వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్రిస్మస్-2025 వేడుకల్లో పాల్గొన్నారు. పులివెందుల పర్యటనలో ఆయన.. సీఎస్‌ఐ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్ధనలకు హాజరయ్యారు. వైఎస్ జగన్ తల్లి విజయమ్మ, సతీమణి వైఎస్ భారతి రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్ధనలలో పాల్గొన్నారు. క్రిస్మస్ కేక్‌ను కట్ చేసిన అనంతరం అందరికీ వైఎస్ జగన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.


