జగపతి బాబు, లయ, హృతిక ప్రధాన పాత్రల్లో నటించిన కొత్త సినిమా వదలా. ఈ చిత్రానికి ఆకెళ్ల వి కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని తమ్మారెడ్డి భరద్వాజ్, కిశోర్ నాయుడు నిర్మాతలుగా సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ జూలై 17న థియేటర్లలో సందడి చేయనుంది.
ఈ నేపథ్యంలో వదలా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. అన్యోన్యంగా ఉండే భార్య, భర్తల మధ్యలోకి మూడో వ్యక్తి వస్తే ఏమవుతుంది అనే కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కించారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మూడో వ్యక్తి వల్ల ఆ కుటుంబం ఎలాంటి ఇబ్బందులు పడిందనేది ట్రైలర్‌లో చూపించారు. కాగా.. ఈ సినిమాకు కార్తీక్ సంగీతమందించారు.


