బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, మిల్కీ బ్యూటీ తమన్నా మోస్ట్ అవైటేడ్ మూవీ వివాన్. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు సంబంధించిన బిగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఈ ఏడాది సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రత్యేక వీడియో పంచుకున్నారు మేకర్స్.
తాజాగా రిలీజైన పోస్టర్ అడవి నేపథ్యంలో డిజైన్ చేశారు. ఇందులో చేతిలో త్రిశూలంతో ఉన్న ఒక యోధుడు కనిపిస్తుండగా.. ఒకవైపు ఉగ్రరూపంతో ఉన్న పులి, మరోవైపు రౌద్రంతో దూసుకొస్తున్న ఎద్దును చూపించారు. ఈ ఫాంటసీ విజువల్స్ చూస్తుంటే థియేటర్లలో ప్రేక్షకులకు మాస్ యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఖాయమని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దీపక్ కుమార్ మిశ్రా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, అరుణభ్ కుమార్, నీరజ్ కొఠారి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Baagh uski dahaad hai… Nandi uski shakti. Aur Vvaan… uski kahaani.#THEVVAAN in cinemas on 25th September, 2026.
Starring: @SidMalhotra #TamannaahBhatia @WhoSunilGrover @ManishPaul03 #ShwetaTiwari @soniiannup
Producers: #ShobhaKapoor @EktaaRKapoor @ArunabhKumar &… pic.twitter.com/YyULbvAFa7— Tamannaah Bhatia (@tamannaahspeaks) July 9, 2026


