శాండల్‌వుడ్ హీరో యశ్ నటిస్తోన్న మోస్ట్ అవేటేడ్ యాక్షన్ థ్రిల్లర్ టాక్సిక్. కేజీఎఫ్-2 తర్వాత రాకింగ్ స్టార్ ఈ మూవీతోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇటీవల టీజర్ రిలీజ్ చేయగా పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. ముఖ్యంగా బోల్డ్ సీన్ పెట్టడంపై దర్శకురాలిపై విమర్శలు చేశారు. ఈ చిత్రానికి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహంచారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 19న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ఈ మూవీ తెలుగు రాష్ట్రాల హక్కులను దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర డిస్ట్రిబ్యూటర్స్ దక్కించుకుంది. దాదాపు రూ.120 కోట్ల డీల్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే తాజాగా ఈ మూవీకి మరో బిగ్ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. ఓవర్‍సీస్‌లో ఇండియన్ లాంగ్వేజేస్‌కి దాదాపు రూ.105 కోట్లకు బిజినెస్ ఓకే అయినట్లు సమాచారం. ప్రముఖ విదేశీ పంపిణీదారు అయిన ఫార్స్ ఫిల్మ్స్‌తో ఈ డీల్ చేసుకుంది. దీంతో ఒక ఇండియన్ సినిమాకు అత్యధిక డీల్ సాధించిన చిత్రంగా టాక్సిక్ నిలవనుంది. రూ. 105 కోట్ల విదేశీ డీల్ రావడం భారతీయ సినిమాకు దక్కిన ఘనతగా భావిస్తున్నారు.
ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ డీల్‌తో ఓవర్‌సీస్‌లో ఇండియన్ భాషల్లో ఫార్స్ ఫిల్మ్ ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. ఈ బిగ్ డీల్ భారతీయ చిత్రానికి ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద అంతర్జాతీయ విడుదల అవుతుందని భావిస్తున్నారు. ఈ చిత్రం నేపాల్, జపాన్, చైనా మినహా దాదాపు అన్ని ప్రపంచ దేశాల్లో విడుదల కానుంది. కాగా.. ఈ చిత్రాన్ని ఓకేసారి కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో చిత్రీకరించారు. ఈ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది.


