breaking news
Toxic Movie
-
ఇదో కొత్త అనుభూతి.. ‘టాక్సిక్’పై స్టార్‌హీరోల ప్రశంసలు
యశ్ హీరోగా వచ్చిన లేటేస్ట్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా టాక్సిక్. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 26న థియేటర్లలో విడుదలైంది. తొలిరోజే నెగెటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా వసూళ్ల పరంగా బాగానే రాణించింది. మొదటి రోజే రూ.140 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. అయితే యాశ్ నటించిన ఈ ప్రయోగాత్మక చిత్రానికి కన్నడ చిత్రసీమ నుంచి గట్టి మద్దతు లభిస్తోంది. యశ్‌ను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.ఇలా చేయడానికి ధైర్యం కావాలి‘ఓ పాత్రను తెరపై ఆవిష్కరించేందుకు నటుడు ఎంతగా కష్టపడతాడో ‘టాక్సిక్’లో యశ్ చూపించాడు. కథ, పాత్రలు సినిమాల తరహాలో లేకపోయినా కొత్తగా ప్రయాణించడం తప్పు కాదు. మనసులో పుట్టిన ఆలోచనను తెరపై తీసుకురావడం అంత సులభం కాదు. యశ్ ఈ సినిమాలో పూర్తిగా లీనమైపోయాడు. ఇలాంటి ప్రయోగం చేయడానికి ముందుకు వచ్చినందుకు హ్యాట్సాఫ్’ అంటూ రిషబ్ శెట్టి ప్రశంసించాడు.( యశ్ టాక్సిక్ వసూళ్లు.. రెండో రోజే తేల్చేశారు..!)‘సాధారణమైన, ఊహించని మార్గాన్ని ఎంచుకోకుండా కొత్తగా ప్రయత్నించారు. ఇలాంటి సినిమా చేయడానికి నమ్మకం, ధైర్యం అవసరం. టాక్సిక్ అసాధారణమైన, ప్రశంసించదగన ప్రయత్నం’ అంటూ కిచ్చా సుదీప్ సైతం పేర్కొన్నాడు.‘టాక్సిక్ ఒక ఫెయిరీ టేల్. కానీ పెద్దల కోసం. అద్భుతమైన సినిమా. సరికొత్త ప్రపంచం, పూర్తిగా కొత్త అనుభూతి. యశ్‌తో పాటు మొత్త చిత్రబృందానికి హ్యాట్సాఫ్’ అంటూ నటుడు ఉపేంద్ర పోస్ట్ చేశారు.ఇదీ చదవండి: రాసింది ఒకటి.. తీసింది మరోకొటి.. ‘టాక్సిక్’ దర్శకురాలి వ్యాఖ్యలు వైరల్అసలు టాక్సిక్‌లో ఏం చూపించారంటే..గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన టాక్సిక్ గ్యాంగ్ స్టార్ డ్రామాగా తెరకెక్కించారు. పోర్చిగీసు కాలం నాటి గోవా నేపథ్యాన్ని జోడించి తీశారు. యశ్ పోషించిన రాయా అనే పాత్ర నేరాలు చేయడానికి గల కారణాలు ఏంటి? అతడితో సోదరి అనుభందం ఏంటి? అనే అంశాల చుట్టు కథ నడుస్తూ ఉంటుంది. -
TOXIC సినిమాపై అన్నామలై ఘాటు విమర్శలు
-
రుక్మిణి తండ్రి వెనుక ఇంత చరిత్ర ఉందా..?
రుక్మిణి వసంత్. ఈ బామ కోసం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కన్నడతో పాటు తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. తన నటనతో, యాక్షన్ సీక్వెన్స్‌లతో మంత్రముగ్ధులను చేస్తూ ఉంటుంది. ఇటీవలే టాక్సిక్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించింది. ఇదే మూవీ ఈవెంట్లో తన తండ్రిని గుర్తుతెచ్చుకుని ఎమోషనల్ అయింది.రుక్మిణి వసంత్ తండ్రి కల్నల్ వసంత్ వేణుగోపాల్. దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. 2007లో జమ్మూకశ్మీర్‌లోని ఉరీలో ఉగ్రవాదులతో జరిగిన పోరులో వీరమరణం పొందారు. అప్పటికి రుక్మిణి వయసు కేవలం పదేళ్లు. ఈవిషయాన్ని టాక్సిక్ ఈవెంట్లో రుక్మిణిని పరిచయం చేస్తూ ఆమె తండ్రి ఓ అమరవీరుడని నిర్వాహకులు చెప్పడంతో ఆమెతో పాటు అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు.అదే అంకితభావంతో..‘నాన్న ఎంతో మంచి వ్యక్తి. ఆయన విధి పట్ల ఎంతో అంకితభావంతో ఉండే సైనికుడు కూడా. సైనికులను ఎక్కడికి పంపినా..నాన్నే మందుండేవారు. అదే అంకితభావం నా వ్యక్తిత్వంపై కూడా ఎంతో ప్రభావం చూపింది. ఆయన దేశానికి చూసిన సేవలను గుర్తుచేసుకుంటూ నేను కూడా అదే పనిలో అదే అంకితభావాన్ని చూపించేందుకు ప్రయత్నిస్తాను’ అని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.కర్ణాటక నుంచి తొలి అశోకచక్ర గ్రహీత 2007 జూలై 31న ఉరీ ప్రాంతంలో ఉగ్రవాదులతో కల్నల్ వసంత్ వేణుగోపాల్ పోరాడారు. ఈ ఘటనలో ఆయన వీరమరణం పొందారు. ధైర్యసాహసాలకు ఆయన మరణాంతరం అశోక చక్ర లభించింది. కర్ణాటకకు చెందిన తొలి ఆర్మీ అధికారిగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు.అలాంటివారిని ఆదుకునేందుకు ఓ ఫౌండేషన్..భర్తను కోల్పోయినా తర్వాత కూడా రుక్మిణి తల్లి సుభాషిణి వసంత్ ఇద్దరు కుమార్తెల బాధ్యతలను చేపట్టారు. అమరవీరుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు ‘వసంతరత్నం ఫౌండేషన్ ఫర్ ఆర్ట్’ను స్థాపించారు. సైనక కుటుంబాలకు సహాయం అందించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.నాన్న ఉంటే మద్దతుగా ఉండేవారు..తన తండ్రి ఉన్న సమయంలో తాను నృత్యంపై ఎక్కువ ఆసక్తి చూపేదానిని అని రుక్మిణి తెలిపారు. ‘ నాన్న మాపై ఎప్పుడూ కఠినంగా ఉండేవారు కాదు. చాలా బాగా చూసుకునేవారు. నేను నటనను కెరీర్‌గా ఎంచుకోవడాన్ని చూసి ఆయన తప్పకుండా సంతోషపడేవారు. ప్రోత్సహించేవారు. అని ఆమె గతంలో చెప్పుకొచ్చారు.సినిమాల విషయానికి వస్తే..కాంతార, తదితర చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న రుక్మిణి వసంత్... యశ్ నటించిన టాక్సిక్ సినిమాతో మరింత క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్ సరసన ‘డ్రాగాన్’ మూవీలో నటిస్తోంది. ఈ సినిమా 2027లో విడుదల కానుంది.ఇదీ చదవండి: జార్జ్‌కుట్టి.. ఈసారి అయినా లొంగిపోవయ్యా..! -
యశ్ ‘టాక్సిక్’కు అన్నామలై రివ్యూ
కన్నడ స్టార్ యశ్ నటించిన భారీ యాక్షన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘టాక్సిక్’ విడుదలైన తొలి రోజే భారీ వసూళ్లు సాధించింది. అయితే కంటెంట్ కారణంగా పూర్తిగా నెగెటివ్ రివ్యూలతో ట్రోలింగ్‌ను ఎదుర్కొంటోంది. మరోవైపు సినిమా వివాదంలో చిక్కుకుంది. సినిమాలో మహిళలను అతిగా చూపించారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బీజేపీ మాజీ నేత, ‘వీ ది లీడర్స్’ వ్యవస్థాపకుడు కె. అన్నామలై ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. సినిమాకు సెన్సార్ బోర్డు ఇచ్చిన అనుమతిపైనా ప్రశ్నలు సంధించారు.సినిమాల్లో మహిళల చిత్రీకరణ విషయంలో సెన్సార్ నిబంధనలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందని అన్నామలై అన్నారు. ప్రముఖ హీరోలు నటించే సినిమాల విషయంలోనూ ఏ సన్నివేశాలు అనుమతించాలి? ఏవి అనుమతించకూడదనే అంశంపై సెన్సార్ బోర్డు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.పిల్లలపై ప్రభావం:‘టాక్సిక్’కు తొలి రోజే రూ.104 కోట్ల వసూళ్లు వచ్చాయని ప్రస్తావించిన అన్నామలై.. ఇలాంటి సినిమాలు పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘మహిళలను ఒక నిర్దిష్ట కోణంలో చూపిస్తున్నారు. పిల్లలు ఇలాంటి చిత్రాలను పదేపదే చూస్తే.. సమాజంలో మహిళల పట్ల వారి దృక్పథం ఎలా మారుతుంది?’’ అంటూ ప్రశ్నించారు.మహిళల భద్రత, గౌరవం కోసం తాము పట్టణాలు, కళాశాలలకు వెళ్లి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అలాంటి సమయంలో మహిళలను సమస్యాత్మకంగా చూపించే సన్నివేశాలతో ఉన్న సినిమాకు సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వడం తనకు ఆందోళన కలిగిస్తోందన్నారు. సినిమాల్లో మహిళలకు తగిన గౌరవం దక్కుతోందా? అని ప్రశ్నించారు.యశ్ రియాక్షన్‘టాక్సిక్’పై మహిళల చిత్రీకరణకు సంబంధించి ఇప్పటికే విమర్శలు రావడంతో.. హైదరాబాద్‌లో జరిగిన సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో యశ్ స్పందించారు. ట్రైలర్లో కనిపించిన కొన్ని సన్నివేశాలను చూసి సినిమా మొత్తాన్ని అంచనా వేయొద్దని అన్నారు. దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ మహిళా పాత్రలను బలంగా తీర్చిదిద్దారని చెప్పారు.‘‘ప్రతి మహిళ, ప్రతి అమ్మాయి ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొని.. తన అభిప్రాయాలను, ఆలోచనలను వ్యక్తం చేసి.. సమాజంలో విజయం సాధించగలదనే విషయాన్ని ఈ సినిమా చూపిస్తుంది’’ అని యశ్ పేర్కొన్నారు. సినిమాలో మహిళలకు ప్రత్యేకమైన స్వరం ఉందని, ట్రైలర్ ద్వారా ఏర్పడిన అభిప్రాయం కంటే సినిమా భిన్నంగా ఉంటుందని చెప్పారు. అమ్మాయిలంతా థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని, ఆస్వాదించాలని కోరారు.భారీ అంచనాలతో ‘టాక్సిక్’‘టాక్సిక్’కు గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, యశ్‌కు చెందిన మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో రూపొందిన ఈ పీరియడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో యశ్ ద్విపాత్రాభినయం చేశారు. నయనతార, తారా సుతారియా, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషీ, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటించారు.ఇదీ చదవండి: నీతులు చెప్పే చైనాకు.. బాన్కియావో ఘోరకలి గుర్తుందా? -
దూసుకుపోతున్న TOXIC ఫస్ట్ డే కలెక్షన్ ఎంతంటే?
-
యశ్ టాక్సిక్ వసూళ్లు.. రెండో రోజే తేల్చేశారు..!
యశ్ హీరోగా వచ్చిన లేటేస్ట్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా టాక్సిక్. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 26న థియేటర్లలో విడుదలైంది. తొలిరోజే నెగెటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా వసూళ్ల పరంగా బాగానే రాణించింది. మొదటి రోజే రూ.140 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. యశ్ నటన మినహాయిస్తే కథలో బలం లేకపోవడం టాక్సిక్ను దెబ్బతీసింది.మొదటి రోజు వసూళ్లపరంగా రాణించిన టాక్సిక్.. రెండో రోజే చతికిలపడింది. నెగెటివ్ టాక్ రావడంతో ఆడియన్స్ థియేటర్లకు మొహం చాటేశారు. దీంతో టాక్సిక్ కేవలం రూ. 49.75 కోట్లకే పరిమితమైంది. దీంతో రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 190.75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ వసూళ్లతో ధురందర్ 2, పుష్ప 2, కేజీఎఫ్: చాప్టర్ 2, ఆర్ఆర్ఆర్ చిత్రాల కంటే వెనకే ఉంది. ధురందర్ 2 రెండో రోజు ఇండియాలోనే సుమారు రూ. 80.72 కోట్ల నికర వసూళ్లు సాధించగా.. పుష్ప 2 రూ. 93.80 కోట్ల నెట్, కేజీఎఫ్ చాప్టర్ 2 రూ. 90.50 కోట్లు, ఆర్ఆర్ఆర్ రూ. 86.70 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టాయి.కాగా.. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన రెండో రోజే తేలిపోయింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలిపోనుంది. ఈ మూవీ ఇండియా వ్యాప్తంగా రెండు రోజుల్లో రూ. 137.50 కోట్ల నెట్.. రూ. 164.50 కోట్ల కలెక్షన్స్‌కే పరిమితమైంది. ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా కీలక పాత్రల్లో నటించారు. -
రాసింది ఒకటి.. తీసింది మరోకొటి.. ‘టాక్సిక్’ దర్శకురాలి వ్యాఖ్యలు వైరల్
గెలుపుకి కారణాలు వెతుకుతారో లేదో కానీ ఓటమికి మాత్రం కచ్చితంగా నిందితులను వెతుకుతారు. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో ఇది ఎక్కువగా ఉంటుంది. ఒక సినిమా ఫ్లాప్ అయితే.. ఆ నింద హీరో కంటే ఎక్కువగా దర్శకుడిపైనే పడుతుంది. ‘టాక్సిక్’విషయంలోనూ అదే జరిగింది. యశ్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిన్న(ఆగస్టు 26) ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ని సంపాదించుకుంది.యశ్ స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను పలువురు ప్రేక్షకులు ప్రశంసిస్తున్నా.. కథ, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్, నెమ్మదైన నేరేషన్, ఎమోషనల్ కనెక్ట్ విషయంలో మాత్రం తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ గతంలో చెప్పిన ఓ మాటలకు సంబంధించిన పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తను సినిమా తీసిన విధానం గురించి మాట్లాడుతూ.. ‘నేను రాసింది ఒకటి. తీసింది మరొకటి. ఎడిటింగ్ చేసింది ఇంకొకటి. మొత్తానికి సినిమా బయటకు వచ్చింది. నేను చాలా హ్యాపీ’ అని గీతూ చెప్పినట్లు ఆ వీడియోలో ఉంది. సినిమా తెరకెక్కించే క్రమంలో స్క్రిప్ట్ రాసిన విధానం, షూటింగ్లో వచ్చిన మార్పులు, చివరగా ఎడిటింగ్‌లో రూపుదిద్దుకున్న సినిమా ఒకేలా ఉండకపోవచ్చని ఆమె వ్యాఖ్యల ఉద్దేశంగా కనిపిస్తోంది. ‘టాక్సిక్’ విడుదలై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తున్న వేళ ఈ పాత వ్యాఖ్యలు మళ్లీ చర్చలోకి వచ్చాయి.#Toxicthemovie Director #GeetuMohandas 🧐Evlo talented ah irukkura directors nalla scripts oda Producer kedaikkama irukaanga😑4 Years of #Yash Call Sheet…Producers Amount Ellam waste pandra Director dha ivanga…#TOXIC - TRASH 🚶🏻♂️ pic.twitter.com/iNW3D550BT— 𝚅𝚎𝚗𝚔𝚊𝚝 𝙶𝚅 (@Itz_Venkatesh55) August 26, 2026 -
టాక్సిక్ డిజాస్టర్.. డైరెక్టర్ గీతూ కామెంట్స్ వైరల్..!
కేజీఎఫ్ హీరో యశ్ నటించిన లేటేస్ట్ మూవీ టాక్సిక్. దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత మరో యాక్షన్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. భారీ బడ్జెట్ మూవీ కావడంతో అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. టీజర్ నుంచి సాంగ్స్, ట్రైలర్‌పై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. అయినా కూడా మేకర్స్ ఎక్కడా తగ్గలేదు. సమ్మర్లో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడుతూ ఆగస్టు 26న థియేటర్లలో సందడి చేసింది.ఈ మూవీకి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన టాక్సిక్ మూవీకి తొలి షో నుంచే నెగెటివ్ టాక్ వచ్చింది. యశ్ యాక్టింగ్ బాగానే ఉన్నప్పటికీ కథలో ఎలాంటి బలం లేదని నెటిజన్స్ తేల్చేశారు. మొదటి రోజే నెగెటివ్ టాక్ రావడంతో టాక్సిక్ మేకర్స్‌కు బిగ్ షాక్ తగిలినట్లైంది. నాలుగేళ్ల తర్వాత వచ్చిన మూవీ కావడంతో యశ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ మూవీకి డిజాస్టర్ టాక్‌తో డైరెక్టర్ గీతూపై యశ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.ఈ నేపథ్యంలోనే గీతూ మోహన్‌దాస్ పాత వీడియో నెట్టింట తెగ వైరవుతోంది. గీతూ 2021లో ఈ సినిమా గురించి మాట్లాడిన ఒక ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. నేను స్క్రిప్ట్ ఒకటి రాస్తాను.. ఇంకొకటి చిత్రీకరిస్తానని ఈ వీడియోలో మాట్లాడింది. నా రచనలో నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలియదు.. ఒక స్క్రిప్ట్‌పై ఒకరి కంటే ఎక్కువ మంది కలిసి పనిచేస్తున్నప్పుడు పరిస్థితి గందరగోళంగా ఉంటుందని తెలిపింది. కొందరు విమర్శలు చేసి వెళ్లిపోతారు.. కానీ నేను వాటిని పట్టించుకోనని వెల్లడించింది. తన టీమ్‌లో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ ఉంటామని గీతూ పేర్కొంది.ఈ చిత్రాన్ని స్త్రీ దృష్టికోణంతో కూడిన గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఆమె అభివర్ణించారు. నేను రాసిన స్క్రిప్టులన్నీ నా సొంతంగానే రాశానని తెలిపారు. నా తర్వాతి సినిమా కోసం రైటర్స్ రూమ్ ఉండటం ఇదే మొదటిసారని అన్నారు. నేను ఒకటి రాస్తాను.. మరొకటి చిత్రీకరిస్తాను.. ఇంకొకటి ఎడిట్ చేస్తాను.. ఆ తర్వాత సినిమా విడుదల అవుతుందన్నారు. అప్పుడు నేను చాలా సంతోషంగా ఉంటా.. అందుకే నేను ఎప్పుడూ స్క్రిప్ట్‌కు కట్టుబడి ఉండనని గీతూ మోహన్ దాస్ తెలిపింది. ఈ కామెంట్స్‌ను కొందరు వ్యతిరేకిస్తుండగా.. మరికొందరు సమర్థిస్తున్నారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ నటించారు.KVN Productions should have listened to this disclaimer. Pun by @coachravindrak - #ToxicTheMovie 😊 pic.twitter.com/QZKgvSREjo— Parth Chaturvedi (@_mrchaturvedi) August 27, 2026 -
టాక్సిక్ ఫస్ట్‌డే కలెక్షన్స్ : డివైడ్ టాక్.. అయినా దుమ్ములేపింది!
‘స్టార్’ పవర్ ఉంటే నెగెటివ్ టాక్ కూడా ‘నీటిమీద రాతే’ అని టాక్సిక్ మూవీ వసూళ్లు నిరూపించాయి. రాకింగ్ స్టార్ యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిన్న(ఆగస్టు 27) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. తెలుగు ప్రేక్షకులు అయితే చాలా వరకు నెగెటివ్ రివ్యూస్ ఇచ్చారు. ఆశించిన స్థాయిలో సినిమా లేదని చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. పలు న్యూస్ వెబ్సైట్లు కూడా ఈ సినిమాపై నెగెటివ్ రివ్యూనే ఇచ్చాయి. (చదవండి: టాక్సిక్ మూవీ రివ్యూ)అయితే ఈవేవి ‘టాక్సిక్’ కలెక్షన్స్‌కు అడ్డుగా మారలేదు. తొలి రోజు రికార్డు స్థాయిలో వసూళ్లను సాధించింది రాకింగ్ స్టార్ పవర్ ఏంటో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్‌కు చూపించింది. సినీ వర్గాల సమాచారం ప్రకారం తొలి రోజు ఈ చిత్రానికి ఇండియాలో రూ. 120 కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిందని మేకర్స్ ప్రకటించారు. వీటిలో హిందీ వెర్షన్ అత్యధికంగా రూ. 55 కోట్లు వసూలు చేయగా.. తెలుగులో రూ. 16 కోట్లు వచ్చినట్లు నివేదికలు పేర్కొన్నాయి. కన్నడలో రూ. 23.3 కోట్లు, తమిళంలో రూ. 5.5 కోట్లు, మలయాళంలో రూ. 1.3 కోట్లు కలెక్ట్ చేసినట్లు వెల్లడించారు. -
టాక్సిక్‌పై తప్పుడు ప్రచారం.. అలాంటి వారికి స్ట్రాంగ్ వార్నింగ్
టాక్సిక్ మూవీపై తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని బెంగళూరు కోర్టు హెచ్చరించింది. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారంపై స్పందించింది. టాక్సిక్ చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ వేసిన పిటిషన్‌పై బెంగళూరు కోర్ట్ విచారణ చేపట్టింది. ఈ సినిమాకు వ్యతిరేకంగా తప్పుడు, పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను ప్రచురించడం, షేర్ చేయడాన్ని నిషేధిస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.అంతేకాకుండా సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ఆంక్షలు విధించింది. టాక్సిక్‌కు సంబంధించి ఎలాంటి తప్పుడు వార్తలు సృష్టించినా వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ సినిమాను కించపరిచేలా మీడియాలోనూ పోస్ట్ చేయడం, స్ట్రీమింగ్ చేయడం, షేర్ చేయడం లాంటివి చేయకూడదని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులు సెప్టెంబర్ 28 వరకు అమల్లో ఉంటాయని కోర్టు తెలిపింది. కోర్టు విధించిన షరతులను ఉల్లంఘిస్తే ఎలాంటి నోటీసులు లేకుండానే వీటిని రద్దు చేస్తామని న్యాయస్థానం పేర్కొంది. -
టాక్సిక్ నెగెటివ్ టాక్... ఆ విషయంలో తగ్గేదేలే..!
యశ్ హీరోగా వచ్చిన లేటేస్ట్ యాక్షన్ మూవీ టాక్సిక్. ఈ చిత్రానికి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. కేజీఎఫ్-2 తర్వాత వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంతేకాకుండా ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్, ట్రైలర్‌పై విమర్శలు రావడంతో ఈ సినిమాపై మరింత హైప్ ఏర్పడింది. భారీ అంచనాలతో పాటు విమర్శల నేపథ్యంలో ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది.మొదటి షో నుంచే ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వినిపిస్తోంది. యశ్ నటనతో మెప్పించినా కథపై విమర్శలు వస్తున్నాయి. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత యశ్ మూవీ కావడంతో అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. తొలి రోజే నెగెటివ్ టాక్ రావడంతో ఫ్యాన్స్ సైతం నిరాశకు గురవుతున్నారు.కలెక్షన్ల వర్షం..అయితే ఈ మూవీకి నెగెటివ్ రివ్యూలు వస్తున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం దూసుకెళ్తోంది. తొలి రోజే దేశవ్యాప్తంగా సాయంత్రం 4 గంటలకే రూ.79.12 కోట్ల నికర వసూళ్లను సాధించిందని ప్రముఖ ట్రేడింగ్ సైట్ శాక్నిల్క్ వెల్లడించింది. కేవలం కన్నడ వర్షన్లో రూ.19 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. గతేడాది డిసెంబర్లో రిలీజైన దురంధర్ రూ.28 కోట్ల వసూళ్లను టాక్సిక్ అధిగమించింది. ఇప్పటికే పఠాన్, యానిమల్, జవాన్ చిత్రాలను కూడా దాటేసింది. అయితే కేజీఎఫ్ చాప్టర్- 2 రూ.116 కోట్ల తొలిరోజు వసూళ్ల ఆల్-టైమ్ కన్నడ ఇండస్ట్రీ రికార్డ్ మాత్రం అందుకోవడం కష్టంగానే అనిపిస్తోంది. కాగా..టాక్సిక్ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా ప్రధాన పాత్రల్లో నటించారు. -
టాక్సిక్ టాప్ లో ఉంది
-
'టాక్సిక్' మూవీ ట్రెండింగ్ లో నయనతార (ఫొటోలు)
-
టాక్సిక్ రివ్యూ.. హిట్టా..? ఫట్టా..?
-
'ఇరుముడి' కోసం థియేటర్ బయట ప్రజలు ధర్నా
ఇప్పుడంతా ఓటీటీ జమానా నడుస్తోంది. అయినా సరే గత కొన్ని నెలల నుంచి జనాలు కొత్త సినిమాలు చూసేందుకు థియేటర్లకు వెళ్తున్నారు. రవితేజ 'ఇరుముడి' కూడా నగరాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ప్రతిచోట ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరి నోట తెగ వినిపిస్తోంది. అయితే ఈ సినిమా ఆడుతున్న థియేటర్ ముందు ప్రజలు ధర్నా చేసిన విచిత్ర సంఘటన మాత్రం తెలంగాణలోని మక్తల్ అనే ఊరిలో కనిపించింది.(ఇదీ చదవండి: రవితేజకు కూడా తెలుసు.. వ్యాపారం వ్యాపారమే అని)నారాయణపేట జిల్లాలోని మక్తల్‌లో ఉన్న వెంకటరమణ థియేటర్లో గత ఐదు రోజుల నుంచి 'ఇరుముడి' సినిమాని ప్రదర్శించారు. అయితే బుధవారం ఉదయం వచ్చి చూసేసరికి దీనిని తీసేసి 'టాక్సిక్' వేశారు. థియేటర్‌కి దగ్గరకు వచ్చిన పలువురు ప్రజలు.. ఎలాగైనా 'ఇరుముడి' సినిమానే ప్రదర్శించాలని ధర్నాకు దిగారట. ఇందుకు సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.గత మూడు, నాలుగు రోజులుగా చాలామంది టికెట్లు దొరక్క వెనుదిరిగామని, మంగళవారం రాత్రి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు థియేటర్‌కు వెళ్లినా టికెట్లు దొరకలేదని... అవసరమైతే కింద కూర్చొని అయినా సినిమా చూస్తామని సదరు ప్రేక్షకులు/ప్రజలు అంటున్నారు. ఎవరి ఒత్తిడితో లేదా ఎవరి సూచనతో మూవీని తీసివేశారో? వెంకటరమణ థియేటర్ యాజమాన్యం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఇది కాస్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది.(ఇదీ చదవండి: స్వామి శరణం.. 'ఇరుముడి'పై రామ్ చరణ్ రివ్యూ) -
‘టాక్సిక్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్నటీనటులు : యశ్, నయనతార, కియరా అద్వానీ, హ్యుమా ఖురేషి, తారా సుతారియా, రుక్ష్మిణి వసంత్, డారెల్ డి సిల్వా తదితరులునిర్మాణ సంస్థలు: కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్నిర్మాత: వెంకట్ కె. నారాయణ, యష్కథ: గీతూ మోహన్‌దాస్, యష్దర్శకత్వం: గీతూ మోహన్దాస్సంగీతం: విశాల్ మిశ్రా,రవి బస్రూర్,తనిష్క్ బాగ్చీ, ఫహీమ్ అబ్దుల్లా, అర్స్లాన్ నిజామీనేపథ్య సంగీతం: రవి బస్రూర్సినిమాటోగ్రఫీ రాజీవ్ రవివిడుదల తేది: ఆగస్టు 26, 2026‘కేజీఎఫ్ 2’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత యశ్ నుంచి వచ్చిన చిత్రం ‘టాక్సిక్’. దాదాపు మూడేళ్ల క్రితమే ఈ సినిమా అనౌన్స్ చేశారు. అప్పటి నుంచి టాక్సిక్‌పై అంచనాలు ఏర్పడ్డాయి. ఇక పోస్టర్, టీజర్, ట్రైలర్ రిలీజ్ తర్వాత ఆ అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అందుకు తగ్గట్లుగానే ప్రమోషన్స్ కూడా చేశారు. మొత్తంగా రిలీజ్ ముందు వరకు అయితే దేశ వ్యాప్తంగా ఈ సినిమాపై బజ్ క్రియేట్ చేయడంతో చిత్రబృందం సక్సెస్ అయింది. మరి రిలీజ్ తర్వాత కూడా ఆ స్థాయి సక్సెస్‌ని అందుకుందా? యష్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం. కథేంటంటే..ఈ సినిమా కథ 1947-67 మధ్య గోవా నేపథ్యంలో సాగుతుంది. ఇండియాకు స్వాతంత్య్రం వచ్చినా.. గోవా ఇంకా పోర్చుగీసుల ఆధీనంలోనే ఉంటుంది. అక్కడ డ్రగ్స్, అక్రమ వ్యాపారాలు, గ్యాంగ్ వార్ జరుగుతూనే ఉంటుంది. గ్యాంగ్‌స్టర్ సాల్వడార్(డారెల్ డి'సిల్వా) నేతృత్వంలో ఈ ఇల్లీగల్ దందాలన్నీ జరుగుతుంటాయి. ఈ క్రైమ్ ప్రపంచంలోకి అడుగుపెడతాడు రాయ(యశ్). పుట్టగానే తల్లిదండ్రులను కోల్పోవడంతో అక్క గంగ(నయనతార) అన్నీ తానై తమ్ముడిని పెంచుతుంది. చిన్నప్పుడు ఎదురైన పరిస్థితుల ప్రభావంతో తమ్ముడిని గ్యాంగ్‌స్టర్‌గా మారేలా చేస్తుంది గంగ. రాయ ఓ సాధారణ వ్యక్తిగా గ్యాంగ్‌స్టర్ ప్రపంచంలో వచ్చి.. అక్కడ తనకంటూ ఓ సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటాడు. అదే సమయంలో రాయల్ సర్కస్ కంపెనీ అమ్మాయి నదియా(కియరా అద్వానీ)తో ప్రేమలో పడతాడు. అప్పటికే సాల్వడార్ కూతురు రెబెకా (తారా సుతారియా)తో రాయకు పెళ్లి అవుతుంది.నదియా తన జీవితంలోకి వచ్చిన తర్వాత రాయ జీవితంలో ఎలాంటి మలుపు వచ్చాయి. డబ్బు, అధికారం కోసం జరిగే పోరులో ఆయన చేసిన తప్పులు ఏంటి? తమ్ముడిని గ్యాంగ్‌స్టర్‌గా చూడాలన్న గంగ కోరిక నెరవేరిందా? ప్రాణంగా ప్రేమించిన నదియా గర్భవతి అని తెలిసినా కూడా.. రాయ ఆమె ముఖాన్ని కూడా చూడకపోవడానికి గల కారణం ఏంటి? ఈ కథలో మెలిసా (రుక్మిణి వసంత్) పాత్ర ఏమిటి? టికెట్(యశ్) ఎవరు? ఒకవైపు గ్యాంగ్‌స్టర్ ప్రపంచంలో ఆధిపత్యం కోసం జరిగే పోరు.. మరోవైపు కుటుంబాన్ని కాపాడుకోవాలనే తపన.. ఈ రెండింటి మధ్య యశ్ చేసిన ప్రయాణమే ‘టాక్సిక్’ కథ. ఎలా ఉందంటే..గ్యాంగ్‌స్టర్ కథలు అన్నీ దాదాపు ఒకేలా ఉంటాయి. హీరో అనుకోని పరిస్థితుల్లో నేర ప్రపంచంలోకి అడుగుపెట్టడం.. అక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా మారడం.. తనకంటూ ఓ సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడం.. ప్రత్యర్థులను ఎదుర్కొని డాన్‌గా ఎదగడం.. చివరకు తాను చేసిన తప్పులే తనకు ముప్పుగా మారడం..ఇలాంటి అంశాలతో ఎన్నో సినిమాలు ఇప్పటికే వచ్చాయి. ‘టాక్సిక్’ కూడా ఇదే తరహా కథా నేపథ్యంతో తెరకెక్కిన చిత్రమే. అయితే ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాకి కుటుంబ సంబంధాలు, ప్రేమ, ద్రోహం, ప్రతీకారం, విముక్తి వంటి అంశాలను జోడించి, కేజీయఫ్ తరహాలో భారీ ఎలివేషన్స్‌తో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు దర్శకురాలు గీతూ మోహన్‌దాస్. అయితే వయెలెన్స్, రొమాన్స్, ఎలివేషన్స్ ఉంటే చాలు జనాలు సినిమా చూసేస్తారు అనుకున్నారో ఏమో కానీ.. ఇందులో ఆ మూడు తప్ప మిగతావాటిపై కనీస శ్రద్ధ కూడా పెట్టలేదు. అసలు కథేంటి? ఏం చెప్పాలనుకున్నారు? చివరకు ఏం అర్థమైంది?... సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటూ థియేటర్స్ నుంచి బయటకు వస్తారు.వయోలెన్స్, రొమాన్స్ తప్ప ఈ సినిమాలో ఇంకేమి ఉండదు. అయితే వాటిని కూడా ఆకట్టుకునేలా తీర్చిదిద్దారా అంటే అదీ లేదు. రక్తం ఏరులై పారుతున్నా..తలలు తెగిపడి మొండాలు వేలాడుతున్నా.. ఎలాంటి రసానుభూతి కలగదు. భారీ భారీ యాక్షన్ సీన్స్, రొమాన్స్ సన్నివేశాలు.. సిస్టర్ సెంటిమెంట్ సీన్స్ ఇవన్నీ ఉన్నా.. ఏ ఒక్కటి మైండ్లోకి దూసుకెళ్లదు. ఎందుకంటే.. అప్పటికే మన మైండ్‌లో యశ్ ఈ కథ ఎలా ఓకే చేశాడా? అనే ప్రశ్న తిరుగుతుంది.ఉన్నంతలో ఫస్టాఫ్ పర్వాలేదు. యశ్ చెప్పే డైలాగులు, లొకేషన్స్, యాక్షన్ సీన్స్ బాగుంటాయి. ప్లాష్ బ్యాక్ స్టోరీ కూడా కొంతవరకు పర్వాలేదు. ఇనీ సెకండాఫ్ మాత్రం భరించడం కష్టం. ముఖ్యంగా తండ్రి కొడుకుల రివేంజ్ డ్రామా మొదలైన తర్వాత కథనం నీరసంగా సాగుతుంది. చాలా వరకు సాగదీత సన్నివేశాలతో ద్వితియార్థం బోరింగ్‌గా సాగుతుంది. సినిమా నిడివి(194 నిమిషాలు) ఎక్కువ ఉండడం కూడా ఈ సినిమాకు మరో మైనస్. కథనం ఆసక్తికరంగా సాగితే నిడివి ఎంత ఉన్నా పర్వాలేదు. కానీ ఈ సినిమా పాత్రలతో ప్రేక్షకుడు కనెక్ట్ కాకపోవడంతో ‘ఇంకెప్పుడు అయిపోతుంది’ అనే భావన కలుగుతుంది. క్లైమాక్స్ కూడా అంతగా ఆకట్టుకోదు. మొత్తంగా టాక్సిక్ కథ ఒక గ్యాంగ్‌స్టర్ వార్‌లా మొదలై.. అక్కా-తమ్ముళ్లు సెంటిమెంట్‌తో సాగుతూ.. కాసేపటికే ప్రేమ వైపు యూటర్న్ తీసుకొని, తండ్రి-కొడుకుల మధ్య రివేంజ్ డ్రామాగా మారి, చివరకు సైకలాజికల్ థ్రిల్లర్‌గా ముగుస్తుంది.ఎవరెలా చేశారంటే.. యశ్.. వన్‌మ్యాన్ షో అని చెప్పాలి. కేజీయఫ్ తరహాలోనే ఇందులో కూడా గ్యాంగస్టర్ పాత్రలో అద్భుంగా నటించాడు.అయితే కేజీయఫ్‌లో బలమైన కథ ఉండడంతో ఆ పాత్ర బాగా ఎలివేట్ అయింది. కానీ టాక్సిక్‌లో అది లేదు. అందుకే రాయ పాత్రకు అంతగా కనెక్ట్ కాలేం. రాయ కొడుకు టికెట్ పాత్రలోనూ యశ్ నటించి మెప్పించాడు. తెరపై కొత్తగా కనిపించాడు. రాయ అక్క గంగ పాత్రలో నయనతార ఒదిగిపోయింది. ఆమె ఇమేజ్‌కి తగ్గట్లుగా పాత్ర కుదిరింది. కానీ కథలో దమ్ములేనప్పుడు ఎంత మంచి పాత్ర దొరికినా ఏం లాభం. ఇక రాయ ప్రియురాలు నడియాగా కియరా అద్వానీ చక్కగా నటించింది. ఇద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్లు యువతను ఆకట్టుకుంటాయి. తారా సుతారియా, రుక్మిణి వసంత్ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేదు కానీ ఉన్నంతలో బాగానే చేశారు. డారెల్ డి సిల్వా పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా ఈ సినిమా పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. రవి బస్రూర్ నేపథ్య సంగీతం జస్ట్ ఓకే. పాటలు పర్వాలేదు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేసి నిడివి తగ్గిస్తే బాగుండేది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
WORST సినిమా... పెద్ద రాడ్ రంబోలా! టాక్సిక్ మూవీ పబ్లిక్ టాక్
-
రవితేజకు కూడా తెలుసు.. వ్యాపారం వ్యాపారమే!
యష్ 'టాక్సిక్'.. తెలుగులోనూ రిలీజ్ కావడం సంగతేమో గానీ నిన్నటి నుంచి సోషల్ మీడియాలో థియేటర్ల గురించి తెగ చర్చ నడుస్తోంది. ఈ డబ్బింగ్ సినిమా కోసం బాగా ఆడుతున్న 'ఇరుముడి'ని అన్యాయంగా థియేటర్ల నుంచి తీసేస్తున్నారని, 'టాక్సిక్' కోసం వాటిని కేటాయిస్తున్నారని పలువురు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. మొత్తం డిస్కషన్ అంతా దీని గురించే జరుగుతోంది. అయితే ఇక్కడే ఓ చిత్రమైన విషయం కూడా చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: యష్ 'టాక్సిక్' ట్విటర్ రివ్యూ)సాధారణంగా ఏ కొత్త సినిమా రిలీజైనా సరే దానికి ఎక్కువగానే థియేటర్లు లేదంటే షోలు కేటాయిస్తారు. ఇప్పుడు 'టాక్సిక్' విషయంలోనూ అదే జరిగినట్లు కనిపిస్తుంది. అంతెందుకు హైదరాబాద్‌లోని రవితేజ సొంత థియేటర్ అయిన 'ఏఆర్టీ సినిమాస్'లోనే ఈరోజు.. 'ఇరుముడి'(7) కంటే 'టాక్సిక్'కే ఎక్కువగా 12 షోలు కేటాయించారు. మరి రవితేజకు తెలియకుండా ఈ విషయం జరిగి ఉంటుందా? దీని బట్టి అర్థమైంది ఏంటంటే సినిమా సినిమానే.. వ్యాపారం వ్యాపారమే!ఒకటి రెండు రోజులు అయితే 'టాక్సిక్' టాక్ బట్టి ఈ సినిమాని థియేటర్లలో ఉంచాలా లేదంటే తీసేసి 'ఇరుముడి'కి ఇవ్వాలా అనేది డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయించుకుంటారు. కానీ అంతలోనే సోషల్ మీడియాలో పెద్ద పంచాయతీ నడుస్తోంది. మరి ఈ రెండు మూవీస్‌లో ఈ వీకెండ్ పూర్తయ్యేసరికి ఏది ముందంజలో నిలుస్తుందో చూడాలి? 'ఇరుముడి' సాధారణ టికెట్ రేట్లతో ప్రదర్శితమవుతోంది. 'టాక్సిక్'కి మాత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.50, రూ.100 పెంపునకు ప్రభుత్వం అనుమతిచ్చింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'ఇరుముడి' పాప థ్రిల్లర్ సినిమా) -
టాక్సిక్ హంగామా
-
యష్ 'టాక్సిక్' ట్విటర్ రివ్యూ
'కేజీఎఫ్' తర్వాత కన్నడ హీరో యష్ నుంచి వచ్చిన సినిమా 'టాక్సిక్'. ఈరోజే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే రూ.100 టికెట్ పెంపుతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్లో షోలు పూర్తయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో షోలు పడిపోయాయి. మరి మూవీ గురించి ట్విటర్లో టాక్ ఏంటి? ఎలా ఉందంటున్నారు? (Toxic Twitter Review Telugu)టాక్సిక్ సినిమా గురించి సోషల్ మీడియాలో ఒక్కరు కూడా పాజిటివ్‌గా చెప్పట్లేదు. ఘోరాతి ఘోరంగా ఉందని ట్వీట్స్ పెడుతున్నారు. చూసిన ప్రతిఒక్కరికి పీడకల అని కూడా అంటున్నారు. మూవీ స్టోరీ ఏ మాత్రం ఆకట్టుకోలేదని అంతా తికమకగా ఉందని చెబుతున్నారు. ఏదైనా ప్లస్ పాయింట్ ఉంది అంటే అది యష్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటు కొన్ని సీన్లు మాత్రమేనని అంటున్నారు. ఫస్టాప్ ఓ మాదిరిగా ఉన్నప్పటికీ సెకండాఫ్ అయితే చాలా బోరింగ్‌గా ఉందని అంటున్నారు. చూస్తుంటే యష్ నాలుగేళ్ల కష్టం వృథా అయినట్లే కనిపిస్తోంది!#TOXICReview:#TOXIC is a MASSIVE letdown.Yes, it looks stylish. Yes, #Yash does well. But beyond that, there is barely anything to hold the film together. The story hardly moves, the pacing becomes painfully tiring, and the movie tests your patience to the extreme.The final…— Movies4u Official (@Movies4u_Officl) August 26, 2026Just first half ayindi visually toooo good asalu chala pedda story it’s okay average feelsss let’s see how 2nd half goes #Toxic— Ok Bagundi (@ok_bagundi) August 26, 2026#Toxic Don’t decide on fake reviews, make decision after watching the movie Few of my friends loved the style & action scenes #Toxicthemovie #Yash pic.twitter.com/rISpTczo96— JD69 (@MasterJd69) August 26, 2026Mana Kouryaniki.. Shouryaniki.. Veeryaniki 🧐Em Dialogues Ra Babu Ivi 💦💦💦 #Toxic— PawanKalyan Devotee || #OG2 (@SidduOfficial) August 26, 2026Inka interval rakundaney velipothunaru enti ra #Toxic #Yash pic.twitter.com/ygO0l1q12S— REBEL VARMA 🦖 (@pranayvarm78773) August 26, 2026#Toxic 1st half pic.twitter.com/AI5gP8lPcS— Peter Prakash 🕷️ (@peterprakashhh) August 26, 2026Interval ki walkout cheyali ane thought unte dayachesi cheseyandiPost interval chuste theatre lone paiki potharu #Toxic— Miss you K (@UlalalaaaUleyoo) August 26, 2026#Toxic A Fairy Tale That Turns Into a Complete Nightmare for Everyone!A technically sound film buried under chaotic writing and exhausting execution. There are barely any proper character introductions, the narrative has no clear flow, and the screenplay gets confusing enough…— Venky Reviews (@venkyreviews) August 26, 2026#ToxicReviewGood one time watch movie just feel it don't try to understand...🙃#Toxic— Raju (@rkchoud30814500) August 26, 2026 -
సినిమా విడుదలకు ముందే లీక్ కావడం బాధాకరం
కేజీఎఫ్ చిత్రంతో పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన కన్నడ యష్. ఈయన తాజాగా నటించిన టాక్సీక్ చిత్రం కోసం భారతీయ సినిమా నే ఆసక్తిగా ఎదురుచూ స్తోంది. నటి నయనతార,రుక్మిణి వసంత్, బాలీవుడ్ నటి హ్యూమషి , కియారా అద్వానీ, తార సుట్టారియ వంటి ముద్దుగుమ్మలు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి నటి, దర్శకురాలు గీతు మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ , మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ అధినేతలు వెంకట్ కే.నారాయణన్, యష్ కలిసి నిర్మించిన ఈ భారీ, బ్రహ్మాండ యాక్షన్ ఎంటర్టైనర్ కథ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం ,హిందీ భాషల్లో బుధవారం ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రానుంది. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం చెన్నై లోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ చిత్ర ఫ్రీ రిలీ జ్ ఫంక్షన్‌ను భారీఎత్తున నిర్వహించారు. ఇందులో పాల్గొన్న నటుడు యష్ మాట్లాడుతూ ‘‘ఇంతకుముందు నేను నటించిన కేజీఎఫ్ చిత్రాన్ని తమిళ ప్రేక్షకులు ఎలాంటి పక్షపాతం చూపకుండా ఆదరించి ఘన విజయాన్ని అందించారు. ఈ చిత్ర నిర్మాత వెంకట్ కె నారాయణన్ ఇంతకుముందు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ హీరోగా నటించిన జననాయకన్ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఆ చిత్రం విడుదలకు ముందే అక్ర మంగా ఇంటర్నెట్లో విడుదలైనప్పుడు నిర్మాత ఎంతో బాధకు గురయ్యారు. అయితే ఆ సమయంలో మీరు అందించిన సపోర్టు, జననాయకన్ చిత్రాన్ని విజయవంతం చేసిన తీరు చూస్తే విజయ్‌పై మీకు ఉన్న ప్రేమాభిమానాలు తెలిశాయి. కేజీఎఫ్ చిత్రాన్ని ఆదరించినట్లే ఈ చిత్రాన్ని విజయవంతం చేస్తారని నమ్ముతున్నాను. ఒక సాధారణ మనుషులమైన మమ్మల్ని మీరే (ప్రేక్షకులే) హీరోలను చేశారు. మిమ్మల్ని ఆనందింప చేయడమే మా బాధ్యత ‘‘ అని నటుడు యష్ పేర్కొన్నారు. నటుడు యష్ ఇచ్చిన పడయప్పా వంటి కొన్ని కమర్షియల్ అంశాలతో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రాల రిఫరెన్స్ తోనే నేను టాక్సిక్ చిత్రాన్ని చేశాను ‘‘ అని దర్శకురాలు గీతూ మోహన్ దాస్ పేర్కొన్నారు. స్పిరిట్ Vs వారణాసి.. సందీప్ రెడ్డి వంగ సంచలన వ్యాఖ్యలు! -
‘టాక్సిక్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. బ్లాక్ బస్టర్ పక్కా?
రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కించిన ఈ పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా మరికొద్ది గంటల్లో(ఆగస్టు 26) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘కేజీఎఫ్ 2’ తర్వాత దాదాపు నాలుగేళ్లకు యశ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టే ఇప్పటి వరకు విడుదలైన ప్రచార చిత్రాలు ఉన్నాయి. అయితే సినిమా ఫలితం ఎలా ఉంటుందో మరికొద్ది గంటల్లో తేలిపోతుంది. ( చదవండి: అడ్వాన్స్ బుకింగ్స్కే 40+ కోట్లు.. ఫస్ట్‌డే 100 కోట్లు పక్కా!)ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు మాత్రం ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు కూడా ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారట. అయితే హింసాత్మక సన్నివేశాలతో పాటు రొమాంటిక్ సీన్లు కూడా ఎక్కువే ఉండడంతో ‘ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు. అంటే పెద్దలు మాత్రమే చూడాల్సిన సినిమా అన్నమాట. టాక్సిక్ స్టోరీ ఇదేనా?సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు, ట్రైలర్ బట్టి చూస్తే.. ఈ సినిమా కథనం ఇలా కొనసాగబోతుంది. ఇండియాకు స్వాతంత్య్రం వచ్చినా.. గోవా మాత్రం పోర్చుగీసు వారి ఆధీనంలోనే ఉంటుంది. అక్కడ చాలా ఇల్లీగల్ దందాలు జరుగుతుంటాయి. డ్రగ్స్,మాఫియా యదేచ్ఛగా కొనసాగేవి. ఆ చీకటి రాజ్యాన్ని సొంతం చేసుకోవడానికి కొన్ని గ్రూపులు పోరాడుతుంటాయి. ఈ నేపథ్యంలో గోవాలో హింస మితిమీరిపోతుంది. వెన్నుపోట్లు, ఆధిపత్య పోరు ఉన్న ఇలాంటి ప్రపంచంలో రాయ(యష్) ఎలా ఎదిగాడు? సొంత చెల్లి గంగ(నయనతార)తో ఎందుకు పోరాటం చేయల్సి వచ్చింది? నాడియా (కియారా)తో రాయ ప్రేమాయణం కొనసాగింది? ఎలిజబెత్ (హ్యుమా ఖురేషి), రెబెకా (తారా సుతారియా), మెలిసా (రుక్మిణి వసంత్) పాత్రలు ఏమిటి? అనేది సినిమా చూసి తెలుకోవాల్సిందే.టాక్సిక్ హైలెట్స్..ఈ సినిమాలో హైలెట్ ఏంటంటే.. యష్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడట. ఇందులో రాయగా, రూమిగా కనిపించి అలరించాడట. మొత్తంగా మూడు డిఫరెంట్ గెటప్‌లో ఆయన కనిపించబోతున్నాడు. సినిమా విజువల్ ట్రీట్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమాకు రవి బస్రూర్ అదిరిపోయే బీజీఎం ఇచ్చాడట. అలాగే యాక్షన్ సీన్లు కూడా అదిరిపోయాయట. ముఖ్యంగా యష్, నయనతారల మధ్య వచ్చే సన్నివేశాలు హైలెట్‌గా నిలుస్తాయని సమాచారం. ఇక తెలుగులో దిల్‌రాజు అల్రెడీ కొంతమందికి సినిమా చూపించాడట. వారంతా సినిమా అదిరిపోయిందని చెప్పినట్లు తెలుస్తోంది. సినిమా ప్రారంభం అయిన 20 నిమిషాలకే అంతా టాక్సిక్ ప్రపంచంలోకి వెళ్తారట. ఫస్టాఫ్‌లో వచ్చే బోల్డ్ సీన్లు, యాక్షన్ సీక్వెన్ హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయని అంటున్నారు.రికార్డులు పక్కా.. అయితే సోషల్ మీడియాలోనూ ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది ఈ చిత్రం అదిరిపోయిందని పోస్టులు పెడుతున్నారు. అయితే వారిలో చాలా మంది సినిమా చూడకుండా 4 రేటింగ్‌లు ఇచ్చి ట్వీట్లు చేస్తున్నారు.బ్లాక్ బస్టర్ సినిమాకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయని చెబుతున్నారు. ఇక సెన్సార్ మెంబర్ని అని తనకు తానుగా చెప్పుకునే ఉమైర్ సందు మాత్రం ఈ చిత్రానికి నెగెటివ్ రివ్యూ ఇచ్చాడు. బీగ్రేడ్ సినిమా అని, యానిమల్ మూవీకి కాపీలా ఉందని ట్వీట్ చేశాడు. అయితే అతని పోస్టులను అంతగా నమ్మే పరిస్థితి లేదు. ప్రతి సినిమాకి ఇలా రిలీజ్‌కు ముందే ఇష్టం వచ్చినట్లుగా రివ్యూ ఇస్తుంటాడు. ఓవరాల్‌గా మాత్రం ఈ సినిమాకు నెట్టింట ఫుల్ క్రేజీ ఏర్పడింది. టాక్సిక్.బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చెబుతున్నారు. మరి నిజంగా ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుందో లేదో చూడాలి. ఒరిజినల్ రివ్యూ కోసం సాక్షి డాట్‌కామ్(sakshi.com)ని ఫాలో అవ్వండి. -
ఆ ఒక్క మేసేజ్.. మూడేళ్లలో మూడు పాన్ ఇండియా చిత్రాలు..!
కన్నడ భామ రుక్మిణి వసంత్ గురించి ఇప్పుడు పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఏకంగా మూడు పాన్ ఇండియా సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది. ఇప్పటికే ఆమె నటించిన కాంతార చాప్టర్-1 బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత ఆమె కీలక పాత్రలో వస్తోన్న మరో పాన్ ఇండియా చిత్రం టాక్సిక్. యశ్ హీరోగా వస్తోన్న ఈ మూవీ ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. అంతేకాకుండా ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తోన్న డ్రాగన్‌లో రుక్మిణి వసంత్‌నే హీరోయిన్గా చేస్తోన్న సంగతి తెలిసిందే.అయితే ఇదంతా కేవలం మూడేళ్ల గ్యాప్‌లోనే జరిగిందంటే మీరు నమ్ముతారా? అవునండి.. రుక్మిణి వసంత్ మూడేళ్లలోనే మూడు పాన్ ఇండియా మూవీస్‌లో ఛాన్స్ కొట్టేసింది. అంతకుముందు ఆమె ఎవరో కూడా కన్నడ ఇండస్ట్రీలో సరిగా తెలియదు. అలాంటి రుక్మిణి పేరు ఇప్పుడు పాన్ ఇండియా మొత్తం వినిపిస్తుందంటే దానికి కారణం ఓకే ఒక్క మేసేజ్. ఆమె పంపిన ఒక ఇన్స్టాగ్రామ్ డీఎమ్ ఆమె కెరీర్‌నే ఒక్కసారిగా మలుపు తిప్పింది. ఇదే విషయాన్ని రుక్మిణి గత ఇంటర్వ్యూలోనే వెల్లడించింది. ఇంతకీ ఆ వివరాలేంటో మనం కూడా తెలుసుకుందాం.రక్షిత్ శెట్టి హీరోగా వచ్చిన ప్రేమకథా చిత్రం 'సప్త సాగరదాచే ఎల్లో'. ఈ మూవీకి హేమంత్ రావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పాత్ర కోసం ఎలా ప్రయత్నించిందో రుక్మిణి వెల్లడించింది. ఇది ఆమె రెండో ప్రాజెక్ట్ కావడం మరో విశేషం. ఈ రోల్ తనకు ఎలా దక్కిందన్న విషయాన్ని గత ఇంటర్వ్యూలో పంచుకుంది. ఈ సినిమా కోసం నటీనటులను ఎంపిక చేస్తున్నారన్న విషయం తెలిసి ఇన్‌స్టాలో నేరుగా దర్శకుడికి ఒక మేసేజ్ చేశానని తెలిపింది.ఈ సినిమాలో ఛాన్స్ కావాలనే తన పట్టుదల గురించి రుక్మిణి చాలాసార్లు చెప్పింది. కేవలం సోషల్ మీడియాలోనే కాకుండా, ఈమెయిల్స్ ద్వారా పంపినట్లు వివరించింది. అలా ఈ చిత్ర బృందంలోని ఎవరైనా తనను గమనించి ఆడిషన్ ఇస్తారని ఆశించినట్లు తెలిపింది. ఈ మూవీ దర్శకుడు హేమంత్ రావు దాదాపు 10 రోజుల తర్వాత నా ఇన్స్టాగ్రామ్ మేసేజ్‌కు స్పందించారని వెల్లడించింది. అలా తనకు సప్త సాగరదాచే ఎల్లో మూవీలో ప్రియా అలియాస్ పుట్టి అనే పాత్ర దక్కేలా చేసిందని రుక్మిణి పేర్కొంది. ఈ మూవీ 2023 సెప్టెంబర్ 1న థియేటర్లలో విడుదలైంది.అలా కేవలం ఒకే ఒక్క మేసేజ్ రుక్మిణి జీవితాన్నే మార్చేసింది. ఆ తర్వాత మూడేళ్లలోనే మూడు పాన్ ఇండియా చిత్రాల్లో ఛాన్స్‌లు కొల్లగొట్టింది. అయితే అంతకుముందే తెలుగులో 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత విజయ్ సేతుపతి 'ఏస్' చిత్రంతో తమిళ ఇండస్ట్రీలోనూ ఎంట్రీ ఇచ్చింది. అంతేకాకుండా శివకార్తికేయన్ సరసన 'మదరాసి' చిత్రంలో కూడా నటించింది. -
Toxic: ఇదేం క్రేజ్‌రా బాబూ.. ఫస్ట్‌డే రూ. 100 కోట్లు పక్కా!
కోడి కూయకముందే తెల్లారినట్టు.. విడుదల కాకముందే ఓ చిత్రం కాసుల వర్షం కురిపిస్తుంది. అడ్వాన్స్ బుకింగ్‌లో సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. అదే టాక్సిక్. కేజీఎఫ్ 2’ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నటించిన ఈ చిత్రం రేపు(ఆగస్టు 26)న తెలుగు, తమిళ,కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ కాబోతుంది. పలు భాషల్లో రేపు ఉదయం 6 గంటలకే షోలు ప్రారంభం కానున్నాయి. అయితే విడుదలకు ముందే..అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఈ చిత్రం భారీ వసూళ్లును సాధించింది. కర్ణాటకలోనే కాకుండా తెలుగు, హిందీలోనూ ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టాలీవుడ్లో అయితే ఈ రోజు బుకింగ్స్ ఓపెన్ కాగా.. హాట్ కేకుల్లా టికెట్స్ అమ్ముడు పోయాయి. హిందీ వెర్షన్ గానూ భారీగానే టికెట్స్ బుక్ అవుతున్నాయి. మొత్తంగా అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే ఈ చిత్రానికి రూ. 40 కోట్లకు పైగా వసూళ్లు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.తెలుగులోనూ హవా.. తెలుగులో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేస్తున్నాడు. ఈ రోజు ఉదయం బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఏపీ, తెలంగాణలో తెల్లవారుజామున 6.30 గంటల నుంచే తొలి షోను ప్రదర్శించనున్నారు. మరోవైపు టికెట్లు ధరలను పెంచేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 4 వరకు మొత్తం 10 రోజుల పాటు సవరించిన ధరలు అమల్లో ఉండనున్నాయి. ప్రభుత్వాలు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‌పై అదనంగా రూ.50, మల్టీప్లెక్స్‌లు, ప్రత్యేక థియేటర్లలో రూ.100 వరకు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. తెలంగాణలో జీఎస్టీతో కలిపి సింగిల్ స్క్రీన్‌లో టికెట్ ధర రూ.227గా, మల్టీప్లెక్స్‌లు, ప్రత్యేక థియేటర్లలో రూ.395గా ఉండనుంది. ఏపీలో ఆగస్టు 26న ఉదయం 6 గంటల స్పెషల్ ప్రీమియర్ షో టికెట్ ధరను రూ.600గా నిర్ణయించారు. బుకింగ్స్ ఓపెన్ అయిన గంటలోనే టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. హైదరాబాద్‌లోని పలు మల్టీప్లెక్స్‌ల్లో రేపటి షోలన్నీ హౌస్‌ఫుల్ అయ్యాయి.(చదవండి: ‘టాక్సిక్’ కోసం యశ్ ఎంత తీసుకున్నాడు?)ఫస్ట్‌డే.. 100 కోట్లు పక్కా.. ప్రస్తుతం ఉన్న ఊపుని బట్టి చూస్తే బాక్సాఫీస్ వద్ద టాక్సిక్ సరికొత్త రికార్డులను సృష్టించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ చిత్రానికి కర్ణాటక బాక్సాఫీసే అతి పెద్దది. యశ్ సొంత రాష్ట్రంలో రికార్డు స్థాయి కలెక్షన్స్ సాధించడం పక్కా. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ చిత్రానికి భారీగా వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. తమిళ, హిందీ భాషలతో కలుపుకొని మొత్తంగా ఫస్ట్‌డే రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫస్ట్ షోకి హిట్ టాక్ వస్తే.. తొలి రోజే రూ. 150 కోట్లను కూడా సాధించే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి రిలీజ్ తర్వాత ఈ చిత్రం ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.కేవీఎన్ ప్రొడక్షన్స్, మోన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కే నారాయణ, యశ్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు. యశ్‌తో కలిసి ఆమె కథ, స్క్రీన్‌ప్లేను రూపొందించారు. నయనతార, కియారా అద్వానీ, హ్యుమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణీ వసంత్‌లు హీరోయిన్లుగా నటించగా, అక్షయ్ ఒబెరాయ్, డారెల్ డిసిల్వ, సుదేవ్ నాయర్, సంజీదా షేక్, కైల్ పాల్, అమిత్ తివారీ, సుర్జీత్ గోపీనాథ్‌లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. రాజీవ్ రవి సినిమాటోగ్రాఫర్‌గా, ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్‌గా వ్యవహరించారు. రవి బస్రూర్ నేపథ్య సంగీతం అందించాడు. -
‘టాక్సిక్’ మూవీ HD స్టిల్స్
-
తెలుగు రాష్ట్రాల్లో 'టాక్సిక్' టికెట్ రేట్లు పెంపు
గత మూడు నెలల నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ ఏ చిత్రానికి కూడా టికెట్ల పెంపు లేదు. రేపు(ఆగస్టు 26) రిలీజయ్యే 'టాక్సిక్' కోసం తెలంగాణ, ఆంధ్రా ప్రభుత్వాలు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిచ్చాయి. ఈ మేరకు జీవో జారీలు చేశాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)తెలంగాణలో సింగిల్ స్క్రీన్లలో రూ.50, మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 (జీఎస్టీతో కలిపి) ఒక్కో టికెట్‌పై పెంచుకునేందుకు అనుమతిచ్చారు. బుకింగ్స్ కూడా ఓపెన్ చేసేశారు. పెంచిన ధరలు పది రోజుల పాటు అమల్లో ఉంటాయని, రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకోవచ్చని తెలిపింది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ కమిటీకి రూ.కోటి డిపాజిట్ చేయాల్సిందిగా నిర్మాణ సంస్థ కేవీయన్ ప్రొడక్షన్స్‌కు ప్రభుత్వం సూచించింది.మరోవైపు ఆంధ్రాలో 'టాక్సిక్' కోసం ఒక్కో టికెట్‌పై సింగిల్ స్క్రీన్లలో రూ.50, మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 వరకు పదిరోజుల పాటు పెంపు ఉండనుంది. అలానే ఉదయం 6 గంటలకు వేసే స్పెషల్ షోకి టికెట్ ధర రూ.600గా నిర్ణయించారు. అయితే ఓ డబ్బింగ్ సినిమాకు ఇలా టికెట్ ధరలు పెంపునకు ఎలా అనుమతిస్తారని సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. థియేటర్లలో 'ఇరుముడి' సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితమవుతున్నందున 'టాక్సిక్' కోసం స్క్రీన్లని ఎలా సర్దుబాటు చేస్తారనేది డిస్కషన్ పాయింట్ అయింది.పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా 'టాక్సిక్' తీశారు. ఇందులో యష్.. తండ్రికొడుకులుగా నటించాడు. కియారా అడ్వాణీ, రుక్మిణి వసంత్, నయనతార, హ్యుమా ఖురేషి, తారా సుతారియా హీరోయిన్లు. గీతూ మోహన్ దాస్ దర్శకురాలు. 3 గంటల 14 నిమిషాల నిడివితో ఇది ప్రదర్శితమవనుంది. సెన్సార్ బోర్డ్ 'ఏ' సర్టిఫికెట్ జారీ చేసినందున పెద్దలకు మాత్రమే థియేటర్లలోకి అనుమతించనున్నారు.(ఇదీ చదవండి: ‘టాక్సిక్’ కోసం యశ్ ఎంత తీసుకున్నాడు? రెమ్యునరేషన్ డీటైల్స్) -
‘టాక్సిక్’ కోసం యశ్ ఎంత తీసుకున్నాడు? హీరోయిన్లకూ ఎక్కువే!
కేజీయఫ్ 2 లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నాలుగేళ్ల గ్యాప్ తీసుకొని ‘టాక్సిక్’తో రేపు(ఆగస్ట్ 26) ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు రాకింగ్ స్టార్ యశ్. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. 1940 నుంచి 1970 మధ్య కాలంలో గోవా నేపథ్యంలో సాగే మాఫియా ప్రపంచాన్ని ఇందులో చూపించినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.యశ్ 'రాయ' అనే పవర్ఫుల్ మాఫియా పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం ఏకంగా రూ. 400 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు సమాచారం. అయితే అందులో యశ్ పారితోషికం కూడా భారీగానే ఉందని ఇండస్ట్రీ టాక్. ఈ సినిమా కోసం ఏకంగా రూ. 50 కోట్లను తీసుకున్నాడట. అంతేకాదు నిర్మాణంలోనూ భాగస్వామిగా ఉన్నాడు. ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించాడు. దీంతో లాభాల్లోనూ యశ్‌కి వాటా రాబోతుంది. ఇలా నిర్మాతగా, నటుడిగా మొత్తంగా రూ. 100-120 కోట్ల వరకు తీసుకునే అవకాశం ఉందట. యశ్‌తో పాటు ఈ సినిమాలో నటించిన హీరోయిన్లకు కూడా భారీగా రెమ్యునరేషన్ ఇచ్చారట. కియారా అద్వానీ రూ. 15 కోట్లు, నయనతార రూ. 15-18 కోట్లు, హ్యూమా ఖురేషి రూ. 2 కోట్ల వరకు తీసుకున్నట్లు సమాచారం. ఇక మరో హీరోయిన్ రుక్ష్మిణి వసంత్ కూడా రూ. 3 కోట్ల పారితోషికం అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భారీ అంచనాలతో రేపు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి. -
కియారా నువ్వు చాలా లక్కీ.. ఆ సినిమా చేయలేదు
కొందరు హీరోయిన్లకు దక్షిణాది సినిమాలు తెగ కలిసొస్తాయి. కొందరికి మాత్రం అస్సలు కలిసిరావు. అలాంటి వాళ్లలో హీరోయిన్ కియారా అడ్వాణీ ఒకరు. ఇప్పటివరకు హిందీలో చాలానే మూవీస్ చేసిన ఈ బ్యూటీ.. 'భరత్ అనే నేను'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. మహేశ్‌తో చేసిన ఈ సినిమా హిట్టయినా తర్వాత చేసిన వినయ విధేయ రామ, గేమ్ ఛేంజర్ ఘోరమైన ఫ్లాప్స్ అయ్యాయి. ఈమె మరో సౌత్ మూవీ ఫ్లాప్ నుంచి తప్పించుకుంది. స్వయంగా డైరెక్టరే ఈ విషయాన్ని బయటపెట్టాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్)కియారా ఓ హీరోయిన్గా చేసిన లేటెస్ట్ మూవీ 'టాక్సిక్'. కన్నడ ఇండస్ట్రీకి చెందిన యష్ హీరోగా నటించాడు. సోమవారం దీని ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు విఘ్నేశ్ శివన్.. తను రీసెంట్గా తీసిన సినిమాపై తానే ట్రోలింగ్ చేసుకున్నాడు. కియారా అందులో నటించకపోవడం ఆమె అదృష్టమని చెప్పుకొచ్చాడు.'కియారా.. నువ్వు కబీర్ సింగ్('అర్జున్ రెడ్డి' హిందీ రీమేక్) సినిమా చేయడానికి ముందు నేను నీకో స్క్రిప్ట్ చెప్పాను. దాన్ని నేను సినిమాగా తీశా. అదే 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'. నువ్వు చాలా లక్కీ. ఎందుకంటే ఆ మూవీలో నటించలేదు' అని విఘ్నేశ్ అనేసరికి ఎదురుగా కూర్చున్న కియారా కూడా నవ్వేసింది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్గా కృతిశెట్టి చేసింది. ప్రదీప్ రంగనాథన్ హీరో. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ ఘోరమైన డిజాస్టర్ అయింది. అలా కియారా ఈ ఫ్లాప్ మిస్ అయింది.(ఇదీ చదవండి: 'ఇరుముడి'లో ఆ సీన్స్ తొలగించాలి: ఏపీ టీచర్లు)#VigneshShivan trolling his own #LIK Film😅:"Kiara I know you. Before Kabir Singh I have met you and narrated one script. I made that Film now, it's called Love Insecure Company. You are lucky, that you didn't do that film" pic.twitter.com/low1kLgwKK— AmuthaBharathi (@CinemaWithAB) August 24, 2026 -
అయ్యప్ప వారం మొదలైంది! ఇరుముడికి కలెక్షన్ల జోరు
-
‘టాక్సిక్’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన హీరోయిన్ రుక్మిణి వసంత్ (ఫొటోలు)
-
విడుదలకు ముందే ‘టాక్సిక్’ కలెక్షన్ల వర్షం
యశ్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం టాక్సిక్. విడుదలకు మరో రెండు రోజులే ఉండడంతో అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూసుకెళ్తోంది. ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం.. తాజా ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇప్పటికే దేశీయంగా రూ.32.52 కోట్ల అడ్వాన్స్ వసూల్లు సాధించింది. ఇప్పటి వరకు 6లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి.కేజీఎఫ్2తో పోలిస్తే.. యశ్ గత చిత్రం ‘కేజీఎఫ్2’ అడ్వాన్స్ బుకింగ్స్‌తో పోలిస్తే టాక్సిక్ ఇంకా వెనుకబడే ఉంది. కేజీఎఫ్2 విడుదలకు ముందే దాదాపు రూ.60 కోట్ల అడ్వాన్స్ సేల్స్ నమోదు చేసింది. దీంతో ఇప్పుడు ట్రేడ్ వర్గాల దృష్టి మిగిలిన రెండు రోజుల్లో టాక్సిక్ బుకింగ్స్ ఎంతవరకు పెరుగుతాయన్నదానిపైనే ఉంది.రూ.100 కోట్లకు చేరాలంటే..ప్రస్తుతం రూ.32.52 కోట్ల వద్ద ఉన్న టాక్సిక్ అడ్వాన్స్ బుకింగ్స్ మరో రెండు రోజుల్లో మరింత పెరిగే అవకాశముంది. అయితే రూ.100 కోట్ల ప్రీ సేల్స్ మార్క్‌ను అందుకోవాలంటే ఇంకా దాదాపు రూ.67.5కోట్లు రాబట్టాలి.ఘీ వేగాన్ని చూస్తే ఆ లక్ష్యం చేరుకోవడం కష్టమేనని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.యశ్ సరసన కియారా అద్వానీ, నయనతార, రుక్షిణీ వసంత్, తదితరులు నటించిన ఈ చిత్రానికి ఏ సర్టిఫికేట్ వచ్చింది. కన్నడ, తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అంచనాలను పెంచేసింది. దీంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదీ చదవండి: క్రిస్మస్ బరిలో బాలయ్య..! -
మల్లారెడ్డి కళాశాలపై కేసు నమోదు
హైదరాబాద్: టాక్సిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో జరిగిన ప్రమాదంలో ఓ విద్యార్థి కాలు విరగగా, మరో నలుగురికి స్వల్ప గాయాలు కావడంతో కళాశాల యాజమాన్యంతో పాటు నిర్వాహకులు, చిత్ర యూనిట్‌పై పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ విజయవర్ధన్ కథనం ప్రకారం... మైసమ్మగూడ మల్లారెడ్డి కళాశాలలో టాక్సిక్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం రాత్రి నిర్వహించగా సినీ హీరో యష్ , హీరోయిన్లతో పాటు వేలాదిమంది విద్యార్థులు, ఇతరులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్ల కోసం ఏర్పాటు చేసిన ఫ్లడ్ లైట్ పోల్‌పై విద్యార్థులతో పాటు పలువురు యువకులు ఎక్కడంతో అదుపుతప్పి ఒక్కసారిగా కింద పడిపోయింది. దీంతో వనపర్తికి చెందిన బీటెక్ మూడవ సంవత్సరం విద్యార్థి భాను ప్రకాష్ (22) కాలు విరగగా, వరంగల్ జిల్లాకు చెందిన విద్యార్థి అఖిల్, ఆటో డ్రైవర్లు సన్నీ, మార్క్, దీపక్ లకు స్వల్ప గాయాలు కాగా వారికి ప్రాథమిక చికిత్స చేసి పంపించినట్లు మల్లారెడ్డి ఆసుపత్రి డాక్టర్లు వెల్లడించారు. ఈ మేరకు పేట్‌బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని మల్లారెడ్డి కళాశాల యాజమాన్యంతో పాటు ఫ్రీ రిలీజ్ చిత్ర యూనిట్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. టాక్సిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఫోటోలు -
టాక్సిక్ మేకర్స్‌కు షాక్.. కేసు నమోదు
టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈవెంట్లో తొక్కిసలాట జరగడంతో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఈవెంట్ నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు టాక్సిక్ చిత్ర యూనిట్‌తో పాటు మల్లారెడ్డి కాలేజీపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేజీఎఫ్ స్టార్ యశ్ హీరోగా వస్తోన్న మూవీ టాక్సిక్. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. మల్లారెడ్డి కాలేజీలో ఏర్పాటు చేసిన ఈవెంట్లో యష్ మాట్లాడుతుండగా భారీ సౌండ్ బాక్స్ సెట్ కుప్పకూలింది. ఈ క్రమంలోనే ఇద్దరు యువకులకు కాళ్లు విరిగినట్లు తెలుస్తోంది. మరో ఇద్దరమ్మాయిలకి గాయలు కాగా.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరు స్పృహ కోల్పోయినట్లు తెలిసింది. ఈ ఘటనతో ఒక్కసారిగా ఈవెంట్ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తాజాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
యశ్ టాక్సిక్.. కేజీఎఫ్-2 రికార్డ్ బద్దలు కొడుతుందా?
యశ్ హీరోగా వస్తోన్ పాన్ ఇండియా మూవీ 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్'. ఈ మూవీ కోసం యశ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా ఫుల్ వయొలెన్స్ అండ్ బోల్డ్‌గా అనిపించింది. ఈ సినిమాకు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించగా.. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. ఈ మూవీని ఓకేసారి కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో రూపొందించారు.రిలీజ్‌కు మూడు రోజులే సమయం ఉండడంతో అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ప్రారంభించారు మేకర్స్. కేజీఎఫ్ తర్వాత వస్తోన్న మూవీ కావడంతో ఆడియన్స్‌లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. దీంతో విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొడుతోంది. తాజా సమాచారం ప్రకారం ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌తో ఏకంగా రూ.27 కోట్ల వసూళ్లు దాటేసింది. దేశవ్యాప్తంగా ఐదు భాషల్లో కలిపి 4 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ప్రీ-సేల్స్‌లో కన్నడ వెర్షన్లో అత్యధిక వాటాను కలిగి ఉండగా..ఆ తర్వాత హిందీ వర్షన్లో ఎక్కువగా సేల్స్ కనిపించాయి.కేవలం కన్నడ 2డీ వర్షన్‌లోనే 4 లక్షల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. దీంతో ఒక్క కర్ణాటకలోనే రూ. 9 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆ తర్వాత హిందీ 2డీ , తెలుగు 2డీ వర్షన్ నిలిచాయి. ఈ జోరు చూస్తుంటే తొలి రోజే వసూళ్ల పరంగా సెంచరీ కొట్టేలా కనిపిస్తోంది. గతంలో రిలీజైన కేజీఎఫ్ చాప్టర్-2 అడ్వాన్స్ బుకింగ్స్‌లో రూ.80 కోట్లకు పైగా వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఈ రికార్డ్‌ను టాక్సిక్ బద్దలు కొడుతుందో లేదో వేచి చూడాల్సిందే. -
టాక్సిక్ ఈవెంట్.. స్పెషల్ అట్రాక్షన్‌గా కియారా అద్వానీ (ఫోటోలు)
-
టాక్సిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఫోటోలు
-
మేం చేసిందేం లేదు.. సీరియస్‌గా తీసుకోవద్దు: యశ్
కేజీఎఫ్ హీరో నటించిన లేటేస్ట్ యాక్షన్ అండ్ బోల్డ్ మూవీ టాక్సిక్. ఈ సినిమాకు గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటించారు. ఈ మూవీని మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్, కేవీఎన్ ప్రోడక్షన్స్ పై వెంకట్ కె.నారాయణ, యష్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ ఆగస్టు 26న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్.ఈ ఈవెంట్‌కు హాజరైన హీరో యశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినిమాలు, విద్యార్థులను ఉద్దేశించిన ఆయన మాట్లాడారు. మేము సినిమాలను ఎక్కువగా సీరియస్‌గా తీసుకోవద్దని విద్యార్థులకు సూచించారు. ఇందులో పెద్దగా మేం చేసింది ఏం లేదన్నారు. మీ కలల కోసం మీరు కష్టపడండి.. అప్పుడే మీకు ఈ సమాజంలో సక్సెస్‌తో పాటు రెస్పెక్ట్ దొరుకుతుందన్నారు.మనం ఫెయిల్ అయితే ఈ ప్రపంచాన్ని నిందించాల్సిన అవసరం లేదు.. దానికి మనమే బాధ్యులమని యశ్ అన్నారు. మనదేశంలో ఎన్నో రాష్ట్రాలు, భాషలు ఉన్నాయి.. మన భాషలతో కొందరు పాలిటిక్స్ చేస్తారని తెలిపారు. నార్త్, సౌత్ అనే తేడా మనకు వద్దని.. మన పని చూస్తే ఎక్కడికెళ్లినా అదే గౌరవం దక్కుతుందని యశ్ తెలిపారు. -
'టాక్సిక్' హైదరాబాద్ ఈవెంట్లో ప్రమాదం
యష్ హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ 'టాక్సిక్'. వచ్చే బుధవారం (ఆగస్టు 26) పాన్ ఇండియా వైడ్ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ట్రైలర్, పాటలు రిలీజ్ చేశారు. తాజాగా హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో శనివారం రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో యష్ మాట్లాడుతుండగా భారీ సౌండ్ బాక్స్ సెట్ కుప్పకూలింది. ఈ క్రమంలోనే ఇద్దరు యువకులు కాళ్లు విరిగినట్లు తెలుస్తోంది. మరో ఇద్దరమ్మాయిలకి గాయలవగా.. వీళ్లలో ఒకామె స్పృహ కోల్పోయింది. వీళ్లని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో ఈవెంట్ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తీసిన 'టాక్సిక్' సినిమాలో తండ్రికొడుకులుగా యష్ ద్విపాత్రాభినయం చేశాడు. నయనతార, రుక్మిణి వసంత్, కియారా అడ్వాణీ, తారా సుతారియా, హ్యుమా ఖురేషి హీరోయిన్లు. రవి బస్రూర్ సంగీతమందించాడు. గీతూ మోహన్ దాస్ దర్శకురాలు. -
‘టాక్సిక్’ అడ్వాన్స్ బుకింగ్స్ అదుర్స్.. టికెట్ ధర ఎంతటే..?
యశ్ కథానాయకుడిగా, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన చిత్రం టాక్సిక్. ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు ఇంకా సమయం ఉండగానే ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్స్ జోరందుకున్నాయి. అమెరికాలో టాక్సిక్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇప్పటికే సుమారు రూ.1.06కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఇప్పటివరకు 204 ప్రాంతాల్లో 589 షోలకు కలిపి 5,500 టికెట్లు అమ్ముడయ్యాయట. విడుదలకు ముందు రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది.బుక్‌మైషోలోనూ మార్క్ ఇక బుక్‌మైషోలో ‘టాక్సిక్’కు ఇప్పటికే 10లక్షలకు పైగా ఇంట్రెస్ట్స్ నమోదయ్యాయి. ఈ ఘనత సాధించిన 13వ భారతీయ చిత్రంగా ‘టాక్సిక్’ నిలిచింది. యశ్ కెరీర్లో కేజీఎఫ్2 తర్వాత ఆ స్థాయిలో ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందిన రెండవ చిత్రమిది కావడం విశేషం.నేడు భారత్‌లో అడ్వాన్స్ బుకింగ్స్?ఇప్పటివరకు అమెరికాలో మాత్రమే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా.. భారత్‌లో బుకింగ్స్ ఆగస్టు 21 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. యశ్ క్రేజ్ కారణంగా తొలి రోజు భారీ ఓపెనింగ్ వస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ఇదే జోరులో కొనసాగితే తొలి రోజే రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.టికెట్ ధరలు భారీగా ఉండే ఛాన్స్తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 6 గంటల ప్రత్యేక షోలకు టికెట్ ధరలు రూ.500–600 వరకు ఉండొచ్చని తెలుస్తోంది. సాధారణ షోల టికెట్ ధరలు కూడా సాధారణ ధరల కంటే రూ.50–100 వరకు అధికంగా ఉండే అవకాశం ఉంది. ముంబై, ఢిల్లీలో కొన్ని ప్రీమియం షోలకు టికెట్ ధరలు ఏకంగా రూ.2,600 వరకు ఉండొచ్చని సమాచారం.‘కేజీఎఫ్ 2’ తర్వాత దాదాపు నాలుగేళ్లకు యశ్ మళ్లీ తెరపైకి వస్తుండటంతో ‘టాక్సిక్’పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రంపై ఇప్పుడు అందరి దృష్టి భారత్ అడ్వాన్స్ బుకింగ్స్‌పైనే ఉంది.ఇదీ చదవండి: ‘టాక్సిక్’కు ‘ఏ’ సర్టిఫికేట్..! కంటెంట్ సంగతేంటి? -
‘టాక్సిక్’కు ‘ఏ’ సర్టిఫికేట్..! కంటెంట్ సంగతేంటి?
కన్నడ స్టార్ యశ్ హీరోగా వస్తోన్న యాక్షన్ మూవీ ‘టాక్సిక్’. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ నెల 26న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ అంచనాలను పెంచేసింది. అయితే ఈ సినిమాలో ఎలాంటి సన్నివేశాలు తొలగించకుండా సెన్సార్ బోర్డు( CBFC) ‘ఏ’ సర్టిఫికేట్ జారీ చేసినట్లు సమాచారం. సినిమా నిడివి 3 గంటల 12 నిమిషాలు ఉండనుందట.అనుమతి ఎలా ఇస్తారంటూ..కన్నడ భాషలో కేవలం రెండు నుంచి మూడు పదాలు మాత్రమే మ్యూట్ చేశారట. ఇప్పటికే యాశ్ ఈ సినిమాపై స్పందిస్తూ ఇది పెద్దవాళ్లకి మాత్రమే అని సూచించాడు . అయితే సెన్సార్‌బోర్డు ఎలాంటి సన్నివేశాలు తొలగించకపోవడంపై సోషల్‌మీడియాలో చర్చనీయాంశంగా మారింది. పెద్దవాళ్లకి మాత్రమే అన్నప్పుడు ఒక్క సీన్ కూడా తొలగించకుండా అనుమతి ఎలా ఇస్తారంటూ సోషల్‌మీడియా వేదికగా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.కాగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో నయనతార, కియారా, హుమా ఖురేషి, తదితరులు కీలక పాత్రలు వహిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇదీ చదవండి: ‘మూకుత్తి అమ్మన్2’ చిత్రానికి భారీ ఓటీటీ డీల్ -
టాక్సిక్ టికెట్ ధరలపై ఫ్యాన్స్ ఫైర్.. డబ్బింగ్ మూవీకి ఇంత రేటా..?
-
ట్రెండ్ మారింది..‘టాక్సిక్’కు టికెట్ రేట్లు పెంచుతారా?
యశ్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ యాక్షన్ మూవీ టాక్సిక్. ఈ మూవీ రిలీజ్‌కు అంతా సిద్ధమైంది. ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్‌లో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉన్నందున విమర్శలు వస్తున్నాయి. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్‌కు దగ్గరవడంతో ఇటీవల వచ్చిన పలు సినిమాల టికెట్ రేట్లను పెంచకుండా రిలీజ్ చేయడం ఆ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవడం వంటి అంశాలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.ఇటీవల టికెట్ రేట్లు పెంచకుండా విడుదలైన ‘విశ్వనాధ్ అండ్ సన్స్’, ‘కొరియన్ కనకరాజు’, ‘చెన్నై లవ్ స్టోరీ’, ‘లెనిన్’ సినిమాలు మంచి విజయాలు సాధించాయి. దీంతో టికెట్ రేట్లు పెంచకపోవడం వల్లే థియేటర్లకు ఫుట్‌ఫాల్ పెరుగుతోందనే చర్చ మొదలైంది. ఇలాంటి సమయంలో 'కేజీఎఫ్' ఫేమ్ యశ్ హీరోగా నటించిన ‘టాక్సిక్’ సినిమాకు ఏపీలో టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక జీవో ఇంకా రాలేదు కానీ, పెంపు దాదాపు ఖరారైందనే టాక్ మాత్రం వినిపిస్తోంది.ఉదయం 6 గంటల ఎర్లీ మార్నింగ్ షోకు రూ.500–600 వరకు, రెగ్యులర్ షోలకు టికెట్‌పై రూ.50 వరకు పెంపు ఉండొచ్చని సమాచారం. ఇటీవల వచ్చిన సినిమాల అందుబాటు ధరలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో ‘టాక్సిక్’కు ఇంత భారీ రేట్లు పెడితే ఏపీ ప్రేక్షకులు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాకు ఆగస్టు 21 నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. అప్పటికి టికెట్ ధరలపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.యశ్ జీవితాన్ని పూర్తిగా మార్చేసిన చిత్రం 'కేజీఎఫ్'. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 'రాకీ భాయ్' పాత్రతో యశ్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. దీంతో తెలుగు ప్రేక్షకులకు కూడా మరింత దగ్గరయిన విషయం తెలిసిందే. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంతో తెరకెక్కిన ఈ చిత్రంలో యాశ్ తండ్రీకొడుకులుగా రెండు పాత్రల్లో కనిపించననున్నాడు. తండ్రీతనయుల మధ్య సంఘర్షణ, వారి భిన్నమైన ఆలోచనలు, కోపం నేపథ్యంలో కథ సాగినట్లు ట్రైలర్ చూస్తే స్పష్టం అవుతోంది. చివర్లో తండ్రీకొడుకులు ఒకరిని ఒకరు కొట్టుకోవడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకాలపై వెంకట్ కె.నారాయణ, యశ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 26న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రష్మిక.. నా గురించి అందుకే అలా మాట్లాడిందేమో
రష్మిక స్వతహాగా కన్నడ అమ్మాయి. 'కిరిక్ పార్టీ' మూవీతో హీరోయిన్ అయింది. తర్వాత మాతృభాషలో కొన్ని మూవీస్ చేసింది. ఇదంతా 9-10 ఏళ్ల కిందటి ముచ్చట. అయితే ఈ టైంలో పలు వివాదాల్లోనూ ఈమె ఇరుక్కుంది. అందులో 'కేజీఎఫ్' హీరో యష్‌పై చేసిన 'షో ఆఫ్' కామెంట్ కూడా ఉంది. దీని కారణంగా యష్ అభిమానులు రష్మికని చాలా ట్రోల్ చేశారు. తొమ్మిదేళ్ల క్రితం నాటి వ్యాఖ్యపై యష్ ఇన్నాళ్లకు స్పందించాడు. ఓ ఇంటర్వ్యూలో సదరు విషయమై క్లారిటీ ఇచ్చాడు.(ఇదీ చదవండి: చిరంజీవితో సినిమా.. నేను ఇంకాస్త ఎదగాలి: డైరెక్టర్ వెంకీ అట్లూరి)'ఆమె ఏ సందర్భంలో ఆ కామెంట్ చేసిందో నాకు తెలీదు. అప్పుడే ఆమె ఇండస్ట్రీలోకి వచ్చింది. కొందరు యాంకర్లు ఇష్టమొచ్చినట్లు ప్రశ్నలు అడుగుతూ, ఆప్షన్లు ఇచ్చి ఏదో చెప్పమంటారు. బహుశా రష్మిక కూడా ఆ ఆప్షన్ నాకు సరిపోతుందని భావించి అలా మాట్లాడిందేమో! రష్మిక వ్యాఖ్యల వల్ల చాలామంది దర్శకులు ఇబ్బంది పడ్డారు. అయితే తోటి నటీనటులు ఎవరేమనుకున్నా నేను దాన్ని పెద్దగా పట్టించుకోను. అది నా వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేయదు. ఎవరైనా తమకు నచ్చింది చెప్పొచ్చు. కానీ దాని వల్ల నేనేం మారిపోను' అని యష్ అన్నాడు.ఇక తన అభిమానులని ఉద్దేశిస్తూ ఈ క్రమంలోనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తోటి నటీనటులని గౌరవించలేని వాళ్లు తన అభిమానులే కాదని యష్ క్లారిటీ ఇచ్చాడు. అయితే ఈ వివాదంపై అప్పట్లోన రష్మిక స్పందించింది. అలా అన్నందుకు క్షమాపణ కూడా చెప్పింది. అయితే ఇన్నేళ్లకు సందర్భం రావడంతో యష్ కూడా స్పందించి ఎట్టకేలకు దీనికి ముగింపు పలికాడు. ఇకపోతే యష్ హీరోగా చేసిన 'టాక్సిక్'.. వచ్చే బుధవారం (ఆగస్టు 26) థియేటర్లలోకి రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: 'ఇరుముడి' నుంచి 'మల్లెపూల పల్లకి సాంగ్' రిలీజ్) -
'టాక్సిక్‌లో బోల్డ్ కంటెంట్'.. స్పందించిన హీరో యశ్
యశ్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ యాక్షన్ మూవీ టాక్సిక్. ఈ మూవీ రిలీజ్‌కు అంతా సిద్ధమైంది. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్‌లో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉన్నందున విమర్శలు వస్తూనే ఉన్నాయి.ఈ నేపథ్యంలోనే హీరో యశ్ స్పందించారు. టాక్సిక్ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన యశ్.. బోల్డ్ కంటెంట్ విమర్శలపై మాట్లాడారు. అసభ్యత తప్పేనని.. కానీ నేను ఇందులో కనీసం ఒక్క ముద్దు కూడా పెట్టలేదని అన్నారు. దానికి కూడా ఒక హద్దు ఉంటుందని.. అది మాకు తెలుసని స్పష్టం చేశారు. ఇక్కడ సినిమా అంటే దృశ్యపరంగా ఆకట్టుకునేలా కనిపించాలని.. అదే ఒక క్రియేటర్ గొప్పతనం అని అన్నారు.ప్రస్తుతం మీ సినిమాలపై జెన్ జీ ఎందుకు విమర్శలు చేస్తున్నారని యశ్‌ను ప్రశ్నించారు. దీనికి బదులిస్తూ.. ప్రతి పాత తరం వారు యువతరం తప్పు చేస్తోందని భావిస్తుంటారని తెలిపారు. తన చిత్రంలోని బోల్డ్ సీన్స్‌పై వస్తున్న విమర్శలకు యశ్ సమాధానమిచ్చారు. -
'అభిమాని అంత్యక్రియలు.. నేనలా చేయడం కరెక్ట్ కాదు'
కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన లేటేస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ 'టాక్సిక్- ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్'. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఫుల్ బోల్డ్ అండ్ వయొలెంట్‌గా అనిపించింది. ఈ యాక్షన్ మూవీ ఆగస్టు 26న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటించారు.టాక్సిక్ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు యశ్. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన ఓ అభిమాని అంత్యక్రియలకు హాజరు కాకపోవడంపై క్లారిటీ ఇచ్చారు. తాను వెళ్తే అభిమానుల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అన్నారు. అందుకే తన అభిమాని అంత్యక్రియలకు వెళ్లలేదని స్పష్టం చేశారు. అతని మరణం నన్ను బాధించిందని.. కానీ నేను వెళ్తే మిగతా అభిమానులు కూడా అదే పని చేస్తారని యశ్ తెలిపారు.కాగా.. 2021 ఫిబ్రవరిలో కర్ణాటకలోని మాండ్యా జిల్లా కొడిదొడ్డి గ్రామానికి చెందిన 25 ఏళ్ల యశ్ అభిమాని రామకృష్ణ ఆత్మహత్య చేసుకుని మరణించాడు. తన అంత్యక్రియలకు యశ్, రాజకీయ నాయకుడు సిద్దరామయ్య హాజరు కావాలని కోరుతూ ఒక లేఖను రాశాడు. ఇది చూసి సిద్దరామయ్య అంత్యక్రియలకు హాజరయ్యారు. కానీ యశ్ హాజరు కాలేదు. తాజాగా తాను అంత్యక్రియలకు వెళ్లకపోవడంపై క్లారిటీ ఇచ్చారు. అలాంటి వాటిని ప్రోత్సహిస్తే.. మిగతా ఫ్యాన్స్ కూడా అలానే చేస్తారని.. ఆ ఆలోచనా విధానమే తప్పని యశ్ స్పష్టం చేశారు. -
రూ.50 కూలీ.. రూ.4,000 కోట్ల బడ్జెట్ సినిమాకు స్టార్ హీరో
నేడు తెరపై కనిపిస్తున్న కొంతమంది స్టార్ హీరోల వెనుక ఎన్నో కష్టాలు, కన్నీళ్లు దాగి ఉంటాయి. కొందరు అవకాశాలను అందిపుచ్చుకుని విజయాన్ని సొంతం చేసుకుంటే.. మరికొందరు మధ్యలోనే వెనుదిరుగుతారు. అయితే, ఎన్ని కష్టాలు ఎదురైనా తన కలను వదులుకోకుండా ముందుకు సాగిన వారిలో కన్నడ స్టార్ యశ్ ఒకరు. రోజుకు రూ.50 కూలీతో టీలు అందించిన ఈ స్టార్ ఇప్పుడు రూ.4,000 కోట్ల భారీ సినిమా ప్రాజెక్టులకు స్టార్‌గా నిలిచాడు.బస్సు డ్రైవర్ కుమారుడిగా..హసన్‌లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో నవీన్‌కుమార్ గౌడగా జన్మించిన యశ్.. ప్రభుత్వ బస్సు డ్రైవర్ అరుణ్‌కుమార్, గృహిణి పుష్ప దంపతుల కుమారుడు. చిన్నప్పటి నుంచే ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా తమ కుమారుడు జీవితంలో ఎదుగుతాడనే నమ్మకాన్ని ఆ తల్లిదండ్రులు ఎప్పుడూ కోల్పోలేదు.తొలి ప్రయత్నం విఫలం..చిన్నప్పటి నుంచే యశ్‌కు సినిమాలంటే ఎంతో ఇష్టం. దీంతో ఇంటర్ పూర్తి చేసిన తర్వాత తన కలను నెరవేర్చుకోవడానికి బెంగళూరుకు వెళ్లాడు. సహాయ దర్శకుడిగా మారాలన్న ఆయన తొలి ప్రయత్నం అందని ద్రాక్షగానే మిగిలింది. అయినా నిరాశ చెందకుండా బీవీ కారంత్కు చెందిన బెనక నాటక బృందంలో రోజుకు రూ.50 వేతనంతో పనిచేశాడు. కళాకారులకు టీలు అందించడం, వేదికలను శుభ్రం చేయడం వంటి పనులు చేస్తూనే నటనపై దృష్టి పెట్టాడు.బుల్లితెరతో గుర్తింపు..2004లో నాటక రంగంలో తొలి ప్రధాన పాత్రను దక్కించుకున్న యశ్.. అదే ఏడాది బుల్లితెరపై కూడా అడుగుపెట్టాడు. అనంతరం వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. 2007లో 'జంబాడ హుడుగి' చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన యశ్.. 'మొగ్గిన మనసు' సినిమాతో మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత 'మోడలసాల', 'కిరాతక', 'లక్కీ', 'జాను' వంటి చిత్రాలు ఆయనకు మంచి పేరును తీసుకొచ్చాయి. 2012 నుంచి 2014 వరకు వచ్చిన 'డ్రామా', 'గూగ్లీ', 'రాజా హులి', 'గజకేసరి', 'మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి' చిత్రాలు ఆయనను కన్నడ చిత్రసీమలో అగ్ర కథానాయకుడిగా నిలబెట్టాయి.తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యాడు..అయితే, యశ్ జీవితాన్ని పూర్తిగా మార్చేసిన చిత్రం 'కేజీఎఫ్'. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 'రాకీ భాయ్' పాత్రతో యశ్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. దీంతో తెలుగు ప్రేక్షకులకు కూడా మరింత దగ్గరయ్యాడు.నాలుగేళ్ల విరామం తర్వాత యశ్ 'టాక్సిక్', 'రామాయణ' చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ఈ రెండు చిత్రాలు భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులుగా నిలిచాయి. సుమారు రూ.4,000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న 'రామాయణ', రూ.500 కోట్ల వ్యయంతో రూపొందుతున్న 'టాక్సిక్' చిత్రాల్లో నటించడమే కాకుండా సహ నిర్మాతగా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. రోజుకు రూ.50 కూలీతో ప్రారంభమైన యశ్ ప్రయాణం.. నేడు వేల కోట్ల ప్రాజెక్టులకు నాయకత్వం వహించే స్థాయికి చేరడం నిజంగా ఎందరికో స్ఫూర్తిదాయకం. -
మిర్చి కంటే ఘాటుగా 'టాక్సిక్' కియారా గ్లామర్ (ఫొటోలు)
-
యశ్ టాక్సిక్.. రన్ టైమ్ చాలా ఎక్కువే?
కేజీఎఫ్ స్టార్ యశ్ నటించిన లేటేస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ టాక్సిక్. గీతూ మోహన్ దాస్ డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా.. మోస్ట్ వయొలెన్స్ అండ్ బోల్డ్‌గా అనిపించింది. అంతకుముందు బోల్డ్ సాంగ్‌పై విమర్శలు రాగా.. టాక్సిక్ ట్రైలర్ రిలీజ్ తర్వాత మరిన్ని విమర్శలొచ్చాయి. అయితే ఇప్పటికే ఈ సినిమా కేవలం పెద్దల కోసమేనని మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు.తాజాగా ఈ మూవీకి సంబంధించి రన్ టైమ్ లాక్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి సెన్సార్ వాళ్లు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ మూవీ రన్ టైమ్ దాదాపు 3 గంటల 14 నిమిషాలుగా ఫిక్స్ చేశారు మేకర్స్. మూడు గంటలకు పైగా లాంగ్ రన్ టైమ్ కావడంపై ఈ సినిమాపై అభిమానుల్లో మరింత ఆసక్తి ఏర్పడింది. ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయనతార, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. -
యశ్‌ను కర్ణాటకలో ఉండనివ్వం: టాక్సిక్‌పై ప్రముఖ నటి ఆగ్రహం
కేజీఎఫ్ హీరో యశ్ నటించిన లేటేస్ట్ మూవీ టాక్సిక్. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయగా.. మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ ట్రైలర్లో ఎక్కువగా వయొలెన్స్‌తో పాటు బోల్డ్ కంటెంట్ ఎక్కువగా చూపించారు. ఈ మూవీకి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమాలోని కియారాతో బోల్డ్ సాంగ్‌పై పెద్దఎత్తున విమర్శలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ కేవలం పెద్దల కోసమేనని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.ఈ నేపథ్యంలోనే కన్నడ నటి రిషికా సింగ్ టాక్సిక్ చిత్రంపై విమర్శలు గుప్పించింది. ఈ ట్రైలర్‌లోని బోల్డ్ సీన్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేసింది. ట్రైలర్లో చూపించిన రొమాంటిక్, బోల్డ్ సీన్స్ తనను తీవ్ర నిరాశకు గురి చేశాయని తెలిపింది. యశ్ కూడా ఓ భర్తగా, తండ్రిగా మహిళల పట్ల గౌరవం చూపాలని ఆశిస్తున్నట్లు వెల్లడించింది. మహిళలను గౌరవించకపోతే అతడిని కర్ణాటక నుంచి ఖాళీ చేయిస్తామంటూ మాట్లాడింది. అంతేకాకుండా నేను టాక్సిక్ అంటూ కామెంట్స్ చేసింది.దీంతో రిషికా వ్యాఖ్యలపై నెట్టింట్ యశ్ అభిమానులు మండిపడుతున్నారు. 'టాక్సిక్'లోని బోల్డ్ సన్నివేశాలపై ఆమె చేసిన విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిషీకా గతంలో నటించిన చిత్రాలు, ఫోటోషూట్లకు సంబంధించిన క్లిప్‌లు కొందరు నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. కాగా.. ఈ మూవీ ఆగస్టు 26న థియేటర్లలో సందడి చేయనుంది. అసలు రిషికా సింగ్ ఎవరు?కన్నడ భామ రిషికా సింగ్ 'కల్ల మల్ల సుల్లా', 'బెంకి బిరుగలి', 'కంతిరవ', 'తుంటరు' లాంటి చిత్రాలతో ఫేమస్ అయింది. ఆమె చిత్రనిర్మాత రాజేంద్ర సింగ్ బాబు కుమార్తె కావడం విశేషం. అంతేకాకుండా బిగ్ బాస్ కన్నడ మొదటి సీజన్లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. -
యశ్ టాక్సిక్.. రన్ టైమ్ అంతేనా?
కన్నడ స్టార్ యశ్ హీరోగా వస్తోన్న యాక్షన్ అండ్ గ్యాంగ్‌స్టర్ మూవీ టాక్సిక్. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్‌కు సిద్ధమైంది. ఈనెల 26న థియేటర్లలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా.. మరింత బోల్డ్ అండ్ వయొలెంట్‌గా చూపించారు. ఈ మూవీ కేవలం పెద్దలకు మాత్రమేనని ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో చర్చ మొదలైంది. భారీ బడ్జెట్ మూవీ కావడంతో రన్‌టైమ్ గురించి ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ మూవీ రన్‌టైమ్ దాదాపు 3 గంటల 11 నిమిషాలని ప్రచారం జరుగుతోంది. ఈ రన్‌టైమ్ చూస్తుంటే కాస్తా తక్కువగానే ఉన్నట్లుగానే అనిపిస్తోంది. ఎందుకంటే ఈ మూవీలో అధికంగా వయొలెన్స్, యాక్షన్ సన్నివేశాలు ట్రైలర్లో కనిపించాయి. అందువల్లే గీతూ మోహన్ దాస్ ఇదే నిడివితో సెన్సార్‌కు పంపినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ సినిమాను ప్రైమ్ బిగ్ స్క్రీన్ ఫార్మాట్ ఐమాక్స్‌లో కూడా విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ ఫార్మాట్లో రిలీజవుతోన్న రెండో కన్నడ సినిమా ఇదే కావడం విశేషం. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ స్థాయిలో నిర్మించారు. ఈ చిత్రంలో నయనతార, కియారా అడ్వాణీ, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషి, తారా సుతారియా హీరోయిన్లుగా నటించారు. -
యశ్ టాక్సిక్.. పారితోషికం ఎవరికి ఎన్ని కోట్లంటే?
కన్నడ స్టార్ యశ్ హీరోగా వస్తోన్న యాక్షన్ అండ్ బోల్డ్ మూవీ టాక్సిక్. ఈ మూవీకి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ పలుసార్లు వాయిదా పడగా.. ఎట్టకేలకు ఆగస్టు 26న థియేటర్లలోకి రానుంది. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఫుల్ బోల్డ్ అండ్ వయొలెంట్‌గా ఉంది. ఈ ట్రైలర్‌తో టాక్సిక్‌పై అంచనాలు మరింత పెరిగాయి.ట్రైలర్ తర్వాత టాక్సిక్ మూవీ కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టాక్సిక్ మూవీకి సంబంధించి ఓ టాక్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సినిమాకు యశ్, కియారా, నయనతార ఎంత తీసుకున్నారనే దానిపై చర్చ నడుస్తోంది. ఈ భారీ బడ్జెట్ మూవీకి కాస్తా గట్టిగానే ఛార్జ్ చేశారని తెలుస్తోంది.ఈ సినిమాకు కేజీఎఫ్ స్టార్ యశ్ దాదాపు రూ.50 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నారని శాండల్‌వుడ్‌లో టాక్ వినిపిస్తోంది. హీరోయిన్ కియారాకు కూడా భారీగానే ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఆమెకు ఏకంగా రూ.15 కోట్లు చెల్లించనున్నారని సమాచారం. అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార రూ.12 నుంచి 18 కోట్ల వరకు పారితోషికం అందుకోనున్నట్లు తెలుస్తోంది.అలాగే కాంతార ఫేమ్ రుక్మిణీ వసంత్ సైతం భారీగానే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసం రూ.3 నుంచి 5 కోట్ల వరకు ఛార్జ్ చేయనుందని టాక్. అలాగే బాలీవుడ్ భామలు హ్యుమా ఖురేషీ, తారా సుతారియా రూ.2 నుంచి 3 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకోనున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ లెక్కన కేవలం హీరో, హీరోయిన్లకే దాదాపు వంద కోట్ల వరకు ఖర్చు చేయనున్నారని అర్థమవుతోంది. ఇంత భారీ ఎత్తున నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలా రాణిస్తుందో వేచి చూడాల్సిందే. -
'టాక్సిక్' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
యశ్ టాక్సిక్.. ఆ రూల్‌కు నయనతార బ్రేక్
కన్నడ హీరో యశ్ నటిస్తోన్న యాక్షన్ మూవీ టాక్సిక్ ట్రైలర్ రిలీజైంది. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన మూవీ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ట్రైలర్ విడుదల చేసి ప్రమోషన్స్ ప్రారంభించారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ కాగా.. లేడీ సూపర్ స్టార్ నయనతార కీలక పాత్ర పోషించింది. ట్రైలర్ చూస్తుంటే వయొలెన్స్‌తో పాటు బోల్డ్ కంటెంట్‌ను తలపిస్తోంది.అయితే ఈ మూవీ సంగతి పక్కనపెడితే.. నయనతార చేసిన పనికి సినీ ప్రియులు షాకవుతున్నారు. గతంలో ఏ మూవీకి కూడా ప్రమోషన్స్ చేయడం నాకు ఇష్టముండదని ప్రకటించింది. అందుకే తాను ప్రమోషన్స్ ఈవెంట్స్‌కు దూరంగా ఉంటానని తెలిపింది. అలా చెప్పిన నయన్.. మూవీ ప్రమోషన్స్‌కు హాజరు కావడం అభిమానులను, నెటిజన్లను షాకింగ్‌కు గురి చేస్తోంది. బెంగళూరులో జరిగిన ఈవెంట్‌కు నయనతార రావడంపై సినీ ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. తాను టాక్సిక్ ఈవెంట్‌కు హాజరు కావడంపై కోలీవుడ్ భామ క్లారిటీ ఇచ్చింది.నయనతార మాట్లాడుతూ.. 'సినిమా ప్రచార కార్యక్రమాలకు హాజరు కావడం నాకు ఇష్టం లేదని కాదు. నాకు వాటిలో అంతగా నైపుణ్యం లేదు. అందుకే నేను వాటికి చాలా దూరంగా ఉంటాను. కానీ చాలా కొన్ని కారణాల వల్ల ఇది నాకు చాలా ప్రత్యేకం. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చానంటే యశ్ కారణం. అతను కేవలం ఒక ఫోన్ కాల్ చేశాడు. నేను ఈ కార్యక్రమానికి హాజరయ్యా. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. దీనికి చాలా కారణాలున్నాయి.' అని అన్నారు. కాగా.. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటించగా.. హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రలు పోషించారు. #Nayanthara’s speech at #Toxic trailer launch!.. pic.twitter.com/utsRVrK9Ku— Gv (@gowtham0725) August 8, 2026 -
మొన్న ప్యారడైజ్.. నిన్న టాక్సిక్.. ఏం సందేశం ఇస్తున్నారు?
యశ్ హీరోగా వస్తోన్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ – అప్స్. ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, తార సుతారియా, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషీ ప్రధాన పాత్రల్లో నటించారు. గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో వెంకట్ కె. నారాయణ, యశ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న రిలీజ్ కానుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా అభిమానుల్లో అంచనాలు పెంచేసింది. ఈ మూవీ కేవలం పెద్దల కోసం మాత్రమేనని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌లో వయొలెన్స్, గన్స్, స్టైలిష్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు బోల్డ్ టచ్ ఉన్న సన్నివేశాలు, గ్లామరస్ పాటలు సినిమాపై ఆసక్తితో పాటు చర్చకు కూడా కారణమయ్యాయిఅయితే తాజాగా టాక్సిక్ మూవీలో కియారా రోల్‌పై మొదటి నుంచి విమర్శలొస్తున్నాయి. ఆమె తల్లి అయిన కొద్ది నెలల్లోనే ఇలాంటి బోల్డ్ రోల్ చేయడంపై నెట్టింట ట్రోల్స్ చేస్తున్నారు. టాక్సిక్ బోల్డ్ సాంగ్ రిలీజ్ తర్వాత ఆమెపై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. ముఖ్యంగా ఈ మూవీ డైరెక్టర్ కూడా లేడీ కావడంతో టాక్సిక్‌పై మరింత ఆసక్తికరంగా మారింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులోనూ వయొలెన్స్, బోల్డ్ సన్నివేశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ ఈవెంట్‌కు హాజరైన హీరో యశ్.. హీరోయిన్ కియారాపై ప్రశంసలు కురిపించారు. ఆమె ఒక ప్రళయం అంటూ కొనియాడారు. ముఖ్యంగా ట్రోలింగ్స్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు యశ్. నువ్వు ఈ సినిమాలో చాలా గొప్ప పాత్ర పోషించావని కొనియాడారు. నయనతార సైతం కియారాపై ప్రశంసలు కురిపించింది.అయితే ఈ సినిమాలో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉండడంపై నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ రోజుల్లో సినిమా అంటే కేవలం వయొలెన్స్, బోల్డ్కే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడుతున్నారు. ఇలాంటి సినిమాలతో సమాజానికి ఏం ప్రయోజనం అని ప్రశ్నిస్తున్నారు. ఏదైనా మూవీ తీస్తే కథలో కొంతైనా సందేశాత్మకంగా ఉండాలని అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి కంటెంట్‌ను ఎక్కువగా తీసుకురావడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. టాక్సిక్ మాత్రమే కాదు.. ఇటీవలే రిలీజైన ది ప్యారడైజ్ టీజర్లో కూడా కేవలం హింసనే చూపించారు. రక్తపాతాన్ని తలపించేలా టీజర్ విడుదల చేశారు. ఇదంతా చూస్తుంటే డైరెక్టర్స్ సృజనాత్మకత పక్కనపెట్టి.. కేవలం హింస, బోల్డ్నే నమ్ముకున్నారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. సినిమా అంటే సమాజానికి ఓ సందేశం ఇచ్చేలా ఉండాలి కానీ.. కేవలం డబ్బుల కోసం ఇలా చేయడం ఎంత వరకు కరెక్ట్ అనేది ఓ సారి ప్రశ్నించుకోవాలి. సినిమాను సినిమాగానే చూడాలి అని అంటారు.. కరెక్టే కానీ.. దానికి కూడా లిమిట్స్ ఉంటాయని గ్రహించాలని నెటిజన్స్ కోరుతున్నారు. -
యష్ 'టాక్సిక్' ట్రైలర్ రిలీజ్
యశ్ హీరోగా నటించిన ద్విభాషా (కన్నడ, ఇంగ్లిష్) చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ – అప్స్’. ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, తార సుతారియా, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషీ ప్రధాన పాత్రల్లో నటించారు. గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో వెంకట్ కె. నారాయణ, యశ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ‘టాక్సిక్’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను బెంగళూరులో నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన కన్నడ స్టార్శివ రాజ్‌కుమార్ మాట్లాడుతూ– ‘‘ట్రైలర్ అద్భుతంగా ఉంది. ఈ సినిమా కోసం మేమందరం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. యశ్ నాకు బ్రదర్‌లాంటివాడు. తను ప్రతి సినిమాతో ఎదుగుతుండటం చాలా ఆనందంగా ఉంది’’ అని అన్నారు. యశ్ మాట్లాడుతూ– ‘‘నాకు ఇది చాలా ప్రత్యేకమైన సినిమా. నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చేసిన సినిమా ఇది. ఇందులో రెండు, మూడు విభిన్నమైన లుక్స్‌లో కనిపిస్తాను. దాని కోసం చాలా సమయం అవసరమైంది. ఇండియన్ సినిమాను గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌పై నిలబెట్టాలనే సంకల్పంతో ఈ సినిమా చేశాం. ఈ సినిమాను కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించాం. ఎంతోమంది ప్రతిభావంతులు ప్యాషన్‌తో హార్డ్ వర్క్ చేశారు. (ఇదీ చదవండి: భారత క్రికెటర్ జైస్వాల్‌తో డేటింగ్? క్లాస్ పీకిన మృణాల్)గీతూ మోహన్‌దాస్ ఈ సినిమా కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఆమె విషయంలో ప్రతి ఒక్కరూ చాలా గర్వపడతారు. నిర్మాత వెంకట్‌గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆయన ఎప్పుడూ రాజీపడలేదు. అలాగే నా భార్య రాధిక స పోర్ట్ లేక పోతే ఈ సినిమా చేయగలిగేవాడిని కాదు. నేను ఇండియన్ సినిమాకు ఒక కార్మికుడిలా పని చేస్తాను. నా బెస్ట్ ఇవ్వడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తాను. ‘టాక్సిక్’ కచ్చితంగా మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుంది. ఈ సినిమా గుర్తుండి పోతుంది’’ అన్నారు. దర్శకురాలు గీతు మోహన్‌దాస్ మాట్లాడుతూ– ‘‘మమ్మల్ని నమ్మి కేవీఎన్గారు అన్నీ సమకూర్చడంవల్లే ఈ సినిమా సాధ్యమైంది. యశ్ వండర్ఫుల్ యాక్టర్, బ్రిలియంట్ ప్రోడ్యూసర్, అద్భుతమైన కో రైటర్. మా ప్రోడక్షన్ టీమ్‌కి, డైరెక్షన్ టీమ్‌కి, నటీనటులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. వాళ్లందరి హార్డ్ వర్క్ వల్లే ఈ సినిమా సాధ్యపడింది’’ అని చెప్పారు.‘‘దేశాల సరిహద్దులు దాటి ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు వెంకట్ కె. నారాయణ. ‘‘నేను ఎక్కడికి వెళ్లినా ఈ సినిమా గురించే అడుగుతున్నారు. ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్ట్‌లో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది’’ అని హ్యూమా ఖురేషి అన్నారు. ‘‘నా కెరీర్లో ‘బిఫోర్ టాక్సిక్, ఆఫ్టర్ టాక్సిక్’ అని తప్పకుండా అంటారు. ఇది నాకు చాలా స్పెషల్ మూవీ’’ అని కియారా అద్వానీ తెలిపారు. ‘‘మంచి క్యారెక్టర్ ఇచ్చి, నన్ను ప్రోత్సహించిన గీతూగారికి థాంక్యూ. ఈ సినిమా నాకో గొప్ప అనుభవం’’ అని రుక్మిణి వసంత్ పేర్కొన్నారు. ‘‘గతంలో గీతూతో కలిసి ఒక సినిమా చేశాను. కానీ ‘టాక్సిక్’ చేస్తున్నప్పుడు ఆమె పూర్తిగా వేరుగా కనిపించారు. ఈ సినిమా కథను ఆమె మైండ్ బ్లోయింగ్‌గా చెప్పారు’’ అని నయనతార చెప్పారు.(ఇదీ చదవండి: సినిమా మీద మేం చేసే ఆ ఖర్చంతా వేస్ట్: నిర్మాత నాగవంశీ) -
టాక్సిక్‌లో బోల్డ్ రోల్.. అందుకే ఒప్పుకున్నా: కియారా
యశ్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ యాక్షన్ మూవీ టాక్సిక్.. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం పలుసార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీకి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో యశ్ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్‌పై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. మరీ బోల్డ్‌గా సీన్స్ ఉన్నాయంటూ పలువురు విమర్శించారు.తమ సినిమాపై విమర్శల వస్తోన్న నేపథ్యంలో తన రోల్‌పై హీరోయిన్ కియారా అద్వానీ స్పందించింది. తన పాత్రకు సంబంధించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ కథ వినగానే ఆ పాత్రకు కనెక్ట్ అయ్యానని తెలిపింది. మహిళలను కేవలం మూసధోరణి పాత్రలే కాకుండా బలంగా, మరింత సహజంగా ఉండాలని పేర్కొంది. అలాంటి అవకాశం ఈ పాత్రలో ఉన్నందుకే వెంటనే ఓకే చెప్పానని కియారా వెల్లడించింది.ఇలాంటి పాత్ర చేయడం ప్రతి నటికీ ఓ కల అని అన్నారు. నా కెరీర్లో ఇలాంటి క్లిష్టమైన పాత్రను పోషించగలననే ధైర్యం కలిగిందని తెలిపారు. నయనతార, హుమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్‌లతో కలిసి పనిచేయడం నాకు చాలా కొత్త అనుభూతిని ఇచ్చిందన్నారు. ఇంతమంది ఒకే సినిమాలో కనిపించడం ప్రేక్షకులకు నచ్చుతుందని పేర్కొన్నారు. ఈ సినిమాపై నాకు ఇష్టం కలగడానికి ఇలాంటి క్షణాలే కారణమని వెల్లడించారు. -
అఫీషియల్: యశ్ టాక్సిక్.. పెద్దలకు మాత్రమే!
కేజీఎఫ్‌తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కన్నడ స్టార్ హీరో యశ్.. ఇప్పుడు ‘టాక్సిక్’తో మరోసారి వార్తల్లో నిలిచారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌లో వయొలెన్స్, గన్స్, స్టైలిష్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు బోల్డ్ టచ్ ఉన్న సన్నివేశాలు, గ్లామరస్ పాటలు సినిమాపై ఆసక్తితో పాటు చర్చకు కూడా కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రం పూర్తిగా పెద్దలకు మాత్రమే అనే క్లారిటీ వచ్చేసింది. యశ్ టాక్సిక్‌పై ఆ నిర్మాత వెంకట్ కె. నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘టాక్సిక్: ఏ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ పెద్దల కోసం రూపొందించిన సినిమా అని స్పష్టం చేశారు. యశ్ కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం సాధారణ కమర్షియల్ సినిమా కాదని నిర్మాత తెలిపారు. కథ చెప్పే విధానం, విజువల్స్, సినిమా స్థాయి అన్నీ ప్రత్యేకంగా ఉంటాయని చెప్పారు. థియేటర్లలో ప్రేక్షకులు ఈ సినిమాను వంద శాతం ఆస్వాదిస్తారని ధీమా వ్యక్తం చేశారు.“టాక్సిక్ చాలా అంబిషియస్ ప్రాజెక్ట్. దీని స్కేల్, గ్రాండియర్, కథన శైలి పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ప్రేక్షకులు థియేటర్లలో చూసిన తర్వాత మేము చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకుంటారు. అయితే ఇది పూర్తిగా పెద్దలకు మాత్రమే కంటెంట్‌తో నిండిన చిత్రం” అని నిర్మాత వెంకట్ కె. నారాయణ పేర్కొన్నారు.ఇప్పటికే విడుదలైన పాటలు, పోస్టర్లు సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ముఖ్యంగా గ్లామర్, డార్క్ టోన్, యాక్షన్ ఎలిమెంట్స్ ఎక్కువగా కనిపించడంతో ఈ సినిమా ఏ జానర్లో ఉండబోతోందన్న చర్చ మొదలైంది. కొందరు అభిమానులు గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో భారీ యాక్షన్ ఉంటుందని అంచనా వేస్తుండగా.. మరికొందరు దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తనదైన శైలిలో కొత్త అనుభూతిని అందించబోతున్నారని భావిస్తున్నారు.తండ్రీకొడుకుల మధ్య సంఘర్షణ నేపథ్యంలో ఈ కథ సాగుతుందని సమాచారం. యాక్షన్‌తో పాటు భావోద్వేగాలు, డ్రామా, మానవ సంబంధాలను కూడా ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్నో వాయిదాల తర్వాత యశ్ ‘టాక్సిక్’ రిలీజ్ డేట్ ఖరారైంది. 2026 ఆగస్టు 26న ఈ భారీ యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
'టాక్సిక్' మరో రొమాంటిక్ సాంగ్.. గన్‌తో లవ్ ప్రపోజ్
'కేజీఎఫ్' తర్వాత యష్ హీరోగా నటిస్తున్న సినిమా 'టాక్సిక్'. వచ్చే నెల 26న థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీ గ్యాంగస్టర్, యాక్షన్ ఎంటర్టైనర్గా తీశారు. గీతూ మోహన్ దాస్ దర్శకురాలు కాగా నయనతార, కియారా అడ్వాణీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా, హ్యుమా ఖురేషీ హీరోయిన్లుగా నటించారు.(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి మృణాల్ థ్రిల్లర్ సినిమా)ఈ సినిమా నుంచి తొలుత వచ్చిన టీజర్లో శృంగరభరిత కంటెంట్‌ని ఎంతలా చూపించారో తెలిసిందే. తర్వాత వచ్చిన 'తబాహి' అనే పాటలోనూ యష్-కియారా తమదైన శైలిలో రొమాన్స్ పండించారు. ఇప్పుడు తాజాగా 'మనసాగదే' అంటూ ఓ సాంగ్ రిలీజ్ చేశారు. ఇందులో యష్-తారా సుతారియా అలానే రొమాన్స్ పండించారు. బాత్ టబ్‌లో గన్‌తో ప్రపోజ్ చేసిన సీన్ వెరైటీగా అనిపించింది.'టాక్సిక్' ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే యాక్షన్ కంటే గ్లామరస్ రొమాన్స్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారా అని సందేహం కలుగుతోంది. ఇప్పటివరకు అయితే మూవీపై పెద్దగా అంచనాలు లేవు. రిలీజ్‌కి ఎలానూ మరో నెల రోజులు టైముంది. ఆ లోపు ట్రైలర్ వల్ల ఏమైనా హైప్ పెరుగతుందేమో చూడాలి?(ఇదీ చదవండి: రోజుకు రూ.100 కోట్లు ఇచ్చినా సోషల్ మీడియాలోకి రాను) -
టాక్సిక్‌లో నయనతార.. అన్ని కోట్లు తీసుకుంటోందా?
కన్నడ స్టార్ యశ్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ యాక్షన్ మూవీ టాక్సిక్. ఈ మూవీకి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు వచ్చేనెల 26న థియేటర్లకు రానుందని మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్లలో భాగంగా ఓ రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేశారు. అది టీజర్ లాగే విమర్శలకు దారితీసింది. ఓవర్‌గా రొమాన్స్ ఉండడంతో విమర్శలొస్తున్నాయి.అయితే ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ నయనతార సైతం కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ కాగా.. నయన్ ఓ ప్రధాన పాత్రలో నటించింది. ఈ నేపథ్యంలోనే నయనతార పారితోషికంపై నెట్టంట చర్చ మొదలైంది. అసలు టాక్సిక్ కోసం నయన్ ఎంత తీసుకుందనే దానిపై శాండల్‌వుడ్‌తో పాటు కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.అయితే ఈ చిత్రంలోని తన పాత్రకు నయనతార భారీగానే డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి ఏకంగా రూ.15 కోట్లు డిమాండ్ చేసిందని టాక్. ఈ ప్రాజెక్ట్‌లో నయనతారకు ఎక్కున స్క్రీన్ టైమ్ లేకపోవడంతో మేకర్స్ ఆమె పారితోషికాన్ని తగ్గించుకోవాలని కోరినట్లు సమాచారం. నిర్మాతలతో పలు దఫాల చర్చల తర్వాత నయన్ రూ. 12 కోట్లకు ఓకే చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఆమెకు ఎక్కువ స్క్రీన్ టైమ్ లేకపోయినా ఇంత పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ చెల్లించడం విశేషం. -
ఈ సినిమాకు A సర్టిఫికెట్ కూడా తక్కువే!
పాన్ ఇండియా స్టార్ యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో 'టాక్సిక్' అనే తీశారు. ఆగస్టు 26న థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే దీనిలో కథ, యాక్షన్, స్టార్ నటీనటుల కంటే హింస, శృంగార కంటెంట్ కారణంగానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా విడుదలైన "తబాహీ" వీడియో సాంగ్ ఆ చర్చ మరింత ముదిరేలా చేసింది.(ఇదీ చదవండి: ప్రేమ పేరుతో నాలుగేళ్లు నా వెంటపడ్డాడు: హీరోయిన్ అంజలి)టాక్సిక్ మొదటి టీజర్ విడుదలైనప్పటి నుంచే దర్శకురాలు గీతూ మోహన్ దాస్‌పై విమర్శలు వస్తున్నాయి. టీజర్లో హింస, రక్తపాతం, శృంగార సన్నివేశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సాధారణంగా యాక్షన్ సినిమాల్లో హింస ఉండటం కొత్తేమీ కాదు. అయితే టాక్సిక్‌లో హింసను చూపించిన తీరు, దానికి తోడు గ్లామర్‌ని మిళితం చేసిన విధానం చర్చకు దారితీసింది.ఆ తర్వాత మహిళా తారాగణాన్ని పరిచయం చేస్తూ విడుదల చేసిన ప్రత్యేక వీడియో కూడా ఇదే తరహా విమర్శలను ఎదుర్కొంది. పాత్రల పరిచయం కంటే స్టైలిష్ విజువల్స్, సెక్సువల్ టోన్, డార్క్ ప్రెజెంటేషన్కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని సినీ అభిమానుల్లో కొందరు అభిప్రాయపడ్డారు.తాజాగా విడుదలైన "తబాహీ" వీడియో సాంగ్ ఈ చర్చను మరోస్థాయికి తీసుకెళ్లింది. పాటలో యాక్షన్‌తో పాటు శృంగార సన్నివేశాలు కూడా ఎక్కువగా ఉండటంతో సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీనిని సినిమా కథకు తగ్గ ప్రెజెంటేషన్‌గా సమర్థిస్తుంటే, మరికొందరు అవసరానికి మించి రెచ్చగొట్టే విజువల్స్‌ను ఉపయోగించారని విమర్శిస్తున్నారు.(ఇదీ చదవండి: మళ్లీ పెళ్లి చేసుకున్న హీరోయిన్ 'కలర్స్' స్వాతి)పాటలో కనిపించిన కియారా అద్వానీపైనా సోషల్ మీడియాలో గట్టిగానే విమర్శలు వస్తున్నాయి. పెళ్లయి, బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఇలాంటి బోల్డ్ సన్నివేశాల్లో నటించాల్సిన అవసరం ఏమిటని కొందరు ప్రశ్నిస్తుండగా, వ్యక్తిగత జీవితం, నటిగా చేసే పాత్రలను కలిపి చూడకూడదని మరికొందరు అంటున్నారు. నటీనటులు తమ పాత్రల ప్రకారం నటిస్తారని, వ్యక్తిగత జీవితంతో వాటికి సంబంధం లేదని సినీ విశ్లేషకులలో మరో వర్గం అభిప్రాయపడుతోంది.ఈ పరిణామాల మధ్య మరో ఆసక్తికరమైన చర్చ కూడా నడుస్తోంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో కనిపించే మితిమీరిన హింస, ముద్దు సన్నివేశాలు, బోల్డ్ ప్రెజెంటేషన్ ప్రేక్షకులను ఆకర్షించాయని, ఇప్పుడు అదే ఫార్ములాను గీతూ మోహన్ దాస్ కూడా అనుసరిస్తున్నారా? అనే ప్రశ్న వినిపిస్తోంది. ఇది ఇప్పటివరకు కేవలం ప్రేక్షకులు, సినీ వర్గాల్లో జరుగుతున్న చర్చ మాత్రమే. సినిమా విడుదలైన తర్వాతే కథకు ఈ అంశాలు ఎంతవరకు అవసరమో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.మరోవైపు 'టాక్సిక్' టీమ్ మాత్రం సినిమాని ఒక డార్క్, స్టైలిష్ యాక్షన్ డ్రామాగా ప్రచారం చేస్తోంది. ప్రచారంలో భాగంగా విడుదల చేస్తున్న ప్రతి వీడియోతో ఆసక్తిని పెంచే ప్రయత్నం చేస్తోంది. అదే టైంలో హింస, శృంగార సన్నివేశాలే ప్రధాన చర్చగా మారడం చిత్రబృందానికి లాభమా? నష్టమా? అనేది విడుదల తర్వాతే తేలనుంది. చూస్తుంటే ఈ సినిమాకు 'ఏ' సర్టిఫికెట్ కూడా తక్కువే అనిపిస్తోంది!(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'పెద్ది'.. ఆ సీన్లు మార్చేశారు) -
'టాక్సిక్' లేడీస్ స్పెషల్.. రొమాన్స్ ప్లస్ వయలెన్స్
'కేజీఎఫ్' తర్వాత యష్ హీరోగా చేసిన సినిమా 'టాక్సిక్'. ఇప్పటికే రెండుసార్లు వాయిదాపడింది. ఎట్టకేలకు ఆగస్టు 26న రిలీజ్ అని ప్రకటించారు. ఇప్పటికే టీజర్, ఓ పాట వదలగా అవేం పెద్దగా బజ్ క్రియేట్ చేయలేకపోయాయి. ఇప్పుడు సడన్‌గా లేడీస్ స్పెషల్ పేరిట హీరోయిన్లతో ఓ టీజర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: మళ్లీ థియేటర్లలోకి 'ఆరుగురు పతివ్రతలు'?)టాక్సిక్ మూవీలో హీరోయిన్లు నయనతార, రుక్మిణి వసంత్, కియారా అడ్వాణీ, తారా సుతారియా, హ్యుమా ఖురేషి ఉన్నారు. అయితే వీళ్లలో ఎవరు హీరోయిన్? ఎవరికి కీలక పాత్రలు అనేది తెలియాల్సి ఉంది. తాజాగా రిలీజ్ చేసిన వీడియోలో అయితే నయనతార, రుక్మిణి వసంత్ గన్స్ పట్టుకుని కనిపించగా.. కియారా, హ్యూమా, తారా గ్లామర్ చూపించారు.యష్.. లేడీ ఫైటర్స్ చేసిన యాక్షన్ ఇందులో చూపించారు. మధ్యమధ్యలో రొమాన్స్ చూపిస్తూ మరోవైపు ఫైట్స్ చూపిస్తూ ఆసక్తి కలిగించారు. గీతూ మోహన్ దాస్ ఈ చిత్రానికి దర్శకురాలు.(ఇదీ చదవండి: తెలుగు స్టార్ హీరోలు గమనిస్తున్నారా? 95 శాతం ఫ్లాపులు, డిజాస్టర్లే) -
TOXIC రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇక మాస్ జాతరే
-
టాక్సిక్ వంద రోజుల రీ షూట్.. నిర్మాణ సంస్థ క్లారిటీ
కన్నడ స్టార్, కేజీఎఫ్ హీరో నటించిన యాక్షన్ మూవీ టాక్సిక్..ఏ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్. ఈ సినిమాకు గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు. జూన్ 4న థియేటర్లలోకి రావాల్సిన ఈ చిత్రం అనూహ్యంగా వాయిదా పడింది. దీంతో అదే తేదీన రామ్ చరణ్ పెద్ది థియేటర్లలోకి వచ్చేసింది.అయితే తాజాగా ఈ మూవీపై కొన్ని ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలోని కొన్ని సీన్స్‌పై హీరో యశ్ తీవ్ర అసంతప్తిగా ఉన్నారని టాక్. అందుకే దాదాపు రూ.40 కోట్ల వ్యయంతో నిర్మించిన వంద రోజుల షూటింగ్‌ను రీ షూట్ చేయాలని అడిగారని ఓ వార్త వైరలవుతోంది. రిలీజ్ తేదీ వాయిదా పడడంతో ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూరుతోంది.ఈ నేపథ్యంలోనే టాక్సిక్ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ స్పందించింది. రీ షూట్ అంటూ వస్తున్న వార్తలను ఖండించింది. ఈ చిత్రానికి ఎలాంటి రీషూట్లు షెడ్యూల్ చేయలేదని నిర్మాణ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా.. మొదట 'టాక్సిక్' మూవీని మార్చి 19న విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ కుదరలేదు.. ఆ తర్వాత జూన్ 4వ తేదీని అనౌన్స్ చేసినప్పటికీ మళ్లీ వాయిదా వేశారు. ఇప్పటి వరకు చిత్ర నిర్మాతలు ఇంకా కొత్త విడుదల తేదీని ప్రకటించలేదు.'కేజీఎఫ్-2' తర్వాత యశ్ నటిస్తోన్న చిత్రం ఇదే కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటించారు. -
టాక్సిక్ డైరెక్టర్ బర్త్ డే.. స్పెషల్ వీడియో వైరల్
యశ్ హీరోగా వస్తోన్న యాక్షన్ మూవీ టాక్సిక్.. ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్అప్స్. ఈ మూవీ గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా అనూహ్యంగా వాయిదా పడింది. టాక్సిక్ పోస్ట్‌పోన్ కావడంతోనే రామ్ చరణ్ పెద్ది థియేటర్లలోకి వచ్చేసింది. అయితే ఇవాళ టాక్సిక్ మూవీ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ బర్త్ డే కావడంతో మేకర్స్ ప్రత్యేక వీడియో పంచుకున్నారు. ఆమె మూవీ షూటింగ్లో సీన్స్ తెరకెక్కించిన విధానాన్ని చూపించారు. ఈ వీడియో చూస్తుంటే టాక్సిక్ కోసం ఆమె ఎంత డెడికేషన్‌తో పనిచేశారో తెలుస్తోంది. ఈ సందర్భంగా పలువురు సినీతారలు గీతూకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.టీజర్‌పై విమర్శలు..అయితే గతంలో టాక్సిక్ టీజర్ రిలీజ్ చేయగా పెద్దఎత్తున విమర్శలకు గురైంది. ఆ టీజర్లో ఇంటిమేట్ సీన్ కాస్తా ఓవర్‌గా ఉందంటూ పలువురు విమర్శించారు. లేడీ డైరెక్టర్ కావడంతో ఇలాంటి సీన్స్ తెరకెక్కించడంపై వివాదానికి కారణమైంది. కానీ ఇలాంటివీ సినిమా కోణంలోనే చూడాలని మరికొందరు కామెంట్స్ చేశారు. మొత్తానికి టీజర్‌తోనే టాక్సిక్‌పై అంచనాలు ఒక్కసారిగా పెంచేసింది గీతూ మోహన్‌దాస్. Behind every shot that hit different, every silence that said more than dialogue ever could, there she was!❤️🔥 Happy birthday, Geetu Mohandas ✨️#Toxic#ToxicTheMovie@TheNameIsYash#Nayanthara @advani_kiara@humasqureshi @rukminitweets #TaraSutaria #GeetuMohandas… pic.twitter.com/PjtUiLlDhi— TOXIC (@Toxic_themovie) June 8, 2026 -
'యశ్‌తో ఇంటిమేట్ సీన్స్.. అదంతా నాన్సెన్స్'
కేజీఎఫ్ స్టార్ యశ్ నటించిన యాక్షన్ మూవీ టాక్సిక్. ఈ మూవీ ఊహించని వివాదాలతో వాయిదా పడింది. జూన్ 4న రావాల్సిన ఈ సినిమా పోస్ట్‌పోన్ చేశారు. కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. ఈ మూవీకి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా కనిపించనుంది. అయితే తాజాగా టాక్సిక్ మూవీకి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. కియారా తన ఇంటిమేట్ సీన్స్ కట్ చేయాలని మేకర్స్ కోరినట్లు తెగ హల్చల్ చేస్తోంది.ఈ నేపథ్యంలో హీరోయిన్ కియారా అద్వానీ దీనిపై స్పందించింది. యశ్‌తో ఇంటిమేట్ సీన్స్ తొలగించాలని తాను కోరలేదని తెలిపింది. ఇవన్నీ అబద్ధమని కొట్టిపారేశారు. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. ఇలాంటివీ ఎవరు కూడా నమ్మవద్దని హితవు సూచించారు. ఈ మూవీ ఫైనల్ కట్ చూసిన కియారా.. కొన్ని బోల్డ్ తొలగించాలని పలు కథనాలు వెలువడ్డాయి. దీంతో హీరోయిన్ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఈ చిత్రాన్ని కెవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ చిత్రంలో నయనతార, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా కీలక పాత్రల్లో నటించారు. -
'టాక్సిక్'.. అనుకున్నదే జరిగింది
మనం ఎలాంటి సినిమా తీశామనేది ముఖ్యం కాదు చెప్పిన టైంకి రిలీజ్ చేశామా లేదా అనేది ప్రేక్షకులు చూస్తారు. ఒకసారి వాయిదా పడింది అంటే సరేలే ఏదో సమస్య ఉండొచ్చు అనుకుంటారు. కానీ మళ్లీ మళ్లీ వాయిదా పడితే లేనిపోని సందేహాలు వస్తాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే గత కొన్నిరోజుల నుంచి సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నట్లే యష్ 'టాక్సిక్' మరోసారి వాయిదా పడింది. ఈ విషయాన్ని ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: హీరో విజయ్‌ని టార్గెట్ చేసి తీసిన సినిమా! ఐదు ఓటీటీల్లో స్ట్రీమింగ్)ఈ సినిమాని జూన్ 4న విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ, అది కుదరడం లేదు. మూవీ అయితే సిద్ధంగా ఉందని కానీ అంతర్జాతీయ డిస్ట్రిబ్యూషన్, భాగస్వామ్యాలు జరుగుతున్న కారణంగా విడుదల తేదీని మారుస్తున్నాం. ప్రపంచవ్యాప్తగా ఒకే తేదీకి రిలీజ్ చేసేలా కొత్త డేట్ త్వరలోనే ప్రకటిస్తాం. ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే సామర్థ్యం ఉంది. ఆడియెన్స్ అంచనాలు అందుకునేలా కాస్త టైమ్ తీసకుని, అత్యుత్తమ ఔట్పుట్ అందించాలనుకుంటున్నామని హీరో, నిర్మాత యష్ ఓ నోట్ రిలీజ్ చేశాడు.మాఫియా బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమాలో యష్ హీరో కాగా రుక్మిణి వసంత్, నయనతార, కియారా అడ్వాణీ, హ్యుమా ఖురేషి, తారా సుతారియా హీరోయిన్లుగా నటించారు. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దీన్ని తెరకెక్కించింది. 'జన నాయగణ్' నిర్మించిన కేవీఎన్ ప్రొడక్షన్.. ఈ చిత్రాన్ని కూడా యష్‌తో కలిసి నిర్మించింది. తొలుత మార్చి 19 అనుకున్నారు కుదర్లేదు. జూన్ 4 అనుకున్నారు కుదర్లేదు. మరి ఈసారైనా ఓ తేదీ ఫిక్స్ చేసుకుని రిలీజ్ చేస్తారా అనేది చూడాలి?ఇకపోతే ఈ చిత్రం నుంచి ఇప్పటికే ఓ గ్లింప్స్ వీడియో, పాట రిలీజ్ చేశారు గానీ ఏ మాత్రం హైప్ ఏర్పడలేదు. ఇప్పుడిలా వాయిదాల మీద వాయిదాలు పడితే దీనిపై ఉన్న కాస్తోకూస్తో హైప్ కూడా తగ్గిపోయే ప్రమాదముంది.(ఇదీ చదవండి: కొత్త అఖిల్‌ని చూస్తారు.. నాగార్జున ఫస్ట్ రివ్యూ) -
టాక్సిక్ వాయిదా పడే ఛాన్స్.. అంతా యశ్ వల్లేనా?
కేజీఎఫ్ తర్వాత యశ్ నటిస్తోన్న భారీ యాక్షన్ చిత్రం టాక్సిక్. ఈ బిగ్ ప్రాజెక్ట్‌కు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ ఓసారి వాయిదా వేశారు. మార్చిలో రావాల్సిన ఈ చిత్రం జూన్‌కు పోస్ట్‌పోన్ అయింది. ఈ మూవీ టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్ ఒక్కసారిగా అంచనాలు పెంచేశారు. టీజర్లో బోల్డ్ సీన్ ఉండడంతో పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. అయితే ఈ మూవీ రిలీజ్ మరోసారి వాయిదా పడనుందనే టాక్ వినిపిస్తోంది. జూన్ 4న రిలీజ్ కావడం కష్టమేనని తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం మూవీ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. అంతేకాకుండా ఆర్థిక లావాదేవీల విషయంలో వివాదం కూడా ఉన్నట్లు సమాచారం.ఓటీటీ డీల్ ఆలస్యం..!ఈ బిగ్ మూవీ ఓటీటీ డీల్‌పై వివాదం కొనసాగుతోంది. ఈ మూవీ నిర్మాతలు డిజిటల్ రైట్స్ కోసం ఏకంగా రూ.250 కోట్ల భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుత మార్కెట్ ప్రకారం ఓటీటీ యాజమాన్యాలు రూ.110 కోట్లకు పైగా చెల్లించేందుకు ముందుకు రావడం లేదు. నిర్మాతల డిమాండ్ వల్లే టాక్సిక్ మరింత ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది.యశ్ వల్లేనా..?ఈ మూవీ ఓటీటీ డీల్ ఆలస్యానికి హీరో యశ్ ఓ కారణమని తెలుస్తోంది. సాధారణంగా పెద్ద ప్రాజెక్టులకు ఓటీటీ డీల్ సమయంలో ఆ సంస్థ ప్రతినిధులకు సినిమా ప్రివ్యూ చూపించాలి. కానీ మాత్రం ఈ విషయంలో ఒప్పుకోవడం లేదని సమాచారం. ఈ చిత్రాన్ని కేవలం థియేటర్లలోనే చూడాలని..ముందే చూపించడం వల్ల సినిమాపై ఆసక్తి తగ్గుతుందని యశ్ భావిస్తున్నారట. యశ్ నిర్ణయం వల్ల తీసుకున్న అంత పెద్ద మొత్తాన్ని ఇచ్చేందుకు ఓటీటీలు వెనకాడుతున్నాయని లేటేస్ట్ టాక్. అందుకే టాక్సిక్ మరోసారి వాయిదా తప్పదని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
'పెద్ది' కొత్త రిలీజ్ డేట్ ఫిక్సయిందా?
రామ్ చరణ్ 'పెద్ది' చిత్రానికి కష్టాలు మామూలుగా లేవు. తొలుత మార్చిలో రిలీజ్ అన్నారు. పని ఇంకా పూర్తవ్వకపోయేసరికి ఏప్రిల్ చివరలో కచ్చితంగా విడుదల చేస్తాం అని మాటిచ్చారు. తీరా ఈసారి కూడా మాట తప్పి జూన్‌లో థియేటర్లలోకి వస్తామని అధికారికంగా ప్రకటించారు. ఈసారి తేదీ వెల్లడించనప్పటికీ బయట రూమర్స్ మాత్రం వినిపిస్తున్నాయి.(ఇదీ చదవండి: తల్లి కాబోతున్న మరో తెలుగు సీరియల్ హీరోయిన్)ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న ప్రకారం.. 'పెద్ది' మూవీని జూన్ 4న థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటున్నారట. ఈ తేదీ దాదాపుగా ఖరారు అయినప్పటికీ పనులన్నీ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత దీనిని అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. అయితే ఈ డేట్‌కి వస్తామని ఇప్పటికే యష్ 'టాక్సిక్' సినిమా ఖర్చీఫ్ వేసుకుంది. మరి 'పెద్ది' కూడా అదే తేదీకి వస్తే రెండు పాన్ ఇండియా చిత్రాల మధ్య పోటీ నెలకొంటుంది. అప్పుడు ఇద్దరిలో పైచేయి ఎవరిది అవుతుందో చూడాలి?స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న 'పెద్ది'లో చరణ్.. క్రికెట్, కుస్తీ క్రీడాకారుడిగా కనిపించబోతున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా కన్నడ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నాడు. బుచ్చిబాబు దర్శకుడు. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడేసరికి చాలామంది దీనిపై మెల్లగా ఆసక్తి తగ్గుతోంది. ఒకవేళ మూడోసారి కూడా వాయిదా పడితే గనుక మరింత డ్యామేజీ కావడం గ్యారంటీ. మరి టీమ్ ఈసారి ఏం చేస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: 'దేవర 2' కంటే ముందు కొరటాల నుంచి మరో హిట్ సినిమా సీక్వెల్?) -
టాక్సిక్ గ్యాంగ్‌స్టర్ సినిమా కాదు.. యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు
గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యశ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం టాక్సిక్. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. టీజర్ చూసిన తర్వాత అందరూ ఇది కూడా కేజీయఫ్‌లో ఓ గ్యాంగ్‌స్టర్ కథ అని ఫిక్స్ అయ్యారు. కానీ ఇది అలాంటి కథ కానే కాదు అంటున్నాడు హీరో యశ్. ఇంతవరకు ఇలాంటి కథాంశంతో ఒక్క చిత్రం కూడా రాలేదని..ఇదొక డిఫరెంట్ జోనర్ మూవీ అంటున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో టాక్సిక్ సినిమా గురించి మాట్లాడారు. ‘టీజర్ రిలీజ్ తర్వాత అందరూ ఇది గ్యాంగ్‌స్టర్ కథ అంటున్నారు. కానీ పదేపదే చెబుతున్నా.. ఇది గ్యాంగ్‌స్టర్ సినిమా కాదు. యాక్షన్ మాత్రమే కాదు బలమైన ఎమోషన్స్ ఉంటాయి. కొత్త కాన్సెప్ట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. సినిమాకు వచ్చిన ప్రేక్షకుడు కొత్త ప్రపంచంలోకి వెళతాడు. విజువల్స్ ఆకట్టుకుంటాయి. అలాగే నా నుంచి అభిమానులు కోరుకుంటున్న అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. ప్రతి చిన్న విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కచ్చితంగా ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’ అన్నారు. అలాగే యశ్ రావణుడిగా, రణ్‌బీర్ రాముడిగా కలిసి నటిస్తున్న ‘రామాయణ’ చిత్రం గురించి మాట్లాడుతూ.. ‘తొలిభాగంలో రణ్‌బీర్‌తో నాకు ఎలాంటి సన్నివేశాలు లేవు. కానీ ఇద్దరం పలుమార్లు కలుసుకున్నాం. రణ్‌బీర్ ఓ అద్భుతమైన నటుడు. మా ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉన్నాయి. అది ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది’అన్నారు. నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. ఈ ఏడాది దీపావళికి తొలి భాగం విడుదల కానుంది. -
టాక్సిక్ మరోసారి వాయిదా.. మేకర్స్ ఏమన్నారంటే?
కన్నడ హీరో యశ్.. గీతూ మోహన్ దాస్ డైరెక్షన్లో నటిస్తోన్న చిత్రం ‘టాక్సిక్’ (Toxic). ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను మెప్పించింది. టీజర్ కాస్తా బోల్డ్‌గా ఉండడంతో మేకర్స్‌పై విమర్శలొచ్చాయి. అయినప్పటికీ ఈ టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత ఈ సినిమా నుంచి ఓ సాంగ్‌ను కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా విడుదల ఇప్పటికే ఓ సారి వాయిదా పడింది.ఈ నేపథ్యంలోనే టాక్సిక్ మరోసారి వాయిదా పడుతుందన్న వార్తలొస్తున్నాయి. ఈ మూవీ జూన్ 4వ తేదీన రిలీజ్ కానుందని ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు మూవీ టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. ఈ సినిమా రిలీజ్‌కు కేవలం 40 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో ఈ సినిమా వాయిదా పడుతుందని ఫ్యాన్స్‌లో మరో ఆందోళన కలిగిస్తోంది.తాజాగా వాయిదా వార్తలను టాక్సిక్ టీమ్ ఖండించింది. చెప్పిన ప్రకారం జూన్ 4వ తేదీనే విడుదల కానుందని స్పష్టం చేసింది. ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రమోషన్స్ చేయనున్నట్లు తెలిపింది. మరోవైపు యష్ ప్రస్తుతం అమెరికాలో 'రామాయణం' ప్రచార కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు.కాగా.. ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయన తార, హూమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. కేవీఎన్ ప్రోడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్‌పై వెంకట్ కె.నారాయణ, యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్, కన్నడ భాషల్లో నేరుగా, హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. -
పవన్ దొరికిపోతే.. యష్ తప్పించుకున్నాడు!
కొన్నిసార్లు పోటీ కంటే తప్పుకోవడం వల్ల కూడా మంచి జరగొచ్చు. అవును ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లు, మూవీ లవర్స్ మధ్య ఇలాంటి ఓ ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇదంతా కూడా 'ధురంధర్ 2' గురించే. ఈ మూవీ నుంచి యష్ ఎలా తప్పించుకున్నాడు. పవన్ కల్యాణ్ ఎలా దొరికిపోయాడనేదే ఈ స్టోరీ.(ఇదీ చదవండి: ఎక్కువ సినిమాల్లో నన్ను పెట్టుకోండి: రాజశేఖర్)గతేడాది డిసెంబరు 5న 'ధురంధర్' తొలి పార్ట్ రిలీజైనప్పుడు సీక్వెల్ గురించి క్లారిటీ ఇచ్చారు. మార్చి 19న థియేటర్లలోకి వస్తుందని ప్రకటించారు. అయినా సరే 'కేజీఎఫ్' ఫేమ్ యష్ 'టాక్సిక్' మూవీని అదే తేదీకి తీసుకొస్తామని మేకర్స్ ఘనంగా అనౌన్స్ చేశారు. మార్చి మొదలైన వరకు రెండు పాన్ ఇండియా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీపడతాయేమోనని అనుకున్నారు. కానీ ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పశ్చిమాసియా దేశాల్లో అనిశ్చితి వాతావరణాన్ని కారణంగా చూపిస్తూ 'టాక్సిక్' మూవీని వాయిదా వేశారు. షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండటం వల్లే ఇలా చేశారని మాట్లాడుకుంటున్నారు.మరోవైపు 'ధురంధర్ 2' రిలీజైన వారం తర్వాత అంటే మార్చి 26న తమ సినిమా రిలీజ్ చేస్తామని 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలుత చెప్పింది. కానీ 'టాక్సిక్' వాయిదా పడటంతో వారం ముందుకొచ్చారు. ధురంధర్ హిందీ సినిమానే అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి హైప్ ఉంది. ఇదేమైనా 'ఉస్తాద్..'కి నెగిటివ్ అవ్వొచ్చేమోనని పలువురు అభిప్రాయపడ్డారు. అయితే రిలీజ్ రోజున 'ధురంధర్ 2' తెలుగు వెర్షన్ రాకపోవడం, ఉగాది పండగ వల్ల 'ఉస్తాద్..'కి ఉన్నంతలో కలిసొచ్చింది.కానీ రెండో రోజు నుంచి 'ధురంధర్ 2' హిందీ బుకింగ్స్ పెరిగాయి. అదే టైంలో మూస కంటెంట్ వల్ల 'ఉస్తాద్..' వసూళ్లలోనూ విపరీతమైన డ్రాప్ కనిపించింది. అది మరింతగా కొనసాగుతోంది. ఈ వీకెండ్ వరకు ఓకే గానీ సోమవారం నుంచి పవన్ సినిమాకు అగ్నిపరీక్షే. ఎందుకంటే వర్కింగ్ డేస్‌లోనూ ఈ మూవీ నిలబడితే పర్లేదు. అలా జరగకపోతే మాత్రం కష్టమే. మరోవైపు 'ధురంధర్ 2' తెలుగు షోలకు ఇచ్చిన స్క్రీన్లు సరిపోవడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి థియేటర్ ఓనర్స్ ఈ సినిమా వైపు మొగ్గుచూపుతారా? లేదంటే 'ఉస్తాద్..'నే కొనసాగిస్తారా అనేది చూడాలి?(ఇదీ చదవండి: పవన్-హరీశ్ శంకర్ మూడో సినిమా.. అయ్యే పనేనా?) -
యశ్ వల్లనే 'టాక్సిక్' వాయిదా.. యుద్ధం సాకు మాత్రమేనా?
కన్నడ హీరో యశ్ నటించిన కొత్త చిత్రం ‘టాక్సిక్’.. దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కించిన ఈ మూవీని వెంకట్ కె. నారాయణ, యశ్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. మార్చి 19న విడుదల కావాల్సిన టాక్సిక్ను సడెన్‌గా వాయిదా వేశారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా దీన్ని జూన్ 4కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, అసలు నిజం మరోకటని నెట్టింట వార్తలు వస్తున్నాయి.టాక్సిక్ సినిమా వాయిదాకు అసలు కారణాలు ఇవ్వే అంటూ పలు కథనాలు వస్తున్నాయి. ఇటీవల యష్ కోసం ఒక ప్రత్యేక స్క్రీనింగ్‌ను మేకర్స్ ఏర్పాటు చేశారట. ఫైనల్ అవుట్‌పుట్ విషయంలో యశ్ సంతృప్తి చెందాడని సమాచారం. ముఖ్యంగా మూవీలో VFX, నేపథ్య సంగీతం అతన్ని నిరాశపరిచాయని, అందుకే అతను విడుదలను వాయిదా వేయమని సూచించారట. మూవీలోని లోటుపాట్లను సరిచేసి రిలీజ్ చేద్దామని ఆయన కోరారట. దీంతో అసలు విషయం చెప్పకుండా పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల వల్ల వాయిదా వేస్తున్నామనేది కేవలం సాకు మాత్రమేనని నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదే నిజమైతే సినిమా అవుట్‌ఫుట్ మరింత బలంగా వస్తుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.టాక్సిక్ చిత్రంలో యశ్‌తో పాటు హ్యుమా ఖురేషీ , నయనతార, కియారా, తారా సుతారియా, రుక్మిణి వసంత్ నటించారు. ఈ మూవీ ఇంగ్లిష్, కన్నడ భాషల్లో నేరుగా, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో డబ్బింగ్ వెర్షన్లో రిలీజ్ కానుంది. ఈ మూవీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల తెలుగు రిలీజ్ హక్కులను ‘దిల్’ రాజు సొంతం చేసుకున్నారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.వాయిదాపై నిర్మాణ సంస్థ ఏం చెప్పిందిటాక్సిక్ వాయిదా గురించి చిత్ర నిర్మాణ సంస్థ ఇలా చెప్పింది. ‘‘మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌లో నెలకొన్న ప్రస్తుత అనిశ్చితి, యుద్ధ వాతావరణం నేపథ్యంలో విడుదలను వాయిదా వేయాలనుకున్నాం. ఓవర్సీస్లో ప్రధాన పంపిణీ భాగస్వామి అయిన ఫార్స్ ఫిల్మ్స్ సలహా ప్రకారం ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. గల్ఫ్ ్రపాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, దాని ఫలితంగా సినిమా కార్యకలాపాలకు అంతరాయాలు ఏర్పడటం కూడా విడుదల వాయిదాకి ఓ కారణం’’ అని యూనిట్ పేర్కొంది. -
'ధురంధర్ 2'కి లైన్ క్లియర్.. 'టాక్సిక్' వాయిదా
ఈ నెలలో రావాల్సిన పెద్ద సినిమాల్లో 'టాక్సిక్' ఒకటి. కేజీఎఫ్ లాంటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ సక్సెస్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని హీరో యష్ చేసిన మూవీ ఇది. లెక్క ప్రకారం మార్చి 19నే థియేటర్లలో రిలీజ్ అన్నారు. నిన్నటి వరకు అదే మాటపై ఉంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి పరిస్థితులు మారిపోయేసరికి వాయిదా వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: మా బాడీ పార్ట్స్ జూమ్ చేసి ఫొటోలు.. 'కాంతార' హీరోయిన్ ఫైర్)మార్చి 19న రావాల్సిన 'టాక్సిక్' చిత్రాన్ని జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. పశ్చిమ ఆసియా దేశాల్లో యుద్ధ ప్రభావమే దీనికి కారణమని చెప్పుకొచ్చారు. విదేశాల్లో ఆడియెన్స్ కోసం ఈ చిత్రాన్ని తెరకెక్కించామని ప్రస్తుతం యుద్ధ కారణంగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో అనిశ్చితి నెలకొందని, తమ పార్ట్నర్స్ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ఓ నోట్ రిలీజ్ చేసింది.'టాక్సిక్' వాయిదా పడింది. దీంతో 'ధురంధర్ 2'కి లైన్ క్లియర్ అయిపోయినట్లే. గతేడాది డిసెంబరులో పెద్దగా హడావుడి లేకుండానే 'ధురంధర్' వచ్చింది. రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. ట్రైలర్ రిలీజ్ చేస్తే ఇది కూడా వస్తుందా లేదా అనేది క్లారిటీ వస్తుంది. 'ధురంధర్ 2' గురించి వాయిదా లాంటివి రూమర్స్ అయితే ఇప్పటివరకు ఏం రావట్లేదు.(ఇదీ చదవండి: టాలీవుడ్‌పై ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం ఎంత?) -
టాక్సిక్ ఫస్ట్ సాంగ్ విడుదల.. నిరాశపరిచిన యశ్
కన్నడ నటుడు యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘టాక్సిక్’ (Toxic). ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను మెప్పించింది. అయితే, తాజాగా ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. యశ్, కియారా ఆద్వాణిల మధ్య సాగే 'తాబాహీ..' ఈ పాటను విశాల్ మిశ్రా ఆలపించగా రామజోగయ్య శాస్త్రి తెలుగు సాహిత్యం రాశారు. టాక్సిక్‌లో నదియా అనే పాత్రలో కియారా నటిస్తున్న విషయం తెలిసిందే.టాక్సిక్ మూవీ నుంచి తాజాగా విడుదలైన ఈ పాట మొదటిసారి వినగానే బాగుంది. కానీ, మరింత బలంగా ఆకర్షించేందుకు మరికొంత సమయం పట్టొచ్చు. సినిమా నుండి రొమాంటిక్ సాంగ్‌ను ఆశించిన వారు కొంచెం నిరాశ చెందవచ్చు. ఒకే పోస్టర్‌తో సాంగ్‌ను విడుదల చేశారు. కనీసం వీరిద్దరి స్టిల్స్, విజువల్స్ చేర్చకుండా పాటను విడుదల చేయడంతో ఇది అభిమానులను మరింత నిరాశపరచవచ్చు. ఈ సినిమా మార్చి 19న పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది. -
8 ఏళ్ల తర్వాత తీసేశాడు.. ఈ స్టార్ హీరోని గుర్తుపట్టారా?
పాన్ ఇండియా ట్రెండ్ కలిసొచ్చిన హీరోల్లో ఇతడు ఒకడు. చేసింది రెండే సినిమాలు అయినా దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఇతడికి అభిమానులయ్యారు. 2022లో చివరగా పలకరించిన ఈ హీరో.. దాదాపు నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఓ మూవీతో థియేటర్లలోకి రాబోతున్నాడు. అయితే గత 8-9 ఏళ్లుగా ఒకే లుక్ మెంటైన్ చేస్తూ వచ్చిన ఇతడు.. ఎట్టకేలకు కొత్తగా కనిపించాడు. మరి ఇతడెవరో గుర్తుపట్టారా?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)పైన కనిపిస్తున్నది 'కేజీఎఫ్' ఫేమ్ యష్. సడన్‌గా చూస్తే మీరు గుర్తుపట్టలేకపోవచ్చు. ఎందుకంటే 'కేజీఎఫ్' సినిమాల కోసం చాలా గడ్డం పెంచేసిన ఇతడు.. దాన్ని అలానే ఉంచేశాడు. తర్వాత 'టాక్సిక్' మూవీ చేసినప్పటికీ అందులో గడ్డం లుక్‌తోనే ఓ పాత్ర ఉంది. ఇది కాకుండా మరో రోల్లో క్లీన్ షేవ్‌తో కనిపించాడు. కొన్నిరోజుల క్రితం వచ్చిన టీజర్ చివరలో కనిపించి కనిపించకుండా లుక్ చూపించారు. దాన్ని ఏఐతో క్రియేట్ చేశారని చాలామంది కామెంట్స్ చేశారు.ఆ ట్రోల్స్‌పై క్లారిటీ ఇచ్చిన స్టైలిష్ట్.. యష్ క్లీన్ షేవ్ లుక్ వీడియోని తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. 'నమ్మకం నిజమైనది అయినప్పుడు.. పనే మాట్లాడుతుంది' అని సదరు హెయిర్ స్టైలిష్ట్ క్యాప్షన్ పెట్టాడు. అయితే ఇన్నాళ్లు గడ్డంతోనే యష్‌ని చూసిన ఫ్యాన్.. ఈ లుక్ చూసి గుర్తుపట్టలేకపోతున్నారు. వాళ్లకు ఈ యష్.. ఎవరో కొత్త వ్యక్తిలా కనిపిస్తుండటం విశేషం.'టాక్సిక్' విషయానికొస్తే 1970ల్లో గోవా బ్యాక్‌డ్రాప్‌లో జరిగే గ్యాంగ్‌స్టర్ డ్రామాగా దీన్ని తెరకెక్కించారు. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దీన్ని తీసింది. నయనతార, రుక్మిణి వసంత్, కియారా అడ్వాణీ, హ్యుమా ఖురేషి తదితరులు హీరోయిన్లుగా నటించారు. మార్చి 19న ఇది పాన్ ఇండియా వైడ్ థియేటర్లలోకి రానుంది. టీజర్ రిలీజ్ తర్వాత యష్ సొంత భాషలో పెద్దగా సౌండ్ లేదు. తెలుగులోనే కాస్తంత ఎక్కువ హడావుడి కనిపిస్తోంది. దానికి తోడు.. మార్చి 19నే 'ధురంధర్ 2' రిలీజ్ కానుంది. యష్ మూవీతో పోలిస్తే దీనిపైనే ఎక్కువ హైప్ ఉంది.(ఇదీ చదవండి: అన్న అని పిలవను.. రాజీవ్ కనకాల నాకు బావ!: గాయత్రి భార్గవి) View this post on Instagram A post shared by Alex Vijaykanth (@alex.vijaykanth) -
ఇది ఉత్తరాది-దక్షిణాది మధ్య యుద్ధం కాదు అంతకు మించి
సంక్రాంతి తర్వాత చెప్పుకోదగ్గ స్థాయిలో బాక్సాఫీస్ దగ్గర సౌండ్ లేదు. అయితే మార్చిలో 'ధురంధర్ 2', టాక్సిక్ లాంటి భారీ పాన్ ఇండియన్ మూవీస్ థియేటర్లలోకి రాబోతున్నాయి. వీటి గురించి సగటు ప్రేక్షకుడు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు. మరోవైపు ఈ చిత్రాల మధ్య పోటీ గురించి.. ప్లస్ మైనస్సుల గురించి దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో విశ్లేషించాడు. ఈ మేరకు ట్విటర్లో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.'నేను కేవలం రెండు పెద్ద సినిమాల గురించి మాట్లాడటం లేదు. భారతీయ సినీ చరిత్రలో ముందెన్నడూ చూడని ఓ భీకర యుద్ధాన్ని చూడబోతున్నాం. ఇది డేవిడ్, గోలియత్ మధ్య జరుగుతున్న పోరాటం. గతంలో 'కేజీఎఫ్ 2' సాధించిన భారీ వసూళ్లు.. 'ధురంధర్' ముందు చిన్నవిగా అనిపించాయి. ఇప్పుడు 'ధురంధర్ 2' అనే డేవిడ్ ముందు 'టాక్సిక్' అనే గోలియత్ నిలబడింది. ధురంధర్ మేకర్స్.. ప్రేక్షకుల తెలివితేటలని గౌరవిస్తున్నారు. 'టాక్సిక్' మేకర్స్ మాత్రం ప్రేక్షకుల్ని మూర్ఖులని భ్రమపడుతున్నారు' అని ఆర్జీవీ రాసుకొచ్చాడు. అలానే కొన్ని పాయింట్స్ కూడా దేనికదే చెప్పుకొచ్చాడు.హీరోయిజం: గుడ్డిగా హీరోని ఆరాధించడం ఓవైపు ఉంటే, కథలోని నైతిక విలువల ద్వారా హీరోని ప్రేక్షకులని అభిమానించడం మరోవైపు.యాక్షన్: గాలిలో ఎగిరే స్టంట్స్, న్యూటన్ ఫార్ములాని వెక్కిరించే ఫైట్స్ 'టాక్సిక్'లో ఉంటే.. ఒళ్లు గగుర్పొడితే సహజ యాక్షన్ 'ధురంధర్' సొంతంమ్యూజిక్: ప్రతి ఐదు నిమిషాలకు విజిల్స్ వేయించే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒకటైతే, నటనకు అవకాశమిస్తూ నిశ్శబ్దంగా సాగే సంగీతం మరోవైపుకేవలం ఓ నటుడిని దేవుడిలా చూపించడానికి రూ.700 కోట్లు ఖర్చు చేయడం కంటే ప్రతి పాత్రని మనిషిలా చూపించడానికి రూ.130 కోట్లు ఖర్చు చేయడం గొప్ప. ప్రేక్షకులని పిల్లలనుకుని ప్రతిదీ వివరించి చూపించడం మానేయాలి. క్లిష్టంగా ఉండే స్టోరీలని కూడా అర్థం చేసుకోగలరని 'ధురంధర్' నిరూపించింది. అయితే ఇదంతా కూడా ఆదిత్య ధర్ మీద ప్రేమతో రాయడం లేదు. మన సినిమాపై ఉన్న ఆశతో రాస్తున్నాను. మార్చి 19న మన దేశం.. ధురంధర్ 2ని ఎంచుకుంటుందో లేదా టాక్సిక్ మాస్ మత్తులో పడుతుందో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని రాంగోపాల్ రాసుకొచ్చాడు.ఈ ట్వీట్ చూసిన చాలామంది.. 'ధురంధర్ 2'ని పొగుడుతూ 'టాక్సిక్'ని తక్కువ చేశాడా అని మాట్లాడుకుంటున్నారు. దీంతో ఆర్జీవీ మరో ట్వీట్ చేశాడు. తాను సినిమాల గురించి మాట్లాడట్లేదని.. స్టైల్ ఆఫ్ మూవీస్ గురించి ప్రస్తావించానని క్లారిటీ ఇచ్చాడు.For all the dumbos , who dint understand I just wanted to clarify that , in the context of the 2 releases , I was talking about the styles of cinema and not in particular about a film https://t.co/Ydy61Nr32F— Ram Gopal Varma (@RGVzoomin) February 22, 2026 -
ధురంధర్-2 కు పోటీగా టాక్సిక్.. అసలు తగ్గేదేలే అంటున్న యష్..
-
'టాక్సిక్' వైలెంట్ టీజర్ విడుదల
కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన టాక్సిక్ టీజర్ వచ్చేసింది. కొద్దిరోజుల క్రితం విడుదలైన గ్లింప్స్ మరింత బోల్డ్‌గా ఉండటంతో చాలా విమర్శలు వచ్చాయి. అయితే, తాజాగా విడులైన టీజర్లో పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్‌ను చూపించారు. ‘కేజీఎఫ్, కేజీఎఫ్ 2’ వంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత యష్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం కావడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. కియారా అద్వానీ, నయన తార, హూమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కుతోంది. కేవీఎన్ ప్రోడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్‌పై వెంకట్ కె.నారాయణ, యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్, కన్నడ భాషల్లో నేరుగా, హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో డబ్బింగ్ వెర్షన్‌ని మార్చి 19న రిలీజ్ చేస్తున్నారు. -
యశ్ టాక్సిక్.. రిలీజ్‌కు ముందే మరో వివాదం..!
కేజీఎఫ్ హీరో నటించిన ఫుల్ యాక్షన్ మూవీ టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్. ఈ సినిమా రిలీజ్‌కు ముందే వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. టీజర్ రిలీజ్ తర్వాత బోల్డ్ సీన్‌పై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. ఆ సీన్ విషయంలో కొందపు ఏకంగా డైరెక్టర్ గీతూ మోహన్ దాస్‌పై మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ సినిమా థియేటర్లలో రిలీజ్‌కు ముందే మరో కొత్త వివాదానికి దారితీసింది. ఈ సినిమాలో మతపరమైన విశ్వాసాలను కించపరిచేలా చిత్రీకరించారని ఓ సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సినిమాలోని కొన్ని దృశ్యాలు తమ మత విశ్వాసాలను అగౌరవపరిచేలా ఉన్నాయంటూ నేషనల్ క్రిస్టియన్ ఫెడరేషన్ సంబంధిత అధికారులకు లేఖ రాసింది. తమ మతంలో ప్రధాన దేవదూత అయిన సెయింట్ మైఖేల్ చిత్రీకరణపై ఈ బృందం ప్రత్యేకంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. సెయింట్ను అభ్యంతరకరమైన రీతిలో చిత్రీకరించారని.. ఇది తమ మనోభావాలను దెబ్బతీసిందని నేషనల్ క్రిస్టియన్ ఫెడరేషన్ ఆరోపిస్తోంది.అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాడని ఫెడరేషన్ అధ్యక్షుడు ప్రదీప్ కుమార్ అధికారులను కోరారు. వివాదాస్పద దృశ్యాలను, ఆన్లైన్ వీడియోలను కూడా తొలగించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా అదనంగా చిత్రనిర్మాతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిపై మూవీ మేకర్స్ స్పందించాల్సి ఉంది. దీనిపై ఇప్పటి వరకు చిత్రనిర్మాతలు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. కాగా.. ఈ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీ ధురంధర-2తో పోటీ పడనుంది. -
యశ్ టాక్సిక్.. రిలీజ్‌కు ముందే రికార్డ్స్.. మరో బిగ్ డీల్..!
శాండల్‌వుడ్ హీరో యశ్ నటిస్తోన్న మోస్ట్ అవేటేడ్ యాక్షన్ థ్రిల్లర్ టాక్సిక్. కేజీఎఫ్-2 తర్వాత రాకింగ్ స్టార్ ఈ మూవీతోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇటీవల టీజర్ రిలీజ్ చేయగా పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. ముఖ్యంగా బోల్డ్ సీన్ పెట్టడంపై దర్శకురాలిపై విమర్శలు చేశారు. ఈ చిత్రానికి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహంచారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 19న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ఈ మూవీ తెలుగు రాష్ట్రాల హక్కులను దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర డిస్ట్రిబ్యూటర్స్ దక్కించుకుంది. దాదాపు రూ.120 కోట్ల డీల్ చేసుకున్నట్లు తెలుస్తోంది.అయితే తాజాగా ఈ మూవీకి మరో బిగ్ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్లో ఇండియన్ లాంగ్వేజేస్‌కి దాదాపు రూ.105 కోట్లకు బిజినెస్ ఓకే అయినట్లు సమాచారం. ప్రముఖ విదేశీ పంపిణీదారు అయిన ఫార్స్ ఫిల్మ్స్‌తో ఈ డీల్ చేసుకుంది. దీంతో ఒక ఇండియన్ సినిమాకు అత్యధిక డీల్ సాధించిన చిత్రంగా టాక్సిక్ నిలవనుంది. రూ. 105 కోట్ల విదేశీ డీల్ రావడం భారతీయ సినిమాకు దక్కిన ఘనతగా భావిస్తున్నారు.ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ డీల్‌తో ఓవర్సీస్లో ఇండియన్ భాషల్లో ఫార్స్ ఫిల్మ్ ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. ఈ బిగ్ డీల్ భారతీయ చిత్రానికి ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద అంతర్జాతీయ విడుదల అవుతుందని భావిస్తున్నారు. ఈ చిత్రం నేపాల్, జపాన్, చైనా మినహా దాదాపు అన్ని ప్రపంచ దేశాల్లో విడుదల కానుంది. కాగా.. ఈ చిత్రాన్ని ఓకేసారి కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో చిత్రీకరించారు. ఈ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. -
'ధురంధర్ 2'కి భయపడుతున్నారా? ఎందుకీ వాయిదాలు?
కొన్ని సినిమాల విషయంలో అప్పుడప్పుడు ఊహలకు అందనివి జరుగుతుంటాయి. రెండు నెలల క్రితం అలాంటి ఓ సంచలనానికి కారణమైంది 'ధురంధర్' అనే మూవీ. రిలీజ్ వరకు దీనిపై పెద్దగా బజ్ లేదు. రెగ్యులర్ ఆడియెన్స్ కాస్తోకూస్తో ఆసక్తి చూపించారు గానీ సాధారణ ప్రేక్షకుడికి అయితే థియేటర్లలోకి వచ్చేంతవరకు ఇదో సినిమా ఉందని కూడా తెలియదు. అలాంటిది బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టేసరికి.. దేశవ్యాప్తంగా పెద్ద డిస్కషన్‌కి కారణమైంది. త్వరలో రాబోతున్న దీని సీక్వెల్ ప్రభావం.. తెలుగు చిత్రసీమపై గట్టిగానే పడినట్లు కనిపిస్తోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అవి డోంట్ మిస్)సాధారణంగా వేసవిని తెలుగు దర్శకనిర్మాత మిస్ చేసుకోరు. ఈసారి కూడా అందుకు తగ్గట్లే డకాయిట్, పెద్ది, ప్యారడైజ్ లాంటి మూవీస్ రిలీజ్ అవుతాయని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. దీంతో ఆయా హీరోల ఫ్యాన్స్, సినిమా లవర్స్ చాలా ఉత్సాహపడ్డారు. తీరా చూస్తే ఈ తెలుగు చిత్రాలన్నీ ఇప్పుడు వాయిదా పడటం గ్యారంటీ. అధికారిక ప్రకటనలు రాలేదు గానీ వాయిదా పడటం అయితే పక్కా.చరణ్ 'పెద్ది', నాని 'ప్యారడైజ్' సినిమాల షూటింగ్ చాలా పెండింగ్‌లో ఉంది. దీంతో ఇవి వాయిదా పడ్డాయంటే సరేలే ఏదో అనుకోవచ్చు. కానీ అడివి శేష్ 'డకాయిట్' మాత్రం ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. మార్చి 19న పక్కా వస్తామని శేష్ కూడా కొన్నాళ్ల ముందు జరిగిన ప్రెస్మీట్లో చెప్పాడు. ఇదంతా 'ధురంధర్' విడుదలకు ముందు జరిగింది. కానీ ఈ మూవీ సూపర్ హిట్ అయ్యేసరికి.. రిస్క్ ఎందుకని 'డకాయిట్' టీమ్ వెనకడుగేసింది. ఏప్రిల్‌లో రావాలని ప్లాన్స్ చేసుకుంటున్నారట.(ఇదీ చదవండి: ఓటీటీలో 'ధురంధర్'.. తెలుగు ఆడియెన్స్ ఏమంటున్నారు?)మరోవైపు 'పెద్ది' కోసం అనుకున్న రిలీజ్ తేదీకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాన్ని తీసుకురావాలని అనుకుంటున్నట్లు రెండు రోజుల క్రితం వరకు రూమర్స్ వచ్చాయి. ఎప్పుడైతే 'ధురంధర్ 2' రిలీజ్ పక్కా అని క్లారిటీ వచ్చిందో.. 'ఉస్తాద్' టీమ్ రిస్క్ వద్దులే అనుకుందనే టాక్ వినిపిస్తుంది. వీళ్లు కూడా ఏప్రిల్ నెలనే టార్గెట్ చేస్తున్నారని టాక్. ఈ లెక్కన చూసుకుంటే మార్చిలో ప్రామిసింగ్ తెలుగు సినిమా ఒక్కటి కూడా వచ్చే సాహసం చేయట్లేదనిపిస్తుంది. అంటే తెలుగు రాష్ట్రాల్లో 'ధురంధర్ 2'కి దాదాపు లైన్ క్లియర్.అయితే ఈ చిత్రానికి 'టాక్సిక్' పోటీగా నిలబడుతోంది. కన్నడ స్టార్ యష్ నటించిన గ్యాంగస్టర్ డ్రామా మూవీ ఇది. మార్చి 19నే 'ధురంధర్ 2'తో పాటు ఈ చిత్రం కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతోంది. కాకపోతే ప్రమోషన్ పరంగా చాలా వీక్‌గా ఉన్నారు. సాంగ్స్, ట్రైలర్స్ లాంటివి రిలీజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు 'టాక్సిక్' వాయిదా పడటానికి అవకాశాల్లేవని తెలుస్తోంది. దానికి కారణాలు చాలానే ఉన్నాయి. విజయ్ 'జన నాయగణ్' నిర్మించిన కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థనే యష్ మూవీ కూడా తీసింది. ఇది కూడా వాయిదా పడితే కోట్లలో నష్టాలు ఉండొచ్చు. అందుకే 'ధురంధర్ 2' పోటీలో ఉన్నప్పటికీ వెనక్కి తగ్గే పరిస్థితులు అయితే కనిపించట్లేదు.(ఇదీ చదవండి: 'ధురంధర్'తో హిట్.. ఇప్పుడు చిరంజీవి కూతురిగా?) -
టాక్సిక్ టాక్స్: ట్రైలర్‌తో వైరల్ అయిన లేడీ డైరెక్టర్
‘కేజీఎఫ్’ వంటి చారిత్రక విజయం తర్వాత రాకింగ్ స్టార్, దక్షిణాది క్రేజీ హీరో యష్ నటించిన ‘టాక్సిక్’ ట్రైలర్ తోనే సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. హీరో యష్ తన స్వంత బ్యానర్ మాన్స్టర్ క్రియేషన్స్ ద్వారా సహ–నిర్మాతగా వ్యవహరిస్తున్న పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ మూవీ టాక్సిక్. ఇందులో యష్ అత్యంత క్రూరమైన గ్యాంగ్ లీడర్ ‘రాయా’ పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ ‘ది టీజ్’ తోనే ఈ మూవీ భారీ అంచనాలు పెంచి సంచలనాలు కూడా రేపింది. కెమెరా టేకింగ్ యాక్టింగ్ వగైరాలన్నీ సినీ సాంకేతిక నిపుణుల మధ్య చర్చనీయాంశంగా మారి పలు ప్రశంసలు కూడా అందుకుంటుంటే... మరోవైపు నీలిచిత్రాల స్థాయిలో ఉన్న సన్నివేశం సంప్రదాయవాదుల కన్నెర్రకు కారణమైంది. ఈ నేపధ్యంలోనే ఆ సినిమాకు దర్శకత్వం వహించింది ఎవరు?తన నేపధ్యం ఏమిటి? అంటూ కన్నడేతర భాషా ప్రేక్షకుల్లో చర్చ కూడా జోరుగా సాగుతోంది. మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించే షాకింగ్ సీన్లను జోడిస్తూ రూపొంది త్వరలోనే వెండితెరపై సందడి చేయబోతున్న ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్–అప్స్’.చిత్రం∙దర్శకురాలి పేరు గీతూ మోహన్‌దాస్.యాక్షన్ టూ డైరెక్షన్...ఆమె ఒక సెన్సేషన్...పాన్ ఇండియా యాక్షన్ చిత్రాలకు అలవాటైన దర్శకుల నుంచి కాకుండా, యష్ పూర్తిగా భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు.దానికి తగినట్టుగా ఆయనకు కనిపించారు దర్శకురాలు గీతూ మోహన్‌దాస్. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి, తరువాత ఆస్కార్ స్థాయికి ఎదిగిన ప్రతిభావంతురాలైన దర్శకురాలిగా పేరొందారు. సాధారణ వాణిజ్య చిత్రాలకు పూర్తి భిన్నం గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘లైయర్స్ డైస్’ (2013). ప్రముఖ నటీనటులు నవాజుద్దీన్ సిద్ధిఖీ, గీతాంజలి థాపాలు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, హిమాలయాల్లోని ఓ గ్రామం నుంచి ఢిల్లీ వరకు తన భర్త కోసం ఒక మహిళ చేసే ప్రమాదకర ప్రయాణాన్ని భావోద్వేగ సహితంగా చూపిస్తుంది.ఈ చిత్రం సండాన్స్ రోటర్‌డామ్ వంటి అంతర్జాతీయ చిత్రోత్సవాల్లోనూ ప్రశంసలు అందుకోవడంతో పాటు 87వ ఆస్కార్ అవార్డ్స్‌కు భారతదేశం తరపున అధికారిక ఎంట్రీగా ఎంపికైన ఘనత దక్కించుకుంది. అంతేకాదు 61వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఈ చిత్రం ఉత్తమనటి, ఉత్తమ సినిమాటోగ్రఫీలకు గాను రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులను సొంతం చేసుకుంది. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. సినిమాటోగ్రాఫర్ రాజీవ్ రవి గీతూ మోహందాస్ భర్త కావడం. ఆయన అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రూపొందిన ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్’ కు తన రఫ్ అండ్ రియలిస్టిక్ విజువల్స్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చి విజువల్ మాస్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. గీతూ మోహన్‌దాస్ వైవిధ్యభరిత లైన్స్‌కు తెరపై జీవం పోసే లెన్స్ రాజీవ్ రవి అని చెప్పొచ్చు. అలాగే దేవ్ డి, చాందినీ బార్, ఉడ్తా పంజాబ్ వంటి వైవిధ్యభరిత సినిమాలు కూడా ఆయన ఖాతాలో ఉన్నాయి.‘టాక్సిక్’ కోసం గీతూనే ఎందుకు?‘కేజీఎఫ్’ లాంటి మాస్ బ్లాక్‌బస్టర్ తర్వాత, యష్ గీతూ మోహన్‌దాస్ లాంటి ఆలోచనాత్మక చిత్రాలకు పేరొందిన దర్శకురాలిని ఎంపిక చేయడం ఇండస్ట్రీలో ఆశ్చర్యాన్ని కలిగించింది. కానీ ఆమె రెండో చిత్రం ‘మూతోన్’ (సండాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో గ్లోబల్ ఫిల్మ్ మేకింగ్ అవార్డు విజేత) చూసినవారికి ఈ నిర్ణయం ఎంత సరైనదో అర్థమవుతుంది. గీతూ కథనాల్లో ఉండే డార్క్ రియలిజం, అంతర్జాతీయ టచ్ – యశ్ మాస్ ఇమేజ్‌తో కలిసినప్పుడు, ఒక కొత్త తరహా భారతీయ బ్లాక్‌బస్టర్ రూపుదిద్దుకోబోతోందన్న అంచనాలు నెలకొన్నాయి.ఈ చిత్రంలో యష్‌తో పాటు నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, తారా సుతారియాలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏదేమైనా... భారతీయ చిత్రాల్లో కామసూత్ర తీసిన మీరానాయర్ ఎంత వివాదాస్పదం అయ్యారో తెలిసిందే. అయితే సబ్జెక్ట్ పరంగా అవసరం కాబట్టి తీశానంటూ ఆమె సమర్ధవంతంగా తిప్పికొట్టగలిగారు. మరి కేవలం ఒకే ఒక్క టీజర్ ద్వారా సంప్రదాయవాదుల దాడులతో పాటుగా న్యాయ వివాదాలు కూడా ఎదుర్కుంటున్న గీతూ మోహన్...పూర్తి సినిమా విడుదల తర్వాత ఏవేం వివాదాలు ఎదుర్కోనున్నారో వేచి చూడాలి. -
ఒక్క సీన్‌తో వైరల్.. 'టాక్సిక్' బ్యూటీ ఇన్‌స్టా డిలీట్
కన్నడ స్టార్ హీరో యశ్ కొత్త సినిమా టాక్సిక్ టీజర్ పాన్ ఇండియా రేంజ్లో హీట్ పెంచుతుంది. టీజర్లో ఉన్న ఇంటిమేట్ సీన్‌పై మహిళా సంఘాలు తీవ్రమైన అభ్యంతరం తెలిపాయి. యశ్‌తో పాటు బోల్డ్ సీన్లో కనిపించిన బీట్రీజ్ టోఫెన్ బాఖ్ (Beatriz Taufenbach) తన ఇన్స్టాగ్రామ్ ఖాతాను తొలగించింది. తన ఇంటిమేట్ సీన్స్‌పై వివాదాలు రావడం వల్లనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీని దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.టాక్సిక్ టీజర్లో చాలా బోల్డ్‌గా నటించిన తర్వాత ఆమె గురించి తెలుసుకోవాలని నెటిజన్లు పోటీపడ్డారు. ఈ క్రమంలో దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ ఆమె వివరాలు షేర్ చేశారు. దీంతో ఆమె పేరు బీట్రీజ్ బాఖ్ అని పంచుకున్నారు. హాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు ఇదే ఫస్ట్ ఇండియన్ సినిమా... దీంతో ఆమెకు భారీగా ఫాలోవర్స్ పెరిగారు. జనవరి 13 వరకు ఆమె ఖాతా యాక్టివ్గానే ఉంది. కానీ, సెడెన్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఖాతా కనిపించకపోవడంతో నెటిజన్లు ఈ విషయాన్ని షేర్ చేస్తున్నారు. -
యశ్‌తో 'టాక్సిక్' బ్యూటీ.. ఎవరో తెలుసా?
సుమారు నాలుగేళ్ల తర్వాత కన్నడ స్టార్ యశ్ మరోసారి బాక్సాఫీస్ వద్దకు రానున్నాడు. తన కొత్త సినిమా టాక్సిక్ నుంచి యశ్‌ను పరిచయం చేస్తూ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఒక శ్మశానంలో శత్రువులకు చుక్కలు చూపించేలా తన ఎంట్రీ ఉంటుంది. అయితే, కారులో ఒక నటితో యశ్ ఇంటిమేట్ అయ్యే సీన్ ఉంటుంది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మరీ ఇంత బోల్డ్‌గా ఎలా తెరకెక్కించారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే, యశ్‌తో రొమాన్స్ చేసిన నటి ఎవరు అంటూ సోషల్‌మీడియాలో నెటిజన్లు వెతుకుతున్నారు.ఈ టీజర్లో యశ్‌తో కలిసి సన్నిహిత సీన్లో కనిపించింది హాలీవుడ్ నటి 'బీట్రీజ్ టోఫెన్ బాఖ్' (Beatriz Taufenbach).. ఉక్రెయిన్‌కు చెందిన ఈ బ్యూటీ అమెరికాకు వెళ్లి, నటనలో కెరీర్ ప్రారంభించింది. నటనతో పాటు మోడల్, స్క్రీన్‌రైటర్, నిర్మాతగా కూడా విజయం అందుకుంది. తన నెట్ వర్త్ కూడా సుమారు రూ. 150 కోట్లకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో తనను తక్కువ అంచనా వేశారో పప్పులో కాలేసినట్లే..అమెరికన్ పౌరసత్వం పొందిన తరువాత, ఆమె పలు స్టూడియోస్‌లలో కూడా భాగస్వామిగా ఉంది. హాలీవుడ్లో యాక్షన్ సినిమాలతో పాటు థ్రిల్లర్ మూవీస్‌తో పేరు తెచ్చుకున్న బహుముఖ ప్రతిభావంతురాలిగా గుర్తింపు పొందింది. అయితే, టాక్సిక్ సినిమాతో ఆమె ఇండియన్ స్క్రీన్‌పై కనిపించనుంది. ఇందులో ఆమె కీలకపాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. యశ్‌తో బోల్డ్ సీన్లో నటించడంతో ఒక్కసారిగా నెట్టింట తన పేరు వైరల్ అవుతుంది.


