South India
-
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. దర్శకుడు భారతీరాజా కుమారుడు కన్నుమూత
కోలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు భారతీరాజా తనయుడు మనోజ్ గుండెపోటుతో ఈ రోజు సాయంత్రం మృతి చెందారు. అనారోగ్యంతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన మనోజ్‌కు హఠాత్తుగా గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయస్సు 48 ఏళ్లు కాగా.. ఇటీవలే ఆయనకు గుండెకు శస్త్రచికిత్స జరిగినట్లు తెలుస్తోంది.కాగా.. మనోజ్ భారతిరాజా ప్రముఖ లెజెండరీ ఫిల్మ్ మేకర్ భారతిరాజా కుమారుడు. మనోజ్ తొలిసారిగా తాజ్ మహల్ (1999)మూవీలో నటించారు. ఆ తర్వాత అల్లి అర్జున (2002), కాదల్ పుక్కల్ (2001), అన్నక్కోడి, పల్లవన్, లాంటి తమిళ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. గత రెండేళ్లుగా దర్శకత్వం వైపు అడుగులు వేశారు. తన తండ్రి నిర్మించిన 2023 తమిళ చిత్రం మార్గజి తింగల్‌తో దర్శకుడిగా పరిచయమయ్యారు.మనోజ్ అరంగేట్రం చేయడానికి ముందు సినిమా పట్ల ఉన్న అభిరుచితో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. అంతకుముందు అతను సౌత్ ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో థియేటర్ ఆర్ట్స్ అభ్యసించారు. ఫైనల్ కట్ ఆఫ్ డైరెక్టర్ (2016) వంటి చిత్రానికి తన తండ్రికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే మనోజ్ తన స్నేహితురాలు, తమిళ నటి నందనను నవంబర్ 19న, 2006న వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. -
అర్ధరాత్రి నుంచే ఓటీటీకి ముఫాసా.. ఎక్కడ చూడాలంటే?
చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరినీ అలరించిన చిత్రం ది లయన్ కింగ్. ఈ చిత్రంలో రాజ్యాన్ని పాలించే ముఫాసా, అతని తమ్ముడు స్కార్ పాత్రలు అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అడవికి రాజుగా ముఫాసా తన రాజ్యాన్ని కాపాడుతూ ఉంటారు. అతనికి సింబా అనే కుమారుడు జన్మిస్తాడు. ఇప్పటికే ఈ సిరీస్‌లో లయన్ కింగ్-2 కూడా వచ్చేసింది.అయితే గతేడాది లయన్ కింగ్ ప్రీక్వెల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. ఈ సినిమాను అకాడమీ అవార్డ్ విజేత, దర్శకుడు బారీ జెంకిన్స్ తెరకెక్కించారు. గతేడాది డిసెంబరు 20న విడుదలైన ఈ సినిమా మొదటి వారంలో భారీ కలెక్షన్స్ రాబట్టింది. ముఫాసా ఎదగడానికి చేసిన ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూపించారు. తెలుగులో మహేశ్ బాబు.. ముఫాసా పాత్రకు డబ్బింగ్ చెప్పగా, హిందీలో షారుక్ ఖాన్ వాయిస్ ఓవర్ ఇచ్చారు.అయితే ముఫాసా: ది లయన్ కింగ్ మరికొద్ది గంటల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ అర్ధరాత్రి నుంచే జియోహాట్‌స్టార్‌లో అందుబాటులోకి రానుంది. మార్చి 26 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. Two lions, one destiny, bound by more than blood.#Mufasa: The Lion King, coming to #JioHotstar on March 26 in English, Hindi, Tamil and Telugu.#MufasaOnJioHotstar #JioHotstar #InfinitePossibilities pic.twitter.com/2mYE0RvhCL— JioHotstar (@JioHotstar) March 24, 2025 -
బుల్లితెర నటి కూతురి అన్నప్రాసన వేడుక.. సోషల్ మీడియాలో వైరల్!
ప్రముఖ బుల్లితెర నటి మాళవిక కృష్ణదాస్ గతేడాది నవంబర్‌లో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. బుల్లితెర నటుడు తేజస్‌ను 2023లో పెళ్లాడిన నటి ఆ తర్వాత ప్రెగ్నెన్సీ ప్రకటించి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. గత నవంబర్‌లో పండంటి పాపకు జన్మనిచ్చిన ముద్దుగుమ్మ.. తన కూతురికి రుత్వి తేజస్‌గా నామకరణం చేసింది. అయితే తాజాగా తన కూతురి అన్నప్రాసన వేడుకను గ్రాండ్‌గా నిర్వహించింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.కాగా.. టీవీ సీరియల్స్, టెలివిజన్ డ్యాన్స్ రియాలిటీ షో సూపర్ డాన్సర్ జూనియర్ 2 ద్వారా మలయాళ కుట్టి మాళవిక కృష్ణదాస్ ఫేమ్ తెచ్చుకున్నారు. అంతేకాకుండా మాళవిక కృష్ణదాస్ మలయాళంలో పలు టీవీ సీరియల్స్‌లోనూ నటించింది. ఆ తర్వాత మాళవిక కృష్ణదాస్, తేజస్ జ్యోతి ప్రముఖ రియాలిటీ షో నాయికా నాయకన్లో కంటెస్టెంట్స్‌గా పాల్గొన్నారు. ఆ షో ద్వారానే మరింత ఫేమస్ అయ్యారు. రియాలిటీ షోలో పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. View this post on Instagram A post shared by Malavika Krishnadas (@malavika_krishnadass) View this post on Instagram A post shared by Malavika Krishnadas (@malavika_krishnadass) -
‘పొన్ మాన్’ మూవీ రివ్యూ : అప్పు ఎప్పుడైనా నిప్పే!
ఈ రోజుల్లో అప్పు చేయని వాళ్ళు చాలా తక్కువ. మరీ మధ్యతరగతి వాళ్ళు అవసరాల కోసం అప్పులకై తిప్పలు పడతారు. ఒకవేళ అప్పు దొరికినా దానిని తీర్చడం మరో ఎత్తు. ఈ కసరత్తు మీదనే పొన్ మాన్(ponman Movie) సినిమా రూపుదిద్దుకుంది. ఇదో మళయాళ సినిమా. జియో హాట్ స్టార్ వేదికగా తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా లభ్యమవుతుంది. జ్యోతిష్ శంకర్ దీనికి దర్శకత్వం వహించారు. ప్రముఖ మళయాళ నటుడు బసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఓ ఫ్యామిలీ డ్రామా. కాని జీవితంలో నగదు లేదా డబ్బు రూపేణా అప్పు చేసిన ప్రతివారు చూడవలసిన సినిమా. అలా అని ఇదేదో మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కాదు, ఓ ఫ్యామిలీ థ్రిల్లింగ్ డ్రామా అని చెప్పుకోవచ్చు. ఇక పొన్ మాన్ కథ విషయానికొస్తే కేరళ రాష్ట్రంలోని తీర ప్రాంతమైన కొల్లాంలో బ్రూనో అనే వ్యక్తి తో ఈ కథ మొదలవుతుంది. చెల్లెలు స్టెఫీ, తల్లితో పాటు ఓ చిన్న కుటుంబం బ్రూనోది. సంపాదన లేకున్నా రాజకీయలపై ఇష్టంతో ఓ పార్టీలో చేరతాడు బ్రూనో. తన నోటి దురుసుతనం వల్ల పార్టీ నుంచి సస్పెండ్ కూడా అవుతాడు. బ్రూనో తల్లి స్టెఫీకి త్వరగా పెళ్ళి చేయాలన్న తాపత్రయంలో పక్క ఊరిలోని మరియానోతో 25 సవర్ల బంగారం కట్నకానుకాలు ఇచ్చే విధంగా సంబంధం కుదురుస్తుంది. దానికి గాను అజేష్ అనే బంగారు బ్రోకర్ ను సంప్రదించి పెళ్ళికి ముందు బంగారం తీసుకుని పెళ్ళిలో వచ్చే చదివింపులతో తిరిగి నగదు రూపేణా అప్పు తీర్చేవిధంగా ఏర్పాటు చేస్తుంది. అజేష్ ఇచ్చిన నగలతో స్టెఫీ, మరియానో పెళ్ళి అంగరంగ వైభవంగా జరుగుతుంది. కాని అనుకోకుండా అంత డబ్బులు రావు. దీనితో అజేష్ తానిచ్చిన బంగారం కోసం పెళ్ళి వారితో పాటు స్టెఫీ అత్తగారింటికి వెళతాడు. స్టెఫీ మరియానో కరుడుగట్టిన రౌడీ. స్టెఫీ వేసుకున్న బంగారం అప్పుకు తెచ్చిందన్న విషయం అత్తవారింట్లో ఎవరికీ తెలియదు. ఈ సమయంలో అజేష్ తన బంగారం స్టెఫీ నుండి తీసుకోగలడా లేదా అన్నది మాత్రం పొన్ మాన్ చూస్తేనే తెలుస్తుంది. ఈ సినిమా మొత్తం థ్రిల్లర్ జోనర్ తో ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లో నడుస్తుంది. అప్పు తీసుకునే ప్రతి వాళ్ళూ తీసుకునేటపుడు బరువుగాను తిరిగి ఇచ్చేటపుడు బాధ్యతగాను ఉంటే ఏ సమస్యా ఉండదు. అలా కాని పక్షంలో ఈ సినిమాలో చూపిన ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వర్త్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. -
ఎంపురాన్ మూవీ పోస్టర్.. ఆ మిస్టరీ మ్యాన్ ఎవరు?
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ లేటెస్ట్ మూవీ 'ఎల్ 2: ఎంపురాన్'. గతంలో హిట్‌గా నిలిచిన 'లూసిఫర్' చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రానికి సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని తెలుగులో దిల్ రాజు విడుదల చేస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీ ఉగాది కానుకగా మార్చి 27న థియేటర్లలో సందడి చేయనుంది.అయితే తాజాగా ఎంపురాన్ విడుదల చేసిన పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారింది. ఆ పోస్టర్లో ఉన్నది ఎవరా? అనే చర్చ మొదలైంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ కూడా నటించారా? అనే ఆసక్తి నెలకొంది. తాజాగా విడుదలైన ఎంపురాన్ కొత్త పోస్టర్లో ఉన్నది అమిర్ ఖానా? రిక్ యూనేనా అని నెటిజన్స్ తెగ కన్ఫ్యూజ్ అవుతున్నారు.ఒక అభిమాని రాస్తూ.. ఈ ఫోటోలో ఉన్నది అమీర్ ఖానే.. అతని చెవులు చూడండి అచ్చం అలానే ఉన్నారు. అవును ఆ పోస్టర్లో ఉన్నది కచ్చితంగా అమీర్ ఖానే.. ఎందుకంటే ఆయన సోదరి కూడా చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని మరో నెటిజన్స్ కామెంట్ చేశాడు. మరికొందరైతే హాలీవుడ్ నటుడు రిక్ యునే కావచ్చుని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఫోటోలో ఉన్నది అమిర్ ఖాన్ కాదు.. కచ్చితంగా రిక్ యున్ అని కామెంట్స్‌లో రాసుకొచ్చాడు.ఓ నెటిజన్ ఏకంగా ఏఐ గ్రోక్‌ని కూడా అడిగాడు. ఈ ఫోటో రిక్ యున్‌తో పోలికను కలిగి ఉందా? అని అడిగాడు. ఈ పోస్టర్లో డ్రాగన్‌కి ఎదురుగా ఉన్న సూట్లో వెనుక నుంచి ఒక వ్యక్తి కనిపిస్తాడు.. అది బహుశా మోహన్‌లాల్ అయి ఉండొచ్చు. ముఖం కనిపించకుండా ఉన్న ఈ పోస్టర్‌కు రిక్ యున్‌తో పెద్దగా పోలిక లేదు. ఈ శైలి యున్ యాక్షన్ పాత్రలను సరిపోలినప్పటికీ.. కానీ భౌతికంగా చూస్తే ఆ పోలిక అస్పష్టంగా ఉంది" అని గ్రోక్ సమాధానమిచ్చింది. అయితే ఎల్2 ఎంపురాన్ పోస్టర్ మిస్టరీ మ్యాన్ ఎవరనే విషయంపై నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 2 days to go! #L2E #EMPURAAN In theatres worldwide from 27/03/25.BMS - https://t.co/N8VWfpo2bnPaytm - https://t.co/Fjlf0z8Vtv District - https://t.co/y1UCD4nLGVTicketnew - https://t.co/wvQGWTXGxa#March27 @mohanlal #MuraliGopy @antonypbvr @aashirvadcine @GokulamGopalan… pic.twitter.com/XxRkMHNgr5— Prithviraj Sukumaran (@PrithviOfficial) March 24, 2025 -
‘లిప్‌లాక్’ కి ముందు అతన్ని బ్రష్ చేసుకోమన్నా: నటి సురభి
పెద్ద స్టార్ కాస్ట్ లేకపోయినా ఆషిక్ అబు దర్శకత్వం వహించిన మళయాళ చిత్రం రైఫిల్ క్లబ్ (Rifle Club) ఊహించని విజయం సాధించింది. ఈ చిత్రంలో సుసాన్ గా నటి సురభి లక్ష్మి (Surabhi Lakshmi ) ప్రధాన పాత్రలో కనిపించింది . ఆమె నటించలేదు... జీవించింది అన్నంత బాగా చేసింది అంటూ విమర్శకుల ప్రశంసలు పొందింది. సీరియస్ సన్నివేశాలతో పాటు సినిమాలో అత్యంత కీలకమైన ముద్దు సన్నివేశంలో కూడా ఆమె థియేటర్లలో ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకోవడం విశేషం. అందువల్లే ఆ లిప్‌లాక్ సీన్ ఇప్పుడు అత్యంత చర్చనీయాంశంగా కూడా మారింది.ఈ నేపధ్యంలో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, నటి సురభి లక్ష్మి ఇటీవల రైఫిల్ క్లబ్లో ముద్దు సన్నివేశాన్ని చిత్రీకరించిన అనుభవాలను గురించి మాట్లాడింది. అది లిప్ లాక్ అని తనకు షూట్ రోజున మాత్రమే తెలిసిందని వెల్లడించింది. ఈ సీన్ ని మొదట సాదాసీదా ముద్దుగా భావించానని, అయితే అది పూర్తి స్థాయి లిప్ లాక్ అని తర్వాత తెలిసిందని వివరించింది. ప్రస్తుతం బాగా పాప్యులరైన ఈ లిప్–లాక్ సన్నివేశం రైఫిల్ క్లబ్ సినిమా క్లైమాక్స్ లో ఉంటుంది. జాతీయ అవార్డు గెలుచుకున్న ఈ నటి లిప్ లాక్ సీన్ ఉందని తెలిసిన తర్వాత షాక్ తినడం లాంటివేవీ చేయకుండా ఒక నిజమైన నటిలా దానిని పండించడం కోసం చేసిన ముందస్తు ప్రయత్నాలు గురించి చెప్పి కూడా అందరి ప్రశంసలు పొందింది. ‘రైఫిల్ క్లబ్లో నాకు ముద్దు సన్నివేశం ఉంటుందని శ్యామ్ చెప్పాడు. మొదట్లో, ఇది సాధారణ ముద్దుగా ఉంటుందని అనుకున్నాను. కానీ అది లిప్ లాక్ అని షాట్ తీయడానికి ముందు మాత్రమే నాకు తెలిసింది.‘ ఆశ్చర్యం కలిగినా ఆ సన్నివేశం గురించి తాను టెన్షన్ పడలేదని స్పష్టం చేసింది. బదులుగా, దానిని పండించాలని నిర్ణయించుకున్నానని స్పష్టం చేసింది. ఆ సమయంలో సినిమాలో తన భర్తగా నటించిన సజీవ్ కుమార్‌ను ఎలా ఫీల్ అయ్యాడో తెసుకోవాలని ప్రయత్నించానని చెప్పింది. ‘నా భర్తగా నటించిన సంజీవ్ చెట్టన్ ని టెన్షన్ గా ఉన్నావా? అని అడిగాను. అయితే అతను కూడా నాలాగే ఏ టెన్షన్ పడడంలేదని చెప్పాడు’’ అంటూ గుర్తు చేసుకుంది. సన్నివేశం బాగా రావాలని అనుకున్నానని అందుకే ‘అతను సిగరెట్ తాగే అలవాటున్నవాడు కాబట్టి, షాట్‌కు ముందు అతనిని పళ్ళు తోముకుని తిరిగి రావాలని కోరానని వెల్లడించింది. అంతేకాదు సెట్లోని ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్లను పిలిచి యాలకులు కొని తీసుకురావాలని కోరింది. షాట్ కు ముందు వాటిని నోట్లో వేసుకుని కాసేపు నమిలింది. మా సెట్లో ఉన్న దర్శనకు లిప్లాకింగ్లో అనుభవం ఉంది. అయితే తన అనుభవం నుంచి ప్రశ్నలు అడగాలని అనిపిస్తుదేమో అని నేను ఆమె వైపు చూడలేదు, ’’అని సురభి చెప్పింది. సాధారణంగా శృంగార సన్నివేశాలు తక్కువ మంది షూటింగ్ సిబ్బందితో చిత్రీకరించడ జరుగుతుంటుంది, దీనికి కారణం హీరోయిన్ ఇబ్బంది పడకూడదనే. అయితే సురభి మాత్రం దీనికి భిన్నంగా ఆలోచించింది. అదేదో ప్రత్యేకమైన అంటరాని సన్నివేశంగా మారకూడదని ఆలోచించినట్టుంది. ఆమె ఆ సమయంలో సెట్లో ప్రతి ఒక్కరూ ఉండేలా చూసుకుంది, తద్వారా ఆ సున్నితమైన సందర్భానికి వినోదం స్నేహం సరదాల్ని జోడించింది. తన ట్రేడ్‌మార్క్ హాస్యం తో, సురభి లక్ష్మి ఒక ఉద్విగ్న క్షణాన్ని సెట్లో తేలికైన మరపురాని అనుభవంగా మార్చింది. తద్వారా సహ నటీనటుల నుంచి ప్రశంసలు అందుకుంది. సినిమాల్లో ఒకప్పుడు అటువంటి సన్నివేశాలు బాగా తక్కువగా ఉండేలా చేసేవారు.. లేదా భారీగా సెన్సార్ కత్తెరకు గురయ్యాయి. అయితే సమకాలీన ఫిల్మ్ మేకర్లు ఇప్పుడు వాటిని పరిపక్వత తో చిత్రీకరిస్తూ అసభ్యత అనిపించకుండా మెప్పిస్తున్నారు. .ఈ పరిస్థితుల్లో, నటీనటులు కూడా ఆయా సన్నివేశాలు చిత్రీకరించేటప్పుడు తమ అనుభవాలు వ్యక్తపరచడం గురించి ఒకప్పుడు సంకోచించేవారు, ఇప్పుడు మాత్రం బహిరంగంగా ప్రస్తావిస్తున్నారు. కామెడీ, యాక్షన్ సన్నివేశాల సమయంలో తమ అనుభవాలను పంచుకున్నట్టే రొమాంటిక్ సీన్స్ గురించి కూడా మాట్లాడడంతో తప్పులేదు ఎందుకంటే అదంతా నటనేలో భాగమే కాబట్టి. -
తగ్గేదేలే అంటోన్న అజిత్ కుమార్.. మరో కప్ కొట్టిన టీమ్!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌కు కార్ రేసింగ్ అంటే విపరీతమైన క్రేజ్. ఎక్కడా రేసింగ్ జరిగినా సరే తన టీమ్‌తో కలిసి అక్కడ ప్రత్యక్షమవుతాడు. ఇటీవలే ఓ రేసింగ్‌లో గెలిచిన అజిత్ టీమ్.. తాజాగా మరోసారి ఛాంపియన్‌గా నిలిచారు. తాజాగా ఇటలీలో జరిగిన కార్ రేసింగ్-12 హెచ్ ఛాంపియన్‌షిప్‌లో అజిత్ కుమార్ బృందం మూడో స్థానంతో నిలిచి సత్తా చాటారు. ఈ విజయాన్ని తన టీమ్‌తో కలిసి అజిత్ సంబురాలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారత త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని పోడియం సందడి చేశారు. కాగా.. ఇటీవలే దుబాయ్- 24 హెచ్ రేసులో అజిత్ కుమార్ రేసింగ్ టీమ్ మూడో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.ఇక సినిమాల విషయానికొస్తే అజిత్ చివరిసారిగా విదాముయార్చిలో కనిపించారు. గతనెల థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ప్రస్తుతం అజిత్ మరో యాక్షన్ థ్రిల్లర్ గుడ్ బ్యాడ్ అగ్లీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించింది. ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించగా.. మైత్రి మేకర్స్ బ్యానర్లో వై రవిశంకర్, నవీన్ యేర్నేని నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.Victory in style! 🏆🔥 Team @Akracingoffl shines at the 12H Mugello, Italy, celebrating a fantastic podium finish! 🏁Kudos to @fabian_fdx89, @mathdetry, and @BasKoetenRacing for their stellar performance on the track! 🚀🏎️#AKR #AjithKumar | #AjithKumarRacing #24HSeries… pic.twitter.com/1ug9mohbTr— Suresh Chandra (@SureshChandraa) March 23, 2025 -
దళపతి విజయ్ చివరి సినిమా.. రిలీజ్ తేదీ ఫిక్స్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తోన్న చివరి చిత్రం 'జననాయగన్'. ఈ సినిమాను పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నటి పూజా హెగ్డే, మమిత బైజు హీరోయిన్లుగా కనిపించనున్నారు. అంతేకాకుండా కోలీవుడ్ భామ శృతిహాసన్ అతిథి పాత్రలో మెరవబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఇప్పటికే రాజకీయ పార్టీని ప్రారంభించిన విజయ్ వచ్చే ఎన్నికల్లో పోటీకి ముందు నటిస్తోన్న చివరి సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకున్నాయి.అయితే తాజాగా ఈ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌ను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. పొంగల్ పండుగ సందర్భంగా జనవరి 9, 2026న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తామని ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ విజయ్ ప్రత్యేక పోస్టర్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, నటి ప్రియమణి, దర్శకుడు గౌతమ్ మీనన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు.pic.twitter.com/JeY4Vpnc3J— Vijay (@actorvijay) March 24, 2025 -
విడాకుల కేసు.. ఒకే కారులో వచ్చివెళ్లిన సెలబ్రిటీ జంట
ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ (GV Prakash Kumar).. గతేడాదే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. దాదాపు 11 ఏళ్ల బంధానికి ముగింపు పలుకుతున్నట్లు చెప్పాడు. తాజాగా భార్యతో కలిసి విడాకుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కానీ ఒకే కారులో వచ్చి వెళ్లడం మాత్రం చర్చనీయాంశంగా మారింది.తెలుగు, తమిళంలో అడపాదడపా సినిమాలకు సంగీతమందిస్తున్న జీవీ.. మధ్య మధ్యలో హీరోగానూ పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. కెరీర్ పరంగా బాగానే ఉంది. మరి ఏమైందో ఏమో గానీ గతేడాది మేలో విడాకులు తీసుకుంటున్నట్లు చెప్పి అందరికీ షాకిచ్చాడు. చిన్ననాటి స్నేహితురాలు సైంధవిని (Saindhavi) జీవీ పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు అన్వీ అనే కూతురు కూడా ఉంది.(ఇదీ చదవండి: నెల క్రితం గాయం.. 'మన్మథుడు' హీరోయిన్ కి ఏమైంది?)విడాకులు కారణాలేంటనేది బయటపెట్టలేదు గానీ గతేడాది ప్రకటించిన తర్వాత నుంచి వేర్వేరుగానే నివసిస్తున్నారట. కానీ తాజాగా సోమవారం చెన్నైలోని ఫ్యామిలీ కోర్టుకి మాత్రం ఒకే కారులో వచ్చారు. విడాకుల కోసం అర్జీ దాఖలు చేశారు. కానీ వాయిదా పడటంతో తిరిగి ఒకే కారులో వెళ్లిపోయారు. సాధారణంగా విడాకులు తీసుకుంటున్నారంటేనే ఎవరికి వారు యుమునా తీరే అన్నట్లు విడివిడిగా వస్తుంటారు. కానీ జీవీ-సైంధవి మాత్రం ఒకే కారులో వెళ్లిరావడం అక్కడున్న వాళ్లని ఆశ్చర్యపరిచింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: 'కన్నప్ప' మూవీని ట్రోల్ చేస్తే శాపానికి గురవుతారు: రఘుబాబు)இசையமைப்பாளர் ஜி.வி பிரகாஷ் - பாடகி சைந்தவி ஆகியோர் பரஸ்பரம் விவாகரத்து கோரி குடும்ப நல நீதிமன்றத்தை நாடிய நிலையில், வழக்கு விசாரணையை நீதிபதி செல்வ சுந்தரி ஒத்திவைப்பதாக அறிவித்தார். இதையடுத்து நீதிமன்றத்திலிருந்து ஒரே காரில் இருவரும் புறப்பட்டுச் சென்றனர். #GVPrakash #Saindhavi pic.twitter.com/kOp7QyVoM6— Idam valam (@Idam_valam) March 24, 2025 -
షూటింగ్ ముగించుకుని వస్తుండగా అపహరణ.. నేనేం తప్పు చేశానని భయపడాలి?
కిందపడగానే పైకి లేస్తాం.. దెబ్బ తగిలితే ఆయింట్మెంట్ రాసుకుంటాం.. అలాగే నేరం జరగగానే పోలీసులను సంప్రదించాను అంటోంది హీరోయిన్ భావన. మలయాళంలో టాప్ హీరోయిన్గా రాణిస్తున్న సమయంలో భావన (Actress Bhavana) జీవితంలో పెద్ద కుదుపు. 2017 ఫిబ్రవరి 17న షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఆమెను కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.ఎందుకు భయపడాలి?ఈ కేసులో హీరో దిలీప్ కుమార్ రెండునెలలపాటు జైలు శిక్ష కూడా అనుభవించాడు. తాజాగా భావన.. ఆనాటి సంగతులను గుర్తు చేసుకుంది. నేను ఏ తప్పూ చేయనప్పుడు ఎందుకు భయపడాలి? ఎందుకు వెనకడుగు వేయాలి? అందుకే ఏదీ ఆలోచించకుండా నాకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఆ సమయంలో అదే కరెక్ట్ అనిపించింది, చేశాను. అయితే అప్పుడది పెద్ద సెన్సేషన్ అయిపోయింది. మౌనంగా ఉంటే..నేనేదో గొప్ప పని చేశానని ఇప్పటికీ అనుకోను. మౌనంగా ఉంటే సమస్య ఇంకా పెద్దదవుతుంది కదా అనిపించింది. నాకు నేను సర్ది చెప్పుకుని మౌనంగా ఉండి.. కొన్నేళ్ల తర్వాత బయటకు చెప్పాననుకోండి.. ఇన్నాళ్లు ఎందుకు సైలెంట్‌గా ఉన్నావంటారు. అందుకే ఆ క్షణమే పోలీసులను ఆశ్రయించాను అని చెప్పుకొచ్చింది. భావన తెలుగులో ఒంటరి, మహాత్మ, హీరో చిత్రాలు చేసింది. ప్రస్తుతం తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పలు సినిమాలు చేస్తోంది.చదవండి: నాకు పొగరనుకున్నారు.. సినిమా ఛాన్సులు కోల్పోయా: యష్ -
నాకు పొగరనుకున్నారు.. సినిమా ఛాన్సులు కోల్పోయా: యష్
కేజీఎఫ్ (K.G.F Movie)తో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు యష్ (Yash). అభిమానులు ఈయనను వెండితెరపై చూసి మూడేళ్లవుతోంది. ప్రస్తుతం యష్.. టాక్సిక్: ఎ ఫేరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. అటు బాలీవుడ్లో రామాయణ సినిమాలో రావణుడిగా నటిస్తున్నాడు. తాజాగా ఇతడు బెంగళూరులో జరిగిన మనడ కదలు సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు హాజరయ్యాడు. యోగరాజ్ భట్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మార్చి 28న విడుదల కానుంది. తలపొగరు అనుకున్నారుట్రైలర్ రిలీజ్ అనంతరం యష్ మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో అందరూ నాకు పొగరు అనుకునేవారు. ఎందుకంటే దర్శకులను నేను స్క్రిప్ట్ కాపీ అడిగేవాడిని. కథ నచ్చకపోతే, దానిపై నాకు నమ్మకం కుదరకపోతే సినిమా ఎలా చేయగలను? ముందు దాన్ని పూర్తిగా చదివి అర్థం చేసుకున్నాక సినిమా మొదలుపెడదాం అనుకునేవాడిని. అది కొందరికి నచ్చేది కాదు దీనివల్ల చాలా సినిమాలు కోల్పోయాను. అయితే మొగ్గిన మనసు సినిమా నిర్మాత నన్ను బలంగా నమ్మాడు. ఆయన వల్ల చివరి నిమిషంలో ఆ సినిమాలో జాయిన్ అయ్యాను. ఆ సినిమాయూనిట్పై ఇప్పటికీ గౌరవం..దర్శకుడు శశాంక్ కథ పూర్తిగా చెప్పడంతోపాటు నా పాత్ర గురించి కూడా వివరించాడు. ఇప్పటికీ ఆ ఇద్దరిపై, ఆ సినిమా యూనిట్ మొత్తంపై నాకు ఎనలేని గౌరవం ఉంది అని చెప్పుకొచ్చాడు. టాక్సిక్ గురించి అప్డేట్ అడగ్గా.. ఇది సందర్భం కాదని దాటవేశాడు. తమపై నమ్మకం ఉంచి ఓపిక పట్టమని కోరాడు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న టాక్సిక్ 2026 మార్చి 19న విడుదల కానుంది. ఇందులో నయనతార, హ్యూమా ఖురేషి, కియారా అద్వానీ, తారా సుతారియా, అచ్యుత్ కుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.చదవండి: హీరో నితిన్‌పై హర్టయ్యా.. అవమానభారంతో షూటింగ్‌కు రానన్నా: అమృతం నటుడు -
రిలీజ్ కి ముందే రూ.58 కోట్ల కలెక్షన్
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ లేటెస్ట్ మూవీ 'ఎల్ 2: ఎంపురన్'. గతంలో రిలీజైన 'లూసిఫర్' చిత్రానికి ఇది సీక్వెల్. కాకపోతే అప్పట్లో తక్కువ బడ్జెట్ తో సింపుల్ గా తీశారు. ఇప్పుడు భారీగా తీశారు. మార్చి 27న థియేటర్లలోకి రాబోతున్న ఈ పాన్ ఇండియా మూవీ.. రిలీజ్ కి ముందే కళ్లు చెదిరే వసూళ్లు సాధిస్తుండటం విశేషం.(ఇదీ చదవండి: 'కన్నప్ప' మూవీని ట్రోల్ చేస్తే శాపానికి గురవుతారు: రఘుబాబు)మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ చిత్రానికి పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకుడు. లూసిఫర్ చిత్రాన్ని అప్పట్లో మలయాళంతో పాటు తెలుగులోనూ డబ్బింగ్ చేశారు. కాకపోతే ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం బడ్జెట్ గట్టిగానే పెట్టి సినిమా భారీగా తీశారు. అంతే భారీగా రిలీజ్ కూడా ప్లాన్ చేస్తున్నారు.తెలుగులో దిల్ రాజు.. ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇకపోతే ఈ మూవీ ప్రీ సేల్స్ ద్వారానే దాదాపు రూ.58 కోట్ల వరకు సొంతం చేసుకుందని పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు తెలుగులో ఓ మాదిరి హైప్ మాత్రమే ఉంది. దీనికి విక్రమ్ 'వీరధీర శూర', 'మ్యాడ్ స్క్వేర్', 'రాబిన్ హుడ్' చిత్రాలు పోటీగా ఉన్నాయి. మరి తెలుగులో మోహన్ లాల్ మూవీ ఏం రిజల్ట్ అందుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలో హారర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్) -
మెగాస్టార్ ఇంట్లో బస చేసే ఛాన్స్.. రోజుకు రూ.75,000!
హీరోలు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. కాస్ట్లీ బంగ్లాలో నివసిస్తారు. వారిని చూసేందుకు స్టార్ హీరోల ఇంటిముందు పడిగాపులు కాస్తుంటారు ఫ్యాన్స్. అంతేకాదు.. కథానాయకుల లైఫ్‌స్టైల్ ఎలా ఉంటుంది? ఏం తింటారు? ఎక్కడకు వెళ్తుంటారు? ఇంద్రభవనంలాంటి ఇల్లు లోపల ఎలా ఉంటుంది? ఇలా అన్నీ తెలుసుకోవాలనుకుంటారు. అందుకే ఓ హీరో బంపరాఫర్ ఇస్తున్నారు. తన ఇంట్లో బస చేసే అవకాశం కల్పిస్తున్నారు. కాకపోతే హోటల్ మాదిరిగానే ఇక్కడ కూడా రోజుకింత అని డబ్బు కట్టి ఉండొచ్చట.. ఇంతకీ ఆ హీరో ఎవరు? ఆ ఇల్లు ఎక్కడ అనేది పూర్తి కథనంలో చదివేయండి..ఇంటిని అభిమానుల కోసం..మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty)కి కేరళ కొచ్చిలోని పనంపిల్లి నగర్లో ఓ ఇల్లుంది. భార్య సుల్ఫాత్, కుమారుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), కూతురు కుట్టి సురుమితో కలిసి 2008 నుంచి 2020 వరకు ఇదే ఇంట్లో నివసించారు. ఆ తర్వాత ఎర్నాకులంలోని వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యారు. అయినప్పటికీ అప్పుడప్పుడు ఈ పాతింటికి వస్తూ వెళ్తుంటారట! అయితే సకల వసతులు ఉన్న ఈ ఇంటిని ఖాళీగా ఉంచడం ఇష్టం లేక.. అభిమానులకు ఆతిథ్యం ఇస్తే ఎలా ఉంటుందని ఆలోచించారు. అనుకున్నదే తడవుగా ప్లాన్‌ను అమల్లోకి తెచ్చారు. ఒక్కరోజు ఉండాలంటే..ఇంతకాలం ఇంటిని బయటనుంచే ఫోటోలు తీసుకున్న అభిమానులు ఇప్పుడెంచక్కా ఇంట్లోనే బస చేయొచ్చు. మమ్ముట్టి గదిలో, దుల్కర్ గదిలో సేద తీరొచ్చు. తండ్రీకొడుకుల జ్ఞాపకాలతో ముడిపడి ఉన్న ప్రైవేట్ థియేటర్, గ్యాలరీ రూమ్ చూసేందుకు కూడా వీలు కల్పిస్తారట! ఈ ఇంట్లో ఒక్కరోజు బస చేయాలంటే రూ.75 వేలు చెల్లించాలి. ఏప్రిల్ 1 నుంచి బుకింగ్స్ మొదలుపెడతారట! ఎంత ఖర్చయినా పర్లేదు, మమ్ముట్టి ఇంటికి వస్తాం.. ఆయన్ను కలుస్తాం అనుకునేరు.. కేవలం ఆయన ఇంట్లో బస చేయడానికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు. మమ్ముట్టిని, దుల్కర్‌ను కలిసేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయరు.దుల్కర్ సల్మాన్ బెడ్‌రూమ్‌సినిమా..మమ్ముట్టి.. చివరగా డామినిక్ అండ్ ద లేడీస్ పర్స్ అనే సినిమా చేశారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ప్రస్తుతం మమ్ముట్టి బజూక అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది. ఈ మూవీలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. డీనో డెనిస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. దుల్కర్ సల్మాన్ విషయానికి వస్తే.. ఈయన చివరగా లక్కీ భాస్కర్ చిత్రంతో అలరించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ప్రస్తుతం కాంత, ఆకాశంలో ఒక తార, ఐయామ్ గేమ్ అనే సినిమాలు చేస్తున్నాడు. View this post on Instagram A post shared by VKation Experiences (@vkationexperiences) చదవండి: 'ఒకప్పటిలా లేదు.. ప్లాస్టిక్ సర్జరీ'.. పెదవి విప్పిన హీరోయిన్ -
చెర్రీ మూవీలో స్టార్ హీరో.. జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ ప్రస్తుతం రామ్ చరణ్ మూవీలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఆర్సీ16 వర్కింగ్ టైటిల్ తెరకెక్కిస్తోన్న చిత్రంలో ఆయన నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే అమెరికా వెళ్లి క్యాన్సర్ చికిత్స తీసుకుని ఇండియాకు తిరిగొచ్చారు. ప్రస్తుత చెర్రీ-బుచ్చిబాబు సనా కాంబోలో వస్తోన్న మూవీ షూట్ కోసం హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ప్రముఖ ఆలయాన్ని సందర్శించారు. అయితే క్యాన్సర్ చికిత్స తర్వాత ఆయన పూర్తిగా మారిపోయినట్లు కనిపించారు.భాగ్యనగరంలో అడుగుపెట్టిన శాండల్‌వుడ్ స్టార్ జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించారు. ఆయన సతీమణితో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. శివరాజ్‌కుమార్‌ను చూసిన భక్తులు ఆయనతో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. గతేడాది శివరాజ్‌కుమార్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ భైరాతి రణగల్ మూవీతో ప్రేక్షకులను అలరించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. 2024లో శివరాజ్ కుమార్ నటించిన చివరి చిత్రం ఇదే కావడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఆహాలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. #TFNExclusive: Actor @NimmaShivanna visits Shri Peddamma Talli Temple to seek divine blessings while in Hyderabad for #RC16 shoot🙏🏻✨#ShivaRajKumar #TeluguFilmNagar pic.twitter.com/SnkF2ZQQFo— Telugu FilmNagar (@telugufilmnagar) March 23, 2025 -
లేడీ కమెడియన్ కొడుక్కి పేరు పెట్టిన కమల్ హాసన్
బిగిల్, పాగల్, విరుమాన్ తదితర సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న లేడీ కమెడియన్ ఇంద్రజ శంకర్.. గతేడాది పెళ్లి చేసుకుంది. డాక్టర్ కార్తిక్ తో ఏడడుగులు వేసింది. వీళ్లకు రీసెంట్ గానే కొడుకు కూడా పుట్టాడు. ఇప్పుడు ఆ పిల్లాడికి స్వయంగా కమల్ హాసన్ నామకరణం చేయడం విశేషం.(ఇదీ చదవండి: వీడియో: దుబాయిలోని హిందూ దేవాలయంలో అల్లు అర్జున్)ఇంద్రజ శంకర్ తండ్రి కూడా కమెడియనే. రోబో శంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన పలు సినిమాల్లో నటించడంతో పాటు తమిళ బిగ్ బాస్ షోలోనూ పాల్గొన్నాడు. ఇప్పుడు ఈయన.. తన కూతురు-కొడుకుతో పాటు మనవడిని పట్టుకుని ఆదివారం కమల్ హాసన్ ని కలిశారు.ఈ క్రమంలోనే కమల్ హాసన్.. ఇంద్రజ శంకర్ కొడుక్కి నక్షత్రన్ అనే పేరు పెట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలని ఇంద్రజ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి. ఇకపోతే కమల్ ప్రస్తుతం 'థగ్ లైఫ్' అనే మూవీ చేస్తున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలో 25 ఏళ్ల తర్వాత స్ట్రీమింగ్ అవుతున్న సినిమా) -
'ఖుషి' ఫ్లాప్ అయితే నేను బతికేవాడిని కాదు: ఎస్జే సూర్య
ఎస్జే సూర్య (S. J. Suryah) మంచి నటుడు మాత్రమే కాదు దర్శకుడు కూడా! వాలి, ఖుషి(తమిళ, తెలుగు, హిందీ), నాని, అంబే ఆరుయిరే, పులి, ఇసై వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఖుషి (Kushi Movie) తను డైరెక్ట్ చేసిన రెండో మూవీ. అయితే తొలిరోజు సరిగా రెస్పాన్స్ రాకపోవడం చూసి పిచ్చెక్కిందంటున్నాడు సూర్య. వీర ధీర శూరన్ సినిమా ప్రమోషన్స్‌లో ఎస్జే సూర్య మాట్లాడుతూ.. ఒక సినిమా డైరెక్ట్ చేయడమంటే.. ఓ మహిళ బిడ్డకు జన్మనివ్వడంతో సమానం. దర్శకత్వం అనేది చాలా కష్టం.శ్మశానంలో కూర్చున్నట్లు..మనం ఏదైనా మనసుకు నచ్చినట్లు చేసుకుపోతుంటాం. కానీ డైరెక్షన్ చాలా ఒత్తిడితో కూడుకున్న పని. ఖుషి మూవీ ఇప్పుడు సూపర్ హిట్ అని అంటున్నారు. కానీ ప్రీమియర్ రోజు సినిమావాళ్లంతా ఏదో శ్మశానంలో కూర్చున్నట్లుగా సైలెంట్‌గా సినిమా చూస్తున్నారు. ఎవరి ముఖంలో చిన్న నవ్వు లేదు. నాకు భయమేసింది. అది మాత్రం ఫ్లాప్ అయిందంటే ఈరోజు నేనిక్కడ ఉండేవాడిని కాదు. నాకసలే కొంచెం పిచ్చి. నా సినిమా పోయిందంటే చనిపోయేందుకు కూడా వెనుకాడను. రెండో రోజు సీన్ మారింది.. లేదంటేనా..కానీ తర్వాతి రోజు నుంచి థియేటర్ శ్మశానంలా కాకుండా ఐపీఎల్ స్టేడియంలా మారిపోయింది. చప్పట్లు, విజిల్స్.. సంతోషమేసింది. సినిమా వైఫల్యాన్ని తట్టుకోవడం దర్శకుడికి చాలా కష్టం. సినిమా రిలీజ్‌కు ముందు కూడా ఇది బాగుందా? లేదా? అని డైలమాలో పడిపోతాడు. తనపై తాను నమ్మకాన్ని కోల్పోతాడు. డైరెక్షన్ చాలా టఫ్ అని చెప్పుకొచ్చాడు సూర్య. ఈయన డైరెక్షన్‌ను వదిలేసి పదేళ్లవుతోంది. నటుడిగా ఇటీవలే గేమ్ ఛేంజర్ సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం ఈయన చేతిలో వీర ధీర శూరన్, ఇండియన్ 3, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, సర్దార్ 2 చిత్రాలున్నాయి.చదవండి: నలుగురు సంతానం, ఇంకా పిల్లలు కావాలన్నా.. కుటుంబ నియంత్రణపై విష్ణు కామెంట్స్ -
జూన్‌లో థగ్ లైఫ్
కమల్‌హాసన్ హీరోగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న చిత్రం ‘థగ్ లైఫ్’. ‘నాయగన్’ (1987) వంటి హిట్ మూవీ తర్వాత 38 సంవత్సరాలకు వీరి కాంబినేషన్లో వస్తున్న ద్వితీయ చిత్రమిది. శింబు, త్రిష, అశోక్ సెల్వన్, ఐశ్వర్యా లక్ష్మి, జోజు జార్జ్, అభిరామి, నాజర్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.కమల్‌హాసన్, మణిరత్నం, ఉదయనిధి స్టాలిన్, ఆర్. మహేంద్రన్, శివ అనంత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 5న విడుదల కానుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతదర్శకుడిగా, రవి కె. చంద్రన్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. -
నీదీ నాది ఒకే కథ.. బంధువులే అసభ్యంగా.. ఏడ్చేసిన వరలక్ష్మి శరత్‌కుమార్
హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా.. ఎలాంటి పాత్రలనైనా ఇట్టే చేయగలదు నటి వరలక్ష్మి శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar). సీనియర్ నటుడు శరత్‌కుమార్ కూతురైన వరలక్ష్మి.. పోడాపొడి (2012) సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయమైంది. నిజానికి ఈ సినిమాకంటే ముందే ఆమెకు శంకర్ 'బాయ్స్' మూవీలో ఆఫర్ వచ్చింది. కానీ తండ్రి వద్దనడంతో మంచి అవకాశాన్ని వదులుకుంది.సౌత్‌లో విలక్షణ నటిగా గుర్తింపుఅయినప్పటికీ వరుస ఆఫర్లు వస్తూనే ఉండటంతో కాదనలేకపోయింది. అలా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించింది. తెలుగులో తెనాలి రామకృష్ణ బిఎ. బిఎల్. నాంది, క్రాక్, యశోద, వీర సింహా రెడ్డి, ఏజెంట్, హను-మాన్, కోట బొమ్మాళి ఐపీఎస్, శబరి వంటి పలు చిత్రాల్లో నటించింది.వెండితెర.. బుల్లితెరఓపక్క వెండితెరపై బిజీగా ఉంటూనే మరోపక్క బుల్లితెరపైనా సందడి చేస్తోంది. డ్యాన్స్ జోడీ డ్యాన్స్ రీలోడెడ్ 3 (తమిళ) షోలో జడ్జిగా వ్యవహరిస్తోంది. తాజాగా ఈ షో నుంచి ఓ ప్రోమో రిలీజైంది. అందులో ఓ కంటెస్టెంట్ అద్దం ముందు నిలబడి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది. మన జీవితంలో టర్నింగ్ పాయింట్ వచ్చినప్పుడు కుటుంబమే మద్దతుగా నిలబడుతుందంటారు. కానీ నా జీవితంలో మాత్రం కుటుంబం, బంధువులెవరూ నాకు సాయంగా నిలబడలేదు. పైగా నన్ను తిడుతూ వేధించారు, టార్చర్ పెట్టారు అంటూ ఏడ్చేసింది. నీది నాదీ ఒకే కథఅది విన్న వరలక్ష్మి.. నీ బాధ నేను అర్థం చేసుకోగలను. మా అమ్మానాన్న పనిలో బిజీగా ఉండటం వల్ల చిన్నప్పుడు నన్ను ఇంటి దగ్గరే వదిలేసి వెళ్లిపోయేవారు. నన్ను చూసుకోమని బంధువులకు అప్పజెప్పేవారు. అలా ఓసారి నా ఇంట్లోనే ఐదారుగురు మంది నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అసభ్యంగా తాకారు. నీదీ నాదీ ఒకే కథ.. అంటూ కంటెస్టెంట్‌ను పట్టుకుని ఒక్కసారిగా ఏడ్చేసింది. దయచేసి తల్లిదండ్రులు పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ నేర్పించాలని వరలక్ష్మి కోరింది.చదవండి: లూసిఫర్2: 'మోహన్‌లాల్' రెమ్యునరేషన్‌పై పృథ్వీరాజ్ కామెంట్స్ -
లూసిఫర్2: 'మోహన్‌లాల్' రెమ్యునరేషన్‌పై పృథ్వీరాజ్ కామెంట్స్
మలయాళ టాప్ హీరో మోహన్‌లాల్ నటించిన 'లూసిఫర్2: ఎంపురాన్' (L2 Empuraan) మార్చి 27న విడుదల కానుంది. పాన్ ఇండియా రేంజ్లో స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో ఆయన ఒక కీలకమైన పాత్రలో కూడా కనిపించనున్నారు. అయితే, ఈ సినిమా రెమ్యునరేషన్ వివరాల గురించి ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. 2019లో వచ్చిన లూసిఫర్ చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీని భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. సుమారు రూ.140 కోట్ల బడ్జెట్‌తో లూసిఫర్2 చిత్రాన్ని నిర్మించారు.'లూసిఫర్2' కోసం మోహన్‌లాల్ ఒక్కరూపాయి కూడా తీసుకోలేదని పృథ్వీరాజ్ సుకుమారన్ తెలిపారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం వల్లే ఈ సినిమాను తెరకెక్కించడం జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. ముందుగా అనుకున్నదానికంటే బడ్జెట్ పెరగడంతో సినిమా చిత్రీకరణ విషయంలో కాస్త జాప్యం ఏర్పడిందని పృథ్వీరాజ్ తెలిపారు. ‘‘ఎల్ 2 ఎంపురాన్’లో స్టీఫెన్ గట్టుపల్లి (ఖురేషి అబ్రమ్)గా మోహన్‌లాల్, ఆయనకు రైట్ హ్యాండ్‌లా జయేద్ మసూద్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు.మోహన్‌లాల్ రెమ్యునరేషన్ గురించి గతంలో కూడా పలు వార్తలు వచ్చాయి. లూసిఫర్ భారీ హిట్ కావడంతో దానికి సీక్వెల్ తీయాలని ఆయన అనుకున్నారు. ఈ క్రమంలో లైకా ప్రొడక్షన్ ముందుకు రావడంతో సినిమా మొదలైంది. అయితే, బడ్జెట్ పెరిగిపోవడంతో ఆ ఇబ్బందులు గ్రహించిన మోహన్‌లాల్ తనకు రెమ్యునరేషన్ వద్దని చెప్పారట. అదే విషయాన్ని ఇప్పుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తెలిపారు. అయితే, ఈ సినిమాలో నటించడమే కాకుండా దర్శకత్వ బాధ్యతలను సుకుమారన్ తీసుకున్నారు. అందుకు గాను ఆయన కూడా ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదని తెలుస్తోంది. కానీ, సినిమా నుంచి లాభాలు ఏమైనా వస్తే అందులో షేర్ తీసుకునే ఛాన్స్ ఉంది.కన్నప్పకు కూడా అండగా నిలిచిన మోహన్లాల్మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న కన్నప్పలో మోహన్‌లాల్ కూడా కీలకపాత్రలు పోషించారు. ఇందులో నటించాలని మోహన్‌లాల్‌ను కోరిన వెంటనే ఆయన ఒప్పుకున్నారని ఒక ఇంటర్వ్యూలో తన రెమ్యునరేషన్ గురించి విష్ణు తెలిపారు. 'అంకుల్.. రెమ్యునరేషన్ గురించి మీ మేనేజర్‌తో ఏమైనా మాట్లాడమంటారా అని అడిగాను. అప్పుడు ఆయన నవ్వుతూనే.. ‘నువ్వు అంత పెద్ద వాడివయ్యావా..?’ అని అన్నారు. ఈ మూవీ కోసం ప్రభాస్ కూడా ఎలాంటి రెమ్యునరేషన తీసుకోలేదని విష్ణు చెప్పిన విషయం తెలిసిందే. -
పాన్ ఇండియా సినిమాకు నిర్మాతగా 20ఏళ్ల యువతి సక్సెస్
రియా షిబు.. 20 ఏళ్ల ఈ బ్యూటీ ఇప్పుడు కోలీవుడ్‌లో ట్రెండ్ అవుతుంది. హీరోయిన్గా మెప్పించిన రియా ఇప్పుడు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌గా రాణిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. తాజాగా తాను నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం 'వీర ధీర శూరన్'( Veera Dheera Sooran) నుంచి ట్రైలర్ విడుదలైంది. చియాన్ విక్రమ్(Vikram ) కథానాయకుడిగా నటిస్తున్న 62వ సినిమాలో నటి దుషార విజయన్( Dushara Vijayan) నాయకిగా నటిస్తుండగా ఇందులో నటుడు ఎస్జే సూర్య విలన్‌గా కనిపించనున్నారు. హెచ్ఆర్ పిక్చర్స్ పతాకంపై రియా షిబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సేతుపతి, చిత్తా చిత్రాల ఫేమ్ అరుణ్ కుమార్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు.వీర ధీర శూరన్ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం తాజాగా చెన్నైలో జరిగింది. వేదికపై నిర్మాత రియా షిబు మాట్లాడిన మాటలు చాలా ఎనర్జిటిక్‌గా ఉన్నాయంటూ ప్రశంసిస్తున్నారు. ఒక యాంకర్ కంటే స్పీడ్‌గా మాట్లాడటమే కాకుండా.. హీరోయిన్ కంటే గ్లామర్‌గా కనిపించడంతో అందరిని ఆకర్షించింది. నటి దుషార విజయన్ నటన గురించి ఆమె ప్రశంసించిన తీరు అందరినీ మెప్పించేలా ఉంది. అలా ప్రేక్షకులను కట్టిపడేశాల కనిపించడంతో ఈ అమ్మాయి ఎవరంటూ ఆశ్చర్యపోయారు. ఇంతలో నటుడు ఎస్జే సూర్య(S. J. Suryah) మాట్లాడుతూ రియాను మెచ్చుకున్నారు. ప్రముఖ నిర్మాత షిబు వారసురాలిగా ఆమె మరింత స్థాయికి చేరుకుంటారని తెలిపారు. హెచ్ఆర్ పిక్చర్స్‌కు ప్రధాన బలం ఆమె అంటూ ప్రశంసించారు. ఆమెను హీరోయిన్ లేదా ప్రొడ్యూసర్ ఎలా పిలవాలో తనకు అర్థం కావడం లేదని సరదాగా అన్నారు. కోలీవుడ్‌లో 'ఆర్ఆర్ఆర్' డిస్ట్రిబ్యూటర్‌గా రియాకోలీవుడ్ నిర్మాత, పంపిణీదారుడు షిబు తమిన్స్ కుమార్తెనే ఈ రియా షిబు (20).. కేరళకు చెందిన రియా శిబు చెన్నైలోని లయోలా కాలేజీలో చదువుతోంది. రియా శిబు ఒక వైపు చదువులు, మరోవైపు నిర్మాతగా అనేక బాధ్యతలను నిర్వహిస్తోంది. ఇవన్నీ కాకుండా కప్స్ అనే మలయాళ సినిమాలో కూడా హీరోయిన్గా నటించింది. తమ హెచ్ఆర్ పిక్చర్స్ నుంచి పులి,ఇంకొక్కడు, సామీ వంటి చిత్రాలను నిర్మించడమే కాకుండా ఆర్ఆర్ఆర్(RRR Movie), డాన్, విక్రమ్, జిగ్రా వంటి సినిమాలను కోలీవుడ్‌లో పంపిణీ చేశారు. ఈ బాధ్యతలన్నీ కూడా ఆమె విజయవంతంగా పూర్తి చేసింది. హెచ్ఆర్ పిక్చర్స్ నిర్మిస్తున్న నాల్గవ చిత్రం వీర ధీర శూరన్. ఈ నిర్మాణ సంస్థ వెనుక 20 ఏళ్ల కాలేజీ విద్యార్థి ఉండటం చాలా మందికి ఆశ్చర్యం కలిగించవచ్చు.#RiyaShibu wat an energy 😂💪 Pesama avangaley host pannalam pola event ah 😄👌#VeeraDheeraSooran pic.twitter.com/Zw5ARbBDzC— Kolly Corner (@kollycorner) March 20, 2025🔥 #SJSuryah on Producer #RiyaShibu at #VeeraDheeraSooran Audio Launch! 🔥🔥 Daughter of legendary Shibu sir— a man of his word & a pillar of support for directors!🔥A powerhouse of energy! From heroine to producer, she’s setting new benchmarks!pic.twitter.com/BDlYDQBUYe— Movie Tamil (@MovieTamil4) March 20, 2025 -
బెట్టింగ్ ప్రమోషన్స్: ఒక్కో వీడియోకు ఎంత రెమ్యునరేషన్..?
బెట్టింగ్, గేమింగ్, క్యాసినో యాప్స్‌లను ప్రమోట్ చేసిన వారు భారీగా సంపాధించారని పోలీసుల విచారణలో తెలుస్తోంది. ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’పేరుతో సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేస్తున్న అవగాహన కార్యక్రమం వల్ల సెలబ్రిటీల చుట్టూ... బెట్టింగ్ యాప్స్ ఉచ్చు బిగుస్తుంది. బెట్టింగ్ యాప్ప్ ప్రమోట్ చేసి డబ్బలు దండుకున్న వారిలో ప్రకంపనలు పుట్టిస్తోంది. అయితే, వారు ఒక్కో యాప్‌ను ప్రమోట్ చేసినందుకు గాను ఎంతమొత్తంలో డబ్బు తీసుకుంటారో అధారాలతో సహా బయటకొస్తున్నాయి.బెట్టింగ్ యాప్స్ గురించి ఒక నిమిషం వీడియోకు రూ.90వేలకు పైగానే చార్జ్ చేసినట్లు సోషల్‌మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు చెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో 1 మిలియన్‌కు పైగా ఫాలోవర్స్ ఉంటే నెలకు రూ. 30 లక్షలు కూడా తీసుకున్నట్లు సమాచారం. ఎక్కువ మంది సుమారు15 వీడియోలకు పైగానే ప్రమోట్ చేసినట్లు పంజాగుట్ట పోలీసుల విచారణలో తేలింది. ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ.. అన్వేష్‌కు ఈ బెట్టింగ్ యాప్స్ నిర్వాహుకులు ఏకంగా కోటి రూపాయలు ఆఫర్ చేసినట్లు ఆయన చెప్పాడు. అదే సమయంలో బ్యాంకాక్ పిల్ల యూట్యూబర్‌ను(శ్రావణి ) కూడా వారు సంప్రదించారట. ఆమెకు రూ. 70 లక్షలు ఇస్తామని బెట్టింగ్ యాప్స్ వాళ్లు ఆఫర్ చేసినట్లు తన యూట్యూబ్ ఛానల్లో పంచుకుంది. ఫాలోవర్స్ ఎక్కువగా ఉంటే అధికమొత్తంలో డబ్బులు ఇచ్చేందుకు ఈ గేమింగ్ యాప్స్ నిర్వాహుకులు ఏమాత్రం వెనకడుగు వేయడంలేదని చెప్పవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో 5వేల మంది ఫాలోవర్స్ ఉన్నా కూడా నెలకు 20వేల వరకు ఇచ్చారని చెబుతున్నారు. ఇలా వారికి ఉన్న గుర్తింపును బట్టి డబ్బులు ఇచ్చేవారని తెలుస్తోంది. ఈ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన వారు కనీసం రూ. 50 లక్షలకు పైగానే సంపాధించారని సమాచారం. వారి బ్యాంకు లావాదేవీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఎవరెన్ని వీడియోలు చేశారు.. ఎంత డబ్బు సంపాధించారు అనే కోణంలో విచారిస్తున్నారు.ఎవరెవరు ఏ యాప్స్‌లో.. ఈ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న వాటిలో అత్యధికం సోషల్‌మీడియాలో పాప్అప్ యాడ్స్ రూపంలో వస్తున్నట్లు గుర్తించారు. రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్‌లు జంగిల్‌రమ్మీ.కామ్, విజయ్ దేవరకొండ ఏ23, మంచు లక్ష్మి యోలో247.కామ్, ప్రణీత ఫేర్‌ప్లే.లైవ్, నిధి అగర్వాల్ జీత్‌విన్ సైట్లు, యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు తెలుసుకున్నారు.సోషల్‌మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యాంకర్లుగా ఉన్న అనన్య నాగెళ్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందర్‌రాజన్, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నాయని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, బయ్యా సన్నియాదవ్, టేస్టీ తేజ, రీతు చౌదరి, బీఎస్ సుప్రీత వివిధ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు గుర్తించారు. -
'భారతరత్న' అవార్డ్స్.. రేసులో టాప్ మ్యూజిక్ డైరెక్టర్
దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’( Bharat Ratna) అవార్డును ప్రముఖ సంగీత దర్శకుడు అందుకోనున్నారని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతుంది. ఏదైనా రంగంలో అసాధారణ సేవలు అందించి, అత్యుత్తమ పనితీరును కనబరచినవారికి ఈ అవార్డును అందజేస్తారు. ఒక ఏడాదిలో గరిష్ఠంగా ముగ్గురికి మాత్రమే ఈ పురస్కారాన్ని ప్రకటించవచ్చు. అయితే, 2025 ఏడాదికి గాను మేస్ట్రో ఇళయరాజాను (Ilaiyaraaja) భారతరత్న అవార్డ్‌తో కేంద్ర ప్రభుత్వం గౌరవించనుందని తెలుస్తోంది. ఈ ఉగాదిలోపు ప్రకటించే అవకాశం ఉంది.మేస్ట్రో ఇళయరాజా... ఈ పేరు వింటే చాలు సంగీత ప్రియులు ఆయన సినిమాల్లోని పాటలతో కూని రాగాలు తీస్తుంటారనడంలో సందేహం లేదు. తన పాటలతో అంతలా సంగీత ప్రియులను అలరించారాయన. తనకంటూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఇళయరాజాను భారతరత్న అవార్డ్‌తో కేంద్ర ప్రభుత్వం గౌరవించనున్నట్లు దాదాపు ఖాయం అయిందని సమాచారం. తన 30 సంవత్సరాల వృత్తి జీవితములో వివిధ భాషలలో దాదాపు 5వేల పాటలతో పాటుగా 1000 సినిమాలకు పైగానే సంగీత దర్శకత్వం వహించి రికార్డ్ క్రియేట్ చేశారు. బీజేపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఆయన కొనసాగుతున్న విషయం తెలిసిందే.2010లో భారత ప్రభుత్వం ఆయనను "పద్మభూషణ్" పురస్కారంతో సత్కరించగా.. 2018లో "పద్మవిభూషణ్" అవార్డ్ వరించింది. ఉత్తమ సంగీత దర్శకుడుగా ఏడు సార్లు జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడిగా ఆయన రికార్డ్ క్రియేట్ చేశారు. దేశంలోనే అత్యున్నతమైన 24 అవార్డ్స్‌ను ఇళయరాజా అందుకున్నారు.లండన్‌లో ఇటీవల ఇళయరాజా ‘వాలియంట్’ పేరుతో మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అక్కడ వెస్ట్రన్ క్లాసికల్ సింఫొనీ నిర్వహించిన తొలి ఆసియా మ్యూజిక్ కంపోజర్‌గా ఇళయరాజాకు గౌరవం దక్కింది. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా ఇళయరాజా కలిశారు. -
సెలబ్రిటీల చుట్టూ... బెట్టింగ్ యాప్స్ ఉచ్చు
సాక్షి, హైదరాబాద్/మియాపూర్: ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’పేరుతో సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేస్తున్న అవగాహన కార్యక్రమం ప్రకంపనలు పుట్టిస్తోంది. దీంతో స్ఫూర్తి పొందిన అనేక మంది సామాజిక కార్యకర్తలు బెట్టింగ్, గేమింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఉన్న పంజగుట్ట ఠాణాలో 11 మంది యాంకర్లు, ఇన్ఫ్లుయెన్సర్లపై కేసు నమోదు కాగా... తాజాగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్న మియాపూర్ పోలీసుస్టేషన్లో 25 మందిపై రిజిస్టరైంది. ఇందులో సినీనటులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాశ్‌రాజ్, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్ తదితరులు నిందితులుగా ఉన్నారు. మియాపూర్‌కు చెందిన పీఎం ఫణీంద్ర శర్మ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. కాలక్రమంలో బానిసలుగా...: బెట్టింగ్, గేమింగ్, క్యాసినో యాప్స్‌కు వ్యతిరేకంగా ముమ్మర ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఫణీంద్ర గత ఆదివారం తమ కాలనీకి చెందిన యువకులతో సంప్రదింపులు జరిపారు. ఈ నేపథ్యంలోనే వారిలో అత్యధికులు ఈ యాప్స్‌పై ఆసక్తి చూపడాన్ని గమనించారు. సోషల్‌మీడియా ద్వారా పలువురు సెలబ్రిటీలు, యాంకర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు చేస్తున్న ప్రచారమే దీనికి కారణమని ఫణీంద్ర గుర్తించారు. ఈ సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్ల ప్రచారం యువతను ప్రధానంగా డబ్బు అవసరం ఉన్న వారిని బెట్టింగ్ యాప్స్ ఉచ్చులోకి లాగుతోందని, అనేకమంది వాటిలో డబ్బు పెట్టి నిండా మునిగిపోతున్నారని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఎవరెవరు ఏ యాప్స్‌లో.. ఈ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న వాటిలో అత్యధికం సోషల్‌మీడియాలో పాప్అప్ యాడ్స్ రూపంలో వస్తున్నట్లు ఫణీంద్ర గుర్తించారు. రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్‌లు జంగిల్‌రమ్మీ.కామ్, విజయ్ దేవరకొండ ఏ23, మంచు లక్ష్మి యోలో247.కామ్, ప్రణీత ఫేర్‌ప్లే.లైవ్, నిధి అగర్వాల్ జీత్‌విన్ సైట్లు, యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు తెలుసుకున్నారు. సోషల్‌మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యాంకర్లుగా ఉన్న అనన్య నాగెళ్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందర్‌రాజన్, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నాయని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, బయ్యా సన్నియాదవ్, శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి, బీఎస్ సుప్రీత వివిధ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు పూర్తి వివరాలు సమరి్పస్తూ బుధవారం మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈడీ కూడా రంగంలోకి.. పోలీసులు 25 మంది సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లపై బీఎన్ఎస్లోని 318 (4), 112 రెడ్ విత్ 49, గేమింగ్ యాక్ట్‌లోని 3, 3 (ఎ), 4, ఐటీ యాక్ట్‌లోని 66 డీ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ నిందితుల్లో కొందరు పంజగుట్టలో నమోదైన కేసులోనూ నిందితులుగా ఉన్నారు. ఈ కేసుల వివరాలను సేకరించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ప్రాథమిక విచారణ ప్రారంభించారు. మరోపక్క పంజగుట్ట కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారులు మంగళ, బుధవారాల్లో టేస్టీ తేజ, హబీబ్‌నగర్ కానిస్టేబుల్ కిరణ్ గౌడ్‌ను ప్రశ్నించారు. గురువారం విష్ణు ప్రియ, రీతు చౌదరి విచారణకు హాజరయ్యారు. ఒక్కొక్కరిని 3 నుంచి 8 గంటలపాటు ప్రశి్నస్తున్న అధికారులు కొందరి ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తాము కేవలం స్కిల్డ్ గేమ్ అని చెప్పడంతోనో, తెలియకో ఆ యాప్స్‌ను ప్రమోట్ చేశామని కొందరు తమ వాంగ్మూలాల్లో పేర్కొన్నట్లు తెలిసింది. ఈ క్యాంపెయిన్‌కు సంబంధించిన లావాదేవీలన్నీ యాప్స్ నిర్వాహకులతో బ్యాంకు ఖాతా ద్వారానే జరిగినట్లు వాళ్లు పేర్కొన్నట్లు తెలిసింది. దీంతో తదుపరి విచారణకు బ్యాంకు స్టేట్మెంట్స్తో హాజరుకావాలని పోలీసులు వారికి స్పష్టం చేశారు. మిగిలిన ఇన్ఫ్లూయన్సర్లు ఒకటిరెండు రోజుల్లో విచారణకు రానున్నారు. -
స్పెషల్ సాంగ్స్‌కి సై
‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అనేది సామెత. చిత్ర పరిశ్రమలో ఈ సామెత బాగా వర్తిస్తుంది. ప్రత్యేకించి హీరోయిన్ల విషయంలో.. క్రేజ్ ఉన్నప్పుడే వరుసగా సినిమాలు చేసి, అటు ప్రేక్షకుల్ని అలరించడంతో పాటు ఇటు బ్యాంక్ బ్యాలెన్స్‌లు పెంచుకోవాలి. ఇందుకు కేవలం హీరోయిన్ పాత్రలకే పరిమితం కాకుండా ట్రెండ్‌కి తగ్గట్టుగా కెరీర్‌ని మలచుకుంటూ స్పెషల్ సాంగ్స్‌కి కూడా సై అంటున్నారు పలువురు కథానాయికలు.పైగా ప్రత్యేక పాటల్లో నటించే వారికి పారితోషికం కూడా భారీగా ఇస్తుండటంతో స్పెషల్ సాంగ్స్‌లో నర్తించేందుకు హీరోయిన్లు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ప్రస్తుతం పూజా హెగ్డే, శ్రియ, నేహా శెట్టి, కేతికా శర్మ, రెబా మోనికా జాన్, చంద్రికా రవి వంటి హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్‌లో నటిస్తున్నారు. ఆ వివరాలేంటో చూద్దాం.రెట్రోకి హైలైట్ ‘ఇష్టం’ (2001) సినిమాతో హీరోయిన్గా పరిచయమయ్యారు శ్రియా శరణ్. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, ప్రభాస్, పవన్ కల్యాణ్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్... ఇలా పలువురు హీరోలకి జోడీగా నటించి, స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు శ్రియ. ప్రస్తుతం హీరోయిన్గా అవకాశాలు తగ్గడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్, స్పెషల్ సాంగ్స్‌పై దృష్టి పెట్టారు శ్రియ. ప్రత్యేక పాటల్లో నర్తించడం ఆమెకు కొత్త కాదు. రామ్‌ని హీరోగా, ఇలియానాని హీరోయిన్గా పరిచయం చేస్తూ వైవీఎస్ చౌదరి తెరకెక్కించిన ‘దేవదాసు’ (2006) సినిమాలో తొలిసారి ప్రత్యేక పాటలో చిందేశారు శ్రియ.ఆ తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన ‘మున్నా’ (2007), వెంకటేశ్ కథానాయకుడిగా నటించిన ‘తులసి’ (2007), పవన్ కల్యాణ్ హీరోగా చేసిన ‘పులి’, సందీప్ కిషన్, సాయిదుర్గా తేజ్ నటించిన ‘నక్షత్రం’ (2017) వంటి తెలుగు సినిమాలతో పాటు పలు తమిళ, హిందీ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన శ్రియ తాజాగా ‘రెట్రో’ సినిమాలో ప్రత్యేక పాటలో సందడి చేయనున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొదుతున్న ఈ సినిమాలో సూర్యకి జంటగా పూజా హెగ్డే నటించారు.సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ మూవీలో ఓ స్పెషల్ సాంగ్‌లో సూర్యతో కాలు కదిపారు శ్రియ. గోవాలో ప్రత్యేకంగా వేసిన సెట్స్‌లో సూర్య, శ్రియలపై ఈ పాట చిత్రీకరించారు మేకర్స్. సూర్య, జ్యోతిక, కార్తికేయ సంతానం నిర్మించిన ఈ మూవీ మే 1న విడుదల కానుంది. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌ను సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ సొంతం చేసుకుంది. ముచ్చటగా మూడోసారినాగచైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ (2014) సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు పూజా హెగ్డే. ప్రభాస్, మహేశ్‌బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, వరుణ్ తేజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అఖిల్ వంటి హీరోలకి జోడీగా నటించి, తెలుగులో ఓ వెలుగు వెలిగిన ఆమె ప్రస్తుతం తమిళ, హిందీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఓ వైపు హీరోయిన్గా నటిస్తున్న ఈ బ్యూటీ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘కూలీ’ సినిమాలో ఓ ప్రత్యేక పాటలో నర్తించారు.రామ్‌చరణ్ హీరోగా నటించిన ‘రంగస్థలం’ (2018) సినిమాలోని ‘జిల్ జిల్ జిగేల్ రాణి...’ పూజా చేసిన తొలి స్పెషల్ సాంగ్. ఈ పాటలో రామ్‌చరణ్, పూజా హెగ్డే మాస్ డ్యాన్సులకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత ‘ఎఫ్ 3’ (2022) సినిమాలో ‘అధ్యక్షా... లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా...’ అనే సాంగ్‌లో రెండోసారి చిందేసిన పూజ ముచ్చటగా మూడోసారి ‘కూలీ’లో ఓ స్పెషల్ సాంగ్ చేశారు.రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొదిన చిత్రం ‘కూలీ’. అనిరు«ధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ మూవీలోని ప్రత్యేక పాట చాలా వెరీ వెరీ స్పెషల్‌గా ఉంటుందట. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, శ్రుతీహాసన్ ప్రధాన పాత్రల్లో నటించారు. సన్న్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ‘కూలీ’ నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించలేదు.అది దా సర్ప్రైజ్అది దా సర్ప్రైజ్ అంటున్నారు కేతికా శర్మ. ఆకాశ్ పూరి హీరోగా నటించిన ‘రొమాంటిక్’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమయ్యారు కేతిక. 2021 అక్టోబరు 21న విడుదలైన ఈ మూవీలో ఈ అమ్మడు అందాలకు కుర్రకారు ఫిదా అయ్యారు. ఆ తర్వాత ‘లక్ష్య, రంగరంగ వైభవంగా, బ్రో’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన కేతికా శర్మ తొలిసారి ‘రాబిన్‌హుడ్’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశారు. ‘భీష్మ’ (2020) వంటి హిట్ మూవీ తర్వాత హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్లో రూపొదిన ద్వితీయ చిత్రం ‘రాబిన్‌హుడ్’.శ్రీలీల హీరోయిన్గా నటించారు. ఈ సినిమాలో ‘అది దా సర్ప్రైజ్...’ అంటూ సాగే ప్రత్యేక పాటలో కేతికా శర్మ సందడి చేశారు. జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందించిన ఈ పాటని ఇటీవలే విడుదల చేశారు. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటని నీతి మోహన్, అనురాగ్ కులకర్ణి పాడగా, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదలవుతోంది.నా ముద్దుపేరు స్వాతి రెడ్డి శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘సామజవర గమన’ (2023) సినిమాతో టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు రెబా మోనికా జాన్. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో ఈ బ్యూటీ క్రేజ్ ఓ రేంజ్‌కి వెళ్లింది. ప్రస్తుతం ఆమె ‘మృత్యుంజయ్’ మూవీలో శ్రీవిష్ణుతో రెండోసారి జోడీగా నటిస్తున్నారు. ఓ వైపు హీరోయిన్గా నటిస్తున్న ఈ బ్యూటీ మరోవైపు ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశారు. సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’.కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియాంకా జవాల్కర్, మురళీధర్ గౌడ్, డైరెక్టర్ కేవీ అనుదీప్ కీలక పాత్రలు పోషించారు. ‘మ్యాడ్’కి (2023) సీక్వెల్‌గా రూపొదిన ‘మ్యాడ్ స్క్వేర్’లో రెబా మోనికా జాన్ ప్రత్యేక గీతంలో సందడి చేయనున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.‘నా ముద్దుపేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి... నే ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండుగడ్డి...’ అంటూ సాగే ఈ పాటలో హుషారైన స్టెప్పులు వేశారు రెబా. సురేష్ గంగుల సాహిత్యం అందించిన ఈ పాటని స్వాతి రెడ్డి, భీమ్స్ ఆలపించారు. సూర్యదేవర నాగవంశీ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న రిలీజ్ కానుంది.మొదటి సారి...ఆకాశ్ పూరి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘మెహబూబా’ (2018) సినిమా ద్వారా హీరోయిన్గా తెలుగుకి పరిచయం అయ్యారు కన్నడ బ్యూటీ నేహా శెట్టి. ఆ సినిమా తర్వాత ‘గల్లీ రౌడీ, డీజే టిల్లు, బెదురులంక 2012, రూల్స్ రంజన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ వంటి సినిమాల్లో నటించి, మెప్పించారామె. సిద్ధు జొన్నలగడ్డకి జోడీగా నటించిన ‘డీజే టిల్లు’ (2022) సినిమాలో రాధిక పాత్రతో కుర్రకారు మనసులు దోచేశారీ బ్యూటీ. ఈ మూవీలో ఆమె నటన, గ్లామర్‌కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.ఇదిలా ఉంటే నేహా శెట్టి తొలిసారి ఓ ప్రత్యేక పాటలో చిందేశారు. పవన్ కల్యాణ్ హీరోగా ‘సాహో’ మూవీ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్). డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా మోహన్, శ్రియా రెడ్డి హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఆ పాటలో పవన్ కల్యాణ్‌తో కలిసి చిందేశారట నేహా శెట్టి. థాయ్‌ల్యాండ్‌లో ఈ పాటని చిత్రీకరించారని సమాచారం. ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబరులో రిలీజ్ కానుందని ఫిల్మ్‌నగర్ టాక్.టచ్‌లో ఉండు ఓ రబ్బీ...తమిళ చిత్ర పరిశ్రమలో హీరోయిన్గా నటించిన చంద్రికా రవి ఓ స్పెషల్ సాంగ్‌తో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు. 2019లో విడుదలైన ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ సినిమాలో ఓ ప్రత్యేక పాట ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారీ బ్యూటీ. ఆ తర్వాత బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీర సింహారెడ్డి’ (2023) మూవీలో ‘మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే...’ అనే స్పెషల్ సాంగ్‌లో తనదైన గ్లామర్, డ్యాన్సులతో ప్రేక్షకులను ఫిదా చేశారు చంద్రిక.తాజాగా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేశారామె. ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ సినిమా ద్వారా హీరోగా పరిచయమైన యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించిన ద్వితీయ చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. దర్శక ద్వయం నితిన్, భరత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దీపికా పిల్లి కథానాయికగా నటించారు. యూనిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొదిన ఈ మూవీలో ‘టచ్‌లో ఉండు ఓ రబ్బీ... ఓ రబ్బీ...’ అంటూ చిందేశారు చంద్రిక.ఈ పాటకి చంద్రబోస్ మాస్ లిరిక్స్ అందించగా, లక్ష్మీ దాస, పి. రఘు పాడారు. రధన్ తనదైన హుషారైన సంగీతం అందించారు. శేఖర్ మాస్టర్ నృత్యరీతులు సమకూర్చారు. మాంక్స్ అండ్ మంకీస్ బ్యానర్‌పై రూపొదిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ ఏప్రిల్ 11న విడుదల కానుంది. చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఆ పాటలో చిరంజీవితో కలిసి ఊర్వశీ రౌతేలా చిందేయనున్నారని టాక్. ‘వాల్తేరు వీరయ్య’ (2023) సినిమాలో ‘వేర్ ఈజ్ ద పార్టీ...’ అనే ప్రత్యేక పాటలో చిరంజీవి– ఊర్వశీ రౌతేలా తమదైన స్టెప్పులతో అలరించిన సంగతి తెలిసిందే.ఈ పాట సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో ‘విశ్వంభర’లోనూ చిరంజీవితో కలిసి స్పెషల్ సాంగ్‌లో ఊర్వశి మెరవనున్నారట. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్‌పై వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్న ఈ మూవీ ఈ వేసవిలో విడుదల కానుందని టాక్. ఇదిలా ఉంటే... బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ హీరోగా టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన హిందీ చిత్రం ‘జాట్’. ఈ మూవీలో రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్, సయామీ ఖేర్, రెజీనా కసాండ్రా ఇతర కీలక పాత్రధారులు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఆ పాటలో హీరోయిన్ నిధీ అగర్వాల్ మెరవనున్నారని టాక్. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీలపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. కాగా ‘విశ్వంభర’లో ఊర్వశీ రౌతేలా, ‘జాట్’లో నిధీ అగర్వాల్ స్పెషల్ సాంగ్స్ విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు.వీరే కాదు.. మరి కొందరు హీరోయిన్లు కూడా ప్రత్యేక పాటల్లో సందడి చేయనున్నారు. – డేరంగుల జగన్ మోహన్ -
బెట్టింగ్ యాప్ కేసు.. అవును ప్రమోట్ చేశా.. కానీ: స్పందించిన ప్రకాశ్ రాజ్
బెట్టింగ్ యాప్స్ కేసు వ్యవహారంపై సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. తాను కూడా బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేసినట్లు వెల్లడించారు. అయితే 2016 జూన్‌లో ఓ యాడ్ చేసినట్లు తెలిపారు. అది కేవలం ఏడాది పాటు మాత్రమే చేసుకున్న అగ్రిమెంట్ అని వెల్లడించారు. ఆ తర్వాత తన తప్పును తెలుసుకుని ఆ కంపెనీతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నానని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. ప్రస్తుతం తాను ఏ గేమింగ్ యాప్‌ను ప్రమోట్ చేయడం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్‌లో ఓ వీడియోను విడుదల చేశారు.ఈ వ్యవహారంపై వీడియోలో ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ..' బెట్టింగ్ యాప్ కేసు గురించి ఇప్పుడే తెలిసింది. 2016లో ఓ యాడ్ నా దగ్గరకు వచ్చింది, నేను ఆ యాడ్ చేసిన మాట నిజమే. కానీ ఆ యాడ్ చేయడం తప్పని కొన్ని నెలల్లోనే తెలుసుకున్నా. 2017లోనూ ఒప్పందం పొడిగిస్తామని కంపెనీ వాళ్లు అడిగారు. కానీ నేను ఆ యాడ్‌ను ప్రసారం చేయవద్దని కోరా. 9 ఏళ్ల కిందట ఏడాది పాటు ఒప్పందంతో చేసుకుని ఈ యాడ్ చేశా. ఇప్పుడు ఏ గేమింగ్ యాప్‌కు ప్రచారకర్తగా పనిచేయడం లేదు. 2021లో ఆ కంపెనీ ఇంకో కంపెనీకి అమ్మేస్తే సోషల్ మీడియాలో నా ప్రకటన వాడారు. నా ప్రకటన వాడినందుకు ఆ కంపెనీకి లీగల్ నోటీసులు పంపా. ఇప్పటి వరకు పోలీసు శాఖ నుంచి నాకు ఎలాంటి సందేశం రాలేదు. ఒకవేళ పిలిస్తే నేను చేసిన ప్రకటనపై పోలీసులకు వివరణ ఇస్తా' అని అన్నారు.My response 🙏🏿🙏🏿🙏🏿 #SayNoToBettingAps #justasking pic.twitter.com/TErKkUb6ls— Prakash Raj (@prakashraaj) March 20, 2025 -
విజయ్ వర్మతో బ్రేకప్ రూమర్స్.. అలా అనిపిస్తేనే చెబుతా: తమన్నా
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవల సినిమాల కంటే ఎక్కువగా వ్యక్తిగత విషయాలతోనే వార్తల్లో నిలుస్తోంది. తన బాయ్‌ఫ్రెండ్, నటుడు విజయ్ వర్మతో బ్రేకప్ చేసుకోబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇటీవల రవీనా టాండన్ నిర్వహించిన హోలీ వేడుకల్లో వీరిద్దరూ జంటగా కనిపించలేదు. విడివిడిగానే హోలీ ఈవెంట్లో సందడి చేశారు. దీంతో ఈ జంట బ్రేకప్ ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమన్నా తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న వార్తలపై తాజా ఇంటర్వ్యూలో స్పందించింది. నా పర్సనల్ లైఫ్‌ను సీక్రెట్‌గా ఉంచడానికే ఎక్కువగా ఇష్టపడతానని అంటోంది తమన్నా. నాకు ఏదైనా సౌకర్యంగా అనిపిస్తేనే ఆ విషయాన్ని అందరితో పంచుకుంటానని తెలిపింది. అది నా లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తుందని.. అందుకే నాపై ఎలాంటి ఫిర్యాదులు ఉండవని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ.తమన్నా మాట్లాడుతూ..'నేను ప్రజల మనిషిని. వారితో మాట్లాడాటాన్ని ఆస్వాదిస్తా. నేను ఎయిర్‌పోర్ట్‌లో ఒక పెద్దమనిషిని కలిశాను. నా వద్దకు వచ్చిన వ్యక్తులకు ఫోటోగ్రాఫ్‌లు కూడా ఇచ్చా. ఇవన్నీ నేను సంతోషంగా చేస్తున్నా. నేను ఎంచుకున్న దానితో ప్రస్తుతం సంతోషంగా ఉన్నా. అలాగే నాకు నచ్చిన వ్యక్తులనే ఇష్టపడతా. అంతే కాకుండా యాదృచ్ఛికంగా జరిగే విషయాల పట్ల విముఖత చూపను. అపరిచితులతో మాట్లాడటం వల్ల విలువైన విషయాలు కూడా తెలుసుకోవచ్చని' తన మనసులో మాటను వెల్లడించింది. కాగా.. తమన్నా భాటియా, విజయ్ వర్మ వర్మ 2022లో డేటింగ్ ప్రారంభించారు.2023లో విడుదలైన నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్- 2లో జంటగా కలిసి నటించారు. -
ఫిబ్రవరిలో ఒక్కటి తప్ప అన్నీ ఫ్లాపే.. ఒక సినిమాకైతే రూ.10 వేలే వచ్చాయ్!
హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉన్నాయి. అలా మలయాళంలో (Mollywood) గత నెలలో 17 సినిమాలు రిలీజయ్యాయి. అందులో ఎన్ని హిట్టయ్యాయి? ఎన్ని నష్టాల్ని మిగిల్చాయి? అన్న నివేదిక బయటకు వచ్చింది. కేరళ చలనచిత్ర నిర్మాతల మండలి (కేఎఫ్‌పీఏ) ఫిబ్రవరి బాక్సాఫీస్ రిపోర్టు (Malayalam Film Industry Report- February 2025)ను విడుదల చేసింది. మాలీవుడ్‌కు రూ.53 కోట్ల నష్టంఈ నివేదిక ప్రకారం.. గత నెలలో 17 సినిమాలు రిలీజ్ చేస్తే అందులో ఆఫీసర్ ఆన్‌డ్యూటీ సినిమా (Officer on Duty Movie) మాత్రమే బడ్జెట్‌కు దగ్గరగా వసూళ్లు రాబట్టింది. మిగతా చిత్రాలన్నీ తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. 17 సినిమాల బడ్జెట్ అంతా కలిపితే రూ.75 కోట్లు కాగా.. అందులో కేవలం రూ.23.55 కోట్లు మాత్రమే వెనక్కు రావడం గమనార్హం. అంటే దాదాపు రూ.53 కోట్ల నష్టం వాటిల్లింది. రూ.13 కోట్లతో నిర్మితమైన ఆఫీసర్ ఆన్‌డ్యూటీ సినిమా ఇప్పటివరకు రూ.11 కోట్ల షేర్ (రూ.50 కోట్ల గ్రాస్) సాధించింది. ఇప్పటికీ విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. కాపాడలేకపోయిన స్టార్ హీరోఅయితే ఈ మూవీ నేడు (మార్చి 20) నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చేసింది. దీని ప్రభావం బాక్సాఫీస్ కలెక్షన్లపై పడనుంది. మార్కో వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత ఉన్నిముకుందన్ హీరోగా నటించిన చిత్రం గెట్ సెట్ బేబీ. రూ.10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ కేవలం రూ.1.40 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవడం కూడా కష్టమే! లవ్ డేల్ అనే సినిమా అయితే రూ.1.60 కోట్లు పెట్టి తీయగా కేవలం రూ.10 వేలు మాత్రమే తెచ్చిపెట్టి నిర్మాతలను నిండా ముంచేసింది.పేరు ఘనం.. కలెక్షన్స్ శూన్యంమలయాళ చిత్రాలకు సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉన్నారు. అయినా పేరు ఘనం.. ఫలితం శూన్యం అన్నట్లు ఎప్పుడూ ఈ ఇండస్ట్రీ నష్టాల్లోనే కొట్టుమిట్టాడుతోంది. చాలామంది ఈ చిత్రాలను థియేటర్లలో కన్నా ఓటీటీలోనే ఎక్కువగా ఆదరిస్తున్నారు. దీనికి తోడు నిర్మాణ వ్యయాలు పెరగడం, నటీనటులు పారితోషికం పెంచడంతో బడ్జెట్ తడిసిమోపడవుతోంది. కనీసం లాభాలు కాదుకదా పెట్టుబడి వెనక్కి వచ్చినా చాలనుకునే దయనీయ స్థితి మాలీవుడ్‌లో కనిపిస్తోంది.కేరళ చలనచిత్ర నిర్మాతల మండలి విడుదల చేసిన నివేదిక నిజంగా షాక్‌కు గురిచేసింది. ఫిబ్రవరిలో రిలీజైన 17 సినిమాల్లో ఆఫీసర్ ఆన్‌డ్యూటీ మూవీ మాత్రమే పెట్టిన పెట్టుబడికి సమీపంలో వసూళ్లు రాబట్టింది. అన్నింటికీ కలిపి రూ.73 కోట్లు పెడితే కేవలం రూ.23.55 కోట్లు మాత్రమే వెనక్కు రావడం విచారకరం.- శ్రీధర్ పిళ్లై, సినీ విశ్లేషకుడుగ్రాస్: మొత్తం సినిమా టికెట్ల అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బునెట్: గ్రాస్ వసూళ్ల నుంచి ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టగా మిగిలేది నెట్షేర్: నెట్ వసూళ్ల నుంచి థియేటర్ అద్దె, నిర్వహణ వంటి ఖర్చులు తీసేయగా మిగిలేది షేర్చదవండి: హీరో అజిత్‌ను పేరు పెట్టి పిలిచా.. అందరూ షాకయ్యారు: నటుడు -
హీరో అజిత్‌ను పేరు పెట్టి పిలిచా.. అందరూ షాకయ్యారు: నటుడు
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ (Ajith)ను పేరు పెట్టి పిలిచినందుకు అందరూ తనను గుర్రుగా చూశారంటున్నాడు నటుడు రఘురామ్. ఇతడు ప్రస్తుతం అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్లో జరిగిన ఆసక్తికర విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించాడు. రఘురామ్ (Raghu Ram) మాట్లాడుతూ.. నేను పెరిగిందంతా ఢిల్లీలో.. ఉంటోంది ముంబైలో! అక్కడ మాకంటే పెద్ద స్థాయిలో ఉండేవారిని కూడా పేరు పెట్టే పిలుస్తాం. నాకూ అదే అలవాటైపోయింది.తల కొట్టేసినట్లయిందిగుడ్బ్యాడ్ అగ్లీ సినిమా (Good Bad Ugly) షూటింగ్లో అజిత్ తనను తాను పరిచయం చేసుకున్నాడు. నన్ను నేను పరిచయం చేసుకునే క్రమంలో అతడి పేరు పెట్టి పిలిచాను. అందరూ షాకయ్యారు. సెట్ నిశ్శబ్దంగా మారిపోయింది. అలా పేరు పెట్టి పిలవడం ఆయన్ను అవమానించినట్లు కాదా అన్నారు. నాకు తల కొట్టేసినట్లుగా అనిపించింది. అంత పెద్ద హీరోతో కలిసి నటించే ఛాన్స్ వస్తే నేనిలా చేశానేంటి? అనుకున్నాను. స్పెయిన్‌లో షూటింగ్‌కు వెళ్లినప్పుడు దర్శకుడు, సహాయ దర్శకుడు కూడా అజిత్‌ను పేరు పెట్టి పిలవొద్దన్నారు. అందుకే అలా పిలుస్తున్నా..సరే.. సర్ అని పిలుస్తానని చెప్పాను. సాధారణంగా ఆయన ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరనుకుంటాను. జనాలు ఇబ్బందిపడుతున్నారని నేనే ఆయన్ను సర్ అనడం మొదలుపెట్టాను అని చెప్పుకొచ్చాడు. రఘురామ్ ఝూఠా హై సహీ అనే చిత్రంతో నటుడిగా వెండితెరకు పరిచయం య్యాడు. తీస్మార్ ఖాన్ మూవీలోనూ నటించాడు. తమిళంలో డాక్టర్, తెలుగులో గాంధీ తాత చెట్టు, మెకానిక్ రాకీ చిత్రాల్లో నటించాడు.చదవండి: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాం.. సారీ చెప్పాం.. ఇంకేంటి? సురేఖావాణి ఫైర్ -
స్టీఫెన్ తిరిగొచ్చాడు.. 'లూసిఫర్2' తెలుగు ట్రైలర్ రిలీజ్
మలయాళ టాప్ హీరో మోహన్‌లాల్ నటించిన 'లూసిఫర్2: ఎంపురాన్' (L2 Empuraan) తెలుగు ట్రైలర్ వచ్చేసింది. 2019లో వచ్చిన లూసిఫర్ చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో నటిస్తూనే దర్శకత్వం వహించారు. మార్చి 27న విడుదల కానున్న ఈ మూవీపై తెలుగులో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని నిర్మాత దిల్‌రాజు రిలీజ్ చేస్తున్నారు. ‘‘ఎల్ 2 ఎంపురాన్’లో స్టీఫెన్ గట్టుపల్లి (ఖురేషి అబ్రమ్)గా మోహన్‌లాల్, ఆయనకు రైట్ హ్యాండ్‌లా జయేద్ మసూద్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు. -
'లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అలా జరిగిపోయింది'.. శ్రియా శరణ్ ఆసక్తికర పోస్ట్
టాలీవుడ్ హీరోయిన్ శ్రియా శరణ్ (Shriya Saran) తెలుగులో పలువురు స్టార్ హీరోల సరసన నటించింది. ఇష్టం సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్గా మెప్పించింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల సినిమాల్లో ప్రేక్షకుల్ని మెప్పించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ అభిమానులతో మాత్రం టచ్‌లోనే ఉంటోంది. తాజాగా సోషల్ మీడియాలో ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.సోషల్ మీడియా వేదికగా తన భర్త అండ్రీ కొచ్చీవ్‌తో దిగిన ఫోటోలను షేర్ చేసింది. తనతో సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం పరిచయం ఏర్పడిందని తెలిపింది. మార్చి 19న 2017లో మొదటిసారి అతన్ని కలుసుకున్నట్లు వెల్లడించింది. అనుకోకుండా ఓ రాంగ్ ఫ్లైట్.. ఓ డైవింగ్ ట్రిప్ వల్లే మేమిద్దరం ఒక్కటయ్యామని పేర్కొంది. అసలు మా ఇద్దరికీ ఎలా కుదిరిందో ఇప్పటికీ తెలియదని.. ప్రస్తుతం ప్రతిరోజు కలిసి నడుస్తున్నామని ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. 2017 నుంచి 2025 వరకు తన భర్తతో ఉన్న మధురమైన జ్ఞాపకాలను పోస్ట్ చేసింది. అలాగే తన ముద్దుల కూతురితో దిగిన ఫోటోను కూడా పంచుకుంది.కాగా.. శ్రియ శరన్ రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అండ్రీ కొచ్చీవ్‌ను రహస్యంగా పెళ్లాడింది. ముంబైలో అతికొద్ది మంది సమక్షంలో వీరి వివాహం జరిగింది. కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులులతో పాటు సినీ ఇండస్ట్రీ నుంచి మనోజ్ బాజ్‌పేయి, షబానా అజ్మీలను మాత్రమే వివాహానికి హాజరయ్యారు. . View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) -
మీ కోసం నా భర్త ఫోటోలు షేర్ చేయాలా?.. విడాకులపై మహాత్మ హీరోయిన్
తెలుగులో 'మహాత్మ', 'ఒంటరి' లాంటి తెలుగు సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మలయాళ బ్యూటీ భావన. శ్రీకాంత్ హీరోగా నటించిన మహాత్మ చిత్రంలో ఆడియన్స్‌ను మెప్పించింది. కేరళకు చెందిన భావన.. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. అయితే కొంతకాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన భావన 2018లో కన్నడ నిర్మాత నవీన్ రమేశ్‌ను పెళ్లాడింది. గతేడాది 'నడికర్' అనే మలయాళ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ ముద్దుగుమ్మపై సోషల్ మీడియాలో రూమర్స్ తెగ వైరలవుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన భావన తనపై వస్తున్న వార్తలపై స్పందించింది. ఇంతకీ ఆ ముచ్చట ఏంటో తెలుసుకుందాం పదండి.ఈ మలయాళీ భామ త్వరలోనే తన భర్త నవీన్ రమేశ్‌తో విడిపోనుందంటూ సామాజిక మాధ్యమాల్లో కథనాలు వస్తున్నాయి. దీంతో తమపై వస్తున్న వార్తలపై భావన తాజా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడం తనకు ఇష్టం ఉండదని తెలిపింది. అలాగే తన భర్తతో దిగిన ఫోటోలను కూడా తాను షేర్ చేయకపోవడం వల్లే ఇలా మాట్లాడుకుంటున్నారని భావన వెల్లడించింది.భావన మాట్లాడుతూ..' నా భర్తతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం నాకు ఇష్టముండదు. అందుకే మేము విడాకులు తీసుకుంటున్నామని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మేమిద్దరం కలిసి జీవిస్తున్నాం. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించి గోప్యతను పాటిస్తా. నేను యాదృచ్ఛికంగా ఫోటోలు పోస్ట్ చేసినా ఏదో తప్పు జరిగిందని ఊహాగానాలు సృష్టిస్తారు. అలా అని మా బంధం నిరూపించడానికి మేము సెల్ఫీలు పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా?" అంటూ విడాకులపై వస్తున్న రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చేసింది. భావన తన సినీ కెరీర్‌ను మలయాళ చిత్రం నమ్మల్ (2002)తో ప్రారంభించింది. తరువాత చితిరం పెసుతడితో తమిళ సినిమాల్లోకి ప్రవేశించింది. తమిళంలో అజిత్ కుమార్ సరసన కూడా నటించింది. ఆ తర్వాత ఒంటరి మూవీతో తెలుగులోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. శ్రీకాంత్ నటించిన మహాత్మ తెలుగులో ఆమెకు గుర్తింపును తీసుకొచ్చింది. ఆమె ప్రస్తుతం కన్నడ చిత్రం పింక్ నోట్, తమిళ చిత్రం ది డోర్ సినిమాలో కనిపించనుంది. -
శబరిమల అయ్యప్పని దర్శించుకున్న మోహన్ లాల్
మన దగ్గర కొత్త సినిమా రిలీజ్ ఉందనగా చాలామంది తిరుమల శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. చాలామంది హీరోలకు ఇది సెంటిమెంట్ అని చెప్పొచ్చు. ఇలానే ఇప్పుడు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్.. కేరళలోని శబరిమల కొండని కాలినడకన ఎక్కారు. భుజాన ఇరుముడి కూడా కనిపించింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ తెలుగు సినిమా)18 మెట్లు ఎక్కి అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకున్న మోహన్ లాల్.. ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. అయితే ఇదంతా కూడా త్వరలో రిలీజ్ కాబోతున్న తన సినిమా 'ఎల్ 2: ఎంపురన్' కోసమే అని తెలుస్తోంది. పాన్ ఇండియా వైడ్ భారీ స్థాయిలో మార్చి 27న రిలీజ్ కానుంది.గతంలో 'లూసిఫర్' అనే సినిమా వచ్చింది కదా! దీనికి సీక్వెల్ 'ఎల్2' మూవీ. సలార్ ఫేమ్ పృథ్వీరాజ్.. దర్శకత్వం వహించడంతో పాటు కీలక పాత్రలోనూ నటించాడు. ఈ సినిమాపై అటు మోహన్ లాల్, ఇటు పృథ్వీరాజ్ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. మరి ఫలితం ఏమవుతుందో మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.(ఇదీ చదవండి: సగం బాలీవుడ్ 'ఐపీఎల్' కోసం.. ఒక్క రాత్రి ఖర్చు ఎంతంటే?)శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించుకున్న ప్రముఖ నటుడు మోహన్‌లాల్.#Mohanlal #Aadhantelugu #Sabarimala #AyyappaTemple pic.twitter.com/MXkX48lfra— Aadhan Telugu (@AadhanTelugu) March 19, 2025சபரிமலைக்கு திடீர் விசிட் அடித்த நடிகர் மோகன்லால்; நடிகர் மம்முட்டி பெயரில் சிறப்பு பூஜை! #Mohanlal #Mammootty #Sabarimala #Kerala pic.twitter.com/2YMtwZYgrj— Idam valam (@Idam_valam) March 19, 2025 -
కూలీ కంప్లీట్
‘కూలీ’ సినిమా షూటింగ్ పూర్తయింది. రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కూలీ’. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, శ్రుతీహాసన్, షౌబిన్ షాహిర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఓ గెస్ట్ రోల్లో ఆమిర్ ఖాన్, స్పెషల్ సాంగ్‌లో పూజా హెగ్డే నటించారు. సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించింది.కాగా ఈ సినిమా చిత్రీకరణ ముగిసిన విషయాన్ని ‘ఎక్స్’ వేదికగా ధృవీకరించారు మేకర్స్. పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ మొదలయ్యాయి. ఈ చిత్రాన్ని ఈ ఏడాది దీపావళి సందర్భంగా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. మరోవైపు రజనీకాంత్ హీరోగా ‘జైలర్ 2’ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. -
ధనుశ్ డైరెక్షన్లో లవ్ స్టోరీ.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
పవిష్, అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం 'జాబిలమ్మ నీకు అంత కోపమా'(తమిళంలో నిలవుకు ఎన్ మెల్ ఎన్నాడి కోబం). ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ (Dhanush) దర్శకత్వం వహించారు. ఈ మూవీ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ మూవీ గతనెల ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రాన్ని తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి బ్యానర్లో రిలీజ్ చేశారు.(ఇది చదవండి: ధనుశ్ డైరెక్షన్లో లవ్ ఎంటర్టైనర్.. ట్రైలర్ చూశారా?)అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈనెల 21 నుంచి అందుబాటులోకి తీసుకు రానున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రంలో వెంకటేష్ మీనన్, రబియా ఖాటూన్, రమ్య రంగనర్హన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. ఈ సినిమాను వండర్‌బార్ ఫిల్మ్స్ బ్యానర్లో స్తూరి రాజా, విజయలక్ష్మి కస్తూరి రాజా నిర్మించిన సంగతి తెలిసిందే. -
అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ.. ఫస్ట్ సాంగ్ వచ్చేసింది!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించింది. ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని మైత్రి మేకర్స్ బ్యానర్లో వై రవిశంకర్, నవీన్ యేర్నేని నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. తాజాగా ఈ మూవీ నుంచి ఓజీ సంభవం పేరుతో ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్ విడుదల చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. గుడ్ బ్యాడ్ అగ్లీ టీజర్లో అజిత్ యాక్షన్ సన్నివేశాలు ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాగా.. ఈ యాక్షన్ మూవీ ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా.. ఈ చిత్రంలో సునీల్, ప్రసన్న కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతం అందించారు. Maameyyyyy!!!The Blast is here 💥💥#OGSambavam from #GoodBadUgly 🔥🔥https://t.co/FWr6nWOpB5In cinemas April 10th.— Mythri Movie Makers (@MythriOfficial) March 18, 2025 -
నేరుగా ఓటీటీకి మీరా జాస్మిన్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్స్ మీరా జాస్మిన్, నయనతార నటించిన చిత్రం 'ది టెస్ట్'. ఈ సినిమాతో నిర్మాత శశికాంత్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీలో మాధవన్, సిద్ధార్థ్ లీడ్ రోల్స్ చేశారు. చెన్నైలో జరిగిన ఓ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ముగ్గురు వ్యక్తుల జీవితాలను ఎలా ప్రభావితం చేసిందనే కథనంతో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించారు. వైనాట్ స్టూడియోస్ బ్యానర్లో ఈ మూవీని తెరకెక్కించారు.అయితే ఈ సినిమాను నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. మీరా జాస్మిన్ ఫోటోలు షేర్ చేస్తూ స్ట్రీమింగ్ డేట్‌ను రివీల్ చేసింది. ఏప్రిల్ 4వ తేదీ నుంచి టెస్ట్ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు పోస్ట్ చేసింది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీలో కూడా అందుబాటులో ఉండనుందని ట్విటర్ ద్వారా తెలిపింది.ఒకప్పటి స్టార్ హీరోయిన్ మీరా జాస్మిన్ తెలుగువారికి సుపరిచితమే. రవితేజ భద్ర సినిమాతో టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. టాలీవుడ్లో గుడుంబా శంకర్, రారాజు, ఆకాశ రామన్న, గోరింటాకు, బంగారు బాబు, మహారథి లాంటి చిత్రాల్లో కనిపించింది. అయితే కొన్నేళ్లపాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన మీరా.. ఆ తర్వాత విమానం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం టెస్ట్ మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది.Some things change, but our love for Meera Jasmine? Never 🥰Watch TEST, out 4 April in Tamil, Telugu, Malayalam, Kannada and Hindi, only on Netflix!#TestOnNetflix pic.twitter.com/Sm1Neb2B4t— Netflix India South (@Netflix_INSouth) March 18, 2025 -
రన్యా రావు కేసులో బిగ్ ట్విస్ట్.. టాలీవుడ్ హీరో అరెస్ట్!
దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ దొరికిపోయిన కన్నడ నటి రన్యా రావు (Ranya Rao Case) కేసులో రోజుకో ట్విస్ట్ బయటకు వస్తోంది. తాజాగా ఈ కేసు మరో మలుపు తిరిగింది. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో తెలుగు నటుడు తరుణ్ రాజ్ కొండూరుని పోలీసులు అరెస్ట్ చేశారు.‘పరిచయం’(2018)అనే సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన తరుణ్ రాజ్.. డెబ్యూ ఫిల్మ్‌తోనే ప్లాప్‌ని మూటగట్టుకున్నాడు. లక్ష్మీకాంత్ చెన్నా ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, సిమ్రత్ కౌర్ హీరోయిన్గా నటించింది. 2018 తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. ఇప్పుడు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ కావడంతో తరుణ్‌రాజ్ కొండూరు పేరు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. రోజుకో ట్విస్ట్గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టై ప్రస్తుతం డీఆర్ఐ కస్టడీలో ఉన్న కన్నడ నటి రన్యారావు గురించి రోజుకో ట్విస్ట్ బయటకు వస్తూనే ఉంది. ఆమెకు గత నవంబర్‌లో వివాహం అయిందట. పెళ్లయిన నెల నుంచే తాము విడిగా ఉంటున్నట్లు ఆమె భర్త జతిన్ హుక్కేరి కోర్టులో వెల్లడించారు. తాము అధికారికంగా విడిపోలేదని, అయితే కొన్ని కారణాల వల్ల వేరుగా జీవిస్తున్నామని చెప్పారు. ఈ కేసు విషయంలో తాజాగా జతిన్ హుక్కేరీని అధికారులు కర్ణాటక హైకోర్టులో హాజరుపరిచారు. రన్యారావు చేస్తున్న స్మగ్లింగ్ తో ఏమైనా సంబంధాలు ఉన్నాయన్న కోణంలో జతిన్ ను కస్టడీకి ఇవ్వాలంటూ డీఆర్ఐ కోరింది. ఈ క్రమంలోనే జతిన్ ను మరోసారి ఈరోజు(సోమవారం) కోర్టు ముందు హాజరుపరిచారు. అయితే రన్యారావు స్మగ్మింగ్ తో తనకు ఏమీ సంబంధం లేదని చెబుతున్న జతిన్.. తాము పెళ్లి చేసుకున్నాం.. కానీ వేరుగా ఉంటున్నామని కోర్టుకు తెలిపాడు. ఇదే విషయాన్ని జతిన్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అతని విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న కోర్టు.. తదుపరి విచారణ వరకూ జతిన్ పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని అధికారులను ఆదేశించారు.ఏం జరిగింది?నటి రన్యారావు మార్చి 3న బెంగళూరు ఎయిర్‌పోర్టులో 14 కిలోల బంగారాన్ని అక్రమంగా తీసుకొస్తూ పట్టుబడింది. ఈమెకు సీనియర్ ఐపీఎస్ అధికారి కె.రామచంద్రారావు సవతి తండ్రి అవుతాడు. భద్రతా తనిఖీలను తప్పించుకునేందుకు తండ్రి పేరును దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలున్నాయి. ఆమెను అరెస్టు చేసిన అధికారులు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. -
'ఘాటి'తో విక్రమ్ కనెక్ట్ అవుతాడా.. భారీ అంచనాలతో అనుష్క
దక్షిణాదిలో అగ్ర కథానాయకిగా రాణించిన నటి అనుష్క. తెలుగులో తొలుత కథానాయకిగా రంగప్రవేశం చేసినా, ఆ తరువాత తమిళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోల సరసన నటించి క్రేజీ హీరోయిన్గా రాణించారు. మొదట్లో చాలా మంది హీరోయిన్ల మాదిరిగానే గ్లామర్‌ను నమ్ముకున్న అనుష్కను అరుంధతి చిత్రం ఆమె కెరీర్‌నే మార్చేసింది. ఆ చిత్రంలో అనుష్క రౌద్రమైన నటన అందరి ప్రశంసలు అందుకుంది. ఆ తరువాత రుద్రమదేవి, బాహుబలి, భాగమతి వంటి చిత్రాల విజయాలకు తన నటన అదనపు బలంగా మారింది. బరువు పెరగడం తదితర అంశాల కారణంగా సినిమాలు తగ్గాయనే చెప్పాలి. అనుష్క చివరిగా నటించిన చిత్రం మిస్‌శెట్టి మీస్టర్ పొలిశెట్టి 2023లో విడుదలై మంచి విజయాన్నే అందుకుంది. కాగా ఆ తరువాత రెండేళ్ల గ్యాప్ తరువాత అనుష్క నటించిన 'ఘాటి' చిత్రం తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. దీన్ని టాలీవుడ్ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ఇంతకు ముందు వీరి కాంబినేషన్లో వచ్చిన వేదం చిత్రం 2010లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. కాగా 15 ఏళ్ల తరువాత ఇప్పుడు ఘాటి చిత్రంతో ఈ కాంబో రిపీట్ కావడం విశేషం. ఈ చిత్రం ద్వారా తమిళ నటుడు విక్రమ్ ప్రభు తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. ఘాటి చిత్రం తమిళంతో పాటూ మలయాళం,తెలుగు, కన్నడం,హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు ప్రకటించారు. కాగా ఈ చిత్ర టైటిల్, టీజర్లు ఇప్పటికే విడుదలై ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశాయి. కాగా చిత్రాన్ని ఎప్రిల్ 18వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ప్రకటించిన ప్రకారం ఘాటి చిత్రం తెరపైకి వస్తుందా? అనే ప్రశ్న సినీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. అంతే కాకుండా ఈ చిత్రం అంచనాలను అధిగమిస్తుందా? అనే చర్చ జరుగుతోంది. ఇకపోతే ఈ 44 ఏళ్ల భామ తాజాగా మలయాళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడ కత్తనార్ అనే చిత్రంలో నటిస్తున్నారు. -
నటి సీతకు విడాకులు.. భార్య స్థానం మరొకరికి ఇవ్వలేను: పార్తీబన్
ఆర్. పార్తీబన్ (R. Parthiban) నటుడు మాత్రమే కాదు.. దర్శకుడు, నిర్మాత కూడా! అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ఆరంభించిన దాదాపు 16 సినిమాలకు దర్శకుడిగా, దాదాపు 14 సినిమాలకు నిర్మాతగా పని చేశాడు. వందకుపైగా సినిమాల్లో యాక్టర్‌గా పని చేశాడు. రచయితగా, సింగర్‌గానూ తన టాలెంట్ చాటుకున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. సీత వల్లే ఆ సినిమా హిట్టుడైరెక్టర్గా నా మొదటి సినిమా పుదియా పాడై (Pudhiya Paadhai). సీత నటించడం వల్లే ఈ సినిమా హిట్టయింది. తర్వాత సీతనే పెళ్లి చేసుకున్నాను. పెళ్లయ్యాక కొంతకాలం పాటు ఆమె సినిమాలు చేయలేదు. సినిమాల్లో నటించమని ఒత్తిడి చేయొద్దన్నారు. సరేనని ఊరుకున్నాను. తర్వాత కొంతకాలానికి తనకే ఆసక్తి వచ్చి మళ్లీ యాక్టింగ్ మొదలుపెట్టింది. అయితే కొన్ని కారణాల వల్ల పరస్పర అంగీకారంతో విడిపోయాం. అప్పుడు మేము కలిసున్న ఇంటిని అమ్మేశాం. ఇంతవరకు మళ్లీ ఇల్లు కొనలేకపోయాను. అద్దె ఇంట్లోనే ఉంటున్నాను.అందుకే ఇంకా సింగిల్‌గానే..అయితే ఇప్పటికీ సీతను గౌరవిస్తాను, ప్రేమిస్తాను. అందుకే 24 ఏళ్లయినా మళ్లీ పెళ్లి చేసుకోలేదు. నా భార్యగా సీతకు స్థానమిచ్చాను. దాన్ని మరొకరికి ఇవ్వలేను. ఇద్దరమ్మాయిలకు పెళ్లయింది. నా కొడుకు, నేను మాత్రం ఇంకా సింగిల్‌గానే ఉంటున్నాము. సీతతో నేను టచ్‌లో లేను. ఆమె తల్లి చనిపోయినప్పుడు మాత్రం వెళ్లి దగ్గరుండి అంత్యక్రియలు జరిపించాను అని చెప్పుకొచ్చాడు.పార్తీబన్ కెరీర్పార్తీబన్ 1990లో నటి సీతను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం. ఒక కుమారుడిని దత్తత తీసుకున్నారు. 2001లో పార్తీబన్- సీత విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి ఇతడు ఒంటరిగానే ఉంటున్నాడు. సీత మరొకరిని పెళ్లి చేసుకోగా తర్వాతి కాలంలో ఆయనకు సైతం విడాకులిచ్చినట్లు తెలుస్తోంది. సినిమాల విషయానికి వస్తే.. యుగానికి ఒక్కడు, నేనూ రౌడీనే, పొన్నియన్ సెల్వన్ 1, పొన్నియన్ సెల్వన్ 2 వంటి పలు చిత్రాల్లో నటించాడు. సుడల్ 1 వెబ్ సిరీస్‌లోనూ యాక్ట్ చేశాడు. ప్రస్తుతం హాలీవుడ్లో కూడా ఓ సినిమా చేస్తున్నాడు.చదవండి: కూతురికి పాలు పట్టిద్దామంటే రూ.5 కూడా చేతిలో లేవు: నటుడు -
నటుడిపై మాజీ భార్య తీవ్ర ఆరోపణలు.. ఇక ఆపేయాలంటూ వార్నింగ్!
మాజీ భార్య తనను వేధింపులకు గురి చేస్తోందంటూ ప్రముఖ మలయాళ నటుడు బాలా ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమెతో పాటు మరో యూట్యూబర్‌పై కొచ్చి పోలీసులను ఆశ్రయించారు. అయితే అతని మాజీ భార్య ఎలిజబెత్ ఉదయన్ నటుడిపై తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది. తనను బాలా వేధించడంతో పాటు అత్యాచారం చేశాడంటూ ఎలిజబెత్ ఉదయన్ సోషల్ మీడియా వేదికగా ఆరోపించింది. తాజాగా ఈ వివాదంపై నటుడు బాలా ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ విషయంపై మాట్లాడుతూ ఫేస్బుక్లో వీడియో పోస్ట్ చేశారు. అంతకుముందే నటుడి భార్య కోకిల సైతం తన భర్తపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఎలిజబెత్‌ను కోరుతూ ఓ వీడియో రిలీజ్ చేసింది.బాలా వీడియోలో మాట్లాడుతూ.."దయచేసి మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి. ఈ వివాదంపై ఇది నా చివరి వీడియో కావాలని కోరుకుంటున్నా. ప్రియమైన ఎలిజబెత్.. మీ కుటుంబం పట్ల నాకు గౌరవం ఉంది. ప్రస్తుతం మీరు డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. ఇప్పుడు మీకు కావాల్సింది సోషల్ మీడియా అటెన్షన్ కాదు.. ఈ సమయంలో మీకు వైద్యం చాలా అవసరం. మీ కుటుంబంలో ఎవరైనా డాక్టర్ ఉన్నట్లయితే సరైన వైద్యం తీసుకోండి. లేదంటే మీ సోదరులు, తల్లిదండ్రులతో కలిసి వైద్యుని వద్దకు కెళ్లండి. తనపై తప్పుడు ప్రచారం మానేయండి. ఈ వివాదానికి ఇక్కడితో ముగింపు పలకండి. లేని పక్షంలో ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వెనుకాడను' అంటూ పోస్ట్ చేశారు.కాగా.. నటుడు బాలా.. డాక్టర్ ఎలిజబెత్ ఉదయన్‌ను 2021లో వివాహం చేసుకున్నారు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత మనస్పర్థలు రావడంతో ఈ జంట విడిపోయారు. అయితే ఈ విషయంలో కొందరు ఎలిజబెత్‌కు మద్దతుగా నిలుస్తుండగా.. మరికొందరు ఆమె తీరును తప్పుబడుతున్నారు. మీవల్లే ఎలిజబెత్ అలా ప్రవర్తిస్తోందని నటుడు బాలాపై కొందరు విమర్శలు చేస్తున్నారు. -
రూ.100 కోట్ల ఖరీదైన ఇల్లు కొన్న నయన్?
హీరోయిన్ నయనతార (Nayanthara) ప్రస్తుతం సినిమాలు చాలావరకు తగ్గించేసింది. అడపాదడపా మాత్రమే చేస్తోంది. రీసెంట్ గానే తమిళంలో ఒకటి కమిటైంది. కానీ ఇప్పటికే నటిగా బోలెడంత పేరు, లెక్కలేనంత ఆస్తి సంపాదించుకుంది. ఇప్పుడు అలా తాను సంపాదించుకున్న డబ్బుతో కోట్ల ఖరీదు ఇల్లు కమ్ స్టూడియోని (Nayan New House)కొనుగోలు చేసింది. (ఇదీ చదవండి: ఈ రైతుబిడ్డ పెద్ద వెధవ, బికారిలా అడుక్కుని ఇప్పుడేమో..: అన్వేష్ ఫైర్)దక్షిణాదిలో దాదాపు 15 ఏళ్లకు పైగా సినిమాలు చేస్తున్న నయన్.. రీసెంట్ టైంలో ఏదో ఒకలా వార్తల్లో నిలుస్తూనే ఉంది. నెట్ ఫ్లిక్స్ అమ్మిన తన పెళ్లి వీడియో కోసం ఏకంగా హీరో ధనుష్(Dhanush)తోనే గొడవ పెట్టుకుంది. ఇదేమో రూ.10 కోట్ల పరువు నష్టం దావా వరకు వెళ్లింది. సరే ఇవన్నీ పక్కనబెడితే ఇప్పుడు చెన్నైలోని రజనీకాంత్, ధనుష్ తదితర సెలబ్రిటీలు నివసించే ఖరీదైన పోయెస్ గార్డెన్ ఏరియాలో ఇప్పుడు నయన్.. భర్తతో కలిసి కొత్తగా ఇల్లు కొనుగోలు చేసింది.మూడు అంతస్తులు ఉన్న ఈ ఇంటిలో గ్రౌండ్ ఫ్లోర్ అంతా స్టూడియో సెటప్, పైన ఇల్లుకు తగ్గట్లు డిజైన్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు స్వయంగా నయన్ ఇన్ స్టాలోనే కనిపించాయి. చూస్తుంటేనే రాజసం ఉట్టిపడేలా 7000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇల్లు ఖరీదు రూ.100 కోట్లు ఉండొచ్చనే టాక్ వినిపిస్తుంది. సాధారణంగా అక్కడ సాధారణమైన ఇల్లు రూ.2 కోట్ల ఖరీదు పలుకుతుంది. అలాంటి ఇంతలా సెటప్, ఇంటీరియర్ డిజైన్ చూస్తుంటే రూమర్స్ నిజమే అనిపిస్తోంది.(ఇదీ చదవండి: థియేటర్లో సినిమాల జోరు.. ఓటీటీలో ఏకంగా 15 చిత్రాలు/సిరీస్‌లు) -
అనారోగ్యంతో నటి 'బిందు' మృతి.. చివరిరోజుల్లో చుట్టుముట్టిన ఆర్థిక సమస్యలు
సీనియర్ హాస్య నటి బిందు ఘోష్ ఇక లేరు. ఆదివారం మధ్యాహ్నం చైన్నెలోని స్వగృహంలో కన్నుమూశారు . ఈమె వయసు 76 ఏళ్లు. ఈమె అసలు పేరు విమల. 1981లో గ్రూప్ డాన్సర్‌గా సినీ రంగ ప్రవేశం చేసిన ఈమె నృత్య దర్శకుడు కన్నప్పన్ వద్ద డాన్సర్‌గా పనిచేశారు. అలా తమిళ్లో కలతూర్ కన్నమ్మ చిత్రంలో నటుడు కమలహాసన్‌తో కలిసి డాన్స్ చేశారు. ఆ తర్వాత కోళి కూవుదు చిత్రం ద్వారా నటిగా మారిన బిందు ఘోష్ పలురకాల పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. కమల్ హాసన్ రజనీకాంత్ ప్రభు, విజయ్ కాంత్, కార్తీక్ తదితర ప్రముఖ నటుల చిత్రాల్లో నటించారు. తెలుగులో దొంగ కాపురం, పెళ్లి చేసి చూడు, కృష్ణ గారి అబ్బాయి, ప్రాణానికి ప్రాణం, చిత్రం భళారే విచిత్రం తదితర చిత్రాల్లో నటించారు. ఈమె తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. కాగా స్థానిక విరుగంబాక్కంలో నివసిస్తున్న బిందు గోష్ వృద్ధాప్యంలో పలు రకాల సమస్యలతో అనారోగ్యానికి గురయ్యారు. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో వైద్య ఖర్చులకు కూడా డబ్బు లేక అవస్థలు పడ్డారు. కాగా చైన్నెలోని విరుగంబాక్కంలో నివశిస్తున్న సింధు ఘోష్ ఆదివారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. బిందు ఘోష్ భౌతిక కాయానికి సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆమె కుమార్తెలు తెలిపారు.రెండురోజుల క్రితమే ఆమె గురించి ఇలా మాట్లాడిన కుమారుడుతల్లి అనారోగ్య పరిస్థితి గురించి తనయుడు, కొరియోగ్రాఫర్ శివాజీ కొద్దిరోజుల క్రితమే మీడియాతో పంచుకున్నాడు. 'అమ్మకు 76 ఏళ్లు. ఒకప్పుడు 118 కిలోల బరువుండేది. అనారోగ్యం వల్ల ఏకంగా 38 కిలోలకు తగ్గిపోయింది. ఆహారం కూడా తీసుకోవడం లేదు. ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయి. అమ్మ సంపాదించిన ఆస్తులన్నీ కోల్పోయింది. అందుకే ఇప్పుడు ఇంత ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఈ మధ్యే తమిళనాడు ప్రభుత్వం స్పందించి అమ్మకు చికిత్స అందిస్తోంది' అని గతంలో ఆయన పేర్కొన్నాడు. ఇంతలోనే ఆమె మరణించారనే వార్త తెలియడంతో అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. -
మలయాళ మెగాస్టార్‌పై రూమర్స్.. స్పందించిన టీమ్!
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఆరోగ్యంపై వస్తున్న రూమర్స్‌పై ఆయన టీమ్ స్పందించింది. గత కొద్ది రోజులుగా ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారని కథనాలొచ్చాయి. అందుకే సినిమాలకు దూరంగా ఉన్నారంటూ రాసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన టీమ్ అభిమానులకు క్లారిటీ ఇచ్చింది. అవన్నీ ఫేక్ న్యూస్ అని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆయన స్టార్ సెలవుల్లో ఉన్నారని తెలిపింది. రంజాన్ కోసం ఉపవాసంలో ఉన్నారని పేర్కొంది. త్వరలోనే తిరిగి సినిమాల్లో నటిస్తారని వెల్లడించింది.మమ్ముట్టి టీమ్ తమ ప్రకటనలో రాస్తూ.. 'ఆయన ప్రస్తుతం రంజాన్ ఉపవాసం ఉన్నందున సెలవుల్లో ఉన్నారు. ఆ కారణంతోనే అతను తన షూట్ షెడ్యూల్ నుంచి కూడా విరామం తీసుకున్నారు. విరామం తర్వాత మోహన్ లాల్- మహేష్ నారాయణన్ సినిమా షూటింగ్‌కి తిరిగి వెళ్తారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అవన్నీ ఫేక్ న్యూస్" అని స్పష్టం చేశారు.కాగా.. మమ్ముట్టి, మోహన్‌లాల్‌లు నటిస్తోన్న మహేష్ నారాయణన్ సినిమా మొదటి షెడ్యూల్ శ్రీలంకలో ప్రారంభమైంది. ఈ మల్టీస్టారర్ మలయాళ చిత్రంలో ఇద్దరు పెద్ద స్టార్స్ మమ్ముట్టి, మోహన్‌లాల్ నటిస్తున్నారు. ఈ మూవీకి తాత్కాలికంగా ఎంఎంఎంఎన్ (మమ్ముట్టి, మోహన్‌లాల్, మహేష్ నారాయణన్) అని వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్, కుంచాకో బోబన్, నయనతార, దర్శనా రాజేంద్రన్ కూడా నటిస్తున్నారు. కాగా.. మమ్ముట్టి చివరిగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించిన కామెడీ చిత్రం డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్‌లో కనిపించారు. ఈ చిత్రం ఈ ఏడాది జనవరి 23న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. -
మాజీ భార్య వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన నటుడు
ప్రముఖ మలయాళ నటుడు, డైరెక్టర్ బాలా పోలీసులను ఆశ్రయించారు. తన మాజీ భార్య ఎలిజబెత్ ఉదయన్ వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. తనతో పాటు తన భార్య కోకిలపై యూట్యూబర్ అజు అలెక్స్‌తో కలిసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని కొచ్చి సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కంప్లైంట్ ఇచ్చారు. ఎలిజబెత్ తనను రూ. 50 లక్షలు డిమాండ్ చేసిందని పోలీసులకు వివరించారు. ఆ డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతోనే తనపై విష ప్రచారం చేస్తోందని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.తన ప్రతిష్టకు భంగం కలిగేలా సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని నటుడు బాల ఆరోపిస్తున్నారు. యూట్యూబర్ అజు అలెక్స్ ఛానెల్లో తనపై అభ్యంతరకరమైన వీడియోలను పోస్ట్ చేయడం ప్రారంభించారని బాల తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. సెప్టెంబర్ 8, 2023లోనే ఎలిజబెత్‌తో తాను విడిపోయినట్లు బాలా పోలీసులకు వెల్లడించారు. కేవలం డబ్బు కోసం తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని బాలా మండిపడ్డారు.ఫిర్యాదు అనంతరం బాలా మీడియాతో మాట్లాడుతూ..' కొందరు సోషల్ మీడియా ద్వారా నన్ను, నా కుటుంబాన్ని వేధిస్తున్నారు. ఇదో వెబ్ సిరీస్‌లా సాగుతోంది. నేనేమైనా రేపిస్టునా?, ఒక మహిళపై ఏడాదిన్నర పాటు అత్యాచారం ఎలా చేయగలను? నాకు ఇప్పటికే సర్జరీ జరిగింది. నా శస్త్రచికిత్స సమయంలో ఎలిజబెత్ ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. ఏడాదిన్నర తర్వాత వచ్చి ఆమె నాపై ఆరోపణలు చేస్తోంది' అని బాల అన్నారు. ఓ వ్యక్తితో కలిసి ఆమె తమపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన భార్య కోకిల మీడియాకు తెలిపారు. సోషల్ మీడియాలో తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని వాపోయారు. -
హీరోయిన్ కి ఖరీదైన కారు గిఫ్ట్.. రేటు ఎంతో తెలుసా?
సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు ఏదో ఒకటి కొంటూనే ఉంటారు. బాలీవుడ్ లో ఈ ట్రెండ్ ఎక్కువ. ఫ్లాట్స్, కార్లు అని ఏదో ఒకటి కొని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. అలా ఇప్పుడు హీరోయిన్ అమలాపాల్ (Amala Paul) భర్త ఖరీదైన కారు కొని భార్యకి బహుమతిగా ఇచ్చాడు. ఇంతకీ దీని రేటు ఎంతో తెలుసా?(ఇదీ చదవండి: హీరో విశ్వక్సేన్ సోదరి ఇంట్లో భారీ చోరీ)కేరళకు చెందిన అమలాపాల్ ప్రస్తుతం సినిమాలేం చేయట్లేదు. కొన్నాళ్ల ముందు వరకు మాత్రం తెలుగు, తమిళ, మలయాల చిత్రాల్లో నటించింది. 2023లో జగత్ దేశాయ్ అనే బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకున్న తర్వాత టైమ్ అంతా పూర్తిగా ఫ్యామిలీకే కేటాయిస్తోంది. గతేడాది కొడుకు కూడా పుట్టాడు.తాజాగా సందర్భం ఏంటో తెలియదు గానీ జగత్.. అమలాపాల్ కి ఖరీదైన బీఎండబ్ల్యూ 7 సిరీస్ (BMW Car) కారుని బహుమతిగా ఇచ్చాడు. దీని ధర మార్కెట్ లో రూ.2 కోట్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. అంతే కాకుండా వీళ్ల దగ్గర కాస్ట్ లీ పోర్స్ కారు కూడా ఒకటి ఉంది. బీఎండబ్ల్యూ కారు వీడియోని మాత్రం అమలాపాల్, ఆమె భర్త ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.(ఇదీ చదవండి: కుడుంబస్థాన్ సినిమా రివ్యూ (ఓటీటీ)) View this post on Instagram A post shared by Jagat Desai (@j_desaii) -
వెంకటేష్‌తో హిట్ సినిమా.. జైలుకు వెళ్లడంతో ఆమె కెరీర్ క్లోజ్
వెంకటేష్, సౌందర్య జంటగా నటించిన 'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు' చిత్రం చాలామంది చూసే ఉంటారు. 1996లో విడుదలైన ఈ చిత్రానికి ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అప్పట్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అయితే, ఇందులో నేపాలి అమ్మాయిగా నటించిన టాప్ హీరోయిన్ 'వినీత' గుర్తుందా..? కథలో భాగంగా ఒకమారు వెంకటేష్ నేపాల్‌కు వెళ్లినపుడు చిత్రమైన పరిస్థితులలో చిక్కుకొని ఆ నేపాలి అమ్మాయిని పెళ్ళి చేసుకొంటాడు. ఆపై కథ అనేక మలుపులు తిరుగుతుంది. వినీత విషయానికి వస్తే.. 2003 వరకు సుమారు 70కి పైగా సినిమాల్లో నటించిన ఆమె ఒక్కసారిగా చిత్రపరిశ్రమకు ఎందుకు దూరం అయింది..? మళ్లీ రీ ఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తుందా..?ఇండియన్ సినిమా పరిశ్రమలో ఒకప్పుడు 'వినీత' పేరు బాగా పాపులర్. ముఖ్యంగా కోలీవుడ్‌లో ఆమె స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో అక్కడి స్టార్ హీరోలతో అనేక సినిమాల్లో మెప్పించింది. ఆపై మలయాళంలో కూడా మోహన్ లాల్ లాంటి హీరోతో నటించింది. ఆపై బాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇచ్చేసింది. ఇలా వరుస విజయాలతో వెళ్తున్న వినీతకు 2003లో తగిలిన ఎదురుదెబ్బతో ఆమె ఇప్పటికీ కోలుకోలేదు. ఆ ఏడాదిలో కొందరి ఫిర్యాదుతో వినీతపై వ్యభిచారం కేసును పోలీసులు నమోదుచేశారు. తల్లి, సోదరుడితో కలిసి ఆమె ఈ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కానీ, 2004లో ఆమెకు అనుకూలంగా కోర్టు తీర్పు వెళ్లడించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలా కేసు నమోదు చేశారని కోర్టు తప్పుబట్టింది. ఆమెపై ఎటువంటి అభియోగాలు లేకుండా ఆ కేసును న్యాయస్థానం కొట్టివేసింది. అయతే, ఆమెకు జరగాల్సిన నష్టం అంతా ఇంతలోనే జరిగిపోయింది. విచారణ పేరుతో తనను మానసిక వేదనకు గురిచేశారని ఆ సమయంలో వినీత పేర్కొంది. సమాజంలో తన పేరును నాశనం చేసేలా పోలీసులు తనపై తప్పుడు కేసు నమోదు చేశారని ఆమె తెలిపింది. ఈ కేసు తర్వాత వినీతకు సినిమా ఛాన్సులు ఎవరూ ఇవ్వలేదు. తన వ్యక్తిగత జీవితంతో పాటు.. సినీ కెరీర్‌ను కావాలనే కొందరు నాశనం చేశారని ఆమె అభిమానులు పేర్కొన్నారు. సినిమా ఛాన్సులు లేకపోవడంతో ఆమె చాలా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు పలు కథనాలు కూడా వచ్చాయి. సుమారు ఎనిమిది సంవత్సరాల పాటు పరిశ్రమకు దూరంగానే ఉన్న ఆమె మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన రెండు, మూడు సినిమాల్లో మాత్రమే ఛాన్సులు వచ్చాయి. అవి కూడా సహాయక పాత్రలు మాత్రమే.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా కొనసాగిన వినీత ఇలా చిన్న చిన్న పాత్రలలో ఆమె నటించడం అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోయారు. అయితే, వినీత ఇప్పుడు మరోసారి చిత్రపరిశ్రమలో ఛాన్సుల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. అన్నీ కుదురితే తెలుగు పరిశ్రమలో ఎంట్రీ ఇవ్వాలని ఆమె చూస్తున్నట్లు సమాచారం. -
ఆస్పత్రి నుంచి ఏఆర్ రెహమాన్ డిశ్చార్జ్
సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ (A. R. Rahman) ఆస్పత్రిపాలయ్యాడు. ఆదివారం ఉదయం ఛాతీలో నొప్పి మొదలవడంతో చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరినట్లు వార్తలు వచ్చాయి. ప్రత్యేక వైద్య బృందం ఆయనకు ఈసీజీ, ఎకోకార్డియోగ్రామ్ వంటి పలు టెస్టులు నిర్వహించినట్లుగా కథనాలు వెలువడ్డాయి. దీనిపై రెహమాన్ కుమారుడు ఏఆర్ అమీన్ స్పందించాడు. డీహైడ్రేషన్ కారణంగా తన తండ్రి ఆస్పత్రిలో చేరినట్లు వెల్లడించాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని పేర్కొన్నాడు. కొన్ని టెస్టులు చేశారని, అన్నీ నార్మల్‌గానే ఉండటంతో తనను డిశ్చార్జ్ చేశారని తెలిపాడు.సినీ ప్రయాణంఏఆర్ రెహమాన్.. రోజా సినిమాతో సంగీత దర్శకుడిగా ప్రయాణం ఆరంభించాడు. ఎన్నో హిట్ చిత్రాలకు బ్లాక్‌బస్టర్ సంగీతం అందించాడు. తెలుగులో గ్యాంగ్‌మాస్టర్, నీ మనసు నాకు తెలుసు, నాని, ఏ మాయ చేసావె, సాహసం శ్వాసగా సాగిపో వంటి చిత్రాలకు పని చేశాడు. ఇటీవల వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ ఛావాకు అద్భుతమైన సంగీతం అందించాడు. ప్రస్తుతం రామ్‌చరణ్-బుచ్చిబాబు సనా కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. ఈయనను ప్రభుత్వం.. పద్మ శ్రీ, పద్మ భూషణ్‌తో సత్కరించింది. స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమాకుగానూ రెండు ఆస్కార్లు అందుకున్నాడు. చదవండి: నా పక్కన హీరోయిన్గా నటించలేమన్నారు: సప్తగిరి -
'జైలర్' కోసం నమ్మించి మోసం చేయాలనుకున్నారు: మలయాళ నటి
ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసిన కూడా స్కామ్‌లతో పాటు మోసాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సినిమా ఛాన్స్‌ల పేరుతో కొందరు చేస్తున్న మోసాలకు చాలామంది బలి అవుతున్నారు. ఇదే విషయాన్ని మలయాళ నటి షైనీ సారా ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. తనకు రజనీకాంత్ నటించిన జైలర్ సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తామని కొందరు మోసానికి పాల్పడినట్లు ఆమె గుర్తుచేసుకుంది. ఆయనకు సతీమణిగా నటించే అవకాశం ఉన్నట్లు తనను ఒక టీమ్ నమ్మించేందుకు ప్లాన్ చేసిందని ఆమె తెలిపింది.జైలర్ చిత్రంలో రజనీకాంత్ భార్య పాత్ర కోసం తనను ఎంపిక చేసినట్లు వాట్సాప్‌లో ఒక మేసేజ్ వచ్చినట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఆ మెసేజ్ చూసిన తర్వాత తాను మొదట నమ్మానని షైనీ సారా వివరించింది. తరువాత, ఆమె వద్ద నటుల సంఘం సభ్యత్వ కార్డు ఉందా అని వారు అడగడంతో .. అవేవీ లేవని చెప్పినట్లు తెలిపింది. అయతే, ఆ స్కామర్ ఆ సభ్యత్వం తానే ఏర్పాటు చేస్తానని ముందుకొచ్చాడంటూ ఆమె ఇలా చెప్పింది. 'రెండు రోజుల తర్వాత సురేష్ కుమార్ అనే వ్యక్తి నన్ను సంప్రదించాడు. చీర ధరించి వీడియో కాల్లోకి రావాలని కోరాడు. కాల్ తర్వాత, నేను ఎంపికి అయ్యానని చెప్పారు. కానీ, సభ్యత్వ కార్డు కోసం రూ. 12,500 చెల్లించమని అడిగారు. అనుమానం వచ్చి, నేను ఎలాంటి చెల్లింపులు చేయలేదు. దీంతో కనీసం కొంత మొత్తాన్ని అయినా సరే పంపమని కోరారు. అప్పుడు నా సందేహాలు మరింత ఎక్కువ అయ్యాయి. ఆ తర్వాత నా తోటి నటులను సంప్రదించాను. నటనకు సభ్యత్వం తప్పనిసరి కాదని వారు నిర్ధారించారు. దీంతో మళ్లీ ఆ వ్యక్తిని సంప్రదించడానికి ప్రయత్నించినప్పుడు, అతని ఫోన్ స్విచ్ ఆఫ్ చేయబడింది. సినీ పరిశ్రమలో ఇలాంటి మోసాల గురించి జాగ్రత్తగా ఉండాలని ఆమె ఇతరులను హెచ్చరించింది. -
దిల్లీ రిటర్న్స్
దిల్లీ రిటర్న్స్ అని హీరో కార్తీ అంటున్నారు. హీరో కార్తీ, దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో రూపొందిన ‘ఖైదీ (2019)’ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో దిల్లీ అనే ఖైదీ పాత్రలో కార్తీ మంచి నటన కనబరిచారు. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ఖైదీ 2’ చేయాలని కార్తీ, లోకేశ్ ఎప్పట్నుంచో ప్లాన్ చేస్తున్నారు. కానీ లోకేశ్‌కు ఉన్న ఇతర కమిట్మెంట్స్ కారణంగా ‘ఖైదీ 2’ చిత్రీకరణ వాయిదా పడుతూ వస్తోంది.కాగా ఈ ఏడాది ‘ఖైదీ 2’ చిత్రీకరణప్రారంభం అవుతుందన్నట్లుగా ‘ఎక్స్’లో ‘దిల్లీ రిటర్న్స్’ అంటూ పేర్కొన్నారు కార్తీ. ‘ఖైదీ’ సీక్వెల్ ‘ఖైదీ 2’ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్, కేవీన్ప్రొడక్షన్స్ సంస్థలు నిర్మించనున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం రజనీకాంత్ ‘కూలీ’ సినిమా పనులతో బిజీగా ఉన్నారు లోకేశ్ కనగరాజ్. ‘సర్దార్ 2’ మూవీతో బిజీగా ఉన్నారు కార్తీ... వీరిద్దరూ వారి వారి కమిట్మెంట్స్ పూర్తి చేసుకున్న తర్వాత ‘ఖైదీ 2’ చిత్రం సెట్స్‌పైకి వెళ్తుందని ఊహించవచ్చు. -
ఆస్తులు కోల్పోయి మంచాన పడ్డ నటి.. 118 నుంచి 38 కిలోలకు..
దాదాపు మూడు వందల సినిమాల్లో నటించిన బిందు ఘోష్ (Bindu Ghosh) ఇప్పుడు దీన స్థితిలో ఉంది. తమిళ, తెలుగు భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణించిన ఆమె మంచాన పడింది. మూడు నెలలుగా కాలేయం, బీపీ సంబంధింత సమస్యలతో బాధపడుతోంది.క్షీణించిన ఆరోగ్యం..తల్లి అనారోగ్య పరిస్థితి గురించి తనయుడు, కొరియోగ్రాఫర్ శివాజీ మాట్లాడుతూ.. అమ్మకు 76 ఏళ్లు. ఒకప్పుడు 118 కిలోల బరువుండేది. అనారోగ్యం వల్ల ఏకంగా 38 కిలోలకు తగ్గిపోయింది. ఆహారం కూడా తీసుకోవడం లేదు. ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయి. అమ్మ సంపాదించిన ఆస్తులన్నీ కోల్పోయింది. తెలుగులో ఏయే సినిమాలు?అందుకే ఇప్పుడు ఇంత ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఈ మధ్యే తమిళనాడు ప్రభుత్వం స్పందించి అమ్మకు చికిత్స అందిస్తోంది అని పేర్కొన్నాడు. బిందు ఘోష్.. కృష్ణగారి అబ్బాయి, దొంగ కాపురం, పెళ్లి చేసి చూడు, చిత్రం భళారే చిత్రం వంటి ఎన్నో తెలుగు చిత్రాల్లో నటించింది. తమిళంలో నటిగానే కాకుండా కొరియోగ్రాఫర్‌గానూ రాణించింది.చదవండి: నితిన్ వల్లే ఐటం సాంగ్ చేశా.. ఇప్పటికీ ఇబ్బందిగా అనిపిస్తుంది: గుత్తా జ్వాల -
అమాయకురాల్ని.. తెల్ల కాగితాలపై బలవంతంగా సంతకం..: రన్యా రావు లేఖ
కన్నడ నటి రన్యా రావు (Ranya Rao) కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. తానసలు బంగారం అక్రమ రవాణా చేయలేదని యూటర్న్ తీసుకుంది. తాను గోల్డ్ స్మగ్లింగ్ చేసినట్లుగా అధికారులే బలవంతంగా ఖాళీ పేపర్లపై సంతకం చేయించారని తెలిపింది. తనకు న్యాయం చేయండంటూ డీఆర్ఐ (Directorate of Revenue Intelligence) అడిషనల్ డైరెక్టర్ జనరల్‌కు లేఖ రాసింది. ఒత్తిడి చేశారుఇటీవల బెంగళూరు ఎయిర్‌పోర్టులో దాదాపు రూ.17 కోట్ల విలువైన బంగారంతో అధికారులకు పట్టుబడింది నటి రన్యారావు. ఆమెను అరెస్ట్ చేసి విచారించగా బంగారం అక్రమ రవాణా చేసినట్లు అంగీకరించింది. ఇంతలో తన తప్పే లేదంటూ లేఖ రాయడం సంచలనంగా మారింది. ఆ లేఖలో ఇంకా ఏముందంటే.. నేను ఎటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడలేదు. కావాలనే నన్ను ఈ కేసులో ఇరికించారు. పోలీసులు అరెస్టు చేసినప్పటి నుంచి కోర్టులో ప్రవేశపెట్టేవరకు నరకం చూపించారు. స్మగ్లింగ్ చేసినట్లుగా ఒప్పుకోమని ఒత్తిడి చేశారు. ఖాళీ పేపర్లపై సంతకం15 సార్లు నా చెంప పగలగట్టారు. బలవంతంగా సంతకం చేయించారు. నాపై దాడి చేసిన అధికారులను నేను గుర్తుపట్టగలను. శారీరక హింస, మానసిక ఒత్తిడిని తట్టుకోలేకపోయాను. వారు చెప్పినట్లుగా 50-60 పేజీలను చదవకుండానే సంతకం చేశాను. అలాగే మరో 40 తెల్లకాగితాలపైనా సంతకం చేయించారు. దయచేసి ఈ కేసులో పారదర్శక విచారణ జరిపించి నాకు న్యాయం చేయండి అని లేఖలో పేర్కొంది. ఇకపోతే ఇటీవల రన్య కస్టడీలో ఉన్నప్పటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో రన్య కళ్ల కింద చర్మం కమిలిపోయి ఉండటం స్పష్టంగా కనిపించింది.(చదవండి: నితిన్ వల్లే ఐటం సాంగ్ చేశా.. ఇప్పటికీ ఇబ్బందిగా అనిపిస్తుంది: గుత్తా జ్వాల)ఏం జరిగింది?నటి రన్యారావు మార్చి 3న బెంగళూరు ఎయిర్‌పోర్టులో 14 కిలోల బంగారాన్ని అక్రమంగా తీసుకొస్తూ పట్టుబడింది. ఈమెకు సీనియర్ ఐపీఎస్ అధికారి కె.రామచంద్రారావు సవతి తండ్రి అవుతాడు. భద్రతా తనిఖీలను తప్పించుకునేందుకు తండ్రి పేరును దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలున్నాయి. ఆమెను అరెస్టు చేసిన అధికారులు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. విచారణలో స్మగ్లింగ్ చేయడం ఇదే మొదటిసారి అంటూ నేరాన్ని అంగీకరించిన ఆమె ఇప్పుడు యూటర్న్ తీసుకోవడంతో కేసు ఆసక్తికరంగా మారింది. ఇటీవల రన్యారావు బెయిల్ కోసం బెంగళూరు ఆర్థిక నేరాల కోర్టును ఆశ్రయించగా.. బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఈ క్రమంలో ఆమె ఉన్నతాధికారులకు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.చదవండి: హీరో విజయ్ 10 సినిమాలు రిజెక్ట్ చేశా: మ్యూజిక్ డైరెక్టర్ -
స్టార్ హీరో రిటైర్మెంట్.. నటిగా కూతురు ఎంట్రీకి లైన్ క్లియర్
కన్నడ హీరో కిచ్చా సుదీప్ 28 సంవత్సరాలుగా ఎన్నో సినిమాలతో అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. రీసెంట్గా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రిటైర్మెంట్ ప్లాన్ గురించి చర్చించారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఆయన కూతురు సాన్వీ సుదీప్ చిత్ర పరిశ్రమలో అడుపెట్టబోతున్నట్లు ప్రకటించింది. దీంతో ఆయన అభిమానులు సోషల్‌మీడియాలో సాన్వీకి స్వాగతం పలుకుతున్నారు. కిచ్చా సుదీప్ నటించిన తాజా చిత్రం మ్యాక్స్ మంచి ఆదరణ పొందింది. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. తాను ఇంకా అలసిపోలేదని అయితే ఏదో సమయంలో తాను నటన నుంచి వైదొలిగే అవకాశం ఉందని షాకింగ్ న్యూస్ చెప్పారు.సినిమా పరిశ్రమ నుంచి కిచ్చా సుదీప్ వైదొలిగిపోతానని చేసిన కామెంట్లు ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇంతలోనే ఆయన కూతురు సాన్వీ ఒక పాడ్‌కాస్ట్‌లో ఇలా చెప్పుకొచ్చింది. 'సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పటకే హైదరాబాద్‌లో 4 నెలల వర్క్‌షాప్‌లో శిక్షణ కూడా పూర్తి చేశాను. నా సొంతంగా అవకాశాలు తెచ్చుకోవాలని ఎదురుచూస్తున్నాను. నాన్న పేరు చెప్పుకుంటే అవకాశాలు వెంటనే దొరుకుతాయి. కానీ, నాకు అలా అవకాశం దక్కించుకోవడం ఇష్టం లేదు. అందుకే నేను నటి అయ్యేందుకు మరికొంత సమయం పట్టొచ్చు. ఇంతలో నేను దర్శకత్వం, స్క్రిప్ట్ రైటింగ్‌లో రాణించే ప్రణాళికలు పెట్టుకున్నాను. పరిశ్రమలో ఉన్న అన్ని విభాగాల్లోనూ నేను ప్రయత్నించాలనుకుంటున్నాను. కానీ, నా అసలైన టార్గెట్ నటిగా గుర్తింపు తెచ్చుకోవడమే..' అని ఆమె చెప్పింది.తాను చాలా కాలంగా అధిక బరువుతో బాధపడుతున్నానని, అందువల్ల నటిగా చేరుకోవడానికి కొంత సమయం పడుతుందని సాన్వీ సుదీప్ నిజాయితీగానే చెప్పంది. ఈలోగా, తాను కెమెరా వెనుక జరిగే పనుల్లో ఉంటానని ఆమె తెలిపింది. ఇప్పటి వరకు పలు పాటలు పాడిన ఆమె హీరోయిన్గా మాత్రమే నటించాలని కోరిక తనకు లేదని కూడా చెప్పింది. ఎలాంటి పాత్ర వచ్చినా సరే చేస్తానని ఆమె తెలిపింది. అయితే, ఫైనల్‌గా సాన్వీ ఎంట్రీ ఉంటుందని క్లారిటీ ఇచ్చేసింది.సాన్వీకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. మంచి సింగర్ కూడా. ఇప్పటికే పలు మ్యూజిక్ ఆల్బమ్స్ చేసింది. సుదీప్ మేనల్లుడు నటించిన ‘జిమ్మీ’ సినిమాలో ఓ పాట కూడా ఆమె పాడింది. త్వరలోనే ఈ బ్యూటీ హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు కన్నడ మీడియాలో కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అవన్నీ నిజం చేస్తూ.. సినిమా ప్రపంచంలో తన ఎంట్రీ ఉంటుందని సాన్వీ పేర్కొంది. ఓ స్టార్ డైరెక్టర్ ఆమెను హీరోయిన్గా పరిచయం చేయబోతున్నాడని తెలుస్తోంది. -
రన్యా రావు స్నేహితుడు తరుణ్‌రాజ్‌కు రిమాండ్
బంగారం అక్రమరవాణా కేసులో అరెస్ట్ అయిన నటి రన్యా రావు స్నేహితుడు తరుణ్‌రాజ్‌కు 14 రోజుల పాటు జుడీషియల్ రిమాండ్ విధిస్తూ బెంగళూరు ఆర్థిక నేరాల విభాగం కోర్టు ఆదేశించింది. తరుణ్‌రాజ్‌ను కస్టడీ గడువు ముగియడంతో డీఆర్ఐ అధికారులు అతన్ని కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన కోర్టు 14 రోజుల పాటు జుడీషియల్ రిమాండ్‌కు ఆదేశించింది. ఆమె ఆప్తుడు, పారిశ్రామికవేత్త తరుణ్ రాజ్‌ను రిమాండ్‌కు తరలించడంతో ఆమెలో ఆందోళన మొదలైనట్లు తెలుస్తోంది.బంగారం అక్రమ రవాణా కేసులో పట్టుబడిన నటి రన్యారావు(34) వ్యవహారంపై మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు ముమ్మరం చేసింది. బెంగళూరుతో పాటు ఆమెకు సంబంధించిన పలు చోట్ల దాడులు చేపట్టింది. ఈ రాకెట్లో భారీ కుట్ర దాగి ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈడీ అధికారులు కూడా ఆ దిశగానే దర్యాప్తు చేస్తోంది. ఈ వ్యవహారంలో సీబీఐ కూడా ఇప్పటికే దర్యాప్తు ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. సౌదీ అరేబియాతో పాటు అమెరికా, పశ్చిమాసియా, ఐరోపా దేశాలలో కూడా రన్యారావు ప్రయాణించినట్లు అధికారులు గుర్తించారు. ఇందులో అంతర్జాతీయ రాకెట్ హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. -
ఊహకందని... ఊహించలేని ఇన్వెస్టిగేషన్ ఇది
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో మలయాళ చిత్రం ‘రేఖా చిత్రం’(Rekhachithram) ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ఇదో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. ఈ తరహా సినిమాలు ఇప్పటికే మనకు పరిచయమున్నా క్షణం కూడా మీ చూపును మరల్చకుండా చేస్తుంది ఈ సినిమా స్క్రీన్‌ప్లే. ‘రేఖా చిత్రం’ ఓ మలయాళ సినిమా. సోనీలివ్, ఆహాలో తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా ఉంది. ఈ సినిమాకి దర్శకుడు జోఫిన్ టి చాకో. కథ రాము సునీల్ అందించారు.ప్రముఖ నటులు ఆసిఫ్ అలీ, అనస్వరా రాజన్ ప్రధాన తారాగణంగా నటించారు. సినిమా చూసే ప్రేక్షకులను ఆద్యంతం ఉత్కంఠతతో, ఊహకందని ట్విస్టులతో ఉర్రూతలూగిస్తుంది. అంతలా ఈ సినిమాలో ఏముందో కథలోకి వెళ్లి తెలుసుకుందాం. వివేక్ అనే పొలీస్ ఆఫీసర్‌కి మలక్కపరా అనే ప్రాంతంలో కొత్తగా పొస్టింగ్ వస్తుంది. అప్పటిదాకా అది క్రైమ్ ఫ్రీ ఫారెస్ట్ ప్రాంతం. కానీ వివేక్ ఛార్జ్ తీసుకున్న వెంటనే ఓ ఆత్మహత్య జరుగుతుంది. ఆత్మహత్య చేసుకున్నది రాజేంద్రన్ అనే బిజినెస్‌మేన్.అది కూడా ఓ సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకుంటాడు. సెల్ఫీ వీడియోలో తాను కూర్చుని ఉన్న ప్రదేశంలో కొన్నేళ్ల క్రితం ఓ శవాన్ని మరో కొంతమందితో కలిసి పాతి పెట్టానని, ఆ బాధ తనను వేధిస్తుందని ఆత్మహత్య చేసుకుంటాడు. వివేక్ వెంటనే ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి ఆ ప్రాంతంలో తవ్వగా ఓ అస్థిపంజరం బయటపడుతుంది.అది ఓ అమ్మాయిదని ఫోరెన్సిక్ నివేదికలో తేలుతుంది. ఇప్పుడు వివేక్ చేతిలో రాజేంద్రన్ సెల్ఫీ వీడియో తప్ప ఈ అస్థిపంజరానికి సంబంధించిన ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు. మరి... వివేక్ ఈ కేసు ఎలా పరిష్కరించాడో సినిమాలోనే చూడాలి. పైన చెప్పుకున్నట్టు సినిమా మొత్తం ఊహించని ట్విస్టులతో క్లైమాక్సులో ఊహకందని మలుపుతో మతి పొగొడుతుంది. పెద్దవాళ్లు మాత్రమే చూడదగ్గ ఈ సినిమా వీకెండ్‌కు మంచి కాలక్షేపం. వర్త్‌ఫుల్ వాచ్ ఫర్ థ్రిల్లింగ్. – ఇంటూరు హరికృష్ణ -
ఓటీటీకి మిస్టరీ థ్రిల్లర్.. మరో సూక్ష్మదర్శిని కానుందా?
ఓటీటీలు వచ్చాక భాషతో సంబంధం లేకుండా సినిమాలను ఆదరిస్తున్నారు. ముఖ్యంగా మలయాళ చిత్రాలకు ఓటీటీల్లో ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. ఈ ఏడాది ఓటీటీకి వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ సూక్ష్మదర్శినికి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో మలయాళ నటుడు బసిల్ జోసెఫ్ కీలక పాత్రలో నటించారు. ఈ మలయాళ థ్రిల్లర్ మూవీకి ఓటీటీలో ఊహించని స్పందన వచ్చింది. దీంతో ఓటీటీలో మలయాళ చిత్రాలకు ప్రేక్షకుల విపరీతంగా కనెక్ట్ అవుతున్నారు.ఈ నేపథ్యంలోనే మరో మిస్టరీ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. బసిల్ జోసెఫ్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ప్రవీణ్ కూడు షప్పు. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రం మలయాళ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ మూవీని డార్క్ కామెడీ మర్డర్ మిస్టరీగా శ్రీరాజ్ శ్రీనివాసన్ దర్శకత్వంలో తెరకెక్కించారు.తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 11 నుంచి సోనీలివ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు ప్రవీణ్ కూడా షప్పు మూవీ ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. ఈ విషయాన్ని సోనీలివ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది. కాగా.. ఈ చిత్రంలో సీనియర్ నటి రేవతి కీలక పాత్రలో కనిపించారు.Get ready for a dark comedy that unfolds the chaos-#PravinkooduShappu trailer out now! #PravinkooduShappu #PravinkooduShappuOnSonyLIV@basiljoseph25 @IamChandini #SoubinShahir #ChembanVinodJose #ShyjuKhalid #Chandini #SreerajSreenivasan pic.twitter.com/t8fMtcHKbt— Sony LIV (@SonyLIV) March 14, 2025 -
ఈ సినిమా నా జీవితాన్ని మార్చేసింది: డ్రాగన్ బ్యూటీ కయాదు లోహర్
హీరోయిన్ కయాదు లోహార్ ఇటీవలే డ్రాగన్ మూవీతో ప్రేక్షకులను అలరించారు. 21 ఏళ్ల వయసులోనే కన్నడ సినిమా ముగిల్‌పేటతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తరువాత మలయాళంలో పథోన్పత్తం నూత్తాండు అనే చిత్రంలో అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో 2022లోనే శ్రీ విష్ణు హీరోగా నటించిన అల్లూరి చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అంతే కాకుండా మరాఠీ భాషలోనూ ప్రేమ్ యు అనే చిత్రంలో కనిపించింది. దక్షిణాది అన్ని భాషల్లో అడుగుపెట్టిన డ్రాగన్ మూవీతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుందిం. ఈ సందర్భంగా ఈ సినిమాను గురించి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది.డ్రాగన్ సినిమా తన జీవితాన్నే మార్చేసిందని చెబుతోంది ఈ అస్సాం బ్యూటీ. ఈ సందర్భంగా డైరెక్టర్, హీరోతో పని చేసిన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ప్రదీప్ రంగనాథన్ లాంటి కో స్టార్‌తో పని చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది. ఈ మూవీతో నాకు నిజమైన స్నేహితుడు దొరికాడని సంతోషం వ్యక్తం చేసింది. అయితే మొదట ఈ సినిమాలో ఛాన్స్ రాదేమోనని బాధపడ్డానని కయాదు లోహర్ వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇన్‌స్టాలో సుదీర్ఘ పోస్ట్ చేసింది.కయాదు లోహర్ ఇన్‌స్టాలో రాస్తూ..'మొదట జూమ్ కాల్లో డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు కీర్తి క్యారెక్టర్‌కు సంబంధించిన కథ చెప్పారు. అది విని చాలా ఉత్సాహంగా ఉన్నా. కానీ ఆ తర్వాత అతని నుంచి నాకు రిప్లై రాలేదు. దీంతో నేను ఆ ప్రాజెక్ట్‌ను కోల్పోయానేమో అని కొంచెం బాధపడ్డా. కానీ ఒక నెల తరువాత అశ్వత్ మళ్లీ నాతో టచ్‌లోకి వచ్చారు. రెండోసారి పల్లవి పాత్ర కోసం నాకు నేరేషన్ ఇచ్చారు. నేరేట్ చేయడం పూర్తి చేసిన తర్వాత మీటింగ్ ముగించి ఆయన వెళ్లిపోవడంతో కాస్త కంగారు పడ్డా. కానీ 5 నిమిషాల్లోనే తిరిగి వచ్చి పల్లవిగా నిన్ను ఎంపిక చేసినట్లు ఆయన చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయని' తెలిపింది.ఆ తర్వాత తాను పల్లవి పాత్రలో అద్భుతంగా చేసి చూపిస్తానని ఆయనకు ప్రామిస్ చేశా.అశ్వత్ మరిముత్తు సినిమాలో స్త్రీ పాత్రలకు ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుంది. ఈ కథను రెండుసార్లు విని.. పల్లవి పాత్రను అర్థం చేసుకున్న తర్వాత ఈ చిత్రంలో భాగమయ్యే అవకాశాన్ని కోల్పోకూడదని నిర్ణయించుకున్నా. పల్లవి పాత్ర నాకు ఇచ్చినందుకు అశ్వత్‌కు ధన్యవాదాలు. నాకు అద్భుతమైన పాత్రతో అరంగేట్రం ఇచ్చినందుకు. మీకు నటుల పట్ల మీకు ఉన్న ప్రేమ, వారికి ఉత్తమమైన పాత్రలు అందించడం, వేరే దేని గురించి ఆలోచించకుండా పూర్తిగా సినిమాపై ప్రేమ పని చేస్తారు. ఈ విషయంలో మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటానని' పోస్ట్ చేసింది. ప్రదీప్ రంగనాథన్ గురించి రాస్తూ..' ప్రదీప్ లాంటి కో స్టార్ దొరకడం చాలా అరుదు. ఈ సినిమాతో నాకు నిజమైన స్నేహితుడు లభించాడు. అతని అనుభవం నుంచి నేర్చుకున్న పాఠాలు నా మనసులో ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మేమిద్దరం సెట్లో మాట్లాడుకోవడం.. కథ గురించి చర్చించుకోవడం.. మా ఇద్దరి మనస్సులో ఎప్పటికీ నిలిచే ఉంటుంది. ప్రదీప్ సార్ మీరు సూపర్ టాలెంటెడ్.. అద్భుతమైన నటుడు మీరు' అంటూ హీరోపై ప్రశంసలు కురిపించింది. View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) -
రజనీకాంత్ భార్యగా ఛాన్స్ ఇప్పిస్తాం.. కాకపోతే ఒక కండీషన్!
రజనీకాంత్ సినిమాలో ఛాన్స్ ఇస్తాం.. అనగానే ఎవరైనా ఏం చేస్తారు? ఎగిరిగంతేస్తారు. అందులోనూ రజనీకి భార్యగా అనేసరికి లోలోపలే సంతోషపడిపోయింది మలయాళ నటి శినీ సారా. కానీ ఆ ఆనందం ఎంతోకాలం నిలవలేదు. అదేంటి? ఆల్రెడీ రజనీకి భార్యగా రమ్యకృష్ణ నటిస్తోందిగా అని స్ఫురించింది. కేవలం తన దగ్గర డబ్బు గుంజేందుకే ఇలాంటి కాకమ్మ కహానీలు చెప్పాడని అర్థం కావడంతో నిరాశగా నిట్టూర్పు విడ్చింది.ఆర్టిస్ట్ కార్డ్ ఉందా?ఈ మోసం గురించి శినీ సారా మాట్లాడుతూ.. కాస్టింగ్ ఏజెన్సీ ద్వారా అందిన మీ అప్లికేషన్‌ను సెలక్ట్ చేశాం అంటూ వాట్సాప్‌లో ఒక మెసేజ్ వచ్చింది. జైలర్ 2 మూవీలో రజనీకాంత్ భార్య కోసం నటుల్ని వెతుకుతున్నట్లుగా ఉంది. తర్వాత వారు ఫోన్ చేసి ఆర్టిస్ట్ కార్డు ఉందా? అని అడిగారు. మలయాళంలో అయితే అలాంటి కార్డులు ఏవీ లేవన్నాను. సరే దానికి అవసరమైన ఏర్పాట్లు తామే చూసుకుంటామన్నారు. సురేశ్ కుమార్ అనే వ్యక్తి మీకు ఫోన్లో సంప్రదిస్తాడని చెప్పారు.జైలర్ 2లో రజనీ భార్యగా ఛాన్స్రెండు రోజుల తర్వాత ఆ సురేశ్ కుమార్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. చీర కట్టుకుని వీడియో కాల్లో ఇంటర్వ్యూకు హాజరవమన్నారు. జైలర్ 2లో రజనీకాంత్ భార్యగా నన్ను ఎంపిక చేసినట్లు తెలిపారు. నాకసలు అర్థం కాలేదు. అప్పటికే జైలర్ 2లో రజనీ భార్యగా రమ్య కృష్ణ నటిస్తోంది. ఇదే విషయం చెప్పాను. దాంతో అతడు మరో సినిమా కోసం సెలక్ట్ చేశామన్నాడు. అయితే ఆర్టిస్ట్ కార్డ్ తప్పనిసరిగా అవసరం ఉంటుందని.. దానికోసం అప్లై చేయాల్సి ఉంటుందన్నాడు. డబ్బు అడగడంతో అనుమానం మొదలుఇందుకోసం ఓ అప్లికేషన్ కూడా పంపిస్తున్నానని, అందులో అన్ని వివరాలు పొందుపరచమని చెప్పాడు. ఇదంతా నిజమేననుకుని ఆధార్ కార్డ్ వివరాలు, నా ఫోటో షేర్ చేశాను. వెంటనే అతడు రూ.12,500 డబ్బు కట్టమన్నాడు. అందుకోసం నాకు రెండు రోజుల గడువు ఇవ్వమని అడిగాను. దానికతడు.. వీలైనంత త్వరగా కట్టేయాలని, ఇప్పుడే డబ్బు పే చేయమన్నాడు. అప్పుడు నాకు అనుమానం మొదలైంది. తస్మాత్ జాగ్రత్తకోలీవుడ్లో నాకు తెలిసిన స్నేహితులు మాల పార్వతి, లిజొమోల్‌కు ఫోన్ చేశాను. కానీ వారు నా కాల్ లిఫ్ట్ చేయలేదు. అప్పుడు మరొకరికి కాల్ చేయగా.. ఆర్టిస్ట్ కార్డ్ లేకపోయినా తమిళ ఇండస్ట్రీలో పనిచేయొచ్చని తెలిపారు. దీంతో నాకు జరిగింది స్కామ్ అని తెలిసిపోయింది. ఇలాంటివారిని నమ్మి చాలా మంది డబ్బులు మోసపోతున్నారు. జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించింది.చదవండి: ప్రేయసి కోసం ముందు జాగ్రత్తలు తీసుకున్న 60 ఏళ్ల హీరో.. అప్పుడే..! -
పవన్, విజయ్‌లకు గురువు అభ్యర్థన
సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమలో మార్షల్ ఆర్ట్స్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇందులో పవన్ కల్యాణ్, దళపతి విజయ్ ఇద్దరూ కూడా ఒకే చోట శిక్షణ పొందారని మీకు తెలుసా..? తమిళనాడుకు చెందిన మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు షిహాన్ హుస్సేని (60) వద్ద వారు శిక్షణ తీసుకున్నారు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడంతో చిత్ర పరిశ్రమలో వారికి ప్రత్యేక గుర్తింపు దక్కింది. ఈ స్టార్ హీరోలకు విద్య నేర్పించిన గురువు అనారోగ్యం వల్ల ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. సాయం కోసం ఆయన ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తమిళ ఛానల్ గలాట్టాకు షిహాన్ హుస్సేని ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. తన శిష్యులు అయిన పవన్ కల్యాణ్, విజయ్‌లను ఆయన ఒక అభ్యర్థన కూడా చేశారు.మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు షిహాన్ హుస్సేని బ్లడ్ క్యాన్సర్‌తో పోరాటం చేస్తున్నాడు. అందుకోసం చికిత్స తీసుకుంటున్నాడు. ప్రస్తుతం తను పడుతున్న ఇబ్బందుల గురించి ఇలా పంచుకున్నాడు. తన పూర్వ విద్యార్థులు విజయ్, పవన్ కల్యాణ్‌లకు అభ్యర్థన చేశారు. 'ప్రతి రోజు క్యాన్సర్‌పై నేనొక పోరాటం చేస్తున్నాను. కానీ, కరాటే మనిషిని కాబట్టి ఇవన్నీ నాకు అలవాటే.. క్యాన్సర్ కూడా కరాటే నుంచి నన్ను దూరంగా ఉంచనివ్వలేదు. మార్షల్ ఆర్ట్స్‌కు ఉన్న గొప్పతనం ఇదే..' అని హుస్సేని అన్నారు, ప్రతిరోజూ తనకు రెండు యూనిట్ల రక్తం అవసరం అవుతుందని ఆయన పంచుకున్నారు. ట్రీట్మెంట్కు అధికమొత్తంలో ఖర్చు అవుతుందని వాపోయారు. 'నేను ఇలాగే కొనసాగలేనని నాకు తెలుసు. నాకు దేవాలయం లాంటి నా శిక్షణా కేంద్రాన్ని అమ్ముతున్నాను.' అని ఆయన చెప్పుకొచ్చారు.అయితే, షిహాన్ హుస్సేని తన పూర్వ విద్యార్థి పవన్ కల్యాణ్ ఆ శిక్షణా కేంద్రాన్ని కొనమని కోరారు. ఈ క్రమంలో పవన్‌తో కొన్ని విషయాలను పంచుకున్నారు ' నా వద్ద శిక్షణ తీసుకుంటున్న సమయంలో అతనికి పవన్ అని పేరు పెట్టాను. ఈ మాటలు అతని చెవులకు చేరితే అతను తప్పకుండా స్పందిస్తాడని తెలుసు. అతను ఈ మార్షల్ ఆర్ట్స్ శిక్షణా కేంద్రాన్ని కొనుగోలు చేసి భవిష్యత్ తరాల కోసం నిర్వహిస్తారని ఆశిస్తున్నాను. అతను ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి అని నాకు తెలుసు. కానీ, అతను నా దగ్గర శిక్షణ పొందిన రోజులు ఇప్పటికీ గుర్తు ఉన్నాయి. శిక్షణా కేంద్రాన్ని శుభ్రం చేయడమే కాదు.. ప్రతిరోజు నాకు టీ అందించే వాడు కూడా.. మార్షల్ ఆర్ట్స్ ను దేశవ్యాప్తంగా విస్తరింపచేయాలని ఇద్దరమూ మాట్లాడుకునే వాళ్లం. ఇప్పుడు దానిని పవన్ పూర్తి చేస్తాడని ఆశిస్తున్నాను.' అని హుస్సేని అన్నారు. ఈ శిక్షణ కేంద్రాన్ని వాణిజ్య సముదాయంగా లేదా నివాస అపార్ట్‌మెంట్‌గా మార్చే వ్యక్తికి అమ్మే బదులు, ఇది తన వారసత్వాన్ని సజీవంగా ఉంచడంలో సహాయపడుతుందని ఆయన నమ్మారు.నటుడు విజయ్ కోసం కూడా హుస్సేని ఒక అభ్యర్థన చేశాడు. ఆసక్తికరంగా, పవన్ కల్యాణ్ నటించిన 'తమ్ముడు' చిత్రాన్ని తమిళ్లో బద్రి పేరుతో విజయ్ రీమేక్ చేశారు. అందులో విజయ్‌కు శిక్షణ ఇచ్చే మాస్టర్‌గా హుస్సేని నటించారు. అలా వీరిద్దరి మధ్య మంచి అనుబంధమే ఉంది. విజయ్ గురించి ఆయన ఇలా చెప్పుకొచ్చారు. 'ఒలింపిక్ పతక విజేతలను తమిళనాడులో తయారు చేయాలని విజయ్ కల కనేవాడు. క్రీడల పరంగా దేశంలో తమిళనాడుకు ప్రత్యేక గుర్తింపు రావాలని ఒక ఎజెండాను కూడా సిద్ధం చేసుకున్నాడు. ఇక్కడ మార్షల్ ఆర్ట్స్ మాత్రమే కాకుండా, విలువిద్యలో కూడా శిక్షణ ఇచ్చే వాళ్లం. తాను అనుకున్న ఒలింపిక్ కలను విజయ్ నిలబెట్టుకోవాలని' హుస్సేని తన అభ్యర్థనగా పంచుకున్నారు. తమిళనాడులోని ప్రతి ఇంట్లో ఒక విలువిద్య ఔత్సాహికుడు ఉండేలా చూడాలని విజయ్ను కోరుతున్నానని ఆయన అన్నారు. ఒలింపిక్స్ సహా వివిధ ఈవెంట్లలో రాష్ట్రం, దేశానికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తి ఉండేలా చూడాలని తాను విజయ్ను అభ్యర్థిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. షిహాన్ హుస్సేని కూడా పలు సినిమాల్లో నటించారు. -
ఇళయరాజా మ్యూజికల్ జర్నీపై తమిళనాడు ప్రభుత్వం కీలక ప్రకటన
తరాలు మారుతున్నా ఇళయరాజా సంగీతంపై అభిమానం ఏంతమాత్రం తగ్గదు. గత 50 ఏళ్లుగా కోట్లమందికి తన సంగీతంతో ఆయన దగ్గరయ్యారు. ఈ క్రమంలో ఇళయరాజా 50 ఏళ్ల మ్యూజికల్ జర్నీపై తమిళనాడు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా ప్రస్థానాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు తాజాగా తమిళనాడు ప్రభుత్వం పేర్కొంది. ఇదే విషయాన్ని ఎక్స్ వేదికగా తమిళనాడు సీఎం స్టాలిన్ తెలిపారు.తమిళనాడు తేని జిల్లాలో మారుమూల కుగ్రామంలో రాజయ్యగా పుట్టి, రాజాగా ఆయన మారారు. అప్పటికే చిత్ర పరిశ్రమలో మన ఏ.ఎం.రాజా ఉండటం వల్ల ‘ఇళయ’ చేర్చుకుని ఇళయరాజాగా ఆయన పరిచయం అయ్యారు. అలా ‘అన్నాకిళి’ (1976)తో మొదటి చిత్రం చేశారు. ఏ ముహూర్తాన సంగీత దర్శకుడిగా జన్మించాడోగాని ఇంతకాలం తర్వాత, 1,500 సినిమాలకు 8,500 పాటలు చేశాక, 81 ఏళ్లకు చేరుకున్నాక కూడా ఆకర్షణ కోల్పోలేదు. భారతీయ సంగీత ప్రతిభను ప్రపంచానికి చాటడానికి వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్‌లో అత్యంత క్లిష్టమైన ‘సింఫనీ’ రాసి, దానికి ‘వేలియంట్’ అని నామకరణం చేసి, మార్చి 8న లండన్ లో 85 మంది సభ్యుల ప్రతిష్ఠాత్మక రాయల్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రాతో ప్రదర్శన ఇచ్చారు. ప్రపంచ దేశాల నుంచి రాజా అభిమానులు ఈ సింఫనీకి హాజరయ్యారు. 45 నిమిషాల నాలుగు అంచెల సింఫనీని విని స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఇలా వెస్ట్రన్ క్లాసికల్లో సింఫనీ రాసి, లండన్ (London)లో ప్రదర్శన ఇచ్చిన మొట్టమొదటి భారతీయుడిగా రాజా చరిత్ర సృష్టించారు. -
'హరి హర వీరమల్లు' విడుదలలో మార్పులు.. ప్రకటించిన మేకర్స్
టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన చారిత్రాత్మక తాజా చిత్రం ‘హరి హర వీరమల్లు’. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమాకు జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తుండగా, ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్నారు. పవన్ సింగిల్ హీరోగా నటించిన చిత్రం విడుదల కాక చాలారోజులు అయింది. దీంతో ఆయన నటించిన కొత్త చిత్రం ‘హరి హర వీరమల్లు’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.పవన్ అభిమానులలు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘హరి హర వీరమల్లు’ మే 9న రానున్నట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేస్తుంది. ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్‌పై ప్రకటన విడుదలైంది. ఒక పోస్టర్‌తో పాటుగా మే 9న ఈ చిత్రం విడుదల చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాలోని ‘కొల్లగొట్టినాదిరో..’ పాట లిరికల్ వీడియోను కొద్దిరోజుల క్రితమే రిలీజ్ చేశారు. గణేష్ మాస్టర్స్ కొరియోగ్రఫీ స్టెప్పులకు అభిమానులు ఫిదా అయ్యారు. 2023లో విడుదలైన ‘బ్రో’ తర్వాత దాదాపు రెండేళ్లకు ‘హరి హర వీరమల్లు’తో పవన్ వెండితెరపై అలరించడానికి సిద్ధమవుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయని నిర్మాత ఏఎం రత్నం అన్నారు.పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కిన ఈ మూవీని క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా పార్ట్-1 మాత్రం మార్చి 28న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు. ఈమేరకు అధికారికంగా ఒక పోస్టర్‌ను కూడా ఆ సమయంలో విడుదల చేశారు. కానీ, పలు కారణాల వల్ల విడుదల విషయంలో జాప్యం జరిగింది. దీంతో మరోసారి విడుదల తేదీని ప్రకటించారు. -
ఏడు జన్మల తోడుగా...
‘‘కలల్లో కానరాకున్నా... నీ కోసం నేను వేచున్నా... నిన్నే నా ఏడు జన్మల తోడుగా కోరుకుంటున్నా’’ అంటూ మొదలవుతుంది ‘వీర ధీర శూరన్ పార్టు 2’ సినిమాలోని లవ్ సాంగ్. విక్రమ్ హీరోగా ఎస్.యు అరుణ్‌కుమార్ దర్శకత్వంలో ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని రియా శిబుల నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది.తాజాగా ఈ సినిమాలోని ‘కలల్లో..’ అనే పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. రాజేశ్ గోపిశెట్టి సాహిత్యం అందించిన ఈ పాటను శరత్ సంతోష్, రేష్మ శ్యామ్ పాడారు. దుషారా విజయన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో ఎస్జే సూర్య, సూరజ్ వెంజరాముడు ఇతర పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్. -
ప్రియమణి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.. ఆడియన్స్‌ను మెప్పించిందా?
టైటిల్: ఆఫీసర్ ఆన్ డ్యూటీ(మలయాళ డబ్బింగ్ సినిమా)నటీనటులు: ప్రియమణి, కుంచకో బోబన్ తదితరులుడైరెక్టర్: జీతూ అష్రఫ్నిర్మాతలు: మార్టిన్ ప్రక్కత్, సిబి చవారా, రంజిత్ నాయర్సంగీత దర్శకుడు: జేక్స్ బిజోయ్తెలుగులో విడుదల: 14 మార్చి 2025ఇటీవల తెలుగులో మలయాళ చిత్రాలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. మలయాళంలో తెరకెక్కించిన పలు చిత్రాలు తెలుగులోనూ సూపర్‌హిట్‌గా నిలిచాయి. మంజుమ్మెల్ బాయ్స్, ప్రేమలు, సూక్ష్మదర్శిని లాంటి సినిమాలు తెలుగులోనూ సత్తాచాటాయి. ముఖ్యంగా క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలతో పాటు కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా ఆడియన్స్ ఆదరిస్తున్నారు. అలా మరో సరికొత్త క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మలయాళంలో ఫిబ్రవరిలో విడుదలైన ఆఫీసర్ ఆన్ డ్యూటీని తెలుగులోనూ రిలీజ్ చేశారు. మలయాళ స్టార్ కుంచకో బోబన్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.అసలు కథేంటంటే..సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ప్రత్యేకమైన ఆడియన్స్ ఉంటారు. అందుకే ఈ జోనర్ సినిమాలకు ఆదరణ ఎప్పటికీ ఉంటుంది. జీతూ అష్రఫ్ తన డెబ్యూ కథగా అలాంటి జోనర్‌నే ఎంచుకున్నారు. పోలీసు అధికారి ఆత్మహత్య చేసుకునే సీన్‌తో కథ మొదలవుతుంది. ఆ తర్వాత బస్సులో చైన్ స్నాచింగ్, ఫేక్ గోల్డ్ లాంటి కేసుల చుట్టూ తిరుగుతుంది. అయితే ఇలాంటి కేసులను అవలీలగా ఛేదించే సీఐ హరిశంకర్(కుంచకో బోబన్) ఫేక్ గోల్డ్ కేసు ఎదురవుతుంది. ఆ కేసును సీరియస్‌గా తీసుకున్న హరిశంకర్ దర్యాప్తు ప్రారంభిస్తారు. ఆ సమయంలో సీఐ హరిశంకర్‌కు షాకింగ్ విషయాలు తెలుస్తాయి. అంతే కాకుండా ఈ ఫేక్ గోల్డ్ కేసు కాస్తా ఓ అమ్మాయి ఆత్మహత్యకు దారితీస్తుంది. అసలు ఈ కేసుతో ఆ అమ్మాయికి గల సంబంధం ఏంటి? ఆ అమ్మాయి ఎందుకు సూసైడ్ చేసుకుంది? ఆ అమ్మాయి సూసైడ్‌కు హరిశంకరే కారణమా? దీని వెనక ఏదైనా మాఫియా ఉందా? ఇదేక్రమంలో హరిశంకర్‌కు భార్య ప్రియమణి(గీత)తో తీవ్రమైన గొడవ జరుగుతుంది. అన్యోన్యంగా ఉండే భార్య, భర్తల మధ్య గొడవ ఎందుకు జరిగింది? అసలు వారిద్దరు ఎందుకు విడిపోవాలనుకున్నారు? వీరి ముద్దుల కూతురు ఎందుకు సూసైడ్ చేసుకుంది? అనే విషయాలు తెలియాలంటే ఆఫీసర్ ఆన్ డ్యూటీ చూడాల్సిందే.ఎలా ఉందంటే..సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు అనగానే దాదాపుగా ప్రేక్షకుల ఊహకందేలా ఉంటాయి. మర్డర్ మిస్టరీని ఛేదించడం లాంటివీ కథలు రోటీన్‌గా అనిపిస్తాయి. ముఖ్యంగా ఇలాంటి జోనర్లో పోలీసులు, నిందితులను పట్టుకోవడం, వారికి శిక్ష పడేలా చేసి బాధితులకు న్యాయం చేయడం చుట్టే కథ తిరుగుతుంది. కానీ ఆఫీసర్ ఆన్ డ్యూటీలో పోలీసు అధికారులే బాధితులు కావడమనేది కొత్త పాయింట్‌ను డైరెక్టర్ ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఫస్ట్ హాఫ్‌లో వరుస కేసులు, దర్యాప్తు సమయంలో వచ్చే ట్విస్ట్‌లతో ఆడియన్స్‌ను ఆసక్తిని క్రియేట్ చేశాడు డైరెక్టర్. అసలు ఒక కేసు దర్యాప్తు చేయడానికి వెళ్తే.. ఆ కేసు మరో కేసుకు లింక్ కావడంతో మరింత ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. నిందితుల కోసం హరిశంకర్ వేసే స్కెచ్, అతనికి పోలీసు డిపార్ట్మెంట్లో ఎదురయ్యే సమస్యలు కాస్తా రోటీన్‌గానే అనిపిస్తాయి. ఈ కేసు కీలకదశలో ఉండగానే ఊహించని ట్విస్ట్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. సెకండాఫ్‌లో మరింత ఆసక్తికర మలుపులతో ప్రేక్షకులను సీట్‌కు అతుక్కునేలా చేశాడు డైరెక్టర్ అష్రఫ్. వరుస ట్విస్ట్‌లతో ప్రేక్షకుల్లో సస్పెన్స్ క్రియేట్ చేశాడు. నిందితులను పట్టుకునే క్రమంలో వచ్చే సీన్స్, ఫైట్స్‌తో ఆడియన్స్‌కు వయొలెన్స్‌ను పరిచయం చేశాడు మన దర్శకుడు. సెకండాఫ్ మొత్తం వన్ మ్యాన్ షోగా అనిపిస్తుంది. అంతేకాకుండా ఓ సిన్సియర్ పోలీసు అధికారి కేసు డీల్ చేస్తే ఎలా ఉంటుందనేది కోణం కూడా దర్శకుడు తెరపై ఆవిష్కరించాడు. పోలీసులు నిందితుల కోసం వేసే స్కెచ్, దర్యాప్తు సీన్స్ రోటీన్‌గా ఉన్నప్పటికీ.. ఈ జోనర్లో కథలో కొత్తదనాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. కథను సస్పెన్స్‌గా తీసుకెళ్లడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కొన్ని చోట్ల రోటీన్‌గా అనిపించినా.. ప్రేక్షకుల ఊహకందని ట్విస్ట్‌లతో కథను ఆసక్తిగా తీసుకెళ్లాడు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌కు ఎండింగ్లో కూడా అంతే ట్విస్ట్ ఇచ్చాడు. క్లైమాక్స్ సీన్‌తో ఆడియన్స్‌కు కాసేపు ఉత్కంఠకు గురిచేశాడు. ఓవరాల్‌గా కొత్త డైరెక్టర్ అయినా తాను అనుకున్న పాయింట్‌ను తెరపై ఆవిష్కరిచండంలో సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి ఆఫీసర్ ఆన్ డ్యూటీ సరికొత్త అనుభూతిని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎవరెలా చేశారంటే..మలయాళ స్టార్ కుంచన్ బోబన్ పోలీసు అధికారిగా తన అగ్రెసివ్ యాక్టింగ్‌తో మెప్పించాడు. ముఖ్యంగా తనదైన భావోద్వేగాలతో ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు. ప్రియమణి పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేనప్పటికీ.. తన రోల్‌కు పూర్తిస్థాయిలో న్యాయం చేసింది. మిగిలిన నటీనటులందరూ తమ పాత్రల పరిధిలో ఆడియన్స్‌ను మెప్పించారు. ఇక సాంకేతికత విషయానికొస్తే.. విజువల్స్ పరంగా ఫర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా జేక్స్ బిజోయ్ బీజీఎం ఈ సినిమాకు ప్లస్. ఎడిటింగ్‌లో ఇంకాస్తా ఫోకస్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సంస్థకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. - మధుసూదన్, సాక్షి వెబ్‌డెస్క్ -
విజయ్ ఆంటోని కెరీర్లో 25వ సినిమా.. టీజర్ చూశారా?
హీరోగా, నిర్మాతగా, గేయ రచయితగా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా, ఎడిటర్‌గా ఇలా అన్ని రకాలుగా సత్తా చాటుకున్నారు విజయ్ ఆంటోనీ (Vijay Antony). ఆయన ప్రస్తుతం తన 25వ చిత్రం ‘భద్రకాళి’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై మీరా విజయ్ ఆంటోని సమర్పణలో అరుణ్ ప్రభు నిర్మిస్తున్నారు.తాజాగా భద్రకాళి సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ‘పిల్లి కూడా ఒక రోజు పులి అవును.. అబద్ధం, అహంకారం అంతం అవును’.. అంటూ ప్రారంభమైన ఈ టీజర్లో విజయ్ ఆంటోని అసలు ఏ పాత్రను పోషిస్తున్నాడనేది అర్థం కాకుండా ఉంది. ఒకసారి ఫ్యామిలీ మెన్లా, మరోసారి గ్యాంగ్‌స్టర్‌లా, ఇంకో సందర్భంలో ఉన్నతాధికారిలా కనిపిస్తున్నారు.రూ.190 కోట్ల కుంభకోణం చుట్టూ కథ తిరిగేలా ఉంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటూ చివర్లో వచ్చే డైలాగ్ సస్పెన్స్‌కు తెరదీసింది. విజయ్ ఆంటోని ఈ చిత్రంలో ఇదివరకెన్నడూ కనిపించనంత స్టైలిష్‌గా, యాక్షన్ హీరోగా కనిపిస్తున్నారు. ఈ సినిమాకు విజయ్ ఆంటోనియే సంగీతాన్ని అందిస్తుండటం విశేషం. వాగై చంద్రశేఖర్, సునీల్ కృపలానీ, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, మాస్టర్ కేశవ్ వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. భద్రకాళి సినిమాను సమ్మర్ కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు. చదవండి: అయోధ్యలో మళ్లీ భూమి కొన్న బిగ్‌బీ.. ఈసారి పెద్ద మొత్తంలో..! -
40 ఏళ్ల చరిత్ర గల 'రజినీకాంత్' థియేటర్ కూల్చివేత
దాదాపు 40 ఏళ్ల చరిత్ర గల మరో థియేటర్ నేలమట్టమైంది. సూపర్‌స్టార్ రజనీ కాంత్ చేతులమీదుగా 1985లో చెన్నైలో ప్రారంభమైన బృందా థియేటర్.. దశాబ్దాల పాటూ అభిమానులను ఎంతో అలరించింది. కొత్త కొత్త సినిమాలను ప్రదర్శిస్తూ అభిమానుల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్న ఈ థియేటర్ ఇక కనుమరుగు కానుంది. ఇప్పటికే సినిమాలను ప్రదర్శించడం ఆగిపోయింది. గత కొన్నేళ్లుగా సినిమాలు చూడటానికి థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య క్రమంగా తగ్గింది. దీనికి ప్రతిగా తమిళనాడు వ్యాప్తంగా ఐకానిక్ థియేటర్లను కూల్చివేస్తున్నారు. ఇప్పటికే చైన్నెలో పాపులర్ అయిన అగస్త్య, కామథేను, కృష్ణ వేణితదితర ఎన్నో థియేటర్లు నేలమట్టమయ్యాయి. ఈ స్థితిలో ఉత్తర చైన్నెకి ల్యాండ్‌మార్క్‌గా నిలిచిన పెరంబూర్ బృందా థియేటర్ చరిత్ర సోమవారంతో ముగిసింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'ముఫాసా'.. అధికారికంగా ప్రకటన)1985 ఏప్రిల్ 14న సూపర్ స్టార్ రజనీకాంత్ చేతులమీదుగా బృందా థియేటర్ని ప్రారంభించారు. అప్పుడు లోగనాథన్ చెట్టియార్ దాని యజమాని. అతని మరణానంతరం, అతని వారసులు విశ్వనాథన్, చంద్రశేఖర్ దీనిని కొనసాగించారు. ఈ మంగళవారం నుంచి ప్రదర్శనలు నిలిపివేశారు. ఈ థియేటర్‌ను కూల్చివేయనున్నారు. ఓ ప్రైవేట్ నిర్మాణ సంస్థ స్థలాన్ని కొనుగోలు చేసిందని, త్వరలోనే భవనాన్ని కూల్చివేసి అపార్ట్మెంట్లు నిర్మించనున్నట్లు చెబుతున్నారు. 40 ఏళ్లుగా పనిచేస్తున్న మేనేజర్ పన్నీర్ సెల్వం మాట్లాడుతూ.. మా థియేటర్‌కి బృందా థియేటర్ అని పేరు పెట్టినా రజనీ థియేటర్ అని పిలుస్తారని, రజనీ ఈ థియేటర్ని ప్రారంభించారు.. రజనీ సినిమాలన్నీ ఇక్కడ ప్రదర్శితమయ్యాయని చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: 6 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) -
డెలివరీ తర్వాత కాళ్లు, చేతులు కదల్లేవు.. బతకననుకున్నా: నటి
ప్రెగ్నెన్సీ జర్నీ అంత బాగానే జరిగినా.. డెలివరీ సమయంలో మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నానంటోంది నటి దేవిక నంబియార్ (Devika Nambiar). ఇటీవలే ఈమె రెండో బిడ్డకు జన్మనిచ్చింది. తన డెలివరీ జర్నీ గురించి దేవిక మాట్లాడుతూ.. నా మొదటి ప్రెగ్నెన్సీ సాఫీగా సాగింది. ఇది కూడా అలాగే ఉంటుందనుకున్నాను. అందుకే బ్యాగ్ కూడా సర్దుకోలేదు. కానీ ఈసారి ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు. అయితే నేను కళ్లు తెరవకపోవడంతో అందరూ చాలా భయపడ్డారు.స్పృహ కోల్పోయిన నటిఒకరోజు తర్వాత స్పృహలోకి వచ్చి నా బిడ్డను చూసుకున్నాను. అప్పటికీ నా కాళ్లు, చేతులు కదలకపోవడంతో చనిపోతానేమో అనుకున్నాను అని చెప్పుకొచ్చింది. దేవిక భర్త, సింగర్ విజయ్ మాట్లాడుతూ.. మాకు బిడ్డను చూపించారు కానీ నా భార్యను కలవనివ్వలేదు. సమయం గడిచేకొద్దీ నాలో భయం ఎక్కువైంది. నేను ఎలాగైనా కలవాల్సిందేనని చెప్పగా దేవిక స్పృహలోనే లేదని చెప్పారు. షాకయ్యాను. ఆమె ముక్కు, నోట్లో పైపులు పెట్టారు.బోరున ఏడ్చేశాతననలా చూడగానే అంతా అయిపోయిందనుకున్నాను. తనను వెంటిలేటర్‌పై పెట్టారు. ఆమెనలా ఎన్నడూ చూడలేదు. గదిలోకి వెళ్లి ఏదీ తినకుండా బోరుమని ఏడ్చాను అని చెప్పుకొచ్చాడు. కాగా దేవిక కలభ మజా, గల్ఫ్ రిటర్న్స్, పరయాన్ బాకీ వచెత్తు, స్నేహ కాదల్, వికడకుమారన్, కట్టప్పనేయిలే రిత్విక్ రోషన్ వంటి మలయాళ చిత్రాలతో పాటు తమిళంలోనూ నటించింది. ఈమె నటి మాత్రమే కాదు యాంకర్ కూడా! సినిమాల మధ్యలో ఆల్బమ్ సాంగ్స్ కూడా చేసింది.చదవండి: ఎక్స్‌ట్రాలు ఎక్కువైతున్నాయ్.. ఇలాంటివారికి బుద్ధి చెప్పాల్సిందే! -
హనీరోజ్ అమాయకురాలేం కాదు.. దేనికైనా లిమిట్ ఉంటుంది: నటి ఫైర్
ఈ మధ్యకాలంలో హనీరోజ్ (Honey Rose) సినిమాలతో కన్నా వివాదాలతోనే తరచూ వార్తల్లో నిలుస్తోంది. తనపై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ వ్యాపారవేత్త బాబీ చెమ్మనూర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో అతడిని అరెస్టు చేయగా తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఈ విషయంలో కొందరు హనీరోజ్‌కు మద్దతుగా నిలబడితే మరికొందరు ఆమెను తప్పుపట్టారు.దాని అర్థమేంటి?తాజాగా నటి ఫరా శిబిల (Fara Shibla).. హనీ పోరాటాన్ని ఓపక్క మెచ్చుకుంటూనే మరోపక్క ఆమె తీరుపై విమర్శలు గుప్పించింది. ఫరా మాట్లాడుతూ.. హనీరోజ్ వేషధారణను నేను తప్పుపట్టడం లేదు. కాకపోతే ఆమెను రకరకాల యాంగిల్స్‌లో తీసిన ఫోటోలను వీడియోలను తనే స్వయంగా షేర్ చేస్తోంది. దీని ద్వారా ఆమె ఏం చెప్పాలనుకుంటోందని మాత్రమే ప్రశ్నించాను. నేను వేసుకునే దుస్తులు అవతలివారికి అసౌకర్యంగా అనిపించకూడదు. అందరూ అదే పని!దేనికైనా కొన్ని హద్దులుంటాయి. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో అందరూ తమ శరీరాల్ని చూపిస్తూ ఎగ్జిబిషన్ పెట్టేస్తున్నారు. చాలామంది సోషల్ మీడియాలో ఇదే చేస్తున్నారు. నేను కూడా ఫోటోషూట్ చేశాను కదా అని ప్రశ్నిస్తారేమో! ఏదైనా ఐడియా నచ్చితేనే, చూడటానికి బాగుందనిపిస్తేనే ఆయా ఫోటోషూట్ చేస్తాను. కానీ ఇప్పుడు జనాలు కేవలం లోదుస్తులతో కోల్డ్ కాఫీ తయారు చేస్తూ వీడియోలు చేస్తున్నారు.అమాయకురాలేం కాదుహనీరోజ్ అమాయకురాలైతే కాదు.. తను తెలివైనది. తనేం చేస్తుందో తనకు బాగా తెలుసు. డబ్బు సంపాదించడం తప్పు కాదు.. కానీ ఇండస్ట్రీలో కష్టాలు ఎదుర్కొంటున్న ఎంతోమందికి ఆమె ఒక చెత్త ఉదాహరణగా నిలుస్తోంది. సినిమాలు లేకపోతే ఇలా శరీరాన్ని ఎగ్జిబిషన్‌గా పెట్టి డబ్బు సంపాదించుకోవాలని నేర్పిస్తోంది. మనపై మనకు నమ్మకం ఉండాలి. ప్రతిభను నమ్ముకోవాలి తప్ప శరీరాన్ని కాదు అని చెప్పుకొచ్చింది. మలయాళ బ్యూటీ హనీరోజ్ ఆలయం సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఈ వర్షం సాక్షిగా, వీరసింహారెడ్డి చిత్రాల్లో నటించింది.చదవండి: దర్శన్‌తో గొడవ? ఇలాంటివాడికి ఆస్కార్ ఇవ్వాలంటూ నటి వరుస పోస్టులు! -
దర్శన్‌తో గొడవ? ఇలాంటివాడికి ఆస్కార్ ఇవ్వాలంటూ నటి వరుస పోస్టులు!
కన్నడ హీరో దర్శన్ (Darshan Thoogudeepa) చేసిన పని చర్చనీయాంశంగా మారింది. అతడు సోషల్ మీడియా ఖాతాలో కొన్నేళ్లుగా ఫాలో అవుతున్న ఆరుగురిని అన్‌ఫాలో కొట్టాడు. అందులో నటి, మాజీ ఎంపీ సుమలత అంబరీష్, ఆమె తనయుడు అభిషేక్ ఉన్నారు. ఉన్నట్లుండి వీరిని అన్‌ఫాలో కొట్టడంతో దర్శన్ ఎందుకిలా చేశాడన్న చర్చ మొదలైంది. దర్శన్ కొడుకులాంటివాడని చెప్పిన సుమలత.. తాను జైల్లో ఉండగా ఒక్కసారి కూడా చూడటానికి రాలేదన్న కోపంతోనే అతడు ఇలా చేసి ఉండొచ్చన్న ప్రచారం మొదలైంది.అలాంటి వారు హీరోలా..!ఈ నేపథ్యంలో సుమలత అంబరీష్ (Sumalatha Ambareesh) ఇన్స్టాగ్రామ్ స్టోరీలో చేసిన పోస్టులు వైరల్‌గా మారాయి. తిమ్మిని బమ్మి చేసి, కాస్తైనా పశ్చాత్తాపపడకపోగా ప్రజలను బాధిస్తూ, అవతలివారిపైకి నిందను తోసేవారు ఇప్పటికీ వారిని వారు హీరోలుగా పరిగణించుకుంటున్నారు. ఇలాంటివారికి కదా ఉత్తమ నటుడిగా ఆస్కార్ ఇవ్వాలి అని ఓ పోస్ట్‌లో రాసుకొచ్చింది. అవే అసలైన పునాదిమరో పోస్ట్‌లో.. ఎటువంటి విచారం, నొప్పి లేకుండా ప్రశాంతంగా నిద్రలేవడం, మనల్ని మనం అర్థం చేసుకోవడం, ఆందోళనగా పరుగులు తీయకుండా శాంతియుతంగా గడపడం.. అనేవి ఒక నిధిలాంటివి. ఇవన్నీ సోషల్ మీడియాలో పనికొస్తాయో లేవో కానీ మన జీవితానికి బలమైన పునాది వేస్తాయి. ఈ అంశాలే మనల్ని మానసికంగా ధనవంతుల్ని చేస్తాయి అని మరో పోస్ట్ షేర్ చేసింది.(చదవండి: రికార్డు సృష్టించిన డాకు బ్యూటీ.. ఆ కారు కొన్న మొట్టమొదటి నటిగా)దర్శన్‌ను ఉద్దేశించి అనలేదుదీంతో సుమలత ఈ రెండు పోస్టులు దర్శన్‌ను ఉద్దేశించే చేసిందన్న చర్చ జరుగుతోంది. దర్శన్, సుమలత మధ్య సత్సంబంధాలు పూర్తిగా చెడిపోయినట్లున్నాయని ఎవరికి వారు కథలు అల్లేసుకుంటుకున్నారు. ఈ క్రమంలో సుమలత సోషల్ మీడియా వేదికగా అది అబద్ధమని కొట్టిపారేసింది. నేను ఇంతకుముందు చేసిన పోస్టుల గురించి అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. సాధారణంగా నేను పరిశీలించిన అంశాలపై ఆ పోస్టు పెట్టానే తప్ప ఎవరినీ ఉద్దేశించి కాదు. అలాగే ఎంతమంది ఫాలో అవుతున్నారు? ఎంతమంది అన్‌ఫాలో చేస్తున్నారు? అని చెక్ చేసే అలవాటు నాకు లేదు.ఎందుకిలా రాద్ధాంతం చేస్తున్నారుదర్శన్.. ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (ట్విటర్)లో ఎవరినీ ఫాలో అవకూడదని నిర్ణయించుకున్న విషయం నాకు మీడియా వల్లే తెలిసింది. దీన్నెందుకు భూతద్దంలో చూస్తున్నారో నాకు తెలియడం లేదు. దర్శన్ అన్‌ఫాలో అవడం, తర్వాత నేను పోస్టులు పెట్టడం అనేది అనుకోకుండా జరిగింది. అంతేతప్ప ఇందులో ఏమీ లేదు. అసలే గొడవా లేనిచోట ఏదో జరుగుతోందంటూ వివాదం సృష్టించడం ఆపేయండి. నేను పెట్టిన పోస్టులు ప్రత్యేకంగా ఏ ఒక్కరినీ ఉద్దేశించిదని కాదని మళ్లీ చెప్తున్నాను.. నా కుటుంబ సభ్యులు, నా ఆప్తులు అనుకున్నవారితో సోషల్ మీడియాకు బదులుగా నేరుగానే మాట్లాడతాను అని సుమలత పేర్కొంది. కాగా అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో హీరో దర్శన్, అతడి ప్రేయసి, నటి పవిత్రగౌడ అరెస్టయిన విషయం తెలిసిందే! వీరిద్దరూ ప్రస్తుతం బెయిల్ మీదున్నారు. View this post on Instagram A post shared by Sumalatha Ambareesh (@sumalathaamarnath) చదవండి: ఒకప్పటి మావోయిస్టుల కంచుకోటలో మహేశ్ బాబు సినిమా షూటింగ్!ఓటీటీలోకి 'ముఫాసా'.. అధికారికంగా ప్రకటన -
దళపతి విజయ్ పై పోలీసులకు ఫిర్యాదు
హీరో దళపతి విజయ్.. ముస్లింలని అవమానించారని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు తమిళనాడు సున్నత్ జమాత్.. చెన్నై పోలీసులకు కంప్లైంట్ చేశారని వార్తలొస్తున్నాయి. రీసెంట్ గా విజయ్ ఇచ్చిన ఇఫ్తార్ విందు దీనికి కారణమని పేర్కొన్నారు.తమిళంలో హీరోగా స్టార్ డమ్ ఉన్న విజయ్.. గతేడాది రాజకీయ అరంగ్రేటం చేశారు. తమిళ వెట్రి కళగం (టీవీకే) పేరుతో పార్టీని స్థాపించారు. వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయంగా తన ముద్ర వేసే ప్రయత్నాల్లో ఉన్నారు.(ఇదీ చదవండి: తమ్ముడి పెళ్లిలో సాయిపల్లవి డ్యాన్స్.. వీడియో వైరల్)అలా గత శుక్రవారం రాయపేట వైఎంసీఏ గ్రౌండులో ముస్లింల కోసం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. రంజాన్ ఉపవాస దీక్ష విరమించే ముందు ప్రార్థనల్లో పాల్గొన్న విజయ్.. హాజరైన వారితో కలిసి విందు కూడా చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కొన్ని వైరల్ అయ్యాయి.అయితే విజయ్ పై తమిళనాడు సున్నత్ జమాత్ ఫిర్యాదు చేసింది. ఉపవాస దీక్షలు, ఇఫ్తార్ విందులతో సంబంధం లేని తాగుబోతులు, రౌడీలు పాల్గొనడం ముస్లింలను అవమానించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఏర్పాట్లు సక్రమంగా చేయలేదని, విజయ్ తెచ్చిన విదేశీ గార్డులు ప్రజలను అగౌరవపరిచారని తమిళనాడు సున్నత్ జమాత్ కోశాధికారి సయ్యద్ కౌస్ మీడియాతో చెప్పారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) -
బాధలో 'కాంతార' హీరోయిన్.. పోస్ట్ వైరల్
'కాంతార' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు నచ్చేసిన నటి సప్తమి గౌడ (Sapthami Gowda) బాధపడుతోంది. తన ఇంట్లో ఎంతో ప్రేమగా పెంచుకున్న కుక్క చనిపోవడంతో చాలా పెద్ద పోస్ట్ పెట్టింది. పెడ్ డాగ్ తో ఉన్న బోలెడన్ని జ్ఞాపకాల్ని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ 'ఛావా'.. డేట్ ఫిక్సయిందా?)బెంగళూరుకి చెందిన సప్తమి గౌడ.. 2020 నుంచి సినిమాల్లో నటిస్తోంది. 'కాంతార'తో దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు పరిచయమైంది. గతేడాది 'యువ' అనే మూవీ చేసింది. ప్రస్తుతం 'కాంతార' మూవీ సీక్వెల్ లో నటిస్తోంది. ఇకపోతే తన ఇంట్లో 2010 నుంచి పెంచుకుంటున్న పెంపుడు కుక్క సింబా చనిపోయిందని సప్తమి ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: తమ్ముడి పెళ్లిలో సాయిపల్లవి డ్యాన్స్.. వీడియో వైరల్) View this post on Instagram A post shared by Sapthami Gowda 🧿 (@sapthami_gowda) -
'ఈగ' స్టోరీతో మరో సినిమా.. టీజర్ రిలీజ్
ఇప్పుడంటే రాజమౌళి పాన్ ఇండియా డైరెక్టర్. కానీ అప్పట్లో ఓ సాధారణ దర్శకుడిగా ఉన్నప్పుడు ఓ ఈగని హీరోగా పెట్టి సినిమా తీసేశాడు. దక్షిణాదితో పాటు హిందీలో రిలీజైన ఈ చిత్రం హిట్ అయింది. ఇప్పుడు అలా ఈగతో మలయాళంలో మరో సినిమా తీశారు. చూస్తుంటే జక్కన్న మూవీకి సీక్వెల్ లా అనిపించింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)'ప్రేమలు', 'లియో' తదితర డబ్బింగ్ చిత్రాలతో ఓటీటీ వల్ల తెలుగు ప్రేక్షకులకు కాస్త పరిచయమైన మలయాళ నటుడు మథ్యూ థామస్. ఇతడితో పాటు ఈగని ప్రధాన పాత్రధారులుగా పెట్టి 'లవ్లీ' మూవీ తీశారు. ఏప్రిల్ 4న తెలుగులోనూ విడుదల కానుంది. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ రిలీజ్ చేశారు.ఓ కుర్రాడితో ఈగ స్నేహం చేయడం, అతడికి కష్టమొస్తే ఆదుకోవడం లాంటి సీన్స్ చూపించారు. ఈగ విజువల్స్ చూస్తుంటే రాజమౌళి 'ఈగ' గుర్తొచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉండబోతుందనేది చూడాలి?(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' నటి) -
కాపీరైట్ కేసు.. హైకోర్టులో డైరెక్టర్ శంకర్‌కి భారీ ఊరట!
కోలీవుడ్ డైరెక్టర్ శంకర్( Shankar )కు సంబంధించిన ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనకు మద్రాస్ కోర్టు ఊరట కల్పించింది. రోబో సినిమా కథ విషయంలో కాపీరైట్(Copyright Case) ఉల్లంఘనకు పాల్పడ్డారని శంకర్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఆయనకు సంబంధించిన సుమారు రూ. 10 కోట్ల ఆస్తులను కొద్దిరోజుల క్రితమే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. అయితే, ఈడీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. మరోసారి హైకోర్టులో పిటిషన్ వేశారు. గతంలో తనకు అనుకూలంగా ఇచ్చిన కోర్టు తీర్పును కూడా లెక్కచేయకుండా ఈడీ చర్యలు తీసుకోవడం ఏంటి అంటూ మరోసారి కోర్టుకు వెళ్లారు. దీంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చర్యలపై మద్రాసు హైకోర్టు స్టే విధించింది.తాను ఎలాంటి కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడలేదని మద్రాస్ హైకోర్టులో కొద్దిరోజల క్రితమే శంకర్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ఈరోజు (మార్చి 11) న్యాయమూర్తులు ఎంఎస్ రమేష్, ఎన్. సెంథిల్‌కుమార్‌ల సెషన్లో విచారణకు వచ్చింది. ఆ సమయంలో శంకర్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది పీఎస్ రామన్.. రోబో సినిమా కథ విషయంలో శంకర్ కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించలేదని మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి వారు గతంలోనే శంకర్‌కు అనుకూలంగా తీర్పునిచ్చారని గుర్తుచేశారు. అయినప్పటికీ ఎన్ఫోర్స్మెంట్ విభాగం వారు శంకర్ ఆస్తులను జప్తు చేశారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. సినిమాకు సంబంధంలేని ఆస్తులను కూడా ఈడీ ఎలా జప్తు చేస్తుందని ఆయన ప్రశ్నించారు. దీంతో కేసును విచారించిన న్యాయమూర్తులు.. ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయడం సాధ్యమేనా..? అని ఈడీని ప్రశ్నించారు.దర్శకుడు శంకర్‌కు అనుకూలంగా సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చినప్పుడు తుది ఫలితం వచ్చే వరకు వేచి చూడకుండా ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకున్నారని న్యాయస్థానం ప్రశ్నించింది. దీనిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లాయర్ స్పందిస్తూ.. నేరం రుజువైతే ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ విభాగం కేసు నమోదు చేయవచ్చని తెలిపారు. అయితే, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ చర్యల వల్ల డైరెక్టర్ శంకర్‌కు ఎలాంటి నష్టం జరగలేదని, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్తో ఈ కేసును ఎదుర్కోవచ్చని ఆయన తెలిపారు. కానీ, ఈడీని కోర్టు తప్పబట్టింది. శంకర్ పిటిషన్‌పై పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలని ఎన్ఫోర్స్మెంట్ శాఖను ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్ 21కి వాయిదా వేశారు.ఏం జరిగిందంటే..?సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ రోబో. శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సైంటిఫిక్ యాక్షన్ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తమిళంలో ఎంథిరన్ పేరుతో ఈ మూవీని శంకర్ తెరకెక్కించారు. అయితే, ఈ కథను ‘జిగుబా’ను కాపీ కొట్టిసినిమా తెరకెక్కించారంటూ అరూర్ తమిళనాథన్ అనే వ్యక్తి 2011లోనే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాపీరైట్ చట్టాన్ని ఆయన ఉల్లంఘించారని పిటిషన్లో తెలిపారు. ఈ కేసు విషయంలో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్టీఐఐ) నివేదిక శంకర్‌కు వ్యతిరేకంగా వచ్చింది. ఈ క్రమంలో జిగుబా కథకు, రోబో సినిమాకు మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదని తేల్చేసింది. దీంతో శంకర్ కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 63ని ఉల్లంఘించినట్లు ఈడీ పేర్కొంది. -
'రేయ్.. ఎవర్రా మీరంతా'.. థియేటర్లలోకి మళ్లీ వచ్చేస్తున్నాడు
ప్రస్తుతం టాలీవుడ్లో రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. బ్లాక్ బస్టర్ సినిమాలు మళ్లీ విడుదల చేసినా ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న రామ్ చరణ్ లవ్ ఎంటర్టైనర్ ఆరెంజ్‌ను రీ రిలీజ్ చేశారు. రామ్ చరణ్- జెనీలియా జంటగా నటించిన లవ్ అండ్ రొమాంటిక్ మూవీ థియేటర్లలో సందడి చేసింది. తాజాగా ఇటీవల మరో టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టును ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమాకు థియేటర్లలో మరోసారి ఆడియన్స్‌ను అలరించింది. ఈ మూవీలో విక్టరీ వెంకటేశ్, మహేశ్ బాబు, సమంత, అంజలి కీలక పాత్రల్లో నటించారు. తాజాగా మరో సూపర్ హిట్ మూవీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది. కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం యుగానికి ఒక్కడు(ఆయిరత్తిల్ ఒరువన్) (Yuganiki Okkadu) మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. 2010లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బిగ్ హిట్‌గా నిలిచింది. ఈ విజువల్ వండర్ మూవీకి సెల్వరాఘవన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కార్తీతో పాటు ఆండ్రియా, రీమాసేన్ తమ నటనతో ప్రేక్షకులను మెప్పించారు.తాజాగా యుగానికి ఒక్కడు దాదాపు 15 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ కానుంది. ఈనెల 14న థియేటర్లలో సందడి చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, అమెరికాలో రీరిలీజ్ కానుందని వెల్లడించారు. కాగా.. ఇప్పటికే ఈ సినిమా తెలుగు వర్షన్ ఆహా ఓటీటీలో అందుబాబులో ఉంది. తమిళ వర్షన్ సన్‌నెక్ట్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.From gritty battles to heart-stopping drama❤️🔥Witness @Karthi_Offl's most captivating and raw performance in #YuganikiOkkadu on the big screens once again 🔥#YuganikiOkkaduReRelease in theatres from MARCH 14thBook your tickets now! -- https://t.co/Y4GE3fy2MiAP & TG,… pic.twitter.com/fNsmtD2UwL— Primeshow Entertainment (@Primeshowtweets) March 10, 2025 -
ఎన్నో దారుణమైన సౌత్ సినిమాలకంటే కంగువా బెటర్: జ్యోతిక
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటించిన కంగువా సినిమా (Kanguva Movie) కలెక్షన్స్ కొల్లగొడుతుందనుకుంటే బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. దాదాపు మూడేళ్లపాటు కష్టపడి తీసిన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. సినిమా ఏమీ బాగోలేదని, చాలా బోరింగ్‌గా ఉందన్న విమర్శలు వచ్చాయి. దీనిపై సూర్య సతీమణి, హీరోయిన్ జ్యోతిక అప్పట్లోనే ఘాటుగా రియాక్ట్ అయింది. కంగువ అద్భుతమైన సినిమా అని.. ఇలాంటి సాహసం చేయడానికి ధైర్యం కావాలంది. తొలి అరగంట బాగోలేదంతేసూర్య (Suriya)ను చూస్తుంటే గర్వంగా ఉందని తెలిపింది. తొలి అరగంట సినిమా బాగోలేదు, అలాగే మ్యూజిక్ కూడా కాస్త ఎక్కువగా ఉన్నట్లు అనిపించిందని పేర్కొంది. తప్పులు జరగడం సహజమేనని, ఇలాంటి చిత్రంలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయంది. ఇలాంటి మూవీకి నెగెటివ్ రివ్యూలు చూసి ఆశ్చర్యపోయానంది. డబుల్ మీనింగ్స్, ఓవర్ యాక్షన్ సీక్వెన్స్, పాత స్టోరీలతో తీసే సినిమాలకు వీళ్లెవరూ నెగెటివ్ రివ్యూలు ఇవ్వడం చూడలేదని బుగ్గలు నొక్కుకుంది.సినిమాను తొక్కేశారుకంగువా పాజిటివ్ అంశాలు కనబడలేదా? అని ప్రశ్నించింది. తొలిరోజే కంగువాపై నెగెటివిటీ చూస్తుంటే బాధగా ఉందని, కావాలనే సినిమాను తొక్కేస్తున్నారని మండిపడింది. తాజాగా డబ్బా కార్టెల్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో మరోసారి కంగువా సినిమా నెగెటివిటీపై స్పందించింది. జ్యోతిక (Jyotika) మాట్లాడుతూ.. కొన్ని సినిమాలు అస్సలు బాగోవు. అయినా సరే కమర్షియల్‌గా బాగా ఆడతాయి. వాటికి మంచి రివ్యూలు కూడా ఇస్తుంటారు. కానీ నా భర్త సినిమా (కంగువా) విషయానికి వచ్చేసరికి మాత్రం కాస్త కఠినంగా ప్రవర్తించారనిపిస్తుంది.ఎన్నో దారుణ సినిమాల కంటే కంగువా నయంసినిమాలో బాగోలేని సన్నివేశాలు కొన్ని ఉండొచ్చు. కానీ ఆ మూవీ కోసం అందరూ ఎంతగానో కష్టపడ్డారు. అది కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తోంది. అయినా సరే.. దక్షిణాదిలో ఎన్నో అద్వాణ్నమైన సినిమాలకంటే కూడా ఈ చిత్రానికే ఎక్కువ దారుణమైన రివ్యూలు ఇచ్చారు. అది చూసి నాకెంతో బాధేసింది అని చెప్పుకొచ్చింది. సుమారు రూ.350 కోట్లతో తెరకెక్కిన కంగువా కేవలం రూ.160 కోట్లు మాత్రమే రాబట్టింది. ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహించాడు.చదవండి: భారత్‌లో తొలి ఏఐ సినిమా.. హీరోహీరోయిన్లు కూడా.. -
'ముత్తువేల్ పాండియన్' వేట మొదలైంది
రజనీకాంత్- నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్లో వచ్చిన జైలర్ 2023 సినిమా భారీ హిట్ అయింది. ఈ చిత్రానికి సీక్వెల్ వస్తుందని వార్తలు అయితే వస్తున్నాయి కానీ అధికారికంగా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనేది చెప్పలేదు. తాజాగా, ఈ అంశం గురించి సన్‌పిక్చర్స్ అప్డేట్ ఇచ్చేసింది. ‘జైలర్ 2’ సినిమా షూటింగ్ నేటి నుంచి ప్రారంభం అవుతుందని మేకర్స్ ప్రకటంచారు. ముత్తువేల్ పాండియన్ వేట ఇప్పుడే ప్రారంభమైంది అంటూ ఒక పోస్టర్‌ను పంచుకున్నారు.జైలర్2 షూటింగ్ ప్రారంభమైనట్లు మేకర్స్ ప్రకటించడంతో రజనీకాంత్ అభిమానులు వైరల్ చేస్తున్నారు. ‘టైగర్ కా హుకుమ్’ అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. ‘జైలర్ 2’ కథాంశం ప్రధానంగా గోవా నేపథ్యంలో ఉంటుందని కోలీవుడ్ సమాచారం. ఇకపోతే జైలర్ చిత్రంలో నటించిన మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ తదితర ప్రముఖ నటీనటులే నటించనున్నట్లు తెలుస్తోంది. సీక్వెల్లో కన్నడ భామ శ్రీనిధి శెట్టి నటించనున్నట్లు తెలిసింది. ఈ ఏడాది డిసెంబర్లో జైలర్2 విడుదల చేసే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నారు.సూపర్‌స్టార్ రజనీకాంత్ ఏడు పదుల వయసులోనూ వరుసగా చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఈయన ఇటీవల జ్ఞానవేల్ దర్మకత్వంలో వేట్టైయన్‌లో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా మెప్పించారు. అయితే, ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రంలో రజనీకాంత్ నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా కూలీ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తి అయిపోయింది. దీంతో వెంటనే ఆయన జైలర్2 ప్రాజెక్ట్‌లోకి షిఫ్ట్ అయిపోయారు. -
'రష్మిక'కు రక్షణ కల్పించాలంటూ అమిత్ షాకు 'కుల' పెద్దల లేఖ
పాన్ ఇండియా రేంజ్లో సత్తా చాటుతున్న కన్నడ బ్యూటీ 'రష్మిక మందన్న'కు రక్షణ కల్పించాలని ఆమె కులానికి (కొడవ) చెందిన సంఘం వారు రంగంలోకి దిగారు. ఈమేరకు వారు కేంద్రానికి లేఖ కూడా రాశారు. రీసెంట్గా 'ఛావా' సినిమా సక్సెస్ మీట్లో రష్మిక చేసిన వ్యాఖ్యలు కన్నడ నాట భగ్గుమన్నాయి. బాలీవుడ్ మీడియాతో ఆమె మాట్లాడుతూ.. 'నేను హైదరాబాద్ నుంచి వచ్చాను.. నాపై ఇక్కడి వారు చూపుతున్న ప్రేమాభిమానాలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది.' అని చెప్పడంతో కర్ణాటకలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. సొంతూరును మరిచిపోయి ఇలా మాట్లాడటం ఏంటి అంటూ ఆమెపై కన్నడ అభిమానులు ఫైర్ అయ్యారు.రష్మికకు రక్షణగా 'కుల' పెద్దలుసౌత్ ఇండియాతో పాటు బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ కెరీర్లో దూసుకెళ్తున్న రష్మికకు భద్రత కల్పించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాష్ట్ర హోం మంత్రి జి. పరమేశ్వర్లకు 'కొడవ నేషనల్ కౌన్సిల్' (సీఎన్సీ) లేఖ రాసింది. రష్మిక చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెను దుమారం రేగడంతో కర్ణాటకలోని ఒక ఎమ్మెల్యేతో పాటు కన్నడ అనుకూల వర్గానికి చెందిన వారు ఆమెపై బెదిరింపులకు దిగారని (సీఎన్సీ) పేర్కొంది. దీంతో నటికి భద్రత కల్పించాలని 'కొడవ' బోర్డు కోరింది. తమ తెగకు చెందిన రష్మిక తన కృషి, ప్రతిభతో భారతీయ చిత్ర పరిశ్రమలో అఖండ విజయాన్ని సాధించిందని బోర్డు చైర్మన్ ఎన్.యు. నాచప్ప లేఖలో పేర్కొన్నారు. దేశంలోనే గొప్ప నటులుగా గుర్తింపు ఉన్న అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్ వంటి వారితో స్క్రీన్ షేర్ చేసుకుందని గుర్తుచేశారు. ఆమెకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది కాబట్టే తన అభిప్రాయాన్ని పంచుకుందన్నారు. కానీ, ఎమ్మెల్యే చేసిన ప్రకటనతో ఆమెలో భయం పెరిగిందని ఆయన అన్నారు. తాను వెనుకబడిని వర్గానికి చెందిన మహిళ కాబట్టే టార్గెట్ చేసి బెదిరిస్తున్నారు. ఇప్పటికే రష్మిక మందన్న కూడా ఫిర్యాదు చేసిందని నాచప్ప తెలిపారు. కర్ణాటకలో కొడవ వర్గం ప్రజలు ఓబీసీ కిందకు వస్తారు. రష్మిక మందన్న సామాజిక వర్గం 'కొడవ' అని తెలిసిందే.ఎమ్మెల్యే బెదిరింపులురష్మికపై కర్ణాటకలోని మండ్యాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే 'రవి గనిగ' ఫైర్ అయ్యారు. బాలీవుడ్లో ఆమె చేసిన వ్యాఖ్యలను తప్పుబడతూ ఆయన ఒక ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. జీవితాన్ని ఇచ్చిన ఇండస్ట్రీని ఆమె తక్కువ చేసిందని తెలిపారు. ఈ విషయం రష్మిక తెలుసుకోవాలని కోరారు. బెంగళూరు వేదికగా జరుగుతోన్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు కూడా ఆమె అంగీకరించలేదని ఆయన ఆరోపించారు. రష్మిక మందన్నకు సరైన గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్యే రవి పిలుపునిచ్చారు. ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనని వారిపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అలాంటి వారి నట్లు, బోల్టులు ఎలా సరిచేయాలో తమకు తెలుసని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో కొడవ సామాజిక వర్గం వారు రష్మిక మందన్నకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. ఆమెకు రక్షణ కల్పించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కొడవ వర్గం లీడర్ ఒక లేఖ రాశారు. -
కేవలం రూ. 2500 కోసం రోడ్డుపైనే డ్యాన్స్ చేశా: వరలక్ష్మి శరత్ కుమార్
కోలీవుడ్ ప్రముఖ నటుడు శరత్ కుమార్ వారసురాలు నటి వరలక్ష్మి శరత్ కుమార్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఈమె తండ్రి సపోర్ట్ లేకుండానే దక్షిణాదిలో ప్రముఖ నటిగా ఎదిగారు అన్నది వాస్తవం. నటి నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన పోడాపోడి చిత్రం ద్వారా కథానాయకిగా ఎంట్రీ ఇచ్చిన నటి వరలక్ష్మి . శంభో కథానాయకుడిగా నటించిన ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఆమెకు వెంటనే మరో అవకాశం రాలేదు. అలాంటి సమయంలో దర్శకుడు బాల తాను దర్శకత్వం వహించిన తారైతప్పట్టై చిత్రంలో నటించే అవకాశాన్ని కల్పించారు. ఆ చిత్రం నటి వరలక్ష్మి శరత్ కుమార్ మంచి పేరును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో కథానాయకిగా నటించింది. అయితే, హీరోయిన్గా టాప్ స్టార్ ఇమేజ్ ని మాత్రం ఇప్పటికీ పొందలేకపోయింది. కానీ, ఆమె కథానాయకిగానే కాకుండా ప్రతి కథానాయకిగా కూడా నటిస్తూ విలక్షణ నటిగా గుర్తింపు పొందింది. అలా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం తదితర భాషల్లో నటిస్తూ దక్షిణాది నటిగా ముద్ర వేసుకుంది. డేరింగ్ నటిగా పేరు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ 39 ఏళ్ల వయసులో గత ఏడాది తన చిరకాల మిత్రుడు నికోలాయ్ సచ్దేవ్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వివాహ తర్వాత తన భర్తతో పాటుగా కనిపిస్తున్న ఆమె ఇటీవల ఒక డాన్స్ కార్యక్రమంలో పాల్గొంది. ఆ డాన్స్ కార్యక్రమంలో ముగ్గురు పిల్లలకు తల్లి అయిన మరో మహిళ కూడా పాల్గొంది. తనదైన స్టెప్పులతో అదరగొట్టేసింది. ఆమె టాలెంట్‌ను చూసిన వరలక్ష్మీ ఫిదా అయిపోయింది. అయితే, మ్యూజిక్ వినగానే తనకు డాన్స్ చేయాలనిపిస్తుందని ఆ మహిళ తెలిపింది. దీంతో నటి వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ తాను ఇప్పటి వరకు ఎవరికీ చెప్పని ఒక రహస్యాన్ని ఈ వేదికపై చెబుతానని పేర్కొంది. గతంలో తాను కూడా ఒక్కోసారి రోడ్డుపైనే డాన్స్ చేసిన సంర్భాలను గుర్తుచేసుకుంది. తాను సినీ రంగ ప్రవేశం చేయకముందు 2500 రూపాయల కోసం మొట్టమొదటిసారిగా ఒక షో కోసం రోడ్లో డాన్స్ చేశానని చెప్పింది. రోడ్డుపై డాన్స్ చేయడం ఎవరూ తప్పుగా భావించవద్దని నటి వరలక్ష్మి శరత్ కుమార్ పేర్కొంది. -
కస్టడీలో రన్యా రావు.. కన్నీళ్ల పర్యంతమైన నటి!
ప్రముఖ కన్నడ నటి రన్యా రావు బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడింది. దుబాయ్ నుంచి బెంగళూరు చేరుకున్న ఆమెను డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి దాదాపు 14 కేజీలకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే రన్యారావును అరెస్ట్ చేసిన అధికారులు రిమాండ్‌కు పంపించారు. ప్రస్తుతం రన్యా రావును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారుల కస్టడీలో ఉన్నారు. ఈ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.అయితే ఇవాళ డీఆర్ఐ అధికారుల ముందు విచారణకు హాజరైన రన్యారావు కన్నీళ్ల పర్యంతమైంది. అసలు ఇందులోకి ఎందుకు వచ్చానో అంటూ తన న్యాయవాదులతో అన్నారు. నిద్రలో కూడా ఎయిర్పోర్ట్ గుర్తొస్తోందని.. అస్సలు నిద్రపట్టడం లేదని తెలిపింది. మానసికంగా కృంగిపోయానని తన లాయర్లతో రన్యా రావు చెప్పింది. విచారణ సందర్భంగా ఫుల్ ఎమోషనలైంది రన్యా రావు. మరోవైపు ఆమెపై ఇప్పటికే సీబీఐ అధికారులు కూడా కేసు నమోదు చేశారు.కాగా.. మాణిక్య సినిమాతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన రన్యా రావు కేవలం మూడు చిత్రాల్లో మాత్రమే కనిపించింది. ఈ మూవీ తెలుగు సినిమా మిర్చి రీమేక్‌గా తెరకెక్కించారు. ఆ తర్వాత పటాస్ కన్నడ రీమేక్ పటాకిలో హీరోయిన్గా నటించింది. తమిళంలో వాఘా మూవీ చేసింది. ఎనిమిదేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటోంది. బంగారు అక్రమ రవాణా చేస్తుండగా మార్చి 3న దుబాయ్ నుంచి వస్తుండగా కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. -
ప్రెగ్నెన్సీతో 46 ఏళ్ల నటి.. ఫొటో షూట్ పిక్స్ వైరల్
జైలర్, డాక్టర్ తదితర డబ్బింగ్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ రెడిన్ కింగ్ స్లీ. హాస్యంతో పాటు మంచి డ్యాన్సర్ కూడా. లేటు వయసులో నటి సంగీతని ప్రేమించి పెళ్లిచేసుకోగా.. కొన్నాళ్ల క్రితం ప్రెగ్నెన్సీని కూడా ప్రకటించారు. తాజాగా ఫొటో షూట్ పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.నటుడిగా రాణిస్తున్న రెడిన్.. 40 ఏళ్లు దాటిపోయినా సరే మొన్నమొన్నటివకు సింగిల్ గానే ఉన్నాడు. ఈ క్రమంలోనే తమిళ సీరియల్ నటి సంగీతని ప్రేమించాడు. అలా 2023 డిసెంబరులో వీళ్లిద్దరూ గుడిలో సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు కూడా. సరిగ్గా ఏడాది పూర్తయిన తర్వాత అంటే గతేడాది డిసెంబరులో ప్రెగ్నెన్సీ విషయాన్ని ప్రకటించారు.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' నటి)తాజాగా సంగీత ప్రెగ్నెన్సీతొ ఫొటో షూట్ చేయించుకుంది. ఈ క్రమంలోనే రెండు ఫొటోల్ని పోస్ట్ చేసింది. ఇందులో ఓ ఫొటోలో అబ్బాయి, అమ్మాయి అని రెండు ట్యాగ్స్ పట్టుకోవడంతో ఈమెకు కవలలు పుట్టబోతున్నారా అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.దళపతి విజయ్ 'మాస్టర్' సహా పలు సినిమాల్లో సంగీత నటించినప్పటికీ, సీరియల్స్ తో పాపులారిటీ తెచ్చుకుంది. ప్రస్తుతం గర్భవతి కావడంతో కొన్ని నెలల పాటు సీరియల్స్ లో నటించడం మానేసింది సంగీత.(ఇదీ చదవండి: 'పుష్ప 2' దెబ్బకు ఫ్లాప్.. ఇన్నాళ్లకు ఓటీటీలోకి ఆ సినిమా) -
సతీమణి బర్త్ డే.. భార్యకు సర్ప్రైజ్ ఇచ్చిన కేజీఎఫ్ స్టార్
కేజీఎఫ్ సినిమాలో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరో యశ్. ఈ మూవీతో దేశవ్యాప్తంగా ఫేమస్ అయిపోయారు. ప్రస్తుతం ఆయన టాక్సిక్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాకు గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాకుండా బాలీవుడ్లో నితీశ్ తివారీ తెరకెక్కించనున్న రామాయణంలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో రావణుడి పాత్రలో యశ్ మెప్పించనున్నారు.అయితే నటి రాధిక పండిట్‌ను యశ్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. 2016లో వీరిద్దరు వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. తాజాగా ఇటీవల మార్చి 7న యశ్ భార్య రాధిక పండిట్ బర్త్ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ పుట్టినరోజు వేడుకల్లో హీరో యశ్ సతీమణికి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఆమె బర్త్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలో రొమాంటిక్ సాంగ్‌ను ఆలపించాడు. 1981లో వచ్చిన కన్నడ మూవీలోని పాటను పాడి సతీమణికి గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను రాధిక తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇక సినిమాల విషయానికొస్తే కేజీఎఫ్ స్టార్ యశ్ చివరిసారిగా కేజీఎఫ్-2లో కనిపించారు. View this post on Instagram A post shared by Radhika Pandit (@iamradhikapandit) -
నిశ్చితార్థం చేసుకున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' నటి
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటి అభినయ నిశ్చితార్థం చేసుకుంది. పుట్టుకతోనే ఈమె బధిరురాలు. అంటే మాట్లాడలేదు, వినబడదు. కానీ నటిగా వరస సినిమాలు చేస్తోంది. ఇప్పుడు రహస్యంగా నిశ్చితార్థం చేసుకుని అందరికీ షాకిచ్చింది.(ఇదీ చదవండి: గోదావరిలో అస్థికలు కలిపిన యాంకర్ రష్మీ)చెన్నైకి చెందిన అభినయ.. 2008 నుంచి దక్షిణాది భాషల్లో సినిమాలు చేస్తోంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, దమ్ము, ధృవ, శంభో శివ శంభో, సీతారామం తదితర చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించింది. రీసెంట్ గా 'పని' అనే మలయాళ మూవీలో హీరోయిన్ గానూ చేసింది.కొన్నాళ్ల క్రితం హీరో విశాల్ తో ఈమె రిలేషన్ లో ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. వాటిని తోసిపుచ్చిన అభినయ.. తాను 15 ఏళ్లుగా తన చిన్నప్పటి స్నేహితుడితో ప్రేమలో ఉన్నానని, త్వరలోనే పెళ్లి చేసుకుంటామని చెప్పింది. అందుకు తగ్గట్లే ఇప్పుడు నిశ్చితార్థం చేసుకుంది. కాకపోతే కాబోయే భర్త ముఖం, వివరాలు లాంటివి బయటపెట్టలేదు.(ఇదీ చదవండి: 'పుష్ప 2' దెబ్బకు ఫ్లాప్.. ఇన్నాళ్లకు ఓటీటీలోకి ఆ సినిమా) View this post on Instagram A post shared by M.g Abhinaya (@abhinaya_official) -
'డ్రాగన్' నా లైఫ్‌లో జరిగిందే.. మనీ అడగాలంటే సిగ్గనిపించింది: డైరెక్టర్
కంటెంట్ బాగుంటే చాలు భాషతో సంబంధం లేకుండా సినిమాలు సక్సెస్ బాట పడతాయి. ఇటీవల వచ్చిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ (Return Of The Dragon) కూడా అదే కోవలోకి వస్తుంది. లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) హీరోగా నటించిన ఈ సినిమా తమిళం, తెలుగు భాషల్లో ఫిబ్రవరి 21న విడుదలైంది. అనుపమ పరమేశ్వరన్, కయాడు లోహర్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ రూ.120 కోట్లపైనే వసూళ్లు రాబట్టింది. తాజాగా హిందీలోనూ విడుదలకు సిద్ధమైంది. ముందడుగుఈ విషయాన్ని హీరో ప్రదీప్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. మార్చి 14న రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ హిందీలో రిలీజవుతోంది. నా సినిమాలు దేశమంతటా చూడాలని ఎప్పటినుంచో అనుకునేవాడిని. నా ఆలోచనలు ఆచరణలో అమలయ్యేందుకు తొలి అడుగు పడింది. షారూఖ్ ఖాన్ సర్, సల్మాన్ ఖాన్ సర్, ఆమిర్ ఖాన్ సర్.. మీరందరూ పక్కకు జరగండి.. నేను వస్తున్నా అని సరదాగా ట్వీట్ చేశాడు.అంత పెద్దోడివైపోయావా?ఇది చూసిన నెటిజన్లు.. ఏంటి, బాలీవుడ్ హీరోలకే ధమ్కీ ఇస్తున్నావా? అంత పెద్దవాడివైపోయావా?, ఏదేమైనా హిందీలో రీమేక్ చేయకుండా డబ్బింగ్ చేసి మంచి పని చేశారు అని కామెంట్లు చేస్తున్నారు. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందించాడు. డ్రాగన్ సినిమా తన నిజ జీవితానికి సంబంధించిందని చిత్రదర్శకుడు అశ్వత్ మారిముత్తు తెలిపాడు. సినిమాలోని ఆ బ్యాచిలర్ రూమ్ నేను నివసించిందే!'కొన్నిసార్లు మన జీవితంలో అత్యంత ముఖ్యమైనవారికి కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోతుంటాం. వాళ్లెవరో కాదు మన స్నేహితులే! డ్రాగన్ సినిమాలో చూపించే బ్యాచిలర్ రూమ్ లైఫ్ నా నిజజీవితంలోనిదే! కేవలం పాత్రలు మాత్రమే కాదు ఆ ప్లేస్ కూడా నేను నివసించిందే.. ఇగీ, పంబు, అంబు, అజయ్, కరుప్స్, బాలాజీ, జై, మురళి, జాన్, గ్లెన్, హరి, విక్కీ.. మేమంతా కాలేజీ ఫ్రెండ్స్. అందరం రూమ్ తీసుకుని ఉండేవాళ్లం. కాలేజీ అయిపోయాక జీరోఇందులో కొందరు అప్పుడప్పుడు మా దగ్గరకు వచ్చేవారు. సినిమాలో చూపించినట్లే కాలేజ్ అయిపోయాక నేను జీరోనయ్యాను. కానీ నాలో టాలెంట్ ఉందని నమ్మి నా స్నేహితులు నాకు అండగా నిలబడ్డారు. వాళ్లు కష్టపడి సంపాదించిన జీతంలో నుంచి ఒక్కొక్కరూ రూ.2000 చొప్పున నాకు ఇచ్చేవారు. ఆ డబ్బుతో షార్ట్ ఫిలింస్ తీశాను. ఒకసారి ఏదో పోటీలో నేను రెండో రౌండ్‌కు సెలక్ట్ అయ్యాను. నా బెస్ట్ ఫ్రెండ్ ప్రోత్సాహంతో..కానీ ఫ్రెండ్స్‌ను మళ్లీ డబ్బులడగాలంటే నాకు సిగ్గుగా అనిపించింది. ఆ సమయంలో నా బెస్ట్ ఫ్రెండ్ ఇగీ.. అతడి తల్లికి ఫోన్ చేసి అశ్వత్ పోటీలో ముందుకు వెళ్లడానికి రూ.2 వేలిస్తున్నాను. మీరు అడ్జస్ట్ చేసుకోండి అని చెప్పాడు. అది నేనెన్నటికీ మర్చిపోలేను. 8 షార్ట్ ఫిలింస్ తీశా.. నా ప్రతి అడుగులో వారు తోడున్నారు. నా ఫోన్ పగిలిపోయినప్పుడు బాలాజీ ఫోన్ కొనిచ్చాడు. ఇంత మంచి మిత్రులు నా జీవితంలో ఉన్నారు. మా గ్యాంగ్‌లో నేనే మిగిలా..నేను అందుకున్న విజయం వారి సొంతం. థాంక్యూ బాయ్స్.. ఈ రోజు మా గ్యాంగ్‌లో పంబు పెళ్లి జరిగింది. అంటే ఈ గ్యాంగ్‌లో సింగిల్‌గా మిగిలింది నేనొక్కడినే' అని రాసుకొచ్చాడు. ఇందుకు తన ఫ్రెండ్స్‌తో దిగిన పాత ఫోటోలను జత చేశాడు. ఇది చూసిన నెటిజన్లు.. ఇంత మంచి స్నేహితులు దొరకడం నీ అదృష్టం.. నువ్వు జీవితంలో ఇంకా ఎన్నో విజయాలు అందుకోవాలి అని కామెంట్లు చేస్తున్నారు. ‘Return of The Dragon ‘ releasing in HINDI from MARCH 14 . Always wanted my movies to be watched by the whole of India, and here is our first step . Sharukh @iamsrk sir , Salman @BeingSalmanKhan sir , Aamir sir संभल जाओ, मैं आ रहा हूँ! 😂😂😂😂😂😂Link. :… pic.twitter.com/Lg99OWYIFn— Pradeep Ranganathan (@pradeeponelife) March 8, 2025Important post. Sometimes we fail to thank the most important people in our life because they are our friends and they won’t take it wrong !The bachelor room life that u see in ‘Dragon’ is almost 90 percent recreated from my life ! Not just the characters but also the place !… pic.twitter.com/k2Jzc64SFa— Ashwath Marimuthu (@Dir_Ashwath) March 8, 2025చదవండి: కన్నడ స్టార్ యశ్‌తో విభేదాలు.. స్పందించిన సోదరి -
25 ఏళ్ల మా బంధానికి ఆయన ఆశీస్సులే కారణం: ఖుష్బు సుందర్
సీనియర్ నటి ఖుష్బు సుందర్ అప్పట్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. తమిళంతో పాటు తెలుగులోనూ పలు స్టార్ హీరోలతో కలిసి నటించింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో కనిపిస్తోంది. కోలీవుడ్‌తో పాటు తెలుగులోనూ పలు సినిమాల్లో నటిస్తోంది. సినిమాల్లో నటిస్తూనే 2000వ సంవత్సరంలో వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. హీరో, డైరెక్టర్ అయిన సుందర్‌ను ఆమె పెళ్లాడింది.తాజాగా ఇవాళ తమ 25వ వివాహా వార్షికోత్సవం జరుపుకున్నారు ఖుష్బు - సుందర్ దంపతులు. ఈ సందర్భంగా ప్రముఖ మురుగన్ ఆలయాన్ని సందర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు ఖుష్బు సుందర్న్తన భర్తతో దిగిన ఫోటోను షేర్ చేశారు. ఈ ప్రత్యేకమైన రోజున తన వెడ్డింగ్ శారీని ధరించినట్లు వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఈ జంటకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.I very proudly wear my wedding saree on my 25th anniversary today. I added few borders to give a twist. We couldn't have asked for a better way to start our day than taking the blessings of ##LordMuruga in Palani. What we have today wouldn't be possible without the blessings of… pic.twitter.com/5JobnMNkdF— KhushbuSundar (@khushsundar) March 9, 2025 -
కన్నడ స్టార్ యశ్‌తో విభేదాలు.. స్పందించిన సోదరి
కన్నడ స్టార్ యశ్ (Yash), నటి దీపికా దాస్ దగ్గరి బంధువులు. వీరిద్దరూ వరసకు అన్నాచెల్లెళ్లవుతారు. కానీ ఎప్పుడూ ఒకరి గురించి మరొకరు పెద్దగా మాట్లాడుకోరు, కలిసి కనిపించరు. దీంతో వీరి మధ్య ఏమైనా గొడవలున్నాయా? అన్న రూమర్లు కూడా వినిపించాయి. అయితే అలాంటిదేమీ లేదని కొట్టిపారేసింది దీపిక. దీపికా దాస్ (Deepika Das) ముఖ్య పాత్రలో నటించిన కన్నడ చిత్రం పారు పార్వతి. ఈ మూవీ ఈ వారమే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. యష్‌తో విభేదాలుసినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె యశ్‌తో విభేదాలున్నాయా? అన్న ప్రశ్నకు స్పందించింది. మా మధ్య ఎటువంటి గొడవలు లేవు. మేము బాగానే ఉన్నాం. కాకపోతే వృత్తిపరంగా ఎవరి కెరీర్‌ను వారే నిర్మించుకోవాలనుకున్నాం. సినిమాలను మా మధ్యలోకి రానివ్వం. మాకు ఒకరిపై మరొకరికి గౌరవం ఉంది. పదేపదే మా బంధాన్ని పబ్లిక్‌లో చెప్పాల్సిన పని లేదన్నది నా అభిప్రాయం.గోప్యతకే ప్రాధానంఅలాగే నేనేదైనా మంచిపని చేస్తే యశ్ నన్ను అభినందిస్తాడు. కానీ దాన్ని పబ్లిసిటీ చేయడం మాకు నచ్చదు. పాజిటివ్, నెగెటివ్ ఏదైనా కానీ చిన్న వార్త దేశమంతా చుట్టేస్తోంది. అందుకే మా వ్యక్తిగత జీవితాలను గోప్యంగానే ఉంచుకుంటాం, అందరికీ చెప్పాలనుకోం. మా కుటుంబాలు వేర్వేరు ఇళ్లలో నివసిస్తాయి. అందువల్ల ఏదైనా ప్రత్యేక సందర్భాల్లోనే మేము కలుసుకుంటూ ఉంటాం.సంతోషంగా ఉందియశ్ కన్నడ సినిమాను అగ్రస్థానంలో నిలబెట్టాడు. అతడు కొనసాగుతున్న కన్నడ చలనచిత్ర పరిశ్రమ (Sandalwood)లో నేనూ ఉండటం సంతోషంగా భావిస్తున్నాను. అతడు మున్ముందు సాండల్‌వుడ్‌ను ప్రపంచ చిత్రపటంలో నిలబెట్టాలని ఆశిస్తున్నాను అని చెప్పుకొచ్చింది. కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 సినిమాలతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ తెచ్చుకున్న యశ్ ప్రస్తుతం టాక్సిక్ మూవీ చేస్తున్నాడు.చదవండి: 'శ్రీలీల రాకతో ఈ ఐటం బ్యూటీ కెరీర్ ఖతం'.. ఇవే నచ్చదంటున్న నోరా -
'ఛావా' తెలుగు వర్షన్.. రెండో రోజు కలెక్షన్ల జోరు
బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా 'ఛావా' తెలుగులో కూడా సత్తా చాటుతుంది. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. విక్కీ కౌశల్, రష్మిక ప్రధానపాత్రలో నటించిన ఈ చిత్రాన్ని లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 14న హిందీ వర్షన్లో మాత్రమే విడుదలైన ఈ మూవీ తెలుగు డబ్బింగ్లో మార్చి 7న థియేటర్స్‌లోకి వచ్చేసింది. ఈ ఏడాది బాలీవుడ్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా ఛావా రికార్డు నెలకొల్పింది. మూడు వారాల తర్వాత తెలుగులో విడుదలైనప్పటికీ కలెక్షన్స్ పరంగా దుమ్మురేపుతుంది.ఛావా సినిమా తెలుగు వర్షన్‌ను గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ పతాకంపై నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేశారు. తొలిరోజే ఈ చిత్రం రూ.3 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు సంస్థ తెలిపింది. ఒక డబ్బింగ్ చిత్రానికి ఈ స్థాయిలో కలెక్షన్లు రావడం రికార్డ్ అంటూ నెట్టింట పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే, రెండో రోజు 'ఛావా' తెలుగు కలెక్షన్స్ మరింత పెరిగాయి. రెండు రోజులకు గాను టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రూ. 6.81 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. నేడు ఆదివారం కావడంతో సులువుగా రూ. 10 కోట్ల మార్క్‌ను దాటుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఈ చిత్రంలో శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్ ఆయన సతీమణి యేసుబాయి భోంస్లే పాత్రలో రష్మిక మందన్న జీవించేశారని ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. కథలో కీలకమైన ఔరంగజేబు పాత్రతో అక్షయ్ ఖన్నా అదరగొట్టేశారని చెప్పవచ్చు. దీంతో ఛావా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లు దాటేసింది. -
ఏ ఎండకు ఆ గొడుగు పట్టేస్తే ఎలా.. డ్రాగన్ బ్యూటీపై సెటైర్స్
సినిమా రంగంలోనైనా, రాజకీయరంగంలోనైనా చెప్పేదొక్కటి చేసే దొక్కటి. ఈ రంగాల్లో సందర్భాన్ని బట్టి మాట మార్చడం చాలా మంది విషయంలో సహజమే. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, డ్రాగన్ నటి కయాదు లోహార్నే కారణం. ఈ అస్సామీ బ్యూటీ 21 ఏళ్ల పరువంలోనే నటిగా ఎంట్రీ ఇచ్చారు. అలా మొదట్లో కన్నడంలో ముగిల్పేట అనే చిత్రంలో కథానాయకిగా నటించారు. ఆ తరువాత మలయాళంలో పథోన్పత్తం నూత్తాండు అనే చిత్రంలో ఎంట్రీ ఇచ్చారు. ఆపై తెలుగులో 2022లో అల్లూరి అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అదే విధంగా మరాఠీ భాషలోనూ ప్రేమ్ యు అనే చిత్రంలో నటించారు. అలా రెండేళ్లలోనే నాలుగు భాషలను చుట్టేసిన ఈ అమ్మడికి తాజాగా తమిళంలో నటించిన డ్రాగన్ చిత్రంతో సంచలన విజయం వరించింది. ఇప్పుడు దక్షిణాదిలో క్రేజీ కథానాయకిగా మారిపోయారు. కాగా తాజాగా అధర్వకు జంటగా ఇదయం మురళి అనే చిత్రంలో నటిస్తున్నారు. అదే విధంగా మరో తెలుగు చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. కాగా తెరపై అందాలను ఆరబోయడంలో ఏమాత్రం వెనుకాడని ఈ అమ్మడి తన నోటీకొచ్చింది మాట్లాడేస్తుండటంతో నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గన కయాదు లోహర్‌ను సెలబ్రిటీ క్రష్ ఎవరు అన్న ప్రశ్నకు దళపతి విజయ్ తన సెలబ్రిటీ క్రష్ అని చెప్పారు. ఆన నటన తనకు చాలా ఇష్టం అని కూడా పేర్కొన్నారు. ఆయన నటించిన చిత్రాల్లో తెరి అంటే చాలా ఇష్టం అని చెప్పారు. అయితే అలా అన్న కొద్ది రోజుల్లోనే తన ఇన్‌స్ట్రాగామ్‌లో అభిమానులతో ముచ్చటిస్తూ తనకు నచ్చిన హీరో ధనుష్ అనీ, ఈ విషయంలో మరొకరికి చోటు లేదు అని చెప్పారు. దీంతో ఈ బ్యూటీ వ్యవహారాన్ని గమనించిన నెటిజన్లు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే నటి అంటూ ఆడేసుకుంటున్నారు. అలా కయాదు లోహర్ వారికి దొరికిపోయారు. అయినా, సినిమాల్లో ఇదంతా సహజమే అంటున్నారు సినీ ప్రముఖులు. -
తెలుగు హీరో... హిందీ విలన్
తెలుగు తెరపై బాలీవుడ్ హీరోయిన్ల హవా ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. కానీ ఇప్పుడు బాలీవుడ్ నటులు కూడా తెలుగు సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే తెలుగు సినిమాల్లో ఎక్కువగా విలన్ రోల్స్ చేసేందుకే బాలీవుడ్ యాక్టర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా తొలిసారిగా తెలుగు తెరపై విలన్‌గా కనిపించనున్న కొందరు బాలీవుడ్ యాక్టర్స్, వారు ఓకే చేసిన సినిమాలు వివరాలు ఇలా ఉన్నాయి.మల్టీ మిలియనీర్‘నీర్జా, పద్మావత్, సంజు, గంగుభాయి కతియావాడి’ వంటి చిత్రాలతో నటుడిగా బాలీవుడ్లో నిరూపించుకున్నారు జిమ్ సర్భ్. ఈ నటుడికి టాలీవుడ్ ఎంట్రీ చాన్స్ లభించింది. నాగార్జున–ధనుష్ హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ అనే మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ మూవీలో ఓ మల్టీ మిలియనీర్ పాత్రను జిమ్ సర్భ్ చేస్తున్నారు.తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ పీరియాడికల్ ఫిల్మ్‌ను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఎస్వీసీఎల్ఎల్పీ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ హైప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మిస్తున్నారు. జూన్ 20న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాల్లో ధనుష్ భిక్షగాడిగా కనిపిస్తారని, ఓ ఆఫీసర్‌గా నాగార్జున, మల్టీ మిలియనీర్ పాత్రలో జిమ్ సర్భ్ కనిపిస్తారని తెలిసింది. ఓ బలమైన సామాజిక అంశం, డబ్బు ప్రధానాంశాలుగా ‘కుబేర’ కథనం సాగుతుందని సమాచారం.ఇటు ఓజీ... అటు జీ2‘మర్డర్, గ్యాంగ్‌స్టర్, ముంబై సాగ, టైగర్ 3, వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై’ వంటి పలు బాలీవుడ్ సినిమాల్లో నటించిన ఇమ్రాన్ హష్మి గురించి తెలుగు ఆడియన్స్‌కు తెలిసిందే. ఈ హీరో టాలీవుడ్ ఎంట్రీ ఇప్పుడు ఖరారైంది. ప్రజెంట్ రెండు తెలుగు సినిమాల్లో విలన్‌గా నటిస్తున్నారు ఇమ్రాన్ హష్మి. పవన్ కల్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలోని గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్ ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ – ప్రచారంలో ఉన్న టైటిల్)లో ఇమ్రాన్ హష్మీ ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. ఓమి భావ్ అనే పాత్రలో హష్మి కనిపించనున్నట్లుగా తెలిసింది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.వీలైనంత తొందరగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసి, ఈ ఏడాదే రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ ΄్లాన్ చేస్తోంది. మరోవైపు అడివి శేష్ ‘జీ 2’ (గూఢచారి 2) చిత్రంలోనూ ఇమ్రాన్ హష్మి ఓ లీడ్ రోల్లో నటిస్తున్నారు. అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీలో బాలీవుడ్ నటి వామికా గబ్బి మరో లీడ్ రోల్లో నటిస్తున్నారు. కాగా ‘జీ 2’ సినిమా షూటింగ్లో ఆల్రెడీ ఇమ్రాన్ హష్మీ జాయిన్ అయ్యారు. గత ఏడాది అక్టోబరులో ‘జీ 2’ కోసం ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తుండగా ఇమ్రాన్ గాయపడ్డారు. కానీ ఆ తర్వాత తిరిగి షూటింగ్లో పాల్గొన్నారు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వినయ్ కుమార్ సిరిగినీడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాదే రిలీజ్ కానుంది. కాగా అడివి శేష్ హీరోగా నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘గూఢచారి’కి సీక్వెల్‌గా ‘జీ 2’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇలా ఒకేసారి రెండు తెలుగు సినిమాల్లో విలన్‌గా నటిస్తూ, డబుల్ విలన్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఇమ్రాన్ హష్మి.ఇన్స్పెక్టర్ స్వామిఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ చిత్రం విజయ్ సేతుపతి ‘మహారాజా’, మలయాళ చిత్రం ‘రైఫిల్ క్లబ్’ వంటి చిత్రాల్లో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ నటన తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. దీంతో అనురాగ్ కశ్యప్ యాక్టర్‌గా తెలుగులో ఓ స్ట్రయిట్ ఫిల్మ్ చేస్తే బాగుంటుందని కొందరు తెలుగు ఆడియన్స్ ఆశపడ్డారు. వారి ఆశ నిజమైంది. అడివి శేష్ హీరోగా ‘డెకాయిట్: ఓ ప్రేమకథ’ అనే సినిమా రూపొందుతోంది.ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఏక కాలంలో రూపొందుతున్న ఈ సినిమాకు షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమాలోని ఇన్స్పెక్టర్ స్వామి అనే కీలక పాత్రలో అనురాగ్ కశ్యప్ నటిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణలో ఆయన పాల్గొన్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీకరణ మహారాష్ట్రలో ఉంటుందని తెలిసింది. కథ రీత్యా... ఇద్దరు ప్రేమికులు బ్రేకప్ చెప్పుకుంటారు. కొన్ని పరిస్థితుల కారణంగా వారికి ఇష్టం లేకపోయినా... వీరిద్దరూ కలిసి ఓ క్రైమ్ చేయాల్సి ఉంటుంది.ఈ క్రైమ్‌ను అడ్డుకోవాల్సిన బాధ్యత ఇన్స్పెక్టర్ స్వామిది. మరి... క్రిమినల్స్ అయిన ఈ ప్రేమికులను పోలీసాఫీసర్‌గా ఇన్స్పెక్టర్ స్వామి పట్టుకున్నాడా? అనేది ‘డెకాయిట్’ సినిమా చూసి తెలుసుకోవాలి. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రేమ, ద్రోహం, ప్రతీకారం, భావోద్వేగం వంటి అంశాల మేళవింపుతో రూపొందుతున్న ‘డెకాయిట్’ మూవీ ఈ ఏడాదే రిలీజ్ కానుంది. మరోవైపు నటుడిగానే కాదు... ‘పాంచ్, బాంబే టాకీస్, అగ్లీ, మ్యాడ్లీ, దో బార’ వంటి హిందీ చిత్రాలతో అనురాగ్ కశ్యప్ బాలీవుడ్లో దర్శకుడిగా పాపులర్ అన్న సంగతి తెలిసిందే. అలాగే నిర్మాతగానూ, రైటర్‌గానూ ఆయన రాణిస్తున్న విషయం కూడా విదితమే.అర్జున్‌కు విలన్‌గా...స్క్రీన్‌పై నందమూరి కల్యాణ్‌రామ్‌తో ఢీ అంటే ఢీ అంటున్నారు బాలీవుడ్ యాక్టర్ సోహైల్ ఖాన్. నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోంది. సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి, సోహైల్ ఖాన్, శ్రీకాంత్, ‘యానిమల్’ పృథ్వీరాజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ మూవీలో ఐపీఎస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు విజయశాంతి. ఇక ఈ మూవీలో విలన్‌గా నటిస్తున్నారు సోహైల్ ఖాన్. ‘పార్ట్నర్, వీర్, దబాంగ్ 3’ వంటి చిత్రాల్లో నటుడిగా అభినందనలు అందుకున్న సోహైల్ ఖాన్‌కు తెలుగులో ఇదే తొలి చిత్రం కావడం విశేషం. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. టాకీ పార్టు పూర్తయింది. రామ్‌చరణ్‌కు విలన్‌గా...రామ్‌చరణ్‌కు విలన్‌గా కనిపించనున్నారు బాలీవుడ్ యంగ్ హీరో దివ్యేందు. హీరో రామ్‌చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్లో ఓ పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (ప్రచారంలో ఉన్న టైటిల్) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, జగపతిబాబు, శివరాజ్‌కుమార్, దివ్యేందు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ ఈ వారంలోప్రారంభం కానుందని తెలిసింది.కాగా ఈ మల్టీ స్పోర్ట్స్ (క్రికెట్, కుస్తీ తదితర క్రీడలు) డ్రామాలో దివ్యేందు ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆల్రెడీ దివ్యేందు ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. కాగా ఈ సినిమాలో రామ్‌చరణ్ పాత్రకు విలన్‌గా కనిపిస్తారట దివ్యేందు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది. మార్చి 27న రామ్‌చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టీజర్ రిలీజ్ కావొచ్చని, దీపావళికి ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉందనీ సమాచారం. మరోవైపు ‘ప్యార్‌కా పంచనామా, టాయిలెట్: ఏక్ ప్రేమకథ, ఓల్డ్ కపుల్’ వంటి బాలీవుడ్ చిత్రాల్లో నటుడిగా రాణించారు దివ్యేందు. కాగా ‘మిర్జాపూర్, సాల్ట్ సిటీ, ది రైల్వే మెన్’ వంటి వెబ్ సిరీస్‌లతో దివ్యేందు మరింత పాపులర్ అయ్యారు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి వస్తున్నారు. కొందరు బాలీవుడ్ యాక్టర్స్ ఆల్రెడీ తెలుగులో బిజీ అయిపోయారు. బాలకృష్ణ హీరోగా చేసిన ‘భగవంత్ సింగ్ కేసరి’లో అర్జున్ రామ్‌పాల్, ‘డాకు మహారాజ్’లో బాబీ డియోల్ విలన్స్‌గా నటించారు. కాగా పవన్ కల్యాణ్ ‘హరిహరవీర మల్లు’ చిత్రంలో ఎంతో కీలకమైన ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ యాక్ట్ చేస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ ‘దేవర 2’ చిత్రంలోనూ బాబీ డియోల్ విలన్‌గా కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. గత ఏడాది విడుదలైన రామ్ ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీలో ఫుల్ లెంగ్త్ విలన్ రోల్ చేశారు సంజయ్ దత్. ఇప్పుడు ప్రభాస్ ‘రాజా సాబ్’, సాయిదుర్గా తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ చిత్రాల్లోనూ లీడ్ రోల్స్ చేస్తున్నట్లుగా తెలిసింది. అలాగే ప్రభాస్ ‘ఫౌజి’ చిత్రంలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ లీడ్ యాక్టర్స్‌గా చేస్తున్నారు. నాగార్జున–నానీల ‘దేవదాసు’ (2018)లో విలన్‌గా యాక్ట్ చేసిన కునాల్ కపూర్ ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’లో మళ్లీ విలన్‌గా యాక్ట్ చేస్తున్నారని తెలిసింది. ప్రభాస్ ‘కల్కి’లో అమితాబ్ బచ్చన్ ఎంతటి బలమైన రోల్ చేశారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘కల్కి 2’లోనూ అమితాబ్ బచ్చన్ రోల్ కొనసాగుతుందని తెలిసిందే... ఇలా విలన్స్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటిస్తున్న బాలీవుడ్ యాక్టర్స్ మరికొందరు ఉన్నారు.– ముసిమి శివాంజనేయులు -
రష్మికని హింసించకండి.. నటి రమ్య కౌంటర్
రష్మిక ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్. భాషతో సంబంధం లేకుండా మూవీస్ చేస్తూ దూసుకుపోతోంది. కానీ ఈమెపై సొంత రాష్ట్రం కర్ణాటకలోనే తీవ్రమైన ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. మొన్నటిమొన్న కాంగ్రెస్ నాయకుడు కూడా రష్మికపై నోరు పారేసుకున్నాడు. ఈ క్రమంలోనే రష్మికపై జరుగుతున్న ట్రోలింగ్ పై కన్నడ నటి రమ్య స్పందించింది. విమర్శకులకు కౌంటర్ ఇచ్చింది.(ఇదీ చదవండి: చివరి కోరిక తీరకుండానే చనిపోయిన ఎన్టీఆర్ అభిమాని)నటి-రాజకీయ నాయకురాలిగా దక్షిణాది ప్రజలకు పరిచయమున్న నటి రమ్య.. తెలుగులోనూ ఓ సినిమాలో నటించింది. కానీ అది ఫ్లాప్ కావడంతో పూర్తిగా కన్నడకే పరిమితమైంది. తాజాగా బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మాట్లాడుతూ రష్మికకు అండగా నిలిచింది.'రష్మిక లాంటి నటీమణుల్ని ట్రోల్స్ ద్వారా అవమానించడం దయచేసి ఆపండి. ఇది అమానవీయం. ఆడపిల్లలు మెత్తగా ఉంటారు. ఏమన్నా సే తిరిగి మాట్లాడరు కాబట్టి ఇలా హింసించడం తగదు. ఇప్పుడు సినిమా అనే కాదు అన్ని రంగాల్లోనూ మహిళలకు అన్యాయం జరుగుతోంది. దీనికి వ్యతిరేకంగా మనమందరం ఐక్యం కావాలి' అని నటి రమ్య చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: 'రేఖాచిత్రం' సినిమా రివ్యూ (ఓటీటీ))కెరీర్ ప్రారంభంలో రష్మిక పలు కన్నడ సినిమాలు చేసింది. ఎప్పుడైతే ఫేమ్ వచ్చిందో అప్పటినుంతి తెలుగు, హిందీ, తమిళ మూవీస్ మాత్రమే చేస్తోంది. మొన్నీమధ్య తనది హైదరాబాద్ అని చెప్పడం కన్నడ ప్రేక్షకులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో అదేపనిగా ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రమ్య, రష్మికకు అండగా నిలిచింది.రమ్య తెలుగులో కళ్యాణ్ రామ్ అభిమన్యు చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆమె తెలుగులో నటించిన ఒకే ఒక చిత్రం అదే. ఆ మూవీ పరాజయం చెందడంతో మళ్ళీ తెలుగులో రమ్య కనిపించలేదు. రష్మిక విషయానికొస్తే కొన్నిరోజుల క్రితం 'పుష్ప 2', తాజాగా 'ఛావా'తో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టింది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు)) -
రన్యారావు వద్ద కోట్లలో డబ్బు.. ఆశ్చర్యపోయిన అధికారులు
బంగారం అక్రమ రవాణా కేసులో పట్టుబడిన నటి రన్యారావ్ కేసులో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దుబాయ్ నుంచి బంగారు బిస్కెట్లను అక్రమంగా తీసుకువస్తూ బెంగళూరులో ఆమె దొరికిపోయిన విషయం తెలిసిందే. అయితే, ఆమెను మూడురోజుల పాటు విచారించాలని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ)కు కోర్టు అనుమతి ఇచ్చింది.కిలో బంగారం రవాణాకు రన్యారావ్‌కు రూ.5 లక్షల కమీషన్ అందిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఆమె నుంచి ఇప్పటికే 14 కిలోల బంగారు బిస్కెట్లు, రూ.2 కోట్ల విలువైన ఆభరణాలు, సుమారు రూ.3 కోట్ల నగదును డీఆర్ఐ అధికారులు జప్తు చేశారు. ఆమె వద్ద మొత్తం రూ. 18 కోట్ల ఆస్తులను గుర్తించినట్లు తెలుస్తోంది. సినిమా అవకాశాలు లేని ఒక నటి వద్ద ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఉండటం చూసి అధికారులే ఆశ్చర్యపోతున్నారు. తన వద్ద ఉన్న డబ్బుకు సరైన ఆధారాలను ఆమె చూపించలేకపోయింది.ఆమె గత ఆరు నెలల్లో 27 సార్లు దుబాయ్‌కు వెళ్లి వచ్చినట్లు అధికారులు తెలిపారు. సౌదీ అరేబియాతో పాటు అమెరికా, పశ్చిమాసియా, ఐరోపా దేశాలలో కూడా రన్యారావు ప్రయాణించినట్లు అధికారులు గుర్తించారు. కేవలం బంగారం అక్రమ రవాణా మాత్రమే కాకుండా సంఘవిద్రోహ శక్తులతో కూడా ఆమెకు సంబంధాలు ఉన్నట్లు వారు కనుగొన్నారు. ఈ క్రమంలో రన్యారావు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. విచారణ క్రమంలోనే దానిని కోర్టు తోసిపుచ్చింది. -
అప్పుడే మహిళ ఎదిగినట్లు లెక్క!: శ్రుతీహాసన్
‘‘సమస్య ఎక్కడైనా ఉంటుంది. ఎలా ఎదుర్కొంటున్నామన్నదే ముఖ్యం. సమస్యలకు భయపడి పారిపోతే ఓడిపోతాం... ధైర్యంగా ఎదుర్కొంటే గెలుస్తాం’’ అంటున్నారు శ్రుతీహాసన్. తన తల్లి సారిక సినిమాలు చేసినప్పటి పరిస్థితులను, ఇప్పుటి పరిస్థితులను పోల్చి కొన్ని విషయాలు చెప్పారు శ్రుతి. ఇంకా ‘మహిళా దినోత్సవం’ సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో శ్రుతీహాసన్ చెప్పిన విషయాలు తెలుసుకుందాం.∙మీ అమ్మగారి కెరీర్‌ని చూశారు... అప్పటి ఆమె కెరీర్ పరిస్థితులను ఇప్పటి మీ కెరీర్‌తో పోల్చుకున్నప్పుడు ఏమనిపిస్తోంది? అప్పటి పరిస్థితుల గురించి అమ్మ నాతో చెప్పేవారు. ‘ఈక్వాలిటీ’ విషయంలో అప్పుడు ప్రాబ్లమ్ ఉండేదట. ఉమెన్‌కి చాలా తక్కువప్రాధాన్యం ఉండేదట. అలాగే అప్పట్లో ‘పీరియడ్స్’ గురించి బాహాటంగా మాట్లాడడానికి సిగ్గుపడేవాళ్లు. అసలు బయటకు చెప్పకూడదన్నట్లు ఉండేది. ఇబ్బందిగా ఉన్నా బయటకు చెప్పకుండా షూటింగ్ చేసేవాళ్లు. ఇప్పుడు పీరియడ్స్ ఇబ్బంది గురించి ఓపెన్‌గా చెప్పి, ఆ రోజు పని మానుకునే వీలు ఉంది.∙మరి... మీ జనరేషన్ హీరోయిన్లతో పోల్చితే అప్పటివారు ఏ విషయంలో హ్యాపీ? మాటల విషయంలో... అప్పట్లో కాస్త ఓపెన్‌గా మాట్లాడగలిగేవాళ్లు. కానీ ఇప్పుడు ఏం మాట్లాడితే ఏం వస్తుందోనని మాటలకు కత్తెర పెట్టాల్సిన పరిస్థితి. అయితే నేనలా కాదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతాను. అది అందరికీ తెలిసిన విషయమే. సోషల్ మీడియా వల్ల ఏం మాట్లాడలేకపోతున్నారు. అన్ని కళ్లూ మనల్నే చూస్తున్న ఫీలింగ్. అంతెందుకు? పదిహేనేళ్ల క్రితం నేను కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఇలా లేదు. రిలాక్సింగ్‌గా ఉండేది.ఇప్పుడు ఫొటోలు తీసేసి, సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. ఆ ప్రెజర్ చాలా ఉంది. ఈ ఒత్తిడి వల్ల పబ్లిక్‌లోకి వచ్చినప్పుడు చాలామంది ఎక్కువ జాగ్రత్తగా ఉంటున్నారు. మా అమ్మ జనరేషన్లో ఉన్నంత కూల్‌గా ఉండలేని పరిస్థితి. ఇంకా చెప్పాలంటే స్కూల్ పిల్లలకు కూడా తిప్పలు తప్పడంలేదు. ‘అలా ఉన్నావు... ఇలా ఉన్నావు’ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇలా చిన్నప్పుడే ప్రెజర్ మొదలై పోతోంది. అయితే ఇప్పటి ఈ పరిస్థితిని నేను విమర్శించడంలేదు. మార్పుని స్వీకరించడమే. ∙ఇండస్ట్రీలో ‘క్యాస్టింగ్ కౌచ్’ ఎదుర్కొన్న నటీమణులు చాలామంది ఉన్నారు... మీకు అలాంటివి? నాకలాంటి చేదు అనుభవాలు లేవు. ఒకవేళ నాకు నచ్చని పరిస్థితి ఎదురైందంటే నిర్మొహమాటంగా చెప్పేస్తాను. నా పాలసీ ఒక్కటే. నేను ఎవరినైనా ఇష్టపడితే టూ హండ్రెడ్ పర్సెంట్ ఇష్టపడతాను... నాకు కంఫర్ట్‌గా ఉన్న చోట ఉంటాను. నాకు నచ్చని చోట ఉండను... నచ్చని మనుషులను నా లైఫ్‌లో నుంచి ఎగ్జిట్ చేసేస్తాను. ఇంకో విషయం ఏంటంటే... మనకు ఏదైనా నచ్చలేదనుకోండి గొడవపడక్కర్లేదు... అరిచి చెప్పక్కర్లేదు. ‘నాకు నచ్చలేదు’ అని కూల్‌గా చెప్పి, సమస్యకు ఫుల్స్టాప్ పెట్టేయాలి. ∙మీలా చాలామంది ధైర్యంగా ఉండలేరు... నిర్భయంగా మాట్లాడలేరు... వారికి మీరిచ్చే సలహా? భయాలు వదలండి. దయచేసి మీ మనసులోని సమస్యలను బయటకు చెప్పండి. మనసులోనే ఉంచుకుంటే ఆరోగ్యం చెడిపోతుంది. మనకు ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్లతో షేర్ చేసుకోవాలి. అయితే వారికన్నా కూడా ఒక మంచి కౌన్సెలర్ అవసరం. వాళ్లయితే మన మానసిక స్థితిని బాగా అర్థం చేసుకుని సలహాలు ఇవ్వగలుగుతారు. ఫిజికల్‌గా హెల్దీగా ఉండాలంటే ‘మెంటల్ హెల్త్’ చాలా ముఖ్యం. ∙కమల్‌హాసన్‌గారి కూతురు కావడం వల్లే మీకు ఇండస్ట్రీలో ఇబ్బందులు ఎదురు కాలేదనుకోవచ్చా? బ్యాక్‌గ్రౌండ్ అనేది ప్లస్సే... కాదనడంలేదు. నాన్నగారి పేరు నాకు హెల్ప్ అయింది. అయితే శ్రుతీహాసన్ అంటే కమల్‌హాసన్ కూతురు అనే విషయాన్ని మరచిపోయేలా చేయాలి. అప్పుడే నేను సక్సెస్ అయినట్లు. నా వర్క్‌తో నేను నిరూపించుకుని నాకంటూ పేరు తెచ్చుకున్నాను. పని పరమైన ఇబ్బందులు కామన్. అలాంటివి ఎప్పుడూ మా నాన్నగారికి చెప్పలేదు. నేనే సాల్వ్ చేసుకుంటుంటాను.∙‘మహిళా దినోత్సవం’ జరుపుకుంటారా? నా ఫ్రెండ్స్‌తో ‘అన్ని రోజులూ మనవే’ అంటుంటాను. ‘మేల్ డే’ అని లేదు. మరి... ‘ఉమెన్స్ డే’ ఎందుకు? అంటే... ఇంకా స్త్రీ వెనకబడి ఉన్నట్లేనా? అలాగే ‘ఉమెన్ ఓరియంటెడ్’ సినిమా అంటారు. ‘మేల్ ఓరియంటెడ్’ మూవీ అనరు. ముందు ఈ తేడా పోవాలి. మహిళా దినోత్సవం అనేది ప్రత్యేకంగా లేని రోజున ఉమెన్ ఎదిగినట్లు లెక్క. సినిమా ఇండస్ట్రీలో టెక్నికల్ డిపార్ట్మెంట్లో మహిళలు తక్కువగా ఉండటానికి కారణం? ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు మహిళల శాతం ఎక్కువే ఉంది. లేడీ టెక్నీషియన్స్ ఇంకా పెరుగుతారు. అంతెందుకు? నేను ఈ మధ్య లీడ్ రోల్ చేసిన ‘ది ఐ’ మూవీకి డైరెక్టర్,ప్రొడ్యూసర్, ఇంకా ఇతర విభాగాల్లో మహిళలే ఎక్కువ. ఆ విధంగా ఈ సినిమా నాకు స్పెషల్. -
ధైర్యంగా బతకాలి... ప్రశాంతంగా ఉండాలి: నదియా
‘‘మీ విలువ మీరు తెలుసుకోండి... మీకు నచ్చినట్లు మీరు బతకండి’’ అంటున్నారు నదియా. హీరోయిన్గా 1980–1990లలో విజయవంతమైన కెరీర్‌ని చూసిన నదియా బిజీగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని, అమెరికాలో సెటిలయ్యారు. 1994లో సినిమాలకు దూరమై, 2004లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సిల్వర్ స్క్రీన్‌కి వచ్చారు. ‘కారవాన్’ వాహన సౌకర్యాలు లేని రోజులను, ఇప్పుడు ఆ సౌకర్యాలు ఉన్న రోజులనూ చూస్తున్నారు నదియా. ‘మహిళా దినోత్సవం’ సందర్భంగా ‘సాక్షి’కి నదియా ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలోని విశేషాలు తెలుసుకుందాం. ‘‘నిజ జీవితాన్ని, నా సినీ జీవితాన్ని పంచుకుని నాకు విజయం అందించిన నా హీరోయిన్స్ అందరికీ, యావన్మంది మహిళలకు చేతులెత్తి నమస్కరిస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు’’ అంటూ శుక్రవారం సోషల్ మీడియా వేదికగా ఈ ఫొటోను షేర్ చేసి, చిరంజీవి పేర్కొన్నారు⇒ టీనేజ్‌లో హీరోయిన్ అయిన మీకు అప్పటి షూటింగ్ వాతావరణం, అంతమంది వ్యక్తులతో పని చేయడం వంటివి ఇబ్బందిగా అనిపించేదా? మలయాళంలో నా తొలి సినిమా ‘నోకెత్త దూరత్తు కన్నుమ్ నాట్టు’ (1984). ఈ సినిమా తమిళంలో ‘పూవే పూచ్చూడవా’గా రీమేక్ అయింది. తమిళంలోనూ నేనే నటించాను. తమిళంలో నాకు తొలి సినిమా. ఆల్రెడీ ఒక భాషలో చేసిన సినిమా కావడం ఒక ప్లస్. మలయాళం సినిమా డైరెక్టర్ ఫాజిల్ తమిళంలోనూ చేశారు. అలాగే నాకు తమిళ్ అస్సలు రాకపోవడంతో ఓ ట్యూటర్‌ను పెట్టి, నేర్పించారు. దాంతో ఈజీ అయింది. షూటింగ్ పరంగా ఎలాంటి చేదు అనుభవాలు ఎదురు కాలేదు. దాంతో భయపడాల్సిన అవసరం రాలేదు. అలాగే ఆ సినిమా హిట్ కావడంతో వెనక్కి తిరిగి చూసుకోనంతగా బిజీ అయ్యాను.⇒ సినిమా ఇండస్ట్రీలో అమ్మాయిలు నిలదొక్కుకోవాలంటే చాలా కష్టం అంటారు... ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుందనే టాక్ కూడా వినిపిస్తుంటుంది... నేను నా అనుభవాల గురించి మాట్లాడతాను. నాతో పాటు మా నాన్న షూటింగ్‌కి వచ్చేవారు. ఒక్క నిమిషం కూడా ఆయన నన్ను ఒంటరిగా వదిలిపెట్టేవారు కాదు. ఆయన అంతగాప్రొటెక్ట్ చేయడంతో నాకు ప్రెజర్ ఉండేది కాదు. అలాగే వచ్చిన ప్రతి సినిమా కమిట్ చేయించేసి, నాతో ఓవర్ వర్క్ చేయించలేదు. వర్క్‌ని ఎంజాయ్ చెయ్ అన్నారు. నా పక్కన ఓ గైడింగ్ ఫోర్స్ (తండ్రిని ఉద్దేశించి) ఉండటంతో నాకెప్పుడూ ‘అన్‌సేఫ్’ అనిపించలేదు.⇒షూటింగ్ స్పాట్లో స్టార్స్‌కి ఏర్పాటు చేసే ‘కారవాన్’ వాహన సౌకర్యం అప్పట్లో లేదు. పల్లెల్లో షూటింగ్స్ చేసినప్పుడు కాస్ట్యూమ్స్ మార్చుకోవడానికి, ఇతర వ్యక్తిగత విషయాలకూ పడిన ఇబ్బందుల గురించి? మాకు బోలెడంత ప్రేమ దక్కేది. విలేజెస్లో ఎవరో ఒకరింట్లో కాస్ట్యూమ్స్ మార్చుకునేంత అభిమానం మా మీద ఉండేది. ‘ఏం ఫర్వాలేదు. మీ ఇల్లులా అనుకోండి’ అనేవాళ్లు. ఎలాంటి భయాలూ ఉండేవి కావు. ఇప్పడున్నన్ని సౌకర్యాలు లేకపోయినా హ్యాపీగానే ఉండేది.⇒ అప్పట్లో సౌకర్యం లేకపోయినా హ్యాపీగానే గడిచిందన్నారు... సో.. ఇప్పుడు కారవాన్ తదితర సౌకర్యాలు పొందుతున్న నటీమణుల లైఫ్ ఇంకా హ్యాపీ అనుకోవచ్చా... మాతో పోల్చుకుంటే ఇప్పటి అమ్మాయిలు హ్యాపీ కాదు. అన్ని సౌకర్యాలతో పాటు సమస్యలూ ఎక్కువే. ప్రతి క్షణం ఎవరో ఒకరు మనల్ని గమనిస్తున్న ఫీలింగ్. సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ వల్ల పబ్లిక్‌లోకి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఈ జనరేషన్‌కి ఆ ప్రెజర్ ఎక్కువ.⇒మరి... ఈ ప్రెజర్‌ని ఎలా అధిగమించాలి? ప్రపంచం మారిపోయింది. మనమూ అందుకు తగ్గట్టు మారాలి. పరిస్థితులు ఇలా ఉన్నాయేంటని భయపడకుండా మన జాగ్రత్తల్లో మనం ఉండటమే. ⇒ నెగటివిటీ ఎక్కువ శాతం ఉన్న ఈ మోడ్రన్ వరల్డ్‌లో అమ్మాయిలు తమ లైఫ్‌ని ఎలా లీడ్ చేయాలంటారు? ధైర్యంగా, గర్వంగా బతకాలి. ఎందుకంటే ఆ దేవుడు సృష్టించిన ప్రత్యేకౖమైనమనుషులం మనం. ఎక్కడ ఉన్నా మనం సౌకర్యంగా ఉండటం మనకు ముఖ్యం. సౌకర్యం అంటే లగర్జీస్ కాదు. మనకు నచ్చినట్లుగా మనం ఉండటం. అలాగే మనం అనుకున్నది నిర్మొహమాటంగా చెప్పాలి. మన విలువని మనం తెలుసుకోవాలి. మనం మన గురించి ఏమనుకుంటున్నామో అదే మనం. తక్కువగా అనుకుంటే తక్కువగా... ఉన్నతంగా అనుకుంటే ఉన్నతంగా. అందుకే మన గురించి మనం ఉన్నతంగా అనుకోవాలి. ఆత్మవిశ్వాసంతో బతకాలి. ⇒ఇద్దరు అమ్మాయిల తల్లిగా మీ పిల్లలకు ఈ విషయాలు చెబుతుంటారా? చెబుతాం. మా అమ్మాయిలకు బాగా స్వేచ్ఛ ఇస్తాం. వాళ్ల ఇష్టాలను కాదనం. వద్దని చెప్పాల్సి వస్తే ఎందుకు వద్దో చెబుతాం. ఎంత జాగ్రత్తగా ఉండాలో వివరిస్తాం. ఒకప్పుడు పెద్దలు చెప్పిన మాటలను పిల్లలు వినేవాళ్లు. ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగిన ఈ కాలంలో పిల్లలు చెప్పేది కూడా పెద్దలు వినాలి. మేం మా పిల్లలతో బాగా కమ్యూనికేట్ అవుతాం. మా పిల్లలకే కాదు... ఎవరికైనా నేను చెప్పేదేంటంటే... ధైర్యంగా బతకాలి... ప్రశాంతంగా ఉండాలి.నా జీవితం హ్యాపీ నా జీవితం మొత్తం సాఫీ. హీరోయిన్గా బిజీగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని, మా ఆయనతో అమెరికాలో సెటిలయ్యాను. ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆ లైఫ్‌ని పరిపూర్ణంగా ఆస్వాదించాను. చాలా గ్యాప్ తర్వాత సినిమాలకు చాన్స్ వచ్చింది. ‘నటిగా నీ పూర్తి ప్రతిభని నువ్వు వినియోగించుకోలేదు.. సినిమాలు కంటిన్యూ చెయ్’ అని మా ఆయన, ‘మళ్లీ యాక్ట్ చెయ్ అమ్మా’ అని పిల్లలు అన్నారు. వచ్చాను.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉన్నాను. -
జీవీ ప్రకాశ్ కుమార్ 'కింగ్స్టన్' మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ తమిళంతో పాటు తెలుగులోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా కింగ్ స్టన్ మూవీతో నిర్మాతగా కూడా మారిపోయాడు. ఈ చిత్రానికి నిర్మాతగా, హీరోగా, సంగీత దర్శకుడిగా త్రిపాత్రాభినయం చేశారు. ఈ మూవీలో హిరోయిన్‌గా దివ్య భారతి నటించారు. తెలుగు, తమిళం భాషల్లో ఈ మూవీ ఈరోజు రిలీజైంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో రివ్యులో తెలుసుకుందాం.అసలు కింగ్స్టన్ కథేంటంటే..కింగ్ (జీవీ ప్రకాశ్ కుమార్) తుతువూరు ప్రాంతానికి చెందిన వాడు. తుతువూరు ప్రాంతానికి సముద్ర శాపం ఉంటుంది. ఆ ఊరి వాళ్లు ఎవరు సముద్రంలోకి వెళ్లినా తిరిగి శవంగానే బయటకు వస్తారు. ఆ కారణంతో ఆ ఊర్లో ఎవరికీ ఉపాధి ఉండదు. దీంతో ఆంటోని (సబూమన్) గుప్పిట్లోకి వెళ్తాడు కింగ్. అతడి వద్దే పని చేస్తుంటాడు. అక్కడ ఆంటోని చేసే పనులు నచ్చక ఓ టైంలో కింగ్ ఎదురు తిరుగుతాడు. దీంతో కింగ్‌తో పాటు, అతని ఊరి మొత్తానికి పని లేకుండా పోతుంది. అసలు తన ఊరికి ఉన్న శాపం ఏంటి? శాపం వెనుకున్న కారణాలు ఏంటి? సముద్రంలోకి వెళ్లిన వాళ్లు ఎందుకు మరణిస్తున్నారు? అనే విషయాల్ని తెలుసుకోవాలంటే కింగ్స్టన్ సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..తమిళంలో తెరకెక్కిన కింగ్స్టన్ మూవీని తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం అంటే కథలో బలం ఉన్నందుకే. ఇలాంటి డిఫరెంట్ కథలకి సినీ ఆడియన్స్ ఆదరిస్తారనే నమ్మకంతో విడుదల చేయటం అభినందనీయం. సముద్ర శాపంతో కొట్టుమిట్టాడే ఓ ఊరి ప్రాంతం.. ఉపాధి లేక అల్లాడిపోతోన్న జనం.. ఆ ఊరి జనం కోసం నిలబడే హీరో... మాస్ ఎలివేషన్స్‌తో వెండి తెరపై హీరో కనిపిస్తే బీసీ సెంటర్లలో విజిల్స్ పడాల్సిందే.ముఖ్యంగా మాస్ ఆడియన్స్‌ను మెప్పించేలా ఎలివేషన్స్, ఎమోషన్స్ ఉన్నాయి. విలన్ వద్ద హీరో పనిచేస్తూ... అతనికే ధమ్కీ ఇవ్వాలంటే హీరోకి కావాల్సినంత మాస్ ఉండాలి. అప్పుడే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. ఈ విషయంలో దర్శకుడు బాగా సెట్ చేశాడు. లాజిక్స్ పక్కన పెట్టి సినిమాను చూస్తే... బాగానే ఎంగేజ్ చేస్తుంది మూవీ. సినిమా ఫస్ట్ హాఫ్ కాస్త స్లో కావడం ప్రేక్షకుల్ని నిరాశ కలిగించినా.... సెకండ్ హాఫ్ అద్భుతంగా ఉంటుంది. క్లైమాక్స్ సీన్ కూడా అదిరిపోయింది. డైరెక్టర్ కథను ఆడియన్స్‌కు వివరించడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు.ఎవరెలా చేశారంటే..జీవీ ప్రకాశ్ ఇలాంటి పాత్రలు ఈజీగా చేసేస్తుంటాడు. పాత్రకు తగ్గట్టుగా మేకోవర్ అయిపోతాడు. ఈ చిత్రంలో జీవీ ప్రకాష్ యాక్టింగ్‌తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా మాస్ లుక్‌లో అలరించాడు. యాక్షన్ సీక్వెన్స్‌లోనూ ఫ్యాన్స్‌ను జీవీ మెప్పించాడు. ఇక దివ్య భారతి తన పరిధిలో ఆకట్టుకుంది. ఆంటోని, సాల్మాన్, బోస్, చార్లెస్ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక సాంకేతికత విషయానికొస్తే విజువల్స్, కెమెరా వర్క్, బీజీఎమ్, వీఎఫ్ఎక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. పడవ, సముద్రం, అక్కడ చూపించిన సీన్ విజువల్స్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్తా పని చెప్పాల్సింది. జీవీ ప్రకాశ్ కుమార్ నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. -
కంగనా రనౌత్ ఎమర్జన్సీ.. చెత్తగా తీశారన్న ప్రముఖ కన్నడ నటి
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌పై ప్రముఖ నటి రమ్య(దివ్య స్పందన) ఆసక్తికర కామెంట్స్ చేశారు. గతంలో కంగనా నటించిన 'మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ' పోలుస్తూ మాట్లాడారు. ఎమర్జన్సీ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద ప్రశంసలు వచ్చినప్పటికీ.. ఆ సినిమా నిర్మించిన తీరు బాగాలేదని ఆమె అన్నారు. కంగనా విషయానికొస్తే ఆమె అద్భుతమైన నటి అని కొనియాడింది. బెంగళూరు ఫిల్మ్ ఫెస్టివల్లో జరిగిన ప్యానెల్ చర్చ సందర్భంగా రమ్య కామెంట్స్ చేసింది. కాగా.. ఈ చిత్రంలో కంగనా భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో నటించింది.రమ్య మాట్లాడుతూ.. "ఎమర్జెన్సీ చిత్రం చెత్తగా నిర్మించారు. కంగనా రనౌత్ చాలా ప్రతిభావంతురాలైన నటి. ఆ సినిమాతో కంగనాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ ఆ సినిమా చెడుగా తీయడం వల్లే ప్రేక్షకులు తిరస్కరించారు. గతంలో కంగనా మణికర్ణికను కూడా నిర్మించింది ఆ మూవీ కంటెంట్ బాగుంది. అందుకే ఆ సినిమాను ప్రేక్షకులు ఇష్టపడ్డారు. అందుకే బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.' అని తెలిపింది. కాగా.. కంగనా రనౌత్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఎమర్జన్సీ చాలాసార్లు వాయిదా పడిన తర్వాత జనవరి 17న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి, శ్రేయాస్ తల్పాడే, మిలింద్ సోమన్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. -
పద్మ విభూషణ్ గ్రహీత, సీనియర్ నటిపై మరణ వార్తలు.. కుమారుడు క్లారిటీ
అలనాటి నటి, పద్మ విభూషణ్ వైజయంతి మాల పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. 1955లో బాలీవుడ్లో దిలీప్ కుమార్ నటించిన దేవదాస్ చిత్రం హీరోయిన్గా కనిపించారు. అంతేకాకుండా నయా దౌర్, మధుమతి, జ్యువెల్ థీఫ్, సంగం లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె నటనకు గానూ పద్మ శ్రీ, పద్మ విభూషణ్ లాంటి ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. అంతేకాకుండా ఆమెను అభిమానులు ముద్దుగా డ్యాన్సింగ్ క్వీన్ అని పిలుచుకుంటారు.తాజాగా ఈ సీనియర్ నటి వైజయంతిమాల చనిపోయారంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరలయ్యాయి. దీంతో ఆమె కుమారుడు స్పందించారు. ఆమె మరణించారన్న వార్తలను వైజయంతిమాల కుమారుడు సుచింద్ర బాలి ఖండించారు. ప్రస్తుతం అమ్మ ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన తెలిపారు. ఆమె మరణ వార్తల్లో ఎలాంటి నిజం లేదని సోషల్ మీడియాలో వెల్లడించారు. కాగా.. ప్రస్తుతం ఆమె వయస్సు 91 ఏళ్లుగా ఉన్నట్లు తెలుస్తోంది.డాక్టర్ వైజయంతిమాల బాలి ఆరోగ్యంగానే ఉన్నారని.. ఆ వార్తలు షేర్ చేసే ముందు ఒకసారి ధృవీకరించుకోవాలని ఆమె కుమారుడు సుచింద్ర బాలి హితవు పలికారు. కాగా.. ఇటీవలే జనవరిలో చెన్నైలోని కళా ప్రదర్శినిలో వైజయంతిమాల భరతనాట్యం ప్రదర్శించారు. ఆమె ఆరోగ్యంగానే కనిపించారు. వైజయంతిమాల తన నటనకు గాను పద్మభూషణ్ అవార్డ్‌ను దక్కించుకుంది. -
సోషల్‌మీడియాను షేక్ చేసిన సాంగ్ వీడియో వర్షన్ వచ్చేసింది
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 'గోల్డెన్ స్పారో' సాంగ్ వీడియో వర్షన్ వచ్చేసింది. నటుడు, దర్శక–నిర్మాత ధనుష్ స్వీయ దర్శకత్వంలో విడుదలైన తాజా తమిళ చిత్రం ‘నిలువుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్’. ఈ రొమాంటిక్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ మూవీలో అనిఖా సురేంద్రన్ , ప్రియా ప్రకాశ్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేష్ మీనన్ , రమ్య రంగనాథన్ లీడ్ రోల్స్‌లో నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 21న విడుదలైంది. అయితే, ఒక ప్రేక్షకులకు ఈ మూవీ బాగా కనెక్ట్ అయిందని చెప్పవచ్చు.ఈ మూవీలో ‘మామా మామా కమ్ అండ్ సింగు... క్వీనే వచ్చెను... నువ్వే కింగు...’ అంటూ మొదలయ్యే ఒక హిట్ సాంగ్ తాజాగా వీడియో వర్షన్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ హిట్ సాంగ్‌ను జీవీ ప్రకాష్ కుమార్‌తో సుబ్లాషిణి, ధనుష్, అరివు ఆలపించారు. ఈ మూవీని ‘జాబిలమ్మ నీకు అంత కోపమా..’ అనే టైటిల్‌తో తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ‘గోల్డెన్ స్పారో’ పాట లిరికల్ వీడియో తెలుగు వర్షన్ కూడా అందుబాటులో ఉంది. -
దుబాయ్ ట్రిప్.. 'రన్యా రావ్'కు ఎంత కమీషన్ ఇచ్చేవారంటే..
బంగారం అక్రమ రవాణా కేసులో పట్టుబడిన నటి రన్యా రావ్ కేసు కీలక మలుపు తిరిగింది. కిలో బంగారం రవాణాకు రన్యారావ్‌కు రూ.5 లక్షల కమీషన్ అందిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నటి పాత్రధారి కాగా అసలైన సూత్రధారి వేరే వ్యక్తి అని తెలిసింది. నటి రన్యారావ్‌ను డీఆర్ఏ అధికారులు తీవ్ర విచారణ చేపట్టగా నేను పాత్రధారి మాత్రమే అని, అసలు వ్యక్తి వేరేవారని తెలిపింది. రూ.17 కోట్లు విలువ చేసే బంగారం కొనుగోలు చేసే శ్రీమంతురాలు కాదు. ఈమె సీనియర్ పోలీస్ అధికారి పెంపుడు కూతురు కావడంతో ఆమెను ఈ దందాకు వాడుకుంటే చాలా సులభంగా బంగారం రవాణా చేయవచ్చనే అంచనాతో నటి రన్యారావ్‌ను బంగారం రవాణాకు వాడుకున్నారు. అక్రమ బంగారం రవాణాలో విమానాశ్రయంలోని కొందరు అధికారులు కూడా కుమ్మకైనట్లు అనుమానం వ్యక్తమైంది. డీఆర్ఐ అధికారులు ఈ కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు. కిలో బంగారం రవాణా కోసం రన్యారావ్‌కు రూ.5 లక్షలు కమీషన్ ఇస్తున్నట్లు తెలిసింది. కమీషన్‌తో పాటు రాకపోకలు, బస, ఇతర ఖర్చులకు మొత్తంగా రూ.12 లక్షలు వసూలు చేసేదని విచారణలో తేలింది. ఒక్క ట్రిప్‌లో ఆమె సుమారు పది కేజీలకు పైగానే బంగారం అక్రమ రవాణా చేసేదని పోలీసులు గుర్తించారు. రన్యారావ్ బెంగళూరుకు తీసుకువచ్చిన బంగారం ఎవరికి ఇస్తుంది అనేదానిపై అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. గత రెండేళ్లుగా రన్యారావ్ వాడుతున్న బ్యాంక్ అకౌంట్ మొబైల్‌ను అదికారులు స్వాధీనం చేసుకున్నారు. డీఆర్ఐ అధికారులు అసలు సూత్రధారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.అయితే, ఈ అక్రమ బంగారం రవాణా స్టోరీలో ఆమెకు ఓ రాజకీయ నాయకుడి సహకారమూ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రన్యా రావుకు పరిచయం ఉన్న నాయకులతో పాటు ఇతర అధికారుల పేర్లు విచారణలో తెలుస్తాయని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య న్యాయ సలహాదారు, ఎమ్మెల్యే ఏఎస్ పొన్నణ్ణ పేర్కొన్నారు. కొందరు స్మగ్లర్లతో ఆమెకు సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఆమె సుమారు 30 సార్లు దుబాయ్ వెళ్లి వచ్చినట్లు సమాచారం.అధికారితో గొడవ వల్లే దొరికిపోయిందికొద్దిరోజుల క్రితం రన్యా రావు దుబాయ్ నుంచి బెంగళూరుకు వచ్చిన సమయంలో విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారితో ఆమె గొడవకు దిగింది. తన బంధువు పేరును వాడుకున్న ఆమె తన దర్పాన్ని ఆ అధికారి వద్ద ప్రదర్శించింది. ఈ గొడవే ఆమెకు చిక్కులు తెచ్చిపెట్టింది. ఆ ఘటన వల్ల రన్యా రావు రాకపోకల వివరాలను ఆ అధికారి పరిశీలించారు. ఈ క్రమంలో గతంలో ఆమె ఎక్కడెక్కడకు ప్రయాణం చేశారో చెక్ చేశారు. అయితే, ఆమె తరచూ దుబాయ్‌కు వెళ్లి వస్తుండటమే కాకుండా.. వెళ్లిన ప్రతిసారీ ఒకే రకమైన దుస్తులు ధరించి కనిపిస్తుండటంతో ఆయన అనుమానించారు.ఈసారి ఆమె దుబాయ్ నుంచి మళ్లీ వచ్చినప్పుడు సోదాలు చేయాలని పక్కా ప్రణాళికతో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆమె బంగారం బిస్కెట్లతో దొరికిపోయింది. -
ఆ డైరెక్టర్ వల్ల బతకొద్దనుకున్నా.. సింగపూర్‌లో 13 ఏళ్లు టీచర్‌గా..: హిట్లర్ నటి
మలయాళ డైరెక్టర్ తనను ఇబ్బందిపెట్టాడంటోంది నటి అశ్విని నంబియార్ (Ashwini Nambiar). సినిమా గురించి మాట్లాడాలని పిలిపించి దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకున్నాడని చెప్తోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆయన ఒక పెద్ద డైరెక్టర్. ఒకరోజు సినిమా గురించి ఏదో మాట్లాడాలని ఆఫీసుకు రమ్మన్నాడు. నిజానికి నేనెక్కడికి వెళ్లినా అమ్మ నా వెంటవచ్చేది. ఆమె తోడుంటే వెయ్యి ఏనుగుల బలం ఉండేది. ఆ రోజు తనకు ఆరోగ్యం బాగోలేదు. హెయిర్ డ్రెస్సర్‌గా పనిచేసే మహిళను తోడు తీసుకెళ్లమంది. అప్పుడు నేనింకా టీనేజర్‌ను.సినిమా గురించి రమ్మని చెప్పి..అతడి ఇల్లు, ఆఫీస్ అంతా ఒకేచోట ఉంటాయి. నాతోవచ్చిన మహిళ కిందే ఆగిపోయింది. నేను ఆడుతూ పాడుతూ పైగదిలోకి వెళ్లాను. అక్కడెవరూ కనిపించలేదు. ఇంతలో బెడ్రూమ్లో నుంచి ఇటురా.. అన్న పిలుపు వినిపించింది. ఆ డైరెక్టర్ (Malayalam Director)తో అంతకుముందు ఓ మలయాళ సినిమా చేశాను. ఆ చనువుతో దగ్గరకు వెళ్లాను. కూతురి వయసున్న నన్ను అసభ్యంగా తాకాడు. అక్కడి నుంచి బయటకు వచ్చేశాక నా పెదాలపై నవ్వు మాయమైంది. సరదాగా ఉండే నేను మూగబోయాను. నేనేమైనా తప్పు చేశానా? ఆయనకు నేనే అవకాశం ఇచ్చానా? అని రకరకాలుగా ఆలోచించాను. అమ్మ ఏడుపు చూసి..నా ముఖం చూడగానే ఏమైందని అమ్మ ఆరా తీసింది. జరిగిందంతా చెప్పడంతో తాను రాకపోవడం వల్లే ఇలా జరిగిందని ఏడ్చేసింది. నా వల్ల అమ్మ బాధపడటం చూసి తట్టుకోలేకపోయాను. ఏంచేయాలో తెలియక ఆ రోజు రాత్రి నిద్రమాత్రలు మింగాను. వెంటనే నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లి కాపాడారు. అప్పుడు మా అమ్మ.. జరిగినదాంట్లో నా తప్పు లేదని అర్థమయ్యేలా చెప్పింది. నేను లేకపోతే తను బతకలేనని బాధపడింది. ఇంకెప్పుడూ ఇలాంటి పిచ్చి పని చేయొద్దని ప్రాధేయపడింది. ఆ డైరెక్టర్‌కు నా తండ్రి వయసుంటుంది. (చదవండి: మహేశ్ వల్లే సినిమాలకు దూరమైన నమ్రత.. రిలేషన్లో ఉన్నప్పుడు)రీఎంట్రీ..అమ్మ మాటలతో ధైర్యం తెచ్చుకున్నాను. తిరిగి షూటింగ్లో అడుగుపెట్టాను. కొన్నిసార్లు అమ్మ లేకపోయినా సెట్‌కు వెళ్లేదాన్ని. దేన్నైనా ఎదుర్కోగలను అన్న ధైర్యంతోనే ముందడుగు వేశాను అని చెప్పుకొచ్చింది. 18 ఏళ్లపాటు వెండితెరకు దూరంగా ఉన్న అశ్విని ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ సుడల్ 2తో రీఎంట్రీ ఇచ్చింది. దీని గురించి ఆమె మాట్లాడుతూ.. పెళ్లవగానే యాక్టింగ్ మానేస్తానని ఎక్కడా చెప్పలేదు. ఎప్పటికైనా మళ్లీ సినిమాల్లోకి వస్తానన్న నమ్మకం నాకుంది. ప్రస్తుతం నా కూతురు కాలేజీలో చదువుతోంది. ఇదే సరైన సమయం అనిపించింది. ఇదే సరైన ఛాన్స్ అని..షూటింగ్స్ కోసం సింగపూర్ నుంచి పదేపదే చెన్నై రావడం అంత ఈజీ కాదు. సింగపూర్‌లో ఉండగా నేను మాస్టర్స్ పూర్తి చేశాను. కాలేజీలో 13 ఏళ్లపాటు టీచర్‌గా పని చేశాను. ప్రోగ్రామ్స్ చేసేదాన్ని. గతేడాది నా కూతురు కాలేజీలో జాయిన్ అయింది. ఇదే సరైన సమయం అనుకున్నాను. సరిగ్గా అప్పుడే సుడల్ 2 సిరీస్ నుంచి పిలుపొచ్చింది. ఈ సిరీస్ రచయితలు పుష్కర్- గాయత్రితో అంతకుముందు పనిచేసిన అనుభవం ఉండటంతో సులువుగా ఒప్పేసుకున్నాను అని చెప్పుకొచ్చింది. అశ్విని మొదట సీరియల్స్‌లో నటించింది. హిట్లర్ మూవీలో చిరంజీవి చెల్లెలిగా కనిపించింది. ఆంటీ, పెళ్లి చేసుకుందాం, పోలీస్ చిత్రాలతో తెలుగువారిని పలకరించింది. మలయాళ, తమిళ భాషల్లోనూ సినిమాలు చేసింది. -
నటుడి నాలుగో పెళ్లి.. ఎవరి దిష్టి తగలకూడదని గుండు గీయించుకున్న అత్త
మలయాళ నటుడు బాలా (Actor Bala) ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో నానుతూనే ఉన్నాడు. గతంలో అతడి రెండో భార్య ఆరోపణలు, ఫిర్యాదుల వల్ల పోలీస్ స్టేషన్‌కు కూడా వెళ్లొచ్చాడు. ఇటీవల మూడో భార్య తనపై సంచలన ఆరోపణలు చేయగా వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మరోవైపు బాలా గతేడాది తన చుట్టాలమ్మాయి కోకిలను నాలుగో పెళ్లి చేసుకున్నాడు. వీరి బంధం నూరేళ్లపాటు కొనసాగాలని కోరుతూ కోకిల తల్లి తిరుమలలో గుండు కొట్టించుకుంది.వచ్చే ఏడాది బిడ్డతో..'మీ జంటను చూసి చాలామంది కుళ్లుకుంటున్నారు. అందరి కళ్లు మీ పైనే ఉన్నాయి. అందుకే ఎవరి దిష్టి తగలకుండా మీ దాంపత్యజీవితం సాఫీగా సాగాలని భగవంతుడిని కోరుకుంటూ తలనీలాలు సమర్పించుకున్నాను' అని కోకిల తల్లి చెప్పుకొచ్చింది. కోకిల నానమ్మ అయితే దంపతులను ఆశీర్వదిస్తూ.. వచ్చే ఏడాది బిడ్డను ఎత్తుకుని రావాలని కోరింది. వీరిద్దరూ బాలాకు ఉంగరం, కోకిలకు ముక్కుపుడకను బహుమతిగా ఇచ్చారు. అందుకు సంబంధించిన వీడియోను బాలా సోషల్ మీడియాలో షేర్ చేశాడు.బాలాపై ట్రోలింగ్ఇది చూసిన కొందరు బాలాను విమర్శిస్తున్నారు. నువ్వు ఏం చేసినా సరే ఈ లోకంలోనే కాదు పరలోకంలోనూ నీకు మోక్షం లభించదు. ఈ ప్రపంచంలో సొంత బిడ్డను మోసం చేసిన ఏకైక తండ్రివి నువ్వే.. ముగ్గురు స్త్రీల కన్నీళ్లకు నువ్వు సమాధానం చెప్పాల్సి ఉంటుంది అని ఆగ్రహంతో కామెంట్లు చేస్తున్నారు. దీనికి బాలా స్పందిస్తూ..నాపై నెగెటివ్ కామెంట్లు చేసే మిత్రులారా.. నేను పెట్టే వీడియోలు చూస్తుంటే మీకెంత కోపం వస్తుందో నాకు తెలుసు. కాబట్టి నా అకౌంట్‌ను మీరు అన్‌ఫాలో అయితే సరిపోతుంది. అలా చేయలేకపోతున్నారంటే నా వీడియోలకు మీరు బానిసైపోయారని అర్థం. అయినా నేనెవర్నీ మోసం చేయలేదు అని ఫేస్బుక్లో రాసుకొచ్చాడు. చదవండి: బంగారం అక్రమ రవాణా చేసిన హీరోయిన్.. తండ్రి డీజీపీ.. మరి భర్త?!ఓటీటీలో ముగ్గురు స్టార్స్ నటించిన సినిమా.. డైరెక్ట్‌గా స్ట్రీమింగ్ -
బంగారం అక్రమ రవాణా చేసిన హీరోయిన్.. తండ్రి డీజీపీ.. మరి భర్త?!
కన్నడ హీరోయిన్ రన్యారావు (Ranya Rao) బంగారం అక్రమరవాణా కేసులో కటకటాలపాలైంది. 15 రోజుల్లో నాలుగుసార్లు దుబాయ్‌కు వెళ్లడం, అదికూడా ప్రతిసారి సేమ్ డ్రెస్ ధరించడంతో అధికారులకు అనుమానమొచ్చింది. సోమవారం (మార్చి 3న) ఆమెను బెంగళూరు ఎయిర్‌పోర్టులో తనిఖీ చేయగా 14 కిలోలకు పైగా బంగారంతో అడ్డంగా దొరికిపోయింది. దీంతో ఆమెను అరెస్టు చేసిన అధికారులు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఆమె భర్తను సైతం విచారిస్తున్నారు. ఇకపోతే రన్యా రావుకు కర్ణాటక డీజీపీ డాక్టర్ కె.రామచంద్రారావు సవతి తండ్రి అవుతాడు.పెళ్లయ్యాక మళ్లీ కలిసిందే లేదన్న డీజీపీఇప్పటికే ఈ విషయంపై డీజీపీ స్పందిస్తూ రన్యాకు నాలుగు నెలలకిందటే పెళ్లి జరిగిందని, అప్పటినుంచి తనను కలవలేదని పేర్కొన్నారు. కూతురు, అల్లుడు చేసే పనుల గురించి తనకెటువంటి విషయాలు తెలియదన్నాడు. ఈ క్రమంలో రన్యా భర్త ఎవరన్న వివరాలు బయటకు వచ్చాయి. రన్యా భర్త పేరు జతిన్ హుక్కేరి. ఈయన ఆర్కిటెక్ట్. బెంగళూరులో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పట్టా పొందాడు. తర్వాత లండన్‌లో డిస్రప్టివ్ మార్కెట్ ఇన్నొవేషన్ కోర్సు చదివాడు. తండ్రి డీజీపీ, భర్త ఆర్కిటెక్ట్మొదట్లో బెంగళూరులోని పలు రెస్టారెంట్లకు డిజైనర్‌గా పని చేశాడు. లండన్‌లోనూ ఆర్కిటెక్ట్‌గా సేవలందించాడు. WDA & DECODE LLC సంస్థను స్థాపించడంతోపాటు దానికి క్రియేటివ్ డైరెక్టర్‌గానూ వ్యవహరిస్తున్నాడు. క్రాఫ్ట్ కోడ్ కంపెనీకి ఫౌండర్ కూడా ఇతడే! రన్యారావును పెళ్లి చేసుకున్నాక తనతో కలిసి పలుమార్లు దుబాయ్ ట్రిప్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఎయిర్‌పోర్టులో బంగారం స్మగ్లింగ్ చేస్తూ రన్యా దొరికిపోగా.. ఆమె ఇంటిని సైతం తనిఖీ చేశారు. ఈ సోదాలో రూ.2.06 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.2.67 కోట్ల నగదు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.సినిమారన్యా రావు.. కిశోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ స్కూల్లో నటనపై శిక్షణ తీసుకుంది. మాణిక్య అనే కన్నడ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. ఇది ప్రభాస్ మిర్చి మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. పటాస్ కన్నడ రీమేక్ పటాకిలో హీరోయిన్గా నటించింది. తమిళంలో వాఘా మూవీ చేసింది. ఎనిమిదేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటోంది.చదవండి: ఓటీటీలో శర్వానంద్ 'మనమే'.. అఫీషియల్ ప్రకటన -
ఏమి రైటింగ్ ఫెంటాస్టిక్.. దర్శకుడిపై రజనీ ప్రశంసలు!
ఏమి రైటింగ్. ఫెంటాస్టిక్. ఈ మాటలు అన్నది ఎవరో కాదు. సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth). ఇటీవల మంచి కంటెంట్‌తో కూడిన చిన్న చిత్రాలు మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. అలాంటి చిత్రాల్లో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్(Return of the Dragon) ఒకటి. నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, కయాడు లోహర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి ఓ మై కడవులే చిత్రం ఫేమ్ అశ్వద్ మారిముత్తు కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చి సంచలన విజయాన్ని అందుకుంది. దీంతో పలువురు సినీ ప్రముఖులు దర్శకుడు అశ్వద్ మారిముత్తును అభినందనలతో ముంచెత్తుతున్నారు. కాగా మంచి చిత్రాలను, ప్రతిభావంతులైన కళాకారులను ప్రశంసించడంలో ముందుండే నటుడు రజనీకాంత్ ఇటీవల డ్రాగన్ చిత్రాన్ని చూసి,వెంటనే ఆ చిత్రం దర్శకుడు అశ్వద్ మారిముత్తును తన ఇంటికి ఆహ్వానించి ఎంతగానో ప్రశంసించారు. ఏమి రైటింగ్ ఫెంటాస్టిక్ అంటూ డ్రాగన్ చిత్ర కథ గురించి అభినందించారు. ఈ విషయాన్ని దర్శకుడు అశ్వద్ మారిముత్తు తన ఎక్స్ మీడియాలో పేర్కొంటూ రజనీకాంత్‌తో దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. అందులో ‘‘మంచి చిత్రాన్ని చేయాలి. దాన్ని రజనీకాంత్ చూసి ప్రశంశించాలి. ఇంటికి పిలిపించి అభినందించాలి. మా చిత్రం గురించి మాట్లాడాలి అని కష్టపడి పనిచేసే ఎందరో సహాయం దర్శకులు కలలు కంటారు. అలాంటి నా కల ఇప్పుడు నెరవేరింది ‘‘ అని పేర్కొన్నారు. ఇప్పుడు ఈయన వ్యాఖ్యలు, రజనీకాంత్‌తో ఈయన దిగిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. Rajini sir : what a writing Ashwath ! Fantastic fantastic !!🥹🥹nalla padam pannanum, padatha pathutu Rajini sir veetuku kooptu wish panni namma padatha pathi pesanum !! Ithu director aganum nu kasta patu ozhaikra ovoru assistant director oda Kanavu ! Kanavu neraveriya nal… pic.twitter.com/IFuHhNkqjY— Ashwath Marimuthu (@Dir_Ashwath) March 5, 2025 -
బంగారం అక్రమరవాణా.. నా కూతురిలా చేస్తుందనుకోలేదు: డీజీపీ
బంగారం అక్రమరవాణాతో అప్రతిష్ట మూటగట్టుకుంది కన్నడ హీరోయిన్ రన్యారావు (Ranya Rao). 14 కిలోలకు పైగా బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఆమెను బెంగళూరు విమానాశ్రయంలో సోమవారం అరెస్ట్ చేశారు. ఆమె డీజీపీ కూతురినని చెప్పడంతో పోలీసులు సైతం షాక్ అయ్యారు. అయితే రన్యా రావుకు కర్ణాటక డీజీపీ డాక్టర్ కె రామచంద్రారావు సొంత తండ్రి కాదు, సవతి తండ్రి అవుతాడు!మాకేదీ తెలియదుతాజాగా ఈ ఘటనపై డీజీపీ కె రామచంద్రరావు స్పందించారు. నాలుగు నెలల క్రితమే రన్యా పెళ్లి జరిగింది. అప్పటినుంచి ఇప్పటివరకు తను మమ్మల్ని కలవనేలేదు. తన గురించి కానీ, తన భర్త చేసే బిజినెస్ గురించి మాకేమీ తెలీదు. జరిగిన విషయం తెలిసి మేమంతా షాకయ్యాం.. అలాగే నిరాశచెందాం. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నారు. ప్రస్తుతం రన్యాను మార్చి 18 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచనున్నారు.ఎవరీ రన్యా?రన్యా.. కర్ణాటకలోని చిక్కమంగళూరులో జన్మించింది. కిశోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ స్కూల్లో నటనలో మెళకువలు తెలుసుకుంది. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంది. డ్యాన్స్‌లోనూ శిక్షణ తీసుకుంది. ఈమెను దర్శకుడు, హీరో సుదీప్ వెండితెరకు పరిచయం చేశాడు. ఆయన డైరెక్ట్ చేసిన మాణిక్య చిత్రంలో సహాయ నటిగా యాక్ట్ చేసింది. ఇది ప్రభాస్ మిర్చి మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో హీరో దర్శన్‌తో కలిసి పని చేయాలనుందని తెలిపింది. తాను మంచి భోజన ప్రియురాలు అని, షాపింగ్ చేయడం అంటే ఇష్టమని పేర్కొంది. పటాస్ కన్నడ రీమేక్ పటాకిలో హీరోయిన్గా నటించింది. తమిళంలో వాఘా మూవీ చేసింది. ఎనిమిదేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటోంది.చదవండి: ఇంకా ఎందుకు బతికున్నావ్.. ఎలుకల మందు తిను అన్నారు: నటుడు -
ఆ సినిమా చేసేందుకు సౌత్ హీరోలు ముందుకురావట్లేదు: దర్శకుడు
రొమాంటిక్ సినిమాలు తెరకెక్కించాలనుంది.. కానీ దక్షిణాదిలో ఏ హీరో కూడా అందుకు ఒప్పుకోవడం లేదు అంటున్నాడు దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon). బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి (Bengaluru International Film Festival) గౌతమ్ బుధవారం హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈరోజుల్లో ఏ హీరో కూడా రొమాంటిక్ సినిమాలు చేయాలనుకోవడం లేదు. అందుకే ఇంకా ఇండస్ట్రీలో ఉన్నా..తెలుగు (Tollywood), తమిళం.. కన్నడలో కూడా పలువురు హీరోలను సంప్రదించాను. రొమాంటిక్ కథ ఉందని చెప్పగానే వాళ్లు మీటింగ్‌ను వాయిదా వేస్తున్నారు. కొందరేమో కలవడానికే ఇష్టపడటం లేదు. అది ఎందుకనేది మీరే వారిని అడగండి అన్నాడు. అయితే నా దగ్గర కథలకు కొదవలేదు. అందుకే ఇంకా సినిమాల్లో కొనసాగుతున్నాను. అదే పెద్ద ఛాలెంజ్సినిమాలు తెరకెక్కించడమన్నా.. ప్రజలను థియేటర్‌కు తీసుకురావడమన్నా నాకెంతో ఇష్టం. అదే సమయంలో నేను తీసే ప్రతి చిత్రం కూడా ప్రయోగాత్మకమైనదే! కాఖా కాఖా చిత్రం రిలీజైన మొదట్లో ఎవరూ పెద్దగా ఇష్టపడలేదు. కానీ నెమ్మదిగా అది అందరికీ నచ్చింది. ఓటీటీలకు జనాలు అతుక్కుపోయిన ఈ రోజుల్లో వారిని థియేటర్‌కు రప్పించడం దర్శకనిర్మాతలకు పెద్ద ఛాలెంజ్‌గా మారింది. దీనికి ఎలాంటి మార్గం కనిపెట్టాలో నాకూ అర్థం కావడం లేదు. డైరెక్టర్లను తిడుతున్నారువేందు తైంతదు కాడు సినిమాను ఆదరించిన జనాలు జోషువాను మాత్రం తిరస్కరించారు. తెలుగు, తమిళంలో ఇప్పటికీ జనాలు థియేటర్‌కు వస్తుండటం విశేషం. సినిమా రివ్యూలు కూడా ఎలా ఉంటున్నాయంటే పర్సనల్ టార్గెట్ చేస్తున్నారు. యూట్యూబ్, సోషల్ మీడియాలో దర్శకుడిని బండబూతులు తిడుతున్నారు. రచయితను కూడా వదలడం లేదు. ఇలాంటివాళ్లు సొంతంగా ఓ సినిమా తీయాలని కోరుతున్నాను అని చెప్పుకొచ్చాడు.చదవండి: బంగారం అక్రమంగా తరలిస్తున్న హీరోయిన్.. ఏకంగా డీజీపీ కూతురేనట! -
అక్రమ బంగారంతో దొరికిపోయిన హీరోయిన్.. ఏకంగా డీజీపీ కూతురేనట!
ప్రముఖ కన్నడ నటి రన్యా రావు బంగారం అక్రమ రవాణా చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. దాదాపు 14.8 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు యత్నిస్తుండగా ఆమెను బెంగళూరు విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి బంగారాన్ని తీసుకొస్తుండగా ఎయిర్‌పోర్ట్‌లో ఆమెను అరెస్ట్ చేశారు. కేవలం 15 రోజుల్లోనే రన్యా రావ్ నాలుగుసార్లు దుబాయ్ వెళ్లి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. పక్కా ప్రణాళికతోనే రన్య రావును అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇంతకీ ఎవరు ఈ రాన్యా రావు అని నెటిజన్స్ తెగ వెతికేస్తున్నారు. అసలు ఆమె డీజీపీ కూతురు అని చెప్పడంతో పలువురు ఆరా తీస్తున్నారు. ఆ వివరాలేంటో మీరు చూసేయండి.రన్యా రావు స్వస్థలం కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా కాగా.. నటనలో అడుగు పెట్టక ముందు బెంగళూరులో విద్యను అభ్యసించింది. 2014లో ఆమె మాణిక్య చిత్రంలో ప్రముఖ హీరో కిచ్చా సుదీప్ సరసన శాండల్‌వుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీని తెలుగులో ప్రభాస్ నటించిన మిర్చి చిత్రానికి రీమేక్‌గా కన్నడలో తెరకెక్కించారు. ఆ తర్వాత దాదాపు రెండేళ్ల తర్వాత విక్రమ్ ప్రభు సరసన వాఘాతో తమిళంలో అడుగుపెట్టింది. 2017లో యాక్షన్ కామెడీ చిత్రం పటాకీతో కన్నడలో రీ ఎంట్రీ ఇచ్చింది. తెలుగు సినిమా పటాస్‌కి రీమేక్‌గా రూపొందించిన ఈ చిత్రంలో సంగీత పాత్రలో మెప్పించింది. ఈ చిత్రంలో కన్నడ నటుడు గణేష్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంది. చివరిసారిగా పటాకీ కనిపించిన రాన్యా రావు ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. తాజాగా బంగారం తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడింది. ప్రస్తుతం ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించారు.డీజీపీ కూతురే రాన్యా రావ్..మరోవైపు రన్యా రావు డీజీపీ కూతురు అని తెలుస్తోంది. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)గా ఉన్న ఐపీఎస్ అధికారి రామచంద్రరావు సవతి కుమార్తె అని సమాచారం. -
ఓటీటీలో 'మార్కో'.. అసలు ముద్దాయి సెన్సార్ బోర్డ్!
'చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం' అని తెలుగులో ఓ సామెత ఉంది. కేరళ సెన్సార్ బోర్డ్ ఆలోచనా విధానం చూస్తుంటే ఇప్పుడు అదే గుర్తొస్తుంది. ఎందుకంటే 'మార్కో' చిత్రం విషయంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సహాయం కావాలని కోరడమే కారణం.(ఇదీ చదవండి: దర్శకుడి అసత్య ఆరోపణలు.. ఇచ్చిపడేసిన హీరోయిన్)అసలేం జరిగింది?గతేడాది డిసెంబరులో మలయాళంలో 'మార్కో' అనే సినిమా రిలీజైంది. ఉన్ని ముకుందన్ నటించిన ఈ చిత్రం మరీ వైల్డ్ గా తీశారు. చిన్న పిల్లాడ్ని, గర్భిణిని, కళ్లు లేని యువకుడిని వర్ణించలేని విధంగా ఎలా చంపారో ఈ సినిమాలో చూపించారు.తొలుత మలయాళంలో రిలీజ్ చేస్తే హిట్ అయిన ఈ చిత్రాన్ని ఆ తర్వాత తెలుగులోనూ రిలీజ్ చేశారు. ఇక్కడ కొందరికి నచ్చేసింది. ఫిబ్రవరి 14న సోనీ లివ్ ఓటీటీలో మలయాళ వెర్షన్, తర్వాత కొన్నిరోజులకు ఆహాలో తెలుగు వెర్షన్, అమెజాన్ ప్రైమ్ లో హిందీ వెర్షన్ రిలీజయ్యాయి.(ఇదీ చదవండి: పెళ్లికి ముందే విడాకులు.. హైదరాబాద్ అబ్బాయితో తమన్నా కటిఫ్)ఆల్రెడీ ఈ సినిమాలో సీన్లపై దారుణమైన విమర్శలు వచ్చాయి. నరుక్కోవడం, చంపడమే అనే కాన్సెప్ట్ తో తీసిన ఈ సినిమాకు అసలు సెన్సార్ సర్టిఫికెట్ ఎలా ఇచ్చారా అని తిట్టినవాళ్లు కూడా ఉన్నారు. తీరిగ్గా జరగాల్సిన నష్టమంతా జరిగిపోయిన తర్వాత సెన్సార్ బోర్డ్ మేల్కొన్నట్లుంది.టీవీలో స్క్రీనింగ్ జరగకుండా 'మార్కో' మూవీపై నిషేధం విధించింది. ఇప్పుడు ఓటీటీలో నుంచి కూడా ఈ మూవీని నిషేధించాలని కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసింది. ఇప్పటికే 'మార్కో'ని చాలామంది చూసేశారు. సెన్సార్ బోర్డ్ తీరిగ్గా కేంద్రానికి ఇప్పుడు లెటర్ రాస్తే ఏం ప్రయోజనమో వాళ్లకే తెలియాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. మరి థియేటర్లలో?) -
దర్శకుడి అసత్య ఆరోపణలు.. ఇచ్చిపడేసిన హీరోయిన్
ఇప్పుడంతా ఓటీటీల (OTT Movies) జమానా. భాషతో సంబంధం లేకుండా నటీనటులు అభిమానుల్ని సంపాదించుకుంటున్నారు. అలా ఓటీటీ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కాస్త పరిచయమున్న మలయాళ నటి అనస్వర రాజన్ (Anaswara Rajan). ఈమె నటించిన 'మిస్టర్ & మిసెస్ బ్యాచిలర్' అనే మూవీ విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే చిత్ర దర్శకుడు ఈమెపై ఆరోపణలు చేశాడు. తానేం తప్పు చేయలేదని ఇచ్చిపడేసిన అనస్వర రాజన్.. దర్శకుడికి అదే రేంజులో ఇచ్చిపడేసింది.(ఇదీ చదవండి: సింగర్ కల్పనకు ఏమైంది? పోలీసుల అదుపులో భర్త)అసలేం జరిగింది?ఇంద్రజిత్ సుకుమారన్, అనస్వర రాజన్ జంటగా నటించిన 'మిస్టర్ & మిసెస్ బ్యాచిలర్' మూవీ లెక్క ప్రకారం గతేడాది ఆగస్టులోనే థియేటర్లలో రిలీజ్ కావాలి. కానీ అనుకోని కారణాల వల్ల అది జరగలేదు. కొన్నిరోజుల క్రితం పలు మీడియా ఛానెళ్లకి ఇంటర్వ్యూలు ఇచ్చిన దర్శకుడు దీపు కరుణాకరన్(Deepu Karunakaran).. హీరోయిన్ అనస్వర రాజన్ అస్సలు ప్రమోషన్ కోసం సహకరించట్లేదని చెప్పాడు. ఆమెపై లేనిపోని ఆరోపణలు చేశాడు.తాజాగా దర్శకుడి కామెంట్స్ పై స్పందించిన అనస్వర రాజన్.. ఆయన అన్ని అబద్ధాలే చెబుతున్నాడని క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమా కోసం ఇచ్చిన ఒకేఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూ తనదేనని, సినిమా పోస్టర్స్ కూడా తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశానని చెప్పుకొచ్చింది. రిలీజ్ డేట్ మార్పు గురించి తనకు అస్సలు సమాచారం ఇవ్వలేదని వాపోయింది.(ఇదీ చదవండి: పెళ్లికి ముందే విడాకులు.. హైదరాబాద్ అబ్బాయితో తమన్నా కటిఫ్)ఇలానే తనపై ఆరోపణలు చేస్తూ పరువు తీసేందుకు ప్రయత్నిస్తే మాత్రం ఎంతవరకైనా వెళ్తానని వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో సదరు దర్శకుడిపై అనస్వర ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ వివాదం మలయాళ చిత్రసీమలో చర్చనీయాంశంగా మారింది.అనస్వర నటించిన చిత్రాల విషయానికొస్తే.. సూపర్ శరణ్య, ప్రణయ విలాసం, గురువాయూర్ అంబలనడయిల్, నెరు తదితర చిత్రాలు ఉన్నాయి. ఈమె నటించిన లేటెస్ట్ హిట్ మూవీ 'రేఖాచిత్రం' ఈ శుక్రవారం నుంచి సోనీ లివ్ ఓటీటీలోకి రానుంది. తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ కానుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. మరి థియేటర్లలో?) View this post on Instagram A post shared by S H E ♾️ (@anaswara.rajan) -
ఒకప్పటి హీరోయిన్ లైలాకు వింత వ్యాధి!
ఒకప్పటి హీరోయిన్ లైలా చాన్నాళ్ల తర్వాత రీసెంట్ గా మీడియా ముందుకొచ్చింది. తాను నటించిన 'శబ్దం' ప్రమోషన్లలో పాల్గొంది. తన గురించి బోలెడన్ని విషయాల్ని పంచుకుంది. ఈ క్రమంలోనే తనకు అరుదైన వ్యాధి ఉందని చెప్పి అందరికీ షాకిచ్చింది.గోవాకు చెందిన లైలా.. 1996-2006 మధ్య కాలంలో తెలుగు, తమిళ భాషల్లో వరస సినిమాలు చేసింది. ఎగిరే పావురమా, పెళ్లి చేసుకుందాం, ఉగాది, ఖైదీ గారు, పవిత్రప్రేమ, లవ్ స్టోరీ 1999, శుభలేఖలు, నా హృదయంలో నిదురించే చెలి, శివపుత్రుడు తదితర చిత్రాల్లో నటించింది.(ఇదీ చదవండి: సింగర్ కల్పనకు ఏమైంది? పోలీసుల అదుపులో భర్త)2006లో ఇరానియన్ బిజినెస్ మ్యాన్ మెన్ మెహ్దినీని పెళ్లిచేసుకున్న తర్వాత పూర్తిగా నటనకు దూరమైంది. రీసెంట్ టైంలో కార్తి 'సర్దార్', విజయ్ 'ద గోట్' చిత్రాల్లో నటించింది. తాజాగా 'శబ్దం' మూవీతో ప్రేక్షకుల్ని పలకరించింది. ఈ చిత్ర ప్రమోషన్లలో తన నవ్వు వ్యాధి గురించి బయటపెట్టింది.తాను ఎప్పుడూ నవ్వుతూనే ఉంటానని, ఒక్క నిమిషం దాన్ని ఆపితే వెంటనే కన్నీళ్లు వచ్చేస్తాయని లైలా చెప్పింది. 'శివపుత్రుడు' షూటింగ్ టైంలో నిమిషం పాటు నవ్వకుండా ఉండాలని విక్రమ్ ఛాలెంజ్ చేయగా.. 30 సెకన్లకే ఏడ్చేశానని, దీంతో తన మేకప్ అంతా పాడైపోయిందని చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: ప్లీజ్ నన్ను అలా పిలవొద్దు: హీరోయిన్ నయనతార) -
ప్లీజ్ నన్ను అలా పిలవొద్దు: హీరోయిన్ నయనతార
దక్షిణాదిలో గ్లామరస్, హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేసే అతికొద్దిమంది హీరోయిన్లలో నయనతార ఒకరు. అభిమానులు ఈమెని ముద్దుగా లేడీ సూపర్‌స్టార్ అని పిలుస్తుంటారు. ఇకపై అలా పిలవొద్దని నయన్ విజ్ఞప్తి చేసింది. (ఇదీ చదవండి: సింగర్ కల్పనకు ఏమైంది? పోలీసుల అదుపులో భర్త)అభిమానులు ఎంతో ప్రేమతో అలా పిలవడం ఆనందంగా ఉన్నా సరే నయనతార అనే పేరే తన మనసుకు దగ్గరైందని చెప్పుకొచ్చింది. నటిగానే కాకుండా వ్యక్తిగానూ తనేంటో ఆ పేరు తెలియజేస్తుందని సోషల్ మీడియాలో ఓ నోట్ రిలీజ్ చేసింది.'మీరు చూపించే అభిమానికి థ్యాంక్యూ. నా జీవితం తెరిచిన పుస్తకం. నా విజయంలో, కష్టసమయంలో మీరు అండగా ఉన్నారు. మీరెంతో ప్రేమతో ఇచ్చిన లేడీ సూపర్‌స్టార్ బిరుదుకు రుణపడి ఉంటాను. కానీ నయనతార అని పిలిస్తేనే నాకు సంతోషం. ఇలాంటి బిరుదుల వల్ల సౌకర్యంగా ఉండలేని పరిస్థితి. సినిమా మనందరినీ ఒక్కటిగా ఉంచుతుంది. దాన్ని ఎప్పుడూ సెలబ్రేట్ చేసుకుందాం' అని నయనతార నోట్ లో రాసుకొచ్చింది.(ఇదీ చదవండి: పెళ్లికి ముందే విడాకులు.. హైదరాబాద్ అబ్బాయితో తమన్నా కటిఫ్) -
హనుమాన్ నటి బర్త్ డే.. గొప్ప మనసు చాటుకున్న వరలక్ష్మి శరత్‌కుమార్
హనుమాన్ మూవీతో తెలుగు ప్రేక్షకుల్లో చోటు సంపాదించుకున్న కోలీవుడ్ బ్యూటీ వరలక్ష్మీ శరత్‌కుమార్. టాలీవుడ్లో బాలయ్య మూవీ వీరసింహారెడ్డిలోనూ తనదైన నటనతో మెప్పించింది. ప్రస్తుతం కోలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఈ నెల 5న ఆమె పుట్టినరోజు కావడంతో తన గొప్ప మనసును చాటుకున్నారు.వరలక్ష్మి తన బర్త్ డే సందర్భంగా అనాథ చిన్నారుల్లో సంతోషం నింపారు. హైదరాబాద్‌లోని లెప్రా సోసైటీ అనాథాశ్రమానికి వెళ్లిన వరలక్ష్మీ తన భర్త నికోలయ్ సచ్దేవ్తో పాటు పుట్టిన రోజు వేడుకలు చేసుకుంది. ఈ సందర్భంగా చిన్నారులకు బహుమతులు అందించారు. అంతేకాకుండా ఆశ్రమానికి తనవంతుగా ఆర్థికసాయం అందజేశారు. సెలబ్రిటీలు వస్తే అనాథాశ్రమం గురించి ప్రజలకు తెలుస్తుందనే మంచి ఉద్దేశంతోనే వచ్చానని వరలక్ష్మీ శరత్‌కుమార్ అన్నారు. -
షూటింగ్ లో గాయపడ్డ హీరో కార్తి
తమిళ హీరో కార్తి గాయపడ్డాడు. ఆవారా, యుగానికి ఒక్కడు, ఖైదీ తదితర చిత్రాలతో తెలుగులోనూ కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న ఈ హీరో ప్రస్తుతం మైసూరులో ఉన్నారు. షూటింగ్ సందర్భంగా గాయపడ్డాడు.గత కొన్నిరోజుల నుంచి కర్ణాటకలోని మైసూరులో కార్తి కొత్త సినిమా 'సర్దార్ 2' షూటింగ్ జరుగుతోంది. కీలకమైన సన్నివేశాలు తీస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ క్రమంలోనే కార్తి కాలికి గాయమైంది. దీంతో టీమ్ దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు.(ఇదీ చదవండి: కూతురిచ్చిన గిఫ్ట్.. రూ.6 కోట్లకు అమ్మేసిన నటుడు)ఎలాంటి ఇబ్బంది లేదని, కాకపోతే వారంపాటు విశ్రాంతి తీసుకోవాలని కార్తికి వైద్యులు సూచించారు. దీంతో షూటింగ్ అంతా ఆపేసి చెన్నై వెళ్లిపోయారు. 2022లో వచ్చిన 'సర్దార్' చిత్రానికి ఇది సీక్వెల్. ఇందులో కార్తి, రజిషా విజయన్ తో పాటు ఎస్జే సూర్య, మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ నటిస్తున్నారు.సర్దార్ 2 పూర్తి చేసిన తర్వాత కార్తి.. ఖైదీ 2 షూటింగ్ మొదలు పెడతాడు. అంతలో దర్శకుడు లోకేశ్ కనగరాజ్.. రజినీకాంత్ తో 'కూలీ' పూర్తి చేసి వస్తాడు. LCUలో భాగమైన 'ఖైదీ 2' అంచనాలు మాత్రం గట్టిగానే ఉన్నాయ్.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. మరి థియేటర్లలో?) -
దిగ్గజ హీరో ఇల్లు జప్తు.. హైకోర్ట్ సంచలన ఆదేశం
ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలంలో తమిళంలో హీరోగా అద్భుతమైన సినిమాలు తీసి నడిగర్ తిలగం అనే బిరుదు సంపాదించుకున్నారు శివాజీ గణేశన్(Sivaji Ganesan). ఈయన వారసులు ఇప్పుడు నటులుగా చేస్తున్నారు. సరే ఇదంతా పక్కనబెడితే ఈయన మనవడు చేసిన అప్పు వల్ల శివాజీ గణేశన్ కి ఎంతో ఇష్టమైన ఇంటిని జప్తు చేయామని మద్రాస్ హైకోర్ట్(Madras Highcourt) ఆదేశించింది.(ఇదీ చదవండి: దుబాయ్‌లోనే నిర్మాత 'కేదార్' అంత్యక్రియలు)ఏం జరిగింది?శివాజీ గణేశన్ వారసుడు రామ్ కుమార్ ప్రస్తుతం నటుడిగా కొనసాగుతున్నాడు. ఈయన కొడుకు దుష్యంత్ మాత్రం భార్యతో కలిసి ఈశాన్ ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థ స్థాపించాడు. ఇప్పటికే నష్టాల్లో ఉండగా.. ఒక్క మూవీ తీసి అప్పులన్నీ తీర్చేద్దామనుకున్నాడు. ఈ క్రమంలోనే ధనభాగ్యం ఎంటర్ ప్రైజెస్ అనే సంస్థ నుంచి రూ.3.74 కోట్లు రూపాయల్ని ఏడాదికి 30 శాతం వడ్డీకి అప్పుగా తీసుకున్నాడు. 'జగజాల కిలాడి' అనే సినిమా మొదలుపెట్టాడు.ఇదంతా జరిగి చాన్నాళ్లయిపోయింది. ఈ క్రమంలోనే తమ దగ్గర తీసుకున్న అప్పుని దుష్యంత్ చెల్లించలేదని.. సదరు ధనభాగ్య సంస్థ మద్రాసు హైకోర్టుని ఆశ్రయించింది. మధ్యవర్తి ద్వారా ఈ సమస్యని పరిష్కరించుకోవాలని కోర్టు చెప్పింది.(ఇదీ చదవండి: ఆస్కార్ మెచ్చిన వేశ్య కథ.. ఏంటి 'అనోరా' స్పెషల్?)ఈ క్రమంలోనే తీసిన సినిమాను ధనభాగ్య సంస్థకు ఇచ్చేయాలని దుష్యంత్ తో మధ్యవర్తి చెప్పాడు. అప్పుడు అసలు నిజం బయటపడింది. తాను ఇంతవరకు సినిమా పూర్తి చేయలేదని, అప్పుగా తీసుకున్న డబ్బుతో తన పాత బాకీలు తీర్చుకున్నానని దుష్యంత్ చెప్పాడు. ఈ విషయంలో తమని తప్పుదారి పట్టించాడని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.దీంతో దుష్యంత్ కి ఉమ్మడి ఆస్తిగా దక్కిన తాత శివాజీ గణేశన్ ఇంటిని జప్తు చేయాలని, ఇంటికి తాళాలు వేయాలని అధికారుల్ని న్యాయస్థానం ఆదేశించింది. ఇది తెలిసిన దిగ్గజ హీరో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. మరి థియేటర్లలో?) -
అజిత్ కుమార్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'.. ధనుశ్ పోటీ నుంచి తప్పుకున్నట్టేనా?
విదాముయార్చి మూవీ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ మరో యాక్షన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ వేసవిలో మరోసారి అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కిస్తోన్న గుడ్ బ్యాడ్ అగ్లీలో అజిత్ నటిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా కనిపించనుంది.అయితే అదే రోజు ధనుశ్ హీరోగా నటిస్తోన్న ఇడ్లీ కడై విడుదల కానుంది. ఈ మూవీలో నిత్యామీనన్ హీరోయిన్గా నటిస్తోంది. అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ కూడా అదే రోజు కావడంతో ఇడ్లీ కడై మేకర్స్ పునరాలోచనలో పడ్డారు. ఇడ్లీ కడై మూవీ రిలీజ్ వాయిదా వేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా.. తిరుచిత్రంబలం మూవీ తర్వాత ధనుశ్, నిత్యా మీనన్ మరోసారి జంటగా కనిపించనున్నారు. ఇదిలా ఉండగా.. ధనుశ్ డైరెక్షన్లో అజిత్ కుమార్ నటించనున్నట్లు మరో టాక్ వినిపిస్తోంది. ధనుశ్ సొంత నిర్మాణ సంస్థ అయిన వండర్‌బార్ పిక్చర్స్ బ్యానర్లో అజిత్ కుమార్ నటించే అవకాశం ఉందని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నట్లు కోలీవుడ్ టాక్. -
అమ్మాయితో చాటింగ్ వైరల్.. తన ఉద్దేశం అది కాదన్న హీరో
నేను ఏ తప్పూ చేయలేదు, మీరు అనవసరంగా పొరబడుతున్నారు అంటున్నాడు హీరో మాధవన్ (R Madhavan). ఇటీవల ఆయన అమ్మాయితో చేసిన చాటింగ్ స్క్రీన్‌షాట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో యువతి కిస్ ఎమోజీలతో చేసిన మెసేజ్‌కు మాధవన్ రిప్లై ఇవ్వడంతో చాలామంది ఆయన క్యారెక్టర్‌నే అనుమానించారు. ఈయనేంటి, అలాంటి మెసేజ్‌లకు స్పందిస్తున్నారని కొంత అసహనం వ్యక్తం చేశారు.ఓ అమ్మాయి మెసేజ్..తాజాగా అతడు సోషల్ మీడియా (Social Media)లో ఎదురయ్యే ఇబ్బందుల గురించి మాట్లాడుతూ తన చేదు అనుభవాన్ని బయటపెట్టాడు. 'పిల్లలు సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారనేది తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. మీకో ఉదాహరణ చెప్తా.. నేను ఒక నటుడిని. ఇన్స్టాగ్రామ్ వంటి పలు సామాజిక మాధ్యమాల ద్వారా నాకు జనాలు మెసేజ్‌లు చేస్తూ ఉంటారు. అలా ఓ అమ్మాయి.. మీ సినిమా చూశాను, చాలా బాగా నచ్చింది. మీరు నిజంగా గొప్ప యాక్టర్. మీరు నన్ను ఇన్స్పైర్ చేశారు అని మెసేజ్ చేసింది. కానీ చివర్లో హార్ట్, లవ్ సింబల్స్ పెట్టింది.రిప్లై ఇచ్చిన పాపానికి..నా గురించి అంత గొప్పగా రాసినందుకు ఆమెకు రిప్లై ఇవ్వాలా? వద్దా? సాధారణంగా.. థాంక్యూ సో మచ్, గాడ్ బ్లెస్ యు.. ఇలాంటి రిప్లైలే ఎక్కువగా ఇస్తుంటాను. తనకూ అదే రిప్లై ఇచ్చాను. వెంటనే ఆమె దాన్ని స్క్రీన్‌షాట్ తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. జనాలు ఆమె పెట్టిన హార్ట్, కిస్, లవ్ ఎమోజీలను మాత్రమే చూశారు. వాటికే నేను రిప్లై ఇచ్చానని ఓ నిర్ణయానికి వచ్చేశారు. కానీ నా ఉద్దేశం అది కాదు.. కేవలం తన మెసేజ్‌కు స్పందించాను. అందుకే భయంమీరేమో మ్యాడీ అమ్మాయిలతో ఇలా చాట్ చేస్తాడా? అని ఏవేవో ఊహించుకున్నారు. అందుకే ఆ భయంతోనే సోషల్ మీడియాలో ఏదైనా కామెంట్ పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నాను. మరి నాలాగా అనుభవం లేనివారు ఎన్ని ఇబ్బందుల్లో పడతారో ఊహించారా? అని ప్రశ్నించాడు. మాధవన్ చివరగా హిసాబ్ బరాబర్ సినిమా (Hisaab Barabar Movie)లో కనిపించాడు. తమిళంలో అధిర్శ్తసాలి, టెస్ట్ సినిమాలు చేస్తున్నాడు. హిందీలో అమీర్కీ పండిత్, దేదే ప్యార్ దే 2, కేసరి చాప్టర్ 2, ధురంధర్ మూవీస్‌లో కనిపించనున్నాడు.చదవండి: ధనుష్‌ను కాపీ కొడుతున్నారా? ఇబ్బందిపడ్డ ప్రదీప్ రంగనాథన్ -
ఈవెంట్ తెచ్చిన తంటా.. రష్మికకు ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్
శాండల్‌వుడ్‌లో వివాదం మరింత ముదురుతోంది. ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు కన్నడకు చెందిన అగ్ర సినీతారలు హాజరు కాకపోవడం రాజకీయ రంగు పులుముకుంది. ఈ అంశంపై ఇప్పటికే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ అందరికీ నట్లు, బోల్టులు ఎప్పుడు బిగించాలో తమకు తెలుసని మండిపడ్డారు. తాజాగా మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే నేషనల్ క్రష్, పుష్ప భామ రష్మిక మందన్నాపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇటీవల జరిగిన బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు రష్మిక హాజరు కాకపోవడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి గణిగ మండిపడ్డారు. కన్నడ చిత్రం కిరిక్ పార్టీతో తన కెరీర్‌ను ప్రారంభించిన రష్మిక తన మూలాలు మరిచిపోవడం సరైంది కాదని హితవు పలికారు. గతేడాది కూడా ఈవెంట్‌కు ఆహ్వానించగా నిరాకరించిందని వెల్లడించారు. తాను కెరీర్ ప్రారంభించిన ఇండస్ట్రీని చిన్నచూపు చూస్తున్న రష్మికకు తగిన గుణపాఠం చెప్పకూడదా? అంటూ అని మాండ్యా నియోజకవర్గ ఎమ్మెల్యే రవి గణిగ ప్రశ్నించారు. కాగా.. రష్మిక 2016లో కన్నడ చిత్రం కిరిక్ పార్టీతో రక్షిత్ శెట్టి సరసన సినీ రంగ ప్రవేశం చేసింది.(ఇది చదవండి: ఇలాగే ఉంటే నటీనటులకు నట్లు, బోల్టులు బిగిస్తాం: డిప్యూటీ సీఎం)రష్మిక కన్నడ చిత్ర పరిశ్రమను పూర్తిగా విస్మరించిందని ఆయన అన్నారు. అలాగే కన్నడ భాషను కూడా విస్మరించి అగౌరవపరిచేలా మాట్లాడిందని ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ కార్యక్రమానికి రష్మిక మందన్నను చాలాసార్లు ఆహ్వానించినప్పటికీ.. బెంగళూరు రావడానికి సమయం లేదని సమాధానమిచ్చిందని అన్నారు. మా శాసనసభ్యురాలు ఒకరు ఆమెను ఆహ్వానించడానికి 10 నుంచి 12 సార్లు ఆమె ఇంటికి వెళ్లారని గుర్తు చేశారు. కానీ రష్మిక కన్నడ పరిశ్రమను పట్టించుకోలేదని.. ఇలాంటి వారికి వారికి గుణపాఠం చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు. రష్మిక ప్రవర్తనకు తగిన పరిణామాలు తప్పవని ఆయన హెచ్చరించారు. కాగా.. ఇటీవల బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్-16 వేడుకలు గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు శాండల్‌వుడ్ అగ్రతారలు హాజరు కాకపోవడంపై డీసీఎం డీకే శివకుమార్ సైతం మండిపడ్డారు. -
ధనుష్‌ను కాపీ కొడుతున్నారా? ఇబ్బందిపడ్డ ప్రదీప్ రంగనాథన్
లవ్ టుడే సినిమాతో సెన్సేషన్ అయిన ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీ (Return of the Dragon Movie)తో మరో బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. ప్రదీప్ హీరోగా నటించిన డ్రాగన్ మూవీ రూ.100 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు ప్రదీప్ రంగనాథన్ సమాధానాలిచ్చారు. మీ పర్ఫామెన్స్ బాగుంటుంది. కానీ స్క్రీన్‌పై చూసినప్పుడు ధనుష్‌ను కాపీ చేసినట్లు అనిపిస్తుంది. ఎవర్నీ కాపీ కొట్టట్లేదుఆ విషయాన్ని మీరు గ్రహించారా? లేదా ఎవరైనా చెప్పారా? అని ఓ పాత్రికేయుడు అడిగారు. అందుకు ప్రదీప్ ఇబ్బందిగా నవ్వుతూనే.. చాలాకాలంగా ఇలాంటి కామెంట్స్ వింటూనే ఉన్నానన్నాడు. కాకపోతే తానెవరినీ ఇమిటేట్ చేయడం లేదని క్లారిటీ ఇచ్చాడు. తన ఫిజిక్, ఫేస్‌కట్ వల్ల మీ అందరూ అలా పొరబడుతున్నారని వివరణ ఇచ్చాడు. సేమ్ ధనుష్లాగే ఉండటం మీకు ప్లస్సా? మైనస్సా అన్న ప్రశ్నకు.. అదంతా నాకు తెలియదు.. అద్దంలో చూసుకున్నప్పుడు నాకు నేను మాత్రమే కనపడతాను. నేను తీసిన సినిమా బాగా ఆడుతోందంటే నేను బాగానే చేస్తున్నాను అనుకుంటున్నాను అని హీరో తెలిపాడు. నా కళ్లకు ప్రదీప్లాగే ఉన్నాడు: దర్శకుడి అసహనంఇంతలో డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు (Ashwath Marimuthu) మైక్ అందుకుని.. మీ కళ్లకు మాత్రమే ఫలానా హీరోలా కనిపిస్తున్నాడేమో కానీ నా కళ్లకు మాత్రం ప్రదీప్ రంగనాథన్లాగే ఉన్నాడు. కేవలం ఆయన్ను మిగతా హీరోతో పోల్చాలని మాత్రమే ఈ ప్రశ్న అడిగినట్లున్నారు. ప్రదీప్ రంగనాథన్లో నేను ఏ ఇతర హీరోను చూడలేదు అని గరమయ్యాడు. డ్రాగన్ సినిమా విషయానికి వస్తే.. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించగా అనుపమ పరమేశ్వరన్, కయాడు లోహర్ హీరోయిన్లుగా యాక్ట్ చేశారు. ఫిబ్రవరి 21న ఈ సినిమా తమిళంతోపాటు తెలుగులోనూ రిలీజైంది.చదవండి: నాపై నీ ప్రేమకు, నమ్మకానికి థాంక్యూ.. పెళ్లిరోజు మౌనిక స్పెషల్ పోస్ట్ -
ఇలాగే ఉంటే నటీనటులకు నట్లు, బోల్టులు బిగిస్తాం: డిప్యూటీ సీఎం
బెంగళూరులో జరుగుతున్న చలన చిత్రోత్సవంలో అనేక మంది శాండల్‌వుడ్ నటీనటులు పాల్గొనకపోవడంపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా విధానసౌధలో జరిగిన కార్యక్రమంలో ఇండస్ట్రీ ప్రముఖలపై ఆయన భగ్గుమన్నారు. కన్నడ భూమి, భాష గురించి నటీనటులు స్పందించకుంటే మీ నట్లు బోల్ట్లను టైట్ చేస్తామని సినీ ప్రముఖులను హెచ్చరించారు. దీంతో నెట్టింట పెద్ద దుమారం రేగింది. అయితే, తన వ్యాఖ్యలను కొంత సమయం తర్వాత డీకే సమర్థించుకున్నారు. 'సినిమా ప్రముఖులు ఏమికావాలంటే అది చేసుకోనీ, నాకు తెలియదు. నా మాటల్లో నిజాలున్నాయి. ధర్నాలు చేసినా ఫర్వాలేదు. రాష్ట్రానికి అన్యాయం జరిగినప్పుడు ఇండస్ట్రీ నుంచి ఎవరూ మద్దతు ఇవ్వడం లేదు. మన నీరు, మన హక్కు పోరాటంలో సినిమా వాళ్లెవరూ పాల్గొనలేదు' అని ఆయన ఆరోపించారు. మేకెదాటు పాదయాత్రలో ప్రేమ్, దునియా విజయ్, సాధుకోకిల పాల్గొన్న సమయంలో బీజేపీ ప్రభుత్వం కేసులు వేసిందని డీకే శివకుమార్ ఆరోపించారు. కాగా, కుంభమేళాలో స్నానం చేయడంపై సొంత పార్టీ నాయకులు విమర్శించారని ప్రశ్నించగా, అక్కడి నీటికి కులం, మతం ఉందా, ఏ పార్టీకై నా చెందిందా అని మండిపడ్డారు.అధికార దర్పం: ఫిల్మ్ చాంబర్డిప్యూటీ సీఎం ప్రకటనను కర్ణాటక ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు నరసింహలు ఖండించారు. అయన అధికార దర్పంతో అలా మాట్లాడి ఉండవచ్చని అన్నారు. బెంగళూరులో జరుగుతున్న అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో కన్నడ కళాకారులందరూ పాల్గొనవలసి ఉంది. ఆహ్వానం అందని కారణంగా కొందరు పాల్గొనలేదని చెప్పారు.మీకు సాధ్యమా: అశోక్సినిమా రంగం, నటులపై డీకే శివకుమార్ మాటలను బీజేపీ పక్ష నాయకుడు ఆర్ అశోక్ ఖండించారు. మీరు చెప్పేది సాధ్యమా, ముందు మీ మంత్రి రాజణ్ణకు నట్లు బోల్టులను బిగించాలని హేళన చేశారు. కిచ్చ సుదీప్, కేజీఎఫ్ యశ్, దర్శన్ నట్లు బోల్టులను బిర్రు చేయడం మీకు సాధ్యమా అంటూ ప్రశ్నించారు. కన్నడ సినిమా రంగాన్ని అవమానించారని, క్షమాపణలు చెప్పాలని డీకే శివకుమార్‌ను అశోక్ డిమాండ్ చేశారు. -
ధైర్యమే ఆయుధం
భర్త కోసం ఒకరు... మార్పు కోసం మరొకరు... ఊరి కోసం ఇంకొకరు... ఇలా సమాజంతో, వ్యతిరేక పరిస్థితులతో ధైర్యాన్నే ఆయుధంగా చేసుకుని పోరాటానికి నడుం బిగించారు కొందరు తారలు. తమ హక్కులు, లక్ష్యాల కోసం సిల్వర్ స్క్రీన్‌పై తగ్గేదే లే అంటూ విజృంభించారు.. పోరాటానికి ‘సై’ అని కొందరు నటీమణులు చేసిన ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం.క్రిమినల్... లెజెండ్ ‘అరుంధతి, రుద్రమదేవి’ వంటి ఉమెన్ సెంట్రిక్ మూవీస్‌లో అనుష్క యాక్షన్ టాలెంట్‌ని ఆడియన్స్ చూశారు. కొంత గ్యాప్ తర్వాత అనుష్క నటిస్తున్న ఈ తరహా చిత్రం ‘ఘాటి’. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 18న విడుదల కానుంది. ఓ వ్యాపారంలో ఎదుగుతున్న మహిళను కొందరు వ్యక్తులు ఓ కుట్రలో ఇరికించి, క్రిమినల్‌గా చిత్రీకరిస్తారు. ఆ సమస్యల నుంచి ఆమె బయటపడి, తనను ఇబ్బంది పెట్టినవారికి ఎలా బుద్ధి చెప్పింది? ఆ వ్యాపార సామ్రాజ్యానికి ఓ లెజెండ్‌గా ఆమె ఎలా ఎదిగింది? అన్నదే ‘ఘాటి’ సినిమా కథ అని టాక్.మా ఇంటి బంగారం కుటుంబాన్ని చక్కబెట్టే ఓ గృహిణి గన్ పట్టిందంటే అందుకు కొన్ని అసాధారణ పరిస్థితులే కారణమై ఉంటాయి. మరి... ఆమె ఎందుకు గన్ పట్టుకుందో ‘మా ఇంటి బంగారం’ సినిమాలో చూడాలి. ఈ సినిమాలో గృహిణిగా నటిస్తున్నారు సమంత. తన నిర్మాణ సంస్థ ట్రా లా లా పిక్చర్స్‌పై సమంత నిర్మిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. గత ఏడాది తన బర్త్ డే (ఏప్రిల్ 28) సందర్భంగా ‘మా ఇంటి బంగారం’ను ప్రకటించారు. ఆ తర్వాత ఈ మూవీపై అప్డేట్ రాలేదు. అలాగే ‘ట్రా లా లా’లోనే ఓ హారర్–కామెడీ ఫిల్మ్ రూపొందుతోందని తెలిసింది. ఈ చిత్రంలో సమంత గెస్ట్ రోల్ చేశారని సమాచారం. భర్త కోసం... ఆల్మోస్ట్ అందరూ మహిళలే ఉన్న ఓ నిర్మాణ సంస్థ నిర్మించిన చిత్రం ‘ది ఐ’. ఈ చిత్రంలో శ్రుతీహాసన్ లీడ్ రోల్లో నటించారు. డాఫ్నే ష్మోన్ దర్శకత్వంలో రూపొందిన అంతర్జాతీయ చిత్రం ఇది. త్వరలోనే ఈ చిత్రం రిలీజ్ కానుంది. వేరే దేశంలో ఉన్న తన భర్త మరణ వార్త విని షాక్ అయిన ఓ మహిళ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్తుంది. అక్కడ ఆమెకు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఓ దశలో భర్త బతికే ఉన్నాడనే అనుమానం కూడా ఆమెకు వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అనే అంశాల నేపథ్యంలో ‘ది ఐ’ ఉంటుందని సమాచారం.వీరోచిత పోరాటం ఓ ఊరి సంరక్షణ కోసం దుష్ట శక్తులతో శివ శక్తి అనే నాగసాధువు ఎలాంటి వీరోచిత పోరాటం చేసిందనే ఇతివృత్తంతో రూపొందుతున్న సినిమా ‘ఓదెల 2’. ఈ చిత్రంలో నాగ సాధువుగా నటిస్తున్నారు తమన్నా. దర్శక–నిర్మాత సంపత్ నంది పర్యవేక్షణలో అశోక్ తేజ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. బ్యాగ్‌లో బాంబు ఓ అమ్మాయి తన హ్యాండ్ బ్యాగ్‌లో కత్తి, బాంబు, తుపాకీలు పెట్టుకుని తిరుగుతుంటుంది. ఎందుకనేది థియేటర్స్‌లో ‘రివాల్వర్ రీటా’ మూవీ చూసి తెలుసుకోవాలి. కీర్తీ సురేష్ టైటిల్ రోల్లో నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ ‘రివాల్వర్ రీటా’. జేకే చంద్రు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. స్టూడెంట్ స్టోరీ రష్మికా మందన్నా తొలిసారి చేస్తున్న ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘ది గర్ల్‌ఫ్రెండ్’. ప్రేమలో పడకూదనుకుంటూనే ప్రేమలో పడే ఓ కాలేజీ స్టూడెంట్ కథగా ఈ సినిమా కథనం ఉంటుందని తెలిసింది. ఈ చిత్రంలో కాలేజ్ స్టూడెంట్‌గా నటిస్తున్నారు రష్మికా మందన్నా. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందు తున్న ఈ సినిమా రిలీజ్‌పై త్వరలో ఓ ప్రకటన రానుంది. అలాగే ‘రెయిన్ బో’ అనే మరో లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్‌కూ రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీపై తాజా అప్డేట్ రావాల్సి ఉంది. సుబ్బు సాహసం అనుపమా పరమేశ్వరన్, దర్శనా రాజేంద్రన్, సంగీత... ఇలా ముగ్గురు హీరోయిన్లు నటించిన చిత్రం ‘పరదా’. ఊరి సంప్రదాయం, కట్టుబాట్ల కోసం సుబ్బు (అనుపమ) చేసిన సాహసోపేతమైన ప్రయాణమే ‘పరదా’. ఈ చిత్రంలోని మెయిన్ హీరోయిన్ రోల్లో అనుపమా పరమేశ్వరన్ నటించారు. ఈ సినిమాతో ఓ సామాజిక అంశాన్ని బలంగా చెప్పబోతున్నారట ఈ చిత్రదర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల. ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది. అలాగే ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ అనే కోర్టు రూమ్ డ్రామాలోనూ, ‘లాక్ డౌన్’ అనే మరో ఉమెన్ సెంట్రిక్ చిత్రంలోనూ అనుపమ నటించారు. నెగటివిటీ తగ్గాలంటే... సమాజంలోని నెగటివిటీని తగ్గించాలకుని ఓ యువతి తనదైన శైలిలో ఏం చేసింది? అనే అంశంతో ఓ ఉమెన్ సెంట్రిక్ మూవీ నిర్మాణంలో ఉంది. సామాజిక, రాజకీయ అంశాల మేళవింపుతో రానున్న ఈ సినిమాలో హీరోయిన్ సంయుక్త లీడ్ రోల్ చేస్తున్నారు. కేఎస్సీ యోగేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంయుక్త కూడా ఓ నిర్మాత. ఆమెకు నిర్మాతకు ఇదే తొలి చిత్రం కావడం ఓ విశేషం. సతీ లీలావతి ‘హ్యపీబర్త్ డే’ తర్వాత హీరోయిన్ లావణ్యా త్రిపాఠి సైన్ చేసిన మరో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘సతీ లీలావతి’. తాతినేని సత్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం ఆరంభమైంది. కథాంశం గురించి పూర్తి వివరాలు రావాల్సి ఉంది.బూమరాంగ్ అనూ ఇమ్మాన్యుయేల్ లీడ్ రోల్లో నటించిన హారర్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘బూమరాంగ్’. ఇందులో శివ కందుకూరి కీలక పాత్రధారి. ఆండ్రూ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఓ సైకో కిల్లర్ నుంచి ఒక యువతి ఎలా తప్పించుకుంది? అనే అంశంతో ఈ చిత్రం రూపొందుతోందని టాక్.సత్యభామ కథ పెళ్లైన ఓ అమ్మాయి తన సమస్యలను తానే ఏ విధంగా పరిష్కరించుకుంది? అనే అంశంతో రూపొందుతున్న సినిమా ‘శివంగి’. ఈ మూవీలో సత్యభామగా ఆనంది, పోలీసాఫీసర్‌గా వరలక్ష్మీ శరత్‌కుమార్ నటించారు. దేవరాజ్ భరణీధరన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది. అలాగే ప్రముఖ బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘గరివిడి లక్ష్మి’ సినిమాలో ఆనంది టైటిల్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రానికి గౌరీ నాయుడు జమ్ము దర్శకత్వం వహిస్తున్నారు.మహిళలు ఎదగాలి మహిళలను గౌరవించాలి, అన్ని రంగాల్లో ఆడపిల్లలు ఎదిగేందుకు సహకరించాలి, సమాజంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించాలనే అంశాల ఇతివృత్తంగా రూపొందిన చిత్రం ‘నారీ’. ఈ సినిమాలో ఆమని ఓ లీడ్ రోల్ చేశారు. సూర్య వంటిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 7న రిలీజ్ కానుంది. ఇవే కాదు... ఇంకా మరికొన్ని ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ నిర్మాణంలో ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు -
నటిపై సీమాన్ వివాదాస్పద వ్యాఖ్యలు
కోలీవుడ్ నటి విజయలక్ష్మి పడుపు వృత్తిని కొనసాగిస్తున్నారని, ఇందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నట్టు నామ్‌తమిళర్ కట్చి కన్వీనర్, నటుడు సీమాన్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. వివరాలు..విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇప్పటికే సీమాన్ లైంగిక దాడికేసు విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆయన వద్ద పోలీసులు తీవ్ర విచారణ జరిపి, కోర్టులోచార్జ్ షీట్ దాఖలకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో ఈకేసు నుంచి తన పేరును తప్పించాలని కోరుతూ సీమాన్ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. ఈ పరిస్థితులలో సీమాన్ మరోమారు విజయలక్ష్మిపై విరుచుకుపడ్డారు. తెన్కాశి పర్యటనకు వెళ్తూ చైన్నె విమానాశ్రయంలో మీడియాతో ఆయన మట్లాడుతూ, తమిళనాడులో రోజూ లైంగిక దాడులు జరుగుతున్నాయని, ఈ కేసుల నమోదు లేని రోజంటూ లేదని వివరిస్తూ, వీటి మీద దృష్టి పెట్టకుండా తనను అవమాన పరచడమే లక్ష్యంగా పోలీసులు ముందుకెళ్తున్నారని మండిపడ్డారు. తన మీద ఫిర్యాదు చేసిన విజయలక్ష్మి పడుపు వృత్తిలో ఉన్నారని, ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నట్టు ఆరోపించారు. నగరంలో ఒక ఖరీదైన భవనం తీసుకుని ఆమెతో పాటు మరికొందరు యువతులతో ఈ వృత్తిలో ఉన్నారంటూ తెలిపారు. ఎంజాయ్మెంట్ గురించి ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్ చెప్పిన ఎంజాయ్మెంట్ వితవుట్ రెస్పాన్స్ బిలిటీ అన్న వ్యాఖ్యలను తాను అనుసరిస్తున్నానని వివరించారు. పెరియార్ మార్గంలోనే ఇప్పుడు తానుకూడా నడుస్తున్నానని, అలాంటప్పుడు తాను ఏ తప్పు చేసినట్టో అని ప్రశ్నించారు. ఇందుకు డీఎంకే ఎంపీ కనిమొళితో పాటూ ఆ పార్టీ వర్గాలే కాదు, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీల నేతలు ఎలాంటి సమాధానం ఇస్తారని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన విజయలక్ష్మి తన కన్నీరే భవిష్యత్‌లో సీమాన్‌కు శాపంగా మారుతుందని వ్యాఖ్యానించారు. -
అనన్య నాగళ్ల సండే లుక్.. ఫ్యాషన్ డ్రెస్‌లో నా సామిరంగ బ్యూటీ!
హీరోయిన్ అనన్య నాగళ్ల సండే లుక్స్...సన్‌సెట్ ఆస్వాదిస్తోన్న బిగ్‌బాస్ బ్యూటీ కిర్రాక్ సీత..ఫ్యామిలీ ట్రిప్ ఆస్వాదిస్తోన్న హీరోయిన్ ప్రణీత..నాటీ డ్రెస్‌లో నా సామిరంగ బ్యూటీ ఆషిక రంగనాథ్..రానా సతీమణి మిహికా బజాజ్ లేటేస్ట్ లుక్.. View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Seetha🦋🇮🇳 (@kirrakseetha) View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka) View this post on Instagram A post shared by Sahithi Dasari (@sahithi_dasari7) -
బాక్సాఫీస్ వద్ద 'డ్రాగన్'.. పది రోజుల్లోనే రికార్డ్‌స్థాయి వసూళ్లు!
లవ్ టుడే మూవీతో తెలుగు వారికి దగ్గరైన యంగ్ హీరో ప్రదీప్‌రంగనాథన్. ఇటీవల డ్రాగన్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాకు కోలీవుడ్ డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్, కాయదు లోహర్ హీరోయిన్లుగా నటించారు. ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో కలెక్షన్లపరంగా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే రూ.50 కోట్ల మార్క్‌ను దాటేసింది.తాజాగా ఈ చిత్రం మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ మూవీ రిలీజైన పది రోజుల్లోనే వందకోట్ల మార్క్‌ను చేరుకుంది. ఈ విషయాన్ని హీరో ప్రదీప్ రంగనాథన్ ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా రూ.100 గ్రాస్ వసూళ్లు సాధించినట్లు పోస్టర్‌ను షేర్ చేశారు.డ్రాగన్ మూవీ కథేంటంటే..డి.రాఘవన్(ప్రదీప్ రంగనాథన్)(Pradeep Ranganathan) ఇంటర్మీడియట్లో 96 శాతం మార్కులతో పాస్ అయిన తర్వాత తాను ఇష్టపడిన అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. అయితే ఆమె తనకు బ్యాడ్ బాయ్స్ అంటేనే ఇష్టమని చెబుతూ అతని ప్రేమను రిజెక్ట్ చేస్తుంది. దీంతో రాఘవన్ బ్యాడ్ బాయ్‌గా మారిపోయి బీటెక్‌లో జాయిన్ అవుతాడు. కాలేజీలో అతనికి డ్రాగన్ అని పేరు పెడతారు. ప్రిన్సిపల్(మిస్కిన్)తో సహా ఫ్యాక్టల్లీ మొత్తానికి డ్రాగన్ అంటే నచ్చదు. 48 సబ్జెక్టుల్లో ఫెయిల్ అవుతాడు. రెండేళ్ల పాటు ఖాలీగా ఉండడంతో కాలేజీలో తనను ప్రేమించిన అమ్మాయి కీర్తి(అనుపమ పరమేశ్వరన్)(Ashwath Marimuthu) బ్రేకప్ చెప్పి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది.దీంతో జీవితంలో ఎలాగైన సక్సెస్ కావాలని ఫేక్ సర్టిఫికేట్స్ మంచి ఉద్యోగం సంపాదిస్తాడు. తనకున్న తెలివితో పెద్ద పొజిషియన్‌కి వెళ్తాడు. ఇల్లు, కారు కొంటాడు. బాగా ఆస్తులు ఉన్న అమ్మాయి పల్లవి (కయాదు లోహర్)తో పెళ్ళి కూడా ఫిక్స్ అవుతుంది. లైఫ్ అంతా సాఫీగా సాగుతున్న సమయంలో ఫేక్ సర్టిఫికెట్స్ గురించి ప్రిన్సిపల్‌కి తెలుస్తుంది. ఈ విషయం తాను ఉద్యోగం చేస్తున్న కంపెనీతో పాటు పిల్లనిచ్చి పెళ్లి చేయబోతున్న మామగారికి చెప్పకుండా ఉండాలంటే కాలేజీకి వచ్చి చదువుకొని పెండింగ్‌లో ఉన్న 48 సబ్జెక్టులు పాస్ అవ్వాలని కండీషన్ పెడతాడు. పరీక్షలకు మూడు నెలల సమయమే ఉంటుంది. దీంతో వేరే దారిలేక తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ కాలేజీకి వెళ్తాడు డ్రాగన్. ఆ తర్వాత ఏం జరిగింది? కాలేజీకి మళ్లీ కీర్తి ఎందుకు వచ్చింది? ఆఫీస్‌లో,ఇంట్లో అబద్దం చెప్పి కాలేజీకి వచ్చిన డ్రాగన్‌కి ఎదురైన సమస్యలు ఏంటి? నిజంగానే 48 సబ్జెక్టుల్లో పాస్ అయ్యాడా? లేదా? పల్లవితో పెళ్లి జరిగిందా? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.#Dragon crosses 100crs pic.twitter.com/RVvQetBy2u— Pradeep Ranganathan (@pradeeponelife) March 2, 2025 -
International Women's Day: సినీ మేడమ్స్
కథానాయికలు(Actress) కనిపిస్తేనే వెండితెరకు నిండుదనం. సినిమాల ఘనవిజయాల్లో వారి పాత్ర గణనీయం దర్శకత్వం, రచన, నిర్మాణ నిర్వహణ, సినిమాటోగ్రఫీ.. వంటి తెరవెనుక పాత్రల్లోనూ కొందరు మహిళలు రాణిస్తున్నారు. తెరపైనా, తెరవెనుకా రాణించే సినీ మేడమ్స్ ముచ్చట్లు.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం(International Women's Day) సందర్భంగా...దీపిక కొండిమన సమాజంలో పురుషాధిక్యత, లింగ వివక్ష, అసమానతలు వంటి రకరకాల అవరోధాలు మహిళల అభివృద్ధికి సవాలుగా నిలుస్తున్నాయి. ఈ సమస్యలు అన్ని రంగాల్లోనూ ఉన్నాయి. వెండితెరపై కథానాయికలుగా మహిళలు వెలుగొందే సినీరంగం కూడా ఈ సామాజిక రుగ్మతలకు అతీతం కాదు. ఎన్ని సమస్యలు ఉన్నా, ఏటికి ఎదురీదుతూ ఎప్పటికప్పుడు తమ సత్తా చాటుకుంటున్న మహిళలు కూడా సినీరంగంలో ఉన్నారు. వారే నేటితరాలకు స్ఫూర్తి ప్రదాతలు. తాజాగా ఆర్మాక్స్ మీడియా భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని మహిళా ప్రాతినిధ్యంపై ఓ వుమానియా! 2024 నివేదిక విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, సినిమాలను ప్రేమించి, సినిమాల కోసం పనిచేసే సినీ మేడమ్స్ గురించిన ప్రత్యేక కథనం..‘ఓ వుమానియా!’... భారతీయ చలన చిత్రపరిశ్రమలోని మహిళా ప్రాతినిధ్యంపై వెలువడిన నివేదిక. గత నాలుగేళ్లుగా ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ ‘ఆర్మాక్స్ మీడియా’ ఏటా ఈ నివేదికను విడుదల చేస్తూ వస్తోంది. ఈ నివేదికను ఫిల్మ్ కంపానియన్ స్టూడియోస్ వీడియో రూపంలో నిర్మించగా, ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ‘అమెజాన్ ప్రైమ్’ విడుదల చేసింది. తాజాగా ‘ఓ ఉమానియా–2024’ నివేదిక ప్రస్తుత ధోరణులపై మరింత లోతైన వివరాలను అందించింది. సినిమా నిర్మాణం, సినీ నిర్మాణ సంస్థల్లోని కార్పొరేట్ నాయకత్వం, మార్కెటింగ్ వంటి కీలక రంగాలలో మహిళా ప్రాతినిధ్యంలోని అసమానతలను గుర్తించింది.2023లో మొత్తం తొమ్మిది (తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, పంజాబీ, బెంగాలీ, గుజరాతీ) భారతీయ భాషలలో విడుదల చేసిన 169 సినిమాలు, సిరీస్‌లను విశ్లేషించింది. వీటిని మళ్లీ థియేట్రికల్ సినిమాలు (70), డిజిటల్ స్ట్రీమింగ్ సినిమాలు (30), సిరీస్(69)లుగా విభజించింది.ఇందులో మన దక్షిణాది నుంచి లియో, జవాన్, ఆదిపురుష్, వాల్తేరు వీరయ్య, పొన్నియిన్ సెల్వన్ 2, భగవంత్ కేసరి, 2018, దసరా, విరూపాక్ష, సార్, హాయ్ నాన్న, భోళాశంకర్, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి, ఇంటింటి రామాయణం సహా పలు సినిమాలు ఎంపికయ్యాయి. బాలీవుడ్ నుంచి జైలర్, ఓ మై డాడ్ 2, మిషన్ మజ్ను, ది ఆర్చీస్, లస్ట్ స్టోరీస్ 2 వంటి పలు చిత్రాలున్నాయి. స్వీట్ కారం కాఫీ, మోడర్న్ లవ్ చెన్నై, షైతాన్, దూత, సేవ్ ది టైగర్స్, కుమారి శ్రీమతి సిరీస్‌లు సిరీస్ విభాగంలో సెలెక్ట్ అయి, మంచి మార్కులు సాధించాయి. ట్రైలర్ టాక్‌టైమ్‘ఓ వుమానియా’ నివేదిక ప్రకారం, మహిళలు ట్రైలర్లలో 29 శాతం టాక్‌టైమ్‌కు పరిమితమయ్యారు. గత రెండేళ్లలో ఇది నామమాత్రంగా పెరిగినప్పటికీ, ఓటీటీ స్ట్రీమింగ్ (OTT Streaming) సినిమాలు ప్రమోషనల్ ట్రైలర్లలో మహిళలకు ఎక్కువ టాక్‌టైమ్ కేటాయించే ధోరణిని చూపిస్తున్నాయి. వీటిల్లో కొన్ని 55 శాతం ట్రైలర్ టాక్‌టైమ్‌తో అగ్రస్థానంలో ఉన్నాయి.తెలుగు: బూ, హాయ్ నాన్న; హిందీ: మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2, వెడ్డింగ్.కాన్, సాస్ బహు ఔర్ ఫ్లెమింగో, జానే జాన్, రెయిన్బో రిష్ట, తాలీ; మరాఠీ: జిమ్మ; తమిళం: స్వీట్ కారమ్ కాఫీపాత బెచ్‌డెల్ పరీక్షసినిమాల్లో స్త్రీలను ఎలా ప్రదర్శిస్తున్నారో కొలిచే కొలమానం ‘బెచ్‌డెల్’ పరీక్ష. దీనిని 1985లో కార్టూనిస్ట్ అలిసన్ బెచ్‌డెల్ రూపొందించారు. అప్పటి నుంచి దశాబ్దాలుగా ఈ పరీక్షను చిత్రపరిశ్రమలో లింగవివక్షపై అంతర్జాతీయ కొలమానంగా పరిగణించారు. ఒక సినిమాలో కనీసం ప్రతి రెండు సన్నివేశాల్లో ఇద్దరు పేరున్న మహిళలు మాట్లాడుతుంటే, ఆ సినిమా బెచ్‌డెల్ టెస్ట్‌లో నెగ్గినట్లు పరిగణిస్తారు. అయితే, సినిమాల కంటే సిరీస్‌లకు ఎక్కువ రన్‌టైమ్ ఉంటుంది. కాబట్టి దానిని దృష్టిలో ఉంచుకొని, ఆ ప్రమాణాన్ని ప్రస్తుతం సిరీస్‌లకు రెండు నుంచి మూడు సన్నివేశాలుగా మార్చారు.నవరత్నాలుచలనచిత్ర పరిశ్రమలోని మొత్తం తొమ్మిది విభాగాల్లో పనిచేసే మహిళల స్థితిగతులను ఈ నివేదిక విశ్లేషించింది. దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, రైటింగ్, ప్రొడక్షన్, డిజైనింగ్, సంగీతం వంటి కీలక విభాగాలలో 15 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు. దీన్ని ఓటీటీ, థియేట్రికల్‌గా విభజిస్తే థియేట్రికల్‌కు 6 శాతం మాత్రమే! దక్షిణాదిలో ఈ సంఖ్య చాలా తక్కువ. గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య ఒక శాతం తగ్గింది. ఓటీటీలో మాత్రం పరిస్థితి మెరుగ్గా ఉంది. స్ట్రీమింగ్ సినిమాలు, సిరీస్ రెండింటిలోనూ 20 శాతం కంటే ఎక్కువ స్థానాల్లో మహిళలు నాయకత్వం వహిస్తున్నారు. 18 శాతం కంటే ఎక్కువగా మహిళా నాయకత్వం ఉన్న విభాగాలలో ఎడిటింగ్ ముందంజలో ఉంది. డైరెక్టర్ స్థానాల్లో 8 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు, గత సంవత్సరంతో పోలిస్తే ఇది కొంచెం తగ్గింది.టూల్‌కిట్ టెస్ట్నాలుగు భిన్నమైన ప్రశ్నలతో తయారుచేసిన ఒక టూల్‌కిట్‌ను కూడా ఈ నివేదిక విడుదల చేసింది. ఈ టూల్‌కిట్ ఆధారంగా విశ్లేషించిన స్ట్రీమింగ్ సినిమాల్లో కేవలం 31శాతం మాత్రమే లింగ సమానత్వ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాయి. వీటిలో సిరీస్‌లు ముందంజలో ఉన్నాయి, వాటిలో 45 శాతం పరీక్షలో ఉత్తీర్ణత సాధించాయి. సినిమాలు, సిరీస్‌లు తదితరమైన వాటి నిర్మాణంలో వివిధ విభాగాలకు మహిళలు నాయకత్వం వహించినప్పుడు వాటిలో మహిళలకు సముచిత ప్రాతినిధ్యం లభించిందని, అవి బాగా విజయవంతమయ్యాయని ఈ నివేదిక వెల్లడించింది. థియేట్రికల్ సినిమాల్లో 18 శాతం మాత్రమే మహిళల నాయకత్వంలో రూపొందాయి.మహిళల ప్రాతినిధ్యంపై ప్రశ్నావళిపురుషులు లేని సంభాషణ, డైలాగ్ కనీసం ఒకటైనా ఉందా? కథానాయకుడితో ప్రేమ లేదా కుటుంబ సంబంధం లేని పాత్రను పోషించిన ఒక మహిళా పాత్ర ఉందా?2. షో/సినిమా కథకు కీలకమైన ఆర్థిక, గృహసంబంధ, సామాజిక నిర్ణయాలను తీసుకోవడంలో, కనీసం ఒక్కరైనా చురుకైన మహిళ పాత్రను పోషిస్తున్నారా? కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలు, సిరీస్‌లలో పురుష పాత్రలపై వ్యతిరేక దృక్పథాన్ని వ్యక్తపరచే అంశం ఉందా?షో/సినిమా స్త్రీలను లైంగికంగా చిత్రీకరించడం లేదా మహిళలపై హింసను సాధారణంగా లేదా ఆమోదయోగ్యంగా చిత్రీకరిస్తుందా?మొదటి మూడు ప్రశ్నలకు సానుకూల సమాధానం ‘అవును’, అయితే నాల్గవ ప్రశ్నకు అది ‘లేదు’ అని సమాధానాలు వచ్చినట్లయితేనే, తమ సినిమాలో లేదా సిరీస్‌లో మహిళలకు సముచిత ప్రాతినిధ్యం దక్కుతున్నట్లు నిర్మాతలు ఎవరికి వారే తేల్చుకోవచ్చు. అందుకు ఈ ప్రశ్నావళి ఉపయోగపడుతుంది.మహిళా జట్టు సినిమాల హిట్టుపూర్తి మహిళా బృందంతో చిత్రీకరించిన తొలిచిత్రం ‘ది మైడెన్’. 2018లో అలెక్స్ హూమ్స్ రచించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాను విక్టోరియా గ్రెగరీ ‘న్యూ బ్లాక్ ఫిల్మ్స్’ నిర్మించింది. ఇందులో ఒక అమ్మాయి సెకండ్ హ్యాండ్ నౌకను కొని, నౌకాయానం నేర్చుకొని, రేసులో ఎలా గెలుస్తుందో చూపించారు. ఇదేవిధంగా మహిళలు ప్రధానంగా, ఎక్కువ సంఖ్యలో ఉండి ఎన్నో సినిమాలు తీశారు. వాటిల్లో ముఖ్యమైనవి, చెప్పుకోదగినవి ‘ది వుమెన్’. 1939లో విడుదలైన ఈ సినిమాలో ఒక్క పురుషుడు కూడా కనిపించడు. మొత్తం 130 మంది మహిళలు ఇందులో నటించారు.అలాగే ‘స్టీల్ మాగ్నోలియాస్’ సినిమాలో లూసియానా పట్టణంలోని ఒక స్త్రీల బృందం జీవితం, ప్రేమను చూపిస్తుంది. ‘ఎ లీగ్ ఆఫ్ దేర్ ఓన్’ ఇదొక బేస్‌బాల్ బృందం కథ. తక్కువ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఎంతోమంది చేత కంటతడి పెట్టిస్తుంది. 1993లో విడుదలైన ‘ది జాయ్ లక్ క్లబ్’ సినిమా చైనీస్ మహిళల వలసలు, తల్లుల మధ్య సంబంధాలను అద్భుతంగా చిత్రీకరించింది. 2018లో విడుదలైన ‘ఓసెన్స్ 8’ చిత్రం, మహిళలు దోపిడీలు చేస్తే ఎలా ఉంటుందో కాస్త నవ్విస్తూనే అందరినీ ఆశ్చర్యపరచేలా చూపించింది.తెలుగు తెర మెరుపులు..మహానటి సావిత్రిమహానటి సావిత్రి గొప్ప నటిగానే కాకుండా, దర్శకురాలిగానూ పేరు సంపాదించుకున్నారు. హీరోయిన్గా కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ఆమె దర్శకత్వంలో ప్రయోగం చేశారు. సావిత్రి దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘చిన్నారి పాపలు’. 1968లో ‘శ్రీమాతా పిక్చర్స్’ నిర్మాణ సంస్థ విడుదల చేసిన ఈ చిత్రానికి సావిత్రి స్వయంగా కథారచన చేశారు. వాణిజ్యపరంగా ఇది విఫలమైనప్పటికీ, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ‘మాతృదేవత’, ‘వింత సంసారం’ వంటి సినిమాలకు కూడా ఆమె దర్శకత్వం వహించారు. బహుముఖ ప్రజ్ఞశాలి భానుమతి తెరపై కథానాయికగానే కాదు, తెర వెనుక అనేక విభాగాల్లోనూ పనిచేసిన నటి భానుమతి రామకృష్ణ. ‘చండీరాణి’ సినిమాతో డైరెక్టర్‌గా మారిన ఆమె, ‘నాలో నేను’ అనే పుస్తకంతో పాటు, మరెన్నో పాటలకు రచన, గాత్రం అందించారు. భర్త రామకృష్ణతో కలసి చిత్ర నిర్మాణంలోనూ పాలు పంచుకున్నారు. కళారంగంలో ఆమె చేసిన కృషికి జాతీయ చలనచిత్ర అవార్డుతోపాటు, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను అందుకున్నారు. రికార్డు నెలకొల్పిన విజయనిర్మల సినీ ప్రపంచంలోకి ఒంటరిగా అడుగుపెట్టి, తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మహిళ విజయనిర్మల. కేవలం నటిగానే కాదు, నిర్మాతగా, దర్శకురాలిగా వెండితెరపై తన పేరుకు తగ్గట్లుగానే ఎన్నో విజయాలు సాధించారు. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్ట్స్‌లో స్థానం సంపాదించుకున్నారు. సినీ సీతమ్మ అంజలీదేవిసీతాదేవి అనగానే ఠక్కుమని గుర్తొచ్చే నటి అంజలీదేవి. అభినయ సీతమ్మగా పాపులర్ అయిన ఆమె నటిగా, డ్యాన్సర్‌గానే కాదు, నిర్మాతగానూ చేశారు. తన భర్త ఆదినారాయణరావుతో కలసి నెలకొల్పిన ‘అంజలీ పిక్చర్స్’ నిర్మాణ సంస్థ ద్వారా ‘భక్త తుకారం’, ‘చండీప్రియ’ సహా మొత్తం 27 సినిమాలను నిర్మించారు. కృష్ణవేణి ఎన్టీఆర్‌లాంటి మహానటుడిని చిత్రసీమకు పరిచయం చేసిన, ప్రముఖ నిర్మాత చిత్తజల్లు కృష్ణవేణి బాలనటిగా రంగప్రవేశం చేశారు. ఇటీవల మరణించిన ఆమె, మీర్జాపురం రాజావారితో వివాహం అనంతరం ‘జయా పిక్చర్స్’ బాధ్యతలనూ తీసుకున్నారు. తర్వాత ‘శోభనాచల స్టూడియోస్’గా పేరు మార్చి ఎన్నో చిత్రాలను నిర్మించారు. ఆమె కుమార్తె అనురాధ కూడా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 17 సినిమాలు నిర్మించి, అత్యధిక చిత్రాలను నిర్మించిన మహిళా నిర్మాతగా లిమ్కా బుక్ రికార్డ్స్ సాధించారు. కృష్ణవేణి తన 98 ఏళ్ల వయసులో 2022లో ‘సాక్షి ఎక్సలెన్స్’ అవార్డుల్లో భాగంగా ‘జీవిత సాఫల్య పురస్కారం’ అందుకున్నారు. మరెందరో!నటి జీవితా రాజశేఖర్ ‘శేషు’ సినిమాతో దర్శకురాలిగా మారి, ‘సత్యమేవజయతే’, ‘మహంకాళి’ వంటి సినిమాలను రూపొందించారు. సూపర్‌స్టార్ కృష్ణ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంజుల ఘట్టమనేని ‘మనసుకు నచ్చింది’ సినిమాకు దర్శకత్వం వహించారు. మరెన్నో సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. తొలి చిత్రం ‘ఆంధ్రా అందగాడు’ సినిమాతో విమర్శలు అందుకున్న సుధ కొంగర, తాజాగా ఆకాశమే హద్దు అనిపించారు.‘ద్రోహి’, ‘గురు’ చిత్రాలతో పాటు, ‘ఆకాశమే నీ హద్దు రా’ సినిమాతో వరుస విజయాలు అందుకున్నారు. ‘అలా మొదలైంది’ చిత్రంతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన నందినిరెడ్డి, ‘కళ్యాణ వైభోగమే’, ‘ఓ బేబీ’ మరెన్నో విజయవంతమైన చిత్రాలను చిత్రీకరించారు. దశాబ్దంపాటు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచే సి, తొలిచిత్రం ‘పెళ్లి సందడి’తో విజయం సాధించారు డైరెక్టర్ గౌరీ రోణంకి. నిర్మాణ రారాణులుసినీ ప్రపంచంలో నిర్మాతలుగా రాణిస్తున్న రాణులు కూడా లేకపోలేదు. దిల్‌రాజు కుమార్తె హన్షితా రెడ్డి, తండ్రి బాటలోనే సుమారు 50కి పైగా సినిమాలు నిర్మించారు. మెగా కుటుంబం నుంచి వచ్చిన నిహారిక కొణిదెల కూడా ఇటు ప్రొడక్షన్ రంగంలో గుర్తింపు తెచ్చుకున్నారు. పలు వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్స్ నిర్మించారు. చిన్న సినిమాలే కాదు, భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించారు, నిర్మాత అశ్వనీ దత్ కూతుర్లు అయిన స్వప్న దత్, ప్రియాంక దత్. అన్నపూర్ణ స్టూడియోస్ సీఈఓ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుప్రియ యార్లగడ్డ కూడా ఎన్నో చిత్రాలను నిర్మించింది. వీరితో పాటు నటి సమంత ‘ట్రలాలా మూవింగ్ పిక్చర్స్’ , నయనతార ‘రౌడీ పిక్చర్స్’, జ్యోతికలు వివిధ ప్రొడక్షన్ హౌస్‌లు స్థాపించి, తమదైన రీతిలో రాణిస్తున్నారు. చిత్రపరిశ్రమలో వైవిధ్యం, స్త్రీ పురుష సమానత్వం ఉన్నట్లయితే, సమాజంలో సానుకూల మార్పులకు అవి దోహదపడతాయి. వినోదరంగంలో మహిళలకు మరిన్ని అవకాశాలను సృష్టిస్తూ, వైవిధ్యభరితమైన, సమ్మిళితమైన, సమానమైన పరిస్థితులను కల్పించాలి. ప్రతి ఒక్కరూ స్త్రీలను చూసేలా, వినగలిగేలా, సానుకూలంగా చెప్పుకునేలా చేయాలి. అప్పుడే సినిమా బతుకుతూ, మరెందరినో బతికిస్తుంది. -
పాటలపై హక్కులెవరికి..?
సినిమా పాటల హక్కులు ఎవరివి అనే వివాదం చాలాకాలంగా చిత్ర పరిశ్రమలో నడుస్తోంది. సంగీతదర్శకుడు ఇళయరాజా ‘నా పాటపై హక్కు నాదే’ అంటుంటారు. కొందరు గాయనీగాయకులు తమకు రాయల్టీ రావాలంటున్నారు. కొందరైతే నిర్మాతలకే హక్కు అంటున్నారు. ఈ విషయంపై చెన్నైకి చెందిన ఇంటర్నేషనల్ ట్రేడ్ మార్క్ అసోసియేషన్ సహకారంతో క్రియాలా, ఐపీ అండ్ మ్యూజిక్ సంస్థలు శనివారం చెన్నైలో సదస్సు నిర్వహించాయి. ఈ సదస్సులో నిర్మాత ధనుంజయన్, థింక్ మ్యూజిక్ ఇండియా సంతోష్, గాయకుడు హరిచరణ్ శ్రీనివాస్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. కాగా సినిమా పాటలు అనేక మాధ్యమాల ద్వారా సంగీత ప్రియులను అలరిస్తున్నాయి. అసలు వీటి హక్కులు ఎవరికి చెందుతాయి? అనే విషయం గురించి క్రియాలా సంస్థ నిర్వాహకుడు, న్యాయవాది ఎంఎస్. భరత్ మీడియా సమావేశంలో వివరిస్తూ... ఒక పాట రూపొందాలంటే సంగీత దర్ళకుడు, గీత రచయిత, గాయకుడు, సౌండ్ ఇంజినీర్.. ఇలా పలువురి కృషి ఉంటుందన్నారు. అయితే వీటన్నింటికీ మూలం నిర్మాత అనీ, ఆయన పెట్టుబడితోనే పాట రూపొందుతోందనీ, పాటలకు మొదటి హక్కుదారుడు నిర్మాతనే అని అన్నారు. ఒకవేళ ఒప్పందం ఉంటే, అందులోని నిబంధనల ప్రకారం హక్కులు వర్తిస్తాయన్నారు. ఎలాంటి ఒప్పందం లేకపోతే పాటల హక్కులు నిర్మాతకే ఉంటాయన్నారు. ఒకవేళ చిత్ర నిర్మాత కన్నుమూస్తే, ఆయన కుటుంబ సభ్యులకే హక్కులు చెందుతాయని భరత్ పేర్కొన్నారు. – ‘సాక్షి’ చెన్నై, తమిళ సినిమా -
విడాకుల తర్వాత పరిచయం.. పిల్లలు ఎందుకు లేరంటే?: నటి సీత
మొండిమొగుడు పెంకి పెళ్లాం, వజ్రం, రావణ బ్రహ్మ.. ఇలా ఎన్నో చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా యాక్ట్ చేసింది నటి సీత (Actress Seetha). తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో కలిపి దాదాపు 60 సినిమాలు చేసింది. ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్‌లో అమ్మ, అత్త పాత్రలు పోషిస్తోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాలు వెల్లడించింది. సీత మాట్లాడుతూ.. మూడేళ్ల వయసు నుంచే యాక్టింగ్ చేస్తున్నాను. బాల్యంలో చాలా సినిమాలు చేశాను. పెద్దయ్యాక తెలుగులో కంటే మలయాళంలో ఎక్కువ సినిమాలు చేశాను. ఇప్పుడు సీరియల్స్‌లో బిజీ అవడంతో సినిమాలు చేయట్లేదు.చిన్నప్పుడే నాన్న మరణం..నా వ్యక్తిగత విషయానికి వస్తే చిన్నప్పుడే నాన్న చనిపోయాడు. అమ్మ నాతోపాటు షూటింగ్స్‌కు వచ్చేది. ఒకసారి విపరీతంగా దగ్గుతుంటే హాస్పిటల్‌కు తీసుకెళ్లాను. అప్పుడు తనకు క్యాన్సర్ నాలుగో స్టేజీ అని తెలిసింది. రెండు నెలలకంటే ఎక్కువ బతకదని చెప్పారు. ఆమెను బతికించమని దేవుళ్లను వేడుకున్నా.. కానీ ఫలితం లేకుండా పోయింది. అప్పటినుంచి నాకు దేవుడంటేనే నమ్మకం పోయింది. (చదవండి: రీఎంట్రీకి సిద్ధమైన స్టార్ హీరోయిన్ రంభ.. ఈసారైనా..?)మొదటి భర్తతో విడాకులునాకు గతంలో పెళ్లయి విడాకులు కూడా అయిపోయాయి. వేరే మతానికి చెందిన వ్యక్తిని రెండో పెళ్లి చేసుకున్నా.. ఆయనక్కూడా ఇది రెండోదే! మొదటి వైవాహిక బంధంలో భర్తతో ఎక్కువగా కలిసుండలేదు. ఎప్పుడూ పుట్టింట్లోనే ఉండేదాన్ని. ఏదైనా తప్పు జరిగుంటే విడాకులవుతాయి. కానీ నేను ఏ తప్పూ చేయలేదు. అయినా అలాంటి పరిస్థితి వచ్చింది. 2013లో విడాకులయ్యాయి. తర్వాత నా స్కూల్‌మేట్ పరిచయమయ్యాడు. 2018లో అతడిని పెళ్లి చేసుకున్నాను. గర్భాశయం తీసేశారుపిల్లలు ఎందుకు లేరంటే నాకు గర్భాశయంలో కణతులు (ఫైబ్రాయిడ్స్) ఏర్పడ్డాయి. మొదటి భర్తతో ఉన్నప్పుడే ఈ సమస్య తెలిసింది. టాబ్లెట్స్ వేసుకుంటే కరిగిపోతుందన్నారు. కానీ అప్పటి గొడవల వల్ల పెద్దగా పట్టించుకోలేదు. తీరా రెండో పెళ్లయ్యాక ఆ కణతుల పరిమాణం పెరిగిపోయింది. ఆ గడ్డ వల్ల వేరే సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరించారు. అప్పటికే రెండుసార్లు అబార్షన్ అయింది. దాంతో నేను గర్భాశయాన్నే తొలగించుకోవాల్సి వచ్చింది. అందుకే మాకు పిల్లలు లేరు. అని నటి సీత చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కార్తీకదీపం 2 సీరియల్లో యాక్ట్ చేస్తోంది.చదవండి: తండ్రితో పోటీపడిన బుడ్డోడు.. ఇప్పుడెలా మారిపోయాడో చూశారా?! -
నా భార్యకు వీడియోలు పంపుతున్నారు.. అవి డిలీట్ చేయండి: అనిల్
వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). ఆయన దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam Movie) రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రం నేడు ఓటీటీలో, టీవీలో ఒకేసారి ముందుకు వచ్చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అనిల్ రావిపూడి భవిష్యత్తులో కుదిరితే హీరోగా సినిమా చేస్తానన్నాడు. ఆ సినిమాకు హీరోయిన్గా మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)ని తీసుకోండి, మీ ఇద్దరి కెమిస్ట్రీ బాగుంటుందని యాంకర్ అనడంతో అతడు ఆశ్చర్యపోయాడు.దారుణమైన కథలు ప్రచారం..ఆ కామెంట్‌కు అనిల్ స్పందిస్తూ.. మా మధ్య కెమిస్ట్రీలు, ఫిజిక్స్‌లు ఏం లేవు. ఇప్పటికే మా గురించి యూట్యూబ్‌లో రకరకాలుగా రాస్తున్నారు. నాయనా.. నేనేదో ప్రశాంతంగా సినిమాలు తీసుకుంటున్నాను. వీళ్లేమో యూట్యూబ్‌లో వాయిస్ ఓవర్‌తో ఘోరమైన కథలు ప్రచారం చేస్తున్నారు. ఆ వీడియోలు నా భార్యకు, కుటుంబానికి వాట్సాప్‌లో పంపిస్తున్నారు. నా గురించి ఏ స్టోరీలు రాయకండ్రా బాబూ.. దీనిపై సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశాను.ఎలాంటి కెమిస్ట్రీ లేదుమర్యాదగా ఆ వీడియోలు యూట్యూబ్‌లో నుంచి తీసేయండి. లేదంటే మిమ్మల్ని బ్లాక్ చేస్తారు. నాకెటువంటి కెమిస్ట్రీలు లేవు. నా గురించే కాదు చాలామంది గురించి ఇలాగే కథలు అల్లుతున్నారు. వ్యూస్ కోసం లేని కథను అందమైన వాయిస్ ఓవర్‌తో రిలీజ్ చేస్తున్నారు. చాలామంది అది నిజమని నమ్ముతున్నారు. దానివల్ల చాలామంది వ్యక్తిగతంగా ఇబ్బందిపడుతున్నారు. లేనిపోనివి రాయకండి అని అనిల్ రావిపూడి కోరాడు.చదవండి: సంజయ్-నమ్రత సినిమా.. రెండు పెగ్గులేసి వెళ్లా: డైరెక్టర్ -
సౌత్‌లో ఇదే పెద్ద సమస్య.. ఎప్పుడూ పోరాడుతూనే ఉండాలి: జ్యోతిక
చాలామంది డైరెక్టర్లు హీరోల కోసమే కథలు రాసుకుంటారు అంటోంది హీరోయిన్ జ్యోతిక (Jyotika). హీరోయిన్ల కోసం ప్రత్యేకంగా కథలు రాసుకునేవారు ఎంతమంది ఉన్నారని పెదవి విరిచింది. జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ డబ్బా కార్టెల్. ఫిబ్రవరి 28న ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. డబ్బా కార్టెల్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా జ్యోతిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వయసైపోయినవారిని హీరోలుగా జనాలు ఒప్పుకుంటారు. కానీ హీరోయిన్ల ఏజ్ పెరిగితే మాత్రం అస్సలు యాక్సెప్ట్ చేయరు.. నిజమేనా? అని అడుగుతుంటారు.వయసు అడ్డుగోడఇది చాలా పెద్ద ప్రశ్న.. నా విషయానికి వస్తే 28 ఏళ్ల వయసులో నాకు పిల్లలు పుట్టారు. ఆ తర్వాతే నేను విభిన్న పాత్రలు చేసుకుంటూ వస్తున్నాను. అయితే స్టార్ హీరోలతో కలిసి నటించలేదనుకుంటాను. ఇక్కడ వయసును పరిగణనలోకి తీసుకుంటారు. సౌత్‌లోని అన్ని ఇండస్ట్రీల గురించి నేను చెప్పలేను కానీ తమిళ ఇండస్ట్రీలో మాత్రం వయసును ఒక అడ్డుగోడగా చూస్తారు. అలాంటప్పుడు మనమే కొత్త దర్శకులతో పని చేస్తూ మన కెరీర్‌ను నిర్మించుకోవాల్సి ఉంటుంది. అదే పెద్ద సమస్యమహిళా ప్రధాన సినిమాలు, కథలు తెరకెక్కించేందుకు కె. బాలచందర్ వంటి దర్శకులు ఇప్పుడు లేరు. ఇప్పుడున్న పెద్ద డైరెక్టర్లందరూ పెద్ద హీరోల కోసం కథలు రాసే పనిలోనే బిజీగా ఉన్నారు. మహిళా నటిని దృష్టిలో పెట్టుకుని సినిమా తీసిన పెద్ద దర్శకుడు ఇటీవలి కాలంలో ఎవరున్నారు చెప్పండి? అదే మనం కోల్పోతున్నాం. లేడీ ఓరియంటెడ్ అనగానే బడ్జెట్ కూడా కుదించేస్తారు. వయసు పెరిగితే పరిగణనలోకి తీసుకోరు.. ఇది ఇంకో సమస్య! సౌత్‌లో నటిగా రాణించడం చాలా కష్టం. ఎప్పుడూ ఒంటరి పోరాటం చేస్తూనే ఉండాలి అని చెప్పుకొచ్చింది.లవ్.. సినిమాజ్యోతిక.. 'డోలీ సజా కె రఖనా' అనే హిందీ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. వాలి చిత్రంతో తమిళంలో ఎంట్రీ ఇచ్చింది. పూవెల్లమ్ కెట్టుప్పర్, ఖుషి, రిథమ్, దం దం దం, పూవెల్లం ఉన్ వాసం. ఖాకా ఖాకా, ధూల్, మన్మధన్.. ఇలా పలు చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. ఠాగూర్, చంద్రముఖి, మాస్ సినిమాలతో తెలుగువారికీ పరిచయమైంది. హీరో సూర్య (Suriya)తో ఏడు సినిమాల్లో నటించింది. ఆ సమయంలో సూర్యతో ప్రేమలో పడ్డ జ్యోతిక 2006లో అతడ్ని పెళ్లి చేసుకుంది. వీరికి కూతురు దియా, కుమారుడు దేవ్ సంతానం.చదవండి: జనరేటర్ లో పంచదార గొడవపై ప్రశ్న.. విష్ణు ఏమన్నాడంటే? -
మరో లక్కీ ఛాన్స్ కొట్టేసిన ప్రేమలు బ్యూటీ!
ఒక్క సక్సెస్ కోసం పోరాడితే చాలు. ఆ తరువాత అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఇది అందరికీ జరగకపోయినా, చాలా మంది విషయంలో జరిగేది ఇదే. నటి మమిత బైజు(Mamitha Baiju ) ఇందుకు ఒక ఉదాహరణ. ప్రేమలు అనే మలయాళం చిత్రంతో మాలీవుడ్‌నే కాకుండా టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులను మైమరిపించిన కథానాయకి ఈ బ్యూటీ. ఆ తరువాత మాతృభాషలోనే కాకుండా ఇతర భాషల్లోనూ అవకాశాలు తలుపు తడుతున్నాయి. అలా తమిళంలో జీవీ ప్రకాశ్ కుమార్‌కు జంటగా రెబల్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా ఇక్కడ మరిన్ని అవకాశాలు అందుకుంటున్నారు. అలా రెండో అవకాశమే దళపతి విజయ్‌తో కలిసి నటించే అవకాశం వచ్చింది. అదీ ఆయన నటిస్తున్న చివరి చిత్రం జననాయకన్లో కావడం విశేషం. ఇందులో చాలా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అదే లక్కు అనుకుంటే తాజాగా మరో క్రేజీ అవకాశం ఈమెను వరించింది. అవును దర్శకుడు, కథానాయకుడిగా వరుసగా విజయాలను అందుకుంటున్న నటుడు ప్రదీప్ రంగనాథన్ తదుపరి చిత్రంలో కథానాయికిగా మమిత బైజూ నటించబోతున్నారన్నది తాజా సమాచారం. ఈ చిత్రం ద్వారా దర్శకురాలు సుధా కొంగర శిష్యుడు కీర్తీశ్వరన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారని తెలిసింది. ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే పూర్తి వివరాలతో వెలువడే అవకాశం ఉంది. మొత్తం మీద డ్రాగన్ చిత్రంతో పెద్ద విజయాన్ని అందుకున్న నటుడు ప్రదీప్ రంగనాథన్‌తో జత కట్టే అవకాశాన్ని దక్కించుకున్న నటి మమిత బైజు నిజంగా లక్కీనే. -
అగాథియా నిరుత్సాహపరచదు: జీవా
‘‘అగాథియా’(Agathiya) వైవిధ్యమైన చిత్రం. హారర్ అంశాలతో పాటు తల్లి సెంటిమెంట్, దేశభక్తి వంటి అంశాలు కూడా ఉంటాయి. ప్రేక్షకులు సరికొత్త అనుభూతిని పొందుతారు. వారిని మా సినిమా నిరుత్సాహపరచదు’’ అని జీవా తెలిపారు. ప్రముఖ పాటల రచయిత పా.విజయ్ కథ అందించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘అగాథియా’. జీవా, రాశీఖన్నా జంటగా, అర్జున్ సర్జా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘అగాథియా’.వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి కె.గణేష్, అనీష్ అర్జున్ దేవ్ నిర్మించిన ఈ మూవీ తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఫిబ్రవరి 28న విడుదలైంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో జీవా విలేకరులతో మాట్లాడుతూ–‘‘మూడేళ్ల ప్రయాణం ‘అగాథియా’. ఎంతో కష్టపడి భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తీశాం. నా పాత్రతో పాటు అర్జున్ సర్, రాశీఖన్నా, ఎడ్వర్డ్ సోన్నెన్‌బ్లిక్... ఇలా అందరి పాత్రలను విజయ్‌గారు అద్భుతంగా తెరపై ఆవిష్కరించారు.కంప్యూటర్ గ్రాఫిక్స్ కోసం చాలా రోజులు పట్టింది. యువన్ శంకర్ రాజాగారితో నా మూడో సినిమా ఇది. ఈ చిత్రం కోసం అద్భుతమైన మ్యూజిక్, నేపథ్య సంగీతం ఇచ్చారాయన. దీపక్ కుమార్ పాడి విజువల్స్ సినిమాకి ప్లస్. ‘రంగం’ సినిమా నుంచి నన్ను ఎంతో ఆదరిస్తున్న తెలుగు వారికి థ్యాంక్స్. నేను నటించిన స్ట్రైట్ తెలుగు చిత్రం ‘యాత్ర 2’కి నటుడిగా మంచి పేరొచ్చింది. తెలుగులో నేరుగా మరో సినిమా చేయాలని నాకూ ఉంది. రచయితలు, దర్శకులు నా కోసం కథ సిద్ధం చేస్తే నేను రెడీ. ప్రస్తుతానికి నా దృష్టి సినిమాలపైనే ఉంది. రాజకీయాల ఆలోచన లేదు’’ అని తెలిపారు. -
అజిత్ యాక్షన్ థ్రిల్లర్.. గుడ్ బ్యాడ్ అగ్లీ టీజర్ రిలీజ్
కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. ఈ మూవీలో త్రిష హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాను మార్క్ ఆంటోని ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీమూవీమేకర్స్ బ్యానర్లో నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉన్నా అలా జరగలేదు. దీంతో వేసవిలో థియేటర్లలో సందడి చేయనుంది.ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. టీజర్లో అజిత్ యాక్షన్ సన్నివేశాలు ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి. అజిత్‌పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉన్నట్లు అర్థమవుతోంది. ఈ చిత్రంలో సునీల్, ప్రసన్న కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతం అందించారు.అజిత్ కుమార్ ఇటీవల విదాముయార్చి మూవీతో ప్రేక్షకులను పలకరించారు. తెలుగులో పట్టుదల పేరుతో ఈ సినిమా విడుదలైంది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊహించినంత స్థాయిలో రాణించలేకపోయింది. దీంతో అజిత్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఏప్రిల్ 10న విడుదల కానున్న గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతోనైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని అజిత్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.Maamey! The festival is here 💥This summer is going to be SUPER CRAZY 🔥🔥Here's the #GoodBadUglyTeaser ❤️🔥▶️ https://t.co/evp1QJiM2J#GoodBadUgly Grand release on 10th April, 2025 with VERA LEVEL entertainment 🤩A @gvprakash Musical ❤️🔥#AjithKumar… pic.twitter.com/M4hRGPdbAr— Mythri Movie Makers (@MythriOfficial) February 28, 2025 -
ఓపక్క కీమోథెరపీ.. మరోపక్క షూటింగ్స్..: శివరాజ్‌కుమార్
కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ (Shivarajkumar)కు సినిమాలపై ఉన్న ప్రేమ మాటల్లో చెప్పలేనిది. అందుకనే.. ఓ పక్క క్యాన్సర్‌తో బాధపడుతున్నా సరే ఇటు షూటింగ్స్ వదల్లేదు. అటు కీమోథెరపీ చేయించుకుంటూనే ఇటు షూటింగ్లో పాల్గొన్నాడు. చికిత్సలో భాగంగా ఇటీవలే అమెరికాలో సర్జరీ కూడా చేయించుకున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.ఇంకేం చేయగలను?నిజాయితీగా చెప్పాలంటే.. నాకు క్యాన్సర్ (Bladder Cancer) సోకిందన్న విషయం తెలియగానే భయపడ్డాను. కానీ దాన్ని ఎదుర్కోవడం తప్ప ఇంకేం చేయగలను? అయితే నేను ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయగలనా? లేదా? అన్నదే నా ముందున్న పెద్ద ప్రశ్న! సినిమాలు చేస్తూ డ్యాన్స్ కర్ణాటక డ్యాన్స్ అనే రియాలిటీ షోకు హాజరవుతూ ట్రీట్మెంట్ మొదలుపెట్టాను. కీమోథెరపీ చేయించుకుంటే జుట్టు రాలుతుందని తెలుసు. దీనివల్ల నా సినిమా లుక్ దెబ్బతింటుందేమోనని ఆందోళన చెందాను. కీమోథెరపీ చేయించుకుంటూనే షూటింగ్చికిత్స తీసుకుంటూ షూటింగ్స్‌కు వెళ్లడం వల్ల త్వరగా అలిసిపోయిన ఫీలింగ్ వచ్చేది. అందులోనూ కీమోథెరపీ తర్వాత సెట్లో అడుగుపెట్టినప్పుడు నా ఒంట్లో ఓపిక ఉండేది కాదు. ఇలా ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడే 45 సినిమాలో క్లైమాక్స్ షూట్ కూడా పూర్తి చేశాం. అందులో నా పర్ఫామెన్స్ చూసి మీరు కచ్చితంగా షాకవుతారు. శివన్నా ఎలా చేయగలిగాడు? అని ఆశ్చర్యపోతారు. ఇకపోతే ఆ భగవంతుడే నన్ను ఈ క్యాన్సర్ గండం నుంచి గట్టెక్కించాడు.అప్పటినుంచే తిరిగి షూటింగ్స్‌లో..మార్చి 3 నుంచి నా తర్వాతి సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటాను. రామ్‌చరణ్ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాను. మార్చి 5న హైదరాబాద్‌లో నా సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్‌కు హాజరు కానున్నాను అని చెప్పుకొచ్చాడు. శివరాజ్‌కుమార్ చివరగా భైరతి రణగల్ సినిమాలో నటించాడు. ప్రస్తుతం ఆయన నటించిన 45 మూవీ ఆగస్టు 15న విడుదల కానున్నట్లు తెలుస్తోంది.చదవండి: శుభవార్త చెప్పిన గేమ్ ఛేంజర్ హీరోయిన్.. ఓ మై గాడ్ సామ్ రియాక్షన్ -
నాగచైతన్య తండేల్ మూవీ.. అలాంటి సీన్ రిపీట్!
అక్కినేని హీరో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం తండేల్. చందు మొండేటి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. శ్రీకాకుళం ప్రాంతంలోని మత్స్యకారుల నేపథ్యంలో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఏపీకి చెందిన కొందరు జాలర్లు పొరపాటున పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించడంతో వారి బంధించి తీసుకెళ్లారు. ఆ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వారిని విడిపించారు. యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా సక్సెస్ సాధించింది.అయితే తాజాగా ఇలాంటి సంఘటనే మరోసారి రిపీట్ అయింది. తమిళనాడుకు చెందిన కొందరు మత్స్యకారులు పొరపాటున సరిహద్దు రేఖ దాటారు. వీరి గుర్తించిన శ్రీలంక నావికాదళం దాదాపు 27 మందిని అరెస్ట్ చేసింది. దీంతో తమిళనాడులోని రామేశ్వరం ప్రాంతానికి చెందిన దాదాపు 700 మంది జాలర్లు నిరవధిక సమ్మెకు దిగారు. వారి ఆందోళనలతో దిగొచ్చిన తమిళనాడు ప్రభుత్వం.. కేంద్రం సహకారంతో వారిని విడిపించారు. దీంతో మరోసారి తండేల్ సినిమా రిపీట్ అయిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. నాగచైతన్య నటించిన తండేల్ మూవీ తమిళంలోనూ విడుదలైన సంగతి తెలిసిందే. -
మలయాళం నుంచి మరో థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ
థ్రిల్లర్ సినిమాలు తీయాలంటే మలయాళీ దర్శకుల తర్వాత ఎవరైనా! ఎందుకంటే చాలా సాధారణంగా అనిపించే విషయాల్ని స్టోరీలుగా మలచి అదిరిపోయే థ్రిల్లర్ చిత్రాలు తీస్తుంటారు. 'దృశ్యం' నుంచి మొదలుపెడితే కొన్నాళ్ల క్రితం వచ్చిన 'కిష్కింద కాండం' వరకు లిస్ట్ చాలా పెద్దదే.ఇప్పుడు ఈ జాబితాలోకి మరో మూవీ చేరింది. ఫిబ్రవరి 20న కేరళలోని థియేటర్లలో రిలీజైన 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు ప్రస్తుతానికి రూ.30 కోట్ల మేర కలెక్షన్స్ కూడా సాధించింది. ఎంతలా మెప్పించకపోతే ఇప్పుడు దీన్ని డబ్బింగ్ చేసి తెలుగులోకి కూడా తీసుకొస్తారు. (ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు)'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' పేరుతోనే మార్చి 7న.. ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. మైత్రీ సంస్థ ఆ పని చేస్తుంది. ఈ మేరకు అధికారిక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ప్రియమణి.. కీలక పాత్రలో నటించింది.సినిమా కథ విషయానికొస్తే.. సీఐగా పనిచేసే హరీశ్ శంకర్ చాలా స్ట్రిక్ట్. తన టీమ్ కూడా అలానే ఉండాలనుకుంటాడు. ఓసారి నకిలీ బంగారు ఆభరణాల కేసుని దర్యాప్తు చేస్తున్న టైంలో సె*క్స్, డ్ర*గ్ రాకెట్ కేసులు బయటపడతాయి. దీంతో ఇన్వెస్టిగేషన్ లో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. నకిలీ ఆభరణాల కేసుకు.. డ్రగ్స్ కి సంబంధమేంటనేది మిగతా స్టోరీ. కట్టిపడే సస్సెన్స్ తో చివరి వరకు ఈ సినిమా థ్రిల్ చేస్తుందట. మరి తెలుగులో ఏ మేరకు అలరిస్తుందో?(ఇదీ చదవండి: నాన్న ఫోన్ చేసేసరికి ప్రభాస్ భయపడ్డాడు: మంచు విష్ణు) -
Sabdham Review: ‘శబ్దం’ మూవీ రివ్యూ
టైటిల్: శబ్దంనటీనటులు: ఆది పినిశెట్టి, సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్ తదితరులునిర్మాణ సంస్థ: 7G ఫిల్మ్స్ నిర్మాత: 7G ఫిల్మ్స్ శివ దర్శకత్వం: అరివళగన్సంగీతం: తమన్‌సినిమాటోగ్రఫీ: అరుణ్ బత్మనాభన్ఆది పినిశెట్టికి (Aadhi Pinisetty) సోలో హిట్ పడి చాలా కాలమైంది. తెలుగు సినిమాల్లో విలన్‌గా ఆకట్టుకుంటున్నాడు. కానీ హీరోగా నటించిన చిత్రాలేవి ఆశించిన స్థాయిలో ఆడడం లేదు. దీంతో తనకు ‘వైశాలి’ లాంటి బిగ్ హిట్ అందించిన దర్శకుడు అరివళగన్‌తో మరో మూవీ చేశాడు. అదే ‘శబ్దం’. (sabdham movie) ఈ సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్‌లో లక్ష్మీ మీనన్, సిమ్రాన్, లైలా కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య నేడు(ఫిబ్రవరి 28) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..కేరళలోని ఓ మెడికల్ కాలేజీలో విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటారు. శృతి అనే వైద్య విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మరణిస్తుంది. విద్యార్థుల మరణం వెనుక దెయ్యాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది. దీంతో యాజమాన్యం ఆహ్వానం మేరకు మరణాల వెనుక ఉన్న మిస్టరీ ఛేదించేందుకు ఘోస్ట్ ఇన్వెస్టిగేటర్ వ్యోమ వైద్యలింగం(ఆది పినిశెట్టి) రంగంలోకి దిగుతాడు. ఇన్వెస్టిగేషన్లో వ్యోమ వైద్యలింగంకి తెలిసిన నిజాలు ఏంటి? కాలేజీ లెక్చరర్ అవంతిక(లక్ష్మీ మీనన్) ఎందుకు అనుమానస్పదంగా ప్రవర్తిస్తుంది? డయానా(సిమ్రాన్) ఎవరు? కాలేజీలో జరుగుతున్న మరణాలతో ఆమెకు ఉన్న సంబంధం ఏంటి? నాన్సీ(లైలా) ఎవరు? కాలేజీలో ఉన్న లైబ్రరీ నేపథ్యం ఏంటి? మరణాల వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? 42 దెయ్యాల స్టోరీ ఏంటి? అనేది తెలియాలంటే సినిమా (Shabdam Review) చూడాల్సిందే. ఎలా ఉందంటే..హరర్ చిత్రాలన్ని ఓకే ఫార్మాట్లో సాగుతాయి. భయపెట్టే దెయ్యాలు.. వాటికి ఓ ఎమోషనల్ నేపథ్యం.. చివరకు వారి చావులకు కారణమైన వారికి శిక్ష పడడం..దాదాపు అన్ని హారర్ థ్రిల్లర్ సినిమాల కథ ఇలానే ఉంటుంది. శబ్దం కథ కూడా ఇలాంటిదే.కానీ కథనం డిఫరెంట్‌గా ఉంటుంది. ప్రేక్షకులను భయపెట్టేందుకు దర్శకుడు అరివళగన్ రొటీన్ జిమ్మిక్కులను వాడుకోకుండా కొత్తగా ట్రై చేశాడు. టైటిల్‌కి తగ్గట్టే డిఫరెంట్ శబ్దాలతో ప్రేక్షకులను భయపెట్టారు. ఫస్టాఫ్ మొత్తం డిఫరెంట్‌గా ఉంటుంది. హారర్ జానర్లో ఇదొక ప్రయోగంలా అనిపిస్తుంది. హీరో పాత్ర పరిచయం మొదలు.. దెయ్యాలు ఉన్నాయో లేవో తెలుసుకునేందుకు చేసే ప్రయత్నం వరకు ప్రతీదీ సైంటిఫిక్ మెథడ్‌లో చెప్పారు. స్క్రీన్ ప్లే చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. ఏం జరుగుతుందోనన్న క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఇంటర్వెల్ వరకు కథనం ఆసక్తికరంగా సాగుతుంది. ఇక సెకండాఫ్ మొత్తం మళ్లీ రోటీన్ హారర్ చిత్రాలను గుర్తు చేస్తుంది. ఒక్కో ట్విస్ట్ రివీల్ అయ్యే కొద్ది సాధారణ సినిమాను చూసిన ఫీలింగే కలుగుతుంది. 42 దెయ్యాల నేపథ్యం, వాటి లక్ష్యం తెలిసిన తర్వాత కొన్ని సందేహాలు కలుగుతాయి. కొన్ని చోట్ల లాజిక్ మిస్ అయినట్లుగా అనిపిస్తుంది. అయితే స్క్రీన్‌ప్లే కొంతమేర కొత్తగా అనిపిస్తుంది. ఓ సీన్లో తెరపై బొమ్మ కనిపించకుండా చేసి కేవలం సౌండ్‌తోనే ప్రేక్షకుడిని భయపెట్టాడు. టెక్నికల్ అంశాలపై కొంత అవగాహన ఉంటే ఈ సినిమా బోర్ కొట్టదు. హారర్ చిత్రాలను ఇష్టపడేవారికి నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. పారానార్మల్ ఇన్వెస్టగేటర్ వ్యోమ వైద్యలింగం పాత్రలో ఆది పినిశెట్టి ఒదిగిపోయాడు. డిఫరెంట్ లుక్‌తో తెరపై కొత్తగా కనిపించాడు. నటన పరంగా ఆయనకు వంక పెట్టడానికేమి లేదు. ఇంటర్వెల్ వరకు ఆమె పాత్రతో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సిమ్రాన్ కూడా ఓ కొత్త రోల్ ప్లే చేసింది. డయానా పాత్రలో ఆమె చక్కగా నటించింది. నాన్సీగా లైలా తెరపై కనిపించేంది కాసేపే అయినా తనదైన నటనతో ఆకట్టుకుంది. రిడిన్ కింగ్స్లే కొన్ని చోట్ల నవ్వించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం తమన్ నేపథ్య సంగీతం. తనదైన బీజీఎంతో సినిమాను నిలబెట్టాడు. కొన్ని సన్నివేశాలలో నటన కంటే బ్యాగ్రౌండ్ స్కోరే ఎక్కువ భయపెడుతుంది. డిఫరెంట్ బీజీఎంతో ఆడియన్స్‌కి కొత్త ఎక్స్‌పీరియన్స్‌ని అందించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
'ఒకడి అత్యాశే ఊరిని మొత్తం నాశనం చేసింది'.. ఆసక్తిగా ట్రైలర్
జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా నటించిన చిత్రం కింగ్స్టన్. ఈ సినిమాకు కమల్ ప్రకాశ్ దర్శకత్వం వహించారు. ఈ సీ ఫాంటసీ అడ్వెంచర్ చిత్రంలో దివ్యభారతి హీరోయిన్గా నటించింది. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, పారలల్ యూనివర్స్ పిక్చర్స్ బ్యానర్స్‌పై జీవీ ప్రకాష్ కుమార్, ఉమేష్ కేఆర్ బన్సల్ నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు గంగ ఎంటర్టైన్మెంట్స్ అధినేత మహేశ్వర్ రెడ్డి తీసుకొస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో మార్చి 7న సినిమా థియేటర్లలోకి రానుంది. తాజాగా తెలుగు ట్రైలర్ విడుదల చేశారు.ట్రైలర్ చూస్తే సముద్ర తీర గ్రామం చుట్టూ తిరిగే కథగా ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ మార్చి 7న తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో చేతన్, అళగం పెరుమాళ్, ఎలాంగో కుమారవేల్, సాబుమోన్ అబ్దుసమద్, ఆంటోని, అరుణాచలేశ్వరన్, రాజేష్ బాలచంద్రన్ కీలక పాత్రలు పోషించారు. -
సిద్దార్థ్‌కు, నాకు పడేది కాదు.. 'బాయ్స్'లో నాకే ఎక్కువ పారితోషికం: తమన్
తెలుగు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Thaman S) ఒకప్పుడు సినిమాలోనూ యాక్ట్ చేశాడు. సిద్దార్థ్‌తో కలిసి బాయ్స్ మూవీ (Boys Movie)లో నటించాడు. అయితే తనకు, సిద్దూకు అస్సలు పడేది కాదంటున్నాడు తమన్. అరివళగన్ దర్శకత్వంలో ఆది పినిశెట్టి హీరోగా నటించిన శబ్ధం సినిమాకు తమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు. ఈ మూవీ ఫిబ్రవరి 28న విడుదల కానుంది.బాయ్స్ సినిమాలో నా రచ్చ అంతా ఇంతా కాదు!ఈ సినిమా ప్రమోషన్స్‌లో తమన్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అతడు మాట్లాడుతూ.. బాయ్స్ సినిమాలో ఎక్కువ పారితోషికం అందుకుంది నేనే! సిద్దార్థ్(Siddharth)కు, నాకు అస్సలు పడేది కాదు. వాడు నేనే హీరో అంటే.. నువ్వు హీరో అయితే ఏంటి? హీరోయిన్ అయితే నాకేంటి? ఎక్కువ రెమ్యునరేషన్ అందుకుంటోంది నేను.. అనేవాడిని. చాలా టార్చర్ పెట్టేవాడిని. సినిమా షూటింగ్లో ఓసారి సిద్దార్థ్‌కు నైకీ సాక్స్ ఇచ్చి నాకు ఏదో మామూలు సాక్స్ ఇచ్చారు. నేనది తీసుకెళ్లి రత్నంగారి ముందు పడేశాను. సిద్దార్థ్‌కు నైకీ ఇచ్చి, నాకు నైలాన్ సాక్స్ ఇస్తే ఎలా? అని అడిగాను. ఇలాంటి చీప్ కొట్లాటలు చాలానే ఉన్నాయి. నాకది క్రేజీ ఎక్స్పీరియన్స్.చాలా పెంట చేశా..బాయ్స్ సినిమాకు అరివళగన్.. శంకర్ దగ్గర అసోసియేటివ్‌గా పని చేశాడు. నన్ను చూసుకోవడమే ఆయన పనైపోయింది. బాయ్స్ సెట్లో ఎవరి మాటా వినకుండా అందరినీ టార్చర్ పెట్టేవాడిని. క్యారవాన్‌లో ప్లగ్ తీసేసి కరెంట్ ఆపేవాడిని. బాత్రూమ్కు వెళ్లే నీళ్ల పైప్ కూడా కట్ చేసేవాడిని. ఇలా చాలా పెంటలు చేశాను. ఇవన్నీ అరివళగన్ కంట్రోల్ చేసేవాడు. సినిమా డైరెక్షన్ నేర్చుకోవడానికి వచ్చి నన్ను చూసుకునే పనిలో పడ్డాడు అని తమన్ నవ్వుతూ సరదాగా చెప్పుకొచ్చాడు.చదవండి: నాది రంగుల జీవితం కాదు.. ఎన్నో అవమానాలు..: హీరోయిన్ -
Sabdham X Review: ‘శబ్దం’ మూవీ ట్విటర్ రివ్యూ
'వైశాలి’తో సూపర్ హిట్ అందుకున్న హీరో ఆది పినిశెట్టి(Aadhi Pinisetty), దర్శకుడు అరివళగన్‌లు రెండోసారి మరో ఇంట్రస్టింగ్ సూపర్‌నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ ‘శబ్దం’(Sabdham Movie) తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 7G ఫిల్మ్స్ శివ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తో సినిమాపై క్యురియాసిటీ పెంచాయి. రేపు (ఫిబ్రవరి 28) ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే కోలీవుడ్‌లో పలు చోట్ల ఈ సినిమా ప్రీమియర్లు పడ్డాయి. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. మరి ఈ చిత్రానికి కోలీవుడ్‌లో ఎలాంటి టాక్ వచ్చింది? నెటిజన్ల ఓపీనియన్ ఏంటి? ఓ లుక్కేద్దాం. ఈ సినిమా ప్రీమియర్ షోకి పాజిటివ్ స్పందనే లభించింది. సోషల్ మీడియాలో చాలా మంది పాజిటివ్‌గానే పోస్టులు పెడుతున్నారు. మరి అసలు టాక్ ఏంటనేది రేపే తెలుస్తుంది. #Sabdham (3.75/5) Suspense Horror Investigation Thriller with High quality technical stuff 👌𝐇𝐢𝐠𝐡𝐥𝐢𝐠𝐡𝐭𝐬 :Direction @dirarivazhagan Writting & Direction 👏Adhi Performance 💯 Thaman BGM 👌Technical Department 🔥1st Half 💥 𝐕𝐞𝐫𝐝𝐢𝐜𝐭 : 𝐇𝐢𝐠𝐡𝐥𝐲…— Sugumar Srinivasan (@Sugumar_Tweetz) February 27, 2025 శబ్దం సస్పెన్స్ హారర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. టెక్నికల్ టీమ్ పనితీరు చాలా బాగుంది. అరివళగన్ డైరెక్షన్, ఆది పినిశెట్టి యాక్టింగ్, తమన్ బీజీఎం అదిరిపోయిందంటూ ఓ నెటిజన్ 3.75 రేటింగ్ ఇచ్చాడు.#Sabdham Review - A Brilliant Sound Horror Thriller Rating: 3.5/5 (Try not to miss)Sabdham is a good investigative horror film that brilliantly blends the suspense with an innovative sound based horror Concept.#Arivazhagan direction keeps the tension high, making the movie… pic.twitter.com/I8gFyBEoM7— Tamizh Stories (@TamizhStoriesz) February 27, 2025 శబ్దం ఓ మంచి ఇన్వెస్టిగేటివ్ హారర్ ఫిల్మ్. హారర్ కాన్సెప్ట్‌కి వినూత్నమైన సౌండ్‌ని మిళితం చేసి చక్కగా తీర్చిదిద్దారు. అరివళగన్ డైరెక్షన్ టెన్షన్‌ని పెంచేలా ఉంది. నిజంగా జరుగుతున్నట్లుగానే సినిమాను తెరకెక్కించారంటూ ఓ నెటిజన్ 3.5 రేటింగ్ ఇచ్చాడు.#Sabdham [3.5/5] : An Excellent horror thriller that uses sound to detect Paranormal activities..It offers plenty of thrills and emotions..Scenes arexinterestingly and intelligently written..@AadhiOfficial excels as the Paranormal Investigator.. 👏@MusicThaman 's Music is…— Ramesh Bala (@rameshlaus) February 26, 2025 శబ్దం అద్భుతమైన హారర్ థ్రిల్లర్. థ్రిల్స్‌తో పాటు ఎమోషనల్ సన్నివేశాలు కూడా పుష్కలంగా ఉన్నాయంటూ అంటూ ఓ నెటిజన్ 3.5 రేటింగ్ ఇచ్చాడు.#Sabdham - 3.5/5👌-Offers One Of The Best Theatrical Experiences in Recent Times! -A Uniquely Crafted Horror Film Where @MusicThaman's BG Score Plays A Vital Role. -Extraordinary Writing From @dirarivazhagan.-A Solid Comeback Movie For @AadhiOfficial Visually Looks Stunned pic.twitter.com/2ixhX7K5W8— Hemanathan Nagarajan (@HemanathanNaga1) February 26, 2025 -
నాది రంగుల జీవితం కాదు.. ఎన్నో అవమానాలు..: హీరోయిన్
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్న మాటను సెలబ్రిటీలు తు.చ. తప్పకుండా పాటిస్తారు. ఓ పక్క సినిమాలు చేస్తూనే అవకాశం దొరికినప్పుడల్లా వివిధ కార్యక్రమాలు, షోరూమ్‌ల ప్రారంభోత్సవానికి వెళ్తుంటారు. మలయాళ హీరోయిన్ మాళవిక మీనన్ (Malavika C Menon) కూడా ఇదే చేస్తోంది. అయితే అదే పనిగా వరుసపెట్టి కార్యక్రమాలకు వెళ్తూ ఉన్నందుకు కొందరు విమర్శలు కూడా గుప్పించారు. సినిమాల్లో మంచి పాత్రల కోసం ఆరాటపడకుండా ఇలా ప్రోగ్రామ్‌ల వెనక పరిగెట్టడం దేనికని బుగ్గలు నొక్కుకున్నారు. ఎన్ని ఖర్చులుంటాయనుకున్నారు!అయితే ఇలాంటి ప్రోగ్రామ్‌లకు వెళ్తే వచ్చే డబ్బు తనకు ఖర్చులకే సరిపోతోందని చెప్తోంది మాళవిక. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఒక కార్యక్రమానికి వెళ్లాలంటే నువ్వు చాలా ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. మొదట నీ దుస్తుల కోసం.. తర్వాత నువ్వు ప్రయాణించడానికి ఓ వాహనం కావాలి. అందులోనూ అమ్మాయైతే ఆ ఖర్చు రెట్టింపవుతుంది. మేకప్ సామాను కొనుక్కోవాలి, డ్రెస్సులు కొనుగోలు చేయాలి. దానిపైకి మ్యాచ్ అయ్యే జ్యువెలరీ కొనాలి.(చదవండి: నీ భర్త కంటే విజయ్ నయం.. జ్యోతిక ఏమందో తెలుసా?)కెరీర్ మొదట్లో ఇబ్బందిపడ్డా..కొన్నిసార్లు మనమే రెడీ అయినా సమయం లేకపోతే మేకప్ ఆర్టిస్టును పిలిపించుకోవాలి. అలాగే హెయిర్ స్టయిలిస్ట్. కొన్నిసార్లు మన లుక్ సరిగ్గా ఉండేందుకు స్టయిలిస్ట్ అవసరం కూడా ఉండొచ్చు. వీళ్లందరికీ మనం డబ్బులివ్వాలిగా! తమ పనిని వదిలేసుకుని వచ్చినందుకు వారి డిమాండ్‌ను బట్టి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ట్రావెలింగ్ ఖర్చులు ఉండనే ఉన్నాయి. కెరీర్ మొదట్లో ఆర్థికంగా చాలా ఇబ్బందిపడ్డాను.ప్రతి పైసాను గౌరవిస్తా..ఆ సమయంలో కుటుంబమే నా అవసరాలు తీర్చింది. నేను వెనకడుగు వేయకుండా ప్రోత్సహించింది. కొన్నిసార్లు ఇంట్లోనూ పరిస్థితులు కఠినంగా ఉండేవి కానీ అవి నాకు తెలియనిచ్చేవారు కాదు. ఒకసారైతే నేను కనుబొమ్మలు గీయించుకోవడానికి కూడా డబ్బులేదు. ఇప్పుడా పరిస్థితి మారింది. అందుకే ప్రతి పనిని, ప్రతి పైసాను గౌరవిస్తాను. తెరపై సెలబ్రిటీలను చూసి వారిది రంగుల జీవితం అనుకుంటాం కానీ అలా ఏం ఉండదు. వాళ్లకూ ఎన్నో కష్టాలుంటాయి. ఏదీ శాశ్వతం కాదునేను కూడా ఎన్నోసార్లు అవమానాలకు గురయ్యాను. అయితే ఏదీ శాశ్వతం కాదని బలంగా నమ్ముతూ ముందడుగు వేస్తాను అని చెప్పుకొచ్చింది. కాగా మాళవిక.. నిద్ర, హీరో, నాదన్, నదేవయానం, ఎంజన్ మరికుట్టి, జోసెఫ్, మామంగం, ఏఐ మల్లు, పెయి మామ వంటి పలు మలయాళ, తమిళ చిత్రాల్లో నటించింది. తెలుగులో లవ్ కె రన్, అమ్మాయిలు అంతే అదో టైప్ సినిమాలు చేసింది.చదవండి: నాకు పుట్టబోయే పిల్లల్ని కూడా వదల్లేదు: ప్రియమణి -
మజాకా హీరోయిన్ మూవీ.. ఏడేళ్ల తర్వాత థియేటర్లలో రిలీజ్!
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ హీరోగా నటించిన చిత్రం 'ధృవ నచ్చితిరమ్'(తెలుగులో ధృవ నక్షత్రం ). 2017లో ప్రారంభమైన ఈ చిత్రం ఇప్పటివరకు థియేట్రికల్ రిలీజ్ కాలేదు. ఈ మూవీని గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్షన్లో తెరకెక్కించారు. 2018లో విడుదల కావాల్సిన ఈ సినిమా పలు అనివార్య కారణాలతో పాటు ఆర్థిక సమస్యల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. దాదాపు ఏడేళ్లుగా ఈ మూవీ విడుదలకు మోక్షం మాత్రం లభించడం లేదు. గతేడాది కూడా రిలీజ్ అవుతుందని వార్తలొచ్చినా అలా మాత్రం జరగలేదు. అయితే ఈ చిత్రంలో మజాకా మూవీ హీరోయిన్ రీతూ వర్మ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాపై మరోసారి టాక్ వినిపిస్తోంది. అన్ని సజావుగా సాగితే ఈ ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుందని తాజా సమాచారం. ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే విడుదల తేదీకి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అన్ని కుదిరితే మే 1న కార్మిక దినోత్సవం రోజున ధృవ నచ్చతిరమ్ థియేటర్లలో విడుదలయ్యే అవకాశముంది. అదే జరిగితే సూర్య, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కాంబోలో వస్తోన్న రెట్రోతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడడం ఖాయంగా కనిపిస్తోంది.కాగా.. గతంలో ధృవ నచ్చతిరమ్ మూవీని మొదట సూర్యతో ప్లాన్ చేశారు. కానీ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్‌తో విభేదాల కారణంగా సూర్య ఈ చిత్రం నుండి వైదొలిగాడు. ఆ తర్వాత చియాన్ విక్రమ్‌ని సినిమాను తెరకెక్కించాడు. కాగా.. 2017లో సెట్స్‌పైకి వెళ్లిన ధృవ నచ్చితిరమ్ ఆర్థికపరమైన సమస్యలతో 2023లో పూర్తయింది. అప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద మాత్రం విడుదల కాలేదు. కాగా.. ఈ చిత్రంలో నటుడు సిమ్రాన్, పార్థిబన్, రాధిక శరత్‌కుమార్, వినాయకన్, దివ్యదర్శిని, వంశీకృష్ణ ముఖ్యపాత్రలు పోషించారు. -
నాకు పుట్టబోయే పిల్లల్ని కూడా వదల్లేదు: ప్రియమణి
ప్రేమకు కులమతాలతో పట్టింపు లేదు. అది కేవలం హృదయాల్ని తాకుతుంది. మనసుల్ని ఒక్కటి చేస్తుంది. సమాజం విధించిన కట్టుబాట్లను కాదనుకుని మనసు మాట విని పెళ్లి చేసుకున్నవారికి సూటిపోటి మాటలు తప్పడం లేదు. ఈ విషయంలో ఇప్పటికీ విమర్శలు ఎదుర్కొంటునే ఉన్నానంటోంది హీరోయిన్ ప్రియమణి (Priya Mani Raj). ఈమె 2017లో ప్రియుడు ముస్తఫ రాజ్‌ను పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి ఇప్పటివరకు తనపై ట్రోలింగ్ జరుగుతూనే ఉందని చెప్తోంది.సంతోషాన్ని పంచుకుందామనుకుంటే..తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రియమణి మాట్లాడుతూ.. నేను నా సంతోషకర క్షణాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటాను. అలా నా ఎంగేజ్మెంట్ విషయాన్ని ఓ రోజు సోషల్ మీడియాలో వెల్లడించాను. విచిత్రంగా చాలామందికి మా జంటపై విపరీతమైన అనుమానాలు పుట్టుకొచ్చాయి. అతడు నన్ను మతం మార్పిడికి ఒత్తిడి తెస్తాడని ఏవేవో ఊహించుకుని మాపై విషం కక్కారు. జనాలు ఎంతదూరం వెళ్లారంటే.. రేపు మాకు పుట్టబోయే పిల్లలు ఐసిస్‌లో చేరతారని కామెంట్లు చేశారు.ఇప్పటికీ అంతే..నేను సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని అయినంతమాత్రాన మీ నోటికి ఏదొస్తే అది అనేస్తారా? అసలు సంబంధం లేని వ్యక్తుల్ని కూడా విమర్శిస్తారా? ఆ ట్రోలింగ్ వల్ల రెండు, మూడు రోజులపాటు నేను మనిషిని కాలేకపోయాను. ఇప్పటికీ నా భర్తతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తే చాలు.. పదిలో తొమ్మిది కామెంట్లు మతం లేదా కులం గురించే ఉంటాయి అని చెప్పుకొచ్చింది. ఇకపోతే ప్రియమణి చివరగా ఆఫీసర్ ఆన్ డ్యూటీ అనే మలయాళ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం విజయ్ జన నాయగన్ మూవీ చేస్తోంది. అలాగే ద ఫ్యామిలీ మ్యాన్ 3లో నటిస్తోంది.చదవండి: OTTలో తెలుగు సినిమా.. నాలుగు నెలల తర్వాత స్ట్రీమింగ్ -
తొలి సినిమా నా భర్తతో చేయడం మరిచిపోలేను: జ్యోతిక
కోలీవుడ్ స్టార్ హీరో సతీమణి జ్యోతిక ప్రస్తుతం బాలీవుడ్లో నటిస్తోంది. తాజాగా ఆమె డబ్బా కార్టెల్ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారామె. అయితే ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలకు హాజరువుతున్నారు. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన జ్యోతిక తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. బాలీవుడ్లో నటించడంపై ఆమె మాట్లాడారు.బాలీవుడ్‌తో నా తొలిచిత్రం అక్షయ్ ఖన్నాతో నటించానని తెలిపింది. ఆ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు.. అందువల్లే ఆ తర్వాత ఆఫర్లు రాలేదని వివరించింది. అది చేసే సమయంలో ఓ దక్షిణాది సినిమాకు సైన్ చేశానట్లు వెల్లడించింది. కోలీవుడ్‌లో తొలి సినిమానే నా భర్త సూర్యతో చేయడం ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొంది. స్టార్డమ్ గురించి ఆమెను ప్రశ్నించగా.. ఇంటికి వెళ్లేముందే బయటే తమ స్టార్‌డమ్‌ను వదిలేస్తామని తెలిపింది. ఇంట్లోకి అడుగుపెట్టగానే మా పిల్లలకు తల్లిదండ్రులుగానే ఉంటాం.. ప్రతి ఉదయం వారి బాక్స్‌ల గురించే ఆలోచిస్తామని.. వాళ్ల పనులకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తామని జ్యోతిక వెల్లడించింది. కాగా.. తాజా వెబ్ సిరీస్ డబ్బా కార్టెల్‌లో.. షబానా అజ్మీ, గజరాజ్, జ్యోతిక, నిమేషా సజయన్, షాలినీ పాండే ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్‌ను హితేష్ భాటియా దర్శకత్వంలో తెరకెక్కించారు. ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ ఫిబ్రవరి 28వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్‌ను క్రైమ్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ముంబయిలో డబ్బావాలా బాగా ఫేమస్. ఆ కోణంలోనే ఈ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఫుడ్ డబ్బాల్లో లంచ్‌తో పాటు డ్రగ్స్ కూడా సరఫరా చేసే ఐదుగురు గృహిణుల చుట్టూ తిరిగే స్టోరీగా డబ్బా కార్టెల్ రూపొందించారు. ఈ సిరీస్‌లో అంజలి ప్రసాద్, సాయి తమంకర్ కీలకపాత్రలు పోషించారు. -
నీ భర్త కంటే విజయ్ నయం.. జ్యోతిక ఏమందో తెలుసా?
ఎవరి టాలెంట్ వారిదే! ఈ పదం సినిమా ఇండస్ట్రీలో అందరికీ వర్తిస్తుంది. ఎవరి స్క్రిప్ట్ సెలక్షన్ వారిదే.. బాక్సాఫీస్ వద్ద ఎవరి సత్తా వారిదే! ఒకరితో మరొకరిని పోల్చలేం. కొన్నిసార్లు అపజయాలు ఎదురైనా మరికొన్నిసార్లు కలెక్షన్ల ఊచకోతతో రికార్డులు సృష్టిస్తుంటారు. ఫెయిల్యూర్ అందుకున్నంతమాత్రాన నటులు వెనకబడిపోయినట్లు కాదు! అయితే కంగువా సినిమాతో డిజాస్టర్ అందుకున్న హీరో సూర్య (Suriya)ను పలువురూ ట్రోల్ చేస్తున్నారు. తాజాగా జ్యోతిక (Jyotika) షేర్ చేసిన పోస్ట్ కింద నెగెటివ్ కామెంట్లతో చెలరేగిపోతున్నారు.నీ భర్తను ఆ రేంజ్ కలెక్షన్స్ తెమ్మనుసూర్య కంటే విజయ్ బెటర్ అని ఒకరు, నీ భర్త కంటే ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) ఉత్తమం అని మరొకరు సెటైర్లు వేశారు. సూర్య, కార్తీల కంటే విజయ్ చాలా నయం.. ఇదే నిజం.. ఆ ఇద్దరు హీరోలను డ్రాగన్, లవ్ టుడే కంటే ఎక్కువ కలెక్షన్స్ తీసుకురమ్మనండి అంటూ ఇలా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే వీటన్నింటిపై జ్యోతిక చాలా కూల్‌గా స్పందించింది. నీ భర్త కంటే విజయ్ నయం అన్న కామెంట్‌కు.. అవునా, నిజమా? అన్నట్లుగా స్మైల్ ఎమోజీతో రిప్లై ఇచ్చింది. స్పందించడం అవసరమా?తర్వాత సదరు కామెంట్లన్నింటినీ డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే జ్యోతిక ఆ ట్రోలర్స్‌కు రిప్లై ఇవ్వడం అవసరమా? అని పలువురు మండిపడుతున్నారు. పోనీ.. నీ భర్త కంటే వేరొకరు నయం అన్నప్పుడు చెంప చెల్లుమనిపించేలా ఆన్సర్ ఇవ్వొచ్చుగా అని అభిప్రాయపడుతున్నారు. మరికొందరేమో.. ఇతర నటులు సక్సెస్ అయితే ఈ కుటుంబమంతా ఈర్ష్యతో రగిలిపోతుంది అని పెదవి విరుస్తున్నారు. ఇకపోతే జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన డబ్బా కార్టెల్ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 28న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. View this post on Instagram A post shared by Jyotika (@jyotika) చదవండి: 'నమో నమః శివాయ' వీడియో సాంగ్ వచ్చేసింది -
విజయ్ ఇంటిపై చెప్పు విసిరిన యువకుడు
కోలీవుడ్ హీరో దళపతి విజయ్ ఇంటిపై ఒక యువకుడు చెప్పు విసరడంతో అభిమానులు భగ్గుమన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు. తమిళగ వెట్రి కళగం పార్టీ ఆవిర్భవించి ఏడాది కాలం పూర్తయిన విషయం తెలిసిందే. బుధవారం 2వ వసంతంలోకి పార్టీ ప్రస్తుతం అడుగు పెట్టింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈసీఆర్‌లోని మహాబలిపురం సమీపంలో ఉన్న పూంజేరి గ్రామంలో ఉన్న రిసార్ట్‌లో ప్రత్యేక వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు పార్టీ తరపున జిల్లాల కార్యదర్శులు, 2,500 మంది ముఖ్య నిర్వాహకులను మాత్రమే ఆహ్వానించారు. వేదికపై జిల్లాల కార్యదర్శులు, రాష్ట్ర నేతలు ఆశీనులయ్యారు. తమిళ హక్కులు, భాషా అభిమానం, రాజకీయ శాసనాలు, మత సామరస్యం, సహోదరత్వం తదితర అంశాల పరిరక్షణ లక్ష్యంగా గుండెల మీద చేతులు వేసుకుని నేతలందరూ ప్రతిజ్ఞ చేసినానంతరం సమావేశం ప్రారంభమైంది. ఇటీవల వీసీకేను వీడి టీవీకేలో చేరిన ఆదవ అర్జునన్ మాట్లాడుతూ, ప్రస్తుతం బలంగా ఉన్న డీఎంకే కూటమిలో మున్ముందు బీటలు వారనున్నట్టు పేర్కొంటూ, ఇక విజయ్ను దళపతి అని కాకుండా తలైవా అని పిలుద్దామని సూచించారు.తమిళనాడులో 1967, 1977 ఎన్నికల చరిత్రను పునరావృతం చేసే విధంగా 2026లో మార్పు తథ్యం అని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ ధీమా వ్యక్తం చేశారు. మరో చరిత్రను సృష్టించే విధంగా విజయ బావుటా ఎగుర వేస్తామన్నారు. త్వరలో బూత్ కమిటీ మహానాడు నిర్వహించబోతున్నామని, ఇదే తమిళగ వెట్రికళగం బలాన్ని చాటే వేదిక కానున్నట్టు వ్యాఖ్యలు చేశారు. టీవీకే గెలుపు అన్నది ఇక్కడున్న వారి చేతులలోనే కాదు, ఈ రాష్ట్ర ప్రజల చేతులలో ఉందని వ్యాఖ్యానించారు. ప్రతి కార్యకర్త పడే శ్రమ మీదే అది ఆధారపడి ఉందన్నారు.విజయ్ ఇంటిపై చెప్పు విసిరిన యువకుడు మహాబలిపురంలో విజయ్ సభ జరుగుతున్న సమయంలో చాలామంది అభిమానులు టీవీల ముందు కూర్చొన్నారు. తమ అభిమాన హీరో రాజకీయ ప్రసంగం ఎలా ఉంటుందో అని ఎదురుచూస్తుండగా ఆయన ఇంటిపై ఒక యువకుడు చెప్పు విసరడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. నీలాంగరైలో ఉన్న విజయ్ ఇంటి వద్దకు గుర్తు తెలియని వ్యక్తి, అకస్మాత్తుగా చెప్పును ఇంటిలోకి విసిరాడు. దీన్ని గమనించిన సెక్యూరిటీ ఆ వ్యక్తిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇంతలో అతను అక్కడి నుంచి పరారీ అయ్యాడు. అయితే, అతనొక మానసిక రోగి అని కొందరు చెబుతున్నారు. ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. జకీయ దురుద్దేశంతో కావాలనే ఎవరో ఈ పని చేసి ఉంటారని విజయ్ అభిమానులు అనుమానిస్తున్నారు. -
రెండు వారాల్లో రజనీకాంత్ 'కూలీ' నుంచి అదిరిపోయే గిఫ్ట్
అభిమానులే కాదు, సినీ ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురు చూసే కథానాయకుల చిత్రాలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిలో కూలీ ఒకటి. కారణం ఈ చిత్ర కథానాయకుడు రజనీకాంత్ కావడమే. అంతేకాదు. లోకేశ్ కనకరాజ్ వంటి క్రేజీ దర్శకుడు, సన్ పిక్చర్స్ వంటి నిర్మాణ సంస్థ చేస్తున్న చిత్రం ఇది. ఇకపోతే నటి శృతిహాసన్, కన్నడ స్టార్ నటుడు ఉపేంద్ర, తెలుగు స్టార్ నటుడు నాగార్జున, సత్యరాజ్ వంటి ప్రముఖ నటీనటులు ప్రధాన పాత్రలు పోషించడంతో పాటూ ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్ కూడా కీలక పాత్రలో మెరవనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అంతే కాదు క్రేజీ నటి పూజాహెగ్డే ఒక ప్రత్యేక పాటలో మెరుపులు మెరిపించనున్నారని సమాచారం. ఇక అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంపై ఎవరికై నా ఎందుకు ఆసక్తి ఉండదు. ఇప్పటికే ఈ చిత్ర టైటిల్‌కు, విడుదలైన గ్లింప్స్‌కు అభిమానుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఇందులో రజనీకాంత్ గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్నట్లు ప్రచారం జరగడంతో కూలీపై అంచనాలు పెరిగిపోతున్నాయి. చిత్ర షూటింగ్ కూడా చివరి దశకు చేరికుంది. దీంతో ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ కోసం రజనీకాంత్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాగా తాజాగా కూలీ చిత్ర వర్గాల నుంచి వచ్చిన ఓ అప్డేట్ ఈ చిత్ర టీజర్‌ను రెడీ చేశారట. ఈ చిత్ర టీజర్ చాలా బాగా వచ్చిందని యూనిట్ వర్గాలు ఫుల్‌జోష్‌లో ఉన్నారట. దీన్ని మరో రెండు వారాల్లో విడుదల చేయనున్నట్లు తాజా సమాచారం. మార్చి 14న లోకేశ్ కనగరాజ పుట్టినరోజు ఉంది. అదే రోజున కూలీ టీజర్‌ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్‌లో ఉన్నారు. -
కలిసి డ్యాన్స్.. వారసుడిని పరిచయం చేసిన ప్రభుదేవా
ప్రభుదేవా పేరు చెప్పగానే అద్భుతమైన డ్యాన్సులే గుర్తొస్తాయి. రీసెంట్ టైంలో పెద్దగా మెరుపుల్లేవ్. కొన్నాళ్ల ముందు వరకు పలు సినిమాలకు దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం నటుడిగా తమిళ మూవీస్ చేస్తున్నాడు. సరే ఇదలా ఉంచితే ఇప్పుడు డ్యాన్స్ తో తన వారసుడిని పరిచయం చేశాడు.(ఇదీ చదవండి: ఇది 40 ఏళ్ల ప్రేమ.. ఉపాసన పోస్ట్ వైరల్)ప్రభుదేవా.. చెన్నైలో తాజాగా ప్రభుదేవా లైవ్ డ్యాన్స్ పేరుతో కాన్సర్ట్ నిర్వహించాడు. దీనికి పలువురు హీరోయిన్లు, సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ వేడుకలోనే ప్రభుదేవా.. తన కొడుకు రిషి రాఘవేందర్ ని పరిచయం చేశాడు. ఇద్దరూ కలిసి డ్యాన్స్ కూడా చేయడం విశేషం.కొడుకు స్టేజీ పెర్ఫార్మెన్స్ వీడియో షేర్ చేసి తెగ ఎమోషనల్ అయిపోయాడు. కొడుకుని పరిచయం చేయడం ఎంతో గర్వంగా ఉందని, ఇది కేవలం డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కాదని అంతకు మించి అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే ప్రభుదేవాకు ఇద్దరు కుమారులు. వాళ్లలో రిషి ఒకడు. మరొకరు అదిత్.(ఇదీ చదవండి: ఆ ఓటీటీలోనే 'మజాకా' సినిమా) View this post on Instagram A post shared by Prabhudeva (@prabhudevaofficial) View this post on Instagram A post shared by Prabhudeva (@prabhudevaofficial) -
ఆ సమయంలో నా తండ్రి పేరు చెప్పుకోలేదు: శృతిహాసన్
సినిమాల్లో మారువేషాలు మారుపేరులు కలిగిన పాత్రను చూస్తుంటాం. అయితే నటి శృతిహాసన్ నిజ జీవితంలోనూ మారుపేరుతో తిరగడం విశేషం. సలార్ చిత్రం తర్వాత ఈ బ్యూటీ ఇప్పటివరకు తెరపై చూడలేదు. అయినప్పటికీ ఈమె పలు భారీ చిత్రాల్లో నటిస్తున్నారన్నది గమనార్హం. అందులో ఒకటి రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న కూలీ.. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇందులో నటి శృతిహాసన్ చాలా ముఖ్యపాత్రను పోషిస్తున్నారు .అదేవిధంగా విజయ్ సేతుపతికి జంటగా ట్రైన్ చిత్రంలో కథానాయకిగా నటిస్తున్నారు. అయితే, విజయ్ దళపతి 69వ చిత్రం జననాయకన్లో కూడా ఈ బ్యూటీ కీలకపాత్రలో మెరవబోతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా శృతిహాసన్ ఏదో ఒక సంచలన ఘటనలనో, లేక ఆసక్తికరమైన విషయాలనో అభిమానులతో పంచుకుంటూ సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటారన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన తండ్రి కమల్ హాసన్ లెగిసీని వాడుకోకపోయినా ఆయన గొప్పతనాన్ని తరచూ వ్యక్తం చేస్తూనే ఉంటారు. కాగా తాజాగా తను సినీ రంగ ప్రవేశం చేయకముందు జరిగిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఇటీవల ఓ భేటీలో తెలిపారు. తాను కమల్ వారసురాలని బయట తెలిస్తే.. స్నేహితులతో తిరగడానికి ఇబ్బంది కలుగుతుందని భావించినట్లు ఆమె చెప్పుకొచ్చింది.సినీ రంగ ప్రవేశం చేయకముందు నకిలీ పేరుతో కొన్ని రోజులు చాలా స్వేచ్ఛగా తిరిగానని పేర్కొంది. నటుడు కమలహాసన్ కూతురు అని పరిచయం చేసుకుంటే ఎవరితో మాట్లాడిన వాళ్లు పూర్తిగా తన తల్లిదండ్రుల గొప్పతనం గురించే మాట్లాడుతారని, అందుకే తాను నకిలీ పేరు చెప్పి పరిచయం చేసుకునేదానినని, అలా వారితో ఎలాంటి సంశయం లేకుండా కోరుకున్న విధంగా నేను నాలా మాట్లాడగలిగేదాన్ని శృతిహాసన్ చెప్పుకొచ్చారు. అయితే ఎప్పుడైతే చిత్రాల్లో నటించడం ప్రారంభించానో అప్పటి నుంచి ఆ నకిలీ పేరును వాడే అవకాశం లేకపోయిందని ఈ భామ పేర్కొన్నారు. -
ఇండియాతో ఎంతో అనుబంధం ఉంది: హాలీవుడ్ నటుడు జెరోమ్ ఫ్లిన్
‘‘నాకు ఇండియాతో ఎంతో అనుబంధం ఉంది. నా యంగ్ ఏజ్‌లో నేను ఎక్కువగా ఇక్కడి ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించాను. ఇండియాలో గడిపిన తర్వాత నా జీవితం పూర్తిగా మారిపోయింది. ‘ఎల్2ఈ ఎంపురాన్’(L2E Empuraan) సినిమాలో నటించడంతో మళ్లీ నా ఇంటికి వచ్చినట్టు అనిపించింది’’ అని ప్రముఖ హాలీవుడ్ నటుడు జెరోమ్ ఫ్లిన్ (Jerome Flynn)(‘గేమ్ ఆఫ్ థ్రోన్స్, జాన్ విక్ చాప్టర్ 3, సోల్జర్ సోల్జర్, బ్లాక్ మిర్రర్’ ఫేమ్) తెలిపారు.మోహన్‌లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన హిట్ మూవీ ‘లూసిఫర్’ (2019)కి సీక్వెల్‌గా ‘ఎల్2ఈ ఎంపురాన్’ మూవీ రూపొందింది. సీక్వెల్లోనూ మోహన్‌లాల్ హీరోగా నటించగా పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలో నటించడంతోపాటు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో జెరోమ్ ఫ్లిన్ చేసిన బోరిస్ ఆలివర్‌పాత్రని రివీల్ చేశారు. జెరోమ్ ఫ్లిన్ మాట్లాడుతూ– ‘‘ఖురేషి (మోహన్‌లాల్‌పాత్ర పేరు) ప్రయాణంలో బోరిస్ ఆలివర్ది ఒక ముఖ్యమైనపాత్ర. ఈ క్యారెక్టర్ని ప్రేక్షకులు ఇష్టపడతారు’’ అని పేర్కొన్నారు. మార్చి 27న మలయాళం, తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. -
వారి వల్ల ప్రతిసారి ఫోటోలు షేర్ చేస్తూనే బతుకుతున్నాం: రవీందర్
ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) హీరోగా నటించిన ‘డ్రాగన్’ (Dragon) సినిమాతో నటుడు రవీందర్ పేరు మరోసారి నెట్టింట వైరల్ అవుతుంది. ఇందులో ఫేక్ సర్టిఫికెట్లు సరఫరా చేసే వ్యక్తిగా ఆయన కనిపించాడు. ఆయన గతంలో పలు సినిమాలకు నిర్మాతగా కూడా ఉన్నారు. డ్రాగన్ సినిమా తనకు చాలా పేరు తీసుకొచ్చిందని సంతోషంలో ఉన్నారు. తాజాగా ఆయన సతీమణి మహాలక్ష్మితో పాటు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో పలు విషయాలను రవీందర్ పంచుకున్నాడు. తనకు పెళ్లి అయిన తర్వాత చాలామంది హేళన చేశారని వాపోయాడు. ఇంత అందమైన అమ్మాయితో పెళ్లి ఏంటి అంటూ కొందరు మెసేజ్‌లు కూడా చేశారని ఇలా చెప్పుకొచ్చాడు.మహాలక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. పెళ్లి తర్వాత చాలా విమర్శలు వచ్చినా కూడా భరించాము. కొద్దిరోజుల తర్వాత మేమిద్దరం విడాకులు తీసుకున్నామని, విడిపోయామని కూడా వార్తలు వచ్చాయి. అది చూసి నవ్వుకున్నాం. ఇంత అందమైన స్త్రీ ఇంత శరీరాకృతి ఉన్న వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకుంది..? ఈ పెళ్లి ఎన్ని రోజులు ఉంటుందిలే అంటూ అందరూ హేళన చేసే వాళ్లే కనిపించారు. కొందరైతే మేము విడాకులు తీసుకుని విడిపోయి వేరువేరుగా ఉంటున్నామని ప్రచారం చేశారు. ఇలాంటి వార్తలు వచ్చిన ప్రతిసారీ.. మేం కలిసి ఉన్నాము అంటూ ఫోటోలు పోస్ట్ చేస్తూ రూమర్స్‌కు ముగింపు పలుకుతున్నాం. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. కొందరి చేస్తున్న హేళన తట్టుకోలేక ఎన్నోసార్లు ఫోటోలు షేర్ చేస్తూ బతుకుతున్నాం. చాలామందికి వారి జీవితం ఏమౌతుందో అనే కంటే ఇతరుల జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది.' అని ఆయన అన్నారు. వెన్నుపోటు పొడిచారు: మహాలక్ష్మిఇదే ఇంటర్వ్యూలో పాల్గొన్న మహాలక్ష్మి చెప్పుకొచ్చారు. 'నమ్మిన వ్యక్తులే మాకు వెన్నుపోటు పొడిచారు. మాతో సన్నిహితంగా ఉంటూనే అలాంటి పనిచేశారు. ఎప్పుడైతే మనం ఇతరులను సర్వస్వం అని నమ్ముతామే వాళ్లే వెన్నుపోటు పొడుస్తారు. శత్రువు కూడా అలాంటి పనిచేయడు. మనతో పాటు ఉన్నవాడు, మనకు బాగా తెలిసినవాడు మాత్రమే మన వెన్నులో పొడవగలడు. మన జీవితంలో అమ్మ, నాన్న, భర్త, పిల్లలు తప్ప ఎవరినీ నమ్మలేని పరిస్థితి ఉందని' ఆమె చెప్పింది. అయితే, వారికి నష్టం చేసిన వ్యక్తి పేరు మాత్రం చెప్పలేదు. కొద్దిరోజుల క్రితం ఆర్థిక లావాదేవీల విషయంలో రవీందర్ జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. నమ్మిన వ్యక్తి వల్లే తమకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఆమె గతంలో కూడా ఒకసారి చెప్పింది.కోలీవుడ్‌లో సన్ మ్యూజిక్‌లో హోస్ట్‌గా చేసిన మహాలక్ష్మి ఆపై సీరియల్స్‌తో మరింత పాపులర్ అయింది. ఆమెకు అనిల్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. కానీ, ఇద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. తదనంతరం, నిర్మాత రవీందర్‌ని ప్రేమించి ఆమె పెళ్లి చేసుకుంది. -
'మీ మాటలు ఎప్పటికీ గుర్తుంచుకుంటాను'.. అమిర్ ఖాన్‌తో డ్రాగన్ హీరో
జీవితం ఊహించలేనిది.. ఇలా అన్నది ఎవరో తెలుసా? అది తెలుసుకోవాలంటే ముందుగా యువ నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ గురించి చెప్పాలి. ఈయన కోమాలి చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యి హిట్ కొట్టారు. ఆ తరువాత మరో చిత్రానికి దర్శకత్వం వహిస్తారని అందురూ ఎదురు చూశారు. అలాంటిది హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అలా ఈయన స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన చిత్రం లవ్ టుడే. ఈ చిత్రం పెద్ద హిట్ అయ్యి ఏకంగా రూ. 100 కోట్ల క్లబ్లో చేరింది. ఆ తరువాత ఈయనకు వరుసగా అవకాశాలు తలుపు తడుతున్నాయి.అలా తాజాగా ఈయన కథానాయకుడిగా నటించిన చిత్రం డ్రాగన్. ఏజీఎస్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రాన్ని ఓ మై గాడ్ చిత్రం ఫేమ్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించారు. ఈ నెల 21వ తేదీన తెరపైకి వచ్చిన ఈ చిత్రం సంచలన విజయం వైపు పరుగులు తీస్తోంది.ఇలాంటి పరిస్థితుల్లో నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్‌ను కలవడం ఆసక్తిగా మారింది. ప్రదీప్ రంగనాథన్ తమిళంలో నటించి, దర్శకత్వం వహించిన లవ్ టుడే చిత్రాన్ని హిందీలో రీమేక్ చేశారు. దీనికి ప్రదీప్ రంగనాథన్ సహ నిర్మాత కావడం గమనార్హం. అందులో అమీర్‌ఖాన్ వారసుడు జునైత్ ఖాన్, శ్రీదేవి వారసురాలు ఖుషీ కపూర్ జంటగా నటించారు. అయితే ఈ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదన్నది గమనార్హం.ఇలాంటి పరిస్థితిలో ప్రదీప్ రంగనాథన్ బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్‌ను చెన్నైలో కలవడం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఒక వేళ డ్రాగన్ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసే ఆలోచనతో ఆయన్ని కలిశారా? లేక మరోదైన విషయం కోసం కలిశారా? అన్న చర్చ జరుగుతోంది. అయితే అమీర్‌ఖాన్ ప్రస్తుతం నటుడు రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ చిత్రంలో ప్రత్యేక పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే.అదే విధంగా అనారోగ్యానికి గురైన ఆయన తల్లి చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెను పరామర్శించడానికి ప్రదీప్ రంగనాథన్ వెళ్లారా? అనే చర్చ కూడా జరుగుతోంది. ఏదేమైనా అమీర్‌ఖాన్‌తో ఉన్న ఫొటోను సామాజిక మాధ్యమాలకు విడుదల చేసిన ప్రదీప్ రంగనాథన్ అందులో.. జీవితం ఊహించలేనిది అని నేను ఎప్పుడూ చెబుతాను.. మీ అద్భుతమైన మాటలకు ధన్యవాదాలు అమిర్ ఖాన్ సార్.. జీవితాంతం దాన్ని గుర్తుంచుకుంటాను అని పోస్ట్ చేశారు. కాగా ప్రస్తుతం ఈయన విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో ఎల్ఐకే చిత్రంలో నటిస్తున్నారు. Life is unpredictable as i always say :) Thankyou for your wonderful words #aamirkhan sir . Will cherish it for life ❤️ pic.twitter.com/HPjpJLvDN2— Pradeep Ranganathan (@pradeeponelife) February 23, 2025 -
బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న డ్రాగన్.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
లవ్ టుడే మూవీతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన యంగ్ హీరో ప్రదీప్‌రంగనాథన్. చాలా గ్యాప్ తర్వాత 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్'(Return Of The Dragon Movie)తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాకు 'ఓరి దేవుడా' ఫేమ్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్, కాయాదు లోహర్ హీరోయిన్లుగా నటించారు. ఈ నెల 21న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజే పాజిటివ్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా రిలీజైన మూడు రోజుల్లోనే రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఏకంగా రూ.50 కోట్ల మార్క్‌ను దాటేసింది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా షేర్ చేశారు హీరో ప్రదీప్ రంగనాథన్. మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.50.22 కోట్ల వసూళ్లు సాధించినట్లు వెల్లడించారు. దీంతో ప్రదీప్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.డ్రాగన్ మూవీ కథేంటంటే..డి.రాఘవన్(ప్రదీప్ రంగనాథన్)(Pradeep Ranganathan) ఇంటర్మీడియట్లో 96 శాతం మార్కులతో పాస్ అయిన తర్వాత తాను ఇష్టపడిన అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. అయితే ఆమె తనకు బ్యాడ్ బాయ్స్ అంటేనే ఇష్టమని చెబుతూ అతని ప్రేమను రిజెక్ట్ చేస్తుంది. దీంతో రాఘవన్ బ్యాడ్ బాయ్‌గా మారిపోయి బీటెక్‌లో జాయిన్ అవుతాడు. కాలేజీలో అతనికి డ్రాగన్ అని పేరు పెడతారు. ప్రిన్సిపల్(మిస్కిన్)తో సహా ఫ్యాక్టల్లీ మొత్తానికి డ్రాగన్ అంటే నచ్చదు. 48 సబ్జెక్టుల్లో ఫెయిల్ అవుతాడు. రెండేళ్ల పాటు ఖాలీగా ఉండడంతో కాలేజీలో తనను ప్రేమించిన అమ్మాయి కీర్తి(అనుపమ పరమేశ్వరన్)(Ashwath Marimuthu) బ్రేకప్ చెప్పి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది.దీంతో జీవితంలో ఎలాగైన సక్సెస్ కావాలని ఫేక్ సర్టిఫికేట్స్ మంచి ఉద్యోగం సంపాదిస్తాడు. తనకున్న తెలివితో పెద్ద పొజిషియన్‌కి వెళ్తాడు. ఇల్లు, కారు కొంటాడు. బాగా ఆస్తులు ఉన్న అమ్మాయి పల్లవి (కయాదు లోహర్)తో పెళ్ళి కూడా ఫిక్స్ అవుతుంది. లైఫ్ అంతా సాఫీగా సాగుతున్న సమయంలో ఫేక్ సర్టిఫికెట్స్ గురించి ప్రిన్సిపల్‌కి తెలుస్తుంది. ఈ విషయం తాను ఉద్యోగం చేస్తున్న కంపెనీతో పాటు పిల్లనిచ్చి పెళ్లి చేయబోతున్న మామగారికి చెప్పకుండా ఉండాలంటే కాలేజీకి వచ్చి చదువుకొని పెండింగ్‌లో ఉన్న 48 సబ్జెక్టులు పాస్ అవ్వాలని కండీషన్ పెడతాడు. పరీక్షలకు మూడు నెలల సమయమే ఉంటుంది. దీంతో వేరే దారిలేక తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ కాలేజీకి వెళ్తాడు డ్రాగన్. ఆ తర్వాత ఏం జరిగింది? కాలేజీకి మళ్లీ కీర్తి ఎందుకు వచ్చింది? ఆఫీస్‌లో,ఇంట్లో అబద్దం చెప్పి కాలేజీకి వచ్చిన డ్రాగన్‌కి ఎదురైన సమస్యలు ఏంటి? నిజంగానే 48 సబ్జెక్టుల్లో పాస్ అయ్యాడా? లేదా? పల్లవితో పెళ్లి జరిగిందా? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. #Dragon Opening pic.twitter.com/BJyckrx1FA— Pradeep Ranganathan (@pradeeponelife) February 24, 2025 -
ఇంగ్లిష్‌లో యశ్ ‘టాక్సిక్’
‘కేజీఎఫ్: చాప్టర్ 1, కేజీఎఫ్: చాప్టర్ 2’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీస్‌తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు హీరో యశ్(yash). ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సిక్(toxic): ఏ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్ అప్స్’. గీతూ మోహన్ దాస్ దర్శకుడు. కేవీఎన్ ప్రొడక్షన్స్, యశ్ మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్‌పై వెంకట్ కె.నారాయణ నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాని కన్నడతో పాటు గ్లోబల్ ఆడియన్స్ కోసం ఇంగ్లిష్‌లోనూ చిత్రీకరిస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్.గీతూ మోహన్ దాస్ మాట్లాడుతూ– ‘‘విభిన్న భాషా, సాంస్కృతిక నేపథ్యంలో రాబోతున్న ‘టాక్సిక్’ మూవీని అన్ని భాషల, ప్రాంతాల ప్రేక్షకులు ఆస్వాదించేలా రూపొందిస్తున్నాం’’ అన్నారు. ‘‘ఇంగ్లిష్‌లో చిత్రీకరిస్తున్న మొదటి భారతీయ చిత్రంగా ‘టాక్సిక్’ రికార్డుల్లోకి ఎక్కింది. మా సినిమా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లోకి డబ్ అవుతుంది’’ అని వెంకట్ కె.నారాయణ తెలిపారు. -
ఆర్య హీరోగా వస్తోన్న స్పై థ్రిల్లర్.. తెలుగు టీజర్ వచ్చేసింది!
కోలీవుడ్ స్టార్ ఆర్య హీరోగా నటించిన తాజా చిత్రం 'మిస్టర్ ఎక్స్'. ఈ చిత్రానికి మను ఆనంద్ దర్శకత్వం వహించారు. గూఢచారుల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ తెలుగు టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే తమిళ టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.భారతీయ గూఢచర్య వీరుల జీవితాల ఆధారంగా ఈ కథను తెరకెక్కించినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. దేశాన్ని కాపాడటం మన పని మాత్రమే కాదు.. అది మన బాధ్యత.. అంటూ అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది. శత్రువుల నుంచి మనదేశాన్ని కాపాడే నేపథ్యంలో ఈ కథను రూపొందించారు. ప్రధానంగా ఓ న్యూక్లియర్ డివైజ్ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందని టీజర్లోనే తెలుస్తోంది. కాగా.. ఈ స్పై థ్రిల్లర్ సినిమాను వినీత్ జైన్, ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రంలో గౌతమ్ రామ్ కార్తీక్, శరత్ కుమార్, మంజు వారియర్, అనఘా, రైజా విల్సన్, అతుల్య రవి, జయప్రకాష్, కాళి వెంకట్ కీలక పాత్రల్లో నటించారు. -
అలాంటి మాంసం కూడా తిన్నా.. రుచికరంగా..: టాలీవుడ్ విలన్
ఒకప్పుడు విలన్లను చూస్తేనే భయపడేవాళ్లు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. విలన్లు కూడా మంచి ఎత్తూపొడుగూ ఉంటున్నారు. హీరోలతో పోటీపడేలా బాడీని మెయింటైన్ చేస్తున్నారు. ఫిట్నెస్తో అబ్బురపరుస్తున్నారు. ఈ జాబితాలో నటుడు ఆదిత్య మీనన్ (Adithya Menon) ఉన్నాడు. మిర్చి, బిల్లా, పుష్ప.. ఇలా ఎన్నో సినిమాల్లో విలనిజం పండించిన ఆయన తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.హీరోగా ఛాన్సులు..ఆదిత్య మాట్లాడుతూ.. హీరోలకు బాధ్యత ఎక్కువ ఉంటుంది. అందుకే హీరోగా అవకాశాలు వచ్చినా వదిలేసుకున్నాను. వివిధ రకాల పాత్రలు చేయడం ఇష్టం. అందుకే క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నాను. కెరీర్ ప్రారంభంలో వచ్చిన పాత్రలన్నీ చేసుకుంటూ పోయాను. తర్వాత నాకు ఏవి సెట్టవుతాయి? ఏవి సెట్టవవు? అని ఆలోచించి సెలక్టివ్‌గా సినిమాలు ఎంచుకుంటున్నాను.(చదవండి: రూ.50 లక్షల ప్రైజ్‌మనీ.. ఇంతవరకు ముట్టనేలేదు: బిగ్‌బాస్ విజేత)చిత్రవిచిత్ర దేశాలకు వెళ్తుంటా.. నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. దేశవిదేశాలు తిరుగుతూ ఉంటాను. అందరూ వెళ్లే ప్రదేశాలకు కాకుండా భిన్నమైన ప్లేసెస్‌కు వెళ్తుంటాను. అక్కడి ప్రజల గురించి, అలవాట్ల గురించి తెలుసుకుంటాను. వారి వంటకాలు ట్రై చేస్తాను. అక్కడ గుర్రపు మాంసం తిన్నాను. ఇదే కాదు పాము మాంసం, కప్ప కాళ్లు, మొసలి మాంసం తిన్నాను. పాము తోలు తీసి, ముక్కలు చేసి వండిస్తారు, బాగుంటుంది. నేను నాస్తికుడిని, భగవంతుడు ఉన్నాడని నమ్మను అని చెప్పుకొచ్చాడు.సినిమాఆదిత్య మీనన్.. తెలుగులో బిల్లా, సింహా, అధినాయకుడు, కృష్ణం వందే జగద్గురుం, ఈగ, బాద్షా, బలుపు, మిర్చి, పవర్, లయన్, పండగ చేస్కో, రుద్రమదేవి, అమర్ అక్బర్ ఆంటోని, కార్తికేయ 2, పుష్ప 2.. ఇలా పలు చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు. ఈయన తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ అనేక సినిమాలు చేశాడు.చదవండి: కావాలనే రాంగ్ మెడిసిన్ ఇచ్చారు.. చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో నటుడు -
కావాలనే రాంగ్ మెడిసిన్ ఇచ్చారు.. చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో..: బాలా
నాకు హానికరమైన ఔషధాలు ఇచ్చి నా ఆరోగ్యం చెడగొట్టారు అంటున్నాడు మలయాళ నటుడు బాలా (Actor Bala). రెండేళ్ల క్రితం ఆయనకు కాలేయ మార్పిడి జరిగింది. ఆ సమయంలో తను కోలుకోకుండా చేయాలన్న ప్రయత్నాలు జరిగాయంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలా మాట్లాడుతూ.. నాకు ఇప్పటివరకు రెండు సర్జరీలు జరిగాయి. రెండేళ్ల క్రితం నేను చనిపోయానని వదంతులు పుట్టుకొచ్చాయి. కానీ, చూడండి నేను మీ ముందు ఇలా ఆరోగ్యంగా నిలబడ్డాను.తనెవరో చెప్పనుఅయితే సర్జరీ జరిగాక గతేడాది నాకు మంచి మెడిసిన్ ఇవ్వలేదు. దానికి బదులుగా నా ఆరోగ్యాన్ని దిగజార్చే ఔషధాలు ఇచ్చారు. రాంగ్ మెడిసిన్ ఎవరిచ్చారన్నది నేను చెప్పను. అయితే ఆ విషయం తెలియక గుడ్డిగా అవే ఉపయోగించాను. తీవ్ర అనారోగ్యంతో పదిరోజులపాటు ఆస్పత్రిపాలయ్యాను. అప్పుడు నా బంధువైన కోకిల ఒక తల్లిలా నాకు సేవ చేసింది. అప్పుడే తను నన్నెంత ప్రేమిస్తుందో అర్థమైంది.చనిపోయానని అనుకున్నారునేను ఐసీయూలో ఉన్నప్పుడు మరణించానన్న వార్తలు పుట్టుకొచ్చాయి. ఆ సమయంలో నాకు వెంటిలేటర్ తీసేయాలనుకున్నారు. అంతర్గత అవయవాలు పని చేయడం లేదన్నారు. కిడ్నీ, లివర్, బ్రెయిన్.. ఇలా ఒక్కొక్కటిగా అన్నీ పని చేయడం ఆగిపోతున్నాయి. అప్పుడు మా అమ్మ చెన్నైలో ఉంది. నా చావు ఖాయమని అర్థమై పోస్ట్‌మార్టమ్ చేయాలని నిర్ణయించుకున్నారు. నాకోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రార్థించారు. ముఖ్యంగా నా సినిమాలు చూసిన చిన్నపిల్లలు నేను బతకాలని బలంగా కోరుకున్నారు. అలాగే 25 ఏళ్లుగా నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాను. అరగంటలో అద్భుతంవీటన్నిటి ఫలితమో ఏమో కానీ.. అరగంటలో అద్భుతం జరిగింది. నాలో ప్రాణం తిరిగి వచ్చింది. నన్ను ఎంతో ప్రేమించిన కోకిలతో నా పెళ్లి జరిగి మూడు నెలలవుతోంది. ఈ మధ్యకాలంలో కూడా ఒకరికి హార్ట్ సర్జరీ చేయించాను, స్కూల్ కట్టించాను. కోకిల స్థానంలో మరొకరుంటే కచ్చితంగా నాపై ఫిర్యాదు చేసేవారు. కానీ కోకిలకు నా లక్ష్యం ఏంటో తెలుసు. రేపు మాకు పుట్టబోయే బిడ్డ కూడా ఇదే సేవా మార్గంలో వెళ్లాలని కోరుకుంటాను అని పేర్కొన్నాడు.చిత్రహింసలు పెట్టాడన్న మూడో మాజీ భార్యకాగా మలయాళ నటుడు బాలా ఇప్పటివరకు నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. రెండో మాజీ భార్య అమృత గతేడాది అతడిపై వేధింపుల కేసు పెట్టింది. మూడో మాజీ భార్య ఎలిజబెత్ ఇటీవలే సోషల్ మీడియా వేదికగా బాలా తనను చిత్రహింసలు పెట్టాడన్న విషయాన్ని వెల్లడించింది. బాలాకు విషపూరితమైన మెడిసిన్ ఇచ్చారన్న ఆరోపణలను కొట్టిపారేస్తూ.. అది నిజమని నిరూపించమని సవాల్ విసిరింది. ఈ క్రమంలోనే బాలా పై కామెంట్లు చేసినట్లు తెలుస్తోంది.చదవండి: అభిమాని అత్యుత్సాహం.. కోపంతో ఫోన్ లాక్కున్న హీరో