ఒకే ఒక్కడు మూవీ షూటింగ్.. నాకోసం పది నిమిషాల్లోనే..! | Arjun Sarja Daughter Aishwarya Comments About Her Father | Sakshi
Sakshi News home page

Arjun Sarja: ఒకే ఒక్కడు మూవీ షూటింగ్.. నాకోసం పది నిమిషాల్లోనే..!

Feb 10 2026 7:30 PM | Updated on Feb 10 2026 7:42 PM

Arjun Sarja Daughter Aishwarya Comments About Her Father

హీరో అర్జున్‌ సర్జా కుమార్తె ఐశ్వర్య, నిరంజన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సీతా పయనం’. ఈ మూవీకి అర్జున్‌ దర్శకత్వం వహించడంతో పాటు అతిథి పాత్రలో నటించారు. శ్రీ రామ్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా ఈ నెల 14న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ సినీ ప్రియులను ఆకట్టుకుంది.

మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు అర్జున్‌, ఆయన కూతురు ఐశ్వర్య. తండ్రి, కూతురు తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు ఐశ్వర్య అర్జున్. తాను చెన్నైలో స్కూల్లో చదివే సమయంలో కడుపునొప్పిగా ఉందని డాడీకి కాల్ చేశానని తెలిపింది. అప్పుడు నాన్న ఒకే ఒక్కడు సినిమా షూటింగ్‌లో ఉన్నారు. దాదాపు నాకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ నేను చెప్పగానే నాకోసం హుటాహుటిన స్కూల్‌కు వచ్చేశారని ఐశ్వర్య అర్జున్‌ వెల్లడించారు.
 
ఆ రోజు నేను చాలా వేగంగా డ్రైవ్ చేస్తూ వచ్చానని ‍అర్జున్‌ సర్జా తెలిపారు. ఆ రోజు నా డ్రైవింగ్ చూసి చాలామంది తిట్టుకుని ఉంటారని అన్నారు. వీరిద్దరి బాండింగ్ చూస్తుంటే కూతురంటే అర్జున్‌కు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రంలో సత్యరాజ్, ప్రకాశ్‌రాజ్, కోవై సరళ, అర్జున్‌ మేనల్లుడు ధ్రువ సర్జా కీలక పాత్రలు పోషించారు.

Advertisement
 
Advertisement
Advertisement