బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ఇటీవలే పెద్ది మూవీ సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వచ్చిన మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన హీరోయిన్‌గా మెప్పించింది ముద్దుగుమ్మ. ఈ చిత్రంలో అచ్చియమ్మ పాత్రతో అభిమానులను ఆకట్టుకుంది.
ఇక సినిమాల సంగతి పక్కన పెడితే జాన్వీ కపూర్ ఇటీవలే బోనీ కపూర్ మొదటి భార్య కూతురైన అన్షులా కపూర్ పెళ్లిలో సందడి చేసింది. తన సిస్టర్ ఖుషీ కపూర్‌తో కలిసి ఈ వేడుకకు హాజరైంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‍గా మారాయి.
వరుసకు తన సోదరి అయిన అన్షులా కపూర్ వివాహ రిసెప్షన్‌లో జాన్వీ కపూర్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె వేసుకున్న మెహందీలో తన ప్రియుడైన శిఖర్ పహారియాను పేరును రాసుకుంది. ఆమె ముద్దుగా పిలిచే శికు అంటూ మెహందీలో రాసుకొచ్చింది. ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలను జాన్వీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఇది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
శిఖర్ పహారియాతో డేటింగ్..
కాగా.. జాన్వీ కపూర్, శిఖర్ పహారియా చాలా ఏళ్లుగా ఫ్రెండ్‌షిప్‌లో ఉన్నారు. వీరిద్దరూ 2016లో డేటింగ్ ప్రారంభించి.. 2018లో జాన్వీ బాలీవుడ్‌లో అడుగుపెట్టిన తర్వాత విడిపోయినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మళ్లీ 2023లో వీరిద్దరూ పలు సందర్భాల్లో జంటగా కనిపించారు. దీంతో మళ్లీ డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. అప్పటి నుంచి ఎక్కడికెళ్లినా జాన్వీతోనే శిఖర్ కనిపిస్తున్నారు. దీంతో వీళ్లిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని వార్తలొచ్చాయి. ఈ ఏడాది ప్రారంభంలో జాన్వీ, శిఖర్ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు కూడా వచ్చాయి. అయితే, ఈ ఊహాగానాలను ఆమె తండ్రి, నిర్మాత బోనీ కపూర్ ఖండించారు.


