
ఆసియాకప్-2025 కోసం 20 మంది సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్ హాంకాంగ్ ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా యాసిమ్ ముర్తజా ఎంపికయ్యాడు. అతడి డిప్యూటీగా బాబర్ హయత్ వ్యవహరించనున్నాడు. అన్షుమాన్ రత్, నిజకత్ ఖాన్, బాబర్ హయత్, ఐజాజ్ ఖాన్, ఎహ్సాన్ ఖాన్, కించిత్ షా, ఆయుష్ శుక్లా వంటి సీనియర్ ఆటగాళ్లకు ఈ జట్టులో చోటు దక్కింది.
ఆసియాకప్ టీ20 ఫార్మాట్‌లో కోహ్లి తర్వాత సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా బాబర్ హయత్ నిలిచాడు. కాగా ఈ టోర్నమెంట్‌కు ముందు హాంకాంగ్ ఆగస్టు 24 నుంచి యూఈఏలో సన్నాహక శిబిరాన్ని నిర్వహిస్తుంది.
గ్రూప్ బిలో ఉన్న హాంకాంగ్ సెప్టెంబర్ 9న తొలి మ్యాచ్‌లో అబుదాబి వేదికగా అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది. అనంతరం హాంకాంగ్ సెప్టెంబర్ 11న బంగ్లాదేశ్‌తో, సెప్టెంబర్ 15న శ్రీలంకతో ఆడనుంది.
ఆసియాకప్-2025 కోసం హాంకాంగ్ జట్టు
యాసిమ్ ముర్తుజా, జీషన్ అలీ, షాహిద్ వాసిఫ్, నిజాకత్ ఖాన్, నస్రుల్లా రాణా, మార్టిన్ కోయెట్జీ, అన్షుమన్ రాత్, బాబర్ హయత్, ఎహసాన్ ఖాన్, కల్హన్ చల్లు, ఆయుష్ శుక్లా, ఐజాజ్ ఖాన్, అతీక్ ఇక్బాల్, కించిత్ షా, ఆదిల్ మెహమూద్, అనాస్, హరూద్, అనస్సాన్, ఘజన్‌ఫర్, మహ్మద్ వహీద్
చదవండి: Asia Cup 2025: 'ఆసియాకప్ గెలిచేది ఆ జట్టే'.. వీరేంద్ర సెహ్వాగ్ జోస్యం