప్రాజెక్ట్ కోసం 'ఎర్త్ జాయెద్ ఫిలాంత్రోపీస్' (Erth Zayed Philanthropies) అనే సంస్థ 100 మిలియన్ దిర్హామ్‌ల (సుమారు రూ.225 కోట్లకు పైగా)ను విరాళంగా ప్రకటించింది.యూఏఈ వ్యవస్థాపక పితామహుడు షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ జ్ఞాపకార్థం ఈ 'ఎర్త్ జాయెద్ ఫిలాంత్రోపీస్' సంస్థను స్థాపించారు. అబుదాబీ కేంద్రంగా పనిచేసే ఈ ప్రభుత్వ సంస్థ..యూఏఈ అంతర్జాతీయ మానవతా సాయం, స్వచ్ఛంద కార్యక్రమాలన్నింటినీ నిర్వహిస్తుంటుంది.ఈ సంస్థ చైర్మెన్‌గా యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఉన్నారు. కాగా ఈ 100 మిలియన్ దిర్హామ్‌లను అబుదాబి అవ్కాఫ్ పర్యవేక్షణలో ప్రత్యేక పెట్టుబడి పథకాల్లో మదుపు చేస్తారు. దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని యూఏఈలోని అనాథ పిల్లల విద్య, ఆరోగ్యం, వారి భవిష్యత్తు సాధికారత కోసం ఖర్చు చేయునున్నారు. -
అరబ్ దేశాల్లో క్యాసినో.. లగ్జరీ కా సీన్ ...!
అత్యంత కఠినమైన సంప్రదాయాలు, ఆచారాలకు పేరొందిన అరబ్ దేశాలు పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా ఉదారవాద విధానాల వైపు మారడం ప్రారంభమై..గత కొంత కాలంగా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నాయి. ఈ ట్రెండ్‌లో ముందున్న దుబాయ్... ఇప్పటికే ప్రపంచ పర్యాటక ఆకర్షణ కేంద్రంగా మారింది. ఈ నేపధ్యంలో దుబాయ్‌కి సమీపంలోనే ఉన్న రస్ ఆల్ ఖైమా లో ఏర్పాటవుతున్న క్యాసినో ఆ ప్రాంత పర్యాటక సంప్రదాయాలను పునర్నిర్వచించనుంది. క్యాసినో అంటే ప్రధానంగా జూదకేంద్రాలు అనేది తెలిసిందే. ప్రపంచంలో పలు దేశాల్లో ఇవి విజయవంతంగా నడుస్తున్నప్పటికీ చాలా దేశాల్లో అనుమతులు లేవు. మన దేశంలో సైతం కేవలం గోవాలో అది కూడా సముద్రజలాలపై తప్ప మరెక్కడా వీటి నిర్వహణకు అవకాశం లేదు. ఈ నేపధ్యంలో అత్యంత కఠినమైన సంప్రదాయాలకు పేరొందిన అరబ్ దేశాల్లో తొలి క్యాసినో పరిచయం కానుండడం ప్రపంచ పర్యాటకంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. దాదాపు 5.1 బిలియన్ డాలర్ల అంచనా వ్యయంతో ఇంటిగ్రేటెడ్ రిసార్ట్ అయిన విన్ అల్ మార్జన్ ఐలాండ్ ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని రస్ అల్ ఖైమా లో ఏర్పాటవుతోంది. తద్వారా ప్రపంచ పర్యాటక రంగంలో ఒక పెద్ద మార్పుకు రంగం సిద్ధమవుతోంది. దుబాయ్ నుంచి 50 మైళ్ల లోపు దూరంలో ఉన్న 60 హెక్టార్ల మానవ నిర్మిత ద్వీపంలో ఈ రిసార్ట్ నిర్మితమైంది. ఇది అరేబియన్ గల్ఫ్ కంటే 70 అంతస్తుల ఎత్తులో ఉంటుంది. పూర్తి విలాసవంతంగా రూపొందిన ఈ రిసార్ట్‌లో మొత్తం 1,530 గదులు సూట్లు, పై అంతస్తులలో బోటిక్ హోటల్, ఇందులోని ‘ఎన్ క్లేవ్‘లో 313 అల్ట్రా–లగ్జరీ బస సౌకర్యం ఉంటుంది. మొత్తం 20,900 చదరపు మీటర్ల క్యాసినో 22వ అంతస్తులో రెండవ గేమింగ్ ప్లేస్, వాటర్ గేమ్స్ కోసం డీప్–వాటర్ మెరీనాలు ఉంటాయి. విన్ అల్ మార్జన్ ద్వీపంలో 22 రెస్టారెంట్లు, లాంజ్‌లు కూడా ఉంటాయి.వీటిలో చెఫ్ అలైన్ డుకాస్ రూపొందించిన ఫ్రెంచ్–అమెరికన్ స్టీక్‌హౌస్ ప్రఖ్యాత లాస్ వెగాస్ సప్పర్ క్లబ్ అయిన డెలిలా లు ఉన్నాయి. ఫైవ్–స్టార్ స్పా, లగ్జరీ రిటైల్ ప్రొమెనేడ్, థియేటర్, నైట్‌క్లబ్ 7,700 చదరపు మీటర్ల ఈవెంట్స్ సెంటర్ ఉన్నాయి.షెడ్యూల్ ప్రకారం దీని నిర్మాణం చకచకా పురోగమిస్తోంది,గత 2025 చివరి నాటికి దాదాపుగా 90శాతం పనులు పూర్తి కాగా, మరో ఏడాది అంటే 2027లో ఇది ప్రారంభానికి నోచుకుంటుందని అంచనా. ప్రారంభం తర్వాత ఈ రిసార్ట్ రస్ అల్ ఖైమా ప్రొఫైల్‌ను పెంచుతుందని, సంపన్నులైన పర్యాటకులను, సందర్శకులను పెద్ద సంఖ్యలో ఆకర్షిస్తుందని గణనీయమైన ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. అలాగే యుఎఇ ఆర్థిక వృద్ధి బాటలో వైవిధ్యాన్ని సృష్టించడానికి, ప్రపంచ క్యాసినో గమ్యస్థానాలతో పోటీ పడటానికి ఈ ఎడారి ‘ఆటల వేదిక’ సిద్ధమవుతోంది. ఈ విన్ అల్ మార్జన్ ద్వీపం పర్యాటకం, వినోదం పట్ల అరబ్ ప్రాంతపు సంప్రదాయ విధానాన్ని పునర్నిర్వచించడం గల్ఫ్‌లో ఆతిథ్య పరిశ్రమకు ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించడం ఖాయంగా పర్యాటక రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
T20 WC 2026: కొనసాగుతున్న సౌతాఫ్రికా జైత్రయాత్ర
టీ20 ప్రపంచకప్ 2026లో గత ఎడిషన్ రన్నరప్ సౌతాఫ్రికా జైత్రయాత్ర కొనసాగుతోంది. ప్రొటీస్ జట్టు వరుసగా నాలుగో గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లోనూ గెలిచి అజేయ జట్టుగా సూపర్-8లోకి ప్రవేశించింది. యూఏఈతో ఇవాళ (ఫిబ్రవరి 18) జరిగిన తమ చివరి గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన సౌతాఫ్రికా యూఏఈని 122 పరుగులకే (6 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది. కార్బిన్ బాష్ (4-0-12-3), అన్రిచ్ నోర్జే (4-0-28-2), జార్జ్ లిండే (4-0-17-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు. యూఏఈ ఇన్నింగ్స్‌లో అలీషాన్ షరాఫు (45) టాప్ స్కోరర్‌గా కాగా.. మరో ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. వీరిలో కెప్టెన్ ముహమ్మద్ వసీం 22, ఆర్యాంశ్ శర్మ 13, ముహమ్మద్ అర్ఫాన్ 11 పరుగులు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని సౌతాఫ్రికా 13.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. డెవాల్డ్ బ్రెవిస్ (36), ర్యాన్ రికెల్టన్ (30), కెప్టెన్ మార్క్రమ్ (28), డికాక్ (14), స్టబ్స్ (6 నాటౌట్), జేసన్ స్మిత్ (3 నాటౌట్) తలో చేయి వేసి ప్రొటీస్‌ను గెలిపించారు. యూఏఈ బౌలర్లలో హైదర్ అలీ, జవాదుల్లా, అర్ఫాన్, ఫరూఖ్ తలో వికెట్ తీశారు. ఈ ఓటమితో ప్రపంచకప్‌లో యూఏఈ పోరాటం ముగిసింది. ఈ జట్టు కెనడాపై మాత్రమే గెలిచి న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, సౌతాఫ్రికా జట్ల చేతుల్లో ఓడింది. -
గెలిచి నిలిచిన అఫ్గానిస్తాన్
న్యూఢిల్లీ: గ్రూప్‌లోని గట్టి ప్రత్యర్థులు న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతుల్లో ఓడిపోయిన అఫ్గానిస్తాన్ టి20 ప్రపంచకప్‌లో ఎట్టకేలకు మూడో మ్యాచ్‌లో గెలుపు బోణీ కొట్టింది. ‘సూపర్–8’ చేరే అవకాశాలను నిలబెట్టుకుంది. సోమవారం గ్రూప్ ‘డి’లో జరిగిన మ్యాచ్‌లో అజ్మతుల్లా ఒమర్జాయ్ (4 వికెట్లు; 21 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అఫ్గానిస్తాన్ 5 వికెట్ల తేడాతో యూఏఈపై గెలుపొందింది. మొదట యూఏఈ నిరీ్ణత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. సోహైబ్ ఖాన్ (48 బంతుల్లో 68; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) దంచేశాడు. అజ్మతుల్లా (4–0–15–4) నిప్పులు చెరిగే స్పెల్‌తో యూఏఈ బ్యాటర్లను కట్టడి చేశాడు. ఇన్నింగ్స్ 16వ ఓవర్లో అఫ్గానిస్తాన్ కెపె్టన్, లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ బౌలింగ్‌లో అర్ఫాన్ హిట్‌వికెట్‌గా వెనుదిరిగాడు. దాంతో టి20 క్రికెట్ చరిత్రలో 700 వికెట్లు సాధించిన తొలి బౌలర్‌గా రషీద్ ఖాన్ గుర్తింపు పొందాడు. అంతర్జాతీయ టి20ల్లోనూ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రషీద్ ఖానే (191) అగ్రస్థానంలో ఉన్నాడు. అనంతరం అఫ్గానిస్తాన్ 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసి గెలిచింది. ఇబ్రహీం జద్రాన్ (41 బంతుల్లో 53; 6 ఫోర్లు, 1 సిక్స్), అజ్మతుల్లా రాణించారు. ఈ గ్రూప్‌లో దక్షిణాఫ్రికా ఆడిన మూడూ గెలిచి 6 పాయింట్లతో ఇప్పటికే ‘సూపర్–8’కు చేరింది. రెండు మ్యాచ్‌లు నెగ్గిన న్యూజిలాండ్ 4 పాయింట్లతో అఫ్గానిస్తాన్ కంటే మెరుగైన స్థితిలో ఉంది. ఈరోజు కెనడాతో జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలిస్తే అఫ్గానిస్తాన్ టోర్నీ నుంచి ని్రష్కమిస్తుంది. న్యూజిలాండ్ ‘సూపర్–8’కు చేరుతుంది. -
పసికూనల పోరులో యూఏఈదే పైచేయి
టీ20 ప్రపంచకప్‌లో ఇవాళ (ఫిబ్రవరి 13) మధ్యాహ్నం పసికూనలు యూఏఈ, కెనడా జట్ల మధ్య పోటీ జరిగింది. ఈ మ్యాచ్‌లో యూఏఈ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కెనడా.. హర్ష్ ఠాకూర్ (50) అర్ద సెంచరీతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. నవ్‌నీత్ ధలీవాల్ (34), శ్రేయస్ మొవ్వ (21) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. మిగతా ఆటగాళ్లంతా స్వల్ప స్కోర్లకే ఔటయ్యారు. కెప్టెన్ దిల్‌ప్రీత్ బజ్వా 11, యువరాజ్ సమ్రా 5, నికోలస్ కిర్టన్ 4, జస్కరన్ సింగ్ 4 (నాటౌట్), సాద్ బిన్ జాఫర్ 5, డిలాన్ హేలిగర్ 6 (నాటౌట్) పరుగులు చేశారు. యూఏఈ బౌలర్లలో జునైద్ సిద్దిఖీ (4-0-35-5) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతనికి ముహమ్మద్ జవాదుల్లా (4-0-16-1) సహకరించాడు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన యూఏఈ ఆదిలో కాస్త తడబడినప్పటికీ.. చివర్లో గేర్ మార్చి 19.4 ఓవర్లలో గెలుపు తీరాలకు (5 వికెట్ల నష్టానికి) చేరింది. 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినా.. ఓపెనర్ ఆర్యాంశ్ శర్మ (74 నాటౌట్), షోయబ్ ఖాన్ (51) పట్టుదలగా ఆడి యూఏఈని గెలిపించారు. కెనడా బౌలర్లలో సాద్ బిన్ జాఫర్ (4-0-14-3) యూఏఈ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. కలీమ్ సనా (4-0-29-1), డిలన్ హేలిగర్ (4-0-33-0) కూడా పర్వాలేదనిపించారు. అయితే ఆర్యాంశ్, షోయబ్ పట్టుదల ముందు వీరి ఈ ప్రదర్శనలు ఉపయోగపడలేదు. -
T20 WC 2026: యూఏఈ తరఫున ఇరగదీసిన పాక్ జాతీయుడు
టీ20 ప్రపంచకప్ 2026లో యూఏఈకు ప్రాతినిథ్యం వహిస్తున్న పాక్ జాతీయుడు జునైద్ సిద్దిఖీ చెలరేగిపోయాడు. 33 ఏళ్ల ఈ కుడి చేతి వాటం ఫాస్ట్ బౌలర్.. ఇవాళ (ఫిబ్రవరి 13) కెనడాతో జరుగుతున్న మ్యాచ్‌లో 5 వికెట్ల ప్రదర్శనతో సత్తా చాటాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన కెనడా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 150 పరుగులకే పరిమితమైంది.సిద్దిఖీ తన కోటా 4 ఓవర్లలో 35 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఓ యూఏఈ బౌలర్ నుంచి అత్యుత్తమ ప్రదర్శన ఇదే. టీ20 వరల్డ్‌కప్‌లో 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి యూఏఈ బౌలర్ కూడా సిద్దిఖీనే. చాలామంది పాక్ క్రికెటర్లలాగే సిద్దిఖీ కూడా క్రికెట్ కెరీర్ కోసం యూఏఈకి వలస వెళ్లాడు. అక్కడ పౌరసత్వం పొంది 2019 నుంచి యూఏఈ జట్టుకు ఆడుతున్నాడు.యూఏఈ తరఫున ఇప్పటివరకు 88 టీ20లతో పాటు 63 వన్డేలు ఆడిన సిద్దిఖీ మొత్తంగా 208 వికెట్లు తీశాడు. యూఏఈ జట్టులో అత్యంత అనుభవజ్ఞుడు, అత్యంత విజయవంతమైన బౌలర్ సిద్దిఖీనే.మ్యాచ్ విషయానికొస్తే.. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో యూఏఈ, కెనడా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో కెనడా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే అనుకున్నట్లుగా వారికి మంచి ఆరంభం లభించలేదు. సిద్దిఖీ ఇద్దరు కెనడా ఓపెనర్లను (యువరాజ్ సమ్రా (5), దిల్‌ప్రీత్ బజ్వా (11)) 5 పరుగుల తేడాతో పెవిలియన్‌కు పంపాడు.ఆతర్వాత వచ్చిన నవ్‌నీత్ ధలివాల్ (34), హర్ష్ ఠాకూర్ (50) బాధ్యతాయుతంగా ఆడి కెనడాకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 58 పరుగులు జోడించడంతో కెనడా నిర్ణీత 20 ఓవరల్లో 7 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేయగలిగింది. చివర్లో శ్రేయస్ మొవ్వ (21) ఉపయోగకరమైన పరుగులు చేశాడు. కెనడా ఇన్నింగ్స్‌లో హర్ష్, ధలివాల్, శ్రేయస్ మినహా ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. యూఏఈ బౌలర్లలో సిద్దికీతో పాటు ముహమ్మద్ జవాదుల్లా (4-0-16-1) సత్తా చాటాడు.అనంతరం లక్ష్య ఛేదనలో యూఏఈ కూడా తడబడుతుంది. 15 ఓవర్ల తర్వాత ఆ జట్టు 4 వికెట్లు కోల్పోయి 88 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో యూఏఈ గెలవాలంటే 30 బంతుల్లో మరో 62 పరుగులు చేయాలి. -
నిన్ను నాశనం చేస్తా: తీవ్ర స్థాయిలో మండిపడ్డ భజ్జీ
టీమిండియా దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌కు కోపమొచ్చింది. ఇంకోసారి ఇలాగే వాగితే సర్వనాశనం చేస్తా అంటూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్‌పై భజ్జీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత భజ్జీ క్రీడా విశ్లేషకుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.పాక్ క్రికెటర్ల వెంటపడతాడుఈ క్రమంలో ఇటీవల యూఏఈ వేదికగా ILT20 లీగ్‌లో భజ్జీ బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరించాడు. ఇందులో భాగంగా పాకిస్తాన్ వివాదాస్పద స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ (Usman Tariq)ను ఇంటర్వ్యూ చేశాడు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ తన్వీర్ అహ్మద్ అనే ఓ పాక్ మాజీ ఆటగాడు భజ్జీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ క్రికెటర్లతో తిరుగుతూ ఉంటేనే నీకు గుర్తింపు అన్నట్లుగా ఓవరాక్షన్ చేశాడు.ఈ నేపథ్యంలో భజ్జీ ఘాటుగా స్పందించాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా.. ‘‘ఈ వీడియో ఓ తుచ్ఛ మానవుడి గురించి. అతడు నా గురించి ఏవేవో మాట్లాడుతున్నాడు. అతడి పేరేంటో కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను అతడిని ఇంత వరకు ఒక్కసారి కూడా చూడనేలేదు.ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రంలా బిల్డప్ఇలాంటి వ్యక్తి తనకంటూ గుర్తింపు సంపాదించుకునే క్రమంలో వివిధ ప్లాట్‌ఫామ్‌లలో డ్రామా చేస్తూ ఉంటాడు. నాకైతే ఆ వ్యక్తి గురించి ఏమాత్రం తెలియదు. మీలో ఎవరికైనా తెలిసి ఉంటే చెప్పండి. అతడి పేరు తన్వీర్ అహ్మద్ అట.పాకిస్తాన్ తరఫున అతడు 3-4 మ్యాచ్‌లు ఆడి ఉంటాడు. కానీ తానేదో ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్, వకార్ యూనిస్ అన్నట్లుగా బిల్డప్‌లు ఇస్తూ ఉంటాడు. ఓ బ్రాడ్‌కాస్టర్‌గా ILT20 టోర్నీలో నా పని నేను పూర్తి చేశాను. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న ఉస్మాన్ తారిఖ్‌ను ప్రశ్నలు అడిగాను.ఆ మ్యాచ్‌లో అతడు మూడు వికెట్లు తీసి తన జట్టును గెలిపించుకున్నాడు. ఓ బ్రాడ్‌కాస్టర్‌గా నేను అతడిని ప్రశ్నలు అడగాల్సి ఉంటుంది. కానీ ఈ వ్యక్తి (తన్వీర్)కి ఇదే సమస్యగా మారిందట. పాకిస్తానీ క్రికెటర్ కనిపిస్తే చాలు వారి వెంట నేను తిరుగుతానట.దిగజారుడు చానెళ్లలో దిగజారుడు వ్యాఖ్యలుచెవులు రిక్కించుకుని విను. నువ్వెవరో కూడా నాకు తెలియదు. పాకిస్తాన్ నుంచి వచ్చిన దిగ్గజ క్రికెటర్లు ఎవరూ కూడా నీలాగా నోరు పారేసుకోలేదు. వాళ్లు తమకంటూ ప్రత్యేక గౌరవాన్ని సంపాదించుకున్నారు. కానీ నీలాంటి వాళ్లు.. జీవితంలో ఏదీ సాధించకపోయినా ఓ చోట కూర్చుని దిగజారుడు చానెళ్లలో దిగజారుడు వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు.నిన్ను నాశనం చేస్తా. . జాగ్రత్తఇప్పటికైనా మాట్లాడే విధానం తెలుసుకో. ఐదు మ్యాచ్‌లు ఆడిన వాడికి 100 మ్యాచ్‌లు ఆడిన వాడికి తేడా ఉంటుంది. కాబట్టి తన్వీర్ అహ్మద్ నీ స్థాయి ఏమిటో తెలుసుకో. మరోసారి ఇలాగే వాగావు అంటే నిన్ను నాశనం చేస్తా. జాగ్రత్త’’ అంటూ భజ్జీ ఫైర్ అయ్యాడు.కాగా టీమిండియా తరఫున హర్భజన్ సింగ్ 1998- 2016 మధ్య 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్ ఖాతాలో 417 టెస్టు వికెట్లు, 269 వన్డే వికెట్లు, 25 టీ20 వికెట్లు ఉన్నాయి.మరోవైపు.. రైటార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్ తన్వీర్ అహ్మద్ పాక్ తరఫున 5 టెస్టులు, 2 వన్డేలు, ఒక టీ20 ఆడాడు. ఆయా ఫార్మాట్లలో 17, 2, ఒక వికెట్ తీశాడు.చదవండి: IND vs PAK: 'ఈజీగా ఔట్ చేయవచ్చు'.. అభిషేక్‌ను ఎగతాళి చేసిన పాక్ మాజీ ఆటగాడు -
న్యూజిలాండ్ ఓపెనర్ల ఊచకోత.. సరికొత్త చరిత్ర
టీ20 వరల్డ్‌కప్ 2026లో న్యూజిలాండ్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఈ జట్టు.. తాజాగా (ఫిబ్రవరి 10) యూఏఈపై 10 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో యూఏఈ నిర్దేశించిన 174 పరుగుల లక్ష్యాన్ని ఓపెనర్లే ఊదేశారు. ఫిన్ అలెన్ (50 బంతుల్లో 84 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), టిమ్ సీఫర్ట్ (42 బంతుల్లో 89 నాటౌట్; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) ఊచకోత ధాటికి న్యూజిలాండ్ కేవలం 15.2 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యంగా నిలిచింది. సీఫర్ట్-అలెన్ దెబ్బకు యూఏఈ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. వీరిద్దరు పడ్డ బంతిని పడ్డట్టు ఎడాపెడా బాదారు. అలెన్ కాస్త నిదానంగా ఆడినా, సీఫర్ట్ మాత్రం బౌండరీలు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. విన్నింగ్ రన్స్‌ను కూడా సీఫర్ట్ సిక్సర్‌తోనే సాధించాడు. అలెన్ తన హాఫ్ సెంచరీని 27 బంతుల్లో పూర్తి చేస్తే, సీఫర్ట్ కేవలం 23 బంతుల్లోనే పని కానిచ్చేశాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన గత మ్యాచ్‌లోనూ సీఫర్ట్ ఇదే తరహా విధ్వంసం (42 బంతుల్లో 65; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) సృష్టించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. సీఫర్ట్ ధాటికి ఆ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని కివీస్ 17.5 ఓవర్లలోనే ఛేదించింది. సీఫర్ట్ విధ్వంసకర ఫామ్ చూస్తుంటే, ఈ ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ను ఆపడం కష్టమేమో అనిపిస్తుంది. అతనికి ఫిన్ అలెన్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్ లాంటి బ్యాటర్లు తోడైతే, బ్యాటింగ్‌కు స్వర్గధామమమైన ఉపఖండపు పిచ్‌లపై న్యూజిలాండ్‌ను ఆపడం కష్టమే. బ్యాటింగ్ విషయాన్ని పక్కన పెడితే, ప్రస్తుత న్యూజిలాండ్ జట్టు బౌలింగ్‌లో మరింత ప్రమాదకరంగా ఉంది. ఆ జట్టులో డఫీ, హెన్రీ, ఫెర్గూసన్, నీషమ్ లాంటి ప్రమాదకర ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. అలాగే స్పిన్ విభాగంలో మిచెల్ సాంట్నర్ లాంటి టాప్ స్పిన్నర్ ఉన్నాడు. ఈ గెలుపుతో గ్రూప్-డి నుంచి న్యూజిలాండ్ సూపర్-8 బెర్త్ దాదాపుగా ఖరారైనట్లే.అసాధారణ ప్రదర్శనఈ మ్యాచ్‌లో యూఏఈ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ జట్టు బ్యాటర్లు అసాధారణ ప్రదర్శన కనబర్చారు. పటిష్టమైన న్యూజిలాండ్ బౌలింగ్ లైనప్‌ను ఎదుర్కొని నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేశారు. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో యూఏఈకి ఇదే అత్యధిక టీమ్ స్కోర్.కెప్టెన్ ముహమ్మద్ వసీం (66 నాటౌట్), అలీషాన్ షరాఫు (55) కలిసి యూఏఈకి ఈ రికార్డు స్కోర్ అందించారు. ఆఖర్లో మయాంక్ కుమార్ (21) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 2 వికెట్లు తీయగా.. డఫీ, ఫెర్గూసన్, సాంట్నర్, ఫిలిప్స్ తలో వికెట్ తీశారు.బెంబేలెత్తిపోయిన యూఏఈ బౌలర్లు174 పరుగుల లక్ష్య ఛేదనను న్యూజిలాండ్ ఓపెనర్లు ఆచితూచి ప్రారంభించారు. అయితే వీరిద్దరు క్రమంగా గేర్ మార్చి వీలు చిక్కనప్పుడల్లా యూఏఈ బౌలర్లును ఉతికి ఆరేశారు. వీరి ధాటికి రోహిద్ ఖాన్ 3.2 ఓవర్లలో 51 పరుగులు, జునైద్ సిద్దిఖీ 4 ఓవర్లలో 47 పరుగులు, అర్ఫాన్ 3 ఓవర్లలో 36 పరుగులు సమర్పించుకున్నారు. యూఏఈ బౌలర్లలో హైదర్ అలీ (4-0-27-0) ఒక్కడు కాస్త పొదుపుగా బౌలింగ్ చేశాడు. మొత్తంగా టిమ్ సీఫర్ట్, ఫిన్ అలెన్ ధాటికి యూఏఈ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. -
T20 WC 2026: గ్లెన్ ఫిలిప్స్‌కు ఘోర పరాభవం
న్యూజిలాండ స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్‌కు ఘోర పరాభవం ఎదురైంది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఓ అసోసియేట్ దేశంపై ఓ ఓవర్లో అత్యధిక పరుగులిచ్చిన (27 పరుగులు) ఫుల్ మెంబర్ జట్టు బౌలర్‌గా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. 2026 ఎడిషన్‌లో భాగంగా యూఏఈతో ఇవాళ (ఫిబ్రవరి 10) జరుగుతున్న మ్యాచ్‌లో ఫిలిప్స్ ఈ అవాంఛిత రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. యూఏఈ ఇన్నింగ్స్ 18వ ఓవర్లో ఇది జరిగింది. ఆ ఓవర్లో ఫిలిప్స్ వరుసగా 1, 4, 6, 1wd, 4nb, 6, 1, 2 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ ఓవర్లో యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం, మయాంక్ కుమార్ ఫిలిప్స్‌ను చెడుగుడు ఆడుకున్నారు.టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఓ అసోసియేట్ దేశంపై ఓ ఫుల్ మెంబర్ జట్టు బౌలర్ ఓ ఓవర్లో సమర్పించుకున్న అత్యధిక పరుగులు27 పరుగులు – గ్లెన్ ఫిలిప్స్ (NZ) vs UAE, చెన్నై, 202622 పరుగులు – కైల్ అబ్బాట్ (SA) vs ఆఫ్ఘనిస్తాన్, 201622 పరుగులు – తబ్రైజ్ షంసీ (SA) vs USA, 202422 పరుగులు – జోఫ్రా ఆర్చర్ (ENG) vs నేపాల్, 2026ఇదిలా ఉంటే, యూఏఈతో మ్యాచ్‌లో ఫిలిప్ ఒక్క ఓవర్లో తడబడినా, ఫీల్డ్‌లో మ్యాజిక్ చేశాడు. మూడు కీలక క్యాచ్‌లు పట్టడంతో పాటు, పలు అద్భుత ఫీల్డింగ్ విన్యాసాలు చేసి యూఏఈని 200 పరుగుల మార్కును తాకకుండా కట్టడి చేశాడు. తాను బౌలింగ్ చేసిన 2 ఓవర్లలో ఓ ఓవర్లో 27 పరుగులిచ్చినా, మరో ఓవర్లో కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ కూడా తీశాడు.అసాధారణ ప్రదర్శనఈ మ్యాచ్‌లో యూఏఈ బ్యాటర్లు అసాధారణ ప్రదర్శన కనబర్చారు. పటిష్టమైన న్యూజిలాండ్ బౌలింగ్ లైనప్‌ను ఎదుర్కొని నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేశారు. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో యూఏఈకి ఇదే అత్యధిక టీమ్ స్కోర్. కెప్టెన్ ముహమ్మద్ వసీం (66 నాటౌట్), అలీషాన్ షరాఫు (55) కలిసి యూఏఈకి ఈ రికార్డు స్కోర్ అందించారు. ఆఖర్లో మయాంక్ కుమార్ (21) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 2 వికెట్లు తీయగా.. డఫీ, ఫెర్గూసన్, సాంట్నర్, ఫిలిప్స్ తలో వికెట్ తీశారు. -
యూఏఈ కొత్త రూల్.. పిల్లలకు అవి బ్యాన్
ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిసారించాయి. అందులో భాగంగానే పిల్లలకు పోషకాహార పథకాలు మెుదలు.. స్కూళ్లలో మద్యాహ్న భోజనాలు లాంటి ఏన్నో పథకాలు అమలు చేస్తున్నాయి. అయితే యూఏఈ మాత్రం మరో అడుగు ముందుకేసి పిల్లల శారీరక, మానసిక ఆరోగ్య రక్షణకై కీలక నిర్ణయం తీసుకుంది.సాధారణంగా పిల్లలకు శీతల పానీయాలు, ఐస్‌క్రీములు, చాక్లెట్లు ఇతరత్రా తీపి పదార్థాలతో పాటు జంక్ ఫుడ్ ఇష్టం ఉంటాయి. అయితే ఆ వయసులో వాటి వల్ల కలిగే నష్టం వారికి తెలియదు. అందుకే వాటిని ఇష్టపడుతూ తింటుంటారు. ఈ నేపథ్యంలో పిల్లల్లో క్రమశిక్షణను పెంచడంతో పాటు వారి ఆరోగ్య రక్షణకు యూఏఈ విద్యా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో ఉండే క్యాంటీన్లతో పాటు పరిసర ప్రాంతాల్లో జంక్ ఫడ్స్ అమ్మకం నిషేదిస్తూ ఆదేశాలు జారీ చేసింది.అంతేకాకుండా ఎటువంటి ఎనర్జీ డ్రింక్స్, స్వీట్స్, చాక్లెట్స్, కేకులు, డోనట్స్, నూడుల్స్ లాంటివి ఏవికూడా పాఠశాలల పరిసర ప్రాంతాలలో అమ్మకూడదని తెలిపింది. వాటితో పాటు పిల్లలకు వారి తల్లిదండ్రులు తప్పనిసరిగా ఇంటి నుంచే సమతుల్య ఆహరం పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటివి పంపించాలని తెలిపింది. వీటితో పాటు ఎట్టిపరిస్థితుల్లో పిల్లలు పాఠశాలకు ఫోన్లు తీసుకరాకూడదని పేర్కొంది.ఒకవేళ గనుక వారు మెుబైల్ ఫోన్లు పాఠశాలలకు తీసుకవస్తే మెుదటి సారి ఒక నెల వరకూ వారి ఫోన్ జప్తు చేయాలని తిరిగి అదే పునరావృతం అయితే విద్యా సంవత్సరం చివరి వరకూ మెుబైల్స్ స్వాధీన పరచుకోవాలని పేర్కొంది. అయితే పాఠశాల అనుమతుల ప్రకారం టాబ్స్, ఐప్యాడ్ లాంటివి వినియోగించవచ్చని పేర్కొంది. విద్యార్థుల శారీరక మానసిక ఆరోగ్యాన్ని కాపాడడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యుఏఈ విద్యాశాఖ ప్రకటించింది. -
స్కూల్స్‌లో ఇకపై జంక్ ఫుడ్ నిషేధం
విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో భాగంగా యూఏఈ విద్యామంత్రిత్వ శాఖ కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వలు జారీ చేసింది. స్కూల్ క్యాంటీన్లలో జంక్ ఫుడ్, డ్రింక్స్ అమ్మడంపై నిషేధం విధించింది. ఈ జాబితాలో సాఫ్ట్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, కృత్రిమ జ్యూసులు, చాక్లెట్, కేక్, డోనట్, స్వీట్ బిస్కెట్లు,చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, నూడుల్స్, సాసేజులు, బర్గర్స్ ఉన్నాయి. అలర్జీ సమస్యల కారణంగా వేరుశనగ, కాజూనట్స్ని కూడా నిషేధించారు. పండ్లు, కూరగాయలు, హోల్ గ్రెయిన్స్ మెండుగా ఉండే ఇంట్లో తయారు చేసిన ఆహారం పిల్లలకు ఇవ్వమని ప్రభుత్వం సూచించింది.అలానే పిల్లల్లో మొబైల్ ఫోన్ వినియోగంపై కూడా కఠిన నియమాలు అమలు చేశారు. తొలిసారి పాఠశాలకు ఎవరైనా ఫోన్ తీసుకునివస్తే నెల రోజులపాటు దాన్ని తిరిగి ఇవ్వరు. మళ్లీ మళ్లీ ఇలానే చేస్తే.. విద్యాసంవత్సరం పూర్తయ్యే వరకు ఆ ఫోన్ తిరిగి ఇవ్వడం కుదరదని యూఏఈ ప్రభుత్వం పేర్కొంది. ఈ నియమాలు అమలు చేయడంలో భాగంగా అధికారులు.. విద్యార్థుల బ్యాగ్స్ తనిఖీ చేయొచ్చు. అయితే తనిఖీలు చేసినప్పుడు పిల్లల బ్యాగ్‌లో మొబైల్ దొరికితే.. వెంటనే తల్లిదండ్రులు సంతకంతో రికార్డ్ చేయాలి.ఐప్యాడ్ లేదా ట్యాబ్ అనేవి చదువుకోసం మాత్రమే. టీచర్స్ అనుమతితోనే వీటిని ఉపయోగించాల్సి ఉంటుంది. విరామం లేదా క్లాస్ తర్వాత వీటిని ఉపయోగించడం.. నిబంధనలకు విరుద్ధం. ఈ చర్యలన్నీ విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు సహాయపడతాయని సంబంధిత మంత్రిత్వ శాఖ భావిస్తోంది. -
టీ20 వరల్డ్‌కప్ నుంచి పాక్ మూలాలున్న ఆటగాడి తొలగింపు
టీ20 వరల్డ్ కప్-2026 పాల్గొంటున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) జట్టులో కలకలం రేగింది. పాకిస్తాన్ మూలాలున్న బ్యాటర్ మొహమ్మద్ జోహెబ్‌ను ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ECB) అకస్మాత్తుగా స్వదేశానికి పంపించింది. బోర్డు ప్రకటన ప్రకారం.. జోహెబ్ శాసన నియమావళిని ఉల్లంఘించాడు. ఈ విషయమై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.జోహెబ్ ఏ నియమాలు ఉల్లంఘించాడోనని క్రికెట్ ప్రపంచం మొత్తం ఆరా తీస్తుంది. ఇంత సడెన్‌గా ఓ ఆటగాడిని స్వదేశానికి పంపారంటే ఏదో బలమైన కారణమే ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, జోహెబ్ మాత్రం తనపై తీసుకున్న చర్యను జాతి వివక్షగా అభివర్ణించాడు. మేనేజ్మెంట్ మొత్తం భారతీయ మూలాలున్నవారే ఉన్నారని, తాను పాకిస్తాన్ మూలాలవాడినైనందు వల్ల జట్టు నుంచి ఆకస్మికంగా తొలగించారని ఆరోపించాడు. ఈ విషయంలో తనకు అన్యాయం జరిగిందని, దీనిపై అధికారిక విచారణ జరపాలని డిమాండ్ చేశాడు.ఈ విషయంలో జోహెబ్ భారత్‌ను నిందించడాన్ని భారతీయులు తప్పుబడుతున్నారు. ఏదైనా ఉంటే యూఏఈతో బోర్డుతో చూసుకోవాలి కాని, భారత మూలలున్న వారిని అడ్డం పెట్టుకొని భారత్‌ను నిందించడం సరికాదని వార్నింగ్ ఇస్తున్నారు.కాగా, జోహెబ్ తొలగింపుతో యూఏఈ జట్టులో కలకలం రేగినా, టోర్నమెంట్లో వారి ప్రయాణం కొనసాగుతుంది. రేపు (ఫిబ్రవరి 10) జరిగే మొదటి మ్యాచ్‌లో వారు న్యూజిలాండ్‌ను ఎదుర్కొంటారు. ఆ తర్వాతి మ్యాచ్‌లు కెనడా, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికాతో జరగనున్నాయి. ప్రీ-టోర్నమెంట్లో ఇటలీతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో యూఏఈ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. 193 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక, కేవలం 91 పరుగులకే కుప్పకూలింది. జోహెబ్ లేకుండా యూఏఈ జట్టు మరింత బలహీనపడిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నప్పటికీ.. కెనడా, ఆఫ్ఘనిస్తాన్పై గెలిచే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచకప్‌లో యూఏఈ స్క్వాడ్: మహ్మద్ వసీమ్ (కెప్టెన్), అలీషాన్ షరాఫు, ఆర్యన్ష్ శర్మ, ధ్రువ్ పరాశర్, హైదర్ అలీ, హర్షిత్ కౌశిక్, జునైద్ సిద్దిఖీ, మయాంక్ కుమార్, మహ్మద్ అర్ఫాన్, మహ్మద్ ఫారూక్, మహ్మద్ జవాదుల్లా, రోహిద్ ఖాన్, సోహెబ్ ఖాన్, సిమ్రంజీత్ సింగ్ -
న్యూస్టార్ట్ చర్చలకు అమెరికా, రష్యా ఓకే
మాస్కో: ఆయుధాల నియంత్రణకు సంబంధించిన న్యూస్టార్ట్ ఒప్పందంపై చర్చలను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని అమెరికా, రష్యాలు అంగీకారానికి వచ్చాయి. రష్యా, ఉక్రెయిన్, అమెరికా ప్రతినిధుల మధ్య యూఏఈలోని దుబాయ్‌లో జరుగుతున్న శాంతి చర్చల సమయంలో ఈ అంశం ప్రస్తావనకు వచి్చనట్లు శుక్రవారం రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ చెప్పారు. అదేవిధంగా, రెండు దేశాల మిలటరీ మధ్య 2021 నుంచి నిలిచిపోయిన ప్రత్యక్ష సంబంధాలను తిరిగి నెలకొల్పుకునేందుకు కూడా సంసిద్ధత వ్యక్తం చేశాయని వివరించారు. బాధ్యతాయుతమైన రెండు దేశాలు స్టార్ట్ చర్చలపై ఆసక్తితో ఉన్నాయన్నారు. అమెరికా, రష్యాల మధ్య చిట్టచివరి వ్యూహాత్మక ఆయుధాల నియంత్రణ ఒప్పందం(స్టార్ట్) గడువు గురువారంతో ముగిసిపోయింది. దీంతో, అత్యధికంగా అణ్వాయుధాలు కలిగిన ఈ రెండు దేశాలకు ఇప్పుడు ఇక ఎటువంటి పరిమితులు లేవు. స్టార్ట్ ఒప్పందం విధించిన పరిమితులకు కట్టుబడి ఉండేందుకు తాము సిద్ధమని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇటీవల ప్రకటించగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పట్టించుకోలేదు. చైనా కూడా ఈ ఒప్పందంలో చేరాలని పిలుపునిచ్చారు. చైనా మాత్రం ససేమిరా అంటోంది. -
UAEలో భగ్గుమంటున్న ఇంటి అద్దె.. ఆందోళనలో భారతీయులు
అబుదాబిలో అద్దెలు రాకెట్ వేగంతో దూసుకెళుతున్నాయి. విల్లాలతో పాటు సాధారణ ప్లాట్ల అద్దెని ఒకేసారి రెట్టింపు చేయడంతో చాలా మంది తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. సంపాదించిన దాంట్లో అగ్రభాగం ఇంటి అద్దెలకే చెల్లించాల్సి వస్తుందని అక్కడి భారతీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.యూఏఈ అబుదాబిలో అక్కడి ప్రాపర్టీ మేనేజర్లు అధికంగా డబ్బులు అర్జించే లక్షంతో కొత్త నిబంధనలు తీసుకవచ్చారు. ఉన్న ఫలంగా అద్దెలను రెట్టింపు చేశారు. అక్కడి గృహా చట్టాల ప్రకారం ఒక విల్లాలో ఒకటి కంటే ఎక్కువ కుటుంబాలు ఉండడం నిషిద్ధం. అయితే అక్కడి అద్దెల రీత్యా చాలా మంది విల్లాలలను షేర్ చేసుకొని అద్దెకు తీసుకుంటారు. కాగా ఇప్పుడు ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాలలో నివాసమున్న వారిని వెంటనే ఖాళీ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. దీంతో చట్టపరంగా అది విరుద్ధం కావడంతో చేసేదేం లేక వారు ఖాళీ చేస్తున్నారు.విల్లాలతో పాటు ఫ్యామిలీలు అధికంగా నివసించే ప్రాంతాలకు కరెంట్ కట్ చేసి మూడు రోజుల్లో ఖాళీ చేయాలని ఆదేశాలు ఇస్తున్నారు. దీంతో వారు ఎటువెళ్లాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఉంటున్న వారిని బలవంతంగా ఖాళీ చేయించి అదే వాటిని కొత్త వారికి అధిక ధరలకు ఇస్తున్నారని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.గతంలో 24,000 దిర్హామ్‌లు ఉండే విల్లాల అద్దె ప్రస్తుతం 40,000 దిర్హామ్‌లు చేరుకుంది. -
ఇరాన్లో భూకంపం.. తీవ్రత ఎంతంటే?
ఆదివారం దక్షిణ ఇరాన్‌లోని కొన్ని ప్రాంతాలలో భూకంపం సంభవించింది. అక్కడి స్థానిక కాలమానం ప్రకారం ఉదయం కొన్ని ప్రాంతాలలో భూమి కంపించినట్లు జియోలాజికల్ సర్వే అథారిటీ తెలిపింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైనట్లు పేర్కొంది. అయితే దీనివల్ల ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని తెలిపింది.కొన్నిచోట్ల భవనాలకు పగుళ్లు రావడం మినహా ఎటువంటి ఆస్తి నష్టం జరగలేదని మెహర్, బిద్ధన్ అఖండ్ ప్రాంతాలలోని భవనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయని అక్కడి అధికారులు పేర్కొన్నారు. భూకంపం రావడంతో ప్రజలు పెద్దఎత్తున బాహ్య ప్రదేశాలకు పరుగులు తీశారని తెలిపారు. అంతే కాకుండా ఖతార్‌లోనూ యూఏఈలోనూ స్వల్పంగా భూ ప్రకంపనలు వచ్చినట్లు ఆ దేశాలు ప్రకటించాయి. అయితే దానివల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదని పేర్కొన్నాయి. అయితే భూకంప తీవ్రత ఎలా ఉందనే అంశం అధికారులు పరిశీలిస్తున్నారు. -
దుబాయ్ బిలియనీర్ బంపర్ ఆఫర్..! పెళ్లికి రూ. 12 లక్షలు, పిల్లలు కంటే..
దుబాయ్ షేక్ ఇచ్చిన బంపర్ ఆఫర్ చూస్తే షాకవ్వుతారు. జస్ట్ పెళ్లి చేసుకుంటే రూ. 12 లక్షలు. పిల్లలు కంటే మరో రూ. 12 లక్షలు ఇస్తామని సోషల్ మీడియా ఎక్స్‌లో కళ్లుచెదిరే ఆఫర్ ప్రకటించారు దుబాయ్‌లోని బిలియనీర్ వ్యాపారవేత్త ఖలాఫ్ అహ్మద్ అల్ హబ్తూ సోషల్ మీడియా పోస్ట్‌లో. వివాహం, కుటుంబాన్ని పోషించడం వ్యక్తిగత విషయాలు కాదని అవి సామాజిక బాధ్యతలని పిలుపునిస్తూ..తన అల్ హబ్తూర్ గ్రూప్‌లోని ఎమిరేట్ ఉద్యోగులకు ఈ ఆఫర్ అందిస్తూ తన పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు. "కుటుంబాలే బలమైన దేశానికి కీలకమని, పిల్లలు దేశ భవిష్యత్తులో పెట్టుబడి అని అన్నారు. మా ప్రభుత్వాలు యువకుల కుటుంబ జీవితాలు ప్రారంభంలో మద్దతివ్వడానికి వెనకడుగు వేయవు. అందువల్ల యుఏఈ జాతీయులు వివాహం చేసుకుని కుటుంబాన్ని పెంచుకునేలా ప్రోత్సహించడానికి ప్రతి ఒక్కరి నుంచి ఆచరణాత్మక చొరవలు కూడా అవసరంర. కుటుంబాలు నిర్మించడం అనేది ఉమ్మడి బాధ్యత అని, కుటుంబం చిన్నదైనా లేదా పెద్దదైనా సమాజం, దేశం భవిష్యత్తులో చాలా ప్రభావాన్ని చూపిస్తుంది." అని అన్నారు. కాగా, ఖలాఫ్ అహ్మద్ అల్ హబ్టూర్ UAE వ్యాపారవేత్త, అల్ హబ్టూర్ గ్రూప్ అండ్ దుబాయ్ నేషనల్ ఇన్సూరెన్స్ అండ్ రీఇన్సూరెన్స్ కంపెనీకి ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు. ఆయన గతంలో దుబాయ్ కమర్షియల్ బ్యాంక్ ఛైర్మన్‌గానూ, అల్ జలీలా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వైస్ ఛైర్మన్‌గా, అలాగే UAE ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ సభ్యుడిగా కూడా పనిచేశారు.గతేడాది అక్టోబర్‌లో, అల్ హబ్టూర్ యువకులను వివాహం చేసుకోవాలని కోరారు. అంతేగాదు ఆయన యువకులు 30 ఏళ్లలోపు వివాహం చేసుకునేలా ప్రోత్సహించే చట్టం కోసం ఆశిస్తుండటం గమనార్హం. వివాహం చేసుకోకుండా ఉండిపోయిన యువకులను జవాబాదారీగా ఉంచాలని కూడా అన్నారు. ఇది సమాజంలో మనుగడకు, ఐక్యతకు సంబంధించిన విషయం అని అన్నారు. కుటుంబాలే దేశానికి కీలకం అంటూ అందర్నీ ఆలోచింపచేసేలా ఆయన ఈ షేకింగ్ ఆఫర్ ఇచ్చారు.تزوّجتُ وأنا في عمر 17 عاماً، وأسّستُ مع زوجتي عائلة جميلة، أحمدُ الله على هذه النعمة في كل لحظة. منذ تلك اللحظة، أصبحت الأسرة بالنسبة لي دائماً ملاذ راحة، ومصدر سكينة، ونعمة حقيقية أستمدّ منها القوة والسعادة.ومن هذا الإيمان، أودّ أن أُشجّع شبابنا على تأسيس أسر متماسكة تكون… pic.twitter.com/ououH8gqkj— Khalaf Ahmad Al Habtoor (@KhalafAlHabtoor) January 24, 2026 (చదవండి: చేతిలో పదివేలు ఉంటే చాలు..ఆ దేశాల్లో లక్షాధికారులే..?) -
వలస కార్మికులకు బంపర్ ఆఫర్
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వెళ్లాలనుకునే వలస కార్మికుల ఉచిత వీసాల కోసం అక్కడి ఏడీఎన్‌హెచ్ సంస్థ, తెలంగాణలోని జీటీఎం సంస్థలు రిక్రూట్మెంట్ ర్యాలీకి సన్నాహాలు చేస్తున్నాయి. ఫిబ్రవరిలో నాలుగు చోట్ల ఇంటర్వ్యూలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేశాయి. క్లీనింగ్ విభాగంలో పనిచేసేందుకు ఉచితంగా వీసాలను జారీ చేసి, ఉచిత విమాన టికెట్, వసతి, భోజన సదుపాయం కల్పించి.. మన కరెన్సీలో రూ.23 వేల వరకు వేతనాలను చెల్లించనున్నారు. వచ్చే నెల 6న జగిత్యాల, సిరిసిల్లలో, 7న నిజామాబా ద్, ఆర్మూర్‌లలోని జీటీఎం సంస్థ కార్యాలయాలలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. వివ రాల కోసం ఆర్మూర్ (8332062299), నిజామాబాద్ (8686860999), జగిత్యాల (83320422 99), సిరిసిల్ల (9391661522) నంబర్లలో సంప్రదించవచ్చని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. దళారుల్ని నమ్మొద్దు ఈనెల 9, 10 తేదీలలో ఇంటర్వ్యూలకు హాజరైన వంద మందిని రెండు మూడు రోజుల్లో యూఏఈకి పంపించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. దళారులను నమ్మి మోసపోవద్దు. – చీటీ సతీశ్‌రావు, చైర్మన్, జీటీఎం ఇంటర్నేషనల్ (చదవండి: 90 నిమిషాల ఎమర్జెన్సీ రూమ్‌కి..హడలెత్తించేలా బిల్లు..!) -
ఎడారి దేశంలో వడగళ్ల వాన.. వీడియోలు వైరల్
ఎడారి దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సోమవారం తెల్లవారుజామున ఉత్తర ప్రాంతాల్లోని రాస్ అల్ ఖైమా, అల్ రామ్స్ పరిసరాల్లో భారీగా వడగళ్ల వాన కురిసింది. అనేకచోట్ల రోడ్లన్నీ మంచు ముక్కలతో నిండిపోయాయి.ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఉపరితల అల్పపీడన ప్రభావం వల్ల ఈ వడగళ్ల వర్షం కురిసినట్లు నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ వాతావరణ మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. జెబల్ జైస్ వంటి పర్వత ప్రాంతాల్లో అత్యల్పంగా 4.7°C ఉష్ణోగ్రత నమోదైంది. మంగళవారం కూడా యూఏఈలోని ఉత్తర, తూర్పు ప్రాంతాలలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పొగమంచు కూడా ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉందని అక్కడి వాతావరణ శాఖ వెల్లడించింది.దీంతో రోడ్లపై ప్రయాణించే వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. కాగా గత నెలలో కూడా యూఏఈలో కుండపోత వర్షాలు కురిశాయి. భారీ వర్షాల వల్ల.. అబుదాబీ, దుబాయ్‌తో పాటు నగరాల్లో జనజీవనం స్తంభించింది. కానీ ఇప్పుడు ఈ వడగళ్ల వానను అక్కడి ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by مركز العاصفة لمراقبة الطقس والتغير المناخي المؤسس omar alnauimi (@storm_ae) -
యూఏఈ ఉద్యోగ రంగంలో 'రియల్ ఎస్టేట్' తుఫాన్
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)లో రియల్ ఎస్టేట్ ఉద్యోగాలకు డిమాండ్ భారీగా పెరిగింది. ప్రముఖ జాబ్ పోర్టల్ 'నౌకరీ గల్ఫ్' 2025 వార్షిక నివేదిక ప్రకారం.. గతేడాది అత్యధిక ఉపాధి అవకాశాలు కల్పించిన రంగంగా రియల్ ఎస్టేట్ నిలిచింది.దుబాయ్, అబుదాబి నగరాల్లో ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లు పెరగడంతో రియల్ ఎస్టేట్ ఉద్యోగాలకు డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ కంపెనీలు కేవలం సేల్స్ ఏజెంట్లనే కాకుండా ప్రాజెక్ట్ మేనేజర్లు, సివిల్ ఇంజనీర్ల పోస్టులను కూడా భర్తీ చేస్తున్నాయి.అదేవిధంగా ఈ రంగంలో డిజిటల్ మార్కెటింగ్, ఏఐ నిపుణులకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. కొత్తగా ఉద్యోగంలో చేరిన సేల్స్ ఏజెంట్లు నెలకు 6,000 (సుమారు రూ.1,50,000) - 15,000 (సుమారు రూ.3,75,000) దిర్హామ్‌లు సంపాదిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. రియల్ ఎస్టేట్ తర్వాత ఐటీ, టెలికాం, ఇంటర్నెట్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. -
అబుదాబీలో సెల్ ఫోన్ డ్రైవింగ్.. ఫైన్ ఎంతో తెలిస్తే షాక్?
ప్రపంచవ్యాప్తంగా రోజుకు దాదాపుగా 3,260 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచంలో ప్రతి ఏడాది లక్షలాది మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రమాదాలకు ప్రధాన కారణం ట్రాఫిక్ నియమాలను సంపూర్ణంగా పాటించకపోవడమే.అయితే అరబ్ దేశమైన యూఏఈ రోడ్డుప్రమాదాలను నివారించేందుకు కఠినమైన ట్రాఫిక్ రూల్స్‌ను అమలు చేస్తోంది. అబుదాబీ ట్రాఫిక్ నిబంధనల ప్రకారం.. వాహనం నడుపుతున్నప్పుడు ఫోన్ వాడితే 800 దిర్హామ్‌లు (సుమారు రూ. 18,000 ) జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.అంతేకాకుండా డ్రైవింగ్ లైసెన్స్‌పై 4 బ్లాక్ పాయింట్లు విధిస్తారు. యూఏఈలో ఒక డ్రైవర్‌కు 24 బ్లాక్ పాయింట్లు వస్తే వారి లైసెన్స్ పూర్తిగా రద్దు చేయబడుతోంది. అబుదాబీలో రోడ్లపై ఉండే అత్యాధునిక ఏఐ కెమెరాలు డ్రైవర్ ఫోన్ వాడుతున్నా లేదా సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా వెంటనే గుర్తించి ఆటోమేటిక్‌గా ఫైన్ వేస్తాయి. అయితే బ్లూటూత్ లేదా హెడ్‌ఫోన్స్ ద్వారా మాట్లాడేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. అదేవిధంగా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రెడ్ సిగ్నల్ పడ్డాక వెళ్తే 1,000 దిర్హామ్‌లు(సుమారు రూ.25,000) ఫైన్‌తో పాటు 12 బ్లాక్ పాయింట్లు విధిస్తారు. పరిమితి(80 కి.మీ) కంటే ఎక్కువ వేగంతో వెళ్తే 3,000 దిర్హామ్‌ల(సుమారు రూ.75,000) జరిమానా పడుతోంది. రోడ్లపై ప్రమాదకరమైన డ్రైవింగ్ చేస్తే ఆ వాహనాన్ని సీజ్ చేస్తారు. తిరిగి వాహనాన్ని విడిపించుకోవడానికి 50,000 దిర్హామ్‌లు(రూ.12 లక్షలకు పైగా) కట్టాల్సి ఉంటుంది. -
UAE: 900 మంది భారత ఖైదీల విడుదలకు రంగం సిద్ధం
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జైళ్లలో మగ్గుతున్న 900 మందికి పైగా భారత ఖైదీల విడుదలకు రంగం సిద్దమైంది. జైళ్ల నుంచి విడుదల కానున్న ఖైదీల జాబితాను యూఏఈ అధికారులు అబుదాబిలోని భారత రాయబార కార్యాలయానికి అందజేశారు. గతేడాది డిసెంబర్ 2న యూఏఈ జాతీయ దినోత్సవం (ఈద్ అల్ ఇతిహాద్) పురస్కరించుకుని మొత్తం 2,937 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తున్నట్లు అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ప్రకటించారు. ఈ 2,937 మందిలో 900 మందికి పైగా భారతీయులు ఉండటం విశేషం. షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ క్షమాభిక్ష మేరకే ఇప్పుడు వందలాది మంది ఖైదీలకు విముక్తి లభించనుంది. కాగా ఈ విడుదల ప్రక్రియలో యూఏఈ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శిక్షలో భాగంగా ఖైదీలకు విధించిన జరిమానాలు, పరిహార చెల్లింపులను కూడా ప్రభుత్వమే భరించనుంది. ఈ నిర్ణయం యూఏఈ నిబద్ధతకు ఇది ప్రతిబింబంగా నిలుస్తుందని, వారి కుటుంబ సభ్యులపై పడే భారం, బాధ్యతలు తగ్గుతాయని యూఏఈ అధికారి ఒకరు పేర్కొన్నారు. కాగా యూఏఈ, భారత్ మధ్య మంచి స్నేహం ఉంది. ఇటీవలే అధ్యక్షుడు నహ్యాన్ భారత్ పర్యటనకు వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. -
'మీ ఇల్లు మీ బాధ్యత'.. యూఏఈలో సరికొత్త కార్యక్రమం
ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించడమే లక్ష్యంగా అబుదాబి సివిల్ డిఫెన్స్ అథారిటీ(ADCDA) మరో కీలక అడుగు వేసింది. అగ్ని ప్రమాదాల నివారణ, గృహోపకరణాల భద్రత వంటి ఆంశాలపై అవగాహన పెంచేందుకు “మీ ఇల్లు మీ బాధ్యత” అనే కార్యక్రమాన్ని ఎడిసిడిఎ ప్రారంభించింది.ఈ ప్రచారంలో భాగంగా సివిల్ డిఫెన్స్ అధికారులు నేరుగా నివాసాలకు చేరుకుని అక్కడి భద్రతా ప్రమాణాలను పరిశీలిస్తారు. ప్రధానంగా ఇళ్లలో జరిగే అగ్నిప్రమాదాల నివారణపై అధికారులు దృష్టి సారించారు. వంటగదిలో గ్యాస్ స్టౌవ్, ఆయిల్ వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగహన కల్పించనున్నారు. అదేవిధంగా స్మోక్ డిటెక్టర్ల యంత్రాల ప్రాముఖ్యతను కూడా వివరించనున్నారు. యూఏఈ ప్రభుత్వం ఇళ్లలో ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ ఫైర్ అలారం వ్యవస్థ ‘హసన్తుక్’ కొనసాగింపుగా ఈ ప్రచారం జరుగుతోంది. షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, సోషల్ మీడియా ద్వారా అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేయాలని ఎడిసిడిఎ నిర్ణయించింది. అంతేకాకుంగా త్వరలోనే వీటిపై మాక్ డ్రిల్స్, వర్క్‌షాప్‌లను నిర్వహించనున్నారు. -
వైద్య రంగంలో అద్భుతం.. ఒకే ఒక పరీక్షతో 70 రకాల క్యాన్సర్లు గుర్తింపు
క్యాన్సర్ మహమ్మారిని ప్రాథమిక దశలోనే తుడిచిపెట్టేందుకు యూఏఈ వైద్య రంగం విప్లవాత్మక అడుగు ముందుకేసింది. అబుదాబిలోని బుర్జీల్ హాస్పిటల్స్ ప్రవేశపెట్టిన 'ట్రూచెక్ ఇంటెల్లి' అనే రక్త పరీక్షతో ఒకేసారి 70 రకాల క్యాన్సర్లను గుర్తించవచ్చు.శరీరంలో క్యాన్సర్ లక్షణాలు కనిపించకముందే, కణాల స్థాయిలో మార్పులను ఈ టెస్టుతో తెలుసుకోవచ్చు. ముఖ్యంగా 40 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు కలిగిన వారి కోసం ఈ 'ట్రూచెక్ ఇంటెల్లి' పరీక్షను తీసుకొచ్చారు. ఎందుకంటే వయస్సు పెరిగే కొద్దీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఎండోస్కోపీ లేదా బయాప్సీ వంటి పరీక్షలంటే భయం ఉన్నవారికి ఇదొక గొప్ప ప్రత్యామ్నాయం. ఈ పరీక్షలో ఫలితాల ఖచ్చితత్వం 95 శాతం నుండి 98 శాతం వరకు ఉన్నట్లు తెలుస్తోంది.ఇదే విషయంపై బుర్జీల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సీఈఓ డాక్టర్ హుమైద్ అల్ షంసీ మాట్లాడుతూ.. మేము నిర్వహించిన సర్వేలో దాదాపు 60 శాతం మంది ప్రజలు ముందస్తు క్యాన్సర్ పరీక్షలకు భయపడుతున్నారని తేలింది. కొలనోస్కోపీ, బయాప్సీ వంటి పరీక్షలపై ఉన్న భయం వల్ల చాలామంది వ్యాధి ముదిరే వరకు డాక్టర్ దగ్గరకు రావడం లేదు. ఆ అడ్డంకిని తొలగించేందుకు 'ట్రూచెక్ ఇంటెల్లి' పరీక్షను తీసుకొచ్చాము. ఒక చిన్న రక్త పరీక్షతో ఏ రకమైన క్యాన్సర్‌నైనా గుర్తించవచ్చు. దీంతో ప్రాథమిక దశలోనే చికిత్స ప్రారంభించే అవకాశం ఉంటుంది"అని చెప్పుకొచ్చారు. -
అబుదాబిలో ‘హౌస్ ఆఫ్ ఇండియా’
భారత్-యూఏఈ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. భారతీయ సంస్కృతి, చరిత్రను చాటిచెప్పేలా అబుదాబిలో ‘హౌస్ ఆఫ్ ఇండియా’ ఏర్పాటుకు యూఏఈ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారత పర్యటనలో భాగంగా తీసుకున్న అత్యంత కీలకమైన నిర్ణయాలలో ఇదొకటి. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన 'లూవ్రే అబుదాబీ'వంటి మ్యూజియం ఉన్న సాదియాత్ కల్చరల్ డిస్ట్రిక్ట్ లోనే ఈ 'హౌస్ ఆఫ్ ఇండియా'ను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం విశేషం. ఇందులో యోగా,ఆయుర్వేదం వంటి భారతీయ పురాతన సంప్రదాయాలను డిజిటల్ గ్యాలరీల రూపంలో పర్యాటకులకు వివరించనున్నారు. అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు, భారతీయ పారిశ్రామికవేత్తలు, కళాకారులు, విద్యావేత్తలు సమావేశమయ్యేలా ఒక 'బిజినెస్ అండ్ కల్చరల్ హబ్'గా ఈ హౌస్ ఆఫ్ ఇండియా పనిచేయనుంది.ఇప్పటికే అబుదాబిలో బీఏపీఎస్ హిందూ దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయం ప్రధాని నరేంద్ర చేతుల మీదగా ప్రారంభమైంది. కాగా యూఏఈ అధ్యక్షుడు కేవలం రెండు గంటల పర్యటన కోసం భారత్‌కు సోమవారం(జనవరి 19) వచ్చిన సంగతి తెలిసిందే. -
యూఏఈలో అనుమతి లేకుండా ఫోటోలు తీశాడు.. కట్ చేస్తే భారీ జరిమానా
గల్ఫ్ దేశాల్లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయనే విషయం అందరికి తెలిసిందే. చిన్నచిన్న తప్పులకు కూడా పెద్ద శిక్షలు ఉంటాయి. తాజాగా యూఏఈలోని అబుదాబి ఫ్యామిలీ, సివిల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కోర్టు ఇచ్చిన తీర్పు అందరిని షాక్‌కు గురిచేసింది. ఓ వ్యక్తి ప్రైవసీకి భంగం కలిగించినందుకు కోర్టు ఏకంగా 25,000 దిర్హామ్‌లు (సుమారు రూ. 5.6 లక్షలు) జరిమానా విధించింది.ఏమి జరిగిందంటే?ఓ వ్యక్తి బహిరంగ ప్రదేశంలో తనకు సంబంధించిన ఆర్ధిక లావాదేవీల్లో బీజీగా ఉండగా.. మరొకరు అతడికి తెలియకుండా ఫోటోలు, వీడియోలు తీశారు. అంతటితో ఆగకుండా వాటిని తన స్నాప్‌చాట్ అకౌంట్లో పోస్ట్ చేశారు. దీంతో సదరు వ్యక్తి తనకు ప్రైవసీకి భంగం కలిగించరాని, మనస్తాపానికి గురయ్యానని కోర్టును ఆశ్రయించాడు. కేసును విచారించిన అబుదాబి ఫ్యామిలీ, సివిల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కోర్టు నిందితుడికి 25,000 దిర్హామ్‌లు ఫైన్ విధించింది. అదేవిధంగా నిందితుడి స్నాప్‌చాట్ అకౌంట్‌ను వెంటనే రద్దు చేయాలని, ఆరు నెలల పాటు ఇంటర్నెట్ ఉపయోగించకూడదని కోర్టు ఆదేశించింది. కాగా యూఏఈ సైబర్ సెక్యూరిటీ చట్టాల ప్రకారం.. ఒక వ్యక్తి అనుమతి లేకుండా వారి ఫోటోలు తీయడం, వీడియోలు రికార్డ్ చేయడం లేదా వాటిని ప్రచారం చేయడం వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించినట్లు' గా పరిగణిస్తారు. -
యూఏఈతో.. తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం
సాక్షి హైదరాబాద్: యుఏఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీని ప్రపంచంలోనే మేటి నగరంగా నిర్మించడానికి యూఏఈ సహాకారం అందించనుంది. ఈ మేరకు దావోస్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూఏఈ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రితో భేటీ అయి ఒప్పందం చేసుకున్నారు. ఈ ప్రాజెక్టును వేగవంతంగా నిర్మించేందుకు ఇరువైపులా జాయింట్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయనున్నారు.కాగా హైదరాబాద్ నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న కందుకూరు మండలంలోని ముచ్చర్ల, మీర్ఖాన్పేట గ్రామాల మధ్య సుమారు 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరగబోతుంది. దీనిలో 11 టౌన్‌షిప్‌లను నిర్మించనున్నారు. -
ఉద్యోగులకు రూ.37 కోట్లు.. ఓ సీఈవో మంచి మనసు
అబుదాబి: రోగుల సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న ఫ్రంట్‌లైన్ హెల్త్‌కేర్ వర్కర్లకు 15 మిలియన్ దిర్హామ్స్ (సుమారు రూ.37 కోట్లు) ఆర్థిక సహాయం అందించనున్నట్లు మిడిల్ ఈస్ట్‌లోని ప్రముఖ హెల్త్‌కేర్ ప్రొవైడర్ బుర్జీల్ హోల్డింగ్స్ ప్రకటించింది. బుర్జీల్ హోల్డింగ్స్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్, సీఈవో డాక్టర్ షంషీర్ వయాలిల్ అబుదాబిలోని ఎతిహాద్ అరేనాలో నిర్వహించిన గ్రూప్ వార్షిక టౌన్‌హాల్ సమావేశంలో ఈ కీలక ప్రకటన చేశారు.ఈ కార్యక్రమంలో 8,500 మందికి పైగా ఉద్యోగులు పాల్గొన్నారు. బుర్జీల్ హోల్డింగ్స్ ‘బుర్జీల్ 2.0’ పేరుతో వృద్ధి తదుపరి దశలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా, ఈ ఆర్థిక ప్రోత్సాహకాన్ని ‘బుర్జీల్ ప్రైడ్’ ఇనిషియేటివ్‌లో భాగంగా ప్రకటించారు. గ్రూప్‌కు చెందిన నర్సింగ్, పేషెంట్ కేర్, ఆపరేషన్స్, అనుబంధ సేవల విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 10,000 మంది ఫ్రంట్‌లైన్ హెల్త్‌కేర్ వర్కర్లు ఈ ప్రయోజనాన్ని పొందనున్నారు. అర్హత కలిగిన ఉద్యోగులకు వారి సర్వీస్ కాలాన్ని బట్టి ఒక నెల లేదా అర నెల ప్రాథమిక వేతనానికి సమానమైన మొత్తాన్ని అందించనున్నారు.డాక్టర్ షంషీర్ ప్రసంగం ఇంకా కొనసాగుతుండగానే ఉద్యోగుల మొబైల్ ఫోన్లకు వచ్చిన అనూహ్య ఎస్ఎంఎస్ ద్వారా ఈ ఆర్థిక సాయం విషయం వెల్లడైంది. ఈ ప్రకటనకు ఉద్యోగుల నుంచి భారీ చప్పట్లు, భావోద్వేగ స్పందనలు వెల్లువెత్తాయి. ఈ మొత్తం త్వరలోనే వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని సంస్థ వర్గాలు తెలిపాయి.“ఇది ఎలాంటి షరతులు లేకుండా అందించే గుర్తింపు. ఆరోగ్య సేవలకు వెన్నెముకగా నిలిచే ఫ్రంట్‌లైన్ బృందాల సమిష్టి కృషికి ఇది మా కృతజ్ఞత. వారు ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లోనూ రోగులతో నేరుగా పనిచేస్తూ, రియల్‌టైమ్‌లో సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఈ సహాయం వారి పట్ల మా నమ్మకం, గౌరవానికి నిదర్శనం” అని డాక్టర్ షంషీర్ తెలిపారు.బుర్జీల్ హోల్డింగ్స్ ఎదుగుదలకు యూఏఈ ప్రభుత్వం అందిస్తున్న మద్దతు, ప్రోత్సాహం అమూల్యమని ఆయన పేర్కొన్నారు. దేశ నాయకత్వం చూపిన దిశే ఈ పురోగతికి పునాదిగా నిలిచిందని అన్నారు. ప్రస్తుతం యూఏఈలో అతిపెద్ద హెల్త్‌కేర్ ప్లాట్‌ఫార్మ్‌లలో ఒకటైన బుర్జీల్ హోల్డింగ్స్‌లో 14,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. -
యూఏఈ అధ్యక్షుడికి మోదీ స్వాగతం
యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ మెుహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారత పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు అరుదైన గౌరవం దక్కింది. యుఏఈ అధ్యక్షుడికి స్వాగతం పలకడానకి స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. యుఏఈ అధ్యక్షున్ని కౌగిలించుకొని సాదరంగా స్వాగతం పలికారు.ఈ వివరాలను ప్రధాని తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. "నా సోదరుడు షేక్ మెుహమ్మద్ బిన్ జాయెద్‌కు స్వాగతం పలకడానికి ఎయిర్‌పోర్టుకు వెళ్లాను. ఆయన పర్యటన భారత్‌కు ఆయన ఇస్తున్న ప్రాముఖ్యతకు నిదర్శనం. యూఏఈ అధ్యక్షునితో చర్చల కోసం ఎదురుచూస్తున్నాను" అని ప్రధాని మోదీ రాసుకొచ్చారు.ఇరువురు దేశాధినేతలు వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, రక్షణ, అంతరిక్షం, సాంకేతికత, ఆహర భద్రత, తదితర అంశాలలో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. -
యూఏఈ అధ్యక్షుడి భారత్ పర్యటన నేడే
అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ జనవరి 19న భారత్‌లో అధికారిక పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన భారత ప్రధాని నరేంద్ర మోదీతో కీలక ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.ఈ భేటీలో వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, రక్షణ, అంతరిక్షం, సాంకేతికత, ఆహార భద్రత, అలాగే ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా ఇరు నేతలు అభిప్రాయాలు పంచుకోనున్నట్లు తెలుస్తోంది.భారత్–యూఏఈ మధ్య ఇప్పటికే బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలకు మరింత ఊపునివ్వనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారం, పరస్పర పెట్టుబడులు, వాణిజ్య మార్పిడిలో గణనీయమైన వృద్ధి చోటుచేసుకుంటోంది.గత 10 సంవత్సరాల కాలంలో భారతదేశానికి ఇది షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఐదో అధికారిక పర్యటన కాగా, అధ్యక్ష పదవిని స్వీకరించిన తర్వాత మూడోసారి భారత్‌కు రానున్నారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య ఉన్న దీర్ఘకాలిక స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేయనుంది. -
ఇతర దేశాలకూ ముప్పు తప్పదా..?
దీర్ఘకాలంగా మిత్రదేశాలుగా ఉన్న సౌదీ అరేబియా... యూఏఈల మధ్య ఘర్షణలు చెలరేగడంతో మధ్య ప్రాచ్య దేశాల్లో అలజడి చెలరేగింది. అంతగా స్నేహంగా ఉన్న దేశాల మధ్య ఒక్కసారిగా విబేధాలు రావడానికి యెమన్ దేశమే కారణమైంది. 9 ఏళ్లుగా యెమన్‌లో యుఏఈ మద్దతు ఇస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్న సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ అనే వేర్పాటువాద గ్రూప్. ఆ గ్రూప్‌ను యెమన్ దేశంతో పాటు... సౌదీ అరేబియా వ్యతిరేకిస్తోంది. కానీ... యూఏఈ మాత్రం ఆ గ్రూప్‌ను సమర్థిస్తోందన్న అనుమానాలు బలంగా ఉన్నాయి. సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ పేరిట పుట్టిన వేర్పాటు వాద గ్రూప్... అంతర్గత కలహాలు సృష్టిస్తూ యెమెన్‌లోని ప్రధాన దక్షిణ వేర్పాటువాదం కోసం పోరాడుతోంది. ముఖ్యంగా యెమెన్ దక్షిణ ప్రాంతానికి స్వతంత్రత సాధించాలనే లక్ష్యంతో పని చేస్తున్న ఈ గ్రూప్ 2017లో పుట్టింది.వేర్పాటు వాదులకు మద్దతు ఇస్తోందన్న అనుమానంతో సౌదీకి కోపం వచ్చింది. దీంతో సౌదీ బలగాలు నేరుగా డిసెంబర్ ౩౦న యెమెన్‌లోని ముకల్లా పోర్ట్ నగరంపై దాడి చేయగా... యుఏఈ దీనిని తీవ్రంగా ఖండించింది. అంతే కాకుండా అక్కడ ఉన్న యూఏఈ సైన్యాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. యెమన్‌పై జరిగిన దాడితో పాత మిత్రుల మధ్య పుట్టుకొచ్చిన వ్యతిరేకతను దూరం చేయడానికి గల్ఫ్ దేశాలు సమాలోచనలు చేస్తున్నాయి. మరోవైపు దాడి జరగ్గానే యెమన్‌లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. యెమన్లోని వేర్పాటు వాదులకు యూఏఈ నుంచి ఆయుధాలు అందుతన్నాయన్న ఆగ్రహం వ్యక్తం చేస్తూ... యెమెన్‌లోని ముకల్లా పోర్ట్‌పై సౌదీ సైన్యం వైమానిక దాడులు జరిపింది. దాడిని యూఏఈ ఖండిస్తూ... సౌదీ ఆరోపణలు నిరాధారమైనవని.. అసలు వారి వద్ద ఆయుధాలే లేవని యూఏఈ స్పష్టం చేసింది. అనాలోచిత దాడి అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ యెమన్‌లో ఉన్న యూఏఈ సైన్యాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఇది ఊహించని పరిణామమని గల్ఫ్ దేశాలు చెబుతున్నాయి. అయితే అక్కడ చెలరేగిన యూఏఈ- సౌదీ మధ్య విబేధాలు ఇటు మన దేశంపై కూడా ప్రభావం చూపే అవకాశముంది. ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఆర్థిక భద్రత, భారత్‌కు అందే ఇంధన సరఫరా, ప్రవాస భారతీయుల సంక్షేమాలపై ప్రభావం చూపే అవకాశముంది. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ గురించి ఇతర దేశాల్లో అలజడి ప్రారంభమైంది. యెమన్‌లో మళ్లీ సౌదీ ప్రభుత్వం సైనిక చర్యలకు పాల్పడే అవకాశం లేకపోలేదని... దీంతో గల్ఫ్ దేశాల్లో ప్రధానమైన సౌదీ అరేబియా- యూఏఈల మధ్య ఘర్షణ ముదిరితే.. యెమన్, యూఏఈతో పాటు ఇతర దేశాలకూ ముప్పు తప్పదనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. గల్ఫ్‌లో ఉద్రిక్తతలు పెరిగితే వాటి ప్రభావం నేరుగా చమురు ధరలపై పడుతుంది. భారత్ లో ప్రవాస భారతీయుల భద్రత, భారత్‌కు ఇంధన సరఫరా, వాణిజ్య సంబంధాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని మన ప్రభుత్వం ఆలోచిస్తోంది. -మహమ్మద్ అబ్దుల్ ఖదీర్ -
యెమెన్ ఎఫెక్ట్.. యూఏఈకి సౌదీ హెచ్చరిక..
దుబాయ్: సౌదీ అరేబియా, యెమెన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. యెమెన్‌లోని తీర ప్రాంత నగరం ముకల్లాపై మంగళవారం సౌదీ అరేబియా బాంబుల వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో యెమెన్‌కు మద్దతుగా నిలుస్తున్న యూఏఈకి సౌదీ హెచ్చరికలు జారీ చేసింది. 24 గంట్లలో యెమెన్ నుంచి దళాలను ఉపసంహరించుకోవాలని సౌదీ వార్నింగ్ ఇచ్చింది.ఇక, అంతకుముందు.. యెమెన్‌లోని వేర్పాటువాదుల కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) పంపిన ఆయుధ నౌకలపై దాడి చేసినట్లు సౌదీ తెలిపింది. యూఏఈ చర్యలు అత్యంత ప్రమాదకరమైనవంటూ వ్యాఖ్యానించింది. యూఏఈ మద్దతు కలిగిన సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్‌కు చెందిన వేర్పాటువాదులు ఇటీవలి కాలంలో యెమెన్‌లో పలు ప్రాంతాలను ఆక్రమించుకుంటున్నారు. దీనిపై సౌదీ, దాని మిత్ర దేశాలు గుర్రుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సౌదీ అరేబియా దాడికి దిగింది.Saudi Arabia bombs a UAE convoy in Yemen meant to establish a Zionist friendly state called 'South Arabia'. Saudi has issued a warning to the UAE to remove it's presence in Yemen within 24 hours. pic.twitter.com/QelYcZkC69— Israel Exposed (@xIsraelExposedx) December 30, 2025యూఏఈ తీర నగరం పుజైరాహ్ నుంచి ఆయుధాలతో ముకల్లాకు వచ్చిన రెండు నౌకల నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలను, మిలటరీ వాహనాలను కిందికి దించుతున్న సమయంలోనే మిత్ర కూటమి విమానాలు బాంబులతో దాడి జరిపాయని సౌదీ తెలిపింది. అదే సమయంలో, 24 గంటల్లోగా యెమెన్ నుంచి బలగాలను ఉపసంహరించుకోవాలని యూఏఈకి తీవ్ర హెచ్చరికలు చేసింది. ఈ పరిణామంపై యూఏఈ స్పందించింది. సహనం, వివేకంతో వ్యవహరించాలంటూ సౌదీకి హితవు పలికింది. యెమెన్ నుంచి బలగాలను వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్‌పై మాత్రం ఆ దేశం స్పందించలేదు. యెమెన్‌లోని తమ బలగాలకు అవసరమైన వాహనాలను మాత్రమే ఆ నౌకల్లో పంపామని, ఆయుధాలు లేవని యూఏఈ అంటోంది.సౌదీ ఆగ్రహం.. కాగా, యెమెన్‌లో వేర్పాటు వాదులు ఇటీవల సాధించిన పైచేయికి యూఏఈ కారణమని సౌదీ స్పష్టంచేసింది. దక్షిణ యెమెన్‌కు ప్రత్యేక దేశ స్థాయి కల్పించేందుకు పోరాటం సాగిస్తున్న సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్(ఎస్టీసీ)కు యూఏఈ మద్దతు తెలుపుతోంది. వేర్పాటు వాద సంస్థ ఎస్టీసీని సౌదీ అరేబియా వ్యతిరేకిస్తోంది. ఆ సంస్థకు మద్దతుగా యూఏఈ తీసుకుంటున్న చర్యలు అత్యంత ప్రమాదకరమైనవని సౌదీ పేర్కొంది. సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్‌కు మద్దతుగా యూఏఈ నౌకలు ఆయుధాలు చేరవేశాయని ప్రకటన వివరించింది. తాజా పరిణామాలు సౌదీ అరేబియాకు, యూఏఈకీ మధ్య ఉద్రిక్తతల్ని పెంచేలా ఉన్నాయి. పశ్చిమాసియాకు సంబంధించిన అనేక ఇతర విషయాలపై కలసికట్టుగా పనిచేస్తున్న ఈ రెండు దేశాల మధ్య ఆర్థిక, రాజకీయ విషయాల్లో విభేదాలు ఉన్నాయి.రంగంలోకి అమెరికా..ఇదిలా ఉండగా.. సౌదీ, యెమెన్ వ్యవహారంపై అమెరికా ఫోకస్ పెట్టింది. తాజాగా యెమెన్ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో అమెరికా విదేశాంగమంత్రి మార్కో రూబియో మాట్లాడినట్టు తెలిపారు. యెమెన్ పరిస్థితి, మధ్య ప్రాచ్య భద్రత, స్థిరత్వాన్ని ప్రభావితం చేసే విస్తృత సమస్యల గురించి ఇద్దరూ చర్చించారని సమాచారం. -
మానసిక అస్వస్థతతో అబుదాబిలో తెలంగాణా కార్మికుడు, ప్రజావాణిలో వినతి
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పెరుమాల్ల గ్రామానికి చెందిన గిరిజన కార్మికుడు మాలోత్ శ్రీరాం యూఏఈ రాజధాని అబుదాబి ముసఫ్ఫా ప్రాంతంలో ఆశ్రయం, ఆహారం లేక రోడ్లపై భిక్షాటన చేస్తూ కాలం గడుపుతున్నాడు. గ్రామంలో చెడు అలవాట్లకు బానిసై దాన్నుంచి బయటపడాలని గల్ఫ్ దేశానికి వెళ్లి అక్కడ దుర్భర జీవితాన్ని వెళ్ల దీస్తున్నాడు.నవంబర్ 11న క్లీనర్ వీసాపై అబుదాబికి వెళ్లిన శ్రీరాం, రెండు రోజులకే మతిస్థిమితం కోల్పోయి లేబర్ క్యాంప్ నుంచి అదృశ్యమయ్యాడు. నెల రోజుల అనంతరం అతడిని గుర్తించి క్యాంప్‌కు తీసుకువచ్చినా, కంపెనీ మానవత్వం మరిచి లోపలికి అనుమతించకుండా బయటకు తోసివేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ అమానుష వైఖరి కారణంగా అతడు మళ్లీ రోడ్ల పాలయ్యాడు.ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే, కంపెనీ అతడిపై ‘అబ్స్కాండింగ్’ కేసు నమోదు చేసి, స్వదేశానికి పంపాలంటే 4,500 దిర్హముల (సుమారు రూ.1.10 లక్షలు) జరిమానా చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. దీంతో ఆందోళన చెందిన బాధితుడి భార్య సునీత మంగళవారం (23.12.2025) హైదరాబాద్‌లోని ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’లో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పేరిట వినతిపత్రం సమర్పించారు. ఈ వినతి ప్రతులను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె. మదన్ మోహన్ రావు, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, తెలంగాణ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి లకు అందజేశారు.మంద భీంరెడ్డి వెంట రాగా, బాధితుడి భార్య సునీత 'సీఎం ప్రజావాణి' ఇంచార్జి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా. జి. చిన్నారెడ్డిని కలిసి తన ఆవేదనను వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన చిన్నారెడ్డి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ముఖ్య కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి వి. శేషాద్రికి లేఖ రాశారు.ఇదిలా ఉండగా, శ్రీరాంను స్వదేశానికి పంపించే ప్రయత్నాల్లో అబుదాబి తెలంగాణ సామాజిక సేవకురాలు, వేములవాడకు చెందిన ప్రియా సింగిరెడ్డి కంపెనీ యాజమాన్యం, భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేస్తున్నారు.“నా భర్తను తక్షణం స్వదేశానికి తీసుకువచ్చి, కుటుంబ సభ్యుల సమక్షంలో మానసిక వైద్యం, పునరావాసం కల్పించండి. అత్యంత పేద గిరిజన కుటుంబం. ఈ ఖర్చులు భరించే స్థితిలో లేము” అంటూ సునీత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు, అబుదాబి లోని భారత రాయబార కార్యాలయంకు లేఖ రాశారు. -
యూఏఈలో విమానయాన రంగం కొత్త పుంతలు
అబుదాబి: యూఏఈలో విమానయాన రంగం కొత్త పుంతలు తొక్కనుంది. వచ్చే ఏడాది నాటికి దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్స్ అందుబాటులోకి రానున్నాయి. తద్వారా 1.28 లక్షల కోట్ల దిర్హమ్ల పెట్టుబడులు ఆకర్షించగలుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దుబాయ్ వరల్డ్ సెంట్రల్ నుండి షార్జా, రాస్ అల్ ఖైమా వరకు మరిన్ని రన్వేలు, టెర్మినల్స్, స్మార్ట్ మౌలిక సదుపాయాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.షార్జా:2028 నాటికి షార్జా విమానాశ్రయం విస్తరణ పూర్తవుతుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.రాస్ అల్ ఖైమా:2031 నాటికి కొత్త టెర్మినల్ ప్రారంభం కానుంది. 11 కోట్ల ప్రయాణికుల సామర్థ్యంతో ఇది మధ్యప్రాచ్యంలో కీలక కేంద్రంగా మారనుంది.2043 నాటికి యూఏఈ మొత్తం 53 కోట్ల ప్రయాణికులను ఆతిథ్యం ఇవ్వగల సామర్థ్యాన్ని సాధించాలన్నది ప్రధాన లక్ష్యం. ఈ విస్తరణ ప్రాజెక్టులు గల్ఫ్ ప్రాంతాన్ని ప్రపంచ విమానయాన రంగంలో అగ్రస్థానంలో నిలబెట్టనున్నాయని అంచనా. విమానాశ్రయాల విస్తరణతో పర్యాటక రంగం, వాణిజ్యం, ఉద్యోగావకాశాలు విస్తృతంగా పెరగనున్నాయి. ఏఐ ఆధారిత సిస్టమ్స్, సస్టైనబుల్ ఎనర్జీ వినియోగం ఈ ప్రాజెక్టుల ప్రత్యేకత. దోహా, ఒమాన్, బహ్రెయిన్ వంటి దేశాలతో యూఏఈ పోటీ పడనుంది. తద్వారా యూఏఈ విమానాశ్రయ విస్తరణ ప్రాజెక్టులు కేవలం గగనతల ప్రయాణాన్ని సులభతరం చేయడమే కాకుండా, మధ్యప్రాచ్యాన్ని ప్రపంచ విమానయాన రంగంలో కీలక కేంద్రంగా నిలబెట్టే దిశగా అడుగులు వేస్తున్నాయి. -
పాక్ పరువు తీస్తున్న అరబ్ కంట్రీస్
అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ ఇమేజ్ మరోసారి దెబ్బ తింది. ఆ దేశ పౌరులను అరబ్ దేశాలు బలవంతంగా వెనక్కి పంపించేస్తున్నాయి. పైగా వాళ్ల మీద బిచ్చగాళ్లు.. నేరగాళ్లు అనే ముద్ర వేయడం ఆసక్తికర చర్చకు దారి తీసింది ఇప్పుడు.. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌కు కొత్త తలనొప్పి వచ్చి పడుతోంది. వలస వెళ్లిన తమ పౌరులను ఆ దేశాలు వెనక్కి పంపించేస్తున్నాయి. పాక్ పౌరుల వల్ల తమ దేశాల్లో నేరాలు పెరుగుతున్నాయని.. పైగా భిక్షాటనతో తమ దేశ పర్యాటక రంగాన్ని దెబ్బ తీస్తున్నారని ఆయా దేశాలు భావిస్తున్నాయి. దీంతో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ల నుంచి పెద్ద సంఖ్యలో పాక్ పౌరులను వెనక్కి పంపించేస్తున్నారు. యూరప్-ఆసియా సరిహద్దులోని.. కాకేసస్ దేశం అజర్ బైజాన్ కూడా ఇలాంటి చర్యలే చేపట్టింది. ఇందులో సౌదీ అరేబియా నుంచి వచ్చిన 24,000 మంది ఉన్నారు. దుబాయ్ నుంచి 6,000 మంది, అజర్బైజాన్ నుంచి వచ్చిన 2,500 మందిని పాక్‌కు తిప్పి పంపించారు. ఆర్గనైజ్డ్ బెగ్గింగ్ మాఫియాలో భాగంగా ఆయా దేశాలకు వెళ్లినట్లు నిర్ధారణ అయ్యింది. అయితే వీళ్ల వల్ల విద్య, ఉద్యోగాల నిమిత్తం ఆయా దేశాలకు వెళ్లిన వాళ్లను కూడా వెనక్కి పంపుతున్నారని పాక్ ఆవేదన వ్యక్తం చేస్తోంది.హెచ్చరించినా కూడా.. 2024లో సౌదీ అరేబియా పాక్‌కు ఓ ప్రకటన జారీ చేసింది. ఉమ్రా వీసాలను భిక్షాటన కోసం దుర్వినియోగం చేయొద్దని తమ పౌరులకు గట్టిగా చెప్పాలని పాకిస్తాన్‌ను హెచ్చరించింది. నియంత్రించకపోతే హజ్, ఉమ్రా యాత్రికులపై ప్రతికూల ప్రభావం ఉంటుందని తెలిపింది. అయినా కూడా ఆ వ్యవహారం కొనసాగుతూ వస్తోంది. ఇక యూఏఈ ఏమో అదనంగా ఇంకో వాదనను తెరపైకి తెచ్చింది. తమ దేశంలో జరుగుతున్న నేరాల్లో పాక్ పౌరుల వాటా కూడా ఉంటోందని.. వివిధ ఉద్దేశాలతో వచ్చి చాలామంది నేరాలకు పాలపడుతున్నారని యూఏఈ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో కిందటి ఏడాది ఆ పాక్ పౌరులపై వీసా పరిమితులు విధించింది. అరబ్ దేశాలు మాత్రమే కాదు.. ఆఫ్రికా, యూరప్ ఖండాల్లోని పలు దేశాల్లో.. ఆసియాలో కాంబోడియా, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో కూడా పాక్ పౌరులు బిచ్చగాళ్లుగా అక్కడి ప్రభుత్వాలకు తలనొప్పులుగా మారుతున్నారు. ఈ క్రమంలో ఆర్గనైజ్డ్ భిక్షాటన గ్యాంగ్‌లను అడ్డుకోవడం, అక్రమ వలసలను నిరోధించడం కోసం వాళ్లను వెనక్కి పంపించేస్తున్నాయని ఆయా దేశాలు. అయితే.. పశ్చిమాసియాలో పట్టుబడ్డ ముఠాల్లో 90 శాతం బిచ్చగాళ్లు పాక్‌కు చెందిన వాళ్లే ఉన్నారని ఆ దేశ విదేశాంగ అధికారి జీషాన్ ఖంజాదా చెబుతుండడం గమనార్హం. వేల మంది ముఠాగా..ఈ ఏడాదిలో ఇప్పటిదాకా పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(FIA) విమానాశ్రయాల్లో 66,154 మందిని విదేశాలకు వెళ్లకుండా ఆపగలిగింది. మక్కా, మదీనా పవిత్ర స్థలాల వద్ద కూడా పాకిస్తానీ భిక్షాటనకారులు యాత్రికులను వేధిస్తున్నారని పాక్‌కు చెందిన డాన్ పత్రిక ఈ మధ్యే ఓ కథనం ప్రచురించడం గమనార్హం. ఈ పరిణామాలపై ఎఫ్ఐఏ డీజీ స్పందిస్తూ.. ఈ నెట్‌వర్క్‌ల వల్ల పాక్ పరువు పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సైన్యం సాయంతో ఇలాంటి ముఠాలను అడ్డుకోవాలని షెహబాజ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలితం ఇవ్వడం లేదు. -
బ్యాంకింగ్ లావాదేవీల్లో ఇకపై OTP అవసరం లేదు..!
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (UAE) బ్యాంకింగ్ లావాదేవీలు ఇకపై మరింత సురక్షితం కానున్నాయి. SMS ద్వారా వచ్చే వన్ టైమ్ పాస్వర్డ్ (OTP) విధానాన్ని దశలవారీగా రద్దు చేసి, బ్యాంక్ మొబైల్ యాప్‌లోనే నేరుగా అనుమతి ఇచ్చే స్మార్ట్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టారు. ఈ కొత్త స్మార్ట్ సెక్యూరిటీ సిస్టమ్‌లో ఆన్లైన్ కొనుగోళ్ల సమయంలో OTP బదులు బ్యాంక్ యాప్‌లో పుష్ నోటిఫికేషన్ వస్తుంది.వినియోగదారులు యాప్‌లో లాగిన్ చేసి బయోమెట్రిక్ లేదా స్మార్ట్ పాస్ పిన్ ద్వారా లావాదేవీకి అనుమతి ఇవ్వాలి. యాప్‌లోనే వెరిఫికేషన్ జరుగుతుండటంతో ఫిషింగ్, సిమ్ స్వాప్ వంటి మోసాలు నివారించబడతాయి. ఎమిరేట్స్ NBD సహా ప్రముఖ బ్యాంకులు ఇప్పటికే ఈ మార్పు ప్రారంభించాయి. కొత్త స్మార్ట్ సెక్యూరిటీ సిస్టమ్ ఎలా పని చేస్తుందంటే..?కార్డ్ వివరాలు ఇచ్చిన వెంటనే యాప్‌లో లాగిన్ చేయమని సందేశం వస్తుంది. యాక్టివిటీస్ విభాగంలో లావాదేవీ వివరాలు చూసి, రెండు నిమిషాల్లో అనుమతి ఇవ్వాలి. స్మార్ట్ పాస్ పిన్ నమోదు చేసిన వెంటనే లావాదేవీ పూర్తవుతుంది. దశలవారీగా అమలు ప్రస్తుతం కొన్ని లావాదేవీలకు మాత్రమే ఈ సిస్టమ్ అమల్లో ఉంది. 2026 మార్చి నాటికి SMS, ఈమెయిల్ OTP విధానాలు పూర్తిగా రద్దవుతాయి. అప్పటి వరకు పాత విధానం మరియు కొత్త విధానం రెండూ కలిపి కొనసాగుతాయి. కొత్త స్మార్ట్ సెక్యూరిటీ సిస్టమ్‌తో యుఏఈలో డిజిటల్ బ్యాంకింగ్ మరింత వేగవంతం, సురక్షితం కానుంది. -
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 14 సిక్సర్లు, 9 ఫోర్లతో
అండర్-19 ఆసియాకప్ 2025ను టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఘనంగా ఆరంభించాడు. ఈ టోర్నీలో భాగంగా దుబాయ్ వేదికగా యూఏఈతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో సూర్యవంశీ భారీ సెంచరీతో చెలరేగాడు. ఆతిథ్య జట్టు బౌలర్లకు వైభవ్ చుక్కలు చూపించాడు.తొలుత కాస్త ఆచితూచి ఆడిన సూర్యవంశీ.. క్రీజులో సెటిల్ అయ్యాక ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తనదైన స్టైల్లో బౌండరీల వర్షం కురిపించాడు. అతడిని ఆపడం ప్రత్యర్ధి బౌలర్ల తరం కాలేదు. ఈ క్రమంలో కేవలం 56 బంతుల్లోనే తన రెండో యూత్ వన్డే సెంచరీ మార్క్‌ను వైభవ్ అందుకున్నాడు.సెంచరీ పూర్తి అయిన తర్వాత కూడా తన జోరును కొనసాగించాడు. అతడి దూకుడు చూస్తే సునాయసంగా డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకుంటాడని అంతాభావించారు. స్పిన్నర్ ఉద్దీష్ సూరి బౌలింగ్‌లో అనవసరంగా రివర్స్ స్కూపు షాట్‌కు ప్రయత్నించి క్లీన్ బౌల్డయ్యాడు. ఓవరాల్‌గా 95 బంతులు ఎదుర్కొన్న వైభవ్.. 14 సిక్సర్లు, 9 ఫోర్లతో 171 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ ఏడాది అతడికి అన్ని ఫార్మాట్లలో కలిపి ఇది ఆరో సెంచరీ కావడం విశేషం.ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్ దిశగా భారత్ సాగుతోంది. 44 ఓవర్లు ముగిసే సరికి భారత యువ జట్టు 4 వికెట్లు కోల్పోయి 353 పరుగులు చేసింది. విధ్వంసంకర సెంచరీతో మెరిసిన వైభవ్.. ఆరోన్ జార్జ్ తో కలిసి 212 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కెప్టెన్ అయూష్ మాత్రే(4) సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యాడు.చదవండి: నాతో పాటు అతడి వల్లే ఈ ఓటమి: సూర్యకుమార్A century in no time...just 𝗩𝗮𝗶𝗯𝗵𝗮𝘃 𝗦𝗼𝗼𝗿𝘆𝗮𝘃𝗮𝗻𝘀𝗵𝗶 things! 💯 Watch #INDvUAE at the #DPWorldMensU19AsiaCup2025 LIVE NOW, on Sony Sports Network TV channels & Sony LIV!#SonySportsNetwork #SonyLIV pic.twitter.com/3N140FhcRV— Sony Sports Network (@SonySportsNetwk) December 12, 2025 -
భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి చోటు
అండర్-19 ఆసియా కప్ టోర్నమెంట్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) శుక్రవారం తమ జట్టును ప్రకటించింది. పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకు ఆయుశ్ మాత్రే (Ayush Mhatre)ను కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు తెలిపింది. ఇక ఈ జట్టులో చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)కి కూడా చోటు దక్కింది. కాగా డిసెంబరు 12 నుంచి 21 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా అండర్-19 ఆసియా కప్ టోర్నీ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. వన్డే ఫార్మాట్లో నిర్వహించే ఈ ఈవెంట్లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. డిసెంబరు 14న భారత్- పాక్ మ్యాచ్‌గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, క్వాలిఫయర్ 1 విజేత, క్వాలిఫయర్ 3 విజేత పోటీపడనుండగా... అదే విధంగా.. గ్రూప్-‘బి’ నుంచి బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గనిస్తాన్, క్వాలిఫయర్-2 విజేత రేసులో ఉన్నాయి.ఇక అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత్ డిసెంబరు 12న.. ఐసీసీ అకాడమీ వేదికగా క్వాలిఫయర్-1 విజేతతో తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. ఇదే వేదికపై డిసెంబరు 14న దాయాది పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది. అనంతరం డిసెంబరు 16న ది ‘సెవెన్స్’లో క్వాలిఫయర్-3 విజేతతో తలపడుతుంది.కాగా డిసెంబరు 19న ఐసీసీ అకాడమీ స్టేడియంలో తొలి సెమీ ఫైనల్ జరుగనుండగా.. డిసెంబరు 19న ది ‘సెవెన్స్’ వేదికగా రెండో సెమీస్ మ్యాచ్ జరుగుతుంది. డిసెంబరు 21న ఫైనల్‌తో ఈ టోర్నీకి తెరపడుతుంది. కాగా గ్రూప్-‘ఎ’, గ్రూప్- ‘బి’ గ్రూపుల నుంచి టాప్-2లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. సెమీ ఫైనల్ విజేతల మధ్య టైటిల్ పోరు జరుగుతుంది.సెమీస్‌లోనే ఇంటిబాటఇదిలా ఉంటే.. ఇటీవల ఆసియా క్రికెట్ మండలి టీ20 రైజింగ్ స్టార్స్ టోర్నీలో భారత్ సెమీస్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిన సంగతి తెలిసిందే. దీంతో జితేశ్ శర్మ సేన ఇంటిబాట పట్టగా.. మరో సెమీ ఫైనల్లో శ్రీలంకను ఓడించి పాక్ ఫైనల్ చేరింది. టైటిల్ పోరులో బంగ్లాదేశ్‌పై గెలుపొంది ట్రోఫీ అందుకుంది.అండర్-19 ఆసియా కప్ టోర్నమెంట్‌కు భారత జట్టు ఇదే:ఆయుశ్ మాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా (వైస్ కెప్టెన్), వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్), హర్వంశ్ సింగ్ (వికెట్ కీపర్), యువరాజ్ గోహిల్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ ఎ.పటేల్, నమన్ పుష్పక్, డి. దీపేశ్, హెనిల్ పటేల్, కిషన్ కుమార్ సింగ్ (ఫిట్నెస్ ఆధారంగా), ఉద్ధవ్ మోహన్, ఆరోన్ జార్జ్.స్టాండ్ బై ప్లేయర్లు: రాహుల్ కుమార్, హేముచుందేశన్ జె, బీకే కిషోర్, ఆదిత్య రావత్.చదవండి: WPL 2026: వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్లు వీరే -
నెలకు రూ.7.5 లక్షల జీతం.. మూడునెలల్లో వదిలేసాడు!
చాలామంది ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం చేయాలని కలలు కంటారు. అలాంటి అవకాశం వస్తే బాగుంటుందని ఎదురు చూస్తారు. కానీ నెలకు రూ.7.5 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని ఒక వ్యక్తి వదులుకుని.. బెంగళూరులోని గూగుల్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. దీనికి కారణం ఏమిటి?, ఇతరత్రా వివరాలను ఈ కథనంలో చూసేద్దాం.బెంగళూరులోని గూగుల్‌లో.. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న టెక్నీషియన్ 'అడ్వైన్ నెట్టో' యూఏఈలోని అబుదాబిలో అధిక జీతం వచ్చే ఉద్యోగాన్ని మూడు నెలల్లోనే వదులుకుని భారతదేశానికి ఎందుకు తిరిగి వచేసాడు. ఈ విషయాన్ని అతడు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పేర్కొన్నారు.అడ్వైన్ నెట్టో ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వెల్లడించిన సమాచారం ప్రకారం.. నెలకు రూ.7.5 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని ఆరు సంవత్సరాలకు ముందు వదిలిపెట్టేశాను అని పేర్కొన్నాడు. యూఏఈ వర్క్ వీసా రావడానికి దాదాపు ఐదు నెలలు పట్టింది. కానీ మూడు నెలల్లోనే ఉద్యోగన్ని వదిలేశాను. ఎక్కువ పనిగంటలు, ప్రతి రోజూ ఉదయం 9 గంటలకు పంచ్ వేయకపోతే.. సగం రోజు జీతం కట్ అవుతుంది.మౌలిక సదుపాయాలు, భౌతిక అభివృద్ధిలో యూఏఈ చాలా అద్భుతంగా ఉంది. కానీ డిజిటల్ రంగంలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఇంకా అభివృద్ధి చెందలేదు. ఇక్కడ డబ్బు సమస్య కాదు. అత్యున్నత పదవులు అర్హత కంటే.. జాతీయతపై ఆధారపడి ఉన్నాయని, దీనివల్ల నిజమైన నైపుణ్యం వృద్ధి చెందడం కష్టమైందని పేర్కొన్నారు.నేను యూఏఈలో నెలకు నెలకు 30000 AED సంపాదించడం చాలా పెద్దదిగా అనిపించవచ్చు. కానీ అక్కడ హాయిగా జీవించడానికి, సులభంగా 10000 AED ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే యూఏలో నెలకు 20000 AEDలను పొదుపుచేయగలిగాను. ఎంత సంపాదించిన అక్కడి పని వాతావరణం ఇబ్బందిగా అనిపించింది. ఇదీ చదవండి: ఎయిర్ పొల్యూషన్ ఎఫెక్ట్: అమల్లోకి కొత్త రూల్!నా పరిస్థితిని వెల్లడించినప్పుడు.. నువ్వు కంపెనీని మార్చి ఉండవచ్చు, దేశాన్ని (యూఏఈ) ఎందుకు వదిలి వెళ్లావని కొంతమంది స్నేహితులు అన్నారు. అలా కూడా ట్రై చేసాను. కొంతమంది సన్నిహితులను అడిగాను. వాళ్ల పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది. అంతే కాకుండా కొందరు వారానికి ఆరు రోజులు పనిచేస్తున్నట్లు చెప్పారు. కాబట్టే ఆ దేశంలో ఉద్యోగాన్ని వదిలేయాల్సి వచ్చిందని అడ్వైన్ నెట్టో పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Advin Roy Netto (@advinroynetto) -
ఆరోజే ఐపీఎల్ వేలం
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026 Auction)- 2026 సీజన్ వేలం వరుసగా మూడో ఏడాది విదేశీ గడ్డపైనే జరగనుంది. తాజా సీజన్ వేలం కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని అబుదాబి నగరాన్ని వేదికగా ఎంపిక చేశారు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఉన్నతాధికారి ఒకరు నిర్ధారించారు. కాగా 2023లో దుబాయ్, 2024లో జిద్దాలో ఐపీఎల్ లీగ్ వేలం నిర్వహించారు. అయితే, వేలంపాటకు సంబంధించిన తేదీ విషయంలో బీసీసీఐ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. డిసెంబర్ 15 లేదా 16 తేదీల్లో వేలం జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా పది ఫ్రాంఛైజీలు నవంబరు 15 నాటికి తాము అట్టిపెట్టుకునే, విడిచిపెట్టే ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేసుకోవాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ అత్యధికంగా ఐదేసి సార్లు ట్రోఫీ గెలవగా.. కోల్‌కతా నైట్ రైడర్స్ మూడు, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ ఒక్కోసారి చాంపియన్‌గా నిలిచాయి. ఇక 2009లో డక్కన్ చార్జర్స్ టైటిల్ గెలుచుకుంది. ఈ ఏడాది ఆర్సీబీ తొలిసారి ట్రోఫీని ముద్దాడగా.. పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌ల కల ఇంకా తీరలేదు.ఇదీ చదవండి: సరికొత్త చరిత్రజమ్మూ కశ్మీర్ జట్టు తమ రంజీ ట్రోఫీ చరిత్రలో ఘనతకెక్కే విజయాన్ని సాధించింది. గత 65 ఏళ్లుగా ఢిల్లీ చేతిలో ఇంటా బయటా ఓడిపోతూ వచ్చిన కశ్మీర్ ఇప్పుడు ఢిల్లీ గడ్డపై ఢిల్లీనే వణికించి గెలిచింది. గ్రూప్ ‘డి’లో జరిగిన ఈ మ్యాచ్‌లో జమ్మూ కశ్మీర్ జట్టు 7 వికెట్ల తేడాతో ఢిల్లీపై జయభేరి మోగించింది. ఇది గాలివాటం గెలుపు కానేకాదు. మ్యాచ్ మొదలైన మొదటి రోజు నుంచి ఢిల్లీ బ్యాటర్లను జమ్మూ బౌలర్లు ఆకిబ్ నబీ (5/35), వంశజ్ (2/57), ముస్తాక్ (2/50) సమష్టిగా దెబ్బకొట్టారు.తర్వాత బ్యాటింగ్‌లో కెప్టెన్ పారస్ డోగ్రా తొలి ఇన్నింగ్స్ శతకం, ఢిల్లీ రెండో ఇన్నింగ్స్‌ను వంశజ్ (6/68), సాహిల్ (3/73) ఇలా ప్రతి ఒక్కరు కశ్మీర్‌ను గెలిపించేందుకు ప్రతీ రోజు కష్టపడ్డారు. 1960 నుంచి ఇప్పటివరకు ఢిల్లీ, జమ్మూ కశీ్మర్ జట్లు 43 సార్లు తలపడితే ఇందులో 37 మ్యాచ్‌ల్లో ఢిల్లీదే గెలుపు. గత సీజన్ వరకు ఢిల్లీపై గెలుపన్నదే ఎరుగని కశీ్మర్ జట్టు ఎట్టకేలకు తాజా సీజన్లో అసాధారణ ప్రదర్శనతో ఘన విజయం సాధించింది. ఇక్బాల్ అజేయ శతకం మంగళవారం 179 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఓవర్‌నైట్ స్కోరు 55/2తో ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన కశ్మీర్ 43.3 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ కమ్రాన్ ఇక్బాల్ (147 బంతుల్లో 133 నాటౌట్; 20 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతను బాదుతున్న బౌండరీలు, భారీ సిక్స్‌లతో విరుచుకుపడుతున్న వైనం చూస్తే ఇది నాలుగు రోజుల ఫస్ట్‌క్లాస్ మ్యాచా లేదంటే వన్డేనా అన్న సందేహం కలుగకమానదు.ఒంటిచేత్తో గెలిపించడం అంటే ఇదేనేమో అనిపించేలా దంచేశాడు. అవుటైన ముగ్గురు శుభమ్ (8), వివ్రంత్ శర్మ (3), వంశజ్ (8)లు చేసిందేమీ లేదు. ఇక్బాల్‌తో పాటు అజేయంగా నిలిచిన సారథి పారస్ డోగ్రా (10 నాటౌట్) పెద్ద స్కోరేం కాదు. ఈ నలుగురి కంటే కూడా ఎక్స్‌ట్రాల (17) రెండో అత్యధిక స్కోరు కావడం గమనార్హం!.. ఎనిమిది జట్లున్న గ్రూప్ ‘డి’లో 7 పాయింట్లతో ఢిల్లీ ఆరో స్థానంలో ఉంది. సొంతగడ్డపై ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలవకపోగా (రెండు డ్రా)... ఇప్పుడు కశ్మీర్ చేతిలో చిత్తుగా ఓడటంతో ఢిల్లీ నాకౌట్ అవకాశాల్ని క్లిష్టం చేసుకుంది.చదవండి: ఆర్సీబీ వాళ్లిద్దరిని వదిలేస్తే చాలు!.. మిగతా అందరూ ఉండాల్సిందే! -
రూ. 240 కోట్ల విజేత: అమ్మానాన్నల కలలు తీరుస్తా...
యుఎఇ లాటరీలో తొలిసారిగా దిర్హామ్ 100 మిలియన్ (రూ. 240 కోట్లు) గెలుచుకున్న వ్యక్తిగా నిలిచిన తెలంగాణకు చెందిన 29 ఏళ్ల అనిల్‌కుమార్ బొల్లా తన అదృష్టాన్ని బాధ్యతాయుతంగా ఎలా ఉపయోగించుకోవాలో ప్రస్తుతం ఆలోచిస్తున్నాడు. ఖమ్మం జిల్లాలోని ఒక వ్యవసాయ కుటుంబానికి చెందిన అనిల్ ఐటీ రంగంలో పనిచేయడానికి దాదాపు ఒకటిన్నర సంవత్సరాల క్రితం అబుదాబికి వెళ్లాడు. ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌కు, తరువాత ఉద్యోగం కోసం అబుదాబికి వెళ్లే ముందు ప్రభుత్వ పాఠశాలలో ఎలా చదువుకున్నాడో గుర్తుచేసుకుంటూ’ఒక టికెట్ నా జీవితాన్ని మార్చివేసింది’ అని ఈ లాటరీ విజేత ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆనందంగా చెప్పాడు. తనకు విజయాన్ని అందించిన టికెట్ ప్రత్యేక అర్థాన్ని కలిగి ఉందని, ఎందుకంటే దానిలో తన తల్లి పుట్టిన తేదీని నంబర్ కాంబినేషన్లో చేర్చారని అన్నాడు. తన తల్లిదండ్రులు సోదరుడిని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)కి తరలించడం తన తొలిప్రాధాన్యత అని అనిల్ చెబుతున్నాడు.యుఎఇ లాటరీ లో దాదాపు ఒక సంవత్సరం గా పాల్గొంటున్న బొల్లా, గత అక్టోబర్ 18 డ్రా కోసం 12 టిక్కెట్లను కొనుగోలు చేశానని, వాటిలో ఒకటి తనను దిర్హామ్‌ల 100 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్‌ను పొందిన మొదటి వ్యక్తిగా నిలిపిందని చెప్పాడు. రాబోయే తన సంపదను ఎలా నిర్వహించాలనుకుంటున్నాడో చెబుతూ తెలివిగా పెట్టుబడి పెట్టడం గురించి ఆలోచిస్తున్నానన్నాడు. ‘ఈ మొత్తాన్ని నేను ఎలా పెట్టుబడి పెట్టాలి – దానిని సరైన మార్గంలో ఖర్చు చేయడం గురించి నేను ఆలోచిస్తున్నాను‘ అని అనిల్ అన్నాడు. ‘గెలిచిన తర్వాత, నా దగ్గర డబ్బు మాత్రమే ఉన్నట్టు నాకు అనిపించింది, కానీ ఇప్పుడు ఇక నా ఆలోచనలు సరైన మార్గంలో ఉండాలి. ఏదైనా భారీగా ప్లాన్ చేయాలనుకుంటున్నాను.‘ అన్నాడు.తనకు వ్యక్తిగత కలలు ఉన్నాయని, కానీ వాటిని కుటుంబ ప్రాధాన్యతలతో కలిపి సమతుల్యం చేసుకోవాలనుకుంటున్నానని ఆయన అన్నారు. ‘‘నాకు సూపర్ కారు కొనాలనే కల ఉంది.అలాగే గొప్ప రిసార్ట్‌లో లేదా సెవెన్ స్టార్ హోటల్లో నా సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నా. నా కుటుంబాన్ని ఇక్కడకు తీసుకువచ్చి వారితో కలిసి నా జీవితాంతం ఆనందించాలనుకుంటున్నాను. మా అమ్మా నాన్నవి చాలా చాలా చిన్న కలలు , నేను వారి కలలన్నింటినీ నెరవేర్చి వారిని జాగ్రత్తగా చూసుకోవాలని అనుకుంటున్నాను’’ అని వివరించాడు. అంతేకాకుండా బహుమతిలో కొంత భాగాన్ని ఛారిటీకి ఇవ్వాలనే ప్రణాళికలను కూడా వెల్లడించాడు. ‘‘విరాళాలు నిజంగా సహాయం అవసరమైన వ్యక్తులకు చేరుతాయని నమ్ముతున్నాను కాబట్టి నేను ఛారిటీకి కొంత డబ్బును ఇవ్వాలి అనుకుంటున్నాను. అది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది’’ అని ఆయన అన్నాడు. తన ప్రయాణం ఇతరులకు ప్రేరణగా పనిచేస్తుందని ఆయన అభిప్రాయపడుతున్నాడు ‘‘ప్రతిదీ ఒక కారణం కోసం జరుగుతుందని నేను నమ్ముతున్నాను. ప్రతి ఆటగాడు ఆడుతూనే ఉండాలని సూచిస్తున్నాను. ఏదో ఒక రోజు, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది’’ అంటూ ఉద్భోధిస్తున్నాడు.మరోవైపు ఖమ్మం జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో నివసించే అతని తల్లిదండ్రులు మాధవరావు భూలక్ష్మి తమ కొడుకు సాధించిన విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.ఓ ఆంగ్ల పత్రిక ప్రతినిధితో మాట్లాడుతూ, భూలక్ష్మి ఈ వార్త విన్న తర్వాత తమ కుటుంబం చాలా ఆనందంగా ఉందని చెప్పారు.‘లాటరీ గెలుపొందినట్లు మేం విన్నాము. మేం చాలా సంతోషంగా ఉన్నాము,‘ అని ఆమె అంటున్నారు. -
తండ్రి మత్స్యకారుడు.. కొడుకు బుర్జ్ ఖలీఫా ఓనర్
దుబాయ్ అంటే అందరికీ 'బుర్జ్ ఖలీఫా' గుర్తొస్తుంది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనంగా ప్రసిద్ధి చెందిన ఈ బుర్జ్ ఖలీఫాను ఒక మత్స్యకారుడి కుమారుడు నిర్మించారనే విషయం బహుశా చాలామందికి తెలిసుండకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలను తెలుసుకుందాం.బుర్జ్ ఖలీఫాను.. దుబాయ్‌లోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఎమ్మార్ ప్రాపర్టీస్ నిర్మించింది. ఈ కంపెనీ ఫౌండర్ 'మహమ్మద్ అలబ్బర్' (Mohamed Alabbar). ఈయనే బుర్జ్ ఖలీఫా యజమాని.తండ్రి మత్స్యకారుడుమహమ్మద్ అలబ్బర్.. దుబాయ్‌లో ఒక సాధారణ, మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఈయన తండ్రి ఒక మత్స్యకారుడు. చిన్నప్పుడు తన తండ్రి చేసే పనిలో సహాయం చేసేవాడు. పట్టుదల, క్రమశిక్షణ, వినయాన్ని నా తండ్రి నుంచే నేర్చుకున్నానని అలబ్బర్ అనేక ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.ప్రాధమిక విద్యను దుబాయ్‌లో పూర్తిచేసిన మహమ్మద్ అలబ్బర్.. ఆ తరువాత ప్రభుత్వం అందించిన స్కాలర్షిప్ ద్వారా అమెరికాలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేశారు. ఆ తరువాత 1981లో స్వదేశానికి (దుబాయ్) తిరిగి వచ్చాడు. అలబ్బర్ అమెరికా నుంచి కేవలం డిగ్రీతో రాలేదు. జీవితంలో ఎదగడానికి ఎదో ఒకటి చేయాలనే లక్ష్యంతో వచ్చాడు.బ్యాంక్‌లో ఉద్యోగంఅలబ్బర్ తన కెరియర్ను యుఎఈ సెంట్రల్ బ్యాంక్‌లో ప్రారంభించి, ఆర్థిక వ్యవస్థల గురించి పూర్తిగా తెలుసుకున్నాడు. పనితనంతో అందరి దృష్టినీ ఆకసారిస్తూ.. చాలా తక్కువ కాలంలోనే ఆయన దుబాయ్ ఆర్థిక అభివృద్ధి విభాగానికి డైరెక్టర్ జనరల్ అయ్యారు. ఆ సమయంలోనే దుబాయ్ దార్శనిక పాలకుడు 'షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్'తో పరిచయం ఏర్పడింది. ఆ తరువాతే భవిష్యత్తును ఊహించాడు.1997లో అలబ్బర్ ఎమ్మార్ ప్రాపర్టీస్‌ను స్థాపించినప్పుడు. ఆ సమయంలో చాలామంది ఎగతాళి చేశారు. కానీ ఒక దశాబ్దంలోనే దీనికి ఎనలేని గుర్తింపు లభించింది. ఆ తరువాత దుబాయ్ ఫౌంటెన్, డౌన్‌టౌన్ దుబాయ్, దుబాయ్ మాల్ వంటి నిర్మాణాలను పూర్తిచేసి.. ఈ రంగంలో అలబ్బర్ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందాడు.బుర్జ్ ఖలీఫా గురించిప్రపంచంలో ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా.. అత్యంత ఖరీదైన అపార్ట్మెంట్ భవనాల్లో కూడా ఒకటి. ఇందులో సింగిల్ బెడ్ రూమ్ అద్దె ఏడాదికి 180000 – 250000 దిర్హామ్‌లు (రూ. 40 లక్షల నుంచి రూ. 55 లక్షలు).బుర్జ్ ఖలీఫా ఎత్తు 829.8 మీటర్లు (2,722 అడుగులు). ఇందులో 163 అంతస్తులు ఉన్నాయి. 2004లో ప్రారంభమైన ఈ భవనం నిర్మాణం 2010కి పూర్తయింది. 95 కిలోమీటర్ల నుంచి కూడా కనిపించే ఈ భవనంలో 304 విలాసవంతమైన హోటల్ రూల్స్, 900 హై-ఎండ్ అపార్ట్మెంట్లు ఉన్నాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ బిల్డింగ్ బయటివైపు శుభ్రం చేయడానికే సుమారు మూడు నెలల సమయం పడుతుందని సమాచారం.ఇదీ చదవండి: ఉద్యోగం పోతుందన్న భయం: రోజుకు రెండు గంటలే నిద్ర! -
రూ.240 కోట్ల లాటరీ.. మరి ట్యాక్స్ ఎంత కట్టాలి?
యూఏఈలో ఇటీవల ఒక భారతీయ వ్యక్తి 100 మిలియన్ దిర్హమ్ల (రూ.240 కోట్లు) భారీ లాటరీని గెలుచుకున్నారు. ఇది విన్నవారందరూ ఆశ్చర్యచకితులై ఉంటారు. ‘వామ్మో అన్ని కోట్లు గెలిచాడా.. మరి దీనిపై ట్యాక్స్ కట్టాలా.. కడితే ఎంత కట్టాలి.. గెలిచిన లాటరీ సొమ్మును ఇండియాకు తెచ్చుకోవచ్చా?’ అందిరికీ వెంటనే ఇవే సందేహాలు వచ్చి ఉంటాయి. వీటి గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం..యూఏఈలో నో ట్యాక్స్లాటరీ గెలిచింది అబుదాబిలో నివసిస్తున్న 29 ఏళ్ల ప్రవాస భారతీయ యువకుడు అనిల్ కుమార్ బొల్లాగా గుర్తించారు. లాటరీ సొమ్ముపై ట్యాక్స్ అన్నది ఆయన ఎక్కడ పన్నులు చెల్లిస్తాడనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఆ దేశంలో ఇప్పటివరకు గెలిచిన అతిపెద్ద జాక్ పాట్ ఇదే అయినప్పటికీ, అక్కడ అటువంటి లాటరీలపై స్థానిక యూఏఈ పన్నులేవీ ఉండవు. అంటే ఆయన మొత్తం డబ్బును యూఏఈలోని తన బ్యాంకు ఖాతాలో జమవుతుంది.మరి భారత్‌లో..భారతదేశంలో లాటరీ బహుమతులపై ఫ్లాట్ 30% పన్ను వర్తిస్తుంది. అదనంగా ఈ పన్ను మొత్తంపై 15% సర్ఛార్జ్ (రూ .1 కోటి కంటే ఎక్కువ గెలుపొందినవారికి), అలాగే మొత్తంపై 4% ఆరోగ్య, విద్యా సెస్ చెల్లించాల్సి ఉంటుంది. సదరు వ్యక్తి భారతదేశంలో నివాసి హోదాను కలిగి ఉంటే ఈ పన్నుకు లోబడి ఉంటాడు.ఒక వ్యక్తి భారతదేశంలో నివాసిగా పరిగణించబడాలంటే.. గడిచిన సంవత్సరంలో కనీసం 182 రోజులు భారతదేశంలో ఉండాలి. లేదా గడిచిన సంవత్సరంలో 60 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం, అలాగే అంతకుముందు నాలుగు సంవత్సరాలలో మొత్తం 365 రోజులు భారత్‌లో నివసించి ఉండాలి.ఈ రెండు సందర్భాల పరిధిలోకి లాటరీ విజేత రాకపోతే నాన్-రెసిడెంట్ ఇండియన్ (ఎన్ఆర్ఐ) హోదాను కలిగి ఉంటారు. కాబట్టి భారతదేశంలో పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ నివాస హోదా ఉంటే, డైరెక్టరేట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం.. ప్రపంచంలో ఎక్కడ సంపాదించినా.. అది భారతదేశంలోకి తీసుకురాకపోయినా భారతదేశంలో ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తుంది.అనిల్ కుమార్ బొల్లా దీర్ఘకాలంగా అబుదాబి నివాసి. ఒకటిన్నర సంవత్సరాలకు పైగా ఆయన యూఏఈలో నివసిస్తున్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక తెలిపింది. అంటే ఆయన భారతీయ పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు.ఇక ఆయన గెలుచుకున్న లాటరీ సొమ్మును భారతదేశానికి తీసుకురాగలడా అంటే.. తీసుకొచ్చేందుకు నిబంధనలు అనుమతించవు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ), ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) ప్రకారం, బయటి దేశాల్లో లాటరీ ద్వారా గెలుచుకున్న సొమ్మును భారత్‌లోకి తేవడం నిషేధం. -
యూఏఈ లాటరీలో జాక్‌పాట్.. చరిత్ర సృష్టించిన అనిల్ బొల్లా
పండుగపూట లక్ష్మీదేవి ఆ భారతీయ యువకుడ్ని మాములుగా కనికరించలేదు. రాత్రికి రాత్రే అతగాడిని కోటీశ్వరుడిని చేసేసింది. తల్లి సెంటిమెంట్‌తో రూ.1,200 పెట్టి లాటరీ టికెట్ కొంటే.. 88 లక్షల మంది పాల్గొన్న లాటరీలో ఏకంగా రూ.240 కోట్ల డబ్బు గెల్చుకుని చరిత్ర సృష్టించాడు. భారత్‌కు చెందిన అనిల్‌కుమార్ బొల్లా(అతని స్వస్థలంపై స్పష్టత రావాల్సి ఉంది).. ఏడాదిన్నర కిందట యూఏఈకి వెళ్లాడు. అయితే.. 2025 అక్టోబర్ 18న యూఏఈ నగరం అబుదాబిలో జరిగిన లక్కడీ డే డ్రాలో రూ.240 కోట్ల (Dh100 మిలియన్) బంపర్ లాటరీ గెలుచుకున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వీడియోను యూఏఈ లాటరీ నిర్వాహకులు సోమవారం అధికారికంగా విడుదల చేశారు. తన పూర్తి పేరు అనిల్‌కుమార్ బొల్లా మాధవరావు బొల్లా అని, రాత్రికి రాత్రే తన జీవితం మారిపోయిందని ఆ యువకుడు చెప్పడం ఆ వీడియోలో ఉంది. లాటరీ నెగ్గానని తెలియగానే సోఫాలో కుప్పకూలిపోయానని.. సంతోషంతో మాటలు రాలేదని, లోపల మాత్రం యస్.. నేను గెలిచా అనే ఆంనందం అలా ఉండిపోయిందని వివరించాడు.ఈ లాటరీ కోసం ఒక్కో టికెట్‌కు 50దిర్హామ్(రూ.1200) పెట్టి 12 టికెట్లు కొన్నాడు అనిల్. అయితే అందులో అదృష్టం తెచ్చి పెట్టి టికెట్ నెంబర్ 11. ఆ నెంబర్‌కు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా?. తన తల్లి పుట్టినరోజు అంట. అందుకే ఆ నెంబర్‌ను ఎంపిక చేసుకుని.. తన తల్లి ఆశీర్వాదంతోనే అదృష్టం కలిసొచ్చిందని.. అంతకు మించి తాను ఏదీ చేయలేదని నవ్వుతూ చెబుతున్నాడు అనిల్. పైగా దీపావళి సమయంలోనే ఇలా జరగడాన్ని సంతోషంగా భావిస్తున్నట్లు తెలిపాడు.మరి ఇంత డబ్బుతో ఏం చేస్తావు? అని ప్రశ్నిస్తే.. తనకు కొన్ని కలలు ఉన్నాయని అని నెరవేర్చకుంటానని, అలాగే.. ఓ సూపర్‌కార్ కొనుగోలు చేసి.. సెవెన్‌స్టార్ హోటల్లో కొన్నాళ్లపాటు జాలీగా గుడుపుతానని నవ్వుతూ చెప్పాడు. అంతకంటే ముందు.. తన తల్లిదండ్రులకు చిన్నచిన్న కోరికలను తీరుస్తానని, తన కుటుంబాన్ని యూఏఈకి తీసుకొచ్చి ఇక్కడే గడుపుతానని, వచ్చిందాంట్లో కొంత చారిటీలకు ఇస్తానని తెలిపాడు.From anticipation to celebration, this is the reveal that changed everything!Anilkumar Bolla takes home AED 100 Million! A Lucky Day we’ll never forget. 🏆For Anilkumar, Oct. 18 wasn’t just another day, it was the day that changed everything.A life transformed, and a reminder… pic.twitter.com/uzCtR38eNE— The UAE Lottery (@theuaelottery) October 27, 2025 -
యూఏఈ రూల్: ఎంత బంగారానికి డిక్లేర్ అవసరం..
భారతీయులకు బంగారం అంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే ఎప్పటికప్పుడు, ఎక్కడికి వెళ్లినా గోల్డ్ కొనేస్తూ ఉంటారు. ఇంకొందరైతే గోల్డ్ కొనుగోలు చేయడానికి ప్రత్యేకించి.. అరబ్ దేశాలకు వెళ్తున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నిబంధనల ప్రకారం.. భారతీయ ప్రయాణికుల వద్ద ఎంత విలువైన బంగారం ఉంటే డిక్లేర్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం.భారతీయులు యూఏఈ (UAE)కి ప్రయాణించే సమయంలో తమ వద్ద ఉన్న బంగారం విలువ రూ.13.5 లక్షల(AED 60,000)కు మించి ఉంటే, దానికి డిక్లేర్ (declare) చేయాల్సి ఉంటుంది. అంటే, మీరు వెంట తీసుకెళ్లే బంగారం విలువ.. ఈ పరిమితికి మించి ఉంటే, సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలి.పరిమితికి మించి బంగారం తీసుకెళ్లడానికి లీగల్‌గా ఎలాంటి అనుమతి ఉండదు. కాబట్టి దీనికి ట్యాక్స్, డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. వివాహాలు, పండుగలు లేదా గిఫ్ట్ రూపంలో.. సాంప్రదాయకంగా బంగారు ఆభరణాలను తీసుకెళ్లే భారతీయ పర్యాటకులు, NRIలు, వ్యాపార ప్రయాణికులు ఆ విషయాన్ని తప్పకుండా గమనించాలి.ఇదీ చదవండి: గోల్డ్ వార్నింగ్ సిగ్నెల్: శ్రీధర్ వెంబు ట్వీట్బంగారం అక్రమ రవాణాను తగ్గించేందుకు, ట్యాక్స్ ఎగవేతను అడ్డుకునేందుకు ఈ నిబంధనను అమలు చేస్తున్నారు. డిక్లేర్ చేయకుండా ఎక్కువ బంగారం తీసుకెళితే, దానిని సీజ్ చేయవచ్చు. లేదా మీకు భారీ జరిమానా పడవచ్చు లేదా జైలుశిక్షను కూడా అనుభవించాల్సి ఉంటుంది. -
ఆర్బీఎల్ బ్యాంకులో ఎన్‌బీడీకి మెజారిటీ వాటాలు
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ఆర్బీఎల్ బ్యాంకులో మెజారిటీ 60 శాతం వాటాలను కొనుగోలు చేసేందుకు యూఏఈకి చెందిన ఎమిరేట్స్ ఎన్బీడీ బ్యాంక్ ప్రతిపాదించింది. ఇందుకోసం రూ. 26,853 కోట్లు ఆఫర్ చేసింది. విలువపరంగా దేశీ ఆర్థిక రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి సంబంధించి ఇది అత్యంత భారీ డీల్ కానుంది. ఇటీవలే జపాన్‌కి చెందిన ఎస్ఎంబీసీ మరో దేశీ ప్రైవేట్ బ్యాంక్ యస్ బ్యాంకులో 24.9 శాతం వాటాలను రూ. 16,333 కోట్లతో కొనుగోలు చేసిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ఆమోదించిన సందర్భంగా ఎమిరేట్స్ ఎన్బీడీ బ్యాంక్ నుంచి రూ. 26,853 కోట్ల సమీకరణకు కూడా తమ బోర్డు ఆమోదముద్ర వేసినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు ఆర్బీఎల్ బ్యాంకు తెలిపింది. ఈ డీల్‌తో రెండు బ్యాంకుల భాగస్వాములకు ప్రయోజనం చేకూరగలదని ఆర్బీఎల్ బ్యాంక్ ఎండీ ఆర్ సుబ్రమణియకుమార్ తెలిపారు. ప్రిఫరెన్షియల్ ఇష్యూ .. ఒక్కొక్కటి రూ. 10 ముఖ విలువ చేసే 95.90 కోట్ల వరకు ఈక్విటీ షేర్లను రూ. 228 రేటు చొప్పున ఎమిరేట్స్ ఎన్బీడీ బ్యాంకునకు ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన కేటాయించేందుకు బోర్డు ఆమోదించింది. ఇది 60 శాతం వాటాకు సమానం. ప్రిఫరెన్షియల్ ఇష్యూ అనంతరం ఆర్బీఎల్ బ్యాంకుపై ఎమిరేట్స్ ఎన్బీడీ బ్యాంక్‌నకు నియంత్రణ లభిస్తుంది. అటుపైన దాన్ని ప్రమోటరుగా వ్యవహరిస్తారు. ఆర్బీఎల్ బ్యాంకును విదేశీ బ్యాంక్ అనుబంధ సంస్థగా వర్గీకరిస్తారు. ప్రిఫరెన్షియల్ ఇష్యూ కారణంగా ఎమిరేట్స్ ఎన్బీడీ, ఆర్బీఎల్ బ్యాంక్ షేర్హోల్డర్లకు ఓపెన్ ఆఫర్ ఇవ్వాల్సి వస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంకు నికర లాభం 20 శాతం క్షీణించి రూ. 223 కోట్ల నుంచి రూ. 179 కోట్లకు క్షీణించింది. -
చివరి బెర్త్ కూడా ఖరారు.. టీ20 ప్రపంచకప్ ఆడబోయే జట్లు ఇవే..!
2026 టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2026) ఆడబోయే 20 జట్లు ఖరారయ్యాయి. చివరి బెర్త్‌ను తాజాగా యూఏఈ (UAE) దక్కించుకుంది. ఈస్ట్ ఏషియా పసిఫిక్ క్వాలిఫయర్స్‌లో (East Asia Pacific Qualifier) జపాన్‌పై గెలుపుతో యూఏఈ ప్రపంచకప్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఇదే రీజియనల్ క్వాలిఫయర్ ద్వారా నిన్ననే ఒమన్, నేపాల్ ప్రపంచకప్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి.భారత్, శ్రీలంక వేదికలుగా వచ్చే ఏడాది జరుగబోయే పొట్టి ప్రపంచకప్‌కు అర్హత సాధించిన జట్లపై ఓ లుక్కేద్దాం. ముందుగా ఆతిథ్య హోదాలో భారత్, శ్రీలంక నేరుగా అర్హత సాధించాయి. ఆతర్వాత గత ప్రపంచకప్‌లో (2024) సూపర్-8 దశకు చేరిన 7 జట్లు (ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, యూఎస్ఏ) నేరుగా అర్హత సాధించాయి. ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా పాకిస్తాన్, న్యూజిలాండ్, ఐర్లాండ్ జట్లు ప్రపంచకప్ బెర్త్‌లు దక్కించుకున్నాయి. అమెరికా రీజియనల్ క్వాలిఫయర్ ద్వారా కెనడా అర్హత సాధించింది.యూరప్ క్వాలిఫయర్స్ ద్వారా నెదర్లాండ్స్, ఇటలీ అర్హత సాధించాయి. అఫ్రికా క్వాలిఫయర్ ద్వారా నమీబియా, జింబాబ్వే క్వాలిఫై అయ్యాయి. చివరిగా ఈస్ట్ ఏషియా పసిఫిక్ క్వాలిఫయర్ ద్వారా ఒమన్, నేపాల్, యూఏఈ జట్లు ప్రపంచకప్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి. చదవండి: తేలిపోయిన బంగ్లా బ్యాటర్లు.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..? -
6జీ కనెక్టివిటీ టెస్ట్ విజయవంతం
యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) 6జీ కనెక్టివిటీ పరీక్షల్లో రికార్డు స్థాయిలో 145 గిగాబిట్స్ పర్ సెకన్ (Gbps) ఇంటర్నెట్ వేగాన్ని సాధించినట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వెలిశాయి. ఈ టెక్నాలజీ టెలికమ్యూనికేషన్స్ రంగంలో కీలక మైలురాయిగా నిలవనుంది. కనెక్టివిటీలో అసాధారణ వేగం, అతి తక్కువ జాప్యం (Ultra low Latency) వంటి అంశాలు భవిష్యత్ డిజిటల్ ప్రపంచానికి సరికొత్త మార్గాన్ని సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ కూడా 6జీ టెక్నాలజీ అభివృద్ధిలో చురుకుగా ముందుకు సాగుతోంది.భారత్‌లో పరిశోధనలుభారతదేశం కేవలం 6జీ టెక్నాలజీని స్వీకరించే దేశంగా కాకుండా దాని రూపకల్పన, అభివృద్ధి, ప్రమాణాలను నిర్దేశించడంలో ప్రపంచానికి నాయకత్వం వహించే దేశంగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. దాంతో భారత్ 6జీ విజన్‌ను ప్రారంభించింది. 2023 మార్చి 23న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్ 6జీ విజన్ పత్రాన్ని ఆవిష్కరించారు. 2030 నాటికి ఈ టెక్నాలజీలను రూపొందించి దేశీయంగా అమలు చేయాలనేది దీని ముఖ్య ఉద్దేశం. దేశీయ పరిశ్రమ, విద్యాసంస్థలు, జాతీయ పరిశోధనా సంస్థలు, ప్రమాణాల సంస్థల సహకారంతో 2023 జులై 3న భారత్ 6జీ కూటమిని ప్రారంభించారు. భారత్ 6జీ విజన్‌కు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి ఇది ఒక వేదికగా పనిచేస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాల చర్చల్లో చురుకుగా పాల్గొనడం, పరిశోధనలకు నిధులు సమకూర్చడం దీని విధుల్లో భాగం.టెలికాం టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ (TTDF) పథకం కింద 6జీ టెక్నాలజీకి సంబంధించిన 104కి పైగా పరిశోధన ప్రాజెక్టులకు రూ.275.88 కోట్లకు పైగా నిధులు మంజూరు చేశారు. దేశంలోని కొన్ని ప్రముఖ విద్యాసంస్థల్లో 6జీకి సిద్ధంగా ఉండే పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి 100 5జీ ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. ఇవి భవిష్యత్తులో 6జీ పరిశోధనలకు వేదికగా మారుతాయి.🚨 The UAE has successfully completed its first 6G testing, achieving a record speed of 145 Gbps. pic.twitter.com/uhtmRk6Zrv— Indian Tech & Infra (@IndianTechGuide) October 15, 2025ఇండియాలో 6జీ వస్తే చోటు చేసుకోనున్న పరిణామాలుఇండియాలో ‘భారత్ 6జీ విజన్’ కింద 6జీ సాంకేతికతను 2030 నాటికి అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత్ వంటి అతిపెద్ద జనాభా గల దేశంలో 6జీ రాక వల్ల భారీ పరివర్తనలు సంభవిస్తాయి.డిజిటల్ విప్లవం: 6జీ గ్రామీణ, సరైన కనెక్టివిటీలేని ప్రాంతాలకు సైతం మెరుగైన కమ్యునికేషన్ అందిస్తుంది.ఆరోగ్య సంరక్షణ (Healthcare): రియల్-టైమ్ టెలిసర్జరీలు, రిమోట్ పేషెంట్ మానిటరింగ్, ఏఐ-ఆధారిత డయాగ్నోస్టిక్స్ వంటివి విస్తృతం అవుతాయి. అంబులెన్స్‌లు, ఆసుపత్రులు సహా అన్ని వైద్య మౌలిక సదుపాయాలు ఏఐ ఆధారితంగా అనుసంధానమవుతాయి.విద్య (Education): విద్యార్థులు వర్చువల్ టీచర్లతో, క్లాస్‌మేట్స్‌తో ఇంటరాక్ట్ అవ్వడం, ఎక్కడైనా, ఎప్పుడైనా నాణ్యమైన విద్యా వనరులను పొందేందుకు 6జీ ఉపయోగపడుతుంది.పరిశ్రమల ఆటోమేషన్ (Industrial Automation): స్మార్ట్ ఫ్యాక్టరీల్లో యంత్రాల రియల్-టైమ్ రిమోట్ కంట్రోల్, ఏఐ-ఆధారిత ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్, రోబోటిక్స్ వంటివి ఉత్పత్తి సామర్థ్యాన్ని, నాణ్యతను అసాధారణంగా పెంచుతాయి.రవాణా (Transportation): అర్బన్ ఎయిర్ మొబిలిటీ (UAM), అటానమస్ వాహనాల (Self-Driving Cars) కోసం 6జీ కమ్యూనికేషన్ అత్యంత అవసరం. ట్రాఫిక్ నిర్వహణ, లాజిస్టిక్స్‌లో డ్రోన్ ఫ్లీట్ల వాడకం పెరుగుతుంది.రక్షణ రంగం (Defence): కమాండర్లకు వేగవంతమైన, రియల్-టైమ్ క్షేత్ర సమాచారం అందించేందుకు వీలవుతుంది. సురక్షితమైన కమ్యూనికేషన్, డ్రోన్లు, హైపర్సోనిక్ ఆయుధాలకు కమ్యూనికేషన్ లింక్‌లు అందించడం ద్వారా రక్షణ సామర్థ్యం పెరుగుతుంది.ఈ టెక్నాలజీ వివిధ దేశాల పరిశోధనలుప్రస్తుతానికి ప్రపంచంలో ఏ దేశంలోనూ పూర్తిగా వాణిజ్యపరమైన (Commercial) 6జీ నెట్వర్క్ వాడుకలో లేదు. 6జీ సాంకేతికతను 2030 నాటికి వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుని అభివృద్ధి, పరిశోధన (R&D)లో వివిధ దేశాలు, టెక్ కంపెనీలు చురుగ్గా పోటీ పడుతున్నాయి.6జీ అభివృద్ధిలో ముందున్న దేశాలుచైనా: 6జీ పరిశోధన, అభివృద్ధిలో ముందంజలో ఉంది. చైనా భారీగా పెట్టుబడులు పెడుతోంది. టెరాహెర్ట్జ్ సిగ్నల్ ప్రసారాన్ని పరీక్షించేందుకు ఇప్పటికే ప్రయోగాత్మక ఉపగ్రహాన్ని (Experimental Satellite) ప్రయోగించింది. 6జీ పేటెంట్ ఫైలింగ్స్‌లో చైనా అగ్రస్థానంలో ఉంది.దక్షిణ కొరియా: 5జీని వేగంగా అమలు చేసిన దక్షిణ కొరియా 6జీలో కూడా బలమైన పోటీదారుగా ఉంది. శాంసంగ్, ఎల్జీ వంటి దిగ్గజ సంస్థలు 6జీ R&D కేంద్రాలను ఏర్పాటు చేశాయి. 2028 నాటికి 6జీని వాణిజ్యపరంగా విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.జపాన్: టెక్నాలజీ అభివృద్ధిలో తన నైపుణ్యాన్ని కొనసాగిస్తూ 2030 నాటికి 6జీని ఆవిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.యునైటెడ్ స్టేట్స్, యూరప్: యూఎస్ ‘నెక్స్ట్ G అలయన్స్’ ద్వారా ఈయూ ఆధ్వర్యంలో ‘హెక్సా-ఎక్స్’ (Hexa-X) వంటి చొరవలతో 6జీ పరిశోధనలో చురుకుగా పాల్గొంటున్నాయి.ఇదీ చదవండి: ఓ మై గోల్డ్! -
భార్యాబిడ్డల్ని విమానం ఎక్కించి వచ్చాడో లేదో తీవ్ర గుండెపోటు, విషాదం
ఇటీవలి కాలంలో వరుస ఎన్ఆర్ఐల మరణాలు ఆందోళన రేపుతున్నాయి. అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో తన భార్య , కుమారుడికి వీడ్కోలు పలికిన కొన్ని గంటలకే UAEలో ఒక భారతీయ ప్రవాస ఇంజనీర్ గుండెపోటుతో ఆకస్మికంగా మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. బాధితుడిని హరిరాజ్ సుదేవన్ (37) (Hariraj Sudevan) గుర్తించారు.కేరళలోని అలప్పు జిల్లాకు చెందిన 37 ఏళ్ల హరిరాజ్ సుదేవన్ హరిరాజ్ సుదేవన్ గత 12 ఏళ్లుగా యుఎఇలో నివసిస్తున్నాడు. అయితే తన భార్య డాక్టర్ అను అశోక్ , 10 ఏళ్ల కుమారుడు ఇషాన్ దేవ్ హరి కేరళ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వారిని విమానాశ్రయంలో దింపిన కొన్ని గంటలకే అబుదాబిలో గుండెపోటుతో మరణించాడు. అల్లుడు అకాల మరణంపై మామ అశోకన్ కేపీ తీవ్ర విచారాన్ని ప్రకటించారు. ఆయన ఇక లేరనే వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నామనంటూ కంట తడిపెట్టారు.ఆదివారం సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే ముందు తన కుమార్తె , మనవడు హరిరాజ్తో 10 రోజులు గడిపారని, అక్టోబర్ 27న తన కొడుకు పుట్టినరోజుకు హాజరు కావడానికి హరిరాజ్ ఈ నెల చివర్లో రావాల్సి ఉందని గుర్తు చేసుకున్నారు. ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి అయిన సుదేవన్, యుఎఇలో 12 సంవత్సరాలకు పైగా సీనియర్ ఆఫ్‌షోర్ కన్స్ట్రక్షన్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. కుసాట్ నుండి బి.టెక్ ,ఐఐటీ మద్రాస్ నుండి ఎంటెక్ పట్టా పొందారు. హరిరాజ్, అబుదాబిలో సీనియర్ పనిచేస్తున్నారు. అంత్యక్రియల కోసం ఆయన మృతదేహాన్ని కేరళకు తరలించారు. థామస్ కుమార్తె పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడానికి మా ఇంటికి వచ్చారని, ఎంతో సంతోషంగా గడిపామని సన్నిహిత స్నేహితుడు డిజిన్ థామస్ తెలిపారు. -
కొత్త రకాల వీసాలను ప్రకటించిన యూఏఈ
ప్రపంచ ప్రతిభను ఆకర్షించడానికి, పర్యాటకాన్ని పెంచడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నాలుగు కొత్త విజిట్ వీసా కేటగిరీలను ప్రకటించింది. రెసిడెన్సీ వ్యవస్థలోనూ మార్పులు చేసింది. వీటిలో ఏఐ, ఎంటర్టైన్మెంట్, ఈవెంట్, క్రూయిజ్ టూరిజం కోసం నాలుగు కొత్త వీసా (New Visa) కేటగిరీలు ఉన్నాయి.అంతే కాకుండా, వ్యాపార, ట్రక్ డ్రైవర్ వీసాలకు సంబంధించి కూడా మార్పులు చేశారు. మానవతా సహాయం, వితంతువులు, విడాకులు తీసుకున్న వారు, నివాసితుల బంధువులు, స్నేహితులకు కూడా రెసిడెన్సీ అవకాశం కల్పిస్తున్నారు.నాలుగు కొత్త విజిట్ వీసా కేటగిరీలు ఇవే..ఏఐ స్పెషలిస్ట్ వీసా: ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లోని నిపుణుల కోసం ఉద్దేశించినది. ఇందు కోసం టెక్ ఫోకస్డ్ కంపెనీ నుంచి స్పాన్సర్ షిప్ అవసరం అవుతుంది. ఒకటి లేదా ఎక్కువ ఎంట్రీలకు అనుమతి ఉంటుంది.ఎంటర్టైన్మెంట్ వీసా: కమర్షియల్ ఎంటర్ టైన్ మెంట్ సెక్టార్ లోని వ్యక్తుల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన వీసా ఇది. విశ్రాంతి లేదా ప్రదర్శన నిమిత్తం వచ్చే ప్రముఖులకు దీన్ని కేటాయిస్తారు.ఈవెంట్ వీసా: పండుగలు, ఎగ్జిబిషన్లు, కాన్ఫరెన్సులకు హాజరయ్యేవారికి ఈ ఈవెంట్ వీసాలు జారీ చేస్తారు. అయితే వీటిని ఈవెంట్ నిర్వాహకులచే స్పాన్సర్ చేయాలి.క్రూయిజ్ టూరిజం వీసా: క్రూయిజ్ ట్రావెలర్లకు మల్టిపుల్ ఎంట్రీ వీసా ఇది. లైసెన్స్ పొందిన మారిటైమ్ సంస్థల ద్వారా స్పాన్సర్ చేస్తారు.రెసిడెన్సీ, ఇతర వీసా అప్డేట్లుహ్యుమానిటేరియన్ రెసిడెన్స్ పర్మిట్: సంక్షోభ పరిస్థితుల నుంచి వచ్చే వ్యక్తులకు ఒక సంవత్సరం పునరుద్ధరించతగిన వీసా.స్నేహితులు, బంధువుల కోసం విజిట్ వీసా: నివాసితులు తమ బంధువులకు దీన్ని స్పాన్సర్ చేయవచ్చు.ట్రక్ డ్రైవర్ వీసా: లాజిస్టిక్స్ లో కార్మిక కొరతను పరిష్కరించే వీసా. లైసెన్స్ పొందిన కంపెనీల ద్వారా స్పాన్సర్ షిప్ అవసరం అవుతుంది.వితంతువులు, విడాకులకు రెసిడెన్సీ: నిర్వచించిన పరిస్థితులలో ఒక సంవత్సరం పునరుద్ధరణ అనుమతి.బిజినెస్ ఎక్స్ ప్లోరేషన్ వీసా: బిజినెస్ ప్రారంభించేందుకు వచ్చే ఆర్థిక సాల్వెన్సీ రుజువు ఉన్న వ్యాపారవేత్తలకు జారీ చేస్తారు. -
యూఏఈకి ఉచిత వీసాలు.. అబుదాబి కంపెనీ ఆఫర్
మోర్తాడ్(బాల్కొండ): గల్ఫ్‌లో ఉపాధి పొందాలనుకునే వలస కార్మికులకు అబుదాబిలోని ఏడీఎన్‌హెచ్ కంపెనీ (Abu Dhabi company) తెలంగాణలోని జీటీఎం సంస్థ ద్వారా ఉచితంగా వీసాలను (free visa) జారీ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. పలుమార్లు అనేకమందికి ఉచితంగా వీసాలు ఇచ్చిన ఈ సంస్థ..మరోసారి ఉచిత వీసాల జారీ కి ఇంటర్వ్యూలను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లోని అబుదాబి కేంద్రంగా పనిచేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ ఏడీఎన్‌హెచ్ కంపెనీ క్లీనింగ్, క్యాటరింగ్ రంగాల్లో యువతకు ఉపాధి కల్పిస్తోంది. ఈనెల 10న జగిత్యాలలో, 11న నిజామాబాద్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఈసీఎన్ఆర్ పాస్‌పోర్టు కలిగి ఉన్న యువకులకు అర్హత వయస్సు 21 నుంచి 38 ఏళ్ల వరకూ ఉండొచ్చని జీటీఎం సంస్థ చైర్మన్ చీటి సతీష్‌రావు ‘సాక్షి’తో చెప్పారు.బేసిక్ ఇంగ్లిష్ వచ్చి ఉండాలని, పచ్చబొట్టు కనబడకుండా ఉండాలని తెలిపారు. ఒరిజినల్ పాస్పోర్టుతో జగిత్యాల లేదా నిజామాబాద్‌లో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని తెలిపారు. ఎంపికైన వారికి రూ. 23 వేల వరకూ వేతనం, ఉచిత భోజనం, వసతి కల్పించనున్నట్టు వెల్లడించారు. ఎవరికీ నయాపైసా చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఏదైనా సమాచారం కోసం అభ్యర్థులు జీటీఎం సంస్థ నిజామాబాద్ (8686860999), ఆర్మూర్ (8332062299), జగిత్యాల (8332042299), సిరిసిల్ల (9347661522) నంబర్లలో సంప్రదించాలని సతీష్‌రావు సూచించారు. -
కొత్త కస్టమర్లను తీసుకోవద్దు: హెచ్డీఎఫ్సీ బ్యాంకుపై ఆంక్షలు
హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు.. దుబాయ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ (DFSA) షాకిచ్చింది. హెచ్డీఎఫ్సీ దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ (DIFC) బ్రాంచ్.. కొత్త కస్టమర్లను చేర్చుకోవడపై నిషేధం విధించింది.దుబాయ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాలు సెప్టెంబర్ 26 నుంచి అమలులోకి వచ్చాయి. తరువాత నోటీసులు అందేవరకు ఈ ఆర్డర్ అమలులోనే ఉంటుంది. కాబట్టి అప్పటివరకు కొత్త ఆర్ధిక ఉత్పత్తులకు సంబంధించిన సలహాలు ఇవ్వడం, ఇన్వెస్ట్మెంట్ డీల్స్, క్రెడిట్ సంబంధిత సలహాలు ఇవ్వడం, కస్టడీ సర్వీస్ వంటి పలు ఆర్థిక సేవలను నిలిపివేయాలి. అంతే కాకుండా కొత్త ఆర్ధిక ప్రచారాల్లో కూడా బ్యాంక్ పాల్గొనకూడదు. అయితే ఇప్పటికే ఉన్న బ్యాంక్ కస్టమర్లు.. తమ సేవలను యధావిధిగా పొందవచ్చు.దుబాయ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాలు పాటించడానికి బ్యాంక్ సిద్దమైంది. అంతే కాకుండా ఈ సమస్యను వీలైనంత తొందరగా పరిష్కరించుకోవడానికి.. డీఎఫ్ఎస్ఏతో కలిసి పనిచేయడానికి తాము కట్టుబడి ఉన్నామని హెచ్డీఎఫ్సీ ఒక ప్రకటనలో వెల్లడించింది.ఇదీ చదవండి: అక్టోబర్‌లో బ్యాంక్ హాలిడేస్: ఇదిగో జాబితా..సెప్టెంబర్ 23 నాటికి, దాని డీఐఎఫ్సీ బ్రాంచ్‌లో జాయింట్ హోల్డర్లతో సహా 1,489 మంది కస్టమర్లు ఉన్నారని హెచ్డీఎఫ్సీ తెలిపింది. అయితే దుబాయ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ ఇచ్చిన ఆర్డర్.. బ్యాంకు మొత్తం కార్యకలాపాలు లేదా ఆర్థిక స్థితిపై అటువంటి ప్రభావం చూపదని హెచ్డీఎఫ్సీ వెల్లడించింది. అంతే కాకుండా బ్రాంచ్ కస్టమర్ల నిరంతర సేవలకు ఈ నిషేధం వర్తించదని స్పష్టం చేసింది. -
భారత్‌కు యూఏఈ వీసా నిలిపేసిందా?
యూఏఈ(UAE) విదేశాల నుంచి తమ దేశం వస్తున్న టూరిస్ట్‌లు, వర్కింగ్ వీసాదారులను తాత్కాలికంగా నిలిపేసిందని(Suspension) కొన్ని అంతర్జాతీయ వార్తా సంస్థలు కథనాలు ప్రచురించాయి. అయితే దీనిపై యూఏఈ అధికారికంగా వివరణ ఇవ్వాల్సి ఉంది. కథనాల్లోని వివరాల ప్రకారం.. యూఏఈ తొమ్మిది దేశాల టూరిస్ట్ వీసాలు, వర్కింగ్ వీసాల(tourist and work visas) జారీని తాత్కాలికంగా నిలిపివేసింది. ఆ జాబితాలో భారత్ లేదని గమనించాలి. యూఏఈ వీసాలు నిలిపేసిన దేశాల వివరాలు కింది విధంగా ఉన్నాయి.అఫ్గానిస్థాన్లిబియాయెమెన్సోమాలియాలెబనాన్బంగ్లాదేశ్కామెరూన్సూడాన్ఉగాండాఈ సస్పెన్షన్ కొత్త వీసా దరఖాస్తులకు మాత్రమే వర్తిస్తుంది. పైన తెలిపిన దేశాల నుంచి వచ్చి ప్రస్తుతం యూఏఈలో ఉంటున్న వీసా హోల్డర్లకు ఎలాంటి సమస్య లేదు.ఈ నిర్ణయానికి కారణం..భద్రతా ఆందోళనలు: ఇంటెలిజెన్స్ నివేదికలు ఉగ్రవాదానికి సంబంధించిన సంభావ్య ప్రమాదాలను సూచిస్తున్నాయి.దౌత్యపరమైన ఉద్రిక్తతలు: కొన్ని దేశాలకు యూఏఈ, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) సభ్య దేశాలతో ఉన్న సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇది వీసా విధాన నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది.ప్రజారోగ్య ప్రోటోకాల్స్: కరోనా నియంత్రణలో ఉన్నప్పటికీ యూఏఈ కఠినమైన ఆరోగ్య పరీక్షలు, ప్రయాణ భద్రతా చర్యలను అమలు చేస్తూనే ఉంది. తక్కువ టీకా రేట్లు లేదా అస్థిరమైన ఆరోగ్య డేటా రిపోర్టింగ్ ఉన్న దేశాలు దీని వల్ల ప్రభావితం అవుతున్నాయి.మైగ్రేషన్ మేనేజ్మెంట్: కార్మికుల రాకపోకలను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి యూఏఈ తన ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను పునసమీక్షిస్తోంది.ఇదీ చదవండి: హెచ్-1బీ వీసా నిపుణులకు మైక్రోసాఫ్ట్ వేతనాలు ఇలా.. -
ఆసియా కప్: సూపర్-4లో ఆడే జట్లు ఇవే.. షెడ్యూల్, టైమింగ్ వివరాలు
ఆసియా కప్-2025 టోర్నమెంట్ కీలక దశకు చేరుకుంది. మొత్తంగా ఎనిమిది జట్లు పాల్గొంటున్న ఈ ఖండాంతర టోర్నీలో రెండు గ్రూపులు ఉన్న విషయం తెలిసిందే. లీగ్ స్టేజ్‌లో గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ పోటీ పడ్డాయి. అయితే, వీటిలో భారత్, పాకిస్తాన్.. శ్రీలంక, బంగ్లాదేశ్ సూపర్-4 (Asia Cup Super 4)లో అడుగుపెట్టగా.. యూఏఈ, ఒమన్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ ఎలిమినేట్ అయ్యాయి. కాగా లీగ్ దశలో ఒకే ఒక్క మ్యాచ్ మిగిలి ఉంది. నామమాత్రపు మ్యాచ్ఆఖరిగా భారత్- ఒమన్ మధ్య శుక్రవారం మ్యాచ్ జరుగుతుంది. అయితే, టీమిండియా ఇప్పటికే యూఏఈ, పాకిస్తాన్ జట్లను ఓడించి సూపర్-4కు చేరగా.. పాక్ ఒమన్, యూఏఈలపై గెలిచి అర్హత సాధించింది. దీంతో టీమిండియా- ఒమన్ మధ్య మ్యాచ్ నామమాత్రపు మ్యాచ్‌గానే మిగిలిపోనుంది. మరోవైపు.. నాలుగు పాయింట్లతో పాటు నెట్ రన్ రేటు (+4.793) పరంగానూ టీమిండియా ప్రస్తుతం మెరుగైన స్థితిలో ఉన్నందున.. ఒమన్ మ్యాచ్ తర్వాత కూడా గ్రూప్-ఎ టాపర్‌గా ఉండటం లాంఛనమే.గ్రూప్-బి నుంచి ఆ రెండు జట్లుఇక గ్రూప్-బి విషయానికొస్తే... అబుదాబి వేదికగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్ ద్వారా ఫలితం తేలింది. అఫ్గనిస్తాన్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించిన లంక.. రషీద్ ఖాన్ బృందాన్ని నాకౌట్ చేసింది. ఫలితంగా లంకతో పాటు బంగ్లాదేశ్ సూపర్-4కు క్వాలిఫై అయింది. గ్రూప్-బి లీగ్ మ్యాచ్‌లన్నీ ముగిసిపోవడంతో టాపర్‌గా శ్రీలంక నిలవగా.. బంగ్లాదేశ్ రెండో స్థానం ఆక్రమించింది. ఈ నేపథ్యంలో ఆసియా కప్-2025 సూపర్-4 దశ షెడ్యూల్, వేదికలు, మ్యాచ్ టైమింగ్ వివరాలు తెలుసుకుందాం!సూపర్-4 షెడ్యూల్👉మ్యాచ్ 1: సెప్టెంబరు 20- శనివారం- శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్- దుబాయ్👉మ్యాచ్ 2: సెప్టెంబరు 21- ఆదివారం- భారత్ వర్సెస్ పాకిస్తాన్- దుబాయ్👉మ్యాచ్ 3: సెప్టెంబరు 23- మంగళవారం- పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక- అబుదాబి👉మ్యాచ్ 4: సెప్టెంబరు 24- బుధవారం- భారత్ వర్సెస్ బంగ్లాదేశ్- దుబాయ్👉మ్యాచ్ 5: సెప్టెంబరు 25- గురువారం- పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్- దుబాయ్👉మ్యాచ్ 6: సెప్టెంబరు 26- శుక్రవారం- భారత్ వర్సెస్ శ్రీలంక- దుబాయ్ఫైనల్👉సెప్టెంబరు 28- దుబాయ్టైమింగ్స్👉ఫైనల్ సహా సూపర్-4 మ్యాచ్‌లన్నీ కూడా భారత కాలమానం ప్రకారం రాత్రి ఎనిమిది గంటలకు ఆరంభంలైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే👉టీవీ: సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్👉డిజిటల్: సోనీ లివ్ వెబ్సైట్, మొబైల్ యాప్జట్లు ఇవేటీమిండియాసూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.రిజర్వు ప్లేయర్లు: ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్.పాకిస్తాన్సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారీస్ (వికెట్-కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీమ్ జూనియర్, సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, సల్మాన్ మీర్జా, షాహిన్ అఫ్రిది, సూఫియాన్ మొకిమ్శ్రీలంకచరిత్ అసలంక (కెప్టెన్), కుశాల్ మెండిస్ (వికెట్‌కీపర్), పాతుమ్ నిస్సాంక, కుశాల్ పెరీరా, కమిల్ మిషార, దసున్ షనక, కమిందు మెండిస్, వనిందు హసరంగ, నువానీదు ఫెర్నాండో, దునిత్ వెల్లాలగే, చమిక కరుణరత్నే, మహీశ్ తీక్షణ, మతీశ పతిరణ, నువాన్ తుషార, దుష్మంత చమీరా, బినుర ఫెర్నాండో.బంగ్లాదేశ్లిట్టన్ కుమార్ దాస్ (కెప్టెన్), తాంజిద్ హసన్, పర్వేజ్ హొస్సేన్ ఇమాన్, సైఫ్ హసన్, తౌహిద్ హ్రిదోయ్, జాకర్ అలీ అనిక్, షమీమ్ హొస్సేన్, క్వాజీ నూరుల్ హసన్ సోహన్, షాక్ మహేదీ హసన్, రిషద్ హుస్సేన్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, తాంజిమ్ హసన్ సకీబ్, టస్కిన్ అహ్మద్, షరీఫుల్ ఇస్లాం, షైఫ్ ఉద్దీన్స్టాండ్బై ప్లేయర్లు: సౌమ్య సర్కార్, మెహిదీ హసన్ మిరాజ్, తన్వీర్ ఇస్లాం, హసన్ మహమూద్. చదవండి: Asia Cup: మా జట్టులో భారత్, పాక్ వినిపించదు.. మేమంతా ఒకే కుటుంబం -
‘సూపర్–4’కు పాకిస్తాన్
దుబాయ్: ఆసియా కప్ టి20 టోర్నీలో రెండో విజయంతో పాకిస్తాన్ ‘సూపర్–4’ దశకు అర్హత సాధించింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా బుధవారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో పాక్ 41 పరుగుల తేడాతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ని ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ఫఖర్ జమాన్ (36 బంతుల్లో 50; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలవగా, ఇతర ప్రధాన బ్యాటర్లంతా విఫలమయ్యారు. సయీమ్ అయూబ్ (0) వరుసగా మూడో మ్యాచ్‌లోనూ డకౌటై అంతర్జాతీయ టి20ల్లో ఈ చెత్త రికార్డును నెలకొల్పిన మూడో పాకిస్తానీ ఆటగాడిగా నిలిచాడు. ఫర్హాన్ (5), కెపె్టన్ సల్మాన్ ఆగా (27 బంతుల్లో 20), హసన్ (3), ఖుష్దిల్ (4), హారిస్ (18) ప్రభావం చూపలేకపోయారు. చివర్లో షాహిన్ అఫ్రిది (14 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడటంతో పాక్ మెరుగైన స్కోరు సాధించింది. యూఏఈ బౌలర్లలో జునేద్ సిద్దిఖీ 4 వికెట్లు పడగొట్టగా, సిమ్రన్‌జీత్ సింగ్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం యూఏఈ 17.4 105 పరుగులకు ఆలౌటైంది. రాహుల్ చోప్రా (35 బంతుల్లో 35; 1 ఫోర్, 1 సిక్స్) రాణించగా, ధ్రువ్ పరాశర్ (20) ఫర్వాలేదనిపించాడు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది, రవూఫ్, అబ్రార్ అహ్మద్ రెండు వికెట్లు చొప్పున తీశారు. నేడు జరిగే మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌తో శ్రీలంక తలపడుతుంది. -
సూపర్-4కు అర్హత సాధించిన భారత్.. పాకిస్తాన్ మరి?
ఆసియాకప్ 2025లో గ్రూపు-ఎ నుంచి భారత క్రికెట్ జట్టు సూపర్-4కు అర్హత సాధించింది. ఈ మెగా టోర్నీ గ్రూపు-ఎలో భాగంగా సోమవారం అబుదాబి వేదికగా యూఏఈ, ఒమన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఒమన్‌ను 42 పరుగుల తేడాతో యూఏఈ చిత్తు చేసింది.దీంతో ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ ఓటమి పాలైన ఒమన్ టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టింది. ఇదే సమయంలో వరుసగా రెండు మ్యాచ్‌లలో గెలిచి టేబుల్ టాపర్‌గా కొనసాగుతున్న సూపర్ ఫోర్కు క్వాలిఫై అయిన తొలి జట్టుగా నిలిచింది.రెండో జట్టు ఏది?ఇక గ్రూపు-ఎ నుంచి సూపర్ ఫోర్ రౌండ్‌కు అర్హత సాధించేందుకు పాకిస్తాన్, యూఏఈ జట్లు పోటీపడుతున్నాయి. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో భారత్, పాకిస్తాన్, యూఏఈ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. సెప్టెంబర్ 17న దుబాయ్ వేదికగా యూఏఈ-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు భారత్‌తో పాటు సూపర్-4లో అడుగు పెడుతోంది. బుధవారం జరిగే మ్యాచ్‌లో యూఏఈను ఓడించడం పాక్‌కు అంత సులువు కాదు.ఈ టోర్నీకి ముందు జరిగిన ట్రైసిరీస్‌లో కూడా పాక్‌కు యూఏఈ గట్టి పోటీ ఇచ్చింది. ఇప్పుడు ఆసియాకప్‌లోనూ అదే పట్టుదలతో పాక్‌ను ఢీకొట్టేందుకు ఆతిథ్య యూఏఈ సిద్దమైంది. పాకిస్తాన్ ఎప్పుడూ ఎలా ఆడుతుందో ఎవరూ ఊహించలేరు. పాకిస్తాన్ జట్టు జింబాబ్వే వంటి పసికూన చేతిలో కూడా ఓడిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ రెండు జట్లలో ఎవరూ సూపర్-4కు వస్తారన్నది ముందే అంచనా వేయడం కష్టమనే చెప్పాలి. మరోవైపు భారత ఆటగాళ్లు తమకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంతో పాకిస్తాన్ ఘోర అవమానంగా ఫీల్ అవుతోంది. భారత ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాలని పీసీబీ డిమాండ్ చేస్తోంది. ఐసీసీ చర్యలు తీసుకోపోతే యూఏఈతో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తామని పాకిస్తాన్ క్రికెట్ బెదరిస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే యూఏఈ సూపర్-4కు ఆర్హత సాధిస్తోంది.చదవండి: Asia cup 2025: హ్యాండ్ షేక్ వివాదం.. పాకిస్తాన్‌కు ఐసీసీ షాక్? -
Asia Cup 2025: బోణీ కొట్టిన యూఏఈ
ఆసియా కప్-2025లొ ఆతిథ్య యూఏఈ బోణీ కొట్టింది. ఇవాల్టి సాయంత్రం మ్యాచ్‌లో ఒమన్‌పై 42 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసి, ఆతర్వాత లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచి మూడో స్థానానికి ఎగబాకింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఒమన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.పూర్తి వివరాల్లో వెళితే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. ఓపెనర్లు ముహమ్మద్ వసీం (54 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 69 పరుగులు), అలీషాన్ షరాఫు (38 బంతుల్లో 51; 7 ఫోర్లు, సిక్స్) అర్ద సెంచరీతో రాణించడంతో మంచి స్కోర్ చేసింది. ఆరంభంలో ధాటిగా ఆడి 200 స్కోర్ దిశగా పయనించిన యూఏఈ.. ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమైంది. ఆసిఫ్ ఖాన్ (2), వికెట్ కీపర్ రాహుల్ చోప్రా (0) నిరాశపర్చగా.. ముహమ్మద్ జోహైబ్ (21), హర్షిత్ కౌశిక్ (19 నాటౌట్) తేలికపాటి మెరుపులు మెరిపించారు. ఒమన్ బౌలర్లలో జితేన్ రామనంది 2, హస్నైన్ షా, సమయ్ శ్రీవాత్సవ తలో వికెట్ తీశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన ఒమన్ ఆది నుంచే తడబడుతూ వచ్చింది. 50 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఆ దశలోనే మ్యాచ్‌పై ఆశలు వదులుకుంది. ఆర్యన్ బిస్త్ (24), వినాయక్ శుక్లా (20), రామనంది (13) కొద్ది సేపు ఓటమిని వాయిదా వేయగలిగారు. 18.4 ఓవర్లలో ఆ జట్టు 130 పరుగులకే కుప్పకూలింది. జునైద్ సిద్దిఖీ 4 వికెట్లు తీసి ఒమన్‌ను దెబ్బకొట్టాడు. హైదర్ అలీ, ముహమ్మద్ జవాదుల్లా తలో 2, రోహిద్ ఖాన్ ఓ వికెట్ తీశారు. యూఏఈ తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో (సెప్టెంబర్ 17) తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఆ జట్టుకు సూపర్ 4 అవకాశాలు ఉంటాయి. -
చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్.. ప్రపంచ రికార్డు బద్దలు
యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం అంతర్జాతీయ టీ20ల్లో చరిత్ర సృష్టించాడు. బంతుల పరంగా అత్యంత వేగంగా 3000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వసీంకు ముందు ఈ రికార్డు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోస్ బట్లర్ పేరిట ఉండేది. బట్లర్ 3000 పరుగులు పూర్తి చేసేందుకు 2068 బంతులు తీసుకోగా.. వసీం కేవలం 1947 బంతుల్లోనే ఈ ల్యాండ్ మార్క్‌ను తాకాడు. ఈ జాబితాలో వసీం, బట్లర్ తర్వాతి స్థానాల్లో ఆరోన్ ఫించ్ (2077), డేవిడ్ వార్నర్ (2113), రోహిత్ శర్మ (2149) ఉన్నారు.మ్యాచ్‌ల పరంగా చూస్తే.. వసీం మొహమ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్), విరాట్ కోహ్లి (భారత్), బాబర్ ఆజమ్ (పాకిస్తాన్) తర్వాత అత్యంత వేగంగా 3000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ మైలురాయిని చేరుకునేందుకు రిజ్వాన్‌కు 79, విరాట్ కోహ్లికి 81, బాబర్ ఆజమ్‌కు 81 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా.. వసీం తన 84వ ఇన్నింగ్స్‌లో 3000 పరుగుల మైలురాయిని తాకాడు. ఆసియా కప్-2025లో భాగంగా ఒమన్‌తో ఇవాళ (సెప్టెంబర్ 15) జరుగుతున్న మ్యాచ్‌లో వసీం పై రెండు ఘనతలు సాధించాడు. ఈ మ్యాచ్‌లో వసీం 54 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 69 పరుగులు చేశాడు. వసీంకు జతగా మరో ఓపెనర్ అలీషాన్ షరాఫు (38 బంతుల్లో 51; 7 ఫోర్లు, సిక్స్) కూడా అర్ద సెంచరీతో రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో ఒమన్ తడబడుతుంది. ఆ జట్టు 6.1 ఓవర్ల తర్వాత 4 వికెట్లు కోల్పోయి 48 పరుగులు చేసింది. షా ఫైసల్ (8), ఆర్యన్ బిస్త్ (5) క్రీజ్‌లో ఉన్నారు. ఈ టోర్నీలో యూఏఈ భారత్, పాక్, ఒమన్‌తో కలిసి గ్రూప్-ఏలో ఉంది. కొద్ది రోజుల కింద భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ జట్టు చిత్తుగా ఓడింది. -
చిన్ననాటి స్నేహితుడిని కలిసిన గిల్.. 14 ఏళ్ల తర్వాత! వీడియో
టీమిండియా స్టార్ ప్లేయర్, టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తన చిన్ననాటి స్నేహితుడు సిమ్రన్‌జీత్ సింగ్‌ను 14 ఏళ్ల తర్వాత కలిశాడు. ఇందుకు ఆసియాకప్-2025 వేదికైంది. పంజాబ్‌కు చెందిన స్పిన్నర్ సిమ్రంజీత్ సింగ్ ప్రస్తుతం యూఏఈ తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు.ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం దుబాయ్ వేదికగా యూఏఈ, భారత్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో యూఏఈను తొమ్మిది వికెట్ల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. అయితే ఈ మ్యాచ్ ముగిశాక గిల్.. సిమ్రన్‌జీత్ వద్దకు వెళ్లి ఆలింగనం చేసుకుంటూ ఆప్యాయతగా మాట్లాడాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ మ్యాచ్‌లో గిల్ కేవలం 9 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్స్‌తో 20 పరుగులు చేశాడు. అతడితో పాటు అభిషేక్ శర్మ( 16 బంతుల్లో 30) మెరుపులు మెరిపించాడు. దీంతో 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం 4.3 ఓవర్లలో చేధించింది.నాకు గిల్ తెలుసు..కాగా భారత్‌తో మ్యాచ్‌కు ముందు పీటీఐతో మాట్లాడిన సిమ్రన్‌జీత్.. గిల్ తనకు చిన్ననాటి నుంచి తెలుసు అని చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు అతడికి తాను గుర్తున్నానో లేదో తెలియదని ఈ యూఏఈ స్పిన్నర్ పేర్కొన్నాడు. కానీ ఇప్పుడు గిల్ కలిసి మాట్లాడడంతో సిమ్రన్‌జీత్ ఆనందంలో మునిగి తేలిపోతున్నాడు. ఇక భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో ఆదివారం దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో తలపడనుంది.When Shubman Gill Meets his childhood friend after 14 years | Asia Cup | Asia Cup 2025 | Simranjeet Singh | UAE | India | Team India | Ind vs uae...#Cricket #teamindia #india #shubmangill #shubman #asiacup #asiacup2025 #indvsuae #simranjeetsingh #shubmangillchildhoodfriend pic.twitter.com/WFQwrzIrPf— Dinesh Bedi (@dineshbedi6) September 11, 2025 -
ఆసియా కప్ టీ-20లో టీమిండియా బోణి
-
ధనాధన్... ఫటాఫట్
అంతర్జాతీయ టి20ల్లో భారత్‌కు, ఇతర జట్లకు మధ్య ఉన్న స్థాయీభేదం ఏమిటో మరోసారి కనిపించింది. వరల్డ్ చాంపియన్ టీమిండియా ముందు పసికూనలా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) జట్టు పూర్తిగా తేలిపోయింది. ఫలితంగా ఆసియా కప్ టి20 టోర్నీలో భారత్ భారీ గెలుపుతో సత్తా చాటింది. భారత బౌలర్ల ధాటికి 79 బంతుల్లోనే యూఏఈ ఇన్నింగ్స్ ముగియగా, లక్ష్యాన్ని ఛేదించేందుకు మన జట్టుకు 27 బంతులే సరిపోయాయి. కుల్దీప్ యాదవ్, శివమ్ దూబే కలిసి 7 వికెట్లతో ప్రత్యర్థిని పడగొట్టగా... అభిషేక్ శర్మ జోరుతో లాంఛనం ముగిసింది. ఇక అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమరంలో ఆదివారం పాకిస్తాన్‌తో భారత్ ఆడుతుది. దుబాయ్: ఆసియా కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఘన విజయంతో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో యూఏఈని చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ 13.1 ఓవర్లలో 57 పరుగులకే కుప్పకూలింది. అలీషాన్ (17 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్), వసీమ్ (22 బంతుల్లో 19; 3 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. కుల్దీప్ యాదవ్ (4/7), శివమ్ దూబే (3/4) బౌలింగ్‌లో చెలరేగారు. అనంతరం భారత్ 4.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 60 పరుగులు చేసి గెలిచింది. ఇందులో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో మొత్తం 46 పరుగులు వచ్చాయి! అభిషేక్ శర్మ (16 బంతుల్లో 30; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడగా... శుబ్‌మన్ గిల్ (9 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (7 నాటౌట్) కలిసి మ్యాచ్‌ను ముగించారు. కుల్దీప్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం లభించింది. భారత్ తమ తదుపరి మ్యాచ్‌ను ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టుతో ఆడుతుంది. అబుదాబి లో నేడు జరిగే గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో హాంకాంగ్‌తో బంగ్లాదేశ్ ఆడుతుంది. టపటపా... యూఏఈ ఇన్నింగ్స్ తొలి 21 బంతుల్లో 26 పరుగులు... ఇందులో 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో అలీషాన్ ఒక్కడే 22 పరుగులు చేశాడు. ఆ తర్వాత బుమ్రా వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో కెప్టెన్ వసీమ్ మూడు ఫోర్లు బాది 12 పరుగులు రాబట్టాడు. ఈ రెండు సందర్భాలు మినహా యూఏఈ ప్రదర్శనలో చెప్పుకోవడానికేమీ లేదు. భారత బౌలర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంతో యూఏఈ బ్యాటర్లు పరుగులు చేయడంలో తీవ్ర తడబాటు కనిపించింది. సింగిల్ కూడా తీయడం కష్టంగా మారిపోవడంతో పాటు జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. 26/0 నుంచి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. తర్వాతి 32 బంతుల్లో 24 పరుగులు మాత్రమే చేసిన టీమ్ సగం వికెట్లు కోల్పోవడంతో స్కోరు 50/5కి చేరింది. వీటిలో కుల్దీప్ ఒకే ఓవర్లో తీసిన మూడు వికెట్లు ఉన్నాయి. అనంతరం తర్వాతి 25 బంతుల్లో 7 పరుగులే చేసిన జట్టు మరో ఐదు వికెట్లు చేజార్చుకుంది. వీటిలో దూబే ఒకే ఓవర్లో తీసిన రెండు వికెట్లు ఉన్నాయి. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా 2, బుమ్రా 4 ఫోర్లు ఇవ్వగా... మిగతా నలుగురు బౌలర్లు కలిపి 55 బంతుల్లో ఒక్క ఫోర్ ఇవ్వకుండా ఒక సిక్స్ మాత్రం (అక్షర్ బౌలింగ్‌లో) ఇచ్చారు! 2024 టి20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత తొలిసారి భారత్ తరఫున టి20 మ్యాచ్ బరిలోకి దిగిన బుమ్రా... ఆరేళ్ల తర్వాత మొదటిసారి పవర్‌ప్లేలో మూడు ఓవర్లు వేశాడు. స్కోరు వివరాలు యూఏఈ ఇన్నింగ్స్: అలీషాన్ (బి) బుమ్రా 22; వసీమ్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 19; జోహెబ్ (సి) కుల్దీప్ (బి) వరుణ్ 2; రాహుల్ చోప్రా (సి) గిల్ (బి) కుల్దీప్ 3; ఆసిఫ్ ఖాన్ (సి) సామ్సన్ (బి) దూబే 2; కౌశిక్ (బి) కుల్దీప్ 2; ధ్రువ్ (ఎల్బీ) (బి) దూబే 1; సిమ్రన్‌జిత్ (ఎల్బీ) (బి) అక్షర్ 1; హైదర్ అలీ (సి) సామ్సన్ (బి) కుల్దీప్ 1; జునైద్ (సి) సూర్యకుమార్ (బి) దూబే 0; రోహిద్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (13.1 ఓవర్లలో ఆలౌట్) 57. వికెట్ల పతనం: 1–26, 2–29, 3–47, 4–48, 5–50, 6–51, 7–52, 8–54, 9–55, 10–57. బౌలింగ్: పాండ్యా 1–0–10–0, బుమ్రా 3–0– 19–1, అక్షర్ 3–0–13–1, వరుణ్ 2–0–4–1, కుల్దీప్ 2.1–0–7–4, దూబే 2–0–4–3. భారత్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (సి) హైదర్ (బి) జునైద్ 30; గిల్ (నాటౌట్) 20; సూర్య కుమార్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (4.3 ఓవర్లలో వికెట్ నష్టానికి) 60. వికెట్ల పతనం: 1–48. బౌలింగ్: హైదర్ అలీ 1–0–10–0, రోహిద్ 1–0–15–0, ధ్రువ్ 1–0–13–0, జునైద్ 1–0–16–1, సిమ్రన్‌జిత్ 0.3–0–6–0. 27 ఛేదనలో బంతుల పరంగా భారత్‌కు ఇదే అతి వేగవంతమైన విజయం. గతంలో 39 బంతుల్లో స్కాట్లాండ్పై లక్ష్యాన్ని ఛేదించింది. -
శుభారంభంపై గురి
దుబాయ్: ఆసియా కప్ టోర్నీలో తమ ఆధిపత్యాన్ని మరోసారి ప్రదర్శించేందుకు భారత జట్టు సిద్ధమైంది. టోర్నీలో భాగంగా గ్రూప్ ‘ఎ’లో నేడు జరిగే తమ తొలి మ్యాచ్‌లో టీమిండియా... ఆతిథ్య జట్టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో తలపడనుంది. డిఫెండింగ్ వరల్డ్‌కప్ చాంపియన్ కావడంతో పాటు అపార ఐపీఎల్ అనుభవంతో నిండిన సూర్యకుమార్ బృందానికి ఈ పోరులో విజయం లాంఛనమే. అయితే మన తుది జట్టు కూర్పు ఎలా ఉంటుందనేదే ఇప్పుడు ప్రధాన చర్చ కానుంది. మరోవైపు అంతర్జాతీయ క్రికెట్లో ఇంకా ఎదిగే దశలోనే ఉన్న యూఏఈ బలమైన ప్రత్యర్థికి ఏమాత్రం పోటీనిస్తుందనేది చూడాలి. 2024లో విజేతగా నిలిచిన టి20 వరల్డ్ కప్ ఆరంభం నుంచి చూస్తే భారత్ 24 మ్యాచ్‌లు గెలిచి, 3 మాత్రమే ఓడింది. సామ్సన్ అవుట్! టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ పునరాగమనంతో టి20 టీమ్‌లో భారత్ తప్పనిసరి మార్పులు చేసుకోవాల్సి వస్తోంది. ఈ ఫార్మాట్లో అసాధారణ ఫామ్‌లో ఉన్న అభిషేక్ శర్మతో కలిసి అతను ఓపెనింగ్ చేస్తాడు. మూడో స్థానంలో ఇప్పటికే తనను తాను నిరూపించుకున్న తిలక్ వర్మకు అదే స్థానంలో అవకాశం ఖాయం కాగా నాలుగో స్థానంలో కెపె్టన్ సూర్యకుమార్ ఉన్నాడు. దాంతో వికెట్ కీపర్‌గా సంజు సామ్సన్‌కు చాన్స్ దొరికే అవకాశం కనిపించడం లేదు.సామ్సన్ సాధారణంగా టాపార్డర్ బ్యాటర్. టాప్–3లో ఆడకపోతే అతనికి చోటు అనవసరమని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. మంగళవారం జట్టు ప్రాక్టీస్ సెషన్‌ను బట్టి చూసినా అదే కనిపించింది. సామ్సన్‌కంటే ఫినిషర్‌గా జితేశ్ శర్మ మెరుగైన ఆటగాడు కాబట్టి కీపర్‌గా అతను బరిలోకి దిగవచ్చు. పేస్ బౌలింగ్, విధ్వంసక బ్యాటింగ్ కలగలిపిన ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేలతో జట్టు దుర్బేధ్యంగా ఉంది. ప్రధాన పేసర్లు బుమ్రా, అర్ష్ దీప్ల స్థానాలకు ఢోకా లేదు. మరో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కూడా ఆడటంపై ఎలాంటి సందేహం లేదు. మిగిలిన ఏకైక స్థానం కోసం కుల్దీప్, వరుణ్ చక్రవర్తి మధ్య పోటీ ఉంది. అయితే టీమిండియాకు సంబంధించి తుది జట్టులో ఎవరు ఉన్నా అంతా విడివిడిగా మ్యాచ్ విన్నర్లు కాబట్టి సమస్య లేదు. అనుభవలేమితో సమస్య... సొంత మైదానంలో బరిలోకి దిగుతుండటం, ఇటీవలే ముక్కోణపు టోర్నీలో కూడా ఆడిన అనుభవం యూఏఈ జట్టుకు మానసికంగా కాస్త ఆత్మవిశ్వాసం పెంచే విషయం. అయితే భారత్‌లాంటి అత్యంత బలమైన జట్టును ఈ టీమ్ నిలువరించడం చాలా కష్టమైన విషయం. బుమ్రాలాంటి స్టార్‌ను ఎదుర్కొని పరుగులు సాధించడం వారి శక్తికి మించిన పని కావచ్చు. ఓపెనర్, కెప్టెన్ మొహమ్మద్ వసీమ్‌తో పాటు మరో ఓపెనర్ అలీషాన్పై జట్టు బ్యాటింగ్ ప్రధానంగా ఆధారపడి ఉంది. ఆసిఫ్ ఖాన్, రాహుల్ చోప్రా కూడా కొన్ని కీలక పరుగులు సాధించగల సమర్థులు. జునైద్ సిద్దిఖ్, రోహిద్, హైదర్ అలీ ప్రధాన బౌలర్లు కాగా...లెఫ్టార్మ్ స్పిన్నర్ సిమ్రన్‌జీత్ సింగ్ మరో కీలక బౌలర్. భారత మాజీ ఆటగాడు, 2007లో టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచిన జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన లాల్‌చంద్ రాజ్‌పుత్ ఇప్పుడు యూఏఈ టీమ్‌కు హెడ్ కోచ్‌గా ఉన్నాడు. ఆయన మార్గదర్శకత్వంలోనే టీమ్ ఇటీవల కాస్త మెరుగైంది.1 భారత్, యూఏఈ మధ్య ఇప్పటి వరకు ఒకే ఒక టి20 మ్యాచ్ జరిగింది. 2016 ఆసియా కప్‌లో భాగంగా జరిగిన ఈ పోరులో భారత్ 9 వికెట్ల తేడాతో గెలిచింది. పిచ్, వాతావరణంచాంపియన్స్ ట్రోఫీ సమయంలో పిచ్‌ల పూర్తిగా పొడిబారి స్పిన్‌కు బాగా అనుకూలించాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఈ సీజన్లో కొత్తగా, జీవం ఉన్న పిచ్‌లు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి అటు బ్యాటింగ్‌తో పాటు పేసర్లకు కూడా మంచి అవకాశం ఉంది. తీవ్రమైన ఎండల మధ్య ఆటగాళ్లు శ్రమించాల్సి ఉంటుంది. -
మైదానంలో వాళ్లను ఆపను.. ఈసారి ఫేవరెట్ జట్టు ఏదీ లేదు: పాక్ కెప్టెన్
పొట్టి క్రికెట్ ప్రేమికులకు వినోదం పంచేందుకు ఆసియా కప్-2025 (Asia Cup 2025) టోర్నమెంట్ సిద్ధంగా ఉంది. అఫ్గనిస్తాన్- హాంకాంగ్ (AFG vs HK) మ్యాచ్‌తో మంగళవారం (సెప్టెంబరు 9) ఈ మెగా ఈవెంట్‌కు తెరలేస్తుంది. ఈ నేపథ్యంలో టోర్నీలో పాల్గొనే ఎనిమిది జట్ల కెప్టెన్లు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.టీమిండియా సారథి సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)తో పాటు.. రషీద్ ఖాన్ (అఫ్గనిస్తాన్), చరిత్ అసలంక (శ్రీలంక), లిటన్ దాస్ (బంగ్లాదేశ్), సల్మాన్ ఆఘా (పాకిస్తాన్), జతీందర్ సింగ్ (ఒమన్), ముహమ్మద్ వసీం (యూఏఈ), యాసిమ్ ముర్తాజా (హాంకాంగ్) విలేకరులతో ముచ్చటించారు.హుందాగా బదులిచ్చిన సూర్యఈ క్రమంలో ఆసియా కప్ తాజా ఎడిషన్ టోర్నీ విజేతగా టీమిండియా ఫేవరెట్ కదా అన్న ప్రశ్న వచ్చింది. ఇందుకు సూర్య తనదైన శైలిలో హుందాగా సమాధానమిచ్చాడు. ‘‘మీకెవరు ఈ విషయం చెప్పారు?.. నేనైతే ఎప్పుడూ వినలేదు.అయితే, సుదీర్ఘకాలంగా మేము టీ20 క్రికెట్లో ఉత్తమంగా రాణిస్తున్నాం. ఇప్పుడు కూడా టోర్నీకి పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాము’’ అని సూర్య తెలిపాడు. ఇక ఇదే ప్రశ్నకు పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా ఇచ్చిన సమాధానం వైరల్‌గా మారింది.షాకింగ్‌గా సల్మాన్ సమాధానంటీమిండియాను ఫేవరెట్‌గా భావిస్తున్నారా అని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘టీ20 క్రికెట్లో గంట.. రెండు గంటల సమయంలోనే అంతా తలకిందులైపోతాయి. మ్యాచ్ రోజు ఎవరైతే గొప్పగా ఆడతారో వారిదే విజయం. అందుకే ఈ ఫార్మాట్ టోర్నీలో ఓ జట్టు ఫేవరెట్‌గా ఉంటుందని నేను అనుకోను’’ అని సల్మాన్ ఆఘా పేర్కొన్నాడు.మైదానంలో వాళ్లను ఆపనుఇక మైదానంలో ఫాస్ట్‌బౌలర్లను కట్టడి చేస్తారా అని విలేకరులు అడుగగా.. ‘‘ఫాస్ట్ బౌలర్లు అంటేనే దూకుడుగా ఉంటారు. వారిని దాని నుంచి మనం వేరుచేయలేము. ఎవరైతే మైదానంలో అగ్రెసివ్ ఉండాలనుకుంటారో వారికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది.క్రీడా స్ఫూర్తికి భంగం కలగనంత వరకు స్వేచ్ఛ కొనసాగుతుంది. నా వైపు నుంచైతే ఫాస్ట్‌బౌలర్లపై ఎలాంటి ఆంక్షలూ ఉండవు’’ అని సల్మాన్ ఆఘా స్పష్టం చేశాడు.కాగా ఆసియా కప్-2025 టోర్నీకి ముందు పాకిస్తాన్.. యూఏఈ- అఫ్గనిస్తాన్‌లతో ముక్కోణపు టీ20 సిరీస్ ఆడింది. ఇందులో యూఏఈ, అఫ్గన్లపై వరుస విజయాలతో ఫైనల్ చేరింది. టైటిల్ పోరులో రషీద్ ఖాన్ బృందాన్ని ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. తద్వారా రెట్టించిన ఆత్మవిశ్వాసంతో పాక్ బరిలోకి దిగుతోంది.టీమిండియాదే హవాఇదిలా ఉంటే.. ఆసియా కప్ టోర్నీలో ఆది నుంచీ టీమిండియాదే హవా. ఇప్పటికి ఎనిమిది సార్లు భారత్ టైటిల్ గెలవగా.. శ్రీలంక ఆరుసార్లు చాంపియన్‌గా నిలిచింది. పాకిస్తాన్ రెండుసార్లు మాత్రమే ట్రోఫీని సొంతం చేసుకోగలిగింది. ఇక ఈసారి దాయాదులు భారత్- పాక్ సెప్టెంబరు 14న ముఖాముఖి తలపడనున్నాయి.చదవండి: ముందుగానే స్టేజీ దిగిపోయిన పాక్ కెప్టెన్.. సూర్య, రషీద్ ఖాన్ ఏం చేశారంటే? -
భారత్‌ను ఆపతరమా!
వన్డే, టి20 ఫార్మాట్లు కలిపి ఇప్పటి వరకు ఆసియా కప్ 16 సార్లు జరిగింది. వీటిలో 8 సార్లు విజేతగా నిలిచిన భారత్ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఫార్మాట్ ఏదైనా ఇప్పుడు టీమిండియా ఫామ్ చూస్తే ఎదురులేని జట్టుగా కనిపిస్తోంది. విధ్వంసకర బ్యాటర్లు, పదునైన బౌలర్లతో నిండిన సూర్యకుమార్ బృందం టైటిల్ గెలవకపోతేనే ఆశ్చర్యపోవచ్చు! ఎనిమిది దేశాల ఈ టోర్నీలో భారత్‌కు మిగతా జట్లు ఎంత వరకు పోటీనిస్తాయనేది సందేహమే. ఈ నేపథ్యంలో కొంత విరామం తర్వాత క్రికెట్ అభిమానులకు కొత్త సీజన్లో మళ్లీ పూర్తి వినోదానికి ఆసియా కప్‌తో తెర లేస్తోంది. దుబాయ్: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన సరిగ్గా ఆరు నెలల తర్వాత ఎడారి దేశంలో మరో పెద్ద టోర్నీకి రంగం సిద్ధమైంది. ఎనిమిది టీమ్‌లు పాల్గొంటున్న ఆసియా కప్ టి20 టోర్నీ నేడు మొదలవుతోంది. తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌తో హాంకాంగ్ ‘ఢీ’కొంటుండగా... భారత్ తమ తొలి మ్యాచ్‌లో బుధవారం ఆతిథ్య యూఏఈతో తలపడుతుంది. నిజానికి ఈ టోర్నీ భారత్‌లోనే జరగాల్సింది. అయితే పాకిస్తాన్ మన దేశంలో ఆడే అవకాశం లేదని తేలడంతో తటస్థ వేదికకు మార్చారు.దుబాయ్, అబుదాబిలలో మ్యాచ్‌లు నిర్వహిస్తుండగా... ఆతిథ్య హక్కులు మాత్రం బీసీసీఐ చేతుల్లోనే ఉన్నాయి. 2023లో వన్డే ఫార్మాట్లో జరిగిన ఆసియా కప్‌లో భారత్ విజేతగా నిలిచింది. సిరాజ్ (6/51) ధాటికి శ్రీలంక 50 పరుగులకే కుప్పకూలగా, భారత్ 6.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. వచ్చే ఏడాది ఆరంభంలో టి20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఈసారి ఫార్మాట్‌ను టి20కి మార్చారు. సెప్టెంబర్ 28న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. రెండు గ్రూపులుగా... ఆసియా కప్‌లో ఎనిమిది జట్లు ఆడటం ఇదే మొదటిసారి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ నేరుగా అర్హత సాధించగా... ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్రీమియర్ కప్ పేరుతో నిర్వహించిన టోర్నీలో టాప్–3లో నిలిచిన యూఏఈ, ఒమన్, హాంకాంగ్ టోర్నీకి అర్హత పొందాయి. గ్రూప్ ‘ఎ’లో భారత్‌తో పాటు పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ ఉండగా... గ్రూప్ ‘బి’లో అఫ్గానిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, హాంకాంగ్ తలపడుతున్నాయి. ప్రతీ జట్టు తమ గ్రూప్‌లోని మిగతా మూడు జట్లతో తలపడుతుంది. ప్రతీ గ్రూప్‌లోని టాప్–2 టీమ్‌లు సూపర్–4కు అర్హత సాధిస్తాయి. ఇక్కడా మిగతా మూడు జట్లతో ఆడిన తర్వాత టాప్–2 ఫైనల్ చేరతాయి. అంతా ఆ మ్యాచ్ కోసమే... పహల్గాం ఉగ్రదాడి తర్వాతి పరిణామాలను బట్టి చూస్తే భారత్, పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్‌లు జరగడం అసాధ్యంగా అనిపించింది. అయితే చివరకు భారత ప్రభుత్వం పాక్‌తో మ్యాచ్‌లు ఆడేందుకు టీమిండియాకు అనుమతి ఇచ్చింది. బలాబలాలపరంగా ఇరు జట్ల మధ్య ఆకాశమంత వ్యత్యాసం ఉన్నా...ఇటీవలి ఉద్రిక్తతల నేపథ్యంలో ఒక్కసారిగా ఈ పోరుపై ఆసక్తి పెరిగింది.భారత్, పాక్ గ్రూప్ దశలో ఈ నెల 14న (ఆదివారం) తలపడతాయి. సంచలన ఫలితాలు లేకపోతే ఇరు జట్ల మధ్య టోర్నీలో మరో రెండు మ్యాచ్‌లు (ఫైనల్ సహా) జరిగే అవకాశం కూడా ఉంది. దాయాది దేశాల మధ్య గతంలో ఎప్పుడూ ఆసియా కప్ ఫైనల్ జరగలేదు! కొత్త కుర్రాళ్లతో... భారత్‌తో పోలిస్తే బలహీనంగా ఉన్నా... ఇతర టీమ్‌లు కొన్ని అనూహ్య ఫలితాలను ఆశిస్తున్నాయి. పైగా కొందరు ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శన కూడా టోర్నీలో కీలకం కానుంది. బాబర్, రిజ్వాన్‌లను తప్పించిన పాకిస్తాన్ జట్టు సల్మాన్ ఆఘా సారథ్యంలో కొత్తగా కనిపిస్తోంది. ముక్కోణపు టోర్నీని గెలవడం జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. బంగ్లా ఇటీవలే లంకపై సిరీస్ విజయం సాధించింది. ఒమన్‌కు ముంబై మాజీ క్రికెటర్ సులక్షణ్ కులకర్ణి కోచ్‌గా వ్యవహరిస్తుండగా, హాంకాంగ్, యూఏఈ జట్లు తమ కెపె్టన్లు ముర్తజా, వసీమ్‌లపై ఆధారపడుతున్నాయి. పాక్ లెఫ్టార్మ్ పేసర్ సల్మాన్ మీర్జా, అఫ్గానిస్తాన్ స్పిన్నర్ ఘజన్ఫర్ కొత్తగా చూడదగ్గ ఆటగాళ్లు. -
ఎట్టకేలకు ఒకటి.. ట్రై సిరీస్ గెలిచిన పాక్.. ఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్పై విజయం
ద్వైపాక్షిక సిరీస్‌లు కాకుండా పాక్ ఇటీవలికాలంలో ఆడిన ఏ ప్రధాన టోర్నీ గెలవలేదు. చివరిగా 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన ఆ జట్టు.. ఎట్టకేలకు 8 ఏళ్ల తర్వాత రెండుకు పైగా జట్లు పాల్గొన్న ఓ టోర్నీలో విజయం సాధించింది. యూఏఈ వేదికగా జరిగిన ముక్కోణపు టోర్నీలో విజేతగా నిలిచింది. నిన్న (సెప్టెంబర్ 7) జరిగిన ఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది.షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ చెప్పుకోదగ్గ స్కోరేమీ చేయలేదు. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫకర్ జమాన్ (27), మొహమ్మద్ నవాజ్ (25), కెప్టెన్ సల్మాన్ అఘా (24) మాత్రమే 20కి పైగా స్కోర్లు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి పాక్‌ను కట్టడి చేశారు. రషీద్ ఖాన్ 3, నూర్ అహ్మద్, ఫజల్ హక్ ఫారూకీ తలో 2, ఘజన్ఫర్ ఓ వికెట్ తీసి పాక్‌ను కట్టడి చేశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడంలో పాక్ విజయవంతమైంది. ఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ తడబడింది. మొహమ్మద్ నవాజ్ (4-1-19-5) ధాటికి 15.5 ఓవర్లలో 66 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా లో స్కోరింగ్ మ్యాచ్‌లో 75 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. పాక్ బౌలర్లలో అబ్రార్ అహ్మద్, సుఫియాన్ ముఖీమ్ కూడా తలో 2 వికెట్లు తీసి ఆఫ్ఘనిస్తాన్‌ను దెబ్బ కొట్టారు. షాహీన్ అఫ్రిది ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో రషీద్ ఖాన్ (17), సెదిఖుల్లా అటల్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా వాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఈ టోర్నీలో పాల్గొన్న మరో జట్టు యూఏఈ. ఈ జట్టు లీగ్ దశలో ఆడిన 4 మ్యాచ్‌ల్లో ఓడి అప్పుడే నిష్క్రమించింది. -
ఈసారైనా టైటిల్ గెలవండి: భారత మాజీ క్రికెటర్
టీమిండియా అత్యధికంగా ఎనిమిదిసార్లు.. శ్రీలంక ఆరుసార్లు.. పాకిస్తాన్ రెండుసార్లు.. ఆసియా కప్ (Asia Cup) టైటిల్‌ను గెలిచాయి. ఇక ఈ ఖండాంతర టోర్నమెంట్లో బంగ్లాదేశ్ మూడుసార్లు ఫైనల్ చేరగలిగింది. కానీ కప్ మాత్రం గెలవలేక రన్నరప్‌తో సరిపెట్టుకుంది.ఇక ఆసియా కప్ తాజా ఎడిషన్‌లో గ్రూప్- ‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, ఒమన్, యూఏఈ.. గ్రూప్- ‘బి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ పాల్గొంటున్నాయి. ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించే ఈ టోర్నీకి సెప్టెంబరు 9- 28 వరకు షెడ్యూల్ ఖరారైంది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా (Aakash Chopra).. అఫ్గనిస్తాన్ జట్టును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. గత కొంతకాలంగా ఐసీసీ టోర్నీల్లో సత్తా చాటిన అఫ్గన్‌కు.. ఈసారి ఆసియా కప్ టైటిల్ రేసులో నిలిచే అవకాశం ఉందన్నాడు.తేలికగా తీసిపారేసే జట్టు కాదు‘‘ఇప్పటి వరకు వాళ్లు తోడి పెళ్లికూతుళ్లుగా మాత్రమే ఉన్నారు. పెళ్లికూతురు మాత్రం కాలేకపోయారు. అంటే.. వారి ప్రాముఖ్యత ఇంకా పెరగలేదని అర్థం. అయితే, అంత తేలికగా తీసిపారేసే జట్టు కూడా కాదు. అఫ్గన్ క్రికెటర్లను మనం గౌరవిస్తాం.. ప్రశంసలు కురిపిస్తాం.కానీ వారు ఇంత వరకు ఒక్క టైటిల్ కూడా గెలవలేదన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటి వరకు కనీసం ఒక్కసారి కూడా ఆసియా కప్ గెలవలేదు. టీ20 ప్రపంచకప్-2024 సెమీ ఫైనల్‌కు వెళ్లడం.. వన్డే వరల్డ్‌కప్-2023లో రాణించడం.. గొప్ప విషయాలు.ఈసారైనా గెలవండిఅయితే, ఈసారి ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో జరగడం.. ఆ జట్టుకు టైటిల్ గెలిచేందుకు సువర్ణావకాశాన్ని ఇచ్చింది. దీనిని వారు సద్వినియోగం చేసుకుంటారో.. లేదో చూడాలి. సెదీఖుల్లా అటల్, డార్విష్ రసూలీ, అల్లా ఘజన్ఫర్ వంటి యువ ఆటగాళ్లకు ఇదొక మంచి అవకాశం. ఒకవేళ వారు ఇక్కడ రాణిస్తే గనుక ఐపీఎల్‌లోనూ మంచి అవకాశాలు వస్తాయి’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.తమ బలమైన స్పిన్ మాయాజాలంలో ప్రత్యర్థిని బంధిస్తే అఫ్గనిస్తాన్ గెలుపు సులువేనన్న ఆకాశ్ చోప్రా.. రహ్మనుల్లా గుర్బాజ్ శుభారంభం అందిస్తే బ్యాటింగ్ పరంగానూ తిరుగు ఉండదని పేర్కొన్నాడు. ఇబ్రహీం జద్రాన్ కూడా తన వంతు పాత్ర పోషించాల్సి ఉందని పేర్కొన్నాడు.అయితే, అఫ్గన్ జట్టులో ఉన్న ప్రధాన బలహీనత.. నిలకడలేమి అని ఆకాశ్ చోప్రా అన్నాడు. ప్రతి ఒక్క జట్టుకు ఇలాంటి బలహీనత ఉంటుందని.. ప్రతిసారీ గెలవడం ఎవరికీ సాధ్యం కాదని పేర్కొన్నాడు. కాబట్టి సరైన సమయంలో రాణించి కప్ గెలిచే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని రషీద్ ఖాన్ బృందానికి సూచించాడు.ఆసియాకప్-2025 టోర్నీకి అఫ్గనిస్తాన్ జట్టు ఇదేరషీద్ ఖాన్ (కెప్టెన్), రహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, డార్విష్ రసూలీ, సెదిఖుల్లా అటల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కరీం జనత్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, షరాఫుద్దీన్ అష్రఫ్, మహ్మద్ ఇషాక్, ముజీబ్ ఉర్ రహమాన్, అల్లా ఘజన్ఫర్, నూర్ అహ్మద్, ఫారిక్ అహ్మద్ మాలిక్, నవీన్-ఉల్-హక్, ఫజల్హాక్ ఫరూకీరిజర్వ్ ఆటగాళ్లు: వఫివుల్లా తారఖాల్, నంగ్యాల్ ఖరోటే, అబ్దుల్లా అహ్మద్జాయ్.చదవండి: చరిత్ర సృష్టించిన బవుమా బృందం.. బ్రీట్జ్కే వరల్డ్ రికార్డుతో.. -
భయపెట్టిన యూఏఈ.. బతికిపోయిన ఆఫ్ఘనిస్తాన్
యూఏఈ ట్రై సిరీస్-2025లో ఇదివరకే ఫైనల్‌కు క్వాలిఫై అయిన ఆఫ్ఘనిస్తాన్.. నిన్న యూఏఈతో జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో తృటిలో ఓటమి తప్పించుకుంది. ఈ మ్యాచ్‌లో యూఏఈ ఓడినా, అద్భుతంగా పోరాడింది. ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన 171 పరుగుల లక్ష్యానికి యూఏఈ 5 పరుగుల దూరంలో నిలిచిపోయింది.తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. ఓపెనర్లు గుర్బాజ్ (40), ఇబ్రహీం జద్రాన్ (48) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. కరీం జనత్ (28), గుల్బదిన్ నైబ్ (20 నాటౌట్), అజ్మతుల్లా (14 నాటౌట్) ఆఖర్లో వేగంగా పరుగులు సాధించారు. యూఏఈ బౌలర్లలో హైదర్ అలీ 2 వికెట్లు తీయగా.. సిమ్రన్‌జీత్ సింగ్, ముహమ్మద్ ఫరూక్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 171 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన యూఏఈ.. చివరి బంతి వరకు గెలుపు కోసం పోరాడింది. చివరి ఓవర్లో గెలుపుకు 17 పరుగులు అవసరం కాగా.. యూఏఈ తొలి మూడు బంతులకే 12 పరుగులు చేసి గెలుపు ఖాయమనుకుంది. అయితే ఆఫ్ఘన్ బౌలర్ ఫరీద్ అహ్మద్ మాలిక్ అనూహ్యంగా పుంజుకుని చివరి 3 బంతులకు ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు.దీంతో యూఏఈకి ఓటమి తప్పలేదు. యూఏఈ ఇన్నింగ్స్‌కు కెప్టెన్ ముహమ్మద్ వసీం (44), అలీషాన్ షరాఫు (27) శుభారంభాన్ని అందించారు. ఆఖర్లో ఆసిఫ్ ఖాన్ (40) మెరుపు ఇన్నింగ్స్ ఆడినా చివరి రెండు బంతులను వృధా చేసి, మూడో బంతికి ఔటయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో ఫరీద్ మాలిక్, ముజీబ్, షరాఫుద్దీన్, నూర్ అహ్మద్, అహ్మద్జాయ్ తలో వికెట్ తీశారు.కాగా, ఈ టోర్నీ ఫైనల్ రేపు జరుగనుంది. టైటిల్ కోసం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ తలడపడతాయి. ఈ టోర్నీ ముగియగానే ఇరు జట్లు ఆసియా కప్‌లో పాల్గొంటాయి. -
యూఏఈ పెట్టుబడులకు తెలంగాణే బెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణను ‘గ్లోబల్ డిజిటల్, ఇన్నోవేషన్ హబ్’గా మార్చా లని కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పించిందని, ఈ లక్ష్య సాధనలో భాగస్వామి కావాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆహ్వనించారు. యూఏఈ పర్యటనలో భాగంగా ఆ దేశ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఏఐ, డిజిటల్ ఎకానమీ అండ్ రిమోట్ వర్క్ అప్లికేషన్స్ ఒమర్ బిన్ సుల్తాన్ అల్ ఒలా మాతో గురువారం శ్రీధర్‌బాబు భేటీ అయ్యారు.తెలంగాణను ‘ఏఐ కేపిటల్ ఆఫ్ ది గ్లోబ్’గా తీర్చి దిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న ఏఐ సిటీ, ఏఐ యూనివర్సిటీ, ఏఐ ఇన్నోవేషన్ హబ్ తదితర ప్రాజెక్టుల గురించి శ్రీధర్ బాబు వివరించారు. భారత్‌లోనే తొలిసారిగా అందుబాటులోకి తెచ్చిన ఏఐ ఆధారిత ‘తెలంగాణ డేటా ఎక్సే్చంజ్’వల్ల ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, ప్రభుత్వ పాలన తదితర రంగాల్లో కలుగుతున్న ప్రయోజనాల గురించి తెలిపారు. హైదరాబాద్‌లో ఏఐ ఆర్ అండ్ డీ సెంటర్‌ను ప్రారంభించాలని కోరారు.యూఏఈ డిజిటల్ ఆర్థిక సంస్థలకు భార త్లో ప్రవేశ కేంద్రంగా హైదరాబాద్ అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందని తెలిపారు.జీసీసీల ఏర్పాటుకు తెలంగాణఅన్ని రకాలుగా అనుకూలమని, ఇక్కడ యూఏ ఐ కంపెనీలు నానో– జీసీసీలు, డిజిటల్ హబ్స్ ప్రారంభించేలా చొరవ చూపాలని విన్నవించారు.డీప్–టెక్, ఏఐ స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టడానికి యూఏఈ సావరిన్ ఫండ్స్, వెంచర్ క్యాపిటల్ సంస్థలకు మంచి అవకాశాలు ఉన్నాయని శ్రీధర్‌బాబు తెలిపారు. ‘ఏఐ, స్టార్టప్ సమ్మిట్’ను యూఏఈతో కలిసి నిర్వహించేందుకు తెలంగాణ ఆసక్తిగా ఉందని, ఇందుకు సహకరించాలని కోరారు. గేమింగ్‌లో‘తెలంగాణ–యూఏఈ ఫ్యూచర్ స్కిల్స్ అకాడమీ’ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని ఆహ్వనించారు. తెలంగాణతో కలిసి పనిచేసేందుకు సిద్ధం: అల్ ఒలామా తెలంగాణను ‘గ్లోబల్ డిజిటల్, ఇన్నోవేషన్’హబ్‌గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను యూఏఈ మంత్రి ఓమర్ బిన్ సుల్తాన్ అల్ ఒలామా ప్రశంసించారు. ఏఐ, డిజిటల్ ఎకానమీ, క్లౌడ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, గేమింగ్ తదితర రంగాల్లో తెలంగాణతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.100 బిలియన్ డాలర్ల అంచనా వ్యయంతో యూఏఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఏఐ ఆధారిత ‘స్టార్ గేట్’ప్రాజెక్టు గురించి మంత్రి శ్రీధర్‌బాబుకు వివరించారు. ఈ ప్రాజెక్టులో తెలంగాణ కీలక భాగస్వామిగా మారాలని ఆకాంక్షించారు. త్వరలో యూఏఐలో నిర్వహించనున్న ‘ఫిన్ టెక్ స్టార్టప్స్’సమ్మిట్‌లో తెలంగాణ కంపెనీలను కూడా భాగస్వామ్యం చేస్తామని చెప్పారు. -
‘ఆసియా కప్-2025లోనూ అతడిని ఆడించరు.. మళ్లీ బెంచ్ మీదే’
టీమిండియాకు దొరికిన అదురైన లెఫ్టార్మ్ స్పిన్నర్లలో కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) ఒకడు. అండర్-19 ప్రపంచకప్-2014లో భారత్ తరఫున ఆరు ఇన్నింగ్స్‌లో పద్నాలుగు వికెట్లు కూల్చి వెలుగులోకి వచ్చాడీ కాన్పూర్ ‘కుర్రాడు’. ఆ తర్వాత దేశీ క్రికెట్లో, ఐపీఎల్లో రాణించి టీమిండియాకు ఆడే అవకాశం దక్కించుకున్నాడు.మ్యాచ్ విన్నర్చైనామన్ స్పిన్నర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న కుల్దీప్ యాదవ్.. ఇప్పటికే మ్యాచ్ విన్నర్‌గా నిరూపించుకున్నాడు. గతేడాది సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ (IND vs ENG)ను భారత్ 4-1తో గెలవడంలో కుల్దీప్ది కీలక పాత్ర. అదే విధంగా.. టీ20 ప్రపంచకప్-2024, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిళ్లను టీమిండియా సొంతం చేసుకోవడంలోనూ అతడు కీలకంగా వ్యవహరించాడు.అయినప్పటికీ చాన్నాళ్లుగా కుల్దీప్ బెంచ్‌కే పరిమితమవుతున్నాడు. ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఐదు టెస్టుల్లోనూ అతడికి ఆడే అవకాశం రాలేదు. మార్చిలో చివరగా టీమిండియాకు ఆడిన కుల్దీప్ యాదవ్.. ఆసియా కప్-2025 టోర్నమెంట్‌తో పునరాగమనం చేసే అవకాశం ఉంది.ఇంగ్లండ్‌లో ఆడిస్తే గెలిచేవాళ్లంఅయితే, ఈ టీ20 టోర్నీలోనూ కుల్దీప్ యాదవ్ బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశం ఉందని.. భారత మాజీ స్పిన్నర్ మణిందర్ సింగ్ అంటున్నాడు. ‘‘ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో కుల్దీప్ యాదవ్‌ను ఆడించి ఉంటే.. టీమిండియా 3-1తో గెలిచేది.కుల్దీప్ లాంటి బౌలర్లు అరుదుగా ఉంటారు. ఇంగ్లిష్ బ్యాటర్లు అతడి బౌలింగ్‌లో ఇబ్బందిపడేవారు. అతడి గూగ్లీలను వాళ్లు రీడ్ చేయలేకపోయేవారు. తొలి టెస్టులో వాళ్లు 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు. ఆ సమయంలో కుల్దీప్ గనుక మైదానంలో ఉండి ఉంటే ఇలా జరిగేదే కాదు.ఈసారి కూడా బెంచ్ మీదే!ఇక ఆసియా కప్ టోర్నీలోనూ ఇద్దరు స్పిన్నర్లను మాత్రమే ఆడించాలని భావిస్తే.. మేనేజ్మెంట్ కుల్దీప్ యాదవ్‌ను ఈసారి కూడా పక్కనపెట్టవచ్చు. వరుణ్ చక్రవర్తిని ఆడిస్తారు. బ్యాటింగ్ కూడా చేయగలడు కాబట్టి అక్షర్ పటేల్‌ను తీసుకుంటారు’’ అని మణిందర్ సింగ్ ఇండియా టుడేతో పేర్కొన్నాడు.కాగా సెప్టెంబరు 9- 28 వరకు యూఏఈ వేదికగా ఆసియా కప్ టోర్నీ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఇదిలా ఉంటే.. చివరగా ఇంగ్లండ్‌లో పర్యటించిన టీమిండియా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీని 2-2తో సమం చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ టూర్తోనే శుబ్‌మన్ గిల్ టీమిండియా టెస్టు సారథిగా ప్రయాణం ఆరంభించాడు. బౌలింగ్ దళంలో పేసర్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ కీలకంగా వ్యవహరించగా.. స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా సత్తా చాటాడు.చదవండి: ఒక్కరికే మద్దతు.. అందుకే గిల్‌కు టీ20 జట్టులో చోటు: ఊతప్ప -
చరిత్ర తిరగరాసిన యూఏఈ కెప్టెన్.. రోహిత్ శర్మ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు బద్దలు
యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం అంతర్జాతీయ టీ20ల్లో ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. నిన్నటి దాకా టీమిండియా మాజీ టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉన్న ఆ రికార్డును వసీం తన ఖాతాలో వేసుకున్నాడు. యూఏఈ టీ20 ట్రై సిరీస్‌లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో నిన్న (సెప్టెంబర్ 1) జరిగిన మ్యాచ్‌లో 6 సిక్సర్లు బాదిన వసీం.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన కెప్టెన్‌గా అవతరించాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మను వెనక్కు నెట్టాడు. రోహిత్ టీమిండియా కెప్టెన్‌గా 62 ఇన్నింగ్స్‌ల్లో 105 సిక్సర్లు బాదగా.. వసీం 54 ఇన్నింగ్స్‌ల్లోనే 110 సిక్సర్లు కొట్టాడు. ఈ జాబితా టాప్-4లో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (65 ఇన్నింగ్స్‌ల్లో 86 సిక్సర్లు), ఆసీస్ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ (76 ఇన్నింగ్స్‌ల్లో 82 సిక్సర్లు) వసీం, రోహిత్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ముహమ్మద్ వసీం మెరుపు అర్ద శతకంతో (37 బంతుల్లో 67; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) విరుచుకుపడినా యూఏఈని గెలిపించలేకపోయాడు. అతనికి వికెట్‌కీపర్ రాహుల్ చోప్రా (35 బంతుల్లో 52 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా సహకరించినా ప్రయోజనం లేకుండా పోయింది. మిగతా బ్యాటర్లలో ఒక్కరు కూడా రాణించకపోవడంతో ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యం యూఏఈకి చాలా భారీగా పరిగణించబడింది. రషీద్ ఖాన్ (4-0-21-3), షరాఫుద్దీన్ అష్రఫ్ (4-0-24-3) చెలరేగడంతో 150 పరుగులకే పరిమితమై, 38 పరుగుల తేడాతో పరాజయంపాలైంది.అంతకుముందు సెదీఖుల్లా అటల్ (40 బంతుల్లో 54), ఇబ్రహాం జద్రాన్ (40 బంతుల్లో 63), అజ్మతుల్లా (12 బంతుల్లో 20 నాటౌట్), కరీమ్ జనత్ (10 బంతుల్లో 23 నాటౌట్) రాణించడంతో ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.కాగా, ఆసియా కప్‌కు ముందు షార్జా వేదికగా జరుగుతున్న ముక్కోణపు టోర్నీలో యూఏఈ, ఆఫ్ఘనిస్తాన్‌తో పాటు పాకిస్తాన్ కూడా పాల్గొంటుంది. ఈ టోర్నీలో పాక్ వరుసగా రెండు విజయాలు (ఆఫ్ఘన్, యూఏఈ) సాధించగా.. ఆఫ్ఘనిస్తాన్ తాజా తొలి విజయం నమోదు చేసింది. యూఏఈ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడి బోణీ కోసం ఎదురుచూస్తుంది. ఇవాళ పాక్, ఆఫ్ఘనిస్తాన్ మరోసారి తలపడనున్నాయి. -
రషీద్ ఖాన్‌ను ఓదార్చిన పాక్ క్రికెటర్లు.. వీడియో
అఫ్గనిస్తాన్ టీ20 జట్టు కెప్టెన్ రషీద్ ఖాన్ (Rashid Khan)ను పాకిస్తాన్ క్రికెటర్లు ఓదార్చారు. ఇరుజట్ల మధ్య టీ20 మ్యాచ్ ముగిసిన తర్వాత పాక్ పేసర్ షాహిన్ ఆఫ్రిది రషీద్‌ను ఆలింగనం చేసుకుని అతడి భుజం తట్టాడు. కాగా రషీద్ ఖాన్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.నా ప్రగాఢ సానుభూతిఈ స్టార్ స్పిన్నర్ అన్న అబ్దుల్ హలీమ్ శిన్వారి మృతి చెందాడు. ఈ విషయాన్ని అఫ్గన్ క్రికెటర్ ఇబ్రహీం జద్రాన్ (Ibrabim Zadran) సోమవారం వెల్లడించాడు. ‘‘రషీద్ ఖాన్ పెద్దన్న హాజీ అబ్దుల్ హలీమ్ మరణించారని తెలిసి నా మనసు బాధతో నిండిపోయింది. ట్రై సిరీస్పెద్దన్న కుటుంబం మొత్తానికి తండ్రిలాంటి వాడు. రషీద్ ఖాన్, అతడి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’’ అని ఇబ్రహీం జద్రాన్ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. ఆసియా కప్-2025 టోర్నమెంట్ సన్నాహకాల్లో భాగంగా అఫ్గనిస్తాన్- పాకిస్తాన్- యూఏఈ మధ్య ట్రై సిరీస్ శుక్రవారం మొదలైంది. ఈ ముక్కోణపు పోరులో భాగంగా తొలుత పాకిస్తాన్- అఫ్గనిస్తాన్ మధ్య షార్జా వేదికగా మ్యాచ్ జరిగింది.సల్మాన్ ఆఘా కెప్టెన్ ఇన్నింగ్స్ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. టాపార్డర్‌లో సాహిబ్జాదా ఫర్హాన్ (21), సయీమ్ ఆయుబ్ (14).. ఫఖర్ జమాన్ (20) విఫలం అయ్యారు. అయితే, సల్మాన్ ఆఘా కెప్టెన్ ఇన్నింగ్స్ (36 బంతుల్లో 53)తో అలరించడంతో పాక్ మెరుగైన స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.అఫ్గన్ బౌలర్లలో ఫరీద్ అహ్మద్ రెండు వికెట్లు తీయగా.. ముజీబ్ ఉర్ రెహ్మాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, కెప్టెన్ రషీద్ ఖాన్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో అఫ్గనిస్తాన్ శుభారంభం అందుకున్నా దానిని కొనసాగించలేకపోయింది.39 పరుగుల తేడాతో విజయంఓపెనర్లలో రహ్మనుల్లా గుర్బాజ్ (38) ఫర్వాలేదనిపించగా.. ఇబ్రహీం జద్రాన్ (9) నిరాశపరిచాడు. సెదీకుల్లా అటల్ 23, డార్విష్ రసూలీ 21 పరుగులు చేయగా.. రషీద్ ఖాన్ 16 బంతుల్లో 39 పరుగులు చేశాడు.అయితే, మిగతావారి నుంచి సహకారం లేకపోవడంతో రషీద్ మెరుపు ఇన్నింగ్స్ వృథాగా పోయింది. 19.5 ఓవర్లలో 143 పరుగులు చేసి అఫ్గనిస్తాన్ ఆలౌట్ అయింది. ఫలితంగా పాక్ అఫ్గన్‌పై 39 పరుగుల తేడాతో విజయం సాధించింది.ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం పాక్ క్రికెటర్లు రషీద్ ఖాన్ అన్న మృతికి సంతాపం వ్యక్తం చేశారు. డ్రెసింగ్‌రూమ్ సమీపంలో ప్రార్థన చేసి అతడిని ఓదార్చారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.చదవండి: ఆసియా కప్-2025: కీలక అప్డేట్.. ఆ ఒక్కటి మినహా.. ఫైనల్‌తో సహా.. Pakistan team offers condolences and prayers on the death of Rashid Khan's elder brother. #PakistanCricket #RashidKhan pic.twitter.com/gxwvXyYdnG— Ahtasham Riaz (@ahtashamriaz22) August 29, 2025 -
ఆసియా కప్-2025: కీలక అప్డేట్.. ఆ ఒక్కటి మినహా..
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వేదికగా సెప్టెంబరు 9న ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించే ఈ ఈవెంట్లో ఎనిమిది జట్లు పాల్గొంటుండగా.. మొత్తంగా 19 మ్యాచ్‌లు జరుగనున్నాయి.గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్, ఒమన్, యూఏఈ.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ అమీతుమీ తేల్చుకుంటాయి. కాగా ఈ టోర్నీలో మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 7. 30 నిమిషాలకు ఆరంభం కావాల్సింది. అయితే, తాజాగా మ్యాచ్ ఆరంభ సమయంలో మార్పులు చేస్తున్నట్లు యూఏఈ క్రికెట్ ప్రకటించింది.ఫైనల్‌తో సహా..ఆసియా కప్-2025 టోర్నీలో 19 మ్యాచ్‌లకు గానూ.. 18 మ్యాచ్‌లు (ఫైనల్‌తో సహా) భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఆరంభమవుతాయి. సెప్టెంబరులో యూఏఈలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బ్రాడ్కాస్టర్ల అభ్యర్థన మేరకు యూఏఈ క్రికెట్ ఈ మేరకు మ్యాచ్ సమయాల్లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది.కాగా సెప్టెంబరు 15న అబుదాబిలోని జాయేద్ క్రికెట్ స్టేడియంలో యూఏఈ- ఒమన్ మధ్య జరిగే మ్యాచ్ టైమింగ్‌లో మాత్రం మార్పులేదు. ఇదిలా ఉంటే.. సెప్టెంబరు 9న అఫ్గనిస్తాన్- హాంకాంగ్ మధ్య మ్యాచ్‌తో ఆసియా కప్ టోర్నీకి తెరలేవనుంది. సెప్టెంబరు 28న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.లీగ్ దశ షెడ్యూల్👉సెప్టెంబరు 9: అఫ్గనిస్తాన్ వర్సెస్ హాంగ్‌కాంగ్- అబుదాబి- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 10: ఇండియా వర్సెస్ యూఏఈ- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు 👉సెప్టెంబరు 11: బంగ్లాదేశ్ వర్సెస్ హాంగ్‌కాంగ్- అబుదాబి- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 12: పాకిస్తాన్ వర్సెస్ ఒమన్- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 13: బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక- అబుదాబి- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 14: ఇండియా వర్సెస్ పాకిస్తాన్- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 15: యూఏఈ వర్సెస్ ఒమన్- అబుదాబి- సాయంత్రం 5.30 నిమిషాలకు👉సెప్టెంబరు 15:శ్రీలంక వర్సెస్ హాంగ్‌కాంగ్- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 17: పాకిస్తాన్ వర్సెస్ యూఏఈ- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 18: శ్రీలంక వర్సెస్ అఫ్గనిస్తాన్- అబుదాబి- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 19: ఇండియా వర్సెస్ ఒమన్- అబుదాబి- రాత్రి ఎనిమిది గంటలకుసూపర్ 4 దశ👉సెప్టెంబరు 20: గ్రూప్- బి టాపర్ వర్సెస్ రెండో స్థానంలో ఉన్న జట్టు (B1 Vs B2)- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 21: గ్రూప్-ఎ టాపర్ వర్సెస్ రెండో స్థానంలో ఉన్న జట్టు (A1 vs A2)- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 23: A2 vs B1- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 24: A1 vs B2- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 25: A2 vs B2- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 26: A1 vs B1- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 28: ఫైనల్- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు.చదవండి: రాజస్తాన్ రాయల్స్‌కు ద్రవిడ్ గుడ్‌బై.. అధికారిక ప్రకటన విడుదల -
రషీద్ ఖాన్ చిరునవ్వులు.. పాక్ కెప్టెన్ ముఖం మాడిపోయింది!
పాకిస్తాన్ క్రికెట్ జట్టు గత కొంతకాలంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. వన్డే వరల్డ్‌కప్-2023, టీ20 ప్రపంచకప్-2024, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 వంటి మెగా టోర్నమెంట్లలో కనీసం సెమీస్ కూడా చేరలేక చతికిలపడింది. ద్వైపాక్షిక సిరీస్‌లలోనూ పరిస్థితి అంతంత మాత్రమే.సల్మాన్ ఆఘాకు పగ్గాలుఈ క్రమంలో 2024లో బాబర్ ఆజం (Babar Azam) కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. మహ్మద్ రిజ్వాన్ పాక్ జట్టు వన్డే, టీ20 పగ్గాలు చేపట్టాడు. కానీ ఏడాదిలోపే బాబర్‌తో కలిసి టీ20 జట్టులో స్థానం కోల్పోయాడు రిజ్వాన్. ఆసియా కప్-2025 టీ20 టోర్నీకి పాక్ బోర్డు ప్రకటించిన జట్టులోనూ వీరిద్దరికి స్థానం దక్కలేదు.టీ20 ట్రై సిరీస్ ఇక రిజ్వాన్ స్థానంలో పాకిస్తాన్ టీ20 జట్టు కెప్టెన్‌గా ఎంపికైన సల్మాన్ ఆఘా.. చివరగా ఇటీవల వెస్టిండీస్ పర్యటనలో 2-1తో సిరీస్ నెగ్గాడు. ఈ క్రమంలో ఆసియా టోర్నీకి సన్నాహకంగా తదుపరి యూఏఈ- అఫ్గనిస్తాన్‌తో సల్మాన్ బృందం టీ20 ట్రై సిరీస్ ఆడనుంది. ఆగష్టు 29- సెప్టెంబరు 7 వరకు ఈ ముక్కోణపు సిరీస్ జరుగనుంది.ఈ నేపథ్యంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో యూఏఈ, అఫ్గనిస్తాన్ కెప్టెన్లతో కలిసి సల్మాన్ ఆఘా మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో అతడికి చేదు అనుభవం ఎదురైంది. ఆసియాలో రెండో అత్యుత్తమ జట్టుగా అఫ్గనిస్తాన్ఓ పాకిస్తానీ జర్నలిస్టు.. అఫ్గన్ కెప్టెన్ రషీద్ ఖాన్‌కు ప్రశ్న సంధిస్తూ.. ‘టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఆసియాలో రెండో అత్యుత్తమ క్రికెట్ జట్టుగా అఫ్గనిస్తాన్ నిలిచింది కదా!’ అని పేర్కొన్నాడు.పాపం ముఖం మాడిపోయింది!ఇందుకు ఓ వైపు రషీద్ ఖాన్ బదులిస్తుంటే.. సల్మాన్ ఆఘా ముఖం మాత్రం మాడిపోయింది. ‘‘ఇదేందయ్యా ఇది.. అబ్బో.. అటూ ఇటూ తిరిగి మావైపే విమర్శనాస్త్రాలు వచ్చేలా ఉన్నాయే’’ అన్నట్లుగా అతడి ముఖకవలికలు మారిపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇది చూసిన నెటిజన్లు.. ‘‘పాపం.. పాకిస్తాన్ క్రికెట్ జట్టు.. మీకంటే అఫ్గనిస్తాన్ బెటర్ అని మీ వాళ్లే చెబుతుంటే.. ఇంతకంటే ఇంకేం చేస్తారు’’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. కాగా అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టీ20 ప్రపంచకప్-2024లో అఫ్గనిస్తాన్ సంచలన విజయాలు సాధించింది.అఫ్గన్ సంచలన ప్రదర్శనఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి పటిష్ట జట్లను ఓడించి సెమీ ఫైనల్‌కు దూసుకువెళ్లింది అఫ్గన్ జట్టు. మరోవైపు.. పాకిస్తాన్ అమెరికా వంటి పసికూన చేతిలో ఓడి లీగ్ దశ దాటకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక ఈ టోర్నీలో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా చాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. యూఏఈ వేదికగా సెప్టెంబరు 9- 28 వరకు ఆసియా కప్ టోర్నమెంట్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: Danish Malewar: డబుల్ సెంచరీతో చెలరేగిన యువ సంచలనం.. తొలి ప్లేయర్‌గా రికార్డుAgha’s reaction when a journalist in PC called Afghanistan the second best teamin Asia 😭😭😭😭 pic.twitter.com/vKd4jQImNn— 𝐀. (@was_abdd) August 28, 2025 -
ఆసియాకప్-2025కు హాంకాంగ్ జట్టు ప్రకటన..
ఆసియాకప్-2025 కోసం 20 మంది సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్ హాంకాంగ్ ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా యాసిమ్ ముర్తజా ఎంపికయ్యాడు. అతడి డిప్యూటీగా బాబర్ హయత్ వ్యవహరించనున్నాడు. అన్షుమాన్ రత్, నిజకత్ ఖాన్, బాబర్ హయత్, ఐజాజ్ ఖాన్, ఎహ్సాన్ ఖాన్, కించిత్ షా, ఆయుష్ శుక్లా వంటి సీనియర్ ఆటగాళ్లకు ఈ జట్టులో చోటు దక్కింది.ఆసియాకప్ టీ20 ఫార్మాట్లో కోహ్లి తర్వాత సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా బాబర్ హయత్ నిలిచాడు. కాగా ఈ టోర్నమెంట్‌కు ముందు హాంకాంగ్ ఆగస్టు 24 నుంచి యూఈఏలో సన్నాహక శిబిరాన్ని నిర్వహిస్తుంది.గ్రూప్ బిలో ఉన్న హాంకాంగ్ సెప్టెంబర్ 9న తొలి మ్యాచ్‌లో అబుదాబి వేదికగా అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది. అనంతరం హాంకాంగ్ సెప్టెంబర్ 11న బంగ్లాదేశ్‌తో, సెప్టెంబర్ 15న శ్రీలంకతో ఆడనుంది.ఆసియాకప్-2025 కోసం హాంకాంగ్ జట్టుయాసిమ్ ముర్తుజా, జీషన్ అలీ, షాహిద్ వాసిఫ్, నిజాకత్ ఖాన్, నస్రుల్లా రాణా, మార్టిన్ కోయెట్జీ, అన్షుమన్ రాత్, బాబర్ హయత్, ఎహసాన్ ఖాన్, కల్హన్ చల్లు, ఆయుష్ శుక్లా, ఐజాజ్ ఖాన్, అతీక్ ఇక్బాల్, కించిత్ షా, ఆదిల్ మెహమూద్, అనాస్, హరూద్, అనస్సాన్, ఘజన్ఫర్, మహ్మద్ వహీద్చదవండి: Asia Cup 2025: 'ఆసియాకప్ గెలిచేది ఆ జట్టే'.. వీరేంద్ర సెహ్వాగ్ జోస్యం -
Asia Cup: ‘ఆఖరి నిమిషంలో కూడా మనసు మార్చుకోవచ్చు’
ఆసియా కప్-2025 (Asia Cup)టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ దిగ్గజ పేసర్ వసీం అక్రం (Wasim Akram) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మెగా ఈవెంట్లో భారత్- పాకిస్తాన్ మ్యాచ్ ఆఖరి నిమిషంలో రద్దైనా ఆశ్చర్యపోనక్కర్లేదన్నాడు. ఏనాటికైనా పరిస్థితులు చక్కబడి దాయాదులు టెస్టు సిరీస్‌లో పోటీపడితే చూడాలని ఉందని తెలిపాడు.ఎనిమిది జట్లుఈసారి టీ20 ఫార్మాట్లో ఆసియా కప్ టోర్నీ నిర్వహించనున్నారు. భారత్ ఆతిథ్య హక్కులు దక్కించుకున్నా.. పాక్ క్రికెట్ బోర్డుతో ఒప్పందం ప్రకారం తటస్థ వేదికైన యూఏఈలో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ ఖండాంతర టోర్నీలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గనిస్తాన్‌లతో పాటు ఒమన్, హాంకాంగ్, యూఏఈ పాల్గొంటున్నాయి.అఫ్గనిస్తాన్- హాంకాంగ్ మ్యాచ్‌తో ఆసియా కప్ టోర్నీకి సెప్టెంబరు 9న తెరలేవనుండగా.. 28న ఫైనల్‌తో ముగుస్తుంది. ఇక ఈ ఈవెంట్లో చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ సెప్టెంబరు 14న తొలిసారి తలపడనున్నాయి. అన్నీ సజావుగా సాగితే మరో రెండుసార్లు దాయాదులు పరస్పరం ఢీకొట్టే అవకాశం ఉంది.అయితే, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇరుదేశాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రీడల్లో ఏ స్థాయిలోనూ పాకిస్తాన్‌తో ఆడొద్దనే డిమాండ్లు వెల్లువెత్తాయి. కానీ.. ఆసియా కప్ టోర్నీలో పాక్‌తో మ్యాచ్‌ను బహిష్కరించే పరిస్థితి కనబడటం లేదు. ఏదేమైనా భారత ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగానే బీసీసీఐ ఈ విషయంలో నిర్ణయం తీసుకోనుంది.ఈ నేపథ్యంలో పాక్ లెజెండ్ వసీం అక్రం స్పందిస్తూ.. ‘‘ఆసియా కప్ షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. దీనిపై వ్యతిరేకత కూడా వస్తోంది. అయితే, పాకిస్తాన్లో మేము మాత్రం సైలైంట్‌గానే ఉన్నాము. ఆఖరి నిమిషంలో కూడా మనసు మార్చుకోవచ్చుఒకవేళ వాళ్లు మాతో మ్యాచ్ ఆడినా.. ఆడకపోయినా ఓకే. ఆఖరి నిమిషంలో వారు మనసు మార్చుకున్నా ఆట ముందుకు సాగుతూనే ఉంటుంది. అయితే, నా జీవితకాలంలో భారత్- పాకిస్తాన్ మధ్య టెస్టు సిరీస్ జరిగితే చూడాలని ఉంది’’ అని ఓ పాడ్‌కాస్ట్‌లో వ్యాఖ్యానించాడు.అదే విధంగా.. ‘‘రాజకీయాలు వేరు. వాటి గురించి నాకు తెలియదు. వాళ్లు వారి దేశం గురించి ఆలోచిస్తున్నారు. అలాగే మేము కూడా. అయితే, అంతకు మించి ఎక్కువ మాట్లాడకూడదు. ఎవరైనా సరే తమ దేశం సాధించిన విజయాల గురించి తలచుకోవడానికే ఇష్టపడతారు. అక్కడితో ఆగిపోతే అంతా బాగుంటుంది’’ అని వసీం అక్రం చెప్పుకొచ్చాడు.కాగా భారత్- పాకిస్తాన్ చివరగా ఈ ఏడాది ఫిబ్రవరిలో యూఏఈ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో ముఖాముఖి తలపడ్డాయి. దుబాయ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి సెంచరీతో చెలరేగి.. టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. పాక్‌పై ఆరు వికెట్ల తేడాతో గెలుపొందిన రోహిత్ సేన.. ఆ తర్వాత వరుస విజయాలతో చాంపియన్‌గా నిలిచింది.చదవండి: Asia Cup 2025: ‘చెత్త సెలక్షన్.. అతడంటే ఎవరికి ఇష్టమో అందరికీ తెలుసు’ -
‘నోటికొచ్చినట్లు వాగొద్దు.. టీమిండియాకు దొరికిన వజ్రం అతడు’
టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)పై గత కొన్నాళ్లుగా విమర్శల వర్షం కురుస్తోంది. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఐదింట అతడు మూడు టెస్టులు మాత్రమే ఇందుకు ప్రధాన కారణం. వర్క్‌లోడ్ మేనేజ్మెంట్ కోసమే బుమ్రా విషయంలో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ముందుగానే ప్రకటించాడు.ఆడితే ఓడటమేఅందుకు తగినట్లుగానే ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో లీడ్స్, లార్డ్స్, మాంచెస్టర్ టెస్టుల్లోనే బుమ్రా ఆడాడు. అతడు ఆడిన ఈ మ్యాచ్‌లలో రెండింట టీమిండియా ఓడింది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్లు బుమ్రా తనకు నచ్చినపుడు విశ్రాంతి తీసుకుని.. నచ్చినపుడు ఆడటాన్ని విమర్శించారు. మరికొందరు మాత్రం బుమ్రా ఆడితేనే టెస్టుల్లో భారత జట్టుకు ఓటమి తప్పదని ట్రోల్ చేశారు.నోటికొచ్చినట్లు వాగొద్దుఇక ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను శుబ్‌మన్ గిల్ సేన 2-2తో సమం చేసింది. తదుపరి టీమిండియా ఆసియా టీ20 కప్ టోర్నీ ఆడనుండగా.. బుమ్రా ఈ జట్టులో భాగంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ బుమ్రా విమర్శకులకు ఘాటుగా కౌంటర్ ఇచ్చాడు.‘‘ఇంగ్లండ్‌లో బుమ్రా ఆడని మ్యాచ్‌లలోనే టీమిండియా గెలిచిందని నోటికొచ్చినట్లు మాట్లాడేవాళ్లు.. నోళ్లు తెరిచేముందు కాస్త జాగ్రత్తగా ఉండలి. బుమ్రా ఒక్కడే ఫార్మాట్లకు అతీతంగా జట్టును ఎన్నిసార్లు గెలిపించాడో మీకు తెలుసా?టీమిండియాకు దొరికిన అరుదైన వజ్రంఅతడొక మ్యాచ్ విన్నర్. టీమిండియాకు దొరికిన అరుదైన వజ్రం. అతడి గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదు. అతడి కెరీర్‌పై ఒక్క మచ్చ కూడా లేదు. తనెంతో అంకితభావం గల ఆటగాడు’’ అని బుమ్రాపై కైఫ్ ప్రశంసల వర్షం కురిపించాడు.ఇక ఆసియా కప్ టోర్నీలో బుమ్రా అన్ని మ్యాచ్‌లు ఆడాల్సిన అవసరం లేదన్న కైఫ్.. ఒమన్, యూఏఈ వంటి జట్లతో ఆడేటపుడు విశ్రాంతి తీసుకోవచ్చని అభిప్రాయపడ్డాడు. ఈసారి టోర్నీ టీ20 ఫార్మాట్లో జరుగుతుంది కాబట్టి.. ఒక్కో మ్యాచ్‌లో కేవలం నాలుగు ఓవర్లే వేయాల్సి ఉన్నందున సమస్య ఉండదని పేర్కొన్నాడు.యూఏఈ వేదికగా..ఏదేమైనా భారత టీ20 జట్టులో బుమ్రా పాత్ర ముఖ్యమని.. అతడు లేని జట్టును ఊహించుకోలేమని కైఫ్ పేర్కొన్నాడు. కాగా సెప్టెంబరు 9- 28 వరకు యూఏఈ వేదికగా ఆసియా కప్-2025 టోర్నీకి షెడ్యూల్ ఖరారైంది. కాగా ఇప్పటి వరకు తన కెరీర్లో 70 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన బుమ్రా.. 89 వికెట్లు కూల్చాడు. ఇక ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ రైటార్మ్ పేసర్ 145 మ్యాచ్‌లలో కలిపి 183 వికెట్లు కూల్చాడు.చదవండి: Asia Cup: టీమిండియాలో దక్కని చోటు: శ్రేయస్ అయ్యర్ రియాక్షన్ వైరల్ -
అందుకే అక్షర్‌ను తప్పించి.. వైస్ కెప్టెన్‌గా గిల్: సూర్యకుమార్ యాదవ్
టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill).. అంతర్జాతీయ టీ20లలో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్ ఆడబోయే భారత టీ20 జట్టుకు అతడు ఎంపికయ్యాడు. అంతేకాదు.. పొట్టి ఫార్మాట్లో జరిగే ఈ ఖండాంతర ఈవెంట్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు గిల్ డిప్యూటీగా వ్యవహరించనున్నాడు.ఏడాది కాలంగా దూరంకాగా 2024 జూలైలో శ్రీలంక పర్యటన సందర్భంగా గిల్ చివరగా టీ20లలో టీమిండియాకు ఆడాడు. నాడు సూర్య కెప్టెన్సీలో ఓపెనర్‌గా వచ్చిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 39 పరుగులు చేశాడు. అనంతరం.. దాదాపు ఏడాది కాలంగా భారత టీ20 జట్టుకు దూరంగా ఉన్న గిల్.. మెగా టోర్నీ నేపథ్యంలో అకస్మాత్తుగా జట్టులోకి రావడమే కాకుండా.. వైస్ కెప్టెన్‌గానూ ఎంపిక కావడం గమనార్హం.అక్షర్ పటేల్‌ను తప్పించి..ఇన్నాళ్లు టీ20 జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్న అక్షర్ పటేల్‌ను తప్పించి.. గిల్‌ను సూర్య డిప్యూటీగా నియమించడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఆసియా కప్ జట్టు ప్రకటన సందర్భంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఈ విషయంపై స్పందించాడు. అందుకే వైస్ కెప్టెన్‌గా గిల్‘‘టీ20 ప్రపంచకప్-2024లో గెలిచిన తర్వాత టీమిండియా శ్రీలంకలో టీ20 సిరీస్ ఆడినపుడు నేను కెప్టెన్‌గా ఉంటే.. గిల్ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. నిజానికి టీ20 ప్రపంచకప్-2026 కోసం కొత్త సైకిల్‌ను మేము అప్పుడే ఆరంభించాము.అయితే, ఆ తర్వాత వరుస టెస్టు సిరీస్‌లతో గిల్ బిజీ అయ్యాడు. అందుకే టీమిండియా తరఫున టీ20 మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. అంతేకాదు.. చాంపియన్స్ ట్రోఫీతోనూ మరింత బిజీ అయిపోయాడు.అందుకే టీ20లకు కాస్త దూరమయ్యాడు. అతడు తిరిగి జట్టులోకి రావడం సంతోషంగా ఉంది’’ అని సూర్యకుమార్ యాదవ్ మీడియా సమావేశంలో పేర్కొన్నాడు. కాగా రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 రిటైర్మెంట్ తర్వాత సూర్య టీమిండియా టీ20 పగ్గాలు చేపట్టగా.. టెస్టులకు వీడ్కోలు పలికిన నేపథ్యంలో ఇటీవలే గిల్ టెస్టు జట్టు సారథి అయ్యాడు.ఇక ఇప్పటికే వన్డేల్లోనూ వైస్ కెప్టెన్‌గా ఉన్న గిల్.. టీ20లలోనూ రీఎంట్రీ ఇవ్వడంతో అతడిని ఆల్ ఫార్మాట్ ఫ్యూచర్ కెప్టెన్‌గా తీర్చిదిద్దేందుకు సిద్ధమైనట్లు బీసీసీఐ సంకేతాలు ఇచ్చినట్లయింది. కాగా సెప్టెంబరు 9- 28 వరకు యూఏఈ వేదికగా ఆసియా కప్ -2025 టోర్నీ జరుగనుంది.ఐపీఎల్లో అదరగొట్టాడుఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ గడ్డ మీద ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ సందర్భంగా శుబ్‌మన్ గిల్ టీమిండియా టెస్టు కెప్టెన్‌గా తన ప్రయాణం మొదలుపెట్టాడు. బ్యాటర్‌గా 754 పరుగులతో ఇరగదీసిన గిల్.. ఎడ్జ్‌బాస్టన్‌లో తొలిసారి భారత్‌కు టెస్టు విజయం అందించాడు. అంతేకాదు.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో సమం చేసి సత్తా చాటాడు.అయితే, అంతర్జాతీయ టీ20లలో గిల్ ఇప్పటి వరకు 21 మ్యాచ్‌లు ఆడి 139.28 స్ట్రైక్‌రేటుతో 578 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ (126) ఉంది. ఇక ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన గిల్.. 15 మ్యాచ్‌లలో కలిపి 650 పరుగులు సాధించాడు. గుజరాత్‌ను ప్లే ఆఫ్స్ చేర్చినా టైటిల్ మాత్రం అందించలేకపోయాడు.చదవండి: Asia Cup 2025: అందుకే శ్రేయస్‌ను సెలక్ట్ చేయలేదు: కుండబద్దలు కొట్టిన అగార్కర్#ShubmanGill is back in T20Is! 😳Here's what skipper #SuryakumarYadav has to say about his inclusion as a vice-captain! 🗣Watch the Press Conference Now 👉 https://t.co/kwwh4UUSWe pic.twitter.com/OiX06F3995— Star Sports (@StarSportsIndia) August 19, 2025 -
వచ్చే వారంలో ట్రంప్‌తో భేటీ
మాస్కో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వచ్చే వారం సమావేశమవ్వాలని భావిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. బహుశా యూఏఈలో శిఖరాగ్రం జరిగే అవకాశముందన్నారు. మూడేళ్లుగా కొనసాగిస్తున్న యుద్ధానికి ముగింపు పలకాలంటూ అమెరికా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా ఒత్తిళ్లు తెస్తున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. యూఏఈ అధ్యక్షుడు జాయెద్ అల్ నహ్యాన్తో క్రెమ్లిన్‌లో జరిగిన భేటీ అనంతరం పుతిన్ ఈ ప్రకటన చేశారు. ప్రతిపాదన తమదే అయినా, ఇరు దేశాలు ఈ భేటీపై ఆసక్తితో ఉన్నాయన్నారు. చర్చల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పాల్గొంటారా అన్న ప్రశ్నకు పుతిన్..ఇందుకు తాను వ్యతిరేకం కాదని గతంలోనూ అనేక పర్యాయాలు చెప్పానన్నారు. అయితే, ఇందుకు కొన్ని పరిస్థితులు అనుకూలించాల్సి ఉందన్నారు. అంతకుముందు, రష్యా విదేశాంగ శాఖ సలహాదారు యూరి ఉషకోవ్ మాట్లాడుతూ.. శిఖరాగ్రం వచ్చే వారం జరిగే అవకాశాలున్నాయని తెలిపారు. ఇందుకు వేదికపై సూత్రప్రాయ అంగీకారం కుదిరినట్లు వెల్లడించారు. తేదీలింకా ఖరారు కాలేదన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా ఈ భేటీలో పాల్గొనే ఛాన్సుందన్న వార్తలను ఉషకోవ్ కొట్టిపారేశారు. పుతిన్, ట్రంప్ భేటీ విజయవంతం, ఫలవంతం కావాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. యుద్ధానికి ముగింపు పలికేందుకు గతంలో జెలెన్స్కీ భేటీ ప్రతిపాదన తెచ్చినా పుతిన్ పట్టించుకోలేదు. తాజాగా, పుతిన్ వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్ష భవనం స్పందించలేదు. యుద్ధం ఆపకుంటే ఆర్థికపరమైన కఠిన ఆంక్షలను విధిస్తామని ట్రంప్ చేసిన హెచ్చరికల గడువు శుక్రవారంతో ముగియనుంది. ట్రంప్–పుతిన్ శిఖరాగ్రం తమ వైఖరిని స్పష్టంగా తెలియజేసేందుకు ఒక అవకాశమని రష్యా బుధవారం వ్యాఖ్యానించింది. అరుదైన ఖనిజాల వెలికితీత వంటి అంశాల్లో ఉమ్మడి పెట్టుబడులకు ఆర్థిక అవకాశాలపైనా చర్చలు జరపవచ్చని తెలిపింది.యుద్ధానికి వ్యతిరేకంగా ఉక్రేనియన్లు2022తో పోలిస్తే రష్యాతో జరిగే యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా ముగించాలని ఎక్కువమంది ఉక్రెయిన్ ప్రజలు కోరుకుంటున్నారు. యుద్ధం మొదలైన కొత్తలో చేపట్టిన ఓ సర్వేలో విజయం సాధించేదాకా పోరాడాల్సిందేనంటూ మూడొంతుల మంది గట్టిగా కోరుకున్నారు. తాజాగా ఇటీవల చేపట్టిన సర్వేలో మాత్రం ఇందుకు విరుద్ధమైన ఫలితాలు వచ్చాయి. యుద్ధానికి కొనసాగించాలనుకునే వారి సంఖ్యలో గణనీయంగా తగ్గుదల కనిపించింది. త్వరగా యుద్ధానికి ముగింపు పలికి, రష్యాతో ఒప్పందానికి రావాలని మూడొంతుల మంది కోరుకుంటున్నారని వెల్లడైంది. రష్యా ఆధీనంలోని భాగాలు మినహా మిగతా ప్రాంతాల్లోని 15 ఏళ్లు పైబడిన వెయ్యి మంది నుంచి అభిప్రాయాలను తెలుసుకున్నామని సర్వే నిర్వాహకులు తెలిపారు. -
Asia Cup 2025: ఆసియా కప్‌లో గిల్, జైస్వాల్!
న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో ‘డ్రా’గా ముగిసిన టెస్టు సిరీస్ తర్వాత భారత జట్టు వచ్చే నెలలో ఆసియా కప్ టి20 టోర్నీలో బరిలోకి దిగనుంది. సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేదికగా ఈ టోర్నీ జరుగుతుంది. ఇది ముగిసిన తర్వాత అక్టోబర్ 2 నుంచి వెస్టిండీస్‌తో తొలి టెస్టులో టీమిండియా తలపడుతుంది. అయితే వారం రోజుల్లోపే టెస్టు సిరీస్ ఉన్నా సరే... టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో పాటు ఓపెనర్ యశస్వి జైస్వాల్‌లను ఆసియా కప్‌కు ఎంపిక చేయాలని సెలక్టర్లు భావిస్తున్నారు. బిజీ షెడ్యూల్ కారణంగా గత కొన్ని టి20లనుంచి గిల్, జైస్వాల్‌లకు విశ్రాంతినిచ్చారు. ఆ సమయంలో సంజు సామ్సన్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా చెలరేగిపోయారు. అయితే తాజా ఫామ్, ఐపీఎల్లో ప్రదర్శనను బట్టి చూస్తే గిల్, జైస్వాల్‌లను టి20 టీమ్‌లోకి తీసుకొచ్చే ఆలోచన ఉంది. ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన మరో బ్యాటర్ సాయి సుదర్శన్ పేరు కూడా టీమ్ పరిశీలనలో ఉంది. సుదర్శన్ భారత్ తరఫున 3 వన్డేలు, ఏకైక టి20 మ్యాచ్ ఆడాడు. ఈ ముగ్గురినీ తీసుకుంటే టాప్–3 కోసం ప్రత్యామ్నాయం అందుబాటులో ఉంటుందనేది సెలక్టర్ల భావన. ఆసియా కప్‌కు 17 మందితో టీమ్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది కాబట్టి అదనపు ఆటగాళ్లను ఎంపిక చేయడంలో సమస్య రాకపోవచ్చు. ఆ తర్వాత ఆరు నెలల్లో టి20 వరల్డ్ కప్ కూడా జరగనున్న నేపథ్యంలో ‘కోర్ గ్రూప్’లో సభ్యులుగా అందరి ఆటను సెలక్టర్లు పరిశీలించే అవకాశం ఉంది. మరోవైపు బుమ్రా, సిరాజ్‌ల విషయంలో టోర్నీకి ముంద ఫిట్నెస్ను పరిశీలించే తుది నిర్ణయం తీసుకుంటారు. -
యూఏఈకి ఉచిత వీసాలు
మోర్తాడ్ (బాల్కొండ): యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పరిధిలోని ఆబుదాబిలో ఉపాధి కల్పనకు ఉచిత వీసాల జారీకి ఏడీఎన్‌హెచ్, జీటీఎం సంస్థలు మరోసారి నియామకాల మేళా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఈనెల 16న జగిత్యాలలో, 17న నిజామాబాద్‌లలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు.క్లీనింగ్ విభాగంలో పని కల్పించడానికి ఇంటర్వ్యూలను నిర్వహించనుండగా.. 21 ఏళ్లు నిండి, 38 ఏళ్లలోపు వయసున్న వారు ఈసీఎన్ఆర్ పాస్‌పోర్టు కలిగి ఉంటే నియామకాల మేళాకు హాజరు కావచ్చు. ఎంపికైన వారికి మన కరెన్సీలో రూ.22 వేల వేతనం ప్రతి నెలా చెల్లించనున్నారు. ఉచిత వసతి, ఉచిత భోజన సదుపాయాన్ని కల్పించనున్నారు.వివరాలకు ఆర్మూర్ (8332062299), సిరిసిల్ల (9347661522), నిజామాబాద్ (8686860999), జగిత్యాల్ (8332042299)ల్లోని జీటీఎం సంస్థ శాఖలను సంప్రదించాలని సంస్థ చైర్మన్ చీటీ సతీశ్‌రావు వెల్లడించారు. ఉచిత వీసాలతో పాటు ఉచిత టికెట్ల కోసం నిర్వహిస్తున్న ఈ నియామకాల మేళాను నిరుద్యోగ యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఎవరికి నయాపైసా చెల్లించాల్సిన అవసరం లేదని సతీశ్‌రావు స్పష్టం చేశారు. -
ఆసియాకప్ పూర్తి షెడ్యూల్ విడుదల.. భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడంటే?
ఆసియాకప్-2025 వేదికలు ఖరారు అయ్యాయి. ఇప్పటికే ఈ టోర్నీకి సంబంధించి షెడ్యూల్‌ను విడుదల చేసిన ఆసియా క్రికెట్ కౌన్సిల్.. తాజాగా మ్యాచ్‌లు జరిగే వేదికలను ప్రకటించింది. ఈ మెగా టోర్నమెంట్ యూఏఈలోని అబుదాబి, దుబాయ్ వేదికలగా జరగనున్నట్లు ఏసీసీ వెల్లడించింది.ఈ ఆసియాకప్‌లో 11 మ్యాచ్‌లు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, మరో 8 మ్యాచ్‌లు అబుదాబి ఇంటర్ననేషనల్ మైదానంలో జరగనున్నాయి. ఫైనల్ మ్యాచ్‌కు దుబాయ్ ఆతిథ్యమివ్వనుంది. అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 14న జరగనుంది.ఈ మెగా టోర్నమెంట్ సెప్టెంబర్ 9న ప్రారంభమై 28న ముగియనుంది. తొలి మ్యాచ్‌లో దుబాయ్ వేదికగా అఫ్గానిస్తాన్, హాంకాంగ్ జట్లు తలపడనున్నాయి. ఇక ఇది ఇలా ఉండగా.. వాస్తవానికి ఈ ఏడాది ఆసియాకప్‌కు భారత్ ఆతిథ్యమివ్వాల్సింది.కానీ భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఈ ఈవెంట్‌ను యూఏఈలో నిర్వహించాలని ఏసీసీ నిర్ణయించింది. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గోనున్నాయి. ఈ జట్లను మొత్తం రెండు గ్రూపులుగా విభజించారు.ఏ గ్రూప్‌లో ఎవరు?గ్రూప్ ఎ: భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్గ్రూప్ బి: శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్, హాంకాంగ్ఆసియా కప్‌లో టీమిండియా షెడ్యూల్..10 సెప్టెంబర్: భారత్ - యూఏఈ (దుబాయ్)14 సెప్టెంబర్: భారత్ - పాకిస్తాన్ (దుబాయ్)19 సెప్టెంబర్: భారత్ - ఒమన్ (అబుదాబీ)ఈ టోర్నీ కోసం భారత జట్టును బీసీసీఐ త్వరలోనే ప్రకటించే అవకాశముంది. అయితే ఈ ఆసియా జెయింట్స్ పోరుకు టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.చదవండి: IND vs ENG: టీమిండియాతో ఐదో టెస్టు.. 123 ఏళ్ల చరిత్రను ఇంగ్లండ్ తిరగరాస్తుందా? -
కంటెంట్ క్రియేటర్ల పీక నొక్కిన యూఏఈ
సోషల్ మీడియా ప్రమోషన్ల కోసం కంటెంట్ క్రియేటర్లందరికీ తప్పనిసరిగా ‘అడ్వర్టైజర్ పర్మిట్’ అవసరమని యూఏఈ మీడియా కౌన్సిల్ ప్రకటించింది. కంటెంట్ క్రియేటర్లు అధికారిక వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఈ అనుమతి మంజూరు చేస్తామని తెలిపింది. ఈ విధానం త్వరలో అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. అయితే కంటెంట్ క్రియేటర్లకు ఈ అనుమతులు మొదటి మూడేళ్లు ఉచితంగా ఇవ్వబోతున్నట్లు తెలిపింది. ఆ తర్వాత రెన్యువల్ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.క్రియేటర్లు దరఖాస్తు చేసుకున్న తర్వాత వెరిఫై చేసి ప్రభుత్వం వారికి పర్మిట్ నంబర్లను కేటాయిస్తుంది. ఈ పర్మిట్ నంబర్లను కంటెంట్ క్రియేటర్లు తమ అకౌంట్లపై స్పష్టంగా ప్రదర్శించాల్సి ఉంటుంది. కౌన్సిల్ నుంచి అనుమతులు పొందిన తరువాత మాత్రమే ప్రకటనలు పోస్ట్ చేయాలి. యూఏఈ మీడియా కౌన్సిల్ సెక్రటరీ జనరల్ మొహమ్మద్ సయీద్ అల్ షెహి మాట్లాడుతూ.. ‘అడ్వర్టైజర్ పర్మిట్ అనేది ప్రజా హక్కులను కాపాడుతుంది. కంటెంట్ సృష్టికర్తలు, ప్రకటనదారులు, ప్రేక్షకుల మధ్య బాధ్యతాయుతమైన, వృత్తిపరమైన సంబంధాలను మెరుగుపరుస్తుంది’ అని చెప్పారు. సొంత ఉత్పత్తులు లేదా సర్వీస్ లేదా కంపెనీని ప్రమోట్ చేయడానికి వ్యక్తిగత ఖాతాలను ఉపయోగించే వారికి ఈ నియమం నుంచి మినహాయింపు ఇస్తామని కౌన్సిల్ పేర్కొంది. ఎడ్యుకేషన్, అథ్లెటిక్, సాంస్కృతిక లేదా అవగాహన కార్యకలాపాలలో పాల్గొనే 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వారికి ఈ వెసులుబాటు ఉంటుందని చెప్పింది.యూఏఈ మీడియా కౌన్సిల్లో స్ట్రాటజీ అండ్ మీడియా పాలసీ సెక్టార్ సీఈఓ మైతా మజీద్ అల్ సువైది మాట్లాడుతూ.. కౌన్సిల్ ద్వారా లైసెన్స్ పొందిన వ్యక్తులతో మాత్రమే కంపెనీలు, సంస్థలు టైఆప్ కావాలని తెలిపారు. విజిటింగ్ కంటెంట్ క్రియేటర్లు ‘విజిటర్ అడ్వర్టైజర్ పర్మిట్’ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మూడు నెలలు చెల్లుబాటు అవుతుంది. తర్వాత మూడు నెలలకు ఒకసారి రెన్యువల్ చేసుకోవాలి. యూఏఈలో కౌన్సిల్ ఆమోదించిన లైసెన్స్డ్ అడ్వర్టైజింగ్ లేదా టాలెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీల ద్వారా రిజిస్ట్రేషన్లు నిర్వహించనున్నారు.భారత్‌పై ప్రభావం ఎంతంటే..భారత్ కేవలం యూఏఈకి పొరుగు దేశం మాత్రమే కాదు. ఇది దాని డిజిటల్, కల్చరల్ ఎకోసిస్టమ్‌లో కీలకమైన స్థానంలో ఉంది. యూఏఈ డిజిటల్ టాలెంట్ పూల్‌లో భారతీయ క్రియేటర్లు, ఫ్రీలాన్సర్లు, ఇన్ఫ్లూయెన్సర్లు గణనీయమైన భాగం ఉన్నారు. తాజా నిర్ణయంతో యూఏఈ ఆధారిత ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకున్న భారతీయ ఇన్ఫ్లూయెన్సర్లపై ప్రభావం ఉండనుంది. అక్కడ నివసిస్తున్న ఎన్ఆర్ఐలు, భారతీయ ప్రవాసులు కంటెంట్‌ను సృష్టించడంలో సదరు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. భారతీయ బ్రాండ్లు, ఏజెన్సీలు యూఏఈ ఆధారిత ఇన్ఫ్లుయెన్సర్లతో కలిసి పనిచేయడం లేదా గల్ఫ్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ప్రచారాలను నిర్వహించడంలో కొంత ఇబ్బందులు ఎదురవ్వొచ్చు.మన కంటెంట్ క్రియేటర్లకు కొత్త సవాళ్లుప్రమోషనల్ కంటెంట్‌పై చెల్లుబాటు అయ్యే ప్రకటనదారు పర్మిట్ నెంబరును పొందాల్సి ఉంటుంది. దీన్ని బహిరంగంగా ప్రదర్శించాలి.కంటెంట్ సృష్టించే స్వల్పకాలిక సృష్టికర్తలు లేదా పర్యాటకులకు యూఏఈ ఆధారిత ఏజెన్సీ స్పాన్సర్షిప్ అవసరం.అన్‌పెయిడ్ ఎండార్స్మెంట్లు ఇప్పుడు నియంత్రణ పరిధిలోకి వస్తాయి.నిబంధనలు పాటించకపోతే భారీ జరిమానాలు, ప్లాట్‌ఫామ్ ఆంక్షలు లేదా నిషేధానికి కూడా దారితీసే అవకాశం ఏర్పడవచ్చు. ఇక్కడా ఇలాంటి నిబంధనలు?ఇన్ఫ్లూయెన్సర్ రెగ్యులేషన్‌లో భారత్ అడ్వాన్స్గానే ఉంది. అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్సీఐ), వినియోగదారుల రక్షణ చట్టం ఇప్పటికే వీటి అవసరాన్ని హైలైట్ చేశాయి. భారత్‌లో ఇప్పటికే పెయిడ్ కొలాబరేషన్‌కు సంబంధించిన వివరాలను స్పష్టంగా వెల్లడించాలి. #ad, #sponsored లేదా #collab వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో కంటెంట్‌కు లేబులింగ్ ఇవ్వాలి.యూఏఈ తీసుకున్న నిర్ణయం భారత్‌లో మరిన్ని నియంత్రణ చర్యలకు దారితీసే అవకాశం ఉంది. తప్పుడు సమాచారం, పెయిడ్ ఎండార్స్మెంట్లు, డిజిటల్ మార్కెటింగ్‌లో ఆర్థిక పారదర్శకతపై పెరుగుతున్న పరిశీలన, భారత ప్రభుత్వం లేదా నియంత్రణ సంస్థలు లైసెన్సింగ్ నమూనాలను కఠినంగా అమలు చేయడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవచ్చు.యూఏఈ అడ్వర్టైజర్ పర్మిట్ రూల్ ప్రయోజనాలుపారదర్శకతవీక్షకులు ప్రమోషనల్ కంటెంట్‌ను స్పష్టంగా గుర్తించగలరు. మోసపూరిత ప్రకటనల అవకాశాలను తగ్గించవచ్చు. ఇది ఇన్ఫ్లూయెన్సర్లు, ప్రేక్షకుల మధ్య ఎక్కువ నమ్మకాన్ని పెంపొందిస్తుంది.పరిశ్రమపై పక్కా ప్రమాణాలుఇన్ఫ్లూయెన్సర్ మార్కెటింగ్ కోసం ప్రమాణాలను ఏర్పరుస్తుంది. క్రియేటర్లకు వ్యాపార అవకాశాలు అందిస్తుంది.వినియోగదారుల రక్షణముఖ్యంగా ఫైనాన్స్, హెల్త్, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో ప్రేక్షకులను తప్పుదోవ పట్టించే లేదా అప్రకటిత ఎండార్స్మెంట్ల నుంచి రక్షణ లభిస్తుంది. అన్‌పెయిడ్ ప్రమోషన్లను కూడా నియంత్రిస్తుంది.ప్రభుత్వానికి రెవెన్యూపర్మిట్ ఫీజుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. ఇన్ఫ్లూయెన్సర్ క్యాంపెయిన్లు, బ్రాండ్ కోలాబరేషన్లపై ట్రాకింగ్ ఉంటుంది.ఇదీ చదవండి: ‘టీసీఎస్ నిర్ణయం ప్రమాదకరం’యూఏఈ ప్రకటనతో నష్టాలుచిన్న కంటెంట్ క్రియేటర్లలో నిరుత్సాహంఫ్రీలాన్సర్లు, మైక్రో-ఇన్ఫ్లూయెన్సర్లు, స్పాన్సర్ అవసరాలను నిర్వహించడం కష్టంగా మారుతుంది. కొత్తగా వచ్చేవారిని నిరుత్సాహపరుస్తుంది.యూఏఈ కాని క్రియేటర్లకు..యూఏఐ వెలుపల కంటెంట్ సృష్టికర్తలు (ఉదా. భారతదేశంలో లేదా మరెక్కడైనా) అక్కడి ప్రేక్షకులను ప్రభావితం చేసేందుకు చట్టాలు అడ్డంకిగా మారుతాయి. గ్లోబల్ డిజిటల్ కంటెంట్‌లో పరిధులు నిర్ధారించినట్లు అవుతుంది.సందర్శకులకు పరిమితులుతాత్కాలికంగా యూఏఈని సందర్శించే సృష్టికర్తలకు (ఉదా.ట్రావెల్ వ్లాగ్‌లు లేదా ఈవెంట్ల కోసం) పరిమిత అనుమతులుంటాయి. ఇందుకోసం స్థానిక స్పాన్సర్షిప్ అవసరం అవుతుంది. -
Asia Cup: పూర్తి షెడ్యూల్ విడుదల.. భారత్- పాక్ మ్యాచ్‌ల తేదీలివే!
Asia Cup 2025: ఆసియా కప్-2025 నిర్వహణకు మార్గం సుగమమైంది. ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించే టోర్నమెంట్‌కు సంబంధించి ఆసియా క్రికెట్ మండలి (ACC) శనివారం షెడ్యూల్ విడుదల చేసింది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 9- 28 వరకు ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించనున్నారు.మూడుసార్లు ఢీకొట్టే అవకాశం!చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ (India vs Pakistan) జట్లు సెప్టెంబరు 14న పరస్పరం తలపడనున్నాయి. దాయాదులు రెండూ ఒకే గ్రూపులో ఉన్నాయి కాబట్టి సూపర్ ఫోర్ దశలో మరోసారి అంటే.. సెప్టెంబరు 21న ఢీకొట్టే వీలుంది. ఒకవేళ ఇరుజట్లు ఫైనల్ చేరితో సెప్టెంబరు 28న మరోసారి ముఖాముఖి పోటీపడతాయి.గ్రూప్- ఎ నుంచి ఇండియా, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ పోటీపడనుండగా.. శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ గ్రూప్-బి నుంచి తలపడతాయి. దుబాయ్, అబుదాది వేదికలుగా ఈ 19 మ్యాచ్‌ల టోర్నమెంట్‌ను నిర్వహించనున్నారు.బీసీసీఐపై విమర్శలుకాగా ఆసియా కప్ టీ20 టోర్నీకి ఈసారి భారత్ వేదిక. అయితే, ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం గతంలో మాదిరి ఈసారి కూడా తటస్థ వేదికపై టోర్నీని నిర్వహించనున్నారు. అయితే, పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌తో అన్ని స్థాయిల్లోనూ క్రీడల్లోనూ బంధం తెంచుకోవాలనే డిమాండ్లు వచ్చాయి. బీసీసీఐ సైతం దాయాదితో పోటీ పడేందుకు సుముఖంగా లేమని వెల్లడించింది.కానీ.. తాజా షెడ్యూల్ ప్రకారం చిరకాల ప్రత్యర్థితో టీమిండియా తలపడనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ తీరుపై విమర్శలు వస్తున్నాయి. కాగా ఇటీవల వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్‌లో పాక్‌తో మ్యాచ్ ఆడేందుకు ఇండియా చాంపియన్స్ నిరాకరించింది. దీంతో ఇరుజట్ల మధ్య మ్యాచ్ రద్దు కాగా.. చెరో పాయింట్ వచ్చింది.లీగ్ దశ షెడ్యూల్👉సెప్టెంబరు 9: అఫ్గనిస్తాన్ వర్సెస్ హాంగ్‌కాంగ్👉సెప్టెంబరు 10: ఇండియా వర్సెస్ యూఏఈ👉సెప్టెంబరు 11: బంగ్లాదేశ్ వర్సెస్ హాంగ్‌కాంగ్👉సెప్టెంబరు 12: పాకిస్తాన్ వర్సెస్ ఒమన్👉సెప్టెంబరు 13: బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక👉సెప్టెంబరు 14: ఇండియా వర్సెస్ పాకిస్తాన్👉సెప్టెంబరు 15: యూఏఈ వర్సెస్ ఒమన్👉సెప్టెంబరు 15:శ్రీలంక వర్సెస్ హాంగ్‌కాంగ్👉సెప్టెంబరు 17: పాకిస్తాన్ వర్సెస్ యూఏఈ👉సెప్టెంబరు 18: శ్రీలంక వర్సెస్ అఫ్గనిస్తాన్👉సెప్టెంబరు 19: ఇండియా వర్సెస్ ఒమన్సూపర్ 4 దశ👉సెప్టెంబరు 20: గ్రూప్- బి టాపర్ వర్సెస్ రెండో స్థానంలో ఉన్న జట్టు (B1 Vs B2)👉సెప్టెంబరు 21: గ్రూప్-ఎ టాపర్ వర్సెస్ రెండో స్థానంలో ఉన్న జట్టు (A1 vs A2)👉సెప్టెంబరు 23: A2 vs B1👉సెప్టెంబరు 24: A1 vs B2👉సెప్టెంబరు 25: A2 vs B2👉సెప్టెంబరు 26: A1 vs B1👉సెప్టెంబరు 28: ఫైనల్.చదవండి: IND vs AUS: ధావన్ ధనాధన్.. పఠాన్ విధ్వంసం.. యువీ మాత్రం విఫలం -
షార్జాలో మరో విషాదం : బర్త్‌డే రోజే కేరళ మహిళ అనుమానాస్పద మరణం
షార్జాలో మరో మలయాళీ మహిళ మరణం ఆందోళన రేపుతోంది. కేరళకు చెందిన అతుల్య శేఖర్ శనివారం తెల్లవారు జామున యుఎఇలోని షార్జా అపార్ట్మెంట్లో శవమై కనిపించింది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు ఆమె భర్తపై హత్య కేసు నమోదు చేసినట్లు కేరళ పోలీసులు తెలిపారు.గల్ఫ్ న్యూస్ ప్రకారం, అతుల్య 30వ పుట్టినరోజే కన్నుమూసింది. అదీ కొత్త ఉద్యోగంలో చేరిన మొదటి రోజే ఆమె అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయింది. మహిళ తల్లి దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం,ఆమె భర్త సతీష్ ఆమెను గొంతు పిసికి, కడుపుపైతన్నాడు, తలపై ప్లేట్‌తో కొట్టాడు, ఫలితంగానే ఆమె మరణించింది. మృతురాలికి పదేళ్ల కుమార్తె కూడా ఉంది. అతుల్య ఏకైక కుమార్తె ఆరాధిక (10) ప్రస్తుతం కొల్లాంలో తన అమ్మమ్మ, తాతాయ్య రాజశేఖరన్ పిళ్లై , తులసి భాయ్‌లతో ఉంది అతుల్య మరణం భారతీయ సమాజాన్ని మరోసారి దిగ్భ్రాంతికి గురిచేసిందని గల్ఫ్ న్యూస్ నివేదించింది.చదవండి: లవ్ ప్రపోజల్ తిరస్కరించిన ఇండియన్ టెకీకి బాస్ చుక్కలు : నెటిజన్లు ఏమన్నారంటే2014లో సతీష్, అతుల్య వివాహం జరిగింది. భర్త సతీష్‌తో కలిసి షార్జాలో నివసిస్తోంది అతుల్య అప్పటినుంచీ బైక్, 43 తులాల బంగారం ఇచ్చినప్పటికీ, తగినంత కట్నం తీసుకురాలేదని పదేపదే వేధించే వారని అతుల్య కుటుంబం ఆరోపిస్తోంది. అల్లుడు మద్యానికి బానిస అని ఎప్పుడూ కొడుతూ ఉండేవాడని అతుల్య తండ్రి ఆరోపించారు.పాప కోసంమే తన బిడ్డ అన్ని హింసలను భరించిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వేధింపులకు సంబంధించి గతంలో ఇరు కుటుంబాల మధ్య చర్చలకు జరిగాయి. పోలీసు కేసు కూడా నమోదైంది. ఇదీ చదవండి: బాలీవుడ్ తరహా ఈవెంట్లు, లగ్జరీ లైఫ్ : 100మందికి పైగా ముంచేసిన ఎన్ఆర్ఐ జంటఅయితే ఈ ఆరోపణలను సతీష్ ఖండించాడు. అతుల్య మరణంలో తన పాత్ర లేదని పేర్కొన్నారు. ఆమె ఆత్మహత్య చేసుకుందంటే తాను నమ్మడం లేదన్నాడు. కాగా యూఏఈ షార్జాలో వరకట్న వేధింపుల కారణంగా కేరళకు చెందిన మహిళ బిడ్డను చంపి తాను ఆత్మహత్యకు పాల్పడింది. జూలై 8న షార్జాలోని అల్ నవ్దాలో 32 ఏళ్ల విపంజిక మణి తన 16 నెలల కుమార్తెను హత్య చేసి, తాను తనువు చాలించిన సంగతి తెలిసిందే. -
అంతా ఫేక్.. నమ్మొద్దు!
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ప్రభుత్వం కొత్త రకం గోల్డెన్ వీసా పథకాన్ని ప్రారంభించినట్లు వచ్చిన వార్తలపై అక్కడి ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. కొన్ని షరతులతో నామినేషన్ విధానంలో ఈ వీసాను త్వరలో జారీ చేయనున్నట్లు వచ్చిన కథనాల్లో వాస్తవం లేదని యూఏఈ ప్రభుత్వం అధికారికంగా వివరణ ఇచ్చింది. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్ సెక్యూరిటీ (ఐసీపీ) విభాగాలు ఈ కథనాలు పూర్తిగా ఫేక్ అని కొట్టిపారేశాయి.లక్ష అరబ్ ఎమిరేట్స్ దినార్లు (సుమారు రూ.23.3 లక్షలు) ఫీజు చెల్లిస్తే జీవితకాలం వర్తించే వీసా అందజేస్తున్నట్లు రాయద్ గ్రూప్ తెలిపింది. దాంతో చాలా అంతర్జాతీయ వార్తా సంస్థలు ఈమేరకు కథనాలు ప్రచురించాయి. ఇవికాస్తా వైరల్‌గా మారడంతో దుబాయ్ ప్రభుత్వమే రంగంలోకి దిగి స్పష్టతనిచ్చింది. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్ సెక్యూరిటీ (ఐసీపీ) విభాగాలు ఇలా వస్తున్న కథనాలను నమ్మకూడదని తేల్చి చెప్పాయి.UAE denies lifetime Golden Visa eligibility for Indians, Bangladeshis; dismisses ₹23 lakh reporthttps://t.co/FcxxTHOnpx— Hindustan Times (@htTweets) July 9, 2025ఇదీ చదవండి: యాపిల్ కొత్త సీఓఓ మనోడే..‘అన్ని గోల్డెన్ వీసా అప్లికేషన్లు అధికారిక యూఏఐ ప్రభుత్వ మార్గాలు, స్పష్టమైన విధానాల ద్వారానే ప్రాసెస్ అవ్వాలి. దరఖాస్తుదారులను నమ్మించేలా, వారి అప్లికేషన్లను ప్రాసెస్ చేయడానికి లేదా నామినేట్ చేయడానికి ఏ బాహ్య కన్సల్టెన్సీకి లేదా ఏజెన్సీకి అధికారం లేదు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ, ప్రజల ఆకాంక్షలను దుర్వినియోగం చేసే సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని తెలిపింది. ఖచ్చితమైన వివరాల కోసం దరఖాస్తుదారులు ఐసీపీ అధికారిక వెబ్సైట్ లేదా 600 522 222 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని కోరింది. -
Ind vs Pak: ఆసియా కప్-2025.. భారత్-పాక్ మ్యాచ్ ఆరోజే!
ఆసియా కప్-2025 నిర్వహణకు మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరులో టోర్నమెంట్ నిర్వహించేందుకు ఆసియా క్రికెట్ మండలి (ACC) ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి జూలై మొదటి వారంలోనే షెడ్యూల్ విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కాగా భారత్- పాకిస్తాన్ (India vs Pakistan) మధ్య ఇటీవలి ఉద్రిక్తతల నేపథ్యంలో ఆసియా కప్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్న విషయం తెలిసిందే. కశ్మీర్‌లోని పహల్గామ్లో ఉగ్రవాదులు అమాయక పర్యాటకులను కాల్చి చంపగా.. ఇందుకు ప్రతిగా భారత సైన్యం పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట దాడులు చేసింది.ఈ క్రమంలో పాకిస్తాన్ సైన్యం ఎదురుదాడికి తెగబడగా.. భారత ఆర్మీ ధీటుగా బదులిచ్చింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. అయితే, సింధు జలాల ఒప్పందం రద్దు సహా పాక్‌పై భారత్ కఠిన చర్యలకు ఉపక్రమించిన నేపథ్యంలో దాయాది కాల్పుల విరమణకు అంగీకరించింది. దీంతో ప్రస్తుతం పరిస్థితులు చక్కబడ్డాయి.అయితే, ఆసియా కప్‌లో భారత్- పాకిస్తాన్ కలిసి ఆడతాయా లేదా అన్న సందేహాల నడుమ.. టైమ్స్ ఆఫ్ ఇండియా ఆసక్తికర కథనం ప్రచురించింది. భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీని ముందుగా నిర్ణయించినట్లుగా తటస్థ వేదికైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో నిర్వహించనున్నట్లు తెలిపింది.భారత్- పాక్ మ్యాచ్ ఆరోజేఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించనున్న ఆసియా కప్.. సెప్టెంబరు 5న ఆరంభం కానున్నట్లు పేర్కొంది. అదే విధంగా.. గ్రూప్ దశలో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్- పాక్ తొలుత సెప్టెంబరు 7న ముఖాముఖి తలపడనున్నట్లు వెల్లడించింది. ఇక 2022, 2023 మాదిరే ఈసారి కూడా గ్రూప్ దశ తర్వాత సూపర్ ఫోర్ ఫార్మాట్లోనే టోర్నీని నిర్వహించనున్నట్లు సమాచారం.ఒకవేళ భారత్‌తో పాటు పాకిస్తాన్ కూడా సూపర్ ఫోర్కు అర్హత సాధిస్తే సెప్టెంబరు 14న మరోసారి దాయాదులు పరస్పరం ఢీకొట్టనున్నాయి. అన్నీ సజావుగా సాగి ఇరు జట్లు ఫైనల్ చేరితే సెప్టెంబరు 21న మరోసారి హై వోల్టేజీ మ్యాచ్ చూసేందుకు అభిమానులకు అవకాశం లభిస్తుంది.మూడుసార్లు పోటీ పడే అవకాశం!అయితే, ప్రస్తుత ఫామ్ దృష్ట్యా పాక్ గ్రూప్ దశ దాటడమే కష్టంగా కనిపిస్తోంది. ఏదేమైనా దాయాదులు ఈ టోర్నీలో మూడుసార్లు ముఖాముఖి పోటీ పడే అవకాశాలు మాత్రం లేకపోలేదు. కాగా ఆసియా కప్-2025లో మొత్తంగా ఆరు జట్లు తలపడనున్నాయి. టీ20 ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్‌లతో పాటు ఏసీసీ మెన్స్ ప్రీమియర్ కప్‌లో అగ్రస్థానంలో నిలిచిన యూఏఈ కూడా టైటిల్ కోసం పోటీపడనుంది.తటస్థ వేదిక కాబట్టికాగా పాకిస్తాన్‌తో కలిసి ఆడకూడదని టీమిండియా భావించగా.. ఏసీసీ సమావేశంలో భాగంగా ఆతిథ్య హోదాలో ఆడేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సుముఖంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల బ్రాడ్కాస్టన్ సోనీ స్పోర్ట్స్ విడుదల చేసిన పోస్టర్లో పాక్ కెప్టెన్ కనబడకపోవడంతో.. ఈ టోర్నీ నుంచి పాక్ తప్పుకొందనే సంకేతాలు వచ్చాయి. ఇక ఈ కథనాల్లో ఏది నిజమో తేలాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే!చదవండి: ఇంగ్లండ్ గడ్డపై ఇరగదీస్తున్న ఇషాన్ కిషన్, తిలక్ వర్మ -
Air India Incident భారీ విరాళం ప్రకటించిన యూఏఈ వైద్యుడు
Air India plane crash అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమానం 171 ప్రమాదంలో ఘోర ప్రమాదం వందల కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ప్రమాంలో విమాన ప్రయాణికులతోపాటు, అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన బాధిత వైద్య విద్యార్థులు ,వైద్యుల కుటుంబాలను ఆదుకోవడానికి యుఏఈలో ఉండే భారతీయ డాక్టర్ షంషీర్ వాయాలిల్ (Indian doctor Shamshir Vayalil) ముందుకొచ్చారు. సుమారు రూ. 6కోట్ల (2.5 మిలియన్ దిర్హామ్ సహాయాన్ని ప్రకటించారు..కేరళకు చెందిన వైద్యుడు బహుళజాతి ఆరోగ్య సంరక్షణ సంస్థ , VPS హెల్త్‌కేర్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ డాక్టర్ వాయలిల్ మానవ్, ఆర్యన్, రాకేష్ , జైప్రకాష్లను "భవిష్యత్ ఫ్రంట్‌లైన్ హీరోలు" అంటూ వారికి నివాళి అర్పించారు. స్వయంగా మెడికల్ హాస్టల్లో చదువుకున్న ఆయన వైద్య విద్యార్థుల పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. భోజనం తింటున్న సమయంలో హాస్టల్లో జరిగిన ప్రమాదంలపై ఆయన తీవ్రంగా చలించిపోయారు. ఈ నేపథ్యంలో యువ వైద్యుల కుటుంబాలకు అండగా నిలబడానికి నిర్ణయించుకున్నారు. అబుదాబి నుంచే ఆయన ఈ సాయాన్ని ప్రకటించారు. దీన్ని మరణించిన నలుగురు విద్యార్థుల కుటుంబాలలో ఒక్కొక్కరికి రూ. కోటి, తీవ్రంగా గాయపడిన ఐదుగురు విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 20 లక్షలు, సన్నిహితులను కోల్పోయిన వైద్యుల కుటుంబాలకు రూ. 20 లక్షల అందించనున్నారు. బీజే మెడికల్ కాలేజీలోని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ద్వారా డా. షంషీర్ ప్రకటించిన సాయం త్వరలోనే అందనుంది.They were future frontline heroes.Manav, Aaryan, Rakesh, and Jaiprakash were preparing to save lives, not lose their own. The AI171 crash took them from us. Pledging ₹6 crore to support their families and others affected.#AirIndia171 #AI171 #BJMedicalCollege pic.twitter.com/Jh0vivpstJ— Dr. Shamsheer Vayalil (@drshamsheervp) June 16, 2025ప్రమాదం తర్వాత జరిగిన పరిణామాలను చూసినప్పుడు తాను తీవ్రంగా కలత చెందారట. తాను హాస్ట్‌లో ఉంటూ చదువుతకుంటూ రోజులను తలచుకున్న ప్రమాద దృశ్యాలను చూసి చలించిపోయారట. వాయలిల్ తాను చదువుకునే రోజుల్లో మంగళూరు (Mangalore)లోని కస్తూర్బా మెడికల్ కాలేజీ, చెన్నై(Chennai)లోని శ్రీ రామచంద్ర మెడికల్ కాలేజీ హాస్టళ్లలో ఉన్నారట. స్వయంగా వాయలిల్ అల్లుడు, లులు గ్రూప్ ఇంటర్నేషనల్ యజమాని M.A. యూసుఫ్ అలీ తెలిపారు. మరోవైపు బుర్జీల్ హోల్డింగ్స్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ కూడా అయిన వాయలిల్ తన దాతృత్వాన్ని చాటుకోవడం ఇదే మొదటి సారి కాదు 2010లో, మంగళూరు విమాన ప్రమాదం తర్వాత, బుర్జీల్ హోల్డింగ్స్‌లో బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం, ఉపాధి అవకాశాలను కల్పించారు.ఇదీ చదవండి: Cancer Risk ఈ ఫుడ్స్‌తో ముప్పే..!డాక్టర్ వార్నింగ్కాగా లండన్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా విమానం AI-171 ,జూన్ 12న అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అతుల్య హాస్టల్ కాంప్లెక్స్‌లో కూలిపోయింది. ఈఘటనలో మెడికల్ కాలేజీ (BJMC) మెస్ భవనంలో భోజనం చేస్తుండగా మరణించిన వారి సంఖ్యను BJMC జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (JDA) ధృవీకరించింది . ప్రమాదంలో మరో 20 మంది విద్యార్థులు గాయపడ్డారని తెలిపింది. వారిలో 11 మంది డిశ్చార్జ్ అయ్యారు, మిగిలిన చికిత్స పొందుతున్నారని DA అధ్యక్షుడు డాక్టర్ ధవల్ గమేటి తెలిపారు. విద్యార్థుల ప్రాణనష్టంతో పాటు, "అతుల్యం" నివాస గృహాలలో నివసిస్తున్న సూపర్-స్పెషాలిటీ వైద్యుల నలుగురు కుటుంబ సభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఒక నివాస వైద్యుడి భార్య గాయపడి చికిత్స పొందుతోంది. -
అబుదాబిలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
అబుదాబి :తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం అబు ధాబిలోని ఇండియా ఎంబసీ వేదికగా ఎంతో వైభవంగా నిర్వహించబడింది. తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ - అబుధాబి ఆధ్వర్యంలో జయప్రదంగా సాగిన ఈ వేడుక తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పింది. ఈ వేడుకకు ప్రేం చంద్, కాన్సులర్(కౌన్సిలర్) ముఖ్య అతిథిగా హాజరయ్యారు, గౌరవ అతిథులుగా కుమారి ఆయుషి సుతారియా, సెకండ్ సెక్రటరీ (పాలిటికల్) పాల్గొన్నారు. వీరి సమక్షంలో దీపప్రజ్వలన కార్యక్రమం నిర్వహించబడింది.తెలంగాణ పిల్లలు భారత మరియు యుఏఈ జాతీయ గీతాలు, తెలంగాణ రాష్ట్ర గీతం ఆలపించి దేశభక్తిని ప్రతిబింబించారు. అనంతరం తెలంగాణ బాలికలు మరియు మహిళలు శాస్త్రీయ నృత్యాలు, జానపద నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా వేడుకకు కొత్త అందాన్ని తెచ్చారు. తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సహకారంతో, ధరావత్ రాజ్‌కుమార్ నేతృత్వంలో వచ్చిన ప్రతినిధి బృందం పేరిణి శివ తాండవం, గుస్సాడి నృత్యం, పోతరాజు, మరియు ఇతర సంప్రదాయ నృత్యాలు ప్రదర్శించారు. ఈ కళారూపాలు, వేడుకలో తెలంగాణ సాంస్కృతిక సంపదను మధురంగా ప్రతిబింబించాయి.ప్రత్యేకంగా, తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు - పావని, అర్చనా, లక్ష్మి తమ కృషితో తెలంగాణ కళా సంపదను ప్రతిబింబించే చిత్ర ప్రదర్శన వేడుకలకు మరింత ఆకర్షణ గా నిలిచింది. ఎంబసీ ప్రాంగణం తెలంగాణను తలపించేలా అలంకరించబడింది. తెలంగాణ సంస్కృతి, చరిత్రను ప్రతిబింబించే కళా ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఇంతే కాదు, డప్పు కళాకారుల దరువు వేడుక లో మరింత ఉత్తేజం నింపింది. డప్పు కళాకారులు, పోతరాజు కళాకారులు, గుస్సాడీ కళాకారులు మరియు పేరిణి శివ తాండవం కళాకారులు కలిసి చేసిన జుగల్ బంది ప్రేక్షకులను ఎంత గానో అలరించింది. ఈ సందర్భంగా తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్, ఎంబసీ అధికారులను ప్రత్యేకంగా సన్మానించింది. ఈ సంబరాలలో పాల్గొన్న ఇతర రాష్ట్రాల సంఘాల నాయకులను మరియు ఇతర సాంఘిక సేవ సంఘం నాయకులను శాలువా కప్పి మరియు మొమెంటో ప్రధానం చేసి సత్కరించారు. అలాగే కార్యక్రమం లో పాల్గొన్న కళాకారులందరికి జ్ఞాపికలు ఇచ్చి సన్మానించారు.. ఈ వేడుక అబూదాబి లో నివసిస్తున్న తెలంగాణ ప్రజలకు చిరస్థాయిగా నిలిచిపోవలసిన జ్ఞాపకంగా మారింది అని అసోసియేషన్ కార్య నిర్వాహకుడు రాజా శ్రీనివాస రావు తెలియ జేశారు.వేడుకల తదనంతరం కార్యక్రమానికి వచ్చిన అతిదులందరికి, కార్య క్రమ నిర్వాహకులు తెలంగాణ వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం, సాంస్కృతిక శాఖ, మరియు భారత రాయబార కార్యాలయం అందించిన సహాయంతో ఈ వేడుక మరింత వైభవంగా జరిగింది. వేదికను అందుబాటులోకి తీసుకువచ్చిన ఎంబసీ అధికారులకు తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. -
రికార్డు విజయం.. బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన యూఏఈ
క్రికెట్ పసికూన యూఏఈ రికార్డు విజయం సాధించింది. తమ చరిత్రలో తొలిసారి బంగ్లాదేశ్‌పై విజయం నమోదు చేసింది (టీ20ల్లో). మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నిన్న (మే 19) జరిగిన రెండో టీ20లో ఇది జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన యూఏఈ మరో బంతి మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించి, 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో యూఏఈ 1-1తో సమంగా నిలిచింది. ఈ సిరీస్ కోసం యూఏఈలో (షార్జా) పర్యటిస్తున్న బంగ్లాదేశ్.. తొలి మ్యాచ్‌లో 27 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. నిర్ణయాత్మకమైన మూడో టీ20 మే 21న (షార్జాలో) జరుగనుంది.రాణించిన బంగ్లా బ్యాటర్లుటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. టాపార్డర్ బ్యాటర్లు తంజిద్ హసన్ (59), లిటన్ దాస్ (40), నజ్ముల్ హసన్ షాంటో (27), తౌహిద్ హృదోయ్ (45), జాకిర్ అలీ (6 బంతుల్లో 18) రాణించడంతో భారీ స్కోర్ చేసింది. యూఏఈ బౌలర్లలో జవాదుల్లా 3, సాఘిర్ ఖాన్ 2 వికెట్లు తీశారు.యూఏఈని గెలిపించిన కెప్టెన్అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన యూఏఈని కెప్టెన్ ముహమ్మద్ వసీం (42 బంతుల్లో 82) అద్భుత ఇన్నింగ్స్ ఆడి గెలిపించాడు. వసీం ఔటయ్యే సరికి యూఏఈ లక్ష్యానికి ఇంకా దూరంలో ఉన్నా.. వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లు తలో సిక్సరో, బౌండరీనో బాది జట్టు గెలుపుకు దోహదపడ్డారు. ఆఖర్లో ధృవ్ పరాషార్ (11), హైదర్ అలీ (15 నాటౌట్) జాగ్రత్తగా ఆడి యూఏఈకి రికార్డు విజయాన్నందించారు. యూఏఈ 19.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. బంగ్లా బౌలర్లలో షొరీఫుల్, నహిద్ రాణా, రిషద్ హొసేన్ తలో రెండు వికెట్లు తీయగా.. తన్వీర్ ఇస్లాం, తంజిమ్ హసన్ చెరో వికెట్ పడగొట్టారు. -
బంగ్లా ప్లేయర్ విధ్వంసకర శతకం.. రికార్డులు బద్దలు
రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం యూఏఈలో పర్యటిస్త్ను బంగ్లాదేశ్ విజయంతో బోణీ కొట్టింది. నిన్న (మే 17) జరిగిన తొలి మ్యాచ్‌లో ఆ జట్టు ఆతిథ్య జట్టును 27 పరుగుల తేడాతో ఓడించింది. షార్జా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన యూఏఈ 164 పరుగులకే ఆలౌటై ఓటమిపాలైంది.ఎమోన్ విధ్వంసకర శతకంఈ మ్యాచ్‌లో బంగ్లా ఓపెనర్ పర్వేజ్ హొస్సేన్ ఎమోన్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. 54 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 100 పరుగులు చేశాడు. మిగతా ఎనిమిది మంది బంగ్లా బ్యాటర్లు కలిపి 66 బంతుల్లో 70 పరుగులు మాత్రమే చేశారు. యూఏఈ బౌలర్లు ఎక్స్‌ట్రాల రూపంలో ఏకంగా 21 పరుగులిచ్చారు.రికార్డు శతకంఎమోన్ విధ్వంసకర సెంచరీ సాధించిన క్రమంలో పలు రికార్డులు బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ టీ20ల్లో తమీమ్ ఇక్బాల్ (2016 టీ20 వరల్డ్‌కప్‌లో ఒమన్‌పై) తర్వాత బంగ్లా తరఫున సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ఎమోన్ చేసిన సెంచరీ (53 బంతుల్లో) టీ20ల్లో బంగ్లా తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీగా రికార్డైంది. తమీమ్ ఒమన్‌పై 60 బంతుల్లో సెంచరీ చేశాడు.తమీమ్ 27 ఏళ్ల వయసులో సెంచరీ చేయగా.. ఎమోన్ 22 ఏళ్ల వయసులోనే ఈ ఘనత సాధించాడు. తద్వారా బంగ్లా తరఫున అతి చిన్న వయసులో టీ20 సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో ఎమోన్ కొట్టిన 9 సిక్సర్లు టీ20ల్లో ఆ జట్టు తరఫున (ఓ మ్యాచ్‌లో) అత్యధికం. గతంలో ఈ రికార్డు రిషద్ హొస్సేన్ (2024లో శ్రీలంకపై 7 సిక్సర్లు) పేరిట ఉండేది.సత్తా చాటిన బౌలర్లు192 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన యూఏఈ.. బంగ్లా బౌలర్లు తంజిమ్ (4-0-22-2), మెహిది హసన్ (4-0-55-2), హసన్ మహమూద్ (4-0-33-3), ముస్తాఫిజుర్ (4-0-17-2), తన్వీర్ ఇస్లాం (4-0-30-1) సత్తా చాటడంతో 20 ఓవర్లలో వికెట్లన్నీ కోల్పోయి 164 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టు తరఫున కెప్టెన్ ముహమ్మద్ వసీం (54), ఆసిఫ్ ఖాన్ (42), రాహుల్ చోప్రా (35) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 మే 19న షార్జా వేదికగా జరుగనుంది. -
జుట్టు విరబోసుకుని వింత డాన్స్.. UAEలో ట్రంప్ కు ఘన స్వాగతం
-
వింత డ్యాన్స్‌తో ట్రంప్‌కు స్వాగతం.. వీడియో వైరల్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పశ్చిమ దేశాల పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు చేరుకున్నారు. ట్రంప్‌కు యూఏఈలో ఘన స్వాగతం లభించింది. ఆయనకు అక్కడి సంప్రదాయ నృత్యం అల్ అయ్యాలా (Al-Ayyala)తో స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదేం డ్యాన్స్ అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.వివరాల ప్రకారం.. అధ్యక్షుడు ట్రంప్ యూఏఈ (UAE) చేరుకున్నాక అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ స్వాగతం పలికారు. అనంతరం, ఇద్దరు నేతలు కలిసి అధ్యక్ష భవనం ఖషర్ అల్-వాటన్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలోనే పలువురు బాలికలు జుట్టు విరబోసుకొని సంప్రదాయ సంగీతానికి అనుగుణంగా తలలు ఊపుతూ ట్రంప్‌నకు స్వాగతం పలికారు. పక్కనే కొందరు డబ్బులు వాయిస్తుండగా ఇద్దరు నేతలు ముందుకు కదిలారు. వారి డ్యాన్స్ చూసిన ట్రంప్.. ఒక్కసారిగా షాకయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.In a symbolic gesture of respect, the #UAE welcomed Donald Trump with the traditional Al-Ayyala dance — a beautiful display of heritage, unity, and yes, the iconic hair-flippic.twitter.com/rjYe0y0VJu— Jordan Kyle (@_Jordan_Kyle_) May 15, 2025ఇదిలా ఉండగా, యునెస్కో (UNESCO)ప్రకారం.. అల్- అయ్యాలా అనేది యూఏఈ, ఒమన్లలో ప్రసిద్ధి చెందిన సంప్రదాయ నృత్యం. సంప్రదాయ దుస్తులు ధరించిన బాలికలు వారి పొడవాటి జుట్టును విరబోసుకొని.. సంగీతానికి అనుగుణంగా తలలను ఊపుతుంటారు. వేడుకలు, వివాహాల సమయాల్లో అల్- అయ్యాలాను ఎక్కువగా ప్రదర్శిస్తుంటారు. వయసు, లింగం, సామాజిక బేధం వంటి తేడాలు లేకుండా అందరినీ ఒకచోట చేర్చేదిగా దీన్ని భావిస్తారు. వీరంతా తలలు ఊపుకుంటూ డ్యాన్స్ చేసినట్టుగా ఊగిపోతారు.It is actually a traditional Emirati dance called Al Ayyala or Al Razfa depending on the region. The hair movement by the women symbolizes pride and beauty and is part of a heritage performance that reflects unity and strength. What you saw was not just a show. It was culture. pic.twitter.com/JKcAlXOmGd— Khalid Alkaabi (@alyarwani) May 15, 2025 -
10 మంది రిటైర్డ్ అవుట్
బ్యాంకాక్: మహిళల టి20 ప్రపంచకప్ ఆసియా క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో అరుదైన ఫీట్ నమోదైంది. బ్యాంకాక్ వేదికగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఖతార్ మధ్య జరిగిన మ్యాచ్‌లో యూఏఈకి చెందిన 10 మంది ప్లేయర్లు రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరిగారు. మహిళల, పురుషుల క్రికెట్లో కలిపి ఒక జట్టులో ఇద్దరికి మించి ఎక్కువ మంది ఆటగాళ్లు రిటైర్డ్ అవుట్ కావడం ఇదే తొలిసారి. మొదట బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ 16 ఓవర్లలో 192 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్, కెపె్టన్ ఈషా ఓజా (55 బంతుల్లో 113; 14 ఫోర్లు, 5 సిక్స్‌లు), తీర్థ సతీశ్ (42 బంతుల్లో 74; 11 ఫోర్లు) దంచి కొట్టారు. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 16 ఓవర్లలోనే 192 పరుగులు జోడించారు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో డిక్లరేషన్ సౌలభ్యం లేకపోవడంతో... వీరిద్దరితో పాటు మిగిలిన ప్లేయర్లంతా రిటైర్డ్ అవుట్‌గా ప్రకటించుకొని ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించారు. లక్ష్యఛేదనకు దిగిన ఖతార్ 11.1 ఓవర్లలో 29 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా యూఏఈ జట్టు 163 పరుగుల తేడాతో విజయం సాధించింది.ఓపెనర్ రిజ్పా బానో ఇమ్మాన్యూయేల్ (20; 2 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... మిగిలిన వాళ్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. 8 మంది ప్లేయర్లు డకౌటయ్యారు. దీంతో ఇరు జట్లలో కలిపి 15 మంది ప్లేయర్లు డకౌటయ్యారు. మహిళల టి20 క్రికెట్లో ఇదే అత్యధికం. యూఏఈ బౌలర్లలో మిచెల్ బోథా 3, కేటీ థామ్సన్ 2 వికెట్లు పడగొట్టారు. -
క్రికెట్ చరిత్రలో తొలిసారి.. ఒకే ఇన్నింగ్స్‌లో 10 మంది రిటైర్డ్ ఔట్
అంతర్జాతీయ క్రికెట్ అయినా, దేశవాళీ క్రికెట్ అయినా ప్లేయర్ 'రిటైర్డ్ ఔట్' అనేది చాలా అరుదుగా చూస్తూ ఉంటాము. కానీ ఓ మ్యాచ్‌లో మొత్తం పది మంది బ్యాటర్లు 'రిటైర్డ్ ఔట్ రూపంలో పెవిలియన్‌కు చేరారు. అవును మీరు విన్నది నిజమే. అసలు విషయం తెలియాలంటే ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే.మహిళల టీ20 ప్రపంచకప్-2025లో భాగంగా బ్యాంకాక్ వేదికగా శనివారం యూఏఈ, ఖతార్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన యూఏఈ మహిళల జట్టు 16 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 192 పరుగులు చేశారు. ఇక్కడే యూఏఈ క్రికెట్ టీమ్ సంచలన నిర్ణయం తీసుకుంది. బ్యాంకాక్‌లో వర్షం పడే అవకాశం ఉన్నందున యూఏఈ తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయాలని నిర్ణయించుకుంది. కానీ టీ20ల్లో డిక్లరేషన్ రూల్ లేకపోవడంతో, యూఏఈ మెనెజ్‌మెంట్ తమ బ్యాటర్లందరిని మైదానంలోకి పిలిచి రిటైర్డ్ ఔట్ చేయాలని నిర్ణయించుకుంది. దీంతో క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా మొత్తం పది మంది బ్యాటర్లు రిటైర్డ్ ఔటయ్యారు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన స్కోర్ కార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న యుఏఈ కెప్టెన్, మేనేజ్మెంట్పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురుస్తున్నారు. అనంతరం 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఖతార్ కేవలం 29 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఖతార్‌పై 163 పరుగల తేడాతో యూఏఈ విజయం సాధించింది.చదవండి: #Rohit Sharma: సోషల్ మీడియాలోనే రిటైర్మెంట్.. రోహిత్‌ను ఇలాగే పంపిస్తారా? -
పాకిస్తాన్‌కు భారీ షాక్.. పీఎస్ఎల్ నిర్వహణకు యూఏఈ నో?
పాకిస్తాన్ సూపర్ లీగ్-2025లో మిగిలిన మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలని భావించిన పాక్ క్రికెట్ బోర్డుకు భారీ షాక్ తగిలింది. భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు పీసీబీ అభ్యర్ధను తిరష్కరించినట్లు తెలుస్తోంది. పీఎస్ఎల్ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చేందుకు యూఏఈ సిద్దంగా లేనట్లు సమాచారం. ఇప్పటికే ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు తమ నిర్ణయాన్ని పీసీబీ తెలియజేసినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి."బీసీసీఐతో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుకు మంచి సంబంధాలు ఉన్నాయి. టీ20 ప్రపంచకప్-2021, ఐపీఎల్ ఎడిషన్లు, ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ తమ మ్యాచ్‌లను యూఏఈలోనే ఆడింది. యూఈఏలో చాలా మంది క్రికెట్ అభిమానులు దక్షిణాసియా నుంచే ఉన్నారు. ఇటువంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య పీఎస్ఎల్ వంటి టోర్నమెంట్ నిర్వహించడం వల్ల ఇరు దేశాల మైత్రి దెబ్బతింటుంది. భద్రతాపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే పీఎస్ఎల్ను నిర్వహించేందుకు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు సిద్దంగా లేదని" క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. కాగా రావాల్పిండి స్టేడియం సమీపంలో డ్రోన్ అటాక్ జరగడంతో పీఎస్ఎల్-2025 సీజన్‌ను పీసీబీ వాయిదా వేసింది. -
బంగ్లాదేశ్ కెప్టెన్‌గా లిట్టన్ కుమార్ దాస్..
పాకిస్తాన్, యూఏఈలతో టీ20 సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ సిరీస్‌లకు బంగ్లాదేశ్ కెప్టెన్‌గా వికెట్ కీపర్ బ్యాటర్ లిట్టన్ కుమార్ దాస్ ఎంపికయ్యాడు. టీమిండియాతో టీ20 సిరీస్ అనంతరం బంగ్లా టీ20 కెప్టెన్సీకి నజ్ముల్ హొస్సేన్ శాంటో రాజీనామా చేశాడు.ఈ క్రమంలోనే తమ టీ20 జట్టు కెప్టెన్‌గా లిట్టన్ కుమార్ దాస్‌ను బంగ్లా క్రికెట్ బోర్డు నియమించింది. ఈ సిరీస్‌లలో లిట్టన్ దాస్ సారథిగా తనను తాను నిరూపించుకుంటే ఫల్ టైమ్‌గా కెప్టెన్‌గా కొనసాగించే అవకాశముంది. అయితే ఈ సిరీస్‌లకు స్టార్ ఆల్‌రౌండర్ మెహదీ హసన్ మిరాజ్‌కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. అయితే మాజీ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటోతో పాటు యువ ఆటగాళ్లు షమీమ్ హొస్సేన్, జాకర్ అలీ అనిక్, రిషాద్ హొస్సేన్‌లకు సెలక్టర్లు చోటిచ్చారు. బంగ్లా జట్టు తొలుత యూఏఈతో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌లు మే 17, మే 19 తేదీలలో షార్జాలో జరగనున్నాయి. ఆ తర్వాత బంగ్లాదేశ్ ఐదు మ్యాచ్‌ల సిరీస్ కోసం పాకిస్తాన్‌కు వెళ్లనుంది. ఈ సిరీస్ మే 25 నుంచి ప్రారంభం కానుంది.యూఏఈ, పాకిస్తాన్ టీ20 సిరీస్‌లకు బంగ్లా జట్టులిట్టన్ కుమార్ దాస్ (కెప్టెన్), తాంజిద్ హసన్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్, షమీమ్ హొస్సేన్, జాకర్ అలీ అనిక్, రిషద్ హొస్సేన్, షక్ మహిదీ హసన్ (వైస్ కెప్టెన్), తన్వీర్ మహ్ముద్, ససనీబ్, తన్వీర్ మహ్మద్, సస్కీమ్, నహిద్ రానా, షోరిఫుల్ ఇస్లాం -
హైదరాబాద్‌లో చిన్న ఆయుధాల తయారీ కేంద్రం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రా (ఎంఈఐఎల్) గ్రూప్ సంస్థ ఐకామ్ టెలీ తాజాగా హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి చిన్న ఆయుధాల తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. ఇందుకోసం యూఏఈకి చెందిన చిన్న ఆయుధాల తయారీ సంస్థ, ఎడ్జ్ గ్రూప్‌లో భాగమైన క్యారకల్‌తో జట్టు కట్టింది. రెండు సంస్థల మధ్య కుదిరిన లైసెన్సింగ్ ఒప్పందం కింద క్యారకల్ సాంకేతిక సహకారాన్ని అందిస్తుంది. మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ నినాదం కింద ఈ ప్లాంటులో సీఏఆర్ 816 క్లోజ్–క్వార్టర్స్ అసాల్ట్ బ్యాటిల్ రైఫిల్, సీఏఆర్ 817 అసాల్ట్ రైఫిల్ మొదలైనవి ఉత్పత్తి చేస్తారు. వీటిని భారత సాయుధ బలగాలు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్‌లు, రాష్ట్రాల పోలీస్ ఫోర్స్‌లు, ఎస్పీజీ మొదలైన రక్షణ రంగ విభాగాలకు సరఫరా చేయడంతో పాటు వివిధ దేశాలకు ఎగుమతి కూడా చేస్తారు. రక్షణ బలగాల పట్ల తమ నిబద్ధతకు, ఆత్మ నిర్భర్ భారత్ విజన్‌పై నమ్మకానికి ఇది నిదర్శనంగా నిలుస్తుందని ఐకామ్ ఎండీ సుమంత్ పాతూరు తెలిపారు. ఇరు దేశాల మధ్య రక్షణ రంగ సహకారానికి సంబంధించి సాంకేతిక బదిలీ ఒప్పందం కీలక మైలురాయిలాంటిదని క్యారకల్ సీఈవో హమద్ అల్అమెరి పేర్కొన్నారు. -
సలహా కమిటీ అడుగులు ముందుకు..
మోర్తాడ్ (బాల్కొండ): తెలంగాణ ప్రవాసీ విధానం (ఎన్ఆర్ఐ పాలసీ) రూపకల్పన, గల్ఫ్ బోర్డు ఏర్పాటు కోసం నిర్దేశించిన గల్ఫ్ సలహా కమిటీ అడుగులు ముందుకు పడ్డాయి. సలహా కమిటీ బాధ్యతలను స్వీకరించిన వారం రోజులలోనే యూఏఈలో ఒక దుర్ఘటన చోటు చేసుకోవడం, ఈ అంశంలో కమిటీ సభ్యులు వేగంగా స్పందించి మృతదేహాలను స్వదేశానికి తెప్పించడంతో బాధిత కుటుంబాలకు ఊరట లభించింది.యూఏఈలోని ఆల్‌కూజ్ ప్రాంతంలోని బేకరీలో పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి చేతిలో నిర్మల్ జిల్లా సోన్‌కు చెందిన ప్రేమ్‌సాగర్, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమన్నపేట్‌కు చెందిన స్వర్గం శ్రీనివాస్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈనెల 11న వీరు హత్యకు గురి కాగా వారం రోజుల వ్యవధిలోనే మృతదేహాలను స్వదేశానికి తెప్పించారు. ఇందులో సలహా కమిటీ కీలకపాత్ర పోషించింది. గల్ఫ్ సలహా కమిటీ చైర్మన్ వినోద్‌కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, ఇతర సభ్యులు ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారులతో యూఏఈ ఘటనపై చర్చించారు. సీఎంవో నుంచి కేంద్ర ప్రభుత్వానికి, విదేశాంగ శాఖకు సమాచారం అందించడంతో వారం రోజులలోనే మృతదేహాలను స్వదేశానికి తీసుకురాగలిగారు. గతంలో గల్ఫ్‌లో ఎవరైనా మరణిస్తే మృతదేహం ఇంటికి రావడానికి నెల రోజుల వరకు సమయం పట్టేది. బాధిత కుటుంబాలకు భరోసా యూఏఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. సలహా కమిటీ విజ్ఞప్తి మేరకు బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. హత్యకు గురైన వ్యక్తుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ విధానంలో ఏదైనా ప్రభుత్వ శాఖలో ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. గల్ఫ్ భరోసా కింద రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.అంత్యక్రియలకు ప్రభుత్వ సాయం స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు జగిత్యాల జిల్లా కలెక్టర్ రూ.15 వేల ఆర్థికసాయం మంజూరుచేశారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా మరణిస్తే వారి అంతిమ సంస్కారాలకు మాత్రమే ప్రభుత్వ సాయం అందుతుంది. గల్ఫ్‌లో హత్యకు గురైన ఘటనను మానవతా దృక్పథంతో పరిగణనలోకి తీసుకున్న జగిత్యాల జిల్లా (Jagtial District) కలెక్టర్ సత్యప్రసాద్ తన విచక్షణాధికారాలను ఉపయోగించుకుని స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించారు.చదవండి: స్మిత సబర్వాల్ ధిక్కార స్వరం!శనివారం జరిగిన శ్రీనివాస్ అంతిమ యాత్రలో ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పాల్గొని పాడె మోశారు. ఆయన కూడా సొంతంగా రూ.10 వేల సాయం అందించారు. ఇద్దరు మృతుల ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రకటించారు. సలహా కమిటీ ఏర్పడిన వెంటనే గల్ఫ్ ప్రవాసులకు ప్రయోజనం కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంపై గల్ఫ్ కార్మిక కుటుంబాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాయి. -
అబుదాబిలో ఘనంగా ఉగాది వేడుకలు..
సనాతనం, సత్సంబంధం, సంఘటితం, సహకారం, సత్సంగం వంటి పంచ ప్రామాణికాలతో ప్రారంభించబడిన యు.ఏ.ఈ లోని అతిపెద్ద బ్రాహ్మణ సమూహం గాయత్రీ కుటుంబం ఆధ్వ్యర్యంలో శ్రీ విశ్వావసు ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సుమారు 300 కుటుంబాలు ఈ వేడుకలో పాల్గొన్నారుప్రారంభం నుంచి చివరి వరకు ఆర్ష సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తూ ఆద్యంతం చక్కటి కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం రాజధాని అబుదాబిలో కన్నుల పండుగగా జరిగింది. దీపారాధన, విఘ్నేశ్వర పూజతో ప్రారంభమైన కార్యక్రమాలు, ప్రముఖ జ్యోతిష్య పండితులు, జ్యోతిష్య విశారద బ్రహ్మశ్రీ కొడుకుల సోమేశ్వర శర్మ గారిచే పంచాంగ పఠనం, ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి ప్రీతి తాతంభొట్ల, సంగీత గురువులు రాగ మయూరి, ఇందిరా కొప్పర్తి గార్లు తమ శిష్య బృందంతో సంగీత, నృత్య ప్రదర్శనలు, శ్రీనివాస మూర్తి గారు లాస్య వల్లరి, శివ తాండవ స్తోత్రం, ప్రముఖ తెలుగు కవులు ఆదిభట్ల కామేశ్వర శర్మ గారి ఆర్ధ్వర్యంలో, శ్రీలక్ష్మి చావలి, వెంపటి సతీష్‌ల కవి సమ్మేళనం, భగవద్గీత, అన్నమాచర్య, రామదాసు కీర్తనలు, సుభాషితాలు, సాహిత్య కార్యక్రమాలతో గాయత్రీ కుటుంబానికి సంబంధించిన చిన్నారులు, పెద్దలు తమ అద్భుతమైన ప్రతిభతో పూర్తి తెలుగింటి సంప్రదాయాన్ని కార్యక్రమంలో ఆవిష్కరిస్తూ రసజ్ఞులను సమ్మోహితులను చేశారు .ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా శ్రీమతి ఉషా బాల కౌతా గారు అందర్నీ ఆకట్టుకున్నారు. ఓరుగంటి సుబ్రహ్మణ్య శర్మ గాయత్రీ కుటుంబం ప్రధాన ఉద్దేశ్యాల గురించి వివరిస్తూ.. స్వదేశంలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పేద బ్రాహ్మణ కుటుంబాలకు గాయత్రి కుటుంబం అండదండగా నిలుస్తోంది. వారికి విద్య, వైద్య , వివాహం వంటి కార్యక్రమాలకు ఇప్పటి వరకూ గాయత్రి కుటుంబ సభ్యులు సుమారు కోటిన్నర రూపాయల వరకు సహాయం అందించారని, భవిష్యత్తులో బ్రాహ్మణ సంక్షేమానికి మరింత సహకారం అందిస్తామని వివరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ రచయిత, తెలుగు వేద కవి జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు గాయత్రీ కుటుంబం సమైక్యతను అభినందిస్తూ..ఈ సమూహం చేస్తున్న వివిధ కార్యక్రమాలను ప్రశంసించారు. అలాగే "ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఆ దేశ సంస్కృతిని గౌరవిస్తూనే బ్రాహ్మణులు స్వధర్మాన్ని పాటించవలసిన ఆవశ్యకతను కూడా నొక్కి చెప్పారు. బ్రాహ్మణులు ధర్మ జీవనం, ధర్మ పరిరక్షణ వదిలిపెట్టవద్దని, ఎల్లప్పుడూ జ్ఞానార్జన చేస్తూ.. ఆ జ్ఞానాన్ని అందరికీ పంచాలన్నారు. పట్టుదల, దీక్ష, తపస్సు, సహనం, నియమ నిష్ఠలతో నిత్యం గాయత్రీదేవిని ఆరాధించి, బ్రాహ్మణత్వాన్ని పొందాలి అని పిలుపునిచ్చారుఈ మొత్తం కార్యక్రమానికి సంపంగి గ్రూపు పూర్తి సహకారాన్ని అందించినందుకు నిర్వాహకులు ఆ గ్రూపు పెద్దలను సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ నిర్విరామంగా సాగిన ఈ కార్యక్రమంలో సభ్యులకు ఉగాది పచ్చడి, తిరుమల శ్రీవారి తీర్ధ ప్రసాదాలతో పాటు, అచ్చమైన బ్రాహ్మణ భోజనాన్ని అందించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమాన్ని గాయత్రీ కార్యకారిణీ బృందం రాయసం శ్రీనివాసరావు, మోహన్ ముసునూరి, గడియారం శ్రీనివాస్, సుబ్రహ్మణ్య శర్మ, వంశీ చాళ్లురి, రమేష్ సమర్ధవంతంగా నిర్వహించింది. (చదవండి: Ugadi 2025: సింగపూర్‌లో ఘనంగా ఉగాది వేడుకలు..) -
యూఏఈ: 500 మందికి పైగా భారతీయులకు క్షమాభిక్ష
అబుదాబి: భారత్‌తో సత్సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే క్రమంలో యూఏఈ అనూహ్య నిర్ణయం తీసుకుంది. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా భారీ సంఖ్యలో ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించింది. అందులో భారత్‌కు చెందిన వాళ్లే 500 మందికి పైగా ఉండగా.. వాళ్లంతా జైళ్ల నుంచి విడుదలైనట్లు సమాచారం. రంజాన్ సందర్భంగా యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ అక్కడి జైళ్లలో ఉన్న 1,295 మంది ఖైదీలను విడుదల చేయాలని ఆదేశించారు. మరోవైపు ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూడా 1,518 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దుబాయ్‌లోని జైళ్లలో మగ్గుతున్న వివిధ దేశాలకు చెందిన ఖైదీలకు తాజా క్షమాభిక్ష వర్తిస్తుందని అటార్నీ జనరల్, ఛాన్సలర్ ఎస్సమ్ ఇస్సా అల్ హుమైదాన్ ప్రకటించారు. రంజాన్ మాసం సందర్భంగా ఇలా ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించడం.. విడుదల చేయడం యూఏఈలో ఆనవాయితీగా వస్తోంది. అయితే సత్ప్రవర్తనను ఆధారంగా చేసుకునే ఆయా ఖైదీలను ఎంపిక చేసి విడుదల చేస్తుంటారు. అంతేకాదు వాళ్లు జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు అవసరమయ్యే ఆర్థిక సాయం కూడా అందించనున్నారు. -
యూఏఈలో మరో ఇద్దరు భారతీయులకు మరణశిక్ష అమలు
దుబాయ్: యూఏఈలో మరో ఇద్దరు భారతీయులకు మరణశిక్ష అమలైంది. హత్య కేసులో కేరళకు చెందిన ఇద్దరికి మరణశిక్ష అమలు చేసినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖకు యూఏఈ అధికారులు తాజాగా స్పష్టం చేశారు.కేరళ రాష్ట్రంలోని కన్నూర్ కు చెందిన మహ్మద్ రినాష్, పీవీ మురళీధరన్ లకు మరణశిక్ష అమలు చేసిన విషయాన్ని భారత విదేశాంగ శాఖ దృష్టికి తీసుకొచ్చారు. వివరాల్లోకి వెళితే.. ట్రావెల్ ఏజెన్సీ ఏఐ ఎయిన్ లో పని చేసిన రినాష్.. ఓ హత్య కేసులో ఇరుక్కున్నాడు. యూఏఈకి చెందిన ఓ వ్యక్తిని హత్య చేసిన నేరం కింద మరణశిక్ష అమలు చేయగా,. మురళీధరన్ అనే వ్యక్తి భారత్ కు చెందిన ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో మరణశిక్షను అమలు చేశారు.వీరి హత్య కేసులో భాగంగా కావాల్సిన అన్ని న్యాయపరమైన ఏర్పాట్లు చేసినట్లు భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అయితే వారిపై ఉన్నవి హత్యానేరాలు కావడంతో మరణశిక్ష అమలు తప్పలేదని, వారి చివరి మజిలీలో భాగంగా కుటుంబ సభ్యుల్లో ఇద్దరి చొప్పున అక్కడికి వెళ్లేందుకు ఏర్పాటు చేసినట్లు విదేశాంగ అధికారులు పేర్కొన్నారు. ఫిబ్రవరి 28వ తేదీనే వీరికి మరణశిక్షను ఖరారు చేయగా, తాజాగా వారి శిక్షను అమలు చేశారు. ఇప్పటిరవకూభారత్ కు చెందిన 28 మంది యూఏఈలో మరణశిక్ష బారిన పడ్డారు. ఇటీవల మార్చి 3వ తేదీన ఒక మహిళకు కూడా మరణశిక్షను అమలు చేసిన సంగతి తెలిసిందే.యూఏఈలో భారతీయ మహిళకు మరణశిక్ష అమలు -
యూఏఈలో భారతీయ మహిళకు మరణశిక్ష అమలు
న్యూఢిల్లీ: నాలుగు ఏళ్ల చిన్నారి మృతి కేసులో భాగంగా ఓ భారత మహిళకు యూఏఈలో మరణశిక్ష అమలైంది. గత నెల 15వ తేదీన శిక్షను ఖరారు చేసినప్పటికీ, ఆ విషయాన్ని తాజాగా విదేశాంగ శాఖ.. ఢిల్లీ హైకోర్టు తెలిపింది. యూపీకి చెందిన షెహజాదీ ఖాన్ అనే మహిళ.. గత కొంతకాలంగా అబుదాబిలో ఉంటోంది. 33 ఏళ్ల షెషజాదీ ఖాన్.. యూపీలోని బాంద్రా జిల్లాకు చెందిన మహిళ. టూరిస్టు వీసా మీద నాలుగేళ్ల క్రితం అబుదాబి వెళ్లింది.2022లో ఆగస్టులో తన కొడుకును చూసుకునే బాధ్యతను ఆమెకు అప్పగించాడు. షెహజాదీ కేర్ గివర్ కింద ఆ బాధ్యతలు తీసుకుంది. 2022, డిసెంబర్ 7 వ తేదీన వ్యాక్సినేషన్ కు తీసుకెళ్లింది నాలుగేళ్ల బుడతడికి. అయితే అది కాస్తా విషాదాంతమైంది. ఆ బాబు చనిపోవడంతో కేసు షెహజాదీ పడింది. తన కుమారుడు మరణానికి ఆమె కారణమంటూ కేసు ఫైల్ చేశాడు. ఇలా కొంతకాలం కోర్టులో చుట్టూ తిరగ్గా ఆమెకు మరణశిక్ష ఖరారైంది. ఆమెకు మరణశిక్ష ఖాయమైందన్న తెలుసుకున్న కుటుంబ సభ్యులు లబోదిబోమన్నారు. ఆ క్రమంలోనే ఆమె తండ్రి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే యూఏఈ చట్టాల ప్రకారం ఆమె మరణశిక్ష అమలు కావడంతో ఆ విషయాన్ని విదేశాంగ శాఖ.. ఢిల్లీ హైకోర్టుకు స్పష్టం చేసింది.అక్రమంగా రవాణా చేసి.. ఆమె టూరిస్టు వీసా మీద వెళ్లి అక్కడ స్థిరపడాలనుకుంది షెహజాదీ. అయితే ఆమెను అక్కడికి తీసుకెళ్లేముందు అది టూరిస్టు వీసా అనే సంగతిని ఫైజ్, నాడియా దంపతులు ఆమెకు చెప్పలేదు. అలా వెళ్లి ఇరుక్కుపోయింది ఆమె.ఆమెను అక్రమంగా రవాణా చేసినందుకు ఫైజ్, నాడియా దంపతులపై కూడా కేసు నమోదు అయ్యింది. ఈ క్రమంలోనే వారి నాలుగేళ్ల కొడుకును షెహజాదీ చూసుకుంటోంది. కానీ ఆ బాబు ఆమె చేతుల మీదుగానే చనిపోవడంతో మరొక కేసు షెహజాదీకి చుట్టుకుంది. యూఏఈ చట్టాలు కఠినంగా అమలు చేయడంతో ఆమెకు మరణశిక్ష అమలు చేసింది అక్కడ కోర్టు.చివరి కోరికను అడగ్గా..మరణశిక్ష అమలుకు ముందు గత నెల 16వ తేదీన చివరి కోరిక ఏమటని అడగ్గా.. కుటుంబ సభ్యులతో మాట్లాడిన తెలిపింది. తాను నిర్దోషినని కుటుంబ సభ్యుల ముందు కన్నీటి పర్యంతమైంది. అదే చివరిసారి ఆమె కుటుంబంతో మాటలని తండ్రి అంటున్నారు. -
తెలుగమ్మాయికి యూఏఈ ప్రతిష్టాత్మక అవార్డు..!
ఎయిర్ క్వాలిటీని పెంచడానికి కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుని ఆక్సిజన్ ను విడుదల చేసే బయోడీగ్రేడబుల్ కార్బన్ స్పాంజీ టైల్స్ ఫార్ములాను రూపొందించిన మోనిక అక్కినేని అబుదాబికి చెందిన ప్రతిష్ఠాత్మకమైన ‘జాయేద్ సస్టైన్ బిలిటీ ప్రైజ్’ను గెలుచుకుంది. చిన్నప్పుడు జానపద కథల్లో రాక్షసుల గురించి విన్నదో లేదోగానీ కాలుష్యకారక రాక్షసుల గురించి విన్నది మోనిక. భూతాపం పెంచే ఎన్నో భూతాల గురించి విన్నది. అలా వింటున్న క్రమంలో కర్బన ఉద్గారాల కట్టడికి తన వంతుగా ఏదైనా చేయాలనుకునేది. ఆవిష్కరణకు ముందు అధ్యయనం ముఖ్యం కదా!క్లైమెట్ ట్రాన్స్‌పరేన్సీ రిపోర్ట్లు చదవడం నుంచి కార్బన్ కాప్చర్ స్టోరేజీ(సీసీఎస్) తెలుసుకోవడం వరకు ఎన్నో చేసింది.... ఏలూరు నగరానికి చెందిన భూపేష్ రఘు అక్కినేని, స్వీటీ దంపతులు అబుదాబీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. వారి కుమార్తె మోనిక అక్కినేని అబుదాబీలోని మేరీల్యాండ్ ఇంటర్నేషనల్ స్కూల్లో పదవ తరగతి చదువుతోంది. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే ప్రాజెక్టులపై గత రెండేళ్ళుగా మోనిక ఆసక్తి పెంచుకుని సహ విద్యార్థి ముస్కాన్ తో కలిసి పనిచేస్తోంది. గత ఏడాది జూన్ నుంచి ఎయిర్ క్వాలిటీ పెంచే బయో డీగ్రేడబుల్ కార్బన్ స్పాంజ్ టైల్స్ తయారీపై పరిశోధనలు ప్రారంభించింది. సముద్ర గర్భంలో ఉండే నాచు, కొబ్బరిపీచులు, వైబర్ (ఇండస్ట్రియల్ సిమెంట్)తోపాటు మరికొన్ని రసాయనాలు వాడి చిన్నపాటి ప్లేట్లను సిద్ధం చేసింది. మోనిక పూర్తి చేసిన ప్రాజెక్టును స్కూల్ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించింది. ఒక ఫ్యాక్టరీలో ప్రాజెక్టు పనితీరును అధ్యయనం చేసి మేరీల్యాండ్స్ స్కూల్ ప్రాజెక్టును ఎంపిక చేసింది. ప్రతి ఏటా అబుదాబీ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ రాజకుటుంబం పేరుతో ‘జాయేద్ సస్టైన్బిలిటీ ప్రైజ్‌లను 11 విభాగాల్లో అందిస్తుంటారు. ఆరోగ్యం, ఆహారం, ఎనర్జీ, నీరు, వాతావరణంలో మార్పులపై అధ్యయనం... ఇలా పదకొండు విభాగాలకు ఆన్‌న్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తారు. ఈ ఏడాది 5,500 దరఖాస్తులు అందాయి. మోనిక ఈ అవార్డుకు దరఖాస్తు చేసింది. పదకొండు విభాగాల్లో 33 మందిని షార్ట్‌లిస్ట్ చేసి పదకొండు మందిని విజేతలుగా ఎంపిక చేశారు. ఎయిర్ క్వాలిటీ పెంచడానికి కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుని ఆక్సిజన్‌ను విడుదల చేసే బయోడీగ్రేడబుల్ కార్బన్ స్పాంజీ టైల్స్ ఫార్ములాను రూపొందించిన మోనికకు ప్రైజ్ దక్కింది. మోనిక రూపొందించిన ఫార్ములా గురించి చెప్పుకోవాలంటే... 1,100 పీఎస్ఐ కార్బన్ డయాక్సైడ్ విడుదలైతే మూడు గంటల వ్యవధిలో 300 పీఎస్ఐ ఆక్సిజన్ విడుదల చేస్తుంది. ఆడిటోరియాలు, జనాలు అధికంగా ఉండే భవనాలు, పాఠశాల తరగతి గదుల్లో గోడలకు ఈ టైల్స్‌ను అతికిస్తే దీర్ఘకాలం పనిచేస్తాయి. ప్రత్యేకంగా స్కూల్ గదుల్లో ఉపయోగపడేలా ఈ ప్రాజెక్టును రూపొందించింది. ఈ టైల్స్‌ను వినియోగించడం ద్వారా గాలిలోని కర్బన ఉద్గారాలను తగ్గించి గాలి నాణ్యత పెంచవచ్చు. అవార్డుతోపాటు మౌనిక అక్కినేనికి లక్షన్నర డాలర్ల గ్రాంటును మంజూరు చేశారు. భవిష్యత్‌లో ఈప్రాజెక్టు తోపాటు సరికొత్త ఆవిష్కరణలకు గ్రాంటును వినియోగించుకునే అవకాశం ఇచ్చారు.మరిన్ని ఆవిష్కరణలు...మా పేరెంట్స్, స్కూల్లో టీచర్ల ద్వారా పర్యావరణానికి జరుగుతున్న ముప్పు గురించి ఎన్నో సార్లు విన్నాను. బాధగా అనిపించేది. బాధ పడడం కంటే ‘నా వంతుగా ఏం చేయగలను’ అని ఆలోచించడం ముఖ్యం అనిపించింది. ఉపాధ్యాయులు, ఇంటర్నెట్ ద్వారా ఎన్నో విషయాల గురించి తెలుసుకోగలిగాను. పర్యావరణానికి ఉపయోగపడేలా మరిన్ని ఆవిష్కరణలు చేయాలనుకుంటున్నాను. మెడిసిన్ చేయాలనేది నా లక్ష్యం అంటోంది మోనిక అక్కినేని ఆక్సిజెమ్ – కాట్రపాటి కిషోర్, సాక్షి ప్రతినిధి, ఏలూరు(చదవండి: ది బెస్ట్ ఎగ్ రెసిపీ' జాబితాలో మసాలా ఆమ్లెట్ ఎన్నో స్థానంలో ఉందంటే..) -
యూఏఈలోకి రిలయన్స్ ప్రొడక్ట్స్ ఎంట్రీ.. కాంపా లాంచ్
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు చెందిన ఎఫ్ఎంసీజీ విభాగం అయిన రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL) యూఏఈలో (UAE) అడుగు పెట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫుడ్ అండ్ బేవరేజ్ సోర్సింగ్ ఈవెంట్ అయిన గల్ఫుడ్ 30వ ఎడిషన్‌లో యూఏఈలో భారతీయ లెగసీ బ్రాండ్ కాంపాను అధికారికంగా ప్రారంభించింది.2022లో కాంపా కోలాను కొనుగోలు చేసి, 2023లో దేశంలో తిరిగి ప్రవేశపెట్టిన రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ 1970, 80లలో భారతదేశంలో కల్ట్ హోదాను కలిగి ఉన్న ఈ హెరిటేజ్ బ్రాండ్‌ను విజయవంతంగా పునరుద్ధరించింది. యూఏఈలో ప్రముఖ ఆహార, పానీయాల కంపెనీలలో ఒకటైన అగ్థియా గ్రూప్‌తో కలిసి కాంపా కోలాను ఇక్కడి వారికి పరిచయం చేస్తోంది."50 సంవత్సరాల క్రితం స్థాపించిన హెరిటేజ్ ఇండియన్ బ్రాండ్ అయిన కాంపాతో యూఏఈ మార్కెట్లోకి ప్రవేశించడానికి మేము ఉత్సాహంగా ఉన్నాము. ఇక్కడ దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెడుతున్నాం. ఈ ప్రాంతంలో వేగవంతమైన వృద్ధికి గొప్ప సామర్థ్యాన్ని చూస్తున్నాము. యూఏఈలో వినియోగదారులకు పానీయాల అనుభవాన్ని మార్చడానికి భాగస్వాములతో కలిసి ఇక్కడికి వస్తున్నందుకు సంతోషిస్తున్నాము" అని రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ సీఓఓ కేతన్ మోదీ పేర్కొన్నారు. -
ఐవోసీ భారీ కాంట్రాక్ట్..
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) భారీ డీల్‌కు తెరలేపింది. ఇందులో భాగంగా యూఏఈ నుంచి లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్‌ను (ఎల్ఎన్జీ) దిగుమతి చేసుకోనుంది. 14 ఏళ్ల ఈ దీర్ఘకాలిక కాంట్రాక్ట్ విలువ 7–9 బిలియన్ డాలర్లు. ఏడీఎన్ఓసీ గ్యాస్‌తో ఈ మేరకు ఐవోసీ ఒప్పందం చేసుకుంది. 2026 నుంచి ఏటా 1.2 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీని ఏడీఎన్ఓసీ గ్యాస్ సరఫరా చేయనుంది.ఇండియా ఎనర్జీ వీక్ సందర్భంగా ఇరు సంస్థల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్‌తోనూ (బీపీసీఎల్) ఏడీఎన్ఓసీ ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం 2025 ఏప్రిల్ నుంచి అయిదేళ్లలో 2.4 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీ సరఫరా చేయాల్సి ఉంటుంది. గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్‌కు 10 ఏళ్ల పాటు ఏటా 4,00,000 టన్నుల ఎల్ఎన్జీ విక్రయించేందుకు ఫ్రెంచ్ దిగ్గజం టోటల్ఎనర్జీస్ చేతులు కలిపింది.బీపీసీఎల్ ఈ సందర్భంగా బ్రెజిల్‌కు చెందిన పెట్రోబ్రాస్‌తో 6 మిలియన్ బ్యారెళ్ల వరకు ముడి చమురు కొనుగోలుకై ఒప్పందాన్ని చేసుకుంది. దేశంలో తొలిసారిగా అలల నుంచి విద్యుత్ ఉత్పత్తికై ముంబై వద్ద 100 కిలోవాట్ సామర్థ్యంతో పైలట్ ప్రాజెక్టు చేపట్టేందుకు ఎకో వేవ్ పవర్‌తో బీపీసీఎల్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. బీహెచ్ఈఎల్కు రూ.6,700 కోట్ల ఆర్డర్ ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఈఎల్ తాజాగా సింగరేణి కాలరీస్ కంపెనీ నుండి రూ.6,700 కోట్ల విలువైన ఆర్డర్‌ను పొందినట్లు తెలిపింది. ఇందులో భాగంగా తెలంగాణలోని మంచిర్యాల వద్ద 800 మెగావాట్ల సూపర్‌క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేస్తారు. ప్రాజెక్ట్ డిజైన్, ఇంజనీరింగ్, తయారీ, సరఫరా, నిర్మాణం, కార్యరూపంలోకి తేవడంతోపాటు సివిల్ పనులను చేపడుతుంది.ప్రతిపాదిత యూనిట్ ప్రస్తుతం పనిచేస్తున్న 2 గీ 600 మెగావాట్ల యూనిట్లకు ఆనుకొని ఏర్పాటు చేస్తారు. ఈ రెండు యూనిట్లను బీహెచ్ఈఎల్ 2016 ప్రారంభించడం విశేషం. ముఖ్యంగా తెలంగాణలోని వివిధ విద్యుత్ సంస్థల కోసం 75 శాతానికి పైగా బొగ్గు ఆధారిత సెట్స్‌ను బీహెచ్ఈఎల్ విజయవంతంగా ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా 1,70,000 మెగావాట్లకుపైగా సామర్థ్యం గల విద్యుత్ ప్రాజెక్టుల ను ఏర్పాటు చేసింది. -
పంచ్‌లో బెబ్బులి..కిక్ ఇస్తే.. ప్రత్యర్థులకు చుక్కలే ఎవరీ దేవి?
పెరెగ్రైన్ ఫాల్కన్ కన్నా వేగవంతమైన కిక్‌లకు టెక్నిక్ మేళవించి ప్రత్యర్థులను మట్టి కరిపిస్తుంది. చిరుత కంటే వేగంగా పాదాలను కదిలించి ఎదుటివారిని చిత్తు చేస్తుంది. పాల్గొన్న ప్రతిపోటీలోనూ పతకం సాధించి తనకుతానే సాటిగా అంతర్జాతీయ వేదికపై మరోమారు సత్తా చూపించేందుకు సిద్ధమవుతోంది సికింద్రాబాద్ చిలకలగూడకు చెందిన కరాటే క్వీన్ దేవిహంసిని. ఇప్పటి వరకూ అనేక జాతీయ, అంతర్జాతీయ కరాటే పోటీల్లో పాల్గొని బంగారు, వెండి మెడల్స్‌తోపాటు పలు అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుంది.- చిలకలగూడ యనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ) ఫుజైరాలో 2025 ఫిబ్రవరిలో జరిగే కరాటే–1 యూత్‌లీగ్ పోటీలకు అండర్–14 కటా విభాగంలో తెలంగాణ నుంచి ఎంపికైన ఏకైక క్రీడాకారిణి దేవిహంసిని. వడోరై కరాటే డూ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో యుఏఈలో జరిగే యూత్‌లీగ్ పోటీలకు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, తెలంగాణలకు చెందిన ఎనిమిది మందిని ఎంపిక చేశారు. చిన్ననాటి నుంచే.. సాధారణ కుటుంబానికి చెందిన పెబ్బిలి దేవిహంసిని (12) సికింద్రాబాద్ సెయింట్ మేరీ హైసూ్కల్లో ఏడో తరగతి చదువుతోంది. తండ్రి కోటేశ్వరరావు ప్రైవేటు ఉద్యోగి, తల్లి అంజలి గృహిణి. తన ఆరో ఏట నుంచే మార్షల్ ఆర్ట్స్‌పై చిన్ననాటి నుంచే మక్కువ పెంచుకుంది. మొదట విశాఖపట్నంలోని కింగ్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్‌లో చేరింది. కరాటే కోచ్ సిహాన్, సీహెచ్ శ్రీనివాసరావు వద్ద ఓనమాలు నేర్చుకుంది. కఠోరశ్రమ, చిత్తశుద్ధి, నేర్చుకోవాలనే తపనతో మెళకువలను ఔపోసన పట్టి బ్లాక్‌బెల్ట్ సాధించింది. సినీనటుడు సుమన్ నుంచి బ్లాక్‌బెల్ట్ అందుకోవడం గర్వంగా ఉందని చెబుతోంది దేవి. సాధించిన పతకాలు..జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన దేవిహంసిని పాల్గొన్న ప్రతి పోటీలోనూ బహుమతి సాధించి విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. కటా, కుమిటీ విభాగాల్లో పది గోల్డ్, రెండు వెండి, జాతీయ స్థాయిలో 22 బంగారు, ఐదు వెండి, మూడు రజిత పతకాలు కైవసం చేసుకుంది. సౌత్ నేషనల్ లెవల్లో 7 గోల్డ్, ఒక్కో సిల్వర్, బ్రాంజ్, ఆసియన్ లెవల్లో ఒక్కో సిల్వర్, బ్రాంజ్, స్టేట్ లెవల్లో ఐదు బంగారు, ఒక్కో సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సొంతం చేసుకుంది. మువ్వన్నెల జెండా ఎగురవేస్తా.. అంతర్జాతీయ వేదికలపై మువ్వన్నెల జెండా ఎగురవేస్తా. యుఏఈ ఫుజైరాలో కరాటే యూత్‌లీగ్‌లో విజయం సాధిస్తా. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రోత్సాహం కూడా అవసరం. అందరి సహకారం ఉంటే గెలుపు తథ్యమని దేవిహంసిని ధీమా వ్యక్తం చేస్తోంది. చదవండి: చదివింది 10వ తరగతే..ముగ్గురు పిల్లలు : అట్టడుగు స్థాయినుంచి వ్యాపారవేత్తగా -
వీసా కష్టం.. పైసా నష్టం..
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యార్జన, ఉజ్వల భవిష్యత్తు కోసం, ఇతర కారణాలతో విదేశాలకు వెళ్లేవారు ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోగా.. మరోవైపు వీసా తిరస్కరణ (Visa Reject) బాధితుల సంఖ్యా ఎక్కువగానే పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి వీసాలూ అధిక సంఖ్యలోనే తిరస్కరణకు గురవుతున్నాయి. దేశవ్యాప్తంగా వీసాల తిరస్కరణ కారణంగా గత ఏడాదిలో నష్టపోయిన మొత్తం రూ.660 కోట్ల పైమాటేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. పర్యాటకులను స్వాగతించే దేశంగా పేరున్న యూఏఈ వీసాలు పొందడంలో సైతం ఎదుర్కొన్న ఇబ్బందులను చాలామంది గత ఏడాది చివరిలో సోషల్ మీడియా (Social Media) వేదికగా పంచుకున్నారు.జనవరి నుంచి అక్టోబర్ 2024 మధ్యకాలంలో 24.8% మంది భారతీయలు (Indians) యూఏఈని సందర్శించారు. భారతీయ పర్యాటకులకు అత్యంత ప్రసిద్ధ గమ్యస్థానాలలో ఒకటిగా యూఏఈ (UAE) ఉంది. అయితే కొంతకాలం క్రితం దుబాయ్ ఇమ్మిగేషన్ విభాగం ప్రవేశపెట్టిన కఠినమైన నిబంధనల కారణంగా భారీ స్థాయిలో వీసాలు తిరస్కరణలకు గురయ్యాయి. కోవిడ్ అనంతరం ఇతర అనేక దేశాలు కూడా తమ వీసా నిబంధనలను సవరించాయి. ఈ నేపథ్యంలో వీసాల తిరస్కరణ కారణంగా గత ఏడాది భారతీయులు రూ.664 కోట్లను నష్టపోయారని గణాంకాలు చెబుతున్నాయి. తిలా పాపం తలా పిడికెడువీసా నిబంధనలు కఠినతరం చేసిన దేశాలలో యూఏఈతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే ప్రధానంగా ఉన్నాయి. గత ఏడాది న్యూజిలాండ్ 32.5 శాతం భారతీయ వీసా (Indian Visa) దరఖాస్తులను తిరస్కరించింది, ఆస్ట్రేలియా 29.3 శాతం, యూకే 17 శాతం మందిని తిరస్కరించాయి. స్కెంజెన్ ఏరియా (యూరప్) 15.7 శాతం వీసాల్ని తిరస్కరించింది. యూఏఈ భారతీయ వీసాల తిరస్కరణ రేటు గత ఏడాది 6 శాతానికి చేరుకుంది. అయితే 2019లో వీసా ఆమోదం రేట్లతో పోల్చనప్పుడు. 2024లో భారతీయుల కోసం అధిక శాతం వీసాలను ఆమోదించిన దేశంగా అమెరికా నిలిచింది. 2019లో 28 శాతం భారతీయ వీసా దరఖాస్తులను యూఎస్ తిరస్కరించగా, 2024లోకి వచ్చేసరికి ఇది 16 శాతానికి తగ్గింది. అయితే అమెరికా వెళ్లేందుకు మనవారి వీసా దరఖాస్తుల సంఖ్య పరంగా చూస్తే ఈ 16 శాతం కూడా ఎక్కువేనని నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ తర్వాత కఠినంగా..ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే, యూఏఈ వంటి దేశాలు వీసా నిబంధనలను కఠినతరం చేయడం అనేది..కరోనా మహమ్మారి అనంతరం ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన వీసా దరఖాస్తుల సూక్ష్మస్థాయి పరిశీలన, ఎంపిక ధోరణిని ప్రతిబింబిస్తోంది. వీసాల తిరస్కరణ రేటు పెరుగుదల భారతీయ ప్రయాణీకులను ఆందోళనకు గురిచేస్తోంది. దరఖాస్తుదారులు.. తమకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు సరిగ్గానే ఉన్నాయని, తమ దరఖాస్తులు పూర్తి దోష రహితంగా ఉన్నాయని నిర్ధారించుకోవాల్సిన ఆవశ్యకతను ఈ పరిస్థితి స్పష్టం చేస్తోంది.సర్వ సాధారణంగా మారిన తిరస్కరణలు‘ఎంఫార్మ్ కోసం అమెరికా వీసాకు దరఖాస్తు చేస్తే రెండుసార్లు తిరస్కరణకు గురైంది. మరోసారి అప్లయ్ చేయబోతున్నా. ఇప్పటివరకు రూ.42 వేలు ఖర్చయ్యింది. నా స్నేహితుడు ఒకరికి 10 సార్లు వీసా నిరాకరించారు..’అని పంజాగుట్ట నివాసి ప్రవీణ్ చెప్పాడు. ఇక రెండుసార్లు, మూడుసార్లు వీసా తిరస్కరణలకు గురి కావడమనేది సర్వసాధారణంగా మారుతోంది. యూకేకి రూ.12 వేలు మొదలుకుని రూ.లక్ష పైగా వీసా దరఖాస్తు ఫీజులు ఉన్నాయి. అలాగే ఆ్రస్టేలియాకు రూ.4 వేల నుంచి రూ.60 వేలు వరకూ, న్యూజిలాండ్‌కు రూ.11 వేల నుంచి రూ.1.15లక్షల వరకూ, యూఏఈకి రూ.8 వేల నుంచి రూ.35 వేలు ఆపైన ఉన్నాయి.చదవండి: ఆర్జీకర్ ఘటన అందుకే ‘అరుదైన కేసు’ కాలేకపోయింది!అమెరికాకు రూ.20 వేల వరకూ వీసా ఫీజులు ఉన్నాయి. అయితే వెళ్లే కారణాన్ని బట్టి, వీసా పొందడానికి ఎంచుకున్న విధానాన్ని బట్టి ఈ ఫీజులు ఇంతకంటే పెరగవచ్చు కూడా. ‘మా అబ్బాయి అమెరికా వీసాకి మొదటిసారి రూ.70 వేల దాకా పెట్టిన ఖర్చు వృథా అయ్యింది. రెండవసారి దాదాపు అంతే ఖర్చు పెట్టి వీసా తెచ్చుకున్నాం..’ అని మల్కాజిగిరికి చెందిన లక్ష్మి చెప్పారు. మొత్తంగా చూస్తే వీసా తిరస్కరణల కారణంగా పెద్ద మొత్తంలోనే నష్టం జరుగుతోందనేది నిర్వివాదాంశం. ఈ నేపథ్యంలో వీసా నిబంధనలపై సంపూర్ణ అవగాహన పెంచుకోవాలని, డాక్యుమెంట్లన్నీ పూర్తి కచ్చితత్వంతో ఉండేలా చూసుకున్న తర్వాతే దరఖాస్తు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. -
CT 2025: టీమిండియా మేనేజర్‌గా హెచ్‌సీఏ కార్యదర్శి
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టుకు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) కార్యదర్శి ఆర్. దేవ్‌రాజ్ మేనేజర్‌గా ఎంపికయ్యారు. వచ్చే నెల 19 నుంచి జరగనున్న ఈ టోర్నీలో రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు బరిలోకి దిగనుంది. పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో టీమిండియా ఆడే మ్యాచ్‌లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నిర్వహించనున్నారు.ఇదో గొప్ప గౌరవం‘టీమిండియాకు నన్ను మేనేజర్‌గా నియమించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆఫీస్ బేరర్లకు ధన్యవాదాలు. చాలా కాలం తర్వాత భారత జట్టుకు మేనేజర్‌గా వ్యవహరించే అవకాశం హెచ్‌సీఏ అధికారికి లభించింది. ఇదో గొప్ప గౌరవంగా భావిస్తున్నాను’ అని దేవ్‌రాజ్ అన్నారు. టీమిండియా మేనేజర్‌గా ఎంపికైన దేవ్‌రాజ్‌కు హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతోపాటు ఇతర సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఫిబ్రవరి 19న పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది. అయితే, అంతకంటే ముందు రోహిత్ సేన సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్ ఆడనుంది. ఇండియా- ఇంగ్లండ్ మధ్య జనవరి 22, 25, 28, 31, ఫిబ్రవరి 2వ తేదీల్లో ఐదు టీ20లు జరుగుతాయి. ఆ తర్వాత.. ఫిబ్రవరి 6, 9, 12 తేదీల్లో మూడు వన్డేలు నిర్వహిస్తారు. తద్వారా మెగా టోర్నికి ముందు ఇరుజట్లకు కావాల్సినంత ప్రాక్టీస్ లభించనుంది.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి బీసీసీఐ ఎంపిక చేసిన జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా(ఫిట్నెస్ ఆధారంగా) మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్.ట్రావెలింగ్ రిజర్వ్స్: వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డిచాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించిన జట్లు ఇవేగ్రూప్-‘ఎ’: ఇండియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికాగ్రూప్-‘బి’: ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా షెడ్యూల్ఫిబ్రవరి 20, 2025 (దుబాయ్)- ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ ఫిబ్రవరి 23, 2025 (దుబాయ్)- ఇండియా వర్సెస్ పాకిస్తాన్మార్చి 2, 2025 (దుబాయ్)- ఇండియా వర్సెస్ న్యూజిలాండ్రజతం నెగ్గిన జ్యోతి సురేఖ సాక్షి, హైదరాబాద్: ఇండోర్ వరల్డ్ కప్ సిరీస్‌లో భాగంగా ఫ్రాన్స్‌లో జరిగిన నిమెస్ ఆర్చరీ టోర్నమెంట్లో భారత స్టార్ వెన్నం జ్యోతి సురేఖ రజత పతకాన్ని సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం ఫైనల్లో విజయవాడకు చెందిన జ్యోతి సురేఖ 146–147తో అలెజాంద్రా ఉస్కియానో (కొలంబియా) చేతిలో ఓడిపోయింది. క్వాలిఫయింగ్‌లో జ్యోతి సురేఖ 600 పాయింట్లకుగాను 592 పాయింట్లు స్కోరు చేసి ఆరో స్థానంలో నిలిచింది. -
బామ్మకు స్వీట్ సర్ప్రైజ్ : 20 లక్షలకు పైగా వ్యూస్
జైనబ్ రోష్నా దుబాయిలో ఉంటుందన్న మాటేగానీ కేరళలోని బామ్మ జ్ఞాపకాలు ఎప్పుడూ తనతోనే ఉంటాయి. ఆ జ్ఞాపకాలు హాయిగా ఉంటాయి, నవ్విస్తాయి. కొన్నిసార్లు భావోద్వేగానికి గురి చేస్తాయి. తనకు తీరిక దొరికినప్పుడల్లా బామ్మతో ఫోన్లో మాట్లాడుతుంది జైనబ్.‘ఇలా ఫోన్లో మాట్లాడుకోవడమేనా! నన్ను చూడడానికి ఎప్పుడు వస్తావు?’ అని అడుగుతుంది బామ్మ.‘నువ్వు దూరంగా ఉంటే కదా రావడానికి. నువ్వు ఎప్పుడూ నా కళ్ల ముందే ఉంటావు’ అని నవ్వుతుంది జైనబ్.‘నీ మాటలకేంగానీ... నువ్వు నన్ను చూడడానికి రావాల్సిందే’ అన్నది బామ్మ. అటు నుంచి నవ్వు మాత్రమే వినిపించింది! కట్ చేస్తే...ఆ రోజు బామ్మగారి బర్త్‌డే. తన ఊళ్లో ఆ రోజు కూడా బామ్మ అన్ని రోజులలాగే ఎప్పటిలాగే ఉంది. ‘నా బర్త్‌డేను జైనబ్ ఎంత ఘనంగా చేసేదో’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది. ఇంతలో ఎవరో వస్తున్న అలికిడి వినిపించింది.ఎవరా అని చూస్తే... ఊహించని వ్యక్తి. నిజమా? భ్రమా!’ అనుకుంటుండగానే సంతోషంగా అరిచింది జైనబ్. స్వీట్ షాక్ నుంచి తేరుకున్న తరువాత... View this post on Instagram A post shared by ZAINAB ROSHNA | ZR✌🏻 (@zainabroshna) ‘నన్ను చూడడానికి వచ్చావా తల్లీ... ఒక్క మాటైనా చెప్పలేదు...’ అంటూ సంతోషంతో కళ్ల నీళ్ల పెట్టుకుంది బామ్మ. ‘ముందే చెబితే ఏం మజా ఉంటుంది! ఇలా వస్తేనే సర్ప్రైజింగ్గా ఉంటుంది’ అన్నది జైనబ్. ఆ రోజు వంద పండగలు ఒకేసారి వచ్చినంత సంతోషంగా ఫీల్ అయింది బామ్మ. ప్రేమగా, గారాబంగా మనవరాలిని ముద్దు పెట్టుకుంది. ‘గత ఏడాది మా అమ్మమ్మ పుట్టిన రోజున నా ఎమిరేట్స్ యూనిఫాం ధరించి వీడియో కాల్ చేశాను. నన్ను యూనిఫాంలో చూసి అమ్మమ్మ ఆశ్చర్యపడింది. కొత్త అమ్మాయిని చూసినట్లుగా ఉంది అని నవ్వింది. ఈ పుట్టిన రోజుకు మరింత సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను. అందుకే చెప్పకుండా వచ్చాను’ అని ఇన్‌స్టా పోస్ట్‌లో రాసింది జైనబ్.ఒక్క మాటలో చెప్పాలంటే... ఇది మామూలు సంఘటన. అయితే సోషల్ మీడియా లో బామ్మ, మనవరాళ్ల వీడియో ఎంతో సందడి చేస్తోంది. దుబాయి నుంచి వచ్చిన జైనబ్ బామ్మ గదిలోకి సంతోషంగా పరుగెత్తుతున్న దృశ్యాలు నెటిజనులను ఆకట్టుకున్నాయి.జైనబ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో క్లిప్ 2.3 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ వీడియో క్లిప్ నేపథ్యంలో అమ్మమ్మ, నానమ్మలతో తమకు ఉన్న విలువైన జ్ఞాపకాలు పంచుకున్నారు నెటిజనులు.‘అమ్మ దగ్గర కంటే అమ్మమ్మ దగ్గరే నాకు చనువు ఎక్కువ. ఈ వీడియో క్లిప్ చూసినప్పుడు మా అమ్మమ్మ గుర్తుకు వచ్చి కళ్లలో నీళ్లు తిరిగాయి. పెద్దవాళ్లు మన నుంచి ఏమీ కోరుకోరు. మనం వారికి ఒకసారి కనిపించినా పెద్ద బహుమతిగా ఫీలవుతారు’ అని స్నేహ అనే నెటిజన్ తన కామెంట్ పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో ఈ బామ్మ, మనవరాళ్ల వీడియో ఎంతో సందడి చేస్తోంది. దుబాయి నుంచి వచ్చిన జైనబ్ బామ్మ గదిలోకి సంతోషంగా పరుగెత్తుతున్న దృశ్యాలు నెటిజనులను ఆకట్టుకున్నాయి. జైనబ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో క్లిప్ 2.3 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. చదవండి: Maha Kumbh Mela 2025: ‘కండల బాబా’ స్పెషల్ ఎట్రాక్షన్, ఎవరీ బాహుబలిఅత్యధిక జీతాన్ని వద్దనుకొని.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలు -
న్యూ ఇయర్ వేళ విషాదం : భారత సంతతి వైద్యుడు దుర్మరణం
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) దేశంలో దుబాయ్ ఎమిరేట్, రాస్ అల్ ఖైమాలో జరిగిన చిన్న ప్రైవేట్ విమాన ప్రమాదంలో 26 ఏళ్ల భారత సంతతికి వైద్యుడు సులేమాన్ అల్ మాజిద్ దుర్మరణం పాలయ్యారు. యూఏఈలోని రస్ అల్ ఖైమా తీరంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో విమానంలోని పైలట్, కోపైలట్ ఇద్దరూ చనిపోయారని యుఎఇ ప్రభుత్వ విభాగమైన జెనెరల్ సివిల్ ఏమియేషన్ అథారటీ ధృవీకరిస్తూ ప్రకటన జారీ చేసింది.చనిపోయిన ఇద్దరిలో 26 ఏళ్ల పాకిస్థానీ మహిళ కాగా మరొకరు సులేమాన్ అల్ మాజిద్. ఇతను విమానంలో కోపైలట్‌గా ఉన్నాడు. సులేమాన్ దుబాయ్‌లోనే పుట్టి పెరిగాడు. విమానాన్ని అద్దెకు తీసుకున్నట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. బెంగుళూరుకి చెందిన ఇతని కుటుంబం యూఏఈ దేశానికి వలస వెళ్లింది. యూకే దేశంలోని డుర్హాం కౌంటీ, డార్లింగ్టన్ ఎన్హెచ్ఎస్ ఫౌండేషన్‌లో ఫెలో డాక్టర్‌గా ఉద్యోగం చేసేవాడు. బిట్రీష్ మెడికల్ అసోసియేషన్ సభ్యుడిగా, హానరరీ సెక్రటరీ, నార్తరన్ రెసిడెంట్ డాక్టర్స్ కమిటీలో కో-చైర్మన్ పదవులు చేపట్టాడు. అలాగే యూకేలో డాక్టర్‌గా ఉన్న సమయంలోజూనియర్ డాక్టర్లు, రెసిడెంట్ డాక్టర్ల వేతనం పెంచాలని ఉద్యమం చేసినట్టు సోషల్‌మీడియా ప్రొఫైల్ ద్వారా తెలుస్తోంది.సులేమాన్ తన కుటుంబంతో కలిసి కొత్త సంవత్సరాన్ని సరదాగా కొంత సమయం గడిపాడు. ఆ తరువాత తల్లిదండ్రులు, తమ్ముడితో కలిసి ఒక ప్రైవేట్ ఏమియేషన్ క్లబ్ కు వెళ్లాడు. అక్కడ ముందుగా సులేమాన్ సరదాగా గాల్లో విహరించేందుకు క్లబ్ విమానంలో వెళ్లాడు. పైలట్ ఒక పాకిస్తానీ మహిళ ఉన్నారు. అయితే వీరి విమానం గాల్లోకి ఎగిరిన కొద్ది సేపటికే కాంటాక్ట్ మిస్ అయింది. కోవ్ రొటానా హోటల్ సమీపంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. తీవ్ర గాయాలైన ఇద్దరినీ ఆస్పత్రి తరలించారు. కానీ ఇద్దరూ చనిపోయారు. సులేమాన్ అకాల మరణంపై తండ్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కొడుకుతో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో ఉన్నాం. త్వరలోనే అతడికి పెళ్లి కూడా చేయాలనుకున్నాం. కానీ ఇంతలోనే అతను మమ్మల్ని వదిలి వెళ్లిపోయాడు. తమకు సర్వస్యం అయిన సులేమాన్ లేకుండా ఎలా జీవించాలో అర్థం కావడం లేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. -
రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా వాచ్‌మ్యాన్
దుబాయ్‌లో పనిచేస్తున్న హైదరాబాదీ వాచ్మెన్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. హైదరాబాద్‌కి చెందిన 60 ఏళ్ల నాంపల్లి రాచమల్లయ్య దుబాయ్‌లోని అబుదాబిలో గత మూడు దశాబ్దాలుగా బిల్డింగ్ వాచ్‌మ్యాన్‌గా పనిచేస్తున్నాడు. అయితే అతనికి అప్పుడప్పుడూ బిగ్‌టికెట్ కొనే అలవాటు ఉంది. ఎప్పటిలానే తన స్నేహితులతో కలిసి యథావిధిగా టికెట్‌ని కొనుగోలు చేశాడు. ఈసారి అనూహ్యంగా రాజమల్లయ్య కొనుగోలు చేసిన టికెట్‌కి లాటరీ తగలడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇటీవల అనౌన్స్ చేసిన బిగ్ టికెట్ మిలియనీర్ ఎలక్ట్రానిక్ లక్కీ డ్రా లో విజేతగా నిలిచాడు రాజమల్లయ్య. ఈ లక్కీ డ్రాలో రాజమల్లయ్య సుమారు రూ. రెండు కోట్లు(రూ. 2,32,76,460) పైనే గెలుచుకున్నాడు. తాను ఇలా లాటరీ టిక్కెట్‌ని గత ముప్పైఏళ్లుగా కొనుగోలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే ఎట్టకేలకు అదృష్ట వరించిందని సంతోషంగా చెబుతున్నాడు రాజమల్లయ్య. ఈ ప్రైజ్ మనీని తాను టికెట్ కొనడానికి సాయం చేసిన స్నేహితులతో పంచుకుంటానని, అలాగే మిగతా మొత్తాన్ని కుటుంబం కోసం ఉపయోగిస్తానని తెలిపాడు రాజమల్లయ్య. View this post on Instagram A post shared by Big Ticket (@bigticketauh) (చదవండి: టీనేజ్ పిల్లలకు ఈజీగా వంట నేర్పించండిలా..!) -
Asia Cup 2024: టీమిండియా ఓపెనర్ల ఊచకోత.. సెమీ ఫైనల్లో భారత్
అండర్-19 ఆసియా కప్-2024 టోర్నీలో యువ భారత్ అదరగొట్టింది. వరుసగా రెండో విజయం సాధించి సెమీ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. షార్జాలో బుధవారం నాటి మ్యాచ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)ను చిత్తుగా ఓడించి టాప్-4కు అర్హత సాధించింది.కాగా దుబాయ్ వేదికగా వన్డే ఫార్మాట్లో జరుగుతున్న ఈ టోర్నమెంట్లో భారత్ గ్రూప్-‘ఎ’లో ఉంది. తమ తొలి లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడి ఓటమిపాలైన మహ్మద్ అమాన్ సేన.. రెండో మ్యాచ్‌లో జపాన్ను 211 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించింది.137 పరుగులకే ఆలౌట్‌ఈ క్రమంలో మూడో మ్యాచ్‌లో భాగంగా యూఏఈతో షార్జా క్రికెట్ స్టేడియంలో యువ భారత్ తలపడింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. భారత బౌలర్ల దెబ్బకు కుప్పకూలింది. కేవలం 137 పరుగులకే ఆలౌట్ అయింది. రయాన్ ఖాన్ ఒక్కడు 35 పరుగులతో రాణించగా.. మిగతావాళ్లంతా చేతులెత్తేయడంతో 44 ఓవర్లలోనే యూఏఈ కథ ముగిసింది. భారత బౌలర్లలో యుధాజిత్ గుహ మూడు వికెట్లతో చెలరేగగా.. చేతన్ శర్మ, హార్దిక్ రాజ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. కేపీ కార్తికేయ, ఆయుశ్ మాత్రే ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ఇక లక్ష్య ఛేదనకు దిగిన భారత్ పసికూనపై ప్రతాపం చూపింది. ఓపెనర్లు ఆయుశ్ మాత్రే, వైభవ్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టుకు భారీ విజయం అందించారు. ఆయుశ్ 51 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 67 పరుగులు చేయగా.. వైభవ్ 46 బంతుల్లోనే 76 రన్స్ చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉండటం విశేషం.టీమిండియా ఓపెనర్ల ఊచకోత.. ఇలా ఓపెనర్లు ఆకాశమే హద్దుగా విజృంభించడంతో భారత్ కేవలం 16.1 ఓవర్లలోనే టార్గెట్ పూర్తి చేసింది. వైభవ్ కొట్టిన సిక్సర్‌తో విజయతీరాలకు చేరిన టీమిండియా(143).. పది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఈ మ్యాచ్‌లో ఒక వికెట్ తీయడంతో పాటు బ్యాటింగ్‌లోనూ అదరగొట్టిన ఆయుశ్ మాత్రే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకున్నాడు. కాగా అండర్-19 ఆసియా కప్‌లో డిసెంబరు 6న సెమీస్ మ్యాచ్‌లు జరుగనుండగా.. డిసెంబరు 8న ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.చదవండి: రోహిత్ వచ్చాడు!.. ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తారు?.. కేఎల్ రాహుల్ స్టన్నింగ్ ఆన్సర్ -
భారత్ X పాకిస్తాన్
దుబాయ్: ఆసియా కప్ అండర్–19 వన్డే క్రికెట్ టోర్నీలో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. యూఏఈలో జరుగుతున్న ఈ టోర్నీలో నేడు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో యువ భారత జట్టు తలపడుతుంది. ఉదయం గం. 10:30 నుంచి జరిగే ఈ మ్యాచ్‌ను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. గ్రూప్ ‘ఎ’లో భాగంగా జరగనున్న ఈ లీగ్ పోరులో శుభారంభం చేయాలని మొహమ్మద్ అమాన్ సారథ్యంలోని భారత జట్టు భావిస్తోంది. ఇప్పటి వరకు 10 సార్లు జరిగిన ఈ టోర్నీలో ఎనిమిదిసార్లు విజేతగా నిలిచిన యువ భారత్... ఈసారి కూడా టైటిల్ నెగ్గాలనే లక్ష్యంతో ఉంది. ఇటీవల ఐపీఎల్ మెగా వేలంలో రూ.1.10 కోట్లకు అమ్ముడుపోయిన 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై అందరి దృష్టి నిలవనుంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌ల్లో అఫ్గానిస్తాన్‌పై బంగ్లాదేశ్; నేపాల్ జట్టుపై శ్రీలంక విజయం సాధించాయి. -
యువ ఆటగాళ్ల ఆసియా సమరం
దుబాయ్: ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అండర్–19 ఆసియా కప్ 11వ ఎడిషన్‌కు రంగం సిద్ధమైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో 8 జట్లు రెండు గ్రూప్‌లుగా విడిపోయి లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో పోటీ పడుతున్నాయి. పాకిస్తాన్, యూఏఈ, జపాన్‌తో కలిసి భారత జట్టు గ్రూప్ ‘ఎ’ నుంచి బరిలోకి దిగుతుండగా... శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, నేపాల్ గ్రూప్ ‘బి’లో ఉన్నాయి. ఈ టోర్నీలో మొత్తం 15 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. బంగ్లాదేశ్ డిఫెండింగ్ చాంపియన్‌గా ఉంది. శుక్రవారం బంగ్లాదేశ్‌తో అఫ్గానిస్తాన్... శ్రీలంకతో నేపాల్ తలపడతాయి. దుబాయ్, షార్జాలలో మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఇప్పటి వరకు ఏసీసీ ఆసియా కప్‌ను 10 సార్లు నిర్వహించగా... అందులో ఎనిమిదిసార్లు భారత జట్టు చాంపియన్‌గా నిలిచింది. డిసెంబర్ 8న జరగనున్న తుది పోరుతో టోర్నమెంట్ ముగుస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో తగిన గుర్తింపు సాధించేందుకు ఆటగాళ్లకు ఈ టోర్నీ ఎంతో ఉపయోగపడనుంది. గతంలో అండర్–19 స్థాయిలో మెరుపులు మెరిపించి... ఆ తర్వాత గ్లోబల్ స్టార్స్‌గా ఎదిగిన ప్లేయర్లు ఎందరో ఉన్నారు. ప్రస్తుతం యువ భారత జట్టుకు మొహమ్మద్ అమాన్ సారథ్యం వహిస్తుండగా... కిరణ్ చోర్మలే వైస్ కెపె్టన్‌గా వ్యవహరించనున్నాడు. టోర్నీలో భాగంగా భారత జట్టు శనివారం తమ తొలి పోరులో పాకిస్తాన్ జట్టుతో తలపడనుంది. అనంతరం డిసెంబర్ 2న జపాన్‌తో, 4న ఆతిథ్య యూఏఈతో మ్యాచ్‌లు ఆడుతుంది. గ్రూప్ దశ ముగిశాక రెండు గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. భారత అండర్–19 జట్టు: మొహమ్మద్ అమాన్ (కెపె్టన్), కిరణ్ చోర్మలే (వైస్ కెపె్టన్), ఆయుశ్ మాత్రే, వైభవ్ సూర్యవంశీ, ఆండ్రీ సిద్ధార్్థ, కేపీ కార్తికేయ, ప్రణవ్ పంత్, హార్దిక్ రాజ్, నిఖిల్ కుమార్, హర్వంశ్ సింగ్, అనురాగ్, ఇనాన్, సమర్థ్ నాగరాజ్, యుధాజిత్ గుహ, చేతన్ శర్మ. -
Asia Cup 2024: పాక్ భారీ విజయం.. భారత్‌తో పాటు సెమీస్‌లో!
ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా టీ20 కప్-2024లో పాకిస్తాన్-‘ఎ’ జట్టుకు వరుసగా రెండో విజయం లభించింది. అల్ అమెరత్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో పాక్ యూఏఈ టీమ్‌ను ఏకంగా 114 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ గెలుపుతో సెమీ ఫైనల్ బెర్తును కూడా ఖరారు చేసుకుంది.పాక్, యూఏఈలపై గెలిచిన భారత్‌కాగా ఒమన్ వేదికగా వర్ధమాన టీ20 జట్ల మధ్య ఆసియా కప్ ఈవెంట్ జరుగుతోంది. ఇందులో తిలక్ వర్మ సారథ్యంలోని భారత జట్టు సహా పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ గ్రూప్-బిలో ఉండగా.. హాంగ్‌కాంగ్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గనిస్తాన్ గ్రూప్-ఎలో ఉన్నాయి.ఈ క్రమంలో ఇప్పటికే పాకిస్తాన్, యూఏఈలపై గెలుపొంది భారత్ గ్రూప్-బి నుంచి సెమీస్‌లో అడుగుపెట్టింది. తాజాగా పాక్ సైతం టాప్-4కు అర్హత సాధించింది. యూఏఈతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది.కెప్టెన్ ధనాధన్ ఇన్నింగ్స్‌ఓపెనర్లు ఒమైర్ యూసఫ్(11 బంతుల్లో 21), యాసిర్ ఖాన్(13 బంతుల్లో25) శుభారంభం అందించగా.. వన్‌డౌన్ బ్యాటర్ మహ్మద్ హ్యారిస్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. మొత్తంగా 49 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 71 పరుగులు సాధించాడు.మిగతా వాళ్లలో కాసిం అక్రం 23 పరుగులు చేయగా.. హైదర్ అలీ మెరుపు ఇన్నింగ్స్(17 బంతుల్లో 32*) ఆడాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి 179 పరుగులు చేసింది.65 పరుగులకే కుప్పకూలిన యూఏఈలక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే యూఏఈ తడబడింది. ఓపెనర్లు ఆయాన్ష్ శర్మ(8), మయాంక్ రాజేశ్ కుమార్(0) విఫలం కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ తానిశ్ సూరి 15 రన్స్ చేశాడు. మిగిలిన ఆటగాళ్లలో వికెట్ కీపర్ సయీద్ హైదర్ షా(12), ధ్రువ్ పరాషర్(1), బాసిల్ హమీద్(4), సంచిత్ శర్మ(0), ముహ్మద్ ఫారూక్(3), అకీఫ్ రాజా(0), ఒమిద్ రెహ్మాన్(0 నాటౌట్) దారుణ ప్రదర్శన కనబరిచారు.ఇక కెప్టెన్ రాహుల్ చోప్రా చేసిన ఇరవై పరుగులే యూఏఈ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు. ఈ క్రమంలో 16.3 ఓవర్లలో కేవలం 65 పరుగులకే యూఏఈ జట్టు కుప్పకూలింది. పాక్ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ షానవాజ్దహాని అత్యధికంగా ఐదు వికెట్లు పడగొట్టగా.. సూఫియాన్ ముఖీమ్ రెండు, అహ్మద్ దనియాల్, అబ్బాస్ ఆఫ్రిది, అరాఫత్ మిన్హాస్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. కాగా పాక్ అంతకుముందు ఒమన్‌పై విజయం సాధించింది.చదవండి: Ind vs NZ: అతడి ఆట తీరు బాగుంది.. అయినా..: గంభీర్ నువ్వేమైనా ‘హ్యాట్రిక్’ హీరోవా? బుద్ధిలేదా?: పాక్ మాజీ క్రికెటర్ ఫైర్ -
అభిషేక్ శర్మ ఊచకోత.. యూఏఈపై టీమిండియా ఘన విజయం
టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024 టోర్నీలో భాగంగా యూఏఈతో ఇవాళ (అక్టోబర్ 21) జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. భారత బౌలర్ల ధాటికి 16.5 ఓవర్లలో 107 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా పేసర్ రసిఖ్ సలామ్ ఐదు బంతుల వ్యవధిలో మూడు వికెట్లు తీసి యూఏఈని చావుదెబ్బ కొట్టాడు. అనంతరం రమణ్‌దీప్ సింగ్ రెండు ఓవర్లలో రెండు వికెట్లు పడగొట్టాడు. అన్షుల్ కంబోజ్, వైభవ్ అరోరా, అభిషేక్ శర్మ, నేహల్ వధేరా తలో వికెట్ దక్కించుకున్నారు. యూఏఈ ఇన్నింగ్స్‌లో రాహుల్ చోప్రా ఒక్కడే ఒంటరిపోరాటం చేశాడు. రాహుల్ 50 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేసి చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. యూఏఈ ఇన్నింగ్స్‌లో రాహుల్‌తో పాటు కెప్టెన్ బాసిల్ హమీద్ (12 బంతుల్లో 22; ఫోర్, 2 సిక్సర్లు), మయాంక్ రాజేశ్ కుమార్ (5 బంతుల్లో 10; ఫోర్, సిక్స్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అభిషేక్ శర్మ ఊచకోత..స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. అభిషేక్ శర్మ (24 బంతుల్లో 58; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో 10.5 ఓవర్లలో విజయతీరాలకు చేరింది. భారత ఇన్నింగ్స్‌లో తిలక్ వర్మ 21, ప్రభ్‌సిమ్రన్ సింగ్ 8, అభిషేక్ 58 పరుగులు చేసి ఔట్ కాగా.. నేహల్ వధేరా 6, ఆయుశ్ బదోని 12 పరుగులతో అజేయంగా నిలిచారు. -
టీమిండియా బౌలర్ల విజృంభణ.. 107 పరుగులకే కుప్పకూలిన పసికూన
ఏసీసీ మెన్స్ టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024 టోర్నీలో భాగంగా పసికూన యూఏఈతో ఇవాళ (అక్టోబర్ 21) జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు విజృంభించారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. యూఏఈని 107 పరుగులకే (16.5 ఓవర్లలో) కుప్పకూల్చింది. టీమిండియా పేసర్ రసిఖ్ సలామ్ ఐదు బంతుల వ్యవధిలో మూడు వికెట్లు తీసి యూఏఈని చావుదెబ్బ కొట్టాడు. అనంతరం రమణ్‌దీప్ సింగ్ రెండు ఓవర్లలో రెండు వికెట్లు పడగొట్టాడు. అన్షుల్ కంబోజ్, వైభవ్ అరోరా, అభిషేక్ శర్మ, నేహల్ వధేరా తలో వికెట్ దక్కించుకున్నారు. యూఏఈ ఇన్నింగ్స్‌లో రాహుల్ చోప్రా ఒక్కడే ఒంటరిపోరాటం చేశాడు. రాహుల్ 50 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేసి చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. యూఏఈ ఇన్నింగ్స్‌లో రాహుల్‌తో పాటు కెప్టెన్ బాసిల్ హమీద్ (12 బంతుల్లో 22; ఫోర్, 2 సిక్సర్లు), మయాంక్ రాజేశ్ కుమార్ (5 బంతుల్లో 10; ఫోర్, సిక్స్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. ఒమిద్ రెహ్మాన్ బౌలింగ్‌లో ప్రభ్‌సిమ్రన్ సింగ్ (8; సిక్స్) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే మరో 100 పరుగులు చేయాల్సి ఉంది. కాగా, భారత్ ఈ టోర్నీలో జరిగిన తమ ఓపెనింగ్ మ్యాచ్‌లో దాయాది పాకిస్తాన్‌పై ఏడు పరుగుల తేడాతో గెలుపొందింది.చదవండి: ఇంగ్లండ్ కెప్టెన్‌గా లియామ్ లివింగ్‌స్టోన్ -
గుర్తించారు... చాలు! క్రికెటర్ శ్రేయాంక పాటిల్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్
‘కుదిరితే క్షమించు. లేదంటే శిక్షించు. కానీ మేమున్నామని గుర్తించత్తా. దయచేసి గుర్తించు. దయచేసి గుర్తించు..’ అని అనేది ఓ సినిమాలో డైలాగ్! నిజమే.. క్షమించినా, శిక్షించినా, విమర్శించినా, ద్వేషించినా... అసలంటూ గుర్తించటమే కావలసింది. ఆటలోనైనా, బతుకు పోరాటంలోనైనా గెలుపోటములు ఎలా ఉన్నా ముందైతే గుర్తింపు ముఖ్యం. ఆ విషయాన్నే భారత మహిళా క్రికెట్ జట్టులోని ఆల్ రౌండర్ శ్రేయాంక పాటిల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంతో చక్కగా వ్యక్తం చేశారు. ‘మీ అభిమానానికి, మీ విమర్శలకూ నిజంగా అభివందనాలు. ఈవిధంగానైనా మమ్మల్ని గుర్తించినందుకు ధన్యవాదాలు. ఓటమి మమ్మల్ని ఒకవైపు బాధిస్తున్నా, గెలుపు కోసం మరింతగా ఆకలిని మాలో రాజేసింది.. ‘ అని రాశారు. యూఏఈలో ప్రస్తుతం జరుగుతున్న టి20 విమెన్ వరల్డ్ కప్‌లో భారత జట్టు సెమీస్‌కి క్వాలిఫై కాలేక సోయిన సంగతి అటుంచితే... ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రేయాంక పాటిల్ పెట్టిన ఈ పోస్ట్...ముఖ్యంగా స్పాన్సరర్లు మహిళల క్రికెట్ జట్టును గుర్తించి, మరింతగా ప్రోత్సహించవలసిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. View this post on Instagram A post shared by Shreyanka Patil (@shreyanka_patil31) -
అబుదాబిలో బతుకమ్మ సంబరాలు
అబుదాబి, సాక్షి : తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఉంటున్న తెలంగాణీయులందరు దేశ రాజధాని అయిన అబుదాబి లో జత చేరి అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. అబుదాబి లోని తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యం లో గత నెల రోజులు గా ఈ ఉత్సవాల కు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ అద్భుత కార్యక్రమానికి అబుదాబిలోని ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ వేదిక అయ్యిందియుఏఈ లో ఉన్న వందలాది తెలంగాణ మహిళలు మరియు చిన్నారులు గత నెల రోజులు గా అవిశ్రాంతంగా వివిధ తెలంగాణ నృత్యాల ప్రదర్శనల తయారీ చేశారు. ఎడారి ప్రాంతం కావడం కారణంగా పూలు దొరకడం చాలా కష్టం తోను మరియు చాలా ఖర్చు తో కూడుకున్న వ్యవహారం కావడం తో సంఘ నాయకత్వం ఎక్కువ మోతాదు లో తెలంగాణ నుండి వందలాది కిలోల వివిధ పూలను తెప్పించి అబూ దాబి ని పూల వనంగా మార్చారు. ఇండియా నుండి తెచ్చిన తీరొక్క పూలతో ఘనంగా సామూహిక బతుకమ్మ తయారీ కార్యక్రమాన్ని నిర్వాహకులు పల్లె వాతావరణాన్ని పరిమళించే లా చేశారు. ఈ కార్యక్రమానికి వందలాది తెలంగాణ మహిళలు విచ్చేసి బతుకమ్మ తయారీ ప్రాంగణాన్ని బతుకమ్మ పాట ల తో మార్మోగించారు. శుక్రవారం సాయంత్రం కార్యక్రమ వేదిక అయిన ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ కి రెండు వేల మంది మహిళలు కార్యక్రమ ఆరంభ సమయానికి ముందే చేరుకొని సందడి చేశారు. ఈ తెలంగాణ సంబరాలకు వన్నె తెచ్చేందుకు అందరిని అలరించడానికి మరియు తెలంగాణ వాతావరణానికి మరింత కల తెచ్చేందుకు ప్రముఖ కవి గాయకుడు శ్రీ అష్ట గంగాధర్ మరియు తెలంగాణ వర్ధమాన గాయని శ్రీమతి తేజు ప్రియ ప్రత్యేకంగా ఇండియా నుండి విచ్చేసారు. కార్యక్రమాన్ని తెలంగాణ సంప్రదాయానికి ప్రతిభింబించే లా డప్పు వాయిద్యం మరియు కోలాటాల సందడి మధ్యలో అన్ని బతుకమ్మలను బతుకమ్మ ప్రాంగణానికి తోడ్కొని వెళ్లారుఆ తరువాత తెలంగాణ మహిళలు మరియు చిన్నారులు తెలంగాణ సాంప్రదాయo ఉట్టి పడుతూ చేసిన నృత్య ప్రదర్శనలు సందర్శకులకు కనువిందు చేశాయి. తెలంగాణ నుండి వచ్చిన ఇద్దరు కళాకారులు వివిధ రకాల తెలంగాణ ఆట పాటలతో ప్రేక్షకులను అలరించారు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణ గా జంటల (Couples) నృత్య ప్రదర్శన నిలిచింది. ప్రత్యేకంగా ఇండియా నుండి తెప్పించి అందరికి పంచిన తెలంగాణ పిండి వంటలు కార్యక్రమానికి వచ్చిన తెలంగాణ వారినందరిని విశేషంగా ఆకర్షించాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యుఏఈ భారత రాయబార కార్యాలయ డిప్యూటీ చీఫ్ అఫ్ మిషన్ శ్రీ అమర్నాథ్ అశోకన్ ముఖ్య అతిధి గా మరియు కాన్సులర్ డా: ఆర్. బాలాజీ మరియు కుటుంబ సభ్యులు గౌరవ అతిధులు గా హాజరు అయ్యారు. వారు కూడా తెలంగాణ మహిళ ల తో బతుకమ్మ ఆడి పాడారు. తదనంతరం కార్య నిర్వాహకులు 10 అందమైన బతుకమ్మలకు, ప్రాంగణానికి మొదటగా వచ్చిన 3 బతుకమ్మలకు, అందంగా ముస్తాబైన చిన్నారులకు, చక్కగా బతుకమ్మ నాట్యం చేసిన మహిళలకు మరియు జంటలకు బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమ ముఖ్య దాతలు టైటిల్ స్పాన్సర్ గా సంపంగి గ్రూప్ మరియు కో స్పాన్సర్ గా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఏ ఎక్స్ ప్రాపర్టీస్, బ్యూటీ డెంటా కేర్ వారిని నిర్వాహుకులు ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమానికి విశేష అతిథులుగా అబుదాబి బాప్స్ హిందూ మందిర్ డైరెక్టర్ శ్రీ ప్రణవ్ దేశాయ్ మరియు వారి కుటుంబ సభ్యులు హాజరు అయి తెలంగాణ మహిళలందరితో బతుకమ్మ ఆడారు. చివరగా గౌరీ పూజ చేసి బతుకమ్మ నిమజ్జనం కృతిమ కొలను లో చేసి ప్రసాదాలు పంచి, విందు భోజనం ఆరగించారు ఈ కార్యక్రమాన్ని రాజశ్రీనివాస రావు, గోపాల్, వంశీ, శ్రీనివాస్, సాగర్, గంగన్న, సంతోష్, జగదీష్, అశోక్ , శ్రీనివాస్ రెడ్డి, పావని, అర్చన, పద్మజ, లక్ష్మి, నిధి తదితరులు దగ్గర ఉండి నడిపించారు. బతుకమ్మ ఉత్సవాలు విదేశాలలో కూడా ఇంత ఘనంగా జరుపుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని కార్య నిర్వాహకులు రాజశ్రీనివాస రావు తెలియజేశారు. -
పాక్‌కు బిగ్ షాక్.. భారత్ ఫైనల్ చేరితే వేదిక మారే ఛాన్స్! ఎక్కడంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు పాకిస్తాన్ ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. దాదాపు 14 ఏళ్ల తర్వాత తమ సొంత గడ్డపై ఓ ఐసీసీ ఈవెంట్ జరగనుండడంతో విజయవంతంగా నిర్వహించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పటినుంచే వ్యూహాలు రచిస్తోంది. అయితే ఈ టోర్నీలో పాల్గోనందుకు పాక్‌కు టీమిండియా వెళ్లడంపై ఇంకా సందిగ్ధం కొనసాగుతునే ఉంది.ఇరు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా గత 10 ఏళ్ల పాక్-భారత జట్ల మధ్య ఎటువంటి ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. ఇరు జట్లు కేవలం ఐసీసీ టోర్నీలు, ఆసియాకప్ వంటి ఈవెంట్లో తలపడతున్నాయి. ఆసియాకప్-2023కు పాక్‌నే ఆతిథ్యమిచ్చింది.కానీ భారత్ మాత్రం పాక్‌కు వెళ్లలేదు. దీంతో ఆ టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించారు. భారత్ తమ మ్యాచ్‌లన్నింటని శ్రీలంకలో ఆడింది. ఇప్పుడు కూడా ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించాలని హైబ్రిడ్ మోడల్లోనే బీసీసీఐ డిమాండ్ చేస్తోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ పాక్‌కు వెళ్లేది లేదని ఐసీసీకి భారత క్రికెట్ బోర్డు తెలియజేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ పీసీబీ మాత్రం భారత జట్టు తమ దేశానికి రావాల్సిందేనని మొండి పట్టుతో ఉంది. పీసీబీ ఇప్పటికే డ్రాప్ట్ షెడ్యూల్‌ను కూడా ఐసీసీకి పంపించింది. దీనిలో భాగంగా ఫైనల్ మ్యాచ్‌కు లాహోర్‌ను వేదికగా నిర్ణయించింది. అయితే తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీ నిర్వహణకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. భారత్ ఒకే వేళ ఫైనల్ చేరితే వేదిక దుబాయ్‌కి మారే అవకాశం ఉందని ‘టెలిగ్రాఫ్’ తమ నివేదికలో పేర్కొంది. టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం.. పాక్‌కు వెళ్లకూడదని భారత జట్టు నిర్ణయించుకుంటే టీమిండియా మ్యాచులన్నీ యూఏఈలో నిర్వహించే అవకాశం ఉంది. త్వరలోనే ఈ విషయంపై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. కాగా ఐసీసీ నూతన చైర్మెన్‌గా జై షా ఎంపికైన విషయం విధితమే. -
చెలరేగిన ఓపెనర్.. సౌతాఫ్రికా ఘన విజయం
ఐర్లాండ్‌తో తొలి వన్డేలో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. పాల్ స్టిర్లింగ్ బృందాన్ని ఏకంగా 139 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. కాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సౌతాఫ్రికా.. ఐర్లాండ్‌తో తొలుత రెండు టీ20లు ఆడింది.పొట్టి సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ప్రొటిస్ జట్టు గెలుపొందగా.. రెండో టీ20లో అనూహ్య రీతిలో ఐర్లాండ్ పది పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బుధవారం వన్డే సిరీస్ మొదలైంది. అబుదాబి వేదికగా జరిగిన మొదటి వన్డేలో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసింది.చెలరేగిన ఓపెనర్ఓపెనర్ రియాన్ రికెల్టన్.. 102 బంతుల్లో 7 ఫోర్లు, మూడు సిక్స్‌ల సాయంతో 91 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ టోనీ డి జోర్జీ(12), కెప్టెన్ తెంబా బవుమా(4), వాన్ డెర్ డసెన్(0) పూర్తిగా విఫలమయ్యారు. ఈ క్రమంలో ఐదో నంబర్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ రికెల్టన్‌తో కలిసి ప్రొటిస్ ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టించాడు. 86 బంతుల్లో 79 పరుగులు చేశాడు.మిగతా వాళ్లలో జోర్న్ ఫార్చూన్ 28, లుంగి ఎంగిడి 20(నాటౌట్) పరుగులతో ఫర్వాలేదనిపించారు. ఈ క్రమంలో సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 271 పరుగులు చేసింది. ఐరిష్ బౌలర్లలో మార్క్ అదేర్ నాలుగు, క్రెయిగ్ యంగ్ మూడు వికెట్లు కూల్చగా.. హ్యూమ్, ఆండీ మెక్‌బ్రిన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.132 పరుగులకు ఆలౌట్ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్‌ను సౌతాఫ్రికా బౌలర్లు ఆది నుంచే బెంబేలెత్తించారు. ఏ దశలోనూ ఐరిష్ బ్యాటర్లను కోలుకోనివ్వలేదు. ఫలితంగా 31.5 ఓవర్లకే 132 పరుగులు చేసి ఐర్లాండ్ జట్టు కుప్పకూలింది. ప్రొటిస్ పేసర్లలో లిజాడ్ విలియమ్స్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. లుంగి ఎంగిడి రెండు వికెట్లు తీశాడు. ఒట్నీల్ బార్ట్‌మన్, వియాన్ ముల్దర్ ఒక్కో వికెట్ కూల్చారు. స్పిన్నర్ జోర్న్ ఫార్చున్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక ఐర్లాండ్ బ్యాటర్లలో జార్జ్ డాక్రెల్ 21 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సౌతాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించిన రియాన్ రెకెల్టన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరుజట్ల మధ్య శుక్రవారం(అక్టోబరు 4) రెండో వన్డే జరుగనుంది.చదవండి: న్యూజిలాండ్ టెస్టు కెప్టెన్సీకి సౌథీ గుడ్‌బై.. కొత్త కెప్టెన్ ఎవరంటే? -
ఓర్నీ.. క్రికెట్ మ్యాచ్‌లో బ్యాట్లతో కొట్టుకున్న ప్లేయర్లు(వీడియో)
క్రికెట్.. జెంటిల్ మ్యాన్ గేమ్ గా పేరొందిన విషయం అందరికి తెలిసిందే. కానీ క్రికెట్ టోర్నమెంట్లో ఆ పేరుకే మాయని మచ్చ తీసుకువచ్చారు. ఓ మ్యాచ్‌లో ఆటగాళ్లు పొట్టు పొట్టు కొట్టుకున్నారు. అంపైర్లు ఆపినా కూడా బ్యాట్లతో మరి కొట్టుకున్నారు. ప్రొఫిషనల్‌గా ఉండాల్సిన క్రికెటర్లు వీధి రౌడీల్లా మారారు. అస్సలు ఈ సంఘటన ఎక్కడ జరిగింది? ఇంతకీ ఆ టోర్నీ ఏదో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.ఏం జరిగిందంటే?ఎంసీసీ స్పోర్ట్స్ క్రికెట్ క్లబ్.. ఎంసీసీ వీక్డేష్ బాష్ XIX పేరిట ఓ టోర్నీ నిర్వహించింది. ఈ టోర్నీకి యూఏఈలోని ఆజ్మల్ ఆతిథ్యమిచ్చింది. ఈ టోర్నీలో భాగంగా మంగళవారం జరిగిన ఫైనల్లో ఏరోవిసా క్రికెట్, రబ్దాన్ క్రికెట్ క్లబ్‌లు తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్ రణరంగాన్ని తలపించింది. రబ్దాన్ క్రికెట్ క్లబ్ ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేసిన నాసిర్ అలీ బౌలింగ్‌లో చివరి బంతికి కాషిఫ్ మహ్మద్ ఎల్బీగా ఔటయ్యాడు. అయితే కాషిఫ్ను ఔట్ చేసిన తర్వాత బౌలర్ సెలబ్రేషన్స్ శ్రుతిమించాయి. కాషిఫ్ వద్దకు వెళ్లిన అలీ అతడిని రెచ్చగొట్టేలా సంబరాలు చేసుకున్నాడు.అతడి వైపు చేతి వేలు చూపిస్తూ గెట్ అవుట్ అంటూ గట్టిగా అరిచాడు. కాషిఫ్ కూడా అతడి వ్యాఖ్యలకు స్పందిస్తూ గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఇరు జట్ల నుంచి ఆటగాళ్ల సైతం తమ ప్లేయర్లకు మద్దతుగా నిలిచారు. దీంతో గొడవ మరింత తీవ్రమైంది. ఒకరొకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. బ్యాట్లతో కూడా కొట్టుకున్నారు. ఆఖరికి అంపైర్లు జోక్యం చేసుకుని ఈ గొడవను సద్దుమణిగేలా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. KALESH on Cricket Pitch 🥵 pic.twitter.com/mhvNYFIp4I— Sameer Allana (@HitmanCricket) September 25, 2024 -
ICC Women's T20 World Cup 2024: సమరానికి సై
ముంబై: గతంలో జరిగిన తప్పిదాలను ఈసారి పునరావృతం చేయబోమని... ఈసారి విజేత హోదాతో స్వదేశానికి తిరిగి వస్తామని భారత మహిళల టి20 జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వ్యాఖ్యానించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేదికగా అక్టోబర్ 3 నుంచి 20 వరకు జరగనున్న మహిళల టి20 ప్రపంచకప్ కోసం భారత మహిళల జట్టు మంగళవారం బయలు దేరింది. గత జూలైలో ఆసియా కప్‌లో రన్నరప్‌గా నిలిచాక మరే టోర్నీలో ఆడని టీమిండియా... బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ప్రత్యేక శిబిరంలో పాల్గొంది. గత కొన్నాళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో నిలకడ కొనసాగిస్తున్న భారత మహిళల జట్టు ఐసీసీ టోర్నీల్లో మాత్రం విజేతగా నిలువలేకపోయింది. 2017 వన్డే ప్రపంచకప్, 2020 టి20 ప్రపంచకప్‌లలో ఫైనల్‌కు చేరిన భారత అమ్మాయిలు... రెండు పర్యాయాలు ఆ్రస్టేలియా చేతిలో ఓడి రిక్తహస్తాలతో వెనుదిరిగారు.వరల్డ్‌కప్‌లో సత్తా చాటేందుకు కఠోర సాధన చేశామని, సమరానికి సిద్ధంగా ఉన్నామని హర్మన్‌ప్రీత్ పేర్కొంది. ముఖ్యంగా చాన్నాళ్లుగా జట్టును ఇబ్బంది పెడుతున్న ఫీల్డింగ్, ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టినట్లు వెల్లడించింది. జట్టు యూఏఈ బయలుదేరడానికి ముందు మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో హెడ్ కోచ్ అమోల్ మజుందార్, చీఫ్ సెలెక్టర్ నీతూ డేవిడ్‌తో కలిసి హర్మన్‌ప్రీత్ పాల్గొంది. అడ్డంకులు అధిగమిస్తాం... ‘అత్యుత్తమ జట్టుతో ప్రపంచకప్ ఆడనున్నాం. జట్టులోని ప్లేయర్లందరూ చాలా కాలం నుంచి కలిసి ఆడుతున్నారు. మా మధ్య చక్కటి సమన్వయం ఉంది. గతేడాది టి20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్లో ఓడాం. ఈసారి అడ్డంకులన్ని అధిగమించి విజేతగా నిలవాలని అనుకుంటున్నాం. శిక్షణ సమయంలో బలహీనంగా ఉన్న అంశాలపై మరింత దృష్టి పెట్టాం. అన్ని రంగాల్లో రాటుదేలాం. ఆసియా కప్‌లో మెరుగైన ప్రదర్శనే చేశాం. కానీ మాది కాని రోజు ఒకటి ఎదురైంది. దీంతో ఫైనల్లో పరాజయం పాలయ్యాం. నేను ఇప్పటి వరకు చాలా ప్రపంచకప్‌లు ఆడాను. అయినా మొదటి సారి మెగా టోర్నీలో బరిలోకి దిగుతున్నట్లే అనిపిస్తోంది. ఉత్సాహంలో ఏమాత్రం తేడా లేదు. మేము ఏ జట్టునైనా ఓడించగలం. ఆ్రస్టేలియాకు కూడా తెలుసు... ప్రపంచంలో వారిని ఓడించే జట్టు ఏదైనా ఉంది అంటే అది టీమిండియానే’ అని హర్మన్ వివరించింది. 2009 నుంచి ఐసీసీ మహిళల టి20 ప్రపంచకప్ నిర్వహిస్తుండగా... ఇప్పటి వరకు జరిగిన 8 మెగా టోర్నీల్లోనూ 35 ఏళ్ల హర్మన్‌ప్రీత్ కౌర్ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. స్పోర్ట్స్ సైకాలజిస్ట్‌ను నియమించాం: మజుందార్ ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో పరాజయం అనంతరం జట్టుకు ఎలాంటి శిక్షణ అవసరమో ఆలోచించి దాన్నే ప్రత్యేక శిబిరం ద్వారా అందించామని మహిళల జట్టు హెడ్ కోచ్ అమోల్ మజుందార్ అన్నాడు. ‘జట్టుకు ముందు ఫీల్డింగ్, ఫిట్నెస్ శిక్షణ అందించాం. ఆ తర్వాత పది రోజుల పాటు నైపుణ్యాన్ని పెంపొందించడంపై దృష్టి పెట్టాం. అమ్మాయిల కోసం ప్రత్యేకంగా స్పోర్ట్స్ సైకాలజిస్ట్ ముగ్ధా బావ్రేను నియమించాం. ప్లేయర్ల సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు ఫీల్డింగ్‌ను మెరుగు పరచడంపై మరింత దృష్టి సారించాం. శిబిరంలో భాగంగా యోగా సెషన్లు, మానసిక దృఢత్వానికి సంబంధించిన శిక్షణ అందించాం. అన్నీటికి సిద్దంగా ఉండే విధంగా ప్లేయర్లకు తర్ఫీదునిచ్చాం. వరల్డ్‌కప్‌లో భాగంగా పది రోజుల వ్యవధిలో ఐదు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అన్ని విభాగాలను సరిచూసుకున్నాం. టాపార్డర్‌లో ఆరుగురు మంచి బ్యాటర్లు ఉన్నారు. ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి అయినా... అందరి లక్ష్యం జట్టును గెలిపించడమే. వన్‌డౌన్‌లో ఎవరిని ఆడించాలనే దానిపై ఒక నిర్ణయానికి వచ్చాం. యూఏఈలో పరిస్థితులు భారత్‌ను పోలే ఉంటాయి. ఆరంభంలో అధిక బౌన్స్ ఉండే అవకాశం ఉంది’ అని మజుందార్ అన్నాడు. షెడ్యూల్ ప్రకారం మహిళల టి20 ప్రపంచ కప్‌నకు బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వాల్సి ఉండగా.. అక్కడ రాజకీయ అనిశ్చితి నెలకొనడంతో వేదికను యూఏఈకి మార్చారు. -
ఈసారి టీ20 వరల్డ్‌కప్ టీమిండియాదే: కెప్టెన్
ఈసారి టీ20 ప్రపంచకప్ గెలిచితీరతామని టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ధీమా వ్యక్తం చేసింది. జట్టులోని ప్రతి ఒక్కరు ఈ మెగా టోర్నీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని.. గెలుపే లక్ష్యంగా బరిలో దిగుతామని పేర్కొంది. ఈవెంట్ ఎక్కడైనా ప్రేక్షకుల మద్దతు మాత్రం తమకే లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేసింది.న్యూజిలాండ్‌తో తొలి మ్యాచ్‌కాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా అక్టోబరు 3 నుంచి మహిళల టీ20 వరల్డ్‌కప్-2024 మొదలుకానుంది. బంగ్లాదేశ్- స్కాట్లాండ్ మధ్య మ్యాచ్‌తో ఈ ఐసీసీ ఈవెంట్‌కు తెరలేవనుంది. ఇక టీమిండియా అక్టోబరు 4న న్యూజిలాండ్‌తో పోరుతో తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది.ట్రోఫీ గెలవాలన్న నిరీక్షణకు ఈసారి తెరదించుతాంఈ నేపథ్యంలో ఐసీసీతో మాట్లాడిన హర్మన్‌ప్రీత్ కౌర్.. ‘‘మా జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. ట్రోఫీ గెలవాలనే పట్టుదలతో ఉన్నాము. చాలా కాలంగా మేము ఫియర్లెస్ క్రికెట్ ఆడుతున్నాం. అదే మా బలం. ఎక్కడున్నా అభిమానుల మద్దతు మాకే ఉంటుంది. జట్టులోని ప్రతి ఒక్కరు అత్యుత్తమంగా రాణించేందుకు సిద్ధంగా ఉన్నారు. ట్రోఫీ గెలవాలన్న నిరీక్షణకు ఈసారి తెరదించుతాం’’ అని పేర్కొంది. కాగా ఐసీసీ టోర్నీలో భారత మహిళల జట్టు కొన్నేళ్లుగా ఆఖరి మెట్టుపై బోల్తా పడుతున్న విషయం తెలిసిందే. గత టీ20 వరల్డ్‌కప్ ఆసాంతం నిలకడగా రాణించిన హర్మన్ సేన.. ఫైనల్లో మాత్రం అనుకన్న ఫలితం రాబట్టలేకపోయింది. గత పొరపాట్లు పునరావృతం చేయకుండాటైటిల్ పోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇటీవల మహిళల ఆసియా కప్ టోర్నీలోనూ ఫైనల్లో శ్రీలంక చేతిలో అనూహ్యంగా పరాజయం పాలైంది. అయితే, ప్రపంచకప్ ఈవెంట్లో మాత్రం గత పొరపాట్లు పునరావృతం చేయకూడదని.. ఒత్తిడిని జయించి టైటిల్ గెలవాలని భావిస్తోంది. చదవండి: IND vs BAN: అగార్కర్ కీలక నిర్ణయం.. జట్టు నుంచి స్టార్ ప్లేయర్ అవుట్? -
యూఏఈలో ఆడటం సానుకూలాంశం
న్యూఢిల్లీ: మహిళల టి20 ప్రపంచకప్ టోర్నీ యూఏఈ వేదికపై జరగనుండటం భారత జట్టుకు కలిసొచ్చే అంశమని మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ పేర్కొంది. మిగతా జట్లకంటే షార్జా, దుబాయ్ వేదికలు భారత్‌కు సానుకూలమని ఆమె విశ్లేషించింది. అక్కడి స్థానిక వాతావరణ, పిచ్ పరిస్థితులు అందరికంటే భారత్‌కే ఎక్కువగా లాభిస్తాయని ఆమె చెప్పింది. ‘యూఏఈలోని పరిస్థితులు కాస్తా భిన్నంగా ఉండొచ్చేమో కానీ భారత్‌కు దగ్గరగానే ఉంటాయి. ఇది మెగా ఈవెంట్లో మన జట్టుకు బాగా ఉపకరించే అంశం. ఈ సానుకూలతతో జట్టు అక్కడి వాతావరణానికి ఇట్టే అలవాటు పడుతుంది’ అని మిథాలీ వివరించింది. అయితే జరగబోయేది మెగా ఈవెంట్ అన్న సంగతి మరవొద్దని ప్రతీ జట్టు ప్రపంచకప్ కోసం సన్నద్ధమయ్యే వస్తుందని తమ జట్టు వర్గాలను అప్రమత్తం చేసింది. ‘మెగా ఈవెంట్లో పాల్గొనే ప్రతి జట్టు అన్ని రంగాల్లో పూర్తిస్థాయిలో సిద్ధమయ్యే వస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు’ అని తెలిపింది. ఐసీసీ ప్రపంచకప్ టోరీ్నలో ఫైనల్ చేరిన సీనియర్ మహిళల జట్టు ఇంత వరకు టైటిల్‌ను మాత్రం గెలవలేకపోయింది. అండర్–19 ప్రపంచకప్‌లో మాత్రం యువ మహిళల జట్టు గతేడాది ఆరంభమైన తొలి మెగా ఈవెంట్‌ను గెలిచింది. ఈ ప్రపంచకప్‌లో భారత జట్టు రాణించాలని, కప్‌తో తిరిగి రావాలని బలంగా కోరుకుంటున్నట్లు మాజీ కెపె్టన్ చెప్పింది. వచ్చే నెల 3 నుంచి యూఏఈలో అమ్మాయిల టి20 ప్రపంచకప్ మొదలవుతుంది. దుబాయ్ వేదికగా 4వ తేదీన భారత్ తమ తొలి లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడుతుంది. -
T20 WC: టీ20 క్రికెట్.. పొట్టి ఫార్మాట్ కానేకాదు: కెప్టెన్
శారీరక ఫిట్నెస్తో పాటు మానసిక దృఢత్వం కూడా ముఖ్యమని భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పేర్కొంది. ఈ రెండూ సమతూకంగా ఉంటేనే మెగా టోర్నీల్లో విజయవంతం కాగలమని అభిప్రాయపడింది. అందుకే తాము.. మహిళల టీ20 ప్రపంచకప్‌నకు ముందు... మానసిక స్థయిర్యం సాధించేందుకు కూడా కసరత్తు చేస్తుట్లు తెలిపింది.కాగా ఐసీసీ టోర్నమెంట్లలో భారత మహిళల జట్టు కొన్నేళ్లుగా ఆఖరి మెట్టుపై తడబడుతోన్న విషయం తెలిసిందే. గత టీ20 ప్రపంచకప్ ఈవెంట్లో ఆసాంతం నిలకడగా రాణించిన అమ్మాయిల జట్టు ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో కంగుతిని రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక ఈసారైనా గత పొరపాట్లు పునరావృతం చేయకూడదని.. ఒత్తిడి అధిగమించి టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉంది. టీ20 క్రికెట్.. పొట్టి ఫార్మాట్ కానేకాదు!ఈ నేపథ్యంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. ‘చాలా రోజులుగా మేమంతా మానసిక సంసిద్ధతపై దృష్టి పెట్టాం. మ్యాచ్‌ల్లో ఎప్పుడైనా చివరి మూడు, నాలుగు ఓవర్ల ఆట పెను ప్రభావాన్ని చూపిస్తోంది. నిజానికి టీ20 క్రికెట్ అందరు అనుకున్నట్లు పొట్టి ఫార్మాట్ కానేకాదు. ఆ రోజు 40 ఓవర్ల మ్యాచ్ జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మెంటల్ ఫిట్‌నెస్‌పై ఎక్కువ దృష్టి పెట్టాంమేం ఆఖరి నాలుగైదు ఓవర్లు మానసిక పట్టుదలను కనబరిస్తే మ్యాచ్‌లు గెలవచ్చు. ఈ ఓవర్లే ఫలితాలను తారుమారు చేస్తున్నాయి. ఏదేమైనా.. చివరిదాకా చతికిలబడటం చాలా నిరాశను మిగులుస్తోంది. అందుకే అలాంటి సమయంలో నిలకడను కొనసాగించేందుకు ఈసారి మెంటల్ ఫిట్‌నెస్‌పై ఎక్కువ దృష్టి పెట్టాం’ అని తెలిపింది.ఇకపై గత పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్త వహిస్తామని హర్మన్‌ప్రీత్ కౌర్ చెప్పింది. జట్టులో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్లేయర్లతో కలిసి ఆడటం వల్ల విభిన్న సంస్కృతులు తెలుసుకునేందుకు, ఏదైనా కొత్త విషయాలు నేర్చుకునేందుకు అవకాశముంటుందని పేర్కొంది. ఒత్తిడిని అధిగమించలేక ఆఖరి మెట్టుపై బోల్తాకాగా.. 2017 వన్డే ప్రపంచకప్‌లోనూ ఇంగ్లండ్‌తో భారత్ తుదిమెట్టుపై దాదాపు గెలిచే స్థితిలో ఉండి... అనూహ్యంగా 9 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. రెండేళ్ల క్రితం జరిగిన 2022 కామన్వెల్త్ క్రీడల్లోనూ ఆస్ట్రేలియా చేతిలో 9 పరుగుల తేడాతో ఓడి స్వర్ణాన్ని చేజార్చుకుని... వెండి పతకంతో సరిపెట్టుకుంది.యూఏఈలోమహిళా టీ20 ప్రపంచకప్-2024 ఎడిషన్ అక్టోబర్ 3- 20 వరకు జరుగనుంది. షార్జా, దుబాయ్ ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమిస్తున్నాయి. ఈ ఐసీసీ టోర్నీలో భారత జట్టు గ్రూప్ ‘ఎ’లో ఉంది.ఇక ఆరుసార్లు విజేత, డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక, న్యూజిలాండ్‌లో ఈ గ్రూపులోనే ఉండటం విశేషం. దీంతో లీగ్ దశలో భారత్‌కు గట్టిపోటీ ఎదురుకానుంది.ఈ మెగా ఈవెంట్లో హర్మన్ సేన తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 4న న్యూజిలాండ్‌తో ఆడుతుంది.అందుకే వేదిక మార్పుఅదే విధంగా.. లీగ్ దశలోని మొదటి మూడు మ్యాచ్‌ల్ని దుబాయ్‌లో ఆడనున్న టీమిండియా... ఆసీస్‌తో జరిగే ఆఖరి మ్యాచ్‌ను షార్జాలో 13వ తేదీన ఆడుతుంది. నిజానికి ఈ మెగా ఈవెంట్ బంగ్లాదేశ్‌లో జరగాల్సింది. కానీ అక్కడ నెలకొన్న రాజకీయ అనిశ్చితి, హింసాత్మక ఘటనలతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వేదికను యూఏఈకి మార్చిన విషయం తెలిసిందే. చదవండి: 38వ పడిలోకి స్పిన్ మాంత్రికుడు.. హ్యాపీ బర్త్ డే అశ్విన్ -
T20 WC: ‘కెప్టెన్సీకి కఠిన సవాలు.. ఈసారైనా ట్రోఫీ గెలవాలి’
ఒత్తిడిని అధిగమిస్తేనే ప్రపంచకప్ వంటి మెగా ఈవెంట్లలో విజయం వరిస్తుందని భారత మహిళా మాజీ క్రికెటర్ డయానా ఎడుల్జీ పేర్కొంది. ఆస్ట్రేలియా వంటి పటిష్ట జట్లపై పైచేయి సాధించాలంటే ఆత్మవిశ్వాసంతో ఆది నుంచే దూకుడు ప్రదర్శించాలని మహిళా జట్టుకు సూచించింది. ఆస్ట్రేలియా చేతిలో వరుస పరాజయాలుకాగా నాలుగేళ్ల క్రితం జరిగిన టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత మహిళల జట్టు ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. అయితే, టైటిల్ పోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓడి ట్రోఫీని చేజార్చుకుంది. అదే విధంగా... 2023 ఫిబ్రవరిలో జరిగిన టీ20 వరల్డ్ కప్ సమయంలోనూ భారత మహిళా జట్టు ప్రయాణం సెమీఫైనల్స్నే ముగిసింది. ఈ దఫా కూడా మన జట్టు ఆస్ట్రేలియా చేతిలోనే ఓడటం గమనార్హం. అయితే ఈసారి మాత్రం అలాంటి అవకాశాన్ని వదలరాదని, మన ప్లేయర్లు ఒత్తిడిని అధిగమించాలని భారత మాజీ ప్లేయర్ డయానా ఎడుల్జీ సూచించింది. అక్టోబర్ 3 నుంచి యూఏఈలో జరిగే టీ20 వరల్డ్ కప్ ప్రచార కార్యక్రమంలో ఆమె పాల్గొంది.మనదైన రోజు ఏదైనా సాధ్యమేఈ సందర్భంగా... ఎడుల్జీ మాట్లాడుతూ... ‘ఆస్ట్రేలియాలాంటి ప్రొఫెషనల్ టీమ్‌ను ఓడించాలంటే మనం అన్ని రకాలుగా ఆధిపత్యం ప్రదర్శించాలి. మన అత్యుత్తమ ప్రదర్శన ఇస్తేనే ప్రత్యర్థి కూడా తడబడుతుంది. అయితే టీ20ల్లో మనదైన రోజు ఏదైనా సాధ్యమే. ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో మనం ఓడిపోతామని అనుకున్నామా? ప్లేయర్లు ఎలాంటి స్థితిలోనూ ఒత్తిడికి తలవంచవద్దు.భావోద్వేగాలను అదుపు చేసుకోవాలిప్రపంచకప్ కప్ టోర్నీలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తన భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం అవసరం. ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించగల సత్తా ఆమెకు ఉంది. ఆమె బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్సీకి కూడా ఈ టోర్నీ సవాల్’ అని ఎడుల్జీ అభిప్రాయపడింది. అదే విధంగా.. భారత పురుషుల జట్టు మాదిరే మహిళల టీమ్ కూడా ఈ టీ20 వరల్డ్ కప్ గెలిచి.. ఒకే ఏడాది అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేసింది. చదవండి: DT 2024: గిల్ ప్లేస్‌లో ఎంట్రీ.. కట్ చేస్తే మెరుపు సెంచరీ?(వీడియో) -
Pak vs Eng: పాకిస్తాన్లో కాదు శ్రీలంకలో!?
బంగ్లాదేశ్ చేతిలో ఘోర ఓటమిపాలైన పాకిస్తాన్ క్రికెట్ జట్టు సొంతగడ్డపై మరో టెస్టు సిరీస్ ఆడనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా ఇంగ్లండ్‌తో తలపడనుంది. అక్టోబరు 7 నుంచి ఈ సిరీస్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ముల్తాన్, కరాచి, రావల్పిండిలో ఈ మ్యాచ్‌లను నిర్వహించాల్సి ఉంది.అయితే, తాజా సమాచారం ప్రకారం పాకిస్తాన్- ఇంగ్లండ్ టెస్టు సిరీస్ వేదికను విదేశానికి తరలించినట్లు సమాచారం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లేదా శ్రీలంకలో ఈ మ్యాచ్‌లను నిర్వహించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్‌లోని స్టేడియాల పునరుద్ధరణ కార్యక్రమం నేపథ్యంలో ఆ దేశ క్రికెట్ బోర్డు ఈ దిశగా సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.అందుకే వేదిక మార్పుకాగా చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఐసీసీ టోర్నీని సమర్థవంతంగా నిర్వహించాలంటే పాక్ స్టేడియాల్లో తగిన సదుపాయాలు లేవు. ఈ నేపథ్యంలో పాక్ బోర్డు వివిధ స్టేడియాల్లో పునరుద్ధరణ చర్యలు చేపట్టింది. అయితే ఇప్పట్లో పూర్తయ్యే సూచనలు కనిపించకపోవడంతో టెస్టుమ్యాచ్‌ల నిర్వహణ సాధ్యం కాదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో సిరీస్ వేదికను తరలించడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది.కానీ.. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డును ఇందుకు ఒప్పించడం సహా... యూఏఈ లేదంటే శ్రీలంకలో సిరీస్ నిర్వహించడం పాక్ బోర్డుకు అంతతేలికేమీ కాదు. ఎందుకంటే.. బంగ్లాదేశ్‌లో అల్లర్ల నేపథ్యంలో మహిళల టీ20 ప్రపంచకప్-2024 వేదికగా ఇప్పటికే యూఏఈని ఖరారు చేసింది ఐసీసీ. అక్టోబరు 3- 20 వరకు ఈ మెగా ఈవెంట్ జరుగనుంది.లంక బెస్ట్ ఆప్షన్కాబట్టి యూఏఈలో పాకిస్తాన్- ఇంగ్లండ్ టెస్టు సిరీస్ నిర్వహణ సాధ్యం కాకపోవచ్చు. మరోవైపు.. శ్రీలంకలో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడా మ్యాచ్‌లు సజావుగా నిర్వహించడం కష్టమేకానుంది. అయితే, లంక కంటే ఉత్తమ ఆప్షన్ లేదు కాబట్టి అక్కడే ఈ సిరీస్‌ను నిర్వహించాలని పాక్ బోర్డు భావిస్తున్నట్లు ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ పేర్కొంది. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ ఇటీవల బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో 0-2తో క్లీన్‌స్వీప్‌నకు గురైన విషయం తెలిసిందే. పాకిస్తాన్ బంగ్లా చేతిలో టెస్టుల్లో ఓడిపోవడం ఇదే తొలిసారి.పాకిస్తాన్లో ఇంగ్లండ్ పర్యటన 2024- ఖరారైన షెడ్యూల్మొదటి టెస్టు- అక్టోబరు 7- అక్టోబరు 11- ముల్తాన్రెండో టెస్టు- అక్టోబరు 15- అక్టోబరు 19- కరాచిమూడో టెస్టు- అక్టోబరు 24- అక్టోబరు 28- రావల్పిండి. -
యూఏఈ నుంచి 160 టన్నుల బంగారం దిగుమతి
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో యునైటెట్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ) నుంచి అధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది. ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత 2024–25 ఆర్థిక సంవత్సరంలో యూఏఈ నుంచి భారత్ తయారీదారులు, వ్యాపారులు రాయితీ రేటుతో 160 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకునేలా ప్రభుత్వం నోటిఫై చేసింది. భారతదేశం–యూఏఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)లో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నత స్థాయి అధికారి తెలిపారు.రెండు దేశాల మధ్య 2022 మే 1వ తేదీ నుంచి సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పదం ప్రకారం, టారిఫ్ రేట్ కోటా (టీఆర్‌క్యూ) కింద ఒక శాతం టారిఫ్ రాయితీతో యూఏఈ నుండి ఏటా 200 మెట్రిక్ టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకోవడానికి భారత్ అంగీకరించింది. గత ఏడాది 140 టన్నులు ఈ తరహాలో నోటిఫైకాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తాజాగా 160 టన్నుల దిగుమతులకు ఆమోదముద్ర వేసింది.భారత్ బంగారం దిగుమతులలో 40 శాతంతో స్విట్జర్లాండ్ అతిపెద్ద వాటా కలిగిఉంది. యూఏఈ వాటా 16 శాతం కాగా, దక్షిణాఫ్రికా వాటా 10 శాతంగా ఉంది. దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ నిధులకు సంబంధించిన కరెంట్ అకౌంట్‌పై పసిడి కొనుగోళ్ల (దిగుమతుల) ప్రభావం కనబడుతోంది. 2023–24లో భారత్ పసిడి దిగుమతుల విలువ 30 శాతం పెరిగి 45.54 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది.జీఎస్టీ లేకపోవడం, తయారీ ఖర్చులు తక్కువగా ఉండడంతో భారత్‌లో కంటే దుబాయ్‌లో బంగారం ధరలు చౌకగా ఉంటాయి. బంగారం దిగుమతులపై ప్రభుత్వం అందిస్తున్న ఈ వెసులుబాటుతో రెండు దేశాల మధ్య పసిడి వాణిజ్యం మరింత బలపడటమే కాకుండా భారతీయ జువెలరీ పరిశ్రమకూ ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. -
యూఏఈలో టి20 ప్రపంచకప్
దుబాయ్: ఊహించిందే జరిగింది. బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో అక్టోబర్‌లో అక్కడ జరగాల్సిన మహిళల టి20 ప్రపంచకప్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి తరలివెళ్లింది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మంగళవారం ప్రకటన విడుదల చేసింది. మాజీ ప్రధాని షేక్ హసీనా రాజీనామాతో బంగ్లాదేశ్‌లో హింస చెలరేగగా... ముందు జాగ్రత్తగా మహిళల టోర్నీని అక్కడి నుంచి తరలించినట్లు ఐసీసీ వెల్లడించింది. దీంతో అక్టోబర్ 3 నుంచి 20 వరకు దుబాయ్, షార్జాలో మహిళల తొమ్మిదో టి20 ప్రపంచకప్ జరగనుంది. ‘మహిళల టి20 ప్రపంచకప్ నిర్వహించేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అన్ని ఏర్పాట్లు చేసింది. కానీ పరిస్థితులు సహకరించక పోవడంతో మెగా టోర్నీని అక్కడి నుంచి తరలించాల్సి వచ్చి0ది. బీసీబీ ఆతిథ్యంలోనే యూఏఈలో మహిళల టి20 వరల్డ్‌కప్ జరుగుతుంది. భవిష్యత్తులో బంగ్లాదేశ్‌కు మరిన్ని ఐసీసీ టోర్నీలు నిర్వహించే అవకాశం ఇస్తాం. మహిళల వరల్డ్‌కప్ నిర్వహించేందుకు ముందుకు వచ్చిన యూఏఈ క్రికెట్ బోర్డుకు ధన్యవాదాలు’ అని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జెఫ్ అలార్డైస్ తెలిపారు.


