
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం(అక్టోబర్ 9వ తేదీ) చేపట్టిన విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో పర్యటనలు జన ప్రభంజనమయ్యాయి. వైఎస్ జగన్ పర్యటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతాలు జన సంద్రాన్ని తలపించాయి. తమ అభిమాన నాయకుడిని చూసేందుకు జనం తండోప తండాలుగా తరలివచ్చారు. జగనన్న కోసం ఊరూ-వాడా జన తరంగమై కదిలి వచ్చింది.
































