టాక్సిక్‌లో నయనతార.. అన్ని కోట్లు తీసుకుంటోందా? | Nayanthara Gets High Remunaration For Yash Movie Toxic | Sakshi
Sakshi News home page

Nayanthara: టాక్సిక్‌లో నయనతార.. అన్ని కోట్ల పారితోషికమా?

Jul 10 2026 3:30 PM | Updated on Jul 10 2026 3:36 PM

Nayanthara Gets High Remunaration For Yash Movie Toxic

కన్నడ స్టార్ యశ్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ యాక్షన్‌ మూవీ టాక్సిక్. ఈ మూవీకి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్‌ కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు వచ్చేనెల 26న థియేటర్లకు రానుందని మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్లలో భాగంగా ఓ రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేశారు. అది టీజర్ లాగే విమర్శలకు దారితీసింది. ఓవర్‌గా రొమాన్స్ ఉండడంతో విమర్శలొస్తున్నాయి.

అయితే ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ నయనతార సైతం కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో కియారా ‍అద్వానీ హీరోయిన్‌ కాగా.. నయన్ ఓ ప్రధాన పాత్రలో నటించింది. ఈ నేపథ్యంలోనే నయనతార పారితోషికంపై నెట్టంట చర్చ మొదలైంది. అసలు టాక్సిక్ కోసం నయన్ ఎంత తీసుకుందనే దానిపై శాండల్‌వుడ్‌తో పాటు కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.

అయితే ఈ చిత్రంలోని తన పాత్రకు నయనతార భారీగానే డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి ఏకంగా రూ.15 కోట్లు డిమాండ్ చేసిందని టాక్. ఈ ప్రాజెక్ట్‌లో నయనతారకు ఎక్కున స్క్రీన్‌ టైమ్ లేకపోవడంతో మేకర్స్ ఆమె పారితోషికాన్ని తగ్గించుకోవాలని కోరినట్లు సమాచారం. నిర్మాతలతో పలు దఫాల చర్చల తర్వాత నయన్‌ రూ. 12 కోట్లకు ఓకే చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఆమెకు ఎక్కువ స్క్రీన్ టైమ్ లేకపోయినా ఇంత పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ చెల్లించడం విశేషం. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement